
ప్రజారోగ్యం గాలికి..!
పురపాలికల్లో యథేచ్ఛగా జంతువధ
●
అధికారులు చొరవ చూపాలి..
ప్రజారోగ్యంపై పుర అధికారులు చొరవ చూపాలి. నిత్యం పర్యవేక్షణ చేసి నిబంధనల మేరకు జంతువధ చేపడితేనే ప్రజలకు నాణ్యమైన మాంసం అందుతుంది.
– సుధాకర్‌రెడ్డి, కొత్తకోట
తనిఖీలు చేపట్టాలి..
రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు చొరవ తీసుకుంటున్నారు. మాంసంలో నాణ్యత, పర్యవేక్షణ లోపిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అధికారులు తనిఖీలు చేపడితేనే మంచిది.
– కురుమయ్య, పీర్లగుట్ట, వనపర్తి
నిబంధనలు అమలు చేస్తాం..
ప్రజారోగ్య పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే ఉండదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసుకొని నిబంధనలు అమలు చేస్తాం. నిబంధనలు పాటించేలా పుర అధికారులను అప్రమత్తం చేస్తాం. కమిటీల ఏర్పాటుపై దృష్టి సారిస్తాం.
– యాదయ్య, పుర ప్రత్యేక అధికారి, వనపర్తి
వనపర్తి టౌన్: జిల్లాలోని పురపాలికల్లో జీవాలను ఇళ్లు, దుకాణాలు, వీధుల్లో ఎక్కడపడితే అక్కడ వధిస్తూ మాంసం విక్రయాలు చేపడుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీంతో కొనాలన్నా, తినాలన్నా మీమాంస తప్పడం లేదు. జిల్లాకేంద్రంలో కబేళా ఉండి అన్ని వసతులు కల్పించినా విక్రయదారులు ముందుకురావడం లేదు. మిగతా పురపాలికలో కబేళాలు లేవు. పుర అధికారులు ఏడాదికోసారి వేలం నిర్వహించి వదిలేస్తుండటంతో కాంట్రాక్టర్ పన్ను వసూలు చేసుకుంటున్నారే తప్ప ఇవేమీ పట్టించుకోవడం లేదు. కొనుగోలుదారులు సైతం మాంసం నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల స్వలాభాపేక్ష కోసం ఆరోగ్యంగా లేని వాటిని వధిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇవీ నిబంధనలు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం జంతువధ కబేళాలోనే జరగాలి. జంతువధ చేసేముందు పశువైద్యులు అవి ఆరోగ్యంగా ఉన్నాయని ధ్రువీకరించాల్సి ఉంటుంది. తర్వాత పుర అధికారులు ముద్ర వేసిన తర్వాతే వధిస్తారు. కానీ ఏ పురపాలికలో ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. కొన్నేళ్లుగా అధికారులు మౌనంగా ఉండటంతో చేసేదీమీ లేక కొనుగోలుదారులు కిలో మాంసం రూ.700 నుంచి రూ.900 వరకు కొనుగోలు చేస్తున్నారు.
కానరాని కమిటీలు..
ప్రజారోగ్యం దృష్ట్యా రెవెన్యూ డివిజన్ పరిధి కేంద్రంగా ఉన్న పురపాలికలో పుర కమిషనర్ కన్వీనర్‌గా, ఆర్డీఓ చైర్మన్‌గా, హెల్త్, పోలీస్ ఇలా పలు విభాగాలకు చెందిన అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మొత్తం 8 మందితో కమిటీ వేయాలి. అలాగే జిల్లాస్థాయిలోనూ ఉన్నతాఽధికారులతో కమిటీలు ఉండాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.
జిల్లాకేంద్రంలోవృథాగా మారిన కబేళా
ముద్రలు లేకుండానే మాంసం విక్రయాలు
కిలో రూ.800 నుంచిరూ.900 వరకు
ఏర్పాటుకాని డివిజనల్, జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీలు

ప్రజారోగ్యం గాలికి..!

ప్రజారోగ్యం గాలికి..!

ప్రజారోగ్యం గాలికి..!