జిల్లాకేంద్రంలోనూ..
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంతో పాటు విలీన గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేదు. ఇటీవల జరిగిన పుర బడ్జెట్‌లో వెనుకబడిన, మురుగువాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు అన్నీ వార్డుల్లాగే రూ.60 లక్షలు ప్రతిపాదించారు. 21, 23 కొత్త కాలనీలు, 6, 13, 15, 22 వార్డులు, కొత్తగా వెలుస్తున్న శివారు కాలనీలైన 11, 10, 12, 4 వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఖాళీ ప్రదేశాల్లో మురుగు నిలిచి దుర్వాసన వస్తోంది. పుర కార్యాలయం ఎదుట కూడా డ్రెయినేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. పాతబజార్‌లో రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నచోట కాల్వల నిర్మాణాలు మధ్యలోనే వదిలేశారు. రహదారి విస్తరణ అరకొరగా చేపట్టిన పాన్‌గల్ మార్గంలోనూ కొన్నిచోట్ల డ్రెయినేజీలు శిథిలావస్థకు చేరుకోగా.. మరికొన్ని చోట్ల మధ్య మధ్యలో పూర్తి చేయాల్సి ఉంది. దీనికితోడు తాళ్ల చెరువు అలుగు కాల్వను పూర్తిస్థాయిలో ఆధునికీకరించకపోవడంతో మురుగు నిలిచి ఉంటుంది. మర్రికుంట, నర్సింగాయపల్లి, శ్రీనివాసపురం తదితర విలీన గ్రామాల్లోనూ డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment