Crime
-
జనసేన జోగినేని మణి అరాచకం.. మహిళతో అనుచిత ప్రవర్తన
సాక్షి, వైఎస్సార్: ఏపీలో జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున ఓ మహిళను కాళ్లతో తన్ని.. తనకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, సదరు బాధితురాలు.. మణి వల్ల తమకు ప్రాణహని ఉందని పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం.. పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లి పీఎస్‌లో కేసు పెట్టిన జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున మణి.. అదే మండలం చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మహిళ రాజేశ్వరిని కాళ్లతో తన్ని దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేశాడు. అనంతరం, పత్తి రాజేశ్వరిపై దాడి చేశాడు. ఈ సందర్భంగా మణి.. తనకు పవన్ కల్యాణ్, హోం మంత్రి అందరూ తెలుసు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ చులకన చేసి మాట్లాడాడు. దీంతో, మణి వల్ల తనకు ప్రాణహాని ఉంది బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇక, జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్‌గా జోగినేని మణి కొనసాగుతున్నాడు. అంతకుముందు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శించాడంటూ పోసాని కృష్ణమురళిపై మణి కేసు పెట్టిన విషయం తెలిసిందే. అతని ఫిర్యాదు మేరకు అప్పట్లో ఆఘమేఘాలపై పోసానిని అరెస్టు చేశారు పోలీసులు. తాజగా మణి అరాచకాలను బాధితురాలు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. -
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
యశవంతపుర(కర్ణాటక): వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినఘటన బెంగళూరుని హెబ్బాళ కనకనగరలో సోమవారం సాయంత్రం జరిగింది. బషీర్ ఉల్లా, బాహర్ అస్మా(29) దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్త మరో మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు అస్మా అనుమానించింది. ఇదే విషయంపై తీవ్ర మనో వేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో అస్మా ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా మారింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు వచ్చి పరిశీలించారు. అస్మాను చంపి ఉరివేసినట్లు ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి బషీర్ ఉల్లాను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
సాక్షి, మంచిర్యాల: మది నిండా కోటి ఆశలతో అత్తారింట అడుగు పెట్టింది. కొత్త జీవితం సాఫీగా సాగిపోతుందని ఎన్నో కలలు కన్నది. అడిగిన కట్నం కంటే ఎక్కువే ముట్టజెప్పినా ఆ అత్తింటి వరకట్న దాహం తీరలేదు. కాళ్ల పారాణీ ఆరకముందే ఆ నవ వధువు కలలను కల్లలు చేస్తూ అదనపు కట్నం కోసం వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఉరేసుకుని ఊపిరి తీసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. హాజీపూర్ మండలం టీకానపల్లి గ్రామానికి చెందిన కంది కవిత, శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు శృతికి ఇదే మండలంలోని పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధి గొల్లపల్లికి చెందిన గర్షకుర్తి సాయితో గత నెల 16న వివాహం జరిపించారు. కట్నంగా రూ.5లక్షల నగదు, ఎనిమిదిన్నర తులాల బంగారం, వెండి ఆభరణాలు, వంటసామగ్రి, ఇతర కానుకలు అందజేశారు. అనుకున్న దాని కన్న ఎక్కువే ముట్టజెప్పి ఘనంగా పెళ్లి జరిపించారు.అయితే, పెళ్లి జరిగిన వారం రోజులకే శృతికి కష్టాలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త సాయి, అత్తమామలు లక్ష్మి, శంకరయ్యలు.. తనను మానసిక, శారీరక వేధింపులకు గురి చేశారు. పెళ్లికే ఆరు లక్షలు ఖర్చయిందని, ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి తీసుకురావాలని వేధించారు. వారం రోజుల క్రితం శృతి తండ్రి రూ.50వేలు సాయికి అందజేశాడు.ఇంటికి వెళ్తే బతికేది..!మరో రూ.2 లక్షల కోసం ఒత్తిడి చేయడంతో శృతి సోమవారం తండ్రికి ఫోన్ చేసింది. శృతి తల్లిదండ్రులు ఈ నెల 20న రూ.2లక్షలు ముట్టజెప్పుతామని అంగీకరించి.. తమ కూతురును ఇంటికి తీసుకెళ్తామంటే సాయి ఒప్పుకోలేదు. దీంతో ఆ రోజు రాత్రి శృతి తల్లిదండ్రులు టీకానపల్లికి వెళ్లిపోయారు. పెళ్లయిన వారం నుంచే వేధింపులు, అదనపు వరకట్నం కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి శృతి వేదనకు గురైంది. మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అత్తగారింట్లోనే స్నానాల గదిలో శృతి(21) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్నానాల గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా చనిపోయి ఉంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త సాయి, అత్తమామలు లక్ష్మి, శంకరయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. తన కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కూతురిని చంపి.. తల్లి ఉరేసుకుని..
పెద్దపల్లి రూరల్: ఉన్నత చదువులు చదివింది.. కన్నబిడ్డకు విద్యాబుద్ధులు ప్రాప్తించేలా చూడాలంటూ రెండ్రోజుల క్రితమే బాసరలోని సరస్వతీదేవి అమ్మవారి ఎదుట అక్షరాభ్యాసం చేయించింది.. ఇంతలో ఏమైందో ఏమో.. క్షణికావేశంలో కన్న కూతురినే కడతేర్చింది.. ఆపై తానూ ఉరివేసుకుంది. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో బుధవారం రాత్రి వెలుగుచూసిన ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి ఎల్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న లోక వేణుగోపాల్‌రెడ్డికి సాహితి (29)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె రితన్య (2) ఉంది. టీచర్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో.. సాహితి కూతురు రితన్యకు ఉరివేసి చంపి, తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాహితికి రాత్రి తల్లిదండ్రులు ఫోన్‌చేసినా ఎత్తలేదు. దీంతో అనుమానించి ఇరుగు పొరుగు వారితో మాట్లాడి సమాచారం తెలుసుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంటెక్ చదివిన సాహితి ఎక్కువగా ఆలోచిస్తుండేదని, సన్నగా ఉన్నాననే వేదనతో ఉండేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ బాధ తాలూకు క్షణికావేశంలోనే సాహితి.. కూతురిని చంపి, ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అక్షరాభ్యాసం చేయించి.. రెండు రోజుల క్రితమే బాసరలో చిన్నారి రితన్యతో తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. వచ్చే విద్యాసంవత్సరంలో కరీంనగర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. సాహితి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో.. భర్త వేణుగోపాల్‌రెడ్డి మంచివాడేనని స్పష్టం చేసింది. తన చావుకు ఎవరూ బాధపడొద్దని, తాను లేకుండా బిడ్డ ఎలా ఉంటుందోననే వేదనతోనే.. వెంట తీసుకెళ్తున్నానని లేఖలో పేర్కొంది. -
ఫైనాన్స్ దా‘రుణం’.. ఇల్లాలు బలవన్మరణం
భట్టిప్రోలు (కొల్లూరు): ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ఆగడాలు మితిమీరి ఇంటిపైకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడటంతో అవమాన భారం భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులో బాణావత్ గోవింద్‌నాయక్ భార్య పార్వతిబాయ్ (44)తో కలసి నివసిస్తున్నాడు. వీరు అమాయకులు. పెద్దగా చదువు రాదు. గతేడాది వీరు 5 స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో ఇంటి పత్రాలు తనఖా పెట్టి రూ.4 లక్షలు రుణం తీసుకున్నారు. రుణం మంజూరు చేసే సమయంలో రూ.లక్ష చార్జీలంటూ వసూలు చేసి, రూ.3 లక్షలు అందజేశారు. అప్పట్నుంచి లోన్ నగదు చెల్లింపులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే కొంత కాలం తర్వాత తమ ఇంటిని ఫైనాన్స్ సంస్థ వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలియడంతో నెలవారీ కిస్తీలు కట్టడం ఆపేసి.. ఆ విషయం తేల్చాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట సంస్థ ప్రతినిధులు పార్వతీబాయ్ ఇంటికి వెళ్లి ఆమెపై దౌర్జన్యం చేయడంతోపాటు, దుర్భాషలాడారు. దీంతో వారు భట్టిప్రోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంగళవారం సాయంత్రం ప్రైవేటు పైనాన్స్ సంస్థకు చెందిన వ్యక్తులు పార్వతిబాయ్ ఇంటికి వెళ్లి ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. సామగ్రి బయటకు విసిరేశారు. వంట పాత్రలతో ఆమెపై దాడికి తెగబడ్డారు. కేసు వాపసు తీసుకోవాలంటూ తీవ్రంగా హెచ్చరించి వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన పార్వతీబాయ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు తలుపులు తీసి.. ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఆగడాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
పది రోజుల్లో కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఆహ్వాన పత్రాలు పంచి.. బంధువులను కూడా ఆహ్వానించారు. అంతలోనే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆమె తల్లి తన కాబోయే భర్తతో పారిపోవడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నాలుగు నెలల క్రితం ఓ మహిళ తన కూతురు వివాహం చేసేందుకు ఓ సంబంధం చూసింది. ఓ యువకుడితో తన కుమార్తెకు పెళ్లి చేయడానికి నిశ్చయించింది. ఈ నెల 16న పెళ్లి జరగాల్సి ఉండగా.. ఆమె తల్లి తనకు కాబోయే అల్లుడితో పారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పారిపోయేటప్పుడు తన కుమార్తె వివాహం కోసం దాచిన రూ. 5 లక్షలు విలువ చేసే బంగారంతో పాటు 5.5 లక్షలకు పైగా నగదు కూడా తనతో తీసుకెళ్లింది.అయితే పెళ్లి కుదిరిన కొద్ది రోజుల తర్వాత అల్లుడు తన అత్తకు మొబైల్ ఫోన్ బహుమతిగా అందించాడు. తరుచూ ఆమెతో ఫోన్లో మాట్లాడే వాడు. పలుమార్లు అత్త ఇంటికి రావడంతో పాటు, గంటల తరబడి ఒకే గదిలో అత్తతో మాట్లాడేవాడు. ఈ క్రమంలో అల్లుడితో ప్రేమలో పడిన అత్త, పెళ్లికి మరో పది రోజులు ఉందనగా ఇంట్లోని డబ్బు, నగలు తీసుకొని, అతడితో పారిపోయింది. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీస్ అధికారి మహేష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించారు. -
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య
పాట్నా: కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) మనవరాలు సుష్మాదేవి (Sushma Devi) దారుణ హత్య కలకలం రేపుతోంది. సుష్మాదేవిని ఆమె భర్త రమేష్ సింగ్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు.గయా ఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం,గయా జిల్లా అటారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తేటువా గ్రామానికి చెందిన జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి (32),రమేష్ సింగ్ దంపతులు. 13ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. సుష్మాదేవీ వికాస్ మిత్రగా పనిచేస్తుండగా.. ఆమె భర్త రమేష్ సింగ్ ఓ వాహన యజమానిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉన్న సుష్మాను భర్త రమేష్ గన్నుతో కాల్చి చంపాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటన సమయంలో వేరే గదిలో ఉన్న పూనమ్, సుష్మా పిల్లలు పరిగెత్తుకొని రాగా రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. కాల్పులమోతతో ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.మృతురాలి సోదరి పూనమ్ కుమారి మాట్లాడుతూ..తన అక్కను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి రమేష్ తన వద్ద ఉన్న గన్నుతో కాల్చి చంపినట్లు చెప్పారు. తన అక్క మరణానికి కారణమైన రమేష్‌కు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూఈ ఘటనపై గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడారు. సుష్మాను ఆమె భర్త రమేష్ సింగ్ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందం ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమత్తం మగధ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించాం. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం’అని తెలిపారు. జితన్ రామ్ మాంఝీ ఎవరు?మనవరాలి హత్యపై గయ లోక్‌సభ ఎంపీ, సూక్ష్మ,చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ స్పందించలేదు. జితన్ రామ్ మాంఝీ బీహార్ సీఎంగా పనిచేశారు. హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ వ్యవస్థాపకుడు. -
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నిరుద్యోగులను నిండా ముంచేసింది. ఎల్‌టీడబ్ల్యూ ఐటీ బీపీఓ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దీంతో సుమారు 150 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గత పది నెలలు నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం ముప్పు తిప్పలు పెడుతోంది. జీతాలు అడిగితే దుర్భాషలాడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిబంధనలు పాటించకుండా పీఎఫ్‌లు కూడా చెల్లించని సాప్ట్ వేర్ కంపెనీ.. ఫేక్ ఇన్వాయిస్లు ఆఫర్ లెటర్స్‌తో మోసానికి పాల్పడింది. యాజమాన్యం ఆఫీస్ వదిలి వెళ్లిపోతున్నారని తెలుసుకున్న ఉద్యోగులు కార్యాలయాన్ని ముట్టడించారు. తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. -
నాలుగు రోజుల్లో నిశ్చితార్థం.. కార్యదర్శి అనుమానాస్పద మృతి
సాక్షి, నిడదవోలు: నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వార్డు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నెల్లి కరుణ (25) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో నాలుగైదు రోజుల్లో నిశ్చితార్థం.. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా ఆమె ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ ఘటనపై నిడదవోలు రూరల్ ఎస్సై కె.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నెల్లి వెంకట రమణ, సూర్యకుమారి దంపతులకు ఏకైక కుమార్తె కరుణ. ఆమె వార్డు సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులను ముగించుకుని కోరుమామిడి గ్రామంలోని ఇంటికి వెళ్లింది. అనంతరం బంధువులతో కలిసి చర్చిలో ప్రార్థన చేసింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కడుపునొప్పి, కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో వెంటనే కారులో నిడదవోలులో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి సూర్యకుమారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.అప్పటి వరకు సరదాగా ఉండి.. కరుణ ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతిచెందారన్న నిజాన్ని తోటి ఉద్యోగులు నమ్మలేక సామాజిక ఆసుపత్రి వద్ద కన్నీరు పెట్టుకున్నారు. ఆమె స్వగ్రామం కోరుమామిడిలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. విధి నిర్వహణలో ఎంతో చురుగ్గా ఉండేదని అధికారులు అంటున్నారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెకు సమీప బంధువుతో వివాహం నిశ్చయమైంది. మరో నలుగైదు రోజుల్లో నిశ్చితార్థం, మే నెలలో వివాహం జరగాల్సి ఉంది. అటువంటి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అన్నందుకు మహిళలపై దారుణంగా దాడి
మరాఠీలో బదులు ఇంగ్లీషులో మాట్లాడినందుకు మహిళలని కూడా చూడకుండా ఇద్దరిపై కొందరు వ్యక్తులు అమానవీయ దాడికి పాల్పడ్డ సంఘటన డోంబివిలీలోని విష్ణునగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల మేరకు..మంగళవారం డోంబివిలీలో ఇద్దరు మహిళలు తొమ్మిదినెలలపాపతో సహా ఓ స్కూటీపై తాము నివసించే హౌసింగ్ సొసైటీ ఆవరణలోకి ప్రవేశిస్తుండగా ప్రవేశ ద్వారానికి అడ్డుగా ఉన్న యువకుడిని తప్పుకోమంటూ ‘ఎక్స్‌క్యూజ్‌మీ’అని అడిగారు. దీనికి కోపోద్రిక్తుడైన ఆ యువకుడు అతను మరాఠీలో మాట్లాడాలని డిమాండ్ చేస్తూ పైపైకి దూసుకువచ్చాడు. అంతటితో ఆగకుండా మహిళల్లో ఒకరి చేయిని మెలితిప్పాడు. అదే సమయంలో అతని కుటుంబానికి చెందిన మరికొంతమంది వారిపై దాడికి పాల్పడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కేవలం ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అన్నందుకే ఇంతలా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని బాధిత మహిళలు వాపోయారు. సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు విష్ణునగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ సంజయ్ పవార్ తెలిపారు. -
11 గంటలు.. పలు ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ చానల్ అధినేత శ్రవణ్‌రావు మంగళవారం మూడో సారి సిట్ ముందు విచారణకు వచ్చారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఠాణాకు వచ్చిన శ్రవణ్‌రావు సిట్ ఇన్చార్జ్గా ఉన్న ఏసీపీ పి.వెంకటగిరి ముందు హాజరయ్యారు. రాత్రి 10 గంటల వరకు.. అంటే 11 గంటల పాటు అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నలు సంధించారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా శ్రవణ్‌ను ప్రశ్నించారు.ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతో శ్రవణ్ సన్నిహితంగా మెలిగారు. 2023లో జరిగిన ఆయన ఫ్యామిలీ ఫంక్షన్‌కూ హాజరయ్యారు. అక్కడే ప్రభాకర్‌రావు ద్వారా శ్రవణ్‌రావుకు ప్రణీత్‌రావు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలుమార్లు ఎస్ఐబీ కార్యాలయానికి వెళ్లిన శ్రవణ్ అక్కడే ప్రణీత్‌ను కలిశారు. దీనిపై సిట్ ప్రశ్నించగా... తాను ఓ చానల్ అధినేత కావడంతో వృత్తిపరమైన సమాచారం కోసమే వెళ్లానని బదులిచ్చారు. శ్రవణ్ తనకున్న పరిచయాలతో రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల సమాచారం సేకరించేవారు. వీరిలో నాటి ప్రతిపక్షానికి మద్దతుగా ఉన్న వారిని గుర్తించి, ఆ వివరాలను ప్రణీత్‌కు అందించారన్నది ఓ ఆరోపణ. దీనిపైనా సిట్ శ్రవణ్‌ను ప్రశ్నించింది. శ్రవణ్ ఎంపిక చేసిన వారే టార్గెట్‌గా: 2023 ఎన్నికల నేపథ్యంలో ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు సాగిన ఫోన్ ట్యాపింగ్‌లో శ్రవణ్ ఎంపిక చేసిన వారినే టార్గెట్‌గా చేసుకున్నట్లు నిందితుల విచారణలో పోలీసులకు తెలిసింది. ఈ కోణంలోనూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చాలని భావించిన నాటి మంత్రి హరీశ్‌రావు ఓ కీలక సమావేశానికి సిఫార్సు చేశారన్నది పోలీసుల ఆరోపణ. ఆయన సూచనల మేరకే ప్రభాకర్‌రావు, ప్రణీత్, శ్రవణ్ సమావేశమై నిఘా ఉంచాల్సిన వ్యక్తుల పేర్లు ఖరారు చేశారని పోలీసులు చెబుతున్నారు. ప్రణీత్ విచారణలోనూ ఇదే విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శ్రవణ్‌రావుకు, హరీశ్‌రావుకు మధ్య ఉన్న సంబంధాల పైనా ఆరా తీశారు.వీరంతా కలిసి ప్రతిపక్షాలకు చెందిన నగదును పట్టుకోవడం,అధికారపక్షం నగదు రవాణాలోనూ కీలకంగా వ్యవహరించారన్న కోణంలోనూ శ్రవణ్‌ను ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గాల వారీగా సర్వే చేసిన శ్రవణ్.. బీఆర్ఎస్కు 50 సీట్లు దాటడం కష్టమంటూ నివేదిక ఇచ్చినట్లు విచారణలో బయటపడింది. కాగా, శ్రవణ్‌రావు నుంచి సహకారం లభించట్లేదని, తమ ప్రశ్నలకు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 2023లో శ్రవణ్ నుంచి స్వాదీనం చేసుకున్న రెండు సెల్ ఫోన్లలోని సమాచారం పోలీసులు రిట్రీవ్ చేయనున్నారు. ఈ వివరాల ఆధారంగా శ్రవణ్‌ను మరోసారి విచారించాలని భావిస్తున్నారు. -
ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి!
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురు ఉగ్రవాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు వేసిన ఉరి శిక్షను హైకోర్టు సమర్థించడం తెలిసిందే. అయితే ఓ కేసులో నిందితులందరికీ ఉరి శిక్ష పడటం, కింది కోర్టు తీర్పును హైకోర్టు యథాతథంగా సమర్థించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుగా ఉండగా.. ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. మిగతా ఐదుగురికి ఉరి శిక్షను ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. దేశంలో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తై, కింది కోర్టులో శిక్షపడి, దాన్ని హైకోర్టు ఖరారు చేసిన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.ఎవరీ ఐదుగురు? ఇప్పుడెక్కడ ఉన్నారు?పాకిస్తాన్లో తలదాచుకున్న రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు జరి ్డగిన ఈ ఆపరేషన్‌లో అతడి సోదరుడు మహ్మద్ అహ్మద్ సిద్ధిబప్ప అలియాస్ యాసీస్ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వకాస్ (పాకి స్తానీ), మహ్మద్ తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, ఎజాజ్ షేక్ పాల్గొన్నారు. పేలుళ్లపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ దేశంలోని వేర్వే రు ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుంది. వివిధ కేసులకు సంబంధించి కొంతకాలం ముంబై, పుణే జైళ్లలో ఉన్న ఈ ఐదుగురూ ప్రస్తుతం తిహార్ జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు.ఎప్పుడు.. ఎక్కడ చిక్కారంటే..ఎజాజ్ షేక్‌ను 2013 సెప్టెంబర్ 6న ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతమైన సహరంగ్‌పూర్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నట్లు ఎన్ఐఏ రికార్డుల్లో పేర్కొంది. యాసీన్, హడ్డీలు 2013 ఆగస్టు 29న బిహార్‌లోని రక్సుల్ ప్రాంతంలో దొరికారని తెలిపింది. జియా ఉర్ రెహ్మాన్‌ను రాజస్తాన్‌లోని అజ్మీర్ రైల్వేస్టేషన్లో 2014 మార్చ్ 22న, తెహసీన్ అక్తర్‌ను పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో 2014 మార్చి 25న పట్టుకున్నట్లు పేర్కొంది. యాసీన్ అరెస్టు తర్వాత ఎజాజ్ షేక్‌కు దిల్సుఖ్నగర్ పేలుళ్ళలో పాత్ర ఉన్నట్లు తేలింది. కాగా వీరందరినీ వేర్వేరు సమయాల్లో ఎన్ఐఏ హైదరాబాద్‌కు తీసుకువచ్చి అరెస్టు చేసింది. రెండు కేసులు .. ఒకే ఉదంతం2013 ఫిబ్రవరి 21న తొలుత దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్ వద్ద , తర్వాత ఏ–1 మిర్చి సెంటర్ వద్ద కొన్ని సెకన్ల తేడాతో జరిగిన పేలుళ్లలో ఓ గర్భస్థ శిశువు సహా 18 మంది మరణించగా.. 131 మంది క్షతగాత్రులయ్యారు. మొదటిది సాయంత్రం 6 గంటల 58 నిమిషాల 38 సెకండ్లకు పేలగా, రెండోది 6 గంటల 58 నిమిషాల 44 సెకండ్లకు పేలింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట, అప్పటి సైబరాబాద్, ఇప్పటి రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్ ఠాణాల్లో నమోదైన ఈ కేసులు దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏకు బదిలీ అయ్యాయి.దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు సంబంధించి సాంకేతికంగా రెండు కేసులు నమోదైనప్పటికీ ఒకే ఘటన కింద పరిగణనలోకి తీసుకున్నారు. నగరంలో 1990ల నుంచీ ఉగ్రవాద ఛాయలు ఉండటంతో అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏ కేసులోనూ ఎవరికీ ఉరి శిక్ష పడిన దాఖలాలు లేవు. అలాగే ఒకే ఉదంతానికి సంబంధించి మొత్తం దోషులందరికీ ఉరి శిక్షలు వేసిన కేసులు కూడా లేవు.ఏ ప్రాంతానికి చెందినవాళ్లు?⇒ రియాజ్ భత్కల్: కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న తెంగినగుడి ⇒ అసదుల్లా అక్తర్: ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో ఉన్న గులమ్కాపూర్⇒ జకీ ఉర్ రెహ్మాన్: పాకిస్తాన్ పంజాబ్‌లో ఉన్న గోజారా⇒ తెహసీన్ అక్తర్: బిహార్‌లోని సమిస్తిపూర్ జిల్లా ముట్కాపూర్ ⇒ యాసీన్ భత్కల్: కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న ముగ్దుం కాలనీ.⇒ ఎజాజ్ షేక్: మహారాష్ట్రలోని పుణే ఘోర్పేట్ఎవరి పాత్రలు ఏంటి?రియాజ్ భత్కల్: కీలక సూత్రధారియాసీన్ భత్కల్: నేపాల్‌లో ఉండి కుట్రను అమలు చేశాడువకాస్: 107 బస్‌స్టాప్ వద్ద బాంబుతో ఉన్న సైకిల్ పెట్టాడుమోను: ఏ–1 మిర్చి సెంటర్ వద్ద బాంబుతో ఉన్న సైకిల్ వదిలాడుహడ్డీ: అబ్దుల్లాపూర్ మెట్లో షెల్టర్ తీసుకున్నాడు. సైకిళ్ళు తదితరాలు కొనుగోలు చేశాడు.ఎజాజ్: అవసరమైన పేలుడు పదార్థాలు, నగదు సమకూర్చాడువిచారణ పూర్తి, శిక్షలు..2016 నవంబర్ 21న కేసుల విచారణ పూర్తి కాగా.. డిసెంబర్ 13న పరారీలో ఉన్న రియాజ్ మినహా మిగిలిన ఐదుగురినీ ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. అదే నెల 19న వారికి ఉరి శిక్ష విధించింది. -
పొలం ఆన్లైన్ చేయాలంటే పక్కలోకి రమ్మంటున్నారు
కోడుమూరు రూరల్: కోర్టులో న్యాయ పోరాటం చేసి సాధించుకున్న నాలుగెకరాల భూమిని రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో నమోదు చేయకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం జరిగింది. కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన చాకలి పెద్ద సవారన్నకు ఇద్దరు భార్యలు. రెండో భార్య రాములమ్మ కుమార్తె హైమావతికి, మొదటి భార్య సంతానం మధ్య భూముల పంపకంలో వివాదం ఏర్పడి 2011లో కోర్ట్ ను ఆశ్రయించారు. ఏడాది కిందట ఆస్తిలో సగభాగమైన 4ఎకరాల భూమి హైమావతికి చెందుతుందంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.కోర్టు తీర్పు మేరకు తండ్రి నుంచి తనకు సంక్రమించిన 94, 95, 116 సర్వే నంబర్లలోని నాలుగెకరాల భూమిని తన పేరిట ఆన్లైన్ చేయాలంటూ హైమావతి కోడుమూరు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకుంది.రెవెన్యూ అధికారులు రూ.లక్ష లంచం అడగ్గా.. ఆ మొత్తం ఇచ్చానని.. డబ్బు తీసుకోవడంతో పాటు తమ పక్కలోకి వస్తేనే సదరు భూమిని ఆన్లైన్ చేస్తామని వీఆర్వోలు వేధిస్తున్నారని..రెవెన్యూ అధికారుల వేధింపుల వల్ల తనకు చావే శరణ్యమంటూ మంగళవారం తహసీల్దార్ వెంకటేష్ నాయక్ ఎదుట ఫినాయిల్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తహసీల్దార్ ఆమె చేతిలోని ఫినాయిల్ డబ్బాను లాక్కుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: తహసీల్దార్ ఈ ఘటనపై తహసీల్దార్ వెంకటేష్ నాయక్ వివరణ ఇస్తూ.. కోర్టు తీర్పు హైమావతికి అనుకూలంగా వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అయితే సదరు భూమి ప్రభుత్వ భూములకు కేటాయించే 20001901 (రెండు కోట్ల) ఖాతాలో ఉన్నందున హైమావతి పేరును ఆన్లైన్ అడంగల్‌లో నమోదు చేయడం సాధ్యం కాదన్నారు. కోడుమూరు, పులకుర్తి వీఆర్వోలపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
17 ఏళ్లుగా పరారీలోనే!
సాక్షి, హైదరాబాద్: రియాజ్ భత్కల్.. 2007 నాటి గోకుల్ చాట్, లుంబినీ పార్క్, 2013 నాటి దిల్సుఖ్నగర్ పేలుళ్ళకు సూత్రధారిగా, ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నమోదైన విధ్వంసాల కేసుల్లో ఇతని పేరు ప్రముఖంగా ఉంది. 2008లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, 17 ఏళ్లుగా పరారీలో ఉన్న రియాజ్ భత్కల్ ఇప్పటికీ చిక్కలేదు. భత్కల్‌లో పుట్టి.. నేరబాట పట్టిరియాజ్ భత్కల్ అసలు పేరు రియాజ్ అహ్మద్ షహబంద్రి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ గ్రామంలో 1976 మే 19న పుట్టాడు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు, స్మగ్లింగ్ వ్యవహారాలు ఎక్కువ. వాటి ప్రభావంతో నేరబాట పట్టాడు. వీరి కుటుంబం కొన్నాళ్ల పాటు మహారాష్ట్రలోని ముంబైలో నివసించింది. ఇతనికి ఆది నుంచీ డబ్బుపైన ఆశ ఎక్కువ. ఆ యావలోనే ముంబై గ్యాంగ్‌స్టర్ ఫజల్ ఉర్ రెహ్మాన్ ముఠాలో చేరాడు. బెదిరింపులు, కిడ్నాప్‌లు తదితర వ్యవహారాల ద్వారా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు.ఈ మేరకు ఇతనిపై కోల్‌కతా, ముంబయి, కర్ణాటకల్లో అనేక కేసులు నమోదైనా..ఒక్కసారీ అరెస్టు కాలేదు. ఈ గ్యాంగు నుంచి బయటకు వచ్చిన తర్వాత కుర్లా ప్రాంతంలో ‘ఆర్ఎన్’ పేరుతో కొత్తముఠా కట్టి కొంతకాలం వ్యవహారాలు సాగించాడు. అక్కడ స్థానికంగా ఓ ప్రార్థన స్థలానికి, ప్రత్యేక కార్యక్రమాలకు తరచూ వెళ్లేవాడు. ఆ క్రమంలో నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)లో కొంతకాలం పని చేశాడు. అప్పడికే ఇతని అన్న ఇక్బాల్ భత్కల్ పాక్ ప్రేరేపిత లష్కరే తొయిబాతో సంబంధాలు పెట్టుకోవడంతో అతని ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు.ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, రెండో కమాండ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆసిఫ్ రజా కమెండో ఫోర్స్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించిన కోల్‌కతా వాసి అమీర్ రజా ఖాన్ నుంచి అందే ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బు ఏర్పాటు చేస్తుంటాడు. ధనార్జన కోసం రియల్టర్ అవతారం... జిహాద్ పేరుతో యువకులను ఉగ్రవాదం వైపు నడిపించి వారి భవితను భత్కల్ బుగ్గిపాలు చేశాడు. తాను మాత్రం ఉగ్రవాదం పేరు చెప్పి వసూలు చేసిన నిధులను భారీగా దారి మళ్లించి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించాడు. మరిన్ని నిధుల కోసం పుణేకు చెందిన వ్యాపారులను కిడ్నాప్ చేయాలని కుట్రపన్నాడు. విధ్వంసాలకు శిక్షణ, పేలుడు పదార్థాల కొనుగోలు, ఆయుధాల సేకరణ పేరుతో కొన్ని విదేశీ సంస్థల నుంచి హవాలా ద్వారా భారీగా నిధులు సమీకరించాడు. అయితే వాటిని తన సొంత ఖాతాల్లోకి మార్చుకుంటూ మంగళూరు సమీపంలోని థోయ్యత్తు, ఉల్లాల్ పరిసరాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్వహించాడు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్ పేలుళ్ల నిమిత్తం అంటూ విదేశీ సంస్థల నుంచి రూ.లక్షల్లో నిధులు సమీకరించాడు. గుట్టు బయటపడింది ఇతని వల్లే..ఐఎంలో కీలక వ్యక్తిగా ఉన్న రియాజ్ భత్కల్ అనేక పేలుళ్ల సందర్భంలో కొన్ని ఈ–మెయిల్స్ రూపొందించి మీడియా సంస్థలకు పంపాడు. ఇలా చేయడాన్ని మరో ఉగ్రవాదైన సాదిక్ షేక్ పూర్తిగా వ్యతిరేకించాడు. దీనివల్ల తమ ఉనికి బయటపడుతుందని, దర్యాప్తు సంస్థలకు పట్టుబడే అవకా శం ఉందని వాదిస్తూ వచ్చాడు. ఈ మాటలను రియాజ్ పెడచెవిన పెట్టాడు. ప్రతి విధ్వంసానికీ అత్యంత పకడ్బందీగా వ్యూహరచన చేసి కథనడిపేది తామైతే... చివరకు పేరు మాత్రం సీమాంతర ఉగ్రవాద సంస్థలకు రావడం రియాజ్‌కు రుచించలేదు.తమ సంస్థ పేరు బయటకు వచ్చి ప్రచారం జరిగితే నిధులు సైతం భారీగా వస్తాయంటూ సాదిక్‌తో వాదించాడు. చివరకు తన పంతం నెగ్గించుకుని ప్రతి విధ్వంసానికీ ముందు ఈ–మెయిల్ పంపడం ప్రారంభించాడు. ఈ మెయిల్స్ వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఐఎంకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరించారు. అలా ప్రారంభమైన దర్యాప్తుతోనే 2008లో ఐఎం గుట్టురట్టు అయింది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రియాజ్... ప్రస్తుతం పాకిస్తాన్‌లోని డిఫెన్స్ ఏరియాలో తలదాచుకుంటున్నట్టు సమాచారం. -
క్రికెట్ బెట్టింగ్.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
కాకినాడ: క్రికెట్ బెట్టింగ్‌లో సొమ్ము కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కోలనాటి రమణబాబు (33) ఆత్మహత్య చేసుకున్నాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవా రం అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి గ్రామానికి రమణబాబు వర్క్ ఫ్రం హోంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నెలవారీ వస్తున్న జీతం ఇంటికి ఇవ్వకుండా బెట్టింగ్‌కి అలవాటు పడి సొమ్ము పోగొట్టుకున్నాడు. అప్పుల బాధతో నర్సీపట్నం– రేగు పాలెం మధ్యలో రైలు పట్టాల పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
హత్యకేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష
జగిత్యాలజోన్: ముగ్గురు పిల్లలున్న వివాహితపై కన్నేసి, మాట వినకుంటే కిరోసిన్ పోసి నిప్పంటించి, ఆమె మృతికి కారణమైన నిందితుడు ఇల్లంతకుంట శ్రీధర్‌కు యావజ్జీవ శిక్ష, రూ 1.02 లక్షల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ సోమవారం తీర్పునిచ్చారు. పీపీ జంగిలి మల్లికార్జున్ కథనం ప్రకారం కొడిమ్యాలలో నివాసం ఉండే దంపతులకు ముగ్గురు పిల్లలు. భర్త ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భార్య బీడీలు చుడుతూ పిల్లలను చదివిస్తోంది. వీరి ఇంటి పక్కన ఉండే ఇల్లంతకుంట శ్రీధర్ సదరు మహిళపై కన్నేశాడు. కోరిక తీర్చకపోతే చంపుతానని బెదిరించాడు. దీంతో సదరు మహిళ తన పిల్లలతో కలిసి అదే గ్రామంలో వేరే చోటుకు అద్దె ఇంట్లోకి మారింది. అక్కడికి వెళ్లిన శ్రీధర్ మహిళకు ఇల్లు ఎందుకు అద్దెకిచ్చావని యాజమానితో గొడవకు దిగాడు. దీంతో ఆ మహిళ తిరిగి సొంతింటికి వచ్చింది. ఏప్రిల్ 14, 2019 రోజున సదరు మహిళ ఇంట్లో బీడీలు చుడుతుండగా, శ్రీధర్ వచ్చి తన కోరిక తీర్చమని వేదించాడు. ఒప్పుకోకపోవడంతో తన ఇంట్లోంచి కిరోసిన్ తీసుకొచ్చి ఆమెపై పోసి నిప్పంటించాడు. ఈ సమయంలో మహిళ పిల్లలు గ్రామంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా, ఇంట్లోంచి కేకలు వినపడ్డాయి. చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పివేస్తుండగా శ్రీధర్ అక్కడి నుంచి పారిపోయాడు. సదరు మహిళను జగిత్యాలకు తరలించి, అనంతరం హైదరాబాద్‌లోని గాంధీ అసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి సీఐలు సీహెచ్.నాగేందర్, కె.కిశోర్ కేసు నమోదు చేసి, శ్రీధర్‌ను అరెస్ట్ చేసి, చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్‌కుమార్, కేవీ.సాగర్ బలమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో, పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడైన ఇల్లంతకుంట శ్రీధర్‌కు యావజ్జీవ శిక్షతో పాటు రూ.1.02 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
అనారోగ్యంతో రిసెప్షనిస్టు మౌనిక ఆత్మహత్య
చౌటుప్పల్(నల్గొండ): అనారోగ్యంతో బాధపడుతున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గుండ్ల రామచంద్రయ్య–లక్ష్మమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరు పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె గుండ్ల మౌనిక(25) స్థానిక వలిగొండ రోడ్డు వద్ద ఉన్న అఖిల్ నేత్రాలయంలో రిసెప్షనిస్టుగా పనిచేసేది. ఇటీవల తనకు ఎర్ర రక్తకణాలు హెచ్చుతగ్గులు అవుతుండడంతో నాలుగు నెలలుగా ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో సన్నద్ధమవుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రామచంద్రయ్య మధ్యాహ్నం ఇంటికి రాగా.. తలుపు పెట్టి ఉండడం, కుమార్తెను పలకకపోవడంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా.. మౌనిక ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
ఫుడ్ పాయిజన్‌తో తల్లీకొడుకుల మృతి
రుద్రంగి (వేములవాడ): ఫుడ్ పాయిజన్‌తో గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతిచెందిన విషాదకర సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35), నిహాల్ (6), శుక్రవారం రాత్రి ఇంట్లో రొట్టెలు తిని పడుకున్నారు. అనంతరం వాంతులు విరోచనాలు కావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం కోరుట్ల, కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. చికిత్స పొందుతూ ఆదివారం తల్లి పుష్పలత మృతిచెందగా.. పరిస్థితి విషమించడంతో కొడుకు నిహాల్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిహాల్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదుకాగా పుష్పలత, నిహాల్ మృతిపై అనుమానాలు ఉన్నాయని పుష్పలత అన్న పాలెపు శ్రీనివాస్ రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫి ర్యాదు చేశాడు. ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని.. వాటిని మనసులో పెట్టుకొని పుష్ప లత అత్తగారి కుటుంబ సభ్యులే విషప్రయో గం చేసి ఉంటారని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని పాలెపు శ్రీనివాస్ కోరారు. బాధితుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని రుద్రంగి ఎస్సై అశోక్ తెలిపారు. -
మియాపూర్‌లో షెల్టర్!
సాక్షి, సిటీబ్యూరో: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్ కుమార్, అలోక్ కుమార్ ఈ నేరాలు చేయడానికి ముందు మియాపూర్‌లో బస చేసినట్లు వెలుగులోకి వచి్చంది. అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు ఈ విషయం గుర్తించారు. దీనికి సంబంధించిన రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. నగరంలో నేరం చేసిన తర్వాత దేశ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయినట్లు ఈ ద్వయం ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. జనవరి 12న నగరానికి రాక... బీహార్‌లోని వైశాలీ జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ గ్యాంగ్ 2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సెక్యూరిటీ గార్డు జై సింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు దోచుకుపోయింది. నేపాల్ పారిపోయిన ఈ గ్యాంగ్ యూపీ పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత బీహార్ చేరుకుంది. అక్కడ నుంచి తమ స్వస్థలానికి వెళ్లి... ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చింది. బీదర్‌ను టార్గెట్‌గా చేసుకున్న అమన్, అలోక్ ఆ నెల 12న మియాపూర్‌లోని శ్రీ సాయి గ్రాండ్ ఇన్ హోటల్లో బస చేసింది. అక్కడ నుంచి బీదర్‌కు రాకపోకలు సాగించడం తేలికనే ఉద్దేశంతోనే అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అమిత్ కుమార్, మహేష్ కుమార్ పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసిన దుండగులు వాటి ఆధారంగానే రూమ్ తీసుకున్నారు. మూడు రోజుల పాటు రెక్కీ... బీదర్‌లో ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ వ్యాన్‌ను దోచుకోవడానికి ముందు మూడు రోజుల పాటు పక్కాగా రెక్కీ చేసింది. తమ వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై జనవరి 13, 14, 15 తేదీల్లో అక్కడకు వెళ్లి వస్తూ ఈ పని పూర్తి చేసింది. చివరకు ఆ నెల 16న నేరం చేయడానికి బీదర్ వెళ్లిన ఈ ద్వయం సీఎంఎస్ సంస్థ ఉద్యోగుల్లో గిరి వెంకటే‹Ùను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలు దోచుకుంది. అక్కడ నుంచి డబ్బు నింపిన బ్యాగ్‌లు తీసుకుని నేరుగా తాము బస చేసిన హోటల్‌కే వచ్చారు. రూమ్ ఖాళీ చేయడంతో పాటు తమ వస్తువుల్నీ తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరి మియాపూర్ నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చారు. నేరం చేయడానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. నేపాల్‌లో ఉండటంతో పటిష్ట నిఘా... ఈ ట్రావెల్స్ వద్ద జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌ను కాలి్చన ఇద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన వీళ్లు... అక్కడ నుంచి గజ్వేల్ వెళ్లడానికి మరో ఆటో మాట్లాడుకున్నారు. అనివార్య కారణాలతో తిరుమలగిరిలో దిగేసి... ఇంకో ఆటోలో మియాపూర్ వెళ్లారు. ఆపై తిరుపతి వెళ్లే ఏపీఎస్‌ఆరీ్టసీ ఎక్కి కడపలో దిగిపోయారు. మరో బస్సులో నెల్లూరు, అట్నుంచి చెన్నై వెళ్లారు. చెన్నై నుంచి రైలులో కోల్‌కతా చేరుకున్న ఈ ద్వయం పశి్చమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం నుంచి నేపాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మీర్జాపూర్ నేరం తర్వాత ఇలా వెళ్లిన ఈ ద్వయం కొన్నాళ్లకు తమ స్వస్థలాలకు తిరిగి వచి్చంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిటీ పోలీసులు వారి కదలికలపై పటిష్ట నిఘా ఉంచారు. -
సహజీవనం చేసే వాడే చంపేశాడు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): తనతో సహజీవనం చేస్తున్న మహిళను రోకలి బండతో మోది చంపిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపింది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన పసుపులేటి మురళీకృష్ణ అవివాహితుడు. లారీ క్లీనర్‌గా పని చేస్తుంటాడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళ పాడుకు చెందిన వివాహిత కనపర్తి మంగమ్మ (44) తో పరిచయం ఏర్పడింది.ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి మురళీకృష్ణ దగ్గరికి రాగా ఇద్దరూ కలసి తిరుమలగిరిలోనే ఓ అద్దె ఇంట్లో గత 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తరచూ గొడవలు పడుతుండేవారు. ఇంటి యజమాని, చుట్టుపక్కల వారు సర్ది చెబుతుండేవారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మురళీ కృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న మంగమ్మ తలపై రోకలిబండతో బలంగా కొట్టి చంపి పరారయ్యాడు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ తోట సూర్య శ్రీనివాసులు ఘటనా స్థలానికి వచ్చి, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్డం నిమిత్తం పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ తర్వాత నిందితుడు మురళీకృష్ణ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. -
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
చెన్నైకి చెందిన టెక్ బిలియనీర్, రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్(Prasanna Sankar) దంపతులు వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నడిపిస్తోందని ప్రసన్న శంకర్.. తన భర్తే పెద్ద కా*పిశాచి అని దివ్యా శశిథర్(Dhivya Sashidhar) పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో విడాకులు, భరణం, కొడుకు కస్టడీ కోసం న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ప్రసన్న శంకర్, దివ్య తొలిసారిగా 2007లో కలుసుకున్నారు. 2013లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రసన్న శంకర్, దివ్యల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. భరణం కింద తనకు నెలకు రూ. 9 కోట్ల రూపాయలు ఇవ్వాలని దివ్య డిమాండ్స్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ప్రసన్నపై దివ్య సంచలన ఆరోపణలకు దిగింది. ది శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్‌కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త కేవలం తనను సెక్స్ కోసమే అన్నట్లు చూసేవాడని తెలిపింది. ‘‘కోరిక తీర్చకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ప్రసవ సమయంలో నొప్పి అనుభవిస్తున్నప్పుడు కూడా నాతో బలవంతంగా సెక్స్ చేశాడు. అతడు వేశ్యలతో సంబంధాలు పెట్టుకునేవాడు. బాత్రూంలో కెమెరాలతో నిఘా పెట్టేవాడు. రోజూవారీ కార్యకలాపాల సమయంలో చిత్రీకరించేవాడు. సంపదపై పన్నులు పడొద్దని నన్ను, నా కొడుకును మరో దేశానికి ఈడ్చుకెళ్లాడు. .. ఒక వేళ నాతో శృంగారంలో పాల్గొనకుంటే, బయటకు వెళ్లి దానిని పొందాలనుకుంటున్నట్లు చెప్పేవాడు. తన స్నేహితులతోనూ పడుకోవాలని ఒత్తిడి చేసేవాడు. అనూప్‌తో తనకు ఉన్న సంబంధం గురించి ప్రసన్న చెప్పేవి అన్ని కల్పితమైనవే. అతడితో నా సంబంధం లైంగికమైనది కాదు. భావోద్వేగమైనది మాత్రమే’’ అని ఆ ఇంటర్వూ్యలో తెలిపారామె. అయితే భర్త ప్రసన్న శంకర్ ఆమెవన్నీ ఆరోపణలే అని ఖండించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వీరి కేసు కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది. -
ప్రభాకర్‌రావే కీలకం.. బెయిల్ ఇవ్వొద్దు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ పిటిషన్‌పై పోలీసులు తరఫున కౌంటర్ దాఖలు చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. వివిధ కారణాలను ప్రస్తావిస్తూ నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని వాదించారు.కౌంటర్ కాపీలో ఏముందంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌రావే కీలకం. ఎస్ఐబీలో ఎస్వోటీ(Special Operations Team)ని నెలకొల్పింది ఇతనే. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోనే ఎస్వోటీ పనిచేసింది. ఫోన్ట్యాపింగ్కే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహించింది. ట్యాపింగ్ బాధితుల్లో ప్రతిపక్షాలకు చెందిన వాళ్లను, కొందరు అధికారులు, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారు. అంతేకాదు.... ఓఎస్డీగా ఇతర అధికారులకు తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు ఇప్పించారు. ఐపీఎస్ అధికారిగా విరమణ పొంది చట్టపరంగా దర్యాప్తునకు సహకరించడం లేదు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో విధిలేక హైకోర్టుకు వచ్చారు. హైదరాబాద్ వస్తున్నానని గతంలో ట్రయల్‌కోర్టులో పిటిషన్ వేశారు. దాదాపు తొమ్మిది నెలలు గడిచినా నిందితుడు భారత్‌కు రాలేదు’’ అని ఉంది. బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని వాదించిన పీపీ.. పోలీస్ దర్యాప్తునకు సహకరించేలా నిందితుడు ప్రభాకర్ రావుకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టైన నిందితులందరికీ దాదాపుగా బెయిల్ లభించింది. -
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపే తీర్పు
హైదరాబాద్, సాక్షి: దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు(మంగళవారం) తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది చనిపోగా.. 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ కేసు విచారణ జరిపిన ఎన్ఐఏ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి మరణశిక్ష విధించింది. అయితే.. ఈ శిక్షను సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. 2013 ఫిబ్రవరి 21న నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన దిల్సుఖ్ నగర్లో పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఈ దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది. నిందితులలో అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ నిందితులుగా ఉన్నారు. మూడేళ్లపాటు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో జరిగిన విచారణ అనంతరం.. నిందితులపై మరణశిక్ష పడింది. ఈ కేసుతో పాటు పలు ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ను 2013లో బీహార్-నేపాల్ సరిహద్దులో పట్టుకోగలిగారు. ఢిల్లీ(2008), దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలడంతో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
వాంటెడ్స్ వేలల్లో! కింగ్ మేకర్స్ ఐదుగురు నైజీరియన్లే
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 2020-24 మధ్య నమోదైన మాదకద్రవ్యాల కేసుల్లో 8,822 మంది ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వీరిలో ఐదుగురు నైజీరియన్లు అత్యంత కీలకమని, దేశవ్యాప్తంగా డ్రగ్స్ సిండికేట్‌ను వాళ్లే నడిపిస్తున్నారని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) అధికారులు గుర్తించారు. 2023లో పోలీసులు రూ.94.39 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేయగా, అది ఇది గత ఏడాది నాటికి రూ.148.09 కోట్లకు చేరింది. ఈ కేసుల్లో సూత్రధారులు కంటే పాత్రధారులు మాత్రమే చిక్కుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన డ్రగ్స్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీజీఏఎన్‌బీ అధికారులు వాంటెడ్‌గా ఉన్న వారి కోసం గాలిస్తోంది. అప్పట్లో నేరుగా వచ్చిమాదకద్రవ్యాల క్రయవిక్రయాలన్నీ సోషల్ మీడియా, డార్క్ వెబ్ కేంద్రంగా సాగుతున్న విషయం తెలిసిందే. వీటిలోనే పెడ్లర్లు, సప్లయర్లు, కన్జ్యూమర్ల మధ్య బేరసారాలు పూర్తవుతున్నాయి. ఒకప్పుడు ఆన్లైన్లో డబ్బు డిపాజిట్ చేయించుకునే పెడ్లర్లు సిటీకి వచ్చి డ్రగ్స్ అందించి వెళ్లే వాళ్లు. అయితే టీజీఏఎన్‌బీ, హెచ్–న్యూ వంటి ప్రత్యేక విభాగాలు ఏర్పడిన తర్వాత డ్రగ్స్ దందాపై నిఘా పెరిగింది. వరుస పెట్టి డెకాయ్ ఆపరేషన్లు చేసిన అధికారులు, సిబ్బంది జాతీయ, అంతర్జాతీయ పెడ్లర్స్‌ను పట్టుకున్నారు. దీంతో తెలంగాణకు వచ్చి డ్రగ్స్ సరఫరా చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. కొరియర్స్, డెడ్ డ్రాప్ విధానాల్లో... సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్న పెడ్లర్లు ఆన్లైన్లోనే నగదు చెల్లింపులు అంగీకరిస్తున్నారు. ఆపై కొరియర్ పార్శిల్ చేయడం లేదా సప్లయర్‌ను పిలిపించుకొని మాదకద్రవ్యాలను అందిస్తున్నారు. ఈ సప్లయర్లు సైతం నేరుగా కన్జ్యూమర్ని కలవట్లేదు. దీనికోసం డెడ్ డ్రాప్ విధానం అవలంభిస్తున్నారు. మాదకద్రవ్యాన్ని ఓ ప్రాంతంలో ఉంచి ఆ ప్రాంతం ఫొటో, లోకేషన్లను వారికి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధిక కేసుల్లో కన్జ్యూమర్లు, కొన్ని కేసుల్లో సర్లయర్లు చిక్కుతున్నారు. పెడ్లర్స్ మాత్రం దొరక్కపోవడంతో ఆయా కేసుల్లో వాంటెడ్స్ పెరుగుతున్నారు. గత ఏడాది భారీగా పెరిగిన కేసులు... మాదకద్రవ్యాల కేసులు, అరెస్టు అయిన నిందితుల సంఖ్య 2023 కంటే 2024లో గణనీయంగా పెరిగింది. 2023లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదైన కేసుల సంఖ్య 1487గా, అరెస్టు అయిన నిందితుల సంఖ్య 2170గా ఉంది. గత ఏడాది ఇవి 3074, 5205కు పెరిగాయి. 2020–24 మధ్య ఐదేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 7131 కేసులు నమోదు కాగా, వీటిలో 23,547 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 14,725 మంది మాత్రమే అరెస్టు కాగా, ఇప్పటికీ 8822 మంది పరారీలోనే ఉన్నారు. ఈ వాంటెడ్స్ కోసం టీజీఏఎన్‌బీ, హెచ్–న్యూ, టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీలతోపాటు స్థానిక పోలీసులూ గాలిస్తున్నారు. ఆ ఐదుగురూ అత్యంత కీలకం రాష్ట్రంలోనే కాదు... దేశ వ్యాప్తంగా వివిధ మెట్రో నగరాల్లో విస్తరించి ఉన్న డ్రగ్ నెట్‌వర్క్‌లో నైజీరియన్లే కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రధాన పెడ్లర్స్, సర్లయర్స్లో వీళ్లే ఎక్కువగా ఉంటున్నారు. తెలంగాణకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో ఐదుగురు నైజీరియన్లు కీలకమని టీజీఏఎన్‌బీ గుర్తించింది. వీరిలో డివైన్ ఎబుక సుజీపై ఎనిమిది, పీటర్ న్వాబున్వన్నా ఒకాఫర్, నికోలస్ ఒలుసోలా రోటిమీ, మార్క్ ఒవలబిలపై నాలుగు చొప్పున, అమోబి చుక్వుడి మూనాగోలుపై ఒక కేసు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆధారాలు లభించడంతో నిందితులుగా చేర్చామని అధికారులు చెప్తున్నారు. 2023–24ల్లో డ్రగ్స్ దందాలో ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో సూడాన్, కెన్యా, నైజీరియా, సోమాలియా, టాంజానియా, లైబీరియాలకు చెందిన 11 మందిని పోలీసులు నగరంలో గుర్తించి ఆయా దేశాలకు తిప్పిపంపారు. -
కర్ణాటకలో లైంగిక వేధింపులు.. హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకలో ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపుల అంశంపై హోంమంత్రి జి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.బెంగళూరులోని వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను ఓ వ్యక్తి లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా హోంమంత్రి జి పరమేశ్వర స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘పెద్ద నగరాల్లో అలాంటి ఘటనలు జరుగుతుంటాయి. నిరంతరం అప్రమత్తంగా ఉండమని నేను ప్రతీరోజు పోలీసులకు చెబుతూనే ఉంటాను. ఇటీవల జరిగిన ఓ ఘటనపై ఉదయం కూడా కమిషనర్‌తో మాట్లాడాను. ఇక్కడ కొన్ని ఘటనలు జరిగినప్పుడు ప్రజల దృష్టి వాటిపైకి మళ్లుతుంది. పోలీసులు 24X7 పనిచేస్తున్నారు. మేము చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.Sexist shocker from Karnataka Home Minister G Parameshwara- HM trivialises molestation incident: 'Such incidents happen in big cities'- Home Min underplays issue of #WomenSafetyMirror Now's @NehaHebbs shares details | @RitangshuB#BengalururMolestationShocker pic.twitter.com/mThTr3kkVJ— Mirror Now (@MirrorNow) April 7, 2025హోంమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ మాట్లాడుతూ..‘హోంమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఇది చాలా సున్నితమైన విషయం. లైంగిక వేధింపులు, మహిళలపై నేరాలను ఆయన సాదారణ విషయంగా భావిస్తున్నారా?. ఇలా మాట్లాడి తన బాధ్యత నుండి ఆయన తప్పించుకుంటున్నారు. జవాబుదారీగా ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతారు. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రత పరిస్థితులకు ఈ ఘటన అద్దం పడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.A shocking case of sexual harassment on the street has emerged from the #BTMLayout in #Suddaguntepalya area of #Bengaluru, where a youth allegedly touched the private parts of a woman walking on the street on April 4.The accused reportedly approached her from behind and behaved… pic.twitter.com/PqzDc9sMg8— Hate Detector 🔍 (@HateDetectors) April 6, 2025 -
మాజీ ప్రియురాలిపై రౌడీ షీటర్ లడ్డూ దాడి
తెనాలి: స్థానిక అయితానగర్‌కు చెందిన రౌడీ షీటర్ లడ్డూ, గతంలో తనకు సన్నిహితంగా ఉన్న మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపెట్టగా రిమాండ్‌కు ఆదేశించారు. సముద్రాల పవన్‌కుమార్ అలియాస్ లడ్డూ.. పట్టణంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ ఎన్నారైపై దాడి చేశాడు. దీంతో పోలీసులు అతడిని పట్టణ బహిష్కరణ చేశారు. తెనాలి రావొద్దని ఆదేశించారు.అయినా రహస్యంగా పట్టణానికి రాకపోకలు సాగిస్తున్నాడు. గత అక్టోబరులో బహిరంగంగానే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆ సంబరానికి కూటమి నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత మూడురోజులకే అంటే అదే నెల 28వ తేదీ రాత్రి డెకరేషన్ పనులు చేస్తుండే నాజరుపేటకు చెందిన కాకుమాను ఇంద్రజిత్ అనే వ్యక్తిపై అయితానగర్ సెంటర్లోనే లడ్డూ దాడిచేశాడు. వర్కర్‌ను స్కూటర్‌పై ఇంటిదగ్గర దించి తిరిగి వెళుతున్న ఇంద్రజిత్‌పై అకారణంగా లడ్డూ దాడిచేశాడు. అతడి స్కూటర్ తీసుకెళ్లి తగులబెట్టాడు. కూటమి నేతలతో ఉన్న బంధం కారణంగానే లడ్డూ ఇంతకు తెగించాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు వార్తల్లొకొచ్చాడు. దూరంగా ఉంచిందని.. తెనాలి సమీపంలో ఓ గ్రామానికి చెందిన ఓ మహిళతో లడ్డూకు పాత పరిచయం ఉంది. ఆమె విజయవాడలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. కొంతకాలంగా ఆమె లడ్డూను దూరంగా ఉంచింది. ఆగ్రహం చెందిన లడ్డూ శనివారం తనకోసం విజయవాడ వెళ్లి, తనతో గొడవ పెట్టుకున్నాడు. ఆమెను అనుసరించి తెనాలి వచ్చి, తర్వాత ఆమె నివసించే గ్రామానికి వెళ్లాడు. ఆమెను ఊరి వెలుపలికి రమ్మని బెదిరించాడు. తన దగ్గరకు వచ్చిన మహిళపై తీవ్రంగా దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఫిర్యాదుతో రూరల్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తర్వాత అరెస్టుచేసి, స్థానిక ప్రైవేటు వైద్యశాలలో పరీక్షలు చేయించారు. ఆదివారం రాత్రి మేజి్రస్టేటు ముందు హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు.రూరల్ ఎస్ఐ ప్రతాప్‌కుమార్ కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
వివాహేతర సంబంధం.. చిన్నారిపై తల్లి పైశాచికం
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): మూడేళ్ల చిన్నారిపై తల్లి పైశాచికంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విజయవాడ పరిధిలోని జక్కంపూడి కాలనీలో నివసించే వందనకు (23) అమ్ములు అనే మూడేళ్ల పాప ఉంది. కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. శ్రీరాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో వందన, శ్రీరాములు హైదరాబాద్‌కు మకాం మార్చారు. తమ ఆనందానికి పాప అడ్డుగా ఉందని భావించిన వారు.. ఆ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. వంటిపై, వీపుపై ఇష్టానుసారంగా వాతలు పెట్టడంతో ఆ చిన్నారి కేకలు వేసేది. కేకలు బయటకు రాకుండా నోరు మూసి ఈ అకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విజయవాడ వచ్చిన వందన, శ్రీరాములు పాపను రైల్వే స్టేషన్లో వదిలేశారు. విషయం తెలుసుకున్న శ్రీరాములు తల్లి సుమలత రైల్వేస్టేషన్‌కు వెళ్లి అమ్ములును ఇంటికి తీసుకొచ్చింది. కాగా, ఈ అకృత్యాలు తెలుసుకున్న స్థానికులు విషయాన్ని మీడియా దృష్టికి తెచ్చారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
నువ్వు అందంగా ఉన్నావు...
ఖమ్మంవైద్యవిభాగం: ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు.... తక్కువ వయస్సులా కనిపిస్తున్నావు.. చదువుకున్న ఆఫీసర్లా ఉన్నావు.. బొద్దుగా కనిపిస్తున్నావు..’ అంటూ ఓ వివాహితతో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. చేయి విరిగిన ఆమె సర్జరీ కోసం రాగా.. వైద్యులు, సిబ్బంది ప్రవర్తనతో హహిళ భయబ్రాంతులకు గురికాగా.. ఘటనపై వివాహిత బంధువులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.వైరా నియోజకవర్గానికి చెందిన ఓ వివాహిత ఇంట్లో పనులు చేస్తుండగా కిందపడటంతో చేయికి తీవ్రంగా గాయమైంది. సమీపంలోని ఆర్ఎంపీని సంప్రదిస్తే చేయి విరిగిందని నిర్ధారించి ఖమ్మంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సమీపాన శివ ఆర్థోపెడిక్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అక్కడ పరీక్షించాక సర్జరీ చేయాలని చెప్పడంతో గత గురువారం ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం సర్జరీ చేసేందుకు నిర్ణయించగా, ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లాక సదరు మహిళపై సిబ్బంది అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఆపై ఆపరేషన్ చేయడానికి వైద్యుడు కూడా అదే మాదిరి ప్రవర్తించాడు. కేస్‌షీట్‌లో వివరాలన్నీ ఉన్నా వయస్సు ఎంత అని అడిగి చెప్పగానే అంత వయస్సులా కనిపించడం లేదు... అందంగా ఉన్నావు... తెల్లగా, వయస్సు తక్కువగా కనిపిస్తున్నావు... అంటూ మాట్లాడడంతో ఆమె భయాందోళనకు గురైంది.ఆ తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చాక కుటుంబీకులకు చెప్పడంతో డాక్టర్, సిబ్బందిని నిలదీస్తే అలాంటిదేమీ బుకాయించారు. దీంతో కొద్దిరోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉన్నా ఇష్టపడని మహిళను డిశ్చార్జ్ చేయించి తీసుకెళ్లాపోయారు. కాగా, ఘటనపై ఆస్పత్రి యాజమాన్యానికి వివాహిత కుటంబీకులు ఫిర్యాదు చేయగా, ఆమె ఆరోగ్యం చక్కబడ్డాక అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. -
ఢిల్లీలో మరో దారుణం.. యువతిపై కత్తితో దాడి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ(Delhi)లో మరో దారుణం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న నడిరోడ్డుపై 19 ఏళ్ల యువతిపై కత్తితో ఒక వ్యక్తి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది.ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు(Police) సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దాడికి పాల్పడిన నిందితుడు గతంలో బాధితురాలికి పరిచయం అయిన వ్యక్తి అయివుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని సేకరించడంతోపాటు స్థానికులను విచారిస్తున్నారు.ఈ ఘటన ఢిల్లీలో మహిళల భద్రత(Women's safety)పై మరోసారి అనుమానాలను లేవనెత్తింది. ఈ ఘటన దరిమిలా సామాజిక మాధ్యమాల్లో ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, కఠిన శిక్ష విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే ఆమె చికిత్స పొందుతోందని తెలుస్తోంది. పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా -
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై విచక్షణా రహితంగా సిమెంట్ బ్రిక్‌తో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లికి చెందిన మహ్మత్ బస్రత్(32) కోల్‌కత్తాకు చెందిన షబానా పర్వీన్(22)ను 2024 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నాడు. హఫీజ్‌పేట్‌లోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. బస్రత్ తల్లిదండ్రులతో పర్వీన్ తరచు గొడవ పడుతుండటంతో రెండు నెలల క్రితం వేరు కాపురం పెట్టాడు. కాగా పర్వీన్‌కు వాంతులవుతుండడంతో రాఘవేంద్ర కాలనీలోని సియాలైఫ్ హాస్పిటల్లో చేర్పించాడు. ఏప్రిల్1న రాత్రి 10 గంటలకు డిశ్చార్జి చేయగా బయటకు వచ్చి ఇద్దరు గొడవపడ్డాడు. కోపంతో బస్రత్ తన్నడంతో షబానా పర్వీన్ కిందపడి పోయింది. అక్కడ ఉన్న రెండు సిమెంట్ బ్రిక్లతో దాదాపు 15 సార్లు తల, శరీరంపై మోదాడు. చనిపోయిందనుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడి చికిత్సపొందుతోంది. వైద్యులు నిర్వహించిన పరీక్షలలో మూడు నెలల గర్భిణి అని తేలిందని, షబానా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/St6JwDt1Ti— ChotaNews App (@ChotaNewsApp) April 7, 2025 -
ప్రాణాలు తీస్తున్న సరదా
మెదక్‌జోన్: ఈత సరదా యువకుల ప్రాణాలు తీస్తోంది. జిల్లాలో కేవలం ఆరునెలల వ్యవధిలో పాతికేళ్లలోపు యువకులు నలుగురు మృత్యువాత పడ్డారు. గతంలో మంజీరా నదిలో ఇద్దరు.. తాజాగా శనివారం మధ్యాహ్నం బొల్లారం మత్తడిలో మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నీటి వనరుల వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అందరూ పాతికేళ్లలోపు వారే.. అయితే బొల్లారం మత్తడి మెదక్ మండలంలోని పలు గ్రామాలకు సమీపంగా ఉంటుంది. ఇందులోకి ఘనపూర్ ఆనకట్ట నుంచి నీరు వచ్చి చేరటంతో మండు వేసవిలో నిండుకుండలా మారుతుంది. దీంతో యువత అందులోకి ఈత కోసం వెళ్తుంటారు. అయితే ఇప్పటివరకు ఈ మత్తడి నలుగురు యువకులను బలి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరిలో జానకంపల్లికి చెందిన యువకుడు మిత్రులతో కలిసి స్నానం చేస్తుండగా నీట మునిగి మృతిచెందాడు. అలాగే తిమ్మక్కపల్లికి చెందిన మరో యువకుడు మత్తడిలో మునిగి చనిపోయాడు. ఇంత జరుగుతున్నా అధికారులు అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు. అలాగే ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం సమీపంలో మంజీరా నది ఎప్పుడు నిండుకుండలా ఉంటుంది. భక్తులు ముందుగా మంజీరా పాయల్లో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే గత నెల 1వ తేదీన హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం ఏడుపాయలకు వచ్చి మూడు రోజుల పాటు అక్కడే గడిపారు. అందులో ఇద్దరు యువకులు పోతంశెట్‌పల్లి 2వ బ్రిడ్జి వద్ద నదిలో ఈతకు దిగి నీటమునిగి దుర్మరణం చెందారు. మంజీరాలో లోతు ఎక్కువగా ఉండటంతో పాటు రాళ్లు రప్పలతో నిండి ఉంది. ఈ ప్రదేశంలోనికి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అక్కడ నిరంతరం పోలీస్ సిబ్బందిని ఉంచితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు. పండుగ పూట విషాదం మెదక్ మండలం బాలనగర్‌కు చెందిన తుండు అనిల్ (17), తుండుం నవీన్ (25) శనివారం మధ్యాహ్నం బొల్లారం మత్తడికి ఈతకు వెళ్తున్నా మని కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరారు. అయితే రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు మత్తడి వద్దకు వెళ్లి చూడగా గడ్డపై ఇద్దరి దుస్తులు, చెప్పులు కనిపించారు. దీంతో గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతకగా ఆదివారం మధ్యా హ్నం ఇద్దరి మృతదేహలు లభ్యమయ్యాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామానికి చెందిన తుండుం లలిత, పద్మయ్యకు కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా కూతురు పెళ్లిచేయగా.. అనిల్ పదో తరగతి వరకు చదువుకొని ఇంటి వద్ద తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అయితే చేతికందివచి్చన కొడుకు నీటి మునిగి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదే గ్రామానికి చెందిన తుడుం బాలయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. నీట మునిగి మృతిచెందిన నవీన్ (25) రెండో కుమారుడు. అతడికి మూడేళ్ల క్రితం పెళ్లి చేయగా రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడి భార్య గర్భిణి. భర్త నీటి మునిగి చనిపోయాడని తెలియటంతో ఆమె రోదనలు మిన్నంటాయి. -
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
చేవెళ్ల: వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. చేవెళ్ల హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండే గోవిందగారి పురుషోత్తంరెడ్డికి రెండేళ్ల కిత్రం హైదరాబాద్‌లోని కాళీమందిర్‌కు చెందిన తరుణి అలియాస్ యమున(30)తో వివాహ జరిగింది. కొన్నేళ్ల పాటు వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. అనుకోకుండా శనివారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె గదిలో గడియ పెట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంత పిలిచినా బయటకు రాకపోవటంతో కుటుంబసభ్యులు తలుపు తెరిచి చూడగా విగత జీవిగా కనిపించింది. దీనిపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యువతి అదృశ్యం నాగోలు: ఇంట్లో నుండి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..బండ్లగూడ ఇందు అరణ్య అపార్ట్మెంట్లో నివాసముండే సంకేపల్లి నిహారిక(28) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఈ నెల5న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి రాత్రైనా రాలేదు. కుటుంబ సభ్యు లు ఫోన్ చేయగా స్విచ్ఛా ఫ్ వచి్చంది. స్నేహితులు, బంధువులతో ఆరా తీసి నా ఫలితం లేకపోవడంతో ఆదివారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మద్యం మత్తులో డైరెక్టర్, ప్రొడ్యూసర్ కారు బీభత్సం.. చితకబాదిన స్థానికులు
కోల్‌కతా: మద్యం మత్తులో ఓ సీరియల్ డైరెక్టర్ బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో కారును వేగంగా నడుపుతూ జనంపైకి దూసుకెళ్లారు. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు పరిస్థితి విషమంగా మారింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఉదయం దక్షిణ కోల్‌కతాలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ కారు జనాలపైకి దూసుకెళ్లింది. కారు బీభత్సంలో ఒకరు మృతి చెందిగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.చితకబాదిన స్థానికులుప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రముఖ బెంగాలీ ఎంటర్టైన్మెంట్ చానల్‌కు చెందిన ఓ డైలీ సీరియల్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నట్లు తెలిపారు. ఘటన అనంతరం నిందితుల్ని స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం, వారిని పోలీసులకి అప్పగించారు.పోలీసుల విచారణలో మద్యం మత్తులో ఉన్నది బెంగాలీ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సిద్ధాంత దాస్ అలియాస్ విక్టోతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీయా బసు ఉన్నట్లు నిర్ధారించారు. ఘటనకు ముందు ఏం జరిగిందిఘటనకు ముందు డైరెక్టర్,ప్రొడ్యూసర్ తాము నిర్మించిన ఓ టీవీ షో సూపర్ హిట్ కావడంతో దక్షిణ కోల్‌కతాలోని సౌత్ సిటీ మాల్ పబ్‌లో శనివారం అర్థరాత్రి 2గంటల వరకు పార్టీ చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న పలువురు ఎవరికి వారు ఇంటికి వెళ్లిపోగా సిద్ధాంత, శ్రీయా ఇద్దరు పూటుగా మద్యం సేవించి రాత్రంతా నగరంలో డ్రైవింగ్ చేస్తూ తిరిగారు.ఆరుగురి పరిస్థితి విషమంసరిగ్గా ఆదివారం ఉదయం సుమారు 09:30 గంటల సమయంలో ప్రొడ్యూసర్,డైరెక్టర్ ప్రయాణిస్తున్న కారు ఠాకుర్‌పుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. నలుగురిని కస్తూరి నర్సింగ్ హోమ్‌కు, మరో ఇద్దరిని తీవ్ర గాయాలతో సీఎంఆర్ఐ హాస్పిటల్‌కు తరలించాం. నిందితుల వాహనాన్ని సీజ్ చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. -
క్లిక్ చేస్తే అంతే సంగతి!
మీరు సీరియస్‌గా బ్రౌజింగ్ చేస్తుండగానో... సోషల్ నెట్వర్కింగ్ సైట్లో మునిగిఉన్నప్పుడో... ఆకర్షించే విధంగా పాప్అప్స్ వచ్చాయా..? హఠాత్తుగా మీ ఈ–మెయిల్‌కు గుర్తుతెలియని అడ్రస్ నుంచి ‘ఫొటోల’తో కూడిన సందేశం వచ్చిందా..? అలాంటి వాటిని క్లిక్ చేసే ముందు ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే అవి మిమ్మల్ని నిలువునా బుక్ చేసే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. – సాక్షి, హైదరాబాద్ఆ వివరాలు అత్యంత కీలకం ఓ వ్యక్తికి చెందిన సొమ్మును ఆన్లైన్లో స్వాహా చేయడానికి సైబర్ నేరగాళ్లకు అతడి క్రెడిట్/డెబిట్ కార్డు నంబర్, సీవీవీ కోడ్‌తోపాటు కొన్ని వ్యక్తిగత వివరాలు అవసరం. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ కచ్చితంగా ఉండాల్సిందే. వీటితోపాటు ఓటీపీ సైతం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి లేకుండా ఆన్లైన్లో డబ్బు కాజేయడం సాధ్యం కాదు. సాధారణంగా ఈ వివరాల కోసంసైబర్ నేరగాళ్లు వివిధ పేర్లు, వెరిఫికేషన్లు అంటూ, బ్యాంకు అధికారుల పేర్లతో ఫోన్లు చేయడం, మెయిల్స్ పంపడంతోపాటు సూడోసైట్లు సృష్టించే వారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అశ్లీలంతో ఎర వేస్తున్నారు. యువతే టార్గెట్‌గా వెబ్సైట్లు సైబర్ నేరగాళ్ల వలలో యువకులే ఎక్కువగా పడుతున్నారు. వీరిని టార్గెట్‌గా చేసుకుని ఆకర్షించేందుకు కొన్ని అశ్లీల వెబ్సైట్లను సైతం నేరగాళ్లు సృష్టిస్తున్నారు. దీని సమాచారం, అర్ధనగ్న, నగ్న చిత్రాలతో కూడిన పాప్అప్స్ను వివిధ సామాజిక నెట్వర్కింగ్ సైట్లతోపాటు వెబ్సైట్లకు లింక్ చేస్తున్నారు. వీటికి ఆకర్షితులవుతున్న యువత వాటిని క్లిక్ చేస్తోంది. ఆ తరువాతే అసలు అంకం ప్రారంభమవుతోంది. ఆ సైట్లోకి పూర్తిగా లాగిన్ కావాలన్నా, అందులో పొందుపరిచిన వీడియోలు, ఫొటోలు ఓపెన్ కావాలన్నా కొంత రుసుం చెల్లించాలంటూ ప్రత్యేక లింకు ఇస్తున్నారు. దీంతో డబ్బు చెల్లించడానికి క్రెడిట్/డెబిట్ కార్డుల వివరాలు, నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు అందులో పూరిస్తున్నారు. నిగూఢంగా ఉండే ప్రత్యేక సాఫ్ట్వేర్ కారణంగా ఈ వివరాలన్నీ నేరుగా సైబర్ నేరగాళ్లకు చేరుతున్నాయి. ఇవన్నీ వారి చేతికి చిక్కిన తర్వాత ఇక కావాల్సింది ఓటీపీ మాత్రమే. దీనికోసం సదరు వెబ్సైట్లోనే ప్రత్యేక లింకు ఏర్పాటు చేస్తున్నారు. ఓపక్క ఈ వివరాలతో ఆన్లైన్ లావాదేవీలు పూర్తి చేసి.. ఓటీపీ వచ్చేలా ఆప్షన్ ఎంచుకుని వేచి చూస్తున్నారు. వాళ్లు తమ వెబ్సైట్లో ఓటీపీని పొందుపరిచిన వెంటనే లావాదేవీ పూర్తి చేసి ఆన్లైన్లో ఖాతాలోని డబ్బును స్వాహా చేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడే వారు వినియోగిస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉంటుండటంతో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కూడా అసాధ్యంగా మారుతోందని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. ఈ స్కామ్స్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రత్యేకంగా కొన్ని కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు. వారికి నైతికత ఉండదు ఆన్లైన్ షాపింగ్, చెల్లింపులను పూర్తి నమ్మకమైన సైట్ల ద్వారానే చేపట్టాలి. అశ్లీల సైట్లు నిర్వహించే వారికి నైతికత ఉండదన్నది గుర్తుంచుకోవాలి. అలాంటి వాళ్లు మీ కార్డులు, ఆన్లైన్ ఖాతాల వివరాలు తెలిస్తే కచ్చితంగా దురి్వనియోగం చేస్తారు. ఈ తరహా నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... నిందితులు చిక్కడం, నగదు రికవరీ కావడం అంత కష్టం. అప్రమత్తంగా ఉండటం ద్వారానే సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టొచ్చు. ఇలాంటి అశ్లీల వెబ్సైట్ల వల్ల కొన్ని సందర్భాల్లో భయంకరమైన వైరస్లు కూడా కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లలోకి వచ్చి చేరతాయి. ఫలితంగా అవి పాడవటంతోపాటు డేటా మొత్తం క్రాష్ అయ్యే ప్రమాదం ఉంటుంది. –సైబర్ క్రైమ్ అధికారులు -
Visakha: ఎట్టకేలకు టీడీపీ మహిళా నేతపై కేసు నమోదు
విశాఖ: ఓ వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో విశాఖ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి గత నెలలో దాడి చేస్తే.. ఇప్పటికి కేసు నమోదైంది. గత నెలలో సర్వసిద్ధి అనంతలక్ష్మి.. ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టింది. అది కూడా పోలీస్ స్టేషన్ లో ఆ వ్యక్తి ఉండగా దాడికి దిగింది టీడీపీ మహిళా నేత అనంతలక్ష్మి. అనకాపల్లికి చెందిన కొత్తూరు నరేంద్రను గాజువాక పోలీస్ స్టేషన్ లో నే చెప్పుతో కొట్టింది. అంతే కాదు.. తనపై కేసు పెడితే బదిలీ చేయిస్తానని అనంతలక్ష్మి బెదిరించింది. అధికారంలో ఉన్నామనే గర్వంతో పోలీసుల్నే భయపెట్టింది. ఇది జరిగి సుమారు నెల అయ్యింది. అయితే దీనిపై ఎట్టకేలకు కేసు నమోదైంది. బీఎన్ఎస్ సెక్షన్ 323 కింద కేసు నమోదు చేశారు గాజువాక సీఐ పార్థసారధి. ఇంత ఆలస్యం ఎందుకో..?అయితే టీడీపీ నేత కాబట్టి కేసు నమోదు చేయడానికి పోలీసులు అలక్ష్యం ప్రదర్శించారు. కేసును ఏదో రకంగా పక్కదారి పట్టించే యత్నం చేశారు. కాకపోతే అనంతలక్ష్మిపై కేసు ఏమైందని పలువురు పదే పదే ప్రశ్నించడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదైతే చేశారు కానీ, దాన్ని ఎంతవరకూ ముందుకు తీసుకెళతారో అనేది చూడాలి. కాలయాపన చేసి కేసును మాయం చేస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. అదే ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. టీడీపీ నేతల విషయానికి వచ్చే సరికి కళ్లముందు తప్పుకనిపిస్తున్నా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు.. ఆ నేతలు ఏం చేస్తున్నా చూస్తూ మిన్నుకుండిపోతున్నారు. అనంతలక్ష్మిపై కేసు నమోదు చేయడానికి సుమారు నెల రోజులు సమయం తీసుకోవడమే ఇందుకు ఉదాహరణ. కేసు అయితే పెట్టాం కదా అని చెప్పుకోవడానికే ఈ తతంగం నడుపుతున్నారా.. లేక నిజంగానే ఆమెపై చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. -
యూకే డాక్టర్‌నని చెప్పి.. ఏడుగురి ప్రాణాలు తీశాడు..!
భోపాల్: యూకే రిటర్న్స్ డాక్టర్ పేరుతో ఓ వ్యక్తి ఆడిన నాటకం.. ఏడుగురి ప్రాణాలు తీసింది. కార్డియాలజీ స్పెషలిస్టునని ‘ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలో ఒక ఆస్పత్రిలో జాయినయ్యాడు. ఇక అంతే స్పెషలిస్టు కదా అని .. మేజర్ ఆపరేషన్లను అతనికే అప్పగించింది ఆ ఆస్పత్రి యాజమాన్యం. అంతే అతను ఆపరేషన్లు చేసిన వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో అసలు విషయం బయటపడింది. అతను యూకే డాక్టర్ కాదని, కార్డియాలజిస్ట్ అంతకన్నా కాదనే విషయం వెలుగుచూసింది. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘంగా తీవ్రంగా స్పందించింది.డాక్టర్ ఎన్ జాన్ కెన్ పేరుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు ఓ డాక్టర్. యూకేకు చెందిన కార్డియలాజిస్ట్ నని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ చూపించడంతో అతన్ని డాక్టర్ గా అపాయింట్ చేసుకున్నారు. ఇక అంతే వరుస పెట్టి ఆపరేషన్లు చేసేస్తున్నాడు. హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లమ్ అయితే ఇక ఆపరేషన్ అంటున్నాడు. ఆ ఆస్పత్రికి ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భవా స్కీమ్ కు కూడా ఉండటంతో పేషెంట్లు కూడా ఆపరేషన్ కు సరే అంటున్నారు. ఇలా 15 ఆపరేషన్లు చేయగా, 7 గురు చనిపోయారు. దాంతో దీనిపై ఆరా తీయగా అతను ఫేక్ డాకర్ట్ అనే విషయం తెలిసింది. ఈ విషయాన్ని దామోహ్ చైల్డ్ వెల్ఫే్ కమిటీ అధ్యక్షుడు దీపక్ తివారీ వెలుగులోకి తేవడంతో ఆ డాక్టర్ అసలు కథ బయటపడింది. ఒక నెలలోనే అతను చూసిన ఏడుగురు మృతి చెందడంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది.ఫేక్ డాక్టర్ పై విచారణకు ఆదేశించాంఒక డాక్టర్ గా ఆస్పత్రిలో జాయిన్ అయి ఏడుగురు ప్రాణాలు పోవడానికి కారణమైన సదరు ఫేక్ డాక్టర్ పై విచారణ జరుగుతోందని జాతీయ మానవ హక్కుల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు తమకు ఫిర్యాదు అందిందని, ఏడుగురి ప్రాణాలు పోవడానికి కారణమైన డాక్టర్ వ్యవహారం మా దృష్టికి వచ్చింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవా స్కీమ్ కింద ఆపరేషన్ చేసి ఆ నిధుల్ని కూడా దుర్వినియోగం చేశాడు’ అని ఎన్ హెచ్ ఆర్సీ సభ్యుడు ప్రియాంక్ కనూన్ గో పేర్కొన్నారు. -
షాక్ ఇచ్చిన పోలీసులు.. పెళ్లయిన ఏడాదికి భర్తపై పోక్సో కేసు
బి.కొత్తకోట: పెళ్లయి ఏడాది గడిచి, పాప పుట్టిన తర్వాత మైనర్ బాలికను వివాహం చేశారని గుర్తించి కర్ణాటక రాష్ట్రం బట్లపల్లిలో కేసు నమోదు చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ జీవన్ గంగనాథ్‌బాబు వివరాల మేరకు.. కర్ణాటకలోని బట్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబులాపురానికి చెందిన లలితకు తల్లిదండ్రులు లేరు. ఏడాది కిందట 17 ఏళ్ల వయసులో బి.కొత్తకోట మండలం గుడిపల్లికి చెందిన మల్లి కార్జున(35)ను వివాహం చేసుకుంది.లలిత గర్భం దాల్చడంతో కర్ణాటక రాష్ట్రం చింతామణి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లింది. అక్కడి వైద్యులు వయస్సు ఆరా తీసి బట్లపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బి.కొత్తకోట మండలంలో వారు ఉండడంతో ఆ స్టేషన్‌కు బదిలీ చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో లలిత భర్త మల్లికార్జునపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ దంపతులకు ఒక పాప కూడా పుట్టింది. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
గుణదల(విజయవాడ తూర్పు): యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క్రీస్తురాజపురం ఫిల్మ్ కాలనీకి చెందిన మచ్చా సరస్వతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. భర్త చైతన్య ఆయుర్వేద వైద్యుడు వీరికి ఒక పాప, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇంటిని, చిన్న పిల్లలను చూసుకునే నిమిత్తం సరస్వతి తన అక్క కుమార్తె బల్లం శరణ్య(19)ను ఇంట్లో ఉండాల్సిందిగా కోరి తీసుకువచ్చింది. కడప జిల్లా బద్వేలుకు చెందిన శరణ్య గత మూడు నెలలుగా విజయవాడలో పిన్ని ఇంట్లో ఉంటోంది. సరస్వతి ప్రతి రోజు విధులకు మధ్యాహ్నం రెండు గంటలకు ఆసుపత్రికి వెళ్లి రాత్రి 8 గంటలకు తిరిగి వస్తుంది. శుక్రవారం యథావిధిగా ఆసుపత్రికి వెళ్లిన సరస్వతి సాయంత్రం 5 గంటల సమయంలో శరణ్యకు ఫోన్ చేసి పిల్లల గురించి అడిగే ప్రయత్నం చేసింది. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా శరణ్య ఫోన్‌కు స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి త్వరగా ఇంటి వద్దకు చేరుకుంది. ఎంత ప్రయత్నించినా తలుపు తెరవకపోవడంతో చుట్టుపక్కల వాళ్ల సహాయం కోరింది. స్థానికులు వెనుక గుమ్మం తలుపులు తీసి లోనికి ప్రవేశించగా శరణ్య ఉరికి వేలాడుతూ కని్పంచింది. సరస్వతి 108 సహాయంతో శరణ్యను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మాచవరం పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇది ముమ్మాటికీ హత్యే... శరణ్య ఉరివేసుకుని చనిపోలేదని, ఆమెను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శరణ్య కుటుంబానికి, సరస్వతి కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా ఆర్థికపరమైన గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. ఉరికి వేలాడుతున్న శరణ్య పాదాలు మంచానికి తాకుతున్నాయని, అలా చనిపోయే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. సన్నని వైర్లను గొంతుకు బిగించి ఆమెను హత్య చేశారని సరస్వతి, చైతన్యలే శరణ్య మృతికి కారణమని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. -
టెక్కీనని చెప్పి రెండో పెళ్లి
కర్ణాటక: సోషల్ మీడియాలో పరిచయమైన యువతిని ప్రేమించిన వివాహితుడు, చివరకు ఆమెను చంపిన ఘటన జిల్లాలోని హుణసూరు తాలూకా బిళికెరె ఫిర్కా బూచనహళ్లి గ్రామంలో జరిగింది. తుమకూరుకు చెందిన పవిత్ర (26)ను ఆమె భర్త సచిన్ (26) హత్య చేశాడు. కొబ్బరి బోండాల వ్యాపారి సచిన్‌కు ఆరు నెలల క్రితం ఇన్‌స్టాలో పరిచయమైన పవిత్ర తనకు ఎవరూ లేరని, తాను ఇన్ఫోసిస్‌లో టెక్కీనని చెప్పుకుంది. సచిన్‌కు అదివరకే పెళ్లయినా ఆమెతో ప్రేమాయణం నడిపాడు. చివరకు ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో తాళికట్టాడు.రోజూ ఆఫీసుకు డ్రాప్సచిన్ ఆమెను మైసూరులోని ఇన్ఫోసిస్‌లో రోజూ డ్రాప్ చేసి వచ్చేవాడు. పవిత్ర పెద్దమ్మగా చెప్పుకున్న ఆమెకు సచిన్ ఫోన్ చేయగా, పవిత్ర ఎవరో తమకు తెలియదని చెప్పింది. ఆమె అన్నగా చెప్పుకున్న వ్యక్తితో మాట్లాడగా, పవిత్రకు ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకుందని తెలిపాడు. ఆమె ఇన్ఫోసిస్ ఉద్యోగిని కాదని, ఆమె వద్ద ఉన్నది నకిలీ ఐడీ కార్డు అని తెలుసుకున్నాడు. తనను నమ్మించేందుకు ఉత్తుత్తిగా ఆఫీసుకు వెళ్తోందని తెలిసి రగిలిపోయాడు. దీనిపై భార్యను ప్రశ్నించగా గొడవ జరిగింది. చివరకు బయట టిఫిన్ తిందాం రా అని భార్యను ఆటోలో తీసుకెళుతూ మార్గమధ్యంలో పొలంలోకి తీసుకెళ్లి పవిత్రకు తాడుతో గొంతు బిగించి చంపాడు. ఓ బాలుడు కూడా ఇందుకు సహకరించాడు. తరువాత సచిన్ బిళికెరె పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. స్థలాన్ని ఎస్పీ విష్ణువర్ధన్, ఏఎస్పీ మాలిక్, డీఎస్పీ గోపాలకృష్ణ, ఇన్స్పెక్టర్ లోలాక్షి చేరుకుని పరిశీలించారు. నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.భార్యను గొంతుకోసి హతమార్చిన భర్తబొమ్మనహళ్లి: భార్యను నడిరోడ్డుపై చాకుతో గొంతు కోసి హత్య చేసిన భర్త ఉదంతం బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని దొడ్డతోగూరులో శుక్రవారం రాత్రి జరిగింది. ఆగ్నేయ విభాగం డీసీపీ సారా ఫాతిమా విలేకరులకు తెలియజేసిన వివరాలు.. బాగేపల్లికి చెందిన కృష్ణ, శారద (35) దంపతులు దొడ్డతోగూరులో ఉంటున్నారు. శారద పనికివెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. కృష్ణ మరో మహిళపై మోజులో పడ్డాడు. ఈక్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించాడు. శుక్రవారం రాత్రి శారద పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రగతి నగరలో దారి కాచిన కృష్ణ రెండు చాకులతో దాడి చేశాడు. భార్యను కింద పడేసి గొంతు కోసి హత్య చేసి ఉడాయిస్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి నిందితుడు కృష్ణను అరెస్ట్ చేశారు. హత్యోదంతంపై విచారణ చేపట్టామన్నారు. దారుణ హత్యతో స్థానికంగా తీవ్ర కలకలం ఏర్పడింది. -
ఆట నేర్పడు.. బాలికలతో ఆడుకుంటాడు
కర్ణాటక: ఓ క్రీడా శిక్షకుడు కామాంధునిగా మారి కటకటాలు లెక్కిస్తున్నాడు. మైనర్ బాలికపై దారుణానికి పాల్పడిన కేసులో బ్యాడ్మింటన్ కోచ్‌ను బెంగళూరు హుళిమావు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితడు సురేశ్ బాలాజీ (26), వివరాలు.. ఇటీవలే టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన బాలిక సెలవులు రావడంతో హుళిమావులోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. బాలిక 2 ఏళ్లుగా సురేశ్ బాలాజీ అనే బ్యాడ్మింటన్ కోచ్ వద్ద ఆట నేర్చుకుంటోంది. తమిళనాడుకు చెందిన ఇతడు బెంగళూరులో స్థిరపడ్డాడు. ఆట నేర్పించే నెపంతో అతడు బాలికను మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడేవాడు, ఎవరికై నా చెబితే హత్య చేస్తానని బెదిరించేవాడు.ఇలా గుట్టురట్టుఇటీవల బాలిక అమ్మమ్మ మొబైల్ ద్వారా నిందితునికి నగ్న చిత్రాలు, వీడియోలు పంపుతోంది. అమ్మమ్మ గమనించి బాలికను నిలదీయడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితున్ని అరెస్టు చేశారు. అతని మొబైల్ఫోన్ని పోలీసులు తనిఖీ చేయగా 8 మంది బాలికల నగ్న ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. దీంతో వారి మీద కూడా అత్యాచారాలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. కోచ్ తనను కనీసం 25 సార్లు అతని గదికి తీసుకెళ్లాడని బాలిక విచారణలో తెలిపింది. బాలికల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఇతడు దురాగతాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుని విచారణలో మరిన్ని నిజాలు బయటపడే అవకాశముంది. -
నెల క్రితమే నిశ్చితార్థం.. జీవితాన్ని మలుపు తిప్పిన విహారం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మరికొన్ని నెలల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్న జంటకు ఊహించని అనుభవం ఎదురైంది. ఏదో సరదాగా అమ్యూజ్మెంట్ పార్క్‌కు వెళ్లడమే వారి జీవితాన్ని మలుపు తిప్పింది. పార్క్‌లో జరిగిన ప్రమాదంలో తనకు కాబోయే భార్య చనిపోయింది.వివరాల ప్రకారం.. నిఖిల్ అనే వ్యక్తికి ప్రియాంక(24)తో కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఈ క్రమంలో వారిద్దరికీ ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. మరికొన్ని నెలల్లో వారికి పెళ్లి జరిగాల్సి ఉంది. అయితే, ఇద్దరూ సరదాగా తిరుగొద్దామని నైరుతి ఢిల్లీలోని కపషెరా ప్రాంతంలో ఉన్న ఫన్ అండ్ ఫుడ్ విలేజ్‌కు వెళ్లారు. కాసేపు అక్కడ తిరిగిన తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగిపోయింది. దీంతో, ప్రియాంక ఎత్తులో నుంచి కింద పడిపోయింది.దీంతో వెంటనే కాబోయే భర్త నిఖిల్ ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో, ఒక్కసారిగా నిఖిల్ కుప్పకూలిపోయి కన్నీటిపర్యంతమయ్యాడు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మృతిచెందిన ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ఈఎన్టీ రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు అయినట్టు వైద్యులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. చాణక్యపురికి చెందిన ప్రియాంక.. నోయిడాలోని సెక్టార్ 3లోని ఒక టెలికాం కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. Delhi | A 24-year-old woman, Priyanka lost her life after falling from a roller coaster ride at Fun and Food Village in the Kapashera area of Delhi yesterday. She reportedly lost her balance and fell from the ride, sustaining severe injuries. Despite being rushed to a nearby…— ANI (@ANI) April 5, 2025 -
నా భార్య నన్ను టార్చర్ పెడుతోంది.. ‘ఇక నాకు చావే శరణ్యం’
భువనేశ్వర్ : ‘నాకు పెళ్లై రెండేళ్లవుతుంది. పెళ్లైన నాటి నుంచి నా భర్య నన్ను మానసికంగా వేధిస్తోంది. ఆమె వేధింపుల్ని తట్టుకోలేకపోతున్నా. ఇక నాకు చావే శరణ్యం’ అంటూ ఓ భర్త కదులుతున్న ట్రైన్ ఎదురు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆ దుర్ఘటన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈస్ట్ కోస్ట్ డివిజన్ రైల్వే పోలీసుల వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం ఖోర్ధాజిల్లా కుంభార్బస్తా (Kumbharbasta) కు చెందిన రామచంద్ర బర్జెనా కదులుతున్న ట్రైన్ నుంచి ప్రాణాలు తీసుకున్నాడు. దుర్ఘటనకు ముందు ఓ వీడియోను తన సెల్ఫోన్లో రికార్డ్ చేశాడు.ఆ వీడియోలో ‘నేను రామచంద్ర బర్జెనాను. నేను కుంభార్బస్తాలో ఉంటాను. ఇవాళ నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. అందుకు కారణం నా భార్య రూపాలీనే. రూపాలీ నన్ను మెంటల్ టార్చర్ చేస్తోంది. ఇక నేను బ్రతకలేను’ అని విలపిస్తూ వీడియోలో చెప్పాడు. వీడియో తీసిన అనంతరం, నిజిఘర్-తపాంగ్ రైల్వే ట్రాక్ సమీపంలో కదులుతున్న రైలు ముందు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రామచంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు రామచంద్ర, రూపాలీకి రెండేళ్ల క్రితం వివాహమైంది. వారికో కుమార్తె. అయితే, పెళ్లైన నాటి నుంచి భార్య రూపాలి.. భర్త రామచంద్రను మానసికంగా వేధిస్తుండేది. అది సరిపోదున్నట్లు మెట్టినింట్లో చిచ్చుపెట్టేది. ఇవన్నీ తట్టుకోలేక రామచంద్ర ప్రాణాలు తీసుకున్నాడు. రామచంద్ర ఆత్మహత్యపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు రామచంద్ర తీసిన వీడియో ఆధారంగా భార్య రూపాలీని అరెస్ట్ చేశారు. Odisha: Unable to endure relentless torture from his wife, a young man tragically ended his life. The incident occurred in Kumarabasta village of Khordha district. The deceased has been identified as Ramchandra Badjena. Before his death, Ramchandra posted a video on social media,… https://t.co/hmwt0hzaEx— ସତ୍ୟାନ୍ୱେଷୀ/सत्यान्वेषी/Satyanweshi (@imsatyanweshi) April 5, 2025 రామచంద్ర ఆత్మహత్య తర్వాత అతని తల్లిదండ్రులు.. కోడలు రూపాలీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నా కుమారుడు రామచంద్రకు రూపాలీతో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి కూడా మా ఇంట్లోనే అంగరంగ వైభవంగా చేశాం. పెళ్లైన నాటి నుంచి రూపాలీ నా కొడుకుని చిత్ర హింసలు పెట్టేది. పాప పుట్టింది. తరుచూ మెట్టి నుంచి పుట్టింటికి వెళ్లేది. పుట్టింటికి వెళ్లకపోతే నన్ను నా కుటుంబ సభ్యుల్ని దూషిస్తుండేది. అయినప్పటికీ, అత్త కుటుంబసభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రూ.20లక్షలు అప్పుగా ఇచ్చాం. కానీ రూపాలీ తీరు మారలేదు. నా కొడుకు ఆమె చేతిలో నరకాన్ని అనుభవించాడు. ఆమె క్రూరత్వానికి ఫలితం ఇదే. మాకు న్యాయం చేయండి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
Hyderabad : ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం
హైదరాబాద్: బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల్లంతైన ఆరుగురు కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారి ఆచూకీ కనిపెట్టేందుకు బోయిన్పల్లి పోలీసులు ప్రత్యేక బృందాన్ని విజయవాడ పంపించారు. ఆరుగురిలో ఒక్కరి వద్దే సెల్‌ఫోన్ ఉండగా అది కూడా స్విచ్చాఫ్ కావడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కొంత కష్టంగా మారినట్లు తెలుస్తోంది.బోయిన్‌పల్లికి చెందిన మహేశ్ తన భార్య ఉమ, ముగ్గురు పిల్లలు రిషి, చైతు, శివన్, మరదలు సంధ్యతో కలిసి ఈ నెల 1న ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయారు. రెండు రోజుల అనంతరం మహేశ్ బావమరిది బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలు పెట్టారు. మహేశ్ కుటుంబం 1వ తేదీన బోయిన్పల్లి నుంచి నేరుగా, ఇమ్లీబన్‌కు చేరుకుని అక్కడ విజయవాడకు వెళ్లే గరుడ బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మరుసటి రోజు ఉదయం విజయవాడలో దిగినట్లు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయింది.సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బాలంరాయి పంప్‌హౌజ్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మహేశ్, తోటి ఉద్యోగులతో ముభావంగానే ఉండేవాడని తెలుస్తోంది. మహేశ్ కుమారుడు ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో తీర్థయాత్రలకు వెళ్లి ఉండచ్చొని మహేశ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వీరి గల్లంతుకు గల ఇతరత్రా కారణాలు ఏవైనా ఉంటాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. గల్లంతయిన వారి ఆచూకీ తెలిశాకే పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
Banjara Hills: అడిగిన పాట వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా..
హైదరాబాద్ : తాను కోరిన పాటను ప్రసారం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ యువతి బెదిరించడంతో ఛానల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఓ టీవీ ఛానెల్ రోజూ మ్యూజిక్ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేస్తుంది. ఓ యువతి ఈ కార్యక్రమానికి ప్రతిరోజూ ఫోన్ చేస్తూ ఒకే పాటను కోరుకుంటుంది.ఒకసారి ప్రసారం చేసిన తర్వాత కూడా మళ్లీ ఫోన్ చేసి అదే పాట కావాలంటూ పట్టుబడుతూ నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఫోన్లో అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే బాగుండదంటూ హెచ్చరించేది. తాజాగా శనివారం ఫోన్ చేసిన ఆమె నేను కోరిన పాటను వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో ఆందోళన చెందిన టీవీ నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలు యువతికి కత్తిపోట్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పట్టపగలు ఇంటికెళ్లి యువతిపై ఒక దుండగుడు దాడిచేసి కత్తితో పొడిచిన ఘటన విజయనగరం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. గరివిడి మండలంలోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, 18 ఏళ్ల యువతికి నానమ్మ, తల్లిదండ్రులు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత రెండేళ్లుగా ఇంటివద్దే ఉంటోంది. ఉదయం 9:30 గంటల సమయంలో ఇంటి వద్ద వంట పాత్రలు శుభ్రం చేస్తున్న యువతిపై ఓ యువకుడు ముసుగు (మంకీ క్యాప్) ధరించి వచ్చి దాడి చేశాడు. కత్తితో కడుపు పక్క భాగంలో రెండుచోట్ల పొడిచాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు పరారయ్యాడు. ఇంటికి ఎదురుగానే ఉంటున్న బూర్లె ఆదినారాయణ అనే యువకుడే ఈ దాడికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దిరోజులుగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఇందుకు కారణం. పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్న నలుగురు యువకుల్లో ఆదినారాయణ కూడాఉన్నట్లు తెలిసింది. దెబ్బతిన్న కాలేయం, ఊపిరితిత్తులు తీవ్ర రక్తస్రావంతో ఘటన జరిగిన వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని స్థానికులు 108 వాహనంలో తొలుత ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దాడిలో కాలేయం భాగం దెబ్బతిన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లోనూ రక్తస్రావం కావడంతో ఊపిరి తీసుకోవడానికి యువతి ఇబ్బందిపడుతోంది.బాధితురాలికి వైఎస్సార్సీపీ అండబాధితురాలికి అండగా ఉండాలన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సత్యలత ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైద్య ఖర్చుల నిమిత్తం పార్టీ తరఫున యువతి కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అండగా ఉంటామని చెప్పారు. -
వైఎస్సార్సీపీ నాయకుడు ప్రతాపరెడ్డిపై హత్యాయత్నం
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇందూరు ప్రతాపరెడ్డిపై ఆయన సొంత గ్రామం గోవిందపల్లెలో శనివారం హత్యాయత్నం జరిగింది. ప్రతి శనివారం తన ఇంటి సమీపంలోని దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించడం ప్రతాపరెడ్డికి ఆనవాయితీ. ఇది గమనించిన టీడీపీ మూకలు ఉదయం నుంచి దేవాలయం సమీపంలో కాపుకాసారు. ప్రతాపరెడ్డి దేవాలయంలో పూజ చేస్తుండగా వెనక వైపు నుంచి కత్తులు, గొడ్డళ్లతో నరికారు.అక్కడే ఉన్న ప్రతాపరెడ్డి మనువరాలుసహా సమీపంలో ఉన్న వారు భయంతో పరుగులు తీయగా ప్రతాపరెడ్డి దేవాలయంలోనే కుప్పకూలి పోయారు. దీంతో ఆయన మృతిచెందారని భావించిన దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుటుంబీకులు పరుగున అక్కడకు వచ్చి గ్రామస్థుల సహాయంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆయనను నంద్యాల వైద్యశాలకు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఘటనలో ఇద్దరు పాల్గొన్నట్లు నిర్ధారణ అవుతోందని పేర్కొన్నారు. వారిలో ఒకరు గ్రామానికి చెందిన రవిచంద్రారెడ్డి కాగా మరొకరు కొత్త వ్యక్తిగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. గతంలో జరిగిన జంట హత్యల కేసులో రవిచంద్రారెడ్డి ప్రధాన నిందితుడు కాగా.. ఈ కేసులో ప్రతాపరెడ్డి ప్రధాన సాక్షిగా ఉన్నారన్నారు. ఈ కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో ప్రతాపరెడ్డిని హతమార్చేందుకు యత్నించినట్లు కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. నాడు ప్రతాపరెడ్డి అన్న ప్రభాకర్‌రెడ్డి హత్య గత టీడీపీ ప్రభుత్వంలో అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో ఆధిపత్యం కోసం 2017 మే 6వ తేదీన వైఎస్సార్సీపీ నాయకుడు ప్రతాపరెడ్డి అన్న ఇందూరు ప్రభాకర్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. టీడీపీ నాయకులు నిందితులుగా ఉన్న ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన సాక్షి ప్రతాపరెడ్డి. రాజీకి రావాలని ప్రయత్నించినప్పటికీ ఒప్పుకోకపోవడంతో ఆయనను కూడా అంతమొందిస్తే, సాక్ష్యంతో పాటు గ్రామంలో ఆదిపత్యం చెలాయించవచ్చని భావించే హత్య చేసేందుకు యత్నించినట్లు గ్రామంలో చర్చించుకుంటున్నారు. కాగా,హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉండటంతో ప్రతాపరెడ్డికి ప్రాణహాని ఉంటుందని భావించిన గత ప్రభుత్వం, పోలీస్ శాఖ గన్‌మెన్‌ను కేటాయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గన్‌మెన్‌ను తొలగించింది. -
ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపుతావా.. లేదా.. ? భర్తపై భార్య దాడి
గ్వాలియర్: ఇది భార్య భర్తల మధ్య చోటు చేసుకున్న రగడ. అత్తను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయమని డిమాండ్ చేస్తోంది కోడలు. అందుకు కొడుకు ఒప్పుకోవడం లేదు. అమ్మను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయడమేంటని పట్టుపట్టుకుని కూర్చున్నాడు. ఇక్కడ ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదని భార్యకు తేల్చిచెప్పాడు. ఇది గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సంఘర్షణ. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. తన మాట విననందుకు కుటుంబ సభ్యుల్ని పిలిపించింది భార్య. ఈ విషయంలో భర్తతో అమీతుమీ తేల్చుకోవడాని సిద్ధమైంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో ఆమె భర్త గొడవపడ్డాడు.. అయితే భర్తపై భార్య తరఫు బంధువులు దాడికి దిగారు. తన కొడుకును ఒక్కడిని చేసి దాడి చేస్తున్నారని తల్లి పరుగెత్తుకొచ్చింది. కొడుకును రక్షించాలని తాపత్రాయపడింది. మరి కోడలు ఊరుకుంటుందా.. అత్తను జట్టు పట్టుకుని కిందకు పడేసింది. పడిపోయిన అత్తపై మళ్లీ మళ్లీ దాడి చేసింది సదరు కోడలు.వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్ కు చెందిన విశాల్ బత్రా, నీలిక భార్యా భర్తలు. వీరితో కలిసి విశాల్ తల్లి ఉంటోంది. 70 ఏళ్లు పైబడ్డ వయుసులో కొడుకును ఆశ్రయించింది. తన తల్లిని చూసుకోవాలనే బాధ్యతను గ్రహించిన విశాల్.. తల్లిని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. అయితే కోడలు ఊరుకోలేదు. ఎంతకాలం ఈ ముసలామెను ఇంట్లో ఉంచుతావంటూ భర్తతో పదే పదే గొడవ పడేది. ఇలా ఏడాదికి పైగానే గడిచింది. ఎంతకాలమైనా తన వద్దే తల్లి ఉంటుందని భర్త తెగేసి చెప్పాడు. దాంతో ఆగ్రహించిన భార్య.. తన బంధువుల్ని గొడవకు పురామాయించింది. ఎలాగైనా సరే అత్తను ఇంట్లో నుంచి పంపించాలని భీష్మించుకుని కూర్చొంది. విశాల్ ఇంటికి వచ్చిన ‘పెద్దలు’( భార్య తరప/ బంధువులు) అతనిపై దాడికి పూనుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి విశాల్ పై దాడికి దిగారు. దీన్ని చూసిన విశాల్ తల్లి దాన్ని ఆపడానికి యత్నించింది. ఇక్కడ కోడలు అమాంతం అత్త మీదకు దూకి ఆ పెద్దామెను జట్టు పట్టుకుని ఈడ్చేసింది. ఈ క్రమంలోనే ఆమె కిందపడిపోయినా మళ్లీ మళ్లీ దాడి చేసింది. ఈ ఘటనను ఇండియన్ ప్రైవేట్ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ తో సహా పలు జాతీయ చానళ్లు వెలుగులోకి తెచ్చాయి.Gwalior, Madhya Pradesh: An incident occurred in Adarsh Colony, where a video of a daughter-in-law, along with her brother, assaulting her mother-in-law and husband went viral. pic.twitter.com/BmhTQZllPr— IANS (@ians_india) April 4, 2025 నా భార్య వేధిస్తోంది.. చివరకు దాడి చేసింది..దీనిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన విశాల్.. బయట మీడియాతో మాట్లాడారు. ‘ నేను నా ఇంటిలో దాడికి గురయ్యాను. సుమారు 10 నుంచి 15 మంది వరకూ నా ఇంటికి వచ్చి నన్ను, మా అమ్మపై దాడి చేశారు. నా తల్లిని బయటకు పంపేయమని నా భార్య వేధిస్తోంది. దీన్ని నేను కాదనడంతో నాపై దాడికి చేయించింది. నీలిక సోదరుడు, తండ్రి కలిసి మమ్మల్ని దారుణంగా కొట్టారు. ఈ విషయంలో భార్య నీలిక నన్ను రోజూ తీవ్రంగా తిడుతూ ఉంటోంది. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ ఆఫీస్ కు వచ్చాను’ అని విశాల్ తెలిపాడు. -
రాజమండ్రి నాగాంజలి కేసు.. ఎన్నో అనుమానాలు?
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బొల్లినేని కిమ్స్‌లో మృతి చెందిన ఫార్మసిస్ట్ నాగాంజలి కేసులో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకుందన్న సమయంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఏం జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు. ఈ సమయంలో నాగాంజలికి ఏం జరిగిందో వాస్తవాలు వెల్లడికాలేదు. సాయంత్రం 6:30 నుండి 8:30 మధ్యలో నాగాంజలికి ఎలాంటి చికిత్స జరిగింది?. ట్రీట్మెంట్ ఎవరిచ్చారు?. వార్డు నెంబర్ 802లో నాగాంజలికి అనస్థీషియా ఇంజెక్షన్ ఎవరు చేశారో? ఇప్పటివరకు స్పష్టం కాలేదు.బాధితురాలు తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. ఆ రూమ్‌లో సీసీ ఫుటేజ్ ఏమైనట్టు?. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే దీపక్‌తో పాటు ఎవరెవరు ఈ దారుణానికి సహకరించారో బయటపడే అవకాశం ఉంది. సంఘటన జరిగిన రోజు సాయంత్రం 6:30కు అంజలి ఫోన్‌తో దీపక్ క్యాజువాలిటీకి ఎందుకు వచ్చాడు?. ఆసుపత్రి యాజమాన్యం సకాలంలో ట్రీట్మెంట్ చేస్తే అంజలి బతికేదా?. నాగాంజలిది ఆత్మహత్యా? లేక హత్యా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.కాగా, మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి నిన్న(శుక్రవారం) ఉదయం తుది శ్వాస విడిచింది. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది. -
మరో పదిహేను రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. అంతలోనే విషాదం
గండేపల్లి/జగ్గంపేట(కాకినాడ): మరో పదిహేను రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. ఈ నేపథ్యంలో కొత్త దుస్తులు కొనుక్కుని.. ఎంతో ఆనందంగా తిరిగి వస్తున్న ఆ యువకుడిపై మృత్యువు కన్నెర్ర చేసింది. లారీ రూపంలో దూసుకువచ్చి, అతడి ఆయువు హరించేసింది. పెళ్లి చేసుకుని, కొడుకు, కోడలు చిలకాగోరింకల్లా తమ కళ్ల ముందు తిరుగుతూంటే చూసి మురిసిపోవాలనుకున్న కలలు కల్లలు కావడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతేలేకుండా పోయింది. ఈ విషాద ఘటన వివరాలివీ.. గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన చిక్కాల కాటమస్వామి, సావిత్రి దంపతులకు కుమార్తె, కుమారుడు చిక్కాల శ్రీను (28) ఉన్నారు. కుమార్తెకు గతంలోనే వివాహం చేశారు. శ్రీను ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తండ్రి కాటమ స్వామి వ్యవసాయం చేస్తున్నారు. శ్రీనుకు గోకవరం మండలం మల్లవరం గ్రామానికి చెందిన అమ్మాయితో ఈ నెల 20న వివాహం చేయాలని నిశ్చయించారు. శనివారం శ్రీను పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు, పెళ్లి వేడుకలకు అవసరమైన దుస్తులు కొనుగోలు చేసేందుకు స్నేహితుడితో కలిసి, శ్రీను శుక్రవారం మోటార్ సైకిల్‌పై పెద్దాపురం వెళ్లాడు. అక్కడ మిత్రులిద్దరూ కొత్త దుస్తులు కొనుకున్నారు. సాయంత్రం ఆనందంగా ఇంటికి తిరిగి వస్తూండగా, వారి బైక్‌ను జగ్గంపేట మండలం కాట్రావులపల్లి పెట్రోల్ బంకు వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీను (28) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మోటార్ సైకిల్‌పై ఉన్న స్నేహితుడు స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై జగ్గంపేట ఎస్సై రఘునాథరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లింట పెను విషాదం శ్రీను పెళ్లి సమయం సమీపిస్తూండటంతో కుంటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే పెళ్లి దుస్తుల కోసం వెళ్లిన వరుడు శ్రీను రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే సమాచారంతో కుటుంబం తల్లడిల్లిపోయింది. పుట్టిన రోజు వేడుక, పెళ్లి సంబరాలతో ఆనందం నిండాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. పరిసరాల్లో విషాదం నెలకొంది. అందరితోనూ స్నేహభావంతో ఉండే శ్రీను మృతి అందరినీ కలచి వేసింది. -
పూజలకు పీరియడ్స్ ఆటంకం, తప్పు జరిగిందంటూ..
నవరాత్రి వేడుకలను నిష్టగా ఆచరించేందుకు ఆ వివాహిత ఏడాదిగా ఎదురుచూస్తూ వచ్చింది. తీరా ఆ సమయం వచ్చేసరికి అందులో పాల్గొనలేకపోయింది. ఆ బాధతోనే మానసికంగా కుంగిపోయింది. తన బదులు ఆ పూజలు చేసేందుకు భర్త సైతం సిద్ధం అయ్యాడు. అయినా కాని ఆమె కోలుకోలేకపోయింది. చివరకు.. ఏకంగా ప్రాణమే తీసుకుంది!. ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని పన్నా లాల్ గొల్లా కువాన్ ప్రాంతంలో ప్రియాంషా సోని(36).. భర్త ముఖేష్ సోనీ, పిల్లలు జాన్వి, మాన్విలతో కలిసి నివసిస్తుంది. అయితే, ప్రియాంషా సోనికి దుర్గాదేవి అంటే అపరామైన భక్తి. ప్రతి ఏడాది ఎంతో ఇష్టంగా నవరాత్రి వేడుకలు జరుపుకునేది. అలాగే, ఈసారి నవరాత్రి వేడుకలు నిర్వహించుకోవాలని అంతా సిద్ధం చేసుకుంది. భర్త ముఖేష్‌తో చెప్పి పూజకు కావాల్సిన సామాగ్రిని ఏర్పాటు చేసుకుంది.మార్చి 30వ తేదీన చైత్ర నవరాత్రి ప్రారంభమైంది. అయితే మొదటి రోజే ప్రియాంషాకి పీరియడ్స్ వచ్చింది. దీంతో ఆమె నవరాత్రి పూజల్లో పాల్గొనలేకపోయింది. ఏడాదిగా ఆ పూజ కోసమే ఎదురు చూసిన ఆమె.. నాటి నుంచి తీవ్రంగా కుంగిపోయింది. ఇది సహజంగా జరిగేదే అని భర్త ముఖేష్ సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినప్పటికి ఆమె వినిపించుకోలేకపోయింది. బదులుగా తాను పూజలు చేస్తానని చెప్పినా వినలేదు. తప్పు జరిగిపోయిందంటూ ఏడుస్తూ ఉండిపోయింది. దీంతో పుట్టింట్లో అయినా ఆమె సంతోషంగా ఉంటుందని భావించి కొన్నాళ్లు ఉండమని దింపి వచ్చాడు. అయితే.. తల్లిదండ్రులు ఓదార్చిన ఆమె ఆ బాధ నుంచి బయటపడలేకపోయింది. ఈ బాధలోనే చనిపోవాలని విషం తాగింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి, చికిత్స కోసం ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. అయితే, ఇంటికి వచ్చాక ప్రియాంషా ఆరోగ్యం మరోసారి క్షీణించింది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా, అక్కడి చికిత్స పొందుతూ, బుధవారం మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
Vadodara Case: ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో షాకింగ్ విషయాలు
గాంధీనగర్: వడోదరా కారు ప్రమాదం కేసులో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడు రక్షిత్ చౌరాసియా తానేం మద్యం సేవించి బండి నడపలేదంటూ మొదటి నుంచి వాదిస్తున్నాడు. అయితే.. తాజాగా తేలింది ఏంటంటే అతను, అతని స్నేహితులు గంజాయి తీసుకుని కారు నడిపారని!.మార్చి 13వ తేదీన హోలీనాడు వడోదరా కరేలీబాగ్లోని అమ్రపాలి చౌరస్తాలో ఘోరం చోటు చేసుకుంది. 23 ఏళ్ల న్యాయ విద్యార్థి రక్షిత్ చౌరాసియా తన ఇద్దరు స్నేహితులతో కలిసి కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలు వాహనాలకు మీదకు దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించగా.. మరో ఏడుగురుకి గాయాలయ్యాయి. ఈ ఘటన అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యింది. అంతేకాదు.. ఘటన తర్వాత కూడా చౌరాసియా ఏదో మత్తులో జోగుతూ ‘‘ఇంకో రౌండ్.. ఇంకో రౌండ్.. ఓం నమఃశివాయ’’ అంటూ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో అతను మద్యం సేవించి బండి నడిపి ఉంటాడని అంతా భావించారు. అయితే ఆ వాదనను అతను, ఆ టైంలో అతనితో పాటు మరో ఇద్దరు స్నేహితులు తోసిపుచ్చుతూ వచ్చారు. ఘటన జరిగిన మరుసటిరోజే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతనిది ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌గా పోలీసులు ప్రకటించారు. అయితే కారు గుంతలో పడిపోయి ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నాయని.. అందువల్లే తనకేం కనబడక ఆ ప్రమాదం జరిగిందని రక్షిత్ వాదించాడు. కావాలంటే బాధిత కుటుంబాన్ని తాను పరామర్శించి.. పరిహారం అందజేస్తానంటూ ప్రకటించాడు. ఈ క్రమంలో.. వాళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ(FSL) 20 రోజుల తర్వాత ప్రాథమిక నివేదిక వెల్లడించింది. అందులో రక్షిత్ గంజాయి సేవించి ఉన్నారని తేలింది. దీంతో ఎడీపీఎస్( Narcotic Drugs and Psychotropic Substances) యాక్ట్ 1985 ప్రకారం పోలీసులు రక్షిత్‌తోపాటు అతని స్నేహితులపైనా కేసు నమోదు చేశారు. అలాగే.. రక్షిత్‌పై మోటార్ వెహికిల్స్ యాక్ట్‌లోని సెక్షన్ 185 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇప్పటికే రక్షిత్ వడోదరా సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అతని స్నేహితుడిని తాజాగా అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాని, అతని కోసం గాలింపు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.Law student's reckless driving during Holi celebrations leaves one dead, seven injured in Vadodara. Driver admits to consuming bhang before crash#VadodaraCrash #RoadSafety #DrunkDriving #HoliTragedy #GujaratNews #JusticeForHemali #RecklessDriving #TrafficAccident #StudentCrime pic.twitter.com/2y3SgdC78P— The Source Insight (@DSourceInsight) March 15, 2025 -
భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య
యశవంతపుర: కుటుంబ కలహాలకు ఓ కుటుంబమే కడతేరింది. ప్రభుత్వ ఉద్యోగి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కలబురగి పట్టణం జీవర్గి రోడ్డులోని కెహెచ్బీకాలనీ అపార్ట్మెంట్లో బుధవారం జరిగింది. సంతోష్ కోరళ్లి(45) అనే వ్యక్తికి బీదర్‌కు చెందిన శృతి(32)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈయన జెస్కాంలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి మునిశ్(9), మూడు నెలల అనిశ్ అనే సంతానం ఉన్నారు. శృతి పుట్టింటికి వెళ్లే విషయంలో బుధవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఇదే విషయాన్నిసంతోష్ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. కాగా తనను పుట్టింటికి పంపకపోతే చావో రేవో తేల్చుకుంటానని శృతి పేర్కొంది. విచక్షణ కోల్పోయి భార్య, ఇద్దరు పిల్లలను గొంతుపిసికి హత్య చేశాడు. అనంతరం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలబురగి నగర కమిషనర్ డాక్టర్ శరణప్ప ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్టేషన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు. మానసిక సమస్యలతో సంతోష్ ఈ అకృత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కలబురగి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు. -
కర్ణాటకలో ఘోర ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని జీపు కొట్టిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలోని జీవరగి సమీపంలో శనివారం తెల్లవారుజామున లారీని అధిక వేగంతో వస్తున్న జీపు అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు దుర్మరణం చెందారు, పది మందికి పైగా గాయాలయ్యాయి. బాగల్ కోట నుంచి కలబుర్గిలోని హజరత్ కాజా గరీబ్ నవాజ్ దర్గాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. Kalaburagi, Karnataka | Five people died and 10 injured after a van rammed into a parked truck near Nelogi Cross in Kalaburagi district at around 3.30 am. The deceased have been identified as residents of Bagalkote district. The injured have been admitted to Kalaburagi Hospital.… pic.twitter.com/3i04s2SNVF— ANI (@ANI) April 5, 2025 -
క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు
మేడ్చల్‌రూరల్: క్రికెట్ ఆడుతూ ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కండ్లకోయలోని సీఎంఆర్‌ఈసీ కళాశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సీఎంఆర్‌ఈసీ కళాశాలతో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడేందుకు కళాశాల ఆవరణలోని గ్రౌండ్‌కు వెళ్లాడు. ఆటలో భాగంగా ఫీల్డింగ్ చేస్తున్న వినయ్ గుండపోటు రావడంతో ఒక్కసారిగా గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. తోటి విద్యార్థులు అతడిని సమీపంలోని సీఎంఆర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడు వినయ్ ఖమ్మం జిల్లాకు చెందిన పేద విద్యార్థి .. తల్లిదండ్రులు రోజు కూలీ చేస్తూ తమ కుమారుడిని ఉన్నత చదువు చదివిస్తున్నట్లు తెలిసింది. -
ఐదేళ్ల క్రితం అంత్యక్రియలు.. ఇప్పుడు ప్రత్యక్షం
కర్ణాటక: భార్య అదృశ్యమైంది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య మరణించిందటూ ఓ మృతదేహానికి భర్త అంత్యక్రియలు పూర్తి చేశారు. మా కూతురిని హత్య చేశాడంటూ అనుమానంతో అత్తంటివారు ఫిర్యాదు చేయటంతో భర్తను కేసు పెట్టి జైలుకు పంపారు. ఎలానో శిక్ష నుంచి బయట పడ్డారు. ఇదీ కథ కాదు. ఐదేళ్లు క్రితం జరిగిన యద్దార్థ ఘటన. ఇప్పుడు ఆ భార్య ప్రియునితో కలిసి ప్రత్యక్షమైంది. ఈ విచిత్ర సంఘటన కొడగు జిల్లా కుశాలనగర తాలూకా బసవనహళ్లి గ్రామంలో జరిగింది. ఓ రోజు మిస్సింగ్ కుశాలనగర తాలూకా బసవనహళ్లికి చెందిన సురేశ్, మల్లిగె దంపతులు కూలిపని చేసుకుని జీవిస్తుండగా వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఒక రోజు మల్లిగె అదృశ్యమైంది. ఆమె ఆక్రమ సంబంధం కారణంగా వెళ్లిపోయిందని భర్త చెప్పేవాడు. ఓ రోజు మల్లిగెకి ఫోన్ చేసి నాతో సంసారం చేయకున్నా పర్వాలేదు. ఇద్దరు పిల్లలున్నారు. చూసుకోవడానికైనా రావాలని మల్లిగెని ప్రాధేయ పడ్డాడు. ఆమె మనసు కరగలేదు. చివరికి సురేశ్ 2021లో కుశాలనగర పోలీసులకు మిస్సింగ్ అని ఫిర్యాదు చేశాడు. 2022లో శవం లభ్యం 2022లో సురేశ్‌కు కుశాలనగర పోలీసులు ఫోన్ చేసి మీ భార్య మృతదేహం లభించినట్లు సమాచారం ఇచ్చారు. పిరియాపట్టణ పోలీసులు సురేశ్‌తో పాటు మల్లిగె తల్లి గౌరిని తీసుకెళ్లి బెట్టదపురలో ఓ అస్తిపంజరాన్ని చూపించగా ఇది మల్లిగెది అని గుర్తించారు. అక్కడే అంత్యసంస్కారంను పూర్తి చేయించారు. తన అల్లుడే ఆమెను చంపాడని అత్త గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సురేశ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రెండేళ్లు తరువాత డీఎన్ఎ పరీక్షల రిపోర్ట్ రాగా, ఎవరి శవమో అని తెలియడంతో సురేశ్ జైలు నుంచి బయట పడ్డారు. ఇలా దొరికింది ఇలా ఉండగా మల్లిగె ఈ నెల 1ను తన ప్రియునితో కలిసి మడికేరిలోని ఒక హోటల్‌కు వెళ్లింది. అక్కడ సురేశ్ స్నేహితులు ఆమె ఫోటో తీసి సురేశ్‌కు, పోలీసులకు పంపారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా తను ప్రియునితో కలిసి వెళ్లినట్లు వెల్లడించింది. మల్లిగెని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజర్ పరిచి మైసూరు జైలుకు తరలించారు. అప్పట్లో లభించిన శవం ఎవరిది, అన్యాయంగా సురేశ్‌ను జైలుకు పంపారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తాయి. -
మొదటి భార్యకు విడాకులపై నాటకం
కర్ణాటక: మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని నకిలీ దాఖలాలను సృష్టించిన వ్యక్తి రెండో పెళ్లి చేసుకోగా రెండో భార్య వద్ద నుంచి సుమారు రూ.50 లక్షలకు పైగా నగదు తీసుకొని పరారైన సంఘటన నగరంలోని కువెంపునగర పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మోసకారి వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొని వంచనకు గురైన బాధితురాలు రోజా ఆనే మహిళ కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలోని కువెంపు నగరలో లేడీస్ పీజీని నిర్వహిస్తున్న రోజా ఆనే మహిళ మొదటి భర్త నుంచి కొన్ని కారణాలతో విడాకులు తీసుకుంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. తన కుమారుడికి అండగా ఉండటం కోసం రెండో పెళ్లి చేసుకోడానికి డైవర్స్ మ్యాట్రిమోనిలో యాప్ ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేరళకు చెందిన త్రిశూర్‌లో నివాసం ఉంటున్న శరత్ రామ్ రోజాను పరిచయం చేసుకున్నాడు. తనకు పెళ్లి అయిందని, మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చానని నకిలీ దాఖలాలు రోజాకు చూపించాడు. దాంతో శరత్రామ్ను నమ్మిన రోజా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందే షికార్లు ఇద్దరు కలిసి పెళ్లికి ముందు షికార్లు తిరిగారు. శారీరకంగాను కలిశారు. పెళ్లి ఘనంగా వద్దని రిజిస్టర్ పెళ్లి చెసుకుందామని ఆనుకున్నారు. ఈ సందర్బంగా తనకు వ్యాపారం కోసం అని విడతల వారీగా రోజా వద్ద నుంచి సుమారు రూ.50 లక్షల వరకు నగదును తీసుకున్నాడు. అనంతరం లేడీడిస్ పీజీలో వచ్చిన డబ్బు కూడా తీసుకున్నాడు. రోజా పేరుతో రెండు కంపెనీలు పెట్టి ఆందులో ప్రజల నుంచి డబ్బులు సేకరించి వారిని కూడా మోసం చేశారు. పెళ్లి చేసుకుందామని కోరుతున్నా వాయిదా వేస్తూ వచాచడు. దాంతొ ఆనుమానం పెంచుకున్న రోజా ఆతని విడాకులు నిజమా, కాదా? అని న్యాయవాది ద్వారా విచారిందగా అవి నకిలీ అని, అతను విడాకులు తీసుకోలేదని మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని రోజా ప్రశ్నించడంతో తననే ఎదిరిస్తావా? ఆని రోజా పైన దాడి చేసి కొట్టి పారిపోయాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రైలుకిందపడి నర్సు ఆత్మహత్య
సికింద్రాబాద్: ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఒక యువతి మౌలాలి–చర్లపల్లి రైల్వేస్టేషన్ మధ్య గల రైల్వే ట్రాక్‌పైకి వచ్చింది. ఆమెను గుర్తించిన కీ మ్యాన్ వారిస్తున్నా వినకుండా మౌలాలి నుంచి చర్లపల్లి వైపు వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలు వరంగల్ ఉర్సుకు చెందిన రవికుమార్ కుమార్తె మాదారపు లత (30)గా గుర్తించారు. హన్మకొండలోని శ్రీలక్ష్మి ఆసుపత్రిలో ఆమె నర్సుగా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని, గతంలోనూ ఇంట్లో చెప్పకుండా మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లిందని, సమాచారం అందుకుని తాము తిరిగి ఇంటికి తీసుకువచ్చినట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వచ్చిందని, చర్లపల్లి వైపు వెళుతుందని తాము ఊహించలేదన్నారు. ఇదిలా ఉండగా మృతురాలి హ్యాండ్‌బ్యాగులో లభించిన లేఖలో హిందూ సంప్రదాయం ప్రకారం తన అంత్యక్రియలు నిర్వహించాలని పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. -
నేను డీఎస్పీని..పదండి పోలీస్‌స్టేషన్‌కు..
హైదరాబాద్: నంబర్ ప్లేట్ లేని కారుకు పోలీస్ స్టిక్కర్ తగిలించుకుని వెళ్లిన ఆగంతకులు గదిలో ఉన్న ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన యువకులను కిడ్నాప్ చేసి అచ్చంపేటకు తీసుకువెళ్లి చితకబాదిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కడప జిల్లాకు చెందిన భూమిరెడ్డి కిషోర్‌రెడ్డి టీవీ నటులు ఇంద్రాణి, మేఘనలకు పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. టీవీ సీరియళ్లకు డ్రైవర్‌గా పనిచేస్తున్న సందీప్‌రెడ్డి, ఓ తెలుగు ఛానల్లో కాస్ట్యూమర్‌గా పనిచేస్తున్న పల్లె శివ ముగ్గురూ కలిసి శ్రీకృష్ణానగర్‌లో అద్దెకు ఉంటున్నారు. అచ్చంపేట సమీపంలోని బీకే ఉప్పనూతల గ్రామానికి చెందిన శివ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగు రోజుల క్రితం పెద్దలకు చెప్పకుండా పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె సోదరుడు సోహెల్‌తో పాటు మరో ఇద్దరు యువకులు గురువారం రాత్రి కిషోర్‌రెడ్డి గదికి వచ్చారు. తాము పోలీసులమని, శివ ఆచూకీ చెప్పాలని అతడిని చితకబాదారు. తమకు ఏమీ తెలియదని చెప్పినా వినిపించుకోకపోగా, తాము పోలీసులమంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పదండి అంటూ కిషోర్, సందీప్‌లను కారులో ఎక్కించుకుని తక్కుగూడకు తీసుకెళ్లి మళ్లీ కొట్టి, ఫోన్లు లాక్కున్నారు. అక్కడి నుంచి ఉప్పనూతల గ్రామానికి తీసుకెళ్లడంతో అప్పటికే అక్కడ అప్పటికే రెండు కార్లలో సిద్ధంగా ఉన్న మరో 10 మంది యువకులతో కలిసి వారిని మరోసారి తీవ్రంగా కొట్టారు. అనంతరం బాధితులను అచ్చంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. టీవీ నటి ఇంద్రాణికి కిషోర్ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించింది. బాధితులు కూడా అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విషయాన్ని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీసుల నగరానికి తిరిగి వచ్చిన కిషోర్, సందీప్ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సోహెల్, ఇబ్బూతో పాటు ప్రియురాలి పెదనాన్న, వారి బంధుమిత్రులపై కేసు నమోదు చేశారు. కిషోర్, సందీప్‌లను కిడ్నాప్ చేసింది నకిలీ పోలీసులని తేల్చారు. అమ్మాయి అడ్రస్ కనుక్కునేందుకు వారిని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బలైపోయిన అంజలి
సాక్షి, రాజమహేంద్రవరం / కంబాలచెరువు /బుట్టాయగూడెం : ఆత్మహత్యా యత్నం చేసి.. మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి (22) తుది శ్వాస విడిచింది. రాజమహేంద్రవరంలోని కిమ్స్ (బొల్లినేని) ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ వేధింపులు తట్టుకోలేక 12 రోజుల క్రితం ఆమె హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితికి చేరిన ఆమె అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతోంది. ఆమెకు అదే కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రోజురోజుకూ ఆమె మెదడు పనితీరు క్షీణిస్తూ.. ఇతర అవయవాల పనితీరు సన్నగిల్లుతూ వచ్చింది. గురువారం రాత్రి పూర్తి విషమంగా మారడంతో ప్రభుత్వాస్పత్రి వైద్య బృందం కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించింది. అదే సమయంలో ఆమెకు గుండె సమస్య అధికమైంది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చి, గుండె ఆగిపోవడంతో నాగాంజలి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడేనికి తీసుకెళ్లారు. దీపక్ వేధింపుల వల్లే దారుణం ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుంది. దాని ప్రభావంతో అక్కడే స్పృహ తప్పి కుప్పకూలిపోయింది. ఆ ఇంజక్షన్ చాలా హానికరమైనది కావడంతో కొద్ది నిమిషాలకే కోమాలోకి వెళ్లిపోయింది. అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది. ఈ క్రమంలో అంజలి రాసిన సూసైడ్ నోట్ ఆ మరుసటి రోజు అంటే.. గత నెల 24న బయటకు వచ్చిoది. దీంతో ఆమె తీసుకున్న ఇంజక్షన్ ఏమిటనే విషయం బహిర్గతమైంది. తన ఆత్మహత్యాయత్నానికి కారణం ఎవరన్నది ఆ లేఖలో ఆమె స్పష్టంగా రాయడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు దీపక్‌ను అరెస్టు చేశారు. బాధితురాలికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినప్పటి నుంచి ఆమెకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఆది నుంచీ ఆ కుటుంబానికి అండగా నిలిచింది. నాగాంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పూర్తి న్యాయ సహాయం అందిస్తామని కూడా చెప్పారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆస్పత్రికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు సైతం రోడ్డెక్కారు. ఆందోళనకు తలొగ్గిన ప్రభుత్వం.. నాగాంజలి ఆరోగ్య పరిస్థితిపై 28న ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. వారు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఘటన జరిగిన తర్వాత నాగాంజలి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల పరామర్శించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. నాగాంజలిని దారుణంగా హింసించి, ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన దీపక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రౌతుగూడెంలో ప్రజల ఆందోళన నాగాంజలి మృతితో ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంబులెన్స్‌లో ఆమె మృతదేహం గ్రామానికి చేరుకునే సమయానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అంజలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘వి వాంట్ జస్టిస్’ అంటూ ఫ్లెక్సీలు పట్టుకుని ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగాంజలి మృతి పట్ల వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంతాపం తెలిపారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నాగాంజలిని పొట్టన పెట్టుకుందిఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపాటు నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త కావడం వల్లే ప్రభుత్వ నిర్లక్ష్యం సాక్షి, అమరావతి: రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతికి కూటమి ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అ«ధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన దీపక్ ఏజీఎంగా ఉన్న ఆస్పత్రిలోనే బాధితురాలికి చికిత్స చేయొద్దని, వేరే ఆస్పత్రికి తరలించాలని వైఎస్సార్సీపీ కోరినా, ఆమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం కళ్యాణి మీడియాతో మాట్లాడారు. తన ఆత్మహత్యకు కిమ్స్ ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యాయత్నం చేసినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించక పోవడం దారుణం అని అన్నారు. నిందితుడు దీపక్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినందునే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ‘గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేస్తే.. ఈ 12 రోజుల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితల్లో ఏ ఒక్కరూ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఆమె కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు’ అని వరుదు కళ్యాణి విమర్శించారు. వీళ్ల వాగ్దానాలన్నీ మాటలకే పరిమితమని, చేతల్లో చేసేదేం ఉండదని అర్థం అవుతోందన్నారు. -
రాజమండ్రి నాగాంజలి కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యకు కారణమైన నిందితుడు దీపక్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నాగాంజలిని పెళ్లి చేసుకుంటానని చెప్పి దీపక్ లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి పేరుతో విషయం బయటకు చెప్పకుండా బాధితురాలిని కట్టడి చేశాడు. దీపక్ మాటలను అమాయకంగా నమ్మిన బాధితురాలు.. వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమెను దీపక్ రెండు,మూడు సార్లు కొట్టాడు. దీపక్ అకృత్యాలను తండ్రికి, రూమ్మేట్లకు సైతం నాగాంజలి తెలియనివ్వలేదు.ఈ నెల 23న దీపక్‌కు కాల్ చేసి పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. చనిపోవాలంటే చనిపోవచ్చని.. తనకు ఇబ్బందిగా ఉందంటూ దీపక్ కర్కశంగా వ్యవహరించాడు. తాను మోసపోయినట్టు గుర్తించిన నాగాంజలి.. తీవ్ర మానసిక వేదన అనుభవించింది.కాగా, దీపక్‌కు పెళ్లయి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2010లో బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో దీపక్ చేరాడు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్‌లో ఉన్నాడు.రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, గత 28 నుంచి నాగాంజలిని వ్యైదుల బృందం పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఉదయమే పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇప్పటివరకు ఫార్మసీ విద్యార్థిని ఘటనకు సంబంధించి ప్రభుత్వం, మంత్రులు స్పందించకపోవడం గమనార్హం. -
ఇన్‌స్టా క్వీన్.. ఉద్యోగం ఊడింది
సోషల్ మీడియాలో ఇన్‌స్టా క్వీన్(Insta Queen)గా పేరున్న సీనియర్ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్‌ను పంజాబ్ పోలీస్ శాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. అంతేకాదు.. ఇంతకాలం ఆమె విలాసాలకు కారణం ఏంటన్న గుట్టు కూడా ఎట్టకేలకు వీడింది. పంజాబ్‌లో మాదకద్రవ్యాల కట్టడికి అక్కడి ఆప్ ప్రభుత్వం యుధ్ నాశేయన్ విరుధ్ డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో పక్కా సమాచారంతో.. బాదల్ ఫ్లైఓవర్ వైపు వేగంగా వెళ్తున్న ఓ వాహనాన్ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అందులో మరో వ్యక్తితో పాటు అమన్‌దీప్ కౌర్(Amandeep Kaur) కూడా ఉండగా.. వాళ్ల వద్ద 17 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రాథమిక చర్యల కింద మాన్సా పీఎస్ నుంచి బథిండా పోలీస్ లైన్స్‌కు ఎటాచ్ చేశారు. View this post on Instagram A post shared by Kaur deep (@police_kaurdeep) అయితే.. దర్యాప్తులో డ్రగ్స్ రవాణాలో ఆమె పాత్ర ఉందని తేలడంతో గురువారం డిస్మిస్ చేస్తూ పంజాబ్ పోలీస్ శాఖ ఉత్తర్వులు వెలువరించింది. police_kaurdeep పేరిట ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉంది. థార్ కారులో కూర్చుని.. ఖరీదైన వాచీలను ధరించి పాటలు పాడుతూ ఐఫోన్లలో రీల్స్ చేస్తూ వస్తోంది. ఫాలోవర్స్ తక్కువే అయినా ఆమె ఇచ్చే బిల్డప్లకు ఇన్‌స్టా క్వీన్‌గా ఆమెకు ఓ పేరు అయితే ముద్రపడింది. అయితే.. View this post on Instagram A post shared by Kaur deep (@police_kaurdeep) అమన్‌దీప్ కౌర్ ఇంతకు ముందు కూడా వార్తల్లోకి ఎక్కారు. గుర్మీత్ కౌర్ అనే మహిళ ఆమెపై గతంలో సంచలన ఆరోపణలు చేసింది. అమన్‌దీప్ దగ్గర రూ.2 కోట్ల విలువైన బంగ్లా.. లక్షలు విలువ చేసే ఖరీదైన వాచీలు, కార్లు ఉన్నాయని ఆరోపించింది. ఆంబులెన్స్ డ్రైవర్ అయిన తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఆ ఆంబులెన్స్‌లోనే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తోందని ఫేస్బుక్లో ఆరోపిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే అప్పట్లో ఆ ఆరోపణలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరెవరికి రవాణా చేశారు? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. -
గూగుల్ మ్యాప్‌తో రాంగ్ టర్న్!
వాళ్లంతా ఒకే ఏరియాలో ఉండే స్నేహితులు. సరదా ట్రిప్పు కోసం కారులో కొద్ది దూరం వెళ్లారు. కానీ, తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వాళ్లలో ఇద్దరిని కబళించింది. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు.. ఇదంతా గూగుల్ మ్యాప్(Google Map) చేసిన నిర్వాకమనే విషయం తెలిసి కంగుతిన్నారు.ఢిల్లీ-లక్నో హైవేపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన కారు-ట్రక్కు ప్రమాదంలో విస్తుపోయే విషయం ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. గూగుల్ మ్యాప్ చూపించినట్లుగా ముందుకెళ్లిన కారు.. అనూహ్యంగా ట్రక్కు ఢీ కొట్టడంతో ప్రమాదానికి గురైందని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారని ఎన్డీటీవీ ఒక కథనం ఇచ్చింది.హర్యానా రోహ్తక్కు చెందిన శివాని, సిమ్రాన్, రాహుల్, సంజూలు నైనిటాల్‌లోని నీమ్ కరోలీ బాబా ఆశ్రమ్‌కు వెళ్లి తిరిగొస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి టైంలో బైపాస్ గుండా వెళ్లాల్సిన కారు.. అనూహ్యాంగా ఢిల్లీ వైపు మలుపు తిరిగింది. అంతలో రామ్‌పూర్ నుంచి ఢిల్లీ వైపు వేగంగా వెళ్తున్న సిమెంట్ దిమ్మెలతో కూడిన ట్రక్కు వీళ్ల కారును బలంగా ఢీ కొట్టింది. ఆ ప్రమాద తీవ్రతకు ట్రక్కు బోల్తా పడగా.. కారు నుజ్జు అయ్యి ట్రక్కు కింద ఇరుక్కుపోయింది. దీంతో క్షగాతత్రులు సాయం కోసం కేకలు వేశారు.సుమారు 15 మంది(ట్రక్కు డ్రైవర్‌తో సహా).. దాదాపు గంట సేపు అతికష్టం మీద శ్రమించి కారులో ఉన్న నలుగురు క్షతగాత్రులను బయటకు తీశారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావమైన శివాని, సిమ్రాన్‌లు అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ టైంలో డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి దగ్గర ఫోన్ గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఉంది. బహుశా ఆ రాంగ్ టర్నే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావించిన పోలీసులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుల నుంచి అదే విషయాన్ని ధృవీకరించుకున్నారు. -
కాన్పు కోసం వచ్చి మాయం.. ఆపై బస్టాండ్‌లో ప్రత్యక్షం
కాకినాడ, సాక్షి: కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ.. ఉన్నట్లుండి ఆస్పత్రి నుంచి మాయమైంది. ఆందోళనకు గురైన భర్త, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే.. కొన్నిగంటల తర్వాత ఆమె ఆచూకీ లభ్యమైంది. అయితే తనకు బలవంతంగా ప్రసవం చేసి పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారంటూ ఆమె కన్నీళ్లు పెడుతుండడంతో ఇటు భర్త, అటు పోలీసులు షాక్‌కు గురయ్యారు. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన కుప్పిశెట్టి సంధ్యారాణికి నెలలు నిండడంతో కాన్పు కోసం రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నాం చేర్పించారు. కాసేపటికే ఆసుపత్రి బయట వాకింగ్ చేస్తూ హఠాత్తుగా ఆమె అదృశ్యమైంది. ఆందోళనకు గురైన భర్త లోవరాజు.. రాజమండ్రి త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో రాత్రి కాకినాడ ఆర్టీసి బస్టాండ్ వద్ద సంధ్యారాణీ ఆచూకీ లభించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను కారులో అపహరించారని, తనకు ఇంజెక్షన్ ఇచ్చి డెలివరీ చేశాక పుట్టిన కవలలను ఎత్తుకెళ్లారని సంధ్యారాణీ ఏడుస్తూ చెబుతోంది. అనంతరం ఆమెను కాకినాడ జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందించారు. అయితే ఆమె చెబుతున్న విషయాలు నిజమో కాదో తెలుసుకునేందుకు.. శుక్రవారం ఉదయం ఆమెను పోలీసులు రాజమండ్రికి తరలించారు. ఈ క్రమంలో సీసీఫుటేజీ కీలకంగా మారిందని పోలీసులు చెబుతున్నారు. ఓ ఆటోలో ఆమె ఎక్కి వెళ్తున్నట్లుగా దృశ్యాలు అందులో రికార్డు అయినట్లు కనిపిస్తోంది. -
పల్నాడులో ఘోరం.. వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
పల్నాడు, సాక్షి: కూటమి పాలనలో టీడీపీ గుండాలు మరో దారుణానికి తెగబడ్డారు. కిడ్నాప్ చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్త హరిచంద్రను దారుణంగా హతమార్చారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రెండు రోజుల కిందట నాగార్జునసాగర్ లోని హిల్ కాలనీలో పింఛన్ తీసుకోవడానికి వెళ్లిన హరిచంద్ర తిరిగి రాలేదు. టీడీపీ నేతలు కొందరే ఆయన్ని కిడ్నాప్ చేసినట్లు తర్వాత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనను చంపేస్తారేమో అని ఆందోళన వ్యక్తం చేశారు కూడా. చివరకు.. టీడీపీ నేతలే చంపేసి ఆ మృతదేహాన్ని ఆయన పొలంలోనే పడేశారు. -
ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
పూర్వవిద్యార్థులందరూ కలిసి కొన్ని ఏళ్లు, దశాబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నారంటే.. ఎవ్వరికైనా సరే చాలా మంచి ముచ్చటగా అనిపిస్తుంది. ఎంతోకాలం కిందట కలిసి చదువుకుని, కొన్ని సంవత్సరాలుగా.. ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు తెగిపోయిన పరిస్థితుల్లో బతుకుతెరువు బాటలో పడి యాంత్రికంగా గడుపుతున్న జీవితాలకు.. అలాంటి ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఒక మంచి నవనీత లేపనంలా అనిపిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే అలూమ్ని, గెట్ టుగెదర్ కాన్సెప్టులతో వచ్చిన మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, 93 లాంటి సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయాల్ని నమోదు చేశాయి.ప్రస్తుతం ఆధునిక సాంకేతికత, కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సోషల్ మీడియా తదితర అనేక కారణాల వల్ల.. పాత కాలం మిత్రుల ఆచూకీ కనిపెట్టడం సులువుగా మారుతున్న తరుణంలో.. ఇంకా ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళ్లనాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. యాభయ్యేళ్ల కిందట కలిసి చదువుకున్న వృద్ధులు కూడా.. ఇలాంటి సమావేశాలు నిర్వహించుకుంటూ.. అప్పటికి జీవించి ఉన్న తమ గురువులను ఆహల్వానించి సత్కరించుకుంటూ.. తమ తమ అప్పటి ఆనందానుభూతులను నెమరు వేసుకుంటూ గడుపుతున్నారంటే.. ఆ పూర్వవిద్యార్థుల సమ్మేళనాలకు ఉన్న ప్రాధాన్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.అయితే.. ఇలాంటి సమ్మేళనాలకు కొన్ని వికృత ఫలితాలు కూడా ఉంటాయని తెలిస్తే మనం నివ్వెరపోతాం. ఆత్మీయ సమ్మేళనాల పుణ్యమాని చిన్నప్పటి ప్రేమానుబంధాలు తిరిగి మొగ్గతొడిగే సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. పరిస్థితుల్ని బట్టి వారి మధ్య ఆత్మీయ బంధాలు బలపడుతుంటాయి. కానీ.. పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో హైస్కూలు జీవితం నాటి ప్రియుడి కాంటాక్ట్ దొరకడం, దానిని వాడుకుంటూ భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం కొనసాగించడం అనేది వింటేనే వెగటు పుట్టిస్తుంది. అలాంటిది.. ఆ ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం అన్నెం పున్నెం ఎరుగని, తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను ఒక తల్లి తన చేతులతోనే కడతేర్చిందంటే.. మనం నిర్ఘాంతపోతాం. కడుపు మండుతుంది. పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు ఇలాంటి వికృత ఫలితాలను కూడా ఇస్తున్నాయా? అని ఆవేదన చెందుతాం. సంగారెడ్డిలో వెలుగుచూసిన సంఘటన సమాజంలో పతనమవుతున్న నైతిక విలువల తీరును, ఒక మంచి అనుభూతి కోసం జరిగే మంచి పనులను ఎలాంటి వికృత పోకడలతో భ్రష్టు పట్టిస్తున్నారనే వైనాన్ని తెలుసుకోవడానికి మంచి ఉదాహరణ అవుతోంది.సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో ఇటీవల ఒక దారుణం జరిగింది. రజిత- చెన్నయ్య దంపతుల పిల్లలు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. తల్లి రజిత కడుపునొప్పితో విలవిల్లాడుతూ ఆస్పత్రి పాలైంది. భర్తతో తగాదాలు, కుటుంబ సమస్యల కారణంగా ఆమె ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి పెట్టి చంపేసి, తాను ఆత్మహత్యకు పాల్పడిందని తొలుత పోలీసులు భావించారు. భర్త పాత్రపై అనుమానాలు వచ్చాయి. షాపు నుంచి తెచ్చిన పెరుగు కలిపి పెట్టానని, అంతకుమించి ఇంకేం తెలియదని ఆ తల్లి బుకాయించే ప్రయత్నమూ చేసింది. కానీ అసలు వాస్తవాలు నెమ్మదిగా వెలుగులోకి వచ్చాయి.రజిత అలియాస్ లావణ్య ఇంటర్మీడియట్ చదువుతుండగా 2013లో చెన్నయ్యతో పెళ్లయింది. వారికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ కలిగారు. ఆరునెలలుగా రజిత టెన్త్ క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల ఆ ఆత్మీయ సమ్మేళనం కూడా జరిగింది. అప్పటినుంచి.. హైస్కూలు నాటి ప్రియుడు శివతో ఆమె అనుబంధం పెరిగింది. అది వివాహేతర సబంధానికి దారితీసింది. పెళ్లిచేసుకోమని అడిగింది. అయితే ముగ్గురు పిల్లల తల్లిని ఎలాచేసుకుంటానంటూ శివ తిరస్కరించాడు. పిల్లల అడ్డు తొలగితే పోతుందని వారిద్దరూ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పిల్లలను చంపేస్తే ఆ నేరం భర్త మీదకు వెళుతుందని కూడా ప్లాన్ చేసినట్టు వినిపిస్తోంది. మొత్తానికి రజిత.. పెరుగన్నంలో విషం కలిపి ముగ్గురు పిల్లలకు తినిపించి, వారి గొంతు నులిమి చంపేసింది. తాను కడుపునొప్పితో బాధపడుతున్నట్టుగా నాటకమాడింది గానీ.. పోలీసుల విచారణలో బాగోతం మొత్తం బయటపడింది. వివాహేతర సంబంధం కోసం, ప్రియుడితో శాశ్వతంగా కలిసి ఉండడం కోసం పిల్లల్ని తల్లులే కడతేర్చే దుర్మార్గాలు మనం ఇంకా అనేకం సమాజంలో చూస్తున్నాం. కానీ.. అలాంటి ఒక దుర్మార్గానికి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మూలకారణం కావడం ఇక్కడ శోచనీయమైన విషయం.పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు ఎంతో గొప్పవి. జీవితంలో పసితనం నాటి స్నేహాలు, ప్రేమలు, ఆప్యాయతలు కొన్ని దశాబ్దాల యెడబాటు తర్వాత.. మళ్లీ చిగురించడం మానసికంగా గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి గెట్ టుగెదర్ కార్యక్రమాల వల్ల.. యాంత్రికంగా మారుతున్న జీవితాల్లో తిరిగి జీవనోత్సాహాన్ని నింపుకోగలుగుతారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చాలాచోట్ల బాగా సక్సెస్ అవుతుంటాయి. అయితే ఇంత మంచి కార్యక్రమాలు కూడా కొన్ని వికృత ఫలితాలకు దారితీస్తున్నాయని తెలిస్తే బాధ కలుగుతుంది. రజిత- శివ లాంటి వాళ్లు ఇలాంటి కార్యక్రమాలనే సాటి సమాజం అనుమానించే విధంగా చేస్తున్నారనడంలో సందేహం లేదు. నైతిక, సామాజిక విలువల స్పృహ లేకపోవడం మనుషుల్ని ఎంతకైనా దిగజారుస్తుందని తెలుసుకోవడానికి, అమృతాన్ని అందించిన క్షీరసాగరమధనంలోంచే గరళం కూడా పుడుతుందని గ్రహించడానికి ఇది మంచి ఉదాహరణ.:: ఎం.రాజేశ్వరి -
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతిచెందింది. బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, గత 28 నుంచి నాగాంజలిని వ్యైదుల బృందం పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఉదయమే పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇప్పటివరకు ఫార్మసీ విద్యార్థిని ఘటనకు సంబంధించి ప్రభుత్వం, మంత్రులు స్పందించకపోవడం గమనార్హం.జరిగింది ఇదీ.. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి చావుబతుకుల్లో ఉన్న ఫార్మసీ ఫైనలియర్ విద్యార్థిని కేసు దర్యాప్తు దారి తప్పుతోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ఈ ఘటన జరిగితే మూడు రోజులు గోప్యంగా ఉంచడం గమనార్హం. బాధిత విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ టీడీపీలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్నందున కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేయగా.. కూటమి సర్కారు మొద్దు నిద్రపై మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఓ మహిళ హోంమంత్రిగా ఉండి కూడా పరామర్శించకపోవడం.. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కిమ్స్ ఆస్పత్రి వద్ద ధర్నా చేశాయి.తన చెల్లిని ఇక్కడకు ఎలా వచ్చిందో అలాగే తమకు ప్రాణాలతో అప్పగించాలని బాధిత విద్యార్థిని అక్క కన్నీళ్లతో వేడుకుంది. పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ వెంటనే ఆసుపత్రికి రావాలని డిమాండ్ చేసింది. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా ఈ విషయం తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారని, దాని అర్థం ఇదేనా? అని నిలదీసింది.నిందితుడు టీడీపీ నేతలకు బంధువు.. ఈ కేసులో అరెస్టయిన కిమ్స్ ఏజీఎం దీపక్ కాకినాడ జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది అవుతాడని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుగ్గా పని చేశాడు. నిందితుడు మరో టీడీపీ నేతకు అల్లుడు కూడా కావడంతో ఈ కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని, దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో విద్యార్థిని ఆరోగ్యం విషమంగానే ఉందని, బ్రెయిన్‌కు పూర్తిగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో డ్యామేజ్ ఎక్కువగా ఉందని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. వెంటిలేటర్ ఉన్నందున బీపీ, హార్ట్‌బీట్, పల్స్ నార్మల్‌గా ఉన్నట్లు వెల్లడించారు. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు. -
టీచర్‌తో వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లులున్నా ప్రియుడే కావాలని..
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలో గత నెల 31వ తేదీన అర్ధరాత్రి హత్యకు గురైన పార్ధసారథి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు గురువారం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని జగదీశ్ కాలనీలో నివాసం ఉండే తాటి పార్ధసారథికి స్వప్నతో వివాహం జరగగా వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వప్నకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏటపాక మండలం నెల్లిపాకలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సొర్లాం వెంకట విద్యాసాగర్‌తో పరిచయం ఉంది. స్వప్న తల్లిగారి ఇంటి ప్రాంతంలో వెంకట విద్యాసాగర్ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండగా 2016లో స్వప్నకు పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం పార్ధసారథికి తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. పార్ధసారథి హెచ్చరించినా స్వప్న పట్టించుకోలేదు.ఈ క్రమంలోనే పార్ధసారథికి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎంజేపీలో హెల్త్ సూపర్వైజర్ ఉద్యోగం రాగా గతేడాది ఫిబ్రవరి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. సెలవుల సమయంలో ఇంటికి వెళ్లి వస్తుండగా అప్పుడప్పుడు స్వప్నకు వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. అయితే వివాహేతర సంబంధానికి భర్త అడ్డు ఉన్నాడని, అతడిని ఎలాగైనా అంతమొందించాలని స్వప్న తన ప్రియుడు వెంకట విద్యాసాగర్‌కు చెప్పింది. దీంతో వెంకట విద్యాసాగర్.. కొత్తగూడెం మండలానికి చెందిన తెలుగూరి వినయ్‌కుమార్, శివశంకర్, ఏటపాక మండలానికి చెందిన వంశీతో మాట్లాడి పార్ధసారథిని హత్య చేయించాలని పథకం రచించించారు.దీంతో, ముగ్గురు వ్యక్తులకు రూ.5 లక్షలు సుపారీగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉగాది, రంజాన్ సెలవుల కోసం పార్ధసారథి కొత్తగూడెం వచ్చి మార్చి 31వ తేదీన సాయంత్రం దంతాలపల్లికి వెళ్లే క్రమంలో కొత్తగూడెంలో దంపతులు షాపింగ్ చేశారు. అనంతరం పార్ధసారథి తన బైక్‌పై బయలుదేరాక స్వప్న వెంటనే వెంకట విద్యాసాగర్‌కు ఫోన్ చేసి తన భర్త వెళ్తున్న సమాచారం తెలిపింది. దీంతో సుపారీ గ్యాంగ్ ఓ కారును అద్దెకు తీసుకుని పార్ధసారథిని వెంబడిస్తూ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలోకి చేరుకోగానే అడ్డగించి దారుణంగా హత్య చేశారు.ఈ కేసులో పార్ధసారథి భార్య స్వప్న, ప్రియుడు వెంకట విద్యాసాగర్‌ను అరెస్ట్ చేయగా వినయ్‌కుమార్, శివశంకర్, వంశీ పరారీలో ఉన్నారని తెలిపారు. అదే విధంగా ఏడాది క్రితం పార్ధసారథిపై దాడి జరిగిన ఘటనలో రెక్కీ నిర్వహించినట్లు కూసం లవరాజు అనే వ్యక్తిని గుర్తించగా అతడు కూడా పరారీలో ఉన్నారన్నారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు సర్వయ్య, సూర్యప్రకాశ్, హథీరాం,నరేందర్, రవికుమార్, ఎస్సైలు దీపిక, మురళీధర్, సతీశ్, ఐటీకోర్ పీసీ సుమన్, క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ బృందం సభ్యులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
పండగ పూట విషాదం.. బావిలోకి దిగి ఎనిమిది మంది మృతి
భోపాల్: శివపార్వతుల్ని స్మరించుకుంటూ జరుపుకునే సంప్రదాయ పండుగ పర్వదినాన మధ్యప్రదేశ్‌లో (madhya pradesh) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఖాండ్వా జిల్లాలో చారుగావ్ మఖాన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండావత్ గ్రామంలో 150ఏళ్ల పురాతన బావిని శుభ్రం చేస్తున్న 8 మంది భక్తులు మృత్యువాత పడ్డారు.పోలీసు ఉన్నతాధికారుల సమాచారం మేరకు.. రాష్ట్రంలో ప్రతిఏడాది హిందూ సంప్రదాయ పద్దతిలో శివపార్వతులను (Lord Shiva Parvati) స్మరించుకుంటూ గంగోర్ (Gangaur festival) అనే పండుగను నిర్వహిస్తుండడం ఆనవాయితీ. అయితే, ఎప్పటిలాగే ఈ ఏడాది సైతం రాష్ట్రంలోని కొండావత్ గ్రామంలో భక్తులు గంగోర్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పండుగ సంప్రదాయంలో భాగంగా దేవుళ్ల విగ్రహాల్ని గంగాజలంలో నిమజ్జనం చేయాల్సి ఉంది. ఇందుకోసం గ్రామానికి చెందిన అతి పురాతన బావిలో విగ్రహాల్ని నిమజ్జనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఒక్కొక్కరుగా బావిలోకి దిగి ముందుగా బావిలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసేందుకు గురువారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అందులోకి దిగాడు. బావి నుంచి విషవాయివులు వెలువడడంతో ఊపిరాడక బావిలోనే మరణించారు. బావిలోకి దిగిన ఎంత సేపటికీ అతని జాడ తెలియకపోవడంతో అతన్ని రక్షించేందుకు ఒక్కొక్కరుగా బావిలో దిగారు. అలా ఒక్కరి ప్రాణాల్ని రక్షించేందుకు వెళ్లిన మొత్తం ఎనిమిది మంది గ్రామస్తులు మరణించినట్లు ఖాండ్వా కలెక్టర్ రిషవ్ గుప్తా, ఎస్పీ మనోజ్ కుమార్ రాయ్ ప్రకటించారు. నాలుగు గంటల పాటు శ్రమించిబావిలోకి దిగిన గ్రామస్తుల ఆచూకీ గల్లంతు కావడంతో వారిని రక్షించేందుకు జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు, ఎసీఆర్ఎఫ్ బృందాలు తరలివచ్చాయి. నాలుగు గంటల పాటు శ్రమించి బావిలోనే ప్రాణాల్ని కోల్పోయిన గ్రామస్తుల్ని ఒక్కొక్కరిగా మొత్తం ఎనిమిదిమంది మృతదేహాల్ని వెలికి తీశాయి. సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతిఈ విషాదంపై సమాచారం అందుకున్న సీఎం మోహన్ యాదవ్ ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణించిన ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. खंडवा जिले अंतर्गत छैगांवमाखन क्षेत्र के कोंडावत गांव में एक दुर्भाग्यपूर्ण घटना में गणगौर विसर्जन के लिए कुएं की सफाई हेतु उतरे एक व्यक्ति के दलदल में फंसने पर बचाने के प्रयास में एक के बाद एक कुएं में उतरे अन्य सात व्यक्ति भी अंदर फंस गए, कुएं में जहरीली गैस से दम घुटने के कारण…— Dr Mohan Yadav (@DrMohanYadav51) April 3, 2025 బాధితుల గుర్తింపుబావిలోకి దిగి ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది మృతుల వివరాల్ని అధికారులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో రాకేష్ పటేల్ (23), అనిల్ పటేల్ (25), అజయ్ పటేల్ (24), శరణ్ పటేల్ (35), వాసుదేవ్ పటేల్ (40), గజానన్ పటేల్ (35), అర్జున్ పటేల్ (35),మోహన్ పటేల్ (53) గా గుర్తించారు.మరణానికి గల కారణంవిషాదానికి గల కారణాల్ని తెలుసుకునేందుకు పోలీసులు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో బావి లోపల కార్బన్ మోనాక్సైడ్ లేదా మీథేన్ వంటి వాయువులు పేరుకుపోవడం వల్ల విషపూరిత పొగలు వచ్చి ఉండవచ్చని వైద్యులు అంచనా వేశారు. సరైన భద్రతా చర్యలు లేకుండా బావులు, సెప్టిక్ ట్యాంకులు వంటి ప్రదేశాల్లో దిగే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటాంజిల్లా యంత్రాంగం ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. మరణాలకు ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తూనే, మృతుల కుటుంబాలకు సహాయం చేస్తామని జిల్లా అధికార యంత్రాంగం హామీ ఇచ్చింది. -
బాలికపై టీడీపీ కార్యకర్త లైంగిక దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: అభం..శుభం తెలియని 12 ఏళ్ల బాలికను చెరబట్టాడు టీడీపీకి చెందిన ఓ కామాంధుడు. అలాంటి వాడిని శిక్షించాల్సిన కుటుంబ సభ్యులు వెనకేసుకొచ్చారు. ఏదో చిన్న తప్పు జరిగిపోయింది..ఇక్కడితో వదిలేద్దామని బాధిత బాలిక తండ్రిని బెదిరించి బలవంతంగా ఒప్పించారు. ఆ బాలిక శీలానికి విలువ కట్టారు. రూ. లక్ష అపరాధంగా చెల్లించేందుకు నిర్ధారిస్తూ ..అడ్వాన్స్ గా రూ. 20వేలు చెల్లించారు. ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది ఎక్కడో కాదు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే. వివరాల్లోకి వెళితే.. 10 మంది సంతానమున్న ఓ తండ్రి పొట్టకూటి కోసం కుటుంబాన్ని తీసుకుని సమీపంలోని వేరే గ్రామానికి వచ్చాడు. అక్కడ ఓ రైతు దగ్గర వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా పిల్లలు గొర్రెలు, ఆవులు మేపుతున్నారు. వారిలో పన్నెండేళ్ల బాలిక బుధవారం (ఏప్రిల్ 2) అడవిలోకి వెళ్లింది. ఆమెను గిడ్డెగానిపెంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆర్ రమేశ్ అనుసరించాడు. నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధ భరించలేని ఆ బాలిక కేకలు వేస్తూ పరుగులు తీసింది. గమనించిన ఓ వ్యక్తి బాధితురాలని ఏమైందని ప్రశ్నించగా జరిగిన ఘోరాన్ని తెలియజేసింది. ఆ వ్యక్తి రమేశ్‌ను మందలించి పిడిగుద్దులు కురిపించాడు.రూ. లక్షకు ఒప్పందం..రూ. 20వేల అడ్వాన్స్ నిందితుడి కుటుంబ సభ్యులు ఈ విషయం బయటికి పొక్కకుండా పెద్దల సమక్షంలో బుధవారం రాత్రి బాలిక తండ్రితో బలవంతంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ. లక్ష ఇస్తామని, ఎవరితోనూ చెప్పవద్దంటూ అడ్వాన్స్‌గా రూ. 20వేలు ముట్టజెప్పారు. అయితే ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వారు విచారణ చేపట్టి రమేశ్ లైంగిక దాడికి పాల్పడినట్టు నిర్ధారించారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులను కుప్పం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు. ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు రమేశ్ పరారయ్యాడు. కాగా ఫేస్బుక్ ఖాతాలో టీడీపీ నాయకులతో దిగిన ఫొటోలు, బ్యానర్లను రాత్రికి రాత్రే తొలగించాడు. -
నాన్నా.. అమ్మ ఎక్కడ?.. ఏం చెప్పాలో తెలియని స్థితిలో తండ్రి
విశాఖ: నగరంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు దీపక స్పృహలోకి వచ్చింది. అయితే ప్రేమోన్మాది దాడిలో తల్లి చనిపోయిందనే విషయం ఆమెకు తెలియదు. దాంతో స్పృహలోకి వచ్చిన వెంటనే తల్లి ఎక్కడ అని సైగల ద్వారా అడిగింది. గొంతుపై ఆమెకు లోతైన గాయం కారణంగా ఆరు కుట్లు పడ్డాయి. దాంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమె.. తల్లి గురించి సైగల ద్వారా ఆరా తీసింది. అయితే తల్లి మరణించదన్న వార్తను కూతురికి తండ్రి చెప్పలేకపోయాడు.ఇదిలా ఉండగా, తల్లి లక్ష్మి మృతదేహానికఇ పోస్ట్ మార్టం పూర్తయ్యింది. పోస్ట్ మార్టం పూర్తియిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాలోని స్వగ్రామానికి తరలించినట్లు తెలుస్తోంది.కాగా, పెళ్లికి నిరాకరించారన్న కారణంతో తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే.. బుధవారం జరిగిన ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కుమార్తె తీవ్రంగా గాయపడింది. పార్వతీపురం మన్యం జిల్లా దేవుదళ సమీపంలోని పెద్దపుర్లికి చెందిన నక్కా రాజు బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం మధురవాడకు వచ్చి, కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. కుమార్తె దీపిక (20) ఆరేళ్ల క్రితం వీరఘట్టం మండలం పనసనందివాడలోని తన పిన్ని ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లింది.ఎదురింట్లో ఉంటున్న దమరసింగి నవీన్ పరిచయమయ్యాడు. నవీన్ డిగ్రీ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నాడు. దీపిక విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తి చేసి, నర్సింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దీపికను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె తల్లిదండ్రులపై నవీన్ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడు. ఇతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానని కూడా పలుమార్లు బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతడి జీవితం నాశనం అయిపోతుందని దీపిక తండ్రి రాజు ఆలోచించాడు. అదే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. -
భర్తతో 20 ఏళ్లు గ్యాప్.. క్లాస్మేట్ శివతో వివాహేతర సంబంధం
సంగారెడ్డి జోన్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి అతి కిరాతకంగా తల్లే హత్య చేసిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమీన్పూర్ మండలం బీరంగూడ గ్రామం రాఘవేంద్రనగర్‌లో ఇటీవల జరిగిన ముగ్గురు పిల్లల మృతి ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. పిల్లల తల్లి రజిత ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా.. ఆరు నెలల క్రితం పదో తరగతి పూర్వ విద్యార్థులు అంతా కలసి పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ పార్టీ సందర్భంగా తన క్లాస్ మేట్ అయిన శివతో రజిత స్నేహం ఏర్పరుచుకుంది.రోజూ చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడేవారు. అంతే కాకుండా పలు మార్లు రహస్యంగా కలుసుకున్నారు. కాగా, రజిత భర్త చెన్నయ్య.. ఆమె కంటే వయసులో ఇరవై సంవత్సరాలు పెద్దవాడు కావడంతో మొదటి నుంచీ ఆమెకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. తరచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలో తన పదోతరగతి క్లాస్మేట్ శివను కలసుకోవడం, అతనికి పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉండాలని భావించింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోమని రజిత, శివను అడగ్గా.. పిల్లలు లేకుండా ఒంటరిగా తనతో వస్తా అంటే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. దీంతో శివను పెళ్లి చేసుకోవాలంటే పిల్లలను అడ్డు తొలగించుకోవాల్సిందేనని రజిత నిర్ణయించుకుంది. మార్చి 28న సాయంత్రం ఆరు గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పగా, త్వరగా ఆ పని పూర్తి చేయమని చెప్పాడు. అదే రోజు రాత్రి భర్త భోజ నం చేసి 10 గంటలకు ట్యాంకర్ తీసుకొని చందానగర్ వెళ్లగా, ఇదే అదనుగా భావించి మొదట పెద్ద కొడుకు సాయికృష్ణ (12)ను, తర్వాత కూతురు మధుప్రియ (10)ను, ఆ తర్వాత చిన్న కొడుకు గౌతమ్ (8)ను.. ఇలా ముగ్గురిని ఒకరి తరువాత ఒకరిని ముక్కు, మూతిపై టవల్ వేసి, చేతితో గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసి చంపింది. పిల్లలను అడ్డు తొలగించుకోవాలని రజితను శివ ప్రోత్సహించగా ఆమె కిరాతకంగా వారిని చంపివేసిందని ఎస్పీ వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామన్నారు. ఈ సమావేశంలో పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ నరేశ్, డీఐ రాజు, ఎస్ఐ సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
‘గుట్ట’లోకి వెళ్లడాన్ని గుర్తించి అత్యాచారం
కల్వకుర్తిటౌన్: బాధితురాలి కదలికలను గుర్తించే నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన ఆ ఘటన వివరాలను బుధవారం కల్వకుర్తిలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెల్లడించారు. జడ్చర్లకు చెందిన ఓ వివాహిత తన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మార్చి 29న (శనివారం) మధ్యాహ్నం ఊర్కొండపేటకు వచ్చి దైవదర్శనం చేసుకొని రాత్రి అక్కడే బస చేశారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో మరో బంధువు అక్కడకు రాగా.. ఆయనతో మాట్లాడుతూ 150 మీటర్ల దూరంలో ఆలయానికి ముందు భాగంలో ఉన్న గుట్ట ప్రాంతంలోకి వెళ్లడాన్ని నిందితులు గమనించారు. ఈ క్రమంలో నిందితులు అక్కడకు వెళ్లి బా ధితులను బెదిరించి, ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో మార్పాకుల ఆంజనేయులు, సిద్ధిఖ్ బాబా, వాగుల్దాస్ మణికంఠ, కార్తీక్ మొదట అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ నలుగురు.. మట్ట మహేష్‌గౌడ్, హరీశ్‌గౌడ్, మట్ట ఆంజనేయులును ఘటనా ప్రాంతానికి పిలిపించగా, మద్యం తాగి వారు సైతం అత్యాచారం చేశారు. బాధిత మహిళ తాగడానికి నీరు అడగ్గా, కార్తీక్ బాటిల్లో మూత్రం పోసి ఇచ్చాడని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులంతా 28 ఏళ్లలోపు వారేనని, మహిళపై రాత్రి 12 గంటల వరకు అత్యాచారం చేశారని, ఈ విషయాన్ని బయటకు చెబితే మీరు కలిసి ఉన్న ఫొటోలను పబ్లిక్ చేస్తామని హరీశ్‌గౌడ్ బెదిరించారని చెప్పారు. మార్చి 30న (ఆదివారం) తెల్లవారుజామున బాధితురాలు తన బంధువుతో కలిసి వెళ్తుండగా విషయాన్ని బయటకు చెప్పకుండా వారిని బెదిరించి ఆలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మహేశ్‌గౌడ్ వారి వద్ద రూ.6 వేలు డిమాండ్ చేసి వసూలు చేశాడు. బాధితురాలు తన ఊరికి వెళ్లి, తిరిగి సోమవారం ఊర్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అత్యాచార ఘటనలో నిందితులను కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచామని, జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ వెల్లడించారు. అత్యాచార ఘటనలో బాధితురాలి నుంచి నిందితులు బంగారం, నగదు తీసుకున్నారని చెప్పినా.. అందుకు సంబంధించిన రికవరీని పోలీసులు చూపించలేదు. ఈ సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్ఐలు మాధవరెడ్డి, కృష్ణదేవ, కురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
అంత స్వల్ప సమయంలో యువతినెలా నమ్మించాడు?
రంగారెడ్డి జిల్లా : సంచలనం సృష్టించిన విదేశీ యువతిపై అత్యాచార ఘటనలో రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన పాతబస్తీ యాకుత్‌పురాకు చెందిన నిందితుడు మహ్మద్ అస్లాంను మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. కేవలం గంట రెండుగంటల వ్యవధిలోనే నిందితుడు యువతితో పాటు ఆమె స్నేహితుడిని అంతగా ఎలా నమ్మించాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన నిందితుడికి ఆంగ్లంపై పట్టుండటంతో చలాకీగా మాట్లాడి ఆకర్షించాడా.. వేరే కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకున్న నిందితుడు.. గతంలో కూడా ఇదే తరహా ఏవైనా నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పవిత్రమైన రంజాన్ పర్వదినం రోజున అస్లాం ఇలాంటి ఘటనకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, విజిటింగ్ వీసాపై జర్మనీ నుంచి వచ్చిన యువతిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు భారత్‌లోని జర్మన్ కాన్సులేట్‌కు నివేదికను పంపనున్నారు. ఇదిలా ఉండగా, మీర్‌పేట మిథులానగర్లోని స్నేహితుడి ఇంట్లో ఉంటున్న ఆ యువతి గురువారం అర్ధరాత్రి తిరిగి స్వదేశానికి వెళ్లనుంది. -
ఎంఎంటీఎస్ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ
హైదరాబాద్: సికింద్రాబాద్–మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో లైంగిక దాడి యత్నం ఘటన నుంచి బైటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పూర్తిగా కోలుకుంది. దీంతో ఆమెను ఈ నెల 1న సాయంత్రం డిశ్చార్జి చేయించి కడప జిల్లాలోని తన సొంత ఊరికి పంపించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మార్చి 22న రాత్రి ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న బాధితురాలిపై ఓ దుండగుడు దాడిచేయటంతో, తప్పించుకునే ప్రయత్నంలో ఆమె నడుస్తున్న రైలు నుంచి కిందకుదూకిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల తరువాత మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, దంతాలకు శస్త్ర చికిత్సలు చేయించారు. పది రోజులపాటు చికిత్స పొందిన బాధితురాలు పూర్తిగా కోలుకున్నట్టు డాక్టర్లు ధృవీకరించటంతో సొంత ఊరికి పంపించినట్టు పోలీసులు తెలిపారు. -
ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగ్యలక్ష్మి .. చివరకు
తమిళనాడు: పల్లావరం సమీపంలో ఓ నిండు ప్రాణాన్ని వివాహేతర సంబంధం బలితీసుకుంది. ప్రియురాలు మరొకరితో సంబంధం కలిగి ఉందనే కారణంతో ప్రియుడు ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. లొంగిపోయిన కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై శివారు పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు గౌరీ ఎవెన్యూ 2వ వీధికి చెందిన జ్ఞానసిద్ధన్ (40). నితను తాంబరం కార్పొరేషన్లో లారీ డ్రైవర్. ఇతను అవివాహితుడు. అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అనకాపుత్తూరు అరుల్ నగర్ 3వ వీధికి చెందిన భాగ్యలక్ష్మి(33)తో ఇతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భాగ్యలక్ష్మి అప్పటికే భర్తకు విడాకులు ఇచ్చి, తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. ఇద్దరూ తరచూ కలుసుకుని సరదాగా గడుపుతూ వచ్చారు. ఈక్రమంలో భాగ్యలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని జ్ఞానసిద్ధన్ నిర్ణయించుకున్నాడు. భాగ్యలక్ష్మికి జ్ఞానసిద్ధన్‌తో పాటు మరొకరితో సంబంధం ఉందని తెలిసింది. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ బుధవారం ఉదయం భాగ్యలక్ష్మితో గొడవపడ్డాడు. ఆగ్రహించిన జ్ఞానసిద్ధన్ పెద్ద బండరాయితో భాగ్యలక్ష్మి తలపై వేశాడు. భాగ్యలక్ష్మి సంఘటన స్థలంలోనే మృతిచెందింది. జ్ఞానసిద్ధన్ శంకర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నువ్వు యాంకరింగ్ చేయడం నాకు ఇష్టం లేదు..!
విశాఖపట్నం: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కొట్టడంతో తీవ్రంగా గాయపడిన భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలివి.. వెంకటేశ్వరమెట్టకు చెందిన పోలిపల్లి రమాదేవి, భీమ్‌నగర్‌కు చెందిన బంగార్రాజు భార్యాభర్తలు. ఇద్దరూ వృత్తిరీత్యా డ్యాన్సర్లు. రమాదేవి యాంకరింగ్ కూడా చేస్తుంటుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రమాదేవి యాంకరింగ్ చేయడం బంగార్రాజుకు ఇష్టం లేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఆమె వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని బంగార్రాజు అనుమానించడంతో గొడవలు మరింత పెద్దవయ్యాయి. ఈ క్రమంలో గత నెల 31న గొడవ జరగడంతో.. రమాదేవి పిల్లలను తీసుకుని వెంకటేశ్వరమెట్టలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అదే రోజు బంగార్రాజు అక్కడికి వెళ్లి, తిరిగి ఇంటికి రమ్మని భార్యను పిలిచాడు. ఆమె అందుకు నిరాకరించడంతో.. ఆగ్రహంతో ఆమెను ఇంటి నుంచి బయటకు లాగి చెంపపై కొట్టాడు. ఈ ఘటనలో ఆమె పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తలకు బలంగా గాయమైంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. మృతురాలి బంధువులు బంగార్రాజుపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. బంగార్రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది..!
యశవంతపుర: భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి రెండేళ్లవుతోంది. పాఠశాలలో కూతురిని మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నారు. ఈ పరిణామాలతో శాడిస్టుగా మారిన ఓ వ్యక్తి.. తుపాకీతో మారణహోమం సృష్టించాడు. భార్యను అంతమొందించాలని వెళ్లాడు, ఆమె లేకపోవడంతో తల్లి, మరదలుతో పాటు కూతురిని కూడా తూటాలకు బలి చేశాడు. ఈ కర్కశ సంఘటన చిక్కమగళూరు జిల్లా ఖాండ్యా సమీపంలోని మాగలు గ్రామంలో చోటుచేసుకొంది. సమాజంలో క్షీణించినపోతున్న కుటుంబ బాంధవ్యాలకు మరోసారి అద్దం పట్టింది. వివరాలు.. జిల్లాలోనే కడబగెరె సమీపంలో ఓ పాఠశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్న రత్నాకర్ (35) ఈ రక్తపాతానికి పాల్పడ్డాడు. అతనికి మాగలుకు చెందిన యువతిలో సుమారు పదేళ్ల కిందట పెళ్లయింది. స్కూలు బస్సు డ్రైవర్‌గా పనిచేవాడు. వీరికి కూతురు మౌల్య ఉంది. అయితే కుటుంబ కలహాలతో భార్య రెండేళ్ల కిందట భర్తను వదిలేసి వెళ్లిపోయింది. బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. పాఠశాలలో తన స్నేహితులు మీ అమ్మ ఎక్కడని అడుగుతున్నట్లు కుతూరు మౌల్య రోజు తండ్రి వద్ద చెప్పుకునేది. దీంతో ఆక్రోశానికి గురైన రత్నాకర్ భార్యతో తాడేపేడో తేల్చుకోవాలనుకున్నాడు. ఉగాది పండుగ సందర్భంగా మౌల్య అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. భార్య కూడా వచ్చి ఉంటుందని రత్నాకర్ భావించాడు. విచ్చలవిడిగా కాల్పులు ఆమెతో మాట్లాడాలని, కుదరకపోతే హత్య చేయాలని ప్లాన్ వేసుకొని మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో మాగలులో అత్తవారింటికి వెళ్లాడు. భార్య లేదని తెలిసి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు, సింగల్ బ్యారెల్ తుపాకీ తీసి అత్త జ్యోతి (50), మరదలు సింధు (26), కూతూరు మౌల్య (7)ను కాల్చిచంపాడు. అడ్డుకోబోయిన సింధు భర్త మీద కాల్పులు జరపగా స్వల్ప గాయాలు తగిలి తప్పించుకున్నాడు. తరువాత మృతదేహాలను ఇంటి నుంచి కొంతదూరం లాక్కువెళ్లి అక్కడ తుపాకీతో కాల్చుకుని హంతకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మోసం చేసింది.. అందుకేనంటూ..చంపడాటానికి ముందు రత్నాకర్ సెల్ఫీ వీడియోలో బాధలను చెప్పుకున్నారు. భార్య వదిలి వెళ్లిన తరువాత బాధతో ఈ అమానుషమైన ఘటనకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. రెండేళ్ల క్రితం భార్య మోసం చేసి వెళ్లిపోయింది. కూతురి సంతోషం కోసం ఏమైనా చేస్తానన్నాడు. స్కూలులో స్నేహితులు మీ అమ్మ ఎక్కడ అని అడిగితే ఫోటోను చూపిస్తుంది అని వివరించాడు. ఘటనాస్థలిని చిక్కమగళూరు ఎస్పీ విక్రమ్ అమటె పరిశీలించారు. బాళెహొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
మధురవాడ (విశాఖ)/శ్రీకాకుళం క్రైమ్/బూర్జ/వీరఘట్టం/సాక్షి, అమరావతి : పెళ్లికి నిరాకరించారన్న కారణంతో తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది విచక్షణారహితంగా దాడి చేశాడు. తల్లి మృతి చెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. సీపీ శంఖబ్రత బాగ్చి, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా దేవుదళ సమీపంలోని పెద్దపుర్లికి చెందిన నక్కా రాజు బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం మధురవాడకు వచ్చి, కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. కుమార్తె దీపిక (20) ఆరేళ్ల క్రితం వీరఘట్టం మండలం పనసనందివాడలోని తన పిన్ని ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లింది. ఎదురింట్లో ఉంటున్న దమరసింగి నవీన్ (26) పరిచయమయ్యాడు. నవీన్ డిగ్రీ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నాడు. దీపిక విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తి చేసి, నర్సింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దీపికను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె తల్లిదండ్రులపై నవీన్ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడు. ఇతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానని కూడా పలుమార్లు బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతడి జీవితం నాశనం అయిపోతుందని దీపిక తండ్రి రాజు ఆలోచించాడు. అదే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం12 గంటలకు కొమ్మాది జంక్షన్ హైవేకు కూతవేటు దూరంలో ఉన్న స్వయంకృషి నగర్లో బాధితుల ఇంటికి నవీన్ వచ్చాడు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేస్తామని చెప్పడంతో విచక్షణ కోల్పోయి వాదనకు దిగాడు. ఓ దశలో ఉన్మాదంతో ఊగిపోతూ 1.30 గంటలకు తల్లీ కూతుళ్లపై చాకుతో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో నక్కా లక్ష్మి (47) అక్కడికక్కడే మృతి చెందగా, దీపికకు చేయి, మెడ ఇతర భాగాలపై తీవ్ర గాయాలై, స్పృహ తప్పింది. ఆ వెంటనే నిందితుడు పరారయ్యాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన దీపిక తల్లి చలనం లేకుండా ఉండడాన్ని గమనించింది. సహాయం కోసం ఎంత ప్రయత్నించినా ఎవరూ అందుబాటులోకి రాలేదు. మేడ మీద నుంచి అతికష్టంగా కిందికి వచ్చి ఆర్తనాదాలు చేయడంతో పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ చెయ్యడంతో పీఎంపాలెం ఎస్ఐ కె.భాస్కరరావు సంఘటనా స్థలికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న దీపికను ద్విచక్ర వాహనంపై దగ్గర్లోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం మెడికవర్ ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. నిందితుడు నవీన్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఐదు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టి, శ్రీకాకుళం జిల్లా బూర్జ నుంచి వీరఘట్టం వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. మేజి్రస్టేట్ ముందు హాజరు పరుస్తామని చెప్పారు. ఉలిక్కిపడిన పనసనందివాడ ఈ ఘటనతో నవీన్ స్వగ్రామం పనసనందివాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీపికతో కొన్నేళ్లుగా పరిచయం ఉన్నప్పటికీ, కొద్ది రోజులుగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరితో ఫోన్లో మాట్లాడినా అనుమానిస్తూ వచ్చాడు. ఓ దశలో ఆ యువతిపై చేయి కూడా చేసుకున్నాడు. దీంతో కొద్దిరోజులుగా అతనితో పెళ్లి జరిపించడంపై యువతి తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పది రోజులుగా అతని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చివరకు కడతేర్చేందుకు పూనుకున్నాడు. వీరఘట్టం ఎస్ఐ జి.కళాధర్ గ్రామానికి చేరుకుని నవీన్ తల్లిదండ్రులు జ్యోతి, అన్నారావుల నుంచి వివరాలు సేకరించారు. కాగా, నిందితుడిని గంటల వ్యవధిలో పట్టుకున్నందుకు పోలీసులను విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అభినందించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువుకూటమి సర్కారుపై వైఎస్ జగన్ మండిపాటు విశాఖపట్నంలో ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో వేదింపులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మరువక ముందే విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్థితిలో ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది నవీన్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. -
అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
సాక్షి, సంగారెడ్డి: అమీన్పూర్ ముగ్గురు పిల్లల మృతి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు పిల్లల్ని తల్లే చంపినట్లు పోలీసులు తేల్చారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వివాహితర సంబంధంతో భర్తతో పాటు ముగ్గురు పిల్లలను కూడా చంపాలని హంతకురాలు రజిత ప్లాన్ చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండా చేసి కన్నతల్లే చంపేసింది.ఇటీవలే పదవ తరగతి విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకు పరిచయం ఏర్పడింది. హంతకురాలు రజిత లావణ్య, ప్రియుడు సూరు శివ కుమార్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు.కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం. రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు.అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూశారు. -
నాగర్‌కర్నూల్ ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, నాగర్ కర్నూల్: ఊర్కొండపేటలో మహిళపై లైంగిక దాడి కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు ఇవాళ ఆరెస్టు చేశారు. గత శనివారం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన మహిళపై అదే గ్రామానికి చెందిన ఏడుగురు నిందితులు పాశవికంగా ప్రవర్తించి సామూహిక లైంగిక దాడి చేశారని నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాద్ తెలిపారు.తన బంధువుతో కలిసి ఆలయానికి సమీపంలో ఉండగా నిందితులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేశారని తెలిపారు. ఆమెతో ఉన్న వ్యక్తిని చెట్టుకు కట్టేశారని వివరించారు. మొదట వారిద్దరి ఫోటోలు తీసి బెదిరించారని విషయం బయటికి చెబితే ఫోటోలో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని తెలిపారు. వారిపై దాడి చేసి రూ.6 వేలు లాక్కున్నారని చెప్పారు. బీఎన్ఎస్ సెక్షన్ 70, సెక్షన్ 351, సెక్షన్ 310, కింద నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.నిందితులు ఊర్కొండ పేటకు చెందిన మరి పాకుల ఆంజనేయులు, సిద్ధిక్ బాబా, మొగుల్దాస్ మనీ అలియాస్ మణికంఠ, కార్తీక్, మట్టా మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్ట ఆంజనేయులుగా గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు. దాహం వేసి నీళ్లు అడిగితే ఓ నిందితుడు మూత్ర విసర్జన చేశాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని.. మళ్లీ నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామని ఎస్పీ తెలిపారు. -
విశాఖలో ప్రేమోన్మాది దాడి.. తల్లి మృతి, కూతురి పరిస్థితి విషమం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. గతంలో న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన మరువకముందే మధురవాడలో జరిగిన మరో ఘటన నగరంలో కలకలం రేపుతోంది. ప్రేమోన్మాది దాడిలో తల్లి మృతి చెందగా, కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పీఎం పాలెం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.ప్రేమోన్మాది నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా బూర్జిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతురాలు లక్ష్మి చెల్లి సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు నవీన్‌ను నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ డిమాండ్ చేసింది. పెళ్లి చేస్తామని చెప్పిన కానీ దారుణంగా చంపాడు. కాళ్లు, చేతులు నరికి నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆమె అన్నారు. -
భర్త మొబైల్లో పక్కంటి మహిళ ఫోన్ నంబరు..
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇరు కుంటుంబాలు పక్కపక్కనే ఉంటాయి.. తెల్లారితే ఒకరి ముఖాలు.. ఒకరు చూసుకోవాలి. తీరా బంధువులు కూడా.. అయితే ఏమైందో..ఏమో కానీ..ఆ ఇరు కుటుంబీకు ల మధ్య కొన్ని నెలల కిందట వివాదం తలెత్తింది. దూరం పెరిగింది. మాటల్లేవ్.. ఈ తరుణంలో భర్త ఫోన్లో ఆ పక్కంటి మహిళా ఫోన్ నంబరు ఉందని భార్య గొడవకు దిగింది. దీంతో మనస్తాపానికి గురైన పక్కంటి మహిళా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. పదెంకెల ఫోన్ నంబరు తెచ్చిన తంటాకు ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ ఘటన మంగళవారం చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రా మంలో చోటుచేసుకుంది.గ్రామస్తులు, పోలీసులు వివరాల మేరకు...చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రామానికి చెందిన రమేష్ భార్య ఉమ (30). ఈ దంపతులకు పెళ్లిలై ముగ్గురు పిల్లలున్నారు. వీళ్ల ఇంటి పక్కనే శివమణి, సుజాత అనే దంపతులు ఉన్నారు. ఈ ఇరుకుటుంబీకులు దగ్గర బంధువు లు. వీళ్ల మధ్య ఏర్పడిన చిన్న తగదాలు గొడవగా మారాయి. కొన్ని నెలలుగా ఈ ఇరు కుటుంబీకుల మధ్య మాటలు లేవు. అయితే సోమవారం శివమణి మొబైల్లో ఉమ ఫోన్ నంబరును సుజాత గమనించింది. ఆ నంబరు నీ ఫోన్లో ఎందుకు ఉందని సుజాత భర్తతో వాగ్వాదానికి దిగింది. ఇలా అక్రోశానికి గురైన సుజాత రోడెక్కింది. ఉమతో గొడవకు దిగింది. ఇద్దరు దుర్భాషలాడుకున్నారు. ఇలా మాట మాట పెరిగి జట్టు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనా ఉమ సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో జాకెట్లోని అట్టముక్కలో తన చావుకు కారణం సుజాతనేని రాసి పెట్టింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. అనుమానం పెనుభూతమైంది. ఓ మహిళా ప్రాణాన్ని బలి తీసుకుంది. క్షణికావేశానికి గురై ఆ మహిళ పరువుకు తలొంచి ఆత్మహత్య చేసుకుంది. -
బంగారం ఇచ్చి నీ భార్యను తీసుకుపో..!
చందుర్తి (వేములవాడ): బాకీ డబ్బుల వివాదంలో తన భార్య చేయి పట్టుకున్నారని మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. చందుర్తి ఎస్సై అంజయ్య కథనం ప్రకారం.. వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన బోదాసు రాజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శివరాత్రి దేవయ్య, దండుగుల నరేశ్ వద్ద ఏడేళ్ల క్రితం రెండు తులాల బంగారాన్ని అప్పుగా తెచ్చుకుని జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. కొన్నాళ్లకు రెండు తులాల బంగారం తిరిగిచ్చాడు. ఒప్పందం ప్రకారం మరో తులం బంగారం బాకీ ఉన్నాడు. ఐదేళ్ల క్రితం రాజు గల్ఫ్ నుంచి స్వగ్రామానికి చేరుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అప్పటినుంచి దేవయ్య, నరేశ్ బంగారం కోసం రాజును వేధిస్తున్నారు. మంగళవారం కూడా వచ్చి తులం బంగారం అడిగారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగింది. ‘నీ భార్యను తీసుకెళ్తేనే బంగారం ఇస్తావు..’అంటూ దేవయ్య, నరేశ్.. రాజు భార్య చేయి పట్టుకోవడంతో మనస్తాపానికి గురైన అతడు అక్కడే ఉన్న పురుగుల మందు తాగాడు. రాజు భార్య ఫిర్యా దు మేరకు దేవయ్య, నరేశ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజయ్య వివరించారు. -
హెల్త్ సూపర్వైజర్ దారుణ హత్య.. కీలకం కానున్న హెల్మెట్..!
మహబూబాబాద్ రూరల్: ఓ గురుకులంలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్‌తండా సమీపంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ పి.సర్వయ్య కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన తాటి పార్ధసారథి (42) భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో నివాసముంటున్నాడు. 11 ఏళ్ల క్రితం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రేకపల్లే గ్రామానికి చెందిన స్వప్నతో వివాహం జరిగింది. వారికి పిల్ల లు భార్గవ్‌సాయి, పరమేశ్వరి ఉన్నారు. పార్ధసారథి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏడాది కాలంగా హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య స్వప్న, పిల్లలు భార్గవ్‌సాయి, పరమేశ్వరి భద్రాచలంలోని జగదీశ్ కాలనీలో ఉంటున్నారు. పార్ధసారథి మాత్రం దంతాపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటూ సెలవు రోజుల్లో ఇంటికి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం భద్రాచలం వెళ్లి సోమవారం సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరాడు. తాను వస్తున్నానని తన గది యజమానికి ఫోన్ చేసి ఇంటి గేటు వేయొద్దని చెప్పాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున బోరింగ్‌తండా సమీపంలోని మిరప చేనులో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని స్థానిక రైతులు గమనించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం తెలిపారు. దీంతో రూరల్ ఎస్సై వి.దీపిక, సీఐ పి.సర్వయ్య, డీఎస్పీ ఎన్.తిరుపతిరావు ఘటనా స్థలిని పరిశీలించి ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్‌కు సమాచారం ఇవ్వగా ఆయన హుటాహుటిన చేరకున్నారు. డాగ్స్కా్వ డ్, ఫింగర్‌ప్రింట్స్, క్లూస్‌టీం బృందాలు వివరాలు సేకరించాయి. ఘటనాస్థలికి చేరుకున్న మృతుడి సోదరి మద్దుల హేమవరలక్ష్మి, బావ శివప్రసాద్ బోరున విలపించారు. హేమవరలక్ష్మి మాట్లాడుతూ.. తన సోదరుడు పార్ధసారథిపై ఏడాది క్రితం దాడి జరిగిందని తెలిపారు. మరదలు స్వప్నకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఈ కారణంగానే తమ సోదరుడి హత్య జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా, పోలీస్ స్టేషన్లో పార్ధసారథిని దుండగులు హత్య చేసి చంపారని ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ గురుకులాల ఆర్సీఓ రాజ్‌కుమార్.. పార్ధసారథి హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, డీఎస్పీ తిరుపతిరావు, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై దీపిక, బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతి, సీసీఎస్ సీఐ హథీరాం, ఇతర పోలీసుల అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.కీలకం కానున్న హెల్మెట్..పార్ధసారథి హత్య విషయంలో ఘటనా స్థలిలో లభ్యమైన హెల్మెట్ కీలకం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుల రాకపోకలు, వాళ్లు వాడిన ద్విచక్రవాహనం ఆచూకీ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజీల్లో నిందితులు హత్య చేయడానికి వచ్చే ముందు ఆ వాహనం నడిపిన వ్యక్తి ధరించిన హెల్మెట్ తెలుపురంగులో ఉండగా, ఘటనా స్థలిలో లభించిన హెల్మెట్ కూడా అదే రంగులో ఉండడం గమనార్హం. పార్ధసారథి హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. భద్రాచలం నుంచి హత్య జరిగిన ప్రాంతం వరకు రహదారుల వెంట ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. -
అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్
సంగారెడ్డి, సాక్షి: అమీన్పూర్ చిన్నారుల మృతి కేసు(Ameenpur Children Death Case)లో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధం కారణంగానే ముగ్గురు పిల్లలను కన్నతల్లి రజితనే కడతేర్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో మొదట భర్త చెన్నయ్యపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు.. లోతైన దర్యాప్తులో సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత(Rajitha) కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు. కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం.రజిత పదో తరగతి క్లాస్మేట్స్ ఈ మధ్య గెట్ టు గెదర్ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూయగా.. భర్త చెన్నయ్యకు అనుమానం రావొద్దని కడుపు నొప్పి నాటకం ఆడి ఆస్పత్రిలో చేరిందామె. -
భార్యను కాపురానికి పంపలేదని అత్తకు శ్రద్ధాంజలి పోస్టర్
వేలూరు: తిరుపత్తూరు సమీపంలోని తన భార్యను కాపురానికి పంపలేదని అత్తపై ఆగ్రహించిన అల్లుడు అత్త మృతి చెందినట్లుగా శ్రద్ధాంజలి పోస్టర్‌ను ముద్రించి వాటిని అన్ని ప్రాంతాల్లో కరిపించడంతో పాటూ బంధువులకు వాట్సాప్ ద్వారా పంపిన ఘటన సంచలనం రేపింది. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని నిమ్మయంబట్టు గ్రామానికి చెందిన వెంకటేశన్ ఇతని భార్య వినోదిని దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. వెంకటేశన్ బ్యాంకులో లోన్ తీసుకొని పాడి పశువును కొనుగోలు చేసి బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించలేదు. దీంతో దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో భార్య వినోదిని ఇలక్కినాయకన్‌పట్టి గ్రామంలో ఉన్న అమ్మగారింటికి రెండు నెలల క్రితం వెళ్లింది. అక్కడ నుంచే వినోదిని వేరే దుకాణంలో పనిచేస్తోంది. ఇదిలా ఉండగా అత్త మాదు తన భార్యను కాపురానికి పంపకుండా అడ్డుకుంటుందని ఆగ్రహించిన వెంకటేశన్ అత్త ప్రాణాలతో ఉన్నప్పటికీ ఆమె మృతి చెందినట్లు శ్రద్ధాంజలి బ్యానర్, పోస్టర్లు వేసుకొని చుట్టు పక్కల కరిపించడంతో పాటూ భార్య వినోదిని బంధువులకు వాట్సాప్ పంపాడు. ఈ విషయాన్ని బంధువులు వినోదినికి పోన్ చేసి విషయాన్ని తెలిపారు. దీంతో వినోదిని తన భర్త వెంకటేష్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకటేష్ ను అరెస్ట్ చేశారు. -
హైవేపై రెండు బస్సులు, కారు ప్రమాదం.. పలువురు మృతి
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బుల్దానాలో బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. షీగాన్-కామ్గాన్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు.. బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో ప్రమాదానికి గురైన రెండు వాహనాలను మరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Buldhana, Maharashtra: A triple accident on Shegaon-Khamgaon Highway involving a Bolero, an ST bus, and a private bus killed five people and injured 24. The injured are receiving treatment at Khamgaon government hospital pic.twitter.com/dIWmrwPEN9— IANS (@ians_india) April 2, 2025 -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా, ప్రశాంత్‌నగర్‌కు చెందిన ఉప్పరపల్లి మహేందర్ (25) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అడ్డగుట్ట సొసైటీలోని హాస్టల్లో ఉంటున్నాడు.సోమవారం సాయంత్రం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో హాస్టల్ నిర్వాహకుడు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమలో ఓడిపోవడమే తన మరణానికి కారణమని రాసి ఉన్న లెటర్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు పై పడిన సెల్‌ఫోన్ తీసుకుంటుండగా...శామీర్‌పేట్: రోడ్డు పడిన సెల్ ఫోన్ తీసుకుంటుండగా కారు ఢీ కొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సిద్దిపేట్ జిల్లా, మామిడ్యాల గ్రామానికి చెందిన పొట్ట ప్రవీణ్ (23), హైదరాబాద్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై రాజీవ్ రహదారి మీదుగా వెళుతుండగా తుర్కపల్లి గ్రామ సమీపంలో తన జేబులోంచి సెల్‌ఫోన్ రోడ్డుపై పడింది. దీంతో కిందపడిన సెల్‌ఫోన్‌ను తీసుకుంటుండగా అదే సమయంలో నగరం నుంచి వేగంగా వచి్చన ఎర్టిగా కారు వెనక నుంచి అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జినోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..!
కృష్ణరాజపురం/ బనశంకరి: బెంగళూరులో ఓ పారిశ్రామికవేత్తను హనీట్రాప్ చేసి ముప్పుతిప్పలు పెట్టి దోచుకున్న ముఠా ఉదంతమిది. కిలాడీ మహిళ ఒక ముద్దుకు రూ.50 వేల చొప్పున వసూలు చేయడం గమనార్హం. ముఠా బెదిరింపులను తట్టుకోలేక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కిలాడీ శ్రీదేవి రుడగి (25), ఆమె ప్రియుడు సాగర్ మోరే (28), రౌడీషీటర్ గణేష్ కాలే (38) లను నగర సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... మహాలక్ష్మి లేఔట్లో ప్రీ స్కూల్ నిర్వహిస్తున్న శ్రీదేవి అసలు నిందితురాలు. ఆమె ప్రీస్కూల్‌కు రాకేష్ వైష్ణవ్ (34) అనే వ్యాపారవేత్త తన పిల్లలను పంపించేవాడు. అలా అతనితో పరిచయం పెంచుకుని స్కూలు నిర్వహణ కోసమని రూ.4 లక్షలను అప్పుగా తీసుకుంది. డబ్బు వాపసు ఇవ్వాలని అడగగా ప్రీ స్కూల్ పార్టనర్ కావాలని కోరింది. చనువు పెంచుకుని కలిసి తిరిగేవారు. కొత్త ఫోను, సిమ్ శ్రీదేవితో మాట్లాడేందుకు కొత్త సిమ్, ఫోన్‌ను రాకేష్ కొనిచ్చాడు. శ్రీదేవి అతనికి ముద్దు పెట్టి రూ.50 వేలు చొప్పున తీసుకుంది. నీతోనే రిలేషన్షిప్లో ఉంటానని చెప్పి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తరచూ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో రాకేష్‌కు విసుగొచ్చి ఆమె సిమ్‌ను విరగ్గొట్టి పారేశాడు. టీసీ ఇస్తామని పిలిచి కిడ్నాప్ రాకేష్ ఆమె సూచన మేరకు మార్చి 12న పిల్లలకు టీసీని తీసుకునేందుకు ప్రీ స్కూల్‌కు వచ్చాడు. అప్పుడు శ్రీదేవితో పాటు నిందితులు సాగర్ మోరే, గణేష్ కాలే ఉన్నారు. వారు రాకేష్ పై దాడి చేసి, సాగర్‌తో శ్రీదేవికి నిశ్చితార్థం అయ్యింది. నువ్వు ఆమెతో మజా చేస్తున్నావా? ఈ సంగతిని శ్రీదేవి తండ్రికి, నీ భార్యకు చెబుతానంటూ రాకేష్‌ను బ్లాక్మెయిల్ చేశారు. పోలీసు స్టేషన్‌కు వెళ్దాం పద అంటూ రాకే‹Ùను ఎక్స్‌యూవీ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఇంతటితో వదిలేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని రాకే‹Ùను ఒత్తిడి చేశారు. చివర రూ.20 లక్షలు ఇస్తే చాలని డిమాండ్ చేశారు. ఆఖరికి రూ.1.90 లక్షలు తీసుకుని వదిలేశారు. నిందితులు బిజాపురవాసులు శ్రీదేవి విద్యార్థుల తండ్రులను తీయని మాటలతో మోసపుచ్చి వలలో వేసుకునేదని, ముద్దు ఇస్తే రూ.50 వేలు ఇవ్వాలనే షరతుతో సల్లాపాలు నడిపేదని వెలుగులోకి వచ్చింది. నిందితులు ముగ్గురూ విజయపుర (బిజాపుర) జిల్లా నివాసులు. ఉపాధి కోసం బెంగళూరుకు వలసవచ్చి చాతుర్యాన్ని ప్రదర్శించారు. రౌడీ గణేశ్ కాలేపై బెదిరింపులు, దోపిడీ, హత్యాయత్నం వంటి 9 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కిలాడీలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి పోలీస్‌కస్టడీకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. దర్యాప్తులో మరిన్ని హనీట్రాప్ బాగోతాలు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. నగరంలో ఈ హనీట్రాప్ దందా సంచలనం కలిగిస్తోంది. ఈమె బారిన మరికొందరు పడి ఉంటారని అనుమానాలున్నాయి.మళ్లీ బ్లాక్‌మెయిలింగ్ మార్చి 17న మళ్లీ రాకేష్ కు శ్రీదేవి ఫోన్ చేసి రూ.15 లక్షలు ఇవ్వాలని, అప్పుడే మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు, చాటింగ్‌ను డిలిట్ చేస్తాను, లేకుంటే నీ భార్యకు చూపించి నీ సంసారాన్ని పాడు చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో విసిగిపోయిన రాకేష్ చివరకు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీదేవి, గణేష్, సాగర్లను అరెస్టు చేసి మరింత విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకున్నారు. -
లింగమయ్య హత్య కేసులో ‘పరిటాల’ ఒత్తిళ్లు
సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య దారుణ హత్య కేసులో పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబం ఒత్తిళ్ల మేరకే వ్యవహరిస్తున్నారని జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఘటనలో 20 మందికి పైగా పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా, కేవలం ఇద్దరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. హత్య ఘటనకు సంబంధించి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులు ధర్మవరపు ఆదర్శ్ నాయుడు, మనోజ్ నాయుడుపై మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పూర్తిగా ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ కనుసన్నల్లో నడుస్తూ.. టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా పని చేస్తున్నారనేందుకు ఈ సంఘటన తాజా ఉదాహరణ అని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఎస్ఐ.. ఏకపక్షంగా వ్యవహరిస్తూ రామగిరి మండలంలో భయాందోళనలు సృష్టిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. గత వారం జరిగిన రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎస్ఐ సుధాకర్ యాదవ్ తీరు తీవ్ర వివాదాస్పదమైంది.అదే సమయంలో పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటిపై పరిటాల సునీత సమీప బంధువులు ఆదర్శనాయుడు, మనోజ్ నాయుడు తదితరులు వరుసగా రెండు రోజుల పాటు రాళ్ల దాడికి పాల్పడినా ఎస్ఐ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీనికితోడు కురుబ లింగమయ్య హత్య కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. 20 మంది ఆ ఘటనలో పాల్గొంటే కేవలం ఇద్దరిపై మాత్రమే కేసు పెట్టి.. రెండు రోజులుగా వారికి రాజ¿ోగాలు కల్పించి, మంగళవారం అరెస్ట్ చూపించారు. ఇద్దరు నిందితుల అరెస్టు కురుబ మజ్జిగ లింగమయ్య (లింగన్న) హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, రామగిరి సీఐ శ్రీధర్ తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. లింగమయ్య కుమారుడు మనోహర్ మార్చి 30న అత్తగారింటికి వెళుతుండగా.. గ్రామానికి చెందిన ఆదర్శ్, అతని అనుచరులు అభ్యంతరకరంగా హేళన చేయగా, తండ్రి లింగమయ్యకు ఫోన్ చేసి తెలిపాడన్నారు. ఈ విషయంపై లింగమయ్య తన ఇంటి ముందు కూర్చుని.. అదే గ్రామానికి చెందిన ధర్మవరపు రమేష్ కుమారుడు ధర్మవరపు ఆదర్శ్, ధర్మవరపు మహేష్ కుమారుడు ధర్మవరపు మనోజ్ నాయుడులను ప్రశి్నంచారని చెప్పారు. ఇది జీర్ణించుకోలేని ఆదర్శ్ నాయుడు, మనోజ్నాయుడులు లింగమయ్యపై కట్టెలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. అనంతరం లింగమయ్యను అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చేరి్పంచగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై హతుడి భార్య ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో ఆదర్శ్ నాయుడు, మనోజ్నాయుడులను మంగళవారం రామగిరి శివారులోని 11కేవీ సబ్‌స్టేషన్ వద్ద అరెస్టు చేశామని తెలిపారు. -
ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో ముద్దాయికి ఉరిశిక్ష
సాక్షి, అనకాపల్లి: పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బాలిక వేపాడ దివ్య (7) హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ అనకాపల్లి జిల్లా చోడవరం అదనపు జిల్లా న్యాయమూర్తి రత్నకుమారి మంగళవారం తీర్పుచెప్పారు. బాధితుల తరఫున పీపీ ఉగ్గిన వెంకట్రావ్ వాదించారు. వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులు మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలోని గొల్లపేట వీధిలో హోటల్ నిర్వహించేవారు. వారి ఒక్కగానొక్క కుమార్తె దివ్య (7) స్థానిక ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుకుంటోంది.హోటల్లో పనిచేయడానికి ధనలక్ష్మికి వరుసకు సోదరుడయ్యే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన గుణశేఖర్ సుబ్బాచారిని పనికి కుదుర్చుకున్నారు. సుబ్బాచారి పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనను ధనలక్ష్మి, మురుగన్ దంపతులు పనిలో నుంచి తొలగించారు. దీంతో వారిపై సుబ్బాచారి కక్షగట్టాడు. 2015లో డిసెంబర్ 23న స్కూల్‌కు వెళ్లి వచ్చిన దివ్య సాయంత్రం నుంచి కనిపించడంలేదని తల్లిదండ్రులు దేవరాపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎవరి మీదన్నా అనుమానం ఉందా అని మురుగన్ దంపతులను అడగ్గా సుబ్బాచారిపై వారు అనుమానం వ్యక్తం చేశారు. 2015 డిసెంబర్ 24న బిళ్లాల మెట్ట వద్ద ఓ బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు చెప్పారు. మృతదేహంపై కత్తితో కోసిన గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికను దివ్యగా గుర్తించి, సుబ్బాచారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దివ్యను తానే హత్య చేసినట్లు నేరాన్ని ఒప్పుకొన్నాడు. బీరు సీసాతో పీక కోసి హత్య.. 23న దివ్య చదువుకుంటున్న ఉషోదయ స్కూల్ దగ్గరికి వెళ్లి, ఆమెకు రూ.20 ఇచ్చి గారెలు కొనుక్కోమన్నానని, అక్కడ నుంచి దివ్యను రైవాడ జలాశయం సమీపంలోని బిళ్లలమెట్ట కొండ వద్దకు తీసుకువెళ్లి పగలకొట్టిన బీరు సీసాతో పీక కోసి హత్య చేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. నిందితుడిపై గతంలో ఒంగోలులో వాహన దొంగతనం కేసు కూడా ఉంది. హత్య కేసును విచారణ జరిపిన చోడవరం 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి బాలిక హత్యకు కారణమైన నిందితుడిని సెక్షన్ 302 ఐపీసీ ప్రకారం దోషిగా నిర్థారిస్తూ పైవిధంగా శిక్ష విధించారు. -
కొలిక్కి చేరని ‘క్లింటన్’ కేసు!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జర్మన్ యువతిపై జరిగిన అఘాయిత్యం రాజధానిలో తీవ్ర కలకలం సృష్టించింది. 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బంజారాహిల్స్‌లో ఓ విదేశీ యువతిపై అత్యాచారం జరిగింది. అమెరికా నుంచి వచ్చి, బేగంపేటలోని క్లింటన్ ఫౌండేషన్‌లో న్యూట్రీషన్‌గా పనిచేసిన బాధితురాలిపై 2010 జూలై 7న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనంగా మారడంతో ఏకంగా రాష్ట్ర డీజీపీ రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా నిందితుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. తుపాకీ చూపించి అత్యాచారం...అమెరికాకు చెందిన సదరు యువతి (అప్పట్లో 25 ఏళ్లు) ఉద్యోగ నిమిత్తం 2009లో నగరానికి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్డు నెం. 11లోని ఓ ఇంటి పెంట్‌హౌజ్‌లో ఏడాదిన్నర పాటు నివసించింది. ఎప్పటిలాగే తన విధులు ముగించుకుని 2010 జూలై 6 రాత్రి 8 గంటలకు తన ఇంటికి చేరుకుంది. తలుపులు లోపల నుంచి తాళం వేసుకుని నిద్రించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ల వయసున్న యువకుడు కిటికీ గ్రిల్ తొలగించి లోపలకు ప్రవేశించాడు. బెడ్రూమ్లోకి వెళ్లి రివాల్వర్ చూపిస్తూ అరిస్తే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఉదయం బాధితురాలు నేరుగా ఆస్పత్రికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తెలిసిన వారిగా ఆధారాలు లభించినా...ఈ కేసు దర్యాప్తు కోసం నాటి పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఘాతుకం జరిగిన రోజు యువతి అల్మారాలో రూ.5 లక్షలు ఉన్నాయి. ఆమె ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడు తొలుత ఆ డబ్బు గురించే అడిగాడు. దీంతో ఆమెకు తెలిసిన వ్యక్తే ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఆ అమెరికన్ అప్పట్లో బేగంపేటలోని ఓ జిమ్‌కు వెళ్లేవారు. అక్కడ ఆమెతో సన్నిహితంగా మెలిగే కొందరిని అనుమానించారు. క్లూస్ టీమ్ నిపుణులు ఘటనా స్థలి నుంచి 14 ఆధారాలు సేకరించారు. ఎన్ని రకాలుగా దర్యాప్తు చేసినా... కేసు మాత్రం కొలిక్కిరాలేదు. ఆ యువతి తన స్వదేశానికి వెళ్లిపోతూ ‘ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ హావ్ స్వీట్ మెమరీస్ ఇన్ హైదరాబాద్. బట్.. దిస్ ఇన్సిడెంట్ ఈజ్ ఎ బ్యాడ్ మెమరీ ఫర్ మీ’ (హైదరాబాద్‌లో కొంతకాలంగా ఎన్నో తీపి జ్ఞాపకాలు భద్రపర్చుకున్నా. ఈ దురదృష్టకర ఘటన చేదు గుర్తుగా మిగిలిపోయింది) అని పోలీసులతో అన్న మాటలు ఇప్పటికీ అధికారులను వెక్కిరిస్తూనే ఉన్నాయి.‘విదేశీ’ కేసులపై ప్రత్యేక చట్టం తేవాలి..విదేశీయులపై జరిగే నేరాలకు సంబంధించిన కేసులు దేశంలో తక్కువగానే నమోదవుతున్నాయి. అత్యాచారం వంటి ఉదంతాలు అరుదు. అనేక కేసుల్లో నిందితులు చిక్కుతున్నా.. ఈ కేసుల్లో శిక్షలు పడే శాతం మాత్రం దారుణంగా ఉంటోంది. బాధితులు తమ దేశాలకు వెళ్లిపోయిన తర్వాత కేసు విచారణను పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రతి కేసుకూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు పెట్టడం సాధ్యం కాకపోవడంతో విచారణకు చాలా సమయం పడుతోంది. ఇవన్నీ నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. విదేశీయులపై జరిగే నేరాలకు సంబంధించి ప్రత్యేక చట్టం, కోర్టులు అమలులోకి తీసుకువస్తే ఈ పరిస్థితులు మారే అవకాశం ఉంది. – పి.రామకృష్ణ, మాజీ డీఎస్పీ -
స్టూడెంట్ తండ్రితో స్కూల్ టీచర్ ఎఫైర్.. ఆపై బ్లాక్ మెయిలింగ్
బెంగళూరు: పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ దారి తప్పింది. స్టూడెంట్ తండ్రితో ఎఫైర్ పెట్టుకుని ఆపై బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. ఇది బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ స్కూల్ టీచర్ గా పని చేస్తున్న శ్రీదేవి రుదాగి అనే టీచర్.. ఓ వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలను బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. తన ఐదేళ్ల కూతుర్ని 2023లో బెంగళూరులోని ఓ స్కూల్ లో జాయిన్ చేశాడు తండ్రి సతీష్(పేరు మార్చాం). అయితే అక్కడే అసలు కథ మొదలైంది. పాపను స్కూల్ కు తీసుకొచ్చి, తీసుకెళ్లే క్రమంలో అతనితో టీచర్ శ్రీదేవి సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. ఇలా ఇరువురి మధ్య ప్రారంభమైన వ్యవహారం కాస్తా ముదిరింది. ఈ క్రమంలోనే అతనితో సాన్నిహిత్యంగా ఉండటాన్ని సీక్రెట్ గా వీడియో రికార్డు చేసింది. అక్కడ్నుంచి అసలు కథ మొదలైంది. తనకు డబ్బులు కావాలంటూ పదే పదే వేధించసాగింది. కాలే, సాగర్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి వ్యాపారిని ముప్పుతిప్పలు పెట్టింది ఇలా మొత్తం మీద రూ. 4 లక్షల వరకూ లాగేసింది.ఏకంగా ఇంటికి..ఇక తనతో సాన్నిహిత్యం తగ్గించడంతో వ్యాపారి ఇంటికి వచ్చేసింది టీచర్ శ్రీదేవి. తనకు అప్పు కావాలనే వంకతో ఇంటికి వచ్చింది. అక్కడ రూ. 50 వేల అప్పు రూపంలో ఆమెకు ఇస్తున్నట్లు ఇంట్లో నమ్మించాడు సదరు వ్యాపారి. ఆ తర్వాత కూడా ఆమె నుంచి వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది.మకాం మార్చాడు..ఇక ఆమె వేధింపులు అధికం కావడంతో గుజరాత్ కు మకాం మార్చాడు సదరు వ్యాపారి. అయితే తన ఐదేళ్ల కూతురు ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్ కోసం మళ్లీ ఆమెను కలవాల్సి వచ్చింది. అలా ఆమె ఆఫీస్ లో చిక్కుపోయాడు వ్యాపారి. అక్కడ వీడియోలు, ఫోటోలు చూపిస్తూ రూ. 20 లక్షలు డిమాండ్ చేసింది. ఒకవేళ ఇవ్వకపోతే ఇంట్లో వాళ్లకు వాటిని పంపిస్తానంటూ బెదిరించింది. అక్కడ కాలే, సాగర్ లు కూడా ఉండటంతో చివరకు చేసేది లేక బయటకొచ్చాడు.పోలీసులకు ఫిర్యాదుఈ వ్యవహారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాన్ని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అప్పగించారు. దీనిపై విచారణ చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శ్రీదేవితో పాటు కాలే, సాగర్ లను కూడా అరెస్ట్ చేయగా,. ఆ ముగ్గురు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. -
గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. బెయిల్ కోసం హైకోర్టుకు రన్యారావు
బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసు(Gold Smuggling Case)లో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రన్యారావు (Ranya Rao) బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. గతంలో మేజిస్ట్రేట్, సెషన్స్ కోర్టుల్లో ఆమెకు చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఈ వారం లేదా వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఆమె డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) కస్టడీలో ఉన్నారు.కాగా, రన్యా రావు బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 14.8 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తుండగా ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. కేవలం 15 రోజుల్లోనే రన్యా రావ్ నాలుగుసార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే రన్య రావును అదుపులోకి తీసుకున్నారు.రన్యా రావు స్వస్థలం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కాగా.. నటనలో అడుగు పెట్టక ముందు బెంగళూరులో విద్యను అభ్యసించింది. 2014లో ఆమె మాణిక్య చిత్రంలో ప్రముఖ హీరో కిచ్చా సుదీప్ సరసన శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని తెలుగులో ప్రభాస్ నటించిన మిర్చి చిత్రానికి రీమేక్‌గా కన్నడలో తెరకెక్కించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల తర్వాత విక్రమ్ ప్రభు సరసన వాఘాతో తమిళంలో అడుగుపెట్టింది.2017లో యాక్షన్ కామెడీ చిత్రం పటాకీతో కన్నడలో రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమా పటాస్‌కి రీమేక్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీత పాత్రలో మెప్పించింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు గణేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. చివరిసారిగా పటాకీ కనిపించిన రాన్యా రావు ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. తాజాగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. -
గోడు చెప్పుకోలేక..వినేవారులేక!
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రాష్ట్రానికి చెందిన ఓ మూగ, బధిర విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం అర్ధరాత్రి హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఎం. రాహుల్ చైతన్య (18) అనే యువకుడు తనువు చాలించాడు. పుట్టినరోజున తల్లికి మెసేజ్ పంపి బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మృతుడి స్వస్థలం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామం. ఇదే కళాశాలకు చెందిన కాట్రవత్ అఖిల్ (20) అనే మరో తెలంగాణ విద్యార్థి కార్డియాక్ అరెస్ట్‌తో ఆదివారం రాత్రే మరణించడం గమనార్హం. తీవ్రంగా గాయపడిన రాహుల్‌ను సమీపంలోని ఎస్ఆర్ఎన్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ధూమన్‌గంజ్ ఏసీపీ అజేంద్ర యాదవ్ తెలిపారు. తమ కళాశాలలోని మూగ, బధిర విభాగంలో రాహుల్ చైతన్య బీటెక్ ఫస్టియర్‌లో చేరాడని అలహాబాద్ ట్రిపుల్ ఐటీ పీఆర్వో పంకజ్ మిశ్రా చెప్పారు. గత మూడు నెలలుగా అతను తరగతులకు హాజరుకావడం లేదని.. చదువుల సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు. ఈ ఒత్తిడి గురించి అతను తల్లికి కూడా తెలియజేశాడని వివరించారు. ఇద్దరు విద్యార్థుల మరణంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టేందుకు యాజమాన్యం త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. -
గ్రూప్ 1 పరీక్ష సరిగ్గా రాయలేదని.. యువతి ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఆకుల శృతి (27) సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శృతి ఎంకాం పూర్తి చేసింది. పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతూ.. ఇటీవలే గ్రూప్–1, 2 పరీక్ష రాసినా మంచి ర్యాంక్ రాలేదు. వీటికితోడు శృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. మరోవైపు శృతి ఏడాదికాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స చేయించుకుందామంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనస్తాపానికి గురైన శృతి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శృతి తల్లి రోజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు. పండుగ కోసం వచ్చి.. ప్రాణాలు వదిలి.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి సుల్తానాబాద్‌రూరల్ (పెద్దపల్లి): ఐతరాజుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన పంగ నిఖిల్(26) మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. పంగ భాస్కర్–పద్మ దంపతుల కుమారుడు నిఖిల్ హైదారాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది పండుగ కోసమని ఈనెల 29న స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఐతరాజుపల్లిలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి రాత్రి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలు దేరాడు. ఈక్రమంలో ప్రమాదవాశాస్తు ద్విచక్ర వాహనంపై నుంచిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
అనకాపల్లి: వేపాడు దివ్య కేసులో సంచలన తీర్పు
అనకాపల్లి, సాక్షి: పదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు గుణశేఖర్‌ను దోషిగా ప్రకటించిన చోడవరం కోర్టు.. మరణశిక్షను ఖరారు చేసింది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గుణశేఖర్‌కు దివ్య కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకుని.. స్కూల్‌కి వెళ్లి వస్తున్న ఆరేళ్ల చిన్నారి దివ్యను నిందితుడు తన వెంట తీసుకెళ్లాడు. బిళ్లలమెట్ల రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి బీర్ బాటిల్‌తో గొంతు కోసి పైశాచికంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా జరిపారు. చివరకు బంధువైన గుణ శేఖరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లపాటు విచారణ జరగ్గా.. చివరకు దివ్య కుటుంబానికి న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
హైదరాబాద్‌లో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: మీర్పేట్లో విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. లిఫ్ట్ పేరిట ఆమెను ఎక్కించుకుని వెళ్లిన కొందరు యవకులు ఘాతుకానికి ఒడిగట్టారు.మీర్‌పేట వద్ద వాహనాల కోసం ఎదురు చూస్తున్న విదేశీయురాలిని లిఫ్ట్ వంకతో తీసుకెళ్లారు. ఆపై పహాడీషరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది. సదరు బాధితురాలు జర్మనీకి చెందిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
బస్సును ఓవర్టేక్ చేయబోయి..
హైదరాబాద్: బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పిన ఇన్నోవా వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.గుంటూరుకు చెందిన కొండేపాటి పుల్లారావు నగరానికి వచ్చి బీఎన్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నాడు. సోమవారం అతను భార్య పిల్లలతో కలిసి బైక్‌పై ఈసీనగర్ నుంచి పెద్ద చర్లపల్లి వైపుగా వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఇన్నోవా వాహనం బస్సును ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లారావు (32) అక్కడికక్కడే మృతి చెందగా, అతడి భార్య నాగరాణి, కుమారులు రుత్విక్, రాజేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఇన్నోవా డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. -
దైవసన్నిధికి వెళుతూ... మృత్యు ఒడికి..
అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు... గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటకు చెందిన జిడుగు సందీప్ తన తల్లిదండ్రులు మోహన్‌బాబు(57), అరుణ(50), భార్య పల్లవి, కుమార్తె సాత్విక(5), కుమారుడు షణ్ముఖ(3 నెలలు)తో కలసి కారులో కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి బయలుదేరారు. వారి కారును పులిగడ్డ–పెనుమూడి వంతెన టోల్‌ప్లాజా మధ్య ఎదురుగా పామాయిల్ లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్‌బాబు, అరుణ, షణ్ముఖ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సాతి్వకను అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మచిలీపట్నం తరలిస్తుండగా, మార్గంమధ్యలో మరణించింది. గాయపడిన పల్లవి, సందీప్‌లను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉంది. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో చిన్నారి షణ్ముఖను ఊయలలో వేసేందుకు వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడటం చూపరులను కలచివేసింది. -
గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురి మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. పథార్ ప్రతిమా మండలంలోని ధోలాహట్ గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఓ నివాసంలో సోమవారం రాత్రి 9గం. ప్రాంతంలో సిలిండర్ పేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసి.. సహాయక చర్యలు చేపట్టారు. ఏడు మృతదేహాలను బయటకు తీసుకురావడంతో పాటు గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో బాణాసంచా తయారీ కేంద్రం నడుపుతున్నారేమోననే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్యాస్ సిలిండర్లు ఒకేసారి పేలాయని.. బాణాసంచా కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. #Breaking: 7 people, including 4 children, killed in a gas cylinder blast at Pathar Pratima in Bengal''s South 24 Parganas district.#WestBengal #South24Parganas #CylinderBlast #Blast pic.twitter.com/JC3togdyt5— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) March 31, 2025 -
ఇద్దరు యువతులతో ప్రేమాయణం
యశవంతపుర: బెళగావిలో ప్రేమికుడు మోసం చేశాడనే కారణంగా యువతి రెండురోజుల కిందట ఆత్మహత్య చేసుకొంది. ప్రైవేటు హాస్టల్లో యువతి ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. మొదట ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు విచారించగా ప్రేమించిన ప్రియుడు మోసం చేయడంతో విరక్తి కలిగి విజయపురకు చెందిన ఎంబీఎ పట్టభద్రురాలు ఐశ్యర్వ లక్ష్మీ గలగలి (25) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బయట పడింది. ప్రియుడు ఆకాశ్ చడచణను బెళగావి ఎపిఎంసీ పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహం వేలాడుతున్నా చూడకుండా.. ఆకాశ్ ఐశ్వర్యతో ప్రేమాయణం నడుపుతూనే మరో యువతితోనూ ప్రేమపేరుతో షికార్లు సాగించేవాడు. ఈ సంగతి ఐశ్వర్యకు తెలిసి నిలదీసినా మార్పురాలేదు. మోసపోయాననే బాధతో ఐశ్యర్వ ఉరి వేసుకొని చనిపోయింది. ఐశ్యర్వ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆకాశ్ మొబైల్‌కు ఒక సందేశం పెట్టింది. నా మరణానికి నువ్వు, నీ ప్రియురాలే కారణమని తెలిపింది. దీంతో ఆందోళన చెందిన ఆకాశ్ తక్షణం ఐశ్యర్వ ఉంటున్న పీజీ వెళ్లి తలుపులు తట్టాడు. చివరకు తలుపును పగలగొట్టి ఆమె మొబైల్‌ని ఎత్తుకెళ్లాడు. ప్రియురాలు ఉరికి వేలాడుతున్నా కనీసం పట్టించుకోలేదు. అతడు వచ్చిన దృశ్యాలు పీజీలోని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఇద్దరి మధ్య కాలేజీ రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆకాశ్ బెళగావిలో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. ఐశ్యర్వ ఎంబీఏ పూర్తిచేసి ఇంటర్న్íÙప్ చేస్తోంది. ఆకాశ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
అత్యాచారం చేసి.. నోట్లో మూత్రం పోసి..
సాక్షి, నాగర్‌కర్నూల్: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరించే రీతిలో మహిళపై ఏడుగురు కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. దాడి చేసి.. చెట్టుకు కట్టేసి ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన మహిళపై కామాంధులు దాడికి తెగబడ్డారు. శనివారం సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆమె తల్లిదండ్రు లు, పిల్లలు ఆలయ పరిసరాల్లో పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లింది. అక్కడ కనిపించిన బంధువుతో మాట్లాడుతుండగా, అక్కడే కాచుకుని ఉన్న ఏడుగురు కామాంధులు వారిపై దాడిచేసి, ఆమె బంధువును చెట్టుకు కట్టేశారు. మహిళపై అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తూ ఏడుగురు కలిసి సా మూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కనీసం తాగేందుకు నీళ్లు ఇవ్వమని వేడుకున్నా కనికరించలేదు. పైగా నోట్లో మూత్రం పోసి అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్టు తెలిసింది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళ వెనకడుగు వేసినట్టు తెలిసింది. తర్వాత కుటుంబ సభ్యుల భరోసా మేరకు ఎట్టకేలకు సోమ వా రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గంజాయి, మద్యం మత్తులో.. జిల్లాలో పలుచోట్ల గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, బహిరంగంగా మద్యం తాగుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ మత్తులో విచక్షణ కోల్పోయి ఇష్టారీతిగా అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఊర్కొండపేట ఆలయ పరిసరాలతోపాటు జిల్లాలో పలుచోట్ల ఇతర దర్శనీయ ప్రదేశాల్లో బహిరంగ మద్యపానం, గంజాయి వినియోగంపై తరచుగా ఫిర్యాదులు వస్తున్నా, పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. పలుచోట్ల ఫిర్యాదు చేసినా, తరచుగా ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా ఆయా చోట్ల పో లీసుల నిఘా ఉండటం లేదు. తాజాగా మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో గంజా యి, మ ద్యం మత్తులో నిత్యం జోగుతున్న స్థానిక యువకులు, పలువురు ఆటోడ్రైవర్ల పాత్ర ఉందని తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఏడు గురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా.. ఇంకా ఎవరికైనా ఈ ఘటనతో సంబంధం ఉందా.. అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. వేగంగా విచారణ చేస్తున్నాం.. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ, సీఐ అధికారులు స్పందించి కేసు నమోదు చేశారని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. కేసుపై వేగంగా విచారణ కొనసాగుతోందన్నారు. ఏడుగురు నిందితులను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. బాధితురాలిపై నిందితులు అత్యంత దారుణంగా ప్రవర్తించారని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు.నిందితులు ఎవరైనా వదిలిపెట్టం జడ్చర్ల టౌన్: ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట శివారులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పారీ్టకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని నాగర్‌కర్నూల్ ఎస్పీని కోరానని వెల్లడించారు. ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వారు ఓ పారీ్టకి చెందిన నాయకులు అని తన దృష్టికి వచ్చిందని, అయితే ఈ ఘటనలో తాను రాజకీయాలు చేయదలుచుకోలేదన్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని, యువతికి అండగా ఉంటామన్నారు. అలాగే ఊర్కొండ పోలీసులతో మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కలి్పంచాలని కోరానన్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
కృష్ణాజిల్లా: జిల్లాలోని అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పులిగడ్డ పెనుమూడి వారధి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఒక పసికుందు కూడా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.మృతుల్లో ఒకరు తెనాలికి చెందిన జిడుగు రామ్మోహన్ గా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మిగతా ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రామాయణం చదివైనా బాగుపడు తల్లీ
ముస్కాన్ రస్తోగీ(muskaan rastogi).. గత పదిరోజులుగా ఇటు మీడియా అటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. ప్రాణంగా ఆమెను ప్రేమించిన భర్తను.. గంజాయి మత్తులో ప్రియుడితో కలిసి జోగుతూ ముక్కలు చేసి, ఆపై డ్రమ్ములో ఆమె దాచిన వైనం ‘మీరట్ ఉదంతంగా’గా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఆమెలో సత్పరివర్తన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెబుతున్నారు ఎంపీ అరుణ్ గోవిల్.టీవీ రామాయణంతో అన్ని భాషల ప్రజలకు చేరువైన నటుడు అరుణ్ గోవిల్.. మీరట్ ఎంపీ అనే సంగతి తెలిసిందే కదా. తాజాగా.. ఆదివారం చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు వెళ్లి అక్కడి ఖైదీలకు ఆయన 1,500 రామాయణ ప్రతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తన నుంచి రామాయణం ప్రతి అందుకున్న వెంటనే ముస్కాన్ భావోద్వేగానికి గురైందని ఆయన అన్నారు.‘‘రామాయణం పుస్తకాన్ని(Ramayana Book) అందుకోగానే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయ్. ఇది ఆమె జీవితంలో కచ్చితంగా చీకట్లు పారదోలుతుందని చెప్పాను. ఇది చదివైనా జీవితంలో బాగుపడమని.. మంచి మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ముస్కాన్‌తో అన్నాను’’ అని అరుణ్ గోవిల్(Arun Govil) మీడియాకు వివరించారు. ముస్కాన్‌తో పాటు ఈ కేసులో సహా నిందితుడు సాహిల్ శుక్లా కూడా రామాయణం అందుకున్నాడట. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా 11 లక్షల రామాయణ కాపీలను పంచాలని అరుణ్ గోవిల్ నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే ఇంటింటికీ రామాయణం అనే కార్యక్రమం చేపట్టిన ఆయన.. ఇలా ఖైదీలకూ పంపిణీ చేశారు.మీరట్‌లో మార్చి 4వ తేదీన సౌరభ్ తివారీ హత్య జరిగింది. భర్తను ముక్కలు చేసి డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో సీల్ చేసిందామె. ఆపై ప్రియుడితో కలిసి జాలీగా ట్రిప్పులు వేసింది. భర్త మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో దొరికిపోతామనే భయంతో తన తల్లిదండ్రులకు ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో వాళ్లే ఆమెను దగ్గరుండి పోలీసులకు అప్పజెప్పారు. ఈ కేసులో భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు తరలించారు. మొదట్లో తమకు భోజనం వద్దని.. గంజాయి కావాలని.. ఇద్దరినీ ఓకే బ్యారక్ ఉంచాలంటూ జైలు సిబ్బందితో గొడవలకు దిగారు వాళ్లు. ఈ క్రమంలో వైద్యుల పర్యవేక్షణలో వాళ్లకు చికిత్స అందింది. అయితే వైద్య పర్యవేక్షణ ముగియడంతో అధికారులు వాళ్లకు పనులు అప్పజెప్పబోతున్నారు. రిమాండ్ మీద ఉన్న వీళ్లు.. కోర్టు విచారణ పూర్తయ్యేదాకా కుట్లు అల్లికలతో ముస్కన్, కూరగాయాలు పండిస్తూ సాహిల్ గడపబోతున్నారు.అది ఏఐ జనరేటెడ్ వీడియో!రిమాండ్ ఖైదీగా ఉన్న ముస్కాన్ ఓ పోలీస్ అధికారితో ఏకాంతంగా గడిపినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అయ్యింది. అయితే అది నకిలీ వీడియో అని.. తన ప్రతిష్టకు భంగం కలిగించే యత్నమని చెబుతూ సదరు అధికారి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. అది ఏఐ జనరేటెడ్ వీడియోగా తేల్చారు. అంతేకాదు.. దానిని అప్లోడ్ చేసిన అకౌంట్‌ను గుర్తించిన పోలీసులు, దీని వెనుక ఉన్నవాళ్లను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు.. ముస్కాన్, సాహిల్ పేరిట కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతుండడం విశేషం. -
ఏలూరు జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జైలులో ఒక రిమాండ్ మహిళా ఖైదీ ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల కిందటే జైలుకు వచ్చిన ఆమె ఆదివారం ఉదయం చున్నీతో బ్యారక్‌లోని కిటికీకి ఉరి వేసుకుని మృతిచెందడం కలకలం సృష్టించింది. వివరాలు... ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసు (31)తో తెలంగాణలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శాంతికుమారి(29)కి 12 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. బోసుపై మార్చి 18న గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు.ఖమ్మం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 19న మృతిచెందాడు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. శాంతికుమారి తన ప్రియుడు సొంగా గోపాల్‌తో కలిసి భర్త బోస్ హత్యకు కుట్ర చేసిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమెను మార్చి 24న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, జడ్జి రిమాండ్ విధించారు. మరోవైపు తన భర్తను చంపేస్తామని కొంతమంది రాజకీయ నాయకులు హెచ్చరించారని, ఆయనపై దాడి జరిగిన రోజే శాంతికుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త మృతికి, తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా పోలీసులు తనను కేసులో ఇరికించారని శాంతికుమారి బాధపడుతున్నట్లు ఆమె బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జైలు బ్యారక్‌లో కిటికీకి తన చున్నీతో ఉరి వేసుకుంది. వెంటనే జైలు సిబ్బంది ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించగా, వైద్యులు మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌లోని మార్చురీలో ఉంచారు. ఏలూరు జిల్లా జైలు అధికారుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, శాంతికుమారి ఆత్మహత్య నేపథ్యంలో మహిళా బ్యారెక్ వద్ద విధులు నిర్వహించిన హెడ్ వార్డర్ ఎల్.వరలక్ష్మి, వార్డర్ నాగమణిలను సస్పెండ్ చేస్తూ జైలు సూపరింటెండెంట్ సీహెచ్ఆర్వీ స్వామి ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. -
చేదు మిగిల్చిన ఉగాది
మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఉగాది పండుగ నాడు ఒక స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు కుమారులు మృతి చెందడం విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. మడకశిర గాందీబజార్లో సొంతింట్లో స్వర్ణకారుడు క్రిష్ణాచారి కుటుంబం నివాసం ఉంటోంది. ఏమైందో ఏమో కానీ క్రిష్ణాచారి (45), భార్య సరళ (38), పెద్ద కుమారుడు సంతోష్ (15), రెండో కుమారుడు భువనేష్ (13) మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఆదివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో వెలుగులోకి వచి్చంది. మృతుడు క్రిష్ణాచారికి తండ్రితోపాటు గోపి, సురేష్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. చిన్న సోదరుడు సురేష్ ఇంట్లో ఉంటున్న తండ్రి ఉదయాన్నే క్రిష్ణాచారికి ఫోన్ చేశారు. ఫోన్ తీయకపోవడంతో సురేశ్ తన అన్న కిృష్ణాచారి ఇంటి వద్దకు వెళ్లి చూడగా లోపల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేశాడు. క్రిష్ణాచారి జేబులో సైనేడ్ డబ్బా.. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఇంటిని క్షుణ్నంగా పరిశీలించింది. క్రిష్ణాచారి జేబులో సైనేడ్ డబ్బా ఉన్నట్లు గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే క్రిష్ణాచారి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. క్రిష్ణాచారి ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు ముందు బెంగళూరులో ఉన్న తన అక్కతో ఫోన్లో మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. అయ్యో పిల్లలు.. ఉగాదికి ఇంటికొచ్చి.. క్రిష్ణాచారి పెద్ద కుమారుడు సంతోష్ మడకశిర సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతూ.. పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. చిన్న కుమారుడు భువనేష్ అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఇద్దరూ పాఠశాల హాస్టల్లో ఉంటూ.. ఉగాది సందర్భంగా ఇంటికొచ్చారు. వీరిద్దరూ తల్లిదండ్రులతోపాటు ప్రాణాలు కోల్పోయారు. -
ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?
నోయిడా: కారును ర్యాష్ డ్రైవ్ చేయడమే కాదు.. ఫుట్ పాత్ పైకి ఎక్కించేశాడు లాంబోర్కిని కారును డ్రైవ్ చేస్తున్న డ్రైవర్. అదే సమయంలో ఫుట్ పాత్ పై ఇద్దరు కార్మికులు పని చేస్తున్నారు. తలకు హెల్మెట్ పెట్టుకుని ఆరంజ్ జాకెట్లు తొడక్కుని పనిలో ఉన్నారు. ఇంతలో ఓ కారు అమాంతం ఫుట్ పాత్ పైకి వచ్చేసింది. దీంతో కొద్ది పాటి గాయాలతో తప్పించుకున్నారు ఇద్దరు కార్మికులు. తలకు హెల్మెట్ ఉండటం వల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పింది.అయితే కారు డ్రైవర్ ను పట్టుకుని నిలదీశాడు ఆ కార్మికుల్లో ఒకరు. రోడ్డుపై ఫుట్ పాత్ పై స్టంట్స్ ఏమైనా చేస్తున్నావా అంటూ ప్రశ్నించాడు. అయితే దానికి ఆ డ్రైవర్ నుంచి ఎటకారంతో కూడిన సమాధానం వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారేంటి అంటూ బదులిచ్చాడు. దానికి ఆ కార్మికులకు కోపం చిర్రెత్తు కొచ్చింది. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఆ డ్రైవర్ పై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడేంటి.. నేను కారును ఫుట్ పాత్ పైకి ఎక్కించా.. ఎంతమంది చచ్చిపోయారంటూ హిందీలో మళ్లీ ప్రశ్నించాడు.దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు వచ్చిన వారు.. ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు కారును కూడా సీజ్ చేశారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 94లో నిర్మాణంలో ఉన్న ఒక కాంప్లెక్స్ పక్కన ఉన్న ఫుట్‌పాత్ వద్ద ఇది జరిగింది. అయితే ఈ ఇద్దరు కార్మికుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించామని, ఎటువంటి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు.A #Lamborghini, a fat bank account, and ZERO Humanity This #Noida brat mows down two labourers and casually asks—“Koi mar gaya idhar?” pic.twitter.com/TaUgdB769z— Smriti Sharma (@SmritiSharma_) March 30, 2025 -
రూ. 800 ఫీజు కట్టలేదని అవమానించారు.. బాలిక ఆత్మహత్య!
ఆ బాలిక చదివేది తొమ్మిదో తరగతి.. ఎగ్జామ్ టైమ్ వచ్చింది. కానీ ఆ బాలిక స్కూల్ ఫీజు రూ. 800 కట్టాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించక ఆ కొద్ది మొత్తాన్ని పరీక్షల నాటికి కట్టలేకపోయింది. ఇంకేముందే పరీక్షలు రాయడానికి స్కూల్ యాజమాన్యం అంగీకరించకపోగా, అవమానించింది. ఇది కూడా బహిరంగంగా ఆ అమ్మాయిని స్కూల్ యాజమాన్యం అవమానించింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ గడ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది.స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ దగ్గర్నుంచీ స్కూల్ మేనేజర్ సంతోష్ కుమార్, ఆఫీసర్ దీపక్ సరోజ్ లు ఆ బాలికను అవమానానికి గురి చేశారు. స్కూల్ పరీక్ష ఫీజు కట్టలేకపోయిందంటూ అవమానించారు. అంతేకాకుండా పరీక్షలకు అనుమతించేది లేదని చెప్పారు. ఇక చేసేది లేక అక్కడ ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేసింది. లోపలకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆమె తల్లి పొలం పనికి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి విగత జీవిలా కనిపించింది.స్కూల్ ఫీజు కట్టలేదని ఆమెను పరీక్షకు అనుమతించడమే కాకుండా అవమానించడం దారణమని న్యాయవాది, స్థానిక పంచాయతీ సభ్యుడైన మొహ్మద్ అరిఫ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యాలు అవమానించాయంటే అది నేరం కిందకు వస్తుందన్నారు.తన కూతురు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. దీనిపై భారతీయ న్యాయ సన్నిహిత సెక్షన్ 107 కింద స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
గుంటూరులో దారుణం.. రెండో భార్య చిత్ర హింసలకు బాలుడు మృతి
సాక్షి, గుంటూరు: గుంటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మొదటి భార్య సంతానమైన కవల పిల్లలను రెండో భార్య తీవ్రంగా హింసించింది. అంతటితో ఆగకుండా పండుగ వేళ ఆరేళ్ల బాబును గోడకేసి కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో బాలుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలంలోని గొల్లపాలెంకు చెందిన సాగర్ అనే వ్యక్తికి గతంలో వివాహం జరిగింది. సాగర్‌కు ముగ్గురు సంతానం. ముగ్గురిలో కార్తీక్, ఆకాష్ కవల పిల్లలు. కొద్ది రోజుల క్రితం మొదటి భార్య చనిపోవడంతో ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య పిల్లలను లక్ష్మి తరచూ చిత్రహింసలకు గురిచేస్తోంది. పిల్లలను అడ్డు తొలగించుకోవాలని వారిని ప్రతీరోజు కొడుతూనే ఉండేది. ఈ క్రమంలో ఆదివారం దారుణంగా హింసిస్తూ చిన్న కుమారుడు కార్తీక్‌ను గోడకేసి కొట్టింది. దీంతో ఆ బాలుడు తల పగిలి అక్కడికక్కడేచనిపోయాడు. పెద్ద కుమారుడు ఆకాశ్ శరీరంపై రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. దీంతో, ఆకాశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. తాజాగా బాలుడి మరణంతో లక్ష్మి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు.. లక్ష్మిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
తల్లి ఫోన్ మాట్లాడలేదనే వేదనతో..
అన్నానగర్: గుజరాత్‌కు చెందిన అబిషా వర్మ (24). ఈమె తండ్రి చిన్నప్పుడే చనిపోయిన నేపథ్యంలో తల్లి మరో పెళ్లి చేసుకుని దుబాయ్‌లో ఉంటోంది. అబిషా వర్మ 22 ఏళ్ల వయస్సు వరకు తన తల్లితో కలిసి దుబాయ్‌లో నివసించింది, ఆమెకు చెన్నైలోని విమానాశ్రయంలో ఫ్లైట్ అటెండెంట్‌గా ఉద్యోగం వచ్చింది. దీంతో కుండ్రత్తూరు పక్కనే ఉన్న తిరుముడివాక్కం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ అపార్ట్ మెంట్లో తన స్నేహితులతో కలిసి ఉంటూ రోజూ పని నిమిత్తం చెన్నై విమానాశ్రయానికి వెళ్లేది. ఈ స్థితిలో గత కొన్ని రోజులుగా దుబాయ్ నుంచి వచ్చిన అభిషావర్మతో తన తల్లి ఫోన్లో మాట్లాడడం లేదని తెలుస్తుంది. దీంతో అబిషావర్మ తీవ్ర మనస్థాపానికి లోనై శనివారం తన తల్లి అబిషా వర్మకు పలుమార్లు ఫోన్ చేసేందుకు ప్రయతి్నంచింది. ఆమె నంబరు స్విచ్ ఆఫ్ రావడంతో అబిషా ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించింది. ఆమె స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుండ్రత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇల్లరికం వచ్చిన భర్తను హత్య చేయించిన భార్య
నిజామాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను భార్య అంతమొందించింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం నాగారం గ్రా మానికి చెందిన అమృతం విఠల్ (38) అనే వ్యక్తి 20 ఏళ్ల కిత్రం సోమేశ్వర్ గ్రామంలోని మేనమామ కూతురు కాశవ్వను పెళ్లి చేసుకొని ఇల్లరికం వచ్చాడు. మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, ఒక్కరికి పెళ్లి అయింది. విఠల్ భార్య కాశవ్వ నాగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. విఠల్‌ను అంతమొందిస్తే ఏ గొడవా ఉండదని భావించిన కాశవ్వ అదే గ్రామానికి చెందిన అమృతం విఠల్(నిందితుడు), పుల్కంటి విఠల్‌కు విషయం తెలిపింది. శుక్రవారం రాత్రి విఠల్(మృతుడు)ను పొలం వద్దకు తీసుకెళ్లిన అమృతం విఠల్, పుల్కంటి విఠల్ అతిగా మద్యం తాగించి మెడకు టవల్‌తో గట్టిగా బిగించి, పైపులతో కొట్టి చంపారు. అనంతరం విఠల్ మృతదేహాన్ని కొల్లూర్ సబ్‌స్టేషన్ సమీపంలో బాన్సువాడ–బీర్కూర్ ప్రధాన రహదారిపై పడేసి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి అన్న బింగి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి భార్య కాశవ్వ, అమృతం విఠల్, పుల్కంటి విఠల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, విఠల్‌ను తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సీఐ అశోక్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
కాల్పుల కలకలం
గోల్కొండ: గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్ గార్డెన్లో దావత్ – ఎ– రంజాన్ షాపింగ్ ఎక్స్‌పోలో శనివారం రెండు స్టాళ్ల నిర్వాహకుల మధ్య జరిగిన గొడవ గాలిలోకి కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్‌లో దావత్– ఎ– రంజాన్ పేరుతో రంజాన్ షాపింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్స్పో శుక్రవారం రాత్రి ముగిసింది. శనివారం ఉదయం నిర్వాహకులు తమ స్టాళ్లను తొలగిస్తున్నారు. కాగా.. ఫారూక్ అహ్మద్, సయ్యద్ హారూన్ సోదరులు బొమ్మల షాపు నిర్వహిస్తుండగా.. వీరి స్టాల్ పక్కనే దుబాయ్‌కి చెందిన తౌఫిక్ అనే వ్యక్తి పర్ఫ్యూమ్ షాపు నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఫారూక్ అహ్మద్ తనకు ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఇవ్వాలని తౌఫిక్‌ను అడుగుతున్నాడు. ఈ విషయమై శనివారం ఉదయం ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకుంటూ స్టాళ్లను ధ్వంసం చేయసాగారు. పర్ఫ్యూమ్ స్టాల్ నిర్వాహకుడు తౌఫిక్ ఈవెంట్ ఆర్గనైజర్ అయిన మీర్ హసీబుద్దీన్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. తమపైనే షికాయత్ చేస్తావా అంటూ ఫారూక్ అహ్మద్, సయ్యద్ హారూన్‌లు కలిసి తౌఫిక్‌పై దాడికి వెళ్లారు. వీరి మధ్య పరస్పరం తోపులాట చోటుచేసుకుంది. ఇది గమనించిన ఈవెంట్ ఆర్గనైజర్ మీర్ హసీబుద్దీన్ తనపై కూడా దాడి జరగవచ్చనే అనుమానంతో తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్‌తో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం వినగానే స్టాళ్లను తొలగించిన వ్యాపారులు, వారి సహాయకులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన మీర్ హసీబుద్దీన్ నుంచి రివాల్వర్‌ను స్వా«దీనం చేసుకుని నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
పండుగ పూట విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, కామారెడ్డి: ఉగాది పండగ వేళ కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెరువులో మునిగి తల్లి, ముగ్గురు పిల్లలు మృతిచెందారు. దీంతో, వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనలో మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్‌గా గుర్తించారు.వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌కు చెందిన మౌనిక (26) చెరువు వద్ద బట్టలు ఉతుకుతోంది. ఈ క్రమంలో తన బిడ్డలు ముగ్గురూ చెరువులోకి స్నానానికి దిగారు. చెరువు లోతుగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడేందుకు తల్లి ప్రయత్నించింది. ఈ క్రమంలో తల్లితో పాటు పిల్లలు ముగ్గురూ చెరువులో మునిగి చనిపోయినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లీ పిల్లలు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనలో మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్‌గా గుర్తించారు. -
టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురి అరెస్ట్
నకిరేకల్: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురిని శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించామని నల్లగొండ జిల్లా నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 21న నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఓ యువకుడు తెలుగు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాద్యమాల్లో వైరల్ చేసిన విషయం విధితమే. ఈ ఘటనలో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఈ నెల 23న చిట్ల ఆకాష్, బండి శ్రీను, గుడుగుంట్ల శంకర్, బ్రహ్మదేవర రవిశంకర్, ఓ బాలుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కేసు తదుపరి విచారణ అనంతరం శనివారం నకిరేకల్‌కు చెందిన పోగుల శ్రీరాముల, తలారి అఖిల్‌కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్‌కుమార్, పళ్ల మనోహర్‌ను శనివారం రిమాండ్‌కు పంపామని, ఓ బాలుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. రిమాండ్ చేసినవారిలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు బీజేపీకి చెందిన వారుగా గుర్తించామని పేర్కొన్నారు. -
మళ్లీ కాల్పుల మోత
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య శనివారం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఏకంగా 17 మంది మావోయిస్టులు మృతి చెందగా వీరిలో 11 మంది మహిళలే ఉన్నారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, దర్భా డివి జన్ కార్యదర్శి, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు జగదీశ్ అలియాస్ బుద్రా మరణించినట్టు పోలీసులు ధ్రువీకరించారు. ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడగా వారిని ఎయిర్‌లిఫ్ట్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పక్కా సమాచారంతో..: సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు కేర్లపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోగుండ గుట్టల దగ్గర మావోయిస్టు దర్భా డివిజన్, కేర్లపాల్, నేషనల్ పార్క్ ఏరియా కమిటీలు సమావేశమయ్యాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సుక్మా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ), సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత గుట్టల వద్దకు చేరుకున్నాయి. శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటల వరకు అనేకసార్లు కాల్పులు చోటు చేసుకున్నా యి. అనంతరం ఘటనా స్థలిని పరిశీలించగా 17 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తేలింది. మృతదేహాలను సుక్మాకు తరలించారు. ఇందులో ఏడుగురి వివరాలు మాత్రమే తెలిశాయి. ఘటనా స్థలంలో ఏకే 47, ఇన్సాస్, రాకెట్ లాంఛర్లు, ఇతర ఆటోమేటిక్ వెపన్లు లభించాయి. మిలటరీ ఆపరేషన్లలో దిట్ట జగదీశ్!: సుక్మా జిల్లా లోని పౌర్గుండం గ్రామానికి చెందిన బుద్రా కుహరామి చిన్నప్పుడే మావోయిస్టుల్లో చేరాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ దర్భా డివిజన్ కమిటీ కార్యదర్శి స్థాయికి చేరాడు. మరో మావోయిస్టు అగ్రనేత జగదీశ్ మాస్టర్జీ 2011లో అరెస్ట్ అయ్యాక ఆయన పేరును బుద్రా ఉపయోగిస్తున్నాడు. భద్రతా దళాలే లక్ష్యంగా దాడులు చేయడం, మిలిటరీ ఆపరేషన్లకు వ్యూహాలు రచించడం, పేలుడు పదార్థాలను ఉపయోగించడంలో దిట్టగా జగదీశ్‌కు పేరుంది. ఈ క్రమంలో 2023 ఏప్రిల్ 23న ఆరన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భద్రతా దళాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని శక్తివంతమైన ఐఈడీ బాంబు పేల్చగా పది మంది డీఆర్జీ జవాన్లు మరణించారు. ఈ దాడి వెనుక మాస్టర్ మైండ్ జగదీశ్‌దేనని పోలీసుల విచారణలో తేలింది. అప్పటి నుంచి జగదీశ్ కదలికలపై భద్రతా దళాలు కన్నేసి ఉంచాయి. డీఆర్జీ జవాన్ల సంబరాలు జగదీశ్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఎదురుకాల్పుల మృతుల్లో ఆయన ఉన్నట్టు తెలియగానే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ (కగార్) చేపడుతున్న జవాన్లు సంబరాలు చేసుకున్నారు. జవాన్లకు బస్తర్ డీఐజీ కమలోచన్ కశ్యప్, సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్‌లు మిఠాయిలు పంచారు. ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ‘ఎక్స్’లో స్పందించారు. ‘అనదర్ స్ట్రైక్ ఆన్ నక్సలిజం’(నక్సలిజంపై మరో దాడి) అని అన్నారు. ‘ఆయుధాలు పట్టుకున్న వారికి నాదొక్కటే విజ్ఞప్తి, హింసతో మీరు ఎలాంటి మార్పు తేలేరు. శాంతితోనే మార్పు సాధ్యం’అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2026 మార్చి చివరి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని పునరుద్ఘాటించారు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట సుక్మా జిల్లా ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలా ఉండేది. క్షేత్రస్థాయిలో జన మిలీíÙయా మద్దతుతో మావోలు ఇక్కడ గట్టిగా నిలదొక్కుకున్నారు. 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయిన తాడిమెట్ల – చింతల్నార్ దాడి, సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో సహా 32 మంది చనిపోయిన జీరామ్ఘాట్ దాడులు ఇక్కడే చోటుచేసుకున్నాయి. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ విజయాలు దక్కలేదనే భావన యాంటీ నక్సల్స్ టీమ్స్‌లో ఇంతకాలం ఉండేది. కాగా ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడం సుక్మా జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతున్నారు. సుక్మా ఎన్కౌంటర్ బూటకం – పౌరహక్కుల సంఘం ఖండన సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్, నారాయణరావులు ఆరోపించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆపరేషన్ కగార్ పేరుతో 60 ఏళ్లకు పైబడిన వారిని, కదల్లేని వాళ్లను నిరాయుధులుగా పట్టుకుని చిత్రహింసలు పెడుతూ హత్యాకాండ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 14 నెలల హత్యాకాండలో 470 మంది మరణించారని తెలిపారు. ఇప్పటికైనా కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జరిగిన అన్ని ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలన్నారు. -
పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు.. చేతులు, ముఖంపై గాయాలు: డీఐజీ
సాక్షి, తూర్పుగోదావరి: ఈ నెల 24న అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందినట్టు గుర్తించామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం.. ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను మీడియాకు ఆయన వెల్లడించారు. ప్రవీణ్ బంధువులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేశామని తెలిపారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని.. తూర్పుగోదావరి ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఈ నెల 24న ఉదయం 11 గంటలకు పాస్టర్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1.29 గంటలకు చౌటుప్పల్ టోల్గేట్ దాటారు. విజయవాడలో మూడు గంటల పాటు ఆయన ఎక్కడున్నారనే విషయంపై ట్రాక్ చేస్తున్నాం. కొంతమూరు పెట్రోల్ బంక్ వద్దకు రాత్రి 11:40 గంటలకు చేరుకున్నారు. 11:42కు ఘటన జరిగింది. పోస్టుమార్టం రిపోర్టులో కొన్ని అంశాలకు సంబంధించి సమాచారం వచ్చింది. చేతులు, ముఖంపై కొన్ని గాయాలు ఉన్నాయని తేలింది. పూర్తి వివరాలు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ప్రవీణ్ ఎలా మృతి చెందారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కారు ఢీ కొడితే మోటార్ సైకిల్ కింద పడిందా లేదా.. అన్న విషయాన్ని కూడా ట్రాన్స్‌పోర్టు అధికారులు పరిశీలిస్తున్నారు.’’ అని ఐజీ చెప్పారు.జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ మాట్లాడుతూ.. హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డేటా పరిశీలిస్తామని తెలిపారు. ‘‘అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం. రాజమహేంద్రవరం ఎందుకు వచ్చారో పరిశీలించాం. లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట ప్రవీణ్ కొంత స్థలం కొనుగోలు చేశారు. అక్కడ ఒక భవనం నిర్మించాలనుకున్నారు. దీని కోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఆయన రాజమండ్రి వస్తున్నట్టు భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్‌కు మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులందరినీ విచారించాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా పరిశీలిస్తాం’’ అని ఎస్పీ తెలిపారు. -
హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య
సాక్షి,రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఏడాది క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో కోర్టు మ్యారేజ్ చేసుకున్న పింకీ.. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులే కారణమా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. అమిష్ లోయా అనే వ్యక్తితో ఏడాది క్రితం పింకీ శర్మ వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ.. తర్వాత ఇద్దరి మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి.అప్పటి నుంచి బయటకెళ్లటప్పుడు పింకీ శర్మను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడని.. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా పింకీ శర్మ, అమిష్ మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. దీంతో పింకీ శర్మను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు. కాసేపటికి ఇంటికి తిరిగొచ్చేసరికి పింకీ శర్మ చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్ అధికారి దుర్మరణం
నాగర్ కర్నూల్: జిల్లాలోని చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు ఐపీఎస్ అధికారి దుర్మరణం చెందారు. అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో పగవరపల్లిదోమల పెంట మధ్యలో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, అందులో సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నట్లు గుర్తించారు. వీరంతా కారులో మహారాష్ట్ర నుంచి బయల్దేరి శ్రీశైలం వెళుతున్నట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. దంపతులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హఫీజ్‌పేట్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. బెట్టింగ్ నిర్వహిస్తున్న దంపతులు అజయ్, సంధ్యలను ఎస్వోటీ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముగ్గురు పంటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఫేక్ కంపెనీల పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి.. రెండు మ్యాచ్‌లపై రూ.40 లక్షల వరకు లావాదేవీలు జరిపారు. మొత్తం ఏడు అకౌంట్లను పోలీసులు గుర్తించారు. బ్యాంక్ అకౌంట్లలోని రూ.22 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు అజయ్‌పై గతంలో నాలుగు బెట్టింగ్ కేసులు నమోదయ్యాయి. -
Hyd:గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్‌పోలో కాల్పుల కలకలం రేగింది. ఎక్స్‌పోలో ఇద్దరు షాప్ యజమానుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారిలో ఓ షాపు యజమాని గాలిలో కాల్పులు జరిపాడు. దీంతో ఎక్స్‌లో ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్పో నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. -
‘హమ్మయ్యా!’ ఆ ఆరుగురు దొరికారు
అంబేద్కర్ కోనసీమ జిల్లా, సాక్షి: ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. ఐదురోజుల తర్వాత.. శనివారం ఆ పిల్లల ఆచూకీ శనివారం లభ్యమైంది. తల్లిదండ్రులు మందలించారనే వాళ్లు అలా వెళ్లిపోయినట్లు సమాచారం.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ నెల 24వ తేదీన స్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదు. బడి, ఇల్లు తప్ప ఏం తెలియని చిన్నారులు అలా కనిపించకుండా పోయేసరికి అంతా ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించి.. బంధువులను ఆరా తీసి చివరకు స్థానిక పోలీసులను అశ్రయించారు.ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. వాళ్లంతా బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలోనే చదువుతున్నారు. స్థానికుల సాయంతో పోలీసులు చుట్టుపక్కల గాలించారు. వాళ్ల ఫొటోలను మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. డ్రోన్ సాయంతో పరిసర ప్రాంతాల్లో అన్వేషించారు. నాలుగు రోజులైనా ఆచూకీ తెలియరాకపోవడంతో అంతా కంగారుపడ్డారు.చివరకు పి.గన్నవరం మండలం పెదమాల లంకలో మొక్కజొన్న రైతులకు విద్యార్థులు కనిపించారు. అయితే వాళ్లు ఆకలితో ఉండడంతో భోజనం పెట్టి పంపించి వేశారు. ఈ క్రమంలో సిద్ధాంతం వద్ద ఉన్న లంకలో బాలబాలికను గుర్తించిన పోలీసులు చివరకు ఆలమూరుకు తరలించారు. తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. -
వీడు మనిద్దరికి పుట్టిన బిడ్డేనా?
అన్నానగర్: భార్యపై అనుమానం పెనుభూతమైంది. తామిద్దరూ నల్లగా ఉన్నా.. బిడ్డ మాత్రం మంచి రంగుతో జన్మించడంపై సందేహించాడు. బిడ్డ ఎదిగే కొద్దీ అనుమానం కూడా అదే తీరులో బలపడింది. చివరకు ఆ రెండున్నరేళ్ల చిన్నారిని గొంతు నులిమి హతమార్చాడు. ఊయల తాడు బిగుసుకుని మరణించిందని బుకాయించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో గొంతు నులమడం వల్లే చనిపోయిందని తేలడంతో ఆ కసాయి కటకటాలపాలయ్యాడు. వివరాలు..చెన్నై మన్నడి లింగుచెట్టి వీధికి చెందిన అక్రమ్ జావిద్ (33) పత్తి దుకాణంలో పని చేసేవాడు. అతని భార్య నిలోఫర్. వీరికి పెళ్లయి నాలుగేళ్లైంది. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కుమార్తె పాహిమా ఉంది. గత 26వ తేదీ రాత్రి నీలోఫర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ ఉపవాసం విరమించేందుకు సమీపంలోని మసీదుకు వెళ్లింది. కుమార్తెతో ఇంట్లోనే జావిద్ ఉండిపోయాడు. ఇఫ్తార్ అనంతరం ఇంటికి తిరిగొచ్చిన నీలోఫర్‌కు పాహిమా మెడ తొట్టి తాడుతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుందని అక్రమ్ జావిద్ తెలిపారు. వెంటనే చిన్నారిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం మేరకు నార్త్ కోస్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయకాంత్ కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జావిద్‌ను ప్రశ్నిస్తే ఊయల తాడు మెడకు బిగుసుకుపోవడం వల్లే చనిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే శుక్రవారం అందిన పోస్టుమార్టం నివేదికలో చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడైంది. దీంతో తమదైన శైలిలో విచారణ చేసేసరికి తానే బిడ్డను గొంతు నులిమి హతమార్చినట్టు జావిత్ అంగీకరించాడు. తాను, తన భార్య నల్లగా ఉన్నప్పటికీ పుట్టిన బిడ్డ మాత్రం మంచి రంగుతో ఉండడంతో తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు వాంగ్మూలమిచ్చాడు. -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం...
తమిళనాడు: తనకు వివాహమైనప్పటికీ స్నేహితుడి భార్యను తీసుకెళ్లి గుట్టుగా కాపురం చేస్తున్న వ్యక్తి చివరకు అనుమానాస్పద స్థితిలో శవమై వెలుగులోకి వచ్చాడు. అతడితో సహజీవనం చేస్తున్న స్నేహితుడి భార్య అదృశ్యం కావడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని కటైమేడు గ్రామానికి చెందిన గోకుల్(25) వెల్డింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఇతడు ఆంబూరుకు చెందిన తన స్నేహితుడి భార్యను నాగర్‌కోయిల్‌కు తీసుకెళ్లి అక్కడే ఒక అద్దె ఇంట ఉంటూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ వ్యవహారం గోకుల్ భార్య తులసికి తెలియడంతో ఆమె ఎన్నోసార్లు అతడికి ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ అని వస్తూండడంతో అప్పట్లో పోలీసులకు సైతం ఆమె ఫిర్యాదు చేసింది.ఈ నేపథ్యంలో గోకుల్ నివసిస్తున్న ఇంటి నుంచి గురువారం సాయంత్రం దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తాళం వేసి ఉండడంతో దానిని పగలగొట్టి లోనికి వెళ్లి పరిశీలించారు. గోకుల్ విగతజీవిగా ఉండటం గుర్తించారు. దీంతో వేలూరులోని అతని భార్యకు సమాచారమిచ్చారు. అయితే గోకుల్‌తో ఉన్న మహిళ ఏమైంది? గోకుల్ హత్యకు గురయ్యాడా, ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలికి పురుగుల మందు తాగించి పరారైన ప్రియుడు..!
జంగారెడ్డిగూడెం(ఏలూరు): మండలంలోని పేరంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి ఎస్సై షేక్ జబీర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరంపేటకు చెందిన హేమదుర్గా అనంత ప్రసన్నకు, కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన దార్ల రాంప్రసాద్‌తో 2014లో వివాహమైంది. వీరికి 11 సంవత్సరాల కుమార్తె ఉంది. కొయ్యలగూడెం మండలం గంగన్నగూడెంకు చెందిన మోదుగ పెద్దసాయి.. ప్రసన్నను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో పొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఫిబ్రవరి 7న ప్రసన్న ఇంటికి వెళ్లి మనిద్దరం చనిపోదాం! అంటూ పురుగుల మందు తాగించాడు. కుటుంబ సభ్యులు ఆమెను కొయ్యలగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందిన తరువాత తండ్రి ఈశ్వరాచారి కుమార్తె ప్రసన్ననను జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు తీసుకొచ్చాడు. 15 రోజుల తరువాత పెద్దసాయి పేరంపేటకు వచ్చి గొడవ పడ్డాడు. మార్చి 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న ఇంటికి వచ్చిన సాయి చనిపోదాం.. అని నమ్మించి ప్రసన్నతో కలుపుమందు తాగించాడు. మందు ప్రభావాన్ని తట్టుకోలేక ప్రసన్న కేకలు వేయగా, ఆమె తల్లి పరుగున అక్కడికి వచ్చింది. ఆమెను చూసిన సాయి అక్కడినుంచి పారిపోయాడు. ప్రసన్నను వెంటనే జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 27న చనిపోయింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.మృతదేహంతో ధర్నాకొయ్యలగూడెం: ప్రసన్న కుటుంబానికి న్యాయం చేయాలంటూ గంగన్నగూడెంలో బంధువులు ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి గంగన్నగూడెంకు ప్రసన్న మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా, పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి మధ్యలోనే ఆపించారు. దీంతో మృతదేహాన్ని మోటార్‌సైకిళ్లపై గంగన్నగూడెం తీసుకువెళ్లి ధర్నా చేశారు. ప్రసన్న మృతికి గంగన్నగూడెం గ్రామానికి చెందిన సాయి కారణమని అతని ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ఆ సమయంలో యువకుడితో సహా అతని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయటే ఉండి ఆందోళన చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వారితో చర్చించి మృతదేహాన్ని తరలించేలా ఒప్పించారు. -
పిల్లల కోసం వస్తే.. పిల్లలతో పాటు భార్యా దక్కలేదని..
డాబాగార్డెన్స్: పిల్లల కోసం కలలు కన్న ఒక నిరుపేద దంపతులకు ఫెర్టిలిటీ సెంటర్ తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఇందుకోసం తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోగా.. కడుపులో పెరుగుతున్న కవలలతో సహా తల్లి కూడా మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆ ముగ్గురు ప్రాణాల విలువను రూ.4 లక్షలుగా వెలకట్టి ఆస్పత్రి యాజమాన్యం చేతులు దులుపుకుంది. బాధితుడు తెలిపిన వివరాలివి..అనకాపల్లి జిల్లా మాకవరపాలెం ఎస్సీ కాలనీకి చెందిన గెంజి వరహాలు బాబు ఓ కంపెనీలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఎనిమిదేళ్ల కిందట లక్ష్మితో అతనికి వివాహం జరిగింది. పిల్లలు లేకపోవడంతో బాధపడుతున్న వరహాలు బాబుకు.. అదే కంపెనీలోని ఒక సహోద్యోగి రామ్‌నగర్‌లోని ఆరాధ్య ఆస్పత్రి గురించి చెప్పాడు. అక్కడ చికిత్స తీసుకుంటే పిల్లలు పుడతారని చెప్పడంతో.. వరహాలు బాబు, లక్ష్మి దంపతులు ఎనిమిది నెలల కిందట ఆరాధ్య ఆస్పత్రిని సంప్రదించారు. ప్రారంభంలో ఆస్పత్రి యాజమాన్యం రూ.2,25,000 ఖర్చు అవుతుందని చెప్పగా.. తమ ఆర్థిక పరిస్థితిని వివరించడంతో రూ.2,10,000కు అంగీకరించింది. వరహాలు బాబు పరీక్షల కోసం మరో రూ.12 వేలు చెల్లించాడు. పరీక్షలు పూర్తయ్యాయి. లక్ష్మికి రూ.12 రోజుల పాటు రోజుకు ఒక ఇంజక్షన్ చొప్పున 12 ఇంజక్షన్లు వేశారు. అప్పటి నుంచి ప్రతి నెలా పరీక్షల కోసం మాకవరపాలెం నుంచి నగరానికి వెళ్లొస్తూ ఉండేవారు. ప్రయాణాలు, వైద్య ఖర్చులు, మందులు, స్కానింగ్‌ల కోసం నెలకు దాదాపు రూ. 20 వేల వరకు ఖర్చు చేసేవారు. నాలుగో నెలలో లక్ష్మి గర్భంలో ముగ్గురు పిల్లలు ఉన్నారని వైద్యులు చెప్పడంతో సంతోషించిన ఆ దంపతులు.. ఇద్దరు పిల్లలు చాలని కోరారు. దీంతో వైద్యులు ఒక పిండాన్ని తొలగించారు. ఆ తర్వాత ఆరు నెలల వరకు తల్లి, పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు. 7వ నెలలో నిర్వహించిన పరీక్షల్లో లక్ష్మికి మధుమేహం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్యుల సూచనల మేరకు ఆహార నియమాలు పాటించినప్పటికీ.. సరైన పోషకాహారం లేక పిల్లల ఎదుగుదల సరిగా లేకపోయింది. దీంతో ఆస్పత్రి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.ముందే చెప్పి ఉంటే..కాగా.. గత ఆదివారం రాత్రి లక్ష్మికి తీవ్రమైన విరేచనాలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం వరకు అవి ఆగకపోవడంతో ఆందోళన చెందిన వరహాలు ఆస్పత్రికి ఫోన్ చేసినా స్పందన రాలేదు. ఉదయం 8 గంటల తర్వాత స్పందించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తీసుకురావాలని సూచించారు. మధ్యాహ్నానికి ఆస్పత్రికి చేరుకున్న లక్ష్మిని మొదట 6వ అంతస్తులో, తర్వాత 3వ అంతస్తుకు మార్చారు. పరిస్థితి విషమించడంతో స్కానింగ్ చేయగా కడుపులో ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పిల్లలు చనిపోయినా భార్యను కాపాడమని వేడుకున్న వరహాలు బాబుకు చెప్పకుండానే అదే రోజు రాత్రి లక్ష్మిని అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం లక్ష్మి తుదిశ్వాస విడిచింది. భార్యను, కడుపులోని ఇద్దరు పిల్లలను కోల్పోయిన వరహాలు బాబు కన్నీరుమున్నీరుగా విలపించాడు. పిల్లల కోసం వస్తే.. పిల్లలతో పాటు భార్యా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆవేదననను చూసి కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీస్తే.. ముగ్గురి ప్రాణాలకు కలిపి రూ.4 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించాడు. ప్రతి నెలా పరీక్షలు చేస్తూ లక్షలు వసూలు చేసిన యాజమాన్యం.. చివరికి తల్లి శరీరం సహకరించడం లేదని చెప్పడం దారుణమని వరహాలు బాబు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ముందే చెప్పి ఉంటే ఈ ప్రయత్నమే చేసేవాళ్లం కాదని, ముగ్గురు ప్రాణాలను రూ.4 లక్షలకు వెలకట్టడం దారుణమని ఆమె రోదించింది. -
భర్త సంపాదన ప్రియుడిపాలు!
కాకినాడ: భార్య వివాహేతర సంబంధంతో జీవితంపై విరక్తి చెంది కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి కేసులో ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన చల్లా దుర్గారావు (29) ఈ నెల 25 వ తేదీన పెరవలి లాకుల వద్ద మోటార్ సైకిల్ వదలి కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి 26వ తేదీన ఇరగవరం మండలం రాపాక వద్ద శవమై తేలిన విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్ నోట్ ప్రకారం తన చావుకు కారణమైన ఖండవల్లి గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్, మోత్రపు శివ ప్రసాద్, మృతుడి భార్య చల్లా దివ్య కుమారి కారణమని పేర్కొన్నాడు.ఫిర్యాదుదారు చల్లా వెంకట సుబ్బారావు ఇచ్చిన వివరాలు, గ్రామ పెద్దల సమాచారం, సాంకేతిక ఆధారాల మేరకు వారి ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచినట్టు తెలిపారు. తన భార్య అదే గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని దుర్గారావు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు అమోఘ్‌ను ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో అతడితో పాటు తండ్రి శివప్రసాద్‌లు దుర్గారావును దుర్భాషలాడి అవమానించారు.దీంతో అతడు మనస్తాపం చెంది తన చావుకు వారు ముగ్గురే కారణమని, తాను దుబాయి వెళ్లి సంపాదించినదంతా దివ్యకుమారి ప్రియుడికి దోచిపెట్టిందని, దీంతో తాను ఆర్థికంగా చితికిపోయానని, వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్తాపం చెందానని సూసైడ్ నోట్ రాసి కాల్వలోకి దూకాడు. నిందితులను రిమాండ్ నిమిత్తం తణుకు కోర్టులో శుక్రవారం హాజరు పరిచినట్టు ఎస్సై తెలిపారు. -
బిడ్డా.. నన్ను విడిచి వెళ్లిపోయావా...
విజయనగరం: బిడ్డా.. చనిపోయేందుకే వచ్చావా.. ఎంతఘోరం జరిగిపోయింది.. అండగా ఉంటానని చెప్పి అందని లోకాలకు వెళ్లిపోయావా... అంటూ ఆ తల్లి రోదన అక్కడివారికి కన్నీరు తెప్పించింది. పొట్టకూటి కోసం తల్లికి తోడుగా వలసవెళ్లి రెండు నెలల తర్వాత పాఠశాలకు వెళ్లిన విద్యార్థి మృత్యువాత పడిన ఘటన సీతంపేట మండలం దోనుబాయి ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కె.కాగుమానుగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సవర చలపతి (14) దోనుబాయి ఆశ్రమపాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కూలిపని కోసం విజయవాడకు వలస వెళ్లిన తల్లి లండమ్మకు తోడుగా వెళ్లిపోవడంతో ఫిబ్రవరి నుంచి మార్చి 26 వరకు పాఠశాలకు గైర్హాజరయ్యాడు. పరీక్షలని తెలియడంతో ఈ నెల 27న పాఠశాలకు వచ్చి ఎప్పటివలే విద్యార్థులతో కలసిమెలసి ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఫలహారం అనంతరం పాఠశాల పై అంతస్తులో తన గదిలో బంకర్ బెడ్ మంచానికి ఊయల కట్టుకుని సరదాగా ఊగుతున్నాడు. ఈ క్రమంలో గట్టిగా ఊగడంతో ఒక్కసారిగా కాలు జారి కిందపడిపోయాడు. మంచం కూడా విద్యార్థిపై పడి తలకు బలమైన గాయమైంది. రక్తం ధారలా కారుతుండడాన్ని చూసిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యాధికారి భానుప్రతాప్‌తో పాటు వైద్యసిబ్బంది సేవలందించినా ఫలితం లేకపోయింది. తండ్రి భీముడు రెండేళ్ల కిందటే మృతిచెందాడు. ఇద్దరు అన్నదమ్ములు గణే‹Ù, ప్రసాద్ ఉన్నారు. ఎస్ఐ షేక్ మస్తాన్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, సీఐ చంద్రమౌళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతిపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లికి తోడుగా వలస వెళ్లి... మృతుడి పెద్దఅన్నయ్యకు వివాహం కాగా, చిన్న అన్నయ్య నిరుద్యోగి. నిరుపేద కుటుంబం కావడంతో కూలిపనుల కోసం విజయవాడకు తల్లి బయలుదేరగా తోడుగా చలపతి వెళ్లాడు. ఐదు రోజుల కిందటే గ్రామానికి వచ్చారు. తొమ్మిదో తరగతి పరీక్షలు జరుగుతాయని గురువారం పాఠశాలకు వెళ్లాడు. ఇంతలో బిడ్డ మృతి చెందాడన్న పిడుగులాంటి సమాచారం అందడంతో తల్లితో పాటు కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.కుటుంబాన్ని ఆదుకుంటాం మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి తెలిపారు. విద్యార్థి మృతివార్త తెలుసుకున్న వెంటనే ఆయన పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. మృతికి కారణాలు తెలుసుకున్నారు. తనకు సమగ్ర నివేదిక అందించాలని గిరిజన సంక్షేమశాఖ డీడీ అన్నదొరను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామపెద్దలు ఎస్.భాస్కరరావు, విజయ్, రవి తదితరులు పీఓను కోరారు. ముందుగా రుణ సౌకర్యం కలి్పంచి ఆదుకుంటామని పీఓ హామీ ఇచ్చారు. దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.10 వేలు అందజేశారు. ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, పార్వతీపురం ఐటీడీఏ డీడీ కృష్ణవేణి, ఏఎంవో కోటిబాబు, జీసీడీఓ రాములమ్మ, హెచ్ఎంలు ఎ.భాస్కరరావు, చంద్రరావు తదితరులు ఉన్నారు. -
40 ఏళ్లు దాటినా పెళ్లి కావడంలేదని...
విజయనగరం క్రైమ్: నగర శివారు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ధర్మపురిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై అశోక్ శుక్రవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ధర్మపురికి చెందిన సేనాపతి ఆదిలక్ష్మి (40) కొన్నేళ్లుగా తనకు పెళ్లి కావడంలేదని కుంగిపోయింది. ఇంట్లో తనతో పాటు కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు 40 ఏళ్లకే అకాల మరణం చెందారు. వాళ్లకు కూడా పెళ్లికాక మనోవేదనతో అకాలమృతి కావడంతో ఆదిలక్ష్మి మనస్తాపానికి గురైంది. రక్తం పంచుకుపుట్టిన అన్నదమ్ములు లేక ముగ్గురు అన్నల్లో ఒక అన్నావదిన దగ్గర ఉంటూ అన్నయ్య పిల్లలతోనే కాలం వెళ్లదీస్తోంది. ఇంట్లో వదిన కూడా తరచూ నీకు ఇంకా పెళ్లి కాలేదని మాటలతో వేధించసాగింది. అటు బయటకూడా స్నేహితులు, చుట్టుపక్కల వారు ఆదిలక్ష్మికి ఇంకా పెళ్లి కాలేదని గుసగుసలాడుకోవడం మరింతగా కంగదీసింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్పుడే ఆమె వదిన హుటాహుటిన నగరంలోని మహరాజా ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించగా శుక్రవారం చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. దీంతో వదిన నుంచి ఫిర్యాదు అందుకున్న ఎస్సై అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రవీణ్ ఇప్పుడైనా పెళ్లి చేసుకో.. నేను గర్భిణిని
విశాఖపట్నం: మూడేళ్లుగా ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు.. ఆ యువతి గర్భం దాల్చగానే ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి మల్కాపురం సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలివి. ప్రవీణ్ అనే 24 ఏళ్ల యువకుడు 40వ వార్డు ఏకేసీ కాలనీలోని తన అక్క వద్ద మూడేళ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్ ఉంటున్న ఇంటికి సమీపంలో 19 ఏళ్ల వయసు గల ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.ఆ యువతితో మొదట పరిచయం ఏర్పరచుకున్న ప్రవీణ్, అనంతరం ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆ యువకుడి మాటలను నమ్మిన యువతి అతడితో బయటకు వెళ్లడం, వారిద్దరూ శారీరకంగా కలవడం వంటివి జరిగాయి. ఈ క్రమంలో ఆ యువతి మూడు నెలల గర్భం దాల్చడంతో.. తనను ఇప్పుడైనా పెళ్లి చేసుకోవాలని ప్రవీణ్‌ను కోరింది. దీంతో అతడు నిరాకరించడంతో, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ప్రవీణ్‌ను పోలీసులు విచారించగా, అక్కడ కూడా పెళ్లికి నిరాకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ.. పరువు.. ఆత్మహత్య.. హత్య!
ప్రేమ.. త్యాగం నేర్పుతుంది అంటారు. కానీ.. యువతీ, యువకుల మధ్య చిగురించిన ప్రేమ బలికోరుతోంది. సామాజిక సమీకరణాలు కుదరక కులాల కుంపటి రాజుకుంటోంది. గ్రామాల్లో ఈ పోకడ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాము కనీ, పెంచిన పిల్లలు తమకు దక్కకుండా పోతారన్న భయం, పరువు పోతుందన్న ఆందోళనలో తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. .. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. మరోపక్క తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించన్న భయంతో ప్రేమికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండగా.. సామాజిక అంతరాలకు అద్ధం పడుతున్నా యి. వేర్వేరు కులాల యువతీ, యువకులు ప్రేమించుకుంటే వారిపై దాడులు సహజమే అయినా.. అది చంపుకునేదాకా వెళ్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ పోకడ ఉమ్మడిజిల్లాకు పాకడం గమనార్హం.పంతాలతో కుటుంబాలు నాశనంసామాజిక కట్టుబాట్లను ఛేదించలేక, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రేమను అంగీకరించలేక పెద్దలు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కుటుంబ పెద్ద జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా చితికిపోతున్నా యి. వాస్తవానికి ఏ సమాజంలో ఏ పరువు కోసం హత్యలు చేస్తున్నారో.. తరువాత అదే సమాజం ఆయా కుటుంబాలకు అండగా నిలబడని విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుక్తవయసులో ప్రేమే సర్వస్వం అంటూ జీవితంలో స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని పలు ఘటనలు⇒ మార్చి 27న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన ముత్యం సద య్య తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం కులాలు వేరన్న కా రణమే సాయిని చంపేలా చేసింది.⇒ ఇల్లందకుంట యువకుడు, నిర్మల్ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం ఉండదన్న ఆందోళనతో మార్చి 17న జమ్మికుంట పరిధిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.⇒ మార్చి 6న చొప్పదండికి చెందిన ప్రేమికులు ఇంట్లోవారు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో కరీంనగర్లో స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2024 ఏప్రిల్‌లో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందన్న బాధతో సిరిసిల్ల జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు పిండ ప్రదానం చేశాడు. తమ ఆశలను అడియాశలు చేసిన కూతురు మరణించిందని ఫ్లెక్సీ పెట్టించడం సంచలనంగా మారింది.⇒ 2023 నవంబరులో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2023 ఆగస్టులో కోరుట్ల పట్టణంలో తన ప్రియుడితో పరారయ్యే క్రమంలో ప్రియురాలు తన అక్కనే హత్య చేసి పరారవడం కలకలం రేపింది.⇒ 2021 ఆగస్టులో మంథనికి చెందిన ఓ ప్రేమజంటపై యువతి తండ్రి హేయంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రేమికులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ⇒ 2017లో మంథనిలో మధుకర్ అనే దళిత యువకుడి అనుమానాస్పద మరణం కూడా పరువుహత్యగా ప్రాచుర్యం పొందింది. అనుమానాస్పద మరణం అని పోలీసులు, ప్రి యురాలి బంధువులే చంపారని మధుకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళితసంఘాలు ధర్నా చేయడంతో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది.⇒ 2016లో తిమ్మాపూర్‌లోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకునేందుకు పీటల మీద కూర్చున్న జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పెళ్లికూతురు కళ్లముందే పెళ్లి కొడుకును విచక్షణా రహితంగా పొడిచి చంపడం కలకలం రేపింది.ఆలోచన తీరు మారాలి కులం అహంకారంతో జరిగే దారుణాలతో ప్రాణాలుపోతున్నాయి. టెక్నాలజీలో ముందున్న మనం ఆధునికంగా ఆలోచించలేక పోతున్నాం. ఉన్నత చదువులు చదువుకునే..యువత కూడా ప్రేమించుకోవడం.. కాదన్నారని ప్రాణాలు తీసుకోవడం తగదు. ఈ ఘటనలకు కేవలం ఆలోచన తీరే కారణం. తీరుమారితే విపరీత ధోరణులు మారుతాయి. – ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత,సోషియాలజీ విభాగం అధిపతి, శాతవాహన వర్సిటీకుల వివక్షపై అవగాహన కల్పించాలి సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నా కుల,మత భేదాలు గ్రామాల్లో అలాగే కొనసాగుతున్నాయి. కులాల మధ్య వైరుధ్యాలు పెరిగేలా ప్రభుత్వాలు కులాల ఆధారంగా ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజల మధ్య దూరాలను పెంచుతున్నాయి. పిల్లల ప్రేమ కన్నా పరువు, పట్టింపులే ఎక్కువ అనే భావన తొలిగేలా, కులవివక్షపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.– కల్లెపల్లి ఆశోక్, కేవీపీఎస్ :::సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
నాతో ఉంటే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు..!
ఫిలింనగర్: ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ వివాహితను పరిచయం చేసుకున్న స్పా యజమాని ప్రేమ పేరుతో వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుండటంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మల్కాజగిరిలోని హనీ స్పా యజమాని విక్కీ విక్రమ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..ఫిలింనగర్‌లోని దీన్‌దయాళ్‌నగర్ బస్తీకి చెందిన వివాహిత (35) మాదాపూర్‌లోని ఓ స్పాలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నది. ఇటీవల మరింత మెరుగైన ఉద్యోగం కోసం మల్కాజిగిరిలోని హనీ స్పాలో ఇంటర్వ్యూకు వెళ్లగా స్పా యజమాని విక్కీ విక్రమ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య తరచూ ఫోన్ సంభాషణ జరుగుతుంది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన భర్తకు ఈ విషయం తెలియదని ఆమె చెప్పగా అదంతా తాను చూసుకుంటానని, నాతో ఉంటే నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్మబలికాడు. దీంతో ఆమె విక్కీ విక్రమ్‌తో మరింత సన్నిహితంగా మెలిగింది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఆమె దూరంగా ఉండసాగింది. ఇది భరించలేని విక్రమ్ గురువారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వచ్చి బయట నుంచి డోర్ లాక్ చేశాడు. దీంతో ఆమె భయంతో అరవడంతో చుట్టుపక్కల వారు గమనించారు. దీంతో విక్రమ్ అక్కడి నుంచి ఉడాయించాడు. తనను శారీరికంగా, మానసికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 75, 78 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మా వల్ల కావట్లేదు.. ఎవరి దయ మీదా బతకాలనుకోవడం లేదు
బెంగళూరు: వీడియో కాల్ చేసి.. ఆపై నగ్నఫొటోలున్నయంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య తరచూ చూస్తున్నదే. అయితే అలాంటి సైబర్ నేరంలో చిక్కుకుని.. వాళ్ల బెదిరింపులకు భయపడి వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పైగా అప్పటికే రూ.50 లక్షలు చెల్లించిన ఆ జంట.. ఇంకా చేసేది లేక ఈ ఘాతుకానికి దిగింది.బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా బీడి గ్రామంలో గ్రామంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి డియోగో నజరత్(83), పావీయా నజరత్(79) దంపతులు నివాసం ఉంటున్నారు. గత రెండు రోజులుగా ఇంటినుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో స్వసహయ సంఘం మహిళలు వెళ్లి చూడగా.. విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న నందగడ పోలీసులు వచ్చి పరిశీలించారు. డియోగో గొంతు, మణికట్టు వద్ద కత్తి కోసిన గాయం కనిపించింది. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం కోసం బీమ్స్ ఆస్పత్రికి తరలించారు. ‘‘నా వయసు 82 ఏళ్లు.. నా భార్య వయసు 79 సంవత్సరాలు. ఈ వయసులో మాకు ఆదుకోవడానికి ఎవరూ లేరు. సమాజంలో ఎంతో గౌరవంగా ఇంతకాలం బతికాం. కానీ, ఇప్పుడు ఈ వేధింపులు భరించలేకపోతున్నాం. ఎవరిని సాయం అడిగి.. ఎవరి దయ మీదా బతకాలనీ అనుకోవడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని డియోగో స్వదస్తూరితో రాసిన లేఖ అది. నెల రోజులుగా వేధింపులు.. సూసైడ్ నోట్ ఆధారంగా కీలక విషయాలు వెలుగు చూశాయి. దంపతులను సైబర్ నేరగాళ్లు నెల రోజులుగా వేధిస్తున్నారు. తాము పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. మా వద్ద మీ నగ్న చిత్రాలున్నయంటూ ఫోన్లో బెదిరించారు. అడిగినంత డబ్బులు ఇవ్వకంటే ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తామంటూ బెదిరించారు. ఆ వేధింపులు తాళలేక రూ.50 లక్షలు చెల్లించారు. అయినా మరింత నగదు కావాలని ఒత్తిడి చేశారు. దీంతో బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. పావీయా నిద్రమాత్రాలు మింగి ఆత్మహత్య చేసుకుంది. డియాగో డెత్‌నోట్ రాసి చాకుతో గొంతు కోసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థలాన్ని బెళగావి జిల్లా ఎస్పీ పరిశీలించి కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.లేఖలో.. సుమిత్రా బిర్రా, అనిల్ యాదవ్ అనే ఇద్దరి పేర్లను డియాగో ప్రస్తావించారు. తాను న్యూఢిల్లీ నుంచి టెలికామ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నానని సుమిత్రా , అనిల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుగా పరిచయం చేసుకుని మరీ బెదిరింపులకు దిగారట. నగ్నఫోల్‌కాల్స్ ఉన్నాయని.. సిమ్ కార్డ్ దుర్వినియోగం కింద చట్టపరమైన చర్యలు ఉంటాయని బెదిరించారట. అయితే.. అప్పటికే రూ.50 లక్షలు చెల్లించామని.. ఇంకా కావాలని డిమాండ్ చేశారని.. బంగారం మీద రుణం కూడా తీసుకుని చెల్లించామని లేఖలో డియాగో వాపోయాడు. స్నేహితుల వద్ద నుంచి తెచ్చిన అప్పును తన భార్య నగలు అమ్మి చెల్లించాలని సూసైడ్ నోట్లో కోరిన డియాగో.. తమ ఇద్దరి మృతదేహాలను మెడికల్ కాలేజీకి అప్పగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
నిందితుడిని పట్టించిన ఫోన్ కాల్
బనశంకరి: భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా కత్తరించి సూట్‌కేసులో పెట్టి ఉడాయించిన టెక్కీ రాకేశ్ రాజేంద్ర ఖడేకర్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. మిత్రుడికి చేసిన ఫోన్ కాల్ అతన్ని పోలీసులకు పట్టించింది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా కత్తిరించి సూట్‌కేస్‌లో పెట్టి బాత్రూమ్లో దాచి మహారాష్ట్రకు వెళ్తూ మార్గమధ్యంలో భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. మీ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పి కాల్ కట్ చేశారు. అదే సమయంలో ఇతను నివాసం ఉండే అద్దె ఇంటి కింద ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి తన భార్యను హత్యచేసినట్లు తెలిపాడు. స్నేహితుడి మొబైల్‌కు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పుణె మార్గమధ్యంలో సంచరిస్తున్నట్లు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం చేరవేశారు. పుణె చేరుకోగానే రాకేశ్ కారు రోడ్డు పక్కన నిలిపి దుకాణంలో ఫినాయిల్‌ను కొనుగోలు చేసి తాగి ఆత్మహత్యకు ప్రయతి్నంచాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న పుణె పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. పుణెకు చేరిన హుళిమావు పోలీసులు పుణే వైపు వెళుతున్నట్లు సమాచారం అందుకున్న హుళిమావు పోలీసుల బృందం కూడా అక్కడికి చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాకేశ్ కోలుకోగానే అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకు వస్తారు. టెక్కీ రాకేశ్ భార్యను హత్య చేయడానికి కచ్చితమైన కారణం తెలియరాలేదు. కుటుంబ కలహాల కారణంతో హత్య చేసినట్లు సమాచారం ఉందని కమిషనర్ దయానంద్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అతడి ఆరోగ్యం స్దిరంగా ఉందని డాక్టర్లు తెలిపిన అనంతరం బెంగళూరుకు తీసుకువచ్చి విచారణ చేపడతామన్నారు. విచారణ అనంతరం భార్య హత్యకు కారణాలు ఏమిటో తెలియనుంది. మృతురాలు గౌరీ కుటుంబ సభ్యులు నగరానికి చేరుకోగా వారి నుంచి కూడా సమాచారం సేకరించామన్నారు. -
దారి తప్పిన దర్యాప్తు!
సాక్షి, రాజమహేంద్రవరం: లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి చావుబతుకుల్లో ఉన్న ఫార్మసీ ఫైనలియర్ విద్యార్థిని కేసు దర్యాప్తు దారి తప్పుతోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ఈ నెల 23న ఈ ఘటన జరిగితే మూడు రోజులు గోప్యంగా ఉంచడం గమనార్హం. బాధిత విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ టీడీపీలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్నందున కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేయగా.. కూటమి సర్కారు మొద్దు నిద్రపై మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఓ మహిళ హోంమంత్రిగా ఉండి కూడా పరామర్శించకపోవడం.. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కిమ్స్ ఆస్పత్రి వద్ద ధర్నా చేశాయి. తన చెల్లిని ఇక్కడకు ఎలా వచ్చిందో అలాగే తమకు ప్రాణాలతో అప్పగించాలని బాధిత విద్యార్థిని అక్క కన్నీళ్లతో వేడుకుంది. పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ వెంటనే ఆసుపత్రికి రావాలని డిమాండ్ చేసింది. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా ఈ విషయం తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారని, దాని అర్థం ఇదేనా? అని నిలదీసింది. నిందితుడు టీడీపీ నేతలకు బంధువు.. ఈ కేసులో అరెస్టయిన కిమ్స్ ఏజీఎం దీపక్ కాకినాడ జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది అవుతాడని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుగ్గా పని చేశాడు. నిందితుడు మరో టీడీపీ నేతకు అల్లుడు కూడా కావడంతో ఈ కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని, దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో విద్యార్థిని ఆరోగ్యం విషమంగానే ఉందని, బ్రెయిన్‌కు పూర్తిగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో డ్యామేజ్ ఎక్కువగా ఉందని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. వెంటిలేటర్ ఉన్నందున బీపీ, హార్ట్‌బీట్, పల్స్ నార్మల్‌గా ఉన్నట్లు వెల్లడించారు. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు.ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంపై శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.ఎవరిని కాపాడేందుకీ తాత్సారం?: మార్గాని భరత్రామ్కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లైంగిక వేధింపులు భరించలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించి సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రికి శుక్రవారం ఆయన చేరుకుని ఐసీయూలో ఉన్న బాధితురాలిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం భరత్‌రామ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థిని బ్రెయిన్ డెడ్ అయిందని ఒకరు... లేదని మరొకరు చెబుతున్నారన్నారు. ఘటనపై ఈ నెల 23న ఒక ఎఫ్ఐఆర్, 24న మరొకటి ఎలా నమోదయ్యాయని నిలదీశారు. ఎఫ్ఐఆర్లో సెక్షన్లు కూడా మార్చారన్నారు. ఈవీఎం ఎమ్మెల్యే (రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు) ఇక్కడకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కేసులో అరెస్టయిన దీపక్ టీడీపీ నాయకుడి అల్లుడని చెప్పారు. ఇవన్నీ చూస్తూంటే ఎవరినో కాపాడడానికి పోలీసులు తాత్సారం చేస్తున్నట్లు కనిపిస్తోందని భరత్‌రామ్ అనుమానం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇంత జరుగుతున్నా హోంమంత్రి రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. హోంమంత్రికి పరామర్శించే సమయం లేదా?ఐద్వా, మహిళా సంఘాల మండిపాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. బాధితురాలు చికిత్స పొందుతున్న కిమ్స్ బొల్లినేని ఆసుపత్రికి ఐద్వా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ), మహిళా కాంగ్రెస్ నాయకులు శుక్రవారం చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఐద్వా నేత రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ఏదైనా అద్భుతం జరిగితే మినహా ఆ విద్యార్థిని సాధారణ స్థితికి రాలేదని వైద్యులు చెబుతున్నారన్నారు. నిందితుడు దీపక్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే విద్యార్థిని సెల్‌ఫోన్ డేటాను దీపక్ డిలీట్ చేశాడని, ఆధారాలను మాయం చేసి సాక్ష్యాలను తారుమారు చేశాడన్నారు. మహిళ అయి ఉండి కూడా హోంమంత్రి ఇంత వరకూ ఎందుకు రాలేదని నిలదీశారు. బాధిత విద్యార్థినిని దీపక్ బ్లాక్మెయిల్ చేసి లోబరచుకున్నట్లు తెలుస్తోందన్నారు. అతడిపై రేప్ కేసు నమోదు చేశారో లేదో వెల్లడించాలని డిమాండ్ చేశారు.టూరిజంపై ట్వీట్ చేయడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి ఈ అకృత్యంపై ఎందుకు ట్వీట్ చేయలేదని, గుండెల్ని పిండేసే ఈ ఘోష పాలకులకు పట్టదా? అని ప్రశ్నించారు. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న పెద్దమనిషి పవన్ కళ్యాణ్ ఏమైపోయాడని నిలదీశారు. పుట్టిన రోజు చేసుకున్న మహిళా హోంమంత్రి ఇంత దారుణ సంఘటన జరిగితే ఇప్పటి వరకూ స్పందించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. -
ఆరుగురు విద్యార్థులు అదృశ్యం
ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఒకే రోజు అదృశ్యమయ్యారు. స్కూల్‌కు వెళుతున్నామని చెప్పి నాలుగు రోజులైనా వారు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు శుక్రవారం స్థానిక పోలీసులను అశ్రయించారు. ఇప్పటి వరకూ ఇల్లు, స్కూల్‌కు తప్ప వేరే ప్రదేశం తెలియని ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ విద్యార్థులందరూ కనిపించకపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానిక ఎస్సై ఎం.అశోక్ కథనం ప్రకారం.. ఆలమూరులోని బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలో కొమరిగిరి కరుణ (8వ తరగతి), కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొమరిగిరి పృథ్వీవర్మ (6వ తరగతి), గంధం సతీష్ (8వ తరగతి), మర్రి సంతోష్ (7వ తరగతి), కొమరిగిరి పండు (6వ తరగతి), రామచంద్రపురంలోని ఎయిడెడ్ స్కూల్లో కొమరిగిరి మాధురి (7వ తరగతి) చదువుతున్నారు. ఈ ఆరుగురు విద్యార్థులూ ఈ నెల 24వ తేదీన పాఠశాలలకు యథావిధిగా వెళ్లారు. ఆ తరువాత తిరిగి రాలేదు. అప్పటి నుంచీ పరిసర ప్రాంతాల్లోను, బంధువుల ఇళ్ల వద్ద ఎంత గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులందరూ మూకుమ్మడిగా పోలీసు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితి వివరించారు. విద్యార్థులందరూ కూడబలుక్కుని వెళ్లిపోయారా లేక వారిలో ఎవరైనా ప్రభావితం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ప్రచార మాధ్యమాల్లో ఆ విద్యార్థుల ఫొటోలు ప్రదర్శించడంతో పాటు వివిధ పోలీసు స్టేషన్లకు సమాచారం అందించినట్లు ఎస్ఐ అశోక్ చెప్పారు. -
పుట్టినరోజు నాడే ప్రాణం తీశారు
సాక్షి, పెద్దపల్లి: కుమార్తెను ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ యువకుడిని యువతి తండ్రి కిరాతకంగా హతమార్చిన దారుణ ఘటన గురువారం రాత్రి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ (20), అదే గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరుకావడంతో వారి ప్రేమకు యువతి తండ్రి ముత్యం సదయ్య అడ్డుచెప్పాడు. తొమ్మిదో తరగతిలోనే చదువు మానేసిన సాయికుమర్ను ఇకపై తన కూతురితో మాట్లాడొద్దని పలుమార్లు హెచ్చరించాడు. అయినా యువతీయువకులు తరచూ మాట్లాడుకోవడంతోపాటు గురువారం ఉదయం కలిసే సాయికుమార్ బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సమాచారం తెలియడంతో రగిలిపోయిన యువతి తండ్రి ముత్యం సదయ్య గురువారం రాత్రి 10 గంటలకు సాయికుమార్‌ను గొడ్డలితో నరికి చంపాడు. పుట్టినరోజు వేడుకల్లోనే.. పెద్దపల్లిలోని హాస్టల్లో ఉంటూ డిగ్రీ సెకండియర్ చదువుతున్న యువతిని సాయికుమార్ గురువారం కలిశాడు. ఆమెతో కలిసి బర్త్‌డే వేడుకలు చేసుకున్నాడు. రాత్రికి గ్రామంలో నలుగురు స్నేహితులు పూరెల్ల అఖిల్, చిలుమల హన్సిక్, కామెర అభిషేక్, చెవుల రాకేశ్‌తో కలిసి కేక్ కట్ చేశాడు. ఆపై స్నేహితులంతా మద్యం తాగేందుకు సిద్ధమయ్యారు. స్నాక్స్ కోసం రాకేశ్, అభిషేక్ కిరాణా దుకాణానికి వెళ్లగా.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న యువతి తండ్రి వెంట తెచ్చుకున్న గొడ్డలితో సాయికుమార్‌పై దాడి చేశాడు. సాయికుమార్ ప్రాణభయంతో పరుగులు తీసినా సుమారు 200 మీటర్లు వెంటాడి గొడ్డలితో వేటు వేశాడు. ఈ క్రమంలో స్నేహితుడు అఖిల్ సదయ్యను అడ్డుకొని అతన్నుంచి గొడ్డలిని లాక్కున్నాడు.రక్తపుమడుగులో సాయికుమార్ కొట్టుమిట్టాడుతుండటంతో సదయ్య అక్కడి నుంచి నుంచి పారిపోయాడు. దాడి విషయాన్ని స్నేహితులు సాయికుమార్ తండ్రి పర్శరాములుకు తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సాయికుమార్‌ను సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శుక్రవారం పోస్ట్‌మార్టం అనంతరం ముప్పిరితోటలో అంత్యక్రియలు నిర్వహించారు. పర్శరాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సదయ్య కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అయితే నిందితుడు జూలిపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడని సమాచారం. సదయ్యగా భావిస్తున్న వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు ఓ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది.వెంటాడిన మృత్యువు..గురువారం తెల్లవారుజామున బాబాయ్ భరత్‌కు కిడ్నీలో నొప్పి వస్తోందని చెప్పడంతో సాయికుమార్ ఆయన్ను తీసుకొని కారులో కరీంనగర్ ఆస్పత్రికి బయల్దేరాడు. మార్గమధ్యలో దుబ్బపల్లి వద్ద కారు బోల్తాపడి రెండు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో భరత్‌కు స్వల్ప గాయాలవగా సాయికుమార్ సురక్షితంగా బయటపడ్డాడు. కానీ రాత్రికి మాత్రం దారుణ హత్యకు గురయ్యాడు. సాయికుమార్ చెల్లెలు 2016లో డెంగీతో మరణించగా ప్రస్తుతం కొడుకు సైతం మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.పథకం ప్రకారమే హత్య.. నా కొడుకు, ఆ యువతి రెండేళ్లుగా ప్రే మించుకుంటున్నారు. దీంతో మాకు టుంబాల మధ్య గొడవలయ్యాయి. నా కొడుకును చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి గతేడాది ఆగస్టు 23న పోలీసులకు ఫిర్యాదు చేశా. యువతి తల్లితో హరీశ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటాన్ని నా కొడుకు చూశాడు. ఇది అందరికీ చెబుతా డనే భయంతో హరీశ్, యువతి తల్లిదండ్రులతో కలిసి చంపినట్లు అనుమానంగా ఉంది. – పర్శరాములు, మృతుడి తండ్రి -
నోట్లో నురగలతో ముగ్గురు చిన్నారుల మృతి
పటాన్చెరు టౌన్: రాత్రి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుజామున నోట్లో నురగలతో విగతజీవులై కన్పించారు. ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఆస్పత్రిలో చేరిన వారి తల్లి చికిత్స పొందుతోంది. సీఐ నరేష్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెదకపల్లి గ్రామానికి చెందిన చెన్నయ్యకు 2008లో వివాహం జరిగింది.2010లో భార్య అనారోగ్యంతో మరణించడంతో 2012లో నల్లగొండ జిల్లా మందాపూర్ గ్రామానికి చెందిన రజిత అలియాస్ లావణ్యను రెండో వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం బతుకుతెరువు కోసం రాఘవేంద్ర కాలనీకి వచ్చి ఉంటున్నాడు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రజిత స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. వీరికి ఐదో తరగతి చదువుతున్న సాయికృష్ణ (12), నాలుగో తరగతి చదువుతున్న మధుప్రియ (10), మూడు చదువుతున్న గౌతమ్ (8) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతా కలిసే భోజనం చేశారు గురువారం రాత్రి 9 గంటల సమయంలో అంతా కలిసి భోజనం చేశారు. పిల్లలు, రజిత పప్పుతో పాటు షాపు నుంచి తెచ్చుకున్న పెరుగుతో అన్నం తిన్నారు. చెన్నయ్య మాత్రం వట్టి పప్పుతో తిని, ట్యాంకర్ తీసుకుని చందానగర్‌కు వెళ్లాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగిరాగా, రజిత తలుపులు తీసింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రజిత తీవ్రంగా కడుపు నొప్పి వస్తోందని భర్తకు చెప్పింది. చెన్నయ్య వెంటనే పిల్లలను నిద్రలేపేందుకు వెళ్లగా ముగ్గురు పిల్లలు నోటి నుండి నురగలు కక్కుతూ చలనం లేకుండా కనిపించారు.దీంతో వెంటనే బయటకు వెళ్లిన ఆయన ‘కాపాడండి..’అంటూ అరిచాడు. స్ధానికులు రావడంతో పిల్లలు చనిపోయారని, భార్యకు సీరియస్‌గా ఉందని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు రజితను బీరంగూడలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ పారితోష్ పంకజ్, సీఐ నరేష్, క్లూస్ టీం ఇంటి ముందు, వెనుక, భవనంపైన పరిశీలించారు. ఘటనపై స్థానికుల్ని ఆరా తీశారు.పిల్లల్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజితతో అమీన్పూర్ పోలీసులు మాట్లాడారు. తాము విషం లాంటిదేమీ తీసుకోలేదని, పప్పు, పెరుగన్నం తిన్నామని, భర్త పప్పుతో అన్నం తిన్నాడని వివరించింది. దీంతో వీరు తిన్న పెరుగులో ఏదైనా కలిసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చిన్నారుల బ్లడ్ శాంపిల్స్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అమీన్పూర్ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో ధర్యాప్తు చేస్తున్నారు. రాత్రి అసలేం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. మరణించిన చిన్నారులు తీసుకున్న ఆహారంలో ఎవరైనా ఉద్దేశపూర్వంగా విషం కలిపారా? లేక ఫుడ్ పాయిజన్ జరిగిందా? అనేది పరిశీలిస్తున్నారు. చిన్నారుల బ్లడ్ శాంపిళ్లతో పాటు, ఇతర శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎస్పీ పరితోష్ పంకజ్ ‘క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించాం. స్థానికంగా ఆరా తీశాం. కానీ ఏం జరిగింది అన్న విషయం ఇంకా పూర్తిస్ధాయిలో తెలియరాలేదు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఎలా మృతి చెందారన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం..’అని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు.గతంలో భార్యాభర్తల మధ్య గొడవలున్నాయి: రజిత తల్లి ‘గత ఏడాది వరకు నా కూతురుకి, అల్లుడికి గొడవలు ఉన్నాయి. అప్పట్లో వచ్చి సర్ది చెప్పి వెళ్లాం. అప్పుడే నా కూతురు.. మళ్లీ గొడవ జరిగితే నేను, నా పిల్లలు మందు తాగి చనిపోతామని, మందు దొరకకపోతే ఎక్కడైనా నదిలో పడి చనిపోతామని చెప్పింది..’అని రజిత తల్లి పార్వతమ్మ మీడియాకు చెప్పింది.కారు ఇచ్చి ఆస్పత్రికి పంపా.. ‘చెన్నయ్య ఏడేళ్లుగా రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నా డు. అర్ధరాత్రి రెండున్నర స మయంలో పిల్లలు చనిపోయారని, భార్య ప్రాణాపా య స్థితిలో ఉందంటూ చెన్నయ్య అరవడంతో బ యటకు వచ్చాం. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నేనే కారు ఇచ్చా. డయల్ 100కు, పోలీసులకు సమా చారం ఇచ్చా’అని కాలనీ వాసి ప్రభాకర్ చారి చెప్పారు. -
అయ్యో...అవ్వ!
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వంలో ఒంటరి వృద్ధులకూ రక్షణ కరువైంది. ఎవరిని ఏం చేసినా పట్టించుకునే వారే లేకపోవడంతో అరాచకశక్తులు పేట్రేగిపోతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఏలూరు వన్‌టౌన్ సత్యనారాయణపేటకు చెందిన చానాపతి రమణమ్మ (65) అనే ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ప్రసాద్ అనే యువకుడు ఆమె వద్ద డబ్బు ఉందని తెలుసుకుని 7.30 గంటల సమయంలో గొడవ పడ్డాడు. 9.30 గంటలకు మరోసారి వెళ్లి గొడవకు దిగాడు. ఆమె ముఖంపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మెడలోని బంగారు గొలుసు, బీరువాలోని కొంత నగదు తీసుకుని పరారయ్యాడు. తానే చంపానన్న అనుమానం వస్తుందని భావించి అర్ధరాత్రి ఆమె ఇంటికి మళ్లీ వచ్చాడు. ఆమె చేతులు, కాళ్లను కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి, వెంట తీసుకువచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. ఆమె ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావటంతో స్థానికులు వెళ్లి చూడగా విషయం వెలుగు చూసింది. పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ బృందంతో రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. -
TG: కారులోమహిళ డెడ్ బాడీతో పారిపోయేందుకు యత్నం!
నిజామాబాద్: కారులో డెడ్ బాడీని తీసుకెళ్తున్న ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారు ఆపకుండా ముందుకు వెళ్లిపోయింది. అది కూడా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ పోలీసులను దాటేసిందా కారు. అయితే అసలు కారును ఆపకుండా వెళ్లిపోవడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ కారును ఛేజ్ చేశారు. కారును వెంబడించి దాస్ నగర్ శివారులో నిజాం సాగర్ కెనాల్ పద్ద పట్టుకున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని అనుమానించి ఆరా తీశారు. ఎంతకీ పెదవి విప్పకపోవడంతో కారు డిక్కీని ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్ అయ్యారు. డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని రాజేష్ గా గుర్తించిన పోలీసులు.. మృతురాలు కమలగా గుర్తించారు. -
భార్యను హత్య చేసిన ఘటన.. టెకీ ఆత్మహత్యాయత్నం!
బెంగళూరు: భార్యను హత్య చేసిన భర్త, భర్తను హత్య చేసిన భార్య.. ఇవే ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైవాహిక బంధాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారో.. లేక ఆ బంధంలో భారాన్ని మోయలేకపోతున్నారో కానీ ఈ తరహా హత్యోదంతాలు కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి.తాజాగా మరో హత్య వెలుగుచూసింది. బెంగళూరులో టెకీగా పని చేస్తున్న 36 ఏళ్ల వ్యక్తి.. భార్యను హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాకేష్ రాజేంద్ర ఖేదకర్.. ఒక సాప్ట్ వేర్ కంపెనీలో ప్రొఫెషనల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అయితే భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ కారణంగా భార్య గౌరీ అనిల్ షెంబేకర్ (32)ను హత్య చేశాడు . బుధవారం వీరిద్దరూ కలిసి డిన్నర్ చేసే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తన చేతిలో ఉన్న కత్తిని భర్తపైకి విసిరింది భార్య. దీంతో భర్త రాజేంద్రకు గాయమైంది. దాంతో సహనాన్ని కోల్పోయిన భర్త.. అదే కత్తితో భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది.సూట్ కేస్ లో ప్యాక్ చేసి..అయితే భార్య మృతదేహాన్ని సూట్ కేస్ లో పార్శిల్ చేసి ఇంటి లోపల పెట్టిన భర్త.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని తన అత్త మామలకు ఫోన్ చేసి చెప్పాడు. తాను మీ కూతుర్ని హత్య చేశానంటూ ఫోన్ చేప్పాడు. డెడ్ బాడీని బయట సూట్ కేస్ లో ప్యాక్ చేసినట్లు వెల్లడించాడు. దాంతో ఆ విషయాన్ని మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. అక్కడన్నుంచి కర్ణాటక పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఒక ప్యాక్ చేసి ఉన్న ఒక సూట్ కేస్ కనిపించింది. అందులో మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టంకు పంపగా అది హత్యగా ధృవీకరించారు. మెడపై, చాతీలో కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్ లో వెల్లడైంది.ఆత్మహత్యకు యత్నంభార్యను హత్య చేసిన తర్వాత పుణెకు పారిపోయాడు భర్త రాజేంద్ర.. అయితే అక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతను ఎక్కుడున్నాడో విషయాన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. పుణె పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లిన పుణె పోలీసులకు అతను అపస్మారక స్థితిలో కనిపించాడు. దాంతో అతన్ని పుణె ఆస్పత్రిలో చేర్చించారు. ఈ సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు పుణెకు చేరుకున్నారు. రాజేంద్ర సృహలోకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకురానున్నట్లు పోలీసులు తెలిపారు.ఏడాది క్రితమే బెంగళూరుకు..మహారాష్ట్రకు చెందిన వీరిద్దరికి రెండేళ్ల క్రితమే వివాహం జరగ్గా, ఏడాది క్రితమే బెంగళూరుకు వచ్చారు. కొంతకాలంగా వీరి వైవాహిక సాఫీగానే సాగింది. భర్త ఒక ప్రైవేటు కంపెనీ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం అతను వర్క్ ఫ్రమ్ హోమ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య మాస్ మీడియలో బ్యాచలర్ డిగ్రీ కంప్లీట్ చేసింది. -
హైకోర్టునే బురిడీ కొట్టించిన మాయగాడు
సొంత ఇంటికే కన్నమేసినట్లు.. తాను పని చేసే చోట దారుణమైన మోసానికి పాల్పడ్డాడు ఆ వ్యక్తి. కాస్త ఆలస్యంగానైనా పాపం పండడంతో కేసు నమోదు అయ్యింది. ఈలోపు హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే ఉన్నత న్యాయస్థానాన్ని సైతం బురిడీ కొట్టించిన అతని మోసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముంబై: ఫోర్జరీ, కాపీ రైట్ ఉల్లంఘన కేసులో నిందితుడు ఏకంగా జడ్జి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు. ఆ ఫేక్ కోర్టు ఆదేశాలతో హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ మీద ఎంచక్కా బయటకు వచ్చాడు. చివరకు.. ఆ మోసం బయటపడేలోపు పరారయ్యాడు. ఆ మాయగాడి వ్యవహారంపై బాంబే హైకోర్టు(Bombay High Court) భగ్గుమంది. కోర్టు ఆదేశాలతో పోలీసులు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. పుణేకి చెందిన సీటీఆర్ మానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డిజైన్లను చెన్నైకు చెందిన ఓ కంపెనీ ఉపయోగించడంపై 2022లో ఫిర్యాదు దాఖలైంది. దర్యాప్తులో సీటీఆర్‌లో పని చేసే ఉద్యోగులే ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది. సీటీఆర్ ఉద్యోగులు.. మాజీ ఉద్యోగులు కొందరి మీద విమంతల్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. 2016-2017 పని చేసిన హరిబావు చెంటే కూడా నిందితుల జాబితాలో ఉన్నాడు. అతనిపై ఫోర్జరీ, కాపీ రైట్ ఉల్లంఘన అభియోగాలున్నాయి.అయితే.. ముందస్తు బెయిల్ కోసం హరిబావు పుణే జిల్లా కోర్టును ఆశ్రయించగా.. అతనికి చుక్కెదురైంది. దీంతో బాంబే హైకోర్టులో ఓ పిటిషన్ వేశాడు. ఈ క్రమంలో పుణే కోర్టు జడ్జి సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కోర్టు ఆదేశాలను సృష్టించాడు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 169 ప్రకారం.. నిందితుడి మీద అభియోగాలకు సంబంధించి సరైన ఆధారాలు లేకుంటే న్యాయ విచారణ లేకుండా విడుదల చేయొచ్చు. దీన్ని ఆసరాగా చేసుకుని పుణేకు చెందిన ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సంతకాన్ని చెంటే ఫోర్జరీ చేశాడు. ఆ నకిలీ ఆదేశాలకు హైకోర్టుకు సమర్పించి.. ఈ ఏడాది జనవరి 17వ తేదీన బెయిల్ పొందాడు. అయితే..ఈ వ్యవహారంపై అనుమానంతో సీటీఆర్ కంపెనీ విమంతల్ పోలీసులను ఆశ్రయించింది. వాళ్లు ఈ విషయాన్ని ఇటు పుణే కోర్టు.. అటు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హరిబావు సమర్పించిన కోర్టు ఆదేశాలు రాతపూర్వకంగా ఉండడంతో హైకోర్టు పరిశీలన జరిపింది. జడ్జి సంతకం ఫోర్జరీ, నకిలీ ఆదేశాలు బెయిల్ పొందినట్లు తేలడంతో హైకోర్టు తీవ్రంగా భావించింది. అతని బెయిల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. అతనిపై మరో కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న హరిబావు చెంటే కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం
సాక్షి, పెద్దపెల్లి జిల్లా: రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో సాయికుమార్ అనే యువకుడిని తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముప్పిరతోట గ్రామానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుట్టినరోజు నాడే సాయికుమార్‌ను ప్రత్యర్థులు మట్టుబెట్టారు. దీంతో సాయికుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మృతదేహాన్ని ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న అమ్మాయి తండ్రి కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. -
భవనంపై నుంచి దూకి నవ వధువు ఆత్మహత్య
ముషీరాబాద్: భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్‌పూర్‌లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోలక్‌పూర్‌కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరీష్ యాదవ్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.అయితే, సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని, చెప్పకుండా పెళ్లి చేశారని ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు సౌజన్యను తరచూ వేధిస్తున్నారు. ఈ విషయం దాచినందుకు అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు ఆమెను పుట్టింటికి పంపారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి అత్తింటికి వెళ్లిన సౌజన్యను తమ ఇంటికి రావొద్దంటూ అక్కడినుంచి వెల్లగొట్టారు.దీంతో మనస్తాపం చెందిన సౌజన్య పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికి మృతి చెందినట్లు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి పుష్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిద్రలోనే ముగ్గురు పిల్లల కన్నుమూత!
సంగారెడ్డి, సాక్షి: బతుకుదెరువు కోసం ఆ దంపతులు వలస వచ్చారు. ముగ్గురు పిల్లలతో అప్పటిదాకా సంతోషంగానే జీవించారు. ఏం జరిగిందో తెలియదు.. అభం శుభం తెలియని ఆ బిడ్డలు విషం కలిపిన అన్నం తిని నిద్రిలోనే తుదిశ్వాస విడిచారు. అమీన్ పూర్(Ameenpur) మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి ఉంటున్నాడు. స్థానికంగా వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. భార్యా, ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత(Wife Rajitha) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా భర్త చెన్నయ్య చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురు పిల్లలు నిద్రలోనే మృతి చెందారని నిర్ధారించుకున్నారు. సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8)గా పేర్లను ప్రకటించారు. భర్త చెన్నయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.కాగా, ఈ ఘటనలో చిన్నారుల మృతిలో ఎలాంటి నిర్ధారణకు రాలేదని సంగారెడ్డి ఎస్పీ పంకజ్ ప్రకటించారు. తల్లి విషం ఇచ్చి చంపారన్న విషయం ధృవీకరణ కాలేదని.. కుటుంబ కలహాలతోనే ఘాతుకం జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని మీడియాకు తెలిపారు. ప్రస్తుతానికి రజిత ఆరోగ్యం నిలకడగానే ఉందన్న ఎస్పీ.. ఫోరెన్సిక్ నిపుణులు శాంపిల్స్ సేకరించారని, పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. -
మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం.. నీళ్ల బకెట్లో వేసి కన్నతల్లే చంపేసింది
మైలార్‌దేవ్‌పల్లి: నీళ్ల బకెట్లో పడి 14 రోజుల పసికందు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే చిన్నారిని తల్లే నీటి బకెట్లో వేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మైలార్దేపల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ గురువారం వివరాలు వెల్లడించారు. తమిళనాడు ప్రాంతానికి ముదిలాని మణి, ఆరోగ్య విజ్జి(30) భార్యాభర్తలు అలీనగర్‌లోని ఓ కంపెనీలో పని చేస్తూ అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.వీరికి ఒక కుమారుడు, 14 రోజుల కుమార్తె ఉన్నారు. మణికి రెండు కిడ్నీలు పాడైపోవడంతో అతడి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. దీంతో గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో పాప జన్మించడంతో ఆమె పోషణ విషయమై ఆరోగ్య విజ్జి ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న భర్త పనికి వెళ్లిన సమయంలో విజ్జి తన కుమార్తెను బాత్రూమ్లోని నీటి బకెట్లో పడేసి హత్య చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించింది. గురువారం నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
రెండు బీర్లు.. ఒక క్వార్టర్
శంకరపట్నం: మద్యం దుకాణంలో రోజుకు రూ.లక్షల్లో గిరాకీ.. కౌంటర్లో డబ్బు బాగానే ఉంటుందని భావించిన ఓ దొంగ.. దుకాణం మూశాక చోరీకి దిగాలని భావించాడు. అర్ధరాత్రి వచ్చి కష్టపడి పైకప్పు రేకు కోసి, లోపలికి దిగాడు. ఆశగా కౌంటర్ తెరిస్తే రూపాయి కూడా లేకపోవడంతో నిరాశ చెందాడు. ఖాళీ చేతులతో వెళ్లడం ఎందుకని ఒక క్వార్టర్, రెండు బీర్లను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్‌రోడ్డు సమీపంలోని మద్యం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనపై వైన్స్ యజమాని, పోలీసుల కథనం ప్రకారం.. మొలంగూర్ క్రాస్ రోడ్డు సమీపంలోని మద్యం దుకాణంలో బుధవారం రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించారు. సమయం ముగిశాక సిబ్బంది కౌంటర్లోని డబ్బులు తీసుకుని వైన్స్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగ దుకాణం పైకప్పు రేకులను కోసి దుకాణంలోకి చొరబడ్డాడు. కౌంటర్లో డబ్బు లేకపోవడంతో రెండు బీర్లు, క్వార్టర్ సీసా, సీసీ ఫుటేజీ హార్డ్‌డిస్క్ తీసుకెళ్లాడు. గురువారం వైన్స్ తెరవగా.. పైకప్పు కోసి ఉండడాన్ని గమనించి వ్యాపారి శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ రవి, క్లూస్‌టీం వివరాలు సేకరించారు. ఈ వైన్స్‌లో గతంలోనూ దొంగలు పైకప్పు తొలగించి చోరీకి దిగారని, దీంతో ఇనుపరాడ్లు వేశానని, అయినా రేకు కోసి దొంగ లోపలకు దిగాడని యజమాని వాపోయాడు. -
భవనం కూలిన ఘటనలో ఒకరి మృతి
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగిన బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో విషా దం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించి శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చిన కార్మికుడు చల్లా కామేశ్వరరావు (48).. ఆస్పత్రికి తరలించిన కాసేపటికే మృతి చెందాడు. తల, ఉదర భాగం మినహా నడుం కింది భాగంలో అవయవాలన్నీ శిథిలాల కింద నలిగిపోవడంతో ప్రాణాలు వదిలాడు. మరో కార్మికుడు పడిసర ఉపేందర్ ఆచూకీ కోసం శిథిలాల కింద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కూలిన ఐదు స్లాబులను క్రేన్లతో డ్రిల్ చేస్తూ, కట్టర్లు, గ్యాస్ వెల్డింగ్‌తో ఇనుమును తొలగిస్తున్నారు. అయితే ఉపేందర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బ్రిడ్జి సెంటర్లో, ఘటనాస్థలం వద్ద ఆందోళన చేశారు. సహాయక చర్యల్లో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహాయక చర్యలను భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. -
భార్యను ముక్కలు చేసి.. సూట్‌కేసులో కుక్కి..
సాక్షి, బెంగళూరు: జీవిత భాగస్వామిని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరకడం వంటి కిరాతక నేరాలు దేశంలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అలాంటి ఘోరం బెంగళూరులోనూ చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి ముక్కలుగా ఖండించి సూట్‌కేసులో పెట్టి పారిపోయాడు. ఈ ఘటన బెంగళూరులోని హుళిమావు పరిధిలోని దొడ్డకమ్మనహళ్లిలో జరిగింది.రెండేళ్ల కిందటే పెళ్లి.. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ (37) అనే వ్యక్తి తన భార్య గౌరి సాంబేకర్ (32)ను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి సూట్‌కేసులో నింపేశాడు. రెండేళ్ల క్రితం రాకేశ్, గౌరికి వివాహం జరిగింది. నెల రోజుల క్రితమే దొడ్డకమ్మనహళ్లిలోని ఇంటికి మారారు. ఇద్దరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కింద ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటున్నారు... గురువారం ఏం జరిగిందో కానీ హత్య చేసి, మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన గౌరి తల్లిదండ్రులు తమ ఊళ్లోని సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చారు. ఆ పోలీసులు వెంటనే హుళిమావు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఇంటికి వెళ్లి తాళాలు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బాత్రూంలో సూట్‌కేసులో గౌరి మృతదేహం ముక్కలై కనిపించడంతో కంగుతిన్నారు. ఆమె హత్యకు ఇంకా కారణాలు తెలియరాలేదు. నిందితుడు రాకేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆగ్నేయ డీసీపీ సారా ఫాతిమా, క్లూస్ టీం చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. -
‘నేను పెళ్లి చేసుకోలేదు.. బతికిపోయా’, మీరట్ ఘటనపై బాగేశ్వర్ బాబా
లక్నో: ‘థ్యాంక్ గాడ్. నేను పెళ్లి చేసుకోలేదు. లేదంటే’.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసుపై బాగేశ్వర్ బాబాగా ప్రచారంలో ఉన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రేమించి పెళ్లాడిన భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను ప్రియుడు సాహిల్ సాయంతో కట్టుకున్న భార్య ముస్కాన్ దారుణంగా హత్య చేసి,ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకుంది. అనంతరం, ప్రియుడి సాయంతో ముస్కాన్ తన భర్త సౌరభ్ రాజ్ మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి శరీర భాగాన్ని బులుగు రంగు ప్లాస్టిక్ డ్రమ్ములో దాచి పెట్టి పైన సిమెంటుతో కప్పిపెట్టారు.దారుణం వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుల్ని కటకటాల్లోకి నెట్టారు. ఈ నేపథ్యంలో సౌరభ్ రాజ్ ఘటనపై ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధీరేంద్ర కృష్ణ శాస్త్రి స్పందించారు. ప్రియుడి సాయంతో భర్తను హతమార్చిన ఘటనను ఉదహరించారు. ‘ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తల్లి దండ్రులు వారి పిల్లల్ని సరిగ్గా పెంచలేదు. వారి పెంపకంలో లోపాలు కనిపిస్తున్నాయి. అందుకే తల్లిదండ్రులు వారి పిల్లలకు విలువల్ని నేర్పించాలి. ఇందుకోసం శ్రీరామ చరిత్మానస్ బోధనలను పాటించాలని సూచించారు.#WATCH | Meerut, UP | On the Meerut murder case, Bageshwar Dham's Dhirendra Shastri said, "The Meerut case is unfortunate. In the present society, the declining family system, the advent of Western culture and married men or women engaged in affairs are destroying families...… pic.twitter.com/ULalTXvTj5— ANI (@ANI) March 27, 2025 ‘ప్రస్తుతం మనదేశంలో బ్లూ డ్రమ్ బాగా పాపులరైంది. చాలా మంది భర్తలు షాక్‌లో ఉన్నారు. థ్యాంక్ గాఢ్.నేను పెళ్లి చేసుకోలేదు’ అని నవ్వుతూ ప్రతిస్పందించారు. మీరట్ ఘటన దురదృష్టకరం. క్షీణిస్తున్న కుటుంబ వ్యవస్థ, పాశ్చాత్య సంస్కృతి, వివాహిత స్త్రీ, పురుషుల వ్యవహారాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. అందుకే ఉన్నతవంతమైన కుటుంబాన్ని నిర్మించేందుకు ప్రతి భారతీయుడు శ్రీరామచరిత్మానస్‌ను ఆచరించాలని కోరారు.