'నన్ను తాకొద్దు.. వెంటపడొద్దు..'
'ఎప్పుడూ నా వెనకే తిరుగుతావు. ఇక నుంచి అలా చెయ్యడానికి వీల్లేదు. బస్సులో నాతో ఆటలాడొద్దు. నాకసలే షార్ట్ టెంపర్.. నా భుజలామీద చేతులేయడంలాంటివి అసలే వద్దు. ఇంత చెప్పినా నువ్వు మారకపోయావో.. మా అమ్మనాన్నలకి కంప్లైంట్ చేస్తా. అప్పుడు నీకు కౌన్సిలింగ్ తప్పదు. నీకు నేనంటే ఇష్టమని తెలుసు. కానీ నువ్వనుకుంటున్నట్లు అలా (బాయ్ ఫ్రెండ్ లాగా) నిన్ను ఇష్టపడను. ఎందుకంటే నేనంత పెద్దదాన్ని కాలేదు. ఈ ఉత్తరాన్ని 500 సార్లు చదివి అర్థం చేసుకో.. మనిద్దరి మధ్య ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాల్సిందే..'
ఇది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఉత్తరం.. అమెరికాకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని జోయ్ తన క్లాస్ మేట్ నోవాకు రాసిన ఈ రూల్స్ లెటర్ ఇది. అలా ఇలా ఇదికాస్తా క్లాస్ టీచర్ కంటపడింది. 10ఏళ్ల అమ్మాయి ఇంత సూటిగా తన మనోభావాలు వ్యక్తం చేయడం ముచ్చటేసిందో ఏమోగానీ క్లాస్ టీచర్ ఈ లెటర్ ను ఒక ఫ్రెండ్ కు పంపింది. డెన్నీ డింపుల్స్ అనే ఆ స్నేహితురాలు లెటర్ ను కాస్తా ట్విట్టర్ లో పెట్టింది. అంతే.. నాలుగురోజుల్లో 10వేల లైక్స్ వచ్చాయి. 7వేలసార్లు రీ ట్వీట్ అయింది.
చివరికి నోవా.. జోయ్ పెట్టిన రూల్స్ కు అంగీకరించాడో లేదో తెలియరాలేదు. ఏదిఏమైనా, పెద్దా, చిన్నా ఎవరైనా ఎవరిహద్దుల్లో వాళ్లుంటేనే ఫ్రెండ్ షిప్ సజావుగా సాగిపోతుందే లేకుంటే ఇలా 500 సార్లు చదవాల్సిన ఉత్తరాలో లేక ఫిర్యాదులు ఎదుర్కోవాల్సివస్తుంది. ఏమంటారు?