Delhi
-
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతిపై తాను త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి(Subramanian Swamy) ప్రకటించారు. అంతేకాదు ఈ విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపైనా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఢిల్లీ సాక్షి ప్రతినిధితో ఆయన శుక్రవారం మాట్లాడారు. రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కలిపించారు. గోవు అంటే జంతువు మాత్రమే కాదు.. కోట్ల మందికి ఆరాధ్య దైవం కూడా. అలాంటిది గోవుల ఆలనా పాలనా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తింది. తిరుమలలో సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. పైగా గోవుల మరణాల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారు. వయసు మళ్లిన మనుషుల్లాగే.. వయసు మళ్లిన ఆవులూ చనిపోతున్నాయని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారు. రేపు మీరు కూడా చనిపోతారు. అప్పుడు వయసు మల్లారని పట్టించుకోకుండా మీ కుటుంబ సభ్యులు వదిలేస్తారా?. అని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడిన చైర్మన్‌ను సీఎం చంద్రబాబు వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక కుట్ర ఉంది. టీటీడీలో వ్యాపార ధోరణితో చూడడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా?. గోవుల మృతి పై దర్యాప్తు జరగాలి. టీటీడీ గోశాలలో గోవుల మృతి పై త్వరలో కోర్టులో కేసులు దాఖలు చేస్తా. ఇప్పుడున్న టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. గత టీటీడీ బోర్డు చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు.. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు’’ అని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేసుకున్నారు. -
Bhagavad Gita: గర్వించ దగ్గ క్షణం.. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు
సాక్షి,న్యూఢిల్లీ: భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత,భరతముని రాసిన నాట్య శాస్త్రానికి గుర్తింపు లభించింది.ఈ ఘనతపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘భారత నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం ఇది. భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో లిఖించబడ్డాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు.‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం ఇది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో గీత, నాట్యశాస్త్రం చేర్చబడటం మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు. భగవత్ గీత,నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. A proud moment for every Indian across the world! The inclusion of the Gita and Natyashastra in UNESCO’s Memory of the World Register is a global recognition of our timeless wisdom and rich culture. The Gita and Natyashastra have nurtured civilisation, and consciousness for… https://t.co/ZPutb5heUT— Narendra Modi (@narendramodi) April 18, 2025 -
ఆప్‌కు అక్రమంగా విదేశీ నిధులు
న్యూఢిల్లీ: నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆమ్ ఆద్మీ పార్టి(ఆప్)కి విదేశాల నుంచి నిధులు అందాయనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే, పార్టీ గుజరాత్ ఎన్నికల సహ ఇన్చార్జి దుర్గేశ్ పాఠక్ ఇంటిపై గురువారం సీబీఐ అధికారులు దాడులు జరిపారు. విదేశీ విరాళాల నిబంధనల సవరణ చట్టం(ఎఫ్సీఆర్ఏ)– 2010కు విరుద్ధంగా ఆప్ నిధులు అందుకుందనే ఆరోపణలపై హోం శాఖ నుంచి అందిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో ఆప్‌కు చెందిన మరో నేత దివంగత కపిల్ భరద్వాజ్ పేరు కూడా ఉంది. ఆప్ ఓవర్సీస్ ఇండియా పేరుతో ఏర్పాటైన విభాగానికి అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో వలంటీర్లు ఉన్నారని తెలిపింది. వీరు నిబంధనలకు విరుద్ధంగా నిధులు సేకరించి దుర్గేశ్ పాఠక్, కపిల్ భరద్వాజ్‌లకు పంపినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. కాగా, విచారణకు అవసరమైతే పార్టీ అగ్ర నేతలను కూడా ప్రశ్నించే అవకాశముందని సీబీఐ వర్గాలు తెలిపాయి. సోదాలపై దుర్గేశ్ స్పందించారు. గుజరాత్లో పార్టికి పెరుగుతున్న ఆదరణను చూసి భయంతోనే కేంద్ర ప్రభుత్వం తనను బెదిరించేందుకు ఈ కుట్ర పన్నిందని ఆరోపించారు. గురువారం ఉదయం ఆరుగురు సీబీఐ అధికారులు తన నివాసానికి వచి్చ, రెండు గదుల్లో దాదాపు 4 గంటల పాటు అణువణువూ గాలించారని, వారికేమీ దొరకలేదని ఆయన చెప్పారు. సెర్చ్ వారెంట్ చూపిన అధికారులు సోదాలకు కారణం మాత్రం చెప్పలేదన్నారు. భయపెట్టడం ద్వారా గుజరాత్లో తమ పార్టీని ఏకాకిని చేయడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశమని ఆరోపించారు. తమ పార్టీని అంతం చేయడమే బీజేపీ ఉద్దేశమని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. దుర్గేశ్‌కు గుజరాత్లో 2027లో జరిగే అసెంబ్లీ ఎ న్నికల బాధ్యతలను అప్పగించిన వెంటనే బీ జేపీ ప్రభుత్వం దాడులకు దిగిందని ఆప్‡ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. -
రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు
న్యూఢిల్లీ: రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదని చెప్పారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు. సుప్రీంకోర్టుకు అలాంటి ఆదేశాలిచ్చే అధికారం ఎక్కడిదని ఆక్షేపించారు. గురువారం రాజ్యసభలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దేశంలో ఏం జరుగుతోంది? అని నిలదీశారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదన్నారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరిస్తూ ఏకంగా రాష్ట్రపతికే ఆదేశాలు జారీ చేయడం సరైంది కాదన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ సుప్రీంకోర్టుకు అలాంటి అధికారాలు ఇవ్వలేదని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థకు చట్టాలు వర్తించడం లేదని, అందుకే పారదర్శకత కనిపించడం లేదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ హద్దులు దాటుతోందని విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు ఇచ్చిన ప్లీనరీ అధికారాలు.. నిత్యం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రయోగించడానికి న్యూక్లియర్ మిస్సైల్‌గా మారాయని వ్యాఖ్యానించారు.నోట్లకట్టల ఘటనలో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మార్చి 14న నోట్ల కట్టలు దొరికిన ఘటనపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని జగదీప్ ధన్‌ఖడ్ ప్రశ్నించారు. న్యాయమూర్తులు విచారణకు అతీతమా? అని ప్రశ్నించారు. వారికి అలాంటి వెసులుబాటు ఉందా? అని అడిగారు. సాధారణ పౌరుల ఇంట్లో నగదు దొరికి ఉంటే దర్యాప్తు ఎలక్ట్రానిక్ రాకెట్ వేగంతో జరిగేదని చెప్పారు. యశ్వంత్ వర్మ విషయంలో దర్యాప్తు కనీసం ఎడ్లబండి వేగంతోనూ జరగడం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది దర్యాప్తు నుంచి రక్షణ పొందడం కాకూడదని తెలిపారు. -
ఆధునిక టెక్నాలజీతో యమునా నది ప్రక్షాళన
న్యూఢిల్లీ: కాలుష్యమయంగా మారిన యమునా నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ అంశంపై ఆయన గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నది ప్రక్షాళన కోసం చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రక్షాళన క్రతువులో ఢిల్లీ ప్రజలను తప్పనిసరిగా భాగస్వా ములను చేయాలని ప్రధానమంత్రి సూచించారు. రియల్–టైమ్ డేటా, స్పేస్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతల సాయంతో నదిని పరిశుభ్రంగా మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలుష్యానికి తావులేకుండా యమునా నదిలో ఛాత్ పూజలు నిర్వహించుకొనే అవకాశం కల్పించాలని అన్నారు. నది పట్ల మరింత గౌరవం పెంచేలా చూడాలన్నారు. పవిత్ర యుమునతో ప్రజల అనుబంధం మరింత పెరగాలని ఆకాంక్షించారు. -
వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోం
న్యూఢిల్లీ: ఇప్పటికే వక్ఫ్ ఆస్తులుగా పరిగణనలో ఉన్న ఆస్తులను డీనోటిఫై చేయబోమని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మే 5వ తేదీదాకా సెంట్రల్ వక్ఫ్ బోర్డులు, మండళ్లలో నియామకాలు చేపట్టబోమని పేర్కొంది. అయితే వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామంటూ సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనపై మాత్రం కేంద్రప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం గురువారం సైతం కొనసాగించింది. ఈ సందర్భంగా వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఏడు రోజుల్లోపు స్పందన తెలియజేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం కోర్టుకు తెలిపారు. చట్టంలోని సెక్షన్ 9, సెక్షన్ 14 ప్రకారం వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలో ఎలాంటి నియామ కాలను కేసు తదుపరి విచారణ తేదీదాకా చేపట్ట బోమని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే ‘వక్ఫ్ బై యూజర్’ విధానం ద్వారా వక్ఫ్ ఆస్తులుగా రిజిస్ట్రర్ అయిన, ధృవీకరించబడిన ఆస్తులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను డీనోటిఫై చేసి గందరగోళం చేయబోమని ఆయన మాటిచ్చారు. ‘‘ ఎంతో విస్తృతస్థాయి చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని చట్టంగా తీసుకొచ్చాక ప్రభుత్వ వాదన వినకుండానే ధర్మాసనం ఆ చట్టాన్ని నిలుపుదలచేయడం సహేతుకం అనిపించుకోదు. ప్రభుత్వంలో భాగమైన మేము పార్లమెంట్‌కు, ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు ‘వక్ఫ్ బై యూజర్’ నిబంధనపై తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి?’’ అని మెహతా ప్రశ్నించారు. దీనిపై సీజేఐ ఖన్నా స్పందించారు. ‘‘ 1995నాటి వక్ఫ్ చట్టం ప్రకారం గతంలో రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న వక్ఫ్ ఆస్తులను ఈ కేసుల తదుపరి విచారణదాకా డీనోటిఫై చేయకూడదు’’ అని కేంద్రాన్ని ఆదేశించారు. గతంలో వక్ఫ్ ఆస్తులుగా కోర్టులు ప్రకటించిన ఆస్తుల డీనోటిఫైకు వీలుకల్పించే నూతన చట్టంలోని సెక్షన్లను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులకు ప్రతిపాదిస్తామని బుధవారం కోర్టు వ్యాఖ్యానించడం తెల్సిందే.ప్రైవేట్ ఆస్తులనూ వశపర్చుకున్నారుసెక్షన్ల నిలుపుదల ప్రతిపాదనను తుషార్ మెహతా తప్పుబట్టారు. ‘‘ చట్టంలోని సుదీర్ఘ సెక్షన్లను జడ్జీలు హడావిడిగా, యథాలాపంగా చదివి ఉండొచ్చు. చట్టబద్ధ్దమైన సెక్షన్‌ను నిలుపుదలచేయడం నిజంగా అరుదైన విషయం. ఈ విషయంలో ఈ చట్టం పూర్వాపరాలను జడ్జీలు మరోసారి పరిశీలించాలని వేడుకుంటున్నా. అన్ని వర్గాల నుంచి వినతులను స్వీకరించాకే ప్రభుత్వం ఈ సవరణ చట్టాన్ని తెచ్చింది. వక్ఫ్ పేరిట ప్రైవేట్ ఆస్తులనూ తమ వశం చేసుకున్నారు. కొన్ని చోట్ల గ్రామాల్లోని భూములు మొత్తం వక్ఫ్ పేరిట నమోదై ఉన్నాయి. లెక్కలేనన్ని ప్లాట్లు వక్ఫ్ ఆక్రమణలో ఉన్నాయి’’ అని మెహతా వాదించారు. ‘‘ప్రభుత్వం నుంచి ప్రాథమికస్థాయి స్పందనను అనుమతించకుండానే చట్టంలోని నిబంధనలను నిలుపుదలచేయడమంటే ధర్మాసనం అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోందని అర్థమవుతోంది’’ అని మెహతా అసహనం వ్యక్తంచేశారు. ‘‘ మా వాదనలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్లు, పాత శాసనాలను మీ ముందు ఉంచుతాం. మాకు ఒక వారం గడువు ఇవ్వండి. ఈలోపు ఏమీ జరిగిపోదుగా’’ అని మెహతా వ్యాఖ్యానించారు. ‘‘ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వకుండా వారం రోజులు ఆగినంత మాత్రాన ఆకాశం విరిగిపడదుగా’’ అని ఒక రాష్ట్రం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వ్యాఖ్యానించారు. దీంతో సీజేఐ స్పందించారు. ‘‘ మీరు వక్ఫ్ ఆస్తులకు సంబంధించి యతాతథ స్థితిని మార్చకుండా ఉంటే చాలు’’ అని అన్నారు. వక్ఫ్ చట్టం అమలుకాకుండా తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషన్ల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే చట్టం మొత్తం పూర్తిగా నిలుపుదల చేయడం కుదరదని కోర్టు స్పష్టంచేసింది. ‘‘ నూతన చట్టంలోని కొన్ని సెక్షన్లు సమతుల్యతతో ఉన్నాయి. అందుకే మొత్తం చట్టాన్ని నిలుపుల చేయడం అస్సలు కుదరదు. అలా చేయడం సహేతుకం కూడా కాదు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున డీనోటిఫై లాంటి వాటి జోలికి పోవద్దు’’ అని ధర్మాసనం సూచించింది.ముగ్గురే వాదించాలి‘‘ఎన్నో పిటిషన్లు వచ్చినా ప్రస్తుతానికి మేం ఐదు పిటిషన్లనే స్వీకరిస్తాం. మీ అందరిలో కేవలం ముగ్గురు న్యాయవాదులనే అన్ని పిటిషన్ల తరఫున వాదించేందుకు అనుమతిస్తాం. ఏ ముగ్గురు వాదించాలో మీరే నిర్ణయించుకోండి’’ అని పలు పిటిషన్ల తరఫు లాయర్లకు సీజేఐ సూచించారు. ఏడు రోజుల తర్వాత కేంద్రప్రభుత్వం స్పందన తెలిపాక ఐదురోజుల్లోపు రీజాయిండర్లను సమర్పించేందుకు పిటిషన్లకు ధర్మాసనం గడువు ఇచ్చింది. మే ఐదో తేదీన ప్రాథమిక స్థాయి అభ్యంతరాలను ఆలకించాక తాత్కాలిక ఉత్తర్వులిస్తామని బెంచ్ తెలిపింది. 1995 వక్ఫ్ చట్టాన్ని, ఆ చట్టానికి 2013లో చేసిన సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లనూ వేరుగా విచారిస్తామని కోర్టు పేర్కొంది. వైఎస్సార్సీపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియత్ ఉలేమా–ఇ–హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, డీఎంకే, ఆకాఫ్ కర్ణాటక రాష్ట్ర బోర్డు మాజీ ఛైర్మన్ అన్వర్ బాషా, సమçస్త కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ ఖదారీ, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ ఫజుల్‌రహీమ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, మొహమ్మద్ జావేద్, ఢిల్లీ ఆప్ ఎంపీ అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ తదితరులు మొత్తంగా దాదాపు 72 పిటిషన్లను వక్ఫ్ చట్టాన్ని సవాల్‌చేస్తూ దాఖలు చేయడం తెల్సిందే. -
సుప్రీం కోర్టు తీర్పు.. ఉపరాష్ట్రపతి హాట్ కామెంట్స్
న్యూఢిల్లీ: శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించడం లేదంటే తిప్పి పంపే విషయంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికీ ఇటీవల సుప్రీం కోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేశారాయన. రాజ్యసభ ఇంటర్న్స్ 6వ బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి ఉండకూడదన్నారు. అదే జరిగితే రాజ్యాంగంలోకి ఆర్టికల్ 142 కింద సుప్రీం కోర్టు తనకున్న ప్రత్యేక అధికారాలను.. ప్రజాస్వామ్య శక్తులపై ఒక అణ్వాయుధాన్నే ప్రయోగించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు నిర్దిష్ట సందర్భాల్లో ఈ అధికారాన్ని విస్తృతంగా ఉపయోగించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.తమిళనాడు పెండింగ్ బిల్లుల వ్యవహారంపై జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్న సర్వోన్నత న్యాయస్థానం.. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం 10 పెండింగ్ బిల్లుల్ని చట్టాలుగా ప్రకటించింది.అయితే అటుపై రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలే చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గవర్నర్ పంపిన బిల్లులను రాష్ట్రపతి ఎటూ తేల్చకపోతే అప్పుడు రాష్ట్రాలు నేరుగా తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తీర్పుపై కేంద్రం ప్రభుత్వం సమీక్షకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే వేదిక నుంచి.. ఢిల్లీ హైకోర్టు జడ్జి బంగ్లాలో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంపైనా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ స్పందించారు. ఘటన జరిగి నెలరోజులు గడుస్తున్నా.. ఎఫ్ఐఆర్ లేకపోవడం, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం, జడ్జిలకు కలిగే ఉపశమనం గురించీ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
‘సుప్రీం’ కీలక నిర్ణయం.. పశ్చిమ బెంగాల్ టీచర్లకు స్వల్ప ఊరట
న్యూఢిల్లీ: విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని, నియామకాల్లో అవకతవకల కారణంగా ఈ నెల ప్రారంభంలో నియామకాలు రద్దు చేసిన పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయులు.. తాజా ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు విధుల్లో కొనసాగవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణంపై ఈ నెల ప్రారంభంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు 2016లో చేపట్టిన 25,753 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలు చెల్లవని తేల్చి చెప్పింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. తాజాగా, టీచర్ల నియామకం రద్దులో స్వల్ప ఊరట కల్పించింది.ఆ ఉద్యోగులకు వర్తించదుకొత్త టీచర్ల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు బోధన కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. అయితే, ఈ ఉపశమనం 2016 నియామకాలపై దర్యాప్తు సమయంలో ఆరోపణలు లేని అసిస్టెంట్ టీచర్లకే వర్తిస్తుంది. గ్రూప్- సీ, గ్రూప్-డీ, నాన్-టిచింగ్ ఉద్యోగులకు ఇది వర్తించదు. ఎందుకంటే వారిలో ఎక్కువమంది నియామకాల్లో అవినీతి పాల్పడ్డారని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కొత్త నియామక ప్రక్రియ ఎప్పుడంటేచీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం, పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (SSC)కు స్పష్టమైన గడువు విధించింది. కొత్త నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రకటన మే 31లోపు విడుదల చేయాలి. డిసెంబర్ 31లోపు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే, కోర్టు తగిన చర్యలు తీసుకుంటుందనీ, జరిమానా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ నెల ప్రారంభంలో పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (West Bengal Teacher Scam 2016)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. -
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
లక్నో: మాటలు, వినికిడి లోపం ఉన్న 11ఏళ్ల బాలికపై మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరించే రీతిలో బాలికపై ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ (uttar pradesh)రామ్‌పూర్ జిల్లాలో జరిగింది. ఆ దారుణం జరిగిన తీరును చూసి వైద్యులే కనీరు పెడుతున్నారు. తాము చూసిన అత్యంత ఘోరమైన లైంగిక నేరాల్లో ఇది ఒకటి’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రామ్‌పూర్ (rampur district) జిల్లాలో ఓ గ్రామానికి చెందిన బాలిక మంగళవారం సాయంత్రం కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, ఆ మరునాడే (బుధవారం)బాధితురాలి ఇంటికి అర కిలోమీటరు దూరంలో ఉన్న చెట్ల పొదల్లో అర్ధనగ్నంగా పడి ఉండడాన్ని ఓ వ్యక్తి గమనించాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు,స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.నేను చూసిన అత్యంత భయంకరమైన లైంగిక నేరాలలోవైద్య పరీక్షలు చేసిన డాక్టర్ అంజు సింగ్ బాలికపై జరిగిన దారుణాన్ని చూసి కంట తడిపెట్టారు. ‘నేను చూసిన అత్యంత భయంకరమైన లైంగిక నేరాలలో ఇది ఒకటి. బాలికపై ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు అత్యాచారం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అంతర్గత అవయవాల్ని సిగరెట్‌తో కాల్చారు. పంటి గాట్లు కూడా ఉన్నాయి. బలమైన వస్తువుతో ముఖం మీద కొట్టారు. ముఖం మీద తీవ్రగాయాలయ్యాయి. జరిగిన దారుణంతో షాక్‌కి గురైంది. భయపడుతోంది’ అని గద్గద స్వరంతో చెప్పారు.పోలీసులపై నిందితుడు కాల్పులుబాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అడిషనల్ ఎస్పీ అతుల్ కుమార్ శ్రీవాత్సవ నిందితుడి కోసం గాలింపు చర్యల్ని చేపట్టారు. మూడు పోలీసు బృందాల్ని రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా.. నిందితుడిది అదే గ్రామానికి చెందిన డాన్ సింగ్ (24) అనే వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించారు. పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు తెగబడ్డాడు. ఎదురు కాల్పుల్లో డాన్ సింగ్ గాయపడ్డాడని నిర్ధారించారు. బాలికకు మాయ మాటలు చెప్పిరామ్పూర్ పోలీస్ చీఫ్ విద్యా సాగర్ మిశ్రా మాట్లాడుతూ ..నిందితుడిని పట్టుకోవడానికి మూడు బృందాలను ఏర్పాటు చేశాం. అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపగా.. ఈ కాల్పుల్లో అతనికి బుల్లెట్ గాయమైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలిక ఇంటి బయట నిందితుడు బాలికతో మాట్లాడాడు. అనంతరం, మాయ మాటలు చెప్పి ఇంటి సమీపంలోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం 2025ను సవాల్ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు వింది. కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు. ఈ క్రమంలో.. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దని సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ‘‘వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు. వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దు. వక్ఫ్, వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై చేయొద్దు వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై స్టేటస్ కో విధిస్తున్నాం. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో సవివర రిప్లై దాఖలు చేయాలి. మరో ఐదు రోజుల్లో రిజైన్డర్ దాఖలు చేయాలి’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. గత విచారణలో(బుధవారం).. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుందిఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టంవక్ఫ్ అంటే ఇస్లాం కు అంకితమైందికేంద్రప్రభుత్వం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలుజేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామువక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమేహిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయిహిందూయేతర అధికారులు హిందూ ధార్మిక సంస్థలను నిర్వహిస్తున్నారువక్ఫ్ భై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారురిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకున్న అభ్యంతరం ఏమిటి సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలుసుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయివక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైందిఅయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయిహిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదాపార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా ?హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదాఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమి లోనే ఉందని అంటున్నారు చారిత్రక , పురావస్తు ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించడానికి వీలు లేదువక్ఫ్ పిటిషన్లపై విచారణ వేళ.. హైలైట్స్‌అంతకు ముందు.. వక్ఫ్ పిటిషన్ల విచారణను లైవ్ టెలికాస్ట్ కోరుతూ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ లేఖ రాసింది. బుధవారం విచారణ టైంలో కిక్కిరిసిపోయిన కోర్టు హాల్లో కనీసం నిలబడటానికి కూడా స్థలం సరిపోలేదని, ఊపిరి ఆడక ఇద్దరు లాయర్లు స్పృహ కోల్పోయారని లేఖలో ప్రస్తావించింది.సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షంహైదరాబాద్: వక్ఫ్ (సవరణ) బిల్లుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు వైఖరి దేశవ్యాప్తంగా ముస్లింలకు ఊరట కలిగించిందన్నారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం చేసిందన్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామన్నారు. 👉అధికారంలోకి రాగానే వక్ఫ్ చట్టాన్ని అడ్డుకుంటాం. బీహార్‌ను వక్ఫ్ అల్లర్లతో మరో బెంగాల్(ముర్షిదాబాద్)గా మార్చాలని వాళ్లు(కేంద్రంలోని బీజేపీ) అనుకుంటున్నారు. ఆర్జేడీ నాయకత్వంలో అది అయ్యే పని కాదు అని తేజస్వి యాదవ్ అన్నారు. 👉వక్ఫ్ చట్టం దేశ ప్రజల మధ్య ఐక్యతను క్రమంగా తుడిచిపెట్టేందుకేనని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వక్ఫ్ సవరణ చట్టం తెచ్చిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. ఇది ఫెడరలిజాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉల్లంఘించడమేనని అన్నారాయన. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్య ద్వారా.. ఆరెస్సెస్, బీజేపీలు వక్ఫ్ చట్టం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ఇండియా కూటమి.. కలిసి పోరాడుదాంరాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ చట్టం అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా కలిసి రావాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. సొంత దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం.. సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఆతిథ్యం మాత్రం స్వీకరిస్తున్నారని మండిపడ్డారు. ఏకతాటిపైకి వచ్చి వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలు పోరాడాలని ఆమె అంటున్నారు. -
తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం.. హైకోర్టు తీర్పుతో దంపతులకు షాక్!
లక్నో: ‘మీరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి పెళ్లి (love marriage) చేసుకున్నారు. అలాంటప్పుడు మీకెందుకు పోలీస్ భద్రత ఇవ్వాలి. మేం ప్రేమ వివాహం చేసుకున్నాం కాబట్టి తల్లిదండ్రుల నుంచి ముప్పు ఉందని పోలీస్ సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేం. మీ జీవితానికి, స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉందని మేం భావిస్తే అప్పుడు మీకు పోలీసులు భద్రత కల్పిస్తారు’ అంటూ అలహాబాద్ హైకోర్టు (allahabad high court) కీలక తీర్పును వెలువరించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ప్రేమవివాహం చేసుకున్న దంపతుల కేసులో అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్ 4న ఓ కీలక తీర్పును వెలువరించింది. ‘తాము ప్రేమవివాహం చేసుకున్నామని, తల్లిదండ్రుల నుంచి భయాందోళనలు ఉన్నాయంటూ శ్రేయా కేసర్వాని అనే మహిళ తన భర్తతో కలిసి తమకు పోలీసు రక్షణ కల్పించాలని’ కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి సౌరభ్ శ్రీవాస్తవ విచారణ చేపట్టారు. విచారణలో.. మీ జీవితానికి, మీ స్వేచ్ఛకు భంగం కలిగించేలా బెదిరింపులు వస్తే పోలీసులు రక్షణ కల్పించవచ్చు. అలాంటి బెదిరింపులు లేకుండా, కేవలం తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నారని చెప్పి రక్షణ కోరడం తగదని స్పష్టం చేసింది.దంపతులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్న విషయాలను పరిశీలించిన అనంతరం, దంపతులకు ప్రాణ భయమేమీ లేదని, వారికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని, పైగా వారి బంధువులు ఎటువంటి మానసిక లేదా శారీరక హానిని కలిగించే అవకాశం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.అలాగే, తమకు బెదిరింపులు వస్తున్నాయని సంబంధిత పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేయకపోవడం కూడా పరిగణనలోకి తీసుకుంది. అయితే, చిత్రకూట్ జిల్లా ఎస్పీకి రక్షణ కోరుతూ వినతి పత్రం ఇచ్చిన విషయాన్ని గుర్తించింది. పోలీసులు అవసరమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సామాజికంగా ఎదురయ్యే సమస్యలను దంపతులు ఎదుర్కొని, పరస్పరం అండగా ఉండడం నేర్చుకోవాలి’ అని కోర్టు సూచించింది.అంతేకాదు..ప్రేమ పెళ్లి చేసుకున్న యువతకు న్యాయస్థానాలు కేవలం రక్షణ కల్పించేందుకు మాత్రమే లేవు’ అంటూ గతంలో ఈ తరహా పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (supreme court of india) చేసిన వ్యాఖ్యల్ని ఉదహరించింది. -
జేఈఈ–మెయిన్ ఫైనల్ కీ కోసం వేచి ఉండండి: ఎన్టీఏ
న్యూఢిల్లీ: జేఈఈ–మెయిన్ ఆన్సర్ ఫైనల్ కీని విడుదల చేసే వరకు వేచిచూడాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) బుధవారం ఇంజనీరింగ్ విద్యార్థులను కోరింది. ప్రొవిజినల్ కీలో ఇచ్చిన సమాధానాల ఆధారంగా అప్పటివరకు ఎటువంటి నిర్ణయానికి రావొద్దని సూచించింది. జేఈఈ–మెయిన్ ప్రొవిజినల్ కీలో ఇచ్చిన సమాధానాల్లో పలు తప్పులు దొర్లాయంటూ విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్న ఈ మేరకు ఎన్టీఏ స్పష్టతనిచ్చింది. ‘పరీక్షా విధానంలో ఎన్టీఏ పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. ఇందులో భాగంగానే ప్రొవిజినల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. దీనిపై వచ్చిన అన్ని రకాల సందేహాలను పరిగణనలోకి తీసుకుంటుంది. విద్యార్థుల ఆందోళనలను, సందేహాలను నివృత్తి చేస్తుంది. అందరికీ న్యాయం దక్కేందుకు తగు చర్యలు తీసుకుంటుంది. ఫైనల్ ఆన్సర్ కీని ఇంకా వెల్లడించలేదు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా మాత్రమే స్కోర్ నిర్ణయమవుతుంది. ప్రొవిజినల్ కీ ఆధారంగా ఆన్సర్లపై ఎటువంటి నిర్ణయానికి రావద్దని ఎన్టీఏ సూచిస్తోంది. అనవసరమైన సందేహాలకు, ఆందోళనలకు కారణమయ్యే వార్తలను నమ్మవద్దని విద్యార్థులను కోరుతోంది’అని పేర్కొంది. కాగా, జేఈఈ–మెయిన్ రెండు దశల్లో జనవరి, ఏప్రిల్‌లలో ఎన్టీఏ నిర్వహించింది. -
సీఈసీ, ఈసీల నియామకంపై మే14న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: 2023 చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్లు(ఈసీల) నియామకాలను చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మే 14వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశంపై సత్వరం విచారణ చేపట్టాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన వినతి మేరకు బుధవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 19న సుప్రీంకోర్టు ప్రకటించిన విధంగా వాస్తవానికి ఈ పిటిషన్లపై బుధవారమే విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే, భూ సేకరణకు సంబంధించిన కీలకమైన అంశాలున్నందున వాయిదా వేయాల్సి వచ్చిందని ధర్మాసనం తెలిపింది. మే 14వ తేదీన తప్పక విచారిస్తామంది. -
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైన వక్ఫ్(సవరణ) చట్టం,2025ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ తొలిరోజే సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్లకు కాస్తంత ఊరట కల్గించేలా వ్యాఖ్యానించింది. సుదీర్ఘకాలంగా ముస్లిం మత, దాతృత్వ కార్యక్రమాలతో సంబంధముండి వక్ఫ్ అ«దీనంలో ఉన్న ఆస్తులను(వక్ఫ్ బై యూజర్) ఇకమీదటా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమా ర్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఆ దిశగా ఉత్తర్వులు, ఆదేశాలు ఇవ్వడానికంటే ముందు ఈ పిటిషన్లపై పూర్తిగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం కోరింది. ‘‘ ఆస్తులు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వక్ఫ్ అ«దీనంలో ఉన్నాయా? రిజిస్ట్రర్ డాక్యుమెంట్లతో వక్ఫ్ కు దఖలుపడ్డాయా? అనేది తేలకుండానే ‘వక్ఫ్ బై యూజర్’ అనే నిబంధనను తొలగించలేం. ఎక్స్–అఫీషియో సభ్యులు మినహా వక్ఫ్ బోర్డులు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లలో అందరూ ముస్లింలే సభ్యులుగా ఉండాలి’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. వక్ఫ్(సవరణ)చట్టం చట్టబద్ధతను సవాల్‌చేస్తూ దాఖలైన డజన్లకొద్దీ పిటిషన్లను బుధవారం విచారించడం మొదలెట్టాక తొలుత వీటిని హైకోర్టుకు బదలాయించాలని సుప్రీంకోర్టు భావించింది. అయితే ఈ ఆలోచనపై పిటిషన్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్, హుజేఫా అహ్మదీ, వైఎస్సార్సీపీ తరఫున వాదించిన ఎస్.నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావంచూపగల ఈ కేసులను సుప్రీంకోర్టులోనే విచారించాలని కపిల్ సిబల్ గట్టిగా వాదించారు. తర్వాత కోర్టు కేసును గురువారం మధ్యాహ్నానికి వాయిదావేసింది. ఆనాటి ఆస్తులకు పత్రాలుంటాయా? వక్ఫ్ ఆస్తిగా నమోదుచేయాలంటే వాటి డాక్యుమెంట్లు కచి్చతంగా సమర్పించాలంటూ చట్టంలోని సెక్షన్ 2ఏలో పేర్కొనడంపై సీజేఐ జస్టిస్ ఖన్నా అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘ ఢిల్లీలోని జామా మసీదునే ఉదాహరణగా తీసుకుందాం. వందల ఏళ్లుగా వాళ్ల అ«దీనంలో ఉన్న ఇలాంటి పాత ఆస్తులకు రిజిస్టర్ చేయాలంటే ఇప్పుడు డాక్యుమెంట్లు తీసుకురమ్మంటే ఎలా?. అలాంటి ఆస్తులకు డాక్యుమెంట్లు వాళ్ల దగ్గర ఉంటాయా? ’’ అని సీజేఐ.. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. గతాన్ని మీరు మార్చలేరు అని కేంద్రానుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ వక్ఫ్ ఆస్తుల్లో కొన్ని దురి్వనియోగం అయిన మాట వాస్తవమే. అంతమాత్రాన దాన్ని సాకుగా చూపి ‘వక్ఫ్ బై యూజ్’ నిబంధనను తొలగిస్తామంటే కొత్త సమస్యలొస్తాయి. వక్ఫ్ బై యూజర్‌ను కోర్టులు గతంలోనే ధృవీకరించాయి. కోర్టు తీర్పులు, ఉత్తర్వులు, నిర్ణయాలను ప్రభుత్వాలు నిర్ణయించకూడదు. మీరు కేవలం ప్రాతిపదికను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కేంద్రాన్ని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. వక్ఫ్ చట్టం తమకొద్దని చాలా మంది ముస్లింలు చెబుతున్నారని తుషార్ మెహతా చెప్పగా కోర్టు కలుగజేసుకుని ‘‘ అయితే మీరు హిందూ దాతృత్వ ట్రస్టుల్లోనూ ముస్లింలను సభ్యులుగా చేరుస్తామని చెప్పదల్చుకున్నారా?’’ అని సూటి ప్రశ్న వేసింది. ‘‘ వక్ఫ్ చట్టంపై ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ 38 సార్లు సమావేశమైంది. ఏకంగా 98.2 లక్షల మెమోరండంలను కమిటీ పరిశీలించింది. తర్వాతే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందింది’’ అని మెహతా చెప్పుకొచ్చారు. దీంతో సీజేఐ స్పందించారు. ‘‘ ఇక్కడ రెండు విషయాలు తేలాలి. ఈ కేసులన్నింటినీ హైకోర్టుకు బదలాయించాలా? లేదంటే అసలు మీరు సుప్రీంకోర్టు ద్వారా ఏం ఆశిస్తున్నారు? ఏం వాదించాలనుకుంటున్నారు? అంటూ కేంద్రంంతోపాటు పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారు. వాటికి సమాధానం చెప్పాలని ఆదేశించారు. ‘‘ చట్టంపై ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం ఆందోళనకరం. ఓవైపు ఈ అంశం కోర్టుల పరిధిలో పరిశీలనలో ఉండగా మరోవైపు ఆందోళనలు,హింస చెలరేగడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది’’ అని అన్నారు. వెంటనే తుషార్ మెహతా కలుగజేసుకుని ‘‘ఇలా ఆందోళనలు చేయడం ద్వారా వ్యవస్థపై వాళ్లు తీవ్రమైన ఒత్తిడిని తేద్దామని చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ ఎవరు ఎవరిపై ఒత్తిడి తెస్తున్నారు? మాకైతే అర్థంకావట్లేదు’’ అని సిబల్ బదులిచ్చారు. ‘‘ సానుకూల అంశాలపైనా చర్చిద్దాం’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఏ ప్రాతిపదికన ముస్లింగా నిర్ధారిస్తారు? పిటిషనర్ల తరఫున కపిల్ సిబల్ వాదించారు. ‘‘ నేను ముస్లింనా కాదా అనే విషయాన్ని ఏ రకంగా కేంద్రం నిర్ధారిస్తుంది?. ఇతను వక్ఫ్‌కు ఆస్తిని, ఇతరత్రాలను దానంగా ఇవ్వడానికి అర్హుడు అని కేంద్రం ఎలా నిర్ధారించుకుంటుంది?. గత ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్న వాళ్లే దానం ఇవ్వాలని చెప్పే హక్కు కేంద్రానికి ఎక్కడిది?’’ అని కోర్టులో సిబల్ వాదించారు. దశాబ్దాలుగా ఆచరణలో ఉన్న ‘వక్ఫ్ బై యూజర్’ను ఏకపక్షంగా తొలగించకూడదని లాయర్ హుజేఫా అహ్మదీ కోరారు. వైఎస్సార్సీపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియత్ ఉలేమా–ఇ–హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, సమస్థ కేరళ జమియతుల్ ఉలేమా, అంజుమ్ ఖదారీ, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మొహమ్మద్ షఫీ, మొహమ్మద్ ఫజుల్‌రహీమ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ ఝా, డీఎంకే, కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, మొహమ్మద్ జావేద్, తదితరులు మొత్తంగా 72 పిటిషన్లను వక్ఫ్ చట్టాన్ని సవాల్‌చేస్తూ దాఖలు చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీచేయకుండా ముందస్తుగా కేంద్రం ఏప్రిల్ 8వ తేదీన కెవియట్ పిటిషన్ దాఖలుచేసింది. దీంతో పటిషన్ల విచారణ మొదలుకాకుండానే సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి తాత్కాలిక ఉత్తర్వులురాకుండా అడ్డుకోగలిగింది.కేంద్రానికి సుప్రీంకోర్టు సంధించిన కీలక ప్రశ్నలు ⇒ ముస్లిమేతరులూ వక్ఫ్ బోర్డుల్లో ఉండేందుకు కొత్త చట్టం అనుమతిస్తోంది. మరి హిందూ ఆలయాల నిర్వహణ బాధ్యతలు చూసే ట్రస్టుల్లో ముస్లింలను సభ్యులుగా కేంద్రప్రభుత్వం అనుమతిస్తుందా? ⇒ బ్రిటిషర్లు రానంతవరకు భారత్‌లో భూములకు రిజి్రస్టేషనే లేదు. కొన్ని మసీదులను 14వ, 15వ శతాబ్దంలో నిర్మించారు. వాటికి సేల్‌డీడ్ లాంటివి తేవడం అసాధ్యం. శతాబ్దాలుగా వక్ఫ్ ఆస్తులుగా కొనసాగుతున్న మసీదులు, ఇతర ఆస్తుల హక్కుల పత్రాలు, డాక్యుమెంట్లను ముస్లింలు ఇప్పుడెలా తీసుకురాగలరు? ⇒ విచారణ, దర్యాప్తు పూర్తిచేసి అధీకృత అధికారి నిర్ధారించనంతవరకు సంబంధిత ఆస్తి వక్ఫ్‌ది కాదు అని ప్రభుత్వం చెబుతోంది. అలా నిర్ధారణ సాధ్యంకాని ఆస్తులన్నీ ప్రభుత్వానికి చెందుతాయా? ⇒ వక్ఫ్(సవరణ)చట్టం,2025 అమల్లోకి రాకముందు వరకు వక్ఫ్ బై యూజర్ నిబంధన అమల్లో ఉంది. ఇప్పుడు అది మనుగడలో లేదంటారా? ⇒ గతంలో కొన్ని ఆస్తులు వక్ఫ్ ఆస్తులేనని కోర్టు తీర్పులే స్పష్టంచేస్తున్నాయి. కొత్త చట్టంలోని సెక్షన్ 2ఏతో ప్రభుత్వం ఆ తీర్పులను చెల్లనివిగా మారుస్తోందా? -
‘కంచ’లోనే లోపలేస్తాం!
సాక్షి, న్యూఢిల్లీ: ‘అభివృద్ధి పేరుతో మూడు రోజుల్లోనే వందల బుల్డోజర్లను ఉపయోగించి 100 ఎకరాల్లో చెట్లను తొలగించారు. చెట్ల నరికివేతను ఏ రకంగానూ సమర్ధించుకోవాలని చూడొద్దు. చెట్ల నరికివేతకు అసలు అనుమతులు తీసుకున్నారా లేదా? ఈ ప్రశ్నకు మాకు సూటిగా సమాధానం చెప్పండి. ఒకవేళ అనుమతులు తీసుకోకపోయి ఉంటే మాత్రం అందుకు బాధ్యులైన అధికారులందరినీ జైలుకు పంపుతాం. వారి కోసం అదే ప్రాంతంలో తాత్కాలిక జైలు నిర్మించి మరీ ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ కంచ గచ్చిబౌలి భూముల కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జార్జ్ అగస్టీన్ మసీలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో 1996లో తామిచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులే బాధ్యులవుతారనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది. వంద ఎకరాల్లో అటవీ సంరక్షణ కోసం చట్టప్రకారం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఆదేశించింది. తాము చేపట్టబోయే తీవ్ర చర్యల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఇతర కార్యదర్శులను కాపాడాలనుకుంటే 100 ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తేల్చిచెప్పింది. పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికతోనే మా ముందుకు రావాలని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సుమారు అరగంటపాటు సాగిన వాదనల అనంతరం కేసు విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటివరకు స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. చెట్ల తొలగింపుపై తమ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) సమర్పించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ’పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషన్ తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అభివృద్ధి చేసేందుకే.. అంతకుముందు అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు ప్రారంభిస్తూ అన్ని అనుమతులతోనే ఆ భూముల్లో చెట్లను (పొదలు) తొలగించామన్నారు. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా అని ఈ సందర్భంగా ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. తెలంగాణలో వాటర్ అండ్ ట్రీ (వాల్టా) యాక్ట్ ఉందంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ జోక్యం చేసుకొని ధర్మాసనానికి వివరించగా ఈ చట్టం కింద అనుమతులు తీసుకోకుంటే అందరిపై చర్యలు తీసుకుంటామని ధర్మాసనం బదులిచ్చింది. ఆ భూములను రూ. 10 వేల కోట్లకు తనఖాపెట్టి ప్రభుత్వం అప్పు తెచ్చుకుందని అమికస్ క్యూరీ పేర్కొనగా ఆయన వ్యాఖ్యలను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఆ భూములను మార్టిగేజ్ చేశారా లేదా అమ్ముకున్నారా అనేది మాకు అనవసరం. అక్కడ చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? లేదా అనేది మాత్రమే మాకు సూటిగా జవాబు చెప్పండి’అంటూ సింఘ్వీని ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో కొన్ని షెడ్యూల్డ్ జంతువులు ఉన్నాయని.. అక్కడ పనులు జరిగేటప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని ‘బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ ’తరుఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, మోహిత్‌రావులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో జేసీబీలు ఉన్నాయని చెప్పారు. హెచ్సీయూకు 25 వేల ఎకరాల భూమి ఉందని.. అందులో 400 ఎకరాల భూవివాదం 2004 నుంచి కొనసాగుతోందని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. దీనికి సంబంధించి కోర్టు తీర్పులు, 20 ఏళ్లలో ఆ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. ఈ స్థలంలో ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మందికి జీవనోపాధి, ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు చెప్పారు. సీఎస్ ఒక మహిళ అని, ఆమె నెల రోజుల్లో రిటైరవనున్నారని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? ఈ సందర్భంగా ధర్మాసనం మళ్లీ స్పందిస్తూ ‘మేం పదేపదే చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అని అడుగుతున్నాం. ఈ ప్రశ్నకు మాకు సూటిగా మీ సమాధానం కావాలి’అంటూ వ్యాఖ్యానించింది. ‘సీఎస్ నెల రోజుల్లో రిటైరవుతున్నారంటే ఎలా సింఘ్వీజీ? ఆ ప్రాంతంలో జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? రాష్ట్రంలో జరుగుతున్న విషయాలకు సీఎస్ బాధ్యత వహించాలి కదా?’అంటూ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘అడవి అనే పదానికి నిర్వచనం ఇస్తూ 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా చెట్ల నరికివేత జరిగి ఉంటే మాత్రం మేం ఊపేక్షించం. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకోవాలనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అంటూ ధర్మాసనం నిలదీసింది. మహానగరాల్లో అటవీభూముల్లో కాపాడుకోకపోతే ఎలా? ‘చార్ధామ్ యాత్ర కోసం రోడ్డు నిర్మాణానికి చెట్లు తొలగిస్తామంటేనే మేం అనుమతించలేదు. మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కోసం పర్యావరణానికి నష్టం కలిగించిన కేసు రెండు దశబ్దాలుగా సుప్రీంకోర్టులోనే పెండింగ్‌లో ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాల్లోని అటవీ భూముల్ని కూడా కాపాడుకోలేకపోతే ఎలా? అంటూ ప్రశ్నలు సంధించింది. మంత్రులు ఏది చెబితే అధికారులు అది చేసేస్తున్నారంటూ అమికస్ క్యూరీ పరమేశ్వర్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా ‘పర్యావరణానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను జైళ్లకు పంపించాల్సి వస్తుంది జాగ్రత్త. చెట్లను కొట్టేసిన దగ్గరే తాత్కాలిక జైలు నిర్మిస్తాం. సంబంధిత అధికారులను అదే జైలులో 6 నెలలపాటు ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారు? చెట్లు కొట్టేసిన ప్రాంతంలో పర్యావరణ పునరుద్ధరణ కోసం తీసుకున్న చర్యలేంటి? ఆ భూముల్లో వన్యప్రాణుల్ని ఎలా రక్షిస్తారు? అక్కడి నష్టాన్ని ఎలా పూడుస్తారు?’అంటూ సింఘ్వీపై ధర్మాసనం ప్రశ్నలవర్షం కురిపించింది. విధ్వంసం చేస్తే ప్రేక్షక పాత్ర పోషించాలా? ఆ ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధపడిందని.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నందునే ఆ ప్రాంతమంతా దట్టమైన పొదలతో అడవిలా తయారైందని సింఘ్వీ వాదించారు. ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి ఎందరో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనుందని ధర్మాసనానికి చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘అభివృద్ధి, ఉద్యోగాల కల్పన పేరుతో మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే మేం ప్రేక్షకపాత్ర పోషించాలా?. మీకు మీరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమిటి? మూడు రోజుల్లో 100 ఎకరాలు ధ్వంసం చేశారంటే ఎన్ని బుల్డోజర్లు అక్కడ ఉన్నట్లు? మీరు సృష్టించిన రణరంగానికి అక్కడి జంతువులు ప్రాణభయంతో పరుగులు తీయగా వాటిని కుక్కలు కరిచాయి. ఆ వీడియోలను చూసి చలించిపోయాం’అని పేర్కొంది. అయితే ఆ భూముల్లో జంతువులు లేవని.. కావాలనే కొందరు నకిలీ వీడియోలు సర్క్యులేట్ చేశారని సింఘ్వీ బుదులివ్వగా ధర్మాసనం ఆక్షేపించింది. అక్కడ జంతువులు పరుగులు తీసిన వీడియోలను తాము చూసి చలించిపోయమని తెలిపింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని సింఘ్వీ ధర్మాసనానికి బదులిచ్చారు. దీనిపై తదుపరి విచారణను ధర్మాసనం మే 15కు వాయిదా వేసింది. -
సీఎన్జీ ఆటోలపై నిషేధం!.. ఢిల్లీ మంత్రి క్లారిటీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ ఆటోలపై నిషేధం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ స్పష్టత నిచ్చారు. సీఎన్జీ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయనున్నారనే వార్తలను మంత్రి పంకజ్ కుమార్ సింగ్ కొట్టిపారేశారు. సీఎన్జీతో నడిచే ఆటోరిక్షాలపై నిషేధం విధిస్తామన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ఢిల్లీ సర్కార్ పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఢిల్లీలో ఎలాంటి ఆటోలను తాము నిలిపివేయబోమని ఆయన ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి.త్వరలోనే 'ఈవీ పాలసీ 2.0'ను తీసుకురావడానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సీఎన్జీ ఆటోలపై బ్యాన్ విధిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో రవాణా శాఖ మంత్రి స్పందిస్తూ సీఎన్జీ ఆటోలపై నిషేధం విధించబోమంటూ క్లారిటీ ఇచ్చేశారు. -
వక్ఫ్ పిటిషన్లపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్ 16న) విచారణ ముగిసింది. తదుపరి విచారణను రేపటి మధ్యాహ్నానికి వాయిదా వేసింది. వక్ప్ సవరణ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాలని ఆదేశించింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ విచారణ చేపట్టనుంది. కేంద్రం కేవియెట్ పిటిషన్ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వక్ఫ్‌పై సుప్రీం కోర్టు సీజేఐ సంజీవ్ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న (వక్ఫ్ బై యూజర్) ఆస్తులను డినోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం..అయితే ఇది దుర్వినియోగమైంది. అయితే నిజంగా ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయి.హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు’ అని పేర్కొన్నారు. .. వక్ప్ సవరణ చట్టం పిటీషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం. వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైందన్నారు. .. కేంద్రప్రభుత్వం తరఫు వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జేపిసీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపాము. వక్ఫ్ అనేది కేవలం చారిటీకి సంబంధించినది మాత్రమే. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి’ అని వాదించారు. ..ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించడానికి వీలు లేదు’ అని స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రేపటికి వాయిదా వేసింది. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ప్రతిపాదించిన మధ్యంతర ఉత్తర్వులుకేసు విచారణ నేపథ్యంలో కోర్టు వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను డినోటిఫై చేయకూడదు . వక్ఫ్ బై యూజర్ అయినా, వక్ఫ్ బై డీడ్ అయినా సరే వాటిని డినోటిఫై చేయవద్దు. వక్ఫ్ భూమా, ప్రభుత్వ భూమా అనే అంశంపై కలెక్టర్ విచారణ జరుపుతున్నప్పుడు దానికి వక్ఫ్ సవరణ చట్టంలోని నిబంధనలను అమలు చేయవద్దు వక్ఫ్ బోర్డు , సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగిలిన వారంతా తప్పనిసరిగా ముస్లింలు మాత్రమే సభ్యులుగా ఉండాలి -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్.. కొలీజియం సిఫార్సు
ఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court) తదుపరి చీఫ్ జస్టిస్‌గా భూషణ్ రామకృష్ణ గవాయ్ (justice Bhushan Ramkrishna Gavai) బాధ్యతలు చేపట్టనున్నారు. మే13న కానున్న ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా రిటైర్ కానున్నారు. తదుపరి సీజేఐగా జస్జిస్ గవాయ్ పేరును కొలీజియం సిఫార్సు చేసింది. అనంతరం, కొలీజియం తన ప్రతిపాదనను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సుకు అనుగుణంగా కేంద్రం జస్టిస్ గవాయిని తదుపరి సీజేఐగా ((Chief Justice of India) నియమించింది. దీంతో సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ అనంతరం సుప్రీం తదుపరి సీజేఐ జస్జిస్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆరు నెలల పాటు సుప్రీం సీజేఐగా జస్జిస్ గవాయ్కేంద్రం నిర్ణయంతో జస్టిస్ గవాయ్ సుమారు ఆరు నెలలు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆయన నవంబరులో పదవీవిరమణ చేయనున్నారు. 2007లో భారత అత్యున్నత న్యాయస్థాన పదవిని చేపట్టిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత, ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే రెండో దళితుడు జస్టిస్ గవాయ్.జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రస్థానంమహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు.1992లో నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2003లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు. త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
గచ్చిబౌలి భూములు.. తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక
సాక్షి, ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడ చెట్ల నరికివేతపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికివేతపై సమర్థించుకోవద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి అని ప్రశ్నించింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూముల అంశంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీన్ని సమర్ధించుకోవద్దంటూ చురకలు అంటించింది. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా?.. సూటిగా జవాబు చెప్పండి. వంద ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారు?. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదు. వీడియోలు చూసి మేము ఆందోళనకు లోనయ్యాం. అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతుల్యం అవసరం. ఇష్టం వచ్చినట్టు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తామంటే ఊరుకోం. వాటిని ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పండి.. లేదంటే చెరువు దగ్గరే తాత్కాలిక జైలుపెట్టి అధికారులను అక్కడే ఉంచుతాం. షెల్టర్ కోసం జంతువులు పరుగులు తీస్తే.. వాటిని వీధి కుక్కలు తరిమాయి. 1996లో మేము ఇచ్చిన తీర్పుకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులు అవుతారు. ప్రైవేట్ ఫారెస్టులో సైతం చెట్లు నరికితే సీరియస్‌గా పరిగణిస్తాం. భూముల తాకట్టు అంశాలతో మాకు సంబంధం లేదు. కేవలం నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలి. డజన్ల కొద్ది బుల్డోజర్లతో అడవిలో వంద ఎకరాలు తొలగించారు. మీరు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలి. సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని ప్రశ్నించింది. చివరగా.. పర్యావరణ, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని తెలిపింది. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసింది. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ.. అన్ని పనులు ఆపి వేశాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారు. మినహాయింపులకు లోబడే మేము కొన్ని చెట్లు తొలగించాం అని చెప్పుకొచ్చారు.అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ.. సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుని.. అన్నింటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు. ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధం. ఈ భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకుంది అని అన్నారు. అంతకుముందే, ఈ కేసులో ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం. కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగా హెచ్‌సీయూ భూములలోని పక్షులు ఇక్కడికి వచ్చాయని పేర్కొంది. -
కంచె లేకపోవడం వల్లే.. కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్
న్యూఢిల్లీ, సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ విచారణ జరగనుంది. ఈ భూముల్లో జరుగుతున్న అన్ని కార్యాకలాపాలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ధర్మాసనం ఇంతకుముందు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 16లోపు(ఇవాళ) అఫిడవిట్ సమర్పించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు ఎంపవర్డ్ కమిటీని ఆదేశించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగానే.. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ‘‘కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కావు. 20 ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల పొదలు పెరిగాయి. అటవీ రెవెన్యూ రికార్డులలో వీటిని అడవులుగా పేర్కొనలేదు. ఆ భూములకు ఎలాంటి కంచె లేదు. కంచె ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నం చేశాం. ఈ భూముల్లో ఎలాంటి జంతువులు లేవు. కంచె లేని కారణంగానే హెచ్‌సీయూ భూముల్లోని పక్షులు ఇక్కడికి వచ్చాయి’’ అని కౌంటర్లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు.. సుప్రీం కోర్టు ఆదేశాలనుసారం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన కేంద్ర సాధికార కమిటీ(సీఈసీ) నివేదికను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణ నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ శాంతికుమారి( CS Shanti Kumari), తెలంగాణ పీసీసీఎఫ్ డోబ్రియాల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన అఫిడవిట్, సీఈసీ దాఖలుచేసిన నివేదికను పరిశీలించిన తర్వాత ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత’’గత వాదనల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అయిన జస్టిస్ గవాయ్ -
వక్ఫ్ పిటిషన్లపై ‘సుప్రీం’ కీలక విచారణ.. హైలైట్స్
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లను(Waqf Petitions) సుప్రీంకోర్టులో ఇవాళ (ఏప్రిల్ 16న) విచారణ జరపనుంది. కేంద్రం కేవియెట్ పిటిషన్ వేయడంతో ఇరువైపులా వాదనలను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. కొత్త చట్టంలోని పలు సెక్షన్లు రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు పలు సంస్థలు, ఎన్జీవోలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లను ఉమ్మడిగా ఇవాళ మధ్యాహ్నాం సీజేఐ బెంచ్ విచారణ జరపనుంది. వక్ఫ్ సవరణ చట్టం(Waqf Amendment Law) రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లిం మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమేనని వైఎస్సార్సీపీ సైతం తన పిటిషన్లో పేర్కొంది.👉ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్(బిహార్)తో పాటు జేడీయూ, ఆప్, డీఎంకే, సీపీఐ, వైఎస్సార్‌షీపీ.. ఇలా ప్రధాన పార్టీలతో పాటు జమైత్ ఉలేమా హింద్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా పిటిషన్లు వేశాయి. వక్ఫ్‌సవరణ చట్టం బిల్లు నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, ముస్లింల హక్కులను హరించే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. ; ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. 👉బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు చట్టానికి మద్ధతుగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. ఆ చట్టాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టేయబోదన్న ధీమాతో ఉంది.👉ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో మంగళవారం మరో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టంలోని కొన్ని సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే అది ఇవాళ విచారించబోయే పిటిషన్లతోనా? లేదంటే ప్రత్యేకంగానా? అనేదానిపై ఈ మధ్యాహ్నాం స్పష్టత రానుంది.👉పిటిషన్లలో కొన్ని.. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరికొన్ని.. దీనిని అమలు చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరాయి. 👉పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఈ నెల మొదట్లో సుదీర్ఘ చర్చల అనంతరం ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది. 👉అయితే.. చట్టసభల పరిధిని తాము దాటబోమని ఇంతకు ముందే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో చివరి తీర్పు ఇచ్చే అధికారం మాత్రం ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో.. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లో సమానత్వ హక్కు, మతాచారాలను అనుసరించేలాంటి హక్కులు ప్రభావితం అయ్యాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. అందుకే సుప్రీం కోర్టు ఈ పిటిషన్లపై వాదనలు వినేందుకు సిద్ధమైంది. 👉ఈ సవరణలు వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి, వెనుకబడిన ముస్లింలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని కేంద్రం అంటోంది. మత స్వేచ్ఛను హరిస్తాయనే విమర్శలను తప్పుబడుతోంది. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటోంది. వక్ఫ్ బోర్డుల్లో అవినీతిని తగ్గించి, వ్యవస్థను పారదర్శకంగా చేయడానికే ఈ బిల్లును తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. -
పిల్లలు కిడ్నాపైతే ఆస్పత్రి లైసెన్స్ రద్దు: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: ఏదైనా ఆస్పత్రి నుంచి పసికందు అపహరణకు గురైతే నిర్లక్ష్యానికి శిక్షగా ఆ ఆస్పత్రి లైసెన్స్‌ను రద్దుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంతర్రాష్ట్ర నవజాత శిశువుల కిడ్నాప్ రాకెట్లో సూత్రధారులైన 13 మంది నిందితులకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం మంగళవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, హైకోర్టులకు కీలక ఉత్తర్వులిచ్చింది.‘‘దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులు, జిల్లా కోర్టులు పెండింగ్‌లో ఉన్న పిల్లల కిడ్నాప్‌లు, అక్రమ రవాణా కేసులపై తక్షణం దృష్టిపెట్టాలి. ట్రయల్ కోర్టుల్లోని కిడ్నాప్‌ల కేసుల వివరాలు తెప్పించుకోవాలి. ఈ మేరకు మేం సర్క్యులర్ జారీ చేసిన ఆరు నెలల్లోపు ట్రయల్ కోర్టుల్లో ఈ కేసుల విచారణ కచ్చితంగా పూర్తవ్వాలి. అవసరమైతే కేసులను ప్రతిరోజూ విచారించండి. విచారణ పూర్తవగానే హైకోర్టులు మాకు నివేదించాలి’’ అని ధర్మాసనం సూచించింది. సిఫార్సులను రాష్ట్రాలు అమలుచేయాలి ‘‘మానవుల అక్రమ రవాణా ముఖ్యంగా ఆస్పత్రుల్లో నవజాత శిశువులు, బహిరంగ ప్రదేశాల్లో చిన్నారుల కిడ్నాప్ ఉదంతాల నివారణలో రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాల్లో తీవ్ర లోపాలున్నట్లు భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(బర్డ్) గుర్తించింది. 2023 ఏప్రిల్ 12వ తేదీన బర్డ్ ఇచ్చిన నివేదికను రాష్ట్రాలు కూలంకషంగా పరిశీలించాలి. నివేదికలోని ప్రతి అంశాన్ని, చేసిన ప్రతి సిఫార్సును రాష్ట్రాలు తప్పక పాటించాలి. మా ఆదేశాలను తూ.చ.తప్పకుండా అమలుచేయండి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండొద్దు’’ అని సుప్రీంకోర్టు ఆదేశించింది. తీవ్రమవుతున్న కిడ్నాప్‌లు ‘‘కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి పొందిన చిన్నారులను బాలల ఉచిత, నిర్బంధ విద్య,2009 చట్టం ప్రకారం స్కూళ్లలో చేరి్పంచండి. వాళ్ల విద్యావసరాలు తీర్చండి’’ అని సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ‘‘ కిడ్నాపర్ల పంథా మారింది. వినూత్న మార్గాల్లో అపహరణ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నిందితులకు అలహాబాద్ హైకోర్టు అత్యంత నిర్లక్ష్యంగా బెయిల్ మంజూరుచేయడం నిజంగా బాధపడాల్సిన విషయం. ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగా ఇలాంటి మరెందరో నిందితులు బయటికొచ్చి పత్తాలేకుండా పారిపోతున్నారు. దీంతో కేసుల్లో పురోగతి ప్రశ్నార్థకంగా మారుతోంది.కనీసం ఆ నిందితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వారానికి ఒకసారైనా హాజరయ్యే హైకోర్టు షరతును విధిస్తే బాగుండేది. ఈ కేసుల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఖరి సైతం విస్మయం కల్గిస్తోంది. హైకోర్టు ఈ కేసులో బెయిల్ ఇస్తే ఇంతకాలమైనా యూపీ సర్కార్ ఎందుకు బెయిల్‌ను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించలేదు?. ఈ కేసు తీవ్రతను రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం అర్థంచేసుకోలేదు’’ అని సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. బాధితులు, వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని యోగి సర్కార్‌ను ఆదేశించింది. నిందితులను రెండు నెలల్లోపు పట్టుకోవాలని ఆదేశించింది. -
ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: రైతన్నలకు శుభవార్త. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం ప్రకటించింది. వర్షపాతం 96 శాతం నుంచి 104 శాతం నమోదైతే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. ఈసారి దేశంలో మొత్తం దీర్ఘకాల సగటు వర్షపాతం 105 శాతంగా ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలియజేశారు.సాధారణ వర్షపాతానికి 30 శాతం, సాధారణం కంటే అధిక వర్షపాతానికి 33 శాతం, సాధారణం కంటే అత్యధిక వర్షపాతానికి 26 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ స్పష్టంచేసింది.తమిళనాడుతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. మొత్తం సీజన్లో ఎల్‌నినో పరిస్థితులు నెలకొనే అవకాశం లేదని తెలియచెప్పింది. 1971 నుంచి 2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సీజన్ వర్షపాతం దీర్ఘకాల సగటు 87 సెంటీమీటర్లుగా నమోదైందని ఐఎండీ తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ప్రతిఏటా జూన్ 1వ తేదీకల్లా కేరళలో ప్రవేశిస్తుంటాయి. సెప్టెంబర్ రెండోవారం కల్లా రుతుపవనాల సీజన్ ముగుస్తుంది. -
ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా
న్యూఢిల్లీ: హరియాణాలో భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా మంగళవారం ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. దాదాపు 2 గంటలపాటు ప్రశ్నించారు. 56 ఏళ్ల రాబర్ట్ వాద్రా సెంట్రల్ ఢిల్లీలోని సుజన్‌సింగ్ పార్కు సమీపంలో ఉన్న తన నివాసం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి నడుచుకుంటూ వచ్చారు.ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసులోకి అడుగుపెట్టారు. ఆయన తరఫు లాయర్లు, భద్రతా సిబ్బందిని ఈడీ అధికారులు లోపలికి అనుమతించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్తూ వాద్రా మీడియాతో మాట్లాడారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు తప్ప మరొకటి కాదన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం మాట్లాడినప్పుడల్లా తమ నోరు నొక్కడానికి, అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పార్లమెంట్లో మాట్లాడకుండా రాహుల్‌ని సైతం అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. -
హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై చార్జిషీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ఎంపీలు సోనియా గాందీ, రాహుల్ గాం«దీతోపాటు ఇతర నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జిషిట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా, సుమన్ దూబే, సునీల్ భండారీతోపాటు యంగ్ ఇండియా, డాటెక్స్ మెర్కండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను చార్జిషిట్‌లో నిందితులుగా చేర్చింది.రూ.2,000 కోట్ల విలువైన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దోచుకోవడానికి కుట్ర జరిగిందని, ప్రస్తుతం వాటి విలువ రూ.5,000 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టంచేసినట్లు సమాచారం. ఈ కేసులో సోనియా, రాహుల్ గాం«దీలను ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. వారిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)లోని వేర్వేరు సెక్షన్ల కింద ఈ నెల 9వ తేదీన ఈ చార్జిషీట్‌ను ఈడీ దాఖలు చేసింది. ఇందులో నంబర్–1గా సోనియా గాం«దీ, నెంబర్–2గా రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించింది. ఈడీ చార్జిషీట్‌ను పరిశీలించిన ప్రత్యేక జడ్జి విశాల్ గాగ్నే దీనిపై తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని కాంగ్రెస్ ఆరోపించింది. సుబ్రమణ్య స్వామి ఫిర్యాదుతో.. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. వాటిని స్వాదీనం చేసుకుంటామని చెబుతూ ఆయా ఆస్తుల్లో ఉంటున్నవారికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో 2021లో ఈడీ విచారణ ప్రారంభమైంది. 2014 జూన్ 26న బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ పరిగణనలోకి తీసుకున్నారు.మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈడీ దర్యాప్తు చేపట్టింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు మోతీలావ్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. నిందితులపై దర్యాప్తు చేపట్టడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని పేర్కొంది. కోర్టులు ఆ పిటిషన్లను కొట్టివేశాయని, దర్యాప్తునకు అనుమతించాయని గుర్తుచేసింది. సత్యమేవ జయతే: జైరామ్ రమేశ్ ఈడీ చార్జిషిట్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వేధింపులపై తాము మౌనంగా ఉండే ప్రసక్తే లేదని, కచ్చితంగా పోరాడుతామని స్పష్టంచేశారు. సత్యమేవ జయతే అంటూ మంగళవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. హెరాల్డ్ ఆస్తులను స్వా«దీనం చేసు కోవడం ప్రభుత్వ ప్రాయోజిత నేరమని విమర్శించారు. ప్రధాని, హోంమంత్రి బెదిరించాలని చూస్తే బెదిరిపోయే వారు ఎవరూ లేరని తేల్చిచెప్పారు. మరోవైపు సోనియా, రాహుల్‌పై చార్జిషిట్‌కు వ్యతిరేకంగా బుధవారం ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు? నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను 1938లో జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. ఈ పత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) ప్రచురించింది. 2008లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పత్రిక మూతపడింది. నేషనల్ హెరాల్డ్‌కు దేశ రాజధాని ఢిల్లీతోపాటు ప్రధాన నగరాల్లో విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పాటైంది. ఇందులో సోనియా గాం«దీ, రాహుల్ గాంధీలకు 38 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. రూ.2,000 కోట్లకుపైగా విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను 2012లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేవలం రూ.50 లక్షలకు కొట్టేసిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. -
ఈసీ తీరు పూర్తిగా.. అనుమానాస్పదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్‌కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడిగినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతున్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి చిరకాలంగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయమై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఆహ్వానం ఆ మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. తమ డిమాండ్లను మరోసారి ఈసీ ప్రతినిధుల ముందుంచారు. అనంతరం వారంతా మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు. తమ డిమాండ్లకు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదంటూ ఆక్షేపించారు.సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. ఇది ఈసీ విశ్వసనీయతకే పెనుసవాలు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్ భూషణ్ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. ఓటింగ్ సంబంధిత డేటాను ఎన్నికల ఏజెంట్లకు అందించడంలో లేని అభ్యంతరం వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ‘‘ఓటింగ్ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్ జరుగుతోందని దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింతగా బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్ దుయ్యబట్టారు.2024లోనూ అవకతవకలు: మొయిత్రా2019లోనే గాక 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్‌కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్ శాతాలు రాత్రికల్లా అనూహ్యంగా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది. అంతేకాదు, వాటిని తెలుసుకుని తీరాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది’’ అని ఆమె స్పష్టం చేశారు. -
ఈసీ తీరు అనుమానాస్పదం
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు సంస్థ పూర్తిగా తిలోదకాలిస్తోందంటూ ధ్వజమెత్తాయి. ‘‘ఓటింగ్‌కు సంబంధించి పౌరులందరికీ తెలియాల్సిన గణాంకాలను అడిగినా బయటపెట్టడం లేదు. ఎన్నికల ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఈసీ తీరుతో నానాటికీ బలపడుతున్నాయి’’ అంటూ దుయ్యబట్టాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల శాతానికి సంబంధించిన పూర్తి గణాంకాలను బయట పెట్టాల్సిందిగా అవి డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయమై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)తో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓట్లకు సంబంధించి 17సీ పార్ట్–1 తాలూకు ప్రతులన్నింటినీ వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. దీనిపై తొలుత ఈసీని సంప్రదించాల్సిందిగా గత నెల కోర్టు వారికి సూచించింది. దాంతో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఆహ్వానం మేరకు మంగళవారం సమావేశం జరిగింది. ఏడీఆర్ ప్రతినిధులతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, మొయిత్రా తదితరులు భేటీలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈసీ తీరుపై పెదవి విరిచారు. సీఈసీ, ఈసీ ఎక్కడ: భూషణ్ సీఈసీ గానీ, ఎన్నికల కమిషనర్లు గానీ భేటీలో పాల్గొనకపోవడాన్ని ప్రతినిధులు తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏదో అత్యున్నత న్యాయస్థానం సూచించింది గనుక తప్పలేదన్నట్టుగా వ్యవహరించారు. భేటీకి కేవలం ఈసీ ప్రతినిధులను పంపి సరిపెట్టారు. సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అతి కీలకమైన సమస్య విషయంలో వారి చిత్తశుద్ధి ఏపాటిదో దీన్నిబట్టే తేలిపోతోంది. అయినా సుప్రీంకోర్టుపై గౌరవంతో మా అనుమానాలన్నింటినీ ఈసీ ప్రతినిధుల ముందుంచాం. 2019 లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ శాతానికి సంబంధించిన డేటాలో చాలా అవకతవకలున్నట్టు వారి దృష్టికి తీసుకెళ్లాం. వాటిపై సమాధానాలు కోరాం. ఫాం 17(సీ), 20 వంటివాటిని వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచాల్సిందిగా సూచించాం. కానీ వారినుంచి సానుకూల స్పందనే లేదు’’ అంటూ ప్రశాంత్ భూషణ్ పెదవి విరిచారు. దీనిపై తమ తదుపరి వాదనలను ఇక సుప్రీంకోర్టు ముందే ఉంచుతామని స్పష్టం చేశారు. ‘‘ఓటింగ్ విషయంలో తప్పిదాలు, అవకతవకలు జరుగుతున్నాయని, ఈవీఎంల టాంపరింగ్ జరుగుతోందని దేశవ్యాప్తంగా చాలా అనుమానాలున్నాయి. అవి వాస్తవమేనంటూ దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు గళమెత్తుతున్నారు. ఈసీ ప్రవర్తన ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది’’ అంటూ భూషణ్ దుయ్యబట్టారు. 2024లోనూ అవకతవకలు: మొయిత్రా 2019లోనే గాక 2024 లోక్‌సభ ఎన్నికల విషయంలో కూడా ఓటింగ్‌కు సంబంధించి భారీ అవకతవకలు జరిగాయని మొయిత్రా ఆరోపించారు. ‘‘గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో్లనూ చాలా నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు పొంతనే లేదు. సాయంత్రం దాకా ఉన్న పోలింగ్ శాతాలు రాత్రికల్లా భారీగా పెరిగిపోయాయి. చాలాచోట్ల ఈ పెరుగుదల ఏకంగా 20 శాతం దాకా ఉంది’’ అని గుర్తు చేశారు. ఫలితంగా ప్రస్తుతం ఈసీ విశ్వసనీయత ఎన్నడూ లేనంతగా అడుగంటిందని విమర్శించారు. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ పూర్తిగా అప్రతిష్టపాలైందన్నారు. ‘‘మేం కోరుతున్నది రహస్య వివరాలేమీ కాదు. దేశప్రజలందరికీ వాటిని తెలుసుకునే హక్కుంది’’ అని ఆమె స్పష్టం చేశారు. -
అత్యాచార కేసులో అభ్యంతరకర వ్యాఖ్యలు.. అలహాబాద్ హైకోర్టుపై ‘సుప్రీం’ ఆగ్రహం
ఢిల్లీ: పలు సంచలన తీర్పులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న అలహాబాద్ (ఉత్తర ప్రదేశ్)హైకోర్టుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా తీర్పులతో సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.మార్చి 17వ తేదీన ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన తీర్పు వెల్లడించారు. వక్షోజాలను తాకడం.. యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రాదని పేర్కొంటూనే.. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును, న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది.మైనర్ బాలిక కేసు విచారణపై తీర్పు ఇచ్చిన తర్వాత.. ఇదే తరహా మరో కేసులో.. మరో కీలక తీర్పును వెలువరించింది. అత్యాచార ఘటనలో యువతిది స్వయంకృతాపరాధమేనని వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలపై మంగళవారం సుప్రీం కోర్టు స్పందించింది.అలహాబాద్ హైకోర్టు తీర్పుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. తీర్పులో భాగంగా బెయిల్ ఇవ్వొచ్చు. కానీ కోర్టు ఇలా వ్యాఖ్యానించవచ్చా?.అని ప్రశ్నించింది. తీర్పులు ఇచ్చే సమయంలో జడ్జీలు చేసే వ్యాఖ్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ కేసును పరిష్కరించేటప్పుడు మేము మరిన్ని కేసులను కూడా పరిశీలిస్తాం’ అని జస్టిస్ గవాయి అన్నారు. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ..‘న్యాయం చేయడమే కాదు, దాని గురించి అందరూ మాట్లాడకునేలా ఉండాలి’ అని అన్నారు. అలహాబాద్ కోర్టు చేసిన ఇలాంటి వ్యాఖ్యలు సామాన్యుడి దృష్టిలో ఎలా అనిపించవచ్చు అన్న విషయాన్ని జడ్జీలకు గుర్తు చేయాలని ఆయన సూచించారు. తీర్పును నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. అసలేం జరిగిందంటే?గతేడాది ఢిల్లీలో పీజీ విద్యార్థినిపై ఆమె క్లాస్‌మెట్ అత్యాచారం చేసినట్లు ఓ యువతి కేసు పెట్టింది. మద్యం మత్తులో ఉన్న తనని నిందితుడు రెండు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. అయితే, బాధితురాలిపై జరిగింది అత్యాచారం కాదని, పరస్పర అంగీకారంతో ఇద్దరు కలిసినట్లు నిందితుడి తరుఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిందితుడికి జైలు శిక్షను విధించింది. నిందితుడు నాటి నుంచి జైల్లో జీవితం అనుభవిస్తున్నారు. ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!తాజాగా, ఈ కేసు నిందితుడు అలహాబాద్‌లో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితురాలుగా ఉన్న యువతి ఎంఏ చదువుతోంది. ఏది తప్పో..ఏది ఒప్పో.. నైతికత గురించి ఆమెకు తెలియంది కాదు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. ఇక్కడ సమస్యను స్వయంగా ఆమెనే ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, జరిగిన దానికి ఆమె కూడా ఓ బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!.స్పందించిన సుప్రీం కోర్టు పైగా వైద్య పరీక్షలో కన్నెపొర(Hymen) చిరిగిపోయినట్లు తేలింది. కానీ లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇక ఈ కేసులో నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్ షరతులను ఉల్లంఘించడని హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకం కుదిరిన తర్వాతే నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలపై సుప్రీం కోర్టు స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించింది. -
రాణాపై రోజూ 8–10 గంటలు ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవ్వుర్ రాణా(64)ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)అధికారులు రోజులో 8 నుంచి 10గంటలపాటు ప్రశ్నిస్తున్నారు. పేలుళ్ల వెనుక కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. 2008 నవంబర్ 26వ తేదీన దాడులకు ముందు అతడు దేశంలోని పలు ప్రాంతాల్లో చేసిన పర్యటనల వెనుక ఉద్దేశాన్ని కనుగొనే దిశగా విచారణ సాగుతోందన్నారు. ఈ నెల 10న అమెరికా నుంచి తీసుకు వచ్చిన రాణాను ఢిల్లీ కోర్టు 18 రోజుల కస్టడీకి అనుమతించడం తెల్సిందే. రాణాకు ఆరోగ్య పరీక్షలు చేయించడంతోపాటు లాయర్‌ను కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని అధికారులు వివరించారు. ప్రధాన విచారణాధికారి జయా రాయ్ సారథ్యంలో విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారులకు రాణా సహకరిస్తున్నాడని ఓ అధికారి వెల్లడించారు. రాణా కోరిన మేరకు పెన్, నోట్ ప్యాడ్, ఖురాన్‌ను సమకూర్చామన్నారు. ఇతర నిందితులకు మాదిరిగానే ఆహారం అందిస్తున్నామని, ప్రత్యేకంగా ఏదీ అతడు కోరలేదన్నారు. రాణా ప్రస్తుతం ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్‌లో ఉన్న ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో అత్యంత భద్రత కలిగిన సెల్లో ఉన్నాడు. కుట్ర, హత్య, ఉగ్రకార్యకలాపాలకు ఊతమివ్వడం, ఫోర్జరీ తదితర ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ముంబై దాడుల వెనుక లష్కరే తోయిబా, హర్కతుల్ జిహాదీ ఇస్లామీకి చెందిన పలువురు ఉగ్ర నేతల ప్రమేయం ఉన్నట్లు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీలోనూ దాడులకు కుట్ర 2008 నవంబర్ 26వ తేదీన ముంబై ఉగ్రదాడులకు పథకం రచన చేసిన తహవ్వుర్ రాణా అదే రోజు దేశ రాజధాని ఢిల్లీలోనూ మారణ హోమం సృష్టించేందుకు పథకం వేసినట్లు వెల్లడైంది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్ జిత్ సింగ్ ఈ నెల 10వ తేదీన జారీ చేసిన 10 పేజీల ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘దేశమంతటా విస్తృతంగా పర్యటన చేసిన రాణా పలు నగరాల్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఇందులో ఢిల్లీ కూడా ఉన్నట్లు ఎన్ఐఏ ఆధారాలున్నాయి. జాతీ భద్రతకు సంబంధించిన విషయం ఇది. దీని వెనుక ఉన్న భారీ కుట్రకోణాన్ని ఛేదించేందుకు రాణా కస్టోడియల్ విచారణ అవసరం. సాకు‡్ష్యల విచారణ, ఆధారాల సేకరణ, రాణా అతడి అనుయాయుల పర్యటనల వివరాలను రాబట్టాల్సి ఉంది. 17 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలపై రాణాను పలు కీలక ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది’అని అందులో పేర్కొన్నారు. అనేక ఆరోగ్య సమస్యలున్న రాణాకు 48 గంటలకోసారి వైద్య పరీక్షలు చేయించాలని ఆయన ఆదేశించారు. -
అంబేడ్కర్‌కు బీజేపీ–ఆర్ఎస్ఎస్ శత్రువులు: ఖర్గే
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌పై ఎటువంటి అభిమానం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ ప్రభుత్వం అంబేడ్కర్ కృషిని ప్రశంసించడం కేవలం మాటలకే పరిమితమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. వాస్తవానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అంబేడ్కర్‌కు శత్రువులని ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందంటూ ప్రధాని మోదీ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఈ మేరకు స్పందించారు. 1952 ఎన్నికల్లో తన ఓటమికి కమ్యూనిస్ట్ నేత ఎస్ఏ డాంగే, హిందుత్వ వాది వీడీ సావర్కర్లే కారణమంటూ బీఆర్ అంబేడ్కర్ రాసిన ఒక లేఖను ఈ సందర్భంగా ఖర్గే మీడియాకు చూపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం దక్కేలా డాక్టర్ అంబేడ్కర్ పౌరులకు రాజ్యాంగాన్ని కానుకగా ఇచ్చారని కొనియాడారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఎస్సీ,ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కులగణనను వెంటనే చేపట్టాలన్నారు. ప్రభుత్వం పథకాలను అమలు చేసేందుకు ఇప్పటికీ 2011 జనగణనే ఆధారంగా చేసుకుంటోందని తెలిపారు. 2021లో చేపట్టాల్సిన జనగణన ప్రస్తావనను ప్రభుత్వం తేవడం లేదన్నారు. జనగణన, కులగణనను చేపట్టి సమాజంలోని అన్ని వర్గాలకు సమ న్యాయం చేయాలన్నారు. -
వేలానికి గోల్కొండ బ్లూ వజ్రం
న్యూఢిల్లీ: ఇండోర్, బరోడా మహారాజులు గతంలో ఎంతో మక్కువతో సొంతం చేసుకున్న అత్యంత అరుదైన గోల్కొండ బ్లూ వజ్రం వేలానికి రాబోతోంది. క్రిస్టీస్ వేలం సంస్థ స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో మే 14వ తేదీన ఈ నీలిరంగు వజ్రాన్ని వేలం వేయనుంది. ఈ వజ్రం బరువు 23.24 క్యారెట్లు. వేలంలో 35 మిలియన్ డాలర్ల నుంచి 50 మిలియన్ డాలర్లు (రూ.300 కోట్ల నుంచి రూ.430 కోట్లు పలకవచ్చని అంచనా వేస్తున్నారు. అరుదైన గోల్కొండ వజ్రాన్ని తాము వేలం వేస్తుండడం క్రిస్టీస్ సంస్థ గొప్ప గౌరవంగా భావిస్తోంది. ఇలాంటి అవకాశం జీవితకాలంలో ఒక్కసారే లభిస్తుంది ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. రంగు, పరిమాణంలో గోల్కొండ నీలి వజ్రాన్ని మించింది మరొకటి లేదని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ జువెల్లరీ రాహుల్ కడాకియా వెల్లడించారు. ఈ వజ్రం మూలాలు హైదరాబాద్ శివార్లలోని గోల్కొండ ప్రాంతంలో ఉన్నట్లు చెబుతున్నారు. -
బుల్డోజర్ల ప్రయోగంలో రేవంత్ సర్కారు బిజీ: ప్రధాని మోదీ
‘తెలంగాణ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేసేలా, జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తోంది. అడవుల్ని ధ్వంసం చేస్తోంది. వాటిపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది..’ –ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. హామీలను పక్కన పెట్టి బుల్డోజర్లను ప్రయోగించడంలో రేవంత్ సర్కార్ నిమగ్నమైందని ధ్వజమెత్తారు. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు నమ్మక ద్రోహానికి గురవుతున్నారని విమర్శించారు. తాము అభివృద్ధి ఎజెండాతో ముందుకెళుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పారు. హరియాణాలోని హిసార్‌లో ‘మహారాజ అగ్రసేన్ ఇంటర్నేషనల్’ విమానాశ్రయాన్ని ప్రధాని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఇటీవల వివాదం రేకెత్తిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల విశ్వాస ఘాతుకం హరియాణాలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తాము పూర్తిగా అమలు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో అక్కడి ప్రభుత్వాలు విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేసేలా, జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తోంది. అడవుల్ని ధ్వంసం చేస్తోంది. వాటిపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది..’అని మోదీ ధ్వజమెత్తారు. అవినీతిలో కర్ణాటకను నంబర్ వన్‌గా నిలిపారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్‌నప్రదేశ్‌లోనూ అభివృద్ధి, సంక్షేమం అటకెక్కిందన్నారు. కర్ణాటకలో కరెంట్ నుంచి పాల దాకా, బస్సు చార్జీల నుంచి విత్తనాల వరకు ప్రతిదాని రేట్లు పెరిగాయని ప్రధాని మండిపడ్డారు. అక్కడి సీఎం అవినీతిలో దేశంలోనే నంబర్ వన్‌గా ఆ రాష్ట్రాన్ని నిలిపారని ఆరోపించారు. బీజేపీది అభివృద్ధి మోడల్ అయితే, కాంగ్రెస్‌ది అబద్ధాల మోడల్ అని విమర్శించారు. -
యువతిని వేధించి.. ఆపై పోలీస్ స్టేషన్లో.. ‘ట్రై చేస్తే ఆస్కార్ అవార్డ్ పక్కా’
లక్నో: యువతి,యువకుడిపై అల్లరి మూకలు తెగబడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమంలో నిందితులు తాము అనారోగ్యంతో ఉన్నామంటూ పోలీసులకు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాలుతో కుంటుకుంటూ నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగింది?ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో అల్లరి మూకలు వీరంగం సృష్టించారు. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడి అనంతరం బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.అదిగో అప్పుడే నిందితులు తమలోని నటులను బయటపెట్టారు. ఫిర్యాదు దారులే తమపై దాడి చేశారంటూ పోలీసుల వద్ద మొరపెట్టుకున్నారు. బలహీన స్థితిలో ఉన్నామంటూ నటించేందుకు ప్రయత్నించారు. కాలుతో కుంటుకుంటూ నడుస్తూ, యాక్టింగ్ చేస్తున్న దృశ్యాలు చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వచ్చేస్తుంది కావాలంటే ట్రై చేయండి అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆస్కార్ అవార్డ్ రేంజ్ యాక్టింగ్‌తో పోలీస్ స్టేషన్లో అల్లరిమూకలు చేసిన స్టంట్ మీరూ చూసేయండి. These men from UP's Muzaffarnagar misbehaved with a woman. They were caught by @Uppolice and took them to their acting class and were asked to perform in front of cameras.@Uppolice, you've become a joke! pic.twitter.com/vKLV3oxOM7— Congress Kerala (@INCKerala) April 14, 2025 -
‘వక్ఫ్’ చట్టంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్
తాడేపల్లి,సాక్షి: వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఓటు వేసిన విషయం తెలిసిందే. మైనారిటీ సమాజానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.ఇందులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లును ఇటీవల పార్లమెంట్లో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. గతంలోనే వక్ఫ్ సవరణ బిల్లుపై వైఎస్సార్సీపీ అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. మళ్లీ పార్లమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టడంతో లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎంపీలు ఓటేశారు. ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి మరోసారి ముస్లింలను మోసం చేశారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి, వారి ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం’ అని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వైఎస్సార్సీపీ పేర్కొంది.కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో పాటు ఆపై రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ సవరణ బిల్లు చట్టు రూపం దాల్చింది. దీనిని సవాల్ చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవ్వగా, తాజాగా వైఎస్సార్ సీపీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. అందుకే వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో సవాల్ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోకుండా చట్టం చేశారు. అందుకే వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13,14,25,26లను ఉల్లంఘిస్తోంది. ప్రాథమిక హక్కులు, సమానత్వం, మత స్వేచ్చలకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని మతాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉంది. ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చటం వక్ఫ్ బోర్డు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవటమే. ఈ నిర్ణయం వక్ఫ్ బోర్డు పరిపాలన స్వాతంత్య్రాన్ని దెబ్బ తీస్తోందని వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. YSRCP has filed a petition in the Supreme Court challenging the Waqf Bill, citing serious constitutional violations and failure to address the concerns of the Muslim community.The Bill violates Articles 13, 14, 25, and 26 of the Constitution—provisions that guarantee…— YSR Congress Party (@YSRCParty) April 14, 2025 -
కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
హర్యానా: కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ సర్కార్ బిజీగా ఉంది. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీ సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు135వ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ హర్యానా రాష్ట్రం, యమునా నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పాలనని ప్రస్తావించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుంది. బీజేపీ చెత్త నుంచి మంచి పనులు చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ ఉన్న అడవులను నాశనం చేస్తుంది. ప్రకృతి నష్టం, జంతువులకు ప్రమాదం జరుగుతుంది. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతుంది.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మక ద్రోహం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజల ఆందోళనతో అభివృద్ధి కుంటు పడింది. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు, బస్సు కిరాయి వరకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం రేట్లు, పన్నులు పెంచింది. కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసింది. సత్యం ఆధారంగా, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ బీజేపీ ముందుకు వెళ్తోంది. వికసిత్ భారత్ కోసం బీజేపీ పనిచేస్తోందని పునరుద్ఘాటించారు.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదంప్రకృతి నడుమ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అలజడి రేగింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదం రేగింది. విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు. విద్యార్థి సంఘాలు, విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ హెచ్‌సీయూలో వివాదాస్పద భూముల పరిశీలనకు వచ్చింది. ఈ తరుణంలో కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ స్పందించారు. -
రెండ్రోజులు ఢిల్లీలో సీఎస్ మకాం
సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎలా స్పందించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గత విచారణలో భాగంగా కంచ గచ్చిబౌలిలో వెంటనే పనులు ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.అలాగే ఆ భూములను సందర్శించి ఈ నెల 16లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌తోపాటు మరో 10 మంది అధికారులతో కలిసి శనివారం ఢిల్లీ చేరుకున్న సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుమారు ఐదు గంటలపాటు అధికారులతో సమాలోచనలు చేశారు.సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన నివేదికపై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సహా మరికొందరు న్యాయవాదులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం. నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలేమిటి? క్షేత్రస్థాయిలో ఏం జరిగింది? ప్రభుత్వం నివేదిక సమర్పించాక న్యాయస్థానం ఎలా స్పందిస్తుంది? వంటి విషయాలపై న్యాయవాదుల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆదివారం సాయంత్రం ఆమె హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. -
వక్ఫ్ సవరణ చట్టంపై హీరో విజయ్ కీలక నిర్ణయం
ఢిల్లీ: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 4న పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ అంశాన్ని ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలతో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తాజాగా విజయ్ సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ వారంలో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే.రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది. దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే. వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. రాష్ట్రపతి సంతకంతో చట్టంగా రూపుదాల్చింది. -
యూపీఐ సేవల్లో తీవ్ర అంతరాయం
న్యూఢిల్లీ: భారత్‌లో నిత్యజీవిత కృత్యంగా మారిపోయిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. శనివారం మధ్యాహ్నం దేశవ్యాప్తంగా ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో తీవ్ర అవాంతరం ఏర్పడింది. జిరాక్స్ తీస్తే చెల్లించే రెండు రూపాయల మొదలు వ్యక్తిగత చెల్లింపు కింద ఏకంగా రూ.1 లక్ష దాకా నిత్యం నిరాటంకంగా కొనసాగుతున్న డిజిటల్ పేమెంట్లు ఆగిపోవడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపుల్లో ఇలా సమస్యలు తలెత్తడం గత నెలరోజుల్లో ఇది నాలుగోసారి. ఏప్రిల్ రెండో తేదీ, మార్చి 31, 26వ తేదీల్లో సైతం యూజర్లు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. యూపీఐ వంటి డిజటల్ చెల్లింపులను ట్రాక్ చేసే డౌన్‌డిటెక్టర్ సంస్థ ప్రకారం శనివారం ఉదయం 11.30 గంటల తర్వాత సమస్య మరింత ఎక్కువైంది. భారతీయ రిజర్వ్‌బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) కొంతకాలం క్రితం యూపీఐ సేవలను అందుబాటులోకి తేవడం తెల్సిందే. ‘‘శనివారం నాటి సమస్యకు పరిష్కార చర్యలు తీసుకుంటున్నాం. సేవల అంతరాయానికి చింతిస్తున్నాం’అని ఎన్పీసీఐ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేసింది. ‘‘పర్సు ఖాళీ. ఆన్లైన్లో ఆటోవాలాకు డబ్బులిద్దామంటే యూపీఐ పనిచేయట్లేదు. చాలా ఇబ్బంది పడ్డా’’అని ఒక యూజర్ అసహనం వ్యక్తంచేశారు. యూపీఐ పేమెంట్ సమస్యలొచ్చే వీలుందని కాస్త ముందుగా సమాచారం ఇస్తే చాలా బాగుంటుందని మరో యూజర్ అన్నారు. సాధారణ చెల్లింపులకుతోడు ఆటోపే ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వివిధ రకాల బిల్లులు, చందాలకు చెల్లింపులు ఆటోమేటిక్‌గా జరుగుతుండటంతో దేశవ్యాప్తంగా రోజూ యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య ఎప్పటికప్పుడు రికార్డుల స్థాయిలో పెరుగుతోంది. మార్చి నెలలో ఏకంగా రూ.24.77 లక్షల కోట్ల విలువైన యూపీఐ చెల్లింపులు జరిగాయి. గత నెలలో పోలిస్తే ఇది ఏకంగా 12.7 శాతం ఎక్కువ. జనవరిలో ఏకంగా 16.99 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీధి వ్యాపారులు, చిల్లర వర్తకులు, చిరు వ్యాపారులు, దుకాణాల్లో యూపీఐ చెల్లింపులు నేడు సర్వసాధారణమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రిటైల్ వ్యాపార చెల్లింపుల్లో 80 శాతం చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా ఆ 10 బిల్లులు
చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్.ఎన్.రవికి మధ్య వివాదానికే గాక అంతిమంగా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకు కారణమైన 10 బిల్లులు ఎట్టకేలకు చట్టంగా మారాయి. ఆ క్రమంలో మరో సంచలనానికి కారణమయ్యాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయి! ఇది భారత శాసననిర్మాణ చరిత్రలోనే కనీవిని ఎరుగని సంఘటనగా నిలిచిపోనుంది. ఆ 10 బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినా గవర్నర్ ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చడం తెలిసిందే. వాటికి గవర్నర్ ఆమోదం లభించినట్టుగానే పరిగణిస్తున్నట్టు పేర్కొంటూ ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన విశేషాధికారాల ద్వారా ఏప్రిల్ 8న తీర్పు వెలువరించింది. దాంతో గవర్నర్ గానీ, రాష్ట్రపతి గానీ లాంఛనంగా ఆమోదించకుండానే సదరు 10 బిల్లులకు స్టాలిన్ సర్కారు చట్టబద్ధత కల్పించగలిగింది. తీర్పు పూర్తి ప్రతి శుక్రవారం రాత్రి అందుబాటులోకి రాగానే ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే వాటికి చట్టరూపం కల్పిస్తున్నట్టు అందులో స్పష్టంగా పేర్కొంది. వీటిలో తమిళనాడు వర్సిటీలు, ఫిషరీస్ వర్సిటీ, వైస్ చాన్స్లర్ల బిల్లులు తదితరాలున్నాయి. దీన్ని చరిత్రాత్మక ఘటనగా డీఎంకే అభివర్ణించగా చరిత్ర సృష్టించడం తమ పార్టీ నైజమంటూ సీఎం స్టాలిన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాష్ట్రస్థాయిలో ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే ముందుగా అసెంబ్లీ, తర్వాత గవర్నర్ ఆమోదం పొందాలి. గవర్నర్ దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టవచ్చు. రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. లేదంటే అసెంబ్లీ పునఃపరిశీలన నిమిత్తం తిప్పి పంపవచ్చు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా గవర్నర్ విధిగా అనుమతి తెలిపాల్సిందే. అలాగాక రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను తమిళనాడు గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని స్టాలిన్ సర్కారు 2023లో సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై కోర్టు గత మంగళవారం తీర్పు వెలువరించింది. గవర్నర్ చర్య రాజ్యాంగవిరుద్ధమని, ఆర్టికల్ 200కు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. గవర్నర్ పునఃపరిశీలనకు వచ్చిన 2023 నవంబర్ 18వ తేదీనే బిల్లులకు ఆమోదం లభించినట్టే పరిగణిస్తున్నట్టు పేర్కొంది. అంతేగాక, ‘‘ఇకపై గవర్నర్లు తమ వద్దకొచ్చే బిల్లులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. అదే బిల్లు రెండోసారి వస్తే నెలలోపు ఆమోదం తెలిపి తీరాలి’’ అని గడువు విధిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తద్వారా గవర్నర్ వ్యవస్థను తక్కువ చేయడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఆ స్థానానికి ఉండే అత్యున్నత గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత గవర్నర్లపై ఉంటుంది. ప్రథమ పౌరునిగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని ప్రమాణం చేశాక రాజకీయ మొగ్గుదలలు తదితరాలకు అతీతంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మెలగాలి. అలాగాక ప్రజలకు ప్రతిరూపమైన అసెంబ్లీ నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకోవడమంటే చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే’’ అని స్పష్టం చేసింది. -
రాష్ట్రపతికీ మూడు నెలలే
న్యూఢిల్లీ: గవర్నర్ల నుంచి ఆమోదం నిమిత్తం రాష్ట్రపతి వద్దకు వచ్చే బిల్లుల విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాటిపై రాష్ట్రపతి మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని పేర్కొంది. తమిళనాడు గవర్నర్‌కు సంబంధించిన కేసుపై ఇటీవల వెలువరించిన తీర్పులో ఈ మేరకు స్పష్టం చేసింది. రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం ఇలా గడువు నిర్దేశించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మూణ్నెల్లు దాటినా సరైన కారణాలు చూపకుండా బిల్లులపై రాష్ట్రపతి ఏ నిర్ణయమూ తీసుకోని పక్షంలో సంబంధిత రా ష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ‘‘బిల్లుల విషయంలో 201 ఆర్టికల్ కింద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయసమీక్షకు అతీతమేమీ కాదు. వాటిని కోర్టులు సమీక్షించవచ్చు’’అని కూడా పేర్కొనడం విశేషం! బిల్లులపై నిర్ణయం విషయంలో గవర్నర్లకు స్పష్టమైన గడువు నిర్దేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్థీవాలా, జస్టిస్ ఎం.మహదేవన్ ధర్మాసనం ఏప్రిల్ 8న చరిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. ‘‘అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుపై గవర్నర్ మూడు నెలల్లోపు నిర్ణ యం తీసుకోవాలి. రెండోసారీ పంపితే నెలలోపు వి« దిగా ఆమోదించాల్సిందే తప్ప రాష్ట్రపతికి పంపడం చట్టవిరుద్ధం’’అని స్పష్టం చేసింది. అలా ఈ విషయమై గవర్నర్‌కు తొలిసారిగా గడువు విధించింది. బిల్లుల విషయమై మూడు నెలల గడువును రాష్ట్రపతికి కూడా వర్తింపజేయడం విశేషం. ఆ తీర్పు తాలూకు 415 పేజీల పూర్తి ప్రతిని సుప్రీంకోర్టు శుక్రవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడాలి ఆర్టికల్ 201 ప్రకారం గవర్నర్ తన వద్దకు పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు, లేదా పెండింగ్‌లో పెట్టవచ్చు. అది ఎంతకాలమన్న విషయమై అందులో రాజ్యాంగం గడువూ నిర్దేశించలేదు. అంతమాత్రాన బిల్లులపై నిరవధికంగా ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండేందుకు రాష్ట్రపతికి ‘పాకెట్ వీటో’అధికారాలేమీ ఉండబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘రాష్ట్రపతి తన వద్దకొచి్చన బిల్లుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే (షల్ డిక్లేర్) అని ఆర్టికల్ 201లో స్పష్టంగా పేర్కొన్నారు. దానికి ఆమోదం తెలపడమో, పెండింగ్‌లో పెట్టడమో ఏదో ఒకటి తప్పనిసరన్నదే దాని ఉద్దేశం. అంతే తప్ప రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అదే రాజ్యాంగం తాలూకు స్ఫూర్తికి విరుద్ధంగా ఉపయోగించవచ్చని కాదు. అదీగాక ఏ అధికారన్నైనా వాడుకునే విషయంలోనైనా సముచిత కాలావధి తప్పనిసరి. చట్టపరంగా కూడా అదే సరైనది. ఈ సాధారణ న్యాయసూత్రానికి 201 ఆర్టికల్ కింద రాష్ట్రపతికి సంక్రమించిన అధికారాలు కూడా అతీతం కాదు’’అని పేర్కొంది. ‘‘ఏదైనా బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం మూడు నెలలకు మించి ఆలస్యమయ్యే పక్షంలో అందుకు తగిన కారణాలను విధిగా నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియపరచాలి. రాష్ట్రాలు కూడా వాటికి సరైన వివరణలు, సమాధానాలివ్వడం ద్వారా ఈ విషయంలో పూర్తిగా సహకరించాలి’’అని స్పష్టం చేసింది.కోర్టుల పాత్ర పోషించొద్దు చట్టసభలు రూపొందించే బిల్లుల రాజ్యాంగబద్ధత విషయంలో కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆ కారణంగా బిల్లులను పెండింగ్‌లో పెట్టే పక్షంలో వాటి రాజ్యాంగబద్ధతను తేల్చాల్సింది సుప్రీంకోర్టు మాత్రమే. కనుక ఆర్టికల్ 143 ప్రకారం ఈ అంశాన్ని విధిగా సుప్రీంకోర్టుకు నివేదించాల్సి ఉంటుంది’’అని స్పష్టం చేసింది. అంతే తప్ప వాటిపై ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుని కోర్టుల పాత్ర పోషించడానికి వీల్లేదని పేర్కొంది. ‘‘ఫక్తు న్యాయపరమైన అంశాలివి. ఇలాంటి వాటిలో కార్యనిర్వాహక విభాగం వేలు పెట్టడానికి వీల్లేదని చెప్పడానికి మేం ఎంతమాత్రమూ సంశయించడం లేదు. ఎందుకంటే బిల్లుల రాజ్యాంగబద్ధతపై లోతుగా పరిశీలన జరిపి తగిన చర్యలను సిఫార్సు చేసే అధికారం కేవలం రాజ్యాంగ ధర్మాసనాలది మాత్రమే’’అని వివరించింది. -
కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ రాజీనామా
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమక్షంలో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ (ఆర్ఎల్డి)లోకి దిలీప్ చేరారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరిన దిలీప్.. ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో రాజీనామా చేసినట్లు సమాచారం. ఆర్ఎల్డిలోకి చేరిన దిలీప్ కుమార్‌ను ఆ పార్టీ తెలంగాణ, మహారాష్ట్ర ఇంఛార్జ్‌గా జయంత్ చౌదరి నియమించారు. -
వనజీవి రామయ్య మృతికి ప్రధాని మోదీ సంతాపం
న్యూఢిల్లీ, సాక్షి: సామాజిక కార్యకర్త, పర్యావరణ ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య(85) మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు దిగ్భ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన సేవలను కొనియాడారు. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపం తెలియజేశారు. ఈ మేరకు తెలుగులో ఓ పోస్ట్ ఉంచారాయన.‘‘దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో, మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ.. నలుగురితో మొక్కలు నాటిస్తూ.. వైవిధ్యమైన రీతిలో ప్రచారంతో హరిత ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తూ వచ్చారాయన. ఈ క్రమంలో కోటి మొక్కలకు పైనే నాటి అరుదైన ఘనత సాధించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు.దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో,…— Narendra Modi (@narendramodi) April 12, 2025 -
Intelligence alert: అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ, సాక్షి: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరగవచ్చనే నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత పట్టణాలు అప్రమత్తంగా ఉండాలని, గస్తీ పెంచుకోవాలని సూచించింది. సముద్ర మార్గం గుండా వచ్చిన ఉగ్రవాదులు 2008 ముంబై 26/11 మారహోమానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక సూత్రధారి, లష్కరే ఉగ్రవాది తహవూర్ రాణా విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని నిఘా సంస్థలు కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పించాయి. దీంతో హోం శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. ఉగ్రవాదులు డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని, ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతాలపై ఎక్కువ నిఘా ఉంచాలని సూచించింది. మరోవైపు.. నిఘా సంస్థలు రైల్వే శాఖను ప్రత్యేకంగా అప్రమత్తం చేయడం గమనార్హం. -
మూడు నెలల్లో తేల్చేయాల్సిందే.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి దేశసర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాలు రూపొందించే బిల్లుల నిలుపుదల విషయంలో గవర్నర్లకు, రాష్ట్రాలకు రాజ్యాంగ బద్ధమైన ప్రత్యేక అధికారాలేవీ ఉండబోవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.ఇంతకు ముందు గవర్నర్ల విషయంలోనూ ఇలాంటి గడువును నిర్దేశించిన సుప్రీం కోర్టు.. ఇప్పుడు రాష్ట్రపతి విషయంలోనూ ఈ తరహా సూచన చేయడం తెలిసిందే. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో..ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను మూడు నెలలకు మించి ఉంచకూడదని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని తాజాగా బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ జాప్యం జరిగితే గనుక సరైన రాష్ట్రపతి భవన్ ఆ కారణాలను రాష్ట్రాలకు వివరించాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ నిర్ణీత సమయంలోపూ రాష్ట్రపతి నుంచి సరైన స్పందన లేకుంటే మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచించింది.అంతకు ముందు గవర్నర్ విషయంలోనూ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రి మండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదంది. ఇక.. తాజాగా ఆర్టికల్ 201 రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ బిల్లు గనుక రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే.. రాష్ట్రపతి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీం కోర్టును సంప్రదించడానికి అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
ఢిల్లీలో దుమ్ము తుపాను, వర్ష బీభత్సం.. 205 విమాన సర్వీసులు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తూ.. దుమ్ము తుపానుతో పాటు మోస్తారు వర్షం కురిసింది. ఈ క్రమంలో దుమ్ము, ధూళితో కూడిన గాలులు వీయడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు.. ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో ముంబై టీమ్ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ తుపాన్ రావడంతో దీనికి సంబంధించిన వీడియోను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్లో షేర్ చేశారు.వివరాల ప్రకారం.. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులు వీస్తూ మోస్తరు వర్షం కురిసింది. అంతకుముందు.. దుమ్ము తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఈదురుగాలుల ఎఫెక్ట్‌తో ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 205 విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దాదాపు 50 విమాన సర్వీసులను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.Crazy wx! Gale and dust-storms at Dwarka, New Delhi.Heard from a friend at IGI airport, his aircraft was moving and guess what, he’s still on ground. You can imagine the wind speed then. #delhirain #delhiweather pic.twitter.com/BIOdq0bOq7— Anirban 👨💻✈️ (@blur_pixel) April 11, 2025ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. విమానాల రాకపోకల ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 12 గంటలుగా విమానాశ్రయంలోనే వేచి చూసినట్లు ఒక మహిళ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రయాణికులు ట్విట్టర్ వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైకి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాం. ఉదయం 12 గంటలకు బుక్ చేసుకున్న విమానం కాకుండా మరొకటి ఎక్కాలని అధికారులు సూచించారు. అదికాస్త ఎక్కాక అందులోనే 4 గంటల పాటు కూర్చోబెట్టి తర్వాత దింపేశారు అని ఒక ప్రయాణికుడు తెలిపారు.Delhi NCR is under a heavy dust storm! Visuals from Gurgaon — very intense dust storm hits Gurugram. Stay safe everyone! pic.twitter.com/IqGVen4kLb— The Curious Quill (@PleasingRj) April 11, 2025ఇక, శ్రీనగర్ నుండి ఢిల్లీకి ముంబైకి సాయంత్రం 4 గంటలకు కనెక్టింగ్ విమానం ఉంది. మా విమానం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది, కానీ దుమ్ము తుఫాను కారణంగా చండీగఢ్‌కు మళ్లించబడింది. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లింది అని ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న మరో ప్రయాణీకుడు తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం అయి ఉండి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.Flight Indigo 6E2397 jammu To delhi experiencing a dust storm, affecting takeoffs and landings and potentially causing air traffic congestion at delhi airport we are diverted to jaipur after long 4 hrs waiting to land at delhi now waiting in aircraft at jaipur airport for… pic.twitter.com/2GDeO19UK1— Dr. Safeer Choudhary (@aapkasafeer) April 11, 2025 Very strong #DustStorm Hit Delhi ncr#DelhiWeather pic.twitter.com/REZY7o8v5y— Raviiiiii (@Ravinepz) April 11, 2025आज दिल्ली में बवंडर 🌪️ आ गया …सभी अपने घर में सुरक्षित रहें 🙏🏻#delhiweather #sandstorm #DelhiRains #delhi pic.twitter.com/OCf4ZE7BfS— Shivam Rajput (@SHIVAMespeare) April 11, 2025 మరోవైపు.. ఢిల్లీలోని కక్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలో ప్లేయర్స్‌ను గ్రౌండ్ నుంచి లోపలికి వెళ్లాలని రోహిత్ శర్మ హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ROHIT SHARMA, WHAT A CHARACTER 😀👌 pic.twitter.com/Ifz1YlNHX4— Johns. (@CricCrazyJohns) April 11, 2025 कल रात आए आंधी–तूफान का भयानक मंजर देखिए, गुरुग्राम का हैं वीडियो#Gurugram #Thunderstorm #WeatherUpdate #DelhiWeather pic.twitter.com/EMu90l1Bjf— Vistaar News (@VistaarNews) April 12, 2025 -
ప్రజల హక్కుల గురించీ ఆలోచించాలి
న్యూఢిల్లీ: ప్రజలకుండే ప్రాథమిక హక్కుల గురించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆలోచించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నాగరిక్ అపూర్తి నిగమ్(ఎన్ఏఎన్) కుంభకోణం కేసును ఛత్తీస్‌గఢ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలంటూ ఈడీ వేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ ఎలా వేస్తారంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించింది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం వాటిల్లితే వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించి రక్షణ కోరేందుకు ఆర్టికల్ 32 వీలు కల్పిస్తుంది. ఇదే విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించగా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు..ఈడీకి కూడా ప్రాథమిక హక్కులుంటాయంటూ బదులిచ్చారు. అలాగైతే, వ్యక్తులకు కూడా ప్రాథమిక హక్కులుంటాయనే విషయం ఈడీ ఆలోచించాలి కదా..అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్ ఉపసంహరించుకునే అనుమతి కోరడంతో ధర్మాసనం సమ్మతించింది. ఈడీ తన హక్కుల కోసం మరో కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. కుంభకోణం ఆరోపణలున్న మాజీ ఐఏఎస్ అనిల్ టుటేజా ముందస్తు బెయిల్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఈడీ గతంలో ఆరోపణలు చేసింది. అంతేకాదు, ఈ కేసులో ఆరోపణలున్న ఉన్నత స్థాయి వ్యక్తులు కొందరు ఛత్తీస్‌గఢ్ హైకోర్టులోని ఒక జడ్జీతో టచ్‌లో ఉంటూ న్యాయపరమైన వెసులుబాట్లు పొందారని కూడా పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని, ముందస్తు బెయిల్‌ను కూడా రద్దు చేయాలని కోరింది. -
నాడు కసబ్ కోసం పెట్టిన ఖర్చు ఇదే.. ఇప్పుడు రాణా కోసం ఇంకెంత ఖర్చు చేయాలో?
ముంబై: దేశ చరిత్రలో అతి కిరాతక ఘటనగా నిలిచిపోయిన ముంబై ఉగ్రదాడి జరిగి 16 సంవత్సరాలు గడిచాయి. నాడు మారణ హోమానికి తెగబడిన ఉగ్రవాదులను తెరవెనక నుంచి నడిపించిన కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ హుస్సేన్ రాణాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు అనుమతి ఇచ్చింది.ఈ తరుణంలో నాటి 2008, నవంబర్ 26న పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ తోటి ఉగ్రవాదులతో కలిసి మారణ హోమం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ముంబై ఉగ్రవాద దాడిలో ప్రాణాలతో బయటపడిన ఏకైక నిందితుడు అజ్మల్ కసబ్ ఉరితీయడానికి సుదీర్ఘ సమయం పట్టగా.. జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ అందించారనే ఆరోపణలు ఉన్నాయి. అజ్మల్ కసబ్ తరహాలో కాకుండా తహవూర్ హుస్సేన్ రాణాకు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వొద్దని ముంబై ఉగ్రదాడి బాధితులతో పాటు యావత్ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాడు పట్టుబడ్డ సమయం నుంచి ఉరిశిక్ష వేసే వరకు అజ్మల్ కసబ్‌పై పెట్టిన ఖర్చు ఎంత అనే వివరాల్ని సమాచార హక్కు చట్టం ద్వారా అథక్ సేవా సంఘ్ ఛైర్మన్ అనిల్ గాల్గాలీ సేకరించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా.. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అజ్మల్ కసబ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కలిపి రూ. 28.46 కోట్లు ఖర్చు చేశాయి. ఆర్థర్ రోడ్ సెంట్రల్ జైలులో, పుణెలోని యరవాడ జైలులో కసబ్‌పై కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఖర్చు పెట్టాయి. వీటితో పాటు కసబ్‌కు ఉరిశిక్ష విధించే రోజు భోజనం కోసం రూ. 33.75, దుస్తుల కోసం రూ. 169 ఖర్చు కాగా,అంత్యక్రియల కోసం ప్రభుత్వం రూ. 9,573 ఖర్చు పెట్టినట్లు ఆర్టీఐ తేలింది. కసబ్‌పై పెట్టిన మొత్తం ఖర్చు వివరాలను మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆహారం: రూ. 43,417.67భద్రత: రూ. 1,50,57,774.90మెడిసిన్: రూ. 32,097దుస్తులు: రూ. 2,047సెక్యూరిటీ: రూ. 5,25,16,542అంత్యక్రియలు: రూ. 9,573మొత్తం ఖర్చు: రూ. 6,76,49,676.82ప్రస్తుతం, ఎన్ఐఏ రిమాండ్‌లో ఉన్న తహవూర్ రాణాకు సైతం విచారణ సుదీర్ఘ కాలం జరిగితే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాటి కసబ్ పెట్టిన ఖర్చుతో పోలిస్తే తహవూర్ రాణాకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.కసబ్‌కు ఉరిశిక్ష పడిన తేదీ, సమయంఉరిశిక్ష తేదీ, సమయం: కసబ్‌ను నవంబర్ 21, 2012న ఉదయం 7:30 గంటలకు ఉరితీశారు.ఎక్కడ ఉరితీశారు: మహారాష్ట్రలోని పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైలులో ఉరితీశారు. మెర్సీ పిటిషన్: ఉరిశిక్షకు రెండు వారాల ముందు, నవంబర్ 5, 2012న కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. -
భారతీయులకు అలా జరగాల్సిందే.. హెడ్లీతో రాణా
న్యూఢిల్లీ: ముంబై 26/11 దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్తాన్లో వీరమరణం పొందే సైనికులకు ఇచ్చే అవార్డు ఇవ్వాలని డేవిడ్ హెడ్లీతో తహవూర్ రాణా జరిపిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భారత్‌కు రాణా అప్పగింత సమయంలో అమెరికా న్యాయ విభాగం విడుదల చేసిన ఒక ప్రకటన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ అప్పగింత బాధిత కుటుంబాలకు న్యాయం చేసే కీలక అడుగుగా అభివర్ణించింది.ముంబై దాడుల సమయంలో భారత బలగాల చేతుల్లో మరణించిన తొమ్మిది మంది లష్కరే(LeT) ఉగ్రవాదులకు నిషాన్ ఏ హైదర్(పాక్‌లో వీరమరణం పొందే సైనికులకు ఇచ్చే గౌరవం) ఇవ్వాలి అని దాడుల మాస్టర్ మైండ్ హెడ్లీని రాణా కోరారు. అలాగే.. దాడులకు రెండేళ్లకు ముందు నుంచే హెడ్లీ తరచూ చికాగోకు వెళ్లి రాణాను కలుస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎల్ఈటీ కదలికల గురించి, ముంబై దాడుల గురించి వీరిరువురూ చర్చించారు.అప్పటికే చికాగోలో ఇమ్మిగ్రేషన్ వ్యాపారంలో ఉన్న రాణా ముంబైలోనూ ఓ కార్యాలయం తెరవాలని చూశాడు. దానికి ఎలాంటి అనుభవం లేకపోయినా హెడ్లీని మేనేజర్‌ను చేయాలనుకున్నాడు. అలాగే ముంబై దాడుల అనంతరమూ ఈ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో జరిగిన నష్టం గురించి హెడ్లీ ప్రస్తావించగా.. భారతీయులకు ఇలా జరగాల్సిందేనంటూ రాణా బదులిచ్చాడు. అంతేకాదు హెడ్లీ ప్రయాణాలకు అవసరమైన తప్పుడు పత్రాలను కూడా రాణానే సృష్టించేవాడు. ముంబై దాడుల్లో భాగస్వాములుడేవిడ్ కోల్మన్ హెడ్లీ(దావూద్ గిలానీ), తహవూర్ హుసేన్ రాణా.. ఈ ఇద్దరూ 2008 ముంబై ఉగ్రదాడుల కేసుల్లో ప్రధాన నిందితులుగానే ఉన్నారు. డేవిడ్ హెడ్లీ ప్రధాన సూత్రధారి కాగా.. రాణా అతనికి సహకరించాడని అభియోగాలు ఉన్నాయి. రెక్కీ నిర్వహించడంతో దాడులకు బ్లూప్రింట్ రూపకల్పన తదితర అంశాలను రాణానే దగ్గరుండి చూసుకున్నట్లు నేరారోపణలు ఉన్నాయి. ముంబై దాడులతో పాటు పలు ఉగ్రదాడుల కేసుల్లో 2009 అక్టోబర్‌లో తొలుత హెడ్లీ, ఆపై రాణా అరెస్టయ్యారు. డేవిడ్ హెడ్లీకి అక్కడి కోర్టులు 35 ఏళ్ల కారాగార శిక్ష విధించగా.. అప్రూవర్‌గా మారిపోయి అమెరికా న్యాయ విభాగంతో జరుపుకున్న ఒప్పందం ప్రకారం అతన్ని భారత్‌కు అప్పగించే అవకాశం లేకుండా పోయింది. ఇక.. 2013లో తహవూర్ రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఇల్లినాయిస్ కోర్టు. దాదాపు ఏడేళ్ల తర్వాత.. 2020లో తహవూర్ రాణాను తమకు అప్పగించాలని భారత్ అమెరికాకు విజ్ఞప్తి చేసింది. మూడేళ్ల తర్వాత.. సెంట్రల్ డిసస్టట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా అనుమతించింది. అప్పటి నుంచి అన్నిరకాల కోర్టుల్లో ఊరట కోసం రాణా ప్రయత్నిస్తూ వచ్చాడు. చివరకు అగ్రరాజ్య సుప్రీం కోర్టులోనూ దారులు మూసుకుపోవడంతో.. ఎట్టకేలకు అమెరికా భారత్‌కు అప్పగించింది. -
‘ప్రభుత్వం తప్పు చేస్తే శిక్ష మేం భరించాలా’, రోడ్డెక్కిన మాజీ ఉపాధ్యాయులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016 నిర్వహించిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమీషన్ (ssc)లో అవకతవకలు జరిగాయంటూ సుమారు 26 వేల మంది టీచర్ల నియామకాల్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. అయితే ఈ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసిన 26వేలమంది టీచర్లలో సుమారు 500 మంది రోడ్డెక్కారు.తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమబెంగాల్ సీల్దా, సెంట్రల్ అవెన్యూ ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జోగ్యో శిక్షక్ మంచ్ (అర్హత గల ఉపాధ్యాయుల ఫోరం) ప్రతినిధి మెహబూబ్ మండల్ మాట్లాడుతూ.. ‘పరీక్షలో మంచి స్కోరు సాధించినా, నియామకాల్లో జరిగిన అవినీతి వల్ల మేం అర్హులమే అయినప్పటికీ ఉద్యోగాలు పోయాయి ఇది మా తప్పా?' అని ఆవేదన వ్యక్తం చేశారు. #WATCH | West Bengal: A large number of teachers in Purulia district locked the gates of Purulia District Education Department and protested in the wake of 26,000 teachers in Bengal schools losing their jobs following a Supreme Court order. pic.twitter.com/F0x3x9bnXw— TIMES NOW (@TimesNow) April 10, 2025అయితే, మా ఉద్యోగం మాకు తిరిగి ఇవ్వండి. లేదంటే అర్హులు, అవినీతి పరుల్ని గుర్తించాలని కోరుతూ చేసిన ఈ ధర్నాలో బాధితులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. పలువురిపై దాడి చేశారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దాడి,లాఠీఛార్జీపై ఆందోళన కారులు మాట్లాడుతూ. ప్రజాస్వామ్యంలో మేము శాంతియుతంగా నిరసన తెలపలేకపోతే, న్యాయం కోసం మేము ఎవరి దగ్గరకు వెళ్లాలి? అని ప్రశ్నించారు. Kolkata Police officer using “mild force” to “violent mob” who happens to be teachers terminated from jobs due to ruling party’s monumental scam. #SSCScam pic.twitter.com/N2yd4u0acP— Aparna (@chhuti_is) April 9, 2025అవినీతికి శిక్ష, న్యాయానికి గౌరవం దక్కాలన్నదే మా డిమాండ్. త్వరలో మరింత మంది అర్హులైన ఉపాధ్యాయులతో సంప్రదింపులు జరపనున్నాం. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు.టీచర్ల నియామకం రద్దు.. తీర్పు వెలువరించిన సుప్రీం అంతకుముందు పశ్చిమబెంగాల్ టీచర్ స్కాంపై సుప్రీం కోర్టు ఏప్రిల్ 3న విచారణ చేపట్టింది. అనంతరం తుదితీర్పును వెలువరించింది. పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్ల్యూబీఎస్ఎస్సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. విద్యాశాఖ మంత్రితో సహా పలువురి అరెస్ట్2016లో పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్ఎస్సీ)నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థలైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు రంగంలోకి దిగాయి. దర్యాప్తు చేపట్టి పశ్చిమ బెంగాల్ మాజీ విద్యా శాఖ మంత్రి పార్థ ఛటర్జీ , రాష్ట్రస్కూల్ సర్వీస్ కమిషన్ పదవులు నిర్వహించిన మరికొందరు అధికారులను అరెస్ట్ చేశాయి. -
ముంబై ఉగ్రదాడి: తహవ్వుర్ హుస్సేన్ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ
ఢిల్లీ: ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణాను 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. గురువారం అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పాటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.వివరాల ప్రకారం.. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ ఎదుట ఎన్ఐఏ అధికారులు హాజరుపర్చారు. ఎన్ఐఏ తరఫున సీనియర్ అడ్వొకేట్లు నరేందర్ మాన్, దయాన్ కృష్ణన్, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వొకేట్ పీయూష్ సచ్‌దేవా వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించాలని దయాన్ కృష్ణన్ కోరగా, 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. అర్ధరాత్రి వరకూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా, ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్ఏంజెలెస్ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. అతిపెద్ద దౌత్య విజయం భారత్‌కు అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవ్వుర్ రాణా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగించింది. కొన్ని రోజులు క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రాణా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయ్యింది.2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి. అతడిని అమెరికా నుంచి భారత్‌కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతిచెందినవారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రాణా అప్పగింత ఒక కీలకమైన ముందుడుగు అని అమెరికా న్యాయ శాఖ గురువారం వెల్లడించింది. ముంబైలో ఆ రోజు ఏం జరిగింది? 2008 నవంబర్ 26న పాకిస్తాన్‌కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించారు. నవంబర్ 26 నుంచి 29 దాకా.. నాలుగు రోజులపాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. ఛత్రపతి శివాజీ టెరి్మనస్, ఒబెరియ్ ట్రిడెంట్ హోటల్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా హాల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు.ఆరుగురు అమెరికా పౌరులు సహా 166 మంది మృతిచెందారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. ముంబైలో ఉగ్రవాద దాడులకు రాణా సహాయ సహకారాలు అందించినట్లు ఎన్ఏఐ చెబుతోంది. 2009లో ఎఫ్‌బీఐ రాణాను అరెస్టు చేసింది. లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించింది. ఎవరీ రాణా? పాకిస్తాన్లో ధనవంతుల కుటుంబంలో 1961 జనవరి 12న జన్మించిన తహవ్వుర్ హుస్సేన్ రాణా చివరకు ఉగ్రబాట పట్టాడు. ఇస్లామాబాద్‌లో పెరిగిన రాణా హసన్ అబ్దల్ కేడెట్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే డేవిడ్ కోలోమన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. వైద్య విద్య అభ్యసించిన రాణా పాకిస్తాన్ సైన్యంలో డాక్టర్‌గా పనిచేశాడు. 1997లో మేజర్ హోదాలో పదవీ విరమణ పొందాడు. తర్వాత కెనడాకు చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ సేవలు అందించే కంపెనీ స్థాపించాడు. కెనడా పౌరసత్వం సంపాదించాడు.అనంతరం అమెరికాలోని షికాగోకు మకాం మార్చాడు. ఇమ్మిగ్రేషన్, వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. హలాల్ మాంసం విక్రయించే వ్యాపారం చేశాడు. హెడ్లీ సూచన మేరకు రాణా ముంబైలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. 2006 నుంచి 2008 దాకా హెడ్లీ ఈ ఆఫీసుకు ఐదుసార్లు వచ్చి వెళ్లాడు. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయాలో నిర్ణయించుకున్నాడు. 26/11 దాడులకు రాణా ఆఫీసును ఉగ్రవాదులు ఒక అడ్డాగా వాడుకున్నారు. ఆరుగురు ప్రధాన కుట్రదారుల్లో రాణా కూడా ఉన్నాడు. అయితే, హెడ్లీ అప్రూవర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో కస్టడీలో ఉన్నాడు. -
బాల్య వివాహాల కట్టడిపై కేంద్రం దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బాల్య వివాహాలను అరికట్టడానికి, బాల్య వివాహాలతో సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం సంబంధిత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. అందులో భాగంగా 2024 నవంబర్ 27న ‘బాల్ వివాహ ముక్త్ భారత్’ ప్రచారాన్ని ప్రారంభించింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన పెంపొందించడం, ఈ ఘటనలు ఎక్కడ జరిగినా నిరోధించేలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సహకారం అందించడం వంటి చర్యలను కేంద్రం చేపట్టింది. బాల్య వివాహాల నిషేధ పర్యవేక్షణ అధికారులను నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది. మరోవైపు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ‘మిషన్ శక్తి’ పథకం కింద బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని అమలు చేస్తోంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కూడా బాల్య వివాహాలను అరికట్టే విషయంలో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా 1098 అనే నెంబర్‌తో చైల్డ్ హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. మరోవైపు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2020 నుంచి 2022 వరకు మూడేళ్లలో దేశంలో 2,837 బాల్య వివాహాలు జరిగాయి. ఇందులో అత్యధికంగా 2021లో 1,050 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాల పరంగా చూస్తే ఈ మూడేళ్లలో అత్యధికంగా కర్ణాటకలో 672 , తమిళనాడులో 401, పశ్చిమబెంగాల్లో 324 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 170, ఆంధ్రప్రదేశ్‌లో 77 బాల్య వివాహాలు జరిగాయి. -
‘వక్ఫ్’ పిటిషన్లపై 16న సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)చట్టం–2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సహా దాఖలు చేసిన 10 వరకు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటుందని సుప్రీంకోర్టు వెబ్సైట్ పేర్కొంది. ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ఉంటారు. ఒవైసీతోపాటు ఆప్ నేత అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అర్షద్ మదానీ, సమస్త కేరళ జమియతుల్ ఉలెమా, అంజుమ్ కదారి, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మహ్మద్ షఫీ, మహ్మద్ ఫజలుర్రహీమ్, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా పిటిషన్లు వేశారు. ఈ చట్టంపై ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా ముందుగా తమ వాదనను వినాలంటూ ఈ నెల 8న కేంద్రం సుప్రీంకోర్టులో కెవియెట్ దాఖలు చేయడం తెల్సిందే. పార్లమెంట్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ముర్ము సంతకం చేయడంతో వక్ఫ్(సవరణ) చట్టం–2025ను గురువారం నోటిఫై చేసింది. తీవ్ర వ్యతిరేకత నడుమ పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ చట్టంతో తమిళనాడులోని 50 లక్షల మందితోపాటు దేశంలో ఉన్న 20 కోట్ల మంది ముస్లింల హక్కులకు భంగం వాటిల్లనుందని పిటిషనర్లలో ఒకటైన డీఎంకే అంటోంది. ఈ చట్టంలోని అంశాలు ఏకపక్షంగా, ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉన్నాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) అంటోంది. -
ఎన్ఐఏ అదుపులో రాణా
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. అతడిని ఎప్పుడు తీసుకొస్తారు? ఎలా తీసుకొస్తారు? అన్నదానిపై ఉత్కంఠకు తెరపడింది. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్ఏంజెలెస్ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ ఎదుట హాజరుపర్చారు. ఎన్ఐఏ తరఫున సీనియర్ అడ్వొకేట్లు నరేందర్ మాన్, దయాన్ కృష్ణన్, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వొకేట్ పీయూష్ సచ్‌దేవా వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించాలని దయాన్ కృష్ణన్ కోరగా, న్యాయమూర్తి తన ఉత్తర్వును రిజర్వ్ చేశారు. అర్ధరాత్రి వరకూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్ సమర్పించారు. అతిపెద్ద దౌత్య విజయం భారత్‌కు అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవ్వుర్ రాణా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగించింది. కొన్ని రోజులు క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రాణా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయ్యింది. 2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి. అతడిని అమెరికా నుంచి భారత్‌కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతిచెందినవారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రాణా అప్పగింత ఒక కీలకమైన ముందుడుగు అని అమెరికా న్యాయ శాఖ గురువారం వెల్లడించింది. ముంబైలో ఆ రోజు ఏం జరిగింది? 2008 నవంబర్ 26న పాకిస్తాన్‌కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించారు. నవంబర్ 26 నుంచి 29 దాకా.. నాలుగు రోజులపాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. ఛత్రపతి శివాజీ టెరి్మనస్, ఒబెరియ్ ట్రిడెంట్ హోటల్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా హాల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఆరుగురు అమెరికా పౌరులు సహా 166 మంది మృతిచెందారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. ముంబైలో ఉగ్రవాద దాడులకు రాణా సహాయ సహకారాలు అందించినట్లు ఎన్ఏఐ చెబుతోంది. 2009లో ఎఫ్‌బీఐ రాణాను అరెస్టు చేసింది. లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించింది. ఎవరీ రాణా? పాకిస్తాన్లో ధనవంతుల కుటుంబంలో 1961 జనవరి 12న జన్మించిన తహవ్వుర్ హుస్సేన్ రాణా చివరకు ఉగ్రబాట పట్టాడు. ఇస్లామాబాద్‌లో పెరిగిన రాణా హసన్ అబ్దల్ కేడెట్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే డేవిడ్ కోలోమన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. వైద్య విద్య అభ్యసించిన రాణా పాకిస్తాన్ సైన్యంలో డాక్టర్‌గా పనిచేశాడు. 1997లో మేజర్ హోదాలో పదవీ విరమణ పొందాడు. తర్వాత కెనడాకు చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ సేవలు అందించే కంపెనీ స్థాపించాడు. కెనడా పౌరసత్వం సంపాదించాడు. అనంతరం అమెరికాలోని షికాగోకు మకాం మార్చాడు. ఇమ్మిగ్రేషన్, వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. హలాల్ మాంసం విక్రయించే వ్యాపారం చేశాడు. హెడ్లీ సూచన మేరకు రాణా ముంబైలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. 2006 నుంచి 2008 దాకా హెడ్లీ ఈ ఆఫీసుకు ఐదుసార్లు వచ్చి వెళ్లాడు. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయాలో నిర్ణయించుకున్నాడు. 26/11 దాడులకు రాణా ఆఫీసును ఉగ్రవాదులు ఒక అడ్డాగా వాడుకున్నారు. ఆరుగురు ప్రధాన కుట్రదారుల్లో రాణా కూడా ఉన్నాడు. అయితే, హెడ్లీ అప్రూవర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో కస్టడీలో ఉన్నాడు. రాణాను బహిరంగంగాఉరి తీయాలి: ఏక్నాథ్ ఓంబలే ఉగ్రవాది తహవ్వుర్ రాణాను బహిరంగంగా ఉరి తీయాలని ఏక్నాథ్ ఓంబలే డిమాండ్ చేశాడు. వందల మంది ప్రాణాలను బలిగొన్న ముష్కరుడికి బతికే హక్కు లేదని అన్నాడు. భారత్‌పై దాడులు చేయాలన్న ఆలోచన వస్తే ఏం జరుగుతుందో ఉగ్రవాదులకు తెలియాలంటే రాణాను జనం సమక్షంలో ఉరికంభం ఎక్కించాల్సిందేనని తేల్చిచెప్పాడు. 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల్లో ఏక్నాథ్ ఓంబలే సోదరుడు, అసిస్టెంట్ ఎస్ఐ తుకారాం ఓంబలే కన్నుమూశాడు. ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను బంధించే ప్రయత్నంలో మృతిచెందాడు. ఆ సమయంలో తుకారాం వద్ద లాఠీ తప్ప ఎలాంటి ఆయుధం లేదు. ఆయినప్పటికీ కసబ్‌ను ధైర్యంగా అడ్డుకున్నాడు. కోపోద్రిక్తుడైన కసబ్ కాల్పులు జరపడంతో తుకారాం నేలకొరిగాడు. కసబ్‌ను చాలాసేపు నిలువరించడం వల్లే చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. తుకారాంకు ప్రభుత్వం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. దాడులకు ముందు తాజ్‌మహల్ సందర్శన ఉగ్రవాది తహవ్వుర్ రాణా ముంబై దాడుల కంటే ముందు భార్యతో కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్‌తోపాటు కొచ్చీ, ముంబై నగరాల్లో పర్యాటక ప్రాంతాలను సందర్శించాడు. 2008 నవంబర్ 26న దాడులు జరిగాయి. నవంబర్ 13 నుంచి 21 దాకా రాణా ఇండియాలోనే ఉన్నాడు. అతడు దేశం వదిలివెళ్లిపోయిన ఐదు రోజుల తర్వాత 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించారు. భార్య డాక్టర్ సమ్రజ్ అక్త్తర్తో కలిసి రాణా నవంబర్ 13న ఢిల్లీకి చేరుకున్నాడు. తర్వాత వారు మీరట్, ఘజియాబాద్‌లోని సమ్రజ్ బంధువుల ఇళ్లకు వెళ్లారు. తర్వాత వేగన్ఆర్ కారులో ఆగ్రాకు చేరుకొని ఓ హోటల్లో బసచేశారు. మరుసటి రోజు తాజ్‌మహల్‌ను సందర్శించారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగివెళ్లారు. కొచ్చిలో రెండు రోజులు ఉన్నారు. తర్వాత ముంబైలో పోవై హోటల్లో, జలవాయు విహార్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో బస చేశారు. జలవాయు విహార్‌లో 1971 నాటి యుద్ధ వీరులు నివసిస్తుంటారు. ఈ యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ కాంప్లెక్స్‌ను పేల్చివేయాలని రాణా భావించాడు. కానీ, అక్కడ దాడులకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. నవంబర్ 21న ఇండియా నుంచి వెళ్లిపోయాడు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల కేసులో తహవ్వుర్ రాణాపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ తరఫున వాదించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ అడ్వొకేట్ నరేంద్ర మాన్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన నియామకం రాబోయే మూడేళ్లపాటు లేదా కేసు విచారణ పూర్తయ్యేదాకా అమల్లో ఉంటుంది. ఉగ్రవాద దాడులకు సంబంధించి ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేత కోర్టులతోపాటు అప్పిలేట్ కోర్టులో నరేంద్ర మాన్ వాదిస్తారు. దయాన్ కృష్ణన్ కృషి వల్లే.. తహవ్వుర్ రాణాను రప్పించడం వెనుక సీనియర్ లాయర్ దయాన్ కృష్ణన్ కృషి ఎంతో ఉంది. రాణా కేసులో భారత ప్రభుత్వం తరఫున అమెరికా కోర్టుల్లో ఆయన సమర్థంగా వాదనలు వినిపించారు. అమెరికా కోర్టులో రాణాపై విచారణ 2018లో ప్రారంభమైంది. 2023 మే 16న కృష్ణన్ చేసిన వాదనను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆఫ్ సెంట్రల్ డి్రస్టిక్ట్ ఆఫ్ కాలిఫోరి్నయా మేజిస్ట్రేట్ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. రాణాను ఇండియాకు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారు. రాణాను రప్పించే విషయంలో ఈ తీర్పు కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఒకే కేసులో రెండుసార్లు ఎలా శిక్షిస్తారంటూ రాణా తరఫు న్యాయవాది పాల్ గార్లిక్ క్యూసీ చేసిన వాదనను దయాన్ కృష్ణన్ గట్టిగా తిప్పికొట్టారు. రాణాపై ఎన్ఐఏ కోర్టులో ఎన్ఐఏ తరఫున వాదించే బృందంలో కృష్ణన్ సైతం చేరబోతున్నట్లు తెలిసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్కు ఆయన సహకరిస్తారు. ఈ బృందంలో అడ్వొకేట్లు సంజీవి శేషాద్రి, శ్రీధర్ కాలే సైతం ఉంటారని సమాచారం. అప్పటి హీరోనే ఇప్పటి ఎన్ఐఏ చీఫ్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సదానంద్ దాతే 26/11 దాడుల సమయంలో ఉగ్రవాదులతో హోరాహోరీగా తలపడ్డారు. అప్పట్లో ఏసీపీగా పని చేస్తున్న సదానంద్ ఆ రోజు రాత్రి ముంబై కామా ఆసుపత్రిలో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్‌ను 40 నిమిషాలపైగా ఒంటరిగా ఎదుర్కొన్నారు. ముష్కరుల కాల్పుల్లో మిగతా పోలీసులు గాయపడగా, అయన ఒక్కరే ధైర్యంగా ముందడుగు వేశారు. ఎదురు కాల్పులు జరుపుతూ ఆ ఇద్దరినీ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్ పేలి సదానంద్ గాయపడ్డారు. అయినప్పటికీ కాల్పులు ఆపలేదు. 40 నిమిషాలపాటు సమయం చిక్కడంతో చాలామంది ప్రజలు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 26/11 దాడుల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏకు సదానంద్ దాతే 2024 మార్చి నుంచి సారథ్యం వహిస్తున్నారు. 2026 డిసెంబర్ 31దాకా ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. -
Tahawwur Rana: తహవూర్ రాణా దారులన్నీ మూసుకుపోయాయి.. ఇక
ఢిల్లీ: ముంబై 26/11 ఉగ్రదాడి కేసు ప్రధాన నిందితుడు తహవూర్ హుస్సేన్ రాణాను (Tahawwur Rana) భారత్‌కు తరలించారు. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఢిల్లీ విమానాశ్రయంలోనే రాణాను ఎన్ఏఐ(National Investigation Agency) అరెస్ట్ చేసింది. అనంతరం తీహార్ జైలుకు తరలించింది. తీహార్ జైల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా తహవూర్ రాణా గురించి ఎన్ఐఏ అధికారిక ప్రకటన చేసింది.ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ తహవర్ రాణాను భారత్‌కు తీసుకురావడంలో ఎన్ఐఏ విజయవంతమైంది. ముంబై దాడులకు పడిన పాల్పడిన కుట్ర దారున్ని న్యాయస్థానాల ముందు నిలబెడుతున్నాం. అమెరికాలో రాణాకు అన్ని న్యాయపరమైన దారులు మూసుకు పోయాయి. 2023 మే 16న భారత్‌కు అప్పగించేందుకు అమెరికా స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. pic.twitter.com/nS7dA58W55— NIA India (@NIA_India) April 10, 2025 రాణా ఫైల్ చేసిన అన్ని పిటిషన్లు అమెరికా సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు కొట్టివేశాయి. అమెరికా భారత్‌లోని కీలక సంస్థల సమన్వయంతో రాణాను భారత్‌కు తీసుకు రాగలిగాం. ముంబై ఉగ్రదాడుల కుట్ర దారు రాణా. డేవిడ్ హెడ్లితో కలిసి ముంబై దాడులకు కుట్ర పన్నాడు. లష్కర్ ఈ తోయిబా, హుజీ ఉగ్ర సంస్థలు, పాకిస్తాన్ కుట్ర దారులు ఇందులో భాగస్వాములు. ముంబై ఉగ్రదాడులో 166 మంది చనిపోయారు 238 మంది గాయపడ్డారు’అంటూ అధికారిక నోట్‌ను విడుదల చేసింది. -
తహవూర్ రాణా అరెస్ట్.. తీహార్ జైలుకు తరలించిన ఎన్ఐఏ
న్యూఢిల్లీ, సాక్షి: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్ రాణాను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అనంతరం, తీహార్ జైలుకు తరలించింది. తీహార్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు ఎన్ఐఏ కోర్టు ముందు రాణాను ప్రవేశపెట్టనున్నారు. తీహార్‌లోని హై సెక్యూరిటీ జైల్లోనే రాణాను ఎన్ఐఏ విచారణ చేయనుంది. ముంబై దాడుల వెనుక పాకిస్తాన్లో ఎవరెవరున్నారనే కోణంలో ఎన్ఐఏ విచారణ జరుపనుంది.26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్ రాణా ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో గురువారం మధ్యాహ్నాం ల్యాండయ్యింది. దీంతో దేశ రాజధాని రీజియన్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారికంగా అరెస్టు చేసినట్లు సమాచారం. అనంతరం ఎన్ఐఏ కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఎన్ఐఏ న్యాయమూర్తి 2008 ముంబై ఉగ్రదాడి కేసు విచారించనున్నారు. విచారణ అనంతరం.. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు తీహార్ జైలుకు తరలిస్తారా? లేదంటే మరోచోట ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. 🚨 BIG BREAKING NEWS26/11 mastermind Tahawwur Rana has ARRIVED in India, following his EXTRADITION from US [Bharti Jain/TOI] 🔥— NIA will take him into custody. pic.twitter.com/ELPwS28L5L— Megh Updates 🚨™ (@MeghUpdates) April 10, 2025తహవూర్ రాణాను విచారణ ఇలా ఉండనుంది26/11 దాడుల నిందితుడు రాణాపై దర్యాప్తు ఎలా జరుగుతుందనే అంశంపై పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తహవూర్ రాణాను ఎన్ఐఏ లేదా సంబంధిత దర్యాప్తు సంస్థలు అతనిని అరెస్ట్ చేస్తాయి. అనంతరం,ఎన్ఐఎలోని 12 మంది సీనియర్ అధికారుల బృందంతో విచారణ చేస్తారు. రాణా నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి, కోర్టులో పోలీస్ కస్టడీ కోరుతారు. ఈ దశలో అతని పాస్‌పోర్ట్‌లు, డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలను పరిశీలన జరుగుతుంది.అతని సహచరులతో సంబంధాలపై విచారణ చేపడతారు. కుట్రలు,ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా అనే కోణంలో ప్రశ్నలు ఉంటాయి. పోలీస్ విచారణ ముగిసిన తర్వాత, అతనిని జైల్లో జుడిషియల్ కస్టడీకి తీసుకుంటారు. ఈ దశలో కోర్టులో చార్జ్ షీట్ దాఖలవుతుంది. ప్రతి 14 రోజులకు ఒకసారి రిమాండ్ పొడిగింపు.ఎన్ఐఏ/సీబీఐ వంటి సంస్థలు సేకరించిన ఆధారాల ఆధారంగా యూఏపీఏ, ఐపీసీ, ఆయుధ చట్టాలలోని సెక్షన్ల కింద కోర్టులో చార్జ్‌షీట్ నమోదు చేస్తారు. తహవూర్ రాణాకు శిక్ష పడేది అప్పుడే అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ ఉగ్రవాద సంస్థల నుండి మద్దతు, డబ్బు మార్పిడి లింకులు పరిశీలన ఉంటుంది. చార్జ్ షీట్ కోర్టు ఆమోదించిన తరువాత అభియోగాలపై రాణా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వ తరఫున ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పిస్తుంది. తుది తీర్పు రీత్యా శిక్ష అమలవుతుంది. ఆధారాల బలాన్ని బట్టి ఈ మొత్తం ప్రక్రియ నెలల నుంచి సంవత్సరాల వరకూ సాగే అవకాశం ఉంటుంది. ఎవరి తహవూర్ రాణాపాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది FBI అతన్ని అరెస్టు చేసింది. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. అయితే ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో తహవూర్ రాణా(Tahavur Rana)ను భారత్‌కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే.. ఆ తర్వాత కూడా భారత్‌కు తరలించే అంశంపై రాణా ఊరట కోసం ప్రయత్నించినప్పటికీ.. దారులన్నీ అప్పటికే మూసుకుపోయాయి. -
రాణాకు వీఐపీ ట్రీట్మెంట్.. బిర్యానీలతో మేపొద్దు
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి,లష్కరే తోయిబా ఉగ్రవాది తహవుర్ రాణా (Tahawwur Hussain Rana) భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన తహవుర్ రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. ఈ తరుణంలో రాణాకు జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ అంటే ప్రత్యేక సెల్, బిర్యానీ వంటి వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదని, అతన్ని ఉరితీయాలని దేశ ప్రజలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.తహవూర్ రాణాను ఉరితీయాలివారిలో 2008లో ముంబై ఉగ్రవాద దాడుల నుండి అనేక మందిని ప్రాణాలు కాపాడిన స్థానిక టీసెల్లర్ ఛోటు చాయ్ వాలా అలియాస్ మహ్మద్ తౌఫిక్ సైతం ఉన్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే దేశంలో కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పీటీఐతో మాట్లాడారు. అజ్మల్ కసబ్‌కు ఇచ్చినట్లుగా తహవూర్ రాణాకు ప్రత్యేక సెల్ లేదా, బిర్యానీ, ఇతర సౌకర్యాలు అందించాల్సిన అవసరం లేదన్నారు#WATCH | Mumbai: On 26/11 Mumbai attacks accused Tahawwur Rana's extradition to India, Mohammed Taufiq, a tea seller known as 'Chhotu Chai Wala' whose alertness helped a large number of people escape the attack, says, "...For India, there is no need to provide him with a cell.… pic.twitter.com/zLqHEt7sHs— ANI (@ANI) April 9, 2025‘రాణాను భారత్‌కు తీసుకుని రావడం శుభపరిణామం. కానీ అతనిని 15 రోజుల్లో లేదా రెండు మూడు నెలల్లో బహిరంగంగా ఉరితీయాలి. ఇలాంటి ఉగ్రవాదులకు ఎటువంటి ప్రత్యేక వసతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అజ్మల్ కసబ్‌కు జైల్లో అందించిన వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఇలాంటి వారిపై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వృధా. రాణాను ఉరితీసేవరకు తాను ఎదురు చూస్తాను. నాటి ఉగ్రదాడి బాధితులకు ప్రభుత్వం సహాయం అందించింది. కానీ డబ్బుతో ప్రాణాల్ని తిరిగి తెచ్చుకోలేం కదా?’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రమూకల నుంచి ప్రజల్ని కాపాడి2008 నవంబర్‌లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ సమీపంలో మహ్మద్ తౌఫిక్ టీ స్టాల్ నడుపుతున్నారు.ఆ సమయంలో ఉగ్రవాదులు దాడిలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజల్ని చూసిన తౌఫిక్ అప్రమత్తమయ్యారు.వెంటనే వారిని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని,జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారిని సురక్షితంగా ఉగ్రవాదుల నుంచి తప్పించారు. అప్పటికే ముష్కరుల చేతిలో గాయపడిన బాధితుల్ని ఆస్పత్రి తరలించారు. -
రాణా ఓ పిల్లకాకి.. అతడి విషయంలోనే దుర్మార్గంగా అమెరికా తీరు: జీకే పిళ్లై
న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు తహవూర్ రాణా(Tahawwur Rana) భారత్‌కు వస్తున్న వేళ.. హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల్లో రాణా పాత్ర నిమిత్త మాత్రమేనన్న ఆయన.. అసలు కుట్రదారుడ్ని అప్పగించకుండా అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.తహవూర్ రాణా ఓ పిల్లకాకి. 26/11దాడుల్లో అతని జోక్యం చాలా తక్కువే. అసలు కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ(David Coleman Headley). అతను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని అమెరికాకూ తెలుసు. అయినా అతని తరలింపును ఆపేసి దుర్మార్గంగా వ్యవహరించింది అని జీకే పిళ్లై(GK Pillai) అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఐఎస్ఐకి డబుల్ ఏజెంట్‌గా వ్యవహరించిన హెడ్లీ.. 26/11 సంఘటన తర్వాత కూడా దాడుల కోసం భారత్‌పై నిఘా కొనసాగించాడు. 2009 అక్టోబర్‌లో చికాగో ఎయిర్‌పోర్టులో అతన్ని అరెస్ట్ చేశారు. ఆపై ఉగ్ర దాడుల అభియోగాలు రుజువు కావడంతో అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే.. దర్యాప్తునకు సహకరించి లష్కరే తాయిబా గురించి కీలక సమాచారం అందించేందుకు అతను అంగీకరించాడు. ఈ ఒప్పందం కారణంగా.. అతనితో బేరసారాలు కుదుర్చుకున్న అమెరికా భారత్‌కు అప్పగించకుండా ఉండిపోయింది. దావూద్ సయ్యద్ గిలానీ(డేవిడ్ కోల్మన్ హెడ్లీ) 1960లో వాషింగ్టన్లో జన్మించాడు. అతని తండ్రి సయ్యద్ సలీం గిలానీ పాక్ దౌత్య వేత్త. తల్లి అలైస్ సెర్రిల్ హెడ్లీ వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయంలో అమెరికా కార్యదర్శిగా పని చేశారు. పాక్‌లో ఎక్కువ రోజులు గడిపిన హెడ్లీ.. క్రమంగా లష్కరే తాయిబాకు దగ్గరై ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన 64 ఏళ్ల కెనెడియన్ అయిన రాణా ఇప్పటివరకు లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. 2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తొలుత రైల్వే స్టేషన్లో బీభత్సం సృష్టించిన ముష్కరులు ఆ తర్వాత రెండు లగ్జరీ హోటళ్లపై దాడి చేశారు. ప్రాణాలతో దొరికిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను నవంబర్ 2012లో పూణెలోని యరవాడ జైలులో ఉరి తీశారు. ఈ దాడులకు మాస్టర్‌మైండ్ డేవిడ్ హెడ్లీనే అని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) భావిస్తోంది. అయితే ఇదే కేసులో కీలక నిందితుడిగా లష్కర్ ఉగ్రవాది తహవూర్ రాణా ఉన్నాడు. హెడ్లీకి అత్యంత సన్నిహితుడైన రాణా.. దాడులకు ముందు ఎనిమిదిసార్లు భారత్‌కు వచ్చాడు. రెక్కీ నిర్వహించాక ఏకంగా 231 సార్లు ఫోన్లో మాట్లాడాడు. ముంబై ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీ చేసింది కూడా రాణానే. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన వెంటనే రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఉంది. తద్వారా హెడ్లీ మీద దృష్టిసారించే అవకాశం లేకపోలేదు. -
భారత్‌కు రాణా తరలింపు!
న్యూఢిల్లీ: 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి, పాకిస్తాన్ సంతతి ఉగ్రవాది తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాణాను తీసుకొని భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి బుధవారం రాత్రి 7.10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రత్యేక విమానంలో బయలుదేరారు. గురువారం మధ్యాహ్నంకల్లా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రాణాను అధికారికంగా అరెస్టు చేస్తుంది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను తీహార్ జైలుకు తరలిస్తారు. రాణా భద్రత కోసం జైలులో ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో రాణాపై విచారణ ప్రారంభం కానుంది. కేసు విచారణ ఢిల్లీలోనే జరుగుతుంది కాబట్టి రాణాను ముంబైకి తరలించే అవకాశం లేదని అంటున్నారు. అమెరికా నుంచి రాణా తరలింపు ప్రక్రియను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తనను ఇండియాకు అప్పగించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ రాణా దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలే తిరస్కరించింది. దాంతో అతడిని ఇండియాకు అప్పగించేందుకు అవరోధాలు తొలగిపోయాయి. -
మరో 26 రఫేల్ జెట్లు
న్యూఢిల్లీ: ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా నావికాదళాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు అంగీకారం తెలిపింది. భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరే ఈ భారీ ఒప్పందం విలువ రూ.63,000 కోట్లు. ఒప్పందంపై త్వరలో సంతకాలు చేసే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 26 ఫైటర్ జెట్లలో 22 సింగిల్–సీటర్ జెట్లు, 4 ట్విన్–సీటర్ జెట్లు ఉన్నాయి. భారత నావికా దళానికి ఈ యుద్ధ విమానాలు సరఫరా చేయడంతోపాటు వాటి నిర్వహణ, మరమ్మతులు, విడిభాగాల సరఫరా, సిబ్బందికి శిక్షణ కూడా ఒప్పందంలో భాగమే. కీలకమైన ఈ డీల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెక్యూరిటీ కేబినెట్ కమిటీ బుధవారం ఆమోద ముద్ర వేసింది. 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్ల అప్పగింత ప్రక్రియ రాబోయే ఆరేళ్లలో పూర్తి కానుంది. మొదటి బ్యాచ్ యుద్ధవిమానాలు 2029లో ఫ్రాన్స్ నుంచి భారత నేవీకి అందుతాయి. 2031 నాటికి అన్ని విమానాల అప్పగింత పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రెండు దేశాల ప్రభుత్వాల మధ్యే ఒప్పందం కుదరనుంది. విమానాల అప్పగింత, వాటి నిర్వహణ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఆ నిర్ణయం తీసుకున్నారు. సముద్ర గగనతలంపై పట్టు రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్–29కే యుద్ధ విమానాలు భారత నావికా దళానికి సేవలందిస్తున్నాయి. వీటి స్థానంలో రఫేల్ ఫైటర్ జెట్లను దశలవారీగా ప్రవేశపెట్టబోతున్నారు. భారత విమాన వాహక నౌకలైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి వీటిని ఆపరేట్ చేస్తారు. అత్యాధునిక ఎల్రక్టానిక్, ఆయుధ వ్యవస్థతో కూడిన రఫేల్ ఫైటర్ జెట్లతో సముద్ర గగనతలంపై భారత నావికాదళం పట్టు మరింత పెరుగనుంది. మరోవైపు సముద్ర ఉపరితలంపైనే కాకుండా సముద్ర అంతర్భాగంలోనూ పోరాట పటిమను పెంచుకొనే దిశగా ఇండియన్ నేవీ అడుగులు వేస్తోంది. -
జైన మతంతో భారత్‌కు గుర్తింపు
న్యూఢిల్లీ: భారతదేశ గుర్తింపును నిర్మించడంలో జైన మతం అమూల్యమైన పాత్ర పోషించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, యుద్ధాలు, ధ్వంసమవుతున్న పర్యావరణం వంటి పెను సవాళ్లకు అసలైన పరిష్కార మార్గాలు జైన ధర్మంలో ఉన్నాయని ఉద్ఘాటించారు. ‘నవకర్ మహామంత్ర దివస్’ సందర్భంగా బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. జైన మతంతో ముడిపడి ఉన్న ప్రాచీన కట్టడాలు, జైన గురువుల బోధనలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. పార్లమెంట్ భవనంలో జైన తీర్థంకరుల విగ్రహాలకు స్థానం కలి్పంచినట్లు తెలిపారు. జైన మత ప్రభావం మన పార్లమెంట్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. సమాజంలో ఒకరికొకరు సహకరించుకుంటూ శాంతియుతంగా జీవించాలని జైనిజం బోధిస్తున్నట్లు గుర్తుచేశారు. హింసను ఎంతమాత్రం అంగీకరించదని పేర్కొన్నారు. శాంతి, సౌభ్రాతృత్వం, పర్యావరణ పరిరక్షణను బోధించే జైనమత సూత్రాలు అందరికీ ఆచరణీయమని పిలుపునిచ్చారు. భారత ఆధ్యాతి్మక వైభవానికి జైన సాహిత్యం వెన్నుముకగా నిలుస్తోందని ప్రధాని మోదీ కొనియాడారు. జైన సాహిత్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రాచీన గ్రంథాలను డిజిటలైజ్ చేసే పథకం తీసుకొచ్చామని తెలిపారు. పాళీ, పాకృత బాషలను ప్రాచీన భాషలుగా గుర్తించామని వివరించారు.మనమంతా తొమ్మిది ప్రతిజ్ఞలు చేద్దామని మోదీ సూచించారు. అవేమిటంటే... 1. నీటిని సంరక్షించుకుందాం.. జల సంరక్షణ మనందరి బాధ్యత 2. మాతృమూర్తి పేరిట ఒక మొక్క నాటుదాం 3. పరిశుభ్రతను ప్రోత్సహిద్దాం 4. స్థానిక ఉత్పత్తులనే ఉపయోగిద్దాం 5. దేశంలో పర్యటిద్దాం.. పర్యాటకాన్ని ప్రోత్సహిద్దాం.. పేదలకు సాయం అందిద్దాం 6. రసాయనాలకు తావులేకుండా ప్రకృతి వ్యవసాయం చేద్దాం7. ఆహారంలో భాగంగా తృణధాన్యాలు స్వీకరిద్దాం.. తద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుందాం.8. వంట నూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకుందాం9. క్రీడలు, యోగాను మన నిత్యజీవితంలో ఒక భాగంగా మార్చుకుందాం -
Air India ‘Pee-gate’: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం!
ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాలో (air india) అమానుష ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ-బ్యాంకాక్ ఎయిరిండియా విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన (Air India ‘Pee-gate’) చేసిన ఘటన కలకలం రేపుతోంది.ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కు ప్రయాణించిన ఎయిరిండియా విమానంలో (AI 2336) ఓ ప్రయాణికుడు మధ్యం సేవించాడు. అయితే మద్యం మత్తులో ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టగా పనిచేస్తున్న ప్రయాణికుడి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ప్రయాణికుడిపై మూత్రం పోసినట్లు ఎయిరిండియా అధికారిక ప్రకటన చేసింది.ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించామని,బ్యాంకాక్‌లో బాధితుడికి అవసరమైన సహాయం అందించేందుకు ఎయిరిండియా సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే బాధితుడు ఆ సహాయం తీసుకోవడానికి నిరాకరించినట్టు సంస్థ వెల్లడించింది.ప్రయాణికుడిపై మూత్ర విసర్జన ఘటనపై విచారణ కోసం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ కమిటీ ఘటనపై సమగ్రంగా సమీక్షించి, అవసరమైతే సంబంధిత ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటుందని సంస్థ స్పష్టం చేసింది. డీజీసీఏ రూపొందించిన ప్రామాణిక కార్యకలాపాల ప్రకారమే వ్యవహరిస్తామని పేర్కొంది. An Air India spokesperson says, “Air India confirms that an incident of unruly passenger behaviour was reported to the cabin crew operating flight AI2336, from Delhi to Bangkok, on 9 April 2025. The crew followed all laid down procedures, and the matter has been reported to the… pic.twitter.com/QwMB1pWr2E— ANI (@ANI) April 9, 2025 గత రెండేళ్లుగా మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన చేసిన ఘటనలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 2023 మార్చిలో అమెరికాలోని ఓ యూనివర్సిటీకి చెందిన భారతీయ విద్యార్థి ఆర్య వోహ్రా, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో సహయాత్రికుడిపై మూత్రవిసర్జన చేశాడని ఆరోపణల నేపథ్యంలో విమాన సంస్థ అతనిపై నిషేధం విధించింది. గతేడాది నవంబర్‌లో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో ఓ వృద్ధ మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. -
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని సుప్రీం కోర్టు మందలించింది. ఈ విషయాన్ని తీవ్ర ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ బుధవారం సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసింది.ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ ఉద్దేశం. ప్రత్యేకించి గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుంది. దీని అమలుకుగానూ కేంద్రానికి సుప్రీం కోర్టు మార్చి 14వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే గడువు దాటినా కేంద్రం ఇంతదాకా దీనిని అమలు చేయలేదు.‘‘ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దీనిని తీవ్రమైన కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా పరిగణిస్తున్నాం’’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. ఈ అలసత్వానికి సంబంధించి రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ‘‘అధికారులు కోర్టులకు హాజరైతేనే మా ఆదేశాలను తీవ్రంగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని మా సుదీర్ఘ అనుభవం ద్వారా మేం తెలుసుకున్నాం. ఏప్రిల్ 28వ తేదీన సమన్లు అందుకున్నవాళ్లు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలి. సకాలంలో చికిత్స అందకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ.. ఒక్క విషయాన్ని మేం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. ఎటువంటి పురోగతి సాధించలేదని మేం గనుక గుర్తిస్తే కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తాం అని జస్టిస్ ఓకా సంబంధిత అధికారులను హెచ్చరించారు.రోడ్డుప్రమాదాల సమయంలో ఆ దారిన వెళ్లేవాళ్లు, పోలీసులు,కొన్నిసార్లు ఆస్పత్రులు కూడా ఎవరైనా ముందుకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాయి. ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇదిలా ఉంటే.. 2023 డిసెంబర్లో నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్రం తొలి అడుగు వేసింది. ప్రమాదాల్లో (Road Accidents) గాయపడిన బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఎంవీఏ యాక్టు 2019లో భాగం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. అయితే.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహకారంతో రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంది.రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాణాంతకంగా ఉన్న సమయంలో.. ప్రత్యేకించి గోల్డెన్ అవర్ టైంలో రోడ్డు ప్రమాద బాధితుడి ప్రాణాలు రక్షించే చికిత్స కోసం నగదు చెల్లింపులు చేయడానికి ఎవరూ లేనప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. క్యాష్‌లెస్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ స్కీమ్ కింద.. రోడ్డు ప్రమాదాలకు గురైన వాళ్ల చికిత్స కోసం ఏడు రోజులకుగానూ లక్షా 5 వేల రూపాయల ఖర్చు భరిస్తుంది. అయితే ఇది ప్రమాదం జరిగిన 24 గంటలలోపు పోలీసులకు తెలియజేస్తేనే!. ఇక..ఆస్పత్రులు మోటార్ వెహికిల్స్ యాక్ట్ ఫండ్ నుంచి ట్రీట్మెంట్ సొమ్మును రీయింబర్స్మెంట్ ద్వారా పొందుతాయి. ఇదికాక.. అదనంగా హిట్ అండ్ రన్ కేసుల్లో మరణించిన వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అందిస్తుంది. అయితే.. ఏడాదిన్నరగా ఈ పథకాన్ని ఆచరణలో పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన సరైన విధివిధానాలతో ఓ పథకం రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా.. మోటార్ వెహికిల్స్ యాక్ట్(సవరణ చట్టం)లోని సెక్షన్ 162(2) ప్రకారం.. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. కానీ, ఇది కూడా అమలు కావడం లేదని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది. -
‘దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్సరే తీయాలి’.. AICCలో రాహుల్
గాంధీ నగర్ : దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్సరే తీయాలని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రెండో రోజు ‘అఖిల భారత కాంగ్రెస్ కమిటీ’ (ఏఐసీసీ) సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. దళితులు,ఆదివాసీలు,పేదల కోసం కాంగ్రెస్ పనిచేస్తోంది. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ నిత్యం పోరాటం చేస్తుంది. కులగణనతో దేశంలో ఓబీసీల సంఖ్య తేలుతుంది. తెలంగాణలో కులగణన చేపట్టాం. జాతీయ స్థాయిలో జనగణన చేసే వరకు పోరాడుతాం. కుల గణనతో ఏ వర్గం జనాభా ఎంత ఉంటుందో తేలుతుందని వ్యాఖ్యానించారు. LIVE: Nyaypath - AICC Session | Ahmedabad, Gujarat https://t.co/8snXJNmtEM— Rahul Gandhi (@RahulGandhi) April 9, 2025 గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళవారం ప్రారంభమైన ఏఐసీసీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 1,700 మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. తొలిరోజు ఏప్రిల్ 8న విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఏప్రిల్ 9న ఏఐసీసీ సభ్యులతో సమావేశం కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ రెండు సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సీఎంలు దీనిలో పాల్గొన్నారు. -
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ : కార్గో,ఎక్స్‌ప్రెస్,ప్యాసింజర్ రైళ్ల రాకపోకల కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీలోని (చిత్తూరు, తిరుపతి) మీదుగా తమిళనాడు (వెల్లూరు) వరకు వెళ్లే రైల్వే లైన్లో మరో అదనపు రైల్వే లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది. బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలోని నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తిరుపతి -పాకాల - కాట్పడి మధ్య 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ రూ.1332 కోట్ల రూపాయల ఖర్చుతో డబ్లింగ్ చేయనుంది. తద్వారా 400 గ్రామాలు,14 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తిరుపతికి కనెక్టివిటీ పెరగనుంది. నాలుగు మిలియన్ టన్నుల సరుకు రవాణా ఏడాదికి పెరిగే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నేరుగా 35 లక్షల పని దినాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి’ అని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 👉పీఎంకేఎస్వైలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి గాను కమాండ్ ఏరియా అభివృద్ధికి కేంద్రం రూ.1600 కోట్లు ఖర్చు చేయనుంది. Union cabinet approves modernization of Command Area Development and Water Management (M-CADWM) as a sub-scheme of Pradhan Mantri Krishi Sinchayee Yojana (PMKSY) for the period 2025-2026 with an initial total outlay of Rs.1600 crore. pic.twitter.com/SB3g4Mcqoq— ANI (@ANI) April 9, 2025 -
ట్రంప్ టారిఫ్.. భారత ప్రతీకార సుంకాలు అనుమానమే!
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌పై అమెరికా విధించిన పరస్పర సుంకాలు 26 శాతం నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావంతో.. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి కేబినెట్ భేటీని కీలకంగా భావిస్తోంది. అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో.. అమెరికా , భారతీయ ఉత్పత్తులపై విధించిన సుంకాల పై కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, ఫార్మా ఉత్పత్తులు, ఆటోపార్ట్స్‌పై సుంకాల ప్రభావం పడనుంది. ఈ క్రమంలో.. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే.. అమెరికా చర్యలు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధమని భావిస్తున్న కేంద్రం.. WTO వద్ద సమస్యను లేవనెత్తే దిశగా ఆలోచనపై చర్చించే అవకాశం ఉంది. అలాగే.. ప్రతిస్పందనగా భారత్ తరఫున కొంతమేర కౌంటర్ టారిఫ్‌లు విధించాల్సిన అవసరం ఉందా? అనే దానిపై విస్తృతంగా చర్చించనుందని సమాచారం. అయితే, అవి పరస్పర ప్రతీకారంగా ఉండకూడదని కేంద్రం భావిస్తోంది. అలాంటి ఒప్పందాల దిశగా సిద్ధమవుతోందని భోగట్టా. అలాగే.. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక అమెరికా సుంకాల వల్ల ప్రభావితమవుతున్న భారతీయ ఎగుమతిదారులకు మద్దతు కల్పించేలా ఆదాయ పరంగా వెసులుబాట్లు ఇవ్వాలనే ప్రతిపాదన కేబినెట్ ముందుకు రానుంది. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో అమెరికా ప్రభుత్వంతో ఉన్న చర్చలను వేగవంతం చేసే అంశంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. తమ దేశంపై ట్రంప్ 104 శాతం సుంకాల విధింపును అన్యాయంగా పేర్కొంటున్న చైనా.. అగ్రరాజ్య ప్రాధాన్యతను తగ్గించేందుకు కలిసి పనిచేద్దామంటూ భారత్‌కు ప్రతిపాదన చేసింది. అయితే కేబినెట్ భేటీలో చైనా ప్రతిపాదన అంశం చర్చకు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్‌లలో ఇప్పటికే 10 శాతం అమల్లోకి రాగా.. తాజాగా మరో 16 శాతం నేటినుంచి అమలవుతోంది. తనకు భారత ప్రధాని మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదని టారిఫ్‌ల విధింపు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 52 శాతం సుంకాలను విధిస్తోందన్నారు. తాము అందులో సగమే విధిస్తున్నామని ఆయన చెప్పారు. -
ఈ వేసవిలో 10 శాతం పెరగనున్న... విద్యుత్ డిమాండ్!
న్యూఢిల్లీ: ప్రపంచమంతటా విద్యుత్ డిమాండ్ ఏయేటికాయేడు విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వేసవిలో భారత్‌లో విద్యుత్ డిమాండ్ 9 నుంచి 10 శాతం పెరగనుందని గ్లోబల్ ఎనర్జీ థింక్ ట్యాంక్ ‘ఎంబర్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ’అంచనా వేసింది. ‘‘ఏప్రిల్ నుంచి జూన్ దాకా దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. వడగాల్పుల రోజులు కూడా పెరుగుతాయి. అందుకే విద్యుత్ డిమాండ్ బాగాపెరగనుంది’’అని మంగళవారం విడుదల చేసిన కొత్త నివేదికలో వెల్లడించింది. వచ్చే దశాబ్ద కాలంలో దేశంలో ఎయిర్ కండిషన్ల సంఖ్య మరో 15 కోట్ల దాకా పెరుగుతుందని పేర్కొంది. దాంతో 2035 నాటికి పీక్ అవర్ విద్యుత్ డిమాండ్ ఏకంగా 180 గిగావాట్లకు పెరిగి విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర భారం పడుతుందని తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా.. 2024లో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఏడాది ప్రపంచ విద్యుత్ డిమాండ్ పెరుగుదలలో ఐదో వంతుకు వడగాలులే కారణం. దాంతో ప్రపంచ విద్యుత్ రంగ ఉద్గారాలు 2024లో 1.6 శాతం పెరిగాయి. 22.3 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలైంది. దాంతో మొత్తం ఉద్గారాలు రికార్డు స్థాయిలో 1,460 కోట్ల టన్నులకు పెరిగాయి.భారత్‌లో... 2024 ఏప్రిల్–జూన్ మధ్య మన దేశంలో విద్యుత్ డిమాండ్ 10.4 శాతం పెరిగింది. మొత్తం విద్యుత్ వాడకంలో ఎయిర్ కండిషనర్ల వాటాయే 30 శాతం! 2024 మే 30న జాతీయ స్థాయిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 250 గిగావాట్లు దాటింది. ఇది అంచనాల కంటే 6.3 శాతం ఎక్కువ! 2024లో దేశంలో వడగాల్పుల తరచుదనం, తీవ్రత పెరిగాయి. జాతీయ గృహ విద్యుత్ వినియోగం వాటా 2012–13లో 22 శాతం కాగా 2022–23 నాటికి 25 శాతానికి పెరిగింది. ఆర్థిక వృద్ధి, పెరిగిన వేడి వంటివి శీతలీకరణకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో చైనా, నైజీరియా, ఇండొనేíÙయా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, అమెరికా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. -
మీది కడుపుకోతా?.. మరి అసలైన తల్లిదండ్రులది?
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీరు పిల్లలను కొన్నారు.. వారు మీ పిల్లలే అనే ఆలోచనతో మీకు ఆ బాధ ఉంటుంది. అందుకే మీపై మేము కేవలం సానుభూతి చూపించగలం. అంతకుమించి మీకు న్యాయమైతే చేయలేం కదా?’అంటూ.. 2024లో హైదరాబాద్‌లో పసికందులను దత్తతకు తీసుకున్న తల్లిదండ్రులను ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. మీరు చెప్పినదానిని బట్టి చూస్తే మీదేనా కడుపు కోతా? మీది కడుపుకోత అయినప్పుడు అసలైన తల్లిదండ్రులది ఏమనాలి? అంటూ ప్రశ్నలు సంధించింది. ఢిల్లీ, పుణే నగరాల్లోని ఆసుపత్రుల్లో ఒకరోజు, రెండు రోజుల పసికందులను దొంగలించి హైదరాబాద్‌కు తీసుకొచి్చ.. పిల్లలు లేని వారికి దత్తత పేరుతో అమ్మకాలు చేపట్టారు. మే 22న ఫీర్జాదిగూడలో ఓ పసికందును విక్రయిస్తుండగా మేడిపల్లి పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు కుని కేసు నమోదు చేయడంతో.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా.. కొనుగోలు చేసిన వారికి అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిoది. శిశు సంక్షేమ కమిటీ ఈ తీర్పును ద్విసభ్య ధర్మాసనం వద్ద సవాల్ చేయగా.. ప్రభుత్వానికి సానుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ గత ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిల్లలు లేరు అందుకే దత్తత తీసుకున్నాం పిల్లలు లేని కారణంగానే.. ఆ పసికందులను దత్తత తీసుకున్నట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రీనివాస్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ పిల్లలతో తమకెంతో భావోద్వేగం ఉన్నట్లు తెలిపారు. తమ నుంచి పిల్లలను స్వాధీనం చేసుకున్న నాటి నుంచి తాము విలవిలలాడుతున్నామని, వారిని తిరిగి తమకు అప్పగించాలని కోరారు. చట్టపరమని మేము ఎలా చెబుతాం? ‘మీరు తీసుకున్నదే ఇల్లీగల్ (చట్టవిరుద్ధం)గా.. మమ్మల్ని న్యాయం చేయమంటే మేం లీగల్ (చట్టపరం) అని ఎలా చెబుతాం? కొనుగోలు చేసిన వారిలో రెండు రోజుల పసికందులున్న విషయం గమనించారా? కన్న ఆ తల్లి క్షోభ మీకు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? మీరు చేస్తున్నదితప్పు అని మీ మనస్సాక్షికి అనిపించలేదా’అంటూ నిలదీసింది. ఈ విషయంలో మేం కేవలం మీపై సానుభూతి మాత్రమే చూపించగలం. కన్న తల్లిదండ్రుల నుంచి చిన్నారులను దత్తత తీసుకున్న వాళ్లు కాదు మీరు, పర్చేజ్ చేసిన వాళ్లు అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. -
పదేళ్లలో రూ.33.65 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదు ప్రారంభమైన ప్రధానమంత్రి–ముద్ర యోజన (పీఎం–ఎంవై) మంగళవారంతో పదేళ్లు పూర్తి చేసుకుంది. 2015 ఏప్రిల్ 8న ప్రారంభమైన నాటి నుంచి ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 52 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు రూ.33.65 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ముద్ర యోజన లబ్ధిదారులతో ముచ్చటించారు. వారి విజయగాధలు అడిగి తెలుసుకున్నారు. నైపుణ్యాలు కలిగిన యువత ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఈ పథకం తోడ్పడుతోందని అన్నారు. ఉద్యోగాలు కోరుకొనేవారుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారుగా మారగలమన్న నమ్మకం వారిలో పెరుగుతోందని తెలిపారు. పథకంతో లబ్ధిపొందినవారు మరో 10 మందిలో ప్రేరణ కలిగించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ తన సక్సెస్ స్టోరీని ప్రధానమంత్రితో పంచుకున్నారు. నరేంద్ర మోదీ, లబ్ధిదారు మధ్య జరిగిన సంభాషణ. లబ్ధిదారు: సార్.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నాకు హిందీ రాదు. తెలుగులోనే మాట్లాడుతా.. మోదీ: ఏం ఫర్వాలేదు.. మీరు తెలుగులోనే మాట్లాడండి. లబ్ధిదారు: నాకు 2009లో వివాహం జరిగింది. 2019 వరకు గృహిణిగా ఉన్నాను. జ్యూట్ బ్యాగ్‌ల తయారీలో కెనరాబ్యాంక్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో 13 రోజులపాటు ట్రైనింగ్ తీసుకున్నాను. బ్యాంక్‌కు చెప్పి నాకు లోన్ ఇప్చించారు. ష్యూరిటీ ఏమీలేదు. ఎవరూ నాకు సపోర్ట్ లేరు. కెనరా బ్యాంక్ వారు నన్ను నమ్మి లోన్ ఇచ్చారు. రూ.2 లక్షలు ముద్ర లోన్ తీసుకుని 2019లో వ్యాపారం ప్రారంభించా. నా రీపేమెంట్స్ చూసి 2022లో రూ.9.5 లక్షలు రుణం మంజూరు చేశారు. వ్యాపారాన్ని మరింత విస్తరించా. ఇప్పుడు నా దగ్గర 15 మంది పనిచేస్తున్నారు. మోదీ: అంటే.. రూ.2 లక్షలతో ప్రారంభించారు. రూ.9.5 లక్షలకు చేరుకున్నారు. మీతో ఎంతమంది పనిచేస్తున్నారు? లబ్ధిదారు: 15 మంది సార్. అందరూ గృహిణిలు, గ్రామీణ ప్రజలే సార్. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మోదీ: కృతజ్ఞతలు.. మీకు ధన్యవాదాలువారి ప్రయాణం స్ఫూర్తిదాయకం: మోదీ పీఎం–ముద్రా యోజన పథకంతో జీవితాలు మారిపోయిన వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ దశాబ్ద కాలంలో ముద్ర యోజన అనేక కలలను సాకారం చేసింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించి వారిని శక్తివంతంగా మార్చింది. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. పథకం లబ్ధిదారుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. 70 శాతం కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలే కావడం చాలా సంతోషకరం. ముద్రా యోజనతో సామాజిక, ఆర్థిక స్వేచ్ఛ లభిస్తోంది. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది’’ అని మోదీ ‘ఎక్స్’లో తెలుగులో పోస్టు చేశారు. -
గవర్నర్‌కు గడువు 3 నెలలే
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి ఎట్టకేలకు విజయం లభించింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ముందుకు వచ్చిన బిల్లులపై నిర్దేశిత గడువులోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. గవర్నర్ ఆర్.ఎన్.రవి 10 బిల్లులను పెండింగ్‌లో పెట్టడాన్ని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించామన్న సాకుతో 10 బిల్లులను చాలాకాలం పెండింగ్‌లో కొనసాగించడం సమంజసం కాదని స్పష్టంచేసింది. బిల్లులను శాశ్వతంగా పెండింగ్‌లో పెట్టే అధికారం గవర్నర్‌కు లేదని తెలియజేసింది. తమిళనాడు గవర్నర్ నిర్ణయం చట్టవిరుద్ధం, నిర్హేతుకం, ఏకపక్షం అని విమర్శించింది. ఆయన నిర్ణయాన్ని తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది. ‘‘అసెంబ్లీలో ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ సమ్మతి కోసం పంపించగా ఆయన తిరస్కరించారు. దీంతో అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి పంపించారు. వాటిపై గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రపతికి నివేదించామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమే. అందుకే రెండోసారి పంపిన తేదీ నుంచే అవి గవర్నర్ సమ్మతి పొందినట్లు పరిగణిస్తున్నాం’’ అని ధర్మాసనం తీర్పు ప్రకటించింది. విఫలమైతే జ్యుడీషియల్ రివ్యూ తప్పదు రాజ్యాంగంలోని ఆర్టీకల్ 200 ప్రకారం.. బిల్లులను గవర్నర్ ఎప్పటిలోగా ఆమోదించాలన్నదానిపై ఎలాంటి కాలపరిమితి లేదు. ఫలానా సమయంలోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాజ్యాంగం నిర్దేశించలేదు. కానీ, బిల్లులపై గవర్నర్ ఎటూ తేల్చకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెడితే ప్రభుత్వ పరిపాలనకు అవరోధాలకు ఎదురవుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. చట్టాలు చేసే శాసన వ్యవస్థకు అడ్డంకులు సృష్టించినట్లు అవుతుంది పేర్కొంది. అందుకే బిల్లులపై గవర్నర్లు ఎక్కువకాలం నాన్చకుండా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని, ఈ మేరకు గడువు నిర్దేశిస్తున్నట్లు తేల్చిచెప్పింది.బిల్లుకు సమ్మతి తెలపడం లేదా రాష్ట్రపతికి నివేదించడం లేదా శాసనసభకు తిప్పిపంపడం మూడు నెలల్లో పూర్తి కావాలని వెల్లడించింది. గవర్నర్ వెనక్కి పంపిన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపిస్తే నెల రోజుల్లోగా కచ్చితంగా సమ్మతి తెలపాలని స్పష్టంచేసింది. ఈ టైమ్‌లైన్ పాటించే విషయంలో విఫలమైతే.. కోర్టుల జ్యుడీషియల్ రివ్యూకు గవర్నర్ సిద్ధపడాల్సి ఉంటుందని పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీలో రెండోసారి ఆమోదం తర్వాత గవర్నర్‌కు పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాజ్యాంగంలోని ఆర్టీకల్ 142 ద్వారా తమకు సంక్రమించిన అధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. తమిళనాడులో గవర్నర్ ఆర్.ఎన్.రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపకుండా గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డీఎంకే సర్కారు మండిపడుతోంది. 12 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఆమోదించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రభుత్వం 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ, తన వద్ద 10 బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయని గవర్నర్ 2023 నవంబర్ 13న ప్రకటించారు. తర్వాత అసెంబ్లీ నవంబర్ 18న ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ 10 బిల్లులను మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. తన వద్దకు వచ్చిన బిల్లును గవర్నర్ నవంబర్ 28న రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేశారు. మిత్రుడిగా, మార్గదర్శిగా గవర్నర్ పనిచేయాలి ‘‘గవర్నర్లు చాలా వేగంగా పనిచేయాలని, చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని రాజ్యాంగం ఆశిస్తోంది. నిర్ణయాల్లో విపరీతమైన జాప్యం చేయడం ప్రజాస్వామ్య పరిపాలన స్ఫూర్తిని దెబ్బతీసినట్లే. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ వీటో చేయడం అనేది మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం గవర్నర్ తన విచక్షణ మేరకు వ్యవహరించవచ్చు. బిల్లు ప్రజలకు హాని కలిగిస్తుందని భావించినప్పుడు, రాష్ట్రపతి సమ్మతి కచ్చితంగా అవసరమని అనుకున్నప్పుడు కొంతకాలం జాప్యం చేయొచ్చు. గవర్నర్ విచక్షణాధికారానికి సైతం ఆర్టికల్ 200 కొన్ని పరిమితులు విధిస్తోంది. బిల్లుపై నిర్ణయం తీసుకోకుండా ఉండడం సరైంది కాదు. గవర్నర్ స్పందించకపోతే బిల్లు కేవలం ఒక కాగితం ముక్కగా, మాంసం లేని అస్థిపంజరంగానే ఉండిపోతుంది. శాసనసభలో ఆమోదించిన బిల్లును ఇష్టంవచ్చినట్లు తొక్కిపెడతామంటే కుదరదు. అసెంబ్లీలో రెండోసారి ఆమోదం పొంది వచ్చిన బిల్లుకు (మొదటి దాని కంటే వైవిధ్యమైనది అయితే తప్ప) తప్పనిసరిగా సమ్మతి తెలపాల్సిందే. రాష్ట్రపతికి నివేదించకూడదు. అలాంటి బిల్లుపై గవర్నర్‌కు వీటో పవర్ ఉండదు. ప్రజల బాగు కోసం పని చేస్తామంటూ గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ప్రజలకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంటుంది. ప్రజల చేత ఎన్నికైన శాసనసభ్యులకు అడ్డంకులు సృష్టించకూడదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలి. మంత్రివర్గం సూచనల మేరకు గవర్నర్ వ్యవహరించాలని ఆర్టీకల్ 200 చెబుతోంది. గవర్నర్ ఒక మిత్రుడిగా, మార్గదర్శిగా వ్యవహరించాలి. రాజకీయపరమైన ఉద్దేశాలతో పనిచేయొద్దు. గవర్నర్ ఉ్రత్పేరకంగా ఉండాలి తప్ప నిరోధకంగా ఉండొద్దు. గవర్నర్ సైతం న్యాయ సమీక్షకు అర్హుడేనన్న సంగతి మర్చిపోవద్దు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. గవర్నర్‌కు న్యాయస్థానం స్పష్టమైన గడువు నిర్దేశించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చరిత్రాత్మకం: స్టాలిన్‌చెన్నై: గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చెప్పారు. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని హర్షం వ్యక్తంచేశారు. ఇది తమిళనాడుతోపాటు దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు దక్కిన గొప్ప విజయమని పేర్కొన్నారు. స్టాలిన్ మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. సభలో బల్లలు చరిచి సుప్రీంకోర్టు తీర్పుపై సంబరాలు జరుపుకోవాలని అధికారపక్ష సభ్యులకు సూచించారు. తమిళనాడు ప్రజలకు, తమ న్యాయ బృందానికి అభినందనలు తెలియజేస్తూ స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో సమతూకాన్ని పునరుద్ధరించే విషయంలో ఈ తీర్పు ఒక కీలకమైన ముందడుగు అని ఉద్ఘాటించారు. అసలైన సమాఖ్య భారత్‌లో ప్రవేశం కోసం ఎడతెగని పోరాటం చేస్తున్న తమిళనాడుకు విజయం దక్కిందన్నారు. తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ మినహా ఇతర పారీ్టలన్నీ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాయి. అధికార డీఎంకే నాయకులు మిఠాయిలు పంచుకొని, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తమ గవర్నర్ ఆర్.ఎన్.రవి యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా ఉండే అధికారం కోల్పోయారని డీఎంకే నేత ఒకరు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం హర్షం వ్యక్తంచేశారు. -
Waqf Act : అమల్లోకి వక్ఫ్ చట్టం.. విచారణపై తొందరెందుకన్న ‘సుప్రీం’
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు.. చట్ట రూపం దాల్చింది. ఇవాళ్టి నుంచే(ఏప్రిల్ 8వ తేదీ) అమల్లోకి వచ్చినట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గత శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరోవైపు..సుప్రీంకోర్టులో వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తమ వాదనలు వినాలంటూ కేంద్రం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో 15, 16వ తేదీల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జరగబోయే విచారణపై ఉత్కంఠ నెలకొంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుమారు 16 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటితో పాటు కేంద్రం వేసిన కేవియట్‌ను కలిపి విచారించాలని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది. సిస్టమ్ ప్రకారమే వెళదాం.. తొందరెందుకు?ఇదిలా ఉంటే.. వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టడానికి నిరాకరించింది. జమైత్ ఉలేమా హై హింద్ ప్రెసిడెంట్ మౌలానా అర్షద్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సవరణ బిల్లుపై దాఖలైన పిటిషన్లను త్వరగా విచారించాలని ఆయన కోరారు. అయితే ఈ విజ్ఞప్తిపై చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.‘ఎందుకు త్వరగా అని మెన్షన్ చేస్తున్నారు. మనకో సిస్టం ఉంది కదా. వాటిని తప్పకుండా సమీక్షిస్తాం. అవసరమైన వాటిని సూచిస్తాం’ అని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. దీంతో వచ్చే మంగళ, బుధవారాల్లో విచారణ జరపనున్నట్లు పేర్కొంది. -
మీరూ టీచరేగా.. దయచేసి జోక్యం చేసుకోండి
న్యూఢిల్లీ: బెంగాల్ టీచర్ల తొలగింపు వ్యవహారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ లేఖ రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని.. ఏ తప్పూ చేయని టీచర్లకు న్యాయం జరిగేలా చూడాలని కోరారాయన. 2016 టీచర్ రిక్రూట్మెంట్లో భారీ మోసం జరిగిందంటూ 25 వేల నియామకాలను ఇటు కలకత్తా హైకోర్టు రద్దు చేయగా.. అటు సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థించింది. అయితే.. నియామకాల సమయంలో జరిగిన నేరాలు ఖండించదగ్గవే అయినప్పటికీ.. ఏ తప్పూ చేయనివాళ్ల ఉద్యోగాలు పోవడం తీవ్ర అన్యాయం కిందకు వస్తుందని రాహుల్ గాంధీ అంటున్నారు. ఏ తప్పు చేయకుండా చట్టపరంగా ఉద్యోగాలు పొందిన వాళ్లు సైతం నష్టపోవడం ఇక్కడ బాధాకరం. దాదాపుగా దశాబ్దంపాటుగా విధులు నిర్వహిస్తున్న ఈ కళంకం లేని టీచర్లను తొలగించడం.. విద్యా వ్యవస్థకు ఆటంకం కలిగించడమే అవుతుంది. అంతేకాదు.. వాళ్ల కుటుంబాలూ ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతాయి.గతంలో మీరూ ఓ టీచరే కదా. కాబట్టి.. ఈ మానవతప్పిదం కారణంగా జరుగుతున్న అన్యాయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఏ మోసానికి, తప్పునకు పాల్పడకుండా ఉద్యోగాలు సాధించిన వాళ్లను.. తిరిగి కొనసాగించేలా ప్రభుత్వాన్ని కొరతారని మీకు విజ్ఞప్తి చేస్తున్నా అని లేఖలో రాష్ట్రపతి ముర్మును రాహుల్ గాంధీ కోరారు. ఈ లేఖను తన ఎక్స్ ఖాతాలోనూ పోస్ట్ చేశారాయన. I have written to the Honourable President of India, Smt. Droupadi Murmu ji, seeking her kind intervention in the matter of thousands of qualified school teachers in West Bengal who have lost their jobs following the judiciary's cancellation of the teacher recruitment process.I… pic.twitter.com/VEbf6jbY2F— Rahul Gandhi (@RahulGandhi) April 8, 2025 -
సుప్రీంకోర్టులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి షాక్
ఢిల్లీ: సుప్రీం కోర్టులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట దక్కింది. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ వెంటనే ఆమోదం తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.తమిళనాడు ఎంకే స్టాలిన్ ప్రభుత్వం పదిబిల్లులను ప్రతిపాదించింది. అయితే, ఆ బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలపలేదు. ఇదే అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. గవర్నర్ చట్టవిరుద్ధంగా వ్యవహించారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. వెంటనే ప్రభుత్వం ప్రతిపాదించిన పది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాలని స్పష్టం చేసింది. Key pointers from Supreme Court judgement in Tamil Nadu Governer RN Ravi case:➡️ Reservation of 10 bills for consideration by parliament after they were reconsidered by State assembly is illegal. ➡️Any consequential steps taken by President on the 10 bills is NON EST ➡️ Court… pic.twitter.com/1nlANNi7Gs— Bar and Bench (@barandbench) April 8, 2025గవర్నర్ పది బిల్లులను రిజర్వ్ చేయడం అనేది చట్ట విరుద్ధం. అందువల్ల, ఆ చర్యను రద్దు చేస్తున్నాం. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న పది బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ బిల్లులు గవర్నర్‌కు సమర్పించిన తేదీ నుండి ఆమోదించబడినట్లుగా పరిగణించబడతాయి’ అని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై సీఎం డీఎంకే స్టాలిన్ హర్షంసుప్రీం కోర్టు తీర్పుపై తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు చారిత్రాత్మకమైందని’ అభివర్ణించారు. ఈ తీర్పు కేవలం ఒక్క తమిళనాడుకే కాదు. దేశంలోని అన్నీ రాష్ట్రాలకు గర్వ కారణం’ అని అన్నారు. 2021లో తమిళనాడు గవర్నర్‌గా ఆర్ఎన్ రవిసీబీఐలో పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎన్. రవి 2021లో తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వంతో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు.బీజేపీ అధికార ప్రతినిధి అంటూ విమర్శలుఇదే అంశంపై డీఎంకే ప్రభుత్వం గవర్నర్ ఆర్ఎన్ రవిపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చింది. గవర్నర్ ఆర్ రవి బీజేపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మండి పడిందది. కావాలనే రాష్ట్ర శాసనసభ బిల్లులకు ఆమోదం తెలపకపోవడం , నియామకాలపై అనుమతి నిరాకరించారని ధ్వజమెత్తింది. అయితే, గవర్నర్ రవి మాత్రం తనకు రాజ్యాంగం అందించిన అధికారాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నానంటూ సర్థించుకున్నారు. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ గవర్నర్ తన పదవిలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లోనూ వివాదాలు కొనసాగుతున్నాయి. గత ఏడాది, గవర్నర్ ప్రారంభపు ఉపన్యాసం సందర్భంగా జాతీయ గీతం పాడకపోవడంపై గవర్నర్ టీఎన్ రవి నిరసనగా సభనుంచి వెళ్లిపోయారు. తమిళనాడు అసెంబ్లీలో సాంప్రదాయం ప్రకారం ప్రసంగం ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వళ్తు' అనే రాష్ట్ర గీతం పాడడం, ముగింపులో జాతీయ గీతం పాడటం జరుగుతుంది. కానీ గవర్నర్ రవి మాత్రం ప్రారంభంలోను, ముగింపులోను జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని అభిప్రాయపడ్డారు.గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వంగా 2023లో, గవర్నర్ అసెంబ్లీకి రాసిన సంప్రదాయ ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించారు. ఎందుకంటే ఆ ప్రసంగంలో ఉన్న విషయాలు నిజానికి భిన్నంగా ఉన్నాయన్నారు. అంతకంటే ముందు ఏడాది, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, పేరియార్, సి.ఎన్. అన్నాదురై పేర్లు, ‘ద్రవిడ మోడల్’ అనే పదబంధం, రాష్ట్రంలోని చట్టం, శాంతి పరిపాలన గురించి మాట్లాడకుండా వదిలేశారు. ఇలా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య తరచూ వివాదాలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో ఇవాళ సుప్రీం కోర్టు తీర్పుతో గవర్నర్ విషయంలో తాము చేస్తున్న పోరాటానికి ఫలితంగా దక్కిందని ఆ రాష్ట్ర అధికార పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. -
గ్యాస్ బండపై రూ. 50 వడ్డింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఎల్పీజీ వినియోగదారులపై భారం మరింత పెరిగింది. గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ కేంద్రం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఇది సాధారణ వినియోగదారులతో పాటు నిరుపేద ఉజ్వల పథక లబ్దిదారులకు కూడా వర్తిస్తుందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి నుంచే పెంపు అమల్లోకి వచ్చింది. ఎల్పీజీ విక్రయాలపై పెట్రోలియం సంస్థలు నష్టాలు మూటగట్టుకుంటున్నందున ఈ నిర్ణయం తప్పలేదన్నారు. తాజా పెంపుతో దేశ రాజధానిలో ఎల్పీజీ సిలిండర్ ధర ఉజ్వల వినియోగదారులకు రూ.503 నుంచి రూ.553కు పెరిగింది. సాధారణ వినియోగదారులకు ధర రూ.853కి చేరింది. సీఎన్జీ ధరలను కూడా దాదాపు నాలుగు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు ఒక రూపాయి పెరిగి రూ.75.09కి చేరింది. వీటితో పాటు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కూడా కేంద్రం 2 రూపాయల చొప్పున పెంచింది. అయితే ఈ పెంపు రిటైల్ ధరలకు వర్తించబోదు. ఫలితంగా ఈ భారం సామాన్య వినియోగదారులపై పడబోదని పురి స్పష్టం చేశారు. ‘‘అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారల్‌కు 70–75 డాలర్ల నుంచి 60 డాలర్లకు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం విధించాలని నిర్ణయించాం. దీనివల్ల కేంద్రానికి రూ.32 వేల అదనపు ఆదాయం సమకూరనుంది. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగని పక్షంలో పెట్రో ధరలను తగ్గించే అవకాశం కూడా ఉంది’’ అని మంత్రి వెల్లడించారు. తాజా నిర్ణయంతో పెట్రోల్‌పై కేంద్రం పన్నులు లీటర్‌కు రూ.21.9కి, డీజిల్‌పై రూ.15.8కి చేరాయి. భారత్‌లో పెట్రోల్, డీజిల్ వార్షిక వినియోగం 16,000 కోట్ల లీటర్లు. మన చమురు అవసరాలకు 85 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడ్డాం. -
సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి ఊరట.. పోలీసులకు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్లో భాగంగా తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది.మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ముందస్తు బెయిల్‌పై జస్టిస్ జేబీ. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ విచారణ జరిపింది. ఈ క్రమంలో మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో, మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక, పిటిషన్‌పై మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.ఇదిలా ఉండగా, అంతకుముందు.. మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ కోసం ప్లాన్ చేస్తున్నాయి. దీంతో, మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఇక, మద్యం వ్యవహారంలో ఆది నుంచీ ఏపీ సీఐడీ పోలీసుల తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వ్యక్తులను బెదిరించి సీఐడీ తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంది. తప్పుడు వాంగ్మూలాల్లో తమకు కావాల్సిన వారి పేర్లను చెప్పించారు సీఐడీ అధికారులు. ఈ క్రమంలో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా వారి అరెస్టుకు ముందడుగులు వేస్తున్నారు. అలాగే, తప్పుడు వాంగ్మూలాల్లో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. నిన్న హైదరాబాద్‌లో పలువురి ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల సందర్భంగా ఇళ్లల్లో ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసినట్టు సమాచారం. పోలీస్ స్టేషన్లకు రప్పిస్తామంటూ మహిళలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
నేడు సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ
ఢిల్లీ : వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ ధర్మాసనం విచారణ జరపనుంది.మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ నమోదుచేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి గత నెలలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్‌పై విచారణ జరిగే సమయంలో ఏపీ సీఐడీ తరుఫు న్యాయవాది మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ హైకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్‌రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని చెప్పారు. దీంతో, మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ తరుణంలో ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీం కోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
‘ద్రోహి’వ్యాఖ్యలు.. బాంబే హైకోర్టులో కునాల్ కమ్రా క్వాష్ పిటిషన్
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై (Eknath Shinde) నోరు పారేసుకున్న స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా (kunal kamra) బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను సవాలు చేస్తూ కోర్టులో క్వాష్ పిటిషన్ (quash petition) దాఖలు చేశారు. ‘నయా భారత్’ అనే స్టాండప్ కామెడీ షోలో కునాల్ కమ్రా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ‘గద్దార్’ (ద్రోహి)గా పేర్కొంటూ ఓ పేరడీ పాటను ఆలపించారు. దీనిపై వివాదం చెలరేగింది. డిప్యూటీ సీఎంపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముర్జీ పటేల్ ఫిర్యాదు మేరకు కునాల్ కమ్రాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా కార్యక్రమ వేదికపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అతడిని అరెస్టు చేయాలంటూ డిమాండ్లు చేశారు.అయితే, ఈ తరుణంలో ఇవాళ శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ ఫిర్యాదు ఆధారంగా మార్చి 24న ఖార్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కమ్రా బాంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు.అంతకుముందు, తాను చేసిన వ్యాఖ్యలపై అంతేకాదు చట్ట బద్ధంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అదే సమయంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మార్చి 27న మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. షరతులతో ఏప్రిల్ 7 వరకు గడువిస్తూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.న్యాయ స్థానం బెయిల్ ఇచ్చిన తర్వాత ఏప్రిల్ 1న నమోదైన మూడు ఎఫ్ఐఆర్లపై ఖార్ పోలీస్‌స్టేషన్‌కు విచారణకు హాజరు కావాలని కునాల్ కమ్రాను పోలీసులు కోరారు. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. అయినప్పటికీ స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. -
కార్యకర్తలే పార్టీకి వెన్నెముక: మోదీ
న్యూఢిల్లీ: బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ కార్యకర్తలకు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో వరుసగా పోస్టులు చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని స్పష్టంచేశారు. వారంతా క్షేత్రస్థాయిలో చురుగ్గా పని చేస్తున్నారని, సుపరిపాలన ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తు న్నారని పేర్కొన్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తున్న కార్యకర్తలను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని గుర్తుచేశారు. కార్యకర్తల శక్తి, ఉత్సాహం తనకు ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాయని వివరించారు. దేశ ప్రజలు బీజేపీలో సుపరిపాలన ఎజెండాను దర్శిస్తున్నారని, ఎన్నికల్లో పార్టీకి లభిస్తున్న చరిత్రాత్మక విజయాలే ఇందుకు తార్కాణమని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అన్ని రకాల ఎన్నికల్లో బీజేపీ అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. సమాజ సేవకు, దేశ సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని వెల్లడించారు. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని బలోపేయడానికి కంకణబద్ధులై పనిచేస్తున్న కార్యకర్తల సేవలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇదేనని పేర్కొన్నారు. దేశ ప్రగతి కోసం మనమంతా పూర్తి అంకితభావంతో పనిచేయాలని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించుకోవాలని మోదీ పిలుపు నిచ్చారు. -
వక్ఫ్ బోర్డులను నియంత్రించే ఉద్దేశం లేదు: నడ్డా
న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డులను నియంత్రించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జె.పి.నడ్డా స్పష్టంచేశారు. వక్ఫ్ బోర్డులు చట్ట పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆయా బోర్డుల ఆస్తులు విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం ఉపయోగపడాలని, తద్వారా ముస్లిం వర్గానికి మేలు జరగాలని చెప్పారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జె.పి.నడ్డా పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టర్కీతోపాటు చాలా దేశాల్లో వక్ఫ్ బోర్డుల ఆస్తులను అక్కడి ప్రభుత్వాలు నియంత్రణలోకి తీసుకున్నాయని గుర్తుచేశారు. మన దేశంలో మాత్రం బోర్డులు చట్ట పరిధిలో పని చేయాలని చెబుతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా సరే నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే బీజేపీ ప్రస్థానాన్ని నడ్డా ప్రస్తావించారు. నేడు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీల్లో ఒకటిగా మారిందని అన్నారు. ప్రస్తుతం బీజేపీకి 240 మంది లోక్‌సభ సభ్యులు, 98 మంది రాజ్యసభ సభ్యులు, 1,600 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తుచేశారు. -
సిద్ధార్థ్‌కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియల్లో సానియాను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు
చంఢీగఢ్ : గుజరాత్ జామ్‌నగర్‌లో ఈ బుధవారం జాగ్వార్ జెట్‌లో మరణించిన భారత వాయుసేన ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఆయన స్వగ్రామామైన భలాకీ మజ్రాలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వేలాది మంది స్థానికులు, వాయుసేన అధికారులు, ఇతర సైనికులు, పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొని సిద్ధార్థ్ యాదవ్‌కు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. పది రోజుల క్రితం సిద్ధార్థ యాదవ్, సానియాల ఎంగేజ్మెంట్ అయ్యింది. నవంబర్ 2న పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో కాబోయే భార్య సానియా.. సిద్ధార్ధ్ అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది.అంత్యక్రియలు ముగిసే సమయంలో సానియా గుండెలవిసేలా రోదించారు. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.‘సిద్ధార్ధ్ ముఖాన్ని చూపించండి. ఇంకోసారి సిద్ధార్ధ్ ముఖాన్ని చూడనివ్వండి అని భౌతిక ఖాయం వద్ద గుండెలవిసేలా ఏడుస్తున్న దృశ్యాలు చూపురలను కంటతడి పెట్టిస్తున్నాయి. ‘బేబీ నన్ను తీసుకెళ్లేందుకు నువ్వు ఎందుకు రాలేదు. నువ్వు నాకు ప్రామిస్ చేశావ్ కదా అంటూ సిద్ధార్ధ్ భౌతికఖాయంతో సంభాషించడం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది.What a heart wrenching moment...#SiddharthYadav got engaged 10 days back, marriage was due on 2nd November...his fiance says: Baby तू आया नहीं...तूने कहा था मुझे लेने आएगा। #jaguarcrash #Rewari pic.twitter.com/c7KGJOQixr— Rahul Yadav (@Raahulrewari) April 4, 2025 అంతా బాగున్నప్పుడు కాదు.. ప్రమాదంలో అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపుటంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కూలిపోయిన భారత వైమానిక దళ జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది. #BREAKING: Tragic news from Jamnagar, Gujarat. A Jaguar fighter jet of the Indian Air Force crashed during a routine sortie, 12 kms away from Jamnagar city. While one pilot ejected safely, a trainee pilot has been killed in the crash. The body has been found by the villagers. pic.twitter.com/yGRefVVyQR— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 2, 2025 తాను మరణిస్తూ.. మరికొందరికికో పైలట్‌తో కలిసి సురక్షితంగా ఎజెక్టయ్యే అవకాశముంది. అయినా సిద్ధార్థ్ తన ప్రాణాల కోసం పాకులాడలేదు. ప్రజల భద్రత గురించే ఆలోచించారు. విమానం జనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. సురక్షితంగా మైదానంలో కూలిపోయేలా చూశారు. తద్వారా ఎంతోమంది పౌరుల మరణాలను నివారించారు. ఆ క్రమంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా తన సాటిలేని త్యాగంతో జాతి గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. కో పైలట్ సురక్షితంగా ఎజెక్టయినా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.IAF's Jaguar fighter aircraft crashes in Jamnagar, Gujarat. More details awaited.#planecrash pic.twitter.com/Xz8UAGeasc— Kedar (@Kedar_speaks88) April 2, 2025 చివరి క్షణాల్లోనూ... బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రమాదం తప్పదని స్పష్టమైంది. దాంతో పైలెట్లిద్దరూ ఎజెక్షన్ ప్రారంభించారు. అంతటి క్లిష్ట సమయంలోనూ ముందు కో పైలట్ సురక్షితంగా బయటపడేలా సిద్ధార్థ్ జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత కూడా విమానాన్ని వెంటనే వదిలేయకుండా నివాస ప్రాంతాలకు దూరంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రాణాలనే పణంగా పెట్టారు. సిద్ధార్థ్ ఇటీవలే సెలవులనుంచి తిరిగి విధులకు హాజరయ్యారు. ఈ ప్రమాదం ఒక సాధారణ శిక్షణ ఫ్లైట్ సమయంలో జరిగింది.విచారంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ మృతిపై భారత వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారి కుటుంబానికి మేం అండగా నిలుస్తాం. ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు విచారణ కమిటీని నియమించినట్లు తెలిపింది. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ట్వీట్ సిద్ధార్ధ్ యాదవ్ మరణంపై హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ విచారం వ్యక్తం చేశారు. జామ్‌నగర్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రేవారి జిల్లా మజ్రా (భాల్ఖీ) గ్రామానికి చెందిన పుత్రుడు, జాగ్వార్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్‌కు నా శ్రద్ధాంజలి. ఈ త్యాగం ఎప్పటికీ మరిచిపోలేము. ఈ శోక సమయంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలి’అని ట్వీట్లో పేర్కొన్నారు. -
వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర
న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫ్ (సవరణ) బిల్లు–2025 (ఉమీద్)పై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం సంతకం చేశారు. శనివారం రాత్రి ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో వక్ఫ్ బిల్లు చట్టరూపం దాల్చింది. తీవ్ర వాదోపవాదాలు, విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో వక్ఫ్ బిల్లుపై ఉభయ సభల్లోనూ ఓటింగ్ జరగడం, లోక్‌సభలో 288–232, రాజ్యసభలో 128–95 ఓట్ల తేడాతో బిల్లు గట్టెక్కడం తెలిసిందే.. -
ఇక చర్చిల ఆస్తులపై గురి!
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం క్రైస్తవ సంస్థల ఆస్తులేనని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాజాగా పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ బిల్లులోని అనేక అంశాలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీ శనివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో నడిచే ‘ఆర్గనైజర్’లోని కథనాన్ని ఉదహరించారు. కాథలిక్ సంస్థలకు దేశవ్యాప్తంగా 7 కోట్ల హెక్టార్ల భూములున్నాయని, ఇంత భారీగా భూములున్న ప్రభుత్వేతర సంస్థ ఇదేనంటూ అందులో పేర్కొన్నారని రాహుల్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ కన్ను ఇప్పుడిక కాథలిక్ భూములపై పడినట్లు ఈ కథనంతో అర్థమవుతోందని ఆరోపించారు. ముస్లిం వర్గం ఆస్తులే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లు ఇతర వర్గాలకు లక్ష్యంగా చేసుకోవడానికి ఒక ఉదాహరణగా ఉంటుందని రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అతి త్వరలోనే క్రైస్తవుల ఆస్తులపై ఆర్ఎస్ఎస్ దృష్టి పడనుందని ఆయన జోస్యం చెప్పారు. ‘ఇటువంటి దాడుల నుంచి మనకు రక్షణ కల్పించే ఏకైక సాధన రాజ్యాంగం. రాజ్యాంగాన్ని మనం కలిసికట్టుగా పరిరక్షించుకుందాం’అని పిలుపునిచ్చారు. ఇండియన్ చర్చ్ యాక్ట్–1927 ప్రకారం బ్రిటిషర్ల పాలనలో కాథలిక్ సంస్థలు అత్యధికంగా భూములు సంపాదించుకున్నట్లు ఆర్గనైజర్ కథనం పేర్కొంది. అయితే, వలస పాలనలో లీజుకిచ్చిన భూములను చర్చి ఆస్తులుగా పరిగణనలోకి రావంటూ 1965లో భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. -
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు కుట్ర.. ఢిల్లీకి ఏపీ సీఐడీ
సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌కు ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి.మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో, మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్ రెడ్డి అరెస్ట్ కోసం ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు.. మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక, మద్యం వ్యవహారంలో ఆది నుంచీ ఏపీ సీఐడీ పోలీసుల తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వ్యక్తులను బెదిరించి సీఐడీ తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంది. తప్పుడు వాంగ్మూలాల్లో తమకు కావాల్సిన వారి పేర్లను చెప్పించారు సీఐడీ అధికారులు. ఈ క్రమంలో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా వారి అరెస్టుకు ముందడుగులు వేస్తున్నారు. అలాగే, తప్పుడు వాంగ్మూలాల్లో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. నిన్న హైదరాబాద్‌లో పలువురి ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల సందర్భంగా ఇళ్లల్లో ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసినట్టు సమాచారం. పోలీస్ స్టేషన్లకు రప్పిస్తామంటూ మహిళలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
‘ఎలక్టోరల్ బాండ్ల’ తీర్పుపై సమీక్షకు సుప్రీం నో
న్యూఢిల్లీ: 2018నాటి ఎలక్టోరల్ బాండ్ పథకం ద్వారా రాజకీయ పార్టీలు అందుకున్న రూ.16,518 కోట్లను జప్తు చేయాలన్న పిటిషన్లను తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్ష చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఖేమ్ సింగ్ భాటి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం కొట్టివేసింది. ఇందుకు సంబంధించిన పెండింగ్ పిటిషన్లను సైతం తిరస్కరిస్తూ మార్చి 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో అప్పటి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయడం తెల్సిందే. ఎలక్టోరల్ బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు సారథ్యంలో విచారణ జరపాలని, ఆ నిధులను జప్తు చేయాలంటూ గతేడాది ఆగస్ట్‌లో భాటి సహా పలువురు వేసిన పిటిషన్లు సైతం తిరస్కరణకు గురయ్యాయి. -
దళితులు, గిరిజనుల కోసం సబ్ ప్లాన్ తెచ్చాం
సాక్షి, న్యూఢిల్లీ: దళితులు, గిరిజనుల కోసం గత యూపీఏ ప్రభుత్వం సబ్ ప్లాన్ తీసుకొచ్చిందని, దీని వల్ల తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా వర్గాలకు తగిన ప్రయోజనాలు లభిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం దళిత, గిరిజనుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రముఖులను కలిసిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్ ) చైర్పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య కూడా రాహుల్‌ను కలిసిన వారిలో ఉన్నారు. వారితో కలిసిన చిత్రాన్ని రాహుల్ శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఇటీవల నేను దళిత, గిరిజన వర్గాలకు చెందిన పరిశోధకులు, సామాజిక కార్యకర్తలను కలిశాను. కేంద్ర బడ్జెట్లో కొంత భాగాన్ని దళితులు, గిరిజనులకు అందించేలా జాతీయ చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి చట్టం ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అమలులో ఉంది. ఈ వర్గాలకు అక్కడ నిర్దిష్ట ప్రయోజనాలు లభించాయి. యూపీఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో దళితులు, ఆదివాసీల కోసం ‘సబ్ ప్లాన్‘తీసుకొచి్చంది. కానీ మోదీ ప్రభుత్వ హయాంలో ఇది బలహీనపడింది. బడ్జెట్లో చాలా తక్కువ భాగం ఈ వర్గాలకు చేరుతోంది. వారికి అధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అనే అంశంపై ఇప్పుడు మనం ఆలోచించాలి. దళితులు, ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన పథకాలకు బడ్జెట్లో న్యాయమైన వాటాను నిర్ధారించే జాతీయ చట్టం మనకు అవసరం’అని రాహుల్ పేర్కొన్నారు. -
పార్లమెంట్ నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ ఏడాది జనవరి 31వ తేదీన ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. వక్ఫ్(సవరణ) బిల్లును ఉద్దేశించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో శుక్రవారం దుమారం రేగింది. ఈ బిల్లు ముమ్మాటికీ రాజ్యాంగంపై దాడేనని, బిల్లును లోక్‌సభలో బుల్డోజ్ చేశారు అంటూ సోనియా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ... సోనియా గాంధీ వ్యాఖ్యలు దురదృష్ట్టకరం, సభ గౌరవానికి విరుద్ధం అని పేర్కొన్నారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా టారిఫ్‌లపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత స్పీకర్ తన ముగింపు వ్యాఖ్యలను చదివారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో 173 మంది, కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో 169 మంది సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 16 బిల్లులు ఆమోదించినట్లు, సభ ఉత్పాదకత 118 శాతానికి పెరిగినట్లు ప్రకటించారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యసభలో రెండో సుదీర్ఘ భేటీ ఈ సెషన్లో రాజ్యసభ మొత్తంగా 119 గంటలపాటు పని చేసిందని, ఉత్పాదకత 119 శాతానికి పెరిగిందని ఎగువ సభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు. సభలో రికార్డు స్థాయిలో 49 మంది సభ్యులు ప్రైవేటు మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారని వివరించారు. వక్ఫ్(సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభ గురువారం ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4.02 గంటల వరకు విరామం లేకుండా సుదీర్ఘంగా సమావేశమైందని, ఇదొక రికార్డు అని అన్నారు. పార్లమెంటరీ రికార్డుల ప్రకారం.. రాజ్యసభలో ఇది రెండో సుదీర్ఘ భేటీ. మొదటి సుదీర్ఘ భేటీ 1981 సెప్టెంబర్ 18న జరిగింది. అప్పట్లోసభ మరుసటి రోజు తెల్లవారుజామున 4.43 గంటల వరకు కొనసాగింది. అత్యవసర సేవల నిర్వహణ బిల్లు–1981పై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చించారు. ఇదిలా ఉండగా, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ధ్రువీకరిస్తూ రాజ్యసభలో ఒక తీర్మానాన్ని శుక్రవారం ఆమోదించారు. పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారు. మణిపూర్‌లో ఘర్షణకు తెరదించడమే లక్ష్యంగా రెండు ముఖ్యమైన తెగల మధ్య సమావేశం త్వరలో జరగబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో వెల్లడించారు. ఢిల్లీలో ఈ భేటీ జరుగుతుందన్నారు. -
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలకు తొలగిన అడ్డంకి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. జీవో 29పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ జాబితా టీజీపీఎస్సీ విడుదల చేసింది. త్వరలో టీజీపీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనుంది. కాగా, దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రభుత్వం జీఓ 29ను జారీ చేసింది. దీనిని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్ అయ్యింది. -
వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, ఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీం కోర్టులో ఆయన సవాల్ చేశారు. వక్ఫ్ బిల్లు చట్ట విరుద్ధమని.. వక్ఫ్ ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతోందంటూ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఈ వివాదాస్పద బిల్లు ఆమోదం పొందడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.కాగా, రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది.దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే. -
గూగుల్ మ్యాప్‌తో రాంగ్ టర్న్!
వాళ్లంతా ఒకే ఏరియాలో ఉండే స్నేహితులు. సరదా ట్రిప్పు కోసం కారులో కొద్ది దూరం వెళ్లారు. కానీ, తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వాళ్లలో ఇద్దరిని కబళించింది. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు.. ఇదంతా గూగుల్ మ్యాప్(Google Map) చేసిన నిర్వాకమనే విషయం తెలిసి కంగుతిన్నారు.ఢిల్లీ-లక్నో హైవేపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన కారు-ట్రక్కు ప్రమాదంలో విస్తుపోయే విషయం ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. గూగుల్ మ్యాప్ చూపించినట్లుగా ముందుకెళ్లిన కారు.. అనూహ్యంగా ట్రక్కు ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురైందని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారని ఎన్డీటీవీ ఒక కథనం ఇచ్చింది.హర్యానా రోహ్తక్కు చెందిన శివాని, సిమ్రాన్, రాహుల్, సంజూలు నైనిటాల్‌లోని నీమ్ కరోలీ బాబా ఆశ్రమ్‌కు వెళ్లి తిరిగొస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి టైంలో బైపాస్ గుండా వెళ్లాల్సిన కారు.. అనూహ్యాంగా ఢిల్లీ వైపు మలుపు తిరిగింది. అంతలో రామ్‌పూర్ నుంచి ఢిల్లీ వైపు వేగంగా వెళ్తున్న సిమెంట్ దిమ్మెలతో కూడిన ట్రక్కు వీళ్ల కారును బలంగా ఢీ కొట్టింది. ఆ ప్రమాద తీవ్రతకు ట్రక్కు బోల్తా పడగా.. కారు నుజ్జు అయ్యి ట్రక్కు కింద ఇరుక్కుపోయింది. దీంతో క్షగాతత్రులు సాయం కోసం కేకలు వేశారు.సుమారు 15 మంది(ట్రక్కు డ్రైవర్‌తో సహా).. దాదాపు గంట సేపు అతికష్టం మీద శ్రమించి కారులో ఉన్న నలుగురు క్షతగాత్రులను బయటకు తీశారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావమైన శివాని, సిమ్రాన్‌లు అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ టైంలో డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి దగ్గర ఫోన్ గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఉంది. బహుశా ఆ రాంగ్ టర్నే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావించిన పోలీసులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుల నుంచి అదే విషయాన్ని ధృవీకరించుకున్నారు. -
మా చేతుల్లో ఏం లేదు.. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్పై సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌లో చిన్నారులు సోషల్ మీడియా(Social Media) వాడకుండా నిషేధించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ నిర్ణయం తమ చేతుల్లో లేదన్న సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికార యంత్రాగాన్ని సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.సోషల్ మీడియా వాడకం వల్ల చిన్నారులపై శారీరకంగా, మానసికంగా, ప్రభావం పడుతోందని, కాబట్టి 13 ఏళ్లలోపు పిల్లలు వాడకుండా చట్టబద్ధమైన నిషేధం విధించాలని ఓ పిల్(PIL) దాఖలైంది. అంతేకాదు 13-18 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్ల పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలని జెప్ ఫౌండేషన్ ఈ పిల్లో కోరింది. దీనిని పరిశీలించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం.. అది తమ పరిధిలోని అంశం కాదని, విధానపరమైన నిర్ణయమని చెబుతూ పిల్‌ను తిరస్కరించింది.పిల్లో ఏముందంటే.. 13 ఏళ్లలోపు వయసున్నవాళ్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వాడకూడదంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నామమాత్రంగా నిబంధనను పెట్టాయి. కేవలం యూజర్లు రిపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అలాంటి అకౌంట్ల వివరాలు బయటకు వస్తున్నాయి. ఇదీ ఆందోళన కలిగించే అంశమే.మైనర్ల సోషల్ మీడియా అకౌంట్లకు కూడా అనియంత్రిత యాక్సెస్unrestricted access ఉంటోంది. దీని మూలంగా వాళ్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.మైనర్లు సోషల్ మీడియా వాడకుండా నియంత్రించని ఈ వ్యవహారం.. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి, కఠిన జరిమానాలు, ఇతర చర్యల ద్వారా పిల్లల చేతికి సోషల్ మీడియా వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.భారత్‌లో యువత సగటున ప్రతీరోజు ఐదు గంటలపాటు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ఈ సమయం గణనీయంగా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగించే అంశం. అందుకు తగ్గట్లే దేశంలో సైబర్ నేరాలు.. మైనర్లకు సైబర్ వేధింపులు పెరిగిపోతున్నాయి.ఉదాహరణకు.. మహారాష్ట్రలో 9-17 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం ఆరు గంటలకు పైగా సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో గడుపుతున్నారు. ఇది వాళ్ల చదువులపై, జీవన శైలిపై తీవ్ర ప్రభావం చూపెడుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో పలు రాష్ట్రాలు మైనర్లు సోషల్ మీడియా ఉపయోగించకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.భారతదేశ జనాభాలో దాదాపు 30% మంది 4-18 సంవత్సరాల వయస్సు మధ్యే ఉంది. కాబట్టి 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై చట్టబద్ధమైన నిషేధాన్ని అమలు చేయడం అత్యవసరం.అయితే పైన పేర్కొన్న దేశాలు మైనర్లకు సోషల్ మీడియా కట్టడిని కేవలం ప్రత్యేక చట్టాల ద్వారా మాత్రమే చేయగలిగాయి. ఏ సందర్భంలోనూ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోలేదు. కాబట్టి భారత్‌లోనూ చట్ట ప్రక్రియ ద్వారా మాత్రమే కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుందనేది నిపుణుల మాట. -
వామనరావు దంపతుల కేసు.. సర్కార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణకు చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించి వీడియోలను తమకు అందించాలని ఆదేశించింది.కాగా, న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా.. హత్య కేసుకు సంబంధించి వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం, అన్ని రికార్డులను పరిశీలించిన తర్వాత సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు ధర్మాసనం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో రికార్డులు అందజేయాలని ఆదేశించింది. అనంతరం, విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
ఆయుష్మాన్ భారత్ పథకంలో అవకతవకలు.. ఈడీ దాడులు
ఢిల్లీ: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ (pmjay) పథకంలో అవకతవకులు జరిగాయి. కాగ్ రిపోర్ట్ ఆధారంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చర్యలకు ఉపక్రమించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈడీ ఏక కాలంలో దాడులకు దిగింది. 2023లో పార్లమెంటులో కాగ్ నివేదికను ప్రవేశ పెట్టింది. జార్ఖండ్‌లో ఆయుష్మాన్ పథకం పేరుతో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగిందనేది ఆ నివేదిక సారాశం. రోగులను చేర్చుకోకుండా, బీమా మొత్తాన్ని మోసపూరితంగా క్లయిమ్ చేస్తున్నారని అందులో పేర్కొంది. కాగ్ తన రిపోర్ట్‌లో దేశంలోని 212 ఆస్పత్రులలో పీఎంజేఏవైలో ఈ అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. చికిత్స అందించకుండాఈ నేపథ్యంలో శుక్రవారం ఆయుష్మాన్ భారత్ పథకం కింద మోసపూరిత కార్యకలాపాలు, ఆర్థిక దుర్వినియోగానికి సంబంధించి జార్ఖండ్‌లోని రాంచీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. పీఎంజేఏవైలోని నెట్ వర్క్ ఆస్పత్రులలో ఎటువంటి వైద్య చికిత్స లేకుండా, ఏ రోగిని చేర్చకుండా చెల్లింపులు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ దాడులకు దిగింది. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పీఎంజేఏవై పథకం కిందపీఎంజేఏవై పథకం కింద కేంద్రం నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తుంది. ఈ పథకంలో రూ.5లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ప్రస్తుతం దాదాపు 12.3 కోట్ల కుటుంబాలకు అందుబాటులో ఉంది. తాజాగా కేంద్రం ఈ పథకాన్ని 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వర్తించేలా మార్పులకు శ్రీకారం చుట్టింది. -
వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును(waqf amendment bill) సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. వీలైనంత త్వరలోనే ఇది ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూనే ఉంటామన్న ఆయన.. గతంలో సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలపై పోరాటాలు చేశామని జైరాం రమేశ్(Jairam Ramesh) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ ద్వారా తెలియజేశారు. The INC's challenge of the CAA, 2019 is being heard in the Supreme Court.The INC's challenge of the 2019 amendments to the RTI Act, 2005 is being heard in the Supreme Court.The INC’s challenge to the validity of the amendments to the Conduct of Election Rules (2024) is being…— Jairam Ramesh (@Jairam_Ramesh) April 4, 2025 ఇదిలా ఉంటే.. రాజ్యసభ(Rajya Sabha)లో గురువారం మధ్యాహ్నాం నుంచి సుమారు 13 గంటలపాటు వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగింది. ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. దీంతో శుక్రవారం ఉదయం బిల్లును ఆమోదించినట్లు పార్లమెంట్ అధికారికంగా ప్రకటించింది. బిల్లుపై చర్చ సందర్భంగా.. ఇది మైనారిటీలకు వ్యతిరేకంగా.. రాజ్యాంగవిరుద్ధంగా ఉందంటూ పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అదే సమయంలో ఇది చారిత్రక సంస్కరణగా అభివర్ణించిన కేంద్రం ఈ బిల్లు ముస్లింలకు లబ్ధి చేకూరుస్తుందని అంటోంది. అంతకు ముందు..సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ(Lok Sabha) ఆమోదం తెలిపింది. చర్చ సమయంలో అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ ప్రతిధ్వనించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో.. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. -
పశ్చిమ బెంగాల్ టీచర్ నియామకాల రద్దులో ట్విస్ట్.. సోమా దాస్‌కు సుప్రీం ఊరట!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ (mamata banerjee) ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (West Bengal Teacher Scam 2016)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది.అయితే వారిలో పశ్చిమ బెంగాల్ మాతృభాష బెంగాలీని బోధిస్తున్న సోమా దాస్ (School teacher Soma Das) అనే ఉపాధ్యాయురాలికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. యథావిధిగా ఆమె ఉద్యోగంలో కొనసాగవచ్చని పేర్కొంది. ఇంతకి ఎవరీ సోమాదాస్? వేలాది మంది టీచర్ల నియామకాల్ని రద్దు చేసిన సుప్రీం.. ఆమె ఒక్కరే ఉద్యోగంలో కొనసాగవచ్చని ఎందుకు తీర్పు ఇచ్చింది.సుప్రీం తీర్పుపై సోమాదాస్ 2016లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేపట్టిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాల్లో సోమాదాస్ అనే మహిళ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. తాజాగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం తన తీర్పుతో సోమాదాస్ ఉపాధ్యాయురాలిగా కొనసాగనున్నారు. ఓ వైపు సుప్రీం కోర్టు తీర్పుపై టీచర్‌గా కొనసాగే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారనే నిరాశను వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. నేను నిజంగా అదృష్టవంతురాలి. కానీ వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇది ఎవ్వరూ ఊహిచని విషయం అని తన అభిప్రాయాన్ని తెలిపారు. దీదీ సర్కార్‌పై సోమాదాస్ న్యాయపోరాటం2016లో కోల్‌కతా ప్రభుత్వం 9-10 తరగతి ఉపాధ్యాయ నియామక (ఎస్ఎల్ఎస్టీ) పరీక్షను పెట్టారు. ఆ పరీక్షల్లో సోమాదాస్ అర్హత సాధించారు. మెరిట్ జాబితాలో ఆమె పేరు ఉన్నప్పటికీ.. దీదీ సర్కార్ ఆమెకు టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు. ఇదే అంశంపై సోమాదాస్ న్యాయపోరాటానికి దిగారు. కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓ వైపు క్యాన్సర్‌తో పోరాడుతూనేఆమె నియామకంపై హైకోర్టులో కేసు విచారణ, బహిరంగ ఆందోళనలు చేస్తున్న సమయంలో 2019లో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే.. తనకు టీచర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. అదే సమయంలో సోమాదాస్ ఆవేదనను అప్పటి కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ కీలక తీర్పును వెలువరించారు. సోమాదాస్ను ఉపాధ్యాయురాలిగా నియమించాలని జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆదేశించారు. దీంతో 2022లో దీదీ ప్రభుత్వం సోమాదాస్‌కు బీర్భూమ్లోని నల్హాటిలో మోధురా జిల్లా పాఠశాలలో నియమించింది. ప్రస్తుతం ఆమె అదే స్కూల్లో విధులు నిర్వహిస్తున్నారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తంఈ నేపథ్యంలో 25వేల మంది టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ అత్యున్నత న్యాయ స్థానం తీసుకున్న నిర్ణయంపై సోమాదాస్ స్పందించారు. సుప్రీం తీర్పు హర్షం వ్యక్తం చేశారు. కానీ తనకు ఆమోద యోగ్యం కాదన్నారు. నేను ఎప్పుడూ ఇతరులు వారి ఉద్యోగాలను కోల్పోవాలని అనుకోను. ఈ తీర్పు నాకు ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే 2016 బ్యాచ్‌లో చాలా మంది అర్హులు ఉన్నారు. ప్రభుత్వం, స్కూల్ కమిషన్ నిర్లక్ష్యం కారణంగా అర్హులైన వారు ఎంతో మంది ఉద్యోగాలో కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. -
పండగ పూట విషాదం.. బావిలోకి దిగి ఎనిమిది మంది మృతి
భోపాల్: శివపార్వతుల్ని స్మరించుకుంటూ జరుపుకునే సంప్రదాయ పండుగ పర్వదినాన మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఖాండ్వా జిల్లాలో చారుగావ్ మఖాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండావత్ గ్రామంలో 150ఏళ్ల పురాతన బావిని శుభ్రం చేస్తున్న 8 మంది భక్తులు మృత్యువాత పడ్డారు.పోలీసు ఉన్నతాధికారుల సమాచారం మేరకు.. రాష్ట్రంలో ప్రతిఏడాది హిందూ సంప్రదాయ పద్దతిలో శివపార్వతులను (Lord Shiva Parvati) స్మరించుకుంటూ గంగోర్ (Gangaur festival) అనే పండుగను నిర్వహిస్తుండడం ఆనవాయితీ. అయితే, ఎప్పటిలాగే ఈ ఏడాది సైతం రాష్ట్రంలోని కొండావత్ గ్రామంలో భక్తులు గంగోర్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పండుగ సంప్రదాయంలో భాగంగా దేవుళ్ల విగ్రహాల్ని గంగాజలంలో నిమజ్జనం చేయాల్సి ఉంది. ఇందుకోసం గ్రామానికి చెందిన అతి పురాతన బావిలో విగ్రహాల్ని నిమజ్జనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక్కొక్కరుగా బావిలోకి దిగి ముందుగా బావిలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసేందుకు గురువారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అందులోకి దిగాడు. బావి నుంచి విషవాయివులు వెలువడడంతో ఊపిరాడక బావిలోనే మరణించారు. బావిలోకి దిగిన ఎంత సేపటికీ అతని జాడ తెలియకపోవడంతో అతన్ని రక్షించేందుకు ఒక్కొక్కరుగా బావిలో దిగారు. అలా ఒక్కరి ప్రాణాల్ని రక్షించేందుకు వెళ్లిన మొత్తం ఎనిమిది మంది గ్రామస్తులు మరణించినట్లు ఖాండ్వా కలెక్టర్ రిషవ్ గుప్తా, ఎస్పీ మనోజ్ కుమార్ రాయ్ ప్రకటించారు. నాలుగు గంటల పాటు శ్రమించిబావిలోకి దిగిన గ్రామస్తుల ఆచూకీ గల్లంతు కావడంతో వారిని రక్షించేందుకు జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు, ఎసీఆర్ఎఫ్ బృందాలు తరలివచ్చాయి. నాలుగు గంటల పాటు శ్రమించి బావిలోనే ప్రాణాల్ని కోల్పోయిన గ్రామస్తుల్ని ఒక్కొక్కరిగా మొత్తం ఎనిమిదిమంది మృతదేహాల్ని వెలికి తీశాయి. సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతిఈ విషాదంపై సమాచారం అందుకున్న సీఎం మోహన్ యాదవ్ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించిన ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. खंडवा जिले अंतर्गत छैगांवमाखन क्षेत्र के कोंडावत गांव में एक दुर्भाग्यपूर्ण घटना में गणगौर विसर्जन के लिए कुएं की सफाई हेतु उतरे एक व्यक्ति के दलदल में फंसने पर बचाने के प्रयास में एक के बाद एक कुएं में उतरे अन्य सात व्यक्ति भी अंदर फंस गए, कुएं में जहरीली गैस से दम घुटने के कारण…— Dr Mohan Yadav (@DrMohanYadav51) April 3, 2025 బాధితుల గుర్తింపుబావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది మృతుల వివరాల్ని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో రాకేష్ పటేల్ (23), అనిల్ పటేల్ (25), అజయ్ పటేల్ (24), శరణ్ పటేల్ (35), వాసుదేవ్ పటేల్ (40), గజానన్ పటేల్ (35), అర్జున్ పటేల్ (35),మోహన్ పటేల్ (53) గా గుర్తించారు.మరణానికి గల కారణంవిషాదానికి గల కారణాల్ని తెలుసుకునేందుకు పోలీసులు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో బావి లోపల కార్బన్ మోనాక్సైడ్ లేదా మీథేన్ వంటి వాయువులు పేరుకుపోవడం వల్ల విషపూరిత పొగలు వచ్చి ఉండవచ్చని వైద్యులు అంచనా వేశారు. సరైన భద్రతా చర్యలు లేకుండా బావులు, సెప్టిక్ ట్యాంకులు వంటి ప్రదేశాల్లో దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాంజిల్లా యంత్రాంగం ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. మరణాలకు ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తూనే, మృతుల కుటుంబాలకు సహాయం చేస్తామని జిల్లా అధికార యంత్రాంగం హామీ ఇచ్చింది. -
వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడే
న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు భారత రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ అన్నారు. సమాజాన్ని శాశ్వతంగా విభజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో ఇది భాగమన్నారు. లోక్‌సభలో బిల్లును ఆదరాబాదరగా ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. సంవిధాన్ సదన్‌లో గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా తమ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఒక దేశం– ఒకే ఎన్నిక బిల్లు కూడా రాజ్యాంగ విద్రోహమన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ‘వక్ఫ్ (సవరణ) బిల్లును బుధవారం లోక్‌సభలో హడావుడిగా ఆమెదింపజేసుకున్నారు. గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి సుస్పష్టం. ఇది రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమే. సమాజాన్ని ఎప్పటికీ విభిజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో భాగమే’ అని సోనియా పేర్కొన్నారు. విపక్షాల సవరణలను మూజువాణి ఓటుతో తిరస్కరించాక, వక్ఫ్ బిల్లును బుధవారం అర్ధరాత్రి లోక్‌సభ 288–232తో ఆమోదించిన విషయం విదితమే. మహిళా రిజర్వేషన్ బిల్లును రెండేళ్ల కిత్రమే ఇరుసభలు ఆమోదించాయని, దాన్ని తక్షణం అమలులోకి తేవాలనే కాంగ్రెస్ డిమాండ్‌ను బీజేపీ ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పైనా బీజేపీ శీతకన్ను వేస్తోందన్నారు. -
25 వేల మంది టీచర్ల నియామకాలు రద్దు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో 2016 నుంచి పనిచేస్తున్న 25 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు 2024లో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నియామకాల్లో భారీ అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్ఎస్సీ)కు అత్యున్నత న్యాయస్థానం తలంటింది. మొత్తం 25,753 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల్లో అవకతవకలను, లోపాలను ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..మొత్తం నియామకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. మళ్లీ నియామకాలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం గురువారం ఆదేశించింది. మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం టీఎంసీ ప్రభుత్వానికి షాక్ వంటిదని చెబుతున్నారు. ఎంపిక ప్రతి దశలోనూ పాల్పడిన అక్రమాలను కప్పిపుచ్చుకు నేందుకు డబ్ల్యూబీఎస్ఎస్సీ చేసిన అతి ప్రయత్నాల వల్ల ప్రస్తుతం పరిశీలన, ధ్రువీకరణ అసాధ్యంగా మారాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అవకత వకల కారణంగా మొత్తం ఎంపిక ప్రక్రియ ఉద్దేశపూర్వకంగా లోపభూయిష్టంగా మారిందని నమ్ముతున్నట్లు స్పష్టం చేసింది. కోల్‌కతా హైకోర్టు మొత్తం నియామకాలను రద్దు చేస్తూ 2024 ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పును సమర్థించింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, ఒక్క వ్యక్తి చేసిన తప్పిదానికి అందరినీ ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. మానవీయ కోణంలో ఈ తీర్పును అంగీకరించబోనంటూనే సుప్రీం ఆదేశాలను అమలు చేస్తానని, న్యాయవ్యవస్థను గౌరవిస్తానంటూ ప్రకటించారు. -
ఆన్లైన్లో సుప్రీం జడ్జీల ఆస్తుల వివరాలు
న్యూఢిల్లీ: పారదర్శకతను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థిర, చరాస్తుల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. గురువారం జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సహా సుప్రీంకోర్టులోని 30 మంది జడ్జీలు ఆస్తులను ప్రకటించనున్నారు. అయితే, ఇది న్యాయమూర్తుల ఐచ్ఛికం మాత్రమేనని వెబ్సైట్ తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి సహా అందరు న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గానీ, ఏదైనా గణనీయ స్థాయిలో ఆస్తి సముపార్జన జరిగినప్పుడు గానీ ఆ వివరాలను బహిర్గతం తెలియజేయాలని ఫుల్‌కోర్టు నిర్ణయించిందని వెబ్సైట్ తెలిపింది. -
బీసీ రిజర్వేషన్ల పెంపుకోసం కొట్లాడుతాం
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేయటంద్వారా సామాజిక న్యాయ సాధనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దారి చూపిందని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాం«దీ, రాహుల్‌గాంధీ అన్నారు. కులగణనను పూర్తి చేయడంతో పాటు దానికి అసెంబ్లీ ఆమోదం పొందిన తీరు అభినందనీయమని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవ వల్ల విద్య, ఉద్యోగాల్లో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు.బీసీ రిజర్వేషన్ల పెంపునకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ వెలుపలా, లోపలా ఈ తీర్మానం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, బీర్ల అయిలయ్య, రాజ్‌ఠాకూర్, వీర్లపల్లి శంకర్, సంజీవ్‌రెడ్డి తదితరులు సోనియా, రాహుల్‌లను పార్లమెంట్ ప్రాంగణంలో విడివిడిగా కలిశారు.జనగణన, బీసీ బిల్లుపై తీర్మానం, జంతర్‌మంతర్‌లో ధర్నా గురించి వారికి వివరించారు. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుపై కీలక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ధర్నాకు హాజరు కాలేకపోయానని రాహుల్‌గాంధీ ఈ సందర్భంగా చెప్పారు. బీసీలకు సామాజిక న్యా యం జరిగేవరకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్రం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదించి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. రాహుల్, సోనియాతో భేటీ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చర్చించేందుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారు. రిజర్వేషన్ల అమలుకై ఎక్కడికైనా వచ్చేందుకు సీఎం రేవంత్‌తో సహా కేబినెట్ మంత్రులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హెచ్‌సీఏ భూములు వాస్తవంగా ప్రభుత్వానికి చెందినవని చెప్పారు. ఈ భూముల విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రతినిధి బృందం కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్రకుమార్‌ను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చించింది. -
2028 వరకు వేచి చూడాల్సిందేనా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడి 14 నెలలు అవుతోంది. ఇది సరిపోదూ అన్నట్లు ఇంకా మరింత సమయం అడుగుతున్నారు?. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు 2028 జనవరి వరకు వేచి చూడాల్సిందేనా?. ఇదేనా మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే?’అంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది అభిõÙక్ మనుసింఘ్వీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని న్యాయవాదులు మర్చిపోతే ఎలా? అంటూ చురకలు వేసింది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై పలువురు ఇతర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఎస్ఎల్పీ, రిట్ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు విన్పించారు. ఎస్ఎల్పిపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్‌పై దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావులు వాదనలు వినిపించారు. సింఘ్వీ సుదీర్ఘ వాదనలను విన్న తర్వాత ధర్మాసనం తీర్పును ఎనిమిది వారాలకు రిజర్వ్ చేసింది. స్పీకర్‌కు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమనలేం.. ఈ ఫిరాయింపులపై స్పీకర్, స్పీకర్ కార్యాలయం స్పందించేందుకు మరికొంత సమయం కావాలంటూ సింఘ్వీ ఆరంభంలోనే అభ్యరి్థంచారు. ‘స్పీకర్ తలకు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమనలేం..’అని ఆయన అన్నారు. దీనికి జస్టిస్ గవాయి స్పందిస్తూ.. ‘ప్రతిరోజూ ముఖ్యమైనదే అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కోర్టుపై ఉందనే విషయాన్ని గుర్తించండి. రెస్పాండెంట్ల వాదనలో వైరుధ్యాలను కూడా కోర్టు ఎత్తి చూపింది. మీ దృష్టిలో రీజనబుల్ సమయం అంటే ఎంతో ఇప్పటికైనా చెబుతారా..?’అంటూ ధర్మాసనం నిలదీసింది. దీంతో ‘సహేతుకమైన కాలం‘అనేది స్పీకర్ నిర్ణయించాలని, ఆరు నెలల సమయం సరిపోతుందని సింఘ్వీ అన్నారు. ఇబ్బందికరంగా న్యాయవాదుల తీరు: ధర్మాసనం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి నాలుగు వారాల్లో ఒక షెడ్యూల్ నిర్ణయించాలని స్పీకర్‌ను సింగిల్ బెంచ్ ఆదేశించిన విషయం మర్చిపోవద్దని జస్టిస్ గవాయి అన్నారు. ‘కోర్టు జోక్యం చేసుకునే వరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ కాలేదు’అని ఆర్యమా సుందరం చెప్పారు. ‘సహేతుక సమయం’లో స్పీకర్ నిర్ణ యం తీసుకుంటారని మరోసారి సింఘ్వీ చెబుతుండగా.. జస్టిస్ గవాయి అడ్డుకున్నారు. ‘ఇప్పటికే 14 నెలలు గడిచాయి. ఇంకా ఆరు నెలల సమయం అడుగుతున్నారు.అంటే 2028వ సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి ఎన్నికలు వచ్చే వరకు ఉండాల్సిందే అంటారా? ఇదేనా మీరు చెప్పే, మీ దృష్టిలో ఉన్న రీజనబుల్ టైం’అంటూ ఘాటుగా స్పందించారు. ‘ప్రత్యేకంగా ఇటువంటి కేసుల్లో న్యాయవాదులు వ్యవహరిస్తున్న తీరు న్యాయస్థానాలకు ఇబ్బందికరంగా ఉంటోంది..’అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.రెండు వైపులా వాదనలను విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. 8 వారాల వరకు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ఆర్యమా సుందరం.. 8 వారాల్లోపే తీర్పు వెలువరించాలని అభ్యర్ధించారు. ఆ విధంగానే 8 వారాల్లోపు తీర్పును వెలువరిస్తామని ధర్మాసనం హామీ ఇచ్చింది. -
సీఎంకు సంయమనం పాటించడం తెలియదా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ముఖ్యమంత్రికి సంయమనం పాటించడం తెలియదా? ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ఎగతాళి చేసినట్లే ఉన్నాయి..గతంలో హెచ్చరించినా ఆయనలో మార్పు రాలేదు..’అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీతో కూడిన ధర్మాసనం వరుసగా రెండోరోజు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఆయనపై తాము గతంలో చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించింది.గురువారం సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా.. ‘ఉప ఎన్నికలు రావు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అంటూ సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యను బీఆర్ఎస్ తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం గురువారం మరోసారి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన పత్రికా కథనాలను న్యాయమూర్తులకు చూపించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందించింది. గతంలో చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా? ‘గతంలో ఇలాంటి అనుభవం ఉన్నందున కొంత సంయమనం పాటించాలనే విషయం ముఖ్యమంత్రికి తెలియదా? 2024 ఆగస్టులో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కవితకు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. వాటిపై అప్పుడు క్షమాపణలు చెప్పారు. కానీ ఆ సమయంలో మేము సీఎంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా? అని ఇప్పుడు అనిపిస్తోంది. సీఎం కనీస స్వీయ నియంత్రణ పాటించలేరా?..’అని ధర్మాసనం ప్రశ్నించింది.‘గతంలో ఇలాంటి ఘటనను ఎదుర్కొన్న వ్యక్తి ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా? సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుంది..’అని జస్టిస్ గవా యి హెచ్చరించారు. ‘సీఎం అటువంటి వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయం, పైగా స్పీకర్ సమక్షంలో ఇలా వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదు అని వారించినా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా మాట్లాడారు..’అని ఆర్యమా సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ రెండు వ్యవస్థలు సంయమనం పాటించాలి ‘న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య పరస్పర సంయమనం అవసరం. దేశ సర్వోన్నత న్యాయస్థానం అన్ని విషయాల్లో సంయమనం పాటిస్తుంది. అదే సంయమనాన్ని శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల నుంచి మేం ఆశిస్తున్నాం..’అని ధర్మాసనం పేర్కొంది. అసెంబ్లీలో విపక్షం నుంచి అంతకంటే ఎక్కువగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని స్పీకర్ తరఫు న్యాయవాది అభిõÙక్ మనుసింఘ్వీ చెప్పారు. అయితే అవన్నీ ఇప్పుడు అప్రస్తుతమని జస్టిస్ గవాయి బదులిచ్చారు. శాసనసభలో ముఖ్యమంత్రి ఫిరాయింపులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను (ట్రాన్స్క్రిప్్ట, టేప్స్) యథాతథంగా తమకు అందజేయాలని సింఘ్వీని జస్టిస్ గవాయి ఆదేశించారు. -
చైనా అధీనంలో 4 వేల చ.కి.మీ. భూభాగం
న్యూఢిల్లీ: నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. మరోవైపు మనం భారత్– చైనా దౌత్య సంబంధాల వజ్రోత్సవాలను జరుపుకొంటున్నామని ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ గురువారం లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కొత్త టారిఫ్‌లు భారత ఆర్థికవ్యవస్థ నడ్డి విరుస్తాయని పేర్కొన్నారు. చైనా దురాక్రమణ, అమెరికా టారిఫ్‌లపై కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘చైనా ఒకవైపు 4,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. మరోవైపు కొద్దికాలం కిందట మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చైనా రాయబారితో కలిపి కేక్ కట్ చేశారు. ఇది చూసి నేను నివ్వెరపోయా. చైనా ఆక్రమించిన నాలుగు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం సంగతేమిటి? అక్కడ ఏం జరుగుతోంది?’ అని రాహుల్ నిలదీశారు. గాల్వాన్ లోయలో ఘర్షణలను ఉటంకిస్తూ 20 మంది భారత జవాన్లు అమరులయ్యారని గుర్తుచేశారు. ‘ఒకవైపు వీరి త్యాగం.. మరోవైపు కేక్ కట్ చేసి (చైనా రాయబారితో కలిసి) సంబరాలు జరుపుకుంటున్నాం. ఏమిటిది? చైనా తో సరిహద్దుల్లో సాధా రణ పరిస్థితులు నెలకొ నడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ దానికి మునుపు యథా తథస్థితిని పునరుద్ధరించాలి’ అని రాహుల్ గాంధీ పేర్కొ న్నారు. ‘మొదట మన భూభాగాన్ని తిరిగిపొందాలి. ఆక్రమిత భూభాగానికి సంబంధించి రాష్ట్ర పతి, ప్రధానమంత్రులు చైనాకు లేఖలు రాశారని నా దృష్టికి వచ్చింది. ఈ విషయం మనవాళ్ల ద్వారా తెలియలేదు. భారత్‌లోని చైనా రాయబారి లేఖల విషయాన్ని చెప్పారు’ అని రాహుల్ అన్నారు. సమర్థ విదేశీ విధానం అంటే విదేశాలతో సమాన స్థాయిలో సంబంధ బాంధవ్యాలను నెరపడం. ఒకవైపు చైనా మన 4 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. మరోవైపు అమెరికా అకస్మాత్తుగా భారత్‌పై టారిఫ్‌లు విధించింది అని కాంగ్రెస్ నేత పేర్కొ న్నారు. అమెరికా టారిఫ్‌లు భారత్‌కు శరాఘా తమని అభిప్రాయపడ్డారు. మన ఆటోమొబైల్ రంగం, ఫార్మా పరిశ్రమ, వ్యవసాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. -
వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది. దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే.సదుద్దేశమే: రిజిజు న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై గురువారం అర్ధరాత్రి దాకా జరిగిన వాడివేడి చర్చ పెద్దల సభను వేడెక్కించింది. ఉమీద్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్)గా పేరు మార్చిన వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు నిరసనగా పలువురు విపక్ష సభ్యులు నల్లదుస్తులు ధరించి సభకు వచ్చారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డారు. ముస్లింల భూములను లాక్కోవడమే మోదీ సర్కారు అసలు లక్ష్యమని ఆరోపించారు. విపక్షాల వాదనను రిజిజు ఖండించారు. వాటి అభ్యంతరాలను తోసిపుచ్చారు. ‘‘ముస్లింల హక్కులను ఎవరూ లాక్కోబోవడం లేదు. ఈ విషయమై విపక్షాలు చేస్తున్నదంతా దు్రష్పచారమే’’ అని పేర్కొన్నారు. ‘‘2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు ఏకంగా 8.72 లక్షలకు పెరిగాయి. తద్వారా దేశంలో వక్ఫ్ అతి పెద్ద ప్రైవేటు భూ యజమానిగా అవతరించింది’’ అని వివరించారు. ‘‘వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తేవడం, వాటి ఆస్తులను మరింత సమర్థంగా నిర్వహించడం, ముస్లిం మహిళలకు సాధికారత కల్పించడం, ముస్లింలలోని అన్ని తెగల హక్కులనూ పరిరక్షించడమే బిల్లు లక్ష్యం. అంతే తప్ప మతంతో ఈ బిల్లుకు ఎలాంటి సంబంధమూ లేదు’’ అని పునరుద్ఘాటించారు. ‘‘అందుకే సున్నీలు, షియాలతో పాటు ముస్లింలలోని ఇతర వెనకబడ్డ వర్గాల వారు కూడా వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉంటారు. తద్వారా వారి ప్రయోజనాలకూ న్యాయం జరుగుతుంది. ఇందుకు ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు’’ అన్నారు. ‘‘కేంద్ర వక్ఫ్ మండలి సభ్యుల్లో అధిక సంఖ్యాకులు ముస్లిమేతరులే ఉంటారనడం అవాస్తవం. 22 మందిలో వారి సంఖ్య 4కు మించబోదు. వక్ఫ్ బోర్డులు చట్టపరమైన సంస్థలు. అంతే తప్ప కేవలం ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు కాదు. వక్ఫ్ ట్రిబ్యునళ్ల ముందు 31,999 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వివాదాస్పద వక్ఫ్ భూముల్లో ఇప్పటికే కోర్టుల్లో పరిష్కారమైన వాటి జోలికి పోబోం. పసలేని ఆరోపణలు మాని బిల్లును ఆమోదించడంలో విపక్షాలు కూడా కలసి రావాలి’’ అని కోరారు. దురుద్దేశాలు: విపక్షాలు వక్ఫ్ (సవరణ) బిల్లు వెనక మోదీ సర్కారు దురుద్దేశాలు దాగున్నాయని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. మోదీ ప్రభుత్వాన్ని ముస్లింలు విశ్వసించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు రామ్‌గోపాల్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా చూడాలన్నారు. బిల్లులో పలు అంశాలు పైకి బాగానే ఉన్నా దీని వెనక మోదీ సర్కారు ఉద్దేశమే అనుమానాలకు తావిస్తోందని బీఆర్ఎస్ సభ్యుడు కె.ఆర్.సురేశ్‌రెడ్డి అన్నారు. బిల్లులోని 75 శాతం అంశాలను బిల్లుతో నిమిత్తం లేకుండానే అమలు చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుచ్చి శివ (డీఎంకే), వై.వి.సుబ్బారెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), అభిõÙక్ మను సింఘ్వీ, సయీద్ సనీర్ హుసేన్ (కాంగ్రెస్), సుష్మితా దేవి (టీఎంసీ), సంజయ్ రౌత్ (శివసేన–యూబీటీ), సంజయ్‌సింగ్ (ఆప్), ముజీబుల్లా ఖాన్ (బీజేడీ), జాన్ బ్రిటాస్ (సీపీఎం), పి.పి.సునీర్ (సీపీఐ), హరీస్ బీరన్ (ఐయూఎంఎల్), వైగో (ఎండీఎంకే) తదితర సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (జేడీఎస్) బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. వక్ఫ్‌కు ముస్లిమేతరులూ విరాళాలు ఇవ్వొచ్చు: సిబల్ ముస్లిమేతరులకు కూడా వక్ఫ్ విరాళాలిచ్చే హక్కుందని స్వతంత్ర సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ‘‘నా ఆస్తిని ఫలానా వారికి ఇవ్వొద్దని చట్టం చేయడానికి మీరెవరు? హిందువులు వక్ఫ్ విరాళాలు ఇవ్వడమే కాదు, స్వాతంత్య్రానికి ముందే వక్ఫ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని పలు హైకోర్టులూ సమరి్థంచాయి’’ అని చెప్పారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో హిందూ మత సంస్థలకు 10 లక్షల ఎకరాలకు పైగా భూములున్నాయని ఆయన అన్నారు. ‘‘హిందూ మతంలో స్వార్జిత ఆస్తిని కుమారులకు మాత్రమే ఇవ్వగలరు. దాన్ని కూతుళ్లకూ ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ చట్టాన్ని మార్చండి’’ అని సూచించారు. చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ జోక్యం చేసుకుంటూ కూతుళ్లతో పాటు ఎవరికైనా ఇచ్చేందుకు మన చట్టాలు వీలు కల్పిస్తున్నాయని చెప్పారు. అయోమయం సృష్టిస్తున్నారు: రిజిజు సిబల్ తీరును మంత్రి రిజిజు తీవ్రంగా దుయ్యబట్టారు. హిందూ మత సంస్థలకు చెందిన భూమిని వక్ఫ్ భూములతో పోల్చడాన్ని ఖండించారు. ‘‘పలువురు సీనియర్ సభ్యులు ఏ అంశం పడితే అది లేవనెత్తడం ద్వారా అయోమయం సృష్టిస్తున్నారు. కానీ వాటిపై వివరణలు వినే దాకా కూడా సభలో ఉండటం లేదు’’ అంటూ అసహనం వెలిబుచ్చారు. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే: ఖర్గే వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దానిపై చర్చలో ఆయన పాల్గొన్నారు. బిల్లు ముసుగులో సమాజంలో విభజన బీజాలు నాటేందుకు, ముస్లింలను వేధించేందుకు, వారి భూమిని లాక్కొని కార్పొరేట్ మిత్రులకు పంచేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ‘‘ఈ బిల్లు ఆమోదం పొందితే ముస్లింల ఆస్తులను లాగేసుకుంటారు. వారి ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి’’ అని ఆరోపించారు. అస్మదీయులను వక్ఫ్ బోర్డుల్లోకి చొప్పించేందుకు వీలుగా సవరణలు చేశారంటూ బిల్లులోని పలు అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. ‘‘గత 11 ఏళ్లలో ముస్లింల సంక్షేమానికి కేటాయించిన రూ.18,274 కోట్ల నిధులనే పూర్తిగా వెచ్చించని చెత్త రికార్డు మోదీ సర్కారుది. అలాంటివాళ్లు పస్మాంద వంటి పేద ముస్లింల సంక్షేమంపై మొసలి కన్నీరు కారుస్తున్నారు’’ అంటూ తూర్పారబట్టారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉండాలన్న ప్రతిపాదనను ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం, రామమందిర్ ట్రస్ట్ వంటివాటిల్లో ఒక్కరైనా ముస్లిం ఉన్నారా అని ప్రశ్నించారు. ఆలయ ట్రస్టుల్లో కనీసం దళితులకు కూడా స్థానం కల్పించడం లేదని ఆక్షేపించారు. ‘‘‘దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బ తీయకండి. ప్రతిష్టకు పోకుండా ఈ తప్పులతడక బిల్లును తక్షణం వెనక్కు తీసుకోండి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పాపమే: నడ్డా కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో ముస్లిం మహిళల అభ్యున్నతికి చేసిందేమీ లేదని రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా ఆక్షేపించారు. వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిన పాపం ఆ పారీ్టదేనంటూ దుయ్యబట్టారు. ‘‘ముస్లిం మహిళలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడంతో కోట్లాది మంది ముస్లిం మహిళలు గౌరవంగా జీవిస్తున్నారు. వక్ఫ్ బిల్లు జాతి ప్రయోజనాల కోసం ఉద్దేశించింది. వక్ఫ్ ఆస్తులు తీవ్రంగా దురి్వనియోగమవుతున్నాయి. దానికి పూర్తిగా అడ్డుకట్ట వేసి వక్ఫ్ వ్యవహారాల్లో జవాబుదారీతనం తేవడమే బిల్లు లక్ష్యం. వక్ఫ్ బిల్లులో సవరణలు సూచించేందుకు ఏకంగా 31 మంది సభ్యులతో జేపీసీ వేశాం. యూపీఏ హయాంలో కేవలం 13 మందితో జేపీసీ వేసి మమ అనిపించారు’’ అని నడ్డా ఆరోపించారు. ‘‘వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చి ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించేందుకు వీలుగా సౌదీ అరేబియా, తుర్కియే వంటి ముస్లిం దేశాలు కూడా పలు చట్టాలు చేశాయి. వక్ఫ్ ఆస్తులను డిజిటైజ్ కూడా చేస్తున్నాయి. అదే పని భారత్‌లో చేస్తుంటే అభ్యంతరమెందుకు?’’ అని విపక్షాలను ప్రశ్నించారు. -
పనులు ఆపేయండి.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు స్టే
సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించింది. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకుండా స్టే విధించింది. తమ ఆదేశాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల అంశాన్ని అమికస్ క్యూరీ పరమేశ్వర్ గురువారం ఉదయం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం.. వారాంతం సెలవులను సద్విని యోగం చేసుకుని అధికారులు చెట్లను నరికివేయడంలో తొందరపడ్డారని అభిప్రాయపడింది. తక్షణమే ఆ భూములను సందర్శించి మధ్యాహ్నం 3:30 లోపు మధ్యంతర నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతను అనుమతించకూడదని సీఎస్‌ను ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక అందిన అనంతరం 3.45 గంటలకు విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది గౌరవ్ అగర్వాల్, భూముల విషయంలో ఆందోళన చేస్తున్న వారి తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణ్ వాదనలు వినిపించారు. అటవీ ప్రాంతం కాదు: ప్రభుత్వ న్యాయవాది కంచ గచ్చిబౌలిలో ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రదేశం అటవీ ప్రాంతం కాదని, 30 సంవత్సరాలుగా ఆ భూమి వివాదంలో ఉందని గౌరవ్ అగర్వాల్ చెప్పారు. అటవీ భూమి అని చెప్పేందుకు ఆధారాలు లేవని అన్నారు. దీంతో.. ‘ఒకవేళ అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లను నరికేందుకు అనుమతి తీసుకున్నారా? కేవలం 2, 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్ల నరికివేత తీవ్రమైన అంశం. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా చట్టానికి అతీతం కాదు.’ అని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో చెట్ల నరికివేతపై దాఖలైన పిటిషన్‌పై ఇప్పటికీ విచారణ జరుగుతోందన్నారు. కాగా.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారని గోపాల్ శంకర నారాయణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నెలరోజుల్లో నిపుణుల కమిటీ వేయాలి చెట్ల నరికివేతపై హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) సమర్పించిన నివేదికలోని అంశాలపై ధర్మాసనం ది్రగ్బాంతి వ్యక్తం చేసిసింది. ‘పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేసి, భారీ యంత్రాలను ఉపయోగించి వందలాది ఎకరాలను అస్తవ్యస్తం చేశారు. ఈ విధ్వంసకాండ వల్ల నెమళ్లు, జింకలు ఈ ప్రాంతం నుంచి పారిపోయినట్లు చూపించే చిత్రాలు నివేదికలో ఉన్నాయి. దీనికి తోడు అక్కడ ఒక చెరువు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రిపోర్టులో పొందుపర్చిన చిత్రాలను ప్రాథమికంగా పరిశీలిస్తే.. ఈ ప్రాంతం అడవి జంతువుల నివాసానికి అనువుగా ఉంది..’ అని ధర్మాసనం పేర్కొంది. అటవీ భూములు గుర్తించడానికి చట్టబద్ధమైన కమిటీలను ఏర్పాటు చేయకపోతే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాల్సివస్తుందంటూ..ఓ కేసులో మార్చి 4న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నామని ధర్మాసనం గుర్తుచేసింది. అటవీ భూములను గుర్తించే చట్టబద్ధమైన కసరత్తు ఇంకా ప్రారంభం కానప్పుడు, చెట్లను నరికివేసేందుకు ఉన్న ‘అంత ఆందోళనకరమైన ఆవశ్యకత’ ఏంటి? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో నెలరోజుల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. ఆ కమిటీ ఆరు నెలలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే.. కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని సందర్శించి ఈ నెల 16 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ‘ఆ ప్రాంతంలో చెట్లను తొలగించడం వంటి కార్యకలాపాలను చేట్టపట్టాల్సిన అవసరం ఏంటి? చెట్ల నరికి వేత కోసం అటవీ అధికారుల నుంచి కానీ మరేదైనా స్థానిక చట్టాల కింద కానీ అనుమతులు తీసుకున్నారా? నరికివేసిన చెట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?..’ తదితర ప్రశ్నలకు జవాబులివ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
హెచ్‌సీయూ వివాదం: సుప్రీంకోర్టు నిర్ణయంపై కిషన్‌రెడ్డి రియాక్షన్
సాక్షి, ఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూమిలో పర్యావరణ విధ్వంసంపై ‘స్టే’ విధిస్తూ.. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 400 ఎకరాల్లో పర్యావరణం, జీవ వైవిధ్యతను కాపాడాలంటూ అన్ని వర్గాల ద్వారా జరుగుతున్న ఆందోళనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని.. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన తీర్పులోని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని.. వెంటనే ఈ భూముల్లో చెట్ల నరికివేతను తక్షణమే ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నెలరోజుల్లో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆరు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయం.. విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కినట్లుగా భావిస్తున్నాము’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.‘‘కంచ గచ్చిబౌలి ప్రాంతంలో అటవీ సంపదను నష్టపరిచే ప్రయత్నం జరుగుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక చెట్టు నరికేందుకే అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో చెట్లను నరికేందుకు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా?. జీవవైవిధ్యత కళ్లముందు కనబడుతున్నప్పటికీ.. చెట్లను నరికివేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఇవాళ ఉదయం ఈ అటవీ సంపద విధ్వంసాన్ని సుమోటోగా తీసుకున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా.. ఉదయం నుంచి చెట్ల నరికివేతను కొనసాగించడం దురదృష్టకరం’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.‘‘ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తమ ఆలోచనను మార్చుకుని.. వ్యక్తిగత అహాన్ని పక్కనపెట్టి.. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతున్నాను. పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అరెస్టు చేసిన విద్యార్థులను, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
‘స్ట్రేచర్ ఉందని విర్రవీగితే’.. సుప్రీం తీర్పుపై HCU విద్యార్థుల సంబరాలు
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీయూ భూముల్లో చేపడుతున్న పనులన్నింటిని నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యులవుతారని హెచ్చరించింది. ఈమేరకు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్), జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. దీంతో హెచ్‌సీయూలో పండుగ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు.కంచ గచ్చిబౌలి భూముల్లో (kancha gachibowli land issue) 400 ఎకరాల వేలంపై వారం రోజులగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీలో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోలేమేని భీష్మించుకున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్టు తమ పోరాటానికి మద్దతుగా సుప్రీం కోర్టు ఉత్తర్వులపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇది విద్యార్థుల విజయంమరోవైపు సుప్రీం కోర్టు ఉత్తర్వులపై రాజకీయ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. కంచ గచ్చిబౌలి పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విజయం. విద్యార్థుల నిస్వార్థ నిరంతర స్ఫూర్తివంతమైన పోరాటం వల్లనే ఈ సానుకూల తీర్పు వచ్చింది’ అని అన్నారు.స్ట్రేచర్ ఉందని విర్రవీగితే..సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలకు ఇది చెంపపెట్టు లాంటిది అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు హెచ్‌సీయూ భూముల విషయంలో సుప్రీం అక్షింతలు. స్ట్రేచర్ ఉందని విర్రవీగితే.. చట్టం చూస్తూ ఊరుకోదు. పర్యావరణాన్ని కాపాడడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందినపుడు న్యాయస్థానం మార్గదర్శకంగా ఉండడం శుభ పరిణామం. ఇది విద్యార్థుల విజయం, పర్యావరణ ప్రేమికుల విజయం, సామాజిక వేత్తల విజయం.హెచ్‌సీయూ భూములు కాపాడుకునేందుకు ఎంతగానో పోరాటం చేసిన విద్యార్థులకు, తెలంగాణ సమాజానికి అభినందనలు’ అని తెలిపారు. పర్యావరణ విధ్వంసంపై సుప్రీం ఆవేదన హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై సుప్రీం కోర్టు గురువారం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ నుంచి నివేదిక తెప్పించుకుని విచారించింది. విచారణ సందర్భంగా.. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో యదేశ్చగా చెట్లను నరకడంతో పాటు పర్యావరణాన్ని దెబ్బ తీయడం, జేసీబీలతో చెట్లను కొట్టేయడం,మూగజీవాల్ని హింసిస్తున్నారనే తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (బీఆర్ గవాయ్), జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.ఎవరిచ్చారు మీకు ఆ హక్కు‘ఇది చాలా సీరియస్ విషయం. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం. ఏ అధికారంతో చెట్లను ఎలా తొలగిస్తారాని పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. సీఎస్,జీహెచ్ఎంసీ కమీషనర్ ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించింది. హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్ఎంసీ కమీషనర్‌తో పాటు పలువురి అధికారులను తొలగించింది. ఈనెల 16 కల్లా సీఈసీ పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. -
సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించబోను: మమతా బెనర్జీ
న్యూఢిల్లీ, సాక్షి: పశ్చిమ బెంగాల్లో 25 వేల మంది టీచర్ల నియామకాలను రద్దుచేస్తూ సుప్రీం కోర్టు(Supreme Court) ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. న్యాయ వ్యవస్థపై తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని.. అయినప్పటికీ ఈ తీర్పును అంగీకరించబోమని అన్నారామె.ఈ దేశ పౌరురాలిగా నాకు ప్రతీ హక్కు ఉంటుంది. అలా.. మానవతా ధృక్పథంతో నా అభిప్రాయం తెలియజేస్తున్నా. న్యాయమూర్తులపై అపారమైన గౌరవం ఉన్నప్పటికీ ఈ తీర్పును నేను అంగీకరించబోను. అయినప్పటికీ ప్రభుత్వపరంగా కోర్టు చెప్పినట్లు నడుచుకుంటాం. స్కూల్ సర్వీస్ కమిషన్‌ను రిక్రూట్మెంట్ ప్రాసెస్ తిరిగి ప్రారంభించాలని కోరినట్లు తెలిపారామె. ఈ క్రమంలోనే ఢిల్లీ నోట్ల కట్టల జడ్జి(Delhi Notes Judge) అంశాన్ని ఆమె ప్రస్తావించారు.ఒక సిట్టింగ్ జడ్జి నివాసంలో నోట్ల కట్టలు దొరికితే కేవలం ట్రాన్స్ఫర్తో సరిపెడతారా?. అదే నియామకాల్లో మోసం జరిగిందని మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తారా?. అలాంటప్పుడు వీళ్లను(అభ్యర్థులను) ఎందుకు బదిలీతో సరిపెట్టకూడదు అని మమతా అన్నారు. అలాగే.. నియామకాల రద్దుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చిన తొలి జడ్జి ఇప్పుడు బీజేపీ ఎంపీగా(అభిజిత్ గంగోపాధ్యాయను ఉద్దేశించి..) ఉన్నారని, ఈ తీర్పు వెనుక బీజేపీ, సీపీఎంల కుట్ర దాగుంది అని అన్నారామె. బెంగాల్ విద్యా వ్యవస్థ కుప్పకూల్చాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోందని మండిపడ్డారామె. బెంగాల్లో 25 వేల మంది టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ నియమకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు(Calcutta High Court) తీర్పు ఇచ్చింది. ఇవాళ సుప్రీం కోర్టు ఆ తీర్పును సమర్థించింది. ఈ నియామకాల ప్రక్రియ మొత్తం మోసపూరితంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. తిరిగి సరిదిద్దుకోలేని కళంకం ఇది. ఎలాంటి మోసానికి పాల్పడకుండా ఎంపికైన అభ్యర్థులు కూడా బాధపడాల్సి వస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.అయితే సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరి కారణంగా.. అంతమందిని శిక్షించడం ఏంటని ప్రశ్నించారామె. ఇది కేవలం 25 వేల మంది అభ్యర్థులకు మాత్రమే సంబంధించిన విషయం కాదని.. వాళ్ల కుటుంబాలకు సంబంధించిన అంశమని అన్నారామె. 2016లో జరిగిన 25 వేల టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. -
‘మీరెళ్లి చైనీయులతో కలిసి చైనా సూప్ తాగండి’
న్యూఢిల్లీ,సాక్షి: లోక్‌సభలో రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. 4వేల స్కైర్ కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. మన భూముని మనం తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా కేంద్రం ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ దిగువ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘భారత్ భూభాగంలో ఏం జరుగుతోంది నాకు అర్ధం కావడం లేదు. చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించింది. మన భూమి మనకు వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు .. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు లేఖ రాయాలి. చైనా 4వేల స్కైర్ కిలోమీటర్ల భారత భూమిని ఆక్రమించుకుంది. ఈ విషయం నన్ను మరింత షాక్‌కు గురిచేసింది. మన భూమిని మనం ఎలా తిరిగి స్వాధీనం చేసుకోవాలి? అని ఆలోచించాల్సి ఉంది. అలా చేయడం లేదు. భారత విదేశాంగ కార్యదర్శి చైనా రాయబారితో కలిసి కేక్ కట్ చేస్తున్నారు. చైనా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. చైనాను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై కేంద్రం సభలో ప్రకటన చేయాలి. భారత్‌పై అమెరికా 26శాతం సుంకాలు విధించింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి’ అని అన్నారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. రాహుల్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఎవరి కాలంలో ఈ ప్రాంతాన్ని చైనా తన ఆధీనంలోకి తీసుకుంది? డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనా అధికారులతో సూప్ తాగిన వ్యక్తులు ఎవరు? రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనీయుల నుండి డబ్బు ఎందుకు తీసుకుంది?’ అని అడిగారు. అలాంటి వారికి నేను ఒక్కటే చెబుతున్నా.. భారత్ భూభాగాన్ని చైనా ఒక్క అంగుళం కూడా తీసుకోలేదు. ఈ తరహా రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని రాహుల్‌కు హితువు పలికారు. -
రాజ్యసభలో వక్ఫ్ బిల్లు.. వాడీవేడి చర్చ
Waqf Bill In Rajya Sabha Updates..👉వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో చర్చ నడుస్తోంది.👉వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభలో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ప్రవేశపెట్టారు.వక్ఫ్ బిల్లు పేరు మార్పుకేంద్రమంత్రి కిరణ్ రిజుజు కామెంట్స్..వక్ఫ్ బిల్లును యూఎంఈఈడీగా పేరు మార్పుUMEED (Unified Waqf Management Empowerment Efficiency and Development) బిల్లుగా మార్చినట్టు వ్యాఖ్యలు. #WATCH | Speaking in Rajya Sabha on Waqf Amendment Bill 2025, Union Minister Kiren Rijiju says, "Waqf Amendment Bill, 2025, will be renamed as the UMEED (Unified Waqf Management Empowerment Efficiency and Development) Bill." pic.twitter.com/1sFSkVJqre— ANI (@ANI) April 3, 2025 👉వక్ఫ్ సవరణ బిల్లుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు ఇవ్వాలని కోరారు. Speaking in Rajya Sabha on Waqf Amendment Bill 2025, Union Minister Kiren Rijiju says, "I appeal to Congress party and its allies to support Waqf Amendment Bill 2025." pic.twitter.com/jkWTFDPj5J— ANI (@ANI) April 3, 2025చైనా ఆక్రమించిన భూమి తిరిగి రావాలి: రాహుల్ఈ విషయంపై ప్రధాని, రాష్ట్రపతి చైనా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసిందిచైనా రాయబారి ద్వారా ఈ విషయం బయటపడిందిట్రంప్ సుంకాలు విధించడంపై కేంద్ర ప్రభుత్వ స్పందన తెలియజేయాలని రాహుల్ డిమాండ్ఎంపీ అనురాగ్ ఠాకూర్‌పై ఖర్గే సీరియస్..బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నిన్న నాపై అసత్య, నిరాధార ఆరోపణలు చేశారు.మా పార్టీ ఎంపీలు ప్రశ్నించడంతో ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకున్నారు.కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.సోషల్ మీడియా, మీడియాల్లో బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలే వైరల్ అవుతున్నాయి.అందువల్లే ఈ రోజు నేను నిలబడి ఆయన ఆరోపణలను ఖండించాల్సి వస్తోంది.ఆయన వ్యాఖ్యలకు గానూ సభాపక్ష నేత క్షమాపణలు చెప్పాలి’’ అని ఖర్గే డిమాండ్ చేశారు.నా జీవితం తెరిచిన పుస్తకం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా.అయినప్పటికీ ప్రజా జీవితంలో తలెత్తుకొని నిలబడ్డా.అలాంటి నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు.ఈ ఆరోపణలను ఠాకూర్ నిరూపించగలరా?ఒకవేళ అలా చేస్తే నేను రాజీనామా చేస్తా.లేదంటే ఆయనకు పార్లమెంట్లో ఉండే అర్హత లేదు.రాజీనామా చేయాల్సిందే. ఇలాంటి రాజకీయ దాడులతో బీజేపీ నేతలు నన్ను భయపెట్టాలని చూస్తున్నారు.గుర్తుంచుకోండి. నేను ఎవరికీ భయపడను. తలొగ్గను అని అన్నారు.లోక్‌సభలో ఠాకూర్ కామెంట్స్.. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు బాధ్యతారహితంగా వినియోగిస్తున్నాయని ఆరోపించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఆ భూములను కబ్జా చేశారంటూ ఖర్గేపై ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.I will not bow down!🔥Congress President Shri @kharge ji. pic.twitter.com/otsKZiDySW— Telangana Youth Congress (@IYCTelangana) April 3, 2025సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు..పార్లమెంటులో ప్రతిపక్షాలను మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదు.కాంగ్రెస్ సభ్యులు తమ సమస్యలను లేవనెత్తనివ్వకుండా సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి చేయడమే.దిగువ సభలో ఈ బిల్లును తొక్కేశారు.మోదీ ప్రభుత్వం విద్య, పౌర హక్కులు, స్వేచ్ఛ, సమాఖ్య నిర్మాణం, ఎన్నికల నిర్వహణ ఏదైనా దేశాన్ని అగాధంలోకి లాగుతోంది.రాజ్యాంగం అనేది కేవలం కాగితాలకే పరిమితమైంది.దాన్ని కూడా కూల్చేయాలనేదే వారి ఉద్దేశమని మాకు తెలుసు.మోదీ ప్రభుత్వ వైఫల్యాలను, వారి ఉద్దేశాలను బహిర్గతం చేయాలి.ఏది సరైనది, ఏది న్యాయబద్ధమైనది అనేది ప్రజలకు తెలియజేసేందుకు అందరం కలిసి మన పోరాటాన్ని కొనసాగించాలి.రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికే ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు.దీన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు.బీజేపీ సభ్యులు కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలని టార్గెట్ చేశారు. 👉రాజ్యసభలో ఈ బిల్లు ఇప్పుడు కీలకమైన పరీక్షను ఎదుర్కొంటోంది. ఇక్కడ ప్రస్తుత సభ్యుల మొత్తం బలం 236. బిల్లును ఆమోదించడానికి అధికార ఎన్డీయే కూటమికి 119 ఓట్లు అవసరం. స్వతంత్ర, నామినేటెడ్ సభ్యుల మద్దతుతో, దాని సంఖ్య 125గా ఉంది. ప్రతిపక్షం వద్ద 95 ఓట్లు ఉండగా 16 మంది సభ్యులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.👉లోక్‌సభలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష సభ్యులు 100 కు పైగా సవరణలను ప్రతిపాదించారు అయితే ఓటింగ్ సమయంలో అవన్నీ తిరస్కరించారు. దాదాపు 12 గంటల చర్చ అనంతరం వక్ఫ్ సవరణ బిల్లును స్పీకర్ ఆమోదించారు. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, సాక్షి: భారత ప్రధాన న్యాయమూర్తితో సహా సుప్రీం కోర్టు న్యాయమూర్తులంతా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఆస్తులను ప్రకటించడానికి ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. తద్వారా జడ్జీలు ఆస్తులు వెల్లడించాల్సిందేననే సంకేతాలిచ్చారు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆ వివరాలను సుప్రీం కోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసే జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఒకవైపు ప్రత్యేక కమిటీ విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు ఆ వివరాలను సర్వోన్నత న్యాయస్థానం వెబ్సైట్లో ఉంచి ఆశ్చర్యపరిచింది కూడా.ఈ నేపథ్యంతో.. ఏప్రిల్ 1వ తేదీన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో న్యాయమూర్తులంతా ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నారు. తమ ఆస్తుల్ని బహిర్గతపరిచేందుకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం.. విధులు స్వీకరించే సమయంలో తమ ఆస్తుల వివరాలను న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు తెలియజేయాల్సి వచ్చేది. ఆపై ఆ వివరాలను సుప్రీం కోర్టు తన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ వచ్చింది. కొంత మంది న్యాయమూర్తుల ఆస్తుల చిట్టా ఆ వెబ్సైట్లో ఉంది కూడా.అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆ వివరాలేవీ అప్డేట్ కావడం లేదు. అందుకు కారణం.. ఆ వివరాలను తప్పనిసరిగా ప్రజలకు బహిర్గత పర్చాలనే నిబంధనేదీ లేకపోవడం లేకపోవడమే. ఈ క్రమంలో ఇప్పుడు జస్టిస్ వర్మ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో.. తమ ఆస్తుల్ని బహిర్గత పర్చాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తులంతా నిర్ణయించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.#BREAKING All Supreme Court Judges unanimously agree in a full court meeting to declare their assets to the Chief Justice of India.The declaration of the Judges' assets will be uploaded on the Supreme Court's website.#SupremeCourt pic.twitter.com/XT9OvDaNmo— Live Law (@LiveLawIndia) April 3, 2025 -
కేటీఆర్‌వి పగటి కలలు.. టీపీసీసీ చీఫ్ సెటైర్లు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగలు కంటున్నారని కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో రాబోయే రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బంగారం లాంటి భూములను దోచుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అంటూ విమర్శలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఐఎంజీ భారత్‌కు భూములను అప్పనంగా కట్టబెట్టారు. అప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ భూమి కేటాయింపులను రద్దుచేసి ప్రభుత్వ భూములను కాపాడారు. రాష్ట్రంలో బంగారం లాంటి భూములను దోచుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపైన విచారణ జరగాలి. లక్షల కోట్ల అప్పుల్లో ముంచి తెలంగాణను నాశనం చేసిన వ్యక్తి కేటీఆర్. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీనే ఉండదు అంటూ వ్యాఖ్యలు చేశారు.అలాగే, మంత్రి వర్గ విస్తరణ ఏఐసీసీ పరిధిలో ఉంది. ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాలని కోరాం. మొత్తం మంత్రి వర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. మంత్రి వర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రాంతాలు, కులాల వారీగా చూడాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీకి అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు.. ఢిల్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..‘ఈడబ్ల్యూఎస్ కింద ముస్లింలకి బీజేపీ రిజర్వేషన్లను ఇస్తోంది. ఏపీ నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ రిజర్వేషన్లను తొలగించే దమ్ము బీజేపీకి ఉందా?. 70 ముస్లిం తెగలకు రిజర్వేషన్లు ఇచ్చామని గతంలోనే నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది అని ప్రశ్నించారు. -
సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, సాక్షి: పార్టీ మారినా ఉప ఎన్నికలు రావంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎం కొంతమేర సంయమనం పాటించాలని.. ఇలాంటి వ్యాఖ్యలు కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై గురువారం విచారణ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో.. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం మరోసారి బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. స్పీకర్ తరఫునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. స్పీకర్ తరఫున సీఎం ఎలా కామెంట్ చేస్తారు?. సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక.. పిటిషన్లపై విచారణ జరుగుతుందని మేమెలా నమ్మాలి అని లాయర్ ఆర్యమ వాదించారు.దీంతో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సీఎం కొంత మేర సంయమనం పాటించాలి. గతంలో కూడా ఇలాగే వ్యవహరించారు. ఇలాంటివాటిని కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుంది. మేము సంయమనం పాటిస్తున్నాం. మిగిలిన రెండు వ్యవస్థలు కూడా అదే గౌరవంతో ఉండాలి. అసెంబ్లీలో జరిగిన పూర్తి చర్చను మేము పరిశీలిస్తాం.. .. గత అనుభవం ఉన్న వ్యక్తిగా, ముఖ్యమంత్రి కనీసం కొంత నియంత్రణ పాటించాలి కదా?. ఆ సమయంలో మేము చర్యలు తీసుకోకుండా, సరియైన తీర్పును (contempt) ఇవ్వకుండా తప్పు చేశామా?. మేము రాజకీయ నేతలు ఏం చెబుతున్నారనే దానితో పట్టించుకోము. కానీ ఇదే పరిస్థితిని ఇంతకుముందు ఎదుర్కొన్న వ్యక్తి ఉన్నప్పుడు ఎలా ఉండాలి?..’’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జస్టిస్ బీఆర్ గవాయి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ టైంలో న్యాయవాది సింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. రేవంత్ ఏమన్నారంటే..మార్చి 26వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని వ్యాఖ్యానించారు. -
HCU: ఇది చాలా సీరియస్ విషయం.. తెలంగాణ సర్కార్‌పై ‘సుప్రీం’ ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వివాదం(HCU Land Issue)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ విధ్వంసం చాలా తీవ్రమైన విషయమన్న సుప్రీం కోర్టు.. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? అని తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ గురువారం స్టే ఆదేశాలు జారీ చేసింది.వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘‘అంత అత్యవసరంగా చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారు?. పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇలా ఎలా చేస్తారు?. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా?. ఇది చాలా తీవ్రమైన విషయం. అవసరమైతే సీఎస్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటాం’’ అంటూ తదుపరి ఆదేశాలిచ్చేదాకా అన్ని పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఒకవేళ ఉల్లంఘనలు గనుక జరిగితే సీఎస్‌దే బాధ్యత అని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.ఇక.. హెచ్‌సీయూ భూములపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులను తొలగించింది. ఈ నెల 16వ తేదీకల్లా పర్యావరణ కమిషన్ (Commission for Environmental Cooperation) పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అమికస్ క్యూరీని రిట్ పిటిషన్‌తయారు చేయాలని సూచించింది. తెలంగాణ సీఎస్‌ను ప్రతివాదిగా చేర్చిన సుప్రీం కోర్టు.. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.అంతకు ముందు.. ఈ ఉదయం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వం విక్రయించాలనుకున్న కంచ గచ్చిబౌలి భూముల్ని వెంటనే సందర్శించాలని, ఇవాళ మధ్యాహ్నాం 3.30గం. లోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఆ సమయంలో.. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోబోమని సుప్రీం కోర్టు తాజా విచారణతో ఉద్ఘాటించింది. -
ఎయిమ్స్‌లో లాలూకు కొనసాగుతున్న చికిత్స
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. లాలూ ప్రసాద్ వీపు, చేతులపై పుండ్లు పడినట్లు సమాచారం. దీంతో బుధవారం రాత్రి ఆయన్ని కార్డియో క్రిటికల్ కేర్ యూనిట్(CCU)కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వైద్య బృందం ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం లాలూ వెంట ఆయన సతీమణి రబ్రీదేవి ఉన్నారు. వాస్తవానికి.. బుధవారం ఆయన ఢిల్లీకి బయలుదేరినప్పటికీ.. విమానాశ్రయానికి చేరుకోగానే ఒక్కసారిగా రక్తపోటులో తేడా కనిపించింది. దీంతో వెంటనే పాట్నాలోని పరాస్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకున్న అనంతరం ఢిల్లీ తరలించారు.లాలూ ఆరోగ్యంపై ఆయన తనయుడు, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు. పరాస్ ఆసుపత్రి నుంచి లాలూను తొలుత ఎయిర్ అంబులెన్స్‌లో ఎయిమ్స్‌కు తరలించాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రయాణికుల విమానంలో వెళ్తానని చెప్పడంతో తీసుకెళ్లినట్లు చెప్పారు. తన తండ్రి చాలా ధైర్యవంతుడన్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని తేజస్వి అంటున్నారు. 76 ఏళ్ల చాలా ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతుండడంతో ఇప్పటికే గుండె, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. గత ఏడాది జూలైలో ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొంది కోలుకున్నారు. -
ఇప్పటికే 14 నెలలు వృథా.. ఇంకా టైం ఎలా అడుగుతారు?: సుప్రీం కోర్టు అసహనం
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో విచారణ ముగిసింది. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. 8 వారాల్లోగా తీర్పు వెల్లడించాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఇవాళ ఫిరాయింపుల కేసు(Defections Case)లో వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వీ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రీజనబుల్ టైం ఏంటో చెప్పాలని స్పీకర్‌ను కోరుతూ.. మరోసారి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీ అభిప్రాయం ప్రకారం సమంజసమైన కాల వ్యవధి(Reasonable Time) అంటే ఎంత?. 2028 జనవరి-ఫిబ్రవరి వరకు ఎదురు చూసేలా.. వ్యవస్థను మార్చేందుకు అనుమతించాలా?. మేము కొంత న్యాయసమ్మతమైన ధోరణిని ఆశిస్తున్నాం అని సింఘ్వీని ఉద్దేశించి జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని.. సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు. అనర్హత పిటిషన్లపై విచారణకు మీకు ఎంత సమయం కావాలి? అని ప్రశ్నించగా.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరు నెలల సమయం కావాలి అని న్యాయవాది సింఘ్వీ అన్నారు. దీంతో జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే 14 నెలల సమయం వృథా అయ్యింది. మరో ఆరు నెలలు ఎలా అడుగుతారు?. ఇన్ని నెలలు గడిచాక కూడా కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన సమయం రాలేదా? అని ప్రశ్నించారు. అయితే.. స్పీకర్‌కు తుపాకీ గురిపెట్టి నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తున్నారని లాయర్ సింఘ్వీ అన్నారు. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం కలుగజేసుకుని సీఎం రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. స్పీకర్ తరఫునే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన చెప్పారు. స్పీకర్ తరఫున సీఎం ఎలా కామెంట్ చేస్తారు?. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని అన్నారు. సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక.. పిటిషన్లపై విచారణ జరుగుతుందని మేమెలా నమ్మాలి అని లాయర్ సుందరం అన్నారు. దీనిపై జస్టిస్ గవాయ్(Justice Gavai) స్పందిస్తూ ‘‘సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా?’’ అని ప్రశ్నించారు. మరోవైపు అభిషేక్ మనుసింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. అయితే.. సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. ‘‘మేం సంయమనం పాటిస్తున్నాం.. మిగతా రెండు వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టులో కేసులతో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని సింఘ్వీ పేర్కొనగా.. సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకుని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. అన్నివైపులా వాదనలు పూర్తి కావడంతో కేసు విచారణ ముగిస్తున్నట్లు.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు జస్టిస్ గవాయ్ తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం, తెలంగాణ స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ, అసెంబ్లీ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. -
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ, సాక్షి: లిబరేషన్ డే పేరిట.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ‘సుంకాల బాంబు’ పేల్చారు. ఈ క్రమంలోనే భారత్‌పై 26శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటించారు. దీంతో ట్రంప్ నిర్ణయంపై భారత్‌లో విశ్లేషణ మొదలైంది. అయితే ఇదేం మన దేశానికి ఎదురుదెబ్బ కాదంట!. ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల(reciprocal tariffs) ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అయితే, ఇక్కడో మార్గం లేకపోలేదు. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే.. ఆ దేశంపై సుంకాల (Tariffs) తగ్గింపును ట్రంప్ ప్రభుత్వం పునఃపరిశీలించే నిబంధన కూడా ఉంది. కాబట్టి ఇది మిశ్రమ ఫలితమే అవుతుంది తప్ప.. భారత్‌కు ఎదురుదెబ్బ కాదు అని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.ఎప్పటి నుంచి అమలు.. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో..) ట్రంప్ ప్రతీకార సుంకాలపై ప్రకటన చేశారు. తాను విధించిన టారిఫ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ అన్నారు. కానీ, 26 శాతం టారిఫ్‌లో.. 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు అంటున్నాయి. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చెబుతోంది. లిబరేషన్ డే పేరిట ట్రంప్ చేసిన ప్రకటన సారాంశం.. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. అయితే కనీసం 10% సుంకం చెల్లించాల్సిందే. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర విధిస్తున్నాం. భారత్ మా ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, మేం 26% సుంకం విధిస్తున్నాం. ఇదిలా ఉంటే.. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన చేసే వేళ భారత ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు.ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనకు ముందు గతంలో భారతీయ దిగుమతులపై అమెరికా చాలా తక్కువ సుంకాలను విధిస్తూ వచ్చింది. విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై కేవలం 2.5% సుంకాలను, దిగుమతి చేసుకున్న మోటార్‌సైకిళ్లపై 2.4% సుంకాలను మాత్రమే విధించాయి. అయితే భారత్ మాత్రం అమెరికా వస్తువులపై 52% సుంకాలను వసూలు చేస్తోందన్నది ట్రంప్ వాదన.నీ క్రమంలోనే ఇప్పుడు 26 శాతం టారిఫ్‌ను ప్రకటించారు. -
స్పీకర్ చర్యలు తీసుకోకున్నా చేతులు కట్టుకొని చూస్తుండాలా?: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మేం (కోర్టులు) చేతులు కట్టుకొని కూర్చోవాలా?’ అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు తమ ముందుకు వచ్చే దాకా పార్టీ మారిన ఎమ్మె ల్యేలకు స్పీకర్ ఎందుకు నోటీ సులు జారీ చేయలేదని ప్రశ్నించింది. తొలి నోటీసు ఇచ్చేందుకు స్పీకర్‌కు 11 నెలలు ఎందుకు పట్టిందని నిలదీసింది. ‘ఒకవేళ కేసు మా ముందుకు రాకపోయి ఉండి ఉంటే మీరు (స్పీకర్) నాలుగేళ్లు కాలయాపన చేసేవాళ్లేమో?’ అంటూ చురకలు అంటించింది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)తోపాటు మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాందీలపై దాఖలైన రిట్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఎస్ఎల్పీపై సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం, రిట్ పిటిషన్‌పై దామ శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించగా స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, అభిషేక్ మనుసింఘ్వీ వాదించారు. స్పీకర్ స్వతంత్రుడు... తొలుత ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘స్పీకర్ స్వతంత్రుడు, కోర్టులు ఆదేశాలు ఇవ్వజాలదు. స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టుకు హైకోర్టులపై నియంత్రణ అధికారం లేదు. స్పీకర్ తన విధానాలకు స్వతంత్రుడు. కాబట్టి కోర్టు ఆదేశాలు ఇవ్వజాలదు’ అని పేర్కొన్నారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది రాజ్యాంగ తీర్పులకు వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్‌కు చెప్పలేమా? అంటూ ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘మేం అలా చేయకపోతే రాజ్యాంగ నిబంధనలను నిరాశ పరిచినవారమవుతాం. 2, 3, 4 ఏళ్లు నిర్ణయం తీసుకోకపోయినా ఆర్టికల్ 226 కింద ఆదేశాలు జారీ చేయడానికి కోర్టుకు అధికారం లేదని మీరెలా అంటారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అనర్హత పిటిషన్లను నిర్దిష్ట కాలపరిమితిలో నిర్ణయించాలని తాము స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై రోహత్గీ స్పందిస్తూ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే హైకోర్టులో పిటిషనర్లు పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు వేస్తూ వచ్చారని.. కనీసం స్పీకర్‌కు ఫిర్యాదును పరిశీలించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని తెలిపారు. చర్యలకు ఉపక్రమించొచ్చు ముకుల్ రోహత్గీ వాదనలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘న్యాయస్థానాలు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయి. 11 నెలలుగా స్పీకర్ ఫిరాయింపులపై స్పందించలేదు. మేం జోక్యం చేసుకున్న తర్వాతే కదా వాళ్లకు మీరు నోటీసులు ఇచ్చింది. మేం స్పందించకపోతే ఇలాగే మరో నాలుగేళ్లు వేచి చూసేవాళ్లేమో?, స్పీకర్ జోక్యం చేసుకోకుంటే మేం ఇలాగే చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచనట్లే. రాజ్యాంగ సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన బాధ్యత మాపై ఉంది. ‘సింగిల్ బెంచ్ కేవలం స్పీకర్‌ను నాలుగు వారాల్లో షెడ్యూల్‌ను నిర్ణయించాలని మాత్రమే అడిగింది. అలాంటప్పుడు అందులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదు. కానీ రాజ్యంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలు, అభ్యర్థనలను రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అయినా పాటించనప్పుడు.. వారిపై చర్యలు తీసుకొనే అధికారం ఉంటుంది. మా నిర్ణయాన్ని స్పీకర్‌కు అభ్యర్థన రూపంలో తెలియపరుస్తాం. అప్పటికీ స్పీకర్ స్పందించకపోతే ఆర్టికల్ 142 ప్రకారం మా అధికారాలు ఉపయోగించి చర్యలకు ఉపక్రమిస్తాం. గతంలో మాకున్న అధికారాలతో ఓ స్పీకర్‌ను కోర్టుకు పిలిపించిన విషయాన్ని మర్చిపోవద్దు’ అంటూ ధర్మాసనం గుర్తుచేసింది. ముకుల్ రోహత్గీ వాదనల అనంతరం స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మనుసింఘ్వీ, ఎమ్మెల్యేల తరఫున రవిశంకర్ జంధ్యాల, ఎమెల్యేల తరఫున గౌరవ్ అగర్వాల్‌లు వాదనలను వినిపించారు. స్పీకర్, స్పీకర్ కార్యదర్శి తరఫున ముగ్గురు వాదనలను వినిపిస్తారా? ఏం చెప్పినా ఒకటే కదా మీ అందరూ చెప్పేది అంటూ జస్టిస్ గవాయి వారిని ఉద్దేశించి వ్యంగ్రా్రస్తాలు సంధించారు. సీఎం రేవంత్‌పై సుప్రీం ఆగ్రహం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘రాష్ట్రంలో ఉపఎన్నికలు రావు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను విచారణ సందర్భంగా బీఆర్ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘స్పీకర్ సమక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను అపహస్యం చేసినట్లే’ అని ధర్మాసనం మండిపడింది. అయితే తాను సీఎం తరఫున వాదనలను వినిపించట్లేదని.. అందువల్ల ఆ వ్యాఖ్యల గురించి వివరించలేకపోతున్నానని ముకుల్ రోహత్గీ బదులిచ్చారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ గతంలో అదే సీఎం తరఫున ఒక కేసులో హాజరైన విషయం మర్చిపోవద్దంటూ గుర్తుచేశారు. ‘రాజకీయ నాయకులు అసెంబ్లీలో ఏదైనా చెప్పినప్పుడు దానికి కొంత పవిత్రత ఉంటుంది, ప్రజలు ఆ మాటలను విశ్వసిస్తారు. మేము కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేయడంలో నెమ్మదిగా ఉండొచ్చు.. కానీ శక్తిలేనివారమైతే కాదు. కాబట్టి ఇకపై ఇటువంటి వ్యాఖ్యలను పునరావృతం చేయొద్దని సీఎంకు చెప్పి హెచ్చరించండి’ అని ధర్మాసనం రోహత్గీకి సూచించింది. అనంతరం ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. గురువారం స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. అనంతరం ఆర్యమా సుందరం రోహత్గీ, సింఘ్వీల వాదనలపై రిప్లై ఇవ్వనున్నారు. ఆర్టికల్ 142 ఏం చెబుతోందంటే... రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు విస్తృతాధికారాలు కల్పిస్తోంది. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై అవసరమైన ఉత్తర్వులు జారీ చేసేందుకు అవకాశమిస్తుంది. ఈ ఉత్తర్వులను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అమలు చేసి తీరాల్సిందే. గతంలో ఈ ఆర్టికల్ మేరకు అధికారాలను వినియోగించి భోపాల్ గ్యాస్ లీక్ కేసులో పరిహారం అందించాలని, జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు వైన్ షాపులు ఏర్పాటు చేయవద్దని.. ఇలా పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
కుదిరితే సయోధ్య.. లేకుంటే ధర్మయుద్ధం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకునేందుకే ఢిల్లీకి వచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రిజర్వేషన్లు పెంచని పక్షంలో కేంద్రంతో ధర్మయుద్ధం తప్పదని స్పష్టంచేశారు. రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం జాప్యం చేస్తే ‘గద్దె దిగాల్సిందే.. లేకుంటే గ్రామాల్లో గద్దెలు కూలాల్సిందే’అని హెచ్చరించారు. బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన బీసీ పోరు గర్జన ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం జాప్యం చేస్తోందని విమర్శించారు. ‘కురుక్షేత్ర యుద్ధానికి ముందు అయిననూ పోయి రావలె హస్తినకు అన్నారు. ధర్మ యుద్ధం కోసం ఢిల్లీకి వచ్చాం. సంధిలో భాగంగానే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాం. సయోధ్య కుదుర్చుకుందాం.. ఐదు గ్రామాలు ఇవ్వమన్నా నాడు దుర్యోధనుడు ఇవ్వలేదు. తర్వాత కురుక్షేత్రంలో ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటాం అని అడుగుతున్నాం. ఇకపై విజ్ఞప్తులు తీసుకొని ఢిల్లీకి రాం. గల్లీలకు వాళ్లు ఎట్లా వస్తారో చూస్తాం. ధర్మయుద్ధం ప్రకటించి మన సత్తా ఏంటో చూపుదాం’అని పిలుపునిచ్చారు. గద్దె దిగుడో.. గద్దెలు కూల్చుడో.. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుకుంటామని అడిగితే ప్రధాని మోదీకి వచ్చిన నొప్పేంటని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ కుర్చీ అడిగామా? లేక గుజరాత్లో అమలు చేయమన్నామా? అని నిలదీశారు. ‘బీజేపీకి హెచ్చరిక జారీ చేస్తున్నా. అయితే రిజర్వేషన్లు పెంచాలి. లేదంటే మీరు గద్దె దిగాల్సిందే.. గ్రామాల్లో గద్దెలు కూలాల్సిందే. ఇదే నినాదంతో ముందుకు పోతాం. ఇప్పుడు రాకుంటే రిజర్వేషన్లు ఎప్పుడూ రావు. మీకు సహకారం అందించే సీఎంగా నేనున్నా. రాహుల్‌గాంధీ మద్దతు ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాలను ఏకం చేసి రిజర్వేషన్లు పెంచే బాధ్యత రాహుల్‌గాంధీ తీసుకుంటారు. మీరంతా ఏకమై ధర్మయుద్ధం ప్రకటించండి. మీ బలమేంటో పరేడ్ గ్రౌండ్లో చూపెట్టండి. మున్ముందు ఎర్రకోటపై మనమే జెండా ఎగురవేస్తాం. అందరం కలిసి రిజర్వేషన్లను సాధించుకుందాం’అని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ కమండల్ యాత్ర ప్రతినిధి రాహుల్‌గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కులగణన చేపట్టామని, బీసీల రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ విధానపరంగా వ్యతిరేకమని విమర్శించారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం మండల్ కమిషన్‌ను నియమిస్తే, దానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్ యాత్ర మొదలుపెట్టిందని తెలిపారు. ఆ యాత్ర ప్రతినిధే నరేంద్ర మోదీ అని విమర్శించారు. బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందనే 2021లో చేయాల్సిన జనాభా లెక్కలను బీజేపీ ప్రభుత్వం వాయిదావేసిందని ఆరోపించారు. ‘బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన చేపట్టలేదు. మేము బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరడం లేదు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే 10 లక్షల మందితో సభ పెట్టి మోదీని సన్మానిస్తాం. అలా కాకుండా మాపై అధికారం చెలాయిస్తామంటే నాడు రజాకార్లకు పట్టిన గతే ఇప్పుడు బీజేపీకి పడుతుంది. జనగణనతోపాటు కులగణన నిర్వహించాల్సిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీల కోసం ప్రాణం ఇస్తామంటున్నారు. మాకు ప్రాణాలు అక్కర్లేదు. కేవలం రిజర్వేషన్లు పెంచితే చాలు’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు యువత పోరాడినా గత దుర్మార్గ పాలకులు పట్టించుకోలేదని బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు ఇవ్వనందుకే తండ్రీకొడుకుల ఉద్యోగాలను యువత ఊడగొట్టారని తెలిపారు. -
‘బిల్లీ’ కబంధ హస్తాల్లోంచి..భూముల చెర విడిపించాం
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విలువైన కంచ గచ్చిబౌలి భూములను నాటి చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందని.. వారి కబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెర విడిపించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో బిల్లీరావు కు కట్టబెట్టిన భూముల కేటాయింపులను రద్దు చేసి, దానిపై న్యాయపోరాటం చేసినది దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఆ భూములను స్వాదీనం చేసుకోవడం ద్వారా అద్భుత ముగింపు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడి ప్రజలకు కానుకగా ఇచ్చామని, అవే భూముల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణానికి ఎలాంటి ఇక్కట్లు కలగకుండానే అభివృద్ధి ఉంటుందని హామీ ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూములపై వివాదం రగులుతున్న నేపథ్యంలో భట్టి విక్రమార్క బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివాద అంశాలపై స్పష్టత ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. చంద్రబాబు హయాంలో ధారాదత్తం.. ‘‘యూనివర్సిటీ భూములను చంద్రబాబు ప్రభుత్వం 2003 ఆగస్టు 9న బిల్లీరావు అనే వ్యక్తికి చెందిన ఐఎంజీ భారత్‌కు అప్పనంగా ధారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2004 ఫిబ్రవరి 10న సేల్‌డీడ్ ద్వారా 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు ఇచ్చారు. దీనికి బదులుగా యూనివర్సిటీకి గోపన్‌పల్లిలో 397 ఎకరాల భూమిని ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో యూనివర్సిటీకి, బిల్లీరావుకు లబ్ధి జరిగితే నష్టపోయినది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలే. వైఎస్ పోరాడితే.. మేం ముగింపునిచ్చాం.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బిల్లీరావుకు కట్టబెట్టిన భూములను రద్దు చేస్తూ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 2006 అక్టోబర్ 21న సేల్‌డీడ్‌ను రద్దు చేస్తూ.. భూములను తిరిగి స్వా«దీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై బిల్లీరావు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే.. వైఎస్సార్ బలంగా న్యాయపోరాటం చేశారు. క్రమేణా రాష్ట్ర విభజన అనంతరం ఈ భూముల అంశాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తే.. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చాక కోర్టులో న్యాయపోరాటం మొదలుపెట్టింది. 2024 మార్చిలో హైకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదేనని తీర్పు ఇస్తే.. బిల్లీరావు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సైతం బలమైన వాదనలు వినిపించింది. దీనితో అదే ఏడాది మే 3న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. వైఎస్సార్ చేసిన పోరాటానికి ప్రభుత్వం అలా ముగింపునిచ్చింది. దశాబ్దాలుగా ప్రైవేటు వ్యక్తుల్లో ఉన్న భూమిని స్వా«దీనం చేసుకుంది. రాష్ట్ర ఆస్తి రాష్ట్ర ప్రజలకే దక్కాలన్నది ప్రభుత్వ భావన. ఇది ప్రజల విజయం. కుట్రదారులే అశాంతి రేపుతున్నారు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లీరావుకే భూములు చెందాలన్న లక్ష్యంతో మౌనంగా ఉంది. పంచుకుని తిందామని చూసింది. అప్పుడు కోర్టులో కొట్లాడకుండా మౌనంగా ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీ దానికి వంత పాడుతోంది. యువతలో అశాంతిని నెలకొల్పి ప్రభుత్వంపై ఉసిగొల్పాలన్నదే వారి లక్ష్యం. ఈ కుట్రలపై యువత అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాలకు పోవద్దు. పోలీసులు సైతం సంయమనంతో వ్యవహరించాలి..’’అని భట్టి పేర్కొన్నారు. పెట్టుబడులు, ఉద్యోగాలు లక్ష్యంగా అభివృద్ధి.. యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం యువత ఆశయాల కోసం కట్టుబడలేదు. అటు ప్రభుత్వ రంగంలో, ఇటు ప్రైవేటు రంగంలో ఉపాధి ఊసే లేదు. ప్రస్తుత ప్రభుత్వం యువత కోసం టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తోంది. మరోవైపు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన చేయాలన్న లక్ష్యంతో ఉంది. ఈ భూముల్లో ఐటీ హబ్, నాలెడ్జ్ సిటీ, ఫైనాన్స్ సిటీ, హైటెక్ సిటీ ఫేజ్–1, 2 ఏర్పాటు చేస్తాం. దీనిద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. హైదరాబాద్‌కు ఇప్పటికే ఉన్న గ్లోబల్ సిటీ పేరును మరింత విస్తరించేందుకు ఇది దోహదం చేస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలే తప్ప.. ఎవరి సొంత ప్రయోజనాలు లేవు. పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిరక్షిస్తూనే అభివృద్ధి చేపడతాం. -
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: దేశ జనాభాలో ముస్లింలు దాదాపు 15 శాతం ఉన్నారని.. వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. ఆర్టికల్స్ 14, 25, 26లను ఉల్లంఘిస్తుందని చెప్పారు.‘‘ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా చేసే చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 13 స్పష్టం చేసింది. నాన్ ముస్లింలను వక్ఫ్ కమిటీలలో ఎలా చేరుస్తారు. మైనారిటీలు టీడీపీ వాదనలను సమర్థించరు. చంద్రబాబు ముస్లింలను మోసం చేశారు. వక్ఫ్ విషయంలో ముస్లింలకు అండగా నిలబడతామని వైఎస్ జగన్ ప్రకటించారు. దానికి అనుగుణంగానే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం’’ అని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. -
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలు మారినా ఉప ఎన్నికలు రావు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలను బుధవారం విచారణలో ప్రత్యేకంగా ప్రస్తావించిన జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలే చేసింది.పవిత్రమైన చట్టసభలో ఈ వ్యాఖ్యలు చేయడం... రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అపహాస్యం చేయడం కిందకే వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా సీఎంకు హితవు చెప్పండి. ఎట్టిపరిస్థితుల్లో ఈ తరహా వ్యాఖ్యలను ఉపేక్షించబోం. అవసరమైతే కోర్టు ధిక్కారంగా భావించాల్సి వస్తుంది’’ అని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఉద్దేశించి జస్టిస్ గవాయ్ అన్నారు.మేం అన్నీ ఆలోచించే కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తున్నాం. అంతమాత్రాన మాకు అధికారాలు లేవని కాదు. అసెంబ్లీలో నాయకులు చేసే ప్రకటనలకు ఒక విలువ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడే అంశాలను కోర్టులు కూడా తీసుకుంటాయి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీఆర్ఎస్ హయాంలో ఉన్న రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పుడు పార్టీలు మారిన నేతల విషయంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని వ్యాఖ్యానించారు. -
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగిరావాలి, లేకుంటే..: రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తే.. గుజరాత్‌కు వచ్చిన నష్టమేంటని ప్రధాని మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ఆలోచనా విధానం.. బీసీలకు వ్యతిరేకమన్న ఆయన.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జంతర్ మంతర్‌లో జరిగిన బీసీ సంఘాల పోరు గర్జనలో పాల్గొని ఆయన ప్రసంగించారు. బీసీల లెక్క తేలకుండా రిజర్వేషన్లు ఇవ్వలేమని కోర్టులు చెబుతున్నాయి. లెక్కలు పక్కగా తీస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. అందరి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అందుకే అధికారంలోకి వస్తే కులగణన చేయిస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. జనగణనతోనే కులగణన చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానం. అందుకే కేంద్రం కుట్రపూరితంగా జనగణన కూడా చేయడం లేదు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కులగణన చేయడం లేదు. మండల్ కమిషను కు వ్యతిరేకంగా.. కమండల్ తెచ్చిన చరిత్ర బీజేపీది. దేశ రాజకీయాలకు తెలంగాణ ఓ వెలుగు. రాహుల్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. తెలంగాణలో 56.36 శాతం అని పక్కాగా తేల్చాం. ఫిబ్రవరి 4వ తేదీన సోషల్ జస్టిస్ డే జరుపుకుంటున్నాం. బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. రిజర్వేషన్ల పెంపు కేంద్ర పరిధిలోని అంశం. అందుకే కేంద్రానికి పంపాం. మేం తెలంగాణలో రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం. గుజరాత్లో ఇవ్వాలని కాదు. తెలంగాణలో రిజర్వేషన్లు ఆమోదిస్తే గుజరాత్‌కు వచ్చిన నష్టమేంటి?. విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు అమలైతేనే బీసీలకు న్యాయం జరుగుతుంది.బీసీల రిజర్వేషన్లు పెంచాలనే కోరిక అసంబద్ధమైంది కాదు. అందుకు పలు పార్టీలు కూడా మద్దతు ఈ వేదికపై ప్రకటించాయి. ఎవరేం అనుకున్నా బీసీలకు మేం అడగా నిలబడతాం. మా రాష్ట్రంలో మేం పెంచుకుంటే.. మీకేంటి నష్టం. మేమంతా మద్దతు ఇస్తున్నా మీకు వచ్చిన నష్టమేంటి?. మీ కుర్చీ.. ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం అని మేం అనడం లేదు. మాకు మీ ప్రాణాలొద్దు.. 42 శాతం రిజర్వేషన్లు కావాలి. ప్రధాని మోదీ మా గుండె చప్పుడు వినాలి. రిజర్వేషన్లకు అనుమతిస్తే పది లక్షల మందితో మోదీకి సన్మానం చేస్తాం. మాకు అనుమతి ఇవ్వకపోతే దేశమంతా కార్చిలా ఉద్యమిస్తాం. అధికారం, చట్టం మీ చేతుల్లో ఉందని మాపై ఆధిప్యతం చెలాయించాలని చూడకండి. బలం లేకపోయినా వక్ఫ్ బిల్లు తెచ్చారు...మరి బీసీ బిల్లుకు అభ్యంతరం ఏమిటి?. మేం సయోధ్యకు వచ్చాం. గల్లీలో వినిపించుకోవడం లేదని.. ఢిల్లీలో గళం వినిపించేందుకు వచ్చాం. యుద్ధభేరి మోగించే ముందు ఢిల్లీకి రావాలని వచ్చాం. రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాలి. ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం. చెప్పిన మాట వినకపోతే మా సత్తా చూపిస్తాం. తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వని తండ్రీకొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టాం. రిజర్వేషన్లపై దిగి రావాలి.. లేదంటే దిగిపోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలు వీళ్ల సంగతి తేల్చాలి అని రేవంత్ పిలుపు ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లు బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలనే డిమాండ్‌తో హస్తినలో బీసీ గర్జన జరగ్గా.. దేశవ్యాప్తంగా పలు పార్టీల అధినేతలు, ప్రతినిధులు హాజరై మద్ధతు ప్రకటించారు. -
శాంతి చర్చలకు సిద్ధం: కేంద్రానికి మావోయిస్టుల లేఖ
న్యూఢిల్లీ, సాక్షి: మావోయిస్ట్ రహిత భారత్ నినాదంతో ఆపరేషన్ కగార్‌ను దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఈ క్రమంలో గత 100 రోజుల్లో వివిధ ఎన్కౌంటర్లలో 120 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అదే సమయంలో మరోపక్క భారీగా దళ సభ్యులు లొంగిపోతున్నారు. ఈ క్రమంలో కేంద్ర, పలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన ఉంచారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే.. కాల్పుల విరమణకు సిద్ధమంటూ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన చేసింది. ‘‘ప్రజల కోసం ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి. ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి. ఛత్తీస్‌గఢ్, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుపుతున్న హత్యాకాండను ఆపాలి.’’ .. శాంతి చర్చల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల వాతావరణం కల్పించాలి. అప్పుడు మేం వెంటనే కాల్పుల విరమణ పాటిస్తాం’’ అని మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. దీనికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న సంగతి మరవొద్దు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ బుధవారం వాదనలు వినిపించారు. స్పీకర్‌కు కోర్టులు గడువు విధించడం సరికాదని ఆయన వాదించారు. ఈ క్రమంలో.. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా? అని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే జ్యుడీషియల్ సమీక్షకు అవకాశముంటుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్‌కు గడువు విధించడం సరికాదు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైందే. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పడం భావ్యం కాదు. ఒకవేళ సూచనలు చేస్తే స్వీకరించాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయమే. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదు’’ అని ముకుల్ రోహత్గీ వాదించారు.ముకుల్ రోహత్గీ వాదనల్లో జస్టిస్ బీఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు. హైకోర్టు జోక్యం చేసుకోవద్దా?. రాజ్యాంగ పరిరక్షకులుగా న్యాయస్థానాలు వ్యవహరిస్తాయి. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే సుప్రీం కోర్టు కూడా చేతులు కట్టుకుని చూస్తుండాలా?. నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా?. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో స్పీకర్‌ను కోర్టుకు పిలిచామన్న విషయం మరిచిపోవద్దు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా? ఆయనకు విజ్ఞప్తి చేయడమో.. ఆదేశించడమో చేయలేమా? అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అయితే అది ప్రత్యేక సందర్భమన్న రోహత్గి.. సుప్రీం కోర్టుకు న్యాయసమీక్ష చేసే అధికారం ఉందని, నిర్ణయాలపై న్యాయసమీక్ష చేయొచ్చని తెలియజేశారు.. ఫిరాయింపులపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని వాదించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే పిటిషన్ వేశారన్నారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారని.. కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా పిటిషన్లు వేశారని కోర్టుకు తెలియజేశారు.2024 మార్చి 18న పిటిషనర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. 2025 జనవరి 16న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ తన విధులు నిర్వర్తిస్తున్నారు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తరఫున ఇవాళ ముకుల్ రోహత్గీ వాదనలు ముగిశాయి. ఇక అసెంబ్లీ కార్యదర్శి తరపున రేపు(గురువారం) వాదనలు వినిపిస్తానన్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బెంచ్ సమ్మతి తెలిపి విచారణ వాయిదా వేసింది. తెలంగాణలో కారు పార్టీ గుర్తు మీద గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని, ఉన్నత న్యాయస్థానం చెప్పినా వాళ్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. అనర్హత వేటు కోరుతూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతరులు పిటిషన్లు వేశారు. అయితే మొదటి నుంచి ఈ కేసు విచారణలో తెలంగాణ స్పీకర్ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేస్తూనే వస్తోంది. గత విచారణలో.. బీఆర్ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదనలు పూర్తి చేశారు. ఆ వాదనల సమయంలో.. సుప్రీం కోర్టు ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలే చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. -
వక్ఫ్‌పై అపోహ మాత్రమే: లోక్‌సభలో అమిత్ షా
Waqf Bill In Lok sabha Updates..వక్ఫ్‌పై అపోహ మాత్రమే: లోక్‌సభలో అమిత్ షావక్ఫ్ సవరణ బిల్లు 2025 గురించి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. వక్ఫ్ చట్టం, బోర్డు 1995లో అమల్లోకి వచ్చింది.వక్ఫ్ బోర్డ్‌పై అనేక అపోహలున్నాయి.ముందుగా ముస్లిమేతరులు ఎవరూ వక్ఫ్ పరిధిలోకి రారు.వక్ఫ్ నిర్వహణలో ముస్లిమేతరులను చేర్చాలనే నిబంధనల లేదు.మేం ఆ పనిచేయాలనుకోవడం లేదు.ఈ చట్టం ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటుందని, వారు విరాళంగా ఇచ్చిన ఆస్తిల్లో జోక్యం చేసుకుంటుందనేది ఓ అపోహ.మైనారిటీలలో వారి ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఈ తరహా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మత వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదు: గౌరవ్ గొగొయ్దేశ ప్రజల్లోని సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయత్నమిదిరాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కొన్ని నియమాలను సృష్టించుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉందిదానిని పూర్తిగా తొలగించాలని చూస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ ఎంపీ#WATCH | Deputy Leader of Congress in Lok Sabha, Gaurav Gogoi, speaks on the Waqf Amendment Bill He says, "Did the Minority Affairs Ministry make this bill, or did some other department make it? Where did this Bill come from?... Today, the condition of minorities in the country… pic.twitter.com/QJPNnwcpyI— ANI (@ANI) April 2, 2025 వక్ప్ భూములపై కిరణ్ రిజుజు కీలక వ్యాఖ్యలు..వక్ఫ్ సవరణ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో వివరిస్తున్న కిరణ్ రిజుజుఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఇది తెలుసుకోవాలి.మత విశ్వాసాల విషయంలో ఎలాంటి జోక్యం ఉండదు.వక్ఫ్ చట్టం లోపాలతో అనేక ఉల్లంఘనలకు అవకాశం ఏర్పడింది.పార్లమెంట్ భవనం కూడా తమ ఆస్తేనని వక్ఫ్ బోర్డు అన్నది.వక్ప్ వాదనను ప్రధాని మోదీ అడ్డుకున్నారు.యూపీఏ అధికారంలో ఉండి ఉంటే ఢిల్లీలో 23 కీలక స్థలాలు వక్ఫ్ సొంతం అయ్యేవి.123 విలువైన ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ వక్ఫ్‌కు కట్టబెట్టింది.2014 ఎన్నికలకు ముందు వక్ఫ్‌కు ఆస్తులు కట్టబెట్టారు.దేశంలో మూడో అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ దగ్గర ఉంది.భారతీయ రైల్వే దగ్గర అత్యధికంగా ల్యాండ్ ఉంది.ఆ భూమిని భారతీయులుంతా వినియోగించుకుంటున్నారు.రెండో స్థానం రక్షణ శాఖ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది.మూడో స్థానంలో ఉన్న వక్ఫ్ భూములను భారతీయులంతా వినియోగించుకోలేరు.ప్రపంచంలోనే అత్యధిక ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది.మసీదుల నిర్వహణపై ఈ చట్టం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు.కిరణ్ రిజుజు వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అభ్యంతరం.కేంద్రమంత్రి మాట్లాడేటప్పుడు అడ్డుకోవద్దని ప్రతిపక్షాలను హెచ్చరించిన స్పీకర్ ఓం బిర్లా..#WATCH | After introducing the Waqf Amendment Bill in Lok Sabha, Parliamentary Affairs Minister Kiren Rijiju says "A case ongoing since 1970 in Delhi involved several properties, including the CGO Complex and the Parliament building. The Delhi Waqf Board had claimed these as Waqf… pic.twitter.com/qVXtDo2gK7— ANI (@ANI) April 2, 2025 అమిత్ షా కామెంట్స్..జేపీసీ నివేదికలో ఇచ్చిన సవరణలతో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టాం.జేపీసీ వేయాలని కాంగ్రెస్ సహా విఫక్షాలు కోరాయి.విపక్షాల డిమాండ్ మేరకే జేపీసీ వేశాం.ప్రభుత్వం తెచ్చిన బిల్లులో జేపీసీ సవరణలు సూచించింది.మేము కాంగ్రెస్ లాగా జేపీసీ సవరణలను పట్టించుకోకువడా బిల్లును యథాతథంగా తీసుకురాలేదు. #WATCH | Waqf (Amendment) Bill taken up for consideration and passing in Lok SabhaUnion Home Minister Amit Shah says, "...It was your (opposition) insistence that a Joint Parliamentary Committee should be formed. We do not have a committee like the Congress. We have a… pic.twitter.com/bbKRTuheft— ANI (@ANI) April 2, 2025 కిరణ్ రిజుజు కామెంట్స్..ఈ బిల్లులో ముస్లింలకు నష్టం చేసేదేమీ లేదు.అన్ని వర్గాల సలహాలను తీసుకున్నాం.మైనార్టీల్లో అనవసర భయాలను సృష్టిస్తున్నారు.బిల్లుపై విస్తృత చర్చ జరిపాం.గతేడాది వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.జేపీసీ నివేదిక తర్వాత వక్ఫ్ బిల్లులో సవరణలు చేసిన ప్రభుత్వం లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో ప్రారంభమైన చర్చలోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిరణ్ రిజుజుచర్చ అనంతరం ఓటింగ్ చేపట్టే అవకాశం #WATCH | Parliamentary Affairs Minister Kiren Rijiju introduces Waqf Amendment Bill in Lok Sabha. pic.twitter.com/BukG8RSqBT— ANI (@ANI) April 2, 2025వక్ఫ్ బిల్లుకు ఢిల్లీ మహిళల మద్దతు..ఢిల్లీలో పలువురు ముస్లిం మహిళలు బయటకు వచ్చి బీజేపీకి మద్దతు.వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తూ ప్రకటన.మోదీకి మద్దతు తెలుపుతూ ఫ్లకార్డుల ప్రదర్శన #WATCH | Women in Delhi come out in support of Waqf (Amendment) Bill to be presented today in Lok Sabha https://t.co/Eo2X9nBo9s pic.twitter.com/HGWKHnRwLD— ANI (@ANI) April 2, 2025కేంద్రమంత్రి కిరణ్ రిజుజు కామెంట్స్..కొంతమంది మత పెద్దలు సహా కొందరు నాయకులు అమాయక ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారు. అలాంటి కొందరు వ్యక్తులే సీఏఏ.. ముస్లింల పౌరసత్వ హోదాను తొలగిస్తుందని చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు అవసరమని వ్యక్తిగతంగా చెబుతున్నారు. కానీ, వారి ఓటు బ్యాంకు కోసం దానిని వ్యతిరేకిస్తున్నారు అని అన్నారు.#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha today Union Minister of Minority Affairs, Kiren Rijiju says, "Union Minority Affairs Minister Kiren Rijiju says, "Some leaders, including some religious leaders, are misleading innocent Muslims... The same… pic.twitter.com/EfzC86vrAC— ANI (@ANI) April 2, 2025రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ కామెంట్స్..దేశంలో లౌకిక పార్టీ ఎవరో ఈరోజే నిర్ణయించబడుతుంది.బీహార్‌లో ఎన్నికలు ఉన్నాయి.జేడీయూ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే, వారు ఎన్నికల్లో ఓడిపోతారు.బీజేపీ దానిని ఆమోదించే అవకాశం పొందడానికి వారు వాకౌట్ చేసే అవకాశం ఉంది.చిరాగ్ పాస్వాన్ కూడా అదే చేయగలరు.ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఎవరు ఓటు వేస్తారో చూడాలి#WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayRajya Sabha MP Kapil Sibal says "...It will be decided today who is a secular party in this country. There are elections in Bihar, if JDU votes in favour of the Bill, they will lose the elections. It is… pic.twitter.com/F5YnPRmzYh— ANI (@ANI) April 2, 2025కాంగ్రెస్ ఎంపీ నిరసన.. లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢి నల్ల దుస్తులు ధరించి పార్లమెంటుకు వచ్చారు.Congress MP Imran Pratapgarhi arrives at the Parliament wearing black attire to protest against the Waqf Amendment Bill, which will be introduced in Lok Sabha today pic.twitter.com/5UdDhZedtH— ANI (@ANI) April 2, 2025 వైఎస్సార్సీపీ లోక్‌సభపక్ష నేత మిథున్ రెడ్డి కామెంట్స్..ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాంలోక్‌సభ, రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాంమైనారిటీ సమాజానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ ప్రకటించారుముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిస్తున్నారు చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేశారుఅన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలిముస్లింల ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరంవక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలను అణచివేసే విధంగా ఉందిఇదిలాగే కొనసాగితే దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉంది 👉నేడు లోక్‌సభలో కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.👉తాజాగా కాంగ్రెస్ ఎంపీ, జేపీసీ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము నిజం చెప్పాలనుకుంటున్నాను. ముస్లింలకు ఏమీ జరగదని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ప్రభుత్వానికి వాటా ఉన్న ప్రభుత్వ ఆస్తి వివాదాస్పదమని, నియమించబడిన అధికారి దర్యాప్తు చేసే వరకు ఆ ఆస్తిని వక్ఫ్‌గా పరిగణించబోమని, వివాదాస్పద ఆస్తి ఇకపై వక్ఫ్‌గా ఉండదని వారు నిబంధన చేశారు’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Waqf Amendment Bill to be introduced in Lok Sabha todayCongress MP and JPC member Imran Masood says, "We are ready for discussion. But I want to tell you the truth. The government is repeatedly saying that nothing will happen to Muslims, but they have made a… pic.twitter.com/ZULzEi1RzT— ANI (@ANI) April 2, 2025👉 ఇక, బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు.👉బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆయా పార్టీలు విప్ జారీ చేశాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు.👉ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయించారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 298 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి. ఏమిటీ వివాదం? 👉వక్ఫ్ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం.👉ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయించాలి.👉ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి. -
హెచ్‌సీయూ భూముల అంశంలో జోక్యం చేసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూ) చెందిన 400 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభు త్వానికి బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిలో 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులు ఉన్నా యని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గొడెం నగేశ్‌ల బృందం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి వినతి పత్రం అందజేసింది. ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన అనంతరం బీజేపీ ఎంపీలు తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు.కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం కట్టేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూములను అమ్ముతోందని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. హెచ్‌సీయూ భూముల విషయంలో ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. భూముల అమ్మకం విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుగానే కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. ట్రిపుల్ఆర్ రాజ్యాంగం అమలవుతోంది: లక్ష్మణ్తెలంగాణలో రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి రాజ్యాంగమే అమలవుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దుయ్యబట్టారు. మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్ లేవనెత్తారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు తీర్చలేకే ప్రభుత్వం భూములను అమ్ముతోందన్నారు. లోక్‌సభలో ధర్మపురి అర్వింద్ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేసేందుకు చొరవ చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుకుంటాం: భూపేంద్ర యాదవ్ హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూములపై నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలకు హామీ ఇచ్చారు. మంగళవారం తెలంగాణ బీజేపీ ఎంపీలు భూపేంద్ర యాదవ్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని ఆ భూములను పరిరక్షించాలని కోరారు. -
చిలీ అధ్యక్షునితో మోదీ భేటీ
న్యూఢిల్లీ: సమగ్ర ఆర్థిక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందంపై భారత్, చిలీ చర్చలు ప్రారంభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ ఫాంట్ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ఖనిజాలు, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో కలిసి పని చేయాలని, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. లాటిన్ అమెరికాలో చిలీ తమకు అత్యంత కీలక భాగస్వా మ్య దేశమని మోదీ పేర్కొన్నారు. చిలీతో దశాబ్దా లుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని వెల్లడించారు. బోరిక్ ఫాంట్‌తో భేటీ అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య ఎన్నో సారూప్యతలున్నాయని గుర్తుచేశారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, అంతరిక్షం వంటి రంగాల్లో తమ అనుభవాన్ని చిలీలో పంచుకోడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ వెల్లడించారు. ఐరాస భద్రతా మండలితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల విషయంలో ఇండియా, చిలీ ఏకాభిప్రాయంతో ఉన్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వీసా జారీ ప్రక్రియను సులభతరంగా మార్చుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. -
పాలిటిక్స్ ఫుల్‌టైమ్ కాదు
లక్నో: రాజకీయాలు అనేవి తనకు ఫుల్‌టైమ్ ఉద్యోగం కాదని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే తాను కేవలం యోగిని మాత్రమేనని ఆయన స్పష్టంచేశారు. ‘బుల్డోజర్ మోడల్‌ను మా ప్రభుత్వం సాధించిన ఘనతగా చూడటం లేదు. అదొక అవసరం. సమాజహితం కోసం దాన్ని మెరుగైన విధానంలో వాడొచ్చని మేం చూపించాం’’ అన్నారు. మంగళవారం పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై యోగి సుదీర్ఘంగా మాట్లాడారు. అగ్రనేతలతో విభేదాల్లేవు ‘‘బీజేపీ అగ్రనేతలతో నిజంగా విభేదాలే ఉంటే ఇంకా సీఎంగా కొనసాగగలనా? అవన్నీ వదంతులే. నా రాజకీయ జీవితానికి పరిమితి ఉంది. ఆర్ఎస్ఎస్ మద్దతు నాకుంది. నన్నే కాదు, దేశం కోసం పరిశ్రమించే ప్రతి ఒక్కరినీ ఆర్ఎస్ఎస్ ముందుండి ప్రోత్సహిస్తుంది. సరైన పథంలో లేని వాళ్లలోనూ స్ఫూర్తి నింపి సన్మార్గం వైపు నడిపిస్తుంది. బీజేపీ ఆదేశానుసారం యూపీ ప్రజలకు సేవ చేస్తున్నా’’ అని అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో దిగిపోతారని, భావి ప్రధాని అవకాశాలు యోగికే ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ‘‘రాజకీయాలు నాకు ఫుల్‌టైమ్ జాబ్ కాదు. నేనొక యోగిని మాత్రమే. ఇతర రాష్ట్రాల్లోనూ నాకు పాపులారిటీ పెరగడానికి వేరే కారణం ఉందనుకుంటున్నా. యాత్రల్లో భాగంగా దేశవ్యాప్తంగా భక్తులు యూపీని సందర్శిస్తున్నారు. 2017 తర్వాత యూపీలో స్పష్టంగా కనిపిస్తున్న అభివృద్ధి వల్ల వారలా భావించి ఉంటారు’’ అన్నారు. రాజకీయాలు, మతంపై... ‘‘ కొంతమంది మాత్రమే రాజకీయాలు చేయాలని, మతానికి సైతం పరిధులు ఉండాలని భావించినప్పుడే సమస్యలు తలెత్తుతాయి. స్వార్థం కోసం రాజకీయాలను వాడుకుంటే సమస్యలొస్తాయి. అందరి మంచి కోసం రాజకీయాలు చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. సమస్యకు, పరిష్కారానికి మధ్య ఎటువైపు నిల్చోవాలనేదే మతం మనకు బోధిస్తుంది’’ అని అన్నారు. మీరు రాజకీయనేత అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా లేదంటే మతానికి సంబంధించిన ప్రతినిధి అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? అని ప్రశ్నించగా.. ‘పౌరుడిగా పనిచేసేందుకు ఇష్టపడతా. పౌరునిగా రాజ్యాంగబద్ధ కర్తవ్యమే నాకు ముఖ్యం. నా వరకు దేశమే అత్యున్నతం. దేశం బాగుంటే నా మతం కూడా బాగుంటుంది. మతం సురక్షితంగా ఉంటే సంక్షేమ మార్గం దానంతట అదే తెరుచుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ముస్లింలపై... ‘‘రాష్ట్ర అభివృద్ధిలో ముస్లింలకు తగు ప్రాతినిధ్యం లభిస్తుంది. మైనారిటీలు అయినంత మాత్రాన ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు అంటూ ఏమీ ఉండవు. పాదచారులు రోడ్ల పక్కన నడవాలి. అంతేగానీ రోడ్లపై నమాజ్ చేస్తామంటే కుదరదు. రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కల్గించడం చట్టప్రకారం నేరం. అయినాసరే అలాగే చేస్తామంటే అందుకు తగ్గ పరిణామాలను ‘బుల్డోజర్ న్యాయం’ రూపంలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేవాళ్లు హిందువులను చూసి నేర్చుకోండి. మహాకుంభమేళా వేళ ప్రయాగ్‌రాజ్‌కు 60 కోట్ల మంది హిందువులు వచ్చారు. దొంగతనం, విధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్ ఘటనలు ఒక్కటి కూడా జరగలేదు. దీనినే మత క్రమశిక్షణ అంటారు. దీన్ని హిందువుల నుంచి ఇతరులు కూడా నేర్చుకోవాలి’’ అని ముస్లింలనుద్దేశించి యోగి అన్నారు.ఆలయాల దాతృత్వం, సేవా కార్యక్రమాలపై.. ‘‘విద్య, ఆరోగ్యానికి సంబంధించిన అందరికీ సమానంగా ఆలయాలు, మఠాలు దాతృత్వ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆలయాలతో పోలిస్తే అత్యధిక ఆస్తులున్న వక్ఫ్ బోర్డులు ఏనాడైనా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాయా?. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం తప్ప’’ అని యోగి అన్నారు. ‘‘ నూతన నిర్మాణాలు, పాత ఆక్రమణలను తొలగించడంతోపాటు బుల్డోజర్ను మా ప్రభుత్వం ‘మెరుగైన రీతి’లో వాడింది. మా సద్వినియోగాన్ని సుప్రీంకోర్టు సైతం గతంలో మెచ్చుకుంది’’ అని వ్యాఖ్యానించారు. -
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
న్యూఢిల్లీ: కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు. ఎన్డీయేలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలైన తెలుగుదేశం, జేడీ(యూ) తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆదేశించాయి. బిల్లుకు మద్దతు పలకాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీలు సైతం తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు. బీఏసీ సమావేశం నుంచి విపక్షాల వాకౌట్ వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు రానున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. విపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలన్న ప్రతిపాదనకు వారు అంగీకరించారు. అయితే, ఈ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం తమ గొంతును అణచివేస్తోందని ఆరోపిస్తూ బీఏసీ సమావేశం నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే బుధవారం లోక్‌సభలో వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న లక్ష్యంతో విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఉమ్మడి వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ‘ఇండియా’ కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాందీ, కేసీ వేణుగోపాల్, రాంగోపాల్ యాదవ్, సుప్రియా సూలే, కల్యాణ్ బెనర్జీ, సంజయ్ సింగ్. టి.ఆర్.బాలు, తిరుచ్చి శివ, కనిమొళి, మనోజ్‌కుమార్ ఝా తదితరులు మంగళవారం సమావేశమయ్యారు. ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను అణచివేయడానికే వక్ఫ్(సవరణ) బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.బిల్లుకు మద్దతు పలుకున్న తెలుగుదేశం, జేడీ(యూ)లకు ప్రజలు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజ్యాంగవిరుద్ధమైన బిల్లును ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ బీఏసీ సమావేశం జరిగింది. గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 293 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి.ఏమిటీ వివాదం? వక్ఫ్ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయించాలి. ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. 2023లో యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య గురయ్యాడు. హత్యకు గురైన అతిక్ చెందిన స్థిరాస్థుల్ని అధికారులు కూల్చివేశారు. వాస్తవానికి బుల్డోజర్తో కూల్చేసిన నిర్మాణాలతో అతిక్‌కు సంబంధం లేదు. ఆ ఇళ్లు లాయర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తున్నవారివి. ఎప్పటిలాగే సంఘ విద్రోహ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే సీఎం యోగి ప్రభుత్వం (Yogi Adityanath) పొరపాటున బాధితుల ఇళ్లను బుల్డోజర్లతో (Bulldozer justice) కూల్చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.రూ.10లక్షల నష్టపరిహారం ఆ పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు జస్టిస్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బూల్డోజర్ చర్యలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌తో పాటు ప్రయాగ్‌రాజ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. తక్షణమే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని సూచించింది.అది మా పొరపాటేఅంతకుముందు అడ్వకేట్, ప్రొఫెసర్ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ల గురించి అత్యున్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. నిబంధనలకు విరుద్ధంగా బుల్డోజర్లతో ఇళ్లను ఎలా కూల్చేస్తారు? కూల్చేవేతకు ఓ రోజు ముందు నోటీసులు ఎలా అంటిస్తారని ప్రశ్నించింది. అయితే, సుప్రీం ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు యూపీ అధికారులు బదులిచ్చారు. మేం కూల్చేసిన ఇళ్లు గ్యాంగ్‌స్టర్ అతిక్ నిర్మించుకున్నాడేమోనని పొరపాటున బుల్డోజర్ చర్యలకు దిగినట్లు వివరణ ఇచ్చారు.రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదుకూల్చివేత నోటీసులు అందజేసిన తీరుపై అధికారులను కోర్టు మందలించింది. కూల్చేసిన ఇళ్లనకు నోటీసులు అతికించామని రాష్ట్ర న్యాయవాది చెప్పగా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదని అడిగింది. అదే సమయంలో ఈ తరహా చర్యల్ని వెంటనే ఆపాలి. బాధితులు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వారికి నష్టపరిహారం కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించండి. పరిహారం ఇస్తే వారికి న్యాయం జరిగినట్లవుతుందని జస్టిస్ ఎస్.ఓకా అభిప్రాయం వ్యక్తం చేశారు.మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయిఈ కేసులు మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయి. పిటిషనర్ల ఇళ్లను నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారని కోర్టు అభిప్రాయ పడినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లు కూల్చేస్తున్నట్లు నోటీసులు గాని, నోటీసులు తీసుకున్న వారికి వివరణ ఇచ్చేందుకు తగిన అవకాశం ఇవ్వలేదని ప్రస్తావించింది. అందరూ కలత చెందుతున్నారుఅదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో బుల్డోజర్ కూల్చివేతల సమయంలో వైరలైన ఓ వీడియో గురించి కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అధికారులు బుల్డోజర్లతో ఇళ్లను కూల్చే సమయంలో సదరు ఓ ఇంటికి చెందిన బాలిక తన పుస్తకాల్ని చేతపట్టుకుని ఉండడాన్ని చూడొచ్చు. ఇలాంటి దృశ్యాలతో అందరూ కలత చెందుతున్నారు’ అని జస్టిస్ భుయాన్ అన్నారు. -
ట్రాఫిక్ సిగ్నల్‌లో భార్య రీల్స్ .. ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకున్న భర్త
ఛండీఘడ్ : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ భార్య చేసిన అత్యుత్సాహం భర్త కొంప ముంచింది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. దీంతో భర్త లబోదిబో మంటూ మళ్లీ తనని విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ప్రాధేయపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? లేటెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్ హర్యానా సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ని తెగ ఆకట్టుకుంటోంది. అందుకే సమయం ఎప్పుడైనా, సందర్భం ఏదైనా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఆ సాంగ్ పాడటం లేదంటే, డ్యాన్స్‌లతో అదరగొట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.ఈ తరుణంలో మార్చి 20న సాయంత్రం 4:30 గంటల సమయంలో జ్యోతి అనే మహిళ తన వదిన పూజతో కలిసి స్థానికంగా ఉండే దేవాలయానికి వెళ్లింది. దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఛండీఘడ్ సెక్టార్-20 గురుద్వారా చౌక్ సిగ్నల్‌లో జ్యోతి అత్యుత్సాహం ప్రదర్శించింది. తన వదిన పూజ సాయంతో హర్యాన్వీ ఫోక్‌సాంగ్‌కు డ్యాన్స్ వేసింది. తన వదిన వీడియో తీస్తే ఆమె డ్యాన్స్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగచక్కెర్లు కొట్టాయి.चंडीगढ़: पुलिसकर्मी की पत्नी ने ज़ेबरा क्रॉसिंग पर बनाई रील, ट्रैफिक नियमों की उड़ाई धज्जियां; रोड पर लगा जाम महिला के खिलाफ पुलिस ने FIR दर्ज की, हालांकि थाने में ही बेल दे दी गई. मामला सेक्टर-20 में गुरुद्वारा चौक के पास का है.#Chandigarh pic.twitter.com/l2j4fTYFGv— Ishani K (@IshaniKrishnaa) March 27, 2025 ఈ వీడియో వైరల్ కావడంతో, హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్‌లోని సెక్టార్ 34 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై చండీగఢ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏఎస్ఐ బల్జిత్ సింగ్ నేతృత్వంలోని బృందం సెక్టార్ 20లోని గురుద్వారా చౌక్, సెక్టార్ 17లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను సమీక్షించింది. సీసీటీవీ ఫుటేజీల్లో ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద డ్యాన్స్ చేసిన జ్యోతిపై, వీడియో తీసిన పూజపై బీఎన్ఎస్ సెక్షన్ 125, 292 3(5) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.సెక్టార్ 19 పోలీస్ స్టేషన్లో సీనియర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి భర్త అజయ్ కుందును పదవి నుండి సస్పెండ్ చేశారు. ఎందుకంటే భార్య డ్యాన్స్ వీడియోను అజయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడంపై అతనిపై చర్యలు తీసుకున్నారు. కేసులు నమోదు కావడంతో జ్యోతి,పూజలు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. -
పార్లమెంట్‌కు చేరిన HCU భూముల వ్యవహారం
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వ్యవహారం పార్లమెంట్‌కు చేరింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. భూముల వేలాన్ని తక్షణమే ఆపివేయాలని పెద్దల సభ వేదికగా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. భూముల వేలాన్ని ఆపి పర్యావరణాన్ని రక్షించాలి. అరుదైన పక్షులు, వృక్షజాతులు అక్కడ ఉన్నాయి. ఉగాది పండుగ రోజున అర్ధరాత్రి హెచ్‌సీయూ భూముల్లో బుల్డోజర్లు నడిపించారు. భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఉచిత హామీల పథకం కోసం భూములను అమ్మవద్దు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. రాహుల్ రేవంత్ రాజ్యాంగ నడుస్తుంది అని మండిపడ్డారాయన.అంతకుముందు ఈ అంశంపై ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశాం. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేసింది. ఈ భూములను ఎవరికి ధారధత్తం చేయవద్దని సుప్రీంకోర్టు గతంలోనూ తీర్పు చెప్పింది. కానీ, ఢిల్లీకి కప్పం కట్టేందుకు ప్రభుత్వ భూములను రేవంత్ పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం జింకలను , నెమళ్లను చంపి భూములను నాశనం చేస్తుంది. రూ.40 వేల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మి.. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. విద్యార్థులపై రేవంత్ ప్రభుత్వం పాశవిక చర్యలు మానుకోవాలి అని అన్నారు. బీజేపీ ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని కేంద్రం ఆలోచిస్తుందన్న విషయం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమకు తెలియజేశారని, అలాంటి యూనివర్సిటీ భూములను అమ్మొద్దని తాము పోరాటం చేస్తామని అన్నారు. -
వక్ఫ్ బిల్లుకు సర్వం సన్నద్ధం
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. బిల్లులోని కొన్ని అంశాలకు సంబంధించి ప్రజలను తప్పుదోవపట్టించి, సమాజంలో ఉద్రిక్తతలను పెంచేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింలకు ప్రయోజనాలను అందించేందుకే ఈ బిల్లును రూపొందించామన్నారు. అయితే, ముస్లింలను రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకువచ్చేందుకు జరిగే ప్రయత్నాలు దేశానికి మంచివి కావని చెప్పారు. బిల్లు చట్టం రూపంలోకి వస్తే మసీదులు, ఖబరస్తాన్‌ల వంటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. పౌరసత్వ సవరణ బిల్లు సమయంలోనూ ఇలాంటి దుష్ప్రచారమే జరిగిందని గుర్తు చేశారు. బిల్లులోని వివరాలను పూర్తిగా అధ్యయనం చేసి, ప్రభుత్వంతో చర్చలు జరపాలని మంత్రి ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు సైతం ఈ బిల్లును తొందరగా ప్రవేశపెట్టాలని తనను కోరాయని మంత్రి వివరించారు. అందుకే, సాధ్యమైనంత త్వరగా ఈ బిల్లును ఆమోదింప జేసుకోవాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, బిల్లును ప్రవేశపెట్టే తేదీ ఇంకా నిర్ణయం కాలేదని తెలిపారు. మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4వ తేదీతో ముగియనున్నాయి. బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టడంపై మంగళవారం రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. దీన్నిబట్టి చూస్తే మంగళవారం వక్ఫ్ బిల్లును మొదటగా లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలు కని్పస్తున్నాయి. ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్ట విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పలు సవరణలతో పార్లమెంట్ సంయుక్త కమిటీ ఆమోదం పొందిన బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలు ర్యాలీలు సైతం చేపట్టాయి. -
వాటర్ డ్రోన్ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: భారత నావికాదళ అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం వచ్చి చేరబోతోంది. సముద్రజలాల్లో శత్రు దేశాల యుద్ధనౌకలపై ఓ కన్నేసి, నిఘాను అత్యంత సమర్థవంతంగా నిర్వహించే అధునాతన‘వాటర్ డ్రోన్’ను రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది. అన్ని దశల పరీక్షలను పూర్తిచేసుకున్నాక ఇది భారత నౌకాదళాల చేతికి రానుంది. దీంతో సముద్రజలాలపై ఉపరితల నిఘా కార్యకలాపాల్లో భారత్ సామర్థ్యం ద్విగుణీకృతం కానుంది. నీటిలో కాస్తంత మునిగి కనిపించకుండా దూసుకెళ్లే హై ఎండ్యూరన్స్ అటానమస్ అండర్‌వాటర్ వెహికల్ (హెచ్ఈ ఏయూవీ)ను విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్డీవో సోమవారం ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యం ‘ఎక్స్’లోని తన ఖాతాలో ఒక ప్రకటన విడుదలచేసింది. జలాంతర్గామిలా కనిపించే అత్యంత చిన్న స్వయంచాలిత వాహనాన్ని వాటర్ డ్రోన్‌గా పిలుస్తారు. సరస్సులో వాటర్ డ్రోన్‌ను పరీక్షిస్తున్న వీడియోను డీఆర్డీఓ తన ‘ఎక్స్’ సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్ట్చేసింది. ఉపరితలంలో, కాస్తంత మునిగి ప్రయాణిస్తూ ఈ అటానమస్ వెహికల్ నిర్దేశిత పరామితులను అందుకుందని సంస్థ పేర్కొంది. సోనార్, కమ్యూనికేషన్ సామర్థ్యాలను అత్యంత కచ్చితత్వంతో ప్రదర్శించిందని ప్రకటించింది. నావల్ సైన్స్ అండ్ టెక్నాలాజికల్ లేబొరేటరీ ఈ వాటర్ డ్రోన్‌ను అభివృద్ధిచేసింది. దాదాపు 6 టన్నులు బరువు ఉండే ఈ డ్రోన్ పొడవు 9.75 మీటర్లు. శత్రువుల యుద్ధనౌకల సిబ్బంది కంట్లోపడకుండా నీటి ఉపరితలంపై పెద్దగా అలల అలజడి సృష్టించకుండా నిశ్శబ్దంగా, మెల్లగా ముందుకెళ్తుంది. అత్యవసర సందర్భాల్లో గంటకు గరిష్టంగా 14 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. దాక్కోవాల్సిన పరిస్థితుల్లో సముద్రజలాల్లో ఏకంగా 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. సమీపంలో సంచరించే భారత జలాంతర్గాముల రక్షణ, అన్వేషణ సామర్థ్యాలను సైతం ఈ వాటర్డ్రోన్ మెరుగుపరుస్తుందని డీఆర్డీవో పేర్కొంది. -
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. అగ్ర నేత రేణుక మృతి
రాయ్‌పూర్ : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్రనేతల్ని కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రెస్ టీమ్ ఇన్ఛార్జ్ మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక మరణించారు. దంతెవాడ- బీజాపూర్ బోర్డర్లో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో జవాన్లు దండకారణ్యంలో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ- బీజాపూర్ బోర్డర్ తుపాకుల మోతతో దద్దరిల్లింది. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం భీకర ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక అలియాస్ చైతే అలియాస్ సరస్వతి మరణించినట్లు దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ అధికారికంగా ప్రకటించారు. రేణుక తెలంగాణలోని వరంగల్ జిల్లా జనగామ నివాసి. ఆమె తలపై రూ.25లక్షల రివార్డ్ ఉన్నట్లు చెప్పారు. కాల్పుల అనంతరం, ఆటోమెటిక్ ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్‌తో పాటు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 135మంది మావోయిస్టులు మృతి చెందగా.. గతేడాది 219మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. #WATCH | Chhattisgarh | Kamlochan Kashyap, DIG South Bastar, congratulates the security forces for a successful anti-naxal operation, an encounter in which security forces neutralised a female Naxalite identified as Renuka, a Dandakaranya Special Zonal Committee (DKSZC) member… pic.twitter.com/BfyzLaaZzJ— ANI (@ANI) March 31, 2025ఈ ఏడాది జనవరిలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. అదే నెల చివర్లో.. కూంబింగ్ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఫిబ్రవరిలో బీజాపూర్ జిల్లాలోనే జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లోని.. గంగలూరు పరిధి ఆండ్రి దండకారణ్యంలో మార్చి 20వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు, ఓ డీఆర్జీ జవాన్ రాజు మరణించారు. అదే రోజున కాంకేర్ జిల్లా(Kanker Encounter) ఛోటెబేథియా కోరోస్కోడో గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా ఆపరేషన్ కగార్(Operation Kagar) పేరిట హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. -
మన దగ్గరే 'బంగారు' కొండ
సాక్షి, స్పెషల్ డెస్క్: సుమారు 25,000 టన్నులు.. భారతీయుల వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు ఇవి. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. బంగారం అంటే మన వాళ్లకు అమితపైన ప్రేమ ఉంది కాబట్టి ఆ మాత్రం ఉండొచ్చు అనే కదా మీ ఆలోచన. అసలు విషయం చెబితే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రపంచంలో ఉన్న 10 ప్రధాన కేంద్ర బ్యాంకుల (ఆర్బీఐలాంటి సెంట్రల్ బ్యాంక్స్) వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల కంటే మన భారతీయుల వద్ద ఉన్న బంగారమే ఎక్కువని హెచ్ఎస్బీసీ గ్లోబల్ తాజా నివేదికలో వెల్లడించింది. భారతీయుల కుటుంబాల్లో ఉన్న ‘బంగారు కొండ’ ఏపాటితో దీనిని బట్టి అర్థం అవుతుంది. తరతరాలుగా సంపదను సంరక్షించుకోవడం, భద్రత కోసం బంగారాన్ని ఒక ప్రాధాన్య ఆస్తిగా మనవారు ఆధారపడిన విధానాన్ని ఈ కొండ నొక్కి చెబుతోంది. భారతీయులు పసిడిని ఇలా విస్తారంగా కూడబెట్టుకోవడం దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో పుత్తడికి ఉన్న ప్రాముఖ్యతకు నిదర్శనం.ప్రత్యామ్నాయంగా పుత్తడి..యూఎస్ఏ, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, భారత్, జపాన్, తుర్కియే దేశాలు ఈ టాప్–10 జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల సెంట్రల్ బ్యాంకుల మొత్తం బంగారం నిల్వలను మించి భారతీయుల వద్ద పసిడి ఉందంటే.. పొదుపు, పెట్టుబడి వ్యూహం విషయంలో భారతీయుల్లో ఈ యెల్లో మెటల్ ఎంతటి కీలకపాత్ర పోషిస్తోందో అవగతం అవుతుంది. భారతీయ కుటుంబాలకు బంగారం ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా ఉందనడంలో సందేహం లేదు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ విలువల హెచ్చుతగ్గులకు దీనిని ఒక విరుగుడుగా ప్రజలు భావిస్తున్నారు. వివాహాలు, పండగలు, మతపర వేడుకలు గోల్డ్ డిమాండ్‌ను గణనీయంగా పెంచుతున్నాయి. బ్యాంకుల్లో పొదుపు చేస్తే వచ్చే వడ్డీ కంటే బంగారం కొనుగోలు ద్వారా దీర్ఘకాలంలో అధిక ఆదాయం పొందవచ్చన్నది ప్రజల మాట. అందుకే అత్యధిక కుటుంబాల్లో బ్యాంకు డిపాజిట్లకు ప్రత్యామ్నాయంగా పుత్తడి అవతరించింది. సెంట్రల్ బ్యాంక్స్ సైతం..ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా, చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారత్ నిలిచింది. పుత్తడి దిగుమతులు సైతం భారత వాణిజ్య లోటు పెరగడానికి కారణం అవుతున్నాయి. అయితే కుటుంబ సంపద పరిరక్షణలో పసిడి ఇప్పటికీ ముఖ్యమైన భాగంగా ఉంది. భారతీయ కుటుంబాలు వ్యక్తిగతంగా బంగారాన్ని దాచుకోవడంలో ముందంజలో ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా ఇటీవలి కాలంలో పుత్తడి కొనుగోళ్లను పెంచాయి. ఆర్థిక అస్థిరతల నుంచి రక్షణ ఇచ్చే సాధనం బంగారమేనని ఇవి భావిస్తుండడమే ఇందుకు కారణం. ఈ ప్రపంచ ధోరణులకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన బంగారు నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. 2024 డిసెంబర్ నాటికి ఆర్బీఐ వద్ద 876.18 టన్నుల నిల్వలు పోగయ్యాయి. తొలిస్థానంలో ఉన్న యూఎస్ఏ 8,133 టన్నులు, రెండోస్థానంలో ఉన్న జర్మనీ వద్ద 3,352 టన్నుల నిల్వలు ఉన్నాయి. -
ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?
నోయిడా: కారును ర్యాష్ డ్రైవ్ చేయడమే కాదు.. ఫుట్ పాత్ పైకి ఎక్కించేశాడు లాంబోర్కిని కారును డ్రైవ్ చేస్తున్న డ్రైవర్. అదే సమయంలో ఫుట్ పాత్ పై ఇద్దరు కార్మికులు పని చేస్తున్నారు. తలకు హెల్మెట్ పెట్టుకుని ఆరంజ్ జాకెట్లు తొడక్కుని పనిలో ఉన్నారు. ఇంతలో ఓ కారు అమాంతం ఫుట్ పాత్ పైకి వచ్చేసింది. దీంతో కొద్ది పాటి గాయాలతో తప్పించుకున్నారు ఇద్దరు కార్మికులు. తలకు హెల్మెట్ ఉండటం వల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పింది.అయితే కారు డ్రైవర్ ను పట్టుకుని నిలదీశాడు ఆ కార్మికుల్లో ఒకరు. రోడ్డుపై ఫుట్ పాత్ పై స్టంట్స్ ఏమైనా చేస్తున్నావా అంటూ ప్రశ్నించాడు. అయితే దానికి ఆ డ్రైవర్ నుంచి ఎటకారంతో కూడిన సమాధానం వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారేంటి అంటూ బదులిచ్చాడు. దానికి ఆ కార్మికులకు కోపం చిర్రెత్తు కొచ్చింది. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఆ డ్రైవర్ పై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడేంటి.. నేను కారును ఫుట్ పాత్ పైకి ఎక్కించా.. ఎంతమంది చచ్చిపోయారంటూ హిందీలో మళ్లీ ప్రశ్నించాడు.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు వచ్చిన వారు.. ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు కారును కూడా సీజ్ చేశారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 94లో నిర్మాణంలో ఉన్న ఒక కాంప్లెక్స్ పక్కన ఉన్న ఫుట్‌పాత్ వద్ద ఇది జరిగింది. అయితే ఈ ఇద్దరు కార్మికుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించామని, ఎటువంటి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు.A #Lamborghini, a fat bank account, and ZERO Humanity This #Noida brat mows down two labourers and casually asks—“Koi mar gaya idhar?” pic.twitter.com/TaUgdB769z— Smriti Sharma (@SmritiSharma_) March 30, 2025 -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ ఎస్పీ ఎదుట 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. వారిలో ఆరుగురిపై రూ.8లక్షల, 13మందిపై రూ.68లక్షల రివార్డ్ ఉంది.మావోయిస్టు సిద్ధాంతాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకువడం, వారి సీనియర్ కేడర్ స్థానిక గిరిజనుల్ని దోచుకోవడం, అంతర్గత విభేదాల కారణంగా లొంగిపోయినట్లు బీజాపూర్ సీనియర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వారికి పునరావసం కల్పిస్తామని చెప్పారు.అయితే, మార్చి 31, 2026లోపు నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ఆ దిశగా మావోయిస్టులను ఏరిపారేస్తుంది. శనివారం శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో భద్రతా దళాలు రెండు ప్రాంతాల్లో జరిపిన ఎదురుకాల్పుల్లో 18 మావోయిస్టులను మట్టుబెట్టాయి. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. ఆ భారీ ఎన్కౌంటర్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలో మావోయిస్టులు లొంగిపోయారు.#Chhattisgarh: 50 Maoists have surrendered in Bijapur district. Out of these, 13 Maoists had a reward of Rs. 68 lakhs declared on their heads.For the first time in the state, such a large number of Maoists have surrendered together.Bijapur district's Superintendent of Police… pic.twitter.com/aAfakC1FJA— All India Radio News (@airnewsalerts) March 30, 2025కాగా,ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 134 మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. వీరిలో 118 మంది బస్తర్ డివిజన్‌లోనే మృతి చెందారు.2024లో, బస్తర్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో కలిపి మొత్తం 792 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. -
పిల్లలు ఆరుబయట ఆడాలంటే మాస్క్ ధరించాల్సిరావడం దారుణం
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో చిన్నారులు ఆడుకోవాలంటే మాస్క్ ధరించాల్సిన దుస్థితి దాపురించొద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ ఆవేదన వ్యక్తంచేశారు. కాలుష్య ఉద్గారాల ఉధృతికి అడ్డుకట్టవేయాలని, కాలుష్యం కట్టడి కోసం తగు ‘స్వచ్ఛ’సాంకేతికతలపై పెట్టుబడులు పెరగాలని ఆయన అభిలíÙంచారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మొదలైన వాతావరణ జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘దేశ రాజధాని గత కొంతకాలంగా కాలుష్య రాజధానిలా తయారైంది. కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. పిల్లలు ఆరుబయట ఆడుకోవాలంటే మాస్క్ ధరించాల్సిన దారుణ పరిస్థితులు రావడం శోచనీయం. ఇంత తక్కువ వయసులో కాలుష్యమయ గాలి పీల్చడం వల్ల ఎన్నో శ్వాససంబంధ వ్యాధులు చుట్టుముడతాయి. కాలుష్య ఉద్గారాల వెల్లువకు అడ్డుకట్టపడాల్సిందే. ఇందుకోసం మనందరం సమైక్యంగా నిలబడి తక్షణ కార్యాచరణతో రంగంలోకి దిగాలి. ఆర్థికాభివృద్ధికి, పర్యావరణహిత విధానానికి సమతూకం సాధించాలి. శుద్ధ సాంకేతికతల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు విధాన నిర్ణయాలు తీసుకోవాలి. పర్యావరణానికి హాని కల్గించని టెక్నాలజీలపై దృష్టిసారించాలి. తక్కువ ఉద్గారాలను వెదజల్లే రవాణా విధానాలను అవలంభించాలి. అలాంటప్పుడు మనం పీల్చే గాలి గరళంగా మారకుండా ఉంటుంది. నీటి కాలుష్యం సైతం మరో తీవ్ర సమస్యగా తయారైంది. శుద్ధికి నోచుకోని వ్యర్థాలు నేరుగా నదీజలాల్లో కలిసిపోతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు నదీజలాల్లో కలవకుండా అడ్డుకోవాలి. మురుగునీటిని శుద్ధిచేశాకే నదీజలాల్లోకి వదలాలి. నదీతీరాల్లోని స్థానిక ప్రజానీకం సైతం వ్యర్థాలను నేరుగా నదుల్లో పడేయకుండా తమ వంతు బాధ్యతగా మెలగాలి’’అని జడ్జి అన్నారు. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఛైర్పర్సన్, అటార్నీ జనరల్, తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. -
‘తెలంగాణ రైజింగ్’కు ఆ దేశాలు వద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ‘భారత్ సమ్మిట్’(తెలంగాణ రైజింగ్)కు కొన్ని దేశాల వారిని పిలవొద్దని కేంద్రం ఆంక్షలు విధించింది. అరబ్‌దేశాలు, ఆ దేశాలకు సహకరిస్తున్న మరికొన్ని దేశాల వారిని పిలవకుండా రైజింగ్ జరుపుకోమని సూచనలు చేసింది. ఆయా దేశాల ప్రతినిధులు భారత్‌కు వస్తే సంకేతాలు మరోలా బయటకు వెళతాయనే ఆలోచనతోనే తాము వద్దు అంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌కు.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచించిన వివిధ దేశాల పేర్లు తొలగించి, కొత్త పేర్లతో మరో లేఖ ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. మీ ఆలోచన మంచిదే.. కానీ వాళ్లు వద్దు ‘రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణను సమున్నతంగా నిలిపేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవండి. ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్ పేరుతో నిర్వహించబోయే ‘భారత్ సమ్మిట్’కు పలు దేశాల వారిని పిలవాలని అనుకుంటున్నాం. దీనికి మీ మద్దతు, అనుమతి అవసరం’అంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ను సీఎం రేవంత్ కోరారు. ఈ నెల 13న ఢిల్లీలో జైశంకర్‌ను కలసి అందుకు సంబంధించిన లేఖను అందచేశారు.ఆ లేఖలో పలు దేశాల పేర్లు పొందుపరిచారు. కాగా, ‘తెలంగాణ రైజింగ్ పేరుతో మీరు నిర్వహించ తలపెట్టిన భారత్ సమ్మిట్ అభినందనీయం. మీఆలోచన మంచిదే.. అయితే, వీటిలో ఉన్న అరబ్ దేశాలు, అరబ్ దేశాలకు సహకరిస్తున్న కొన్ని దేశాల పేర్లు తొలగించండి. వాళ్లు భారత దేశానికి రావడం మాకు ఇష్టం లేదు. వాళ్లు ఇక్కడకు వచ్చి ఏదైనా మాట్లాడితే, భారత్‌తో స్నేహపూర్వకంగా ఉన్న దేశాలకు తప్పుడు సంకేతాలు అందుతాయి. కాబట్టి, ఆయా దేశాల పేర్లు తొలగించి మీరు ఏ కార్యక్రమమైనా పెట్టుకోండి, మాకేమీ ఇబ్బంది లేదు’అంటూ సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి జైశంకర్ బదులిచ్చారు. ఆ దేశాల పేర్లు తొలగించకపోతే కష్టమే? ఇదిలా ఉండగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య, అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య, మయన్మార్‌లో అంతర్గతంగా కొంతకాలంగా యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దేశాలకు కొన్ని దేశాలు మద్దతు తెలుపుతుండగా, కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో యుద్ధాలు జరిగే దేశాలు, వాటికి సహకరిస్తున్న దేశాల వారిని భారత్‌కు పిలవడం మనకు నష్టమని కేంద్రం భావిస్తోంది. వారిని మినహాయించి ఎవరు వచ్చినా తమకేమీ ఇబ్బంది లేదని కేంద్రం చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గొప్పతనం చాటిచెప్పాలని, అందుకే ఆయా దేశాల వారిని ఇక్కడకు ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ చెబుతున్నారు. సీఎం ఆలోచన మంచిదే అయినప్పటికీ కేంద్రానికి మాత్రం కొన్ని దేశాల వాళ్లు ఈ తరుణంలో ఇక్కడకు రావడం ఇష్టం లేదని, ఆ దేశాల పేర్లు తొలగించి కొత్తగా పేర్లు ఇస్తే అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని విశ్వసనీయ సమాచారం. లేనిపక్షంలో తెలంగాణలో భారత్ సమ్మిట్ జరగడం కష్టమేనని కేంద్ర సర్వీసుల్లోని అధికారులు అంటున్నారు. -
కేంద్రంలో మరో 20 ఏళ్లు బీజేపీనే
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ కనీసం 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. స్థిరమైన పనితీరు కనబరుస్తున్న తమ పార్టీ పట్ల ప్రజాదరణ చెక్కుచెదరదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ విజయమైనా కష్టపడి పనిచేసే లక్షణంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. సొంత బాగు కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తే విజయం కచ్చితంగా సొంతమవుతుందని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ రాబోయే 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటుందని తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పానని గుర్తుచేశారు. గత పదేళ్లుగా అధికారంలో కొనసాగుతోందని, మరో 20 ఏళ్లపాటు పార్టీకి ఢోకా లేదని తేల్చిచెప్పారు. శుక్రవారం రాత్రి ‘టైమ్స్ నౌ’సదస్సులో అమిత్ షా మాట్లాడారు. చక్కటి పరిపాలన అందించిన పార్టీకి ప్రజాదరణ లభిస్తుందని, తద్వారా ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రజలు మెచ్చే పాలన అందించలేని పార్టీలకు ఇలాంటి ఆత్మవిశ్వాసం లభించదని స్పష్టంచేశారు. పదేళ్లలో 16,000 మంది లొంగుబాటు దేశంలో అంతర్గత భద్రతకు ప్రస్తుతం వచ్చిన ముప్పేమీ లేదని అమిత్ షా స్పష్టంచేశారు. నక్సలైట్ల హింసాకాండ, జమ్మూకశీ్మర్‌లో ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం అనే మూడు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మూడు అంశాలకు సంబంధించి గత పదేళ్లలో 16,000 మంది యువత లొంగిపోయారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత హోంమంత్రిగా తనపై ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆరాధన స్థలాల చట్టం–1991పై ఇప్పుడు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని పేర్కొన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో మనం మాట్లాడడం సరైంది కాదన్నారు. కోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తామన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ వలసదార్లను ఓటుబ్యాంకుగా మార్చుకుంటోందని అమిత్ షా మండిపడ్డారు. పొరుగు దేశం నుంచి వచ్చినవారిని ఓటర్లుగా చేర్పిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం లేదు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై అమిత్ షా స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ ఒకదాని వెంట ఒకటి యూసీసీని ప్రవేశపెట్టబోతున్నాయని వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో యూసీసీపై చట్టం తీసుకొచ్చారని, గుజరాత్‌లోనూ దీనిపై కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. బీజేపీ ఏర్పాటైనప్పటి నుంచి పార్టీ ఎజెండాలో యూసీసీ అనేది అత్యంత కీలకమైన అంశమని ఉద్ఘాటించారు. దేశంలో యూసీసీని అమలు చేస్తామంటూ హామీ ఇచ్చామని తెలిపారు. అది జరిగి తీరుతుందని స్పష్టంచేశారు. యూసీసీని తీసుకురావాలన్నది రాజ్యాంగ సభ నిర్ణయమని పేర్కొన్నారు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీ మర్చిపోయినప్పటికీ బీజేపీ మర్చిపోలేదన్నారు. చెప్పినట్లుగానే ఆర్టికల్ 370ని రద్దు చేశామని, అయోధ్యలో రామమందిరం నిర్మించామని, ఇక యూసీసీని అమలు చేయడం తథ్యమని వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు దొరికిన ఘటనపై త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కమిటీ విచారణకు ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు. మోదీ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంటోందన్న విమర్శల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వెల్లడించారు. సంఘ్ గత వందేళ్లుగా దేశభక్తులను తయారు చేస్తోందని ప్రశంసించారు. -
ప్రాణాల కోసం పరుగులు తీశాం.. బ్యాంకాక్ భూకంపంపై భారతీయ టూరిస్టులు
మయన్మార్, థాయిలాండ్‌లలో సంభవించిన భూకంపం(Earthquake) వందలాదిమందిని పొట్టనపెట్టుకుంది. భూకంపం సంభవించిన సమయంలో భవనాలు ఊగిపోతూ నేలకొరిగాయి. కొన్ని భవనాలపైనుంచి నీరు బయటకు దారాపాతంగా పొంగుకొచ్చింది. ఈ పరస్థితులను చూసిన జనం వణికిపోతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు.Terremoto en tailandia desde la altura de un edificio, que locura#earthquake #Terremoto pic.twitter.com/mGQS5Ts5W3— ¿Por qué es tendencia Colombia? (@TendenciaenXHoy) March 29, 2025మయన్మార్(Myanmar)లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించగా దాని ప్రకంపనలు థాయ్‌లాండ్‌ను కుదిపివేశాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న భారత్‌కు చెందిన పర్యాటకులు వెనువెంటనే విమానాల్లో భారత్‌కు తిరిగి వచ్చారు. వీరు తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. థాయ్‌లాండ్ నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్న రంజన్ బెనర్జీ మాట్లాడుతూ.. భూకంపం సంభవించినప్పుడు వెంటనే మాల్స్‌తోపాటు పలు కార్యాలయాలను ఖాళీ చేయించారు. మెట్రో రైలు రాకపోకలను నిలిపివేశారని తెలిపారు. మరో పర్యాటకుడు సఫ్దర్ మాట్లాడుతూ, ఆకాశహర్మ్యాలు వణికిపోయాయని, భవనాల పైనుంచి జలపాతంలా నీరు కిందికి పడిందని తెలిపారు.సంజీవ్ దత్తా మాట్లాడుతూ.. తాను పడుకున్న మంచం ఒక్కసారిగా కదిలిపోయిందన్నారు. జనం భయంలో రోడ్లపై పరిగెట్టారని, తాను ఏడవ అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చి, అక్కడ కొంతసేపు వేచి ఉన్నానని, భారీ ట్రాఫిక్ కారణంగా 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఐదారు గంటలు పట్టిందని ఏఎన్ఐకి తెలిపారు. అత్యవసరంగా విమానాశ్రయానికి చేరుకునేందుకు టాక్సీలు దొరకలేదని భారతి ఖురానా చెప్పారు. తాము ఉన్న హోటల్ తీవ్రంగా కంపించడంతో అందరూ బయటకు పరుగులు తీసిన విషయాన్ని ప్రణవ్ గుర్తు చేసుకున్నారు.థాయిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం(Indian Embassy) అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో థాయిలాండ్‌లోని భారతీయ పౌరులు నంబర్ +66 618819218ను సంప్రదించాలని సూచించారు. బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు,సిబ్బంది చియాంగ్ మాయిలోని కాన్సులేట్ సభ్యులంతా సురక్షితంగా ఉన్నారని థాయిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో తెలిపింది.ఇది కూడా చదవండి: Nepal: మాజీ రాజు జ్ఞానేంద్ర షా అరెస్టుకు రంగం సిద్ధం? -
సర్వీస్ చార్జీ స్వచ్ఛందమే
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీల పేరుతో అదనంగా వసూలు చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తప్పుబట్టింది. వినియోగదారులు సర్వీస్ చార్జీలను స్వచ్ఛందంగా ఇవ్వాల్సిందే తప్ప వారి నుంచి బలవంతంగా వసూలు చేయజాలవని స్పష్టం చేసింది. బిల్లుపై అదనంగా సర్వీస్ చార్జీలంటూ వసూలు చేయరాదన్న సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నిబంధనలను సవాల్ చేస్తూ రెస్తారెంట్ల సంఘాలు వేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ‘‘కస్టమర్లకు ఇష్టమైతే టిప్ ఇవ్వొచ్చు. అంతేతప్ప సర్వీస్ చార్జీలంటూ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అసలు బిల్లులో కలపని ఈ మొత్తాన్ని జీఎస్టీ లేదా సర్వీస్ ట్యాక్స్ అని కస్టమర్లు భావించే అవకాశముంది. ఇది మోసమే అవుతుంది’’ అని జడ్జి పేర్కొన్నారు. పిటిషన్‌దారులైన ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్హెచ్ఆర్ఏఐ), నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆండియా(ఎన్ఆర్ఏఐ)లకు చెరో రూ.లక్ష చొప్పున జరిమానా సైతం విధించారు. వినియోగదారుల సంక్షేమానికి ఉపయోగపడేలా ఈ మొత్తాన్ని సీపీపీఏ ఖాతాలో జమ చేయాలన్నారు. రెస్టారెంట్ల హక్కుల కంటే వినియోగదారుల హక్కులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తేల్చి చెప్పారు. -
డీసీసీ చీఫ్‌లు మూడేళ్ల పాటుఎన్నికల్లో పోటీకి దూరమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో వరుస భేటీలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల్లో పార్టీకి మూలస్తంభాలైన డీసీసీ అధ్యక్షులు పార్టీ కార్యలాపాలపై పూర్తి దృష్టి పెట్టేందుకు వీలుగా నియమితులైన మొదటి మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిషేధించే విషయాన్ని పరిశీలించనున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఏఐసీసీ నియమించిన ముకుల్ వాస్నిక్ కమిటీ చేసిన మూడేళ్ల నిషేధం ప్రతిపాదనను పార్టీ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్నిక్ కమిటీ సిఫార్సుల ప్రకారం డీసీసీ అధ్యక్షులు తమ ఐదేళ్ల పదవీ కాలంలో తొలి మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీకి అనుమతించరు. వీరంతా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాలను నిర్ధారించడం, ఎన్నికల ప్రచారాన్ని నిశితంగా పరిశీలించడం, సామాజిక ఇంజనీరింగ్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఎదుర్కోవడం, పార్టీ అనుకూల కథనాలను రూపొందించడం, జిల్లాల్లో ని అన్ని స్థాయిలలో మీడియా, సోషల్ మీడియా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం వంటి పనులకు నాయకత్వం వహిస్తారు. అభ్యర్థుల ఎంపికలో, వివిధ పదవులకు నామినీల పరిశీలనలో వీరే క్రియాశీలంగా ఉంటారు. ఎన్నికల్లో గెలుపోటములకు బాధ్యత వహిస్తారు. ఈ మూడేళ్ల తర్వాత పదవుల ఎంపికలో డీసీసీలకు ప్రాధాన్యమిస్తారు. మూడేళ్ల ప్రతిపాదనపై వచ్చే నెలలో గుజరాత్లో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. -
రూ.62,500 కోట్లతో 156 ప్రచండ్ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: రూ.62,500 కోట్లతో 156 ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ(సీసీఎస్) శుక్రవారం ఆమోద ముద్రవేసింది. ఈ తేలికపాటి కాంబాట్ హెలికాప్టర్లను హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నుంచి కొనుగోలు చేయనున్నారు. దేశంలో సైనిక సామర్థ్యాన్ని పెంచడంలో ఇదొక ముందడుగు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి, అభివృద్ధి చేసిన యుద్ధ హెలికాప్టర్లు ఇవే కావడం విశేషం. ప్రచండ్ హెలికాప్టర్లు 5 వేల మీటర్ల ఎత్తు వరకు ప్రయాణింగలవు. సీసీఎస్ ఆమోదం తెలపడంతో హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన రెండు ఒప్పందాలపై రక్షణ శాఖ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇందులో 66 హెలికాప్టర్లను భారత వాయుసేనకు, మరో 90 హెలికాప్టర్లను భారత నావికాదళానికి హెచ్ఏఎల్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ‘మేక్ ఇన్ ఇండియా’కు ఇదొక గొప్ప ప్రోత్సాహకమని, ఈ రెండు ఒప్పందాల వల్ల 8,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. -
జస్టిస్ యశ్వంత్‌కు ఏ పనీ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాసేపటికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ కేవలం బదిలీపై మాత్రమే అలహాబాద్ హైకోర్టుకు వస్తున్నారని, ఆయనకు ప్రస్తుతానికి ఏ విధమైన జ్యుడిషియల్ వర్క్ అప్పచెప్పవద్దని సీజేఐ సంజీవ్ ఖన్నా కోరారు. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ పై విచారణ పెండింగ్ లో ఉన్న క్రమంలోనే ఆయనకు ఏ పనీ అప్పచెప్పవద్దని సీజేఐ సూచించారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఈ తరహా ఆదేశాలనే జారీ చేశారు సీజేఐ.కేంద్రానికి సిఫార్సు.. గ్రీన్ సిగ్నల్జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే క్రమంలో కేంద్రానికి ప్రతిపాదన పంపింది సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం. దీనికి ఈరోజు(శుక్రవారం) గ్రీన్ సిగ్నల్ లభించడంతో యశ్వంత్ వర్మ.. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లనున్నారు. 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్ మళ్లీ అక్కడికే వెళ్లనున్నారు.ఆరు రాష్ట్రాల బార్ అసోసియేన్స్ తో సీజేఐ భేటీఅయితే యశ్వంత్ వర్మ సచ్ఛీలురుగా బయటకొచ్చేవరకూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్ తో పలు రాష్ట్రాల బార్ అసోయేషన్స్ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలు బార్ అసోసియేషన్ హెడ్స్ తో సీజేఐ సంజీవ్ ఖన్నా నిన్న(గురువారం)ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ బదిలీని నిలుపుదల చేయాలని సదరు బార్ అసోసియేషన్స్ కోరిన తరుణంలో వారితో సీజేఐ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ సమావేశమై వారితో చర్చించారు. వారి డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇంట్లో నోట్ల కట్టలు..!కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది.ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయడమే సమంజసమా?, బదిలీ చేసి అక్కడ జ్యుడిషియల్ వ్యవహారాలు అప్పగించకుండా ఉండేలా చేయడమే కరెక్టా అనే కోణంలో వీరు చర్చించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జస్టిస్ యశ్వంత్ పై విచారణ పూర్తయ్యేవరకూ ఎటువంటి బాధ్యతలు కేటాయించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించినట్లు సమాచారం. -
Justice Yashwant Varma : అలహాబాద్ కోర్టుకే జస్టిస్ వర్మ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ : హోలీ పండుగ రోజు రాత్రి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో కోట్లు విలువ చేసే కాలిన కరెన్సీ నోట్లు వెలుగులోకి వచ్చాయనే వార్త దేశవ్యాప్తంగా సర్వత్రా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు ఉపక్రమించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. నోట్ల కట్టల విషయంపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీఎస్ సందవాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్‌లను సభ్యులుగా చేర్చింది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రెండురోజుల కిందట ఘటన జరిగిన జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసానికి వెళ్లింది.అయితే, సుప్రీం కోర్టు కొలీజియం జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్‌తో పాటు దేశంలో పలు రాష్ట్రాల హైకోర్టు బార్ అసోసియేషన్లు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దీంతో ఈ నెల 21న సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయనను బదిలీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది.ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయన తన పదవిని చేపట్టి ఉత్తరప్రదేశ్ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. కాగా, జస్టిస్ వర్మ విషయాన్ని సమీక్షిస్తున్నామని,ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన బదిలీపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ఒక రోజు తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్.. మరో కేసు నమోదు
ఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై పిటిషన్ దాఖలైన క్రమంలో ఆయనపై కేసు నమోదు చేయాలని ఇటీవల ఢిల్లీ కోర్టు ఆదేశాలు చేయగా, పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు కోర్టుకు రిపోర్ట్‌ను సమర్పించారు.ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని, మరింత సమయం కావాలని కోర్టుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 18కి కోర్టు వాయిదా వేసింది. కాగా, 2019లో ద్వారకలో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటుకు నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ రౌజ్‌అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ సహా ఇతర నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఆ అభ్యర్థనకు ఢిల్లీ కోర్టు అంగీకారం తెలిపింది. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రోసిజర్ సెక్షన్ 156(3) కింద దరఖాస్తును అనుమతించాల్సిన అవసరం ఉందని ఈ కోర్టు అభిప్రాయపడింది.ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 2007లోని సెక్షన్ 3 కింద నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. అక్రమ హోర్డింగ్‌లు కూలిపోవడం వల్ల గతంలో మరణాలు నమోదయ్యాయని, అందువల్ల కఠిన చర్యలు అవసరమని కోర్టు నొక్కి చెప్పింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎస్‌హెచ్‌వోను ఆదేశించినట్లు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నేహా మిట్టల్ తన తీర్పులో పేర్కొన్నారు. 2019లో దాఖలైన ఫిర్యాదులో కేజ్రీవాల్, కొందరు నేతలు ఆ ప్రాంతం అంతటా భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. -
భావ ప్రకటన స్వేచ్ఛ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్ర్యం.. భావ ప్రకటన స్వేచ్ఛపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court Of India) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో.. అందునా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో అవి భాగమని.. ప్రాథమిక హక్కులను పరిరక్షించడం న్యాయస్థానాల విధి అని స్పష్టం చేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది.రెచ్చగొట్టేలా పద్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గర్హీపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం.. సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ(Freedom of Expression) అంతర్భాగమని, ఆ హక్కును గౌరవించాల్సిన అవసరం కచ్చితంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గుజరాత్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ కేసులో ఎలాంటి నేరం లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంలోనే ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.సినిమాలు, కవిత్వం.. సాహిత్యం, వ్యంగ్యం.. మనుషుల జీవితాన్ని మరింత అర్థవంతం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ లేనప్పుడు.. ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం ఎలా సాధ్యమవుతుంది?. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో.. విభిన్న అభిప్రాయాలను.. ప్రతివాదనలతో ఎదుర్కోవాలే తప్ప అణచివేతతో కాదు. ఒకవేళ ఆ వ్యాఖ్యలపై ఆంక్షలు విధించాల్సివస్తే.. అవి సహేతుకంగా ఉండాలే గానీ.. ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి అభిప్రాయాలను ఎక్కువమంది వ్యతిరేకించినా సరే.. ఆ వ్యక్తి భావ ప్రకటనా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. భావ స్వేచ్ఛ ప్రకటన, వాక్ స్వాతంత్య్రం(Freedom of Speech) అనేవి ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాల విధి. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి. అంతిమంగా.. ఆర్టికల్ 19(1)ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదే’’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. జరిగింది ఇదే..గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి(Imran Pratapgarhi) గతేడాది డిసెంబరులో 46 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఒకటి పోస్ట్ చేశారు. ఓ పెళ్లి వేడుక మధ్యలో ఆయన నడిచివస్తుండగా పూలవర్షం కురిపిస్తూ.. బ్యాక్‌గ్రౌండ్ ఓ పద్యం వినిపించారు. అయితే, ఆ పద్యంలో పదాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, అవి మత విశ్వాసాలు, సామరస్యాన్ని, జాతి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయన్న ఫిర్యాదుతో గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ హైకోర్టులో ఇమ్రాన్‌కు ఊరట లభించలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం.. ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్‌కు ఊరట ఇచ్చింది. -
జమ్ములో కొనసాగుతున్న ఉగ్ర వేట.. నలుగురు పోలీసుల వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టగా.. మరికొందరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు వీరమరణం చెందారు. డీఎస్పీ అధికారి సహా మరో ముగ్గురు సిబ్బందికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.రాజ్‌బాగ్ ప్రాంతంలోని జఖోలె గ్రామం వద్ద గురువారం ఈ ఎన్కౌంటర్ జరిగింది. పాక్ భూభాగం నుంచి దొంగచాటుగా చొరబడిన ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన కార్డన్ ఆపరేషన్ సుదీర్ఘ ఎదురు కాల్పులకు దారి తీసింది. ఇంకా నలుగురు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో జమ్మూకశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ)కి ఎదురుపడ్డ ఉగ్రవాదుల గ్రూపు తప్పించుకుపోయింది. ఘటనాప్రాంతంలో ఎం4 కార్బైన్ తపాకులు నాలుగు, గ్రనేడ్లు 2, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఒకటి, ఐఈడీ సామగ్రి అక్కడ లభించాయి. శనివారం వీరు లోయమార్గం గుండా, లేదా కొత్తగా నిర్మించిన సొరంగం గుండా చొరబడి ఉంటారని భావిస్తున్నారు. అప్పటి నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, జాగితాలతో వేటాడుతూనే ఉన్న ఎస్‌వోజీ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో గురువారం వారి జాడను పసిగట్టింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సుఫైన్ గ్రామ సమీప దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. పోలీసులకు తోడు ఆర్మీ, సీఆర్పీఎఫ్ను కూడా ఉన్నతాధికారులు అక్కడికి తరలించారు. -
వసుధైక కుటుంబం ఎక్కడ: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా విచ్చిన్నమై పోతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం (వసుధైక కుటుంబం) అని భావించడం భారతీయ సంప్రదాయమని పేర్కొంది. ప్రస్తుతం ఆ భావన ఎక్కడా కనిపించడం లేదని, ఒక్కరే ఒక కుటుంబం అనే పరిస్థితి వచ్చిందని వెల్లడించింది. దగ్గరి కుటుంబ సభ్యులను సైతం కలిపి ఉంచలేకపోతున్నామని తెలియజేసింది. తమ ఇంటిని, ఆస్తులను ఆక్రమించుకొని, తమను వేధిస్తున్న కుమారుడిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కుటుంబం అనే భావన కనుమరుగైపోతోందని విచారం వ్యక్తంచేసింది. తల్లిదండ్రులతో పిల్లలను ఒక్కటిగా కలిపి ఉంచడం అసాధ్యంగా మారుతోందని తెలియజేసింది. ఈ కేసులో కుమారుడిని ఇంటి నుంచి బయటకు పంపించాల్సిన అవసరం లేదని భావిస్తున్నామని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల జీవనానికి అవసరమైన ఖర్చులు ఇవ్వాలని కుమారుడిని ధర్మాసనం ఆదేశించింది.