హిక్కిం పోస్టాఫీస్ బాక్సులో ఉత్తరం పోస్టు చేస్తున్న అనూష
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరానికి చెందిన పుప్పాల అనూష హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రెక్కింగ్ కోసం జూలై నెలలో హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన ఆమె ఆ రాష్ట్రంలోని హిక్కిం అనే చిన్న గ్రామంలో ఉన్న ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పోస్టాఫీస్‌ను సందర్శించారు. సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో మంచు శిఖరపు అంచుల్లో ఈ పోస్టాఫీస్ ఉంది. పోస్టాఫీస్ చరిత్రతో కూడిన ఫొటోలు, హిమాచల్‌ప్రదేశ్ అందాలతో ముద్రించిన పోస్టు కార్డులు ఇక్కడ రూ.70కి అమ్ముతుంటారు.
ఈ పోస్టుకార్డుపై అనూష విశాఖలోని మురళీనగర్‌లో నివాసం ఉంటున్న తన తల్లి సరస్వతికి...అమ్మ ప్రేమ గొప్పదనాన్ని వర్ణిస్తూ ఉత్తరం రాశారు. జూలై నెల చివర్లో హిక్కిం పోస్టాఫీస్‌లో పోస్టు చేసిన ఆ ఉత్తరం ఆగస్టు 25న విశాఖ చేరుకుంది. అక్టోబర్ 10న ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఆ ఉత్తరంతో పాటు పోస్టాఫీస్ బాక్సులో తాను లెటర్ వేస్తున్న ఫొటోను అనూష ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment