BTech student
-
క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు
మేడ్చల్‌రూరల్: క్రికెట్ ఆడుతూ ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కండ్లకోయలోని సీఎంఆర్‌ఈసీ కళాశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సీఎంఆర్‌ఈసీ కళాశాలతో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడేందుకు కళాశాల ఆవరణలోని గ్రౌండ్‌కు వెళ్లాడు. ఆటలో భాగంగా ఫీల్డింగ్ చేస్తున్న వినయ్ గుండపోటు రావడంతో ఒక్కసారిగా గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. తోటి విద్యార్థులు అతడిని సమీపంలోని సీఎంఆర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడు వినయ్ ఖమ్మం జిల్లాకు చెందిన పేద విద్యార్థి .. తల్లిదండ్రులు రోజు కూలీ చేస్తూ తమ కుమారుడిని ఉన్నత చదువు చదివిస్తున్నట్లు తెలిసింది. -
గోడు చెప్పుకోలేక..వినేవారులేక!
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రాష్ట్రానికి చెందిన ఓ మూగ, బధిర విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం అర్ధరాత్రి హాస్టల్ భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఎం. రాహుల్ చైతన్య (18) అనే యువకుడు తనువు చాలించాడు. పుట్టినరోజున తల్లికి మెసేజ్ పంపి బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. మృతుడి స్వస్థలం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామం. ఇదే కళాశాలకు చెందిన కాట్రవత్ అఖిల్ (20) అనే మరో తెలంగాణ విద్యార్థి కార్డియాక్ అరెస్ట్‌తో ఆదివారం రాత్రే మరణించడం గమనార్హం. తీవ్రంగా గాయపడిన రాహుల్‌ను సమీపంలోని ఎస్ఆర్ఎన్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ధూమన్‌గంజ్ ఏసీపీ అజేంద్ర యాదవ్ తెలిపారు. తమ కళాశాలలోని మూగ, బధిర విభాగంలో రాహుల్ చైతన్య బీటెక్ ఫస్టియర్‌లో చేరాడని అలహాబాద్ ట్రిపుల్ ఐటీ పీఆర్వో పంకజ్ మిశ్రా చెప్పారు. గత మూడు నెలలుగా అతను తరగతులకు హాజరుకావడం లేదని.. చదువుల సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని పేర్కొన్నారు. ఈ ఒత్తిడి గురించి అతను తల్లికి కూడా తెలియజేశాడని వివరించారు. ఇద్దరు విద్యార్థుల మరణంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టేందుకు యాజమాన్యం త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. -
హిట్ అండ్ రన్.. బీటెక్ విద్యార్థి దుర్మరణం
పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీటెక్ విద్యార్థి వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన పున్నం లోకేష్ (21) బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి కాలేజీకి స్నేహితుడితో కలిసి వెళ్తున్నాడు. పంజగుట్ట– అమీర్‌పేట మార్గంలోని బిగ్‌బజార్ ఎదురుగా గుర్తు తెలియని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంతో వచ్చి వెనక నుంచి లోకేష్ బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న లోకేష్ తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి స్వల్ప గాయాల య్యాయి. ప్రమాద స్థలికి వచి్చన పోలీసులు లోకేష్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ప్రవీణ్‌కుమార్ ఫిర్యాదు మేర కు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. యథేచ్ఛగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు ఈ ప్రాంతంలో నిత్యకృత్యమయాయి. ట్రావెల్స్ బస్సులు ఉదయం 7.30 గంటల్లోపే నగరంలోని రోడ్లల్లో తిరగాలనే నిబంధనలు ఉండడంతో సమయంలోపు నగర శివారు దాటాలన్న ఉద్దేశంతో అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు అంటున్నారు. పోలీసులు సమయం దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవని వారు పేర్కొంటున్నారు. -
సూపర్ పవర్ ఉందంటూ..
సేలం: తనకు సూపర్ పవర్స్ ఉన్నాయంటూ ఓ కళాశాల విద్యార్థి నాలుగో అంతస్తుపై నుంచి అమాంతం కిందకు దూకి కాళ్లు, చేతులు విరగొట్టుకున్న ఘటన కోవైలో కలకలం రేపింది. కాగా, ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కోవై జిల్లా మలుమిసంపట్టి సమీపంలో మైలేరిపాళయంలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల ఉంది. ఇందులో ఈరోడ్ జిల్లా పెరుందురై సమీపంలో ఉన్న మేక్కూర్ గ్రామానికి చెందిన యువకుడు ప్రభు (19) హాస్టల్లో బస చేసి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభు మంగళవారం సాయంత్రం అతను బస చేసి ఉన్న హాస్టల్లో నాలుగో అంతస్తుపై నుంచి అకస్మాత్తుగా కిందకు దూకాడు. దీంతో చేతులు, కాళ్లు విరిగి పోయి తీవ్రంగా గాయపడిన ప్రభును సహ విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు రక్షించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెట్టిపాళయం పోలీసులు జరిపిన విచారణలో బాధితుడు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రభు అని తెలిసింది. తనకు సూపర్ పవర్ ఉందనే భ్రమలో ఉన్న ప్రభు తాను ఎంత ఎత్తయిన భవనం పై నుంచైనా దూకగలడని, తనకు ఏమీ కాదనే నమ్మకాన్ని పలు మార్లు స్నేహితులకు చెప్పినట్లు తెలిసింది. గతంలో కూడా ఇదే విధంగా పక్క భవనం పైకి జంప్ చేసిన క్రమంలో కింద పడి గాయపడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా హాస్టల్ నాలుగో అంతస్తు పైనుంచి ప్రభు కిందకు దూకిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.Shocking, a 19-year-old #BTech #student, believed he had #superpowers and jumped off the fourth floor of the students' hostel building in #Coimbatore , #TamilNadu The student from Mekkur village near Perundurai in Erode district suffered injuries. 28/10/24 pic.twitter.com/sGXqeMyRWF— Dilip kumar @DBN (@Dilipkumar_PTI) October 30, 2024 -
ప్రేమ పేరుతో వేధింపులు.. బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి జిల్లా: దోమడుగు గ్రామంలో బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక తేజస్విని అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి నాలుగవ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి మృతి చెందింది.సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడుతున్న గంజాయి బ్యాచ్.. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా కూడా బెదిరించినట్లు సమాచారం. వేధింపులు తాళలేక తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. యువకుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్‌రెడ్డి విచారణ చేపట్టారు. -
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో బీటెక్ స్టూడెంట్స్..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బీటెక్ విద్యార్థులు కారు డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. బీటెక్ విద్యార్థి సాకేత్ రెడ్డి తన మిత్రుడితో కలిసి మంగళవారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం, కారు డ్రైవ్ చేస్తూ జాబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీభత్సం సృష్టించారు. వారిద్దరూ మద్యం మత్తులో ఉండటంతో కారు కృష్ణానగర్వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో కారు అదుపు తప్పింది. కారు అతివేగంతో ఫుట్‌పాత్‌పైకి ఎక్కి.. టెలిఫోన్ స్థంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఇక, ప్రమాదాన్ని గమినించిన స్థానికులు కారులో ఇరుక్కుపోయిన వారిద్దరినీ బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సాకేత్ రెడ్డి, కారులో ఉన్న అతడి స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో కారు డ్రైవ్ చేసిన సాకేత్ రెడ్డికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. మద్యం మోతాదు 146 పాయింట్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. మద్యం మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. -
Hyderabad: బీటెక్ విద్యార్థి బలవన్మరణం
ఇబ్రహీంపట్నం: బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో చోటుచేసుకుంది. ఎస్ఐలు రామకృష్ణ, మైబెల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా అరుపాలెం మండలం, మామునూర్ గ్రామానికి చెందిన సంగెపు నరేంద్ర (27) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదిబట్ల ఏరోస్పేస్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇబ్రహీంపట్నం ఎంబీఆర్ నగర్‌లోని ఎస్వీ బాయ్స్ హాస్టల్ ఉంటున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి హాస్టల్ రెండో అంతస్తులోని తన గదిలో బెడ్ షీట్‌తో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. షాపింగ్ కోసం నగరానికి వెళ్లిన రూంమేట్స్ వచ్చి చూసేసరికి విగతజీవిగా మారి కనిపించాడు. దీంతో వారు హాస్టల్ యజమాని వేణుకు సమాచారం ఇచ్చారు. వెంటనే మృతుని కుటుంబసభ్యులు, పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. మృతుని తండ్రి రాంబాబు, బంధువులు శనివారం ఉదయం హాస్టల్‌కు చేరుకుని బోరున విలపించారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని, ఆర్థిక ఇబ్బందులు కారణం కావచ్చని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా నరేంద్ర మొబైల్ ఫోన్ లాక్ ఓపెన్ కాలేదు. కాల్ డేటాను పరిశీలిస్తే ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు ఆర్థిక ఇబ్బందులా లేక మరేమైనా ఉన్నాయా అనేది స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.హాస్టల్ భవనంపై నుంచి దూకి...లాలాపేట: తార్నాకలోని ఓయూ ఇంటర్నేషనల్ హాస్టల్ విద్యార్థి హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం జరిగింది. ఓయూ పోలీసులు తెల్పిన మేరకు.. వికారాబాద్ జిల్లాకు చెందిన ముల్కగల్ల రవి (25) నిజాం కళాశాలలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తార్నాకలోని స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం రెండంతస్తుల హాస్టల్ భవనంపై నుంచి దూకాడు. పెద్ద శబ్దం రావడంతో గమనించిన తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది 108కు ఫోన్ చేశారు. అక్కడి నుంచి వెంటనే ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. తలకు, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఈమేరకు పోలీసులకు సూసైడ్ నోట్ లభించిందని తెలిసింది. -
ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి
సాక్షి, హైదరాబాద్: శంకర్పల్లి ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం చేసుకుంది. బీటెక్ విద్యార్థిని లేఖపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో యాసిడ్ దాడి జరిగింది. విద్యార్థిని లేఖ్యపై తోటి విద్యార్థులు యాసిడ్ దాడి చేశారు. రంగు నీళ్లకు బదులు బకెట్లో యాసిడ్‌ను విద్యార్థులు నింపారు. రంగు నీళ్లు అనుకొని యాసిడ్‌ని తోటి విద్యార్థులు విద్యార్థినిపై పోశారు. విద్యార్థిని లేఖకు తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. -
Hyderabad: కలల తీరం చేరకుండానే.. రోడ్డు ప్రమాదంలో
హైదరాబాద్: వీసా ప్రాసెస్‌లో భాగంగా బ్యాంక్ స్టేట్మెంట్ కోసం వెళ్తున్న బీటెక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి సత్యనారాయణపురానికి దొంతరి మధుసూదన్‌రెడ్డి, సుష్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు వర్షిత్ రెడ్డి (23) బీటెక్ పూర్తి చేశాడు. విదేశీ విద్య కోసం అమెరికా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా వీసా కోసం నగరంలోని హిమాయత్‌నగర్ బ్యాంక్‌లో స్టేట్మెంట్ కోసం యాక్టివాపై వెళ్తుండగా.. ఉప్పల్ కట్టమైసమ్మ దేవాలయం వద్ద ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో వర్షిత్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తాడనుకున్న కుమారుడిని మృత్యువు కబళించడంతో వర్షిత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
గుండె పోటుతో బీటెక్ విద్యార్థిని మృతి
నర్సాపూర్(జి): మండలంలోని బామిని(బి) గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు... మండలంలోని బామిని(బి) గ్రామానికి చెందిన నార్వాడే హాసిని(18) హైదరాబాద్‌లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆరోగ్యం బాగలేకపోవడంతో ఇటీవల ఇంటికి వచ్చేసింది. గురువారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిర్మల్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతిచెందింది. తండ్రి నార్వాడే వెంకట్ రావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కూతురు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
రేణుశ్రీ ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడింది..
సంగారెడ్డి: రుద్రారంలోని గీతం వర్సిటీలో బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం వర్సిటీ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం విద్యార్థిలోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలోని కూకట్పల్లి– శంషీగూడలోని శిల్పా బృందావన్ కాలనీకి చెందిన రాహుల్, లక్ష్మీసరస్వతీల కూతురు రేణుశ్రీ గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వర్సిటీ ఐదో అంతస్తుపైకి వెళ్లి ఫోన్లో మాట్లాడి అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. మూడు నెలల క్రితమే ఇంజనీరింగ్ కళాశాలలో చేరిన ఆమె గురించి వివరాలు ఎవరికీ సరిగ్గా తెలియవు. కళాశాలకు సక్రమంగా వెళ్లేదికాదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇటీవల రేణుశ్రీని తండ్రి రాహుల్ కలిశారని, క్లాస్‌లకు రెగ్యులర్‌గా వెళ్లాలని మందలించినట్లు సమాచారం. విద్యార్థి ఆత్మహత్యకు తండ్రి మందలింపా.. ప్రేమ వ్యవహారం కారణమా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆమె బలవన్మరణానికి గల కారణాలను పోలీసులు అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. తన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఎవరితో ఫోన్లో మాట్లాడిందోనని ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ పురుషోత్తం రెడ్డి చెప్పారు. కాగా, రేణుశ్రీ ఆత్మహత్యపై తల్లిదండ్రులు కాకుండా ఆమె బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కేసు దర్యాప్తులోఉంది. -
అమ్మాయిల పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ అకౌంట్స్.. బరితెగించిన బీటెక్ స్టూడెంట్
-
'గొడవలు పెట్టుకోవద్దు.. పరువు పోతుందంటూ..' చివరికి బీటెక్ విద్యార్థి?
సాక్షి, కరీంనగర్: అత్తాకోడళ్ల గొడవతో మనస్తాపం చెందిన బీటెక్ విద్యార్థి పడాల అభిలాష్(20) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై విజేందర్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి పడాల రమేశ్–రేణుక దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో పెద్దకుమారుడు అభిలాష్ కరీంనగర్‌లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఇతడి తల్లి, నానమ్మ ఇంట్లో తరచూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా గొడవపడ్డారు. ఇంట్లో గొడవలు జరిగితే తమ పరువు పోతుందని ఇద్దరికీ చెప్పాడు. గొడవలు పెట్టుకోవద్దని సూచించాడు. అయినా, అత్తాకోడళ్లు ఇదేమీ పట్టించుకోలేదు. తీవ్రమనస్తాపం చెందిన అభిలాష్ తన ఇంటి సమీపంలో పత్తి చేనులోకి వెళ్లాడు. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబసభ్యులు తొలుత పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో కరీంనగర్‌లోని మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com Follow the Sakshi TV channel on WhatsApp: -
బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
మహబూబ్‌నగర్: పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని హైదరాబాద్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కుమ్మిరి గోపాల్ కుమార్తె శ్రీవాణి (19) హైదరాబాద్ మేడ్చల్‌లోని సూర్యనగర్కాలనీలో ఉన్న ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదివేది. ఇటీవల ఇంటికి వచ్చి రెండ్రోజులు ఉండి సోమవారం తిరిగి హాస్టల్‌కు వెళ్లింది. బుధవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కళాశాల నుంచి తండ్రికి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ హైదరాబాద్‌కు బయలుదేరారు. మూడు నెలల కిందట శ్రావణి అక్క వివాహం జరింది. అనంతరం శ్రావణి తల్లి పెబ్బేరు నుంచి కొత్తకోటకు బైక్‌పై వస్తుండగా నాటవెళ్లి సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు బైక్ పైనుంచి పడి అక్కడికక్కడే మృతిచెందింది. మూడు నెలల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు మృతి
ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాయపోల్ సమీపంలో చోటుచేసుకుంది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. కందుకూరుకు చెందిన నారాయణరెడ్డి, లంగర్‌హౌస్ డిఫెన్స్ కాలనీకి చెందిన భానుప్రసాద్, హస్తినాపురం ఈస్ట్ కాలనీకి చెందిన నవీన్ ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరు బైక్‌పై రాయపోల్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా దూసుకొచ్చిన మారుతి వాహనం (ఏపీ28 బీఎస్ 0010) వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలొదిరారు. కాగా, భారత్ ఇంజినీరింగ్ కళాశాల హైదరాబాద్ వెళ్లే దారిలో ఉంటే.. వీరు రాయపోల్ వైపుగా ఎందుకు వచ్చారో తెలియాల్సి వుంది. కారును నడిపిస్తున్న పి.శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆసరా అవుతారనుకుంటే.. ఉన్నత చదువులు చదివి కుటుంబాలకు ఆసరాగా నిలబడతారని అనుకుంటే రోడ్డు ప్రమాదం ఆ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాయపోల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడటంతో కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులను అప్పగించనున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. -
TS: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. బీటెక్ విద్యార్థి మృతి
నడికూడ: సెల్ఫీ సరదా ఓ బీటెక్ విద్యార్థి ప్రాణం తీసింది. వాగు మాటు వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామం వాగులో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ (19) హసన్‌పర్తిలోని కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువా రం ఉదయం కాలేజీ స్నేహితులు సయ్యద్ జాహెద్‌షా, అబ్దుల్ షాదాబ్తో కలిసి బైక్‌పై సరదాగా కంఠాత్మకూర్ వాగు వద్దకు వచ్చారు. ఇస్మాయిల్ వాగులోని ఓ మాటు (నీటిని నిల్వచేసేందుకు అడ్డంగా వేసిన కట్ట) వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడిపోయాడు. దూరంగా ఉన్న స్నేహితులు గట్టిగా అరవడంతో స్థానికంగా ఉన్న వారు వచ్చి కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే అతను మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న దామెర ఎస్సై రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ఇది కూడా చదవండి: ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్ -
అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి..
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లా పెనమలూరు మండల పరిధిలోని పెదపులిపాక గ్రామ శివారు డొంకరోడ్డులో బుధవారం తెల్లవారు జామున ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహం కలకలం రేపింది. మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లూరుపాలేనికి చెందిన సుధాకర్, రూతమ్మలు విజయవాడ సున్నపుబట్టీల వద్ద ఉంటున్నారు. సుధాకర్ వాచ్‌మేన్‌గా పని చేస్తాడు. వారి కుమారుడు జమ్మలమూడి జీవన్(21) విజయవాడ వన్‌టౌన్‌లోని పొట్టిశ్రీరాములు ఇంజినీరింగ్‌కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం జీవన్ మిత్రుడు శ్యామ్ పుట్టిన రోజు సందర్భంగా గురునానక్‌నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు పార్టీలో ఉన్న జీవన్.. మిత్రుడి యాక్టీవా తీసుకుని బయటకొచ్చాడు. ఆ తర్వాత పెదపులిపాక శివారులోని డొంక రోడ్డులో కాలిపోయి శవమై కనిపించాడు. జీవన్‌ను ఎవరైన పథకం ప్రకారం హత్య చేశారా.. లేక బలవన్మరణానికి పాల్పడ్డాడా.. అనే విషయం మిస్టరీగా మారింది. ఘటనపై పెనమలూరు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి పలు విషయాలు సేకరించారు. జీవన్ మంగళవారం రాత్రి 12:20 గంటలకు మిత్రుడి వాహనంపై రెస్టారెంట్ నుంచి బయటకొచ్చాడు. అక్కడి నుంచి యనమలకుదురు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి సీసాలో రూ.100 పెట్రోల్ పోయించుకున్నాడు. ఈ దృశ్యాలు పెట్రోల్ బంక్ వద్ద సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ తర్వాత అర్ధరాత్రి 1.40 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. రూ.12 వేలు ఈఎంఐ డబ్బు వాడుకున్నాను.. ఇంటికి రావడం లేదు.. అమ్మ సారీ.. అని చెప్పాడు. ఆ తర్వాత జీవన్ ఫోన్ పని చేయలేదు. అంతకు ముందు రోజే జీవన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో.. దిస్ ఈజ్ లాస్ట్ డే. అని పెట్టగా మిత్రులు ఎగతాళి చేశారు. దీనికి జీవన్.. రాత్రి చూస్తారుగా అని పోస్టు పెట్టాడు. ఈ విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. జీవన్ మృతదేహం వద్ద ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. రాత్రి పార్టీలో ఉన్న మిత్రులను పోలీసులు ప్రశి్నస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (చదవండి: సీరియల్ రేపిస్ట్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. 30 మంది పిల్లలను దారుణంగా..) -
తమ్ముడూ.. ఏం తక్కువ చేశామురా నీకు..
వైఎస్సార్: కురబలకోట మండలం అంగళ్లులోని ఓ కళాశాలలో సీఎస్ఈ బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న మధు (21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. పీటీఎం మండలం అంగడివారిపల్లెకు చెందిన కుడుం ఉత్తన్న కుమారుడు మధు చదువుల్లో మేటి. పదిలో ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. ఇంటర్లో కూడా రాణించాడు. అంగళ్లులోని ఓ కళాశాలలో ఇతనికి సీఎస్ఈలో ఫ్రీ సీటు వచ్చింది. తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సహ విద్యార్థులతో బాగా కలసిపోయే వాడు. అంగళ్లులో రూము అద్దెకు తీసుకుని కళాశాలకు రాకపోకలు సాగించేవాడు. ఈనేపథ్యంలో ఈనెల 12న సాయంత్రం నుంచి కన్పించకుండా పోయాడు. రూముకు రాకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కూడా చుట్టుపక్కల విచారించారు. సెల్ ఫోన్ కూడా రూములో వదిలి వెళ్లాడు. ఇతని ఆచూకీ కోసం కుటుంబీకులు పలుచోట్ల గాలించారు. ఎక్కడైనా ఉంటాడులే అని భావి స్తూ వచ్చారు. మంగళవారం ఉదయం అంగళ్లులోని తుమ్మచెట్లపల్లె వద్ద ఉన్న కోల్డ్‌స్టోరేజీ వెనుక వైపు ప్రాంతంలో దుర్వాసన రాసాగింది. స్థానికులు పరిశీలించి చూడగా కుళ్లిన స్థితిలో శవం కన్పించింది. మృతుడి దుస్తులు, చెప్పుల ఆధారంగా అదృశ్యమైన మధుగా గుర్తించారు. పక్కన టమాటా పంట వద్ద ఉన్న డ్రిప్ వైరుతో ఇతను చెట్టుకు ఉరి వేసుకున్నట్లు సంఘటన స్థలాన్ని బట్టి స్పష్టమవుతోంది. ముట్టుకుంటే ఊడిపోయే పరిస్థితి కావడంతో డాక్టర్లు మంగళవారం సంఘటన స్థలానికి వచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఎందుకురా ఇలా చేశావ్.. ఇదిలా ఉండగా మధుకు తెలివైన విద్యార్థిగా పేరుంది. ఎవ్వరితో ఎలాంటి విబేధాలు లేవు. ఆర్థిక సమస్యతో స్నేహితులను ఇటీవల డబ్బు ఆడిగినట్లు చెబుతున్నారు. దీనికి తోడు అంగళ్లుకు చెందిన మరొకరికి బాకీ ఉన్నట్లు సమాచారం. కొత్త అప్పు పుట్టక మరో వైపు చేసిన అప్పు తీరే మార్గం కన్పించక మనో వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్నేహితులు మాత్రం ఎందుకురా ఇంత పని చేశావని సంఘటన స్థలంలో కంట తడిపెట్టడం చూపరులను కలిచివేసింది. తమ్ముడూ.. ఏం తక్కువ చేశామురా నీకు.. మన కుటుంబంలో ఒక్కరూ చదువుకున్న వారు లేరు.. నువ్వన్నా ప్రయోజకుడవు అవుతావని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మాకున్నా లేకున్నా.. కష్టపడి చదివిస్తున్నాం కదరా.. ఎందుకిలా చేశావురా.. అంటూ మధు అన్నయ్య బోరున విలపించాడు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు రూరల్ సర్కిల్ సీఐ శివాంజనేయులు తెలిపారు. ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్‌లు లేదా రుణ యాప్‌లు ఏమైనా ఈ సంఘటనకు దారి తీశాయా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. -
బైక్ అదుపు తప్పి బీటెక్ విద్యార్థి దుర్మరణం
విశాఖపట్నం: మండలంలోని సబ్బవరం–చోడవరం రోడ్డులోని ఆరిపాక శివారు లగిశెట్టిపాలెం సమీపంలో బుధవారం అర్ధరాత్రి బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీస్‌లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. రోలుగుంట మండలంలోని అడ్డసార శివారు మర్రిపాలెం గ్రామానికి చెందిన కూరాకుల చిన్నబ్బాయి చిన్న కుమారుడు నాని(21)తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చిన అతడు బుధవారం రాత్రి బైక్‌పై తగరపువలసలోని కళాశాలకు తిరిగి వెళ్తున్నాడు. ఆరిపాక శివారు లగిశెట్టిపాలెం వద్ద బైక్ అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకు హెల్మెట్ ఉన్నప్పటికీ బలంగా ఢీకోవడంతో హెల్మెట్ నుజ్జునుజ్జు అయి తలకు తీవ్రగాయాలయ్యాయి .దీనితో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక ఎస్ఐ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుని సోదరుడు భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బాలానగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: బాలానగర్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరిగ్గా చదువుకోవడం లేదంటూ తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన శివప్రసాద్.. ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి గదిలో సూసైడ్ నోట్, సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆత్మహత్యపై బాలానగర్ పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: ‘టీచర్ కొట్టడం వల్లే మా బిడ్డ చనిపోయాడు!’ -
ఆమె వల్ల పిచ్చోడినయ్యా.. ప్లీజ్ వారినైనా కాపాడండి: బీటెక్ విద్యార్థి సూసైడ్
సాక్షి, విజయవాడ: సూసైడ్ నోట్ రాసిపెట్టి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కాగా, విద్యార్థి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహరమే కారణమైనట్టు తెలుస్తోంది. ప్రేయసి చేసిన మోసం తట్టుకోలేకనే.. పేరెంట్స్‌కు ఏం చెప్పాలో తెలియకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో రాశాడు. వివరాల ప్రకారం.. బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ సూసైడ్ నోట్ రాసిపెట్టి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుకుమిక అనే యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని లేఖలో రాసుకొచ్చాడు. ఆమె టైమ్ పాస్ ప్రేమ వల్ల తాను పిచ్చోడిని అయ్యానని.. తనకు జీవితం మీద విరక్తి కలిగిందని చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సుకుమిక తనపై ఫేక్ ప్రేమ నటిస్తూ.. వివాహితుడైన ఓ లెక్చరర్‌తో సంబంధం కొనసాగిస్తున్నదని.. వీడియో కాల్స్‌తో అసభ్యకరంగా వీడియోలు తీసుకున్నదని సలామ్ లేఖలో రాశాడు. అర్ధరాత్రి మరో వ్యక్తితో కూడా ఇలా వీడియో కాల్స్ మాట్లాడుతోందని తెలిపాడు. తన ప్రవర్తనను మార్చాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ మారలేదని పేర్కొన్నాడు. అదే సమయంలో అబ్బాయిలు మోసం చేసే హైలైట్ చేస్తారు కానీ.. అమ్మాయిలు మోసం చేస్తే ఎందుకు ప్రశ్నించరు అంటూ ప్రశ్నించాడు. కుసుమిక చేతిలో మోసపోయిన అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ లేఖలో రాశాడు. -
కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
నిజామాబాద్: బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. నిజామాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ చదువుతున్న అర్పిత అనే విద్యార్థిని నిన్న(ఆదివారం) సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల బిల్డింగ్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బీటెక్ విద్యార్థిని ప్రేమవివాహం.. గ్రామంలోకి వచ్చి బలవంతంగా..
సాక్షి, ప్రకాశం(కొత్తపట్నం): వారు ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ అమ్మాయి కన్నవారికి నచ్చలేదు.. వెంటనే అమ్మాయి ఆచూకీ కనుగొని బలవంతంగా తీసుకెళ్లడానికి యత్నించగా గ్రామస్తులు అడ్డుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారందరినీ అదుపులోనికి తీసుకున్నారు. వివరాలు.. తమిళనాడుకు చెందిన జీవిత శివకుమారి గూడురు కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కొత్తపట్నం మండలం గుండమాల గ్రామానికి చెందిన కారాని రాజేష్ తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శినానికి వెళ్లాడు. అదే సమయంలో చెన్నై నుంచి వారి బంధువులతో జీవిత శివకుమారి కూడా దర్శినానికి వచ్చింది. ఇలా ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమదాకా దారి తీసింది. ఇటీవల సింగరాయకొండలో వివాహం చేసుకున్నారు. తరువాత కొత్తపట్నం పోలీస స్టేషన్‌కు వచ్చి తమకు ప్రాణహాని ఉందని రక్షించాలని వేడుకున్నారు. అప్పటికే యువతి తల్లిదండ్రులు గూడూరు పోలీస్ స్టేషన్లో తమ కుమార్తె అదృశ్యం అయిందని ఫిర్యాదు చేశారు. వారు కొత్తపట్నంలో ఉన్నారని తెలుసుకున్న గూడూరు టూటౌన్ ఎస్సై, కొత్తపట్నం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇద్దరినీ తీసికెళతానని చెప్పాడు. వెంటనే గుండమాల గ్రామస్తులు కలుగచేసుకుని ఇద్దరూ మేజర్లు అయితే ఎలా తీసికెళతారని ప్రశ్నించారు. దీంతో ఏమీ చేయలేక ఎస్సై వెనుతిరిగాడు. అయితే వారం రోజుల తరువాత మళ్లీ కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇద్దరూ గూడూరు రావాలని కోరాడు. కానీ యువతి నిరాకరించడంతో ఆయన వెళ్లిపోయాడు. ఈ క్రమంలో గత నెల అక్టోబర్ 19న సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో చర్చిలో వివాహం చేసుకున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం గూడూరు నుంచి 30 మంది వాహనాల్లో వచ్చి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసికెళ్లారు. గ్రామస్తులు అడ్డగించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న సర్పంచ్ కారాని జయరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దారిలోనే వారిని పోలీసులు అడ్డగించి ఒంగోలు టూటౌన్‌కు తీసుకొచ్చారు. అయితే పెండ్లి కుమార్తె తండ్రి కారాని శ్రీను.. కొత్తపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. తమ కోడలను ఆమె మేనమామలు భాస్కర్‌రెడ్డి, భరత్‌రెడ్డి మరి కొంత మంది బలవంతగా తీసికెళ్లారని యువకుని తండ్రి ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో ఎస్సై కొక్కిలగడ్డ మధుసూదన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘వైజాగ్ బిట్స్’ విద్యార్థుల ఆలోచనలకు రెక్కలు.. ‘కాంకర్డ్’కు అంకురార్పణ
సాక్షి, విశాఖపట్నం: స్థానిక బాబా ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు “కాంకర్డ్” పేరిట అంకుర సంస్థను ఏర్పాటు చేసినట్టు ప్రిన్సిపాల్ డా.గోవింద రాజు వెల్లడించారు. గురువారం జరిగిన ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా చెగ్ ఇండియా న్యూఢిల్లీకి చెందిన ప్రకృతి శ్రీవాస్తవ గౌరవ అతిధిగా క్యాథెరిన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ ఆలివర్ రాయ్ హాజరయ్యారని తెలిపారు. చదవండి: వావ్..వాట్సాప్‌లో అదిరిపోయే సూపర్ ఫీచర్లు..అవేంటో తెలుసా? కాంకర్డ్ అంకుర సంస్థను బిట్స్ వైజాగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు పి. జాషువ రాజు ఆధ్వర్యంలో, ఐదుగురు విద్యార్థుల బృందం ఈ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుత కంప్యూటింగ్ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక నైపుణ్యంతో, యుఐ/యుఎక్స్ డిజైనింగ్, వెబ్, మొబైల్ అప్లికేషన్ డెవలెప్మెంట్, డిజైన్ స్పాటిలైట్ వెర్టికల్స్ లో సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తారని సంస్థ వ్యవస్థాపకులు జోషువా రాజు వివరించారు. సహ వ్యవస్థాపకులు సందీప్, మేఘశ్యామ్ ఫుల్ స్ట్యాక్ డెవలప్మెంట్ లో అప్లికేషన్స్ అభివృద్ధి చేస్తారని, విద్యార్థి రాహుల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, మహేష్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా వ్యవరిస్తారని చెప్పారు. మూడవ సంవత్సరం చదువుతున్న శ్రావ్య కంటెంట్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్‌గా పని చేస్తారన్నారు. విద్యార్థి దశలోనే ఇటువంటి సంస్థను ప్రారంభించడం అభినందనీయమని, వారికి తాము అండగా నిలుస్తామని ఈ సందర్భంగాప్రకృతి శ్రీవాస్తవ హామీ ఇచ్చారు. తమ విద్యార్థులు అంకుర సంస్థను విద్యార్థులు స్థాపించడం చాలా గర్వంగా ఉందని, భవిష్యత్తులో ఇటువంటి సంస్థల్ని మరిన్ని తీసుకురావాలని ప్రిన్సిపాల్ అభిలషించారు. కళాశాల కరెస్పాండెంట్ డా. కొండ్రు శ్రీలక్ష్మి బృంద సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరి కొన్ని సంస్థలు అన్ని విభాగాల్లోనూ స్టార్టప్‌తో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బిట్స్ వైజాగ్ అకడమిక్ ముఖ్య సలహాదారు డా. సీవీ గోపినాథ్, డీన్ డా.విక్టర్ బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వీడియో: ‘బీటెక్ చాయ్‌వాలి’.. ఆమె థింకింగ్ వేరె లెవల్ గురూ..
ఆలోచన ఉండాలే గానీ.. జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని ఇప్పటికే ఎందరో నిరూపించి తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు. తాజాగా చదువు అనేది కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదని ఓ యువతి.. తన కలలను నిజం చేసుకుంది. సొంతంగా బీటెక్ చాయ్‌వాలి అనే పేరుతో ఓ టీ షాప్ ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన వర్తికా సింగ్ హర్యానాలో తన బీటెక్ పూర్తి చేసింది. కాగా, తాను చదువుకుంటున్న సమయంలో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. దీంతో, తన కలను సాకారం చేసుకునేందుకు ఓ వినూత్న ఆలోచన చేసింది. సొంతంగా ఓ టీ షాప్‌ను ప్రారంభించింది. సదరు షాప్‌నకు ‘బీటెక్ చాయ్వాలీ’ అని పేరుపెట్టింది. దీంతో, వ్యాపారం ప్రారంభించినట్టు పేర్కొంది. ఈ క్రమంలో వర్తికా సింగ్ మాట్లాడుతూ.. సొంత వ్యాపారం చేయాలనుకోవడం నా డ్రీమ్. అందులో భాగంగానే ఫరీదాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్ వద్ద ‘బీటెక్ చాయ్వాలీ’ని ప్రారంభించాను. ప్రతీరోజు సాయంత్రం 5:30 నుండి రాత్రి 9:30 గంటల వరకు టీ షాప్‌ను నడుపుతున్నాను. ‘బీటెక్ చాయ్వాలీ’తో ఎంతో సంతృప్తి చెందాను అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Swag Se Doctor (@swagsedoctorofficial) మరోవైపు.. గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతంలో ‘బీటెక్ చాయ్వాలీ’ ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ షాప్‌లో స్పెషల్ టీ, మసాలా టీ తాగేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, బీటెక్ చాయ్వాలీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. మీ చిరునవ్వు, విశ్వాసం నాకు నచ్చింది. నేను మీ కోసం ప్రార్థిస్తాను అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. రాబోయే ఒక్క సంవత్సరంలో మీరు బ్రాండ్ అవుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు. https://t.co/l4NsiNCmn1 ke baad ab https://t.co/uwi8X7YeHb chaiwali bhi aagyi 🙄 Ab apun bhi bnega Upsc chaiwala 😍 pic.twitter.com/hH2Xxu2vKy — 🚩ASHU THAKUR 🚩 (@ashu_thakurr) October 3, 2022 -
రాంగ్‌కాల్ పరిచయం.. బీటెక్ యువతి పాలిట శాపం
నెల్లూరు(క్రైమ్) : రాంగ్‌కాల్ పరిచయం ఓ యువతి పాలిట శాపంగా మారింది. సేకరించిన సమాచారం మేరకు.. కావలి పట్టణానికి చెందిన ఓ యువతి బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. యువతి సెల్‌ఫోన్‌కు కొంతకాలం కిందట ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే సారీ.. రాంగ్ నంబర్ అంటూ యువకుడు మాటలు కలిపాడు. వారి పరిచయం సాన్నిహిత్యానికి దారితీసింది. రెండురోజుల కిందట ఇద్దరూ నెల్లూరులో కలుసుకున్నారు. అనంతరం ఓ లాడ్జికి వెళ్లారు. ఈ క్రమంలో యువకుడు ఆమె సెల్‌ఫోన్‌లోని వీడియోలు, ఫొటోలు చూసి ఎవరివని ప్రశ్నించాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన యువకుడు ఆమెపై దాడిచేసి సెల్‌ఫోన్‌తో పరారయ్యాడు. దీంతో యువతి అతని కోసం గాలించింది. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి, పరారైన యువకుని ఫోన్ నంబర్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (నీ న్యూడ్ వీడియో, ఫొటోలను బయట పెడతా.. సీఐ వేధింపులు) -
తేలు కాటుకు బీటెక్ విద్యార్థిని మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా: తేలు కాటుకు గురైన ఓ యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడు గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్తుల వివరాల పకారం.. రగుడుకు చెందిన దొంతుల బాలమల్లు–పద్మ దంపుతలకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కూతురు మాలతి(22) బీటెక్ పూర్తి చేసింది. ఇటీవలే ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రాగా, జాయిన్ కావాల్సి ఉంది. ఆదివారం తల్లిదండ్రులతో కలిసి తమ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లింది. కూరగాయలు తెంపుతున్న సమయంలో కాలికి ఏదో విషపురుగు కుట్టినట్లు అనిపించగా అక్కడున్నవారికి తేలు కనిపించింది. మాలతిని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె హార్ట్‌బీట్ తక్కువగా ఉందని, మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులు చికిత్స పొందిన ఆమె పరిస్థితి విషమించడంతో మంగళవారం చనిపోయింది. ఉద్యోగం చేసి, తమకు అండగా ఉంటుందనుకున్న కూతురు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. బీజేపీ నాయకుల ఆందోళన సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో సరైన చికిత్స అంది ఉంటే మాలతి బతికేదని బీజేపీ నాయకులు అన్నా రు. ఈ మేరకు దవాఖానాలో వారు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీధర్ వారి తో మాట్లాడారు. యువతి గుండె పనితీరు సరిగా లేకపోవడం వల్లే మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారన్నా రు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్!
వేలూరు: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఒక విద్యార్థి అరెస్ట్ కలకలం రేపింది. ఆంబూరు పట్టణానికి చెందిన అనార్ అలీ ఆర్కాడు దగ్గర్లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. శనివారం తెల్లవారుజామున ఢిల్లీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ పోలీసులు, వేలూరు ఇంటెలిజెన్స్ పోలీసుల సాయంతో అనార్ అలీ ఇంటిని చుట్టుముట్టారు. అతని వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విద్యార్థిని రహస్యంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇతర దేశాల్లోని కొందరితో నిందితుడికి పరిచయం ఉందని, వీరిలో కొందరు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ అధికారులు విద్యార్థిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అల్‌ఖైదాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన నటుడు ఉసేన్ లస్కర్‌తో ఈ విద్యార్థి చాలాసార్లు ఫోన్లో మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదీ చదవండి: రాడికల్ శక్తులను కట్టడి చేయండి -
ఇంజనీరింగ్ పట్టాతో ఎగిరిపోవాల్సిందే.. ఉద్యోగం వచ్చినా వద్దే వద్దు
సాక్షి, హైదరాబాద్: బీటెక్ పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది విదేశీ విద్య వైపే మొగ్గుచూపుతున్నారు. క్యాంపస్ నియామకాల్లో ఎంపికైనా సరే... ఎంఎస్ చేసిన తర్వాతే ఏదైనా అంటున్నారు. ఎంటెక్ వంటి పీజీ కోర్సుల్లో చేరేందుకు తక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. గత ఐదేళ్లుగా ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. ఎంటెక్ కోర్సుల్లో సీట్లు నిండే పరిస్థితి కూడా లేదు. ఏటా 70–65 వేల మంది బీటెక్ ప్రవేశాలు పొందుతుంటే, కనీసం 4 వేల మంది కూడా ఎంటెక్‌లో చేరడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదీ కూడా గేట్ ద్వారా ఐఐటీ, ఎన్ఐటీల్లో చేరే వారే 3 వేల మంది వరకూ ఉన్నారు. దాదాపు 12 వేల మంది ప్రతి ఏటా ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. మేనేజ్మెంట్, ఇతర పీజీ కోర్సులకు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్లే వారి సంఖ్య 15 వేల వరకూ ఉంటోంది. ఇలా మొత్తం మీద 27 వేల మందికిపైగా బీటెక్ తర్వాత ఇతర దేశాలకు పయనమవుతున్నారు. దీంతో రాష్ట్రంలో బీటెక్‌కు ఉన్న పోటీ వాతావరణం ఇతర కోర్సులకు ఉండటం లేదు. అవకాశాలే లక్ష్యం... విదేశాల్లో సాధారణంగా ఎంఎస్ తర్వాత సాఫ్ట్వేర్ సంస్థల్లో నియామకాలు చేపడతారు. మన దేశంలో మాత్రం బీటెక్ తర్వాతే ఈ అవకాశాలు ఉంటున్నాయి. అయితే, మన దేశంతో పోలిస్తే విదేశాల్లో ఎంఎస్ చేసిన తర్వాత మంచి వేతనం లభిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. ఎంఎస్ చేసేందుకు బ్యాంకులు ఎక్కువగా రుణాలివ్వడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అమెరికా వంటి దేశాల్లో అనధికారికంగా ఏదో ఒక పార్ట్‌టైమ్ ఉపాధి పొందేందుకు అవకాశాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, కొంతకాలంగా ఇంజనీరింగ్ విద్యలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కంప్యూటర్ కోర్సుల్లో ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ ఉన్న కోర్సులొచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సులు ఇక్కడ చేసి, కొనసాగింపుగా అమెరికాలో ఎంఎస్ చేయడం ప్రయోజనంగా ఉంటోందని సాఫ్ట్వేర్ నిపుణులు అంటున్నారు. ఈ కారణంగా బీటెక్ తర్వాత ఎంఎస్కే ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర మేనేజ్మెంట్ కోర్సుల్లోనూ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ముందంజలో ఉన్నాయి. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికతో విద్యను అందిస్తున్నాయి. అందుకే విదేశీ మేనేజ్మెంట్ కోర్సులకూ ప్రాధాన్యమిస్తున్నారు. -
ఆన్లైన్ బెట్టింగ్ గేమ్‌లకు అలవాటుపడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు: పలమనేరు పట్టణంలోని గుడియాత్తంరోడ్డు బజంత్రీ వీధిలో నివాసముంటున్న బీటెక్ విద్యార్థి దిలీప్‌రెడ్డి(20 ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు, అన్నమయ్య జిల్లా చినమండ్యం గ్రామానికి చెందిన దిలీప్‌రెడ్డి పట్టణ సమీపంలోని ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. బజంత్రీవీధిలోని ఓ ఇంట్లో మరో ఇద్దరు విద్యార్థులతో కలసి అద్దెకుంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం గదిలో ఫ్యానుకొక్కీకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి విచారిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా దిలీప్ ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్‌లకు అలవాటుపడ్డట్లు పోలీసులు తెలిపారు. గేమ్‌లకోసం అప్పులు చేసినట్లు, చివరికి మొబైల్ కూడా తాకట్టు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
సూసైడ్ నోట్ రాసి.. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, చైతన్యపురి: ‘నా చావుకు ఎవరూ కారణం కాదని’ సూసైడ్ నోట్ రాసి ఓ బీటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రంగారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, రాచూరు గ్రామానికి చెందిన గుత్తి బాలయ్య కుమారుడు అనిల్ కుమార్ అవంతి కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత కొంతకాలంగా అతను స్నేహితుడితో కలిసి న్యూ దిల్‌సుఖ్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ నెల 6న స్నేహితుడు సొంతూరుకు వెళ్లగా అనిల్ ఒక్కడే గదిలో ఉన్నాడు. రెండు రోజులుగా అద్దెకు ఉంటున్న వారు కనిపించకపోవడంతో సోమవారం ఇంటి ఓనర్ గది వద్దకు వెళ్లి చూడగా లోపల గడియ పెట్టి వుంది. కిటికీ లోనుంచి చూడగా అనిల్‌కుమార్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. గదిలో పోలీసులు తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..) -
‘దిశ చట్టంతోనే రమ్య కుటుంబానికి న్యాయం జరిగింది’
సాక్షి, అమరావతి: రమ్య హత్య కేసులో శశికృష్ణకు ఉరి ఖరారు కావడంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. కోర్టు విధించిన ఈ చారిత్రాత్మకమైన తీర్పుని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హత్య జరిగిన పది గంటల వ్యవధిలో శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు వారం రోజుల్లో ఛార్జ్ షీటు వేశారని తెలిపారు. 8 నెలల వ్యవధిలో తీర్పు వచ్చిందని, రమ్య కేసులో తీర్పుపై దిశ చట్టం ప్రభావం ఎంతైనా ఉందన్నారు. ‘ఆడ పిల్లలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి దిశ యాప్ తీసుకువచ్చారు.. దిశ చట్టం పెండింగులో ఉన్నప్పటికీ పోలీసులకు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేశారని’ చెప్పారు. దిశ చట్టంతోనే రమ్య కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు దిశ చట్టంపై హేళన మానుకోవాలని హితవు పలికారు. -
Ramya Murder Case: ఉరిశిక్షపై శశికృష్ణ తల్లి స్పందన ఇదే..
సాక్షి గుంటూరు: శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ వచ్చిన తీర్పుపై ఏమీ మాట్లాడలేనని.. హైకోర్టుకు వెళ్లే ఆర్థిక స్థోమత మాకు లేదు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని శశికృష్ణ తల్లి భూలక్ష్మి అన్నారు. చదవండి: (రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'మా అబ్బాయి ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. అసలు వారి మధ్య ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. అంతకుముందు వారి ప్రేమ విషయం మాకు చెప్పలేదు. రమ్య తల్లిదండ్రులకు నేనేమీ చెప్పలేను. మావాడికి ఉరిశిక్ష వేస్తే చనిపోయిన పాప తిరిగి రాలేదు కదా?. ఆవేశం మీద మావాడు తప్పు చేశాడు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి బాధ రాకూడదు' అని శశికృష్ణ తల్లి భూలక్ష్మి అన్నారు. చదవండి: (బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు) -
సత్తా చాటిన ‘దిశ’.. న్యాయం జరిగింది
సాక్షి, అమరావతి: ‘మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారికి దిశ వ్యవస్థ ద్వారా ఉరి శిక్ష వేయించండి చూద్దాం..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు తరచూ ప్రభుత్వానికి విసురుతున్న సవాల్‌కు శుక్రవారం జవాబు లభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థ తన సత్తా చాటింది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే అతి తక్కువ వ్యవధిలో ఓ హంతకుడికి న్యాయస్థానం ద్వారా ఉరిశిక్ష వేయించింది. గుంటూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను 10 గంటల్లోనే అరెస్టు చేయడంతోపాటు.. సత్వరం చార్జ్‌షీట్ దాఖలు, ఫోరెన్సిక్ నివేదికల సమర్పణ, క్రమంతప్పని రీతిలో విచారణ ద్వారా నిందితుడి నేరాన్ని రుజువు చేసి, కేవలం 257 రోజుల్లోనే దోషిగా తేల్చి.. కోర్టు ద్వారా ఉరి శిక్ష వేయించగలిగింది. మహిళా భద్రత పరిరక్షణలో దేశానికే దిశ వ్యవస్థ చుక్కానిగా నిలిచింది. యుద్ధప్రాతిపదికన స్పందన మహిళలపై నేరాలకు పాల్పడే వారిని తక్షణం గుర్తించి సత్వరం శిక్ష విధించే ప్రక్రియలో దిశ వ్యవస్థ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. 2021 ఆగస్టు 15న గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్యపై శశికృష్ణ అనే యువకుడు నడిరోడ్డుపై దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశాడు. సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు నిందితుడిని కేవలం 10 గంటల్లోనే అరెస్టు చేశారు. నేర నిరూపణకు కీలకమైన ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షలను కేవలం 48 గంటల్లోనే పూర్తి చేసి నివేదికలు తెప్పించారు. నిందితుడు సాంకేతికపరమైన లోపాలను అవకాశంగా చేసుకుని తప్పించుకునేందుకు ఏమాత్రం వీలులేకుండా చేశారు. రమ్య మృతదేహం, నిందితుడి దుస్తులు, కత్తి, ఘటనా స్థలంలో ఉన్న రక్తపు నమూనాలను సరిపోల్చి నిర్ధారించారు. ఫోరెన్సిక్ వ్యవస్థ బలోపేతం కేవలం రెండ్రోజుల్లోనే ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికలు తెప్పించడం దిశ వ్యవస్థతోనే సాధ్యమైంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనంతరం ఫోరెన్సిక్ సైన్స్ విభాగం హైదరాబాద్‌లోనే ఉండిపోయింది. దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ నివేదికల కోసం నమూనాలను హైదరాబాద్‌లోని ల్యాబొరేటరీకి పంపించి నివేదికలు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేది. కానీ దిశ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఫోరెన్సిక్ సైన్స్ విభాగాన్ని బలోపేతం చేసింది. గుజరాత్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సౌజన్యంతో రాష్ట్రంలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలను నెలకొల్పడంతో పాటు ఈ వ్యవస్థను మూడింతలు అభివృద్ధి చేసింది. ఆ విభాగంలో నిపుణులను ఐదింతలు పెంచింది. తద్వారా రమ్య కేసులో కేవలం 48 గంటల్లోనే ఫోరెన్సిక్, డీఎన్ఏ నివేదికలను తెప్పించారు. దిశ వ్యవస్థలో భాగంగా సైబర్ క్రైమ్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐదింతలు బలోపేతం చేసింది. దాంతో ఈ కేసులో నిందితుడి కాల్‌డేటాను పోలీసులు సత్వరం, సమర్థవంతంగా విశ్లేషించగలిగారు. హత్యకు ముందు నిందితుడు తన మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడిన టవర్ లొకేషన్, రమ్యను వేధిస్తూ అంతకుముందు మాట్లాడిన కాల్‌డేటా, పంపిన వాట్సాప్ మెసేజ్‌లు అన్నింటినీ నిర్ధారించారు. పక్కాకుట్రతోనే రమ్యను శశికృష్ణ హత్య చేశాడని నిరూపించే సాక్ష్యాలను పోలీసులు న్యాయస్థానం ముందుంచారు. చకచకా కొలిక్కి.. రమ్య హత్య కేసును పోలీసులు దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కేంద్ర హోం శాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉండగా, ఈ కేసులో కేవలం వారం రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేయడం విశేషం. దిశ కేసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం కేసు సత్వర విచారణకు దోహదపడింది. గతంలో మహిళలపై దాడుల కేసుల్లో విచారణ ఏళ్ల తరబడి సాగేది. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఇతర పోలీసు కేసులతోపాటు ఈ కేసులను కూడా వాదించాల్సి వచ్చేది. దాంతో పని భారంతో తరచూ వాయిదాలు కోరేవారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ అడ్డంకిని తొలగించింది. దిశ కింద నమోదు చేసిన కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. దాంతో రమ్య హత్య కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రమం తప్పకుండా న్యాయస్థానంలో విచారణకు హాజరై నేరాన్ని పూర్తి ఆధారాలతో నిరూపించారు. తద్వారా హత్య జరిగిన 257 రోజుల్లోనే కోర్టు హంతకుడికి ఉరిశిక్ష విధించేలా దిశ వ్యవస్థ తన సత్తా చాటింది. ‘దిశ’తో దర్యాప్తు వేగవంతం ఇలా మహిళలపై దాడుల కేసుల్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర హోం శాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాలి. కాగా ఏపీ పోలీసులు 164 అత్యాచారం కేసులు, 378 లైంగిక వేధింపుల కేసుల్లో వారం రోజుల్లోనే చార్జ్షీట్లు దాఖలు చేశారు. దేశంలోనే అత్యధికంగా 854 కేసుల్లో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. 2020–21లో దేశంలోనే అత్యధికంగా 92.21 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్షీట్లు దాఖలు చేశారు. 2022లో ఇప్పటి వరకు 94.94 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే చార్జ్షీట్లు నమోదు చేశారు. -
రమ్య హత్య కేసులో సంచలన తీర్పు: కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
సాక్షి, గుంటూరు: బీటెక్ విద్యార్థి రమ్య హత్య కేసులో గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడి శశిక్రిష్టకి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. కోర్టు తీర్పుపై రమ్య కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలైన రోజు మరింత సంతోషిస్తామని రమ్య తల్లి అన్నారు. కష్టకాలంలోనూ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందని తెలిపారు. ఇంత వేగంగా కేసు పూర్తవుతుందనుకోలేదన్నారు. రమ్య సోదరి మౌనిక మాట్లాడుతూ కేసు విచారణలో ఎక్కడా ఏ చిన్న అలక్ష్యం జరగలేదన్నారు. ప్రభుత్వం మొదటి నుంచి మాకు పూర్తి అండగా నిలిచిందని తెలిపారు. ఇదిలా ఉంటే, గతేడాది ఆగస్టు 15న తనను ప్రేమించడంలేదంటూ టిఫిన్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన బీటెక్ విద్యార్థి రమ్యను శశికృష్ణ దారుణంగా పొడిచి చంపాడు. ఘటన జరిగిన 9 నెలల్లోనే కేసు విచారణ పూర్తి చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించింది. 28 మంది సాక్షుల నుంచి వాంగూల్మం సేకరించింది. నేర నిర్థారణలో సీసీ ఫుటేజీ కీలకంగా మారిందని, సెక్షన్ 302 కింద ఉరిశిక్షను కోర్టు ఖరారు చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రత్యక్ష సాక్షులతో పాటు డిజిటల్ ఎవిడెన్స్ కీలకంగా మారాయని ఎస్పీ తెలిపారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధతో కేసును పరిష్కరించారన్నారు. చదవండి: (బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు) కేసు వివరాలిలా.. ►ఆగస్టు 15, 2021న రమ్య హత్య ►సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి గుర్తింపు ►10 గంటల వ్యవధిలో అరెస్టు ►2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్ఏ నిర్ధారణ ►దిశ కింద కొత్త ల్యాబులు, సామర్థ్యం పెంపుతో అత్యంత వేగంగా ఫోరెన్సిక్ ఫలితాలు ►ఘటన జరిగిన వారంరోజుల్లో దిశ ప్రకారం ఛార్జి షీటు దాఖలు ►క్రమం తప్పకుండా కోర్టు విచారణ ►వాదనలు వినిపించిన దిశ ప్రత్యేక న్యాయవాది ►257 రోజుల్లో తీర్పు ఇచ్చిన గుంటూరు కోర్టు ►ఏప్రిల్ 29, 2022న నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు -
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య కేసులో న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. గుంటూరులో రమ్యను పాశవికంగా నడిరోడ్డుపై హత్య చేసిన కుంచాల శశికృష్ణకు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. నడిరోడ్డుపై ఒక విద్యార్థినిని అత్యంత పాశవికంగా చంపడం, ముద్దాయిని పట్టుకునే సమయంలో ఆత్మహత్యాయత్నం చేయడం, విచారణ సందర్భంగా కోర్టు నుంచి పరారు కావడానికి ప్రయత్నించడం తదితర కారణాల వల్ల ఈ కేసును అత్యంత అరుదైనది (రేరెస్ట్ ఆఫ్ ది రేర్)గా భావిస్తున్నామని న్యాయమూర్తి రాంగోపాల్ తన తీర్పులో పేర్కొన్నారు. క్రైం నెంబర్ 446/2021 అండర్ సెక్షన్ 354(డి).. 302 ఐపీసి, సెక్షన్3 (2)(విఎ)ఆఫ్ ఎస్సి–ఎస్టీ యాక్ట్ కింద నమోదైన కేసులో ఉరి శిక్ష (దీన్ని హైకోర్టు నిర్దారించాల్సి ఉంటుంది), రూ.వెయ్యి జరిమానా లేదా ఒక నెల సాధారణ జైలు శిక్ష విధించారు. 354(డి) సెక్షన్ కింద రెండేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష, ఎస్సి–ఎస్టీ కేసు సెక్షన్ 3 (2)(వి) కింద జీవిత ఖైదు, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష, ఎస్సి–ఎస్టీ కేసు సెక్షన్ 3 (2)(విఎ) కింద రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా లేదా 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పొడిచి పొడిచి హత్య గుంటూరు పరమాయకుంటలో నివాసముంటూ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న నల్లపు రమ్య(20)కు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామం వడ్డెరపాలెంకు చెందిన కుంచల శశికృష్ణ(19)తో ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం అయ్యింది. పదోతరగతి మధ్యలో మానేసి, ఆటోమొబైల్ షాపులో పనిచేసిన శశికృష్ణ.. తర్వాత తన నానమ్మ ఊరు వెళ్లి అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. రమ్యను బస్టాండ్‌లో తరచూ కలిసే శశికృష్ణ.. తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు రమ్య తిరస్కరించింది. అతని ఫోన్ నంబర్‌ను కూడా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న శశికృష్ణ గత ఏడాది ఆగస్టు 15న తన ఇంటి నుంచి టిఫిన్ కోసం హోటల్‌కు వచ్చిన రమ్యను నడిరోడ్డుపై కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. సీసీ కెమెరాలో నమోదైన హత్య దృశ్యాల ఆధారంగా శశికృష్ణను 12 గంటల్లోనే నరసరావుపేట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్వంలో పోలీసులు 36 మందిని విచారించి ఏడు రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 13న కోర్టు విచారణకు తీసుకుంది. డిసెంబర్ 31న విచారణ ప్రారంభించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్.శారదామణి 28 మంది సాక్షులను విచారించారు. హత్యకు సంబంధించి కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని, ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు ఈ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నేతృత్వంలో అన్ని సాక్ష్యాలను సేకరించారు. ఆఖరుకు డీఎన్ఎ టెస్ట్ కూడా చేయించారు. సాక్షులు అందరూ సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పారు. మంగళవారంతో వాదనలు పూర్తి అయ్యాయి. శుక్రవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో న్యాయవాదులు, ప్రజా సంఘాలు, మీడియాతో కోర్టు ఆవరణ కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 12 గంటలకు కోర్టు మొదలవ్వగానే.. శశికృష్ణ దోషిగా నిర్ధారణ అయ్యిందని, మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువరిస్తానని న్యాయమూర్తి ప్రకటించారు. సరిగ్గా 2.30 గంటలకు దోషికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. అనంతరం భారీ బందోబస్తు నడుమ ముద్దాయిని జైలుకు తరలించారు. కాగా, గుంటూరు జిల్లా చరిత్రలో విద్యార్థినిపై హత్య కేసులో ఉరిశిక్ష పడటం ఇది రెండోసారి. 1999లో జెకేసీ కళాశాలలో సాయిలక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థినిని సుభాని అనే వ్యక్తి కత్తితో నరికి చంపాడు. ఆ కేసులోనూ దోషికి ఉరి శిక్ష పడింది. అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వం రమ్య హత్య జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. నిందితులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. అప్పటి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర ప్రజా ప్రతినిధులు రమ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ప్రకటించారు. రెండో రోజే ముఖ్యమంత్రి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు రమ్య తల్లి నల్లపు జ్యోతికి అందించారు. అదే నెల 20వ తేదీకల్లా రమ్య తల్లికి నవరత్నాలు – పేదలందరికి ఇల్లు పథకం కింద గుంటూరులో ఇంటి పట్టా అందించారు. పోస్టుమార్టం, ఛార్జ్‌షీట్ వేసే దశలో అమె తల్లికి మరో రూ.8,25,000 ఇచ్చారు. ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు చెల్లించారు. రమ్య సోదరి నల్లపు మౌనికకు సెప్టెంబర్ 16న రెవిన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చారు. అప్పటికి మౌనికకు డిగ్రీ పూర్తి కాకపోవడంతో ఐదేళ్లలోగా డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించింది. వారు కోరిన విధంగా వారి సొంత గ్రామమైన అమృతలూరు మండలం యలవర్రులో కోటీ 61 లక్షల 25 వేల 300 రూపాయల ఖర్చుతో ఐదు ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి రమ్య తల్లి పేరున రిజిస్టర్ చేశారు. ప్రభుత్వ స్పందనను జాతీయ ఎస్సీ కమిషన్ కొనియాడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ కేసులో ప్రభుత్వం స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఆగష్టు 15న నా కుమార్తె హత్యకు గురైందని తెలిసి సృహ కోల్పోయాను. తర్వాత ఎస్పీ వచ్చి ధైర్యం చెప్పారు. దిశ డీఎస్పీ రవికుమార్ నాతో వివరాలు సేకరించారు. సీఎం ఆదేశాల మేరకు దోషిని వెంటనే పట్టుకుంటామన్నారు. ఆ మాట నిలుపుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదలుకుని పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరూ మాకు వెన్నంటి ఉండి అండగా నిలిచారు. ఆ సమయంలో ఇప్పుడు మంత్రిగా ఉన్న మేరుగ నాగార్జున పరామర్శించి, మరింత ధైర్యం చెప్పారు. న్యాయస్థానమంటే ఎరుగని మాకు ప్రత్యేక పీపీ శారదామణి సొంత మనిషిగా భావించి సహకరించారు. ఇవాళ దోషికి ఉరి శిక్ష విధించడంతో మాకు ఊరట లభించింది. మాకు సహకరించిన ప్రభుత్వం, పోలీసులు, దళిత ప్రజా సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు – జ్యోతి, హత్యకు గురైన రమ్య తల్లి సీఎంతో మాట్లాడాకే ధైర్యం వచ్చింది మా అక్కను చంపిన వాడిని గంటల వ్యవధిలోనే గుర్తించి పట్టుకున్నారు. ఈ కేసులో మాకు న్యాయం జరుగుతుందని తొలుత భావించలేదు. సీఎం జగన్మోహన్రెడ్డి వద్దకు వెళ్లే ముందు కూడా న్యాయం జరుగుతుందని పెద్దగా అనిపించలేదు. అయితే సీఎంతో మాట్లాడిన తర్వాతే ధైర్యం వచ్చింది. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం దగ్గరుండి అన్నీ తానై చూసుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు, న్యాయస్థానం, ప్రజాప్రతినిదులు మాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. – మౌనిక, హత్యకు గురైన రమ్య సోదరి ఈ తీర్పుతో మహిళలకు భరోసా గత ఏడాది ఆగస్టు 15న బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకు గురవ్వగానే ఘటనా స్థలాన్ని పరిశీలించాం. అనంతరం జీజీహెచ్‌కు వెళ్లి రమ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పాం. హత్య చేసిన యువకుడిని సాంకేతిక ఆధారాలతో గుర్తించి, పది గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశాం. సాక్ష్యాలు, సీసీ పుటేజీ, వేలి ముద్రలు, డీఎన్ఏ తదితర ఆధారాలు సేకరించాం. పోలీస్, ఫోరెనిక్స్, న్యాయస్థానం.. ఒక బృందంగా పని చేశాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సైతం పోలీసుల పనితీరును అభినందించింది. ఈ తీర్పుతో మహిళలకు భరోసా కలుగుతుందనడంలో సందేహం లేదు. – కె.ఆరిఫ్‌హఫీజ్, గుంటూరు జిల్లా ఎస్పీ ఈ శిక్షకు అతను అర్హుడే రమ్య హత్య కేసుపై జిల్లా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. కోర్టు ట్రయల్ జరుగుతున్న క్రమంలో పలువురు సాక్షులను విచారించాం. సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం దోషికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. హత్యకు పాల్పడిన అతను ఈ శిక్షకు పూర్తిగా అర్హుడే. – శారదామణి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణ శిక్ష సరికాదు క్షణికావేశంలో చేసిన తప్పుకు మరణ శిక్ష సరికాదు. ఘటన జరిగిన రోజు నుంచి నా కుమారుడు ఏడుస్తూనే ఉన్నాడు. తప్పు చేశానని పశ్చాత్తాప పడుతున్నాడు. నా కుమారుడికి ఉరి శిక్ష వేస్తే రమ్య తిరిగి వస్తుందనుకుంటే ఆ శిక్ష వేయొచ్చు. కోర్టు తన నిర్ణయాన్ని పునరాలోచించాలి. – భూలక్ష్మి, శశికృష్ణ తల్లి ‘దిశ’ను విమర్శిస్తున్న వారికి ఇదో చెంపపెట్టు ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పు దిశ చట్టంపై విమర్శలు చేస్తున్న వారికి చెంపపెట్టు. దేశంలో ఎక్కడాలేని రీతిలో పిల్లలు, మహిళల రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టానికి రూపకల్పన చేశారు. పార్లమెంట్ ఆమోదించడంలో జాప్యం వల్ల దిశ ఇంకా చట్ట రూపం సంతరించుకోలేదు. ఆ చట్టం స్ఫూర్తితో దిశ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. కోటి మంది ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్న మహిళలు యాప్‌లో సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కోర్టు తీర్పు చరిత్రాత్మకం విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ గుంటూరు కోర్టు తీర్పునివ్వడం చరిత్రాత్మకం. హత్య జరిగిన 10 గంటల్లోపే నిందితుణ్ణి అరెస్ట్ చేసి.. 24 గంటల్లోనే చార్జిషీట్ దాఖలు చేశాం. కోర్టు తీర్పుతో ఇలాంటి ఘటనలకు పాల్పడే మృగాలకు వణుకు పుడుతుంది. ఈ తీర్పు ఇప్పుడు దిశ చట్టం అవసరాన్ని మరింత గుర్తు చేస్తోంది. – తానేటి వనిత, హోంమంత్రి ‘దిశ’ గొప్పదనమిది విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు గుంటూరు కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని స్వాగతిస్తున్నాం. 9 నెలల్లోనే నిందితుడికి ఉరి శిక్షపడేలా చేయడం సీఎం వైఎస్ జగన్ పరిపాలన గొప్పదనం. దిశ చట్టాన్ని కేంద్రం ఆమోదిస్తే.. 21 రోజుల్లోనే నిందితులకు ఉరి శిక్ష పడేలా చేయడానికి ఆస్కారం ఉండేది. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి ‘దిశ’తో సత్వర న్యాయం గుంటూరులో ఉన్మాది కత్తిపోట్లకు బలైన రమ్య హత్యకేసు నిందితునికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం హర్షణీయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ’దిశ’ బిల్లు స్ఫూర్తితో సత్వర న్యాయానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ కేసు విచారణ, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని జాతీయ ఎస్సీ కమిషన్ సైతం మెచ్చుకుంది. మహిళలపై అకృత్యాలకు పాల్పడే మృగాళ్లకు ఈ కేసు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. – వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్, మహిళా కమిషన్ మృగాళ్లకు కనువిప్పు రమ్య హత్య కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు మృగాళ్లకు కనువిప్పు అవుతుంది. ఎవరైనా మహిళల జోలికి వస్తే తమ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. రమ్య కేసును దిశ చట్టం రూపకల్పనలో పేర్కొన్నట్టుగా వేగవంతంగా చర్యలు చేపట్టి శిక్ష పడేలా చేశారు. – విడదల రజని, వైద్యారోగ్య శాఖ మంత్రి -
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు తీర్పు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసు తీర్పు శుక్రవారం వెలువడనుంది. తనను ప్రేమించడంలేదని వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన కుంచాల శశికృష్ణ (19) ఉదయం 9.40కి టిఫిన్ తీసుకురావడం కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమ్యతో గొడవపడి కత్తితో ఎనిమిదిసార్లు పొడిచాడు. ప్రభుత్వాస్పత్రికి తరలించేలోగా రమ్య చనిపోయింది. ఈ హత్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితుడు శశికృష్ణను అదేరోజు రాత్రి నరసరావుపేట సమీపంలోని మొలకలూరులో అరెస్టు చేసిన పోలీసులు ఆరురోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానంలో గత ఏడాది డిసెంబర్ ఏడు నుంచి సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ఈ నెల రెండున మొదలైన వాదనలు మంగళవారం ముగిశాయి. శుక్రవారం తీర్పు చెప్పనున్నట్లు న్యాయాధికారి రామ్‌గోపాల్ ప్రకటించారు. రమ్య కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వం హత్య జరిగిన రెండోరోజే సీఎం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా రూ.పది లక్షల్ని రమ్య తల్లి జ్యోతికి అప్పటి హోంమంత్రి సుచరిత అందించారు. ఆ కుటుంబానికి మూడునెలలపాటు నిత్యావసరాలకు నగదు ఇచ్చారు. అదేనెల 20వ తేదీకల్లా రమ్య తల్లికి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద గుంటూరులో ఇంటిస్థలం పట్టా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం మరో రూ.8,25,000 అందజేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు ఇచ్చింది. రమ్య సోదరి మౌనికకు సెప్టెంబర్ 16న రెవెన్యూ విభాగంలో ఉద్యోగం ఇచ్చింది. ఆమె ఐదేళ్లలోగా డిగ్రీ పూర్తిచేసుకునే అవకాశం కల్పించారు. వారు కోరిన విధంగా వారి సొంత గ్రామమైన అమృతలూరు మండలం యలవర్రులో రూ.1,61,25,300తో ఐదెకరాల పట్టా భూమి కొనుగోలు చేసి రమ్య తల్లి పేరున రిజిస్టర్ చేసింది. రమ్య హత్యకేసు విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరు బావుందని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్‌చైర్మన్ అరుణ్‌హల్దార్ కొనియాడారు. హత్య అనంతరం గుంటూరు వచ్చిన కమిషన్ బృందం.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీ ప్రభుత్వం చాలా పాజిటివ్‌గా స్పందించిందని కొనియాడింది. -
పలాస అమ్మాయి జాక్‌పాట్.. రూ.44లక్షల ప్యాకేజీతో ఉద్యోగం
సాక్షి, విశాఖపట్నం: బీటెక్ చదువుతుండగానే ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో భారీ ఆఫర్‌ను చేజెక్కించుకుందో విద్యార్థిని. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సింహాచలం, సుభాసితిల కుమార్తె కొంచాడ స్నేహకిరణ్ అనే విద్యార్థిని విశాఖపట్నంలోని అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ కళాశాలలో అమెజాన్ సంస్థ 2021 డిసెంబర్లో క్యాంపస్ సెలక్షన్ నిర్వహించింది. అందులో స్నేహకిరణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఏడాదికి రూ.44 లక్షల జీతంతో ఉద్యోగం సాధించింది. ఇదిలా ఉండగా, విద్యార్థిని తండ్రి జీడిపప్పు పరిశ్రమలో గుమాస్తాగా పనిచేస్తున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని స్నేహకిరణ్ నిరూపించింది. కూతురు సాధించిన విజయంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (ఆర్ఆర్ఆర్ సినిమా భయం.. థియేటర్లో ఇనుప కంచెలు) -
Hyderabad: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. తల్లిదండ్రులు వరంగల్‌లో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూకట్పల్లి వివేకానంద నగర్లో నివసించే బత్తిని సోహన్ సిద్ధ అనే బీటెక్ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు వరంగల్‌లో బంధువుల పెళ్లికి వెళ్లొచ్చేసరికి సిద్ధ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (హోటల్లో స్నేహితురాలితో ఏకాంత వీడియో.. ఇంటర్నెట్లో ప్రత్యక్షమవడంతో) -
సిద్ధూ.. ఒక్కసారి చూడు బాబూ..
వెంకటాచలం(నెల్లూరు జిల్లా): పెద్ద చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న కన్న కొడుకు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు ఆదూరు శీనయ్య – అపర్ణ తల్లడిల్లిపోయారు. కందలపాడు సమీపంలో సాగునీటి కాలువలో ఈతకు వెళ్లి మృతిచెందిన మండలంలోని కనుపూరుకు చెందిన బీటెక్ విద్యార్థి ఆదూరు సిద్ధూ, తిరుపతికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి పర్నా అనుదీప్ మృతదేహాలకు శుక్రవారం ఉదయం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. దీంతో అనుదీప్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు తిరుపతికి తీసుకెళ్లగా సిద్ధూ మృతదేహాన్ని బంధువులు శుక్రవారం 12 గంటలకు కనుపూరుకు తీసుకువచ్చారు. చదవండి: రహస్యంగా భర్త రెండో పెళ్లి.. మళ్లీవచ్చి తీసుకెళ్తానని చెప్పి.. గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు కనుపూరు గ్రామానికి చెందిన ఆదూరు శీనయ్య – అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సిద్ధూ బీటెక్ చదువుతుండగా, రెండో కుమారుడు హర్ష నెల్లూరు నగరంలోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. వ్యవసాయ కుటుంబమైనప్పటికీ తమ ఇద్దరు కొడుకులను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులుగా చూడాలని తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ విధి వికటించి పెద్ద కుమారుడు సిద్ధూ మరణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. సిద్ధూ మృతదేహం ఇంటికి చేరుకోగానే తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల దుఃఖానికి అంతేలేదు. సిద్ధూ ఒక్కసారి నన్ను చూడు బాబూ.. అంటూ ఆ తల్లి పడిన ఆవేదన చూసిన వారిని కంటతడి పెట్టించింది. ఎమ్మెల్యే కాకాణి పరామర్శ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఆదూరు సిద్ధూ మృతిచెందాడని తెలియడంతో వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం కనుపూరుకు వెళ్లి సిద్ధూ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. -
అనుమానాస్పదంగా విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్: బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూలు జిల్లా మాదవన్పల్లికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అరుణ దంపతుల కుమారుడు శివనాగులు బాచుపల్లిలోని వీఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీటెక్ సీఎస్ఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 20 రోజుల క్రితం వీఎన్ఆర్ కాలే జీæ హాస్టల్లో చేరాడు. కాగా గురువారం ఉదయం శివనాగులు హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని హాస్టల్ నిర్వాహకులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాచుపల్లిలో నివాసముండే శివనాగులు మేనమామ ప్రకాష్ హుటాహుటిన హా స్టల్ దగ్గరకు వచ్చాడు. అయితే సుమారు 30 నిమిషాలు అతన్ని హాస్టల్ సిబ్బంది లోపలికి అనుమతించ లేదు. అప్పటికే మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ, బీజేపీ నాయకులు కాలేజ్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అయితే పోలీసులకు సంఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్లో తనకు జీవితంపై విరక్తి వచ్చిందని, అందుకే తాను ఆత్మహత్య చేసు కుంటున్నానని, కుటుంబ సభ్యులు తనను క్షమించాలని కోరినట్లు అందులో ఉంది. మృతుడి తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, ఇతర ఎలాంటి సమస్యలు లేవని, సుసైడ్ నోట్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ తమ బిడ్డది కాదని పేర్కొన్నారు. విద్యార్థి సంఘాల ధర్నా.. లాఠీ చార్జ్.. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు విద్యార్థి మృతిపై అనుమానాలున్నాయంటూ కాలేజ్ గేట్ ముందు ధర్నా చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న వారిపై లాఠీ చార్జ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాలేజ్ యాజమాన్యం కనీసం విద్యార్థి మృతికి సంతాపం కూడా తెలపక పోవడం సిగ్గుచేటని ఏబీవీపీ నాయకులు అన్నారు. మధ్యాహ్నం తరువాత స్పందించిన కాలేజ్ యాజమాన్యం సెలవు ప్రకటించింది. లాఠీ చార్జిపై శ్రీశైలంగౌడ్ ఆగ్రహం.. విద్యార్థి అనుమానాస్పద మృతిపై నిరసన తెలిపిన ఏబీవీపీ నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలంగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవి ధంగా మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, నిజాంపేట్ మున్సి పల్ అ«ధ్యక్షుడు సతీష్‌లు పోలీసులు, కళాశాల యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై మండి పడ్డారు. అదే విధంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్, మండల కార్యదర్శి శ్రీనివాస్‌లు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి వరకు హాస్టల్లో ఫ్రెషర్స్ పార్టీ.. వీఎన్ఆర్ హాస్టల్లో బుధవారం రాత్రి ఫ్రెషర్స్ పార్టీ జరిగినట్లు సమాచారం. ఆ పార్టీ అర్ధరాత్రి వరకు కొనసాగిందని, ఈ నేపథ్యంలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. లేదా ఇతరాత్రా కారణాలేమైనా ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడితే అసలు విషయం బయటపడే అవకాశముంది. -
నెల్లూరు జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్థి దారుణ హత్య?
కావలి( నెల్లూరు జిల్లా): కావలి రూరల్ పోలీస్‌స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ముసునూరు టోల్గేట్ సమీపంలో హైవే పక్కనే చెట్ల మధ్య వింజమూరుకు చెందిన బీటెక్ విద్యార్థి కంచర్ల రాజేందర్ (20)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి తగులబెట్టిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ కథనం మేరకు.. టోల్గేట్ నుంచి తుమ్మలపెంట వెళ్లే మార్గంలో హైవే పక్కనే చిల్లచెట్లలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు హైవే అథారిటీ సిబ్బంది సమాచారం అందించారు. చదవండి: వీడిన మిస్టరీ: ‘కోరిక’ తీర్చాలని బలవంతం చేయడంతో.. మృతదేహం వద్ద లభించిన సగం కాలిన సెల్‌ఫోన్‌లోని సిమ్‌కార్డ్ ఆధారంగా వివరాలు సేకరించారు. అతను వింజమూరుకు చెందిన కంచర్ల రాజేందర్‌గా తెలిసింది. కావలి విట్స్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న రాజేందర్ గురువారం ఉదయం కాలేజీకని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కళాశాలలో విచారించగా అసలు కాలేజీకే రాలేదని తెలిపారు. ఈ క్రమంలోనే రాజేందర్ మృతదేహం ముసునూరు టోల్గేట్ సమీపంలో లభించింది. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. చదవండి: అమ్మా నేను చనిపోతున్నా.. నన్ను క్షమించు.. -
ప్రేమ, పెళ్లి అంటూ మోసం: ఆటో డ్రైవర్‌పై బీటెక్ స్టూడెంట్ ఫిర్యాదు
హయత్‌నగర్: ప్రేమ, పెళ్లి అంటూ వెంట తిప్పుకొని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఓ యువకుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని (22) చంపాపేట్‌కు చెందిన రబ్లావత్ శంకర్(24) అనే ఆటో డ్రైవర్‌ను ప్రేమించింది. రెండేళ్ల పాటు తనను వెంట తిప్పుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోనని అంటున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత యువతి బుధవారం సాయంత్రం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు యువకుడి ఆచూకీ కోసం యత్నిస్తున్నారు. -
బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
పెనమలూరు: కృష్ణా జిల్లాలో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చాట్రాయి మండలం సూరంపాలెంకు చెందిన ఎం.విజయ్‌కుమార్ కుమార్తె రోహిత (21) విజయవాడ కానూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కళాశాలకు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఆమె సోమవారం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తనకు ఏడాదిగా పరిచయమున్న అదే కళాశాలకు చెందిన విద్యార్థితో మనస్పర్థలు వచ్చాయని, తనతో అతను మాట్లాడటం లేదని ఆవేదన చెందింది. దిగులు పడవద్దని తాము వచ్చి మాట్లాడతామని తల్లిదండ్రులు ఆమెకు ధైర్యం చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నా ఆమె తీయలేదు. దీంతో అనుమానంతో కుటుంబసభ్యుల్లో ఒకరు మంగళవారం రాత్రి హాస్టల్‌కు వచ్చి రోహిత గదిని చూడగా అక్కడ ఆమె ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. విషయం తల్లిదండ్రులకు చెప్పగా వారు చాట్రాయి నుంచి కానూరు వచ్చారు. హాస్టల్ గదిలో రోహిత మృతదేహాన్ని చూసి అనుమానం వ్యక్తం చేస్తూ బుధవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సల్మా! నన్ను క్షమించు.. మీకు ఏమీ చేయలేకపోయా' -
పేర్లు మార్చి.. ప్రేమ పేరుతో నమ్మించి..
కర్నూలు (టౌన్): వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పేర్లు మార్చుకుంటూ.. యువతులను ప్రేమ పేరుతో నమ్మించి మోసగిస్తున్న బీటెక్ విద్యార్థిని కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలివీ.. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం తగ్గపర్తి గ్రామానికి చెందిన అన్వేష్ అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోషల్ మీడియాలో యువతుల మొబైల్ నంబర్లు తెలుసుకుని వారిని ట్రాప్‌లో పడేసి ప్రేమిస్తున్నట్లు నమ్మిస్తున్నాడు. అన్వేష్ అనే వ్యక్తిగా ఒకరితో, భరత్ అనే పేరుతో మరో అమ్మాయితో, చరణ్ అనే పేరుతో ఇంకో అమ్మాయితో మాట్లాడుతూ ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక అమ్మాయికి వివాహం కాగా, ఆమె ఫొటోలను వాట్సాప్‌లో ఆమె కుటుంబ సభ్యులకు పంపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితులు కర్నూలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఒకటో పట్టణ సీఐ కళా వెంకటరమణ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. నిందితుడు అన్వేష్‌ను కర్నూలు కలెక్టరేట్ వద్ద గుర్తించి అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఐ హెచ్చరించారు. -
డిగ్రీ చేశానని నమ్మించి నిశ్చితార్థం
వైరా రూరల్: తనకు కాబోయే భర్తకు డిగ్రీ పూర్తి కాలేదని వేదికపైనే నిశ్చితార్థానికి అభ్యంతరం తెలిపింది ఓ యువతి. ఖమ్మం జిల్లా వైరా మండలం వల్లాపురంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వల్లాపురానికి చెందిన బీటెక్ చదువుకున్న ఓ యువతికి ఈర్లపూడిలోని భాగ్యాతండాకు చెందిన ఇక్బాల్‌తో వివాహం కుదిరింది. ఇక్బాల్ డిగ్రీ చదివినట్లు చెప్పారు. ఆదివారం యువతి ఇంటివద్ద నిశ్చితార్థం ఏర్పాటు చేయగా ఇక్బాల్ డిగ్రీ మధ్యలోనే ఆపేసినట్లు తెలిసింది. దీంతో యువతి తనను మోసం చేశాడంటూ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. ఈ సందర్భంగా ఘర్షణలో యువతి సోదరుడు జాన్‌పాషాకు తీవ్ర గాయాలయ్యాయి. -
లోకేష్ ఏం మాట్లాడుతున్నారో.. ఆయనకే అర్థం కాదు
తూర్పుగోదావరి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసును టీడీపీ రాజకీయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిశా చట్టం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే టీడీపీ నేతలు ఎప్పుడైనా పట్టించుకున్నారా..అని ప్రశ్నించారు. నారా లోకేష్ ఏంమాట్లాడుతున్నారో.. ఆయనకే అర్థంకాదని మండిపడ్డారు. -
‘ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దళితుడికి అన్యాయం జరగదు’
సాక్షి, తాడేపల్లి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని ఏపీ సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సునీల్ కుమార్ తెలిపారు. ఘటన జరిగిన 12 గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం కూడా ప్రభుత్వం అందించిందని వెల్లడించారు. అయితే నారా లోకేష్‌బాబు, ఆ పార్టీ నేతలు రాజకీయ ఉనికి కోసం ఆందోళనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలకు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని అన్న చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడని మండిపడ్డారు. అప్పుడు లేవని ఆ పార్టీలోని దళిత నాయకుల నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. ఆ నాడు చంద్రబాబు సహా టీడీపీ నేతలు దళితుల గురించి మాట్లాడిన మాటలు గుర్తులేవా అని, అప్పుడు ఈ దళితుల నోళ్లు ఎందుకు లేవలేదని విమర్శించారు. చంద్రబాబు మెప్పు కోసం పని చేయవద్దని టీడీపీ నాయకులకు సునీల్ కుమార్ హితవు పలికారు. దళితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దళితుడికి అన్యాయం జరగదని భరోసానిచ్చారు. టీడీపీ హయాంలో దళితుల్లో కేవలం ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే వైఎస్ జగన్ 5 మందికి పైగా మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని దళితులంతా జగనన్న వెంటే ఉన్నారని, టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా మమ్మల్ని జగనన్నతో విడదీయలేరని స్పష్టం చేశారు. చదవండి: రమ్య హత్యకు ముందు రెక్కీ పాక్‌లో దారుణం: మహిళా టిక్‌టాకర్‌పై 300 మంది దాడి! -
గుంటూరులో టీడీపీ నేతల శవ రాజకీయం
-
టీడీపీ శవరాజకీయాలు
సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు ఈస్ట్: తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. గుంటూరులో ఆదివారం హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహానికి సోమవారం ఉదయం పంచనామా పూర్తయింది. మృతురాలి కుటుంబానికి రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, కలెక్టర్ వివేక్‌యాదవ్ ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కు అందజేసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ, మేయర్ మనోహర్‌నాయుడు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము తదితరులు రమ్య తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం రమ్య మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రమ్య మృతదేహానికి నివాళులర్పించడానికి మాజీ మంత్రి లోకేశ్ వస్తున్నారని, ఆయన వచ్చేవరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచాలని టీడీపీ నేతలు ఆనంద్‌బాబు, ఆలపాటి రాజా, శ్రావణ్‌కుమార్, నసీర్ అహ్మద్, కార్యకర్తలు అంబులెన్సు ముందు బైఠాయించారు. వారించిన పోలీసులపై తిరగబడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తపేట ఎస్ఐ నరసింహపై దాడిచేశారు. అంబులెన్స్‌కు దారిచూపే ప్రయత్నం చేసిన వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. జీజీహెచ్ నుంచి రమ్య మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్సును అడ్డుకున్న టీడీపీ శ్రేణులు అక్కడా అంతే.. మృతురాలి ఇంటి వద్ద కూడా టీడీపీ కార్యకర్తలు ఇదే రీతిన ప్రవర్తించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నించారు. లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, శ్రావణ్‌కుమార్, ఆలపాటి రాజా, ఆనంద్‌బాబు మృతురాలి ఇంటి ముందు నిలబడి నినాదాలు చేశారు. అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను లోకేశ్ బృందం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురు పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదని పేర్కొన్నారు. రమ్య ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు సృష్టించటమేగాక పోలీసు విధులకు ఆటంకం కలిగించిన లోకేశ్, మరో 32 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను అర్బన్, రూరల్ ఎస్పీలు ఆరీఫ్ హఫీజ్, విశాల్ గున్నీ అరెస్టు చేసి ప్రత్తిపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. లోకేశ్‌ను విడుదల చేయాలంటూ టీడీపీ వారు ప్రత్తిపాడులో రోడ్డుపై బైఠాయించి ఎస్ఐ అశోక్‌తో వాగ్వాదానికి దిగి కవ్వించారు. పాతగుంటూరు పోలీసుస్టేషన్ సీఐ వాసు సోమవారం రాత్రి లోకేశ్‌తో పెదకాకాని పోలీసుస్టేషన్ వద్ద సంతకం చేయించుకుని పంపించారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు గుంటూరులో హత్యకు గురైన దళిత విద్యార్థిని రమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్ నుంచి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలో రమ్య హత్య జరుగుతుంటే దిశ యాప్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. గుంటూరు నడిబొడ్డునే సీసీ కెమెరాలు పనిచేయలేదంటే సీఎం జగన్‌కి మహిళల రక్షణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ నేతలపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. -
గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య
సాక్షి, గుంటూరు: కాకాని రోడ్డులో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని హత్యకు గురైంది. విద్యార్థినిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. పొట్ట, గొంతులో 6 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థిని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై అర్బన్ ఎస్పీ హఫీజ్ దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన యువతి సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్ ఓపెన్ చేస్తే హత్య కేసులో కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. -
సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ బీటెక్ విద్యార్థిని
వనపర్తి క్రైం: కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వనపర్తి పట్టణానికి చెందిన బీటెక్ సెకండియర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ మధుసూదన్ కథనం ప్రకారం.. వనపర్తి పట్టణంలోని హరిజనవాడకు చెందిన లావణ్య (21) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వింటోంది. ఆమె తండ్రి వెంకటయ్య కానాయపల్లిలోని మిషన్ భగీరథ కార్యా లయంలో సెక్యూరిటీ గార్డుగా, తల్లి ఈశ్వరమ్మ స్థానికంగా కూలి పనిచేస్తూ కూతురిని, కుమారుడిని చదివిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం కళాశాల ఫీజు కోసం లావణ్య తండ్రిని డబ్బులు అడిగింది. దీంతో ఆయన రూ.8 వేలు అప్పుగా తెచ్చి కూతురుకు ఇచ్చి పనికి వెళ్లాడు. తల్లి, తమ్ముడు కూడా బయటకు వెళ్లారు. ఈ క్రమంలో తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి మనస్థాపానికి గురైన లావణ్య ఇంట్లోనే మధ్యాహ్నం ఉరేసుకొని చనిపోయింది. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలాఉండగా, ఆత్మహత్యకు ముందు లావణ్య సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్టు సమాచారం. -
మరొకరితో చనువుగా ఉంటోందని బీటెక్ విద్యార్థినిపై దారుణం
సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: మరొకరితో చనువుగా ఉంటోందని అక్కసుతో ఓ బావ మరదలిని గొంతు నులిమి చంపేసిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం వివరాలు.. హబీబ్‌నగర్‌కు చెందిన సోమేశ్వరరావు, నీలవేణి దంపతుల కుమార్తె మంజుల (19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరి బంధువుల కుమారుడు వరుసకు బావ అయిన భూపతి (21) ఏవీబీపురంలో నివాసముంటున్నాడు. వీరిరువురూ స్నేహంగా ఉండేవారు. ఇటీవల మంజుల మరో వ్యక్తితో చనువుగా ఉంటూ ఫోన్లో మాట్లాడుతోందని భూపతి రెండు రోజుల క్రితం గొడవకు దిగాడు. ఈ నెల 10న తన ఇంటికి మంజులను రప్పించుకొని ఆమె గొంతు నులిమి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నీటిసంప్‌లో పడేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని భావించాడు. కానీ.. కాసేపటికి భూపతి తన నిర్ణయాన్ని మార్చుకొని అదేరోజు పోలీసులకు లొంగిపోయాడు. -
విషాదం: ఒక్కసారిగా కృష్ణాలో దూకిన బీటెక్ విద్యార్థి
సాక్షి, తాడేపల్లి: స్నేహితులతోపాటు సరదాగా కృష్ణానదికి వచ్చిన బి.టెక్. విద్యార్థి అనంత లోకాలకు వెళ్లడంతో స్నేహితులు, విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ కృష్ణలంకకు చెందిన బి.టెక్ 4వ సంవత్సరం చదివే సాయి (20), అవినాష్ అనే స్నేహితుడు, మరో ఐదుగురితో కలిసి ఉండవల్లి-అమరావతి కరకట్ట వెంట ఉన్న ఆక్వా డెవిల్స్‌లోకి ఈతకు వెళ్లారు. అవినాష్, మరో ఐదుగురు కృష్ణానదిలోకి దిగి ఈత కొడుతుండగా సాయి గట్టు మీద నుంచొని ఉన్నాడు. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ స్నేహితులు ఈత కొట్టడం చూసి ఒక్కసారిగా గట్టు మీద నుంచి కృష్ణానది నీటిలోకి దూకాడు. దూకిన సాయి మునిగిపోయి కనిపించకపోవడంతో ఆక్వా డెవిల్స్ సిబ్బంది వెదికి, బయటకు తీయగా సాయి మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సాయి తల్లిదండ్రులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. సాయి మృతదేహాన్ని స్నేహితులు విజయవాడ తీసుకువెళ్లారు. సాయి వారి తల్లిదండ్రులకు ఏకైక కుమారుడిగా తెలియవచ్చింది. నలుగురు జూదరుల అరెస్ట్ చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కొత్తూరు తాడేపల్లిలో పేకాట ఆడుతున్న నలుగురిని కొత్తపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తూరు తాడేపల్లిలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో సెక్టార్ ఎస్ఐ శేఖర్‌బాబు పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి రూ. 28 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. శానిటైజర్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు చిట్టినగర్: నిబంధనలకు విరుద్దంగా శానిటైజర్లు విక్రయిస్తున్న వ్యక్తిని కొత్తపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కొత్తపేటకు చెందిన పి. మురళి కొంతకాలంగా శానిటైజర్‌ను చిన్నచిన్న బాటిల్స్‌గా చేసి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న సెక్టార్ ఎస్ఐ విశ్వనాథ్ నిందితుడిని అరెస్టు చేసి 80 బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం చిట్టినగర్: పాముల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు కాలువలో ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. కాలువలో సుమారు 45 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి నీటిలో కనిపించడంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమల మెట్లెక్కుతూ బీటెక్ విద్యార్థి మృతి
తిరుమల: శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడకమార్గంలో తిరుమలకు వస్తున్న భక్తుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్ధి రాహుల్ కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనార్ధం కాలినడకన తిరుమలకు బయలుదేరాడు. గాలిగోపురం వద్ద ఆయాసం రావడంతో శ్వాస ఆడలేదు. టీటీడీ సిబ్బంది ప్రథమ చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఊపిరి అందక రాహుల్ మృతి చెందాడు. చదవండి: వివాహేతర సంబంధం: తండ్రీ కొడుకుల ఆత్మహత్య ఎక్స్‌లేటర్‌పై కాలుతీసి బ్రేక్‌పై మోపడంతో... -
జూబ్లీహిల్స్: ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం
బంజారాహిల్స్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రహమత్‌నగర్ సమీపంలోని కార్మికనగర్‌లో నివసించే విద్యార్థిని (23) బీకాం చదువుతోంది. శుక్రవారం అదే ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి రాజు(23) ఆమెతో మాట్లాడాలని, పెళ్లి చేసుకుంటానని ఇంటికి పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: విడాకులు కోరిన భార్య.. కడుపుమీద కారు ఎక్కించి హత్య) -
సెల్ఫీ వీడియో: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, పెనుగంచిప్రోలు (కృష్ణా): ఒక్కగానొక్క కుమారుడు.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పెద్ద చదువులు చదివిస్తున్నారు. కానీ ఓ పరీక్ష ఫెయిలయ్యానన్న మనస్థాపంతో ఆ కుమారుడు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కడపుకోతను మిగిల్చాడు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. వివరాలు... పెనుగంచిప్రోలుకు చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసి దంపతుల ఏకైక కుమారుడు తిరుమలేష్(23) ఏలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు రాసే ప్రవేశ పరీక్షలో క్వాలిఫై కాలేదని మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. (చదవండి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం) ఈ క్రమంలో సోమవారం సెల్ఫీ వీడియో తీసుకుని కళాశాల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. "అమ్మా... నేను ఫెయిల్యూర్‌గా మిగిలిపోయా. ఎంత ప్రయత్నించినా ముందుకు సాగలేక పోతున్నా.. చదువులో ముందుకు వెళ్లలేకపోతున్నానమ్మా. నాలాంటి ఎదవకు జన్మనిచ్చి మీరు తప్పు చేశారమ్మా.. మీ ఆశల్ని నెరవేర్చలేక పోతున్నందుకు బాధగా ఉంది. మీరు కష్టపడి పెంచిన ఈ జీవితానికి ఇక సెలవమ్మా, నన్ను క్షమించండి" అంటూ వీడియో తీసి మిత్రులకు పంపాడు. తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తిరుమలేష్‌ను విజయవాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. (చదవండి: జీవితం నాశనం అయింది, బతికింది చాలు) -
ఆస్ట్రేలియాలో తెలంగాణ విద్యార్థిని బ్రెయిన్‌డెడ్
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన రక్షిత అనే బీటెక్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్ అయింది. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన 20ఏళ్ల రక్షిత.. సిడ్నీలోని ఐఐబీఐటీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. డిసెంబర్ 31న రక్షిత బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రక్షితకు బ్రెయిన్ డెడ్ అయినట్లు అక్కడి వైద్యులు నిర్థారించారు. ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన తమ కూతురు రోడ్డు ప్రమాదానికి గురైందని తెలిసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురి అవయవాలను దానం చేస్తున్నట్లు యువతి తల్లిదండ్రులు మల్లెపల్లి వెంకట్ రెడ్డి, అనితలు ప్రకటించారు. మాజీ సైనిక ఉద్యోగి అయిన వెంకట్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని డీఆర్డీఓలో పని చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్థులకు గూగుల్ గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ శుభవార్త అందించింది. ప్రెష్ గ్రాడ్యుయేట్స్‌కి ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్ సమ్మర్ 2021 కార్యక్రమానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులు. నిర్దేశిత ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాల పాటు ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తుకు చివరితేది డిసెంబర్ 11, 2020 అని గూగుల్ ప్రకటించింది. హైదరాబాద్, బెంగుళూర్లోని గూగుల్ క్యాంపస్‌లలో మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంటుంది. (వ్యాక్సిన్: ఒబామా, బుష్, క్లింటన్ సంచలన నిర్ణయం) అర్హతలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్టూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసునేందుకు అర్హులు. అభ్యర్థులకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా, సీ + +, పైథాన్ తెలిసి ఉండాలి. సిస్టమ్స్ సాఫ్ట్వేర్ లేదా అల్గారిథమ్‌లతో పాటుఎస్ క్యూఎల్, స్పింగ్, హైబర్ నేట్, వెబ్ సర్వీసెస్, జావా స్క్రిప్ట్ వర్క్ తెలిసి ఉండాలి. -
ఇంజనీరింగ్‌లో కొత్త కోర్సులు
టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఇది అది అనే తేడా లేకుండా.. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే విద్యా రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. దేశంలో ఇంజనీరింగ్ విద్యను పర్యవేక్షించే.. ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ).. బీటెక్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల పరిశ్రమలు..మానవ వనరులను తగ్గించుకునేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఆయా రంగాల్లో ప్రవేశ పెడుతున్నాయి. ఇవే కాకుండా వ్యాపార అభివృద్ధి సులభతరం చేసుకునే విధంగా డేటాసైన్స్ వంటి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి తరుణంలో ఆయా రంగాల్లో సరిపడ సంఖ్యలో సమర్థవం తమైన నిపుణులు ఉన్నారా.. అంటే లేరనే చెప్పాలి. ఈ కొరతను అధిగమించడానికి గత కొంతకాలంగా ఆన్లైన్ మార్గాల ద్వారా ఏఐ,డేటాసైన్స్ లాంటి కోర్సులో పలు అవసరాలకు అనుగుణంగా శిక్షణన అందిస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ విద్యలో ఇలాంటి నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. తెలుగు రాష్టాల్లోనూ పలు కాలేజీల్లో బీటెక్ స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డేటా సైన్స్ నైపుణ్యం కలిగిన డేటా సైంటిస్టులను తయారు చేయడానికి ఇంజనీరింగ్ విద్యలో డేటాసైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. రంగం ఏదైనా.. జరగబోయే పరిణామాలను ముందే అంచనా వేసి.. కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందించేదే.. డేటాసైన్స్. విద్య, వైద్యం, వ్యాపార, సామాజిక ఆర్థిక, రాజకీయం.. ఇలా రంగం ఏదైనా గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల సమాచారాన్ని తెలుసుకొని.. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే.. ఆయా రంగాల్లో విజయం సా«ధించడానికి వీలుంటుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పే వారే.. డేటా సైంటిస్టులు. డేటా విశ్లేషణ: డేటాసైన్స్.. గణాంక సహిత సమాచారాన్ని విశ్లేషించడానికి ఉపయోగించే సాధనం. అల్గారిథం, మెషిన్‌లెర్నింగ్ సిద్ధాంతాలను ఉపయోగించి.. వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏ సంవత్సరంలో ఎంత మొత్తంలో అమ్మకాలు జరిగా యి. ఆ సమయంలో డిమాండ్ –సప్లయ్ ఏ విధంగా ఉంది. ప్రస్తుతం అంత డిమాండ్ ఎందుకు లేదు. ఆయా వస్తువులపై వినియోగదారుల అభిప్రాయం ఏంటి? కొనుగోలు శక్తిలో వచ్చిన మార్పులు ఏంటి?!వంటివి అంచనా వేసి చెబుతారు. గతంలో ఉన్న డిమాండ్‌ను ప్రస్తుత డిమాండ్‌తో పోల్చి విశ్లేషించి..రానున్న కాలంలో ఎంత డిమాండ్ ఉండవచ్చు..ఆ సమయానికి వినియోగ దారులకు అందుబాటులో ఉంచాల్సిన ప్రొడక్ట్స్ సంఖ్యతో సహా కచ్చితమైన లెక్కలతో వివరిస్తారు డేటా నిపుణులు. కోర్సు స్వరూపం: డేటాసైన్స్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు.. డేటావిజువలైజర్స్, డేటాసైన్స్ కన్సల్టెంట్, డేటా ఆర్కిటెక్చర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఇంజనీరింగ్ సహా వివిధ రకాల ఉద్యోగాలు పొందవచ్చు. వేతనాలు: డేటాసైన్స్ వి«భాగంలో ఉద్యోగాలు దక్కించుకున్న వారికి వార్షిక వేతనం దాదాపు రూ.5లక్షల వరకు ఉంటుంది. నైపుణ్యాలు,అనుభవం ఆధారంగా వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ/ప్రైవేట్, వ్యాపార సంస్థలు సహా ప్రతీ రంగంలో లావాదేవీలన్నీ ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా లావాదేవీలు, సంబంధిత సమాచార భద్రత అనేది చాలా క్లిష్టంగా మారింది. ఇటువంటి విలువైన సమాచారాన్ని భద్రపరచడానికి రక్షణ కవచంగా వచ్చిందే..సైబర్ సెక్యూరిటీ. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌కు సంబంధించి సైబర్ సెక్యూరిటీ నాలుగేళ్ల కోర్సు. డేటా స్ట్రక్చర్, డిజిటల్ ప్రిన్సిపుల్స్, సిస్టమ్ డిజైన్, జావా ప్రోగ్రామింగ్, సిస్టమ్ సాఫ్ట్వేర్, అల్గారిథంలను రూపొందించడం వంటివి ఈ కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డెవలపర్, క్రిప్టానలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందే వీలుంటుంది. వేతనాలు : సంస్థను బట్టి సైబర్ సెక్యూరిటీ నిపుణులకు వార్షిక వేతనం రూ.8 లక్షల వరకు లభిస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంజనీరింగ్‌లో కొత్తగా ప్రవేశ పెట్టిన మరో కోర్సు.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ. సైబర్ నేరాలను ఆరిక ట్టడానికి ఆయా వ్యవస్థలపై పనిచేసే నిపుణులు ఎప్పటికప్పడు నూతన పరిజ్ఞానాన్ని అందుబా టులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిందే బ్లాక్‌చైన్ టెక్నాలజీ. ఆర్థికపరమైన లావాదేవీలల్లో పారదర్శకతను పెంచేవిధంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ ఆధారంగా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రానున్న కాలంలో బ్లాక్ చైన్ టెక్నాలజీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే: బ్లాక్‌చైన్ టెక్నాలజీ అనేది ఒక పట్టిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ. వ్యక్తులు, వ్యవస్థల మధ్య జరిగే ఆర్థిక సహ ఇతర కార్యకలాపాల సమాచారానికి కట్టుదిట్టమైన భద్రను కల్పించే రక్షణ కవచం ఇది. ఎంతటి సైబర్ హ్యాకర్లైనా దొంగలించేందుకు వీలులేకుం డా ఉండే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఇది. దీని ద్వారా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్వర్లలో సమాచారం నిక్షిప్తం చేసి.. ఇతరులు దానిని దొంగిలించకుండా భద్రత కల్పిస్తారు. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ కోర్సు వ్యవధి నాలుగేళ్లుగా ఉంటుంది. కోర్సులో భాగంగా బ్లాక్చైన్టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్‌చైన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై లోతైన అవగాహన కల్పిస్తారు. అలాగే సాలిడిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ క్లౌడ్ ప్లాట్‌ఫాం,ఎథెరియం,బిట్ కాయిన్ క్రిప్టోకరెన్సీల గురించి అవగాహన కలిగించే విధంగా కోర్సు ఉంటుంది. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బ్లాక్‌చైన్ డెవలపర్, బ్లాక్‌చైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్లాక్‌చైన్ ఎస్ఐ పార్టనర్ డెవలప్మెంట్ మేనేజర్, బిట్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ డెవలపర్, బ్లాక్‌చైన్ ప్రిన్సిçపల్ ప్రోగ్రామ్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్ అసోసియేట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు: ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఐబీఎం, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, వీసా వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. వేతనాలు: బ్లాక్‌చైన్ నిపుణులకు ప్రారంభంలో వార్షిక వేతనం రూ.5 లక్షల వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్. మానవ ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత యంత్ర వ్యవస్థ పనిచేసేలా చేయడమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐలో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ లాంటి చాలా అంశాలుంటాయి. రోబోటిక్స్లోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం కీలకం. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఏఐ, మెషిన్ లెర్నింగ్) ఉంటుంది. ఈ కోర్సు లో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ లాంగ్వేజ్‌లను నేర్పిస్తారు. జావా, ప్రొలాగ్, లిస్ప్, పైథాన్ వంటి కోర్సులు ఇందులో నేర్చుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన అభ్య ర్థులకు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ప్రిన్సిపుల్ డేటాసైంటిస్ట్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి. వేతనాలు : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగా లు పొందిన వారికి వార్షిక వేతనం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఘనత ఇంటర్నెట్కు దక్కుతుంది. సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మ కతకు ముఖ్య కారణం ఇంటర్నెట్ అనడంలో సందేహం లేదు. దీని విస్తృతి మరింత పెరిగి.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) తెరపైకి వచ్చింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులో ఐఓటీ కూడా ఒకటి. ఐఓటీ అంటే: భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఒక స్మార్ట్ నగరం గా మారడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఉపయోగపడు తుంది. మనుషుల జీవితాలను మరింత సుఖమయం చేయడా నికి ఇది తోడ్పడుతుంది. మనుçషుల మాదిరిగానే యంత్రాలు, యంత్ర పరికరాలు అన్ని ఇంటర్నెట్ ఆధారంగా అనుసంధా నంగా ఉండి.. ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి పనిచేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ «థింగ్స్ అంటారు. అంటే.. మనుషులు తమలో తాము ఎలాగైతే ఒకరితో ఒకరు మాట్లాడుకొని పనులు చేస్తారో.. యంత్రాలు కూడా ఒక దానితో ఒకటి సమాచార మార్పిడి చేసుకొని పనిచేస్తాయి. ప్రతి వస్తువు ఇంటర్నెట్తో అనుసం« దానంగా ఉండి.. వివిధ రకాల కార్యకలాపాలను కచ్చితమైన సమయంలో సమర్థవంతంగా పూర్తిచేస్తాయి. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్ స్థాయిలో నాలుగేళ్ల బీటెక్ ఇన్ ఐఓటీ అండ్ అప్లికేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జాబ్ ప్రొఫైల్: ఇంజనీరింగ్‌లో ఐఓటీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఐఓటీ ఇంజనీర్, ఐఓటీ యాప్ డెవలపర్, ఐఓటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సిటిజన్ ఐఓటీ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఐఓటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లుగా విధులు నిర్వహిస్తారు. బిజినెస్ అనలిటిక్స్ ఒకప్పుడు వ్యాపార సంస్థల మధ్య పోటీ తక్కువగా ఉండేది. కొన్ని సంస్థల గుత్తాధిపత్యం కొనసాగేది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో.. వ్యాపార సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో ఆయా వ్యాపారాలను లాభాల బాటలో తీసుకేళ్లేందుకు అందరూ బిజినెస్ అనలిటిక్స్ సహాయం తీసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం బడా కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ.. లక్షల్లో జీతాలు ఇచ్చి బిజినెస్ అనలిటిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో బిజినెస్ అనలిటిక్స్‌కు బాగా డిమాండ్ ఏర్పడింది. పని తీరు మదింపు: స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్, టెక్నికల్ çపరిజ్ఞానాన్ని ఉపయోగించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని వివిధ రకాల పద్దతుల ద్వారా విశ్లేషించి.. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ పని తీరును మదించడమే బిజినెస్ అనలిటిక్స్. ఆయా సంస్థల వ్యాపారవృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు బిజినెస్ అనలిటిక్స్ ఉపయోగపడుతుంది. కోర్సు స్వరూపం: ఈ కోర్సులో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనకునే వారు బీటెక్ బిగ్ డేటా అనలిటిక్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల ఈ కోర్సులో డేటా మైనింగ్, డేటా వేర్‌హౌసింగ్, డేటా విజువలైజేషన్ అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు కూడా డేటా సైన్స్‌కు అనుబంధంగా ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు బిజినెస్ అనలిటిక్స్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు. వేతనాలు: బిజినెస్ అనలిటిక్స్ నిపుణులకు నైపుణ్యాలను బట్టి వార్షిక వేతనం రూ.ఆరు లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ లభిస్తుంది. బయో మెడికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీంగ్ ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కోర్సులో ఒకటి. ఆరోగ్య రంగానికి సాంకేతిక తోడ్పాటు అందించేందుకు ఈ విభాగం కృషి చేస్తోంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రధానంగా రోగ నిర్ధారణకు సంబంధించి ఉపయోగించే పరికరాలను తయారు చేస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రోగ నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎంఆర్ఐలతో పాటు రోగా నిర్ధారణ పరిక్షల కోసం ఉపయోగించే ఇతర పరికరాలను తయారు చేసే వారే బయో మెడికల్ ఇంజనీర్లు. ఈ పరికరాలను తయారు చేయడానికి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. బయాలజీ, ఇంజనీరింగ్.. ఈ రెండింటిపై అవగాహన ఉండాలి. అందుకే ఈ రెండింటిని కలిపి ఉమ్మడిగా బయో మెడికల్ ఇంజనీరింగ్ కోర్సును రూపొందించారు. కోర్సు స్వరూపం: బయాలజీ, మెడిసిన్లకు సాంకేతికతను అన్వయించి మెడికల్ ఎక్విప్ మెంట్‌ను తయారు చేసేదే.. బయోమె డికల్ ఇంజనీరింగ్. నాణ్యమైన పరికరాలను తక్కువ ధరల్లో తయారు చేసేందు కు కృషి చేస్తారు. ఇది రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉన్న రంగంగా మారుతుందని నిపుణుల అంచనా. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బయోమెడికల్ టెక్నిషియన్, బయో మెడికల్ ఇంజనీర్, బయో కెమిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తారు. ఉద్యోగాలు: మెడికల్ కంపెనీలు, హాస్పిటల్స్, ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యా క్చరర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇన్‌స్టాలెషన్ యూనిట్లల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వేతనాలు: ఈ రంగంలో ఉద్యోగాలు చేసే వారికి నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వేతనంగా లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనం పెరుగుతుంది. -
దివ్య తల్లిదండ్రులకు రూ.10 లక్షల చెక్కు అందజేత
సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాది చేతిలో హత్యకుగురైన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దివ్య కుటుంబసభ్యులకు పది లక్షలు చెక్కును అందజేశారు. దివ్యతేజస్విని తల్లిదండ్రులను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. హామీ ఇచ్చిన 48 గంటల్లోనే దివ్య తల్లిదండ్రులకు ప్రభుత్వం చెక్కును అందజేసింది. చక్కగా చదువుకునే దివ్య జీవితం నాశనం చేసిన నాగేంద్రకు కఠిన శిక్ష పడుతుందని దేవినేని అవినాష్ అన్నారు. సీఎం జగన్ దివ్య తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారని, ప్రభుత్వం తరపున , పార్టీ తరపున వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. (సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది) సీఎం వైఎస్ జగన్ సహాయం మరవలేనిదని దివ్య తల్లిదండ్రులు జోసెఫ్, కుసుమ అన్నారు. మా బాధను విని సీఎం జగన్, హోంమంత్రి సుచరిత ధైర్యాన్ని ఇచ్చారని, ఆరోజు నుంచీ ఈరోజు వరకూ అందరూ మాకు అండగా ఉన్నారని తెలిపారు. ఆర్థిక సహాయం చేస్తారని ఊహించలేదని, మా కుటుంబ పరిస్థితులు అర్ధం చేసుకొని సహాయం చేసిన సీఎం జగన్‌కి రుణపడి ఉంటామన్నారు. ఈ కేసులో తమ బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. (సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు) -
నిలకడగా నాగేంద్రబాబు ఆరోగ్యం
సాక్షి, గుంటూరు: దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు తెలిపారు. విజయవాడలో బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు అనంతరం ఆత్మహత్యకు యత్నించి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విషయం విదితమే. కడుపులో పేగులకు అయిన గాయాలకు ఆపరేషన్ చేసిన అనంతరం వైద్యులు నాగేంద్ర బాబును పోస్టు ఆపరేటివ్ ఐసీయూ వార్డుకు మార్చారు. (అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత) వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్ఎంఓ సతీష్ ఆదివారం తెలిపారు. నాగేంద్రబాబు గాయపడి 48 గంటలు దాటిందని, కొంతమేరకు కోలుకున్నాడని వెల్లడించారు. సోమవారం అతని ఆరోగ్య పరిస్థితిని వైద్య అధికారులు పరీక్షించిన అనంతరం తదుపరి వివరాలు తెలియజేస్తామన్నారు. ('7 నెలలుగా దివ్య ఎంత క్షోభ అనుభవించిందో') -
'హోంమంత్రి భరోసాతో ధైర్యంగా అనిపిస్తుంది'
విజయవాడ : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం ఎన్నో పథకాలు తెచ్చారని, దివ్యను హత్యచేసిన ఉన్మాదిని శిక్షించి న్యాయం చేయాలని ఆమె తల్లి కుసుమ విన్నవించుకున్నారు. స్వయంగా రాష్ర్ట హోం మంత్రే తమ ఇంటికి రావడంతో భరోసాగా ఉందని దివ్య తండ్రి జోసెఫ్ అన్నారు. కోర్టుల చుట్లూ తిరగలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తమకు హోంమంత్రి భరోసా ఇవ్వడం చాలా ధైర్యంగా అనిపిస్తుందన్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగేలా మంత్రి భరోసా ఇచ్చారని తెలిపారు. (సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది) తాను సీఎం వైఎస్ జగన్‌కు వీరాభిమానినని , తన చెల్లికి తక్షణమే న్యాయం జరుగుతుందని భావిస్తున్నా అని దివ్య సోదరుడు దినేష్ అన్నారు. ఈ ఘటనను సామాజిక దారుణంగా చూడాలని, ఇంట్లో ఉన్నా రక్షణ లేకపోవడం అన్నది సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమన్నారు. దేశంలో ప్రతీ రెండు రోజులకు ఎక్కడో చోట ఇలాంటి దారుణాలు జరుగతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. (అందుకే ఆమెను చంపి నేనూ చనిపోవడానికి సిద్ధపడ్డా! ) -
అసలేం జరిగింది?
-
'7 నెలలుగా దివ్య ఎంత క్షోభ అనుభవించిందో'
సాక్షి, విజయవాడ: విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన దివ్య తేజశ్విని కేసులో నాగేంద్రను ఎన్కౌంటర్ చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు దివ్య తల్లిదండ్రులు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'దివ్యను నాగేంద్ర అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దివ్య శరీరంపై 13 కత్తిపోట్లు ఉన్నాయి. నాగేంద్ర తనకు తానే చిన్న చిన్న గాయాలు చేసుకున్నాడు. ఇదంతా పథకం ప్రకారమే జరిగింది. హత్యానేరం నుంచి బయటపడేందుకే నాగేంద్ర మీడియాతో మాట్లాడుతున్నాడు. పోలీసులకు వివరాలు చెప్పాం. దివ్య పెళ్లి ఇతర విషయాలు నిజం కాదు. ఏడు నెలలుగా మా బిడ్డ ఎంత క్షోభ అనుభవించిందో సెల్ఫీ వీడియో చూసేదాకా మాకు తెలీదు. సైకోలా వేధిస్తున్నాడని దివ్య వీడియోలో చెప్పింది. నా కూతర్ని అత్యంత కిరాతకంగా హింసించి, హత్య చేసిన నాగేంద్రను ఎన్కౌంటర్ చేయాలి' అని దివ్య తండ్రి జోసెఫ్ డిమాండ్ చేశారు. (దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్) పోలీసుల విచారణలో కొత్త విషయాలు దివ్య తేజస్విని హత్య కేసులో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. దివ్య, నాగేంద్ర వివాహంపై పోలీసుల విచారణలో ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లభించలేదు. అయితే 2018 మార్చిలో మంగళగిరి పానకాలస్వామి ఆలయానికి దివ్య, నాగేంద్ర వెళ్లారు. అక్కడ వారికి వివాహమైనట్లు ఏ వివరాలు నమోదు కాలేదని పోలీసులు గుర్తించారు. నాగేంద్రకు సాయం చేసిన మహిళ కూపీ లాగేందకు పోలీసులు బృందం విష్ణు కాలేజీకి వెళ్లింది. ఈ విషయంపై మరింత స్పష్టత కోసం నాగేంద్ర, దివ్య ఫోన్లలో వాట్సాప్, ఫేస్బుక్ మెసేజ్‌లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న చివరిసారిగా నాగేంద్రకు దివ్య కాల్ చేయగా.. ఏప్రిల్ 2న దివ్యకు నాగేంద్ర నుంచి చివరి కాల్ వచ్చినట్లు గుర్తించారు. కాగా ఈ కేసును బెజవాడ పోలీస్ స్టేషన్ నుంచి దిశ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోయిన రక్తాన్ని మళ్లీ రీప్లేస్ చేశాం జీజీహెచ్ సర్జికల్ వార్డులో నాగేంద్రబాబుకు చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ప్రభావతి అన్నారు. నాగేంద్ర బీపీ, పల్స్ సాధారణంగానే ఉన్నాయి. అతని అన్నవాహిక, పేగులకు గాయాలయ్యాయి. వాటిని సరి చేస్తూ వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే అతను సాధారణ స్థితికి రావడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుంది' అని ఆమె వెల్లడించారు. (అందుకే ఆమెను చంపి నేనూ చనిపోదామని..!) -
ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర
సాక్షి, విజయవాడ: ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దివ్యను తాను చంపలేదని, ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని నిందితుడు నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించపోవడంతో ఇదంతా చేశామని నాగేంద్ర తెలిపాడు. నాగేంద్ర ఇచ్చి వాంగ్మూలం ప్రకారం.. ‘మూడేళ్ల క్రితం దివ్య నాకు పరిచయమైంది. మా ఇద్దరికీ వివాహమైంది. దివ్య బలవంతం చేస్తేనే పెళ్లి చేసుకున్నా. ఏడు నెలలుగా ఆమె నాకు దూరంగా ఉంటుంది. ఆమెతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లా. తమ పెద్దలు అంగీకరించడంలేదని చనిపోదామని దివ్య చెప్పింది. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం. ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత నా చేతిని ఎవరు కోశారో అర్థం కాలేదు’అని నాగేంద్ర పేర్కొన్నాడు. (చదవండి: మంగళగిరిలో పెళ్లి చేసుకున్నాం: నాగేంద్ర) కాగా, నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన ఈఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనంగా మారింది. అయితే, ప్రేమ పెళ్లి చేసుకున్న తనను దివ్య దూరం పెట్టిందని నాగేంద్ర చెప్తుండగా.. అవన్నీ అబద్ధాలని దివ్య తల్లిదండ్రులు తోసిపుచ్చారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే నాగేంద్ర ప్రేమ, పెళ్లి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కూతురు ఏనాడూ ప్రేమకు సంబంధించిన విషయం చెప్పలేదని అన్నారు. తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న నాగేంద్రను కూడా చంపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక దివ్యపై దాడి అనంతరం తానూ మెడ, మణికట్టు, పొట్ట భాగాల్లో పొడుచుకున్న నాగేంద్ర తీవ్ర గాయాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ కళాశాలలో దివ్య తేజశ్విని ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. నాగేంద్ర పెయింటర్. (చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం) ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దివ్య తేజస్విని అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ వ్యవహారంపై దివ్య తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. దివ్యతో నాగేంద్రకు రహస్య వివాహం జరిగిందన్న నిందితుడి వాదనలో నిజం లేదు. నాగేంద్ర ఇంటిపై మేము దాడి చేసామన్న ఆరోపణలు కూడా సత్యదూరం. అతడి మాటల్లో దివ్యపై ప్రేమ ఉంటే అంత కిరాతకంగా ఎలా చంపాడు..?. వాట్సాప్ చాటింగ్‌లు, ఫొటోలు విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవన్నీ కూడా మార్ఫింగ్ ఫొటోలని దివ్య తల్లి కుసుమ కొట్టిపారేసింది. -
గో కార్టింగ్ సీజ్, నిర్వాహకులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : గుర్రంగూడలోని హాస్టన్ గో కార్టింగ్ నిర్వాహకులను మీర్‌పేట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సంబంధిత శాఖల నుంచి అనుమతి లేకుండానే గో కార్టింగ్ నిర్వహిస్తున్నారని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే సందర్శకులను అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ నిర్వహాకులు గుర్రం లోహిత్ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి గో కార్టింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. కాగా వనస్థలిపురంలోని ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన శ్రీ వర్షిణి అనే యువతి గో కార్టింగ్ చేస్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గో కార్టింగ్ నిర్వాహకులపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణి మృతదేహానికి ఆమె కుటుంబ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. (గో కార్టింగ్ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి) -
గో కార్టింగ్ ప్రమాదంపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: హాస్టన్ గో కార్టింగ్ ప్లే జోన్ నిర్వాహకులపై మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గత బుధవారం సాయంత్రం గో కార్టింగ్ రైడింగ్ చేస్తూ బీటెక్ విద్యార్థిని శ్రీ వర్షిణి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. రైడింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదానికి గురైన శ్రీవర్షిణి గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు విడిచింది. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరికొద్ది సేపట్లో శ్రీ వర్షిణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవనుంది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. వెంట్రుకలు చిక్కుకోవడంతో గో కార్టింగ్ రైడ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు హెల్మెట్ జారి కింద పడగా వెంట్రుకలు టైర్లలో చిక్కుకోవడంతో శ్రీ వర్షిణి కిందపడిపోయింది. ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హాస్టెన్ గో-కార్టింగ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శ్రీవర్షిణి మృతి చెందిందని మృతురాలి సోదరుడు నాగప్రణీత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నాడు. ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపాడు. అయితే, సెల్ఫీ కోసం శ్రీ వర్షిణి హెల్మెట్ తీసే ప్రయత్నం చేయడంతో ఆమె వెంట్రుకలు టైర్ వీల్లో చిక్కుకున్నాయని, ఆమె కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిందని హాస్టన్ గో కార్టింగ్ జోన్ నిర్వాహకులు చెప్తున్నారు. (చదవండి: గో కార్టింగ్ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి) -
గో కార్టింగ్ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి
సాక్షి, హైదరాబాద్ : గో కార్టింగ్ ప్లే జోన్లో తీవ్రంగా గాయపడ్డ శ్రీ వర్షిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా కమరపల్లి మండలానికి చెందిన కాపా నాగేశ్వరరావు, మంజుల దంపతులకు కుమార్తె శ్రీవర్షిణి (21), కుమారుడు నాగప్రణీత్లు ఉన్నారు. నాగేశ్వరరావు మృతి చెందడంతో రెండున్నరేళ్ల క్రితం తల్లి మంజుల పిల్లలతో కలిసి రెండున్నరేళ్ల క్రితం వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. శ్రీవర్షిణి వరంగల్ కిట్స్‌లో బీటెక్ 3వ సంవత్సరం సీఎస్సీ గ్రూప్ చదువుతోంది. బుధవారం ఇంటికి బంధువులు రావడంతో శ్రీ వర్షిణి వారితో కలిసి సరదాగా రాత్రి 7.30 గంటల సమయంలో గుర్రంగూడలోని హస్టెన్ గో-కార్టింగ్‌కు వెళ్లారు. కాగా శ్రీవర్షిణి బంధువుతో కలిసి రైడ్‌కు వెళ్లగా ప్రమాదవశాత్తు హెల్మెట్ జారి కింద పడగా వెంట్రుకలు టైర్లలో చిక్కుకోవడంతో కిందపడి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో వెంటనే శ్రీవర్షిణి చికిత్స నిమిత్తం గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీవర్షిణి గురువారం మధ్యాహ్నం 3.40 గంటలకు మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది... హాస్టెన్ గో-కార్టింగ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే శ్రీవర్షిణి మృతి చెందిందని మృతురాలి సోదరుడు నాగప్రణీత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నాడు. ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపాడు. హెల్మెట్ తీయడం వలనే ఈ ప్రమాదం దీనిపై గో-కార్టింగ్ యాజమాన్యం స్పందిస్తూ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. నిర్వాహకుడు కిరణ్ మాట్లాడుతూ.. శ్రీ వర్షిణితో పాటు వాళ్ల బాబాయ్ నిన్న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మా కార్టన్‌కు వచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మేము కార్టన్ ఇస్తాం. శ్రీ వర్షిణి, వాళ్ల బాయ్ ఇద్దరూ ఒకే వెహికల్‌పై ఉన్నారు. ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నారు. ఒక రౌండ్ వేశాక రెండో రౌండ్లో శ్రీ వర్షిణి హెల్మెట్ తీసి సెల్ఫీ కోసం ప్రయత్నం చేసింది. దీంతో ఆమె వెంట్రుకలు టైర్ వీల్లో చిక్కుకున్నాయి. ఆమె కిందపడటంతో తలకు దెబ్బ తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. గత మూడేళ్లుగా కార్టిన్ నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. హెల్మెట్ తీయడం వలనే ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారని తెలిపారు. -
గో కార్టింగ్: బీటెక్ విద్యార్థినికి తీవ్ర గాయాలు
-
గో కార్టింగ్: బీటెక్ విద్యార్థినికి తీవ్ర గాయాలు
సాక్షి, హైదరాబాద్ : గో కార్టింగ్ సరదా బీటెక్ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన నగర శివారులోని గుర్రంగూడ గో కార్టింగ్ ప్లే జోన్లో చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రీ వర్షిణి తన స్నేహితులతో కలిసి గో కార్టింగ్‌కు వెళ్లింది. గో కార్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ టైర్‌కు యువతి తల వెంట్రుకలు చుట్టుకున్నాయి. వేగంగా వెళుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో శ్రీ వర్షిణి తల బలంగా నేలకు తగిలింది. ఆమె పెట్టుకున్నహెల్మెట్ కూడా పగిలిపోయి తలకు తీవ్రంగా గాయమైంది. దీంతో శ్రీ వర్షిణిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గో కార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శ్రీ వర్షిణి తల్లిదండ్రులు మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లవ్ ఫెయిల్: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, కరీంనగర్: ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఎవరిని ప్రేమించకండి, చచ్చేదాకా మనతో ఎవరుంటారో వారినే ప్రేమించండి అంటూ తన మిత్రులకు బాయ్ చెప్తూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకెళ్తే.. కరీంనగర్ జిల్లా సప్తగిరికాలనీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సాయి మూడు రోజుల క్రితం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. వెంటనే స్థానికులు గుర్తించి అతన్ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ రోజు ప్రాణాలు కోల్పోయాడు. అయితే గతంలో ఓ అమ్మాయిని ప్రేమించిన సాయి.. ఆ అమ్మాయి తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రాణాలు కోల్పోయాక అతని సెల్ ఫోన్లో సూసైడ్‌కు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటపడడంతో కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు బోరున విలపించారు. (‘సాయి ఆదుకున్నాడు, దేవ ముంచాడు’) -
వింత వ్యాధితో గిరిజన విద్యార్థిని..
సీతంపేట: ఎచ్చెర్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న అమీల అనే గిరిజన విద్యార్థిని కొద్ది నెలలుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. సీతంపేట మండలంలోని ఎతైన కొండలపై ఉన్న గడికారెం గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని వింత వ్యాధితో బాధపడుతోంది. ఒల్లంతా కురుపులతో నరకయాతన అనుభవిస్తోంది. ఇప్పటికే ఈమె వైద్యానికి రూ.2 లక్షల వరకు ఖర్చు అయింది. అయినా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో అప్పులు చేసి ఈమెకు వైద్యం చేయించారు. ఇంకా నయం కావడానికి మరో రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని తమ కుటుంబానికి వింత వ్యాధి దాపురించిందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. -
నాన్నా.. తాగొద్దు.. అమ్మను బాగా చూసుకో
కర్నూలు(సెంట్రల్): నాన్నా తాగొద్దు. అమ్మను బాగా చూసుకో అంటూ లెటర్ రాసి పెట్టి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కల్లూరులోని జానకీ నగర్‌కు చెందిన విజయకుమార్ జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి అనారోగ్య సమస్యలతోపాటు ఇంట్లో తండ్రి మందుకు అలవాటుపడడంతో చదువుపై దృష్టి సారించలేకపోయేవాడు. ఈక్రమంలో శుక్రవారం ఇంట్లో వాళ్లు బంధువుల ఇంటికి వెళ్లడంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొనిఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలుతెలియాల్సి ఉంది. -
ఇంటర్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి
అమీర్‌పేట: ఇంటర్ విద్యార్థికి బదులు పరీక్ష రాస్తూ్త బీటెక్ విద్యార్థి పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఆర్నగర్లోని నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని దీప్‌శికా ఒకేషనల్ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. అయితే విద్యార్థికి బదులుగా బీటెక్ చదువుతున్న సాయితేజ అనే మరో విద్యార్థి శుక్రవారం జరిగిన గణితం బి.2 పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాస్తున్న విద్యార్థి వయస్సు ఎక్కువగా కనిపించడంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి హాల్ టికెట్‌ను తనిఖీ చేశాడు.విద్యార్థి వద్ద ఉన్న హాల్‌టికెట్‌లోని ఫోటోతో పరీక్ష రాస్తున్న విద్యార్థిని పరిశీలించడంతో అసలు విషయం వెలుగుచూసింది.దీంతో పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సాయినాథ్ తెలిపారు. -
ఇంజినీరింగ్ విద్యార్థుల ఫిర్యాదుపై విచారణ
పామూరు: విజయవాడ, గుంటూరు, ఒంగోలులో బీటెక్ చదువుతున్న తమ పేర్లను పట్టణంలోని బెల్లంకొండ డిగ్రీ కళాశాలలో నమోదు చేసుకున్నారని పామూరు పట్టణం, మండలంలోని ఇనిమెర్ల గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం కనిగిరి ఏఎస్‌డబ్ల్యూవో రాజేశ్వరి, పామూరు ఎస్ఐ చంద్రశేఖర్‌లు విచారణ చేపట్టారు. వివరాలు.. పామూరుతో పాటు మండలంలోని ఇనిమెర్ల, ఇతర గ్రామాలకు చెందిన విద్యార్థులు 2017–19 విద్యా సంవత్సరంలో పట్టణంలోని బెల్లంకొండ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ ఎంపీసీ పూర్తి చేశారు. ఆ తర్వాత సర్టిఫికెట్లు తీసుకుని విజయవాడ, ఒంగోలు, గుంటూరులోని పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరారు. విద్యార్థులు వేముల వాసు, వై.మోహన్‌కృష్ణ, ఎ.నరసింహ, బత్తుల రాజాలు విజయవాడ ఎంఐసీ కళాశాలలో, వల్లపుశెట్టి సతీష్ ఒంగోలు పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో, ఇర్లా కల్యాణ్ గుంటూరు చలపతి కళాశాలలో బీటెక్‌లో చేరారు. వీరు ఫస్ట్ సెమ్ పరీక్షలు కూడా రాసి రెండో సెమ్ పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉండగా నవశకం కార్యక్రమంలో భాగంగా జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి మీ పేర్లు ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చూపిస్తున్నాయని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు సదరు విద్యార్థులకు సమాచారం ఇచ్చాయి. విద్యార్థులు అవాక్కై హుటాహుటిన పామూరు వచ్చి సదరు డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ప్రశ్నించిన తమను యాజమాన్యం దూషించిందని బాధిత విద్యార్థులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ విద్యార్థులను విచారించి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారు. డిగ్రీ కళాశాల నిర్వాహకులను పిలిపించి విచారణ జరిపారు. జిల్లా అధికారుల ఆదేశాలతో విచారణకు వచ్చిన కనిగిరి ఏఎస్‌డబ్ల్యూవో ఈ.రాజేశ్వరమ్మ కూడా విద్యార్థులను విచారించారు. దీనిపై విద్యార్థులు పామూరులో సదరు డిగ్రీ కళాశాల లేదని, సీఎస్‌పురంలో ఉందని తెలపగా విద్యార్థులు తెలిపిన కళాశాలలో విచారణ చేపట్టి ఆమె వెళ్లారు. దీనిపై ఎస్ఐని వివరణ కోరగా బుధవారం ఏఎస్‌డబ్ల్యూవో నివేదిక ఆధారంగా సీఐతో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఏఎస్డబ్ల్యూవోను వివరణ కోరేందుకు యత్నించగా ఆమె ఫోన్ అందుబాటులోకి రాలేదు. -
వీడిన బీటెక్ విద్యార్థి కేసు మిస్టరీ
సాక్షి, మేడ్చల్: బీటెక్ విద్యార్థి జీవన్‌రెడ్డి మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. 15 రోజులుగా కనిపించకుండా పోయిన అతను గోవాలో ఉన్నట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. నల్గొండ జిల్లా సిద్దార్థ కాలనీకి చెందిన జీవన్‌రెడ్డి మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతను కళాశాల సమీపంలోని హరిహర హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 11న కాలేజీకి వెళ్లిన అతడు తిరిగి రాలేదు.(అయిదు రోజులైనా లభించని బీటెక్ విద్యార్థి ఆచూకీ) ఇక హాస్టల్ రూమ్ బాత్రూంలో రక్తపు మరకలు కనపడటంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. విద్యార్థి తండ్రి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు 15 రోజులుగా అతని కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు జీవన్ రెడ్డి గోవాలో ఉన్నట్లు గుర్తించారు. జల్సాల కోసమే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. గతంలోనూ అతను క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడేవాడని తెలిసింది. (విద్యార్థి అదృశ్యం: 70 సీసీ కెమెరాల పుటేజీ పరిశీలన) -
నారాయణమ్మ విద్యార్థినికి బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌లొ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఎం.లోహితా రెడ్డి అడోబ్ ఐఎన్‌సీ సంస్థలో రూ.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించింది. ఇటీవల కళాశాలలో అడోబ్, అమేజాన్, జేపీ మోర్గాన్, డెలాయిట్ తదితర సంస్థలు విద్యార్థునులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయని కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. (హెచ్‌సీయూ విద్యార్థినికి భారీ ప్యాకేజీ) కళాశాలకు చెందిన 440 మంది విద్యార్థులు పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. సుమారు రెండు వందల మంది రూ.6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు. ఇంజినీరింగ్ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న సుమారు 100 మంది విద్యార్థినులకు పలు కంపెనీలు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాయి. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను కళాశాల చైర్మన్ పి.సుబ్బారెడ్డి, కార్యదర్శి విద్యారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
బంజారాహిల్స్: ఆక్సిజన్ సిలిండర్ పైపులను మెడకు చుట్టుకుని.. పాలిథిన్ కవర్లను ముఖానికి వేసుకొని బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బీటెక్ రెండో సంవత్సరం పరీక్షల్లో ఓ సబ్జెక్ట్ తప్పడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఫిలింనగర్‌లోని వినాయనగర్ బస్తీలో నివసించే పి.గణేష్ (19) బండ్లగూడలోని మహవీర్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి కురుమయ్య టిప్పర్ డ్రైవర్. తల్లి రమణమ్మ పూలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో గణేష్ ఉంటున్న గది నుంచి తీవ్రంగా వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు గమనించి డోర్ కొట్టారు. పావుగంట గడిచినా డోర్ తీయకపోగా అప్పటికే వాసన మరింత పెరగడంతో కిటికీలోంచి లోనికి చూడగా గణేష్ ఆక్సిజన్ సిలిండర్ పైపులను మెడకు చుట్టుకొని, ఓ పాలిథిన్ కవర్‌ను ముఖానికి వేసుకొని కనిపించాడు. అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు పగులగొట్టి గణేష్‌ను వెంటనే అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండు నెలల క్రితం గణేష్ బీటెక్ రెండో సంవత్సరం పరీక్ష తప్పడంతో మనస్తాపానికి గురయ్యాడని, మరోసారి పరీక్ష రాసినప్పటికీ ఫలితం రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు నుంచే ప్రణాళిక వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితమే ఆక్సిజన్ సిలిండర్లను తన ఇంట్లోకి తెచ్చుకోగా వాటిని తల్లి గమనించలేదు. మృతుడి చెల్లెలు మాత్రం సిలిండర్ల గురించి ప్రశ్నించగా గణేష్ సమాధానం చెప్పలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని మరో విద్యార్థి.. మలక్‌పేట: పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపంతో ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు వివరాల ప్రకారం.. గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన హరీష్ బాయ్ కుమారుడు దర్శన్ హరీష్ బాయ్ (24) చదువు కోసం నగరానికి వచ్చి మూసారంబాగ్ హెగ్డే ఆస్పత్రి సమీపంలోని దీక్షత్ అపార్ట్మెంట్ పెంట్హైస్లో అద్దెకు ఉంటున్నాడు. గడ్డిఅన్నారంలోని ఓ విద్యాసంస్థలో గేట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ నెల 2న గేట్ పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం పరీక్ష ‘కీ’ పేపర్ చూసుకోగా తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో మనోవేదనకు గురైన అతడు ఈ నెల 15న తన గదిలోని సీలింగ్ హుక్కుకు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వాచ్‌మన్ మారుతి ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనునాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గదిలో దొరికిన సూసైడ్ నోట్లో తన శవాన్ని కోయంబత్తూర్‌లోని ‘బూ యోగా’ సెంటర్‌కు అందించాలని రాసి ఉంది. -
పుట్టిన రోజే.. ఆఖరి రోజు
హుస్నాబాద్: ట్రాక్టర్ బోల్తాపడి బీటెక్ విద్యార్థిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన నవీన(20) వరంగల్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఆమె పుట్టిన రోజు కావడంతో గురువారం ఇంటికి వచ్చింది. శుక్రవారం ఉదయం పొలం పనుల్లో తండ్రికి సహాయ పడేందుకు వెళ్లింది. వరినారు చేరవేసేందుకు నవీన ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న రోటవేటర్‌పై నారు వేసుకొని ట్రాక్టర్ నడుపుకుంటూ పొలం ఒడ్డు వద్దకు చేరుకుంది. ఒడ్డుపై ఉన్న ట్రాక్టర్‌ను కొంత వెనుకకు తీసుకురావాలని తండ్రి కోరగా, ఒక్కసారిగా ట్రాక్టర్ పొలంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. నవీనపై ట్రాక్టర్ పడటంతో ఆమె బురదలో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందింది. -
ఇంజినీరింగ్ చదువుతూ.. మతిస్థిమితం లేని దశకు..!
సాక్షి, ఉలవపాడు: రోడ్‌సేఫ్టీ పోలీసుల మానవత్వం ఓ యువకుడిని తన సొంత ఇంటికి చేర్చింది. మతి స్థిమితం లేకుండా జాతీయ రహదారిపై తిరుగుతున్న యువకుడిని చేరతీసి సమాచారం సేకరించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా.. ఉలవపాడు, గుడ్లూరు మండలాలకు కలిపి ఏర్పాటు చేసిన రోడ్డుసేప్టీ వాహనంలో కానిస్టేబుళ్లు ప్రసాద్, బ్రహ్మయ్యలు విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై బీట్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ యువకుడు తడుస్తూ కనిపించాడు. తొలుత అనుమానించలేదు. మరలా తిరిగివస్తున్న సమయంలో కూడా అలానే కనిపించడంతో సోమవారం ఉదయం అతనిని దగ్గరకు తీసుకున్నారు. ముందు ఉలవపాడు హోటల్లో టిఫిన్ పెట్టించారు. తమ వాహనంలోనే ఉంచుకుని సమాచారం అడిగారు. మధ్యాహ్నం, రాత్రి కూడా భోజనం పెట్టించారు. అతని వద్ద ఆధార్ కార్డు ఉండడం గమనించి కార్డుతీసుకుని అతని ఫొటోలు తీసి అక్కడ ఉన్న వారికి పంపించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు గుర్తించి మంగళవారం ఉదయం ఉలవపాడుకు వచ్చారు. వచ్చిన తరువాత ఆ యువకుడు అలా మతిస్థిమితం లేకుండా తిరగడానికి గల కారణాలు, ఆ కుటుంబం పడుతున్న బాధలను తల్లిదండ్రులు వివరించారు. ఇంజినీరింగ్ చదువుతూ.. మతిస్థిమితం లేని దశకు... ప్రకాశం జిల్లాలోని పుల్లలచెరువు మండలం రాచకొండ గ్రామంలోని ఉమ్మడివరం కాలనీకి చెందిన కందుకూరి రాములు, సృజనల కుమారుడు కందుకూరి రాజేష్. 2012 లో విజయవాడలోని ఆర్.కె ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చేరాడు. మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో గొడవ జరిగింది. కళాశాలలో తల పై కొట్టడంతో గాయపడ్డాడు. ఆ తరువాత అక్కడ నుంచి ఇంటికి వచ్చేశాడు. అప్పటి నుండి క్రమంగా మతి స్థిమితం లేకుండా తయారవుతున్నాడు. ఈ పరిస్థితులో హైదరాబాద్, బెంగళూరు ఇలా పలు చోట్ల చూపించారు. అయినా తగ్గలేదు. తరువాత ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్ 14న ఒంగోలు రిమ్స్ లో చేర్చారు. అక్కడే 21 వరకు ఉన్నాడు. వైద్యశాలలో తల్లి నిద్రపోతున్న సమయంలో పారిపోయి బయటకు వచ్చేశాడు. అప్పటి నుంచి మతి స్థిమితం లేకుండా ఇలా రోడ్ల పై తిరుగుతూనే ఉన్నాడు. అప్పటి నుంచి వారి తల్లితండ్రులు వెతికినా ఆచూకీ కనపడలేదు. ఈ పరిస్థితుల్లో రోడ్‌సేఫ్టీ పోలీసులు గుర్తించి అతనితో మంచిగా మాట్లాడుతూ దాదాపు 12 గంటలు ఉంచుకున్న తరువాత తన అడ్రస్‌కు సంబంధించి కార్డును చూపించాడు. తల్లిదండ్రులకు అప్పగింత... ఇక్కడ తీసిన ఫొటోలను అక్కడి పోలీసులకు, మిత్రులకు రోడ్ సేఫ్టీ సిబ్బంది వాట్సప్ ద్వారా పంపించారు. వారి తల్లితండ్రులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వారి తల్లితండ్రులు కందుకూరి రాములు, సృజనలు ఆ ఫోటోలు చూసి తమ కుమారుడిని గుర్తించారు. వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం రావడంతో రోడ్‌సేఫ్టీ పోలీసు సిబ్బంది ప్రసాద్, బ్రహ్మయ్యలు రాజేష్‌ను వారికి అప్పగించారు. కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
రుషికొండ బీచ్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నం : ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో ఆదివారం జరిగింది. బీటెక్ పూర్తి చేసిన యశ్వంత్ ఉద్యోగాన్వేషణలో భాగంగా విశాఖలోని ఎంవీపీ కాలనీలో నివాసముంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో రుషికొండ బీచ్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మృతుడు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం వాసిగా గుర్తించారు. -
మాదాపూర్‌లో కారు బోల్తా
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్‌లో ఆదివారం ఉదయం›4.30 ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో అదే కారులో ప్రయాణిస్తున్న బీటెక్ విద్యార్థిని చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. కారును డ్రైవ్ చేసిన యువకుడు మద్యం సేవించి ఉండటమే దీనికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీలోని గుంటూరులోని బ్రాడీపేటకు చెందిన సాయి విహిత (20) కూకట్‌పల్లిలోని హాస్టల్లో ఉంటోంది. గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. అదే కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేసిన కూకట్పల్లి వాసి సుచిత్‌బాబు (28) ఈమెకు స్నేహితుడు. ప్రాజెక్టు వర్క్ పని ఉందంటూ విహి త వారం రోజులుగా కాలేజీకి వెళ్లట్లేదు. శనివారం రాత్రి ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం సుచిత్‌తో కలసి అతడి కారులో (ఏపీ37 ఎస్ 0444) హాస్టల్ నుంచి బయటకు వెళ్లింది. ఆదివారం ఈ వాహనం మాదాపూర్‌లోని వంద అడుగుల రోడ్డులో ప్రయాణిస్తోంది. పర్వత్‌నగర్ చౌరస్తా, కల్లు కాంపౌండ్ చౌరస్తా మధ్య ఉన్న రెస్ట్రో హోటల్ వద్ద మితిమీరిన వేగం కారణంగా కారు అదుపు తప్పింది. అక్కడ ఉన్న ఓ ఆటోను వెనుక నుంచి ఢీకొంది. అప్పటికీ అదుపులోకి రాని కారు ఫుట్‌పాత్ ఎక్కి బోల్తా కొట్టింది. ఈ ప్రమా దంలో కారు నుంచి బయటకు పడిపోయిన విహిత తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆటోడ్రైవర్ చందర్‌కు కుడికాలు, మెడ వద్ద గాయాలయ్యా యి. ప్రమాదంపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి, విహిత మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కారును వదిలి పారిపోయిన సుచిత్‌బాబు సెల్‌ఫోన్ అందులోనే పడిపోయింది. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ రికార్డుల్ని పరిశీలించారు. శనివారం తర్వాత అతడికి వచ్చిన ఫోన్‌కాల్స్‌లోని సంభాషణలు, కారులో లభించిన మద్యం సీసాల ఆధారంగా ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్‌గా అనుమానిస్తున్నారు. సుచిత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే వీరి ద్దరూ ఎక్కడకు వెళ్లారు? ఏ సమయంలో వెళ్లారు? తదితర వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
సెల్ఫీ వీడియో తీసి బీటెక్ విద్యార్థి బలవన్మరణం
సాక్షి, ఐరాల (పూతలపట్టు) : పూతలపట్టు మండలంలోని పి. కొత్తకోట సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో గురువారం బీటెక్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ ఆశీర్వాదం, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు..పలమనేరు చెందిన విజయకుమార్ (లేట్), భగవతి (ఆర్టీసీ కండక్టర్) దంపతుల కుమారుడు దిలీప్ కుమార్ (26) పి.కొత్తకోట సమీపంలోని కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఆత్మహత్యకు పాల్పడటాన్ని అతను సెల్ఫీ తీసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణం? ప్రేమ వ్యవహారం వల్లే దిలీప్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియవచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కొందరితో ఛాటింగ్ చేసిన ట్లు, అందులో తాను చదువుతున్న కాలేజీ అమ్మాయితో ఎక్కువ సేపు చాట్ చేసినట్లు సమాచారం. సంఘటన స్థలానికి వెళ్లేంతవరకు మృతుడి సెల్ కెమెరా వీడియో లైవ్‌లోనే ఉన్నట్టు పోలీసులు చెప్పారు. దిలీప్ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాన్ని సెల్ఫీ వీడియోగా తీయడంతో పోలీసులు దానిని చూశారు. అనంతరం అది లాక్ అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు. మృతుడు చదువులో ప్రావీణ్యుడు దిలీప్ కుమార్ మృతి చదువుల్లో ప్రావీణ్యం కలవాడని కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. దిలీప్ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి కళాశాలకు వచ్చాడని, అయితే గురువారం మధ్యాహ్నం భోజనానంతరం ఒంట్లో నలతగా ఉందని చెప్పి హాస్టల్ రూములోనే ఉండిపోయాడన్నారు. అయితే అతడి సహచరులు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రూము వద్దకు చేరి తలుపు తట్టినా తీయకపోవడంతో తలుపులు పగలకొట్టి చూడగా గది లోపల ఉన్న కొక్కీకి దిలీప్ వేలాడుతూ కనిపించడంతో పోలీసుల సమాచారం ఇచ్చామన్నారు. ఆపై అతడిని పి.కొత్తకోట ఆసుపత్రి తరలించి వైద్యుల సూచనల మేరకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా దిలీప్ ముభావంగా ఉంటున్నాడని, రాత్రి సమయాల్లో సెల్ఫోన్లో ఎవరితోనో ఆవేదనగా మాట్లాడేవాడని విద్యార్థులు చెప్పినట్లు తెలిపారు. -
కోచింగ్ కోసం వెళ్లి.. ప్రేమోన్మాదిగా మారి!
సాక్షి, నెల్లూరు రూరల్: చిన్నప్పటి నుంచి కష్టాన్ని దగ్గరగా చూస్తూ పెరిగాడు. ఉన్నతచదువులు చదివి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలవాలనుకున్న ఆకాంక్ష అతనిని విద్యాధికుడిని చేసింది. తలకుమించిన భారం అయినప్పటికీ బ్యాంకు(ఐఎస్‌డబ్ల్యూ) కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాడు. ప్రేమలో పడి ఉన్మాదిగా మారి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇది దిల్‌సుఖ్‌నగర్‌లో యశస్విని గొంతుకోసిన ప్రేమికుని నేపథ్యం. నెల్లూరు రూరల్ మండలం నారాయణరెడ్డిపేటకు చెందిన జనార్దన్ , ప్రసూన్నమ్మ దంపతులకు వెంకటేష్. సునీల్ కుమారులు. జనార్దన్ వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన లాగే తన బిడ్డలు కష్టపడకూడదని తలకు మించిన భారం అయినప్పటికీ ఉన్నంతలోనే చదివించాలని నిశ్చయించుకున్నాడు. సంపాదించిన దాంట్లో కొంత వారి చదువులకు వెచ్చించాడు. చిన్నప్పటినుంచి తల్లిదండ్రులు కష్టాలను చూస్తూ పెరిగిన వెంకటేష్ చదువుల్లో రాణించి వారికి చేదోడువాదోడుగా నిలవాలన్న లక్ష్యంతో చదువుల్లో రాణించాడు. రాయ వేలూరులో బీటెక్ పూర్తిచేశాడు. అతని తమ్ముడు సునీల్ ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ చదువుతన్నాడు. బీటెక్ పూర్తిచేసుకున్న వెంకటేష్ ఐదునెలల కిందట బ్యాంకు కోచింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో యశస్వినితో పరిచయం పెరిగింది. తర్వాత ఆమె అతనిని దూరంపెట్టడం, ప్రేమోన్మాదిగా మారి ఆమె గొంతుకోశాడు. తాను ఈ లోకంలో జీవించకూడదని నిశ్చయించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో వెంకటేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేన్సర్ వ్యాధిని దాచిపెట్టి... కొంతకాలంగా ప్రసూన్నమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆమెను పరీక్షించిన వైద్యులు కేన్సర్ వ్యాధి అని నిర్ధారించారు. ఎక్కడ ఈ విషయం కొడుకుకు తెలిస్తే చదువు మీద దృష్టిపెట్టడని భావించిన తల్లిదండ్రులు దాచిపెట్టారు. ఇటీవల ప్రసూన్నమ్మ హైదరాబాద్‌లోని బసవతారకం హాస్పిటల్లో చికిత్స చేయించుకుని కుమారుడ్ని కలిసింది. బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని చెప్పి నెల్లూరుకు తిరిగి వచ్చింది. తన కొడుకు బాగా చదువుకుంటున్నాడని, త్వరలోనే ఉద్యోగం వస్తుందని మా బతుకులు బాగుపడుతాయని తెలిసిన వారందరికీ తల్లిదండ్రులు చెప్పి పొంగిపోయారు. కన్నీరు మున్నీరుగా.... మంగళవారం వెంకటేష్ ప్రేమోన్మాదిగా మారి మనశ్విని గొంతు కోసి తాను ఆత్మహత్యచేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న జనార్దన్, ప్రస్నూమ్మ కుప్పకూలిపోయారు. కొడుకును తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. చేతికందివచ్చిన కుమారుడు ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండడం వారు జీర్ణించుకోలేకపోయారు. అదేక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి వెంకటేష్ ఇలా అంటూ వారిని ప్రశ్నించడంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇంటికి తాళంవేసి వెళ్లపోయారు. మంగళవారం రాత్రి వెంకటేష్ తల్లిదండ్రులు హైదరాబాద్ వెళుతున్నారని స్థానికులు వెల్లడించారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి,విశాఖపట్నం : పరీక్షల్లో తప్పానన్న మనస్తాపంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పాతనగరంలో శని వారం ఈ సంఘటన జ రిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలకపేటలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న శీలం మణితేజ (22) బీటెక్ (డీఎంఈ) నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఫెయిల్ అయిన మణితేజ మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మణితేజ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఏఎస్ఐ వి.మురహరి ఆధ్వర్యంలో సిబ్బంది కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విజయవాడ గంజాయి అమ్మకాల్లో కొత్త కోణం
సాక్షి, విజయవాడ : నగరంలో గంజాయి అమ్మకాల్లో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. పలువురు బీటెక్ విద్యార్థులు గంజాయి విక్రేతలుగా మరినట్టుగా టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో బయటపడింది. విజయవాడ పరిసరాల్లో గంజాయి అమ్మకాలపై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. పలుచోట్ల తనిఖీలు చేపట్టారు. అందులో పట్టుబడ్డ ఒక బీటెక్ విద్యార్థిని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విద్యార్థి చెప్పిన వివరాలు విని పోలీసులు షాక్ తిన్నారు. 2 నుంచి 4 కిలోల గంజాయి తీసుకోచ్చి వాటిని ప్యాకెట్లుగా మార్చి కాలేజీల్లో అమ్మకాలు చేపడుతున్నట్టుగా సదురు విద్యార్థి పోలీసుల విచారణలో వెల్లడించారు. మరోవైపు గంజాయి అమ్మకాలతో సంబంధం ఉన్న పదిమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో ఆరుగురు బీటెక్ విద్యార్థులు ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. అరకు వెళ్లి అక్కడి నుంచి నేరుగా గంజాయి కొనుగోలు చేస్తున్న బీటెక్ విద్యార్థులు.. వాటిని కాలేజ్‌లోని తమ సహచరులకు విక్రయిస్తున్నారు. విజయవాడలోని ఐదు కాలేజ్‌ల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. గన్నవరం, తెల్లప్రోలు, కానూరు, మొగల్రాజపురం ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కాలేజ్‌ల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నాలుగు నెలల క్రితం నలుగురు విద్యార్థులు ఇదే విధంగా పట్టుబడగా పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయిన గంజాయి అమ్మకాలు యథావిధిగా కొనసాగుతుండటంతో.. గంజాయి అమ్మేవారితో విద్యార్థులకు ఉన్న సంబంధాలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
మీర్‌పేట: బీటెక్ మూడవ సంవత్సరంలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మనస్తాపానికి లోనైన ఓ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా, వెంకంపాడు గ్రామానికి చెందిన బుర్రా ఉపేందర్ కుమారుడు సాయికృష్ణ (22) గత మూడేళ్లుగా మీర్‌పేట ఆర్‌ఎన్‌రెడ్డినగర్‌లో ఉంటూ టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో పార్ట్‌టైంగా ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. బీటెక్ 3వ సంవత్సరం ఫలితాల్లో కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్‌కావడంతో మనస్తాపానికి గురైన సాయికృష్ణ శుక్రవారం మధ్యాహ్నం తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన పక్క గదిలోని యువకులు సాయికృష్ణ స్నేహితుడు సైదులుకు సమాచారం అందించాడు. అతను మృతుడి బాబాయ్ వెంకన్నకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వెంకన్న ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సింగిల్‌గా వెళతాడు.. అరగంటలో ముగిస్తాడు..
సాక్షి, సిటీబ్యూరో: బీటెక్ చదువుతూ మధ్యలోనే మానేసిన ఓ యువకుడు జల్సాల కోసం అడ్డదారి తొక్కి బడా చోరుడిగా అవతారమెత్తాడు. 2014 నుంచి ఇప్పటివరకు ఇళ్లల్లో చోరీలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన అతడిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేసినా తీరు మార్చుకోలేదు. కారు డ్రైవర్‌గా చెలామణి అవుతూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని ఒంటరిగా చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, రెయిన్‌బజార్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి 53.4 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, నాలుగు ల్యాప్‌టాప్‌లు, బైక్, టీవీ, ట్యాబ్‌తో పాటు రూ.41,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్‌లో సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. నాలుగు నెలల్లో 14 చోరీలు... రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌కు చెందిన నేనావత్ వినోద్ కుమార్ ఇబ్రహీంపట్నం ఏవీఎన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. చెడు అలవాట్లకు బానిసైన అతను అనంతరం కారు డ్రైవర్‌గా మారాడు. ఈ సమయంలోనే 2014 నుంచి 2018 వరకు ఈజీమనీ కోసం 28 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. చోరీకి అరగంట ముందు తాళం వేసి ఉన్న ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించి ఒంటరిగానే పని పూర్తి చేసుకొని వెళ్లేవాడు. 2015లో నగర పోలీసులకు చిక్కిన వినోద్‌కుమార్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్న అతను 2017లో రాచకొండ పోలీసులకు చిక్కడంతో మరో సారి పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2018 ఆగస్టులో జైలు నుంచి బయటికి వచ్చిన అతను చోరీలకు పాల్పడుతూ అదే ఏడాది సెప్టెంబర్‌లోనే మీర్‌పేట పోలీసులకు చిక్కాడు. 2019 జవనరిలో జైలు నుంచి బయటికి వచ్చిన వినోద్‌కుమార్ కేవలం నాలుగు నెలల వ్యవధిలో హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 14 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. చోరీ చేసిన సొత్తును శంషీర్‌గంజ్‌కు చెందిన మదన్ కుమార్, గుజరాత్ వడోదరలోని నేహ జ్యూవెల్లరీ యజమానికి విక్రయించేవాడు. వారు ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. పీడీ యాక్ట్ నమోదైన నేరగాళ్లపై పోలీసు నిఘా ఉండటంతో తరచూ తన మకాం మారుస్తూ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వినోద్‌కుమార్‌పై మరోసారి పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును రెయిన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ ఎస్.చైతన్యకుమార్, ఈస్ట్‌జోన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్, రెయిన్‌బజార్ ఇన్స్పెక్టర్ అంజనేయులు పాల్గొన్నారు. ఛేదించిన కేసులు రెయిన్‌బజార్‌లో రెండు, వనస్థలిపురంలో రెండు, ఘట్కేసర్లో నాలుగు, సైఫాబాద్‌లో ఒకటి, మీర్‌పేటలో రెండు, ఎల్బీనగర్లో ఒకటి, బాలాపూర్‌లో ఒకటి, బంజారాహిల్స్‌ల ఒక చోరీకి పాల్పడినట్లు తెలిపారు. -
నీళ్ల యంత్రం.. పొదుపు మంత్రం
కమలాపూర్ (హుజూరాబాద్): వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌కు చెందిన బీటెక్ విద్యార్థి మిట్టపెల్లి సందీప్ స్నేహితులతో కలసి వాటర్ మీటర్‌ను రూపొందించాడు. సందీప్ అనంతసాగర్‌లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం పూర్తి చేశాడు. నీటి వృథాను అరికట్టడానికి స్నేహితులు శశిప్రీతమ్, శ్రీవిద్య, సాయితేజతో కలసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటర్ మీటర్‌ను రూపొందించి ఒక యాప్‌కు అనుసంధానం చేశారు. ఒక రోజు ఎన్ని నీళ్లు కావాలనేది ఈ యాప్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే అన్ని నీళ్లు పొందే అవకాశం ఉంటుంది. ఈ విద్యార్థుల బృందం గతేడాది సెప్టెంబర్‌లో నిట్ వరంగల్‌లో జరిగిన సెమీ ఫైనల్స్‌లో వాటర్ మీటర్‌ను ప్రదర్శించి ఫైనల్స్‌కు చేరుకున్నారు. అక్టోబర్‌లో హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన ఫైనల్స్‌లోనూ నాలుగో స్థానంలో నిలిచారు. అలాగే ఈ ఏడాది మార్చి హైదరాబాద్‌లో జరిగిన టైగ్రాడ్ గ్లోబల్ ఈవెంట్లో సైతం పాల్గొని ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో టీఎస్‌ఐసీతో విద్యార్థుల బృందానికి సంబంధాలు పెరగడంతో పాటు ఎలవేటర్ పిచ్ వీడియోను ట్విట్టర్లో పెట్టారు. వీటన్నింటిని ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్రలో అప్లోడ్ చేసి వరంగల్ అర్బన్ కలెక్టర్‌తోపాటు కేటీఆర్, జేఎస్ రంజన్, జీహెచ్ఎంసీ అధికారులకు ట్యాగ్ చేశారు. స్టార్టప్ ఇండియా యాత్రను పూర్తిగా సపోర్ట్ చేస్తున్న కేటీఆర్ వాటర్ మీటర్‌ను చూసి స్పందించి సందీప్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈనెల 12, 13 తేదీల్లో రెండు, మూడు రోజుల పాటు డెమోకు రావాలని సందీప్ బృందాన్ని వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆహ్వానించారు. కాగా ఈ వాటర్ మీటర్‌ను మిషన్ భగీరథకు పథకానికి వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
ఎర్ర చందనం స్మగ్లింగ్.. బీటెక్ విద్యార్థి అరెస్ట్
సాక్షి, కడప : రాజంపేట ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని రోల్లమడుగు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు మూడు రోజుల పాటు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ 60 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అధికారులకు తారసడ్డారు. ఫారెస్ట్ పోలీసులను చూసిన స్మగ్లర్లు అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరిలో ఒక బీ టెక్ విద్యార్థి ఉండటం గమనార్హం. స్మగ్లింగ్ లాభసాటిగా ఉండటంతో చాలా మంది చదువుకున్న తమిళ యువత అడవుల బాట పడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. స్మగ్లర్ల నుంచి రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలతో పాటు 10 గొడ్డళ్లు, రంపాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
జ్యోత్స్న మృతిపై దర్యాప్తు ముమ్మరం
విశాఖపట్నం , సీతమ్మధార(విశాఖ ఉత్తర): నగరంలోని బుల్లయ్య కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న మల్కాపురం దరి జనతా కాలనీకి చెందిన జ్యోత్స్న మృతిపై ఫోర్తుటౌన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కయ్యపాలెం శాంతిపురం దరి కట్టా ఎన్‌క్లేవ్‌లోని ఫోర్తుప్లోర్‌లోని ప్లాట్‌లో జ్యోత్స్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్లాట్‌లో బిహార్‌కు చెందిన అంకోర్‌తోపాటు అతని స్నేహితుడు, మరో లెక్చరర్ పవన్ ఉంటున్నాడు. దీంతో ఇప్పటికే వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా జ్యోత్స్న ప్లాట్‌లోకి వెళ్లేటప్పటికి ఎవరున్నారు..? ఆమె ఆత్మహత్య చేసుకునే సమయంలో అంకోర్, పవన్ ఎక్కడున్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు ఇప్పటికే అపార్టుమెంట్ వాసులతో పాటు వాచ్‌మెన్‌ను విచారించారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం ఉదయం బుల్లయ్య కళాశాలకు సీఐ రవి వెళ్లారు. అక్కడి జ్యోత్స్న స్నేహితురాళ్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. మరోవైపు మృతురాలి ఫోన్లో ఉన్న మెసేజ్‌లు, చాటింగ్‌కు సంబంధించిన వివరాలు సేకరించి దర్మాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్యకు ముందు జ్యోత్స్న ఎవరెవరికి ఫోన్ చేసింది..? అన్న వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు మృతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. మంగళవారం పోస్టుమర్టం పూర్తి కావడంతో ఇంకా రిపోర్టు రావాలసి ఉందని సీఐ రవి తెలిపారు. అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
జ్యోత్స్నది ముమ్మాటికీ హత్యే
విశాఖపట్నం, డాబాగార్డెన్స్ / పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): బీటెక్ విద్యార్థిని జ్యోత్స్నది ముమ్మాటికీ హత్యేనని మహిళ చేతన కార్యదర్శి కె.పద్మ ఆరోపించారు. నగరంలోని మల్కాపురం ప్రాంతానికి చెందిన జ్యోత్స్న(20) అనుమానాస్పద మృతిపై మహిళా సంఘాలు మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ విద్యార్థిని మృతిపై హత్య కోణంలో పోలీసులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓ అమ్మాయి అనుమానస్పదంగా మృతి చెందితే దర్యాప్తు చేపట్టకుండా మృతదేహాన్ని మార్చురీకి తరలించే ప్రయత్నం పోలీసులు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలన్నారు. ఫ్యాకల్టీ రూమ్‌లో విద్యార్థిని మృతి చెందిందంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలపాలన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.ఎన్.మాధవి, ఆర్.విమల మాట్లాడుతూ నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టంలో సమగ్ర నివేదిక ఇవ్వాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఆడ పిల్లలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో మహిళా సంఘాల ప్రతినిధులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పాల్గొన్నారు -
విశాఖపట్నంలో బీటెక్ విద్యార్థిని జ్యోత్స్న అనుమానాస్పద మృతి
-
బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, విశాఖపట్నం: బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపింది. బుల్లయ్య కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న జ్యోత్స్న అనే విద్యార్థిని అక్కయ్యపాలెంలోని లెక్చరర్ ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో అనుమానాలు తలెత్తాయి. మల్కాపురం ప్రకాశ్ నగర్‌కు చెందిన జోత్స్న ఏడాదిన్నర కాలంగా అంకుర్ కిష్లే అనే లెక్చరర్ వద్ద ఐఐటీ కోచింగ్‌కు సంబంధించి సలహాలు తీసుకుంటోంది. బిహార్‌లోని పట్నాకు చెందిన అంకుర్.. అక్కయ్యపాలెంలోని అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. నిన్న ఉదయం అంకుర్ ఇంటికి వెళ్లిన జ్యోత్స్న అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీస్ స్టేషన్‌కు వచ్చి అంకుర్ చెప్పడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఆమె దేహంపై ఎటువంటి గాయాలు లేవు. గతంలో లాంగ్ టర్మ్ తీసుకునే సమయంలో అంకుర్‌తో జోత్స్నకు పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది. అంకురే చంపి ఉంటాడు తన కుమార్తె ఎంతో తెలివైనదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని జ్యోత్స్న తల్లి మారుతి అన్నారు. తన కూతురిని అంకురే చంపివుంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కాగా, నిందితుడు అంకుర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జ్యోత్స్న మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. -
వాట్సప్ మెసేజ్ చేసింది.. ఆ తర్వాత కొద్దిసేపటికి
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్‌లో నివసించే టంగుటూరి పావని (21) అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. వరంగల్‌కు చెందిన పావని గండిపేటలోని సీబీఐటీలో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతోంది. సమీపంలోని ఓసియన్ పార్కు వద్ద జయా రెసిడెన్సీ హాస్టల్లో ఉంటుంది. సెలవులు రావడంతో ఓటు వేసేందుకు ఈనెల 6న స్వగ్రామం వరంగల్ జిల్లా మట్టెవాడ గోపాలస్వామి టెంపుల్ లైన్లో ఉన్న ఇంటికి వెళ్లింది. గురువారం ఉదయం ఓటు వేసిన అనంతరం 9.30 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు వచ్చి హైదరాబాద్ వెళ్లేందుకు రైలెక్కింది. మధ్యాహ్నం 12.40 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దిగినట్లుగా సోదరి గౌతమికి ఫోన్ చేసి చెప్పింది. మెహిదీపట్నంలో బస్సు ఎక్కానని నేరుగా హాస్టల్‌కు వెళుతున్నానని మధ్యాహ్నం 2.28 గంటలకు వాట్సప్ మెసేజ్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆమె హాస్టల్‌కు చేరుకోలేదు. వాస్తవానికి శుక్రవారం ఆమెకు పరీక్ష కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హుమాయున్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి సెల్సిగ్నల్స్పై ఆరా తీయగా శంకర్‌పల్లిలో చివరి సిగ్నల్ వచ్చిందనీ అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తర్వాత సిగ్నల్స్ అందలేదని తేలింది. ఆమె కాల్‌డేటా కోసం పోలీసులు వేచిచూస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ ఫుటేజ్‌లు పరిశీలిసు ్తన్నారు. ఆమె కాల్‌డేటా తీస్తే గానీ అసలు విషయం బయటపడదని పోలీసులు భావిస్తున్నారు. ఇంకోవైపు శంకర్‌పల్లిలోని పలు ప్రాంతాల్లో ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఫీజు కట్టలేదని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్ : తల్లిదండ్రులు కాలేజీ ఫీజు కట్టలేదని మనస్తాపానికి గురయిన ఓ విద్యార్థిని బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు.. సుస్మిత (21) అనే విద్యార్థిని ఘట్కేసర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఈ నేపథ్యంలో కాలేజీ ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులకు చెప్పింది. అందుకు వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురయిన సుస్మిత మూడవ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుస్మితను విద్యానగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
తాను చనిపోతూ మరికొందరికి ప్రాణదానం
సోమాజిగూడ: బ్రెయిన్‌డెడ్ అయిన ఓ విద్యార్థిని తన అవయవాలను ఇతరులకు దానం చేసి మరికొందరికి ప్రాణదానం చేసింది. వివరాలు.. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంకు చెందిన అయిలూరి శ్రీనివాస్, కవిత దంపతుల కుమార్తె అభినయ(14) కొత్తగూడెంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది.ఈ నెల 5న అభినయ తన ఇంట్లో అకస్మాత్తుగా కళ్లు తిరిగి కింద పడిపోయింది. వెంటనే చికిత్స కోసం మలక్‌పేట్‌లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు చికిత్స నిర్వహించినా ఫలితం కనిపించలేదు. 7వ తేదీ సాయంత్రం అభినయకు బ్రెయిన్ డెడ్ అయిందని అక్కడి న్యూరో ఫిజీషియన్ నిర్ధారించాడు. జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవ దానంపై బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో అవయవ దానానికి వారు అంగీకరించారు. దీంతో అభినయ శరీరం నుంచి కిడ్నీలు, లివర్, కళ్లు, ఊపిరితిత్తులు సేకరించి అవసరమైన మరికొందరు రోగులకు అమర్చారు. -
పెద్దకుమారుడి సంవత్సరీకం జరిగిన 15 రోజులకే ..
సాక్షి, గుంటూరు/గుంటూరు రూరల్/గుంటూరు ఈస్ట్: గుంటూరు రూరల్ మండలం, లాలుపురం శివారు ప్రాంతంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు బీటెక్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామంలోని ఆర్వీఆర్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాధినేని ధనుష్(18), గుంటూరు కోటేశ్వరరావు(19), చిరుమామిళ్ల సాయిరాం(18), షేక్ గఫూర్(18) ప్రాణాలు కోల్పోయారు. అలోకం తారక్ హీరేంద్ర, దొప్పలపూడి సత్య కౌశిక్, ఆళ్ల శివాజీ గాయపడ్డారు. ఈ ఏడుగురూ కలిసి సోమవారం ఉదయం కళాశాలలో అడ్వాన్స్ న్యూ ఇయర్వేడుకలు జరుపుకొన్నారు. అనంతరం షాపింగ్ కోసం విజయవాడకు కారులో బయలుదేరారు. కారు గుంటూరు వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపైకి ఎక్కి రెండు కిలోమీటర్లు వెళ్లే సరికి ముందు వెళ్తున్న మున్సిపల్ చెత్త లారీని ఓవర్టేక్ చేయబోయి వెనుక భాగంలో ఢీ కొంది. కారు నడుపుతున్న కౌశిక్ కంగారుపడి కారును కుడి వైపు తిప్పగా అప్పటికే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న వాహనం డివైడర్ ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి గాలిలోకి పల్టీలు కొట్టుకుంటూ 50 మీటర్ల దూరంలో పడింది. లారీ సైతం ఇనుప రెయిలింగ్‌ను ఢీకొని బోల్తాపడింది. లారీ డ్రైవర్ దేవరపల్లి కిరణ్, క్లీనర్ దూపాటి రాంచరణ్, మున్సిపల్ కార్మికుడు రుద్రయ్య గాయపడ్డారు. మృతదేహాలు, క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న విద్యార్థుల బంధువులు, తల్లిదండ్రులు, ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల విద్యార్థులు జీజీహెచ్‌కు చేరుకున్నారు. వారి రోదనలు మిన్నంటాయి. కను పాపలను బలితీసుకున్న రోడ్డు ప్రమాదాలు పట్నంబజారు(గుంటూరు): ఆ కుటుంబంపై కాలం కక్షగట్టిందో ఏమో.. కంటికి రెప్పలా చూసుకున్న ఇద్దరు కుమారులను రోడ్డు ప్రమాదాల రూపంలో పొట్టనబెట్టుకుంది.. సంవత్సరం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం ఆ ఇంటి పెద్ద కుమారుడిని బలితీసుకుంది. పెద్ద కుమారుడు ఆ ఇంట చేసిన సందడి ఛాయల ఆలాపనలు ఊసులాడుతూనే ఉన్న ఆ తల్లితండ్రులపై విధి మరోసారి చిన్నచూపు చూసింది.. సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం మరో కంటిపాపను చిదిమేసింది.. పెద్దకుమారుడి సంవత్సరీకం జరిగి పదిహేను రోజులు గడవవముందే.. చిన్నకుమారుడి మరణవార్త విన్న ఆ తల్లితండ్రుల గుండెల పగిలిపోయాయి.. కుమారుల మృత్యువు రూపంలో పాపం ఆ తల్లితండ్రులను కన్నీటి సుడుల మధ్య నలిగిపోయేలా చేసింది. ఆర్వీఆర్ అండ్ జేసి కళాశాలలో బీటె చదువుతూ లాలుపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన వారిలో ఒకరైన సాధినేని ధనుష్ (20) కుటుంబానిది ఎనలేని విషాధ గాథ. ధనుష్ తండ్రి వెంకటసుబ్బారావు బిల్డర్.. తల్లి జ్యోతి గృహిణి. వారికి శ్రీకల్యాణ్ (24), ధనుష్ సంతానం. ప్రకాశం జిల్లా కోనంకి మండలంకు చెందిన వెంకటసుబ్బారావు విద్యానగర్‌లో స్థిరపడ్డారు. ఇద్దరు కుమారులను చదివించుకుంటున్న ఆ తల్లిదండ్రులను చూసి విధికి కన్నుకుట్టిందేమో... చెన్నైలో బీటెక్ నాలుగో సంవత్సరం అభ్యసిస్తున్న పెద్ద కుమారుడు శ్రీకల్యాణ్ను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. గత ఏడాది క్రితం 2017 డిసెంబర్ 16వ తేదీన కల్యాణ్ రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడు. సరిగ్గా పదిహేను రోజుల క్రితం అతని సంవత్సరీకం జరిగింది. ఆ బాధను మరువక ముందే మరో దుర్ఘటన.. చిన్నకుమారుడు ధనుష్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని తెలిసిన బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున విద్యానగర్‌లోని వెంకటసుబ్బారావు ఇంటికి చేరుకున్నారు. అప్పటి వరకు ప్రమాద సమాచారం ధనుష్ తల్లి జ్యోతికి తెలియదు. ఏదో ఉపద్రవం మరోమారు తమ కుటుంబాన్ని అతలాకుతలం చేసిందని గ్రహించిన ఆ తల్లి పడ్డ వేదన ప్రతి ఒక్కరి చేత కంటనీరు పెట్టించింది. కడుపున పుట్టిన బిడ్డలు ఇక లేరని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. కదిలిస్తే కన్నీళ్లే గుంటూరు ఈస్ట్: మృతిచెందిన, గాయపడిన విద్యార్థుల కుటుంబ సభ్యుల ఒక్కొక్కరిదీ ఒక్కొక్క వ్యథ. పిల్లల భవిష్యత్తు కోసం కొందరు తమ శక్తికి మించి బీటెక్ చదివిస్తున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అప్పు చేసి కష్టాలను మీద వేసుకుని జీవిత నౌకను ముందుకు లాగుతున్నారు. అయితే ఆ పిల్లలు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరారని తెలియడంతో వారి ఆశల సౌధాలు కుప్పకూలిపోయాయి. తారక్ వీరేంద్ర తండ్రి సుధాకర్ తన అన్న మృతిచెందడంతో అంత్యక్రియల కోసం ఊరు వెళ్లారు. కొడుకుకు ప్రమాదం జరిగిందని ఫోన్లో తెలుసుకుని విలవిలలాడిపోయారు. గుంటూరులో ఉన్న సమీప బంధువుకు ఫోన్‌చేసి జీజీహెచ్‌కు వెళ్లాలని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. తాను కారు డ్రైవర్ అయినా .. పిడుగురాళ్లకు చెందిన షేక్ బాలసైదా ఎంతో ఆశపడ్డాడు. అప్పు, సొప్పు చేసి బీటెక్ చేర్పించారు. హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. అతని కుమార్తె ఫాతిమా ఆరో తరగతి చదువుతోంది. తాను ఎంతో ఆశపెట్టుకున్న గఫూర్ కానరాని లోకానికి వెళ్లిపోవడంతో బాలసైతా అచేతనుడయ్యాడు. మేనల్లుడి పుట్టిన రోజు కోసం.. చిరుమామిళ్ల సాయిరామ్ సోదరి అమెరికాలో ఉంటారు. వారం క్రితం కంభంపాడు వచ్చారు. ఆమె కుమారుడి పుట్టిన రోజు రెండు రోజుల్లో ఉంది. ఆ వేడుకలకు హాజరు కావాలని సాయిరామ్ స్నేహితులకు సంతోషంగా చెప్పుకున్నాడు. ఇంతలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదలడంతో అతని తండ్రి రమేష్‌బాబు, తల్లి గంగాదేవి ఇక తాము ఎందుకు బతకాలంటూ రోదించారు. అప్పుచేసి ఇంటికి మరమ్మతులు గుంటూరు కోటేశ్వరరావు తండ్రి సాంబశివరావు రైతు. బీటెక్ చదివే కుమారుడి స్నేహితులు వస్తే, వారికి తగ్గట్టుగా ఇల్లు ఉండాలని ఖర్చు పెట్టి ఇంటికి మరమ్మతులు చేయించాడు. భార్య మల్లేశ్వరి అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఈ ఖర్చు ఎందుకని వారించానని తండ్రి విలపించారు. సివిల్స్ సాధిస్తాడనుకుంటే.. పిడుగురాళ్ల/పిడుగురాళ్ల టౌన్: చదివే లోకం.. సివిల్స్‌లో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చదువుకుంటున్న పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్ గఫూర్ (19) సోమవారం కారు ప్రమాదంలో మృతిచెందాడు. తల్లిదండ్రులు షేక్ సైదాబీ, బాలసైదాలు కన్నీరు మున్నీరయ్యారు. గఫూర్ మృతదేహం సోమవారం రాత్రి పిడుగురాళ్లలోని స్వగృహానికి రావడంతో విషాదఛాయలు అలముకున్నాయి. సివిల్స్‌ను గెలిచి ఉద్యోగం సాధిస్తానని, కుటుంబంతోపాటు అందరిని ఆదుకుంటానని చెప్పే గఫూర్ కానరాని లోకానికి వెళ్లాడంటూ తల్లిదండ్రులు రోదించారు. పెద్దయ్యాక మమ్మల్ని ఆదుకుంటానని చెప్పావుగా.. ఇప్పుడు కళ్ల తెరవకుండా పడుకున్నావు.. ఒక్క సారి కల్లు తెరువు బిడ్డా అంటూ చిన్నమ్మ మంగ విలపించారు. నెరవేరని తండ్రి ఆశలు శావల్యాపురం(వినుకొండ): గుంటూరు సమీపంలోని లాల్పురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గుంటూరు కోటేశ్వరరావు స్వగ్రామం శావల్యాపురం మండలం కొత్తలూరు పంచాయతీ శివారు తుమ్మలకుంట. అతని మృతితో తుమ్మలకుంటలో విషాదఛాయలు అలముకున్నాయి. మాజీ సర్పంచిగుంటూరు సాంబశివరావు, నాగమల్లేశ్వరి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రాథమిక విద్య నుంచి రాణిస్తున్న కుమారుడిని ఉన్నత స్థానాల్లో చూడాలని సాంబశివరావు ఖర్చును సైతం లెక్కచేయకుండా చదవిస్తున్నారు. అయితే ఆ బిడ్డను రోడ్డు ప్రమాదం పొట్టనబెట్టుకుందని తెలిసిన దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. -
యూ ట్యూబ్‌లో చూసి చోరీయత్నం
వారంతా బీటెక్ చదివిన యువకులు.. చెడు వ్యసనాలకు బానిసలై ఈజీ మనీకి ప్రయత్నించారు. యూ ట్యూబ్‌లో చోరీ చేసే వీడియోలు చూసి బ్యాంక్ ఏటీఎంలను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆ చోరీ ప్రయత్నం ఫలించకపోగా, పోలీసులకు చిక్కారు. నిడదవోలు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కొవ్వూరు డీఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి, నిడదవోలు: పట్టణానికి చెందిన చెరుకూరి మునీంద్ర, ఎస్కే అరుణ్ రహిద్, యంగాల ఆదిత్య కొవ్వూరు డివిజన్ పరిధిలో దేవరపల్లి, గౌరీపట్నం, చాగల్లు ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఏటీఎం చోరీలకు ప్రయత్నించారు. వీరంతా బీటెక్ డిప్లమో పూర్తి చేశారు. చాగల్లు ఏటీఎం కేంద్రం వద్ద మంగళవారం మరోసారి ఏటీఎం చోరీకి ఉపక్రమిస్తున్న సమయంలో సిబ్బంది దాడి చేసి ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. స్నేహితులైన ఈ ముగ్గురు ఏటీఎం కేంద్రాల్లో చోరీ ఎలా చెయ్యాలో యూ ట్యూబ్ ద్వారా తెలుసుకున్నారు. ఏటీఎం కేంద్రాల్లో ఉన్న సీసీ కెమెరాలను రాడ్‌తో పగలగొట్టిన అనంతరం ఏటీఎం యంత్రాలను రాడ్లతో ధ్వంసం చేస్తారు. ఏటీఎం యంత్రాల్లో ఉన్న బాక్స్‌లు తెరుచుకోకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేసేవారు. బాక్స్‌లు తెరచుకోకపోవడంతో డబ్బులు వీరికి దొరకలేదని డీఎస్పీ చెప్పారు. యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. నిడదవోలు సీఐ కేవీఎస్వీ ప్రసాద్, చాగల్లు, నిడదవోలు ఎస్సైలు ఐ.రవికుమార్, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో మోసం..విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సాక్షి, విజయవాడ: ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముంటున్న గుర్రం ప్రవీణ్ వృత్తిరీత్యా మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమ పేరుతో స్థానిక కాలేజీలో బీటెక్ చదువుతున్న యువతిని మోసం చేస్తూ ఇన్ని రోజులు కాలం వెల్ల దీశాడు. ఆ యువతిని పీకల్లోతూ ప్రేమలోకి దించేశాడు. చివరికి పెళ్లి ప్రస్తావనను ఆ యువతి తీసుకొచ్చేసరికి తనకు అప్పటికే పెళ్లైన విషయం చెప్పడంతో మోసానికి గురయినట్లు భావించింది. దీంతో మనస్థాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ: నగరంలో గురువారం కలకలం రేగింది. వివిధ కారణాలతో ముగ్గురు వేర్వేరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు.. నగర శివారులోని వాంబే కాలనీలో నివాసముంటున్న శ్రావణి అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి బలవన్మరణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేశామని దర్యాప్తు మొదలైందని విజయవాడ రూరల్ పోలీసులు తెలిపారు. నగర శివారు ప్రాంత గ్రామంలో.. విజయవాడ శివారులో గల ఓ గ్రామంలో వరదారెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆర్ధిక ఇంబందుల కారణంగా వరదా రెడ్డి ఆత్మహత్య చేసుకోవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. బీటెక్ విద్యార్థి కృష్ణలంకలో బీటెక్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న యువతిని విజయవాడలోని ప్రవేట్ ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. కాగా, కుటుంబ కలహాల కారణంగానే యువతి చనిపోయిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నామనీ, దర్యాప్తు మొదలుపెట్టామని పోలీసులు వెల్లడించారు. మృతురాలు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. -
తల్లిదండ్రులు, చెల్లెలిపై బీటెక్ విద్యార్థి కిరాతకం
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తన ‘స్వేచ్ఛ’కు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులు, చెల్లెలిపై కోపం పెంచుకున్న బీటెక్ విద్యార్థి, వారిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా ఈ నేరాన్ని తండ్రిపై నెట్టాలని చూశాడు. చివరికి నేరాన్ని అంగీకరించి కటకటాలపాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం... మిథిలేశ్ అనే ఇంటీరియర్ డిజైనర్ భార్యా పిల్లలతో కలిసి దక్షిణ ఢిల్లీలో నివసిస్తున్నాడు. కొడుకు సూరజ్(19).. గురుగ్రామ్‌లోని ఓ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ మొదటి ఏడాది చదువుతున్నాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి జల్సాలకు అలవాటు పడ్డ సూరజ్ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. స్నేహితులతో తిరగొద్దని, వాళ్లను ఇంటికి తీసుకురావద్దని హెచ్చరించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులపై కోపం పెంచుకున్న సూరజ్.. వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా తన మొబైల్ చెక్ చేస్తూ వారికి తన గురించి చాడీలు చెబుతున్న చెల్లెల్ని(16) కూడా అడ్డు తొలగించుకోవాలని భావించాడు. బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించిన సూరజ్.. బెడ్రూంలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు, చెల్లెలిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. కట్టుకథ అల్లాడు.. హత్య చేసిన తర్వాత ఇరుగుపొరుగు వారిని పిలిచిన సూరజ్ తన తల్లిదండ్రులు, చెల్లెల్ని దొంగలు చంపేశారని ఏడ్వడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా వారికి అనుమానం రాకుండా తనని తాను కత్తితో గాయపరచుకున్నాడు. ఈ ఘటనతో ఉలికిపడ్డ పక్కింటి వారు సూరజ్‌ను సముదాయించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే సూరజ్ ప్రవర్తనతో అనుమానం కలిగిన పోలీసులు అతడిని పోలీసు స్టేషనుకు పిలిపించారు. విచారణ జరుపుతున్న క్రమంలో హత్యకు కారణం దొంగలు కాదని.. తన తల్లి, చెల్లెలిని కత్తితో పొడిచింది తండ్రేనని.. అందుకే ఆయనను చంపానని సూరజ్ పోలీసులకు చెప్పాడు. కానీ మిథిలేశ్‌కు అలాంటి వాడు కాదని.. భార్యా పిల్లలను ప్రేమగా చూసుకునే వాడని ఇరుగుపొరుగు వారు చెప్పడంతో సూరజ్‌ని మరోసారి లోతుగా విచారించారు. ఈ క్రమంలో కామన్ గేట్ తాళం చెవి ఆధారంగా నిందితుడు సూరజేనని కనిపెట్టగలిగారు. 2013లో కిడ్నాప్ నాటకం... చిన్ననాటి నుంచే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన సూరజ్‌కు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ సరిపోయేది కాదు. అంతేకాకుండా తమది సంపన్న కుటుంబమైనా తల్లిదండ్రులు తనకి డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని 2013లో కిడ్నాప్ నాటకం ఆడాడు. స్నేహితుల దగ్గరే కొన్నాళ్లపాటు ఉన్న సూరజ్ కిడ్నాప్ అయ్యానంటూ తల్లిదండ్రుల నుంచి డబ్బు వసూలు చేశాడు. -
జుబైర్ ఖాన్.. బీటెక్
అత్యాధునిక టెక్నాలజీని అనవసర, అభ్యంతరకర విషయాలకు మాత్రమే యువత ఉపయోగిస్తున్నారని అనేక మంది అభిప్రాయం. అయితే అదేసాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నగరంలోని సైబరాబాద్ పరిధిలో అత్యంత ప్రమాదకరమైన రహదారులను, సంబంధిత విశేషాలను గుర్తించి వాటిని నివారించే పనిలో ఉన్నవారికి ఉపకరించేలా ఓ మ్యాప్‌ను తయారు చేశాడు నగర విద్యార్థి జుబైర్‌ఖాన్. ఈ కుర్రాడి పరిశోధన పత్రాలను ఇటీవలే ఢిల్లీకి చెందిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్టెక్నికల్ ఇన్నొవేషన్ ఇన్ మోడ్రన్ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ప్రచురించింది. సాక్షి, సిటీబ్యూరో: సిటీలో రోడ్లతో పాటు వాహనాలు వాటితో పాటు ప్రమాదాలు కూడా అంతకంతకూ పెరుగుతున్న విషయం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేప«థ్యంలోదారుస్సలాంలోని డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్ కోర్సు ఫైనల్ ఇయర్ విద్యార్ధి జుబైర్‌ఖాన్ ఈ అంశంపై ఒక సమగ్రమైన నివేదిక తయారు చేయాలని సంకల్పించాడు. దీని గురించి టోలీచౌకి నివాసి జుబైర్ ‘సాక్షి’కి చెప్పిన విశేషాలు తన మాటల్లోనే... ఏడాది కృషి... అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నా ప్రమాదాలను నివారించలేకపోతున్నామనే బాధే నన్ను ఈ ప్రాజెక్ట్‌పై పనిచేసేందుకు పురికొల్పింది. ఈ మ్యాప్ రూపకల్పనుకు మొత్తంగా ఏడాది సమయం పట్టింది. దీని కోసం తొలుత 4 నెలల పాటు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్)సాఫ్ట్వేర్, జిపిఎస్ వంటి 4 రకాల సాఫ్ట్వేర్లపై పట్టు సాధించాను. అనంతరం ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్స్‌తో పాటు మరికొన్నింటి సాయం తీసుకున్నా. గూగుల్ ఎర్త్‌ను ఉపయోగించి నగరంలో ప్రమాదం జరిగే ప్రాంతాలను రోడ్ నెట్‌వర్క్‌ను గుర్తించా. ఆర్క్ జిఐస్ సాఫ్ట్వేర్ ద్వారా 2017లో జరిగిన రోడ్డు ప్రమాదాల డేటా తీసుకున్నాను. సాఫ్ట్వేర్ ద్వారా ప్రమాద నిలయాలైన మేడ్చల్, దుండిగల్, మియాపూర్, కీసర, ఉప్పల్, ఆదిభట్ల, కెపిహెచ్బి, శంషాబాద్, నార్సింగ్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాలను గుర్తించాను. డేటా ప్రకారం వీటిలో ప్రమాదాల స్థాయిని బట్టి తక్కువ, మధ్యస్థం, ఎక్కువ, అత్యధికం ఇలా విభజించాను. డేంజరస్ రోడ్స్...ఇవే... సైబరాబాద్ పరిధిలోకి వచ్చే... చందా నగర్ నుంచి మియాపూర్, గచ్చిబౌలి నుంచి కెపిహెచ్బి, జీడిమెట్ల నుంచి మేడ్చల్, మీర్ పేట్ నుంచి ఇబ్రహీంపట్నం, మీర్పేట్ నుంచి వనస్థలి పురం, నార్సింగ్ నుంచి నానక్‌రామ్ గూడ, శంషాబాద్ వైపుగా వెళ్లే ఎన్‌హెచ్7 రోడ్స్, సాగర్ రింగ్ రోడ్ నుంచి రాజేంద్రనగర్... రహదారులు ప్రమాదాలకు కేంద్రాలుగా గుర్తించా. ఈ రోడ్ల మీద కేవలం ఒక్క ఏడాది (2017–18)లోనే 200కిపైగా తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మద్యం తాగి డ్రైవ్ చేయడంతో పాటు గతుకుల రోడ్లు, వాహనాల వేగం, నిబంధనలు పాటించకపోవడ ంవంటి అనేక కారణాలు ఈ ప్రమాదాల వెనుక ఉంటున్నాయి. ప్రమాదాలకు సంబంధించిన ఈ డేటాని ఉపయోగించి ప్రమాదాలను–ట్రాఫిక్‌ను విశ్లేషించడానికి, భద్రతా స్థాయిలను గుర్తించడంలో ఇది సహకరిస్తుందని నా అభిప్రాయం. -
విద్యార్థిని ఆత్మహత్య
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండల నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఫిరంగిపురం మండలం వేములూరిపాడుకు చెందిన ఆట్ల నాగమణి(20) ఓ కార్పోరేట్ కళాశాలలో హాస్టల్లో ఉంటూ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అనారోగ్యంగా ఉందని ఉదయం జరిగే స్టడీ అవర్ క్లాసులకు వెళ్లకుండా హాస్టల్ రూంలోనే ఉంది. ఈ క్రమంలో తాను ఉండే గది పక్కనే ఉన్న మరో గదిలో స్నేహితుల బ్యాగులు వెతుకుతుండగా హాస్టల్లో ఉండే విద్యార్థులు గమనించి ఆమె నిలదీశారు. వార్డెన్‌కు ఫిర్యాదు చేసేందుకు విద్యార్థులు వెళ్లడంతో మనస్తాపానికి గురైన నాగమణి రూం తలుపులు వేసుకుని చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు రాకపోవటంతో గమనించిన అధ్యాపకులు కిటికీలనుంచి చూడగా అప్పటికే ఉరివేసుకుని ఫ్యానుకు వేలాడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
శైలజ.. బీటెక్ దొంగ
బోడుప్పల్: లేడీస్ హాస్టళ్లలో చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఓ బీటెక్ విద్యార్థినిని గురువారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా, కాచికుంట కాలనీకి చెందిన శైలజ(19) బీటెక్ రెండో సంవత్సరం చదువుతుంది. మూడు నెలల క్రితం చదువు మానేసిన ఆమె ఉప్పల్ రామాలయం వీధిలో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. పీర్జాదిగూడ బుద్ధానగర్‌లో నాగరాజు అనే వ్యక్తి స్టైల్ ఆఫ్ శ్రీనిధి గరల్స్ పేరుతో లేడీస్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 4న హాస్టల్లో చోరీ జరగడంతో అతను మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం బుద్ధానగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న శైలజను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించింది. ఉప్పల్‌లోని ఓ హాస్టల్లో రూ 22.500 నగదు, బుద్ధానగర్‌లో రూ 40 వేల విలువైన ఐఫోన్‌ను దొంగలించినట్లు తెలిపింది. నిందితురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
విదేశాలకు వెళ్లాలని...
నాచారం: విదేశాలకు వెళ్లాలనే కోరికతో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తులను సీసీఎస్ మల్కాజిగిరి, భువనగిరి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 3.50 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ క్రైం డీసీపీ నాగరాజు, అడిషనల్ డీసీపీ ఎస్కె సలీమ ఆదివారం నాచారం సీసీఎస్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. సరూర్‌నగర్, బాలాజీ నగర్‌కు చెందిన నెనావత్ వినోద్ కుమార్, అంబర్ పేటకు చెందిన మనీష్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు గతంలో పలు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లారు. జైలులో వీరికి పరిచయం ఏర్పడింది. దొంగిలించిన సొమ్ముతో కెనడాకు వెళ్లి స్థిరపడాలని నిర్ణయించుకున్న వీరు జైలు నుంచి విడుదలైన అనంతరం మీర్పేట్, ఉప్పల్, వనస్థలిపురం, పంజాగుట్ట , చించువాడ(పూణే) పోలీస్స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్నారు. ఆదివారం ఉదయం సీసీఎస్ భువనగిరి పోలీసులు వీరిని అరెస్ట్ చేసి వారి నుంచి 3 ద్విచక్రవాహనాలు, సోనీ ఎల్ఈడి టీవీ, ల్యాప్ టాప్, సామ్సంగ్ మొబైల్, 10 గ్రాముల బంగారు అభరణాలు, డిజిటల్ కెమెరా, హ్యాండీ క్యామ్, వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు బంగారు ఆభరణాలను అడ్డా కూలీలైన మహిళల సహాయంతో బంగారు షాపుల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సీసీఎస్ భువనగిరి ఇన్స్పెక్టర్ పార్థసారథి, ఏఎస్ఐ షర్బుద్దీన్, కానిస్టేబుళ్లు ఇలయ, ప్రశాంత్ రెడ్డి, కిషోర్‌లను డీసీపీ అభినందించారు. -
నాకు అతనే కావాలి!
సాక్షి, తాడేపల్లి రూరల్: విజయవాడకు చెందిన ఓ దొంగ బీటెక్ చదివే విద్యార్థినిని ప్రేమలోకి దించి, ఆమె మెప్పు పొందేందుకు దొంగతనాలకు పాల్పడుతూ సదరు యువతికి కావాల్సినవన్నీ కొంటూ, చివరకు పెళ్లి చేసుకునే తరుణంలో పోలీసులకు చిక్కి చెరసాల పాలైన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... విజయవాడ నగరంలోని పెజ్జోనిపేటలో నివాసం ఉండే ఎస్.కె.ఇమ్రాన్ ఐటీఐ చదువు మధ్యలో ఆపివేసి, జల్సాలకు అలవాటు పడ్డాడు. జల్సాలకు అవసరమైన డబ్బులు సంపాదించేందుకు కొంతమందితో కలిసి దొంగతనాలకు పాల్పడుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని పరిచయమైంది. అప్పట్లో ఇమ్రాన్ ఇంటికి వచ్చిన యువతి మైనర్ కావడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో నివాసం ఉండే ఆ యువతిని చూసేందుకు ఇమ్రాన్ గ్రామానికి వచ్చి దొంగతనానికి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పట్లో మంగళగిరి పోలీసులు అతనిపై కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అయిదు రోజుల కిందట ఆ విద్యార్థిని మేజర్ అవడంతో తిరిగి ప్రియుడు ఇమ్రాన్‌ను వెతుక్కుంటూ విజయవాడ వెళ్లింది. ఇద్దరూ కలిసి పరారయ్యారు. యువతి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో వడ్డేశ్వరంలోని ఓ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తూ బయట నివాసం ఉంటున్న విద్యార్థుల ల్యాప్‌టాప్‌లు పోయాయని తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తుండగా, పాత నేరస్తుడు ఇమ్రాన్‌గా గుర్తించి, ఫోన్‌కాల్స్ డిటైల్స్ ఆధారంగా ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేశారు. తాడేపల్లి పోలీసులు ఇమ్రాన్‌ను పట్టుకోవడానికి వెళ్లిన సమయంలో పక్కనే ఆ విద్యార్థిని ఉండడంతో, వారిద్దరిని, వారితోపాటు మరో ఇద్దరు యువకులను తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ముందు నాకు పెళ్లి చేయండి, ఆ తర్వాతే కేస్ పెట్టండంటూ పోలీసుల కాళ్లావేళ్లా యువతి పడి బతిమిలాడడం గమనార్హం. బీటెక్ చదివే అమ్మాయి దొంగను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడం చూసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారంతా ముక్కుమీద వేలేసుకున్నారు. పోలీసులు మాత్రం బెయిల్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమని యువతికి సూచించారు. విద్యార్థిని తన తల్లిదండ్రులతో పుట్టింటికి వెళ్లకుండా దొంగ ఇమ్రాన్ తల్లిదండ్రులతో కలసి వారింటికి వెళ్లడం విశేషం. -
పుట్టినరోజు పార్టీ అని చెప్పి హోటల్‌కు తీసుకెళ్లి..
-
ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి
సాక్షి, విజయవాడ : సంగమం ఘాట్ వద్ద నలుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతైన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆ నలుగురు విద్యార్థుల్లో ఒకరైన ప్రవీణ్ (18) తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ నలుగురు కానిస్టేబుళ్లను సెక్యురిటీగా పెడితే మా బాబు బతికే వాడని, ఘాట్ వద్ద సెక్యురిటీ, హెచ్చరిక బోర్డులని ఎందుకు ఏర్పాటు చేయలేదని పోలీసులను నిలదీశారు. ఏ ముహుర్తాన సంగమం ఘాట్ ఏర్పాటు చేశారో కానీ ఎంతో మంది బలైపోతున్నారని వాపోయారు. ఘటన జరిగిన తరువాత కాలేజీ యాజమాన్యం కూడా మాకు సమాచారం ఇవ్వలేదనీ, ఈ దుర్ఘటనకు కాలేజీ యాజమాన్యంతో పాటు, ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతంలో పడవ ప్రమాదం జరిగి 22మంది చనిపోయినా ప్రభుత్వం ఘాట్ వద్ద సెక్యురిటీని ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. -
నలుగురు బీటెక్ స్టూడెంట్స్ గల్లంతు
-
విషాదం: నలుగురు బీటెక్ స్టూడెంట్స్ గల్లంతు
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద శనివారం జరిగింది. కంచికచర్లోని మిక్(ఎంఐసీ) ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పెర్రీ ఘాట్ వద్దకు వెళ్లారు. అయితే వీరిలో తొలుత ఒక విద్యార్థి స్నానం చేయడానికి కృష్ణా నదిలో దిగగా ప్రమాదశాత్తూ లోపలికి జారిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు తమ స్నేహితుడిని కాపాడేందుకు యత్నించారు. కానీ ఆ ప్రయత్నంలో ఆ ముగ్గురు బీటెక్ విద్యార్థులూ గల్లంతయ్యారు. కాగా గల్లంతైన వారి పేర్లు ప్రవీణ్(18), చైతన్య (18), శ్రీనాథ్ (19), రాజ్ కుమార్ (19). సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతైన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫెయిలైనా తల్లిదండ్రులు ప్రశ్నించలేదనీ..
ప్రకాశం ,తాళ్లూరు: ఆ విద్యార్థిని బీటెక్ చదువుతోంది. నాలుగేళ్లలోపు ఎన్ని సబ్జెక్టులు ఫెయిలైనా మరుసటి ఏడాదికి ప్రమోట్ చేస్తారు. అంత వరకూ ఓకే. బీటెక్ చదువుతున్న విద్యార్థిని మొదటి ఏడాదిలోనే తొమ్మిది సబ్జెక్టులు తప్పింది. ఇందుకు తల్లిదండ్రులు ఆమెను ఏమీ అనలేదు. దీన్నే ఆ విద్యార్థిని సీరియస్‌గా తీసుకుంది. తీవ్ర మనస్తాపం చెందింది. చిన్న సూసైడ్ నోట్ రాసి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని తురకపాలెంలో శుక్రవారం జరగగా ఆదివారం వెలుగు చూసింది. వివరాలు.. తురకపాలెం మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సూరా సుబ్బులు మనుమరాలు, వెంకటరెడ్డి కుమార్తె గురులక్ష్మి (20) గుంటూరు జిల్లా తెనాలిలోవని ఓ కాలేజీలో మూడో సంవత్సరం బీటెక్ చదువుతోంది. ఈ నేపథ్యంలో గురులక్ష్మి ఫస్టియర్‌లో తొమ్మిది సబ్జెక్టుల్లో ఫెయిలైంది. అయినా తల్లిదండ్రులు పల్లెత్తు మాటనలేదు. దీనికి విద్యార్థిని మరింత మనస్తాపం చెందింది. శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందింది. ఎస్ఐ రంగనాథ్ తన సిబ్బందితో కలిసి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వైఎస్సార్ సీపీ నేతల సంతాపం ఎంపీటీసీ మాజీ సభ్యురాలు సూరా సుబ్బులు మనుమరాలు మృతి చెందిన వార్తతో వైఎస్సార్ సీపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. అందరితో సఖ్యతగా ఉంటూ నలుగురిని నవ్విస్తూ ఉండే గురులక్ష్మి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని నేతలు వ్యాఖ్యానించారు. ఆమె మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త బాదం మాధవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఇడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీపీ గోళ్లపాటి మోషే, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ రమా వెంకటేశ్వరరెడ్డిలు సంతాపం తెలిపారు. -
విద్యార్థినిని వేధిస్తున్న కండక్టర్ అరెస్ట్
నాగోలు: బస్సులో ప్రయాణిస్తున్న బీటెక్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక వేధింపులకు పాల్పడుతున్న బస్సు కండక్టర్‌ను వనస్థలిపురం షీ టీమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. నాగోలు అయ్యప్ప కాలనీకి చెందిన బాదం శ్రీనివాస్‌గుప్తా అలియాస్ బీఎస్గుప్తా(50) బండ్లగూడ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. హయత్‌నగర్ నుంచి మెహిదీపట్నం వెళ్లే బస్సులో భాగ్యలత ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థిని రోజు బస్సు ఎక్కే క్రమంలో శ్రీనివాస్‌గుప్తా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతని వేధింపులు శృతిమంచడంతో బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. దీనిపై ఆమె గుప్తాను నిలదీయగా దురుసుగా ప్రవర్తించాడు. శుక్రవారం బస్సు లో మరోసారి అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు వనస్థలిపురం షీ టీమ్ వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న షీటీమ్ సభ్యులు నిందితుడిని అ రెస్ట్ చేసి కేసులు నమోదు చేసి రిమా ండ్‌కు త రలించారు. కండక్టర్ శ్రీనివాస్‌గుప్తా బస్సు లో మహిళలు, విద్యార్థినుల పట్ల అస భ్యంగా ప్ర వర్తిస్తున్నాడని పోలీసులు తెలిపా రు. సమావేశంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్ఐ విజయ్, షీ టీమ్ ఏఎస్ఐ యాద య్య, సుమలత, మహేష్, పాల్గొన్నారు. -
తండ్రి మందలించాడని..
పటాన్చెరు టౌన్: మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి మందలించడంతో రుద్రారం గీతం కాలేజీ బిల్డింగ్ 5వ అంతస్తుపై నుంచి దూకి ఫణిభూషన్ అనే బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, విద్యార్థి తల్లిదండ్రుల కథనం ప్రకారం..హైదరాబాద్‌లోని నిజాంపేట్ పరిధిలోని జయభరత్‌నగర్ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి రమేశ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సూర్య ఫణిభూషన్(20) పటాన్చెరు మండల పరిధిలోని గీతం కళాశాలలో బీటెక్(సీఈసీ) మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదల అయిన సెమిస్టర్ ఫలితాల్లో ఫణీందర్‌కు తక్కువ మార్కులు రావడంతో శుక్రవారం సాయంత్రం తండ్రి మందలించాడు. మంచిగా చదువుకోవాలని సూచించాడు. కళాశాల ఏఎంసీ క్రాంతి కుమార్‌తో తనను ఫోన్లో మాట్లాడించాలని సూచించాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 7: 30 గంటలకు ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లిన ఫణిభూషన్ 8: 50 గంటలకు కాలేజీ బిల్డింగ్‌పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రగాయాలపాలైన ఫణిభూషన్‌ను గమనించిన తోటి విద్యార్థులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు మృతుడు తనంతట తానే కిందపడ్డాడా లేదా ప్రమాదవశాత్తు కింద పడి మృతిచెం దా డా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇద్దరు బిటెక్ విద్యార్థులు దుర్మరణం..
సాక్షి, రంగారెడ్డి: బైక్‌పై వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అబ్బులపూర్ మేట్ మండలం కవాడి పల్లిలో చోటుచేసుకుంది. ప్రమాదంలో చనిపోయిన వారు విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థులని తెలుస్తోంది. మృతులు వైష్ణవి(సీఎస్సీ థర్డ్ ఈయర్) లోకేష్( సెకండ్ ఈయర్)గా గుర్తించారు. ఎదురుగా వస్తున్న ఆటోను, టిప్పర్ తప్పించబోయి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. తీవ్రగాయాలైన విద్యార్థులు ఘటన స్థలంలోని మృతిచెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
బీటెక్ విద్యార్థి దారుణ హత్య
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ కడప జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. రాజంపేటలోని డిగ్రీ కళాశాల సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ హత్య జరిగనట్లు తెలుస్తోంది. మృతుడు స్థానిక బోయనపల్లె అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల్లో సెకండీయర్ చదువుతున్న సోము సాయి(20)గా గుర్తించారు. పది రోజుల కిందట కళాశాలలో విద్యార్థుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సోము సాయి తండ్రి శివయ్య చిన్న వ్యాపారి. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భోజనం చేసిన అనంతరం ఫోను రావడంతో సాయి బయటకు వెళ్లాడు. పది గంటల ప్రాంతంలో డిగ్రీ కళాశాల సమీపంలోని ముళ్లచెట్ల వద్ద రక్తం మడుగులో పడున్న విద్యార్థిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు వెళ్లి పరిశీలించగా అప్పటికేమృతిచెందాడు. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి చంపినట్లు మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయి -
వైఎస్సార్ జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి దారుణ హత్య
-
బ్యాంకులు చేయలేని పని ఆ విద్యార్థులు చేశారు!
లక్నో: నీరవ్ మోదీతో కలిసి బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి వేలకోట్ల దోచుకున్న బిలియనీర్ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ వ్యవహారం ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తూ బ్యాంకు ఉద్యోగులే ఈ ఘరానా మోసగాడితో కుమ్మక్కు కాగా.. బీటెక్ చదివిన ఏడుగురు యువకులు మాత్రం అతన్ని కోర్టుకు ఈడ్చారు. జైపూర్‌లోని రాజస్థాన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు బీటెక్ గ్రాడ్యుయేట్లు గత రెండేళ్లుగా అతనిపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్లో గీతాంజలి జెవెలరీ రిటైల్ ఫాంచైజ్ను తెరవాలని బీటెక్ విద్యార్థులు భావించారు. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్, తనఖా అప్పులతోపాటు తల్లిదండ్రుల నుంచి కొంత అడిగి మొత్తం రూ. 3 కోట్లు సేకరించారు. ఎలక్టానిక్ ఇంజినీర్ వైభవ్ ఖురానియా (24), ఐటీ ఇంజినీర్ దీపక్ బన్సాల్ (23) నేతృత్వంలో వీరు ఆర్ఎం గ్రీన్ సొల్యూషన్స్ సంస్థ స్థాపించారు. అయితే, ఈ సంస్థ ద్వారా లాభాలు ఆర్జించాలన్న వారి కలలు కల్లలయ్యాయి. రూ. 1.5 కోట్ల సెక్యూరిటీ సొమ్ము తీసుకొని గీతాంజలి సంస్థ థర్డ్‌గ్రేడ్, నాసిరకం వజ్రాలు, రత్నాలు పంపించడంతో బిత్తరపోయారు. దీనిపై వారు కోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలు నిజమైతే చోక్సీని అరెస్టు చేయాలని సాకేత్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే, ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని చోక్సీ గత ఏడాది ఆగస్టులో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. -
టాప్ బీటెక్ విద్యార్థులకు ఫెలోషిప్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2018 లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విద్యార్థులకు ఒక శుభవార్త అందించారు. దేశవ్యాప్తంగా డాక్టరేట్ చేయాలనుకునే టాప్ బీటెక్ విద్యార్థులకు ఫెలోషిప్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి ఫెలోషిప్ పథకం కింద వెయ్యివందికి ఈ ఫెలోషిప్‌ను అందిస్తామన్నారు.తద్వారా ముఖ్యమైన ఐఐటీలో, ఐఐఎస్సీలలో పీహెచ్డీ చదివేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి విద్యా బడ్జెట్ కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రూ .85,010 కోట్లను కేటాయించారు. ఇందులో రూ .35,010 కోట్లు ఉన్నత విద్యకు, పాఠశాల విద్య కోసం రూ .50,000 కోట్లు నిధులు సమకూర్చనున్నారు. దీంతోపాటు 24 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు కనీసం ఒక వైద్య కళాశాల ఏర్పాటును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు జైట్లీ వెల్లడించారు. అలాగే ఎస్టీల విద్యార్థుల క కోసం ప్రత్యేకంగా ఏకలవ్య స్కూళ్లను స్టార్ట్ చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలను పెంచేందుకు ప్రత్యేక పథకాన్ని మొదలుపెట్టనున్నారు. రైజ్ స్కీమ్ కింద సుమారు లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు. టీచర్లలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాదు విద్యా రంగాన్ని డిజిటల్‌గా మారుస్తామని.. బ్లాక్ బోర్డును డిజిటల్ బోర్డుగా మారుస్తామని జైట్లీ పేర్కొన్నారు. -
దేశంలో బీటెక్ విద్యార్థుల దారుణ దుస్థితి
సాక్షి, న్యూఢిల్లీ : బీ. జయచంద్రన్ 2011 సంవత్సరంలో తమిళనాడు, తంజావూరులోని 'పెరియార్ మణియమ్మై ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ' నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కటీ రాలేదు. 2012, 2013 సంవత్సరాల్లో ఏదో ఎల్ఐసీ పాలసీలు చేపిస్తూ బతికాడు. ఆ మరుసటి సంవత్సరం తంజావూరులోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరాడు. బీటెక్ సందర్భంగా తాను తీసుకున్న విద్యా రణాన్ని చెల్లించేందుకు సరిపడ డబ్బులు కూడా రాకపోవడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. 2015లో బ్యాంకు ఉద్యోగాల కోసం పరీక్షలు రాయడం మొదలు పెట్టాడు. జయచంద్రన్ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు బ్యాంకు నుంచి లక్షన్నర రూపాయల రుణాన్ని తీసుకున్నారు. సకాలంలో దాన్ని తీర్చకపోవడం వల్ల ఇప్పుడు ఆయన బ్యాంకుకు మూడు లక్షల రూపాయల బాకీ పడ్డారు. జయచంద్రన్ తండ్రి రిటైర్డ్ తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగి. రెండేళ్ల క్రితం ఆయన రిటైర్డ్ బెనిఫిట్ల నుంచి బ్యాంక్‌కు 45 వేల రూపాయలను చెల్లించారు. ఇప్పుడు ఆయన తన పింఛను డబ్బుల నుంచి నెల నెలకు బ్యాంకు రుణ వాయిదాలు చెల్లిస్తున్నారు. నేడు భారత దేశంలో ఉద్యోగం దొరక్కా, తీసుకున్న విద్యా రుణాలను చెల్లించలేక సతమతమవుతున్న జయచంద్రన్ లాంటి వాళ్లు లక్షల్లో ఉన్నారు. దేశంలో ఇంజనీరింగ్ కళాశాలలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, విద్యా ప్రమాణాలు పడిపోవడం, మార్కెట్లో ఉద్యోగావకాశాలు సన్నగిల్లి పోటీ పెరగడం తదితర కారణాల వల్ల జయచంద్రన్ లాంటి వాళ్ల పరిస్థితి దారుణంగా తయారయింది. బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణాలను చెల్లించే పరిస్థితుల్లో బీటెక్ పట్టభద్రులు ఉండడంతో ఆ భారం తల్లిదండ్రులపై పడుతోంది. వీటిని తీర్చేందుకు కొందరి తల్లిదండ్రులు నగలు, నట్రా అమ్మి డబ్బులు చెల్లిస్తుండగా, మరి కొందరి తల్లిదండ్రులు ఇంటి స్థలాలు, ఇళ్లు అమ్మి కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2001లో ఈ విద్యా రుణాల స్కీమ్‌ను ప్రారంభించింది. దాన్ని 2006లో ఒకసారి, 2009లో మరోసారి సవరించింది. ఏడాదికి నాలుగున్నర లక్షల రూపాయలకన్నా తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వడ్డీలేని రుణాలను అందజేయడం ఈ స్కీమ్ లక్ష్యం. విద్యార్థుల కోర్సు పూర్తయిన ఏడాది వరకు మాత్రమే ఈ స్కీమ్ కింద ఇచ్చే రుణాలకు వడ్డీ వర్తించదు.ఆ తర్వాత వడ్డీతో కలిపి చెల్లించాల్సిందే. ఇక 2015లో కేంద్ర ప్రభుత్వం విద్యారుణాల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద ఏడున్నర లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేస్తారు. వీటికి ప్రత్నామ్నాయ పూచికత్తును సమర్పించాల్సిన అవసరం కూడా లేదు. ఈ సమయంలోనే సాంకేతిక విద్యా సంస్థలు తామర తుంపరగా వందలాది కొత్త కోర్సులను ప్రవేశపెట్టాయి. 2006-2007 సంవత్సరంలో 1600 కోర్సులు అందుబాటులో ఉండగా, 2016-2017 సంవత్సరానికి ఆ కోర్సుల సంఖ్య 3,391కి చేరుకున్నాయి. ఇలాగైతే దేశంలో విద్యా ప్రమాణాలు ఘోరంగా పడిపోతాయని పలు సమావేశాల్లో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా రుణాలు తీసుకొని డీఫాల్ట్ అయిన కేసులు 2013 నుంచి 2016 మధ్య 142 శాతం పెరిగి 6,336 కోట్ల రుణాలు మొండి బకాయిలుగా మారాయి. 2017, మార్చి నెల నాటికే ఈ మొండి బకాయిల రుణాలు ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ లెక్కల పకారం 5,191 కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగస్టు నెలలో పార్లమెంట్‌కు వెల్లడించింది. డీఫాల్టయిన కేసుల్లో బీటెక్ కోర్సు కోసం తీసుకున్నవే ఎక్కువగా ఉన్నాయని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలియజేశారు. ఇప్పుడు ఆ రుణాల రికవరీని అవుట్ సోర్సింగ్ చేసినట్లు ఆయన తెలిపారు. తమ వద్దకు వచ్చిన కేసుల్లో కూడా 90 శాతం కేసులు ఇంజనీరింగ్ విద్యార్థులవేనని 2013లో విద్యా రుణాలపై అవగాహన ఉద్యమాన్ని చేపట్టిన మాజీ బ్యాంకర్ ఎం. రాజ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు పుట్టగొడుగుల్లో పెరిగి, విద్యా ప్రమాణాలు పడిపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అన్నారు. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే ప్రస్తుతం 500లకు పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని ఆయన తెలిపారు. విద్యారుణాలను తీసుకొని చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న పట్టభద్రులు దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో రుణాలు తీసుకున్న వారూ, చెల్లించలేక పోతున్నవారు కూడా ఎక్కువే. కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకొని గత ఆగస్టు నెలలో 'విద్యా రుణాల తిరిగి చెల్లింపు సహాయ పథకం'ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద రుణాలను మాఫీ చేయరుగానీ, నెలవారి వాయిదాల్లో కొంత సొమ్మును ప్రభుత్వం చెల్లిస్తుండగా, మిగతా భాగాన్ని విద్యార్థిగానీ, వారి తల్లిదండ్రులుగానీ చెల్లించాలి. దేశంలో మరెక్కడా ఇలాంటి స్కీములు లేవు. ముఖ్యంగా తమిళనాడులో రుణాల వసూళ్ల ఏజెంట్ల ఒత్తిళ్లను తట్టుకోలేక పాతికేళ్ల లోపు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఇటు విద్యార్థి సంఘాలు, అటు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
అంగన్వాడీ పోస్టులకు బీటెక్ గ్రాడ్యుయేట్లు
సాక్షి, రంగారెడ్డి: అంగన్వాడీ ల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి నిరు ద్యోగుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. బీటెక్, పీజీ, బీఈడీ చేసిన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసించినా చదువులకు తగిన ఉద్యోగాలు లభించని కారణంగా అంగన్వాడీ పోస్టులపై ఆసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోంది. వేతనం తక్కువైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం కావడంతో మహిళలు అధిక సంఖ్యలో పోటీపడుతున్నారు. అంతేగాక స్థానికంగా ఉద్యోగం లభిస్తుండడం కలిసి వచ్చే అంశంగా వారు భావిస్తున్నారు. వాస్తవంగా టీచర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస అర్హత పదో తరగతి ఉత్తీర్ణతగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పదో తరగతి నుంచి మొదలుకుని పీజీ చేసిన వారంతా దరఖాస్తు చేస్తున్నారు. దరఖాస్తుల వెల్లువ... జిల్లాలో ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 1,600 అంగన్వాడీల్లో మొత్తం 287 ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీకి జిల్లా యంత్రాంగం గత నెల 24న నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల్లో ప్రధాన అంగన్వాడీ టీచర్లు 62, మినీ అంగన్వాడీ టీచర్లు 54, ఆయా పోస్టులు 171 ఉన్నాయి. అదే తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. దరఖాస్తులు సమర్పించేందుకు ఈనెల 6వ తేదీ తుది గడువు. అయితే ఇప్పటివరకు దరఖాస్తుల సంఖ్య ఐదు వేలు దాటినట్లు అంచనా. దరఖాస్తుల సమర్పణకు మరో రోజు మిగిలి ఉండడంతో వీటి సంఖ్య ఏడు వేలు దాటొచ్చని యంత్రాంగం భావిస్తోంది. గడువు సమీపిస్తున్న సమయంలో అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తుండడంతో వెబ్సైట్ మొరాయిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక.. అంగన్వాడీ కేంద్రాల వారీగా వచ్చిన దరఖాస్తుల జాబితాను స్థానికంగా ప్రదర్శించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. -
చేసేది బీటెక్.. పనులు లోటెక్..
వరంగల్ , రైల్వేగేట్: ఏం చేసైన ఎంజాయ్ చేయాలి.. జల్సా చేస్తూ సుఖపడాలి అనుకున్న ఓ బీటెక్ విద్యార్థిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని వరంగల్ జీఆర్పీ సీఐ జూపల్లి వెంకటరత్నం శుక్రవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన చౌహన్ సురజ్(21) హైదరాబాద్‌లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కాగా, ఈ నెల 21న కొత్తగూడెం నుంచి కుటుంబ సభ్యులతో పుష్పుల్ రైలులో వస్తున్న చిట్టి శ్రీనివాస్ భార్యకు చెందిన హ్యాండ్‌బ్యాగును వరంగల్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్ ఫామ్–2లో రాత్రి 11.30 గంటలకు అపహరించాడు. దీంతో అదే రాత్రి బాధితులు వరంగల్ జీఆర్పీలో ఫిర్యాదు చేశారు. దీంతో జీఆర్పీ పోలీసులు నేరస్తుడి కోసం తీవ్రంగా గాలించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్లో అనుమనాస్పదంగా కనిపిం చిన నిందితుడు చౌహన్ సిరజ్ను అరెస్ట్ చేశారు. అలాగే అతను అపహరించిన బ్యాగుతో పాటు అందులో ఉన్న 5తులాల బంగారు హారం, కమ్మలు, మాటీలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటరత్నం పేర్కొన్నారు. అనంతరం నిందితున్ని రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో ఆర్పీఎఫ్ సీఐ రవిబాబు, జీఆర్పీ ఎస్సైలు పి.శ్రీనివాస్, ఎస్.శ్రీనివాస్, రాజేందర్, జితేందర్‌రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య
-
లేడీస్ హస్టల్ నుంచి దూకి అబ్బాయి ఆత్మహత్య..
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్‌కు చెందిన చెంద్రశేఖర్ కుమారుడు ఈశ్వర్ ఆనంద్(19), మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న రాజ్‌దూత్ ఆపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తుపై నుంచి కిందకు దుకాడు. తీవ్ర గాయాలైన ఆనంద్‌ను చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే రాజ్‌దూత్ అపార్ట్మెంట్లో లేడీస్ హస్టల్ ఉందని, దానిపైకి ఎందుకు వెళ్లాడన్న దానిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
చదవలేక.. ముఖం చూపించలేక..
ఇష్టం లేని ఇంజినీరింగ్ కోర్సులో ఆ విద్యార్థి ఇమడలేకపోయాడు. తోటి విద్యార్థులతో కలిసి చదువులో పోటీపడలేకపోయాడు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేకతున్నానని మదనపడ్డాడు. తనలో తానే కుంగిపోయాడు. తిండీ తిప్పలు మానేశాడు. దినచర్యలో భాగంగా వాకింగ్‌కని వెళ్లి అర్ధంతరంగా తనువు చాలించాడు. అనంతపురం ,పామిడి :పామిడిలో బీటెక్ విద్యార్థి బుధవారం రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తి రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఇ.శ్రీరాములు నాయక్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పామిడికి చెందిన దూదేకుల హŸన్నూర్సాబ్, షబీనాకౌసర్ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు డి.షోయబ్ అక్మల్(18) తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌లో ఈసీఈ ప్రథమ సంవత్సరం చదువుతన్నాడు. ఎంత చదివినా బుర్రకెక్కకపోవడంతో కోర్సు పూర్తి చేయడం కష్టమని భావించాడు. ఒంటరిగా గడిపేవాడు.. వేళకు భోజనం చేసేవాడు కాదు. తల్లిదండ్రులకు విషయం తెలిసి వేళకు భోజనం చేయాలంటూ పలుమార్లు సూచించారు. అయినప్పటికీ అతనిలో మార్పు లేకపోయింది. దసరా సెలవులు ఇవ్వడంతో ఇటీవలే పామిడికి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి కూడా మానసికంగా బాధపడుతున్నాడు. కుమారుడి ఆరోగ్యం కుదుట పడాలని బుధవారం నార్పల మండం గూగూడు కుళ్లాయిస్వామి దర్శనానికి వెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దినచర్యలో భాగంగా ఉదయాన్నే అక్మల్ వాకింగ్‌కని వెళ్లాడు. కొద్దిసేపటికే రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఛిద్రమైన కుమారుడి మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. ‘నాయనా... అప్పుడే నీకు నూరేళ్లు నిండెనా... ఎంత పనిచేశావు నాయనా...’ అంటూ రోదించడం చూపరులను కంటతడి పెట్టింది. చేతికొచ్చిన కొడుకు దూరమవ్వడంతో వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. సంఘటనా స్థలంలోనే గుత్తి రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు నాయక్, కానిస్టేబుల్ నారాయణస్వామి సమక్షంలో ప్రభుత్వ వైద్యులు మమత, రాధారాణిలు మృతదేహానికి పంచనామా నిర్వహించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
వీడియో గేమ్ కొనివ్వలేదని..ఓ విద్యార్థి..
-
వీడియో గేమ్ కొనివ్వలేదని..ఓ విద్యార్థి..
హయత్‌నగర్: వీడియోగేమ్ కొనివ్వలేదని భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కుంట్లూర్ రత్నా కాలనీకి చెందిన గండు శ్రీనివాస్ కుమారుడు అభినయ్(17) నాదర్గుల్లోని ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత వారం రోజులుగా వీడియోగేమ్ కొనివ్వాలని తండ్రిని కోరుతున్నాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన అభినయ్ ఆదివారం రాత్రి తమ ఇంటి 2వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించా రు. వైద్యుల సూచనమేరకు ఎల్బి నగర్‌లోని కామినేని అసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ర్యాగింగ్ కలకలం
జేఎన్టీయూ: అనంతపురం నగరం పరిధిలోని ఓ ప్రవైటు ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ర్యాగింగ్ కలకలం రేగింది. బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు ఇద్దరు , మొదటి సంవత్సరం విద్యార్థి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో మొదటి సంవత్సరం విద్యార్థి ప్రతిఘటించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో ఆ ఇద్దరు విద్యార్థులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల సమక్షంలోనే వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ర్యాగింగ్ చేస్తే వచ్చే దుష్పరిణామాలు ఎలా ఉంటాయో వివరించారు. ర్యాగింగ్ నిరోధానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు కోరుతున్నారు. -
మంచిగా ఉంటూనే హైందవిని మట్టుపెట్టాడు..
► పరులతో జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు ► హైందవి హత్యతో ప్రొద్దుటూరులో భయాందోళనలు ప్రొద్దుటూరు: అతను అద్దెకు ఉన్నది మూడు నెలలే. అయినా ఆ కుటుంబంతో బాగా చనువు ఏర్పడింది. ఈ కారణంగా అప్పుడప్పుడు ఇంట్లోకి వెళ్లేవాడు. మంచిగా ఉంటూనే అతను బీటెక్ విద్యార్థిని హైందవిని మట్టుపెట్టాడు. గోకుల్‌నగర్‌లో నివాసం ఉంటున్న జయప్రకాష్‌రెడ్డికి కుమార్తె హైందవి, కుమారుడు మౌనీశ్వరరెడ్డిలు ఉన్నారు. ఆయన లెక్చర్‌గా పని చేస్తుండగా, భార్య విజయలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. వారి కుమార్తె హైందవి 10 వరకూ ఉషోదయ హైస్కూల్, ఇంటర్ షిర్డిసాయి జూనియర్ కాలేజిలో చదువుకుంది. తర్వాత బీటెక్ ట్రిపుల్ఈ హైదరాబాద్‌లోని సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజిలో పూర్తి చేసింది. మొదటి నుంచి హైందవికి క్లాస్‌లో మంచి మార్కులు వచ్చేవి. బాగా చదివి ఎప్పటికైనా ఉన్నతమైన ఉద్యోగం సాధిస్తానని తల్లిదండ్రులతో చెప్పేది. ఈ క్రమంలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లలో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైంది. అయితే ఆ కంపెనీ నుంచి కాల్‌లెటర్ రాకపోవడంతో ఇంటిì వద్ద ఖాళీగా ఉండకుండా బ్యాంకు కోచింగ్‌కు వెళ్లేది. వృత్తి రీత్యా ఏనాడైనా విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుందని భావించిన హైందవి ఇటీవల పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఇంట్లో ఉంటే తల్లికి ఒక్క పని కూడా చేసే అవకాశం ఇవ్వదు. అంతా తానే చేస్తుంది. తన దారిన తాను వెళ్లి ఉంటే.. తన స్కూటీ రోజూ మొరాయిస్తుండంతో రిపేరు చేయించేందుకు షెడ్డులో ఇచ్చింది. స్కూటీ తెచ్చుకునేందుకు హైందవి తండ్రి బైక్‌లో బజారులోకి వెళ్లింది. అప్పటికే స్కూటీ రిపేరు చేసి ఉండటంతో తీసుకొని నేరుగా ఇంటికి బయలుదేరింది. పెట్రోల్ అయిపోవడంతో నవీన్ కుమార్ దారిలో బైక్ నిలిపి ఆగి ఉన్నాడు. అదే దారిలో వెళ్తున్న హైందవి అతన్ని చూసి ఆగింది. పెట్రోల్ అయిపోవడంతో ఆగానని అతను చెప్పగా మానవత్వం చూపిన హైందవి తన స్కూటీలో కూర్చోపెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్లింది. ఇంట్లో ఉన్న ఒక ఖాళీ బాటిల్ ఇచ్చి పెట్రోల్ తెచ్చుకోమని స్కూటీ తాళాలను అతనికి ఇచ్చింది. తమ కుటుంబంతో పరిచయం కారాణంగా హైందవి అతనికి సాయం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. అలా కాకుండా తన దారిన తాను వెళ్లి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని పలువురు అంటున్నారు. పరులతో జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు పరాయి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంటి పక్కన ఉన్న కారణంగా చనువు ఉంటుందని, అలాంటి వారికి ఎక్కువ చనువు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని అంటున్నారు. కొందరు మనుసులో ఏదో ఆలోచన పెట్టుకొని పరిచయం పెంచుకునేవాళ్లు కూడా లేకపోలేదని పోలీసులు పేర్కొంటున్నారు. మంచితనం అనే ముసుగు కప్పుకొని నిండా ముంచేవాళ్లు ఇటీవల కాలంలో ఎక్కువగా ఉన్నారని, ఇంటా బయట జాగ్రత్తగా ఉంటే ఎలాంటి నేరాలు జరగడానికి అస్కారం ఉండదని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. హైందవి హత్యతో ప్రొద్దుటూరులో భయాందోళనలు హైందవి హత్య జరిగిన మరు క్షణం నుంచి ప్రొద్దుటూరు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇంట్లోకి చొరబడి గొంతులు కోస్తుండటంతో పట్టణ వాసుల్లో అలజడి మొదలైంది. ఇప్పటి వరకూ బయటికి వెళ్లేటప్పుడు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేవారు. ఇళ్లలో ఉన్న వాళ్లు కూడా పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పట్టణంలోనే గాక శివారు ప్రాంతాల్లో పోలీసులు రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ!
-
హైందవి హత్యకేసులో వీడిన మిస్టరీ!
ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని కడపన హైందవి కేసు మిస్టరీ వీడింది. గతంలో హైందవి ఇంట్లో అద్దెకు ఉన్న నవీన్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు హైందవి మొబైల్ ఫోన్ కాల్స్ ఆధారంగా నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైందవి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని నవీన్ గమనించారు. దాంతో శుక్రవారం మధ్యాహ్నం వాళ్లింటికి వచ్చిన అతడు...హైందవిపై అత్యాచారయత్నం చేశారు. అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో పాటు, తన గుట్టు బయటపడుతుందనే భయంతో నవీన్ ...ఆమెను దారుణంగా హతమార్చాడు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు దోపిడీ దొంగలే ఈ ఘటనకు పాల్పడినట్లు హైందవి వంటిపై బంగారు ఆభరణాలతో పాటు, స్కూటీతో పరారయ్యాడు. -
బీటెక్ విద్యార్థి అదృశ్యమా.. డ్రామాలా!
వలిగొండ: గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ఇంజనీరింగ్ విద్యార్థి గణేష్ కేసులో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు బీటెక్ స్టూడెంట్ కిడ్నాప్ అయ్యాడా.. అదృశ్యమయ్యాడా.. లేక ఎక్కడో తలదాచుకుంటూ కావాలనే డ్రామాలు ఆడుతున్నాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఏరియాలో గణేష్ ఉన్నట్లు ఫోన్ సిగ్నల్స్ ద్వారా గుర్తించినట్లు ఎస్ఐ ప్రకాశ్ తెలిపారు. నేటి సాయంత్రంలోగా అతడిని వెతికి పట్టుకుని తల్లిదండ్రులకు అప్పచెబుతామని చెప్పారు. ఓ వైపు ఈ నెల 6వ తేదీ నుంచి తమ కుమారుడు గణేష్ కనిపించడం లేదని విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేయగా, మరోవైపు గణేష్ మాత్రం తరచుగా బంధువులతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే వారు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏం జరిగిందంటే... యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన గణేష్ ఘట్కేసర్ లోని వీబీఐటీ బీటెక్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. గణేష్ అదే కాలేజీకి చెందిన తన ప్రియురాలితో కలసి భద్రాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 6వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మణుగూరు రైలు ఎక్కి మధ్యలో దిగారు. తాము తీసుకున్న లాడ్జి రూములోనే ఆత్మహత్య చేసుకుందామని సూచించాడు. ప్రియురాలు వద్దని చెప్పినా సూసైడ్ చేసుకునేందు క్రిమిసంహారక మందు తెచ్చేందుకు వెళ్లాడు. చెప్పా పెట్టకుండ ఆ యువతి హైదరాబాద్‌కు చేరుకుని అనంతరం కాలేజీకి వెళ్లి విషయాన్ని చెప్పింది. గణేష్ మాత్రం ఇంటికి తిరిగిరాలేదని, అదృశ్యమయ్యాడని అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. -
డెంగీ లక్షణాలతో బీటెక్ విద్యార్థి మృతి
ధర్మవరం అర్బన్ : డెంగీ లక్షణాలతో పామిశెట్టి తేజ అనే బీటెక్ విద్యార్థి (17) మృతిచెందాడు. ధర్మవరం పట్టణంలోని శివానగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు పామిశెట్టి తేజ ఈ నెల 26న బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద గల శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఐటీ) కళాశాలలో బీటెక్‌లో చేరాడు. అదే రోజు తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి జ్వరం వస్తుండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించారు. వైద్యుల సలహా మేరకు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. తేజ డెంగీ లక్షణాలతో బాధపడుతున్నాడని వైద్యపరీక్షల్లో తేలింది. రక్తంలో ప్లేట్లెట్స్ పూర్తిగా తగ్గిపోవడంతో గురువారం రాత్రి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. -
బీటెక్ విద్యార్థి దుర్మరణం
జూపాడుబంగ్లా: మోటార్ సైకిల్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గొల్ల నరేష్(20) అనే బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన శనివారం ఉదయం...80 బన్నూరు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల వివరాల మేరకు..కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన రామసుబ్బయ్య చిన్న కుమారుడు నరేష్.. గుంటూరు జిల్లా మదనపల్లె సమీపంలోని బీటెక్ కళాశాలలో ద్వితీయసంవత్సరం చదువుతున్నాడు. కరివేనలో మిత్రుని వివాహానికి ద్విచక్రవాహనంపై కర్నూలు నుంచి బయలు దేరాడు. ఆత్మకూరు నుంచి కర్నూలుకు వస్తున్న బస్సు 80 బన్నూరు సమీపంలోని జంబులమ్మ దేవాలయం వద్ద.. మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ప్రమాదంలో నరేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. హెల్మెట్ ఉన్నా అతన్ని కాపాడలేకపోయింది. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి మృతుని తల్లిదండ్రులను ఓదార్చారు. -
ఇసుక గుంతలో పడి బీటెక్ విద్యార్థి మృతి
ఇసుక అక్రమ తవ్వకాలే కారణం తాడేపల్లి రూరల్(మంగళగిరి): గుంటూరు జిల్లాలో సీఎం ఇంటికి సమీపాన కృష్ణానదిలో ఇసుక గుంతలో పడి ఆదివారం వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సాయి తేజ మృతిచెందాడు. ఇసుక అక్రమ తవ్వకాలు అతడిని బలితీసుకున్నాయి. అతడితో ఉన్న ఐదుగురు అతికష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు. కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న సాయితేజ, ఎలుగంటి సూర్య (వైఎస్సార్ జిల్లా కడప), కార్లపూడి బాలాజీ, దాసరి సుగుణ్ (విజయ వాడ), వంగల ప్రదీప్‌రెడ్డి (నల్లగొండ జిల్లా దేవర కొండ), విద్యాసాయిసుమంత్(కరీంనగర్) ఆది వారం ముఖ్యమంత్రి నివాసం చూద్దామంటూ కృష్ణా కరకట్ట వైపు వెళ్లారు. అక్కడ నిషేధిత ఇసుక రేవు వద్ద నదిలో స్నానానికి దిగారు. ఇసుక అక్ర మార్కులు పెద్దఎత్తున ఇసుక తవ్వడంతో అక్కడ భారీ గోతులేర్పడ్డాయి. విషయం తెలియని విద్యా ర్థులు నీళ్లలోకి దిగి గోతిలో పడిపోయారు. సాయి తేజ మునిగిపోగా, మిగిలినవారు ఓ పడవ ఆధా రంగా ఒడ్డుకు చేరారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయితేజ మృతదేహాన్ని వెలికితీశారు. -
రంగుల పండుగలో విషాదం
-
నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు
అప్పుల బాధ నుంచి బయట పడేందుకు నకిలీ నోట్ల ముద్రణ ఇద్దరు వ్యాపారులు, ఇద్దరు బీటెక్ విద్యార్థుల అరెస్టు హైదరాబాద్: అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు నకిలీ నోట్ల కరెన్సీని ముద్రించిన ఇద్దరు వ్యాపారులతో పాటు వాటిని చలామణి చేస్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను సైబరాబాద్ పోలీసులు గురువా రం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.35 లక్షల విలువ చేసే నకిలీ నోట్లతో పాటు కలర్ ప్రింటర్ కమ్ స్కానర్ కమ్ జిరాక్స్ మెషీన్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి వెల్లడించారు. బోయిన్‌పల్లికి చెందిన బంగారం వ్యాపారి విజయ్ శర్మ, హిమాయత్‌నగర్‌కు చెందిన బజాజ్ క్యాపిటల్ సేల్స్ అసోసియే ట్‌గా పనిచేసే మోతేశ్యామ్ అలీఖాన్ మంచి స్నేహితులు. వ్యాపారంలో నష్టాలు ఎదుర వడంతో పెద్ద మొత్తంలో అప్పులు చేశారు. వాటిని తీర్చేందుకు కొత్త రెండు వేల నోట్లు జిరాక్స్ తీసి చలామణి చేస్తే తమ కష్టాలు తీరుతాయని భావించారు. విజయ్‌శర్మ కలర్ ప్రింటర్ కమ్ స్కానర్ కమ్ జిరాక్స్ మెషీన్, ఏ4 పేపర్స్ బండిల్స్‌ను కొనుగోలు చేశాడు. తన ఇంట్లో అలీఖాన్‌తో కలసి 18 కొత్త 2 వేల రూపాయల నోట్లతో ఒకే రోజులో రూ.35 లక్షల విలువ చేసే రూ.2వేల నోట్లను కలర్ జిరాక్స్ తీశారు. ఇందులో రూ.22 లక్షల నకిలీ నోట్లను అలీఖాన్‌కు ఇచ్చి అప్పు లు క్లియర్ చేసుకోమని సూచిం చాడు. అయితే ఈ డబ్బులు ఇస్తే అందరికీ అనుమానం వస్తుందనే ఉద్దేశం తో వీటిని చెలామణి చేసేందుకు హిమాయత్ సాగర్‌లోని లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న తన మేనల్లుడు వాజిహుద్దీన్, అతని స్నేహితుడు టోలిచౌకి వాసి అబ్దుల్ సమద్‌ను రంగంలోకి దింపాడు. రెండు లక్షల నకిలీ కరెన్సీని ఇచ్చి కాలేజీ క్యాంటీన్, సిటీలోని మాల్స్‌లో మార్పిడి చేయాలని సూచించాడు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట పట్టణంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందాడు. దీంతో తోటి కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగటంతో పట్టణంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. రైల్వేకోడూరుకు చెందిన యుగంధర్ స్థానిక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతున్నాడు. అతడు కళాశాల నుంచి బైక్‌పై వస్తుండగా కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన యుగంధర్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి మృతితో ఆగ్రహం చెందిన తోటి విద్యార్థులు బస్సు అద్దాలు పగులగొట్టి ఆందోళనకు దిగారు. దీంతో కడప-రేణికుంట రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని విద్యార్థులను నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. కాగా విద్యార్థి మృతితో అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద వైఎస్ఆర్సీపీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో వివేకానందరెడ్డి, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థి యుగంధర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
కొత్త సంవత్సరం రోజే విషాదం
తిరుమలకు వెళుతూ ప్రమాదం బీటెక్ విద్యార్థి దుర్మరణం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కొత్త సంవత్సరం ప్రారంభం రోజే జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని మిగిల్చాయి. వేర్వురు ఘనటనల్లో ఇద్దరు మృత్యువాత పడగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొత్త సంవత్సరం తొలి రోజున తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే.. అంతా మంచి జరుగుతుందని భావించి తన స్నేహితులతో కలిసి కారులో బయలుదేరిన ఓ యువకుడు మధ్యలో ఆ స్వామి సన్నిధికే చేరిపోయాడు. కొత్త సంవత్సరం ప్రారంభంతో స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్న మరో యువకుడు ఇంటికి వెళ్తూ ప్రమాదంలో మృత్యువుకు చేరువయ్యాడు. కొడవలూరు : బీటెక్ విద్యార్థులు కారులో తిరుమలకు వేంకటేశ్వరుడి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇందులో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలం లోని రాచర్లపాడు వద్ద ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. విజయవాడ కృష్ణలంకలోని రాణిగారితోట ప్రాంతానికి చెందిన మణికంఠ (18) బీటెక్ చదువుతున్నాడు. కొత్త సంవత్సరం రోజున వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు స్నేహితులైన వరప్రసాద్ (20), గణేష్ (21)తో కలసి మణికంఠ సొంత కారులో ఆదివారం తెల్లజామున తిరుమలకు బయలుదేరారు. రాచర్లపాడు వద్దకు చేరుకునే సరికి కారు నడుపుతున్న మణికంఠ నిద్రలోకి జారుకోవడంతో కారు ఫ్లై ఓవర్ వంతెన ఎంట్రన్స్ గోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మణికంఠ అక్కడకక్కడే మృతి చెంది అందులోనే ఇరుక్కుపోయాడు. మణికంఠ స్నేహితులు వరప్రసాద్, గణేష్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైవే మొబైల్ వాహనంలో నెల్లూరులోని సింహపురి వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ అంజిరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబరాలు చేసుకుని వెళ్తూ.. చేనిగుంట (తడ) : స్నేహితులతో నూతన సంవత్సర స్వాగత వేడుకల్లో పాల్గొని ఇంటికి బయలుదేరిన ఇద్దరు యువకులు రోడ్డుప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన సంఘటన జాతీయ రహదారిపై చేనిగుంట వద్ద రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది. సూళ్లూరుపేట మండలం సామంత మల్లాం గ్రామానికి చెందిన చిట్టేటి చైతన్య (27), ఎరుగరాజుల కిషోర్ శనివారం రాత్రి తడలో జరిగిన నూనత సంవత్సరం వేడుకల్లో పాల్గొని బైక్‌పై ఇంటికి బయలుదేరారు. తడ నుంచి ఐదు కిలో మీటర్లు ప్రయాణించిన మీదట ప్రమాదానికి గురయ్యారు. రాత్రి ఎప్పుడు ప్రమాదం జరిగిందో కానీ.. ఉదయం 6 గంటలకు వరకు వెలుగులోకి రాలేదు. ఉదయం వరదయ్యపాళెం నుంచి అక్కంపేటకు బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు గమనించి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ఈఎంటీ సురేష్, పైలెట్ సుధీర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చైతన్య మృతి చెందినట్లు నిర్ధారించారు. కిషోర్ మాత్రం ప్రాణాలతో ఉండటంతో సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం అతన్ని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇద్దరు యువకులు రోడ్డుకి దూరంగా ఒకరి పక్కన ఒకరు పడి పోవడం, బైక్ మరికొంత దూరంలో చెట్లల్లో పడిపోయింది. దీంతో రోడ్డుపై వెళ్లే వారికి ప్రమాదం విషయం తెలియలేదు. చైతన్య తడ నిప్పో పరిశ్రమలో పనిచేస్తుండగా, కిషోర్ శ్రీసిటీలోని వీఆర్వీ పరిశ్రమలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ అవివాహితులు. సమాచారం అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి, సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. సంఘటనా స్థలాన్ని తడ ఎస్ఐ సురేష్‌బాబు పరిశీలించారు. చైతన్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
బైక్‌లు ఢీ కొని బీటెక్ విద్యార్థి దుర్మరణం
ఇబ్రహీంపట్నం: రెండు బైక్‌లు ఢీకోనడంతో ఒక ఇంజనీరింగ్ విద్యార్ధి దుర్మరణం చెందగా, మరొకరికి గాయాలైన సంఘటన మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతపల్లిగూడ సమిపంలో చేటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు వివరాల ప్రకారం....మణిసాయిప్రశాంత్, రోహిత్‌సాయిబాలాజీ జాగృతి కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. ఎదురెదురుగా వస్తున్న వీరి బైక్‌లు ప్రమాదవశాత్తు ఢీకోనడంతో మణిసాయిప్రశాంత్(19) అక్కడిక్కక్కడే దుర్మరణం చెందాడు. రోహిత్‌బాలజీకి గాయాలు కావడంతో అస్పతికి తరలించారు. మృతుడు నగరంలోని హైటెక్‌సీటి వివేకానందనగర్ కాలనీ చెందినవాడు కాగా, గాయపడ్డ విద్యార్థి చిక్కడపల్లి నివాసి. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
స్వీపర్ ఉద్యోగాల కోసం బీటెక్‌లు, ఎంబీయేలు!
ఉత్తరప్రదేశ్‌లో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. అలహాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ)లో కాంట్రాక్టు పద్ధతిలో స్వీపర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే.. ఏకంగా 1.10 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. అంతేకాదు, కేవలం హిందీలో చదవడం, రాయడం వస్తే సరిపోతుందని అర్హతలలో పేర్కొంటే.. చాలామంది బీటెక్‌లు, ఎంబీయేలు, ఇతర పీజీలు చేసిన వాళ్లు కూడా క్యూకడుతున్నారు. కాంట్రాక్టు స్వీపర్లు (సఫాయీ కర్మచారీలు) ఉద్యోగాల కోసం వీళ్లంతా ఇంత పెద్ద సంఖ్యలో రావడంతో రిక్రూట్మెంట్కు ఎంతలేదన్నా కనీసం 408 రోజుల పాటు సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. ఈలోపు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చి, ప్రభుత్వం మారితే మరింత ఆలస్యం తప్పదట. అలహాబాద్ మునిసిపాలిటీలో 119 పోస్టులతో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక్కో జిల్లాకు 100 చొప్పున స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికోసం పెద్దపెద్ద చదువులు చదివినవాళ్లు కూడా రావడంతో రోజుకు 250 మంది చొప్పున అభ్యర్థులను అహ్మదాబాద్ మునిసిపాలిటీ పిలుస్తోంది. పెద్దపెద్ద విద్యార్హతలు ఉన్నవాళ్లు, యువకులు దీనికి దరఖాస్తు చేశారని అదనపు మునిసిపల్ కమిపషనర్ ఓపీ శ్రీవాస్తవ తెలిపారు. వీళ్లందరినీ ఇంటర్వ్యూ చేయాలంటే 408 పనిదినాలు.. అంటే సుమారు రెండు సంవత్సరాల సమయం పడుతుందని, వీళ్లంతా ప్రాక్టికల్ పరీక్షలు కూడా పాసవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. -
బీటెక్ విద్యార్థిపై నిర్భయ కేసు
బంజారాహిల్స్ : ప్రేమించాలంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న బీటెక్ విద్యార్థిపై నిర్భయ కేసు నమోదైంది. కళాశాలకు వెళ్లి యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దారికాచి వేధిస్తున్న ఓ బీటెక్ విద్యార్థిని నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... యూసుఫ్‌గూడ సమీపంలోని రహ్మత్‌నగర్‌లో నివసించే అభిషేక్(19) బీటెక్ చదువుతున్నాడు. యాదగిరినగర్‌లో నివసించే డిగ్రీ విద్యార్థిని, అభిషేక్ తమ 8వ తరగతి నుంచి స్నేహితులుగా ఉన్నారు. అదే అదనుగా భావించిన అభిషేక్ ఆ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడసాగాడు. తనకు ఇష్టం లేదని ఆమె ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకపోగా కొన్ని రోజుల నుంచి వేధింపులు శృతిమించి ఆమె చదువుతున్న కాలేజీ వరకు వెళ్లాయి. ప్రేమించకపోతే నీ అంతు చూస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు తన తల్లిదండ్రుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. తండ్రితో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అభిషేక్‌పై ఐపీసీ 354కింద కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
చొక్కాలు విప్పించి.. మోకాళ్లపై కూర్చొబెట్టి..
జేఎన్టీయూహెచ్లో ర్యాగింగ్ కలకలం హైదరాబాద్: నగరంలోని జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం రేపింది. జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ ఇంజనీ రింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆవోతు రాఘవేందర్, జశ్వంత్‌లను సెకం డియర్ విద్యార్థులు నిర్భయ్, సారుుసూర్య తేజలు హాస్టల్‌కు తీసుకువెళ్లి చొక్కాలు విప్పించి మోకాళ్ల మీద కూర్చొబెట్టించారు. నిరాకరించిన రాఘవేందర్ చెంపపై కొట్టారు. అరగంటపాటు వారిని వేధింపులకు గురిచేశారు. రాత్రి భోజనం అనంతరం హాస్టల్ కన్వీనర్ సీనియర్ విద్యార్థ్ధు లను పిలిచి మందలించి క్షమాపణలు చెప్పించా రు. బుధవారం ఉదయం ర్యాగింగ్ విషయం వాట్సాప్, విద్యార్థి సంఘాల ద్వారా బయటకు పొక్కడం, టీవీల్లో స్క్రోలింగ్ రావడంతో కేపీహెచ్‌బీ సీఐ కుశాల్కర్ జేఎన్టీయూహెచ్కు చేరుకొని విచారణ చేపట్టారు. ప్రిన్సిపల్ గోవర్ధన్‌తోపాటు బాధిత విద్యార్థ్ధి రాఘవేందర్ ను విచారించి ఫిర్యాదు తీసుకున్నారు. నిందితు లను కూడా విచారించారు. క్షమాపణలు చెప్పిం చినా విద్యార్థి సంఘాల నాయకులు రచ్చ చేస్తు న్నారని బీటెక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితులను శిక్షించాలంటూ టీఆర్ఎస్వీ, తెలం గాణ జాగృతి సంఘాల ప్రతినిధులు ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ధర్నా చేశారు. బీటెక్ విద్యార్థు లు ప్రతి నినాదాలు చేస్తూ బైఠారుుంచారు. దీంతో ఇరువర్గాల నడుమ వాగ్వాదం చోటు చేసుకోగా సీఐ జోక్యం చేసుకొని ఇరువర్గాలను సముదారుుంచారు. విచారణ జరుపుతున్నాం... జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే విష యమై ర్యాగింగ్ నిరోధక కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నామని కమిటీ నివేదిక ఆధా రంగా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ గోవర్ధన్ తెలిపారు. ర్యాగింగ్‌కు తావు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. -
ఈ యువతిని ఆదుకోరూ...
బీటెక్ విద్యార్థినికి టీబీ వైద్యానికి రూ.4.5 లక్షలు అవసరం దాతలు ఆదుకోవాలని వినతి హైదరాబాద్: బీటెక్ చదువుతున్న ఓ యువతి టీబీ వ్యాధితో తీవ్ర వేదనకు గురవుతోంది. వైద్యానికి తగిన ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన శ్రీనివాసులు పెద్ద కుమార్తె ఎస్.సువర్చలాదేవి బీటెక్ మూడవ సంవత్సరం చదువుతుంది. శ్రీనివాసులు వృత్తిరీత్యా కూల్‌డ్రింక్ షాపు నిర్వహిస్తున్నాడు. గత మార్చిలో సువర్చలాదేవి జ్వరంతో బాధపడుతుండగా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. టీబీ వ్యాధి వచ్చిందని, వైద్యానికి రూ.4.5 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో వారు తల్లడిల్లిపోయారు. ఆర్థిక పరిస్థితి సహకరించనందున దాతలు సహాయం అందించాలని కోరుతున్నారు. సాయం చేయదలచిన వారు..బ్యాంకు ఎకౌంట్-194110100003448 (ఆంధ్రా బ్యాంకు, యర్రగొండపాలెం బ్రాంచ్) ఫోన్: 9493266482, 9666013171 నెంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య!
-
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య!
- లెక్చరర్ వేధింపులే కారణం - ప్రేమ పేరిట పైశాచికం - తోటి విద్యార్థుల సాయంతో రహస్యంగా ఫొటోల చిత్రీకరణ - వాట్సాప్ సందేశాలతో ప్రేమాయణం - తాళలేక తనువు చాలించిన ఉషారాణి - ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన కళ్లెదుట అందమైన ప్రపంచం. ఇంజనీరింగ్ విద్యతో కళ సాకారమవుతుందనే ఆశ. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఆ విద్యార్థిని ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఈ ప్రయాణంలో అనుకోని ఒడిదుడుకు ఆమె జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. లక్ష్యం దిశగా సాగుతున్న అడుగులకు ఊతమివ్వాల్సిన అధ్యాపకుడు.. తోడు నిలవాల్సిన సాటి విద్యార్థులే ఆమెకు మరణ శాసనం రాయడం తల్లిదండ్రుల ఆశల దీపాన్ని ఆర్పేసింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: లెక్చరర్ వేధింపులతో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పాణ్యం సమీపంలోని ఆర్జీఎం కాలేజీలో ఉషారాణి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన ఓ లెక్చరర్ కన్ను ఈమెపై పడింది. ప్రేమ పాఠాలు చెబుతూ.. ప్రేమించాలని వెంటబడ్డాడు. నిరాకరించడంతో.. బలవంతంగా లొంగదీసుకోవాలనుకున్నాడు. అందులో భాగంగానే కొందరు విద్యార్థినులను మచ్చిక చేసుకున్నాడు. బట్టలు మార్చుకుంటున్నప్పుడు.. ఆదమరిచి నిద్రిస్తున్నప్పుడు ఫొటోలు తీయించాడు. ఆమె ఫోన్లోని వాట్సాప్కే ఫొటోలను పంపిన లెక్చరర్.. నీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన సొంతమనే వెకిలి సందేశాలతో వేధించసాగాడు. షాక్ తిన్న ఉషారాణి.. పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఫొటోలను కాలేజీలో అందరికీ పంపుతానని బెదిరించడంతో ఆందోళనకు లోనైంది. ఇంతలో దీపావళి సెలవులు రావడంతో ఇంటికి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులతో జరిగిన విషయమంతా చెప్పి.. సెలవులు పూర్తయ్యాక తండ్రితో కలిసి కాలేజీకి వచ్చింది. ఆమె తండ్రి జరిగిన విషయాన్ని ప్రిన్సిపాల్‌కు పూసగుచ్చినట్లు వివరించాడు.ఽ యాజమాన్యం ఆయనకు నచ్చజెప్పడంతో ఉషారాణి హాస్టల్‌కు వెళ్లిపోయింది. తండ్రి ఇంటికి చేరుకునే లోపు.. కాలేజీలో వదిలిన తండ్రి కుమార్తెకు ధైర్యం చెప్పి వెళ్లాడు. అయితే లెక్చరర్ వేధింపులు గుర్తుకొచ్చిన ఆమె ఇక తన ఈ లోకంలో ఉండలేననే నిర్ణయానికి వచ్చింది. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తప్పును కప్పి పుచ్చే ప్రయత్నంలో యాజమాన్యం? విద్యార్థిని మృతికి లెక్చరర్ వేధింపులు కారణమనే విషయం కళాశాల అంతా కోడై కూస్తున్నా యాజమాన్యం మాత్రం కొత్త కారణం తెరపైకి తీసుకొచ్చింది. అనారోగ్యం కారణంగానే ఆమె సెలవుపై వెళ్లిందని.. ఇంటి వద్ద ఏదో జరిగితే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పడం విద్యార్థుల ఆగ్రహానికి కారణమవుతోంది. ఇప్పటి వరకు పోలీసులు కానీ, కాలేజీ యాజమాన్యం కానీ లెక్చరర్ వేధింపుల కోణాన్ని బహిర్గతం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ విద్యార్థిని భవిష్యత్‌ను చిదిమేసిన లెక్చరర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తూ.. సాధారణ ఆత్మహత్యగా చిత్రీకరించే దిశగా సాగుతున్న ప్రయత్నం విద్యార్థి లోకాన్ని కలచివేస్తోంది. -
ప్రదీప్ హత్యకేసులో ఐదుగురి అరెస్ట్
విశాఖపట్నం: ఇంజనీరింగ్ విద్యార్థి దానబాల ప్రదీప్ హత్య కేసులో 8 మందిపై కేసు నమోదైంది. ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం డిఫెన్స్ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. గత నెల 28న మాకవరంపాలెంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న ప్రదీప్ హత్యకు గురైన విషయం తెలిసిందే. గత నెల 28న సహచర విద్యార్థినితో కలిసి కశింకోట వద్ద ప్రదీప్ బస్సు దిగాడు. ఆ తర్వాత ఆ అమ్మాయితో కలిసి చాట్ తింటుండగా గుర్తుతెలియని దుండగులు ప్రదీప్‌ను అక్కడినుంచి లాక్కెళ్లి కిడ్నాప్ చేసి.. ఆపై హత్య చేశారు. అదే రోజు ప్రదీప్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ప్రదీప్ బంధువులు ఆందోళన చేస్తున్నారు. ప్రదీప్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్
-
యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్
సికింద్రాబాద్: ఫేస్బుక్లో నగ్న చిత్రాలు పెడతానంటూ ఓ యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థిని సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. సీతాఫల్మండిలో నివశిస్తున్న ఆకాష్ రెడ్డికి,అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఐదేళ్లక్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. నిత్యం వీరు చాటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తానంటూ ఆకాష్‌రెడ్డి సదరు యువతిని బెదిరించి 5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.