కొరవడిన పర్యవేక్షణ | - | Sakshi
Sakshi News home page

కొరవడిన పర్యవేక్షణ

Published Sat, Mar 29 2025 12:27 AM | Last Updated on Sat, Mar 29 2025 12:27 AM

కొరవడ

కొరవడిన పర్యవేక్షణ

జిల్లాలో పెరిగిన కల్తీ నూనెలు, ఆహార పదార్థాల విక్రయాలు

తనిఖీలు చేపడుతున్నాం..

జిల్లాతో పాటు మరో రెండు జిల్లాల ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వర్తిసున్నా. షెడ్యూల్‌ ప్రకారం నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ నమూనాలు సేకరిస్తున్నాం. ప్రైవేట్‌ ఆహార విక్రయ కేంద్రాలతో పాటు హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లోనూ నమూనాలు సేకరించి నాణ్యతపై పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రతి జిల్లాలో ప్రతి నెల 25 నుంచి 30 నమూనాలు తగ్గకుండా సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆహార కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే జరిమానా తప్పదు.

– నీలిమ, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, వనపర్తి

వనపర్తి: ఆహార కల్తీ రోజురోజుకు పెరిగిపోతోంది. అందుకు అనుగుణంగా అధికారుల పర్యవేక్షణ కొనసాగడం లేదనేందుకు తాజాగా జిల్లాకేంద్రంలోని ఓ పెద్ద మార్ట్‌లో ఓ వినియోగదారుడికి కుళ్లి, బూజు పట్టి ఉన్న ఆహార పదార్థం గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఫిర్యాదుతో మేల్కొని సోదాలు నిర్వహించారు. ఊహించని విధంగా కుప్పలకొద్దీ కూళ్లిన ఆహార పదార్థాలు రిఫ్రిజిరేటర్లలో బయటపడ్డాయి. జిల్లాకు ఒక ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ లేకపోవడం ఆహార కల్తీకి ఆజ్యం పోసినట్లు అయింది. జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌కు మరో రెండు జిల్లాల అదనపు బాధ్యతలు అప్పగించడంతో పర్యవేక్షణ కొరవడిందని చెప్పవచ్చు. జిల్లావ్యాప్తంగా వేలల్లో ఆహార విక్రయ కేంద్రాలు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు ఉండగా.. కేవలం 1,200 మంది విక్రయదారులు మాత్రమే ఫుడ్‌ లైసెన్‌న్స్‌ కలిగి ఉండడం గమనార్హం.

మూడు నెలల్లో 40 కేసులు..

జిల్లావ్యాప్తంగా మూడు నెలల్లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ దాడులు నిర్వహించి నోటీసులు ఇచ్చిన ఘటనలు కేవలం 40 మాత్రమే ఉన్నాయి. వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించడానికి సమయం సరిపోవడం లేదని అధికారులు లబోదిబోమంటున్నారు. మూడు జిల్లాల్లో పర్యవేక్షణ చేయాల్సి ఉండగా.. ఒక్కో జిల్లాకు నెలకు ఏడు నుంచి ఎనిమిది రోజుల సమయం మాత్రమే కేటాయించేందుకు వెసులుబాటు లభిస్తుంది. దీంతో ప్రైవేటు ఆహార విక్రయ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, గురుకుల పాఠశాలల్లో సైతం సందర్శించి ఆహార నాణ్యతను పరీక్షించాల్సిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సమయం సరిపోవడం లేదని వాయిదాలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ హాస్టళ్లు..

జిల్లాకేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లో పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ హాస్టళ్లు వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే హాస్టళ్లు ఏర్పాటు చేస్తుండటంతో జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయనే విషయంపై అధికారులకు సైతం స్పష్టత లేకపోవడం గమనార్హం. ఏదేని అనుకొని ఘటన చోటు చేసుకున్నప్పుడు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టడం, ఫిర్యాదులు అందితేనే తనిఖీలు చేయడానికి అధికారులు అలవాటు పడ్డారన్న ఆరోపణలు లేకపోలేదు.

రూ. 50 వేల

జరిమానా..

మూడు జిల్లాలు.. ఒక్క అధికారి...

వనపర్తితో పాటు గద్వాల, నారాయణపేట జిల్లాలను ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ నీలిమనే పర్యవేక్షణ చేయాల్సి ఉంది. జిల్లా కలెక్టరేట్‌లోని డీఎస్‌ఓ కార్యాలయంలో ఒక టేబుల్‌, ఒక బీరువాను ఓ మూలన ఏర్పాటు చేసుకొని అదే కార్యాలయంగా భావించి విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా రెండు జిల్లాల్లో ఆ మాత్రం కార్యాలయాలు కూడా లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, శాంపుల్స్‌ సేకరించే అధికారి, డాటా ఎంట్రీ ఆపరేటర్‌, అటెండర్‌ మొత్తం నలుగురు సిబ్బంది ఉండాలి. కేవలం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ను మాత్రమే నియమించి మిగతా సిబ్బందిని నేటికీ కేటాయించలేదు. వేలల్లో ఆహార విక్రయ కేంద్రాలు ఉంటే.. వందల్లో లైసెన్సులు ఉన్నాయి.

ఇటీవల జిల్లాకేంద్రంలోని ఓ మార్ట్‌లో కుళ్లిన పదార్థాలు గుర్తించిన వినియోగదారులు

నోటీసులు, చిన్న మొత్తం జరిమానాలతో సరిపెడుతున్న అధికారులు

మూడు జిల్లాలకు ఒకే ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

ఇటీవల జిల్లాకేంద్రంలోని ఒక పెద్ద మార్ట్‌లో కుళ్లిన ఆహార పదార్థాలు పట్టుబడగా.. రూ.50 వేల జరిమానా విధించారు. మూడునెలల్లో జిల్లావ్యాప్తంగా 40 నమూనాలు సేకరించి పరీక్షలకు ల్యాబ్‌కు పంపించామని. వాటిలో కల్తీ నిర్ధారణ అయితే వారికి సైతం జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కొరవడిన పర్యవేక్షణ 1
1/1

కొరవడిన పర్యవేక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement