
మార్కెట్ నిర్మించాలి..
కొల్లాపూర్‌లో మామిడి సాగుచేసే రైతులు వేల సంఖ్య లో ఉన్నారు. ప్రభు త్వం రైతులను పట్టించుకోవాలి. మామిడి మార్కెట్ ఏర్పాటుచేస్తామని కొన్నేళ్లుగా చెబుతున్నారు. కానీ మార్కెట్ నిర్మించడం లేదు. ప్రైవేటు మార్కెట్లలోనే రైతులు పంట అమ్ముకుంటున్నారు. ఈ అంశంపై ప్రజాప్రతినిధు లు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. రైతులందరికీ ఉపయోగపడేలా మార్కెట్ ఏర్పాటుచేయాలి. ఈ ఏడాది పంట నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– బాలచంద్రయ్య, మామిడి రైతు, కొల్లాపూర్
అధికారులకు నివేదించాం..
మామిడి మార్కెట్ నిర్మాణం మార్కెటింగ్ శాఖ పరిధిలోనిద. మార్కెట్ నిర్మాణానికి అనువైన స్థల సేకరణ కోసం కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో మామిడి సాగు, దిగుబడి, మార్కెటింగ్ అంశాలను గతంలో ఉన్నతాధికారులకు నివేదించాం. రైతులు పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్‌తో పాటు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్‌లోని ప్రైవేటు మార్కెట్‌లకు వెళ్తున్న విషయాలను కూడా తెలియజేశాం.
– లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్
●

మార్కెట్ నిర్మించాలి..