Wanaparthy District Latest News
-
హోరాహోరీగా పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు
అయిజ: మండల కేంద్రంలోని తిక్కవీరేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ వారు శుక్రవారం అంతర్రాష్ట్ర స్థాయి పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 20 పొటేళ్లు హోరా హోరీగా తలపడ్డాయి. అయిజ మండలానికి చెందిన సుల్తాన్ పొట్టేలు ప్రథమ స్థానంలో నిలిచి రూ.50వేలు, హైదరాబాద్‌కు చెందిన రాజావలి, ఎంజీ గ్రూప్, క్రైమ్ మేకర్ పొట్టేళ్లు ద్వితీయ, తృతీయ, నాల్గో స్థానాల్లో నిలిచి రూ.35వేలు, 20వేలు, రూ.10వేలు గెలుచుకున్నాయి. అనంతరం విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు. -
ఇన్చార్జ్ అదనపు కలెక్టర్‌గా యాదయ్య
వనపర్తి: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ నారాయణపేటకు బదిలీ కావడంతో జెడ్పీ సీఈఓ యాదయ్యకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మార్కెట్ యార్డు నిర్మాణ స్థలం మార్పు ఖిల్లాఘనపురం: ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాలకు కలిపి ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డును మంజూరు చేసింది. మొదట మార్కెట్ యార్డును షాపురం గ్రామానికి వెళ్లే కూడలిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని నిర్ణయించారు. శిలా ఫలకం నిర్మాణం, ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులుగౌడ్ శుక్రవారం సాయంత్రం అక్కడికి చేరుకున్నారు. మార్కెట్‌యార్డును మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలంటూ స్థానికులతో పాటు అటువైపు ఉన్న గ్రామాల నాయకులు ఏర్పాట్లను పరిశీలించేందుకు రాకుండా పద్మశాలి కళ్యాణ మండపం దగ్గర అలిగి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారికి ఫోన్లో నచ్చజెప్పేందుకు యత్నించినా వారు ఒప్పుకోకపోవడంతో చేసేది లేక నేరుగా అక్కడికి చేరుకున్నారు. మండల కేంద్రంలోనే ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు, రైతులు పట్టుబట్టారు. నిర్మాణానికి అవసరమైన స్థలం చౌడమ్మ గుట్ట దగ్గర ఉండటంతో ఎమ్మెల్యేతో పాటు నాయకులు వెళ్లి పరిశీలించారు. నిర్మాణానికి ఎమ్మెల్యే అంగీకరించడంతో నాయకులు, రైతులు ఆయనను శాలువాతో సన్మానించారు. శిలా ఫలకం ఏర్పాటుకు స్థలాన్ని శుభ్రం చేసే పనులను నాయకులు వెంటనే ప్రారంభించారు. మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, మాజీ సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్రావు, సింగిల్‌విండో వైస్ చైర్మన్ రాజు, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్, సాయిచరణ్‌రెడ్డి, నాయకులు ఉన్నారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా పాలమూరు: జిల్లాలో విద్యుత్ డిమాండ్ గతేడాది కంటే ఈసారి 18 శాతం పెరిగిందని, ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. జిల్లాలో విద్యుత్ శాఖ వేసవి యాక్షన్ ప్లాన్ పనులను శుక్రవారం పరిశీలించడంతోపాటు టీడీగుట్ట సబ్‌స్టేషన్‌లో దాదాపు రూ.కోటి వ్యయంతో అదనంగా ఏర్పాటు చేసిన ఐదు ఎంవీఏ ఫవర్ ట్రాన్స్ఫార్మర్లను కలెక్టర్ విజయేందిరతో కలిసి సీఎండీ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో విద్యుత్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది పీక్ డిమాండ్ 352 మెగావాట్లు కాగా ఈసారి 415 మెగావాట్లకు చేరిందని, ఇంతగా డిమాండ్ పెరిగినా ఎలాంటి ఓవర్‌లోడ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. డిమాండ్ 500 మెగావాట్లకు చేరిన సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందని, గతేడాదితో పోల్చితే ఈసారి జనవరి వరకు దాదాపు 15 వేల మంది చేరికతో మొత్తం వినియోగదారులు 3.99 లక్షలకు చేరారని, గృహాజ్యోతి పథకం కింద దాదాపు 1.29 లక్షల మంది గృహ వినియోగదారులు లబ్ధిపొందుతున్నారని చెప్పారు. గతేడాది దాదాపు 9 సబ్‌స్టేషన్ల్ పరిధిలో ఫవర్ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ అయ్యాయని, డివిజన్ల వారీగా పెరుగుతున్న లోడ్లకు తగ్గట్టుగా నూతన ట్రాన్స్ఫార్మర్, ఫీడర్ల విభజన చేయడం జరిగిందన్నారు. కేవలం హైదరాబాద్‌కు పరిమితమైన విద్యుత్ కాల్ సెంటర్ 1912 సదుపాయాన్ని జిల్లాలకు విస్తరించామన్నారు. విద్యుత్ అంతరాయాలు జరిగిన వెంటనే సమస్య పరిష్కరించేందుకు అంబులెన్స్ తరహా వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్య ఉంటే వినియోగదారులు 1912 ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డైరెక్టర్ ఆపరేషన్ నర్సింహులు, రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి, ఎస్ఈ రమేష్ పాల్గొన్నారు. -
బకాయి వేతనాలు చెల్లించాలంటూ ఆందోళన
వనపర్తి రూరల్: తమ బకాయి వేతనాలు చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు మాట్లాడుతూ.. కార్మికులు మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకునే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెల 1న వేతనాలు చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండేళ్లుగా వారికి సబ్బులు, నూనెలు అందించడం లేదని.. ఇప్పటి నుంచైనా విధిగా అందించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. సేఫ్టీ పరికరాలు, గ్లౌజులు, బూట్లు పంపిణీ చేయాలన్నారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులతో కలిసి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్ల వినతిపత్రాన్ని కార్యాలయ సూపరింటెండెంట్‌కు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు నిక్సన్, రమేశ్, రాములు, మధు, జీపీ కార్మిక సంఘం నాయకులు పుష్ప, హనీఫ్, అక్తర్‌పాషా, దాసు, సుగ్రీవుడు, ఖాదర్, మధు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
సర్వశిక్ష అభియాన్ నిధులు ఖర్చు చేయాలి.. వనపర్తి: కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన పీఎంశ్రీ, సర్వశిక్ష అభియాన్ నిధులను వందశాతం ఖర్చుచేసి నివేదికలు అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా పాఠశాలల్లో మౌలిక వసతులు, క్షేత్రస్థాయి పరిశీలనకు విడుదలైన నిధులు ఖర్చుచేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్ పంపాలన్నారు. అలాగే గ్రీన్ స్కూల్, ఆత్మరక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన, మౌలిక వసతులు, స్పోర్ట్స్, సైన్స్ బడ్జెట్ నిధుల వినియోగంపై సమీక్షించారు. నిధులు ఖర్చుచేసి నివేదిక ఇవ్వాలని, అపార్ నమోదు సైతం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘ నీ, మండల విద్యాధికారులు, పీఎంశ్రీ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కొత్తకోట రూరల్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం జిల్లాకు రానున్నారని.. పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్‌పాం ఫ్యాక్టరీకి మంత్రులు భూమిపూజ చేయనున్నందున శుక్రవారం ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించి మాట్లాడారు. కార్యక్రమ స్థలంలో జిల్లా ఉద్యాన, వ్యవసాయశాఖకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ఆయిల్‌పాం సాగుచేస్తున్న ముగ్గురు ఆదర్శ రైతులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. వచ్చిన వారికి ఆహారం అందించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసుశాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి వచ్చే ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సభాస్థలిని పరిశీలించిన ఎస్పీ.. మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ శంకుస్థాపనకు శనివారం రాష్ట్ర మంత్రులు రానున్న సందర్భంగా శుక్రవారం భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షించారు. సభాస్థలి, వాహనాల పార్కింగ్ స్థలాలు, బందోబస్తు ఏర్పాట్ల తీరును పరిశీలించారు. బందోబస్తులో పాల్గొనే పోలీసు అధికారులకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన భద్రతపై పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి వచ్చే ప్రజాప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని, విధులను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, కొత్తకోట ఎస్ఐ ఆనంద్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
వెంచర్ల ఏర్పాటులో నిబంధనలు పాటించాలి
ఆత్మకూర్: వెంచర్ల ఏర్పాటులో ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని భార్గవినగర్, బీసీకాలనీలో ఏర్పాటు చేస్తున్న వెంచర్లలో హద్దులు, విద్యుత్, ఇరిగేషన్, రహదారుల నిర్మాణాలను పరిశీలించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా లేఅవుట్లు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే అనుమతులు రద్దు చేస్తామని వివరించారు. ఆయన వెంట ట్రాన్స్‌కో ఎస్ఈ రాజశేఖరం, ఏఈ నర్సింహ, నీటిపారుదలశాఖ ఏఈ కిషోర్, ఆర్అండ్బీ డీఈ సీతారామస్వామి, తహసీల్దార్ చాంద్‌పాషా, పుర కమిషనర్ శశిధర్, ఎంపీడీఓ శ్రీపాద్, టీపీఓ కరుణాకర్ తదితరులు ఉన్నారు. పౌల్ట్రీ ఫాం పరిశీలన ఆత్మకూర్: బర్డ్‌ఫ్లూ వైరస్‌తో కోళ్లు చనిపోతున్నాయని.. చికెన్ తినడం మానుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డా. వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. మండలంలోని పిన్నంచర్లలో ఉన్న పౌల్టీ ఫాంలో కోళ్లు చనిపోవడంతో శుక్రవారం ఆయన ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, పశువైద్యాధికారి డా. రమేశ్‌తో పరిశీలించారు. ఫాం పరిసరాలను పరిశీలించి బ్లీచింగ్ పౌడర్ చల్లించి గ్రామంలోని చికెన్ దుకాణాలను మూయించారు. ఆత్మకూర్‌లో సైతం చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని, దుకాణాలను మూసివేయించాలని పుర కమిషనర్ శశిధర్‌కు సూచించారు. ఆయనవెంట జేవీఓ నిర్మల, ఏఎస్‌లు నాగరాజు, మహిమూద్ ఉన్నారు. 3న జాతీయ సదస్సు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్ సమీపంలోని క్రిస్టియన్‌పల్లిలో ఉన్న ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ‘తెలంగాణ ఆర్థికాభివృద్ధి, అవకాశాలు.. సవాళ్లు, ఎంఎస్ఎంఈల పాత్ర’ అనే అంశంపై మార్చి 3న జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి పీయూ వీసీ శ్రీనివాస్, కంట్రోలర్ రాజ్‌కుమార్ తదితరులు హాజరవుతారన్నారు. -
గిరిజనులకు ఉచిత న్యాయ సేవలు
కొత్తకోట రూరల్: గిరిజనులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలం చీకురుచెట్టుతండాలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా న్యాయ సేవాసంస్థ పనితీరు, గిరిజనుల హక్కులు, చట్టాల గురించి క్షుణ్ణంగా వివరించారు. బాల్య వివాహాలు, పోక్సో, రహదారి నిబంధనలు, బాల కార్మికుల చట్టం గురించి అవగాహన కల్పించారు. గిరిజనులతో పాటు హరిజనులు, మహిళలు, పిల్లలు, వయో వృద్ధులకు కూడా ఉచిత న్యాయసేవలు అందిస్తున్నామని.. వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. అనంతరం మానసిక వైద్యులు డా. పుష్పలత మాట్లాడుతూ.. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని భూత వైద్యుల వద్దకు కాకుండా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మానసిక వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎల్ఏడీసీఎస్ జి.ఉత్తరయ్య, సఖి లీగల్ కౌన్సిల్ డి.కృష్ణయ్య, పారా లీగల్ వలంటీర్ అహ్మద్, మాజీ సర్ప ంచ్ రాధాకృష్ణ, పంచాయతీ కార్యదర్శి ప్రీతి, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. -
పాలమూరుపై పగ ఎందుకు?
నారాయణపేట: ‘పాలమూరు జిల్లాలో కృష్ణానది 811 టీఎంసీల నీరు పారుతుంది.. ఈ నీరు దశాబ్దాలుగా పారుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఎందుకు తీరలేదు.. సాగునీరు, తాగునీరు ఎందుకు అందలేదు.. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో పాలమూరులో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు.. జిల్లాను ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ’ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా దాదాపు రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం అప్పక్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పదేళ్లు నిర్లక్ష్యం చేశారు.. పైగా పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయేందుకు అవకాశం కల్పించారని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. పాలమూరులో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కేసీఆర్‌కు పగ ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం 12 నెలల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఈ విషయంలో ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. 70 ఏళ్లకు సీఎం పదవి హైదరాబాద్ రాష్ట్రానికి పాలమూరు జిల్లావాసి బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తే దాదాపు 7 దశాబ్దాల తర్వాత తిరిగి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. పాలమూరు బిడ్డ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. పాలమూరు ప్రజల పేదరికాన్ని ప్రపంచ దేశాలకు చూపించి విదేశాల్లో మార్కెటింగ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెనకబడిన ఈ పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని, ఇందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘పేట–కొడంగల్’ను పూర్తి చేసుకుందాం పదేళ్లలో సంగం‘బండ’ పగలకొట్టలేదు. దీంతో ఆ ప్రాంతంలోని 10 వేల వ్యవసాయ భూములకు సాగునీరు అందక ఏడారిగా మారాయని సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.15 కోట్లు మంజూరు చేసి బండను పగలకొట్టించామన్నారు. ఇప్పుడు 10 వేల ఎకరాలు పారుతున్నాయన్నారు. మక్తల్, కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టు 2014లో కొట్లాడి మంజూరు చేయిస్తే తనపైన ఉన్న కోపంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ఆపేశారన్నారు. ఇప్పుడు తన హయాంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదండాపూర్, పాలమూరు రంగారెడ్డి, ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పేట– కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని, రైతులకు ఎకరాకు రూ.10 లక్షలు సరిపోకపోతే రూ.20 లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. లగచర్లలో పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తే అడ్డుకున్నారని, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుంటే ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నించారు. జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని, నన్ను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిదేశంలోనే తొలి మహిళా పెట్రోల్ బంక్ ఆడబిడ్డలకు ఆర్థిక స్వావలంభన ఇవ్వాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ మంజూరు చేశామని సీఎం అన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం పదేళ్లలో బడుగు బలహీన వర్గాల ప్రజలను డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట మోసం చేసి గద్దెనెక్కిందని విమర్శించారు. తిరిగి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసుకొని.. ఈ రోజు నారాయణపేట మండలం అప్పక్‌పల్లి నుంచి భూమిపూజ చేయడం జరిగిందన్నారు. అవసరమైతే నియోజకవర్గానికి 5 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేకపోయారు కృష్ణానదిలో 811 టీఎంసీలు పారుతున్నా.. సాగు, తాగునీరు లేదు ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం నారాయణపేట ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ సభలో సీఎం రేవంత్‌రెడ్డి రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు -
No Headline
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు మాత్రమే అవుతుందని ఈలోగానే ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషిచేశామన్నారు. పదేళ్ల పరిపాలన చేసిన గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసి మరో రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టిందని దుయ్యబట్టారు. అభివృద్ధి విషయంలో వేదిక ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ● మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు ఇచ్చిన సూచన మేరకు 120 రోజుల్లో విజయవంతంగా కులగణన పూర్తి చేయడం జరిగిందన్నారు. దీంతోపాటు వర్గీకరణ పూర్తి చేసి అన్ని విధాలుగా వెనకబడిన మాదిగ కులానికి 9.7 శాతం రిజర్వేషన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ● -
అడుగంటుతున్న కృష్ణమ్మ
గతేడాది వర్షాకాలంలో కృష్ణానదికి భారీగా వరదలు వచ్చినప్పటికీ బ్యాక్‌వాటర్ భారీగా తగ్గిపోతోంది. వివిధ ప్రాజెక్టుల ద్వారా తాగు, సాగునీటికి తరలింపు, వేసవి నేపథ్యంలో నిల్వ నీరు వేగంగా అడుగంటుతోంది. దీంతో పెంట్లవెల్లి మండలంలోని మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్, కొల్లాపూర్ మండలంలోని సోమశిల, అమరగిరి గ్రామాల శివారులో కృష్ణానది బురదమయంగా కనిపిస్తుంది. – పెంట్లవెల్లి -
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
కొత్తకోట: ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కొత్తకోటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను గురువారం అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వంటగది, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. మెస్ కమిటీ సమక్షంలో కిరాణ సరుకుల నాణ్యతను పరిశీలించిన తర్వాతే దించుకోవాలని సూచించారు. సూపర్వైజర్లు భోజనాన్ని రుచి చూసిన తర్వాతే విద్యార్థినులకు వడ్డించాలన్నారు. పదోతరగతి విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారి మల్లికార్జున్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ చెన్నమ్మ, ప్రిన్సిపాల్ మాధవి ఉన్నారు. -
ఎల్ఆర్ఎస్కు మోక్షం!
ప్రభుత్వ నిర్ణయంతో నాలుగేళ్ల నిరీక్షణకు తెర ●నిబంధనల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వెంచర్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేస్తాం. జిల్లాలో అత్యధికంగా కొత్తకోట మున్సిపాలిటీలో 7వేల పైచిలుకు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు వచ్చాయి. 25శాతం రాయితీ అవకాశాన్ని ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. – సైదయ్య, మున్సిపల్ కమిషనర్, కొత్తకోట -
లోకాయుక్తకు నివేదిక సమర్పిస్తాం
కొత్తకోట మండలంలోని రాయినిపేట రాయసముద్రం చెరువులో భూములు మునకకు గురవుతుండటంతో నష్టపోతున్నామని.. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆయకట్టు రైతులు లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజినీరు శ్రీనివాస్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో కలిసి కలెక్టర్ ఆదర్శ్ సురభి చెరువును సందర్శించి పరిశీలించారు. ఆయకట్టు రైతులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అన్ని రికార్డులను పరిశీలించిన తర్వాత లోకాయుక్తకు పూర్తి నివేదిక సమర్పిస్తామని కలెక్టర్ తెలిపారు. వారి వెంట తహసీల్దార్లు రమేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
ఎల్ఆర్ఎస్కు మోక్షం!
వనపర్తి: లేఅవుట్ల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో నాలుగేళ్ల నిరీక్షణకు తెర పడింది. రియల్టర్లలో కొత్త ఆశలు చిగురించినట్లు అయ్యింది. మరోవైపు ఆయా లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేస్తామని చెప్పడంతో దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించినట్లయ్యింది. అయితే 2020 ఆగస్టు 28 నాటికి ఏర్పాటుచేసిన లేఅవుట్లకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్‌తో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. దీనికి తోడు చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించడం ప్రోత్సాహకంగా ఉందని చెప్పవచ్చు. జిల్లావ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం భారీగా దరఖాస్తులు సమర్పించినా.. కనీసం 10శాతం కూడా క్రమబద్ధీకరణకు నోచుకోలేదు. ప్రస్తుతం మార్చి 31వ తేదీలోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి ప్రభుత్వం 25శాతం రాయితీ ప్రకటించడంతో ప్లాట్లు, లేఅవుట్లను పెద్ద సంఖ్యలో క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది.జిల్లాలో 69,239 అర్జీలు..జిల్లాలోని మున్సిపాలిటీలు, మండలాల్లో లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 69,239 దరఖాస్తులు అందాయి. అందులో ఒక శాతం కూడా పరిష్కారానికి నోచుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీఓలు, మున్సిపల్ ప్రాంతాల్లో కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. అయితే ఆశించిన మేరకు క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫీజు చెల్లించేలా ప్రయత్నాలు మాత్రం జరగలేదు. దీంతో భారీగా దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. -
రియల్టర్లలో కొత్త ఆశలు..
రియల్ ఎస్టేట్ వ్యాపారంపై 60 శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఎల్ఆర్ఎస్తో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఒక్కసారిగా రియల్ వ్యాపారం నేలచూపులు చూసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరోసారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జన సందడి కనిపించనుంది. అప్పుల ఊబిల్లో కూరుకుపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం కొంత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. రూ.కోట్లలో ఆదాయం.. 2001లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే. అయితే ఒక్కో దరఖాస్తుకు రూ.వెయ్యి చొప్పున ప్రాథమిక రుసుము వసూలు చేశారు. తద్వారా జిల్లావ్యాప్తంగా రూ. కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. అదే తరహాలో మిగతా మొత్తం చెల్లించేలా చేసి ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఎల్ఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. -
ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
వనపర్తి: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని డీఈఓ అబ్దుల్ ఘని సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యతోనే వినయం, విజ్ఞానం సంపాదిస్తామన్నారు. పీఎంశ్రీ పథకం ద్వారా పాఠశాలలో అనేక వసతులను కల్పించారని.. విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా విద్యాశాఖ సమన్వయకర్తలు యుగంధర్, శేఖర్, హెచ్ఎం ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బదిలీ వనపర్తి: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను నారాయణపేట జిల్లాకు బదిలీ చేస్తూ గురువారం సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో తనదైన పాత్ర పోషించారు. పలుమార్లు కలెక్టర్‌గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. వరిధాన్యం బోనస్‌పై జాప్యం తగదు వీపనగండ్ల: కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వరిధాన్యం అమ్మిన రైతులకు బోనస్ అందించడంలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాల్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బొల్లారంలో రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యంలో ఇప్పటికీ 10 శాతం మాత్రమే బోనస్ చెల్లించిందని.. మిగతా 90 శాతం మంది రైతులకు బోనస్ అందకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. మరోవైపు దాదాపు 45 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. రైతుభరోసా అందించడంలోనూ ఆలస్యం చేస్తున్నారన్నారు. ఉమ్మడి మండలంలోని జూరాల, భీ మా కాల్వలకు మార్చి నెలాఖరు వరకు వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేయాలని డి మాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం ఉ పాధ్యక్షుడు ఎం.కృష్ణయ్య, సీపీఎం నాయకులు కృష్ణయ్య, బాలాగౌడ్, తిరుపతయ్య ఉన్నారు. మేధో సంపత్తి హక్కులతో ప్రయోజనం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మేధో సంపత్తి హక్కులతో పరిశోధనలు చేసే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో మేధో సంపత్తి హక్కులపై ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పూర్తి స్థాయి హక్కులు పొందిన తర్వాతనే వాటిని ప్రకటించాలని, అప్పుడు ప్రచురణలు, ప్రయోగాలకు పూర్తిస్థాయిలో విలువ ఉంటుందన్నారు. ఆవిష్కరణలకు పరిరక్షణ, హక్కులు కలిగి ఉండాలంటే తప్పకుండా మేధో సంపత్తి హక్కులు ఉండాలని, రీసెర్చ్ విద్యార్థులు అధ్యాపకులు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇప్పుడు చేసిన ప్రయోగాలు భవిష్యత్ అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, వక్త శంకర్రావు ముంజం, ఐక్యూఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, కంట్రోలర్ రాజ్‌కుమార్, మధు, అర్జున్‌కుమార్, కుమారస్వామి, శాంతిప్రియ, విజయలక్ష్మీ పాల్గొన్నారు. -
నేడు ‘పేట’కు సీఎం రేవంత్
నారాయణపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారిగా శుక్రవారం నారాయణపేట జిల్లాకేంద్రానికి రానున్నారు. ఈ సందర్భంగా రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లను సిద్ధం చేసింది. ● సీఎం శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో నారాయణపేట మండలంలోని సింగారం చౌరస్తా సమీపంలోని గురుకుల పాఠశాల దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రూ.1.23 కోట్లతో నిర్మించిన నూతన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు అప్పక్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌కు భూమి పూజ చేస్తారు. 1.35 గంటల నుంచి 2 గంటల వరకు రూ.130 కోట్లతో నారాయణపేట ప్రభుత్వ వైద్యకళాశాల, హాస్టల్ నిర్మాణానికి, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి, రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, రూ.40 కోట్లతో 100 పడకల యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ.56 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల ఫస్టియర్ అకాడమిక్ బ్లాక్‌ల ప్రారంభించనున్నారు. వీటితో పాటు ధన్వాడ, నారాయణపేట రూరల్ పోలీస్స్టేషన్లు, వివిధ గ్రామాల్లో రూ.500కోట్లకుపైగా నిధులతో నిర్మించనున్న రోడ్లు, హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 2.10గంటలకు బహిరంగసభలో పాల్గొని, మాట్లాడుతారు. పర్యవేక్షించిన అధికారుల బృందం సీఎం పర్యటన నేపథ్యంలో గురువారం రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ క్రిస్టియానా, ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ హరీశ్, ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సింగారం చౌరస్తాలోని హెలీప్యాడ్ స్థలాన్ని, సమీపంలోని నూతన పెట్రోల్ బంక్, వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని, అప్పక్‌పల్లి వద్ద సీఎం భూమి పూజ చేసే ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని అధికారుల బృందం పరిశీలించింది. అనంతరం మెడికల్ కళాశాలలో ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బహిరంగసభ వేదిక పక్కన గ్రీన్ రూమ్, వేదికపై సీటింగ్ కెపాసిటీ, వీఐపీ గ్యాలరీ తదితర వాటిపై చర్చించారు. అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలు సైతం ఏర్పాట్లను పరిశీలించారు. ● సీఎం పర్యటనకు 1000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి ఎస్పీలు, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 81మంది ఎస్ఐలు, 133 మంది ఏఎస్ఐలు, 750 కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం పర్యటన ముందస్తు బందోబస్తు ఏర్పాట్లను మల్టీజోన్–2 ఐజీపీ సత్యనారాయణ, జోగుళాంబ జోన్ –7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పరిశీలించారు. రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
డబుల్బెడ్రూం ఇళ్లలో నివాసం ఉండని వారికి నోటీసులు
వనపర్తి: డబుల్బెడ్రూం ఇళ్లలో చాలా వరకు అసలైన లబ్ధిదారులు నివాసం ఉండటం లేదని.. అలాంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,488 డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించగా.. రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారితో పాటు 543 నిరుపేద కుటుంబాలకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇటీవల డబుల్బెడ్రూం ఇళ్లను పరిశీలించగా.. అసలైన లబ్ధిదారులు నివాసం ఉండటం లేదనే విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. అసలు పట్టాదారులు నివాసం ఉండకుండా అద్దెకు ఇవ్వడం.. మరికొన్ని ఖాళీగా పడి ఉన్నట్లు తెలిసిందన్నారు. నిబంధనల ప్రకారం డబుల్బెడ్రూం ఇళ్లను అద్దెకు లేదా లీజ్‌కు ఇవ్వడం, అమ్ముకోడానికి వీలు లేదన్నారు. ఖాళీగా ఉన్న వాటిని ప్రభుత్వ అధీనంలోకి తీసుకొని అద్దెకు ఉన్న వారికి ఫారం–2, అసలు పట్టాదారుకు ఫారం–1 ద్వారా నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా 90 శాతానికి పైగా నివాసం ఉంటున్న డబుల్బెడ్రూం ఇళ్ల కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీరు మల్లయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం ఉన్నారు. -
నేర రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
వనపర్తి: నేర రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తోందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల్లో పోలీసు శాఖపై మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పనిచేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. డీఎస్పీలు, సీఐలు తప్పనిసరిగా తమ పరిధిలోని స్టేషన్లను పర్యవేక్షించి.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. జిల్లాలో నేర నియంత్రణకు సమన్వయంతో కృషి చేయాలన్నారు. రోజువారీ పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని సూచించారు. నేరస్తులను పట్టుకోవడం, నేర పరిశోధనకు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాలను ఉపయోగించుకోవాలన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని తెలిపారు. పోలీసులు విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయితీగా, జవాబుదారితనంతో ఉండాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఫుట్ పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరంగా చేయాలని సూచించారు. కొత్త చట్టాలపై సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని, చట్టం పరిధిలోనే పనిచేయాలని తెలిపారు. మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని.. షీ టీం బృందాలను మరింత బలోపేతం చేయాలన్నారు. గంజాయి సరఫరా, వినియోగం మీద ఉక్కుపాదం మోపాలన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులందరూ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐలు రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు. పోలీసు శాఖపై మరింత నమ్మకం పెంచుదాం ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలి ఎస్పీ రావుల గిరిధర్ -
పన్ను ఎగవేతదారులను గుర్తించండి
వనపర్తి: ఆదాయపు పన్ను ఎగవేత దారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. అధిక మొత్తంలో జరిగే లావాదేవీలను గుర్తించి.. ఆదాయపు పన్ను శాఖకు రిపోర్టు చేయడంపై గురువారం కలెక్టరేట్లో తహసీల్దార్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పన్ను ఎగవేత దారులను కట్టడి చేయాలంటే అధిక మొత్తంలో జరిగే లావాదేవీలను గుర్తించడం కీలకమని అన్నారు. సీసీఎల్ఏ సూచన మేరకు తహసీల్దార్లు స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిపోర్టు చేయడంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రూ. 30లక్షలకు పైగా జరిగిన లావాదేవీలను గుర్తించి ఆదాయ పన్ను శాఖకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. -
పునరావాసానికి సన్నద్ధం
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న చెంచుపెంటల తరలింపునకు అవసరమైన చర్యలను అటవీశాఖ వేగవంతం చేసింది. ఇప్పటికే కోర్ ఏరియాలో ఉన్న సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ(ఎన్టీసీఏ) ద్వారా బాధితులకు పునరావాస ప్రత్యేక ప్యాకేజీని అందజేయనున్నారు. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే అధికారులు పునరావాస ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. మరో రెండు నెలల్లోనే పునరావాసానికి పూర్తిస్థాయి అనుమతులు లభిస్తాయని భావిస్తున్నారు. విడతల వారీగా చెంచుపెంటల తరలింపు.. నల్లమల అటవీప్రాంతంలో ఉన్న పులులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న చెంచుపెంటలను ఖాళీ చేయించి, అడవి బయట వారికి పునరావాసం కల్పించేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణ, వాటికి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలు కల్పించడం, వన్యప్రాణులకు, మనుషులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిరోధించడంలో భాగంగా పునరావాస ప్రక్రియను చేపడుతున్నట్టు అటవీశాఖ చెబుతోంది. ఇప్పటికే ఇందుకోసం ప్రక్రియను ప్రారంభించగా, తొలి విడతగా తరలించనున్న సార్లపల్లి, కుడిచింతలబైలు, వటవర్లపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించి, స్థానికుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా తరలింపునకు ఒప్పుకున్న వారికే పునరావాస ప్యాకేజీని అమలు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బలవంతం చేయబోమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ స్థానిక చెంచుల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. తొలి విడతలో మూడు గ్రామాలు.. నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉన్న సుమారు 20 వరకు చెంచుపెంటలను విడతల వారీగా ఖాళీ చేయించి మరో చోట పునరావాసం కల్పించాలని అటవీశాఖ భావిస్తోంది. వీటిలో మొదటి విడతగా సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయి సర్వేతో పాటు కుటుంబాల నుంచి అంగీకార పత్రాలను సేకరిస్తోంది. సార్లపల్లిలో మొత్తం 269 కుటుంబాలు ఉండగా, వీరిలో 83 కుటుంబాలు మాత్రమే చెంచులు కాగా, మిగతా ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో ఇతర వర్గాలు మాత్రమే తరలింపునకు అంగీకారం చెబుతుండగా, మెజార్టీ చెంచులు ఒప్పుకోవడం లేదు. ప్యాకేజీ కింద 5 ఎకరాలు.. లేదంటే రూ.15 లక్షలు అడవిని ఖాళీ చేసి మరో చోటుకు తరలుతున్న స్థానికులకు పునరావాసం కింద ఎన్టీసీఏ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ, లేదా 5 ఎకరాల భూమి కేటాయిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని బాధితులు ఎంచుకోవచ్చు. ఖాళీ చేయనున్న గ్రామస్తులకు పునరావాసం కల్పించేందుకు పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఇప్పటికే భూమిని గుర్తించారు. అక్కడే పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు ఇళ్లు, పాఠశాల, రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించనున్నారు. నల్లమల అడవి నుంచి చెంచుపెంటలతరలింపునకు కొనసాగుతున్న కసరత్తు మొదటి విడతలో కుడిచింతలబైలు,సార్లపల్లి, వటవర్లపల్లి గ్రామాలు ఎన్టీసీఏ ద్వారా ప్రత్యేక పునరావాస ప్యాకేజీ పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఏర్పాట్లు -
సాగునీటి కోతలు
●రెండ్రోజులు సరికాదు.. యాసంగిలో జూరాల ఎడమకాల్వ ద్వారా రామన్‌పాడు వరకు మాత్రమే నీటిని అందిస్తామని అధికారులు ప్రకటించారు. అమరచింత ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు వదులుతుండటంతో 4 ఎకరాల్లో వరి సాగుచేశా. వారబందీ విధానంలో 5 రోజులు సాగునీరు వదులుతున్నా పంటలకు సరిపడా అందక ఇబ్బందులు పడుతున్నాం. అలాంటిది ఇకపై వారంలో రెండు రోజులు మాత్రమే అందిస్తామని చెప్పడం సరికాదు. – వెంకట్‌రెడ్డి, రైతు, అమరచింత అమరచింత: జూరాల జలాశయం ఆయకట్టుకు యాసంగిలో వారబందీ విధానంలో అధికారులు సాగునీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతుండటంతో ఇక నుంచి వారంలో రెండ్రోజులే సాగునీరు వదలాలని నిర్ణయించారు. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తగినంత లేదని ఈసారి యాసంగి సాగు ఆయకట్టును 34,246 ఎకరాలకు కుదించిన విషయం తెలిసిందే. ఎడమ కాల్వ విభాగంలో రామన్‌పాడు రిజర్వాయర్ వరకు ఉన్న అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తామని ప్రాజెక్టు అధికారులు ప్రకటించడంతో పాటు ఆయా ప్రాంతాల రైతులకు సైతం సాగు ప్రారంభంలోనే అవగాహన కల్పించారు. గతేడాది కూడా యాసంగిలో అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈసారి వానాకాలంలో ఎగువ నుంచి తగినంత వరద వచ్చినా ప్రాజెక్టులో ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోకపోవడంతో ఈ దుస్థితి తలెత్తిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో రెండ్రోజులే.. జూరాల ఆయకట్టుకు వారంలో రెండ్రోజులే నీటిని అందించేందుకు సిద్ధమయ్యారు. మంగళ, బుధవారం నీటిని సరఫరా చేసి మిగిలిన రోజులు నిలిపివేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు వివరించారు. గతంలో వారబందీ విధానంలో వారంలో 4 రోజులు సాగునీటిని అందించి, మూడు రోజులు నిలిపివేసేవారని.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఇటు పంటలకు, అటు తాగునీటి కష్టాలు తలెత్తకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జూరాల ఆయకట్టుకు వారంలో రెండ్రోజులే నీటి సరఫరా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. జూరాల జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుంది. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలగొద్దనే ఇకపై వారంలో రెండ్రోజులు మాత్రమే సాగునీటిని వదలాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ విషయాన్ని కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు రైతులకు తెలియజేయాలని సంబంధిత ఏఈలకు వివరించాం. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.256 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రభుత్వం ముందుచూపుతో సాగునీటిని పొదుపుగా ఇవ్వాలని నిర్ణయించింది. – జుబేర్ అహ్మద్, ఈఈ, జూరాల ప్రాజెక్టు, గద్వాల డివిజన్ ప్రాజెక్టులో 5.256 టీఎంసీలు.. ప్రస్తుత యాసంగిలో జూరాల జలాశయం ప్రధాన కుడి కాల్వ కింద సుమారు 15 వేల ఎకరాలు, ప్రధాన ఎడమ కాల్వల కింద రామన్‌పాడు జలాశయం వరకు సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. ఇందుకుగాను 4.93 టీఎంసీల నీటిని కేటాయించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.256 టీఎంసీల నీరు ఉండగా.. ఇందులో 2.593 టీఎంసీలను వేసవిలో తాగునీటి అవసరాలకు వినియోగించేందుకు కేటాయించారు. తాగు, సాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు ముందస్తుగా వారబందీని అమలు చేస్తూ వచ్చారు. రైతులను ఆగం చేయడమే.. అమరచింత ఎత్తిపోతల పథకం కింద ఐదు ఎకరాల్లో వరి సాగుచేశా. ఎత్తిపోతలకు జూరాల నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. వారంలో 5 రోజులు నీటిని అందిస్తున్నా పుష్కలంగా అందడం లేదని దిగాలుతో ఉన్నాం. అలాంటిది 2 రోజులు మాత్రమే వదలడమంటే రైతులను ఆగం చేయడమే. – శ్రీనివాస్‌రెడ్డి, రైతు, అమరచింత అసలే వారబందీ.. ఆపై కుదింపు యాసంగి సాగుకు తప్పని కష్టాలు ఆందోళనలో ఆయకట్టు రైతులు -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి
గోపాల్పేట: మండలంలోని చెన్నూరుకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించి మార్చి 15 నాటికి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కోరారు. బుధవారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా చెన్నూరులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సందర్శించి ఆవరణను పరిశీలించారు. మురుగు సమస్యను వెంటనే పరిష్కరించాలని, మెనూ విధిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. తర్వాత బుద్దారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీచేసి వంటగదిని పరిశీలించారు. బియ్యం, కూరగాయలు చూసి మెనూ పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి బోధన వివరాలు తెలుసుకొని వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం తాడిపర్తిలో వైకుంఠధామాన్ని పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడి నీటి సరఫరా, ఇతర సమస్యలపై ఆరా తీశారు. నిధులు మంజూరు చేసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీఓ శంకర్‌నాయక్, ఇతర మండలాల అధికారులు ఉన్నారు. మార్చి 15 నాటికి బేస్మెంట్ లెవల్ పూర్తికావాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ -
22న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల రాక
ఖిల్లాఘనపురం: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 22న మండలానికి వస్తున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఖిల్లాఘనపురం, గోపాల్పేట మండలాలకు దూరమవుతున్నందున రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారి కోరిక మేరకు పెద్దమందడి, ఖిల్లాఘనపురం రెండు మండలాలకు కలిపి మండల కేంద్రంలో నూతన వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. షాపురం గ్రామానికి వెళ్లే కూడలి సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో మార్కెట్‌యార్డు ఏర్పాటుకు మంత్రి భూమిపూజ చేస్తారని వివరించారు. అలాగే గోపాల్‌పేటలో కూడా మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మండలానికి వ్యవసాయ మార్కెట్‌యార్డును మంజూరు చేసినందుగాను పలువురు నాయకులు, రైతులు, వ్యాపారులు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు. ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ.. కొత్తకోట: మండలంలోని సంకిరెడ్డిపల్లిలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి ఈ నెల 22న మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి భూమిపూజ చేయనున్నట్లు సీడీసీ చైర్మన్ గొల్లబాబు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
కస్తూర్బా విద్యాలయం తనిఖీ
చిన్నంబావి: మండల కేంద్రంలోని కేజీబీవీని బుధవారం మండల ప్రత్యేకాధికారి రఘునాథ్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించి తీసుకుంటున్న జాగ్రత్తలు, మెనూ అమలును అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు, రికార్డులను పరిశీలించారు. పదోతరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున సిలబస్, ప్రత్యేక తరగతుల నిర్వహణ తదితరాలపై ఆరా తీశారు. అలాగే మండలంలోని కొప్పునూరు ఎస్సీ వసతిగృహాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమణారావు, సిబ్బంది పాల్గొన్నారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయొద్దు వనపర్తి టౌన్: ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయడం నిబంధనలకు విరుద్దమని పుర శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి అన్నారు. ట్రేడ్ లైసెన్స్ వసూళ్లలో భాగంగా బుధవారం ఆయన పుర సిబ్బందితో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించగా చాలా దుకాణాలకు లైసెన్స్ లేదని గుర్తించారు. కలెక్టరేట్ మార్గంలో ఉన్న దుకాణాదారులు కూడా టేడ్ర్ లైసెన్స్ తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. కొందరు దుకాణాదారులు గడువు కావాలని కోరగా, మరికొందరు లైసెన్స్ ఫీజు అధికంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు దుకాణదారులు లైసెన్స్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని, అలాంటి వారికి నోటీసులిచ్చామని, గడువు ముగిసిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల కొలతల ఆధారంగా ట్రేడ్ లైసెన్స్ రుసుం వసూలు ప్రక్రియ వేగవంతం చేశామని, రోజు రూ.లక్ష లక్ష్యంగా కాగా అందుకు చేరువగా వసూలు చేస్తున్నామన్నారు. పుర సిబ్బంది చేతికి డబ్బులు ఇవ్వొద్దని.. ఆన్లైన్లో చెల్లింపులు చేసి వెంటనే రసీదు పొందవచ్చని సూచించారు. వృద్ధాశ్రమాన్ని సందర్శించిన అడిషనల్ కమాండెంట్ వనపర్తి విద్యావిభాగం: మండలంలోని చిట్యాల సమీపంలో ఉన్న చేయూత అనాథ ఆశ్రమంలోగల వృద్ధాశ్రమానికి బుధవారం 10వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ జయరాజ్, అసిస్టెంట్ కమాండెంట్ పి.శ్రీనివాసులు సందర్శించారు. వృద్ధులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులను అభినందించి నిత్యావసర సరుకులు అందజేశారు. వారి వెంట రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆర్పీ సింగ్, ఆర్ఎస్ఐ శ్రీకాంత్, బోజ్యానాయక్, ఏఆర్ఎస్ఐ జయవర్ధన్చారి, భీమయ్య, అశోక్, రవీంద్రనాయక్, సుధాకర్ తదితరులు ఉన్నారు. మన్యంకొండ హుండీ లెక్కింపు మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం హుండీలను లెక్కించగా.. రూ. 32,39,301 ఆదాయం వచ్చింది. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. రాత్రి 7 గంటలకు ముగిసింది. హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు వెంకటాచారి, శ్రావణ్‌కుమార్, మంజుల, సుధ, ఐడీబీఐ మేనేజర్ రాజవర్దన్‌రెడ్డి, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
ఇసుక రీచ్‌లపై పర్యవేక్షణ తప్పనిసరి
వనపర్తి: జిల్లాలోని ఇసుక రీచ్‌లపై ఆయా ప్రాంతాల తహసీల్దార్ల పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం పెబ్బేరు మండలం వై–శాఖాపురం గ్రామ సమీపంలో ఉన్న ఇసుక రీచ్‌ను, రాంపురం గ్రామ శివారులో అధికారులు సీజ్ చేసిన ఇసుక నిల్వలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక నిల్వలు చేసినా, సరఫరా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాంపురంలో ఇసుక నిల్వల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కలెక్టర్ వెంట పెబ్బేరు తహసీల్దార్ లక్ష్మి, రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలి.. జిల్లాలో ఎంపిక చేసిన 15 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో వెబెక్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా నిర్మాణం చేసుకునే వారికే పథకం వర్తిస్తుందని.. ఇదివరకు సగం నిర్మించుకున్న వారికి వర్తించదని వివరించాలని సూచించారు. ఇంటి నిర్మాణం ప్రారంభించే సమయంలో పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులకు భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలని, తహసీల్దార్లు సైతం దగ్గర్లోని రీచ్ నుంచి ఇసుక తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. విడతల వారీగా నగదు ప్రభుత్వం నుంచి వస్తుందని వారికి స్పష్టంగా తెలియజేయాలని కోరారు. మిగతా గ్రామాల్లో కూడా పథకం ఏ క్షణమైనా ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. అర్హుల జాబితాను మరోమారు పరిశీలించి తుది జాబితా సిద్ధం చేసుకోవాలని ఎంపీడీఓలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో అనర్హులు జాబితాలో లేకుండా చూసుకోవాలన్నారు. తాగునీటి సమస్యలు రానివ్వొద్దు.. వేసవి సమీపిస్తున్నందున గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడకుండా.. ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో స్థానికంగా ఉండే బోర్లను వినియోగించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామాల్లోని బోర్లుమోటార్లు, చేతిపంపులు పనిచేయకుండా ఉంటే వెంటనే మరమ్మతులు చేయించి సిద్ధం చేసుకోవాలని సూచించారు. నీటిట్యాంకులు పరిశుభ్రంగా ఉండాలని, పదిరోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయించాలని ఆదేశించారు. ట్యాంకర్లను సైతం అవసరానికి అనుగుణం సిద్ధం చేసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో నీడ, తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఓ సురేశ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, హౌసింగ్ అధికారులు విఠోభా, పర్వతాలు, మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజినీర్ మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి -
సక్రమంగా ఇస్తేనే వెళతాం..
ఎన్నాళ్ల నుంచో అడవినే నమ్ముకుని ఉంటున్నాం. పులులు, వన్యప్రాణుల సంరక్షణకు మా ఊరిని ఖాళీ చేసి మరో చోటికి పంపిస్తాం అంటున్నారు. పునరావాసం కింద నష్టపరిహారాన్ని అందించి, అక్కడ సౌకర్యాలు కల్పించిన తర్వాతే వెళతాం. అందరికీ న్యాయమైన పరిహారాన్ని అందించి పునరావాస ప్రక్రియ చేపట్టాలి. – మండ్లి భౌరమ్మ, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్ మండలం జీవనోపాధి కల్పించాలి.. ఏళ్లుగా మా ఊరిని ఖాళీ చేయించి, మమ్మల్ని మరో చోటుకి తరలిస్తామని చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది, పరిహారం ఎప్పుడు అందుతుందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. పునరావాసం కల్పిస్తే అక్కడ జీవనోపాధి కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలి. – పోషప్ప, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్ మండలం స్వచ్ఛందంగా తరలింపు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న ఆవాసాల్లో ఉంటున్న వారిని అడవి బయట పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరలింపు ప్రక్రియ స్వచ్ఛందంగా అంగీకారం తెలిపిన వారికే చేపడతాం. పునరావాసం కింద రూ.15 లక్షల ఆర్థిక సహాయం, లేదా 2 హెక్టార్ల భూమి కేటాయింపు ఉంటుంది. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ ● -
బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత
పాన్‌గల్: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి సంధ్యారాణి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జీసీఈసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. వారిని చులకనగా చూడకుండా బాలురతో సమానంగా చదివించాలని సూచించారు. జీసీఈసీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ బాక్స్ (ఫిర్యాదుల పెట్టె)ను వినియోగించుకొని సమస్యలను కాగితంపై రాసి బాక్సులో వేయాలన్నారు. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఏ రంగంలో తక్కువ కాదని.. నిర్దేశించుకున్న లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. బాలికల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ వారికి అండగా నిలవాలని ఎస్ఐ శ్రీనివాసులు, డా. చంద్రశేఖర్, ఎంఈఓ శ్రీనివాసులు తెలిపారు. సమావేశంలో బాలికల సాధికారత కమిటీ జిల్లా కో–ఆర్డినేటర్, ఇన్చార్జ్ హెచ్ఎం కిరణ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు హైమావతి, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కూలీలు, సాగుదారులు
87.6%92.2%కూలీలు సాగుదారులు86.9%88.2%33.9 %81.1%27.3 %25.9 %22.3 %20.8 %వనపర్తినారాయణపేటజో.గద్వాలనాగర్కర్నూల్మహబూబ్నగర్ -
ఏసీబీకి చిక్కిన మక్తల్ సీఐ
మక్తల్: ఓ కేసు విషయంలో వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌కు చెందిన సందె వెంకట్రాములు మక్తల్‌లో శ్రీనిధి సొసైటీని ఏర్పాటు చేశారు. సొసైటీలో కొందరు వ్యక్తులతో బేధాభిప్రాయాలు రావడంతో మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఒకరు ఫిర్యాదు చేయడంతో సందె వెంకట్రాములుపై కేసు నమోదు చేశారు. బెయిల్ కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా.. ప్రతి సోమవారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌కు రావాలని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ వచ్చింది. ఆఫీసు, ఇళ్లలో సోదాలు.. కేసుకు సంబంధించిన చార్జీషీటు కోర్టులో దాఖలు చేయాల్సిన విషయంలో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు గాను మక్తల్ సీఐ జి.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సందె వెంకట్రాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ముందస్తుగా ప్రణాళిక ప్రకారం మంగళవారం మక్తల్ పోలీస్ కార్యాలయంలో నిందితుడి నుంచి కానిస్టేబుల్ నర్సింహ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ శివారెడ్డిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ కార్యాలయం, కానిస్టేబుళ్ల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డిలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. దాడుల్లో ఏసీబీ అధికారులు లింగస్వామి, జిలాని సయ్యద్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
అసంపూర్ణం.. అస్తవ్యస్తం!
జిల్లాలో అసంపూర్తిగా సాగునీటి కాల్వల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిన లింక్ కెనాల్ పనులు.. సింగోటం రిజర్వాయర్ నుంచి గోపలదిన్నె రిజర్వాయర్‌కు లింక్ కెనాల్ నిర్మాణ పనులు కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వీపనగండ్ల మండలం వల్లభాపురం వద్ద నిలిపిపోయాయి. తిరిగి పనులు ఎప్పుడు ప్రారంభమవుతానే విషయం అధికార, పాలకవర్గం వెల్లడించాల్సి ఉంది. ● పాన్‌గల్ మండలం అన్నారం, అన్నారం తండా, గోప్లాపురం గ్రామాల వద్ద పొలాలకు కనుచూపు మేరల్లో కృష్ణా జలాలు పారుతున్నా.. కొద్దిపాటి కాల్వ తవ్వకం పనుల జాప్యంతో సాగు నీరందక మూడు గ్రామాల రైతులు దశాబ్ద కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. కేఎల్ఐ డి–8, ఎంజే–6 కాల్వల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో దావత్ఖాన్పల్లి, ఆకునోనిపల్లి గ్రామాలకు సాగునీరు అందడం లేదు. ● వీపనగండ్ల మండలంలో జూరాల 16వ ప్యాకేజీ కాల్వలో భారీగా పూడిక పేరుకుపోవడంతో సంగినేనిపల్లె వరకు రావాల్సిన నీరు పుల్గరచర్ల, కల్వరాల, వీపనగండ్లలోని కొద్ది ప్రాంతానికి మాత్రమే అందుతున్నాయి. కాల్వ నీటిపై ఆశలు వదులుకున్న రైతులు ప్రత్యేక పైప్లైన్లు వేసి మోటార్లతో పొలాలకు నీరు తరలించుకుపోతున్నారు. మండలంలోని జూరాల డిస్ట్రిబ్యూటరీ 23 నుంచి 28 వరకు లైనింగ్ ధ్వంసమై భారీగా పూడిక పేరుకుపోయింది. ● చిన్నంబావి మండలంలో డిస్ట్రిబ్యూటరీ 29, 30 కాల్వ నుంచి 39వ డిస్ట్రిబ్యూటరీ కాల్వలో ఉన్నాయి. మండలంలోని ఏడు గ్రామాలకు జూరాల కాల్వ ద్వారా సాగునీరు అందాల్సి ఉండగా.. సక్రమంగా రాకపోవడంతో మండలంలోని చాలామంది రైతులు వర్షాకాల పంటలు మాత్రమే సాగుచేస్తుండటం గమనార్హం. ● అమరచింత మండలంలోని నాగల్‌కడ్మూర్, ఈర్లదిన్నె, మిట్టనందిమళ్ల, చంద్రఘడ్, నందిమళ్ల క్రాస్‌రోడ్, కిష్టంపల్లి, ధర్మాపురం వరకు సాగునీరు అందించేందుకు భీమా ఫేజ్–1లో భాగంగా కాల్వలు తవ్వినా నీరు పారక ప్రయోజనం లేకుండా పోయింది. అమరచింత మండలంలోని కొన్ని గ్రామాల రైతులు చంద్రఘడ్ ఎత్తిపోతలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ● ఆత్మకూరు మండలంలోని కట్టకింది గ్రామాల్లో గల జూరాల డి–6, డి–21 కాల్వల లైనింగ్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఏటా సాగునీరు భారీగా వృథా అవుతున్నా నేటికీ మరమ్మతులు చేపట్టడం లేదు. వనపర్తి: జూరాల, భీమా, కేఎల్ఐ సాగునీటి కాల్వల అసంపూర్తి పనులు, నిర్వహణపై నిర్లక్ష్యం అలుముకుంది. కేవలం 150 మీటర్ల కాల్వ తవ్వితే మూడు గ్రామాలకు సాగునీరు అందుతుందని.. సుమారు దశాబ్ద కాలంగా ప్రతిపాదనలకే పరిమితమైందంటూ సోమవారం పానగల్ మండలంలోని అన్నారం, అన్నారంతండా రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సాగునీటి కాల్వల నిర్వహణ, పెండింగ్ పనులు పూర్తి చేయాలనే డిమాండ్ పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట మండలాల్లోని గ్రామాల్లో వినిపిస్తుంది. ● జూరాల కాల్వల్లో ఏపుగా పెరిగిన చెట్లను తొలగించడం, పూడికతీత, ధ్వంసమైన లైనింగ్ నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉండగా.. భీమా కాల్వలు పలుచోట్ల నిర్మించాల్సి ఉంది. కేఎల్ఐ విషయానికొస్తే డి–8, ఎంజే 4, ఎంజే 6తో పాటు బుద్ధారం కుడి, ఎడమ కాల్వల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నట్లు అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. త్వరగా పూర్తి చేస్తాం.. కేఎల్ఐ పరిధిలో పెండింగ్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పాన్‌గల్ మండలంలో సోమవారం రైతులు ఆందోళన చేపట్టడంతో అసంపూర్తి కాల్వ పనులను పరిశీలించాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. కాల్వల్లో పూడికతీత పనులు వేసవిలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – మధుసూదన్‌రావు, ఈఈ, జిల్లా సాగునీటిపారుదలశాఖ ● చివరి ఆయకట్టుకు గ్రహణం ఆందోళనలో అన్నదాతలు కేఎల్ఐ బకాయి పనులకు గుత్తేదారును మార్చిన అధికారులు రూ.60 కోట్ల పనులు పెండింగ్ కేఎల్ఐ పరిధిలోని మేజర్ కాల్వలతో పాటు బుద్ధారం కుడి, ఎడమ కాల్వలు, స్ట్రక్చర్స్ పనులు సుమారు రూ.60 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది.. ఈ విషయంపై ఇటీవల వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సాగునీటి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడంతో అధికారులు మరో సంస్థకు పనులు అప్పగించినట్లు తెలుస్తోంది. -
లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి
వనపర్తిటౌన్: లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం శాశ్వతమని.. కోర్టుకు వెచ్చించే సమయం కూడా ఆదా కావడంతో పాటు ఫీజు వాపస్ ఇవ్వబడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని న్యాయ విజ్ఞాన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి రజనితో కలిసి మాట్లాడారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి మార్చి 8న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్ గొప్ప అవకాశమని.. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో రాష్ట్రంలోనే జిల్లా స్థానం రోజురోజుకు మెరుగుపడుతుందని వివరించారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించి రాష్ట్రంలో 22వ స్థానంలో నిలవడమే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. వచ్చే నెలలో జరిగే లోక్‌అదాలత్‌లో రెట్టింపు కేసుల పరిష్కారమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేసి క్షేత్రస్థాయిలో వేగవంతం చేశామని, ఇందుకు పోలీసు, న్యాయవాదుల పాత్ర కూడా కీలకమని తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత -
‘సైబర్’ బారిన పడొద్దు
సాంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిద్దాం వనపర్తి: ఛత్రపతి శివాజీ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, డీజే సంస్కృతి మాని సాంప్రదాయ నృత్యాలను ప్రోత్సహించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో హిందూవాహిని కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మా ట్లాడారు. ఇతర మతస్తులను గౌరవిస్తూ ఐక్యతను చాటాలని సూచించారు. శోభాయాత్రకు బందోబస్తు కల్పిస్తామని, ట్రా ఫిక్ అంతరాయం తలెత్తకుండా చూస్తామని, ప్రజలు సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. ధ్వని కాలుష్యాన్ని పెంచే డీజేను ఉపయోగించరాదన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, వనపర్తి పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌గౌడ్, కొత్తకోట, ఆత్మకూర్, పెబ్బేరు, శ్రీరంగాపురం హిందూవాహిని మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరచింత: కొందరు సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని.. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయ ఆవరణలో ఉన్న ఫంక్షన్హాల్లో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో చేనేత ఉత్పత్తుల సంఘం సభ్యులు, విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిత్య జీవితంలో కష్టపడి పని చేయడంతోనే డబ్బులు వస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సైబర్ నేరగాళ్లు రూ.లక్ష గెలుచుకున్నారు.. బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నంబర్ పంపమని సెల్ఫోన్లకు సందేశాలు పంపిస్తుంటారని అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేసి మాట్లాడితే వారికి సమాధానం చెప్పకుండా మరోమారు కాల్ చేయొద్దని గట్టిగా చెప్పాలన్నారు. అమ్మాయిల ఫోన్లకు ఆశపడి అబ్బాయిలు ఆకర్షణకు లోనైతే న్యూడ్ కాల్స్ పేరిట బెదిరింపులకు పాల్పడటం, అందినంత దోచుకుంటారని.. వారి వేధింపులు భరించలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయని వివరించారు. అమ్మాయిలు సైతం పరిచయం లేని వ్యక్తులు ఫోన్‌చేస్తే కఠిన సమాధానం ఇవ్వాలన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్.. విద్యార్థులు లక్ష్యాలను చేరుకోవాలంటే ఉపాధ్యాయులు బోధించే విషయాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవడంతోనే సాధ్యమవుతుందని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయులను గౌరవించాలని, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో నిత్యం మాట్లాడుతూ రోజువారీ విషయాలు తెలుసుకోవాలని.. అలాగే ఉపాధ్యాయులను కలిసి పిల్లల ప్రవర్తన గురించి ఆరా తీయడం మంచిదని తెలిపారు. దీంతో పిల్లలు చెడు అలవాట్ల బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ నోడల్ ఏజెన్సీ కో–ఆర్డినేటర్ రాజ్‌కుమార్, ఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ సీఈఓ చిన్నమ్మ థామస్, అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం సీఈఓ శేఖర్, ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, చేనేత సహకారం సంఘం డైరెక్టర్ పొబ్బతి వెంకటస్వామి, ఎస్ఐ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
వనపర్తి: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో తాగునీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, జి.వెంకటేశ్వర్లు పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. అనంతరం సంబంధిత అధికారులతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాలు, పురపాలికల్లో నీటి వనరులను పరిశీలించాలని ఆదేశించారు. బోరుమోటార్ల మరమ్మతులు, మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీలు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు. ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని, ప్రతిరోజూ నివేదిక అందజేయాలని ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను టోల్‌ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, మిషన్ భగీరథ ఈఈ మేఘారెడ్డి, విద్యుత్‌శాఖ ఎస్ఈ రాజశేఖరం, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, నీటిపారుదలశాఖ ఎస్ఈ శ్రీనివాసులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
అన్నింటా.. అట్టడుగు
సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని సూచించే అక్షరాస్యత, తలసరి ఆదాయం, జీఎస్డీపీ, మౌలిక సదుపాయాల కల్పన ఇలా అన్నింట్లోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే అట్టడుగున కొనసాగుతున్నాయి. అక్షరాస్యత విషయంలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు రాష్ట్రంలోనే వెనకబడే ఉన్నాయి. ఈ జిల్లాల్లో అక్షరాస్యత శాతం కనీసం 50 శాతం కూడా మించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టిక్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ● పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్స్లోనూ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 28.8 శాతం మంది విద్యార్థులు పాఠశాల దశలోనే చదువుకు దూరమవుతున్నారు. ఇక వనపర్తి జిల్లా 8.81 శాతం మంది డ్రాపౌట్స్‌తో కాస్త మెరుగ్గా ఉంది. విద్యార్థులకు, ఉపాధ్యాయుల నిష్పత్తిలోనూ గద్వాల, నారాయణపేట జిల్లాలు వెనకబడి ఉన్నాయి. ఉపాధ్యాయుల కొరతలో జోగుళాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. ● తలసరి ఆదాయం విషయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు చివరి వరుసలో ఉన్నాయి. నారాయణపేట జిల్లా రూ.1,94,962 తో అట్టడుగున ఉండగా.. తర్వాతి వరుసలో జోగుళాంబ గద్వాల జిల్లా కొనసాగుతోంది. అభివృద్ధి పురోగతికి సూచీగా నిలిచే జీఎస్డీపీలోనూ నారాయణపేట జిల్లా చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఈ విషయంలో మహబూబ్‌నగర్ జిల్లా కాస్త మెరుగ్గా మొదటి నుంచి పదో స్థానంలో కొనసాగుతోంది. ఉపాధి, పరిశ్రమలు కరువు.. ఉమ్మడి జిల్లాలో ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు లేకపోవడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాల్లోనూ వెనుకబాటు కనిపిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో కేవలం 18 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 297 పరిశ్రమలు ఉన్నాయి. పశుసంపదలో మేటి.. పశుసంపద విషయంలో రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చితే ఉమ్మడి పాలమూరు మేటిగా నిలిచింది. ముఖ్యంగా నారాయణపేట జిల్లా 12.95 లక్షల గొర్రెలతో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. కూలీల సంఖ్య విషయానికి వస్తే గద్వాల జిల్లా 92.2 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా.. వనపర్తి జిల్లాలో 88.2 శాతం మంది కూలీలు ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 33.9 శాతం మంది సాగుదారులు ఉన్నట్టు నివేదికలో వెల్లడయింది. రాష్ట్రంలోని మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల తర్వాత నాగర్‌కర్నూల్‌లోనే అత్యధికంగా 21.4 శాతం ఎస్సీ జనాభా ఉంది. హైదరాబాద్, కరీంనగర్ తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లాలో తక్కువగా 1.5 శాతం మంది మాత్రమే ఎస్టీలు ఉన్నారు. జాతీయ రహదారుల విస్తరణ విషయంలో నల్లగొండ మొదటిస్థానంలో ఉండగా.. నాగర్‌కర్నూల్ జిల్లా 252.83 కి.మీ., విస్తీర్ణంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య) అక్షరాస్యతలో రాష్ట్రంలోనే చివరన ఉమ్మడి పాలమూరు గద్వాల, పేటలో 50 శాతంలోపే.. తలసరి ఆదాయంలోనూ అంతంత మాత్రమే మౌలిక సదుపాయాల కల్పనలో చివరి వరుసలోనే తెలంగాణ స్టాటిస్టిక్ రిపోర్టులో వెల్లడి జనాభా సాంద్రతలో.. (ప్రతి చదరపు కిలోమీటర్‌కు) -
మార్చి 8న జాతీయ లోక్ అదాలత్
వనపర్తి టౌన్: జాతీయ లోక్ అదాలత్‌లో సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత తెలిపారు. సోమవారం జిల్లా న్యాయస్థానంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అధికారుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని.. సాధ్యమైనన్ని కేసులు రాజీ మార్గంలో పరిష్కరించే విధంగా చూడాలని కోరారు. కక్షిదారులను సంప్రదించి రాజీ కుదర్చాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, అన్ని న్యాయస్థానాల న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు. -
అప్‌గ్రేడ్ అందని ద్రాక్షేనా?
దశాబ్దాలుగా గ్రేడ్–3 పురపాలికగా వనపర్తి వార్షిక ఆదాయం అంచనా రూ.4.77 కోట్లు.. వనపర్తి పట్టణ వార్షిక ఆదాయం రూ.4.77 కోట్లు సమకూరుతుందని అధికారులు లక్ష్యం నిర్దేశించుకొని పనిచేస్తున్నారు. రెండేళ్లుగా.. పట్టణాభివృద్ధి 70 శాతం జనరల్ ఫండ్ నుంచే చేస్తున్నట్లు అధికారుల నివేదికల ద్వారా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ మినహా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో విడుదలయ్యే సీఐఎస్ (పరిసరాల అభివృద్ధి నిధి) నిలిచిపోయింది. పట్టణ ప్రగతి నిధులు సైతం నిలిచిపోవడంతో పురపాలికకు వచ్చే ఆదాయంతోనే అభివృద్ధి పనులు, ఇతర ఖర్చులు చూసుకుంటున్నారు. ఐదేళ్లలో రెండు పాలకవర్గాలు కొలువుదీరాయి. ఆయా పాలకవర్గాలు అభివృద్ధి పేరుతో నిధులు ఖర్చు చేసే విషయంపై ఉన్న ధ్యాస.. పుర ఆదాయాన్ని పెంచే అంశంపై చూపించలేదనే విమర్శలు ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం మున్సిపల్ కాంప్లెక్స్–1 టెండర్లు నిర్వహించి పెరిగిన ధరలకు అనుగుణంగా అద్దెలను పెంచడం.. నిబంధనల ప్రకారం 25 ఏళ్లు దాటితే ప్రభుత్వ అనుబంధ దుకాణ సముదాయాల పాత లీజును రద్దు చేస్తూ కొత్తగా టెండర్ నిర్వహించి మారిన ధరలకు అనుగుణంగా కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు వనపర్తి మున్సిపాలిటీలో అమలు కావడం లేదన్నది బహిరంగ సత్యం. వనపర్తి: వనపర్తి పుర ప్రజల కల అప్‌గ్రేడ్ దశాబ్దాలుగా అందని ద్రాక్షగానే మిగులుతోంది. 2012లో మున్సిపాలిటీగా ఆవిర్భవించిన గజ్వేల్‌ను సైతం ఇటీవల గ్రేట్–2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసేందుకు దస్త్రాలు కదులుతుండగా.. 1984లో ఏర్పడిన వనపర్తి పురపాలికపై నిర్లక్ష్యం అలుముకుంది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు గద్వాలతో పాటు వనపర్తి మున్సిపాలిటీని సైతం గ్రేడ్–2గా అప్‌గ్రేడ్ చేయాలని అప్పటి ప్రభుత్వానికి స్థానిక పాలక, అధికార వర్గం ప్రతిపాదనలు పంపినా.. ఈ పురపాలిక విషయంలో వివక్ష కొనసాగింది. జనాభా, ఆదాయ వనరులు, పట్టణ విస్తీర్ణంలో గద్వాలకు ఏమాత్రం తీసుకొని వనపర్తి నేటికీ గ్రేడ్–3 మున్సిపాలిటీగానే కొనసాగుతుండటం శోచనీయం. తాజాగా కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా, మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా, గజ్వేల్లాంటి మున్సిపాలిటీని గ్రేడ్–2గా అప్‌గ్రేడ్ చేశారు. వనపర్తి విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం స్థానికంగా కొంత నిరుత్సాహం అలుముకుంది. వనపర్తిని గ్రేడ్–2గా అప్‌గ్రేడ్ చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధుల కొంతమేర పెరగుతాయి. 2019 పుర ఎన్నికల సమయంలో.. 2019 మున్సిపల్ ఎన్నికల సమయంలో పట్టణానికి సమీపంగా ఉన్న ఆరు గ్రామాలను పంచాయతీరాజ్ నుంచి మున్సిపాలిటీలో విలీనం చేశారు. వార్డులను సైతం 24 నుంచి 33కి పెంచారు. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను, అభివృద్ధి, బెటర్మెంట్ చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ పన్ను తదితర ఆదాయాలు మరింతగా పెరిగాయి. విలీన గ్రామాల్లో రాజనగరం, వడ్డెవాడ, నాగవరం, శ్రీనివాసపురం, మర్రికుంట, మర్రికుంటతండా ఉన్నాయి. వనపర్తి పట్టణ వ్యూ లక్షకు పైగా జనాభా.. 62,144 మంది ఓటర్లు.. ప్రస్తుత పట్టణ జనాభా 1.04 లక్షలు ఉండవచ్చని అధికారుల ప్రాథమిక అంచనా. నిత్యం వివిధ అవసరాల నిమిత్తం సమీప గ్రామాల నుంచి 20 వేల నుంచి 30 వేల మంది జిల్లాకేంద్రానికి వచ్చి వెళ్తుంటారు. గత మున్సిపల్ ఎన్నికల సమయానికి పట్టణ ఓటర్ల సంఖ్య 54,992 ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 62,144కు పెరిగిందని అధికారిక లెక్క. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలోగా మరో వెయ్యికి పైగా ఓట్లు పెరిగే అవకాశం లేకపోలేదు. పదేళ్లుగా ఎదురుచూపులు నిధుల ఖర్చుపైనే పాలకుల మక్కువ ఎక్కువ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్‌తోనే పాలన -
పైరవీకారులను ఆశ్రయించొద్దు
వనపర్తి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే రూ.5 లక్షలు విడతల వారీగా నేరుగా వారి ఖాతాల్లోనే జమవుతాయని.. పైరవీకారులను ఆశ్రయించొద్దని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం సూచించారు. సోమవారం మండలంలోని రాజపేట, అప్పాయిపల్లిలో గత ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పరిశీలించారు. అక్కడి సమస్యలను నివాసం ఉంటున్న వారిని అడిగి తెలుసుకున్నారు. కనీస మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరగా సానుకూలంగా స్పందించారు. అప్పాయిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సువర్ణ, వరలక్ష్మి ఇళ్లను సందర్శించి వారి ఆర్థిక స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు పనులు ప్రారంభించి నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటి నమూనాను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సచిత్ గంగ్వార్, జి.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, హౌసింగ్ అధికారులు విఠోభా, పర్వతాలు, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, ఎంపీడీఓ రాఘవ, తహసీల్దార్ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
కార్చిచ్చు ముప్పు..
విలువైన చెట్లు.. ఔషధ మొక్కలు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుగా నల్లమల అమ్రాబాద్ అభయారణ్యం గుర్తింపు పొందింది. ఇక్కడ ఔషధ మొక్కలతోపాటు టేకు, నల్లమద్ది, వేప, చేదు వేప, ఇప్ప తదితర చెట్లు అధికంగా ఉన్నాయి. వేసవి ప్రారంభంలోనే ఆకులు రాలి ఎండిపోయాయి. వాహనాల్లో వెళ్తున్న వారు సిగరెట్, బీడీలు తాగి.. పూర్తిగా ఆర్పకుండానే రోడ్డు పక్కనున్న అడవుల్లోకి విసురుతుంటారు. మరోవైపు పశువుల కాపరులు, అడవుల్లోకి ప్రవేశించే ఇతర వ్యక్తులు సైతం చుట్ట, బీడీ, సిగరెట్లు కాల్చిన అగ్గిపుల్లలను నిర్లక్ష్యంగా పడేస్తుంటారు. తద్వారా మంటలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అగ్నిప్రమాదాల నివారణకు అటవీశాఖ ముందస్తు చర్యలు ● క్విక్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు ● వీవ్లైన్స్, ఫైర్లైన్స్తో మంటల అదుపు ● అటవీ సమీప గ్రామాల్లో అవగాహన సదస్సులు ● నల్లమలలో విలువైన ఔషధ మొక్కలు, వన్యప్రాణులు అచ్చంపేట: వేసవి నేపథ్యంలో నల్లమలలోని వన్యప్రాణులతోపాటు విలువైన అటవీ సంపదకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అడవుల్లో చెట్ల ఆకులు రాలే సీజన్. చెట్ల నుంచి కింద పడిన ఆకులు ఎండిపోవడంతోపాటు కుప్పలుగా కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో వాటిపై నిప్పు పడితే కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. తద్వారా అటవీ సంపదతోపాటు వన్యప్రాణులకూ ముప్పు వాటిల్లుతోంది. అయితే జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ విపత్తును నివారించవచ్చని భావిస్తున్న అటవీశాఖ అధికారులు.. జిల్లాలోని అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. అడవి బుగ్గిపాలు కాకుండా కాపాడుకునేందుకు ముందస్తుగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారికి ఇరువైపులా వీవ్లెన్స్, ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం అటవీశాఖ సిబ్బందితో అడవిలో ఎండిన ఆకులను వరుసగా పేర్చి కాల్చివేస్తున్నారు. ఒకవేళ అగ్గి రాజుకున్నా శరవేగంగా విస్తరించకుండా ఈ ఫైర్ లైన్స్‌తో అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. నల్లటి రంగుతో సరిహద్దు వేసవిలో చెట్ల ఆకులు రాలడం వల్ల చిన్నపాటి నిప్పురవ్వ పడినా అడవి దావనంలా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది నేలపై రాలిన చెట్ల ఆకులను ఒకచోట పోగు చేసి.. కిలోమీటర్ పొడవునా కాల్చుతున్నారు. తద్వారా నిప్పు అంటుకున్నా మంటలు విస్తరించవు. మరోవైపు నల్లటి రంగుతో సరిహద్దు గీత ఏర్పడి వన్యప్రాణులు సైతం అడవి దాటి బయటకు వెళ్లకుండా ఫైర్‌లైన్స్ ఉపయోగపడతాయి. శాటిలైట్ సహాయంతో.. నల్లమల అటవీ ప్రాంతంలో అగ్గి అంటుకున్న వెంటనే ఆర్పేందుకు వీలుగా అటవీశాఖ అధికారులు తక్షణ స్పందన (క్విక్ రెస్పాన్స్) బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. రేయింభవళ్లు ఎక్కడ అగ్గి రాజుకున్నా శాటిలైట్ సహాయంతో ప్రమాదాన్ని గుర్తించి.. మంటలను ఆర్పివేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మరోవైపు అటవీ సమీప గ్రామాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధి2,166.37 చ.కి.మీ., అటవీ విస్తీర్ణం 2,611.39 చ.కి.మీ., బఫర్ జోన్ (ఏటీఆర్) 445.02 చ.కి.మీ., మొత్తం ఫారెస్టు బ్లాకులు 25 నల్లమల అటవీ ప్రాంతం ఇలా.. కఠిన చర్యలు.. ఎవరైనా అడవిలో నిప్పు పెట్టినట్లు తేలితే అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. అడవులు అగ్నిప్రమాదాల బారిన పడకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాం. వీవ్లైన్స్, ఫైర్‌లైన్స్ ఏర్పాటుతో ఒకచోట నుంచి మరో చోటకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నాం. – రోహిత్‌రెడ్డి, డీఎఫ్ఓ నిరంతర గస్తీ.. అటవీ పరిరక్షణకు గస్తీ ముమ్మరం చేశాం. క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాం. ఆకతాయిలు, పశువుల కాపరులు, ఇతరులు అడవుల్లోకి అగ్గిపెట్టెలు తీసుకుపోకుండా అవగాహన కల్పిస్తున్నాం. రోడ్డు వెంట వెళ్లే వారు నిప్పు వేసినా అడవి కాలకుండా ఇరువైపులా 20 – 30 మీటర్ల వరకు గడ్డి, ఆకులను ముందుగానే కాల్చివేస్తున్నాం. – గురుప్రసాద్, ఎఫ్ఆర్ఓ, దోమలపెంట -
21న ‘పేట’కు సీఎం రాక
నారాయణపేట: ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేటకు రానున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె హెలీప్యాడ్ స్థలాన్ని ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి పరిశీలించారు. అలాగే ఫొటో ఎగ్జిబిషన్, స్టేజీ తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు, వాటిలో మెడికల్ కళాశాల టీచింగ్ హాస్పిటల్, 100 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల, రెండు పోలీస్స్టేషన్ల భవన నిర్మాణాలు, పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనాలు ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. అధునిక సాగుతో అధిక దిగుబడులు పాన్‌గల్: రైతులు ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తూ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త రాజేంద్రకుమార్ సూచించారు. సోమవారం మండలంలోని దొండాయిపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయశాఖ సంయుక్తంగా నిర్వహించిన గ్రామీణ అంచనా (పీఆర్ఏ) కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ పద్ధతులు మెరుగుపర్చడానికి రైతులకు అవసరమైన సాధనాలు, జ్ఞానాన్ని అందించడానికి కేవీకే కృషి చేస్తోందన్నారు. కూరగాయలు, పప్పు దినుసుల సాగు వైపు రైతులను మళ్లించేందుకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రస్తుత వనరులు, వ్యవసాయ సమస్యలు, సామాజిక ఆర్థిక పరిస్థితులు, నెల స్వభావం, సాగునీటి వనరులు, ఏయే పంటలు సాగుకు అనుకూలమనే అంశాలను పరిశీలించి రైతులకు సూచనలు చేస్తారని ఏఓ రాజవర్ధన్‌రెడ్డి తెలిపారు. పీఆర్ఏ కార్యక్రమంపై కేవీకే నిపుణుల బృందం రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డా. భవాని, కె.సురేశ్‌కుమార్, ఏ.అనిత, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హాల్‌టికెట్లతో పరీక్షలకు హాజరుకావచ్చని సూచించారు. విద్యార్థులకు సమాచారం అందించే బాధ్యత ప్రిన్సిపాళ్లదేనని.. ఎవరైనా సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదు రావద్దని కోరారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి గోపాల్పేట: పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని డీపీఓ సురేశ్‌కుమార్ కోరారు. సోమవారం ఏదులలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామాల్లో పన్ను వసూళ్లు, పారిశుద్ధ్యం, ఇతర అభివృద్ధి పనులపై చర్చించారు. పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని, వేసవిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలో విలీనమైన గ్రామాలపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ రాములు, సూపరింటెండెంట్ అరుణవతి, జూనియర్ అసిస్టెంట్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం యాత్రికులకు 24 గంటలు అనుమతి మన్ననూర్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఈ నెల 23 నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీశాఖ చెక్‌పోస్టుల ద్వారా 24 గంటలు వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు డీఎఫ్ఓ రోహిత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంతకాలంగా వన్యప్రా ణుల సంరక్షణలో భాగంగా రాత్రి 9 నుంచి ఉద యం 6 గంటల వరకు మన్ననూర్ చెక్ పోస్టు వద్ద రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల చెందిన శివమాలధారులు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. -
సాగునీటికి రోడ్డెక్కిన రైతులు
పాన్‌గల్: సాగునీరందక పంటలు ఎండుముఖం పడుతున్నాయంటూ సోమవారం మండలంలోని అన్నారం, అన్నారంతండా రైతులు వనపర్తి–కొల్లాపూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు విరమించేది లేదని బైఠాయించడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలకు కాల్వల ద్వారా సాగునీరు అందుతున్నా అన్నారం, అన్నారంతండా గ్రామాలకు మాత్రం సరైన కాల్వలు లేక నీరందక పంటలు ఎండుముఖం పడుతున్నాయన్నారు. సమస్యను పలుమార్లు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమీపంలోని కేఎల్ఐ డి–8 ఎంజే–4 ద్వారా మైనర్–4, మైనర్–5 కాల్వల ద్వారా సాగునీరు అందించేందుకు గతంలో సర్వే కొనసాగినా కాల్వల పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రతిసారి సాగునీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపితే బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పెరిగి ఇబ్బందులు తొలగుతాయని వివరించారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు, పాలకులకు చెప్పినా ఇప్పుడు, అప్పుడంటూ కాలయాపన చేస్తుండటంతో రాస్తారోకో చేయాల్సి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించేదిలేదని రైతులు భీష్మించుకొని రోడ్డుపై బైఠాయించారు. ప్రయాణికులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని రాస్తారోకో విరమించండి లేదా ఓ పక్కకు జరిగి వాహనాలు వెళ్లేందుకు సహకరించాలని సీఐ కృష్ణ, ఎస్ఐ శ్రీనివాసులు నచ్చచెప్పినా రైతులు రాస్తారోకో విరమించలేదు. ఇబ్బందులు తొలగిస్తాం.. మండలంలోని అన్నారం, అన్నారంతండాకు సాగునీరు అందించేందుకు కేఎల్ఐ డి–8 ఎంజే–4 మైనర్ కాల్వలు తవ్వేందుకు గతంలో సర్వే చేశామని, కొందరు రైతులు అభ్యంతరాలు తెలుపడంతో జాప్యం జరుగుతోందని ఇరిగేషన్ ఈఈ మధుసూదన్‌రావు, డీఈ వెంకటరమణదేవి అన్నారు. మరోమారు సర్వేచేసి వివరాలను జిల్లా అధికారులకు నివేదించి వారి ఆదేశానుసారం సాధ్యమైనంత త్వరగా కాల్వలను తవ్వి రైతులకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. పంటలు ఎండిపోకుండా పది రోజుల్లో సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమీపంలోని కాల్వ ద్వారా సాగునీరు అందించే సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేసి చెరువులు, కుంటలు నింపుతామన్నారు. అధికారుల హామీలో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం అధికారులు సమీపంలోని కేఎల్ఐ డి–8 కాల్వను రైతులతో కలిసి పరిశీలించారు. రెండు గంటలపాటు రాస్తారోకో అధికారులు, పోలీసుల హామీతో ఆందోళన విరమణ -
ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం
వనపర్తి: ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ యాదయ్యతో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి 53 దరఖాస్తులు వచ్చాయని.. పరిశీలించి సత్వర పరిష్కారం చూపాలంటూ ఆయా శాఖల జిల్లా అధికారులకు రెఫర్ చేశారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్‌లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వసతిగృహాలను పర్యవేక్షించాలి.. మండల ప్రత్యేక అధికారులు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రజావాణి అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. విద్యార్థుల సమస్యలు, మౌలిక వసతులకు సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎండాకాలం సమీపిస్తున్నందున ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
వైద్యానికి వెతలు!
●ప్రభుత్వ ఆస్పత్రులను వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత ఇబ్బందులు పడుతున్నాం.. భవనం శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడుతోంది. వర్షాకాలంలో పైకప్పు నుంచి గదుల్లోకి నీరు చేరుతోంది. సిబ్బంది, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు, సిబ్బంది కొరత ఉందని ఉన్నతాధికారులకు నివేదించాం. – డా. హరినారాయణ, వైద్యాధికారి, ఆత్మకూర్ ● శిథిల భవనాలు.. వసతులు కరువు ● ఇబ్బందులు పడుతున్న రోగులు ఆత్మకూర్: జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తుంది. పలు భవనాలు శిథిలావస్థకు చేరుకొని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆత్మకూర్, రేవల్లి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ల భవనాలు శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. ఖిల్లాఘనపురం, వీపనగండ్ల, రేవల్లి, ఆత్మకూర్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రులను 2022లో వైద్యవిధాన పరిషత్ పరిధిలో చేర్చి కమ్యూనిటీ హెల్త్సెంటర్లుగా మార్చారు. వైద్యసేవలు మెరుగుపడాల్సి ఉండగా.. రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో వివిధ విభాగాలకు సంబంధించి 16 మంది వైద్యులు, 14 మంది స్టాఫ్‌నర్సులు, ఇతర సిబ్బంది, 25 మందికిపైగా కార్మికులు ఉండాల్సి ఉండగా.. నియామకాలు జరగడం లేదు. ఆత్మకూర్, వీపనగండ్ల, ఖిల్లాఘనపురం, రేవల్లి సీహెచ్సీలలో ఇద్దరు వైద్యులు, నలుగురు స్టాఫ్‌నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆత్మకూర్ సీహెచ్‌సీలో.. ఆత్మకూర్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు జిల్లాలోనే అత్యధిక సాధారణ, సిజేరియన్ ప్రసవాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన గుర్తింపు ఉంది. ఏడాదిన్నరగా ఇక్కడి వైద్యులు బదిలీపై వెళ్లడం.. కొత్త వైద్యులు, సిబ్బంది రాక రోగులకు సరైన వైద్యసేవలు అందక వెనుకబడింది. ఆరు నెలల కిందట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడపడితే అక్కడ వర్షపు నీరు నిలవడం, గదుల్లోని చేరడం, పైకప్పు పెచ్చులూడి పడటం, గోడలకు నీరుచేరి షాక్ వస్తుందని సిబ్బంది ఆయనకు వివరించారు. మరమ్మతులకు రూ.5.60 లక్షలు మంజూరైనా కాంట్రాక్టర్ మరమ్మతులు చేయకుండానే గోడలకు రంగులు వేసి బిల్లులు ఎత్తుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సిబ్బందిని నియమించాలి.. ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి నర్వ, చిన్నచింతకుంట, దేవరకద్ర, మదనాపురం, అమరచింత ప్రాంతాల నుంచి రోగులు వచ్చేవారు. ప్ర స్తుతం వైద్యులు, సిబ్బంది లేక, సరైన వైద్యసేవలు అందక రావడం పూర్తిగా తగ్గిపోయింది. దీనికితోడు ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం నిర్మించడంతో పాటు వైద్యులు, సిబ్బందిని నియమించాలి. – రాజు, సీపీఎం మండల కార్యదర్శి, ఆత్మకూర్ స్థల పరిశీలన పూర్తి.. ఆత్మకూర్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సందర్శించాం. డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి పీజేపీ క్యాంపులో 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశాం. మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అనుమతులు వచ్చి పనులు ప్రారంభమవుతాయి. – వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్ త్వరలోనే నియామకాలు.. జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో వైద్యు లు, సిబ్బంది కొరత ఉంది. వైద్య విధాన పరిషత్ నుంచి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ల క్యాడర్ స్ట్రెంత్ నియామక వివరాలు వెలువడ లేదు, విధివిధానాలు రావాల్సి ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో నియామకాలు చేపడతాం. – డా. చైతన్యగౌడ్, జిల్లా సూపరింటెండెంట్, కమ్యూనిటీ హెల్త్సెంటర్స్ -
అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
కోడేరు: అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో రూ.25 లక్షలతో నిర్మించే టాయిలెట్స్, డార్మెటరీ, డైనింగ్ హాల్, కస్తూర్బా విద్యాలయంలో రూ.10 లక్షలతో నిర్మించే అదనపు తరగతి గదులు, కొండ్రావుపల్లిలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, జనుంపల్లిలో రూ.16 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా పథకాలు అమలు చేసిందన్నారు. త్వరలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని.. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా మౌలిక వసతుల కల్పనకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని.. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వివరించారు. అనంతరం మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్రావు, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ కరీం, బావాయిపల్లి మాజీ సర్పంచ్ వేణుగోపాల్‌యాదవ్, ఎంపీడీఓ శ్రావణ్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, ఆది రాజు, రామకృష్ణ, పొండేళ్ల సురేశ్, ఇమ్రాన్, బాబు పాల్గొన్నారు. -
మిషన్ మధుమేహ
అమరచింత: జిల్లాలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గతేడాది నవంబర్ నుంచి జిల్లాలో 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. మొత్తం 3,04,205 మంది ఉన్నారని.. ఇప్పటి వరకు 1,09,764 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ప్రోగ్రాం అధికారి డా. రామచందర్‌రావు తెలిపారు. మార్చి చివరి నాటికి అందరికీ పరీక్షలు నిర్వహించి నివేదికను సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 20,655 మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉండగా.. ఈ వ్యాధి బారినపడి ఒక్కరుకూడా మరణించకుడదన్న ఉద్దేశంతో మిషన్ మధుమేహ 2.0 కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2024, నవంబర్‌లో ప్రారంభం.. 2024, నవంబర్‌లో జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించి పైలెట్ ప్రాజెక్టుగా అప్పరాల, కడుకుంట్ల, కమాలోద్దీన్‌పూర్, మదనాపురం, శ్రీరంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న 58,127 మందికి మధుమేహ పరీక్షలు నిర్వహించారు. అందులో 3,300 మందికి వ్యాధి నిర్ధారణ కావడంతో చికిత్స ప్రారంభించారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలివ్వడంతో జిల్లావ్యాప్తంగా నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఆదేశించడంతో మిషన్ మధుమేహ 2.0 పేరుతో కార్యక్రమాన్ని ఫిబ్రవరి 3న ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 2,32,089 మందికి డయాబెటిస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. వ్యాధి లక్షణాలు.. అధిక మూత్ర విసర్జన, ఎక్కువ దాహం, అధిక ఆకలి, అలసట, శరీర బరువు తగ్గడం లేదా పెరగడం, గాయం మానడంలో ఆలస్యం, చర్మ సమస్యలు, కాళ్లల్లో నొప్పులు. నియంత్రణకు.. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. రోజు కనీసం 30 నుంచి 45 నిమిషా లు వ్యాయామం చేయాలి. అధిక బరువును తగ్గించుకోవడంతో రక్తంలో చక్కెరస్థాయి నియంత్రణ సులభమవుతుంది. ధాన్యంతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో కొనసాగుతున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు 30 ఏళ్లు పైబడిన వారు 3,09,655.. ఇప్పటి వరకు పూర్తి చేసింది 1,09,764 మార్చి చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు.. మార్చి నాటికి పూర్తి.. జిల్లాలో 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మధుమేహ పరీక్షలు నిర్వహిస్తున్నాం. గతేడాది నవంబర్‌లో కా ర్యక్రమం ప్రారంభించాం. వైద్యసిబ్బంది ఇల్లిల్లూ తిరిగి షుగర్, బీపీ పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య వివరాలు నమోదు చేసుకుంటున్నాం. మార్చి చివరి నాటికి అనుకున్న లక్ష్యం పూర్తిచేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. – డా. రామచందర్‌రావు, జిల్లా కార్యక్రమ అధికారికలెక్టర్ ఆదేశాల మేరకు.. జిల్లాలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. మొదట పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి పరీక్షలు నిర్వహించాం. అనుకున్న లక్ష్యం సాధించడంతో మిగిలిన అన్ని గ్రామాల్లో వ్యాధిగ్రస్తులను గుర్తించి అవగాహన కల్పిస్తున్నాం. – డా. శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ డయాబెటిస్ అంటే.. డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి.. రక్తంలో చక్కెరస్థాయి పెరిగితే మధుమేహం బారిన పడినట్లు. శరీరంలో ఇన్సులిన్ అనే హర్మోన్ సరిపడా ఉత్పత్తి కాకపోవడం.. సరిగా పనిచేయకపోవడంతో ఈ వ్యాధి వస్తుంది. జన్యుపరమైన కారణాలు, కుటుంబంలో ఎవరికై నా ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక బరువుతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. -
25 మంది విద్యార్థులు గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని 14 కళాశాలల్లో ఆదివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 25 మంది విద్యార్థులు గైర్హజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. ప్రాక్టికల్స్ పరీక్షలు పూర్తయిన విద్యార్థులు థియరీ పరీక్షలపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని స్కాలర్స్, మహాత్మా జ్యోతిరావుపూలే, టిమ్రిస్, నివేదిత జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని వివరించారు. ఉదయం పరీక్షలకు 401 మంది విద్యార్థులకుగాను.. 386 మంది హాజరుకాగా, 15 మంది గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం పరీక్షలకు 254 విద్యార్థులకుగాను 244 హాజరుకాగా.. 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు నరేంద్రకుమార్, శ్రీనివాసులు నాలుగు పరీక్ష కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం కవిత, శ్రీనివాస్ ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. -
వీడని మిస్టరీ
● ఏళ్లు గడుస్తున్నా హత్య కేసుల్లో దోషులను గుర్తించని పోలీసులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లోనే పలు మర్డర్ కేసులు ● రాజకీయంగా సంచలనం సృష్టించినవి సైతం అదే తీరు ● రెండు, మూడు రోజుల్లో దొరక్కుంటే అంతే సంగతులు.. ● ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నా ఛేదించడంలో విఫలం సాక్షి, నాగర్‌కర్నూల్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి నేర పరిశోధన, కేసుల ఛేదింపుల్లో పోలీసులకు ఆయుధంగా మారుతోంది. సీసీ కెమెరాలు, సెల్ఫోన్లు, ఫోరెన్సిక్ ఆధారాల సాయంతో హత్య కేసులను ఛేదించడం సులభతరం అవుతోంది. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చోటుచేసుకున్న కొన్ని హత్యకేసుల్లో నిందితులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. మరికొన్ని కేసుల విచారణ ఏళ్లతరబడిగా కొనసాగుతోంది. చాలా సందర్భాల్లో రెండు, మూడు రోజుల్లో నిందితులు పట్టుబడకపోతే ఆ కేసు పెండింగ్‌లో పడిపోతోంది. ఉమ్మడి జిల్లాలో సంచలనం కలిగించిన హత్య కేసుల్లోనూ నిందితులను గుర్తించలేకపోవడం పోలీసుల పనితీరుకు మచ్చగా నిలుస్తోంది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌లోనే ఎక్కువ గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 33 హత్యలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్‌కర్నూల్ మండలాల్లో ఎక్కువగా నేరాలు నమోదయ్యాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 30 హత్యలు జరిగాయి. ఆ తర్వాత వనపర్తిలో 14, జోగుళాంబ గద్వాలలో 9, నారాయణపేట జిల్లాలో 8 హత్య కేసులు నమోదయ్యాయి. విచారణ కొనసాగుతోంది.. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో వ్యక్తి హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇంకా నిందితులను గుర్తించలేదు. ఈ కేసు మినహా ఎక్కడా మర్డర్ కేసులు పెండింగ్‌లో లేవు. ఎప్పటికప్పుడు పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషిచేస్తున్నాం. – వెంకటేశ్వరరావు, డీఎస్పీ, వనపర్తి -
యూరియా నిల్వలు పరిశీలించిన అధికారులు
పాన్‌గల్: స్థానిక సింగిల్‌విండో కార్యాలయంలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ‘రైతులకు యూరియా తిప్పలు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన ఏడీఏ చంద్రశేఖర్, ఏఓ రాజవర్ధన్‌రెడ్డి కార్యాలయాన్ని సందర్శించి యూరియా నిల్వలు, సరఫరాను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్యాలయంలో సీజన్‌కు సరిపడా 90 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వెంట సింగిల్‌విండో సీఈఓ భాస్కర్‌గౌడ్, వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి
వనపర్తి విద్యావిభాగం: పదోతరగతి విద్యార్థులు ఇంటి దగ్గర చదువుకునేలా తల్లిదండ్రులు అనువైన వాతావరణం, సౌకర్యాలు కల్పించాలని జిల్లా విద్యాశాఖ కమిటీ మొబిలైజేషన్ కో–ఆర్డినేటర్ యుగంధర్ కోరారు. శనివారం ఆయన మండలంలోని రాజపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తకోటలోని బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశాలకు ఆయన హాజరయ్యారు. 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థుల ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలు రోజు ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాలని కోరారు. పరీక్షలు దగ్గర పడుతున్నందున పౌష్టికాహారం అందించి వారు ఆరోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వేరుశనగ నూనె తయారీ పరిశ్రమ పరిశీలన
వనపర్తి రూరల్: మండలంలోని దత్తాయిపల్లి శివారులో గత ప్రభుత్వం మండల మహిళా సమాఖ్య (ఐకేపీ) ఆధ్వర్యంలో వేరుశనగ నూనె పరిశ్రమను ఏర్పాటుచేసింది. నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ జిల్లా డీఏఓ చంద్రశేఖర్, ఏడీ పూర్ణచంద్రారెడ్డి, ఏఓ నరేశ్, ఏఈఓ రత్నరావు శనివారం గ్రామానికి చేరుకొని పరిశ్రమను పరిశీలించారు. వనపర్తి డీపీఎం అరుణ మిషనరీ, పరిశ్రమ నిర్మాణ వ్యయాన్ని వారికి వివరించారు. డీఏఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకుగాను కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం వెంకటన్న, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీ దుకాణాలకు టెండర్ల ఆహ్వానం వనపర్తి టౌన్: వనపర్తి ఆర్టీసీ డిపో పరిధిలోని వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, పెబ్బేరు బస్స్టేషన్లలో ఖాళీ స్థలాలు, నిర్మాణంలో ఉన్న, నిర్మించిన దుకాణాలను అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు మార్చి 3 వరకు గడువు ఉందని, డిపో కార్యాలయంలో తగిన రుసుం చెల్లించి టెండర్ ఫారాలు పొందాలన్నారు. బహిరంగ వేలంలో దుకాణాల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్‌ఫోన్ నంబర్లు 99592 26289, 94940 19474, 73828 29092 సంప్రదించాలన్నారు. రామన్‌పాడులో 1,021 అడుగులు మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా లేదని.. ఎన్టీఆర్ కాల్వకు 24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 121, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. కొనసాగుతున్న రాజావళి దర్గా ఉర్సు అమరచింత: పట్టణంలోని సయ్యద్‌షా రాజావళి దర్గా ఉర్సు వైభవంగా కొనసాగుతోంది. శనివారం జరిగిన తాజే చిరాక్ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు మాలీజాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉర్సుకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హాజరై దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర, మహిమ గల రాజావళి దర్గాను ఎన్నో సందర్భాల్లో దర్శించుకున్నానని తెలిపారు. తాగునీటి వసతి కల్పనకు దర్గా ఆవరణలో బోరును వేయిస్తానని హామీ ఇచ్చారు. దర్గా అభివృద్ధికి తనవంతు సాయం అందించేందుకు ముందుంటానని వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, అరుణ్‌కుమార్, మహేందర్‌రెడ్డి, తిరుమలేష్, పోసిరిగారి విష్ణు, మహంకాళి విష్ణు, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
‘డిజిటల్’ కష్టాలు!
పనిచేయని ట్యాబ్‌లు.. మరమ్మతుకు గురవుతున్న స్మార్ట్ఫోన్లు ●ఫోన్లు పాడవుతున్నాయి.. పంట వివరాల నమోదుకు ఐదేళ్ల కిందట వ్యవసాయశాఖ ఇచ్చిన ట్యాబ్‌లు ప్రస్తుతం పనిచేయడం లేదు. దీంతో వ్యక్తిగత స్మార్ట్ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని వివరాలు నమోదు చేస్తున్నాం. ఫొటో క్యాప్చర్, డాటా ఎంట్రీ సమయంలో ఫోన్లు వేడెక్కి పాడవుతున్నాయి. స్మార్ట్ఫోన్లలోని వ్యక్తిగత సమచారం సైతం బయటి వ్యక్తులు చేతుల్లోకి వెళ్తుందనే భయం వెంటాడుతోంది. – సూదిరెడ్డి రవీందర్‌రెడ్డి, ఏఈఓ, కొత్తకోట రక్షణ కరువు.. రెవెన్యూ సహాయకులు లేకపోవడంతో మహిళా ఏఈఓలు ఒంటరిగా వెళ్లి పంట వివరాలు నమోదు చేయడం కష్టంగా ఉంది. గ్రామంలో భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఏయే సర్వేనంబర్లలో ఏయే పంటలు సాగు చేశారనే వివరాలు తెలుసుకోవడానికే సమయం సరిపోతుంది. రోజువారీగా 20 ఎకరాల వివరాలు సైతం నమోదు చేయలేకపోతున్నాం. – హరిత, ఏఈఓ, నాగల్‌కడ్మూర్ సరైన వివరాలు లేక.. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల ప్రకారం గ్రామాలకు వెళ్లి పంట వివరాల నమోదు చేయడంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. పాత ట్యాబ్‌లతో రోజువారీగా పది ఎకరాల పంట వివరాలు ఆన్లైన్లో నమోదు చేయలేని పరిస్థితి ఉంది. జిల్లా అధికారులు స్పందించి కొత్త ట్యాబ్‌లు, సహాయకులను ఇవ్వాలి. – జయశ్రీ, ఏఈఓ, పెబ్బేరు క్లస్టర్ అమరచింత: యాసంగి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల కిందట ఇచ్చిన ట్యాబ్‌లు మరమ్మతుకు గురికావడంతో సొంత స్మార్ట్ఫోన్లలో వివరాలు నమోదు చేస్తుండటంతో అవి కూడా పాడైపోతున్నాయని ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం నిర్వహించే ప్రతి సర్వే పనుల్లో తమను వినియోగించుకుంటున్నారని.. తాము శాఖాపరంగా చేసే సర్వేకు మాత్రం ఇతర సిబ్బందిని సహాయకులుగా ఇవ్వకపోవడంతో పంటల నమోదు ప్రక్రియ భారంగా మారిందని ఏఈఓలు వాపోతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వారం కిందట ఏడీఏకు వినతిపత్రం కూడా అందించామని చెప్పారు. జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న 255 గ్రామపంచాయతీల్లో 71 మంది ఏఈఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరి 2 నుంచి పంట వివరాల నమోదు చేపడుతున్నామని.. సహాయకులు లేకపోవడంతో ఏయే సర్వేనంబర్లలో ఏయే పంటలు సాగు చేశారనే వివరాలు పక్కపొలం రైతులు చెప్పలేని స్థితిలో సర్వే ఎలా చేస్తామంటూ ప్రశ్నిస్తున్నారు. పంట వివరాల నమోదులోఏఈఓల అవస్థలు జిల్లాలో 255 గ్రామాలు.. 71 మంది వ్యవసాయ విస్తరణ అధికారులు రోజు 20 ఎకరాలకు మించి నమోదు కాని వైనం సహాయకులు లేక ఇబ్బందులు పడుతున్న మహిళా ఉద్యోగులుముందస్తు సమాచారం ఇచ్చినా.. రెవెన్యూ అధికారుల మ్యాప్ ఆధారంగా వ్యవసాయ విస్తరణ అధికారులు డిజిటల్ సర్వే చేపడుతున్నారు. గత ప్రభుత్వం రైతుబీమా పథకం అమలు చేయడంతో పట్టాదారు కుటుంబంలోని అందరి పేరిట కొంత కొంత భూమి పట్టా చేశారు. దీంతో అదే సర్వేనంబర్‌ను విభజించి నంబర్లు కేటాయించడంతో ఏ పొలం ఏ రైతు పేరున ఉందన్న విషయం అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. పంట సర్వేకు వస్తున్నామని ముందస్తుగా రైతులకు సమాచారం ఇచ్చినా.. పొలాల వద్ద రైతులు అందుబాటులో లేకపోవడంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పంటల సర్వే ప్రక్రియ రాగానే రెవెన్యూ సిబ్బందిని సహాయకులుగా వెంట పంపడంతో ఎవరి పొలం ఎక్కడుంది.. ఏ రైతు ఏ పంట వేశారనే వివరాలు వెంటనే తెలుసుకోవడం, ఆన్లైన్లో నమోదు చేయడం చకచకా జరిగిపోయేవని.. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే ఆరు నెలలైనా పూర్తి చేయలేని పరిస్థితి ఉందని కొందరు ఏఈఓలు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదించాం.. పంట వివరాల నమోదులో కలుగుతున్న ఇబ్బందులను డివిజన్ పరిధిలోని ఏఈఓలు విన్నవించారు. సమస్యను జిల్లా వ్యవసాయ అధికారికి నివేదించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. – దామోదర్, ఏడీఏ -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
● ఫలించిన 17 ఏళ్ల నిరీక్షణ ● హైకోర్టు ఉత్తర్వులతో పోస్టింగులు ● కాంట్రాక్టు ఎస్జీటీలుగా అవకాశం ● ఉమ్మడి జిల్లాలో 182 మందికి న్యాయం సర్వీస్ కల్పించాలి.. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. అయితే మేమంతా 17 ఏళ్ల సర్వీస్ కోల్పోయాం. ఇప్పటికి మాకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. ఉద్యోగం ఇస్తూ సర్వీస్, ఏరియర్స్ కల్పిస్తూ.. రెగ్యులర్ చేస్తే బాగుంటుంది. – విజయ్‌కుమార్, మద్దూరు నారాయణపేట/మద్దూర్: డీఎస్సీ– 2008 నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు విధానంలో ఎస్టీటీలుగా వారం రోజుల్లోగా నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని బాధిత అభ్యర్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు 30 శాతం పోస్టులు ప్రత్యేకంగా డీఈడీ అభ్యర్థులకు కేటాయించడంతో బీఈడీ అభ్యర్థులు నష్టపోయారు. మెరిట్ జాబితాలో ఉన్నా.. ఉద్యోగాలు రాకపోవడంతో కోర్టుల చుట్టూ తిరుగుతూ వస్తున్నారు. 17 ఏళ్ల న్యాయ పోరాటం.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ కాంట్రాక్టు విధానంలో నియమించనున్నారు. అయితే వీరందరికీ సాధ్యమైనంత త్వరగా పోస్టింగ్ ఇవ్వాలని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసినా వివిధ కారణాలతో జ్యాపం జరుగుతూ వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తయింది. ఈ పరిశీలన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు కొనసాగింది. తాజాగా కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నియామక ఉత్తర్వులను వారం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాధిత అభ్యర్థులు కాంట్రాక్టు ఎస్జీటీలుగా నియామకం కానున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 182 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ నూతన జిల్లాల వారీగానే పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతుండగా.. ఖాళీలను బట్టీ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల50 మహబూబ్‌నగర్ 10 డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు జిల్లాల వారీగా అభ్యర్థుల సంఖ్య.. నారాయణపేట 50 నష్టపోయాం.. డీఎస్సీ– 2008లో వెలువడిన నోటిఫికేషన్ ద్వారా పోటీ పరీక్షల్లో ఎంపికై కౌన్సెలింగ్ సమయంలో ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా చాలా నష్టపోయాం. అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం హర్షణీయం. – బుగ్గప్ప, మద్దూరు సంతోషంగా ఉంది.. 17 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మాకు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. గత 17 ఏళ్లుగా వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించాను. 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు అన్యాయం జరిగి.. మళ్లీ అదే ప్రభుత్వంలో ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. – రవిప్రకాష్, నారాయణపేట నాగర్‌కర్నూల్ 32 వనపర్తి 40 న్యాయ పోరాటంతోనే.. ఎన్నో సంవత్సరాల పోరాటంతో ఫలించిన అద్భుత క్షణం ఇది. 2008లో డీఎస్సీ రోస్టర్‌లో మా పేర్లు ఉన్నా కొన్ని కారణాలతో ఉద్యోగం రాలేదు. 28 జీఓ ప్రకారం మా ఉద్యోగాలు మాకు రావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఎట్టకేలకు అనుకూలంగా తీర్పు రావడం సంతోషంగా ఉంది. – బాలస్వామి, నాగర్‌కర్నూల్ కొత్త జిల్లాల వారీగా.. ఇప్పటికై నా ఉద్యోగం రావడం చాలా ఆనందంగా ఉంది. కానీ, మమ్మల్ని మా స్థానికత ఆధారంగా కొత్త జిల్లాల వారీగా నియమిస్తే బాగుండేది. అలాగే ఎంటీఎస్ విధానంలో జీతాలు ఇవ్వకుండా రెగ్యులర్ టీచర్ల మాదిరిగానే చెల్లించేలా చూడాలి. – అరుణ, వనపర్తి -
సంత్ సేవాలాల్ మార్గం ఆచరణీయం
వనపర్తి: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గం ఆచరణీయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నాగవరం శివారులోని సేవాలాల్ భవన్లో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి గిరిజనులు తరలిరాగా.. మహిళలు తమ సాంప్రదాయ దుస్తులతో వేడుకకు హాజరయ్యారు. సేవాలాల్ మహరాజ్, మేరమయాడి దేవత మహాభోగ్ (హోమం)లో ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి, లంబాడి పూజారులు రాజ్పవార్, బిక్షానాయక్ పాల్గొని నెయ్యి, కడావ్ ప్రసాదం వేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సేవాలాల్ అందరికీ ఆదర్శప్రాయుడని.. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఇందుకుగాను నియోజకవర్గానికి రూ.2.68 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. సేవాలాల్ ఆలయం, సేవాలాల్ భవన్లో వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ధౌర్జన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన యోధుడు సేవాలాల్ అన్నారు. దొంగతనాలు చేయొద్దు.. మాంసాహారం తినొద్దని బోధించారని గుర్తు చేశారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని.. ప్రతి బంజారా చదువుకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఉన్నతవిద్య అభ్యసించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాకు ఎస్టీ గురుకుల పాఠశాల తీసుకొచ్చేందుకు కృషి చేశానన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి పి.సీతారాంనాయక్, గిరిజన అభివృద్ధి అధికారి బీరం సుబ్బారెడ్డి, శంకర్‌నాయక్, జాత్రూనాయక్, వాల్యానాయక్. మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, గిరిజన సేవాసంఘం అధ్యక్షుడు చంద్రూనాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అర్జున్‌నాయక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు హన్మంత్‌నాయక్, వి.రాధాకృష్ణ, సూర్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పాలకవర్గాలకే ‘సహకారం’
● పీఏసీఎస్, డీసీసీబీ చైర్మన్ల పదవీకాలం పొడిగింపు ● ీఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ● డీసీఎంఎస్‌కు సంబంధించి వెలువడని నిర్ణయం సీఎంకు కృతజ్ఞతలు పీఏసీఎస్ పాలకవర్గాల కాలపరమితి మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. మా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని పెంచిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తమ్మల నాగేశ్వర్రావుకు కృతజ్ఞతలు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రైతులకు మరింత చేరువ చేసేందుకు సహకార వ్యవస్థను బలోపేతం చేస్తాం. – విష్ణువర్ధన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్, మహబూబ్‌నగర్ అచ్చంపేట: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వెలువడిన ఉత్తర్వులను ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులు అందుకొని పీఏసీఎస్‌లకు పంపించారు. ఎన్నికల ప్రక్రియకు ఆరు నెలల ముందే కసరత్తు మొదలుపెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. దీంతో ప్రత్యేకాధికారుల పాలనా.. ప్రస్తుతం పాలకవర్గ పదవీకాలాన్ని పొడిగిస్తారా అన్న సందేహాలకు తాజా ఉత్తర్వులతో తెరపడింది. జిల్లాలోని 87 సొసైటీల పాలకవర్గాలు మరో ఆరు నెలలపాటు కొనసాగనున్నాయి. డీసీసీబీ పాలకవర్గ పదవీకాలాన్ని కూడా పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే డీసీఎంఎస్‌కు సంబంధించి అంశం ఉత్తర్వుల్లో లేకపోవడం గమనార్షం. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాలకు మరో పదిరోజుల సమయం ఉండటంతో ఈలోగా డీసీఎంఎస్ పాలకవర్గ పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హర్షాతిరేకాలు.. ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షుల పదవీకాలం శనివారంతో ముగిసింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 20తో పూర్తవుతుంది. ప్రభుత్వం తాజా నిర్ణయంతో డీసీసీబీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, డీసీఎంఎస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ పొడిగింపు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనూ 2018 ఫిబ్రవరి 4న పాలకవర్గాల పదవీకాలం ముగియగా ఆరు నెలల చొప్పున రెండుసార్లు పర్సన్ ఇన్‌చార్జ్‌ల పదవీకాలాన్ని పొడిగించారు. 2020 ఫ్రిబవరి 15న ఎన్నికలు నిర్వహించారు. అంతకు ముందు కాంగ్రెస్ హయాంలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రెండేళ్లు, టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు మూడేళ్లపాటు పొడిగించారు. పర్చన్ ఇన్‌చార్జ్‌లను నియమిస్తే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగించింది. -
రాజకీయ జోక్యమేనా..?
గన్ని బ్యాగుల దగ్ధం కేసులో కొందరు స్థానిక నేతల హస్తం ఉందనే కోణంలో మొదట్లో పోలీసుల విచారణ సాగింది. అంతలోనే చోటు చేసుకున్న కొన్ని రాజకీయ పార్టీ ఫిరాయింపులతో విచారణ మలుపు తిరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ తుది దశకు చేరుకునే సమయంలోనే.. ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు పార్టీ మారినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. వారంతా అధికార పార్టీలో చేరడంతో విచారణ మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. పోలీసు, రెవెన్యూ అధికారులు ఇచ్చిన విచారణ నివేదికలో ఎండ తీవ్రతకు గోదాంలో మంటలు చెలరేగి గన్నీ బ్యాగులకు నిప్పంటుకున్నట్లు పేర్కొన్నట్లు ప్రచారం సాగుతోంది. -
ఉన్నతాధికారులపరిశీలనలో ఉంది..
ఎల్లూరు లిఫ్టులోని ఐదు మోటార్లలో రెండు మోటార్లు పాడై చాలా కాలం అవుతోంది. ఇటీవల మరో పంపు మోటారు కూడా స్వల్ప మరమ్మతుకు గురైంది. అయితే దీనికి ఇక్కడే మరమ్మతు చేయవచ్చు. ప్రస్తుతం రెండు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు సాగుతున్నాయి. అయితే మిషన్ భగీరథ కోసం రెగ్యులర్‌గా నీటి ఎత్తిపోతలు చేపట్టాలి. ఇలా చేయడం వల్ల మోటార్ల మరమ్మతు చేపట్టేందుకు ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికై తే మరమ్మతు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. – లోకిలాల్‌నాయక్, పంపుహౌజ్ నిర్వహణ విభాగం డీఈఈ ● -
రైతులకు ‘యూరియా’ తిప్పలు
పాన్‌గల్: ఎరువుల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యాసంగి వరి పంటలు చిరు పొట్ట దశకు చేరడంతో కర్షకులు యూరియా కోసం సింగిల్‌విండో కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. మండలంలోని 28 గ్రామపంచాయతీలకు ఒకే సింగిల్‌విండో కార్యాలయం ఉంది. శుక్రవారం మూడు లారీల యూరియా (1,050 బస్తాలు) రావడంతో వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో రైతులు కార్యాలయానికి చేరుకుని బయోమెట్రిక్ టోకన్ల కోసం బారులు తీరారు. ముందుగా వచ్చిన వారికి దొరకగా.. వెనుక వచ్చిన రైతులు లభించక నిరాశతో వెనుదిరిగారు. పంటలకు సకాలంలో ఎరువులు అందించకుంటే దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు వాపోతున్నారు. ఈ విషయమై ఏఓ రాజవర్ధన్‌రెడ్డి స్పందిస్తూ నాలుగు రోజులుగా యూరియా లేదని.. శుక్రవారం రావడంతో రద్దీ నెలకొందన్నారు. రైతుల అవసరం మేరకు యూరియా తెప్పిస్తామని, కొరత లేకుండా చూస్తామని తెలిపారు. అధిక ఎరువుల వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సింగిల్‌విండో ఎదుటబారులు -
నాణ్యమైన వైద్యసేవలతోనే గుర్తింపు
వీపనగండ్ల: గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందించినప్పుడే గుర్తింపు లభిస్తుందని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిషన్ మధుమేహ, అనుమానిత కేసులు, రోగుల ఆన్లైన్ నమోదు తదితర అంశాలపై వైద్యసిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లోని సుమారు 40 గ్రామాలకు అందుబాటులో ఉన్న ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. రాబోయే వేసవిలో ప్రజలు వడదెబ్బ బారినపడకుండా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో అవగాహన కల్పించాలని, విధులను నిర్లక్ష్యం చస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి డా. వంశీకృష్ణ, వైద్యాధికారి డా. రాజశేఖర్, ఆయుష్ వైద్యులు డా. హేమవర్ధన్, డా. శ్వేత, డా. కరుణశ్రీ, డా. భాగ్యశ్రీ, సూపర్వైజర్ దయామని, కేశవులు, కళమ్మ, రాములు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు -
ఆశయాలకు ఊతం
అందమైన చిత్రం.. విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో ఉంటూ జ్ఞానాన్ని అర్జిస్తుంటారు. అలాంటి పవిత్ర ప్రదేశంలో వారి ఆలోచనలు, ఆశయాలను ప్రేరేపించేలా అందమైన చిత్రాలు వేయించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి నిర్ణయించారు. ఆయన ఆదేశానుసారం జిల్లా విద్యాశాఖ అధికారులు హైదరాబాద్‌కు చెందిన విజయ్స్వాతితో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు అందమైన చిత్రం వేయించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలకు సైతం చిత్రాలు వేయించనున్నారు. – వనపర్తి -
3, 5 నంబర్ల మోటార్లు
కేఎల్ఐ ప్రాజెక్టులోని ఎల్లూరు పంప్‌హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసి.. ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లు నింపాలి. ఈ రిజర్వాయర్లకు అనుసంధానంగా ఉన్న చెరువులను కూడా రెగ్యులర్‌గా నింపుతూ ఉండాలి. ఇందుకోసం ఎల్లూరు పంప్‌హౌజ్‌లో 5 మోటార్లను ఏర్పాటు చేశారు. వీటిలో రెండు మోటార్లు పాడయ్యాయి. నాలుగున్నరేళ్ల క్రితం పంప్‌హౌజ్‌లోకి నీరు చేరడంతో మూడో నంబర్ పంప్ మోటార్ దెబ్బతినగా.. ఇప్పటి వరకు ఆ మోటార్ మరమ్మతుకు నోచుకోలేదు. అలాగే రెండేళ్ల క్రితం 5వ నంబర్ పంప్ మోటార్ కూడా దెబ్బతినగా.. దీనిని కూడా అలాగే వదిలేశారు. దీంతో మిగిలిన మూడు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు. -
మరమ్మతు చేయరా..?
కేఎల్ఐ ప్రాజెక్టులో పాడైన రెండు మోటార్లు ● ఎల్లూరు పంప్‌హౌజ్‌లో నాలుగున్నరేళ్లుగా గాలికొదిలేసిన వైనం ● మూడింటితోనే కొనసాగుతున్న ఎత్తిపోతలు ● వివిధ రకాల సాకులతో కాలయాపన ● ఏటా వేసవిలో తప్పని సాగు, తాగునీటి కష్టాలు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పంపు మోటార్ల మరమ్మతు ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో పడుతూనే ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు–రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా అందుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు లిఫ్టు నుంచి కృష్ణానది నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు, చెరువులు నింపుతున్నారు. అయితే ప్రాజెక్టులోని మొదటి పంపుహౌజ్ (ఎల్లూరు లిఫ్టు)లో రెండు మోటార్లు పాడై ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఇందుకు ఇటు ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత కంపెనీ ప్రతినిధులు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. ఎత్తిపోతలకు ఇక్కట్లు.. ఎల్లూరు పంప్‌హౌజ్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న మూడు మోటార్లలో రెండింటితోనే నీటి ఎత్తిపోతలు నిర్వహిస్తుండగా.. మరొకటి స్పేర్‌లో ఉంది. రెండు మోటార్లతోనే నీటి ఎత్తిపోతలు చేపడుతుండటంతో వరదల సమయంలో జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు ఆలస్యమవుతోంది. కృష్ణానది వరద ప్రవాహ సమయంలో ఎల్లూరు పంప్‌హౌజ్‌లో నాలుగు మోటార్లు నడిపించి రోజుకు 3,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలి. ఈ నీటితో రిజర్వాయర్లతో పాటు, చెరువులు కూడా నింపుకోవాలి. కానీ, ఎల్లూరు లిఫ్టులో రెండు మోటార్లు మాత్రమే పనిచేస్తుండడంతో ఆశించిన స్థాయిలో ఎత్తిపోతలు జరగడం లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 2,208 చెరువులు నింపేందుకు నెలలు గడిచిపోతోంది. మరమ్మతులకు ఆటంకాలు.. కేఎల్ఐ ప్రాజెక్టులో మోటార్లు పాడైతే మరమ్మతు చేపట్టడం ఇబ్బందికరంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ స్కీం కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండటంతో రెగ్యులర్‌గా నీటి ఎత్తిపోత జరుగుతుంది. దీంతో మోటార్ల మరమ్మతుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మోటార్లు మరమ్మతు చేయాలంటే నీటి ఎత్తిపోతలు కొంతకాలం పాటు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. పాలమూరు ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వస్తేనే కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు నిలిపే అవకాశం ఉంది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా ప్రారంభమయ్యే వరకు మోటార్లకు మరమ్మతు చేపట్టడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. అయితే పాత బిల్లులు పెండింగ్‌లో ఉండటం కూడా కొంత కారణమని సంబంధిత కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఉమ్మడి పాలమూరువాసుల సాగు, తాగునీటి కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో.. రూ.వేల కోట్లు వెచ్చించి.. సంవత్సరాల తరబడి శ్రమించి ప్రాజెక్టు నిర్మించారు.. కానీ, రెండు మోటార్లకు చిన్నపాటి మరమ్మతు చేసేందుకు అంతకు మించి కాలయాపన చేస్తున్నారు. ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉంది.. ఎవరు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విషయం పక్కనపెడితే.. ఉమ్మడి జిల్లా ప్రజలు మాత్రం ప్రతిఏటా ఎండాకాలంలో ఇటు సాగునీటికి, అటు తాగునీటికి గోస పడక తప్పడం లేదు. – కొల్లాపూర్ -
పీఎంఎస్ఆర్ఐ నిధులు ఖర్చు చేయాలి
వనపర్తి: కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన పీఎంఎస్ఆర్ఐ, సర్వశిక్ష అభియాన్ నిధులను ఫిబ్రవరి 20లోగా వందశాతం ఖర్చు చేసి నివేదికలు అందజేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రీన్ స్కూల్, ఆత్మరక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన, మౌలిక వసతులు, స్పోర్ట్స్, సైన్స్ తదితర విభాగాలకు రూ.లక్షల్లో నిధులు విడుదల చేసినా ఖర్చులు మాత్రం జరగడం లేదన్నారు. జిల్లాలో పీఎంశ్రీ కింద 6 ప్రాథమిక పాఠశాలలు, 15 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని.. వారం రోజుల్లో నిధులు ఖర్చుచేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. అలాగే అపార్ నమోదు సైతం త్వరగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, పంచాయతీరాజ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
విశ్వసనీయత ఏది..?
పెబ్బేరు గోదాంలో అగ్నిప్రమాదం జరిగి పది నెలలు వనపర్తి: పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో గన్నీబ్యాగులు నిల్వచేసిన ఓ గోదాంలో మంటలు చెలరేగి సుమారు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిన సంగతి పాఠకులకు విధితమే. ఈ ఘటన జరిగి సుమారు 10 నెలలు గడుస్తున్నా.. కారకులు ఎవరనే విషయాన్ని నేటికీ పోలీసులు గుర్తించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.కోట్ల ప్రజాధనం వృథా అయిన ఘటనపై విచారణ మందకొడిగా సాగడమేమిటనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా.. ఈ విషయంపై మాట్లాడేందుకు అటు పోలీసు అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు అనాసక్తి చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితులను కాపాడేందుకు అధికారులు కొత్త దారులు వెదుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు స్థానిక నాయకులు గోదాంలో భద్రపర్చిన గన్ని బ్యాగుల్లో సుమారు 7 లక్షలు ఇతర జిల్లాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారన్న విషయాన్ని వెలుగులోకి రాకుండా రూ.10 కోట్ల విలువైన సుమారు 12.94 లక్షల గన్ని బ్యాగులకు నిప్పు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడురోజుల పాటు మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపకశాఖ అధికారులు గోదాం గోడలను పగలగొట్టి నలువైపుల నుంచి మంటలు ఆర్పే ప్రయత్నం చేయడంతో.. రూ.10 కోట్ల విలువజేసే గోదాం సైతం దెబ్బతింది. దీంతో ఆస్తి నష్టం విలువ సుమారు రూ.20 కోట్లకు చేరిందని ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై ఇటీవల పోలీస్ అధికారులు ఇచ్చిన దర్యాప్తు నివేదికను కలెక్టరేట్ అధికారులు వెల్లడించడానికి విముఖత చూపుతున్నారు. ఇందుకు కారణాలు ఏమిటనే విషయం వారే వెల్లడించాల్సి ఉంది. మూడురోజుల పాటు మంటలు.. విచారణ కొనసాగుతోంది.. పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌యార్డు గోదాంలో మంటలు చెలరేగి గన్ని బ్యాగులు కాలిపోయిన కేసు విచారణ కొనసాగుతోంది. కొత్తకోట సీఐ రాంబాబును విచారణ అధికారిగా నియమించాం. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన నమూనాల ఆధారంగా వచ్చిన నివేదిక ఆధారంగా విచారణ కొనసాగుతోంది. పూర్తి కాగానే వివరాలు వెల్లడిస్తాం. – వెంకటేశ్వరరావు, డీఎస్పీ, వనపర్తి నివేదిక చూడలేదు.. గన్నీ బ్యాగుల దగ్ధం కేసులో విచారణ నివేదికను ఇటీవలే పోలీసు అధికారులు అందజేశారు. నివేదికను ఇప్పటి వరకు చదవలేదు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం. – జి.వెంకటేశ్వర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్ రూ.20 కోట్ల ప్రజాధనం వృథాపై నేటికీ నిగ్గుతేలని నిజాలు ఎండ తీవ్రతకు మంటలు చెలరేగాయని ప్రచారం రాజకీయ జోక్యంతో విచారణ మలుపు తిరుగుతోందా? -
బీసీ గురుకులంలో కలెక్టర్ బస
వనపర్తి: స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి కలెక్టర్ ఆదర్శ్ సురభి బస చేశారు. నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సామర్థ్యాలను పరిశీలించారు. గణితాన్ని బోధించారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఇన్నాళ్లు తయారు చేసుకున్న రాత పుస్తకాలను తనిఖీ చేశారు. ఉన్నత చదువులతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల సామర్థ్యాలు, వారికి అందిస్తున్న ఆహార నాణ్యత, వసతులను పరిశీలించేందుకు పాఠశాలకు వచ్చినట్లు కలెక్టర్ వివరించారు. పుల్వామా అమరులకు విశ్రాంత సైనికుల నివాళి వనపర్తి విద్యావిభాగం: కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు శుక్రవారం రాత్రి జిల్లాకేంద్రంలో తెలంగాణ మాజీ కేంద్ర సాయిధ పోలీసు బలగాల సిబ్బంది సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అమరుల చిత్రపటాల బ్యానర్లను ప్రదర్శిస్తూ రాజీవ్‌చౌక్ వరకు ర్యాలీ, అక్కడే కొవ్వొత్తులు ప్రదర్శించి నివాళులర్పించారు. దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. విశ్రాంత సైనికులు చీర్ల రాముడు, దేవేందర్, ఉమామహేశ్వర్, ఆంజనేయులు, నాగరాజు, రాములు, సత్యనారాయణ పాల్గొన్నారు. త్రిఫ్ట్ ఫండ్‌కు దరఖాస్తుల ఆహ్వానం అమరచింత: ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్‌ఫండ్ పథకానికి అర్హులైన చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత జౌళీశాఖ ఏడీ గోవిందయ్య శనివారం కోరారు. జిల్లాలోని అమరచింత, కొత్తకోట, తిప్పుడంపల్లి, వెల్టూరు, ఖిల్లాఘనపురం తదితర గ్రామాల్లో చేనేతపై ఆధారపడిన కార్మికులు మగ్గానికి ఇద్దరు చొప్పున జియోట్యాగింగ్ నంబర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఆర్డీ 1 బ్యాంక్ ఖాతాలో తమ నెలసరి వేతనంలో 8 శాతం జమచేయాలని, అలాంటి వారు అన్ని ధ్రువపత్రాలను జౌళిశాఖ కార్యాలయంలో అందించాలని కోరారు.భక్తిశ్రద్ధలతో రాజవళి గంధోత్సవం అమరచింత: పట్టణంలోని సయ్యద్‌షా రాజవళి ఉర్సులో ప్రధాన ఘట్టమైన గంధోత్సవం శుక్రవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకృష్ణనగర్ దర్గా ఇంటి నుంచి గంధాన్ని ఉరేగింపుగా దర్గా షరీఫ్‌కు తీసుకొచ్చారు. వెండితో తయారుచేసిన రాజవళి దర్గా నమూనాను టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్ తలపై ఉంచుకొని దర్గా షరీఫ్‌కు తీసుకొచ్చారు. శనివారం తాజే చిరాక్ సందర్భంగా భక్తులు మలీజాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు అయ్యూబ్‌ఖాన్, దర్గా కమిటీ సభ్యులు ఖాసీం, ఖాజాహుస్సేన్, ఇంతియాజ్, ఖదీర్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఆశాజనకంగా వేరుశనగ ధరలు జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగ ధరలు ఆశాజనకంగా లభిస్తున్నాయి. వారం రోజులుగా ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి 4,402 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.6,819, కనిష్టంగా రూ.4,009 ధరలు పలికాయి. కందులు క్వింటాల్ గరిష్టంగా రూ.6,969, కనిష్టంగా రూ.4,300, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,370, కనిష్టంగా రూ.2,059, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,750, కనిష్టంగా రూ.6,100, మినుములు రూ.7,821, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,479, కనిష్టంగా రూ.2,150 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో కందులు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,869, కనిష్టంగా రూ.6,689గా ధరలు పలికాయి. -
వనపర్తి
పెళ్లి నిర్ణయం పెద్దలకే..శుక్రవారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025ప్రేమ, వివాహం విషయంలో యువత ఆలోచన తీరు మారుతోంది. ప్రేమ, ఆకర్షణ, మ్యారేజ్ కన్నా జీవితంలో స్థిరపడేందుకే అధిక శాతం యువత ప్రాధాన్యం ఇస్తున్నారు. శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలోని మెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్, పీజీ కళాశాలల విద్యార్థులతో ‘సాక్షి’ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 120మంది యువతులు, 120 మంది యువకులు మొత్తం 240 మందితో సర్వే నిర్వహించాం. యువతీ, యువకుల్లో భవిష్యత్‌పై స్పష్టమైన లక్ష్యాలు ఉండడం.. చదువు తర్వాత ఉద్యోగ సాధన.. ఆపై ఆర్థిక స్థిరత్వం తప్పనిసరిగా ఉండాలనే ధోరణి నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెళ్లి విషయంలో పెద్దల మాటకే విలువ ఇస్తామని ఎక్కువ మంది చెబుతున్నారు. ఇందులో యువతులే కాక యువకులూ ఉండడం విశేషం. ఒకవేళ మనసులు కలిసి జీవితాంతం కలిసి ఉంటామనే నమ్మకం ఏర్పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా పెద్దల అంగీకారం తప్పనిసరి తీసుకుంటామని అంటున్నారు. అయితే, ప్రేమ పెళ్లి విషయంలో యువతలతో పోలిస్తే యువకుల్లో కొంత ఎక్కువగా ఆసక్తి కనిపించింది. సర్వేలో భాగంగా యువతీ యువకులను వివిధ ప్రశ్నలు అడుగగా వారి సమాధానాలు ఇలా ఉన్నాయి... – ‘సాక్షి’ నెట్వర్క్ ప్రేమ పెళ్లి.. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఏది సరైనది? ప్రేమ వివాహాలు భవిష్యత్తరాలపై ప్రభావం చూపుతాయా? 5691 -
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
వనపర్తి రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పెద్దగూడెంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా పశువైద్య అధికారి వెంకటేశ్వర్‌రెడ్డితో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో పశుసంతతి పెంచుకోవడానికి రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. శిబిరంలో 10 ఆవులు, 33 గేదెలు, 75 గొర్రెలకు చికిత్స అందించి మందులు పంపిణీ చేశామని పశు వైద్యాధికారి డా. రాజేష్ కన్నా తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ శారదమ్మ, కార్యదర్శి సరోజ, వైద్యాధికారులు ఆంజనేయులు, వెంకటేష్, జేవీఓ హరీశ్, మక్సూద్‌అలీ, వీఏ చక్రవర్తి, సత్యనారాయణ, బాలనాగి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా వెంకన్న రథోత్సవం
ఖిల్లాఘనపురం: గట్టుకాడిపల్లి (అంజనగిరి) లక్ష్మీ వెంకటేశ్వరస్వామి రథోత్సవం బుధవారం రాత్రి కనులపండువగా సాగింది. ఆలయంలో వేదపండితులు ఉదయం నుంచి స్వామివారికి అభిషేకం, అర్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి అందంగా ముస్తాబు చేసిన లక్ష్మి అలవేలుమంగ సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 11.30 ప్రాంతంలో రంగుంగుల విద్యుద్దీపాలు, పూలతో అలంకరించిన రథంపైకి మేళతాళాలు, భాజాభజంత్రీలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ చేర్చారు. రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణతో రథాన్ని తేరు గడ్డ వరకు లాగారు. అక్కడ అర్చకులు పూజలు నిర్వహించి తిరిగి తెల్లవారుజామున 2.30 వరకు ఆలయానికి చేర్చారు. ఆనవాయితీగా ఖిల్లాఘనపురం, మానాజీపేట గ్రామస్తులు ఒక్కో తాడును పోటీపడి లాగారు. గురువారం ఉదయం ఆలయంలో మహా పూర్ణాహుతి, అశ్వవాహన, శేషవాహన సేవలు, తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో తినుబండారాలు, ఆటసామగ్రి తదితర దుకాణాలు వెలిశాయి. గ్రామపెద్దలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించారు. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు భారీగా తరలివచ్చిన భక్తులు గోవింద నామంతో మార్మోగిన గట్టుకాడిపల్లి -
‘మన ఇసుక వాహనం’ వినియోగించుకోవాలి
వనపర్తి: జిల్లాలో 12 ఇసుక రీచ్‌లు ఉన్నాయని.. భవన నిర్మాణదారులు ‘మన ఇసుక వాహనం’ ద్వారానే ఇసుక పొందాలని, దళారులను ఆశ్రయించవద్దని కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో కోరారు. కావాల్సిన మేర ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే సరఫరా చేస్తామని.. ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టరేట్లోని కంట్రోల్‌రూమ్ నంబర్ 08545–233525కు ఫోన్‌చేసి తెలపవచ్చని పేర్కొన్నారు. లేదంటే రూం నంబర్ 115కు నేరుగా వచ్చి తమ సమస్యలను తెలియజేసి సాయం పొందవచ్చని కోరారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం 6 వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు. ఇసుక అక్రమ వ్యాపారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామన్‌పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో గురువారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా నిలిపివేశారని వివరించారు. ఎన్టీఆర్ కాల్వకు 24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 147 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రిని సందర్శించిన డబ్ల్యూహెచ్ఓ బృందం దేవరకద్ర: దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సభ్యులు సందర్శించారు. ఆస్పత్రిలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు పరిశీలించారు. ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో మ హిళలకు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ఐసీయూ గదిని, అందులో ఉన్న సదుపాయలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాలలో పల్లె దవ ఖానాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో తెచ్చినట్లు డీఐఓ పద్మజ వివరించా రు. కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య బృందం సభ్యులు శ్రవణ్, సోనికా, విశాల్, సుబాష్, పవన్‌కుమార్, ఎల్హెచ్ఓ మహేశ్, రమేశ్, కిషన్, వైద్యాధికారి శరత్చంద్ర పాల్గొన్నారు. సగర శంఖారావాన్ని విజయవంతం చేయాలి నాగర్‌కర్నూల్ రూరల్: సగరుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 16న జిల్లాకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సగర శంఖారావం నిర్వహిస్తున్నామని.. సగరులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముత్యాల హరికృష్ణ పిలుపునిచ్చారు. గురువారం పుర పరిధిలోని ఊయ్యాలవాడ సమీపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరాముడి వారసత్వం, భగీరథుడి వంశం సగరులదని.. ఇప్పుడు సగర కులం అంటే రోజువారీ కూలీలు, తాపీ మేసీ్త్రలుగా మిగిలిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని, బీసీలకు ప్రభుత్వం కల్పిస్తామన్న 42 శాతం రిజర్వేషన్లలో సగరుల వాట ఎంత అని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఏర్పాటుచేసి చైర్మన్ పదవి సగరులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
సైబర్ నేరస్తులతో జాగ్రత్తగా ఉండాలి
వనపర్తి: సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత సమాచారంతో నేరాలకు పాల్పడుతున్నారని.. వారితో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. గురువారం జిల్లాకేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయంలో హ్యాండ్ క్రాఫ్ట్ హైదరాబాద్, వనపర్తి జిల్లా స్వర్ణకారుల సంఘం సంయుక్తంగా స్వర్ణకారులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వర్ణకారులు సైబర్ నేరాల బారిన పడకుండా ఆన్లైన్ చెల్లింపులు, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఫోన్ కాల్స్, వాట్సాప్ లింకులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత సమాచారం చోరీ చేయడం, నష్టాలు కలిగించడంవంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ బ్రహ్మచారి, వనిత, జ్యోతి, ఏకే ఖమర్ రహమాన్, స్వర్ణకారుల సంఘాల ప్రతినిధులు, స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ -
ఇసుక నిల్వలు సీజ్
వనపర్తి: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక నిల్వలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గురువారం పెబ్బేరు మండలం రాంపురం గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 400 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్‌తో కలిసి సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేయగా అక్రమ ఇసుక నిల్వలు బయటపడ్డాయని.. వెంటనే సీజ్ చేయాలని, డంప్ చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమంగా రవాణా చేసే ట్రాక్టర్ యజమానులపై కేసులు నమోదు చేయాలని ఆర్డీఓకు సూచించారు. ఆర్డీఓ విచారణ పాన్‌గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లిలో సర్వేనంబర్ 576 పట్టా స్థలంలో క్రీడా మైదానం ఏర్పాటుపై స్థల యజమాని శ్రీనివాసాచారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఆర్డీఓ సుబ్రమణ్యం మండలస్థాయి అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. సొంత స్థలంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని తొలగించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని, గతంలో అధికారులు, పాలకులు ధౌర్జన్యంగా స్థలంలో క్రీడా మైదానం ఏర్పాటు చేశారని బాధిత కుటుంబసభ్యులు అధికారులకు వివరించారు. గ్రామస్తులు పలువురిని విచారించిన ఆర్డీఓ పూర్తి వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తామని పేర్కొన్నారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, సర్వేయర్, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
బాలసదన్‌ను సందర్శన..
వనపర్తి: జిల్లాలోని బాలసదన్‌ను గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని సందర్శించారు. బాలసదన్‌లోని పిల్లలకు బాల కార్మిక, బాల్య వివాహాలు, మోటార్ వెహికల్ తదితర చట్టాల గురించి క్లుప్తంగా వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పిల్లలకు ప్యానెల్ అడ్వొకేట్, పారాలీగల్ వలంటీర్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వారి పేర్లు, ఫోన్‌నంబర్లు ఉన్న చార్ట్‌ను బాలసదన్‌లో ప్రదర్శించారు. కార్యక్రమంలో సఖి లీగల్ కౌన్సిలర్ కృష్ణయ్య, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ కవిత తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
పాన్‌గల్: కొల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని కదిరెపాడు, శాగాపూర్, మాధవరావుపల్లి, గోప్లాపూర్, బండపల్లి, జమ్మాపూర్, కేతేపల్లి, బుసిరెడ్డిపల్లి, మాందాపూర్, చింతకుంట, మల్లాయిపల్లిలో సుడిగాలి పర్యటన చేసి ఆయా గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు భూమిపూజ చేసి మాట్లాడారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మండలానికి రూ.3.60 కోట్లు మంజూరయ్యాయని.. గ్రామాల్లోని ఎస్సీకాలనీలలో చేపట్టే అభివృద్ధి పనులతో రూపురేఖలు మారుతాయని, పనులు నాణ్యతగా నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వివరించారు. సాగునీటితో కాల్వలతో గ్రామాల్లో వలసలు తగ్గినట్లు పేర్కొన్నారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని.. అనర్హులుంటే తొలగిస్తామని తెలిపారు. ప్రభుత్వ బడుల్లోనే చదివించాలి.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల వసతులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండటంతో నాణ్యమైన విద్య అందుతుందని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు బడుల్లో చేర్పించి డబ్బులు వృథా చేసుకోవద్దని మంత్రి సూచించారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందని.. ప్రత్యేక దృష్టి సారించాలని, మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా పిల్లలపై నిఘా ఉంచాలన్నారు. మాందాపూర్ అభివృద్ధికి రూ.3.95 కోట్లు.. మాందాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు రూ.3.95 కోట్లు కేటాయించారు. గ్రామం నుంచి కంబాళాపూర్కు బీటీ రహదారి నిర్మాణానికి రూ.3.50 కోట్లు, గ్రామంలో వేసవిలో నీటిఎద్దడి నివారణ కోసం ప్రత్యేక పైపులైన్ నిర్మాణానికి రూ.15.5 లక్షలు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీ రహదారుల నిర్మాణాలకు రూ. 30 లక్షలు మంజూరైనట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్దన్‌సాగర్, విండో డైరెక్టర్ ఉస్మాన్, మండల నాయకులు రవికుమార్, వెంకటేష్‌నాయుడు, మధుసూదన్‌రెడ్డి, రాముయాదవ్, పుల్లారావు, భాస్కర్‌యాదవ్, జయరాములుసాగర్, నరేందర్‌గౌడ్, దశరథం, వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
రాజీయే రాజమార్గం
వనపర్తి టౌన్: రాజీయే రాజమార్గమని.. క్రిమినల్, సివిల్, కాంపౌండబుల్, మెయింటెనెన్స్, విడాకుల కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. గురువారం జిల్లా న్యాయస్థానంలోని లోక్ అదాలత్ సమావేశ మందిరంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మార్చి 8న లోక్ అదాలత్ ఉంటుందని.. అధిక మొత్తంలో కేసులను రాజీ చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి వి.రజని తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత -
దృశ్యరూప బోధనతో..
ఏఐ విధానంలో బోధన అందిస్తే విద్యార్థి పాఠ్యాంశాన్ని స్వయంగా తిలకిస్తున్నట్లుగా ఉంటుంది. ప్రస్తుతం పురాణాల్లో యుద్ధాలు, సిపాయిల తిరుగుబాటు, స్వాతంత్య్ర ఉద్యమ ఘట్టాలు, విత్తనాలు మొలకెత్తడం తదితర అంశాలను విద్యార్థులు పుస్తకాలు చదివి తెలుసుకుంటున్నారు. ఏఐ విధానంలోనైతే దృశ్యరూపంలో చూస్తూ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో చూసిన పాఠ్యాంశాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకునేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో 580 పాఠశాలలు.. జిల్లాలోని 15 మండలాల పరిధిలో ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలలు 580 ఉండగా.. విద్యుత్ సౌకర్యం 536 పాఠశాలకు, జనరేటర్, ఇన్వర్టర్ సౌకర్యం ఉన్న పాఠశాలలు 83 ఉన్నాయి. 344 పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఉండగా.. 154 పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు ఇటీవల వెల్లడించిన నివేదికలో పేర్కొన్నారు. వీటిలో ఏయే పాఠశాలలను ఎంపిక చేస్తారన్న విషయం రానున్న విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తెలియనుంది. -
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
గోపాల్పేట: గ్రామాల అభివృద్ధి, పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. బుధవారం గోపాల్పేట, ఏదుల, రేవల్లి మండలాల పరిధిలోని బుద్దారం, పొలికెపాడు, కర్ణమయ్యకుంటతండా, తల్పునూరు, రేవల్లి, నాగపూర్, శానాయిపల్లి, బండరావిపాకుల, అనంతపురం, ఏదుల, చీర్కపల్లి తదితర గ్రామాల్లోని ఎస్సీకాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు ఆయన శంకుస్థానపన చేసి ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీకాలనీలు, నిరుపేదలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులకు వేలసంఖ్యలో దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ఇన్చార్జ్ సత్యశిలారెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కొంకి వెంకటేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, జైపాల్‌రెడ్డి, గోపాల్పేట పట్టణ అధ్యక్షుడు శివన్న, రేవల్లి మండల అధ్యక్షుడు పర్వతాలు, ఆయా గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రిటర్నింగ్ అధికారులదే పూర్తి బాధ్యత
వనపర్తి: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో నామపత్రాల స్వీకరణ నుంచి లెక్కింపు వరకు ఆర్వోలదే కీలక పాత్రని.. ఏ చిన్న పొరపాటుకు తావివ్వొద్దని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ఆర్వోలు, ఏఆర్వోలకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణనిచ్చారు. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 17 మంది ఆర్వోలు, ఎంపీటీసీ ఎన్నికలకుగాను 53 మంది ఆర్వోలు, మరో 53 మంది ఏఆర్వోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేటప్పుడు అన్ని ధ్రువపత్రాలు, వివరాలు సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో క్లరికల్ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని.. తప్పనిసరిగా అభ్యర్థుల సమక్షంలోనే స్క్రూటినీ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని.. కారణం లేకుండా నామినేషన్లను తిరస్కరించడానికి వీలు లేదన్నారు. నామినేషన్లను తిరస్కరిస్తే తప్పనిసరిగా కారణాలు పేర్కొనాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆర్వోలకు గురువారం శిక్షణ కార్యక్రమం ఉంటుందని.. సకాలంలో హాజరుకావాలని, లేనిపక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్‌రెడ్డి, ఏఓ భానుప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు -
పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం పొడిగించాలి
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పీఏసీఎస్ చైర్మన్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్‌తోపాటు వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య, పాలక మండలి సభ్యులు రంగారెడ్డి, మంజులారెడ్డి, భూపాల్‌రావు, బక్కన్నయాదవ్, భీంరెడ్డి, వెంకటేష్‌గుప్తా, వంశీచంద్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు పలు విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా సంతకాల సేకరణ చేపట్టారు. ● ఇదిలా ఉండగా.. సర్పంచ్‌లు, ఎంపీపీలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాలకవర్గాల కాలపరిమితి ముగియగానే ప్రత్యేకాధికారుల పాలన మొదలవుతుంది. కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మాత్రం మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాన్ని ఆరు నెలల కాలపరిమితితో పొడిగిస్తూ ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వ సంప్రదాయంగా కొనసాగుతుంది. గత మూడు దశాబ్దాలుగా పీఏసీఎస్ పదవీకాలం ముగిసిన రెండేళ్ల వరకు ఎన్నికలు జరగకపోయినా ప్రతి ఆరునెలలకు ఒకసారి పాలకవర్గాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు నిర్వహించే పద్ధతి ఉంది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉన్న 9 డీసీసీబీ బ్యాంకుల్లో రైతులకు అన్ని రకాలుగా అండగా ఉండటంతోపాటు వాణిజ్యపరంగా మంచి అభివృద్ధి సాధించాయి. అందుకే అధికారుల ఇన్చార్జి పాలనలో కొనసాగే కంటే ఉన్న పాలక వర్గాలను కొనసాగించాలని కోరుతూ అన్ని ఉమ్మడి జిల్లాల్లోని డీసీసీబీ చైర్మన్ల అధ్యక్షతన సమావేశం నిర్వహించి వినతిపత్రాలు అందించాలనే రాష్ట్రంలోని ఉమ్మడి డీసీసీబీ చైర్మన్ల నిర్ణయంలో భాగంగానే ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతం ఒక్క పాలమూరు జిల్లాలోనే కాకుండా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల డీసీసీబీ బ్యాంకుల్లో వాటి పర్యవేక్షణలో పనిచేసే పీఏసీఎస్‌ల చైర్మన్లు తమ సొసైటీల అభివృద్ధికి సంపూర్ణంగా సేవలు చేస్తున్నందున ఈ పాలక వర్గాలనే కొనసాగించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పీఏసీఎస్ చైర్మన్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌గౌడ్ ఆకాంక్షించారు. -
మరో కీలక సైబర్ నిందితుడు అరెస్ట్
వనపర్తి: నకిలీ ధని రుణ యాప్‌తో రూ.2 కోట్లు కాజేసిన సైబర్ కేసులో మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబర్‌క్రైం డీఎస్పీ ఎన్బీ రత్నంతో కలిసి వివరాలు వెల్లడించారు. ఇదివరకు జిల్లాలో నమోదైన సైబర్ కేసులో పలువురుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కొనసాగుతున్న విచారణలో భాగంగా పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు మూసాపేట మండలం స్ఫూర్తితండాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం దాడిచేసి పట్టుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి రూ.4 లక్షల నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సమీప కనకాపూర్ తండాకు చెందిన మరికొందరితో కలిసి బిహార్‌కు చెందిన పంకజ్కుమార్యాదవ్, అంకిత్యాదవ్ గురూజీ, రాహుల్ పాశ్వాన్, దీపక్‌కుమార్, సునీల్ కుమార్, షంబు, కార్తీక్, వివేక్ కుశవాహ సూచన మేరకు వారిచ్చిన సెల్‌నంబర్లకు ధని లోన్ మంజూరైనట్లు సమాచారమిచ్చి ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇన్స్యూరెన్స్ తదితర చార్జీలు ముందుగానే చెల్లించాలంటూ క్యూఆర్ కోడ్‌ని పంపించి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఇటీవల గోపాల్పేట మండలం పొలికెపాడులోని ఓ వ్యక్తికి ఫోన్‌చేసి పలు దఫాలుగా రూ.32,125 ఫోన్‌పే నుంచి పొందినట్లు బయటపడిందని తెలిపారు. పలువురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నన్నారని.. త్వరలో అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ వివరించారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ కృష్ణ, సైబర్‌క్రైం ఎస్ఐ రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రూ.4 లక్షలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రావుల గిరిధర్ -
సాంకేతిక సొబగులు
సర్కారు బడులకు.. ● వచ్చే ఏడాది నుంచి ఏఐ ఆధారిత బోధన అమలుకు ప్రణాళిక ● ఐదు నుంచి పదోతరగతి వరకు వర్చువల్‌గా.. ● ఇంటర్నెట్, విద్యుత్, కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్న పాఠశాలల వివరాలు సేకరిస్తున్న రాష్ట్రశాఖ విద్యార్థులకు ప్రయోజనం.. కృత్రిమ మేధా విధానంలో బోధన విద్యార్థులకు చాలా ప్రయోజనం. చూసిన పాఠ్యాంశాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకునేందుకు దోహదపడుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు జిల్లా నుంచి ప్రతిపాదనలు కోరలేదు. ఈ విధానం అమలులోకి వస్తే ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు ఆశించిన మేరకు పెరగవచ్చు. – ఎండి అబ్దుల్ ఘని, జిల్లా విద్యాధికారి వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏఐ (కృత్రిమ మేధా) విధానంలో వర్చువల్‌గా బోధన అందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కర్ణాటకలోని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్సెప్ట్ ఫౌండేషన్ సహకారంతో జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విద్యాశాఖలో చర్చ వినిపిస్తోంది. ఇందుకోసం అధికారులు ఐదోతరగతి నుంచి పదోతరగతి వరకు అత్యధికంగా విద్యార్థులు, విద్యుత్, జనరేటర్, ఇంటర్నెట్, కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్న పాఠశాల వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సైతం ఏఐ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కార్పొరేట్‌కు ధీటుగా.. కృత్రిమ మేధాను వినియోగించి వర్చువల్ విధానంలో పాఠాలు బోధించే విధానం అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు సైతం కార్పొరేట్‌కు ధీటుగా నిర్వహణ సాధ్యమైనట్లేనని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పాఠ్యాంశాన్నింటిని కళ్లకు కట్టినట్లు దృశ్యరూపంలో బోధించడంతో ఎక్కువ కాలం గుర్తించుకునే అవకాశాలు ఉంటాయని, ఈ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏఐను ఎక్కువగా వినియోగిస్తుండటంతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించేందుకు ఈ పద్ధతిని అమలులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సీఎం విద్యనభ్యసించిన జిల్లా కావడంతో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చదువుకున్న వనపర్తి జిల్లాలో ప్రయోగాత్మక అమలుకు ఎక్కువ అవకాశాలు ఉండవచ్చని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం చదివిన పాఠశాలను రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. -
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి : సీపీఎం
పాన్‌గల్: ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని సీపీఎం జిల్లా మాజీ కార్యదర్శి ఎండీ జబ్బార్ కోరారు. బుధవారం మండలంలోని రేమద్దులలో జరిగిన గ్రామ కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలు పంట రుణమాఫీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డులు తదితర పథకాలు పూర్తిస్థాయిలో అమలుగాక అర్హులైన పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా అర్హులందరికీ అందించాలని కోరారు. రేమద్దుల నుంచి ఏదుట్ల, ఖాసీంనగర్, పాన్‌గల్ వరకు ఉన్న బీటీ రోడ్లను పూర్తిచేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలన్నారు. ఆరు గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలయ్యేలా పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని వివరించారు. సమావేశంలో పార్టీ నాయకులు వెంకటయ్య, భగత్, మల్లేష్, ఖాజా, భాస్కర్, నిరంజన్, కమలాకర్, భాస్కర్‌గౌడ్, వెంకటయ్య, మహేష్, కుమార్, బాలకృష్ణయ్య, బాలకిషన్ పాల్గొన్నారు. మత్తుకు బానిసకావొద్దు గోపాల్పేట: విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి రజని అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. మత్తుకు బానిసైతే మెదడు, నాడీవ్యవస్థ, శరీరంలోని అన్ని భాగాలు దెబ్బతిని భవిష్యత్ అంధకారం అవుతుందని గుర్తుచేశారు. చదువు, క్రీడలపై దృష్టి సారించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడ్వొకేట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణయ్య, సఖికేంద్రం నిర్వాహకురాలు కవిత, వైద్యాధికారి మంజుల, ప్రధానోపాధ్యాయుడు రాందేవ్‌రెడ్డి, యాదగిరి, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. 20న పేటెంట్ రైట్స్‌పై అవగాహన సదస్సు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 20న పేటెంట్ రైట్స్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వీసీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పీయూలో కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేటెంట్ రైట్ పొందే వారు ఏ విధంగా నమోదు చేసుకోవాలి.. అందులో ఎదురయ్యే సవాళ్లు, పరిష్కార మార్గాలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. ముఖ్య వక్తగా శంకర్రావు ముంజం హాజరవుతారని, ఈ అవకాశాన్ని విద్యార్థులు, అధ్యాపకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చైర్మన్ చంద్రకిరణ్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, కోకన్వీనర్ మధు, క్రైటీరియ కోఆర్డినేటర్ కరుణాకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఈశ్వర్‌కుమార్, గాలెన్న తదితరులు పాల్గొన్నారు. వేతనాల మంజూరులో ప్రభుత్వం విఫలం కొత్తకోట: గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంచాయతీ కార్మికులకు ఉద్యోగస్తులతో సమానంగా నెలలో మొదటి వారంలో వేతనాలు జమ చేస్తామని హామీ ఇచ్చారని.. ఫిబ్రవరిలో 12వ తేదీ గడుస్తున్నా నేటికీ జనవరి వేతనాలు అందలేదని పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని, మరోపక్క అధికారులు వేధిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కార్మికుల బ్యాంకు ఖాతాలోనే నేరుగా వేతనాలు జమ చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు బుజ్జన్న, గోపాల్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి కృష్ణా తీర ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన టూరిజం కార్పొరేషన్ ఎండీ ప్రకాష్‌రెడ్డితో కలిసి సోమశిల నదీతీర ప్రాంతాలు పరిశీలించారు. లాంచీలో వెళ్లి మల్లేశ్వరం ఐల్యాండ్, అమరగిరి ప్రాంతాలను సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సోమశిలలో భక్తుల విడిది కోసం నూతనంగా షెడ్లు, డార్మెటరీ గదులు నిర్మించనున్నట్లు చెప్పారు. పర్యాటకులను ఆకర్షించేలా కాటేజీలు ఇతరవి తీర్చిదిద్దుతామన్నారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు వెళ్లే లాంచీని రోజువారీగా తిప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కొల్లాపూర్: గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని సోమశిల గ్రామంలో ఏఐసీసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆదివాసీ గిరిజనులకు రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ట్రైకా చైర్మన్ బెల్లయ్యనాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు జ్యోత్రి ప్రజల్వన చేసి శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, వాటి పరిరక్షణ తదితర అంశాలపై శిక్షణ శిబిరంలో వక్తలు వివరిస్తారని చెప్పారు. శిక్షణ తరగతులను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మూడు రోజులపాటు కొనసాగే శిక్షణ తరగతుల్లో పలువురు ప్రొఫెసర్లు, ఎమ్మెల్యేలు గిరిజనులకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. అనంతరం గిరిజన సంఘం నాయకులు మంత్రి జూపల్లిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు లింగయ్యనాయక్, హన్మంతునాయక్, శంకర్‌నాయక్, గోపి, బస్తీరాం, బాలు, శ్రీరామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు