Wanaparthy District News
-
‘ఎల్ఆర్ఎస్’ వేగవంతం చేయాలి
వనపర్తి: జిల్లాలోని ఐదు పురపాలికల్లో ప్లాట్ల క్రమబద్దీకరణకు సుమారు 25 వేల మందికి నోటీసులు జారీ చేసినా.. ఆశించినస్థాయిలో ఫలితం కనిపించడం లేదని, లేఅవుట్లు చేసిన వారు, బిల్డర్లు, ప్లాట్ల యజమానులకు వార్డు అధికారులతో ఫోన్ చేయించి డబ్బులు కట్టించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పుర కమిషనర్లు, టౌన్ ప్లానర్లు, టౌన్ ప్లానింగ్ ఇంజినీర్లతో ఎల్ఆర్ఎస్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ ఉంటే ప్లాట్‌కు రక్షణ ఉంటుందని, ఎవరూ ఆక్రమించడానికి అవకాశం ఉండదని, పురపాలిక ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో ప్లాట్ విక్రయించాలనుకున్నా ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్‌కు మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవారి నుంచి డబ్బులు వసూలు చేసి క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు 25 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించిందని.. తర్వాత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ప్రస్తుత మార్కెట్ విలువకు 14 శాతం జరిమానా చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని.. ఎట్టి పరిస్థితిలోను అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. అనంతరం ఎల్ఆర్ఎస్ డబ్బులు చెల్లించిన ప్లాట్ల యజమానులకు కలెక్టర్ క్రమబద్ధీకరణ ఉత్తర్వు కాపీలు అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకేంద్రంలోనూ..
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంతో పాటు విలీన గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదు. ఇటీవల జరిగిన పుర బడ్జెట్లో వెనుకబడిన, మురుగువాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు అన్నీ వార్డుల్లాగే రూ.60 లక్షలు ప్రతిపాదించారు. 21, 23 కొత్త కాలనీలు, 6, 13, 15, 22 వార్డులు, కొత్తగా వెలుస్తున్న శివారు కాలనీలైన 11, 10, 12, 4 వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఖాళీ ప్రదేశాల్లో మురుగు నిలిచి దుర్వాసన వస్తోంది. పుర కార్యాలయం ఎదుట కూడా డ్రెయినేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. పాతబజార్‌లో రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నచోట కాల్వల నిర్మాణాలు మధ్యలోనే వదిలేశారు. రహదారి విస్తరణ అరకొరగా చేపట్టిన పాన్‌గల్ మార్గంలోనూ కొన్నిచోట్ల డ్రెయినేజీలు శిథిలావస్థకు చేరుకోగా.. మరికొన్ని చోట్ల మధ్య మధ్యలో పూర్తి చేయాల్సి ఉంది. దీనికితోడు తాళ్ల చెరువు అలుగు కాల్వను పూర్తిస్థాయిలో ఆధునికీకరించకపోవడంతో మురుగు నిలిచి ఉంటుంది. మర్రికుంట, నర్సింగాయపల్లి, శ్రీనివాసపురం తదితర విలీన గ్రామాల్లోనూ డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. -
పందుల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఆత్మకూర్‌లో పందుల దొంగతనానికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆత్మకూర్‌లోని పరమేశ్వరస్వామి చెరువుకట్ట సమీపంలో చెన్నయ్య షెడ్ వేసుకొని 73 పందులను పెంచుతున్నారు. ఫిబ్రవరి 16న బింగిదొడ్డి అంజి, మాదిరె మహేష్, నందవరం బాలరాజు రెక్కి నిర్వహించి పందులు ఉన్నట్లు ఎరుకలి భీమన్న, కందేనతి సుంకన్నకు సమాచారం ఇచ్చారు. 17వ తేదీన అందరూ కలిసి ఎరుకలి సిద్ధప్ప బొలెరో వాహనంలో సింధనూర్ నుంచి బయలుదేరి మార్గమధ్యంలో ఎరుకలి అంజి, ఎరుకలి నాగరాజును ఎక్కించుకొని ఎమ్మిగనూర్‌కు వచ్చి అక్కడ ఎరుకలి భీమన్న, గుల్లి నాగరాజు, కందెనతి సుంకన్న, మదిరె మహేశ్, హోలిగుంది అంజి కలిసి అదేరోజు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో 30 పందులను వాహనంలో ఎక్కించారు. కాపలాగా ఉన్న ఇద్దరు లేచి అరుస్తూ దగ్గరగా వస్తుండగా వారిపై గాజు సీసాలు, రాళ్లతో దాడిచేయగా గాయాలయ్యాయి. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు లాక్కొని మార్గమధ్యంలో జూరాల జలాశయంలో పడేసి వెళ్లి బెంగుళూరులో రూ.90 వేలకు విక్రయించారు. ఇలా దొరికారు.. మంగళవారం ఉదయం సిద్ధప్ప తన బొలెరో వాహనంలో హోలిగుంది అంజి, సిరిగెరి నాగరాజు, బింగిదొడ్డి అంజి కలిసి దొంగతనం చేయడానికి అమరచింత వైపు వస్తున్నారు. మస్తీపూర్ చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా గమనించి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారిస్తే గతంలో వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల, పెద్దమందడి మండలం దొడగుంటపల్లి, గద్వాల జిల్లాలోని అలంపూర్, శాంతినగర్, అయిజ, కర్నూల్ జిల్లా మంత్రాలయం, ఎమ్మిగనూర్, నందవరం, మాధవరం, కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్, మస్కి, హుబ్లి, సింధనూర్ ప్రాంతాల్లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి బొలెరో వాహనం, రూ.90 వేల నగదు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ, అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, ఆత్మకూరు సీఐ శివకుమార్, ఆత్మకూరు ఎస్ఐ నరేందర్, అమరచింత ఎస్ఐ సురేష్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
గ్రూప్–1లో సత్తాచాటిన వడ్డెవాట యువకుడు
కొత్తకోట రూరల్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో మండలంలోని వడ్డెవాటకు చెందిన మండ్ల పవన్‌కుమార్ 510 మార్కులు సాధించి సత్తా చాటారు. తండ్రి వెంకటస్వామి స్థానిక సర్కిల్ కార్యాలయంలో రైటర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తమ ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు, పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు. సమయస్ఫూర్తి కోల్పోవద్దు వనపర్తిటౌన్: అతి తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఆశ, అత్యాశతోనే ఉన్న నగదును కోల్పోవాల్సి వస్తోందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, వనపర్తి సీనియర్ సివిల్‌కోర్టు న్యాయమూర్తి వి.రజని అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రధానమంత్రి కౌశల్ యోజన శిక్షణ కేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు చూపే ఆశకు లోనుకాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. తెలియని వెబ్సైట్లను ఓపెన్ చేసి అనవసర ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. ప్రజలకు న్యాయ సేవలను చేరువ చేసేందుకు న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాల్య వివాహాలు, పోక్సో, మోటార్ వెహికిల్, బాలకార్మిక వ్యవస్థ తదితర చట్టాల గురించి వివరించారు. శిక్షణ కేంద్రం నిర్వాహకుడు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళా సాధికారతకు పాటుపడాలి మదనాపురం: మహిళా సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల కోరారు. సోమవారం రాత్రి మండలంలోని అజ్జకొల్లులో ఐద్వా గ్రామకమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రీబాయి పూలే వర్ధంతి కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, మహిళా రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ అధ్యక్ష కార్యదర్శులు స్వాతి, లక్ష్మి, భాగ్యలక్ష్మి, రేణుక, రమాదేవి, శిరీష, కృష్ణవేణి పాల్గొన్నారు. ఆ భూములు గిరిజనులకే దక్కాలి ఊర్కొండ: గిరిజనులకు సంబంధించిన భూములు వారికే దక్కాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్‌నాయక్ అన్నారు. మండలంలోని గునగుండ్లపల్లి పంచాయతీ రెడ్యాతండా సమీపంలోని ఊర్కొండపేట రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నం.186లో గల 109 ఎకరాల అసైన్డ్ భూమి తరతరాల నుంచి గిరిజనుల స్వాధీనంలో ఉందని, ఆ భూమిని ప్రస్తుతం ఇతరులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుండటంతో తండావాసులు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం రెడ్యాతండాను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు సందర్శించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అసైన్ భూములు గిరిజనులకు దక్కే విధంగా చూస్తామని, అదేవిధంగా తండా ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినప్పటికీ వారు ఏనాడు కూడా ఇక్కడ సేద్యం చేయలేదని, అలాంటి వారు ఇప్పుడు గిరిజనులను మా భూములు మాకే చెందుతాయని భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. గిరిజనులకు సంబంధించిన భూములను గిరిజనులకు చెందేలా తనవంతు కృషిచేస్తానన్నారు. అధికారులు ఎలాంటి తప్పిదాలు చేయకుండా అసైన్డ్ భూములు నిరుపేద గిరిజనులకు దక్కేలా చూడాలని ఆదేశించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి ఇక్కడికి వచ్చామని, గిరిజన నాయకులు మాట్లాడిన విధానం చూస్తుంటే ఇక్కడ కొందరు కావాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలుస్తుందని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. అధికారులు వాస్తవాలను నెల రోజుల్లో తెలియజేసేలా చూడాలని సూచించారు. -
పాలమూరు యూనివర్సిటీలో 27, 28 తేదీల్లో వర్క్‌షాప్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్‌షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కన్వీనర్ అర్జున్‌కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్‌ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు. -
పురం.. అపరిశుభ్రం
మున్సిపాలిటీల్లో రహదారులపై పారుతున్న మురుగు అమరచింత: జిల్లాలోని పురపాలికల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అమరచింత, కొత్తకోట, ఆత్మకూర్, పెబ్బేరులో నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో మురుగు రహదారులపై పారుతుండటంతో పాటు ఇళ్ల నడుమ నిలిచి మురుగు కుంటలను తలపిస్తున్నాయి. వరాహాలు, దోమల వ్యాప్తిచెంది ప్రజలు అనారోగ్యం బారినపడి ఆస్పత్రుల పాలవుతున్న దుస్థితి నెలకొంది. బీఆర్ఎస్ హయాంలో పెద్ద గ్రామపంచాయతీలను పురపాలికలుగా మార్చే సమయంలో సమీప గ్రామాలను విలీనం చేశారు. పెబ్బేరులో చెలిమిళ్ల, ఆత్మకూర్‌లో ఖానాపురం గ్రామాన్ని విలీనం చేయడంతో ఆయా గ్రామాలు పురపాలికలోని వార్డుగా మారడంతో ఆయా గ్రామాల్లో మున్సిపాల్టీ నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కొత్త పురపాలికలకు ఆదాయ వనరులు సరిగా లేకపోవడంతో వచ్చే బడ్జెట్ నుంచే సీసీ రహదారులు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేయాలి. కానీ పూర్తిస్థాయిలో డ్రెయినేజీలు నిర్మించడంలో పుర పాలకులు విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. అవసరం ఉన్న చోట్ల వదిలి ఇతర ప్రాంతాల్లో కాల్వల నిర్మాణాలు చేపట్టడంతో పుర నిధులు వృథా అయ్యాయన్న ఆరోపణలున్నాయి. పాలకుల నిర్లక్ష్యం.. ఎన్టీఆర్ కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక ఇబ్బందులు పడుతున్నాం. పాలకుల నిర్లక్ష్యం కారణంగా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకమండలి పదవీకాలం ముగిసి మూడు నెలలు గడుస్తున్నా అధికారులు డ్రెయినేజీల్లోని మురుగు తొలగించే చర్యలు చేపట్టడం లేదు. పుర కమిషనర్ చొరవ చూపాల్సిన అవసరం ఉంది. – లాల్కోట రవి, 7వ వార్డు, కొత్తకోట డ్రెయినేజీ అస్తవ్యస్తం.. జోగినీకాలనీలో ఏళ్లుగా మురుగు వ్యవస్థ అధ్వానంగా ఉంది. మున్సిపాలిటీగా మారినా నేటికీ కొత్త డ్రెయినేజీలు నిర్మించడం లేదు. దీంతో ఇళ్ల నుంచి వస్తున్న మురుగంతా రహదారులపై పారుతోంది. అధికారులు స్పందించి మురుగు కాల్వలు నిర్మించాలి. – వెంకటేష్, 7వ వార్డు, అమరచింత మురుగు పేరుకుపోయింది.. పట్టణంలోని 2వ వార్డులో మురుగు సమస్య తీవ్రంగా ఉంది. చెరువు కాల్వ పూడుకుపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నిలిచి పరిసరాల్లో దుర్వాసన వస్తోంది. దీనికితోడు దోమల బెడద తీవ్రంగా ఉంది. అధికారులు స్పందించి మురుగు తొలగించడంతో పాటు డ్రెయినేజీ నిర్మించాలి. – చింతకుంట వెంకటేష్, 2వ వార్డు, అమరచింత ● ఆత్మకూర్‌లో ఆశించిన స్థాయిలో కాల్వల నిర్మాణం పూర్తిగాకపోవడంతో మురుగు రహదారులపై పారుతోంది. విలీన గ్రామమైన ఖానాపురం గ్రామంలో సైతం డ్రైనేజీలు నిర్మించాల్సి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ● పెబ్బేరు పురపాలికలో మురుగు వ్యవస్థ కాస్త మెరుగ్గా ఉన్నా.. వనపర్తి రోడ్లో రహదారి విస్తరణ పనులు చేపట్టడంతో కాల్వలు దెబ్బతిన్నాయి. దీంతో మురుగు రహదారిపై పారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీవాసులు వాపోతున్నారు. విలీన గ్రామమైన చెలిమిళ్లలో సైతం డ్రెయినేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ● కొత్తకోట పురపాలికలో 15 వార్డులు, సుమారు 25 వేల జనాభా ఉంది. ఆయా వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతో మురుగంతా రహదారులపైనే పారుతోంది. పట్టణంలోని విద్యానగర్‌కాలనీలో ఉన్న కాల్వల్లో మురుగు పేరుకుపోయినా తొలగించడం లేదు. దీంతో దోమలు, పందుల బెడద అధికమైంది. పలు వార్డుల్లో అవసరం మేరకు డ్రెయినేజీలు నిర్మించలేదు. పురపాలికల వారీగా ఇలా.. నివేదిక తయారు చేస్తాం.. పురపాలికలో డ్రెయినేజీల నిర్మాణం ఎక్కడెక్కడ చేపట్టాలో పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి నిధుల మంజూరుకుగాను ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. పట్టణంలోని 2, 7వ వార్డులో డ్రెయినేజీలు లేవని మా దృష్టికి వచ్చింది. నిర్మాణాలకు అవసరమయ్యే నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం. – రవిబాబు, పుర కమిషనర్ అమరచింత పట్టించుకోవడం లేదు.. కాలనీలో డ్రెయినేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల ఆవరణలో మురుగు నిలుస్తోంది. దుర్వాసనతో పాటు దోమల బెడద అధికమైంది. సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. – జయమ్మ, అంబేడ్కర్‌చౌక్ సమీపకాలనీ, వనపర్తి ● అమరచింత మున్సిపాలిటీలో పది వార్డులుండలు 2, 7 వార్డుల్లో సీసీ రహదారులు, డ్రెయినేజీల నిర్మాణాలు చేపట్టలేదు. 7వ వార్డులో మురుగు కాల్వలు లేక ఇళ్ల నుంచి వస్తున్న మురుగును రహదారులపై వదలుతున్నారు. దీంతో కాలనీలో దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద అధికంగా ఉండటంతో ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. ముందుకుసాగని డ్రెయినేజీల నిర్మాణాలు చేసిన తీర్మానాలు.. ప్రతిపాదనలకే పరిమితం దోమలు, వరాహాల సంచారంతో జనం బెంబేలు -
చట్టాలపై అవగాహన ఉండాలి
ఖిల్లాఘనపురం: విద్యార్థులకు చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి వి.రజని అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాల్యవివాహాలు జరిపించే వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. అదే విధంగా సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్‌చేసి లాటరీ తగిలింది.. మీ ఖాతాకు డబ్బులు వస్తాయి.. ఓటీపీ చెప్పాలని అడిగితే చెప్పరాదన్నారు. ఫోన్లో ఏదైనా గుర్తుతెలియని లింక్ వచ్చినా ఓపెన్ చేయరాదన్నారు. ఎవరికై నా న్యాయ సేవలు అవసరమైతే 15100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా కరాటే విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంఈఓ జయశంకర్, హెచ్ఎంలు మునవర్ సుల్తానా, లలిత, ప్రశాంతి, సఖి లీగల్ కౌన్సెల్ డి.కృష్ణయ్య, పారా లీగల్ వలంటీర్ అహ్మద్, కరాటే మాస్టర్ శేఖర్, వరుణ్, శివ పాల్గొన్నారు. -
కనుచూపు మేరలోనే..
పర్యాటక ప్రాంతమైన సోమశిలకు నిత్యం జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు ఇక్కడికి రావడం నిత్యకృత్యం. సోమశిలలోని టూరిజం కాటేజీలు, పుష్కరఘాట్ల వద్ద నుంచి చూస్తే.. అలవి వలలతో చేపల వేట సాగించే మత్స్యకారుల గుడారాలతో పాటు నదీ తీరానికి రెండు వైపులా ఆరబెట్టిన చేపపిల్లలు కనిపిస్తాయి. కానీ ఎవరూ అటువైపు కన్నెత్తి చూడరు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోలు, అమరిగిరిలోని నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అలవి వలల గుడారాలే కనిపిస్తాయి. -
అన్ని పోలీస్స్టేషన్లకు అధునాతన కంప్యూటర్లు
వనపర్తి: మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అధునాతన కంప్యూటర్లు అవసరమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అన్ని స్టేషన్ల అధికారులకు కంప్యూటర్లు, ప్రింటర్లు, అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడే పోలీసు శాఖలో జిల్లాలోని అన్ని గ్రామాలు, విభాగాల సమాచారం అందుబాటులో ఉండాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా, మండల పరిధిలోని గ్రామాల వివరాలతో పాటు నేర సంబంధిత విషయాలను భద్ర పరచడానికి, సులభంగా తెలుసుకోవడానికి సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అధునాతన కంప్యూటర్లతో పోలీసు ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారన్నారు. ● పోలీసు ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు ప్రజావాణికి మొత్తం తొమ్మిది ఫిర్యాదులు అందాయని.. వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత సీఐ, ఎస్ఐలకు సూచించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ, ఇన్చార్జి అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐలు కృష్ణ, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ శివకుమార్, సిబ్బంది సుదర్శన్, భరత్ పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు పాన్‌గల్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని.. మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల మహిళా సమాఖ్య భవనంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ.. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాన్‌గల్ మండల మహిళా సమాఖ్యకు రూ. 36లక్షల విలువగల ఆర్టీసీ అద్దె బస్సును కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా 150 మండలాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించగా.. అందులో పాన్‌గల్ మండల మహిళా సమాఖ్య ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ ఆదర్శ్ సురభిలకు మహిళా సమాఖ్య తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం వెంకటేశ్ యాదవ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, మాజీ ఎంపీటీసీ హైమావతి పాల్గొన్నారు. 23న సీపీఐ శతాబ్ధి ఉత్సవాలు వనపర్తి రూరల్: జిల్లా కేంద్రంలో ఈ నెల 23న నిర్వహించే సీపీఐ శతాబ్ధి ఉత్సవాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని జిల్లా కార్యదర్శి విజయరాములు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో కె.శ్రీరామ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హాజరవుతారన్నారు. ఉత్సవాలకు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, నాయకులు చంద్రయ్య, భాస్కర్, రమేశ్, రాబర్ట్, మోష, అబ్రహం, నర్సిహయ్య శెట్టి, శ్రీహరి ఉన్నారు. -
ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించండి
వనపర్తి: ప్రజావాణికి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 51 అర్జీలు వచ్చాయని.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వేసవిలో జాగ్రత్తలు పాటించాలి.. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బకు గురికాకుండా ప్రజలు ముందుజాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. కలెక్టరేట్లో డీఎంహెచ్ఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్పీసీసీహెచ్, హీట్ వేవ్ టాస్క్‌ఫోర్స్ కమిటీలతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పనులు చేసుకోవాలని.. అత్యవసర పనులు ఉంటేనే మధ్యాహ్నం బయటకు వెళ్లాలని సూచించారు. అన్నిశాఖల అధికారులు ఎండల తీవ్రతపై అప్రమత్తమై ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎవరికైనా వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలన్నారు. శిశువులు, బాలబాలికలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం వైద్యారోగ్యశాఖ రూపొందించిన ‘వడదెబ్బ నుంచి రక్షించుకుందాం ‘ వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
మిగిలింది 20 రోజులే..
మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు అంతంతే ● సీఎం ఇలాఖాలో 57 శాతమే వసూలుతో రాష్ట్రస్థాయిలో 63వ స్థానం ● ఉమ్మడి జిల్లాలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లే దిక్కు ● ప్రత్యేకంగా సోమ, గురువారాల్లో రెవెన్యూ మేళాలు ● గడువు నేపథ్యంలో పరుగులు పెట్టిస్తున్న ప్రత్యేకాధికారులు నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు ఆస్తి పన్ను రాబడి కీలకం. నివాసగృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను వసూలుపై మున్సిపల్ అధికార యంత్రాంగం డిజిటల్ చెల్లింపులపై దృష్టిసారించింది. క్యూఆర్ కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా మున్సిపాలిటీ ఖాతా లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలతోనే మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు అధికారులు ఒక అడుగు ముందుకు.. మూడు అ డుగులు వెనక్కి పడినట్లు చెబుతున్నారు. అయితే ము న్సిపాలిటీల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వసూలు అంతంత మాత్రమే ఉండటం.. టార్గెట్ చేరుకునేందుకు కేవలం 20 రోజులే ఉండటంతో అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. 80 శాతంతో నాలుగో స్థానం.. రాష్ట్రస్థాయిలో పన్నులు వసూలు చేయడంలో ఉమ్మడి జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ నాలుగో స్థానంలో నిలిచింది. సుమారు 4 వేల ఆస్తులకు రూ.98 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటికే రూ.78 లక్షలు (80 శాతం) వసూలు చేశారు. రాష్ట్రస్థాయిలో 63వ స్థానం.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో 5,332 ఆస్తులకు రూ.1.94 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1.10 కోట్లు (57 శాతం) వసూలు చేశారు. దీంతో ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 63వ స్థానంలో నిలిచింది. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లపూర్లో సైతం 6,406 ఆస్తులకు రూ.1.28 కోట్లకు రూ.72 లక్షలు వసూలు (56 శాతం) చేశారు. ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 68వ స్థానంలో నిలిచింది. అదనపు కలెక్టర్లకు బాధ్యతలు.. ఈ ఏడాది జనవరి 26తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్) ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించింది. వీరు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లపై ఎప్పటికప్పుడు మున్సిపల్ రెవెన్యూ, బి ల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, కమిషనర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. వారం రోజులుగా ప్రత్యేక దృష్టిసారిస్తూ రోజూవారిగా పన్నుల వసూళ్లపై నివేదిక తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, రివిజన్ పిటిషన్ సహా ఇతర సమస్యల పరిష్కారం కోసం సోమ, గురువారాల్లో ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మున్సిపాలిటీల్లో రెవెన్యూమేళా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీల్లో ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, ఇతర సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ప్రాపర్టీ పేరు మార్పు, మ్యూటేషన్, ఇంటి నంబర్ కేటాయింపు లేదా మార్పు వంటి సేవలు పొందవచ్చు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆస్తులు పన్నులు, వసూలు (రూ.కోట్లలో) రెవెన్యూ ఇన్స్పెక్టర్లు లేక.. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులే దిక్కయ్యారు. మున్సిపాలిటీల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో పన్నుల వసూలు చేయడంలో జాప్యం జరుగుతుందని అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. రెవెన్యూకు సంబంధించిన విషయం కావడంతో ప్రధాన మున్సిపాలిటీల్లో తప్పా కొత్తగా ఏర్పాటైన వాటిలో ఇప్పటి వరకు ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయని సమాచారం. పన్నులు ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతుండటం మరో సమస్యగా చెబుతున్నారు. లక్ష్యం చేరుకుంటాం.. ప్రతి ఏడాది మార్చిలోనే అత్యధికంగా పన్నులు వసూలు అవుతాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి పట్టణ ప్రజలు, వ్యాపారులు తమ ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలి. గత వారం రోజులుగా పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. ఈ నెల 31 వరకు వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు కృషిచేస్తున్నాం. – భోగేశ్వర్, మున్సిపల్ కమిషనర్, నారాయణపేట -
లోక్‌అదాలత్‌లో 6,266 కేసులు పరిష్కారం
వనపర్తిటౌన్: చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు చెప్పారు. ఏడు బెంచ్‌ల ద్వారా 2,663 క్రిమినల్, 8 సివిల్, 3,595 ప్రీ లిటిగేషన్ కేసులతో కలిపి మొత్తం 6,266 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్‌అదాలత్ గొప్ప అవకాశమన్నారు. కక్షిదారులు సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు కోర్టు ఫీజు వాపస్ పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్‌జడ్జి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి బి. రవికుమార్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి జానకి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి బి. శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా చెస్ పోటీలు వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో శనివారం జూనియర్, సీనియర్స్ విభాగాల్లో చెస్ పోటీలు నిర్వహించారు. ముందుగా జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి, కార్యదర్శి వేణుగోపాల్, ఆర్థిక కార్యదర్శి టీపీ కృష్ణయ్య పోటీలను ప్రారంభించగా.. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జూనియర్ విభాగంలో పి.కృతిక, వైష్ణవి, సీనియర్స్ విభాగంలో ఎం.వేణుగోపాల్, పి.మోహన్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇండోర్ స్టేడియంలో ప్రతినెలా రెండో శనివారం, ఆదివారం చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సీఎంను కలిసిన పీయూ వీసీ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పీయూకు మంజూరైన ఇంజినీరింగ్, లా కళాశాలలను త్వరలో ప్రారంభించాల్సి ఉందని, బోధన, బోధనేతర ఖాళీలు భర్తీ చేయాలని వీసీ ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. పీయూ అభివృద్ధికి నిధుల కేటాయింపు, అదనపు పోస్టుల మంజూరు, వనపర్తి పీజీ సెంటర్లో బాలుర, బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కోరారు. రేపు అప్రెంటిస్‌షిప్ మేళా వనపర్తి విద్యావిభాగం: జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో ఈ నెల 10న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కె.రమేస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పలు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు http://www.appr enticeshipindia.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు మహ్మద్ ఇస్తేముల్ హక్ 98492 44030 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. -
మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి
వనపర్తి: మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో శనివారం మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు పలు రంగాల్లో సాధిస్తున్న విజయాలు రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ప్రస్తుత రోజు ల్లో మహిళలు ఏదో ఒక్క రంగంలో అని కాకుండా.. విద్య, వైద్యం, పారిశ్రామిక, అంతరిక్షం ఇలా అన్ని రంగాల్లో రాణించడం హర్షనీయమన్నారు. మహిళా అధికారులు తమ వృత్తిపరమైన బాధ్యతలను ధైర్యంగా నిర్వర్తించాలని సూచించారు. మహిళా పోలీసు సిబ్బంది సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పురుషులతో పోటీపడుతూ ఉద్యోగ అవకాశాలు, విధుల్లో సమానంగా పని చేయడం గొప్ప విషయమన్నారు. ఉన్నతంగా ఆలోచించే మహిళలకు తమ కుటుంబాలను ఉన్నత స్థాయికి చేర్చే సత్తా ఉంటుందన్నారు. ప్రత్యేకంగా పోలీసు శాఖలో ఎస్ఐ నుంచి హోంగార్డు వరకు మహిళా అధికారులు శాంతి భద్రతల విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. తమ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అదే విధంగా విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఎస్పీ పాల్గొని వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను శాలువాలతో సత్కరించారు. ముందుగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాల్లో డీసీఆర్బీ ఇన్చార్జి అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వు సీఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు, షీటీం ఎస్ఐ అంజద్, శిక్షణ ఎస్ఐలు హిమబిందు, దివ్యశ్రీ, భరోసా సెంటర్ కోఆర్డినేటర్, శిరీష, విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తిరుపతయ్య, యాదగిరి, బ్రహ్మాచారి, బైరోజు చంద్రశేఖర్, సూర్యనారాయణ, గణేశ్, నరసింహ, భాస్క ర్, రవి, గిరిరాజాచారి, అలివేలమ్మ, జ్యోతి, కల్పన, సుకన్య, సువర్ణదేవి తదితరులు పాల్గొన్నారు. -
అక్కరకు రాని చేపల మార్కెట్..
జిల్లా కేంద్రం నడిబొడ్డున 2005లో రూ. 23లక్షలతో చేపల మార్కెట్ ప్రారంభించారు. మొదట్లో మార్కెట్ భవనాన్ని వినియోగించుకున్న మత్స్యకారులు.. తదనంతరం రోడ్లపైనే విక్రయాలు చేసేందుకు ఆసక్తి చూపడంతో మార్కెట్ భవనం ముణ్నాళ్ల ముచ్చటగా మారింది. రాజకీయ నాయకులు కొందరు రోడ్లపై విక్రయాలను ప్రోత్సహించడంతో 16 ఏళ్లుగా చేపల మార్కెట్ అక్కరకు రావడం లేదు. మార్కెట్ ఆవరణ ఆటో స్టాండ్‌గా మారింది. జిల్లా కేంద్రంలో చేపల మార్కెట్ ఉందనే విషయాన్ని చివరకు అందరూ మరిచిపోయారు. భవనం వినియోగంపై మున్సిపల్, మత్స్యశాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షల ప్రజాధనంతో నిర్మించిన భవనం శిఽథిలావస్థకు చేరుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. -
బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధన
కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రపస్తుతం బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో మొత్తం రూ.3,225 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1, అల్టమిన్, లోహం మెటీరియల్స్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని తెలుగులో ‘నమస్తే.. బాగున్నారా..!’ అని ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని ‘పుష్ప తగ్గేలే..’ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ ‘దివిటిపల్లి అభివృద్ధి ఆగదు.. ఇక నిరంతర అభివృద్ధే..’ అని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి అమరరాజా కంపెనీలో 80 శాతం మహిళలే పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. కాగా మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో పాటు మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్‌బాబు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్త లు ముందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ డి.శ్రీధర్‌బాబు అన్నారు. ఇటీవల దావోస్ సమ్మిట్‌లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వివిధ పెద్ద సంస్థలు సుమారు రూ.78 వేల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ, చైర్మన్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న గిగా ఫ్యాక్టరీ ద్వారా సుమారు 4,500 మందికి ప్రత్యక్షంగా, మరో పది వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయాలి
వనపర్తి రూరల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని దళితవాడ, చిట్యాల రోడ్డులోని డబుల్బెడ్రూం ఇళ్లు, చందాపూర్ రోడ్డులోని పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీల్లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. అనంతరం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని దళితవాడలో లోఓల్టేజీ, శ్మశానవాటిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితవాడ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. చిట్యాల రోడ్డులోని డబుల్బెడ్రూం ఇళ్ల వద్ద తాగునీరు, వీధిలైట్లు, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు, రేషన్‌షాపు లేక అవస్థలు పడుతున్నారని.. వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రహరీని అనుసరించి చిరు వ్యాపారులు, మెకానిక్‌లు ఏర్పాటుచేసుకున్న డబ్బాలను రోడ్డు విస్తరణలో తొలగించడంతో రోడ్డున పడ్డారని.. వారికి అడ్డాలు చూపించి ఆదుకోవాలని కోరారు. పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీలో ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు అలుపెరగని పోరాటం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ. 2,500 చొప్పున ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పింఛన్ రూ. 4వేలకు పెంచుతామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎ.లక్ష్మితో కలిసి జాన్‌వెస్లీ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, ఎండీ జబ్బార్, మండ్ల రాజు, పట్టణ కార్యదర్శి పరమేశ్వరాచారి, గంధం మధన్, జి.బాలస్వామి, గట్టయ్య, నందిమల్ల రాములు, డీఏ శ్రీను, జి.బాలరాజు, రాబర్ట్, మద్దిలేటి, ఎం.మన్యం, సాయిలీల, కవిత, ఉమా, రేణుక పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
వీపనగండ్ల: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాల మాఫీని పూర్తిచేసిందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని సంగినేనిపల్లిలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ. 20లక్షలతో సీసీరోడ్డు, రూ. 5లక్షలతో ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గోపల్‌దిన్నెలో రూ. 20లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం సీసీరోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అదే విధంగా రూ. 90 లక్షలతో గోఽవర్ధనగిరి – రంగవరం రోడ్డు, రూ. 80 లక్షలతో రంగవరం – నాగసానిపల్లి బీటీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రంగవరం, గోపల్‌దిన్నె, పుల్గర్‌చర్ల తదితర గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య పరిష్కారం కోసం 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపల్‌దిన్నె రైతువేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేస్తున్నట్లు వివరించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 2లక్షల వరకు రుణాన్ని మాఫీ చేశామన్నారు. అర్హులైన పేదలందరికీ 200 యూనిట్లలోపు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అయితే సాంకేతిక సమస్యతో కొందరికి జీరో బిల్లులు రావడంలేదనే విషయం తన దృష్టికి వచ్చిందని.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా రూ. 500లకే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రంగవరం, గోపల్‌దిన్నె గ్రామాల మధ్య నెలకొన్న భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతులందరి పంట రుణాలు మాఫీ అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గోపల్‌దిన్నె గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండు రోజులుగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలను మంత్రి జూపల్లి కృష్ణారావు విరమింపజేశారు. గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు చేపట్టగా.. ఆయా సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హుందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీరయ్య యాదవ్, నాయకులు నారాయణరెడ్డి, బాల్‌రెడ్డి, ఇంద్రకంటి వెంకటేష్, సుదర్శన్‌రెడ్డి, గోపాల్‌నాయక్, చక్ర వెంకటేష్, చిన్నారెడ్డి, రాంరెడ్డి, మోహన్, సీపీఎం మండల కార్యదర్శి బాల్‌రెడ్డి, వెంకటయ్య, నిరంజన్, శేఖర్‌రెడ్డి, చంద్రయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. -
25 శాతం రాయితీపై విస్తృత ప్రచారం
వనపర్తి: ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు నెలాఖరు వరకు 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు పురపాలికల్లో విస్తృత ప్రచారం చేస్తున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి పురపాలికశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్, ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో 48 వేల మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుని కేవలం 160 మంది మాత్రమే డబ్బులు చెల్లించేందుకు ముందుకొచ్చారని వివరించారు. గడువు ముగిసిన తర్వాత ప్రస్తుత మార్కెట్ విలువకు 14 శాతం అదనంగా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్‌రెడ్డి, మిగతా పురపాలికల కమిషనర్లు, పట్టణ ప్రణాళిక ఇంజినీర్లు పాల్గొన్నారు. నేడు జాన్‌వెస్లీ రాక వనపర్తి రూరల్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శనివారం జిల్లాకేంద్రానికి రానున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు కాలనీల్లో ప్రజా సమస్యలపై కొనసాగుతున్న సర్వేలో పాల్గొంటారని పేర్కొన్నారు. -
బీసీడీఓ సస్పెన్షన్
వనపర్తి: జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి బీరం సుబ్బారెడ్డిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారిక బ్యాంకు ఖాతా నుంచి నిధులు డ్రా చేసిన విషయంపై గత నెల 27న ‘అడ్డగోలు చెల్లింపులు’, ఈ నెల 6న ‘నిధుల గోల్మాల్’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు కలెక్టర్ స్పందించారు. సమగ్ర విచారణ జరిపి ముందుగా షోకాజ్ నోటీసు జారీచేసిన అనంతరం శుక్రవారం సస్పెండ్ చేశారు. ఈయన వ్యవహారంపై పీడీఎస్‌యూ, బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు సైతం వేర్వేరుగా రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందజేశారు. ఎట్టకేలకు కలెక్టర్ సదరు అధికారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో కలెక్టరేట్లోని వివిధ ప్రభుత్వశాఖల అధికారుల్లో అలజడి మొదలైంది. -
నాణ్యమైన బియ్యం సరఫరా
ఖిల్లాఘనపురం: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు పురుగులు పట్టిన బియ్యం సరఫరా అయ్యాయి. శుక్రవారం ‘ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భోజన సమయానికి ముందే నాణ్యమైన బియ్యాన్ని వనపర్తి స్టాక్ పాయింట్ నుంచి ఆటోలో వెనికితండా, అప్పారెడ్డిపల్లి, సోళీపురం పాఠశాలలకు తరలించారు. అలాగే పురుగులు పట్టిన బియ్యాన్ని తీసుకెళ్లినట్లు మండల విద్యాధికారి జయశంకర్ వివరించారు. వెనికితండా పాఠశాలకు వచ్చిన నాణ్యమైన బియ్యం -
సామాజిక మాధ్యమాల ప్రభావం
70 శాతం ఫిర్యాదులు సోషల్ మీడియా పరిచయాలతోనే.. వనపర్తి: దేశం శాస్త్ర, సాంకేతికరంగంలో ఎంత పురోగతి సాధించినా.. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా.. ఏటా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఇన్‌స్టా, నోచాట్ లాంటి సామాజిక మాధ్యమాల యాప్‌లలో పరిచయాలు పెంచుకొని మొదట స్నేహం, తర్వాత ప్రేమ పేరుతో దగ్గరై తర్వాత దాడులకు పాల్పడుతున్నట్లు భరోసా కేంద్రంలోని అధికారులు, సభ్యులు వెల్లడిస్తున్నారు. కేంద్రానికి వచ్చిన ఫిర్యాదుల్లో 70 శాతానికిపైగా అలాంటివే ఉండటం శోచనీయం. మహిళలపై దాడులకు సోషల్ మీడియా ప్రధాన భూమిక పోషిస్తుందని షీటీమ్స్, భరోసా, సఖి కేంద్రాలకు అందుతున్న ఫిర్యాదులతో స్పష్టమవుతోంది. మైనర్లే అధికం.. జిల్లాలో భరోసా కేంద్రం ఏర్పాటై సుమారు ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు 51 కేసులు నమోదు కాగా.. అందులో 50 కేసులు పోక్సో చట్టం ప్రకారం నమోదు చేసినట్లు కేంద్రం పర్యవేక్షకుడు, ఎస్ఐ ఎండీ అంజాద్ వెల్లడించారు. జిల్లాలోని విద్యాసంస్థలు, ఇతర ప్రదేశాల్లో కేంద్రం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 59 అవగాహన సదస్సులు నిర్వహించారు. నేటి వరకు భరోసా కేంద్రానికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే సామాజిక మాధ్యమాల్లో పరిచయమై మోసం చేశారన్న ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. కేంద్రానికి వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికం మైనర్ల నుంచే రావడం శోచనీయం. గతేడాది 147 కేసులు.. మహిళల భద్రతకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కొనసాగే షీటీం విభాగానికి కొంతకాలంగా ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2024లో 147 ఫిర్యాదులు అందగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 32 ఫిర్యాదులు వచ్చాయి. వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు నుంచే ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి. బైక్‌లపై వెంబడిస్తూ వేధిస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. షీటీం బృందాలు వివిధ ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. కళాశాలలు, వాణిజ్య సముదాయాలు, బస్టాండ్లలో షీటీం బృందాలు గస్తీ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. మానసిక ధైర్యాన్నిస్తున్నాం.. తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వొదు. సోషల్ మీడియాలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి దురలవాట్లకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆడ పిల్లలకు డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగాల్లో చేరిన తర్వాతే సెల్ఫోన్లు ఇవ్వడం మంచిది. భరోసా కేంద్రానికి వచ్చే ఫిర్యాదుల్లో చాలావరకు పరిష్కరిస్తూ వారికి ఆర్థిక, మానసిక ధైర్యాన్ని అందిస్తున్నాం. – ఎండీ అంజద్, ఎస్ఐ, భరోసా కేంద్రం, వనపర్తి మహిళలకు ‘భరోసా’.. పోలీస్స్టేషన్లు, ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలకు భరోసా కేంద్రాలు అండగా ఉంటున్నాయి. ఫిర్యాదుదారును కేంద్రానికి తీసుకొచ్చి వారికి మానసిక ధైర్యం కల్పించడంతో పాటు కేంద్రంలోని ఏఎన్ఎం జిల్లా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తారు. అనంతరం కేసు నమోదు చేసి వర్చువల్గాగాని నేరుగాగాని న్యాయమూర్తిని కల్పించి స్టేట్మెంట్ను రికార్డు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులను దూరం చేసి వారికి న్యాయం జరిగేలా సలహాలు ఇవ్వడంతో పాటు ఓ కుటుంబంలా తోడుంటుంది. -
No Headline
మక్తల్: జోగిని వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసిన పోరాటం ఆదర్శనీయం.. ఒక దృఢ సంకల్పతో ముందుకు సాగుతూ.. ఏ ఒక్కరినీ జోగినిగా మార్చకుండా అడ్డుకోవడంతో పాటు ఆదర్శ వివాహాలు జరిపిస్తూ.. జోగినుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఊట్కూరుకు చెందిన దళిత మహిళ హాజమ్మ. చిన్నతనం నుంచే జోగిని వ్యవస్థను వ్యతిరేకించిన ఆమె.. ఓఎంఐఎఫ్, ఏహెచ్‌టీయూ సంస్థల సహకారంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జోగినులకు అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం ఆశ్రయ్ సంస్థ నిర్వాహకురాలు గ్రీస్ నిర్మలతో కలిసి ‘ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన సంస్థ’ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థకు హాజమ్మ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. 20 ఏళ్లుగా జోగిని వ్యవస్థను అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు 30 మంది జోగినులకు వివాహాలు జరిపించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 వేల మంది జోగినులు ఉన్నారని.. అందులో 2 వేల మందికి ప్రభుత్వం నేటికీ పునరావాసం కల్పించలేదని హాజమ్మ తెలిపారు. -
దివ్యాంగులకూ గుర్తింపు
సదరం ధ్రువీకరణ పత్రాల జారీకి స్వస్తి పలకనున్న ప్రభుత్వం●ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం.. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం యూడీఐడీ కార్డు తీసుకురావడం హర్షణీయం. సదరం ధ్రువపత్రం గడువు ముగిసిన ప్రతిసారి స్లాట్ బుక్ శిభిరానికి వెళ్లి రెన్యూవల్ చేసుకునేందుకు ఇబ్బందులు ఉండేవి. కొత్త విధానంలో దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేలా యూడీఐడీ కార్డు అందించడంతో దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. – ప్రభుస్వామి, జిల్లా అధ్యక్షుడు, దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక నెలాఖరు వరకు అవకాశం.. దివ్యాంగులు యూడీఐడీ కార్డుల కోసం మీ–సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. నెలాఖరుకు స్లాట్ బుకింగ్ ముగుస్తుంది. సదరం శిభిరాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. యూడీఐడీ పోర్టల్‌లో నమోదు చేసుకుంటేనే కార్డు వస్తుంది. – ఉమాదేవి, డీఆర్డీఓ అమరచింత: కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన గుర్తింపుకార్డు అమలులోకి తీసుకురానుండటంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు జారీ చేస్తున్న సదరం ధ్రువపత్రాలకు ఇక నుంచి స్వస్తి పలకనుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో యూడీఐడీ (యూనిక్ డిసెబులిటీ ఐడెండిటీ కార్డు) అందుబాటులో రాగా.. తెలంగాణలో మాత్రం సదరం ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. మార్చి 1 నుంచి మన రాష్ట్రంలో కూడా యూడీఐడీ కార్డుల విధానం అమలులోకి వచ్చింది. రానున్న రోజుల్లో ఈ కార్డు ఉంటేనే దివ్యాంగులకు పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న దివ్యాంగులు తప్పనిసరిగా యూడీఐడీ కార్డు వివరాలను తమ సర్వీస్ రికార్డుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ధారిత రంగుల్లో కార్డులు.. వికలత్వం శాతం ఆధారంగా నిర్ధారిత రంగుల్లో ఈ కార్డులను జారీ చేయనున్నారు. కార్డు ఒక్కసారి జారీచేస్తే మళ్లీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉండదు. బస్సులు, రైళ్లలో రాయితీతో పాటు దివ్యాంగులకు వర్తించే అన్ని సౌకర్యాలు యూడీఐడీ కార్డు ద్వారా పొందవచ్చు. జిల్లాలో 13,680 మంది.. జిల్లావ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పింఛన్ పొందుతున్న దివ్యాంగులు సుమారు 13,600 మందికి పైగా ఉన్నారని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. భవిష్యత్‌లో వీరంతా వన్ నేషన్ వన్ డిసెబిలిటీ కింద యూడీఐడీ కార్డులు పొందాల్సి ఉంటుంది. త్వరలో శాశ్వత గుర్తింపు కార్డుల మంజూరుకు సన్నాహాలు కార్డు ఆధారంగానే పింఛన్, సంక్షేమ పథకాల వర్తింపు స్లాట్ బుకింగ్‌కు నెలాఖరు వరకు అవకాశం -
ఆయుధ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
వనపర్తి: విధుల్లో వినియోగించే ఆయుధాలపై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎరవ్రల్లిలోని 10వ బెటాలియన్‌లో గురువారం ఉదయం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి మూడురోజుల ఫైరింగ్ శిక్షణ నిర్వహించారు. పోలీసులు విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఒక్కొక్కరు పది రౌండ్లు కాల్చే అవకాశం కల్పించారు. ఎస్పీ స్వయంగా పాల్గొని జిల్లా సాయుద దళాల అదనపు ఎస్పీ, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫైరింగ్ చేసి ఆయుధ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. ఫైరింగ్ శిక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయుధాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు. వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని, శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వర్తించవచ్చన్నా రు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి జీవ న విధానాన్ని అలవర్చుకోవాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి జిల్లాకు, పోలీసుశాఖకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, డ్యూటీలో ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాయుద దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సైబర్‌క్రైం డీఎస్పీ రత్నం, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్, రిజర్వ్ ఎస్ఐలు వినోద్, ఎండీ మొగ్ధుం, జిల్లాలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వరుస చోరీలపై ప్రత్యేక దృష్టి.. ఆత్మకూర్: వరుస చోరీలపై ప్రత్యేక దృష్టి సారించాల ని ఎస్పీ రావుల గిరిధర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆ యన తనిఖీ చేసి సీఐ శివకుమార్, ఎస్ఐ నరేందర్‌తో మాట్లాడి కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పందుల చోరీ, కాపలాదారుడిపై దాడి, అయ్యప్పకాలనీలోని ఇంట్లో జరిగిన చోరీ తదితర కేసుల గురించి ఆరా తీశారు. పక్కాగా విచారణ చేపట్టి దొంగలను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ఎస్పీ రావుల గిరిధర్ -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 25 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరిగాయి. కొత్తకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఏర్పాట్లు, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ రావుల గిరిధర్, కొత్తకోటలోని పరీక్ష కేంద్రాన్ని డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరావు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. జిల్లాకేంద్రంలోని వాగ్దేవి, సీవీ రామన్, త్రివేణి, విజ్ఞాన్ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను డీఐఈవో ఎర్ర అంజయ్య తనిఖీ చేశారు. జనరల్ విభాగంలో 5,798 మంది విద్యార్థులకుగాను 5,663 మంది హాజరుకాగా.. 132 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఉదయం 8.25కి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఎస్, డీవోలు ప్రశ్నాపత్రాలు ఉంచిన ప్రదేశాన్ని పరిశీలించారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లు వేర్వేరుగా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. ఎస్పీ వెంట సీఐ కృష్ణ, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు. కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ, డీఐఈఓ -
ఏమైపోయారో..
లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా.. భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం సొరంగం ప్రాంతానికి చేరుకుంది. వారితో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి.. సర్వే చేసి కచ్చితమైన నివేదిక అందించాలని కోరారు. గురువారం అమ్రాబాద్ రేంజ్లో లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా సర్వే చేయనున్నట్లు తెలిసింది. స్థానిక ఫారెస్టు అధికారులు వారికి సహకరిస్తున్నారు. ● సహాయక చర్యలను కేంద్రం నుంచి వచ్చిన మినిస్ట్రీ ఫర్ హోం అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్‌కుమార్ టన్నెల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. ప్రస్తుతం టీబీఎంను కొద్దికొద్దిగా కట్ చేస్తూ కార్మికులను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. కన్వేయర్ బెల్ట్ మళ్లీ ప్రారంభం కావడంతో మట్టిని బయటికి తరలించే ప్రక్రియ మొదలైతే సహాయక చర్యలు వేగవంతం కానున్నాయని పేర్కొన్నారు. నేటికీ అంతుచిక్కని 8 మంది కార్మికుల ఆచూకీ ● ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్నసహాయక చర్యలు ● తాజాగా రంగంలోకి కేరళ క్యాడావర్ డాగ్స్ ● ఐఐటీ నిపుణులతో టన్నెల్లోకి సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అచ్చంపేట రూరల్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది. తిండీ తిప్పలు దేవుడెరుగు.. కనీసం గాలి, వెలుతురు కూడా లేకుండా ఊపిరి సలపని చీకటి గుహలో తమ వారు ఎలా ఉన్నారో.. ఏమైపోయారో అంటూ టన్నెల్ వెలుపల కార్మికుల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురుచూస్తూనే ఉన్నాయి. దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 13 రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. గురువారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ సూచనలు చేశారు. ఈ క్రమంలోనే సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా క్యాడావర్ డాగ్స్ రప్పించినట్లు అరవింద్‌కుమార్ తెలిపారు. గురువారం ఉదయం షిఫ్టులో సింగరేణి, ఐఐటీ నిపుణులతోపాటు సైనిక అధికారులు సొరంగం లోపలికి వెళ్లారు. మట్టి తరలింపులో ఇబ్బందులు.. సొరంగంలో పేరుకుపోయిన, మట్టి, రాళ్లు, బురద బయటకు పంపడానికి సింగరేణి కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీపీఆర్ మిషన్ చూయించిన చోట 6, 7 మీటర్ల లోపల ఉన్న అవశేషాల కోసం ప్రతిరోజు అన్వేషణ కొనసాగుతోంది. జీపీఆర్ చూయించిన ప్రదేశంలోనే ఎక్కువ శాతం పనులు కొనసాగిస్తుండటం, చివరికి ఆ ప్రాంతంలో ఎలాంటి అవశేషాలు కనిపించకపోవడంతో శ్రమిస్తున్న సింగరేణి కార్మికులకు నిరాశే మిలుగుతోంది. దీనికి తోడు 7 మీటర్ల లోతులో మట్టిని తవ్వి పక్కనే పడేస్తున్నారు. మట్టిని తవ్వడానికి కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పనులు కొనసాగితే ఆ మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను బయటకు పంపిస్తే పని సులువవుతుందని కార్మికులు అంటున్నారు. గోతులు తవ్వితే అధికంగా నీరు, బురద వస్తుంది. దీంతో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అందుబాటులో ఉండాలి.. సొరంగం వద్ద సహాయక చర్యల్లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. అందరూ సమన్వయంతో, సహకారం అందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వివిధ విపత్తుల ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది సొరంగ ప్రాంతానికి వస్తున్నారని, వారికి అన్ని వసతులు కల్పిస్తూ.. సర్వే, ఇతర పనులు చేయించుకోవాలన్నారు. ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉదయం ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలేటర్‌పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి సిబ్బందితో పాటు యాంత్రిక సహకారం తీసుకుంటూ మనుషులు బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. టన్నెల్ లోపల పనిచేసే వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి అధికారులు, ఐఐటీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబసభ్యుల పడిగాపులు.. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులకు సంబంధించి కుటుంబసభ్యులు దోమలపెంట జేపీ కంపెనీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కంపెనీ యజమానితో మాట్లాడటానికి కుటుంబ సభ్యులు చూస్తుండగా.. కంపెనీ అధికారులు, సిబ్బంది పొంతన లేని సమాధానం చెబుతూ వారిని అక్కడి నుంచే పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఓ కార్మికుడి కుటుంబసభ్యులు కార్యాలయం వద్దకు వచ్చి ఆరా తీశారు. అదే సమయంలో జేపీ కంపెనీ యజమాని హెలీకాప్టర్‌లో వస్తుండటంతో అక్కడి నుంచి వారిని పంపించేశారు. -
మహిళలు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి
వనపర్తి: ప్రతి మహిళ తమ ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, క్యాన్సర్ వంటి రోగాలు దరి చేరకుండా కాపాడుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నర్సింగాయపల్లిలోని ఎంసీహెచ్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా మహిళా సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డయాబెటిస్, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, విటమిన్ డి–3, విటమిన్ బి–12, థైరాయిడ్ తదితర వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళా ఉద్యోగులు తప్పనిసరిగా అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రధాన సమస్యగా మారిందని.. ముందుగానే గుర్తించడంతో నియంత్రించవచ్చన్నారు. క్యాన్సర్ మహమ్మారిని స్క్రీనింగ్‌తో ముందుగానే గుర్తిస్తే ప్రాణానికి ముప్పు ఉండదని.. వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స చేయించుకొని ప్రాణాలు కాపాడుకోవచ్చని వివరించారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో నాణ్యమైన వైద్యం అందుతుందని.. ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలోని ఎన్ఆర్సీ కేంద్రం ద్వారా 400 మంది సామ్, మామ్ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడినట్లు తెలిపారు. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు అంగన్వాడీ టీచర్లు, ఏపీఎంలు, సీసీలు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, మహిళలు హాజరయ్యారు. క్రిటికల్ కేర్ యూనిట్ పరిశీలన.. నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ప్రాంగణంలో క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. నెలాఖరు వరకు పనులు పూర్తి చేసేలా వేగం పెంచాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, ఎంసీడీ ప్రోగ్రాం అధికారి రాంచందర్, ఇతర వైద్యాధికారులు ఉన్నారు. -
పాత విధానంలోనే స్లాట్ బుకింగ్..
యూడీఐడీ కార్డు కోసం ఎప్పటి మాదిరిగానే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్వహించే సదరం క్యాంపునకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా మీ–సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకొని నిర్దేశిత తేదీన సదరం శిభిరానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వైద్య పరీక్షల అనంతరం దరఖాస్తుదారుడి వివరాలు, వికలత్వ శాతం వైద్యుల లాగిన్‌కు చేరుతుంది. వివరాలను పరిశీలించి అప్లోడ్ చేయగానే కార్డు మంజూరవుతుంది. జారీ చేసిన అధికారి డిజిటల్ సంతకంతో కార్డు ఉంటుంది. దాని ప్రకారమే ప్రభుత్వం పింఛన్ మంజూరు చేయనుంది. నకిలీల ఆటకట్టు.. కేంద్రం తీసుకొచ్చిన యూడీఐడీ కార్డు విధానంతో ఇప్పటికే నకిలీ ధ్రువపత్రాలతో దివ్యాంగుల పింఛన్‌తో పాటు సంక్షేమ పథకాలు పొందిన వారిని గుర్తించి తొలగించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అర్హులైన దివ్యాంగులకే సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో వీటిని పక్కాగా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. గతంతో జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపునకు వెళ్లి అక్రమ మార్గంలో ధ్రువపత్రాలు పొందినవారు సైతం ప్రస్తుతం యూడీఐడీ కార్డు పొందాల్సి ఉంటుంది. -
ప్రభుత్వ పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా
ఖిల్లాఘనపురం: ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగే మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వ నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవల పంపిణీ చేసిన బియ్యం పురుగుపట్టి ఉండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గత నెల మామిడిమాడ ఉన్నత పాఠశాలకు వచ్చిన 18 బస్తాల బియ్యంలో పురుగులు ఉండటంతో హెచ్ఎం చెన్నప్ప విషయాన్ని గ్రామపెద్దలు దృష్టికి తీసుకెళ్లారు. వారు వనపర్తి స్టాక్ పాయింట్ అధికారులతో మాట్లాడి తిప్పి పంపించి మంచి బియ్యం తీసుకొచ్చారు. రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న బియ్యం మంచిగా ఉన్నాయని.. పాఠశాలలకు పురుగులు పట్టిన బియ్యాన్ని ఎందుకు పంపిణీ చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని వెనికితండా, అప్పారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసిన పురుగుల బియ్యం ఏం చేయాలో తెలియక అలాగే ఉంచారు. ఈ విషయాన్ని ఎంఈఓ జయశంకర్ వద్ద ప్రస్తావించగా.. వెనికితండా, అప్పారెడ్డిపల్లి, మామిడిమాడ ఉన్నత పాఠశాలలకు వచ్చిన బియ్యంలో పురుగులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని జిల్లా అధికారులకు వివరించామని తెలిపారు. 1,018 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో గురువారం 1,018 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదన్నారు. ఎన్టీఆర్ కాల్వకు 84 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 119 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. శిక్షణ కేంద్రాలను వినియోగించుకోవాలి ఖిల్లాఘనపురం: గిరిజన మహిళల అభ్యున్నతికి నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వనితాజ్యోతి మహిళా సంఘం అధ్యక్షురాలు ఏకే కమర్ రహమాన్ కోరారు. గురువారం మండలంలోని సోళీపురం, కోతులకుంటతండాతో పాటు పలు తండాల్లో ఆమె పర్యటించారు. వీజేఎంఎస్ ఆవాజ్ వనపర్తి కమ్యూనిటీ రేడియో ద్వారా గిరిజన సంక్షేమశాఖ అందిస్తున్న అనేక పథకాల గురించి వినిపించారు. త్వరలోనే సోళీపురం గ్రామంలో సంఘం ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందరు సహకరిస్తే వేసవిలో కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తామని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆమె వెంట గ్రామపెద్దలు పురేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనునాయక్, గంధం చిట్టెమ్మ తదితరులు ఉన్నారు. 24 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత ఖిల్లాఘనపురం: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తక్కువ ధరకు కొనుగోలు చేసి రైస్‌మిల్లుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పౌరసరఫరాలశాఖ నయాబ్ తహసీల్దార్ దుబ్బాక పరమేశ్వర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గోపాల్పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన శ్రీమాన్పాడు రామకృష్ణ బుధవారం పలు గ్రామాల్లో 24 బస్తాల రేషన్ బియ్యం కొనుగోలు చేసి రాత్రి సమయంలో ఖిల్లాఘనపురం మండలం సోళీపురం గ్రామంలో ఉన్న సింధు రైస్‌మిల్లుకు వాహనంలో తరలించారు. జిల్లా సీసీఎస్ పోలీసులు పక్కా సమాచారంతో వాహనాన్ని వెంబడించారు. రైస్‌మిల్లులో బియ్యం దింపుతుండగా పట్టుకొని అదే వాహనంలో వనపర్తి స్టాక్ పాయింట్‌కి తరలించారు. గురువారం రైస్‌మిల్ యజమాని, బియ్యం తీసుకొచ్చిన రామకృష్ణపై కేసునమోదు చేయాలని ఖిల్లాఘనపురం పోలీసులకు ఫిర్యా దు చేశారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్‌గౌడ్ తెలిపారు. -
అడ్డగోలు చెల్లింపులు!?
అధికారిక బ్యాంకు ఖాతా నుంచి ఇష్టానుసారంగా డబ్బులుడ్రా ●వాహనాల అద్దె చెల్లింపులపై అనుమానాలు.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతున్న వాహనాల అద్దె చెల్లింపుల్లోనూ భారీఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్లు వదంతులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు పసుపురంగు నంబర్‌ప్లేట్ ఉన్న వాహనాలను మాత్రమే అద్దెకు అనుమతించాల్సి ఉంటుంది. కానీ చాలా శాఖల్లోని అధికారులు మాత్రం తెలుపురంగు నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలనే అద్దెకు తీసుకొని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న అంశంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ప్రభుత్వానికి నివేదిస్తాం.. వచ్చిన ఫిర్యాదుల మేరకు బీసీ అభివృద్ధిశాఖ అధికారిక ఖాతా నుంచి నగదు ఉపసంహరణలపై సమగ్ర విచారణ చేపట్టాం. కార్యాలయ సిబ్బంది పేర్లతో రాసిన చెక్కుల విషయమై వారితో సే్ట్ట్మెంట్ రికార్డ్ చేశాం. ఇప్పటికే సదరు అధికారికి షోకాజ్ నోటీసు కూడా జారీ చేశాం. సమగ్ర విచారణ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం. గతంలో వైద్య, ఆరోగ్యశాఖలో చోటు చేసుకున్న ఘటన విషయం నాకు తెలియదు. – జి వెంకటేశ్వర్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ), వనపర్తి వనపర్తి: అధికారిక బ్యాంకు ఖాతాల నుంచి ఇష్టానుసారంగా నగదు డ్రా చేస్తున్న ఘటనలు రోజుకో ప్రభుత్వ శాఖలో వెలుగుచూస్తున్నాయి. గతంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో అటెండర్లు, కార్యాలయ సిబ్బంది పేర్లతో నగదు విత్‌డ్రా చేసిన ఘటనలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా అప్పటి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ విచారణకు ఆదేశించారు. ఇటీవల నారాయణపేట జిల్లాకు బదిలీ అయిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను విచారణ అధికారిగా నియమించి సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించారు. విచారణ ప్రారంభించి ఏడాదికావస్తున్నా... నేటికీ ఎలాంటి పురోగతి కనిపించకపోవడం గమనార్హం. తాజాగా కలెక్టరేట్లోని బీసీ అభివృద్ధి కార్యాలయంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. విద్యార్థి సంఘాలు, బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు ఆ శాఖలో అక్రమాలు జరిగాయంటూ జిల్లా నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఫిర్యాదు చేశారు. రాజకీయ జోక్యం ఉండటంతో జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల అభ్యున్నతికి వెచ్చించాల్సిన నిధులను అధికారిక చెక్కులపై కార్యాలయ సిబ్బంది పేర్లతో అడ్డగోలుగా డ్రా చేసుకొని వినియోగించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీసీ అభివృద్ధిశాఖలో చోటు చేసుకున్న ఘటనపై రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు విచారణ జరిపి వచ్చిన ఆరోపణలపై సంజయిషీ కోరుతూ సదరు అధికారికి నోటీసు ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనా ప్రభుత్వ శాఖల ఖాతాల నుంచి సదరు శాఖలో పనిచేసే సిబ్బంది పేర్లతో నిధులు డ్రా చేయడం ఏమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని మరికొన్ని ప్రభుత్వ శాఖల్లోనూ చోటు చేసుకున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. మరిన్ని శాఖల్లో జరిగిన అవినీతిని అతి త్వరలోనే బయట పెడతామని.. నిధుల గోల్‌మాల్‌కు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోకుంటే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామంటూ వివిధ ప్రజా, విద్యార్థి సంఘాలు మీడియా, సోషల్ మీడియా వేధికలుగా హెచ్చరికలు చేస్తున్నాయి. మొన్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో.. నిన్న బీసీ అభివృద్ధిశాఖలో... విచారణ పేరుతో కాలయాపన రికవరీపై సన్నగిల్లుతున్న ఆశలు -
మహిళాశక్తి యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి
వనపర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిర మహిళాశక్తి పథకంలోని 16 రకాల యూనిట్ల గ్రౌండింగ్ వందశాతం పూర్తిచేసి లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ ఆదర్శ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో మహిళాశక్తి పథకం యూనిట్లు, బ్యాంకు లింకేజీ రుణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఇందిర మహిళాశక్తి కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. నెలాఖరు వరకు పథకం లక్ష్యాలను చేరుకోవాలని, మహిళా స్వయం సహాయక బృందాలకు పెండింగ్‌లో ఉన్న రూ.30 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా గ్రూపు, వ్యక్తిగత యూనిట్లకు సంబంధిత బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేయించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఎం బాషానాయక్, ఏఎల్డీఎం సాయి తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి
వనపర్తి: సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ ఎన్బీ రత్నం సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ౖనిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోం పేరుతో మనల్ని ఆకర్షితులను చేస్తూ, కొన్నిసార్లు భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు కాజేస్తారన్నారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. ఒకవేళ డబ్బులు నష్టపోతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. నేటి సమాజంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో నమోదు చేయొద్దని సూచించారు. విద్యార్థులు బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, సైబర్ క్రైం ఎస్ఐ రవిప్రకాష్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కారం, తొక్కులే నిత్య భోజనం..
నల్లమలలో మొత్తం 88 చెంచు ఆవాసాలు ఉండగా, చెంచుల మొత్తం జనాభా 9 వేల లోపే. ప్రభుత్వం వీరి సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వాస్తవంలో చెంచులు కనీసం సరైన తిండికీ నోచుకోవడం లేదు. చెంచుల్లో చిన్నారులు, మహిళల నుంచి పెద్దల వరకు నిత్యం కారం, తొక్కులతోనే కాలం గడుపుతున్నారు. అప్పాపూర్, భౌరాపూర్, మేడిమల్కల తదితర చెంచుపెంటల నుంచి కూరగాయలు కావాలంటే సుమారు 40 కి.మీ.దూరంలో ఉన్న మన్ననూరుకు వెళ్లాల్సి ఉంటుంది. పదిహేను, నెలరోజులకు ఒకసారి తెచ్చుకున్న కూరగాయలు, సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో తేనే, చెంచుగడ్డలు తదితర ఆహారం వారికి అరకొరగా దొరికినా, వాటిని ఆహారంగా తీసుకోకుండా ఇతరులకు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. నల్లమలలోని కొమ్మెనపెంటలో చెంచు మహిళలు -
ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 14 మండలాల్లో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష జరగగా 6,714 మంది విద్యార్థులకుగాను 6,476 మంది హాజరుకాగా.. 238 మంది గైర్హాజరైనట్లు వివరించారు. పాన్‌గల్‌లోని పరీక్ష కేంద్రాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్రాల పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. -
12 రోజులైనా జాడే లేదు
మాట్లాడుతున్న కలెక్టర్ ఆదర్శ్ సురభిఅచ్చంపేట/అమ్రాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీతపై ఉత్కంఠ వీడటం లేదు. 12 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. రోజు మాదిరిగానే బుధవారం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగించాయి. కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. అయితే సహాయక బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో, ఎవరికి వారు ఇక్కడ.. అక్కడ అన్నట్టుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో 10 రోజులైనా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్‌చేసిన టీబీఎం మెషీన్ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చి వెళ్లిన నాటి నుంచి అధికారుల హడావుడి అంతగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా లభించని ఎస్ఎల్బీసీ కార్మికుల ఆచూకీ టన్నెల్ వద్ద కనిపించని అధికారుల హడావుడి మళ్లీ పని చేయని కన్వేయర్ బెల్టు లోకో ట్రైన్ ద్వారానే మట్టి, ఇతర వ్యర్థాల తరలింపు సహాయక బృందాల మధ్య కొరవడిన సమన్వయం ఒకడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకు రావడం కష్టతరంగా మారుతోంది. టన్నెల్లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఇందుకు సంబంధించిన నివేదిక అందించాల్సి ఉంది. కాగా, కార్మికుల వెలికితీతకు చేపట్టాల్సిన చర్యలపై రెస్క్యూ బృందాల ప్రతినిధులతో విపత్తుల నిర్వహణ స్పెషల్ చీఫ్ అరవింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నమూనా టీబీఎంను పరిశీలించారు. -
తొక్కు,చింత పులుసే తింటాం
మేం ఎక్కువగా కారం, తొక్కులు, చింతపులుసు తింటాం. మా పిల్లలు కూడా అవే తింటారు. కూరగాయలు కావాలంటే మన్ననూరుకు పోయి తెచ్చుకుంటాం. 15 రోజులు, నెలకు ఒకసారి వెళ్లి తెచ్చుకుంటాం. వారం తర్వాత కూరగాయలు పాడవుతాయి. ఎక్కువ రోజులు కారం పొడి, తొక్కు వేసుకుని అన్నం తింటాం. – దంసాని ఈదమ్మ, కొమ్మనపెంట, అమ్రాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లా సరైన ఆహారం లభించట్లేదు.. చెంచులు ఎక్కువగా రైస్, కారం, తొక్కులపైనే ఆధారపడుతున్నారు. కూరగాయలు, కూరలు, పౌష్టికాహారం లేక రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. పుట్టిన శిశువులు రక్తహీనతతో 2 నుంచి 2.5 కిలోల లోపే జన్మిస్తున్నారు. చలికాలంలో న్యూమోనియా, ముక్కు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. – డాక్టర్ సైఫుల్లా ఖాన్, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ -
తిండికీ తిప్పలే..
కొమ్మెనపెంటలో చెంచుల ఆవాసాలు(బొడ్డు గుడిసెలు) నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో అధికశాతం మందిని రక్తహీనత సమస్య వేధిస్తోంది. సరైన పౌష్టికాహారం లేక చెంచులు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో గర్భిణులకు ప్రసవ సమయంలో వేధన తప్పడం లేదు. కొన్ని సార్లు పుట్టిన శిశువులు సైతం మృత్యువాత పడుతుండటం కలచివేస్తోంది. మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం కనీసం 12 వరకు ఉండాలి, అయితే చెంచు మహిళలు, గర్భిణులు, బాలింతల్లో 60 శాతానికి పైగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 25 శాతం మంది మహిళలు 9 శాతం కన్నా తక్కువ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేసుల్లో 3–6 శాతం మాత్రమే హిమోగ్లోబిన్ ఉంటున్న తీవ్రమైన ఎనిమియా కేసులు చోటుచేసుకుంటున్నాయి. నల్లమలలోని చెంచు మహిళల్లో రక్తహీనత సమస్యపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్(ఎన్ఐఎన్) హైదరాబాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించింది. శిశువులు నెలలు నిండక ముందే జన్మించడం, తక్కువ బరువుతో జన్మించడం, శిశు మరణాలు, పురుషులతో పాటు మహిళల్లోనూ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించింది. అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న చెంచుల జీవితాలు సరైన తిండి, ఆదాయం లేక మరింత దుర్భరంగా మారుతున్నాయి. నిత్యం కారం, తొక్కులే ఆహారం చెంచు మహిళల్లో 60 శాతం మందికి ఎనిమియా సమస్య గర్భిణులు, బాలింతల్లో రక్తం లేక పెరుగుతున్న శిశుమరణాలు -
కుడి, ఎడమ కాల్వల పరిధిలో..
ఈ ఏడాది యాసంగిలో జూరాల కుడి కాల్వ కింద 15 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని అధికారులు ముందస్తుగా ప్రకటించారు. సాగుపై మక్కువతో రైతులు కాల్వల ద్వారా నీరందుతుందని వరి పంటలు సాగు చేశారు. వారబందీ విధానంలో నాలుగు రోజులు నీటి సరఫరా ఉండగా.. ప్రస్తుతం రెండ్రోజులకు తగ్గించడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. సమాంతర కాల్వ నుంచి నీటిని తరలించుకుపోతున్నారని.. కుడి, ఎడమ కాల్వలకు మాత్రం సాగునీరు అందించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని అమరచింత, ఆత్మకూర్ రైతులు ఆరోపిస్తున్నారు. సమాంతర కాల్వ షెట్టర్లు తెరిచి వారంలో మూడురోజులు భీమా ఫేజ్–2కు నీటిని తరలిస్తున్నారని.. ఇక్కడి పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మహిళా సాధికారతతోనే సమగ్రాభివృద్ధి
వనపర్తి విద్యావిభాగం: మహిళా సాధికారతతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎస్వీఎంఆర్ డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలను వినియోగించుకొని మహిళలు అన్నిరంగాల్లో ఉన్నత స్థానంలో ఉండాలన్నారు. బాల్యవివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలు, మహిళలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయసేవలు అందిస్తుందన్నారు. బాల్యవివాహాలు, పోక్సో, బాల కార్మిక, మోటారు వెహికల్ చట్టం గురించి వివరించారు. ఉచిత న్యాయ సలహాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100 సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది చాంద్‌పాషా, కల్పన, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత.. ఆందోళన
జూరాల ఆయకట్టుకు వారంలో రెండ్రోజులే నీటి సరఫరా ●రెండ్రోజులే అంటున్నారు.. అమరచింత ఎత్తిపోతల పథకానికి జూరాల ఎడమ కాల్వ నుంచి సాగునీరు అందుతుంది. ఎత్తిపోతల ఆయకట్టు కింద ఉన్న మూలమళ్ల, సింగపేట, ఖానాపురం, మస్తీపురం, అమరచింత, పాంరెడ్డిపల్లి గ్రామాల పరిధిలో యాసంగిలో 800 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రాజెక్టు అధికారులు వారబందీ విధానంలో కోత విధించి కేవలం రెండ్రోజులు మాత్రమే నీటిని అందిస్తామని చెబుతున్నారు. దీంతో రైతులకు వాట్సాప్‌లో సమాచారమిస్తూ అప్రమత్తం చేస్తున్నాం. – ఆంజనేయులు, ప్రధానకార్యదర్శి, అమరచింత ఎత్తిపోతల పథకం ఉన్నతాధికారుల ఆదేశాలతో.. జూరాల ప్రాజెక్టులో నిల్వనీటి మట్టం రోజురోజుకు పడిపోతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి సరఫరాలో కోతలు విధించాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లా ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలనే ఆలోచనలతో వారంతో రెండ్రోజులే కాల్వలకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – జగన్మోహన్, ఈఈ, జూరాల ప్రాజెక్టు ఎడమకాల్వ విభాగం అమరచింత: ఈ ఏడాది యాసంగిలో ఆయకట్టు విస్తీర్ణం తగ్గించిన ప్రాజెక్టు అధికారులు సాగునీటి సరఫరాలో కోతలు విధించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం పడిపోతుండటంతో వారబందీ విధానంలో వారంలో నాలుగు రోజులు కాల్వలకు నీరు వదలాల్సి ఉండగా.. అధికారులు రెండ్రోజులకు కుదించారు. సోమ, మంగళవారం కాల్వలకు నీరు వదిలి బుధవారం నుంచి నిలిపివేయనున్నారు. ఈ విధానాన్ని ప్రాజెక్టు అధికారులు ఈ నెల 2 నుంచి ప్రారంభించారు. ఏప్రిల్ 15 వరకు నీరందితేనే పంట చేతికందే అవకాశం ఉందని.. అకస్మాత్తుగా నీటి విడుదలను కుదిస్తే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ప్రాజెక్టు అధికారులకు విన్నవించుకుంటున్న పరిస్థితులు తలెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో సందేశాలు.. జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులకు లిఫ్ట్ నిర్వాహకులు నీటి కుదింపుపై వాట్సాప్ సందేశాలు పంపుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇకపై వారంలో రెండ్రోజులే కాల్వలకు నీటిని వదులుతున్నారని.. రైతులు పంటలు ఎండకుండా సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచిస్తుండటంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రాజెక్టులో నీటిమట్టం కేవలం 3.50 టీఎంసీలే.. బుధవారం నుంచి కాల్వలకు నీరు నిలిపివేత ఆయకట్టు రైతుల్లో మొదలైన ఆందోళన కుడి, ఎడమ కాల్వల పరిధిలో 35 వేల ఎకరాల సాగు -
ఎల్ఆర్ఎస్ లేకుంటే ఇబ్బందులే
వనపర్తిటౌన్: ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 25 శాతం రాయితీతో నెలాఖరు వరకు అవకాశం ఇచ్చిందని.. సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయ సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ లేకుండా ప్లాట్లు కొనుగోలు చేస్తే మున్ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఇళ్లు నిర్మించుకునే సమయంలో మార్కెట్ విలువపై 14 శాతం జరిమానా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 29 వేల మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారని.. క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కేవలం 38 మంది మాత్రమే డబ్బులు చెల్లించినట్లు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలోని 5 పురపాలికల్లో సుమారు 25 వేల మందికి నోటీసులు జారీ చేసినప్పటికీ ఫోన్‌నంబర్లు, చిరునామాల్లో తేడాలు ఉండటంతో వారికి సమాచారం చేరడం లేదన్నారు. ఏదైనా కారణంతో ఎల్ఆర్ఎస్ తిరస్కరిస్తే చెల్లించిన డబ్బు నుంచి 10 శాతం ప్రాసెసింగ్ ఫీజు మినహాయించుకొని మిగిలిన 90 శాతం తిరిగి యజమాని ఖాతాలో జమ చేస్తామని వివరించారు. ఓ రియల్ వ్యాపారి చిట్యాల సమీపంలో నాలా కన్వర్షన్ చేసి వెంచర్ వేశామని చెప్పగా ఆ వెంచర్‌ను వెంటనే రద్దు చేయాలని పుర కమిషనర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, అన్ని పురపాలికల కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లు, బిల్డర్లు, టౌన్ ప్లానింగ్ ఇంజినీర్లు, రియల్ పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్‌సురభి -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : డీఐఈఓ
వనపర్తి విద్యావిభాగం: బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించబడి ఉందని.. దానిని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, ఎంత సమయం పడుతుందనే వివరాలు తెలుస్తాయన్నారు. సెల్ఫోన్లు, చేతి గడియారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రాల్లోకి అనుమతించరని.. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అరుణాచలానికి ప్రత్యేక బస్సు కొత్తకోట: ఈ నెల 14న పౌర్ణమిని పురస్కరించుకొని తమిళనాడులోని అరుణాచలం దైవ క్షేత్రానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్ మంగళవారం తెలిపారు. ఈ నెల 12న రాత్రి 8 గంటలకు వనపర్తి బస్‌స్టేషన్ నుంచి బస్సు బయలుదేరుతుందని వివరించారు. ఈ యాత్ర మూడు రోజుల పాటు కొనసాగుతుందని, 13వ తేదీన కాణిపాకం, అదేరోజు సాయంత్రం వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చని చెప్పారు. 14వ తేదీన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ, దర్శనానంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి బయలుదేరుతుందని పేర్కొన్నారు. అడ్వాన్సుగా సీట్ బుక్ చేసుకోవాలనుకుంటే సెల్‌నంబర్ 94906 96971 సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోరుబావులను గుర్తించాలి : ఆర్డీఓ ఖిల్లాఘనపురం: గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణానికిగాను సేకరించిన భూముల్లో బావులు, గొట్టపు బావులు తదితర వాటిని గుర్తించి రికార్డుల్లో నమోదు చేయాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. మంగళవారం మండల కేంద్రం సమీపంలో కొనసాగుతున్న రిజర్వాయర్ పనులను తహసీల్దార్ సుగుణ, భూ సేకరణ తహసీల్దార్ సుభాష్‌తో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్ భూములతో పాటు గట్టుకాడిపల్లికి వెళ్లే రహదారి, కట్ట నిర్మాణం తదితర వాటిని పరిశీలించి మాట్లాడారు. పనులు వేగంగా కొనసాగుతున్నాయని.. భూ నిర్వాసితుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు చెప్పారు. కట్ట వెనుకభాగం పెంచడంతో గట్టుకాడిపల్లి గ్రామానికి వెళ్లే రహదారి ముంపునకు గురవుతుందని.. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఆయన వెంట ఆర్ఐ తిరుపతయ్య, సర్వేయర్ ఆనంద్ తదితరులు ఉన్నారు. పకడ్బందీగా వివరాల నమోదు పాన్‌గల్: గ్రామాల్లో క్షయ, మధుమేహ వ్యాధిగ్రస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పకడ్బందీగా నమోదు చేయాలని ఎన్సీడీ ప్రోగ్రామ్ జిల్లా అధికారి డా. రాంచందర్‌రావు సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి అనుమానితుల వివరాలను ఆన్లైన్లో తప్పక నమోదు చేయాలన్నారు. అలాగే చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయించాలని, ప్రతి గర్భిణి పీహెచ్‌సీలోనే కాన్పు చేయించుకునేలా సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య పరీక్షల విషయంలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించడం సరికాదన్నారు. సమావేశంలో పీహెచ్సీ వైద్యుడు డా. చంద్రశేఖర్, సీహెచ్ఓ రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు
కొత్తకోట రూరల్: మహిళలు ఆర్థికంగా ఎదగడం చాలా ముఖ్యమని.. నాబార్డ్ అందిస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డ్ మహబూబ్‌నగర్ క్లస్టర్ డీడీఎం మనోహర్‌రెడ్డి సూచించారు. మంగళవారం పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాలలో నాబార్డ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ వ్యవసాయ ఆర్థిక బలోపేతంతో గ్రామాలు గొప్పగా ఎదుగుతాయన్నారు. అనంతరం మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. పిడిగం సైదయ్య మాట్లాడుతూ.. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని.. అన్నిరంగాల్లో రాణించే శక్తి వారి సొంతమని కొనియాడారు. వ్యవసాయ రంగంలో విత్తనం పొలంలో నాటిన దగ్గర్నుంచి పంట ఉత్పత్తులు మార్కెట్లో విక్రయించే వరకు మహిళల పాత్ర కీలకమన్నారు. వ్యవసాయంలో రోజురోజుకు మహిళల ప్రాధాన్యం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. అనంతరం ఉత్తమ మహిళా రైతులు, ఉత్తమ స్వయం సహాయక బృందాల మహిళలను విద్యార్థులు, ప్రొఫెసర్లు సన్మానించారు. వనపర్తి జిల్లా అడిషనల్ డీఆర్డీఓ భాస్కర్, వనపర్తి లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే, కళాశాల ఉమెన్ సెల్ ప్రొటెక్షన్ ఇన్చార్జ్ డా. ఆర్.పూర్ణిమా మిశ్రా, డా. విద్య, డా. గౌతమి, నవ్య, శ్వేత, ఏఈఓ రమేష్‌కుమార్, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు మహిళా రైతులు పాల్గొన్నారు. -
ఆచూకీ లభించేనా.?
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరం ● ఎట్టకేలకు కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ ● ఎలాంటి సమాచారం బయటికి పొక్కనివ్వని అధికారులు అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ప్రశ్నార్థకంగా మారింది. రోజూ విడతల వారీగా ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా.. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు సైతం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. షిఫ్ట్‌ల వారీగా సొరంగంలోకి వెళ్లి వచ్చిన వారు కూడా సమాచారం అందించడం లేదు. కాగా, సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీటి ఊట రోజురోజుకూ పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లోకో ట్రైన్లో సహాయ బృందాలు 13.5 కిలోమీటర్లు వెళ్లడానికి సుమారు 2 గంటల సమయం పడుతోందని.. అక్కడికి వెళ్లి గంట పాటు పనులు చేసి బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. టీబీఎం మెషీన్ విడి భాగాలను రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్‌తో తొలగిస్తున్నారు. ● భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం ఢిల్లీ నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకుంది. ఈ బృందం పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సొరంగం కుప్పకూలిన ప్రదేశంలో అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారులతో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫోరెన్సిక్ బృందం రాక.. సొరంగంలో సహాయక బృందాలకు దుర్వాసన వస్తుందని.. మట్టి తవ్వకాల్లో ఎముకలు బయటపడ్డాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి నుంచి ప్రత్యేకంగా ఫోరెన్సిక్ బృందం సొరంగ ప్రాంతానికి చేరుకోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ఉన్నతాధికారుల సమీక్ష.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. టన్నెల్ ఇన్ లెట్ ఆఫీస్ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న బృందాల అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, మైనింగ్, ఫైర్ సర్వీసెస్, ర్యాట్ మైనింగ్ ప్రత్యేకతలు, ప్లాస్మా కట్టర్స్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన కారణంగా గంటకు 800 టన్నుల మట్టిని బయటకు తీసుకురాగలమని అధికారులు వెల్లడించారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని.. కన్వేయర్ బెల్టు ద్వారా వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకురానున్నట్లు చెప్పారు. సహాయక బృందాలకు అవసరమైన ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. కాగా, సహాయక చర్యలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. సమావేశంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కల్నల్ పరిక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న తదితరులు ఉన్నారు. అందుబాటులోకి కన్వేయర్ బెల్టు.. సొరంగంలో టీబీఎం మెషీన్‌తో పాటు పనిచేసే కన్వేయర్ బెల్టు ధ్వంసమైంది. దీంతో సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లను బయటికి తరలించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. సింగరేణి కార్మికులు పదుల సంఖ్యలో సొరంగంలోకి వెళ్లి పనులు చేసినప్పటికీ పురోగతి కనిపించలేదు. మట్టి, నీరు, బురదను బయటకు పంపడానికి శ్రమతో కూడుకున్న పనిగా మిగిలింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు కన్వేయర్ బెల్టును పునరుద్ధరించారు. అయితే ప్రమాదం జరగకముందు సొరంగంలో జరిగిన పనులకు సంబంధించిన మట్టి, రాళ్లు కన్వేయర్ బెల్టుపై ఉండటంతో, వాటిని మాత్రమే బయటికి తరలించారు. -
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు : ఎస్పీ
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నెలాఖరు వరకు జిల్లావ్యాప్తంగా 30 పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ప్రజలు గుమిగూడేలా కార్యక్రమాలు నిర్వహించొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు చేపడితే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు, కులమతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తిచేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత.. బుధవారం నుంచి జరిగే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పరీక్ష కేంద్రాల ఆవరణలో 163 బీఎన్ఎస్ఎస్– 2023 (144) సీఆర్పీసీ చట్టం అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరిగే సమయాల్లో కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని, 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని తెలిపారు. పరీక్ష సమయంలో పోలీస్ అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి మానసిక ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. -
ఆయిల్‌పాం సాగు లక్ష్యాన్ని చేరుకోవాలి
వనపర్తి: 2025–26 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో ఆయిల్‌పాం సాగు లక్ష్యం 6,548 ఎకరాలు సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట సాగుతో కలిగే లాభాలను రైతులకు వివరించి పంట మార్పిడి చేసేలా చూడాలని.. ఏమైనా అపోహలుంటే తొలగించాలని సూచించారు. వ్యవసాయ అధికారులకు మండలాల వారీగా లక్ష్యాలిచ్చి పర్యవేక్షణ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. అదేవిధంగా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో ఆయిల్‌పాం ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, ఎంఏఓలు, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న అన్వేషణ
● బురద, ఊట నీరే ప్రధాన సమస్య ● నిమిషానికి 10– 20 వేల లీటర్ల నీటి ఊట ● సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తేవడంలో అవరోధాలు ● పదోరోజు కొనసాగిన సహాయక చర్యలు ● రెస్క్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం అచ్చంపేట/మన్ననూర్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు సోమవారం పదో రోజు కూడా కొనసాగాయి. కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే భారీస్థాయిలో పేరుకుపోయిన బురద, ఉబికి వస్తున్న నీటి ఊటతో వీరి అన్వేషణకు అవరోధాలు కలిగిస్తున్నాయి. దాదాపు 10– 20 వేల లీటర్ల మేర నీటి ఊట ఉబికి వస్తుంది. మరోవైపు తమవారి రాక కోసం కుటుంబసభ్యులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఎస్ఎల్బీసీ సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి కన్వేయర్ బెల్టు మరమ్మతు సోమవారం సాయంత్రానికి పూర్తవుతాయని చెప్పారు. కానీ, ఇక్కడి పరిస్థితి చూస్తే మరో రెండు రోజులైనా కన్వేయర్ బెల్టు మరమ్మతు జరిగే అవకాశం కనిపించడం లేదు. దీనికోసం సింగరేణి, రాబిట్ బృందాలు కష్టపడుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన శిథిలాలను సింగరేణి బృందాలు మాన్యువల్ పద్ధతిలో తవ్వకాలు చేపడుతున్నారు. ఆ మట్టిని లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ కూడా ఒకింత ఆటంకం సృష్టిస్తుంది. దీనిని బట్టి 15 అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, మట్టి బయటికి తేవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. రాడార్ (జీపీఆర్) స్కానింగ్ గుర్తించిన మూడు, నాలుగు ప్రదేశాల్లో శిథిలాలు తొలగించినా ఆనవాళ్లు దొరకలేదు. ఎంత తవ్వితే అంత ఊట బయటికి వస్తుండటంతో ఎప్పటిప్పుడు డీవాటరింగ్ చేస్తున్న పనులకు అడ్డంకులు కలిగిస్తుంది. -
క్షయ వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం
జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రక్రియను ఈ నెల 17వ తేదీలోగా వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో క్షయవ్యాధి, మిషన్ మధుమేహం, పిల్లలకు టీకాల కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1.60 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 1.26 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా 281 మంది క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. అదే విధంగా మిషన్ మధుమేహలో భాగంగా మొత్తం 2.30 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు లక్ష మందికి మాత్రమే పరీక్షలు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారిని ఈ నెల 20 వరకు నిర్ధారణ పరీక్షలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 23వేల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. పిల్లలకు సమయానుసారం ఇవ్వాల్సిన వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో ఇవ్వాలని సూచించారు. టీకాలు ఏ ఒక్కటి పెండింగ్‌లో ఉండకూడదన్నారు. గర్భిణులకు సకాలంలో ఏఎన్సీ నమోదు చేయించడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో సుఖ ప్రసవాలు జరిగే విధంగా కృషి చేయా లన్నారు. అనంతరం పోలియో రహిత సమాజం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూపొందించిన క్యా లెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్లు సాయినాథ్, పరిమళ, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
సర్వం సన్నద్ధం
ఇంటర్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు అమరచింత: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 5నుంచి 25వ తేదీ వరకు జరిగే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో మొత్తం 12,150 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 6,457 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,693 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 600 మంది ఇన్విజిలేటర్లను నియమించడంతో పాటు నాలుగు సిట్టింగ్ స్క్వాడ్స్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని.. విద్యార్థులు 8:45 గంటలలోగా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి.. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య అన్ని పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తూ.. విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లోని అన్ని గదుల్లో విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. డ్యూయల్ డెస్క్ బెంచీలు, తాగునీటి వసతులను యథావిధిగా కల్పించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా కళాశాలల్లో విద్యార్థులను వార్షిక పరీక్షలకు అన్నివిధాలా సన్నద్ధం చేశారు. పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సీసీ నిఘాలో.. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు ఈసారి సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎప్పటికప్పుడు ప్రత్యేక స్క్వాడ్స్‌తో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయనున్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పాల్పడి పట్టుబడితే విద్యార్థులు తమ విలువైన గమ్యాన్ని కోల్పోతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. 163 సెక్షన్ అమలు.. ఇంటర్ పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్ష సమ యం ముగిసే వరకు మూసి ఉంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రా సేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. ఏర్పాట్లు పూర్తి.. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 12,150 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు 25 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే విద్యార్థులకు హాల్‌టికెట్లు అందాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. – ఎర్ర అంజయ్య, డీఐఈఓ జిల్లావ్యాప్తంగా 25 కేంద్రాల ఏర్పాటు హాజరుకానున్న 12,150 మంది విద్యార్థులు రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు -
మరో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధికి హామీ
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం సుమారు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని.. మరో రూ. వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వనపర్తిలో విద్య అభ్యసించిన అభిమానంతో ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారన్నారు. అతి తక్కువ కాలంలో సీఎం సభ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం.. విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల విషయమై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన ఆరోపణలు సత్యదూరమన్నారు. గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ నిర్మాణాలకు మాత్రమే జీఓలు ఇచ్చారని.. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసింది 500 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిర్మాణానికి మాత్రమేనన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. అదే విధంగా గతంలో కేటీఆర్ ఐటీ టవర్, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వ జీఓలు లేకుండానే శంకుస్థాపన చేశారని.. ఈ విషయమై పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దివంగత మాజీ ఎమ్మెల్యేలు జయరాములు, బాలకిష్ట్ణయ్య పేర్లతో గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రికి నామకరణం చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చందర్, నాయకులు కిచ్చారెడ్డి, మధుసూదన్ రెడ్డి, సతీష్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి
వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని హంగామా సృష్టించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. రూ. 550 కోట్ల పనులకే పరిమితం కావడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ ఎద్దేవా చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అనే కాంగ్రెస్ నైజం వనపర్తి వేదికగా బయటపడిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన అభివృద్ధి పనుల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా ఉందని ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఒకే పార్టీలో ఉంటూ కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన కిషన్‌రెడ్డిపై అనవసర విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. సమావేశంలో బీజేపీ నాయకులు చిత్తారి ప్రభాకర్, రామన్‌గౌడ్, పెద్దిరాజు, శ్రీనివాస్, కుమారస్వామి, వెంకటేశ్వర్‌రెడ్డి, కుమార్, గోపినాథ్, రాజశేఖర్‌గౌడ్, నవీన్‌చారి, రవికుమార్ ఉన్నారు. -
పంటలకు సాగునీరు అందిస్తాం
వనపర్తి: జిల్లాలో యాసంగి పంటలకు సకాలంలో తడి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి యాసంగి పంటలు, ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెనూ అమలు తదితర అంశాలపై కలెక్టర్, ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గతేడాది యాసంగిలో దాదాపు 90వేల ఎకరాల్లో వరిసాగు చేయగా.. ఈసారి 52 శాతం అధికంగా 1.41 లక్షల ఎకరాల్లో సాగుచేయడం జరిగిందన్నారు. ఏదుల, పెబ్బేరు మండలాలకు కొంత సాగునీటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని.. జూరాల, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీరు వదిలితే సమస్య తీరుతుందన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. వీసీలో డీఏఓ గోవింద్ నాయక్, విద్యుత్‌శాఖ ఎస్ఈ రాజశేఖర్, ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ ఉన్నారు. నిబంధనల మేరకే అనుమతులు.. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లాలో కొత్తగా ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, డెంటల్ ఆస్పత్రుల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టరేట్లో డీఎంహెచ్ఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పరిశీలించింది. దరఖాస్తులో పొందుపరిచిన విషయాలు, ఆస్పత్రుల్లో ఉన్న సదుపాయాలు, డాక్టర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లినికల్ యాక్ట్ ప్రకారం ఉన్న వాటికి అనుమతులు మంజూరు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాదయ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. నేటి ప్రజావాణిలో 22 అర్జీలు వచ్చాయని.. వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు. గతేడాది కంటే ఈసారి 52 శాతం అధికంగా సాగు కలెక్టర్ ఆదర్శ్ సురభి -
సీసీరోడ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి
ఖిల్లాఘనపురం: సీసీరోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పంచాయతీరాజ్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. సోమవారం ఖిల్లాఘనపురం, వెంకటాంపల్లి గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 10లక్షలతో నిర్మించిన సీసీరోడ్లను ఏఈ రమేష్ నాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో ఎస్సీ సబ్‌ప్లాన్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. పోరాటాలతోనే హక్కుల సాధన వనపర్తి రూరల్: పోరాటాలతోనే కార్మికుల హక్కులు సాధ్యమవుతాయని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహ్మ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో సెకండ్ ఏఎన్ఎంల సంఘం జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికవర్గం సంఘటితంగా పోరాడితేనే పాలక వర్గాలు దిగివస్తాయన్నారు. సెకండ్ ఏఎన్ఎంలకు వందశాతం గ్రాస్ శాలరీతో పాటు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని.. ఏఎన్ఎంల పోస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, సెకండ్ ఏఎన్ఎంల సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మమ్మ, సుమిత్ర, అరుణ, మాధవి, పార్వతి, విజయ, లక్ష్మి, శివలీల, నాగలక్ష్మి, హారతి, ఈశ్వరమ్మ ఉన్నారు. ఉపాధి హామీ కూలీలకు వసతులు కరువు పాన్‌గల్: ఉపాధి హామీ పథకం పనులు చేపడుతున్న ప్రాంతాల్లో కనీస వసతులు లేక కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యుడు బాల్యానాయక్ అన్నా రు. సోమవారం మండలంలోని తెల్లరాళ్లపల్లిలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కూలీలకు సకాలంలో కూలి డబ్బు లు అందకపోవడంతో పాటు పని ప్రదేశంలో సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు ఉపాఽ ది హామీ పనులను పర్యవేక్షిస్తూ.. కూలీల ఇబ్బందులను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కృష్ణయ్య, సా యిలు, భీమయ్య, భగవంతు పాల్గొన్నారు. -
వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి
వనపర్తి టౌన్: వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్, చీఫ్ ఇంజినీరు పాండే ఆదేశించారు. వేసవి యాక్షన్ ప్లాన్ పనుల పరిశీలనలో భాగంగా సోమవారం జిల్లా విద్యుత్‌శాఖ ఎస్ఈ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయాలన్నారు. వ్యవసాయ, గృహ, వ్యాపార, పరిశ్రమల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని సూచించారు. వేసవి యాక్షన్ ప్లాన్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. 33కేవీ బుద్ధారం ఫీడర్ ఓవర్‌లోడ్‌ను నియంత్రించాలన్నారు. అందుకోసం 33/11 కేవీ పొలికేపాడ్ సబ్‌స్టేషన్ లోడ్‌ను 33కేవీ బుద్ధారం ఫీడర్ నుంచి 33కేవీ గోపాల్పేట ఫీడర్‌కు మార్చాలని ఆదేశించారు. అదే విధంగా 33 కేవీ సోళీపూర్ ఫీడర్ నిర్మాణంలో ఉన్న లైన్‌ను పర్యవేక్షించి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. పెద్దమందడి మండలం వెల్టూర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో రూ. 1.10కోట్ల బడ్జెట్‌తో 5 ఎంబీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పెద్దమందడి మండలం అనకాయపల్లి తండాలో రైతులతో ఆయన సమావేశమై విద్యుత్ సమస్యలపై ఆరా తీశారు. ఆయన వెంట ఎస్ఈ రాజశేఖరం, వెంకటశివరాం తదితరులు ఉన్నారు. -
పాలమూరుకు అన్యాయం చేయం
వనపర్తిటౌన్: పాలమూరుకు అన్యాయం జరిగితే తట్టుకోలేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీరు తీసుకుపోవడాన్ని మంత్రి మండలి సమావేశంలో తాను విభేదించినట్లు చెప్పారు. 6, 7 టీఎంసీలు నిల్వ ఉండే ఏదుల రిజర్వాయర్ నుంచి కాకుండా వట్టెం నుంచి రెండు ప్రాంతాల్లో లిఫ్ట్ చేస్తే కేవలం రూ. 200 కోట్లతో డిండికి నీరు తీసుకెళ్లవచ్చని సూచించినట్లు వెల్లడించారు. కొన్ని శాఖల అధికారులు, గత ప్రభుత్వ నిర్లక్ష్యపు ధోరణితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 62కోట్లతో కొత్తగా మంజూరు చేసిన కాశీంనగర్ ఎత్తిపోతల పథకంతో అంజనగిరి, దత్తాయిపల్లి, జయన్న తిర్మలాపూర్, అప్పాయిపల్లి, కాశీంనగర్తో పాటు 19 తండాల్లో 4వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. డీ– 8 కాల్వ నుంచి గ్రావిటీ ద్వారా రామన్నగట్టు రిజర్వాయర్‌లో నీరు నిల్వచేసి, లిఫ్ట్ ద్వారా ప్రతిపాదిత ప్రాంతాలకు సాగునీరు అందుతాయన్నారు. వనపర్తి వాసులకే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు స్థానికంగా, హైదరాబాద్ వేదికగా వైద్యసేవలు అందించిన డాక్టర్ మాధవరెడ్డి విగ్రహాన్ని వనపర్తిలో ఏర్పాటు చేయడంతో పాటు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఆయన పేరు పెడతామన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ సంస్థలతో కలిసి ముందుకు సాగారని.. ఆ తర్వాత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో విపత్కర సమస్య ఉత్పన్నమైందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, నాయకులు ఖమర్, కోట్ల రవి, బాబా, సహదేవ్, కోళ్ల వెంకటేష్, యాదయ్య, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పెంటన్న, సమద్, జాన్ తదితరులు ఉన్నారు. -
పరిస్థితి సంక్లిష్టం
ఎస్ఎల్బీసీ సొరంగంలో అవశేషాల గుర్తింపుపై వీడని సందిగ్ధం అచ్చంపేట రూరల్: దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ లభ్యతపై స్పష్టత కరువైంది. వారి కోసం మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వారి ప్రాణాలపై ఆశలు వదులుకున్నప్పటికీ.. అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాల్లో పొంతన లేకుండా పోయింది. నేడు, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప.. సహాయక చర్యలను వేగిరం చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహాయక చర్యల్లో మొత్తం 11 బృందాలు పాల్గొంటున్నప్పటికీ.. ప్రధానంగా సింగరేణి కార్మికులే అధికంగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నా.. కార్మికుల ఆచూకీ లభ్యతపై సందిగ్ధం వీడటం లేదు. మరోవైపు జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలు కనుగొన్నామని ఓ వైపు అధికారులు చెబుతున్నా.. నిజ నిర్ధారణ చేయలేకపోతున్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అక్కడ చేపడుతున్న సహాయ చర్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో దాదాపు గంటన్నర పాటు సమీక్షించారు. కానీ సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యతపై స్పష్టతనివ్వలేదు. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని, మరో రెండు, మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్వయంగా సీఎం ప్రకటించడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొండల నుంచి నీరు వస్తుండటంతోనే.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం కొండల నుంచి నీరు రావడమేనని అధికారులు గుర్తించారు. అమ్రాబాద్ రిజర్వు టైగర్ ఫారెస్ట్‌లో ఉన్న తిర్మలాపూర్ సమీపం నుంచి లేదా మల్లెలతీర్థం నుంచి నీరు వస్తున్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే జియోలాజికల్ సర్వే అధికారులు అటవీ శాఖ అధికారులతో కలిసి నీటి ధారలు ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయనే కోణంలో సర్వే చేపట్టారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదస్థలంలో సముద్ర మట్టానికి 450 మీటర్ల లోతులో కుర్తిపెంట ప్రదేశంలో నీటి పొరలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నీటి పొరలు అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి గ్రామ పరిసర అడవుల్లోని ఉసురు వాగు, మల్లె వాగు, మల్లెల తీర్థం తదితర ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్లు చెబుతున్నారు. వాగుల ప్రవాహంతోనే నీరు వస్తుందని అధికారులు నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిసింది. టన్నెల్లోకి వెళ్లిన రెస్క్యూ బృందం గంటల తరబడి మట్టి, రాళ్ల శిథిలాలను తొలగించింది. అయితే నీటి ఊటతో బురద పెరుగుతుందని చెబుతున్నారు. టన్నెల్లో నలుగురి అవశేషాలను గుర్తించిన ప్రాంతంలో 8 మీటర్ల వరకు మట్టి, రాళ్లను తొలగించారు. మరో మూడు మీటర్లు తొలగిస్తే కాని ఏ విషయం తేలే అవకాశం లేదని తెలుస్తోంది. సింగరేణి కార్మికులు షిఫ్ట్‌ల వారీగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒక్కో షిఫ్ట్‌కు 40 నుంచి 80 మంది వరకు సొరంగంలోకి ప్రవేశించి.. అక్కడ మట్టి, నీరును వేరు చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. సహాయక చర్యలను కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఇతర అధికారులు పర్యవేక్షించారు. నీటి ఊటతో పెరుగుతున్న బురద.. కార్మికుల ఆచూకీ కోసం తప్పని ఎదురుచూపులు తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు భారీగా ఉబికి వస్తున్న నీరు, బురదతో ఆటంకాలు -
పాలమూరు రుణం తీర్చుకుంటా
కేసీఆర్ వల్లే కృష్ణా జలాల కేటాయింపుల్లో అన్యాయం ● పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు ● మహిళల పేరుతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ● ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే సహించను ● వనపర్తి బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి కార్పొరేషన్ల వ్యవస్థ మళ్లీ బలోపేతం ఎీస్స, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను పదేళ్ల పాలనలో కేసీఆర్ నిర్వీర్యం చేశారని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించుకునేందుకు కార్పొరేషన్ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు రూ.6వేల కోట్లు కేటాయించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లుకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.14,870 కోట్లను రైతుల పక్షాన ప్రభుత్వం చెల్లించిందన్నారు. సన్న రకాలు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో రూ.1804 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి పైసా సంక్షేమ పథకాల కోసం, ప్రజాభివృద్ధి కోసం ఉపయోగిస్తామని వెల్లడించారు. ● ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. వంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, ఆర్టీసీకి బస్సులు అద్దెకిచ్చే స్థాయికి మహిళలు ఎదిగారని పేర్కొన్నారు. ●● మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పదేళ్లలో తాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే నిలిచాయన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా 50 రోజుల్లో కులగణన చేపట్టి పూర్తి చేసిందన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జాబ్‌మేళాలు నిర్వహించి 295 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ●వనపర్తి: ‘నల్లమల ప్రాంతంలో పుట్టి.. చైతన్యవంతమైన వనపర్తిలో పెరిగి విద్యాభ్యాసం చేశాను. స్వస్థలమైన పాలమూరు ప్రాంత రుణం తీర్చుకుంటాను.’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు అభివృద్ధిని విస్మరించారని, కృష్ణా జలాల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు, పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల పేరుతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. 50 లక్షల పైచిలుకు కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఆడ బిడ్డలను విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సరైన గుణపాఠం చెప్పాలంటే సలాకి కాల్చి వాత పెట్టాలన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకే అప్పగించి కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఇప్పటికింకా వలసలు ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలన్నారు. ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ● వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి ప్రాంతంలో విద్యను అభ్యసించిన సీఎం ఈ ప్రాంతంపై అభిమానంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇప్పటికే రూ.375 కోట్ల అభివద్ధి పనులను చేపట్టామని, మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను చేసేందుకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో చాలా సంక్షేమ హాస్టల్లో ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయని.. వాటికి పక్కా భవనాల నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా సీఎంను కోరారు. జిల్లాలో నూతనంగా నిర్మించనున్న 500 పడకల ఆస్పత్రికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకిష్టయ్య పేరు పెట్టాలని, రాజమహల్ మరమ్మతులు చేసేందుకు అనుమతిచ్చి.. కావాల్సిన నిధులు మంజూరు చేయాలని, వనపర్తి నియోజకవర్గంలోని 133 గ్రామపంచాయతీల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు. పాలమూరు వాసులు అమాయకులేం కాదు.. -
మందకొడిగా ఆస్తిపన్ను వసూలు
బహిరంగ సభకు హాజరైన ప్రజలు జిల్లాలో మండలాల వారీగా ఆస్తిపన్ను వసూలు లక్ష్యం ఇలా.. (రూ.లలో) మండలం గ్రామాలు లక్ష్యం వసూలు శాతం వనపర్తి 26 19,58,306 16,44,577 83.98 ఆత్మకూర్ 13 13,70,596 10,78,976 72.00 పెబ్బేరు 20 30,10,606 13,47,837 44.77 వీపనగండ్ల 14 14,05,306 10,85,228 77.27 మదనాపూర్ 17 19,55,803 7,31,0030 37.38 అమరచింత 14 10,46,667 6.62,871 63.33 గోపాల్పేట 15 21,72,579 10,12678 46.61 రేవల్లి 12 08,38,766 5,58,544 66.59 ఖిల్లాఘనపూర్ 27 29,12,286 22,91,747 78.69 శ్రీరంగాపూర్ 8 08,52,461 5,74,616 65.82 పాన్‌గల్ 28 24,14,567 22,39,428 92.75 చిన్నంబావి 17 14,49,673 13,33,306 91.97 కొత్తకోట 22 26,12,637 23,28,643 89.13 పెద్దమందడి 22 16,36,701 11,10231 67.83 ● గ్రామపంచాయతీల్లో ఇప్పటి వరకు 70శాతం మాత్రమే రాబడి ● ముంచుకొస్తున్న గడువు ● లక్ష్యాన్ని చేరుకుంటామంటున్న అధికారులు ఆత్మకూర్: గ్రామపంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు పన్నులే. ఇలాంటి పన్నుల వసూలులో పురోగతి కనిపించడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు కేవలం 28 రోజుల వ్యవధి మాత్రమే ఉండగా.. జిల్లాలోని 14 మండలాల్లో పన్ను వసూలు మందకొడిగా సాగుతోంది. ప్రస్తుతం వేగవంతంగా పన్ను రాబడితేనే లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరం రూ. 2.41 కోట్ల పన్ను వసూలుచేసి వందశాతం పూర్తిచేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,56,57,445 పన్ను లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు రూ. 1,79,99,712 మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ. 1,95,67,051 పన్ను వసూలు కావాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా జీపీలకు 70 శాతం మాత్రమే పన్ను రాబడి వచ్చింది. ఈ నెలాఖరు నాటికి వందశాతం పన్ను వసూలు చేసి.. లక్ష్యాన్ని చేరుకుంటామని సంబందిత అధికారులు అంటున్నారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాగా, ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలోనే పన్ను వసూలుపై అధికారులు హడావుడి చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. వేగవంతం చేశాం.. జిల్లాలోని అన్ని జీపీల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఆస్తిపన్ను వసూలును వేగవంతం చేశాం. ఈ విషయమై మండలాల వారీగా పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఈ నెల రెండో వారంలోనే వందశాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. – సురేష్, డీపీఓ -
నాణ్యమైన భోజనం అందించాలి
కొత్తకోట రూరల్: వసతిగృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కమిషనర్ క్షితిజ ఆదేశించారు. ఆదివారం కొత్తకోట పట్టణంలోని ఎస్సీ బాలుర, బాలికల వసతిగృహాలతో పాటు కానాయపల్లి శివారులోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో స్టోర్ రూంలతో పాటు డార్మెంటరీ హాల్స్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. హాస్టల్లో భోజనం మంచిగా ఉంటుందా? కూరగాయలు రుచికరంగా ఉన్నాయా లేదా? అని తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో కమిషనర్ ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. వసతిగృహాల్లో ఉంటూ చదువుతున్న ప్రతి విద్యార్థి 10/10 జీపీఏ సాధించాలని సూచించారు. వార్షిక పరీక్షలను భయంతో కాకుండా ఇష్టంతో రాస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా లైబ్రరీ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులందరూ భవిష్యత్‌లో ఉన్నతంగా జీవించాలని ఆకాంక్షించారు. కమిషనర్ వెంట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఎం.మల్లికార్జున్, డివిజనల్ ఆఫీసర్ జె.మల్లేశం, వసతిగృహ సంక్షేమ అధికారులు బెనర్జీ, సంతోష్ కుమార్, జ్యోతి, గోపాల్ నాయక్ ఉన్నారు. -
దివ్యాంగులు యూడీ ఐడీ కలిగి ఉండాలి
వనపర్తి: దివ్యాంగులందరూ యూడీఐడీ (యూనిక్ డిజేబుల్ ఐడి) కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. అనంతం సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. యూడీఐడీ దరఖాస్తుల నమోదుపై మీ–సేవ కేంద్రాల నిర్వాహకులు, పంచాయతీ కార్యదర్శులు, వీఓఏలు, సీసీలు, ఎంపీడీఓలు, ఏడీఎంలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రుల్లో వికలత్వం నిర్ధారణకు అవసరమైన వైద్యులు, పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, శిబిరాల్లో దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆస్పత్రుల్లో స్లాట్ బుకింగ్ చేసి సమాచారం ఇవ్వాలని, నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత యూడీఐడీ కార్డు ఇవ్వాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా సంక్షేమాధికారి సుధారాణి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సైన్స్మేళాలు దోహదం వనపర్తి రూరల్: విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందేందుకు, భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు సైన్స్ మేళాలు దోహదపడుతాయని డీఈఓ అబ్దుల్ ఘని అన్నారు. శనివారం మండలంలోని చిట్యాల శివారు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో నిర్వహించిన పీఎంఎస్హెచ్ఆర్ఐ పాఠశాలల జిల్లాస్థాయి సైన్స్మేళా, గణితమేళాను ఆయన ప్రారంభించారు. జిల్లాలోని 15 పాఠశాలల విద్యార్థులు పాల్గొని గణితం, సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించారు. ఏఎంఓ మహానంది, జిల్లా ప్లానింగ్ కో–ఆర్డినేటర్ శేఖర్, ఎస్ఓ యుగంఘంర్, జీసీడీఓ శుభలక్ష్మి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్స్‌పాల్ గురువయ్యగౌడ్, డిగ్రీ కళాశాల అధ్యాపకులు దామోదర్‌రెడ్డి, శ్రీనివాస్, ఆర్పీ బలరాముడు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ప్రదర్శనలను తిలకరించారు. పాఠశాల చైర్మన్ రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నాటి స్నేహితులతో ఆత్మీయ భేటీ..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 1979–80లో స్థానిక కేడీఆర్ యూపీఎస్‌లో ఏడోతరగతి, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు, 1983–85 వరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఆయనతో కలిసి చదువుకున్న మిత్రులతో పాటు చదువు చెప్పిన గురువులను సైతం ఈ పర్యటనలో కలవనున్నారు. ఈ మేరకు అధికారులు మిత్రబృందం, గురువులు సుమారు 300 మందికి ప్రత్యేక పాసులు జారీ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీరితో ముఖ్యమంత్రి సుమారు రెండు గంటల పాటు గడిపి అక్కడే భోజనం చేయనున్నారు. ఇందుకుగాను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఏర్పాట్లు చేశారు. ఆయన మిత్రుల్లో రైతుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ వ్యాపారులు, రాజకీయ నాయకులు తదితర వర్గాలవారు ఉండటం గమనార్హం. -
చివరి అంకానికి..
ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మంది కార్మికుల అవశేషాల గుర్తింపు సాక్షి, నాగర్‌కర్నూల్/అచ్చంపేట రూరల్: ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను వెలికితీసేందుకు చేపడుతున్న సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. నేడో, రేపో సొరంగం నుంచి కార్మికులను బయటకు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదట గుర్తించిన ఒక స్పాట్ నుంచి నలుగురు, ఆ తర్వాత మరో స్పాట్ నుంచి నలుగురు కార్మికులను వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటి ఊట పెరుగుతుండటం, మట్టి తొలగింపునకు కన్వేయర్ బెల్టు అందుబాటులోకి రాకపోవడంతో ఆలస్యం అవుతోంది. శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి సంఘటన స్థలానికి చేరుకుని, పనులను పర్యవేక్షించారు. నీటి ఊట, మట్టి తొలగింపుతో పనులు ఆలస్యం.. మొత్తం 13.85 కి.మీ. సొరంగ మార్గంలో 13.61 పాయింట్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయి. మిగతా చోటును గాలించేందుకు అక్కడ సుమారు 18 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, శిథిలాలు ఆటంకంగా మారాయి. జీపీఆర్ గుర్తించిన చోట తవ్వకాలు జరిపేందుకు సింగరేణి, ర్యాట్ మైనింగ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి మిషనరీ లేకుండా వారు మ్యానువల్‌గా తవ్వకాలు చేపడుతున్నారు. టీబీఎం సంబంధిన విడిభాగాలు, శిథిలాలను కట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సహాయక బృందాల రాకపోకలకు, మట్టి, శిథిలాల తరలింపునకు దారిని ఏర్పాటు చేస్తున్నారు. కట్టర్ చివరి భాగంలో కా ర్మికులు ఉన్నట్టుగా భావిస్తున్న చోట తవ్వకాలు చేపడుతుండగా, పెద్ద ఎత్తున వస్తున్న నీటి ఊటతో అవరోధాలు ఏర్పడుతున్నాయి. నీటిని తోడేందుకు డీవాటరింగ్, మట్టిని తొలగించేందు కు చేపడుతున్న చర్యలతో ఆలస్యం అవుతోంది. అదనపు మోటార్ల ఏర్పాటు.. సొరంగం సెగ్మెంట్ బిగిస్తుండటంతో ఏర్పడిన రంధ్రాల ద్వారా నీటి ఊట టన్నెల్లోకి అధికమైంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఏర్పాటు చేసిన మోటార్లు సరిపోవడం లేదు. టన్నెల్లోకి నీట ఊట అధికమవడంతో ఐదు అదనపు మోటార్లను, ప్రత్యేకంగా పైపులను ఏర్పాటు చేసి.. నీటిని తోడేస్తున్నారు. బురద గట్టి పడటంతో సింగరేణి కార్మికుల వద్ద ఉన్న పారలు సైతం వాడకంలోకి రావడం లేదు. దీంతో అదనంగా గడ్డపారలు తెప్పించారు. పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్లు వాడుతున్నారు. ఊట నీటిని, మట్టిని తొలగిస్తేనే చిక్కు కున్న వారి అవ శేషాలు వెలికి తీసేం దుకు వీల వుతుంది. టీబీఎంకు ఇరువైపులా ఉన్నట్లు గుర్తించిన జీపీఆర్ స్కానింగ్ నేడు నలుగురు, 2 రోజుల తర్వాత మరో నలుగురు కార్మికులను వెలికి తీస్తారని అంచనా సహాయక చర్యలను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సీఎస్ శాంతికుమారి ఆశలు లేనట్లేనా..? సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోంది. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం నిష్ణాతులైన రెస్క్యూ టీంలతో సహాయక చర్యలను ముమ్మరం చేసినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. టన్నెల్లో పేరుకుపోయిన బురద, నీటి ఊటలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని అధికారులు చెబుతున్నా.. ప్రమాదం జరిగిన సందర్భంలోనే చిక్కుకున్న వారి ప్రాణాలు పోయాయని పలువురు చర్చించుకుంటున్నారు. కుటుంబీకుల ఎదురుచూపులు.. పొట్టకూటి కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు, సిబ్బంది ఎస్ఎల్బీసీ సొరంగంలో పనులు చేస్తూ చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎస్ఎల్బీసీలో జేపీ కంపెనీలో పనులు చేస్తున్నారు. కాగా ఏడు రోజుల నుంచి సొరంగంలో తమ వారు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలను చూసి సొరంగంలో చిక్కుకున్న వారి బంధువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. క్షేమంగా బయటపడతారని ఇన్ని రోజులు ఎదురు చూశామని, అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు భిన్నంగా ఉన్నాయని వాపోతున్నారు. జేపీ కంపెనీ సమీపంలోకి పెద్దఎత్తున పార్థివ అంబులెన్సులు రావడంతో తమవారి ప్రాణాలపై ఆశలు లేవని అర్థమైందని అక్కడికి వచ్చిన బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు. -
ఎన్నికల ప్రచార బోర్డులు రాసిన ప్రాంతానికి సీఎం హోదాలో..
ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో రేవంత్‌రెడ్డి గోడలపై ప్రచార రాతలు రాశారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయనే వెల్లడించారు. అదే ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో రానుండటంతో ఈ ప్రాంత ప్రజలు ఆయనను చూసేందుకు, పలకరించేందుకు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో తన గుర్తింపు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని స్థానికులు ఆశిస్తున్నారు. -
నేడు జిల్లాకు సీఎం రాక
వనపర్తి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకుగాను అధికార, పాలకవర్గం భారీఎత్తున ఏర్పాట్లు చేసింది. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4:35 వరకు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. హెలీకాప్టర్‌లో హైదరాబాద్ నుంచి 11.30కి జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకొని స్వామి వారి దర్శనానంతరం ఆలయ అభివృద్ధికి రూ.కోటి ప్రొసీడింగ్ పత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ అయ్యలూరి రఘునాథశర్మకు అందజేస్తారు. అటు నుంచి తను విద్యనభ్యసించిన జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకొని అక్కడే పాఠశాల, కళాశాల భవన నిర్మాణాలు, జీజీహెచ్ భవనం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, ఐటీ టవర్, శ్రీరంగాపురం ఆలయ అభివృద్ధి పనులు, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి భవనం, జిల్లాకేంద్రంలోని రాజనగరం శివారు నుంచి పెద్దమందడి వరకు బీటీరోడ్డు నిర్మాణం, ఎస్టీ హాబిటేషన్ వర్కింగ్ బిల్డింగ్, నియోజకవర్గంలోని సీఆర్ఆర్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని తన పాఠశాల, కళాశాల మిత్రులు, గురువులతో కాసేపు గడిపి వారితో కలిసి భోజనం చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20కి బయలుదేరి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడే రేవంతన్న కా భరోసా అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, కుట్టుమిషన్లు, నియామక పత్రాలు అందజేసిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు హెలీకాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకానున్నారు. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జోగుళాంబ డీఐజీ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా శనివారం జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ నుంచి జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల వరకు రూట్ బందోబస్తును పరిశీలించారు. సభాస్థలి, సీఎం పర్యటించనున్న ప్రదేశాలు, పైలెట్ వాహనాల ట్రయల్‌రన్ నిర్వహించారు. వీఐపీ కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ ఓపెనింగ్ పార్టీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్లపై చిరు వ్యాపారులు, వాహనాలు నిలుపరాదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ సభకు వచ్చే వాహనాలకు ఆర్టీసీ బస్‌డిపోలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని.. కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే నిలపాలని సూచించారు. బందోబస్తును మొత్తం ఏడు సెక్టార్లుగా విభజించామని.. నలుగురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 28 మంది ఎస్ఐలు, 140 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 420 మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్, 250 మంది హోంగార్డులు విధులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి వెంట సీఐ కృష్ణ, ఇతర పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు. రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ‘రేవంతన్న కా భరోసా’ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి -
భారీ జన సమీకరణ..
స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వేదికగా జరగనున్న ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభకు పెద్దఎత్తున జన సమీకరణ చేసేందుకు అధికార, పాలకవర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. సుమారు 20 వేల మందిని తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్లు కాంగ్రెస్‌పార్టీ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి. పలువురు ప్రధాన నాయకులు సీఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. -
ఇంటర్ పరీక్షలకు పటిష్ట చర్యలు
వనపర్తి: మార్చి 5 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ శాంతికుమారి ఇంటర్ పరీక్షలు, ఎల్ఆర్ఎస్ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్, ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఈ ఏడాది 12,150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని.. నిర్వహణకు 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఇన్విజిలేటర్లకు శిక్షణ సైతం పూర్తి చేశామని.. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు, పరీక్ష సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. కేంద్రాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు అందుబాటులో ఉంచాలని పుర, పంచాయతీ అధికారులను ఆదేశించామని చెప్పారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఐఈఓ అంజయ్య, డీపీఓ కృష్ణ పాల్గొన్నారు. పరీక్షలు సక్రమంగా జరిగేలా చూడాలి.. వనపర్తి విద్యావిభాగం: త్వరలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలు సక్రమంగా జరిగేలా చూడాలని ఇంటర్‌బోర్డ్ పరిశీలకుడు విశ్వేశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. వార్షిక పరీక్షల నిర్వహణ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీఐఈఓ ఎర్ర అంజయ్య వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని వివరించారు. సమావేశానికి 25 కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు, బఫర్ స్టాఫ్ హాజరయ్యారు. రామన్‌పాడులో నిలకడగా నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఎన్టీఆర్ కాల్వకు 940 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 24 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 862 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
కాలుష్య కారకం
కాలం చెల్లిన వాహనం.. ●15 ఏళ్లుపై బడిన వాహనాలతో తీవ్రమైన కాలుష్యం ఆదేశాలు ఇచ్చాం.. ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరూ ఎంవీఐలు, ఆర్టీఓలకు 15 ఏళ్లు పైబడిన వాహనాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేసి అలాంటి వాహనాలు గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో 15, 20 ఏళ్లు పైబడిన వాహనదారులు ప్రతిఒక్కరూ వారి వాహనాల రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువన్ లేని వాహనాలు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో పట్టుబడితే సీజ్ చేస్తాం. ప్రధానంగా రోడ్లపై వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ సీటు బెల్ట్, హెల్మెట్ తప్పక ధరించాలి. – కిషన్, డీటీసీ ఉమ్మడి జిల్లా ● రోగాల విజృంభణ నేపథ్యంలో కట్టడికి చర్యలు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 32,181 వాహనాలు ● గ్రీన్ ట్యాక్స్ భారీగా పెంచిన ప్రభుత్వాలు పాలమూరు: భారీగా పెరిగిపోతున్న వాహన కాలుష్యంతో వాతావరణంలో సమతుల్యత లోపించి కొత్త రకం జబ్బులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15, 20 ఏళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ టాక్స్ భారీగా విధిస్తోంది. 15 ఏళ్లు దాటిన ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.2 వేలు, 20 ఏళ్లు దాటిన బైక్‌లకు రూ.5 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక 15 ఏళ్లు దాటిన కార్లకు రూ.5 వేలు, 20 ఏళ్లు దాటిన వాటికి రూ.10 వేల పన్నులు వసూలు చేయాలని ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో చాలా వరకు కార్లు, ద్విచక్రవాహనాలు 20 ఏళ్లు పైబడినా అలాగే రోడ్లపై నడుపుతున్నారు. అలా కాలం చెల్లిన వాహనాల నుంచి భారీస్థాయిలో పొగ విడుదల కావడంతో మిగిలిన వాహనదారులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ● ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాహనం కలిగి ఉండటం సర్వసాధారణమైపోయింది. వాహనం ఉండటం సరే.. దాని నుంచి వచ్చే కాలుష్యమే పర్యావరణానికి హాని కలిగిస్తోంది. వాహనాల నుంచి వచ్చే కార్బన్ మోనాకై ్సడ్ వల్ల ఓజోన్ పొర బాగా దెబ్బతింటోంది. వాహనాల నుంచి మోతాదుకు మించి కాలుష్యం విడుదల కాకుండా ఆర్టీఏ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. డీజిల్ వాహనాల నుంచి 60 శాతానికి మించి పొగ రాకూడదు. అలాగే పెట్రోల్ వాహనాల నుంచి ద్విచక్రవాహనమైతే 3.5శాతం, కార్లు ఇతర వాహనాలైతే 4.5 శాతానికి మించరాదు. కానీ, కాలం చెల్లిన వాహనాల నుంచి అధిక మోతాదులో పొగ విడుదలవుతుంది. దేశ రాజధానిలో వాహనాల వినియోగం ఎక్కువ కావడంతో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. అక్కడి ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్న నేపథ్యంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకరోజు కొన్ని వాహనాలను మాత్రమే రహదారి మీదికి అనుమతిస్తున్నారు. మన పట్టణంలోనూ రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. జిల్లాలోని పలు గుంతల రహదారులతో పాటు వాహనాల పొగతో వెలువడే కాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ వాధ్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 15ఏళ్లు పైబడిన అన్ని రకాల వాహనాల వివరాలు జిల్లా వాహనాలు మహబూబ్‌నగర్ 13,965 నాగర్‌కర్నూల్ 5,295 వనపర్తి 4,059 జోగుళాంబ గద్వాల 3,672 నారాయణపేట 5,190 -
ముగిసిన చెరుకు కోతలు
కృష్ణవేణి చక్కర ఫ్యాక్టరీ పరిధిలో 2.65 లక్షల టన్నులు ●యాజమాన్యం దృష్టికి సమస్యలు.. చెరుకు రైతుల సమస్యలను ఎప్పటికప్పడు కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నాం. పంట తరలించిన 15 రోజుల్లోపూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించాలని విన్నవించాం. సమయం దాటితే 16 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని కోరాం. సకాలంలో కోత కార్మికులు, యంత్రాలు రప్పించాలని సూచించాం. – జీఎస్ గోపి, రాష్ట్ర అధ్యక్షుడు, చెరుకు రైతు సంఘం సకాలంలో కోతలు.. రెండేళ్లుగా సకాలంలో చెరుకు కోతలు పూర్తవుతున్నాయి. గతంలో వేసవి పూర్తయినా కోతలు పూర్తిగాకపోయేవి. కోత కార్మికుల కొరత కారణంగా జాప్యం జరిగేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. అప్పట్లో పండించిన చెరుకును ఫ్యాక్టరీకి తరలించేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. – మునెప్ప, మస్తీపురం, అమరచింత అమరచింత: జిల్లాలోని కృష్ణవేణి చక్కర ఫ్యాక్టరీ పరిధిలో గతేడాది నవంబర్ 20న ప్రారంభమైన చెరుకు కోతలు ఫిబ్రవరి 19తో ముగిశాయి. మొత్తం 4.20 లక్షల టన్నుల చెరుకును గానుగ ఆడించి ఈ సీజన్ లక్ష్యాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం చేరుకోగలిగింది. గతంలో కోత కార్మికులు అందుబాటులో లేకపోవడంతో కోతలు సకాలంలో పూర్తిగాక ఇటు రైతులు, అటు యాజమాన్యానికి ఇబ్బందులు ఎదురయ్యేవి. రెండేళ్లుగా యాజమాన్యం ముందుస్తుగా కోత కార్మికులతో పాటు యంత్రాలను రప్పించడంతో ఎలాంటి సమస్యలు లేకుండా అనుకున్న సమయానికి కోతలు పూర్తి చేయగలుగుతున్నారు. ఈ ఏడాది మహాఽరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి 120 కోత కార్మిక బృందాలు, 8 యంత్రాలను వినియోగించినట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం వెల్లడించింది. కోత లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు జహీరాబాద్ నుంచి 1.65 లక్షల టన్నుల చెరుకును దిగుమతి చేసుకొని గానుగా ఆడించామని వివరించారు. పదెకరాల్లో సాగు చేశా.. నేను పది ఎకరాల్లో చెరుకు సాగు చేశా. ఈ సారి 350 టన్నుల దిగుబడి రాగా ఫ్యాక్టరీకి సకాలంలో తరలించా. గతంలో చెరుకు తోట కోతకు సిద్ధంగా ఉందని ఫ్యాక్టరీ యాజమాన్యానికి విన్నవించినా కోత కూలీలు సకాలంలో రాకపోయేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కోత కార్మికులను ముందస్తుగానే గ్రామానికి పంపడంతో సకాలంలో కోతలు పూర్తి చేయగలిగాను. – దోసు హన్మంతు, మస్తీపురం, అమరచింత టన్నుకు రూ.3,366.80 చొప్పున.. చెరుకును ఫ్యాక్టరీకి తరలించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.75 కోట్లు జమ చేయగా.. రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ సీజన్లో టన్నుకు రూ.3,366.80 చొప్పున ధర చెల్లించినట్లు డీజీఎం వెల్లడించారు. నాలుగు నెలల్లో కోతలు పూర్తిచేసి సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. కంపెనీ పరిధిలో సాగు విస్తీర్ణం తగ్గుతున్నందున రైతులకు రాయితీలు ప్రకటించడంతో ఈసారి 6 వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుల బకాయిల చెల్లింపులు ఈ నెల రెండో వారంలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పూర్తిస్థాయిలో చెల్లింపులు.. ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన ప్రతి రైతుకు పూర్తిస్థాయిలో సకాలంలో డబ్బులు చెల్లించేలా యాజమాన్యం ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు రూ.75 కోట్లు చెల్లించగా.. బకాయి ఉన్న మరో రూ.20 కోట్లు రెండవ వారంలోగా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు సాగు విస్తీర్ణం 9 వేలకు పెంచేందుకు కృషి చేస్తున్నాం. – మురళి, డీజీఎం, కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ సాగు విస్తీర్ణం పెంపునకు.. ఫ్యాక్టరీ ప్రారంభంలో రైతులు చెరుకు సాగుపై దృష్టి సారించారు. అప్పట్లో సకాలంలో కోత కార్మికులు రాకపోవడం, యాజమాన్యం డబ్బులను సకాలంలో చెల్లించకపోవడంతో 8,500 ఎకరాల విస్తీర్ణం కాస్త 4,500కు పడిపోయింది. దీంతో రెండేళ్లుగా ఫ్యాక్టరీ యాజమాన్యంతో పాటు సిబ్బంది సాగు పెంపుపై దృష్టిసారించి రైతులకు రాయితీలు ప్రకటించడంతో ప్రస్తుతం సాగు విస్తీర్ణం ఆరు వేలకు పెరిగింది. రాయితీపై విత్తనాలు, కౌలు రైతులకు రాయితీలు, గ్రామాల్లో చెరుకు సాగుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తుండటంతో రైతులు సాగుకు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. గానుగ ఆడింది 4.20 లక్షల టన్నులు జహీరాబాద్ నుంచి 1.65 లక్షలు దిగుమతి రైతులకు చెల్లింపులు రూ.75 కోట్లు.. బకాయిలు రూ.20 కోట్లు వచ్చే సీజన్లో సాగు విస్తీర్ణం 9 వేల ఎకరాలకు పెంచే యోచన రాయితీలు ఇలా.. రైతులకు చెరుకు సాగుపై ఆసక్తి పెంపొందించేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం అనేక రాయితీలు ప్రకటిస్తుంది. ప్రతి ఏటా అక్టోబర్ 20 నుంచి జనవరి 20 వరకు చెరుకు ప్లాంటేషన్ చేసే రైతులకు దిగుబడిపై టన్నుకు అదనంగా రూ.350 బోనస్ అందించనుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌లో సాగుచేసిన రైతులకు టన్నుకు రూ.300 చొప్పున చెల్లించనుంది. రెండోసారి పంట కోత సమయంలో రూ.300, నాలుగు, ఐదు కోతల్లో రూ.500 చొప్పున చెల్లిస్తోంది. అలాగే కొత్తగా చెరుకు సాగు చేసే రైతులకు 1.20 ఎకరాల సాగుకు రెండున్నర టన్నుల చెరుకు విత్తనాన్ని రాయితీపై అందిస్తోంది. అదేవిధంగా డ్రిప్ కొనుగోలుకు రూ.20 వేల వరకు రుణం ఇస్తోంది. -
అడ్డంకులు దాటుతూ..
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏడోరోజు కొనసాగిన సహాయక చర్యలు అచ్చంపేట: దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. గ్యాస్ కటింగ్ పరికరంతో టీబీఎం మిషన్ కట్ చేసే పనులు వేగవంతమయ్యాయి. తొలగించిన భాగాలను ఎప్పటికప్పుడు బయటకు తీసుకొస్తున్నారు. శుక్రవారం ఏడోరోజు లోకో ట్రైన్‌కు సింగిరేణి బొగ్గు గనుల నుంచి తెప్పించిన పెద్ద సైజు ట్రేలను బిగించి గ్యాస్, ఫాస్మ కటర్ల ద్వారా తొలగించిన టీబీఎం విడి భాగాలు, ఇతర ఇనుప రాడ్లు, పైపులను రెస్క్యూ టీం సభ్యులు మోయగలిగిన సైజులో కట్ చేసి సొరంగం బయటికి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కన్వేయర్ బెల్ట్‌ను పునరుద్ధరించలేదు. సొరంగం లోపల 14.85 కిలోమీటర్ల వద్ద టీబీఎం మిషన్ ఉండగా పైకప్పు కూలింది. ఇక్కడ పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు లోకో ట్రైన్‌ను 13.500 కిలోమీటరు వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గట్టి పడిన మట్టిని తీయడానికి మినీ పొక్లెయిన్లను వినియోగిస్తున్నారు. పొక్లెయిన్లు, బృందాలు లోపలి బురదను తొలగిస్తూ బయటికి పంపిస్తున్నారు. మూడు బోగీలు (ట్రేలు) ద్వారా బురద బయటికి తరలించారు. సొరంగంలోకి చేరిన నీటిని బయటకు పంపింగ్ చేయడానికి అదనపు మోటార్లను తీసుకొచ్చారు. పూర్తిస్థాయిలో మట్టిని తరలించకపోయినా లోపల ఓ పక్కకు వేస్తూ కార్మికుల ఆచూకీ కనుకొనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బాధితుల కోసం సొరంగంలో టెషర్స్ అందుబాటులో ఉంచారు. రక్షణ కోసం.. టన్నెల్లోకి వెళ్లే సహాయక బృందాల రక్షణ కోసం కృత్రిమ ఏర్పాట్లు చేస్తున్నారు. లోపల ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐరన్ షీట్లు, పైపులను రౌండ్‌గా బెండ్ చేసి వెల్డింగ్ చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్తున్నారు. దీని ద్వారా లోపలికి ప్రవేశించేలా చర్యలు చేపట్టారు. సొరంగం కూలిన, రాళ్లు, రప్పలు ఊడిపడినా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా వీటిని తయారు చేసున్నారు. దీంతో ఏమైనా ప్రమాదం జరిగినా తప్పించుకునే అవకాశం ఉంటుందని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ టన్నెల్ వద్దకు ఇతరులు వెళ్లకుండా నివారిస్తున్నారు. ముమ్మరంగా బురద, మట్టి, శిథిలాల తరలింపు అత్యాధునిక పరికరాలతో గాలింపు సొంతూళ్లకు కార్మికులు.. టన్నెల్లో జరిగిన ప్రమాదంతో భయాందోళనకు గురైన కార్మికులు ఒక్కొక్కరుగా సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. కుటుంబసభ్యులు ఫోన్ చేసి తిరిగి రావాలని వేడుకుంటున్నారని, గత్యంతరం లేక మూడు నెలల జీతాలు రావాల్సి ఉన్నా వదిలి వెళ్తున్నామని కార్మికులు వాపోయారు. సొరంగం వద్ద పనులు సాగుతాయో లేదో అని.. తమ సొంత రాష్ట్రంలోనే ఏదో ఒక పని చేసుకుంటామని పేర్కొంటున్నారు. జీతాలు లేకున్నా సరే మా ప్రాణాలే ముఖ్యం అంటున్నారు. టన్నెల్ వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, వివిధ శాఖల అధికారులు, విపత్తుల విభాగం ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ రావుల గిరిధర్, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. బహిరంగ సభకు వచ్చే ప్రముఖులు, రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. -
సమన్వయంతోనే విజయవంతం..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ రావుల గిరిధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో హెలీప్యాడ్, వాహనాల పార్కింగ్, బారికేడ్ల ఏర్పాట్లను జిల్లా పోలీసు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం పర్యటన సజావుగా సాగేందుకు శాఖాపరంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. వీఐపీ, ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్‌కు వేర్వేరుగా అనువైన స్థలాలను గుర్తించాలని కోరారు. అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ కృష్ణా, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, సీసీఎస్ సీఐ రవిపాల్, ఎస్ఐలు హరిప్రసాద్, జలంధర్‌రెడ్డి, నరేష్, జగన్, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. -
అదనపు బృందాల రాక
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు శుక్రవారం రామగుండం, కొత్తగూడెం నుంచి అదనంగా సింగరేణి బృందాలు చేరుకున్నాయి. సింగరేణి కార్మికులు ఎక్కువగా కష్టపడుతూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు సింగరేణి కార్మికులు సొరంగంలో బురద మట్టిని తొలగించడానికి శాయశక్తులా పనిచేశారు. సింగరేణి కార్మికులు విడతల వారీగా సొరంగంలోకి వెళ్లి పనులు చేపడుతున్నారు. వీరితో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్, బీఆర్ఓ, రైల్వే శాఖతో పాటు పలు ప్రైవేట్ నిర్మాణ సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ● అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం టన్నెల్లో 11.560 కి.మీ., నుంచి 12.950 కి.మీ., వరకు వాటర్, బురద పేరుకుపోగా.. రెండు రోజులుగా వీటిని తొలగిస్తున్నారు. అలాగే 150 మీటర్ల మేర పేరుకున్న మట్టి, బురద, రాళ్లు, సెగ్మెంట్, టీబీఎం శిథిలాలను తొలగించే చర్యలు ముమ్మరం చేశారు. -
‘యూపీఎస్‌పై యుద్ధభేరి’ జయప్రదం చేయండి
పాన్‌గల్: తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టే ‘యూపీఎస్‌పై యుద్ధభేరి’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బౌద్దారెడ్డి, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, చింతకుంట పాఠశాల జీహెచ్ఎం షేక్యానాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని చింతకుంట ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్లను వారు ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కార్యక్రమానికి భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, మనోహర్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి, బక్కన్న, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యాపర్తి సిగలో..
జిల్లాకేంద్రంలో ఏర్పాటుకానున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల వనపర్తి: పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు జిల్లాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. జిల్లాకు కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడంతో విద్యలో మరో అడుగు ముందుకు పడినట్లు విశ్లేషకులు విద్యావంతులు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రిని ఒప్పించి జిల్లాకు పాఠశాలతో పాటు భవన నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు చేయించారు. ఈ పాఠశాల భవన నిర్మాణానికి జిల్లాకేంద్రంలోని పీర్లగుట్ట ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదీ లక్ష్యం.. జిల్లాలో చాలా గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటిన అధిగమించి బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల విద్యార్థులను ఒకే గొడుగు కిందకు తెచ్చి బోధన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో నిర్మించాలన్నదే లక్ష్యం. ఈ క్యాంపస్‌లో తరగతి గదులు, డార్మెంటరీలు, ల్యాబ్స్, క్రీడా మైదానాలు, అవుట్డోర్ జిమ్, థియేటర్ తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చదువుకున్న వనపర్తిలో తొలి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చి 2న జిల్లా పర్యటనలో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కార్పొరేట్‌స్థాయిలో బోధన అందించేందుకే.. వనపర్తి ప్రాంత పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. విద్యాపర్తిని మరింత అభివృద్ధి చేయాలన్నదే ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయించాను. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి ‘వనపర్తికి విద్యాపర్తిగా పేరుంది. జిల్లాకేంద్రంగా మారిన తర్వాత జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు ప్రభుత్వ వైద్య, నర్సింగ్, ఫిషరీస్ తదితర కళాశాలలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కూడా మంజూరు చేసింది.’ రూ.200 కోట్లతో భవన నిర్మాణం శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి -
ఆధార్ అప్డేట్ తప్పనిసరి
వనపర్తి: ఆధార్‌కార్డు అన్ని సేవలకు కీలకమని.. ప్రతి ఒక్కరూ వివరాలు, బయోమెట్రిక్‌ను అప్డేట్ చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు కోరారు. గురువారం సమీకృత కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో యూఐడీఏఐ అసిస్టెంట్ మేనేజర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. పుర కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు వెబెక్స్‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, పౌరసేవలు పొందాలంటే ఆధార్ అప్డేట్ తప్పనిసరి అన్నారు. ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివరాలు పునరుద్ధరించుకోవాలని పేర్కొన్కారు. పుట్టిన శిశువు మొదలు ఐదేళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆధార్ నమోదు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని సూచించారు. ఆధార్‌కార్డులో చిన్న మార్పులకు నివాస ధ్రువపత్రం సరిపోతుందని.. జన్మతేదీ సవరణకు జనన ధ్రువీకరణపత్రం అవసరమని స్పష్టం చేశారు. జనన ధ్రువీకరణపత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని పుర కమిషనర్లు, ఆర్డీఓను ఆదేశించారు. విద్యార్థులు అపార్ కార్డు నమోదుకు ముందు ఆధార్ వివరాలు సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. పాఠశాలల్లోనే బయోమెట్రిక్ అప్డేట్ చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఆధార్ నమోదు, అప్డేట్ కోసం క్యాంపులు నిర్వహించాలని సూచించారు. నవీకరణ ప్రక్రియకు సంబంధించి ఆధార్ సేవాకేంద్రాలకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ–డిస్ట్రిక్ మేనేజర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, యూఐడీఏఐ అసిస్టెంట్ మేనేజర్ సత్యకళ, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్, ఈడీఎం విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
వనపర్తి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 2న ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. శిలా ఫలకాలు, బహిరంగ సభ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా బాధ్యతలను పుర కమిషనర్‌కు అప్పగించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం, జిల్లాలో జరిగిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ప్రసంగించనున్న నేపథ్యంలో మహిళా సంఘాల సభ్యులను సభాస్థలికి తీసుకొచ్చి తిరిగి వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చే బాధ్యతలను అధికారులు, సిబ్బందికి అప్పగించారు. మండలాల వారీగా బస్సులు కేటాయించడం జరిగిందని, సభకు వచ్చే వారికి భోజనం, తాగునీరు, మజ్జిగ, కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 2న జిల్లాకు రానున్నారని.. నియోజకవర్గంలో రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తోందన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 11.8 కిలోమీటర్ల వరకు వెళ్లి వచ్చానని.. అక్కడ భయానక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అక్కడికి సీఎం రాలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతున్నారని.. కొండగట్టులో 70 మంది, శ్రీశైలం పవర్ హౌస్‌లో 8 మంది, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో కార్మికులు చనిపోతే నాటి సీఎం కేసీఆర్ ఎక్కడికై నా వెళ్లారా అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సహా 11 సంస్థలను రప్పించి సహాయ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సీఎం ఘటన స్థలికి రాకపోయినప్పటికీ రోజూ సమీక్షిస్తున్నారని చెప్పారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి మొదటిసారి వనపర్తికి రాబోతున్నారని.. తాను చదివిన పాఠశాలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి 14 నెలల్లో రూ. వందల కోట్ల అభివృద్ధి పనులను నియోజకవర్గానికి తీసుకొచ్చారని.. జాబ్‌మేళా, రుణమేళా, స్కిల్ డెవలప్మెంట్ తదితర కార్యక్రమాలతో సుమారు వెయ్యి మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించే పని చేస్తున్నారన్నారు. సీఎంకు వనపర్తితో అనుబంధం ఉంది.. సీఎం రేవంత్‌రెడ్డి వనపర్తిలో చదువుకున్నందున ఈ ప్రాంతంతో మంచి అనుబంధం ఉందని ఎంపీ మల్లు రవి తెలిపారు. ఆయనతో పాటు చదువుకున్న వారితో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.కోటి, రూ.257 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ఆయన చదివిన జెడ్పీ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో రూ.60 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారని తెలిపారు. రూ.22 కోట్లతో ఐటీ టవర్, రూ.81 కోట్లతో కోర్టు కాంప్లెక్స్, రూ.40 కోట్లతో రాజనగరం నుంచి పెద్దమందడి వరకు రహదారి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం హోదాలో జిల్లాకు తొలిసారిగా రేవంత్‌రెడ్డి రాక ఎస్ఎల్బీసీలో భయానక పరిస్థితులు రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
శిథిలాల తొలగింపు షురూ
లోకో ట్రైన్ మూడు కోచ్‌ల ద్వారా మట్టి వెలుపలికి.. ● 20 మంది చొప్పున మూడు షిఫ్ట్‌లో పనిచేస్తున్న రెస్క్యూ బృందాలు ● ఈ ప్రక్రియ పూర్తయితేనే కార్మికుల జాడ ● ఆరు రోజులైనా మరమ్మతుకు నోచుకోని కన్వేయర్ బెల్ట్ మరికొన్ని వివరాలు.. ● మధ్యాహ్నం 12.16 గంటలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎస్ఎల్బీసీ జేపీ కార్యాలయం వద్ద ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ● 12.30 గంటలకు కార్యాలయానికి వచ్చారు. అంతకు ముందే కార్యాలయం ముందున్న మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి గేటు బయటకు పోలీసులు పంపించారు. ● 2.16 గంటలకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్‌రావుతో పాటు పలువురు ఎస్ఎల్బీసీ సొరంగ ప్రాంతానికి వెళ్లారు. కొందరికే అనుమతి ఇవ్వడంతో రెండు కార్లలో ఉన్నవారు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. 5 నిమిషాల తర్వాత సొరంగానికి పంపించారు. అక్కడి నుంచి వచ్చి ప్రెస్మీట్లో మాట్లాడారు. అచ్చంపేట/ అచ్చంపేట రూరల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ఇంకా బయటికి రాలేదు. టన్నెల్ నుంచి వారిని క్షేమంగా బయటికి తెచ్చే ఆపరేషన్ గురువారం మొదలైంది. సహాయక చర్యల్లో అధికారులు వేగం పెంచారు. లోకో ట్రైన్ మూడు డబ్బాల ద్వారా మట్టి శిథిలాలను తీసుకొచ్చారు. టీబీఎం మిషన్ ఉన్న ప్రాంతానికి లోకో ట్రైన్ పూర్తిగా చేరుకోలేకపోతోంది. 13.95 కి.మీ. వద్ద టీబీఎం మిషన్ ఉండగా చివరి వరకు లోకో ట్రైన్ వెళ్లేందుకు పట్టాలు ఉన్నాయి. అయితే భారీగా పేరుకుపోయిన మట్టి, బురద, సెగ్మెంట్లు, టీబీఎం శిథిలాల వల్ల టన్నెల్ చివరి వరకు లోకో ట్రైన్ వెళ్లలేకపోతోంది. ఈ రెండింటి మధ్య 300 మీటర్ల దూరం ఉంది. దీంతో టీబీఎం వరకు చేరుకునేందుకు లోకో ట్రైన్ పట్టాలు, సొరంగంలోని మట్టి, రాళ్లు, బురద తొలగించేందుకు కార్యాచరణను రెస్క్యూ బృందాలు చేపట్టాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే లోకో ట్రైన్ టీబీఎం చివరి వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత టీబీఎం ఉన్న ప్రాంతంలోని శిథిలాలు తీసే పని మొదలవుతుంది. అప్పటివరకు టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల జాడ కనిపించే అవకాశం లేదు. ఈ ఆపరేషన్‌లో సింగరేణి బృందాలు కీలకంగా పని చేస్తున్నాయి. సొరంగం పైకప్పు కూలకుండా పటిష్టమైన పునః నిర్మాణం చేస్తున్నారు. సింగరేణితో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్ మైనర్స్ తదితర బృందాలు కలిపి 20 మంది చొప్పున మూడు షిఫ్ట్‌లుగా పనిచేస్తున్నారు. అయితే దెబ్బతిన్న కన్వేయర్ బెల్టు మరమ్మతు మాత్రం చేపట్టలేకపోతున్నారు. సొరంగం లోపలికి వెళ్లేందుకు లోకో ట్రైన్ ఒక్కటే ఉండటం వల్ల అందులోనే సిబ్బంది వెళ్తూ.. దానిలోనే మట్టి తీసుకురావడం వల్ల కొంత కష్టంగా మారింది. అయితే తెగిపోయిన కన్వేయర్ బెల్ట్, ఆక్సిజన్ పైపులు పునరుద్ధరిస్తే సహాయక చర్యలు మరింత వేగవంతం అవుతాయి. ముమ్మరంగా డీవాటరింగ్ టన్నెల్లో ప్రతి నిమిషానికి 5 వేల లీటర్ల నీళ్లు ఊరుతోంది. కూలిన రెండోరోజు నుంచే డీవాటరింగ్ చేస్తున్నా అదుపులోకి రాలేదు. రెండు రోజుల క్రితం నుంచి 100 హెచ్‌పీ మోటార్లతో ముమ్మరంగా డీవాటరింగ్ చేయడంతో పూడిక ఉన్న ప్రాంతం వరకు వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే సొరంగంలో చిక్కుకున్న వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రభుత్వం వారిని ఎలాగైనా రక్షించి బయటికి తేవాలనే కృతనిశ్చయంతో సహాయక చర్యలు చేపడుతోంది. ఎన్జీఆర్ఐ ప్రత్యేక బృందం.. సొరంగంలో శిథిలాల కింద చిక్కుకున్న మానవ శరీరాలు గుర్తించేందుకు ప్రత్యేకంగా ఎన్జీఆర్ఐ ప్రత్యేక బృందం గురువారం ఉదయం సహాయ చర్యలు చేపట్టింది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేకంగా గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్ ఆంటీనాను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా వారి ఆచూకీ లభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కఠిన ఆంక్షలు.. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాంతానికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. కనీసం మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. రాజకీయ నాయకుల సందర్శనను తిరస్కరిస్తున్నారు. కేవలం రెస్క్యూ ఆపరేషన్ బృందాలు, అధికారులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మరో 72 గంటల్లో సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తాం అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టన్నెల్ వద్ద సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. టన్నెల్ చుట్టూ ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఆంక్షలు విధించారు. -
దోచుకొని దాచుకోవడం బీఆర్ఎస్ నైజం : ఎమ్మెల్యే
మదనాపురం: గత ప్రభుత్వ హయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకొని దాచుకుందని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని గోవిందహళ్లిలో ఆయన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే దంతనూరు, తిర్మలాయపల్లి, మదనాపురం, నెల్విడి, కొన్నూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి దంతనూరులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తోందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని.. ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, చర్లపల్లి శేఖర్‌రెడ్డి, జగదీశ్, వడ్డె కృష్ణవర్ధన్‌రెడ్డి, నాగన్న యాదవ్, హనుమాన్‌రావు, వడ్డె రాములు, మహదేవన్‌గౌడ్, వెంకట్‌నారాయణ, శ్రావణ్‌కుమార్, సాయిబాబా, శ్రీధర్‌రెడ్డి, డైరెక్టర్ పావని, ఆవుల రాఘవేంద్ర, వడ్డె బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
టీబీఎం మిషన్ కటింగ్
టీబీఎం మిషన్‌ను కట్ చేసేందుకు జేపీ కంపెనీ సంస్థ యజమాని జయప్రకాష్ గౌర్ అనుమతి లభించింది. దీంతో గత అర్ధరాత్రి నుంచి గ్యాస్ కటింగ్ మిషన్‌తో టీబీఎంను కట్ చేసే పనులను వేగవంతం చేసినట్లు సమాచారం. ఇందులో 11 బృందాలతో పాటు ర్యాట్ హోల్ మైనర్స్ ప్రత్యేక నిపుణులు భాగస్వామ్యం అయ్యారు. ప్రమాద స్థలం సమీపానికి చేరుకొని పేరుకుపోయిన బురదను బయటికి పంపే చర్యలు చేపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి.. అనే విషయాలను అధికార యంత్రం బయటకుతెలువనివ్వడం లేదు. -
మల్లెల తీర్థం జలపాతమే కారణమా?
సొరంగం ఘటన జరిగిన ప్రదేశం మల్లెలతీర్థం జలపాతం లోయ ప్రాంతం అయి ఉండవచ్చని వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచితలబైలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ నుంచి 13.93 కి.మీ. వద్ద జరిగిన ప్రమాదాన్ని నేరుగా పరిశీలిస్తే.. ఆ ప్రాంత వరకు వెళ్తోంది. ఇక్కడ 500 అడుగుల ఎత్తు నుంచి నిరంతరం హోరెత్తుతూ దూకే జలధార మూడు సరస్సులను నింపుతూ.. నల్లమల అడవి గుండా కృష్ణానదిలో కలుస్తుంది. మల్లెల తీర్థంలో ఏడు గుండాలు ఉన్నాయి. ఈ గుండాల వద్దనే నీటి నిల్వ ఉంటుంది. ఇందులో ఏదో ఒకటి సొరంగం వద్ద లికేజీ అయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొరంగంలో కిలోమీటరు వరకు సీపేజీ ఉండే అవకాశం ఉందని.. ముందే తెలిసినా జేపీ కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదు రోజులైనా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన సహాయక చర్యలను వేగవంతం చేసి.. రెండు రోజుల్లో ఎనిమిది మంది కార్మికులను బయటికి తెస్తామని మంత్రులు ప్రకటించారు. -
అట్టహాసంగా బండలాగుడు పోటీలు
పాన్‌గల్: మహా శివరాత్రి సందర్భంగా బుధవారం మండలంలోని రేమద్దులలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. మొత్తం 8 జతల ఎద్దులు పాల్గొనగా ప్రథమ స్థానంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్‌పల్లికి చెందిన ఎం.నాగయ్య ఎద్దులు.. ద్వితీయ స్థానంలో కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వల్కూరు గ్రామానికి చెందిన దొడ్డికాటి తిరుమల్లేష్ ఎద్దులు.. తృతీయ స్థానంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ మండలం గుడికల్‌కు చెందిన దాసు ఎద్దులు.. నాలుగో స్థానంలో రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం గ్రామానికి చెందిన వెంకటేష్‌యాదవ్ ఎద్దులు.. ఐదో స్థానంలో చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన గోపాలకృష్ణ ఎద్దులు విజేతలుగా నిలిచాయి. ప్రథమ బహుమతి రూ.60 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు, తృతీయ బహుమతిగా రూ.40 వేలు, నాలుగో బహుమతిగా రూ.30 వేలు, ఐదో బహుమతిగా రూ.20 వేలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్‌రావు, మధుసూదన్‌రెడ్డి, ప్రసాద్‌రావు, దామోదర్‌రెడ్డి, కతాల్, తిరుపతయ్య, బక్కిరెడ్డి, హమాలీ సంఘం నాయకులు శాంతయ్య, రాములు వ్యాఖ్యాత శివశంకర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నిధుల గోల్మాల్..!
వనపర్తి: జిల్లాలోని బీసీ అభివృద్ధిశాఖ కార్యాలయంలో ఓ అధికారి అధికారిక బ్యాంకు ఖాతా నుంచి ఇష్టానుసారంగా నిధులు డ్రా చేసిన ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై పీడీఎస్‌యూ, బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆ శాఖ రాష్ట్రస్థాయి అధికారులకు వేర్వేరుగా ఫిర్యాదులు అందించడంతో పాటు మీడియాతో వెల్లడించారు. ఫిర్యాదుకు ఏకంగా కార్యాలయ సిబ్బంది పేర్లతో అధికారిక బ్యాంకు ఖాతా నుండి నగదు ఉపసంహరించిన జాబితాను జతపర్చారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో వైద్య కళాశాల ప్రారంభమైన సమయంలో విద్యార్థినుల వసతిగృహం కోసం అప్పటికే బీసీ సంక్షేమశాఖ నిర్మించిన ఓ భవనాన్ని నెలకు రూ.50,030 అద్దె చొప్పున అప్పటి కలెక్టర్ కేటాయించారు. నెలవారీ అద్దె ఆ శాఖ అధికారిక బ్యాంకు ఖాతాలో జమ అవుతూ వస్తోంది. నిబంధనల మేరకు అద్దెను బీసీ సంక్షేమశాఖ రాష్ట్రశాఖకు పంపించాల్సి ఉన్నా.. కార్యాలయంలో సౌకర్యాలు కల్పించుకోవాలనే సాకు చూపి విడతల వారీగా భారీ మొత్తంలో నగదు ఉపసంహరించినట్లు తెలుస్తోంది. డ్రా చేసిన సమయంలో చెక్కులపై కొన్నిచోట్ల సెల్ఫ్ అని, మరికొన్ని కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పేర్లతో డ్రా చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై గత కొన్నిరోజులుగా విచారణ కొనసాగుతోంది. ఉద్యోగ నియామకాల్లోనూ.. జిల్లాలోని బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఇటీవల చేసిన తాత్కాలిక సిబ్బంది నియామకాల్లోనూ ఆ అధికారి నిబంధనను గాలికొదిలి ఇష్టానుసారంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు ఆర్థిక, ఇతర ప్రయోజనాలు చేకూర్చిన వారిని ఎలాంటి నిబంధనలు పాటించకుండా నియమించినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలపై కూడా అదనపు కలెక్టర్, ఆర్డీఓ వేర్వేరుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. బీసీ అభివృద్ధిశాఖ కార్యాలయంలో ఓ అధికారి చేతివాటం? కిందిస్థాయి ఉద్యోగుల పేరిట నగదు ఉపసంహరణలు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. కొనసాగుతున్న విచారణ విచారణ కొనసాగుతోంది.. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించాం. 2023లో కార్యాలయ సిబ్బంది పేర్లతో బ్యాంకు నుంచి నగదు ఉపసంహరించినట్లు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం. బ్యాంకు నుంచి వివరాలు సేకరించి రెండేళ్ల లావాదేవీలను పరిశీలిస్తున్నాం. కార్యాలయ సిబ్బంది పేర్లతో డబ్బులు ఎందుకు డ్రా చేయాల్సి వచ్చిందనే అంశాన్ని తెలుసుకోవాల్సి ఉంది. విచారణ త్వరగా పూర్తిచేసి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తాం. – జి.వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వనపర్తి వడ్డీ డబ్బులేవి..? బీసీ అభివృద్ధి రాష్ట్రశాఖ నుంచి జిల్లాకు వివిధ పద్దుల కింద కేటాయించిన నిధులు నెలల పాటు ఖర్చు చేయకపోవడంతో బ్యాంకు ఇచ్చిన వడ్డీ రూ.లక్షల్లో జమ అయింది. వడ్డీ డబ్బులను ఎలాంటి అవసరాలకు వినియోగించరాదని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. వాటిని పక్కనబెట్టి కార్యాలయ అవసరాల పేరుతో విత్‌డ్రా చేసినట్లు ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా అంశాలపై కొన్నాళ్లుగా విచారణ కొనసాగుతుండగా.. తుదిదశకు చేరినట్లు తెలుస్తోంది. సిబ్బంది పేరున చెక్కులు రాసి డబ్బులు డ్రా చేయడంతో అందరూ చిక్కుల్లో పడ్డారు. విచారణలో తమకు సంబంధం లేదంటూ సిబ్బంది లబోదిబోమన్నట్లు ప్రచారం సాగుతోంది. -
ముగిసిన ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో రెండురోజుల పాటు జరిగిన ఎస్ఎఫ్ఐ మహాసభలు బుధవారం ముగిశాయి. మహాసభలో ఎనిమిది తీర్మానాలను ఆమోదించి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.మల్లేష్, ఉపాధ్యక్షుడిగా రాఘవ, కార్యదర్శిగా ఎం.ఆది, సహాయ కార్యదర్శిగా రామకృష్ణ, సభ్యులుగా రాజవర్ధన్, ఆంజనేయులు, వీరన్ననాయక్, మోహన్, మల్లీశ్వరి, రమేశ్, కార్తీక్‌గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామన్‌పాడులో 1,021 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో బుధవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాలువ నుంచి 550 క్యూసెక్కుల వరద వస్తుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదని చెప్పారు. ఎన్టీఆర్ కాల్వకు 24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 88 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నామని వివరించారు. -
హెలీప్యాడ్లు లేక..
సొరంగం ఘటన జరిగిన రోజు నుంచి రెండు, మూడు హెలిక్యాప్టర్లు వచ్చి పోతున్నాయి. జేపీ కంపెనీ కార్యాలయం వద్ద ఒకటి నిలిచేందుకు హెలీప్యాడ్ ఉంది. ఒకటి వస్తే మరొకటి గాలిలో చక్కర్లు కొడుతుంది. కొన్ని సందర్భాల్లో సున్నిపెంట, శ్రీశైలం వెళ్లి ల్యాండ్ అవుతున్నాయి. బుధవారం మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి హెలిక్యాప్టర్‌లో రాగా.. జేపీ కంపెనీ అధినేత జయప్రకాశ్గౌర్ మరో హెలిక్యాప్టర్‌లో వచ్చారు. ఒక హెలీప్యాడ్ మాత్రమే ఉండటంతో దిగడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మరొకటి గాలిలోకి ఎగరాల్సి వచ్చింది. దీంతో హుటాహుటిన మరో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. -
కనిపించని పురోగతి
ఐదు రోజులైనా దొరకని కార్మికుల జాడ ● ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కోసం భగీరథ యత్నం ● నీరు, బురద తొలగించడం పెద్ద సవాలే.. ● రెండ్రోజుల్లో తీసుకొస్తామన్న మంత్రులు అచ్చంపేట/అచ్చంపేట రూరల్/ ఉప్పునుంతల: దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రమాదం జరిగి ఐదు రోజులైనా ఇంత వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం న్యూఢిల్లీలోని బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్, టన్నెల్ వర్క్స్‌లో నిష్టాతులైన వారిని ప్రత్యేకంగా పిలిపించారు. సొరంగంలోకి వెళ్లి వచ్చిన రెస్క్యూ బృందాలు మాత్రం శిథిలాలను తొలగించడం.. అందులో చిక్కుకున్న కార్మికులను కాపాడటం కష్టంగా ఉందని చెబుతున్నారు. సొరంగంలో భారీగా మట్టి, రాళ్లు కూలి పడటంతో.. వాటిని కదిలిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శిథిలాలు, మట్టిని తొలగించేందుకు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. కాగా, ఉత్తరఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 41 మందిని రక్షించినప్పటికీ అక్కడికి ఇక్కడికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రయత్నాలు చేయడం కూడా కష్టంగా మారిందని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. దేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నెల్ ప్రమాదాల్లో ఇదే అత్యంత కఠినమైనదని చెబుతున్నారు. అయితే 12 కి.మీ. వద్ద మరో మార్గం ద్వారా లోపలికి వెళ్లాలని సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. సొరంగంపై నుంచి లేదా పక్క నుంచి రంధ్రం చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రయత్నాలు చేస్తున్నారు. అంతుచిక్కడం లేదు.. సొరంగంలో చేరిన నీటిని, బురదను తొలగించి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడటం పెద్ద సవాల్‌గా మారింది. ఈ ప్రమాదాన్ని అంచనా వేయడం నిపుణులు, ఇంజినీర్లు, రెస్క్యూ బృందాలను సైతం కలవరపెడుతోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన వారికి ఈ ప్రమాదం అంతుచిక్కుడం లేదు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలనే దానిపై ఇప్పటి వరకు ఓ నిర్ణయానికి రాలేదు. లోపల ఉన్న బురద, రాళ్లు, నీటిని బయటికి తీసుకురావడం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది. తెగిపోయిన కన్వేయర్ బెల్టును కూడా ఇప్పటి వరకు పునరుద్ధరించ లేదు. వాస్తవానికి టన్నెల్ బోరింగ్ మెషీన్ నడిస్తేనే ఈ బెల్టు పని చేస్తుంది. కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన.. సొరంగంలో చిక్కుకున్న వారు ఎక్కుడున్నారో.. ఎలా ఉన్నారో అనే ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. టన్నెల్ వద్దకు తమను పంపడం లేదని.. షెడ్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని వాపోతున్నారు. ఎలాంటి సమాచారం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని.. రోజుకు రెండు, మూడు హెలిక్యాప్టర్లు రావడం చూసి ఏమైందోనన్న ఆందోళన చెందుతున్నామని గోడు వెలిబుచ్చారు. మంత్రుల పర్యవేక్షణ.. దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద చేపట్టిన సహాయక చర్యలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌మార్‌రెడ్డి, రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఉన్నతాధికారులు, జేపీ కంపెనీ, వివిధ రెస్క్యూ బృందాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను రెస్క్యూ బృందాలు మంత్రుల దృష్టికి తీసుకువచ్చాయి. గాలి, వెలుతురు లేని సొరంగంలో ఆక్సిజన్ అందకపోవడంతో సహాయక బృందాలు ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాయని.. ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చితే లోపల ఎక్కువ సమయం ఉండేందుకు అవకాశం ఉంటుందని.. ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వ్యూహాలు రచించవచ్చని తెలిపారు. -
బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి
వనపర్తి: బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఏఎల్డీఎం) సాయి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు కోరారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆశా కార్యకర్తలకు ఆర్థిక అక్షరాస్యతపై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్యఅతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎల్డీఎం మాట్లాడుతూ.. ఆర్థిక అక్షరాస్యత పొదుపుతోనే సాధ్యమవుతుందని, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్షా బీమా యోజనను వినియోగించుకోవాలని సూచించారు. అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన గురించి వివరించారు. రూ.20తో బీమా చేయించుకుంటే ఆపద సమయాల్లో బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా సొమ్ము అందుతుందన్నారు. బీమా చేయించుకొని ధీమాగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రయోగాలతో మేధాశక్తి పెంపొందుతుంది
పాన్‌గల్: విద్యార్థులకు చార్ట్‌ల ద్వారా బోధన అందించడంతో మేధాశక్తి, ప్రతిభ పెంపొందుతుందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. మంగళవారం మండలంలోని తెల్లరాళ్లపల్లి లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్‌ను ఆయన ప్రారంభించి విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రయోగాల ద్వారా ఆలోచన విధానం పెరుగుతుందని.. ఇలాంటి ప్రదర్శనలతో తోటి విద్యార్థులకు ప్రేరణ కలుగుతుందన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, నిత్య జీవితంలో సైన్స్ ఉపయోగంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. చెరుకు రైతులకు బకాయిలు చెల్లించండి అమరచింత: చెరుకు రైతులకు వెంటనే బకాయి డబ్బులు చెల్లించాలని చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ గోపి కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ డీజీఎం మురళికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. 2010–11 సంవత్సరం నుంచి రైతులు చెరుగు సాగు చేయడం ప్రారంభించారని తెలిపారు. మొదట్లో డ్రిప్, విత్తనాలు రాయితీపై అందించడమేగాక పెట్టుబడి సాయం ఇచ్చారని.. ఇప్పుడు అన్నీ ఎత్తివేసి మద్దతు ధర కూడా ఇవ్వకుండానే పంట కోతలు చేపడుతున్నారని వివరించారు. పంట కోతలు జరిగి 40 రోజులవుతున్నా నేటికీ డబ్బులు చెల్లించడం లేదని వివరించారు. 15 రోజుల్లో డబ్బులు చెల్లించకుంటే 16 శాతం వడ్డీతో చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బార్, నాయకులు అరుణ్, వెంకట్రాములు, వెంకటేశ్వర్లు, శివలక్ష్మి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల జిల్లా కార్యవర్గం వనపర్తి రూరల్: మండలంలోని చిట్యాల రైతువేదికలో మంగళవారం వ్యవసాయ విస్తరణ అధికారుల జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నందకిషోర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా ఫెరోజ్, ఉపాధ్యక్షులుగా అనిత, శైలజ, ప్రధానకార్యదర్శిగా సంతోష్, కోశాధికారిగా ఎన్. మోహన్‌నాయక్, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యల సాధనే ధ్యేయంగా పోరాడుతామని తెలిపారు. ‘చిన్నారెడ్డిని విమర్శించడం తగదు’ వనపర్తిటౌన్: చిన్నారెడ్డిని విమర్శిస్తే పదవులు రావని.. ప్రజల మన్ననలు పొందితేనే పదవులు వస్తాయనే విషయాన్ని నాయకులు గుర్తించాలని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టకాలంలో చిన్నారెడ్డి జోడోయాత్ర, వరంగల్ డిక్లరేషన్, గ్రామ, మండల కమిటీలు వేస్తూ కాంగ్రెస్‌పార్టీ క్యాడర్ని నిలబెట్టి గెలుపు గ్రాఫ్‌ను పెంచారని.. ఆయన కృషి ఫలితమే ఎమ్మెల్యే మేఘారెడ్డి అని వివరించారు. గోపాలపేట మాజీ ఎంపీపీ ప్రభావతి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గోపాలపేట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజేశ్వర్‌రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి.కృష్ణ, సీనియర్ నాయకులు చీర్ల జనార్దన్, భాస్కర్‌రావు, శేఖర్, శాంతన్న, లీలావతి, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు కదిరే రాములు తదితరులు పాల్గొన్నారు. -
2న జిల్లాకు ముఖ్యమంత్రి రాక
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చిన 2న జిల్లాకు రానున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. మంగళవారం ఎంపీ మల్లు రవి, నేతలతో కలిసి హైదరాబాద్‌లో అభివృద్ధి పనుల నివేదికను సీఎంకు ఆయన అందజేశారు. సుమారు రూ.వెయ్యి కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంగళవారం కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం కలెక్టరేట్ సమీపంలోని హెలీప్యాడ్‌ను ఎస్పీ పరిశీలించి బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్ తదితర వాటిపై డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణకు సూచనలు చేశారు. అభివృద్ధి పనులు ఇలా.. జిల్లా జనరల్ ఆస్పత్రిని 500 పడకలకు పెంచడం, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల భవనం, ఇంటర్మీడియట్ కళాశాల, షాపింగ్ కాంప్లెక్స్, ఇందిరమ్మ ఇళ్ల పథకం, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం జిల్లాకు వచ్చే నాటికి పనుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లా పర్యటనలో తన చిన్ననాటి స్నేహితులతో కొంత సమయం గడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ భేటీ హెలీప్యాడ్ పరిశీలన -
సన్నగిల్లుతున్న ఆశలు
● నాలుగు రోజులైనా దొరకని ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ● ఘటనా స్థలానికి కొద్దిదూరంలోనే ఆగిపోతున్న రెస్క్యూ బృందాలు ● భారీగా వస్తున్న నీటి ఊటతో తీవ్ర ఆటంకం ● టన్నెల్ లోపలికి వెళ్లిన ర్యాట్ హోల్ మైనర్స్ ● దేవుడిపైనే భారమంటున్న కుటుంబ సభ్యులు అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ నెల 22న ఘటన జరగగా నేటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. దాదాపు 11 రెస్క్యూ బృందాలు నాలుగు రోజులుగా రేయింబవళ్లు శ్రమిస్తున్నా కనీసం ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నారు. మంగళవారం నాలుగో రోజు కూడా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో బాధిత కుటుంబాల్లో నిరాశ, నిస్పృహ అలుముకోగా.. ఆశలు సన్నగిల్లుతున్నాయి. సహాయక చర్యలకు ఆటంకం సొరంగంలో సెగ్మెంట్ బిగిస్తుండగా ఏర్పడిన రంధ్రంతో నీటి ప్రవాహం రోజురోజుకూ పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోయింది. బురద, నీటి ప్రవాహంతో సహాయక బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ తదితర 11 బృందాలకు చెందిన 750 మంది నిపుణులు కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తుండగా.. బుధవారం మరిన్ని బృందాలు రంగంలోకి దిగనున్నాయి. చెల్లాచెదురైన టీబీఎం వద్దకు చేరుకునేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు. నిమిషానికి 3,600 నుంచి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో రెండు 100 హెచ్‌పీ మోటార్లతో బయటికి తోడేస్తున్నా ఊట అదుపులోకి రావడం లేదు. రేపటి వరకు నీటి ప్రవాహం తగ్గుతుందనే ఆశాభావం మంత్రుల బృందం వ్యక్తం చేస్తోంది. సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ఎల్అండ్టీ సంస్థ రెండు క్రేన్లను కూడా తెప్పించింది. వాటిని లోపలికి తీసుకెళ్లి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచారు. మరోవైపు పైకప్పు కూలిన ఘటనతో కార్మికుల్లో నెలకొన్న భయం ఇంకా తొలగిపోలేదు. మంగళవారం పనులు చేయడానికి ముందుకు రాకపోవడంతో పలు దఫాలుగా వారితో చర్చలు జరిపి లోపలికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటల షిఫ్టులో వెళ్లాల్సిన బృందం మధ్యాహ్నం ఒంటిగంటకు లోపలికి వెళ్లింది. నీరు, మట్టిని తొలగిస్తేనే.. టన్నెల్లో కాంక్రీట్ సెగ్మెంట్లతో పాటు నిర్మాణ సామగ్రి, సెగ్మెంట్ మిషన్, ఇతర సామగ్రి, కన్వేయర్ బెల్ట్, లోకో ట్రైన్ ట్రాక్ వంటివి నీటిలో మునిగి మట్టిలో కూరుకుపోయాయి. ఈ క్రమంలోనే సెగ్మెంట్ల కిందగానీ, బురదలోగాని కార్మికులు చిక్కుకుని ఉంటారని, తొలగింపు ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. శిథిలాలను తొలగించేందుకు వచ్చిన బృందాలు తాళ్లు, పలుగు, పారలతో లోపలికి వెళ్లారు. నీరు, మట్టిని తొలగిస్తే తప్పా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. శిథిలాలు తొలగిస్తుంటే ఎక్కడి నుంచి ఏ సమస్య ఉత్పన్నమవుతోందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. నిత్యం సమీక్షలు.. సొరంగ ప్రమాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ నాలుగు రోజులుగా సమీక్షలు నిర్వహిస్తూ.. వివిధ దేశాలకు చెందిన నిపుణులను రప్పించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అ యితే ప్రజాప్రతినిధుల రాకతో వారి భద్రతా ఏర్పా ట్లు, అధికారుల హడావుడితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందన్న వాదన వినిపిస్తోంది. పొట్ట కూటి కోసం వచ్చి.. పొట్ట కూటి కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో చిక్కుకున్నారు. వారి ప్రాణాలు ఇప్పుడు దేవుడిపైనే భారంగా మారింది. జార్జండ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకాశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు జేపీ కంపెనీలో పనిచేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కూలీలు ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. తమకు సొంత ప్రాంతంలో పని లేకనే ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నామని, తమ వారి ప్రాణాలకు భద్రత లేదని వాపోతున్నారు. కూలీ డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, ఇక్కడ పనిచేస్తున్నారనే పేరు తప్పా తామే తిండికి డబ్బులు పంపిస్తున్నామని ఆరోపించారు. ఈ క్రమంలోనే మంగళవారం జార్జండ్ రాష్ట్రం గుమ్లా జిల్లాకు చెందిన నాలుగు కుటుంబాలు ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకున్నామయి. సహాయక చర్యలు ముమ్మరం చేసి తమ వారిని క్షేమంగా తీసుకువచ్చి అప్పగించాలని అధికారులను కోరుతున్నారు. -
పన్ను వసూళ్లలో వేగం పెంచాలి
వనపర్తి: జిల్లాలోని ఐదు పురపాలికల్లో ఆస్తి, కొళాయి పన్ను వసూళ్లను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని.. వేగంగా లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని జంగిడిపురం ప్రాంతంలో పర్యటించి పుర సిబ్బంది పన్ను వసూలు తీరును పరిశీలించారు. అనంతరం పుర కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చి పన్నులు వసూలు అయ్యేలా చూడాలని సూచించారు. బిల్ కలెక్టర్లు, సిబ్బంది ఉదయం 7 గంటలకు కార్యాలయంలో హాజరు వేసి క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లు ప్రారంభించాలన్నారు. సిబ్బంది వద్ద తప్పనిసరిగా అత్యధిక బకాయిలు ఉన్న వారి జాబితా ఉండాలని.. డబ్బులు ఎలా తీసుకోవాలనే విషయంపై వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. బకాయిదారులకు నోటీసులు పోస్ట్, ఇళ్లకు వెళ్లినప్పుడు అందజేయాలన్నారు. అలాగే స్మార్ట్‌ఫోన్ నుంచి సందేశాలు పంపించాలని సూచించారు. అన్ని బ్లాక్‌లలో పన్ను వసుళ్ల కోసం ప్రత్యేక శిభిరాలు కూడా ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. నల్లచెరువు సుందరీకరణ, అభివృద్ధి పనుల కోసం టెండర్లు పిలిచి గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర పుర సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
అపార్‌కు అడ్డంకులు
ఆధార్ కేంద్రాలకు పరుగులు.. చిన్నారులను పాఠశాలల్లో చేర్పించే సమయంలో విద్యార్థుల వివరాలు, ఆధార్ కార్డులోని వివరాలు ఒకేవిధంగా ఉంటేనే అపార్ నంబర్ వస్తుంది. లేనిపక్షంలో వెబ్సైట్లో వివరాలు నమోదు కావడం లేదు. ఆధార్‌లో వివరాలు తప్పుగా ఉన్న విద్యార్థులు వాటిని సరి చేసుకునేందుకు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ సరిచేయాలంటే సరైన ధ్రువపత్రాలు తీసుకురావాలని సూచిస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పేరు పూర్తిగా లేకపోవడం, పుట్టిన తేదీల్లో తేడాలతో అపార్ నమోదులో సమస్యలు ఎదురవుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థుల వివరాలు ఒక్కసారి అపార్‌లో నమోదైతే ఇక మార్పులు చేసుకోవడానికి ఎలాంటి వీలుండదు. ● ఆధార్ వివరాల ఆధారంగా నమోదు ● పాఠశాల, ఆధార్‌లో పేర్లు, పుట్టిన తేదీల్లో తేడాలుండటంతో ఇబ్బందులు ● మార్పుచేర్పులకు సమయం పడుతుండటంతో నమోదులో జాప్యం ● జిల్లాలో మొత్తం విద్యార్థులు 95,677 అమరచింత: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్ (ఆటోమెటిక్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నమోదు ప్రక్రియ జిల్లాలో నత్తనడకన కొనసాగుతోంది. విద్యార్థుల ఉన్నత చదువులకు 12 అంకెలతో కూడిన అపార్ గుర్తింపు కార్డు జారీ చేయాలని కేంద్రం రెండేళ్ల కిందటే నిర్ణయించి రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు వీటిని అందించనున్నారు. అపార్ కార్డు కోసం విద్యాసంస్థల నిర్వాహకులు ఆధార్‌కార్డు ప్రకారం విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఆధార్‌కార్డుల్లో నమోదైన తప్పులను సరి చేసుకునేందుకు విద్యార్థులు ఆధార్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. కాని అక్కడ జాప్యం అవుతుండటంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే యూడైస్‌లో ప్రభుత్వ, ప్రైవేట్, ఆదర్శ, గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో మొత్తం 95,677 మంది విద్యార్థులున్నారు. ఏడాది కాలంగా విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నా ఎంతకీ లక్ష్యం చేరడం లేదు. ఐడీలు కేటాయింపునకు ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. జిల్లాలో 678 పాఠశాలలు, 95,677 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 33.37 శాతమే పూర్తయింది. అత్యధికంగా ఏదుల మండలంలో 57.73 శాతం.. అత్యల్పంగా వనపర్తి మండలంలో 20.98 శాతం నమోదైంది. జిల్లాలో నేటికీ 33.37 శాతమే పూర్తి మండలాల వారీగా నమోదు ఇలా.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.. అపార్కార్డుకు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కార్డు వివరాలు కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖల వెబ్సైట్లో నమోదు చేస్తారు. అన్ని ధ్రువపత్రాలను డిజిటల్ లాకర్లో భద్రపర్చుకోవచ్చు. పాఠశాల మారినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వివిధ విద్యాసంస్థల్లో చేరికలు, మార్పులు, ఉద్యోగాల భర్తీ సమయం తదితర సమయాల్లో అపార్ కార్డు ఆధారంగా సమాచారం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితో వివరాలు నమోదు చేస్తున్నారు. -
మహిళలంటే చిన్నచూపు వద్దు
వనపర్తి: మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని.. తల్లిదండ్రులు ఆడపిల్ల అనే చిన్నచూపు చూడకుండా మగ పిల్లలతో సమానంగా స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు చదివించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం బేటీ బచావో–బేటీ పడావో వారోత్సవాల్లో భాగంగా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళలు, మహిళా పోలీసు సిబ్బందితో జిల్లాకేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ర్యాలీ జిల్లా పోలీసు కార్యాలయం మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిరాదరణకు గురైన బాధిత మహిళలు, బాలికలు మౌనం వీడి నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలన్నారు. మహిళ చదువుకుంటే తన పిల్లలకు సమాజంపై అవగాహనే కల్పించే అవకాశం ఉంటుందని.. సమాజంలో జరుగుతున్న మంచి, చెడుపై ఎప్పటికప్పుడు తమ పిల్లలకు అవగాహన కల్పిస్తూ ఉండాలని కోరారు. ఆపద వస్తే ఎలా ఎదుర్కోవాలి.. ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశాలపై మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలని సూచించారు. బాలికలు, మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా, బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసినా టోల్‌ఫ్రీ నంబర్ 1098, డయల్ 100కు, సమీపంలోని పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని.. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణా, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, రూరల్ ఎస్ఐ జలంధర్‌రెడ్డి, మహిళ, శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి సుధారాణి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాంబాబు, రూరల్ డెవప్మెంట్ సొసైటీ చైర్మన్ చిన్నమ్మ థామస్, సూపరింటెండెంట్ అరుంధతి, సీనియర్ అసిస్టెంట్ అప్సర్, డిస్ట్రిక్ట్ మిషన్ కో–ఆర్డినేటర్ భాస్కర్, జండర్ స్పెషలిస్ట్ శ్రీవాణి, పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అడ్డంకులు, కష్టాలు, అసమానతలను అధిగమిస్తూ ముందుకుసాగాలి ఎస్పీ రావుల గిరిధర్ -
పోలీసు సేవల్ని వినియోగించుకోవాలి
వనపర్తి: పోలీసు ప్రజావాణికి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఐదుగురి నుంచి అర్జీలను స్వీకరించి సంబంధిత స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య తీవ్రత, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేలా ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ పని చేస్తుందని వివరించారు. ఎలాంటి శబ్ధ కాలుష్యం లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్ర నిర్వహించినందుకు సోమవారం హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు అరుణ్, పట్టణ అధ్యక్షుడు నందు, యువకులను ఎస్పీ రావుల గిరిధర్ అభినందించారు. ఇక ముందు వినాయక నిమజ్జనాల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, చెక్కభజన, కోలాటం వంటి వాటిని ప్రోత్సహించాలని సూచించారు. సమావేశం అనంతరం ఎస్పీని యువకులు అరుణ్, నందు, మల్లికార్జున్, అఖిల్, దివాకర్ శాలువాతో సన్మానించారు. ఐక్యతతో వేడుకలు జరుపుకోవాలి.. పాన్‌గల్: గ్రామాల్లో వేడుకలను ఐకమత్యంతో కలిసిమెలసి జరుపుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. సోమవారం మండలంలోని దావాజిపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో గ్రామానికి చెందిన నాగేశ్వరరావు ఏర్పాటు చేయించిన శివపార్వతుల విగ్రహాలను ఆయన ఆవిష్కరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సెంట్రల్ లాక్‌లను పరిశీలించి వాటిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు తోడ్పాటునందించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు, గ్రామస్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వంద మీటర్ల దూరంలోనే..
లోకో ట్రైన్ ద్వారా 13.3 కి.మీ. వరకు చేరుకున్న బృందాలు బురదలోకి దిగే ప్రయత్నాలు చేస్తున్నా.. వంద మీటర్ల దూరంలో అంత చీకటిగా ఉండటంతో ఏమీ చేయలేక వెనుదిరిగి వస్తున్నారు. ఆదివారం వెళ్లిన బృందాలకు కన్వేయర్ బెల్టు కిందనే నీటి ఊట ఉండటంతో దానిపై నడుచుకుంటూ వెళ్లగా.. సోమవారం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా కన్వెయర్ బెల్టు సైతం మునిగిపోయినట్లు సమాచారం. తెగిన కన్వేయర్ బెల్టును సరిచేసి ఇప్పుడు దాని ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. అలాగే సోమవారం నుంచి నీటిని తోడేందుకు 100 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్లు ఏర్పాటు చేసినా నీటి ప్రవాహం ఏమాత్రం తగ్గడం లేదని, ఒకవేళ బురద, రాళ్లను తొలగిస్తూ.. ముందుకెళ్తే మరింత ముందుకు వచ్చే అవకాశం ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ● ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఆర్మీ చీఫ్‌తో మాట్లాడి స్పెషల్ ఎక్విప్మెంట్ తెప్పించే ప్రయత్నాలు చేస్తోంది. మూడు రోజులుగా విడతల వారీగా వెళ్తున్న బృందాలు నీళ్లు, బురద ఉండటంతో లోపలికి వెళ్లలేకపోతున్నామనే విషయం తప్పా చిక్కుకుపోయిన వారు కనిపించారనే సమాచారం చెప్పడం లేదు. దీంతో వారు ఇంకా బతికే ఉన్నారా అన్న చర్చ మొదలైంది. మరోవైపు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారుల హడావుడి తప్పా.. లోపల చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే ప్రయత్నాలు ఒక్కటీ కొలిక్కి రావడం లేదు. దీంతో సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే.. మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
పక్కాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
ఆత్మకూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పక్కా ప్రణాళికతో చేపట్టనున్నామని జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పర్వతాలు తెలిపారు. సోమవారం మండలంలోని దేవరపల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై గ్రామస్తులకు ముగ్గుపోసి అవగాహన కల్పించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి నాలుగు దశల్లో బిల్లు చెల్లిస్తారని.. మార్కింగ్, బేస్మెంట్, రూఫ్ లేవల్, నిర్మాణం పూర్తయిన అనంతరం పూర్తిస్థాయిలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమవుతాయన్నారు. లబ్ధిదారులకు ఏవైనా అనుమానాలు ఉంటే ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
భీమా.. రైతులకేదీ ధీమా!
పిచ్చి మొక్కలు, పూడికతో నిండిన కాల్వలు ●చుక్క నీరు రావడం లేదు.. భీమా కాల్వ గ్రామం మీదుగా వెళ్తున్నా చుక్క సాగునీరు అందడం లేదు. కాల్వ కింద పది ఎకరాల పొలం ఉన్నా పంటలు సాగుచేసే అవకాశం లేదు. తప్పని పరిస్థితుల్లో వర్షాధార పంటలు సాగు చేస్తున్నా. భీమా అధికారుల పర్యవేక్షణ లేకనే కాల్వ పూడుకుపోతోంది. – దేవర్ల జమ్ములు, ధర్మాపురం (అమరచింత) ముళ్లపొదలు పెరగడంతో.. కాల్వ గ్రామం మీదుగా వెళ్తుండటంతో సాగునీరు అందుతుందని సంబరపడ్డాం. కాల్వ మాత్రం తవ్వించారే తప్పా సాగునీరు అందడం లేదు. ఎప్పుడో తవ్విన కాల్వలు పూడుకుపోతున్నాయి. ముళ్లపొదలు ఏపుగా పెరుగుతుండటంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. – దేవర్ల మాసన్న, ధర్మాపురం (అమరచింత) పూడికతీతకు ప్రతిపాదనలు.. భీమా, సంగంబండ కాల్వల్లో పూడికతీత కూలీలతో సాధ్యం కావడం లేదు. పాంరెడ్డిపల్లి, నాగల్‌కడ్మూర్ ప్రాంతాల్లో కాల్వ లోతుగా ఉన్న ప్రదేశాల్లో పూడికతీతకు సుమారు రూ.20 లక్షలు అవసరమని ఉన్నతాధికారులకు గతేడాది ప్రతిపాదనలు పంపించాం. కొన్నిచోట్ల ఎంపీడీఓల సహకారంతో ఉపాధి కూలీలతో పూడిక తొలగింపు పనులు చేపడుతన్నాం. – సతీశ్, డీఈఈ, భీమా ప్రాజెక్టు అమరచింత: మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత, ఆత్మకూర్, నర్వ, మక్తల్, మాగనూర్ మండలాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఎనిమిదేళ్ల కిందట భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ప్రత్యేకంగా సుమారు 32.50 కిలోమీటర్ల మేర భీమా కాల్వ నిర్మించారు. ఈ కాల్వ నీటితో ఆయా మండలాల్లోని చెరువులు నీటితో నింపడం, పిల్ల కాల్వల ద్వారా పంటలకు సాగునీరు సరఫరా చేసేవారు. ప్రస్తుతం కాల్వల్లో పిచ్చి మొక్కలు, పూడిక నిండి నీరు ముందుకు పారని పరిస్థితి నెలకొంది. రైతులు తమకుతాముగా వీటిని తొలగించాలని ప్రయత్నాలు చేసినా భారీ వృక్షాలు, ముళ్లపొదలు ఉండటంతో సాధ్యం కావడం లేదు. తమ బాధలను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 24 వేల ఎకరాల ఆయకట్టు.. భీమా కాల్వ నీటితో నియోజకవర్గంలోని సుమారు 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రణాళిక సిద్ధం చేసి అందుకు అనుగుణంగానే కాల్వలు నిర్మించారు. కాల్వ నిర్మాణంతో పాటు వెనువెంటనే లైనింగ్ పనులు సైతం పూర్తి చేయడంతో మొదట్లో సాగునీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారింది. అనంతరం నిర్వహణ కొరవడటంతో మూడేళ్ల కాలంలోనే కాల్వల్లో జమ్ము గడ్డి, ముళ్లపొదలు, పూడిక పేరుకుపోయింది. దీంతో ప్రస్తుతం 10 వేల ఎకరాలకు సైతం నీరందని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో 32.50 కిలోమీటర్ల కాల్వ.. 24 చెరువులు, 25 వేల ఎకరాల ఆయకట్టు ముందుకు పారని సాగునీరు ఆందోళనలో అన్నదాతలు -
మూడో రోజూ నిరాశే..
వాతావరణం ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. మధ్యాహ్నం వేళ ఉక్కపోత తప్పదు. ఆకాశం నిర్మానుష్యంగా ఉంటుంది. అచ్చంపేట: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ సోమవారం మూడోరోజూ చిక్కలేదు. సహాయక బృందాలు షిఫ్ట్‌ల వారీగా టీబీఎం మిషన్ సమీపానికి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. నీటి ఉధృతికి కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయి అందులో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. సోమవారం నాటికి రాష్ట్ర విపత్తుతోపాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, జేపీ, నవయుగ కంపెనీలకు చెందిన బృందాలు ఇప్పటి వరకు ఏడు సార్లు టన్నెల్లోకి వెళ్లి గాలింపు చేపట్టాయి. ఇందులో దాదాపు 584 మంది నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తులో ఈ బృందాలతో పాటు 14 మంది ర్యాట్ (ర్యాట్ హోల్ టీం) మైనర్స్, స్నిపర్ డాగ్స్ సైతం చేరుకున్నాయి. పెద్దఎత్తున బురద నీరు ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయాయి. టన్నెల్ లోపలికి పైనుంచి రంధ్రం చేసి వెళ్లాలన్న (వర్టికల్ డ్రిల్లింగ్) ప్రతిపాదనలు తోసిపుచ్చారు. ఐదు గ్యాస్ కట్టింగ్ మిషన్లతో పనిచేస్తున్నారు. పై సెగ్మెంట్ బిగిస్తుండగా.. టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) మీటరు దూరం సొరంగం తొలచిన తర్వాత మరో మిషన్‌తో కాంక్రీట్ సెగ్మెంట్ బిగిస్తారు. 9 మీటర్ల వ్యాసంతో ఉండే ఈ సొరంగంలో మొత్తం 7 సెగ్మెంట్లు బోల్టుల ద్వారా బిగిస్తారు. చుట్టూ అటు ఇటు మూడు చొప్పున ఆరు సెగ్మెంట్లు బిగించి పై సెగ్మెంట్ బోల్టును బిగిస్తుండగా ఒక్కసారి వచ్చిన నీటి ఊటకు సెగ్మెంట్లు ఊడిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ శిథిలాల కింద కార్మికులు చిక్కుకొని ఉంటారని తోటి కార్మికులు భావిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో నీటి ఊట, రాళ్లు, బురద కూరుకుపోవడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి తలెత్తినట్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పేర్కొంటున్నాయి. సిగ్నల్స్ ఏర్పాటు ద్వారా.. సొరంగంలో విద్యుత్, సమాచార వ్యవస్థ వైర్లు, పరికరాలు దెబ్బతినడంతో సిగ్నల్స్ రావడం లేదు. దట్టమైన అడవితో పాటు సొరంగం ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ అందుబాటులో లేవు. ఈ దశలో ప్రభుత్వం సోమవారం హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రమాదం జరిగిన చోటకు పంపించారు. దీని ద్వారా అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్లో లభించని ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు ఎస్ఎల్బీసీకి చేరుకున్నస్నిపర్ డాగ్స్, ర్యాట్ మైనర్స్ బృందాలు వంద మీటర్ల దూరంలోనే ఆగిపోతున్న వైనం పైనుంచి రంధ్రం చేసి వెళ్లాలన్న ప్రతిపాదన విరమణ మంత్రులు, అధికారుల పర్యవేక్షణ సొరంగం పనుల్లో సంఘటన జరిగిన నాటి నుంచి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండురోజుల పాటు ఇక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. సోమవారం రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, బాలూనాయక్ ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నారు. అలాగే ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, హైడ్రా చీఫ్ సెక్రటరీ అర్వింద్, హైడ్రా కమిషనర్ రంగరాథ్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణ, భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. -
బాల్య వివాహాల నియంత్రణకు చర్యలు
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి.. ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి 66 వినతులు వచ్చాయని.. పరిశీలించి సంబంధిత శాఖల జిల్లాస్థాయి అధికారులకు పంపినట్లు వివరించారు. పెండింగ్, సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వనపర్తి: జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత, బాలికల సంరక్షణపై జనవరి 22 నుంచి మార్చి 8 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1098కి సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులతో పాటు పెళ్లికి సహకరించిన వారు, పెళ్లి చేసే అర్చకుడు, ఖాజీ, పాస్టర్‌పై కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు కేవలం 888 మంది మహిళలు మాత్రమే ఉన్నారని.. ఈ అంతరాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయాలని లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. అమ్మాయిల్లో రక్తహీనతను పారద్రోలేందుకు వైద్యశాఖ, సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సరైన ఎదుగుదల లేని పిల్లలను ఎన్ఆర్సీ కేంద్రాలకు పంపించాలని ఆదేశించారు. సుకన్య సమృద్ధి యోజన.. అమ్మాయిల చదువులు, పెళ్లిళ్ల కోసం కేంద్రం సుకన్య సమృద్ధి యోజనను తీసుకొచ్చిందన్నారు. తల్లిదండ్రులు ఈ పథకంలో చేరి ప్రతి నెల కొంత మొత్తం జమ చేస్తే బాలికకు యుక్త వయస్సు వచ్చే నాటికి ఏటా 8.6 శాతం వడ్డీ కలిపి చెల్లిస్తారని వివరించారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు నాంది పలకాలని కోరారు. అనంతరం బేటీ బచావో బేటీ పడావో ప్రచార గోడపత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీసీపీఓ రాంబాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు
● ఆలయ ఈఓకు అందజేసిన పద్మశాలి కులస్థులు అమరచింత: మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో పట్టణ పద్మశాలీలు భక్తిశ్రద్ధలతో తయారు చేసిన పట్టువస్త్రాలను సోమవారం మహంకాళి శ్రీనివాసులు, సవితారాణి దంపతులు ఆలయ ఈఓకు అందజేశారు. పద్మశాలి భవన్లో పట్టువస్త్రాలకు పూజలు నిర్వహించిన అనంతరం తలపై పెట్టుకొని మేళతాళాలతో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ పూజలు చేసి ఆలయ ఈఓకు సమర్పించారు. వీటిని శివరాత్రి రోజున స్వామి, అమ్మవారికి అలంకరిస్తారు. కార్యక్రమంలో పద్మశాలి సత్రం కమిటీ సభ్యుడు కర్నాటి శ్రీధర్, మహంకాళి సత్యనారాయణ, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ‘త్రివేణి సంగమ జలాలు పవిత్రం’ వనపర్తిటౌన్: త్రివేణి సంగమంలోని జలాలు పరమ పవిత్రమని ప్రముఖ గురువు ఆదిత్యా పరాశ్రీ స్వామిజీ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పెంటగాన్ సమీపంలో కుంభమేళా నుంచి తీసుకొచ్చిన జలాల సంప్రోక్షణ కార్యక్రమం పోచ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కుంభమేళాకు వెళ్లలేని వారికి ఈ పవిత్ర జలాలు అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపపట్టినట్లు వివరించారు. సజ్జన సాంగత్యంతోనే ధర్మమార్గానికి బాటలు పడతాయని.. సజ్జనులు కుంభమేళా జలాలు ప్రతి ఒక్కరికి చేరేందుకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో జీజే శ్రీనివాసులు, వామన్‌గౌడ్, కేవీ రమణ, సదానందగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ దీక్ష.. భగ్నం చేసిన పోలీసులు కొత్తకోట: పట్టణంలోని సమస్యల సాధనకై బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన దీక్షను మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురపాలికలో గతేడాది టెండర్లు పిలిచిన అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించాలని కోరారు. నిధులు మంజూరైనా పుర అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షకు మాజీ కౌన్సిలర్ కొమ్ము భరత్‌భూషణ్ పూనుకోగా చీర్ల తిరుపతయ్య సాగర్, రాజమౌళి, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు. పబ్బ నరేందర్‌గౌడ్, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, వనపర్తి శ్రీనివాస్‌రెడ్డి, కొమ్ము సురేశ్, మొగిలన్న, సతీష్ వారికి సంఘీభావం తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎలాంటి అనుమతి లేకుండా దీక్ష చేపట్టారంటూ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష
వనపర్తి: గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మొత్తం 5,047 విద్యార్థులు పరీక్ష రాసేందుకు 9 కేంద్రాలు ఏర్పాటు చేశారని.. 4,904 మంది హాజరుకాగా, 143 మంది గైర్హాజరయ్యారని వివరించారు. 97.17 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. మర్రికుంటలోని గిరిజన గురుకుల పాఠశాల, నాగవరం తండా వద్దనున్న అనూస్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేసి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. -
‘కాంగ్రెస్‌కు పనిచేయలేదనే ఆధారాలు చూపిస్తావా?’
వనపర్తిటౌన్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ గెలుపునకు పనిచేయలేదని ఎమ్మెల్యే మేఘారెడ్డి పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆధారాలుంటే బయట పెట్టాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం రాత్రి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన్నె జీవన్‌రెడ్డితో రూ.90 కోట్లు ఖర్చు చేయించి ఆ డబ్బుతో వనపర్తి పుర పీఠం దక్కించుకొని గొప్పపని చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అసంపూర్తి పనుల విషయమై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో మాట్లాడానని.. నియోజకవర్గ అభివృద్ధికి ఎవరి కాళ్లు మొక్కేందుకై నా తాను వెనుకాడనని స్పష్టం చేశారు. అభివృద్ధి ముసుగులో అవినీతి జరగొద్దని.. ఓ వ్యక్తి కోసం మండల కేంద్రం కాకుండా వేరే ప్రాంతంలో శంకుస్థాపన చేస్తున్నందుకే అడ్డుకున్నట్లు చెప్పారు. 46 ఏళ్ల రాజకీయ జీవితంలో కన్నతల్లిలాంటి పార్టీకి ఏనాడు తప్పు, చెడు చేయలేదని.. మేఘారెడ్డి నాలుగేళ్లయితే మరో పార్టీలోకి వెళ్లరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించారు. దేశస్థాయిలో తనకు నిజాయితీపరుడనే పేరుందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనను తెలంగాణ ఏకే అంటోనీగా పిలుస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల అధికారిక వాహనంలో రాకుండా సాధారణ కారులో ఎమ్మెల్యే ఎందుకు తీసుకొచ్చారో, మంత్రి ఎలా వచ్చారో అర్థం కాలేదన్నారు. విద్యార్థి దశ నుంచి ఏఐసీసీ స్థాయికి వరకు ఎదిగిన మేం టిష్యూ పేపర్లా కనబడుతున్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత, కొత్త 80, 20 శాతంలో ఉంటేనే పార్టీ బలపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులకు విఘాతం వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికుల హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు కోడ్లుగా విభజించి ఏప్రిల్ ఒకటి నుంచి అమలుకు పూనుకుందని.. పారిశ్రామికవేత్తలకు కార్మికుల శ్రమను దోచి పెట్టేందుకే కోడ్లను తీసుకొచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం కార్మికులు రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తున్నారని.. 12 గంటలు పని చేయాల్సి వస్తుందన్నారు. కోడ్లను అమలు చేస్తే కార్మికులు సమ్మె చేసే హక్కు కోల్పోతారని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న సంఘాల్లో అధికసంఖ్యలో కార్మికులను చేర్చి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు మోషా, శ్రీహరి, శ్రీరామ్, గోపాలకృష్ణ, శ్యాంసుందర్, లక్ష్మమ్మ, భరత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు వనపర్తి టౌన్: మహా శివరాత్రిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాల నుంచి శ్రీశైలానికి వెళ్లే భక్తులు, ప్రజల సౌకర్యార్థం సోమవారం వనపర్తి నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. నేడు మార్కెట్లో లావాదేవీలు దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం యథావిధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయి. శని, ఆదివారాలు సెలవుల కారణంగా రెండు రోజులపాటు మార్కెట్లో ఎలాంటి లావాదేవీలు జరగలేదు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ టెండర్ల ద్వారా రైతులు తెచ్చిన ధాన్యానికి ధరలు నిర్ణయిస్తారు. -
కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు
వనపర్తి: వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మరోమారు భగ్గుమంది. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు శనివారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలోనే ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి విభేదించుకోవడంతో మరోమారు ఆధిపత్య పోరు బహిర్గతమైంది. జిల్లాలో మంత్రుల పర్యటన షెడ్యూల్ ఖరారుగాకముందే ఇద్దరు నేతల చర్చించుకొని సమష్టిగా ముందుకు సాగాల్సింది పోయి.. ఓ వైపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ మరోవైపు విమర్శలు గుప్పించుకోవడం శోచనీయం. ఎమ్మెల్యే తన అనుచరుడి కోసం అభివృద్ధి పనులు చేపడుతున్నారంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేయడం.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలతో చిన్నారెడ్డి సఖ్యత పెంచుకున్నారని, తరుచూ ఫోన్లలో మాట్లాడుతూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ఎమ్మెల్యే బహిరంగంగా విమర్శలు గుప్పించడం కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.అధిష్టానం జోక్యం చేసుకోకుంటే కష్టమే..కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోకుంటే సమీప భవిష్యత్‌లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ కోణంలో ఆ ఇద్దరు నేతలు ఆలోచించడం లేదనే వాదన పార్టీ క్యాడర్లో వినిపిస్తోంది. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో తనకున్న సంబంధాల విషయాన్ని ఎమ్మెల్యే తరచూ చేస్తుండటంతో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఖండించారు. శనివారం నాటి ఘటనతో వనపర్తి కాంగ్రెస్ లో రెండు వర్గాలు ఉన్నాయనేది స్పష్టమైంది.ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం ఫోన్?శనివారం నాటి మంత్రుల పర్యటనలో చోటు చేసుకున్న ఘటనపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యే మేఘారెడ్డిని హైదరాబాద్‌కు పిలిపించి ఆరా తీసినట్లు సమాచారం. అదేరోజు రాత్రి ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన వెళ్లి ఇక్కడ చోటు చేసుకున్న ఘటనల వివరాలను నివేదించినట్లు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నారు.విమర్శలకు ఆస్కారం..అధికారపార్టీలోని వర్గ విభేదాలు ప్రతిపక్షాలకు విమర్శించే అస్త్రాలను చేతికందించినట్లయింది. శనివారం నాటి ఘటనపై బీఆర్ఎస్ నేతలు సామాజిక మాధ్యమాలే వేదికగా అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిని అసరాగా చేసుకొని ప్రతిపక్ష నాయకులు అధికారపార్టీ నేతల మధ్య విభేదాలు పెంచేలా పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఈ విషయాన్ని ప్రధాన నేతలు గుర్తించడం లేదన్న భావన కాంగ్రెస్ క్యాడర్లో వ్యక్తమవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో కాంగ్రెస్‌లోనే స్వపక్ష, విపక్షాల ధోరణి కనిపించనుంది. -
రెండు రోజులుగా టన్నెల్‌లోనే ఎనిమిది మంది కార్మికులు
క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 13 కిలోమీటర్ల తర్వాత సొరంగంలో బురద మట్టి, నీటితో పేరుకుపోవడంతో ముందుకు వెళ్లేందుకు సాధ్యపడటంలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణిలోని నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. సహాయక చర్యలు రాత్రంతా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు మూడు విడతలుగా సహాయక బృందాలు టన్నెల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నాలుగో బృందం లోపలికి వెళ్లగా.. అర్ధరాత్రి తర్వాత ఐదో బృందం టన్నెల్ లోపలికి వెళ్లింది. టన్నెల్లో ప్రమాద స్థలానికి చేరుకుని రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, వారితో పాటు లోపలికి వెళ్లి మట్టి, శిథిలాలను తొలగించేందుకు కార్మికులు జంకుతున్నారు. కళ్ల ముందే ప్రమాదం చోటుచేసుకోవడంతో వారు భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ క్రమంలో లోపల శిథిలాల తొలగింపు, మట్టి తొలగింపునకు కార్మికులు వెనకాడుతుండటంతో సహాయక చర్యల్లో మందగమనం నెలకొంది. దీంతో లోపలికి వెళ్లి విధులు నిర్వర్తించే కార్మికులకు దినసరి వేతనం రూ.2 వేల చొప్పున ఇవ్వాలని ఓ ఉన్నతాధికారి సంబంధిత కంపెనీ ప్రతినిధికి సూచించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) ఇన్లెట్ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల రెస్క్యూ ఆపరేషన్‌పై రెండు రోజులుగా ఉత్కంఠ నెలకొంది. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను చేరుకోలేకపోవడంతో ఇంకా ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. వారిని సమీపించేందుకే సహాయక బృందాలకు సాధ్యపడటంలేదు. 9.8 మీటర్ల వ్యాసార్థం ఉన్న సొరంగం నిండా మట్టి, బురద నిండిపోవడంతో కార్మికుల వద్దకు చేరడం కష్టంగా మారింది. టన్నుల కొద్దీ పేరుకున్న మట్టిని తొలగించడం సైతం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో కార్మికుల జాడ గుర్తింపుపై సందిగ్ధం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకాలే.. సొరంగంలో కార్మికులను కాపాడేందుకు రంగంలోకి ఆర్మీ (24), ఎఫ్‌డీఆర్‌ఎఫ్(120), ఎస్డీఆర్ఎఫ్(24), సింగరేణి(24), హైడ్రా(24) రెస్క్యూ సిబ్బందితో కూడిన బృందాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఆయా శాఖల సమన్వయంతో విడతల వారీగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సుమారు 6–8 గంటలకు ఒక బృందం చొప్పున షిఫ్ట్‌ల వారీగా సహాయక చర్యలను నిరంతరం కొనసాగిస్తున్నాయి. ప్రమాదం జరిగిన 13వ కి.మీ. వద్దకు లోకో ట్రైన్ వెళ్లడానికి గంట, రావడానికి గంట సమయం పడుతోంది. అక్కడ పెద్ద ఎత్తున మట్టి, రాళ్లతో కూడిన శిథిలాలు పేరుకుని ఉండటంతో రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే వారిని రక్షించడం కష్టంగా మారుతోంది. సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కడు వంశీకృష్ణ, కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ పర్యవేక్షిస్తున్నారు. పంథా మార్చితేనే సాధ్యం.. కార్మికులను కాపాడేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలు ఫలించలేదు. కొత్త పంథా(టెక్నిక్)లో వెళ్లితే తప్ప వారిని బయటికి తీసుకురావడం సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు. సొరంగంలో ఒకే మార్గం గుండా రాకపోకలు చేయాల్సి రావడం, ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెళ్లు లేకపోవడంతో రెస్క్యూ వీలు కావడం లేదు. రాకపోకలకు, మట్టిని తరలించేందుకు ఒకే ఒక కన్వేయర్ బెల్టు ఉండగా, ఆ మట్టి తరలించేందుకు దాదాపు మూడు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. సొరంగంలో నుంచి మట్టిని, రాళ్లను తొలగించడం అంతా సాధ్యమైన పని కాదని అంటున్నారు. దీంతో కొత్త పంథాలో సహాయక చర్యలు చేపడితేనే ప్రయోజనం ఉండనుంది. ఉత్తరాఖండ్ తరహాలో రెస్క్యూకు సన్నద్ధం.. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించిన తరహాలోనే ఇక్కడ కూడా ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా పై నుంచి రంధ్రం చేసి కార్మికులను బయటకు తీసు కొచ్చేలా ప్రయత్నించే అవకాశం ఉంది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలను సైతం పరిశీలించనున్నారు. సోమవారం ఉదయానికి ఈ తరహా రెస్క్యూ బృందాలు ప్రమాదస్థలికి చేరుకునే అవకాశం ఉంది. – సాక్షి, నాగర్‌కర్నూల్ /అచ్చంపేట భద్రతా ప్రమాణాలపై అనుమానాలు.. ఎస్ఎల్బీసీ సొరంగం తొలుస్తున్న టీబీఎం కొన్ని రోజులుగా మరమ్మతుకు గురై పెద్ద శబ్ధంతో పనిచేస్తోందని కొందరు కార్మికులు చెబుతున్నారు. అలాగే అసంపూర్తిగా కాంక్రీట్ సెగ్మెంట్ ఉండటం, భద్రతా ప్రమాణాలు పాటించకనే ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిపై అధికారులు స్పందించడం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెల 18న పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ముందస్తుగా పనుల వద్ద సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదని తెలుస్తోంది. పని మొదలుపెట్టిన నాలుగు రోజులకే ప్రమాదం చోటుచేసుకోవడంతో భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రంతా కొనసాగుతున్న సహాయక చర్యలు అర్ధరాత్రి తర్వాత టన్నెల్లోకి ప్రవేశించిన ఐదో బృందం రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఫైర్, సింగరేణి, హైడ్రా బృందాలు టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి -
పురపాలికల్లో యథేచ్ఛగా ఫ్లెక్సీల ఏర్పాటు
వనపర్తిటౌన్: జిల్లాలోని పురపాలికల్లో ఎక్కడ చూసినా భారీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. పండుగలు, గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, రాష్ట్ర, స్థానిక నాయకుల పుట్టిన రోజులు, ముఖ్య నాయకులు, మంత్రులు రాక సమయం.. ఇలా ఒక్కటేమిటి ప్రతి వాటికి అధికార, ప్రతిపక్ష నేతలు ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు పుర అనుమతి తీసుకోవాల్సి ఉండగా అవేమీ పట్టించుకోవడం లేదు. జిల్లాకేంద్రంలో పదేళ్లకుపైగా ఇదే తంతు యథేచ్ఛగా కొనసాగుతోంది. అప్పటి కలెక్టర్ శ్వేతామహంతి ఫ్లెక్సీల ఏర్పాటుపై అసహనం వ్యక్తం చేయడంతో నెలరోజుల పాటు హడివుడి చేసిన పుర అధికారులు ఆ తర్వాత వాటి గురించి పట్టించుకున్న పాపానపోలేదు. వాస్తవానికి ఫ్లెక్సీల ఏర్పాటుకు పుర అనుమతి తీసుకోవడంతో పాటు నిర్దేశించిన రోజులకు రుసుం కూడా చెల్లించి అధికారులు సూచించిన ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన ఆదాయాన్ని పుర అభివృద్ధికి వెచ్చించాలని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ పుర అధికారులు రాజకీయ నాయకుల చేతిలో బందీ కావడంతో ఫ్లెక్సీల ఏర్పాటుకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్దేశిత రుసుం నిర్ణయించి టెండర్ నిర్వహించాలి.. టెండర్‌దారుడు ఆ నగదును ఒకేసారి పురపాలికకు చెల్లించి కేటాయించిన గడువులోగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు రుసుం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారి నుంచి వసూలు చేయాలి. లేదా పుర సిబ్బంది నగదు వసూలు చేసి రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పురపాలికల్లో వర్తించడం లేదు. పుర అధికారులు సైతం ఏనాడు రాజకీయ నాయకులను ప్రశ్నించేందుకు సాహసించడం లేదు. ప్రతి ఏటా ఆస్తి, ట్రేడ్ లైసెన్స్, కొళాయి పన్ను వసూళ్లపై దృష్టి సారిస్తున్న అధికారులు ప్రచార ఆదాయంపై శ్రద్ధ చూపడం లేదు. దీంతో రూ.లక్షల ఆదాయం పురపాలికలు కోల్పోతున్నాయి. అలాగే రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు నెలల తరబడి అలాగే ఉండటంతో రహదారుల ఎదురుగా ఉండే దుకాణదారులు, వాహనాల పార్కింగ్‌కు అసౌకర్యం కలుగుతోంది. అంతేగాకుండా పుర అభివృద్ధికి దోహదపడాల్సిన ప్రజాధనం దుర్వినియోగం పాలవుతోంది. ఏ పార్టీ పాలకవర్గం కొలువుదీరినా ఫ్లెక్సీల ఏర్పాటుకు పాటించాల్సిన నిబంధనలపై ఆలోచించినట్లు కనిపించలేదు. అధికారులు సైతం ఆ దిశగా కార్యాచరణ చేపట్టిన దాఖలలు ఒక్కటంటే ఒక్కటి లేదు. జిల్లాకేంద్రంలో ప్రధాన చౌరస్తాలైన రాజీవ్‌చౌక్, అంబేడ్కర్‌చౌక్, గాంధీచౌక్, కొత్తబస్టాండ్, పాతబజార్, బస్‌డిపో రోడ్డు, కొత్తకోట రహదారి, ఇందిరాపార్కు, శఽంకర్గంజ్ తదితర ప్రదేశాల్లో ఫ్లెక్సీలు అధికంగా ఉంటున్నాయి. -
ప్రచారం మిన్న.. ఆదాయం సున్నా!
సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్●జిల్లాకేంద్రంలో రహదారి పొడవునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అనుమతి తప్పనిసరి.. పురపాలికల్లో ఫ్లెక్సీల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఇందుకుగాను పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. పట్టణ ప్రణాళిక విభాగంలో అధికారులు కొత్తగా వచ్చారు. దీనికితోడు నేను కూడా 20 రోజుల కిందటే విధుల్లో చేరాను. దీనిపై దృష్టి సారిస్తాం. – ఎన్.వెంకటేశ్వర్లు, పుర కమిషనర్, వనపర్తి -
శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
● మహా శివరాత్రి సందర్భంగారీజియన్ నుంచి 357 సర్వీసులు స్టేషన్ మహబూబ్‌నగర్: మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. రీజియన్‌లోని 9 డిపోల నుంచి శ్రీశైలం వరకు 357 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రతి ఏడాది రీజియన్‌లోని డిపోల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. శివరాత్రి అనంతరం తిరుగు ప్రయాణం రోజుల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో అచ్చంపేట డిపో నుంచి 58, గద్వాల నుంచి 15, కల్వకుర్తి 34, కొల్లాపూర్ 37, మహబూబ్‌నగర్ 85, నాగర్‌కర్నూల్ 56, నారాయణపేట 23, షాద్‌నగర్ 6, వనపర్తి డిపో నుంచి 43 ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు రీజియన్ నుంచి 151 బస్సులు నడపనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రీజియన్‌లోని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ తెలిపారు. శ్రీశైలంతోపాటు ఆయా బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం చలువ పందిర్లు, తాగునీరు, వలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్సుల వివరాలు, తేదీల వారీగా.. -
పచ్చదనంపై పట్టింపేది?
ముదురుతున్న ఎండలు.. వాడుతున్న మొక్కలు ●మొక్కలను సంరక్షించాలి.. గతంలో ప్రధాన రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీటిని అందించకపోవడంతో పాటు ట్రీ గార్డులను ఏర్పాటు చేయకపోవడంతో మొక్కలు వాడుముఖం పడుతున్నాయి. వీటికితోడు మొక్కలు తగలబడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. అధికారులు నాటిన మొక్కలను సంరక్షించే చర్యలు తీసుకోవాలి. – విష్ణువర్ధన్ యాదవ్, అమరచింత గ్రీన్ నెట్లు ఏర్పాటు చేయాలి.. వేసవి ప్రారంభంలోనే ఎండల తీవ్రత అధికంగా ఉంది. దీంతో నర్సరీల్లోని మొక్కలు వాడుముఖం పట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలి. గ్రీన్ నెట్లు ఏర్పాటు చేసి రోజు రెండు పూటల నీటిని అందించి సంరక్షించాలి. – వెంకటేష్, నందిమళ్ల, సిబ్బందితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. గ్రామాల్లోని నర్సరీల్లో గ్రీన్నెట్ల ఏర్పాటుపై ఏపీఓలతో సమీక్షిస్తాం. గ్రామపంచాయతీల్లోని గ్రీన్ బడ్జెట్ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొక్కలు వాడుముఖం పట్టకుండా నిత్యం నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పూర్తిస్థాయిలో గ్రీన్ నెట్లను త్వరలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. – ఉమాదేవి, డీఆర్డీఓ అమరచింత: వన మహోత్సవంలో భాగంగా ఏటా గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించే అధికారులు ప్రస్తుతం నర్సరీల్లోని మొక్కలను సంరక్షించని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని 14 మండలాల్లో 255 గ్రామపంచాయతీలు ఉండగా.. ప్రతి గ్రామపంచాయతీలో పది వేల మొక్కల సామర్థ్యంతో నర్సరీని ఏర్పాటు చేసి గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఉపాధిహామీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చలికాలంలో విత్తనాలు చల్లి మొక్కలు పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం వేసవికి ముందే ఎండలు ముదురుతుండటం, నర్సరీల్లో గ్రీన్‌నెట్‌లు ఏర్పాటు చేయకపోవడంతో మొక్కలు ఎండ వేడిమికి వాడుముఖం పడుతున్నాయి. దీనికితోడు మొక్కలకు నిత్యం నీటిని అందించలేని పరిస్థితులు పరిస్థితులు నెలకొన్నాయి. గ్రీన్ బడ్జెట్ నుంచి.. నర్సరీల నిర్వహణకు గ్రామపంచాయతీ నిధుల్లోని గ్రీన్ బడ్జెట్‌ను వినియోగించాల్సి ఉంది. కాని వాచర్లతో మొక్కలకు నీటిని అందించే కార్యక్రమాలు మాత్రమే చేపడుతున్నారు. అలాగే గ్రామపంచాయతీ ట్యాంకర్‌తో రోజు ఉదయం, సాయంత్రం మొక్కలకు నీరు అందించాల్సి ఉండగా.. వారానికి మూడు రోజులు మాత్రమే అందించి చేతులు దులుపుకొంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్పంచ్ల పాలన ముగియడంలో పంచాయతీ కార్యదర్శులు గ్రీన్ బడ్జెట్ ఏర్పాటుపై దృష్టి సారించాలని కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా 25.55 లక్షల మొక్కలు.. వన మహోత్సవంలో భాగంగా ప్రస్తుతం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మండల కేంద్రాలు, పురపాలికల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. పురపాలికలో లక్ష మొక్కలు, గ్రామాల్లో పదివేల మొక్కల సామర్థ్యం ఉన్న నర్సరీలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా అన్ని నర్సరీల్లో 25.55 లక్షల మొక్కలు పెంచాలని ప్రణాళిక సిద్ధం చేసి అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. గతంలో 10 శాతం వినియోగం.. నర్సరీల నిర్వహణతో పాటు నాటిన మొక్కలకు ట్రీగార్డుల ఏర్పాటుకు గ్రామపంచాయతీ నిధుల నుంచి 10 శాతం వినియోగించుకునేవారు. వీటితోనే వేసవికు ముందే నర్సరీల్లో గ్రీన్ నెట్లను ఏర్పాటు చేసుకునేవారు. సర్పంచ్‌లు, వార్డుసభ్యుల బాధ్యతలు ముగిసి ఏడాది గడిచినా నేటికీ ఎన్నికలు జరపకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు అరకొరగా మంజూరవుతున్నాయి. గ్రామపంచాయతీల్లో నిధుల కొరత కారణంగా నర్సరీల్లో గ్రీన్ నెట్లను సైతం వేయలేకపోతున్నారు. నర్సరీల్లో కనిపించని గ్రీన్ నెట్లు పట్టించుకోని అధికారులు, నిర్వాహకులు జిల్లాలో 25.55 లక్షల మొక్కల పెంపకమే లక్ష్యం -
సొరంగంలోనే ఎనిమిది మంది
సీపేజీనే ప్రమాదానికి కారణం.. శ్రీౖశెలం జలాశయం నుంచి నీటిని నల్లగొండ జిల్లాకు తరలించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. నల్లమల కొండలను సుమారు 40 కి.మీ. మేర తవ్వాల్సి ఉండగా.. కృష్ణాతీరం నుంచి 13 కి.మీ., మరోవైపు అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి నుంచి 23 కి.మీ. టన్నెల్ తవ్వకం పూర్తయింది. దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ ఇన్లెట్ నుంచి 14 కి.మీ. వద్ద సొరంగం తవ్వకాలను నాలుగు రోజుల కిందటే మొదలుపెట్టారు. ఈ సొరంగంలో నాలుగేళ్లుగా నీటి సీపేజీ కొనసాగుతోంది. శనివారం ఈ నీటి ఉధృతి అధికమై అప్పటికే బలహీనంగా మారి పైకప్పు, రాక్ బోల్టింగ్, కాంక్రీట్ సెగ్మెంట్‌తోపాటు ఒక్కసారిగా కుప్పకూలింది. సీపేజీ నిర్వహణ, డీవాటరింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించడంతో పాటు భద్రతా ప్రమాణాలు పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు ● ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి, కలెక్టర్, ఎస్పీ ● కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు ● రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, సింగరేణి రెస్క్యూ బృందాలు ● భారీగా నీటి ఊట, బురద, శిథిలాలతో సహాయక చర్యలకు ఆటంకం సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో చేపడుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ పనుల్లో ఇన్లెట్ టన్నెల్లో 14 కి.మీ., వద్ద సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ప్రమాదం సంభవించగా.. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. సొరంగంలో నీటి ఊట ఉధృతి పెరిగి మట్టి వదులు కావడం, అకస్మాత్తుగా కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపడటంతో ప్రమాదం సంభవించింది. టన్నెల్ బోరింగ్ మిషన్‌కు ఇవతల వైపు ఉన్న సుమారు 50 మంది బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకోగా.. అవతల వైపు ఉన్న 8 మంది సొరంగంలోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సుమారు 150 మంది ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక, సింగరేణి కాలరీస్‌కు చెందిన రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. ఒకే మార్గం నుంచి.. టన్నెల్ శిథిలాల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు పెద్దఎత్తున నీటి ప్రవాహం, బురద ఆటంకంగా మారాయి. ఇలాంటి సొరంగ పనుల నిర్వహణకు ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు కీలకంగా పనిచేస్తాయి. వీటి ద్వారా సొరంగంలో తొలగించిన మట్టి, రాళ్లు, శిథిలాల తొలగింపుతోపాటు సొరంగంలో ఎయిర్ ప్రెజర్‌ను సమన్వయం చేసేందుకు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు ఉపయోగపడతాయి. ఇలాంటివి ఏమీ ఈ ప్రాజెక్ట్‌లో లేవు. ప్రధాన సొరంగంతోపాటు అదనంగా ఆడిట్ టన్నెళ్ల నిర్మాణం చేపట్టేందుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఆడిట్ టన్నెళ్లు లేకపోవడం, ఒకే మార్గం గుండా సహాయక చర్యలు చేపట్టడం రెస్య్యూ బృందాలకు సవాలుగా మారింది. -
భగ్గుమన్న విభేదాలు
వనపర్తి: అధికార కాంగ్రెస్ పార్టీలో విభేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వనపర్తి జిల్లాలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఎదుటే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వాగ్వాదానికి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా.. జిల్లాలోని గోపాల్పేట మండలంలోని బుద్దారం గండి వద్ద నూతన మార్కెట్ యార్డు ఏర్పాటుకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వచ్చారు. అయితే ఈ యార్డును అందరికీ ఆమోదయోగ్యంగా గోపాల్‌పేటలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తన వర్గీయులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే మేఘారెడ్డి కల్పించుకొని బుద్దారంలోనే మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మంత్రి ముందే తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా.. ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాలకు మంజూరైన మరో మార్కెట్ యార్డు విషయంలోనూ మండల నాయకుల్లో రసాభాసకు దారితీసింది. ఈ విషయమై ఆయా ప్రాంతాల కాంగ్రెస్ నాయకుల్లో విభేదాలు బయటపడటంతో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పర్యటనను ఖిల్లాఘనపురంలోనే రద్దు చేయాల్సి వచ్చింది. మంత్రి తుమ్మల ఎదుటే వాగ్వాదానికి దిగిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
వనపర్తి/కొత్తకోట రూరల్: దేశంలో ఉన్న మంచినూనె కొరతను అధిగమించి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగేందుకు రైతులు అత్యధికంగా ఆయిల్‌పాం సాగు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. దేవరకద్ర నియోజకవర్గంలోని సంకిరెడ్డిపల్లిలో ప్రీ యూనిక్ సంస్థ నిర్మించనున్న ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయిల్‌పాం రైతులతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో వంటనూనెల లోటు భర్తీ చేయాలంటే 70 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాల్సిన అవసరం ఉందని.. తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందే పంట ఆయిల్‌పాం మాత్రమే అన్నారు. ప్రస్తుతం ఆయిల్‌పాం గెలలు టన్నుకు రూ.20,487 ధర పలుకుతుందని త్వరలో రూ.25 వేలకు చేరుతుందని వివరించారు. ఆగష్టు 15 నాటికి కంపెనీ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభిస్తామని.. అదేవిధంగా బీచుపల్లి వద్ద ఉన్న కంపెనీ మరమ్మతులు పూర్తిచేసి ఇదే సంవత్సరంలో వినియోగంలోకి తీసుకొస్తామని భరోసానిచ్చారు. జిల్లాలో 11 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆయిల్‌పాం కంపెనీ నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చిందని.. త్వరగా నిర్మాణం పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ ప్రతినిధులను కోరారు. ఆయిల్‌పాం సాగుతో ఏడాదికి ఎకరాకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బడుగు, బలహీనవర్గాలు, రైతుల సమస్యలు తనవిగా భావించి పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో ఆయిల్‌పాం కంపెనీ ఏర్పాటుతో పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. భూత్పూర్, అడ్డాకుల మధ్య మరో మార్కెట్‌యార్డు మంజూరు చేయాలని, దేవరకద్ర నియోజకవర్గంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గోదాం మంజూరు చేయాలన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని 1,680 మంది రైతులు 5,500 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేస్తున్నారని, త్వరలో 10 వేల ఎకరాలకు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యానశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. జిల్లాలో వేరుశనగ సాగు అధికంగా ఉన్నందున పెద్దమందడి మండలంలో వేరుశనగ పరిశోధన కేంద్రం మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానశాఖ ఎండీ షేక్ యాస్మిన్‌బాషా, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడారు. అంతకుముందు పెద్దమందడి మండలం వెల్టూరులో ఆరోగ్య ఉప కేంద్ర భవనం, మోజర్లలో గోదాముల సముదాయానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పెబ్బేరులో మరో వ్యవసాయ గోదాం, వ్యవసాయ కార్యాలయ అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కాలిన మార్కెట్‌యార్డు గోదాం పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ రెవెన్యూ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, వనపర్తి మార్కెట్‌యార్డు చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర మార్కెట్‌యార్డు చైర్మన్ ప్రశాంత్, పీఏసీఎస్ చైర్మన్లు, కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆయిల్‌పాం సాగుపై రైతులు దృష్టి సారించాలి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
రామన్‌పాడులో 1,020 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 730 క్యూసెక్కుల వరద వస్తుండగా.. సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా నిలిపివేశారు. ఎన్టీఆర్ కాల్వకు 859 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 20 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. చెస్ జిల్లా కార్యవర్గం ఎన్నిక వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలో శనివారం చెస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సంఘం భవనంలో జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా డా. మురళీధర్, అధ్యక్షుడిగా యాదగిరి, అసోసియేషన్ అధ్యక్షుడిగా గణేష్‌కుమార్, ఉపాధ్యక్షులుగా రాంప్రసాద్, నర్సింహ, ప్రధానకార్యదర్శిగా వేణుగోపాల్, కార్యదర్శలు రవీందర్‌గౌడ్, రాములు, కోశాధికారిగా టీపీ కృష్ణయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బుచ్చిబాబు ఎన్నికయ్యారు. ఈ కార్యవర్గం నాలుగేళ్ల పాటు కొనసాగనుంది. -
పరమేశ్వరస్వామి చెరువును పరిశీలించిన అధికారులు
ఆత్మకూర్: పట్టణంలోని పరమేశ్వరస్వామి చెరువును శనివారం పర్యాటకశాఖ డిప్యూటీ మేనేజర్ జుంకీలాల్, బోట్ ఆపరేటర్ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మార్చి 1 నుంచి స్వల్ప రుసుంతో చెరువులో బోట్ నడుపుతామని, జాతర తర్వాత పరిస్థితులను బట్టి కొనసాగించా లేదా అన్న విషయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాలు, బారికేడ్లు, ప్లాట్‌ఫాం ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలించామని వివరించారు. ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన వనపర్తి రూరల్: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలంటూ తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి సురేశ్ ఆధ్వర్యంలో శనివారం పారిశుద్ధ్య కార్మికులు భోజన విరామ సమయంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య కళాశాలలో మహిళా సిబ్బందికి రక్షణ లేదని, ఫిర్యాదు చేసిన మహిళా కార్మికులను ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. గౌరవ ప్రదమైన హోదాలో ఉండి మహిళలతో అనుచితంగా ప్రవర్తించడం సరికాదని తెలిపారు. ఆమె అనధికారికంగా ఐదుగురు కార్మికులను మహబూబ్‌నగర్‌లోని సొంత ఇంటికి తీసుకెళ్లి పని చేయించుకొని మూడు నెలలు గడిచిన తర్వాత వారిపై దొంగతనం అభియోగం మోపడం బాధాకరమన్నారు. సమగ్ర విచారణ జరిపి కార్మికులకు న్యాయం చేయాలని.. లేనిచో దశల వారీగా ఉద్యమాలకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు మద్దిలేటి, వరుణ్, షకీల్, రాజశేఖర్, మణెమ్మ, చెన్నమ్మ, సైదమ్మ, లావణ్య, నారమ్మ, రమ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి : సీపీఐ ఆత్మకూర్: పట్టణంలో అక్రమ కట్టడాలు తొలగించడంతో పాటు ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు కోరారు. శనివారం పుర కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాబాకాలనీలో రహదారిని సైతం అక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎంపీపీ రహదారిని కబ్జా చేసి దుకాణాలు నిర్మిస్తున్నారని.. పనులు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏర్పాటు చేసిన వెంచర్లలో ప్రజా అవసరాలు, పార్కులు తదితరాల కోసం కేటాయించిన 10 శాతం స్థలాన్ని సైతం అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని ఆరోపించారు. కబ్జాకోరుల చెర నుంచి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సీఎన్ శెట్టి, మోషా, అబ్రహం, భాస్కర్, కుతుబ్, రవీందర్, శేఖర్, గీతమ్మ తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో శనేశ్వరుడికి పూజలు బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఏలినాటి శని నివారణ కోసం శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు చేశారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోపాలరావు, ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, కమిటీ సభ్యులు ప్రభాకరాచారి, పుల్లయ్య, వీరశేఖర్ పాల్గొన్నారు. -
వెంచర్ల ఏర్పాటులో నిబంధనలు పాటించాలి
ఆత్మకూర్: వెంచర్ల ఏర్పాటులో ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని భార్గవినగర్, బీసీకాలనీలో ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో హద్దులు, విద్యుత్, ఇరిగేషన్, రహదారుల నిర్మాణాలను పరిశీలించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా లేఅవుట్లు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే అనుమతులు రద్దు చేస్తామని వివరించారు. ఆయన వెంట ట్రాన్స్‌కో ఎస్ఈ రాజశేఖరం, ఏఈ నర్సింహ, నీటిపారుదలశాఖ ఏఈ కిషోర్, ఆర్అండ్బీ డీఈ సీతారామస్వామి, తహసీల్దార్ చాంద్‌పాషా, పుర కమిషనర్ శశిధర్, ఎంపీడీఓ శ్రీపాద్, టీపీఓ కరుణాకర్ తదితరులు ఉన్నారు. పౌల్ట్రీ ఫాం పరిశీలన ఆత్మకూర్: బర్డ్‌ఫ్లూ వైరస్‌తో కోళ్లు చనిపోతున్నాయని.. చికెన్ తినడం మానుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డా. వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. మండలంలోని పిన్నంచర్లలో ఉన్న పౌల్టీ ఫాంలో కోళ్లు చనిపోవడంతో శుక్రవారం ఆయన ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, పశువైద్యాధికారి డా. రమేశ్‌తో పరిశీలించారు. ఫాం పరిసరాలను పరిశీలించి బ్లీచింగ్ పౌడర్ చల్లించి గ్రామంలోని చికెన్ దుకాణాలను మూయించారు. ఆత్మకూర్‌లో సైతం చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని, దుకాణాలను మూసివేయించాలని పుర కమిషనర్ శశిధర్‌కు సూచించారు. ఆయనవెంట జేవీఓ నిర్మల, ఏఎస్‌లు నాగరాజు, మహిమూద్ ఉన్నారు. 3న జాతీయ సదస్సు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్ సమీపంలోని క్రిస్టియన్‌పల్లిలో ఉన్న ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ‘తెలంగాణ ఆర్థికాభివృద్ధి, అవకాశాలు.. సవాళ్లు, ఎంఎస్ఎంఈల పాత్ర’ అనే అంశంపై మార్చి 3న జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి పీయూ వీసీ శ్రీనివాస్, కంట్రోలర్ రాజ్‌కుమార్ తదితరులు హాజరవుతారన్నారు. -
పాలమూరుపై పగ ఎందుకు?
నారాయణపేట: ‘పాలమూరు జిల్లాలో కృష్ణానది 811 టీఎంసీల నీరు పారుతుంది.. ఈ నీరు దశాబ్దాలుగా పారుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఎందుకు తీరలేదు.. సాగునీరు, తాగునీరు ఎందుకు అందలేదు.. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో పాలమూరులో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు.. జిల్లాను ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ’ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా దాదాపు రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం అప్పక్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పదేళ్లు నిర్లక్ష్యం చేశారు.. పైగా పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయేందుకు అవకాశం కల్పించారని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. పాలమూరులో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కేసీఆర్‌కు పగ ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం 12 నెలల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఈ విషయంలో ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. 70 ఏళ్లకు సీఎం పదవి హైదరాబాద్ రాష్ట్రానికి పాలమూరు జిల్లావాసి బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తే దాదాపు 7 దశాబ్దాల తర్వాత తిరిగి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. పాలమూరు ప్రజల పేదరికాన్ని ప్రపంచ దేశాలకు చూపించి విదేశాల్లో మార్కెటింగ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెనకబడిన ఈ పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని, ఇందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘పేట–కొడంగల్’ను పూర్తి చేసుకుందాం పదేళ్లలో సంగం‘బండ’ పగలకొట్టలేదు. దీంతో ఆ ప్రాంతంలోని 10 వేల వ్యవసాయ భూములకు సాగునీరు అందక ఏడారిగా మారాయని సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.15 కోట్లు మంజూరు చేసి బండను పగలకొట్టించామన్నారు. ఇప్పుడు 10 వేల ఎకరాలు పారుతున్నాయన్నారు. మక్తల్, కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టు 2014లో కొట్లాడి మంజూరు చేయిస్తే తనపైన ఉన్న కోపంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ఆపేశారన్నారు. ఇప్పుడు తన హయాంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదండాపూర్, పాలమూరు రంగారెడ్డి, ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పేట– కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని, రైతులకు ఎకరాకు రూ.10 లక్షలు సరిపోకపోతే రూ.20 లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. లగచర్లలో పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తే అడ్డుకున్నారని, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుంటే ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నించారు. జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని, నన్ను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిదేశంలోనే తొలి మహిళా పెట్రోల్ బంక్ ఆడబిడ్డలకు ఆర్థిక స్వావలంభన ఇవ్వాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ మంజూరు చేశామని సీఎం అన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం పదేళ్లలో బడుగు బలహీన వర్గాల ప్రజలను డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట మోసం చేసి గద్దెనెక్కిందని విమర్శించారు. తిరిగి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసుకొని.. ఈ రోజు నారాయణపేట మండలం అప్పక్‌పల్లి నుంచి భూమిపూజ చేయడం జరిగిందన్నారు. అవసరమైతే నియోజకవర్గానికి 5 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేకపోయారు కృష్ణానదిలో 811 టీఎంసీలు పారుతున్నా.. సాగు, తాగునీరు లేదు ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం నారాయణపేట ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ సభలో సీఎం రేవంత్‌రెడ్డి రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు -
బకాయి వేతనాలు చెల్లించాలంటూ ఆందోళన
వనపర్తి రూరల్: తమ బకాయి వేతనాలు చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు మాట్లాడుతూ.. కార్మికులు మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకునే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెల 1న వేతనాలు చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండేళ్లుగా వారికి సబ్బులు, నూనెలు అందించడం లేదని.. ఇప్పటి నుంచైనా విధిగా అందించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. సేఫ్టీ పరికరాలు, గ్లౌజులు, బూట్లు పంపిణీ చేయాలన్నారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులతో కలిసి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని కార్యాలయ సూపరింటెండెంట్‌కు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు నిక్సన్, రమేశ్, రాములు, మధు, జీపీ కార్మిక సంఘం నాయకులు పుష్ప, హనీఫ్, అక్తర్‌పాషా, దాసు, సుగ్రీవుడు, ఖాదర్, మధు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
సర్వశిక్ష అభియాన్ నిధులు ఖర్చు చేయాలి.. వనపర్తి: కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన పీఎంశ్రీ, సర్వశిక్ష అభియాన్ నిధులను వందశాతం ఖర్చుచేసి నివేదికలు అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా పాఠశాలల్లో మౌలిక వసతులు, క్షేత్రస్థాయి పరిశీలనకు విడుదలైన నిధులు ఖర్చుచేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్ పంపాలన్నారు. అలాగే గ్రీన్ స్కూల్, ఆత్మరక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన, మౌలిక వసతులు, స్పోర్ట్స్, సైన్స్ బడ్జెట్ నిధుల వినియోగంపై సమీక్షించారు. నిధులు ఖర్చుచేసి నివేదిక ఇవ్వాలని, అపార్ నమోదు సైతం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘ నీ, మండల విద్యాధికారులు, పీఎంశ్రీ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కొత్తకోట రూరల్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం జిల్లాకు రానున్నారని.. పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్‌పాం ఫ్యాక్టరీకి మంత్రులు భూమిపూజ చేయనున్నందున శుక్రవారం ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించి మాట్లాడారు. కార్యక్రమ స్థలంలో జిల్లా ఉద్యాన, వ్యవసాయశాఖకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఆయిల్‌పాం సాగుచేస్తున్న ముగ్గురు ఆదర్శ రైతులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. వచ్చిన వారికి ఆహారం అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసుశాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి వచ్చే ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సభాస్థలిని పరిశీలించిన ఎస్పీ.. మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ శంకుస్థాపనకు శనివారం రాష్ట్ర మంత్రులు రానున్న సందర్భంగా శుక్రవారం భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షించారు. సభాస్థలి, వాహనాల పార్కింగ్ స్థలాలు, బందోబస్తు ఏర్పాట్ల తీరును పరిశీలించారు. బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన భద్రతపై పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని, విధులను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, కొత్తకోట ఎస్ఐ ఆనంద్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
హోరాహోరీగా పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు
అయిజ: మండల కేంద్రంలోని తిక్కవీరేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ వారు శుక్రవారం అంతర్రాష్ట్ర స్థాయి పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 20 పొటేళ్లు హోరా హోరీగా తలపడ్డాయి. అయిజ మండలానికి చెందిన సుల్తాన్ పొట్టేలు ప్రథమ స్థానంలో నిలిచి రూ.50వేలు, హైదరాబాద్‌కు చెందిన రాజావలి, ఎంజీ గ్రూప్, క్రైమ్ మేకర్ పొట్టేళ్లు ద్వితీయ, తృతీయ, నాల్గో స్థానాల్లో నిలిచి రూ.35వేలు, 20వేలు, రూ.10వేలు గెలుచుకున్నాయి. అనంతరం విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు. -
ఇన్చార్జ్ అదనపు కలెక్టర్‌గా యాదయ్య
వనపర్తి: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ నారాయణపేటకు బదిలీ కావడంతో జెడ్పీ సీఈఓ యాదయ్యకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మార్కెట్ యార్డు నిర్మాణ స్థలం మార్పు ఖిల్లాఘనపురం: ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాలకు కలిపి ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డును మంజూరు చేసింది. మొదట మార్కెట్ యార్డును షాపురం గ్రామానికి వెళ్లే కూడలిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని నిర్ణయించారు. శిలా ఫలకం నిర్మాణం, ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులుగౌడ్ శుక్రవారం సాయంత్రం అక్కడికి చేరుకున్నారు. మార్కెట్‌యార్డును మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలంటూ స్థానికులతో పాటు అటువైపు ఉన్న గ్రామాల నాయకులు ఏర్పాట్లను పరిశీలించేందుకు రాకుండా పద్మశాలి కళ్యాణ మండపం దగ్గర అలిగి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారికి ఫోన్లో నచ్చజెప్పేందుకు యత్నించినా వారు ఒప్పుకోకపోవడంతో చేసేది లేక నేరుగా అక్కడికి చేరుకున్నారు. మండల కేంద్రంలోనే ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు, రైతులు పట్టుబట్టారు. నిర్మాణానికి అవసరమైన స్థలం చౌడమ్మ గుట్ట దగ్గర ఉండటంతో ఎమ్మెల్యేతో పాటు నాయకులు వెళ్లి పరిశీలించారు. నిర్మాణానికి ఎమ్మెల్యే అంగీకరించడంతో నాయకులు, రైతులు ఆయనను శాలువాతో సన్మానించారు. శిలా ఫలకం ఏర్పాటుకు స్థలాన్ని శుభ్రం చేసే పనులను నాయకులు వెంటనే ప్రారంభించారు. మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, మాజీ సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్రావు, సింగిల్‌విండో వైస్ చైర్మన్ రాజు, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్, సాయిచరణ్‌రెడ్డి, నాయకులు ఉన్నారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా పాలమూరు: జిల్లాలో విద్యుత్ డిమాండ్ గతేడాది కంటే ఈసారి 18 శాతం పెరిగిందని, ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. జిల్లాలో విద్యుత్ శాఖ వేసవి యాక్షన్ ప్లాన్ పనులను శుక్రవారం పరిశీలించడంతోపాటు టీడీగుట్ట సబ్‌స్టేషన్‌లో దాదాపు రూ.కోటి వ్యయంతో అదనంగా ఏర్పాటు చేసిన ఐదు ఎంవీఏ ఫవర్ ట్రాన్స్ఫార్మర్లను కలెక్టర్ విజయేందిరతో కలిసి సీఎండీ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో విద్యుత్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది పీక్ డిమాండ్ 352 మెగావాట్లు కాగా ఈసారి 415 మెగావాట్లకు చేరిందని, ఇంతగా డిమాండ్ పెరిగినా ఎలాంటి ఓవర్‌లోడ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. డిమాండ్ 500 మెగావాట్లకు చేరిన సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందని, గతేడాదితో పోల్చితే ఈసారి జనవరి వరకు దాదాపు 15 వేల మంది చేరికతో మొత్తం వినియోగదారులు 3.99 లక్షలకు చేరారని, గృహాజ్యోతి పథకం కింద దాదాపు 1.29 లక్షల మంది గృహ వినియోగదారులు లబ్ధిపొందుతున్నారని చెప్పారు. గతేడాది దాదాపు 9 సబ్‌స్టేషన్ల్ పరిధిలో ఫవర్ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ అయ్యాయని, డివిజన్ల వారీగా పెరుగుతున్న లోడ్లకు తగ్గట్టుగా నూతన ట్రాన్స్ఫార్మర్, ఫీడర్ల విభజన చేయడం జరిగిందన్నారు. కేవలం హైదరాబాద్‌కు పరిమితమైన విద్యుత్ కాల్ సెంటర్ 1912 సదుపాయాన్ని జిల్లాలకు విస్తరించామన్నారు. విద్యుత్ అంతరాయాలు జరిగిన వెంటనే సమస్య పరిష్కరించేందుకు అంబులెన్స్ తరహా వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్య ఉంటే వినియోగదారులు 1912 ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డైరెక్టర్ ఆపరేషన్ నర్సింహులు, రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి, ఎస్ఈ రమేష్ పాల్గొన్నారు. -
గిరిజనులకు ఉచిత న్యాయ సేవలు
కొత్తకోట రూరల్: గిరిజనులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలం చీకురుచెట్టుతండాలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా న్యాయ సేవాసంస్థ పనితీరు, గిరిజనుల హక్కులు, చట్టాల గురించి క్షుణ్ణంగా వివరించారు. బాల్య వివాహాలు, పోక్సో, రహదారి నిబంధనలు, బాల కార్మికుల చట్టం గురించి అవగాహన కల్పించారు. గిరిజనులతో పాటు హరిజనులు, మహిళలు, పిల్లలు, వయో వృద్ధులకు కూడా ఉచిత న్యాయసేవలు అందిస్తున్నామని.. వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. అనంతరం మానసిక వైద్యులు డా. పుష్పలత మాట్లాడుతూ.. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని భూత వైద్యుల వద్దకు కాకుండా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎల్ఏడీసీఎస్ జి.ఉత్తరయ్య, సఖి లీగల్ కౌన్సిల్ డి.కృష్ణయ్య, పారా లీగల్ వలంటీర్ అహ్మద్, మాజీ సర్ప ంచ్ రాధాకృష్ణ, పంచాయతీ కార్యదర్శి ప్రీతి, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. -
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
కొత్తకోట: ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కొత్తకోటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను గురువారం అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వంటగది, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. మెస్ కమిటీ సమక్షంలో కిరాణ సరుకుల నాణ్యతను పరిశీలించిన తర్వాతే దించుకోవాలని సూచించారు. సూపర్వైజర్లు భోజనాన్ని రుచి చూసిన తర్వాతే విద్యార్థినులకు వడ్డించాలన్నారు. పదోతరగతి విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారి మల్లికార్జున్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ చెన్నమ్మ, ప్రిన్సిపాల్ మాధవి ఉన్నారు. -
అడుగంటుతున్న కృష్ణమ్మ
గతేడాది వర్షాకాలంలో కృష్ణానదికి భారీగా వరదలు వచ్చినప్పటికీ బ్యాక్‌వాటర్ భారీగా తగ్గిపోతోంది. వివిధ ప్రాజెక్టుల ద్వారా తాగు, సాగునీటికి తరలింపు, వేసవి నేపథ్యంలో నిల్వ నీరు వేగంగా అడుగంటుతోంది. దీంతో పెంట్లవెల్లి మండలంలోని మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్, కొల్లాపూర్ మండలంలోని సోమశిల, అమరగిరి గ్రామాల శివారులో కృష్ణానది బురదమయంగా కనిపిస్తుంది. – పెంట్లవెల్లి -
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
వనపర్తి: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని డీఈఓ అబ్దుల్ ఘని సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యతోనే వినయం, విజ్ఞానం సంపాదిస్తామన్నారు. పీఎంశ్రీ పథకం ద్వారా పాఠశాలలో అనేక వసతులను కల్పించారని.. విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా విద్యాశాఖ సమన్వయకర్తలు యుగంధర్, శేఖర్, హెచ్ఎం ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బదిలీ వనపర్తి: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను నారాయణపేట జిల్లాకు బదిలీ చేస్తూ గురువారం సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో తనదైన పాత్ర పోషించారు. పలుమార్లు కలెక్టర్‌గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. వరిధాన్యం బోనస్‌పై జాప్యం తగదు వీపనగండ్ల: కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వరిధాన్యం అమ్మిన రైతులకు బోనస్ అందించడంలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాల్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బొల్లారంలో రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యంలో ఇప్పటికీ 10 శాతం మాత్రమే బోనస్ చెల్లించిందని.. మిగతా 90 శాతం మంది రైతులకు బోనస్ అందకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. మరోవైపు దాదాపు 45 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. రైతుభరోసా అందించడంలోనూ ఆలస్యం చేస్తున్నారన్నారు. ఉమ్మడి మండలంలోని జూరాల, భీ మా కాల్వలకు మార్చి నెలాఖరు వరకు వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేయాలని డి మాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం ఉ పాధ్యక్షుడు ఎం.కృష్ణయ్య, సీపీఎం నాయకులు కృష్ణయ్య, బాలాగౌడ్, తిరుపతయ్య ఉన్నారు. మేధో సంపత్తి హక్కులతో ప్రయోజనం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మేధో సంపత్తి హక్కులతో పరిశోధనలు చేసే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో మేధో సంపత్తి హక్కులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పూర్తి స్థాయి హక్కులు పొందిన తర్వాతనే వాటిని ప్రకటించాలని, అప్పుడు ప్రచురణలు, ప్రయోగాలకు పూర్తిస్థాయిలో విలువ ఉంటుందన్నారు. ఆవిష్కరణలకు పరిరక్షణ, హక్కులు కలిగి ఉండాలంటే తప్పకుండా మేధో సంపత్తి హక్కులు ఉండాలని, రీసెర్చ్ విద్యార్థులు అధ్యాపకులు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇప్పుడు చేసిన ప్రయోగాలు భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, వక్త శంకర్రావు ముంజం, ఐక్యూఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కంట్రోలర్ రాజ్‌కుమార్, మధు, అర్జున్‌కుమార్, కుమారస్వామి, శాంతిప్రియ, విజయలక్ష్మీ పాల్గొన్నారు. -
నేర రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
వనపర్తి: నేర రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తోందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల్లో పోలీసు శాఖపై మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పనిచేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. డీఎస్పీలు, సీఐలు తప్పనిసరిగా తమ పరిధిలోని స్టేషన్లను పర్యవేక్షించి.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. జిల్లాలో నేర నియంత్రణకు సమన్వయంతో కృషి చేయాలన్నారు. రోజువారీ పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని సూచించారు. నేరస్తులను పట్టుకోవడం, నేర పరిశోధనకు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాలను ఉపయోగించుకోవాలన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని తెలిపారు. పోలీసులు విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయితీగా, జవాబుదారితనంతో ఉండాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఫుట్ పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరంగా చేయాలని సూచించారు. కొత్త చట్టాలపై సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని, చట్టం పరిధిలోనే పనిచేయాలని తెలిపారు. మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని.. షీ టీం బృందాలను మరింత బలోపేతం చేయాలన్నారు. గంజాయి సరఫరా, వినియోగం మీద ఉక్కుపాదం మోపాలన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులందరూ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐలు రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు. పోలీసు శాఖపై మరింత నమ్మకం పెంచుదాం ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలి ఎస్పీ రావుల గిరిధర్ -
పన్ను ఎగవేతదారులను గుర్తించండి
వనపర్తి: ఆదాయపు పన్ను ఎగవేత దారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. అధిక మొత్తంలో జరిగే లావాదేవీలను గుర్తించి.. ఆదాయపు పన్ను శాఖకు రిపోర్టు చేయడంపై గురువారం కలెక్టరేట్లో తహసీల్దార్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పన్ను ఎగవేత దారులను కట్టడి చేయాలంటే అధిక మొత్తంలో జరిగే లావాదేవీలను గుర్తించడం కీలకమని అన్నారు. సీసీఎల్ఏ సూచన మేరకు తహసీల్దార్లు స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిపోర్టు చేయడంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రూ. 30లక్షలకు పైగా జరిగిన లావాదేవీలను గుర్తించి ఆదాయ పన్ను శాఖకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. -
డబుల్బెడ్రూం ఇళ్లలో నివాసం ఉండని వారికి నోటీసులు
వనపర్తి: డబుల్బెడ్రూం ఇళ్లలో చాలా వరకు అసలైన లబ్ధిదారులు నివాసం ఉండటం లేదని.. అలాంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,488 డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించగా.. రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారితో పాటు 543 నిరుపేద కుటుంబాలకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇటీవల డబుల్బెడ్రూం ఇళ్లను పరిశీలించగా.. అసలైన లబ్ధిదారులు నివాసం ఉండటం లేదనే విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. అసలు పట్టాదారులు నివాసం ఉండకుండా అద్దెకు ఇవ్వడం.. మరికొన్ని ఖాళీగా పడి ఉన్నట్లు తెలిసిందన్నారు. నిబంధనల ప్రకారం డబుల్బెడ్రూం ఇళ్లను అద్దెకు లేదా లీజ్‌కు ఇవ్వడం, అమ్ముకోడానికి వీలు లేదన్నారు. ఖాళీగా ఉన్న వాటిని ప్రభుత్వ అధీనంలోకి తీసుకొని అద్దెకు ఉన్న వారికి ఫారం–2, అసలు పట్టాదారుకు ఫారం–1 ద్వారా నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా 90 శాతానికి పైగా నివాసం ఉంటున్న డబుల్బెడ్రూం ఇళ్ల కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీరు మల్లయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం ఉన్నారు. -
నేడు ‘పేట’కు సీఎం రేవంత్
నారాయణపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారిగా శుక్రవారం నారాయణపేట జిల్లాకేంద్రానికి రానున్నారు. ఈ సందర్భంగా రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లను సిద్ధం చేసింది. ● సీఎం శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో నారాయణపేట మండలంలోని సింగారం చౌరస్తా సమీపంలోని గురుకుల పాఠశాల దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.1.23 కోట్లతో నిర్మించిన నూతన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌కు భూమి పూజ చేస్తారు. 1.35 గంటల నుంచి 2 గంటల వరకు రూ.130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్యకళాశాల, హాస్టల్ నిర్మాణానికి, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, రూ.40 కోట్లతో 100 పడకల యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ.56 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల ఫస్టియర్ అకాడమిక్ బ్లాక్‌ల ప్రారంభించనున్నారు. వీటితో పాటు ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్లు, వివిధ గ్రామాల్లో రూ.500కోట్లకుపైగా నిధులతో నిర్మించనున్న రోడ్లు, హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 2.10గంటలకు బహిరంగసభలో పాల్గొని, మాట్లాడుతారు. పర్యవేక్షించిన అధికారుల బృందం సీఎం పర్యటన నేపథ్యంలో గురువారం రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ క్రిస్టియానా, ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ హరీశ్, ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సింగారం చౌరస్తాలోని హెలీప్యాడ్ స్థలాన్ని, సమీపంలోని నూతన పెట్రోల్ బంక్, వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని, అప్పక్‌పల్లి వద్ద సీఎం భూమి పూజ చేసే ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని అధికారుల బృందం పరిశీలించింది. అనంతరం మెడికల్ కళాశాలలో ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బహిరంగసభ వేదిక పక్కన గ్రీన్ రూమ్, వేదికపై సీటింగ్ కెపాసిటీ, వీఐపీ గ్యాలరీ తదితర వాటిపై చర్చించారు. అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలు సైతం ఏర్పాట్లను పరిశీలించారు. ● సీఎం పర్యటనకు 1000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి ఎస్పీలు, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 81మంది ఎస్ఐలు, 133 మంది ఏఎస్ఐలు, 750 కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం పర్యటన ముందస్తు బందోబస్తు ఏర్పాట్లను మల్టీజోన్–2 ఐజీపీ సత్యనారాయణ, జోగుళాంబ జోన్ –7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పరిశీలించారు. రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
లోకాయుక్తకు నివేదిక సమర్పిస్తాం
కొత్తకోట మండలంలోని రాయినిపేట రాయసముద్రం చెరువులో భూములు మునకకు గురవుతుండటంతో నష్టపోతున్నామని.. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆయకట్టు రైతులు లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజినీరు శ్రీనివాస్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి కలెక్టర్ ఆదర్శ్ సురభి చెరువును సందర్శించి పరిశీలించారు. ఆయకట్టు రైతులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అన్ని రికార్డులను పరిశీలించిన తర్వాత లోకాయుక్తకు పూర్తి నివేదిక సమర్పిస్తామని కలెక్టర్ తెలిపారు. వారి వెంట తహసీల్దార్లు రమేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
ఎల్ఆర్ఎస్కు మోక్షం!
వనపర్తి: లేఅవుట్ల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో నాలుగేళ్ల నిరీక్షణకు తెర పడింది. రియల్టర్లలో కొత్త ఆశలు చిగురించినట్లు అయ్యింది. మరోవైపు ఆయా లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేస్తామని చెప్పడంతో దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించినట్లయ్యింది. అయితే 2020 ఆగస్టు 28 నాటికి ఏర్పాటుచేసిన లేఅవుట్లకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్‌తో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. దీనికి తోడు చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించడం ప్రోత్సాహకంగా ఉందని చెప్పవచ్చు. జిల్లావ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం భారీగా దరఖాస్తులు సమర్పించినా.. కనీసం 10శాతం కూడా క్రమబద్ధీకరణకు నోచుకోలేదు. ప్రస్తుతం మార్చి 31వ తేదీలోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి ప్రభుత్వం 25శాతం రాయితీ ప్రకటించడంతో ప్లాట్లు, లేఅవుట్లను పెద్ద సంఖ్యలో క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది.జిల్లాలో 69,239 అర్జీలు..జిల్లాలోని మున్సిపాలిటీలు, మండలాల్లో లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 69,239 దరఖాస్తులు అందాయి. అందులో ఒక శాతం కూడా పరిష్కారానికి నోచుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీఓలు, మున్సిపల్ ప్రాంతాల్లో కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. అయితే ఆశించిన మేరకు క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫీజు చెల్లించేలా ప్రయత్నాలు మాత్రం జరగలేదు. దీంతో భారీగా దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. -
ఎల్ఆర్ఎస్కు మోక్షం!
ప్రభుత్వ నిర్ణయంతో నాలుగేళ్ల నిరీక్షణకు తెర ●నిబంధనల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వెంచర్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేస్తాం. జిల్లాలో అత్యధికంగా కొత్తకోట మున్సిపాలిటీలో 7వేల పైచిలుకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు వచ్చాయి. 25శాతం రాయితీ అవకాశాన్ని ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. – సైదయ్య, మున్సిపల్ కమిషనర్, కొత్తకోట -
రియల్టర్లలో కొత్త ఆశలు..
రియల్ ఎస్టేట్ వ్యాపారంపై 60 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఎల్ఆర్ఎస్తో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఒక్కసారిగా రియల్ వ్యాపారం నేలచూపులు చూసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరోసారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జన సందడి కనిపించనుంది. అప్పుల ఊబిల్లో కూరుకుపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కొంత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. రూ.కోట్లలో ఆదాయం.. 2001లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే. అయితే ఒక్కో దరఖాస్తుకు రూ.వెయ్యి చొప్పున ప్రాథమిక రుసుము వసూలు చేశారు. తద్వారా జిల్లావ్యాప్తంగా రూ. కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. అదే తరహాలో మిగతా మొత్తం చెల్లించేలా చేసి ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఎల్ఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. -
ఇసుక రీచ్‌లపై పర్యవేక్షణ తప్పనిసరి
వనపర్తి: జిల్లాలోని ఇసుక రీచ్‌లపై ఆయా ప్రాంతాల తహసీల్దార్ల పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం పెబ్బేరు మండలం వై–శాఖాపురం గ్రామ సమీపంలో ఉన్న ఇసుక రీచ్‌ను, రాంపురం గ్రామ శివారులో అధికారులు సీజ్ చేసిన ఇసుక నిల్వలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక నిల్వలు చేసినా, సరఫరా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాంపురంలో ఇసుక నిల్వల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కలెక్టర్ వెంట పెబ్బేరు తహసీల్దార్ లక్ష్మి, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలి.. జిల్లాలో ఎంపిక చేసిన 15 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో వెబెక్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా నిర్మాణం చేసుకునే వారికే పథకం వర్తిస్తుందని.. ఇదివరకు సగం నిర్మించుకున్న వారికి వర్తించదని వివరించాలని సూచించారు. ఇంటి నిర్మాణం ప్రారంభించే సమయంలో పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులకు భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలని, తహసీల్దార్లు సైతం దగ్గర్లోని రీచ్ నుంచి ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. విడతల వారీగా నగదు ప్రభుత్వం నుంచి వస్తుందని వారికి స్పష్టంగా తెలియజేయాలని కోరారు. మిగతా గ్రామాల్లో కూడా పథకం ఏ క్షణమైనా ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. అర్హుల జాబితాను మరోమారు పరిశీలించి తుది జాబితా సిద్ధం చేసుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులు జాబితాలో లేకుండా చూసుకోవాలన్నారు. తాగునీటి సమస్యలు రానివ్వొద్దు.. వేసవి సమీపిస్తున్నందున గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడకుండా.. ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో స్థానికంగా ఉండే బోర్లను వినియోగించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాల్లోని బోర్లుమోటార్లు, చేతిపంపులు పనిచేయకుండా ఉంటే వెంటనే మరమ్మతులు చేయించి సిద్ధం చేసుకోవాలని సూచించారు. నీటిట్యాంకులు పరిశుభ్రంగా ఉండాలని, పదిరోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయించాలని ఆదేశించారు. ట్యాంకర్లను సైతం అవసరానికి అనుగుణం సిద్ధం చేసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఓ సురేశ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, హౌసింగ్ అధికారులు విఠోభా, పర్వతాలు, మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజినీర్ మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
కస్తూర్బా విద్యాలయం తనిఖీ
చిన్నంబావి: మండల కేంద్రంలోని కేజీబీవీని బుధవారం మండల ప్రత్యేకాధికారి రఘునాథ్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించి తీసుకుంటున్న జాగ్రత్తలు, మెనూ అమలును అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు, రికార్డులను పరిశీలించారు. పదోతరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున సిలబస్, ప్రత్యేక తరగతుల నిర్వహణ తదితరాలపై ఆరా తీశారు. అలాగే మండలంలోని కొప్పునూరు ఎస్సీ వసతిగృహాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమణారావు, సిబ్బంది పాల్గొన్నారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయొద్దు వనపర్తి టౌన్: ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయడం నిబంధనలకు విరుద్దమని పుర శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి అన్నారు. ట్రేడ్ లైసెన్స్ వసూళ్లలో భాగంగా బుధవారం ఆయన పుర సిబ్బందితో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించగా చాలా దుకాణాలకు లైసెన్స్ లేదని గుర్తించారు. కలెక్టరేట్ మార్గంలో ఉన్న దుకాణాదారులు కూడా టేడ్ర్ లైసెన్స్ తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కొందరు దుకాణాదారులు గడువు కావాలని కోరగా, మరికొందరు లైసెన్స్ ఫీజు అధికంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు దుకాణదారులు లైసెన్స్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, అలాంటి వారికి నోటీసులిచ్చామని, గడువు ముగిసిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల కొలతల ఆధారంగా ట్రేడ్ లైసెన్స్ రుసుం వసూలు ప్రక్రియ వేగవంతం చేశామని, రోజు రూ.లక్ష లక్ష్యంగా కాగా అందుకు చేరువగా వసూలు చేస్తున్నామన్నారు. పుర సిబ్బంది చేతికి డబ్బులు ఇవ్వొద్దని.. ఆన్లైన్లో చెల్లింపులు చేసి వెంటనే రసీదు పొందవచ్చని సూచించారు. వృద్ధాశ్రమాన్ని సందర్శించిన అడిషనల్ కమాండెంట్ వనపర్తి విద్యావిభాగం: మండలంలోని చిట్యాల సమీపంలో ఉన్న చేయూత అనాథ ఆశ్రమంలోగల వృద్ధాశ్రమానికి బుధవారం 10వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ జయరాజ్, అసిస్టెంట్ కమాండెంట్ పి.శ్రీనివాసులు సందర్శించారు. వృద్ధులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులను అభినందించి నిత్యావసర సరుకులు అందజేశారు. వారి వెంట రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆర్పీ సింగ్, ఆర్ఎస్ఐ శ్రీకాంత్, బోజ్యానాయక్, ఏఆర్ఎస్ఐ జయవర్ధన్చారి, భీమయ్య, అశోక్, రవీంద్రనాయక్, సుధాకర్ తదితరులు ఉన్నారు. మన్యంకొండ హుండీ లెక్కింపు మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం హుండీలను లెక్కించగా.. రూ. 32,39,301 ఆదాయం వచ్చింది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. రాత్రి 7 గంటలకు ముగిసింది. హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు వెంకటాచారి, శ్రావణ్‌కుమార్, మంజుల, సుధ, ఐడీబీఐ మేనేజర్ రాజవర్దన్‌రెడ్డి, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
పునరావాసానికి సన్నద్ధం
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న చెంచుపెంటల తరలింపునకు అవసరమైన చర్యలను అటవీశాఖ వేగవంతం చేసింది. ఇప్పటికే కోర్ ఏరియాలో ఉన్న సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ(ఎన్టీసీఏ) ద్వారా బాధితులకు పునరావాస ప్రత్యేక ప్యాకేజీని అందజేయనున్నారు. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే అధికారులు పునరావాస ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. మరో రెండు నెలల్లోనే పునరావాసానికి పూర్తిస్థాయి అనుమతులు లభిస్తాయని భావిస్తున్నారు. విడతల వారీగా చెంచుపెంటల తరలింపు.. నల్లమల అటవీప్రాంతంలో ఉన్న పులులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న చెంచుపెంటలను ఖాళీ చేయించి, అడవి బయట వారికి పునరావాసం కల్పించేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణ, వాటికి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలు కల్పించడం, వన్యప్రాణులకు, మనుషులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిరోధించడంలో భాగంగా పునరావాస ప్రక్రియను చేపడుతున్నట్టు అటవీశాఖ చెబుతోంది. ఇప్పటికే ఇందుకోసం ప్రక్రియను ప్రారంభించగా, తొలి విడతగా తరలించనున్న సార్లపల్లి, కుడిచింతలబైలు, వటవర్లపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించి, స్థానికుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా తరలింపునకు ఒప్పుకున్న వారికే పునరావాస ప్యాకేజీని అమలు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బలవంతం చేయబోమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ స్థానిక చెంచుల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. తొలి విడతలో మూడు గ్రామాలు.. నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉన్న సుమారు 20 వరకు చెంచుపెంటలను విడతల వారీగా ఖాళీ చేయించి మరో చోట పునరావాసం కల్పించాలని అటవీశాఖ భావిస్తోంది. వీటిలో మొదటి విడతగా సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయి సర్వేతో పాటు కుటుంబాల నుంచి అంగీకార పత్రాలను సేకరిస్తోంది. సార్లపల్లిలో మొత్తం 269 కుటుంబాలు ఉండగా, వీరిలో 83 కుటుంబాలు మాత్రమే చెంచులు కాగా, మిగతా ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో ఇతర వర్గాలు మాత్రమే తరలింపునకు అంగీకారం చెబుతుండగా, మెజార్టీ చెంచులు ఒప్పుకోవడం లేదు. ప్యాకేజీ కింద 5 ఎకరాలు.. లేదంటే రూ.15 లక్షలు అడవిని ఖాళీ చేసి మరో చోటుకు తరలుతున్న స్థానికులకు పునరావాసం కింద ఎన్టీసీఏ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ, లేదా 5 ఎకరాల భూమి కేటాయిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని బాధితులు ఎంచుకోవచ్చు. ఖాళీ చేయనున్న గ్రామస్తులకు పునరావాసం కల్పించేందుకు పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఇప్పటికే భూమిని గుర్తించారు. అక్కడే పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు ఇళ్లు, పాఠశాల, రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించనున్నారు. నల్లమల అడవి నుంచి చెంచుపెంటలతరలింపునకు కొనసాగుతున్న కసరత్తు మొదటి విడతలో కుడిచింతలబైలు,సార్లపల్లి, వటవర్లపల్లి గ్రామాలు ఎన్టీసీఏ ద్వారా ప్రత్యేక పునరావాస ప్యాకేజీ పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఏర్పాట్లు -
22న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల రాక
ఖిల్లాఘనపురం: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 22న మండలానికి వస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఖిల్లాఘనపురం, గోపాల్పేట మండలాలకు దూరమవుతున్నందున రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి కోరిక మేరకు పెద్దమందడి, ఖిల్లాఘనపురం రెండు మండలాలకు కలిపి మండల కేంద్రంలో నూతన వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. షాపురం గ్రామానికి వెళ్లే కూడలి సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో మార్కెట్‌యార్డు ఏర్పాటుకు మంత్రి భూమిపూజ చేస్తారని వివరించారు. అలాగే గోపాల్‌పేటలో కూడా మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మండలానికి వ్యవసాయ మార్కెట్‌యార్డును మంజూరు చేసినందుగాను పలువురు నాయకులు, రైతులు, వ్యాపారులు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు. ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ.. కొత్తకోట: మండలంలోని సంకిరెడ్డిపల్లిలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి ఈ నెల 22న మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి భూమిపూజ చేయనున్నట్లు సీడీసీ చైర్మన్ గొల్లబాబు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
సాగునీటి కోతలు
●రెండ్రోజులు సరికాదు.. యాసంగిలో జూరాల ఎడమకాల్వ ద్వారా రామన్‌పాడు వరకు మాత్రమే నీటిని అందిస్తామని అధికారులు ప్రకటించారు. అమరచింత ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు వదులుతుండటంతో 4 ఎకరాల్లో వరి సాగుచేశా. వారబందీ విధానంలో 5 రోజులు సాగునీరు వదులుతున్నా పంటలకు సరిపడా అందక ఇబ్బందులు పడుతున్నాం. అలాంటిది ఇకపై వారంలో రెండు రోజులు మాత్రమే అందిస్తామని చెప్పడం సరికాదు. – వెంకట్‌రెడ్డి, రైతు, అమరచింత అమరచింత: జూరాల జలాశయం ఆయకట్టుకు యాసంగిలో వారబందీ విధానంలో అధికారులు సాగునీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతుండటంతో ఇక నుంచి వారంలో రెండ్రోజులే సాగునీరు వదలాలని నిర్ణయించారు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తగినంత లేదని ఈసారి యాసంగి సాగు ఆయకట్టును 34,246 ఎకరాలకు కుదించిన విషయం తెలిసిందే. ఎడమ కాల్వ విభాగంలో రామన్‌పాడు రిజర్వాయర్ వరకు ఉన్న అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని ప్రాజెక్టు అధికారులు ప్రకటించడంతో పాటు ఆయా ప్రాంతాల రైతులకు సైతం సాగు ప్రారంభంలోనే అవగాహన కల్పించారు. గతేడాది కూడా యాసంగిలో అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈసారి వానాకాలంలో ఎగువ నుంచి తగినంత వరద వచ్చినా ప్రాజెక్టులో ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోకపోవడంతో ఈ దుస్థితి తలెత్తిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో రెండ్రోజులే.. జూరాల ఆయకట్టుకు వారంలో రెండ్రోజులే నీటిని అందించేందుకు సిద్ధమయ్యారు. మంగళ, బుధవారం నీటిని సరఫరా చేసి మిగిలిన రోజులు నిలిపివేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు వివరించారు. గతంలో వారబందీ విధానంలో వారంలో 4 రోజులు సాగునీటిని అందించి, మూడు రోజులు నిలిపివేసేవారని.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఇటు పంటలకు, అటు తాగునీటి కష్టాలు తలెత్తకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జూరాల ఆయకట్టుకు వారంలో రెండ్రోజులే నీటి సరఫరా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. జూరాల జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుంది. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలగొద్దనే ఇకపై వారంలో రెండ్రోజులు మాత్రమే సాగునీటిని వదలాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ విషయాన్ని కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు రైతులకు తెలియజేయాలని సంబంధిత ఏఈలకు వివరించాం. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.256 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రభుత్వం ముందుచూపుతో సాగునీటిని పొదుపుగా ఇవ్వాలని నిర్ణయించింది. – జుబేర్ అహ్మద్, ఈఈ, జూరాల ప్రాజెక్టు, గద్వాల డివిజన్ ప్రాజెక్టులో 5.256 టీఎంసీలు.. ప్రస్తుత యాసంగిలో జూరాల జలాశయం ప్రధాన కుడి కాల్వ కింద సుమారు 15 వేల ఎకరాలు, ప్రధాన ఎడమ కాల్వల కింద రామన్‌పాడు జలాశయం వరకు సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. ఇందుకుగాను 4.93 టీఎంసీల నీటిని కేటాయించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.256 టీఎంసీల నీరు ఉండగా.. ఇందులో 2.593 టీఎంసీలను వేసవిలో తాగునీటి అవసరాలకు వినియోగించేందుకు కేటాయించారు. తాగు, సాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ముందస్తుగా వారబందీని అమలు చేస్తూ వచ్చారు. రైతులను ఆగం చేయడమే.. అమరచింత ఎత్తిపోతల పథకం కింద ఐదు ఎకరాల్లో వరి సాగుచేశా. ఎత్తిపోతలకు జూరాల నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. వారంలో 5 రోజులు నీటిని అందిస్తున్నా పుష్కలంగా అందడం లేదని దిగాలుతో ఉన్నాం. అలాంటిది 2 రోజులు మాత్రమే వదలడమంటే రైతులను ఆగం చేయడమే. – శ్రీనివాస్‌రెడ్డి, రైతు, అమరచింత అసలే వారబందీ.. ఆపై కుదింపు యాసంగి సాగుకు తప్పని కష్టాలు ఆందోళనలో ఆయకట్టు రైతులు -
సక్రమంగా ఇస్తేనే వెళతాం..
ఎన్నాళ్ల నుంచో అడవినే నమ్ముకుని ఉంటున్నాం. పులులు, వన్యప్రాణుల సంరక్షణకు మా ఊరిని ఖాళీ చేసి మరో చోటికి పంపిస్తాం అంటున్నారు. పునరావాసం కింద నష్టపరిహారాన్ని అందించి, అక్కడ సౌకర్యాలు కల్పించిన తర్వాతే వెళతాం. అందరికీ న్యాయమైన పరిహారాన్ని అందించి పునరావాస ప్రక్రియ చేపట్టాలి. – మండ్లి భౌరమ్మ, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్ మండలం జీవనోపాధి కల్పించాలి.. ఏళ్లుగా మా ఊరిని ఖాళీ చేయించి, మమ్మల్ని మరో చోటుకి తరలిస్తామని చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది, పరిహారం ఎప్పుడు అందుతుందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. పునరావాసం కల్పిస్తే అక్కడ జీవనోపాధి కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలి. – పోషప్ప, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్ మండలం స్వచ్ఛందంగా తరలింపు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న ఆవాసాల్లో ఉంటున్న వారిని అడవి బయట పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరలింపు ప్రక్రియ స్వచ్ఛందంగా అంగీకారం తెలిపిన వారికే చేపడతాం. పునరావాసం కింద రూ.15 లక్షల ఆర్థిక సహాయం, లేదా 2 హెక్టార్ల భూమి కేటాయింపు ఉంటుంది. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ ● -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి
గోపాల్పేట: మండలంలోని చెన్నూరుకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించి మార్చి 15 నాటికి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కోరారు. బుధవారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా చెన్నూరులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సందర్శించి ఆవరణను పరిశీలించారు. మురుగు సమస్యను వెంటనే పరిష్కరించాలని, మెనూ విధిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. తర్వాత బుద్దారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీచేసి వంటగదిని పరిశీలించారు. బియ్యం, కూరగాయలు చూసి మెనూ పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి బోధన వివరాలు తెలుసుకొని వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం తాడిపర్తిలో వైకుంఠధామాన్ని పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడి నీటి సరఫరా, ఇతర సమస్యలపై ఆరా తీశారు. నిధులు మంజూరు చేసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీఓ శంకర్‌నాయక్, ఇతర మండలాల అధికారులు ఉన్నారు. మార్చి 15 నాటికి బేస్మెంట్ లెవల్ పూర్తికావాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ -
బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత
పాన్‌గల్: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి సంధ్యారాణి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జీసీఈసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. వారిని చులకనగా చూడకుండా బాలురతో సమానంగా చదివించాలని సూచించారు. జీసీఈసీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ బాక్స్ (ఫిర్యాదుల పెట్టె)ను వినియోగించుకొని సమస్యలను కాగితంపై రాసి బాక్సులో వేయాలన్నారు. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఏ రంగంలో తక్కువ కాదని.. నిర్దేశించుకున్న లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. బాలికల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ వారికి అండగా నిలవాలని ఎస్ఐ శ్రీనివాసులు, డా. చంద్రశేఖర్, ఎంఈఓ శ్రీనివాసులు తెలిపారు. సమావేశంలో బాలికల సాధికారత కమిటీ జిల్లా కో–ఆర్డినేటర్, ఇన్చార్జ్ హెచ్ఎం కిరణ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు హైమావతి, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కూలీలు, సాగుదారులు
87.6%92.2%కూలీలు సాగుదారులు86.9%88.2%33.9 %81.1%27.3 %25.9 %22.3 %20.8 %వనపర్తినారాయణపేటజో.గద్వాలనాగర్కర్నూల్మహబూబ్నగర్ -
ఏసీబీకి చిక్కిన మక్తల్ సీఐ
మక్తల్: ఓ కేసు విషయంలో వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌కు చెందిన సందె వెంకట్రాములు మక్తల్‌లో శ్రీనిధి సొసైటీని ఏర్పాటు చేశారు. సొసైటీలో కొందరు వ్యక్తులతో బేధాభిప్రాయాలు రావడంతో మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఒకరు ఫిర్యాదు చేయడంతో సందె వెంకట్రాములుపై కేసు నమోదు చేశారు. బెయిల్ కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా.. ప్రతి సోమవారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌కు రావాలని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ వచ్చింది. ఆఫీసు, ఇళ్లలో సోదాలు.. కేసుకు సంబంధించిన చార్జీషీటు కోర్టులో దాఖలు చేయాల్సిన విషయంలో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు గాను మక్తల్ సీఐ జి.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సందె వెంకట్రాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ముందస్తుగా ప్రణాళిక ప్రకారం మంగళవారం మక్తల్ పోలీస్ కార్యాలయంలో నిందితుడి నుంచి కానిస్టేబుల్ నర్సింహ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ శివారెడ్డిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ కార్యాలయం, కానిస్టేబుళ్ల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డిలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. దాడుల్లో ఏసీబీ అధికారులు లింగస్వామి, జిలాని సయ్యద్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
అన్నింటా.. అట్టడుగు
సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని సూచించే అక్షరాస్యత, తలసరి ఆదాయం, జీఎస్డీపీ, మౌలిక సదుపాయాల కల్పన ఇలా అన్నింట్లోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే అట్టడుగున కొనసాగుతున్నాయి. అక్షరాస్యత విషయంలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు రాష్ట్రంలోనే వెనకబడే ఉన్నాయి. ఈ జిల్లాల్లో అక్షరాస్యత శాతం కనీసం 50 శాతం కూడా మించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టిక్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ● పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్స్లోనూ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 28.8 శాతం మంది విద్యార్థులు పాఠశాల దశలోనే చదువుకు దూరమవుతున్నారు. ఇక వనపర్తి జిల్లా 8.81 శాతం మంది డ్రాపౌట్స్‌తో కాస్త మెరుగ్గా ఉంది. విద్యార్థులకు, ఉపాధ్యాయుల నిష్పత్తిలోనూ గద్వాల, నారాయణపేట జిల్లాలు వెనకబడి ఉన్నాయి. ఉపాధ్యాయుల కొరతలో జోగుళాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. ● తలసరి ఆదాయం విషయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు చివరి వరుసలో ఉన్నాయి. నారాయణపేట జిల్లా రూ.1,94,962 తో అట్టడుగున ఉండగా.. తర్వాతి వరుసలో జోగుళాంబ గద్వాల జిల్లా కొనసాగుతోంది. అభివృద్ధి పురోగతికి సూచీగా నిలిచే జీఎస్డీపీలోనూ నారాయణపేట జిల్లా చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఈ విషయంలో మహబూబ్‌నగర్ జిల్లా కాస్త మెరుగ్గా మొదటి నుంచి పదో స్థానంలో కొనసాగుతోంది. ఉపాధి, పరిశ్రమలు కరువు.. ఉమ్మడి జిల్లాలో ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు లేకపోవడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాల్లోనూ వెనుకబాటు కనిపిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో కేవలం 18 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 297 పరిశ్రమలు ఉన్నాయి. పశుసంపదలో మేటి.. పశుసంపద విషయంలో రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చితే ఉమ్మడి పాలమూరు మేటిగా నిలిచింది. ముఖ్యంగా నారాయణపేట జిల్లా 12.95 లక్షల గొర్రెలతో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. కూలీల సంఖ్య విషయానికి వస్తే గద్వాల జిల్లా 92.2 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా.. వనపర్తి జిల్లాలో 88.2 శాతం మంది కూలీలు ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 33.9 శాతం మంది సాగుదారులు ఉన్నట్టు నివేదికలో వెల్లడయింది. రాష్ట్రంలోని మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల తర్వాత నాగర్‌కర్నూల్‌లోనే అత్యధికంగా 21.4 శాతం ఎస్సీ జనాభా ఉంది. హైదరాబాద్, కరీంనగర్ తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లాలో తక్కువగా 1.5 శాతం మంది మాత్రమే ఎస్టీలు ఉన్నారు. జాతీయ రహదారుల విస్తరణ విషయంలో నల్లగొండ మొదటిస్థానంలో ఉండగా.. నాగర్‌కర్నూల్ జిల్లా 252.83 కి.మీ., విస్తీర్ణంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య) అక్షరాస్యతలో రాష్ట్రంలోనే చివరన ఉమ్మడి పాలమూరు గద్వాల, పేటలో 50 శాతంలోపే.. తలసరి ఆదాయంలోనూ అంతంత మాత్రమే మౌలిక సదుపాయాల కల్పనలో చివరి వరుసలోనే తెలంగాణ స్టాటిస్టిక్ రిపోర్టులో వెల్లడి జనాభా సాంద్రతలో.. (ప్రతి చదరపు కిలోమీటర్‌కు) -
లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి
వనపర్తిటౌన్: లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం శాశ్వతమని.. కోర్టుకు వెచ్చించే సమయం కూడా ఆదా కావడంతో పాటు ఫీజు వాపస్ ఇవ్వబడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని న్యాయ విజ్ఞాన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రజనితో కలిసి మాట్లాడారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్ గొప్ప అవకాశమని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో రాష్ట్రంలోనే జిల్లా స్థానం రోజురోజుకు మెరుగుపడుతుందని వివరించారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించి రాష్ట్రంలో 22వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. వచ్చే నెలలో జరిగే లోక్‌అదాలత్‌లో రెట్టింపు కేసుల పరిష్కారమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేసి క్షేత్రస్థాయిలో వేగవంతం చేశామని, ఇందుకు పోలీసు, న్యాయవాదుల పాత్ర కూడా కీలకమని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత -
‘సైబర్’ బారిన పడొద్దు
సాంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిద్దాం వనపర్తి: ఛత్రపతి శివాజీ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, డీజే సంస్కృతి మాని సాంప్రదాయ నృత్యాలను ప్రోత్సహించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో హిందూవాహిని కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మా ట్లాడారు. ఇతర మతస్తులను గౌరవిస్తూ ఐక్యతను చాటాలని సూచించారు. శోభాయాత్రకు బందోబస్తు కల్పిస్తామని, ట్రా ఫిక్ అంతరాయం తలెత్తకుండా చూస్తామని, ప్రజలు సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. ధ్వని కాలుష్యాన్ని పెంచే డీజేను ఉపయోగించరాదన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, వనపర్తి పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌గౌడ్, కొత్తకోట, ఆత్మకూర్, పెబ్బేరు, శ్రీరంగాపురం హిందూవాహిని మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరచింత: కొందరు సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని.. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయ ఆవరణలో ఉన్న ఫంక్షన్హాల్లో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో చేనేత ఉత్పత్తుల సంఘం సభ్యులు, విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిత్య జీవితంలో కష్టపడి పని చేయడంతోనే డబ్బులు వస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సైబర్ నేరగాళ్లు రూ.లక్ష గెలుచుకున్నారు.. బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నంబర్ పంపమని సెల్ఫోన్లకు సందేశాలు పంపిస్తుంటారని అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేసి మాట్లాడితే వారికి సమాధానం చెప్పకుండా మరోమారు కాల్ చేయొద్దని గట్టిగా చెప్పాలన్నారు. అమ్మాయిల ఫోన్లకు ఆశపడి అబ్బాయిలు ఆకర్షణకు లోనైతే న్యూడ్ కాల్స్ పేరిట బెదిరింపులకు పాల్పడటం, అందినంత దోచుకుంటారని.. వారి వేధింపులు భరించలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయని వివరించారు. అమ్మాయిలు సైతం పరిచయం లేని వ్యక్తులు ఫోన్‌చేస్తే కఠిన సమాధానం ఇవ్వాలన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్.. విద్యార్థులు లక్ష్యాలను చేరుకోవాలంటే ఉపాధ్యాయులు బోధించే విషయాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవడంతోనే సాధ్యమవుతుందని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయులను గౌరవించాలని, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో నిత్యం మాట్లాడుతూ రోజువారీ విషయాలు తెలుసుకోవాలని.. అలాగే ఉపాధ్యాయులను కలిసి పిల్లల ప్రవర్తన గురించి ఆరా తీయడం మంచిదని తెలిపారు. దీంతో పిల్లలు చెడు అలవాట్ల బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ నోడల్ ఏజెన్సీ కో–ఆర్డినేటర్ రాజ్‌కుమార్, ఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ సీఈఓ చిన్నమ్మ థామస్, అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం సీఈఓ శేఖర్, ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, చేనేత సహకారం సంఘం డైరెక్టర్ పొబ్బతి వెంకటస్వామి, ఎస్ఐ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
అసంపూర్ణం.. అస్తవ్యస్తం!
జిల్లాలో అసంపూర్తిగా సాగునీటి కాల్వల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిన లింక్ కెనాల్ పనులు.. సింగోటం రిజర్వాయర్ నుంచి గోపలదిన్నె రిజర్వాయర్‌కు లింక్ కెనాల్ నిర్మాణ పనులు కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వీపనగండ్ల మండలం వల్లభాపురం వద్ద నిలిపిపోయాయి. తిరిగి పనులు ఎప్పుడు ప్రారంభమవుతానే విషయం అధికార, పాలకవర్గం వెల్లడించాల్సి ఉంది. ● పాన్‌గల్ మండలం అన్నారం, అన్నారం తండా, గోప్లాపురం గ్రామాల వద్ద పొలాలకు కనుచూపు మేరల్లో కృష్ణా జలాలు పారుతున్నా.. కొద్దిపాటి కాల్వ తవ్వకం పనుల జాప్యంతో సాగు నీరందక మూడు గ్రామాల రైతులు దశాబ్ద కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. కేఎల్ఐ డి–8, ఎంజే–6 కాల్వల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో దావత్ఖాన్పల్లి, ఆకునోనిపల్లి గ్రామాలకు సాగునీరు అందడం లేదు. ● వీపనగండ్ల మండలంలో జూరాల 16వ ప్యాకేజీ కాల్వలో భారీగా పూడిక పేరుకుపోవడంతో సంగినేనిపల్లె వరకు రావాల్సిన నీరు పుల్గరచర్ల, కల్వరాల, వీపనగండ్లలోని కొద్ది ప్రాంతానికి మాత్రమే అందుతున్నాయి. కాల్వ నీటిపై ఆశలు వదులుకున్న రైతులు ప్రత్యేక పైప్లైన్లు వేసి మోటార్లతో పొలాలకు నీరు తరలించుకుపోతున్నారు. మండలంలోని జూరాల డిస్ట్రిబ్యూటరీ 23 నుంచి 28 వరకు లైనింగ్ ధ్వంసమై భారీగా పూడిక పేరుకుపోయింది. ● చిన్నంబావి మండలంలో డిస్ట్రిబ్యూటరీ 29, 30 కాల్వ నుంచి 39వ డిస్ట్రిబ్యూటరీ కాల్వలో ఉన్నాయి. మండలంలోని ఏడు గ్రామాలకు జూరాల కాల్వ ద్వారా సాగునీరు అందాల్సి ఉండగా.. సక్రమంగా రాకపోవడంతో మండలంలోని చాలామంది రైతులు వర్షాకాల పంటలు మాత్రమే సాగుచేస్తుండటం గమనార్హం. ● అమరచింత మండలంలోని నాగల్‌కడ్మూర్, ఈర్లదిన్నె, మిట్టనందిమళ్ల, చంద్రఘడ్, నందిమళ్ల క్రాస్‌రోడ్, కిష్టంపల్లి, ధర్మాపురం వరకు సాగునీరు అందించేందుకు భీమా ఫేజ్–1లో భాగంగా కాల్వలు తవ్వినా నీరు పారక ప్రయోజనం లేకుండా పోయింది. అమరచింత మండలంలోని కొన్ని గ్రామాల రైతులు చంద్రఘడ్ ఎత్తిపోతలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ● ఆత్మకూరు మండలంలోని కట్టకింది గ్రామాల్లో గల జూరాల డి–6, డి–21 కాల్వల లైనింగ్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఏటా సాగునీరు భారీగా వృథా అవుతున్నా నేటికీ మరమ్మతులు చేపట్టడం లేదు. వనపర్తి: జూరాల, భీమా, కేఎల్ఐ సాగునీటి కాల్వల అసంపూర్తి పనులు, నిర్వహణపై నిర్లక్ష్యం అలుముకుంది. కేవలం 150 మీటర్ల కాల్వ తవ్వితే మూడు గ్రామాలకు సాగునీరు అందుతుందని.. సుమారు దశాబ్ద కాలంగా ప్రతిపాదనలకే పరిమితమైందంటూ సోమవారం పానగల్ మండలంలోని అన్నారం, అన్నారంతండా రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సాగునీటి కాల్వల నిర్వహణ, పెండింగ్ పనులు పూర్తి చేయాలనే డిమాండ్ పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట మండలాల్లోని గ్రామాల్లో వినిపిస్తుంది. ● జూరాల కాల్వల్లో ఏపుగా పెరిగిన చెట్లను తొలగించడం, పూడికతీత, ధ్వంసమైన లైనింగ్ నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉండగా.. భీమా కాల్వలు పలుచోట్ల నిర్మించాల్సి ఉంది. కేఎల్ఐ విషయానికొస్తే డి–8, ఎంజే 4, ఎంజే 6తో పాటు బుద్ధారం కుడి, ఎడమ కాల్వల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నట్లు అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. త్వరగా పూర్తి చేస్తాం.. కేఎల్ఐ పరిధిలో పెండింగ్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పాన్‌గల్ మండలంలో సోమవారం రైతులు ఆందోళన చేపట్టడంతో అసంపూర్తి కాల్వ పనులను పరిశీలించాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. కాల్వల్లో పూడికతీత పనులు వేసవిలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – మధుసూదన్‌రావు, ఈఈ, జిల్లా సాగునీటిపారుదలశాఖ ● చివరి ఆయకట్టుకు గ్రహణం ఆందోళనలో అన్నదాతలు కేఎల్ఐ బకాయి పనులకు గుత్తేదారును మార్చిన అధికారులు రూ.60 కోట్ల పనులు పెండింగ్ కేఎల్ఐ పరిధిలోని మేజర్ కాల్వలతో పాటు బుద్ధారం కుడి, ఎడమ కాల్వలు, స్ట్రక్చర్స్ పనులు సుమారు రూ.60 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది.. ఈ విషయంపై ఇటీవల వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సాగునీటి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడంతో అధికారులు మరో సంస్థకు పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. -
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
వనపర్తి: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, జి.వెంకటేశ్వర్లు పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. అనంతరం సంబంధిత అధికారులతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాలు, పురపాలికల్లో నీటి వనరులను పరిశీలించాలని ఆదేశించారు. బోరుమోటార్ల మరమ్మతులు, మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు. ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని, ప్రతిరోజూ నివేదిక అందజేయాలని ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను టోల్‌ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, మిషన్ భగీరథ ఈఈ మేఘారెడ్డి, విద్యుత్‌శాఖ ఎస్ఈ రాజశేఖరం, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, నీటిపారుదలశాఖ ఎస్ఈ శ్రీనివాసులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
అప్‌గ్రేడ్ అందని ద్రాక్షేనా?
దశాబ్దాలుగా గ్రేడ్–3 పురపాలికగా వనపర్తి వార్షిక ఆదాయం అంచనా రూ.4.77 కోట్లు.. వనపర్తి పట్టణ వార్షిక ఆదాయం రూ.4.77 కోట్లు సమకూరుతుందని అధికారులు లక్ష్యం నిర్దేశించుకొని పనిచేస్తున్నారు. రెండేళ్లుగా.. పట్టణాభివృద్ధి 70 శాతం జనరల్ ఫండ్ నుంచే చేస్తున్నట్లు అధికారుల నివేదికల ద్వారా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ మినహా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో విడుదలయ్యే సీఐఎస్ (పరిసరాల అభివృద్ధి నిధి) నిలిచిపోయింది. పట్టణ ప్రగతి నిధులు సైతం నిలిచిపోవడంతో పురపాలికకు వచ్చే ఆదాయంతోనే అభివృద్ధి పనులు, ఇతర ఖర్చులు చూసుకుంటున్నారు. ఐదేళ్లలో రెండు పాలకవర్గాలు కొలువుదీరాయి. ఆయా పాలకవర్గాలు అభివృద్ధి పేరుతో నిధులు ఖర్చు చేసే విషయంపై ఉన్న ధ్యాస.. పుర ఆదాయాన్ని పెంచే అంశంపై చూపించలేదనే విమర్శలు ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం మున్సిపల్ కాంప్లెక్స్–1 టెండర్లు నిర్వహించి పెరిగిన ధరలకు అనుగుణంగా అద్దెలను పెంచడం.. నిబంధనల ప్రకారం 25 ఏళ్లు దాటితే ప్రభుత్వ అనుబంధ దుకాణ సముదాయాల పాత లీజును రద్దు చేస్తూ కొత్తగా టెండర్ నిర్వహించి మారిన ధరలకు అనుగుణంగా కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు వనపర్తి మున్సిపాలిటీలో అమలు కావడం లేదన్నది బహిరంగ సత్యం. వనపర్తి: వనపర్తి పుర ప్రజల కల అప్‌గ్రేడ్ దశాబ్దాలుగా అందని ద్రాక్షగానే మిగులుతోంది. 2012లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన గజ్వేల్‌ను సైతం ఇటీవల గ్రేట్–2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసేందుకు దస్త్రాలు కదులుతుండగా.. 1984లో ఏర్పడిన వనపర్తి పురపాలికపై నిర్లక్ష్యం అలుముకుంది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు గద్వాలతో పాటు వనపర్తి మున్సిపాలిటీని సైతం గ్రేడ్–2గా అప్‌గ్రేడ్ చేయాలని అప్పటి ప్రభుత్వానికి స్థానిక పాలక, అధికార వర్గం ప్రతిపాదనలు పంపినా.. ఈ పురపాలిక విషయంలో వివక్ష కొనసాగింది. జనాభా, ఆదాయ వనరులు, పట్టణ విస్తీర్ణంలో గద్వాలకు ఏమాత్రం తీసుకొని వనపర్తి నేటికీ గ్రేడ్–3 మున్సిపాలిటీగానే కొనసాగుతుండటం శోచనీయం. తాజాగా కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా, మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా, గజ్వేల్లాంటి మున్సిపాలిటీని గ్రేడ్–2గా అప్‌గ్రేడ్ చేశారు. వనపర్తి విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం స్థానికంగా కొంత నిరుత్సాహం అలుముకుంది. వనపర్తిని గ్రేడ్–2గా అప్‌గ్రేడ్ చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధుల కొంతమేర పెరగుతాయి. 2019 పుర ఎన్నికల సమయంలో.. 2019 మున్సిపల్ ఎన్నికల సమయంలో పట్టణానికి సమీపంగా ఉన్న ఆరు గ్రామాలను పంచాయతీరాజ్ నుంచి మున్సిపాలిటీలో విలీనం చేశారు. వార్డులను సైతం 24 నుంచి 33కి పెంచారు. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను, అభివృద్ధి, బెటర్మెంట్ చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ పన్ను తదితర ఆదాయాలు మరింతగా పెరిగాయి. విలీన గ్రామాల్లో రాజనగరం, వడ్డెవాడ, నాగవరం, శ్రీనివాసపురం, మర్రికుంట, మర్రికుంటతండా ఉన్నాయి. వనపర్తి పట్టణ వ్యూ లక్షకు పైగా జనాభా.. 62,144 మంది ఓటర్లు.. ప్రస్తుత పట్టణ జనాభా 1.04 లక్షలు ఉండవచ్చని అధికారుల ప్రాథమిక అంచనా. నిత్యం వివిధ అవసరాల నిమిత్తం సమీప గ్రామాల నుంచి 20 వేల నుంచి 30 వేల మంది జిల్లాకేంద్రానికి వచ్చి వెళ్తుంటారు. గత మున్సిపల్ ఎన్నికల సమయానికి పట్టణ ఓటర్ల సంఖ్య 54,992 ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 62,144కు పెరిగిందని అధికారిక లెక్క. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలోగా మరో వెయ్యికి పైగా ఓట్లు పెరిగే అవకాశం లేకపోలేదు. పదేళ్లుగా ఎదురుచూపులు నిధుల ఖర్చుపైనే పాలకుల మక్కువ ఎక్కువ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్‌తోనే పాలన -
పైరవీకారులను ఆశ్రయించొద్దు
వనపర్తి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే రూ.5 లక్షలు విడతల వారీగా నేరుగా వారి ఖాతాల్లోనే జమవుతాయని.. పైరవీకారులను ఆశ్రయించొద్దని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం సూచించారు. సోమవారం మండలంలోని రాజపేట, అప్పాయిపల్లిలో గత ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పరిశీలించారు. అక్కడి సమస్యలను నివాసం ఉంటున్న వారిని అడిగి తెలుసుకున్నారు. కనీస మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరగా సానుకూలంగా స్పందించారు. అప్పాయిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సువర్ణ, వరలక్ష్మి ఇళ్లను సందర్శించి వారి ఆర్థిక స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు పనులు ప్రారంభించి నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటి నమూనాను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సచిత్ గంగ్వార్, జి.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, హౌసింగ్ అధికారులు విఠోభా, పర్వతాలు, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, ఎంపీడీఓ రాఘవ, తహసీల్దార్ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
మార్చి 8న జాతీయ లోక్ అదాలత్
వనపర్తి టౌన్: జాతీయ లోక్ అదాలత్‌లో సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత తెలిపారు. సోమవారం జిల్లా న్యాయస్థానంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అధికారుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని.. సాధ్యమైనన్ని కేసులు రాజీ మార్గంలో పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. కక్షిదారులను సంప్రదించి రాజీ కుదర్చాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, అన్ని న్యాయస్థానాల న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు. -
కార్చిచ్చు ముప్పు..
విలువైన చెట్లు.. ఔషధ మొక్కలు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుగా నల్లమల అమ్రాబాద్ అభయారణ్యం గుర్తింపు పొందింది. ఇక్కడ ఔషధ మొక్కలతోపాటు టేకు, నల్లమద్ది, వేప, చేదు వేప, ఇప్ప తదితర చెట్లు అధికంగా ఉన్నాయి. వేసవి ప్రారంభంలోనే ఆకులు రాలి ఎండిపోయాయి. వాహనాల్లో వెళ్తున్న వారు సిగరెట్, బీడీలు తాగి.. పూర్తిగా ఆర్పకుండానే రోడ్డు పక్కనున్న అడవుల్లోకి విసురుతుంటారు. మరోవైపు పశువుల కాపరులు, అడవుల్లోకి ప్రవేశించే ఇతర వ్యక్తులు సైతం చుట్ట, బీడీ, సిగరెట్లు కాల్చిన అగ్గిపుల్లలను నిర్లక్ష్యంగా పడేస్తుంటారు. తద్వారా మంటలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అగ్నిప్రమాదాల నివారణకు అటవీశాఖ ముందస్తు చర్యలు ● క్విక్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు ● వీవ్లైన్స్, ఫైర్లైన్స్తో మంటల అదుపు ● అటవీ సమీప గ్రామాల్లో అవగాహన సదస్సులు ● నల్లమలలో విలువైన ఔషధ మొక్కలు, వన్యప్రాణులు అచ్చంపేట: వేసవి నేపథ్యంలో నల్లమలలోని వన్యప్రాణులతోపాటు విలువైన అటవీ సంపదకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అడవుల్లో చెట్ల ఆకులు రాలే సీజన్. చెట్ల నుంచి కింద పడిన ఆకులు ఎండిపోవడంతోపాటు కుప్పలుగా కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో వాటిపై నిప్పు పడితే కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. తద్వారా అటవీ సంపదతోపాటు వన్యప్రాణులకూ ముప్పు వాటిల్లుతోంది. అయితే జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ విపత్తును నివారించవచ్చని భావిస్తున్న అటవీశాఖ అధికారులు.. జిల్లాలోని అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. అడవి బుగ్గిపాలు కాకుండా కాపాడుకునేందుకు ముందస్తుగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారికి ఇరువైపులా వీవ్లెన్స్, ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం అటవీశాఖ సిబ్బందితో అడవిలో ఎండిన ఆకులను వరుసగా పేర్చి కాల్చివేస్తున్నారు. ఒకవేళ అగ్గి రాజుకున్నా శరవేగంగా విస్తరించకుండా ఈ ఫైర్ లైన్స్‌తో అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. నల్లటి రంగుతో సరిహద్దు వేసవిలో చెట్ల ఆకులు రాలడం వల్ల చిన్నపాటి నిప్పురవ్వ పడినా అడవి దావనంలా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది నేలపై రాలిన చెట్ల ఆకులను ఒకచోట పోగు చేసి.. కిలోమీటర్ పొడవునా కాల్చుతున్నారు. తద్వారా నిప్పు అంటుకున్నా మంటలు విస్తరించవు. మరోవైపు నల్లటి రంగుతో సరిహద్దు గీత ఏర్పడి వన్యప్రాణులు సైతం అడవి దాటి బయటకు వెళ్లకుండా ఫైర్‌లైన్స్ ఉపయోగపడతాయి. శాటిలైట్ సహాయంతో.. నల్లమల అటవీ ప్రాంతంలో అగ్గి అంటుకున్న వెంటనే ఆర్పేందుకు వీలుగా అటవీశాఖ అధికారులు తక్షణ స్పందన (క్విక్ రెస్పాన్స్) బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. రేయింభవళ్లు ఎక్కడ అగ్గి రాజుకున్నా శాటిలైట్ సహాయంతో ప్రమాదాన్ని గుర్తించి.. మంటలను ఆర్పివేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మరోవైపు అటవీ సమీప గ్రామాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధి2,166.37 చ.కి.మీ., అటవీ విస్తీర్ణం 2,611.39 చ.కి.మీ., బఫర్ జోన్ (ఏటీఆర్) 445.02 చ.కి.మీ., మొత్తం ఫారెస్టు బ్లాకులు 25 నల్లమల అటవీ ప్రాంతం ఇలా.. కఠిన చర్యలు.. ఎవరైనా అడవిలో నిప్పు పెట్టినట్లు తేలితే అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. అడవులు అగ్నిప్రమాదాల బారిన పడకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాం. వీవ్లైన్స్, ఫైర్‌లైన్స్ ఏర్పాటుతో ఒకచోట నుంచి మరో చోటకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నాం. – రోహిత్‌రెడ్డి, డీఎఫ్ఓ నిరంతర గస్తీ.. అటవీ పరిరక్షణకు గస్తీ ముమ్మరం చేశాం. క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాం. ఆకతాయిలు, పశువుల కాపరులు, ఇతరులు అడవుల్లోకి అగ్గిపెట్టెలు తీసుకుపోకుండా అవగాహన కల్పిస్తున్నాం. రోడ్డు వెంట వెళ్లే వారు నిప్పు వేసినా అడవి కాలకుండా ఇరువైపులా 20 – 30 మీటర్ల వరకు గడ్డి, ఆకులను ముందుగానే కాల్చివేస్తున్నాం. – గురుప్రసాద్, ఎఫ్ఆర్ఓ, దోమలపెంట