post office
-
రూ.80 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.15 లక్షలు గ్యారెంటీ!
table, th, td { border: 1px solid black; } పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) పథకాన్ని సురక్షితమైన, గ్యారెంటీ రాబడిని కోరుకునే వ్యక్తులు మంచి పెట్టుబడి ఎంపికగా చూస్తారు. ప్రభుత్వ పథకం కావడంతో రిస్క్ తక్కువగా ఉంటుందనే భావనే ఇందుకు కారణం. అయితే ఈ స్కీమ్‌లో ఎంత పెట్టుబడి పెడితే ఎంత మొత్తం సమకూరుతుందో చాలామందికి సరైన అవగాహన ఉండదు. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతోపాటు ఈ పథకం కీలక అంశాలను కింద చూద్దాం.పోస్టాఫీస్ ఎన్ఎస్సీ పథకంనేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ) అనేది భారతీయ తపాలా కార్యాలయం అందించే స్థిర ఆదాయ పెట్టుబడి పథకం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద స్థిరమైన రాబడులు, పన్ను ప్రయోజనాల హామీతో చిన్న, మధ్యతరహా పెట్టుబడిదారులను పొదుపు చేయడానికి ప్రోత్సహించడానికి దీన్ని రూపొందించారు.కీలక ఫీచర్లు..రిస్క్‌లేని పెట్టుబడి: భారత ప్రభుత్వ మద్దతు ఉండడంతో ఎన్ఎస్సీను సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణిస్తున్నారు.ఫిక్స్డ్ వడ్డీ రేటు: వడ్డీ రేటును ఏటా ఫిక్స్ చేసి కాంపౌండ్ చేస్తారు. 2024 మొదటి త్రైమాసిక కాలం నాటికి వడ్డీ రేటు ఏడాదికి 7.7 శాతంగా ఉంది.పన్ను ప్రయోజనాలు: రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు: పెట్టుబడిదారులు ఎన్ఎస్సీలో చేసే ఇన్వెస్ట్‌మెంట్‌కు గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.చక్రవడ్డీ: వడ్డీని ఏటా తిరిగి పెట్టుబడిగా పెడతారు. ఇది మెచ్యూరిటీ సమయంలో అధిక రాబడిని అందిస్తుంది.కనీస పెట్టుబడి: కనీస పెట్టుబడి మొత్తం రూ.1,000.ఇదీ చదవండి: పేరు మార్చుకుంటే రూ.8,400 కోట్లు ఆఫర్!ఐదేళ్ల తరువాత ఎంత వస్తుంది?ఐదేళ్ల కాలపరిమితికి ఎన్ఎస్సీ పథకంలో పెట్టుబడి చేస్తే రూ.80,000 ఇన్వెస్ట్‌మెంట్‌కు మెచ్యూరిటీ మొత్తం కింది విధంగా ఉంటుంది.(రూ.ల్లో)ఏడాదిఅసలు వడ్డీ మొత్తం 180,000 6,160 86,160286,160 6,633 92,7933 92,7937,14599,938499,938 7,695 1,07,63351,07,6338,2861,15,919 -
పోస్టాఫీసులో అకౌంట్ ఉంటే ఇన్ని బెనిఫిట్సా?
నేటి రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులకు కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. బ్యాంక్ ఖాతాదారులకు సాధారణంగా ఏటీఎం ( ATM ) కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తోపాటు మరిన్ని సౌకర్యాలు ఉంటాయి. అయితే గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ప్రజలు పోస్టాఫీసులో ( Post Office ) పొదుపు ఖాతాలను తెరవడానికి ఇష్టపడతారు.పోస్టాఫీసులు అందుబాటులో ఉండటంతోపాటు అందులో సరళమైన విధానాలే ఇందుకు కారణం. బ్యాంకు ఖాతాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో దాదాపు అన్ని ప్రయోజనాలు పోస్టాఫీసులో పొదుపు ఖాతాను ( Savings Account ) తెరవడం వల్ల కూడా పొందవచ్చు. పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఎవరు తెరవగలరు.. ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నది ఈ కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను ఎవరు తెరవచ్చు?పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను తెరవడానికి ముందు మీరు అర్హులో కాదో చూసుకోవడం ముఖ్యం. అర్హత కలిగిన వయసున్న భారతీయ పౌరుడెవరైనా పోస్టాఫీసు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇక మైనర్ పిల్లల తరపున తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఖాతా తెరవవచ్చు.పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు» ఏటీఎం కార్డ్ సౌకర్యం» చెక్‌బుక్ సేవలు» ఈ-బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్» కనీస డిపాజిట్ కేవలం రూ. 500. ఇది చాలా బ్యాంకు ఖాతాలతో పోలిస్తే తక్కువపోస్టాఫీసులో అకౌంట్ తెరవండిలా.. » మీ సమీప పోస్టాఫీసును సందర్శించండి. సంబంధిత అధికారిని కలవండి. అకౌంట్ ఓపెనింగ్ ఫారమ్ తీసుకుని అవసరమైన వివరాలను పూరించండి.» పూర్తి చేసిన ఫారమ్‌కు మీ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన డాక్యుమెంట్లను అటాచ్ చేయండి. మీ దరఖాస్తును సమీక్షించే అధికారికి ఫారమ్‌ను సమర్పించండి. మీ వివరాలను ధ్రువీకరించిన తర్వాత మీ సేవింగ్స్ ఖాతా తెరుస్తారు. -
అసలుకు భరోసా.. భవిత కులాసా..
రాజమహేంద్రవరం సిటీ: బాలికల, మహిళల ఆర్థిక పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తపాలాశాఖ ద్వారా పొదుపు పథకాలను ప్రవేశ పెట్టింది. బాలికలకు సుకన్య సమృద్ధి యోజన, మహిళలకు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని అమలు చేస్తోంది. పొదుపు చేసిన సొమ్ముకు భద్రతతో పాటు ఈ రెండు పథకాలు బాలికలకు, మహిళలకు భరోసానిచ్చే విధంగా ఉన్నాయి. మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకంలో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మహిళలందరూ ఈ పథకంలో చేరేందుకు అవకాశం కల్పించింది. 2025 మార్చి 31 మాత్రమే అమల్లో ఉండే ఈ స్కీమ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డ్రైవ్‌లు నిర్వహించేందుకు తపాలా శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ పథకంలో రూ.1,000 నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్‌కు అవకాశం ఉంది.వన్ టైమ్ సేవింగ్స్ స్కీమ్మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం వన్ టైమ్ సేవింగ్స్ స్కీమ్‌గా కొనసాగుతుంది. గరిష్ట మొత్తానికి రూ.2లక్షల లోబడి ఎన్ని ఖాతాలైనా తెరిచే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే ఖాతా ఉంటే కనీసం మూడు నెలల విరామంతో మళ్లీ ఖాతా తెరవవచ్చు. సేవింగ్స్ ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి రెండేళ్లు పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ కింద డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంది. వడ్డీ రేటు మాత్రం ఏడాదికి 7.5 శాతం ఉంటుంది. ఒకరి పేరుతోనే ఖాతా తెరవాలి. జాయింట్ అకౌంట్ సౌకర్యం లేదు. మైనర్ అయితే గార్డియన్ ద్వారా డిపాజిట్ చేసుకునే వీలుంటుంది.స్కీమ్‌లో చేరే విధానంమహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్‌లో చేరే లబ్ధిదారులు ఆధార్, పాన్ కార్డు, మూడు పాస్ పోర్టు సైజు ఫొటోలు తీసుకుని దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి ఖాతా ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ సేవింగ్స్ సర్టిఫికెట్ కింద డిపాజిట్ చేసిన వారు ఏడాది తర్వాత 40 శాతం డబ్బు ఉపసంహరించుకునే అవకాశముంది. ఒకవేళ డిపాజిట్‌దారులు మృతి చెందితే కారుణ్యం కింద ఖాతా మూసేయవచ్చు. ఎవరైనా మృతి చెందితే తదుపరి నామినీకి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. అవసరాన్ని బట్టి రెండు శాతం తగ్గించుకుని (5.5 శాతం వడ్డీతో)ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా ఖాతాను మూసేయవచ్చు.సుకన్య సమృద్ధి యోజనఈ పథకంలో చేరేందుకు 10 సంవత్సరాల లోపు బాలికలు అర్హులు, కనీసం రూ.250 డిపాజిట్‌తో ఆడపిల్ల పుట్టినప్పుడు ఖాతా తెరిచి, ప్రతీ నెలకు కనీసం వంద రూపాయలు పొదుపు చేస్తే, తల్లిదండ్రుల మొత్తం పెట్టుబడి రూ.18,000 (15 సంవత్సరాలకు) పెడితే వారికి మెచ్యూరిటీగా (21 సంవత్సరాల తర్వాత) రూ. 53,945 తపాలాశాఖ అందిస్తుంది.మహిళా సమ్మాన్ సేవింగ్స్‌లో సొమ్ము పెరిగేది ఇలా (రూ.లలో) ..అవగాహన కల్పిస్తున్నాంరాజమహేంద్రవరం పోస్టల్ డివిజన్ పరిధిలో రెండు హెడ్ పోస్టాఫీసులు (రాజమహేంద్రవరం, రామచంద్రపురం) 63 సబ్ పోస్టాఫీసులు, 307 బ్రాంచి పోస్టాఫీసులు ఉన్నాయి. ఈ పోసాŠీట్ఫసుల పరిధిలో ఇప్పటి వరకూ 7000 మంది మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకంలో చేరారు. 60,000 మంది సుకన్య సమృద్ధి యోజనలో చేరారు. ఈ రెండు పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సుకన్య సమృద్ధి యోజనను ఆడపిల్లల తల్లిదండ్రులు సది్వనియోగం చేసుకోవాలి – కే.శేషారావు, రాజమహేంద్రవరం, పోస్టల్ సూపరింటెండెంట్ -
టాప్ 10 పోస్టాఫీస్ స్కీమ్స్.. ఎంచుకో ఓ మంచి ఆప్షన్
పెట్టుబడులు పెట్టడానికి, స్థిరమైన రాబడులు పొందటానికి ఉత్తమైన ఆప్షన్ 'పోస్ట్ ఆఫీస్ పథకాలు'. పొదుపు చేసుకోవడానికి, ఉత్తమమైన రాబడులను అందుకోవడానికి.. అందుబాటులో ఉన్న 10 ఉత్తమమైన పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ (Post Office Scheme) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ (Post Office Savings Account)పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అనేది రిటైల్ బ్యాంక్ అందించే సేవింగ్స్ ఖాతా. ఈ అకౌంట్ కోసం కనీస 500 రూపాయల బ్యాలెన్స్ అవసరం. ఖాతా ఓపెన్ చేసిన తరువాత రూ.50 నుంచి.. ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ఖాతాదారులకు 4 శాతం వడ్డీ లభిస్తుంది.నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతాసామాన్య ప్రజలు సైతం ఉపయోగించడానికి ఉత్తమైన పోస్టాఫీస్ సేవింగ్ ఖాతాలలో ఒకటి ఈ 'నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్'. ఇందులో నెలకు 100 రూపాయలు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి వడ్డీ మూడు నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు. వార్షిక వడ్డీ 6.7 శాతంగా ఉంది.నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్ అనేది ఒకటి, రెండు, మూడు, ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో అందుబాటులో ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఖాతాను కనిష్టంగా రూ. 1,000లతో ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది.నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు తమ అకౌంట్లో రూ.9 లక్షల వరకు ఉంచుకోవచ్చు. అయితే ఉమ్మడి ఖాతాలలో రూ.15 లక్షల వరకు ఉండొచ్చు. స్థిరమైన ఆదాయ వనరు కోసం వెతుకుతున్న వారు లేదా.. పదవీ విరమణ చేసిన వారికి ఇది ఓ మంచి ఎంపిక అవుతుంది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు సుమారు 7 శాతం వడ్డీ పొందవచ్చు.సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం ఈ స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో రూ. 1000 నుంచి రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వన్-టైమ్ డిపాజిట్లకు కూడా ఇందులో అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారుడు కొంత ఎక్కువ వడ్డీని పొందవచ్చు. సాధారణ ఖర్చుల కోసం పెట్టుబడి రాబడిపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకు అనువైనది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అకౌంట్దీర్ఘకాలిక పొదుపుల కోసం ఎదురుకి హోసేవారికి ఇది మంచి ఎంపిక. ఇందులో రూ. 500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్లు ఏక మొత్తంలో లేదా వాయిదాలలో చేయవచ్చు. ఇది రిటైర్మెంట్ ప్రణాళిక మరియు ఇతర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.సుకన్య సమృద్ధి అకౌంట్ (SSA)ప్రత్యేకంగా ఆడ పిల్లల కోసం అందుబాటులో ఉన్న స్కీమ్. ఇది వారి విద్య, భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ గరిష్టంగా 8.2 శాతం వడ్డీ అందిస్తుంది. ఫ్లెక్సిబుల్ డిపాజిట్ ఆప్షన్లతో ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకాన్ని బేటీ బచావో, బేటీ బడవో కింద 2015లో ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించారు.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)భారతీయులలో పొదుపును అలవాటు చేయడానికి కేంద్రం ఈ పథకాన్ని పరిచయం చేసింది. ఇందులో ఖాతాదారులు కనిష్టంగా రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. ఇందులో ఖాతాదారుడు 7 శాతం కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు.ఇదీ చదవండి: నెలకు ₹10 వేలు.. రూ.7 కోట్ల ఆదాయం - ఎలాగంటే?కిసాన్ వికాస్ పత్ర (KVP)ఈ స్కీమ్ ద్వారా పెట్టే పెట్టుబడి సుమారు 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో కూడా పెట్టుబడిపి గరిష్ట పరిమితి అంటూ ఏమి ఉండదు. ఇందులో వడ్డీ రేటు 7 శాతం కంటే ఎక్కువే ఉంటుంది.మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC)మహిళలకు ఆర్థికంగా ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ప్రారభించిన పథకమే ఈ 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్'. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1000 కాగా, గరిష్టంగా రూ. 2 లక్షలు. ఆర్థిక భద్రత, వృద్ధిని కోరుకునే మహిళలకు ఇది సురక్షితమైన స్కీమ్.Note: పోస్టాఫీస్ పథకాలలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా వీటి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ పథకాలకు సంబంధించిన అనుమానాలను లేదా ఇతర వివరాలను తెలుసుకోవడానికి మీ సమీపంలోని పోస్ట్ ఆఫీసును సందర్శించండి. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరగాళ్లు పెరుగుతున్న తరుణంలో.. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా అవసరం. -
ఆర్థిక లక్ష్యాన్ని చేరేదెలా..?
స్థిరమైన ఆదాయం చాలా మందికి ఒక ముఖ్యమైన ఆర్థిక లక్ష్యం. రిటైర్మెంట్ ప్రణాళిక కావొచ్చు. లేదా ప్యాసివ్ ఆదాయ మార్గం కోరుకోవచ్చు. అప్పటికే వస్తున్న ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని అనుకోవచ్చు. క్రమం తప్పకుండా ఆదాయం వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవితానికీ స్థిరత్వాన్నిస్తుంది. ముందస్తు పింఛను ప్రణాళికలు లేని వారు రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే మార్గాలను ఆశ్రయించాల్సిందే. ఉద్యోగం/వృత్తి/ వ్యాపారాల్లో ఉన్న వారు సైతం తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆసక్తి చూపించొచ్చు. కొన్ని రకాల వృత్తుల్లో, వ్యాపారాల్లో ఉన్న వారికి ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండదు. ఈ తరహా వ్యక్తుల ముందు ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. రిస్క్, రాబడుల ఆధారంగా తమకు అనువైనవి ఎంపిక చేసుకోవడం ద్వారా తమ ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాకారం చేసుకోవచ్చు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్) నెలవారీ ఆదాయం కోసం అందుబాటులోని డెట్ సాధనాల్లో ఇది కూడా ఒకటి. ఇందులో పెట్టుబడులకు నూరు శాతం భారత ప్రభుత్వం హామీ ఉంటుంది. కనుక పెట్టుబడులు, రాబడుల విషయంలో ఎలాంటి రిస్క్ ఉండదు. రిస్క్ వద్దనుకునే వారికి అనువైనది. ప్రస్తుతం ఇందులో పెట్టుబడిపై 7.4 శాతం వార్షిక రాబడి అందుబాటులో ఉంది. ఈ ప్రకారం రూ. లక్ష పెట్టుబడిపై ప్రతి నెలా రూ.616 ఆదాయంగా అందుతుంది. ఇందులో డిపాజిట్ కాల వ్యవధి ఐదేళ్లు. గడువు తీరిన తర్వాత మరో ఐదేళ్లకు తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకరు గరిష్టంగా రూ.9,00,000 వరకు, ఉమ్మడిగా అయితే రూ.15,00,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులకు, వడ్డీ రాబడికి ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. తమ వార్షిక ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సిందే. 10 ఏళ్లు నిండిన మైనర్ పేరిట కూడా ఖాతా ప్రారంభించొచ్చు. నెలవారీ వడ్డీని పోస్టల్ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. గడువు కంటే ముందే ఈ పథకం నుంచి వైదొలిగేట్టు అయితే కొంత నష్టపోవాల్సి వస్తుంది. డిపాజిట్ చేసిన ఏడాది నుంచి మూడేళ్లలోపు అయితే పెట్టుబడిలో 2 శాతం, మూడేళ్ల తర్వాత ఒక శాతాన్ని కోత విధిస్తారు. దీర్ఘకాల ప్రభుత్వ బాండ్లు (జీ–సెక్‌లు)5–40 ఏళ్ల కాలంతో ఇవి ఉంటాయి. వీటిపై ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం పొందొచ్చు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యయాల కోసం ఈ బాండ్ల ద్వారా నిధులు సమీకరిస్తాయి. వీటిల్లో రిస్క్ లేదనే చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్లు ఆర్బీఐ వద్ద రిటైల్ డైరెక్ట్ ఖాతాను ఉచితంగా తెరిచి, జీసెక్‌లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రైమరీ, సెకండరీ మార్కెట్లో ఎలాంటి చార్జీలు లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వ బాండ్లలో ఫిక్స్డ్, ఫ్లోటింగ్, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ అని పలు రకాలున్నాయి. గడువు ముగిసే వరకు కొనసాగకుండా, మధ్యంతరంగా సెకండరీ మార్కెట్లో విక్రయించాలనుకుంటే అప్పటి వడ్డీ రేట్ల పరంగా చేతికి వచ్చే మొత్తంలో మార్పు ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లులు, డేటెడ్ సెక్యూరిటీలు (జీ–సెక్‌లు) జారీ చేస్తుంటుంది. ఇందులో ట్రెజరీ బిల్లులు అన్నవి 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల వ్యవధితో వస్తాయి. వీటిల్లో వడ్డీ చెల్లింపులు ఉండవు. కూపన్ రేటు మేర ముందే ముఖ విలువలో తగ్గించి తీసుకుంటారు. కనుక ఇన్వెస్టర్లు జీసెక్‌లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీలు జారీ చేస్తుంటాయి.యాన్యుటీ ప్లాన్లుపెట్టుబడిపై మరుసటి నెల నుంచే ఆదాయాన్నిచ్చే ‘ఇమీడియెట్ యాన్యుటీ ప్లాన్’లను జీవిత బీమా కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. ఎల్ఐసీ నుంచి జీవన్ శాంతి, జీవన్ అక్షయ్ ఇవే తరహా ప్లాన్లు. ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్లలో ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసుకున్న కాలం వరకు స్థిరమైన రాబడులు ఇందులో వస్తాయి. వడ్డీ రేట్లలో అస్థిరతల ప్రభావం వీటి రాబడిపై ఉండవు. నెలవారీ, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాదికోసారి ఆదాయం వచ్చే ఆప్షన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. జీవితకాలానికి ఈ యాన్యుటీ ప్లాన్లను తీసుకోవచ్చు. మరణానంతరం పెట్టుబడిని నామీనికి అందిస్తారు. వీటికి పన్ను పరమైన ప్రయోజనాలు లేవు. ఈ ప్లాన్ల నుంచి అందుకునే రాబడిపై 1.8 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఈ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు అని కూడా ఉంటాయి. అవి ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన వెంటనే కాకుండా.. నిరీ్ణత కాలం తర్వాత నుంచి క్రమం తప్పకుండా చెల్లింపులు చేసేవి.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)60 ఏళ్లు నిండిన వారికే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉంది. పదవీ విరమణ తర్వాత ఆదాయం కోరుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఇందులో ఒకరు రూ.30లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దంపతులు అయితే ఉమ్మడిగా రూ.60 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పథకం కాల వ్యవధి ఐదేళ్లు. దీనిపై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. అన్ని పోస్టాఫీసుల్లోనూ, కొన్ని బ్యాంక్ శాఖల్లో ఎస్సీఎస్ఎస్ ఖాతా తెరవొచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఇందులో చేసే పెట్టుబడిపై అదే ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడిని ఏ ఏడాదికి ఆ ఏడాదే పన్ను రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. ఆదాయ శ్లాబుకు అనుగుణంగా పన్ను రేటు చెల్లించాల్సి వస్తుంది. ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారికి కనీస వయోపరిమితి 55 ఏళ్లుగా ఉంది. రక్షణ దళాల్లో పనిచేసిన మాజీ ఉద్యోగులు 50 ఏళ్లకే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు)బ్యాంకుల్లో దీర్ఘకాల డిపాజిట్లపై వడ్డీ 7–9 శాతం మధ్య ఉంది. ప్రముఖ బ్యాంకుల్లో ఇది 7–8 శాతం మధ్య ఉంటే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కొంచెం అదనంగా ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (నాన్ క్యుములేటివ్)లపై ప్రతి నెలా వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. కాకపోతే మరీ దీర్ఘకాలానికి (పదేళ్లకు మించిన) డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. పైగా ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. వడ్డీ రాబడి ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. రిస్క్ పరంగా చూస్తే.. బ్యాంక్ ఎఫ్డీలకు ఆర్బీఐ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రక్షణ ఉంటుంది. బ్యాంక్ సంక్షోభంలో పడితే ఒక బ్యాంక్ పరిధిలో ఒక ఖాతాదారు పేరిట ఎంత డిపాజిట్ ఉన్నప్పటికీ గరిష్టంగా రూ.5లక్షల వరకు వెనక్కి వస్తుంది. కనుక ఒక బ్యాంక్ పరిధిలో (ఎన్ని శాఖలైనా) రూ.5లక్షలే డిపాజిట్ చేసుకోవడం తెలివైన నిర్ణయం.మంత్లీ ఇన్కమ్ ప్లాన్లుమ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మంత్లీ ఇన్కమ్ ప్లాన్లను (ఎంఐపీలు) ఆఫర్ చేస్తుంటాయి. ప్రధానంగా డెట్ సెక్యూరిటీల్లో, స్వల్పంగా (10–20శాతం) ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లకు స్థిరాదాయాన్ని అందిస్తాయి. వీటిల్లో రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. స్థిరంగానూ ఉండవు. మార్కెట్ ఆధారితంగా రాబడులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రాబడులు మరీ తగ్గొచ్చు. వీటిల్లో రిస్క్ తక్కువ. లిక్విడిటీ ఎక్కువ. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు.కార్పొరేట్ డిపాజిట్లునాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) తమ డిపాజిట్ల ద్వారా నిధులు సమీకరిస్తుంటాయి. ఈ తరహా కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్ల(నాన్ క్యుములేటివ్)లో ఇన్వెస్ట్ చేసుకుని, వీటి నుంచి నెలవారీ/మూడు నెలలు/ఆరు నెలలు/ఏడాదికి ఒకసారి చొప్పున ఆదాయం తీసుకునే వెసులుబాటు ఉంది. వీటిని బ్యాంక్ డిపాజిట్లతో పోల్చి చూడొచ్చు. బ్యాంకుల్లో రూ. 5 లక్షల వరకు డిపాజిట్లకు రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్ డిపాజిట్లలో ఎలాంటి హామీ ఉండదు. కనుక రిస్క్ తగ్గించుకునేందుకు ఏఏఏ రేటెడ్, ఏఏ మైనస్ రేటెడ్ డిపాజిట్లను ఎంపిక చేసుకోవచ్చు. సంబంధిత ఆర్థిక సంస్థ గత చరిత్రను ఇన్వెస్ట్ చేసే ముందు పరిశీలించాలి. బ్యాంక్ ఎఫ్‌డీల కంటే కాస్త అధిక రాబడులు వీటిల్లో ఉంటాయి. వడ్డీ ఆదాయానికి ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. ఉదాహరణకు బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థలు డిపాజిట్లపై నిధులు సమీకరిస్తుంటాయి. ఇవి మెరుగైన రేటింగ్ కలిగిన సంస్థలు.సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్లు (ఎస్‌డబ్ల్యూపీ)ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లు గురించి తెలిసే ఉంటుంది. ఎంపిక చేసుకున్న పథకాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కలి్పంచేదే సిప్. దీనికి విరుద్ధంగా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి క్రమంగా కొంత చొప్పున ఉపసంహరించుకోవడమే ఎస్‌డబ్యూపీ. ఎంత మేర ఉపసంహరించుకోవాలన్నది ఇన్వెస్టర్ అభీష్టమే. తమ వద్దనున్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనువైన ఫండ్స్‌ను ముందుగా ఎంపిక చేసుకోవాలి. అందులో ఏకమొత్తంలో కాకుండా, ఆరు నుంచి 12 నెలల సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు సగటుగా మారుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి నెలా నిరీ్ణత శాతం మేర ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకోవచ్చు. రాబడుల కంటే మూడు శాతం తక్కువ ఉపసంహరణకు పరిమితం కావాలి. దీనివల్ల ఈ మూడు శాతం తిరిగి పెట్టుబడి వృద్ధికి దోహదపడుతుంది. దీంతో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు వీలుంటుంది. మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది సూచన ప్రకారం.. ఈక్విటీల్లో 65 శాతం, డెట్‌కు 35 శాతం కేటాయించే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ లేదా ఈక్విటీలకు 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయించే బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. వీటిల్లో దీర్ఘకాలంలో రాబడులు 12–13 శాతం మేర ఉంటాయి. కనుక ఉపసంహరణ 6–9 శాతం మించకూడదు. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇవి అయితే ఈక్విటీ కేటాయింపులను 35 శాతానికే పరిమితం చేసి మిగిలిన మొత్తాన్ని డెట్‌కు కేటాయిస్తాయి. వీటిల్లో దీర్ఘకాల రాబడి 9–10 శాతం మేర ఉంటుంది. కనుక 6 శాతం ఉపసంహరణకు పరిమితం కావాలి. ఇవే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, డివిడెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నా సరిపోతుంది. కానీ, డివిడెండ్ ఎప్పుడు ప్రకటించాలన్నది ఫండ్స్ సంస్థల అభీష్టం. అందుకే ఎస్‌డబ్ల్యూపీ మెరుగైన ఆప్షన్ అవుతుంది. వీటిల్లో పెట్టుబడులకు ఎలాంటి పన్ను ప్రయోజనం లేదు. కానీ, ఏడాదిలోపు విక్రయించిన పెట్టుబడులకు సంబంధించి లాభంపై 20 శాతం పన్ను, ఏడాది మించిన పెట్టుబడులు విక్రయించగా వచి్చన లాభంపై మొదటి రూ.1.25 లక్షల తర్వాతి మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బాండ్ ల్యాడర్ పోర్ట్‌ఫోలియో వివిధ కాల వ్యవధులతో బాండ్లను కొనుగోలు చేయడం. అంటే ఒక్కో బాండ్ మెచ్యూరిటీ ఒకే తేదీతో కాకుండా, వరుస క్రమంలో ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఏడాది కాలానికి ఒకటి తీసుకుంటే, 13 నెలలు, 14 నెలలు, 15 నెలలు ఇలా అనమాట. గడువు తీరి చేతికి వచి్చన ప్రతి బాండ్ మెచ్యూరిటీ మొత్తంలో అసలుతో తిరిగి బాండ్ కొనుగోలు చేయాలి. వడ్డీ భాగాన్ని ఆదాయం కింద వినియోగించుకోవాలి. పీర్ టు పీర్ (పీ2పీ) లెండింగ్ పీ2పీ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి రుణం కావాల్సిన వారిని, అదే సమయంలో రుణంపై ఆదాయం కోరుకునే వారిని ఒకే వేదికగా కలుపుతాయి. బాండ్లు, ఎఫ్‌డీల కంటే పీ2పీ ప్లాట్‌ఫామ్‌లు ఎక్కువ రాబడికి మార్గం చూపుతాయి. కాకపోతే రుణం తీసుకునే వ్యక్తికి సంబందించి ఆర్థిక చరిత్ర ఈ సంస్థలకు పెద్దగా తెలియదు. కనుక రుణ ఎగవేతల రిస్క్ వీటిల్లో ఉంటుంది. వడ్డీ ఆదాయంలో కొంత పంచుకునేట్టు అయితే పీ2పీ సంస్థలు రుణం వసూలు బాధ్యతను తీసుకుంటున్నాయి. వీటిని గమనించాలి..→ నెలవారీ లేదా త్రైమాసికంవారీ స్థిరమైన ఆదాయానికి వీలుగా పెట్టుబడి సాధనం ఎంపికలో ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు. పెట్టుబడికి అందుబాటులో ఉన్న నిధి, వాటిపై ఆశిస్తున్న రాబడి, ఎంత రిస్క్ తీసుకోగలరు? ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. తమ ఆకాంక్షలకు సరిపోలే ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడుల వృద్ధికి, పెట్టుబడిపై స్థిరమైన రాబడికి మధ్య వ్యత్యాసం ఉంది. స్పష్టత తెచ్చుకోలేకపోతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవడానికి వెనుకాడొద్దు. → రాబడిపై పన్ను బాధ్యతను తప్పకుండా గుర్తించాలి. పన్ను పోను నికర రాబడి ఎంతన్నది చూడాలి. తమ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలమైన ఉత్పత్తిని ఎంపిక చేసుకోవాలి. → పెట్టుబడి మొత్తాన్ని ఏదో ఒక సాధనంలో కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడాన్ని పరిశీలించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
చిన్న పెట్టుబడి.. పెద్ద రాబడి
సాక్షి, అమరావతి: మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ అనే పొదుపు పథకం విశేష ఆదరణ పొందుతోంది. మహిళలు, బాలికల కోసం ఈ పథకాన్ని 2023–24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖాతాలు ప్రారంభించడానికి ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు మాత్రమే అవకాశం కల్పించింది. మహిళలు తమ పేరు మీద పోస్టాఫీసులు లేదా నిర్దేశించిన బ్యాంకుల్లో ఈ ఖాతాలు తెరవచ్చు. మైనర్ బాలికల పేరుతో సంరక్షకులు ఖాతా తెరిచే అవకాశం కల్పించారు.కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన తేదీ నుంచి రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో తిరిగి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. అలాగే పాక్షిక ఉపసంహరణ సౌకర్యం కూడా కల్పించారు. ఖాతా తెరిచిన తేదీ నుంచి సంవత్సరం తర్వాత ఖాతా బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం.అందువల్ల దీనికి ఎలాంటి రిస్క్ కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 43.30 లక్షల ఖాతాలు తెరిచారని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 7,46,223 ఖాతాలతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. 2,11,016 ఖాతాలతో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాలు తెరిచేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకే గడువు ఉంది. అందువల్ల వీలైనంత త్వరగా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.రూ.31,125 వడ్డీ..ఈ పథకం కింద రూ.2,00,000 డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో రూ.15,000 వడ్డీ, రెండో సంవత్సరంలో రూ.16,125 వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా రెండేళ్ల గడువు పూర్తయ్యేనాటికి వడ్డీతో కలిపి రూ. 2,31,125 మేర ప్రయోజనం పొందుతారు. -
పోస్టాఫీసులకు మహిళలు పరుగులు..ఎందుకో తెలుసా? (ఫొటోలు)
-
Post Office: వదంతులు.. అగచాట్లు!
రేణిగుంట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అందించే సబ్సిడీ పోస్ట్ ఆఫీస్‌లో అకౌంటు ఉన్న మహిళలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని వస్తున్న వదంతులతో మహిళలు స్థానిక పోస్టాఫీసు కార్యాలయానికి క్యూ కట్టారు. మంగళవారం రేణిగుంట పోస్ట్ ఆఫీస్‌లో వ్యక్తిగత ఖాతాలు తెరిచేందుకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారు ఆధార్, ఫోన్ నంబర్ లింక్ చేసుకుంటే సరిపోతుందని అధికారులు చెప్తున్నారు. అయితే కచ్చితంగా పోస్ట్ ఖాతా ఉండాలని పుకార్లు రావడంతో మహిళలు అయోమయంలో పడుతున్నారు. దీనిపై అధికారులు సరైన సమాచారం ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు. -
పోస్టాఫీసులకు పోటెత్తుతున్న మహిళలు
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రధాన పోస్టాఫీసులన్నీ వేలాదిగా తరలివస్తున్న మహిళలతో కిటకిటలాడుతున్నాయి. 18 ఏళ్లు పైబడిన మహిళలందరి వ్యక్తిగత ఖాతాల్లో సీఎం చంద్రబాబు రూ.1,500 జమ చేస్తారన్న విస్తృత ప్రచారంతో మహిళలంతా పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అనంతపురం, హిందూపురంలో హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజూ మహిళలు ఐపీపీబీ ఖాతాల కోసం చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం 5 గంటల నుంచే క్యూ కడుతుండటంతో హెడ్ పోస్టాఫీసులు జాతరను తలపిస్తున్నాయి. నెల రోజులుగా మహిళలు పోస్టాఫీసులకు వెళ్తున్నప్పటికీ.. నాలుగు రోజుల నుంచి వీరి సంఖ్య విపరీతంగా పెరిగింది. సోమవారం వేలాదిగా మహిళలు తరలి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. సూపర్ సిక్స్ పథకాల కోసమంటూ..టీడీపీ కూటమి ఎన్నికల ముందు ఇచి్చన హామీల మేరకు సూపర్‌సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతాయంటూ కూటమి నేతలు పదేపదే చెబుతున్నారు. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాల్లో రూ.1,500 జమ చేస్తారన్న ప్రచారంతో మహిళలు పోస్టాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొందరు మహిళలైతే చంటి బిడ్డలను చంకన వేసుకుని వస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోస్టల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు. తొక్కిసలాట నేపథ్యంలో కొందరు ఊపిరి ఆడక అల్లాడిపోయారు. ఏమవుతుందోనన్న ఆందోళన అందరిలో కనిపించింది. పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారులంతా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారో కూడా అంతుబట్టడం లేదు.అసలు సంగతి ఏమిటంటే..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటికే ఐపీపీబీ ఖాతాలు గల లబ్ధిదారులు కొత్తగా ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదు. అయితే, ఐపీపీబీ ఖాతాలు కలిగి ఆధార్ లింక్ అయినంత మాత్రానా డబ్బు జమ కాదు. కచ్చితంగా ఆధార్ సీడింగ్ అయి ఉండాలి. బ్యాంకర్లు ఖాతాలకు ఆధార్ లింక్ చేస్తున్నా.. సీడింగ్ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగా చాలామంది మహిళలు పోస్టల్ శాఖ ఇచ్చే ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ కానివారు అనంతపురం జిల్లాలో సుమారు 3 లక్షలకు పైబడి ఉన్నట్టు సమాచారం.బ్యాంకుల్లో ఆధార్ సీడింగ్ కాని వారు ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు వస్తుండగా.. ఆధార్ లింకేజీ, సీడింగ్ అయిన వారు కూడా ఐపీపీబీ ఖాతాల కోసం పోస్టాఫీసులకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. మహిళలకు రూ.1,500 చొప్పున ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారు, అందుకోసం మహిళలు ఏం చేయాలి, ఇప్పటికే బ్యాంక్ ఖాతాలున్న మహిళలు ఏంచేయాలి, ఖాతాలు లేనివారు ఏ పోస్టాఫీసుకు లేదా ఏ బ్యాంకును సంప్రదించాలనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఈ సూపర్‌హిట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి తెలుసా?
డబ్బు పొదుపు చేసుకోవాలనుకుంటున్నవారికి, ముఖ్యంగా దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసే వారికి పోస్ట్ ఆఫీస్‌లో అనేక పథకాలు ఉన్నాయి. ఇవి సొమ్ముకు భద్రతతోపాటు మంచి రాబడిని అందిస్తాయి. వీటిలో ప్రధానమైన పథకాలలో ఒకటి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్. ఇది 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీని అందిస్తుంది.పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఈ పొదుపు పథకం ప్రయోజనాలను ఎవరైనా పొందవచ్చు. ప్రత్యేక విషయం ఏమిటంటే ఇందులో వచ్చే రాబడిపై ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును కూడా పొందుతారు. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ అని కూడా అంటారు. ఇక్కడ వడ్డీ ఎప్పటికప్పుడు జమ అవుతూ ఉంటుంది.పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలుఇందులో కనిష్ట పెట్టుబడి రూ.1000. దీనిపైనా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.ఒక సంవత్సరానికి 6.9%, రెండేళ్లకు 7.0%, 3 సంవత్సరాలకు 7.1%, ఐదేళ్లకు 7.5% వడ్డీ రేటు ఉంటుంది.ఈ పథకం కింద వ్యక్తిగతంగా ఒక్కరు లేదా ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ అయినా తెరవవచ్చు.5 సంవత్సరాల వ్యవధిలో సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం.ఈ పథకం ఎందుకు ఆకర్షణీయం?పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది వారి పెట్టుబడిపై హామీతో కూడిన రాబడిని కోరుకునే వారికి సురక్షితమైన, లాభదాయకమైన ఎంపిక. అధిక వడ్డీ రేటు, పన్ను మినహాయింపు ప్రయోజనాలు దీనిని ఆకర్షణీయమైన ఎంపికగా చేస్తాయి. ఈ పథకం ద్వారా మీరు మీ సొమ్ముకు భద్రతతోపాటు ఐదేళ్లలో మంచి వడ్డీని కూడా పొందవచ్చు. -
పోస్టాఫీసు పథకం..పూర్తి వివరాలు ఇవే..!
-
సైకిల్‌పై అద్వానీ.. పోస్టాఫీసులో కమల.. పెళ్లి జరిగిందిలా!
బీజేపీ మాజీ అధ్యక్షుడు, అటల్ ప్రభుత్వంలో ఉప ప్రధాని సేవలందించిన లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపధ్యంలో అద్వానీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత రాజకీయాల్లో భీష్మ పితామహునిగా పేరొందిన అద్వానీ రాజకీయ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మార్గదర్శకునిగా నిలిచారు. కమలతో అద్వానీ వివాహం అత్యంత విచిత్ర పరిస్థితుల్లో జరిగింది. కమలా అద్వానీ పాకిస్తాన్‌లోని సింధ్‌లో జన్మించారు. ఆమె అసలు పేరు కమలా జగత్యాని. విభజన తర్వాత వారి కుటుంబం భారతదేశానికి తరలి వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కమల చదువు పూర్తి చేసుకున్నాక, ఢిల్లీ పోస్టాఫీసులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఇదీ చదవండి: ఎల్కే అద్వానీకి భారతరత్న.. మోదీ భావోద్వేగం అదే సమయంలో ఆమెకు లాల్ కృష్ణ అద్వానీ నుంచి వివాహ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో లాల్ కృష్ణ అద్వానీ జర్నలిస్టుగా పనిచేసేవారు. ప్యాంటు షర్టు వేసుకుని, సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లేవారు. కమల అద్వానీలకు 1965, ఫిబ్రవరి 25న వివాహం జరిగింది. అద్వానీ భార్య కమలా అద్వానీ రాజకీయాల్లో కాలుమోపనప్పటికీ, పలు కార్యక్రమాలలో అద్వానీతో పాటు కనిపించారు. ఆమె అద్వానీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. అలాగే అద్వానీ తినే ఆహారం మొదలుకొని, అతనిని కలుసుకునే వారి జాబితా వరకు అన్నింటిపై కమలా అద్వానీ ఒక కన్నేసి ఉంచేవారు. అద్వానీ ఒక సందర్భంలో తాను దేశానికే హోంమంత్రినని, ఇంటిలో తన సతీమణి కమలనే హోంమంత్రి అంటూ చమత్కరించారు. -
అలాంటి ఏకైక పోస్టాఫీస్ ఇదొక్కటే.. ఏడాదికి ఐదు నెలలే పని
ప్రపంచానికి అత్యంత సుదూరాన మంచుదీవిలో నడుస్తున్న ఏకైక పోస్టాఫీసు ఇది. అంటార్కిటికాలోని పోర్ట్ లాక్రాయ్లో ఉన్న ఈ పోస్టాఫీసును యునైటెడ్ కింగ్డమ్ అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఇది కేవలం పోస్టాఫీసు మాత్రమే కాకుండా, మ్యూజియమ్ కూడా. ప్రస్తుతం ఈ పోస్టాఫీసులో నాలుగు పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టాఫీసు ఏడాదిలో ఐదు నెలలు మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడి ఖాళీలపై ఉద్యోగ ప్రకటన ఇటీవల వెలువడగానే ప్రపంచం నలుమూలల నుంచి వందలాదిగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇందులో పనిచేసేవారు పోస్టాఫీసు బాధ్యతలతో పాటు మ్యూజియం నిర్వహణను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వాటికి తోడు ఇక్కడ పెద్దసంఖ్యలో ఉండే పెంగ్విన్లను లెక్కించడం కూడా వారి బాధ్యతే! పెంగ్విన్లను లెక్కించడంలో నైపుణ్యం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అదనపు అర్హత. సూదూరంగా ఏకాంత ప్రదేశంలో ఉన్న ఈ పోస్టాఫీసులో పనిచేయడం ఏమంత ఆషామాషీగా ఉండదని, ఏటా నవంబర్ నుంచి మార్చి వరకు పనిచేసే ఈ పోస్టాఫీసులో ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటూ పనిచేయడమే కష్టమని యునైటెడ్ కింగ్డమ్ అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ సీఈవో కామిలా నికోల్ తెలిపారు. ఇక్కడ రోజుకు పన్నెండు గంటల సేపు పనిచేయాల్సి ఉంటుందని, ఇప్పటి వరకు తమ ప్రకటనకు స్పందనగా రెండున్నర వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుని పనిచేసే శారీరక దారుఢ్యం, శాస్త్ర పరిశోధనల కోసం ఇక్కడకు వచ్చే పర్యాటకులతో తగిన రీతిలో మెలిగే కలివిడితనం, ఓర్పు, సహనం ఉన్న అభ్యర్థుల కోసం చూస్తున్నామని చెప్పారు. -
పోస్టాఫీసుల్లో బ్లూడార్ట్ డిజిటల్ లాకర్ సేవలు!
న్యూఢిల్లీ: భారతీయ తపాలా శాఖతో బ్లూడార్ట్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో బ్లూడార్ట్ డిజిటల్ లాకర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల పార్సిల్ పొందాల్సిన వ్యక్తి రోజులో 24 గంటల్లో ఎప్పుడైనా డిజిటల్ లాకర్ వద్దకు వెళ్లి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని బ్లూడార్ట్ ప్రకటించింది. ఎలాంటి సంతకాలతో పనిలేదని పేర్కొంది. పోస్టాఫీస్‌తో వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో ఆటోమేటెడ్ డిజిటల్ పార్సిల్ లాకర్స్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. లాకర్లలో పార్సిల్స్ సురక్షితంగా ఉంటాయని, తమకు కేటాయించిన కోడ్‌ను నమోదు చేయడం ద్వారా సులభంగా ప్యాకేజ్‌ను పొందొచ్చని వివరించింది. కేవలం గుర్తింపు ఉన్న వ్యక్తే వీటిని పొందగలరని తెలిపింది. కస్టమర్లు తమ వీలు ప్రకారం ప్యాకేజ్‌లను పొందే అవకాశం కల్పించడమే ఇందులోని ఉద్దేశంగా బ్లూడార్ట్ ఎండీ బాల్ఫోర్ మాన్యుయేల్ ప్రకటించారు. -
'తపాల శాఖ' ద్వారా.. ఇక విదేశాలకు పార్సిళ్లు..!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ప్రధాన తపాల కార్యాలయం నుంచి డాక్ నిర్యాత్ కేంద్ర సర్వీస్ ద్వారా తక్కువ ఖర్చుతో విదేశాలకు సులభంగా పార్సల్స్ పంపే సేవలు ప్రారంభించినట్లు ఆదిలాబాద్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ సుజిత్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఉట్నూర్ పరిధిలోని బ్రాంచి పోస్ట్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. విదేశాలకు పార్సల్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ప్రధాన తపాల కార్యాలయంలో సైతం విదేశాలకు పార్సెల్ సర్వీస్ కరపత్రాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు సమీప పోస్టు ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎం తిరుపతి, రమేశ్, బీపీఎంలు చంద్రశేఖర్, ప్రవీన్, గోకు ల్, విజయ్, సాద్ తదితరులు పాల్గొన్నారు. -
వెంటనే ఉత్తరం రాస్తే.. ఈ బహుమతి మీకే..!
ఆదిలాబాద్: నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్, ఈ–మెయిల్స్, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నారు. ఐదు దశాబ్దాల ముందుకు వెళ్తే ఉత్తర ప్రత్యుత్తరాలు కేవలం లేఖల ద్వారానే జరిగాయి. దూరప్రాంతాల్లో ఉన్న వారి క్షేమ సమాచారాన్ని ఉత్తరం, టెలిఫోన్, టెలిగ్రామ్ ద్వారా తెలుసుకునే పరిస్థితి ఉండేది. సెల్‌ఫోన్ వినియోగం.. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడకం తర్వాత సమాచార వ్యవస్థలో విప్లవం వచ్చిందని చెప్పవచ్చు. నేటి తరానికి ఇంచుమించుగా ఉత్తరం అంటే తెలియని పరిస్థితి ఉంది. అందుకే ఉత్తరాన్ని తిరిగి పరిచయం చేసేందుకు, తెలిసిన వారికి మరోసారి గుర్తు చేసేందుకు తపాలాశాఖ నడుం బిగించింది. లేఖరులకు పోటీ పెడుతోంది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉత్తరాలకు ప్రాధాన్యం తగ్గింది. దూర ప్రాంతాల్లో ఉన్న వారి క్షేమ సమాచారం తెలియజేయాలన్నా, వ్యాపార అవసరాల ని మిత్తం సమాచారం పంపించాలన్నా ఒకప్పుడు పె న్ను, పేపరు తీసుకుని లేఖలు రాసేవారు. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కానరాదు. మొబైల్ ఫోన్ ద్వారా స మస్త సమాచారాన్ని క్షణాల్లో వివిధ మార్గాల్లో చేరవేస్తున్నారు. ఫోన్లోనే ప్రత్యక్షంగా వాయిస్ కాల్, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఖండాంతరాల్లో ఉన్న వారితో సైతం వీడియో కాల్ ద్వారా మాట్లాడే పరిస్థితి ఉండడంతో లేఖల ద్వారా ఉత్తర, ప్రత్యుత్తరాలు మర్చిపోయిన పరిస్థితి ఉంది. ఒకప్పటి సమాచార సాధనమైన ఉత్తరాన్ని నేటి యువతరానికి గుర్తు చేసేందుకు తపాలా శాఖ లేఖారచన పోటీలకు శ్రీకారం చుట్టింది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’ అనే అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ‘థాయి ఆఖర్’ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. బహుమతులు ఇలా.. రెండు కేటగిరీల వారీగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విజేతలను ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ఒక్కో విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి 12 మందికి మించకుండా ప్రథమ రూ.25 వేలు, ద్వితీయ రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5వేలు, జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ రూ.25 వేలు, తృతీయ రూ.10 వేల నగదు అందజేస్తారు. సద్వినియోగం చేసుకోవాలి.. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సదవకాశం. వయసుతో పనిలేకుండా ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇచ్చిన అంశానికి సంబంధించి స్వదస్తూరితో వ్యాసం రాసి పోస్ట్ చేయాలి. – ఎన్.అనిల్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాలా శాఖ పర్యవేక్షకులు రెండు విభాగాల్లో.. ఈ పోటీల్లో భారతదేశ పౌరులు పాల్గొనవచ్చు. 18 ఏళ్ల లోపు వారికి ఒక కేటగిరీ, ఆపై వారిని మరో కేటగిరీగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో వ్యాసం రాయవచ్చు. డిజిటల్ విధానంలో పాలన, మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాలను అందులో పొందుపర్చారు. ఎ4 సైజ్ పేపరుపై రాసి ఎన్వలప్ కవర్లో పంపించవచ్చు. ఎన్వలప్ కవర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా, ఇన్‌ల్యాండ్ లెటర్ అయితే 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్స్ సాధనాల్లో టైప్ చేసిన లేఖలను పోటీకి అనుమతించరు. వ్యాసం చేతితో మాత్రమే రాసి పంపించాలి. లేఖలు పంపించేవారు వారి వయసును నిర్ధారిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోటీలో గెలిస్తే వారి వయస్సు, ఐడీ ధ్రువీకరణకు అవసరమైన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రాసిన ఉత్తరాలను ఎస్పీవోఎస్, ఆదిలాబాద్ డివిజన్ చిరునామాకు అక్టోబరు 31లోగా పంపించాలి. -
ఖాతాదారులకు అలర్ట్: పోస్టాఫీసుల్లో కొత్త మార్పులు
Post Office Account New Rules: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పోస్టాఫీసులకు దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్వర్క్ ఉంది. మారుమూల గ్రామాల్లోనూ శాఖలు ఉన్నాయి. కోట్లాది మంది ఖాతాదారులు ఉన్నారు. అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పోస్టాఫీసుల ద్వారానే అమలవుతున్నాయి. బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులు కూడా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది సేవింగ్స్ అకౌంట్. ఈ అకౌంట్ల ఓపెనింగ్, విత్‌డ్రాయల్, వడ్డీ లెక్కింపు, చెల్లింపులకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. జాయింట్ అకౌంట్ హోల్డర్ల పరిమితి పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ హోల్డర్ల పరిమితిని పెంచారు. ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తులు మాత్రమే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు వీలుండేది. ఇప్పుడు మార్చిన నిబంధనల ప్రకారం, జాయింట్ అకౌంట్‌ను ముగ్గురు వ్యక్తులు కలిసి తెరవవచ్చు. నగదు విత్‌డ్రా సేవింగ్స్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రాకు సంబంధించి కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా కోసం కస్టమర్లు ఫారం-2, అకౌంట్ పాస్‌బుక్ సమర్పించేవారు. ఇక నుంచి నగదు విత్‌డ్రా చేయాలంటే ఫారం-3ని నింపి, పాస్‌బుక్‌తో పాటు సమర్పించాల్సి ఉంటుంది. వడ్డీ లెక్కింపు, చెల్లింపు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై వడ్డీ లెక్కింపు, చెల్లింపులోనూ కీలక మార్పులు వచ్చాయి. దీని ప్రకారం ప్రతి నెలా 10వ తేదీ నుంచి ఆ నెలలో చివరి రోజు వరకు ఉన్న అతి తక్కువ డిపాజిట్ మొత్తం మీద 4 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఆ వడ్డీ మొత్తాన్ని ఏడాదికి ఒకసారి, ఆ సంవత్సరం చివరిలో సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ, సంవత్సరం పూర్తి కాకముందే ఖాతాదారు మరణిస్తే, సేవింగ్స్ అకౌంట్ మూసివేసిన నెలకు ముందు నెలాఖరులో ఆ వ్యక్తి ఖాతాలోకి వడ్డీ డబ్బును జమ చేస్తారు. -
గుడ్‌న్యూస్: ఇక బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ 2023 స్కీమ్ ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల్లోనూ అందుబాటులోకి రానుంది. ఆర్థిక వ్యవహారాల శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. బాలికలు, మహిళల ఆర్థిక భద్రత లక్ష్యంగా 2023 ఏప్రిల్ నుంచి ఈ పథకం పోస్టాఫీసుల్లో మాత్రమే అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. (పోస్టాఫీసు పొదుపు పథకాల రేట్ల పెంపు, కానీ..!) ఈ పథకం కింద చేసిన డిపాజిట్ సంవత్సరానికి 7.5 శాతం వడ్డీని కలిగి ఉంటుంది. త్రైమాసిక చక్రవడ్డీని కలుపుకుంటే 7.7శాతం వడ్డీ వరకూ ప్రయోజనం లభిస్తుంది. కనిష్టంగా రూ. 1,000 గరిష్టంగా రూ.2,00,000 వరకూ డిపాజిట్ చేయవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి రెండేళ్లు. (హెచ్డీఎఫ్సీ విలీనం: వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ బ్యాంక్స్‌లో స్థానం) కాగా శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటు ఇప్పుడు 4 శాతం నుంచి 8.2 శాతం వరకు ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి ఖాతా పథకం వంటి పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది. మరిన్ని బిజినెస్వార్తలు, అప్డేట్స్ కోసంచదవండి: సాక్షిబిజినెస్ -
తపాలాకు సాంకేతిక సొబగులు
నేరడిగొండ: బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకుంటూ ఆధునికతను అందిపుచ్చుకునే దిశగా తపాలా శాఖ అడుగులు వేస్తోంది. అన్ని రంగాలతో సమానంగా ఆన్లైన్ విధానంలోనూ తామేమీ తక్కువ కాదని నిరూపిస్తోంది. ఇప్పటికే పలుసేవలను ఆన్లైన్ విధానంలోకి తెచ్చింది. వీటితోపాటు తాజాగా ‘పోస్ట్ ఇన్ఫో యాప్’ను తీసుకువచ్చింది. దీనిద్వారా పోస్టల్‌కు సంబంధించిన సమాచారాన్ని ఫోన్లోనే తెలుసుకునే వీలు కలిగింది. వినియోగదారుడికి సదుపాయంగా.. పోస్ట్ ఇన్ఫో యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో తపాలా చార్జీలు, బీమా ప్రీమియం, వివిధ డిపాజిట్లపై వడ్డీ లెక్కించుకునే సదుపాయాలు సైతం ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన, డిపాజిట్ పథకం, టైమ్ డిపాజిట్లపై ఏడాది నుంచి ఐదేళ్ల వరకు వచ్చే ఆదాయం వాటిని లెక్కించుకోవచ్చు. ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేట్లు ఆధారంగా పథకాలు ఎంచుకొని డిపాజిట్లు చేయడం ద్వారా వచ్చే ఆదాయం వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు అమలులో ఉన్న (ఆరు అంకెల) పిన్‌కోడ్ నంబర్లను ఎంటర్ చేస్తే తపాలా కార్యాలయం పేరు, డివిజన్ పరిధి తెలియజేస్తుంది. తపాలా అందిస్తున్న సేవలపై ఖాతాదారులు ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు. ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం సైతం ఉంది. కూర్చున్న చోటు నుంచే. ఈ యాప్ ద్వారా కూర్చున్న చోటు నుంచే వినియోగదారులు సులువుగా సమాచారం పొందవచ్చు. తపాలా చార్జీలు, బీమా ప్రీమియం, పొదుపు పథకాల గురించి తెలుసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మరింత సులువు.. తపాలా శాఖలో బ్యాంకులకు దీటుగా ఆన్లైన్ ద్వారా సేవలందిస్తోంది. మహిళలకు ప్రత్యేక పథకాలు ఉన్నాయి. మా శాఖ ద్వారా ఆయా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఏవైన వివరాలు ఉంటే ఆయా గ్రామాల్లో గల తపాలా శాఖ కార్యాలయంలో కాని, బీపీఎంల ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. – మహేశ్‌రెడ్డి, సబ్ పోస్టుమాస్టర్, నేరడిగొండ -
పోతపోసిన పోస్టాఫీస్...!
బెంగళూరు: 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పోతపోసిన తపాలా కార్యాలయం దేశంలో తొలిసారిగా బెంగళూరులో కొలువు తీరనుంది. దీన్ని ఎల్ అండ్ టీ సంస్థ 45 రోజుల్లో 1,000 చదరపు అడుగుల్లో నిర్మించనుంది. పూర్తిగా ఆటో మేటిక్‌గా పనిచేసే రోబోటిక్ ప్రింటర్ దీన్ని తయారు చేస్తుంది. కాంక్రీట్‌ను పొరలు పొరలుగా 3డీ మోడల్‌కు తగ్గట్లు పోస్తుంది. ఎక్కడా కాంక్రీట్ పడే వేగం తగ్గకుండా చూస్తూ వెనువెంటనే గట్టిపడేలా చేస్తుంది. పొరల మధ్య బలమైన బంధం ఉండేలా ‘గ్రీన్ కాంక్రీట్’ను నింపుతుంది. ‘‘జీ+3 నిర్మాణాలు, విల్లాలు, సైనిక బ్యారక్‌లు, ఒకే అంతస్తుండే పాఠశాలలు, పోస్టాఫీసులు, ఫ్యాక్టరీల నిర్మాణంపై దృష్టిపెట్టాం’’ అని సంస్థ పూర్తికాల డైరెక్టర్, ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ (బిల్డింగ్స్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ సతీశ్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. -
పోస్టల్ ఉద్యోగుల అలసత్వమే..
సాక్షి, ఆదిలాబాద్/ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో పదో తరగతి జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్ కేసులో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కనిపిస్తోంది. సోమవారం ప్రథమ భాష పరీక్ష తర్వాత జవాబు పత్రాలను పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఉట్నూర్ పోస్టాఫీసుకు అందించారు. ఇక్కడ బండిళ్లను తయారు చేసి బస్సు ద్వారా వరంగల్‌కు పంపించాలి. పోస్టాఫీస్ నుంచి ఆటోలో సిబ్బంది ఎంటీఎస్, ఈడీ ప్యాకర్ వెంటఉండి వాటిని బస్టాండ్‌కు తరలించాలి. అయితే ఈ సిబ్బంది ఎవరూ వెంట లేకుండానే ఆటోలో వేసి వారు తమ ద్విచక్ర వాహనం ద్వారా వెళ్లారు. బస్టాండ్‌కు వెళ్లిన తర్వాత 11 బండిల్స్ (కట్ట) నుంచి ఒకటి మిస్ అయ్యింది. పోస్టుమాస్టర్ ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఉట్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పేపర్ బండిల్ కోసం వెతికినప్పటికీ దొరకలేదు. మంగళవారం ఉదయం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఈవో ప్రణీత ఉట్నూర్ చేరుకున్నారు. మొదట పోస్టాఫీసుకు వెళ్లగా సెలవు కారణంగా వారు అందుబాటులో లేరు. దీంతో వీరు స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని డీఎస్పీ నాగేందర్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న అధికారులు పూర్తి విషయాలపై ఆరా తీశారు. కాగా, నిజామాబాద్ పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్రావు ఉట్నూర్ చేరుకొని బండిల్ మిస్సింగ్ విషయంలో విచారించారు. ఇదిలా ఉంటే పోలీసులు పోస్టల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఆటో వెళ్లిన దారిలో రోడ్డు పక్కన ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం వరకు పేపర్ బండిల్ దొరకలేదు. పరీక్ష రాసిన 9 మంది విద్యార్థుల జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్‌తో ఆ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇద్దరిపై వేటు టెన్త్ జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్ ఘటనలో పోస్టాఫీస్ ఉద్యోగి ఎంటీఎస్ రజితపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురికాగా ఆదిలాబాద్‌లోని రిమ్స్ కు తరలించారు. మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగి నాగరాజును బాధ్యతల నుంచి తప్పించారు. -
ఇంటింటికీ తిరుగుతున్నారు.. అకౌంట్లు తెరిపిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్ : పూర్వ వైభవాన్ని సాధించే క్రమంలో తపాలా శాఖ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను, సేవలను ప్రవేశపెట్టడం ప్రారంభించింది. అయితే వీటి గురించిన ప్రచారం పెద్దగా లేకపోవడంతో, రెగ్యులర్‌గా పోస్టాఫీసులకు వెళ్లేవారికి తప్ప మిగతా వారికి అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే శాఖ సిబ్బంది ప్రజలకు చేరువగా వెళుతున్నారు. బ్యానర్లు, కరపత్రాలు పట్టుకుని ఊరూరా, ఇంటింటా తిరుగుతున్నారు. పోస్టాఫీసును, వాటి ద్వారా అందుబాటులో ఉన్న సేవలను గుర్తు చేస్తున్నారు. తపాలాఫీసును ఉత్తరాల బట్వాడా కార్యాలయంగానే చూడకుండా.. వివిధ ప్రజోపయోగ సేవలకు కేంద్రంగా గుర్తించాలంటూ కరపత్రాల ద్వారా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం మంచి ఫలితాన్ని ఇవ్వడం, ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తం కావడం విశేషం. తోక లేని పిట్ట 90 ఆమడలు తిరిగిందట ..ఏంటది..? అంటూ..ఒకప్పుడు పోస్టు కార్డు గురించిన పొడుపు కథ విప్పమని అడిగేవారు.ఇప్పటితరానికి పోస్టు కార్డు తెలియదు.. పొడుపు కథ అంతకన్నా తెలియదు. కొందరికి తపాలా కార్యాలయం (పోస్టాఫీసు) గురించి కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రైవేటు కొరియర్ సంస్థలు, బ్యాంకులుపుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన తర్వాత తపాలా శాఖ ఒకప్పటి వైభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది.ఇక జనం తపాలా సేవలను మరిచిపోతున్నారా? అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. దీంతో పోస్టల్డిపార్ట్మెంట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తానే జనం బాట పట్టి మంచి ఫలితాలు సాధిస్తోంది. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి వివిధ పథకాలకు సంబంధించిన ప్రత్యేక మేళాలు నిర్వహించడంతో పాటు కరపత్రాలు, బ్యానర్లతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు అంతగా అందుబాటులో ఉండనందున, గ్రామాల్లో ప్రచారం చేస్తూ మైక్రో ఏటీఎంల ద్వారా తమ సిబ్బందే ఫోన్ చేస్తే ఇంటికి డబ్బు తెచ్చి అందిస్తారని, పోస్టాఫీసులకు వెళ్లినా డబ్బు చెల్లిస్తారని, రైతు బంధు లాంటివి కూడా ఇంటికే వచ్చి ఇస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా ఇటీవల వారం రోజుల్లోనే 1,52,833 పొదుపు ఖాతాలను తెరిపించిన తెలంగాణ సర్కిల్ జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని పొదుపు ఖాతాల సంఖ్య 42,55,352కు చేరుకుంది. వీటిల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 6,76,975 ఖాతాలు తెరవడం గమనార్హం. ఆకర్షిస్తున్న వడ్డీ శాతాలు వృద్ధుల పేరుతో ఖాతాలు తెరిస్తే గరిష్టంగా 8 శాతం వడ్డీ చెల్లిస్తుండటం జనం తపాలా ఖాతాల వైపు మళ్లేందుకు కారణమవుతోంది. ఆడపిల్లల పేరుతో చేసే పొదుపు మొత్తంపై 7.6 వడ్డీ చెల్లిస్తున్న కారణంగా సుకన్య సమృద్ధి యోజన ఖాతాలకు డిమాండ్ పెరిగింది. ఇటీవల మేళాలు ఏర్పాటు చేసి ప్రచారం చేసిన కేవలం మూడు రోజుల్లోనే కొత్తగా 34,384 ఖాతాలు తెరుచుకున్నాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 5,71,659కి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ తరహాలో 92,509 ఖాతాలు తెరుచుకోవడం విశేషం. ♦ ‘సుకన్య సమృద్ధి యోజన పథకం కింద బాలికల పేరిట పొదుపు ఖాతా తెరిస్తే 7.6 శాతం వడ్డీతో ఆ మొత్తం చూస్తుండగానే పెరుగుతూ పోతుంది. వారి చదువులకు, పెళ్లిళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది..’అంటూ తపాలా శాఖ ప్రజల్లోకి వెళ్లింది. సిబ్బంది చేసిన కృషి ఫలించింది. తల్లిదండ్రులు కేవలం 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 34 వేల ఖాతాలు తెరిచారు. ♦ ‘తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతాలు తెరిస్తే మంచి వడ్డీతో పాటు మైక్రో ఏటీఎం ద్వారా పోస్ట్‌మాన్ ఇంటికి డబ్బు పట్టుకొస్తారు. ఏటీఎంకు దూరంగా ఉన్నామన్న బెంగ అవసరం లేదు..’అంటూ తపాలా శాఖ సిబ్బంది మహా మేళాల ద్వారా చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించింది. కేవలం వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల కొత్త పొదుపు ఖాతాలు తెరుచుకున్నాయి. తపాలా శాఖ ద్వారా 150 రకాల సేవలు అందిస్తున్నాం. వీటిల్లో చాలావరకు పోస్టాఫీసు వరకు రాకుండా పోస్ట్‌మాన్ ద్వారానే పొందవచ్చు. జనవరి నుంచి ఖాతాలపై వడ్డీని కూడా పెంచాం. కానీ ప్రజల్లో వీటిపై పెద్దగా అవగాహన లేదు. అందుకే మేమే వారి వద్దకు వెళ్తున్నాం. మా ప్రయత్నం మంచి ఫలితాన్నిస్తోంది. –పీవీఎస్ రెడ్డి, పోస్ట్‌మాస్టర్ జనరల్ -
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: విస్తృతమైన పోస్టాఫీసుల నెట్వర్క్ ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) .. పూర్తి స్థాయి బ్యాంకుగా మారే యోచనలో ఉంది. తద్వారా మరింత మందికి ఆర్థిక సేవలు అందించవచ్చని భావిస్తోంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఐపీపీబీ ఎండీ, సీఈవో జె. వెంకట్రాము ఈ విషయాలు తెలిపారు. 2018లో ఐపీపీబీ కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు 80 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరిగేవని, ప్రస్తుతం టెక్నాలజీ వినియోగంతో ఇది 20 శాతానికి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. తమకున్న నెట్‌వర్క్‌తో మారు మూల ప్రాంతాలకు కూడా చేరడం సాధ్యపడుతుందని, పూర్తి స్థాయి బ్యాంకింగ్ లైసెన్స్ లభిస్తే భారీ లక్ష్యాల సాధనకు తోడ్పడగలదని వెంకట్రాము చెప్పారు. ప్రస్తుతం పేమెంట్ బ్యాంకు హోదాలో ఐపీపీబీ.. డిపాజిట్లు, రెమిటెన్సులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సర్వీసులు అందించగలదు. కానీ రుణాలు ఇవ్వడానికి, క్రెడిట్ కార్డులు జారీ చేయడానికి వీలు లేదు. మరోవైపు, కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారం కోసం సరైన వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు. -
పన్ను ప్రయోజనాలు కావాలంటే.. ఈ పోస్టాఫీస్ పథకాలపై ఓ లుక్కేయండి!
పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఆలోచించేది, ఆచరించే మంత్రం ‘పొదుపు’. వారికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా పొదుపు పథకాలను అందిస్తోంది. ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు పొదుపు చేయడంతో పాటు ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా పొందొచ్చు.అవేంటో తెలుసుకుందాం! పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఈ పథకంలో 15 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఇందులో కనీసం రూ. సంవత్సరానికి 500, గరిష్ట డిపాజిట్ రూ.ఒకే ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షలు జమ చేసుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా ప్రాణాంతక వ్యాధి, ఉన్నత విద్య , నివాస మార్పు వంటి పరిస్థితులకు లోబడి ఉంటుంది. అయితే, వ్యక్తులు 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. 4 సంవత్సరాల తర్వాత రుణాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద చేసిన డిపాజిట్లకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అదనంగా, సంపాదించిన వడ్డీ పూర్తిగా పన్ను రహితం. ప్రస్తుత పోస్టాఫీసు PPF వడ్డీ రేటు వార్షికంగా 7.1% ఉంది. సుకన్య సమృద్ధి ఖాతా ఆడపిల్లల భవిష్యత్ కోసం ఉద్దేశించిన ప్రత్యేక పథకం ఇది. 10 ఏళ్లలోపు బాలికలకు ఈ ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచే సమయంలో అమ్మాయి వయస్సుతో సంబంధం లేకుండా ఈ పథకం 21 సంవత్సరాల కాల వ్యవధిని కలిగి ఉంది. ఉదాహరణకు, ఖాతా తెరిచే సమయంలో ఒక అమ్మాయికి 7 సంవత్సరాలు ఉంటే, ఆ అమ్మాయికి 28 ఏళ్లు వచ్చేసరికి ఆ ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఖాతా తెరిచినప్పటి నుంచి 15 సంవత్సరాల పాటు డిపాజిట్లు చేయాలి. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.60%. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో ముందస్తు విత్ డ్రా చేసుకోవచ్చు, కాకపోతే కనీసం 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ పన్ను ఆదా పథకం కింద చేసిన పెట్టుబడులు సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలకు అర్హత పొందుతాయి. ప్రస్తుత పోస్టాఫీసు సుకన్య సమృద్ధి ఖాతా వడ్డీ రేటు సంవత్సరానికి 7.6% అందిస్తుంది. ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహం కోసం నియమ నిబంధనలను అనుసరించి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో చేసే పెట్టుబడులపై కూడా సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే వడ్డీ గానీ, మెచ్యూరిటీ మొత్తంపై గానీ పన్ను వర్తించదు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అనేది పన్ను మినహాయింపు కోసం ప్రముఖ పోస్టాఫీసు పథకాలలో ఒకటి. ఈ ప్లాన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. పెట్టుబడిదారులు 1, 2, 3, 5 సంవత్సరాల వంటి వివిధ కాల వ్యవధిలో డిపాజిట్లు చేయవచ్చు ఈ పథకంలో గరిష్ట పదవీకాలం 5 సంవత్సరాలు. టైమ్ డిపాజిట్లో కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000, కాగా దీనికి గరిష్ట పరిమితి లేదు. అయితే, పన్ను ప్రయోజనం రూ. 1.5 లక్షలు ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పన్ను ప్రయోజనం కోసం ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఖతాదారుడు మొత్తం పెట్టుబడిని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఖాతాదారులు అసలు, వడ్డీ రెండు కలిపి మొత్తం కార్పస్‌ను అందుకుంటారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 7% వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపునకు అర్హత ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పెద్దలు, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన 55 నుంచి 60 ఏళ్ల లోపు వయసువారు ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకు.. ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. దీని ప్రత్యేకత ఏమనగా.. పోస్టాఫీస్ అందిస్తున్న పథకాల్లో అత్యధిక వడ్డీ రేటుని అందిస్తోంది ఈ పథకం. ప్రస్తుతం వార్షికంగా ఈ పథకం 8% వడ్డీ రేటు అందిస్తోంది. ఇందులో వడ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జులై, అక్టోబరు, జనవరి నెలల్లో మొదటి తేదీన వడ్డీ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులపై కూడా సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. -
పోస్టల్ శాఖ ద్వారా సీఎంకు శుభాకాంక్షలు
అవనిగడ్డ: సీఎం వైఎస్ జగన్‌కి రూ.10తో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం పోస్టల్ శాఖ కల్పిస్తోంది. ఈ నెల 21న సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకునే వారు పోస్టాఫీస్‌లో రూ.10 చెల్లిస్తే వారి అడ్రస్‌తో సందేశం చేరుతుంది. రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీస్‌ల నుంచి వచ్చే సందేశాలను మంగళగిరి ప్రధాన పోస్టాఫీస్ ద్వారా ముఖ్యమంత్రికి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 లోపు ప్రధాన పోస్టాఫీస్‌కు వచ్చి రూ.10 చెల్లించి సీఎంకు జన్మదిన శుభాకాంక్షల సందేశం పంపవచ్చని కృష్ణా జిల్లా అవనిగడ్డ పోస్టుమాస్టర్ సింహాద్రి రామలింగేశ్వరరావు తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు స్థానిక హెడ్‌పోస్టాఫీస్ ద్వారా సీఎంకు శుక్రవారం జన్మదిన శుభాకాంక్షల సందేశం పంపించారు. -
తపాలా నిద్ర.. అక్రమాల ముద్ర
సాక్షిప్రతినిధి, కాకినాడ: పోస్టాఫీసు అంటే నమ్మకానికి చిరునామా. పల్లెల నుంచి నగరం వరకు ఏ చిన్న ఉత్తరం వచ్చినా భద్రంగా అందజేసి విశ్వసనీయత చాటుకునే వ్యవస్థగా మంచి పేరు. ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాల పాత్ర లేకపోవటంతో పోస్టాఫీసులు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాయి. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ)పేరుతో పల్లెల్లో బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంకుల మాదిరి అన్ని నగదు లావాదేవీలు చేపడుతోంది. అయితే ఈ వ్యవహారాపై పర్యవేక్షణ, జవాబుదారీతనం కొరవడిందనే విమర్శ ఇటీవల బలంగా వినిపిస్తోంది. ఉన్నతాధికారుల అజమాయిషీ అంతంతమాత్రంగా ఉంటోందని తెలుస్తోంది. ఫలితంగా కొన్ని బ్రాంచిల్లో పోస్టుమాస్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఖాతాదారుల సొమ్ముకు ఎసరు పెడుతున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు బ్రాంచిల్లో వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టుమాస్టర్ ఏకంగా నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసి కోటిన్నర లూటీ చేయడం పోస్టల్శాఖనే ఒక్క కుదుపు కుదిపేసింది. జిల్లాల పునర్విభజనకు ముందు నుంచి బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తోన్న బ్రాంచిల్లో ఎక్కడోచోట ఈ బాగోతాలు బయటపడి ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. బయటపడిన కొన్ని బాగోతాలు ఈ ఏడాది మేలో అమలాపురం పోస్టల్ డివిజన్ పరి«ధిలోని అయినవిల్లి మండలం విలస సబ్ పోస్టాఫీసు ఐపీపీబీలో రూ.1.18 కోట్లు దుర్వినియోగమయ్యాయి. హెడ్ పోస్టాఫీసులో సిస్టమ్ అడ్మిని్రస్టేటర్ ఖాతాదారుల సొమ్ములను సన్నిహితులు, బంధువుల ఖాతాలకు బదిలీచేసి అక్రమానికి పాల్పడ్డాడు. ఇందులో ఇద్దరు పోస్టల్ అసిస్టెంట్లు సస్పెండయ్యారు. ఆరుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సూత్రధారి సిస్టమ్ అడ్మినిస్టేటర్ ఇప్పటికీ పరారీలో ఉండటం విస్మయాన్ని కలిగిస్తోంది. డిజిటల్ సంతకాల పాస్ వర్డ్‌లను తెలుసుకుని సిస్టమ్ అడ్మి్రస్టేటర్ అక్రమాలకు పాల్పడ్డాడని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో 70 మంది ఖాతాదారులు మోసపోయిన వైనం ఆరు నెలల క్రితం బయటపడింది. డిపాజిట్ సొమ్ము డ్రా చేసేందుకు వెళ్లేసరికి అసలు ఖాతాల్లో సొమ్ములు లేవని తేలడంతో వీరంతా నివ్వెరపోయారు. బాధితులు తాడేపల్లిగూడెం హెడ్‌పోస్టాఫీసుకు ఫిర్యాదు చేయగా విచారణ జరుగుతోంది. నల్లజర్ల మండలం చీపురుగూడెంలో ఖాతాదారు ల డిపాజిట్లను పాస్‌బుక్‌లో నమోదు చేసినా ఐపీపీబీ ఖాతాల్లో జమ చేయలేదు .కల్లూరు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ చిగురుపల్లి గోవర్థన్ తన ఖాతాలో డిపాజిట్ సొమ్ము లేదని గుర్తించడంతో బ్రాంచి పోస్టుమాస్టర్ ఇందిర అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. విచారణ జరుగుతోంది. గోకవరం సబ్ పోస్టాఫీసులో తపాలా ఉద్యోగి (జీడీఎస్–పేకర్) ఐపీపీబీ ఖాతాల నుంచి రూ. 20 లక్షలు కాజేసిన వైనాన్ని గతేడాది డిసెంబర్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. డమ్మీ డిపాజిట్లతో లక్షల్లో విత్‌డ్రా చేసి తపాలా శాఖకు షాక్ ఇచ్చాడు. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టు మాస్టర్ ఖాతాదారులకు కుచ్చుటోపీ వేశారు. పోస్టు మాస్టర్ ఎస్కే మీరావలి నిర్వాకంతో సుమారు 750 మంది డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. పెదవేగి ఆనందరావు ధర్మవరం బ్రాంచిలో డిపాజిట్ చేసిన రూ.5లక్షలు కొవ్వూరు ప్రధాన కార్యాలయంలో పరిశీలిస్తే జమ కాలేదని తేలడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు కోటి రూపాయలు దాటి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ విచారిస్తున్నారు. 2002లో అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలో ఇందిరా వికాస్ పత్రాలు(ఐకేపీ) పేరుతో రూ.1.50 కోట్లు దురి్వనియోగమయ్యాయి. గడువుతీరిన ఐకేపీ పత్రాలను అడ్డం పెట్టుకుని సొమ్ము కాజేయడం అప్పట్లో సంచలనమైంది. ఇద్దరు పోస్టల్ ఉద్యోగులను తొలగించారు. ఐదుగురిని సస్పెండ్ చేశారు. 31 మందిని బాధ్యులుగా నిర్ధారించి జీతాల నుంచి రికవరీ చేశారు. 81 మంది బాధితుల్లో నలుగురు ఇప్పటికే చనిపోయారు. నిరంతర పర్యవేక్షణ బ్రాంచిల్లో ఐపీపీబీల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణతో అవకతవకలకు తావులేకుండా చూస్తున్నాం. ప్రతి నెలా నాలుగైదు బ్రాంచిల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాం. నాతో పాటు నలుగురు ఇనస్పెక్టర్లు, సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి ఐపీపీబీ ఖాతాదారుల పాస్‌పుస్తకాలు, రికార్డులను పరిశీలిస్తున్నాం. బ్రాంచి పోస్టాఫీసులకు వెళ్లి పరిశీలన జరిపే వరకు కూడా బృందం తనిఖీలకు వెళుతున్న సమాచారం గోప్యంగా ఉంచుతాం. కాకినాడ జిల్లాలో షెడ్యూల్ ప్రకారం చేస్తుండబట్టే అవకతవకలకు ఆస్కారం ఉండటం లేదు. నాగేశ్వరరెడ్డి, పోస్టల్ సూపరింటెండెంట్, కాకినాడ ఇలా చేస్తే అడ్డుకట్ట ఐపీపీబీ డివిజన్‌కు ఒక కార్యాలయం మాత్రమే ఉంది. దీంతో పెద్దగా పర్యవేక్షణకు ఆస్కారం ఉండటం లేదు. ఇక్కడ ఉద్యోగులను కూడా అవుట్ సోర్సింగ్‌లో తీసుకుంటున్నారు. ఐపీపీబీ కార్యాలయాల్లో సిబ్బందిని పోస్టల్ బ్రాంచ్ కార్యాలయాలు, సబ్ పోస్టాఫీసులకు అనుసంధానం చేయటంలో లోపాలున్నాయి. తరచూ పోస్టల్ డిపాజిట్లు, అకౌంట్లపై అధికారుల తనిఖీలు ఉండాలి. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు పోస్టల్ కార్యాలయాల్లో రికార్డులనే కాకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి ఖాతాదారుల పాసుపుస్తకాలను కూడా తనిఖీ చేయాలి. వాణిజ్య బ్యాంక్‌ల మాదిరిగానే పోస్టల్ ఖాతాదారుల మొబైళ్లకు మెసేజ్ అలర్టు ఉన్నప్పటికీ నిధులు కాజేసే కొందరు ఉద్యోగులు ఈ మెసెజ్ రాకుండా సర్వర్‌ను నియంత్రిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధానాన్ని కట్టడి చేయాల్సి ఉంది.పాస్‌వర్డు కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకిలా మోసం జరుగుతోంది... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐపీపీబీలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడమే ప్రధాన కారణం. సబ్ పోస్టాఫీసును సూపరింటిండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోసాఫీసెస్ వంటి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వీరు సబ్ పోస్టాఫీసు, పోస్టాఫీసులను ప్రతి మూడు, అరు నెలలకు తనిఖీ చేస్తున్నా ఐపీపీబీ ఖాతాల ఆన్లైన్ లావాదేవీలపై దృష్టి పెట్టడం లేదు. ఈ విధానమే బ్రాంచి స్థాయిలో అవకతవకలకు ఆజ్యం పోస్తోందని తెలుస్తోంది. తపాలా ఉద్యోగులు, ఐపీపీబీ పర్యవేక్షకుల మధ్య సమన్వయం లేకపోవడం కొంప ముంచుతోంది. ఐపీపీబీ రాక ముందు (పోస్టల్ లావాదేవీలు ఆన్లైన్ కాక ముందు) తపాల కార్యాలయాల ద్వారా సేవింగ్స్ బ్యాంకు, రికరింగ్ డిపాజిట్, ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాలను తెరిచేవారు. ఆఫ్‌లైన్‌లో లావాదేవీలు జరిగేటప్పుడు ఈ తరహా అవకతవకలు చోటుచేసుకోలేదు. ఆన్లైన్, ఐపీపీబీ వ్యవస్థ వచ్చాక ఖాతాల నుంచి సొమ్ము మాయవుతుండటం ఉన్నత స్థాయి వైఫల్యంగానే కనిపిస్తోంది. -
బెజవాడ పోస్ట్ ఆఫీస్ లో నిధులు గోల్మాల్
-
ఇంటి వద్దే చిన్నారుల ఆధార్
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ కావాలా.. అయితే పోస్టాఫీస్‌కు ఫోన్ చేయండి.. సిబ్బంది మీ ఇంటికే వచ్చి వివరాలు నమోదు చేసి ఆధార్‌కార్డు అందించే ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) తపాలా శాఖకు అనుమతినిచ్చింది. ఐదేళ్లలోపువారికి కూడా ఆధార్ అవసరమైన నేపథ్యంలో వివరాల నమోదు కోసం చిన్నారులను తీసుకుని ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటిలోనే తంతు పూర్తి చేసేలా తపాలా శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను 28 గ్రామీణ జిల్లాల్లోని పోస్ట్మన్లు, 1,552 గ్రామీణ్ డాక్ సేవక్‌లకు యూఐడీఏఐ సర్టిఫై చేసింది. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులందరికీ ఆధార్ నమోదు ప్రక్రియ వేగంగా సాగేందుకు మహిళా, శిశు సంక్షేమ, విద్యాశాఖలతో సమన్వయం చేసుకుంటూ అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనుంది. ఇందుకుగాను అధికారులు, అంగన్వాడీ కేంద్ర ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులకు లేఖలు రాస్తోంది. బయోమెట్రిక్ లేకుండా... ఆధార్‌లో పేర్ల నమోదుకు బయోమెట్రిక్ తప్పనిసరి అయినా, ఐదేళ్లలోపు చిన్నారులకు మినహాయింపు ఇచ్చారు. చిన్నారుల వేలిముద్ర లు స్పష్టంగా ఉండనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ధారిత వయసు వచ్చాక మళ్లీ వారి వేలిముద్రలు తీసుకోవటం ద్వారా ఆధార్ అప్డేట్ చేస్తారు. ఇప్పుడు మాత్రం తల్లిదండ్రుల బయో మెట్రిక్ తీసుకుని, జనన ధ్రువీకరణ పత్రం(బర్త్ సర్టిఫికెట్) ప్రతి సమర్పించటం ద్వారా వారి పేర్లు నమోదు చేయించొచ్చు. ఈ ప్రక్రియను ఉచితంగా నిర్వహిస్తారు. గతంలో ఐదేళ్ల కంటే పెద్ద వయసువారికి తపాలా కార్యాలయాల్లో, ప్రత్యేక శిబిరాల్లో తపాలా శాఖ ఆధార్ వివరాలను నమోదు చేయించింది. వారికి ఆధార్ కార్డులను యూఐడీఏఐ పోస్ట్ ద్వారా పంపింది. 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చివరకు లక్షమంది వివరాలను తపాలాశాఖ ద్వారా నమోదు చేయించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. -
ఇంటింటికీ ఆధార్ సేవలు!
న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పోస్టమెన్‌ను వినియోగించుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో ఇండియాపోస్ట్ పేమెంట్ బ్యాంక్‌కు చెందిన 48 వేల మంది పోస్ట్మెన్ను రంగంలోకి దించనుంది. వీరు మారుమూల ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి చిన్నారుల పేర్లు నమోదు చేసుకోవడం, ఆధార్‌తో సెల్‌ఫోన్ నంబర్లను లింక్ చేయడం, వివరాలను అప్డేట్ చేయడం వంటి సేవలు అందించనున్నారు. రెండో దశ ప్రణాళికలో భాగంగా 1.50లక్షల మంది తపాలా శాఖ అధికారులను కూడా ఇందులో భాగస్వాములను చేయనుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల వారితోపాటు, సాధ్యమైనంత ఎక్కువ మంది పౌరులకు ఆధార్‌ను అందజేయడమే యూఐడీఏఐ లక్ష్యమన్నారు. ఇంటింటికీ వెళ్లే పోస్ట్‌మెన్ ఆధార్ వివరాలను అక్కడికక్కడే అప్డేట్ చేసేందుకు వీలుగా ట్యాబ్లెట్ పీసీ/ల్యాప్‌టాప్‌లను అందజేస్తామని తెలిపారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 13వేల మంది కామన్ సర్వీస్ సెంటర్ల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఇందులో భాగంగా చేస్తామన్నారు. ఇంకా దేశవ్యాప్తంగా 755 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఆధార్ సేవా కేంద్రాలను కొత్తగా ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతి రోజూ ఆన్లైన్ ద్వారా కనీసం 50వేల మంది చిరునామా, ఫోన్ నంబర్, ఇతర వివరాలను అప్డేట్ చేసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికీ 12 అంకెల బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య ఆధార్‌ను అందించేందుకు యూఐడీఏఐ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. -
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం
న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లేని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పోస్టల్ శాఖతో కలిసి పోస్టాపీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు 2017లోనే ప్రకటించినట్లు విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ దేశంలో ప్రస్తుతం మొత్తం 521 పాస్‌పోర్ట్ కేంద్రాలు పని చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 93 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, 428 పోస్టాఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 24 పార్లమెంటరీ నియోజకవర్గాలకు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు లేదా పోస్ట్ ఆఫీసు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో తిరుపతి, విజయవాడలోను, విశాఖపట్నం రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో విశాఖపట్నం, భీమవరంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు పని చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. లేబర్ కోడ్స్‌పై పలు రాష్ట్రాలు నోటిఫికేషన్ న్యూఢిల్లీ: పార్లమెంట్లో చట్టబద్దత కల్పించిన నాలుగు లేబర్ కోడ్స్‌పై ఇప్పటికే అనేక రాష్ట్రాలు నియమ, నిబంధనలను నోటిఫై చేసినట్లు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కోడ్ ఆన్ వేజెస్ 2019కి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు 28 రాష్ట్రాలు నియమ నిబంధనలను నోటిఫై చేశాయి. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్‌కు సంబంధించి 23 రాష్ట్రాలు, సోషల్ సెక్యూరిటీ కోడ్‌కు సంబంధించి 22 రాష్ట్రాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం కోడ్‌కు సంబంధించి 18 రాష్ట్రాలు ఇప్పటి వరకు నియమ నిబంధనలను నోటిఫై చేసినట్లు మంత్రి చెప్పారు. చదవండి: (కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను: విజయసాయిరెడ్డి ఛలోక్తి) లేబర్ కోడ్స్‌పై ఆయా రాష్ట్రాలు రూల్స్‌ను నోటిఫై చేసేందుకు గడువు విధించే అంశం కేంద్ర ప్రభుత్వం పరిశీనలో ఉందా అన్న మరో ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ కార్మిక శాఖ అనేది రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో అంశం. కార్మికులకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అందువలన కేంద్రం లేబర్ కోడ్స్‌పై చట్టం చేసిన తర్వాత వాటికి సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించేందుకు ఆయా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనిపై కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తోందని చెప్పారు. -
రుచిలో మేటి మాడుగుల హల్వా
కాకినాడ కాజాకు, బందరు లడ్డూకు.. ఆత్రేయపురం పూతరేకులకు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో మధురమైన ప్రత్యేకత ఉంటుంది. మప విశాఖ జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే మాడుగుల హల్వా. పేరులోనే కాదు రుచిలో కూడా దీనికి సాటి మరొకటి లేదని చెప్పక తప్పదు. ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో 132 ఏళ్ల క్రితం పుట్టిన ఈ హల్వా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించింది. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. మాడుగుల: మాడుగులలో 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో పుట్టిన హల్వా నేడు విదేశాల్లో సైతం నోరూరిస్తోంది. మాడుగుల అంటే హల్వాగానే ఖ్యాతి పెరిగింది. గతంలో హల్వా మాడుగులలోనే లభ్యమయ్యేది. ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్ కూడా విస్తరించింది. ఆన్లైన్ ఆర్డరిస్తే ఎంత దూరమైనా హల్వా పంపించే స్థాయికి మార్కెట్..నెట్వర్క్ అభివృద్ధి చెందింది. జీడి, బాదం పలుకులతో పాటు కవ్వంతో చిలికిన ఆవు నెయ్యి, ఎండు ఖర్జూరం నీళ్లు, తేనే..గోధుమ పాలుతోపాటు రాతి రుబ్బి రాయితో గంటలు పాటు సాన పట్టి కర్రలు పొయ్యిలో తగిన ఉష్ణోగ్రతలో తగిన పాకంతో పదునుపట్టగానే పుట్టుకొచ్చేదే మాడుగుల హల్వా. సినీతారలు ఫిదా అరకు, పాడేరు ప్రాంతాల్లో జరిగే సినీ షూటింగ్‌లకు ప్రముఖ హీరోహీరోయిన్లు మాడుగుల హల్వా రుచికి ఫిదా అయినవాళ్లే. హల్వాను లొట్టలేసుకుని తిన్నవారే..అందుకే ఈ ప్రాంతానికి సినీ తారలు ఎవరొచ్చినా కచ్చితంగా హల్వా రుచి చూడకుండా వెళ్లరు. పర్యాటక ప్రాంతాలు వీక్షించేందుకు వచ్చే పర్యటకులు మాడుగుల హల్వా రుచి చూడకుండా వెళ్లరు. విశాఖ అందాలను చూసేందుకు ఎంత ఉవ్విళ్లూరతారో.. మాడుగుల హల్వా తినేందుకు కూడా అంతే ఆసక్తి కనబరుస్తారు. అందుబాటులో ధరలు మాడుగులలో మేలు రకం కిలో రూ 500కాగా రెండో రకం కిలో రూ.400. స్థానిక వ్యాపారంతో పాటు పార్సిల్ ద్వారా ఇతర ప్రాంతాలకు ప్రతి రోజు ఎగుమతి జరుగుతోంది. మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. దంగేటి కుటుంబం మాత్రమే తయారీ చేసేవారు. తయారీ గుట్టురట్టవ్వడంతో మాడుగుల పట్టణానికి చెందిన దాసరి కుటుంబీకులు కూడా హల్వా పాకం, పదునును కనిపెట్టడంతో ప్రస్తుతం సుమారు 20 షాపులకుపైగా ఏర్పాటయ్యాయి. విదేశాలకు హల్వా రుచులు మాడుగులకు చెందిన కొందరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పండగలకు, శుభకార్యాలకు మాడుగుల వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు విదేశీ స్నేహితుల కోసం హల్వా తీసుకువెళ్లడం..ఆ రుచికి వారు మైమరచిపోవడం ఈ స్వీటుకున్న క్రేజ్ తెలియజేస్తుంది. హైదరాబాద్ చిత్రపురి హౌసింగ్ సొసైటీ జనరల్ సెక్రటరీ, సినీ నటుడు కాదంబరి కిరణ్‌కు మాడుగుల హల్వా అంటే చెప్పలేని ఇష్టం. అంతేకాదు చిత్రపురి కార్మికులకు తన స్నేహితుడైన కేజేపురం గ్రామానికి చెందిన పుట్టా ప్రసాద్ బాబుతో హల్వా రప్పించి పంపిణీ చేస్తుంటారు. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, భద్రాచలం, చెన్నై లాంటి నగరాల్లో కార్తీక ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, కోటి దీపాలంకరణ సమయాల్లో ఇక్కడ నుంచి హల్వా తీసుకెళ్లి వందలాది మంది నిరుద్యోగులు జీవనం సాగిస్తుంటారు. హల్వా టర్నోవర్ సాధారణ రోజుల్లో ఒక్కో షాపులో రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు విక్రయిస్తారు. పండగ, పర్యాటకుల రద్దీ ఉన్న సమయాల్లో రూ.4 వేలకు పైగా వ్యాపారాలు జరుగుతాయి. ఈ ఒక్కో షాపు నెలకు రూ.5లక్షలకు పైగానే వ్యాపారం సాగిస్తోంది. 5 వేల మందికి ఉపాధి మాడుగుల కేంద్రంగా తయారయ్యే హల్వా వ్యాపారంపై ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 వేల మందికి పైగా నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ నుంచి విశాఖ, అనకాపల్లి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వరకు ఎగుమతి చేస్తున్నారు. హల్వా సృష్టి కర్త దంగేటి ధర్మారావు నుంచి అతని కుమారుడు, మనుమలు, ముని మనవళ్లు హల్వా తయారీలో నిష్ణాతులు. తరాలు మారుతున్న హల్వా రుచి ఏ మాత్రం తగ్గలేదు. మాడుగుల నుంచి ఢిల్లీ తదితర ప్రాంతాలకు ప్రతి రోజు హల్వా విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. అరకు షూటింగ్‌కు వచ్చిన అల్లు అర్జున్, విజయశాంతి, రాజకీయ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సైతం నాటి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారని వ్యాపారులు దంగేటి మోహన్ , దాసరి ప్రసాద్ చెబుతున్నారు. అలాగే నాటి ప్రధాని ఇందిరా గాంధీ గత 40 ఏళ్ల క్రితం ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు హల్వా రుచి చూసి..ఢిల్లీకి పంపాలని అప్పటి సీనియర్ నాయకుడు వేమరవపు వెంకటరమణకు చెప్పారట. అంతలా మాడుగుల హల్వా రుచి అందరి మనసు గెలుచుకుంది. పోస్టల్ కవర్ పై .. విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి తయారు చేసే హల్వాకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. మాడుగుల వాసులు తయారు చేసే ఈ రకమైన హల్వాకు లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఉందని అంతర్జాతీయంగా కూడా ప్రచారం జరిగింది. గోధుమ పాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు వంటి వాటితో మాడుగుల వాసులు తయారు చేసే హల్వా కూడా తపాలా శాఖ విడుదల చేసిన పోస్టల్ కవర్ల పై ఉండటంతో విస్తృత ప్రచారం జరుగుతోంది. మాడుగుల టు ప్యారిస్ మాది విశాఖ జిల్లా మాడుగుల మండలం సత్యవరం గ్రామం. ఉద్యోగరీత్యా ప్యారిస్‌లో 8 ఏళ్లుగా స్థిరపడ్డాం. మాడుగుల ఎప్పుడు వచ్చినా హల్వా తీసుకెళ్లి ప్యారిస్‌లో ఉన్న స్నేహితులకు ఇస్తుంటా..ఇండియా వచ్చినప్పుడు హల్వా మర్చిపోవద్దు అంటూ స్నేహితులు పదేపదే చెబుతుంటారు. –గోపిశెట్టి వెంకటేష్, మెకానికల్ ఇంజనీర్, ప్యారిస్ తరాలుగా ఒకటే రుచి తాతలు నాటి క్వాలిటీని నేటికీ కొనసాగిస్తున్నాం. ఆవు నెయ్యి, బాదం జీడి పలుకులు, గోధుమ పాలతో చేసే హల్వా రుచి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందుబాటు «ధరల్లో విక్రయాలు జరుపుతున్నాం. హల్వా తయారీలో మా ముత్తాత ధర్మారావు టెక్నిక్ అనుసరిస్తున్నాం. అందుకే రుచిలో ఒకలా ఉంటుంది. –దంగేటి మోహన్,హల్వా తయారీదారుడు మాడుగుల -
పోస్టాఫీస్‌లో భారీ చోరీ.. నిందితుడు స్వీపర్
గచ్చిబౌలి: పన్పెండేళ్లుగా స్వీపర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి పని చేస్తున్న సంస్థకే కన్నం వేశాడు. రాత్రి ఆఫీస్‌లోకి ప్రవేశించి రూ.33.29 లక్షలు చోరీ చేశాడు. ఆదివారం గచ్చిబౌలిలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న అర్ధరాత్రి బీహెచ్ఈఎల్లోని సబ్ పోస్టాఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఆర్పిన అనంతరం గ్రిల్స్ తొలగించి ఉండటం గమనించారు. దీంతో అక్కడ చోరీ జరిగినట్లు గుర్తించారు. పోస్టుమాస్టర్ చౌహన్ శంకర్ ఆర్సీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా చోరీ జరిగిన రోజు నుంచి 12 ఏళ్లుగా స్వీపర్‌గా పని చేస్తున్న జహీర్(25) విధులకు రాలేదు. దీంతో అతనిపై నిఘా ఉంచారు. అతను గోవాకు వెళ్లి మూడు రోజులు ఉన్నట్లుగా కనుగొన్నారు. నగరానికి తిరిగి రాగానే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి రూ.28,52,170 నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న జహీర్ చోరీ చేయడాన్ని ట్యూబ్‌లో చూసి దొంగతనం చేశాడు. నగదు ఎక్కువ డిపాజిట్ అయిన రోజు రాత్రి వాచ్మెన్ లేడనుకొని నిర్ధారించుకొని ఈ చోరీ చేశాడు. మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, సీఐ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. -
సుకన్య సమృద్ధి యోజనపై తపాలా శాఖ శ్రద్ధ
సాక్షి, అమరావతి: బాలికలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజనపై రాష్ట్ర తపాలా శాఖ ప్రత్యేక ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టింది. బాలికా సాధికారత వారోత్సవాల పేరిట ఫిబ్రవరి 7 నుంచి 12వ తేదీ వరకు అన్ని తపాలా శాఖల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ అభినవ్ వాలియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్లలోపు వయసు గల బాలికల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవచ్చని, ఒక కుటుంబం నుంచి గరిష్టంగా ఇద్దరు బాలికల పేరిట ఖాతాలు నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఈ పథకం కింద గరిష్టంగా 7.6 శాతం వడ్డీ లభిస్తుందని, ఈ పథకంలో పెట్టే పెట్టుబడి మొత్తంపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు. బాలికలకు 18 ఏళ్ల వయసు వచ్చేసరికి ఉన్నత విద్య అవసరాల కోసం 50 శాతం, 21 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం డబ్బును వెనక్కి తీసుకోవచ్చని వివరించారు. ఏడాదిలో కనీసం రూ.250 నుంచి రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చన్నారు. మహిళల భవిష్యత్‌కు బలమైన ఆర్థిక పునాది కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
బ్యాంకింగ్ వ్యవస్థలో చేరిపోనున్న పోస్టాఫీసులు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు లావాదేవీలకు దూరంగా ఉంటూ... పోస్టాఫీసునే బ్యాంకుగా భావించే కోట్ల మందికి ఇది నిజ్జంగా శుభవార్తే. ఎందుకంటే కొన్నేళ్లుగా ‘పోస్టల్ బ్యాంక్’ మాట వినిపిస్తున్నా బ్యాంకుకు ఉండాల్సిన చాలా లక్షణాలు పోస్టాఫీసులకింకా రాలేదు. ఇదిగో... వీటన్నిటినీ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొస్తామని నిర్మల హామీనిచ్చారు. అంటే పోస్టాఫీసు ఖాతాదారులంతా ఇకపై ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో డిపాజిట్లు చేయొచ్చు. వేరే ఖాతాలకు నగదు బదిలీ చేయొచ్చు. ఆర్డీ, ఎఫ్డీ సహా బ్యాంకుల నుంచి పొందే ఆన్లైన్ సేవలన్నీ పొందొచ్చు. కాలం చెల్లిన సేవలకు క్రమంగా స్వస్తి చెబుతూ...ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకొని వినూత్న ఆలోచనలు, సరికొత్త సేవలతో ముందడుగు వేస్తున్న పోస్టాఫీసులకు మహర్దశ పట్టనుంది. ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబి) ఏర్పాటు చేసి దాని ద్వారా పోస్టాఫీసుల్లో ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. పోస్టాఫీసులతో పాటు ఇంటి వద్దకు కూడా బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. తాజాగా కేంద్ర బడ్జెట్– 2022లో పోస్టాఫీసుల్లో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించడం మరింత కలిసి వచ్చే అంశం. ఇక పోస్టాఫీసుల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్,నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో రానున్నాయి. ఇప్పటికే ఐపీపీ బ్యాంక్ పోస్టాఫీసుల ద్వారా మూడు రకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాల సేవలు అందిస్తోంది. చదవండి: బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండానే పీఎం కిసాన్, రైతుబంధు డబ్బులు -
సైనిక పాఠశాల వార్షికోత్సవ వేడుక
విజయనగరం రూరల్: విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక పాఠశాల 60వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆడిటోరియంలో నిర్వహించిన వార్షికోత్సవాన్ని ప్రిన్సిపాల్, కల్నల్ ఏఎం కులకర్ణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఆన్లైన్ విధానంలో నిర్వహించిన వేడుకల్లో పూర్వ విద్యార్థులు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, విశ్రాంత లెఫ్ట్‌నెంట్ జనరల్ కె.ఆర్.రావు, సురేంద్రనాథ్, వైవీకే మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కులకర్ణి మాట్లాడుతూ పాఠశాలకు చెందిన సుమారు 690 మంది త్రివిధ దళాలలో ప్రవేశించి దేశ సేవలో తరిస్తున్నారన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన గుర్రపు స్వారీ, మల్లకంబ, హై హార్స్ వంటి సాహస విన్యాసాలు చూపరులను అలరించాయి. ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్కరణ కోరుకొండ సైనిక పాఠశాల 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్కూల్‌పై భారతీయ తపాలా శాఖ ముద్రించిన ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ప్రిన్సిపాల్, కల్నల్ ఏఎం కులకర్ణి, వైస్ ప్రిన్సిపాల్, వింగ్ కమాండర్ ఎస్.కేశవన్, పరిపాలన అధికారి, లెఫ్ట్‌నెంట్ కమాండర్ అభిలాష్ బాలచంద్రన్ మంగళవారం ఆవిష్కరించారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం పాఠశాలకు అంబులెన్స్ వాహనం, 4 కిలోల వెండి జ్ఞాపిక బహూకరించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. -
అయ్యప్ప భక్తులకు తపాల శాఖ తీపికబురు
సాక్షి, వరంగల్: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో శబరిమలై దేవస్థానం వెళ్లలేని భక్తులకు తపాలా శాఖ(పోస్టాఫీస్) ద్వారా అయ్యప్ప స్వామి ప్రసాదం రూ.450లకు అందించనున్నట్లు వరంగల్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి ప్రసాదం కావాలనుకునే భక్తులు సమీప పోస్టాఫీసుల్లో రూ.450 చెల్లించి అరవాన్న ప్రసాదం, పసుపు, కుంకుమ, నెయ్యి, అష్టోత్తర అర్చన ప్రసాదాలు జనవరి 16 వరకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చదవండి: ‘జైలోను పట్టుకుని వెనక్కు లాగిన పులి’.. ఆనంద్ మహీంద్ర ట్వీట్.. -
విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఉత్తరం రాసెయ్.. ప్రధానిని కలిసెయ్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమాన్ ఊరూరూ తిరుగుతూ ‘సార్.. పోస్ట్’అనుకుంటూ ఉత్తరాలు పంచడం ఇప్పుడెక్కడా కనిపించట్లేదు. ఈకాలంలో ఎవరూ అసలు ఉత్తరాలే రాయట్లేదు. నేటి తరం వాళ్లకు చాలా మందికి అసలు పోస్టు కార్డు అంటే ఏంటో కూడా తెలియదు. అందుకే దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఉత్తరాలు రాసే ఇష్టాన్ని పెంచడానికి తపాలా శాఖ ఓ మంచి కార్యక్రమం మొదలుపెట్టింది. ఇందుకు ఆజాదీ కా అమృతమహోత్సవాలను వేదికగా చేసుకుంది. 75 లక్షల పోస్టు కార్డులను ప్రత్యేకంగా ప్రింట్ చేసి రాష్ట్రాలకు పంపింది. విద్యార్థులు అర్ధ రూపాయికి వాటిని కొని వ్యాసం రాసి పంపాలని పోటీ పెట్టింది. గెలిచిన వాళ్లకు బహుమతులతో పాటు నేరుగా ప్రధాని మోదీని కలవొచ్చని చెప్పింది. ఎంట్రీలకు ఈ నెల 20 చివరి తేదీ అని, రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా వ్యాసం రాసి పంపొచ్చని తెలిపింది. మన రాష్ట్రానికి 3 లక్షలు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించాలని తపాలా శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 75 లక్షల పోస్టు కార్డులను ఎంపిక చేసింది. 4వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులను అర్హులుగా ప్రకటించింది. ఆసక్తి ఉన్న వాళ్లు అర్ధ రూపాయి చెల్లించి తపాలా కార్డు కొని దానిపై క్లుప్తంగా వ్యాసం రాయాల్సి ఉంటుంది. డిమాండ్ లేకపోవటంతో తపాలా కార్డులను ఆ శాఖ ప్రింట్ చేయట్లేదు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కార్డులను ముద్రించింది. అన్ని రాష్ట్రాలకూ వాటిని పంపింది. రాష్ట్రానికి 3 లక్షల కార్డులను విద్యా శాఖ, కేంద్రం పరిధిలోని సీబీఎస్సీ పాఠశాలల అధికారులకు అందించింది. ఆసక్తి ఉన్న పాఠశాలల విద్యార్థుల నుంచి ఎంట్రీలు కోరుతోంది. ఒక్కో విద్యా సంస్థ నుంచి 10కి మించకుండా.. స్వాతంత్య్ర సమరయోధులు, 2047 (వందేళ్ల స్వతంత్ర భారతం) నాటికి దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు.. ఈ రెండు అంశాలపై క్లుప్తంగా వ్యాసం రాయాల్సి ఉంటుంది. అలా రాసిన కార్డులను సంబంధిత విద్యా శాఖ అధికారులు సేకరిస్తారు. ఒక్కో విద్యా సంస్థ నుంచి 10 మించకుండా ఉత్తమమైన రచనలను గుర్తించాలి. వాటిని https://innovateindia.mygov.in/postcardcampaign/ లో అప్లోడ్ చేయాలి. వాటిల్లోంచి అతి ఉత్తమమైన 75 ఎంట్రీలను ఎంపిక చేసి ఆ విద్యార్థులు జనవరి 17న స్వయంగా ప్రధానితో ముఖాముఖికి అవకాశం కల్పిస్తారు. బహుమతులు కూడా అందిస్తారు. ఇతర వివరాల కోసం దగ్గర్లోని పోస్టాఫీసుల్లో కూడా సంప్రదించవచ్చని తపాలా శాఖ అధికారులు చెప్పారు. ఉత్తరాలు రాయడం అలవాటు చేయాలని.. తపాలా శాఖ పునరుత్తేజం పొందేందుకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నా ఉత్తరాలు రాసే అలవాటును పెంచలేకపోతోంది. ఆ అలవాటు సమాజం నుంచి దాదాపు మాయమైంది. దీంతో నేటి తరానికి లేఖలు రాసే విష యంలో అవగాహన కూడా లేదు. గతంలో కొన్నిసార్లు మన్‌కీ బాత్ లాంటి కార్యక్రమాల్లో స్వయం గా ప్రధాని మోడీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తరాలు రాస్తే కలిగే అనుభూతిని నేటి తరం కూడా పొందాలని.. స్నేహితులు, బంధువులకు సరదాగానైనా ఉత్తరాలు రాయాల ని పిలుపునిచ్చారు. ఫోన్లో పలకరింపుతో పోలిస్తే ఉత్తరం ద్వారా మాట్లాడటం గొప్ప అనుభూతి అన్నారు. కానీ ఆ దిశగా స్పందన రావట్లేదు. దీంతో విద్యార్థులతో ఉత్తరాలు రాయించే కార్యక్రమాన్ని చేపట్టాలని తపాలా శాఖ నిర్ణయించింది. -
పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్‌ను పోస్టాఫీసులో ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్‌ను ఇకనుంచి పోస్టాఫీసు ద్వారా ఆన్లైన్లో పింఛనుశాఖకు సమర్పించుకోవచ్చునని సిక్రింద్రాబాద్ తపాలశాఖ సీనియర్ సూపరింటెండెంట్ సంతోష్ నేత తెలిపారు. ఈ సేవలను పోస్టుమెన్ ద్వారా పొందవచ్చునని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి: పాము రాసిన విషాద గీతం) -
World Post Day 2021: జ్ఞాపకాల మూట
World Post Day 2021: నిన్న మొన్నటి వరకూ టెలిఫోన్ కలిగిన వారిదే. మధ్యతరగతిది ఉత్తరం. పేదవాడికి పోస్ట్‌కార్డ్. కనీసం ఐదు దశాబ్దాల భారతీయుల జీవన భావోద్వేగాలు లేఖలు, ఉత్తరాలు, ఇంటర్వ్యూ కార్డులు, మనీ ఆర్డర్ల చుట్టే తిరిగాయి. ఉత్తరం లేకపోతే... పోస్ట్‌మేన్ లేకపోతే ఆ జ్ఞాపకాలు ఉండేవా? అక్టోబర్ 9 ‘వరల్డ్ పోస్ట్ డే’ సందర్భంగా కొన్ని ఉద్వేగాల రీవిజిట్. ‘ఇద్దరం ఉద్యోగానికి అప్లై చేద్దాం. నా వంతు డబ్బులు నావి. ఏవీ... మీ డబ్బులు ఇవ్వండి’ అని నిస్సిగ్గుగా సావిత్రి దగ్గరి నుంచి అడిగి మరీ తీసుకుంటాడు ఎన్టీఆర్ ‘మిస్సమ్మ’లో. ఆ నిరుద్యోగ రోజులు అలాంటివి. వారి అప్లికేషన్ పోస్ట్‌లో అందుకున్న వెంటనే ఎస్.వి.రంగారావు ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని టెలిగ్రామ్ ఇమ్మంటాడు మేనల్లుడు ఏఎన్నార్‌ని. అంతేనా ఖర్చులకు 200 ఎం.ఓ కూడా చేయమంటాడు. చూడండి... ఒక్క సీనులో ఎన్ని పోస్టాఫీసు సేవలు అవసరమయ్యాయో. ఆ సేవలు లేకుంటే ఎన్టీఆర్, సావిత్రి ఉద్యోగంలో చేరేవారూ కాదు... ‘రావోయి చందమామ’ పాడేవారూ కాదు. గాంధీ గారికి ఉత్తరాలు రాయకుండా ఏ రోజూ గడవలేదు. నెహ్రూ జైలులో ఉండి తన కుమార్తె ఇందిరకు తెగ ఉత్తరాలు రాశారు. ఉత్తరం రాయడం ఒక మర్యాద. ఉత్తరం అందుకోవడం ఒక గౌరవం. ఉత్తరాలు ఒకరికొకరు రాసుకుంటూ ఉండటం స్నేహం. కాని ఉత్తరం కేవలం పెద్దవాళ్ల వ్యవహారంగా కొంతకాలమే ఉంది. పేదవాళ్లు, మధ్యతరగతి వారు ఉత్తరాలను మొదలెట్టారు. వీధి మొదలులో వేలాడదీసి ఉండే ఎర్రటి పోస్ట్ డబ్బాను గుర్తించారు. ఊళ్లో ఆ రోజుల్లో స్కూల్ మేష్టారు లేదంటే పోస్ట్మేస్టారే కదా గౌరవనీయులు. ‘పెళ్లి చేసి చూడు’లో ఏఎన్నార్ తండ్రి తెలుగు మేష్టారు రావికొండలరావు. కొడుకు పంపాల్సిన మనియార్డర్ ఏదిరా అని పోస్ట్మేన్ని దబాయిస్తాడు. ‘రాలేదు మేష్టారు’ అనంటే ‘వస్తే అందరూ ఇస్తారు. రాకపోయినా ఇవ్వడమే గొప్పదనం’ అంటాడు. 1970లు, 80లు కొడుకుల మనిఆర్డర్ల కోసం తల్లిదండ్రుల కళ్లు కాయలు కాచేలా చేశాయి. నిరుద్యోగ భారతంలో కొడుకు ఉద్యోగం సంపాదించి ఎంతో కొంత పంపితేనే జరుగుబాటైన ఇళ్లు. ఆ రోజుల్లో అకౌంట్లు ఎవరికీ ట్రాన్స్ఫర్లు ఎవరికీ ఫోన్‌పేలు ఎవరికీ? మని ఆర్డరే. పోస్ట్‌మేన్ మనీ ఆర్డర్ తెచ్చి ఇస్తే సంతోషించి ఆ ఇంటి ఇల్లాలు మజ్జిగ ఇచ్చేది. ఇంటి పెద్ద రూపాయో రెండ్రూపాయలో బక్షీసు ఇచ్చేవాడు. ఆ పూట ఆ ఇంట్లో గుండెల మీద కాకుండా వంటగదిలోనే కుంపటి వెలిగేది. సౌదీ, అమెరికా, రంగూన్... వలస వెళ్లిన వారి ఉత్తరాలు నెలల తరబడి వేచి చూస్తే తప్ప వచ్చేవి కావు. సైన్యంలో చేరిన వారి బాగోగులు ఉత్తరాలు చెప్తే తప్ప తెలిసేవి కావు. పట్నంలో చదువుకుంటున్న కొడుకు పరీక్ష ఫీజు కోసం రాసిన పోస్ట్‌కార్డు అతి బరువుగా అనిపించేది. కాపురానికి వెళ్లిన కూతురు నుంచి వచ్చిన ప్రతి ఉత్తరం ఉలికిపాటును తెచ్చేదే. ఆ కూతురు కూడా తక్కువ తిన్నదా? కష్టాలన్నీ తాను దిగమింగుతూ సంతోషంగా ఉన్నట్టు తెగ నటించదూ? ఇంటర్వూకు కాల్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, స్టడీ మెటీరియల్, కలం స్నేహం కోసం మొదలెట్టిన జాబులు, పత్రికకు పంపిన కథకు జవాబు, తకరారులో చిక్కుకుంటే వచ్చే కోర్టు నోటీసు, వ్యాపార లావాదేవీల కరెస్పాండెన్సు, అభిమాన హీరోకు లేఖ రాస్తే పంపే ఫొటో, వశీకరణ ఉంగరం... ఎన్నని. అన్నీ ఆ ఖాకీ బట్టల పోస్ట్‌మేన్ చేతుల మీదుగా అందేవి. తెలిసేవి. సంతోషపెట్టేవి. బాధించేవి. గెలిపించేవి. ఓడించేవి. ఇక కథల్లో, నవలల్లో, సినిమాల్లో ఉత్తరాలు సృష్టించిన ‘డ్రామా’ అంతా ఇంతా కాదు. ‘పోస్ట్ అన్న కేకతో పడక్కుర్చీలోని పరంధామయ్యగారు ఉలిక్కిపడ్డారు’ అనే లైనుతో ఎన్నో కథలు మొదలయ్యేవి. ఉత్తరాలు అందక ఏర్పడిన అపార్థాలు, ఒకరి ఉత్తరం ఇంకొకరికి చేరి చేసే హంగామాలు, ఒకరి పేరుతో మరొకరు రాసే ప్రేమ లేఖలు.. వీటిలో పోస్ట్మేన్లది ఏ పాపమూ ఉండదు. కాని వారికి తెలియకనే వ్యవహారమంతా వారి చేతుల మీదుగా నడుస్తుంటుంది. ఉత్తరాలు బట్వాడా చేయాల్సింది వారే కదా. కొందరు పోస్ట్‌బాక్స్ నంబర్ తీసుకుని ఆ నంబర్ మీదే సవాలక్ష వ్యవహారాలు నడిపేవారు. బుక్పోస్ట్ను ఉపయోగించి పుస్తకాలు పంపని కవులు, రచయితలు లేరు. రిజిస్టర్డ్ పోస్ట్ విత్ డ్యూ అక్నాలెడ్జ్మెంట్ అయితే ఆ ధీమా వేరు. ‘టెలిగ్రామ్’కు పాజిటివ్ ఇమేజ్ లేదు. అది వచ్చిందంటే ఏదో కొంపలు మునిగే వ్యవహారమే. సంతవ్సరం పొడుగూతా సేవ చేసే పోస్ట్‌మేన్ మహా అయితే అడిగితే దసరా మామూలు. అది కూడా ఇవ్వక వారిని చిన్నబుచ్చేవారు కొందరు. చాలీ చాలని జీతంతో, ఎండనక వాననక సైకిల్ తొక్కుతూ ఇల్లిల్లు తిరిగి క్షేమ సమాచారాలు ఇచ్చి ఊరడింప చేసే ఆత్మీయుడు పోస్ట్‌మేన్ మధ్యతరగతి భారతదేశంలో కనిపించని పాత్ర పోషించాడు. ఇవాళ కథే మారిపోయి ఉండవచ్చు. ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్లో ఎక్కడిది. చేతిరాతతో అందుకునే ఉత్తరం జాడ ఎక్కడిది. ఆ చెరగని గుర్తు ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు. ఆ కాలానికి ధన్యవాదాలు. థ్యాంక్యూ పోస్ట్‌మేన్. ‘‘ఇప్పుడు ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్లో ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు.’’ -
అల్లూరి పేరిట పోస్టల్ కవర్
చింతపల్లి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర భావితరాలకు ఆదర్శనీయమని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై అల్లూరి సీతారామరాజు దాడి చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తపాలా శాఖ ఆదివారం విశాఖ జిల్లా చింతపల్లిలో అల్లూరి పేరిట పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించింది. తొలుత ఎంపీ, ఎమ్మెల్యే, తపాలా శాఖ అధికారులు పాత బస్టాండ్ నుంచి సెయింట్ ఆన్స్ స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. అల్లూరి పోరాట చరిత్ర భావితరాలకు గుర్తుండాలనే లక్ష్యంతోనే పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించినట్టు విశాఖ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. అల్లూరి దాడి చేసిన ప్రతి పోలీసు స్టేషన్‌కు ఒకటి చొప్పున పోస్టల్ కవర్‌ను విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్భ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త!
ఇండియా పోస్ట్ తన పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త అందించింది. తన ఖాతాదారుల డైలీ విత్ డ్రా లిమిట్ ను పెంచింది. ఇండియా పోస్ట్ తీసుకోచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు ఖాతాదారులు గ్రామీణ డాక్ సేవ శాఖలో ఒక రోజులో రూ.20,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతకుముందు విత్ డ్రా లిమిట్ రూ.5,000గా ఉండేది. ఇండియా పోస్ట్ తన కొత్త మార్గదర్శకాలలో పేర్కొన్న ప్రకారం ఏ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం) ఒక రోజులో ఒక ఖాతాలో రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ గా స్వీకరించరాదని పేర్కొంది. అంటే ఒక ఖాతా ద్వారా రూ.50,000 కంటే ఎక్కువ నగదు లావాదేవీలు ఒక రోజులో చేయలేము. పీపీఎఫ్, కెవిపీ, ఎన్ఎస్ సీ కొత్త రూల్స్ ఇండియా పోస్ట్ యొక్క కొత్త నిబంధనల ప్రకారం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్ సీఎస్ఎస్), మంత్లీ ఇన్ కమ్ స్కీం (ఎంఐఎస్), కిసాన్ వికాస్ పాత్రా(కెవిపి), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్ సీ) స్కీంల కోసం డిపాజిట్ లేదా విత్ డ్రా చెక్కులు ద్వారా చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీం: కనీస బ్యాలెన్స్ పోస్టాఫీసు పొదుపు పథకంపై 4% వడ్డీ లభిస్తుంది. తపాలా కార్యాలయ పొదుపు పథకం ఖాతాలో కనీసం రూ.500 బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. అయితే కనీస బ్యాలెన్స్ రూ.500 కంటే తక్కువగా ఉంటే ఖాతా నిర్వహణ చార్జీల కింద జరిమానాగా రూ.100 వసూలు చేస్తారు. పోస్టాఫీసు పొదుపు పథకాలు: వడ్డీ రేటు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా: 4% ఏడాది వరకు టీడీ ఖాతా: 5.5% 2 ఏళ్ల వరకు టీడీ ఖాతా: 5.5% 5 ఏళ్ల వరకు టీడీ ఖాతా: 6.7% 5 ఏళ్ల ఆర్ డి: 5.8% సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం: 7.4% పీపీఎఫ్ పొదుపు పథకం: 7.1% కిసాన్ వికాస్ పాత్ర: 6.9% సుకన్య సమృద్ధి ఖాతాదారులకు: 7.6% -
పోస్టాఫీస్‌కు వెళ్తే పాస్‌పోర్ట్...
ఇంట్లో వంట గ్యాస్ అయిపోయిందా.. మొబైల్ ఫోన్, టీవీ డీటీహెచ్ రీచార్జ్ చేయాలా..రైలు, విమాన టికెట్లు కావాలా..ఆస్తి పన్ను చెల్లించాలా.. బీమా పాలసీ ప్రీమియం చెల్లించాలా.. మీకు పాస్‌పోర్టు కావాలా.. అయితే జస్ట్ పోస్టాఫీసుకు వెళ్లండి చాలు. పట్టణానికో, మీసేవా కేంద్రానికో వెళ్లాల్సిన పనిలేదు. మారుమూల గ్రామం అయినా సరే.. తపాలా కార్యాలయానికి వెళితే ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి. సాక్షి, హైదరాబాద్: ఉత్తరాల బట్వాడా సేవలం దించిన పోస్టాఫీసులు ఇప్పుడు పౌరసేవా కేంద్రాలుగా మారిపోతున్నాయి. క్రమంగా ఉనికి కోల్పోతున్న పోస్టాఫీసులకు కొత్త ఉత్తేజం కల్పించే ఉద్దేశంతో పౌర సేవలందించే కేంద్రాలుగా వాటిని రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో నిత్యం ప్రజలకు అవసరమైన పలు సేవలను అందించేలా ఏర్పాటు చేసింది. ఈమేరకు తపాలా సిబ్బందికి శిక్షణను పూర్తి చేసి దశలవారీగా అన్ని పోస్టాఫీసుల్లో వాటిని అందుబాటులోకి తెచ్చింది. అన్ని పోస్టాఫీసుల్లో కామన్ సర్వీసెస్ సెంటర్ (సీఎస్సీ)లను ఏర్పాటు చేసింది. కొన్ని ఉచితం.. కొన్నింటికి రుసుం ఫోన్లు, డీటీహెచ్ రీచార్జ్, పన్నులు, బీమా ప్రీమి యం చెల్లింపు లాంటి సేవలకోసం వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. ఇక పాన్‌కార్డు, పాస్‌పోర్టులాంటి సేవలకు నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అవికూడా వినియోగదారులకు ఏమాత్రం భారం లేకుండా ఖరారు చేశారు. చిన్నచిన్న ఊళ్లలో ఉండేవారు ఆయా సేవలు పొందేందుకు పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇది ఖర్చు, ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు ఊర్లో ఉన్న పోస్టాఫీసుకు వెళ్తే ఆయా పనులు పూర్తవుతాయి. సమయం, దూరాభారం, వ్యయ ప్రయాసలు లేకుండానే సులభంగా పనులు అయ్యేలా వీటిని అందుబాటులోకి తెచ్చారు. గతేడాది జూన్‌లో ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్, హన్మకొండ, జనగామ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి హెడ్ పోస్టాఫీసులలో ప్రారంభించారు. ఇవి విజయవంతం కావటంతో ఇప్పుడు హైదరాబాద్ మొదలు మారుమూల పల్లె వరకు ఉన్న అన్ని పోస్టాఫీసుల్లో ప్రారంభించారు. ఆదర్శంగా తక్కళ్లపల్లి జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లి బ్రాంచి పోస్టాఫీసులో స్వల్ప సమయంలోనే ఈ కేటగిరీ కింద 127 మందికి సేవలందించినందుకుగాను పోస్ట్‌మాస్టర్ జ్ఞానేశ్వర్ జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలిచి పురస్కారం అందుకున్నారు. కేవలం మూడు వేల జనాభా ఉన్న గ్రామంలో ఫోన్ రీచార్జ్ మొదలు పాస్‌పోర్టు వరకు పోస్టాఫీసు ద్వారా సేవలు అందించారు. గతంలో పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఆధార్ అనుసంధానం లాంటి పనులకు పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు వారి ఊర్లలోనే పోస్టాఫీసుకు వెళ్తే సులభంగా పని అయిపోతోందని, ఇది గ్రామస్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉందని జ్ఞానేశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు. ఇంట్లో కూర్చునే... మా ప్రాంతం నుంచి దుబాయికి వెళ్లేవారు ఎక్కువ. పాస్‌పోర్టు కోసం కోరుట్ల గానీ లేదా ఇతర పట్టణాలకు గాని వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు తపాలా శాఖ ప్రారంభించిన కొత్త సేవల వల్ల మేం మా ఊళ్లోనే పాస్‌పోర్టు తీసుకోగలుగుతున్నాం. ఇటీవల నేను, నా ముగ్గురు మిత్రులు మా ఊరి పోస్టాఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసి పాసుపోర్టు పొందాం. ఇంట్లో కూర్చునే పాసుపోర్టు తెప్పించుకున్నట్టనిపించింది. ఖర్చు, కష్టం, సమయం ఆదా అయ్యాయి. – మహేందర్, తక్కళ్లపల్లి గ్రామం -
పన్ను చెల్లింపుదారులకు పోస్ట్ ఆఫీస్ గుడ్‌న్యూస్!
దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులకు పోస్ట్ ఆఫీస్ శుభవార్త తెలిపింది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి వేతన తరగతి ప్రజలు ఇకపై చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు సమీపంలోని పోస్టాఫీసు కామన్ సర్వీసెస్ సెంటర్స్(సీఎస్ సీ) కౌంటర్ లో ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను పొందవచ్చు అని ఇండియా పోస్ట్ తెలిపింది. "ఇప్పుడు మీ ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయడానికి చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు. మీరు మీ సమీప పోస్టాఫీసు సీఎస్ సీ కౌంటర్ వద్ద ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను సులభంగా పొందవచ్చు#AapkaDostIndiaPost" అని ఇండియా పోస్ట్ ట్వీట్ చేసింది. పోస్ట్ ఆఫీస్ సీఎస్ సీ కౌంటర్ వద్ద ప్రజలు పోస్టల్, బ్యాంకింగ్, బీమా సేవలతో పాటు ఇతర ప్రభుత్వ సమాచారం యాక్సెస్ చేసుకోవచ్చు అని డిజిటల్ ఇండియా వెబ్ సైట్ తెలిపింది. ప్రభుత్వం అందించే అన్ని ఈ-సేవలను, పౌరులు వారి స్థానిక తపాలా కార్యాలయాలలో పొందవచ్చు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద అందించే సేవలను వేగంగా స్వీకరించడానికి, పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడుతుంది అని డిజిటల్ ఇండియా వెబ్ సైట్ పేర్కొంది. ఇంతకు ముందు జూన్ 7న ఆదాయపు పన్ను శాఖ తన కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.inను ప్రారంభించింది. अब आयकर रिटर्न जमा करने के लिए दूर जाने की ज़रूरत नहीं है। आप अपने नज़दीकी डाकघर के सीएससी काउंटर पर आसानी से आयकर रिटर्न सेवाओं का लाभ उठा सकते हैं।#AapkaDostIndiaPost pic.twitter.com/afb1sc7GNs — India Post (@IndiaPostOffice) July 14, 2021 -
పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు తీపికబురు!
ఒకవేళ మీకు కనుక పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా ఉన్నట్లయితే శుభవార్త. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఖాతా విషయంలో ₹3,500 వరకు సంపాదించిన వడ్డీపై పన్ను మినహాయింపును కేంద్రం అందిస్తుంది. ఒకవేళ మీకు ఉమ్మడి ఖాతా ఉన్నట్లయితే పన్ను మినహాయింపు ₹7,000 వరకు ఉంటుంది. అలాగే, చాలా తక్కువ వడ్డీ రేటును అందిస్తున్న బ్యాంకు పొదుపు ఖాతా కంటే అధిక వడ్డీరేటుతో పాటు పన్ను మినహాయింపు ఇస్తూ పోస్టాఫీసు కొత్త ఖాతాదారులను ఆకట్టుకుంటుంది. పొదుపు ఖాతాలపై పోస్టాఫీసు అందిస్తున్న వడ్డీ రేట్లు చారిత్రాత్మకంగా తక్కువగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పొదుపు ఖాతాపై వడ్డీ రేటు 2.7 శాతం అందిస్తుంది. అదే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ పై 4 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. కనీసం ₹500 డిపాజిట్‌తో పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను తెరవవచ్చు. తపాలా కార్యాలయ పొదుపు ఖాతాపై వడ్డీ ప్రతి నెలా 10వ తేదీ లేదా నెలలో చివరి రోజు కనీస బ్యాలెన్స్ పై లెక్కిస్తారు. ఒకవేళ ఆర్థిక సంవత్సరం చివరల్లో అకౌంట్ బ్యాలెన్స్ రూ.500కు మించి డబ్బులు జమ చేయకపోతే అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజుగా రూ.100 కట్ చేస్తారు. పోస్టాఫీసు పొదుపు ఖాతాతో సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తారు. జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును యథాతదంగా ఉంచిది. -
వృద్దుల కోసం ఉత్తమమైన పొదుపు పథకాలు!
బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో సీనియర్ సిటిజన్స్‌కు అధిక వడ్డీతో హామినిచ్చే కొన్ని పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొంత మొత్తం డిపాజిట్ చేయడం ద్వారా ప్రతి నెల లేదా ఏడాదికి వడ్డీ రూపంలో నగదు లభిస్తుంది. ఈ వయస్సులో వారికి ఇలాంటి పథకాలు ఆర్థిక చేయూతను ఇస్తాయి. ఎస్బీఐతో సహా కొన్ని అగ్ర బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 5-10 సంవత్సరాల మధ్య కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 6.2 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే, బ్యాంక్‌ల కన్నా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు అధిక వడ్డీని అందిస్తాయి. సీనియర్ సిటిజన్లుకు ఆర్థిక చేయూతను ఇచ్చే కొన్ని పెట్టుబడి పథకాల గురుంచి తెలుసుకుందాం.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్సీఎస్ఎస్) సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్( ఎస్సిఎస్ఎస్ ) అనేది ప్రభుత్వం నడుపుతున్న చిన్న పొదుపు పథకం. దీనిలో చేరిన వారికీ ప్రస్తుతం సంవత్సరానికి 7.40 శాతం అందిస్తుంది. ఎస్సీఎస్ఎస్కు ఐదేళ్ల కాలపరిమితి ఉంది. దీనిని మరో మూడేళ్ల వరకు పొడిగించవచ్చు. అయితే, ఎస్సీఎస్ఎస్లో పెట్టుబడులు పెట్టడానికి గరిష్టపరిమితి రూ.15 లక్షలు. త్రైమాసిక ప్రాతిపదికన అధిక స్థిర రాబడి మరియు సాధారణ ఆదాయం కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లకు ఎస్సిఎస్ఎస్ మంచి ఆదాయ వనరు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80 సి కింద ఎస్సీఎస్ఎస్లో పెట్టుబడులు ద్వారా వచ్చిన నగదుపై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హులు. స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డి) పథకం చాలా మంది సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎల్లప్పుడూ ఒక మంచి ఎంపిక. బ్యాంక్ ఎఫ్‌డిలు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక వడ్డీ రేటు చెల్లింపులను అందిస్తాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక డిపాజిట్లపై 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్రత్యేక ఎఫ్‌డిలు 30 జూన్ 2021 వరకు అమలులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు 6 శాతం నుంచి 7 శాతంపైన వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లకు అందిస్తున్నాయి. ప్రధాన్ మంత్రి వయా వందన యోజన(పీఎంవీవీవై) పీఎంవీవీవై(ప్రధాన్ మంత్రి వయా వందన యోజన) అనేది సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ కమ్ పెన్షన్ పథకం. ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) నిర్వహిస్తుంది. పిఎమ్‌వివివై పథకం 2023 మార్చి 31 వరకు పొడిగించబడింది. ప్రస్తుతం, ఈ పథకం కింద పెట్టుబడి పెట్టిన నగదుపై ప్రతి నెలకు సంవత్సరానికి 7.40 శాతం చొప్పున పెన్షన్‌ను అందిస్తోంది. కాల పరిమితి 10 సంవత్సరాలు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఆదాయ పథకం(పీఓఎంఐఎస్) పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(పీఓఎంఐఎస్) కింద 5 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒకసారి పెట్టుబడి పెడితే గడువు కాలం ముగిసే వరకు వడ్డీ రేటు అలాగే ఉంటుంది. ప్రస్తుతం, జూన్ 2021తో ముగిసిన త్రైమాసికంలో వడ్డీ రేటు సంవత్సరానికి 6.6 శాతంగా ఉంది. చదవండి: డేంజర్ జోన్లో వాట్సప్ యూజర్లు! -
మనకు మనమే ఓ ఉత్తరం రాసుకుందాం!
పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి ఉత్తరం పోస్టు చేసి ఎన్నాళ్లైంది? అసలు ఉత్తరం రాసి ఎన్నేళ్లయింది? ఓ సారి ఉత్తరం రాసి మన వాళ్లను సర్ప్రైజ్ చేస్తే? ఇవన్నీ మనవాళ్ల సంతోషం కోసం చేసే పనులు. మన సంతోషం కోసం కూడా ఓ పని చేద్దాం. మనకు మనమే ఉత్తరం రాసి పోస్ట్ చేసుకుందాం. ఎక్కడ నుంచి ఎక్కడికి పోస్ట్ చేయాలి? హిక్కిమ్ పోస్ట్ ఆఫీస్‌కెళ్లి అక్కడ ఓ ఉత్తరం రాసి మన ఇంటికి పోస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఉత్తరం రాసే ముందు ఒకటి తెలుసుకోవాలి! ఇంతకీ... ఈ హిక్కిమ్ ఎక్కడుంది? హిక్కిమ్ ఈ పదం సిక్కిమ్లాగ ధ్వనిస్తోంది. కానీ ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, లాహుల్ స్పితి జిల్లాలో ఉంది. ప్రపంచంలోనే ఎల్తైన పోస్ట్ ఆఫీస్. ఎల్తైన అంటే కట్టడపు ఎత్తు కాదు. అత్యంత ఎల్తైన ప్రదేశంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అన్నమాట. ఎంత ఎత్తంటే... 17, 060 అడుగుల ఎత్తులో ఉంది. పిన్‌కోడ్ 172114. ఇక్కడి నుంచి టపా రోజూ కాలి నడకన రికాంగ్ పియో వరకు తీసుకువెళ్లి అక్కడ నుంచి బస్‌లో రవాణా చేస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సిమ్లా చేరి అక్కడ రైలెక్కి కల్కాలో దిగి మళ్లీ బస్సెక్కి ఢిల్లీ చేరుతుంది ఉత్తరం. అంత కష్టం మీద ఢిల్లీ చేరుతుంది. ఆ తర్వాత సులువుగా రెక్కలు విప్పుకుని గమ్యంలో వాలుతుంది. ఉత్తరం రాయడానికి అంతదూరాన ఉన్న హిక్కిమ్కి వెళ్లాలా? నిజమే. ఈ ఉత్తరం రాయడంతోపాటు అందమైన స్పితి లోయ సౌందర్యాన్ని, బౌద్ధ భిక్షువుల జీవనశైలిని దగ్గరగా చూడాలంటే వెళ్లి తీరాల్సిందే. ఆరు నెలలే... స్నోఫాల్ ఎక్కువగా ఉండే శీతాకాలం మాత్రం పోస్టాఫీస్‌ను మూసేస్తారు. పోస్టాఫీస్‌ను మాత్రమే కాదు, రోడ్డు రవాణా రాకపోకలు కూడా నిలిచిపోతాయి. మిగిలిన ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. ఎండాకాలం మొదలైన తర్వాత యథాతథంగా జన జీవన స్రవంతితో అనుసంధానమవుతుంది. ఆరు నెలల కాలంలో దాదాపు ఐదు వందలకు పైగా ఉత్తరాలు బట్వాడా అవుతాయంటే గొప్ప విషయమే. మారుమూల గ్రామాలకు కూడా మొబైల్ ఫోన్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత మామూలు పోస్టాఫీసుల్లో కూడా ఈ మాత్రపు బట్వాడా ఉండడం లేదు. ఇక్కడ మరో సంగతి ఏమిటంటే... ఈ హిక్కిమ్ గ్రామంతోపాటు పరిసర గ్రామాలకు కూడా బ్యాంకు లేకపోవడంతో సేవింగ్స్ అకౌంట్ లావాదేవీలు కూడా ఈ పోస్టాఫీస్ ద్వారానే జరుగుతున్నాయి. శీతాజలం... నిజానికి హిమాచల్ ప్రదేశ్ పర్యటన అనగానే సిమ్లా తొలిస్థానంలో ఉండేది. అది ఒకప్పుడు. సిమ్లా క్రేజ్ తగ్గిపోయిన తర్వాత కులు, మనాలి ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆహ్లాదకరమైన పర్యటన కోరుకునే మధ్య వయసు వాళ్లకు అది చక్కటి వెకేషన్ పాయింట్. అడ్వెంచర్ లేని టూర్ మహాబోర్ అనుకునే యువతకు స్పితి లోయ ఒక సాహసాల లోగిలి. స్పితి లోయకు వెళ్లడానికి కులు లోయ నుంచి దారి ఉంటుంది. స్పితిలోయకు వెళ్లే దారిలో రొహటాంగ్ పాస్ దాటిన తర్వాత ఒక పక్కగా కుంజుమ్ కనుమ కనిపిస్తుంది. శీతాకాలంలో మంచు కప్పి ఉంటుంది. ఎండలు మొదలయ్యేసరికి ఆ మంచు కరిగి కుంజుమ్ కనుమ మీదుగా పల్లానికి ప్రవహిస్తుంది. అదే స్పితి నది. ఈ ప్రవాహం చేరే పల్లపు ప్రదేశమే స్పితి లోయ. స్పితి అంటే మధ్యనున్న నేల అని అర్థం. టిబెట్ పొలిమేర ఇది. బౌద్దానికి అచ్చి వచ్చిన నేల. హిక్కిమ్ పోస్ట్ ఆఫీస్ ఈ స్పితి జిల్లాలోనే ఉంది. స్పితికి హిక్కిమ్కు మధ్య దూరం పద్దెనిమిది కిలోమీటర్లు. ఈ పర్యటనలో బౌద్ధ భిక్షువులు కనిపిస్తారు. తెల్లటి మంచు మధ్య కొండవాలులో ఎర్రటి దుస్తులు ధరించి మౌనంగా వెళ్తుంటారు. ట్రావెల్ టిప్స్: జాగ్రత్తగా వెళ్లి వద్దాం! హిమాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రదేశాలకు టూర్ వెళ్లేటప్పుడు మరికొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్పితి వ్యాలీ టూర్‌కి అనుమతి తప్పనిసరి. ఇది ఇండో–చైనా సరిహద్దు కావడంతో ఈ జాగ్రత్తలన్నీ. సిమ్లా, మనాలి, కులూ, రాంపూర్, కాజా, రేకాంగ్ పీయో వంటి చోట్ల ప్రభుత్వ అధికారులు ఈ అనుమతి జారీ చేస్తారు. ఇందుకోసం పాస్‌పోర్టు ఒరిజినల్‌తోపాటు ఒక ఫొటోకాపీ, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తీసుకుని వెళ్లాలి. టూర్ ప్లాన్ వివరాలు (ఎన్ని రోజుల పర్యటన, పర్యటనలో ఏయే ప్రదేశాలున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు వంటివి) తెలియచేయాలి. టిక్కెట్లు, బస కోసం బుక్ చేసుకున్న హోటల్ వివరాలు చూపించాలి. వీటిని పరిశీలించిన తరవాత అనుమతి పత్రం మీద స్టాంప్ వేసి ఇస్తారు. ఇది రెండు వారాలకు మాత్రమే. ఒకవేళ టూర్ మరికొన్ని రోజులు పొడిగించాల్సిన అవసరం ఏర్పడితే కారణాలను తెలియచేస్తూ మరో అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: ‘సీఎం సాబ్... నాకు పెళ్లి కూతుర్ని చూడండి’ -
పోస్టాఫీస్ ఖాతాదారులు ఇవి గుర్తుంచుకోండి!
ప్రస్తుతం ఎన్నో రకాల పథకాలు పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో డబ్బులు జమ చేయడం వల్ల ఎటువంటి సమస్య లేకుండా కచ్చితమైన రాబడి పొందవచ్చు. అయితే, పోస్టాఫీస్‌లో ఖాతా కలిగిన వారు, ఇతర రకాల స్కీమ్స్‌లో చేరిన వారు కచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఇండియా పోస్ట్ ఇటీవలే కొత్త రూల్స్ తీసుకోని వచ్చింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ రూల్స్ వల్ల పోస్టాఫీస్ ఖాతాదారులపై ప్రభావం పడనుంది. పోస్టాఫీస్ జీడీఎస్(గ్రామీణ్ డాక్ సేవ) బ్రాంచుల్లో వ్యక్తి గత ఖాతా నుంచి క్యాష్ విత్‌డ్రాయెల్ లిమిట్‌ను రూ.20,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే వడ్డీ రేటును కూడా సవరించింది. సేవింగ్ ఖాతా నగదుపై ఏడాదికీ 4శాతం వడ్డీ లభించనుంది. పోస్టాఫీస్ జీడీఎస్ బ్రాంచుల నుంచి రూ.5,000 కాకుండా ఇప్పుడు ఒక్కో కస్టమర్ రూ.20 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రోజుకు ఒక అకౌంట్లో రూ.50,000కు మించి డబ్బులు డిపాజిట్ చేయడానికి వీలు లేదు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి స్కీమ్‌లలో డబ్బు డిపాజిట్ చేయడానికి విత్‌డ్రాయెల్ ఫామ్ లేదా చెక్ ఉపయోగించొచ్చు. అలాగే సేవింగ్స్ ఖాతా కలిగిన వారు కచ్చితంగా రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఒకవేళ మీ పోస్టాఫీస్ ఖాతాలోలో రూ.500 మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే.. అప్పుడు మీ ఖాతా నుంచి రూ.100 కట్ అవుతుంది. చదవండి: మీ ఆధార్ ను ఎవరైనా వాడారా తెలుసుకోండిలా..? కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం -
ఇండియా పోస్ట్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్
ఇండియా పోస్ట్ బ్యాంకు ఖాతాదారులకు పోస్టల్ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేయడంపై ఛార్జీలు విధించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. నగదు లావాదేవీలపై విధించే ఛార్జీలు వివిధ ఖాతాల ప్రకారం మారనున్నట్లు తెలుస్తుంది. ఖాతాదారులు నెలలో నాలుగు సార్లు నగదు ఉపసంహరించుకుంటే ఎటువంటి చార్జీలు లేవు. అంతకన్నా ఎక్కువ సార్లు నగదు తీసిన మొత్తంలో 0.50శాతం(కనీసం రూ.25) వసూలు చేయబడుతుంది. మీకు పొదుపు ఖాతా లేదా కరెంట్ ఖాతా ఉంటే, మీరు అదనపు ఛార్జీలు చెల్లించకుండా ప్రతి నెలా రూ.25 వేలు ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఆ తరువాత ప్రతి ఉపసంహరించబడిన మొత్తంలో కనీసం రూ.25 లేదా 0.50 శాతం వసూలు చేయబడుతుంది. మీరు నెలలో 10,000 రూపాయల వరకు నగదు డిపాజిట్ చేస్తే అప్పుడు ఎటువంటి ఛార్జీ ఉండదు. అయితే, మీరు అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ప్రతి డిపాజిట్‌పై కనీసం రూ.25 వసూలు చేస్తారు. పోస్టు పేమెంట్ నెట్‌వర్క్‌లో లావాదేవీలను పూర్తి ఉచితంగా నిర్వహించుకోవచ్చు. దీంతో పాటు పోస్టాఫీసుల్లో మినీ స్టేట్ మెంట్ తీసుకుంటే రూ.5 వరకు చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: ఇండియాలోకి ఎఫ్‌డిఐ పెట్టుబడుల జోరు అలా అయితే రూ.75కే లీటర్ పెట్రోల్! -
పోస్టాఫీస్ జీవిత బీమా పథకాలపై బోనస్
పోస్టాఫీసులో మీరు జీవిత పాలసీలు తీసుకున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. పోస్టాఫీస్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీలను కలిగి ఉన్నవారికి బోనస్ లభించనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వం పోస్టాఫీస్ లైఫ్ ఇన్సురెన్స్(పీఎల్ఐ)కు బోనస్ వర్తించేలా ప్రభుత్వం ప్రకటించింది. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ బోనస్ అమలులోకి వస్తుంది. హోల్ లైఫ్ అస్యూరెన్స్‌లో బోనస్ కింద వేయి రూపాయలకు రూ.76, పిల్లల పాలసీలతో సహా ఎండోమెంట్ అస్యూరెన్స్ కోసం అయితే వేయికి రూ.52 బోనస్ అందుకుంటారు. పోస్టాఫీసులో ప్రస్తుతం ఆరు జీవిత భీమా పాలసీలు ఉన్నాయి. అవి హోల్ లైఫ్ అస్యూరెన్స్(సురక్షా), ఎండోమెంట్ అస్యూరెన్స్ (సంతోష్), కన్వర్టిబుల్ హోల్ లైఫ్ అస్యూరెన్స్ (సువిధా), యాంటిస్పేటెడ్ అస్యూరెన్స్(సుమంగల్), జాయింట్ లైఫ్ అస్యూరెన్స్ (యుగల్ సురక్ష), చిల్డ్రన్ పాలసీ (బాల్ జీవన్ బీమా) లాంటి భీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ రూల్స్ (2011) ప్రకారం.. 2020 మార్చి 31 నాటికి పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఆస్తులు అప్పుల వ్యాల్యూయేషన్ ఆధారంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై సాధారణ రివర్షనరీ బోనస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ బోనస్ ఆకస్మిక మరణం తర్వాత లేదా పాలసీ కాలపరిమితి గడిచిన తర్వాత చెల్లిస్తారు. ఈ జీవిత భీమా పాలసీలపై బోనస్ హోల్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ(డబ్ల్యూఎల్ఏ)పై వెయ్యికి రూ.76లు అదనంగా లభిస్తుంది. ఎండోమెంట్ అస్యూరెన్స్(జాయింట్ లైఫ్ & చిల్డ్రన్ పాలసీలతో సహా) పాలసీపై వెయ్యికి రూ.52లు అదనంగా లభిస్తుంది. యాంటిస్పేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్(సుమంగల్) పాలసీపై వెయ్యికి రూ.48లు అదనంగా లభిస్తుంది. కన్వర్టబుల్ హోల్ లైఫ్ పాలసీలు(సీడబ్ల్యూఏ)పై వోల్ లైఫ్ బోనస్ రేటు వర్తిస్తుంది. అయితే మార్చుకుంటే ఎండోమెంట్ అస్యూరెన్స్ బోనస్ రేటు లభిస్తుంది. పది వేల మొత్తంపై రూ.20లు టెర్మినల్ బోనస్ తో పాటు గరిష్ఠంగా రూ.1000 వస్తుంది. ఇది 20 ఏళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది. -
ఐపీపీబి ద్వారా పోస్టాఫీస్‌లో ఖాతా తెరవండి
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎప్పటికపుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. గతంలో కేవలం ఉత్తరాల పంపిణీకి మాత్రమే పరిమితమైన పోస్ట్ ఆఫీస్ కొత్తగా బ్యాంకింగ్ సేవలను తీసుకొచ్చినప్పటి నుంచి తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఇండియన్ పోస్టల్ బ్యాంకు మరో కొత్త సాంకేతికతను కొత్త యూజర్లకు అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబి) తన మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్ పొదుపు ఖాతాలను తెరిచే సౌకర్యాన్ని కొత్త యూజర్లకు అందిస్తుంది. గతంలో పోస్టాఫీస్‌లో ఖాతా తెరవడానికి కూడా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లకుండానే ఐపీపీబి యాప్ ద్వారానే ఇంట్లో నుంచే ఖాతా తెరవవచ్చు. అలాగే ఈ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెకింగ్, డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకోవడంతో పాటు ఇతర లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. ఐపీపీబిలో పోస్టాఫీస్ ఖాతా తెరిచే విధానం: 1) దరఖాస్తుదారుడు 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరుడు అయి ఉండాలి. 2) మీ మొబైల్ ఫోన్లోని ఐపిపిబి మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌కు వెళ్లి 'ఓపెన్ అకౌంట్' పై క్లిక్ చేయండి. 3) ఇప్పుడు మీ పాన్ కార్డు నంబర్, ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయాలి. 4) ఆధార్ కార్డు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. 5) విద్యా అర్హతలు, చిరునామా, నామినీ వివరాలు వంటి వ్యక్తిగత వివరాలు సమర్పించాలి. 6) అన్ని వివరాలు సమర్పించిన తర్వాత డిజిటల్ ఖాతా తెరవబడుతుంది. ఈ డిజిటల్ పొదుపు ఖాతా ఒక సంవత్సరానికి మాత్రమే చెల్లుతుంది. ఖాతా తెరిచిన ఒక సంవత్సరంలో మీరు దగ్గరలో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత అది సాధారణ పొదుపు ఖాతాగా మార్చబడుతుంది. చదవండి: 10కోట్లకు పైగా అమ్ముడైన ఆపిల్ వాచ్‌లు ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు -
సీజ్: లెహెంగా చాటున కోట్ల దందా
న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక రూపంలో మాదక ద్రవ్యాలు జనబాహుళ్యంలోకి వస్తున్నాయి. తాజాగా అమ్మాయి డ్రెస్‌లో డ్రగ్స్ పెట్టి విదేశాలకు ఎగుమతి చేయాలనుకున్నారు. ఈ మేరకు డ్రెస్‌లో కోటి 70 లక్షల విలువైన డ్రగ్స్ పెట్టి తపాలా నుంచి ఆస్ట్రేలియాకు పంపించాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టింది. వారిని ఢిల్లీ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అందమైన లెహెంగను ఆస్ట్రేలియాకు పంపేందుకు ఢిల్లీ సరిహద్దులోని నోయిడాలో ఉన్న విదేశీ పోస్టాఫీస్‌కు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు పోస్టాఫీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన తీసుకువచ్చిన లెహెంగాను పరిశీలించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఆ డ్రెస్‌ను నిశితంగా పరిశీలించగా అందులో రూ. కోటి 70 లక్షలు విలువ చేసే 3,900 గ్రాముల డ్రగ్స్ బయటపడ్డాయి. ఇది చూసి అధికారులు ఖంగు తిన్నారు. డ్రగ్స్ సరఫరా చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతడు సరఫరా చేయాలనుకున్న డ్రగ్స్ చాలా ప్రమాదకరమని, కాలేయం, మూత్రపిండాలు, గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయని అధికారులు తెలిపారు. మొత్తం 7 లెహెంగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్‌లో మూలాలు ఉన్నాయని తెలుస్తోంది. -
‘తపాలా’లో ఆధార్, మొబైల్ నంబర్ అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకులు పొందేందుకు ఆధార్‌తో మొబైల్ ఫోన్ అనుసంధానం (ఓటీపీ కోసం) తప్పనిసరి కావటంతో తపాలాకార్యాలయాలను వినియోగించుకోవాలని ఆ శాఖ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. పోస్టల్ హైదరాబాద్ రీజియన్ (28 మఫిసియల్ జిల్లాలు) పరిధిలో అందుబాటులో ఉన్న 124 ఆధార్ కేంద్రాల్లో ఈ అనుసంధాన ప్రక్రియ చేయించుకోవచ్చని పేర్కొంది. వీటితోపాటు 15 మొబైల్ కేంద్రాలు కూడా ఈ సేవల్ని అందిస్తున్నాయని తెలిపింది. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తొలగించి, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పటం ద్వారా గాని లేదా ఐరిష్ ద్వారా కానీ సరుకులు ఇచ్చే విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఓటీపీ కోసం ఆధార్‌తో మొబైల్ అనుసంధానం తప్పనిసరైంది. ఆధార్‌లో నిక్షిప్తమై ఉన్న ఐరిస్‌లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున, ఐరిస్‌ను కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ రెండు సేవలను తపాలాశాఖ ఆధ్వర్యంలోని ఆధార్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. -
ప్రధానమంత్రి ప్రీలోన్ ఇప్పిస్తానని..
కణేకల్లు: రూ.10 వేలు ఇస్తే ప్రధానమంత్రి ప్రీలోన్ మంజూరవుతుందని నమ్మించి డబ్బుతో ఓ వ్యక్తి ఉడాయించిన ఘటన కణేకల్లు మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు..కణేకల్లులోని బస్టాండ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సావిత్రమ్మ, మధుసూదన్ దంపతులు బజ్జీలు, వడలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అపరిచిత వ్యక్తి వారింటికి వెళ్లి తాను పోస్టాఫీస్ ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. వారితో మాటలు కలిపాడు. తనకు పింఛన్ వస్తోందని మధుసూదన్ చెప్పగా..అయితే రూ.5 వేలు చెల్లిస్తే రూ.30 వేలు రుణం, రూ.10 వేలు చెల్లిస్తే రూ.60 వేల రుణం వస్తుందని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన దంపతులు రూ.10 వేలు నగదు ఇచ్చారు. అనంతరం వారి నుంచి ఆధార్‌కార్డును మొబైల్లో ఫొటో తీసుకున్నాడు. పోస్టాఫీస్‌కు వచ్చి కలవండి అని చెప్పి వెళ్లిపోయాడు. డబ్బు కోసం దంపతులు పోస్టాఫీసుకు వచ్చి, ఆరాతీశారు. తమ సిబ్బంది ఎవరూ డబ్బు తీసుకోరని ఎస్పీఎం శ్రీనివాసాచారి చెప్పారు. దీంతో మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు. దుర్గమ్మ గుడి వద్ద టోకరాకు యత్నం ఉదయం 10.30 గంటలకు అదే వ్యక్తి కణేకల్లు శివారులో దుర్గమ్మ గుడి వద్ద నివాసముంటున్న వెంకటేశ్వర్రావు ఇంటికెళ్లి పోస్టాఫీసు ఉద్యోగినని పరిచయం చేసుకుని, వివరాలు ఆరా తీశాడు. తన కొడుకు బుద్ధిమాంద్యుడు.. పింఛన్ కూడా వస్తోందని ఆయన చెప్పాడు. అయితే రూ.5వేలు ఇస్తే పోస్టాఫీస్‌కు వెళ్లి మీ పేరున అక్కౌంట్ ఓపెన్ చేస్తామని, రూ.30వేలు రుణం వస్తుందని నమ్మించాడు. తన వద్ద డబ్బులేదు, తన భార్య ఆస్పత్రికి వెళ్లింది..సాయంత్రం మీ ఆఫీస్‌కు వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా వినకుండా కనీసం రూ.3వేలు అయినా ఇవ్వండి..తన వద్ద రూ.2వేలు ఉంది.. ఈ మొత్తంతో అకౌంట్ ఓపెన్ చేస్తానని బలవంతం చేయగా, ఇంటి యజమాని డబ్బు ఇవ్వకుండా పంపించేశాడు. మధ్యాహ్నం వెంకటేశ్వర్రావు భార్య తన కుమారుడిని పిలుచుకుని పోస్టాఫీస్ వద్దకు వెళ్లి, వివరాలు ఆరాతీసింది. ఉదయం రాజు అనే ఉద్యోగి మా ఇంటికి వచ్చి, రూ.5వేలు ఇస్తే రుణం మంజూరు చేస్తామని చెప్పాడని, మాకు ఫ్రీలోన్ ఇవ్వాలని ఆమె అడిగింది. సబ్‌పోస్టుమాస్టర్ కె. శ్రీనివాసాచారి కలగజేసుకుని లోన్లు ఇస్తామని చెప్పి, ఎవరూ ఇళ్ల వద్దకు రారని, అలా ఎవరైనా ఇళ్ల వద్దకు వస్తే ఎవరూ నమ్మవద్దని చెప్పి పంపారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మకండి ప్రభుత్వ పథకాలు ఫ్రీగా మంజూరు చేస్తామని బెనిఫిటరీ వాటా లేదా అకౌంట్ కోసం డబ్బులివ్వాలని కొత్త వ్యక్తులు ఎవరైనా ఇళ్లవద్దకు వచ్చి అడిగితే నమ్మొద్దు. కణేకల్లులో ఓ అపరిచిత వ్యక్తి అమాయకులను మోసం చేశాడు. మరో కుటుంబాన్ని మోసం చేసే ప్రయత్నం చేశాడు. ఇలా కొత్త వ్యక్తులు ఎవరొచ్చి మాయ మాటలు చెప్పినా నమ్మవద్దు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తుంటే తమకు సెల్: 9440901870కు సమాచారం ఇవ్వండి. – కె.సురేష్,ఎస్ఐ -
కలువరాయి పోస్టాఫీస్‌లో నిధుల స్వాహా...?
బొబ్బిలి రూరల్: మండలంలోని కలువరాయి పోస్టాఫీసు లో వివిధ ఖాతాల్లో జమచేసిన మొత్తం స్వాహా అయినట్టు తెలుస్తోంది. దీనికి బీపీఎం లక్ష్మణరావే బాధ్యుడని గుర్తించి ఈ నెల 8న సస్పెండ్ చేశారు. ఇప్పటికే రూ. 54వేలు రికవరీ చేయగా... ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కలువరాయి పోస్టాఫీసు పరిధిలో కలువరాయి, వాకాడవలస, ముత్తాయవలస, కుమందానపేటలున్నాయి. 256 ఎస్బీ ఖాతాలు, 88 సుకన్య సమృద్ధి యోజన, 408 రికరింగ్ డిపాజిట్లు, 30 వరకూ గ్రామీణ తపాలా ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి. జూన్ ఒకటో తేదీన సుకన్య సమృద్ధి యోజ న లబ్ధిదారు ఒకరు బొబ్బిలిలో తన ఖాతా అప్డేట్ చేసినపుడు తేడా రావడంతో బీపీఎం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పార్వతీపురం పోస్టల్ సూపరింటెండెంట్ ఆదేశాల మేర కు బొబ్బిలి మెయిన్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి.గౌతంకుమార్ విచారణ చేపట్టారు. ఆయన పలు ఖాతాలు చెక్‌చేయగా, పాస్‌పుస్తకాల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లు గుర్తించారు. మరోవైపు ఖాతాదారులు డిపాజిట్ చేయడానికి వేసిన సొమ్ము ఆలస్యంగా జమ అయినట్లు గుర్తించారు. ఇంకా కొన్ని ఖాతాలు చెక్ చేయాల్సి ఉంది. ముత్తాయవలసలో సుమా రు 30ఖాతాలు ఇంకా పరిశీలించలేదు. బీపీఎం లక్ష్మణరావు గతంలోనే కొన్ని ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. ప్రస్తు తం పోస్టాïఫీసులో ఇన్‌ఛార్జ్‌గా మరో బీపీఎంను పోస్టల్ అధికారులు నియమించారు. గ్రామస్తులు లక్ష్మణరావుకు అనుకూలంగా ఉండడంతో విషయం బయటకు పొక్కడంలేదు. దీనిపై లక్ష్మణరావు సాక్షితో మాట్లాడుతూ అక్రమాలు ఏవీ లేవని, రాజకీయ దురుద్దేశంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. దర్యాప్తు అధికారి, బొబ్బిలి పోస్టల్ ఇన్స్పెక్టర్ టి.గౌతంకుమార్ సాక్షితో మాట్లాడుతూ బీపీఎంపై ఆరోపణలు రావడం వాస్తవమేనని, ఆతనిని ఈ నెల 8న సస్పెండ్ చేశామని, రూ. 54వేలు రికవరీ చేశామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. -
రేషన్ కార్డులేని వారికి పోస్టల్ ద్వారా రూ.1,500
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డు లబ్ధిదారులకు ఎవరికైతే బ్యాంకు అకౌంటుకు ఆధార్ కార్డు అనుసంధానం లేదో వారికి ఇప్పటికే తపాలా కార్యాలయాల ద్వారా నగదు తీసుకునే వెసులుబాటు కల్పించామని, మొత్తంగా 5.21 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,500 నగదు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఇందులో ఇప్పటికే 52 వేల మంది లబ్ధిదారులకు నగదు చెల్లించామని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగతా జిల్లాల లబ్ధిదారులు నిర్ణయించిన తపాలా కార్యాలయాల నుంచి నగదు తీసుకోవచ్చని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్ల పరిధిలో నిర్ణయించిన తపాలా కార్యాలయాల నుంచి రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందిన లబ్ధిదారులైనా ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్న రూ.1,500 సాయాన్ని తీసుకోవచ్చని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని తపాలా కార్యాలయాలు చెల్లింపులు తీసుకునేందుకు ఎంపిక చేశామని, వాటిలో జీపీఓ, జూబ్లీ హెడ్ ఆఫీస్, ఫలక్నామా, కేశవగిరి, బహదూర్‌పుర, సైదాబాద్, అంబర్‌పేట, ఉప్పల్, కాచిగూడ, రామకృష్ణాపూర్, యాకుత్‌పుర, ఖైరతాబాద్, హుమాయూన్ నగర్, హిమాయత్‌నగర్, మోతీనగర్, ఎస్సార్ నగర్, లింగంపల్లి, శ్రీనగర్ కాలనీ, కొత్తగూడ, మణికొండ, కార్వాన్, సికింద్రాబాద్, తిరుమలగిరి ఉన్నాయని పేర్కొన్నారు. బ్యాంకు అకౌంటు లేని లబ్ధిదారుల జాబితా సంబంధిత రేషన్ షాపుల్లో అందుబాటులో ఉంటుందని గంగుల తెలిపారు. లబ్ధిదారుల జాబితాలో గల వ్యక్తిమాత్రమే నగదు పొందేందుకు అర్హుడని, ఆధార్, రేషన్ కార్డు నంబర్ నగదు ఉపసంహరణకు అవసరమని మంత్రి పేర్కొన్నారు. -
వేలి ముద్రతో నగదు డ్రా
రామకృష్ణ అత్యవసర పని మీద అనంతపురం జిల్లాలోని ఇప్పేరు గ్రామానికి వెళ్లాడు. ఆన్లైన్ చెల్లింపులకు అలవాటు పడిన అతను అత్యవసరంగా అక్కడ రూ.8,000 నగదు చెల్లించాల్సి వచ్చింది. ఆ ఊళ్లో బ్యాంకు, ఏటీఎం లేదు. కనీసం 20 కి.మీ దూరం వెళ్తేకానీ ఏటీఎం సెంటర్ లేదు. ఏం చేయాలో పాలుపోక బిజినెస్ వ్యవహారాలపై అవగాహన ఉన్న తన స్నేహితునికి ఫోన్ చేశాడు. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్తే రూ.10 వేల వరకు నగదు తీసుకోవచ్చని అతను సలహా ఇచ్చాడు. నమ్మకం కలగనప్పటికీ, ప్రయత్నిద్దామని పక్కనే ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి పోస్టుమాస్టర్‌కు తన పరిస్థితి వివరించాడు. అతను రామకృష్ణ వేలిముద్రలు తీసుకొని వెంటనే రూ.10 వేలు ఇచ్చాడు. ఆ వెంటనే తన ఎస్బీఐ ఖాతా నుంచి రూ.10 వేలు డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఆశ్చర్యపోయాడు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే పోస్ట్‌మ్యాన్ మన ఇంటి వద్దకే వచ్చి నగదు డిపాజిట్, విత్‌డ్రా, మనీ ట్రాన్స్ఫర్ వంటి సేవలను అందిస్తున్నారు. విద్యుత్, గ్యాస్, వాటర్ బిల్లు తదితర చెల్లింపులు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సేవలన్నీ పోస్టాఫీసు వద్దకు వెళ్లి ఉచితంగా పొందవచ్చు. పోస్ట్‌మ్యాన్ ఇంటి వద్దకు వచ్చి ఈ సేవలు అందిస్తే క్యాష్ డిపాజిట్, విత్‌డ్రాయల్స్‌కు రూ.25, ఇతర సేవలకు రూ.15 చొప్పున సర్వీస్ చార్జి వసూలు చేస్తారు. రాష్ట్రంలో 10,489 పోస్టాఫీసుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. సాక్షి, అమరావతి: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గత ఏడాది అధునాతన టెక్నాలజీని వినియోగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 15 రోజుల క్రితం ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసులను ప్రవేశపెట్టింది. ఏటీఎం కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలతో పనిలేకుండా నేరుగా పోస్టాఫీసుకు వెళ్లి వేలిముద్ర వేయడం ద్వారా నగదు తీసుకునే సౌకర్యం కల్పించింది. ఆధార్‌తో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతా నుంచి ఈ విధానంలో నగదు తీసుకోవచ్చు. ఖాతాదారునికి నాలుగు బ్యాంకు అకౌంట్లు ఉంటే, ఆధార్ డేటాబేస్‌లో చివరిసారి ఏ బ్యాంకు ఖాతాతో అనుసంధానమై ఉందో ఆ బ్యాంకు ఖాతా నుంచి మాత్రమే నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా కొన్ని బ్యాంకులు రోజుకు గరిష్టంగా రూ.10 వేలు, మరికొన్ని బ్యాంకులు రూ.5 వేలు తీసుకోవడానికి అనుమతిస్తున్నాయి. దీంతో బ్యాంకులు, ఏటీఎంలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఖాతాల పెంపుపై దృష్టి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో కొద్ది రోజులుగా ఖాతాల పెంపుపై దృష్టి సారించారు. ఈ ఖాతాల్లో గరిష్టంగా రూ.లక్షకు మించి దాచుకోవడానికి వీలుండదు. అందుకని వీటిని పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలకు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రూ.లక్షకు మించి ఉన్న నగదు నేరుగా సేవింగ్స్ ఖాతాలోకి వెళ్తుంది. (రూ.లక్షకు మించి డిపాజిట్ చేయాలంటే సేవింగ్స్ ఖాతా తప్పనిసరి) అవసరమైనప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. పోస్టాఫీసు అందిస్తున్న బ్యాంకింగ్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టామని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ రామ్ భరోసా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన, అతి తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ కల్పించే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) పథకాలతో పాటు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి అన్ని రకాల పథకాలు, సేవలను పోస్టాఫీసుల్లో అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 59 పోస్టల్ ఏటీఎంలను ఏర్పాటు చేశామని చెప్పారు. మొదటి స్థానంలో ఏపీ సర్కిల్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించడంలో ఏపీ సర్కిల్ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10.33 లక్షల ఖాతాలతో రూ.21.59 కోట్ల డిపాజిట్లను సేకరించింది. గత ఏడు నెలల్లోనే 6.91 లక్షల ఖాతాలను ప్రారంభించాం. ఈ ఏడాది మొత్తం ఖాతాల సంఖ్యను 30 లక్షలకు చేర్చాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ ద్వారా పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పోస్టాఫీసు ఉన్న ప్రతి గ్రామంలో అన్ని బ్యాంకులు, వాటి ఏటీఎంలు ఉన్నట్లే లెక్క. – జి.ప్రశాంతి, సీనియర్ మేనేజర్, పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, విజయవాడ డివిజన్. -
కాలంతో పోటీ పడలేక సెలవు తీసుకున్నా..
సాక్షి కడప : హలో! నన్ను ఉత్తరం అని పిలుస్తారండి ! ప్రస్తుత ఆధునిక కాలంతో పోటీ పడలేక చాలా రోజుల క్రితమే సెలవు తీసుకున్నా. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది కేవలం నా వల్ల ఒకప్పుడు కలిగిన ప్రయోజనాలను వివరిదద్దామనే వచ్చా. ఉత్తరం... ఒక మధురమైన అనుభూతి....గుండె గదిలో నిక్షిఫ్తమైన జ్ఞాపకాల తడి.....ఉత్తరాలు మన ఆత్మీయుల యోగ క్షేమాలకు ఆనవాళ్లు.....ప్రేయసి, ప్రియులకు మధురానుభూతాలు....భావుకుల గుండెల్లో విరబూసిన పారిజాతాలు.....స్వాప్నికుల మనసులను రాగరంజితం చేసే ఊహా చిత్రాలు....సరిహద్దుల్లో...మంచుకురిసే రాత్రుల్లో పహారా కాస్తూ శత్రువుల గుండెలకు తుపాకీ ఎక్కుపెట్టిన సైనికుడు తన భార్యకు చేసుకునే హృదయ నివేదన....ఉత్తరం కోసం ఎన్నెన్ని ఎదురుచూపులో...ఎన్నెన్ని పడిగాపులో...ఇలా మానవ బంధాలకు నిలయంగా వెలుగొందిన ఉత్తరాలు నేడు కనుమరుగయ్యాయి. సెల్ఫోన్లు, ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌లు, ఈ–మెయిల్ లాంటి ఆధునికి సమాచార వ్యవస్థలు రాడవంతో ఉత్తరం అస్థిత్వాన్ని కోల్పొయింది. రంగురంగుల లేఖతో సీతాకోక చిలుకలా గుంపు వాలినట్లు కనిపించే ఇంట్లోని చిలకొయ్య (హ్యాంగర్) ఉత్తరాలు లేక కనుమరుగైంది. ఉత్తరం కోసం పరితపించిన హృదయాన్ని అక్షరాలు మురిసిపోయేలా, అమృతం కురిసిన రాత్రిలో బాలగంగాధర్ తిలక్ వర్ణించిన తీరు అద్బుతం. ఉత్తరాల్లో ఆ మధురానుభూతులు, తీపి జ్ఞాపకాలు నేడు కనుమరుగయ్యాయి. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా రూపంలో ఆత్మీయ స్పర్శ కోల్పొయింది. ఎవరెక్కడుంటారో తెలియదు. వారపత్రికలు, మాసపత్రికల ద్వారా పరిచయం అయ్యేవారు. ఆ తర్వాత కలం స్నేహంపై ఆసక్తి ఉన్న వారి చిరునామాలను పత్రికల్లో ప్రచురించేవారు. అలాంటి అభిరుచి ఉన్న వారు ఆ చిరునామాకు ఉత్తరాలు రాయడం, తిరిగి వారి నుంచి ప్రత్యుత్తరాలు అందుకునేవారు. కలం స్నేహం అంటే ఒకప్పుడు గొప్ప క్రేజ్ ఉండేది. పేజీలకు పేజీలు ఉత్తరాలు రాసుకునే వారు. ఇదంతా గతం.. పూజ్యులైన అమ్మానాన్నలకు ..... ఇప్పుడంటే సెల్ఫోన్లు వచ్చాయి. వాట్సప్ సందేశాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఇలా కాదు...పైచదువుల కోసం, ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే పిల్లలు ఉత్తరాలు రాస్తే తప్ప వారి తల్లిదండ్రులకు యోగక్షేమాలు తెలిసే అవకాశం ఉండేది కాదు. అలాగే తల్లిదండ్రులు తమ సమాచారాన్ని పిల్లలకు తెలియజేయాలంటే ఉత్తరమే వారధి. ‘పూజ్యులైన అమ్మానాన్నల పాదాలకు నమస్కరించి’ అంటూ దూర ప్రాంతాల నుంచి కొడుకు, అత్తరాంటి నుంచి కూతురు రాసే ఉత్తరాలను చూసుకుని తల్లిదండ్రులు పులకించిపోయారు. ఇలా మానవ సంబంధాలకు నిలయంగా వెలిగొందిన ఉత్తరాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. వాటిస్థానంలో ఆధునిక సమాచార మాధ్యమాలు అల్లుకున్నాయి. ఒకప్పుటి ఉత్తరం ఇప్పుడు సరికొత్త హంగులు సంతరించుకుంది. బంధుమిత్రుల మధ్య ఆప్యాయతతో నిండిన పలకరింపులను పంచిన లేఖలు కార్పొరేట్ సంస్థలకు, వినియోగదారులకు మధ్య వారధులుగా సరికొత్త అవతారం ఎత్తాయి. సెల్ఫోన్లు, ఈ–మెయిల్స్, ఎస్ఎంఎస్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంటర్నెట్, టెలిఫోన్లు, ఎంఎంఎస్, చాటింగ్లకు దీటుగా సేవలు విస్తరించాయి. పోస్టుకార్డులు, ఇంగ్లాండ్ లెటర్ స్థానంలో ఈ–పోస్టు, స్పీడ్ పోస్టు, బిజినెస్ పోస్టు వచ్చి చేరాయి. ఎక్స్‌ప్రెస్ పార్శిల్ పోస్టు, ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌విుషన్ ఉత్తరాలు, బిజినెస్ పోస్ట్ రీటైల్ పోస్టు, బంగారు నాణేలు అమ్మకాలు, పేమెంట్ బ్యాంకులుగా పోస్టాఫీసులు పలు సేవలు అందిస్తున్నాయి. -
మీ ముందుకే ‘ఆధార్’ సేవలు
సాక్షి, హైదరాబాద్: పోస్టల్ శాఖ సరికొత్త సేవలతో ముందుకు వస్తోంది. ఉత్తరాలు, పోస్టుకార్డులు చేరవేస్తూ ప్రజలకు సేవలందిస్తున్న తపాలా శాఖ ఆధార్ సేవలూ అందిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని జనరల్, హెడ్, సబ్ పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసిన తపాలా శాఖ తాజాగా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి ఆధార్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఆధార్ నమోదు, చేర్పులు, మార్పుల సేవలు అవసరమున్నట్లు సమాచారం అందిస్తే చాలు.. డోర్ వద్దకు వచ్చి సేవలందించనుంది. గత రెండున్నరేళ్ల క్రితమే జాతీయ స్థాయిలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తో ఒప్పందం కుదుర్చుకున్న పోస్టల్ శాఖ ఆధార్ అధీకృత కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ప్రైవేటు సంస్థలూ తమ సేవలను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరిగా మారింది. ఇప్పటికే కొత్తగా పుట్టిన శిశువులు, చిన్నారులు మినహా దాదాపు ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకున్నప్పటికీ పేరు, ఇంటి పేర్లలో అక్షర దోషాలు, సవరణలు, చిరునామాలు, మొబైల్ నెంబర్ల లింకేజీ, మార్పు కోసం ఆధార్ కేంద్రాలకు పరుగులు తీయక తప్పడం లేదు. దీంతో ఆధార్ కేంద్రాలకు డిమాండ్ పెరిగింది. 122 పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు హైదరాబాద్‌లో జనరల్ పోస్టాఫీసు, హెడ్, సబ్ పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. గత రెండేళ్ల క్రితం కేవలం ఆధార్ కార్డుల అప్డేషన్కు పరిమితమైన పోస్టల్ శాఖ గతేడాది నుంచి ఎన్రోల్మెంట్ ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు 20 నుంచి 30 టోకెన్లకు తగ్గకుండా పంపిణీ చేసి వినియోగదారులకు సమయం కేటాయిస్తున్నారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలందిస్తున్నారు. టోకెన్ జారీ చేసే సమయంలోనే అవసరమైన పత్రాలను పరిశీలించి కేటాయించిన సమయంలో ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. పోస్టాఫీసుల్లో కొత్త ఆధార్ నమోదుతోపాటు కార్డుల్లో చేర్పులు, మార్పులకు సంబంధించిన పలు సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ నమోదుకు ఉచితంగా.. అప్డేషన్కు రూ.50లు వసూలు చేస్తున్నారు. అప్డేషన్కు బయోమెట్రిక్ తప్పనిసరి ఆధార్ అప్డేషన్ కోసం బయోమెట్రిక్ తప్పనిసరి. ఆధార్ వివరాలు నమోదు అనంతరం ఆథరైజ్ సిబ్బంది, కార్డుదారుడి బయోమెట్రిక్ ఆమోదం అనంతరమే యూఐడీఏఐ ప్రధాన సర్వర్ అప్డేషన్కు అనుమతిస్తుంది. మొబైల్ నెంబర్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా చేర్పులు, మార్పులు పూర్తిచేస్తారు. అనంతరం అప్డేషన్ ప్రక్రియ పూర్తయినట్లు మొబైల్‌కు సంక్షిప్త సమాచారం వస్తుంది. ఈ తతంగం 15 నిమిషాల్లో పూర్తవుతుంది. అనంతరం యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి ఈ–ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండున్నరేళ్లుగా.. హైదరాబాద్‌లో పోస్టల్ శాఖ ఆధార్ కేంద్రాల ద్వారా రెండున్నరేళ్లుగా పెద్ద ఎత్తున సేవలందిస్తోంది. పోస్టల్ ఆధార్ కేంద్రాల ద్వారా సుమారు 16,271 మంది కొత్తగా ఆధార్ నమోదు చేసుకోగా 1,30,996 మంది తమ ఆధార్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకున్నారు. కేవలం హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసు (జీపీవో)లో మాత్రం 1,759 మంది కొత్తగా ఆధార్ నమోదు చేసుకోగా, సుమారు 17,522 మంది తమ ఆధార్‌లో మార్పులు, చేర్పులు చేసుకున్నట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇళ్ల వద్దకే ‘ఆధార్’ సేవలు.. పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలకు మంచి స్పందన వస్తోంది. ఇక ప్రజలకు ఇళ్ల వద్దనే ఆధార్ సేవలు అందించాలని నిర్ణయించాం. ఆధార్ సేవలు అవసరము న్న వారు కనీసం 30 మంది ఉంటే చాలు వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఆధార్ సేవలందిస్తాం. కేవలం విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తే చాలు. అపార్ట్మెంట్, వీధి, కాలనీ కమిటీ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నేరు గా సెల్ నెంబర్ 9440644035ను సంప్రదించవచ్చు. – జయరాజ్, చీఫ్ పోస్ట్‌మాస్టర్, జనరల్ పోస్టాఫీసు, అబిడ్స్, హైదరాబాద్ -
420 పోస్టు మాస్టర్
సాక్షి, కృష్ణా : పోస్టాపీస్ ఖాతాదారులను మోసం చేసిన ఓ పోస్ట్ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం బూతుమిల్లుపాడు,అజంపూడి బ్రాంచ్ లో పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న నాగేంద్ర 300 మంది ఖాతాదారులను మోసం చేసి 43 లక్షల రూపాయలు స్వాహా చేశాడు. 2014 నుండి ఖాతాదారుల నుండి డబ్బు తీసుకొని పాస్ బుక్ జమ చేయకుండా ఆ సొమ్మంత కాజేశాడు. బాధితులు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గత 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న నాగేంద్రను గన్నవరం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం తెలియడంతో బాధితులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. -
అరుదైన ఉత్తరం.. సోషల్ మీడియాలో వైరల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరానికి చెందిన పుప్పాల అనూష హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రెక్కింగ్ కోసం జూలై నెలలో హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన ఆమె ఆ రాష్ట్రంలోని హిక్కిం అనే చిన్న గ్రామంలో ఉన్న ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పోస్టాఫీస్‌ను సందర్శించారు. సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో మంచు శిఖరపు అంచుల్లో ఈ పోస్టాఫీస్ ఉంది. పోస్టాఫీస్ చరిత్రతో కూడిన ఫొటోలు, హిమాచల్‌ప్రదేశ్ అందాలతో ముద్రించిన పోస్టు కార్డులు ఇక్కడ రూ.70కి అమ్ముతుంటారు. ఈ పోస్టుకార్డుపై అనూష విశాఖలోని మురళీనగర్‌లో నివాసం ఉంటున్న తన తల్లి సరస్వతికి...అమ్మ ప్రేమ గొప్పదనాన్ని వర్ణిస్తూ ఉత్తరం రాశారు. జూలై నెల చివర్లో హిక్కిం పోస్టాఫీస్‌లో పోస్టు చేసిన ఆ ఉత్తరం ఆగస్టు 25న విశాఖ చేరుకుంది. అక్టోబర్ 10న ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఆ ఉత్తరంతో పాటు పోస్టాఫీస్ బాక్సులో తాను లెటర్ వేస్తున్న ఫొటోను అనూష ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. -
ప్రీతి మరణానికి కారణం తల్లా ప్రియుడా..?
చెన్నై,టీ.నగర్: మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరువారూరు జిల్లాలో చోటుచేసుకుంది. నీడామంగళం వెన్నాట్రంగరై లైన్ ప్రాంతానికి చెందిన సుమతి మన్నార్గుడి మునిసిపాలిటీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. ఈ దంపతుల కుమార్తె ప్రితి (21) బీఈ చదివింది. ఇటీవల జరిగిన పోటీ పరీక్షలో ఉత్తీర్ణురాలైన ప్రీతికి తపాలాశాఖలో ఉద్యోగం లభించింది. మన్నార్గుడి తామరైకుళం ప్రాంతంలోని తన తాత ఇంట్లో ఉంటూ 20 రోజులుగా ఎడకీళయూరు గ్రామంలోని తపాలా కార్యాలయంలో పనిచేస్తూ వచ్చారు. శనివారం తాత ఇంట్లో ఉంటున్న ప్రీతి హఠాత్తుగా ఒంటిపై కిరోసిన్ కుమ్మరించుకుని నిప్పంటించుకుంది. ఇరుగుపొరుగువారు వచ్చి గాయపడిన ప్రీతిని మన్నార్గుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. దీనిగురించి మన్నార్గుడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ వచ్చారు. తనకు సొంతమైన పూర్వీకుల ఆస్తిని విక్రయించేందుకు తల్లి సుమతి ప్రయత్నాలు చేసింది. ఇందుకు ప్రీతి వ్యతిరేకించింది. దీంతో తల్లి, కుమార్తెల మధ్య విబేధాలు తలెత్తాయి. అలాగే, నీడామంగళం ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ప్రీతి ప్రేమించింది. ప్రీతి ఉద్యోగం చేస్తున్నా ఇంజినీరింగ్ విద్య విడనాడలేదు. కొన్ని రోజుల క్రితం పరీక్ష రాసేందుకు కోవైలోని కళాశాలకు వెళ్లగా అక్కడ రెండు రోజులు హోటల్లో బస చేసింది. ఇది ప్రేమికుడికి నచ్చలేదు. ప్రీతిని అతను అనుమానించాడు. దీంతో ప్రేమికుల మధ్య తగాదా ఏర్పడింది. వీటిలో ఏదేని కారణంతో ప్రీతి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
పొదుపు పేర.. మోసం!
సాక్షి, నల్లగొండ: మూడేళ్ల పాటు పొదుపు చేసుకుంటే అదనంగా డబ్బులు వస్తాయి అంటూ వృద్ధులకు మాయ మాటలు చెప్పాడు ఓ పోస్టల్ అధికారి. ఆయన మాటలు నమ్మి దాదాపు వంద మంది వృద్ధులు పెన్షన్ డబ్బులతో మరికొన్ని కలిపి ఇచ్చారు. ఇలా పదినెలలుగా కడుతూ వస్తున్నారు. సదరు పోస్టల్ అధికారి తీసుకెళ్లి జమ చేస్తున్నానని ఆ వృద్ధులను నమ్మించాడు. మూడు నెలలుగా సదరు అధికారి రాకపోవడంతో అనుమానం వచ్చి పోస్టాఫీస్‌కు వెళ్లి ఆరా తీయగా మీ అకౌంట్లలో ఎటువంటి డబ్బులు జమ కాలేదు.. డబ్బులు వసూలు చేసిన పోస్టల్ అధికారిని విధులనుంచి తొలగించామని చెప్పడంతో వృద్ధులు లబోదిబోమని కన్నీటి పర్యంతమయ్యారు. తాము మోసపోయామని గ్రహించి సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ ముందు గోడు వెల్లబోసుకున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కనగల్ మండలం బోయినపల్లి గ్రామంలో పోస్టల్ అధికారి ప్రసాద్ ప్రతి నెలా వివిధ రకాల సామాజిక పెన్షన్లను పంపిణీ చేసేవాడు. ఈ క్రమంలో పింఛన్ తీసుకుంటున్న వృద్ధులను మాయమాటలతో నమ్మించాడు. ‘ప్రతి నెలా పోస్టాఫీస్‌లో రూ.వెయ్యి చొప్పున మూడేళ్ల పాటు జమ చేసుకుంటే మీరు కట్టిన డబ్బులతో కలిపి అదనంగా మొత్తం రూ.50వేలు వస్తాయి.. మీరు చేతగాని వేళల్లో హాయిగాబతికేందుకు పనికి వస్తాయి’ అంటూ మాటలు చెప్పి వారి నుంచి పొదుపు కట్టించాడు. గ్రామంలో దాదాపు వంద మంది మహిళలు రూ.500 నుంచి రూ.3వేల వరకు ప్రతి నెలా పొదుపు డబ్బులు కడుతూ వస్తున్నారు. ప్రతి నెలా పెన్షన్లు అక్కడే వారికి ఇవ్వడం, ఇచ్చిన డబ్బులనే తిరిగి పొదుపు పేర పోస్టల్ అధికారి ప్రసాద్ లబ్ధిదారులనుంచి కట్టించుకున్నాడు. పోస్టాఫీసుల్లో కొందరికి అకౌంట్ బుక్‌లు తీశాడు. ఆ బుక్కుల్లోనే ప్రతి నెలా వారు కట్టిన డబ్బులకు సంబంధించి బుక్కులో ఎంత కట్టారు, ఎంత జమ అవుతుంది రాస్తూ వస్తున్నాడు. కొందరి మహిళల మొత్తం పొదుపు చేసుకున్నవి రూ.5వేల నుంచి రూ.40 వేల వరకు ఉన్నాయి. మూడు నెలలుగా రాని పోస్టల్ అధికారి మూడు మాసాలుగా వృద్ధాప్య పెన్షన్లు పంచేం దుకు ప్రసాద్ రావడం లేదు. అతనికి ఫోన్ చేసినా ఫోన్ కలవడంలేదు. కొత్త వ్యక్తులు వస్తున్నారు. దీంతో కనగల్ మండల కేంద్రంలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి తమ పాస్ బుక్‌లలో ఉన్న డబ్బులు కావాలని అడిగారు. వాటిని పరిశీలించిన అధికారులు అకౌంట్లలో జమ కాలేదని చెప్పడంతో తెల్లముఖం వేశారు. ‘ప్రతి నెలా మీరు పంపిన వ్యక్తే వచ్చి ఒక చేత్తో పెన్షన్లు ఇచ్చి మరో చేత్తో పొదుపు కట్టించుకున్నాడు... డబ్బులు లేవంటే ఎలా’ అని ప్రశ్నించారు. ‘అతన్ని ఉద్యోగంనుంచి తీసేశాం. మీరు చండూరు పోస్టాఫీస్‌కు వెళ్లి అడగండి’ అని సలహా ఇచ్చారు. దీంతో వృద్ధులు చండూరు వెళ్లి అడగగా, పరిశీలించిన అధికారులు అకౌంట్లలో జమ కాలేదని చెప్పారు. కేవలం మీ దగ్గర ఉన్న పాస్‌బుక్కుల్లో రాశాడు కానీ అకౌంట్లలో జమ చేయలేదని తెలిపారు. దీంతో మోసపోయామని తెలుసుకుని సింగం లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్‌ను కలిసి గోడును వెల్లబోసుకున్నారు. పోస్టల్ అధికారి మోసం చేశాడని, న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. జేసీ.. వెంటనే పోస్టల్ సూపరింటెండెంట్‌ను ఫోన్లో సంప్రదించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం వారు ఎస్పీ ఏవీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన పూర్వాపరాలు తెలుసుకుని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డీఎస్పీకి ఆదేశించారు. మోసం చేశాడు.. పెన్షన్ డబ్బులు ఇచ్చే వ్యక్తే కదా ఆయనే పొదుపు కట్టించుకుంటే మా డబ్బులు ఎక్కడికి వెళ్తాయి అనుకున్నాం. నమ్మకంతో పొదుపు చేశాం. పాస్ పుస్తకాల్లో డబ్బులు కట్టించుకున్నట్లు రాశాడు. పోస్టాఫీస్ వాళ్లు డబ్బులు లేవంటున్నారు. వచ్చిన పెన్షన్ అంతా తినీ తినక పొదుపు చేసుకుంటే మోసం చేశాడు. – దేవకమ్మ, బోయినపల్లి, కనగల్ ఈడంగ ఇచ్చి ఆడంగ తీసుకున్నడు పెన్షన్ డబ్బులు ఈడంగ ఇచ్చి ఆడంగ తీసుకున్నడు. పొదుపు చేసుకుంటే మరిన్ని డబ్బులు వస్తాయన్నాడు. డబ్బులు తీసుకుందామని వెళ్తే వారు లేవంటున్నారు. మాకు న్యాయం చేయాలి. – జెట్టి వీరమ్మ, బోయినపల్లి, కనగల్ మాకు న్యాయం చేయాలి గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ డబ్బులు దాచుకుని పొదుపు చేసుకుంటే పోస్టల్ అధికారి మోసం చేశాడు. మా డబ్బులు తీసుకొని పోస్టాఫీస్‌లో కట్టలేదు. మాకు మూడు నెలల నుంచి డబ్బులు తీసుకెళ్తలేడని పోస్టాఫీస్‌కు వెళ్తే ఆయన లేడని తెలిసింది. డబ్బులు ఇవ్వమంటే కట్టలేదంటున్నారు. డబ్బులు స్వాహా చేసిన అధికారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలి. – సైదమ్మ, బోయినపల్లి, కనగల్ -
బతికున్నట్లుగా సెల్ఫీ అప్లోడ్ చేస్తేనే పింఛను!
బోధన్ మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తికి ప్రతీ నెలా వృద్ధాప్య పింఛను మంజూరవుతోంది. పింఛన్ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమవుతున్నాయి. వాస్తవానికి ఆ వ్యక్తి చనిపోయి చాలా నెలలవుతోంది. అయితే ఇటీవల సదరు వ్యక్తి భార్య వితంతు పింఛన్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుంది. డీఆర్డీఏ పింఛన్ విభాగంలో అధికారులు ఈ దరఖాస్తును పరిశీలించారు. చనిపోయిన భర్త పేరు తెలుసుకుని మంజూరువుతున్న పింఛన్ జాబితాలో ఉందో లేదో చూశారు. ఇప్పటికీ ఆమె చని పోయిన తన భర్త పేరుపై వృద్ధాప్య పింఛ న్ ప్రభుత్వం నుంచి మంజూరు అవుతోందని తెలిసి షాక్ అయ్యారు. ఇలా మున్సిపా లిటీ ల్లో చనిపోయిన వారి పేరుతో బోగస్ పింఛన్లు డ్రా అవుతున్నాయి. సాక్షి, నిజామాబాద్: మున్సిపాలిటీ ప్రాంతాల్లోని బోగస్ పింఛన్లకు త్వరలో చెక్ పడనుంది. చనిపోయిన వ్యక్తుల పేరిట మంజూరువుతున్న పింఛన్లను గుర్తించి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త సాంకేతిక విధానాన్ని అమలుల్లోకి తేనుంది. అదే ‘లైవ్యాప్’ సిస్టం. ఈ మొబైల్ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని లబ్ధిదారులు సెల్ఫోన్లో ఒక సెల్ఫీ ఫొటో దిగి అందులో అప్లోడ్ చేస్తేనే ఇకపై పింఛన్ మంజూరు కానుంది. అయితే ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా పింఛన్ డబ్బులు పొందుతున్న లబ్ధిదారులు మూడు, ఆరు నెలలకోసారి వారు బతికున్నట్లుగా మున్సిపాలిటీల నుంచి లైవ్ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వానికి చూపాల్సి ఉంటుంది. ఈ విధానం అమలవుతున్నా లైవ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగడం లేదు. దీంతో పింఛన్లు పొందే లబ్ధిదారులు బతికున్నారో, చనిపోయారో తెలియడం లేదు. పింఛన్ డబ్బులు మాత్రం నెలనెలా వారి ఖాతాల్లో జమ అవుతుండగా, కుటుంబ సభ్యులు వాటిని డ్రా చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. అదే గ్రామాల్లోని లబ్ధిదారుల విషయానికి వస్తే ప్రతీ నెలా లబ్ధిదారులే పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్ డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో లబ్ధిదారులు బతికున్నట్లుగా తెలిసిపోతుంది. కానీ మున్సిపాలిటీ ప్రాంతాల్లో అలా కాకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతున్నాయి. లబ్ధిదారులు బతికున్నారో, లేదో తెలుసుకోవడానికి వీలు పడదు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి 2లక్షల 60వేలకు పైగా ఉన్నాయి. వికలాంగులకు రూ.3016 కాగా మిగతా అందరికీ రూ.2,016 పింఛన్ అందుతోంది. వచ్చే నెలాఖరు వరకు అమలయ్యే ఛాన్స్.. లైవ్ మొబైల్ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సంగారెడ్డిలో అమలు చేసి విజయవంతమైంది. వచ్చే నెలాఖరు వరకు రాష్ట్రం అంతటా ఈ విధానాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీ ప్రాంతాల వారే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు కూడా మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని సెల్ఫీ దిగి ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నిరక్ష్యరాసులు, వృద్ధులకు ఇది సాధ్యం కాని పని అయినప్పటికీ తెలిసిన వారితో ఫోన్లో సెల్ఫీ ఫొటో దిగి యాప్‌లో అప్లోడ్ చేయాల్సిందే. ఇలా ప్రతీఒక్కరూ ప్రతీ మూడు నెలలకు ఒకసారి చేస్తేనే పింఛన్ ప్రభుత్వం నుంచి మంజూరు కానుంది. కొత్త విధానం వల్ల మున్సిపాలిటీ ప్రాంతాల్లో చనిపోయిన వ్యక్తులు సెల్ఫీ ఫొటో దిగే అవకాశం ఉండదు కాబట్టి ఇకపై ఆ వ్యక్తికి పింఛన్ మంజూరు కాబోదు. దీంతో జిల్లాలో చాలా బోగస్ పింఛన్లు తొలగిపోయే అవకాశం ఉంది. -
‘తపాలా కార్యాలయంలేని ఓ దేశం’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ది కంట్రీ వితౌవుట్ ఏ పోస్టాఫీస్ (తపాలా కార్యాలయం లేని ఓ దేశం)’ అంటూ అమెరికాలో నివసించిన కశ్మీరీ కవి ఆఘా షాహిద్ అలీ 1997లో ఓ కవిత రాశారు. 1990లో కశ్మీర్లో మిలిటెన్సీ తారా స్థాయికి చేరుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఏడు నెలల పాటు తపాలా సేవలను నిలిపివేశారు. అప్పుడు పోస్టాఫీసుల్లో గుట్టలు గుట్టలుగా ఉత్తరాలు, పార్సళ్లు పేరుకు పోయాయి. ఆ పరిస్థితిని దష్టిలో పెట్టుకొన ఆయన ఈ కవిత రాశారు. ఆ తర్వాత 2001లో ఆయన మరణించారు. అయితే ఆయన రాసిన ఆ కవితా ఇప్పటికీ బతికే ఉంది. ఇప్పుడు కూడా కశ్మీర్లో అదే పరిస్థితి ఏర్పడింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోకి 370వ అధికరణాన్ని ఎత్తివేస్తూ, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలను నిలిపివేసినప్పుడే తపాలా సేవలను కూడా నిలిపివేశారు. ఈ విషయం అంతగా దేశం దష్టికి రాలేదు. ఇప్పటికి కూడా కశ్మీర్లో తపాలా సేవలకు ఇంకా పునరుద్ధరించలేదు. మిగతా సర్వీసులను ఇప్పటికే పాక్షికంగానైనా పునరుద్ధరించారు. దీంతో ఇప్పటి కశ్మీరీ పరిస్థితికి ‘ది కంట్రీ వితౌవుట్ ఏ పోస్టాఫీస్’ పేరిట నాడు షాహిద్ అలీ రాసిన కవితా పంక్తులను ప్రముఖ కర్ణాటక çసంగీత విద్వాంసుడు టిఏం కష్ణ గుర్తు చేశారు. ఒకప్పుడు తాను చదివిన ఆ కవితా పంక్తులను గుర్తు చేస్తూ దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాకు విడుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కశ్మీర్‌కు ఎలాంటి ఉత్తరాలుగానీ పార్సళ్లుగానీ బట్వాడా చేయరాదంటూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు ఢిల్లీలోని తపాలా విభాగానికి చెందిన డాక్ భవన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. శ్రీనగర్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన తపాలా విభాగానికి కశ్మీర్ రాష్ట్రవ్యాప్తంగా 1965 తపాలా కార్యాలయాలు ఉన్నాయి. టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ సౌకర్యాలు పెరిగిన నేటి పరిస్థితుల్లో ప్రజలు తపాలా సేవలు ఉపయోగించుకోవడం తగ్గుతూ ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలకు మాత్రం ఈ సేవలు ఇప్పటికీ ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. -
హైదరాబాద్‌లో ఫారిన్ పోస్టాఫీస్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన విశ్వాస్ తయారీ రంగంలో వ్యాపారం ప్రారంభించాడు. మందులు, బలవర్ధకమైన పదార్థాల తయారీకి సంబంధించి చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నాడు. పోస్టాఫీస్‌ల ద్వారా పార్శిళ్లను ఎగుమతి చేస్తున్నాడు. అలాగే కొన్ని ముడి సరుకులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాడు. పార్శిళ్ల రూపంలో జరిగే దిగుమతి ఎగుమతుల్లో పెద్ద చికాకు ఎదురైంది. హైదరాబాద్‌లో తపాలా శాఖకు సంబంధించి ఫారిన్ పోస్టాఫీస్ లేకపోవటంతో కస్టమ్స్ ఎగ్జామినేషన్ కోసం పార్శిళ్లను ముంబై పంపుతున్నాడు. కొన్ని పార్శిళ్ల క్లియరెన్సుకు పక్షం రోజుల నుంచి నెలకు పైబడి సమయం పడుతోంది. అలాగే కస్టమ్ డ్యూటీ ఎంత చెల్లించాలో ముందు తెలియక అప్పటికప్పుడు ముంబై పరుగెత్తాల్సి వస్తోంది. ఇది కేవలం విశ్వాస్ ఒక్కడి సమస్యే కాదు. చివరకు ఇతర దేశాల్లో ఉండే బంధువులకు పంపే పార్శిళ్లలో కూడా ఇదే సమస్య ఏర్పడుతోంది. దేశంలోనే ఓ ప్రధాన నగరంగా భాసిల్లుతున్న హైదరాబాద్‌కు ఇంతకాలం ఇదో సమస్య. ఈ సమస్య పరిష్కరించాలంటూ ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌కు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. నగరంలో ఫారిన్ పోస్టాఫీస్ ఏర్పాటు చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇది పూర్తిస్థాయిలో పని ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఆ నాలుగు చోట్లే.. దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. వాటికి కొన్ని చొప్పున దేశాలను కేటాయించారు. ఆయా దేశాలకు ఎగుమతి కావాల్సిన, దిగుమతి కావాల్సిన పార్శిళ్లు ఆయా నగరాల్లోని ఫారిన్ పోస్టాఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అమెరికా, యూ రప్, గల్ఫ్ దేశాలకు ఎక్కువ పార్శిళ్లు ఎగుమతి అవుతాయి. ఇవి ముంబైకి వెళ్లాల్సి ఉంటుంది. ముంబైలో లక్షల సంఖ్యలో పార్శిళ్లు పేరుకుపోతుండటంతో రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి జాప్యం జరుగుతోంది. ఈలోపు కొన్ని సరుకులు పాడైపోతున్నాయి. ఇది పెద్ద సమస్యగా పరిణమించింది. ఎట్టకేలకు రాజధానిలో.. ఈ సమస్యను గుర్తించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) దేశవ్యాప్తంగా అదనంగా ఫారిన్ పోస్టాఫీసులను ఏర్పాటు చేయాలంటూ 2016లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్‌ను కూడా చేర్చింది. కానీ దాని ఏర్పాటులో జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు తపాలా శాఖ సెంట్రల్ ఎక్సైజ్ విభాగంతో కలసి ఇప్పుడు ఫారిన్ పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేసింది. నగరంలోని హుమాయూన్‌నగర్ తపాలా కార్యాలయంలో ఇందుకు కొంత స్థలాన్ని కేటాయించారు. ఇక్కడే సెంట్రల్ ఎక్సైజ్ విభాగం ప్రత్యేకంగా స్కానర్లను ఏర్పాటు చేసింది. ఇక నుంచి విదేశాలకు ఎగుమతయ్యే, విదేశాల నుంచి దిగుమతయ్యే పార్శిళ్లను ఇక్కడే తనిఖీ చేస్తారు. అవసరమైన వాటికి కస్టమ్ డ్యూటీ కట్టించుకుని డెలివరీకి వీలుగా తపాలా సిబ్బందికి అందిస్తారు. ఎగుమతులకు ప్రోత్సాహం.. నగరం ఇప్పుడు ఎన్నో ఉత్పత్తులకు హబ్‌గా మారుతోంది. శివారు ప్రాంతాల్లో తయారీ రంగం విస్తరిస్తోంది. ఫార్మాతోపాటు చాలా వస్తువులు ఇక్కడ ఉత్పత్తవుతున్నాయి. వీటిల్లో తక్కువ పెట్టుబడితో చిన్నస్థాయి తయారీ యూనిట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ ఉత్పత్తుల్లో చాలా వరకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పెద్దపెద్ద యూనిట్లు షిప్పింగ్ ద్వారా ఎగుమతి చేస్తుండగా.. చిన్నచిన్న తయారీ యూనిట్లు మాత్రం తపాలా ద్వారా పార్శిళ్ల రూపంలో పంపుతోంది. ఇంతకాలం ఫారిన్ పోస్టాఫీసు లేకపోవటంతో ఎగుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వారంతా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇక్కడే ఫారిన్ పోస్టాఫీసు ఏర్పాటు అవటంతో జాప్యం బాగా తగ్గి ఎగుమతులు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. నగరం నుంచి నిత్యం వేల సంఖ్యలో పార్శిళ్లు ఎగుమతవుతున్నాయి. ఆ సంఖ్య బాగా పెరిగి ఎగుమతులకు ప్రోత్సాహం లభించినట్లవుతుంది. విదేశాలకు నిత్యం వేలల్లో పార్సిళ్లు.. నగరం నుంచి నిత్యం వేల సంఖ్యలో విదేశాలకు పార్శిళ్లు ఎగుమతవుతుంటాయి. అంతకంటే ఎక్కువ సంఖ్యలో విదేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. దేశాల మధ్య సరఫరా అయ్యే ఈ పార్శిళ్లన్నింటిని కచ్చితంగా కస్టమ్స్ ఎక్సైజ్ విభా గం తనిఖీ చేయాల్సి ఉంటుంది. వాటిల్లో నిషేధిత వస్తువులు, సరుకులు ఎగుమతి, దిగుమతి కాకుం డా నిరోధించటంలో భాగంగా ఈ తనిఖీ తప్పనిసరి. పార్శిళ్లను బుక్ చేసే వారు వాటిల్లో ఉన్న వస్తువుల వివరాలు పేర్కొంటూ డిక్లరేషన్ ఇస్తారు. డిక్లరేషన్‌లో పేర్కొన్న వస్తువులే అందులో ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే కచ్చితంగా యంత్రాలతో స్కాన్ చేయాల్సిందే. నిబంధనల ప్రకారమే దిగుమతి, ఎగుమతి ప్రక్రియ సాగుతోందని స్పష్టమైన తర్వాతే వాటిని తరలించేందుకు కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ విభాగం అధికారులు పచ్చజెండా ఊపుతారు. అవసరమైతే కస్టమ్ డ్యూటీ కట్టించుకుంటారు. కానీ హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఫారిన్ పోస్టాఫీస్ లేకపోవటంతో స్థానికంగా ఈ ప్రక్రియకు వీల్లేకుండా పోయింది. -
డిపాజిట్ సొమ్ము ఎక్కడ?
సాక్షి, రేగోడ్(మెదక్) : పోస్టల్ డిపార్ట్మెంట్ అంటేనే నమ్మకం. ఎన్నో ఏళ్లుగా ప్రజల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. అలాంటి సంస్థలో వినియోగారుల సొమ్ము స్వాహా చేసిన సంఘటన రేగోడ్ పోస్టాఫీస్‌లో చోటు చేసుకుంది. ఓ అధికారి వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి డబ్బులు స్వాహా చేసినట్లు ఆరోణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగంపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా కనీసం విచారణకు నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. డబ్బు ఇవ్వకుండా మోసం.. మండల కేంద్రమైన రేగోడ్‌లో పోస్ట్‌ఆఫీస్‌లో ఓ అధికారి సబ్ పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి జమ కోసం ఇచ్చిన డబ్బులు, విత్‌డ్రా కోసం ఓచర్లపై సంతకాలు చేసినా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పదిహేను రోజులు దాటినా.. డబ్బులు రాకపోవడంతో సంబంధిత స్థానిక పోస్ట్ ఆఫీస్ అధికారులకు, జిల్లా ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేసి పదిహేను రోజులు దాటినా స్పందించడం లేదని తెలుస్తోంది. కష్టపడి జమచేసుకున్న డబ్బులు తమకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులకోసం ఫోన్‌చేస్తే ఇష్టానుసారంగా అధికారి మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. పన్నెండు మంది వినియోగదారుల సొమ్ము.. 7 గ్రామాలు, 12 మంది వినియోగదారులకు సంబంధించిన రూ.3లక్షల 79వేల 300లను అధికారి స్వాహా చేసినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గతరెండు నెలలుగా తమ డబ్బులు తమకు ఇవ్వాలని పోస్ట్ఆఫీస్కు తిరుగుతున్నా పోస్ట్‌ఆఫీస్‌లో కనిపించడం లేదు. అక్కడ సిబ్బందిని అడిగినా అధికారి ఈ రోజు, రేపు వస్తాడని చెబుతున్నాడని పేర్కొన్నారు. నేను ఏ తప్పూ చేయలేదు ఈ విషయమై స్థానిక సబ్ పోస్ట్‌మాస్టర్ కృష్ణను సోమవారం వివరణ కోరగా.. ఆరోగ్యం బాగాలేక సెలవులో ఉన్నానని, అంతే తప్ప నేను ఏ తప్పు చేయలేదని తెలిపారు. కొందరు కావాలని నాపై లేనిపోనివి చెబుతున్నారని. ఆధారాలు ఉంటే చూపించాలని తెలిపారు. ఓచర్‌పై సంతకం తీసుకుని ఇవ్వడం లేదు సుమారు 2000 సంవత్సరంలో రేగోడ్ పోస్ట్ ఆఫీస్‌లో జీవిత బీమాలో డబ్బులను జమ చేశాను. గత 19 ఏళ్లుగా జమ చేస్తూనే ఉన్నా. ఇటీవల పాలసీ పూర్తయింది. దీంతో గతనెలలో డబ్బులు తీసుకునికి పోస్ట్ఆఫీస్కు వెళ్తే ఓచర్‌పై సంతకం తీసుకుని డబ్బులు లేవని, పైనుంచి రాగానే ఇస్తానని తెలిపారు. డబ్బుల కోసం మళ్లీ పోస్ట్‌ఫీస్‌కు వెళ్తే అధికారి లేరు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాం. – భారతమ్మ, పోచారం విచారణకు ఆదేశించాం.. రేగోడ్ సబ్ పోస్ట్‌మాస్టర్ కృష్ణ అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది.అయితే కృష్ణ నిజంగా అవకతవకలకు పాల్పడ్డారా? లేదా? అనే విషయమై వాస్తవాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించాం. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – బీవీ రమణ, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ (ఎస్పీ) -
తపాలా బీమాతో ధీమా
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తపాలా జీవిత బీమా భరోసా కల్పిస్తోంది. ఉద్యోగుల కోసమే పలు పాలసీలను తపాలా శాఖ గత సంవత్సరమే ప్రవేశపెట్టింది. స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సహకార బ్యాంకుల ఉద్యోగులు కూడా తపాలా జీవిత బీమా పొందే సౌకర్యం ఉంది. మిగతా ఇన్సూరెన్స్ సంస్థల కంటే తపాలాలో బీమా చేసి అదనపు బోనస్‌లు పొందవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఉద్యోగులు ఎక్కువగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ (పీఎల్‌ఐసీ) పట్ల మొగ్గు చూపుతున్నారు. ఈ పాలసీలో 19 నుంచి 55 ఏళ్లు ఉన్న వ్యక్తులు వివిధ రకాల పరిమితుల ఆధారంగా పాలసీ పొందవచ్చు. చిల్డ్రన్స్ కోసం.. తపాలా శాఖ జీవితాంతపు పాలసీగాని, ఎండోమెంట్ పాలసీ గాని కలిగిన తల్లిదండ్రుల మొత్తం పిల్లలు కూడా జీవిత బీమా పొందవచ్చు. ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ బీమా సౌకర్యం ఉంది. ఇందులో ముఖ్య పాలసీదారుడి వయస్సు 45 ఏళ్లకు మించరాదు. సురక్ష పాలసీ.. పాలసీదారుడి వయసు 19 నుంచి 55 ఏళ్లు ఉండాలి. పాలసీ మొత్తం విలువను పాలసీదారుడి వయసు 80 ఏళ్లు నిండిన తర్వాత గాని లేదా పాలసీదారుడి తదనంతరం వారు నిర్దేశించిన వారసులు గాని, ఆయన సూచించిన సంస్థకు ఇస్తారు. సుమంగళ్.. పాలసీదారుడి వయసు 19 నుంచి 45 మధ్య ఉండాలి. కాల పరిమితి 15 లేదా 20 ఏళ్లు. పాలసీదారుడి నుంచి దరఖాస్తు అందగానే నిర్దేశించిన వాయిదా మొత్తం చెల్లిస్తారు. వాయిదా మొత్తం చెల్లించిన అనంతరం కూడా పాలసీ కాల పరిమితి అయ్యే వరకు పాలసీ మొత్తానికి జీవిత రక్షణ ఉంటుంది. ఈ పథకంలో పాలసీపై రుణాలు, పాలసీ సరెండర్ చేసే సదుపాయం ఉండదు. సువిధ.. పాలసీదారుడి వయస్సు 19 నుంచి 45 ఏళ్లలోపు ఉండాలి. మొదటి ఐదేళ్ల వరకు తక్కువగా నిర్దేశించిన ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత పాలసీదారుడు జీవితాంతపు పాలసీని నిర్దేశించిన వయసుకు అంటే.. 50, 55, 58, 60 సంవత్సరాల మధ్య మెచ్యూరిటీ అయ్యే ఎండోమెంట్ పాలసీగా మార్పునకు సదుపాయం కలదు. ఆ విధంగా మార్చుకుంటే మొదటి ఐదేళ్లు నిర్దేశించిన ప్రీమియం యథావిధిగా 60 సంవత్సరాలు వరకు చెల్లించాలి. యుగళ్ సురక్ష.. పాలసీదారుడి వయసు 21– 45 సంవత్సరాల మధ్య ఉండాలి. కాలపరిమితి ఐదు నుంచి పదేళ్ల వరకు ఈ పాలసీని ఆమోదించిన తేదీ నుంచి పాలసీదారుడు దంపతులకు ఒకే ప్రీమియంతో పూర్తి బీమా జమ చేసిన మొత్తానికి బోనస్ సొమ్ము కలిపి బతికి ఉన్న వ్యక్తికి ఇస్తారు. పాలసీ పొందిన వ్యక్తి భాగస్వామి ఉద్యోగి కావాల్సిన అవసరం లేదు. సంతోష్ పాలసీ.. పాలసీదారుడి వయస్సు 19– 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రీమియందారుడు ఎంపిక చేసుకున్న వయసు నాటికి పాలసీ మెచ్యూరిటీ మొత్తం చెల్లిస్తారు. -
కనుడు.. కనుడు..రామాయణ గాథ..
సాక్షి, హైదరాబాద్: రామాయణాన్ని తపాలా బిళ్లల ద్వారా చెప్తే ఎలా ఉంటుంది.. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా తపాలాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఇదే ప్రయత్నం చేశారు. రామాయణ గాథను ఆది నుంచి అంతం వరకు తపాలా బిళ్లల ద్వారా కళ్ల ముందుకు తెస్తున్నారు. పైగా అవన్నీ 20 వివిధ దేశాలు వివిధ సందర్భాల్లో ముద్రించిన రామాయణ ఇతివృత్తంతో కూడిన పోస్టల్ స్టాంపులు కావటం విశేషం. కొన్నేళ్ల పాటు శ్రమించి వాటిని సేకరించిన ఆయన పూర్తి రామాయణ గాథను వాటి రూపంలో నిక్షిప్తం చేశారు. ఆయన కృషికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. బుధవారం అధికారికంగా నిర్వాహకులు ఈ విషయాన్ని ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుమ్మడవల్లి గ్రామానికి చెందిన వెన్నం ఉపేందర్ ఈ ఘనత సాధించారు. 450 స్టాంపులు.. 80 ఏ–4 పేజీలు! తమిళనాడులోని మదురైలో పోస్టుమాస్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఉపేందర్ కొన్నేళ్లుగా రామాయణ ఇతివృత్తంపై వివిధ దేశాలు ముద్రించిన తపాలా బిళ్లలను సేకరించటం ప్రారంభించారు. ఇప్పటివరకు ఆయన 450 స్టాంపులను సమీకరించారు. వాటిని వరుసగా పేరిస్తే ఏ–4 సైజులో ఉండే 80 కాగితాలకు సరిపోతున్నాయి. ఇదే ప్రపంచ రికార్డుగా ఉంది. అంతకుముందు 16 ఏ–4 సైజు షీట్లకు సరిపడా సంఖ్యలో రామాయణ స్టాంపులు సేకరించిన ఇజ్రాయెల్‌కు చెందిన మెల్లమ్ అనే వ్యక్తి పేరిట రికార్డు ఉంది. తన వద్ద ఉన్న స్టాంపులతో పలు ప్రదర్శనల్లో రామాయణ గాథను వివరించిన ఉపేందర్ పలు పురస్కారాలు సొంతం చేసుకున్నారు. గత డిసెంబర్లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి ప్రదర్శనలో ఆయన బంగారు పతకం సైతం సాధించారు. జూన్, జూలైలలో సిడ్నీ, సింగపూర్లలో జరగనున్న అంతర్జాతీయ ప్రదర్శనలో పాల్గొంటున్నట్టు ఉపేందర్ తెలిపారు. ఆగ్నేయాసియా దేశాల్లోనే ఎక్కువ రామాయణ ఇతివృత్తంపై ఉపేందర్ 450 స్టాంపులు సేకరిస్తే అందులో భారత్‌కి చెందినవి 15కు మించిలేవు. ఎక్కువగా ఆగ్నేయాసియా దేశాలవే ఎక్కువగా ఉన్నాయి. కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాలు పెద్ద సంఖ్యలో రామాయణ ఇతివృత్తంపై తపాలా బిళ్లలను విడుదల చేశాయి. పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, మయన్మార్‌లతో పాటు జర్మనీలాంటి కొన్ని యూరప్ దేశాలు కూడా రామాయణ ఘట్టాలపై స్టాంపులు విడుదల చేశాయి. వీటన్నింటిని ఉపేందర్ సేకరించారు. రామాయణం ఏం చెప్తోంది... రామాయణం ప్రస్తుత సమాజానికి ఏం చెప్తోంది.. విదేశాల్లో రామాయణానికి ఇస్తున్న ప్రాధాన్యం.. మొత్తంగా రామాయణ గాథను స్టాంపుల ద్వారా వివరిస్తున్నట్టు ఉపేందర్ తెలిపారు. మలేసియాలో హికాయత్ సేరి రామా పేరుతో రామాయణాన్ని వివరిస్తున్నారని, అక్కడ ప్రధాని ప్రమాణ స్వీకార సమయంలో ఇప్పటికీ రామ పాదాలను ఉంచుతున్నారని, కొన్ని దేశాల్లో రాజులను రామ–1, రామ–2గా పిలుచుకుంటున్నారని.. ఇలాంటి ఎన్నో విషయాలు స్టాంపుల ద్వారా వెల్లడవుతున్నాయని ఆయన చెప్పారు. రామాయణ గాథను వివరించటంతోపాటు స్టాంపుల ద్వారా జనం ముందుకు తీసుకెళ్తున్నందుకు సంతోషంగా ఉందని.. త్వరలోనే ఇది గిన్నీస్ దృష్టికి వెళ్లనుందని అన్నారు. ఉపేందర్ -
పాస్‌పోర్టు ఇక సులువు
మంచిర్యాలక్రైం: మంచిర్యాల, కుమురంభీం జిల్లాల ప్రజలకు ఇక పాస్‌పోర్టు ఇబ్బందులు దూరం కానున్నాయి. ఉపాధి, ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లోని పాస్‌పోర్టు కేంద్రాలకు వెళ్లి రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఒక పోస్టాఫీస్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న మంచిర్యాల జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్లో గల పాత హెడ్ పోస్టాఫీసులో ఈ నెల 15న పాస్‌పోర్టు సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మరో పది రోజుల్లో అధికారికంగా ప్రజాప్రతినిధులతో పూర్తి పాస్‌పోర్టు సేవాకేంద్రంను ప్రారంభించేందుకు పోస్టల్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 15 చొప్పున పాస్‌పోర్ట్ స్లాట్స్‌ను బుకింగ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్ విధానం ద్వారా బుకింగ్‌కు అవకాశం ఉంది. బుకింగ్ చేసుకున్న తర్వాత పోలీసుల వెరిఫికేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ల అనంతరం వారం రోజుల్లో పాస్‌పోర్టు అందజేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తు ఇలా.. ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్ బాట పడుతున్నాయి. పాస్‌ఫోర్ట్ సేవలూ ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని ఆన్లైన్ పోర్టల్‌లో రిజిష్టర్ కావాల్సి ఉంటుంది. పాస్‌ఫోర్ట్ సేవా వెబ్సైట్ హోమ్ పేజీలో అప్లై సెక్షన్లో కనిపించే రిజిష్టర్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఐడీ, పాస్‌వర్డ్‌లతో పాస్‌ఫోర్ట్ సేవా ఆన్లైన్ పోర్టల్‌లో లాగిన్ కావాలి. పాస్‌పోర్ట్ దరఖాస్తును పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన అప్లికేషన్‌కు సంబంధించి అపాయింట్మెంట్ పొందేందుకు పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంటు లింక్‌పై క్లిక్ చేయాలి. బుకింగ్ అపాయింట్మెంట్కు ఆన్లైన్ చెల్లింపు తప్పనిసరి కాబట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఇది పూర్తయిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ లింక్ క్లిక్ చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసిన సమయానికి సంబంధిత పాస్‌పోర్ట్ çసేవా కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో పాస్‌పోర్ట్ ఆన్లైన్ బుకింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది. అవసరమైన పత్రాలు.. భారత్‌లో విదేశీ ప్రయాణాలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పాస్‌పోర్ట్ దరఖాస్తుల సంఖ్య అదే స్థాయిలో పెరుగుతోంది. పాత నిబంధనల ప్రకారం పాస్‌పోర్ట్ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. అన్ని రకాల పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. అవన్నీ ఒకేవిధంగా ఉండాలి, ఎందులోనైన ఒక్క చిన్నతప్పు దొరికినా ఇక అంతే సంగతి కథ మళ్లీ మొదటికి వచ్చేది. ఒకవేళ అన్ని ఉన్నా ఇచ్చిన సమాచారాన్ని నిజ నిర్ధారణ చేసుకునేందుకు పోలీస్ విచారణ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ప్రజల సౌలభ్యం కోసం తాజాగా విదేశాంగ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు దరఖాస్తుతోపాటు నాలుగు పత్రాలు ఉంటే చాలు వారం రోజుల్లో పాస్‌పోర్ట్ చేతిలో ఉంటుంది. ఆధార్‌కార్డు(ఇందులో డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి), ఎలక్ట్రానిక్ ఫొటో ఐడెంటికార్డు, పాన్‌కార్డ్, లాయర్ అఫిడవిట్(స్థానికత, క్రిమినల్ రికార్ట్, ఇంటి చిరునామతో కూడిన వివరాలు పొందుపరిచి ఉండాలి) ఇవి సమర్పిస్తే చాలు ఇందులో ఉన్న సమాచారం నిజమని నిర్ధారించుకున్న తర్వాత పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. తగ్గనున్న దూరభారం.. మంచిర్యాలలో పోస్టాఫీస్‌కు అనుసంధానం చేస్తూ పాస్‌పోర్టు సేవలు ప్రారంభించనున్నారు. కార్యాలయం ఏర్పాటు, ఆఫీస్ నిర్మాణం సుమారుగా పూర్తయింది. ఆన్లైన్ ద్వారా స్లాట్స్ బుకింగ్ ప్రక్రియ మొదలైంది. రోజుకు 15 చొప్పున స్లాట్స్ బుకింగ్ అవుతున్నాయి. గతంలో వందకు పైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌కు వెళ్లేవారు. ఒక రోజు ముందుగానే అక్కడికి చేరుకొని లాడ్జీలు, బంధువుల ఇళ్లలో రెండ్రోజులు ఉండాల్సి వచ్చేది. మంచిర్యాలలో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు కావడంతో కుమురంభీం, మంచిర్యాల జిల్లాల ప్రజలకు ఎటూ వంద కిలోమీటర్లలోపే అందుబాటులోకి రానుంది. రెండు జిల్లాల ప్రజలు పాస్‌పోర్టు పొందడం ఇకపై సులభతరం కానుంది. -
రూ.17 స్పీడ్పోస్టుకు రూ.35 వసూలు..
ఆర్టీఏలో పోస్టల్ చార్జీల పేరిట భారీ దోపిడీ సాగుతోంది. ఏజెంట్ల చేతివాటం, అధికారుల ఏమరుపాటు కారణంగా వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఏటా స్పీడ్ పోస్టుల పేరిట వసూలు చేసిన కోట్ల రూపాయలకు ఆడిటింగ్ కూడా జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. 2008 నుంచి ఇలాగే పోస్టల్ చార్జీలు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఏంటీ సమస్య? ఆర్టీఏ కార్యాలయాల్లో రోజూ వాహనాల రిజి స్ట్రేషన్లు, పర్మినెంట్ లైసెన్స్‌లు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, ఆర్సీ డూప్లికేట్ ఇలా రకరకాల కార్డులు జారీ చేస్తుంటారు. జారీ చేసే స్మార్ట్ కార్డుల సంఖ్య రోజుకు దాదాపు 350కి పైగానే ఉం టుంది. నిబంధనల ప్రకారం వీటన్నింటినీ స్పీడ్ పోస్టుద్వారా పంపాలి. కానీ వీటిలో 80% అంటే దాదాపు 300 కార్డులు దళారుల చేతికే వెళ్తు న్నాయి. ఇందుకు వాహనదారుల వద్ద రూ.100 నుంచి 150 వరకు వసూలు చేస్తు న్నారు. అంటే అధికారుల సాయంతో ఏజెంట్లు నేరుగా చేతికే కార్డులు ఇస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. స్పీడ్ పోస్టు గురించి నిబంధనలు ఇవీ.. భారతీయ తపాలా సంస్థ పెట్టిన నిబంధనలు తెలంగాణ రవాణా శాఖలో అమలు కావ ట్లేదు. 40 గ్రాముల వరకు 350 కిలోమీటర్ల దూరం వరకు రూ.17 చార్జీ చేస్తారు. కానీ తెలంగాణ రవాణా శాఖ జారీ చేసే లైసెన్సుల దూరం మహా అయితే 15 కి.మీ. మించదు. జిల్లాల్లో ఈ పరిధి కాస్త అధికంగా ఉండొచ్చు. కార్డు బరువు 9 గ్రాములే ఉండటం గమనార్హం. ఇందులో కవర్ ఖర్చు ఒక్క రూపాయి అనుకున్నా కార్డు బట్వాడాకు అయ్యే ఖర్చు రూ.18 మాత్రమే. మరి రూ.35 ఎందుకు వసూలు చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ప్రజల నుంచి అక్రమంగా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న రవాణా శాఖలో ఈ విషయంపై ఇంతవరకూ అంత ర్గత ఆడిటింగ్ జరగకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ఇంటర్నరల్ ఆడిటింగ్ ఎందుకు జరగట్లేదు.. అదనంగా వసూలవు తున్న మొత్తం ఎవరి ఖాతాల్లోకి వెళ్తోంది.. దళారులు నేరుగా కార్డులు ఎలా ఇవ్వ గలుగుతున్నారనే వాటికి సమాధానం లేదు. 74 ఆఫీసుల్లో రోజుకు దాదాపు 50 కార్డులు మాత్రమే స్పీడ్ పోస్టు ద్వారా బట్వాడా అవుతున్నాయి. సీఎం, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం వాహనదారుల నుంచి ఆర్టీఏ అధి కారులు కోట్లాది రూపాయలు అక్ర మంగా వసూలు చేస్తున్నారు. తపాలా శాఖ నిబంధనలను కాదని, అదనంగా వసూలు చేస్తున్న రూ.17కు ఎందుకు లెక్క చెప్పరు? ఇలా వసూలవుతున్న కోట్ల రూపాయలను ఏం చేస్తున్నారు? ఈ విషయాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. దీనిపై తప్పకుండా ఏసీబీ విచారణ జరిపించాలి. – దయానంద్, తెలంగాణ ఆటో, మోటార్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దళారులను ఆశ్రయించొద్దు.. వాహనదారులు దళారులను ఆశ్రయించొద్దు. నిబంధనల ప్రకారం కార్డులన్నీ స్పీడ్ పోస్టులోనే తీసుకోవాలి. అలాంటివారిపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. – రమేశ్, జేటీసీ, ఆర్టీఏ చేతికిచ్చే వాటిలోనూ చేతివాటమేనా? మిగిలిన స్మార్ట్ కార్డులను తప్పనిసరిగా స్పీడ్పోస్టులోనే పంపాలని నిబంధనలు ఉన్నాయి. కాబట్టి వాటికి పోస్టల్ చార్జీల కింద రూ.35 వసూలు చేస్తున్నారని అనుకుందాం. కానీ ఏదైనా వాహనానికి ఎన్ఓసీ, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకున్నప్పుడు చేతికే ఇవ్వాలి. కానీ అధికారులు వీటికి ఇస్తున్న రశీదుల్లోనూ రూ.35 స్పీడ్ పోస్టు చార్జీలు కలిపి వడ్డిస్తుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 74 కార్యాలయాల్లో పోస్టు ద్వారా పంపుతున్న మొత్తం కార్డులు 3,700 స్పీడ్ పోస్టుకు వాస్తవంగా వసూలు చేయాల్సింది రూ.18 ప్రస్తుతం అదనంగా వసూలు చేస్తోంది రూ.17 3,700 కార్డులకు ఒకరోజు పడుతున్న అదనపు భారం రూ.62,900 22 పనిదినాలకు పడే భారం రూ.13,83,800 - భాషబోయిన అనిల్‌కుమార్ -
అద్దె ఇవ్వడం లేదని పోస్టాఫీస్‌కు తాళం
ఎలిగేడు(పెద్దపల్లి): ఎలిగేడు మండల కేంద్రంలో ఉన్న సబ్‌పోస్టాఫీస్ భవనానికి సంబంధించిన అద్దె ఇవ్వడం లేదని భవన యజమాని మంగళవారం పోస్టాఫీస్‌కు తాళం వేశాడు. పోస్టుమాస్టర్ రవికుమార్ వివరాల ప్రకారం... ఎలిగేడులో సబ్‌పోస్టాఫీస్ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. 2012– 17వరకు అగ్రిమెంట్‌తో రూ.2500 చెల్లిస్తున్నారు. 2018వరకు గ్రేస్పిరియడతో నడుస్తుండగా ఐదు నెలల క్రితం యజమాని అద్దెను 4500 పెంచి ఇవ్వాలని కోరాడు. విషయాన్ని సిబ్బంది ఉన్నతాధికారులకు వివరించారు. ఇప్పటి వరకు ఎలాంటి అద్దె రాకపోవడంతో పాటు, పెంచిన అద్దెపై స్పష్టత ఇవ్వకపోవడంతో యజమాని మంగళవారం తాళం వేశాడు. దీంతో మంగళవారం విధులకు వచ్చిన సిబ్బంది బయటే నిరీక్షించారు. -
జనం సొమ్ముతో జల్సా
అనంతపురం టౌన్: పోస్టాఫీసుల్లో అక్రమాలకు కొదవే లేకుండా పోతోంది. దొరికితే దొంగ...లేదంటే దొరే! అన్న చందంగా తపాలా అధికారులు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. రోజుకో చోట అక్రమాలు వెలుగుచూస్తున్నా.. కోట్లాది రూపాయాల జనం సొమ్ము స్వాహా అయినట్లు విచారణలో వెల్లడైనా.. తపాలా శాఖ సిబ్బందిపై ఎలాంటి చర్యలు లేవు. ఆ కేసుల్లో ఎలాంటి పురోగతీ కనిపించడం లేదు. వెలుగు చూసిన 75 వీరాపురం బీపీఎం అక్రమం అనంతపురం తపాలా డివిజన్ వ్యాప్తంగా 58 సబ్ పోస్టాఫీసులు, 410 బ్రాంచ్ పోస్టాపీసులున్నాయి. తపాలా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది అక్రమాలకు తెరలేపారు. ప్రజలడిపాజిట్లను ఖాతాల్లో జమ చేయకుండా సొంతానికి వినియోగించుకుంటూ కోట్లాది రూపాయాలను కొల్లగొట్టినా...ఎలాంటి చర్యలు లేకపోవడంతో దర్జాగా తిరుగుతున్నారు. తాజాగా రాయదుర్గం మండలం 75వీరాపురం బ్రాంచ్ పోస్టాఫీసులో బ్రాంచ్ పోస్టుమాస్టర్ (బీపీఎం) పోస్టాఫీసులో దాచుకుంటున్న ప్రజల సొమ్మును సొంతానికి వాడేసుకున్నాడు. కొన్నేళ్లుగా ఈ తంతు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టల్ ఖాతాదారుల పుస్తకాల్లో డబ్బులు కట్టినట్లు నమోదు చేసి పోస్టల్ ఖాతాదారులను నిలువునా ముంచినట్లు తెలుస్తోంది. బయటపడిందిలా.. 75–వీరాపురం గ్రామానికి చెందిన ఇద్దరు పోస్టల్ ఖాతాదారులు తపాలా శాఖ కొంత మొత్తాన్ని పొదపు చేశారు. గడువు ముగిసిన తర్వాత వారు బాండ్లను తీసుకొని డబ్బుల కోసం రాయదుర్గం సబ్ పోస్టాఫీసుకు వెళ్లారు. అయితే తమ పేరిట ఎలాంటి డిపాజిట్ లేదని సమాధానం ఇవ్వడంతో నాలుగు రోజుల క్రితం ఖాతాదారులు బీపీఎంను నిలదీశారు. 75–వీరాపురంలో పోస్టల్ ఖాతారులు చెల్లించిన సొమ్మును అక్కడి బీపీఎం సబ్‌పోస్టాఫీసులో జమ చేయకుండా కొన్ని సంవత్సరాలుగా సొంతానికి వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.లక్షల్లో ప్రజల సొమ్మును సొంతానికి వాడుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం 75–వీరాపురం బ్రాంచ్ పరిధిలోని ఖాతాదారులు తమ ఖాతాల్లోని నిల్వలను సరి చూసుకునే పనిలో నిమగ్నమైనారు. గ్రామీణుల నిరక్ష్య రాస్యతను ఆసరాగా చేసుకుని ఇప్పుడంటే బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి గానీ...ఒకప్పుడు గ్రామీణులంతా చిన్న మొత్తాలను తపాలాలోనే పొదుపు చేసుకునే వారు. పైగా ఎక్కువమంది నిరక్ష్యరాస్యులు ఉండడంతో బ్రాంచ్‌పోస్ట్ మాస్టర్లు వారి సొమ్మును స్వాహా చేయడం ప్రారంభించారు. వారి డబ్బు కట్టినట్లు పాస్‌బుక్కుల్లో రాసినప్పటికీ, ఆసొమ్ము ఖాతాల్లో జమ చేయకుండా సొంతానికి వాడుకునే వారు. ఎక్కడైనా బయటపడితే అప్పటికప్పుడు వారికివ్వాల్సిన మొత్తం ఇచ్చేసి వివాదాన్ని సద్దుమణిపించే వారు. ఇలా కొన్నేళ్ల తర్వాత స్వాహాల పర్వం రూ.లక్షలు దాటేయడంతో వారి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. తపాలా శాఖలో అక్రమాలు మచ్చుకు కొన్ని ♦ గార్లదిన్నె, నూతిమడుగు ఎస్ఓ (సబ్ఆఫీసుల్లో) పరిధిలోని రెండు చోట్ల సబ్ పోస్టు మాస్టర్ శ్రీనివాసులు అనే అధికారి విధులు నిర్వహిస్తున్నారు. రెండు చోట్ల దాదాపు రూ.3 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు నిగ్గులేల్చారు. వీటిపై సీబీఐ అధికారులు సైతం విచారణ జరిపారు. రెండేళ్లు కావస్తున్నా... కేసులో ఎలాంటి పురోగతి లేదు. ♦ ముద్దినేయనిపల్లి బ్రాంచ్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న ఉమేష్ అనే బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఉపాధి కూలీలకు అందాల్సిన నిధులను కాజేశాడు. వీటిని సైతం అధికారులు గుర్తించలేకపోయారు. ఉపాధి బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడంతో కూలీలు పోస్టాఫీసు ముందు ధర్నా నిర్వహించడంతో విచారణ చేపట్టిన అధికారులు రూ.50 లక్షలు కాజేసినట్లు తేల్చారు. ఇక్కడ సైతం చర్యలు లేవు. ♦ కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్దె బ్రాంచ్ పోస్టుమాస్టర్ కేశవనాయక్ ఏకంగా బాలికా సంరక్షణ పథకం డిపాజిట్లకు ఎసరు పెట్టాడు. డిపాజిట్లను ప్రజల నుంచి కట్టించుకుంటున్నాడు తప్పితే... ప్రధాన తపాలా కార్యాలయంలో మాత్రం లబ్ధిదారుల పేరిట నగదును మాత్రం జమ చేయలేదు. దీంతో బాండ్లు ఇవ్వాలని లబ్ధిదారులు 8 నెలల క్రితం బ్రాంచ్ పోస్టాఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడంతో ఈ అక్రమం సైతం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.3 లక్షలకు పైగా సొంతానికి వినియోగించుకున్నట్లు అధికారులు నిగ్గు తేల్చారు. అక్రమార్కులపై చర్యలు నిల్ పోస్టాఫీసుల్లో కోట్లు కొల్లగొట్టిన అక్రమార్కులపై చర్యలు లేకపోవడంతో పోస్టల్ అధికారులు బరితెగిస్తున్నారే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన అక్రమాలపై సైతం నేటికి విచారణే జరుగుతుండడంతో ప్రజల సొమ్మును దోచుకున్న పోస్టల్ అధికారులు దర్జాగా తిరుగుతున్నారు. అక్రమార్కుల నుంచి రికవరీ చేయడంపై సైతం ఉన్నతాధికారులు దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో అక్రమార్కులు దొరికితే దొంగ.. లేదంటే దొర అన్న చందంగా ప్రజల డబ్బులను సొంతానికి వినియోగించుకుంటున్నారు. కొందరు అధికారులైతే ప్రజల సొమ్మును అవసరాలను తీర్చుకున్న తర్వాత మూడు నెలలకు ఒకసారి జమ చేస్తున్నారనే ఆరోపణలు తపాలాశాఖ అధికారుల నుంచే వినిపిస్తున్నాయి. -
తత్కాల్ పాస్‌పోర్ట్‌కు ఆ లేఖలు అక్కర్లేదు
సాక్షి, అమరావతి: తత్కాల్ పద్ధతిలో పాస్‌పోర్ట్ తీసుకోవాలంటే ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. లేదంటే విదేశీ ప్రయాణం వాయిదా వేసుకోవాలి. అంతకుమించి మార్గం లేదు. సడలించిన నిబంధనల ప్రకారం ఇప్పుడా అధికారుల అవసరం లేదు. మూడు ధృవపత్రాలు సమర్పించి రూ.2,500 ఫీజు చెల్లిస్తే చాలు మూడురోజుల్లో పాస్‌పోర్టు తీసుకుని విదేశీ యానం చేసుకోవచ్చు. బ్రోకర్లకు డబ్బులు, ధృవపత్రాల కొరత, ఇవన్నీ ఇప్పుడు సమస్యలే కావు. పుట్టిన తేదీని ధృవీకరించి, నివాస ధృవపత్రం ఒక్కటుంటే చాలు పాస్‌పోర్ట్ తీసుకోవడం సమస్యే కాదు అంటున్నారు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డీఎస్ఎస్ శ్రీనివాసరావు. పాస్‌పోర్ట్ తీసుకోవడం ఇప్పుడు చాలా సులభమని స్పష్టం చేశారు. పాస్‌పోర్ట్ నిబంధనలు సడలించాక మారిన పరిస్థితులపై ఆయన సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రధాన పోస్టాఫీసుల్లో సౌలభ్యం చాలామంది పాస్‌పోర్ట్ కోసం పాస్‌పోర్ట్ సేవాకేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ పోస్టాఫీసుల్లోనూ (పీవో పీఎస్కే) ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్టాఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాస్‌పోర్టు కోసం దూర ప్రాంతాల నుంచి విజయవాడకు రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక వారం రోజులు పాస్‌పోర్ట్ రావడం లేటవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 పోస్టాఫీసుల్లోనూ, 2 పాస్‌పోర్ట్ సేవాకేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరో ఐదు పోస్టాఫీసులు త్వరలోనే ప్రారంభమవుతాయి. దరఖాస్తుకు పరిధి లేదు గతంలో ఫలానా పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన ఉండేది. ఇప్పుడా పరిధి లేదు. ఇండియాలో ఎక్కడి నుంచైనా, ఏ పాస్‌పోర్ట్ పరిధిలోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉదాహరణకు విజయవాడ వాసి నాగపూర్‌లో ఉంటే అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్‌కు ఐదేళ్ల కాలపరిమితి పాస్‌పోర్టు పద్దెనిమిదేళ్ల లోపు వారికి 5 ఏళ్ల కాలపరిమితికి మించి పాస్‌పోర్ట్ ఇవ్వము. కానీ 15 ఏళ్లు దాటి 18 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకుంటే తల్లిదండ్రులు కానీ, దరఖాస్తుదారుడు గానీ, పదేళ్లు కాలపరిమితి కావాలని కోరితే ఇస్తున్నాం. ఏడాది కాలపరిమితి ఉండగా దరఖాస్తు చేసుకున్నా.. దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 10 ఏళ్లు ఇస్తాం. సాధారణ పాస్‌పోర్ట్ పొందడం సులభతరం గతంలో సాధారణ పద్ధతిలో పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకుంటే చాలా ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడవన్నీ ఏమీ లేవు. చదువుకోని వారికి ఎస్ఎస్సీ కూడా అక్కర్లేదు. ప్రభుత్వం జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ తీసుకుని ఫోన్బిల్లు, గ్యాస్‌బిల్లు, ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు ఇలా ఏదో ఒకటి సమర్పిస్తే వచ్చేస్తుంది. త్వరలోనే ఆర్పీవో త్వరలోనే విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం వస్తుంది. నిర్మాణ దశలో ఉంది. ఇది వస్తే పాస్‌పోర్ట్ ప్రింటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. దరఖాస్తుల్లో గుంటూరు, కృష్ణా టాప్ ప్రస్తుతం పాస్‌పోర్టుకు దరఖాస్తుకు చేసుకునే వారిలో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. దీని తర్వాత వైఎస్సార్, చిత్తూరు జిల్లాల నుంచి దరఖాస్తులు ఎక్కువ. గతంలో కంటే ఇప్పుడు పాస్‌పోర్ట్ దరఖాస్తులు భారీగా పెరిగాయి. ఏపీలో రోజుకు 2,700 మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో వెయ్యి లేదా 1,200 మంది మాత్రమే దరఖాస్తు చేసుకునే వారు. పోలీస్ వెరిఫికేషన్ ఇబ్బంది లేదు గతంలో పోలీస్ వెరిఫికేషన్ క్లిష్టంగా ఉండేది. దరఖాస్తు ఆ చిరునామాలో లేకపోతే ఇబ్బంది ఉండేది. ఇప్పుడది లేదు. అతనికి కేవలం నేరచరిత్ర ఉందో లేదో మాత్రమే చూస్తారు. వెంటనే వెరిఫికేషన్ అయిపోతుంది. విద్యార్థులకు ఒకటే వెరిఫికేషన్ గతంలో విద్యార్థులు ఎక్కడైనా చదువుతుంటే, సొంతూరులోనూ, చదువుతున్న చోటా రెండు చోట్లా వెరిఫికేషన్ ఉండేది. ఇప్పుడా నిబంధన లేదు. ఏ చిరునామా అయితే దరఖాస్తులో పెట్టాడో అక్కడే చూస్తారు. దీనివల్ల చాలామంది విద్యార్థులు త్వరగా పాస్‌పోర్ట్ పొందుతున్నారు. మొబైల్ యాప్‌తోనూ.. పాస్‌పోర్ట్ దరఖాస్తు కోసం ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎం–సేవా అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చేయగానే మెసేజ్ వస్తుంది. మెసేజ్ చూపించి, డాక్యుమెంట్లు ఇస్తే సరిపోతుంది. స్మార్ట్‌ఫోన్ ఉన్న ఎవరైనా మొబైల్ ద్వారానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. గతంలో తత్కాల్‌కు ఐఏఎస్, ఐపీఎస్ ఇచ్చే వెరిఫికేషన్ లేఖలు అవసరం ఉండేవి. ఇప్పుడు అవసరం లేదు. ధృవపత్రాల్లో మూడు సమర్పించి, తత్కాల్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు, బ్యాంకు పాస్ బుక్కు ఇలా ఏవైనా మూడు ధృవపత్రాలు సమర్పిస్తే మూడు రోజుల్లో పాస్‌పోర్ట్ తీసుకోవచ్చు. 60 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు, 8 ఏళ్లలోపు చిన్నారులకు ఫీజులో 10 శాతం రాయితీ ఉంటుంది. ఇది తొలిసారి పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకునే సమయంలో మాత్రమే వర్తిస్తుంది. -
నేటి నుంచి ఐపీపీబీ
సుజాతనగర్ : తపాలా శాఖ సేవలు నేటి నుంచి మరింతగా అందుబాటులోకి రానున్నాయి. ఖాతాదారుల ఇళ్ల వద్దకే బ్యాంకింక్ సేవలను తీసుకెళ్లేలా ప్రభుత్వం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ)కి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా నేటి నుంచి దేశవ్యాప్తంగా 650 బ్రాంచీల్లో ఐపీపీబీని ఒకేసారి ప్రారంభించనున్నారు. పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్న ప్రధాన పోస్టాఫీస్, సబ్ పోస్టాఫీస్, బ్రాంచి పోస్టాఫీస్‌ల ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, పోస్ట్మన్లు ఈ సేవలు అందించనున్నారు. పోస్టాఫీస్‌కు వెళ్లలేని వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, పని ఒత్తిడి ఉండేవారికి ఈ సేవలు మరింతగా ఉపయోగపడనున్నాయి. వేలిముద్ర ద్వారా లావాదేవీలు పోస్టాఫీస్‌లో ఖాతా తెరిచిన వారు వేలిముద్రల ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఇందుకుగాను పోస్టాఫీస్‌లో జీరో అకౌంట్ తెరిచేందుకు సెప్టెంబర్ 10 వరకు గడువు ఇచ్చారు. తమ ఆధార్, మొబైల్ నంబర్లను ఇచ్చి ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. ఖాతా ప్రారంభించగానే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. లావాదేవీల అనంతరం వెంటనే సెల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఇందు లో సేవింగ్స్ ఖాతా(ఎస్బీ) తెరిచేవారు రూ.100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ ఖాతా తెరవాలనుకున్నవారు రూ.1000 డిపాజిట్ చేయాలి. సేవింగ్స్ ఖాతాలో రూ.ఒక లక్ష వరకు డిపాజిట్ చేసుకునే సౌకర్యం ఉంది. అంతకంటే ఎక్కువగా డిపాజిట్ చేయాలనుకునేవారు దీనికి అనుబం ధంగా మరో ఖాతాను తెరవాల్సిఉంటుంది. సేవలు ఇలా.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఖాతాదారులు అనేక రకాల సేవలు ఇంటివద్దనుంచే పొందే వీలుంది. తమఖాతా నుంచి నగదును తీసుకోవాలంటే కేటాయించిన నంబర్‌కు ఫోన్ చేసి ఎంత కావాలో చెపితే ఆ మొత్తాన్ని ఇంటికే తీసుకొస్తారు. సంబందిత పరికరం సహాయంతో వేలిముద్ర ద్వారా ఖాతా నుంచి నగదును చెల్తిస్తారు. గరిష్టంగా రూ.20 వేల వరకు ఇంటి వద్దకే తీసుకొస్తారు. అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే వారు పోస్టాఫీస్‌కు వెళ్ళాల్సిందే. ఖాతాదారులకు ఇచ్చే క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కార్డు స్కాన్ చేయడం ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు. ఖాతాదారులు విద్యుత్, ఫోన్, తదితర బిల్లులు చెల్లింపులు చేసుకోవచ్చు. నెఫ్ట్, ఆర్‌టీజీఐ, ఐఎంపీఎస్ వంటి చెల్లింపులు చేయవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం కూడా అవకాశం ఉంది. ఎస్ఎంస్, మిస్డ్‌కాల్ బ్యాంకింగ్ సేవలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రాయితీలు, పథకాల చెల్లింపులు, విద్యార్ధులకు చెల్లించే స్కాలర్షిప్లు కూడా ఈ ఖాతాల ద్వారా జరిపే అవకాశాలు ఉన్నాయి. చిరువ్యాపారులు, కిరాణ వర్తకులు, రైతులు క్యూఆర్ కార్డు ద్వారా నగదు రహిత సేవలను పొందవచ్చు. ప్రయాణంలో నగదు భద్రతపై ఎలాంటి దిగులు ఉండదు. ఎరువులు, విత్తనాల కొనుగోలుకు క్యూఆర్ కార్డును వినియోగించవచ్చు. రుణాలూ పొందవచ్చు. రెండో దశలో అవకాశం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సదుపాయం మొదటి దశలో ఖమ్మం టౌన్ పరిధిలోని 11 సబ్ పోస్టాఫీస్‌లు, ఒక హెడ్ ఆఫీస్, 02 బ్రాంచ్ ఆఫీసులు మొత్తం 13 పోస్టాఫీస్‌లకు మాత్రమే ఇచ్చారు. రెండవ దఫాలో మరో 1000 పోస్టాఫీస్‌లకు ఈ అవకాశం కల్పిస్తారు. అప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని పోస్టాఫీసుల్లో ఐపీపీబి సదుపాయం అందుబాటులోకి వస్తుంది. –టి.శివరామ ప్రసాద్, కొత్తగూడెం హెడ్ పోస్ట్ మాస్టర్ -
అడిగిన పత్రాల ధ్వంసం నేరమే
తనకు పోస్ట్ చేసిన 37 ఉత్తరాలు ఎక్కడినుంచి వచ్చాయి, ఎవరు బట్వాడా చేశారు, అవి ఏరోజు గమ్యస్థానం చేరాయి, చేరిన రుజు వులు ఏవి అని ఒక పౌరుడు పోస్టాఫీసు అధికారులను అడిగాడు. ఒకటి నుంచి 21 వరకు రికార్డు లేదని, గడువు తీరిందని తొలగించామని చెప్పారు, మిగిలిన చీటీలు ఇచ్చారు. ఆర్టీఐ దరఖాస్తు చేసినప్పుడు మొదటి అప్పీలు నాటికి ఉన్నా వాటిని తొలగించడం కోసం వేరు చేసి కుప్పలో పడేశారని వివరించారు. కాగితాలు ఉన్నప్పటికీ వాటిని ధ్వంసం చేసి పౌరుడికి ఇవ్వకపోవడం ఆర్టీఐ చట్టం సెక్షన్ 20 కింద జరి మానా విధించదగిన నేరమే అవుతుందని కమిషన్ నోటీసు జారీ చేసింది. ఆర్టీఐ దరఖాస్తు దాఖలయ్యేనాటికి దస్తావేజులు ఉండి ఉంటే, ఆనాటికే నిలిపే గడువు దాటిపోయినా వాటిని తొలగించకుండా అడిగిన పౌరుడికి ఇవ్వాలనే విధానం ప్రవేశపెట్టాలి. ఊరికే ధ్వంసం చేసే బదులు, అడిగిన వారికి లేదా వాటి సొంతదారులకు ఎందుకు ఇవ్వరో అర్థం కాదు. ఆ సమాచారం కోసం ఒకవైపు చట్టం ప్రకారం అడుగుతూ ఉంటే, మరోవైపు వాటిని ధ్వంసం చేసి రికార్డులు లేవు పొమ్మనడం సమంజసం కాదు. దీన్ని తీవ్రమైన విషయంగా పరిగణించి కమిషన్ తమిళనాడు ఈరోడ్ డివిజన్ తపాలాశాఖ ప్రజాసమాచార అధికారికి గరిష్ఠ జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలపాలనే లేఖ జారీచేసింది. దానికి అధికారి జవాబిస్తూ 37 తపాలా లేఖల డెలివరీ చిట్టీలు ఇవ్వాలన్న ఆర్టీఐ దరఖాస్తు తమకు 22.8.2017న చేరిందని, 22నుంచి 37 వరకు చిట్టీలు ఇవ్వడానికి 54 రూపాయలు పంపాలని 11.9. 2017న అడిగామని, అతను ఆ సొమ్ము చెల్లించగానే ప్రతులు 3.10.2017న ఇచ్చామని తెలిపారు. 1 నుంచి 21కి సంబంధించిన చిట్టీలు తొలగించామని చెప్పారు. మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా పాత దస్తావేజుల తొలగింపునకు సంబంధించిన రుజువు ఇవ్వాలని కోరారు. వాటిని వేరు చేసి ఆ తరువాత విధి విధానాల ప్రకారం తొలగించామని మాత్రం అధికారి జవాబు చెప్పారు. మీరు ఎక్కడ ఆ దస్తావేజు లను కుప్పపోశారో చూపితే తానే తన కాగితాలను వెతుక్కుంటానని కూడా ఆయన మరొక దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ అందుకు అంగీకరించలేదు. తపాలాశాఖ నియమాల ప్రకారం దేశీయ ఉత్తరాల పంపిణీ పత్రాలను 18 నెలలు, స్పీడ్ పోస్టు ఉత్తరాల పత్రాలు ఆరు నెలలు దాస్తామని 11.9.2017న ఆర్టీఐ దరఖాస్తు వేసే నాటికే ఆ రికార్డులను పాత కాగితాలలో కుమ్మరించామన్నారు. అప్పీలు నాటికి పాత కాగితాలు నిజంగా నిర్మూలించకపోయినా కట్టలుకట్టి కుమ్మరించామని, బయటకుతీసే అవకాశం లేదని చెప్పారు. ఆర్టీఐ చట్టంలో కుమ్మరించిన కాగితాల కుప్పనుంచి వెలికి తీయాలనే నియమం లేదని, కనుక తాము ఇవ్వలేదని, తన నిర్ణయాన్ని మొదటి అప్పీలు అధికారి కూడా అంగీకరించారని, తాము కేవలం డిపార్ట్మెంట్ నియమాలను అనుసరించి మాత్రమే వ్యవహరించామని, కనుక తమపై జరిమానా విధిం చకూడదని పీఐఓ వాదించారు. మొదటి అప్పీలు అధికారి పారేసిన కుప్పనుంచి దరఖాస్తుదారు కోరిన కాగితాలు వెతకాలని ఆదేశించలేదని, కనుక తాము ఆ ప్రయత్నం చేయలేదని కూడా వివరించారు. ఆ కుప్పను మార్చి 2018 నాటికి పూర్తిగా తొలగించామని చెప్పారు. ఆర్టీఐ చట్టం రికార్డు దాచే నియమాలను నిర్ధారించలేదని అన్నారు. ఈ దరఖాస్తుదారు ఏడు సార్లు కాగితాల ప్రతులు కోరితే తాము ఇచ్చామని 6.6.2018న జరిగిన అప్పీలు విచారణలో అతను హాజరు కాలేదని అంటే ఆయన దీనికి తగిన ప్రాధాన్యం ఇవ్వనట్టేనని వాదించారు. ఈ కారణాల వల్ల సీఐసీ ఆదేశాన్ని పాటించలేక పోయామని, అడిగిన ప్రతులు ఇవ్వలేకపోయామని వివరించారు. 2017 ఆగస్టు నుంచి దరఖాస్తుదారు తన పత్రాల గురించి పోరాడుతూ ఉంటే తపాలా కార్యాలయం వారు 2018 మార్చిలో రికార్డులను తొలగించారని తేలింది. సెక్షన్ 2(ఎఫ్) 2(జె)లో నిర్వచనాల ప్రకారం సమాచారం అంటే తమ వద్ద ఉన్న కాగితాలు అని స్పష్టంగా ఉంది. ఆర్టీఐ దరఖాస్తు చేసిన నాటికి ఉన్న పత్రాలను అప్పీలు విచారణ దశలో ధ్వంసంచేయడం, సెక్షన్ 20లో చెప్పినట్టు తెలిసి తొలగించడం కిందికి వస్తుందని, దురుద్దేశం లేకపోయినా తెలిసి తొలగించడం నిరాకరణే అవుతుంది. అయినా పీఐఓ వివరణను పరిగణించి గరిష్ఠ జరిమానా 25 వేలు కాకుండా 25 వందల రూపాయల జరిమానా విధించాలని కమిషన్ నిర్ణయిం చింది. ఊరికే ధ్వంసం చేసే బదులు ఆ పత్రాలు మిన హాయింపుల కిందికి రాకపోతే సంబంధిత వ్యక్తులకు ఇవ్వడం గురించి తపాలా శాఖ ఆలోచించాలని కమిషన్ సూచించింది. (CIC/POSTS/ A/2018/1194 69 టీఎస్ శివకుమార్ వర్సెస్ పీఐఓ తపాలాశాఖ కేసులో 6.8.2018న సీఐíసీ తీర్పు ఆధారంగా). వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఇక ఠంచన్‌గా పింఛన్
రాయగిరి గ్రామానికి చెందిన ‘ఆసరా’లబ్ధిదారులు పింఛన్ డబ్బుల కోసం మండల కేంద్రంలోని పోస్టాఫీసుకు వచ్చారు. తీరా అక్కడి సిబ్బంది డబ్బు లేదన్నారు. చేసేది లేక వారంతా వెనుదిరిగారు. మరుసటి రోజు మళ్లీ వచ్చారు. గంటల తరబడి నిరీక్షిస్తే కానీ, పింఛన్ల పంపిణీ మొదలుపెట్టలేదు. ఉన్న కొద్దిపాటి నగదు కొందరికే వచ్చింది. దీంతో మిగిలిన వారు నిరాశతో ఇంటిముఖం పట్టారు... ఇలా పింఛన్ డబ్బుల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పడుతున్న కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. ఈ నెల నుంచి బ్యాంకుల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. సాక్షి, యాదాద్రి : ఆసరా పథకం ద్వారా పింఛన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువుల కష్టాలు తీరే రోజులు వచ్చాయి. తపాలా కా ర్యాలయాల ద్వారా కాకుండా లబ్ధిదారుల బ్యాం కు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనికి సంబంధించి కొన్నాళ్ల క్రితమే ఆదేశాలు వచ్చినప్పటికీ ఈ నెలనుంచే అమలు చేసేం దుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎందుకంటే.. ఆసరా లబ్ధిదారులకు ప్రతి నెలా మొదటి వారంలోనే పింఛన్ డబ్బులు చేతికందాలి. ఈ డబ్బును ప్రస్తుతం తపాలా కార్యాలయాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. పోస్టాఫీస్‌లకు బ్యాంకుల నుంచి డ బ్బు వస్తే తప్ప పంపిణీ చేయలేని పరిస్థితి. కానీ, బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా పోస్టాఫీస్ లకు డబ్బు చేరడం లేదు. దీంతో ఒక్కోసారి రెం డు నెలలు కూడా పింఛన్ అందడం లేదు. పింఛన్ కోసం లబ్ధిదారులు పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి క్యూలో నిలబడడం, తెల్లవారుజాము నుంచి పడిగాపులు గాయడం జరుగుతుంది. వీటికి తోడు ఇంటర్నెట్ సిగ్నల్స్ అందకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో సిగ్నల్స్ కోసం భవనాలపైకి, ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు. ఇలాంటి తరుణంలో ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని నివారించేందుకు లబ్ధిదారుల ఖాతాల్లోనే పింఛన్ డబ్బు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అదేశాలు అందాయి. వచ్చే నెల నుంచి అమలు చేయడానికి చర్యలు చేపట్టారు. ఆధార్, మొబైల్ నంబర్ తప్పనిసరి జిల్లా వ్యాప్తంగా ఆసరా పింఛన్‌దారులు 92,934 మంది ఉన్నారు. వీరందరికీ పోస్టాఫీసుల ద్వారా ప్రతి నెలా రూ.11కోట్లు పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి పోస్టాఫీసుల్లో పింఛన్లు పంపిణీ చేయకుండా లబ్ధిదారులు ఖాతాల్లో వేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటికే పలువురు లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. లేని వారికి జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరవాలని కలెక్టర్ అనితారామచంద్రన్ బ్యాంకు అధికారులను ఇటీవల ఆదేశించారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం, లబ్ధిదారులు సెల్‌ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. దీంతో బ్యాంకుల్లో పింఛన్ జమ కాగానే ఆసమాచారం లబ్ధిదారుల సెల్‌కు మెసేజ్ వస్తుంది. దీని వల్ల పింఛన్‌దారుల కష్టాలను గట్టెక్కించడానికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. -
త్వరలో పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టులు
ఆమదాలవలస : పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ జోనల్ పోçస్టుమాస్టర్ జనరల్(పీఎంజీ) ఎలీషా అన్నారు. ఆమదాలవలసలో నూతనంగా నిర్మిస్తున్న ప్రధాన తపాలా కార్యాలయాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటిస్తూ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని పోస్ట్‌మాస్టర్ వాన శ్రీనివాసరావును సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 564 ప్రధాన తపాలా కార్యాలయాలు ఉన్నాయని, ప్రతి గ్రామంలో బ్రాంచ్ పోస్టాఫీస్ కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు. స్థానికంగా పోస్టల్ ఏటీఎం ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లబ్ధి పొందే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి పోస్టల్ శాఖ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఇప్పటికే గ్రామాల్లో జీడీఎస్ ఉద్యోగుల ద్వారా సేవలు అందిస్తున్నామని, త్వరలోనే మరో 2000 మంది జీడీఎస్ సిబ్బందిని నియమించనున్నామని చెప్పారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డబ్ల్యూ నాగచైతన్య, ఎ.ఎస్ఆర్.ఆర్.నవీన్‌కుమార్ పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. -
జాబులందించే జాబ్‌లో
స్వాతంత్య్రం వచ్చిన 66 ఏళ్లకు 2013 మార్చి 8న మహిళ దినోత్సవం రోజున అందరూ మహిళలే నిర్వహించే పోస్ట్ ఆఫీసు ఢిల్లీలో ఏర్పాటైంది. కానీ అంతకంటే 30 ఏళ్ల ముందుగానే పోస్ట్–ఉమన్‌గా ఎంపికై ఎంతో ధీమాగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు ఇంద్రావతి. ఇప్పటికీ ఆ బాధత్యలను ఇంకా పురుషులే ఎక్కువగా నిర్వహిస్తున్న ఈ కాలంలోనూ దాదాపు రిటైర్మెంట్ వరకూ తన పోస్టును విజయవంతంగా నిర్వహించారామె. ఈ మధ్యే రిటైర్ అయిన ఆమె కథ ఇది. పోస్ట్‌మ్యాన్ అనే మాటనే ఎక్కువగా వింటాం. వాళ్లనే చూసి ఉంటాం. కాని ఇంద్రావతి పోస్ట్ ఉమన్. ఢిల్లీ ఫస్ట్ పోస్ట్ ఉమన్‌గా రిక్రూట్ అయ్యి సేవలు అందించారామె. ఆడవాళ్లు చేయగలిగే ఉద్యోగాలలో వారి ప్రేవేశానికే ప్రతిబంధకాలు ఉన్న రోజుల్లో ఆడవాళ్లకు ఏ మాత్రం ప్రవేశం లేని పోస్ట్‌మేన్ రంగంలో విజయవంతగా సర్వీసు పూర్తి చేశారామె. ప్రయత్నిస్తే వీలు లేని ఉద్యోగాల్లో కూడా విజయం సాధించవచ్చు అంటారామె. కష్టాల నుంచి... హర్యానాలోని చిన్న పల్లెటూరు ఇంద్రావతి స్వస్థలం. అమ్మాయిలను అసలు బడికే పంపని ఊరది. అలాంటి ఊళ్లో ఇంద్రావతి వాళ్లది ఉమ్మడి కుటుంబం. వాళ్లమ్మ అకస్మాత్తుగా చనిపోవడంతో ఉమ్మడికుటుంబంలోంచి వాళ్లను ఉన్నపళంగా బయటకు పంపించేశారు. దాంతో ఇంద్రావతి వాళ్లు ఆ ఊళ్లో బడిలో తలదాచుకున్నారు. ఆమె అక్కడ అక్షరాలు దిద్దడం నేర్చుకున్నారు. ఆ శ్రద్థను చూసి ఇంద్రావతి తండ్రి ఆమెను బడిలో చేర్పించారు. అలా ఆమె చదువు సాగింది. అందుకే ఒక విషాదమే తన చదువుకు తోడ్పడిందని చెబుతారు ఇంద్రావతి. ఉద్యోగమూ అంతే. అనుకోకుండా పంపిన దరఖాస్తుతో కొలువు ఖరారైంది. 1982, సెస్టెంబర్ 13న పోస్ట్(ఉ)మ్యాన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ‘నేను చేరినప్పుడు ఆ జాబ్‌లో అందరూ మగవాళ్లే. అసలు ఆడవాళ్ల వస్తారని అనుకుని ఉండరు. అందుకే ఆ కొలువులో ఆడవాళ్లకు ఓ ప్రాపర్ టైటిల్ ఇవ్వలేదు. నన్ను కూడా పోస్ట్‌మ్యాన్ అనే పిలిచేవారు.’ అని వివరణ ఇస్తారు ఇంద్రావతి. ఒక్కోరోజు 70 ఉత్తరాలు... ఇంద్రావతి మొదట్లో హర్యానాలోని రోథక్‌లో ఉండేవారు. ఉద్యోగమేమో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో. ఢిల్లీకి రోజూ ట్రైన్లో వచ్చేవారు. ఉదయం తొమ్మిదింటికి డ్యూటీ మొదలయ్యేది. పోస్ట్ ఆఫీస్‌కు వచ్చిన ఉత్తరాలన్నిటినీ బస్సు వెళ్లే దారి ప్రకారంగా విభజిస్తారు. ఆ తర్వాత ఆ రూట్ ప్రకారమే బట్వాడా చేస్తారు. వాటిని ఆయా గడపల్లో వేయడానికి రోజుకు కనీసం ఎనిమిది కిలోమీటర్లు నడిచేవారట ఆమె. ఒక్కోరోజైతే 70 ఉత్తరాల దాకా ఉండేవట. బట్వాడా కోసం ఎన్నో ఇళ్ల తలుపులు తట్టాలి. వాటిల్లో అపార్ట్మెంట్లూ ఉంటాయి. కొన్నిటికి లిఫ్ట్స్ ఉంటాయి. కొన్నిటికి ఉండవు. మెట్లెక్కాల్సిందే. ‘ఢిల్లీ ఫస్ట్ పోస్ట్ ఉమన్నే కాదు.. మా ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబ్ దొరికిన ఫస్ట్ లేడీని, ఇంకా చెప్పాలంటే మా ఊరి తొలి ప్రభుత్వోద్యోగిని కూడా నేనే. ఈ క్రెడిట్ నాకూ ప్రౌడ్‌గానే అనిపిస్తుంటుంది. మా ఊళ్లో వాళ్లూ గొప్పగానే చూస్తారు’ అంటారు ఇంద్రావతి నవ్వుతూ. కోడలికీ స్ఫూర్తి.. ఇంద్రావతికి ఇద్దరు పిల్లలు. అమ్మమ్మ, నానమ్మ కూడా అయ్యారు. కోడలు వచ్చాక ఫక్తు అత్తగారిలా ప్రవర్తించలేదామె. తనకు చదువు విలువ తెలుసు కాబట్టి కేవలం ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్న కోడలిని ఉన్నత చదువులకై ప్రోత్సహించారు. ఇప్పుడు కోడలు, కూతురు ఇద్దరూ పోస్ట్గ్రాడ్యూయేట్లే. మహిళలకు ఆర్థిక స్వావలంబన ఉండాలనే ఉద్దేశంతో కోడలినీ ఉద్యోగస్తురాలిని చేసింది. వింతగా చూసేవారు... వేధించేవారు కూడా... పోస్ట్ ఉమన్‌గా తన జీవితం ఎలా ఉంది అని అడిగితే.. ‘మొదట్లో చాలా చాలెంజింగ్‌గా అనిపించేది. యూనిఫామ్ వేసుకొని ఉత్తరాలు పంచడానికి వెళ్తుంటే అందరూ వింతగా చూసేవాళ్లు. కొంతమంది గేలి చేశారు. కొంత మందైతే దొంగననుకునే వాళ్లు. ఇంకొంతమంది బిచ్చగత్తెననీ భ్రమపడ్డారు. అ యితే విషయం తెలుసుకున్నాక వాళ్లే గౌరవించడం మొదలుపెట్టారు. ఒకసారి ఒక తాగుబోతు నాతో మిస్ బిహేవ్ చేశాడు. కాని మత్తు దిగాక మరుసటిరోజు నేను పనిచేస్తున్న పోస్టాఫీస్‌కు వచ్చి క్షమాపణ కోరాడు. తాను అలా ప్రవర్తించినందుకు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. నా జీవితంలో అలాంటి సంఘటన అదే మొదలు, ఆఖరు కూడా. చదువురాని వాళ్లు పర్సనల్ లెటర్స్‌ను నాతో చదివించుకునేవాళ్లు. ఎంతో నమ్మకం ఉంటేనే కదా.. చదవమంటారు! చిన్న వాళ్లు, పెద్దవాళ్లు అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. ఢిల్లీ ఫస్ట్ పోస్ట్ ఉమన్‌ని అని తెలిసీ నాతో సెల్ఫీ దిగడానికి ఆరాటపడుతుంటారు. వాళ్ల అభిమానం చూస్తుంటే హ్యాపీగా ఉంటుంది.’ అంటారు ఇంద్రావతి. ఇంద్రావతి తొలిసారి ఉద్యోగ బాధ్యతలు తీసుకున్న న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ దగ్గరలోని గోల్ ఢాక్–ఖానాలోనే గత నెలాఖర్లో పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆ ఆఫీస్ సిబ్బంది ఆమెకు ఘనంగా వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు. ‘యోగా చేస్తాను. నా మనవరాళ్లతో కలిసి స్విమ్మింగ్‌కు వెళ్తాను. నాకిష్టమైన వ్యాపకాలతో రిటైర్మెంట్ లైఫ్‌నూ అంతే బిజీగా గడపాలని డిసైడ్ చేసుకున్నా’ అంటారు ఇంద్రావతి. -
ఆసరా..బ్యాంకుల్లోనే !
ఇన్నాళ్లు ఆసరా పింఛన్లు పోస్టాఫీసు ద్వారా ఇచ్చేవారు. ఈ పద్ధతికి పులిస్టాప్ పెట్టాలని సర్కారు నిర్ణయించింది. ఇకనుంచి వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు పింఛన్‌దారుల ఖాతాల వివరాలు త్వరగా ఇవ్వాలని ఆయా మండలాల ఎంపీడీఓలు, మున్సిపాలిటీ కమిషనర్లకు సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఉమ్మడి జిల్లాలో 4,21,008 మంది పెన్షన్‌దారులు ఉన్నారు. నల్లగొండ : ఆసరా పింఛన్‌దారుల కష్టాలు తీరనున్నాయి..! పింఛన్ పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక సమస్యల వల్ల పింఛన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం బ్యాంకు ఖాతాల మార్గాన్ని ఎంచుకుంది. నిధుల కొరత వల్ల ప్రభుత్వం రెండు నెలలకోసారి పింఛన్లు పంపిణీ చేస్తోంది. దీంతో లబ్ధిదారులు ఒక నెల పింఛన్, మరొక నెలలో తీసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ నెల పింఛన్ ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని అయో మయ పరిస్థితి నెలకొంది. ప్రతి నెల మొదటివారంలో చేతికందాల్సిన పింఛన్ ఆలస్యం కావడంతో నెలాఖరు వరకు ఎదరుచూడాల్సి వస్తోంది. అదీగాక పింఛన్ల కోసం లబ్ధిదారులు పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఇలాంటి కష్టాల నుంచి గట్టేక్కేందుకు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాల వివరాలు మండలాల్లో అయితే ఎంపీడీఓలకు, పట్టణాల్లో మున్సిపల్ క మిషనర్‌కు ఇవ్వాలని పేర్కొన్నారు. అన్నీ ఆధారాలు తప్పనిసరి... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసరా పింఛన్‌దారులు 4,21,008 మంది ఉన్నారు. ఈ లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా ప్రతి నెల నల్లగొండ జిల్లాలో రూ.23.33 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.17.19 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.9.90 కోట్లు పంపిణీ చేస్తున్నారు. వచ్చేనెల నుంచి పోస్టాఫీసుల్లో పింఛన్లు పంపిణీ చేయడం ఉండదు కాబట్టి బ్యాంకుల్లో ఆర్థికలా వాదేవీలు నిర్వహిస్తున్న ఖాతాల వివరాలు మాత్రమే అధికారులకు ఇవ్వాలి. దీంతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించాలి. ప్రధానంగా లబ్ధిదారులు సెల్‌ఫోన్ నంబరు తప్పనిసరిగా ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీంతో బ్యాంకుల్లో పింఛన్ జమకాగానే ఆ సమాచారం లబ్ధిదారుల సెల్‌నంబరుకు చేరుతుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటిదాకా ఈ సెల్‌నెంబరు అనేది లేకపోవడంతో వికలాంగులు, మరికొంత మంది లబ్ధిదారులు నష్టపోవడం జరిగింది. వికలాంగుల సదరమ్ సర్టిఫికెట్ గడువు ముగిశాక, మళ్లీ వైద్య పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్ పొందే వరకు (రీ అసెస్మెంట్) పింఛన్లు పంపిణీ చేయరు. తిరిగి సర్టిఫికెట్ పొందాక ఆగిపోయిన పింఛన్లు (ఎరియర్స్) పంపిణీ చేస్తారు. అయితే చాలా మంది వికలాంగులు ఈ విషయం తెలియక నష్టపోతున్నారు. కానీ ఇప్పుడు అలా కాకుండా బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమ చేయాలనుకోవడం, ఆ సమాచారాన్ని లబ్ధిదారుల సెల్‌నంబరుకు చేరవేయడంతో మేలు జరుగుతుంది. ఈ సారైనా అమలయ్యేనా..! పింఛన్ల పంపిణీ బ్యాంకుల ద్వారా చేయాలన్న ఆలోచన పాతదే. 2008–09లో మున్సిపాలిటీల్లో పింఛన్ల పంపిణీ బ్యాంకుల ద్వారానే చెల్లించారు. వివిధ కారణాల దృష్ట్యా మళ్లీ పోస్టాఫీసులకు మార్చారు. మళ్లీ పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పింఛన్‌దారులను బ్యాంకుల వైపునకు మళ్లించే ప్రయత్నం చేశారు. కానీ ఆచరణలో సాధ్యం కాకపోవడంతో పోస్టాఫీసులనే కొనసాగిస్తున్నారు. కొంత కాలంగా పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుండటం, పలు చోట్ల పింఛన్ నిధులు దుర్వినియోగం అవుతుండటంతో బ్యాంకులైతేనే శ్రేయస్కరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. మేనెల నుంచే బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేయాలని నిర్ణయించింది.బ్యాంకు ఖాతాలు ఇవ్వాలని చెప్పాం ఆసరా చెల్లింపులు బ్యాంకుల ద్వారా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెర్ప్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు తెలియజేయడం జరిగింది. వీలైనంత త్వరగా బ్యాంకు ఖాతాలు ఇవ్వాలని చెప్పాం. మే నెల నుంచి పింఛన్ చెల్లింపులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తారు. సెల్‌నంబరు, ఆధార్‌కార్డు తప్ప నిసరి. – రింగు అంజయ్య, డీఆర్డీఓ -
పోస్ట్‌మాస్టర్ చేతివాటం
మిరుదొడ్డి(దుబ్బాక): నమ్మకానికి మారుపేరుగా నిలిచే పోస్టాఫీసులో బ్రాంచి పోస్టుమాస్టర్ చేతివాటం చూపిన వైనం మండల పరిధిలోని రుద్రారం ఫోస్టాఫీసులో బుధవారం వెలుగులోకి వచ్చింది. గత 31 నెలలుగా పోస్టాఫీసులో జమ చేసిన డిపాజిట్ డబ్బులను సబ్ పోస్టాఫీసు అకౌంట్‌కు చూపకుండా పోస్టుమాస్టర్ లత రూ.లక్షల్లో స్వాహా చేసినట్లు ఖాతాదారులు లబోదిబో మంటున్నారు. బ్రాంచి పోస్టాఫీసు ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా నిజాంపేట సబ్ ఫోస్ట్ ఆఫీస్ కింద మండల పరిధిలోని రుద్రారం బ్రాంచ్ పోస్టాఫీసులో 47 సుకన్య సంవృద్ధి అకౌంట్లు, 76 రికరింగ్ డిపాజిట్లు, సేవింగ్ బ్యాంక్, గ్రామీణ రూరల్ తపాలా జీవిత బీమా వంటి లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పోస్టుమాస్టర్ లత తీసుకుంటున్న డిపాజిట్లల్లో అనుమానాలు తలెత్తుతున్నట్లు గమనించిన కొందరు ఖాతాదారులు నిజాంపేట సబ్‌పోస్టాఫీసులో వాకబు చేశారు. తమ ఖాతా బుక్కుల్లో గత 31 నెలలుగా డిపాజిట్ చేస్తున్నప్పటికి సబ్ ఫోస్టాఫీసులో కేవలం రూ.4 వేలు మాత్రమే జమ అయినట్లు ఆన్లైన్లో చూపెట్టడంతో ఖాతాదారులు అవాక్కయ్యారు. దీంతో రుద్రారం బ్రాంచ్ ఫోస్టాఫీసులో జరుగుతున్న తతంగంపై మెదక్ సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ నికిత్, మేయిల్ పర్సన్ కరుణాకర్ బుధవారం రుద్రారం పోస్టాఫీసును ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పోస్టాఫీసులోని లావాదేవీలపై విచారణ చేపట్టారు. రికార్డుల పరిశీలనలో బ్రాంచ్ పోస్టుమాస్టర్ లత ఖాతాదారుల పాసుబుక్కుల్లో డబ్బులు జమచేసిన అనంతరం సబ్‌పోస్టాఫీసుకు రోజువారి అకౌంట్ చూపకుండా డబ్బులు స్వాహాచేసినట్లు పోస్టల్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్రాంచ్ పోస్టాఫీసుకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఖతాదారులకు న్యాయం చేస్తాం.. రుద్రారం బ్రాంచ్ పోస్టాఫీసులో జరిగిన సొమ్ము స్వాహాపై ఖాతాదారులు ఆందోళన చెందవద్దని మెదక్ సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ అంకిత్ అన్నారు. ఖతాదారుల పాసుబుక్కులను, రికార్డులను పూర్తిగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎంత సొమ్ము స్వాహా అయ్యిందో విచారిస్తున్నామని తెలిపారు. నష్టపోయిన ఖతాదారులకు బ్రాంచ్ పోస్టుమాస్టర్ నుంచి సొమ్మును రికవరీ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఖాతాదారులు శాంతించారు. అవకతవకలకు పాల్పడిన బ్రాంచ్ పోస్టుమాస్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. – మెదక్ సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ అంకిత్ -
పోస్టాఫీసు ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాదారులు 34 కోట్ల మందికి త్వరలోనే డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఖాతాలను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో పోస్టాఫీసు సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ఏ ఇతర బ్యాంకు ఖాతాలకు అయినా నగదు బదిలీ చేసుకోవచ్చని తపాలా శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది మే నాటికి అనుసంధానించుకునే అవకాశాన్ని ఖాతా దారులకు కల్పిస్తామని చెప్పారు. ఖాతాదారులు ఆమోదం తెలియజేస్తేనే అనుసంధానించడం చేస్తామన్నారు. పోస్టాఫీసు 34 కోట్ల సేవింగ్స్ ఖాతాల్లో 17 కోట్ల ఖాతాలు మంత్లీ ఇన్కమ్ స్కీమ్, రికరింగ్ డిపాజిట్లకు సంబంధించినవి కాగా, మిగిలినవి రెగ్యులర్ ఖాతాలు. దేశవ్యాప్తంగా తపాలా శాఖకు 1.55 లక్షల బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిని పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో అనుసంధానించనుంది. ఖాతాలను పోస్ట్‌పేమెంట్స్ బ్యాంకుతో అనుసంధానించిన తర్వాత ఇతర బ్యాంకుల మాదిరే అన్ని నగదు బదిలీ సేవలు వినియోగించుకోవడం వీలవుతుందని తపాలా శాఖ వర్గాలు తెలిపాయి. తపాలా శాఖ లోగడ జారీ చేసిన ప్రకటన మేరకు, ఈ నెలాఖరు నాటికి పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించి 650 శాఖలు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. -
పోస్టాఫీసు డిపాజిట్లకు సేవింగ్స్ ఖాతాతో పనిలేదు
న్యూఢిల్లీ: పోస్టాఫీసుల్లో డిపాజిట్ పథకాలను నిర్వహించే వారికి ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని ఆ శాఖ తీసుకుంది. డిపాజిట్లపై వడ్డీని, కాల వ్యవధి తీరిన తర్వాత డిపాజిట్ మొత్తాన్ని పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాల్లోనే డిపాజిట్ చేయాలని ఆ శాఖా గతేడాది ఆగస్ట్ 3న ఆదేశాలు జారీ చేసింది. తొలుత జనవరి 15 గడువుగా నిర్ణయించగా, దాన్ని 2018 ఏప్రిల్ 1కు పొడిగిస్తూ తర్వాత ఆదేశాలు జారీ చేసింది. దీంతో డిపాజిట్ చేసే వారు ప్రత్యేకంగా సేవింగ్స్ ఖాతా కూడా తెరవాల్సి ఉంటుంది.అయితే, దీని పట్ల డిపాజిట్‌దారులు సంతృప్తిగా లేరని ఆ శాఖ గుర్తించింది. ప్రత్యేకంగా బేసిక్ సేవింగ్స్ ఖాతా తెరిచేందుకు వారు సుముఖంగా లేనందున గత నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు తపాలా శాఖ గత నెల 23న జారీ చేసిన ఆఫీస్ ఆఫ్ మెమొరాండంలో పేర్కొంది. గతేడాది నవంబర్ నుంచి పలువురు చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులు కాల వ్యవధి తీరిన తమ డిపాజిట్ల కోసం సేవింగ్స్ ఖాతాలను తెరిచేందుకు నిరాకరించడం వంటి సంఘటనలు ఎదురయ్యాయి. దీంతో తపాలా శాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో పోస్టల్ డిపాజిట్ దారులు ఆధార్ సమర్పించాల్సిన గడువును కూడా నిరవధికంగా కొనసాగిస్తూ ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
పొదుపు పథకాలు.. భవిష్యత్తుకు భరోసా
పశ్చిమగోదావరి, నిడమర్రు: ఆర్జించిన నగదుపై రాబడి వచ్చే ఇతర పెట్టుబడి మార్గాల్లో దాచుకోవడంతో భవిష్య నిధిపై భరోసా ఉంటుంది. ఆర్థికపరంగా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా పెట్టుబడికి హామీతో నిర్ధిష్టమైన రాబడి ఇచ్చే పొదుపు మార్గం బ్యాంక్/పోస్టాఫీస్ డిపాజిట్లు. డిపాజిట్ రూపంలో పెట్టిన పెట్టుబడికి లభించే వడ్డీ తక్కువగా ఉన్నా పెట్టుబడి పరంగా ఎటువంటి రిస్క్లేదు. బ్యాంకుల్లో అందుబాటులో ఉండే డిపాజిట్లు రకాలు, వాటి వల్ల ప్రయోజనాలు, ఏది మీకు అనుకూలం తదితర సమాచారం తెలుసుకుందాం.. బ్యాంకు డిపాజిట్లు రెండురకాలు అవి ఫిక్స్డ్ ♦ డిపాజిట్లు (ఎఫ్డీ), రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ) రూపంలో నగదును పెట్టుబడిగా పెట్టవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు ఒక నిర్ణీత మొత్తాన్ని ఒక నిర్ణీత కాలానికి పొదుపుచేస్తే అటువంటి జమ (డిపాజిట్)అని ఫిక్స్డ్ డిపాజిట్లు అంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకుల్లో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకూ అందుబాటులో ఉన్నాయి. కాలాన్ని బట్టి, జమ చేసే మొత్తాన్ని బట్టి మరియు బ్యాంకుల బట్టి వడ్డీ శాతం మారుతుంది. సాధారణంగా వృద్ధులకు సీనియర్ సిటిజన్స్ (60 ఏళ్ల వయసు పైబడినవారు) వడ్డీ 0.25 శాతం నుంచి 1.0 శాతం ఎక్కువగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లను పిల్లల (మైనర్స్) పేరు కూడా తెరవవచ్చు. 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువకాలానికి జమ చేసే టర్మ్ డిపాజిట్లపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ1.5 లక్షల వరకూ ఆదాయంపై పన్ను ఉండదు. వీటిపై వచ్చే వడ్డీ సంవత్సరానికి రూ.10 వేలు వరకు పన్ను ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్లు రెండు రకాలు ఒకటి టర్మ్ డిపాజిట్లు, రెండోది స్ఫెషల్ డిపాజిట్లుగా ఉంటాయి. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ ప్రతి ఆరు నెలలకు ఖాతాదారుని పొదుపు ఖాతాలో జమచేస్తారు. స్పెషల్ టర్మ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ మళ్లీ అదే డిపాజిట్ ఖాతాకు జమ అవుతుంది. అందువల్ల ఖాతాదారునికి వడ్డీ మీద వడ్డీ వస్తుంది. నిర్ణీత కాలానికి ముందుగా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరిస్తే తక్కువ వడ్డీ రావడంతోపాటు కొంత మొత్తాన్ని అపరాధ రుసుం (పెనాల్టీ) రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఇవీ సౌకర్యాలు ♦ పౌరులు/ ఏకైక యాజమాన్యం కల సంస్థలు/ప్రవేట్ మరియు ప్రభుత్వ కంపెనీలు/ హిందూ అవిభక్త కుటుంబాలు / ట్రస్టులు / సంఘాలు / క్లబ్‌లు/ సమితులు /భారతదేశంలో నివసించే విదేశీయులు ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ పథకాలకు అర్హులు ♦ ఖాతాదారుల సౌకర్యార్థం వివిధ బ్యాంకులు టాక్స్ సేవింగ్ డిపాజిట్లను కల్పిస్తున్నాయి ♦ ఎస్బీఐ / ఆంధ్రా బ్యాంక్/ఇతర ప్రైవేట్ బ్యాంకులు తమ ఖాతాదారులకు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా తెరిచే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) నెలనెలా క్రమం తప్పకుండా కనీస మొత్తాన్ని పొదుపు చేసుకుని దానిపై వడ్డీకూడా పొందేదుకు వీలైంది. ఈ డిపాజిట్ ఖాతా ఇది. ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అన్ని బ్యాంకులు/ పోస్టాఫీసులు అందిస్తున్నాయి. పోస్టాఫీసు కంటే బ్యాంకుల్లో ఆర్డీ ఖాతాలే అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ ఆర్డీకి కూడా వర్తిస్తుంది. ఐదేళ్లకు ఆర్డీ ఓపెన్ చేస్తే డిపాజిట్లపై ఐదేళ్ల కాలానికి బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేటే ఆర్డీ ఖాతాకు వర్తిస్తుంది. ఇలా అతి తక్కువ రిస్క్ కలిగి ఉండి తమకు వచ్చే సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్తులో అవసరాలకు సమకూర్చుకోవడానికి ఈ ఆర్డీ పథకాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఆర్డీ సౌకర్యాలు ♦ కనీసం రూ.100 రూపాయల మొత్తం నుంచి నెల నెలా ఆర్డీలో పొదుపు చేసుకోవచ్చు. ♦ కనీస మొత్తం బ్యాంకులను బట్టి మారుతుంది. ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు ఎంపిక చేసుకోవచ్చు. ♦ సాధారణంగా బ్యాంకులు 7 శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీని అందజేస్తున్నాయి. ♦ సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీ 0.5 శాతం అదనంగా లభిస్తుంది. ♦ రికరింగ్ డిపాజిట్ చేసిన మొత్తంలో తిరిగి 80 నుంచి 90 శాతం వరకూ రుణం పొందవచ్చు. ♦ రికరింగ్ డిపాజిట్లో ఉన్న మొత్తానికి ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ లెక్కగడతారు. ♦ బ్యాంకులు ఖాతాదారుల సేవింగ్స్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా వారి రికరింగ్ ఖాతాకు ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ మొత్తాన్ని బదిలీ చేసే సౌకర్యం కల్పిస్తారు. -
పోస్టుమెన్ పోస్టులకు భారీగా దరఖాస్తులు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పోస్టుమెన్/ మెయిల్‌గార్డు పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. పోటీ పెరగడంతో నిరుద్యోగులు ఫీజు కట్టేందుకు కూడా అగచాట్లు ఎదుర్కొంటున్నారు. గత నెల 14న నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తును ఆన్లైన్లో పూరించుకుని ఫీజు పోస్టాఫీసుల్లో చెల్లించుకునే పద్ధతి పెట్టారు. రీజియన్ పరిధిలో 60 పోస్టులు ఉన్నాయి. ఇందులో జిల్లాకు 21 కేటాయించారు. వాటిలో ఎస్సీలకు 5, ఎస్టీలకు 5, మిగతా 11 పోస్టులు అన్‌రిజర్వుడ్ కేటగిరీలోకి వస్తాయి. పురుషులు రూ. 500, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు రూ.100 చొప్పున హెడ్ పోస్టాఫీసుల్లో ఫీజు కట్టాల్సి ఉంది. జిల్లాలో కర్నూలు, ఆదోని, నంద్యాలలో మాత్రమే హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత ఫీజులు కట్టేందుకు ఈ మూడు పోస్టాఫీసులే శరణ్యమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరగడంతో చాంతాడంత క్యూలు ఏర్పడుతున్నాయి. అభ్యర్థులు పోస్టాఫీసు తెరవక ముందే వచ్చి కూర్చుంటున్నారు. పక్షం రోజుల వ్యవధిలోనే కర్నూలు, ఆదోని, నంద్యాల హెడ్ పోస్టాఫీసుల్లో 15 వేల దరఖాస్తులు రావడం గమనార్హం. ఇంకా పక్షం రోజుల గడువు ఉండటంతో మరో 15 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజూ వందలాది అభ్యర్థులు పోస్టాఫీసులకు వస్తున్నా..అధికారులు వారికి కనీసం మంచినీటి సదుపాయం కూడా సమకూర్చడం లేదు. -
గడసాం పోస్టాఫీసులో డిపాజిట్లు స్వాహా!
దత్తిరాజేరు(గజపతినగరం): నిరుపేదలు పైసాపైసా కూడబెట్టి దాచుకున్న మొత్తాలు గద్దల పాలవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీస్‌లో దాచుకున్న సొమ్ము అక్కడి ఇన్చార్జి పోస్టుమాస్టరే కాజేసిన వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గడశాంలో గ్రామానికి చెందిన పలువురు పేదలు దాచుకున్న రూ. 40 లక్షల వరకు అక్కడ ఇన్చార్జ్గా పని చేస్తున్న చినకాద బీపీఎం శ్యాం, రన్నర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ, గడసాం గ్రామానికి చెందిన విశ్రాంతి బీపీఎం బ్రహ్మం కమారుడు జగదీషకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో స్వాహా చేశారు. కొద్దిరోజులుగా జగదీష్ కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన పెదమానాపురం ఎస్పీఎం(సబ్‌పోస్ట్ మాస్టర్) సత్యం సిబ్బందితో కలసి గురువారం గ్రామానికి వెళ్లి రికార్డులను పరిశీలింగా వందలాది మంది డిపాజిట్ దారులు దాచుకొన్న సోత్తు స్వాహా చేసినట్లు తేలింది. ఆయన విజయనగరం హెడ్ పోస్టాఫీస్‌లోని ఐపీఓ పోలేటికి సమాచారం అందించడంతో వారు శుక్రవారం రికార్డులను పరిశీలించి 100 ఖాతాలను సీజ్ చేశారు. గ్రామస్తులు సమాచారం అందించడంతో తాము పరిశీలనకు వచ్చినట్టు పెదమానాపురం బీపీఎం సత్యం సాక్షికి తెలిపారు. వంద పాస్‌పుస్తకాలను సీజ్ చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే ఎంతమొత్తం గల్లంతయిందన్నది ఇంకా లోతుగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. మొత్తమ్మీద గ్రామంలో రూ. 40లక్షల వరకూ కాజేసి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఒక్క ఏడాది.. 13 వేల పాస్‌పోర్టులు..!
సాక్షి, హైదరాబాద్: పన్నెండు నెలలు.. 13 వేల పైచిలుకు పాస్ట్‌పోర్టుల జారీ.. హన్మకొండ తపాలా కార్యాలయం సాధించిన రికార్డు ఇదీ. పోస్టాఫీసులో పాస్‌పోర్టులకు అనూహ్య స్పందన రావడం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. దీంతో రాష్ట్రంలోని పూర్వపు జిల్లా కేంద్రాలన్నింటిలోని తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. మార్చి 4 లోపు మిగతా చోట్ల ప్రారంభించేందుకు పచ్చజెండా ఊపటంతో తెలంగాణ తపాలా సర్కిల్ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఏడాది క్రితం ప్రయోగాత్మకంగా.. పాస్‌పోర్టులు స్థానికంగానే జారీ చేసేందుకు కేంద్రం తపాలా కార్యాలయాల్లో అనుబంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా గత మార్చిలో హన్మకొండ ప్రధాన తపాలా కార్యాలయంలో పాస్‌పోర్టుల జారీని ప్రారంభించింది. తదుపరి మహబూబ్‌నగర్ పోస్టాఫీసులోనూ మొదలుపెట్టింది. ఈ 2 చోట్లా పాస్‌పోర్టుల కోసం జనం ఎగబడటంతో ఇది విజయవంతమైంది. హైదరాబాద్‌లో ప్రధాన పాస్‌పోర్టు కేంద్రంతోపాటు మరికొన్ని సేవా కేంద్రాలు ఉన్నందున ఇక్కడ పోస్టాఫీసులకు అనుమతి ఇవ్వలేదు. కరీంనగర్, నిజామాబాద్‌లో టీసీఎస్ సాయంతో పాస్‌పోర్టు విభాగమే కేంద్రాలను ఏర్పాటు చేసినందున మిగతా జిల్లాల్లోని తపాలా కార్యాలయాల్లో వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పక్షం రోజుల్లో ఇంటికి పాస్‌పోర్ట్ పూర్వపు వరంగల్ జిల్లా పరిధి మొత్తానికి హన్మకొండ పోస్టాఫీసును కేంద్రంగా మార్చిలో ఏర్పా టు చేశారు. తొలి నెలలో 120 పాస్‌పోర్టులే జారీ అయ్యాయి. ఏప్రిల్‌లో 784 పాస్‌పోర్టులు జారీ చేసింది. ఆ తర్వాత ఇది రెట్టింపైంది. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉండటం.. అరగంటలోనే పూర్తవుతుండటంతో పోస్టాఫీసులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రక్రియ పూర్తయి న çపక్షం రోజుల్లో ఇంటికి పాస్‌పోర్టు వస్తోంది. మహబూబ్‌నగర్‌లోనూ సక్సెస్.. మహబూబ్‌నగర్ పట్టణంలోని పోస్టాఫీసులో నిత్యం సగటున 40 పాస్‌పోర్టుల వెరిఫికేషన్ జరుగుతోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 4 వేల పాస్‌పోర్టులు జారీ అయినట్టు అక్కడి తపాలా సూపరింటెండెంట్ శ్రీహరి పేర్కొన్నారు. దీన్ని మహబూబ్‌నగర్ కొత్త జిల్లా పరిధికే పరిమితం చేయడంతో.. పూర్వపు జిల్లా పరిధి మొత్తానికి విస్తరించాలని ప్రతిపాదనలు పంపినట్టు ఆయన వెల్లడించారు. ఖమ్మం, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్లగొండల్లో మార్చి 3 లోపు పాస్‌పోర్టు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తపాలాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. విద్యార్థులు వినియోగించుకుంటున్నారు ఇంటి వద్ద ఉండే పాస్‌పోర్టు పొందిన అనుభూతిని దరఖాస్తుదారులు పొందుతున్నారు. విద్యార్థులు దీనిని బాగా వినియోగించుకుంటున్నా రు. గతంతో పోలిస్తే పాస్‌పోర్టు కేంద్రాల ఏర్పాటు తర్వాత తపాలా సేవలను వినియోగించుకుంటున్నవారి సంఖ్య పెరిగింది. –హన్మకొండ సూపరింటెండెంట్ ఎం.శేషగిరి -
పోస్టాఫీస్‌లో గోల్మాల్
రైల్వేకోడూరు అర్బన్: అవగాహన లేని అమాయకులను పోస్టాఫీసులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు మోసం చేస్తున్నారు. పాస్‌బుక్‌లో రాసి పోస్టల్ అకౌంట్లో జమ చేయకుండా బురిడీకొట్టించి రూ.30లక్షలకుపైనే దోచుకున్నట్లు తెలిసింది. రైల్వేకోడూరు మండలంలోని ఉర్లగడ్డపోడు పంచాయతీ ఎస్వీనగర్ ఫోస్టాఫీస్లో పనిచేస్తున్న బీపీఎం జ్యోతి, సహాయకుడిగా ఉన్న ఆమె భర్త సుబ్రమణ్యంలు కుట్రపూరితంగా స్థానికులైన నారాయణ, లక్ష్మీదేవి, అరుణ, వెంకటలక్ష్మి, సుగుణ, శంకరయ్య, శంకరమ్మ, చీర్ల సుబ్బలతోపాటు సుమారు 100కి పైగా అకౌంటల్లో భద్రపరుచుకున్న సొమ్ము రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు గోల్మాల్ చేశారు. తాము దాచుకున్న సొమ్ము దోపిడీకి గురికావడంతో ప్రజలు లబోదిబో మంటున్నారు. విచారణకు వచ్చిన పోస్టల్‌శాఖ అధికారులు నరసింహులు, శివయ్య తూతూమంత్రంగా విచారణ చేసి బాధ్యులైన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ అధికారులను, జ్యోతి, సహాయకుడిగా ఉన్న అమె భర్త సుబ్రమణ్యంలను ప్రజలు చుట్టుముట్టి నిలదీశారు. పోస్టాఫీసులో ఈ దోపిడీ వ్యవహారంపై కొందరు పైఅధికారులకు ఫిర్యాదుచేయడంతో వారంరోజుల క్రితం వచ్చిన అధికారులు విచారణను గోప్యంగా జరిపారు. 1వ తేదీ వరకు ఆగమని ప్రజలకు చెప్పి వెళ్లారు. కాగా గురువారం మధ్యాహ్నం విచారణకు వచ్చిన అధికారులు పోస్టాఫీసులో స్థానిక సర్పంచ్ శ్రీధర్, బాధితుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. బీపీఎం జ్యోతి, ఆమె భర్త సుబ్రమణ్యంలను కూడా విచారించారు. సమగ్ర నివేదిక పైఅధికారులకు పంపుతామని చెప్పి కొన్ని అకౌంట్లలో మాత్రమే తప్పుదోవ పట్టించారని చివర్లో వెళుతూ తెలపడంతో బాధితులు ఆందోళనకు దిగారు. విచారణ చేసి నిగ్గుతేలుస్తాం కాగా ఉర్లగడ్డపోడు పంచాయతీ ఎస్వీనగర్ పోస్టాఫీస్‌లో జరిగి అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గుతేలుస్తామని విచారణకు వచ్చిన పోస్టల్ శాఖ అధికారులు నరసింహులు, శివయ్యలు పేర్కొన్నారు. ఇక్కడి పాస్‌బుక్‌లు, రికార్డులు అన్ని స్వాధీనం చేసుకుని జరిగిన విషయాలను కడప పోస్టల్ శాఖ పైఅధికారులకు నివేదిస్తామన్నారు. పూర్తిస్తాయిలో విచారించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. మాడబ్బులు వచ్చేటట్లు చేయండి రోజువారీ కూలీలకు వెళ్లి సంపాదించిన సొమ్ములో రూ.18000 దాచుకున్నా. భవిష్యత్ అవసరాలకు స్థానికంగా ఉండే పోస్టాఫీసులలో నమ్మమకంతో భద్రపరుచుకున్నా. కానీ ఇప్పుడు కేవలం రూ.3000 ఉందని చెబుతున్నారు. నా డబ్బులు వచ్చేటట్లు చేయండి. –వెంకట సుబ్బమ్మ, గజ్జలవారిపల్లి, కోడూరు -
పాస్‌పోర్ట్.. ఇంకా సులువు
మర్రిపాలెం(విశాఖ పశ్చిమ): అన్ని వర్గాల ప్రజలు పాస్‌పోర్ట్ సేవలను సులభంగా పొందేలా ప్రభుత్వం విస్తృత అవకాశాలు కల్పించిందని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారి (పీవో) ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. పాస్‌పోర్ట్ సేవలను ప్రజలు సకాలంలో పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలో స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంటోందన్నారు. ఎనిమిదేళ్ల లోపు బాలలు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు 10 శాతం ఫీజులో రాయితీని ప్రభుత్వం ప్రకటించిన విషయం ప్రస్తావించారు. పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించి గత ఏడాది ప్రగతి, భవిష్యత్ ప్రణాళికను ‘సాక్షి’కి వివరించారు. 2017లో కార్యాలయ పరిధిలో 3,49,576 పాస్‌పోర్ట్‌లు మంజూరు చేశామన్నారు. 19,538 పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. సాధారణ పాస్‌పోర్ట్ మంజూరు సగటున 10 నుంచి 15 రోజుల వ్యవధిగా ఉందని, తత్కాల్ పాస్‌పోర్ట్ సేవలు ఒకటి నుంచి మూడు రోజుల్లో అందుతున్నాయని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘పాస్‌పోర్ట్ సేవా ప్రాజెక్ట్’లో భాగంగా ప్రజలకు సేవలు సులువుగా అందుతున్నాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా ‘బి’ కేటగిరీ పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో ఉత్తమ సేవలు అందించడంలో విశాఖపట్నం మూడో స్థానంలో నిలిచిందన్నారు. పాస్‌పోర్ట్ విచారణలో రాష్ట్ర పోలీస్ శాఖ ప్రశంసలు అందుకుందన్నారు. విస్తృతంగా పాస్‌పోర్ట్ సేవలు విశాఖపట్నం ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం పరిధిలోని ఆయా జిల్లాల ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలు విస్తృతం చేసినట్టు పీవో తెలిపారు. హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలోని ఆరు జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు గతేడాది ఏప్రియల్ నుంచి విశాఖపట్నం కార్యాలయంతో అనుసంధానం చేసిన విషయం గుర్తుచేశారు. ఆయా జిల్లాల హెడ్ పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు వినియోగంలో ఉన్నాయన్నారు. నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో ప్రతీ రోజు దాదాపు 100 పాస్‌పోర్ట్ దరఖాస్తులు పరిశీలనకు వస్తున్నాయని వివరించారు. త్వరలో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల హెడ్ పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ‘వాక్ ఇన్’ విధానం నిలిపివేశాం పాస్‌పోర్ట్ మంజూరు కోసం ప్రతీ దరఖాస్తుదారుడు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ తప్పనిసరిగా చేసుకోవాలని పీవో స్పష్టం చేశారు. గతంలో మైనర్లు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు స్లాట్ బుకింగ్‌తో సంబంధం లేకుండా ‘వాక్ ఇన్’ విధానంగా నేరుగా సేవలు ఉండేవన్నారు. ఈ విధానం దుర్వినియోగం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించి నిలిపివేసినట్టు చెప్పారు. స్లాట్ బుకింగ్ లేకుండా సేవలు అందించమని స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో పాస్‌పోర్ట్ సేవలు... కళాశాలల్లో పాస్‌పోర్ట్ సేవలు నేరుగా అందించడంలో మంచి ఫలితాలు సాధించామని పీవో సంతోషం వ్యక్తం చేశారు. ఆయా కళాశాలల్లో 8,500 విద్యార్థులకు, జిల్లాలో 400 మంది మీడియా ప్రతినిధులకు పాస్‌పోర్ట్ అందచేసినట్టు తెలిపారు. గీతం విశ్వవిద్యాలయం, రఘు ఇంజనీరింగ్ కళాశాలలో విజిలెన్స్ అవగాహన సదస్సులు విజయవంతంగా నిర్వహించామన్నారు. విద్యాలయాలు కోరితే పాస్‌పోర్ట్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. -
తిరుమలగిరి పోస్టాఫీస్ ఉద్యోగులపై కేసు
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి పోస్టాఫీసు ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నోట్ల రద్దు సమయంలో ఈ పోస్టాఫీస్ సిబ్బంది, అధికారులు కొత్తనోట్లను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు మార్చారని ఆరోపిస్తూ సికింద్రాబాద్ రీజియన్ పోస్టాఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ వీబీ గణేశ్ కుమార్ రెండు రోజులక్రితం సీబీఐకి ఫిర్యాదు చేశారు. తిరుమలగిరి పోస్ట్‌మాస్టర్ శ్రీనివాసులు, ట్రెజరర్ ఎస్ చంద్రమౌళి ఎలాంటి రికార్డులు లేకుండా రూ.8.8 లక్షల పాతనోట్లకు కొత్తనోట్లను మార్చి ఇచ్చినట్టు గణేశ్ కుమార్ ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ అధికారులు రికార్డులో నగదు మార్పిడికి సంబంధించి ఆధారాలు లేనట్లు గుర్తించింది. దీంతో వీరిద్దరిపై పీసీయాక్ట్ 1988 కింద 13(2) రెడ్‌విత్ 13 (1)(డి), ఐపీసీ 120 బిరెడ్ విత్, 409, 420, 477 (ఏ)కింద కేసులు నమోదు చేశారు. -
రామాయణంపై తపాలా బిళ్లలు
నారాయణవనం: సీతారామ చరిత్రను తెలిపే రామాయణం తపాలా బిళ్లలను భారత తపాలా శాఖ దీపావళి సందర్భంగా విడుదల చేసిందని స్థానిక ఉప తపాలా కార్యాలయ అధికారి ఓబుల్‌రెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీరామ చరిత్రను ప్రతిబింబించే రీతిలో 11 తపాలా బిళ్లలతో కూడిన పోస్టర్‌ను రూ.65కు మండలంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో పొందవచ్చన్నారు. అరుదైన పౌరాణిక చిత్రాలను దాచుకోవచ్చని అన్నారు. ఈ బిళ్లలను శుభ సందర్భాల్లో ఆత్మీయులు, సన్నిహితులకు పంపే తపాలా కవర్లపై అంటించి పంపుకోవచ్చనని చెప్పారు. -
ఏ దేశం దాటిందో.. ఇట్టే తెలుసుకోవచ్చు..
సాక్షి, హైదరాబాద్: ఇతర దేశాలకు పార్శిళ్లు పంపేటప్పుడు ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు తపాలా శాఖ కొత్త విధానాన్ని ప్రారంభించింది. ‘ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీసు’ పేరుతో ప్రారంభించిన ఈ సర్వీసు ద్వారా విదేశాలకు తాము పంపిన పార్శిల్ ఎక్కడుందో ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. దాన్ని ట్రాక్ చేసే వెసులుబాటుతో పాటు, పార్శిల్ గల్లంతైనా, అందులోని వస్తువులు పాడైనా నష్టపరిహారం ఇచ్చే వెసులుబాటు కల్పించారు. తొలుత 12 దేశాలకు ఇది అందుబాటులో ఉంటుంది. ఏషియన్ పసిఫిక్ రీజియన్‌లోని దేశాలతో తపాలా శాఖ ఒప్పందం కుదుర్చుకుంటోంది. 12 దేశాలతో అవగాహన కుదరటంతో ఆయా దేశాలకు ఈ సేవలను ప్రారంభించారు. రెండు కిలోల వరకే పరిమితం విదేశాలకు పార్శిళ్లు పంపటం ఖరీదైన వ్యవహారం. దీన్ని చవకగా అందించేందుకు తపాలా శాఖ ముందుకొచ్చింది. తొలి వంద గ్రాముల బరువుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లకైతే రూ.330, ఇతర దేశాలకు రూ.310గా రుసుమును నిర్ధారించింది. ఈ బరువు పెరిగే కొద్దీ రుసుము పెరుగుతుంది. ప్రస్తుతానికి 2 కిలోల బరువు వరకు మాత్రమే పార్శిళ్లు అనుమతిస్తారు. అంతకంటే ఎక్కువ బరువైనవైతే ఈ కొత్త విధానం కాకుండా మామూలు విధానంతో పంపుతారు. మార్గ మధ్యంలో పార్శిల్ గల్లంతైనా, అందులోని వస్తువులు డామేజ్ అయినా ఆ మేరకు నష్టపరిహారం కూడా అందజేస్తామని తపాలాశాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. అయితే ఇందులో మండే స్వభావం ఉన్నవి, ప్రాణం ఉన్నవి అనుమతించరు. సాధారణంగా విమానాల్లో వస్తువుల తరలింపుపై ఉండే నిబంధనలు దీనికి వర్తిస్తాయన్నారు. ‘ప్రైవేటు సంస్థలు తమకంటే పది రెట్లు ఎక్కువ రుసుము వసూలు చేస్తున్నాయి. చాలా తక్కువ వ్యయంతో పార్శిల్ ఎక్కడుందో సులభంగా ట్రాక్ చేసుకునే వెసులుబాటుతో కొత్త సేవలు ప్రారంభించాం. ప్రజలు దీనిని ఆదరిస్తే ఇది తమకు లాభాలు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో ఉన్నాం’ అని తపాలా శాఖ ఉన్నతాధికారి ఒకరు సాక్షితో చెప్పారు. తపాలా వారోత్సవాల్లో భాగంగా ఈ కొత్త సేవను ప్రారంభించారు. త్వరలో మరిన్ని దేశాలకు దీన్ని విస్తరించనున్నారు. స్పీడ్ పోస్ట్ తరహాలోనే.. దేశీయంగా పోస్టాఫీసుల్లో స్పీడ్ పోస్టు సర్వీసు ఉంది. సంబంధిత పార్శిల్‌ను తపాలా కార్యాలయంలో అందించగానే దానికి నిర్ధారిత రుసుము తీసుకున్న తర్వాత సిబ్బంది దానికి బార్కోడ్ కేటాయిస్తారు. ఆ నంబరు ఆధారంగా ఆన్లైన్లో మనం పార్శిల్ ఎక్కడి వరకు చేరుకుందో ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే విధానాన్ని ఇంటర్నేషనల్ పార్శిళ్లకు కూడా వర్తింపజేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్, కంబోడియాలతో తపాలా శాఖ ఒప్పందం చేసుకుని ఆయా దేశాలకు సర్వీసు ప్రారంభించింది. -
మృతుడికి డబ్బు చెల్లించారా?
విశ్లేషణ మనకు పదివేల కోట్ల రూపాయల మోసాల గురించి థ్రిల్లింగ్ వార్తలు చదవడం, భారతీయుడు వంటి సినిమాలు చూడడం సరదా. కానీ రోజూ ప్రభుత్వ ఆఫీసుల్లో జరుగుతున్న భారీ మోసాల గురించి పట్టింపు ఉండదు. ‘‘ఒక్క మాట చెప్పండయ్యా, నా భర్త చనిపోయిన మూడేళ్ల తరువాత మీ పోస్టాఫీసుకు వచ్చి ఎన్ఎస్సి సర్టిఫికెట్ల డబ్బు తీసుకుపోయినాడా?’’ ఇది.. భర్తను కోల్పోయి ప్రభుత్వ పింఛను పై ఆధారపడిన ఒక మహిళ టి. సుబ్బమ్మ నిలదీసి అడిగిన ప్రశ్న. కర్నూలు పోస్టాఫీసు సూపరింటెండెంట్ని నిరుత్తరుడిని చేసిన ప్రశ్న. టి. సుబ్బమ్మ భర్త చిన్న ఉద్యోగి. జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో పదివేల రూపాయల జాతీయ పొదుపు సర్టిఫికెట్లు 5 కొనుక్కున్నారు. ఆయన మరణించిన తరువాత డబ్బు ఇమ్మని కోరితే పోస్టాఫీసు జవాబివ్వలేదు. ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నారు. సెక్షన్ 8(1)(జె) కింద మూడో వ్యక్తికి చెందిన సొంత సమాచారమంటూ తిరస్కరించారు. మొదటి అప్పీలు వల్ల ప్రయోజనం లేదు. ఎంబీఏ చదివిన కుమారుడు సుధాకర్ తాము అడిగిన వివరాలు ఇప్పించాలని కమిషన్‌కు విన్నవించారు. సర్టిఫికెట్లు కొన్న వ్యక్తి, సుబ్బమ్మగారి భర్త ఆది శేషయ్య స్వయంగా వచ్చి డబ్బు తీసుకున్నారని, సుబ్బమ్మ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపినప్పుడు ఈ విషయం తేలిందని కమిషన్‌కు పోస్ట్ మాస్టర్ తెలియజేశారు. నివేదిక ప్రతిని కూడా సుబ్బమ్మకి ఇచ్చామని వివరించారు. సుబ్బమ్మ: ఏ తేదీన తీసుకున్నారయ్యా? అధికారి: 2007 జూన్ 27న ఒక సర్టిఫికెట్ డబ్బు, జూన్ 29న రెండు సర్టిఫికెట్ల డబ్బు, జూలై 2న మరొక సర్టిఫికెట్ డబ్బును మీ భర్త తానే స్వయంగా తీసుకున్నారమ్మా. సుబ్బమ్మ: మా ఆయన 10.5.2004న చనిపోయాడయ్యా, మూడేళ్ల తరువాత 2007లో ఆయనే వచ్చి డబ్బు ఏ విధంగా తీసుకున్నారయ్యా? వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన విచారణలో ఆ అధికారి ఫైళ్లన్నీ వెతుకుతూ నీళ్లునములుతూ కనిపించారు. ‘‘అయ్యా మరణ ధృవీకరణ పత్రం కూడా ఉంది సార్‘‘ అని సుబ్బమ్మ కుమారుడు వీడియోలో చూపించాడు. ఇప్పుడు చెప్పండి అని కమిషనర్ అడిగితే జవాబు లేదు. తన భర్త వచ్చి డబ్బు తీసుకున్నట్టు రామలింగయ్య అనే వ్యక్తి దొంగ క్లెయిమ్ పత్రాలు కల్పించారని, ఆ తరువాత ఎన్. బుజ్జి అనే పోస్ట్ మాస్టర్ నియమాల ప్రకారం చెక్కు ఇవ్వడానికి బదులుగా నగదు రూపంలో డబ్బు ఇచ్చారని, అదే మోసానికి తగిన సాక్ష్యమని సుబ్బమ్మ కొడుకు సుధాకర్ వాదించారు. చిన్న వెంకయ్య, రామలింగయ్య, తపాలా ఉద్యోగి గౌస్, దొంగ సాక్షి సుంకన విజయ కుమార్ ఆ డబ్బును బుజ్జితో పంచుకుని ఆ రాత్రి మందు, విందు చేసుకున్నారని కూడా సుధాకర్ ఆరోపించారు. సుబ్బమ్మ పోస్టాఫీసులో పనిచేసిన అధికారులపైన ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల సమాచారం లేదా పత్రాలు, విచారణ సాక్ష్యాలు, ఆ అధికారి వ్యక్తిగత సమాచారం అవుతుందని అధికారులు వాదించారు. దీన్ని మొదటి అప్పీలు అధికారి కూడా ఆమోదించడం మరీ ఆశ్చర్యకరం. ఇది దారుణమైన నిరాకరణ. ఒక భర్తలేని మహిళ డబ్బు కాజేయడానికి తోటి అధికారులు చేసిన మోసాన్ని, అవినీతిని రక్షించడానికి సమాచార అధికారులు సెక్షన్ 8(1)(జె)ను, సుప్రీంకోర్టు గిరీశ్ రామచంద్ర దేశ్‌పాండే కేసులో ఇచ్చిన ఒక తీర్పును ఉటంకిస్తూ ఇటువంటి ఫిర్యాదులు.. మోసం చేసిన అధికారుల వ్యక్తిగత సమాచారం కనుక ఇవ్వబోమని తిరస్కరించారు. గోప్యతా అనే పదాన్ని దానికి సంబంధించిన మినహాయింపును దుర్వినియోగం చేసి మోసాలు చేయడానికి వీల్లేదని కమిషన్ విమర్శించింది. పోస్టాఫీసు వాదాన్ని తిరస్కరిస్తూ అడిగిన వివరాలన్నీ ఇవ్వాలని, మొత్తం సంఘటనలపై విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే చిన్న అవినీతి ఇది. దీన్ని పత్రికలు పట్టించుకోవు, విజిలెన్సు వారికి కూడా చిన్నదనిపిస్తుంది. ఇవి ఏసీబీ, సీబీఐ దాకా వెళ్లవు. చదువురాని సుబ్బమ్మకు ఏం చేయాలో తోచదు. చదువుకున్న కొడుకు సాయం చేస్తున్నాడు. కోర్టులో పోరాడాలంటే బోలెడంత డబ్బు ఖర్చు. గెలుస్తారో లేదో? లాయర్ల ఫీజులకే డబ్బు ఒడుస్తుంది. మోసం జరిగిందని పోస్టాఫీసులో అందరికీ తెలుసు. బుజ్జి తరువాత వచ్చిన పోస్ట్మాస్టర్లంతా ఈ ఫైలు కప్పిపుచ్చారే తప్ప సుబ్బమ్మకు న్యాయం చేయాలనుకోలేదు. మధ్యలో ఒక పోస్ట్‌మాస్టర్ మాత్రం అన్యాయాన్ని గుర్తించి విచారణకు ఆదేశించారు. చనిపోయిన వ్యక్తే వచ్చి డబ్బు తీసుకున్నాడని విచారణాధికారి నిర్ణయించారు. సమాచార చట్టం కింద సవాలు చేస్తే ధైర్యంగా విచారణ నివేదిక ప్రతి ఇచ్చారు. కానీ ఇతర వివరాలు నిరాకరించారు. రోజూ ఇటువంటి దాపరికాలు ప్రతి కార్యాలయంలో ఒకటో రెండో జరుగుతూనే ఉన్నాయి. ఈ రెండో అప్పీలు తీర్పులో మానవాసక్తికరమైన వార్త ఉంది. కాని ఒకటి రెండు పత్రికలకు తప్ప మరెవరికీ పట్టదు. పోస్టాఫీసు మోసం ఒక చిన్న సంఘటన. కానీ ఈ మోసాలను వెలికి తీయకుండా ఆర్టీఐని అడ్డుకుంటున్నది గిరీశ్పై తీర్పు. ప్రభుత్వ అధికారులు పన్నిన కుట్రలు, మోసాలు, లంచగొండితనం ఫిర్యాదులు వారి వ్యక్తిగత సమాచారం అంటూ ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన గిరీశ్పై తీర్పు అవినీతి అధికారుల ‘సొంత’ సమాచారానికి దాపరికపు తెర. మన పౌరుల కుంభకర్ణ నిద్రకు దోమతెర. (టి సుబ్బమ్మ వర్సెస్ పోస్టాఫీసు CIC/POST S/A-/2017/123421 కేసులో 29.9.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
కొత్తగా 650 పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 650 పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. వరల్డ్ పోస్ట్ డేను పురస్కరించి సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉన్న 1.55 లక్షల పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా మొదట 650పోస్టల్ పేమెంట్ బ్యాంకులను ప్రారంభించనున్నామని చెప్పారు. తపాలా శాఖ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. -
పోస్టాఫీసుల్లోనూ ఆధార్ తప్పనిసరి
న్యూఢిల్లీ: ప్రభుత్వ పథకాలు, బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, మొబైల్ ఫోన్ నంబర్లు ఇతరత్రా అన్నింటికీ ఆధార్‌ను తప్పనిసరిచేస్తూ వస్తున్న కేంద్రం ఇప్పుడు పోస్టాఫీస్‌లకూ దీన్ని వర్తింపజేసింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) ఖాతాలతో పాటు పోస్టాఫీసుల్లోని అన్ని రకాల డిపాజిట్ పథకాలు, జాతీయ పొదుపు పత్రాలు, కిసాన్ వికాస్ పత్రాలకు కూడా ఆధార్ నంబర్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. ఖాతాదారులు ఇకపై ఆయా పథకాలు, డిపాజిట్ దరఖాస్తులకు ఆధార్‌ను జతచేయాల్సి ఉంటుం దని ప్రభుత్వం గతనెల 29న జారీచేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. అదేవిధంగా ఇప్పటిదాకా పోస్టాఫీస్ పథకాలకు సంబంధించి ఆధార్‌ను తమ దరఖాస్తుల్లో వెల్లడించని ప్రస్తుత డిపాజిటర్లకు ఆధార్ కాపీని సమర్పించేందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ గడువు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. నల్లధనం, బినామీ లావాదేవీలకు చెక్‌పెట్టేందుకు, సబ్సిడీ ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారులకు చేర్చేందుకే ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. కాగా, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందాలాంటే ఈ ఏడాది డిసెంబర్ 31లోపు ఆధార్‌ను తీసుకోవాలంటూ కేంద్రం ఇటీవలే గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అంతక్రితం ఈ గడువు సెప్టెంబర్ 30 వరకూ ఉంది. అప్పటివరకూ లబ్ధిదారులకు సేవలను కొనసాగించాలని, తిరస్కరించవద్దని కూడా ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలకు స్పష్టం చేసింది. -
పోస్టాఫీసులో ‘ఆధార్’ అప్డేషన్
- నిమిషాల్లో అప్డేషన్ ప్రక్రియ.. 24 గంటల్లోగా ఈ–ఆధార్ - మరో రెండు నెలల్లో ఆధార్ నమోదు కేంద్రాల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణలు జరగక ఇబ్బంది పడుతున్నారా? ఇక ఆ అవసరం లేదు. సమీప పోస్టాఫీసు కు వెళ్తే సరిపోతుంది. 15 నిమిషాల్లో అప్డేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. 24 గంటల తర్వాత యూఐడీఏఐ వెబ్సైట్లో ఈ–ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకో వచ్చు. పక్షం రోజుల్లో ఇంటికి ఒరిజనల్ ఆధార్ పోస్టులో అందుతుంది. ఆధార్‌లో అచ్చు తప్పులు, పొరపాట్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డుల జారీకి తపాలా శాఖ ముందుకొచ్చి ంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)తో తపాలా శాఖ ఒప్పందం చేసుకుంది. హెడ్ పోస్టాఫీసుల్లో అప్డేషన్ కేంద్రాలు రాష్ట్రంలోని హెడ్ పోస్టాఫీసుల్లో ఆధార్ అప్డేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పాతబస్తీలోని జూబ్లీ హెడ్ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టగా, మిగతా పోస్టాఫీసుల్లో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి అన్ని సబ్ పోస్టాఫీసుల్లో కేంద్రాలు ప్రారంభించే విధంగా తపాలా శాఖ చర్యలు చేపట్టింది. తపాలా శాఖ సిబ్బందికి ఆధార్ నమోదు, అప్డేషన్పై యూ ఐడీఏఐచే శిక్షణ ఇప్పించారు. ప్రధాన పోస్టాఫీసుల్లో త్వరలో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే బయోమెట్రిక్ డివైజ్‌ల కోసం చెన్నై కు చెందిన సంస్థతో టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. బయోమెట్రిక్ తప్పనిసరి: ఆధార్ అప్డేషన్ కోసం బయోమెట్రిక్ తప్పనిసరి. ఆధార్ వివరాల నమోదు అనంతరం ఆథరైజ్డ్ సిబ్బంది, కార్డుదారుడి బయోమెట్రిక్ ఆమోదం అనంతరమే యూఐడీఏఐ ప్రధాన సర్వర్ అప్‌డేష న్కు అనుమతి ఇస్తుంది. మొబైల్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా మార్పులు, చేర్పులు పూర్తి చేస్తారు. అనంతరం అప్డేషన్ ప్రక్రియ పూర్తయినట్లు మొబైల్‌కు సంక్షిప్త సమాచారం వస్తుంది. ఈ తతంగం 15 నిమిషాల్లో పూర్తవుతుంది. ఆధార్ అప్డేషన్కు రూ.25 వసూలు చేస్తారు. బయోమెట్రిక్‌కు రూ.25, కొత్తగా జనరేట్ కోసం రూ.50 వసూలు చేస్తారు. సద్వినియోగం చేసుకోవాలి పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన అప్డేషన్ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఆధార్‌లో చేర్పులు, మార్పులు, సవరణల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నామమాత్రపు చార్జీలతో ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. – పీవీఎస్ రెడ్డి, పోస్టుమాస్టర్ జనరల్, హైదరాబాద్ హెడ్ క్వార్టర్ రీజియన్, తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ -
నమ్మించి.. నట్టేటముంచి..!
► వంగిపురం బ్రాంచి పోస్టాఫీసులో భారీ గోల్మాల్!? ► ఓ మహిళ చేతికి పొదుపు, ఆర్డీ, ఇన్సూరెన్స్ డబ్బులిచ్చిన గ్రామస్తులు ► పోస్టాఫీసులో జమ చేయని వైనం ► ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అవినీతి బాగోతం ? వంగిపురం (ప్రత్తిపాడు): తమ ఇంట్లో పోస్టాఫీస్ ఉండడంతో అందులో ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికి ఖాతాదారుల నుంచి నగదు వసూలు చేసిన ఓ మహిళ ఉదంతం బట్టబయలైంది. మండలంలోని వంగిపురంలో బ్రాంచి పోస్టాఫీసు ఉంది. పోస్ట్‌మాస్టర్‌గా (బీపీఎం) దాది సుమాంజలి విధులు నిర్వర్తిస్తున్నారు. పోస్టాఫీసుకు సొంత భవనం లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్ కూతురు ఆరుమళ్ల సరోజిని ఇంటిని అద్దెకు తీసుకున్నారు. సరోజిని తండ్రి గతంలో పోస్ట్‌మాస్టర్‌గా పని చేశారు. ఈమె కూడా కొన్ని సంవత్సరాల క్రితం బీపీవోకు అసిస్టెంట్‌గా ఖాతాదారులందరికీ సుపరిచితురాలు. కూలి పనులు చేసుకుంటూ చిన్నమొత్తాల్లో పొదుపు చేసుకుందామని పోస్టాఫీసులకు వచ్చే వారి అమాయకత్వాన్ని సరోజిని క్యాష్ చేసుకుంది. పోస్టాఫీసు ఉద్యోగిలా నమ్మబలికి అందరి నుంచి పొదుపు డబ్బులు, ఆర్డీ సొమ్ములు, ఇన్సూరెన్స్ నగదును నెలనెలా వాయిదాల (రోజువారీ, వారాల వారీ, నెలనెల, ఏడాదికోసారి) రూపంలో తీసుకుంటుంది. ఖాతాదారుల పోస్టల్ పుస్తకాలను సైతం వారికి ఇవ్వకుండా సరోజిని తనవద్దే ఉంచుకుంటూ పెద్ద ఎత్తున చీటింగ్‌కు పాల్పడుతూ వచ్చింది. బీపీఎం ఎవరో తెలియకుండా జాగ్రత్త పడుతూ.. పది గంటల తరువాత పోస్టాఫీసుకు వస్తే సాయంత్రం ఐదు గంటల తరువాత, ఉదయం ఎనిమిది గంటలలోపు రావాలని చెప్పి సరోజిని ఖాతాదారులను వెనక్కు పంపించేది. దీంతో ప్రజలకు అసలు వంగిపురం బ్రాంచిలో బీపీఎం ఉందన్న సంగతి కూడా తెలియకుండా జాగ్రత్త పడింది. ఎప్పుడైనా ఇతర పనులపై పోస్టాఫీసుకు వచ్చిన ఖాతాదారులకు అసలు బీపీఎం సుమాంజలి కనిపిస్తే ఆమె మట్టి డబ్బులు (ఉపాధి పనుల డబ్బులు) ఇవ్వడానికి, పింఛను ప్రత్యేకంగా వస్తుందని చెప్పి ప్రజలను మభ్యపెట్టింది. భారీ మొత్తంలో.. బ్రాంచి పోస్టాఫీసులో సుమారు రెండు వందల వరకు ఖాతాదారులు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కో కుటుంబంలో రెండు, మూడు, నాలుగు పొదుపు ఖాతాలు, ఆర్డీలు, సేవింగ్స్లు చేసుకుంటున్న వారు ఉన్నారు. వీరు నెలనెలా వారి స్థాయిని బట్టి పొదుపు చేసుకుంటున్నారు. సుమారుగా రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ప్రజల సొమ్ము కాజేసినట్లు సమాచారం. ఖాతా పుస్తకాల్లో పోస్టల్ స్టాంప్‌లు వేసి మరీ.. పోస్టాఫీసు తన ఇంట్లోనే ఉండటం సరోజినికి బాగా కలిసొచ్చింది. గ్రామాల్లో ప్రజలు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పొలం పనులకు వెళతారు. దీంతో సరోజిని ఇంట్లోనే పోస్ట్ ఆఫీస్ కావడంతో ఉదయం ఎనిమిది గంటల లోపు, సాయంత్రం ఐదు గంటల తరువాత జనం తమ ఖాతాల్లో డబ్బును జమ చేయాలని సరోజిని వద్దకు వెళుతుంటారు. ఆ సమయంలో బీపీఎం పోస్టాఫీసులో ఉండకపోవడం, పోస్టాఫీసుకు సంబంధించిన ముద్రలు సైతం అక్కడే అందుబాటులో ఉండటంతో పుస్తకాలపై ముద్ర వేసి, ఓ చిన్న సంతకం చేసి పుస్తకాలను ఇచ్చేది. కానీ డబ్బును వారి ఖాతాలకు జమ చేయించేది కాదు. పోస్టల్ అధికారుల విచారణ.. గ్రామానికి చెందిన పి. సామ్రాజ్యమ్మ హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. ఈమె తన మనవడు, మనవరాలు పేరుతో ఆర్డీలు కట్టుకుంటుంది. తన పాస్ పుస్తకాలను ఇవ్వాలని కొద్ది రోజులుగా సరోజినిని అడుగుతోంది. అధికారులు తనిఖీకి తీసుకెళ్లారని సరోజిని ఆమెకు చెప్పింది. అనుమానం వచ్చిన సామ్రాజ్యం పోస్టల్ అధికారులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా తెలియడంతో వ్యాపించడంతో ఎవరికి వారు మా పుస్తకాలు.. మా పుస్తకాలు అంటూ సరోజిని వద్దకు వెళ్లడంతో బాగోతం బట్టబయలైంది. సోమవారం సాయంత్రం సౌత్సబ్ డివిజన్ ఇన్కస్పెక్టర్ జి. హనీ బ్రాంచి పోస్టాఫీసుకు చేరుకుని అక్కడ ఉన్న వందల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. -
చెల్లని నోట్ల మార్పిడికి చివరి చాన్స్
గడువు జూలై 20; సహకార బ్యాంకులకూ వెసులుబాటు న్యూఢిల్లీ: రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లను ఆర్బీఐ వద్ద జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లా సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, పోస్టాఫీసులకు మరోసారి అవకాశం ఇచ్చింది. ఇందుకు జూలై 20వ తేదీని గడువుగా పేర్కొంది. డీమోనిటైజేషన్‌లో భాగంగా ప్రజల నుంచి సమీకరించిన రద్దయిన నోట్లు ఏవైనా మిగిలి ఉంటే వచ్చే నెల 20లోపు ఆర్బీఐ వద్ద మార్చుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ తాజా నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే ఇన్నాళ్లూ ఎందుకు డిపాజిట్ చేయలేదన్న కారణాన్ని కూడా తెలియజేయాల్సి ఉంటుందని షరతు విధించింది. గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆ నోట్లను ప్రజల నుంచి స్వీకరించేందుకు వాణిజ్య బ్యాంకులకు డిసెంబర్ 30 వరకు అనుమతించగా, జిల్లా కోపరేటివ్ బ్యాంకులకు మాత్రం కేవలం నాలుగు రోజులే నవంబర్ 14 వరకు అవకాశం ఇచ్చారు. దీనిపై కోపరేటివ్ బ్యాంకులు అప్పుడే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రద్దయిన నోట్లను స్వీకరించేందుకు ఉద్దేశించిన అధికారిక నోటిఫికేషన్ నవంబర్ 14 చివరి రోజే వచ్చిందని కోర్టుకు వివరించాయి. దీంతో రద్దయిన నోట్లను డిపాజిట్ చేసేందుకు జిల్లా కోపరేటివ్ బ్యాంకులకు మరో అవకాశమిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే తాజా నోటిఫికేషన్ విడుదలైనట్టు ఓ అధికారి వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లోని బ్యాంకు శాఖలు, పోస్టాఫీసుల్లోనూ కోట్లాది రూపాయల విలువైన రద్దయిన నోట్లు ఉన్నట్టు ఆ అధికారి వెల్లడించారు. మరోవైపు మహారాష్ట్రలోని కొన్ని సహకార బ్యాంకుల వద్ద రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.2,770 కోట్ల మేర ఉన్నట్టు సమాచారం. పరోక్షంగా దీని ప్రభావం నష్టాల్లో ఉన్న ఒక్కో రైతుకు రూ.10,000 అందించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ పథకంపై పడింది. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతలు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటి నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్రం చివరి అవకాశం ఇచ్చినట్టయింది. మరోవైపు రద్దయిన నోట్లను మార్చుకునేందుకు ఎన్ఆర్ఐలకు ఇచ్చిన అవకాశం కూడా ఈ నెల 30తో ముగిసిపోనుంది. -
రాష్ట్రంలో 5 పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఐదు పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించాలని విదేశాంగ శాఖ నిర్ణయించింది. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, సిద్దిపేట, నల్లగొండలలో ఈ కేంద్రాలను ప్రారంభించనుంది. దేశంలోని హెడ్ పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సంబంధిత సేవలను అందించడానికి అనువుగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ భాగస్వామ్యంతో 149 కొత్త కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. తాజాగా ప్రారంభించే వాటితో కలిపి దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 235కు చేరుతుంది. ఇక ఏపీలో అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళంలలో ఈ కేంద్రాలను ప్రారంభించాలని విదేశాంగ శాఖ నిర్ణయించింది. -
పౌరసేవలకు చిరునామా.. పోస్టాఫీస్!
- సేవల విస్తరణకు 55 వేల మంది గ్రామీణ్ డాక్ సేవక్స్ నియామకం - తపాలా శాఖ కార్యదర్శి బి.వి.సుధాకర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: నిత్యం జనజీవనంతో ముడిపడిన చాలా వ్యవహారాలను నిర్వహించేందుకు తపాలా శాఖ సిద్ధంగా ఉందని తపాలాశాఖ కార్యదర్శి బి.వి.సుధాకర్ తెలిపారు. మందులు, పాఠ్యపుస్తకాల నుంచి నిరుద్యోగ అభ్యర్థుల వివరాల నమోదు, పాస్‌పోర్టు, ఆధార్‌కార్డు, బిల్లుల చెల్లింపు వరకు అన్నీ తపాలా కార్యాలయాల్లోనే అందుబాటులో ఉంచడం ద్వారా పోస్టాఫీసులను ప్రజలకు మరింత చేరువ చేయబోతున్నామని పేర్కొన్నారు. సోమవారం డాక్‌సదన్‌లో మాట్లాడుతూ గ్రామీణ్ డాక్ సేవక్స్ రూపంలో పోస్టాఫీసుల్లో కొత్తగా 55 వేల మందిని నియమిస్తున్నామని, తెలంగాణ, ఏపీకి చెందిన 1,800 మంది అభ్యర్థులు త్వరలో రాబోతున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ నాటికి అన్ని ప్రధాన, ఉప తపాలా కార్యాలయాల్లో పోస్టల్ పేమెంట్ బ్యాంకులను అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించారు. తపాలా కార్యాలయాలను మినీ ఏటీఎంలుగా మారుస్తున్నా మని చెప్పారు. స్పీడ్‌పోస్టు సేవలను 1,29,346 బ్రాంచి పోస్టాఫీసులకు విస్తరించనున్నామని పేర్కొన్నారు. వచ్చే మార్చి నాటికి 811 ప్రధాన తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టుల జారీ ప్రారంభిస్తామని చెప్పారు. ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజీ కేంద్రాలుగా సేవలు ప్రారంభించామని, ఇప్పటికి 5,775 మంది వివరాలు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. సొంతభవనాలున్న పోస్టాఫీసుల పైభాగంలో సోలార్ ప్యానెల్స్ ద్వారా సౌరవిద్యుత్ సమకూర్చుకుని కరెంటు బిల్లుల ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. పోస్టాఫీసుల్లో డిపాజిట్లను పెంచేందుకు ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. తపాలా సిబ్బందికి కొత్త యూనిఫామ్ రూపొందించామని చెప్పారు. 50 పైసల పోస్టుకార్డుపై తపాలా రూ.9 మేర ఖర్చు చేస్తోందని, ధరల పెంపుపై అధ్యయనం చేస్తామని చెప్పారు. -
ఇక పోస్టాఫీసుల్లో ‘ఆధార్’
సాక్షి, హైదరాబాద్: ఆధార్‌కార్డు... అన్ని సేవలకు ఇప్పుడు ఇదే ఆధారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుసహా ప్రైవేటు సంస్థలు కూడా తమ సేవలను దానితో అనుసంధానిస్తున్నాయి. ఆధార్‌కార్డులో అచ్చుతప్పులు దొర్లుతున్నాయి. ఈ–సేవ, మీ సేవ కేంద్రాల్లో ఆధార్‌కార్డులిస్తున్నా సర్వర్ సమస్యలతో సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. దేశవ్యాప్తంగా ఆధార్ సమస్యలపై ఫిర్యాదులు వస్తుండటంతో వాటిని తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి తేవాలని భారత తపాలా శాఖ కార్యదర్శి సుధాకర్ ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించారు. పోస్టాఫీసులకు సంబంధం లేని పలు సేవలను అందిస్తుండడంతో వాటికి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఇది తీవ్ర నష్టాల్లో ఉన్న పోస్టాఫీసులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఇటీవలే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూడీఐఏ)తో తపాలా అధికారులు సంప్రదింపులు జరిపారు. ఆధార్ యంత్రాలను సమకూర్చి మే నెలలో ఆ ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చి యంత్రాల సరఫరాకు టెండర్లు కూడా పిలిచారు. రెండు, మూడు నెలల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసి ఆధార్ కార్డుల జారీ ప్రారంభించనున్నారు. -
గ్రామీణ పోస్టాఫీసులు ఇక మినీ ఏటీఎంలు
- హ్యాండ్ హెల్డ్ డివైస్ల ద్వారా నగదు చెల్లింపులు - తెలంగాణ, ఏపీల్లో ఏప్రిల్ చివరి నాటికి 2 వేల గ్రామాల్లో అందుబాటులోకి.. - ‘సాక్షి’తో భారత తపాలాశాఖ కార్యదర్శి సుధాకర్ సాక్షి, హైదరాబాద్: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు ఏటీఎంల సంఖ్య తగ్గించుకోవాలని నిర్ణయించాయి. తపాలా శాఖ మాత్రం అన్ని గ్రామాల్లోని తపాలా కార్యాలయాల్లో హ్యాండ్ హెల్డ్ డివైస్‌లను అందుబాటులోకి తెచ్చి వాటిని మినీ ఏటీఎంలుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకు రిజర్వ్ బ్యాంకు కూడా అనుమతివ్వడంతో ఈ నెల చివరి నాటికే అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ నెలాఖరునాటికి దేశవ్యాప్తంగా 24 వేల గ్రామీణ తపాలా కార్యాలయాల్లో హ్యాండ్ హెల్డ్ డివైస్ల ద్వారా నగదు చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి 2 వేల గ్రామీణ తపాలా కార్యాలయాల్లో నగదు చెల్లింపుల విధానం అందుబాటులోకి రానుంది. త్వరలో ఆ సంఖ్య 13 వేలకు చేరుకోనుంది. ఈ విషయాన్ని భారత తపాలాశాఖ కార్యదర్శి సుధాకర్ వెల్లడించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.... దేశవ్యాప్తంగా 13 లక్షల గ్రామీణ తపాలా కార్యాలయాలకు హ్యాండ్ హెల్డ్ డివైస్‌లను సమకూర్చబోతున్నాం. ఇప్పుడు కొన్ని పోస్టాఫీసులు, సబ్ పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలు పనిచేస్తున్నాయి. అవి కేవలం పోస్టాఫీసుల్లో ఖాతా ఉన్నవారు మాత్రమే నగదు పొందేందుకు ఉపయోగపడుతున్నాయి. వాటితోపాటు కొత్తగా ఏర్పాటు చేసే డివైస్ల నుంచి ఎవరైనా నగదు పొందవచ్చు. తపాలా కార్యాలయాల పనివేళల్లోనే ఇది అందుబాటులో ఉంటుంది. తొలుత రూ.5 వేల వరకు నగదు పొం దవచ్చు. ఆ తర్వాత పెంచుతాం. అన్ని గ్రామీణ తపాలా కార్యాలయాల్లో నగదు నిల్వలు సిద్ధం చేస్తున్నాం. ఏటీఎం కార్డుతో వచ్చే వారు హ్యాండ్ హెల్డ్ డివైస్‌లో స్వైప్ చేస్తే అక్కడున్న సిబ్బంది డబ్బు అందిస్తారు. తపాలా కార్యాలయాల్లో ఖాతా ఉన్న వారికి ఎలాంటి రుసుములు ఉండవు, బ్యాంకు ఖాతాదారులకు మాత్రం ఒక్కో విత్‌డ్రా యల్‌కు నిర్ధారిత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం ఖాతాదారు నుంచి కాకుండా సంబంధిత బ్యాంకు నుంచి వసూలు చేస్తాం. తపాలా కార్యాలయాలతో గ్రామాల్లోని దుకాణాలను అనుసంధానం చేసి నగదు రహిత లావాదేవీలు జరిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. -
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం దోహదపడుతోంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొదటి విడతగా మహబూబ్‌నగర్, వరంగల్‌లో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సుముఖత వ్యక్తం చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున తాను కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి కేంద్రం దోహదపడుతోందని చెప్పడానికి ఇది ఉదాహరణ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి సరైన సమయంలో తగిన ప్రతిపాదనలు పంపిస్తే, వాటిపై నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాభివృద్ధికి కేంద్రం దోహదపడుతుందని అన్నారు. రెండు జిల్లాల్లో పాస్‌పోర్టు కేంద్రాల ఏర్పాటుకు కృషి చేసిన మోదీ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, బండారు దత్తాత్రేయలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
రూ.2లక్షల ఆంక్షలపై క్లారిటీ
న్యూఢిల్లీ: నగదు లావాదేవీల పై ఖాతాదారులకు షాకిచ్చిన కేంద్రం కొంత ఊరట నిచ్చింది. రూ.2లక్షలకు మించి నగదు లావాదేవీల ఆంక్షలపై వివరణ ఇచ్చింది. ఐటీ చట్టంలో కొత్తగా చేర్చిన సెక్షన్ ప్రకారం బ్యాంకులకు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు , కో-ఆపరేటివ్ బ్యాంకు ఖాతాల నగదు ఉపసంహరణలకు ఈ నిబంధన వర్తించదని ఆదాయపు పన్ను శాఖ గురువారం తెలిపింది. ఈ విషయంలో అవసరమైన నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పింది. ఫైనాన్స్ బిల్లు 2017లో నగదు లావాదేవీలపై నిషేధం ఉన్నప్పటికీ, ఈ పరిమితులు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, కోఆపరేటివ్ బ్యాంక్ సేవింగ్ ఖాతాలకు వర్తించవని స్పష్టం చేసింది. కొత్తగా జోడించిన ఐటీ యాక్ట్ 269ఎస్టి ప్రకారం రూ.2లక్షలకు పైన నగదు ఉపసంహరణలపై బ్యాన్ ఈ ఖాతాలకు వర్తించదని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. అలాగే నగదు ఉపసంహరణలపై పరిమితులు వీరికి వర్తించవని ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, నల్లధనాన్ని అరికట్టడం కోసం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా నగదు లావాదేవీలను రూ. 2 లక్షలకు పరిమితం చేయాలని నిర్ణయించింది. 2017-18 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రు .3 లక్షల నగదు లావాదేవీ నిషేధించాలని ప్రతిపాదించారు. అయితే గత నెల లోక్‌సభ ఆమోదించిన ఆర్థిక బిల్లు సవరణ ద్వారా ఈ పరిమితిని రూ 2 లక్షల వరకు కుదించారు. రెండు లక్షలకు మించి నగదు లావాదేవీ జరిపితే 100శాతం జరిమానా కట్టవలసి ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
పాస్‌పోర్టు సేవా కేంద్రం ఓ వరం
– కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్‌సిటీ): పాస్‌పోర్టు సేవా కేంద్రం జిల్లా ప్రజలకు ఓ వరమని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పేర్కొన్నారు. కర్నూలు ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని బుధవారం ఎంపీ లాంఛనంగా ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ చదువు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల వెతలు స్వయంగా చూశానని, హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి సిఫార్సు లేఖలు కూడా రాయించుకునే వారని తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ను సంప్రదిస్తే మొదట క్యాంప్ తరహాలో నిర్వహిస్తామన్నారు. పోస్టాఫీసులకు అనుబంధంగా ప్రధాని 100 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడం, అందులో మొదటి విడతలోనే కర్నూలుకు మంజూరు చేయడం అదృష్టమన్నారు. ఉద్దేశం నెరవేరింది.. పాస్‌పోర్టు సేవలు ప్రజల వద్దకు అనే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం నెరవేరిందని రీజనల్ పాస్‌పోర్టు అధికారి ఎన్ఎల్పీ.చౌదరి పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 50 అప్లికేషన్లు ప్రాసెస్ చేయగలమని, పూర్తిస్థాయిలో సెంట్రల్ ప్రాసెసింగ్‌తో అనుసంధానమైన తర్వాత ఆ సంఖ్యను 100కు పెంచవచ్చని తెలిపారు. పోస్టల్ డైరెక్టర్ సంతాన రామన్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఙానం పెరగడం వల్ల గతంలో పాస్‌పోర్టు సైజ్ ఫొటో తీయించుకునేందుకు పట్టే సమయంలో ఏకంగా పాస్‌పోర్టునే తయారు చేయగలుగుతున్నామన్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభం కర్నూలు చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమని పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు పేర్కొన్నారు. రీజియన్ పరిధిలో మొదటి స్థానం సాధించిన డివిజన్ హెడ్ కెవీ సుబ్బారావుతో పాటు డైరెక్టర్ సంతాన రామన్‌ను ఎంపీ సన్మానించారు. అలాగే పాస్‌పోర్టు కేంద్రం మంజూరుకు కృషి చేసిన ఎంపీని పోస్టల్ అధికారులు సత్కరించారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, అదనపు ఎస్పీ షేక్షావలి, వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, పోస్టల్ ఏఎస్పీ నాగానాయక్, పోస్టుమాస్టర్ డేవిడ్ పాల్గొన్నారు. -
ఆకాశవాణి
హ్యూమర్ ప్లస్ ఇప్పుడైతే పాట చెవుల్లోకి దూరి వీధుల్లో మాయలైంది కానీ, ఒకప్పుడు పాట కుళాయి నీళ్ళలా ఎక్కడ చూసినా ప్రవహించేది. ఘంటసాల ఇంటింటి గాయకుడే. రేడియోలు గురగురమని, గడగడమని, స్టేషన్ మార్చినప్పుడల్లా సౌండ్ చేసేవి. ఒక్కోసారి ప్రెషర్ కుక్కర్‌లా ఆగకుండా విజిల్ వేసేవి. హోటళ్ళలో హార్మోనియం పెట్టె సైజ్‌లో కరెంట్ రేడియోలుండేవి. ఈ రేడియో చేసే సౌండ్‌కి ఒక్కోసారి కస్టమర్లు తింటున్న ఇడ్లీలు కూడా వదిలేసి పారిపోయేవాళ్ళు. భక్తిగీతాల దగ్గర నుంచి కార్మికుల కార్యక్రమం వరకూ రేడియో గొంతు వినిపిస్తూనే వుండేది. దేవుడి దయవల్ల ఆకాశవాణి కేంద్రాలకి మధ్యలో విరామం కూడా వుండేది. కరెంట్ రేడియోకి సిస్టర్ ట్రాన్సిస్టర్. దాని పొట్టనిండా బ్యాటరీలు కూరిస్తే తప్ప అది మాట్లాడదు. బుష్, మర్ఫీ అని రెండు కంపెనీలుండేవి. మా ఇంట్లో ఉన్న బుష్ రేడియో నెత్తిమీద నాలుగైదు మొత్తితే తప్ప మూలిగేది కాదు. కడప స్టేషన్ రావాలంటే తూర్పుకి, హైదరాబాద్ రావాలంటే దక్షిణానికి తిప్పాలి. సిలోన్ మాత్రం తొందరగానే తగులుకునేది, కాకపోతే ‘గీక్గుటగుట’ అని గ్యాస్ట్రబుల్ వచ్చినోడి లాగా శబ్దతరంగాలు చేసేది. శ్రీలంక స్టేషన్లో మీనాక్షి పొన్నుదురై అనే అనౌన్సర్ ఒక సెలబ్రిటీ. ఆమె గొంతు వినడం ఒక ఫ్యాషన్. గంటసేపు ప్రోగ్రాంలో భక్తి కార్యక్రమాలు, ప్రకటనలు పోగా గట్టిగా ఐదు పాటలొచ్చేవి. వాటికోసం చెవుల్ని కోసి, రేడియోకి అతికించి వినేవాళ్ళం. అందరిళ్ళలో ఒకేసారి రేడియో మోగడం వల్ల వీధంతా మైక్ పెట్టినట్టుండేది. రేడియోకి లైసెన్స్‌లు కూడా వుండేవి. ఒక పాస్ పుస్తకంలో రకరకాల స్టాంపులుండేవి. పోస్టాఫీస్‌లో డబ్బు కడితే వాటిమీద ముద్రలేసి ఇచ్చేవాళ్ళు. ఆ తరువాత గవర్నమెంట్ లైసెన్స్‌ని రద్దు చేసింది. జనం రేడియోని రద్దు చేశారు. మావూళ్ళో చెన్నకేశవులు అని ఒకాయనుండేవాడు. ఆయనకి రేడియో అంటే ఇష్టం. కొనుక్కునే స్థోమతుండేది కాదు. రేడియో వినడానికి ఇళ్ళముందు తచ్చాడేవాడు. ప్రాణాన్ని చెవుల్లోకి తెచ్చుకుని వినేవాడు. ఆయన కొడుకు మిలట్రీలో చేరిన తరువాత తండ్రికి ఒక రేడియో, సైకిల్ కొనిపెట్టాడు. చెన్నకేశవులు పూలరంగడు తిరిగినట్టు చుట్టుపక్కల ఊళ్ళన్నీ ఒక రౌండేశాడు. సైకిల్‌కి ముందు ఒక బుట్ట, దాంట్లో రేడియో పెట్టుకుని, అట్లాస్ సైకిల్ తొక్కుతుంటే ఆ కతే వేరు. కానీ ఒకరోజు తన చేతుల్తోనే రేడియో పగలగొట్టాడు. మిలట్రీలో కొడుకు చనిపోయిన దుఃఖం అలాంటిది. క్రికెట్ పిచ్చి ఎక్కువయ్యేసరికి పాకెట్ రేడియోలు పుట్టాయి. అర్థమైనా కాకపోయినా కామెంట్రీ వింటూ, గట్టిగా అరుపులు, కేకలు వినిపిస్తే వికెట్ పడిందని డిసైడ్ అయ్యేవాళ్ళు. బెల్‌బాటం ప్యాంట్ వేసుకోకపోయినా, క్రికెట్ కామెంట్రీ వినకపోయినా అనాగరికుడని భావించే కాలం. బ్లాక్ అండ్ వైట్ టీవీ దొంగలా ఇంట్లోకి ప్రవేశించింది. అప్పటివరకూ దొరలా జీవించిన రేడియోకి కష్టకాలం మొదలైంది. చెవులకి పనితగ్గి, కళ్ళు యాక్టివ్ అయ్యాయి. వస్తుందో రాదో తెలియని తెలుగు పాటకోసం ఇల్లంతా ‘చిత్రలహరి’ ముందు కూర్చునేవాళ్ళు. ఈలోగా జపాన్ వాళ్ళు పగబట్టి డొక్కు టేప్రికార్డర్లను తయారుచేసి జనం మీదికి వదిలారు. ఖాళీ క్యాసెట్ ఇస్తే పాటలు రికార్డు చేసేవాళ్ళు వీధుల్లో పుట్టుకొచ్చారు. గ్రామ్‌ఫోన్ రికార్డులు బ్రేక్ కావడం కూడా మొదలైంది. పాట సామూహికంగా మాయమై వ్యక్తిగతంగా మారింది. మార్నింగ్ వాక్‌లో అందరి చెవుల్లోనూ వైర్లు వేలాడుతూ కనిపిస్తాయి కానీ, ఎవరేం పాట వింటున్నారో తెలియదు. అసలు వినాలనిపించే పాటలు వస్తున్నాయో లేదో కూడా తెలియదు. పాటల వల్ల హిట్టయ్యే సినిమాలూ లేవు, పాటలకోసం సినిమాలు చూసేవాళ్ళూ లేరు. తమాషా ఏమంటే ఫేస్‌బుక్‌లు, వాట్సప్‌లు గురించి కూడా పాతికేళ్ళ తరువాత నాలాంటి వాడొకడు కాలమ్ రాస్తాడు. రాయడం అనే మాట తప్పేమో, అప్పటికి పేపర్లు ఉండకపోవచ్చు. – జి.ఆర్. మహర్షి -
నెలాఖరు లోపు పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభించాలి
– పాస్‌పోర్టు అధికారులతో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఈ నెలాఖరు లోపు అని్న సదుపాయాలతో కర్నూలులో పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభించాలని పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక సూచించారు. ఎంపీ సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో పాస్‌పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పాస్‌పోర్టు సేవా కేంద్రం మూడు జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ పాస్‌పోర్టు అధికారి ఎ.కె.మిశ్రా, వైజాగ్ పాస్‌పోర్టు కార్యాలయ సూపరింటెండెంట్ కల్యాణ్, కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సి.హెచ్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
28న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో ఈనెల 28న పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. పోస్టుమెన్లు ఉత్తరాలను సార్టింగ్ చేసుకునే చోటును అనువైన ప్రదేశంగా గుర్తించారు. తూర్పు వైపున ప్రత్యేక ద్వారాన్ని కూడా నిర్మించారు. ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించేందుకు రీజనల్ పాస్‌పోర్టు అధికారి ఎం.ఎల్.పి.చౌదరి నేతృత్వంలోని పర్యవేక్షణ కమిటీ శుక్రవారం వైజాగ్ నుంచి కర్నూలు వచ్చింది. స్థలాన్ని కొలతలు వేసుకుని ఎక్కడ ఏ సదుపాయం ఏర్పాటు చేయాలనే అంశంపై అంచనా వేసుకున్నారు. కౌంటర్లు, టేబుళ్లు, కరెంటు సదుపాయం, జనరేటర్ సామర్థ్యం వంటి వాటి గురించి తెలుసుకున్నారు. పాస్‌పోర్టు కార్యాలయానికి ప్రత్యేక సర్వర్ గది, ప్రత్యేక జనరేటర్ ఉండాలని కమిటీ ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో వైజాగ్ ప్రతినిధి కృష్ణతోపాటు కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు, ఏఎస్పీ సి.హెచ్.శ్రీనివాస్, పోస్టుమాస్టర్ వై.డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.50తోనే సేవింగ్ ఖాతా
అనంతపురం రూరల్ : తపాలశాఖ పరిధిలోని పోస్టాఫీసుల్లో రూ.50తోనే సేవింగ్ ఖాతాతోపాటు ఏటీఎం కార్డును పొందొచ్చని తపాలశాఖ అదనపు సూపరింటెండెంట్ సంజీవ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీస్లుల్లో శుక్రవారం నుంచి ఖాతాలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా చెక్కుబుక్ సౌకర్యాన్ని సైతం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు
పైలెట్ ప్రాజెక్ట్ కింద మైసూర్ ఎంపిక విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి ధ్యానేశ్వర్ మూలే వెల్లడి తిరుపతి: కొత్త పాస్‌పోర్టులను ఇకపై పోస్టాఫీసుల ద్వారా జారీ చేయనున్నట్లు విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి ధ్యానేశ్వర్ మూలే వెల్ల డించారు. ఇందుకోసం మైసూరులోని పోస్టాఫీసు లను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశమంతటా ఈ విధా నాన్ని అమలు చేస్తామన్నారు. రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్విని సత్తారుతో కలసి శుక్రవారం సాయంత్రం «ఆయన తిరుపతి పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38 పాస్‌పోర్టు కార్యాలయాలు, 89 సేవా కేంద్రాలు ఉన్నాయని, వీటి ద్వారా రోజుకు దాదాపు 50 వేల చొప్పున ఏడాదికి సుమారు 1.30 కోట్ల పాస్‌పోర్టులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. దళారుల బెడదను తగ్గించి దరఖాస్తుదారుని ఇంటి వద్దకే పాస్‌పోర్టు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. త్వరలో స్టూడెంట్ కనెక్ట్ పేరిట సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నామనీ, దీని ద్వారా విద్య, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్‌పోర్టు, వీసాలపై అవగాహన కలిపిస్తామన్నారు. ప్రస్తుతం పాస్‌పోర్టు జారీని సులభతరం చేసినట్లు వెల్లడించారు. త్వరలో నెల్లూరు కేంద్రంగా పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడామన్నారు. భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు అధీకృత ఏజెంట్ల ద్వారానే వెళ్లాలనీ, దళారుల ద్వారా వెళితే అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. విజయవాడలో శనివారం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైనప్పుడు ఈ విషయంపై మాట్లాడను న్నట్లు తెలిపారు. తిరుపతిలో త్వరలోనే జర్నలిస్టుల కోసం ప్రత్యేక పాస్‌పోర్ట్ మేళాను నిర్వహించ నున్నట్లు ధ్యానేశ్వర్ మూలే వెల్లడించారు. -
బ్యాంకులతో పోస్టల్ ఏటీఎంల అనుసంధానం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): జిల్లాలోని కర్నూలు, ఆదోని హెడ్ పోస్టాఫీసుల వద్ద ఏర్పాటు చేసిన పోస్టల్ ఏటీఎంలు ఇకమీదట బ్యాంకు ఖాతాదారులకు కూడా ఉపయోగపడనున్నాయి. పోస్టల్ ఏటీఎంను బ్యాంకులతో అనుసంధానం చేసినట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. బుధవారం తన వద్ద ఉన్న బ్యాంక్ ఏటీఎం కార్డును ఉపయోగించి డబ్బు డ్రా చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు ఏటీఎం కార్డులతో పోస్టల్ ఏటీఎంలలో డబ్బు డ్రా చేసుకోవచ్చన్నారు. అయితే వారం రోజుల వరకు తక్కువ డబ్బు పెట్టి ట్రయల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సూపరింటెండెంట్ వెంట పోస్టుమాస్టర్ వై.డేవిడ్, పోస్టుమ్యాన్ మల్లికార్జున తదితరులు ఉన్నారు. -
ముగిసిన గడువు
పాత రూ.500, రూ.1000 నోట్లకు తెర చివరి రోజు పెద్దగా కనిపించని నగదు మార్పిడి 98 బ్యాంకులు, 139 పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి ఏటీఎంల వద్ద కొనసాగిన క్యూలు మంచిర్యాల అగ్రికల్చర్ : పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి గడువు ముగిసింది. యాబై రోజులపాటు సాగిన ఈ నోట్ల మార్పిడి ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. పెద్ద నోట్లు రద్దు చేసి నల్లధనం బయటికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బందు లు మాత్రం తప్పడం లేదు. జిల్లాలో నెలన్నరోజులపాటు దగ్గర ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ఎదుట బారులు తీరారు. చివరి రోజు తక్కువే.. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ 98 బ్యాంకుల్లో, వారం రోజులపాటు 139 పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. చివరి – మిగతా 2లోu రోజైన శుక్రవారం నగదు మార్పిడికి పెద్దగా జనసందడి కనిపించలేదు. బ్యాంకుల్లో ఎక్కువగా విత్‌డ్రాకు మాత్రమే జనాలు వస్తున్నారు. పాత నోట్లను రద్దు చేసి 52 రోజులు గడిచినా ఇంకా నగదు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బ్యాంకుల అవసరం మేరకు డబ్బు చేరకపోవడం, ఏటీఎంల నుంచి సరిపడా చేతికందపోవడంతో ప్రజలు కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నోట్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా, ఏటీఎం వద్ద బారులదీరినా వారి చేతికందేది కొద్ది మొత్తంలోనే.. అందులో రూ.2 వేల నోట్లు ఇస్తుండటంతో దానికి చిల్లర దొరక్క చూసుకొని మురువాల్సి వస్తోంది. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి పనికి రాకుండాపోతున్నాయి. వివిధ రూపాల్లో అవకాశాలు.. నవంబర్ 8 నుంచి రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో మార్చుకునేందుకు వివిధ రకాల ఆప్షన్లు ఇచ్చింది. ఈ నోట్ల మార్పిడి రోజుకు నాలుగు వేల చొప్పున ఆ నెల మొత్తం అవకాశం ఇచ్చింది. దీంతోపాటు ప్రభుత్వ పన్నుల చెల్లింపునకూ రూ. వెయ్యి, రూ.500 నోట్లను అంగీకరించింది. పన్నులు చెల్లింపునకు మూడు సార్లు గడువు పెంచుతూ వచ్చింది. చివరిగా డిసెంబర్ 15 వరకు గడవు ఇచ్చింది. తదనంతరం పాత నోట్లను బ్యాంకుల్లో వారివారి ఖాతాల్లో జమ చేసేందుకు నిబంధన విధించింది. మార్చుకోవడంతోపాటు పన్నులు చెల్లించగా మిగిలిన నోట్లను జమ చేసుకునేందుకు డిసెంబర్ 30 వరకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో నల్లకుబేరులు శత విధాలు ప్రయాత్నిస్తునే ఉన్నారు. పాత నోట్లు దొరికితే జైలే.. రద్దు చేసిన పెద్ద నోట్లను బ్యాంకులో జమ చేయడానికి గడవు ముగిసినందునా ఇక ఈ నోట్లు దేనికీ ఉపయోగపడవు. ఆర్బీఐ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పలు రకాల నిబంధనలతో మార్చి 31 వరకు జమ చేసుకునేందుకు గడువు ఉంది. తదుపరి కూడా ఈ నోట్లు కలిగి ఉంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. రద్దుచేసిన నోట్లు రూ.10 వేల వరకు ఉంటే పెద్దగా పట్టించుకోరు. కానీ.. అంతకుమించి ఎక్కువ ఉన్నా.. ఇతరులకు బదిలీ చేసినా శిక్షార్హులే అవుతారు. నల్లకుబేరుల్లో రైళ్లు పరుగు.. పెద్ద మొత్తంలో అక్రమంగా సంపాదించిన నగదు పాత రూ.500, 1000 నోట్లను మార్చుకునేందుకు నల్లకుబేరులు గడిచిన 50 రోజులు శతవిధాలా ప్రయత్నించారు. నోట్ల మార్పిడికి కమీషన్ ఏజెంట్లను సైతం ఆశ్రయించారు. జిల్లాలో ఎక్కువగా రియల్ ఎస్టేట్, బంగారం, ఇతర వ్యాపారుల ద్వారా అక్రమంగా సంపాదించిన వారు నగుదు మార్చుకునేందకు పలు అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. ఇప్పటికే నగదు మార్పిడి చేస్తూ కొంత మంది కమీషన్ ఏజెంట్లు పట్టుబడ్డ సంఘటనలూ ఉన్నాయి. నల్లకుబేరులు పేదలను పావులుగా వాడుకొని జన్‌ధన్ ఖాతాల్లో సైతం డిపాట్ చేయించినట్లు తెలుస్తోంది. నోట్లు రద్దయిన వారం రోజుల్లో పెద్ద మొత్తంలో బంగారం విక్రయాలు కూడా పెరిగాయి. రూ.500, 1000 నోట్లను రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకు, పోస్టాఫీసుల్లో సుమారుగా రూ.600 కోట్ల నోట్లను జమచేసినట్లు తెలుస్తోంది. -
పండుటాకుల పాట్లు
ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు పోస్టాఫీస్‌ల చుట్టూ ప్రదక్షిణలు నిరీక్షించి నీరసించిపోతున్న వృద్ధులు, దివ్యాంగులు సూర్యాపేట :వయస్సు మీదపడిన పండుటాకులు, దివ్యాంగులు, వితంతువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టి ‘ఆసరా’ పింఛన్ పథకం రోజురోజుకూ నీరుగారుతోంది. మూడు నెలలుగా జిల్లాలోని లబ్ధిదారులకు పెన్షన్ అందకపోవడంతో వారు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. వృద్ధాప్యంలో ప్రభుత్వం అందించే ‘ఆసరా’తోనే బతుకీడుస్తున్న వారు ప్రస్తుతం డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నిత్యం పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేçస్తూ నిరీక్షించి నీరసించి పడిపోతున్నారు. పలు చోట్ల వృద్ధులు అనారోగ్యానికి గురైన సంఘటనలుచోటు చేసుకుంటున్నాయి. ఒకరిద్దరికే ఇచ్చి.... ప్రభుత్వం పెన్షన్ డబ్బులు విడుదల చేసిందని అధికారులు చెబుతున్నా.. లబ్ధిదారులకు మాత్రం మూడు నెలలుగా అందడంలేదు. పోస్టాఫీస్ల్లో ఒకరిద్దరికి ఇచ్చి డబ్బులు లేవని అధికారులు ముఖం చాటేస్తున్నారని వృద్ధులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 23 మండలాలు రెండు మున్సిపాలిటీలు, హుజూర్నగర్ నగర పంచాయతీ పరిధిలో 51,310 వృద్ధాప్య, 51,408 వితంతు, 19,813 వికలాంగులు, 6,500 గీతకార్మికులు, 823 చేనేత కార్మికుల పెన్షన్లు మొత్తం 1,29,854 లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో వృద్ధులు, వితంతులకు, గీత, చేనేత కార్మికులకు నెలకు రూ.వెయ్యి, వికలాంగులకు నెలకు రూ.1,500 అందచేస్తారు. ఇలా జిల్లాలోని పెన్షన్‌దారులకు నెలకు రూ.15.15కోట్ల బడ్జెట్‌ను (ఆక్టోబర్ నెలకు) ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు 19 మండలాల పరిధిలో కేవలం 50,716 మంది లబ్ధిదారులకుగాను రూ.5,89,60,000 మాత్రమే పంపిణీ చేశారు. అంటే మిగిలిన రూ.10 కోట్లు పంపిణీ చేయాల్సింది. అదేవిధంగా పలుప్రాంతాల్లో సెప్టెంబర్ నెల డబ్బులు కూడా అందజేయకపోవడం గమనార్హం. వీటితో పాటు, డిసెంబర్ నెల కూడా గడిచిపోయిందని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల డబ్బులు బ్యాంకులకు వచ్చేదెప్పుడు, వచ్చిన డబ్బులు తమకు అందచేసేదెప్పుడని పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొడెక్కిన వృద్ధులు... మూడు నెలలుగా పెన్షన్లు అందకపోవడంతో తమ కనీస అవసరాలు తీర్చుకోలేక పోతున్నామని వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఆందోళన బాటపట్టి రోడెక్కారు. పెన్‌పహాడ్ మండలంలోని పలు గ్రామాలకు ఇప్పటి వరకు ఆక్టోబర్ నెల డబ్బులు కూడా రాలేదని పోస్టాఫీస్ అధికారులు చెప్పడంతో ఇటీవల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గరిడేపల్లి మండలం కేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద కూడా నిరసన తెలిపారు. ఇక ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో గురువారం పెన్షనర్లు రాస్తారోకో నిర్వహించారు. ఇలా ప్రతీ రోజు ఏదో ఒక చోట నిరసనలు తెలియడం పరిపాటిగా మారింది. పెద్దనోట్ల రద్దుతో... ఆసరా పింఛన్‌దారులకు పెద్దనోట్ల రద్దు దెబ్బ కూడా బాగానే తగిలింది. 50 రోజుల క్రితం కేంద్రం పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రకటన చేసింది. అప్పటికే నెల రోజుల పింఛన్ రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు నోట్ల రద్దు ప్రభావంతో మళ్లీ డబ్బులు అందలేదు. దీంతో వారు ఎంచేయాలో అర్థం కాని పరిస్థితిల్లో పడిపోయారు. కొన్ని చోట్ల నవంబర్ పింఛన్ డబ్బులు పంపిణీ చేసినా రూ.2 వేల నోటుతో చిల్లర ఇక్కట్లు తప్పలేదు. -
పండుటాకుల పరేషాన్..!
మిర్యాలగూడలో తోపులాట.. 12 మంది ఆసరా లబ్ధిదారులకు గాయాలు మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంపు పోస్టాఫీసు వద్ద బుధవారం ఆసరా పింఛన్లకు క్యూలైన్లో నిలబడిన వృద్ధుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అర్ధ రాత్రి నుంచి ఉదయం 9 గంటల వరకు 400 మందికి పైగా వృద్ధులు క్యూలో నిల్చున్నారు. కాగా, ఈ క్యూలైన్లో తోపులాట చోటుచేసుకుని కిందపడ్డారు.దీంతో నాగమ్మ, కాశమ్మ, పద్మ, లింగమ్మ, నర్సమ్మ, సజ్జల అచ్చమ్మ, శ్రీదేవి, రంగమ్మ, ఫాతిమ, జానమ్మ, సరోజ, రాములమ్మ అనే 12 మంది వృద్ధులకు గాయాలయ్యాయి. కాగా, ఈ తోపులాట విషయాన్ని తెలుసుకున్న ఆర్డీఓ కిషన్‌రావు పోస్టాఫీసును సందర్శించి క్యూలో నిలబడిన వారితో మాట్లాడారు. క్యూలో నిలబడిన లబ్ధిదారులందరికీ పింఛన్లు అందజేయాలని పోస్టల్ అధికారులను ఆదేశించారు. -
పోస్టాఫీసులో సీబీఐ దాడులు
సబ్ పోస్ట్‌మాస్టర్, ట్రెజరర్ అరెస్ట్ సాక్షి, విశాఖపట్నం: టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి వ్యవహారంలో విశాఖ స్కేప్‌కు సంబంధాలు న్నాయంటూ రేగిన కలకలం మరువకముందే మరో సంచలనానికి నగరం వేదికైంది. పాత నోట్లను నిబంధనలకు విరుద్ధంగా మార్చారనే అభియోగాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సబ్ పోస్టాఫీస్‌లో ఇద్దరు ఉన్నతోద్యోగులను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను సీబీఐ ఎస్పీ ఆర్.గోపాలకృష్ణారావు వెల్లడించారు. పాత నోట్ల రద్దు తర్వాత వాటిని మార్చుకునేందుకు బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లోనూ అవకాశం కల్పించారు. ఇందులో అక్రమాలకు అవకాశం ఉండటంతో సీబీఐ నిఘా వేసింది. ఈ క్రమంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం సబ్ పోస్టాఫీస్ నుంచి రూ.20 లక్షలకుపైగా అక్రమంగా నోట్ల మార్పిడి జరిగినట్లు సమాచారం అందింది. రహస్య పరిశోధన అనంతరం సమాచారం నిజమేనని నిర్ధారించుకున్న అధికారులు ఈ నెల 14న ఆకస్మికంగా దాడి చేశారు. రికార్డులు తనిఖీ చేశారు. బంధువుల కోసం అక్రమాలు సబ్ పోస్టుమాస్టర్ కె.లలిత, ట్రెజరర్ షేక్ ఎస్ శామ్యూల్ జాన్‌లు తమ బంధువులు, స్నేహితులకు చెందిన రూ.21.73 లక్షల నగదును నిబంధనలకు విరుద్ధంగా మార్చినట్టు తనిఖీల్లో బయటపడింది. పాత నోట్లు తీసుకుని కొత్త రూ.2 వేల నోట్లు ఇచ్చినట్లు తేలింది. దీంతో వీరిపై పలు ఐపీసీ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇద్దరు పోస్టల్ అధికారుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం సబ్ పోస్టాఫీసులోని మరో ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆరుగురు పోస్టల్ అధికారులు అరెస్టు
విశాఖపట్టణం: ఆంధ్రా యూనివర్సటీలోని పోస్టాఫీసులో ఆరుగురు ఉద్యోగులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరు పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ.21లక్షల నగదు అక్రమంగా మార్పిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అరెస్టు అయిన వారిలో సబ్ పోస్టు మాస్టర్, ట్రెజరర్, తదితరులు ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
ఎఫ్డీలకు సెలవ్..!
• ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు ఎన్నో • వడ్డీ రేట్లూ తగ్గినంత కాలం డెట్ ఫండ్స్ ఆకర్షణీయమే • పోస్టాఫీసు పథకాల్లోనూ మెరుగైన రాబడులు • ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌తో రాబడులు, పన్ను ఆదా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఇతర స్థిరాదాయ పథకాలపైనా వడ్డీ రేట్లు ఆశాజనకంగా లేవు. ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఒక శాతానికి మించి రాబడులను ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మంచి రాబ డుల కోసం ఇన్వెస్టర్లు ఈ ప్రత్యామ్నాయాల వైపు చూడొచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ⇔ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లలో రాబడులకు హామీ ఉండదు కానీ, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లకు మించి రాబడులను ఇస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. డెట్ ఫండ్స్‌లోనూ రిస్క్ కాల వ్యవధులను బట్టి... లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇన్కమ్, డైనమిక్ బాండ్ ఫండ్స్ ఇలా భిన్న రకాలు ఉన్నాయి. ⇔ నెలకోసం అయితే లిక్విడ్ఫండ్ అనువుగా ఉంటుంది. ⇔ నెల నుంచి మూడు నెలల వరకు పెట్టుబడి పెట్టేట్టు అయితే అల్ట్రా షార్ట్ టర్మ్ ఎంచుకోవచ్చు. ⇔ కనీసం ఓ ఏడాది పాటు పెట్టుబడి కదిలించను అని అనుకుంటే మాత్రం షార్ట్ టర్మ్ ఫండ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ⇔ పెట్టుబడుల కాల వ్యవధి మూడేళ్లు అయినా çపర్వాలేదనుకుంటే ఇన్కమ్ ఫండ్ అనువైనది. ⇔ మొదటి మూడు ఫండ్లలో రిస్క్ ఉండదు. ఇన్కమ్ ఫండ్, మూడేళ్లకు మించి పెట్టుబడి కోసం ఎంచుకునే ఫండ్లలో రిస్క్ ఉంటుందని తెలుసుకోవాలి. డైనమిక్ బాండ్ ఫండ్స్ స్థిరమైన రాబడులకు డైనమిక్ బాండ్స్ లో అవకాశం ఉంటుంది. భిన్న రకాల కాల వ్యవధులు, వడ్డీ రేట్లతో కూడిన పథకాల్లో మదుపు ద్వారా స్థిరమైన, మోస్తరు రాబడులను అందిస్తాయి. అక్రూయెల్ డెట్ ఫండ్స్ పెట్టుబడిలో కొంత భాగం అక్రూయెల్ డెట్ ఫండ్స్ కు కేటాయించుకోవడం కూడా సమంజసమే. వీటిలో పెట్టుబడులు కాలాన్ని బట్టి కాకుండా వడ్డీ రేట్ల ప్రాధాన్యం ఆధారంగానే ఉంటాయి. దీంతో రిస్క్ దాదాపుగా ఉండదు. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ (ఎఫ్ఎంపీ) ఈ పథకాలు బ్యాంకు ఎఫ్‌డీల కంటే అర శాతం నుంచి ఒక శాతం ఎక్కువ రాబడులను ఇస్తాయి. గడువు తీరే వరకు వీటిలో పెట్టుబడులను కొనసాగించడం వల్ల వడ్డీ రేట్ల పరంగా ఆటు పోట్లు లేకుండా చూసుకోవచ్చు. పోస్టాఫీసు పథకాలు పోస్టాపీసు పథకాల వడ్డీ రేట్లు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నాయి. పీపీఎఫ్‌పై రాబడులకు పన్ను ప్రయోజనాలు, సీనియర్ సిటిజన్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజనపై కూడా వడ్డీ రేట్లు ఆకర్షణీయంగానే ఉన్నాయి. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) కంపెనీలు జారీ చేసే ఎన్సీడీలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లనే ఆఫర్ చేస్తున్నాయి. కంపెనీ ఆర్థిక సామర్థ్యం, వ్యాపారం వృద్ధిలో ఉందా, బ్యాలన్స్ షీటు తదితర వివరాలు పరిశీలించే ఇన్వెస్ట్చేయాలి. లేదంటే అసలుకే ముప్పు ఏర్పడుతుంది. ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అధిక పన్ను పరిధిలోకి వచ్చే వారికి ఇవి చక్కగా నప్పుతాయి. 10 నుంచి 20 ఏళ్ల కాలంలో అధిక రాబడులను అందుకోవచ్చు. -
పోస్టాఫీసులో విజిలెన్స్ తనిఖీలు
ఆదోని టౌన్ : ఆదోని హెడ్ పోస్టాఫీసులో విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు అమరనాథ్, మధుసూదన్ రెడ్డి, డివిజనల్ ఆఫీస్ అసిస్టెంట్ విశ్వనాథ్ రికార్డులను పరిశీలించారు. గతనెల 9వ తేది నుంచి 24వ తేదివరకు జరిగిన పెద్దనోట్ల లావాదేవీలపై తనిఖీ చేసినట్లు అమరనాథ్ తెలిపారు. డోన్, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, కర్నూలు నర్సింగరావుపేట పోస్టాఫీసుల్లో తనిఖీలు పూర్తయ్యాయన్నారు. ఇందుకు సంబంధించి నివేదికలు తయారు చేసి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సీల్డు కవర్లో పంపినట్లు తెలిపారు. -
పింఛన్‌దారులకు పాత 500 నోట్ల పంపిణీ
కొత్త రూ.2000, 100 నోట్లు పక్కదారి.. అల్లాదుర్గం పోస్టాఫీస్‌లో ఘటన అల్లాదుర్గం: పింఛన్‌దారులకు పాత రూ.500 నోట్లను పంపిణీ చేస్తూ దొరికిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం పోస్టాఫీసులో చోటుచేసుకుంది. ఈ పోస్టాఫీస్‌కు కొత్త రూ.2000 నోట్లు 30 లక్షలు, రూ.100 నోట్లు 10 లక్షల వరకు వచ్చినట్లు తెలిసింది. ఫైనాన్సలు, వ్యాపారుల వద్ద పాత నోట్లు తీసుకొని వంద నోట్లు, కొత్త 2,000 నోట్లు లక్షల్లో పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నారుు. ఆసరా పింఛన్‌దారులకు ప్రభుత్వం నవంబరులో వారి ఖాతాలో డబ్బులు వేసింది. అప్పటి నుంచి ఎవరికి పింఛన్ డబ్బులు అందజేయలేదు. అరుుతే, వారం రోజుల నుంచి పోస్టాఫీసులో పాత రూ. 500 నోట్లను పింఛన్‌దారులకు పంపిణీ చేస్తున్నారు. ఈ ఐదు వందల నోట్లను ఆర్డీ కింద కడితే అదే అధికారులు తీసుకోవడం లేదు. పైగా బయట చెల్లుబాటు కావడం లేదు. విషయం తెలుసుకొని ‘సాక్షి’ విలేకరి వెళ్లి ఫొటోలు తీయడంతో వెంటనే పింఛన్ల పంపిణీని నిలిపివేశారు. పింఛన్‌దార్లు కోరితేనే..: ఈ విషయంపై పోస్ట్‌మాస్టర్ రాజశేఖర్‌ను ‘సాక్షి’ విలేకరి వివరణ కోరగా పింఛన్‌దారులు ఇవ్వమంటే పాత ఐదు వందల నోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. తమకు రూ.30 లక్షల రెండు వేల నోట్లు వచ్చాయని, వాటిని సేవింగ్ ఖాతా ఉన్న వారికి ఇచ్చామన్నారు. వంద రూపాయల నోట్లు రాలేదని, అందుకే పింఛన్‌దారులకు పింఛన్ డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. పాత ఐదు వందల నోట్లు ఇప్పుడెక్కడివని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వలేదు. -
గోల్కొండ పోస్టాఫీసులో సిబిఐ సోదాలు
-
ఆర్డీపై పన్ను ఉంటుందా ?
నాలుగేళ్ల నుంచి కొంత మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చే ఏడాది మార్చిలో మెచ్యూర్ అవుతుంది. వీటిపై నేను ఏమైనా పన్నులు చెల్లించాలా? - అవినాశ్, గుంటూరు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లపై మీరు ఆర్జించిన వడ్డీని ఇతర ఆదాయంగా పరిగణిస్తారు. మీకు ఏమైనా ఇతర ఆదాయం ఉంటే, ఈ వడ్డీ మొత్తాన్ని ఆ ఇతర ఆదాయానికి కలుపుతారు. దీనికి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల వడ్డీ ఆదాయం వరకూ ఎలాంటి టీడీఎస్(మూలం వద్ద పన్నుకోత) ఉండదు. ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం ఈ పరిమితిని(రూ.10,000) మించితే, మీ వడ్డీ ఆదాయంలో పది శాతం టీడీఎస్ ఉంటుంది. గత పదేళ్లుగా మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ రెగ్యులర్ ప్లాన్లే. నేను ఇన్వెస్ట్ చేసే దాంట్లోంచి డిస్ట్రిబ్యూటర్‌కు ఒక శాతం కమీషన్ లభిస్తోందని నాకు ఇటీవలే తెలిసింది. నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిని రెగ్యులర్ ప్లాన్‌నుంచి డెరైక్ట్ ప్లాన్లకు బదిలీ చేస్తే నాకేమైనా ప్రయోజనం ఉంటుందా? - భవానీ, హైదరాబాద్ డెరైక్ట్ ప్లాన్ల కంటే రెగ్యులర్ ప్లాన్‌ల్లో వార్షిక వ్యయాలు అధికంగా ఉంటారుు. డిస్ట్రిబ్యూటర్ కమిషన్ తదితర వ్యయాలు రెగ్యులర్ ప్లాన్‌ల్లో ఉంటారుు. ఈక్విటీ ఫండ్సలో డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్ల వ్యయాల్లో తేడా 1 శాతం వరకూ ఉంటుంది. శాతం పరంగా చూస్తే ఇది స్వల్పమైనప్పటికీ, దీర్ఘకాలంగా చూస్తే గణనీయమైనదేనని చెప్పవచ్చు. అరుుతే డెరైక్ట్ ప్లాన్‌ల్లో డిస్ట్రిబ్యూటర్ ఉండరు కాబట్టి, మీకు పనిభారం అధికంగా ఉంటుంది.మీ పెట్టుబడుల నిర్వహణ, పేపర్ వర్క్ చూడడం, మ్యూచువల్ ఫండ్ సంస్థతో మీరే సొంతంగా డీల్ చేయాల్సి రావడం వంటి పనులన్నింటిని చక్కబెట్టుకోవలసి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స పట్ల తగిన అవగాహన ఉండి, ఈ పనులన్నింటినీ చూసుకోగలిగితే మీరు రెగ్యులర్ ప్లాన్ నుంచి డెరైక్ట్ ప్లాన్లకు మారిపోవచ్చు. డెరైక్ట్ ప్లాన్‌ల్లో వ్యయాలు తక్కువగా ఉంటారుు. కాబట్టి ఆ మేరకు మీకు దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలే లభిస్తారుు. సూపర్ టాప్-అప్ పాలసీలు తీసుకోవడం మంచిదేనా? ఈ సూపర్ టాప్-అప్ పాలసీలు ఆన్లైన్లో లభ్యమవుతాయా? -రవీందర్, విజయవాడ మీ వైద్య బీమా కవరేజ్‌ను పెంచుకోవడానికి సూపర్ టాప్-అప్ పాలసీ మంచి అవకాశం. ప్రీమియంలో కొంచెం పెరుగుదలతోనే మరింత బీమా కవరేజ్ పొందవచ్చు.సూపర్ టాప్-అప్ పాలసీలను ఆన్లైన్లో తీసుకోవచ్చు. యునెటైట్ ఇండియా సూపర్ టాప్ అప్ పాలసీ, రెలిగేర్ ఎన్హాన్స సూపర్ టాప్ అప్, అపోలో మ్యూనిక్ ఆప్టిమా... వీటిని పరిశీలించవచ్చు. పాలసీ కొనుగోలు చేసే ముందు పాలసీ డాక్యుమెంట్‌ను, బ్రోచర్‌ను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉంటుంది. వెరుుటింగ్ పిరియడ్, మినహారుుంపులను పరిశీలించడం మరచిపోవద్దు. నాకు ఒక్కతే కూతురు. తనకు మంచి చదువు. చెప్పించాలనేది నా కోరిక, నేను నెలకు రూ.8,000 వరకూ పొదుపు చేయగలను.దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్సలో మంచి రాబడులు పొందవచ్చని మిత్రులంటున్నారు. తగిన సలహా ఇవ్వండి. - రుక్మిణి, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్సలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. పిల్లల ఉన్నత చదువు, సొంత ఇల్లు సమకూర్చుకోవడం, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం సాకారం కోసం మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈక్విటీ ఫండ్స అరుుతే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిస్తారుు. దీర్ఘకాలం అంటే కనీసం ఐదేళ్లకు మించి ఇన్వెస్ట్ చేస్తేనే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స నుంచి మంచి రాబడులు వస్తారుు. వీటికి మూడేళ్ల పాటు లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేడయం ద్వారా పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఏదైని మంచి ఒకటి, లేదా రెండు మంచి మ్యూచువల్ ఫండ్సను ఎంచుకోండి. వీటిల్లో క్రమం తప్పకుండా నెలకు కొంత మొత్తం సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేస్తే మీ కూతురికి మంచి చదువు చెప్పించాలనే మీ ఆర్థిక లక్ష్యం సాకారమవుతుంది. నేను మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను మ్యూచువల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త. మ్యూచువల్ ఫండ్స రెగ్యులర్, ప్లాన్ల కటే కూడా డెరైక్ట్ ప్లాన్‌ల్లో వ్యయాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు? ఎందుకలా? - రామారావు, నెల్లూరు మ్యూచువల్ ఫండ్‌సకు సంబంధించి డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్లు దాదాపు ఒకేలాగా ఉంటారుు. వ్యయాల విషయంలో తేడాలుంటారుు. డెరైక్ట్ ప్లాన్‌ల్లో వ్యయాలు తక్కువగా ఉంటారుు. రెగ్యులర్ ప్లాన్‌ల్లో అరుుతే డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కమిషన్ కారణంగా రెగ్యులర్ ప్లాన్‌ల్లో వార్షిక వ్యయాలు అధికంగా ఉంటారుు. ఇక డెరైక్ట్ ప్లాన్‌ల్లో ఇలాంటి వ్యయాలు ఉండవు. మీరు నేరుగా మ్యూచువల్ ఫండ్ కంపెనీ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. బ్రోకర్లు, ఏజెంట్ల అవసరం ఉండదు. ఈ కమిషన్ ఉండకపోవడం వల్ల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌సకు సంబంధించి ఈ వ్యయాల తేడా ఒక శాతంగా ఉంటుంది. డెరైక్ట్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం కొంచెం శ్రమతో కూడుకున్న పని. మీకు మ్యూచువల్ ఫండ్సలో ఇన్వెస్ట్ చేయడం కొత్త కాబట్టి డిస్ట్రిబ్యూటర్ల/ఏజెంట్ల సలహా, సహాయం తీసుకోవడం తప్పుకాదు. అందుకని ముందుగా రెగ్యులర్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స గురించి కొంత అవగాహన వచ్చిన తర్వాత, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మీరు సొంతంగా నిర్వహించుకోలగమన్న విశ్వాసం కలిగిన తర్వాత అప్పుడు డెరైక్ట్ ప్లాన్లకు మారిపోవచ్చు. -
బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆర్టీసీకి మినహాయింపు
కరెన్సీ కష్టాలకు వ్యతిరేకంగా జరుగు తున్న బంద్ కాబట్టి బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద ఎలాంటి ఆందోళనలు చేయకూడ దని విపక్షాలు నిర్ణరుుంచాయి. ఆర్టీసీ బస్సులు యథాతథంగా తిరగనున్నా యి. ప్రజలు యథావిధిగా బ్యాంకులు,పోస్టాఫీసుల్లో కార్యకలాపాలు ప్రకటించింది. ప్రతిపక్షాలు, వామపక్షాల నేతృత్వంలో సామాన్య ప్రజలు తమ ధిక్కార స్వరాన్ని వినిపించనున్నారు. నల్లధనాన్ని వెలికి తీయడానికంటూ కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసి నేటికి సరిగ్గా ఇరవై రోజులు. ఈ ఒక్క నిర్ణయం దేశ వ్యాప్తంగా పెనుసంచలనమవ్వడంతోపాటు జనానికి కష్టాలు మొదలయ్యారుు. కొద్ది రోజులే కదా సర్దుకుంటుంది అనుకున్నా సమస్య పెద్దదైంది తప్ప సద్దుమణగలేదు. ముందు చూపు లేకపోవడంతో ఏటీఎంలు మొరారుుస్తున్నారుు. నగదు ఉపసంహరణకు పరిమితి విధించడంతో చిన్న వాళ్ల పనులు ఆగిపోయారుు. జిల్లా వ్యాప్తంగా 738 బ్యాంక్ బ్రాంచ్‌ల వద్ద జనం బారులుదీరారు. గంటలు, రోజులపాటు నోట్ల మార్పిడి కోసం పడిగాపులు కాస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, బాలింతలు నరకం చూస్తున్నారు. చివరికి ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే శుభకార్యాలు రద్దు చేసుకునే వరకూ వెళ్లింది. చిరు వ్యాపారాలు కుదేలయ్యారుు. సామాన్య మధ్యతరగతి వారికి ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ఇదే అదనుగా కొందరు స్వార్ధ పరులు నోట్ల మార్పిడికి అడ్డ దారులు చూపిస్తామంటూ సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. ఆర్టీసీ, రైల్వే, పెట్రోల్ బంక్‌లలో పాత నోట్లు అనుమతిస్తారన్నప్పటికీ చిల్లర లేకపోవడంతో అక్కడా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఈ కష్టాలు ఎప్పటికి తీరుతాయో స్పష్టత కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై జనం మండిపడుతున్నారు. గడిచిన 20 రోజుల్లో ఒక్క నల్ల కుబేరుడైనా బ్యాంకుల వద్ద క్యూలో నిలబడ్డాడా అని ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. వారి ఆవేదనకు ప్రతీకగా నేడు జిల్లా వ్యాప్తంగా విపక్షాలు ఆందోళనలు నిర్వహించనున్నారుు. -
పోస్టాఫీసుల్లోకి రూ.36 వేల కోట్లు
న్యూఢిల్లీ: పాత రూ.500, రూ. 1,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లోకి రూ.36,631 కోట్లు డిపాజిట్ల రూపంలో వచ్చినట్లు ఒక అధికారి తెలిపారు. నవంబర్ 10-24 మధ్య రూ.3,680 కోట్ల విలువైన పాత నోట్లను మార్చి ఇచ్చినట్లు చెప్పారు. జిల్లా చెస్టుల్లో పాత నోట్ల నిల్వ ముంబై: బ్యాంకులకు అందుతున్న పాత నోట్లను జిల్లా స్థాయిల్లోని కరెన్సీ చెస్ట్‌లలో భద్రపరచుకోవడానికి ఆర్బీఐ సోమవారం అనుమతినిచ్చింది. ఇందుకోసం చెస్ట్ ప్రత్యేకంగా చెస్ట్ గ్యారెంటీ వాల్ట్(జీసీవీ)ను నిర్వహించాలి. కరెన్సీ చెస్టులు లేని బ్యాంకులు నోట్లను సీల్డ్ బాక్స్‌లలో డిపాజిట్ చేసి వాటి విలువకు సమానమైన మొత్తాన్ని చెస్ట్ శాఖలో ఉన్న తమ కరెంట్ ఖాతాకు జమచేసుకునే వెసులుబాటును కల్పించింది. -
పోస్టాఫీసులపై సీబీఐ ఆకస్మిక దాడులు
హిమాయత్‌నగర్‌లో రూ.40 లక్షలు అధీనంలోకి కొన్ని సేవింగ్స ఖాతాలు, ఫిక్సిడ్ డిపాజిట్లపై కన్ను ఈ నెల 8 నుంచి జరిగిన లావాదేవీల పరిశీలన బ్లాక్ మనీ మార్పిడి జరిగినట్లు అనుమానాలు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల మార్పిడి నేపథ్యంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్‌లోని పలు పోస్టాఫీసుల్లో సీబీఐ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. నగరవ్యాప్తంగా దాదాపు ఆరు చోట్ల ఏకకాలంలో ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. హిమాయత్‌నగర్ పోస్టాఫీస్‌లో ఉన్న రూ.40 లక్షల్ని తమ అధీనంలోకి తీసుకున్న సీబీఐ అధికారులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. పోస్టాఫీసులపై దాడుల నేపథ్యంలో పోలీసుల సహకారం సైతం తీసుకున్న సీబీఐ అధికారులు కార్యాలయాలను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. తనిఖీల్లో పోస్టల్ విజిలెన్స అధికారులు సైతం పాల్గొన్నారని సమాచారం. ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు ఈ నెల 8న నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లోనూ పాత నోట్లను మార్చుకోవచ్చని ప్రకటించింది. దీంతో నగరవాసులు రూ.కోట్లలో పాత కరెన్సీని మార్పిడి చేసుకున్నారు. అరుుతే ప్రతి మార్పిడితోనూ కొన్ని ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలనే నిబంధన ఉంది. కొన్ని పోస్టాఫీసులకు చెందిన అధికారులు సిబ్బంది దీన్ని అతిక్రమించారని, కొందరికి ‘వెసులుబాటు’ కల్పిస్తూ పాత నోట్ల మార్పిడికి సహకరించారని సీబీఐకి వరుస ఫిర్యాదులు అందాయి. వీటికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సైతం సేకరించిన అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గురువారం ఏకకాలంలో దాడులు చేశారు. పోస్టాఫీసులకు సంబంధించి నోట్ల మార్పిడితో అవకతవకలతో పాటు డిపాజిట్లు, సేవింగ్స ఖాతాల్లో జమల్లోనూ భారీ అవకతవకలు జరిగినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రికార్డుల్ని పూర్తి స్థాయిలో పరిశీలించడంతో పాటు ఈ నెల 10 తర్వాత జరిగిన అన్ని ఫిక్సిడ్ డిపాజిట్లు, సేవింగ్స ఖాతాల్లో జమలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవకతవకలు నిర్ధారణ కాలేదు పోస్టాఫీసుల్లో సీబీఐ తనిఖీలు సాధారణమని, తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు నిర్ధారణ కాలేదని పోస్టాఫీసు హైదరాబాద్ సిటీ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ కె.సుధీర్‌బాబు తెలిపారు. సీబీఐ బృందం సాధారణ ప్రక్రియలో భాగంగానే తనిఖీలు నిర్వహించి కరెన్సీ మార్పిడి విధానాన్ని పరిశీలించిందని, కరెన్సీ మార్పిడిలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు బహిర్గతం కాలేదని పేర్కొన్నారు. అనుమానిత పార్సిల్స్‌పైనా దృష్టి కొందరు ‘నల్లబాబులు’ పోస్టాఫీసుల్నే ఆధారంగా చేసుకుని అధికారులు, సిబ్బంది సహకారంతో అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ అనుమానిస్తోంది. సరైన ధ్రువీకరణ లేకుండానే, ఒకే ధ్రువీకరణపై పలు లావాదేవీలు అనుమతిస్తూ పాత నోట్లను మార్చుకునే అవకాశం ఇచ్చారన్నది సీబీఐ అనుమానం. ఇలా సాధ్యం కాని సందర్భాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఫిక్సిడ్ డిపాజిట్లు చేయించుకుని, కొన్ని రోజులకే వాటిని రద్దు చేయిస్తూ కొత్త నోట్లు ఇచ్చినట్లు అనుమానాలను వ్యక్తం చేస్తోంది. కొన్ని అనుమానాస్పద పార్శిల్స్ పైనా దృిష్టిపెట్టినట్లు సమాచారం. ఈ నెల 8 తర్వాత నగరంలోని వాణిజ్య ప్రాంతాల నుంచి ఉత్తరాదితో పాటు ఇతర చోట్లకు వెళ్లిన కొన్ని పార్శిల్స్ వ్యవహారాలను సీబీఐ ఆరా తీసినట్లు తెలిసింది. -
ఇకపై బ్యాంక్ ఖాతాల్లో..?
► వేతనాలు తీసుకోనున్న ఉపాధి వేతనదారులు ► ప్రతి ఒక్కరికీ ఖాతాలు తప్పనిసరి ► పోస్టాఫీస్ సేవలు బంద్ ఖాతా తప్పనిసరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులందరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలి. ఇకపై వేతనదాలు బ్యాంకు ఖాతాలకు జమ అవుతారుు. ప్రస్తుతం 143 పంచాయతీల్లో ఈ విధానం అమలవుతోంది. -పి.ప్రశాంతి, డ్వామా పీడీ, విజయనగరం విజయనగరం పూల్‌బాగ్: ఉపాధి హామీ పథకం వేతనాల చెల్లింపుల్లో మళ్లీ మార్పు చోటుచేసుకుంది. ఇంతవరకు పోస్టాఫీసుల్లో వేతనాలు తీసుకునేవారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానానికి నాంది పలకనున్నారు. వేతనదారుల సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేతనదారుల ఖాతాల్లో కూలి డబ్బులు జమ చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. గతంలోనే ఈ ఆదేశాలు జారీ అరుునప్పటికీ పూర్తి స్థారుులో జిల్లాలో అమలు కాలేదు. వేతనదారులందరికీ బ్యాంకు ఖాతాలు లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దశల వారీగా అమలు చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని 921 పంచాయతీలకు గాను 143 పంచాయతీల్లో ప్రస్తుతం బ్యాంకుల ద్వారా సొమ్మును జమ చేస్తున్నారు. విడతల వారీగా 921 పంచాయతీల్లోనూ ఈ విధానం అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఖాతాదారులందరి చేతా బ్యాంకు ఖాతాలు తెరిపించే పనిలో ఉపాధి సిబ్బంది ఉన్నారు. మొదటి విడతలో 143 గ్రామాల్లో రెండో విడతలో 300.. మూడో విడతలో 478 గ్రామాల్లోని వేతనదారులకు బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించనున్నారు. -
చేతులెత్తేసిన తపాలాశాఖ
-
తపాలాశాఖ చేతులెత్తేసింది
- చాలా పోస్టాఫీసులకు అందని కొత్త నోట్లు - రూ.60 కోట్లడిగితే ఇచ్చింది రూ.12 కోట్లే - చెల్లింపులు చేయలేమంటూ బోర్డులు సాక్షి, హైదరాబాద్: రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి తమవల్ల కాదంటూ పోస్టల్ శాఖ చేతులెత్తేసింది. రిజర్వ్ బ్యాంకు, స్టేట్ బ్యాంకులు తపాలా కార్యాలయాలకు చాలినంత నగదు పంపడంలో నిర్లక్ష్యం చూపుతుండటంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా చాలా కార్యాలయాలు పెద్ద నోట్ల మార్పిడిని అనుమతించలేదు. పాత నోట్లను మార్చలేమంటూ బోర్డులు పెట్టేశాయి. నగదు మార్పిడికి అవకాశం కల్పించేందుకు పోస్టాఫీసులకు కూడా నగదు పంపాలని కేంద్రం నిర్ణరుుంచడం తెలిసిందే. ఆ మేరకు ఆర్బీఐ, స్టేట్ బ్యాంకు శాఖల నుంచి ఏ రోజుకా రోజు పోస్టాఫీసులకు నగదు అందాలి. ఇలా తొలి రోజునే పోస్టాఫీసుల ద్వారా రాష్ట్రంలో రూ.52 కోట్ల మార్పిడి జరిగింది. దాంతో రోజుకు రూ.60 కోట్లకు తగ్గకుండా నగదు కావాలని తపాలా అధికారులు కోరినా రూ.30 కోట్లకు మించ కుండానే ఆర్బీఐ, స్టేట్‌బ్యాంకు పంపుతు న్నాయి. పోస్టాఫీసులు తమ కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు కూడా కలిపి నోట్ల మార్పిడి చేస్తూ వచ్చారుు. రెండో రోజు రూ.78 కోట్లు, మూడో రోజు రూ.83 కోట్లు, నాలుగోరోజు రూ.50 కోట్లు, ఐదోరోజు 60 కోట్లు, ఆరోరోజు రూ.65 కోట్ల చొప్పున మార్చారుు. రోజుకు రూ.60 కోట్లు సమకూర్చాలని రాష్ట్ర అధికారులు బుధవారం కేంద్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వానికీ ఫిర్యాదు చేశారు. కానీ, పరిస్థితి మరింత దిగజారింది. గురువారం రూ.12 కోట్ల నగదే వచ్చినట్టు తెలిసింది. హైదరాబాద్ పరిధిలో నాలుగో వంతు కంటే తక్కువ పోస్టాఫీసులకు, సికింద్రాబాద్‌లో కొన్నింటికి, జిల్లాల్లోని ప్రధాన పోస్టాఫీసులకు, అది కూడా అరకొరగానే కొత్త నోట్లు అందారుు. దాంతో గురువారం నామమాత్రంగానే మార్పిడి జరిగింది. పేరుకుపోతున్న పాత నోట్లు మరోవైపు పోస్టాఫీసులకు నిత్యం రూ.55 కోట్లకు తగ్గకుండా పాత నోట్లు వస్తుండటంతో వాటిని స్టేట్‌బ్యాంకులకు పంపుతున్నారు. కానీ తమ వద్దే భారీగా నోట్లు పేరుకుపోతున్నందున తీసుకోలేమని అవి బదులిస్తుండటంతో పోస్టాఫీసుల్లో పాత నోట్లు కుప్పలు పడుతున్నారుు. వాటిని ఎక్కడ దాచాలో కూడా తెలియని గందరగోళం నెలకొంది. ప్రస్తుతం పోస్టాఫీసుల వద్ద రూ.250 కోట్ల వరకు పాత నోట్ల నిల్వ ఉంటుందని అధికారులంటున్నారు. -
క్యూలో సిటీ
పచ్చనోటు ‘రద్దు’.. నగరవాసికి పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. పదిరోజులు గడుస్తున్నా ‘కొత్తనోటు’ చేతికి అందక ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకుల వద్ద కిలోమీటర్ల పొడవున జనం బారులు.. ఏటీఎం కేంద్రాలు, పోస్టాఫీసుల వద్దే అవే క్యూలు. ఏది కొనాలన్నా తడుముకునే పరిస్థితి. వంటింట్లోని డబ్బాలు వెదికినా పదిరూపాయలు కూడా దొరకడం లేదు. మార్కెట్లు కుప్పకూలిపోయారుు. కూలీలకు పని దొరకని దుస్థితి. కోట్ల ఆస్తులున్నా రూ.2 వేల కొత్త నోట్లు కోసం అవస్థలు పడాల్సివస్తోంది. గురువారం కూడా నగరవ్యాప్తంగా ఇదే దుస్థితి. రూ.500 కొత్త నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. సాధారణ రోజుల్లో రూ.5 కోట్ల మేర అమ్మకాలు జరిగే గుడిమల్కాపూర్ మార్కెట్లో గురువారం రూ.2 కోట్ల మేరకే వ్యాపారం జరిగినట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. బంగారం, కూరగాయలు, హోల్‌సేల్, నిత్యావసరాలు.. ప్రతి మార్కెట్ ‘నోటు’ దెబ్బకు విలవిల్లాడుతున్నారుు. - సాక్షి,సిటీబ్యూరో -
నగదు మార్పిడికి సిరా గుర్తు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): నగదు మార్పిడికి పోస్టాఫీసుల్లో సిరా గుర్తును అమలు చేశారు. ఈ విధానం వల్ల ఒకే వ్యక్తి రెండోసారి నోట్ల మార్పిడికి పాల్పడే అవకాశం లేకుండా పోయింది. నోట్ల మార్పిడికి క్యూలలో రీసైక్లింగ్ విధానం కొనసాగుతున్నట్లు బుధవారం సాక్షి దినపత్రిక 'నోటుకు రెండో వైపు' శీర్షికతో కథనం ప్రచురించింది. బుధవారం పోలీసు బందోబస్తు మధ్య పురుషులు, మహిళలు బారులుదీరి పాత డబ్బును కొత్త నోట్లలోకి మార్చుకున్నారు. కౌంటర్లో డబ్బు మార్పిడి చేసుకున్న మరుక్షణమే వేలిపై ఇంకు గుర్తు వేశారు. ఈ పద్ధతి వల్ల రీసైక్లింగ్ విధానానికి అడ్డుకట్ట వేసినట్లయింది. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో బుధవారం ఒకేరోజున డివిజన్ పరిధిలో రూ. 1.72 కోట్ల నోట్ల మార్పిడి జరిగిందని, రూ. 6.30 కోట్ల డిపాజిట్లు సేకరించామని పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సి.హెచ్.శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆరు రోజుల్లో రూ. 48 కోట్ల డిపాజిట్లు జమ అయినట్లు వివరించారు. ఒక అంధురాలు తమ వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేదంటూ ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయింది. నోటు మార్పిడికి అవకాశం లేదని పోస్టల్ సిబ్బంది వెనక్కి పంపారు. -
పోస్టాఫీసులో నోట్లు మార్చుకున్న అమెరికన్లు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): తపాల శాఖ సిబ్బంది అమెరికాకు చెందిన ఇద్దరు మహిళలకు బుధవారం కర్నూలులో డబ్బు మార్పిడి చేసిచ్చారు. అమెరికన్ మహిళలు డొనాకిన్, టెల్మారైట్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తూ బుధవారం కర్నూలుకు చేరుకున్నారు. పాత నోట్లు చెల్లకపోవడంతో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయానికి వచ్చి తమకు కొత్త నోట్లు కావాలంటూ ఆంగ్లంలో రిక్వెస్టు చేసుకున్నారు. గుర్తింపు కార్డు ఉంటేనే నోట్ల మార్పిడి చేయాలనే నిబంధన ఉండటంతో పోస్టల్ సిబ్బంది కాసేపు సందిగ్ధంలో పడ్డారు. అతిథులను గౌరవించాలనే భారత సంప్రదాయం ప్రకారం డిప్యూటీ పోస్టు మాస్టర్ ఎద్దుల డేవిడ్ కొందరికి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు సమకూర్చి, వాటిపై వారికి అవసరమైన రూ. 32 వేల కొత్త నోట్లను ఇచ్చి పంపారు. వారు పోస్టుమాస్టర్‌తో పాటు పోస్టల్ సిబ్బందికి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకున్నారు. -
రూ.50కే పోస్టల్ అకౌంట్
గుంటూరు (లక్ష్మీపురం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సేవలకు ఆదేశించినా పోస్టల్ శాఖ తనదైన శైలిలో ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంది. జిల్లావాసులు ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో వేల రూపాయలు పెట్టి బ్యాంకులో ఖాతాలు తెరవలేని సామాన్యుల కోసం తపాలా శాఖ వారు యాభై రూపాయలకే అకౌంట్ తెరిచే అవకాశం కల్పిస్తోంది. ఈ ఖాతాల ద్వారా నగదును జమ చేసుకోవచ్చు, డిపాజిట్లు చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితిలో పెద్ద నోట్లను బదిలీ చేసుకునేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోస్టల్ కేంద్రాలలో ఈ ఖాతాలు తెరుచుకోవచ్చు ఖాతా తెరవాల్సిన విధానం.... పోస్టల్ శాఖలో 50 రూపాయలకే అకౌంట్ తెరిచేందుకు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలి. ఈ ఖాతాలో ఖాతాదారుడు రూ.49 వేల రూపాయల వరకు జమ చేసుకోవచ్చు.అంతకంటే అధికంగా నగదు డిపాజిట్ చేసుకునే ఖాతాదారులకు పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం బ్యాంక్ ఖాతాదారులతో పాటు పోస్టల్ శాఖలో ఖాతాలు ఉన్న వారికి కూడా వారంలో రూ.24 వేల రూపాయాలు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. -
పోస్టాఫీసుల్లో రూ. 1.40 కోట్ల మార్పిడి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పోస్టాఫీసుల ద్వారా డివిజన్ పరిధిలో ఆదివారం రూ. 1.40 కోట్ల మేరకు నోట్లు మార్పిడి చేసినట్లు పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సి.హెచ్.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్క హెడ్ పోస్టాఫీసులోనే రూ. 40 లక్షల మేరకు మార్పిడి చేశామన్నారు. సోమవారం గురునానక్ జయంతి సెలవు దినమైనా పోస్టాఫీసులు పనిచేస్తాయన్నారు. ఆదివారం ఎస్బీ ఖాతాలకు రూ. 4.79 కోట్ల డిపాజిట్లు జమ కావడంతో మొత్తం డిపాజిట్లు రూ. 35 కోట్లకు చేరాయని వివరించారు. -
జిల్లాల్లో ఎక్కడ చూసినా..
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బ్యాంకులు, పోస్టాఫీస్‌ల వద్ద రద్దీ కొనసా గుతోంది. పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు, నగదు తీసుకు నేందుకు జనం బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. వరంగల్ జిల్లాలో శనివారం కూడా ఏటీఎం కేంద్రాలు పనిచేయలేదు. బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమి చ్చారుు. సంగారెడ్డి జిల్లాలో ఉదయం 8 నుంచే జనం బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద బారులు తీరారు. సంగారెడ్డి, జోగిపేట, పటాన్చెరు, సదాశివపేట, జహీరాబాద్ తదితర పట్టణాల్లో ఏటీఎంలు పనిచేయలేదు. నల్లగొండ జిల్లా లోనూ నాలుగో రోజు ప్రజలకు కరెన్సీ కష్టాలు తప్పలేదు. చాలా బ్యాంకుల్లో డిపాజిట్లు చేసు కుంటున్నా కొత్త నోట్లు ఇవ్వడం లేదు. కొన్ని బ్యాంకుల్లో కొత్త రూ.500, 2000 నోట్లు ఇస్తు న్నా.. చిల్లర సమస్య ఎదురైంది. ఇక బ్యాం కుల్లో రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. ఇక సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పాత నోట్లు డిపాజిట్ చేసుకోవడం తప్ప కొత్తవి ఇవ్వడం లేదు. వారం తర్వాత రావాల ని తిప్పి పంపుతున్నారు. అసలు ఈ మండలం మొత్తమ్మీద ఉన్నది ఈ ఒక్క బ్యాంకే. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధార పడ్డారు. సాగుకు కావాల్సిన వస్తువులు, విత్తనా లతో పాటు నిత్యావసర వస్తువులు కొనాలంటే కొత్త నోట్లు, చిల్లర నోట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రిలో భక్తుల తిప్పలు యాదగిరిగుట్టలోనూ భక్తులకు నోట్ల పాట్లు తప్పలేదు. రూ.500, 1000 నోట్లు చెల్లక.. రూ.2000 నోట్లకు చిల్లర దొరక్క ఇబ్బందులు ఎదురయ్యారుు. ప్రసాద విక్రయశాల, నిత్య కై ంకర్యాల టికెట్ కౌంటర్లలో సరిపడా చిల్లర లేకపోవడంతో.. ఒకానొక దశలో భక్తులను వెనక్కి పంపారు. దీంతో కొంత మంది భక్తులు ప్రసాదాలు తీసుకోకుండా వెళ్లిపోగా... మరికొందరు స్వామి, అమ్మవారి నిత్యపూజల్లో పాల్గొనకుండానే వెనుదిరిగారు. నోట్ల కోసం వచ్చి ఫిట్స్‌కు గురై.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట ఎస్‌బీహెచ్‌కు నోట్లు మార్చుకునేందుకు వచ్చిన ఓ మహిళ ఫిట్స్ వచ్చి పడిపోయారు. కొంతసేపు సృ్పహ కోల్పోయారు. దీంతో అక్కడే ఉన్న కొందరు సపర్యలు చేయడంతో ఆమె కోలుకున్నారు. ప్రైవేట్ ఉద్యోగి ఖాతాలో రూ.4 లక్షలు జమ.. విత్‌డ్రా మెదక్ జోన్: ఓ ప్రైవేటు ఉద్యోగి ఖాతాలో రూ.14 వేలు ఉన్నారుు. కానీ శుక్రవారం రాత్రి ఆ ఖాతాలో ఏకంగా రూ.4 లక్షలు జమయ్యారుు. ఆ వెంటనే ఆ డబ్బంతా విత్‌డ్రా అరుుంది. అసలే పాత నోట్ల మార్పిడి, కొత్త నోట్ల వ్యవహారం గందరగోళంగా ఉన్న ఈ సమయంలో దీనిపై సందేహాలు వ్యక్తమవుతున్నారుు. నల్లధనం చెల్లుబాటుకు ఇది మార్గమేమోనన్న అనుమానాలు వస్తున్నారుు. మెదక్ జిల్లా రారుునిపల్లికి చెందిన ఎం.రాజాగౌడ్ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు మెదక్ పట్టణంలోని ఎస్బీహెచ్ (ఏడీబీ) బ్యాంకులో ఖాతా ఉంది. శుక్రవారం రాత్రి ఆ ఖాతాలో రూ.4 లక్షలు జమ చేసినట్లుగా ఎస్సెమ్మెస్ వచ్చింది. ఆ వెంటనే ఆ డబ్బులు డ్రా అరుునట్లుగా మరో మెసేజ్ వచ్చింది. శనివారం రాజాగౌడ్ బ్యాంకుకు వచ్చి సిబ్బందికి ఈ విషయం చెప్పగా.. ఖాతాను పరిశీలించి చూస్తామని చెప్పారు. అరుుతే నల్లధనాన్ని మార్చుకునేందుకు ఇలా ఖాతాలను వాడుకుంటున్నారా? లేక మరేదైనా సమస్యా? అని పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. రుణాలు ఇవ్వడం లేదు ‘‘నోట్ల మార్పిడి వ్యవహారంతో బ్యాంకులు రైతులకు రుణాలు రెన్యూవల్ చేయడం లేదు. కొత్త రుణాలు ఇవ్వడం లేదు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా సరైన సమాధానం కూడా రావడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు..’’ - ఉపేందర్‌రెడ్డి, ముడుపుగల్, మహబూబాబాద్ మండలం ఉప్పు, మిరపకాయలకూ డబ్బుల్లేవు ‘‘వానకాలం వడ్లు అమ్మితే రూ.10 వేలు వచ్చినరుు. వాటిని పట్టుకొని దుకాణానికి పోతే చెల్లవని వెల్లగొట్టిండు. ఇదెక్కడి గోస. పొద్దున లేచి డబ్బులు, ఖాతా బుక్కు పట్టుకుపొరుు బ్యాంకులో డబ్బులేసిన. కొత్త నోట్ల కోసం వారం తర్వాత రావాలని చెప్తున్నరు. ఇంట్లో ఉప్పు, మిరపకాయలకు కూడా పైసల్లేవు..’’ - మంక్యానాయక్, తాళ్లతండా, సిద్దిపేట జిల్లా విత్తనాలు ఎట్లా పెట్టాలె? ‘‘మక్కలు అమ్మితే సావుకారి రూ.20 వేలు పెద్ద నోట్లు ఇచ్చిండు. యాసంగి పంటకు పెట్టుబడికి, ఎరువులు తెద్దామని ఇంట్లనే పెట్టిన. ఇప్పుడవి చెల్లవంటే.. పొలంకాడ పని వదులుకొని బ్యాం కుకు వచ్చి, ఖాతాల జమచే సిన. మళ్లీ తీసుకుం దామంటే.. వారం ఆగాలని అంటున్నరు. ఎరు వులు ఎట్లా తేవాలె, ఎరువులు లేంది విత్తనం ఎట్లా పెట్టాలె?’’ - స్వామి, రాజుతండా, సిద్దిపేట జిల్లా -
నోటెత్తిన కష్టాలు....
తీరని నోట్ల కొరత నలుపు, తెలుపు చేసేందుకు అడ్డదారులు హవాలాపై దృష్టి పెట్టిన కుబేరులు సాక్షి ప్రతినిధి, ఏలూరు: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఐదు రోజులు దాటినా ఇప్పటికీ ప్రజల కష్టాలు తీరలేదు. ప్రజలు పనులు మానుకుని బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు క్యూకడుతున్నారు. చిల్లర తీసుకున్నవారే ప్రతిచోటా తీసుకుంటుండటంతో డబ్బులు సరిపోవడం లేదని అందువల్ల ఆదివారం నుంచి చిల్లర మార్చుకునే వారికి ఓటు వేసినప్పుడు వాడే ఇంకు వంటిది వేలిమీద వేయాలని బ్యాంకర్లు భావిస్తున్నారు. నోట్లు మార్చుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉదయం ఎనిమిది గంటల నుంచే బ్యాంకుల ముందుకు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు తాము దాచుకున్న ఐదు వందలు, వెయ్యి రూపాయలలో కొన్ని నకిలీ నోట్లు అని తేలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ బయట చెలామణిలో ఉన్న డబ్బులో నకిలీ నోట్లు ఎక్కువగానే చెలామణి అయ్యాయి.అయితే బ్యాంకుల వద్దకు అవి వెళ్లకపోవడంతో యధేశ్చగా చెలామణి అయిపోయాయి. ఇప్పుడు బ్యాంకర్లు వాటిని నకిలీ నోట్లుగా గుర్తించి చింపివేస్తుండటంతో వాటిని మార్చుకోవడానికి వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆక్వా ఎగుమతుల నుంచి, వ్యాపార లావాదేవీల నిమిత్తం ఖరీదుల కోసమని ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బడా,బడా వ్యాపారులు గతంలో హవాలా ద్వారా డబ్బులు ఏర్పాటు చేసుకునేవారు. అయితే ఇప్పుడు హవాలా వ్యాపారం దాదాపుగా దెబ్బతింది. దీంతో అక్వా రంగంపై నోట్ల రద్దు అంశం తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఇకపై బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిపితే ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో పన్నులు కట్టాల్సి ఉంటుంది. మరి దీనికి సిద్దపడతారా వేరే మార్గం వెతుకుతారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇప్పటి వరకూ బ్యాంకుల వద్దకు సామాన్య, మద్య తరగతి ప్రజలే వస్తున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. నల్లదనం వెలికి తీయడానికి అంటూ రద్దు చేసిన నోట్ల వల్ల నల్లదనం ఇప్పటి వరకూ బయటకు రాలేదని సమాచారం. నల్లదనం ఉన్న వారు ఈ నోట్లను మార్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. నల్లదనాన్ని కాపాడుకునేందుకు ఎక్కువ మంది బంగారం కొనుగోళ్లు జరిపినట్లు సమాచారం. మరోవైపు ఎక్కువ మందికి బ్యాంకులో రెండువేల రూపాయల కొత్త నోట్లు ఇస్తున్నారు. అయితే అంత మొత్తానికి చిల్లర ఇవ్వలేని పరిస్థితి ఉండటంతో వాటిని మార్చడం కూడా ఇబ్బందికరంగా మారింది. రద్దయిన రూ. 500 స్థానంలో కొత్త నోట్లు ఇంకా బ్యాంకులకు చేరకపోవడంతో ఖాతాదారులకు కేవలం రూ. 2వేల నోట్లు మాత్రమే ఇస్తుండడంతో సామాన్యులు వీటిని ఏమి చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. రోజు వారి ఖర్చులకు ఎవరి దగ్గరకు వెళ్లినా చిల్లరలేదని చెబుతున్నారని వాపోతున్నారు. తమ వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు గంటల తరబడి లైనులో నిలబడినా, బ్యాంకు అధికారులు చేతిలో రూ. 2వేల నోటు పెడుతుండడంతో వారు నిరాశకు గురవుతున్నారు. చాలా చోట్ల బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు శ్రద్ద చూపిస్తున్నారుగాని నోట్లు మార్చడానికి ఇప్పుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టాఫీసుల్లో నోట్ల కొరత వేధిస్తోంది. బ్యాంకుల నుంచి సరిపడా చిల్లర తమకు ఇవ్వకపోవడం వల్ల తాముప్రజల చేత తిట్లు తినాల్సి వస్తోందని పోస్టల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వీడని కరెన్సీ కష్టాలు
మనీ ట్రబుల్స్.. బ్యాంకులు, పోస్టాఫీసులకు పోటెత్తిన జనం పనిచేయని ఏటీఎంలు స్తంభించిన వ్యాపారాలు నిత్యావసరాలూ కొనలేక అల్లాడిన సామాన్యులు సిటీబ్యూరో: మూడో రోజూ అదే సీన్... బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద యథావిధిగా జనం బారులు....పనిచేయని ఏటీఎంలు..అక్కడక్కడా అరకొరగా పనిచేసినా..అందరికీ అందని డబ్బులు. బ్యాంకుల్లో నోట్ల జారీ పరిమితి 4 వేలకు కుదించడం..బహిరంగ మార్కెట్లో చెల్లని రూ.500, .వెరుు్య నోట్లతో షరా మామూలుగా గ్రేటర్ సిటీజనులు శుక్రవారం నానా పాట్లుపడ్డారు. పలు మెడికల్ షాపులు, ఆస్పత్రుల్లోనూ పాత నోట్ల స్వీకరణకు ససేమిరా అనడంతో రోగులు ససేమిరా అనడంతో రోగులు విలవిల్లాడారు. పెట్రోలు బంకుల వద్ద కూడా భారీ క్యూలైన్లలో నిల్చుని వాహనదారులకు సొమ్మసిల్లినంత పనైంది. పాలు, కూరగాయలు, బియ్యం, పండ్లు తదితర నిత్యావసరాల కొనుగోలుకు సరిపడినంత చిల్లర లేక నిరుపేదలు, అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, గృహిణులు విలవిల్లాడారు. గంటల తరబడి క్యూలైన్లో నిల్చుని సాధించిన నగదులోనూ రూ.2 వేల నోటు రావడంతో ఈ నోటును మార్పించడానికి నానా ఇక్కట్లు తప్పలేదు. ఎవరి వద్దకు వెళ్లినా చిల్లర లేదంటూ చీత్కరించడంతో జనం పాట్లు వర్ణనాతీతంగా మారారుు. చిల్లర కష్టాలతో బార్లు, మద్యం దుకాణాలు కూడా కళ తప్పారుు. రూ.500 నోట్లు ఎలా ఉందో చూద్దామంటే దొరకని దుస్థితి. పరిస్థితి ఇలా ఉంటే...జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ విభాగాలకు మాత్రం కాసుల వర్షం కురిసింది. పాత నోట్ల స్వీకరణకు అనుమతించడంతో ఒకే రోజు ఆయా విభాగాలకు రూ.కోట్లు ఆదాయం లభించడం విశేషం. ఇక శనివారం నుంచి పలు బహిరంగ మార్కెట్లలో పాత నోట్ల స్వీకరణ నిలిచిపోనుండడంతో కొత్తచిక్కులు తప్పేలా లేవని జనం నిట్టూరుస్తున్నారు. బ్యాంకుల్లో నగదు మార్పిడి, నగదు ఉపసంహరణ పరిమితిని పెంచాలని, ఏటీఎంలోనూ పరిమితి పెంచాలని వినియోగదారులు కోరుతున్నారు. వినియోగదారుల అవస్థలు తీర్చేందుకు ప్రతి బ్యాంకులో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సందట్లో సడేమియాగా నల్లకుబేరుల ఇళ్లలో పోగుపడిన డబ్బును పలువురు బంగారం వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకున్నారు. పాత నోట్లను స్వీకరించి తులం బంగారం రూ.50 వేలకు కట్టబెట్టినట్లు సమాచారం. శుక్రవారం ఒకే రోజు నగరంలో రూ.500 కోట్ల విలువైన బంగారం అమ్ముడరుునట్లు అంచనా. ఇక నల్ల కుబేరులు తమ వద్ద ఉన్న నగదును వైట్‌మనీగా మార్చేందుకు పలువురికి కమీషన్ల ఆశ చూపడం గమనార్హం. -
జనమంతా బ్యాం 'క్యూ' లో నే!
చాంతాడంత లైన్లు.. గంటల తరబడి నిరీక్షణ రాజధానితోపాటు రాష్ట్రమంతటా ఇదే సీన్ పలుచోట్ల తోపులాటలు.. బందోబస్తు మధ్య కార్యకలాపాలు కొన్ని బ్యాంకుల్లో తెరిచిన కొద్ది గంటల్లోనే ఖజానా ఖాళీ రూ. 2 వేల నోటు అందుకుని మురిసిపోరుయిన ప్రజలు నోట్ల మార్పిడి, డిపాజిట్లకు పోటెత్తిన జనం బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు బారులు సాక్షి, హైదరాబాద్: కరెన్సీ కదిలింది.. రెండ్రోజులుగా బీరువాల్లో, పర్సుల్లో, పోపుడబ్బాల్లో అచేతనంగా పడి ఉన్న పెద్ద నోటుకు ప్రాణమొచ్చింది.. బ్యాంకులు, పోస్టాఫీసులకు ఆపపోపాలు పడుతూ వెళ్లి క్యూ కట్టింది..! తళతళలాడే కొత్త రూపాన్ని ధరించి జేబులో చేరింది!! నిన్నమొన్నటిదాకా పాత రూ.500, రూ.1,000 నోట్లు చెల్లక ఇబ్బందులు పడ్డ జనం గురువారం వాటిని మార్చుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులకు పోటెత్తారు. వారితోపాటు డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చినవారితో ఉదయం 8 గంటల నుంచే బ్యాంకులు, పోస్టాఫీసులు కిక్కిరిసిపోయాయి. రాజధాని భాగ్యనగరంతోపాటు రాష్ట్రంలో ఎక్కడచూసినా బ్యాంకుల ముందు చాంతాడంత బారులు కనిపించాయి. పోలీసు బందోబస్తు, గంటల తరబడి పడిగాపుల మధ్య... కొత్తగా చెలామణిలోకి వచ్చిన రూ.2 వేల నోట్లు అందుకున్న వారి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. కొన్నిచోట్ల నగదు చాలకపోవడంతో బ్యాంకులు మధ్యాహ్నం వరకే సేవలను నిలిపివేశారుు. దీంతో జనం నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల తొక్కిసలాటలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసు బందోబస్తు నడుమ బ్యాంకు కార్యకలాపాలు సాగాయి. అటు జిరాక్స్ సెంటర్లు కూడా కిటకిటలాడాయి. నోట్ల మార్పిడికి, డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఆధార్, పాన్‌కార్డు జిరాక్స్ పత్రాలు తప్పనిసరి అని బ్యాంకు అధికారులు స్పష్టం చేయడంతో జనం జిరాక్స్ కేంద్రాలకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. గంటల తరబడి పడిగాపులు జనం ఉదయం 8 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకొని లైన్లలో నించున్నారు. ఉదయం 10.30కు బ్యాంకులు తెరుచుకున్నారుు. ఒక్కో వినియోగదారుడు ఐదారు గంటలకుపైనే లైన్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఉదయం బ్యాంకుకు వచ్చిన వారు మధ్యాహ్నం 3 తర్వాతే బయటకు వెళ్లారు. కొత్త రూ.2,000 నోట్లు చెలామణిలోకి వచ్చినప్పటికీ హైదరాబాద్‌లో అన్ని బ్యాంకుల్లో అందుబాటులోకి రాలేదు. పలుచోట్ల కొత్త నోట్లను అందుకున్న వాళ్లు మాత్రం సంతోషం వ్యక్తంచేశారు. మొత్తంగా పెద్దనోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా కకావికలమైన నగరం గురువారం కాస్త తెరిపిన పడింది. చాలా మంది తమ వద్ద ఉన్న పాత నగదును ఖాతాల్లో జమ చేసుకొనేందుకు పోటీ పడ్డారు. ఖాతాల్లోంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వాళ్లకు రూ.10 వేల వరకు అవకాశం కల్పించారు. కొన్ని బ్యాంకుల్లో విత్‌డ్రాలను మరుసటి రోజుకు వాయిదా వేశారు. మధ్యాహ్నం వరకే క్లోజ్... చంపాపేట్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు గురువారం వైద్య చికిత్సల కోసం కోఠీలోని ఈఎన్టీ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు సీటీ స్కాన్ రాశారు. వెంటనే తన వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకొనేందుకు కోఠీలోని ఎస్బీఐకి వెళ్లాడు. అప్పటికి మధ్యాహ్నం 2.30 అయింది. అప్పటికే కొత్త రూ.2000 నోట్లు, పాత వంద నోట్లు అయిపోయాయంటూ బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు. శ్రీనివాస్‌కు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ఆరా తీస్తే రూ.50 లక్షల వరకు తాము పై అధికారులను అడిగితే బ్యాంకుకు కేవలం రూ.10 లక్షలే అందజేశారని చెప్పారు. ఒక్క కోఠీలోనే కాదు.. చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. విద్యానగర్, కాచిగూడ, చిలకలగూడ, సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో కొన్ని బ్యాంకులు మధ్యాహ్ననికే కార్యకలాపాలను నిలిపివేశాయి. మరోవైపు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పినా.. చాలాచోట్ల అది కనిపించలేదు. సిబ్బంది కొరత, ఇతర కారణాల వల్ల ఒకట్రెండు కౌంటర్లనే ఏర్పాటు చేశారు. దీంతో రద్దీ బాగా పెరిగింది. ఈస్ట్, వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో సర్వర్ డౌన్ వల్ల కొన్ని బ్యాంకుల్లో సేవలు తాత్కాలికంగా స్తంభించాయి. పోస్టాఫీసుల్లో గందరగోళం... రాజధానిలో పలుచోట్ల పోస్టాఫీసుల్లోకి కొత్త కరెన్సీ, వంద నోట్లు అందకపోవడంతో గందరగోళం నెలకొంది. దీంతో క్యూలో నించున్న వారు ఆందోళనకు గురయ్యారు. కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటిగంట నుంచి పంపిణీ మొదలైంది. తప్పని చిల్లర తిప్పలు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరితోపాటు పలు జిల్లాల్లో గురువారం కూడా జనానికి చిల్లర తిప్పలు తప్పలేదు. చిల్లర లేక పెట్రోల్ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కోదాడ పట్టణ సమీపంలో చిల్లర ఇవ్వలేదంటూ జగ్గయ్యపేట డిపోకు చెందిన ఓ బస్సు కండక్టర్ ప్రయాణికులను కోదాడ శివారులో దింపేశాడు. ఇక సూర్యాపేట జిల్లావ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన 130 బ్యాంకుల్లో గురువారం ఒక్కరోజే రూ.వంద కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర జమ అరుునట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాల్లో 367 బ్యాంకులకు జనం క్యూ కట్టారు. పోస్టాఫీస్‌లో డబ్బుల మార్పిడి జరగలేదు. డిపాజిట్లు మాత్రమే చేశారు. కొత్తనోటు చూడముచ్చటగా ఉంది కొత్త రూ.2 వేల నోట్లు తీసుకోవడానికి ఉదయ మే బ్యాంకుకు వెళ్లాను. భారీ క్యూలైన్లో నిలబ డి నోటు చేతికి తీసుకు న్నాను. నోటు కొత్తగా ఉంది. పాత వెయి నోటు అంత అందంగా లేకున్నా చూడముచ్చటగా ఉంది. - తుమ్మలపల్లి మహేశ్, హైదరాబాద్ కాస్త భిన్నంగా ఉంది పాత వెయి నోటు కంటే రూ.2 వేల నోటు కొంత భిన్నంగా ఉంది. మూడు గంటల పాటు లైన్లో నిలబడి పాత నోట్లను మార్పిడి చేసుకున్నాను. - బాలు, హైదరాబాద్ రెండోరోజూ స్తంభించిన మార్కెట్లు రెండోరోజు కూడా హైదరాబాద్‌లోని మార్కెట్లు కళా విహీనంగానే కనిపించారుు. అన్నిచోట్ల కార్యకలాలు స్తంభించారుు. రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లు వెలవెలబోయారుు. సికింద్రాబాద్ జనరల్ బజార్, రాణిగంజ్, మోండా మార్కెట్. కోఠి, మలక్‌పేట్, బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, తదితర ప్రాంతాల్లో గిరాకీ లేక వ్యాపారులు ఉసూరుమన్నారు. నిత్యం రద్దీగా ఉండే బేగంబజార్ వంటి ప్రాంతాలు కూడా వెలవెలబోయారుు. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలోనూ వ్యాపారం ఇంకా జోరందుకోలేదు. -
బ్యాంక్ ఖాతాలకే పింఛన్లు
► మాన్యువల్ చెల్లింపులకు ఇక స్వస్తి ► పోస్టాఫీసుల్లోనూ ఆసరా పింఛన్ల అందజేత సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ పింఛన్ల చెల్లింపుల్లో పారదర్శకతకు పట్టం కట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) నిర్ణయించింది. అవకతవకలను నివారించే నిమిత్తం ఇకపై మాన్యువల్(చేతికి ఇవ్వడం) పద్ధతికి స్వస్తి పలకాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 లక్షల మంది లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ వచ్చే జనవరి నుంచి బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా మాత్రమే పింఛన్ సొమ్మును అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏదేని బ్యాంకు శాఖ ఉన్న గ్రామంలో లబ్ధిదారులందరికీ పింఛన్ సొమ్మును తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలోనే జమ చేయాలని సెర్ప్ సీఈవో నీతూకుమారి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 37 శాతం మందికి బ్యాంక్‌లు, 50 శాతం మందికి పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేశారు. 13 శాతం మందికి పంచాయతీ సిబ్బంది ద్వారా మాన్యువల్‌గా సొమ్మును అందజేస్తున్నారు. జాప్యం నివారణకు ఎన్పీసీఐతో ఒప్పందం! ఆసరా లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు నూతన విధానాన్ని అవలంభించాలని సెర్ప్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కోర్ బ్యాంకింగ్ విధానం(సీబీఎస్) వల్ల బ్యాంకు ఖాతాలున్న 13 లక్షల మందికి పింఛన్ సొమ్మును జమ చేసేందుకు కనీసం 10 నుంచి 15 రోజులు పడుతోంది. ఈ విధానంలో రోజుకు 1.5 లక్షలకు మించి లావాదేవీలు జరిపే అవకాశం లేకపోవడం, బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవు కావడంతో పింఛన్ సొమ్ము సకాలంలో లబ్ధిదారులకు చేరడం లేదు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకబిగిన ఒకేసారి లబ్ధిదారులందరి ఖాతాలకు సొమ్మును జమ చేసేందుకు వీలుగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. సీబీఎస్ విధానంతో సొమ్ము పంపిణీ పూర్తి ఉచితం కాగా, ఎన్పీసీఐ ద్వారా సొమ్ము జమ చేసే ప్రక్రియకు ఒక్కో లావాదేవీకి రూ.11 చెల్లించాల్సి ఉంది. సేవాపన్నుతో కలిపి మొత్తం 13 లక్షలమంది లబ్ధిదారుల ఖాతాలకు ఒకేరోజు పింఛన్ సొమ్మును జమ చే యాలంటే, సర్కారుపై నెలకు రూ.1.5 కోట్ల భారం పడుతుంది. సకాలంలో పింఛన్ ఇవ్వలేకపోయామనే అపవాదు కంటే భారం మోయడమే మేలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
ఇకపై పోస్టాఫీసుల్లో పప్పు దినుసుల విక్రయం
న్యూఢిల్లీ: పోస్టాఫీసుల్లో రాయితీలో పప్పు దినుసులను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం కేంద్ర వినియోగదారుల వ్యవ హారాల శాఖ కార్యదర్శి హేమ్ పాండే నేతృత్వంలో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు, రాష్ట్రాల్లో ప్రభుత్వ దుకాణాలు అందుబాటులో లేకపోవడం, రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో పప్పులను అమ్మనున్నారు. ముఖ్యంగా కంది, మినప, శనగపప్పులను విక్రయించనున్నారు. వీటిని అత్యవసర నిల్వల నుంచి వినియోగదారులకు రాయితీతో అమ్ముతామని, ఇందుకోసం 20 లక్షల టన్నుల పప్పు దినుసులను సేకరిస్తామని ఓ అధికారి చెప్పారు. -
గోల్మాల్
– తేలని ముద్దిరెడ్డిపల్లి పోస్టాఫీసులో డబ్బుల వ్యవహారం – ఏడాది గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు హిందూపురం అర్బన్ : స్థానిక ముద్దిరెడ్డిపల్లి పోస్టాఫీసులోని ఖాతాదారుల సొమ్ము స్వాహా కేసు ఏడాది గడిచినా అతీగతీలేకుండా పోయింది. పోస్టాఫీసులో ప్యాకర్‌గా పని చేసిన కల్యాణŠ æచక్రవర్తి కొందరి ఖాతాల్లోంచి డబ్బును డ్రా చేసుకుని జేబులు నింపుకుని ఉడాయించిన సంగతి తెలిసిందే. పోస్టాఫీసుకు వచ్చి ఖాతాలో జమ చేసినప్పుడల్లా బుక్‌లో సీల్ వేసి డబ్బు కాజేస్తూ వచ్చాడు. ఇలా రూ.లక్షల్లో గోల్మాల్ అయింది. ఈ సంఘటన 2015 సెప్టెంబరులో వెలుగులోకి వచ్చింది. కానీ ఇంవరకు కేసులో ఎలాంటి పురోగతి లేదని బాధితులు వాపోతున్నారు. ముద్దిరెడ్డిపల్లిలో మగ్గం కూలీలు నందవరమ్మ, రత్నమ్మ పోస్టాఫీసులో 2013 నుంచి జ మ చేస్తూ వచ్చారు. పొదుపు పథకంలో నందవరమ్మ 2013 ఏప్రిల్ నుంచి 2014 డిసెంబరు వరకు పాసుబుక్ నంబరు 1050007లో మొత్తం రూ.67 వేలు దాచింది. అలాగే రత్నమ్మ పాసు బుక్ నంబరు 1050106లో తన ఖాతాలో 2013 ఏప్రిల్ నుంచి 2014 డిసెంబరు వరకు రూ.57 వేలు కట్టింది. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ కింద పాసుబుక్ 706046లో మరో రూ.40 వేలు కట్టింది. ఖాతాదారులు డబ్బు కట్టడానికి పోస్టాఫీసుకు వచ్చినప్పుడు అక్కడే పని చేస్తున్న ప్యాకర్ కల్యాణ్ చక్రవర్తి డబ్బు తీసుకుని పాస్‌బుక్‌లో కట్టిన ట్లు సీల్ వేస్తూ పథకం ప్రకారం డబ్బు కాజేస్తూ వచ్చాడు. రెండు ఖాతాల నుంచి సుమారు రూ.1,64 లక్షలు స్వాహా చేసుకున్నాడు. ఇవే కాకుండా సుమారు 40 మందికి సంబంధించిన ఖాతాల్లో వారికి తెలియకుండానే డబ్బుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. విషయం బయటపడగానే విధులకు రాకుండా పరారయ్యాడు. బయటపడింది ఇలా.. నందవరమ్మ తాను దాచుకున్న సొమ్ములో కూతురు పెళ్లి కోసం కొంత డ్రా చేసుకుందామని పోస్టాఫీసుకు వెళ్లి విచారిస్తే ఖాతాలో డబ్బే లేదన్నారు. అసలు మీరు డబ్బు కట్టనే లేదని చెప్పారు. అప్పుడు బ్యాంక్ అధికారులు పాస్‌బుక్‌లు పరిశీలిస్తే స్వాహాల పర్వం బయటపడింది. రత్నమ్మ ఖాతాలోని డబ్బు కూడా ఆమెకు తెలియకుండానే డ్రా అయిపోయింది. బాధితులకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నాగభూషణరెడ్డి పోస్టాఫీసు వద్ద ఆందోళన కూడా చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు హెడ్‌పోస్టాఫీసు అధికారులు స్వీకరించి విచారణ చేపట్టారు. అయితే ఇంతవరకు న్యాయం జరగలేదు. -
భక్తుల ఇంటికి దుర్గమ్మ ప్రసాదం
గుంటూరు (లక్ష్మీపురం): దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ, మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకోలేని భక్తులకు అమ్మవారి ప్రసాదం ఇంటికి చేరేలా పోస్టల్ శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టిందని గుంటూరు హెడ్ పోస్టాఫీస్ పోస్ట్‌మాస్టర్ ఎమ్.తిరుమలరావు, డిప్యూటీ పోస్ట్‌మాస్టర్ ముస్తఫా తెలిపారు. బ్రాడిపేటలోని హెడ్ పోస్టాఫీసు కార్యాలయంలో బుధవారం శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ప్రసాదం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అమ్మవారి ప్రసాదం కావాలనుకునే వారు ఆయా డివిజన్ల పరిధిలో ఉన్న పోస్టల్ శాఖలో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ బుకింగ్ బుధవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉంటుందన్నారు. భక్తులు అమ్మవారి ప్రసాదం కోసం వారి పేరు వివరాలతో పాటు సరైన అడ్రస్ రాసి రూ.50 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బుకింగ్ చేసుకున్న భక్తులకు రసీదు ఇస్తామని చెప్పారు. ప్యాకెట్లో 5 రకాల ప్రసాదాలు ఉండేలా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వాటిలో అమ్మవారి ఖడ్గమాల పూజలో ఉంచి మలేశ్వరస్వామి అభిషేకంతో సంప్రోక్షణ గావింపబడిన శక్తి కంకణం, అమ్మవారి లామినేటెడ్ చిత్రపటం, అమ్మవారి డ్రైఫ్రూట్స్ ప్రసాదం, అమ్మవారి పూజలో ఉంచిన కుంకుమ, అమ్మవారి స్వామి వార్ల పూజలో ఉంచిన అక్షింతలు ఉంటాయని వివరించారు. అమ్మవారి ప్రసాదంను బుకింగ్ చేసుకున్న భక్తులకు తమ శాఖ పోస్ట్‌మాన్ స్వయంగా ఇంటి వద్దకు వచ్చి ప్రసాదం ప్యాకెట్లను అందజేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. నవరాత్రులు ప్రారంభమైన రెండో రోజు నుంచి పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత అమ్మవారి ప్రసాదంను ప్రత్యేక ప్యాకింగ్ చేసి బుకింగ్ చేసుకున్న భక్తులకు చేరవేస్తామన్నారు. అమ్మవారి పవిత్ర నవరాత్రుల ప్రసాదాన్ని గ్రామ స్థాయిలోని ఉన్న తమ శాఖలో బుక్ చేసుకోవచ్చని చెప్పారు. -
పోస్టాఫీసుల ద్వారా భక్తులకు పుష్కర జలం
- పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు వెల్లడి కర్నూలు (ఓల్డ్ సిటీ): కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు తపాలా శాఖ పవిత్ర కృష్ణానది జలం అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒక్కో బాటిల్ ఖరీదు రూ. 30 ఉంటుందని, కావాల్సిన వారు ముందుగానే బుక్ చేసుకుని రశీదు పొందాలని సూచించారు. డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ సదుపాయం కల్పించామని, ఆగస్టు 5వ తేదీ లోపు రశీదులు పొందాలని తెలిపారు. -
ఒక్క ట్వీట్ తో వచ్చేసింది!
న్యూఢిల్లీ: ఒక్క ట్వీట్ తో ఆ ఊరికి పోస్టాఫీస్ వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కలగానే మిగిలిన తపాలా కార్యాలయం ఎట్టకేలకు సిద్ధించింది. ఆ ఊరి పేరు భనోలి సెరా. భారత్-చైనా సరిహద్దుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ పితోరాగఢ్ జిల్లాలో ఉన్న ఈ గ్రామానికి బయట ప్రపంచంతో సంబంధాలు అంతంతమాత్రమే. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 ఏళ్లు అవుతున్నా భనోలి సెరా గ్రామంలో పోస్టాఫీస్ లో లేదు. సమాచార వ్యవస్థలో అందుబాటులో లేకపోవడంతో ఈ గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నిఇన్ని కావు. సమాచారం ఆలస్యంగా చేరడంతో ఉద్యోగావకాశాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. తమ ఊరిలో పోస్టాఫీస్ ఉంటే ఇలాంటి బాధలు తప్పేవని గ్రామస్థులు భావించారు. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్విటర్ ద్వారా కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ దృష్టిని తీసుకొచ్చారు. వెంటనే స్సందించిన మంత్రి నాలుగు రోజుల్లో భనోలి సెరా గ్రామంలో పోస్టాఫీస్ ఏర్పాటు చేయించారు. తాత్కాలిక గదిలో పోస్టాఫీస్ కార్యాకలపాలు ప్రారంభమయ్యాయి. తమ ఊరికి పోస్టాఫీస్ రావడంతో భనోలి సెరా గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. Getting @rsprasad to respond to Ukhand village plea for post office is healthy sign. We should use social media to connect on real issues. — Rajdeep Sardesai (@sardesairajdeep) June 21, 2016 Photo of newly opened PO in Pithoragarh 4 days after I tweeted about its need! Well done @rsprasad , @PARInetwork 😄 pic.twitter.com/6N2706s3fe — Rajdeep Sardesai (@sardesairajdeep) June 26, 2016 -
తపాలా శాఖలో అక్రమాలు
► దొరికితేనే దొంగ.. ► ఒంటిమిద్దె బ్రాంచ్ పోస్టు మాస్టర్‌పై చర్యలకు సిఫార్సు? అనంతపురం రూరల్: దొరికితే దొంగ.. లేకపోతే దొరే.. అనే చందంగా తపాలాశాఖ వ్యవహారాలు సాగుతున్నాయి. గతంలో ఉపాధి బిల్లుల చెల్లింపుల పక్రియ పోస్టాఫీసుల ద్వారా సాగేది. ఈ క్రమంలో 2009లో నూతిమడుగు పోస్టాఫీసు పోస్టుమాస్టర్ ఆర్. శ్రీనివాసులు రూ. 3లక్షలు సొంతానికి వినియోగించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. అయితే మరుసటి రోజు ఆయన ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంతో ఆయనను గార్లదిన్నె పోస్టాఫీసుకు బదిలీతో సరిపెట్టారు. అక్కడ కూడా ఆయన రూ. 5 కోట్ల వరకూ అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. చివరకు ఆయనను సస్పెండ్ చేసి, మొత్తం ఆయన అక్రమాల చిట్టాపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇందులో 60 మంది తపాలా సిబ్బందిపై అప్పట్లో అభియోగాలు మోపడంతో ప్రస్తుతం వారిపై విచారణ జరుగుతోంది. ఆన్‌లైన్‌తో వెలుగులోకి... పోస్టాఫీసుల్లో ఆన్లైన్ పక్రియ పూర్తి కావడంతో బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, తపాలా సిబ్బంది అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 15 రోజుల కిందట శెట్టూరు మండలంలోని కునుకూరు బ్రాంచ్‌లో రూ.6 లక్షల ఉపాధి నిధులు పక్కదారి పట్టినట్లు విచారణలో తేలింది. స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి, బీపీఎంను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కళ్యాణదుర్గం మండలం ఒంటిమిద్దె బ్రాంచ్ పోస్టుమాస్టర్ సుకన్య యోజన సమృద్ధి పథకం కింద ఆడపిల్లల తల్లిదండ్రులు డిపాజిట్ కోసం చెల్లించిన సొమ్మును తన జేబులో వేసుకున్నాడు. బాండ్లు అందజేయడంలో జాప్యం చేస్తుండడంతో అనుమానించిన డిపాజిట్‌దారులు పోలీసులతోపాటు, తపాలా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కళ్యాణదుర్గం తపాలా ఇన్స్పెక్టర్ విచారణ చేయగా రూ. 4 లక్షల వరకూ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని తపాలా ఏఎస్పీ సంజీవ్‌కుమార్‌ను ధ్రువీకరిస్తూ స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేస్తున్నట్లు తెలిపారు. -
పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు కేబినెట్ ఓకే
♦ 2017 సెప్టెంబర్‌కల్లా ఏర్పాటు ♦ 650 బ్రాంచీలతో కార్యకలాపాలు న్యూఢిల్లీ: పోస్టాఫీసు పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2017 సెప్టెంబర్ నాటికి దేశ వ్యాప్తంగా 650 బ్రాంచీలతో ఈ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. దాదాపు రూ.800 కోట్ల కార్పస్‌తో పోస్టాఫీసు పేమెంట్ బ్యాంక్ ఏర్పాటవుతుందని బుధవారం నాడు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ఇందులో రూ.400 కోట్ల ఈక్విటీకాగా, రూ.400 కోట్లు గ్రాంట్. దేశంలో మొత్తం 1.54 లక్షల పోస్టాఫీసులు ఉన్నాయి. ఇందులో 1.39 లక్షల పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు వల్ల గ్రామీణ ప్రాంతాలకు ఆర్థిక అనుసంధానం జరుగుతుందని భావిస్తున్నట్లు రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్వహించే ఈ బ్యాంక్, పటిష్ట స్థాయి నిర్వహణకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు. పోస్టల్ శాఖ, వ్యయ నిర్వహణ శాఖ, ఆర్థిక సేవల శాఖల సహా పలు ఇతర ప్రభుత్వ శాఖలు సైతం బ్యాంక్ సక్రమ నిర్వహణలో భాగస్వామ్యం అవుతాయని అన్నారు. పోస్టాఫీసులకు సంబంధించి కోర్ బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను పెంపొందించే క్రమంలో 2017 మార్చి నాటికి ‘గ్రామీణ డాక్ సేవకులు’ అందరికీ ఐపాడ్, స్మార్ట్ఫోన్లు అందించే విషయమై అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. పోస్టాఫీసుల కోర్ బ్యాంకింగ్ నెట్వర్క్ ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకన్నా అధికంగా ఉంది. ఎస్బీఐ 1,666 కోర్ బ్యాంకింగ్ బ్రాంచీలు కలిగివుండగా, పోస్టాఫీసులకు సంబంధించి ఈ సంఖ్య 22,137గా ఉంది. -
కూలీ డబ్బుల కోసం జాగారం
పోస్టాఫీస్ వద్దనే నిద్రిస్తున్న ఉపాధి కూలీలు సదాశివనగర్: మండుటెండలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలు.. చేసిన పనికి కూలీ తీసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కూలీ డబ్బుల కోసం పొద్దస్తమానం ఎండలో నిలబడడమే కాకుండా రాత్రి వేళ పోస్టాఫీస్ వద్దనే నిద్రపోతున్నారు. ఈ తంతు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో జరుగుతోంది. మండలంలోని 115 గ్రూపులకు సంబంధించి ఉపాధి హామీ కూలీలకు ఇక్కడి పోస్టాఫీస్‌లోనే అందించాల్సి ఉంది. పోస్టాఫీస్‌లో ఒకటే బయోమెట్రిక్ మిషన్ ఉండడం... ఒకేసారి వందల మంది డబ్బుల కోసం వస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే పోస్టాఫీస్ సిబ్బంది రోజుకు 50 మందికి మాత్రమే డబ్బులు ఇస్తామని నిబంధన పెట్టింది. ఇదేమంటే ఇష్టమున్న చెప్పుకోమని బెదిరిస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉపాధి హామీ కూలీలు తమ ఖాతా పుస్తకాలను పోస్టాఫీసు ముందు వరుసలో పెట్టి.. అక్కడే రోడ్డుపై నిద్రిస్తున్నారు. వారం సంది ఇక్కడే పడుకుంటున్నా... పోస్టాఫీస్ దగ్గర్నే వారం సంది పండుకుంటున్నా. ఇంకా పైసలు ఇయ్యలేదు. ఎవళ్లూ పట్టించుకుంటలేరు. నాలుగు వారాల పైసలు రావాలే. డబ్బుల కోసం గోస పడుతున్నం. -కువైట్ బీరయ్య, ఉపాధి కూలీ, సదాశివనగర్ రోడ్డు మీదనే పడుకుంటున్నం నాలుగు రోజుల సంది పొద్దుందాక వరుసలో నిలబడ్డ, రాత్రి ఇక్కడే పడుకున్న పైసలు అస్తలేవు. నాలుగు వారాల పైసలు రావాలే. రోజు గిదే తిప్పలు పడుతున్నం. ఈ పోస్టాపీస్ దగ్గర గీ రోడ్డు మీదనే పడుకుంటున్నం. ఇట్టబోయిన చిన్న బాలయ్య, ఉపాధి కూలీ సదాశివనగర్ కూలీల మీదికి కోపానికొస్తుండ్రు.. మా పైసలు మాకు ఇయ్యమంటే ఈ పోస్టాపీస్‌లో పని చేసేటోళ్లు కూలీలను ఇష్టమొచ్చినట్లు తిడుతుండ్రు. రోజు 50 మందికే పైసలిస్తాండ్రు. మధ్యాహ్నం ఒంటి గంటకు పైసలు ఇయ్యడం చాలు జేసి 3 గంటలకు తినడానికి పోతడు. మళ్ల అయిదు గంటలకు బందు జేస్తుండ్రు. -మర్రి ఆశిరెడ్డి, కూలీ, సదాశివనగర్ -
అద్దె చెల్లించలేదని పోస్టాఫీసుకు తాళం
తిరుపతి అర్బన్: చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ మండలం పెరుమాళ్లపల్లి గ్రామంలోని సబ్‌పోస్టాఫీసుకు అద్దె చెల్లించలేదన్న కారణంగా మంగళవారం ఉదయం తాళం వేశారు. ఏడాది పాటు అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని మంగళవారం తాళం వేశాడు. ఎన్నిసార్లు అడిగినా, నోటీసులు ఇచ్చినా పోస్టల్ యాజమాన్యం స్పందించకపోవడంతో విధిలేక పోస్టాపీసుకు తాళం వేశానని యజమాని చెబుతున్నారు. -
పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ పాలసీ చెల్లింపుల్లో మార్పులు
♦ హోల్ లైఫ్ పాలసీని సవరించిన కేంద్రం ♦ 80 ఏళ్లు దాటిన తర్వాత మెచ్యూరిటీ నగదుతో కలిపి బోనస్ సాక్షి, విజయవాడ బ్యూరో : పోస్టాఫీసుల్లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు (పీఎల్ఐ), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు (ఆర్పీఎల్ఐ) కింద హోల్‌లైఫ్ పాలసీలు కలిగిన వారికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం సవరణలు చేసింది. ఇప్పటి వరకూ హోల్ లైఫ్ పాలసీ చేసిన వ్యక్తి మరణానంతరం వారి వారసులకు పాలసీ మొత్తం, బోనస్ లభించేవి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని సవరించింది. ఈ పాలసీ కలిగిన వ్యక్తి 80 ఏళ్ల వరకూ జీవించి ఉంటే మెచ్యూరిటీ మొత్తంతో పాటు బోనస్ కూడా అందించనుంది. దీనివల్ల జీవించి ఉన్నపుడే పాలసీదారుడు పాలసీ ఫలాలను అనుభవించే వీలుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సులో హోల్ లైఫ్ ఎస్యూరెన్సు కింద లక్ష రూపాయలకు పాలసీ చేస్తే 60 ఏళ్ల వరకూ ప్రీమియం చెల్లిస్తారు. అంటే 35 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లింపులు జరుగుతాయి. ఆ తరువాత మెచ్యూరిటీ మొత్తంతో పాటు బోనస్‌ను కలిపి వారసులకు అందజేస్తారు. ఈ లెక్కన వీరికి 35 ఏళ్లకు లెక్కించి బోనస్ చెల్లింపులు జరిగేవి. అయితే సవరణ అమల్లోకి వచ్చిన దరిమిలా 80 ఏళ్ల వరకూ జీవించిన పాలసీదారులకు 55 ఏళ్లకు బోనస్ లెక్కించి అందజేస్తారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 7.30 లక్షల మంది హోల్‌లైఫ్ పాలసీలు కలిగి ఉన్నారు. ఇందులో 12%మంది 80 ఏళ్లు పైబడిన వారున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరందరూ తమ పాలసీలకు సంబంధించిన ఫలాలను అందుకునేందుకు దగ్గర్లో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలని ఆంధ్రా, తెలంగాణ సర్కిళ్ల చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ వైపీ రాయ్ బుధవారం నాడొక ప్రకటనలో కోరారు. -
చిన్న పొదుపులపై వడ్డీరేటు కోత
పోస్టాఫీస్ స్వల్పకాలిక పథకాలపై పావు శాతం వడ్డీ తగ్గింపు ♦ 1,2,3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లు, కేవీపీ, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లకు వర్తింపు ♦ ఏప్రిల్ నుంచి అమలు ♦ దీర్ఘకాలిక పథకాల రేట్లు యథాతథం న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపులపై వడ్డీరేటును మార్కెట్ రేట్లకు అనుసంధానం చేస్తూ... కేంద్రం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీస్ స్వల్ప కాల పథకాలపై పావుశాతం వడ్డీ రేటు తగ్గించింది. 1, 2, 3 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లు, కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), అలాగే ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై ఇదే కాలపరిమితితో ఉన్న ప్రభుత్వ బాండ్ల రేటుకన్నా అదనంగా పావుశాతం(0.25%) వడ్డీ వస్తోంది. అయితే ఈ ప్రయోజనాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచీ తొలగిస్తున్నట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా తగ్గింపు వల్ల బ్యాంకింగ్‌లో ఈ కాలాలకు సంబంధించి డిపాజిట్ రేట్లకు సైతం ఇవి దాదాపు సమానమవుతాయని పేర్కొంది. దేశంలో తక్కువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థకు సైతం కేంద్రం తాజా చర్య శ్రీకారం చుట్టినట్లయ్యింది. ♦ ఇవి యథాతథం...: మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్, బాలికలకు సంబంధించిన పథకాల విషయంలో వడ్డీరేట్లను మార్చలేదు. ప్రభుత్వ ప్రకటనలో ఇతర ముఖ్యాంశాలు.. ♦ ఇకమీదట ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ రేట్లను సమీక్షించడం జరుగుతుంది. ఒక త్రైమాసికంలో వడ్డీరేటును అంతకుముందు నెల 15వ తేదీన నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వడ్డీరేటును మార్చి 15న నిర్ణయిస్తారు. ప్రభుత్వ బాండ్ ప్రాతిపదికన ఈ రేటు నిర్ణయం ఉంటుంది. పై ఉదాహరణను తీసుకుంటే... డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీ రేటు ఇక్కడ ప్రాతిపదికగా ఉంటుంది. ♦ సుకన్య సమృద్ధి యోజన, సీనియన్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లకు సంబంధించిన వడ్డీరేట్లు- ప్రభుత్వ బాండ్లతో పోల్చితే వరుసగా 0.75 శాతం, 1 శాతం, 0.25 శాతం వడ్డీరేట్లుఅధికంగా ఉన్నాయి. కానీ ఈ రేట్ల విషయంలో ఎటువంటి మార్పు లేదు. సామాజిక భద్రతా పరమైన లక్ష్యాలతో ఈ పథకాలు ముడివడి ఉండడమే దీనికి కారణం. ♦ దీర్ఘకాలిక పథకాలతో పాటు ఐదేళ్ల టర్మ్ డిపాజిట్లు, అదే కాలాలకు సంబంధించిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, పీపీఎఫ్‌లకు ఇచ్చే వడ్డీరేట్లలో సైతం మార్పు లేదు. ♦ {పస్తుతం పీపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటు 8.7 శాతం. సుకన్యా సమృద్ధి యోజన రేటు 9.2 శాతంగా ఉంది. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ రేటు 8.4 శాతం. ♦ 1, 2, 3 సంవత్సరాలు, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్లపై ప్రస్తుతం 8.4 శాతం వార్షిక వడ్డీ అందుతోంది. కిసాన్ వికాస పత్ర విషయంలో డిపాజిట్ 100 నెలలకు(ఎనిమిదేళ్ల 4 నెలలు) అసలు రెట్టింపు అవుతోంది. ♦ కొన్ని వాస్తవ, అత్యవసర అవసరాలు తలెత్తితే పీపీఎఫ్ అకౌంట్ల ప్రీ-మెచ్యూర్ క్లోజర్కూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తీవ్ర అనారోగ్యం, పిల్లల ఉన్నత విద్య వంటివి ఇందులో ఉన్నాయి. ఈ సందర్భాల్లో మొత్తం డిపాజిట్‌పై చెల్లించే వడ్డీలో 1% తగ్గింపు జరిమానాగా ఉంటుంది. ఖాతా ప్రారంభం నుంచీ ఐదేళ్లు పూర్తయి ఉండాలి. ♦ చిన్న పొదుపు మొత్తాలపై రేటు అధికంగా ఉండడం వల్ల ఆర్బీఐ నుంచి అందిన రేటు తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు తన కస్టమర్‌కు బదలాయించలేని పరిస్థితి నెలకొందని ఆర్థికశాఖ వ్యాఖ్యానించింది. -
భాగ్యనగరి తొలి పోస్టాఫీస్
హైద్రాబాద్ నగరంలో మొట్టమొదటి పోస్టాఫీస్‌ను 1866 మార్చి 14న సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అల్వాల్ రైతుబజార్‌కు ఎదురుగా రాష్ట్రపతి నిలయం పక్కనే ఉందీ పోస్టాఫీస్. శతాబ్దిన్నరకు పైగా స్థానికులకు విశిష్ట సేవలందించిన ఘనత ఈ పోస్టాఫీస్ది. నిజాం హయాంలో బ్రిటీష్ పాలకులు తమ సమాచార సౌకర్యార్థం దీనిని ఏర్పాటు చేశారు. తొలిసారిగా టెలిగ్రాఫ్ సౌకర్యం కూడా ఇక్కడే నెలకొల్పారు. స్వాతంత్య్రం అనంతరం ఈ పోస్టాఫీస్ శాఖ భారత ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. ఘన చరిత్ర గల ఈ పోస్టాఫీస్‌కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ డాక్ సేవా అవార్డు కూడా లభించింది. - బన్సీలాల్‌పేట్ -
హైదరాబాద్ మైత్రివనంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్ పేట సమీపంలోని మైత్రీ వనం పోస్టాఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. పోస్టాఫీస్‌లో ఉన్న ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. దీన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు. -
సెల్ ఫోన్ స్టోర్లుగా పోస్టాఫీసులు
భోపాల్: దేశంలో పోస్టాఫీస్‌ల రూపు రేఖలు మున్ముందు మారబోతున్నాయి. మొన్నటి వరకు ఉత్తర ప్రత్యుత్తరాల బట్వాడాలను, ఇటీవల నగదు బదిలీ, ఏటీఎం సెంటర్ల వంటి సర్వీసులను అందించిన పోస్టాఫీసులు ఇక్ సెల్ ఫోన్ స్టోర్లుగా కూడా కనిపించనున్నాయి. మధ్యప్రదేశ్‌లోని పోస్టాఫీసులు త్వరలో సెల్ ఫోన్ అమ్మకాల అంగడిలాగా దర్శనమివ్వబోతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగానే ఈ కొత్త తరహా విధానాన్ని ప్రారంభించినట్లు మధ్యప్రదేశ్ జీపీవో చీఫ్ పోస్ట్ మాస్టర్ మి హఖ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పోస్టాఫీసు కార్యాలయాల్లో సెల్ ఫోన్లు విక్రయిస్తామని వివరించారు. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్, నోయిడాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ, పాంటెల్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. పెంటా భారత్ ఫోన్ పీఎఫ్ 301 అనే ఫోన్లను బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో రూ.1999కే లభిస్తుందని, 18 నెలల కాల పరిమితితో 1999 సెకన్ల ఉచిత టాక్ టైం కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ తరహా కార్యక్రమాన్ని నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేయగా అది విజయవంతం కావడంతో తాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.