lohita
-
గేదెలను మేపడానికి వెళ్లి యువతి విషాదం..
వరంగల్: పశువులు మేపేందుకు వెళ్లి ప్యారంకుంటలో మునిగి యువతి మృతి చెందిన సంఘటన మండలంలోని ఉనికిచర్ల గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఉనికిచర్ల చెందిన ఆక లోహిత(21) ఇంటి వద్దే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. అయితే ఆమె తండ్రి శ్రీనివాస్ సొంత పనులకు శనివారం ముల్కనూర్‌కు వెళ్లగా ఇంటి వద్ద ఉన్న తమ గేదెలను మేపడానికి ఉనికిచర్ల శివారులోని ప్యారంకుంట వైపు వెళ్లింది. ఈ క్రమంలో సాయంత్రం వేళ గేదెలు ప్యారంకుంటలో నుంచి మరో పక్కకు వెళ్లాయి. అటువైపున పొలంపని చేస్తున్న ఓ వ్యక్తి ఆ యువతికి ఫోన్ చేసి గేదెలను అటు వైపునకు తోలుతున్నానని చెప్పాడు. అనంతరం మరోసారి ఫోన్ చేయగా యువతి ఫోన్ ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి యువతి తండ్రికి ఫోన్ చేసి లోహిత ఫోన్ ఎత్తడం లేదని చెప్పగా ఇద్దరు కలిసి ప్యారంకుంట వద్దకు వెళ్లారు. కుంట కట్టపై యువతి చెప్పులు, కర్ర, లంచ్ బాక్స్, సెల్‌ఫోన్ కనిపించాయి. దీంతో వారు కుంటలోకి దిగి వెతకగా లోహిత మృతదేహం లభ్యమైంది. కాగా కుంటలోని గేదెలను ఇటువైపునకు తోలుకొని రావడానికి కుంటలోకి దిగగా ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెంది ఉంటుందని ఆదివారం మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్‌రావు తెలిపారు. ఇవి చదవండి: జన్మదినం రోజే యువకుడి విషాదం.. -
అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి ఫోటోలు
-
అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి.. ఫోటోలు వైరల్
Karthikeya Marriage Photos: యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు లొహితా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్ జరిగిన ఈ వివాహ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో వరుడు కార్తికేయ క్రీమ్, బంగారు షేర్వాణీతో జతగా క్రీమ్ లోఫర్లు, మ్యాచింగ్ పగడి, బ్రూచ్, నెక్లెస్ ధరించి కన్పించాడు. పెళ్లికూతురు కూడా బంగారు రంగు దుస్తుల్లో, వాటికి తగ్గ జ్యూవెలరీలో మెరిసిపోయింది. కార్తికేయ వరంగల్ లో ఎన్ఐటి విద్యార్థిగా ఉన్నప్పడు లొహితతో పరిచయం ఏర్పడింది. 2012లో ఆమెకు ప్రపోజ్ చేశాడు. కానీ హీరో అయ్యాకే మీ ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పాడు. హీరో అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో తన ప్రేమను గెలిపించుకోవడానికీ అంతే కష్టపడ్డాడు. ఫైనల్‌గా యూత్ హీరోగా నిలదొక్కుకున్నాక పెద్దలను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక సినిమా విషయాలకొస్తే.. కార్తికేయ ఇటీవల ‘రాజా విక్రమార్క’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం తల అజిత్ ‘వాలిమై’లో విలన్ గా నటిస్తున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నారాయణమ్మ విద్యార్థినికి బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌లొ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఎం.లోహితా రెడ్డి అడోబ్ ఐఎన్‌సీ సంస్థలో రూ.43 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించింది. ఇటీవల కళాశాలలో అడోబ్, అమేజాన్, జేపీ మోర్గాన్, డెలాయిట్ తదితర సంస్థలు విద్యార్థునులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయని కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. (హెచ్‌సీయూ విద్యార్థినికి భారీ ప్యాకేజీ) కళాశాలకు చెందిన 440 మంది విద్యార్థులు పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. సుమారు రెండు వందల మంది రూ.6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు. ఇంజినీరింగ్ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న సుమారు 100 మంది విద్యార్థినులకు పలు కంపెనీలు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాయి. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను కళాశాల చైర్మన్ పి.సుబ్బారెడ్డి, కార్యదర్శి విద్యారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
జాతీయ టీటీ పోటీలకు సెంయింట్జాన్స్ విద్యార్థిని
గన్నవరం : స్థానిక వీఎస్ సెయింట్‌జాన్స్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని ప్రతిష్టాత్మకమైన సౌత్‌జోన్ నేషనల్ టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైందని పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ బాలశౌరి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన సీబీఎస్ఈ క్లష్టర్ స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని నర్రా లోహిత ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికైందని చెప్పారు. లోహితను, శిక్షణ ఇచ్చిన సీనియర్ బ్రదర్ జిమ్మికురియాకోస్ను ప్రిన్సిపాల్, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. -
తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య
లోహిత(సంగెం): తల్లి మందలించిందని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని లోహితలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లోహిత శివారు పెద్దతండాకు చెందిన గుగులోత్ భద్రి, చక్రు దంపతులకు కుమార్తెలు శ్రీలత(14), శిరీష, కుమారుడు రాజేందర్ ఉన్నారు. లోహితలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీలత పదోతరగతి, శిరీష ఆరోతరగతి, రాజేందర్ మూడోతరగతి చదువుతున్నారు. శ్రీలత కాళ్లు చేతులు గుంజుతున్నాయని పాఠశాలకు వెళ్లనని అనడంతో.. బుధవారం ఉదయం పత్తికి ఎరువులు వేయడానికి వెళ్తూ తల్లి భద్రి కూతురును బడి వెళ్లమని మందలించింది. అనంతరం తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా, తోబుట్టువులు శిరీష, రాజేందర్ బడికి వెళ్లిపోయారు. తల్లి మందలించిందనే మనస్తాపంతో శ్రీలత ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పత్తికి ఎరువు వేసి ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులు తలుపులు తెరిచి చూసేసరికి కూతురు విగతజీవిగా కనిపించింది. దీంతోవారు కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తల్లి భద్రి ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.క్రాంతికుమార్ తెలిపారు. -
చిన్నారి చికిత్సకు వైఎస్సార్ సీపీ చేయూత
దేవరాపల్లి : గుండెకు రంధ్రం పడి చావుబతుకుల్లో ఉన్న బాలికకు వైఎస్సార్సీపీ నాయకులు అండగా నిలిచారు. మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన కంటిపాము నాగేశ్వరరావు, అరుణ దంపతుల కుమార్తె లోహిత (9)కు చిన్నతనం నుంచే గుండెకు రంధ్రం పడడంతో ప్రస్తుతం మృత్యు ఒడిలో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రూరల్ ప్రచార కమిటీ కన్వీనర్ పోతల ప్రసాద్ స్పందించి బాలిక శస్త్రచికిత్సకు అవసరమైన ‘ఎ’ పాజిటివ్ రక్తం 9 యూనిట్లను ఎ.ఎస్.రాజా బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరించిన రక్తాన్ని తండ్రి నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు. ఆ బాలికను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ యువరాజ్‌తో, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడుతో మాట్లాడామని, బాలిక వైద్యసేవలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారని ప్రసాద్ పేర్కొన్నారు. కాగా ఈనెల 28వ తేదీన ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో బాలికకు శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు అంగీకరించారని తెలిపారు.