
సాక్షి, కృష్ణా : పోస్టాపీస్ ఖాతాదారులను మోసం చేసిన ఓ పోస్ట్ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం బూతుమిల్లుపాడు,అజంపూడి బ్రాంచ్ లో పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న నాగేంద్ర 300 మంది ఖాతాదారులను మోసం చేసి 43 లక్షల రూపాయలు స్వాహా చేశాడు. 2014 నుండి ఖాతాదారుల నుండి డబ్బు తీసుకొని పాస్ బుక్ జమ చేయకుండా ఆ సొమ్మంత కాజేశాడు. బాధితులు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గత 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న నాగేంద్రను గన్నవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం తెలియడంతో బాధితులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment