నారాయణమ్మ విద్యార్థినికి బంపర్‌ ఆఫర్‌   | Narayanamma Student Bagged Bumper Offer | Sakshi
Sakshi News home page

నారాయణమ్మ విద్యార్థినికి బంపర్‌ ఆఫర్‌  

Published Wed, Feb 19 2020 8:18 AM | Last Updated on Wed, Feb 19 2020 8:47 AM

Narayanamma Student Bagged Bumper Offer - Sakshi

లోహితా రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌:  నగరంలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌లొ బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న ఎం.లోహితా రెడ్డి అడోబ్‌ ఐఎన్‌సీ సంస్థలో రూ.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించింది. ఇటీవల కళాశాలలో అడోబ్, అమేజాన్, జేపీ మోర్గాన్, డెలాయిట్‌ తదితర సంస్థలు విద్యార్థునులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయని కళాశాల ప్రిన్సిపాల్‌ రమేశ్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. (హెచ్‌సీయూ విద్యార్థినికి భారీ ప్యాకేజీ)


కళాశాలకు చెందిన 440 మంది విద్యార్థులు పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. సుమారు రెండు వందల మంది రూ.6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు. ఇంజినీరింగ్‌ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న సుమారు 100 మంది విద్యార్థినులకు పలు కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించాయి. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను కళాశాల చైర్మన్‌ పి.సుబ్బారెడ్డి, కార్యదర్శి  విద్యారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement