ట్రంప్‌ దూకుడు.. తొలి రోజే సంచలన నిర్ణయాలు | USA Donald Trump Key Decisions On 1st Day Of President Updates | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ దూకుడు.. తొలి రోజే సంచలన నిర్ణయాలు

Published Tue, Jan 21 2025 7:33 AM | Last Updated on Tue, Jan 21 2025 9:18 AM

USA Donald Trump Key Decisions On 1st Day Of President Updates

President Donald Trump Key Decisions Updates..

అమెరికా అధ్యక్షుడిగా(47వ) బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్‌ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

పుతిన్‌కు హెచ్చరికలు..

  • ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై స్పందించిన ట్రంప్‌..
  • రష్యాను పుతిన్‌ నాశనం చేస్తున్నారన్న మండిపడిన ట్రంప్‌.
  • యుద్ధాన్ని ఆపేందుకు ఉక్రెయిన్‌ ప్రతిపాదిస్తున్న ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు అంగీకరించడం లేదని కామెంట్స్‌
  • పుతిన్‌ వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని సూచన
  • లేకపోతే రష్యా గొప్ప ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని హెచ్చరిక

 

కెనడా, మెక్సికో ఉత్పత్తులపై పన్నులు: ట్రంప్‌

  • కెనడా, మెక్సికో షాకిచ్చిన ట్రంప్‌.
  • ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం పన్నులు విధింపు.
  • ఆ రెండు దేశాలు సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయకపోతే పన్నుల విధింపు తప్పదని ఇది వరకే హెచ్చరించిన ట్రంప్‌
  • ఈ మేరకు తాజాగా ప్రకటన
  • అయితే, చైనా ఉత్పత్తులపై సుంకాల విధింపు గురించి వెల్లడించని అమెరికా నూతన అధ్యక్షుడు

క్యాపిటల్‌ దాడి కేసులు రద్దు.. ట్రంప్‌ క్షమాభిక్ష

  • 2021 జనవరి 6న దాడుల్లో పాల్గొన్న 1500 మందికి ఉపశమనం కల్పించిన ట్రంప్‌

  • కార్యాలయంలోకి వచ్చిన మొదటి రోజునే తనకున్న ప్రత్యేక అధికారాల వినియోగం

  • ఈ చర్యతో యూఎస్‌ న్యాయశాఖ చరిత్రలోనే అతిపెద్ద విచారణ, సుదీర్ఘ దర్యాప్తునకు ముగింపు

  • తన మద్దతుదారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తానని ఎన్నికల సమయంలోనే హామీ

ట్రంప్‌ కీలక సంతకాలు ఇవే..

  • బైడెన్‌ ప్రభుత్వం జారీ చేసిన 80 విధ్వంసకర, రాడికల్ పరిపాలనా ఉత్తర్వులు రద్దు చేసిన ట్రంప్‌
  • ట్రంప్‌ యంత్రాంగంపై పట్టు సాధించేవరకు అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా ఉత్తర్వులు
  • మిలిటరీ, ఇతర ముఖ్యమైన ప్రాంతాలు మినహా అన్ని సమాఖ్య నియామకాలు నిలిపివేత
  • పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చిన ట్రంప్‌
  • వాక్‌ స్వాతంత్ర్యంపై సెన్సార్‌ తొలగింపు

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఔట్‌..

  • అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం. అమెరికాను ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి తొలగిస్తూ సంతకం. కోవిడ్‌ వ్యాప్తి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యతారాహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్‌ ఈమేరకు నిర్ణయం తీసుకొన్నారు. 

 

 మోదీ అభినందనలు..
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు. ట్విట్టర్‌ వేదికగా మోదీ..‘నా ప్రియ మిత్రుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు అభినందనలు. ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించేందుకు, ప్రపంచ భవితను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఆయనతో మరోసారి కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆయన పదవీకాలం సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని కామెంట్స్‌ చేశారు. 

ఉత్తర్వులే ఉత్తర్వులు! 
బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్‌ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వలసలపై ఉక్కుపాదం, మెక్సికో సరిహద్దుల్లో మరిన్ని సైనిక దళాల మోహరింపు, జన్మతః పౌరసత్వ విధానం రద్దు, చైనా, కెనడాలపై టారిఫ్‌ల పెంపు, గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మార్చడం వంటివి వీటిలో ఉన్నట్టు వైట్‌హౌస్‌ వర్గాలు చెప్పాయి. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాయి. అయితే చాలా ఉత్తర్వుల అమలుపై న్యాయపరమైన సవాలు ఎదురవడం ఖాయమంటున్నారు.

ట్రంప్‌ రాకతో వైట్‌హౌస్‌ వెబ్‌సైట్‌ కూడా కొత్త రూపు సంతరించుకుంది. ‘అమెరికా ఈజ్‌ బ్యాక్‌’ అనే హెడ్డింగ్‌తో ‘నా ప్రతి శ్వాసతోనూ అమెరికన్ల కోసమే పోరాడతా’ అంటూ ట్రంప్‌ సందేశాన్ని హోం పేజీలో హైలైట్‌ చేసింది. ట్రంప్‌ తాజా నిర్ణయాలను పోస్ట్‌ చేసింది. ‘‘పన్నులు, చమురు ధరలు, విద్యుత్‌ చార్జీలు తగ్గుతాయి. సైన్యాన్ని ఆధునికీకరిస్తారు. విఫల విధానాలు రద్దవుతాయి. పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు తెర దించేందుకు ట్రంప్‌ ప్రాధాన్యమిస్తారు’’ అని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement