
వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి
వనపర్తి టౌన్: వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జి స్పెషల్ ఆఫీసర్, చీఫ్ ఇంజినీరు పాండే ఆదేశించారు. వేసవి యాక్షన్ ప్లాన్ పనుల పరిశీలనలో భాగంగా సోమవారం జిల్లా విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయాలన్నారు. వ్యవసాయ, గృహ, వ్యాపార, పరిశ్రమల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని సూచించారు. వేసవి యాక్షన్ ప్లాన్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. 33కేవీ బుద్ధారం ఫీడర్ ఓవర్‌లోడ్‌ను నియంత్రించాలన్నారు. అందుకోసం 33/11 కేవీ పొలికేపాడ్ సబ్‌స్టేషన్ లోడ్‌ను 33కేవీ బుద్ధారం ఫీడర్ నుంచి 33కేవీ గోపాల్‌పేట ఫీడర్‌కు మార్చాలని ఆదేశించారు. అదే విధంగా 33 కేవీ సోళీపూర్ ఫీడర్ నిర్మాణంలో ఉన్న లైన్‌ను పర్యవేక్షించి త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. పెద్దమందడి మండలం వెల్టూర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 3.15 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో రూ. 1.10కోట్ల బడ్జెట్‌తో 5 ఎంబీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పెద్దమందడి మండలం అనకాయపల్లి తండాలో రైతులతో ఆయన సమావేశమై విద్యుత్ సమస్యలపై ఆరా తీశారు. ఆయన వెంట ఎస్‌ఈ రాజశేఖరం, వెంకటశివరాం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment