
ప్రముఖ యాంకర్, టీవీ ప్రెజెంటర్, బిగ్ బాస్ తమిళ సీజన్ 5 ఫేమ్ ప్రియాంక దేశ్‌పాండే తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాదు, ఆయా షోలకు సక్సెస్‌కు కీలకంగా నిలిచింది. అందుకే ఆమెను దక్షిణ భారత టీవీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్‌గా పేరొందింది. తాజాగా ఆమె తనప్రియుడితో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియాంక వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట సందడిగా మారాయి.
సూపర్ సింగర్, ది వాల్ అండ్ కింగ్స్ ఆఫ్ కామెడీ జూనియర్స్ వంటి షోలలో హోస్ట్‌గా పాపులర్ అయిన ప్రియాంక DJ వాసి సచ్చితో ఏడడగులు వేసింది.కరియర్‌లో సక్సెస్‌అయినప్పటికీ వైవాహిక జీవితంలో ఫెయిల్ అయిన ప్రియాంక రెండోసారి ప్రేమను వెదుక్కుంది. ఏప్రిల్ 16 కొంతమంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకుంది. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అభిమానులతో ఈ ఆనందకరమైన క్షణాలను పంచుకుంది. దీంతో ఈ జంటకు ఫ్యాన్స్‌కు అభినందనలు తెలిపారు. టెలివిజన్ ఐకాన్ పెళ్లి అవతార్‌పై నెటిజన్లు ముగ్ధులైపోతున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, నెటిజన్లు ముగ్ధులయ్యారు.

రాయల్ లుక్‌లో వధూవరులు
ప్రియాంక , వాసి కొత్త దంపతులుగా చాలా అనందంగా కనిపించారు. చాలా సంతోషంగా ఇరు కుటుంబాలతో కలిసి పోజులిచ్చారు. ముఖ్యంగా ప్రియాంక తన స్పెషల్ డే కోసం ఐవరీ అండ్ గోల్డెన్ సిల్క్ చీరలో ముగ్ధమనోహరిలాగా మెరిసిసోయింది. హెవీ ఎంబ్రాయిడరీ , జరీ వర్క్ బ్లౌజ్, సన్నని బంగారు అంచు, సింపుల్ ఎంబ్రాయిడరీతో ఎరుపు దుపట్టాతో కొత్త పెళ్లికూతురిలా కళకళలాడింది. ఇంకా సింపుల్ మేకప్ లాంగ్ నెక్లెస్, గాజులు, ఝుమ్కి, కమర్ బంద్ ,మాంగ్ టీకాతోపాటు, ఆమె ఉత్సాహభరితమైన చిరునవ్వుతో అలంకరించుకుంది. మరోవైపు, వాసి సాధారణ తెల్లటి కుర్తా , వేష్టి ధరించాడు.మొత్తం మీద ఇద్దరూ రాయల్ లుక్‌లో అభిమానులను ఆకట్టుకున్నారు.

ఒక అభిమాన ప్రేమ పూర్వక సందేశం
"మనం కోరుకునే ప్రేమను పొందడం నిజంగా చాలా అరుదు. అలాంటి ప్రేమ దొరికడం అత్యంత అందమైన విషయం. ప్రేమ అంటే యవ్వనంగా కనిపించడం లేదా పరిపూర్ణంగా ఉండటం గురించి కాదు; ఇది ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకోవడం,ఒకరినొకరు సంతోషపెట్టేది ఏమిటో తెలుసుకోవడం,ఒకరికొకరు చిన్న విషయాలను మార్చుకునేంత శ్రద్ధ వహించడం..అంతేగా.. అదే ప్రేమ. ప్రియాంక, స్వచ్ఛమైన, సంతోషకరమైన ప్రేమకు మీరు అర్హులు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ చుట్టూ ప్రేమతో ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టడం చూసి హృదయం నిండిపోతుంది. "మీకు చాలా, చాలా, చాలా సంతోషకరమైన వివాహ జీవితం కావాలని కోరుకుంటున్నాను."

ప్రియాంక దేశ్‌పాండే
ప్రియాంక దేశ్‌పాండే 2016 ఫిబ్రవరిలో సీనియర్ నిర్మాత ప్రవీణ్ కుమార్‌ను వివాహం చేసుకుంది. అయితే, వ్యక్తిగత విభేదాల కారణంగా ఇద్దరూ 2022లో విడిపోయినట్లు సమాచారం.
ఎవరీ డీజే వాసి
మ్యూజిక్ ఇండస్ట్రీలో సుపరిచితమైన పేరు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ క్లిక్ 187 కంపెనీకి డైనమిక్ వ్యవస్థాపకుడు. అగ్రశ్రేణి క్లబ్‌లు, ప్రైవేట్ పార్టీలు సెలబ్రిటీ వివాహాలను నిర్వహణలో దిట్ట. దీనికితోడు సంగీత నైపుణ్యం ,ఈవెంట్ నైపుణ్యం అతన్ని హై-ప్రొఫైల్ ఈవెంట్స్‌లో కీలకంగామారాడు. ప్రియాంక హోస్ట్ చేస్తున్న వాసి ఈవెంట్‌లలో అయిన పరిచయం ప్రేమ, పెళ్లికి దారి తీసింది.