viral letter
-
7ఏళ్లలో తొలిసారి 20 నిమిషాలు లేటు.. ఉద్యోగం నుంచి తొలగింపు!
ఆఫీస్‌కు సరైన సమయానికి చేరుకోవాలని ప్రతి ఒక్క ఉద్యోగి భావిస్తాడు. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు కొంత ఆలస్యంగా వచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తాయి. అయితే.. ఓ వ్యక్తి 20 నిమిషాలు లేటుగా ఆఫీసుకు రావటంతో ఉద్యోగం కోల్పోయాడు. అతను ఉద్యోగంలో చేరిన ఏడేళ్లలో ఇదే మొదటిసారి ఆలస్యం కావటం గమనార్హం. తన సహ ఉద్యోగి ఒకరు ఈ అంశాన్ని రెడిట్‌లో షేర్ చేశారు. అయితే.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు. రెడిట్‌లోని యాంటీవర్క్ ఫోరమ్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు ఓ వ్యక్తి. సంస్థలో ఏడేళ్లకుపైగా పని చేస్తూ మొదటి సారి ఆలస్యమ్యయాడని, కేవలం 20 నిమిషాలు లేటుగా వచ్చినందుకు ఉద్యోగంలో నుంచి తొలగించారని పేర్కొన్నారు. ఆ వ్యక్తిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని మిగితా సిబ్బంది ఆందోళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ‘అతడిని తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు రేపటి నుంచి నేను, నా సహ ఉద్యోగులు ఆఫీసుకు లేటుగా రావాలని నిర్ణయించాం.’ అని పేర్కొన్నారు. 79వేల మంది దీనికి మద్దతుగా నిలిచారు. సంస్థ యాజమాన్యం నిర్ణయాన్ని చాలా మంది యూజర్లు తప్పుపట్టారు. ఆ ఉద్యోగిని ఉద్దేశపూర్వకంగానే తొలగించి తక్కువ జీతాన్ని పని చేసే వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకోవాలని సంస్థ భావించిన్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఇదీ చదవండి: ‘భార్య అలిగి వెళ్లిపోయింది.. సెలవు ఇవ్వండి ప్లీజ్’.. క్లర్క్ లేఖ వైరల్ -
కన్నీటి అభ్యర్థన
-
అరుదైన ఉత్తరం.. సోషల్ మీడియాలో వైరల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరానికి చెందిన పుప్పాల అనూష హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రెక్కింగ్ కోసం జూలై నెలలో హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లిన ఆమె ఆ రాష్ట్రంలోని హిక్కిం అనే చిన్న గ్రామంలో ఉన్న ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పోస్టాఫీస్‌ను సందర్శించారు. సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో మంచు శిఖరపు అంచుల్లో ఈ పోస్టాఫీస్ ఉంది. పోస్టాఫీస్ చరిత్రతో కూడిన ఫొటోలు, హిమాచల్‌ప్రదేశ్ అందాలతో ముద్రించిన పోస్టు కార్డులు ఇక్కడ రూ.70కి అమ్ముతుంటారు. ఈ పోస్టుకార్డుపై అనూష విశాఖలోని మురళీనగర్‌లో నివాసం ఉంటున్న తన తల్లి సరస్వతికి...అమ్మ ప్రేమ గొప్పదనాన్ని వర్ణిస్తూ ఉత్తరం రాశారు. జూలై నెల చివర్లో హిక్కిం పోస్టాఫీస్‌లో పోస్టు చేసిన ఆ ఉత్తరం ఆగస్టు 25న విశాఖ చేరుకుంది. అక్టోబర్ 10న ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా ఆ ఉత్తరంతో పాటు పోస్టాఫీస్ బాక్సులో తాను లెటర్ వేస్తున్న ఫొటోను అనూష ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. -
'నన్ను తాకొద్దు.. వెంటపడొద్దు..'
'ఎప్పుడూ నా వెనకే తిరుగుతావు. ఇక నుంచి అలా చెయ్యడానికి వీల్లేదు. బస్సులో నాతో ఆటలాడొద్దు. నాకసలే షార్ట్ టెంపర్.. నా భుజలామీద చేతులేయడంలాంటివి అసలే వద్దు. ఇంత చెప్పినా నువ్వు మారకపోయావో.. మా అమ్మనాన్నలకి కంప్లైంట్ చేస్తా. అప్పుడు నీకు కౌన్సిలింగ్ తప్పదు. నీకు నేనంటే ఇష్టమని తెలుసు. కానీ నువ్వనుకుంటున్నట్లు అలా (బాయ్ ఫ్రెండ్ లాగా) నిన్ను ఇష్టపడను. ఎందుకంటే నేనంత పెద్దదాన్ని కాలేదు. ఈ ఉత్తరాన్ని 500 సార్లు చదివి అర్థం చేసుకో.. మనిద్దరి మధ్య ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాల్సిందే..' ఇది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఉత్తరం.. అమెరికాకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని జోయ్ తన క్లాస్ మేట్ నోవాకు రాసిన ఈ రూల్స్ లెటర్ ఇది. అలా ఇలా ఇదికాస్తా క్లాస్ టీచర్ కంటపడింది. 10ఏళ్ల అమ్మాయి ఇంత సూటిగా తన మనోభావాలు వ్యక్తం చేయడం ముచ్చటేసిందో ఏమోగానీ క్లాస్ టీచర్ ఈ లెటర్ ను ఒక ఫ్రెండ్ కు పంపింది. డెన్నీ డింపుల్స్ అనే ఆ స్నేహితురాలు లెటర్ ను కాస్తా ట్విట్టర్ లో పెట్టింది. అంతే.. నాలుగురోజుల్లో 10వేల లైక్స్ వచ్చాయి. 7వేలసార్లు రీ ట్వీట్ అయింది. చివరికి నోవా.. జోయ్ పెట్టిన రూల్స్ కు అంగీకరించాడో లేదో తెలియరాలేదు. ఏదిఏమైనా, పెద్దా, చిన్నా ఎవరైనా ఎవరిహద్దుల్లో వాళ్లుంటేనే ఫ్రెండ్ షిప్ సజావుగా సాగిపోతుందే లేకుంటే ఇలా 500 సార్లు చదవాల్సిన ఉత్తరాలో లేక ఫిర్యాదులు ఎదుర్కోవాల్సివస్తుంది. ఏమంటారు?