Gannavaram
-
ఎంపీపీ అనగాని రవి అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన
-
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లా గన్నవరం మండలం మాదలవారిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ మోజు కాలేజీ విద్యార్థుల ప్రాణం తీసింది. లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్ధులు వారంతం సెలవు కావడంతో స్నానం చేసేందుకు స్థానికంగా ఉన్న చెరువులోకి దిగారు. అనంతరం సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో జారి నీటిలో పడిపోయారు. ఈత వచ్చినా.. నీటి ఉద్ధృతికి ఈదలేక కొట్టుకుపోయారు. అయినప్పటికీ ఐదుగురు విద్యార్థులు సురక్షితంగా ఒడ్డుకు రాగా.. ఇద్దరు విద్యార్థులు పాలడుగు దుర్గారావు , జె.వెంకటేష్‌లు ప్రాణాలు కోల్పోయారు.ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమారులు మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటన జరిగినా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని లింగయాస్ కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హైకోర్టులో వంశీకి ఊరట
-
వల్లభనేని వంశీ అరెస్ట్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు.. గత రాత్రి సర్నాల రమేష్, ఈ రోజు ఉదయం యూసఫ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేసింది. వంశీ అరెస్ట్‌పై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. -
నేడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి/గన్నవరం: ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆయన మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు గన్నవరం ఐటీ పార్కు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖరారైంది. మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే తొలి సంతకం మెగా డీఎస్సీపై చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీని నెరవేర్చేలా ప్రమాణ స్వీకార వేదికపైనే సంబంధిత ఫైలుపై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుకు సంబంధించిన అంశంపైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. హాజరుకానున్న ప్రధాని, రాజకీయ ప్రముఖులుఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్‌షా, నడ్డా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులను తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు అతిథులుగా ఆహ్వానించగా చిరంజీవి కుటుంబంతో సహా ఇప్పటికే విజయవాడ వచ్చారు. ఐటీ పార్కు ప్రాంగణం సిద్ధం ప్రమాణ స్వీకారానికి ఐటీ పార్కు వద్ద 14 ఎకరాల ప్రాంగణాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ, మిగిలిన 11.5 ఎకరాల్లో నాయకులు, ప్రజల కోసం గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. సభా ప్రాంగణం లోపల, వెలుపల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రధాన గేటుకు సమీపంలోనే ఉన్న సభా వేదిక వద్దకు ప్రధాని, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునే సౌకర్యం కల్పించారు.వీఐపీల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. నాయకులు, కార్యకర్తల కోసం 36 గ్యాలరీలుగా విభజించారు. ఈ కార్యక్రమానికి వచ్చే బస్సులు, కార్లు, ఇతర వాహనాల కోసం గన్నవరం పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రముఖుల భద్రత, వేదిక, వసతుల కల్పన, బారికేడ్ల ఏర్పాటు, పారిశుధ్యం వంటి పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం కోసం 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ సమన్వయాధికారి ప్రద్యుమ్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో సమావేశం నిర్వహించారు.రద్దీగా మారిన గన్నవరం ఎయిర్పోర్టుప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎక్కువ మంది వీఐపీలు వస్తుండడంతో గన్నవరం ఎయిర్ పోర్టు రద్దీగా మారిపోయింది. ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల నుంచి పలు ప్రత్యేక విమానాల్లో అతిథులు రావడంతో గన్నవరం ఎయిర్‌పోర్టు సందడిగా మారింది. బుధవారం ఉదయం ఇంకా రద్దీగా మారే పరిస్థితి ఉండడంతో ఎయిర్‌పోర్టులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటలలోగా ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు. ప్రయాణికుల విమానాల రాకపోకలపై ఆంక్షలు లేవని, కానీ ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని సూచిస్తున్నారు.తిరుమల వెళ్లనున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుధవారం సాయంత్రం చంద్రబాబు తిరుమల వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు తిరిగి విజయవాడ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. -
ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన.. గన్నవరంలో ఘన స్వాగతం
-
అర్థరాత్రి యార్లగడ్డ అనుచరుల వీరంగం, యువకులపై..
ఎన్టీఆర్, సాక్షి: రాష్ట్రంలో ఎన్నికల ఓటమిని ముందుగానే పసిగట్టి అల్లర్లు, హింసాత్మక ఘటనలకు ప్రతిపక్ష టీడీపీ ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పచ్చ మూక బరి తెగిస్తోంది. వైఎస్సార్సీపీకి సానుభూతిపరుల్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే గన్నవరంలో యువకులపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా తేలింది.గన్నవరం మండలం మర్లపాలెం శివారులో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు యువకులపై దాడి కలకలం రేపింది. రాత్రిపూట అపార్ట్మెంట్ తలుపుల్ని బద్ధలు కొట్టుకుని వెళ్లి మరీ యువకులను చితకబాదారు. ఆపై బలవంతంగా తమ కారులో ఎక్కించుకెళ్లి వాళ్లను చిత్రహింసలకు గురి చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు బయటకు వచ్చాయి.ఇద్దరు యువకులపై దాడి చేసింది గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ నేతలు ఫణి రెడ్డి, పౌలూరి వంశీకృష్ణ, కంభంపాటి దేవేంద్ర, కంభంపాటి బాలనరేష్, దేవినేని హర్షచౌదరి, శొంఠి సురేష్, కన్నా కార్తిక్, బాబీ, కంఠమనేని అరుణకు మార్, మరి కొంత మంది ఉన్నట్టు గుర్తించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గన్నవరం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు
విజయవాడ: గన్నవరం నుంచి దేశ వాణిజ్య రాజధానిగా చెప్పే ముంబైకి మరికొన్ని రోజుల్లో డైలీ విమాన సర్వీసు ప్రారంభం కాబోతోంది. జూన్ 15న ఎయిర్ ఇండియా సంస్థ 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల భారీ బోయింగ్ ఏ320 విమాన సర్వీసును ప్రారంభించనుంది.ప్రారంభ ఆఫర్గన్నవరం నుంచి ముంబైకి నడపనున్న డైరెక్ట్ విమాన సర్వీస్‌కి ప్రారంభ ఆఫర్‌గా టికెట్ ధరను రూ.5600గా ఎయిర్ఇండియా నిర్ణయించింది. తర్వాత డిమాండ్‌ను బట్టి ఈ ధర మారే అవకాశం ఉంది. ప్రతి రోజూ రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి విమానం బయలుదేరి రాత్రి 9 గంటల కల్లా ముంబైకి చేరుతుంది. అంటే ప్రయాణ సమయం కేవలం గంటా యాభై నిమిషాలు మాత్రమే.ఇప్పటి వరకూ విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు లేదు. చాలా విమానాలు హైదరాబాదు మీదుగా కనెక్టింగ్ సర్వీసుగా వెళ్లే పరిస్థితి ఉండేది. దీంతో ప్రయాణ సమయం ఎక్కువగా పడుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు కావాలని నగరంలోని వ్యాపారులు, ఇతర వర్గాల నుంచి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఉంది. దీన్ని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి విమానయాన సంస్థల దృష్టికి తీసుకెళ్లగా ఎయిర్ ఇండియా వెంటనే స్పందించింది. విజయవాడ నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. ప్రారంభ ఆఫర్‌గా కేవలం రూ.5600లకే ముంబైకి ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. సాధారణ ధరలతో పోల్చుకుంటే రూ.4600 తగ్గింపు ఇచ్చింది.గన్నవరం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బిందువుగా ఉంది. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వ్యాపారపరంగా కీలకమైన గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ చాలా ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో విజయవాడ-ముంబై మధ్య నేరుగా విమాన సర్వీసు ప్రారంభం కానుండటంపై హర్షం వ్యక్తమవుతోంది. -
ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ
-
ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేను: వల్లభనేని వంశీ
సాక్షి, కృష్ణా : పవన్ రాజకీయాలను మారుస్తానంటారని, రాజకీయ పార్టీ అధినేతగా సమాచారం తెలుసుకుని మాట్లాడాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని గోబెల్స్ ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. గన్నవరం మండలంలో గురువారం వల్లభనేని వంశీ ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నారా భువనేశ్వరిని నేను ఎప్పుడూ ఒక్కమాట అనలేదు. నేను అన్నట్లు విన్నారా... చూశారా... వీడియో ఉందా?. లోకేష్ నన్ను, నా కుంటుంబ సభ్యులపై ఐటీడీపీతో సోషల్ మీడియాలో వార్తలు రాయించాడు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదని లోకేష్‌కు చెప్పా. నేను అసెంబ్లీలో భువనేశ్వరి గురించి మాట్లాడారని పవన్ అంటున్నారు. ఆరోజు నేను అసలు అసెంబ్లీలోనే లేను. ఐఎస్బీ మొహాలీలో కోర్సు కోసం పంజాబ్‌లో ఉన్నా. పవన్ మాటలు హాస్యాస్పదం. ఎవరో చెప్పిన మాటలు విని పవన్ మాట్లాడటం సరికాదు. నేను అనని మాట నాకు ఆపాదించారు. నేను ఎవరినీ ఏమీ అనకపోయినా క్షమాపణ చెప్పాను. కానీ కొందరు లోకేష్ దగ్గరకు వెళ్లి మీ అమ్మను అన్నారంటూ తప్పుడు సమాచారం ఇచ్చారు’’ అని వంశీ తెలిపారు.చంద్రబాబు, టీడీపీ నేతలపై వంశీ సెటైర్లు‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం పార్లమెంట్లో పెట్టింది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాక రాష్ట్రాలు అంగీకరించాల్సిందే. చంద్రబాబు, టీడీపీ నేతలు ఇప్పుడే కళ్లు తెరిచినట్లు మాట్లాడుతున్నారు. పార్లమెంట్లో, అసెంబ్లీలో మద్దతిచ్చింది వీళ్లే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదు. చంద్రబాబు విద్వేషంతో అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. గత మూడు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేశా. తొలిసారి వైసీపీ తరపున పోటీచేస్తున్నా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబు ఏం చెబితే అదే ప్రజలకు చెప్పేవాళ్లం. అధికారంలోకి వచ్చాక ఏం చేయలేకపోయేవాళ్లం. చంద్రబాబు రుణమాఫీ చేస్తానన్నాడు... చేయలేదు. బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానన్నాడు... చేయలేదు. బాబు వస్తే జాబు అన్నాడు... ఎవరికీ జాబు రాలేదు’’అని వంశీ మండిపడ్డారు. ఇక.. మానవ వనరుల అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి అని సీఎం జగన్ నమ్మారు. దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోను తూ.చా తప్పకుండా అమలు చేసిన ఒకే ఒక్కరు సీఎం జగన్ అని వంశీ అన్నారు. -
గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం
-
యార్లగడ్డకు ఎదురుగాలి!
సాక్షి ప్రతినిధి,విజయవాడ: గన్నవరంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు ఎదురుగాలి వీస్తోంది. ఆయన నోటి దురుసుతనం, అహంకారం కొంపముంచుతోంది. నియోజకవర్గంలో ఓటర్లను దూరం చేస్తోంది. ఆయన ఒంటెత్తు పోకడలతో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సఖ్యత పూర్తిగా కొరవడింది. ఆయన టీడీపీ సామాజిక వర్గానికే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శ ఉంది. మిగిలిన సామాజిక వర్గాల వారిని కనీసం దరికూడ చేరనీయడం లేదని ఆ పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన వర్గాలు కనీస గౌరవంకూడా దక్కటం లేదని ఆగ్రహంతో ఉన్నారు. పెరిగిన అంతరం ఇటీవల హనుమాన్‌జంక్షన్‌లో జరిగిన నారా భువనేశ్వరి పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించ లేదు. దీంతో కాపులు రగిలిపోతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద జనసేన, కాపు సామాజిక వర్గాలు యార్లగడ్డకు మధ్య అంతరం మరింత పెరిగింది. బీసీ, ఎస్సీ వర్గాలను పట్టించుకోక పోవడంతో వారూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సామాజిక వర్గం అధికంగా ఉన్న గ్రామాల్లో ఆయన ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. మిగిలిన గ్రామాలకు తమ కుటుంబ సభ్యులను పంపి మమ అనిపిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గాలను చిన్న చూపుచూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ వర్గాల వారు షేక్ హ్యాండ్ ఇచ్చినా వెంటనే చేతిని సబ్బుతో కడిగి, శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నారని ఆపార్టీ వర్గాల్లోనే చర్చసాగుతోంది. దీంతో ఆయన ఎస్సీలపై ఎంత సామాజిక వివక్ష చూపుతున్నారో అర్థమవుతోందని తెలుస్తోంది. టీడీపీ సామాజిక వర్గానికి చెందిన గ్రూపు కాకుండా ఇతరులు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.బీజేపీ సహకారం అంతంతమాత్రం నియోజకవర్గంలో బీజేపీ మాత్రం ఆయన అభ్యర్థత్వాన్ని బలపరచటం లేదు. నియోజక వర్గంలో బీజేపీలో కీలకంగా ఉండే కొర్రపోలు శ్రీనివాస్, సర్నాల విజయదుర్గ, రెబెల్ అభ్యర్థులుగా నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. దీంతో బీజేపీ నుంచి పూర్తిగా సహకారం లభించడంలేదు. పార్టీలో చేరికలు అంటూ కలరింగ్ టీడీపీలోని వారికే తాయిలాలు ఇచ్చి, ప్రలోభపెట్టి వారికే కండువాలు కప్పి, పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు అంటూ, పచ్చ మీడియాలో ఉదరగొడుతున్నారు. యార్లగడ్డ సమక్షంలో డబ్బుకోసం ఆయన పక్షాన చేరినవారంతా, ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా బస్సుయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. యార్లగడ్డ ప్రచారం, హడావుడి అంతా పాలపొంగు లాంటిదేనని, ఆయనకు ఈసారీ ఎన్నికల్లో విజయం దక్కదనే భావన నియోజక వర్గ ప్రజల్లో వ్యక్తం అవుతోంది. వంశీ ప్రచార జోష్ ఇప్పటికే గన్నవరం నియోజక వర్గం నుంచి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన హాట్రిక్ సాధించేందుకు తన దైన శైలిలో దూసుకుపోతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 58 నెలల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు, వైఎస్సార్ సీపీకి దన్నుగా నిలుస్తున్నాయి. ఇటీవల నియోజక వర్గంలో జరిగిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు జనాలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మహిళలనుంచి అనూహ్య స్పందన లభించింది. నామినేషన్ కార్యక్రమానికి సైతం జనాలు పోటెత్తారు. ఈ పరిణామాలన్నీ నియోజక వర్గంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ నింపాయి. అసెంబ్లీ అభ్యర్థి వల్లభనేని వంశీ సైతం ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి కష్టాల్లో పలు పంచుకుంటున్న వైనం నియోజక వర్గ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన ప్రచారానికి జనాలు అడుగడునా నీరాజనాలు పలుకుతున్నారు. నియోజక వర్గంలో వ్యక్తిగతంగా వంశీని అభిమానించే వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయనకు బలమైన అనుచర వర్గం ఉంది, ఇవన్నీ ఈ విజయానికి కలసి వస్తాయని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. -
దుమ్ములేపుతున్న వల్లభనేని వంశీ ప్రచారం..
-
Memantha Siddham Photos: గన్నవరం.. అభిమాన సంద్రం (ఫోటోలు)
-
గన్నవరంలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
-
సీఎం వైఎస్ జగన్ గన్నవరం బస్సు యాత్ర డ్రోన్ విజువల్స్
-
ప్రజల కోసం ఎందాకైనా.. గాయంతో సిద్ధం..!
-
సీఎం జగన్ బస్సు యాత్ర..ప్రజలతో కిక్కిరిసిన గన్నవరం
-
సీఎం జగన్ దాడిపై గన్నవరం ప్రజల రియాక్షన్..
-
గన్నవరం YSRCP అభ్యర్థి గా వంశీ..!
-
విమానంలో చంద్రబాబు భార్య.. గాల్లో 20 నిమిషాలు గందరగోళం
విజయవాడ: గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద మంగళవారం ఇండిగో విమానంలో గందరగోళం నెలకొంది. ల్యాండ్ అయ్యేందుకు రన్‌వే పైకి వచ్చిన విమానం మళ్లీ గాల్లోకి ఎగిరింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానంలో చంద్రబాబు భార్య భువనేశ్వరీ ఉండడంతో సోషల్ మీడియా ఈ వార్తకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఏం జరిగింది.? హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉదయం ఇండిగో విమానం వచ్చింది. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఇండిగో విమానాన్ని లాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే టేకాఫ్ సమయంలో విమానం చక్రాలు ఉన్న ప్యానెల్ తెరుచుకోలేదు. రెండు మార్లు ప్రయత్నించినా.. వీల్ ప్యానెల్ ఓపెన్ కాకపోవడంతో పైలట్ విమానాన్ని మళ్లీ పైకి లేపాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు (ATC) సమాచారం ఇవ్వడంతో పాటు ప్రయాణీకులకు కూడా విషయాన్ని వివరించాడు. సుమారు 20 నిమిషాల పాటు విమానాన్ని గాల్లోనే తిప్పి.. వీల్ ప్యానెల్‌ను చెక్ చేసుకున్నాడు. అంతా ఓకే అయిన తర్వాత రెండో సారి విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై దించాడు పైలట్. ఎలాంటి ప్రమాదం జరక్కుండా క్షేమంగా దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణీకులు. భువనేశ్వరీ ప్రయాణం ఇవ్వాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు నిజం చెబుతానంటూ నారా భువనేశ్వరీ పర్యటనలను షెడ్యూల్ చేసుకున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపంతో కొందరు చనిపోయారని అప్పట్లో ఎల్లోమీడియా ప్రచారం చేసింది. ఆ కుటుంబాలను పరామర్శిస్తానని అప్పట్లో భువనేశ్వరీ ఓ రెండు రోజులు పర్యటించి సుదీర్ఘ విరామం ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ పర్యటనలు పునఃప్రారంభించారు. ఇవ్వాళ్టి నుంచి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. కేరాఫ్ హైదరాబాద్ హైదరాబాద్‌లో చంద్రబాబు కుటుంబం జూబ్లీహిల్స్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంది. కేవలం సభలు, సమావేశాలు, పర్యటనలున్నప్పుడే మాత్రమే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం పరిపాటే. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వస్తున్నప్పుడు విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురక్షితంగా విమానం లాండవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
పి.గన్నవరం వైఎస్సార్సీపీ ఇంఛార్జిగా విప్పర్తి వేణుగోపాలరావు
-
గన్నవరం ఏయిర్పోర్టు నిర్వాసితుల సమస్యకు పరిష్కారం
-
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టివేత
గన్నవరం: కృష్ణాజిల్లాలోని గన్నవరంలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న కారులో ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు వంద కిలోల గంజాయిని కేంద్ర ప్రత్యేక బృందం పట్టుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. స్థానిక సెయింట్‌జాన్స్ హైసూ్కల్ సమీపంలోని విద్యానగర్‌లో ఓ ఇంటిని ప్లాస్టిక్ వస్తువుల విక్రయ వ్యాపారం చేసే రాజస్థాన్‌కు చెందిన కుటుంబం మూడు నెలల క్రితం అద్దెకు తీసుకుంది. వీరి ఇంటికి గురువారం రాజస్థాన్‌కు చెందిన నలుగురు యువకులు కారులో వచ్చారు. ఆ కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం దాడి చేసింది. అయితే భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్న నలుగురు యువకుల్లో.. అధికారుల రాకను గమనించి ఇద్దరు గోడ దూకి పరారయ్యారు. మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పట్టుబడ్డ ఇద్దరు యువకులను, గంజాయి ఉన్న కారును విజయవాడకు తరలించి విచారిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ సిద్ధాంతం కోసం దుట్టా పని చేస్తారు
సాక్షి, కృష్ణా: గన్నవరం నియోజకవర్గంపై యెల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం, రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అప్రమత్తమైంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో వీళ్ల భేటీ జరిగింది. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన వ్యక్తి దుట్టా రామచంద్రరావు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో దుట్టా ఒకరు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైతం దుట్టా కలిశారు. జగన్మోహన్ రెడ్డి కోసం.. పార్టీ సిద్దాంతం కోసం పనిచేసే వ్యక్తి దుట్టా అని బాలశౌరి తెలిపారు. ‘‘ఎంపీ బాలశౌరికి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ రాజశేఖర్ రెడ్డి శిష్యులుగా సుదీర్ఘకాలం పనిచేసాం. మూడు నెలలు క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశాను. ఆరోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి నాఅభిప్రాయం చెప్పాను. నేడు ఎంపీ బాలశౌరికి అదే చెప్పాను అని దుట్టా మీడియాకు వివరించారు. మరికొందరు నేతలు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.