Top Stories
ప్రధాన వార్తలు

రేపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
తాడేపల్లి : రాష్ట్రంలోఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన నేతలతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు. పార్టీ విజయానికి సహకరించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను వైఎస్ జగన్ స్వయంగా కలవనున్నారు. వీరితో రేపు(బుధవారం) ప్రత్యేకంగా సమావేశమై.. వారిందరికీ అభినందనలు తెలపనున్నారు వైఎస్ జగన్. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకితభావాన్ని గుర్తిస్తూ ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లోని 8 నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు, కో–ఆప్షన్ సభ్యులు హాజరవుతారు. ఇటీవలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజాస్వామిక పరిణామాలు చర్చించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపైనా సమావేశంలో పార్టీ అ«ధ్యక్షుడు దిశా నిర్దేశం చేస్తారు. ముఖ్యంగా కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజా ప్రతిని«ధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.‘ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా’

లక్నోపై పంజాబ్ ఘన విజయం..
IPl 2025 PBKS vs LSG Live Updates: లక్నోపై పంజాబ్ ఘన విజయం..ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది.పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ వదేరా(25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(52 నాటౌట్) దుమ్ములేపారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు.ప్రభ్సిమ్రాన్ సింగ్ ఆన్ ఫైర్..6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రాన్(45) దూకుడుగా ఆడుతున్నాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(8) పరుగులతో పాటు ఉన్నాడు.తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్..172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన ఆర్య.. దిగ్వేష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 4 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజులో ఫ్రబ్‌సిమ్రాన్ సింగ్(25), శ్రేయస్ అయ్యర్(3) ఉన్నారు.రాణించిన పూరన్, బదోని.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు పర్వాలేదన్పించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆయూష్ బదోని(41), అబ్దుల్ సమద్(27), మార్క్రామ్(28) పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, మాక్స్వెల్, చాహల్ తలా వికెట్ సాధించారు.లక్నో ఐదో వికెట్ డౌన్.. మిల్లర్ ఔట్డేవిడ్ మిల్లర్ రూపంలో లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన మిల్లర్.. జాన్సెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. క్రీజులో బదోని(32), సమద్(8) ఉన్నారు.లక్నో నాలుగో వికెట్ డౌన్.. పూరన్ ఔట్నికోలస్ పూరన్ రూపంలో లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన పూరన్.. చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ వచ్చాడు. 12 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న పూరన్..10 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్ జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(23 బంతుల్లో 33) దూకుడుగా ఆడుతున్నాడు. క్రీజులో పూరన్‌తో పాటు బదోని(11) ఉన్నారు.కష్టాల్లో లక్నో.. పంత్ ఔట్లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన పంత్.. మాక్స్వెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.లక్నో రెండో వికెట్ డౌన్..ఐడెన్ మార్క్రామ్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మార్క్రామ్.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి లక్నో రెండు వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్, నికోలస్ పూరన్ ఉన్నాడు.తొలి వికెట్ డౌన్.. మార్ష్ ఔట్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మార్ష్.. ఈ మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి నికోలస్ పూరన్ వచ్చాడు.ఐపీఎల్-2025లో లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున లాకీ ఫెర్గూసన్ అరంగేట్రం చేశాడు. అజ్మతుల్లా ఓమర్జాయ్ స్ధానంలో ఫెర్గూసన్ పంజాబ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు లక్నో మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్.లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్.

రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
ఒక మనిషి చనిపోయినా.. అతడు చేసిన మంచి ఎప్పుడూ బతికే ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి, దివంగత పారిశ్రామికవేత్త 'రతన్ టాటా' (Ratan Tata) ఒకరు. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ.. లెక్కకు మించిన డబ్బును అనేక సేవా కార్యక్రమాల కోసం ఉదారంగా వెచ్చించారు. రతన్ టాటా మరణించిన తరువాత.. ఆయన ఆస్తులు, సంపద ఎవరికి చెందుతాయి? అనే ప్రశ్న.. ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. దానికి ఇప్పుడు సమాధానం లభించింది.టాటా సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించిన రతన్ టాటా ఆస్తి సుమారు రూ. 10వేలకోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సుమారు రూ.3800 కోట్ల సంపదను.. తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ వంటి వాటికి కేటాయించారు.తన సవతి సోదరీమణులైన శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ పేరుమీద రూ.800 కోట్లు రాసినట్లు తెలుస్తోంది. వీటికి కేటాయించిన ఆస్తులలో ఫిక్డ్స్ డిపాజిట్లు, ఖరీదైన పెయింటింగ్స్, వాచ్‌లు వంటివి ఉన్నాయి. రతన్ టాటాకు సన్నిహితుడైన.. మోహిన్ ఎం దత్తాకు కూడా రూ.800 కోట్లు రాశారు.జిమ్నీ నావల్ టాటాకు.. రతన్ టాటాకు చెందిన జుహూలోని బంగ్లాలో కొంత షేర్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కేటాయించారు. మెహిల్ మిస్త్రీ పేరు మీద అలీబాగ్‌లోని బంగ్లా, మూడు పిస్టోళ్లను కేటాయించారు.ఇదీ చదవండి: EPFO విత్‌డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!రతన్ టాటాకు కుక్కలంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే శునకాల సంరక్షణ కోసం కూడా రూ. 12 లక్షల ఫండ్ కేటాయించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 30వేలు చొప్పున వాటికి ఖర్చుచేసే విధంగా నిధులను కేటాయించారు. రతన్ టాటాకు విదేశాల్లో కూడా రూ. 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రముఖ కంపెనీలలో షేర్స్, ఖరీదైన 65 వాచీలు కూడా ఉన్నాయి.ఇక అందరూ తెలుసుకోవాలనుకునే విషయం.. రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు ఏమి కేటాయించారు అని. అయితే శంతను నాయుడుకు తనవంతు సాయం చేసినట్లు తెలుస్తోంది. అది కాకుండా.. స్టూడెంట్ లోన్ మాఫీ చేశారు. ఇది కాకుండా రతన్ టాటా పక్కింట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి అప్పుగా ఇచ్చిన రూ. 23 లక్షలు కూడా మాఫీ చేశారు.

భారత్-చైనా అధ్యక్షులు అభినందనలు తెలియపరుచుకున్న వేళ..
బీజింగ్: గతంలో భారత్-చైనా అంటే ఒక యుద్ధ వాతవారణమే కనిపించేది. భారత్ తో పాకిస్తాన్ ఏ రకంగా కయ్యానికి కాలు దువ్వుతుందో ఆ రకంగానే ఉండేది చైనాతో కూడా. అయితే భారత్-చైనా సంబంధాలు ఇప్పుడు దాదాపు మెరుగైన స్థితిలోనే కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఎక్కడా కనిపించకపోవడమే ఇందుకు ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు.అయితే భారత్ తో స్నేహ హస్తం కోసం చైనా కొన్ని నెలల నుంచి ఎదురుచూస్తోంది. భారత్ తో కలిసి ఎలిఫెంట్ డ్రాగన్ డ్యాన్స్ చేయాలంటూ ఇప్పటికే చైనా చాలా సార్లు స్నేహ హస్తాన్ని ఇవ్వమని నేరుగానే అడిగేసింది. దీనికి భారత్ కూడా సానుకూలంగానే స్పందించింది. చైనాతో స్నేహ పూర్వకంగా కలిసి పని చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రధాని మోదీ కూడా ఇటీవలే స్సష్టం చేశారు. ఇరు దేశాలది ఘనమైన చరిత్ర అని, ప్రపంచ జీడీపీలో ఇరు దేశాలది సగం వాట ఉందంటే భారత్-చైనాలు ఎంత బలమైన దేశాలో అర్థం చేసుకోవచ్చని కూడా ఆ సందర్భంలో మోదీ పేర్కొన్నారు.భారత్ చైనాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షుడు మంగళవారం అభినందనలు తెలుపుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల అధ్యక్షులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.ఇరు దేశాలు మరింత స్నేహ పూర్తకంగా కలిసి పని చేయాలని, భారత్ చైనాల బంధం ఎలిఫెంట్ డ్రాగన్ టాంగో రూపంలో ఉండాలని ఈ సందర్భంగా జిన్ పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల సంబంధాలు శాంతియుతంగా, స్నేహపూర్వకంగా మారడానికి మార్గాలను కనుగొనాలని, అంతర్జాతీయ వ్యవహారాల్లో కమ్యూనికేషన్ తదితర వాటిల్లో మరింతగా పెంచుకోవాలని జిన్‌పింగ్ సూచించారు. సరిహద్దు ప్రాంతాలలో శాంతిని కాపాడడంలో భారత్‌తో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నానని అన్నారు.భారత ప్రధాని మోదీ ‘మంచి మాట’ చెప్పారు: చైనా

కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ
సాక్షి, గుంటూరు: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గుండె నొప్పితో బాధపడుతున్నారని.. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని.. ఈ వ్యవహారాన్ని టీడీపీ ట్రోల్ చేస్తూ వికృత ఆనందాన్ని పొందుతుందని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు ఆయన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్‌లో ఆపరేషన్ చేస్తే ఒత్తిడి పెరుగుతుందని భావంతో ఆయన్ను ముంబైకి తీసుకువెళ్లారని అంబటి వివరించారు.‘‘కొడాలి నానికి ఆపరేషన్ చేసే డాక్టర్ రమాకాంత్ పాండే సర్జరీలు చేయడంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. మా అమ్మ కూడా అక్కడే ఆపరేషన్ చేయించాం. ఇవాళో, రేపో నాని పరిస్థితిని పరిశీలించి డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి డేట్ ఇస్తారు. ఆయన సంతోషంగా ఇంటికి వస్తారు.. అందులో ఎటువంటి సందేహం లేదు. టీడీపీ చేసే దుష్ప్రచారాలను నమ్మొద్దు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.‘‘జైల్లో ఉన్న వంశీ జుట్టుకు రంగు వేయటం మానేశారు. దీంతో ఆయన ఏదో దిగులు పడిపోయినట్టు, కృంగిపోయినట్టు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తూ వికృత ఆనందం పొందుతున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ ధైర్యం కోల్పోయే వ్యక్తులు కాదు. వాళ్లిద్దరూ క్షేమంగా వస్తారు.. టీడీపీని ఎదురిస్తారు. వాళ్ళిద్దరిని ట్రోల్ చేస్తూ టీడీపీ శ్రేణులు పైశాచిక ఆనందం పొందుతున్నాయి.’’ అని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.

భారీ అప్పుతో ఆర్థిక సంవత్సరం ప్రారంభిస్తున్న ఏపీ ప్రభుత్వం
విజయవాడ: ఇప్పటికే వరుస అప్పులు చేస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.. ఈసారి ఏకంగా భారీ అప్పుకు శ్రీకారం చుట్టింది. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని భారీ అప్పుతో ప్రారంభించనుంది ఏపీ ప్రభుత్వం. గురువారం రూ. 5, 750 కోట్లు అప్పు చేయనుంది ప్రభుత్వం.కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే భారీ అప్పుకు ఇండెంట్ పెట్టింది. సెక్యూరిటీల వేలం ద్వారా ఈ రుణం సమకూర్చనుంది ఆర్బీఐ. ఇప్పటికే రికార్డు స్థాయిలో అప్పులు చేసిన చంద్రబాబు కూటమి సర్కారు.. మూడు నెల్లలో రూ, 21, 750 కోట్లు తేవాలని నిర్ణయించింది.

రాజమండ్రి ఘటనపై సిట్‌తో దర్యాప్తు చేయించాలి : వరుదు కళ్యాణి
తూర్పుగోదావరి జిల్లా,సాక్షి: మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోనన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా? అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ప్రశ్నించారు. రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామల, మాజీ ఎంపీ భరత్ రామ్‌లు పరామర్శించారు. బొల్లినేని ఆసుపత్రి ఘటనపై సిట్ వేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరుదు కళ్యాణి: మాట్లాడుతూ.. ఘటన జరిగి పది రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఘటనను పట్టించుకోరా. యువతిని దారుణంగా హింసించి ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు. ఏ హాస్పిటల్లో అయితే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం దారుణం. జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదు. సీసీటీవీ ఫుటేజ్‌ను ఇప్పటిదాకా ఎందుకు తల్లిదండ్రులకు చూపించలేదు. ఈ ఘటనపై సిట్ వేసి దర్యాప్తు జరపాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని హెచ్చరించారు.ఆరే శ్యామల అధికార ప్రతినిధి:బాధిత కుటుంబ తల్లడిల్లిపోతుంది. సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది. మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోమన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ. బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. అంజలికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి.మాజీ ఎంపీ మార్గాని భరత్: బాధితురాల్ని దారుణంగా హింసించిన దీపక్‌ను శిక్షించాలి. నిందితుడు అధికార తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడు కావడంతోనే ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఘట్టంపై సమగ్ర విచారణ జరగాలి. బాధిత యువతి తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదు.. ఎవరు చేశారన్న విషయాన్ని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేయాలి. ప్రభుత్వాధికారులు ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు. గతంలో దీపక్ ఎవరెవరిని హింసించాడన్న అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించాలి. ఈ ఘటనలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి బాధితురాలి తల్లిదండ్రులు :మా బిడ్డను ఆరోగ్యంగా మాతో పంపాలి. లేదంటే అదే ఇంజక్షన్ మాకు ఇవ్వండి. మాకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం’అని హెచ్చరించారు.

మీకు దండం పెడతా ఆ ఫొటోలు ఆపండ్రా బాబు
మార్కెట్లోకి ఏ కొత్త ప్రాడక్ట్ వచ్చినా జనం ఊరుకోరు.. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వచ్చే అప్డేట్స్.. మార్పులు.. కొత్తకొత్త ఆవిష్కరణలు వంటివి జనాన్ని మరింతగా ఆకట్టుకుంటాయి. ఎంతలా అంటే కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చిన కంపెనీకి సైతం నిద్రపట్టని స్థాయిలో మనోళ్లు వాడకం ఉంటుంది. ఐ ఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు తిండి నిద్రమానేసి దానికోసం లైన్లో నిలబడి చివరకు దాన్ని దక్కించుకునేవరకూ ఊపిరిసలపని వాళ్ళు కొందరు. దానికోసం ఏకంగా కిడ్నీలు అమ్ముకునేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఫోన్ కొనకపోతే ఉరేసుకుంటాను అని తల్లిదండ్రులను బెదిరించిన కేసులూ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా చాట్‌జీపీటీలో వచ్చిన కొత్త ఆవిష్కరణ జిబ్లీ స్టూడియో ఫోటోలు.. అంటే మనం ఏదైనా ఫోటోను దానిలోకి అప్లోడ్ చేస్తే అది కార్టూన్ మాదిరి మార్చేసి మనకు తిరిగి ఇస్తుందన్నమాట. అంటే ఒక చిత్రకారుడు పెన్సిల్.. కుంచెతో వేసినట్లు ఆ ఫోటోలు ఉంటాయి.ఈ కొత్త ఫీచర్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం ఐంది. ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఫోటోలు అప్లోడ్ చేసేసి వాటిని జిబ్లీ స్టూడియో ఫొటోలుగా మార్చేసుకుని ఫేసుబుక్ ట్విట్టర్.. ఇన్‌స్టాలో పోస్టు చేసుకుంటున్నారు. మనిషికి తనని తాను చూసుకోవడం ప్రతిసారీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందేమో..అద్దంలో ఒకసారి ఫోటోలో ఒకసారి.. బొమ్మ గీయించుకొని ఒకసారి..చూసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా కార్టూన్ లో ఎలా ఉంటానో అనే కుతూహలంతో.. చాట్‌జీపీటీలో అందరూ స్టూడియో గిబ్లీ ఆర్ట్ స్టైల్ లో తమ ఫొటోలు మారుస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ ఫోటోల పిచ్చి ఏకంగా ఆ చాట్‌జిపిటి సంస్థను సైతం కుదిపేసింది.మనం అప్లోడ్ చేసిన మన మామూలు ఫోటోలను ఏకంగా జపానీస్ యానిమేషన్ స్టూడియో డైరెక్టర్లు హయావో మిజజాకి, ఇసావో టకహట రూపొందించిన పాపులర్ సినిమాలు స్పిరిటెడ్ అవే , ప్రిన్సెస్ మోనోనొకే వంటి సినిమా క్యారెక్టర్లను పోలి ఉండేలా మార్చేసి మనకు అందిస్తోంది. . ఈ కార్టూన్ చిత్రాలు మంచి జనాదరణ పొందడంతో కోట్లకొద్దీ ఫోటోలు చాట్‌జీపీటీలోకి వచ్చి పడుతున్నాయి. దీంతో అక్కడి సిబ్బందికి తిండి నిద్ర కూడా లేదంట. దీంతో ఈ ట్రేండింగ్ ను చూసి విసుగెత్తిపోయిన చాట్ జిపిటి వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మాన్ బాబూ కాస్త గ్యాప్ ఇవ్వండి.. మా సిబ్బంది కూడా కాస్త నిద్రపోవాలి కదా అని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అంటే కొత్త ట్రెండ్ మొదలైతే జనం ఎంతలా వేలం వెర్రిలా ఉంటారన్నదానికి ఇదో ఉదాహరణ అన్నమాట.- సిమ్మాదిరప్పన్న

‘మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. 2023లో యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య గురయ్యాడు. హత్యకు గురైన అతిక్ చెందిన స్థిరాస్థుల్ని అధికారులు కూల్చివేశారు. వాస్తవానికి బుల్డోజర్తో కూల్చేసిన నిర్మాణాలతో అతిక్‌కు సంబంధం లేదు. ఆ ఇళ్లు లాయర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తున్నవారివి. ఎప్పటిలాగే సంఘ విద్రోహ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే సీఎం యోగి ప్రభుత్వం (Yogi Adityanath) పొరపాటున బాధితుల ఇళ్లను బుల్డోజర్లతో (Bulldozer justice) కూల్చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.రూ.10లక్షల నష్టపరిహారం ఆ పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు జస్టిస్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బూల్డోజర్ చర్యలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌తో పాటు ప్రయాగ్‌రాజ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. తక్షణమే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని సూచించింది.అది మా పొరపాటేఅంతకుముందు అడ్వకేట్, ప్రొఫెసర్ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ల గురించి అత్యున్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. నిబంధనలకు విరుద్ధంగా బుల్డోజర్లతో ఇళ్లను ఎలా కూల్చేస్తారు? కూల్చేవేతకు ఓ రోజు ముందు నోటీసులు ఎలా అంటిస్తారని ప్రశ్నించింది. అయితే, సుప్రీం ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు యూపీ అధికారులు బదులిచ్చారు. మేం కూల్చేసిన ఇళ్లు గ్యాంగ్‌స్టర్ అతిక్ నిర్మించుకున్నాడేమోనని పొరపాటున బుల్డోజర్ చర్యలకు దిగినట్లు వివరణ ఇచ్చారు.రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదుకూల్చివేత నోటీసులు అందజేసిన తీరుపై అధికారులను కోర్టు మందలించింది. కూల్చేసిన ఇళ్లనకు నోటీసులు అతికించామని రాష్ట్ర న్యాయవాది చెప్పగా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదని అడిగింది. అదే సమయంలో ఈ తరహా చర్యల్ని వెంటనే ఆపాలి. బాధితులు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వారికి నష్టపరిహారం కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించండి. పరిహారం ఇస్తే వారికి న్యాయం జరిగినట్లవుతుందని జస్టిస్ ఎస్.ఓకా అభిప్రాయం వ్యక్తం చేశారు.మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయిఈ కేసులు మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయి. పిటిషనర్ల ఇళ్లను నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారని కోర్టు అభిప్రాయ పడినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లు కూల్చేస్తున్నట్లు నోటీసులు గాని, నోటీసులు తీసుకున్న వారికి వివరణ ఇచ్చేందుకు తగిన అవకాశం ఇవ్వలేదని ప్రస్తావించింది. అందరూ కలత చెందుతున్నారుఅదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో బుల్డోజర్ కూల్చివేతల సమయంలో వైరలైన ఓ వీడియో గురించి కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అధికారులు బుల్డోజర్లతో ఇళ్లను కూల్చే సమయంలో సదరు ఓ ఇంటికి చెందిన బాలిక తన పుస్తకాల్ని చేతపట్టుకుని ఉండడాన్ని చూడొచ్చు. ఇలాంటి దృశ్యాలతో అందరూ కలత చెందుతున్నారు’ అని జస్టిస్ భుయాన్ అన్నారు.

‘బాబ్బాబు.. మీకు పుణ్యం ఉంటుంది.. నా మీటింగ్‌కు రండమ్మా’
బాపట్ల జిల్లా,సాక్షి: దేశంలో తనకున్న రాజకీయనుభవం ఎవరికీ లేదు. మైక్ దొరికితే చాలు తనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ డబ్బా కొట్టుకుంటూ సంపద సృష్టిస్తానని చెప్పుకునే చంద్రబాబు బాపట్ల జిల్లా పర్చూరు జిల్లా ప్రజలు షాకిచ్చారు. అంతేకాదు, నాలుగుసార్లు సీఎంగా చేశానని తన డప్పు గ్యాప్ లేకుండా ఎల్లోమీడియాలో ప్రచారం చేయించుకుంటుంటారు. కానీ తన మాటల్ని ఎవరూ వినడం లేదని, అందుకే సభలకు ఎవరూ రావడం లేదని చంద్రబాబుకు అర్థమైంది.ఇటీవల నిర్వహించిన పీ4 సభ అట్టర్ ప్లాప్ అవ్వడంతో బాబుకు విషయం త్వరగానే బోధపడింది. అంతే నా మీటింగ్‌కు రండి అంటూ పిల్లల్ని, మహిళల్ని బతిమలాడుకుంటున్నారు చంద్రబాబు. కొత్తగొల్లపాలెంలో సీఎం చంద్రబాబు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో మీరే చూడండి అంటూ స్థానికులు పర్యటన వీడియోల్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇక ఆ వీడియోల్లో.. హే పిల్లలంతా మీటింగ్‌కు రండి. అందరూ నా మీటింగ్‌కు రండమ్మా అంటూ చంద్రబాబు స్థానికుల్ని ప్రాధేయపడుతుండడం మనం గమనించవచ్చు.
ఆరోగ్యకరమైన హాస్యంతో...
చెలరేగిన సిమ్రాన్, అయ్యర్.. లక్నోను చిత్తు చేసిన పంజాబ్
ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?
భారీ అప్పుతో ఆర్థిక సంవత్సరం ప్రారంభిస్తున్న ఏపీ ప్రభుత్వం
పోలీసులు పచ్చచొక్కాలు తొడుక్కున్నారు: గుడివాడ అమర్నాథ్
'చైనా పీస్' మూవీలో వాలిగా నిహాల్
2030 నాటికి ఆ రంగంలో అగ్రగామిగా భారత్: నితిన్ గడ్కరీ
ఈ మాత్రం ఆటకేనా రూ. 27 కోట్లు.. పంత్‌పై నెటిజన్లు ఫైర్
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
లక్నోపై పంజాబ్ ఘన విజయం..
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ
రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
సైకిల్ చక్రం.. బతుకు చిత్రం
అమ్మకాల్లో అదరగొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
చెలరేగిన సిమ్రాన్, అయ్యర్.. లక్నోను చిత్తు చేసిన పంజాబ్
ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?
2030 నాటికి ఆ రంగంలో అగ్రగామిగా భారత్: నితిన్ గడ్కరీ
'మ్యాడ్ స్క్వేర్'కి భారీ వసూళ్లు ఎందుకు వస్తున్నాయంటే..: నాగవంశీ
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు వర్షాలు
పంపాలో మట్టి దొంగలు
DC Vs LSG: ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ ప్లేయర్.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే డకౌట్
భారీ అప్పుతో ఆర్థిక సంవత్సరం ప్రారంభిస్తున్న ఏపీ ప్రభుత్వం
పోలీసులు పచ్చచొక్కాలు తొడుక్కున్నారు: గుడివాడ అమర్నాథ్
'చైనా పీస్' మూవీలో వాలిగా నిహాల్
డిజైనర్ డ్రస్సులో మాళవిక.. ముత్యంలా శ్రద్ధా మెరుపుల్
EPFO విత్‌డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!
ఆరోగ్యకరమైన హాస్యంతో...
ఈ మాత్రం ఆటకేనా రూ. 27 కోట్లు.. పంత్‌పై నెటిజన్లు ఫైర్
వర్శిటీ భూములను మేం లాక్కోవడం లేదు: భట్టీ
మనీశ్ పాండే అరుదైన ఘనత.. ధోని, రోహిత్ సరసన
ఆ వార్తల్ని నమ్మొద్దు.. 'కన్నప్ప' మూవీ టీమ్
చిరు సినిమా: అనిల్ రావిపూడి కెరీర్లోనే అత్యధిక పారితోషికం!
భారత్-చైనా అధ్యక్షులు అభినందనలు తెలియపరుచుకున్న వేళ..
శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!
అమెరికా మెచ్చిన అందం.. తెర్లాం అమ్మాయి సొంతం
April Fools Day 2025 : కాసిన్ని నవ్వులు, మరికొన్ని జోకులు..తేడా వచ్చిందంటే!
రెండు కుటుంబాల ఘర్షణపై సీఐ విచారణ
పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు డిమాండ్
30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ
సన్న బియ్యం పంపిణీకి బ్రేక్
నష్టపరిహారం ఇచ్చాకే...రోడ్డు విస్తరణ చేపట్టండి
నిజంగా హర్షణీయం!
ఉగాది బుట్టబొమ్మలు.. సితార ఇలా మృణాల్ అలా
ఐపీవోలపై కంపెనీల కసరత్తు..
అందమైన తెలుగుదనం– అనన్య నాగళ్ల
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన శ్రవణ్‌రావు సిట్ విచారణ
బిడ్డా.. నన్ను విడిచి వెళ్లిపోయావా...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
చర్యలు తీసుకోవాలని అర్జీ
ఈ రాశి వారికి రావలసిన సొమ్ము అందుతుంది.. స్థిరాస్తివృద్ధి
జీతాల కోసం రూ.4 వేల కోట్లు అప్పు
ఆదాయం పెరిగితేనే పథకాలు నడపగలం
బహుళ ప్రయోజనాల లక్ష్యంతో నెలకొల్పి న చెత్త సంపద కేంద్రాల్లో నిర్లక్ష్యం పేరుకుపోయింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం.. గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యం నీరుగారిపోయింది. ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం ర్యాలీలు, ప్రత
ఆటో ఎక్స్పో 2025: ఆకట్టుకున్న ఈ విటారా
Diwali 2024 ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా, టేస్ట్ అదిరిపోవాలంతే!
టోల్ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!
టోల్ ఫీజు మినహాయింపు ఇక లేదు..
ఆరోగ్యకరమైన హాస్యంతో...
చెలరేగిన సిమ్రాన్, అయ్యర్.. లక్నోను చిత్తు చేసిన పంజాబ్
ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?
భారీ అప్పుతో ఆర్థిక సంవత్సరం ప్రారంభిస్తున్న ఏపీ ప్రభుత్వం
పోలీసులు పచ్చచొక్కాలు తొడుక్కున్నారు: గుడివాడ అమర్నాథ్
'చైనా పీస్' మూవీలో వాలిగా నిహాల్
2030 నాటికి ఆ రంగంలో అగ్రగామిగా భారత్: నితిన్ గడ్కరీ
ఈ మాత్రం ఆటకేనా రూ. 27 కోట్లు.. పంత్‌పై నెటిజన్లు ఫైర్
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
లక్నోపై పంజాబ్ ఘన విజయం..
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై అంబటి రాంబాబు క్లారిటీ
రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
సైకిల్ చక్రం.. బతుకు చిత్రం
అమ్మకాల్లో అదరగొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
చెలరేగిన సిమ్రాన్, అయ్యర్.. లక్నోను చిత్తు చేసిన పంజాబ్
ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?
2030 నాటికి ఆ రంగంలో అగ్రగామిగా భారత్: నితిన్ గడ్కరీ
'మ్యాడ్ స్క్వేర్'కి భారీ వసూళ్లు ఎందుకు వస్తున్నాయంటే..: నాగవంశీ
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు వర్షాలు
పంపాలో మట్టి దొంగలు
DC Vs LSG: ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్లీ ప్లేయర్.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే డకౌట్
భారీ అప్పుతో ఆర్థిక సంవత్సరం ప్రారంభిస్తున్న ఏపీ ప్రభుత్వం
పోలీసులు పచ్చచొక్కాలు తొడుక్కున్నారు: గుడివాడ అమర్నాథ్
'చైనా పీస్' మూవీలో వాలిగా నిహాల్
డిజైనర్ డ్రస్సులో మాళవిక.. ముత్యంలా శ్రద్ధా మెరుపుల్
EPFO విత్‌డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!
ఆరోగ్యకరమైన హాస్యంతో...
ఈ మాత్రం ఆటకేనా రూ. 27 కోట్లు.. పంత్‌పై నెటిజన్లు ఫైర్
వర్శిటీ భూములను మేం లాక్కోవడం లేదు: భట్టీ
మనీశ్ పాండే అరుదైన ఘనత.. ధోని, రోహిత్ సరసన
ఆ వార్తల్ని నమ్మొద్దు.. 'కన్నప్ప' మూవీ టీమ్
చిరు సినిమా: అనిల్ రావిపూడి కెరీర్లోనే అత్యధిక పారితోషికం!
భారత్-చైనా అధ్యక్షులు అభినందనలు తెలియపరుచుకున్న వేళ..
శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!
అమెరికా మెచ్చిన అందం.. తెర్లాం అమ్మాయి సొంతం
April Fools Day 2025 : కాసిన్ని నవ్వులు, మరికొన్ని జోకులు..తేడా వచ్చిందంటే!
రెండు కుటుంబాల ఘర్షణపై సీఐ విచారణ
పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణకు డిమాండ్
30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ
సన్న బియ్యం పంపిణీకి బ్రేక్
నష్టపరిహారం ఇచ్చాకే...రోడ్డు విస్తరణ చేపట్టండి
నిజంగా హర్షణీయం!
ఉగాది బుట్టబొమ్మలు.. సితార ఇలా మృణాల్ అలా
ఐపీవోలపై కంపెనీల కసరత్తు..
అందమైన తెలుగుదనం– అనన్య నాగళ్ల
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన శ్రవణ్‌రావు సిట్ విచారణ
బిడ్డా.. నన్ను విడిచి వెళ్లిపోయావా...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
చర్యలు తీసుకోవాలని అర్జీ
ఈ రాశి వారికి రావలసిన సొమ్ము అందుతుంది.. స్థిరాస్తివృద్ధి
జీతాల కోసం రూ.4 వేల కోట్లు అప్పు
ఆదాయం పెరిగితేనే పథకాలు నడపగలం
బహుళ ప్రయోజనాల లక్ష్యంతో నెలకొల్పి న చెత్త సంపద కేంద్రాల్లో నిర్లక్ష్యం పేరుకుపోయింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం.. గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యం నీరుగారిపోయింది. ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం ర్యాలీలు, ప్రత
ఆటో ఎక్స్పో 2025: ఆకట్టుకున్న ఈ విటారా
Diwali 2024 ఈజీగా, హెల్దీగా బొప్పాయి హల్వా, టేస్ట్ అదిరిపోవాలంతే!
టోల్ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!
టోల్ ఫీజు మినహాయింపు ఇక లేదు..
సినిమా

ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?
2025లో మూడు నెలలు పూర్తయిపోయాయి. గత నెల మార్చిలో బోలెడన్ని మూవీస్ వచ్చాయి. కాకపోతే కోర్ట్ (Court A State Vs Nobody) అనే ఓ చిన్న సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. హీరో నాని (Nani) నిర్మించిన ఈ మూవీ.. మంచి లాభాలని అందుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?)రామ్ జగదీశ్ అనే కొత్త దర్శకుడు తీసిన 'కోర్ట్'లో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తీసిన ఈ సినిమాకు జనాలు నుంచి మంచి ఆదరణ దక్కింది. శివాజీ, ప్రియదర్శితో పాటు హర్ష రోషన్-శ్రీదేవి జంట నటనకు ప్రశంసలు దక్కాయి.ఇక విషయానికొస్తే మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన కోర్ట్ మూవీ.. ఏప్రిల్ 11న ఓటీటీలోకి (Court OTT) వచ్చే అవకాశముందని టాక్. దీని డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో పలు కొత్త సినిమాలు ఈ ఓటీటీలో 28 రోజులకే వస్తున్నాయి. దీంతో కోర్ట్ కూడా అలానే రావొచ్చని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతనేది చూడాలి?(ఇదీ చదవండి: వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?)

అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?
సినిమా సెలబ్రిటీలపై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలానే అల్లు అర్జున్ (Allu Arjun) గురించి కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్వరలో పేరు మార్చుకోబోతున్నాడని పలు ఇంగ్లీష్ వెబ్ సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత?పుష్ప 2 (Pushpa 2 Movie) మూవీతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ కి ఊహించని స్టార్ డమ్ వచ్చింది. దీంతో ఆచితూచి మూవీస్ చేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమా కన్ఫర్మ్, అట్లీతో కూడా ఖరారైందని అంటున్నారు. పుట్టినరోజున (ఏప్రిల్ 8న) అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.(ఇదీ చదవండి: వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?)ఇలా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు మాట్లాడుకుంటున్న ఈ టైంలో బన్నీ (Bunny) పేరు మార్చుకోబోతున్నాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలు జాతకాలు, న్యుమరాలజీ లాంటివి ఎక్కువగా నమ్ముతుంటారు. అలానే న్యూమరాలజీ ప్రకారం.. తన పేరులో అదనంగా ఇంగ్లీష్ అక్షరం U,N గానీ బన్నీ జోడించుకుంటాడని.. ఇలా చేస్తే గుర్తింపు మరింత పెరుగుతుందని నమ్మకమట. మరి బన్నీ పేరు మార్పుపై వస్తున్న రూమర్స్ నిజమా కాదా కొత్త సినిమా ప్రకటిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పటిలానే పేరు ఉంటే ఓకే. లేదంటే మార్పు వార్తలు నిజమేనని తేలుతుంది.(ఇదీ చదవండి: యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!)

వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?
ఉగాది-రంజాన్ కానుకగా థియేటర్లలోకి నాలుగైదు సినిమాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. వస్తున్న కలెక్షన్సే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిన ఈ చిత్రం.. రూ.100 కోట్లకు చేరువలో ఉంది.(ఇదీ చదవండి: దమ్ముంటే నన్ను, నా సినిమాలను బ్యాన్ చేయండి: నాగవంశీ)తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రకారం.. 4 రోజుల్లో ఈ సినిమాకు రూ.69.4 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు పేర్కొన్నారు. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు తొలిరోజు వచ్చిన టాక్, ఇప్పుడు వస్తున్న వసూళ్లకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పొచ్చు. ఓవర్సీస్ లోనూ ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్ వసూళ్లు దాటేసింది.ప్రస్తుతం ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ అయ్యేసరికి రూ.100 కోట్ల మార్క్ దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉందని చివర్లో ప్రకటించారు. మరి అది ఎప్పుడు తీసి రిలీజ్ చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!)

తండ్రి వయసు వ్యక్తితో అలా చూసి, నాన్న షాక్ చెందారన్న నటి
సాధారణంగా అందంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందేంత అభినయం కూడా ఉండడం అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే సాధించగలిగిన విజయం. అలాంటి విజయవంతమైన కధానాయికల్లో అమలాపాల్ ఒకరు. తమిళం, మలయాళం తెలుగు సినిమాలలో నటిస్తూ బహుభాషా నటిగా తన అందానికి, అభినయానికి సమాన ప్రశంసల్ని పొందిన ఈ నటి నిర్మాత కూడా. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుతో సహా ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతగా అమల పాల్(Amala Paul) పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అయితే ఏమీ తెలీకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నాటి అమలాపాల్‌కి ప్రస్తుతం ఉన్న వ్యక్తికి చాలా తేడా ఉందని ఆమె అంటోంది.అమలా పాల్,నటిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తాను విజయాలు మాత్రమే కాదు మరెన్నో సవాళ్లతో నిండిన ప్రయాణాన్ని సాగించానని వెల్లడించింది. . వ్యక్తిగత వృత్తి పరమైన ఎదుగుదలతో పాటు జీవితంలోని హెచ్చు తగ్గులు తన మార్గానికి ఒక రూపాన్ని ఇచ్చాయి అంటోంది. మళ్లీ ప్రేమ, మళ్లీ పెళ్లి, తల్లి కావడం...ఇలాంటి వ్యక్తిగత అనుభవాలను తన అభిమానులతో పంచుకుంటూ.. ఈ 15 సంవత్సరాలలో, ఆమె తన అనుభవాల ద్వారా ఎదురుదెబ్బల నుంచి చాలా నేర్చుకున్నానంది. అమలాపాల్ 2010లో నటించిన తమిళ చిత్రం ‘‘ సింధు సమవేలి’’ ఆమె కెరీర్ ను వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రభావితం చేసింది. ఆమె సింధు సమవేలి(Sindhu Samaveli)లో ఓ బోల్డ్ పాత్రను పోషించింది ఎందరినో ఇబ్బంది పెట్టిన శృంగార సన్నివేశాల్లో నటించింది. ఆ సాహసం ఆమె వ్యక్తిగత జీవితం ప్రారంభ కెరీర్ రెండింటినీ ఎదురుదెబ్బలు ఎదుర్కునేలా చేసింది.తండ్రి వయసు ఉండే తన మామగారితో అక్రమ సంబంధానికి ఒడిగట్టే కోడలు సుందరి పాత్రలో ఆమె నటించిన ఆ చిత్రం విడుదలైన తర్వాత తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వివాదం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,.ఆ సినిమా విషయంలో వెల్లువెత్తిన ప్రతికూలత తనను బాగా భయపెట్టిందని, ముఖ్యంగా ఆ సినిమా చూసి తన తండ్రి తీవ్రంగా కలత చెందారని ఆమె వెల్లడించింది. తన పాత్ర చూపించే సామాజిక ప్రభావాన్ని తాను అంచనా వేయలేకపోయానని అంగీకరించింది. ‘మనం అలాంటి పాత్ర చేయకూడదని, అది చెడ్డదని లేదా అది మన సమాజం అంగీకరించే విషయం కాదని ఆ చిత్రం విడుదల తర్వాత మాత్రనే నేను అర్ధం చేసుకోగలిగాను’’ అంటూ ఆమె గుర్తు చేసుకుంది. అయితే అప్పుడు తాను కేవలం 17 లేదా 18 సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్న నటిని.. కావడంతో దర్శకుడి సూచనలను గుడ్డిగా అనుసరించడం మాత్రమే చేయగలిగానంది. ఈ వివాదం ఆమెను మానసికంగా ప్రభావితం చేయడమే కాకుండా కెరీర్ పరంగానూ వ్యతిరేక పరిణామాలకు దారి తీసింది. సింధు సమవేలి తరువాత, ఆమె తన తదుపరి చిత్రం మైనా ప్రారంభ ప్రమోషన్లలలో సైతం దేనికీ ఆమెను పిలవలేదు, ఆ తర్వాత ఆమెకు తరువాత కమల్ హాసన్ రజనీకాంత్ వంటి దిగ్గజ నటుల నుంచి సైతం కాల్స్ వచ్చాయి, అయితే విపరీతమైన వ్యతిరేకత పట్ల భయం కారణంగా, ఆమె చెన్నైకి వెళ్లలేకపోయింది.అమలాపాల్ సక్సెస్ తర్వాత ఆ వివాదాస్పద చిత్రం మరోసారి రీ–రిలీజ్ అయింది. అప్పుడు కూడా ప్రమోషనల్ మెటీరియల్ తప్పుదారి పట్టిస్తోందంటూ వివాదాన్ని రేకెత్తించింది. వీటన్నింటి నేపధ్యం ‘‘ సినిమా కేవలం వ్యాపారాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని నేను గ్రహించాను, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక నటి ఎదురు దెబ్బలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి‘ అని ఆమె స్పష్టం చేసింది.
న్యూస్ పాడ్‌కాస్ట్

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...

25 ఏళ్లపాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొద్దు... చెన్నైలో జేఏసీ తొలి సమావేశంలో తీర్మానం
క్రీడలు

మనీశ్ పాండే అరుదైన ఘనత.. ధోని, రోహిత్ సరసన
ఐపీఎల్లో టీమిండియా వెటరన్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు మనీశ్ పాండే అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 18 వ సీజన్ వరకూ ప్రతీ సీజన్లోనూ మ్యాచ్ ఆడిన నాలుగో ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో సీజన్లో సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ తరపున ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన పాండే.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో పాండే కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఉన్నారు. పాండే ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్(2008)లో ముంబై ఇండియన్స్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్-2009లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున పాండే సత్తాచాటాడు. అనంతరం 2011-2013 వరకు పూణే వారియర్స్ ఇండియాకు మనీశ్ ప్రాతనిథ్యం వహించాడు. 2014 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌లోకి పాండే వచ్చాడు. ఆ ఏడాది కేకేఆర్ టైటిల్ సాధించడంలో పాండే కీలక పాత్ర పోషించాడు. 2014 నుంచి 2017 వరకు కేకేఆర్ తరపున ఆడిన పాండే.. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి వచ్చాడు. 2018 నుంచి 2021 వరకు ఎస్ఆర్హెచ్కు పాండే ప్రాతినిథ్యం వహించాడు. 2022లో లక్నో సూపర్ జెయింట్స్, 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పాండే ఆడాడు. మళ్లీ ఇప్పుడు తన సొంతగూటికి పాండే చేరాడు. ఐపీఎల్లో మొత్తంగా 172 మ్యాచులు ఆడిన పాండే.. అందులో 3869 పరుగులు స్కోరు చేశాడు. ఇందులో ఒక సెంచరీ.. 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా ధోనీ, కోహ్లి, రోహిత్‌లు మొత్తం 18 ఎడిషన్లలోనూ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో కోహ్లి ఒక్కడే అన్ని మ్యాచ్‌లూ ఒకే ప్రాంఛైజీ తరపున ఆడాడు. ఈ టోర్నీ తొట్టతొలి సీజన్ నుంచి కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడుతున్నాడు.చదవండి: PAK vs NZ: పాక్‌తో రెండో వన్డే.. కివీస్‌కు భారీ షాక్! ఆరేళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ

రిటైర్మెంట్పై విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు!?
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకూ ఆడతానని సంకేతాలు ఇచ్చాడు. ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతనిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా తన భవిష్యత్తు ప్రణాళికలకపై కోహ్లి క్లారిటీ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత మీ ముందు ఉన్న అతి పెద్ద లక్ష్యమేంటి అన్న ప్రశ్న కోహ్లికి ఎదురైంది. అందుకు కోహ్లి బదులిస్తూ.. "నా నెక్స్ట్ బిగ్ స్టెప్ ఏంటో నాకు తెలియదు. తర్వాతి వరల్డ్ కప్ గెలిచేందుకు ప్రయత్నిస్తా" అని సమాధానం ఇచ్చాడు. దీంతో 2027 వన్డే ప్రపంచకప్‌లో వరకూ ఆడతాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ టీ20లకు కోహ్లి వీడ్కోలు పలికాడు. అదేవిధంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ కోహ్లి మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కోహ్లి వ్యాఖ్యలను బట్టి అతడు మరో మూడేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడే అవకాశముంది. కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ సొంతం చేసుకోవడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడి 54.50 సగటుతో 218 పరుగులు చేశాడు.చదవండి: PAK vs NZ: పాక్‌తో రెండో వన్డే.. కివీస్‌కు భారీ షాక్! ఆరేళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీQuestion: Seeing In The Present, Any Hints About The Next Big Step? Virat Kohli Said: The Next Big Step? I Don't Know. Maybe Try To Win The Next World Cup 2027.🏆🤞 pic.twitter.com/aq6V9Xb7uU— virat_kohli_18_club (@KohliSensation) April 1, 2025

పాక్‌తో రెండో వన్డే.. కివీస్‌కు భారీ షాక్! ఆరేళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
హామిల్టన్ వేదికగా పాకిస్తాన్‌తో రెండో వన్డేలో తలపడేందుకు న్యూజిలాండ్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవాలి అని కివీస్ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ మార్క్ చాప్మన్ గాయం కారణంగా రెండో వన్డేకు దూరమయ్యాడు.నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా చాప్మన్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి చాప్మన్ బయటకు వెళ్లిపోయాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి మరో రెండు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చాప్మన్ రెండో వన్డేకు దూరమయ్యాడు. ఇది నిజంగా కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బే అని చెప్పుకోవాలి. తొలి వన్డే చాప్మాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 111 బంతుల్లో 132 పరుగులతో తన కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను నమోదు చేశాడు. ఇక చాప్మాన్ స్ధానాన్ని వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్‌తో న్యూజిలాండ్ మేనేజ్మెంట్ భర్తీ చేసింది. సీఫెర్ట్ దాదాపు ఆరేళ్ల తర్వాత న్యూజిలాండ్ వన్డే జట్టులోకి వచ్చాడు.సీఫర్ట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పాక్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సీఫర్ట్ దుమ్ములేపాడు. సీఫర్ట్ ఐదు మ్యాచ్‌లలో 249 పరుగులతో ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు వన్డే జట్టులో చోటిచ్చారు.న్యూజిలాండ్ జట్టు: విల్ యంగ్, నిక్ కెల్లీ, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టిమ్ సీఫెర్ట్, ముహమ్మద్ అబ్బాస్, మైకేల్ బ్రేస్‌వెల్(కెప్టెన్), మిచెల్ హే(వికెట్ కీపర్), నాథన్ స్మిత్, జాకబ్ డఫీ, విలియం ఒరూర్కే, బెన్ సియర్స్, ఆదిత్య అశోక్చదవండి: IPL 2025, MI VS KKR: చరిత్ర పుటల్లో సూర్యకుమార్

MI Vs KKR: భలా బౌల్ట్.. ఏ బౌలర్‌కు సాధ్యం కాని రీతిలో..!
ఐపీఎల్లో ప్రస్తుత ముంబై ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు ఉంది. ఐపీఎల్లో తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బౌల్ట్ రికార్డు కలిగి ఉన్నాడు. తాజాగా ఈ రికార్డును బౌల్ట్ మరింత మెరుగుపర్చుకున్నాడు. నిన్న (మార్చి 31) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్ మరోసారి తొలి ఓవర్లో వికెట్ తీసి తన తొలి ఓవర్ వికెట్ల సంఖ్యను 30కి (96 మ్యాచ్‌లు) పెంచుకున్నాడు. ఐపీఎల్లో బౌల్ట్ తర్వాత తొలి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత భువనేశ్వర్ కుమార్‌కు దక్కుతుంది. ప్రస్తుతం ఆర్సీబీకి ఆడుతున్న భువీ ఐపీఎల్ తొలి ఓవర్లలో 27 వికెట్లు (126 మ్యాచ్‌లు) తీశాడు. ఈ రికార్డుకు సంబంధించి బౌల్ట్, భువీ దరిదాపుల్లో ఎవరూ లేరు. ఐపీఎల్ తొలి ఓవర్లో ప్రవీణ్ కుమార్ 15, సందీప్ శర్మ 13, దీపక్ చాహర్ 13 వికెట్లు తీశారు.కాగా, కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో బౌల్ట్ తొలి ఓవర్లోనే సునీల్ నరైన్‌ను డకౌట్ చేశాడు. తద్వారా కేకేఆర్ పతనానికి నాంది పలికాడు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం పేసర్ (ముంబై ఇండియన్స్) అశ్వనీ కుమార్ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్ 116 పరుగులకే కుప్పకూలింది. అశ్వనీ కుమార్‌తో పాటు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) రాణించడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది (16.2 ఓవర్లలో). కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ (26) టాప్ స్కోరర్ కాగా.. రమణ్‌దీప్ (22), మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) రెండంకెల స్కోర్లు చేశారు. డికాక్ (1), సునీల్ నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.ఈ సీజన్లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్‌కు లభించిన తొలి విజయం ఇది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ సీజన్లో ఇది రెండో పరాజయం. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిన ఈ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి, తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది.
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,307.27 పాయింట్లు లేదా 1.69 శాతం నష్టంతో.. 76,107.66 వద్ద, నిఫ్టీ 339.50 పాయింట్లు లేదా 1.44 శాతం నష్టంతో.. 23,179.85 వద్ద నిలిచాయి.కనాని ఇండస్ట్రీస్, హెస్టర్ బయోసైన్సెస్, రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ORCHASP, వోడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, వన్‌సోర్స్ స్పెషాలిటీ ఫార్మా, వైశాలి ఫార్మా, DRC సిస్టమ్స్ ఇండియా మొదలైన కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

నాలుగు లక్షల నెంబర్లు లీక్.. రేపు ఒకరి అరెస్ట్ తప్పదు
సోషల్ సెక్యూరిటీ డేటాబేస్ నుంచి నాలుగు లక్షల మంది వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి విక్రయించాడనే ఆరోపణలపై ఒక వ్యక్తిని త్వరలో అరెస్టు చేస్తామని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' తెలిపారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ సెక్యూరిటీ డేటాబేస్ నుంచి దొంగలించిన నాలుగు లక్షల నెంబర్లు, వ్యక్తిగత సమాచారం.. అక్రమ వలసలు, అమెరికా పౌరులు కానివారు ఓటు వేయడానికి అనుమతిస్తామని మస్క్ పేర్కొన్నారు. అంతే కాకుండా.. సామాజిక భద్రత, వైద్య సంరక్షణ, నిరుద్యోగ భృతి, ఐఆర్ఎస్ వాపసులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ, పత్రాలు లేని వలసదారులు ప్రయోజనాలను పొందడాన్ని డెమొక్రాట్లు సులభతరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.విపత్తు సహాయానికి ఉద్దేశించిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని మస్క్ ఆరోపించారు. జాతీయ విపత్తుల వల్ల బాధపడుతున్న అమెరికన్లకు సహాయం చేయడానికి ఉద్దేశించిన ఎఫ్ఈఎమ్ఏ నిధులను దారి మళ్లించి, న్యూయార్క్‌లోని లగ్జరీ హోటళ్లకు అక్రమంగా నివసించేవారి కోసం చెల్లించడానికి ఉపయోగించారని అన్నారు.🚨 ELON MUSK: "Someone is going to be arrested tomorrow. He actually stole 400,000 social security numbers & personal information from the Social Security database and was selling social security numbers in order for people to basically steal money from Social Security." pic.twitter.com/1hjl1Umcup— DogeDesigner (@cb_doge) April 1, 2025

చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్‌న్యూస్
ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల చాట్‌జీపీటీ వినియోగదారుల కోసం కీలక అప్డేట్ను ప్రకటించారు. ఇటీవల చాట్‌జీపీటీలో వైరల్‌గా మారిన ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ జీబ్లీ సర్వీసును సబ్స్క్రిప్షన్ తీసుకోని వినియోగదారులకు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.‘చాట్‌జీపీటీ ఇమేజ్ జనరేషన్ ఇప్పుడు ఉచిత వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చింది’ అని శామ్ ఆల్ట్‌మన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు జీపీటీ-4ఓ యూజర్లకు అందుబాటులో ఉండేది. దాన్ని ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోనివారికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఏఐ ఇమేజ్ జనరేషన్‌ను యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేలా ఇటీవల విభిన్న సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ వెల్లువెత్తింది. దాంతో ఈమేరకు ఆల్ట్‌మన్ స్పందించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఆమెకు మూడు చేతులు..!chatgpt image gen now rolled out to all free users!— Sam Altman (@sama) April 1, 202526 నెలల క్రితం చాట్‌జీపీటీ ప్రారంభించిన సమయంలో అత్యంత క్రేజ్‌తో క్షణాల్లో ఈ ప్లాట్‌ఫామ్ వైరల్ అయి ఐదు రోజుల్లో 10 లక్షల మంది యూజర్లను సంపాదించుకున్నట్లు ఆల్ట్‌మన్ ఇటీవల చెప్పారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన బీజ్లీ స్టూడియో ద్వారా చాట్‌జీపీటీ గతంలో కంటే మరింత వైరల్ అయి కేవలం గంటలోనే 10 లక్షల మంది యూజర్ల బేస్‌ను సంపాదించిందని వివరించారు. ప్రస్తుతానికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్యను విడుదల చేయలేదు. ఈ కొత్త ఫీచర్‌ను ఓపెన్ఏఐ గత వారం జీపీటీ-4ఓలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎలాంటి ఎక్స్టర్నల్ టూల్స్ అవసరం లేకుండా నేరుగా చాట్‌జీపీటీలోనే టెక్ట్స్, యూజర్ ఫొటోలు అప్లోడ్ చేసి బీజ్లీ ఇమేజ్‌లను పొందవచ్చు.

ఎస్బీఐ సేవల్లో అంతరాయం: నిలిచిపోయిన ట్రాన్సాక్షన్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు ఆన్లైన్ సేవలతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వెబ్సైట్ పర్ఫామెన్స్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం, ఈరోజు ఉదయం 8:15 గంటలకు ఈ అంతరాయం ప్రారంభమైంది. 11:45 గంటలకు సమస్య తీవ్రమై 800 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.వార్షిక ముగింపు కార్యకలాపాల కారణంగా.. ఏప్రిల్ 1 మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యూపీఐ సేవల వంటి డిజిటల్ సర్వీసులు అందుబాటులో ఉండవని.. ఈ అంతరాయానికి క్షమించమని ఎస్బీఐ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.ఇదీ చదవండి: రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడుడౌన్డెటెక్టర్ ప్రకారం, సుమారు 64 శాతం మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు, 33 లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంతరాయం నుంచి బయటపడటానికి కస్టమర్లు యూపీఐ లైట్, ఏటీఎమ్ ఉపయోగించుకోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.pic.twitter.com/hoCuUxJIdJ— State Bank of India (@TheOfficialSBI) April 1, 2025
ఫ్యామిలీ

యువతలో జోష్ నింపుతున్న క్రియేటర్ మీట్స్
సృజనాత్మక శక్తి కలిగిన క్రియేటర్లకు హైదరాబాద్ నగరం చిరునామాగా మారుతోంది. పలువురు యువతీ యువకులు సోషల్ మీడియాలో తమ సత్తా చాటుతున్నారు. అత్యధిక ఫాలోవర్లను, వ్యూస్‌ను అందుకుంటూ దూసుకుపోతున్నారు. పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్న సిటీ డిజిటల్ స్టార్స్‌ను సొంతం చేసుకునేందుకు, మరింత మందిని తమవైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ హైదరాబాద్ నగరంపై దృష్టి సారించాయి. విభిన్న రకాల ఈవెంట్లతో నగర యువతను ఊపేస్తున్నాయి. ఈ యాప్స్ ఉపయోగించేవారిలో అత్యధికులు టీనేజర్లు, అందులో యువతులు ఉండడంతో ఈ ఆన్లైన్ యాప్స్ వారి కోసం నగరంలో పలు ఆఫ్‌లైన్ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాయి. క్రియేటర్లకు అవగాహన, మార్గదర్శకత్వం అందించడంతో పాటు కొత్త కొత్త సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ మరింత రాణించేందుకు అన్ని విధాలా సహకరిస్తున్నాయి. అంతేకాకుండా తమ ఫాలోయింగ్, లైక్స్, వ్యూస్ ఉపయోగించుకుంటూ ప్రకటనలు పొందడం, మానిటైజేషన్ అవకాశాలను మెరుగుపరుచుకోవడంపైనా అవగాహన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ తొలి ప్రాధాన్యత.. దేశవ్యాప్తంగా దాదాపు 200 మిలియన్ల క్రియేటర్లను కలిగి ఉన్న ప్రముఖ సోషల్ వేదిక స్నాప్‌చాట్ తన తొలి స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్ కార్యక్రమాన్ని నగరంలోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఆలివ్ బిస్ట్రో రెస్టారెంట్లో గత బుధవారం నిర్వహించింది. క్రియేటర్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలతో పాటు ఆదాయం ఆర్జించే అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ నిర్వహించినట్టు స్నాప్ ఇన్ కార్పొరేషన్ కంటెంట్, ఏఆర్ భాగస్వామ్యాల డైరెక్టర్, సాకేత్ ఝా సౌరభ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు తోడ్పడేందుకు నగరానికి చెందిన క్రియేటివ్ మీడియా సంస్థలు, తమడ మీడియా, చాయ్ బిస్కెట్, సిల్లీ మాంక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రకటించారు. ప్రత్యేకంగా క్రియేటర్ డే సృష్టి.. అంతర్జాతీయ స్థాయిలో క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా క్రియేటర్స్ డే కూడా నిర్వహిస్తున్నారు. మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్‌స్టా ముంబయి, బెంగళూర్ సహా హైదరాబాద్‌లో నూ క్రియేటర్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నాయి. దీంతో పాటే ఔత్సాహిక యువత కోసం ఈ యాప్స్ గతేడాదిలో క్రియేటర్స్ ల్యాబ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చాయి. నటి రష్మిక మందన్న, హీరో నానితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ ఈవెంట్స్‌లో పాల్గొంటుండడంతో వీటికి యువత నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో నగరాన్ని క్రియేటర్స్ హబ్‌గా చూడడం తథ్యం అనిపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవడం బాగుంది.. ‘యూ ట్యూబ్, ఇన్‌స్టా ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిత్యం వేలాది, లక్షలాది మందితో కనెక్ట్ అవ్వొచ్చు’ అని చెప్పారు యాంకర్ లాస్య. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీగా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకుంది లాస్య.. ప్రత్యేకంగా ఇలాగే చేయాలనే ముందస్తు ప్లాన్స్ లేకుండా అప్పటికప్పుడు చేసే సరదా బిట్స్ కూడా వీక్షకాదరణ పొందే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం టీవీకి, సినిమాకీ కొంత దూరంగా ఉన్నా, దీని ద్వారా ఆ లోటు తీరుతోంది. అయితే ఇప్పటికీ మంచి అవకాశం వస్తే వెండితెరపై మెరిసేందుకు సిద్ధమే. నా భర్త మంజునాథ్‌తో కలిసి కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. ఈ సోషల్ మీడియాలో క్రియేటర్స్‌గా రాణించాలంటే ఎప్పటికప్పుడు మన స్కిల్స్ మెరుగుపరుచుకుంటూ, కొత్త కొత్త పోకడలు అందిపుచ్చుకుంటూ ఉండడం అవసరం. దీనికి ఈ యాప్స్ నిర్వహిస్తున్న ఆఫ్‌లైన్ ఈవెంట్స్ బాగా ఉపకరిస్తున్నాయి. ఈ కారణంగానే మేము స్నాప్ చాట్ ఏర్పాటు చేసిన క్రియేటర్స్ కనెక్ట్ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యాం. – మంజునాథ్ లాస్య (యాంకర్) (చదవండి: పింకీ ట్రిగ్గర్..! గంటల తరబడి ఫోన్ వాడుతున్నారా..?)

పింకీ ట్రిగ్గర్..! గంటల తరబడి ఫోన్ వాడుతున్నారా..?
అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తూ పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ దీనికి బానిసలే.. అదే నిత్యవ్యాపకంగా మారిన సెల్‌ఫోన్. ఈ మధ్యకాలంలో సెల్ ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తిలేదు. లేచింది మొదలు పడుకునే వరకూ దాదాపు ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తున్న వారు అధికం అవుతున్నారు. దీంతో వీరిని రకరకాల రుగ్మతలు వెంటాడుతున్నాయి. వాటిలో ఒకటే పింకీ ట్రిగ్గర్, ఫోన్ పింకీ అని పిలుస్తున్నారు. అధిక శాతం మంది కనీసం రోజులో 4–6 గంటలు సగటున ఫోన్ వినియోగిస్తున్నారు. ఇక 13–18 మధ్య వయసు వారు 5–7 గంటలు, 18–30 మధ్య వయసు వారు 6–10 గంటలు, ఉద్యోగాలు చేసేవారు 3–5 గంటలు, సీనియర్ సిటిజన్స్ 1–3 గంటల పాటు ఫోన్ వినియోగిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సోషల్ మీడియా రాకతో ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ గేమ్స్, ఎడ్యుకేషన్, వీడియోలు, రీల్స్ ఇలా ఏ వయసు వారు ఆ స్థాయిలో ఫోన్ వినియోగిస్తున్నారు. పెరుగుతున్న సమస్యలు.. అతిగా ఫోన్ వినియోగించడం వల్ల రక రకాల రుగ్మతులు వెంటాడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల వెంటాడుతోన్న రుగ్మతల్లో ఒకటి పింకీ ఫింగర్, పింకీ ట్రిగ్గర్, ఫోన్ పింకీ ఒకటి. ఈ పదాలు వినడానికి కొత్తగా అనిపించినా ప్రస్తుతం వేదిస్తోన్న ప్రధాన సమస్య. గంటల తరబడి చిటికెను వేలుపై ఫోన్ బ్యాలెన్స్ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుల తరబడి ఫోన్ బరువు పడడంతో వేలుపై ఒత్తిడి పెరిగి తాత్కాలికంగా చిన్న డెంట్ ఏర్పడుతోంది. ఒత్తిడి తగ్గించాలివేళ్లపై అధిక ఒత్తిడి పడడంతో ఆ ప్రభావం నరాలపైనా పడుతోంది. ఫలితంగా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే సమస్యకు దారితీస్తోంది. ఇదో గందరగోళ వైద్య సమస్య అని చెబుతున్నారు. అంతేకాకుండా బొటనవేలు సందుల మధ్య కండరాలు ప్రభావితం చెందడం వల్ల ‘టెక్ట్సింగ్ థంబ్’ సమస్య ఏర్పడుతోంది. దీంతోపాటు ఎక్కువ సేపు తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి మెడనొప్పి సమస్యకు దారితీస్తోంది. వీటి నుంచి బయట పడటానికి రెండు చేతులూ వినియోగించడం, ఫోన్ స్టాండ్స్ వాడటం, చేతి వేళ్లకు విశ్రాంతి ఇవ్వడం, చేతుల వ్యాయామం చేయడం ఉత్తమం. – డాక్టర్ బి.చంద్రశేఖర్, షోల్డర్ సర్జన్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేట (చదవండి: భగభగమండే ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!)

ఎండల్లో ఒళ్లు జాగ్రత్త..!
మానవ మనుగడకు ఎండ ఎంత అవసరమో... అందులోని రేడియేషన్‌తో... అందునా ముఖ్యంగా రేడియేషన్ స్పెక్ట్రమ్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాలతో అంత ప్రమాదం. ఎండ ఎప్పుడూ బాహ్య అవయవమైన చర్మంపైనే పడుతుంది కాబట్టి మొదటి ప్రమాదం మేనికే. పైగా ఇప్పుడు వేసవి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత కొన్నేళ్లతో ΄ోలిస్తే ఫిబ్రవరి మొదటి వారాల్లోనే ఎండ తీవ్రతలు మొదలయ్యాయి. ఈ ఎండల్లో రేడియేషన్ నుంచి ముఖ్యంగా అందులోని అల్ట్రా వయొలెట్ కిరణాల దుష్ప్రభావాలనుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. సూర్యకాంతిలో అల్ట్రావయొలెట్ రేడియేషన్ భూ వాతావరణంలోకి ప్రవేశించగానే అందులోని అల్ట్రా వయొలెట్–ఏ, అల్ట్రా వయొలెట్–బీ, అల్ట్రా వయొలెట్–సీ (వీటినే సంక్షిప్తంగా యూవీ–ఏ, యూవీ–బీ, యూవీ–సీ అంటారు) అనే మూడు రకాల రేడియేషన్లు వాతావరణంలో ప్రవేశించాక ప్రధానంగా యూవీ–ఏ, యూవీ–బీ కిరణాలు చర్మంపై పడతాయి. అదృష్టవశాత్తూ అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌లోని ప్రమాదకరమైన యూవీ–íసీ వాతావరణంలోకి ఇంకి΄ోతాయి. దాంతో యూవీఏ, యూవీబీ రెండూ చర్మంపై పడతాయి. అయితే ఈ రేడియేషన్‌లో దాదాపు 5 శాతం తిరిగి వెనక్కు వెళ్తాయి. మరికొంత పరిమాణం అన్నివైపులకూ చెదిరిపోతుంది. ఎండ తీవ్రంగానూ, నేరుగా పడే భూమధ్యరేఖ, ఉష్ణమండల ప్రాంతాల్లో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువ అని చాలామంది అనుకుంటారు గానీ... నిజానికి మంచు కప్పి ఉన్న ప్రాంతాల్లోనే రేడియేషన్ ప్రభావమెక్కువ. అంటే భూమధ్య రేఖ కంటే ధ్రువాల వైపు ΄ోతున్న కొద్దీ, అలాగే ఎత్తుకు పోయిన కొద్దీ..., అలాగే వేసవి ముదురుతున్న కొద్దీ, వాతావరణంలో మబ్బులు లేకుండా నీలం రంగు ఆకాశం ఉన్నప్పుడూ ఈ రేడియేషన్‌లోని యూవీ కిరణాల తీవ్రత పెరుగుతుంది. రేడియేషన్‌లో ప్రమాదకరమైనది యూవీ–బీ... యూవీ–ఏ, యూవీ–బీలలో రెండోది (యూవీ–బీ) చాలా ప్రమాదకరమైనది. అది చర్మం తాలూకు ‘ఎపిడెర్మిస్’ అనే పొరను తాకాక అక్కడి డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ట్రి΄్టోఫాన్, టైరోజిన్, మెలనిన్లు ఆ కిరణాలను చర్మంలోకి ఇంకి΄ోయేలా చేస్తాయి. ఆ తర్వాత అవి చర్మంలోని మరో పొర ‘డెర్మిస్’నూ తాకుతాయి. అక్కడి ఇంట్రావాస్కులార్ హీమోగ్లోబిన్, డెర్మిస్లోని టిష్యూ బైలింబిన్ అనే కణజాలాలు వాటిని గ్రహించి మళ్లీ వెనకకు పంపుతాయి. అయితే ఈ ప్రక్రియలో అల్ట్రావయెలెట్ కిరణాలు గ్రహించిన ప్రతి డీఎన్ఏలో ఎంతోకొంత మార్పు రావడం జరుగుతుంది. అలాంటి మార్పులు చాలా పెద్ద ఎత్తున లేదా తీవ్రంగా జరిగినప్పుడు చర్మంపై అవి దుష్ప్రభావాల రూపంలో వ్యక్తమవుతాయి. ఇన్‌డోర్స్‌లో ఉన్నా ప్రమాదమే... ఇండ్లలో ఉన్నవాళ్ల మీద అల్ట్రావయొలెట్ రేడియేషన్ దుష్ప్రభావం ఉండదన్నది చాలా మందిలో ఉండే మరో అ΄ోహ. ఆరుబయటితో పోలిస్తే ఇన్‌డోర్స్‌లో కాస్త తక్కువే అయినా... రేడియేషన్ దుష్ప్రభావాలు గదుల్లో ఉన్నా ఎంతోకొంత ఉండనే ఉంటాయి. గదిలో ఉన్నప్పుడు మనకు అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం ఉండదని అనుకుంటాంగానీ... ఇళ్లలో ఉండే ట్యూబ్లైట్స్, ఎలక్ట్రిక్ బల్బుల నుంచి కూడా దాదాపు 5 శాతం వరకు రేడియేషన్ ఉంటుంది. ఆకాశంలో మబ్బులు కమ్మి ఉన్నప్పుడు అల్ట్రా వయొలెట్ కిరణాల తీవ్రత కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. కొన్ని వ్యాధుల్లో ఎండ వల్ల పెరిగే తీవ్రత... కొందరిలో ఈ కింద పేర్కొన్న ఆరోగ్య సమస్యల్లో ఏదో ఒకటి ముందుగానే ఉండవచ్చు. అయితే తీక్షణమైన ఎండకు అదేపనిగా ఎక్కువ సేపు ఎక్స్పోజ్ కావడం వల్ల ముందున్న వ్యాధి తీవ్రత పెరగవచ్చు. ఆ ఆరోగ్య సమస్యల్లో ఇవి కొన్ని... యాక్నె (మొటిమలు) అటోపిక్ ఎగ్జిమా (స్కిన్ అలర్జీ) పెలగ్రా లూపస్ అరిథమెటోసిస్, హెర్పిస్ సింప్లెక్స్ బుల్లస్ పెఫిగోయిడ్ లైకెన్ ప్లానస్ సోరియాసిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మెలాస్మా వంటివి ముఖ్యమైనవి. రేడియేషన్ వల్ల చర్మానికి జరిగే అనర్థాలివి... అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల...సన్ బర్న్స్ సన్ ట్యానింగ్ చర్మం మందంగా మారడం గోళ్లకు నష్టం కావడం అసలు వయసు కంటే పెద్ద వయసు వారిగా కనిపించడం. ఇక ఈ అంశాల గురించి వివరంగా చెప్పాలంటే... సన్‌బర్న్స్: రేడియేషన్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం మొట్టమొదట కణాల్లోని చర్మకణాల్లోని డీఎన్ఏ పై పడుతుంది. అంతకంటే ముందు మొదట చర్మం వేడెక్కుతుంది. తర్వాత ఎర్రబారుతుంది. ఆరుబయటకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం నేరుగా ఎండ పడే చోట... అంటే... ఎండకు ఎక్స్΄ోజ్ అయ్యే ముఖం మీద, చేతుల మీద త్వరగా కనిపిస్తుంది. బాగా ఫెయిర్‌గా ఉండి తెల్లటి చర్మంతో ఉన్నవారిలో సన్‌బర్న్స్ త్వరగా కనిపిస్తాయి. అయితే మన దేశవాసుల్లో సన్‌బర్న్స్ కాస్త తక్కువే. సన్ ట్యానింగ్ : ఎండ తగిలిన కొద్దిసేపట్లోనే చర్మం రంగు మారి అలా అది కొన్ని నిమిషాలు మొదలుకొని కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. దీన్నే ‘ఇమ్మీడియెట్ ట్యానింగ్’ అంటారు. ఇలా మారిన రంగు (నల్లబారడం) మొదట తాత్కాలికంగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ ఎండలోనే ఉండేవారిలో రంగు మారడం చాలాకాలం పాటు కొనసాగి, ఆ మారిన రంగు కాస్తా అలాగే చాలాకాలం పాటు ఉండిపోతుంది. దీన్నే ‘డిలేయ్డ్ ట్యానింగ్’ అంటారు. అటు తర్వాత అలా చాలాకాలం పాటు ఎండకు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతూ ఉండేవారిలో చర్మం మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘హైపర్ప్లేషియా’ అంటారు. తెల్లగా, ఎర్రగా ఉన్నవారిలో ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.ఎండ ప్రభావం గోళ్ల మీద కూడా...ఎండకు అదేపనిగా ఎక్స్΄ోజ్ అవుతుండే గోళ్లకు కూడా నష్టం జరిగే అవకాశముంది. నిత్యం అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు గురయ్యే గోళ్లలో వేలి నుంచి గోరు విడివడి ఊడి΄ోయే అవకాశముంటుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘ఒనైకోలైసిస్’ అంటారు. ఎండ తీవ్రతతో వచ్చే చర్మవ్యాధులివి... ఎండలోని అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు అదేపనిగా ఎక్స్పోజ్ అయ్యేవారిలో కొన్ని రకాల చర్మవ్యాధులు వచ్చే అవకాశముంది. అవి... పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ : ఇవి యుక్తవయస్కుల్లో, పిల్లల్లో ఎక్కువ. చర్మంపై ముఖ్యంగా చెంపలపైన, ముక్కుకు ఇరువైపులా ఎర్రగా ర్యాష్ రావడం, అరచేతి పైనా, మెడ వెనక ఈ ర్యాష్ కనిపిస్తుంది. ఇందులో దురద కూడా ఎక్కువే. ముఖం మీద తెల్లటి మచ్చలు వస్తాయి. ఆక్టినిక్ ప్రూరిగో: ఈ సమస్య ప్రధానంగా అమ్మాయిల్లో ఎక్కువ. చర్మం అలర్జీలు ఉన్నవారిలో ఎక్కువ. మొదట చిన్న చిన్న దురద పొక్కుల్లాగా వచ్చి, అవి పెచ్చులు కట్టి, మచ్చలా మారుతుంటాయి. అలా వచ్చిన మచ్చ ఎన్నటికీ పోదు. హైడ్రోవాక్సినిఫార్మ్ : ఈ సమస్య పిల్లల్లో కనిపించడం ఎక్కువ. ఇవి దురదగా ఉండే రక్తపు నీటి పొక్కుల్లా ఉంటాయి. చాలా ఎర్రగా మారి, ఆ తర్వాత ఎండి, రాలిపోతాయి. అటు తర్వాత అక్కడ చికెన్పాక్స్లో ఉండే మచ్చలాంటిది పడుతుంది. చెంపలు, చెవులు, ముక్కు, చేతుల మీద ఈ పొక్కులు ఎక్కువగా వస్తుంటాయి. సోలార్ అట్రికేరియా: ఎండకు బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్లల్లో కొద్ది నిమిషాల్లోనే అకస్మాత్తుగా చర్మం మీద ఎర్రగా, దద్దుర్లు వస్తాయి. ఇవి ఎవరిలోనైనా రావచ్చు. క్రానిక్ యాక్టినిక్ డెర్మటైటిస్: ఇదో రకం స్కిన్ ఇన్ఫెక్షన్. ఇది వచ్చిన చోట చర్మం ఎర్రగా, మెరుస్తున్నట్లుగా, మందంగా మారి, దురద వస్తుంది. అది వచ్చిన చోట చర్మం పొడిగా మారడమే కాకుండా ఉబ్బినట్లుగా అవుతుంది. ఇది ముఖ్యంగా ముఖం మీద ఎక్కువగా కనిపించినప్పటికీ మాడు, వీపు, మెడ, ఛాతి, చేతుల మీదికి కూడా వ్యాపిస్తుంది. పెద్దవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. స్కిన్ అలర్జీ, పుప్పొడితో కనిపించే అలర్జీలతోపాటు కలిసి వస్తుంది. చర్మ కేన్సర్లు : నిరంతరం నేరుగా, తీక్షణంగా పడే ఎండలో ఎక్కువగా ఉండేవారికి చర్మక్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. వీటిల్లో మెలనోమా, నాన్మెలనోమా అని రెండు రకాల క్యాన్సర్లు రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌తో ఉండే కొన్ని ప్రయోజనాలివి... అల్ట్రా వయొలెట్ రేడియేషన్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అవి... విటమిన్ డి ఉత్పత్తికి : అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్΄ోజ్ కాక΄ోతే అసలు విటమిన్–డి ఉత్పత్తే జరగదు. ఎముకల బలానికీ, వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికీ, అనేక జీవక్రియలకూ విటమిన్–డి చాలా అవసరమన్న విషయం అందరికీ తెలిసిందే. ఎముకల బలానికి అవసరమైన క్యాల్షియమ్ మెటబాలిజమ్, ఎముకల పెరుగుదల, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం కోసం, ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా అల్ట్రా వయొలెట్ రేడియేషన్ కొంతమేరకు అవసరమవుతుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల చికిత్సల్లో : సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా వంటి కొన్ని ఆరోగ్య సమస్యల చికిత్సలో అల్ట్రా వయొలెట్ కిరణాలను ఉపయోగిస్తుంటారు. పుట్టుకామెర్ల చికిత్సలో : నవజాత శిశువుల్లో వచ్చే పుట్టుకామెర్లు (జాండీస్)ను తగ్గించడం కోసం అల్ట్రా వయొలెట్ కిరణాలు ఉపయోగపడతాయి. ఎండలో ఉండే వ్యవధి, తీవ్రత... పెరుగుతున్న కొద్దీ దుష్ప్రభావాల పెరుగుదల... ఎండకు ఎంతసేపు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతుంటే దుష్ప్రభావాలూ అంతగా పెరుగుతాయి. అలాగే అల్ట్రావయొలెట్ రేడియేషన్ తాలూకు తీవ్రత పెరుగుతున్నకొద్దీ నష్టాల తీవ్రత దానికి అనుగుణంగా పెరుగుతూనే ఉంటుంది. ఇందుకు ‘ఫొటో ఏజింగ్’ ఒక ఉదాహరణ. ఫొటో ఏజింగ్ అంటే ఎండకు ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ అంటే... ఎక్స్పోజ్ అయ్యే వ్యవధి పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తి తన వాస్తవ వయసుకంటే ఎక్కువ వయసు పైబడినట్లుగా కనిపిస్తుంటాడు. అల్ట్రా వయొలెట్–బి రేడియేషనే ఇందుకు కారణం. ఆ కిరణాల వల్ల ముఖం అలాగే మేని మీద ముడుతలు రావడం, చర్మం మృదుత్వం కోల్పోవడం, నల్లటి మచ్చలు రావడం, వదులుగా మారి΄ోవడం, తన పటుత్వం కోల్పోవడం వల్ల ఇలా ఏజింగ్ కనిపిస్తూ ఉంటుంది. యూవీ రేడియేషన్ అనర్థాల నుంచి కాపాడుకోవడం ఇలా... ప్రధానంగా వేసవితో పాటు మిగతా అన్ని కాలాల్లోనూ ఎండ తీక్షణత ఎక్కువగా ఉండే సమయంలో అంటే... ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. చర్మంపై సూర్యకాంతి పడకుండా పొడవు చేతి చొక్కాలు (పొడడైన స్లీవ్స్ ఉండే దుస్తులు) తొడగడం మంచిది. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం కవర్ అయ్యేలా చేసే బ్రిమ్ హ్యాట్స్తో పాటు వీలైతే సన్‌గ్లాసెస్ కూడా వాడుకోవడం మంచిది. ఎండలోకి వెళ్లడానికి అరగంట ముందుగా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్పీఎఫ్) ఎక్కువగా ఉన్న మంచి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అలా ప్రతి మూడు గంటలకు ఓసారి రాసుకుంటూ ఉండాలి. ఈదేటప్పుడు, చెమట పట్టినప్పుడు రాసుకునేందుకు వీలుగా కొన్ని వాటర్ రెసిస్టాంట్ సన్‌స్క్రీన్ క్రీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సన్‌స్క్రీన్స్ ఎంచుకునే ముందర ఒకసారి చర్మవ్యాధి నిపుణలను సంప్రదించి తమకు సరిపడే ఎస్పీఎఫ్ను తెలుసుకుని వాడటం మంచిది. డీ–హైడ్రేషన్ నివారించడానికి నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తాగుతుండాలి. డా. వై. అరుణ కుమారి, సీనియర్ డెర్మటాలజిస్ట్ (చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్‌కి చేరుస్తాయంటే ఇదే..!)

మండే ఎండలతో ముప్పు తోటల సంరక్షణ ఎలా?
ఏటేటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో పండ్లు, కూరగాయలు, పూల తోటలకు ప్రతి వేసవీ పెను సవాలుగా మారుతోంది. 2024వ సంవత్సరంలో ప్రతి నెలా గత 190 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2025లో గడచిన మూడు నెలల తీరూ అంతే. సాధారణం కన్నా 4–5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకావటం మార్చిలోనే అనుభవంలోకి తెచ్చింది ఈ సంవత్సరం. ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ ధరావత్ అధిక ఉష్ణోగ్రతల నుంచి వివిధ ఉద్యాన తోటల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను సవివరంగా తెలియజేస్తున్నారు.మామిడి→ ప్రస్తుతం కాయలు వివిధ దశల్లో అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల వేసవిలో స్థిరమైన, తగినంత నీటి సరఫరా ఇవ్వాలి. → 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మామిడి చెట్లకు బిందుసేద్యం ద్వారా రోజుకు 4 నుంచి 5 గంటలు నీరు అందించాలి. → సాధారణ పద్ధతిలో నేల లక్షణాల ఆధారంగా 7 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటిని అందించాలి. → పండ్లకు కాగితపు సంచులు కడితే వేడి నుంచి రక్షించుకోవటానికి సహాయపడుతుంది. → నీటి యాజమాన్యం సరిగ్గా అమలు చేయకపోతే పండ్ల తొడిమె భాగంలో అబ్షిషన్ పొరలు ఏర్పడి పండ్లు రాలిపోవడానికి కారణమవుతాయి. → చెట్ల పాదులకు పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన (సేంద్రియ మల్చ్) ఏర్పాటు చేయాలి. → పొడి వాతావరణంలో తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫి్రపోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. → పండు ఈగ నివారణకు లింగ ఆకర్షక బుట్టల ఉచ్చులను ఉపయోగించాలి. → గోలికాయ దశలో మామిడి కాయలు ఉన్నప్పుడు జిఎ3 (50 పిపిఎం) ఒక లీటరు నీటికి 50 మిల్లీ గ్రాములు కలిపి పిచియారీ చేయటం ద్వారా రాలే కాయలను 15% తగ్గించుకోవచ్చు.ద్రాక్ష→ ప్రతి రోజూ కనీసం చెట్టుకు 6–8 లీటర్ల నీటిని అందించాలి. ∙పందిళ్లపై షేడ్‌నెట్స్ వేస్తే, ద్రాక్ష గుత్తులపై సూర్యరశ్మి పడకుండా చేయవచ్చు.ఆయిల్ పామ్→ ముదురు ఆయిల్ పామ్ చెట్లకు సుమారుగా ఒక రోజుకు గాను ఏప్రిల్ నెలలో 250–300 లీటర్లు, అదేవిధంగా మే నెలలో 300–350 లీటర్ల నీరు అందించాలి. → సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. ‘ఇసారియా ఫ్యూమాజోరోజియా’ జీవ శిలీంధ్ర నాశనిని వాడి సమర్థవంతంగా అరికట్టవచ్చు.→ కత్తిరించిన ఆకులను, మగ గెలలను, ఖాళీ గెలలను మొక్క మొదళ్లలో మల్చింగ్ వలె పరచాలి. తద్వారా నేలలోని నీటి తేమను కాపాడుకోవచ్చు.అరటి→ ఎండిన అరటి ఆకులు, వరి గడ్డి, మొక్కజొన్న గడ్డిని మల్చింగ్గా వేసి మొక్క మొదళ్లలో నీటి తేమను కాపాడాలి. → వేసవిలో నేరుగా సూర్యరశ్మి గెలలపై పడటం వలన గెలలు మాడిపోతాయి. తద్వారా వివిధ తెగుళ్లు ఆశించి కాయ / గెల కుళ్లిపోతుంది. కావున, నేరుగా సూర్యరశ్మి గెలలపై పడకుండా పక్కనే ఉన్న ఆకులను గెలలపై కప్పి గెల నాణ్యతను కాపాడాలి. → వెదురు / సర్వి /సుబాబుల్ వంటి కర్రలను వాడి అరటి చెట్టు కాండానికి ఊతం అందించాలి. లేదా టేపులను నాలుగు వైపులా కట్టాలి. తద్వారా వేసవి వడ గాలులకు అరటి చెట్లు పడిపోకుండా చూసుకోవచ్చు.కొబ్బరి→ పూత, కాత వస్తున్న చెట్లకు సుమారుగా 50–60 లీటర్ల నీటిని అందించాలి.→ సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. దీని నివారణకు వేప నూనె (10,000 పిపిఎం) 2 మిల్లీ లీటర్లు / లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. 10–15 రోజుల అనంతరం ఇసారియా ఫ్యూమారోజియా అనే జీవ శిలీంధ్ర నాశినిని ఆకుల కింద భాగం తడిచేలా పిచికారీ చేస్తే పురుగు ఉధృతిని సమర్థవంతంగా నివారించవచ్చు. → పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడి నేలలోని నీటి తేమను కాపాడాలి.కూరగాయ తోటల రక్షణ ఎలా?టమాట→ అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా కాయలు/ పండ్లలో పగుళ్లు వస్తాయి. ఎండ దెబ్బ తగలటం వల్ల నాణ్యతలేని పండ్ల దిగుబడికి దారితీస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో టమాటలో ఆకుముడత తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. → నీడనిచ్చే వస్త్రాలతో షేడ్‌నెట్ ఏర్పాటు చేసుకుంటే మొక్కలకు సూర్యకాంతి పడటం తగ్గుతుంది. నేల ఉష్ణోగ్రత, గాలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. → నేల తేమను నిలుపుకోవడానికి, నేల ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను తగ్గించడానికి మొక్క చుట్టూ వెండి రంగు ప్లాస్టిక్ మల్చింగ్ లేదా గడ్డిని వేయాలి. → అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల సమయంలో నేల తేమను త్వరగా కోల్పోతుంది. మొక్కలు ఆకుల ద్వారా తేమను బయటకు వదిలే ప్రక్రియ (బాష్పీభవనం) ద్వారా కోల్పోయిన తేమను తిరిగి పొందడానికి తగినంత, తరచుగా నీటిని అందించాలి. → వేడిగాలుల సమయంలో తగినంత పోషకాలను అందించాలి. సంక్లిష్ట ఎరువుల (19–19–19 లేదా 13–0–45)తో పాటు సూక్ష్మపోషక మిశ్రమాలను 3–5 రోజుల వ్యవధిలో రెండుసార్లు లీటరుకు 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేస్తే కూరగాయ పంటలు వేడి ఒత్తిడిని తట్టుకుంటాయి.→ బాష్పీభవనం తగ్గించడానికి కయోలిన్ 3–5% (30–50 గ్రా./లీ.) పిచికారీ చేయాలి. → వడలు తెగులు నియంత్రణ కోసం లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్‌తో నేలను తడపాలి. → వైరస్ తెగుళ్ల నివారణకు వ్యాధిసోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చ అట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించిన ప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనెతో పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి లీటరు నీటికి ఫి్రపోనిల్ను 0.2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ను 0.3 మి.లీ. మోతాదులో కలిపి పిచికారీ చేయాలివంగ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వంగ పంటను మొవ్వు, కాయతొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంది. → వీటి నియంత్రణకు ఎకరానికి 08–10 లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసి, నివారణ చర్యగా లీటరు నీటికి 3 మి.లీ. చొప్పున వేప నూనె (10,000 పిపిఎం)ను కలిపి పిచికారీ చేయాలి. → పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఫ్లూబెండియామైడ్ మందును 0.25 మి.లీ. లేదా ఇమామెక్టిన్బెంజోయేట్ మందును 0.4 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.బెండ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బెండకాయలో పల్లాకు తెగులు వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉన్నాయి. → వ్యాధి సోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చఅట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించినప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్‌ను 0.3 మి.లీ. లేదా డయాఫెంథియురాన్ను 1.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253కూరగాయలు : డా. డి. అనిత –94401 62396పూలు : డా. జి. జ్యోతి – 7993613179ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కలు:కృష్ణవేణి – 9110726430పసుపు : మహేందర్ : 94415 32072మిర్చి : నాగరాజు : 8861188885
ఫొటోలు


'కోర్ట్' బ్యూటీ జర్నీ.. కాకినాడ నుంచి మెగాస్టార్ ఇంటివరకు (ఫొటోలు)


గ్రాండ్‌గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు (ఫోటోలు)


పాలరాతి శిల్పంలా మిల మిల మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ (ఫోటోలు)


ఏపీలో ఈ కోదండరామాలయం ఎంతో ప్రసిద్ధి.. ఎక్కడో తెలుసా? (ఫొటోలు)


వైట్ శారీలో అట్రాక్ట్ చేస్తున్న తెలుగు ముద్దుగుమ్మ దివి వద్త్య (ఫోటోలు)


‘సారంగపాణి జాతకం’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)


టిక్ టాక్ వీడియోలతో ఫేమస్..హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న దీపికా పిల్లి (ఫొటోలు)


గార్దభాలను బండ్లకు కట్టుకుని గుడి చుట్టూ బురదలో ప్రదర్శన (ఫొటోలు)


నంద్యాల : ప్రేమ కోసం పిడకల యుద్ధం..ప్రేమదే విజయం (ఫొటోలు)


'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
International

ట్రంప్ మూడో ముచ్చట తీరేనా?
‘మూడోసారి కూడా అధ్యక్షుడు కావాలనుకుంటున్నా. నేనేమీ జోక్ చేయడం లేదు. సీరియస్‌గానే చెప్తున్నా. నన్ను మూడోసారి కూడా అధ్యక్షునిగా చూడాలని అమెరికన్లలో చాలామంది కోరుకుంటున్నారు’ – రెండోసారి అధ్యక్షుడై మూడు నెలలైనా నిండకముందే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మూడో టర్ము గురించిన ఆకాంక్షలను వెలిబుచ్చడం ఆయనకు ఇది తొలిసారేమీ కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం గత జనవరిలో కూడా, ‘ఒకట్రెండు సార్లు మాత్రమే కాదు, మూడు, ఇంకా చెప్పాలంటే నాలుగుసార్లు కూడా దేశానికి సేవ చేయడం నాకు అత్యంత గౌరవప్రదమైన విషయం’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతించదని తెలిసీ ట్రంప్ ఎందుకిలాంటి ప్రకటన చేశారన్నది ఆసక్తికరం. మనసుంటే మార్గముంటుందన్నట్టు, ‘మూడో’ముచ్చట తీర్చుకునేందుకు ట్రంప్‌కు అవకాశముందని అభిమానులు చెబుతున్నారు. అందుకే అంత బాహాటంగా ఆ ప్రకటన చేశారంటున్నారు. అదెంతవరకు సాధ్యమన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అంతేగాక ట్రంప్ యోచనకు అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి. అవేమిటంటే...రాజ్యాంగాన్ని సవరించాలి అమెరికా రాజ్యాంగానికి చేసిన 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడానికి వీల్లేదు. అంతేకాదు. ఏ కారణాలతోనైనా రెండేళ్లు, అంతకంటే ఎక్కువకాలం అధ్యక్షునిగా చేసినా సరే, ఈ సవరణ ప్రకారం వారు మరొక్కసారి మాత్రమే తిరిగి ఎన్నిక కావచ్చు. ఈ లెక్కన ట్రంప్ కోరిక నెరవేరాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ అది అత్యంత కష్టసాధ్యం. ఎందుకంటే ఆ సవరణను కాంగ్రెస్ ఉభయ సభలూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాలి. ఆ మీదట మూడొంతుల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదముద్ర వేయాలి. కానీ అధికార రిపబ్లికన్లకు కాంగ్రెస్‌లో అంతæ మెజారిటీ లేదు. పైగా 50 రాష్ట్రాల్లో 18 విపక్ష డెమొక్రాట్ల చేతుల్లోనే ఉన్నాయి.‘ఉపాధ్యక్ష’దారిలో... అధ్యక్ష పదవికి రెండుకంటే ఎక్కువసార్లు ‘ఎన్నిక’కావడాన్ని మాత్రమే 22వ సవరణ నిషేధిస్తోంది. వారసత్వంగా ఆ పదవిని పొందే విషయంపై మాత్రం అందులో ఎలాంటి ప్రస్తావనా లేదు. దీన్ని ట్రంప్ తనకు అనుకూలంగా వాడుకోనున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు! ‘‘ఏ కారణంతోనైనా అధ్యక్షుడు రాజీనామా చేస్తే నిబంధనల ప్రకారం ఆ పదవి ఉపాధ్యక్షునికే దక్కుతుంది. కనుక 2028లో ట్రంప్ ఉపాధ్యక్ష బరిలో దిగుతారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారు. గెలిస్తే వెంటనే రాజీనామా చేస్తారు. తద్వారా ట్రంప్ ఆటోమేటిగ్గా మూడోసారి అధ్యక్షుడైపోతారు’’అంటున్నారు. ఈ ఆలోచన తన మనసులో ఉందని ట్రంప్ అంగీకరించారు కూడా. కానీ దీనిపై భిన్న వాదనలున్నాయి. ఇది అసాధ్యమని యూనివర్సిటీ ఆఫ్ నోర్టెడామ్లో ఎన్నికల నిబంధనల నిపుణుడైన ప్రొఫెసర్ డెరెక్ ముల్లర్ చెబుతున్నారు. ‘‘అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అర్హత లేని వ్యక్తి ఉపాధ్యక్ష పదవికి కూడా పోటీ పడేందుకు కూడా అనర్హుడేనని 12వ రాజ్యాంగ సవరణ స్పష్టం చేస్తోంది. 2028లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడు గనుక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కూడా అనర్హుడే అవుతారు’’అని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ కాకుండా ఒకవ్యక్తి మూడుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని రిపబ్లికన్ నేత ఆండీ ఓగ్లెస్ గత జనవరిలో ప్రతిపాదించారు. అంతగా అయితే ఆ మూడుసార్లు వరుసగా కాకుంటే చాలంటూ ఓ నిబంధన విధిస్తే సరిపోతుందని సూచించారు.9 మంది గెలవకుండానే అధ్యక్ష పీఠమెక్కారుఅమెరికా చరిత్రలో ఏకంగా 9 మంది ఉపాధ్యక్షులు ఎన్నికల పోరులో గెలవకుండానే అత్యున్నత పీఠమెక్కారు. అధ్యక్షుని మరణం, లేదా రాజీనామా వల్ల తాము అధ్యక్షులయ్యారు. వయసు అనుమతించేనా? మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు వయసు కూడా ట్రంప్‌కు అడ్డంకిగానే మారేలా కన్పి స్తోంది. ఆయనకిప్పటికే 78 ఏళ్లు. ఆ లెక్కన ఈ పదవీ కాలం ముగిసేసరికి 82 ఏళ్లకు చేరుకుంటారు. ఆ వయసులో తిరిగి ఎన్నికల బరిలో దిగాల్సి ఉంటుంది. అదెంత వరకు సాధ్యమన్నది కాలం గడిస్తే గానీ తేలదు.వద్దే వద్దు: డెమొక్రాట్లు ట్రంప్ మూడో టర్ము వ్యాఖ్యలను విపక్ష డెమొక్రాటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ‘‘ఇటువంటి ఆలోచనలతో ప్రజాస్వామ్యానికి ఆయన మరింతగా తూట్లు పొడుస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైతేనే ప్రపంచమంతటినీ ఇంతటి గందరగోళంలోకి నెట్టేస్తున్న ఆయన మూడోసారి గద్దెనెక్కేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ ప్రతినిధులకు రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసమున్నా ట్రంప్ మతిలేని మూడో టర్ము ఆకాంక్షలను తక్షణం బాహాటంగా ఖండించాలి’’అని డిమాండ్ చేసింది. రిపబ్లికన్లలో కూడా కొందరు మూడో టర్ము సరైన యోచన కాదంటున్నారు. ఈ ఆలోచనకు తానసలే మద్దతివ్వబోనని ఓక్లహామీ సెనేటర్ మార్కవైన్ ములిన్ ఇటీవలే చెప్పారు.రూజ్వెల్ట్ నాలుగుసార్లు! రెండు కంటే ఎక్కువసార్లు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ఏకైక నేతగా ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ నిలిచిపోయారు. 32వ అధ్యక్షునిగా 1933లో తొలిసారి గద్దెనెక్కిన ఆయన 1945లో మరణించేదాకా పదవిలోనే కొనసాగారు! అత్యధిక కాలం పాటు అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా ఆయనదే. అధ్యక్ష పదవిని రెండుసార్లకు మించి చేపట్టరాదన్న సంప్రదాయాన్ని అమెరికా మొదటినుంచీ పాటిస్తోంది. దీనికి బాటలు వేసింది తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టనే. ఆయన వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడోసారీ అధ్యక్షుడు కావాలని దేశమంతా కోరినా సున్నితంగా నిరాకరించి తప్పుకున్నారు. అప్పటినుంచి అందరు అధ్యక్షులూ అనుసరిస్తూ వస్తున్న ఆ సంప్రదాయాన్ని రూజ్వెల్ట్ మాత్రం అతిక్రమించారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని, హిట్లర్ సారథ్యంలో నాజీల దూకుడును బూచిగా చూపిస్తూ 1940, 1944 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మరో రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. అయితే 1944లో నాలుగోసారి బరిలో దిగేనాటికే రూజ్వెల్ట్ ఆరోగ్యం క్షీణించింది. 1945లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే మరణించారు. అనంతరం రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టకుండా 1951లో 22వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్

5 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగింది
అపారమైన మంచు నిల్వలకు గ్రీన్లాండ్ ఆలవాలం. ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 8 శాతం అక్కడే ఉందని అంచనా. అలాంటి గ్రీన్లాండ్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు! 1992లో మొదలైన ఈ ధోరణి ఏటా అంతకంతకూ పెరుగుతూనే వస్తోందట. ఆ లెక్కన గత 28 ఏళ్లలో అక్కడ ఏకంగా 5 లక్షల టన్నుల మంచు మాయమైపోయిందట! గ్రీన్‌లాండ్‌పై గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై చేపట్టిన అధ్యయనంలో సైంటిస్టులు ఈ మేరకు తేల్చారు. ఇది ఒక్క గ్రీన్‌లాండ్‌కే పరిమితం కాదని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) తెలిపింది. ‘‘మొత్తమ్మీద ధ్రువాల వద్ద మంచు కరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇది చాలా ఆందోళనకర పరిణామం’’అని ఆందోళన వెలిబుచి్చంది. అక్కడ మంచు ఈ స్థాయిలో కరిగిపోవడానికి నిర్దిష్ట కారణాలేమిటో తేల్చే పనిలో పడింది. అక్కడినుంచి ఆవిరవుతున్న నీరు ఎటు వెళ్తోందో తెలియడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు అక్కడి నీటి ఆవిరిని డ్రోన్ల సాయంతో సేకరించి పరిశోధిస్తున్నారు. ఇందుకోసం భూ ఉపరితలం నుంచి 5,000 అడుగుల ఎత్తు దాకా వివిధ స్థాయిల్లో నీటి ఆవిరిని పలు దఫాలుగా సేకరించారు. ‘‘ఆవిరయ్యే నీటిలో ఎంతోకొంత తిరిగి మంచుగా మారి అక్కడే పడుతుంది. కానీ చాలావరకు మాత్రం గ్రీన్లాండ్ జలవ్యవస్థకు శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతోంది. ఇదే ఆందోళన కలిగించే విషయం’’అని అధ్యయనానికి సారథ్యం వహించిన కెవిన్ రోజి్మయారెక్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్

ఓ పెద్ద మనిషి.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. నిన్ను ఎవరు బాధించారు?
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు బ్రియాన్ జాన్సన్‌పై భారత వైద్యుడు సంచలన ఆరోపణలు చేశారు. ‘ది లివర్ డాక్' అనే ఇంటర్నెట్ పేరుతో ప్రసిద్ధి చెందిన కేరళకు చెందిన వైద్యుడు సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు . బ్రియాన్ చెప్పేదంతా అబద్ధమని, ఇది ప్రజల్ని మోసగించే చర్య అంటూ ధ్వజమెత్తారు.‘ప్రజలు దానివైపు వెళ్లొద్దు. అదొక భయానకమైన విధానమే కాదు.. మోసపూరితం కూడా. అత్యంత ఖరీదైనదే కాదు.. ఉపయోగం లేనిది కూడా. బ్లూ ప్రింట్ పేరుతో బ్రయాన్ చేస్తున్నదంతా పచ్చి మోసం. ప్రమాదకరమైన స్నేక్ ఆయిల్స్ ను తన ప్రయోగాల్లో బ్రయాన్ జాన్సన్ వాడుతున్నాడు’ అంటూ ఫైరయ్యాడు.తన రక్త పరీక్ష సంస్థ థెరానోస్ కు సంబంధించిన కేసులో దోషిగా తేలిన అమెరికన్ బయోటెక్నాలజీ పారిశ్రామికవేత్త ఎలిజబెత్ ఏన్ హోమ్స్, ఆస్ట్రేలియన్ ఇన్ ఫ్లూయెన్సర్ బెల్లె గిబ్సన్లతో బ్రయాన్ జాన్సన్ ను పోల్చాడు అబ్బీ ఫిలిప్స్. నిన్న(ఆదివారం) అబ్బీ ఫిలిప్ప్ ఈ ఆరోపణలు చేయగా, తాజాగా బ్రయాన్ జాన్సన్ మాత్రం సుతిమెత్తాగా స్పందించాడు. అబ్బీ ఫిలిప్స్ చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వకుండా.. ‘ నీకు ఏమైంది.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. ఎవరు నిన్ను బాధించింది?’ అంటూ రిప్లే ఇచ్చారు బ్రయాన్ జాన్సన్.అసలు బ్రయాన్ జాన్సన్ కథేంటి..?వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడే బ్రియాన్ జాన్సన్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో వార్తల్లో నిలిచిన వ్యక్తి. దీని కోసం కోట్లక్దొదీ డబ్బుని ఖర్చు చేస్తున్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అతడు ఆ ప్రయోగాల్లో సక్సెస్ అందుకుంటాడో లేదా గానీ బ్రయాన్ తనపై చేసుకునే ప్రయోగాలు ఊహకందని విధంగా భయానకంగా ఉంటాయి. ఇంతకుముందు ప్లాస్మా, తన కొడుకు రక్తం ఎక్కించుకోవడం వంటి వాటితో హడలెత్తించాడు. ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో ఆరోగ్యం తోపాటు వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఏకంగా తన కార్యాలయాన్నే హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్‌గా మార్చేశారు. ఇలా ప్రయోగాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు బ్రయాన్ జాన్సన్. It is terrifying that people do not see Bryan Johnson as actually a well-evolved masculine form of fraudsters Elizabeth Holmes and Belle Gibson, selling both expensive and utterly useless investigations and peddling potentially dangerous snake oil supplements in the name of… pic.twitter.com/qjts5KKXTF— TheLiverDoc (@theliverdr) March 30, 2025 Cyriac why are you so angry? Who hurt you?Blueprint offers extra virgin olive oil, proteins, nuts, and nutrients which have independent and robust scientific evidence. They are third party tested. The certificates of analysis are publicly available. They are affordably priced.— Bryan Johnson (@bryan_johnson) March 30, 2025

భూకంప శిథిలాల నుంచి కీలక పత్రాల చోరీ?
బ్యాంకాక్: థాయ్‌లాండ్ భూకంప సహాయక చర్యల్లో.. కొత్త కోణం వెలుగు చూసింది. రాజధాని బ్యాంకాక్(Bangkok Building Collapse)లోని 33 అంతస్థుల భవనం కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రమాద స్థలి నుంచి కొన్ని పత్రాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు కొందరు ప్రయత్నించగా.. సహాయక బృందాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేయగలిగారు. అయితే ఆ ఐదుగురు చైనాకు చెందిన వాళ్లు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. చైనా(China)కు చెందిన రైల్వే నంబర్ 10 కంపెనీ 2018లో థాయ్‌లాండ్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. హౌజింగ్ సొసైటీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఇతర బడా కాంట్రాక్టులను ఈ కంపెనీ స్థానిక కంపెనీలతో జాయింట్ వెంచర్‌గా నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో థాయ్‌లాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం కోసం సుమారు 58 బిలియన్ డాలర్లతో మూడేళ్ల కిందట పనులు చేపట్టారు.తాజా భూకంపం(Earthquake) ధాటికి నిర్మాణంలో ఉన్న ఆ భవనం కుప్పకూలిపోగా.. శిథిలాల నుంచి ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇంతకంటే ఎక్కువ ఎత్తులో భవనాలకు ఏం కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డిజైనింగ్‌లో లోపాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాల నడుమే.. థాయ్‌లాండ్ ఉప ప్రధాని అనుతిన్ చార్న్విరాకుల్ సైతం ప్రమాద స్థలిని సందర్శించి దర్యాప్తునకు ఆదేశించారు. ఈలోపు.. ఈ భవనం నిర్మాణానికి సంబంధించిన పత్రాలను దొంగిలించేందుకు యత్నాలు జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. భవన శిథిలాల వద్దకు ఆదివారం ఐదుగురు వ్యక్తులు అనుమతి లేకుండా లోనికి ప్రవేశించారు. శిథిలాల నుంచి కొన్ని పత్రాలను తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా రెస్క్యూ టీంలు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పజెప్పాయి. వారిని ప్రశ్నించగా.. చైనా దేశస్థులని తెలిసింది. అయితే.. అందులో ఒకరు తాను ప్రాజెక్ట్ మేనేజర్ అని, బీమా క్లెయిమ్ చేసుకోవడం కోసం సంబంధిత పత్రాలు తీసుకెళ్లేందుకు వచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఈ కంపెనీ ‘నాసిరక నిర్మాణాల’తో వార్తల్లోకి ఎక్కింది. అయితే ఆయా ఘటనలతో ప్రమాదవశాత్తూ ప్రాణాలు మాత్రం పోలేదు. అయినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలను ఈ చైనా కంపెనీకి అప్పగించడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక శుక్రవారం మధ్యాహ్నాం మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి.. పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోనూ భారీగా భూమి కంపించింది. రాజధాని బ్యాంకాక్‌లో పలు భవనాలు కుప్పకూలిపోవడంతో.. ఇప్పటిదాకా 18 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.
National

గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురి మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పథార్ ప్రతిమా మండలంలోని ధోలాహట్ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఓ నివాసంలో సోమవారం రాత్రి 9గం. ప్రాంతంలో సిలిండర్ పేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసి.. సహాయక చర్యలు చేపట్టారు. ఏడు మృతదేహాలను బయటకు తీసుకురావడంతో పాటు గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో బాణాసంచా తయారీ కేంద్రం నడుపుతున్నారేమోననే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్యాస్ సిలిండర్లు ఒకేసారి పేలాయని.. బాణాసంచా కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. #Breaking: 7 people, including 4 children, killed in a gas cylinder blast at Pathar Pratima in Bengal''s South 24 Parganas district.#WestBengal #South24Parganas #CylinderBlast #Blast pic.twitter.com/JC3togdyt5— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) March 31, 2025

ఇద్దరు యువతులతో ప్రేమాయణం
యశవంతపుర: బెళగావిలో ప్రేమికుడు మోసం చేశాడనే కారణంగా యువతి రెండురోజుల కిందట ఆత్మహత్య చేసుకొంది. ప్రైవేటు హాస్టల్లో యువతి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. మొదట ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు విచారించగా ప్రేమించిన ప్రియుడు మోసం చేయడంతో విరక్తి కలిగి విజయపురకు చెందిన ఎంబీఎ పట్టభద్రురాలు ఐశ్యర్వ లక్ష్మీ గలగలి (25) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బయట పడింది. ప్రియుడు ఆకాశ్ చడచణను బెళగావి ఎపిఎంసీ పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహం వేలాడుతున్నా చూడకుండా.. ఆకాశ్ ఐశ్వర్యతో ప్రేమాయణం నడుపుతూనే మరో యువతితోనూ ప్రేమపేరుతో షికార్లు సాగించేవాడు. ఈ సంగతి ఐశ్వర్యకు తెలిసి నిలదీసినా మార్పురాలేదు. మోసపోయాననే బాధతో ఐశ్యర్వ ఉరి వేసుకొని చనిపోయింది. ఐశ్యర్వ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆకాశ్ మొబైల్‌కు ఒక సందేశం పెట్టింది. నా మరణానికి నువ్వు, నీ ప్రియురాలే కారణమని తెలిపింది. దీంతో ఆందోళన చెందిన ఆకాశ్ తక్షణం ఐశ్యర్వ ఉంటున్న పీజీ వెళ్లి తలుపులు తట్టాడు. చివరకు తలుపును పగలగొట్టి ఆమె మొబైల్‌ని ఎత్తుకెళ్లాడు. ప్రియురాలు ఉరికి వేలాడుతున్నా కనీసం పట్టించుకోలేదు. అతడు వచ్చిన దృశ్యాలు పీజీలోని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఇద్దరి మధ్య కాలేజీ రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆకాశ్ బెళగావిలో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. ఐశ్యర్వ ఎంబీఏ పూర్తిచేసి ఇంటర్న్íÙప్ చేస్తోంది. ఆకాశ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

కన్యత్వ పరీక్షకు బలవంతం చేయరాదు
బిలాస్పూర్: కన్యత్వ పరీక్షకు చేయించుకోవాలంటూ మహిళను బలవంతం చేయరాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి చర్య రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు గుండెకాయ వంటిదైన ఆర్టికల్ 21కు విరుద్ధమంది. జీవించే హక్కుకు, గౌరవానికి భంగం కలిగించరాదని, మహిళలకు ఇది కీలకమైనది పేర్కొంది. వేరొకరితో అక్రమ సంబంధం నెరపుతున్న తన భార్యకు కన్యత్వ జరిపించేలా ఆదేశాలివ్వాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టుపై వ్యాఖ్యలు చేసింది. నపుంసకుడైన భర్తతో కలిసి జీవించలేనని ఆ మహిళ ఆరోపించగా స్పందించిన న్యాయస్థానం..ఇది అబద్ధమని రుజువు చేసుకోవాలంటూ వైద్య పరీక్షలకు సిద్దం కావాలని పిటిషనర్‌ను కోరింది. లేదా అందుకు తగిన ఆధారాలు చూపించాలంది. జనవరి 9వ తేదీన ఈ మేరకు జారీ చేసిన ఆదేశాలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ఇద్దరూ పరస్పరం చేసుకున్న ఆరోపణలకు సాక్ష్యాధారాలు అవసరమని, వాటితోనే కేసుకు ముగింపు పలకగలమని తెలిపింది. కోర్బా జిల్లాకు చెందిన వీరిద్దరూ 2023 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. భర్తతో కొన్నాళ్లు ఉన్నాక మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త నపుంసకుడని, అతడితో కలిసి ఉండలేనని ఆరోపించింది. అతడి నుంచి నెలకు రూ.20 వేల భరణం ఇప్పించాలంటూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో, ఆమె వేరొకరితో సంబంధం నెరుపుతోందని ఆరోపించిన భర్త..కన్యత్వ పరీక్ష జరిపించాలంటూ పిటిషన్ వేశాడు. కుటుంబ న్యాయస్థానం ఈ పిటిషన్‌ను కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాలతో తిరిగి కేసు కుటుంబ న్యాయస్థానానికే చేరింది.

వక్ఫ్ బిల్లుకు సర్వం సన్నద్ధం
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. బిల్లులోని కొన్ని అంశాలకు సంబంధించి ప్రజలను తప్పుదోవపట్టించి, సమాజంలో ఉద్రిక్తతలను పెంచేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింలకు ప్రయోజనాలను అందించేందుకే ఈ బిల్లును రూపొందించామన్నారు. అయితే, ముస్లింలను రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకువచ్చేందుకు జరిగే ప్రయత్నాలు దేశానికి మంచివి కావని చెప్పారు. బిల్లు చట్టం రూపంలోకి వస్తే మసీదులు, ఖబరస్తాన్‌ల వంటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. పౌరసత్వ సవరణ బిల్లు సమయంలోనూ ఇలాంటి దుష్ప్రచారమే జరిగిందని గుర్తు చేశారు. బిల్లులోని వివరాలను పూర్తిగా అధ్యయనం చేసి, ప్రభుత్వంతో చర్చలు జరపాలని మంత్రి ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు సైతం ఈ బిల్లును తొందరగా ప్రవేశపెట్టాలని తనను కోరాయని మంత్రి వివరించారు. అందుకే, సాధ్యమైనంత త్వరగా ఈ బిల్లును ఆమోదింప జేసుకోవాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, బిల్లును ప్రవేశపెట్టే తేదీ ఇంకా నిర్ణయం కాలేదని తెలిపారు. మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4వ తేదీతో ముగియనున్నాయి. బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టడంపై మంగళవారం రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. దీన్నిబట్టి చూస్తే మంగళవారం వక్ఫ్ బిల్లును మొదటగా లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలు కని్పస్తున్నాయి. ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్ట విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పలు సవరణలతో పార్లమెంట్ సంయుక్త కమిటీ ఆమోదం పొందిన బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలు ర్యాలీలు సైతం చేపట్టాయి.
NRI

ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025).

ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వెస్ట్ చెస్టర్ నగరంలో పియర్స్ మిడిల్ స్కూల్ లో నిర్వహించిన ఈ వేడుకలకు వెయ్యికి మందికి పైగా హాజరై సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు, డైనమిక్ ఫ్యాషన్ షో, స్టాల్ల్స్, రుచికరమైన విందుతో ఆరు గంటల నాన్ స్టాప్ వినోదాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదున్నర దశాబ్దాల నుండి డెలావేర్ రాష్ట్రంలోని డోవర్ నగరంలో విశేషసేవలు అందిస్తున్న ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ జానకి కాజా గారిని తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ జానకి కాజా అమెరికా వచ్చినప్పటి నుంచి అనుభవాలను వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసారు. మన జన్మభూమి భారతదేశం లాగానే కర్మభూమి అమెరికా చాలా గొప్ప దేశమని 1971 లో అమెరికా లో అడుగుపెట్టినప్పటి నుండి ఈరోజు వరకు ఆసుపత్రికి వెళ్లినా, 86 దేశాలు పర్యటించినా మన భారతీయ సంప్రదాయం మరచిపోకుండా తాను ఇప్పటికీ చీర మాత్రమే ధరిస్తానని చీర మన సాంస్కృతిక గర్వానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొంటూ మహిళల జీవితం సవాళ్లతో కూడినదని పట్టుదలతో, దృఢసంకల్పంతో అవకాశాలు అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. తానా మిడ్ అట్లాంటిక్ మహిళల బృందం ఈ కార్యక్రమం విజయవంతం కోసం అవిశ్రాంతంగా పనిచేసింది. మిడ్-అట్లాంటిక్ మహిళా కమిటీ ఛైర్ సరోజా పావులూరి నేతృత్వంలోని బృందం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. వ్యాఖ్యాత లక్ష్మి మంద ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో అలరించారు. రాజేశ్వరి కొడాలి, భవాని క్రొత్తపల్లి, సౌజన్య కోగంటి, రవీనా తుమ్మల, భవానీ మామిడి, మైత్రి రెడ్డి నూకల, నీలిమ వోలేటి , రమ్య మాలెంపాటి, బిందు లంక, దీప్తి కోకా తదితరుల కృషిని హాజరైన వారందరూ అభినందించారు.తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి తన ప్రసంగంలో మహిళలకు అభినందనలు తెలిపారు. తానా ఫౌండేషన్ మరియు ఇతర సేవా సంస్థల ద్వారా అమెరికాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మిలియన్ల డాలర్లు వెచ్చించి ఎనలేని సేవలందిస్తున్న బాబు రావు, డాక్టర్ జానకి కాజా దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డెలావేర్ మిడిల్ టౌన్ నమస్తే ఇండియా రెస్టారంట్ సహా వాలంటీర్లు మరియు క్రాస్ రోడ్స్ రెస్టారంట్, జో కేధార్, రాజన్ అబ్రహం ఇతర దాతలకు అభినందనలు తెలిపారు.2025 జూలై 3 నుంచి 5 వరకు డెట్రాయిట్లో 24వ తానా మహాసభలు జరగబోతున్నాయని తెలిపారు. అందమైన అలంకరణలకు ఫణి కంతేటి మరియు సంగీతాన్ని అందించినందుకు మూర్తి నూతనపాటి, రమణ రాకోతు, ఫోటోగ్రఫీ విశ్వనాధ్ కోగంటిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి, టీం స్క్వేర్ చైర్మన్ కిరణ్ కొత్తపల్లి, కృష్ణ నందమూరి, రంజిత్ మామిడి, గోపి వాగ్వాల, సురేష్ యలమంచి, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, రవి ముత్తు, రాజు గుండాల, శ్రీనివాస్ అబ్బూరి, సుబ్బా ముప్పా, లీలాకృష్ణ దావులూరి, జాన్ ఆల్ఫ్రెడ్, హేమంత్ ఎర్నేని, సనత్ వేమూరి, హరీష్ అన్నాబత్తిన, రంజిత్ కోమటి, సంతోష్ రౌతు, ఉత్తమ్, హేమరాజ్, రాజా గందె, నాగ రమేష్, కృషిత నందమూరి, ప్రసాద్ కస్తూరి తదితరులు ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కృషి చేశారు.

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్లను పూర్తి చేశాడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్‌లో "లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్‌లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్‌ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది. NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులున్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి -సలహా సంఘం:-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల -సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.
క్రైమ్

విరిగిన విద్యార్థిని భుజపుటెముక
‘కర్ర’ పెత్తనం.. ఆత్మకూరు: పరీక్ష కేంద్రం చీఫ్ సాగించిన ‘కర్ర’ పెత్తనం ఓ గిరిజన విద్యార్థిని ఉజ్వల భవితకు ఆటంకంగా మారింది. చీఫ్ సూపరింటెండెంట్ విచక్షణ కోల్పోయి కర్రతో కొట్టడంతో విద్యార్థిని భుజపుటెముక విరిగి చివరి పరీక్ష రాయలేక సతమతమవుతోంది. ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ‘శ్రీనివాసా! ఇదెక్కడి ‘కర్ర’పెత్తనం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వెలువడిన కథనం తెలిసిందే. ఆత్మకూరు మండలం వేపచెర్ల ఎగువతండాకు చెందిన రవినాయక్ కుమార్తె శ్రావణి స్థానిక కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లోని కేంద్రంలో ఆమె పరీక్షలు రాస్తోంది. శనివారం పరీక్ష రాస్తూ జవాబు తోచక దిక్కులు చూస్తున్న శ్రావణిని అక్కడకు చేరుకున్న ఆ కేంద్రం చీఫ్ శ్రీనివాసప్రసాద్ (ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం) కర్రతో కొట్టాడు. నొప్పి తాళలేక ఆమె విలవిల్లాడుతూ.. ‘సార్ కొట్టకండి’ అంటూ ప్రాధేయపడిన వినకుండా పదేపదే కర్రతో కొట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. పరీక్ష ముగిసిన తర్వాత కేజీబీవీకి చేరుకున్న ఆమె జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలపడంతో ఆయన ఆదివారం వచ్చి కుమార్తెకు స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. ఆ సమయంలో తాను పరీక్ష రాయనంటూ బాలిక మొండికేయడంతో మంగళవారం చివరి పరీక్ష ఒక్కటి రాయాలని తండ్రి సముదాయించడంతో సరేనని ఒప్పుకుంది. అయితే రాత్రికి నొప్పి తీవ్రత మరింత ఎక్కువ కావడంతో సమాచారం అందుకున్న రవినాయక్ సోమవారం ఉదయం కుమార్తెను అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి పిలుచుకెళ్లాడు. అనుమానం వచ్చిన వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కుడిచేతి భుజపుటెముక విరిగినట్లుగా స్పష్టంగా కనిపించింది. దీంతో శ్రావణి కుడి చేతికి కట్టు కట్టి పంపించారు. చివరి పరీక్ష రాసేందుకు వీలు కాని పరిస్థితిలో ఉన్న బాలిక దుస్థితిపై ఎంఈఓ నరసింహారెడ్డిని వివరణ కోరగా... 9వ తరగతి విద్యార్థిని సహాయకురాలిగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కాగా, శ్రీనివాస ప్రసాద్ వారం రోజుల క్రితం కూడా కురుగుంటకు చెందిన పదో తరగతి విద్యార్థినిని కొట్టారని, మరో ఇద్దరు విద్యార్థులు అత్యవసరంగా బాత్రూమ్కు వెళ్లి వస్తుండగా వారిని పరీక్ష రాయనీయకుండా దాదాపు అరగంటకు పైగా తన గదిలోనే నిలబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రావణి విషయం తెలియగానే ఆత్మకూరు వాసులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు తప్పు చేస్తే సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా ఎముకలు విరిగేలా కర్రతో కొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రంలో ఘటన పదో తరగతి పరీక్షలు రాస్తుండగా గిరిజన విద్యార్థినిని కర్రతో కొట్టిన కేంద్రం చీఫ్ ఎక్స్‌రేలో బహిర్గతమైన దుర్మార్గం

హైదరాబాద్‌లో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: మీర్పేట్లో విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. లిఫ్ట్ పేరిట ఆమెను ఎక్కించుకుని వెళ్లిన కొందరు యవకులు ఘాతుకానికి ఒడిగట్టారు.మీర్‌పేట వద్ద వాహనాల కోసం ఎదురు చూస్తున్న విదేశీయురాలిని లిఫ్ట్ వంకతో తీసుకెళ్లారు. ఆపై పహాడీషరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది. సదరు బాధితురాలు జర్మనీకి చెందిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

బస్సును ఓవర్టేక్ చేయబోయి..
హైదరాబాద్: బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పిన ఇన్నోవా వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.గుంటూరుకు చెందిన కొండేపాటి పుల్లారావు నగరానికి వచ్చి బీఎన్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నాడు. సోమవారం అతను భార్య పిల్లలతో కలిసి బైక్‌పై ఈసీనగర్ నుంచి పెద్ద చర్లపల్లి వైపుగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఇన్నోవా వాహనం బస్సును ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లారావు (32) అక్కడికక్కడే మృతి చెందగా, అతడి భార్య నాగరాణి, కుమారులు రుత్విక్, రాజేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఇన్నోవా డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.

దైవసన్నిధికి వెళుతూ... మృత్యు ఒడికి..
అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు... గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన జిడుగు సందీప్ తన తల్లిదండ్రులు మోహన్‌బాబు(57), అరుణ(50), భార్య పల్లవి, కుమార్తె సాత్విక(5), కుమారుడు షణ్ముఖ(3 నెలలు)తో కలసి కారులో కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరారు. వారి కారును పులిగడ్డ–పెనుమూడి వంతెన టోల్‌ప్లాజా మధ్య ఎదురుగా పామాయిల్ లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్‌బాబు, అరుణ, షణ్ముఖ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సాతి్వకను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మచిలీపట్నం తరలిస్తుండగా, మార్గంమధ్యలో మరణించింది. గాయపడిన పల్లవి, సందీప్‌లను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉంది. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో చిన్నారి షణ్ముఖను ఊయలలో వేసేందుకు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడటం చూపరులను కలచివేసింది.
వీడియోలు


టీడీపీ మూకల దాడిలో గాయపడి వెంకట్ రెడ్డికి పరామర్శ


HCU Issue: మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం


మీటింగ్‌కు రండమ్మా..! భజనే చంద్రబాబు విజన్


పూరి & విజయ్ సేతుపతి సినిమా ఫిక్స్.... షూటింగ్ ఎప్పటినుంచంటే..?


HCU భూముల వేలం నిలిపేయాలి : రాజ్యసభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్


విజయవాడలో ధర్నాకు దిగిన మున్సిపల్ కార్మికులు


Anjali Incident: సీసీటీవీ ఫుటేజ్ తల్లిదండ్రులకు ఎందుకు చూపించడం లేదు


భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు


కలెక్షన్స్ లో మ్యాడ్ స్క్వేర్ మ్యాజిక్.. పోటీ ఇవ్వలేకపోయిన నితిన్


ముంబై వీధుల్లో చక్కర్లు కొడ్తున్న విజయ్ & రష్మిక ..