
మేడ్చల్‌రూరల్: క్రికెట్ ఆడుతూ ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కండ్లకోయలోని సీఎంఆర్‌ఈసీ కళాశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సీఎంఆర్‌ఈసీ కళాశాలతో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడేందుకు కళాశాల ఆవరణలోని గ్రౌండ్‌కు వెళ్లాడు.
ఆటలో భాగంగా ఫీల్డింగ్ చేస్తున్న వినయ్ గుండపోటు రావడంతో ఒక్కసారిగా గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. తోటి విద్యార్థులు అతడిని సమీపంలోని సీఎంఆర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడు వినయ్ ఖమ్మం జిల్లాకు చెందిన పేద విద్యార్థి .. తల్లిదండ్రులు రోజు కూలీ చేస్తూ తమ కుమారుడిని ఉన్నత చదువు చదివిస్తున్నట్లు తెలిసింది.
