రెగ్యులర్‌ ‘రగడ’..! | - | Sakshi
Sakshi News home page

రెగ్యులర్‌ ‘రగడ’..!

Published Tue, Apr 8 2025 6:59 AM | Last Updated on Tue, Apr 8 2025 6:59 AM

రెగ్య

రెగ్యులర్‌ ‘రగడ’..!

మాకు న్యాయం చేయాలి..

ప్రభుత్వం జీఓ నంబర్‌ 21ని వెంటనే రద్దు చేయాలి. ఇచ్చిన హామీలో భాగంగా డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. కానీ పీయూలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించలేదు. ఇదెక్కడి న్యా యం? ప్రభుత్వం ఇప్పటికై నా పీయూలో కాంట్రాక్ట్‌ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించేలా న్యాయం చేయాలి. ఆ తర్వాత మిగిలిన పోస్టులను రెగ్యులర్‌ ప్రతిపాదికన భర్తీ చేయాలి. – రవికుమార్‌,

పీయూ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

ఆందోళనలు తీవ్రతరం చేస్తాం

యూనివర్సిటీ ప్రారంభం నుంచి లెక్చరర్లుగా విధు లు నిర్వర్తిస్తున్నాం. అయి నా ఎలాంటి ఉద్యోగ భద్ర త లేకుండా పోయింది. 2016లో రెగ్యులర్‌ పోస్టు ల్లో సీనియర్లను పక్కన బెట్టి భర్తీ చేశారు. ఉద్యోగ విరమణకు దగ్గరగా వస్తున్నాం. వెంటనే ప్రభుత్వం జీఓ 21ను రద్దు చేసి క్రమబద్ధీకరించాలి. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నిరసనలు తీవ్రతరం చేస్తాం. – భూమయ్య, పీయూ టీచర్స్‌

అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..

కాంట్రాక్ట్‌ అధ్యాపకుల స మస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితి వస్తే కొత్త కోర్సులు, పీజీ సెంటర్లలో సర్దుబాటు చేస్తాం. ఎవరిని తొలగించాలనే ఉద్దేశం లేదు. కాంట్రాక్ట్‌ అధ్యాపకులందరికీ న్యాయం చేసేలా నా వంతు కృషి చేస్తా.

– శ్రీనివాస్‌, వీసీ, పాలమూరు యూనివర్సిటీ

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : పాలమూరు యూ నివర్సిటీలో లొల్లి రాజుకుంది. విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల శాశ్వత భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 21 కాంట్రాక్ట్‌, పార్ట్‌ టైం లెక్చరర్లలో అలజడి సృష్టిస్తుండగా.. రగడ మొదలైంది. దశలవారీగా తమను తొలగించేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊ రుకునేది లేదని.. తమను క్రమబద్ధీకరించిన తర్వా తే శాశ్వత నియామకాలు చేపట్టాలంటూ సోమవా రం వారు ప్రత్యక్ష పోరుకు శ్రీకారం చుట్టారు.

త్వరలో 22 పోస్టులకు నోటిఫికేషన్‌..

యూనివర్సిటీలో ప్రస్తుతం 16 మంది రెగ్యులర్‌ అ ధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరితో పాటు 93 మంది కాంట్రాక్ట్‌, 60 మంది పార్ట్‌టైం ప్రతిపాదికన విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలా మంది ఉ ద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. పీయూలో మొ త్తం 58 రెగ్యులర్‌ పోస్టులు కాగా.. గతంలో 16 భర్తీ చేశారు. మిగతావి భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో కనీసం 22 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ ఇచ్చి.. భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీయూ లో ప్రభుత్వం రెగ్యులర్‌ అధ్యాపకులను నియమిస్తే.. ఆయా విభాగాల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

గత తొలగింపుల నేపథ్యంలో..

పీయూలో చివరిసారిగా 2014లో రెగ్యులర్‌ అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయితే భర్తీ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురయ్యా యి. ఎట్టకేలకు 2016లో రెగ్యులర్‌ అధ్యాపకుల నియామకాలు జరిగాయి. ఆంగ్ల విభాగంలో ఇద్దరు, తెలుగులో ముగ్గురు, కెమిస్ట్రీ, కామర్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, మైక్రోబయాలజీ విభాగాల్లో ఒక్కొక్కరిని చొప్పున మొత్తం తొమ్మిది మంది అధ్యాపకులను తీసుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులను తొలగించారు. దీంతో సీనియర్‌ కాంట్రాక్ట్‌ అధ్యాపకుడు భూమయ్య తదితరులు ఆందోళనలు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును సైతం ఆశ్రయించారు. ప్రస్తుతం రెగ్యులర్‌ ప్రాతిపాదికన అధ్యాపక పోస్టు ల భర్తీకి రంగం సిద్ధమవుతుండడం.. గతంలో జరిగిన తొలగింపుల నేపథ్యంలో కాంట్రాక్ట్‌ లెక్చరర్లు అభద్రతా భావానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది.

అనుభవానికి వెయిటేజీ ఇస్తున్నా..

నూతనంగా నియామకాలను మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో 50 మార్కులు.. వీసీ, ఉన్నత విద్యామండలి సభ్యుడు, బోర్డు ఆఫ్‌ స్డడీస్‌ చైర్మన్‌, హెచ్‌ఓడీ కన్వీనర్‌గా ఉండే స్క్రూట్నీ కమిటీ పలు కొలమానాల ఆధారంగా మార్కులు కేటా యించనుంది. రెండో దశలో మొత్తం 30 మార్కు లు.. ఇందులో బోధనానుభవం ఉన్న వారికి ఏడాది కి ఒక్క మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు, డెమోకు 10 మార్కులు, పుస్తక రచన, రీసెర్చ్‌ ఫెల్లో షిప్‌ ఇలా మొత్తం 10 మార్కులు కేటాయించనున్న ట్లు సమాచారం. మూడో దశలో ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించనున్నారు. మొత్తంగా 100 మార్కులకు సంబంధించి అత్యధిక మార్కులు సా ధించిన వారికి మాత్రమే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. నియామకాల్లో అనుభవానికి వెయిటేజీ ఇస్తు న్న క్రమంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు మేలు జరిగే అవకాశం ఉంది. అయితే అంతా సవ్యంగా జరుగుతుందా? గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని.. తమకు న్యాయం జరిగే వ రకు పోరాటం చేస్తామన్నారు. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే మిగిలిన పోస్టులను రెగ్యులర్‌ ప్రా తిపదికన భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పీయూలో జీఓ 21 లొల్లి

శాశ్వత నియామకాలపై కాంట్రాక్ట్‌,

పార్ట్‌ టైం అధ్యాపకుల్లో ఆందోళన

దశల వారీగా తమను తొలగిస్తారని

బెంబేలు.. పోరుబాటకు శ్రీకారం

వీసీకి వినతి.. యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రభుత్వ ఉత్తర్వు కాపీల దహనం

డిగ్రీ, ఇంటర్‌ కాలేజీల్లో క్రమబద్ధీకరణ తమకు వర్తించదా అంటూ నిరసన గళం

ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాం..

ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌

మేమెందుకు అర్హులం కాదు ?

ఇటీవలి డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో అర్హత ఉన్న అధ్యాపకులను ప్రభుత్వం రెగ్యులర్‌ చేసిన విషయం తెలిసిందే. పీయూ ఏర్పాటైనప్పటి నుంచి లెక్చరర్లుగా పనిచేస్తున్నామని.. అయినా తమను క్రమబద్ధీకరించపోవడం అన్యాయమని కాంట్రాక్ట్‌, పార్ట్‌ టైం లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమెందుకు అర్హులం కాదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పీయూ వైస్‌చాన్స్‌లర్‌ శ్రీనివాస్‌, నూతన రిజిస్ట్రార్‌ రమేష్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాము ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్‌, పార్ట్‌ టైం ప్రాతిపదికన లెక్చరర్లుగా చేస్తున్నామని.. తమను రెగ్యులర్‌ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన పోస్టుల భర్త్తీ ప్రక్రియ చేపట్టాలని కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పీయూలోని అడ్మినిస్ట్రేషన్‌ భవనం వద్ద జీఓ 21 ప్రతులను దహనం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

రెగ్యులర్‌ ‘రగడ’..! 1
1/4

రెగ్యులర్‌ ‘రగడ’..!

రెగ్యులర్‌ ‘రగడ’..! 2
2/4

రెగ్యులర్‌ ‘రగడ’..!

రెగ్యులర్‌ ‘రగడ’..! 3
3/4

రెగ్యులర్‌ ‘రగడ’..!

రెగ్యులర్‌ ‘రగడ’..! 4
4/4

రెగ్యులర్‌ ‘రగడ’..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement