Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Polavaram Project Authority gives clear message to Ministry of Jal Shakti1
‘బనకచర్ల’ అసాధ్యం!

సాక్షి, అమరావతి: ‘‘పోలవరం జలాశయంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వతో ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. దీనివల్ల పోలవరం ఆయకట్టుకు నీళ్లందించడమే సా­ధ్యం కాదు. పోలవరం–­బనకచర్ల అనుసంధాన ప్రా­జెక్టు (పీబీఎల్‌పీ)కు నీరి­వ్వడం అసాధ్యం’’ అని పోలవరం ప్రాజెక్టు అథా­రిటీ (పీపీఏ) తెగేసి చెప్పింది. ఈ మేరకు పీపీఏ డైరెక్టర్‌ మన్నూజీ ఉపాధ్యాయ కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాశారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వచేసేలా పోలవరాన్ని పూర్తి చేశాకే పీబీఎల్‌పీపై ఏదైనా ఆలోచన చేయవచ్చునని స్పష్టం చేశారు. పీబీఎల్‌పీకి సంబంధించి డీపీఆర్‌ రూ­పకల్పనకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృష్ణా డెల్టా చీఫ్‌ ఇంజనీర్‌ మే 22న కేంద్ర జల సంఘం (సీ­డబ్ల్యూ­సీ)కు ప్రాథమిక నివేదిక (పీ­ఎఫ్‌­ఆర్‌)ను సమర్పించారు. సీడబ్ల్యూసీ... ఈ ప్రాథ­మిక నివేదికపై పీపీఏ అభి­ప్రాయం కోరింది. దీనిని సమగ్రంగా అధ్యయనం చేసిన పీపీఏ తన అభిప్రా­యాన్ని తెలిపింది. పోలవరం జలాశ­యంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చే­సేలా... ఆ ప్రాజె­క్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లుగా గత ఏడాది ఆగస్టు 28న కేంద్రం ఆమోదించిందని, మిగిలిన పను­లకు రూ.­12,157.53 కోట్లకు మించి ఇచ్చేది లే­దని తేల్చిచెప్పిందని పేర్కొంది. దీని ప్రకారమే ప్రస్తుతం పనులు జరుగు­తున్నాయని లేఖలో వివరించింది. పీబీఎల్‌­పీ... పోలవరంలో భా­గం కాదని, ఈ నేపథ్యంలో పో­ల­­వరం నుంచి అదనంగా నీటి తరలింపుపై కేంద్రం సమగ్రంగా అధ్యయనం చేయాలని పీపీఏ పేర్కొంది. అందుబాటులో ఉన్న జ­లా­లు, అంత­ర్రాష్ట్ర వివాదా­లు, ట్రిబ్యునల్‌ అవా­ర్డు­లను పరిగణ­నలోకి తీసుకో­వాలని స్పష్టం చేసింది. పీబీ­ఎల్‌పీలో తాడిపూడి ఎత్తి­పో­తల కాలువను ఉప­యో­గించుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంద­ని­కానీ, పోలవరం పూర్తయ్యాక ఈ ఎత్తిపోతల ఆ­య­కట్టు కూడా పోలవరంలో భాగం అవుతుందని తె­లిపింది. పోలవరం కుడి కాలువ, డి­స్ట్రిబ్యూటరీ­లపై అధ్యయనం చేయాలని సూచించింది. 1980 ఏప్రిల్‌ 2న అంతర్రాష్ట్ర గోదావరి జలాల ఒప్పందం ఆధారంగా పోలవరం నిర్వహణ షెడ్యూ­ల్‌ను రూపొందించారని, పోలవరం నుంచి పీబీఎల్‌­పీ ద్వారా 200 టీఎంసీలను మళ్లించే క్రమంలో నాటి షెడ్యూల్‌ను పునఃపరిశీలించాలని తేల్చిచెప్పింది. పోలవరం కుడి కాలువ ద్వారా 200 టీఎంసీల గోదా­వరి జలాలను బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ (బీసీ­ఆర్‌)కు తరలించేలా పీబీఎల్‌పీని రాష్ట్ర ప్రభు­త్వం రూపొందించింది. 80 లక్షల మందికి తాగు, 7.41 లక్షల ఎకరాలకు సాగు నీరు, నాగార్జున సాగర్‌ కుడి కాలువ, వెలిగొండ, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌ కింద 22.58 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు... పారిశ్రామిక అవస­రాల కోసం 20 టీఎంసీలను సరఫరా చేస్తామని చెబు­తోంది. ఈ ప్రాజెక్టుకు రూ.81,900 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది.కేవలం కమీషన్ల కోసమే బాబు సర్కారు బనకచర్ల రాగం...!రాష్ట్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసమే చేపడుతున్నట్లు స్పష్టం అవుతోందని సాగునీటి రంగ నిపుణులు, విమర్శకులు పేర్కొంటున్నారు. గోదావరి ప్రధాన ఉపనది ఇంద్రావతిపై ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రెండు ప్రాజెక్టులు నిర్మిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రూ.45 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వీటికి కేంద్రం ఆమోదం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రకటించారని చెబుతున్నారు. అంతేగాక సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం ఏటా గోదావరికి వచ్చే వరదలో ఇంద్రావతి నుంచి వచ్చి కలిసే వరద 22.93 శాతం ఉంటుందని వివరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి ఏపీకి నీరు చేరేది ఎప్పుడు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ కీలక విషయాలపై మాట్లాడకుండా బాబు సర్కారు హడావుడి చేస్తోందని విమర్శిస్తున్నారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై మౌనంగా ఉండి బనకచర్ల చేపట్టడమా? అని నిలదీస్తున్నారు. నీళ్లు రాని సంగతి తెలుస్తున్నా.. ఎర్త్‌ వర్క్‌ చేసి కమీషన్లు కొట్టేసే ఎత్తుగడతో పోలవరం–బనకచర్ల చేపట్టారని ఆరోపిస్తున్నారు.జనవరిలోనే ‘సాక్షి’ కథనం.. అక్షర సత్యంపీబీఎల్‌పీకి ఆర్థిక సాయం కోరుతూ కేంద్ర జల్‌ శక్తి శాఖకు చంద్రబాబు ప్రభుత్వం జనవరి 24న ప్రతిపాదనలు పంపింది. అప్పుడే ‘‘పోలవరానికి ఉరేసి.. బనకచర్లకు గోదారెలా?’’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. చంద్రబాబు సర్కారు నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపింది. ఇప్పుడు పీపీఏ డైరెక్టర్‌ మన్నూజీ ఉపాధ్యాయ కూడా ‘సాక్షి’ కథనం అక్షర సత్యమని నిరూపించేలా కేంద్ర జల్‌ శక్తి శాఖకు లేఖ రాయడం గమనార్హం.జీవనాడికి ఉరేసి ఊపిరి తీయడం వల్లే..పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్‌ అనుమతిచ్చింది. ఆ మేరకు గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 55 మీటర్ల ఎ­త్తుతో స్పిల్‌వేను 2021 జూన్‌ 11 నాటికే వైఎ­స్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ, గతేడాది ఆగస్టు 28న 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ­తో పోలవరం పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్‌ ఆ­మోదించింది. దీనిని ఆ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, టీడీపీకి చెందిన రామ్మోహన్‌­నాయు­డు వ్యతిరేకించలేదు. అంటే... పోలవరంలో 41.15 మీ­టర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభు­త్వం అంగీకరించిందన్న మాట. పోలవరం రిజర్వా­యర్‌ను బ్యారేజ్‌గా మార్చేందన్నది కూడా స్పష్టమ­వు­తోంది. పోలవరం కనీస నీటి మట్టం 41.15 మీట­ర్లు. ఈ స్థాయిలో 115.4 టీఎంసీలనే నిల్వ చేయొ­చ్చు. కుడి కాలువకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకు నీటిని తరలించవచ్చు. 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 ల­క్షల ఎకరాలకు నీళ్లందించడానికే సరిపోవని నిపు­ణులు స్పష్టం చే­స్తున్నారు. 42 మీటర్ల ఎత్తు నుంచి పోలవరం కుడి కా­లువ ద్వారా బనకచర్లకు గోదా­వ­రి జలాలను తరలించడం ఎలా సాధ్యమ­న్నది రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి. పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించి, జీవనాడికి ఉరేసి ఊపిరి తీయ­డం వల్లే పీబీఎల్‌పీకి శాపంగా మారిందని సాగు నీటి రంగ నిపుణులు అంటున్నా­రు. ఇదే అంశా­న్ని ప్రస్తావిస్తూ జనవరి 24న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. పీ­బీఎల్‌పీకే కాదు... పోల­వరంలో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజ­ల స్రవంతి ప్రాజెక్టుకు నీళ్లందించడమూ సాధ్యం కాదని నిపు­ణు­లు చెబుతున్నా­రు. సీఎం చంద్రబా­బు పీబీఎల్‌పీని రాయలసీమకు గోదావరి జలాలు అందించాలన్న చి­త్తశుద్ధితో కాదు.. కేవలం కమీషన్ల కోసమే చేపట్టారని పీపీఏ లేఖతో బట్టబయలైంది.

Nato Chief Warns India Over Russia Trade Glbs2
‘రష్యాతో వాణిజ్యం చేస్తారా?’: భారత్‌కు ‘నాటో’ చీఫ్‌ వార్నింగ్‌

న్యూఢిల్లీ: రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూ, అక్కడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తాము 100 శాతం ద్వితీయ ఆంక్షలు విధిస్తామని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) చీఫ్‌ మార్క్ రుట్టే.. భారత్‌, చైనా, బ్రెజిల్ నేతలకు హెచ్చరిక జారీ చేశారు. దీనికితోడు శాంతి చర్చలలో పాల్గొనేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.రష్యాను ఆర్థికంగా ఒంటరి చేయాలనే అమెరికా ఒత్తిడి మేరకు ‘నాటో’ చీఫ్‌ ఈ ప్రకటన చేశారు. ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి, శాంతి చర్చలకు రావాలని కోరారు. మరోవైపు రష్యాకు సహాయం చేస్తున్న దేశాలపై 500% వరకు సుంకాల బిల్లును అమెరికా సెనేటర్లు వెనక్కి తీసుకున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. దీంతో ఆంక్షలు విధిస్తే, భారత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి.బ్రెజిల్, చైనా, భారత్‌లు ఇకపై రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీ ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు నూతన ఆయుధాలు సమకూర్చడంతో పాటు, రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కఠినమైన సుంకాలు విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన దరిమిలా మార్క్ రుట్టే ఈ విధంగా వ్యాఖ్యానించారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు.. ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తూ, వారి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తూ ఉంటే వారిపై 100 శాతం ద్వితీయ ఆంక్షలు విధిస్తానని మార్క్ రుట్టే హెచ్చరించారు. మాస్కోతో శాంతి చర్చలు అ‍త్యంత ప్రధానమైనవిగా పరిగణించాలని మార్క్ రుట్టే కోరారు.ప్రస్తుతం, చైనా, భారత్‌, టర్కీలు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసే దేశాలలో టాప్‌లో ఉన్నాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఒకవేళ అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధిస్తే, ఈ దేశాలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ చర్య ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే ఇప్పటికే అస్థిరంగా ఉన్న ఇంధన ధరలు మరింత భారం అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

Citizens to Avoid non Essential Travel to Iran3
‘అనవసర ప్రయాణాలొద్దు’.. ఇరాన్‌లోని భారతీయులకు హెచ్చరిక

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ జూన్ 13న ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను మొదలుపెట్టి, ఇరాన్‌కు చెందిన సైనిక, అణు సౌకర్యాలపై బాంబు దాడి చేయడంతో ప్రారంభమైన ప్రాంతీయ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ఇరాన్‌లోని భారత పౌరులు అనవసర ప్రయాణాలను మానుకోవాలని కోరింది.గత కొన్ని వారాలుగా ఇరాన్‌లో పెరుగుతున్న భద్రతా సమస్యల మధ్య ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ ప్రకటన చేసింది. ‘గత కొన్ని వారాలుగా నెలకొన్న భద్రతా సంబంధిత పరిణామాల దృష్ట్యా, ఇరాన్‌లో అనవసరమైన ప్రయాణాలు చేపట్టే ముందు ఇక్కడి పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించాలని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్‌’లో సూచించింది. ఇరాన్‌లో ఇప్పటికే ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు, ఫెర్రీలను వినియోగించుకోవచ్చని తెలిపింది. pic.twitter.com/boZI4hAVin— India in Iran (@India_in_Iran) July 15, 2025ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించి ఇరాన్‌పై దాడులకు తెగబడిన దరిమిలా ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. జూన్ 24న ఇజ్రాయెల్ తన దురాక్రమణను ఏకపక్షంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో 12 రోజుల ఈ యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

Devdutt Padikkal Becomes The Highest Bid Player In Maharaja Trophy KSCA T20 Auction4
ఆర్సీబీ ప్లేయర్‌కు జాక్‌పాట్‌.. వేలంలో అత్యధిక ధర

నిన్న (జులై 15) జరిగిన మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీ 2025 ఎడిషన్‌ వేలంలో ఆర్సీబీ ఆటగాడు దేవ్‌దత్‌ పడిక్కల్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. ఈ వేలంలో పడిక్కల్‌ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. పడిక్కల్‌ను హుబ్లీ టైగర్స్‌ రూ. 13.20 లక్షలకు సొంతం చేసుకుంది. పడిక్కల్‌ తర్వాత ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా సన్‌రైజర్స్‌ హిట్టర​్‌ అభినవ్‌ మనోహర్‌ (12.20 లక్షలు), కేకేఆర్‌ వెటరన్‌ మనీశ్‌ పాండే (12.20 లక్షలు), విధ్వత్‌ కావేరప్ప (10.80 లక్షలు), విద్యాధర్‌ పాటిల్‌ (8.40 లక్షలు) నిలిచారు.ఈ వేలంలో రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు సమిత్‌ ద్రవిడ్‌కు నిరాశ ఎదురైంది. అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గత సీజన్‌లో సమిత్‌ మైసూర్‌ వారియర్స్‌కు ఆడాడు. రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కరుణ్‌ నాయర్‌ (6.8 లక్షలు), ప్రసిద్ద్‌ కృష్ణ (2 లక్షలు), మయాంక్‌ అగర్వాల్‌ (14 లక్షలు) లాంటి టీమిండియా స్టార్లు ఉన్నారు.మహారాజా ట్రోఫీ 2025 ఎడిషన్ ఆగస్ట్‌ 11 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మొదలుకానుంది. ఈ లీగ్‌లో మొత్తం 6 ఫ్రాంచైజీలు (మైసూర్ వారియర్స్, హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, మరియు గుల్బర్గా మిస్టిక్స్) పాల్గొంటాయి. ప్రతి ఫ్రాంచైజీ 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసుకుంది.జట్ల వివరాలు..శివమొగ్గ లయన్స్కౌశిక్ వి, హార్దిక్ రాజ్, అవినాష్ బి, నిహాల్ ఉల్లాల్, విధ్వత్ కావేరప్ప, అనిరుధ జోషి, అనీశ్వర్ గౌతమ్, ధృవ్ ప్రభాకర్, సంజయ్ సి, ఆనంద్ దొడ్డమణి, సాహిల్ శర్మ, భరత్ ధురి, దీపక్ దేవాడిగ, రోహిత్ కుమార్ కె, తుషార్ సింగ్, దర్శన్ ఎంబి. మరిబసవ గౌడ, శిరీష్‌ బాల్గార్‌మైసూర్ వారియర్స్కరుణ్ నాయర్, కార్తీక్ CA, ప్రసిద్ధ్ కృష్ణ, కార్తీక్ SU, మనీష్ పాండే, గౌతమ్ K, యశోవర్ధన్ పరంతప్, వెంకటేష్ M, హర్షిల్ ధర్మాని, లంకేష్ KS, కుమార్ LR, గౌతమ్ మిశ్రా, శిఖర్ శెట్టి, సుమిత్ కుమార్, ధనుష్ గౌడ, కుశాల్ M వాధ్వాని, శరత్ శ్రీనివాస్, షమంత్‌మంగళూరు డ్రాగన్స్అభిలాష్ శెట్టి, మక్నీల్ నోరోన్హా, లోచన్ ఎస్ గౌడ, పరాస్ గుర్బాక్స్ ఆర్య, శరత్ బిఆర్, రోని మోర్, శ్రేయాస్ గోపాల్, మేలు క్రాంతి కుమార్, సచిన్ షిండే, అనీష్ కెవి, తిప్పా రెడ్డి, ఆదిత్య నాయర్, ఆదర్శ్ ప్రజ్వల్, అభిషేక్ ప్రభాకర్, శివరాజ్ ఎస్, పల్లవ్‌ కుమార్‌ దాస్‌హుబ్లీ టైగర్స్కెసి కరియప్ప, శ్రీజిత్ కెఎల్, కార్తికేయ కెపి, మాన్వత్ కుమార్ ఎల్, అభినవ్ మనోహర్, దేవదత్ పడిక్కల్, మహ్మద్ తాహా, విజయరాజ్ బి, ప్రఖర్ చతుర్వేది, సంకల్ప్ ఎస్ఎస్, సమర్థ్ నాగరాజ్, రక్షిత్ ఎస్, నితిన్ ఎస్ నాగరాజా, యష్ రాజ్ పుంజా, రితేష్ ఎల్ భత్కల్, శ్రీషా ఆచార్‌, నాథన్‌ మెల్లో, నిశిచిత్‌ పాయ్‌గుల్బర్గా మిస్టిక్స్‌వైషాక్ విజయ్‌కుమార్, లువ్‌నిత్ సిసోడియా, ప్రవీణ్ దూబే, స్మరణ్ ఆర్, సిద్ధత్ కెవి, మోనిష్ రెడ్డి, హర్ష వర్ధన్ ఖుబా, పృథ్వీరాజ్, లవిష్ కౌశల్, శీతల్ కుమార్, జాస్పర్ ఇజె, మోహిత్ బిఎ, ఫైజాన్ రైజ్, సౌరబ్ ఎమ్ ముత్తూర్, ఎస్‌జె నికిన్ జోస్, ప్రజ్వల్‌ పవన్‌, యూనిస్‌ అలీ బేగ్‌, లిఖిత్‌ బన్నూర్‌బెంగళూరు బ్లాస్టర్స్మయాంక్ అగర్వాల్, శుభాంగ్ హెగ్డే, నవీన్ MG, సూరజ్ అహుజా, A రోహన్ పాటిల్, చేతన్ LR, మొహ్సిన్ ఖాన్, విద్యాధర్ పాటిల్, సిద్ధార్థ్ అఖిల్, మాధవ్ ప్రకాష్ బజాజ్, రోహన్ నవీన్, కృతిక్ కృష్ణ, అద్విత్ ఎం శెట్టి, భువన్ మోహన్ రాజు, రోహన్ ఎం రాజు, నిరంజన్ నాయక్, ప్రతీక్ జైన్, ఇషాన్ ఎస్

NRI Arrested In Iconic Runner Fauja Singh Hit-And-Run Case5
మారథాన్‌ రన్నర్‌ ఫౌజా సింగ్‌ మృతి ​కేసు.. ఎన్‌ఆర్‌ఐ అరెస్ట్‌

ఛండీగఢ్‌: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భారత దిగ్గజ మారథాన్‌ అథ్లెట్‌ ఫౌజా సింగ్ కేసులో ఎన్‌ఆర్‌ఐ అమృత్‌పాల్‌ సింగ్ ధిల్లాన్(30)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రమాదం జరిగిన సమయంలో వాహనం నడిపిన అమృత్‌పాల్‌ సింగ్‌ను కర్తార్‌పుర్‌లో మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అతడు కెనడా నుంచి భారత్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడు న‌డిపిన ఫార్చ్యూన‌ర్ ఎస్‌యూవీని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మ‌రికాసేప‌ట్లో అత‌న్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అనంత‌రం రిమాండ్‌కు త‌ర‌లించ‌నున్నారు.ఇదిలా ఉండగా.. పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలోని బియాస్‌ పిండ్‌ గ్రామం వ‌ద్ద‌ జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏళ్ల ఫౌజా సింగ్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా, గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ఫౌజాసింగ్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దగ్గరలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.ప్రపంచంలోనే కురువృద్ధ అథ్లెట్‌గా పేరుగాంచిన ఈ పంజాబ్‌ పుత్తర్‌ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వందేళ్ల వయసును ఏమాత్రం లెక్కచేయకుండా యువకులకు సవాలు విసురుతూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ మారథాన్‌లలో బరిలోకి దిగి సత్తాచాటారు. ఫౌజా సింగ్‌ మృతి పట్ల పలు ప్రపంచ దేశాలు తమ దిగ్భ్రాంతి ప్రకటించాయి. 1911 ఏప్రిల్‌ 1న జన్మించిన ఫౌజాసింగ్‌ 89 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌ కెరీర్‌ మొదలుపెట్టారు. 1993లో ఇంగ్లండ్‌కు వెళ్లిన ఈ దిగ్గజ అథ్లెట్‌.. ‘టర్బన్‌ టోర్నడో’ అంటూ అందరి మనన్నలు పొందారు. 2011లో జరిగిన టొరంటో మారథాన్‌లో 100 ఏళ్ల వయసులో 8 గంటల 11 నిమిషాల్లో రేసు పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐదేళ్ల పసిప్రాయం వరకు నడవని ఆయన.. తన 14 ఏళ్ల అథ్లెటిక్స్‌ కెరీర్‌లో తొమ్మిది మారథాన్‌ రేసుల్లో పోటీపడటం విశేషం.The world's oldest marathon runner, Fauja Singh, has died at the age of 114. He was involved in a hit-and-run near Jalandhar, India.Singh began running at 89 and ran nine full marathons - and was one of the 2012 London Olympic torchbearers. pic.twitter.com/kvevQ84FaD— Channel 4 News (@Channel4News) July 15, 2025తన కుటుంబసభ్యుల మరణాల నుంచి తేరుకునేందుకు పరుగును ఎంచుకున్న ఫౌజాసింగ్‌ను 2015లో బ్రిటిష్‌ ఎంపైర్‌ మెడల్‌ వరించింది. 2012లో జరిగిన హాంకాంగ్‌ మారథాన్‌.. ఆయన చివరి అంతర్జాతీయ రేసుగా నిలిచింది. పంజాబ్‌లో డ్రగ్స్‌ నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఈ దిగ్గజ అథ్లెట్‌ కీలకంగా వ్యవహరించారు. కనీసం నడిచే వీలు లేని వయసులో కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన ఫౌజాసింగ్‌ అకాల మృతి అందరినీ కలిచివేసింది.

Actor Ravi Teja Father Passed Away6
నటుడు 'రవితేజ' కుటుంబంలో విషాదం

ప్రముఖ టాలీవుడ్‌ హీరో రవితేజ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్‌ రాజు (90) వయస్సు, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. తన తండ్రి నేర్పిన పాఠాల ద్వారా కష్టాలను ఎలా ఎదుర్కొవాలో తెలుసుకున్నానని గతంలో రవితేజ తెలిపారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో రాజగోపాల్‌ తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యహ్నం 3 గంటల తర్వాత ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు ముగ్గురు కుమారులు. వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్‌ 2017లో కారు ప్రమాదంలో కన్నుమూశారు, మరో కుమారుడు రఘు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నారు.తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన రాజగోపాల్‌ ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. తన ఉద్యోగం కారణంగా ఎక్కువ భాగం ఉత్తర భారతదేశంలోనే ఆయన గడిపాడు. దీంతో రవితేజ పాఠశాల విద్య 'జైపూర్ , ఢిల్లీ , ముంబై భోపాల్‌'లలో జరిగింది. అందువల్ల రవితేజ చిన్నప్పటి నుంచి వివిధ యాసలు, సంస్కృతులు నేర్చుకున్నాడు. ఇది ఆయన నటనకు ప్రత్యేకతను తీసుకొచ్చిందని పరిశ్రమలో పలువురు చెబుతారు.సంతాపం తెలిపిన చిరంజీవిహీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. సోదరుడు రవి తేజ తండ్రి మరణవార్త విని చాలా బాధపడ్డానని ఆయన అన్నారు. రవితేజను ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశానని గుర్తుచేసుకున్నారు. ఈ కష్ట సమయంలో రవితేజ కుటుంబానికి భగవంతుడు అండగా ఉంటాడని, హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు చిరు పేర్కొన్నారు. రాజగోపాల్‌ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చిరంజీవి తెలిపారు.

Kota Vinutha couple reveals sensational facts with Chennai Police7
పవన్‌ కళ్యాణ్‌కు అంతా తెలుసు

సాక్షి, అమరావతి: ‘మా వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మమ్మల్ని బ్లాక్‌ మెయిల్‌ చేశారు. ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు చెప్పాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్‌ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే డ్రైవర్‌ శ్రీనివాస్‌ హత్య వరకు వ్యవహారం దారి తీసేది కాదు’ అని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్‌ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు దంపతులు విస్పష్టంగా వెల్లడించారు. డ్రైవర్‌ శ్రీనివాస్‌ హత్య కేసులో వారిద్దరినీ చెన్నై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు అక్కడి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. తమ వ్యక్తిగత వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న విషయం పవన్‌ కల్యాణ్‌కు ముందే తెలుసని వారు కుండబద్ధలు కొట్టడం గమనార్హం. తమ పార్టీ మహిళా నేతను వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని తెలిసినా ఆయన పట్టించుకోలేదని వారు వాపోయారు. చెన్నై పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు తమ వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి.గొడవ చేయొద్దు.. సర్దుబాటు చేస్తానన్నారు‘టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మా బెడ్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్‌ శ్రీనివాస్‌ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్‌ శ్రీనివాస్‌ రూ.30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్‌కు విక్రయించారు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్‌ మెయిల్‌ చేయించారు. ఈ విషయం తెలియగానే శ్రీనివాస్‌ను పని నుంచి తొలగించాం. వ్యక్తిగత వీడియోలతో మమ్మల్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుండటంతో వెంటనే మా పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లాం. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే ఇదంతా చేయిస్తున్నారని వివరించాం. ఆ విషయాన్ని ఎవరికీ చెప్దొద్దు.. టీడీపీ వారితో గొడవ పడొద్దని ఆయన మాతో చెప్పారు. ‘నేను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్‌తో మాట్లాడతాను. విషయాన్ని సర్దుబాటు చేస్తాను. మీరు పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు. ప్రభుత్వానికి, రెండు పార్టీలకు ఇబ్బంది కలుగుతుంది’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పార్టీ అధినేత అలా హామీ ఇవ్వడంతో ఆయన మాటలు విశ్వసించాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే సుధీర్‌తో ఏం మాట్లాడారో మాకు తెలీదు. కానీ ఎమ్మెల్యే సుధీర్‌ తన వర్గీయులతో మమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ బెదిరింపులు కొనసాగించారు. అంటే పవన్‌ కల్యాణ్‌ మా ఆవేదనను పట్టించుకోలేదని స్పష్టమైంది.పూర్తి వివరాలు తెలుసుకునేందుకే శ్రీనివాస్‌ను పిలిపించాం టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ రెడ్డి వర్గీయులు బ్లాక్‌ మెయిలింగ్‌ కొనసాగిస్తునే ఉన్నారు. దాంతో శ్రీనివాస్‌ను పిలిపించి గట్టిగా నిలదీశాం. ఎందుకు ఇంత పని చేశావని ప్రశ్నించాం. తనకు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి రూ.30 లక్షలు ఇచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని అతను తెలిపాడు. అందులో రూ.20 లక్షలు ఖర్చు చేసేశానని, తన వద్ద ఇక రూ.10 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దాంతో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఆ ఘర్షణలోనే శ్రీనివాస్‌ హతమయ్యాడు.పవన్‌ స్పందించి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదువ్యక్తిగత వీడియోలతో తమను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న విషయాన్ని చెప్పగానే పవన్‌ కల్యాణ్‌ బాధ్యతాయుతంగా స్పందిస్తారని ఆశించాం. పార్టీలో ఓ మహిళా నేత ఆవేదనను అర్థం చేసుకుంటారని, న్యాయం చేస్తారని అనుకున్నాం. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ సమస్యనే పట్టించుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. పవన్‌ కల్యాణ్‌ వెంటనే స్పందించి.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, టీడీపీ ఎమ్మెల్యే సుధీర్‌ను కట్టడి చేసి ఉండే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నప్పుడు అడ్డుకోకుండా ఉన్నా బాగుండేది. దాంతో పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో. అటు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్‌ బ్లాక్‌మెయిలింగ్‌.. మరోవైపు మా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పట్టించుకోకపోవడం.. దీంతో ఏం చేయాలో మాకు తోచలేదు. దాంతో డ్రైవర్‌ శ్రీనివాస్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాం. ఆ తర్వాత మాటా మాటా పెరిగి పరిస్థితి చేయిదాటిపోయింది. అతను హతమయ్యాడు. బ్లాక్‌ మెయిలింగ్‌ బాధితులమైన మేము హత్య కేసులో చిక్కుకున్నాం. మా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌ తన పంతం నెగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జికే ఇంతటి దుస్థితి ఏర్పడితే.. ఇక జనసేన పార్టీ సామాన్య కార్యకర్తల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతోంది’ అని వారు పేర్కొన్నారు.

KA Paul with Yamen leadership Over Nimisha Priya release8
నిమిష ఉరిశిక్ష ఆపింది నేనే.. హౌతీ, యెమెన్ ప్ర‌భుత్వ పెద్ద‌లతో కేఏ పాల్‌

కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష పడకుండా తానే ఆపినట్టు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను యెమెన్‌, హూతీ దేశాల ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, వారిని ఒప్పించినట్టు పాల్‌ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో నిమిషను కాపడటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్బంగా కేఏ పాల్‌.. మూడు రోజులు రాత్రింభ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి కేర‌ళ న‌ర్సు నిమిష ప్రియ‌కు యెమెన్‌లో ఉరిశిక్ష పడకుండా ఆపాను. నిమిషాను ర‌క్షించ‌డంలో ఎనిమిది సంవ‌త్స‌రాలుగా మోదీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది. మోదీ గ‌వ‌ర్న‌మెంట్ స‌న సిటీలో ప్ర‌భుత్వం లేద‌న్నార‌ని, ఏం చేయ‌లేమ‌ని చేతులెత్తేశారు. కానీ అది అబ‌ద్ధం. హూతీ సిటీలో ప్ర‌భుత్వం ఉంది. మోస్ట్ పాపుల‌ర్ ముస్లీం లీడ‌ర్ సెమీ ఆరియ‌న్ షేక్ అహ్మ‌ద్ ఎంతో సాయం చేశారు.Dr. K.A Paul with Yamen leadership One of the 5 key meetings . Both sides the Houthi leaders and Government leaders have finally considering to help Indian Nurse Nimisha Priya released . The victim Talal Mahdi’s family also considering to pardon Priya the indian Nurse in Sanaa… pic.twitter.com/LSE4jH0i4M— Dr KA Paul (@KAPaulOfficial) July 14, 2025మూడు రోజులుగా క‌ష్ట‌ప‌డి హూతీ, యెమెన్ ప్ర‌భుత్వ పెద్ద‌లను కలిశాను. వారు సాయం చేశారు. నిమిష‌కు ఉరిశిక్ష వాయిదా వేయ‌కుండా ఆమె చంపిన కుటుంబానికి మిలియ‌న్ డాల‌ర్లు ఇస్తామ‌ని హామీ ఇచ్చాన‌ని అన్నారు. అవి కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తుందా.. త‌న‌ను ఇవ్వ‌మంటారా అని ప్ర‌శ్నించారు. వారం రోజుల్లోనే ఆ డ‌బ్బులు ఇవ్వాల‌ని అన్నారు. ఉరిశిక్ష కేవ‌లం వాయిదా ప‌డిందని.. తాను మ‌ళ్లీ యెమ‌న్ లీడ‌ర్ల‌ను క‌లుస్తాన‌ని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆయన వల్లే ఉరి శిక్ష ఆగిపోయిందా అని మాట్లాడుకుంటున్నారు.

Vadde Sobhanadreeswara Rao Serious Comments On CBN Govt9
‘1,500 ఎకరాల్లో అమరావతి రైల్వేస్టేషన్‌ నిర్మాణమా?’

సాక్షి, అమరావతి: అమరావతిలో రైల్వేస్టేషన్‌ను భారతదేశంలోనే అతి గొప్ప రైల్వేస్టేషన్‌గా 1,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని రైతు నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనా­ద్రీ­శ్వ­రరావు పేర్కొన్నారు. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ­లో ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషనా? ఎక్కడైనా చూశామా? అని ప్రశ్నించారు. ‘అత్యంత పురాతనమైన చెన్నై రైల్వేస్టేషన్‌ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా?.. కేవలం 13 ఎకరాలు, అదే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలు­సా?.. 16 ఎకరా­లు, బెజవాడ రైల్వేస్టేషన్‌ విస్తీర్ణం ఎంతో తెలుసా?.. కేవలం 8 ఎకరాల్లో ఉంది. అసలు 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్‌ నిర్మిస్తామని చెబుతుంటే వీళ్లను ఏమనాలని వడ్డే శోభనా­ద్రీశ్వరరావు ప్రశ్నించారు. అదే మాట ఎవరైనా మామూ­లోడు మాట్లాడితే.. ఇలాంటి మాటలు మాట్లాడిన వాడ్ని చెప్పుతీసి కొట్టాలని అంటాం. కానీ బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడినప్పుడు మనం ఏమనగలం? అది పిచ్చివాడు మాట్లాడినట్టుగా అనుకోవాలే తప్ప అంతకు మించి వేరే భాష ఏం మాట్లాడగలం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Donald Trump asks Volodymyr Zelenskyy if Ukraine could hit Moscow10
మాస్కోను కొట్టగలవా?

వాషింగ్టన్‌: దీటైన అస్త్రశస్త్రాలు అందిస్తే మాస్కోను కొట్టగలవా? రష్యాపై భీకరంగా దాడిచేయగలవా? అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూటి ప్రశ్న వేశారు. జూలై నాలుగో తేదీన జెలెన్‌స్కీకి ఫోన్‌చేసిన మాట్లాడిన సందర్భంగా ట్రంప్, వొలదిమిర్‌ జెలెన్‌స్కీల మధ్య జరిగిన సంభాషణ తాలూకు విశేషాలను తాజాగా అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తూ తీవ్ర నష్టం చేకూరుస్తున్న రష్యాకు సైతం అదే స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం కల్గించాలని జెలెన్‌స్కీకి ట్రంప్‌ సూచించినట్లు తెలుస్తోంది.ఇరునేతల సంభాషణ వివరాలను కొన్ని అత్యున్నత వర్గాలు వెల్లడించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘‘ చూడు వొలదిమిర్‌.. నువ్వు రష్యా రాజధాని మాస్కో నగరంపై క్షిపణులతో దాడి చేయగలవా?’’ అని ట్రంప్‌ ప్రశ్నించగా.. ‘‘ తప్పకుండా. మీరు సరైన మిస్సైళ్లు ఇస్తే దాడి చేసి చూపిస్తా’’ అని జెలెన్‌స్కీ హామీ ఇచ్చారు. ‘‘ మీకు కావాల్సిన సుదీర్ఘ శ్రేణి క్షిపణులను అందిస్తాం. రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ను ధ్వంసంచేయగలరా?’’ అని ట్రంప్‌ ప్రశ్నించగా.. ‘‘ ఆ స్థాయిలో దాడికి సరిపడా ఆయుధాలు సమకూరిస్తే తప్పకుండా దాడిచేస్తాం’’ అని జెలెన్‌స్కీ మాటిచ్చారు. ‘‘ దాడుల్లో రక్తమోడుతూ ఉక్రెయిన్‌వాసులు పడుతున్న బాధను రష్యన్లు అనుభవించాలి. మీ దాడులతో వాళ్లకూ నొప్పి తెలిసిరావాలి’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.ఉక్రెయిన్‌తో సయోధ్య కుదుర్చుకోవాలని, లేదంటే 50 రోజుల్లోపు సుంకాల సుత్తితో మోదుతానని రష్యాను ట్రంప్‌ హెచ్చరించిన మరుసటి రోజే ఈ సంభాషణల అంశం తెరమీదకు రావడం గమనార్హం. శాంతి ఒప్పందం చేసుకోండని ఎంతమొత్తుకున్నా రష్యా వినిపించుకోవట్లేదని, సహనం నశించి ట్రంప్‌ ఇలా జెలెన్‌స్కీని దాడులు చేయగలవా? అని ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే సంభాషణల వార్తపై అటూ శ్వేతసౌధంగానీ, ఇటు ఉక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయంగానీ స్పందించలేదు.నాటో కూటమి ప్రధాన కార్యదర్శి మార్క్‌ రుట్టేతో కలిసి శ్వేతసౌధంలో ట్రంప్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ పుతిన్‌ అంత సులభంగా లొంగే మనిషి కాడు. మన నేతలనే మభ్యపెట్టాడు. క్లింటన్‌ మొదలు జార్జ్‌ బుష్, ఒబామా, బైడెన్‌దాకా అమెరికా అధ్యక్షులను తన మాటలతో మభ్యపెట్టాడు. నేను వాళ్లలాగా ఫూల్‌ను కాబోను. బిలియన్ల డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తా. నాటో సభ్యదేశాలు ఆర్డర్‌ ఇచ్చిన 17 గగనతల రక్షణ వ్యవస్థ మిస్సైల్‌ లాంఛర్లన్నీ ఉక్రెయిన్‌కు పంపిస్తాం’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement