పురం.. అపరిశుభ్రం
మున్సిపాలిటీల్లో రహదారులపై పారుతున్న మురుగు
అమరచింత: జిల్లాలోని పురపాలికల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అమరచింత, కొత్తకోట, ఆత్మకూర్, పెబ్బేరులో నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో మురుగు రహదారులపై పారుతుండటంతో పాటు ఇళ్ల నడుమ నిలిచి మురుగు కుంటలను తలపిస్తున్నాయి. వరాహాలు, దోమల వ్యాప్తిచెంది ప్రజలు అనారోగ్యం బారినపడి ఆస్పత్రుల పాలవుతున్న దుస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్ హయాంలో పెద్ద గ్రామపంచాయతీలను పురపాలికలుగా మార్చే సమయంలో సమీప గ్రామాలను విలీనం చేశారు. పెబ్బేరులో చెలిమిళ్ల, ఆత్మకూర్‌లో ఖానాపురం గ్రామాన్ని విలీనం చేయడంతో ఆయా గ్రామాలు పురపాలికలోని వార్డుగా మారడంతో ఆయా గ్రామాల్లో మున్సిపాల్టీ నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. కొత్త పురపాలికలకు ఆదాయ వనరులు సరిగా లేకపోవడంతో వచ్చే బడ్జెట్ నుంచే సీసీ రహదారులు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేయాలి. కానీ పూర్తిస్థాయిలో డ్రెయినేజీలు నిర్మించడంలో పుర పాలకులు విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. అవసరం ఉన్న చోట్ల వదిలి ఇతర ప్రాంతాల్లో కాల్వల నిర్మాణాలు చేపట్టడంతో పుర నిధులు వృథా అయ్యాయన్న ఆరోపణలున్నాయి.
పాలకుల నిర్లక్ష్యం..
ఎన్టీఆర్ కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక ఇబ్బందులు పడుతున్నాం. పాలకుల నిర్లక్ష్యం కారణంగా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకమండలి పదవీకాలం ముగిసి మూడు నెలలు గడుస్తున్నా అధికారులు డ్రెయినేజీల్లోని మురుగు తొలగించే చర్యలు చేపట్టడం లేదు. పుర కమిషనర్ చొరవ చూపాల్సిన అవసరం ఉంది. – లాల్‌కోట రవి, 7వ వార్డు, కొత్తకోట
డ్రెయినేజీ అస్తవ్యస్తం..
జోగినీకాలనీలో ఏళ్లుగా మురుగు వ్యవస్థ అధ్వానంగా ఉంది. మున్సిపాలిటీగా మారినా నేటికీ కొత్త డ్రెయినేజీలు నిర్మించడం లేదు. దీంతో ఇళ్ల నుంచి వస్తున్న మురుగంతా రహదారులపై పారుతోంది. అధికారులు స్పందించి మురుగు కాల్వలు నిర్మించాలి.
– వెంకటేష్, 7వ వార్డు, అమరచింత
మురుగు పేరుకుపోయింది..
పట్టణంలోని 2వ వార్డులో మురుగు సమస్య తీవ్రంగా ఉంది. చెరువు కాల్వ పూడుకుపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నిలిచి పరిసరాల్లో దుర్వాసన వస్తోంది. దీనికితోడు దోమల బెడద తీవ్రంగా ఉంది. అధికారులు స్పందించి మురుగు తొలగించడంతో పాటు డ్రెయినేజీ నిర్మించాలి.
– చింతకుంట వెంకటేష్, 2వ వార్డు, అమరచింత
● ఆత్మకూర్‌లో ఆశించిన స్థాయిలో కాల్వల నిర్మాణం పూర్తిగాకపోవడంతో మురుగు రహదారులపై పారుతోంది. విలీన గ్రామమైన ఖానాపురం గ్రామంలో సైతం డ్రైనేజీలు నిర్మించాల్సి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.
● పెబ్బేరు పురపాలికలో మురుగు వ్యవస్థ కాస్త మెరుగ్గా ఉన్నా.. వనపర్తి రోడ్‌లో రహదారి విస్తరణ పనులు చేపట్టడంతో కాల్వలు దెబ్బతిన్నాయి. దీంతో మురుగు రహదారిపై పారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీవాసులు వాపోతున్నారు. విలీన గ్రామమైన చెలిమిళ్లలో సైతం డ్రెయినేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.
● కొత్తకోట పురపాలికలో 15 వార్డులు, సుమారు 25 వేల జనాభా ఉంది. ఆయా వార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతో మురుగంతా రహదారులపైనే పారుతోంది. పట్టణంలోని విద్యానగర్‌కాలనీలో ఉన్న కాల్వల్లో మురుగు పేరుకుపోయినా తొలగించడం లేదు. దీంతో దోమలు, పందుల బెడద అధికమైంది. పలు వార్డుల్లో అవసరం మేరకు డ్రెయినేజీలు నిర్మించలేదు.
పురపాలికల వారీగా ఇలా..
నివేదిక తయారు చేస్తాం..
పురపాలికలో డ్రెయినేజీల నిర్మాణం ఎక్కడెక్కడ చేపట్టాలో పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి నిధుల మంజూరుకుగాను ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం. పట్టణంలోని 2, 7వ వార్డులో డ్రెయినేజీలు లేవని మా దృష్టికి వచ్చింది. నిర్మాణాలకు అవసరమయ్యే నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం.
– రవిబాబు, పుర కమిషనర్ అమరచింత
పట్టించుకోవడం లేదు..
కాలనీలో డ్రెయినేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల ఆవరణలో మురుగు నిలుస్తోంది. దుర్వాసనతో పాటు దోమల బెడద అధికమైంది. సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు.
– జయమ్మ,
అంబేడ్కర్‌చౌక్ సమీపకాలనీ, వనపర్తి
●
అమరచింత మున్సిపాలిటీలో పది వార్డులుండలు 2, 7 వార్డుల్లో సీసీ రహదారులు, డ్రెయినేజీల నిర్మాణాలు చేపట్టలేదు. 7వ వార్డులో మురుగు కాల్వలు లేక ఇళ్ల నుంచి వస్తున్న మురుగును రహదారులపై వదలుతున్నారు. దీంతో కాలనీలో దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద అధికంగా ఉండటంతో ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు.
ముందుకుసాగని డ్రెయినేజీల నిర్మాణాలు
చేసిన తీర్మానాలు.. ప్రతిపాదనలకే పరిమితం
దోమలు, వరాహాల సంచారంతో జనం బెంబేలు
పురం.. అపరిశుభ్రం
పురం.. అపరిశుభ్రం
పురం.. అపరిశుభ్రం
పురం.. అపరిశుభ్రం
పురం.. అపరిశుభ్రం
పురం.. అపరిశుభ్రం
పురం.. అపరిశుభ్రం
పురం.. అపరిశుభ్రం
Comments
Please login to add a commentAdd a comment