జాతీయ టీటీ పోటీలకు సెంయింట్‌జాన్స్ విద్యార్థిని
గన్నవరం : స్థానిక వీఎస్ సెయింట్‌జాన్స్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని ప్రతిష్టాత్మకమైన సౌత్‌జోన్ నేషనల్ టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైందని పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ బాలశౌరి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన సీబీఎస్‌ఈ క్లష్టర్ స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని నర్రా లోహిత ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికైందని చెప్పారు. లోహితను, శిక్షణ ఇచ్చిన సీనియర్ బ్రదర్ జిమ్మికురియాకోస్‌ను ప్రిన్సిపాల్, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.