ట్రంప్‌ ప్రమాణం.. ఫుల్‌ జోష్‌లో ఎలాన్‌ మస్క్‌ | Elon Musk one Armed Gesture Has Gone viral | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ప్రమాణం.. ఫుల్‌ జోష్‌లో ఎలాన్‌ మస్క్‌

Published Tue, Jan 21 2025 9:03 AM | Last Updated on Tue, Jan 21 2025 10:39 AM

Elon Musk one Armed Gesture Has Gone viral

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ భవనంలో ఈ వేడుక జరిగింది. ట్రంప్‌ ప్రమాణం వేళ బిలియనీర్‌ ఎలాన్ మస్క్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వేదికపై డ్యాన్స్‌ చేస్తూ ఎంతో ఆనందంగా కనిపించారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ​ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలాన్‌ మస్క్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై హాడావుడి చేశారు. అక్కడి వచ్చిన ప్రముఖులు, పార్టీ నేతల్లో జోష్‌ నింపారు. అలాగే, ట్రంప్ ప్రసంగంలో భాగంగా దేశ సంపదను పెంచుతానని, భూభాగాన్ని విస్తరిస్తానంటూ పేర్కొన్నారు. అంగారక గ్రహంపైకి అమెరికా వ్యోమగాములను పంపిస్తానని ట్రంప్ చెప్పారు. తమ జెండాను అక్కడ పాతుతామన్నారు. ఈ వ్యాఖ్యలకు మస్క్ సంబురపడిపోయారు.

47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్

 

ఈ సందర్బంగా ఎలాన్‌ మస్క్‌ థంబ్‌ చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక, ‍ట్రంప్‌ వ్యాఖ్యల నేపథ్యంలో రానున్న కాలంలో మస్క్‌ మరిన్ని రాకెట్‌ ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో మార్స్ గ్రహం అంశం ఇప్పుడు మరింత హాట్ టాపిగ్గా మారింది. ఇక, మస్క్‌ ఎంజాయ్‌ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి ట్రంప్‌తో కలిసి మస్క్‌ ముందుకు సాగారు. ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచే వరకు మస్క్‌ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల ఫలితాల్లో ట్రంప్‌ విజయం సాధించడంతో తన కేబినెట్‌లో మస్క్‌కు కీలక పదవి అప్పగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement