Wanaparthy
-
రెండున్నరేళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తిచేసి తీరుతాం
అచ్చంపేట/ఉప్పునుంతల: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ)ని రెండున్నరేళ్లలో పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గతనెల 22న ప్రమాదం చోటు చేసుకున్న దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్‌లెట్‌ను బుధవారం సందర్శించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేపడుతున్న సహాయక చర్యల గురించి ప్రత్యేకాఽధికారి శివశంకర్ లోతేటి, కలెక్టర్ బదావత్ సంతోష్‌తో మంత్రి తెలుసుకున్నారు. అనంతరం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సొరంగంలో ప్రమాదం చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని.. మరో 105 నుంచి 110 మీటర్ల వరకు మట్టి తవ్వకాలు పూర్తయితే సమస్య ఓకొలిక్కి వస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గడిచిన 40 రోజుల్లో వివిధ బృందాలకు చెందిన 700 నుంచి 800 మంది సహాయక సిబ్బంది, నిపుణులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం 550 నుంచి 600 మంది అత్యాధునిక పరికరాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారన్నారు. సొరంగం లోపల భారీ డ్రిల్లింగ్ యంత్రానికి ఇనుము, ఇతర పరికరాలు అతుక్కుపోవడంతో అక్కడ బురద తొలగింపు కష్టంగా, ప్రమాదకరంగా మారిందన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహాయక సిబ్బందికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. మరో 15 రోజుల్లో సహాయక చర్యలను పూర్తిచేస్తామన్నారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యం కాగా.. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని చెప్పారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. భవిష్యత్‌లో సొరంగం వల్ల ఎలాంటి నష్టాలు జరగకుండా సంపూర్ణ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సొరంగం పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిచేసేందుకు కృతనిశ్చయంతో ఉందన్నారు. సమావేశంలో డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆర్మీ అధికారులు వికాస్‌సింగ్, విజయ్‌కుమార్, ఎన్డీఆర్ఎస్ అధికారి డా.హరీశ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్‌రెడ్డి, హైడ్రా అధికారి జయప్రకాశ్, దక్షిణమధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, నీటిపారుదలశాఖ డీఈ శ్రీనివాసులు, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిఽధి ఫిరోజ్ ఖరేషి, జీఎస్ఐ అధికారులు రాజశేఖర్, కాడవర్ డాగ్స్ ప్రతినిధి ప్రభాత్ తదితరులు ఉన్నారు. లభించని కార్మికుల ఆచూకీ.. ఎస్ఎల్బీసీ సొరంగంలో 45 రోజుల క్రితం ప్రమాదానికి గురైన కార్మికుల జాడ లభించడం లేదు. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండాపోతుంది. ఉబ్బికి వచ్చిన నీటితో కూలిన సొరంగం ప్రదేశంలో పేరుకుపోయిన మట్టి, బురద, బండరాళ్ల తొలగింపునకు మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు. ఇప్పటికే టీబీఎం భాగాలు, శిథిలాలు, మట్టి, రాళ్ల తొలగింపు పనులను సహాయక బృందాలు వేగవంతం చేశాయి. సొరంగంలో 10వేల లీటర్లు నీటి ఊట వస్తుండగా.. 2.5 కి.మీ. ఒకటి చొప్పున 150 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన భారీ మోటార్లతో బయటకు పంపింగ్ చేస్తున్నారు. డీ–1 ప్రాంతం వరకు మట్టి తొలగింపు పూర్తి కాగా.. మరో 105 నుంచి 110 మీటర్ల మేర తవ్వకాలు చేపడితే సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సొరంగంలో ప్రమాదం ఘటన బాధాకరం 15 రోజుల్లో సహాయక చర్యలు పూర్తి మృతుల కుటుంబాలకు త్వరలో పరిహారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యల పరిశీలన -
కౌలుకు తీసుకుని సాగు..
అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతున్నందున ఈసారి 15 ఎకరాలను కౌలుకు తీసుకుని వరిపంట సాగుచేశాను. ఎకరాకు రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు పెట్టుబడి పెట్టాను. వారంలో రెండు రోజులే సాగునీరు అందడంతో పంట ఎదగలేదు. ఇలాంటి సమయంలో నీటిని పూర్తిగా నిలిపివేయడం వల్ల పంటను పశువులకు వదిలిపెట్టి రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. – గుంతల చెన్నప్ప, రైతు, అమరచింత పొట్టదశలో ఉన్నాయి.. జూరాల ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని పొందుతూ ములమళ్ల శివారులో 10 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నా. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉంది. రెండు తడుల వరకు నీటిని అందిస్తే పంట చేతికందే అవకాశం ఉంది. అధికారులు ముందుగా వారబందీతో సాగునీటిని అందించారు. అంతే కాకుండా గత నెల నుంచి వారంలో రెండు రోజులే సాగునీటిని అందించారు. ఇప్పుడు సైతం అదే విధంగా పంటలు చేతికొచ్చే వరకు సాగునీటిని అందించాలి. – ఆంజనేయులు, రైతు, మస్తీపురం మరో రెండు తడులు అందించాలి.. అమరచింత ఎత్తిపోతలకు జూరాల ఎడమ కాల్వ నుంచి సాగునీటిని పొందుతున్నాం. ఎత్తిపోతల ఆయకట్టు పరిధిలో ములమళ్ల, సింగపేట, ఖానాపురం, మస్తీపురం, అమరచింత, పాంరెడ్డిపల్లె గ్రామాల పరిధిలో ఈసారి యాసంగిలో 800 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నాం. ప్రాజెక్టు అధికారులు వారబందీలో కోత పెట్టి కేవలం వారంలో రెండు రోజులు మాత్రమే సాగునీటిని అందించారు. ప్రస్తుతం వరిపైర్లు పొట్టదశలో ఉన్నాయి. గింజలు గట్టిపడాలంటే మరో రెండు తడులపాటు సాగునీటిని అందించాలి. – ఆంజనేయులు, అమరచింత లిఫ్ట్ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారుల ఆదేశాలతో.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటినిల్వ మట్టం తగ్గుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయకట్టుకు ఇదే చివరి తడిగా సాగునీటిని వదిలి.. కాల్వలకు నీటి సరఫరాను నిలిపివేశాం. నీటినిల్వ మట్టం రోజురోజుకు పడిపోతుండటంతో వారబందీ ద్వారా రైతులకు సాగునీటిని అందించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సాగుకు నీటిని వినియోగించే పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లా ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటున్నాం. – జగన్మోహన్, ఈఈ ● -
మామిడి రైతుకు.. మార్కెట్ కష్టాలు
కొల్లాపూర్: మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్‌లో మార్కెట్ ఏర్పాటు కలగానే మారింది. ఇక్కడ మామిడి సాగు విస్తారంగా ఉన్నప్పటికీ.. మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు ప్రైవేటులో విక్రయించక తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా మారి మామిడి ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. దీంతో మామిడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొల్లాపూర్‌లో మార్కెట్ నిర్మాణానికి మూడేళ్ల క్రితం నిధులు మంజూరయ్యాయి. స్థల సమస్య కారణంగా మార్కెట్ నిర్మాణం జరగడం లేదు. ఫలితంగా రైతులు హైదరాబాద్‌తో పాటు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్‌లోని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకే పంటను అమ్ముకుంటున్నారు. స్థల పరిశీలనకే పరిమితం.. కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి శివారులోని దేవాదాయశాఖ భూమిలో మామిడి మార్కెట్ ఏర్పాటుకు మొదట అధికారులు శ్రీకారం చుట్టారు. 19 ఎకరాల విస్థీర్ణంలో మార్కెట్ ఏర్పాటుచేసి.. అందులోనే కొనుగోళ్లు, మామిడి కాయలు నిల్వ ఉంచేందుకు గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసే విధంగా ప్రతిపాదనలు తయారు చేయించారు. స్థల సేకరణ కోసం దేవాదాయశాఖకు ప్రభుత్వం ద్వారా లేఖ పంపించారు. అయితే భూ బదాలాయింపునకు దేవాదాయశాఖ అధికారులు ముందుకు రాలేదు. లీజు ప్రకారం ఇస్తామని చెప్పారు. అది కూడా రెండేళ్లకో సారి రెన్యువల్ చేసుకునేలా ప్రతిపాదనలు చేశారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు ఇందుకు విముఖత వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి గోదాములు, కొనుగోలు కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసి.. రెండేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి అంటే ఇబ్బందికరంగా ఉంటుందని వారు దేవాదాయశాఖ ప్రతిపాదనలను తిరస్కరించారు. కనీసం 20 నుంచి 30 ఏళ్లపాటు లీజుకు ఇస్తేనే మార్కెటింగ్ నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రామాపురం శివారులోని గుట్టపై మార్కెట్ నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించారు. అయితే అక్కడ మార్కెట్ నిర్మాణానికి స్థలం అనువుగా లేదని ఇంజినీరింగ్ అధికారులు నివేదిక ఇవ్వడంతో అక్కడ కూడా నిర్మాణం జరగలేదు. చివరగా కొల్లాపూర్‌లోని ప్రభుత్వ పీజీ కళాశాల సమీపంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమిలో మార్కెట్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన స్థల సర్వే ప్రారంభమయ్యేలోపే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో సర్వే నిలిచిపోయింది. జిల్లాలో సాగు ఇలా.. జిల్లావ్యాప్తంగా 34,712 ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో అధికంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోనే 25,237 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. కొల్లాపూర్ మామిడికి ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ఇక్కడి పండ్లకు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గిరాకీ ఉంటుంది. కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేయాలని స్థానిక రైతులు కొన్నేళ్లుగా పాలకులను కోరుతున్నారు. గత ప్రభుత్వం కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్ నిర్మాణం కోసం రూ. 5.45 కోట్లు మంజూరు చేసింది. అయితే స్థల సమస్య కారణంగా మార్కెట్ నిర్మాణానికి నోచుకోలేదు. వ్యాపారుల సిండికేట్‌తో నష్టాలు.. కొన్నేళ్ల క్రితం వరకు కొల్లాపూర్ రైతులు మామిడి పంట అమ్ముకునేందుకు హైదరాబాద్‌కు వెళ్లే వారు. పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్‌లో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులకు కొంతమేర ఉపశమనం లభించింది. అయితే స్థానిక వ్యాపారులు కూడా హైదరాబాద్ సిండికేట్‌తో కుమ్మకై ్క ధరలు అమాంతం తగ్గించేస్తున్నారు. ప్రతి సంవత్సరం సీజన్ ప్రారంభంలో కొన్ని రోజులు అధిక ధరలు పెట్టి.. ఆ తర్వాత ధరలను తగ్గించేస్తున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సమస్యకు మార్కెట్ నిర్మాణంతోనే పరిష్కారం లభిస్తుంది. కొల్లాపూర్‌లో కలగా మారిన మార్కెట్ నిర్మాణం పండ్ల విక్రయాలకు రైతులకు తప్పని అవస్థలు ప్రైవేటు వ్యాపారుల సిండికేట్‌తో నష్టాలు మామిడి మార్కెట్ ఏర్పాటుతోనే రైతులకు మేలు -
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం/ఖిల్లాఘనపురం: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. బుధవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు 6,853 మంది విద్యార్థులకు గాను 6,840 మంది హాజరు కాగా.. 15మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోగా.. సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ● ఖిల్లాఘనపురం బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని డీఈఓ అబ్దుల్ ఘని తనిఖీ చేశారు. జిల్లాలో ప్రశాంత వాతవరణంలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మండలంలో మొత్తం 443 మంది విద్యార్థులకు గాను 441 మంది చివరి పరీక్షకు హాజరైనట్లు ఎంఈఓ జయశంకర్ తెలిపారు. సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం కొత్తకోట రూరల్: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడం చారిత్రాత్మకమైనదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 1, 9, 20 రేషన్ దుకాణాలతో పాటు పెద్దమందడి మండల కేంద్రంలోని 1వ రేషన్ షాపులో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లతో కలిసి ఆయన సన్నబియ్యం పంపణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడు శ్రీమంతులు తినే సన్నరకం బియ్యాన్ని తినాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై రూ. 5,481 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 5,173 కోట్ల భారం పడుతుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1,59,353 రేషన్ కార్డులు ఉండగా.. 5,22,367 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లాలోని 324 చౌకధర దుకాణాల్లో 3,309 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు బాగా లేకపోయినప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, తహశీల్దార్ సరస్వతి పాల్గొన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం వనపర్తి: నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని.. రాజీవ్ యువవికాసం పథకం దరఖాస్తులను ఆప్‌లైన్‌లోనూ స్వీకరించాలని అదనపు కలెక్టర్ యాదయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ చాంబర్లో రాజీవ్ యువవికాసం పథకానికి సంబంధించి జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇతర విధివిధానాల గురించి చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత, ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించిందన్నారు. ఈ పథకానికి దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. జిల్లాలోని యువత నేరుగా ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేలా కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గడువులోగా అందిన దరఖాస్తులను మండలస్థాయిలో పరిశీలించి.. 20వ తేదీలోగా జిల్లాస్థాయి కమిటీకి పంపాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత 21 నుంచి 31వ తేదీ వరకు కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా అర్హులకు మంజూరు పత్రాలను అందించనున్నట్లు తెలిపారు. డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా ఉద్యానశాఖ అధికా రి అక్బర్, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అబ్జాలుద్దీన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి ఉన్నారు. -
మార్కెట్ నిర్మించాలి..
కొల్లాపూర్‌లో మామిడి సాగుచేసే రైతులు వేల సంఖ్య లో ఉన్నారు. ప్రభు త్వం రైతులను పట్టించుకోవాలి. మామిడి మార్కెట్ ఏర్పాటుచేస్తామని కొన్నేళ్లుగా చెబుతున్నారు. కానీ మార్కెట్ నిర్మించడం లేదు. ప్రైవేటు మార్కెట్లలోనే రైతులు పంట అమ్ముకుంటున్నారు. ఈ అంశంపై ప్రజాప్రతినిధు లు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. రైతులందరికీ ఉపయోగపడేలా మార్కెట్ ఏర్పాటుచేయాలి. ఈ ఏడాది పంట నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – బాలచంద్రయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ అధికారులకు నివేదించాం.. మామిడి మార్కెట్ నిర్మాణం మార్కెటింగ్ శాఖ పరిధిలోనిద. మార్కెట్ నిర్మాణానికి అనువైన స్థల సేకరణ కోసం కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో మామిడి సాగు, దిగుబడి, మార్కెటింగ్ అంశాలను గతంలో ఉన్నతాధికారులకు నివేదించాం. రైతులు పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్‌తో పాటు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్‌లోని ప్రైవేటు మార్కెట్లకు వెళ్తున్న విషయాలను కూడా తెలియజేశాం. – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్ ● -
జంటలే లక్ష్యంగా దోపిడీలు
● ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో బ్లాక్మెయిల్ ముఠా ● వీడియోలు, ఫొటోలతో బెదిరించి డబ్బుల వసూళ్లు ● తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టింది ఈ ముఠానే.. ● ప్రముఖ ఆలయం వద్ద కరువైన పోలీసుల నిఘా సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలో పేరుగాంచిన ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో మహిళపై సామూహిక అత్యాచార కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆలయ సమీపంలో కొన్నాళ్లుగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలిసింది. తాజాగా మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన ఏడుగురు నిందితులే ముఠాగా ఏర్పడి కొన్నాళ్లుగా ఇదే తరహాలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుత కేసులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఇప్పటికే పలుమార్లు నేరాలకు పాల్పడినట్టుగా తేల్చారు. ఆలయానికి వచ్చే ప్రేమ జంటలే లక్ష్యంగా చేసుకుని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. గతంలో ఎన్నిసార్లు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారు.. ఇంకా బాధితులు ఎంత మంది ఉన్నారన్న కోణంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. చట్టం తెలిసిన నేరస్తులు.. మైనర్ల జోలికి వెళ్లరు మహిళపై అత్యాచారం కేసులో పోలీసులు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహేశ్‌గౌడ్‌తోపాటు ఊర్కొండపేట గ్రామానికి చెందిన బంగారు ఆంజనేయులు, మట్ట ఆంజనేయులు, సాదిక్ బాబా, హరీశ్, వాగుల్దాస్, మణికంఠ ఉన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి కొన్ని రోజులుగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ దోపిడీలు చేస్తున్నారు. అయితే వీరు మైనర్లు ఎవరైనా జంటలుగా కనిపిస్తే అప్రమత్తంగా ఉంటారు. వారిపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో ద్వారా కఠిన శిక్షలు అమలు అవుతుండటంతో వారిని బెదిరించి డబ్బులు మాత్రమే వసూలు చేస్తారు. వివాహిత మహిళలు, మేజర్లు అయితే దోపిడీ చేసి అత్యాచారానికి పాల్పడుతున్నారు. బంగారు ఆభరణాలను తీసుకున్నా బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం ఎక్కువగా ఉండటంతో చాలా వరకు డబ్బులకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. ఈ ముఠా ఇప్పటి వరకు ఎంత మందిపై నేరాలకు పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కనీస వసతులకూ దిక్కులేదు.. ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి ఉమ్మడి జిల్లాతోపాటు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే భజన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడే రాత్రి బస చేస్తారు. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో మహిళలకు కనీస వసతులు కూడా కరువయ్యాయి. అరకొరగా ఉన్న బాత్రూంలు, టాయిలెట్లను సైతం మూసి వేస్తుండటం, నిర్వహణ లేకపోవడంతో మహిళలు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. తాగునీరు, టాయిలెట్లు, వసతి గదులు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాలు లేక ఆరుబయటకు వెళ్తున్న మహిళలను బెదిరిస్తూ కొందరు అఘాయిత్యాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. నిఘా వైఫల్యమేనా..? ఊర్కొండపేట ఆలయ సమీపంలో గత కొన్ని నెలలుగా అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఆలయంలోని సిబ్బంది, గ్రామానికి చెందిన కొందరు ఆటోడ్రైవర్లు, యువకులు ఆలయానికి వచ్చే ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారు ఒంటరిగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ, వారి వద్ద ఉన్న నగదును దోచుకుంటున్నారు. ఎవరికై నా చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫొటోలు, వీడియోలు బయట పెడుతామంటూ బెదిరిస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఈ తరహా నేరాలు చోటుచేసుకుంటున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలింగ్ పెంచుతాం : ఐజీ కల్వకుర్తి టౌన్: ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి చాలా మంది భక్తులు ఊర్కొండపేట ఆలయానికి వస్తారని, వీరి రక్షణ కోసం పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అత్యాచార ఘటన జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ వైభవ్‌తో కలిసి పరిశీలించారు. ఊర్కొండ పోలీస్‌స్టేషన్‌కు సిబ్బందిగా ఎక్కువగా కేటాయించి, ఆలయం వద్ద పికెటింగ్ నిత్యం ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. స్థానికులు, ఆలయ పాలక మండలి, ఆలయ పరిసర ప్రాంత ప్రజలతో ఐజీ మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. అత్యాచార ఘటనలో పాల్గొన్న ఆలయ ఉద్యోగి గురించి తెలుసుకొని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు సహకారం అవసరమని ఐజీ పేర్కొన్నారు. ఐజీ వెంట కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. బాధితురాలికి ప్రభుత్వం అండ ఊర్కొండ: ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో అత్యాచార ఘటన జరగడం దారుణమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే సంఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానిక ఆలయ అధికారులు, పోలీసులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆలయ సమీపంలో జరిగిన ఈ సంఘటనను సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఈ విషయమై తనతో ఫోన్లో మాట్లాడారని వివరించారు. ఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి విచారణ వేగవంతం చేస్తున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. స్థానికంగా గంజాయి విక్రయాలు జరుగుతుంటే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. స్థానికులు దీనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో లైటింగ్‌ను మెరుగుపర్చడంతోపాటు ఆలయ ప్రాంతానికి చుట్టూ కంచె ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. అలాగే ప్రతిరోజు పోలీస్ పికెట్ నిర్వహించేలా ఎస్పీతో మాట్లాడానని చెప్పారు. -
ఆస్తి పన్ను @ 56.55 శాతం
అమరచింత: జిల్లాలోని ఐదు పురపాలికల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వసూలు సోమవారం రాత్రి వరకు కొనసాగింది. పుర అధికారులు కొంతకాలంగా పన్ను వసూళ్లలో వేగం పెంచడంతో చివరి రోజు వరకు 56.55 శాతానికి చేరింది. గత నెలలో వడ్డీపై 90 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించడంతో వారం రోజులుగా పన్ను వసూళ్లను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. జిల్లాలోని ఐదు పురపాలికల్లో పన్ను వసూలు లక్ష్యం రూ.16.62 కోట్లు కాగా.. 90 శాతం వడ్డీ రాయితీతో రూ.16.41 కోట్లకు చేరింది. చివరి రోజు వరకు ఇచ్చిన లక్ష్యంలో రూ.9.28 కోట్లు వసూలు చేయగలిగారు. ప్రత్యేక బృందాలుగా.. పన్ను వసూళ్లు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు పుర అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగారు. పండుగ రోజుల్లో సైతం కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇల్లిల్లూ తిరిగి వసూలు చేశారు. ఉదయం ఆరు వరకే సిబ్బంది వార్డుల్లోకి చేరుకొని ఇంటి పన్ను వసూళ్లు చేపట్టారు. మొదట్లో కాస్త నెమ్మదించినా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో వేగం పెంచినా లక్ష్యంలో సగానికే చేరుకోగలిగారు. పురపాలికల వారీగా వసూళ్లు ఇలా (రూ.కోట్లలో..) పురపాలిక లక్ష్యం వసూలు శాతం వనపర్తి 10.94 5.55 50.73 ఆత్మకూర్ 2.39 1.44 60.25 కొత్తకోట 1.60 1.06 66.25 పెబ్బేరు 0.93 0.83 89.25 అమరచింత 0.55 0.40 72.73 జిల్లా లక్ష్యం రూ.16.62 కోట్లు.. వసూలైంది రూ.9.28 కోట్లు -
చట్టాలపై అవగాహన అవసరం
వనపర్తి రూరల్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి రజని అన్నారు. మంగళవారం శ్రీరంగాపురం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించిన కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. అలాగే మోటారు వెహికల్ యాక్ట్, బాల కార్మిక చట్టం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 15100 సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సఖి లీగల్ కౌన్సిల్ డి.కృష్ణయ్య, ప్రధానోపాధ్యాయురాలు వాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు. -
అయితే.. రికార్డే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం నుంచి సన్నాలకు మద్దతు ధరతోపాటు ప్రోత్సాహకంగా క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో అన్నదాతలు ఈ యాసంగిలోనూ వరిసాగు వైపే మొగ్గు చూపారు. ప్రధానంగా బీపీటీ, ఆర్ఎన్ఆర్ రకాలకు చెందిన సన్న రకాల ధాన్యం సాగుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో ఈ సీజన్లో సాధారణ సాగును మించి సుమారు 20 శాతం.. గత యాసంగితో పోలిస్తే దాదాపు 25 శాతం మేర వరి సాగు పెరిగినట్లు వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లో ఉమ్మడి జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు.. 11,36,660 మెట్రిక్ టన్నులు సేకరించాలనే లక్ష్యం నిర్దేశించారు. 1,61,504 ఎకరాల్లో పెరిగిన సాగు.. ఉమ్మడి జిల్లాలో గత యాసంగిలో 4,75,264 ఎకరాల్లో వరి సాగు కాగా.. ప్రస్తుతం ఇదే సీజన్లో 6,36,768 ఎకరాల్లో సాగు చేశారు. ఈ లెక్కన 1,61,504 ఎకరాల్లో వరి సాగు పెరగగా.. ఈ మేరకు అదనంగా మరో 30 కొనుగోలు కేంద్రాలను అదనంగా కేటాయించారు. రెండో వారంలో కేంద్రాలు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసంగి కోతలు ప్రారంభం కాగా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా సేకరణ చేపట్టాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదటి వారం నుంచే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలని సూచించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు సెంటర్లను అధికారులు ఖరారు చేశారు. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో కోతలకు మరింత సమయం పట్టనుండగా.. ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రయత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్ మినహా మిగతా జిల్లాల కలెక్టర్లు.. మిల్లర్లు, వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేశారు. ఎండాకాలం నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ లక్ష్యం 11.36 లక్షల మెట్రిక్ టన్నులు గత సీజన్లతో పోలిస్తే ఈ యాసంగిలో భారీగా వరిసాగు ఉమ్మడి జిల్లాలో 30 వరకు పెరిగిన కొనుగోలు కేంద్రాలు ఈ నెల రెండో వారంలో అందుబాటులోకి సెంటర్లు ఇప్పటికే అధికారులు, మిల్లర్లతో సమీక్షించిన కలెక్టర్లు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి ఏర్పాటుకు ఆదేశాలు -
న్యాయవాద వృత్తి పవిత్రమైంది
వనపర్తి టౌన్: న్యాయవాద వృత్తి పవిత్రమైందని.. న్యాయవాదులు అంకితభావంతో పని చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. మంగళవారం రాత్రి జిల్లా కోర్టు సముదాయం ఆవరణలో వనపర్తి బార్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయవాదులు న్యాయపరమైన పుస్తకాలు చదవడం, అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. జూనియర్ న్యాయవాదులు న్యాయస్థానాలకు క్రమం తప్పకుండా హాజరైతే కేసుల పరిశీలనకు అవకాశం ఉంటుందని.. సీనియర్లు విలువైన సూచనలు, సలహాలు అందించేందుకు అవకాశం లభిస్తుందని వివరించారు. న్యాయవాదులకు అవసరమైన అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసేందుకు న్యాయవాద వృత్తి అరుదైన అవకాశం అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్‌గౌడ్, సభ్యుడు కొండారెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదులకు రిటైర్మెంట్ లేదని, జీవితాంతం వకాలత్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రజని, కవిత, రవికుమార్, శ్రీలత, జానకి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, ఎన్నికల నిర్వహణ అధికారులు మోహన్‌గౌడ్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఉల్లి బహిరంగ వేలం దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి బహిరంగ వేలం నిర్వహిస్తారు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డుకు వరుసగా సెలవులు రావడం వల్ల శనివారం నుంచి మంగళవారం వరకు లావాదేవీలు జరగలేదు. తిరిగి బుధవారం మార్కెట్లో లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఉల్లి వేలం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం ధాన్యం టెండర్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. -
ఊర్కొండపేటలో కలకలం
సాక్షి, నాగర్‌కర్నూల్: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరించే రీతిలో మహిళపై ఏడుగురు కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. దాడి చేసి.. చెట్టుకు కట్టేసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మహిళపై కామాంధులు దాడికి తెగబడ్డారు. శనివారం సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, పిల్లలు ఆలయ పరిసరాల్లో పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లింది. అక్కడ కనిపించిన బంధువుతో మాట్లాడుతుండగా, అక్కడే కాచుకుని ఉన్న ఏడుగురు కామాంధులు వారిపై దాడిచేసి, ఆమె బంధువును చెట్టుకు కట్టేశారు. మహిళపై అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ ఏడుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ వెనకడుగు వేసినట్టు తెలిసింది. తర్వాత కుటుంబ సభ్యుల భరోసా మేరకు ఎట్టకేలకు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గంజాయి, మద్యం మత్తులో.. జిల్లాలో పలుచోట్ల గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, బహిరంగంగా మద్యం తాగుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ మత్తులో విచక్షణ కోల్పోయి ఇష్టారీతిగా అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఊర్కొండపేట ఆలయ పరిసరాలతోపాటు జిల్లాలో పలుచోట్ల ఇతర దర్శనీయ ప్రదేశాల్లో బహిరంగ మద్యపానం, గంజాయి వినియోగంపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నా, పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. పలుచోట్ల ఫిర్యాదు చేసినా, తరచుగా ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా ఆయా చోట్ల పోలీసుల నిఘా ఉండటం లేదు. తాజాగా మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో గంజాయి, మద్యం మత్తులో నిత్యం జోగుతున్న స్థానిక యువకులు, పలువురు ఆటోడ్రైవర్ల పాత్ర ఉందని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా.. ఇంకా ఎవరికై నా ఈ ఘటనతో సంబంధం ఉందా.. అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. వేగంగా విచారణ చేస్తున్నాం.. బాధితురాలి నుంచి సోమవారం ఉదయం ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ, సీఐ అధికారులు స్పందించి కేసు నమోదు చేశారని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. కేసుపై వేగంగా విచారణ కొనసాగుతోందన్నారు. ఏడుగురు నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాధితురాలిపై నిందితులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు. ఆలయానికి వచ్చిన మహిళపై సామూహిక అత్యాచారం ఒళ్లు జలదరించే రీతిలో చిత్రహింసలు జిల్లాలోని దర్శనీయ ప్రదేశాల్లో కొరవడిన భద్రత యథేచ్ఛగా మద్యపానం, గంజాయి వినియోగం ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని వైనం నిందితులు ఎవరైనా వదిలిపెట్టం జడ్చర్ల టౌన్: ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని నాగర్‌కర్నూల్ ఎస్పీని కోరానని వెల్లడించారు. ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారు ఓ పార్టీకి చెందిన నాయకులు అని తన దృష్టికి వచ్చిందని, అయితే ఈ ఘటనలో తాను రాజకీయాలు చేయదలుచుకోలేదన్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని, యువతికి అండగా ఉంటామన్నారు. అలాగే ఊర్కొండ పోలీసులతో మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరానన్నారు. -
ప్లాస్టిక్‌కు చెక్
నల్లమలలో పకడ్బందీగా ప్లాస్టిక్ నిషేధం అమలు ● వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ చర్యలు ● మన్ననూరు, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు ● అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 80 శాతం వరకు తగ్గిన వ్యర్థాలు ● ఇప్పటి వరకు 34 వేల కిలోల ప్లాస్టిక్ రీసైక్లింగ్ పూర్తి సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం అటవీశాఖ రెండేళ్లుగా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని అమలు చేస్తోంది. నల్లమల గుండా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోలకు సాగిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా వాహనదారులు, ప్రయాణికులు వేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్లాస్టిక్ కట్టడిపై చర్యలు కట్టుదిట్టం చేసింది. దట్టమైన నల్లమల అడవిలోకి రాకముందే ముఖద్వారం వద్ద వాహనదారుల నుంచి ప్లాస్టిక్‌ను సేకరించడంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో అడవిలో ప్లాస్టిక్ వేయవద్దని విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. అటవీశాఖ చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధంతోపాటు అవగాహన కార్యక్రమాలకు స్థానిక ప్రజలు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇప్పటికే ఏటా అడవిలో పోగవుతున్న చెత్తలో సుమారు 80 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను నివారించగలిగారు. అడవిలోకి రాకముందే.. హైదరాబాద్– శ్రీశైలం రహదారి మీదుగా శ్రీశైలం చేరుకునే ప్రయాణికులు సుమారు 60 కి.మీ., దట్టమైన నల్లమల అటవీప్రాంతం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అడవి మధ్యలో విసిరేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లతో ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు వన్యప్రాణుల మనుగడకే ముప్పుగా మారుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు రహదారి వెంట ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు అటవీశాఖ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది. పండుగలు, సెలవు రోజుల్లో వాహనాల రద్దీతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు సైతం పెరుగుతున్నాయి. అడవిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలుచేస్తూ.. అడవిలోకి రాకముందే చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్‌ను సేకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను మన్ననూర్ చెక్‌పోస్టు వద్ద, శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలను దోమలపెంట చెక్‌పోస్టు వద్ద ఆపి తనిఖీ చేస్తున్నారు. 16 మంది స్వచ్ఛ సేవకులు అడవిలోకి ప్రవేశించే వాహనాల్లో అత్యవసరంగా వినియోగించే వాటర్ బాటిళ్లను 2 లీటర్లు, అంతకన్నా పెద్ద సైజులో ఉండే సీసాలనే అనుమతిస్తున్నారు. ఖాళీ అయిన బాటిళ్లను అడవిలో ఎక్కడా పడవేయవద్దని వాహనదారులకు అవగాహన కల్పించిన తర్వాతే అడవిలోకి పంపుతున్నారు. ఫలితంగా చాలావరకు అడవిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గాయి. ఎక్కడైనా రోడ్డుకు ఇరువైపులా ఉండే వ్యర్థాలను 16 మంది స్వచ్ఛ సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. చెక్‌పోస్టులు, అడవిలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మన్ననూర్లోని ప్లాస్టిక్ బేయిలింగ్ కేంద్రంలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని తుక్కుగూడలో ఉన్న హైపర్ ప్లాస్టిక్ పార్క్ రీసైక్లింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 34 వేల కిలోల ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయడం గమనార్హం. ఇప్పటికే ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేస్తుండగా.. ఇకముందు చిప్స్, ఇతర కవర్లను సైతం రీసైక్లింగ్ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనూహ్య స్పందన.. ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, వ్యర్థాలను అడవిలో పడేయకుండా ఉండేందుకు స్థానికులు, వాహనదారులకు అటవీశాఖ విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఈ మేరకు స్థానికులు, వ్యాపారులు, వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నల్లమలలోని మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, వ్యాపారులు సైతం ప్లాస్టిక్ నిషేధానికి సహకారం అందిస్తున్నారు. అందరి సహకారంతో.. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పూర్తిస్థాయిలో ప్లాస్టిక్‌పై నిషేధాన్ని అమలుచేస్తున్నాం. అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలతో అడవిలో ఏటా పోగవుతున్న ప్లాస్టిక్ చెత్తలో 80 శాతం తగ్గింది. స్థానిక ప్రజలు, వ్యాపారులతోపాటు హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ప్రయాణిస్తున్న వాహనదారుల నుంచి సహకారం లభిస్తోంది. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీ శాఖ అధికారి -
ఆయిల్‌పాం ఫ్యాక్టరీ పనులు అడ్డుకున్న గ్రామస్తులు
కొత్తకోట రూరల్: మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్‌పాం ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇటీవల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ మాజీ మంత్రి కేటీఆర్ సైతం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. కాగా.. ఆదివారం ఉగాది రోజన ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు యాజమాన్యం యంత్రాలతో రాగా, గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడకు చేరుకొని ఫ్యాక్టరీ మాకొద్దు.. పనులు ప్రారంభించొద్దని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆనంద్ సిబ్బందితో అక్కడకు చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పడంతో వెనుదిరిగారు. అనంతరం ఫ్యాక్టరీ వారు పనులు ప్రారంభించి వెళ్లిపోయారు. -
రేషన్.. పరేషాన్
చౌకధర దుకాణాలకు చేరిన సన్నబియ్యం ●50 కిలోల సంచులనే అందిస్తాం.. రేషన్ దుకాణాలకు చేరిన సన్న బియ్యం సంచుల్లో 50 కిలోలకుగాను 47 కిలోల బియ్యం ఉన్నాయనే సమాచారంతో జిల్లాలోని గోదాంలను పరిశీలించాం. రేషన్ దుకాణాలకు స్టాక్ పాయింట్ నుంచి ఎన్ని క్వింటాళ్ల బియ్యం అందించాలో అక్కడే తూకం చేసి లారీల్లో తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – జగన్మోహన్, డీఎం, పౌరసరఫరాలశాఖ అమరచింత: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ లబ్ధిదారులకు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని రేషన్ దుకాణాలకు ఇటీవల లారీల్లో బియ్యం తరలించారు. అమరచింతలోని రేషన్ దుకాణాలకు వచ్చిన సంచుల్లో బియ్యం తక్కువగా కనిపించడంతో డీలర్లు వాటిని తూకం వేసి చూడగా ఒక్కో సంచిలో కేవలం 45 నుంచి 47 కిలోలు మాత్రమే ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. లబ్ధిదారులందరూ సన్నబియ్యం తీసుకెళ్తారని.. సంచుల్లో బియ్యం తక్కువగా ఉంటే ఎలా భర్తీ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక లారీ లోడ్‌లో ఇలా జరిగిందంటే పొరపాటేనని.. పట్టణంలోని దుకాణాలన్నింటికి వచ్చిన సంచుల్లో ఇవే తేడాలున్నాయని వాపోతున్నారు. గోదాంల పరిశీలన.. రేషన్ దుకాణాలకు సన్నబియ్యం సరఫరా జరుగుతున్న వేళ 50 కిలోల సంచిలో 47 కిలోల బియ్యం ఉన్నాయనే సమాచారంతో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు ఆయా గోదాంలను ఇటీవల పరిశీలించారు. సంచులు పాతబడటం, లారీల్లోకి తరలించే క్రమంలో రంధ్రాలు పడి తూకంలో తేడాలు వచ్చాయని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా 50 కిలోల బియ్యం సంచిలో 47 కిలోల బియ్యం రావడంపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని.. డీలర్లు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామంటున్నామని అధికారులు వివరించారు. సంచిలో 50 కిలోలకు బదులుగా సుమారు 47 కిలోలే.. ఆందోళనలో డీలర్లు జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 255 గ్రామాలు.. 325 రేషన్ దుకాణాలున్నాయి. మొత్తం 1,63,138 తెల్లరేషన్ కార్డులుండగా.. 5,23,972 మందికి ప్రతి నెలా ఉచిత బియ్యం పొందుతున్నారు. ప్రతి నెల 43,461 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సివిల్ సప్లై స్టాక్ పాయింట్ నుంచి దుకాణాలకు చేరుతున్నాయి. -
తగ్గుతున్న నీటి నిల్వలు..
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌పై ఆధారపడి పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఫుల్‌గేజ్ లెవెల్ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 837 అడుగుల దిగువకు నీటిమట్టం చేరింది. డ్యాంలో నీటి నిల్వ 58 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. బ్యాక్‌వాటర్ డెడ్ స్టోరేజీ 30 టీఎంసీలు. అప్పటి వరకు ప్రాజెక్టుల ద్వారా బ్యాక్‌వాటర్‌ను వినియోగించుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తమ వాటాకు సంబంధించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో.. శ్రీశైలం డ్యాంలో ఉన్న 28 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం కేఎల్ఐ ద్వారా రోజూ ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం బ్యాక్‌వాటర్ డెడ్ స్టోరేజీకి చేరేలోగా పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని ఎత్తిపోసుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు. -
అంబరాన్నంటిన ఉగాది సంబరాలు
వనపర్తిటౌన్: తెలుగు వెలుగుల ఉగాదిని ఆదివారం జిల్లావాసులు ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకొన్నారు. జిల్లాలోని అన్ని ఆలయాల్లో ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి, చింతల హనుమాన్, కన్యకాపరమేశ్వరి, వీరబ్రహ్మేంద్రస్వామి, రామాలయం, లక్ష్మీ నర్సింహస్వామి, లక్ష్మీగణపతి తదితర ఆలయాల్లో అర్చకులు ఉదయం ప్రత్యేక పూజలు.. సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు. వనపర్తి సంస్థాన ఆస్థాన సిద్ధాంతి ఓరుగంటి నాగరాజుశర్మ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం చేశారు. విశ్వావసు నామ సంవత్సరంలో రాజకీయ కలహాలు, వైరాలు ఎన్ని ఉన్నా.. అభివృద్ధిలో వనపర్తి పురోగమిస్తోందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో పడిపంటలు, పశుసంపదకు కొదవలేదని చెప్పారు. వనపర్తి ఆదాయం అధికంగా, ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ.. గౌరవంలో ఆశాభంగం తప్పదని, అవమానం అధికమతుందన్నారు. తెలుగు పండుగలు, ఆచార వ్యవహారాలను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రఘునాథాచార్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, నాయకులు వాకిటి శ్రీధర్, బ్రహ్మం, తిరుమల్, లక్ష్మీనారాయణ, యాపర్ల రాంరెడ్డి, గంధం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎత్తిపోతలు జరిగేనా?
‘పాలమూరు’ ద్వారా 4 టీఎంసీల నీటి పంపింగ్‌కు అనుమతులు మోటార్ల బిగింపు పూర్తి.. పాలమూరు ప్రాజెక్టులోని మొదటి లిఫ్టు అయిన ఎల్లూరు పంపుహౌజ్‌లో ఇప్పటి వరకు నాలుగు మోటార్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు మోటార్ల బిగింపునకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. రెండు మోటార్లకు విద్యుత్ సరఫరా, చార్జింగ్ వంటి పనులన్నీ పూర్తిచేశారు. డెలివరీ మెయిన్స్ కూడా దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలే ఎత్తిపోతలు పెండింగ్‌లో పడటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రాజెక్టు వద్ద 400/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తుండగా.. నిర్మాణం, విద్యుత్ సరఫరా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ నెలల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. ప్రాజెక్టు పంప్‌హౌజ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నా నీటి ఎత్తిపోతలు మాత్రం నోచుకోవడం లేదు. అయితే ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా నీటి ఎత్తిపోతలు చేపడుతామని సంబంధిత అధికారులు చెబుతుండగా ఆచరణలో అమలుకు నోచుకుంటుందా.. లేదా.. అనేది సందేహంగా మారింది. 4 టీఎంసీలకు అవకాశం.. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఐదేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2023 సెప్టెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లూరు సమీపంలోని మొదటి లిఫ్ట్‌ను ప్రారంభించగా.. ఒక మోటారు ద్వారా రెండు టీఎంసీల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. తాగునీటి అవసరాల కోసం ఈ సీజన్లో నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. గతేడాది అక్టోబర్‌లోనే కృష్ణానది పరవళ్లు తొక్కగా.. నాటి నుంచి ఎత్తిపోతలు చేపడతామని అధికారులు చెబుతూ వస్తుండగా.. ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రభుత్వం దృష్టిసారిస్తేనే.. పాలమూరు ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ నీటి ఎత్తిపోతలు మాత్రం జరగడం లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదటి లిఫ్టు ద్వారా నీటి ఎత్తిపోతలు జరిగితే.. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీరుతాయి. కేఎల్ఐ ప్రాజెక్టుపై ప్రస్తుతం ఉన్న భారం కూడా తగ్గుతుంది. పాలమూరు ప్రాజెక్టు పంప్‌హౌజ్‌లో ఏర్పాటుచేసే మోటార్ల సంఖ్య : 9 ఒక మోటారుతో రోజు ఎత్తిపోసే నీరు 3,000 క్యూసెక్కులు ఈ సీజన్లో తాగునీటి అవసరాలకు అనుమతి ఉన్న నీటి వాటా 4 టీఎంసీలు నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.04 టీఎంసీలు తుది దశకు పనులు.. ఎల్లూరు లిఫ్టు వద్ద నాలుగు మోటార్ల బిగింపు పూర్తయింది. సివిల్ వర్క్స్, డెలివరీ మెయిన్స్ పనులు తుది దశకు చేరాయి. అక్టోబర్ తర్వాత ఎత్తిపోతలు చేపట్టాలని భావించినా.. మోటార్ల బిగింపు, విద్యుత్ సరఫరా పనులు కొనసాగుతున్నందున సాధ్యం కాలేదు. తాగునీటి అవసరాలకు ఈ సీజన్లో 4 టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో తప్పనిసరిగా ఎత్తిపోతలు చేపడుతాం. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటి పారుదలశాఖ పంప్‌హౌజ్‌లో కొనసాగుతున్న పనులు పూర్తికాని విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం గతేడాది అక్టోబర్ నుంచి వాయిదా పడుతున్న వైనం వచ్చే నెలలో తప్పనిసరిగా చేపడతామంటున్న అధికారులు ఒక్కో మోటారు సామర్థ్యం : 145 మెగావాట్లు -
అసంపూర్తిగా.. అధ్వానంగా
ఏడాది దాటినా పూర్తికాని ఖిల్లాఘనపురం–వెల్కిచర్ల రహదారి పనులు ఖిల్లాఘనపురం: మండల కేంద్రం నుంచి పర్వతాపురం, అప్పారెడ్డిపల్లి, మామిడిమాడ, సల్కెలాపురం గ్రామాల మీదుగా భూత్పూర్ మండలం వెల్కిచర్ల వరకు ఆర్అండ్బీ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రోడ్డుపై నీరు నిలిచి కుంటలను తలపించాయి. అసంపూర్తి పనులతో.. ఖిల్లాఘనపురం నుంచి పర్వతాపురం మీదుగా వెళ్లే బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకుగాను ప్రభుత్వం ఆర్అండ్బీ నిధులు రూ.2.60 కోట్లు మంజూరు చేసింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కల్వర్టు నిర్మాణాలు చేపట్టి వదిలేశారు. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వత్తిడి పెరగడంతో రోడ్డుకు ఇరువైపులా కొంతదూరం మొర్రం పోశారు. కానీ రహదారి పనులు మాత్రం ప్రారంభించడం లేదు. అధ్వాన రహదారితో.. మండల కేంద్రం నుంచి పర్వతాపురం వరకు ఉన్న 6 కిలోమీటర్ల బీటీ రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డుకు కొంతదూరం మొర్రం పోసి వదిలేయడంతో పెద్ద వాహనాలు వెళ్లినప్పుడు పెద్దఎత్తున దుమ్మలేస్తోంది. అలాగే ద్విచక్ర వాహనదారులు రాత్రిళ్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాంట్రాక్టర్‌పై వత్తిడి తీసుకొచ్చి పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం.. గ్రామం నుంచి మండల కేంద్రానికి రోజు వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు మరమ్మతులో భాగంగా చాలాచోట్ల మొర్రం పోసి వదిలేయడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాల పాలవుతున్నారు. భారీ వాహనాలు వెళ్తుంటే పెద్ద ఎత్తున దుమ్ములేస్తోంది. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయించాలి. – గోవర్ధన్‌రెడ్డి, పర్వతాపురం ఉన్నతాధికారులకు విన్నవించాం.. ఖిల్లాఘనపురం నుంచి వెల్కిచర్ల వరకు బీటీ రహదారి పనులను రెండు భాగాలుగా టెండర్ పిలిచాం. ఇప్పటి వరకు ఓ భాగం పనులు పూర్తయ్యాయి. మండల కేంద్రం నుంచి పర్వతాపురం వరకు ఉన్న రహదారి పనులను కాంట్రాక్టర్ చేయడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కాంట్రాక్టర్‌తో మాట్లాడాం.. పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – రాకేష్, ఏఈ, ఆర్అండ్బీ శాఖ రూ.2.60 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం రాకపోకలకు తప్పని అవస్థలు పట్టించుకోని అధికారులు -
14 మంది విద్యార్థులు గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఈఓ అబ్దుల్ ఘనీ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. శుక్రవారం పరీక్షకు 6,853 మంది విద్యార్థులకుగాను 6,839 మంది హాజరుకాగా, 14 మంది గైర్హాజరైనట్లు వివరించారు. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోగా.. సిబ్బంది తనిఖీ చేసి లోనికి అనుమతించారు. అన్ని కేంద్రాల దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రామన్‌పాడులో 1,017 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం 1,017 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 165 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 16 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 57 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తుల ఆహ్వానం వనపర్తిటౌన్: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 5 చివరి గడువని.. నిరుద్యోగ మైనార్టీ యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 వేలకు 100 శాతం, రూ.50,001 నుంచి రూ.లక్ష వరకు 90 శాతం, రూ.1,00,001 నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.2,00,001 నుంచి రూ.4 లక్షల వరకు 70 రాయితీ కల్పిస్తుండగా..మిగతా మొత్తం బ్యాంకు రుణం అందుతుందని పేర్కొన్నారు. ఆసక్తిగల తగిన ధ్రువపత్రాలతో tgobmms new.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ‘పంజాబ్ రైతులపై దాడి అమానుషం’ వనపర్తి రూరల్: రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. రైతులపై పంజాబ్ పోలీసుల లాఠీచార్జ్, అక్రమ అరెస్టులకు నిరసనగా శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సమన్వయ కమిటీ పిలుపు మేరకు మండలంలోని చిట్యాల మార్కెట్‌యార్డు కార్యాలయంలో రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కనీస మద్దతు ధరలు చెల్లిస్తామని బీజేపీ ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని.. దీంతో రైతులు రెండ్రోజులుగా నిరసనలు తెలియజేస్తే అక్రమంగా అరెస్టు చేసి లాఠీచార్జ్ చేయడం సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, భగత్‌సింగ్ పోరాట స్ఫూర్తితో పంజాబ్ రైతులకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు డి.బాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి పరమేశ్వరాచారి, జిల్లా నాయకులు ఎం.బాలస్వామి, రైతులు వెంకటయ్య, నాగయ్య, కృష్ణయ్య, తిరుపతి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. 108 వాహనం తనిఖీ చిన్నంబావి: మండలంలోని 108 వాహనాన్ని శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్, వనపర్తి జిల్లా మేనేజర్ రత్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని పరికరాల పనితీరు, రికార్డులను పరిశీలించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి లేకపోయినా.. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో టెక్నీషియన్ నరేందర్, పైలెట్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యకు బాటలు
అభివృద్ధి వైపు పాలమూరు యూనివర్సిటీ పయనం ●● ఒకే విద్యా సంవత్సరంలో రూ.150 కోట్లు మంజూరు ● పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100 కోట్లు విడుదల చేసిన కేంద్రం ● రాష్ట్ర బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయింపు ● లా, ఇంజినీరింగ్ కళాశాలల భవనాల నిర్మాణంపై దృష్టి ● హాస్టల్స్, ల్యాబ్స్ భవనాల నిర్మాణానికి శ్రీకారం ప్రభుత్వానికి కృతజ్ఞతలు గతంలో కేవలం వేతనాల కోసమే ప్రభుత్వం నిధులు కేటాయించేది. కానీ, ఈ సంవత్సరం వేతనాలతో పాటు అభివృద్ధి కోసం కూడా నిధులు వెచ్చించిన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించడంతో యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తాం. బాలికలకు, బాలురకు ప్రత్యేకంగా హాస్టళ్లు, అకాడమిక్ బ్లాక్, ల్యాబ్స్ నిర్మాణంపై దృష్టిసారిస్తాం. లా, ఇంజినీరింగ్ కళాశాల కోసం కూడా భవనాల నిర్మాణం చేపడతాం. విద్యార్థుల చదువులు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధించే విధంగా కొత్త కోర్సులు ప్రారంభించేలా చూస్తాం. – శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్‌లర్ యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయింపు ఇలా.. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ నూతన భవనాలు, అధునాతన ల్యాబ్‌లు, వినూత్న కోర్సులతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. యూనివర్సిటీకి గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక మొత్తంలో నిధులు కేటాయింపులు చేయడంతో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి విద్యార్థులకు హాస్టళ్లు, తరగతి, గదులు, ల్యాబ్‌లు, గ్రౌండ్స్ వంటివి లేక సతమతమవయ్యే వారు. కానీ, ఈ సంవత్సరం పెద్దమొత్తంలో నిధుల కేటాయింపుతో భవనాల నిర్మాణానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉషా స్కీం ద్వారా ఇచ్చిన నిధులతో పెద్దఎత్తున భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం సైతం నిర్మాణాల కోసం రూ.35 కోట్లు నిధులు కేటాయించింది. ఈ నిధులతో మరిన్ని భవనాల నిర్మాణాలకు అంచనాలు రూపొందిస్తున్నారు. దీంతో యూనివర్సిటీలో ఉన్నత విద్యకు బాటలు పడుతున్నాయి. రూ.150 కోట్లు కేటాయింపు.. యూనివర్సిటీ ప్రారంభం నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో కేవలం సిబ్బంది వేతనాల కోసమే కేటాయింపులు జరిగివి. 2018లో పీయూలో న్యాక్ గ్రేడింగ్ రావడంతో ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేయగా.. పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో సిబ్బంది వేతనాల కోసం గతేడాది రూ.11 కోట్లు, ఈ సంవత్సరం రూ.15 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో నూతనంగా ప్రారంభించనున్న లా, ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేసే సిబ్బంది వేతనాలు కూడా ఇచ్చారు. గతేడాదితో పోల్చితే రూ.4 కోట్లు అదనంగా ఇవ్వడంతో యూనివర్సిటీపై వేతనాల భారం తగ్గనుంది. ఈ క్రమంలో యూనివర్సిటీ అభివృద్ధి పనులకు ఎలాంటి నిధులు కేటాయించనప్పటికీ అధికారులు యూనివర్సిటీ అంతర్గత నిధులు, ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి నిధులు సేకరించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు ఒకేసారి కేటాయించడంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతాయని భావిస్తున్నారు. సంవత్సరం ప్రతిపాదనలు కేటాయింపులు (రూ.కోట్లలో..) 2019– 20 119 6.63 2020– 21 216 7.39 2021– 22 137 7.58 2022– 23 75 9.58 2023– 24 84 10.91 2024– 25 200 50 నిర్మాణ దశలో ఉన్న రీసెర్చ్ ఫెసిలిటీ భవనం వసతుల కల్పనపై దృష్టి.. యూనివర్సిటీలో కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రస్తుతం అవసరమైన నిధులు అందుబాటులో ఉండడంతో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఇంజినీరింగ్, లా కళాశాలల భవనాల నిర్మాణం కోసం అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నారు. ఈ రెండు కళాశాలల్లో చదివే విద్యార్థుల కోసం రెండు బాలుర, బాలికల హాస్టళ్లు, ఒక అకామిక్ బ్లాక్‌ను నిర్మించనున్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో రీసెర్చ్ కోసం రూ.11 కోట్లతో రీసెర్చ్ఫెసిలిటీ భవనం, విద్యార్థులను అథ్లెటిక్స్ ప్రోత్సహించేందుకు సింథెటిక్ ట్రాక్, సందర్శకుల కోసం గ్యాలరీ నిర్మిస్తున్నారు. త్వరలో ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. -
మహిళా సంఘాల అభివృద్ధికి కృషి
వనపర్తి: ప్రతి మండలంలో మహిళా సంఘాలతో స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేయించేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, ఏపీఎంలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల స్వయం ఉపాధి, సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తూ మహిళా సంఘాలకు చేయూతనిస్తున్నాయని, సద్వినియోగం చేసుకొనేలా మహిళా సంఘాలను ప్రోత్సహించాలని ఆదేశించారు. పెట్రోల్‌బంక్, గోదాం, రైస్‌మిల్లు మరేదైనా వ్యాపారం ప్రారంభించేలా అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంఘాలు యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొస్తే జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైతే శిక్షణ సైతం ఇప్పిస్తామని చెప్పారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అత్యధికంగా ఐకేపీ వారికి కేటాయిస్తామని, కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా ఉండేందుకు ఏఈఓల ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని.. కేంద్రాల ఇన్‌చార్జ్‌లు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ఈసారి మంచి నాణ్యమైన గన్నీ బ్యాగులు అందజేస్తామన్నారు. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారు చనిపోతే వారి జీవిత భాగస్వామికి పింఛన్ మంజూరు చేయడంలో అలసత్వం వద్దని ఆదేశించారు. జిల్లాలో 451 పెండింగ్‌లో ఉన్నాయని.. గ్రామాల వారీగా వివరాలు సేకరించి మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, భాగస్వామి బ్యాంకు ఖాతా వివరాలు ఎంపీడీఓ కార్యాలయంలో అందిస్తే ఏప్రిల్ 10 లోగా వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించేందుకు మహిళా సంఘాలకు ఆర్డరు ఇవ్వడం జరిగిందని.. ఏ పాఠశాల విద్యార్థులకు ఎవరు దుస్తులు కుట్టాలో మ్యాచింగ్ బ్యాచింగ్ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి కొలతలు తీసుకొని సరిపోయిన విధంగా కుట్టేలా చూడాలన్నారు. జూన్ 2లోగా కనీసం ఒక జత యూనిఫాం సిద్ధమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఎం అరుణ, ఏపీఎంలు పాల్గొన్నారు. -
కొరవడిన పర్యవేక్షణ
జిల్లాలో పెరిగిన కల్తీ నూనెలు, ఆహార పదార్థాల విక్రయాలు ●తనిఖీలు చేపడుతున్నాం.. జిల్లాతో పాటు మరో రెండు జిల్లాల ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తిసున్నా. షెడ్యూల్ ప్రకారం నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ నమూనాలు సేకరిస్తున్నాం. ప్రైవేట్ ఆహార విక్రయ కేంద్రాలతో పాటు హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లోనూ నమూనాలు సేకరించి నాణ్యతపై పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రతి జిల్లాలో ప్రతి నెల 25 నుంచి 30 నమూనాలు తగ్గకుండా సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆహార కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే జరిమానా తప్పదు. – నీలిమ, ఫుడ్ ఇన్స్పెక్టర్, వనపర్తి వనపర్తి: ఆహార కల్తీ రోజురోజుకు పెరిగిపోతోంది. అందుకు అనుగుణంగా అధికారుల పర్యవేక్షణ కొనసాగడం లేదనేందుకు తాజాగా జిల్లాకేంద్రంలోని ఓ పెద్ద మార్ట్‌లో ఓ వినియోగదారుడికి కుళ్లి, బూజు పట్టి ఉన్న ఆహార పదార్థం గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఫిర్యాదుతో మేల్కొని సోదాలు నిర్వహించారు. ఊహించని విధంగా కుప్పలకొద్దీ కూళ్లిన ఆహార పదార్థాలు రిఫ్రిజిరేటర్లలో బయటపడ్డాయి. జిల్లాకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ లేకపోవడం ఆహార కల్తీకి ఆజ్యం పోసినట్లు అయింది. జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్కు మరో రెండు జిల్లాల అదనపు బాధ్యతలు అప్పగించడంతో పర్యవేక్షణ కొరవడిందని చెప్పవచ్చు. జిల్లావ్యాప్తంగా వేలల్లో ఆహార విక్రయ కేంద్రాలు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఉండగా.. కేవలం 1,200 మంది విక్రయదారులు మాత్రమే ఫుడ్ లైసెన్‌న్స్ కలిగి ఉండడం గమనార్హం. మూడు నెలల్లో 40 కేసులు.. జిల్లావ్యాప్తంగా మూడు నెలల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడులు నిర్వహించి నోటీసులు ఇచ్చిన ఘటనలు కేవలం 40 మాత్రమే ఉన్నాయి. వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించడానికి సమయం సరిపోవడం లేదని అధికారులు లబోదిబోమంటున్నారు. మూడు జిల్లాల్లో పర్యవేక్షణ చేయాల్సి ఉండగా.. ఒక్కో జిల్లాకు నెలకు ఏడు నుంచి ఎనిమిది రోజుల సమయం మాత్రమే కేటాయించేందుకు వెసులుబాటు లభిస్తుంది. దీంతో ప్రైవేటు ఆహార విక్రయ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, గురుకుల పాఠశాలల్లో సైతం సందర్శించి ఆహార నాణ్యతను పరీక్షించాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్ సమయం సరిపోవడం లేదని వాయిదాలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పుట్టగొడుగుల్లా ప్రైవేట్ హాస్టళ్లు.. జిల్లాకేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ హాస్టళ్లు వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే హాస్టళ్లు ఏర్పాటు చేస్తుండటంతో జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయనే విషయంపై అధికారులకు సైతం స్పష్టత లేకపోవడం గమనార్హం. ఏదేని అనుకొని ఘటన చోటు చేసుకున్నప్పుడు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టడం, ఫిర్యాదులు అందితేనే తనిఖీలు చేయడానికి అధికారులు అలవాటు పడ్డారన్న ఆరోపణలు లేకపోలేదు. రూ. 50 వేల జరిమానా.. మూడు జిల్లాలు.. ఒక్క అధికారి... వనపర్తితో పాటు గద్వాల, నారాయణపేట జిల్లాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమనే పర్యవేక్షణ చేయాల్సి ఉంది. జిల్లా కలెక్టరేట్లోని డీఎస్ఓ కార్యాలయంలో ఒక టేబుల్, ఒక బీరువాను ఓ మూలన ఏర్పాటు చేసుకొని అదే కార్యాలయంగా భావించి విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా రెండు జిల్లాల్లో ఆ మాత్రం కార్యాలయాలు కూడా లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, శాంపుల్స్ సేకరించే అధికారి, డాటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ మొత్తం నలుగురు సిబ్బంది ఉండాలి. కేవలం ఫుడ్ ఇన్స్పెక్టర్ను మాత్రమే నియమించి మిగతా సిబ్బందిని నేటికీ కేటాయించలేదు. వేలల్లో ఆహార విక్రయ కేంద్రాలు ఉంటే.. వందల్లో లైసెన్సులు ఉన్నాయి. ఇటీవల జిల్లాకేంద్రంలోని ఓ మార్ట్‌లో కుళ్లిన పదార్థాలు గుర్తించిన వినియోగదారులు నోటీసులు, చిన్న మొత్తం జరిమానాలతో సరిపెడుతున్న అధికారులు మూడు జిల్లాలకు ఒకే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇటీవల జిల్లాకేంద్రంలోని ఒక పెద్ద మార్ట్‌లో కుళ్లిన ఆహార పదార్థాలు పట్టుబడగా.. రూ.50 వేల జరిమానా విధించారు. మూడునెలల్లో జిల్లావ్యాప్తంగా 40 నమూనాలు సేకరించి పరీక్షలకు ల్యాబ్‌కు పంపించామని. వాటిలో కల్తీ నిర్ధారణ అయితే వారికి సైతం జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
తాగునీటి సరఫరాలో ఇబ్బందులు వద్దు
అమరచింత: వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని.. ప్రజలు తాగునీరు అందక ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఉరుకోమని, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తప్పవని మిషన్ భగీరథ ఎస్ఈ కె.వెంకటరమణ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మిషన్ భగీరథ పంప్‌హౌజ్‌ను ఆయన సందర్శించారు. జిల్లాలో మిషన్ భగీరఽథ పైప్‌లైన్ లీకేజీలు, మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపడుతూ నీటి సరఫరా చేస్తున్నా ఎందుకు ప్రజలకు అందించడం లేదని సిబ్బందిని ప్రశ్నించారు. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలోని 150 తాగునీటి పథకాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా తాగునీటిని అందిస్తున్నామని.. అలాంటిది అమరచింత మున్సిపాలిటీకి మాత్రం నీటిని అందించడంలో సమస్యలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని మిషన్ భగీరఽథ ఏఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ సిబ్బంది, మున్సిపల్ వాటర్మెన్ల మధ్య సమన్వయం లేకనే నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. రోజువారీగా ఎన్ని లీటర్ల నీటిని అందిస్తున్నామనే విషయంతో పాటు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిండిన తర్వాతే వాటిని మున్సిపల్ వాటర్లైన్మెన్లకు అప్పగించాల్సిన బాధ్యత మిషన్ భగీరథ సిబ్బందిపై ఉందని తెలిపారు. రెండు జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు లేవని.. కావాల్సిన నీరు ఆయా జలాశయాల్లో ఉన్నాయని, వేసవి పూర్తయ్యే వరకు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. ప్రజలు తమ అవసరాలకు ఎంత మేర అవసరమో అంతే నీరు పట్టుకొని కొళాయిలను కట్టి ఉంచాలని, నీటిని వృథా చేయొద్దని సూచించారు. సమావేశంలో ఈఈ మేఘారెడ్డి, ఏఈలు రుక్మేందర్రెడ్డి, హర్షవర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు. పైప్లైన్ల మరమ్మతుకు ప్రత్యేక చర్యలు మిషన్ భగీరథ ఎస్ఈ కె.వెంకటరమణ -
విద్యుత్‌శాఖలో విజిలెన్స్ విచారణ
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంలో ఈ నెల 22న సీనియర్ అకౌంటెంట్ వెంకటరమణ, ఇతర ఉద్యోగుల విధులకు ఓ కాంట్రాక్టర్ ఆటంకం కలిగించారని, తప్పుడు బిల్లులు చేయనందుకు అమానుషంగా మాట్లాడుతున్నారని విద్యుత్ అధికారులు సీఎండీ ముషారఫ్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం విజిలెన్స్ అధికారి, ఏపీటీఎస్ మహేశ్వర్‌రావు నేతృత్వంలో విజిలెన్స్ ఎస్ఈ మదన్ తదితరులు విచారణ చేపట్టారు. గొడవకు దారితీసిన పరిణామాలు, కాంట్రాక్టర్ వ్యవహరించిన తీరు తదితర వివరాలను ఉద్యోగులు, సిబ్బంది సుమారు 40 మందిని అడిగి తెలుసుకొని నమోదు చేసుకున్నారు. పలువురు అధికారులు జరిగిన ఘటన వీడియోలను విజిలెన్స్ అధికారులకు చూపించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి మహేశ్వర్‌రావు మాట్లాడుతూ.. అధికారులతో పాటు కాంట్రాక్టర్‌ను కూడా విచారిస్తామని, పూర్తి వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు వెంకటరమణ, వెంకటేష్, దయానందం, సత్యం, వరదరాజు, రవికుమార్, ప్రవీణ్, కేవీ శ్రీనివాసులు, నవీన్‌గౌడ్, హుస్సేన్, బాలప్రతాప్, శ్రీకాంత్, వెంకటేశ్వర్‌రెడ్డి, శాంతికుమారి, సునీత, రాధిక, దివ్య, మస్తాన్, జగదీశ్వర్, నిస్సీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టు భద్రతకే ఔట్‌పోస్టు ఏర్పాటు
అమరచింత: కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రత దృష్ట్యా పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. గురువారం ప్రాజెక్టు వద్ద పోలీస్ ఔట్‌పోస్ట్‌తో పాటు గెస్ట్‌హౌజ్ నిర్మాణానికి గురువారం పీజేపీ నందిమళ్ల డివిజన్ క్యాంపు ఏఈతో కలిసి ఎస్పీ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీటి నిర్మాణాలకు నాలుగు ఎకరాల స్థలంతో పాటు సుమారు రూ.కోటి అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని.. త్వరలోనే ఔట్‌పోస్టు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనంతరం పెద్దమందడి మండలంలోని పంటపొలాల్లో పట్టుకున్న భారీ మొసలిని జూరాల బ్యాక్‌వాటర్‌లో వదలడాన్ని ఆయన పరిశీలించారు. వివాదాస్పద స్థలం పరిశీలన.. మండల కేంద్రంలోని నాగులకుంటలో ఉన్న 13.08 ఎకరాల శిఖం భూమి కబ్జాకు గురికావడంతో గురువారం ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిఖం భూమిని కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని సీఐని ఆదేశించారు. నాగులకుంటలో వర్షపునీరు నిలిచేలా ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఆయన వెంట సీఐ శివకుమార్, ఎస్ఐ సురేష్. ఇరిగేషన్ ఏఈ ఆంజనేయులు ఉన్నారు. రూ.కోటితో ప్రతిపాదనలు ఎస్పీ రావుల గిరిధర్ -
గ్రామీణ ప్రాంతాలకు తపాలా సేవలు
లింగాల: మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అందుబాటులోకి తపాలా శాఖ సేవలను విస్తరిస్తున్నట్లు వనపర్తి డివిజన్ ఎస్పీఓ భూమన్న అన్నారు. మండలంలోని రాయవరం గ్రామ పంచాయతీకి నూతనంగా మంజూరైన బ్రాంచి పోస్టాఫీసును గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాయవరంలో బ్రాంచి పోస్టాఫీసు ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారన్నారు. ఈ బ్రాంచి పోస్టాఫీసు పరిధిలోకి కొత్తచెర్వుతండా, పాతరాయవరం, వడ్డెబక్కనగూడెం గ్రామాలు వస్తాయన్నారు. ఇప్పటి వరకు రాయవరంతోపాటు ఇతర గ్రామాల వారు అంబట్పల్లి పోస్టాఫీసుకు వెళ్తూ ఇబ్బందులకు గురయ్యేవారని, ఇక నుంచి ఆ ఇబ్బందులు తప్పినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టాఫీసు ద్వారా ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీల డబ్బులు, ఇతరత్రా సేవలు ప్రజలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు సృజన్నాయక్, రవికుమార్, ప్రసాద్, రవికుమార్, బ్రాంచి పోస్టాఫీస్ ఇన్చార్జ్ బాలాజీనాయక్, నాయకులు మల్లయ్య, తిరుపతిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
యాసంగి కొనుగోళ్లకు పకడ్బందీ చర్యలు
వనపర్తి: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఐకేపీ, పీఏసీఎస్, రైస్‌మిల్లుల యజమానులు, రవాణా సంస్థలతో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా, వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని.. నీడ కోసం షెడ్, కూర్చోడానికి కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని, లేనిపక్షంలో కమీషన్ నిలిపివేస్తామని హెచ్చరించారు. ధాన్యం సేకరణలో పారదర్శకత పాటించాలని, రైతులందరికీ మద్దతు ధర అందేలా చూడాలని, మిల్లులకు ధాన్యం తరలించే ప్రక్రియ వేగవంతం చేయాలని, రవాణా సంస్థలు సకాలంలో లారీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఏ గ్రేడ్ వరికి రూ.2,320, సాధారణ రకం ధాన్యానికి రూ.2,300తో పాటు సన్నరకం ధాన్యానికి బోనస్ రూ.500 ఇవ్వనున్నట్లు తెలిపారు. సన్న, దొడ్డు రకం కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా ఏర్పాటు చేయాలని.. కనీసం 500 మీటర్ల దూరం ఉండాలన్నారు. సన్నరకం ధాన్యం గుర్తింపునకు కేంద్రాల నిర్వాహకులకు వ్యవసాయ విస్తీర్ణాధికారుల ద్వారా శిక్షణ ఇప్పించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరం మేరకు టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, తేమ కొలిచే, ధాన్యం తుర్పారబెట్టే యంత్రాలు సిద్ధంగా ఉంచాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఆలోపు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలశాఖ డీఎం జగన్మోహన్, కో–ఆపరేటివ్ అధికారి ప్రసాద్‌రావు, మార్కెటింగ్ అధికారి స్వరణ్‌సింగ్ పాల్గొన్నారు. -
ప్రాజెక్టు భద్రతకే ఔట్‌పోస్టు ఏర్పాటు
అమరచింత: కృష్ణానదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రత దృష్ట్యా పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. గురువారం ప్రాజెక్టు వద్ద పోలీస్ ఔట్‌పోస్ట్‌తో పాటు గెస్ట్‌హౌజ్ నిర్మాణానికి గురువారం పీజేపీ నందిమళ్ల డివిజన్ క్యాంపు ఏఈతో కలిసి ఎస్పీ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీటి నిర్మాణాలకు నాలుగు ఎకరాల స్థలంతో పాటు సుమారు రూ.కోటి అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని.. త్వరలోనే ఔట్‌పోస్టు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనంతరం పెద్దమందడి మండలంలోని పంటపొలాల్లో పట్టుకున్న భారీ మొసలిని జూరాల బ్యాక్‌వాటర్‌లో వదలడాన్ని ఆయన పరిశీలించారు. వివాదాస్పద స్థలం పరిశీలన.. మండల కేంద్రంలోని నాగులకుంటలో ఉన్న 13.08 ఎకరాల శిఖం భూమి కబ్జాకు గురికావడంతో గురువారం ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిఖం భూమిని కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని సీఐని ఆదేశించారు. నాగులకుంటలో వర్షపునీరు నిలిచేలా ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఆయన వెంట సీఐ శివకుమార్, ఎస్ఐ సురేష్. ఇరిగేషన్ ఏఈ ఆంజనేయులు ఉన్నారు. రూ.కోటితో ప్రతిపాదనలు ఎస్పీ రావుల గిరిధర్ -
మానవుడి ఆయుష్షు పెంచడమే ఉగాది ఉద్దేశం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో గురువారం ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో జీవిస్తున్న మానవుడి ఆయుష్షు పెంచడమే పండగ ఉద్దేశం అని, షడ్రుచులను వివిధ ప్రకృతి ప్రసాదాలతో తయారు చేసిన వాటిని ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఆరోగ్యం పెరుగుతుందన్నారు. చేదు, తీపిలు జీవితంలో మంచి చెడులను ఆస్వాధించడమే అన్నారు. వక్త గుంత లక్ష్మణ్ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడమే ముఖ్యమని, సంస్కృతిలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తోందన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మర్చిపోవద్దని సూచించారు. ప్రపంచ విపత్తులకు భారతదేశ యువత మార్గాలను చూపాలని, చెడు వ్యసనాలకు బానిసై నిర్వీర్యం కాకుండా, తన కుటుంబంతో పాటు దేశసేవలో భాగం కావాలని, వసుదైక ఉమ్మడి కుటుంబ విలువను పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు కవితలు, జానపద గేయాలు, జానపద నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి, కంట్రోలర్ రాజ్‌కుమార్, తెలుగు డిపార్ట్మెంట్ హెచ్ఓడీ సంధ్యరాణి, ప్రిన్సిపాళ్లు రవికాంత్, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం..
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తుందని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్ కోరారు. బడిపిల్లల సంబరాల కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమవంతు సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమ నిర్వహణకు ఆర్థిక తోడ్పాటునందించిన దాత తిరుపతయ్యసాగర్ను విద్యాశాఖ తరఫున సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. జిల్లా విద్యా శాఖ అధికారులు గణేష్‌కుమార్, చంద్రశేఖర్, ఎంఈఓలు శ్రీనివాసులు, నర్సింహ, మద్దిలేటి, శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్‌పార్టీ నాయకులు రవికుమార్, రాముయాదవ్, మధుసూదన్‌రెడ్డి, బ్రహ్మయ్య, జయరాములుసాగర్, వివిధ పాఠశాలల జీహెచ్ఎంలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య
పాన్‌గల్: ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిపిల్లల సంబరాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడుతాయని.. విద్యార్థుల ఆలోచన విధానాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రులు, దాతలు తోడ్పాటునందించాలని కోరారు. క్రాఫ్ట్ మేళాలో విద్యార్థులు తయారుచేసిన వస్తువులను ఆయన పరిశీలించారు. -
మరమ్మతు..
వనపర్తి‘జూరాల’కురూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు పంపిన అధికారులు శుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025రామన్‌పాడు గేట్లకు లీకేజీలు.. రామన్‌పాడు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్న అధికారులు ఆయా గేట్లను పూర్తిస్థాయిలో మూసివేసినా లీకేజీలు ఏర్పడి ముందుకు పారుతోంది. అంతేగాకుండా ఎప్పుడో చేసిన కాల్వల లైనింగ్ దెబ్బతినడంతో ఎప్పుడు తెగిపోయాయోనన్న సందేహాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం రామన్‌పాడు రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేస్తుంటారు. కాల్వల గేట్లు దెబ్బతినడంతో నీటి తాకిడికి ఎప్పుడు కొట్టుకుపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ, రామన్‌పాడు కుడి కాల్వ గేట్లు, అక్కడక్కడ దెబ్బతిన్న కాల్వ లైనింగ్, చిన్న చిన్న మరమ్మతులు వేసవిలో చేపట్టేందుకు అధికారులు రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. ప్రస్తుతం కాల్వల్లో సాగు, తాగునీరు వదులుతున్నామని పంట కోతలు పూర్తయిన వెంటనే అధికారుల ఆదేశాల మేరకు పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు. వేసవి పూర్తయ్యే నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికతో ముందుకుసాగుతున్నామన్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ వెంట రంధ్రాలు పడటం, లైనింగ్ పెచ్చులూడుతోందని.. వేసవిలో మరమ్మతులు పూర్తిచేసి సకాలంలో సాగునీరు అందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. జలాశయం నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఉన్న జూరాల ఎడమకాల్వ వెంట ఎనిమిది చోట్ల కాల్వ దెబ్బతింది. వీపనగండ్ల వరకు ఉన్న ప్రధాన కాల్వ వెంట ఎన్ని గండ్లు ఉన్నాయో గుర్తించే పనుల్లో వర్స్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. రెండేళ్ల కిందట రూ.50 లక్షలతో డి–6 కాల్వ వెంట మరమ్మతులు చేసిన అధికారులు ప్రస్తుతం రూ.1.20 కోట్లతో గేట్లు, లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆయకట్టు ఇలా.. జూరాల ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టు 1.20 లక్షల ఎకరాలుగా ఉండగా.. ప్రస్తుతం 85 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. అమరచింత మండలం నుంచి ఆత్మకూర్, మదనాపురం, పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల మండలం వరకు సుమారు 75 కిలోమీటర్ల పొడవున కాల్వ ఉంది. ఆయా మండలాలను కొన్ని విభాగాలుగా గుర్తించి వాటి ప్రకారం రైతులకు సాగునీరు అందిస్తున్నారు. చివరి ఆయకట్టు వీపనగండ్లలోని గోపాల్దిన్నె రిజర్వాయర్ వరకు సాగునీరు ఎడమకాల్వ ద్వారానే విడుదల చేస్తున్నారు. ఆరు కిలోమీటర్లు.. ఎనిమిది ప్రదేశాల్లో... మూలమళ్ల నుంచి ఆత్మకూర్ శివారు వరకు ఎనిమిది ప్రదేశాల్లో కాల్వ దెబ్బతింది. వీటి మరమ్మతులు చేపట్టకపోతే వచ్చే వర్షాకాలం వరదల నీటి ఉధృతికి లైనింగ్ దెబ్బతిని గండ్లుపడే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. మరమ్మతులు చేపట్టాలి.. జూరాల ప్రధాన ఎడమకాల్వకు ఏర్పడిన రంధ్రాలను పూడ్చడంతో పాటు దెబ్బతిన్న ప్రదేశాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి. రెండేళ్లుగా కాల్వ పనులు, చేపట్టకపోగా.. కనీసం పూడికతీత, ముళ్లపొదలు కూడా తొలగించడం లేదు. – వెంకటేష్, నందిమళ్ల ప్రతిపాదనలు పంపించాం.. జూరాల ప్రధాన ఎడమకాల్వ వెంట ఉన్న రంధ్రాలను పూడ్చడంతో పాటు చిన్న చిన్న మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని గతేడాది ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. ఈ ఏడాది జూరాల ఎడమ కాల్వ, రామన్‌పాడు కుడికాల్వ గేట్ల మరమ్మతులు, చిన్న చిన్న పనుల కోసం రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాం. నిధులు మంజూరైతే పంట కోతలు పూర్తవగానే పనులు ప్రారంభిస్తాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ఎడమకాల్వ సబ్ డివిజన్ దెబ్బతిన్న జూరాల ఎడమ, రామన్‌పాడు కుడి కాల్వ గేట్లు.. లైనింగ్ వేసవిలో పనులు చేపట్టేందుకు అధికారుల సన్నాహాలు -
బండ్ నిర్మాణానికి సహకరించాలి
గోపాల్పేట: మండలంలోని బుద్దారం పెద్దచెరువును రిజర్వాయర్‌గా మార్చే పనుల్లో భాగంగా త్వరలోనే బండ్ నిర్మాణం చేపడతామని.. రైతులు సహకరించాలని ఇరిగేషన్ డీఈ గఫార్ కోరారు. గురువారం గ్రామంలోని రైతువేదికలో బండ్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న పొలాల రైతులతో సమావేశమయ్యారు. బండ్ నిర్మాణానికి 11 ఎకరాల భూమి అవసరమని.. ఇందుకోసం సర్వే కూడా పూర్తయిందని చెప్పారు. ప్రభుత్వం నష్ట పరిహారంగా ఎకరాకు రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. సమావేశంలో రిజర్వాయర్ ఇన్చార్జ్ తహసీల్దార్సుభాష్నాయుడు, డిప్యూటీ తహసీల్దార్ శివలింగం, ఆర్ఐ యాదయ్య, సర్వేయర్ మైనుద్దీన్, సీనియర్ అసిస్టెంట్ సురేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
రహదారి నిబంధనలు పాటించాలి
వనపర్తి రూరల్: వాహన చోదకులు విధిగా రహదారి నిబంధనలు పాటించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. గురువారం మండలంలోని చందాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. పిల్లలకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని తెలిపారు. బాల్యవివాహాలు, పోక్సో, మోటారు వెహికల్, బాలకార్మిక చట్టాల గురించి వివరించారు. ఉచిత న్యాయ సలహాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉత్తరయ్య, ప్రధానోపాధ్యాయుడు శంకరయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఖిల్లాఘనపురం: గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పేద కుటుంబాలకు చెందిన వారు ఉంటారని, వారికి నాణ్యమైన వైద్యం అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని.. విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా మాత, శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డా. ఝాన్సీ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో ఖిల్లాఘనపురం, కమాలోద్ధీన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణుల వివరాలు నమోదు చేసుకొని వారికి సకాలంలో వైద్యసేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించుకునేలా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డా. ప్రవీణ్, డా. సురేందర్, డా. చంద్రశేఖర్, డా. జ్యోతి, హర్షిత, ఎంపీహెచ్ఈఓ నర్సింహులు, హెల్త్ సూపర్వైజర్ నర్సింహారావు, ఏఎన్ఎంలు, ఆయా గ్రామాల ఆశా కార్యర్తలు పాల్గొన్నారు. -
భవిష్యత్ వ్యవసాయ రంగానిదే..
వనపర్తి రూరల్: రాబోవు కాలంలో వ్యవసాయ రంగం మిగిలిన రంగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పెద్దగూడెం శివారులో ఉన్న వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. వసతులు, సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసానిచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. తాను వ్యవసాయ పక్షపాతినని, భవిష్యత్‌లో వ్యవసాయ రంగం మిగిలిన రంగాలకు మార్గదర్శనం అవుతుందని భావించి ఇక్కడ కళాశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 20 ఎకరాల స్థలం కేటాయించి అన్ని వసతులతో అద్భుతమైన భవనం నిర్మించాలని కృషిచేసినా.. దురదృష్టవశాత్తు తమ ప్రభుత్వం రాకపోవడంతో అభివృద్ధి ఆగిపోయిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగంలో విశేష మార్పులు తీసుకురావడంతో రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రత్యేక దృష్టి సారించి కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్‌గౌడ్, విజయ్‌కుమార్, ఉంగ్లం తిరుమల్, నాగన్నయాదవ్, నందిమళ్ల అశోక్ , హేమంత్, చిట్యాల రాము, భాగ్యరాజ్, శివ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన అమరచింత: ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని గురువారం రాత్రి పట్టణంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. పురవీధుల మీదుగా బస్టాండ్ కూడలి వరకు కొవ్వొత్తులతో ఊరేగింపు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ హ్యపీపాల్, కేవీపీఎస్ నాయకులు అజయ్, శ్యాంసుందర్ మాట్లాడుతూ.. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యేనని.. యాక్సిడెంట్‌గా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,646 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ. 6,646, కనిష్టంగా రూ. 5,222 ధరలు లభించాయి. అదే విధంగా కందులు గరిష్టంగా రూ. 6,001, కనిష్టంగా రూ. 5,000, మొక్కజొన్న గరిష్టంగా రూ. 2,281, కనిష్టంగా రూ. 1,827, జొన్నలు గరిష్టంగా రూ. 4,377, కనిష్టంగా రూ. 4,089, ఆముదాలు గరిష్టంగా రూ. 6,329, కనిష్టంగా రూ. 6,270, మినుములు రూ. 7,316, రాగులు గరిష్టంగా రూ. 3,077, కనిష్టంగా రూ. 2,207 ధరలు వచ్చాయి. ● దేవరకద్ర మార్కెట్‌యార్డులో జరిగిన ఈ టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 2,039, కనిష్టంగా రూ. 1,909 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ. 6,011, కనిష్టంగా రూ. 6,000 ధరలు వచ్చాయి. సీజన్ ప్రారంభం కావడంతో మార్కెట్‌కు దాదాపు 400 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
నేడు డయల్ యువర్ డీఎం
వనపర్తి టౌన్: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నట్లు వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులను సెల్‌నంబర్ 73828 26289కు ఫోన్ చేసి తెలుపాలని.. మెరుగైన సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన పాన్‌గల్: మండల కేంద్రంలో మండలస్థాయి గిడ్డంగి (స్టాక్ పాయింట్ గోదాం) నిర్మాణానికి బుధవారం పౌరసరఫరాల జిల్లా మేనేజర్ జగన్మోహన్ స్థల పరిశీలన చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని స్థలంతో పాటు సర్వే నంబర్ 58లో ఉన్న స్థలాన్ని తహసీల్దార్ సత్యనారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రూ.80 లక్షల వ్యయంతో 600 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తున్నామని.. అనువుగా ఉండే స్థలాన్ని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గోవిందరావు, ఎంపీఓ రఘురాములు, మండల, వనపర్తి స్టాక్ పాయింట్ ఇన్‌చార్జ్‌లు నాగరాజు, మహేష్, మండల కాంగ్రెస్ నాయకులు రాముయాదవ్, బ్రహ్మయ్య, వెంకటయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆస్తి పన్ను రాయితీని వినియోగించుకోవాలి వనపర్తి టౌన్: పుర ప్రజలు వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకంలో భాగంగా ఆస్తి పన్ను అపరాధ రుసుం (వడ్డీ)పై ప్రభుత్వం కల్పించిన 90 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని పుర కమిషనర్ వెంటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 31తో గడువు ముగియనుందని.. ఆస్తి, కొళాయి, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. ‘పది’ పరీక్షలకు 13 మంది గైర్హాజరు వనపర్తి విద్యావిభాగం: జిల్లావ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఈఓ అబ్దుల్ ఘని తెలిపారు. బుధవారం జిల్లాలోని 36 పరీక్ష కేంద్రాల్లో 6,853 మంది విద్యార్థులకుగాను 6,840 మంది విద్యార్థులు హాజరుకాగా.. 13 మంది గైర్హాజరైనట్లు వివరించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోగా.. సిబ్బంది తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించగా.. ఉన్నతాధికారుల ఆదేశానుసారం అన్ని మండల కేంద్రాల్లో పరీక్ష సమయం ముగిసే వరకు జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచారు. ‘బాధిత రైతులను ఆదుకోవాలి’ కొత్తకోట రూరల్: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని కానాయిపల్లి శివారులో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కానాయిపల్లి, సంకిరెడ్డిపల్లి, రాయినిపేట, వనపర్తి మండలంలోని క్రిష్టగిరి, నాసనల్లి, పెద్దమందడి మండలం మణిగిల్లలో 800 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లిందని.. వివరాలు సేకరించి ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి నష్టం వివరాలు అంచనా వేయించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని కోరారు. ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా 60 శాతం ఇవ్వలేదని ఆరోపించారు. ఆయన వెంట రైతులు బక్క శ్రీను, కురుమన్న, వెంకటయ్య, మాసన్న, నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డి, చిన్న నర్సింహులు, దామోదర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నిక్సన్, వెంకటయ్య, కుర్మన్న, రాములు తదితరులు ఉన్నారు. -
రుణాలు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి
పాన్‌గల్: సింగిల్‌విండో ద్వారా తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన మహాజన సభకు ఆయన హాజరై మాట్లాడారు. విండో ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలతో పాటు రుణాలు అందిస్తున్నామన్నారు. అలాగే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరించినట్లు పేర్కొన్నారు. రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న 1,433 మంది రైతులకు రూ.9.94 కోట్ల మాఫీ వర్తించిందని.. 887 మంది రైతులకు రూ.6.97 కోట్ల వరకు తిరిగి రుణాలు ఇచ్చినట్లు వివరించారు. పంట రుణాలతో పాటు విద్య, గృహ నిర్మాణ, ఉపాధి రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కర్షకమిత్ర ద్వారా రూ.10 లక్షల వరకు రైతులకు రుణాలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ సామగ్రి కొనుగోలుకు 6 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే మండల కేంద్రంలో సహకార బ్యాంకు ఏర్పాటు చేస్తామని.. మంత్రి జూపల్లి, ఎంపీ డా. మల్లు రవి సహకారంతో విండోను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం రుణాలు సైతం ఈ బ్యాంకు ద్వారా కూడా పొందవచ్చన్నారు. సమావేశంలో పలువురు రైతులు రైతుభరోసా, రుణమాఫీ కాలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. రైతు భరోసా అర్హులైన వారికి అందుతుందని.. రుణమాఫీ సాంకేతిక, రేషన్‌కార్డు వంటి సమస్యలతో కాలేదని, ప్రభుత్వం పరిష్కరించి అర్హులకు మాఫీ వర్తింపజేస్తుందని చెప్పారు. విండో సిబ్బంది గోవర్ధన్సాగర్ను సన్మానించారు. సమావేశంలో విండో వైస్ చైర్మన్ కుర్వ బాలయ్య, సీఈఓ భాస్కర్‌గౌడ్, విండో డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. సింగిల్‌విండో ద్వారా విద్య, ఇంటి, ఉపాధి రుణాలు ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి -
నిజాయితీ చాటుకున్న 108 వాహన సిబ్బంది
పాన్‌గల్: అంబులెన్స్ సిబ్బంది నిజాయితీ చాటుకొని ప్రమాద స్థలంలో దొరికిన నగదును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన కురుమూర్తి బుధవారం బైక్‌పై మెట్టుపల్లికి వెళ్తుండగా దావాజిపల్లి స్టేజీ సమీపంలో వనపర్తి నుంచి పాన్‌గల్ వైపు వస్తున్న భాస్కర్‌రెడ్డి బైక్ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరికీ గాయలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కురుమూర్తి దగ్గర ఉన్న రూ.47,500ను ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఈఎంటీ విజయ్, పైలెట్ ఎల్లస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. -
శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణకే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారి నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు, మెడికల్ సర్టిఫికెట్లు త్వరగా తెప్పించి కేసులు ఛేదించాలని సూచించారు. బెట్టింగ్, లోన్ యాప్ కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం వస్తే వెంటనే దాడులు చేయాలని ఆదేశించారు. ప్రజలతో మమేకమై సత్సంబంధాలు కొనసాగించాలని.. అసాంఘిక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. పోలీస్స్టేషన్లలో విధులు నిర్వర్తించే సిబ్బందికి క్రమశిక్షణ తప్పనిసరి అని, సిబ్బంది ప్రతి ఒక్కరూ విధుల్లో యూనిఫాం ధరించి ఉండాలని సూచించారు. అవినీతికి దూరంగా ఉంటూ నిజాయితీగా ప్రజలకు సేవలందించాలని.. డయల్ 100, సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కోర్టు డ్యూటీ అధికారులతో రోజు సమీక్షిస్తూ నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా కృషి చేయాలని, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ ప్రమాదాలను నియంత్రించాలన్నారు. ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. బ్లూకోర్ట్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ అధికారులు కీలకంగా వ్యవహరిస్తూ ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమా మహేశ్వరరావు, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఐపీఎల్ బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి ఎస్పీ రావుల గిరిధర్ -
నీటి సరఫరాలో అంతరాయం కలిగితే చర్యలు
అమరచింత: వేసవిలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోనని, సిబ్బందిపై చర్యలు తప్పవని మిషన్ భగీరథ ఈఈ మేఘారెడ్డి హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని మిషన్ భగీరథ పంప్‌హౌజ్‌ను ఆయన సందర్శించారు. శనివారం తాగునీరు అందడం లేదని ప్రజలు రోడెక్కి రాస్తారోకో చేయడం ఏమిటని సిబ్బందిని ప్రశ్నించారు. శుక్రవారం గోపాల్పేట మండలంలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడటంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి అదేరోజు రాత్రి నీటి సరఫరాను పునరుద్ధరించామని చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని.. అలాంటిది అమరచింత పురపాలికలో ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ, పుర వాటర్మెన్ల మధ్య సమన్వయం లేకనే నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని.. ఇకపై నీటి సరఫరాలో అంతరాయం కలిగితే సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. రోజువారీగా ఎన్ని లీటర్ల నీటిని అందిస్తున్నారనే విషయంతో పాటు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిండిన తర్వాతే మున్సిపల్ వాటర్ లైన్మెన్లకు అప్పగించాల్సిన బాధ్యత మిషన్ భగీరథ సిబ్బందిపై ఉందని వివరించారు. ఆయన వెంట ఏఈతో పాటు సిబ్బంది ఉన్నారు. -
ఎకో పార్క్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి
వనపర్తి: జిల్లాకేంద్రం సమీపం మర్రికుంటలో అటవీశాఖ పరిధిలోని ఎకో పార్క్‌లో సైక్లింగ్ ట్రాక్, వాకర్స్‌కి ఆహ్లాదకరంగా ఉండేలా వివిధ రకాల మొక్కలు నాటించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా అటవీశాఖ అధికారి కేఏవీఎస్ ప్రసాద్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. పార్క్‌లోని 700 మీటర్ల వాకింగ్ ట్రాక్‌పై నడుస్తూ నిత్యం ఎంతమంది వస్తున్నారు.. చిన్నారులు, పెద్దలకు టికెట్ ధర ఎంత నిర్ణయించారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్క్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, సూచనలను అటవీశాఖ అధికారికి వివరించారు. నిత్యం పార్క్‌కు వచ్చే వాకర్స్‌కి ఇబ్బందులు కలగకుండా ట్రాక్‌ని శుభ్రంగా ఉంచాలని.. ఎంట్రెనన్స్, పార్క్‌లోని పలు ముఖ్యమైన ప్రదేశాల్లో ఫొటోగ్రఫీకి అనుకూలంగా అభివృద్ధి చేయాలని సూచించారు. చిన్నారులు ఆడుకునే ప్రదేశాల్లో జంతువుల బొమ్మలు, ఆటసామగ్రి ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట అటవీశాఖ అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు. -
‘అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలు ఆపలేరు’
వనపర్తి రూరల్: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపడం ఎవరి తరం కాదని ఆశా కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు బుచ్చమ్మ హెచ్చరించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌చౌక్‌లో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అనుబంధం ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు హాజరై మాట్లాడుతూ.. మార్చి 24న హైదరాబాద్‌లోని కోఠి కమిషనర్ కార్యాలయం ఎదుట జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆశాలకు నెలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు జరిగినప్పుడు పరిష్కరిస్తే ప్రభుత్వానికి భవిష్యత్ ఉంటుందని.. కాదు కూడదని నిర్బంధం ప్రయోగిస్తే చరిత్రలో ఏ ప్రభుత్వం మిగలదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు భాగ్యమ్మ, సునీత, చంద్రకళ, చిట్టెమ్మ, శివమ్మ, రాధ, వినీల, నారాయణమ్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ప్రజల్లో మంచి మార్పు రావాలి
వనపర్తి: ఉగాది జిల్లా ప్రజల జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని.. అందరికి శుభం కలగాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆకాంక్షించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విశ్వ బ్రాహ్మణ వేదపండితులు రూపొందించిన పంచాంగాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. సమాజ శ్రేయస్సు, ప్రజలను చైతన్యపర్చే ప్రబోదాలు అర్చకుల నుంచి రావాలని కోరారు. అర్చకుల మంత్రాల విశిష్టత, అర్థం తెలియజేసి ప్రజలను సన్మార్గం వైపు మళ్లించాలన్నారు. అనంతరం వేదపండితులు ఎస్పీని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణదాసు గోవర్ధనాచారి, గౌరవ అధ్యక్షుడు లవకుమారాచారి, హిమవంతాచారి, నర్సింహాచారి, బ్రహ్మచారి, బైరోజు చంద్రశేఖర్, విరాట్ ఆచారి, శ్రీహరి ఆచారి, విక్రమ్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
సామాన్యులపై భారం మోపొద్దు..
అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పడమే కాకుండా ప్రజలపై భారం మోపుతోంది. ఓపెన్ స్పేస్ రుసుం భారం సామాన్య ప్రజలపై మోపడం అన్యాయం. 2022–24 మధ్యలో గ్రామ పంచాయతీ ప్లాట్లను కొందరు సబ్రిజిస్ట్రార్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ముందుగా ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్పై 75 శాతం రాయితీ ఇవ్వాలి. ప్లాట్లు కొన్న సామాన్య ప్రజలపై భారం మోపొద్దు. – మహ్మద్ అన్సార్ హుస్సేన్, బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం.. ఎల్ఆర్ఎస్పై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్లు, రియల్ వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జీపీ లే అవుట్లలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు మా దృష్టికి వచ్చిన మాట వాస్తవమే, కోర్టు ఆర్డర్స్‌తో కొన్ని, కొందరు రూల్స్ అతిక్రమించి రిజిస్ట్రేషన్లు చేసిన వారిని సస్పెండ్ చేశాం. ఇంకా ఎక్కడైనా అలా జరిగినట్లు మా దగ్గరకు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం. – వి.రవీందర్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్ ● -
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లు, రిజిస్ట్రేషన్ లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సెప్టెంబర్‌లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26లోగా సేల్‌డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్ యజమానులు, ప్లాటు ఓనర్లకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని ప్రకటించింది. 2021లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అనుమతి లేని లేఅవుట్లు, అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లను గత సర్కార్ నిలిపివేయడం కొందరు సబ్ రిజిస్ట్రార్లకు కాసులపంట పండించింది. 2021 నుంచి 2024 వరకు పలువురు రిజిస్ట్రేషన్ అధికారులు ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు పరిష్కారం కాకుండానే.. రియల్టర్లతో కుమ్మకై ్క వేల సంఖ్యలో అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రస్తుతం 25 శాతం రాయితీ కల్పించినా.. రిజిస్ట్రేషన్ పూర్తయిన నేపథ్యంలో ఎప్పుడైనా క్రమబద్ధీకరించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. -
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
అమరచింత: వరి సాగుకు అయ్యే పెట్టుబడిలో సగం ఆయిల్‌పాంపై వెచ్చిస్తే మూడేళ్లలో పంట చేతికొచ్చి అనుకున్న లాభాలు పొందే అవకాశం ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం మండలంలోని నాగల్‌కడ్మూర్ రైతువేదికలో జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆయిల్‌పాం సాగు.. లాభాల గురించి రైతులకు వివరించారు. కాలానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని.. సాగు విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఎక్కువ కాలం ఒకే రకమైన పంట సాగు పద్ధతికి స్వస్తి పలికి పంట మార్పిడికి శ్రీకారం చుట్టాలని సూచించారు. దేశంలో వంటనూనెల కొరత ఉందని.. ఇతర దేశాల నుంచి ఆయిల్‌పాం దిగుమతి చేసుకునే పరిస్థితి ఉందని తెలిపారు. దీనిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించి రాయితీలిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. నాలుగైదు నెలల్లో ఇక్కడే ఆయిల్‌పాం ఫ్యాక్టరీ ఏర్పాటు కాబోతుందని.. పండిన పంటను వారే కొనుగోలు చేస్తారని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని, వీటికోసం ప్రత్యేకంగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. ఆసక్తిగల రైతులు ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,500 ఎకరాల్లో ఆయిల్‌పా సాగుకాగా.. అందులో అమరచింత మండలంలో 440 ఎకరాలు ఉండటం సంతోషకరమన్నారు. అనంతరం గ్రామంలో ఆయిల్‌పాం సాగుచేసిన రైతులు వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డితో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, తహసీల్దార్ రవియాదవ్, ఏడీఏ దామోదర్, ఏఓ అరవింద్‌తో తదితరులు పాల్గొన్నారు. ఆయిల్‌పాం తోట పరిశీలన.. ఆత్మకూర్: మండలంలోని బాలకిష్టాపూర్‌లో రైతు లక్ష్మీకాంత్‌రెడ్డి 50 ఎకరాల్లో సాగు చేస్తున్న ఆయిల్‌పాం తోటను కలెక్టర్ సందర్శించారు. రైతుతో మాట్లాడి పాటిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు, పంట చేతికి ఎప్పుడొస్తుందని ఆరా తీశారు. మరో ఆరునెలల సమయం పడుతుందని.. చీడపీడల బాధలు, నిర్వహణ ఖర్చులు ఏమీ ఉండవని రైతు బదులిచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, తహసీల్దార్ చాంద్‌పాషా, ఏఓ వినయ్‌కుమార్ తదితరులు ఉన్నారు. వరి కన్నా ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు రైతునేస్తంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి -
కేంద్రం.. అలంకారప్రాయం!
జిల్లా తపాలా కార్యాలయంలో నిలిచిన రైల్వే రిజర్వేషన్ సేవలు ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నాం.. రిజర్వేషన్ కౌంటర్ లేకపోవడంతో ప్రైవేట్ ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయించి అదనంగా డబ్బులు చెల్లించి టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తోంది. జిల్లాకేంద్రమైన వనపర్తిలో ఉన్న కౌంటర్‌ను వినియోగంలోకి తేకపోవడం సరైంది కాదు. ఉన్నతాధికారులు స్పందిస్తేనే రైల్వే ప్రయాణికులకు ఊరట కలుగుతోంది. – కంది వెంకటరమణ, ప్రయాణికుడు, వనపర్తి రైల్వే అధికారులకు విన్నవించాం.. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో కొంతకాలంగా సేవలు నిలిచిన మాట వాస్తవమే. కౌంటర్ నిర్వహణకు తలెత్తిన సాంకేతిక సమస్యలను సికింద్రాబాద్ రైల్వే అధికారులకు విన్నవించాం. వారు వచ్చి సమస్య పరిష్కరించాల్సి ఉంది. అప్పటి వరకు మేము ఏమీ చేయలేం. – భూమన్న, పోస్టల్ సూపరింటెండెంట్, వనపర్తి వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కనిపిస్తున్నా.. సేవలు మాత్రం అందడం లేదు. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా 12 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన రిజర్వేషన్ కౌంటర్లో ఏడాదిగా సేవలు నిలిచిపోయాయి. జిల్లాకేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వనపర్తి రోడ్, గద్వాల రైల్వేస్టేషన్ ద్వారా ఈ ప్రాంత ప్రజలు రాకపోకలు అధికంగా కొనసాగిస్తుంటారు. టిక్కెట్ రిజర్వేషన్ కోసం ఆయా స్టేషన్లకు వెళ్లి రావడానికి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అప్పట్లో ప్రధాన తపాలా కార్యాలయంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ప్రారంభించారు. కొన్నేళ్ల పాటు బాగానే కొనసాగినా.. కరోనా ప్రారంభం నుంచి సేవలు తగ్గుముఖం పట్టాయి. ఆదాయం ఇలా.. టిక్కెట్ విక్రయాలపై స్థాయిని బట్టి రైల్వేశాఖ తపాలాశాఖకు కొంత ఆదాయాన్ని అందిస్తూ వస్తోంది. స్వీపర్ క్లాస్ టికెట్‌పై రూ.15, ఫస్ట్, సెకండ్ ఏసీకి రూ.30. థర్డ్ ఏసీకి రూ.20 చొప్పున తపాలాశాఖకు ఆదాయం అందుతుండేది. దీంతో ప్రయాణికులకు సౌలభ్యం, రైల్వే, తపాలాశాఖకు ఆదాయం సమకూరేది. ఇటీవలి కాలంలో తీర్థయాత్రలు, వివిధ దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. అలాగే వనపర్తి రోడ్ స్టేషన్లో లోకల్ రైళ్లతో పాటు పలు ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను నిలుపుతుండటం.. కర్నూలు, గద్వాల రైల్వేస్టేషన్లకు చేరేందుకు 1, 2 గంటల సమయం మాత్రమే పడుతుండటంతో టిక్కెట్ విక్రయాలు ఊపందుకునేవి. ప్రస్తుతం ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ ఉందో లేదో తెలియక ప్రయాణికులు డైలమాలో ఉన్నారు. సేవల్లో అంతరాయం.. రిజర్వేషన్ కౌంటర్ నిర్వహణ బాధ్యతను ఓ ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించారు. తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొన్ని రోజులు సేవలు కొనసాగడం, మరికొన్ని రోజులు నిలిచిపోయేవి. దీంతో చాలామంది ప్రయాణికులు కేంద్రానికి రావడం మానేశారు. రిజర్వేషన్ సేవలు సాఫీగా సాగేందుకు ఇప్పటి వరకు ఏ అధికారి కూడా పెద్దగా శ్రద్ధ చూపలేదు. ఆదాయం కోల్పోతున్న రైల్వే, పోస్టల్ శాఖలు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు -
చట్టాలపై అవగాహన ఉండాలి
అమరచింత: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని చేనేత ఉత్పత్తుల సంఘంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. చిన్న వయస్సులో ఆడ పిల్లలకు వివాహాలు చేయడంతో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. బాల్య వివాహాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఉమ్మడి కుటుంబంతో ఎన్నో లాభాలు, సంతోషాలు ఉంటాయని.. చిన్న చిన్న తగాదాలతో భార్యాభర్తలు, అన్నదమ్ముళ్లు విడిపోరాదని సూచించారు. అలాగే బాలకార్మిక వ్యవస్థ, సైబర్ క్రైం, మోటారు వెహికిల్ తదితర చట్టాల గురించి వివరించారు. అనంతరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రజని మాట్లాడుతూ.. విద్యార్థులు, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళలు, బాలికలు, వృద్ధులకు సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని.. హెల్ప్‌లైన్ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి వి.రజని, సీనియర్ సివిల్‌కోర్టు న్యాయమూర్తి కవిత, జూనియర్ సివిల్ న్యాయమూర్తి వై.జానకి, గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం సరికాదు
ఆత్మకూర్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనుల్లో నిర్లక్ష్యం తగదని.. కూలీలందరికి న్యాయం చేయాలని మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక, క్షేత్ర సహాయకులతో ఉపాధిహామీ పనులపై సమీక్ష నిర్వహించారు. భూమి చదును, ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్లు, నర్సరీల ఏర్పాటు, ఉపాధి పనుల వద్ద టెంట్లు, తాగునీరు, కూలీల సంఖ్య పెంపు, పనుల పురోగతి తదితర విషయాలపై చర్చించారు. నిర్దేశించిన పనులు నెలాఖరు లోగా పూర్తి చేయాలని, విధులను నిర్లక్ష్యం చే స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీ ఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, ఏపీఓ విజయభాస్కర్‌రెడ్డి, టెక్నికల్ పీఓ రఘు పాల్గొన్నారు. రామన్‌పాడులో తగ్గుతున్న నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుందని.. మంగళవారం 1,016 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా లేదని వివరించారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 28 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 96 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు. ‘నేటి రాష్ట్ర సదస్సును విజయవంతం చేద్దాం’ వనపర్తి విద్యావిభాగం: యూజీసీ కొత్త నిబంధనల ముసాయిదాను వెనక్కి తీసుకోవాలంటూ బుధవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీలో రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్లు సంఘం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సు లైబ్రరీ ఆడిటోరియంలో జరుగుతుందని.. ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్ యాదవ్, ఇన్చార్జ్ రిజిస్ట్రార్ డా. మధుసూదన్‌రెడ్డి, పీడీఎస్‌యూ జాతీయ కార్యవర్గసభ్యుడు విజయకన్నా, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకట్‌రెడ్డి, సాంబ, పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగం కుమారస్వామి తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. నవోదయ విద్యాలయ ఫలితాలు విడుదల బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 6, 9 తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్కర్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఫలితాల కోసం నవోదయ విద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. వేరుశనగ క్వింటా రూ.6,411 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,411, కనిష్టంగా రూ.5,100 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,792, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,281, కనిష్టంగా రూ.1,791 ,జొన్నలు గరిష్టంగా రూ.4,328, కనిష్టంగా రూ.3,070, ఆముదాలు గరిష్టంగా రూ.6,300, కనిష్టంగా రూ.5,870, మినుములు రూ.7,260 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,205, కనిష్టంగా రూ.1,909గా పలికింది. యాసంగి సీజన్ వరి ధాన్యం కోతకు రావడంతో రైతులు వచ్చిన దిగుబడులను మార్కెట్‌కు తీసుకురావడం ప్రారంభించారు. దాదాపు 300 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. కాగా.. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఉల్లిబహిరంగ వేలం ప్రారంభం అవుతుంది. -
రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం
వనపర్తి: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన సన్నబియ్యం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని.. ఆ దిశగా రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీపై సోమవారం కలెక్టరేట్లో రేషన్ డీలర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం పంపించే సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొడ్డు బియ్యం పంపిణీ చేయవద్దని స్పష్టం చేశారు. సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. ఇదివరకే రేషన్ డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యం నిల్వలను తమ వద్దే ఉంచుకోవాలని.. అందుకు సంబంధించి తదుపరి సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి డీలర్ల సమక్షంలో మాత్రమే బియ్యం సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, డీఎం జగన్ ఉన్నారు. -
పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం
వనపర్తి: పోలీసు భద్రత పథకం పోలీసు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసులు (పీసీ–508) కుటుంబానికి పోలీసు భద్రత పథకం నుంచి మంజూరైన రూ. 8లక్షల చెక్కును సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వివిధ కారణాలతో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్నిరకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఓ సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ● పోలీసు ప్రజావాణికి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం నాలుగు అర్జీలు అందగా.. వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. -
‘పది’ పరీక్షలకు 14మంది గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 6,844 మంది విద్యార్థులకు గాను 6,830 మంది హాజరు కాగా.. 14 మంది గైర్హాజరైనట్లు డీఈఓ అబ్దుల్ ఘని తెలిపారు. కాగా, పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోగా.. సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దెబ్బతిన్న పంటల పరిశీలన వనపర్తి రూరల్/కొత్తకోట రూరల్: ఇటీవల కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులతో పంటలు నష్టపోయిన రైతులను గుర్తించేందుకు సోమవారం వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వనపర్తి మండలంలోని పెద్దగూడెం, కడుకుంట్ల, కొత్తకోట మండలం కానాయపల్లి, సంకిరెడ్డిపల్లి, రాయిణిపేట గ్రామాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి రవీంద్రనాయక్, ఏడీఏ దామోదర్ పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంటనష్టం వివరాలను నమోదు చేసుకున్నారు. పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామాల్లో దాదాపు 58 ఎకరాల్లో వరిపంట దెబ్బతిందని.. కొత్తకోట మండలంలోని మూడు గ్రామాల్లో దాదాపు 330 ఎకరాల్లో వరిపంట, 18 ఎకరాల్లో మామిడి పంట నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు. పంటనష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. వారి వెంట ఏఓ కుర్మయ్య, ఏఈఓ కవిత, మాజీ సర్పంచ్ కొండన్న తదితరులు ఉన్నారు. రాజ్యాంగ పరిరక్షణకే పాదయాత్ర వనపర్తిటౌన్: ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్‌లో భాగంగా ప్రతి గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి ఇర్షద్ అహ్మద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్ సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాల్సిన పాలకులు.. వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రమాణం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి, నాయకులు సత్యారెడ్డి, వెంకటేష్, శ్రీలతారెడ్డి, దేవన్న యాదవ్, దేవిజా నాయక్, దివాకర్ యాదవ్, రోహిత్, జానకీ రాములు పాల్గొన్నారు. నల్లమలలో పులుల గణన కొల్లాపూర్: నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు పులుల గణన చేపట్టారు. కొల్లాపూర్ సమీపంలోని నల్లమల అడవిలో రెండు రోజుల క్రితం గణన ప్రారంభించినట్లు ఫారెస్టు రేంజర్ చంద్రశేఖర్ తెలిపారు. ఫేజ్–4లో భాగంగా కొల్లాపూర్ రేంజ్లో బయాలజిస్టు రవికాంత్ నేతృత్వంలో పులులు, చిరుతల పాదముద్రలు సేకరిస్తున్నట్లు వివరించారు. అటవీ ప్రాంతంలో ప్రతి రెండు చదరపు కిలోమీటర్లకు ఒక కెమెరా ఏర్పాటు చేశామని, కెమెరాలో రికార్డు అయిన వన్యప్రాణులతోపాటు పాదముద్రల ఆధారంగా గణన కొనసాగుతుందని చెప్పారు. పులుల గణనలో స్థానిక ఫారెస్టు అధికారులతోపాటు బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. గతేడాది కొల్లాపూర్ రేంజ్ పరిధిలో 9 పులులను గుర్తించామని ఆయన వెల్లడించారు. -
కొనుగోళ్లకు సన్నద్ధం
యాసంగి వరిధాన్యం సేకరణకు ప్రణాళికలు అమరచింత: యాసంగి సీజనల్లో పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికలు రూపొందించింది. వచ్చేనెల రెండో వారంలో వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో.. మొదటి వారంలోనే ప్రభుత్వపరంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఐదు రోజుల క్రితం కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మండలాల వారీగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. వరి కోతలకు ముందుగానే గ్రామాల్లో కాంటాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించడంతో పాటు సన్నరకాలకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులను సైతం పూర్తిస్థాయిలో చెల్లించిన అధికారులు.. యాసంగి ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో వరిసాగు ఇలా.. జిల్లాలోని 255 గ్రామాల్లో రైతులు ఈసారి సన్నరకాలను సాగుచేస్తున్నారు. మొత్తం 1.95 లక్షల ఎకరాల్లో వరిపంట సాగుచేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారుల సమాచారం. అయితే జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా ఈసారి అమరచింత, ఆత్మకూర్, మదనాపురం మండలాల్లో కేవలం 20వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారు. మిగిలిన ఆయకట్టు రైతులు సమీపంలోని చెరువులు, బోరుబావులపై ఆధారపడి వరిసాగు చేపట్టారు. వేసవికాలం ప్రారంభం తర్వాత భూగర్భజలమట్టం పడిపోవడంతో బోరుబావుల నుంచి నీరందని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడక్కడ వరిపంట ఎండిపోయింది. మరికొన్ని చోట్ల ఎండుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడిని పొందలేని పరిస్థితులు ఉన్నాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే ఈసారి 3.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉండేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వరిసాగు: 1.95లక్షల ఎకరాలు ధాన్యం దిగుబడి అంచనా : 3.95లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యం : 3.50లక్షల మెట్రిక్ టన్నులు 15 రోజుల్లో కోతలు.. యాసంగిలో సాగుచేసిన వరిపంట ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. అక్కడక్కడ 15 రోజుల వ్యవధిలో కోతలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం వడగండ్ల వానలు పడితే వరిపైరు దెబ్బతినే అవకాశం ఉంది. అదే విధంగా ఈదురు గాలులు వీచితే పంట నేలకొరిగి కోతల సమయంలో గింజలు కిందపడే అవకాశం ఉంటుంది. వాతావరణ పరిస్థితుల మేరకు రైతులు వరికోతలు చేపట్టాలి. – దామోదర్, ఏడీఏ ఏర్పాట్లు చేస్తున్నాం.. కలెక్టర్ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో వరికోతలు ఎక్కడ ప్రారంభమవుతున్నాయో గమనించి, రైతుల అవసరాల మేరకు వచ్చేనెల 1నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఈసారి మొత్తం 414 కేంద్రాలను ఏర్పాటుచేసి.. 3.50 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. – జగన్మోహన్, డీఎం, సివిల్ సప్లై జిల్లాలో 414 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు ఏప్రిల్ రెండో వారంలో వరికోతలు ప్రారంభమయ్యే అవకాశం రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు దళారుల బేరసారాలు.. వరిపైరు పొట్టదశకు చేరుకున్న సమయంలోనే కొందరు దళారులు రైతుల పొలాలకు వెళ్లి నేరుగా ధాన్యాన్ని కొంటామని.. రవాణా ఖర్చులు లేకుండా తామే తీసుకెళ్తామంటూ బేరసారాలు మొదలుపెట్టారు. పచ్చి వడ్లను సైతం ప్రభుత్వ ధరకు అనుగుణంగా కొంటామని.. తమకే అమ్మాలని రైతుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. -
చల్లంగుండాలి..
మాకు మీరు.. మీకు మేము ! ‘సివిల్ సప్లయ్’లో తోడు దొంగలు ● జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ఇద్దరు అధికారుల హవా ● మిల్లర్లతో కుమ్మకై ్క ఇష్టారాజ్యంగా వ్యవహారం ● వేడి భరించలేం.. ఏసీలు ఇవ్వాలంటూ బేరం ● నజరానాగా లారీకి 5 క్వింటాళ్ల సీఎమ్మార్ మిగిలించుకునేలా ఒప్పందం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే.. ‘మమకారం’ పంచిన మిల్లర్లకే మొగ్గు.. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌తో ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయం విదితమే. జోగుళాంబ గద్వాల జిల్లాలో 61 వేల మెట్రిక్ టన్నులు, వనపర్తి జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నులు.. మొత్తం 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యాన్ని మర ఆడించి సీఎమ్మార్ కింద బియ్యంగా ఇవ్వాలని గద్వాల జిల్లాలోని 37 రైస్ మిల్లులకు కేటాయించారు. ఈ కేటాయింపుల్లోనే సివిల్ సప్లయ్ అధికారులు వివక్ష చూపినట్లు తెలుస్తోంది. తమపై మమకారం చూపిన మిల్లర్లకు అధికంగా.. తమను పట్టించుకోని వారికి తక్కువ మొత్తంలో ధాన్యం కేటాయింపులు చేసినట్లు సమాచారం. మొత్తానికి గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన 96 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మర ఆడించి.. 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు సుమారు 23 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే మిల్లర్లు అప్పగించినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. -
పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి
వనపర్తి: పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని.. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా ఇండస్ట్రీస్ విభాగం జనరల్ మేనేజర్ జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ జిల్లాస్థాయి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. టీజీ ఐపాస్‌కు సంబంధించి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి.. వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాగా, డీఐపీసీలో భాగంగా టీ ఫ్రైడ్ స్కీం కింద ఎస్సీ 6, ఎస్టీ 6, ఒక పీహెచ్‌సీకి సంబంధించిన ప్రోత్సాహకాలను కలెక్టర్ మంజూరు చేశారు. ఫిర్యాదులు సత్వరం పరిష్కరించండి ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్యతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. -
కమ్యూనిస్ట్ పార్టీ సజీవం
వివరాలు 8లో..వనపర్తి రూరల్: ‘అధికారం కోసం పార్టీలు మారే నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయిందని అంటున్నారు.. సూర్యుడు ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా ఉంటుంది.. దేశంలో వందేళ్ల చరిత్రగల ఏకై క పార్టీ సీపీఐ మాత్రమే..’నని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ 100 వసంతాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, మహిళలతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా ఆయన హాజరై వారితో కలిసి నడిచారు. అనంతరం భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా పలువురు నాయకులతో కలిసి భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. స్వాతంత్య్రం, తెలంగాణ ప్రజలను నిజాం నుంచి విముక్తి, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు పార్టీ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటం చేశామన్నారు. కార్మిక, కర్షక, పీడిత, తాడిత ప్రజల గొంతుకగా చట్టసభలు, బయట పోరాడుతున్నామని.. పోరాటాల ఫలితంగా దేశంలో పేదలకు ప్రభుత్వ భూమి పంపిణీ, నివేశ స్థలాలు, రైతులకు పంట రుణమాఫీ, పింఛన్లు తదితర అనేక సంక్షేమ ఫలాలు అమలవుతున్నాయని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ పేదలకు అనేక హామీలిచ్చి.. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని.. అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. బీజేపీని ఓడించేందుకే కాంగ్రెస్‌పార్టీతో పొత్తు పెట్టుకున్నామని.. హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయం చేయడం నీచమన్నారు. కష్టజీవుల కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుందని.. సంపన్నవర్గాల వారుండే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కమ్యూనిస్టు పార్టీలంటే చిన్నచూపని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలను వాడుకొని మోసం చేశారని.. సీపీఐ బలపడితేనే పేదలకు భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలనర్సింహ, కళావతమ్మ, జిల్లా కార్యదర్శి విజయరాములు, పట్టణ కార్యదర్శి రమేష్, శ్రీరామ్, అబ్రహం, గోపాలకృష్ణ, శ్రీహరి, ఎత్తం మహేష్, కృష్ణవేణి, గీత, భూమిక, వంశీ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మారినా.. పేదల బతుకులు మారలే కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్
వనపర్తి: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని.. కాలనీల్లో కొత్త వ్యక్తుల కదలికలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాకేంద్రంలోని రాంనగర్‌కాలనీలో సీఐ ఎం.కృష్ణ, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 12 మంది ఎస్ఐలు, 88 మంది పోలీస్ అధికారులు, ఇతర సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 300 ఇళ్లను సోదా చేయగా సరైన ధ్రువపత్రాలు లేని కారు, 3 ఆటోలు, 62 బైక్‌లు గుర్తించి జప్తు చేసినట్లు వివరించారు. వాహనాల యజమానులు సరైన పత్రాలు చూపించి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం కాలనీవాసులతో మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ, భరోసా, నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిషేధిత గుట్కా, గంజాయి విక్రయం, గుడుంబా తయారీ, రేషన్ బియ్యం, కలప అక్రమ రవాణా తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని.. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని.. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందన్నారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ మోసపోతే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కొత్తకోట సీఐ రాంబాబు, రూరల్ ఎస్ఐ జలంధర్‌రెడ్డి పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 66 వాహనాలు సీజ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు -
పెరిగిన ఆరుతడి సాగు
● జిల్లాలో అత్యధికంగా ఖిల్లాఘనపురం, చిన్నంబావి మండలాల్లోనే.. ● మొక్కజొన్న, మినుము, పప్పుశనగ, కీర, కర్బూజ సాగుకు ఆసక్తి ● తక్కువ నీటి వినియోగం.. అధిక దిగుబడులు ఖిల్లాఘనపురం/చిన్నంబావి: ఒకప్పుడు వరి మాత్రమే సాగు చేసే రైతులు ఈ ఏడాది యాసంగిలో వరితో పాటు ఆరుతడి పంటల సాగుకు ఆసక్తి చూపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖిల్లాఘనపురం మండలంలో కేఎల్ఐ సాగునీరు అందుతుండటంతో వర్షాకాలం సాగు పూర్తికాగానే రెండోపంటగా ఆరుతడి పంటలు సాగు చేసున్నారు. మండలంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది యాసంగిలో 510 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ ఏడాది వర్షాకాలం పంటలు పూర్తికాగానే రెండో పంటగా మొక్కజొన్న 400 ఎకరాలు, మినుము 70, కీర దోస 15, రాగులు–10, ఉల్లి–15 మొత్తం 510 ఎకరాలు సాగయ్యాయని చెబుతున్నారు. కీరదోస, మినుము పంట కేవలం 70 రోజుల్లో పూర్తి కావడంతో పాటు లాభాలు వస్తున్నట్లు రైతులు వివరించారు. మొక్కజొన్న 110 రోజుల్లో కోతకు వస్తుంది. ఆయా పంటలకు వారంలో ఒకతడి నీరందిస్తే సరిపోతుంది. నీటి ఆదాతో పాటు అధిక దిగుబడి వస్తుండటంతో మంచి లాభాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. 4 ఎకరాల్లో మినుము సాగు చేశా.. యాసంగి పంటగా 4 ఎకరాల్లో మినుము సాగు చేశా. ఎకరాకు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటా రూ.9 వేల నుంచి రూ.10 వేల ధర పలుకుతుంది. 70 రోజుల్లో పంట చేతికందుతుంది. తక్కువ నీటి వినియోగం, అధిక దిగుబడి వస్తుండటంతో లాభదాయకంగా ఉంటుంది. – బాలయ్య, సల్కెలాపురం (ఖిల్లాఘనపురం) ఆరుతడి సాగు శుభపరిణామం.. రైతులు ఆరుతడి పంటల సాగుకు ముందుకు రావడం శుభపరిణామం. ఒకప్పుడు పంటమార్పిడి చేయాలని పెద్దఎత్తున ప్రచారం చేసినా రైతులు పట్టించుకోలేదు. ఈ ఏడాది మండలంలో చాలామంది ఆరుతడి పంటలు సాగుచేశారు. ఆరుతడి పంటలకు తక్కువ నీరు వినియోగం అవడంతో పాటు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. – మల్లయ్య, మండల వ్యవసాయ అధికారి, ఖిల్లాఘనపురం చిన్నంబావి మండలంలో.. మండలంలోని పెద్దదగడ, లక్ష్మీపల్లి, పెద్దమారూర్, చిన్నమారూర్, కొప్పునూరు, వెల్టూరు, అయ్యవారిపల్లి, బెక్కం తదితర గ్రామాల్లో అధికంగా మినుము సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఈ యాసంగి సీజన్లో 12 వేల ఎకరాలు సాగైనట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరాలకు ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. దీనికితోడు నాలుగు వేల ఎకరాల్లో కర్బూజ, కలంగిరి వంటి పండ్ల తోటలు సైతం సాగు చేశారు. అలాగే కృష్ణానది ముంపు ప్రాంతంలో సుమారు 15 వేల ఎకరాల్లో అధికంగా పప్పుశనగ సాగు సాగవుతుంది. -
అకాల వర్షం.. అపార నష్టం
కొత్తకోట రూరల్/ఖిల్లాఘనపురం/వనపర్తి రూరల్: జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి, ఆదివారం కురిసిన వర్షం, ఈదురు గాలులకు వరి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. కొత్తకోట మండలం కానాయపల్లి శివారులో వరి పంట నేలకొరగగా.. ఖిల్లా ఘనపురం మండల కేంద్రంతో పాటు మండలంలోని సల్కెలాపురం, అప్పారెడ్డిపల్లి, మల్కిమియాన్‌పల్లి, అల్లమాయపల్లి తదితర గ్రామాల్లో చెట్లు విరిగిపడగా మొక్క జొన్న, వరి పంటలు నేలకొరిగాయి. అల్లమాయపల్లి ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. సల్కెలాపురం, మల్కిమియాన్‌పల్లి వెళ్లే రహదారులపై చెట్లు కూలిపోయాయి. పర్వతాపురంలో మామిడి కాయలు రాలిపోయాయి. వనపర్తి మండలం పెద్దగూడెం, కడుకుంట్లలో సుమారు 58 ఎకరాల వరి పంట దెబ్బతింది. కడుకుంట్లలో మామిడి కాయలు, పిందెలు రాలి నష్టం వాటిలిందని రైతులు తెలిపారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి దెబ్బతినడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఆడుకోవాలని వేడుకుంటున్నారు. -
చెరుకు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి
అమరచింత: చెరుకు సాగుచేస్తున్న రైతులకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం తగిన ప్రోత్సాహకాలు అందించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న కోరారు. శనివారం ఫ్యాక్టరీ డీజీఎం మురళిని కలిసి చెరుకు రైతుల సమస్యలు విన్నవించారు. రెండేళ్లుగా సకాలంలో కోతలు పూర్తి చేయడం, రైతులకు అనుకున్న సమయానికి విత్తనాలు అందించడంతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. సాగు రైతులకు కంపెనీ ప్రకటించిన రాయితీలు అందించి ప్రోత్సహించాలని కోరారు. వచ్చే సీజన్లో కోత కార్మికులకు అడ్వాన్సులు ముందస్తుగా చెల్లించి త్వరగా రప్పించాలని, కోత యంత్రాల సంఖ్య పెంచాలన్నారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని డీజీఎంకు అందజేశారు. కార్యక్రమంలో వాసారెడ్డి, నారాయణ, తిరుపతయ్య, నాగేందర్, రామకృష్ణ, చంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ టవర్ పనుల్లో వేగం పెంచండి
వనపర్తి: జిల్లాకేంద్రంలో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రతిపాదిత స్థల సర్వే నివేదికను సమర్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం నాగవరం శివారులో ఐటీ టవర్ నిర్మాణానికి ఇదివరకు కేటాయించిన స్థలాన్ని కలెక్టర్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రవణ్‌కుమార్ పరిశీలించారు. స్థలం ఐటీ టవర్ నిర్మాణానికి అనువైనదేనా కాదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు మరోమారు సర్వేచేసి నివేదిక సమర్పించాలని, నిర్మాణం పూర్తయితే యువతకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రమేష్‌రెడ్డి, సర్వే అధికారులు ఉన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఎల్ఆర్ఎస్ వసూళ్లలో వేగం పెంచాలి
వనపర్తిటౌన్: పుర పరిధిలో ఎల్ఆర్ఎస్ వసూళ్లలో వేగం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పుర ప్రత్యేక అధికారి యాదయ్య ఆదేశించారు. శనివారం పుర కార్యాలయంలో పుర కమిషనర్ వెంకటేశ్వర్లుతో సమావేశమై ఎల్ఆర్ఎస్ వసూళ్లపై ఆరాతీసి మాట్లాడారు. పుర పరిధిలో 28,946 మంది దరఖాస్తుదారులు ఉండగా.. ఇప్పటి వరకు 915 మంది తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడం రూ.కోటి ఆదాయం సమకూరిందని వివరించారు. ఎల్ఆర్ఎస్తో ఇళ్లు నిర్మించుకునేందుకు, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ చెల్లింపునకు 25 శాతం రాయితీతో మార్చి 31 వరకు గడువు ఉందని.. పుర అధికారులు సెలవు రోజుల్లోనూ అందుబాటులో ఉంటారని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రసార మాధ్యమాలు, ఫ్లెక్సీలు, ఇతర మార్గాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని.. పుర కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెంకటేశ్వర్లు వివరించారు. త్వరలోనే బుద్దారం రిజర్వాయర్ బండ్ నిర్మాణం గోపాల్పేట: బుద్దారం రిజర్వాయర్‌లో భాగమైన బండ్ నిర్మాణ పనులు త్వరలోనే చేపడతామని ఆర్డీఓ సుబ్రమణ్యం తెలిపారు. శనివారం ఆయన బుద్దారం రిజర్వాయర్ పరిసరాలను పరిశీలించారు. బండ్ నిర్మాణం చేపట్టే స్థలాన్ని చూసి ఎంతమంది రైతుల భూములకు ఇబ్బంది కలుగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే రైతులతో మాట్లాడారు. బండ్ నిర్మాణం, రిజర్వాయర్‌లో భూములు కోల్పోయే రైతులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని.. అభిప్రాయాలు, నష్టపరిహారం వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం చెరువు పరిధిలో 110 ఎకరాలు ఉండగా.. బఫర్ జోన్‌కు ఇంకా 100 ఎకరాలు అవసరం ఉందన్నారు. బాధిత రైతులకు ప్రభుత్వం నుంచి వీలైనంత ఎక్కువ పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని వివరించారు. అనంతరం బుద్దారం గండి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఇరిగేషన్, ఎస్డీసీఎఫ్, రెవెన్యూ అధికారులు తిలక్‌కుమార్‌రెడ్డి, యాదయ్య, రైతులు ఉన్నారు. క్షయ నిర్ధారణలో రాష్ట్రస్థాయిలో ప్రథమం వనపర్తి: వందరోజుల క్షయ క్యాంపెయిన్ ప్రోగ్రాంలో జిల్లాకు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం లభించిందని.. కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచనలు, సహకారంతో అరుదైన ఘనత సాధించామని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో పురస్కారం అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రారంభించిన వందరోజుల క్యాంపెయిన్‌లో అధికారులు, సిబ్బంది ఉత్తమ పనితీరు కనబర్చడంతో రాష్ట్రస్థాయిలో పురస్కారం దక్కిందన్నారు. జిల్లాలో 1.70 లక్షల మందికి క్షయ పరీక్షలు నిర్వహించి 436 మందికి వ్యాధి ఉన్నట్లు గుర్తించామన్నారు. వారందరికి 100 శాతం చికిత్స అందించడమే కాకుండా నాట్కో సంస్థ సహకారంతో పోషకాహార కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు. వ్యాధి నిర్ధారణకు స్క్రీనింగ్ ఎక్స్‌రే యంత్రం కొనుగోలుకు కలెక్టర్ రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. శనేశ్వరుడికి శాస్త్రోక్తంగా పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడికి ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలినాటి శనిదోష నివారణ కోసం భక్తులు శనివారం తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని తిలతైలాభిషేకాలతో తమ గోత్రనామార్చనలతో పూజలు జరిపించారు. -
మినీ స్టేడియం అభివృద్ధికి కృషి
అచ్చంపేట రూరల్: పట్టణంలోని మినీ స్టేడియాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. శనివారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ త్వరలోనే కోలుకుని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వస్తారన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు రాజీవ్ మినీ స్టేడియాలను మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్యే సహకారంతో నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు సమకూర్చుతామన్నారు. పట్టణంలోని రాజీవ్– ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని రూ.15 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. నల్లమల క్రీడాకారులకు పుట్టినిల్లు అని, ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చత్రునాయక్, మల్లికార్జున్, రాము, లక్ష్మణ్, పవన్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు సమస్యల పరిష్కారమే ఎజెండా
నాగర్‌కర్నూల్ రూరల్: రైతు సమస్యల పరిష్కారమే ఎజెండాగా రాష్ట్ర రైతు సంఘం ఆవిర్భవించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని లక్ష్మణాచారి భవన్ వద్ద నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా మూడో మహాసభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులను రక్షించుకుందాం.. వ్యవసాయాన్ని పరిరక్షించుకుందాం.. గ్రామాలను కాపాడుకుందాం.. అంటూనే దేశానికి అన్నం పెట్టే రైతుకు పాలకులు సున్నం పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతుల పోరాటాల వల్లే వాటిని వెనక్కి తీసుకుందని గుర్తుచేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలని, అలాగే రైతు భరోసా అందరికీ అందించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవులుగౌడ్, వెంకటయ్య, కృష్ణాజీ, బాలమురళి, రవీందర్, శ్రీను, భరత్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. -
మిల్లు యజమానిపై కేసు నమోదు
మదనాపురం: మండల కేంద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వర రైస్‌మిల్లు యజమాని మంజులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పౌరసరఫరాలశాఖ డీటీ ఆసిఫ్ తెలిపారు. శనివారం డీఎస్ఓ కాశీవిశ్వనాథ్, అధికారుల బృందం రైస్‌మిల్లులో తనిఖీలు నిర్వహించగా 2022–2023, 2023–24 వానాకాలం, యాస ంగి సీజన్లో ప్రభుత్వం కేటాయించిన వరి ధాన్యంలో 80 వేల బస్తాలు తక్కువగా ఉన్నాయని.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారుల వెంట ఆర్ఐ రాజేశ్వరి ఉన్నారు. విద్యార్థుల సామర్థ్యాలు పెంచేలా బోధన పాన్‌గల్: విద్యార్థుల సామర్థ్యాలు పెంచేలా బోధన సాగించాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) మహానంది సూచించారు. శనివారం మండలంలోని దావాజిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన సందర్శించి తెలుగు, ఆంగ్లం, గణితంలో విద్యార్థుల సామర్థ్యాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి బోధనపై పలు సూచనలు చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కురుమూర్తినాయక్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ లెక్కింపు ప్రక్రియ శనివారం దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ, ఆలయ ధర్మకర్త అయ్యలూరి రఘునాథాచార్యుల పర్యవేక్షణలో చేపట్టారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30 మంది భక్తులు నాలుగు హుండీలను లెక్కించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.4,24,340 ఆదాయం సమకూరిందని అధికారులు ధ్రువీకరించడంతో పాటు బ్యాంకు ఖాతాలో జమచేశారు. కార్యక్రమంలో ఈఓ ఆంజనేయులు పాల్గొన్నారు. -
‘ప్రాధాన్యత రంగాలను విస్మరించారు’
వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధాన రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించలేదని సీపీఎం జిల్లా నాయకుడు ఎండి జబ్బార్ ఆరోపించారు. శనివారం మండలంలోని బొల్లారం గ్రామంలో నిర్వహించిన పార్టీ మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేశారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించకపోవడం, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కృతనిశ్ఛయంతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 100 శాతం పంట రుణమాఫీ, రైతుభరోసా, మహాలక్ష్మీ పథకం, కొత్త ఆసరా పింఛన్లు, వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా వంటి పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బాల్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణయ్య, మహబూబ్‌పాషా, రవిప్రసాద్, నాయకులు బాలగౌడ్, ఆశన్న, ఈశ్వర్, కృష్ణయ్య, నిరంజన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
జాగ్రత్తలతో వడదెబ్బ దూరం
అత్యవసరమైతేనే బయట తిరగాలి ప్రశ్న: వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సుధాకర్, గోపాల్పేట డీఎంహెచ్ఓ: ప్రస్తుతం జిల్లాలో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కళ్లు తిరగడం, శరీరంలో సత్తువకోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్లుగా భావించాలి. నిత్యం ఎండలో పని చేసేవారు నీరు ఎక్కువగా తీసుకోవాలి. శరీరంలో నీటిశాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. డా. శ్రీనివాసులు డీఎంహెచ్ఓ ● సరిపడా నీరు తాగడంతో పాటు రక్షణ చర్యలు తీసుకోవాలి ● చిన్నారులు, వృద్ధులు వడదెబ్బ బారినపడే ప్రమాదం ఎక్కువ ● ‘సాక్షి’ ఫోన్–ఇన్‌లో డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు ప్రశ్న: వడదెబ్బకు ఎలాంటి చికిత్స పొందాలి? – వినయ్, మదనాపురం డీఎంహెచ్ఓ: శరీరంలో నీరు, లవణాల శాతం ఒక్కసారిగా పడిపోవడంతో వడదెబ్బ సోకుతుంది. ఒక్కసారిగా కుప్పకూలుతారు. అలాంటి వారిని వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాయి. ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడంతో పాటు కొబ్బరి బొండాలు, నీరు అందించాల్సి ఉంటుంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. వనపర్తి: మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు సూచించారు. వడదెబ్బ.. వేసవి జాగ్రత్తలు తదితర అంశాలపై శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్–ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలువురు అడిగిన సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా పాటించాల్సిన అంశాలపై పలు సూచనలు చేశారు. మానవ శరీరం 37 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు తట్టుకోగలదని.. జిల్లాలో కొన్నిరోజులుగా 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వాతావరణశాఖ ఆరంజ్ జోన్ జాబితాలో జిల్లాను చేర్చిందన్నారు. ఉపాధి, వ్యవసాయ తదితర ఆరుబయట పనులు ఉదయం 6 నుంచి 9:30 వరకు తిరిగి సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు చేయాలని సూచించారు. రసాయనాలతో తయారుచేసిన శీతల పానీయాలు తాగొద్దని, మజ్జిగ, అంబలి, స్వచ్ఛమైన నీరు ఎక్కువగా తాగడంతో వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు వివరించారు. పండ్ల రసాలు, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలని.. ఎండకు బయట తిరగాల్సి వస్తే తలకు టోపీగాని, తెల్లని వస్త్రంగాని ధరించాలని సూచించారు. ఎండలో తిరిగినప్పుడు చెమట ఎక్కువగా వచ్చి శరీరంలో నీటిశాతం తగ్గిపోవడంతో పాటు లవణాల శాతం క్షీణిస్తుందని.. కళ్లు తిరగడం, ఒంట్లో సత్తువ తగ్గినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడంతో పాటు ఓఆర్ఎస్ పాకెట్లను నీటిలో కలిపిగాని, గ్లాస్ నీటిలో చిటికెడు ఉప్పు, చక్కెర కలిపి తాగాలన్నారు. పిల్లలు, వృద్దులు బయట తిరగొద్దు.. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండలో తిరిగితే త్వరగా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని.. బయటకు వెళ్లాల్సి వస్తే తలపై వస్త్రం ధరించడంతో పాటు వాటర్ బాటిల్, అంబలి వెంట తీసుకెళ్లాలని సూచించారు. పిల్లలు రెండు నుంచి మూడు లీటర్లు, పెద్దలు మూడు నుంచి ఐదు లీటర్ల నీరు ప్రతిరోజు తప్పక తీసుకోవాలని, వేసవి ముగిసే వరకు మాంసకృత్తులు తక్కువ తీసుకోవడం మంచిదన్నారు. జిల్లాలోని ప్రతి పీహెచ్సీలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని.. 94 వేల పాకెట్లను పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లలో సిద్ధంగా ఉంచామని చెప్పారు. ప్రశ్న: ఆరోగ్యశాఖ తరఫున చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేస్తారా? – సతీష్, అమరచింత డీఎంహెచ్ఓ: ప్రభుత్వం తరఫున చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు లేవు. దాతల సాయంతో బస్టాండ్లు, రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. ఎండకు తిరిగే ప్రజలు వాటిని ఉపయోగించుకొని ఉపశమనం పొందవచ్చు. ప్రశ్న: పిల్లలు, వృద్దులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? – రమేష్, గోపాల్పేట డీఎంహెచ్ఓ: వేసవిలో పిల్లలు, వృద్దులు నిమ్మ, పండ్ల రసాలు, మజ్జిగ, పెరుగులాంటివి తీసుకోవాలి. కూరల్లో వేపుళ్లు తినడం తగ్గించాలి. ఎండలో బయట తిరగరాదు. ఫ్రిజ్ నీటికి బదులు మట్టి కుండలోని నీళ్లు తాగేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రశ్న: రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? – రాజు, వీపనగండ్ల డీఎంహెచ్ఓ: మనిషి బరువు ఆధారంగా నీరు తాగాల్సి ఉంటుంది. 50 కిలోల పైబడినవారు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ తీసుకోవాలి. పిల్లలు మూడు లీటర్లకు తగ్గకుండా తాగాలి. దీంతోపాటు పండ్లు, నిమ్మరసం సేవించాలి. ప్రశ్న: అతిగా చల్లటి నీరు తాగవచ్చా? – ఆరిఫ్, అమరచింత డీఎంహెచ్ఓ: మట్టి కుండలో చల్లబడిన నీరు తాగడం శ్రేయస్కరం. 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో చాలాసేపు తిరిగి ఇంటికి రాగానే వెంటనే అత్యధిక చల్లగా ఉండే ఫ్రిజ్ నీటిని తాగడం మంచిదికాదు. -
అర్హత ఉన్నా.. అందని గృహజ్యోతి
వనపర్తిటౌన్: జిల్లాలో తెల్ల రేషన్‌కార్డు ఉండి, గృహజ్యోతి పథకానికి దూరంగా సుమారు 14 వేల మంది ఉన్నట్లు విద్యుత్‌శాఖ అధికారికంగా వెల్లడించింది. గతేడాది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు సర్వీస్ నంబర్, ఆధార్ నంబర్లో తప్పులు దొర్లితే పుర కార్యాలయాలు, గ్రామాలు, మండల కేంద్రాల్లో ఉంటే ఎంపీడీఓ కార్యాలయాల్లో సవరించుకొని లబ్ధి పొందుతున్నారు. ప్రజాపాలన తర్వాత ఏడాది కాలంగా ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తులు తీసుకోలేదు. ఫలితంగా జిల్లాలో 13,658 వేల మంది రాయితీ పొందడం లేదు. గృహజ్యోతికి అర్హత ఉండి బిల్లు చెల్లించని వారి వద్ద రూ.1.75 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వారమే గడువు ఉండటంతో బకాయిలు ఎలా వసూలు చేయాలో ఆ శాఖ అధికారులకు అంతుపట్టడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది బిల్లు వసూళ్లకు వెళ్లగా 200 యూనిట్లలోపే విద్యుత్ వినియోగిస్తున్నామని.. బిల్లు చెల్లించమని తెగేసి చెబుతుండటంతో ఎలా రాబట్టుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. బకాయిదారుల్లో అత్యధికంగా జిల్లాకేంద్రంలో 2,766, వనపర్తి రూరల్‌లో 1,511, పెబ్బేరులో 1,505, కొత్తకోటలో 1,305, ఆత్మకూర్‌లో 1,065 మంది ఉన్నారు. జిల్లాలో సుమారు 14 వేల మంది పథకానికి దూరం వసూలు చేస్తున్నాం.. అర్హత ఉండి గృహజ్యోతి అమలుకాని వినియోగదారులు మున్సిపాలిటీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో నమోదు చేసుకుంటేనే మాకు జాబితా వస్తోంది. సాంకేతిక కారణాలతో కొందరికి గృహజ్యోతి వర్తించడం లేదు. జిల్లాలో 13,658 మంది ఈ పథకానికి దూరంగా ఉన్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.1.75 కోట్ల బకాయిలు ఉన్న మాట వాస్తవామే. వాటిని చెల్లించాలని క్షేత్రస్థాయిలో వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. – రాజశేఖరం, ఎస్ఈ, విద్యుత్‌శాఖ -
ప్రారంభమైన పది పరీక్షలు
సాక్షి నెట్వర్క్: జిల్లాలో శుక్రవారం పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 36 కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటిరోజు 6,853 మంది విద్యార్థులకుగాను 6,842 మంది హాజరుకాగా 11 మంది గైర్హాజరైనట్లు డీఈఓ అబ్దుల్ ఘనీ తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకున్నారు. పరిసరాల్లోని అన్ని జిరాక్స్ కేంద్రాలను పరీక్ష సమయంలో అధికారులు మూసివేయించారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సీఐ కృష్ణ, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ బందోబస్తు నిర్వహించారు. కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా అధికారులు.. పదోతరగతి విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ బందోబస్తు, ప్రాథమిక తాత్కాలిక వైద్య కేంద్రం, తాగునీరు తదితర మౌలిక వసతులను పరిశీలించారు. ప్రశ్నాపత్రాలు తెరిచే సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటును చూశారు. పరీక్ష కేంద్రాల్లోకి ఏ ఒక్కరికీ సెల్‌ఫోన్ అనుమతి లేదని.. ఎవరైనాసరే కేంద్రం బయటే ఉంచి రావాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఈఓ మహ్మద్ అబ్దుల్ ఘని, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి ఉన్నారు. ● చిన్నంబావి మండలం పెద్దదగడ జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ● జిల్లాకేంద్రంలోని సరస్వతి శిశుమందిర్, హరిజనవాడ జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను ఎస్పీ రావుల గిరిధర్ పరిశీలించారు.బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నామని చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ వెంట సీఐ కృష్ణ, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ ఉన్నారు. మొదటిరోజు 11 మంది విద్యార్థులు గైర్హాజరు -
94407 31801, 63049 67688
సమయం: శనివారం ఉదయం 10:30 నుంచి 11.30 వరకువనపర్తి: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. ఏ.శ్రీనివాసులుతో శనివారం ‘సాక్షి’ ఫోన్–ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్ చేసి వడదెబ్బ, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. ఫోన్ చేయాల్సిన సెల్‌నంబర్లు : నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
అసంపూర్తి నిర్మాణాలు పూర్తి చేయాలి
వనపర్తి: వివిధ శాఖల పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఈడబ్ల్యూఐడీసీ శాఖల పరిధిలో ఉన్న బకాయి పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ ఫండ్స్ కింద పంచాయతీరాజ్‌శాఖకు కేటాయించిన 44 పాఠశాలలు, ఈడబ్ల్యూఐడీసీకి కేటాయించిన 20 అంగన్వాడీ కేంద్ర భవనాలు, ఆర్‌అండ్‌బీకి కేటాయించిన నాలుగు అంగన్వాడీ కేంద్ర భవనాల మరమ్మతుల్లో వేగం పెంచాలని సూచించారు. అదేవిధంగా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల పరిధిలో ఎఫ్డీఆర్ నిధులతో చేపట్టిన సీసీ రహదారల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తి చేయడమే కాకుండా వాటికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కూడా సమర్పించాలన్నారు. మన ఊరు–మన బడికి సంబంధించి తుది దశకు చేరుకొని బిల్లులు రాక పనులు నిలిచిన పాఠశాల భవనాలను గుర్తించి పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, ఆర్అండ్బీ డీఈ సీతారామస్వామి, ఈడబ్ల్యూఐడీసీ ఈఈ, ఆయా శాఖల డీఈలు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పీఎం విశ్వకర్మ దరఖాస్తులను పరిష్కరించాలి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ సురభి ఎంపీడీఓలు, పుర కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీఎం విశ్వకర్మకు ఎంపికై శిక్షణ పొందిన వారికి కలెక్టర్ ధ్రువపత్రాలు అందజేసి మాట్లాడారు. శిక్షణ పొందిన వారంతా సద్వినియోగం చేసుకోవాలని.. శిక్షణనిచ్చిన సింక్రోస్సర్వ్ ఏజెన్సీకి కలెక్టర్ అభినందనలు తెలిపారు. ధ్రువపత్రాలు అందుకున్న వారిలో 37 మంది కుమ్మరి, 33 మంది శిల్పి, మరికొందరు ఇతర చేతివృత్తుల్లో శిక్షణ పొందిన వారు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ ఏడీ శివరాంప్రసాద్ కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ యాదయ్యను శాలువాతో సన్మానించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ జీఎం జ్యోతి, బిసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, పరిశ్రమలశాఖ అధికారి నాగేష్, ఎల్డీఎం కౌశల్ కిషోర్ పాండే, అసిస్టెంట్ ఎల్డీఎం సాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రతి దివ్యాంగుడికి గుర్తింపుకార్డు.. ప్రతి దివ్యాంగుడికి గుర్తింపుకార్డు ఉండాలని ప్రభుత్వం యూడీఐడీ (యూనిక్ డిజేబుల్ ఐడి)ని అమలులోకి తీసుకొచ్చిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎంపీడీఓలు, మీసేవా కేంద్రాల నిర్వహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో యూడీఐడీ పోర్టల్ ద్వారానే దివ్యాంగులకు ధ్రువపత్రాలు జారీ చేస్తారని చెప్పారు. కార్డు కోసం దివ్యాంగులు www.swavlam bancard.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసే విషయంలో మీసేవా కేంద్రాల నిర్వాహకులదే కీలక పాత్రని.. వివరాల నమోదులో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని సూచించారు. ఈ విషయంలో ఎంపీడీఓలు, పుర కమిషనర్లు నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీఎంహెచ్ఓ డా.శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక
ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాని కార్యక్రమానికి శ్రీకారం విచారణ చేస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు ●● ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సదావకాశం ● ఆన్లైన్లో అందుబాటులో ఇస్రో ప్రత్యేక వెబ్సైట్ ● రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ ● ఉమ్మడి జిల్లాలో 45,969 మంది విద్యార్థులువిద్యార్థులను ప్రోత్సహించాలి.. వైజ్ఞానిక పోటీల్లో పాల్గొనేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, అంతరిక్ష పరిశోధనా రంగాలపై ఆసక్తి పెంపొందించడానికి యువికా తోడ్పడుతుంది. ఎంపికై న విద్యార్థులకు స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. – భానుప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి, నారాయణపేట నారాయణపేట రూరల్: విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యువికా (యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలను ఇస్రోనే కల్పించనుంది. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో 45,969 మంది 9వ తరగతి విద్యార్థులు ఉండగా ఇందులో ఎంత మంది ఔత్సాహికులు ముందుకు వస్తారో వేచి చూడాల్సి ఉంది. రేపటి వరకు అవకాశం.. దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించారు. ఎంపికై న విద్యార్థుల తొలి జాబితాను ఏప్రిల్ 7న అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. ఎంపికై న విద్యార్థులు మే 18న ఇస్రో కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మే 19 నుంచి మే 30 వరకు ఎంపికై న విద్యార్థులకు 7 శిక్షణ కేంద్రాల్లో యువికా కార్యక్రమం నిర్వహిస్తారు. ఎంపిక విధానం ఇలా.. ఈ విద్య సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. 8వ తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్ ప్రతిభ పరీక్షలు, ఒలింపియాడ్‌లో పాల్గొని మొదటి, మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. రిజిష్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినవారు, స్కౌట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండటం, ఆన్లైన్ క్విజ్‌లో ప్రతిభ చూపిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. అవగాహన కల్పిస్తారు. దరఖాస్తు విధానం.. ఇవీ కేంద్రాలు.. 1. ఐఐఆర్ఎస్, డెహ్రాడూన్ 2. విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్, తిరువనంతపురం 3. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట 4. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, బెంగుళూరు 5. స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్ 6. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్ 7. నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్ విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదట వారి ఈమెయిల్ ఐడీతో ఇస్రో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్‌లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. దరఖాస్తుతో పాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతి, విద్యార్థి మూడేళ ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. వేసవిలో శిక్షణ.. శిక్షణకు ఎంపికై న విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 19 నుంచి 30 వరకు 12 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు. -
ప్రత్యేక కార్యాచరణతో..
పురపాలికలో ఆస్తి, కొళాయి పన్ను వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. రూ.2.37 కోట్లు లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ.1.20 లక్షలు వసూలు చేశాం. మిగిలిన మొత్తాన్ని పది రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించాం. ఇంటి పన్నుతో పాటు కొళాయి పన్ను సైతం వసూలు చేస్తున్నాం. – చికెన్ శశిధర్, పుర కమిషనర్, ఆత్మకూర్ వార్డుల వారీగా వసూలు.. పురపాలికలో రూ.55 లక్షల ఇంటి పన్ను వ సూలు చేయాల్సి ఉంది. ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు వార్డు అధికారులతో కలిసి ఇల్లిల్లూ తిరిగి వసూలు చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ.31.51 లక్షలు వసూలయ్యాయి. పురపాలికకు ప్రధాన ఆదాయ వనరు అయిన ఇంటి పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. – రవిబాబు, పుర కమిషనర్, అమరచింత ● -
రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్–ఇన్
వనపర్తి: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. ఏ.శ్రీనివాసులుతో శనివారం ‘సాక్షి’ ఫోన్–ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్ చేసి వడదెబ్బ, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. ఫోన్ చేయాల్సిన సెల్‌నంబర్లు : 94407 31801, 63049 67688 సమయం : శనివారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు -
యథేచ్ఛగా మట్టి దందా?!
కరుగుతున్న గుట్టలు ●దాడులు చేస్తున్నాం.. జిల్లాకేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రభుత్వ భూములను తవ్వి మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే దాడులు నిర్వహిస్తున్నాం. ఇటీవల శ్రీనివాసపురం ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వి తరలిస్తున్నందుకు రూ.20 వేల జరిమానా విధించాం. సిబ్బంది నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు ఏ ప్రభుత్వ గుట్టల్లో మట్టి తవ్వేందుకు అనుమతి ఇవ్వలేదు. – గోవింద్, ఏడీ, మైనింగ్‌శాఖ వనపర్తి వనపర్తి: జిల్లాకేంద్రం సమీపంలోని గుట్టలు రోజురోజుకు కరిగిపోతున్నాయి. మైనింగ్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొందరు అక్రమార్కులు పట్టపగలే పొక్లెయిన్లు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలిస్తూ యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. ఇందుకు జిల్లాకేంద్రంలో పరుగులు పెడుతున్న మట్టి ట్రాక్టర్లే సాక్ష్యం. అధికార పార్టీ నేతలతో సఖ్యతగా ఉన్న కొందరు మాజీ ప్రజాప్రతినిధుల అండదండలతో జిల్లాకేంద్రంలో ఈ దందా జోరుగా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. పట్టణంలోని శ్రీనివాసపురం శివారు, పాన్‌గల్ రోడ్, రాజనగరం శివారు వడ్డేవాట సమీపంలోని గుట్టలను పొక్లెయిన్లతో తోడేస్తూ భవన నిర్మాణాలు, ఇతర అవసరాల కోసం మట్టిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్‌శాఖ అధికారులు సైతం వారితో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని నామమాత్రపు దాడులు చేపడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తవ్వకాలు చేపడుతున్నట్లు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే తాము పరిశీలనకు వస్తున్నామని అధికారులు అక్రమార్కులకు సమాచారం అందిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు ట్రాక్టర్లు, పొక్లెయిన్లు గుట్టల ప్రాంతంలో కనిపించడం లేదు. శ్రీనివాసపురం శివారులోని గుట్టపై నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కొందరు అధికారులు, మీడియాకు మంగళవారం సమాచారం ఇచ్చారు. కాసేపటికే అధికారులు అక్కడికి చేరుకోగా.. మట్టితో నిండిన కొన్ని ట్రాక్టర్లు ముళ్లపొదల చాటున కనిపించకుండా నిలపడం, తవ్వకాలు చేసిన చోటే కొంత మట్టిని వదిలేసి వెళ్లడం, పొక్లెయిన్లు అక్కడ లేకుండా అక్రమార్కులు జాగ్రత్తలు పడ్డారు. మైనింగ్ అధికారులు కనీసం గుట్ట వద్దకు వెళ్లకుండానే ఎలాంటి తవ్వకాలు లేవని ధ్రువపరుస్తూ కాసేపు అక్కడ గడిపి వెళ్లడం గమనార్హం. నామమాత్రపు జరిమానాలే.. గుట్టల తవ్వకాలపై అతిగా ఫిర్యాదులు అందితే అధికారులు నామమాత్రపు జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకొంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిత్యం రూ.లక్షల్లో చేసే మట్టి దందాకు నామమాత్రంగా రూ.వేలల్లో జరిమానాలు విధిస్తే అక్రమ తవ్వకాలు ఎలా ఆగుతాయన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి భవిష్యత్ తరాలకు జాతి సంపదను కాపాడాలనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలోనూ పలు ప్రజాసంఘాలు కలెక్టర్, మైనింగ్‌శాఖ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేయడంతో కొన్ని నెలల పాటు ఈ దందాకు బ్రేక్ పడినా ఇటీవల తిరిగి జోరందుకుంది. అధికార పార్టీ అండదండలతోనే.. అధికార పార్టీలోని కొందరు ముఖ్యనేతల అండదండలతోనే జిల్లాకేంద్రంలో మట్టి దందా జోరుగా సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఈ దందా కొనసాగుతుందని విమర్శలు ఉన్నాయి. ఎవరికి ఫిర్యాదు చేసినా భ యపడేది లేదంటూ సదరు నేత అంటున్నట్లు స్థానికంగా వినిపిస్తోంది. ఈ నేత గతంలోనూ ప్రైవేటు పట్టా భూమిలో మట్టి తవ్వేందుకు మైనింగ్‌శాఖ నుంచి అ నుమతి తీసుకొని ప్రభుత్వ గుట్టలు తవ్వగా అధికారు లు గుర్తించి పెద్ద మొత్తంలో జరిమానా విధించారు.అధికారులు వస్తున్నారని తెలిసి ముళ్లపొదల చాటున కనబడకుండా నిలిపిన మట్టి ట్రాక్టర్లు నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్న మైనింగ్ అధికారులు అధికార పార్టీ నేతల అండదండలతోనేనా..? అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నట్లు అక్రమార్కులు ముందుగానే తెలుసుకొని మట్టి ట్రాక్టర్లను ముళ్లపొదల చాటున కనపడకుండా నిలిపి జాగ్రత్తలు తీసుకోవడం కనిపించింది. శ్రీనివాసపురం శివారులోని ఎత్తైన గుట్టలను పొక్లెయిన్లతో తవ్వినట్లుగా గుట్టలపై స్పష్టంగా గుర్తులు కనిపిస్తున్నాయి. మట్టి తవ్వకాలు జరిపేందుకు గుట్టపై ఉన్న చెట్లను సైతం తొలగించిన ఆనవాళ్లు ఉన్నాయి. -
శాంతిభద్రతలు, ఆరోగ్యం కీలకం
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని.. వారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద హాస్పిటల్స్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ రావుల గిరిధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, బాలల సంరక్షణ కమిటీ రాష్ట్ర సభ్యురాలు అపర్ణ, ఐఎంఏ అధ్యక్షుడు బాబు, యశోద ఆస్పత్రి జనరల్ సర్జన్ శ్రావ్య, సింధు ముఖ్యఅతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కనీసం ఏడాదికి ఒకసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఏవైనా సమస్యలుంటే ముందుగానే తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోగలుగుతామన్నారు. జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని.. అందులో భాగంగానే మిషన్ మధుమేహ, క్షయ తదితర కార్యక్రమాలతో ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని, కలెక్టర్ కూడా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వనపర్తి జీజీహెచ్, ఎంసీహెచ్‌కు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, నియోజకవర్గంలోని పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి, జిల్లాకేంద్రంలో 500 పడకల ఆస్పత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. ఏవైనా సమస్యలు నిర్ధారణ అయితే చికిత్స కూడా అందిస్తారని, ఇందుకు సహకరించిన వైద్యశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్ కూడా పోలీసుశాఖ బలోపేతానికి సహకారం అందిస్తున్నారని కొనియాడారు. ఏఆర్ విభాగం హెడ్‌క్వార్టర్ నిర్మాణానికి అడిగిన వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేశారని, అదేవిధంగా డీఎస్పీ కార్యాలయ భవనానికి కూడా సహకారం అందించారని వివరించారు. జిల్లాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్, ఎమ్మెల్యే సహకరిస్తున్నారని, అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించగలమన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు పోలీసుశాఖ తరఫున శాలువాలు కప్పి సన్మానించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు జిల్లాలు
అట్టడుగున ● రాష్ట్రంలోనే సోలార్ మోడల్ విలేజ్‌గా నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి నిలిచింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మొత్తం 1,451 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 499 డొమెస్టిక్, 66 కమర్షియల్, 867 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 422 గృహ వినియోగదారులకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం పెంచడం, ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపర్చడం, పర్యావరణ హితంలో భాగంగా ప్రభుత్వం ఈ సోలార్ మోడల్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. సాక్షి, నాగర్‌కర్నూల్: వ్యక్తిగత ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాల కల్పనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు ఇంకా అట్టడుగునే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆదాయం, ఉత్పత్తి, ఉపాధిలో వెనకబాటు కనిపిస్తోంది. తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్‌లుక్–2025 రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అలాగే గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో నూతన పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనుంది. అనీమియా ముక్త్ కార్యక్రమంలో వైద్యసిబ్బంది తీసుకున్న చర్యల ఫలితంగా వనపర్తి జిల్లా 91.8 శాతం పనితీరుతో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ● వస్తు సేవల ఉత్పత్తిగా లెక్కించే జీఎస్డీపీ లెక్కల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే వెనుకంజలో ఉన్నాయి. ఈ విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 30వ స్థానంలో ఉంది. జోగుళాంబ గద్వాల 27, వనపర్తి 26, నాగర్‌కర్నూల్ 19వ స్థానంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా మాత్రం రూ.32,767 కోట్ల జీఎస్డీపీతో రాష్ట్రవ్యాప్తంగా పదో స్థానంలో నిలిచింది. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయంలో మహబూబ్‌నగర్ జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాలు వెనుకబడిపోయాయి. మహబూబ్‌నగర్ రూ.2,93,823 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో 6వ స్థానంలో ఉండగా.. నారాయణపేట 30, జోగుళాంబ గద్వాల 26, వనపర్తి 22, నాగర్‌కర్నూల్ 20వ స్థానంలో ఉన్నాయి. ● ఉమ్మడి పాలమూరులో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. నూతన పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉపాధి కల్పన విషయంలో ఉమ్మడి జిల్లా వెనుకబడి ఉంది. నారాయణపేట జిల్లాలో 102 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. వీటి పరిధిలో 2,045 మంది ఉపాధి పొందుతున్నారు. కాగా మహబూబ్‌నగర్‌లో 462 యూనిట్లతో 32,443 మందికి ఉపాధి పొందుతున్నారు. మిగతా జిల్లాల్లో ఐదు వేల మందికి మించి ఉపాధి లేదు. ఇక అటవీ విస్తీర్ణంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో 35.81 శాతం అటవీ భూమితో రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉండగా.. గద్వాల జిల్లాలో కేవలం 2.32 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉంది. డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లలో 57.4శాతంతో నాగర్‌కర్నూల్ అట్టడుగు స్థానంలో ఉండగా. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలు సైతం 65 శాతం లోపే కనెక్షన్లు ఉన్నాయి. భూ యజమానులు (సగటున హెక్టార్లలో..)1.081.030.980.860.83జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో వెనుకంజ మహబూబ్‌నగర్ జిల్లా కాస్త మెరుగు పరిశ్రమల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కరువు సోలార్ మోడల్ విలేజ్‌గా కొండారెడ్డిపల్లి తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్ లుక్ 2025లో వెల్లడి -
తల్లిదండ్రులు దైవంతో సమానం
వనపర్తి టౌన్: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దైవంగా భావించి పిల్లలు వారికి సేవ చేయాలని.. ఎవరైనా నిరాశ్రయులను చేస్తే హెల్ప్‌లైన్ నంబర్ 14567కు ఫిర్యాదు చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీనియర్ సిటిజన్ ఫోరంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల కనీస అవసరాలు తీర్చకపోయినా, ఇళ్లలో స్థానం కల్పించకపోయినా సీనియర్ సిటిజన్ చట్టం 2007 ప్రకారం రూరల్ డెవలప్మెంట్ అధికారి వారికి పిల్లల నుంచి నెలకు సరిపడా డబ్బులు ఇప్పించాలని చెప్పారు. రూ.10 వేల వరకు మెయింటెనెన్స్ కోరవచ్చని, మెయింటెనెన్స్ ఫిర్యాదు ఇవ్వొచ్చని సూచించారు. పిల్లలు లేనివారి ఆస్తి తదనంతరం ఎవరికి చెందుతుందో వారి ద్వారా, దత్తత తీసుకున్న పిల్లల నుంచి కూడా మెయింటెనెన్స్ కోరే అవకాశం ఉందన్నారు. న్యాయ సలహాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 15100ను సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ అసిస్టెంట్ కౌన్సిల్ ఎం.రఘు, జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, మండల సీనియర్ ఫోరం అధ్యక్షుడు నాగేంద్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘పది’ పరీక్షలు
జిల్లాకేంద్రంలో పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు ఆత్మకూర్: జిల్లాలో శుక్రవారం నుంచి పదోతరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 179 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 6,853 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 3,419 మంది, బాలికలు 3,434 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఫర్నీచర్, ఫ్యాన్లు, ఇతర సౌకర్యాలు సమకూర్చారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను బిగించారు. 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 400 మంది ఇన్విజిలేటర్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, నాలుగు రూట్ ఆఫీసర్ల బృందాలు ఏర్పాటు చేశారు. వనపర్తి, ఆత్మకూర్, పెబ్బేరు, కొత్తకోట, వీపనగండ్ల, పెద్దమందడి, పాన్‌గల్, ఖిల్లాఘనపురం, గోపాల్పేట, రేవల్లి పోలీస్స్టేషన్లలో ప్రశ్నపత్రాలు భద్రపర్చనున్నారు. జిల్లాలో 179 ఉన్నత పాఠశాలలు.. 6,853 మంది విద్యార్థులు 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు -
ప్రణాళికతో యాసంగి ధాన్యం కొనుగోలు
వనపర్తి: యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి వరి ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2024–25 యాసంగికి సంబంధించి రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఏప్రిల్ రెండో వారంలోనే ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని.. పౌరసరఫరాలు, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో అందుకు తగినట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని, గన్ని బ్యాగులు, టార్పాలిన్ల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. వేసవి నేపథ్యంలో నీడ, తాగునీటి వసతి కల్పించాలన్నారు. తాలు తొలగింపునకు ఫ్యాన్లు, రైతులు తీసుకొచ్చిన ధాన్యంలో ఏయే రోజు ఎంత తేమ శాతం ఉందనే వివరాలు రిజిస్టర్లలో నమోదు చేయాలని కోరారు. మార్చి 25లోపు తూకము, తేమ కొలిచే యంత్రాలు సిద్ధం చేయాలని మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. అదేవిధంగా ఏఈఓలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు సన్నరకం ధాన్యాన్ని గుర్తించే విధానంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. రైస్‌మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇస్తేనే ధాన్యం కేటాయింపు జరుగుతుందని, లేదంటే ఇవ్వమని స్పష్టం చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌నాయక్, డీఆర్డీఓ ఉమాదేవి, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలశాఖ డీఎం జగన్, జిల్లా సహకారశాఖ అధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఇసుక రీచ్‌లను గుర్తించాలి.. స్థానిక అవసరాల మేరకు ఇసుక వినియోగించుకునేందుకు జిల్లాలో అందుబాటులో ఉన్న రీచ్‌లను గుర్తించి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లతో కలిసి నిర్వహించిన జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖిల్లాఘనపురం మండలం కమాలుద్దీన్‌పూర్, పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి, మదనాపురం మండలం కరివేన, దుప్పల్లి, ఆత్మకూరు మండలం వీరరాఘవాపురం రీచ్‌లను పరిశీలించాలన్నారు. అదేవిధంగా ఫిల్టర్ ఇసుక దందా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతి లేకుండా ఇసుక తరలించడానికి వీలులేదని.. అవసరం ఉంటే మన ఇసుక వాహనం ద్వారానే బుక్ చేసుకునేలా చూడాలన్నారు. -
అన్నివర్గాలకు సమన్యాయం..
ప్రజల భవిష్యత్‌కు భరోసా.. రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా, ప్రజల భవిష్యత్‌కు భరోసానిచ్చేలా బడ్జెట్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ ద్రవ్యలోటును తగ్గించే చర్యలు చేపట్టింది. వ్యవసాయం, రైతుభరోసాకు కేటాయించిన నిధులు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. సాగునీటి రంగానికి రూ. 23వేల కోట్ల మేరకు కేటాయించడం శుభపరిణామం. మూలధన వ్యయాన్ని రూ. 36,504 కోట్లకు పెంచడం ద్వారా మౌలిక వసతులు పెరుగుతాయి. ఆరు గ్యారంటీల హామీల అమలుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు జరపడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. జీఎస్డీపీలో పర్యాటక రంగం వాటాను 10 శాతానికి పెంచడం, రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాఽధి కల్పించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. 2030 నాటికి 10 కోట్ల మంది దేశీయ పర్యాటకులు, 5 లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం ద్వారా తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం. – జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి అన్ని వర్గాలకు సమన్యాయం కల్పించేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆనందంగా ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంది. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ రాబోయే పదేళ్లలో తెలంగాణ మరింత అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు దోహదపడుతుంది. వైద్యం, విద్య, సాగునీటి పారుదల శాఖలకు నిధులు కేటాయించి ప్రాధాన్యత కల్పించింది. – వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్ -
మోదం.. ఖేదం
ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకే ప్రాధాన్యం సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిరాశే మిగిల్చింది. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో నిధులు సమకూరుస్తారని భావించగా, బడ్జెట్లో కేవలం రూ.2,514 కోట్ల మేరకే కేటాయింపులు దక్కాయి. ఈ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు బడ్జెట్లో ప్రస్తావించింది. ప్రధానంగా ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్, సంగంబండ, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకోసం ఈసారి బడ్జెట్లో నిధులను కేటాయించింది. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కేఎల్ఐ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు.. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, విస్తరణ పనులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. ఇందుకోసం ఈసారి బడ్జెట్లో రూ.800 కోట్లను కేటాయించింది. గతేడాది సైతం రూ. 715 కోట్లు కేటాయించగా, ఈసారి మరికొంత నిధులను పెంచింది. కల్వకుర్తి కింద పెండింగ్‌లో ఉన్న 28, 29, 30వ ప్యాకేజీ లను పూర్తిచేయడం ద్వారా ఆయా ప్రాజెక్ట్‌లకు పూర్తిస్థాయి లో ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కురుమూర్తిస్వామి ఆలయాభివృద్ధికి రూ.110 కోట్లు.. పాలమూరు ప్రజల ఆరాధ్యదైవం అమ్మాపురంలో ఉన్న కురుమూర్తిస్వామి ఆలయానికి ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఘాట్‌రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం 20–25 ఎకరాల స్థలాన్ని కేటాయించి, నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. ● రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్ల పంపిణీ పథకాలకు నిధులను సమకూర్చింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ. 31,605 కోట్లు కేటాయించడం ద్వారా గ్రామీణ రోడ్లు, గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది లబ్ధిపొందనున్నారు. ● ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని చెబుతూ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ఇప్పటివరకు రుణమాఫీ కాని రైతుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. టైగర్ సఫారీ, ఎకో టూరిజం, కృష్ణానదిపై లాంచీ స్టేషన్లు, జెట్టీలు, వాటర్ స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి పర్చనున్నారు. ● నల్లమలలో పర్యాటక అభివృద్ధితో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో గెస్ట్ హౌస్‌ల నిర్మాణాలు, ట్రెక్కింగ్ మార్గాలను అభివృద్ధి చేయనుంది. కృష్ణాతీరంలోని సోమశిల వద్ద బోటింగ్, క్యాంపింగ్, కారవాన్ క్యాంపింగ్ సదుపాయాల కోసం ప్రణాళిక చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న కోయిల్‌సాగర్, సంగంబండ, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులను కేటాయించింది. కోయిల్‌సాగర్‌కు రూ.80.73 కోట్లు, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌కు రూ.144 కోట్లు, సంగంబండకు రూ.98.08 కోట్ల నిధులను కేటాయించింది. కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్‌కు అవసరమైన కేటాయింపులు దక్కడంతో పెండింగ్‌లో ఉన్న దేవరకద్ర గ్రావిటీ కెనాల్, ఎడమ కాల్వ, డిస్ట్రిబ్యూటరీ కాల్వల పనుల్లో వేగం పెరుగనుంది. సంగంబండ కింద చేపడుతున్న భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. కోయిల్‌సాగర్, సంగంబండకు కేటాయింపులు కేఎల్ఐకు రూ.800 కోట్లు కేటాయింపు ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతలకు మరోసారి నిరాశే నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు రాష్ట్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన -
‘పాలమూరు’కు ఇచ్చింది రూ. 2,514 కోట్లే..
ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో మొత్తం 14.5 లక్షల ఎకరాల్లో సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు ఈ బడ్జెట్లో నిరాశే మిగిలింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ఇంకా కనీసం రూ.20 వేల కోట్లు అవసరం ఉంది. అలాగే ఇప్పటి వరకు చేపట్టిన పనులకు దాదాపు రూ.9వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్లో మాత్రం ప్రభుత్వం రూ.2,514 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది బడ్జెట్లోనూ ప్రభుత్వం రూ.2 వేల కోట్లే కేటాయించగా, ఆ మాత్రం నిధులను కూడా ఖర్చు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. సరైన నిధుల కేటాయింపులు లేకపోవడంతో ప్రాజెక్ట్ పను లు ముందుకు సాగే పరిస్థితులు కన్పించడం లేదు. -
‘ఆశాల హామీలు నెరవేర్చాలి’
వనపర్తి రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశా కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలో జిల్లా కమిటి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు మర్రికుంట ధర్నా చౌక్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో కనీస వేతనం రూ.18 వేలు ప్రకటించాలని, రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. అదనపు పనులకు అదనపు వేతనం చెల్లించాలని, అధికారుల వేధింపులు ఆపాలని, పండుగ, వారాంతపు సెలవు సర్క్యులర్ ఇవ్వాలని, పని భారం తగ్గించాలని కోరారు. ఈ సమయంలో పోలీసులకు సీఐటీయూ నాయకులు, ఆశా కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభిని కలిసి డిమాండ్ల వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, నాయకులు బొబ్బిలి నిక్సన్, పీఎన్ రమేష్, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బుచ్చమ్మ, కార్యదర్శి సునీత, భాగ్య, గిరిజ, ఇందిర, సత్యమ్మ, శాంతమ్మ, జ్యోతి, చిట్టెమ్మ, రమాదేవి, శారద పాల్గొన్నారు. -
ప్రభుత్వం తరఫున ముస్లింలకు ఇఫ్తార్
వనపర్తి: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు మతపెద్దల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తీర్మానించామని, తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. వైద్య కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా డా. డి.కిరణ్మయి వనపర్తి: జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా డా. డి.కిరణ్మయి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. డా. కిరణ్మయి జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్‌లో మూడేళ్లుగా గైనకాలజీ నిపుణురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. రైస్‌మిల్లు తనిఖీ చేసిన డీఎస్ఓ కొత్తకోట రూరల్: మండలంలోని మిరాసిపల్లి సమీపంలో ఉన్న ఓ రైస్ మిల్లులో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు ఇదివరకు సీజ్ చేశారు. ఆ ధాన్యాన్ని రాత్రికి రాత్రి తరలిస్తున్నారన్న ప్రాథమిక సమాచారంతో డీఎస్ఓ కాశీవిశ్వనాథ్ బుధవారం మిల్లుకు చేరుకొని పరిశీలించారు. లారీలో ఉన్న వరి ధాన్యం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుంచి మిల్లు యజమాని కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు పత్రాలు చూపించారని డీఎస్ఓ వివరించారు. సీజ్ చేసిన ధాన్యం భద్రంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.7,050 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,050, కనిష్టంగా రూ.4,001 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,649, కనిష్టంగా రూ.6,111, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,329, కనిష్టంగా రూ.2,137, ఆముదాలు, జొన్నలు గరిష్టంగా రూ.4,379, కనిష్టంగా రూ.3,977 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో కందుల ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,019గా ఒకే ధర పలికింది. నల్లకుసుమలు రూ.4,109.. నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నల్లకుసుమలు క్వింటాల్‌కు గరిష్టం, కనిష్టంగా రూ.4,109 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7,475, వేరుశనగ గరిష్టం రూ.5,449, కనిష్టం రూ.5,020, జొన్నలు గరిష్టం రూ.4,735, కనిష్టం రూ.2,812, అలసందలు గరిష్టం రూ.7,176, కనిష్టం రూ.5,109, ఎర్ర కందులు గరిష్టం రూ.7,311, కనిష్టం రూ.6,069, తెల్ల కందులు గరిష్టం రూ.7,305, కనిష్టం రూ.6 వేలు పలికాయి. -
అబద్ధాల చిట్టా చదివారు..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఈసారి బడ్జెట్లో పాలమూరు యూనివర్సిటీకి కేటాయింపులు పెరిగాయి. గతేడాది యూనివర్సిటీకి వేతనాల కోసం రూ.11 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది రూ.200 కోట్లు అభివృద్ధి కోసం, రూ.66 కోట్లు వేతనాల కోసం ప్రతిపాదించారు. వేతనాల్లో కొత్తగా వస్తున్న ఇంజినీరింగ్, లా కళాశాలు, పీజీ కళాశాల సిబ్బంది వివరాలు కూడా ఉన్నారు. కాగా..ఈ సారి బడ్జెట్లో ప్రభుత్వం సిబ్బంది వేతనాల కోసం రూ.15.19 కోట్లు, అభివృద్ధి కోసం రూ.35 కోట్లును కేటాయించింది. మొత్తంగా పీయూకి రూ.50.19 కోట్లను కేటాయించారు. వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్పలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతం కంటే అధికంగా నిధులు కేటాయించిందని, దీంతో యూనివర్సిటీ మరింత అభివృద్ధి జరుగుతుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన వికాసాన్ని కొద్ది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేసింది. డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా మళ్లీ అబద్ధాల చిట్టా చదివారు. ఒక్క ఏడాది నోరు కట్టుకొని ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మూడో బడ్జెట్లోనే చతికిలబడ్డారు. అధికారం చేపట్టి రెండేళ్లుగాకముందే తెలంగాణ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. 15 నెలల్లో రూ.58 వేల కోట్లు అప్పుజేసి సాధించిన ప్రగతి ఏంటో చెప్పాలి. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి అబద్ధాలు వండి వార్చారు. – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి, వనపర్తి -
ప్రజామోద బడ్జెట్..
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం అసెంబ్లీలో అన్నివర్గాలకు మేలు చేకూర్చే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 90 శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాగునీటి రంగానికి సైతం తగిన ప్రాధాన్యతనిచ్చి నిధుల కేటాయింపులు చేశాం. పదేళ్లుగా నిర్వీర్యమైన కార్పొరేషన్లకు నిధులు కేటాయించి పునరుజ్జీవం వచ్చేలా పద్దులు ఉన్నాయి. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి బడ్జెట్లో వెనుకబడిన పాలమూరుకు ప్రత్యేకంగా చేసిన కేటాయింపులు ఏమీ లేవు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. 15 నెలల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రైతుభరోసాకు రైతులు ఎదురుచూసే దుస్థితి నెలకొంది. రుణమాఫీ అరకొరగా చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది. అంకెల గారడీతో రూ.మూడు లక్షల కోట్ల బడ్జెట్ అని గొప్పలు చెప్పుకోవడమే సరిపోయింది. – నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి ప్రత్యేక కేటాయింపులేవీ? -
చదువుతోనే సమాజంలో గుర్తింపు
పాన్‌గల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని.. ఉన్నత లక్ష్య ఛేదనకు నిరంతరం శ్రమించి పట్టుదలతో సాధించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం మండలంలోని మాందాపూర్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం, పదోతరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పెద్ద పెద్ద కలలు కనాలని.. వాటి సాకారం కోసం సమయాన్ని వృథా చేయకుండా ప్రయత్నించాలని సూచించారు. పది విద్యార్థులు వార్షిక పరీక్షలను భయంతో కాకుండా ఇష్టంతో రాసి ఉత్తమ జీపీఏ సాధించాలన్నారు. చెడు అలవాట్లు, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని, ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయ బృందం ఎస్పీని శాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, జిల్లా విద్యాశాఖ అధికారులు చంద్రశేఖర్, గణేష్, ఎంఈఓ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ జయరాములుసాగర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. -
బీసీ బిల్లు చరిత్రాత్మకం : కాంగ్రెస్
వనపర్తిటౌన్: వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లు చరిత్రలో శాశ్వతంగా గుర్తుండిపోతుందని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుందని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు 62 రోజుల పాటు పకడ్బందీగా ఇంటింటి సర్వేతో సమగ్ర వివరాలతో ప్రజామోదానికి అనుగుణంగా అడుగులు వేసిందని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నప్పటికీ ప్రచార లోపంతో వెనుకబడి ఉన్నామని అంగీకరించారు. బీసీ బిల్లుకు చొరవ తీసుకున్న కాంగ్రెస్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు అండగా నిలవాలని కోరారు. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు మాని ప్రజా అభ్యున్నతికి విలువైన సూచనలు ఇచ్చేందుకు ముందుకు రావాలని హితవు పలికారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ నేత కోళ్ల వెంకటేష్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధనకు మాదిగ జాతి మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తోందని, వర్గీకరణ పోరులో ఎందరో అమరులయ్యారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు ముందుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించేందుకు ప్రతి ఊరిలో మాదిగలు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నారాయణ, గోర్ల జానకిరాములు, నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పంటల సంరక్షణకు చర్యలు
వనపర్తి రూరల్: జిల్లాలో రైతులు సాగుచేసిన యాసంగి పంటలు ఎండిపోకుండా సరిపడా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు అన్నిరకాల చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని పెద్దగూడెంతండా పరిధిలో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. తామంతా బోరుబావులపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నామని.. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని, ఆదుకోవాలని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. మొత్తం 36 మంది రైతులకు చెందిన 45 ఎకరాల పంట ఎండిపోయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఆందోళనకు గురికావద్దని సరిపడా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు అటవీశాఖ నుంచి అభ్యంతరాలున్నందున దానికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి పనుల పరిశీలన.. మండలంలోని తిరుమలయ్యగట్టు ప్రాంతంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. పని ప్రదేశాల్లో చలువ పందిళ్లు, తాగునీటి వసతిని తనిఖీ చేశారు. ఎన్ని గంటల వరకు పనులు చేస్తున్నారని కూలీలను అడగ్గా మధ్యాహ్నం 12 వరకు చేస్తున్నామని బదులిచ్చారు. కూలీలతో ఏయే పనులు చేయిస్తున్నారని డీఆర్డీఓను ప్రశ్నించగా.. నీటి గుంతలు తీయించే పనులు చేయిస్తున్నామని సమాధానమిచ్చారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ, జిల్లా వ్యవసాయశాఖ అధికారితోపాటు విద్యుత్‌శాఖ ఎస్ఈ రాజశేఖరం, డీఈ శ్రీనివాసులు, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, ఇతర వ్యవసాయ అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
ఆయకట్టు రైతులను ఆదుకోవాలి
మదనాపురం: కురుమూర్తి ఎత్తపోతల పథకం ఆయకట్టులో రైతులు సాగు చేసిన యాసంగి పంటలు ఎండిపోకుండా నీటిని అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ కోరారు. మంగళవారం మండలంలోని రామన్‌పాడు జలాశయంలో నీటి నిల్వలు, పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుందని, పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. రాష్ట ప్రభుత్వం కర్ణాటక అధికారులతో మాట్లాడి జూరాల ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేయించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వెంకట్రాములు, నాయకులు వెంకటేష్, చెన్నయ్య, కొత్తపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు 152 మంది గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ పరీక్షలకు 152 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీరంగాపూర్, పెబ్బేర్, వీపనగండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించినట్లు చెప్పారు. మొత్తం 6,012 మంది విద్యార్థులకుగాను 5,860 మంది హాజరైనట్లు వివరించారు. రామన్‌పాడులో 1,016 అడుగులు మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం 1,016 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదని చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 39 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 112 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. బకాయి వేతనాలు చెల్లించాలంటూ ధర్నా వనపర్తి రూరల్: పెండింగ్ వేతనాలతో పాటు ఫీఎప్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ చట్టాలు అమలు చేయాలంటూ గ్రామపంచాయతీ కార్మికులు మంగళవారం తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ముందుగా మర్రికుంట నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీయూసీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అరుణ్‌కుమార్ హాజరై మాట్లాడారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతినెల వేతనాలు తీసుకోవడానికి డబ్బులుంటాయిగాని దళిత, బీసీ, మైనార్టీ, బహుజనులైన గ్రామపంచాయతీ కార్మికులకు ఇవ్వడానికి నెలకు రూ.60 కోట్లు లేవా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీల్లో సుమారు 60 వేల మంది కార్మికులు ఉన్నారని.. 2 నుంచి 7 నెలల వరకు బకాయి వేతనాలు చెల్లించాల్సి ఉందని వారంతా ఎలా బతకాలన్నారు. తక్షణమే కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డీఎల్పీఓకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సుబ్బయ్య, ఘట ్టమ్మ, రామచంద్రయ్య, కురుమయ్య, ఖరీం, గంగమ్మ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటికే భద్రాచలం సీతారాముల తలంబ్రాలు వనపర్తి టౌన్: ఆర్టీసీ కార్గో ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం రాత్రి ఆర్టీసీ డిపోలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను అధికారులతో కలిసి విడుదల చేశారు. అ నంతరం మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితు లు, అనారోగ్యం, దూరభారం తదితర కార ణాలతో భద్రాచలం వెళ్లలేని వారికి కార్గో ద్వారా తలంబ్రాలు ఇంటికి చేర్చుతామన్నా రు. కావాల్సిన భక్తులు సమీప ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో రూ.151 చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్‌ఫోన్ నంబర్లు 98663 44200, 88018 28143, 88868 48518, 73828 29494 సంప్రదించాలన్నారు. నేడు జాబ్‌మేళా జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో బుధవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొమ్మిది ప్రైవేట్ కంపెనీల్లో 935 ఉద్యోగాల భర్తీ కోసం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 99485 68830, 95502 05227, 91753 05435 నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు. -
అంగన్వాడీల హామీలు నెరవేర్చాలి : సీఐటీయూ
వనపర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలంటూ మంగళవారం జిల్లాకేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా సీఐటీయూ, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శారద ఆధ్వర్యంలో మర్రికుంట ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీ వెళ్లారు. కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు డిమాండ్ల వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీ ప్రకారం వేతనం రూ.18 వేలకు పెంచాలని, మినీ నుంచి ప్రధాన అంగన్వాడీగా మార్చిన టీచర్లకు పది నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేసవిలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా మే నెలలో సెలవులు ఇవ్వాలన్నారు. కొత్త జీఓలు విడుదల చేసి టీచర్లకు రూ.రెండు లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష రిటైర్మెంట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొబ్బిలి నిక్సన్, పీఎన్ రమేష్, నందిమళ్ల రాములు, మద్దిలేటి, నారాయణమ్మ, కవిత, రమాదేవి, శాంతాబాయి, రాజేశ్వరి, మహేశ్వరి, సంగీత, భారతి, రేణుక, శారద, వెంకటేశ్వరమ్మ, సుమతి తదితరులు పాల్గొన్నారు. -
నిధులు వచ్చేనా.. పనులు సాగేనా?
ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణాలు కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వల మరమ్మతు, డిస్ట్రిబ్యూటరీ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా సుమారు రూ.89.9 కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల కింద నాగిరెడ్డిపల్లి పంప్‌హౌస్ వద్ద రూ.19.68 కోట్లు, తీలేరు పంప్‌హౌస్ వద్ద రూ.19.62 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కోయిల్‌సాగర్ బ్యాక్‌వాటర్ నుంచి తవ్విన దేవరకద్ర గ్రావిటీ కెనాల్ చౌదర్పల్లి నుంచి లక్ష్మిపల్లి వరకు రూ.21 కోట్ల విలువైన పనులు పెండింగ్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాల్వల కింద, గ్రావిటీ కెనాల్ పరిధిలో, ఎడమ కాల్వ పొడిగింపు పనులకు గాను సేకరించిన భూములకు సంబంధించి ఇంకా 347 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. గద్వాల: వలసలకు మారుపేరైన పాలమూరు వరుస మార్చాలనే తలంపుతో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్ల పాలనలో దాదాపు పనులన్నీ 70– 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న రాజశేఖరరెడ్డి మరణం, వరదలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవి ర్భావం వంటి పరిణామాలతో ఆయా ప్రాజెక్టు పనుల గమనానికి అడ్డంకిగా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన రెండు దశాబ్దాలుగా జలయజ్ఞం ప్రాజెక్టులు పెండింగ్‌లోనే కొనసాగుతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో పాలమూరు వాసి అయిన సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల వరద పారి పంట పొలాలకు సాగునీరు అందుతుందనే అన్నదాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. కోయిల్‌సాగర్‌ది అదే దారి.. గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో ముందుకు సాగని వైనం తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాపై కరుణ చూపేనా పెండింగ్ పనులు పూర్తయితేనే పాలమూరు సస్యశ్యామలం నేడు రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆశలు -
ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలి
వనపర్తి: పోలీసు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సీఐలు, ఎస్ఐలను ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొమ్మిది మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి.. వాటిని సత్వర పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్ఐలు, సీఐలకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లా పోలీసు శాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. లక్ష్యం లేని చదువుతో గమ్యం చేరుకోలేం.. అమరచింత: విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని.. లక్ష్యం లేని చదువుతో గమ్యం చేరుకోవడం కష్టమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అమరచింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు బట్టి పట్టే చదువులకు స్వస్తి పలకాలన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని సూచించారు. నిత్యం ఉపాధ్యాయులను గౌరవించినప్పుడే చక్కగా అన్ని విషయాల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు. గతంలో ఉపాధ్యాయులు ఏది చెప్పినా విద్యార్థులు వినే వారని.. అందుకే ఉన్నతంగా రాణించి మంచి ఉద్యోగాలు సాధించారన్నారు. నేటి తరం విద్యార్థుల్లో కొందరు సెల్‌ఫోన్ వినియోగించడం ద్వారా చదువుల్లో రాణించలేక పోతున్నారని తెలిపారు. విద్యార్థి ఏ రంగంలో ప్రావీణ్యం కలిగి ఉన్నాడో గుర్తించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గురుకులంలో చదువుతున్న పూర్ణ అనే విద్యార్థినిలో ఉన్న లక్ష్యాన్ని అప్పటి కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ గుర్తించి, తోడ్పాటు అందించడంతో ఎవరెస్టు శిఖరం ఎక్కి ప్రపంచ గుర్తింపు తెచ్చుకుందని గుర్తుచేశారు. పదో తరగతి విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శివకుమార్, హెచ్ఎం కృష్ణవేణి, రిటైర్డ్ టీచర్ షేక్ అహ్మద్ పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి
వనపర్తి రూరల్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కనీస వేతనం ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సోమవారం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శారద ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో 48 గంటల సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐసీడీఎస్ సేవలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యావిధానం చట్టాన్ని అమలుచేసే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గ్రాడ్యూటీ అమలు చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ. 18వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొబ్బిలి నిక్సన్, పీఎన్ రమేశ్, కవిత, రమాదేవి, జ్యోతి, నాగేంద్రమ్మ, సంధ్యారాణి, విజయమ్మ, గోవిందమ్మ, సుగుణబాయి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్ఆర్ఎస్ను విస్మరిస్తే ఇబ్బందులు తప్పవు
వనపర్తి: అనుమతి లేని, అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకోకపోతే ఇబ్బందులు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి ఎల్ఆర్ఎస్పై మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో అనుమతి లేని, అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని కమిషనర్లను ఆదేశించారు. అనధికారిక ప్లాట్లను రెగ్యులరైజ్ చేయించుకోకపోతే భవిష్యత్‌లో వాటిని అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉండదన్నారు. అనుమతి లేని ప్లాట్లను తక్షణమే ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోవాలని సూచించారు. ఇప్పటికే రూ.వెయ్యి చెల్లించి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ వార్డు ఆఫీసర్ల ద్వారా ఫోన్‌కాల్స్ చేసి తెలియజేయాలని.. అవసరమైతే నోటీసులు కూడా జారీ చేయాలన్నారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని తెలిపారు. దరఖాస్తుదారులకు ఫోన్‌కాల్స్ చేసినప్పుడు ఎల్ఆర్ఎస్ ప్రయోజనాల గురించి వివరించాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా ఆస్తిపన్ను వసూలును వేగవంతం చేయాలన్నారు. మొండి బకాయిదారులకు నోటీసులు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. నెలాఖరులోగా నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు. భవిత కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అన్నిరకాలుగా శిక్షణ, సహకారం అందించి సాధారణ పిల్లలతో సమానంగా తీర్చిదిద్దడమే భవిత కేంద్రం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా కేంద్రంలోని మండల విద్యాధికారి కార్యాలయంలో ఉన్న భవిత కేంద్రంలో విద్యాశాఖ, సమగ్రశిక్ష, అలింకో సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన 69 మంది పిల్లలకు ఉచితంగా ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, క్లచర్స్, వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత కేంద్రంలో శారీరకంగా బలహీనమైన పిల్లలకు ఫిజియోథెరపీ, వినికిడి సక్రమంగా లేని పిల్లలకు ప్రత్యేకమైన బోధన అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రాన్ని భవిత కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్ ఘని, భవిత కేంద్రం అధికారి యుగేందర్, ఎంఈఓ మద్దిలేటి, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు.. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ప్రజావాణికి 43 ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు అనుమతి లేని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
గుర్రంగడ్డ పనుల్లో కదలిక
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో.. గత ప్రభుత్వం 2018లో రూ.12కోట్లతో బ్రిడ్జీ నిర్మాణం చేపట్టాలని పనులు మొదలుపెట్టింది. అయితే పనుల దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చాడు. దీనిపై అధికారులు పలుమార్లు నోటీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాంట్రాక్టర్లో మాత్రం చలనం లేదు. దీంతో గత ఏడేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు వేటు వేశారు. 60సీ నోటీసులు జారీ చేసి పాత కాంట్రాక్టర్, కన్స్ట్రక్షన్ ఏజెన్సీని తొలగించి నూతనంగా మరో ఏజెన్సీకి పనులు అప్పగించారు. దీంతో పనులు దక్కించుకున్న ఏజెన్సీ పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం పనులు వేగవంతం సాగుతున్నాయి. వేసవి కాలంలో పనులు వేగవంతం చేసి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని.. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గుర్రంగడ్డ వాసులు కోరుతున్నారు. నూతన ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు ●● కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం.. ● అత్యవసర పరిస్థితుల్లో నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు ● వంతెన నిర్మాణంతో తీరనున్న కష్టాలు గద్వాల: ఏడాదిలో ఆర్నెళ్లు దీవిలో.. మరో ఆర్నెళ్లు మైదాన ప్రాంతంలో జీవిస్తున్నారు గుర్రంగడ్డవాసులు. విద్య, నిత్యావసర వస్తువులు, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు పొందాలన్నా పుట్టీల సాయంతో నది దాటాల్సిందే. కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం ఇదే. వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని ఏళ్లుగా గుర్రంగడ్డ వాసులు కోరుతున్నా.. బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తవడంలేదు. తాజాగా వంతెన నిర్మాణ పనులను కొత్త ఏజెన్సీకి అప్పగించామని, పనులు వేగవంతం చేసి కష్టాలు తొలగిస్తామని అధికారులు పేర్కొంటుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్నెళ్లు నది మధ్యలోనే.. వానాకాలం సీజన్లో భారీగా కురిసే వర్షాలకు వరద వచ్చి చేరడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటుంది. ఈ సమయంలో గుర్రంగడ్డ వాసులు పుట్టీలు, పడవల ద్వారా ప్రయాణించాల్సిందే. ఈక్రమంలో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నది మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈగ్రామంలో మొత్తం 600 కుటుంబాలు నివాసం ఉంటుండగా 450 మంది వరకు ఓటర్లున్నారు. మొత్తం వ్యవసాయ భూమి విస్తీర్ణం 2100 ఎకరాలు కాగా ఇందులో సుమారు 1600 ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగుచేస్తారు. ఇందులో ప్రధాన పంట వరి. ఇలాంటి పరిస్థితిలో నదిలో భారీగా వరద ప్రవహిస్తున్నప్పుడు బాహ్యప్రపంచంతో దీవివాసులకు పూర్తిగా సంబంధాలు కోల్పోతాయి. ఏడాదిలో ఆర్నెళ్ల వరకు ఈ కష్టాలు వెంటాడుతుంటాయి. రూ.12 కోట్లతో బ్రిడ్జి పనులు ప్రారంభం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది మధ్యలో ఉన్న ఏకై క దీవి గ్రామం గుర్రంగడ్డ. ఈ గ్రామ ప్రజల రాకపోకలకు ఏకై క మార్గం నదిలో పుట్టీల ద్వారా ప్రయాణం చేయడం. దీవిగ్రామ ప్రజల కష్టాలు తీర్చాలని గత ప్రభుత్వం హయాంలో 2015లో రూ.12కోట్ల అంచనాలతో వంతెన నిర్మాణ పనులను చేపట్టారు. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సకాలంలో పనులు మొదలు పెట్టకపోవడంతో గత ఏడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పనులు ముందుకు సాగలేదు. తాజాగా అధికారులు పాత ఏజెన్సీని మార్చేసి కొత్త ఏజెన్సీకి పనులు అప్పచెప్పడంతో పనుల్లో కదలిక మొదలైంది. వచ్చే ఏడాది వరకు పనులు పూర్తి చేసి రాకపోకలు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఏడాదిలో పూర్తి చేస్తాం 2018లో రూ.12కోట్లతో గుర్రంగడ్డ వంతెన నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయలేదు. దీంతో పాత ఏజెన్సీకి 60సీ నోటీసులు ఇచ్చి తొలగించాం. కొత్త ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు అప్పగించాం. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. – రహీముద్దీన్, ఇన్చార్జ్ ఎస్ఈ -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
వనపర్తి టౌన్: జిల్లా ప్రజలు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈ రాజశేఖరం చెప్పారు. జిల్లా విద్యుత్‌శాఖ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లోఓల్టేజీ సమస్యను అధిగమించేందుకు వనపర్తి మండలం రాజపేట, పెద్దమందడి మండలం వెల్టూర్, పెబ్బేరు మండలం గుమ్మడం, ఖిల్లాఘనపురం మండలం మానాజీపేట సబ్స్టేషన్లలో అదనంగా పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా మరో నాలుగు పవర్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరయ్యాయని చెప్పారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు దాదాపు రూ. కోటికి పైగా ఉంటుందన్నారు. వీటి కెపాసిటీ 5 ఎంవీఏ అని తెలిపారు. శ్రీరంగాపూర్, కంచిరావుపల్లి, పెబ్బేరు, చిన్నమందడి తదితర ప్రాంతాల్లో మరో రెండు వారాల్లో వీటిని ఏర్పాటు చేసి విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు లోఓల్టేజీ సమస్యను పూర్తిగా అధిగమిస్తామని తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 296 మంది గైర్హాజరు వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 7,245 మంది విద్యార్థులకు గాను 6,949 మంది హాజరు కాగా.. 296 మంది గైర్హాజరైనట్టు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సూర్య ఒకేషనల్ కళాశాల, వాగ్దేవి కళాశాల పరీక్ష కేంద్రాలను డీఐఈఓ తనిఖీ చేశారు. అంతకు ముందు వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు. రైతులను ఆదుకోవాలనే స్పృహ లేని ప్రభుత్వం వనపర్తి రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యం కేసీఆర్‌ను నిందించడం తప్ప.. పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలనే ధ్యాస, స్పృహ, చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి మండలం పెద్దగూ డెం తండాలో రైతు జూలానాయక్ సాగుచేసిన మూడెకరాల వరిపంట ఎండిపోగా.. సోమ వారం మాజీ మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరెంటు కోతలతో నీరందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సాగునీటి కొరత, కరెంటు కోతలతో హరిగోస పడుతున్నారన్నారు. మరోవైపు మూడెకరాల వరకు రైతుభరోసా సాయం అందించామని చెప్పడం బూటకమని ధ్వజమెత్తారు. ఆర్థికశాఖ, విద్యుత్‌శాఖ, వ్యవసాయశాఖ మంత్రులు సమన్వయంతో పనిచేసి ఉంటే రైతుభరోసా కోసం గోస పడేవారు కాదని.. 448 మంది రైతుల ఆత్మహత్యలు జరిగేవి కావని.. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయ్యేవి కావన్నారు. ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, ధర్మానాయక్, కృష్ణానాయక్, చిట్యాల రాము, చంద్రశేఖర్, నారాయణ నాయక్, టీక్యానాయక్, రూప్లానాయక్ పాల్గొన్నారు. యూజీసీ సంస్కరణలను వ్యతిరేకిద్దాం వనపర్తి విద్యావిభాగం: రాష్ట్ర యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే యూజీసీ నూతన సంస్కరణలను ప్రతి విద్యార్థి వ్యతిరేకించాలని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కందుకూరి పవన్‌కుమార్ పిలుపునిచ్చారు. యూ జీసీ సంస్కరణలకు వ్యతిరేకంగా ఈ నెల 26న పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించే సదస్సుకు సంబంధించిన పోస్టర్లను సోమవారం జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూజీసీ నూతన సంస్కరణలతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫెలోషిప్‌ల కోత పెట్టారన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించకుండా కుట్రలు చేయడం తగదన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సాయికృష్ణ, రాకేష్, ప్రవీణ్, బీచుపల్లి, రాఘవేంద్ర, నరేష్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, ఆంజనేయులు, కార్తీక్, దాసురాం నాయక్ పాల్గొన్నారు. రామన్‌పాడులో 1,016 అడుగుల నీటిమట్టం మదనాపురం: రామన్‌పాడు జలశయంలో సో మవారం 1,016 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ కాల్వకు 28 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 57, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
మైనార్టీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు
● ఉమ్మడి జిల్లాలో 20 కాలేజీలు.. 1,600 సీట్లు ● ఈ నెల 31 వరకు దరఖాస్తులకు అవకాశం స్టేషన్ మహబూబ్‌నగర్: మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 మైనార్టీ గురుకుల కళాశాలలు కొనసాగుతుండగా.. వీటిలో 10 బాలుర, 10 బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. కాగా.. మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025– 26 ప్రవేశాల కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31 వరకు ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో.. ఉమ్మడి జిల్లాలోని 20 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,600 సీట్లు ఉన్నాయి. వీటిలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెండు ఒకేషనల్ మైనార్టీ బాలికల– 2 గురుకుల జూనియర్ కళాశాల (అడ్వాన్స్ అండ్ టాక్సేషన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ), బాలుర– 3 జూనియర్ కళాశాలలో (ఎంఎల్టీ, కంప్యూటర్ సైన్స్) 80 సీట్లు, మిగతా 18 జనరల్ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో చెరో 80 సీట్లు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రకారం.. ఒక్కో మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఒక్కో గ్రూప్‌లో 40 సీట్ల చొప్పున రెండు గ్రూప్‌ల్లో 80 సీట్లు ఉంటాయి.మైనార్టీలకు 75 శాతం రిజర్వేషన్ల ప్రకారం 30, (ముస్లింలకు 26, క్రిస్టియన్లు 2, జైన్స్, పార్సిస్, బుద్దిస్ట్, సిక్కులకు 2 సీట్లు), ఇతరులకు 25 శాతం రిజర్వేషన్ల ప్రకారం 10 (ఎస్సీ 2, ఎస్టీ 2, బీసీ 5, ఓసీ 1) సీట్లు కేటాయిస్తారు. నాణ్యమైన విద్య.. మైనార్టీ గురుకుల కళాశాలల్లో వి ద్యార్థులకు నాణ్యమైన విద్యతో పా టు మెరుగైన వసతి సౌకర్యాలు అందిస్తున్నాం. విద్యా ర్థులు కళా శాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో ద రఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రవేశాలకు సంబంధించి మిగతా సమాచారాన్ని సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలి. – ఖాజా బాహుద్దీన్, ఆర్ఎల్సీ, మహబూబ్‌నగర్ -
‘రైతు హామీలు నెరవేర్చాలి’
ఆత్మకూర్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే నెరవేర్చాలని, సమస్యలన్నింటిని పరిష్కరించాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మూడో మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాసన్న, ఉపాధ్యక్షులుగా భీమన్న, ప్రదీప్, కార్యదర్శిగా రాబర్ట్, సహాయ కార్యదర్శులుగా ఆర్ఎన్ కుమార్, మశప్పతో పాటు 15 మంది సభ్యులను ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, నాయకులు సీఎన్ శెట్టి, మోషా, భరత్, బాలరాజు, లింగన్న, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి కొత్తకోట రూరల్: పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఆదివారం కొత్తకోటలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన కృషితోనే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. మహాత్ముడు బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేశారని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు అందరం పునరంకితం అవుదామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బీచుపల్లి, ఏజే బోయేజ్, మేసీ్త్ర శ్రీనివాసులు, ఎల్లంపల్లి నరేందర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, లక్ష్మయ్య, ఎజాజ్‌అలీ, తయ్యబ్, రఫీఖాన్, సంద వెంకటేశ్, వైశ్యసంఘం నాయకులు బాదం వెంకటేష్, రమేష్, ఆర్.వెంకటేష్, బాలరాజు యాదవ్, పసుపుల రమేష్, క్రాంతికుమార్, అంజి సాగర్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గోపాల్పేట: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని.. జిల్లాను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రం నుంచి ఏదుట్ల వెళ్లే దారిలో హనీ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని.. అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. అనంతరం స్థానిక కార్యకర్తలతో మాట్లాడి స్థానిక విషయాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు సత్యశిలారెడ్డి, కొంకి వెంకటేశ్, శివన్న, కొంకి రమేశ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
మాధవరెడ్డి సేవలు మరువలేనివి
గోపాల్పేట: డా. మాధవరెడ్డి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో న్యూరోసర్జన్‌గా పనిచేస్తూనే జిల్లా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించారని.. ఆయన సేవలు మరువలేనివని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కొనియాడారు. ఆదివారం మండల కేంద్రంలో జిల్లెల మాధవరెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చి ఉచితంగా వైద్యసేవలు పొందిన ఎందరో పేదలు ఆయనను నేటికీ మర్చిపోలేదని గుర్తుచేశారు. మాధవరెడ్డి సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల వనపర్తిలో జరిగిన సభలో ఖాసీంనగర్ ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టారని.. సంతోషించదగిన విషయమన్నారు. ఇదిలా ఉండగా వైద్య శిబిరంలో మహబూబ్‌నగర్ ఎస్వీఎస్ ఆస్పత్రి నుంచి కంటి, పంటి, కీళ్ల నొప్పులకు సంబంధించిన వైద్యులు, నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తిలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నుంచి పది మంది వైద్యులు, సిబ్బంది వచ్చి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే హైదరాబాద్ గ్రేస్ క్యాన్సర్ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు, సిబ్బంది క్యాన్సర్ నిర్ధారణ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. గోపాల్పేట, రేవల్లి, ఏదుల, పెద్దమందడి, వనపర్తి రూరల్ తదితర ప్రాంతాల నుంచి సుమారు ఆరు వేల మందికి పైగా రోగులు వచ్చిన వైద్య పరీక్షలు చేసుకున్నారు. వైద్య శిభిరానికి వచ్చిన ప్రజలకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించారు. గ్రామాల నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించడంతో పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అడిగిన వెంటనే ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించిన డాక్టర్లు, సిబ్బందికి డా. చిన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆయన కుమారుడు జిల్లెల ఆదిత్యారెడ్డి, పరావస్తు ఫౌండేషన్ ఫౌండర్ మధుకర్‌స్వామి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
చంద్రగఢ్ కోట అభివృద్ధికి ప్రాధాన్యం
అమరచింత: చంద్రగఢ్ కోట చరిత్రను అధ్యయనం చేసి పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ప్రాచీన చంద్రగఢ్ కోటను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి సందర్శించారు. కోట లోపల ఉన్న రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాతి కొలనులు, కోటను పరిశీలించి మాట్లాడారు. కోట, ఆలయ ప్రాచుర్యం, చరిత్రను వెలికి తీసేందుకు కృషి చేస్తామని.. కోట వద్ద మౌలిక సౌకర్యాల కల్పనకు ముందస్తుగా రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఈ నిధులతో కోటపై భాగానికి వెళ్లడానికి సీసీ రహదారి నిర్మించాలని అధికారులను ఆదేశించారు. సమీపంలోనే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఉందని.. అక్కడి పర్యాటకులతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కోటను చూడటానికి వస్తుంటారని, పర్యాటక కేంద్రంగా గుర్తించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి పురావస్తుశాఖ అధికారులను పంపించి చరిత్రను గుర్తించి కోట అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శివకుమార్, ఎస్ఐ సురేశ్, కాంగ్రెస్‌పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి.. ఆత్మకూర్: గత పాలకుల నిర్లక్ష్యంతోనే పర్యాటక రంగం అభివృద్ధికి నోచుకోలేదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని పరమేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే డా. వాకిటి శ్రీహరితో కలిసి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పరమేశ్వరస్వామి ఆలయ చరిత్ర ఎంతో ఘనమైందని.. ఆలయంతో పాటు చెరువు అభివృద్ధికి కృషి చేస్తానని, ఇందుకు కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చాంద్‌పాషా, నాయకులు రహ్మతుల్లా, గంగాధర్‌గౌడ్, పరమేశ్, తులసిరాజ్, శ్రీను, సాయిరాఘవ, యాదగిరిశెట్టి, తెలుగు నాగేష్, మశ్ఛందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.25 లక్షలు మంజూరు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
అంతర్ జిల్లాల దారిలో.. అవస్థల ప్రయాణం
కేంద్రానికి ప్రతిపాదించాం.. స్టేట్ హైవేలను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అందులో ప్రధానంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాలుగు రోడ్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న రహదారుల మంజూరు కోసం కృషి చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి రోడ్ల ఆవశ్యకతను వివరించాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్ -
జలం.. తగ్గుముఖం
రోజురోజుకు పడిపోతున్న భూగర్భ నీటిమట్టం రెండునెలలు గడ్డుకాలమే.. రానున్న ఏప్రిల్, మే మాసంలో భూగర్భ జలమట్టం మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా చెరువులు, రిజర్వాయర్లలో గతేడాదితో పోలిస్తే నీటి నిల్వలు కొంతమేర ఉండటం ఊరట కలిగిస్తున్నా.. పరిస్థితులు కఠినంగానే ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రెండునెలలు జిల్లా ప్రజలు, రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. వనపర్తి: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నాలుగు నెలల నుంచి వరుసగా భూగర్భ జలమట్టం తగ్గిపోతోంది. దీంతో జిల్లాలోని పానగల్, వనపర్తి, పెద్దమందడి, గోపాల్పేట, వీపనగండ్ల, కొత్తకోట, మదనాపురం తదితర మండలాల్లో సాగు చేసిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోనూ నీటినిల్వ తగ్గిపోవడం, జూరాల, భీమా, కేఎల్ఐ ప్రాజెక్టుల నుంచి సాగునీటి సరఫరా నిలిచిపోవడంతో భూగర్భ జలాలు సైతం తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరిలో కొంతమేర స్థిరంగా ఉన్నా.. మార్చిలో పెరిగిన ఉష్ణోగ్రతలతో చాలావరకు భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలో 30 ఫిజియో మీటర్లు.. జిల్లావ్యాప్తంగా 15 మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో భూగర్భ జల పరిశోధనశాఖ ఆధ్వర్యంలో 30 ఫిజియో మీటర్లు (భూగర్భ జలాలను కొలిచే యంత్రాలు) ఏర్పాటు చేయగా ఇందులో 15 మాన్యువల్, మరో 15 ఆటోమేటిక్ పద్ధతిన పని చేస్తున్నారు. ప్రతినెల చివరి వారంలో భూగర్భ జలమట్టం ఎలా ఉందనే విషయాన్ని వీటి ద్వారా అధికారులు సేకరిస్తారు. ప్రస్తుతం సాగునీటి కాల్వల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. సాగునీరు సరిపడా అందక యాసంగి వరిసాగు చేసిన రైతులు పంటలు ఎండిముఖం పట్టడంతో లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా పంటలు కోత దశకు వచ్చిన రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వనపర్తి మండలం పెద్దగూడెం, శివారు ప్రాంతాల్లో సుమారు 80 ఎకరాల వరకు వరి పంటలు ఎండుముఖం పట్టినట్లు రైతులు చెబుతున్నారు. వరి పంటకు చివరి దశలో నీరందించకపోతే దిగుబడి తగ్గి నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సమస్యను వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని చెబుతున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయా గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించి నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. ఫిబ్రవరిలో కొంత ఊరట.. జిల్లాలో గతేడాది అక్టోబర్ నుంచి వరుసగా భూగర్భ జలాలు తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరిలో కొంతమేర ఊరట కలిగించినా మార్చిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో తగ్గుతున్నాయి. – దివ్య జ్యోతి, ఏడీ భూగర్భ జలపరిశోధనశాఖ, వనపర్తి వట్టిపోతున్న బోరుబావులు.. ఎండుతున్న పంటలు మొదలైన సాగునీటి కష్టాలు లబోదిబోమంటున్న రైతులు -
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
● నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తా ● మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆత్మకూర్/అమరచింత/మదనాపురం: మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కాదని ప్రజలు తనను గెలిపించారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయం చేస్తానని, అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగుతానని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం ఆత్మకూర్ మండలం తిప్పడంపల్లి, బాలకిష్టాపూర్‌లో పార్టీ జెండాలను ఆవిష్కరించడంతో పాటు తిప్పడంపల్లిలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అలాగే అమరచింత ఏడో వార్డులో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, మదనాపురం మండలం గోపన్‌పేటలో బీజేపీ జెండా ఆవిష్కరించి వివిధ పార్టీలకు చెందిన 40 మంది పార్టీలో చేరగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రం నిరుపేదలకు పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లని డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. అర్హులందరికీ ఇళ్లు ఇప్పిస్తానని, గ్రామాల్లో హైమాస్ట్ వీధిదీపాలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి పయనిస్తున్నారని.. కేంద్రానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుర కేంద్రాల్లో తాగునీటి ఇబ్బందులు దూరం చేయడానికే కేంద్రం అమృత్ 2.0 పథకం తీసుకొచ్చిందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని పార్లమెంట్ సమావేశంలో ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. జూరాల జలాశయంలో నీటినిల్వలు రోజురోజుకు పడిపోతున్నాయని.. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తాత్కాలిక మరమ్మతులకు నిధులు అవసరం ఉంటే తనను సంప్రదించాలని సూచించారు. ఆత్మకూర్‌లో జరిగిన కార్యక్రమంలో నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, అశోక్‌జీ, అశోక్భూపాల్, అనీల్‌గౌడ్, మనోహర్, రాము, ఎల్లన్న, విష్ణురెడ్డి, శ్రీనివాస్, అమరచింతో జరిగిన కార్యక్రమంలో మంగ లావణ్య, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, రవికుమార్, పద్మజారెడ్డి, మేర్వ రాజు, భాస్కర్, మరాఠి అశోక్, వెంకటేశ్వర్లు, గోపన్‌పేటలో జరిగిన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీవం పోసినట్లయింది..
చంద్రగఢ్ ఎత్తిపోతల కింద మూడు ఎకరాల్లో వరి సాగుచేసే వాడిని. మరమ్మతులకు గురికావడంతో రెండున్నర ఏళ్లుగా సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం సాగునీరు వదులుతుండటంతో వరి పైరుకు జీవం పోసినట్లయింది. – ప్రభాకర్, రైతు, చంద్రగఢ్ మిగిలిన పథకాలు బాగుచేయాలి.. చంద్రగఢ్ ఎత్తిపోతలకు చిన్న చిన్న మరమ్మతులు చేపట్టి యాసంగి పంటలకు నీరు అందించడం హర్షణీయం. రైతుల ప్రయోజనాలకు కాపాడేందుకు బెక్కర్‌పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు సైతం నిధులు మంజూరు చేయాలి. – రవి, రైతు, చంద్రగఢ్ ఎమ్మెల్యే చొరవతో .. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం స్టార్టర్ కాలిపోయిందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి విన్నవించాం. సంబంధిత అధికారులతో మాట్లాడి అంచనాలు పంపడం, రూ.26 లక్షలు మంజూరు చేయించి పనులు పూర్తి చేయడం జరిగింది. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే చేసిన కృషి అభినందనీయం. – సర్వారెడ్డి, అధ్యక్షుడు, చంద్రగఢ్ ఎత్తిపోతల సంఘం ● -
హక్కులపై అవగాహన ఉండాలి
వనపర్తి: వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు సూచించారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్లోని పౌరసరఫరాలశాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. వినియోగదారులు ఎక్కడైనా, ఏవైనా వస్తువులు కొనేటప్పుడు నాణ్యత ప్రమాణాలు, గడువు ముగింపు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. నేటి కాలంలో ఆన్లైన్ వేదికగా చాలా మోసాలు జరుగుతున్నాయని.. ఏదైనా కొనుగోలు చేసి మోసపోతే ఆన్లైన్ ద్వారానే వినియోగదారుల ఫోరంను సంప్రదించవచ్చన్నారు. డిజిటల్ విధానంలో ఫిర్యాదు చేయడంతో పాటు వర్చువల్ హియరింగ్‌తో సకాలంలో సత్వర న్యాయం పొందవచ్చని.. ఈ సేవలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, డీటీలు, ఇతర అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు. -
ఏఐ ఆధారిత బోధన కేంద్రం ప్రారంభం
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం మనిగిళ్ల ప్రాథమిక పాఠశాలలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్) ఆధారిత బోధన కేంద్రాన్ని శనివారం జిల్లా మానిటరింగ్ అధికారి మహానంది ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు, నాలుగు, ఐదోతరగతి విద్యార్థులకు భాషా నైపుణ్యాలు, గణిత సామర్థ్యాల మీద పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఏఐ విద్య ఉపయోగపడుతుందని వివరించారు. జిల్లాలోని 11 పాఠశాలలు ఎంపికకాగా.. అందులో మనిగిళ్ల పాఠశాల ఉందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ బాణం విష్ణు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు శాంతన్న, స్థానిక ప్రజాప్రతినిధులు తిరుపతిరెడ్డి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌సాగర్, సురేష్, పల్లవి, హెచ్ఎం వెంకటేష్, రాముడు, లావణ్య, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 113 మంది విద్యార్థులు గైర్హాజరు కొత్తకోట రూరల్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంతో పాటు కొత్తకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నివేదిత జూనియర్ కళాశాల, ప్రతిభ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. 4,917 మంది విద్యార్థులకుగాను 4,804 మంది హాజరయ్యారని.. 113 మంది గైర్హాజరైనట్లు వివరించారు. డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ పెబ్బేరు రూరల్: మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం జిల్లా వైద్యాధికారి డా. అల్లె శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, పరిసరాలను పరిశీలించి సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. మండలంలోని నాలుగు ప్రైవేట్ వైద్యశాలలు, మూడు ల్యాబ్‌లు, 12 ప్రథమ చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేశామని చెప్పారు. స్థాయికి మించిన వైద్యం చేయరాదని ఆర్ఎంపీలు, పీఎంపీలను హెచ్చరించినట్లు వివరించారు. త్వరలోనే మండలంలోని అన్నిగ్రామాల్లో ఉన్న కేంద్రాలను తనిఖీలు చేస్తామని చెప్పారు. ఆయన వెంట డిప్యూటీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి బండారు శ్రీనివాసులు, హెల్త్ ఎడ్యుకేటర్ రవికుమార్, హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్ ఉన్నారు. రామన్‌పాడులో 1,017 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం 1,017 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 69 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా లేదని చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 131 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
ప్రాధాన్యం ఇస్తున్నాం..
యూనివర్సిటీలో అధ్యాపకులు, ఇటు రీసెర్చ్ స్కాలర్ ఎంతో ఉత్సహంగా పరిశోధనలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కొన్ని పేటెంట్లు కూడా వచ్చాయి. దీని ద్వారా పీయూకు ప్రాజెక్టులు, రీసెర్చ్ పరమైన అంశాల్లో ముందంజ వేస్తున్నాం. నిర్మాణంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనం ఉంది. అది అందుబాటులోకి వస్తే పీయూ రీసెర్చ్ హబ్‌గా మారనుంది. అందులో పూర్తిస్థాయిలో ల్యాబ్‌లో అధునాతన ప్రయోగ పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తాం. – శ్రీనివాస్, వైస్ చాన్స్‌లర్, పాలమూరు యూనివర్సిటీ ● -
ఆవిష్కరణలకు గుర్తింపు
పీయూలో పరిశోధనలపై దృష్టి సారించిన అధ్యాపకులు ● ఇప్పటికే కెమిస్ట్రీ విభాగంలో పూర్తిస్థాయి పేటెంట్ హక్కులు ● డిజైన్ విభాగంలో రెండు, యుటిలిటీలో ఒకటి, పరిశీలనలలో మరొకటి ● గుర్తింపు వస్తే పూర్తిస్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశం పాలమూరు యూనివర్సిటీ అధ్యాపకులు బోధనపైనే కాకుండా.. పరిశోధనలపై సైతం దృష్టిసారించారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న పరిశోధనలతో పలు అంశాల్లో పేటెంట్ రైట్స్ సైతం సాధించారు. మొత్తం కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపకులు పర్యావరణహిత రీ ఏజెంట్లు, ఎలాంటి కెమికల్స్ లేకుండా సాధారణ పర్యావరణానికి అనుకూలమైన విధానంలో తయారు చేయడం యూనివర్సిటీ చరిత్రలో ఓ మైలురాయి. దీనికి పేటెంట్ రైట్ రావడంతో టీచర్స్ అసోసియేట్ షిప్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఫెల్లోషిప్ అధ్యాపకులు చంద్రకిరణ్ ఎంపికయ్యారు. మ్యాథ్స్ విభాగంలో అధ్యాపకులు రిమోట్ కంట్రోల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తయారీ, రోలర్ స్టాంప్ తయారీకి డిజైన్ విభాగంలో పేటెంట్ రాగా.. స్ట్రెచింగ్ షీట్‌పై కాసన్ నానోఫ్లూయిడ్స్ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పంచే పద్ధతి వంటివి ఇటీవలే ఆవిష్కరించారు. ఇవి పరిశీలన దశలో ఉండగా.. మరో ఆవిష్కరణను ఎంబీఏ అధ్యాపకులు ఆన్లైన్ ట్రేడింగ్ ప్రిడెక్టర్ వంటి పరికరాలు ఆవిష్కరించారు. దీంతో ఇటు అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్స్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల అనంతరం ఒక కొత్త యంత్రాల ఆవిష్కరణతో జరిగే ప్రయోజనం వంటి అంశాలపై దృష్టిసారించారు. – మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్● రోలర్ స్టాంప్ పరికరాన్ని మ్యాథ్స్ విభాగం అధ్యాపకులు మధు ఆవిష్కరించగా.. పేటెంట్ రైట్ లభించింది. గణితం అంటే భయపడే పాఠశాల స్థాయి విద్యార్థులకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా గణిత ప్రక్రియలను సులభతరం చేసేందుకు అవకాశం ఉంది. ● రసాయన శాస్త్రంలో కెమికల్స్ ప్రాసెసింగ్, ఏరో స్పేస్, బయో మెడికల్ ఇంజినీరింగ్ పారిశ్రామిక అనువర్తనాల్లో వేడి, ద్రవ్యరాశి బదిలీలో కీలకపాత్ర పోషిస్తున్న స్ట్రెచింగ్ షీట్‌పై కానస్ నానోఫ్లూయిడ్ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పెంచే పద్ధతిలో కూడా మ్యాథ్స్ విభాగంలో పరిశోధనలు పూర్తి కాగా పేటెంట్ రైట్ పరిశీలనలో ఉన్నాయి. -
కీలకంగా పర్యావరణహిత రీ ఏజెంట్లు
రసాయన పరిశ్రమలు, ట్యాబ్లెట్లు, ఇతర పరిశ్రమల్లో కెమికల్స్ తయారు చేసేందుకు రీ ఏజెంట్లు ఎంతో కీలకంగా మారనున్నాయి. ఇందులో రీ ఏజెంట్లు మొదట తయారు చేసేందుకు పెద్ద పరిశ్రమలను స్థాపించడం, పెట్టుబడి, ఇతర పర్యావరణానికి నష్టం చేసే విధంగా ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. కానీ, పీయూ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు చేసిన ప్రయోగాలు పూర్తిగా పర్యావరణ హితం కానున్నాయి. సాధారణ గది ఊష్టోగ్రతల వద్ద చిన్న గదుల్లో సైతం రీ ఏజెంట్లను శాసీ్త్రయ పద్ధతిలో తయారు చేసే విధానాన్ని కొనుగొనడంతో మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పేటెంట్ రైట్ ప్రకటించింది. ఇందులో అధ్యాపకులు చంద్రకిరణ్, సిద్ధరామగౌడ్, రీసెర్చి స్కాలర్ స్వాతి భాగస్వాములయ్యారు. వీటితోపా టు మరో 20 రీఏజెంట్లో పరిశోధనలో ఉన్నాయి. -
రిమోట్ కంట్రోల్‌తో ఆక్సిజన్..
పీయూ మ్యాథ్స్ విభాగంలో పేటెంట్ రైట్స్ దృష్టిసారించింది. ఇందులో డిజైన్ విభాగంలో శ్వాసకోశ రోగులకు ఆక్సిజన్ థెరపీ అందించేందుకు రిమోట్ కంట్రోలర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ రూపొందించారు. ఇందులో పేషెంట్ ఆరోగ్యం, పరిస్థితి తదితర అంశాలను కాన్సన్ట్రేటర్ పరిశీలించిన తర్వాత రోగికి ఆక్సిజన్ అందిస్తుంది. అయితే రోగికి మ్యానువల్ పద్ధతిలో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండే నేపథ్యంలో కేవలం రిమోట్ కంట్రోల్ ద్వారా ఆక్సిజన్‌ను అవసరం మేరకు అందిస్తే ఇబ్బందులు తప్పనున్నాయి. ఇందులో పలు యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు శంకర్రావు, మధు, భారతి, సత్తమ్మ, లిపిక, అరుంధతి పాలుపంచుకున్నారు. -
నాణ్యతపై గొంతు విప్పండి
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంమనిషి సమగ్ర వికాసానికి న్యాయ పరిజ్ఞానం అవసరం అవుతుంది. సమాజంలో ప్రజలు ఉత్తమ వినియోగదారులుగా ఉండాలంటే చట్టాలను ఆయుధాలుగా ఉపయోగించుకోవాలి. మార్కెట్లో వ్యాపారులు చేసే మోసాలు గుర్తించి వాటిపై పోరాటం చేయడానికి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. లోపాలు ఉన్న వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో వాటి వల్ల వినియోగదారుడు నష్టపోతే దానిని ప్రశ్నించడానికి ఉన్న చట్టాలు ఉపయోగించుకోవాలి. మనుషులు ఉపయోగించే ప్రతి వస్తువును పరీక్షించి నాణ్యత తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి వస్తువు అయినా సక్రమంగా లేకపోతే అలాంటి వస్తువు ఉత్పత్తి చేసిన కంపెనీపై పోరాటం చేసే అవకాశం వినియోగదారుడికి హక్కు ఉంది. శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – మహబూబ్‌నగర్ క్రైం ● ప్రతి వస్తువు నాణ్యతను తెలుసుకోవాలి ● జిల్లాలో వినియోగదారుల హక్కుల కోసం ప్రత్యేక కోర్టు ● ఆశించిన స్థాయిలో ప్రచారం కల్పించని జిల్లా వినియోగదారుల కేంద్రం వినియోగదారుల ఫోరం కోర్టులో కేసుల వివరాలు (ఏడాది వారీగా ..)ఎలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది వినియోగదారులు ఎయిర్‌లైన్స్, మెడికల్, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్, టెలికాం, పోస్టల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇళ్ల నిర్మాణం, రవాణా, చిట్‌ఫండ్స్, వ్యవసాయం, కస్టమర్ గూడ్స్, కొరియర్ సర్వీస్, విద్యారంగం, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వల్ల నష్టపోతే కేసులు వేయడానికి అవకాశం ఉంది. వినియోగదారుల్లో చైతన్యం రావాలి జిల్లాలో ప్రతిరోజు హక్కుల ఫోరానికి రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత బీమా, చిట్‌ఫండ్, ఫైనాన్స్‌లో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరూ రావడం లేదు. పట్టణ ప్రాంతాల నుంచి అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన లేకుంటే 08542–245633 నంబర్‌కు ఫోన్ చేయాలి. – సృజన్‌కుమార్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరింటెండెంట్ ●మారిన చట్టం.. 1986 వినియోగదారుల రక్షణ చట్టం స్థానంలో 2019 వినియోగదారుల కమిషన్‌గా మార్పు చేశారు. 1986 నాటి వినియోగదారుల రక్షణ చట్టంలో ఆన్లైన్లో లేని వస్తువులను లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా కొనుగోలు చేసిన వారికి హక్కులు వర్తించడం కోసం 2019 చట్టం పరిధిలో చేర్చారు. ఈ చట్ట ప్రకారం నాణ్యత లేని వస్తువులను ఉత్పత్తి చేసినందుకు, వాటిని విక్రయించడానికి ప్రకటనల్లో నటించే సెలబ్రెటీలకు సైతం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల నుంచి పదేళ్ల కఠిన జైలు శిక్ష విధించే విధంగా రూపొందించారు. అలాగే ఆన్లైన్ ద్వారా విక్రయించే వస్తువులకు సంబంధించి పూర్తి వివరాలతో మార్కెట్లోకి విడుదల చేయాలి. నాణ్యత లేని వస్తువులు విక్రయిస్తే వస్తువులు ఉత్పత్తి చేసిన వారితో పాటు అమ్మిన వ్యక్తులపై కేసులు వేయడానికి చట్టంలో సవరణ తెచ్చారు. -
హోలీ.. సంబరాల కేళి
వనపర్తి: జిల్లావ్యాప్తంగా శుక్రవారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. మోదుగపూల రంగు నీళ్లకు బదులుగా.. దుకాణాల్లో లభించే రసాయన రంగులతో జిల్లాకేంద్రమైన వనపర్తితో పాటు వివిధ ప్రాంతాల్లో చిన్నారులు, యువత, మహిళలు పండుగ జరుపుకొన్నారు. యువత రంగులు వేసుకొని మోటార్ సైకిళ్లపై తిరుగుతూ కనిపించారు. గతంతో పోలిస్తే ఈసారి పురుషుల కంటే మహిళలు ఎక్కువగా హోలీ వేడుకల్లో కనిపించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో.. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులు, మీడియా మిత్రులతో కలిసి ఎస్పీ రావుల గిరిధర్ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బందికి రంగులు పూశారు. కార్యాలయ ఆవరణలో ఉట్టి కొట్టడం, జారుడు స్తంభం ఎక్కే పోటీలు నిర్వహించగా సిబ్బంది, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ తన చిన్నతనంలో హోలీ పండుగలో చోటు చేసుకున్న ఘటనలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. వేడుకల్లో ఇన్చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్‌బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి సీఐ కృష్ణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్స్‌లో సత్తా చాటిన యువకుడు
గోపాల్పేట: మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన గురగల శేఖర్ గ్రూప్–2, గ్రూప్–3లో ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇటీవల వెలువడిన గ్రూప్–2లో 356 మార్కులతో రాష్ట్రస్థాయిలో 1,060 ర్యాంకు, శుక్రవారం విడుదల చేసిన గ్రూప్–3లో 273 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 879 ర్యాంకు సాధించారు. తన తల్లిదండ్రులు గురగల నర్సింహ, లక్ష్మీదేవమ్మ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తారని.. వారి సహకారంతోనే ఎలాంటి శిక్షణ లేకుండానే పోటీ పరీక్షలు రాశానని వివరించారు. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాల, ఆరు నుంచి పది వరకు తూడుకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంటర్ వనపర్తిలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల, డిగ్రీ వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం (కంప్యూటర్స్) చదివానని చెప్పారు. అమరచింతలో.. అమరచింత: శనివారం వెలువడిన గ్రూప్–3 ఫలితాల్లో పట్టణానికి చెందిన కృష్ణమూర్తి 285 మార్కులతో రాష్ట్రస్థాయిలో 364 ర్యాంకు సాధించారు. ఆర్నెల్ల కిందట వెలువడిన గ్రూప్–4లో సత్తాచాటి హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసి గ్రూప్స్‌కు ప్రిపేర్ అయినట్లు తెలిపారు. జిల్లాకు 39 మంది జూనియర్ అధ్యాపకులు వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 39 మంది అధ్యాపకులను కేటాయించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య శుక్రవారం తెలిపారు. ఇందులో రసాయన శాస్త్రం–7, ఆంగ్లం–6, వృక్షశాస్త్రం–5, చరిత్ర–5, జంతుశాస్త్రం–4, భౌతికశాస్త్రం–3, గణితం–2, తెలుగు–2, హిందీ–2, ఆర్థికశాస్త్రం–2, వాణిజ్యశాస్త్రం–1 ఉన్నారు. ఇప్పటి వరకు 25 మంది విధుల్లో చేరగా.. మిగిలిన 14 మంది రెండు, మూడు రోజుల్లో చేరుతారని డీఐఈఓ తెలిపారు. వైభవం.. శివపార్వతుల కల్యాణం కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి శివారులో ఉన్న దత్తకోటిలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించగా.. అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం జరిపించారు. ఆది దంపతులకు అర్చకులు తలంబ్రాలు, ఆడపడుచులు అమ్మవారికి వడిబియ్యం పోశారు. కల్యాణ క్రతువు తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వచ్చిన భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. రామన్‌పాడులో 1,018 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం 1,018 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని వివరించారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 187 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 126 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు. -
ప్రాథమిక స్థాయిలో కృత్రిమ మేధ
3, 4, 5 తరగతుల విద్యార్థులకు ‘ఏఐ’ బోధన● నేటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 66 స్కూళ్లలో నిర్వహణ ● నారాయణపేటలో గత నెల 25నే ప్రారంభం ● సత్ఫలితాలు ఇవ్వడంతో అన్నిచోట్ల అమలుకు చర్యలు ● కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇతర పరికరాల ఏర్పాటు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధన గత కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల ద్వారా బోధన సాగుతుండగా.. విద్యార్థి అక్షర పరిజ్ఞానం, అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసి.. వాటిని మదింపు చేయడం అనుకున్నంత మెరుగ్గా జరగడం లేదు. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు చదువులో వెనకబడి పోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో విద్యార్థి విద్యా సామర్థ్యాలను మదింపు చేసేందుకు ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈకే స్టెఫ్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం టెక్నాలజీ పరంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎంతో కీలకంగా మారింది. దీని సేవలను పాఠశాలలో వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదట పైలెట్ ప్రాజెక్టు కింద నారాయణపేటలో 10 పాఠశాలల్లో గత నెల 25న ప్రారంభించారు. అక్కడ సత్ఫలితాలు ఇవ్వడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన మరో 56 పాఠశాలల్లో శుక్రవారం నుంచి అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ ఇందుకోసం ఎంపిక చేశారు. హైస్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తే ప్రైమరీ స్కూల్ విద్యార్థులు కూడా వినియోగించేందుకు వీలుగా రూపొందించారు. ప్రతి జిల్లాలో నలుగురు రీసోర్సుపర్సన్లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. వారు ఆయా జిల్లాల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ల్యాబ్‌ల ఏర్పాటుకు దాదాపు అన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు వచ్చినా ఇందులో టేబుళ్లు, కుర్చీలు, హెడ్‌ఫోన్స్, ఇంటర్నెట్ వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. జిల్లాల వారీగా ఇలా.. మరో 56 పాఠశాలల్లో.. స్థాయిని బట్టి బోధన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా చిన్నారులను ఆకట్టుకునేలా ఏఐ బోధన ఉంటుంది. ఎంపిక చేసిన 3, 4, 5 తరగతుల వారిని ఐదుగురిని ఒక బ్యాచ్‌గా విభజించి.. ఒక్కో బ్యాచ్‌కు తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో ఏఐ పాఠాలు బోధిస్తుంది. ఆ విద్యార్థి అర్థం చేసుకున్నాడా.. లేదా.. అని ఏఐ గుర్తించి అర్థం కాకపోతే సరళమైన మార్గంలో మళ్లీ బోధన అందిస్తుంది. ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను మదింపు చేయడానికి నివేదిక రూపొందిస్తాం. – రమేష్‌కుమార్, డీఈఓ, నాగర్‌కర్నూల్ సులభంగా ఉంది.. ఉపాధ్యాయులు పుస్తకాలతో ప్రతిరోజు పాఠ్యాంశాల బోధన చేస్తుంటారు. కానీ, ఇటీవల మా పాఠశాలలో కంప్యూటర్ ద్వారా చదువు చెబుతున్నారు. దీంతో పుస్తకాల్లోని అంశాలు చాలా సులభంగా అర్థమవుతున్నాయి. చదవాలనే ఉత్సాహం మరింత పెరిగింది. – మీనాక్షి, 5వ తరగతి, నారాయణపేట అర్థం అవుతున్నాయి.. మా తరగతిలో విద్యార్థులు చాలా వరకు పాఠశాలకు గైర్హాజరు అయ్యేవారు. పాఠాలు అర్థం కాక హోంవర్క్ చేసుకుని రాకపోతే టీచర్లు కొడతారని డుమ్మా కొట్టేవారు. విద్యార్థుల స్థాయిని బట్టి కంప్యూటర్లో బోధన వేగంగా, నిదానంగా జరుగుతుండటంతో అన్ని విషయాలు బాగా అర్థం అవుతున్నాయి. – భార్గవ్, 5వ తరగతి, నారాయణపేట సామర్థ్యాల మదింపు.. ఎంపిక చేసిన పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు వెనకబడి ఉండే విద్యార్థులను గుర్తించి కంప్యూటర్ ముందు కూర్బోబెడతారు. ఇందులో ప్రధానంగా ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో విద్యార్థి అభ్యాసనా సామర్థ్యాలను పరిశీలించాల్సి ఉంది. ముందుగా విద్యార్థికి కేటాయించిన పెన్ నంబర్ (పర్మనెంటర్ ఎడ్యుకేషన్ నంబర్) ద్వారా ఇందులో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ నంబర్ ఎంటర్ చేసిన ప్రతిసారి విద్యార్థి గత కొన్ని రోజులుగా చేస్తున్న పర్ఫామెన్స్, డెవలప్మెంట్, నేర్చుకున్న అంశాలు ఇందులో నిక్షిప్తమవుతాయి. -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం
అమరచింత: ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు కె.సూర్యం ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మార్క్స్ భవనంలో ఉమ్మడి మండలాల మాస్‌లైన్ పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపై విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక, కర్షక చట్టాలకు వ్యతిరేకంగా నడుచుకుంటుందన్నారు. మోదీ ప్రభుత్వం అదాని, అంబానీలాంటి కార్పొరేట్ యాజమానులకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారి వ్యవస్థలు నడుపుకోవడానికి రాయితీలు ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌కు అప్పజెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి మనిషికి పని, పనికి భద్రత, విద్య, ఆరోగ్యం, కూడు, గూడు ప్రధానమైనవి కాగా.. కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని.. ఆరు గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని నెరవేర్చలేకపోతోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి హన్మంతు, ప్రసాద్, రాజు, రాజన్న, ఆశన్న, సామేలు, ప్రేమరత్నం, మస్లమణి, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు. -
కిలోకు వంద గ్రాములు తరుగు..
నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంతోపాటు అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో మాంసం విక్రయాల్లో పెద్దఎత్తును మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల పరిధిలో మాంసం విక్రయదారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను నిర్ణయించడమే కాకుండా తాము చెప్పినట్లు, తాము తూకం వేసిందే సబబు అన్నట్లుగా దౌర్జాన్యాలు సాగిస్తున్నారు. కిలోకు సరాసరిగా వంద గ్రాముల చొప్పున తరుగు తీస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వినియోగదారులు మారు మాట్లాడకుండా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై వినియోగదారలు మున్సిపల్లో గాని, సంబంధిత శాఖ అధికారులకు గాని ఫిర్యాదు చేసినా కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పట్టించుకోవడం లేదు.. మాంసం విక్రయ కేంద్రాల్లో ఎక్కువగా తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. మటన్ మార్కెట్లో గొర్రె మాంసంను పొట్టేలు మాంసంగా చిత్రీకరించి అమ్ముతున్నారు. ఇంతే కాకుండా అనారోగ్యం కలిగిన మేకలు, గొర్రెలను కోసి వినియోగదారులకు అమ్ముతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – ఏటిగడ్డ శ్రీనివాసులు, నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్‌లో చేపల విక్రయం -
సమీకృతం.. అసంపూర్ణం
కొత్త పురపాలికల్లో మూడేళ్లవుతున్నా సాగని పనులు ఆత్మకూర్/అమరచింత/వనపర్తిటౌన్/కొత్తకోట రూరల్: పుర కేంద్రాల్లో కూరగాయలు, మాంసం విక్రయాలకుగాను అన్ని హంగులతో సమీకృత మార్కెట్‌యార్డు నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల కిందట శ్రీకారం చుట్టింది. అప్పటి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఒక్కో నిర్మాణానికిగాను రూ.2 కోట్లు విడుదల చేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం వెంటనే టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించినా నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. జిల్లాలోని కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింత పురపాలికల్లో కాంట్రాక్టర్ల అలసత్వం, నిధుల లేమితో పనులు ముందుకు సాగడం లేదు. అన్ని పురపాలికల్లో నిర్మాణాలు సగమే పూర్తయ్యాయి. అప్పట్లో వేసిన టెండర్‌కు.. ప్రస్తుతం పెరిగిన ధరలకు వ్యత్యాసం ఉండటంతో అదనపు భారం అవుతుందని పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికితోడు పనులను పర్యవేక్షిస్తూ వేగం పెంచాల్సిన అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని చిరు వ్యాపారులు, పుర ప్రజలు కోరుతున్నారు. పనులు పూర్తి చేయాలి.. పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డు నిర్మాణం త్వరితగతిన పూర్తిచేస్తే రహదారులకు ఇరువైపులా కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులకు మేలు చేకూరుతుంది. అలాగే వాహనాల రాకపోకల ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారులు, వినియోగదారులకు సౌలభ్యంగా మారనున్న మార్కెట్ నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు, పాలకులు చొరవచూపాలి. – తోట రవి, కూరగాయల వ్యాపారి, ఆత్మకూర్ జిల్లాకేంద్రంలో పూర్తయినా నిరుపయోగంగానే.. రహదారులపై కూరగాయల విక్రయం రాకపోకలకు తప్పని అవస్థలు త్వరగా పూర్తిచేయాలంటున్న చిరు వ్యాపారులు -
వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు
వనపర్తి: జిల్లాలో సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో క్షయ, మధుమేహం, వడదెబ్బ తదితర అంశాలపై వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిషన్ మధుమేహలో భాగంగా 40 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేయాలన్నారు. ఇప్పటి వరకు 70 శాతం పూర్తయిందని.. ఈ నెల 25లోపు లక్ష్యం చేరుకోవాలని సూచించారు. మధుమేహం బారిన పడకుండా ఉండటానికి, వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా వాల్‌పోస్టర్లతో ప్రచారం చేయాలన్నారు. క్షయ అనుమానితులను గుర్తించి వందశాతం వైద్య పరీక్షలు చేయాలని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని ఆదేశించారు. ఇప్పటి వరకు 99 శాతం పూర్తయిందని.. మిగిలిన ఒక శాతం త్వరలోనే పూర్తి చేస్తామని ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్‌రెడ్డి తెలిపారు. తెమడ పరీక్షతో పాటు ఎక్సరే తీసి క్షయ నిర్ధారణ పకడ్బందీగా చేయాలని సూచించారు. మందులు అందుబాటులో ఉంచాలి.. వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి పని ప్రదేశాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, క్షయ ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్‌రెడ్డి, డా. రామచందర్‌రావు, డా. పరిమళ, బాసిత్ తదితరులు పాల్గొన్నారు. సహజ రంగులతో హోలీ జరుపుకోవాలి జిల్లా ప్రజలు సాంప్రదాయ పద్ధతిలో ప్రకృతిలో లభించే, చర్మానికి, పర్యావరణానికి హాని కలిగించని సహజ రంగులను వినియోగించి ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ హోలీ పండుగ జరుపుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే పండుగ జరుపుకోవాలని, శాంతిభద్రతల పరిరక్షణకు సున్నిత ప్రదేశాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం, గుర్తు తెలియని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని చల్లడం నిషేధించామని వివరించారు. గుంపులుగా తిరుగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కార్యకలాపాలను గమనిస్తూ సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
203 మంది గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని జాగృతి, విజ్ఞాన్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలు, పెబ్బేరు, శ్రీరంగాపురంలోని పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. మొత్తం 5,802 మంది విద్యార్థులకుగాను 5,599 మంది హాజరుకాగా.. 203 మంది గైర్హాజరైనట్లు వివరించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా వనపర్తి రూరల్/ఖిల్లాఘనపురం: వ్యవసాయ, గృహ, వ్యాపార, పరిశ్రమల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఇన్చార్జ్ ప్రత్యేక అధికారి, చీఫ్ ఇంజినీర్ పాండే అధికారులకు సూచించారు. వేసవి ముందస్తు చర్యల్లో భాగంగా వనపర్తి మండలంరాజపేట ఉపకేంద్రం, ఖిల్లాఘనపురం మండలం మానాజీపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కొనసాగుతున్న 5 ఎంవీఏ అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో రాజపేట, అచ్యుతాపురం, నాగవరం తదితర పరిసర గ్రామాలు, తండాల్లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కొనసాగుతుందన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎస్ఈ రాజశేఖరం,డీఈలు శ్రీనివాసులు, వెంకటశివం, ఆనంద్‌బాబు, ఏఈ కొండయ్య అధికారులు జావీద్ అహ్మద్, చంద్రశేఖర్ ఉన్నారు. రాయితీ సద్వినియోగం చేసుకోవాలి ఆత్మకూర్: ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం కల్పించిన రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడిజిల్లా రిజిస్ట్రార్ రవీందర్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్‌వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లు, స్థానికులకు ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించారు. అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2020లో రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ డబ్బుల చెల్లింపులో 25 శాతం రాయితీ లభిస్తుందని వివరించారు. ఈ అవకాశం నెలాఖరు వరకు ఉందని వినియోగించుకోవాలని కోరారు. సబ్ రిజిస్ట్రార్ ప్రకాశ్, ఆశీర్వాదం, అరుణ పాల్గొన్నారు. ‘కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు’ అమరచింత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని టీయూసీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యం ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని మార్స్ భవనంలో జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. కార్మిక సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత రేవంత్ సర్కార్ 2024, జనవరిలో అడ్డగోలుగా 73 జీఓలను సవరించిందని.. అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల రూ.9,500 వేతనం కూడా పూర్తిస్థాయిలో చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కావెంజర్లకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదని, మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు సైతం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్, ప్రసాద్, హన్మంతు, సామెలు, రాజు, చెన్నయ్య, గణేష్ పాల్గొన్నారు. -
కొత్తకోట, పెబ్బేరులో అసంపూర్తిగా..
కొత్తకోటతో పాటు పెబ్బేరులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డుల నిర్మాణాలు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. కొత్తకోటలో పాత ఆర్అండ్బీ అతిథిగృహం స్థానంలో పనులు ప్రారంభించినా నేటికీ పూర్తి కాలేదు. 2022లో అప్పటి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డు నిర్మాణానికి రూ.2.20 కోట్లు మంజూరు చేసింది. అప్పటి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మొదట్లో పనులు వేగంగా జరిగినప్పటికి రెండేళ్లుగా పూర్తిగా ఆగిపోయాయి. దీంతో కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలు రోడ్డు పక్కనే కొనసాగుతున్నాయి. వారాంతపు సంత సైతం ప్రవేట్ స్థలంలో కొనసాగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పనులు పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపాలి.. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డు పనులు ప్రారంభించినప్పటికీ అదే ప్రభుత్వ పాలనలో పనులు ఆగిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయించాలి. పట్టణంలో చేపలు, మాంసం, కూరగాయలు ఒక్కో ప్రాంతంలో విక్రయిస్తుండటంతో పుర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డు నిర్మాణం పూర్తయితే అన్ని ఒకేచోట లభిస్తాయి. – చీర్ల నాగన్నసాగర్, మాజీ కౌన్సిలర్, కొత్తకోట ● -
అమరచింతలో రహదారులపైనే..
పుర కేంద్రంలో గత ప్రభుత్వం సమీకృత మార్కెట్‌యార్డు నిర్మాణం ప్రారంభించినా నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. దీంతో ప్రధాన రహదారులకు ఇరువైపులా వారాంతపు సంత కొనసాగుతుండటంతో వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సంత నిర్వహణతో పాటు నిత్యం కూరగాయలు, పండ్ల విక్రయాలకు ప్రత్యేక స్థలం కేటాయించాలని పుర ప్రజలు కోరుతున్నారు. మార్కెట్లో చిరు వ్యాపారుల నుంచి పుర అధికారులు తైబజార్ వసూలు చేస్తున్నా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. -
జిల్లాకేంద్రంలో వృథాగా..
జిల్లాకేంద్రంలోని గంజి ప్రాంతంలో కూరగాయలు, మాంసం విక్రయాలకు అనువుగా రెండు అంతస్తుల్లో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సమీకృత మార్కెట్‌యార్డ్ నిరుపయోగంగా మారింది. గాంధీచౌక్, హనుమాన్ టేకిడీ, శంకర్‌గంజ్, కమాన్ చౌరస్తా, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ తదితర ప్రాంతాల్లో చిరు వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా చేపలు, మాంసం విక్రయాలు కూడా సుమారు 10 ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. వీరందరినీ సమీకృత మార్కెట్‌యార్డుకు తరలించాల్సి ఉన్నా నేటికీ అడుగులు పడటం లేదు. రూ.కోట్లు వెచ్చించిన భవనం అలంకారప్రాయంగా మారింది. -
రంగనాథస్వామి ఆలయంలో రాష్ట్ర కూటుల ఆనవాళ్లు
ఖిల్లాఘనపురం: మండలంలోని సల్కెలాపురం రంగనాథస్వామి ఆలయంలో రాష్ట్రకూటుల కాలపు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు డా. శివనాగిరెడ్డి తెలిపారు. ఆలయ చైర్మన్ తూము బుచ్చారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం ఆయన ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ పరిసరాల్లో సుమారు 1,200 ఏళ్లనాటి చరిత్ర కలిగిన రాష్ట్రకూటుల స్తంభాన్ని, దానిపై చెక్కిన శిల్పాలను గుర్తించినట్లు తెలిపారు. దీని ఆధారంగా గ్రామంలో నాడే ఆలయం నిర్మించినట్లు తెలుస్తుందన్నారు. ఆల యం చుట్టూ నాటి వీరుల శిల్పాలు ఉన్నాయని.. ఇంతటి ప్రాధాన్యం ఉన్న స్తంభాన్ని, శిల్పాలను సంరక్షించాలని గ్రామస్తులకు సూచించారు. -
ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
పాన్‌గల్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినుల ఫిర్యాదుకు ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు ఒకరికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు డీఈఓ అబ్దుల్ ఘని బుధవారం రాత్రి తెలిపారు. ఉపాధ్యాయులు చిన్ననాగన్న, రఘురాంను సస్పెండ్ చేయడంతో పాటు కిరణ్‌కు షోకాజ్ నోటీసులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ప్రవర్తనపై ఈ నెల 6న విద్యార్థినులు ఎంఈఓకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. మరోమారు విచారణ చేసి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి డీఆర్డీఓ ఉమాదేవిని ఆదేశించడంతో ఆమె కూడా ఈ నెల 10న పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించి నివేదిక అందజేశారు. రెండు నివేదికల ఆధారంగా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నట్లు డీఈఓ వివరించారు. ‘ఆదర్శ’ దరఖాస్తు గడువు పొడిగింపు పెబ్బేరు రూరల్: తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు పెబ్బేరు ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డా. తూర్పింటి నరేష్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ 13 నుంచి 20వ తేదీకి మారిందని పేర్కొన్నారు. ఐసీడీఎస్‌ను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రం’ వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రైవేటీకరణలో భాగంగా ఐసీడీఎస్‌ను నిర్లక్ష్యం చేస్తోందని.. అందులో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానం అనే చట్టాన్ని తీసుకొచ్చిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొత్త విధానం అమలైతే ఐసీడీఎస్ స్వతంత్రంగా ఉండదని.. అనేక మార్పులు చోటు చేసుకొని మూతబడే పరిస్థితికి దారి తీస్తుందని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఈ నెల 17, 18 తేదీల్లో 48 గంటల సమ్మెకు పిలుపునిచ్చామని.. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇస్తామని ప్రకటించి నేటికీ అమలు చేయకుండా వెట్టిచాకిరి చేయించుకుంటోందని మండిపడ్డారు. మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా మార్చి వారికి 10 నెలలుగా వేతనాలు ఇవ్వలేదడం లేదని చెప్పారు. వెంటనే వారికి బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా కార్యదర్శి మండ్ల రాజు, నారాయణమ్మ, రాజేశ్వరి, శారద, రేణుక, లత, రామచంద్రమ్మ, సంగీత, భారతి, ఈశ్వరమ్మ, విజయ, సుమిత్ర పాల్గొన్నారు. ఆలయాల్లో అదనపు కమిషనర్ విచారణ అలంపూర్: అలంపూర్ ఆలయాల్లో దేవాదాయ ధర్మాదాయశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు బుధవారం విచారణ జరిపారు. కొద్ది రోజులుగా ఆలయంలోని సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన సందర్శించారు. ఆలయాలకు సంబంధించిన భూములు, టెండర్ల వివరాలు, రోజువారి డీసీఆర్, క్యాష్ బుక్, అన్నదాన విరాళాలు, రసీదు బుక్కులను పరిశీలించారు. అలాగే అన్నదాన సత్రంలోని అన్న ప్రసాద వితరణ, ప్రసాదాల తయారీ, నాణ్యత, వాటి పరిమాణం, కౌంటర్లను తనిఖీ చేశారు. విచారణ నివేదికను దేవాదాయశాఖ కమిషనర్‌కు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,931 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,931, కనిష్టంగా రూ.5,800 ధరలు లభించాయి. కంది రూ. 6,910–రూ.6,540, మొక్కజొన్నరూ.2,335– రూ.19,66, పెబ్బర్లు రూ.6,210– రూ.5,521, జొన్నలు గరిష్టంగా రూ.4,270, కనిష్టంగా రూ.3,810, ఆముదాలు గరిష్టంగా రూ.6,075, కనిష్టంగా రూ.6,040, పత్తి రూ.5,100 ధరలు పలికాయి. -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షల నిర్వహణ
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. బుధవారం ఉదయం 8.15కు జిల్లాకేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఎస్, డీఓలకు సూచనలు చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాల, పెద్దమందడి, ఖిల్లాఘనపురం పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్షలు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బుధవారం పరీక్షకు 5,987 మంది విద్యార్థులకుగాను 5,837 మంది హాజరుకాగా.. 150 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. -
పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించండి
ఆత్మకూర్: పట్టణ ప్రజలు సకాలంలో పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య కోరారు. బుధవారం స్థానిక పుర కార్యాలయంలో అధికారులు, వార్డు ఇన్‌చార్జ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం పన్ను వసూలు లక్ష్యం రూ.2.23 కోట్లుకాగా.. ఇప్పటి వరకు రూ.1.13 కోట్లు వసూలయ్యాయని, సుమారు రూ.1.10 కోట్లు బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి మూడు వేలకు పైగా దరఖాస్తులు రిజిస్ట్రేషన్ కాగా.. కేవలం పది మంది మాత్రమే రుసుం చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ రాయితీ, పన్ను వసూళ్లపై ఇల్లిల్లూ తిరిగి అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ శ్రీపాద్, పుర కమిషనర్ శశిధర్, సబ్ రిజిస్ట్రార్ ప్రకాశ్ ఉన్నారు. -
పకడ్బందీగా పంట వివరాల నమోదు
వనపర్తి/కొత్తకోట రూరల్: జిల్లాలో పంట వివరాల నమోదు ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో రైతు నాగరాజు పొలం వద్ద పంట వివరాల నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఏ రకం వరి వేశారు.. పంట సాగుకు అనుకూలమైన వాతావరణం ఉందా.. సరైన నీటి వనరులు ఉన్నాయా అనే వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. ఎరువులు ఎక్కడ కొంటున్నారు?.. ట్రేడర్లు నాణ్యమైన మందులు, విత్తనాలు ఇస్తున్నారా లేదా అని ఆరా తీశారు. రైతులు సాగు చేసిన పంటకు సంబంధించి అన్ని వివరాలు పక్కాగా నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో వేగం పెంచాలి.. జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కొత్తకోట, పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిర్మాణాలను ఆయన పరిశీలించారు. కొత్తకోట పాఠశాలలో సీబీఎఫ్ నిధులతో చేపడుతున్న ఆరు అదనపు తరగతి గదులు, బాలికల పాఠశాలలో డీఎంఎఫ్టీ నిధులతో నిర్మిస్తున్న రెండు తరగతి గదుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా కంచిరావుపల్లి పాఠశాలలోని రెండు మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా నెలాఖరులోగా పూర్తి కావాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, కొత్తకోట, పెబ్బేరు తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, లక్ష్మి, పంచాయతీరాజ్ ఏఈలు నరేష్, కార్తీక్, ఇతర అధికారులు ఉన్నారు. -
రంగనాథస్వామి ఆలయంలో రాష్ట్ర కూటుల ఆనవాళ్లు
ఖిల్లాఘనపురం: మండలంలోని సల్కెలాపురం రంగనాథస్వామి ఆలయంలో రాష్ట్రకూటుల కాలపు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు డా. శివనాగిరెడ్డి తెలిపారు. ఆలయ చైర్మన్ తూము బుచ్చారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం ఆయన ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ పరిసరాల్లో సుమారు 1,200 ఏళ్లనాటి చరిత్ర కలిగిన రాష్ట్రకూటుల స్తంభాన్ని, దానిపై చెక్కిన శిల్పాలను గుర్తించినట్లు తెలిపారు. దీని ఆధారంగా గ్రామంలో నాడే ఆలయం నిర్మించినట్లు తెలుస్తుందన్నారు. ఆల యం చుట్టూ నాటి వీరుల శిల్పాలు ఉన్నాయని.. ఇంతటి ప్రాధాన్యం ఉన్న స్తంభాన్ని, శిల్పాలను సంరక్షించాలని గ్రామస్తులకు సూచించారు. -
దుర్వాసన వస్తోంది..
కొత్తకోటలో.. కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి ఆలయ సమీపంలో ఉన్న డంపింగ్‌యార్డును పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. పట్టణంలో సేకరించిన చెత్తను ఆటోలు, ట్రాక్టర్లలో తరలించి పట్టణ నడిబొడ్డున ఉన్న భవానీమాత ఆలయం ఎదురుగా ఉన్న ఖాన్‌చెరువు కట్టపై పోసి తగలబెడుతున్నారు. దీంతో ఉదయం వేళలో పొగతో పాటు దుర్వాసన వస్తుండటంతో పరిసరాల్లో ఉండే ఇళ్ల వారు, ఉదయపు నడకకు వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయ సమీపంలో మా ఇల్లు ఉంది. పట్టణంలో సేకరించిన చెత్తను చెరువుకట్టపై పోసి నిప్పంటించడంతో విపరీతమైన పొగతో పాటు వర్షాకాలంలో దుర్వాసన వస్తోంది. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. – రామచంద్రారెడ్డి, 1వ వార్డు, కొత్తకోట ● -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షల నిర్వహణ
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. బుధవారం ఉదయం 8.15కు జిల్లాకేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఎస్, డీఓలకు సూచనలు చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని స్కాలర్స్ జూనియర్ కళాశాల, పెద్దమందడి, ఖిల్లాఘనపురం పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్షలు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బుధవారం పరీక్షకు 5,987 మంది విద్యార్థులకుగాను 5,837 మంది హాజరుకాగా.. 150 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. -
భవిష్యత్ అంతా యువతదే..
వనపర్తి: యువత సంస్కారవంతంగా, బాధ్యతాయుతంగా ఉండాలని.. భవిష్యత్ అంతా వారిదేనని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో నెహ్రూ యువకేంద్రం, మహబూబ్‌నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి ‘యువ ఉత్సవ్–2025’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కడా లేని యువశక్తి మన దేశంలో ఉందని, వారు సరైన మార్గం ఎంచుకుంటే ప్రపంచంలో మనకు తిరుగులేదని పేర్కొన్నారు. యువత తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకొని అందులో గొప్పగా రాణించాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులు, సాటివారిని గౌరవించే తత్వాన్ని అలవర్చుకోవాలని.. ఉపాధ్యాయులు విద్యార్థుల ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుత ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని వివరించారు. అనంతరం సైన్స్ మేళాను ఆయన తిలకించి చక్కటి ఎగ్జిబిట్లు తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. యువ ఉత్సవ్‌లో భాగంగా 15 ఏళ్ల నుంచి 29 ఏళ్లలోపు యువతకు నిర్వహించిన కవిత్వం, చిత్రలేఖనం, సైన్స్ మేళా, ఉపన్యాసం తదితర పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్రం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు కోటనాయక్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా. జగన్, జిల్లా సైనన్స్ అధికారి శ్రీనివాస్, డీవైఎస్ఓ సుధీర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సొసైటీ రాజేందర్, తెలుగు అధ్యాపకుడు ఎజ్జు మల్లయ్య, నిస్వార్థ ఆర్గనైజేషన్ సభ్యుడు అరవింద్, నెహ్రూ యువకేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్లు రాజేందర్‌గౌడ్, అనిల్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్–1లో సత్తాచాటిన వడ్డెవాట యువకుడు
కొత్తకోట రూరల్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో మండలంలోని వడ్డెవాటకు చెందిన మండ్ల పవన్‌కుమార్ 510 మార్కులు సాధించి సత్తా చాటారు. తండ్రి వెంకటస్వామి స్థానిక సర్కిల్ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తమ ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు, పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు. సమయస్ఫూర్తి కోల్పోవద్దు వనపర్తిటౌన్: అతి తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఆశ, అత్యాశతోనే ఉన్న నగదును కోల్పోవాల్సి వస్తోందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, వనపర్తి సీనియర్ సివిల్‌కోర్టు న్యాయమూర్తి వి.రజని అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రధానమంత్రి కౌశల్ యోజన శిక్షణ కేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు చూపే ఆశకు లోనుకాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. తెలియని వెబ్సైట్లను ఓపెన్ చేసి అనవసర ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. ప్రజలకు న్యాయ సేవలను చేరువ చేసేందుకు న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాల్య వివాహాలు, పోక్సో, మోటార్ వెహికిల్, బాలకార్మిక వ్యవస్థ తదితర చట్టాల గురించి వివరించారు. శిక్షణ కేంద్రం నిర్వాహకుడు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళా సాధికారతకు పాటుపడాలి మదనాపురం: మహిళా సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల కోరారు. సోమవారం రాత్రి మండలంలోని అజ్జకొల్లులో ఐద్వా గ్రామకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రీబాయి పూలే వర్ధంతి కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, మహిళా రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ అధ్యక్ష కార్యదర్శులు స్వాతి, లక్ష్మి, భాగ్యలక్ష్మి, రేణుక, రమాదేవి, శిరీష, కృష్ణవేణి పాల్గొన్నారు. ఆ భూములు గిరిజనులకే దక్కాలి ఊర్కొండ: గిరిజనులకు సంబంధించిన భూములు వారికే దక్కాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. మండలంలోని గునగుండ్లపల్లి పంచాయతీ రెడ్యాతండా సమీపంలోని ఊర్కొండపేట రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నం.186లో గల 109 ఎకరాల అసైన్డ్ భూమి తరతరాల నుంచి గిరిజనుల స్వాధీనంలో ఉందని, ఆ భూమిని ప్రస్తుతం ఇతరులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుండటంతో తండావాసులు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం రెడ్యాతండాను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు సందర్శించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అసైన్ భూములు గిరిజనులకు దక్కే విధంగా చూస్తామని, అదేవిధంగా తండా ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినప్పటికీ వారు ఏనాడు కూడా ఇక్కడ సేద్యం చేయలేదని, అలాంటి వారు ఇప్పుడు గిరిజనులను మా భూములు మాకే చెందుతాయని భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. గిరిజనులకు సంబంధించిన భూములను గిరిజనులకు చెందేలా తనవంతు కృషిచేస్తానన్నారు. అధికారులు ఎలాంటి తప్పిదాలు చేయకుండా అసైన్డ్ భూములు నిరుపేద గిరిజనులకు దక్కేలా చూడాలని ఆదేశించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి ఇక్కడికి వచ్చామని, గిరిజన నాయకులు మాట్లాడిన విధానం చూస్తుంటే ఇక్కడ కొందరు కావాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలుస్తుందని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. అధికారులు వాస్తవాలను నెల రోజుల్లో తెలియజేసేలా చూడాలని సూచించారు. -
పందుల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఆత్మకూర్‌లో పందుల దొంగతనానికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆత్మకూర్‌లోని పరమేశ్వరస్వామి చెరువుకట్ట సమీపంలో చెన్నయ్య షెడ్ వేసుకొని 73 పందులను పెంచుతున్నారు. ఫిబ్రవరి 16న బింగిదొడ్డి అంజి, మాదిరె మహేష్, నందవరం బాలరాజు రెక్కి నిర్వహించి పందులు ఉన్నట్లు ఎరుకలి భీమన్న, కందేనతి సుంకన్నకు సమాచారం ఇచ్చారు. 17వ తేదీన అందరూ కలిసి ఎరుకలి సిద్ధప్ప బొలెరో వాహనంలో సింధనూర్ నుంచి బయలుదేరి మార్గమధ్యంలో ఎరుకలి అంజి, ఎరుకలి నాగరాజును ఎక్కించుకొని ఎమ్మిగనూర్‌కు వచ్చి అక్కడ ఎరుకలి భీమన్న, గుల్లి నాగరాజు, కందెనతి సుంకన్న, మదిరె మహేశ్, హోలిగుంది అంజి కలిసి అదేరోజు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో 30 పందులను వాహనంలో ఎక్కించారు. కాపలాగా ఉన్న ఇద్దరు లేచి అరుస్తూ దగ్గరగా వస్తుండగా వారిపై గాజు సీసాలు, రాళ్లతో దాడిచేయగా గాయాలయ్యాయి. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు లాక్కొని మార్గమధ్యంలో జూరాల జలాశయంలో పడేసి వెళ్లి బెంగుళూరులో రూ.90 వేలకు విక్రయించారు. ఇలా దొరికారు.. మంగళవారం ఉదయం సిద్ధప్ప తన బొలెరో వాహనంలో హోలిగుంది అంజి, సిరిగెరి నాగరాజు, బింగిదొడ్డి అంజి కలిసి దొంగతనం చేయడానికి అమరచింత వైపు వస్తున్నారు. మస్తీపూర్ చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా గమనించి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారిస్తే గతంలో వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల, పెద్దమందడి మండలం దొడగుంటపల్లి, గద్వాల జిల్లాలోని అలంపూర్, శాంతినగర్, అయిజ, కర్నూల్ జిల్లా మంత్రాలయం, ఎమ్మిగనూర్, నందవరం, మాధవరం, కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్, మస్కి, హుబ్లి, సింధనూర్ ప్రాంతాల్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి బొలెరో వాహనం, రూ.90 వేల నగదు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ, అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, ఆత్మకూరు సీఐ శివకుమార్, ఆత్మకూరు ఎస్ఐ నరేందర్, అమరచింత ఎస్ఐ సురేష్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
జిల్లాకేంద్రంలోనూ..
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంతో పాటు విలీన గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదు. ఇటీవల జరిగిన పుర బడ్జెట్లో వెనుకబడిన, మురుగువాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు అన్నీ వార్డుల్లాగే రూ.60 లక్షలు ప్రతిపాదించారు. 21, 23 కొత్త కాలనీలు, 6, 13, 15, 22 వార్డులు, కొత్తగా వెలుస్తున్న శివారు కాలనీలైన 11, 10, 12, 4 వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఖాళీ ప్రదేశాల్లో మురుగు నిలిచి దుర్వాసన వస్తోంది. పుర కార్యాలయం ఎదుట కూడా డ్రెయినేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. పాతబజార్‌లో రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నచోట కాల్వల నిర్మాణాలు మధ్యలోనే వదిలేశారు. రహదారి విస్తరణ అరకొరగా చేపట్టిన పాన్‌గల్ మార్గంలోనూ కొన్నిచోట్ల డ్రెయినేజీలు శిథిలావస్థకు చేరుకోగా.. మరికొన్ని చోట్ల మధ్య మధ్యలో పూర్తి చేయాల్సి ఉంది. దీనికితోడు తాళ్ల చెరువు అలుగు కాల్వను పూర్తిస్థాయిలో ఆధునికీకరించకపోవడంతో మురుగు నిలిచి ఉంటుంది. మర్రికుంట, నర్సింగాయపల్లి, శ్రీనివాసపురం తదితర విలీన గ్రామాల్లోనూ డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. -
‘ఎల్ఆర్ఎస్’ వేగవంతం చేయాలి
వనపర్తి: జిల్లాలోని ఐదు పురపాలికల్లో ప్లాట్ల క్రమబద్దీకరణకు సుమారు 25 వేల మందికి నోటీసులు జారీ చేసినా.. ఆశించినస్థాయిలో ఫలితం కనిపించడం లేదని, లేఅవుట్లు చేసిన వారు, బిల్డర్లు, ప్లాట్ల యజమానులకు వార్డు అధికారులతో ఫోన్ చేయించి డబ్బులు కట్టించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పుర కమిషనర్లు, టౌన్ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ ఇంజినీర్లతో ఎల్ఆర్ఎస్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ ఉంటే ప్లాట్‌కు రక్షణ ఉంటుందని, ఎవరూ ఆక్రమించడానికి అవకాశం ఉండదని, పురపాలిక ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో ప్లాట్ విక్రయించాలనుకున్నా ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్‌కు మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారి నుంచి డబ్బులు వసూలు చేసి క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు 25 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించిందని.. తర్వాత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ప్రస్తుత మార్కెట్ విలువకు 14 శాతం జరిమానా చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని.. ఎట్టి పరిస్థితిలోను అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. అనంతరం ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లించిన ప్లాట్ల యజమానులకు కలెక్టర్ క్రమబద్ధీకరణ ఉత్తర్వు కాపీలు అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు యూనివర్సిటీలో 27, 28 తేదీల్లో వర్క్‌షాప్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్‌షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కన్వీనర్ అర్జున్‌కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్‌ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు. -
పురం.. అపరిశుభ్రం
మున్సిపాలిటీల్లో రహదారులపై పారుతున్న మురుగు అమరచింత: జిల్లాలోని పురపాలికల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అమరచింత, కొత్తకోట, ఆత్మకూర్, పెబ్బేరులో నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో మురుగు రహదారులపై పారుతుండటంతో పాటు ఇళ్ల నడుమ నిలిచి మురుగు కుంటలను తలపిస్తున్నాయి. వరాహాలు, దోమల వ్యాప్తిచెంది ప్రజలు అనారోగ్యం బారినపడి ఆస్పత్రుల పాలవుతున్న దుస్థితి నెలకొంది. బీఆర్ఎస్ హయాంలో పెద్ద గ్రామపంచాయతీలను పురపాలికలుగా మార్చే సమయంలో సమీప గ్రామాలను విలీనం చేశారు. పెబ్బేరులో చెలిమిళ్ల, ఆత్మకూర్‌లో ఖానాపురం గ్రామాన్ని విలీనం చేయడంతో ఆయా గ్రామాలు పురపాలికలోని వార్డుగా మారడంతో ఆయా గ్రామాల్లో మున్సిపాల్టీ నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కొత్త పురపాలికలకు ఆదాయ వనరులు సరిగా లేకపోవడంతో వచ్చే బడ్జెట్ నుంచే సీసీ రహదారులు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేయాలి. కానీ పూర్తిస్థాయిలో డ్రెయినేజీలు నిర్మించడంలో పుర పాలకులు విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. అవసరం ఉన్న చోట్ల వదిలి ఇతర ప్రాంతాల్లో కాల్వల నిర్మాణాలు చేపట్టడంతో పుర నిధులు వృథా అయ్యాయన్న ఆరోపణలున్నాయి. పాలకుల నిర్లక్ష్యం.. ఎన్టీఆర్ కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక ఇబ్బందులు పడుతున్నాం. పాలకుల నిర్లక్ష్యం కారణంగా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకమండలి పదవీకాలం ముగిసి మూడు నెలలు గడుస్తున్నా అధికారులు డ్రెయినేజీల్లోని మురుగు తొలగించే చర్యలు చేపట్టడం లేదు. పుర కమిషనర్ చొరవ చూపాల్సిన అవసరం ఉంది. – లాల్కోట రవి, 7వ వార్డు, కొత్తకోట డ్రెయినేజీ అస్తవ్యస్తం.. జోగినీకాలనీలో ఏళ్లుగా మురుగు వ్యవస్థ అధ్వానంగా ఉంది. మున్సిపాలిటీగా మారినా నేటికీ కొత్త డ్రెయినేజీలు నిర్మించడం లేదు. దీంతో ఇళ్ల నుంచి వస్తున్న మురుగంతా రహదారులపై పారుతోంది. అధికారులు స్పందించి మురుగు కాల్వలు నిర్మించాలి. – వెంకటేష్, 7వ వార్డు, అమరచింత మురుగు పేరుకుపోయింది.. పట్టణంలోని 2వ వార్డులో మురుగు సమస్య తీవ్రంగా ఉంది. చెరువు కాల్వ పూడుకుపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నిలిచి పరిసరాల్లో దుర్వాసన వస్తోంది. దీనికితోడు దోమల బెడద తీవ్రంగా ఉంది. అధికారులు స్పందించి మురుగు తొలగించడంతో పాటు డ్రెయినేజీ నిర్మించాలి. – చింతకుంట వెంకటేష్, 2వ వార్డు, అమరచింత ● ఆత్మకూర్‌లో ఆశించిన స్థాయిలో కాల్వల నిర్మాణం పూర్తిగాకపోవడంతో మురుగు రహదారులపై పారుతోంది. విలీన గ్రామమైన ఖానాపురం గ్రామంలో సైతం డ్రైనేజీలు నిర్మించాల్సి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ● పెబ్బేరు పురపాలికలో మురుగు వ్యవస్థ కాస్త మెరుగ్గా ఉన్నా.. వనపర్తి రోడ్లో రహదారి విస్తరణ పనులు చేపట్టడంతో కాల్వలు దెబ్బతిన్నాయి. దీంతో మురుగు రహదారిపై పారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీవాసులు వాపోతున్నారు. విలీన గ్రామమైన చెలిమిళ్లలో సైతం డ్రెయినేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ● కొత్తకోట పురపాలికలో 15 వార్డులు, సుమారు 25 వేల జనాభా ఉంది. ఆయా వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతో మురుగంతా రహదారులపైనే పారుతోంది. పట్టణంలోని విద్యానగర్‌కాలనీలో ఉన్న కాల్వల్లో మురుగు పేరుకుపోయినా తొలగించడం లేదు. దీంతో దోమలు, పందుల బెడద అధికమైంది. పలు వార్డుల్లో అవసరం మేరకు డ్రెయినేజీలు నిర్మించలేదు. పురపాలికల వారీగా ఇలా.. నివేదిక తయారు చేస్తాం.. పురపాలికలో డ్రెయినేజీల నిర్మాణం ఎక్కడెక్కడ చేపట్టాలో పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి నిధుల మంజూరుకుగాను ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. పట్టణంలోని 2, 7వ వార్డులో డ్రెయినేజీలు లేవని మా దృష్టికి వచ్చింది. నిర్మాణాలకు అవసరమయ్యే నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం. – రవిబాబు, పుర కమిషనర్ అమరచింత పట్టించుకోవడం లేదు.. కాలనీలో డ్రెయినేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల ఆవరణలో మురుగు నిలుస్తోంది. దుర్వాసనతో పాటు దోమల బెడద అధికమైంది. సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. – జయమ్మ, అంబేడ్కర్‌చౌక్ సమీపకాలనీ, వనపర్తి ● అమరచింత మున్సిపాలిటీలో పది వార్డులుండలు 2, 7 వార్డుల్లో సీసీ రహదారులు, డ్రెయినేజీల నిర్మాణాలు చేపట్టలేదు. 7వ వార్డులో మురుగు కాల్వలు లేక ఇళ్ల నుంచి వస్తున్న మురుగును రహదారులపై వదలుతున్నారు. దీంతో కాలనీలో దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద అధికంగా ఉండటంతో ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. ముందుకుసాగని డ్రెయినేజీల నిర్మాణాలు చేసిన తీర్మానాలు.. ప్రతిపాదనలకే పరిమితం దోమలు, వరాహాల సంచారంతో జనం బెంబేలు -
ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించండి
వనపర్తి: ప్రజావాణికి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 51 అర్జీలు వచ్చాయని.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవిలో జాగ్రత్తలు పాటించాలి.. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బకు గురికాకుండా ప్రజలు ముందుజాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. కలెక్టరేట్లో డీఎంహెచ్ఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్పీసీసీహెచ్, హీట్ వేవ్ టాస్క్‌ఫోర్స్ కమిటీలతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పనులు చేసుకోవాలని.. అత్యవసర పనులు ఉంటేనే మధ్యాహ్నం బయటకు వెళ్లాలని సూచించారు. అన్నిశాఖల అధికారులు ఎండల తీవ్రతపై అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎవరికైనా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలన్నారు. శిశువులు, బాలబాలికలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం వైద్యారోగ్యశాఖ రూపొందించిన ‘వడదెబ్బ నుంచి రక్షించుకుందాం ‘ వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
ఖిల్లాఘనపురం: విద్యార్థులకు చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి వి.రజని అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాల్యవివాహాలు జరిపించే వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. అదే విధంగా సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్‌చేసి లాటరీ తగిలింది.. మీ ఖాతాకు డబ్బులు వస్తాయి.. ఓటీపీ చెప్పాలని అడిగితే చెప్పరాదన్నారు. ఫోన్లో ఏదైనా గుర్తుతెలియని లింక్ వచ్చినా ఓపెన్ చేయరాదన్నారు. ఎవరికై నా న్యాయ సేవలు అవసరమైతే 15100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా కరాటే విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంఈఓ జయశంకర్, హెచ్ఎంలు మునవర్ సుల్తానా, లలిత, ప్రశాంతి, సఖి లీగల్ కౌన్సెల్ డి.కృష్ణయ్య, పారా లీగల్ వలంటీర్ అహ్మద్, కరాటే మాస్టర్ శేఖర్, వరుణ్, శివ పాల్గొన్నారు. -
కనుచూపు మేరలోనే..
పర్యాటక ప్రాంతమైన సోమశిలకు నిత్యం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు ఇక్కడికి రావడం నిత్యకృత్యం. సోమశిలలోని టూరిజం కాటేజీలు, పుష్కరఘాట్ల వద్ద నుంచి చూస్తే.. అలవి వలలతో చేపల వేట సాగించే మత్స్యకారుల గుడారాలతో పాటు నదీ తీరానికి రెండు వైపులా ఆరబెట్టిన చేపపిల్లలు కనిపిస్తాయి. కానీ ఎవరూ అటువైపు కన్నెత్తి చూడరు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోలు, అమరిగిరిలోని నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అలవి వలల గుడారాలే కనిపిస్తాయి. -
అన్ని పోలీస్స్టేషన్లకు అధునాతన కంప్యూటర్లు
వనపర్తి: మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అధునాతన కంప్యూటర్లు అవసరమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అన్ని స్టేషన్ల అధికారులకు కంప్యూటర్లు, ప్రింటర్లు, అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడే పోలీసు శాఖలో జిల్లాలోని అన్ని గ్రామాలు, విభాగాల సమాచారం అందుబాటులో ఉండాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా, మండల పరిధిలోని గ్రామాల వివరాలతో పాటు నేర సంబంధిత విషయాలను భద్ర పరచడానికి, సులభంగా తెలుసుకోవడానికి సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అధునాతన కంప్యూటర్లతో పోలీసు ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారన్నారు. ● పోలీసు ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు ప్రజావాణికి మొత్తం తొమ్మిది ఫిర్యాదులు అందాయని.. వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత సీఐ, ఎస్ఐలకు సూచించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ, ఇన్చార్జి అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐలు కృష్ణ, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ శివకుమార్, సిబ్బంది సుదర్శన్, భరత్ పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు పాన్‌గల్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని.. మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల మహిళా సమాఖ్య భవనంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ.. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాన్‌గల్ మండల మహిళా సమాఖ్యకు రూ. 36లక్షల విలువగల ఆర్టీసీ అద్దె బస్సును కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా 150 మండలాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించగా.. అందులో పాన్‌గల్ మండల మహిళా సమాఖ్య ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ ఆదర్శ్ సురభిలకు మహిళా సమాఖ్య తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం వెంకటేశ్ యాదవ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, మాజీ ఎంపీటీసీ హైమావతి పాల్గొన్నారు. 23న సీపీఐ శతాబ్ధి ఉత్సవాలు వనపర్తి రూరల్: జిల్లా కేంద్రంలో ఈ నెల 23న నిర్వహించే సీపీఐ శతాబ్ధి ఉత్సవాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని జిల్లా కార్యదర్శి విజయరాములు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో కె.శ్రీరామ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హాజరవుతారన్నారు. ఉత్సవాలకు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, నాయకులు చంద్రయ్య, భాస్కర్, రమేశ్, రాబర్ట్, మోష, అబ్రహం, నర్సిహయ్య శెట్టి, శ్రీహరి ఉన్నారు. -
మిగిలింది 20 రోజులే..
మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు అంతంతే ● సీఎం ఇలాఖాలో 57 శాతమే వసూలుతో రాష్ట్రస్థాయిలో 63వ స్థానం ● ఉమ్మడి జిల్లాలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లే దిక్కు ● ప్రత్యేకంగా సోమ, గురువారాల్లో రెవెన్యూ మేళాలు ● గడువు నేపథ్యంలో పరుగులు పెట్టిస్తున్న ప్రత్యేకాధికారులు నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు ఆస్తి పన్ను రాబడి కీలకం. నివాసగృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను వసూలుపై మున్సిపల్ అధికార యంత్రాంగం డిజిటల్ చెల్లింపులపై దృష్టిసారించింది. క్యూఆర్ కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా మున్సిపాలిటీ ఖాతా లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలతోనే మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు అధికారులు ఒక అడుగు ముందుకు.. మూడు అ డుగులు వెనక్కి పడినట్లు చెబుతున్నారు. అయితే ము న్సిపాలిటీల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వసూలు అంతంత మాత్రమే ఉండటం.. టార్గెట్ చేరుకునేందుకు కేవలం 20 రోజులే ఉండటంతో అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. 80 శాతంతో నాలుగో స్థానం.. రాష్ట్రస్థాయిలో పన్నులు వసూలు చేయడంలో ఉమ్మడి జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ నాలుగో స్థానంలో నిలిచింది. సుమారు 4 వేల ఆస్తులకు రూ.98 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటికే రూ.78 లక్షలు (80 శాతం) వసూలు చేశారు. రాష్ట్రస్థాయిలో 63వ స్థానం.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో 5,332 ఆస్తులకు రూ.1.94 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1.10 కోట్లు (57 శాతం) వసూలు చేశారు. దీంతో ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 63వ స్థానంలో నిలిచింది. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లపూర్లో సైతం 6,406 ఆస్తులకు రూ.1.28 కోట్లకు రూ.72 లక్షలు వసూలు (56 శాతం) చేశారు. ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 68వ స్థానంలో నిలిచింది. అదనపు కలెక్టర్లకు బాధ్యతలు.. ఈ ఏడాది జనవరి 26తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్) ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించింది. వీరు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లపై ఎప్పటికప్పుడు మున్సిపల్ రెవెన్యూ, బి ల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, కమిషనర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. వారం రోజులుగా ప్రత్యేక దృష్టిసారిస్తూ రోజూవారిగా పన్నుల వసూళ్లపై నివేదిక తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, రివిజన్ పిటిషన్ సహా ఇతర సమస్యల పరిష్కారం కోసం సోమ, గురువారాల్లో ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మున్సిపాలిటీల్లో రెవెన్యూమేళా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీల్లో ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, ఇతర సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ప్రాపర్టీ పేరు మార్పు, మ్యూటేషన్, ఇంటి నంబర్ కేటాయింపు లేదా మార్పు వంటి సేవలు పొందవచ్చు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆస్తులు పన్నులు, వసూలు (రూ.కోట్లలో) రెవెన్యూ ఇన్స్పెక్టర్లు లేక.. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులే దిక్కయ్యారు. మున్సిపాలిటీల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో పన్నుల వసూలు చేయడంలో జాప్యం జరుగుతుందని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. రెవెన్యూకు సంబంధించిన విషయం కావడంతో ప్రధాన మున్సిపాలిటీల్లో తప్పా కొత్తగా ఏర్పాటైన వాటిలో ఇప్పటి వరకు ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయని సమాచారం. పన్నులు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతుండటం మరో సమస్యగా చెబుతున్నారు. లక్ష్యం చేరుకుంటాం.. ప్రతి ఏడాది మార్చిలోనే అత్యధికంగా పన్నులు వసూలు అవుతాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి పట్టణ ప్రజలు, వ్యాపారులు తమ ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలి. గత వారం రోజులుగా పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. ఈ నెల 31 వరకు వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు కృషిచేస్తున్నాం. – భోగేశ్వర్, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట -
లోక్‌అదాలత్‌లో 6,266 కేసులు పరిష్కారం
వనపర్తిటౌన్: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు చెప్పారు. ఏడు బెంచ్‌ల ద్వారా 2,663 క్రిమినల్, 8 సివిల్, 3,595 ప్రీ లిటిగేషన్ కేసులతో కలిపి మొత్తం 6,266 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్‌అదాలత్ గొప్ప అవకాశమన్నారు. కక్షిదారులు సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు కోర్టు ఫీజు వాపస్ పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్‌జడ్జి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి బి. రవికుమార్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి జానకి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి బి. శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా చెస్ పోటీలు వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో శనివారం జూనియర్, సీనియర్స్ విభాగాల్లో చెస్ పోటీలు నిర్వహించారు. ముందుగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి, కార్యదర్శి వేణుగోపాల్, ఆర్థిక కార్యదర్శి టీపీ కృష్ణయ్య పోటీలను ప్రారంభించగా.. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జూనియర్ విభాగంలో పి.కృతిక, వైష్ణవి, సీనియర్స్ విభాగంలో ఎం.వేణుగోపాల్, పి.మోహన్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇండోర్ స్టేడియంలో ప్రతినెలా రెండో శనివారం, ఆదివారం చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సీఎంను కలిసిన పీయూ వీసీ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పీయూకు మంజూరైన ఇంజినీరింగ్, లా కళాశాలలను త్వరలో ప్రారంభించాల్సి ఉందని, బోధన, బోధనేతర ఖాళీలు భర్తీ చేయాలని వీసీ ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. పీయూ అభివృద్ధికి నిధుల కేటాయింపు, అదనపు పోస్టుల మంజూరు, వనపర్తి పీజీ సెంటర్లో బాలుర, బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కోరారు. రేపు అప్రెంటిస్‌షిప్ మేళా వనపర్తి విద్యావిభాగం: జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో ఈ నెల 10న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కె.రమేస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పలు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు http://www.appr enticeshipindia.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు మహ్మద్ ఇస్తేముల్ హక్ 98492 44030 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. -
మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి
వనపర్తి: మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో శనివారం మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు పలు రంగాల్లో సాధిస్తున్న విజయాలు రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ప్రస్తుత రోజు ల్లో మహిళలు ఏదో ఒక్క రంగంలో అని కాకుండా.. విద్య, వైద్యం, పారిశ్రామిక, అంతరిక్షం ఇలా అన్ని రంగాల్లో రాణించడం హర్షనీయమన్నారు. మహిళా అధికారులు తమ వృత్తిపరమైన బాధ్యతలను ధైర్యంగా నిర్వర్తించాలని సూచించారు. మహిళా పోలీసు సిబ్బంది సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పురుషులతో పోటీపడుతూ ఉద్యోగ అవకాశాలు, విధుల్లో సమానంగా పని చేయడం గొప్ప విషయమన్నారు. ఉన్నతంగా ఆలోచించే మహిళలకు తమ కుటుంబాలను ఉన్నత స్థాయికి చేర్చే సత్తా ఉంటుందన్నారు. ప్రత్యేకంగా పోలీసు శాఖలో ఎస్ఐ నుంచి హోంగార్డు వరకు మహిళా అధికారులు శాంతి భద్రతల విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. తమ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అదే విధంగా విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఎస్పీ పాల్గొని వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను శాలువాలతో సత్కరించారు. ముందుగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాల్లో డీసీఆర్బీ ఇన్చార్జి అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వు సీఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు, షీటీం ఎస్ఐ అంజద్, శిక్షణ ఎస్ఐలు హిమబిందు, దివ్యశ్రీ, భరోసా సెంటర్ కోఆర్డినేటర్, శిరీష, విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తిరుపతయ్య, యాదగిరి, బ్రహ్మాచారి, బైరోజు చంద్రశేఖర్, సూర్యనారాయణ, గణేశ్, నరసింహ, భాస్క ర్, రవి, గిరిరాజాచారి, అలివేలమ్మ, జ్యోతి, కల్పన, సుకన్య, సువర్ణదేవి తదితరులు పాల్గొన్నారు. -
అక్కరకు రాని చేపల మార్కెట్..
జిల్లా కేంద్రం నడిబొడ్డున 2005లో రూ. 23లక్షలతో చేపల మార్కెట్ ప్రారంభించారు. మొదట్లో మార్కెట్ భవనాన్ని వినియోగించుకున్న మత్స్యకారులు.. తదనంతరం రోడ్లపైనే విక్రయాలు చేసేందుకు ఆసక్తి చూపడంతో మార్కెట్ భవనం ముణ్నాళ్ల ముచ్చటగా మారింది. రాజకీయ నాయకులు కొందరు రోడ్లపై విక్రయాలను ప్రోత్సహించడంతో 16 ఏళ్లుగా చేపల మార్కెట్ అక్కరకు రావడం లేదు. మార్కెట్ ఆవరణ ఆటో స్టాండ్‌గా మారింది. జిల్లా కేంద్రంలో చేపల మార్కెట్ ఉందనే విషయాన్ని చివరకు అందరూ మరిచిపోయారు. భవనం వినియోగంపై మున్సిపల్, మత్స్యశాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షల ప్రజాధనంతో నిర్మించిన భవనం శిఽథిలావస్థకు చేరుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
వీపనగండ్ల: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాల మాఫీని పూర్తిచేసిందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని సంగినేనిపల్లిలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ. 20లక్షలతో సీసీరోడ్డు, రూ. 5లక్షలతో ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గోపల్‌దిన్నెలో రూ. 20లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అదే విధంగా రూ. 90 లక్షలతో గోఽవర్ధనగిరి – రంగవరం రోడ్డు, రూ. 80 లక్షలతో రంగవరం – నాగసానిపల్లి బీటీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రంగవరం, గోపల్‌దిన్నె, పుల్గర్‌చర్ల తదితర గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపల్‌దిన్నె రైతువేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేస్తున్నట్లు వివరించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 2లక్షల వరకు రుణాన్ని మాఫీ చేశామన్నారు. అర్హులైన పేదలందరికీ 200 యూనిట్లలోపు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అయితే సాంకేతిక సమస్యతో కొందరికి జీరో బిల్లులు రావడంలేదనే విషయం తన దృష్టికి వచ్చిందని.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా రూ. 500లకే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రంగవరం, గోపల్‌దిన్నె గ్రామాల మధ్య నెలకొన్న భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతులందరి పంట రుణాలు మాఫీ అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గోపల్‌దిన్నె గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండు రోజులుగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలను మంత్రి జూపల్లి కృష్ణారావు విరమింపజేశారు. గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు చేపట్టగా.. ఆయా సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హుందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీరయ్య యాదవ్, నాయకులు నారాయణరెడ్డి, బాల్‌రెడ్డి, ఇంద్రకంటి వెంకటేష్, సుదర్శన్‌రెడ్డి, గోపాల్‌నాయక్, చక్ర వెంకటేష్, చిన్నారెడ్డి, రాంరెడ్డి, మోహన్, సీపీఎం మండల కార్యదర్శి బాల్‌రెడ్డి, వెంకటయ్య, నిరంజన్, శేఖర్‌రెడ్డి, చంద్రయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలి
వనపర్తి రూరల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని దళితవాడ, చిట్యాల రోడ్డులోని డబుల్బెడ్రూం ఇళ్లు, చందాపూర్ రోడ్డులోని పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీల్లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. అనంతరం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని దళితవాడలో లోఓల్టేజీ, శ్మశానవాటిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితవాడ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. చిట్యాల రోడ్డులోని డబుల్బెడ్రూం ఇళ్ల వద్ద తాగునీరు, వీధిలైట్లు, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు, రేషన్‌షాపు లేక అవస్థలు పడుతున్నారని.. వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రహరీని అనుసరించి చిరు వ్యాపారులు, మెకానిక్‌లు ఏర్పాటుచేసుకున్న డబ్బాలను రోడ్డు విస్తరణలో తొలగించడంతో రోడ్డున పడ్డారని.. వారికి అడ్డాలు చూపించి ఆదుకోవాలని కోరారు. పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీలో ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు అలుపెరగని పోరాటం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ. 2,500 చొప్పున ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పింఛన్ రూ. 4వేలకు పెంచుతామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎ.లక్ష్మితో కలిసి జాన్‌వెస్లీ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, ఎండీ జబ్బార్, మండ్ల రాజు, పట్టణ కార్యదర్శి పరమేశ్వరాచారి, గంధం మధన్, జి.బాలస్వామి, గట్టయ్య, నందిమల్ల రాములు, డీఏ శ్రీను, జి.బాలరాజు, రాబర్ట్, మద్దిలేటి, ఎం.మన్యం, సాయిలీల, కవిత, ఉమా, రేణుక పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ