letter
-
డీలిమిటేషన్‌పై ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
అమరావతి, సాక్షి: నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఓ లేఖ రాశారు. వచ్చే ఏడాది(2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధానిని వైఎస్ జగన్ కోరారు. ‘‘గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపే అందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్(Delimitation) ప్రక్రియ గనుక చేపడితే.. తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ దక్షిణాది రాష్ట్రాల్లో నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి.. .. పార్లమెంటులో తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలి. అప్పుడే జాతీయ విధాన రూపకల్పనలో అన్ని రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం ఉంటుంది. అందుకే దక్షిణాన సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచించి డీలిమిటేషన్ చేపట్టాలని కోరుకుంటున్నా. అటు లోక్‌సభ ఇటు రాజ్యసభలో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా’’ అని ప్రధాని మోదీని వైఎస్ జగన్ లేఖలో కోరారు. 👉పూర్తి లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండిమరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రంలోని బీజేపీకి తమిళనాడు అధికార పక్షం డీఎంకేకు మధ్య రాజకీయ సమరం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం(మార్చి 22న) తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ లేఖ సారాంశాన్ని డీంఎకేకు కూడా పంపించారు. -
ISSలో ఉండగా సునీత విలియమ్స్ కు ప్రధాని మోదీ లేఖ
-
అపాయింట్మెంట్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే అంశంలో సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ సోమవారం రాత్రి లేఖ రాశారు. ‘‘రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానం మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కులగణన సర్వే నిర్వహించాం. ఆ సర్వే నివేదికల ఆధారంగా రాష్ట్రంలోని బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో రెండు బిల్లులను పెట్టి చర్చించాం. అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాయి. బిల్లులు ఆమోదం పొందాయి. ఈ చర్చ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం సహకారం కోరాలని రాజకీయ పక్షాలు సూచించాయి. ఈ మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీల తరఫున మిమ్మల్ని కలసి మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం. సానుకూలంగా స్పందించి అపాయింట్మెంట్ ఇవ్వగలరు’’అని ఆ లేఖలో సీఎం కోరారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టండి రైల్వేశాఖ ఇటీవల ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కోరుతూ రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు సీఎం సోమవారం రాత్రి లేఖ రాశారు. చర్లపల్లి టెర్మినల్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ లాజిస్టిక్ హబ్‌గా మరో కేంద్రం ఏర్పాటు కావడం సంతోషకరమని చెప్పారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును ఈ టెర్మినల్‌కు పెట్టడం సముచితమని పేర్కొన్నారు. -
ట్రంప్ శాంతిమంత్రం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈసారి ఎవరి అంచనాలకూ అందకూడదన్న సంకల్పంతో ఉన్నట్టు కనబడుతోంది. సరిగ్గా నెల్లాళ్ల క్రితం ఆయన ఇరాన్‌పై ఆంక్షల తీవ్రతను పెంచారు. అంతే కాదు... తనను చంపటానికి ప్రయత్నిస్తే ఇరాన్ తుడిచిపెట్టుకుపోతుందని తీవ్రంగా హెచ్చరించారు. తనకేం జరిగినా వెనువెంటనే ఇరాన్‌పై దాడి చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చానన్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన హఠాత్తుగా స్వరం మార్చారు. అణు ఒప్పందంపై చర్చలకు రావా లని ఇరాన్‌కు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించి తాజాగా ఒక లేఖ కూడా విడుదల చేశారు. సైనిక చర్య తీసుకుంటే ఇరాన్ భయంకరమైన పరిణామాలు చవిచూసే పరిస్థితి ఏర్పడుతుంది గనుకే చర్చలకు పిలుపునిచ్చానని ట్రంప్ వివరణనిచ్చారు. తొలిసారి అధికారంలోకొచ్చినప్పుడు అంతక్రితం ఒమామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా ట్రంప్ 2018లో ఏకపక్షంగా రద్దుచేశారు. అది కేవలం అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు. వియన్నాలో 2015 జూలై 14న కుదిరిన ఆ ఒప్పందంపై భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల(అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్)తో పాటు జర్మనీ, యూరప్ యూనియన్(ఈయూ)లు, ఇటుఇరాన్ సంతకాలు చేశాయి. ఆంక్షలు సడలించటానికి అంగీకరించాయి. ఆ సమయంలో కారాలూ మిరియాలూ నూరిన రిపబ్లికన్లు తాము అధికారంలోకొస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది. ట్రంప్ ఏక పక్షంగా ఒప్పందం నుంచి వైదొలగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి. తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. జో బైడెన్ హయాంలో పాత ఒప్పందానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారనుకుంటే సాధ్యపడలేదు.ట్రంప్ తాజా ప్రతిపాదనలో చర్చల ప్రస్తావన ఉన్నా నిజానికది మరిన్ని డిమాండ్లు తమముందుంచి లొంగదీసుకోవటానికేనని ఇరాన్ మత నాయకుడు ఆయతొల్లా అలీ ఖమేనీ చేసిన ప్రకటనను కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇరాన్లో తమ కీలుబొమ్మ పాలకుడు మహమద్ రెజా పహ్లావీ (ఇరాన్ షా) 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో పదవీచ్యుతుడైనప్పటినుంచీ అమెరికా ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. ఆనాటినుంచి కొనసాగిన ఆంక్షల పర్వం ఎడతెరిపి లేకుండా నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఆంక్షలు విధించటం కూడా పరిపాటైంది. 1988లో 290 మందితో వెళ్తున్న ఇరాన్ ప్రయాణికుల విమానాన్ని సైనిక విమానంగా భావించి అమెరికా కూల్చివేసింది. తాను విధించిన ఆంక్షల్ని మరింత విస్తృతం చేయటానికి 2006లో భద్రతామండలిలో తీర్మానం చేయించింది. 2012లో ఈ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. పర్యవసానంగా పసిపిల్లలకు పాలడబ్బాలు, ఔషధాలు మొదలుకొని అనేక నిత్యావసర వస్తువులు దొరక్క ఇరాన్ ప్రజానీకం తల్లడిల్లిపోయారు. అకాల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. తన ప్రధాన ఆదాయ వనరైన ముడిచమురు ఎగుమతుల్లో సింహభాగం నిలిచిపోవటంతో... అమె రికా బ్యాంకుల్లోవున్న వేలాదికోట్ల విలువైన బంగారం, నగదు డిపాజిట్ల స్తంభించటంతో ఇరాన్ ఎన్నో అగచాట్లు పడింది. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ వాదన సమంజసమైనది. అణు కార్య క్రమంపై కేవలం తమతోనే చర్చిస్తే సరిపోదని, పశ్చిమాసియా దేశాలను సైతం భాగస్వాముల్ని చేయాలని ఆ దేశం మొదటినుంచీ కోరుతోంది. ఆ చర్చ అంతిమంగా ఈ ప్రాంతంలో అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలని వాదిస్తోంది. గత ఒప్పందం రద్దయ్యాక అమెరికా, ఇరాన్‌లమధ్య పర స్పరం అవిశ్వాసం పెరిగిపోయింది. దాన్ని తొలుత తొలగిస్తే తప్ప అడుగు ముందుకు పడదు. ట్రంప్ తాజా ప్రతిపాదనలోని ముఖ్యాంశాలేమిటో ఎవరికీ తెలియదు. ఒబామా హయాంలో కుదిరిన పాత ఒప్పందం ఇరాన్‌కు అనుకూలంగా ఉన్నదని ట్రంప్ ఆరోపించారు. దాన్ని మరింత పకడ్బందీగా మారుస్తామన్నారు. ఖమేనీ స్పందన స్పష్టంగా ఉంది. తాము కేవలం ఇరాన్ అణు కార్యక్రమానికి పరిమితమై మాట్లాడతామని, ఇతర అంశాలు ఒప్పుకోబోమని చెప్పారు. క్షిపణుల తయారీ వ్యవహారంపై మాట్లాడే ఉద్దేశంతోనే అమెరికా స్వరం మార్చిందని ఆయన అభిప్రాయంలా కనబడుతోంది. సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ నిరుడు జూన్‌లో ఇరాన్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాక ఆ దేశం వైఖరి మారింది. అగ్రరాజ్యాలతో చర్చించి 2015 నాటి అణు ఒప్పందం వంటిది కుదుర్చు కోవటానికి తాను సిద్ధమని ఆయన ఇప్పటికే చెప్పారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్‌కు మంచి సంబంధాలే వున్నాయి. ఇరాన్‌తో ఒప్పందానికి తన వంతు కృషి చేస్తానని ఇప్పటికే పుతిన్ హామీ ఇచ్చారు. అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇరాన్ ఇంకా అణ్వస్త్ర తయారీ స్థాయికి ఎదగలేదు. ట్రంప్ తొలి ఏలుబడి నాటికి పశ్చిమాసియాలో ఇరాన్ దాదాపు ఏకాకి. సౌదీ అరేబి యాతో దానికి ఘర్షణ వాతావరణం ఉండేది. ఇప్పుడలా కాదు. ఇరాన్‌తో దాదాపు పశ్చిమాసియా దేశాలన్నిటికీ మెరుగైన సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రపంచ వాణిజ్యాన్ని ఛిద్రం చేస్తున్న యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్లతో ఇరాన్‌కు సాన్నిహిత్యముంది. అందువల్ల ఇరాన్‌తో నిజంగా ఒప్పందం కుదిరితే అది ప్రపంచ శాంతికి దోహదపడుతుంది. అయితే ఇరాన్నుంచి ఆశించే ఎలాంటి ఆచరణైనా ఇజ్రాయెల్‌కు కూడా వర్తింపజే సినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. కాని పక్షంలో ఈ సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంటుంది. -
ఆదాయపన్ను శాఖకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ
-
జెలెన్స్కీ నుంచి ముఖ్యసందేశం వచ్చింది: ట్రంప్
వాషింగ్టన్: అమెరికన్ కాంగ్రెస్ తొలిసారి ప్రసంగించిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. మరో కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పంపిన ముఖ్యమైన సందేశాన్ని ప్రస్తావించారు. ఉక్రెయిన్ శాశ్వత శాంతిని కోరుకుంటోందని, చర్చలకు సిద్ధంగా ఉందని జెలెన్స్కీ స్పష్టం చేసినట్లు ట్రంప్ ఆ లేఖను చదివి వినిపించారు.అమెరికా కల పునరుద్ధరణ పేరిట మంగళవారం అమెరికా కాంగ్రెస్(US Congress)లో ఉభయ సభలను ఉద్దేశించి అధ్యక్షుడి హోదాలో ట్రంప్ తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా మెక్సికో, కెనడాలపై విధించిన 25 శాతం టారిఫ్ అంశంతో పాటు ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేతపైనా స్పందించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelenskyy)తో వైట్‌హౌజ్‌లోని తన ఓవెల్ ఆఫీస్లోట్రంప్ జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance)లు జెలెన్స్కీ తీరుపై కెమెరాల సాక్షిగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఖనిజాల ఒప్పందంపై సంతకాలు చేయకుండానే జెలెన్స్కీ వెనుదిగారు. ఆ వెంటనే తన తీరును సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ క్రమంలో.. ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచాయి. ఆ వెంటనే ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం ఆపేస్తున్నట్లు ప్రకటించారాయన.దీంతో కొన్ని గంటల్లోనే జెలెన్స్కీ దిగివచ్చారు. ట్రంప్‌తో చర్చలు జరిగిన తీరుపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. తమ దేశ ఖనిజాలను అమెరికా తవ్వుకునేందుకు ఒప్పందానికి సిద్ధమేనన్నారు. ట్రంప్ బలమైన నాయకత్వంలో ముందుకు వెళ్లి రష్యాతో యుద్ధానికి ముగింపు పలికేందుకు వీలైనంత వేగంగా పనిచేస్తామని ప్రకటించారు. -
కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
-
ప్రధాని, హోంమంత్రులకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదు. జగన్ పర్యటనలో తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి వివరించారు.జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలు. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోంది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లుకాగా.. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించింది. మాజీ సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ వైఫల్యంపై వైఎస్సార్సీపీ నేతలు గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. -
నా సినిమాపై విమర్శలను అంగీకరిస్తున్నా: అభిమానులకు విశ్వక్ సేన్ లేఖ
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) ఇటీవలే లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ మూవీలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించారు. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందే వివాదానికి దారి తీయడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విషయంలో తీవ్రంగా నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమాలు చేయలేకపోయానని ట్విటర్ వేదికగా వెల్లడించారు.విశ్వక్ సేన్ తన లేఖలో రాస్తూ..'అందరికీ నమస్కారం.. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శలను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతిచ్చిన నా అభిమానులకు.. నాకు ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే. కానీ.. ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నా. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్.. మాస్ ఏదైనా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే.. నన్ను విమర్శించే హక్కు మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే' అని రాసుకొచ్చారు.'అంతేకాకుండా నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు.. నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నా. అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన నిర్మాతలు, పంపిణీదారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు నాకు వెన్నెముకగా నిలిచి.. నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరో బలమైన కథతో ముందుకు వస్తా. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం- ఇట్లు మీ విశ్వక్ సేన్' అంటూ లేఖను విడుదల చేశారు.కాగా.. ప్రస్తుతం విశ్వక్సేన్ జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్లో ఫంకీ చిత్రంలో నటిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్ అండ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.🙏 With gratitude #vishwaksen pic.twitter.com/c95Jyal2Il— VishwakSen (@VishwakSenActor) February 20, 2025 -
ఫీజు పోరుకు అనుమతి కోరుతూ ఈసీకి YSRCP లేఖ
-
నిస్సి సూసైడ్ నోట్ లభ్యం.. లెటర్లో ఏముందంటే?
సాక్షి, తిరుపతి జిల్లా: గూడూరులోని పంబలేరు వాగులో నిస్సి మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్ లెటర్‌ను గుర్తించారు. తనను పెళ్లి చేసుకోబోయే చైతన్య అనే అబ్బాయికి లెటర్ రాసిన మృతురాలు.. చైతన్యను జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని.. అతనంటే తనకెంతో ఇష్టమంటూ లేఖలో పేర్కొంది.అయితే ఆత్మహత్యకు గల కారణాలను నోట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. మరో వైపు, అందరినీ వదిలి వెళిపోతున్నా.. మిస్ యూ అంటూ నోట్ రాసి ఇంట్లోనే పెట్టింది. యువతి అదృశ్యం అనంతరం.. ఇంట్లో ఉన్న నోట్‌ను కుటుంబ సభ్యులు గుర్తించారు.కాగా, గూడూరులో యువతి అనుమానాస్పదంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న యువతి వివాహం జరగాల్సి ఉండగా, రెండు రోజుల క్రితం అదృశ్యమైంది.. ఇవాళ వాగులో మృతదేహం లభ్యమైంది. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
డోన్లతో ఉత్తరాల బట్వాడా.. 10 నిముషాల్లో డెలివరీ
ధర్మశాల: ఉత్తరాల బట్వాడాలో పోస్టల్శాఖమరో ముందడుగు వేసింది. హిమాచల్ పోస్టల్ విభాగం డ్రోన్ల సాయంతో మారుమూల, మంచు ప్రాంతాలకు ఉత్తరాలను బట్వాడా చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పోస్టల్‌శాఖ అప్పర్ సిమ్లాలో డ్రోన్ ద్వారా ఉత్తరాలను డెలివరీ చేసే ట్రయల్‌ను ప్రారంభించింది.డ్రోన్ల సాయంతో సబ్ పోస్టాఫీసు నుండి బ్రాంచ్ పోస్టాఫీసులకు ఐదు నుంచి పది నిమిషాల్లో ఉత్తరాలు డెలివరీ అవుతున్నాయి. గతంలో ఇలా ఉత్తరాలు చేరడానికి ఒక రోజు పట్టేది. ఈ ట్రయల్ విజయవంతం అయిన దరిమిలా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పోస్టల్ విభాగం హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి ఇతర మారుమూల ప్రాంతాలకు కూడా ఉత్తరాలను బట్వాడా చేసే అవకాశం ఏర్పడనుంది.హిమాచల్ తపాలా శాఖ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య డ్రోన్ల ద్వారా సబ్ పోస్టాఫీస్ హట్కోటి నుంచి నందపూర్, కథాసు, ఆంటి, జాధగ్ బ్రాంచ్ పోస్టాఫీసులకు ఉత్తరాలను పంపుతోంది. ఒకేసారి ఏడు కిలోగ్రాముల వరకు భారాన్ని మోయగల ఈ డ్రోన్ ఐదు నుండి పది నిమిషాల్లో ఏడు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు ఉత్తరాలను చేరవేసి, తిరిగివస్తోంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఉత్తరాల డెలివరీకి సంబంధించిన పూర్తి డేటాను ఆన్లైన్లో ఉంచుతున్నారు. డ్రోన్ ట్రయల్స్ కోసం ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోస్టల్‌శాఖ అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: Republic Day 2025: అందమైన ఈ శకటాలను చూసితీరాల్సిందే -
కుంభమేళాపై స్టీవ్ జాబ్స్ లేఖ.. ఎన్ని కోట్లు పలికిందంటే?
ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన కార్యక్రమాలలో.. భారతదేశంలో జరిగే 'మహా కుంభమేళా' (Maha Kumbh Mela) ఒకటి. ఇటీవల ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు విచ్చేస్తున్నారు, పవిత్ర సంగమం వద్ద పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దివంగత స్టీవ్ జాబ్స్ భార్య 'లారెన్ పావెల్ జాబ్స్' కూడా వచ్చారు.మహా కుంభమేళాకు వచ్చిన లారెన్ పావెల్ జాబ్స్ తన పేరును 'కమల'గా మార్చుకున్నారు. కాగా ఇప్పుడు ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చేతితో రాసిన ఓ లేఖ (Letter) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1974లో రాసిన ఈ లేఖలో స్టీవ్ జాబ్స్ కుంభమేళా కోసం భారతదేశాన్ని సందర్శించాలని రాసినట్లు తెలుస్తోంది.50 ఏళ్లకింద స్టీవ్ జాబ్స్ రాసిన ఈ లేఖ బోన్హామ్స్ వేలంలో 500312 డాలర్లు లేదా రూ.4.32 కోట్లుకు పలికింది. ఇది స్టీవ్ జాబ్స్ స్వయంగా రాసిన మొదటి లేఖ కావడం గమనార్హం. ఈ కారణంగానే దీనిని చాలామంది సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు.స్టీవ్ జాబ్స్ 19వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందు.. అతని చిన్ననాటి స్నేహితుడు టిమ్ బ్రౌన్కు ఈ లేఖను పంపించారు. ఇందులో ఆయన ఆధ్యాత్మిక, ఆత్మపరిశీలనకు సంబంధించిన చాలా విషయాలను వెల్లడించారు. అంతే కాకుండా బౌద్ధమతాన్ని గురించి ప్రస్తావిస్తూ.. కుంభమేళా కోసం భారతదేశాన్ని సందర్శించాలనే తన ఆకాంక్షను కూడా అందులో వెల్లడించారు.భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. తాను చాలా సార్లు ఏడ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కుంభమేళా కోసం నేను భారతదేశానికి వెళ్లాలనుకుంటున్నాను. నేను మార్చిలో ఎప్పుడో బయలుదేరుతాను, కానీ ఇంకా ఖచ్చితంగా తెలియలేదని అందులో ప్రస్తావించారు.స్టీవ్ జాబ్స్ మొదట ఉత్తరాఖండ్‌లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించాలని అనుకున్నారు. అయితే, నైనిటాల్‌కు చేరుకోగానే, నీమ్ కరోలి బాబా అంతకుముందు సంవత్సరం మరణించినట్లు అతను కనుగొన్నాడు. నిరుత్సాహపడకుండా, జాబ్స్ కైంచి ధామ్‌లోని ఆశ్రమంలో ఉండి, నీమ్ కరోలి బాబా బోధనల నుంచి ఓదార్పు పొందారు. ఆ సమయంలో ఆయన పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగిపోయారు. ఆ తరువాత ఆయనలో చాలా మార్పు వచ్చిందని కూడా చెప్పారు.ఇప్పుడు, స్టీవ్ భార్య లారెన్ పావెల్ జాబ్స్, మహా కుంభమేళా 2025కి హాజరవడం ద్వారా అతని చిరకాల కోరికలలో ఒకదాన్ని నెరవేర్చింది. ఈమె జనవరి 15 వరకు నిరంజినీ అఖారా క్యాంపులోని కుంభ్ టెంట్ సిటీలో ఉండనున్నారు. ఆ తరువాత జనవరి 20న అమెరికాలోనూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరవుతారు.ఇదీ చదవండి: కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యకు అస్వస్థతఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.Steve Jobs letter to his friend about planning to visit Kumbh Mela in India.The thing to notice here is, he used the word "Shanti" before concluding. pic.twitter.com/s4yN2pupjr— Kartik Jaiswal (@draken73jp) October 24, 2021 -
RSS చీఫ్ కు వరుస ప్రశ్నలు సంధించిన కేజ్రివాల్
-
బీజేపీ కుట్రలను సమర్థిస్తున్నారా?
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, పూర్వాంచల్ ప్రజల ఓట్లను, దళితుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపిస్తుండగా, ఆయనలో ఓటమి భయం కనిపిస్తోందని, అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ తాజాగా రా్రïÙ్టయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. డిసెంబర్ 30వ తేదీతో రాసిన ఈ లేఖలో పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ చేస్తున్న తప్పుడు పనులను మీరు సమర్థిస్తున్నారా? అని నిలదీశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తుందా? అని భగవత్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని అన్నారు. ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచడం, కొందరు ఓటర్ల పేర్లను తొలగించడం మీకు సమ్మతమేనా? అని అడిగారు. దేశాన్ని బలహీనపర్చడానికి బీజేపీ కుట్రలు పన్నుతుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం..సీఎం వర్సెస్ ఎల్జీ -
పోలవరం అనుమతీ చెల్లదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని సీతారామ– సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే అంశంపై నిర్వహించనున్న టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) సమావేశానికి తమను పిలవలేదని, సీడబ్ల్యూసీ అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. అలా అయితే, గోదావరి పరీవాహక ప్రాంతంలోని మిగతా రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలను ఆహ్వానించకుండానే.. 2009లో టీఏసీ నిర్వహించి పోలవరం ప్రాజెక్టుకు ఇచి్చన అనుమతులూ చెల్లుబాటు కావు అని స్పష్టం చేసింది. సీతారామ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని టీఏసీ అనుమతులకు సిఫార్సు చేస్తూ గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బోర్డుకు ఇటీవల ఏపీ లేఖ రాసింది. ‘ప్రస్తుతం 2017 మార్గదర్శకాలు అమల్లో ఉండగా, 1996 మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వడం సరికాదు’అని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనిల్‌కుమార్ సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాశారు. ‘పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ 2009, 2011లో అనుమతులను 1996 మార్గదర్శకాల ప్రకారమే ఇచి్చంది. వీటి ఆధారంగానే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యవహరిస్తోంది’అని బదులిచ్చారు. న్యాయస్థానానికి వెళ్లక తప్పని పరిస్థితి కల్పించారని ఏపీ పేర్కొనగా, తప్పుడు ఉద్దేశాలతో కేసులేసినా నిలబడవని తెలంగాణ కౌంటర్ ఇచి్చంది. గోదావరి ట్రిబ్యునల్ అవసరం లేదు అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్ 3 కింద ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి జలాల పంపకానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఏపీ కోరగా, అది ఏమాత్రం అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. తాము 531.908 టీఎంసీల గోదావరి జలాల వినియోగం కలిగి ఉన్నట్టు సీడబ్ల్యూసీ నిర్ణయించడం ఏకపక్షమన్న ఏపీ వాదనను కూడా తెలంగాణ తోసిపుచ్చింది. ‘రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ఏపీకి ఉన్న 1,486 టీఎంసీల నీటి వాటా నుంచి తెలంగాణకు 967.94 టీఎంసీలు, ఏపీకి 518.215 టీఎంసీలను కేటాయిస్తూ ఉమ్మడి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ 2014 జనవరి 2న రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శికి లేఖ రాశారు. దానినే నాటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వరద జలాలు/మిగులు జలాల ఆధారంగా చేపట్టిన పురుషోత్తపట్నం లిఫ్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి లిఫ్టు, గోదావరి–పెన్నా అనుసంధానం తదిత ర ప్రాజెక్టులకు నీటి హక్కులు సాధించుకునేందుకే ఏపీ తప్పుడు ఉద్దేశాలతో ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుకుంటోంది. ఈ ప్రాజెక్టులకు నేటికీ సీడబ్ల్యూసీ నుంచి టెక్నో ఎకనామికల్ క్లియరెన్స్, టీఏసీ అనుమతి లేదు. దీంతో వీటిని రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాల్సి ఉంటుంది. గోదావరి జలాల్లో ఏపీకి 531.908 టీఎంసీల న్యాయబద్ధమైన వినియోగం ఉన్నట్టు నిరూపించడంలో ఆ రాష్ట్రం విఫలమైంది’అని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ అభ్యంతరాలను సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంది సీతారామ ప్రాజెక్టు వల్ల ఏపీ హక్కులకు ఎలాంటి నష్టం ఉండదని సీడబ్ల్యూసీ చెప్పడం సరికాదని ఆ రాష్ట్రం పేర్కొనగా.. ఏపీ అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీడబ్ల్యూసీ ఈ మేరకు తేల్చిందని తెలంగాణ వివరణ ఇచి్చంది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా 85 టీఎంసీల వినియోగంపై గోదావరి ట్రిబ్యునల్ విధించిన ఆంక్షలు ఆ ప్రాజెక్టుకే పరిమితమని, సీతారామ ప్రాజెక్టుకు వర్తించవని తెలిపింది. 35 టీఎంసీలతో దేవాదుల, 195 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంతో ఆ 85 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టేనని, దీంతో సీతారామ ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదన్న ఏపీ వాదనను తోసిపుచి్చంది. ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు కట్టుబడే దేవాదుల, కాళేశ్వరంతో పాటు పోలవరం ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతిలిచి్చందని తెలిపింది.పోలవరం ప్రాజెక్టుపై ప్రభావం ఉండదు‘పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే సమయంలో అక్కడ 991 టీఎంసీల నీటి లభ్యత ఉందని వ్యాప్కోస్ నిర్ధారించగా, 861 టీఎంసీలేనని సీడబ్ల్యూసీ కుదించింది. 2018 నాటి సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ ప్రకారం పోలవరం వద్ద నీటి లభ్యత 460.7 టీఎంసీలకు తగ్గింది. సీతారామ డీపీఆర్ ప్రకారం అక్కడ నికర లోటు 13.64 టీఎంసీల నుంచి 151 టీఎంసీలకు పెరి గింది. గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని న దుల అనుసంధానం సందర్భంగా సీడబ్ల్యూసీ తేల్చింది. ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన నేపథ్యంలో పోలవరం వద్ద నీటి లభ్యతపై తాజా అధ్యయనం జరపాలి’అని ఏపీ కోరింది. సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ పరీ వాహకంలోని అన్ని రాష్ట్రాల ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభా వం ఉండదని నిర్ధారించిందని తెలంగాణ బదులిచ్చింది. -
ఇంటి ముందు లెటర్..యమడేంజర్
పలమనేరు: ఇప్పటిదాకా స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌కు లింకులు, ఫేస్బుక్ హ్యాకింగ్స్, బ్యాంకు అధికారుల పేరిట ఫేక్ కాల్స్, ఓటీపీలు, మన ఫోన్ ఎవరికైనా కాల్ కోసం ఇస్తే దాంట్లో సెట్టింగ్స్ మార్చేయడం, ఫేక్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్, ఫోన్ హ్యాకింగ్, ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలు, తాజాగా బయటి ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్న లేదా ఉద్యోగాల చేస్తున్న వారి నంబర్ల ఆధారంగా వారి కుటుంబీకులకు డిజిటల్ అరెస్ట్‌లు సర్వసాధారణంగా మారాయి. ఈ సైబర్ నేరాలకు సంబంధించి పోలీసులు, వారు ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్లు సైతం బాధితులను రక్షించలేకపోతున్నాయి. తాజాగా మరోకొత్త మోసం వెలుగులోకి వచ్చింది. దీన్ని ఎలాంటి వారైనా నమ్మి మోసపోవాల్సిందే. మీ ఇంటి ముందు ఓ లెటర్‌ను పడేసి.. ఇంటిముందు ఓ లెటర్ లేదా కొరియర్ ఫామ్ పడి ఉంటుంది. దానిపై డేట్, వేబిల్ నంబరు, కొరియర్ లేదా పార్సిల్ కంపెనీ పేరు ఉంటుంది. అందులోని స్కానర్‌ను స్కాన్ చేసి చేంజ్ యువర్ డెలివరీ డేట్, ఆల్టర్నేట్ అడ్రస్ తదితర వివరాలు ఉంటాయి. దీన్ని నమ్మి మనకేమైనా పార్సిల్ లేదా లెటర్, వస్తువులు వచ్చాయేమోనని భావించి మన స్మార్ట్‌ఫోన్ ద్వారా దానిపై ఉన్న క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేశామో ఇక అంతే సంగతులు. వెంటనే మన ఫోన్ హ్యాకర్ల గుప్పెట్లోకి పోతుంది. మనఫోన్‌లో జరిగే అన్ని లావాదేవీలను హ్యాకర్స్ డార్క్‌నెట్ ద్వారా గమనిస్తుంటారు. ఇందుకోసం పెద్ద నెట్వర్క్ ఉంటుంది. చాలామంది సాఫ్ట్వేర్లు ఇందులో పనిచేస్తూ మనం సెల్లో చేసే పనులను గమనిస్తుంటారు. బహుశా మనం ఫోన్‌పే, గూగుల్‌పే నుంచి ఎవరికైనా డబ్బు పంపి మన పిన్ను ఎంటర్ చేశామంటే ఆ పిన్ను వారు గుర్తిస్తారు. ఆపై మన ఖాతాలో ఉన్న డబ్బును మనకు తెలియకుండానే కాజేస్తారు. మన సెల్‌కు డబ్బులు కట్ అయినట్లు ఓ ఎస్ఎంఎస్ మాత్రం వస్తుంది. ఆపై మనం ఏమీ చేయాలన్నా మన సెల్ హ్యాకర్ల అదుపులో ఉన్నందున మనం ఏం చేసినా లాభం ఉండదు. నెల రోజులుగా ఈ మోసాలు.. బెంగళూరులో గత నెల రోజులుగా ఇలాంటి ఫేక్ లెటర్లు ఇంటి ముందు పడి ఉండడం, వాటిని స్మార్ట్‌ఫోన్‌లో స్కాన్ చేసిన వారి ఖాతాల్లో డబ్బు మాయం కావడం ఎక్కువగా జరుగుతోంది. దీంతో ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీలో ఇప్పుడు జరుగుతున్న ఇలాంటి సైబర్ మోసాలు మన చెంతకు చేరడం ఎన్నో రోజులు పట్టదు. మన ఇళ్ల వద్ద ఏదైనా స్కానింగ్ ఉన్న లెటర్ వస్తే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కాపు నేత హరిరామ జోగయ్య మరో లేఖాస్త్రం
-
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. రెండు రోజుల ముందే లేఖ రాసిన యాజమాన్యం!
అల్లు అర్జున్ సినిమాకు పుష్ప-2 మూవీకి భద్రతా కల్పించాలని తాము కోరినట్లు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ యాజమాన్యం తెలిపింది. తమకు 4, 5 తేదీల్లో సెక్యూరిటీ ఇవ్వాలని రెండో తేదీనే లేఖ రాసినట్లు వెల్లడించింది. పుష్ప-2 ప్రత్యేక షోల దృష్ట్యా థియేటర్ వద్ద భద్రత కల్పించాలని చిక్కడపల్లి ఏసీపీకి రాసిన లేఖలో కోరినట్లు యాజమాన్యం పేర్కొంది.అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండిఅయితే డిసెంబర్ 4న వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప-2 బెనిఫిట్ షో ప్రదర్శించారు. ఈ షోకు అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి కూడా హాజరయ్యారు. అయితే బన్నీని చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాతపడగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. -
విభజనపై పార్లమెంటులో చర్చకు కృషి చేయండి
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రాన్ని విభజించిన తీరు, తద్వారా ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చ జరిగేలా నోటీసు ఇప్పించాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ఈ మేరకు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు రాసిన లేఖను మంగళవారం రాజమహేంద్రవరంలో విడుదల చేశారు. 2014 నుంచి జరిగిన పరిణామాలను ఆ లేఖలో ప్రస్తావించారు. ‘2014 ఫిబ్రవరి 18న రాష్ట్ర విభజన బిల్లుపై ఎటువంటి చర్చా జరగకుండా.. ఎంతమంది విభజనకు అనుకూలమో.. ఎంతమంది వ్యతిరేకమో డివిజన్ ద్వారా లెక్క తేల్చకుండా, తలుపులు మూసేసి టీవీ ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసి, రాష్ట్ర విభజన జరిగిపోయిందని లోక్‌సభలో ప్రకటించారు. ఈ విషయం మీకు తెలిసిందే..’ అని లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజనపై నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పదేళ్లుగా నడుసూ్తనే ఉన్నా... కేంద్రం నేటికీ కనీసం కౌంటర్ దాఖలు చేయలేదు. 2018 ఫిబ్రవరి 18న మీరు(పవన్) ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన బకాయిలు రూ.74,542 కోట్లుగా లెక్క తేల్చింది. 2018 జూలై 16న అప్పటి సీఎం చంద్రబాబును కలిసి లోక్‌సభలో జరిగిన దుర్మార్గం గురించి వివరించాను. నేను చూపించిన లోక్‌సభ రికార్డులను పరిశీలించిన చంద్రబాబు నా వాదనతో ఏకీభవించి, లోక్‌సభలో ఈ విషయం చర్చించేందుకు నోటీసు ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. కారణాలేమైనా అవి అమలు కాలేదు.2019 జనవరి 29న విజయవాడలో నేను ఏర్పాటు చేసిన సమావేశానికి వైఎస్సార్సీపీ, సీపీఎం తప్ప మిగిలిన ముఖ్య పార్టీల నేతలందరూ హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీరు స్వయంగా హాజరయ్యారు. 2019 ఎన్నికల అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా, మనకు జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చించాలని, సుప్రీంకోర్టులో ప్రస్తావించాలని ఆ రోజు సమావేశంలో తీర్మానించుకున్నాం. ఇప్పుడు మీరు, చంద్రబాబు ఇద్దరూ బీజేపీతో కలిసి రాష్ట్రం, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోను, సహకరించిన బీజేపీ కేంద్రంలోను అధికారంలో ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవడానికి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇదే సరైన సమయం. మీరిద్దరూ శ్రద్ధ తీసుకుని, పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్ర విభజనపై, జరిగిన అన్యాయంపై చర్చకు నోటీసులు ఇప్పించాలి. దీంతోపాటు సుప్రీంకోర్టులో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలి.’ అని ఉండవల్లి ఆ లేఖలో పేర్కొన్నారు. -
పుష్ప-2 రిలీజ్.. అల్లు అయాన్ లేఖ వైరల్!
ఎన్నో రోజుల నిరీక్షణకు తెరపడింది. అనుకున్నట్లుగానే ఒక రోజు ముందుగానే పుష్ప-2 థియేటర్లలో సందడి చేశాడు. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. దీంతో ఎన్నో రోజులుగా వెయిట్ చేసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా థియేటర్లకు ఉప్పెనలా తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 విడుదల కావడంతో బన్నీ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు.అయితే పుష్ప-2 రిలీజ్‌కు ముందు ప్రతి ఒక్కరూ టీమ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సైతం పుష్ప-2 సక్సెస్ సాధించాలని ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ తనయుడు అయాన్ కూడా తన నాన్నపై ప్రశంసలు కురిపించాడు. సినిమా పట్ల మీ నిబద్ధత, హార్ట్ వర్క్‌ను చూసి గర్వపడుతున్నా అంటూ లేఖ రాశాడు.ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడి మూవీ రిలీజ్ కానుంది. ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం.. పుష్ప-2 కేవలం సినిమా మాత్రమే కాదు.. సినిమా పట్ల నీకున్న ప్రేమను తెలిజేస్తుందని లేఖలో రాశాడు. నా జీవితంలో నువ్వే ఎప్పటికీ హీరో.. నీకున్న కోట్లాది అభిమానుల్లో నేను ఒకడిని అంటూ తన చిట్టి చేతులతో రాసిన లేఖ నెట్టింట వైరలవుతోంది. దీనికి బన్నీ రిప్లై కూడా ఇచ్చాడు. ఈ లెటర్ నా గుండెలను తాకిందంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు.Touched by my son ayaan’s letter 🖤 pic.twitter.com/dLDKOvb6jn— Allu Arjun (@alluarjun) December 4, 2024 -
మేడిగడ్డలో సాక్ష్యాధారాలు ధ్వంసం!
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి ఏర్పడిన బుంగలను పూడ్చడానికి ముందు, అక్కడి స్థితిగతులు తెలుసుకోవడానికి వరుస క్రమంలో నిర్వ హించాల్సిన పరీక్షలపై నిపుణుల కమిటీ చేసిన సి ఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ అమలు చే యకుండా నీరుగార్చింది..’అంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇరిగేషన్ శాఖ నిర్వాకంతో బరాజ్‌లు దెబ్బతినడానికి దారితీసిన కారణాల విశ్లేషణకు అవసరమైన కీలక సమాచారం, సాక్ష్యాధారాలు ధ్వంసమయ్యాయి..’అని తెలిపింది. నీటిపారుదల శాఖ సొంతంగా ఏర్పాటు చేసుకున్న మరో సాంకేతిక కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆ శాఖ నిర్వహించిన మరమ్మతులు.. ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయి..’అని పేర్కొంది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ (టెక్నికల్) గత నెల 11న ఇరిగేషన్ కార్యదర్శికి లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖ సల హాదారు వెదిరే శ్రీరామ్ బుధవారం కాళేశ్వరం బరాజ్‌లపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్డీఎస్ఏ లేఖను మీడియాకు విడుదల చేశారు. బుంగల పూడ్చివేతతో స్థితిగతుల్లో మార్పులు ‘మేడిగడ్డ బరాజ్ ప్లింత్ శ్లాబుకి ఎగువ, దిగువన గ్రౌటింగ్ చేసి భూగర్భంలో ఏర్పడిన బుంగలను పూడ్చి వేయడంతో సికెంట్ పైల్స్, పారామెట్రిక్ జాయింట్స్ వద్ద స్థితిగతుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. బరాజ్ కుంగిన తర్వాత భూగర్భంలో ఉన్న వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయాల్సి ఉండగా, స్థితిగతుల్లో మార్పులతో ఆ అవకాశం లేకుండా పోయింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ గతేడాది అక్టోబర్‌లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో బుంగలు ఏర్పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. బరాజ్‌లలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత మే 1న మధ్యంతర నివేదికను సమర్పించింది. బరాజ్‌లకు మరింత నష్టం జరగకుండా వర్షాకాలం ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన అత్యవసర మరమ్మతులతో పాటు బరాజ్‌లలో లోపాలను నిర్ధారించడానికి నిర్వహించాల్సిన జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు ఇందులో ఉన్నాయి. ఈ పరీక్షలు నిర్వహించక పోవడాన్ని ఎన్డీఎస్ఏ తప్పుబట్టింది. ఈ అధ్యయనాలు/పరీక్షలు ప్రారంభించడంలో జాప్యం చేయడం ద్వారా నీటిపారుదల శాఖ విలువైన సమయాన్ని కోల్పోయిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో కూడా..‘అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునాదుల కింద ఏర్పాటు చేసిన సికెంట్ పైల్స్ వాస్తవ స్థితిగతులను అధ్యయనం చేయడానికి ముందే కరై్టన్ గ్రౌటింగ్ చేసి భూగర్భంలో బుంగలను పూడ్చివేశారు. పునాదుల (ర్యాఫ్ట్‌లు) కింద బుంగలను పూడ్చడానికి సిమెంట్ మిశ్రమంతో గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్‌కు ముందే జియో టెక్నికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, అలా చేయలేదు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే ఎన్డీఎస్ఏ కమిటీకి అవసరమైన వాస్తవ సమాచారం లభించదు. దీనివల్ల ఎన్డీఎస్ఏ కమిటీ పని ప్రణాళికకు విఘాతం కలిగింది..’అని ఎన్డీఎస్ఏ లేఖలో స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ తాజాగా తీసుకోవాల్సిన చర్యలను, చేయాల్సిన పరీక్షలను సిఫారసు చేసింది. 160 టీఎంసీల లభ్యత లేదనడం అవాస్తవం: వెదిరే శ్రీరామ్ ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద 75 డిపెండబిలిటీ ఆధారంగా 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ నిర్ధారించిందని వెదిరే శ్రీరామ్ చెప్పారు. నీటి లభ్యత లేదని చెప్పి ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌ను చేపట్టారని విమర్శించారు. వ్యాస్కోస్ వ్యాపార సంస్థ అని, ఎవరు పని అప్పగిస్తే వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ కట్టి రూ.32 వేల కోట్లతో మొత్తం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి 16.4 లక్షల ఎకరాలకు నీరందించడానికి వీలుండగా, కేవలం రూ.2 లక్షల అదనపు ఆయకట్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. ప్రస్తుతం దీని అంచనాలు రూ.1.27 లక్షల కోట్లకు ఎగబాకాయన్నారు. -
మీకు చౌకగా విద్యుత్ ఇస్తాం
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలంభిస్తున్న వినూత్న విధానాలు, చూపిస్తున్న చొరవకు స్పందిస్తూ పాతికేళ్ల పాటు రాష్ట్రానికి చవగ్గా సౌర విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) తనకు తానుగా తొలుత ప్రతిపాదించింది. అందుకు 2021 సెప్టెంబర్ 15న సెకీ రాసిన లేఖే తిరుగులేని ఆధారం. వేరే ప్రయత్నాలు అవసరం లేదని, అతి తక్కువ ధరకు యూనిట్ రూ.2.49కి తామే అందిస్తామంటూ సెకీనే ఆరోజు రాష్ట్రానికి లేఖ రాసింది. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వ్యవసాయానికి పగటిపూట ఉచితంగా 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన పునరుత్పాదక విద్యుత్‌ను.. అదీ డిస్కంలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అందించాలనే జగన్ వినూత్న ఆలోచనను కేంద్ర సంస్థ ఆ లేఖలో కొనియాడింది. 6,400 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ టెండర్లు పిలిచిందనే విషయం తమకు తెలిసిందని, అయితే తామే చౌక ధరకు సోలార్ విద్యుత్‌ను 25 ఏళ్ల పాటు సరఫరా చేస్తామని ఆ లేఖలో తెలిపింది. 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తం 9 వేల మెగావాట్లు ఇస్తామని వివరించింది. 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి రాష్ట్రానికి మినహాయింపు కూడా ఇస్తామని చెప్పింది. తామిచ్చే టారిఫ్ యూనిట్ రూ.2.49 వల్ల వ్యవసాయ విద్యుత్‌కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని పేర్కొంది. అదే విధంగా 9 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చులు, భూమి కూడా మిగులుతాయని, వాటిని రాష్ట్రం ఇతర అభివృద్ధి, ప్రాజెక్టుల అవసరాలకు వినియోగించుకోవచ్చని వివరించింది. డిస్కంలకు కూడా విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గుతాయని వెల్లడించింది. తమ ప్రతిపాదనకు అంగీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ఏపీ మద్దతు ఇచ్చినట్టవుతుందని కూడా చెప్పింది. వెంటనే సానుకూల నిర్ణయాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే స్వయంగా విద్యుత్ ఇస్తామంటూ ముందుకు వచ్చిన ఈ వ్యవహారంలో స్కామ్‌కు ఆస్కారమే ఉండదన్నది స్పష్టం. ఇందులో ముడుపుల అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విషయం ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది.కేంద్రం ఇంతగా చెప్పాక ఎవరైనా కాదంటారా..! అతి చౌకగా విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వమే ఇంత స్పష్టంగా చెప్పాక ఏ రాష్ట్రమైనా ఎందుకు వద్దంటుంది? పైగా, ఈ విద్యుత్ తీసుకొంటే ఆర్థికంగా, ఇతరత్రా పలు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇంత మంచి అవకాశాన్ని ఏ రాష్ట్రమూ వదులుకోదు. ఒక వేళ వద్దంటే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? తక్కువకు ఇస్తామని కేంద్రమే ముందుకు వస్తే ఎందుకు తీసుకోవడంలేదని, దాని వెనుక రాష్ట్ర ప్రయోజనాలకంటే వేరే కారణాలున్నాయంటూ గోల పెట్టేవి.ఇదే ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తప్పు బడుతూ కథనాలు రాసేది. అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే కేంద్ర ప్రతిపాదనను మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. మంత్రులంతా ఏకగ్రీవంగా సెకీతో ఒప్పందానికి అంగీకారం తెలిపారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. -
కేటీఆర్ పేరు చెప్పలేదు.. చర్లపల్లి జైలు నుంచి పట్నం లేఖ
సాక్షి, హైదరాబాద్: తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అంటూ చర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్‌రెడ్డి లేఖ రాశారు. లగచర్ల దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌పై ఆయన స్పందిస్తూ.. కేటీఆర్ గురించి పోలీసులకు నేనేమీ చెప్పలేదు. పోలీసులు నా గురించి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు, నేను ఎవరి పేరు చెప్పలేదు. చెప్పనిది చెప్పినట్లు రాశారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.నిన్న రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు చేర్చిన పోలీసులు.. దాడి వెనుక కేటీఆర్ ఉన్నట్లు నరేందర్‌రెడ్డి అంగీకరించాడంటూ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కాగా, బెయిల్ కోరుతూ వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, నరేందర్‌రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఏడు రోజులు కస్టడీకి ఇవాలని పోలీసులు కోరారు.ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్‌లో నాటకీయంగా అరెస్టు చేసిన నరేందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరచడం, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడం, పోలీసులు ఆయన్ను జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పేరును నరేందర్‌రెడ్డి ప్రస్తావించారంటూ రిమాండ్ రిపోర్టులో పేర్కొనడంలో కలకలం రేపింది. నరేందర్‌రెడ్డిని కేటీఆర్ స్వయంగా ప్రోత్సహించినట్లుగా దర్యాప్తులో వెల్లడైందని... ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లగచర్లలో దాడి చేసినట్లుగా గుర్తించిన 46 మందిలో 19 మందికి భూములు లేవని తేలిందని ఐజీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: ‘సెగ’చర్ల.. నరేందర్‌రెడ్డి అరెస్టు.. టార్గెట్ కేటీఆర్? -
అమోయ్‌కుమార్ ‘భూ’ కేసుల విచారణలో కొత్త ట్విస్ట్
సాక్షి,హైదరాబాద్: ఐఏఎస్ అమోయ్‌కుమార్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుల విచారణలో కీలక మలుపు తిరిగింది.నాగారం ల్యాండ్ స్కామ్ ఈడీ పోలీసుల నుంచి సమాచారం తీసుకుంది. అమోయ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై వివరాల కోసం తెలంగాణ డీజీపీకి తాజాగా ఈడీ లేఖ రాసింది.భూ అక్రమాలపై ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు వచ్చాయని లేఖలో డీజీపీకి ఈడీ తెలిపింది. ఈడీ లేఖకు తెలంగాణ డీజీపీ స్పందించారు. నాగారం తో పాటు పలు కేసులకు సంబంధించిన వివరాలను ఈడీకి అందజేశారు. ఈడీకి చేరిన శంకరాహిల్స్ సొసైటీ, బాలసాయిబాబా ట్రస్ట్, నాగారం,రాయదుర్గం ల్యాండ్ల వివరాలిచ్చారు.పోలీసుల నుంచి వివరాలు రావడంతో ఈడీ విచారణ వేగవంతం చేయనుంది.ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. ప్రభాకర్‌రావుకు గ్రీన్‌కార్డు..? -
తాతలు ఉత్తరాలు బట్వాడా చేసేవారని..
బహ్రాయిచ్ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి అత్యంత విచిత్రమైన రీతిలో పొట్టపోసుకుంటున్నాడు. జిల్లాకు చెందిన సురేష్ కుమార్ గత 40 ఏళ్లుగా పోస్ట్‌మ్యాన్ రూపంలో ఇంటింటికీ తిరుగుతున్నాడు. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ, తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఈ వింత పంథాను ఎంచుకున్నాడు. తన తాత, ముత్తాతల కాలం నుంచి తమ కుటుంబంలోని వారు ఉత్తరాలు బట్వాడా చేసేవారని సురేష్ కుమార్ మీడియాకు తెలిపారు. పూర్వంరోజుల్లో అతని పూర్వీకులు బ్రిటీష్ వారికి ఉత్తరాలు అందజేసేవారట. ఇప్పుడు సురేష్ పోస్ట్‌మ్యాన్ గెటప్‌తో అందరినీ పలుకరిస్తున్నాడు. దీనికి ప్రతిఫలంగా వారు ఏది ఇచ్చినా తీసుకుంటూ, దానితో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.సురేశ్ ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పోస్ట్‌మ్యాన్ వేషధారణతో తిరుగుతుంటాడు. ఇంటింటికీ వెళ్లి మీ పేరు మీద ఉత్తరం వచ్చిందని వారికి చెబుతుంటాడు. వారు తొలుత అతనిని పోస్ట్‌మ్యాన్‌గా భావిస్తారు. తరువాత విషయం తెలుసుకుని, ఆనందంగా తమకు తోచినంత సురేష్‌కు ముట్టజెపుతుంటారు.స్థానికులు అతనిని పోస్ట్‌మ్యాన్ అని పిలుస్తుంటారు. సురేష్ కుమార్ పోస్ట్‌మ్యాన్ యూనిఫాం ధరించి, తలపై టోపీ పెట్టుకుంటాడు. అలాగే కళ్లద్దాలు కూడా పెట్టుకుంటాడు. చేతిలో వైర్లెస్ వాకీ-టాకీ కూడా ఉంటుంది. ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలుగొందిన ఈ వృత్తిని అనుకరిస్తూ సురేష్ కుమార్ పొట్టపోసుకోవడం విశేషమే మరి.ఇది కూడా చదవండి: ఆ పేరుతో సర్టిఫికెట్ మార్చి ఇస్తాం -
ఉద్యోగం కోసం పాత పద్దతి.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
సాధారణంగా ఉద్యోగం కోసం అప్లై చేయాలంటే.. ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు. టెక్నాలజీ బాగా పెరిగిన తరుణంలో జాబ్ కోసం లెటర్స్ పంపించడం వంటివి ఎప్పుడో కనుమరుగైపోయాయి. కానీ ఇటీవల ఓ వ్యక్తి ఉద్యోగం కోసం లెటర్ పంపించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఏఐను ఉపయోగించి రెజ్యూమ్‌లు తయారు చేస్తున్న ఈ కాలంలో.. ఒక వ్యక్తి పోస్ట్ ద్వారా డిజైనర్ ఉద్యోగానికి అప్లై చేస్తూ ఓ లెటర్ రాసి స్విగ్గీ డిజైన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 'సప్తర్షి ప్రకాష్'కు పంపించారు. లేఖను అందుకున్న తరువాత ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. లెటర్ ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఫోటోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. భౌతికంగా ఒక లేఖను స్వీకరించాను. డిజిటల్ యుగంలో స్కూల్ డేస్ గుర్తు చేశారు. ప్రస్తుతం డిజైనర్ ఉద్యోగానికి సంస్థలో ఎటువంటి ఓపెనింగ్స్ లేదు. కానీ దయ చేసిన నాకు ఈమెయిల్ చేయండి. నేను మీ ఆలోచనను చూడాలనుకుంటున్నాను. డిజైన్ ఓపెనింగ్స్ గురించి ఎవరికైనా తెలిస్తే.. తెలియజేయండి అంటూ స్విగ్గీ డిజైన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లలో కొందరు ఉద్యోగార్ధుల సృజనాత్మకత & నిబద్ధతను తెగ పొగిడేస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో కాగితాన్ని ఉపయోగించి ఉద్యోగానికి పోస్ట్ చేయడం.. చూడటానికి రిఫ్రెష్‌గా ఉందని ఒకరు వెల్లడించారు. ఇలా ఒక్కొక్కరు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.Received a physical letter from a designer wanting to join @Swiggy with a concept. In a digital age, this old-school approach stood outTo the sender: We may not have a role now, but please email me—I’d love to see your idea! 😄If anyone knows of design openings, please share! pic.twitter.com/WSGDaX0fsP— Saptarshi Prakash (@saptarshipr) October 30, 2024 -
‘ఈ క్షణంలో జీవించటం నేర్చుకో’.. ! మనీషాకు యువరాణి రాసిన మందు చీటీ
మందు మనిషి మీద పనిచేస్తే, మాట మనసు మీద పనిచేస్తుంది. ’మందు చీటీ’ వంటిదే ఒక మంచి మాట. చికిత్స తీసుకుంటున్నప్పుడు.. ‘నీకు తప్పక నయం అవుతుంది‘ అనే మాట ఎలాగైతే దివ్యౌషధంలా మనసుపై పని చేస్తుందో, కోలుకుని తిరిగి వచ్చాక ‘వెల్డన్ ఛాంపియన్‘ అనే మాట కూడా గొప్ప సత్తువను, ఉత్సాహాన్ని ఇస్తుంది.వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ నుంచి మనీషా కోయిరాలాకు ఇటీవల ఒక ఉత్తరం వచ్చింది! ‘కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారిలో మీరూ ఒకరని నాకు తెలిసింది. చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి మీరు మునుపటిలా మీ ప్రొఫెషన్ ని కొనసాగించటం, చారిటీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనటం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుంది..‘ అని ఆ ఉత్తరంలో రాశారు కేట్. యువరాణి కేట్ మిడిల్టన్ కూడా కేన్సర్ నుంచి బయట పడినవారే! ప్రివెంటివ్ కీమోథెరపీతో ఆమె ఈ ఏడాదే కేన్సర్‌ను జయించారు.యువరాణి రాసిన ఉత్తరం మనీషాకు తన జీవిత లక్ష్యాలలో మరింతగా ముందుకు సాగేందుకు అవసరమైన మానసిక బలాన్ని ఇచ్చింది. ‘నేను ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు కూడా కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న వారు నాకు ధైర్యాన్ని ఇస్తూ మాట్లాడ్డం నన్ను త్వరగా కోలుకునేలా చేసింది. ఈ విషయంలో (క్రికెటర్) యువరాజ్ సింగ్ కి, (నటి) లీసా రే కి నేను కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్లలాగే ఇతరులకు ధైర్యం చెప్పటం, నయం అవుతుందని నమ్మకం ఇవ్వటం ఇక పై నా వంతు... ‘ అంటున్నారు మనీషా.నాల్గవ స్టేజ్‌లో ఉండగా 2012 లో మనీషా లో ఒవేరియన్ కేన్సర్ ను గుర్తించారు వైద్యులు. ఐదేళ్ల చికిత్స తర్వాత 2017 లో మనీషా కేన్సర్ నుంచి బయటపడ్డారు. అప్పటి నుంచీ ఇండియా, నేపాల్ దేశాలలో కేన్సర్ కేర్ కోసం పని చేస్తున్నారు. ‘యువరాణి వంటి ఒక గొప్ప వ్యక్తి నాకు వ్యక్తిగతంగా ఇలా లేఖ రాయటం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కేన్సర్ బాధితుల కోసం నేను చేస్తున్న పనికి మరింతగా శక్తిని ఇచ్చింది‘ అంటున్న మనీషా, కేన్సర్ తనకొక పెద్ద టీచర్ అని చెబుతున్నారు.‘కేన్సర్ నన్నెంతగా బాధించినప్పటికీ ఎంతో విలువైన జీవిత పాఠాలను కూడా నేర్పింది. ’ఆశను కోల్పోకు, మంచి జరుగుతుందని నమ్ము. ఈ క్షణంలో జీవించటం నేర్చుకో. నీకు సంతోషాన్నిచ్చేవి ఏవో కనిపెట్టు..’ అని ఆ టీచర్ నాకు చెప్పింది..‘ అంటారు మనీషా.. కేన్సర్ గురించి. -
చట్టపరమైన చర్యలకు వెనుకాడం: ఈసీపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు సమయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలు బాధ్యతారారహిత్యమైనవని తెలిపింది. తమకు ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో కాంగ్రెస్ నిరాధార అరోపణలు చేస్తోందని మండిపడింది. ఇలాంటి పనికిమాలిన ఫిర్యాదులు చేసే ధోరణిని అరికట్టేలా పార్టీ చర్యలు తీసుకోవాలని సూచించింది.ఈసీ సమాధానంపై తాజాగా కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల సంఘం తరుచూ కాంగ్రెస్ పార్టీని, పార్టీ నతేలను టార్గెట్ చేసుకొని దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఇలాంటి వ్యాఖ్యలే కొనసాగిస్తే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ ఈసీకి లేఖ రాసింది. సమస్యలను తెలియజేసేందుకు మాత్రమే భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, అంతేగానీ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ కార్యాలయాన్ని గౌరవిస్తున్నామని పేర్కొంది. కానీ ఎన్నికల సంఘం సమాధానాలు మాత్రం మరోలా ఉంటున్నాయని తెలిపింది. తన స్వతంత్రతను పూర్తిగా పక్కనపెట్టడమే ప్రస్తుతం ఈసీ లక్ష్యంగా పెట్టుకుందని, ఆ విషయంలో ఎన్నికల సంఘం అద్భుతమైన పనితీరు చూపుతోందని విమర్శలు గుప్పించింది. ‘ఎన్నికల సంఘం తమకు తాను క్లీన్ చిట్ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఈసీ స్పందన, వాడిన భాష, పార్టీపై చేసిన ఆరోపణలు వంటి అంశాలు మేము తిరిగి లేఖ రాసేందుకు కారణమయ్యాయి. ఎన్నికలు, ఫలితాలపై లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడం ఎన్నికల సంఘం బాధ్యత. అయితే తన విధిని ఈసీ మరిచిపోయినట్లు అనిపిస్తోంది. ఈసీ స్పందన కాంగ్రెస్ పార్టీపై, నాయకులపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసీ ఇదే తరహా భాషను కొనసాగిత్తే.. అలాంటి వ్యాఖ్యలను తొలగించేందుకు న్యాయపరమైన ఆశ్రయం పొందడం తప్ప తమకు మరో మార్గం లేదు’ లేఖలో తీవ్రంగా స్పందించింది. ఈ లేఖపై కేసీ వేణుగోపాల్, అశోక్ గహ్లోత్, అజయ్ మాకెన్ సహా తొమ్మిది మంది సీనియర్ నేతలు సంతకం చేశారు. -
'మీ లేఖ నాలో ధైర్యాన్ని నింపింది'.. ప్రధానికి హీరో రిప్లై!
కన్నడ హీరో కిచ్చా సుదీప్ పీఎంవో నుంచి వచ్చిన లేఖపై స్పందించారు. ఇలాంటి కష్ట సమయంలో అండగా నిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మీ లేఖ నాలో ధైర్యాన్ని నింపిందని కిచ్చా సుదీప్ ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.కాగా ఇటీవల కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మాతృమూర్తి సరోజా సంజీవ్ (86) కన్నుమూసింది. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ పీఎంవో నుంచి లేఖ కూడా వచ్చింది. తాజాగా ఆ లేఖకు హీరో సుదీప్ రిప్లై ఇచ్చారు. Honarable @PMOIndia @narendramodi ji, I am writing to sincerely thank you for this compassionate condolence letter. Your thoughtful words provide a source of comfort during this profoundly difficult time.Your empathy has touched my heart deeply, and I am truly grateful for your… pic.twitter.com/u4aeRF8Sw3— Kichcha Sudeepa (@KicchaSudeep) October 28, 2024 -
చెల్లిపై అపారమైన ప్రేమ కనిపిస్తుందా?.. లేక మోసం చేయాలని ఉద్దేశం ఎక్కడైనా కనిపిస్తుందా?
-
సజ్జనార్ సార్.. ఆ స్టూడెంట్స్ బాధ చూడుండ్రి
-
జవాన్ కుటుంబాన్ని ఆదుకోండి.. చంద్రబాబుకు అవినాష్ రెడ్డి లేఖ
-
పరీక్షలను రీషెడ్యూల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నష్టం కలిగేలా రూపొందిన జీవో 29ను వెంటనే ఉపసంహరించుకోవాలని, గ్రూప్–1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెల్లవారితే పరీక్ష అని తెలిసి కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారంటే.. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని లేఖలో కోరారు. నిరుద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి, వారి డిమాండ్ మేరకు మార్పులు చేయాలన్నారు.జీవో 29 వల్ల 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హులయ్యారని.. 563 పోస్టులకు గుండుగుత్తగా 1ః50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం అన్యాయమని సంజయ్ పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించిన రిజర్వ్డ్ అభ్యర్థులను.. రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తుండటాన్ని గుర్తించాలని లేఖలో కోరారు. అసలు రిజర్వేషన్లనే రద్దు చేస్తున్నారన్న చర్చకు ఈ జీవో దారితీసిందని పేర్కొన్నారు. -
మాల్స్ కట్టి పెద్దలకు ధారాదత్తం చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బ్యూ టిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నిలదీశారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు.మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? డీపీఆర్ ఉందా? ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? రూ. కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి రూ. 2 వేల కోట్లు, నమోగంగ ప్రాజెక్ట్‌కి 12 ఏళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు రూ. లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని ఈటల సీఎంను డిమాండ్ చేశారు.స్టేజీల మీద ప్రకటనలు చేయడం కాకుండా ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం పెడితే తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధమన్నారు. ఈ విషయాలపై స్పష్టత వచ్చే వరకు తన ప్రతిఘటన ఉంటుందని తెలిపారు. -
రుణమాఫీపై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులతోపాటు మొత్తం దేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 లక్షల పంట రుణాలను విజయవంతంగా మాఫీ చేసినట్టు మోసపూరిత వైఖరిని దేశవ్యాప్తంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిని ఎండగడుతూ హరీశ్‌రావు ఆదివారం బహిరంగలేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించే విధానాలను అనుసరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని దేశ ప్రజల దృష్టికి తెచ్చేందుకు లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. లేఖలో ఏముందంటే.... ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2023 డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. హామీని నిలబెట్టుకోని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో రుణమాఫీ గడువును ఈ ఏడాది ఆగస్టు 15 వరకు పెంచింది. కానీ రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా జరిగిందని సీఎం రేవంత్ చేసిన ప్రకటన పూర్తి అబద్ధమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రూ.లక్ష లోపు రుణం 2.99 లక్షల మందికి, రూ.లక్షన్నర లోపు 1.30లక్షల మందికి, రూ.2లక్షల వరకు 65,231 మందికి మాత్రమే మాఫీ అయ్యింది. ఎస్బీఐ సమాచారం ప్రకారం 50 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు. ఇతర బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి. రూ.2లక్షలకు పైబడి చెల్లించినా... రూ.2 లక్షలకు పైగా రుణం ఉంటే రైతులు పైబడిన మొత్తాన్ని చెల్లిస్తే రూ.2 లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుందని హామీ ఇచ్చింది. రైతులు ఈ మొత్తాన్ని చెల్లించినా రుణమాఫీ జరగలేని ఎస్బీఐ స్పష్టం చేసింది. మరోవైపు చాలా మంది రైతులు సీఎం మాటను నమ్మి పంట రుణమాఫీకి అర్హత కోసం ప్రైవేట్ రుణాలు అధిక వడ్డీకి తీసుకున్నారు. అయితే రుణమాఫీకి ప్రభుత్వం 31 రకాల షరతులు పెట్టి రైతులను అనర్హులుగా చేశారు. బీఆర్ఎస్ పాలనలో రైతుబంధు ద్వారా రూ.72వేల కోట్లు ఇచ్చాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దసరా ఇది. ఈ ఖరీఫ్ పంటకు సంబంధించిన పంట పెట్టుబడి సాయం ఇప్పటికీ ఇవ్వలేదు’అని హరీశ్‌రావు తన లేఖలో పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కింద ఎస్బీఐ ఇచి్చన వివరాలు, రూ.2 లక్షలకు మించిన రుణాన్ని చెల్లించిన రైతుల బ్యాంకు రశీదులను లేఖకు జత చేశారు. కాంగ్రెస్ మోసాలను అలయ్ బలయ్‌లో చర్చించండి దసరాకు గ్రామాలకు వస్తున్న కుటుంబసభ్యులు, స్నేహితులతో అలయ్ బలయ్ తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి చర్చించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలును పక్కన పెట్టడంతోపాటు వృద్ధులకు ఆసరా పెన్షన్ కూడా పెంచలేదన్నారు. రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమలు నిలిచిపోయిందని, ధాన్యం బోనస్ బోగస్‌గా మారిందని చెప్పారు. ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతికి అతీగతీ లేదన్నారు. -
27 రోజుల్లో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతాంగానికి రూ. 2లక్షల రుణమాఫీ ప్రక్రియను మాట ఇచ్చిన ప్రకారం పూర్తి చేశామంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ లో ఆ వివరాలను ప్రస్తావించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు మాఫీ చేయలేదని, ఇలాంటి మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దంటూ వ్యా ఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ లేఖను ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.కాంగ్రెస్ హామీ అంటే బంగారు హామీ అని తెలంగాణ రైతులు నమ్మారని, అలాంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రుణమాఫీ చేసి దేశానికి కొత్త పంథా చూపెట్టామని ఎక్స్‌లో పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ అభివృద్ధికి భవిష్యత్‌లో కేంద్రం నుంచి తగిన సహకారం అందించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరారు. లేఖలో ఏం రాశారంటే...!ప్రధాని మోదీకి రాసిన లేఖలో మూడు దఫాలు గా రైతు రుణమాఫీని తెలంగాణలో అమలు పరిచిన తీరును సీఎం రేవంత్ వివరించారు. ఈ ఏడాది జూలై 18న రూ.లక్ష లోపు రుణమాఫీకి సంబంధించి 11,34,412 రైతు ఖాతాల్లో రూ. 6,034.97 కోట్లు జమ చేశామని, జూలై 30న రూ.1.50 లక్షలలోపు మాఫీ కోసం 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6,190.01 కోట్లు జమ చేశామని, ఆగస్టు 15వ తేదీన రూ.2లక్షల వరకు మాఫీ కోసం 4,46,832 మంది ఖాతాల్లో రూ. 5,644.24 కోట్లు జమ చేశామని వెల్లడించారు.మొత్తం కేవలం 27 రోజుల వ్యవధిలో రూ.17,869.22 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు ఆ ఎక్కువ ఉన్న రుణాన్ని బ్యాంకుల్లో కడితే రూ. 2 లక్షలు ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధంగా ఉందని, ఈ ప్రక్రియను కూడా నిర్ణీత గడువులో పూ ర్తి చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లో పారదర్శకత కోసం అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని, అప్పు ల ఊబి నుంచి రైతులను విముక్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ పూర్తి చేశామని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వెల్లడించారు. -
అవినీతి మానేసి హామీలపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు హితవు పలికారు. మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు.ఈ మేరకు సీఎం రేవంత్‌కు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు. గత సీజన్లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.రైతు భరోసా సంగతి తేల్చండి: వానాకాలం సీజన్ పూర్తయినా ప్రభు త్వం రైతు భరోసా సంగతి తేల్చడం లేదని కేటీఆర్ లేఖలో మండిపడ్డారు. రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామనే హామీని విస్మరించిందని, నేటికీ రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని దుయ్యబట్టారు. రైతులకు బాకీ పడిన రైతు భరోసాను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 100 శాతం రుణమాఫీ చేస్తామని ప్రకటించినా 20 లక్షల మంది రైతులకు నేటికీ మాఫీ వర్తించలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా రైతులకు మేలు జరగట్లేదని.. రేవంత్ చేతకానితనం అన్నదాతలకు శాపంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
నా ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపండి
సాక్షి, హైదరాబాద్: తన ఫామ్‌హౌస్‌లోని ఏ కట్టడమైనా ఒక్క అంగుళం ఎఫ్టీఎల్ లేదా బఫర్‌జోన్‌లో ఉన్నా సొంత ఖర్చులతో కూల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు ప్రక టించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నాకు చట్టం నుంచి ఏ మినహాయింపులు వద్దు. ఒక సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏవిధంగా వ్యవహరిస్తుందో, అదే విధంగా వ్యవహరిస్తే చాలు. ఎక్కువ–తక్కువలు అవసరం లేదు.మీరు, నేను కలగజేసుకోకుండా చట్టాన్ని తన పని చేసుకుపోనిద్దాం’’అని పేర్కొంటూ శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి కేవీపీ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డపేరు తేవడానికి తనలో నరనరాన ఉన్న కాంగ్రెస్ రక్తం అంగీకరించనందునే ఈ బహిరంగ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత గల కాంగ్రెస్ కార్యకర్తగా ప్రాంతాలకు అతీతంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ బలోపేతానికి తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. మూసీ ప్రక్షాళనను స్వాగతిస్తున్నా.. హైదరాబాద్ శివార్లలోని అజీజ్‌నగర్‌లో ఉన్న తన ఫామ్‌హౌస్‌కు సంబంధిత అధికారులను పంపాలని.. వారు చట్టప్రకారం మార్క్ చేస్తే ఆ పరిధిలో కట్టడాలేవైనా ఉంటే 48 గంటల్లో కూల్చి, ఆ వ్యర్థాలను కూడా తొలగిస్తానని కేవీపీ లేఖ లో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి భారం పడనివ్వబోనని తెలిపారు. అయితే మార్కింగ్ ప్రక్రి య పారదర్శకంగా జరగాలని.. తేదీ, సమయాన్ని ముందే ప్రకటిస్తే ప్రతిపక్ష నాయకులు కూడా తీరిక చేసుకుని వచ్చి వీక్షించే అవకాశం కలుగుతుందని వెల్లడించారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు వారి స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే మాట్లాడుతున్నారని, వారిది మొసలి కన్నీరని విమర్శించారు.‘‘బీఆర్ఎస్, బీజేపీ నేతలు మీ భుజంపై తుపాకీ పెట్టి నన్ను కాల్చాలని, తద్వారా మిమ్మల్ని ఇరుకున పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారు కాంగ్రెస్ సీఎంపై నిరాధార ఆరోపణలు చేయడానికి నన్ను, మా ఫామ్‌హౌస్‌ను పావుగా వాడుకోవడం మనోవేదన కలిగిస్తోంది. నేను కాంగ్రెస్‌లో క్రమశిక్షణ గల కార్యకర్తను. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా సమరి్థస్తాను. ఈ విషయాన్ని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరమే అయినా తప్పడం లేదు’’లేఖలో కేవీపీ పేర్కొన్నారు. -
తప్పని తేలితే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కి కేవీపీ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఫాంహౌస్ చట్టప్రకారమే నిర్మించానని.. నిర్మాణం అక్రమమని తేలితే సొంత ఖర్చులతో కూల్చేస్తానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉంటే మార్క్ చేయండి. ఫాంహౌస్‌కు అధికారులను పంపించాలంటూ సీఎం రేవంత్‌కు లేఖ రాశారు.మూసీ బఫర్ జోన్ లో నా ఫాం హౌజ్ వస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే అధికారులను పంపి సర్వే చేయించండి. నా ఫాం హౌజ్ బఫర్ జోన్లో ఉంటే 48 గంటల్లో నా సొంత ఖర్చులతో కులగొడతాను. మార్కింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని నా కోరిక. మార్కింగ్ తేదీ, సమయం ముందే ప్రకటించాలి. సర్వే చేసేటప్పుడు నాపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు, వారి అనుకూల మీడియాను తీసుకొచ్చి సర్వే చేయించండి’’ అని కేవీపీ లేఖలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: మంత్రి సురేఖ వ్యాఖ్యలు స్థాయికి తగ్గవి కాదు -
దయచేసి 'మా' వ్యక్తిగత జీవితాలతో ఆడుకోవద్దు: మంచు విష్ణు లేఖ
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. సినిమా వాళ్లపై ఇలాంటి కామెంట్స్ చేయడం దురదృష్టకరమన్నారు. సినీ పరిశ్రమ పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుందని తెలిపారు. రాజకీయ లాభాల కోసం వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయడం నిరాశ కలిగించిందన్నారు. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటామని.. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతమని మా తరఫున మంచు విష్ణు నోట్ విడుదల చేశారు.'సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో.. వాటివల్ల కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని భావిస్తున్నా. మన పరిశ్రమ కూడా ఇతర రంగాల్లాగే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. నిజం కాని కథనాలను రాజకీయ లబ్ధి కోసం వాడటం చాలా నిరాశను కలిగించింది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం.. కానీ మా కుటుంబాలు మాత్రం వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం.. వారి వ్యక్తిగత జీవితాలపై అబద్ధపు ఆరోపణలు రావాలని ఇష్టపడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం.'నోట్లో ప్రస్తావించారు.(ఇది చదవండి: నేను షాకయ్యా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్)'రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి రాజకీయాల కోసం, ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా సినిమాకు చెందిన వారి పేర్లు, కుటుంబాల పేర్లు వాడకండి. చిత్రపరిశ్రమలో పనిచేసేవారు వినోదం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నారు. మా వ్యక్తిగత జీవితాలను ప్రజాక్షేత్రంలోకి లాగొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా.. మనుషులుగా కూడా మన కుటుంబాలపై వచ్చే అబద్ధపు కథనాల వల్ల కలిగే బాధ చాలా తీవ్రమైంది. ఇలాంటి సంఘటనల బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిద్దాం. సినీ ఇండస్ట్రీ తరపున మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. అవసరమైతే మేమంతా ఏకమై నిలబడతాం' అంటూ లేఖ విడుదల చేశారు. Official Statement from Movie Artists Association (MAA) pic.twitter.com/vc4SWsnCj6— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2024 -
రాజస్థాన్‌లో హై అలర్ట్.. రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపులు
జైపూర్: దేశంలో రోజూ ఎక్కడో ఓ చోట బాంబు బెదిరింపు వస్తూనే ఉంది. స్కూళ్లు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు ఇలా దేన్నీ వదలకుండా ఫోన్లు, మెయిళ్లు, లేఖల ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని పలు రైల్వేస్టేషన్లకు బుధవారం(అక్టోబర్2) బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించారు.రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జంక్షన్‌లోని స్టేషన్ సూపరింటెండెంట్‌కు గుర్తుతెలియని నుంచి ఓ లేఖ వచ్చింది. లేఖ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉంది. బికనీర్, శ్రీరంగానగర్, జోధ్‌పుర్, బుందీ, కోట, జైపూర్, ఉదయర్‌పుర్ సహా పలు రైల్వేస్టేషన్లలో బాంబు దాడులు జరగనున్నాయనేది లేఖ సారాంశం.లేఖ చదవిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. బీఎస్ఎఫ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలు రైల్వేస్టేషన్లను జల్లెడ పట్టాయి. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: పుణెలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి -
వారి బతుకులు ఏమైపోవాలి?.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని.. ప్రభుత్వాలే అనుమతులిచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఏమైపోవాలి?. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులు తప్పు అని హైడ్రా ఎలా చెబుతుంది. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’’ అని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘హైడ్రా దూకుడు పేదలపై కాకుండా బాధితులతో చర్చించండి. ఇతర భాగస్వామ్య పక్షాలను పరిగణనలో తీసుకోండి. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కార్ కూల్చివేస్తే వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి. అక్రమంగా భూములు అమ్మిన వారిని బాధ్యులను చేయాలి. రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రోడ్డున పడేస్తే వాళ్ల బతుకులు ఏమైపోతాయి.’’ అంటూ లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘పాలకుల, అధికారుల అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజల నుంచి దళారులు దోచుకున్నారు. అన్ని అనుమతులున్న భవనాలను నేలమట్టం చేయడం బాధకరం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చే అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా నిర్ణయిస్తుంది. మూసీ పరివాహ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేలాది మంది జీవనోపాధి ఇక్కడే ఉంటుంది. దుందుడుకు విధానాలతో ముందుకు వెళ్లవద్దు’’ అని లేఖలో రేవంత్‌కు కిషన్‌రెడ్డి సూచించారు.ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!బ్యాంకులకు, బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు రుణ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవద్దు. కూల్చివేతలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారని లేఖలో పేర్కొన్న కిషన్‌రెడ్డి.. ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలితో గందరగోళానికి గురవుతున్నారన్నారు. అధికారులు ఎలాంటి ప్రకటనలు జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని కిషన్‌రెడ్డి కోరారు. మీరు తీసుకునే నిర్ణయం అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని సీఎంకు కిషన్‌రెడ్డి సూచించారు.‘‘ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందని పక్షంలో అవకాశం ఉన్నచోట పేదలు తమ కష్టాన్ని దారబోసి ఇళ్లను నిర్మించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన మోసానికి గురయ్యారు. సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను మేం సమర్థించం. ఆక్రమణలపై, ఆక్రమ నిర్మాణాలపై చట్టబద్దంగా, న్యాయబద్దంగా చర్యలు ఉండాలన్నదే మా ఉద్దేశ్యం. హడావుడి చేసి, నిత్యం వార్తల్లో ఉండేందుకే ప్రభుత్వం అక్రమ నిర్మాణాల కూల్చివేత’’ అంటూ లేఖలో కిషన్‌రెడ్డి నిలదీశారు. -
ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ లేఖ
-
ప్రధానికి మమత మరో లేఖ.. కేంద్రంపై ఆరోపణలు
కోల్‌కతా:పశ్చిమబెంగాల్ వరదలపై సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. వరదల కారణంగా రాష్ర్టంలో 50లక్షల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారని లేఖలో తెలిపారు.వారిని ఆదుకునేందుకుగాను కేంద్రం వెంటనే నిధులివ్వాలని లేఖలో కోరారు.తమ అనుమతి లేకుండా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ) రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో అనేక జిల్లాలు నీట మునిగాయన్నారు. ఈ విషయమై ప్రధానికి మమత రాసిన తొలి లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ స్పందించారు. డీవీసీ రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలపై ప్రతి దశలోనూ రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చామని వివరణ ఇచ్చారు.దీనిపై బెనర్జీ స్పందిస్తూ డ్యామ్‌ల నుంచి నీటి విడుదల దామోదర్ వ్యాలీ రిజర్వాయర్ రెగ్యులేషన్ కమిటీ అనుమతి, సహకారంతో జరుగుతుంది. నీటి విడుదలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సంప్రదించాలి కానీ వారు అలా చేయలేదు. అన్ని కీలక నిర్ణయాలను కేంద్రం ఆధ్వర్యంలోని శాఖలు ఏకపక్షంగా తీసుకున్నాయి. రాష్ట్రప్రభుత్వానికి ఎటువంటి నోటీసులు లేకుండా నీరు విడుదల చేశారని తప్పుపట్టారు.నీటి విడుదలకు కొద్ది గంటల ముందు సమాచారం ఇవ్వడంతో రక్షణ చర్యలు చేపట్టడం కుదరలేదని విమర్శించారు. -
వాస్తవాలు నిగ్గు తేల్చాలి.. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ
సాక్షి,తాడేపల్లి: తన రాజకీయాల కోసం చంద్రబాబు.. టీటీడీ ప్రతిష్టను దిగజార్చారంటూ ప్రధాని మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు.‘‘స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు. సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారు. టీటీడీ సాంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా మాట్లాడారు. టీడీపీ ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు బుద్ది చెప్పాలి’’ అని లేఖలో వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.‘‘లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి.. వాస్తవాలు నిగ్గు తేల్చాలని ప్రధానికి లేఖ రాశారు.(లేఖ పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘అహ్మద్‌కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్‌పై పోలీసులకు ఫిర్యాదు
ఛతర్పూర్: మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్‌ను ‘లవ్ జిహాద్’గా పేర్కొంటూ, ఎన్సీఈఆర్టీపై పలు ఆరోపణలు గుప్పిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితేడాక్టర్ రాఘవ్ పాఠక్ కుమార్తె ఎన్సీఈఆర్టీ బోర్డు పాఠ్యాంశాలు బోధించే పాఠశాలలో హిందీ మీడియంలో మూడవ తరగతి చదువుతోంది. ఆ చిన్నారికి సంబంధించిన పర్యావరణ సబ్జెక్ట్‌లోని 17వ లెసన్ ‘చిట్టీ ఆయీ హై’ పేరుతో ఉంది. ఇందులో రీనా అనే అమ్మాయి తన స్నేహితుడైన అహ్మద్‌ను సెలవుల్లో అగర్తలాకు రమ్మని ఆహ్వానిస్తూ లేఖ రాస్తుంది. ఈ లేఖ చివరిలో ‘నీ రీనా’ అని రాస్తుంది. దీనిని గుర్తించిన డాక్టర్ రాఘవ్ పాఠక్ ఈ లెసన్ ‘లవ్ జిహాద్’ మాదిరిగా ఉందని ఆరోపించారు. అలాగే ఈ లేఖ లవ్ జిహాద్‌కు ఊతమిస్తుందంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయికి లేఖ రాయడం, పైగా చివరిలో ‘నీ రీనా’ అని రాయడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ లేఖను చదివిన పిల్లల మదిలో లవ్ జిహాద్‌పై ఆకర్షణ పెరుగుతుందని, భవిష్యత్తులో లవ్ జిహాద్ లాంటి ఘటనలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. లవ్ జిహాద్ లాంటి ఘటనలను అరికట్టేందుకు ఒకవైపు ప్రభుత్వం కఠిన చట్టాలు చేస్తుండగా, ఎన్సీఈఆర్టీకి చెందిన ఈ పుస్తకం లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నట్లున్నదని ఆయన ఆరోపించారు.ఈ పుస్తకంలోని 17వ లెసన్‌లో అహ్మద్- రీమా లేఖను తక్షణం మార్చాలని లేదా తొలగించాలని తాను కోరుకుంటున్నానని, తన కుమార్తె ఈ లెసన్ చదివాక ఆమె మనసులో ఎలాంటి తప్పుడు భావన తలెత్తకూడదని భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ విషయమై ఖజురహో పోలీసు అధికారి సునీల్ శర్మ మాట్లాడుతూ ఎన్సీఈఆర్టీ పర్యావరణ పుస్తకంలోని ఒక లెసన్ లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ వచ్చిన ఫిర్యాదును సీనియర్ అధికారులకు పంపినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.ఇది కూడా చదవండి: రైలు పట్టాలపై సిలిండర్.. బయటపడిన మరో కుట్ర -
చంద్రబాబు దుష్ట రాజకీయం .. సుప్రీంకోర్టు సీజేకు జగన్ లేఖ
-
ఖర్గే మోదీకంటే సీనియర్.. అవమానించడం తగదు: ప్రియాంక ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాసిన లేఖకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వకపోవడం పట్ల ప్రియాంక గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖర్గేను ప్రధాని మోదీ అగౌరవపరిచారని, అవమానపరిచారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప సంప్రదాయాన్ని అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకులు పాటించకపోవడం దురదృష్టకరమని అసహనం వ్యక్తం చేశారు.అంతేగాక మోదీకి బదులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందింస్తూ ఖర్గేకు కౌంటర్ లేక రాయడంపై ఆమె మండిపడ్డారు. ‘ఖర్గే ప్రధానమంత్రి కంటే పెద్దవారు. ఆయన్ను మోదీ ఎందుకు అగౌరపరిచారు? ప్రధాని మోదీకి ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం, పెద్దలపై గౌరవం ఉంటే ఆయనే స్వయంగా ఖర్గే ఈ లేఖకు సమాధానమిచ్చేవారు. కానీ అలాకాకుండా నడ్డా ద్వారా ఆయన లేఖ రాయించారు. అందులోనూ ఖర్గేను అవమానపరిచారు. 82 ఏళ్ల సీనియర్ నాయకుడిని అగౌరవపరచాల్సిన అవసరం ఏముంది?ప్రశ్నించడం, సమాధానాలు తెలియజేయడం ప్రజాస్వామ్యంలో భాగం. గౌరవం, మర్యాద వంటి విలువలకు ఎవరూ అతీతులు కాదని మతం కూడా చెబుతోంది. నేటి రాజకీయాలు విషపూరితంగా మారాయి. అయితే ప్రధాని తన పదవికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకొని దీనికి భిన్నమైన ఉదాహరణను చూపాలి. ప్రధాని తమ పదవికి ఉన్న స్థాయిని దృష్టిలోపెట్టుకొని సీనియర్ నాయకుడికి సమాధానం ఇచ్చి ఉంటే ఆయనకు విలువ ఉండేది. ఆయనపై గౌరవం పెరిగేది. ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న నాయకులు ఈ గొప్ప సంప్రదాయాలను తిరస్కరించడం దురదృష్టకరం’ అని ప్రియాంక మండిపడ్డారు.కాగా ఇటీవల బీజేపీ నేతలు, ఎన్డీఏ మిత్రపక్షాలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మోదీకి ఖర్గే లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖ రాశారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ రాహుల్ గాంధీని విఫల నాయకుడిగా అభివర్ణించారు.గతంలో రాహుల్ ప్రధానిని ఇదేవిధంగా అవమానపరచలేదా? అని ప్రశ్నించారు. ‘మోదీపై సోనియాగాంధీ ‘మృత్యుబేహారీ’ అని అవమానకర వ్యాఖ్యలు చేయలేదా? అప్పుడు కాంగ్రెస్ రాజకీయ నైతికతను మరిచిపోయిందా? గత ఐదేళ్లలో ప్రధానిని మీ నేతలు 110 సార్లు అవమానించారు. ఎన్నికల్లో విజయం సాధించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడిని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తోంది’ అంటూ పేర్కొన్నారు. कुछेक भाजपा नेताओं और मंत्रियों की अनर्गल और हिंसक बयानबाज़ी के मद्देनज़र लोकसभा में विपक्ष के नेता राहुल गांधी के जीवन की सुरक्षा के लिए चिंतित होकर कांग्रेस अध्यक्ष और राज्यसभा में विपक्ष के नेता श्री मल्लिकार्जुन खरगे जी ने प्रधानमंत्री जी को एक पत्र लिखा।प्रधानमंत्री जी की…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 20, 2024 -
రేవంత్ నేరపూరిత వ్యాఖ్యలను అరికట్టండి
సాక్షి, హైదరాబాద్: ‘మాజీ సీఎం చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబ సభ్యులపై సీఎం రేవంత్‌రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్యకర భాష, నేరపూరిత వ్యాఖ్య లపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. రేవంత్ వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ అధిష్టానం ద్వంద్వ వైఖరి అవల ంబిస్తోందన్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్‌కు హరీశ్‌రావు గురు వారం బహిరంగ లేఖ రాశారు. ‘కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. రాహుల్ తీవ్రవాది అంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్.. రేవంత్‌పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఢిల్లీలో ఒక నిబంధన, గల్లీలో మరో నిబంధన అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. రేవంత్ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న రేవంత్‌పై కఠినచర్య లు తీసుకోవాలి’అని హరీశ్ లేఖలో డిమాండ్ చేశారు. రుణమాఫీ కోరితే నిర్బంధిస్తారా? ‘ఆంక్షలు, కంచెలు లేని ప్రభుత్వం, ప్రజాపాలన అంటూ డబ్బాకొట్టుకుంటున్న రేవంత్ ప్రభుత్వం రుణమాఫీ కోరిన రైతులను నిర్బంధిస్తోంది. ప్రజాభవన్ చుట్టూ కంచెలు, ఆంక్షలు ఎందుకు? ప్రజాభవన్‌కు రైతులు తరలివస్తుంటే సీఎం ఎందుకు భయ పడుతున్నారు? రుణమాఫీపై మాట తప్పినందుకు అది రేవంత్ ప్రభుత్వానికి ఉరితాడుగా మారుతుంది’అని హరీశ్‌రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత, ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్‌పై అభ్యంతరకరమైన, హింసాత్మక ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు.బీజేపీ, తమ అనుబంధ పార్టీల నేతలు ఉపయోగించే అసభ్యకరమైన భాష భవిష్యత్తు తరాలకు ప్రమాదకరమని ఖర్గే తెలిపారు. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి సంబంధించిన సమస్యగా పేర్కొన్నారు. ‘బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి, రాహుల్‌ను ‘నంబర్ వన్ టెర్రరిస్ట్’గా పలిచారు. మహారాష్ట్రలోని మీ ప్రభుత్వంలోని ఓకూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే(శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్) రాహుల్ నాలుక కోస్తే వారికి రూ.11 రివార్డును ప్రకటిస్తున్నారు. ఢిల్లీలోని ఓ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాహుల్‌పై దాడి చేస్తామని బహరంగంగా బెదిరిస్తున్నారు.చదవండి:అతిషీ మర్లీనా ‘డమ్మీ సీఎం’: స్వాతి మాలీవాల్భారత సంస్కృతి అహింస, సామరస్యం, ప్రేమకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మన లీడర్లు రాజకీయాల్లో ఈ పాయింట్లను ప్రమాణాలుగా స్థాపించారు. బ్రిటీష్ పాలనలోనే గాంధీజీ ఈ ప్రమాణాలను రాజకీయాల్లో ముఖ్యమైన భాగంగా చేశారు. స్వాతంత్య్రానంతరం పార్లమెంటరీ రంగంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య గౌరవప్రదమైన ఒప్పందాలు కుదిరిన చరిత్ర ఉంది. ఇది భారత ప్రజాస్వామ్య ప్రతిష్టను పెంచడానికి పనిచేసింది.ఈ విషయంపై కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి విద్వేషపూరిత శక్తుల వల్ల జాతిపిత మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది. అధికార పార్టీ ఈ రాజకీయ ప్రవర్తన ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత దారుణమైన ఉదాహరణ. మీ నేతలు వెంటనే హింసాత్మక ప్రకటనలు చేయడం మానేయాలి. ఇందుకు మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు -
‘చరిత్రను తుడిచివేసే ప్రయత్నం’లో భాగస్వామిని కాలేను
సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రను తుడిచివేసే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వామిని కాలేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం ప్రజల దృష్టిని మరల్చడమేనని అన్నారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ‘సెప్టెంబర్ 17న ప్రతిపాదిత ప్రజాపాలనా దినోత్సవం కోసం ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు. అయితే ఇంతటి పవిత్రమైన, స్ఫూర్తిదాయకమైన రోజును, వేలాదిమంది త్యాగాల ఫలితమైన విమోచన దినోత్సవానికి పేరుమార్చి.. చరిత్రలో ఏమీ జరగలేదన్నట్టుగా, పరిపాలన నియంత రాజు నుంచి ప్రజాస్వామ్యానికి మారడం మాత్రమే జరిగిందన్నట్టుగా చెప్పడం వాస్తవ చరిత్ర నుంచి ప్రజల దృష్టిని మరల్చడమేనని అర్థమవుతోంది.దీంతోపాటుగా బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహించినట్టవుతోంది. రజాకార్ల హింసకు వేలమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి ఈ గడ్డపై పుట్టిన బిడ్డగా మీకు తెలుసు. వీరుల వీరోచిత పోరాటం, నిస్వార్థ త్యాగం, హృదయ విదారక పరిస్థితులను ఎదుర్కొనడం, బలిదానం కావడం ఇదే మన తెలంగాణ చరిత్ర. అందుకే సెప్టెంబర్ 17 నాడు.. ఆ వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రస్తుత తరానికి మన పెద్దల ధైర్య, సాహసాలను తెలియజేసి జాతీయభావన కల్పించాల్సిన అవసరం ఉంది. విమోచన చరిత్రను వారికి అందజేయాల్సిన బాధ్యత మనపై ఉంది.అయితే గత కొన్నేళ్లుగా సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ వీరుల త్యాగాలను స్మరించుకునేలా, వారికి ఘనంగా నివాళులు అర్పించేలా.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఘనంగా, అధికారికంగా నిర్వహిస్తోంది. అందుకే వాస్తవ, ఘనమైన తెలంగాణ చరిత్రను ప్రజల çస్మృతిపథం నుంచి తుడిచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో నేను భాగస్వామిని కాలేను.సెప్టెంబర్ 17వ తేదీ.. అత్యంత ప్రాధాన్యం కలిగిన రోజుగా మీరు గుర్తించి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోవడం సంతోషకరం. సమీప భవిష్యత్‌లో వాస్తవాలను అర్థం చేసుకొని ఈ చరిత్రాత్మకమైన రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా గుర్తిస్తారని నేను బలంగా విశ్వసిస్తున్నాను’ అని సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
సికింద్రాబాద్, చర్లపల్లి వద్ద రోడ్ల విస్తరణకు సహకరించండి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టరి్మనల్కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు సోమవారం లేఖ రాశారు. తెలంగాణలో మౌలికవసతుల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించి పదేళ్లుగా ఈ దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి శరవేగంగా సాగుతోందని.. కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్తోపాటు లైన్ల విద్యుదీకరణ పనులు, 40కిపైగా స్టేషన్ల అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.ఇందులో భాగంగా సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లిలో రూ. 415 కోట్లతో కొత్త రైల్వే టరి్మనల్ నిర్మాణం కూడా వేగంగా పూర్తవుతోందన్నారు. చర్లపల్లి రైల్వే టరి్మనల్ ప్రారంభోత్సవానికి ప్రత్యక్షంగా హాజరై ప్రజలకు అంకితం చేసేందుకు ప్రధాని మోదీ అంగీకరించారని కిషన్‌రెడ్డి తెలియజేశారు. 100 అడుగుల దాకా రోడ్లు..: ‘చర్లపల్లి రైల్వే టరి్మనల్కు చేరుకోవడానికి ఎఫ్‌సీఐ గోడౌన్ వైపు నుంచి ప్రయాణికుల రాకపోకల కోసం 100 అడుగుల రోడ్డు నిర్మాణం అవసరముంది. దీనిపై మీరు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయించేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నా’అని సీఎం రేవంత్‌ను కిషన్‌రెడ్డి కోరారు. సికింద్రాబాద్ స్టేషన్ మార్గంలోనూ..: దక్షిణ మధ్య రైల్వే కేంద్ర స్థానమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ. 715 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికల్లా అత్యాధునిక వసతులతో ప్రజలకు ఈ స్టేషన్‌ను అంకితం చేసేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని వివరించారు. అయితే రైల్వేస్టేషన్‌కు ప్రయాణికులు వచి్చ, వెళ్లే మార్గాలు చాలా ఇరుకుగా ఉన్నాయన్నారు. రేతిఫైల్ బస్ స్టేషన్, ఆల్ఫా హోటల్ మధ్యనున్న రోడ్డు ఇరుకుగా ఉండటంతో రద్దీ వేళల్లో ప్రయాణికులకు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గే వీలు ఉంటుందని.. ఈ విషయంలోనూ చొరవ తీసుకోవాలని సీఎంను కిషన్‌రెడ్డి కోరారు. -
ఉద్యోగానికి రాజీనామా చేసిన వినేశ్ ఫొగట్.. ఫొటో వైరల్
-
మౌనమేల మోదీజీ!?
కోల్‌కతా : ‘ ఇప్పటికీ నేను రాసిన లేఖపై మీ నుంచి ఎలాంటి జవాబు రాలేదని’ ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాశారు.కోల్‌కతా ఆర్జీకార్ ఘటన అనంతరం దేశంలో మహిళలపై జరిగే దారుణాల్ని అరికట్టేలా కఠిన చట్టాలు అమలు చేయాలని కోరుతూ మమతా బెనర్జీ ఆగస్ట్ 22న తొలిసారి లేఖ రాశారు. మొదటి లేఖపై స్పందన కరువైందంటూ తాజాగా శుక్రవారం రెండో సారి లేఖ రాశారు. ఆ లేఖను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.I have written this letter to the Hon'ble Prime Minister of India in connection with an earlier letter of mine to him. This is a second letter in that reference. pic.twitter.com/5GXKaX6EOZ— Mamata Banerjee (@MamataOfficial) August 30, 2024 ఆర్జీ కార్ ఘటనఆగస్ట్ 9న కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై దారుణం జరిగింది. ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. బాధితురాలికి న్యాయం జరిగేలా నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, ప్రాణ ప్రదాతలైన తమకు భద్రతేది? అని ప్రశ్నిస్తూ దేశ వ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు సామాన్యులకు సైతం మద్దతు పలికారు. ఆ సమయంలో ఆర్జీ కార్ దారుణం జరిగిన ప్రాంతంలో సాక్షాలు తారుమారు చేయడం, అప్పటి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇష్టారీతిన వ్యవహరించడంతో బాధితురాలి తల్లిదండ్రులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం.. వెను వెంటనే విచారణ చేపట్టడం.. వైద్యుల భద్రత కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను నియమించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రినిపల్ సందీప్ ఘోష్‌లను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.దేశంలో రోజుకు 90 దారుణాలుఈ క్రమంలో తొలిసారి ఆగస్ట్ 22న మమతా బెనర్జీ.. మోదీకి లేఖ రాశారు. వైద్యురాలి ఘటన కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని స్పష్టం చేశారు. అదే సమయంలో దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువైపోతున్నాయని ఆరోపించారు. దేశంలో రోజుకు 90 దారుణాలు జరిగిన ఘటనల తాలుకూ కేసులు నమోదవుతున్నాయని, వీటిలో చాలా సందర్భాల్లో బాధితులు హత్యకు గురవతున్నారని తెలిపారు.ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్మహిళలు సురక్షితంగా ఉండేలా వారికి రక్షణ కల్పించేలా చట్టాలు అమలు చేయాలని, అదే విధంగా సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. సత్వర న్యాయం జరగాలంటే 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆమె సూచించారు. అయితే ఆ లేఖపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి స్పందించారు.దీదీపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆగ్రహందేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాల్ని విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నాయని, ముఖ్యంగా మీ రాష్ట్రంలో (పశ్చిమ బెంగాల్)123 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను కేటాయించినప్పటికీ వాటి పనితీరు అంతంతం మాత్రంగా ఉన్నాయంటూ విమర్శించారు. మహిళల రక్షణ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.నేను రాసిన లేఖపై మీరే స్పందించాలిఈ నేపథ్యంలో మమతా బెనర్జీ మరోసారి మోదీకి లేఖ రాశారు. తాను రాసిన మొదటి లేఖకు ప్రధాని మోదీ ఎలాంటి జవాబు ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మహిళా శిశుసంక్షేమశాఖ నుంచి బదులు వచ్చిందని చెప్పిన ఆమె.. సమస్య తీవ్రత దృష్ట్యా ఆ సాధారణ సమాధానం సరిపోదన్నారు.నేరగాళ్లకు మోదీ హెచ్చరికఇదిలాఉంటే..దేశంలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై మోదీ స్పందించారు. మహిళల భద్రత విషయంలో ఉపేక్షించరాదని హెచ్చరించారు. మహిళలపై నేరాలు క్షమించరానివని ప్రతీ రాష్ట్రానికి చెబుతున్నా. నేరస్థులు ఎవరైనా సరే.. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత పటిష్ఠ పరుస్తున్నాం’ అని వెల్లడించారు. -
వాస్తవం ఇదే.. రాహుల్, ఖర్గేకు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగాన్ని రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులు లక్షలాది మంది ఉన్నారని.. ప్రభుత్వం షరతులు పెట్టి 40 శాతం మందికే రుణమాఫీ చేసిందంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.రాష్ట్రంలో రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నా.. ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను లేఖలో కేటీఆర్ వివరించారు.40 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అని చెప్పి కేవలం 17 వేల కోట్లకు పైగా రుణమాఫీతో రైతులను నట్టేట ముంచింది. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలి. లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలను చేస్తున్నారు. సీఎం మాయ మాటలు చెప్పి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే.. వారి తరఫున కాంగ్రెస్ పార్టీ పైన పోరాడతాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు. -
భూదాన్ యజ్ఞ బోర్డు.. రద్దు సబబే
సాక్షి, హైదరాబాద్: ‘భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమే. 2015లో జారీ చేసిన జీవో 59 సమర్థనీయమే. చట్ట నిబంధనలను పరిగణనలోకి తీసుకున్నాకే తగిన కారణాలను చూపుతూ సింగిల్ జడ్జి పిటిషన్లను డిస్మిస్ చేశారు. ఆ ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి చట్టపరమైన కారణాలేవీ కనిపించట్లేదు. బోర్డు రద్దును ప్రశ్నించే చట్టపరమైన హక్కు అప్పీలెంట్ల (చైర్మన్, సభ్యుడు)కు లేదు. అప్పీలెంట్లు చట్టవిరుద్ధంగా భూములను ఇతరులకు అన్యాక్రాంతం చేశారు. దీనిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అన్ని అంశాలను పరిశీలించి అప్పీళ్లను కొట్టివేస్తున్నాం’ అని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పులో పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత భూదాన్ ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై చైర్మన్, ఇతరులు కోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. ఆ తర్వాత ప్రభుత్వం మరోసారి బోర్డును రద్దు చేసింది. దీనిపై చైర్మన్ రాజేందర్‌రెడ్డి, సభ్యులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. పిటిషన్లను కొట్టేస్తూ ఆదేశాలిచ్చారు. 2017 జనవరి 6న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాజేందర్‌రెడ్డి, సభ్యుడు సుబ్రహ్మణ్యం ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు ముగియడంతో తీర్పు వెలువరించింది. ఏం జరిగిందంటే..ఏపీ భూదాన్ అండ్ గ్రామదాన్ చట్టం–1965 ప్రకారం 2012లో ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్‌గా జి.రాజేందర్‌రెడ్డి, సభ్యుడిగా సుబ్రమణ్యంతోపాటు మరికొందరిని నాలుగేళ్ల కాలపరిమితితో ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో బోర్డు కార్యకలాపాలు చూసేందుకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో 11ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ రాజేందర్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేసి ఊరట పొందారు.అనంతరం బోర్డును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రాజేందర్‌రెడ్డి తదితరులకు ప్రభుత్వం 2015లో నోటీసులిచ్చింది. సమాధానం సరిగ్గా లేదంటూ బోర్డును రద్దు చేస్తూ జీవో 59 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాజేందర్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో మళ్లీ పిటిషన్లు వేశారు. భూముల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న జడ్జి.. వారి పిటిషన్లను కొట్టేశారు. దీన్ని సవాల్ చేస్తూ రాజేందర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం అప్పీళ్లు దాఖలు చేశారు. తీర్పు కాపీలో కోర్టు ప్రస్తావించిన అంశాలుఢిల్లీలోని మహిళా చేతన కేంద్రం అధ్యక్షు రాలు డాక్టర్ వీణా బెహన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసినట్లు చెబుతున్న నకిలీ లేఖ ఆధారంగా బోర్డు ఏర్పాటైంది. విచారణలో ఆ లేఖ నకిలీదని తేలింది. పదవీకాలంలో బోర్డు చైర్మన్, సభ్యులు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అనర్హులకు భూములను కేటాయించడంతో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. బోర్డును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కొత్త బోర్డు నియామకమయ్యే వరకు ఆ బాధ్యతలను ప్రభుత్వం అధికారికి అప్పగించవచ్చు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ చోట 100 ఎకరాలు, మరో చోట 50 ఎకరాలు, రైతు డెయిరీకి 35 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలోని గోపాల్ గోశాల ట్రస్టుకు 15 ఎకరాలు చట్టవిరుద్ధంగా లీజు, అక్రమంగా కేటాయించారు. ఇష్టం వచ్చిన వారికి హయత్‌నగర్ మండలం బాటసింగారం సర్వే నంబర్ 319లోని 16.32 ఎకరాలను ఇళ్ల స్థలాలకు ఇచ్చేశారు. శంషాబాద్ మండలం పాలమాకుల సర్వే నంబర్ 1 నుంచి 7లోని 32.24 ఎకరాలను ఏడుగురికి అప్పగించారు. ఈ క్రమంలో చైర్మన్, సభ్యులపై పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీనిపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. తమపై కేసులేవీ లేవని అప్పీలెంట్లు పేర్కొనలేదు. -
కోదండరామ్‌కు ఎమ్మెల్సీ వద్దు: గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ లేఖ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణకు గవర్నర్లు మారుతున్నా గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల నియమాక వివాదం కొనసాగుతూనే ఉంది. టీజేఎస్ నేత కోదండరామ్, మీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించవద్దని కొత్త గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు కోరారు. ఈ మేరకు జిష్ణుదేవ్‌శర్మకు శుక్రవారం(ఆగస్టు2) వారు ఒక లేఖ రాశారు. ఎమ్మెల్సీల నియమాకం విషయమై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున తుది నిర్ణయం తీసుకోవద్దని లేఖలో కోరారు. కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపిన కోదండరామ్, అలీఖాన్ పేర్లపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.గతంలో బీఆర్ఎస్ హాయంలో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో క్యాబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉందా లేదా అన్న అంశంపై దాసోజు,కుర్ర కోర్టుకు వెళ్లారు. అప్పటిదాకా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎవరినీ నియమించవద్దని కోరారు. -
నేతాజీ అస్తికలు తెప్పించండి: ప్రధానికి బోస్ కుమార్తె లేఖ
కోల్‌కతా: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలను జపాన్‌లోని రెంకోజీ ఆలయం నుంచి భారత్‌కు తీసుకురావాలని అతని కుమార్తె అనితా బోస్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18 నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్థంతి అని, ఈ సందర్భంగా ఆయన అస్తికలను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నానంటూ ఆమె ప్రధానికి లేఖ రాశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏకైక కుమార్తె అనితా బోస్ ప్రధానికి రాసిన లేఖలో తన తండ్రి అస్తికలను భారతదేశానికి తీసుకువచ్చి, తమకు అందించాలని వాటితో తాను తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటున్నట్లు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘మా తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులు అర్పించే సమయం ఇది. అతని అస్తికలను భారతదేశానికి తీసుకురావాలి. నేను నా తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాలి. ఇది నా తండ్రి చివరి కోరిక. అందుకే నేను ఈ లేఖ రాస్తున్నాను. నేతాజీకి సంబంధించిన అన్ని రహస్య పత్రాలను బయటపెట్టడానికి ప్రధాని చేసిన ప్రయత్నాన్ని మేమంతా మెచ్చుకుంటున్నాం.నేతాజీ 1945, ఆగస్టు 18న మరణించారని, ఆయన అస్తికలను జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉంచారని దర్యాప్తు నివేదికల్లో వెల్లడయ్యింది. నేతాజీ భారతదేశానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు నా వినయపూర్వకమైన విజ్ఞప్తి ఏమిటంటే.. ఆగస్టు 18న నేతాజీ వర్థంతి. ఆరోజు నాటికి ఆయన అస్తికలను భారతదేశానికి తిరిగి తీసుకురావాలి. నేతాజీ అస్తికలను ఇంకా జపాన్‌లో ఉంచడం అవమానకరం’ అని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు.మీడియాతో నేతాజీ మనుమడు చంద్రకుమార్ బోస్ మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న మన దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. నేతాజీ అస్తికలను జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని, స్వతంత్ర భారతదేశాన్ని కోరుకున్న నేతాజీ అస్తికలను మన దేశంలో ఉంచడం శ్రేయస్కరమన్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం నేతాజీ కుమార్తె అనితా బోస్ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటున్నారని చంద్ర కుమార్ బోస్ తెలిపారు.కాగా రెంకోజీ టెంపుల్ అథారిటీ నేతాజీ అస్తికలను భారత ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉంది. 1945, ఆగష్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మృతి చెందారు. అయితే దీనిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2017లో ఆర్టీఐ (సమాచార హక్కు)కింద నేతాజీ విమాన ప్రమాదంలో మరణించినట్లు ధృవీకరించింది. -
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్ జగన్ లేఖ
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. జూలై 22, 2024న జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం కొన్ని అంశాలపై చేసిన వక్రీకరణలను వైఎస్ జగన్ లేఖలో వివరించారు.ఏపీ అప్పులు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను లేఖలో ప్రస్తావించారు. వాస్తవాలను రికార్డులతో సహా లేఖలో వైఎస్ జగన్ తెలియజేశారు. ఎకనామిక్ సర్వే, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కాగ్, ఆర్బీఐ నివేదికల్లోని వాస్తవాలను పొందుపరుస్తూ లేఖ రాశారు. (లేఖ పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే భారత్‌కు వస్తానన్న ప్రభాకర్‌రావు.. గత నెలలోనే భారత్ రావాల్సి ఉన్నా వాయిదా వేసుకోక తప్పలేదని లేఖలో పేర్కొన్నారు. క్యాన్సర్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని పేర్కొన్నారు.కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్ ప్రణీత్‌రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్ అయిన ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు. -
కేజ్రీవాల్ బెయిల్ నిలిపివేత.. సీజేఐకు 150 మంది న్యాయవాదుల లేఖ
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడంపై 150 మంది న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు ఆచరిస్తున్న అసాధారణ పద్ధతులపై జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ ఉత్తర్వులు ఆప్‌లోడ్ చేయడానికి ముందే ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఎలా సవాల్ చేసింది?, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ఈడీ సవాల్‌పై ఎలా విచారణ చేపట్టి ఆర్డర్‌ను హోల్డ్‌లో ఉంచారు? బెయిల్ అమలును ఎలా నిలిపివేశారు? అని ప్రశ్నించారు. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని, ఇది న్యాయవాదుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిందని 9 పేజీల లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.అదే విధంగా న్యాయవాదుల సమర్పణలను న్యాయమూర్తులు తమ ఆదేశాలలో రికార్డ్ చేయడం లేదని న్యాయవాదులు ఆరోపించారు. ఇది కోర్టు చరిత్రలో మొదటిసారి అని, ఇది చాలా అసాధారణమైనదని పేర్కొన్నారు. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ సమయంలో చేసిన సమర్పణలను న్యాయవాదుల ముందు, కేసు వాయిదా వేయడానికి ముందు రికార్డ్ చేయాలని ఆదేశాలు జారీ చేయవలసిందిగా అభ్యర్ధించారు.బెయిల్ మంజూరులో జాప్యం గురించి ప్రస్తావిస్తూ.. ‘ముఖ్యంగా ఈడీ, సీబీఐకు సంబంధించిన కేసుల్లో న్యాయమూర్తులు ఎక్కువ వ్యవధిలో విచారణ తేదీలు ఇస్తారు. బెయిల్ విషయాలను త్వరగా పరిష్కరించరు. న్యాయ సూత్రాలకు, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హామీకి ఇది విరుద్ధం.ఈ దేశ ప్రజలు ఎంతో ఆశతో, విశ్వాసంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నమ్మకాన్ని న్యాయవ్యవస్థ, న్యాయ సంఘం సమర్థించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే మా ఆందోళనలను మీతో పంచుకుంటున్నాం. వీటిని త్వరగా సరిదిద్దుతారని ఆశిస్తున్నాం.’ అని లేఖలో ప్రస్తావించారు. -
6న కలుద్దాం.. చంద్రబాబుకు రేవంత్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం పక్షాన ఈనెల ఆరో తేదీన ముఖాముఖి కలుద్దామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆహ్వనించారు. 6వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే భవన్లో కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు చంద్రబాబుకు రేవంత్ లేఖ రాశారు. ‘మీరు ఈనెల ఒకటో తేదీన లేఖ రాసినందుకు కృతజ్ఞతలు.ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు మీకు అభినందనలు. నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం ద్వారా మీరు దేశంలోనే అరుదైన నాయకుల్లో ఒకరిగా నిలిచారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు నన్ను కలవాలన్న మీ ప్రతిపాదనతో నేను ఏకీభవిస్తున్నాను. పునరి్వభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి మన భేటీ ఉపయోగపడుతుంది. అవసరం కూడా. వ్యక్తిగతంగా కలవడం పరస్పర సహకారానికి బలమైన పునాది వేస్తుంది. అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించగలం..’అని ఆ లేఖలో రేవంత్ పేర్కొన్నారు. -
చంద్రబాబు లేఖ.. రేవంత్ రిప్లై..
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 6న భేటీకి సిద్ధమని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజాభవన్‌లో భేటీకి రావాలని లేఖలో రేవంత్ ఆహ్వానించారు. విభజన సమస్యల పరిష్కారం కోరుకుంటున్నామని రేవంత్ పేర్కొన్నారు.కాగా, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కలిసి చర్చించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమానికి పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరముందని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, రెండు రాష్ట్రాల లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేయాల్సి వుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయని చంద్రబాబు ఈ సందర్భంగా ఆ లేఖలో గుర్తుచేశారు. -
కలిసి మాట్లాడుకుందాం
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కలిసి చర్చించుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమానికి పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరముందని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, రెండు రాష్ట్రాల లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేయాల్సి వుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయని చంద్రబాబు ఈ సందర్భంగా ఆ లేఖలో గుర్తుచేశారు.ఈ నేపథ్యంలో.. పునర్వ్యవస్థీకరణ చట్టంవల్ల ఎదురవుతున్న సమస్యలపై ఇప్పటికే అనేక చర్చలు జరిగాయని, ఇవన్నీ సంక్షేమం, పురోగతిపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయన్నారు. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి సామరస్యంగా ముందుకెళ్లడం అత్యవసరమని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్‌లో కలుద్దామని రేవంత్‌రెడ్డికి ఆయన ప్రతిపాదించారు. ముఖాముఖి సమావేశం నిర్వహించుకుని క్లిష్టమైన సమస్యలపై సమగ్రంగా చర్చలు జరుపుదామన్నారు. ఏపీ, తెలంగాణకు పరస్పర ప్రయోజనం కలిగే పరిష్కారాలను కనుగొని అందుకనుగుణంగా సమన్వయంతో పనిచేయడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని వివరించారు. -
నీట్ రద్దుపై ప్రధాని మోదీ, ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ స్థాయిలో ఈ వ్యవస్థను తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.వైద్య విధ్యలో విద్యార్ధుల ఎంపిక ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా ప్లస్ 2(12వ తరగతి) మార్కుల ఆధారంగా మాత్రమే ఉండాలని కోరారు. ఇది విద్యార్ధులపై అనవసరమైన అదనపు ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్పారు."దీనికి సంబంధించి, తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని మరియు 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు అందించాలని మేము మా శాసనసభలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాము. ఇది రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాం. అయితే ఇంకా పెండింగ్‌లో ఉంది," అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశారు. ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై రాష్ట్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని సీఎం తెలిపారు. నీటి తొలగింపుపై ఇతర రాష్ట్రాలు కూడా కోరుతున్నాయని పేర్కొన్నారు.పై విషయాలను పరిగణనలోకి తీసుకుని, నీట్ నుంచి తమిళనాడును మినహాయించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం తన సమ్మతిని అందించాలని, జాతీయ స్థాయిలో వైద్య కమిషన్ చట్టాన్ని కూడా సవరించాలని కోరుతూ తమిళనాడు శాసనసభ శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని చెప్పారు.కాగా.. నీట్‌ను రద్దు చేయడానికి తమ తమ అసెంబ్లీలలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని కోరుతూ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని సీఎంలను స్టాలిన్ లేఖల ద్వారా కోరారు. -
వైఎస్సార్సీపీ శ్రేణులకు రక్షణ కల్పించండి
సాక్షి, అమరావతి: అధికార కూటమి నేతల అమానుష దాడుల నుంచి రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని పార్టీ ముఖ్య నేతలు డీజీపీ ద్వారకా తిరుమలరావును కోరారు. పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, పార్టీ కార్యాలయాల్లోకి అక్రమ చొరబాట్లను, దాడులను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం డీజీపీకి ఓ లేఖ రాశారు. దానిని డీజీపీకి మెయిల్ ద్వారా పంపారు. కూటమి నేతల దౌర్జన్యాలకు సంబంధించిన పలు ఆధారాలు, వివరాలు కూడా లేఖతో పాటు జత చేశారు.‘రాష్ట్రంలో టీడీపీ కూటమి గెలుపొందినప్పటి నుంచి గత 25 రోజులుగా వైఎస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, వారి ఆస్తులకు, పార్టీ కార్యాలయాలకు రక్షణ లేకుండా పోయింది. పార్టీ నాయకులు, కార్యకర్తలపైన అమానుషంగా దాడులు చేస్తున్నారు. వారి ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పోలీసులు తగిన రీతిలో చర్యలు తీసుకోవడంలేదు. మా ప్రాణాలకు హాని ఉందని చెప్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదు. ఈ ఘటనలపై వెంటనే కేసులు నమోదు చేసి, కారకులను వెంటనే అరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోకి టీడీపీ, జనసేన మంత్రులు, నాయకులు, కార్యకర్తలు అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు దిగుతున్నారు. గురువారానికి రాష్ట్రంలోని 14 చోట్ల పార్టీ కార్యాలయాల్లోకి చొరబడ్డారు. మా పార్టీ కార్యాలయాలు, ప్రాంగణాల్లోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు పాల్పడి చట్టాన్ని ఉల్లంఘించారు. ఘర్షణలు రేపేందుకు ప్రయత్నించారు. టీడీపీ, జనసేన నాయకులు అక్రమంగా ప్రవేశించినా, బెదిరింపులకు దిగినా పోలీసులు ఎక్కడా వారిని నియంత్రించడంలేదు సరికదా వారి అక్రమాలకు దన్నుగా నిలబడ్డారు. శాంతి భద్రతలను కాపాడి, రక్షణగా ఉండాల్సిన పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకు తావివ్వడం ద్వారా శాంతి భద్రతలను ప్రమాదంలో పడేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార టీడీపీ కూటమి నాయకుల దాడులు, దౌర్జన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నిర్లిప్తంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి... స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వయనాడ్ ప్రజలకు రాహుల్‌గాంధీ భావోద్వేగ లేఖ
న్యూఢిల్లీ: ఎంపీగా నియోజకవర్గాన్ని వదులుకున్న వేళ కేరళలోని వయనాడ్ ప్రజలకు ఆదివారం(జూన్23) రాహుల్ గాంధీ భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ‘వయనాడ్‌ను వదులుకున్నందుకు బాధగా ఉంది. ఇన్ని రోజులు మీరిచ్చిన సహకారానికి నా కృతజ్ఞతలు. మీరు ప్రియాంకను ఎంపీగా ఎన్నుకుంటే బాగా పనిచేస్తుంది. ఆమెను ఇక్కడి నుంచి పోటీ చేయమని నేనే ఒప్పించా. గతంలో నేనెవరో తెలియనపుడే మీరు నన్ను నమ్మారు. మీ గొంతను పార్లమెంటులో వినిపించినందుకు ఆనందంగా ఉంది. రాయ్‌బరేలి, వయనాడ్ రెండింటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. దేశంలో విద్వేషాన్ని హింసను రెచ్చగొట్టేవారిపై కలిసి పోరాడదాం’అని రాహుల్‌గాంధీ లేఖలో తెలిపారు. కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్ రెండు నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలుపొందారు. దీంతో ఆయన ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వచ్చింది. -
కొత్త క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయండి: మోదీకి మమతా లేఖ
పశ్చిమ బెంగాల్ ముఖ్యంమత్రి మమతా బెనర్జీ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు కొత్త నేర చట్టాల అమలును వాయిదా వేయాలని ఆమె కోరారు. కాగా జూలై ఒకటో తేదీ నుంచి కొత్త చట్టాలు అమలులోకి రానున్నాయి. అయితే క్రిమినల్ చట్టాలను వాయిదా వేయడం వల్ల పార్లమెంట్లో వీటిపై సమీక్ష జరిపే అవకాశం ఉంటుందని దీదీ పేర్కొన్నారు.ఇదిలా ఉండగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలను కేంద్రంలోని ఇటీవల బీజేపీ ప్రభుత్వం రూపొందించిన విషయం తెలిసిందే.బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 చట్టాల స్థానంలో కేంద్రం వీటిని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాలు దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించాలన్న ఉద్ధేశ్యంతో వీటిని రూపొందించారు. న్యాయ వ్యవస్థను, కోర్టు నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడనున్నాయి. -
KSR Live Show: జస్టిస్ పై కేసీఆర్ విమర్శలు.. రాజకీయ దుమారం..!
-
అమిత్ షాపై ఆరోపణలు.. జైరాంరమేష్‌కు ఈసీ లేఖ
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం(జూన్2) కోరింది. ఈ మేరకు ఆయనకు ఈసీ ఒక లేఖ రాసింది. ఎన్నికల కౌంటింగ్‌పై అమిత్ షా 150 మంది జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేశారని జైరాం రమేష్ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించింది.మీరు చేసే ఆరోపణలు ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తాయని, వాటిపై విచారణ జరిపేందుకు ఆధారాలుంటే సమర్పించండని ఈసీ జైరామ్‌రమేశ్‌ను కోరింది. ఆధారాలు చూపితే తగిన చర్యలు తీసుకుంటామని రమేష్‌కు ఈసీ లేఖలో తెలిపింది. హోంమంత్రి ఇప్పటివరకు 150 మంది కలెక్టర్లతో మాట్లాడారు. వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. విజయం పట్ల బీజేపీ ఎంత నిరాశలో ఉందో దీని ద్వారా తెలుస్తోంది. ఇండియా కూటమి విజయం సాధిస్తుందని జైరాం రమేష్ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్.. సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. రాష్ట్రంలోకి సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలన్నారు. ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్షాలపై సైబర్‌దాడికి కారకులైన కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులిచ్చి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బండి సంజయ్ శనివారం ముఖ్యమంత్రికి బహిరంగలేఖ రాశారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిద్దరూ ఎమ్మెల్యే పదవులకు అనర్హులని, ఈ మేరకు స్పీకర్‌కు సీఎం లేఖ రాయాలన్నారు. విపక్షాలను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని విచారణలో తెలిసినా.. ఇంతవరకు వారికి కనీసం నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు కూడా చేతులు మారినట్లు తెలుస్తోందని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ కాపాడే యత్నాలు చేస్తోందనే చర్చతో ప్రజల్లో ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతిన్నదన్నారు. ఏఐసీసీకి రాష్ట్రం ఏటీఎంగా మారింది ఏఐసీసీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఒప్పించి, మెప్పించారు కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి వస్తోందని, అందుకే ఆయా కేసుల విచారణ ముందుకు వెళ్లడం లేదన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ను విలీనం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆరోపించారు.దశాబ్ది వేడుకలకు సోనియాను ఆహా్వనించిన రేవంత్‌రెడ్డి, తెలంగాణ బిల్లు ఆమోదంలో కీలకపాత్ర పోషించిన బీజేపీ నాయకులను ఎందుకు ఆహా్వనించలేదని ప్రశ్నించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. -
ఉద్యమాన్ని అవమానిస్తూ.. ఉత్సవాలా?.. సీఎం రేవంత్‌రెడ్డికి కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న, ఉత్తేజకరమైన సందర్భమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకువెళ్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని బీఆర్ఎస్ సహా ఉద్యమకారులు, తెలంగాణవాదులు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వా న్ని అవమానిస్తున్న మీ వికృత పోకడలను నిర సిస్తూ ప్రభుత్వం నిర్వహించే దశాబ్ది ఉత్సవా ల్లో బీఆర్ఎస్ పార్టీ పాల్గొనడం లేదు..’’ అని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ దశా బ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ రేవంత్‌రెడ్డి రాసిన లేఖకు ప్రతిగా కేసీఆర్ శని వారం సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. అందులో కేసీఆర్ పేర్కొన్న అంశాలివే..‘‘రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై మీ (కాంగ్రెస్) ప్రభుత్వం ఇటీవల నిర్వహించి న అఖిలపక్ష సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమై న బీఆర్ఎస్ను ఆహ్వానించక పోవడం అప్రజా స్వామిక వైఖరికి నిదర్శనం. బీఆర్ఎస్ను కావాలని విస్మరించి మీ సంకుచితత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. నన్ను దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించిన తీరు.. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది. ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమాన్ని విజయతీరానికి చేర్చిన న న్ను ఆహ్వానించిన తీరు ఎంతో అవమానకరంగా ఉంది. తెలంగాణ ప్రజాపోరాటానికి నాయ కత్వ స్థానంలో నిలిచిన నాకు వేదికపై స్థానం కల్పించలేదు.రాష్ట్ర సాధనలో నాకున్న అనుభ వాలు పంచుకునేలా ప్రసంగించే అవకాశం క ల్పించక పోవడం మీ అహంకార ఆధిపత్య ధో రణికి పరాకాష్ట. నన్ను ఆహ్వానించి అవమానించాలనే మీ దురుద్దేశాన్ని ప్రజలు గ్రహిస్తున్నా రు. పోరాట వారసత్వాన్ని దెబ్బతీయడానికి మీరు చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసే లా ఉత్సవాలు జరుగుతున్న తీరును ఉద్యమ కారులు ఇప్పటికే నిరసిస్తున్నారు.జై తెలంగాణ అని నినదించరెందుకు?తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ప్రాణప్రదమైన ‘జై తెలంగాణ’ నినాదాన్ని ఇప్పటివరకు నోటినిండా పలకలేని మీ మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇక ముందైనా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణ అని నినదించే వివేకాన్ని తెలంగాణ సమాజం మీ నుంచి కోరుకుంటున్నది. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలవుతున్నా.. ఇప్పటివరకూ తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శించక, శ్రద్ధాంజలి ఘటించక పోవడం ద్వారా ప్రజల మనోభావాలను గాయపరిచారు. అమరుల త్యాగాలతో అవతరించిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్య్రాన్ని నేను నిరసిస్తున్నాను. 1969 నుంచి ఐదు దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చరిత్ర పొడుగునా కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది దాచేస్తే దాగని సత్యం. 1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడం మొదలు కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగింది. తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసి తెలంగాణలో ఐదారు తరాల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది.మీ దమన నీతికి సాక్ష్యం.. అమరుల స్తూపంతెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దమన నీతికి సాక్ష్యమే గన్‌పార్క్ అమరవీరుల స్తూపం. ఆ స్తూపాన్ని కూడా ఆవిష్కరించ నీయకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచింది. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం కాంగ్రెస్ పార్టీదే.తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చరిత్రాత్మక ప్రయత్నంలో భాగంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణను ఇచ్చింది. తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచి ఎన్నికలు, సభలు, సమావేశాలతో రాజకీయ ఒత్తిడి పెంచింది. దేశంలో ఉన్న పార్టీల మద్దతును లిఖిత పూర్వకంగా సాధించింది. కానీ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యపరిచే అనైతిక కుట్రలకు కాంగ్రెస్ పాల్పడింది.తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండినా ప్రాణాలను పణంగా పెట్టి ‘తెలంగాణ వ చ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అని ఆమరణ నిరా హార దీక్షకు దిగడంతో కాంగ్రెస్ ‘డిసెంబర్ 9’ ప్రకటన చేసింది. కానీ సమైక్య పాలకుల ఒత్తి డితో వెనక్కితగ్గి మోసం చేసింది. దాంతో వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చే శారు. దీనిపై కాంగ్రెస్ ఎన్నడూ పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు, క్షమాపణ కోరలేదు. పైగా ద యతో మేమే తెలంగాణ ఇచ్చామనే ఆధిపత్య, అహంభావ ధోరణి ప్రదర్శిస్తూ.. ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానిస్తున్నారు. ఈ రకమైన వైఖరిని మార్చుకోనప్పుడు మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటుంది? ఇప్పటికైనా తెలగా>ణ సమాజానికి క్షమాపణ చెప్పండి. రాజకీయ అవసరాల కోసం కాకుండా మనస్ఫూర్తిగా తెలంగాణ సమాజానికి క్షమాపణలు కాంగ్రెస్ చెప్పినప్పుడే పాప పరిహారం చేసుకున్నట్టు అవుతుంది.మీకు తెలంగాణ రాజకీయ అవకాశమే..కాంగ్రెస్‌కు తెలంగాణ ఒక రాజకీయ అవకాశమే తప్ప మనఃపూర్వక ఆమోదం కాదు. కాంగ్రెస్ ఎన్నటికీ మారదని మీ ప్రవర్తన, మీ పార్టీ ప్రవర్తనతో స్పష్టమ వు తోంది. నాడు, నేడు ఎన్నడూ అంతే. తెలంగాణలో గత ఆరు నెలలుగా సాగుతున్న మీ పరిపాలనే ఇందుకు నిదర్శనం. ప్రజాపా లన పేరిట అధికారంలోకి వచ్చిన మిమ్మ ల్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులతో వేధింపులు, నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు. తెలంగాణకు గర్వకార ణమైన అస్తిత్వ చిహ్నాలపై విషం కక్కు తూ.. అధికార ముద్ర నుంచి తొలగిస్తామ ని అవమానిస్తున్నారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు అన్నం పెట్టిన కాకతీయ రాజులను అవమా ని స్తూ.. కుతుబ్ షాహీల కాలంలో నిర్మించిన చార్మినార్‌కు మలినాన్ని ఆపాదిస్తున్న మీ సంకుచితత్వం తెలంగాణకు హానికరం. -
కేసీఆర్‌కు రేవంత్ ప్రత్యేక ఆహ్వానం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2న పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే అధికారిక కార్యక్రమానికి హాజరుకావా ల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ వ్యక్తిగత ఆహ్వాన లేఖను, ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్‌కు అందించాలని ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్‌లను సీఎం ఆదేశించారు.ఈ మేరకు కేసీఆర్‌ను కలసి ఆహ్వాన లేఖ, పత్రికను అందించేందుకు వారిద్దరూ కేసీఆర్ సిబ్బందితో చర్చలు జరిపారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉన్నారని సిబ్బంది వెల్లడించడంతో.. ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆహ్వాన పత్రిక, లేఖను అందించేందుకు వేణుగోపాల్, అరవింద్ సింగ్ ప్రయత్నిస్తున్నారని సీఎం కార్యాలయం తెలిపింది.చుక్కా రామయ్యకు సీఎం పరామర్శ.. వేడుకలకు ఆహ్వానం..సాక్షి, హైదరాబాద్: కొంతకాలం నుంచి అనారో గ్యంతో బాధపడుతున్న ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. గురువారం నల్లకుంటలోని చుక్కా రామయ్య నివాసానికి సీఎం వెళ్లారు. రామయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరుకావాలంటూ రామయ్యను ఆహ్వానించారు. -
యూపీ కుర్రాడికి ప్రధాని మోదీ ఎందుకు లేఖ రాశారు?
ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే అవసరమైనప్పుడు కొందరికి లేఖలు కూడా రాస్తుంటారు. తాజాగా యూపీలోని ఒక యువకునికి ప్రధాని మోదీ లేఖరాశారు.ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని మొహల్లా పిర్బతవాన్లో నివసిస్తున్న అభయ్ చంద్వాసియాకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన అభయ్‌ను ప్రశంసించారు. అభయ్ గత 20 ఏళ్లుగా మోటార్ న్యూరాన్ డిజార్డర్ అనే నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం 95 శాతం మేర శారీరక వైకల్యంతో జీవిస్తున్నాడు.ప్రధాని మోదీ తన లేఖలో అభయ్ చంద్వాసియాను ప్రశంసించారు. ‘ప్రేమతో కూడిన మీ మాటలు దేశం కోసం మనస్పూర్తిగా పని చేసేవారికి కొత్త శక్తిని ఇస్తాయని మోదీ పేర్కొన్నారు. అభయ్ తన స్వీయ రచనలోని ప్రతి పదాన్ని ప్రధాని మోదీకి అంకితం చేశారు. శారీరక వైకల్యంతో మంచం మీదనే ఉంటున్నప్పటికీ అభయ్ పలు స్ఫూర్తిదాయకమైన రచనలు సాగించాడు. అవి చదివినవారు వీటిని రాసిన వ్యక్తి శారీరక వైకల్యంతో బాధపడుతూ, కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైనవాడంటే ఎవరూ నమ్మలేరు.ప్రధాని నరేంద్ర మోదీపై అభయ్కు ఎనలేని అభిమానం. ఈ కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వం, దేశ ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషి, నాయకత్వ సామర్థ్యాలను వర్ణిస్తూ కవిత్వం రాశాడు. దీనికి స్పందించిన ప్రధాని మోదీ అభయ్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాని నుంచి లేఖ రావడంపై అభయ్ ఆనందం వ్యక్తం చేశారు. -
మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
విశాఖ సిటీ: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటమి ఖాయమని తేలిపోవడంతో పోలింగ్‌కు ముందు రోజు చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖ సృష్టించారు. బొత్స లెటర్ హెడ్‌పైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాస్తున్నట్లుగా లేఖను తయారు చేశారు. దాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రకు తెరలేపారు. ఈ కుతంత్రంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటమి భయంతో చంద్రబాబు ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే అని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్‌కు ఫిర్యాదు చేశారు. నకిలీ లేఖను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.రోజుకో కుట్ర..ఓటమి ముంగిట నిలిచిన చంద్రబాబు రోజుకో కుట్రతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన ప్రతి సంస్కరణ, నిర్ణయంలో లేని వివాదాలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. భూ యజమానులకు మేలు చేసే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూశారు. అయినా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేశారు. ఆయన వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖను సృష్టించారు. -
వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
విశాఖపట్నం: ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిస్పృహతో టీడీపీ నీచపు పనులకు పాల్పడుతోందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. వైఎస్ విజయమ్మ రాసినట్టుగా టీడీపీ ఒక లేఖను సృష్టించి.. దాన్ని అడ్డుపెట్టుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి బురదజల్లుతోందని తెలిపారు.ఆ లేఖలో ఉపయోగించిన భాషను చూస్తే అది ఫేక్ అన్న సంగతి అందరికీ అర్థం అవుతోందని తెలిపారు. ఓడిపోతున్నామనే ఉక్రోషంతో టీడీపీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తోందని విమర్శించారు. టీడీపీ ఫేక్ ప్రచారాలను ప్రజలు తిప్పికొడుతున్నారని తెలిపారు. విజయమ్మ పేరిట లేఖను సృష్టించి సర్క్యులేట్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన తెలిపారు. -
పవన్ కళ్యాణ్ కు పోతిన మహేష్ బహిరంగ లేఖ
-
కాళేశ్వరానికి ‘అత్యవసర’ గడువు మించిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా వానాకాలానికి ముందే తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సత్వరమే సిఫారసు చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేసింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులకు చాలా తక్కువ సమయం మిగిలి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనీల్‌కుమార్ ఇటీవల అయ్యర్ కమిటీకి లేఖ రాశారు. ఈ నెల ముగిశాక ఎప్పుడైనా వానాకాలం ప్రారంభం కావచ్చని, ఆలోగా అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబందించిన ప్రాథమిక సమాచారంతోపాటు మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులకు నిర్వహించిన ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షల నివేదికలను సమరి్పంచామని ఈ ఖలో గుర్తుచేశారు. బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించి వివరాలు సేకరించింది. కమిటీ మధ్యంతర నివేదిక కోసం గత నెల రోజులుగా నీటిపారుదల శాఖ నిరీక్షిస్తోంది. ఎన్నికల ఫలితాలొచ్చాకే మధ్యంతర నివేదిక? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాకే అయ్యర్ కమిటీ మరమ్మతులపై మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖలో ఉన్నత స్థాయి అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆలోగా వర్షాకాలం మొదలవుతుందని.. దీనివల్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టడానికి వీలుండదని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే బ్యారేజీలకు అత్యవసరంగా గ్రౌంటింగ్ వంటి పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అయ్యర్ సిఫారసులు వచ్చాకే మరమ్మతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నీటిపారుదల శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
న్యాయవ్యవస్థను తక్కువ చేసేందుకు ప్రయత్నాలు
న్యూఢిల్లీ: పథకం ప్రకారం ఒత్తిళ్లు తేవడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, బహిరంగ విమర్శల ద్వారా న్యాయ వ్యవస్థను చులకన చేసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని రిటైర్డు జడ్జీల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత లబ్ధి, రాజకీయ స్వార్థం కోసం జరిగే ఇటువంటి ప్రయత్నాల కారణంగా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయే ప్రమాదముందని వారు పేర్కొన్నారు. అయితే, ఏ పరిణామాలు తమను ఈ లేఖ రాసేందుకు ప్రేరేపించాయనే విషయాన్ని అందులో వారు ప్రస్తావించలేదు. అవినీతి కేసుల్లో కొందరు ప్రతిపక్ష నేతల అరెస్టుపై అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సమయంలో ఈ లేఖ రాయడం గమనార్హం. ఆరోపణలెదుర్కొంటున్న నేతలు, వారి పార్టీలు కోర్టులను ఆశ్రయించడం, న్యాయవ్యవస్థ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను చూపుతూ బీజేపీ వారిపై ప్రత్యారోపణలు చేస్తుండటాన్ని లేఖలో వారు ప్రస్తావించారు. ‘ఇటువంటి చర్యలతో న్యాయవ్యవస్థ పవిత్రత దెబ్బతింటోంది. జడ్జీల నిష్పాక్షికత, సచ్ఛీలత అనే సూత్రాలకు ఇవి సవాల్‌గా మారాయి. ఇటువంటి అవాంఛిత ఒత్తిడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అని లేఖలో పేర్కొన్నారు. నిరాధార సిద్ధాంతాలను ప్రచారం చేయడం వంటి చర్యల ద్వారా న్యాయపరమైన ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని సమూహాలు అనుసరిస్తున్న వ్యూహం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. సుప్రీంకోర్టు నేతృత్వంలోని న్యాయవ్యవస్థను ఇటువంటి ఒత్తిళ్లకు వ్యతిరేకంగా బలోపేతం చేయాలని, న్యాయ వ్యవస్థ పవిత్రతను, స్వయంప్రతిపత్తిని పరిరక్షించాలని వారు కోరారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా, అస్థిర రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేఖ రాసిన వారిలో సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీలు జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్ షా సహా వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తులు ఉన్నారు. -
సీజేఐ చంద్రచూడ్‌కు రిటైర్డ్ జడ్జిల లేఖ..
ఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు మొత్తం 21 మంది కలిసి భారత ప్రధాన న్యాయమూర్తి 'డీవై చంద్రచూడ్'కు లేఖ రాశారు. కొన్ని వర్గాలు న్యాయవ్యవస్థ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, బహిరంగంగా కించపరచడం ద్వారా న్యాయవ్యవస్థను అస్థిరపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఈ లేఖలో ఎత్తిచూపారు. మన న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ముచేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని 21 మంది రిటైర్డ్ జడ్జీలు రాసిన లేఖలో పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలు కేవలం అనైతికంగా మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్యం పునాది సూత్రాలకు అత్యంత హానికరమని కూడా వారు పేర్కొన్నారు. 21 Retired Judges write to Chief Justice of India (CJI) Dy Chandrachud "We write to express our shared concern regarding the escalating attempts by certain factions to undermine the judiciary through calculated pressure, misinformation, and public disparagement. It has come to… pic.twitter.com/bPZ0deczI2 — ANI (@ANI) April 15, 2024 -
పిట్టపడా ఎన్‌కౌంటర్‌కు సీఎందే బాధ్యత
సాక్షి, హైదరాబాద్/చర్ల: విప్లవ పోరాటాలపై తె లంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసా గిస్తున్న హత్యాకాండను ప్రజలంతా ఖండించా లని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ములు గు జిల్లా వెంకటాపురం మండలంలో పిట్టపడా వద్ద గ్రేహౌండ్స్ పోలీసు లు చేసిన ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు మావో యిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ శనివారం ఓ లేఖను విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణలోకి కూలీ పనుల కోసం వస్తున్న ఆదివాసీలను ఎస్ఐబీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి మావో యిస్టుల సమాచారం చెప్పాలని వేధిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకే గ్రేహౌండ్స్ బలగాలు ఏప్రిల్ 6న మధ్య రీజనల్ కంపెనీ–2కి చెందిన కమాండర్ అన్నె సంతోష్ శ్రీధర్, సాగర్, అదే కంపెనీకి చెందిన ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యుడు ఆస్మా మణిరామ్, సభ్యుడు పూనెం లక్ష్మణ్ అమరులయ్యారని పేర్కొన్నారు. నిరాయుధులైన వారిని శారీరకంగా ఎంతో హింసించి చంపి మృగాల మాదిరిగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 15న బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు వెల్లడించారు. -
మేనిఫెస్టో పేరిట ఎన్నాళ్లు మోసం?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో మేని ఫెస్టోల పేరిట ప్రజలను మోసం చేయొద్దని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూచించారు. మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడం, ఆ తర్వాత విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు. పార్టీని మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తెస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్ప దమని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీని ఉద్దేశించి శుక్రవారం హరీశ్‌రావు లేఖ రాశారు. ‘ఉమ్మడి ఏపీలో 2004, 2009 ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినా అమలు చేయలేదు. అదే తరహాలో గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనేక హామీలు ఇచ్చి విస్మరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అనేకమార్లు మాట తప్పి ఏ ధైర్యంతో మేనిఫెస్టో విడుదల చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్ని సార్లైనా మోసం చేయొచ్చనే మీ ధైర్యానికి.. ‘రాజ్యాంగ పరిరక్షణ చాప్టర్ లోని 13వ పాయింట్ కింద ప్రజా ప్రతినిధులు ఎవరైనా పార్టీ మారితే, ఆ వెంటనే సభ్యత్వం పోయేలా చట్టం చేస్తామని తాజా మేనిఫెస్టోలో హామీనిచ్చారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకుని వారికే ఎంపీ టికెట్లు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో చెప్పిన నీతులకు, అధికారంలో ఉండి చేస్తున్న చేతలకు ఏమాత్రం పొంతన లేదు. ప్రజలను ఎన్నిసార్లైనా మోసం చేసి గెలవవచ్చు అనే మీ మొండి ధైర్యానికి ఆశ్చర్యం కలుగుతోంది’ అని పేర్కొన్నారు. ‘తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఓట్లేశారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే సందర్భంగా కూడా ఆరు హామీలకు చట్టబద్ధత కల్పించే పత్రంపై మీ సంతకాలు చేసినా ఆ హామీలేవీ రాష్ట్రంలో అమలు కావడం లేదు’ అని ఆరోపించారు. మీకు కొత్తహామీలిచ్చే హక్కు లేదు ‘మహాలక్ష్మి పేరుతో కాంగ్రెస్ పార్టీ మహిళలకు మహా మోసం తలపెట్టింది. రైతులను దగా చేసి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నట్టేట ముంచింది. రూ.2లక్షల రుణమాఫీపై తుక్కుగూడ సభలో స్పష్టమైన ప్రకటన చేయాలని రైతుల పక్షాన కోరుతున్నాను. ఎకరాకు రూ.15వేల రైతుబంధు సాయం అందక రైతులు ఇబ్బందులు పడుతు న్నారు. క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామనే బోగస్ మాటలతో మీ పార్టీ తమాషా చేస్తోంది. వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇలా ప్రతీ హామీ బూటకమని తేలింది. మీ పార్టీ అధికారంలోకి వంద రోజుల్లోనే 210 మంది రైతులు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మళ్ళీ కష్టాలు మొదలుకావడానికి కారకులైన మీరు, మీ పార్టీ క్షమాపణలు చెప్పాలి. హామీల అమలులో శ్రద్ధ లేని మీకు మళ్ళీ కొత్త హామీలను ఇచ్చే నైతిక హక్కు లేదు. తెలంగాణ ప్రజలను మళ్లీ మళ్లీ మోసం చేయాలనుకునే మీ ఎత్తుగడలు ఇక ముందు సాగవు’ అని హరీశ్‌రావు తన లేఖలో హెచ్చరించారు. -
పురందేశ్వరి తహతహ
-
ఇదే మా హెచ్చరిక.. సీఎం రేవంత్‌కు హరీష్‌రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం గమనించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమేనన్నారు. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకున్నారు. ఈ ఏడాది ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్‌తో పోల్చితే డబుల్‌గా ఉండటం గమనార్హం. మాటను నిలబెట్టుకోవాలి. వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాం’’ అని హరీష్‌రావు తెలిపారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు -
సిరిసిల్ల నేతన్నల సమ్మె విరమింపజేయాలి
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభు త్వం వెంటనే జోక్యం చేసుకుని సిరిసిల్ల నేత న్న ల సమ్మెను విరమింపజేయాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవా లని, గత 27 రోజులుగా అక్కడి వస్త్ర పరిశ్రమ ఆసా ములు, కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి ప్రభుత్వమే కారణ మని, వెంటనే వారికి రూ.270 కోట్ల బకాయిలను విడు దల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం వెంటనే కొత్త ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవా లని కోరారు. గత 4 నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పాత బకాయిలు రాక, కొత్త ఆర్డర్లు లేక దాదాపు 20 వేల మంది పవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుండే పరిస్థి తులు ఏర్పడ్డాయ న్నారు. నేత కార్మి కులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నా రు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పథ కాన్ని ప్రవేశపెట్టి కచ్చితంగా అవే చీరలను నేయాలంటూ.. ఆసాము లను, యజమాను లను ఒత్తిడి చేసి పాత వ్యాపారాలను బలవంతంగా బంద్ చేయించిందన్నారు. మాస్టర్ వీవర్స్ పేరుతో బడా వ్యాపారులకు బతుకమ్మ ఆర్డర్లను ఇచ్చిన నేపథ్యంలో చిన్న ఖార్ఖానాల ఆసాములు, యజమానులు కూలీలుగా మారాల్సి వచ్చిందన్నారు. పవర్లూమ్ కార్ఖానాల విద్యుత్ బకాయిల మాఫీతో పాటు గతంలో ఇచ్చిన విద్యుత్ సబ్సిడీని కొన సాగించాలని కోరారు. ఈ కార్ఖానాలకు గత 24 ఏళ్లుగా 50% సబ్సిడీతో అందిస్తున్న విద్యుత్‌ను నిలిపివేయడంతో రెట్టింపు విద్యుత్ బిల్లులు వస్తున్నాయని తెలిపారు. నేత కార్మికుడిని ఆసామి చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం రూ.370 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్’పథకాన్ని పునః ప్రారంభించాలని కోరారు. -
పోటీ నుంచి తప్పుకుంటున్నా
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో బీఆర్ఎస్ గట్టి షాక్ తగిలింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె, బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు గురువారం రాత్రి లేఖ రాశారు. పార్టీపై వచి్చన అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లోనే పోటీనుంచి విరమించుకుంటున్నానని తెలిపారు. కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య? కడియం శ్రీహరి, కడియం కావ్యలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే కావ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా తప్పుకున్నారని అంటున్నారు. ఇందుకోసమే ఇప్పటివరకు కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించ లేదని చెబుతున్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్న తండ్రీకూతుళ్లు ఈ నెల 30న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి బరిలోకి దిగే అవకాశం ఉందని, కానిపక్షంలో కావ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు. ఒకవేళ కడియం శ్రీహరిని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే... ఆయన ఎంపీగా గెలిచిన అనంతరం కావ్యను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ బరిలోకి దింపవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ హామీల మేరకే శ్రీహరి, కావ్యలు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత కోసం శ్రీహరి, కావ్యలను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదు. కావ్య ఎపిసోడ్లో ప్రభుత్వ సలహాదారు, కడియం శ్రీహరికి చిరకాల మిత్రుడు వేం నరేందర్‌రెడ్డి చక్రం తిప్పారన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
సీజేఐకి 600 మంది న్యాయవాదుల సంచలన లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సహా దాదాపు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. పొలిటికల్ అజెండాతో కొన్ని ‘ప్రత్యేక బృందాలు’ తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయస్థానాల పరువు, ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్, హితేష్ జైన్, ఉజ్వల వార్, ఉదయ్ హోల్లా, స్వరూపమా చతుర్వేది, సహా దేశవ్యాప్తంగా 600 మందికిపైగా న్యాయవాదులు ఉన్నారు. వీరంతా లేఖలో ఒకవర్గం న్యాయమూర్తులను తమ పేర్లు ప్రస్తావించకుండా టార్గెట్ చేస్తూ ఈ ఆరోపణలు చేశారు. కొందరు లాయర్లు పగటిపూట రాజకీయ నాయకులను సమర్థించి.. రాత్రిపూట మీడియా ద్వారా న్యాయమూర్తులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన అనేక కేసుల్లో వారు కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఇందుకోసం వారు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ లేఖను మార్చి 26 రాసినట్లు సమాచారం. చదవండి: కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేం: ఢిల్లీ హైకోర్టు -
ఎన్నికల డ్యూటీ వద్దంటూ వినతుల వెల్లువ
దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన వెంటనే పలువురు ఉద్యోగులు తాము తమ ఎన్నికల డ్యూటీకి హాజరకాలేమంటూ ఉన్నతాధికారులకు వినతులు సమర్పించుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల డ్యూటీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే పలువురు ఉద్యోగులు సెలవుల కోసం దరఖాస్తు చేయడం మొదలుపెట్టారు. ఒకరు అనారోగ్యం కారణంగా ఎన్నికల విధులు నిర్వహించలేమని పేర్కొనగా, మరొకరు తమ ఇంటిలో పెళ్లి వేడుకలు ఉన్నాయంటూ సెలవుల కోసం అభ్యర్థించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సింగ్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసినప్పటి నుండి సెలవులకు సంబంధించిన దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులలో ముగ్గురు తాము విదేశాలకు వెళ్తున్నామని రాశారు. ఒకరు తమ కుమార్తె జపాన్‌లో డిగ్రీ అందుకోబోతున్నదని రాయగా, మరొకరు అమెరికాలో తమ కుమార్తె డెలివరికీ వెళ్లాలని రాశారు. ఇంకొకరైతే వివాహ శుభలేఖను కూడా జతచేశారు. ఎన్నికల విధులను తప్పించుకునేందుకు పలువురు ఉద్యోగులు తమ ఆనారోగ్యాన్ని సాకుగా చూపుతున్నారు. నిజానికి ఎన్నికల డ్యూటీలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఎంతో శ్రద్ధగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఈ కారణంగానే పలువురు ఉద్యోగులు ఎన్నికల విధులను తప్పించుకోవాలని చూస్తారనే మాట వినిపిస్తుంటుంది. -
ఇది టీడీపీ మరో వెన్నుపోటు
సాక్షి, అమరావతి: పొత్తుల పేరుతో తెలుగుదేశం పార్టీ మరోసారి బీజేపీకి వెన్నుపోటు పొడుస్తోందని ఏపీ బీజేపీలోని పలువురు సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా ఓడిపోయే సీట్లనే పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిందని వారు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర కమలదళంలో చాలా కాలంగా కొనసాగుతూ, ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న సీనియర్లు కొందరు రెండు రోజుల క్రితం పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాసి అందులో వివిధ అంశాలను వివరించారు. పొత్తులో భాగంగా ఎక్కువచోట్ల మొదట నుంచి పార్టీలో కొనసాగుతున్న వ్యక్తులకు కాకుండా 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వచ్చిన వారికే టికెట్లు దక్కేలా పార్టీ రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి నివేదికలు సమర్పించడాన్ని వ్యతిరేకిస్తూ వీరు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం వీరు పొత్తు సందర్భంగా తమ దృష్టికొచ్చిన అంశాలను పేర్కొంటూ గురువారం జాతీయ నాయకత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖ ప్రతులు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్. దయాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి కె. సురేంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యురాలు కె. శాంతారెడ్డి, బీజేపీ సీనియర్ నేత జూపూడి రంగరాజు, మహిళా మోర్చా జాతీయ మాజీ కార్యదర్శి మాలతీరాణి ఆ లేఖలో సంతకాలు చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను ఉద్దేశిస్తూ రాసిన ఆ లేఖ నకళ్లను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ సంఘటనా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్, కేంద్ర పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యులు లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర పార్టీ సంస్థాగత వ్యవహరాలు పర్యవేక్షించే సంఘటనా కార్యదర్శి మధుకర్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజుకు కూడా పంపారు. పొత్తులకు వ్యతిరేకం కాదు, కానీ.. నిజానికి.. కేంద్ర నాయకత్వంపై తమకు చాలా నమ్మకం ఉందని.. పొత్తు నిర్ణయాన్ని తామేమీ వ్యతిరేకించడంలేదని వారు ఆ లేఖలో స్పష్టంచేశారు. అందులో వారు ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ♦ తాము కూటమి ఏర్పాటుకు వ్యతిరేకం కాదు. కానీ, పొత్తుల పేరుతో జరుగుతున్న పరిణామాలతో మేం విభేదిస్తున్నాం. ♦ పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆరు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలను బీజేపీనే కాదు టీడీపీ కూడా గెలిచే అవకాశంలేదు. ♦ బీజేపీకి కేటాయించిన సీట్లలో గతంలో టీడీపీ గెలవలేదు. అంత బలహీనమైన అసెంబ్లీ సీట్లు మన పార్టీకి ఇచ్చారు. ♦ బీజేపీకి కేటాయించిన ఈ సీట్లు పరిశీలిస్తే టీడీపీ మరో విడత మన పార్టీకి వెన్నుపోటు పొడుస్తోందన్న అభిప్రాయమే కనిపిస్తోంది. ♦ పొత్తులో పార్టీకి కేటాయించిన సీట్లలోనూ అనేక దశాబ్దాలుగా పార్టీ భావజాలంతో పనిచేసి, గెలిచే అవకాశాలున్న అభ్యర్థుల పేర్లను రాష్ట్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ♦ బీజేపీ సీట్లకు అభ్యర్థుల పరిశీలనలో సైతం టీడీపీ ప్రభావమే ఎక్కువగా ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ♦ టీడీపీ మన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ముందస్తు ఎజెండాతోనే ఆ పార్టీ నేతలను మన బీజేపీలోకి బదలాయించింది. తద్వారా ఇప్పుడు ఆ పార్టీ తమ నాయకులను సంతృప్తపరచడంతో పాటు మొదట నుంచి బీజేపీలో కొనసాగే నేతలను కూడా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ♦ కాబట్టి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మా విజ్ఞప్తిని దయతో పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం. పార్టీ అసలైన నేతలకే సీట్లు దక్కేలా చూడాలి.. నిజానికి.. బాధ్యతాయుతమైన పార్టీ నాయకులుగా పార్టీ నిర్ణయాన్ని మేం వ్యతిరేకించడంలేదు. అయితే, గతంలో మనకున్న చేదు అనుభవాల దృష్ట్యా.. భవిష్యత్తులో మన పార్టీని పటిష్టం చేసేందుకు సుదీర్ఘ కాలంగా పార్టీలో కొనసాగుతున్న హార్డ్‌కోర్ నాయకులకే అత్యధిక సీట్లు దక్కేలా చూడాలని మేం అభ్యర్థిస్తున్నాం. రాష్ట్రంలో లక్షలాది మంది పార్టీ అభిమానులు ఇదే అభిప్రాయంతో ఉన్నారన్న విషయం అధిష్టానానికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ లేఖ రాసినట్లు ఆ నాయకులు తమ లేఖలో పేర్కొన్నారు. -
‘పాలమూరు’ పునర్నిర్మాణానికి రూ.10 వేల కోట్లతో ప్రణాళికలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘కాంగ్రెస్ ఎప్పు డైనా విధానాలకు కట్టుబడి, లక్ష్యసాధన కోసం పనిచేసే పార్టీ. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి మూడు నెలల్లోనే పాలమూరు పునర్నిర్మాణం కోసం రూ.10 వేల కోట్లకుపైగా వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నారాయణపేట–కొడంగల్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, ప్రతిష్టా త్మక విద్య, వైద్య సంస్థల ఏర్పాటు, రోడ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం ఇలా ప్రతి రంగంలోనూ అభివృద్ధి పనులతో పాటు పథకాల అమలులో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు’ అని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ హస్తం అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధి ష్టానం వివిధ రాష్ట్రాలకు సంబంధించి శుక్రవారం తొలివిడతగా 39 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు శనివారం కాంగ్రెస్ నాయకత్వానికి వంశీచంద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ.. మహబూబ్‌నగ ర్కు కాంగ్రెస్ గ్యారంటీ పేరిట లేఖ విడుదల చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ నక్కజిత్తులతో పాలమూ రు మోసపోయింది.. ఇదే కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణనే కాదు, మహ బూబ్నగర్నూ పట్టించుకున్న సందర్భం లేదు. ఆ పదేళ్ల నష్టాన్ని పూడుస్తూ, భవిష్యత్ వైపు నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థమైన విధానంతో అడుగులు వేస్తోందని తెలిపారు. అందుకే అడుగడు గునా ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నా రని చల్లా పేర్కొన్నారు. పాలమూరు న్యాయయా త్రలో జనం గుండె చప్పుడు విన్నానని.. కరువు లేని మహబూబ్‌నగర్ ఆకాంక్షకు అనుగుణంగా జనం కోసం.. జలం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు నిర్మించి, జలకళ తెచ్చి, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతానని, అందరూ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. -
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ను ఎలాంటి చార్జీలు లేకుండా అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. గతంలో మీతో సహా, మీ సహచర మంత్రులు చెప్పిన మాటలు, హామీలను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు, ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న మీరు.. ఈరోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాలనీ డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్‌ను మా నిరసన కార్యక్రమం, వినతి పత్రాల రూపంలో మీ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రజల ఆకాంక్షల మేరకు డిమాండ్ మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలి’’ అని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: TS: ‘బాబు పాలనను గుర్తు చేస్తున్న శిష్యుడు’ -
కాపుల డిక్లరేషన్ ఎప్పుడు పవన్?
పాలకొల్లు సెంట్రల్: జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు జయహో బీసీ అంటూ పది హామీలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు సరే.. మరి కాపుల డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారని మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు చేగొండి హరిరామజోగయ్య ప్రశ్నించారు. బుధవారం ‘జయహో కాపూస్ జయహో బీసీస్’ అంటూ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ సరే, కాపుల డిక్లరేషన్ ఎప్పుడంటూ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. 52 శాతం ఉన్న బీసీలకు డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయమేనని, కాపులకూ డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారో కూడా తెలియజేయాల్సిందని సూచించారు. మంగళగిరిలో ఏర్పాటుచేసిన జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్‌లు బీసీ డిక్లరేషన్ పేరుతో 10 ఎన్నికల హామీలిచ్చారని, ఇందులో పవన్ తన వంతుగా బీసీలకు రాజ్యాధికారం దక్కేలా.. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తెస్తానంటూ 11వ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా 25 శాతం ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్థిక సామాజిక పరిస్థితులపైనా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపి –జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ప్రకటించిన హామీలతో సమానంగా కాపులకూ ప్రకటించాల్సిందేనన్నారు. ఇదిలా ఉండగా, మదనపల్లికి.. శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి.. ఆరణి శ్రీనివాస్, రాజంపేట.. ఎంవీ రావు, అనంతపురం.. టీసీ వరుణ్, పుట్టపర్తి.. శివశంకర్, తంబళ్లపల్లి కొండా నరేంద్ర, గుంతకల్లు.. మణికంఠకు కేటాయించాలని సూచిస్తూ పవన్‌కు జోగయ్య మరో లేఖ రాశారు. -
శ్రీశైలంలో మిగిలిన నీళ్లు మాకే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న 15.23 టీఎంసీల జలాలను అత్యవసర తాగు నీటి అవసరాల కోసం తెలంగాణకు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తీవ్ర కరువు పరిస్థితి ఉన్నా కూడా శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 51 టీఎంసీలను ఆ రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలించిందని పేర్కొంది. ఇతర నదీ బేసిన్లకు కృష్ణా జలాలను తరలించేందుకు కృష్ణా ట్రిబ్యునల్–1 అనుమతి లేదని గుర్తు చేసింది. ఇకపై శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు తీసుకోకుండా ఏపీని నిలువరించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా కృష్ణాబోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. తాగునీటి అవసరాలు ముఖ్యం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోని నీటి నిల్వలను తాగు అవసరాలకు కేటాయించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఈ లేఖలో కోరారు. గత ఏడాది అక్టోబర్ 6న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకు న్నట్టు గుర్తు చేశారు. అయినా ఏపీ ప్రభుత్వం సాగు అవసరాలకు సైతం నీటిని తరలించుకుందని ఆరో పించారు. కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణ జనాభా 2 కోట్ల మంది అయితే.. ఏపీ జనాభా 78లక్షల మంది మాత్రమేనని తెలిపారు. 2011 నాటి లెక్కల ప్రకారమే.. తెలంగాణ తాగునీటి అవసరాలకు 46.4 టీఎంసీలు, ఏపీ తాగునీటి అవసరాలకు 18 టీఎంసీలు అవసరమని వివరించారు. కృష్ణా ట్రిబ్యునల్–2కు సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్‌ల ప్రకారం చూస్తే.. తాగునీటి అవసరాల కోసం ఏపీకి 8.85 టీఎంసీలు, తెలంగాణకి 40 టీఎంసీలు అవసరమని స్పష్టం చేశారు. గత వానాకాలంలో తెలంగాణ వాడుకోకుండా మిగిల్చిన 18.7 టీఎంసీలను ఈ ఏడాది వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణా బోర్డును కోరారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలను పణంగా పెట్టి శ్రీశైలం నుంచి చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలను కేటాయించాలన్న నిబంధనేదీ లేదన్నారు. -
‘పాక్ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దు’
వాషింగ్టన్: పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న వేళ.. అగ్రరాజ్య చట్ట సభ్యులు పెద్ద షాకే ఇచ్చారు. ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దంటూ అధ్యక్షుడు జో బైడెన్‌కు డెమొక్రటిక్ సభ్యులు లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. అమెరికా ఆ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని లేఖలో పేర్కొన్నారు వాళ్లంతా. ఫిబ్రవరి 8 నాటి పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగేవరకు కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దని లేఖలో బైడెన్ చట్టసభ్యులు కోరారు. ‘‘పోలింగ్‌కు ముందు, తరువాత రిగ్గింగ్ జరిగిందనే దానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన దర్యాప్తు జరిగేవరకు వేచి చూడండి. అంతవరకు ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దు. లేనిపక్షంలో ఆ దేశాధికారుల ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సమర్థించినట్లవుతుంది. అది అక్కడి ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తిని తక్కువ చేసినట్లే’’ అని లేఖలో ప్రస్తావించారు వాళ్లు. బైడెన్‌తో పాటు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను ఉద్దేశించి సంయుక్త లేఖ రాశారు వాళ్లు. ‘‘ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్‌ఖాన్‌కు జైలు శిక్షలు విధించారు. ఆ పార్టీ అభ్యర్థులకు స్వతంత్రులుగా పోటీ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. పీటీఐ శ్రేణులు.. పోలీసు దాడులు, అరెస్టులు, వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల తుది ఫలితాల విడుదలలో జాప్యం అనుమానాలకు కారణమైంది. ఫలితాలు తారుమారైనట్లు ఆరోపణలు ఉన్నాయి’’ అని 33 మంది చట్టసభ్యులు తెలిపారు. ఇందులో ప్రోగ్రెసివ్ కాకస్ ఛైర్పర్సన్, భారత సంతతికి చెందిన ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో భారీఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు గురువారం పార్లమెంటులోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. అదే సమయంలో.. మెజారిటీ రాకపోయినా కూటమి రూపేణా ప్రభుత్వ ఏర్పాటునకు నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ సిద్ధమైంది. షరీఫ్ సోదరుడు.. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం పాక్ నూతన ప్రధానిగా ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పరిణామాల మధ్య అగ్రరాజ్య చట్టసభ్యుల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
మేమొస్తే ‘అగ్నిపథ్’ రద్దు: ఖర్గే
న్యూఢిల్లీ: తాత్కాలిక ప్రాతిపాదికన యువతను సైన్యంలో చేర్చుకునే ‘అగ్నిపథ్’ పథకాన్ని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ పథకాన్ని ప్రకటించేనాటికే భర్తీ ప్రక్రియలో ఉత్తీర్ణులై నియామక పత్రాల కోసం ఎదురుచూసిన రెండు లక్షల మందికి తక్షణం ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు. ‘సాయుధదళాల్లోకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఆగిపోవడంతో లక్షలాది మంది యువత భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. అగ్నివీర్లు నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాలు కోల్పోయి నడి రోడ్డుపై నిల్చుంటారు. సామాజికంగానూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు’’ పేర్కొన్నారు. సైనిక అభ్యర్థుల పోరాటానికి మద్దతుగా ఉంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ అన్నారు. సైన్యంలో చేరేందుకు యువత కన్న కలలను అగ్నివీర్ పథకంతో బీజేపీ చిదిమేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘‘కేంద్రానికి కొంత జీతభత్యాల చెల్లింపులు ఆదా అవుతాయి తప్పితే ఈ పథకంతో ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలెట్ అభిప్రాయపడ్డారు. అగ్నివీర్ కింద సైన్యంలోకి తీసుకునే యువతలో నాలుగేళ్ల తర్వాత అత్యంత ప్రతిభ కనబరిచిన 25 శాతం మందినే 15 ఏళ్ల శాశ్వత కమిషన్‌లోకి తీసుకుంటామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. -
సీబీఐ విచారణకు 26న ఢిల్లీ రాలేను
సాక్షి, హైదరాబాద్: ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా ఈనెల 26న ఢిల్లీలో విచార ణకు హాజరుకావడం సాధ్యం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి స్పష్టం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీ సుల రద్దు లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐని కోరారు. ఈ మేరకు ఆదివారం కవిత సీబీఐకి లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ఇటీవల సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ప్రతిస్పందనగా రాసిన లేఖలో కవిత కీలకాంశాలను ప్రస్తావించారు. తనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని, 2022 డిసెంబరులో అప్పటి విచారణ అధికారి ఇదే తరహా నోటీసు సెక్షన్ 160 కింద ఇచ్చారని, గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని, సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం లేదా సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటానన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనకు నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని పేర్కొన్నారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం వల్ల తాను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదు సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని, పైగా ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత చెప్పారు. గతంలో ఈడీ నోటీసులు జారీ చేస్తే, తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని, అది పెండింగ్‌లో ఉందన్నారు. తనను విచార ణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని, సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. గతంలో సీబీఐ బృందం హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పు డు విచారణకు సహకరించానని, సీబీఐ దర్యా ప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానని తెలిపారు. కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి పిలవడం, సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. ‘ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మా పార్టీ (బీఆర్ఎస్) కొన్ని బాధ్యతలు అప్పగించింది. రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటాను. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేను. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసుల నిలిపివేత విషయాన్ని పరిశీలించండి’ అని కవిత సీబీఐకి సమాధానమిచ్చారు. -
విచారణకు హాజరుకాలేను.. సీబీఐకి కవిత లేఖ
సాక్షి, హైదరాబాద్: రేపు విచారణకు హాజరుకాలేనంటూ సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించిన ఆమె.. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు రాలేనని స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు వర్చువల్‌గా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. ‘‘గతంలో సెక్షన్ 160 నోటీసుకు, 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉంది. సెక్షన్ 41ఏ కింద ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదు. ఎన్నికల తరుణంలో నోటీసులు ఇవ్వడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఇది నా ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తోంది. సీబీఐ ఆరోపణల్లో నా పాత్ర లేదు.. పైగా కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.’’ అని లేఖలో కవిత పేర్కొన్నారు. ‘‘ఈడీ నోటీసులపై నేను సుప్రీంకోర్టును ఆశ్రయించా.. ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. నన్ను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పారు. సుప్రీంకోర్టులో హామీ సీబీఐకి కూడా వర్తిస్తుంది. సీబీఐ బృందం నా నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించా. సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా సహకరిస్తా. కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు పిలవడం.. సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎంపీ ఎన్నికల దృష్ట్యా మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటా. నా షెడ్యూల్ దృష్ట్యా రేపు విచారణకు హాజరుకాలేను’’ అని కవిత లేఖలో స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన మలుపు -
‘మేడిగడ్డ’ ఖర్చు ప్రభుత్వమే భరించాలి
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, కాఫర్ డ్యాం నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్మాణసంస్థ ఎల్అండ్టీ మళ్లీ తేల్చిచెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్‌తోనే బ్యారేజీని నిర్మించామని, అలాంటప్పుడు అందులో తలెత్తిన లోపాలకు తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈనెల 17న రామగుండం సీఈకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు. అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీళ్లన్నీ మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ను చుట్టుముట్టాయని, దీంతో తాము చేసిన పనులు దెబ్బతిన్నాయని ఆ లేఖలో పేర్కొంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంతో తాము చేసిన పనులు వృథా అయ్యాయని చెప్పింది. ఇందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంటే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్లు (పిల్లర్లు), రాఫ్ట్ ఫౌండేషన్, కటాఫ్ వాల్స్, ససికెంట్ పైల్స్‌ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉందని, పునరుద్ధరణ పనులు చేసే ఏడో బ్లాక్‌తోపాటు దానికి ఇరువైపులా ఉన్న బ్లాకులకు అప్‌స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్‌లో కాఫర్ డ్యాం నిర్మించాల్సి ఉందని ఈ లేఖలో స్పష్టం చేసింది. ఈ పనులు వ్యయ ప్రయాసలతో కూడుకున్నవని, అందుకే ప్రభుత్వం వాటికి మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇందుకు సమ్మతిస్తేనే పునరుద్ధరణ పనులు చేస్తామని పేర్కొంది. గోదావరినదిలో కాపర్‌డ్యాం నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందని, వర్క్అగ్రిమెంట్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. మళ్లీ మొదటికొచ్చిన మేడిగడ్డ పనులు అన్నారం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడానికి ముందు మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో ఇన్వెస్టిగేషన్స్ కొనసాగుతున్నాయనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని, దీంతో ఆ పనులన్నీ మళ్లీ మొదటికొచ్చాయని ఎల్అండ్టీ ఆందోళన వ్యక్తం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్21న సాయంత్రం కుంగిపోయింది. బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్భూమిలోకి ఐదు అడుగులకుపైగా కుంగింది. దీంతో ఏడో బ్లాక్‌లోని నాలుగు పిల్లర్లు భారీగా, ఇంకో ఆరు పిల్లర్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిని పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలని నేషనల్డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రిలిమినరీ రిపోర్టులోనే స్పష్టం చేసింది. బ్యారేజీలోని మిగతా బ్లాకులు దెబ్బతినకుండా ఉండేందుకు పగుళ్లు తేలిన పిల్లర్లు, వాటి రాఫ్ట్ ఫౌండేషన్‌తో సహా తొలగించేందుకు డైమండ్ కట్టింగ్ విధానం అనుసరించాలని నిర్ణయించారు. బ్యారేజీ కుంగిపోయినప్పుడు దానిని పరిశీలించిన ఎల్అండ్టీ అధికారులు తామే పునరుద్ధరిస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు (డిసెంబర్ 2న) బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదని ఎల్అండ్టీ బాంబు పేల్చింది. ఈమేరకు రామగుండం ఈఎన్సీకి ఎల్అండ్టీ అధికారులు లేఖ రాశారు. కాఫర్ డ్యాం నిర్మాణానికికే రూ.55.75 కోట్లు ఖర్చవుతుందని, ఆ మొత్తం కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఇంజనీర్లు, ఎల్అండ్టీ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయి. బ్యారేజీని పునరుద్ధరించకుంటే ఎల్అండ్టీని బ్లాక్‌లిస్టులో పెట్టడంతో పాటు ఆ సంస్థ పొందిన బిల్లులను రెవెన్యూ రికవరీ యాక్ట్ప్రయోగించి వసూలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం ఘాటుగా హెచ్చరించిన తర్వాత కూడా ఎల్అండ్టీ అధికారులు అన్నారం బ్యారేజీ నుంచి నీటి విడుదలను సాకుగా చూపుతూ మేడిగడ్డ పునరుద్ధరణ తమ బాధ్యత కాదని మరో లేఖ రాశారు. మళ్లీ ఒప్పందం చేసుకోండి మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్ డ్యాంతోపాటు బ్యారేజీలో దెబ్బతిన్న పోర్షన్ పునరుద్ధరణకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తిరిగి అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని ఆ లేఖలో స్పష్టం చేసింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2022 జూన్29నపూర్తయ్యిందని, దీంతో దెబ్బతిన్న బ్యారేజీని పునరుద్ధరించడం తమ బాధ్యత కానేకాదని అందులో పేర్కొన్నారు. 2020లో బ్యారేజీ వద్ద కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు సహా ఇతర పనులు చేయాలని కోరారని, ఆ సమయంలో వర్క్అగ్రిమెంట్లో లేని పనులను తాము చేపట్టలేమని స్పష్టత ఇచ్చామని గుర్తు చేశారు. పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్లు ఇవ్వాలని అప్పుడే కోరినా బ్యారేజీ దెబ్బతినేంత వరకు ఇరిగేషన్డిపార్ట్మెంట్నుంచి తమకు ఎలాంటి డిజైన్లు కూడా అందలేదని లేఖలో ప్రస్తావించారు. బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తయిన తర్వాత జరిగిన లోపాలను తాము సరి చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కాఫర్డ్యాంతో పాటు బ్యారేజీ పునరుద్ధరణకు కొత్తగా అగ్రిమెంట్చేసుకుంటే తప్ప తాము అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేమని స్పష్టం చేశారు. -
తెరపైకి కొబ్బరి బోర్డు!
అశ్వారావుపేట రూరల్: రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు అంశం తెరపైకి రావడంతో రైతు ల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుల్లో ఆశలు మొలకెత్తగా.. కేంద్రం స్పందిస్తుందా, లేదా అనే మీమాంస నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా.. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ కేంద్రంగా కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఉండేది. రాష్ట్ర విభజన సమయాన తెలంగాణలో సాగు తక్కువగా ఉందనే కారణంతో ఈ కార్యాలయాన్ని ఏపీకి మార్చారు. ఆనాటి నుంచి ఏపీ కొబ్బరి బోర్డు అధికారులే తెలంగాణలో కుడా కొబ్బరి సాగు విస్తరణ, అభివృద్ధి, రాయితీతోపాటు ఇతర సేవలందిస్తున్నారు. అయితే, తెలంగాణలో బోర్డు లేని కారణంగా కొబ్బరి రైతాంగానికి ఆశించిన స్థాయిలో సేవలు, రాయితీలు అందడం లేదనే చెప్పాలి. దీంతో కొన్నాళ్లుగా ఇక్కడ కూడా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక్కడా వేలాది ఎకరాల్లో సాగు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఎక్కువగా తోటలు, కొబ్బరి నర్సరీలు ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో కొన్నేళ్ల క్రితం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా ఈ రెండు మండలాల్లో కొబ్బరి తోటలు అత్యధికంగా విస్తరించాయి. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో 1,358 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 586 ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ తోటలు సాగులో ఉండగా, తెలంగాణలో ఇప్పటివరకు కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు కాలేదు. ఫలితంగా సాగుదారులకు సేవలందక సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. బోర్డు లేని కారణంగా ఈ ప్రాంత రైతులకు రాయితీలు, ఇతర అంశాల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్లు దక్కడం లేదని తెలుస్తోంది. మంత్రి తుమ్మల లేఖతో కదలిక? గతేడాది ఏప్రిల్‌లో కొబ్బరి అభివృద్ధిమండలి బోర్డు అధికారుల బృందం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించింది. ఈసందర్భంగా రైతుల విజ్ఞప్తి మేరకు బోర్డు ఏర్పాటు విషయాన్ని ఉన్నతా ధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పా రు. కానీ ఆ తర్వాత ఈ అంశం మళ్లీ మరుగునపడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, దమ్మపేట మండలానికి చెందిన మంత్రి తుమ్మలకు వ్యవసాయ శాఖ దక్కడంతో బోర్డు ఏర్పాటు విషయాన్ని స్థానిక రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తుమ్మల తెలంగాణలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటుచేయాలని లేఖ రాయడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. -
70 ఏళ్ల నాటి ప్రేమ లేఖ..అది మరో 'సీతారామం' సినిమా!
ప్రేమికుల గాథలు ఎన్నో చూశాం. కొన్ని విజయవంతమవ్వగా మరికొన్ని విషాదంగా ముగుస్తాయి. ఏదీఏమైనా ప్రేమికులకు సంబంధించిన స్టోరీలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అలాంటి కథే రసవత్తరంగా తెరపైకి వచ్చింది. ఓ లేఖ రూపంలో ఆ గాథ వెలుగులోకి వచ్చింది. అయితే ఆ లేఖ ఎవరూ రాశారు. ఎవరిదీ ఆ ప్రేమ గాథ అనేది మాత్రం మిస్టరీ! వివరాల్లోకెళ్తే..మిచిగాన్‌లోని గ్రాండ్ ర్యాపిడ్స్ అనే ప్రాంతం నుంచి హృదయాన్ని కదిలించే ప్రేమ గాథ వెలుగులోకి వచ్చింది. రిక్ ట్రోజనోవ్స్కీ అనే వ్యక్తికి 70 ఏళ్ల నాటి ప్రేమలేఖ ఒకటి దొరికింది. అతడు 2017లో వ్యవసాయానికి సంబంధించిన వేలంలో ఓ టూల్ బాక్స్‌ని కొనుగోలు చేయగా, అందులో 70 ఏళ్ల క్రితం నాటి లేఖ బయటపడింది. అది శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఆర్మీ కార్పోరల్ ఇర్విన్ ఫ్లెమింగ్ రాసిన లేఖ. గ్రాండ్ ర్యాపిడ్స్‌లో ఉంటున్న మేరీ లీ క్రిబ్స్ అనే మహిళకు రాసిన లేఖ అది. అందులో.. "ఇన్నాళ్లు నీకు దూరంగా ఉండాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు. దేశ సేవ నుంచి తిరిగి వచ్చిన వెంటనే వివాహం చేసుకుంటాను". అని రాసి ఉంది. అయితే ఆ లేఖను ఎవరూ మర్చిపోయారనేది తెలియాల్సి ఉంది. దీంతో రిక్ ఆ లేఖకు సంబంధించిన వారితో ఆ లేఖను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ బాక్స్‌లో పెట్టి మర్చిపోయినా ఆ ప్రేమ లేఖ వెనుక ఉన్న కథను అన్వేషించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు. ఆన్లైన్ సాయంతో ప్రేమికులైన ఫ్లెమింగ్, క్రిబ్స్ని కనుగొని లేఖలో ఉన్నట్లు వారి ప్రేమ సఫలం అయ్యిందో లేదా అని తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు. అయితే తన అన్వేషణ ఫలిస్తుందో లేదో తెలియదు గానీ ఇది తనకు ప్రేమకున్న బలం, శక్తి గురించి గొప్ప అనుభూతిని ఇస్తుందని చెబుతున్నాడు రిక్. అయితే ఆ లేఖ ఈ రోజుల్లో రాసింది మాత్రం కాదంటున్నాడు రిక్. ఎందుకంటే ..ఆ లేఖ మొత్త కవిత్వంలా సాగింది. ప్రసతుతం రిక్ ఆ జంటకు సంబంధించిన బంధువులను వెతికే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే దీని వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా..వారి సంబంధికులు లేదా వారి పిల్లలను కనుక్కుంటే వారి ప్రేమ సఫలం అయ్యిందో లేదా తెలుసుకోగలను, అలాగే వారు కూడా ఓ గొప్ప అనుభూతిని పొందుతారు అని చెబుతున్నాడు రిక్. (చదవండి: మన ప్రేమలు ఏడు రకాలు!) -
వైఎస్సార్సీపీని తప్పించడమంటే.. టీడీపీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజ్యాధికారం నుంచి తప్పించడమంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య చురకలు అంటించారు. పవన్ తనకు అధికారం ముఖ్యంకాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అంటుంటారని, అలాగైతే అధికారం చంద్రబాబుకు ధారపోస్తే మీరు కలలుగంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కుతాయని జనసైనికులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని జోగయ్య ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం ఆయన పవన్‌నుద్దేశించి సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తూ ఒక లేఖ రాశారు. దానిని ఆయన మీడియాకు విడుదల చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ► జనసైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవిలోనైనా రెండున్నర సంవత్సరాలు జనసేనకు కట్టబెట్టనున్నట్లు ముందుగానే చంద్రబాబు నోటితో చెప్పించగలరా? ► పవన్‌కళ్యాణ్, చంద్రబాబునాయుడు అసెంబ్లీ సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో దఫదఫాలుగా సమావేశాలు నిర్వహిస్తుండడం గమనిసూ్తనే ఉన్నాం. కానీ వారిద్దరి మధ్యలో ఏయే చర్చలు జరిగాయో, ఎవరికెన్ని సీట్లు ఇస్తారో, ఏయే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఓ ఎల్లో టీవీ ఛానల్లో జనసేనకు 30 సీట్లని, మరో ఎల్లో వార్తా పత్రికలో 27 సీట్లని ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ► ఎన్నికల నోటిఫికేషన్‌లోగా ఇద్దరు నాయకులు పైవిధంగా ప్రకటించబోతున్నట్లుగా ఎల్లో మీడియాలో రావడం ఎవరిని ఉద్ధరించడానికి? ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలంటే జనసేన పార్టీకి ఇష్టం ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీతో జతకట్టి ముందుకెళ్లడం తప్పని పరిస్థితిగా ఏర్పడింది. ► అయితే, వైఎస్సార్సీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదు. జనసేన సపోర్టు లేకుండా టీడీపీ ఒంటరిగా వెళ్తే మెజారిటీ సీట్లు దక్కించుకోవడం జరిగే పనికాదు. ఇందుకు 2019 ఎన్నికలే నిదర్శనం. ►దీన్ని దృష్టిలో పెట్టుకుంటే జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేది ప్రధాన అంశంకాదు.. జనసేన టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తుందనేది ముఖ్యమైన అంశం. ►కానీ, 25 శాతం జనాభా ఉన్న కాపులు అధికంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన టీడీపీ నుంచి ఎన్ని సీట్లు దక్కించుకుంటోంది? 20 లక్షల జనాభా ఉన్న రాయలసీమలో బలిజలు ఎన్ని సీట్లు, ఉత్తరాంధ్రలో ఎక్కువ జనాభా ఉన్న తూర్పు కాపులు ఎన్ని సీట్లు దక్కించుకోగలుగుతున్నారనేది కాపులకు జనసేన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. చంద్రబాబును అధికారంలోకి తేవడానికి కాదు కాపులు పవన్ వెంట నడిచేది. 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం 50 సీట్లయినా జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది. -
కృష్ణానది జలాలు చెరి సగం పంచాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను చెరిసగం పంచడంతో పాటు షరతులకు అంగీకరిస్తే ప్రాజెక్టులను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయగా బుధవారం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు లేఖ రాసింది. బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) గంపగుత్తగా 811 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిందని, ఆ జలాలను రాష్ట్రాలకు పంచడానికి వీలుగా జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–2)కు బాధ్యతలు అప్పగించారని గుర్తు చేసింది. 811 టీఎంసీలను చెరిసగం అంటే 405.5 టీఎంసీల చొప్పున రెండు రాష్ట్రాలకు కేటాయించాలని స్పష్టం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషన్ ప్రోటోకాల్‌లో కనీస నీటిమట్టాన్ని 830 అడుగులుగా పరిగణనలోకి తీసుకోవాలని, పోతిరెడ్డిపాడు నుంచి ఎస్ఆర్బీసీ ద్వా రా మొత్తం 34 (ఎస్ఆర్బీసీ కాల్వకు 19 టీఎంసీలు, మద్రాస్ తాగునీటికి 15 టీఎంసీలు) టీఎంసీలకు మించి తరలించకుండా కట్టడి చేయాలని, కృష్ణా జలాలను బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలకు మాత్రమే కేటాయించాలని, బేసిన్ వెలుపలికి తరలించకుండా నియంత్రించాలని కోరింది. ఒక నీటి సంవత్సరంలో వాడుకోని మిగులు కోటాను వచ్చే సంవత్సరానికి బదిలీ (క్యారీ ఓవర్) చేసేందుకు అనుమతించాలని, వాడుకోని నీటిని ఖాతాలో లెక్కించకుండా చూడాలని, తాగునీటి వినియోగాన్ని బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 20 శాతంగా మాత్రమే లెక్కించాలని స్పష్టం చేసింది. అలా ప్రకటిస్తే అభ్యంతరం లేదు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చేలోగా పై షరతులకు కట్టుబడి ఉంటామని, అమలు చేస్తామని ప్రకటిస్తే... శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను అప్పగించడానికి అభ్యంతరాలేవీ లేవని ప్రభుత్వం పేర్కొంది. జనవరి 17వ తేదీన నాగార్జునసాగర్‌పై జరిగిన సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను అప్పగించడానికి తెలంగాణ అంగీకారం తెలిపినట్టుగా సమావేశపు మినట్స్‌లో పేర్కొనడాన్ని తప్పుపట్టింది. ఆ సమావేశంలో నాగార్జునసాగర్ వద్ద నవంబర్ 28కి ముందు పరిస్థితిని పునరుద్ధరించాలని మాత్రమే కోరడం జరిగిందని తెలిపింది. తక్షణమే మినట్స్‌ను సవరించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈనెల 27వ తేదీన లేఖ రాశారు. కాగా కేంద్రానికి ఇదివరకే తమ అభిప్రాయాన్ని నివేదించడం జరిగిందని బుధవారం కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. 1న భేటీలో తేల్చి చెప్పండి శ్రీశైలం, నాగార్జునసాగర్ అప్పగింత లాంఛనాలపై చర్చించడానికి వీలుగా ఫిబ్రవరి 1వ తేదీన కేఆర్ఎంబీ నిర్వహించనున్న సమావేశానికి హాజరుకావాలని, లేఖ ద్వారా నివేదించిన అంశాలన్నీ సమావేశంలో తేల్చేసి, తదుపరి చర్చకు ఆస్కారం లేకుండా బయటికి రావాలంటూ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ కీలక సమావేశానికి ఏపీ అధికారులు హాజరుకానున్నారు. -
దేవుడా! ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు: వైరల్ లెటర్
ఈ భూప్రపంచంలో అమ్మను మించిన ప్రేమ దొరకదు. ఆ ప్రేమకు మరో ప్రత్యామ్నాయం లేదు. తన ప్రాణాలు పోతున్నా కూడా బిడ్డ క్షేమం గురించే ఆలోచిస్తుంది. ఈ విషయం అనేక సార్లు రుజువైంది. తాజాగా కేన్సర్‌తో చనిపోతూ తన కుమారుడికి రాసిన ఒక లేఖ ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. పలువురి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. రెడ్డిట్ యూజర్ మాట్ గాల్డ్ కేన్సర్‌తో చనిపోవడానికి ముందు తన తల్లి రాసిన ఒక లేఖను పోస్ట్ చేశారు. చని పోతానని తెలిసి తన కొడుకుపై ప్రేమను, తన బాధను ఈ లేఖలో వ్యక్తం చేసింది ఆ మాతృమూర్తి. ‘‘కన్నా నేను చనిపోతానన్న బాధకన్నా, నిన్ను విడిచి వెళ్లాలన్న ఆలోచన నా ప్రాణాల్ని తోడేస్తోంది. నా తరువాత నిన్ను ఎవరు చూసకుంటారు అనేదే ఎక్కువ బాధగా ఉంది. ఏదో ఒకరోజు నీకు ఇది దొరుకుతుందనే ఆశతో ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసని ఆశిస్తున్నాను.. నువ్వు నా బంగారు కొండవి. మరే ఆదాయం రాదని తెలిసినా నాకోసం ఉద్యోగం మానేసి మరీ ఎంతో సేవ చేసావ్. నీతో గడిపిన ప్రతీ క్షణం చాలా అద్భుతం. ఎప్పుడూ నీతోనే రా..నాన్నా. ఆ పైనుంచి నిన్ను చూస్తూనే ఉంటాను కన్నా.!" అంటూ మాట్ గాల్డ్ చేసిన త్యాగాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె రాసిన లేఖ నెటిజన్లు భావోద్వేగానికి లోను చేసింది. ‘‘ప్రతిరోజూ అమ్మను మిస్ అవుతున్నా.. ఏడుపొస్తోంది. కానీ చిరునవ్వు మధ్య ఆ బాధనంతా దిగమింగుతున్నాను. ఎందుకంటే నాన్న కూడా కేన్సర్‌తో బాధపడుతూ ఐసీయూలో ఉన్నారు. ఆయన్ని చూసుకోవాలి’’ అంటూ మాట్ గాల్డ్ రెడ్డిట్ పోస్ట్ లో రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు సారీ బ్రో అంటూ కమెంట్ చేశారు. నిజంగా మీరు మంచి కొడుకు.. మీకు అంతా మంచి జరగాలని అని కొందరు, అమ్మ ప్రేమ ఎపుడూ మీతోనే... తల్లీ కొడుకుల అనుబంధం ఎప్పటికీ శాశ్వతమే అని మరొకరు వ్యాఖ్యానించారు. మీ కోసం ఆమె కన్న కలలతోపాటు మీ కలలు కూడా నిజం కావాలి అంటూ మరికొందరు యూజర్లు అతనికి ఓదార్పునిచ్చారు. -
‘రీజనల్’కు రాష్ట్ర నిధులు త్వరగా ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. భూసేకరణకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. వెంటనే భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు రూ.2,585 కోట్లను జమ చేయాలని.. హైవే నిర్మాణం వేగంగా సాగేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనితోపాటు తెలంగాణలో మరో 11 జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి 4,048 హెక్టార్ల భూమిని వెంటనే సేకరించి ఇవ్వాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి బుధవారం రెండు లేఖలు రాశారు. ప్రాజెక్టు ఆలస్యమైతే సమస్యలు కేంద్రం భారత్‌మాల పరియోజనలో భాగంగా రూ.26 వేల కోట్లకుపైగా అంచనా వ్యయంతో హైదరాబాద్ నగరం చుట్టూ 350 కిలోమీటర్లకుపైగా రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను నిర్మి స్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మాణ వ్యయా న్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుండగా, భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రం చెరో సగం భరించేలా ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,585 కోట్లను వెంటనే ఎన్హెచ్ఏఐకి జమ చేసి నిర్మాణ పనుల ప్రారంభానికి సహకరించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి గతేడాది ఫిబ్రవరి 3న తాను స్వయంగా రాష్ట్ర సర్కారుకు లేఖ రాశానని, ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాల అధికారులు కూడా పలుమార్లు లేఖలు రాశారని.. అయినా ఆశించిన స్పందన రాలేదని వివరించారు. రాష్ట్రవాటా నిధుల జమలో ఆలస్యం కారణంగా ప్రాజెక్టు జాప్యమై ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయన్నారు. భూసేకరణ త్వరగా చేయండి 66 ఏళ్లలో తెలంగాణలో 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే.. తెలంగాణ ఏర్పాటయ్యాక గత తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలోనే ఎన్డీయే సర్కారు మరో 2,500 కి.మీ జాతీయ రహదారులను నిర్మించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.32,383 కోట్ల అంచనా వ్యయంతో 751 కిలోమీటర్ల పొడవున 11 జాతీ య రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. -
టీటీడీ ఈవో లేఖ.. ఎట్టకేలకు స్పందించిన పురావస్తుశాఖ
సాక్షి, తిరుపతి: అలిపిరి పాదాల మండపం శిథిలావస్థలో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండపం వెనుకభాగం కూలిపోయింది. దీంతో ఇనుప రాడ్లుతో మండపానికి సపోర్ట్ ఇచ్చి తాత్కాలికంగా మరమ్మత్తులు చేశారు,.. కానీ ఏ సమయంలో కూలిపోతుందో తెలియని ఈ మండపం ద్వారా భక్తులకు ప్రాణహాని ఉందని.. టీటీడీ ఈ మండపాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోగా.. దీనిపై రాజకీయ రంగు పులిమి మండప నిర్మాణాన్ని అడ్డుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి రాసిన లేఖపై ఎట్టకేలకు పురావస్తుశాఖ స్పందించింది. ఢిల్లీ ఎఎస్ఏ నుంచి పురావస్తు బృందాన్ని పంపారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం అలిపిరి పాదాల మండపాన్ని పరిశీలించారు. బెంగుళూరు నుంచి జి.శ్రీనివాసులు, చెన్నై నుంచి ఏ. సత్యం, హైదరాబాద్ నుంచి కే.కృష్ణ చైతన్య బృందం మరిన్ని పురాతన మండపాలను పరిశీలించనున్నారు. శిథిలావస్థలో ఉన్న పాదాల మండపం మరమ్మత్తుపై ఆర్కియాలజీ బృందం నివేదిక సమర్పించనున్నారు. -
40 సీట్ల కోసం పవన్ ప్రయత్నం: హరిరామజోగయ్య
సాక్షి, విజయవాడ: ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే కనీసం రెండున్నరేళ్లయినా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆకాంక్షించారు. జన సైనికులు కూడా ఇదే భావిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్‌కు తాను చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం హరిరామజోగయ్య ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా 40 నుంచి 60 సీట్లు కోరాలని పవన్‌కు సూచించానని తెలిపారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం 40 సీట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తనతో చెప్పారని జోగయ్య పేర్కొన్నారు. ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపైనా పవన్‌తో చర్చించానని తెలిపారు. గతంలోనూ హరిరామ జోగయ్య ఇదే విధంగా బహిరంగ లేఖ విడుదల చేయడం గమనార్హం. ఇదీచదవండి.. ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని రాజీనామా -
కుమారుని మృతదేహం పక్కన లేఖ.. వెలుగులోకి కీలక విషయాలు
భళ్లారి: నాలుగేళ్ల కుమారుడిని మైండ్‌పుల్ ఏఐ సీఈఓ సుచనా సేథ్ హత్య చేసిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలుని మృతదేహాన్ని ఉంచిన బ్యాగులో ఓ లేఖ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. విడిపోయిన భర్త తన కుమారున్ని కలవడానికి అనుమతించిన కోర్టు తీర్పుపై ఆవేదన వ్యక్తం చేస్తూ సుచనా నోట్లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. టిష్యూ పేపర్‌పై ఐలైనర్ వాడి సుచనా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ' ఏం జరిగినా సరే కుమారుడు నా వద్దే ఉండాలి. కోర్టు విడాకులు మంజూరు చేసినా సరే.. కస్టడీ హక్కు నాకే దక్కాలి. " అని ఆమె అందులో పేర్కొంది. హత్య అనంతరం బాలుని మృతదేహం వద్ద ఈ లేఖ పెట్టినట్లు తెలుస్తోంది. సుచనా మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పోలీసుల విచారణకు సుచనా సహకరించడం లేదని సమాచారం. కుమారున్ని చంపినందుకు ఆమెలో కొంచెం కూడా మానసిక పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఆరోగ్య, మానసిక పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాగులో దొరికిన లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది. భార్య-భర్తల మధ్య విబేధాల కారణంగా కొడుడు కస్టడీ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుచనా సేథ్ 2010లో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 2020లో దంపతులిద్దరు కోర్టు నుంచి అనుమతి తీసుకొని దూరంగా ఉంటున్నారు. ప్రతి ఆదివారం కుమారునితో కాసేపు తండ్రి గడిపేవాడు. ఇది ఏమాత్రం ఇష్టంలేని కసాయి తల్లి.. కొడుకును చంపేయాలని, తద్వారా భర్తపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Suchana Seth Planned Murder: భరణంగా నెలకు రూ.2.5 లక్షలు -
గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుకు కసరత్తు
సాక్షి, అమరావతి: గోదావరి నదీ జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్ర పరిధిలో గోదావరిలో నీటి లభ్యతను తేల్చి.. జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి అంతరాష్ట్ర నదీ జల వివాదాల (ఐఎస్ఆర్ డబ్ల్యూడీ) చట్టం–1956లో సెక్షన్–3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నవంబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ కోరింది. న్యాయశాఖ అభిప్రాయం ఆధారంగా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర జల్‌శక్తి నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. గోదావరి ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలకు కేటాయించలేదు. నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదరలేదు. కానీ.. జీడబ్ల్యూడీటీ అవార్డు, విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ 714.13 టీఎంసీలు వినియోగించుకోవడానికి అక్రమంగా ఏడు ప్రాజెక్టులను నిర్మిస్తోందని.. దీని వల్ల రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని అనేకసార్లు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ 2020, అక్టోబర్ 6న నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ ఎత్తిచూపారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. కొత్త ట్రిబ్యునల్ కోసం ప్రతిపాదన పంపితే న్యాయసలహా తీసుకుని నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అప్పట్లో హామీ ఇచ్చారు. -
హరిరామ జోగయ్య లేఖపై పేర్ని నాని కామెంట్స్
-
పవన్ కళ్యాణ్ పై హరిరామ జోగయ్య సంచలన లేఖ
-
పవన్ కళ్యాణ్ పై హరిరామ జోగయ్య సంచలన లేఖ
-
మహిళా జడ్జీకి లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్జి తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నారని, అనుమతిస్తే గౌరవప్రదంగా చనిపోతానంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని సీజేఐ సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన ఉత్తర్వుల మేరకు..సత్వరమే నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు. జిల్లాలోని బారాబంకీలో నియామకం అయిన ఏడాదిన్నర నుంచి తనపై కొనసాగుతున్న వేధింపులను బాధిత జడ్జి రెండు పేజీల లేఖలో ప్రస్తావించారు. ‘నాకు ఏమాత్రం జీవించాలని లేదు. ఏడాదిన్నర కాలంలో నన్ను జీవచ్ఛవంలా మార్చారు. నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇంకా మోయడం వల్ల ప్రయోజనం లేదు. నా జీవితంలో ఎలాంటి లక్ష్యం లేదు. దయచేసి నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకునేందుకు అనుమతించండి’అని అందులో తెలిపారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధిత జడ్జి గతంలో పెట్టుకున్న పిటిషన్‌పై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, బాధితురాలిపై వేధింపుల అంశం అంతర్గత ఫిర్యాదుల కమిటీ పరిశీలనలో ఉన్నదని, కమిటీ తీర్మానం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నదంటూ ఆ ఫిర్యాదును ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా, బాధితురాలి లేఖపై సీజేఐ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి నివేదిక కోరారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నివేదికపై ఏమేరకు చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ఆదేశించినట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. -
న్యాయమూర్తులపైనే దాడులా? చీఫ్ జస్టిస్ సీరియస్
ఢిల్లీ: సమాజంలో న్యాయాన్ని కాపాడేవారు న్యాయమూర్తి. అలాంటి హోదా ఉన్న వ్యక్తి అంటే గౌరవం ఉంటుంది. కానీ అలాంటి జడ్జికే లైంగిక వేధింపులు ఎదురైతే? ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. పని ప్రదేశంలో సహచర సీనియర్ న్యాయమూర్తులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళా జడ్జి ఆరోపించారు. స్థానికంగా న్యాయ పోరాటం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో చనిపోవడానికి అనుమితి ఇవ్వాలని కోరుతూ చీఫ్ జస్టిస్‌కు లేఖ కూడా రాశారు. ఉత్తరప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా జడ్జి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ' ప్రజలకు సేవలు చేసే న్యాయమూర్తి వృత్తిలో తక్కువ కాలంలోనే నాకు గొప్ప అగౌరవం జరిగింది. కొన్ని నెలలుగా జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. రాత్రి పూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా కలవమంటున్నారు' అని ఆ మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. 'ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాను. కానీ ఎలాంటి చర్యలు లేవు. హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీని సంప్రదించాను. కానీ, ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ కేసులో సాక్షులు ఆ జిల్లా న్యాయమూర్తి కింద పనిచేసేవారే. సాక్షులు ప్రభావితం కాకుండా దర్యాప్తు పూర్తయ్యేంత వరకు సదరు న్యాయమూర్తిని మరో చోటుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను. కానీ నా అభ్యర్థనను కొట్టివేశారు. ఏడాదిగా ఈ బాధ అనుభవిస్తున్నా. నేను బతికుండి ప్రయోజనం శూన్యం. గౌరవప్రదంగా చనిపోవడానికి అనుమతినివ్వండి' అంటూ లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ దృష్టికి వచ్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించారు. ఈ అంశంపై స్టేటస్ అప్డేట్ కోరాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ ఎం కుర్హేకర్‌ను చీఫ్ జస్టిస్ ఆదేశించారు. తదనంతరం, అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కుర్హేకర్ లేఖ రాశారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నుంచి కూడా నివేదికను కోరారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్ -
వామ్మో చైనా ఇన్ఫెక్షన్
వాషింగ్టన్: చైనాలో నానాటికీ పెరుగుతున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని కొత్త రకం బ్యాక్టీరియల్ నిమోనియా దేశమంతటా శరవేగంగా వ్యాపిస్తుండటం మరింత భయోత్పాతానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో తక్షణం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అమెరికాలో డిమాండ్లు పెరుగుతున్నాయి. చైనాకు రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించాలని ఐదుగురు రిపబ్లికన్ సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. -
మీ వైఫల్యం వల్లే.. సాగర్ స్పిల్ వే సగం స్వాధీనం
సాక్షి, అమరావతి : ఉమ్మడి ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కార్‌ను నియంత్రంచడంలో మీ వైఫల్యంవల్లే మా భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్‌వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను గురువారం స్వాదీనం చేసుకున్నామని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఏపీకి కేటాయించిన నీటిని తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు విడుదల చేశామని స్పష్టంచేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం రాత్రి లేఖ రాశారు. సాగర్ స్పిల్‌వేలో సగభాగాన్ని ఏపీ స్వాదీనం చేసుకుందని కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. కుడి కాలువకు నీటి విడుదలను ఆపేలా ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని ఆ లేఖలో కోరింది. తెలంగాణ సర్కార్ ఫిర్యాదుపై కృష్ణా బోర్డు ఏపీ సర్కార్‌కు శుక్రవారం లేఖ రాసింది. తక్షణమే నీటి విడుదలను నిలిపేయాలన్న కృష్ణా బోర్డు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చుతూ శశిభూషణ్‌కుమార్ బదులిచ్చారు. ఏపీ లేఖలో ప్రధానాంశాలివీ.. ► శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈకి, సాగర్ నిర్వహణ బాధ్యత ఆ ప్రాజెక్టు సీఈకి అప్పగించారు. 2014 నుంచే తెలంగాణ భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈకి అప్పగించకుండా.. తానే నిర్వహిస్తోంది. అదే సమయంలో మా భూభాగంలోని సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను సైతం తెలంగాణ తన అదీనంలోకి తీసుకుంది. ► గత తొమ్మిదేళ్లుగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ సాగర్‌కు తరలించి.. అటు సాగర్ ఎడమ కాలువలో తమ పరిధిలోని ఆయకట్టుకు నీళ్లందిస్తూ రాష్ట్ర హక్కులను తెలంగాణ హరిస్తోందని అనేకసార్లు బోర్డుకు ఫిర్యాదు చేశాం. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను స్వాదీనం చేసుకోవాలని బోర్డును అనేకసార్లు కోరాం. లేదంటే ఏపీ భూభాగంలోని సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను ఏపీకి అప్పగించాలని కోరాం. కానీ, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ► అక్టోబరు 6న త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, సాగర్ నుంచి 15 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ కృష్ణా బోర్డు అక్టోబరు 9న ఉత్తర్వులిచ్చింది. తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించింది. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ యథావిధిగా అదే రోజున ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభించి శ్రీశైలాన్ని తెలంగాణ సర్కార్ ఖాళీచేస్తూ వచ్చింది. దీనిపై అప్పుడే బోర్డుకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీనివల్ల శ్రీశైలంలో మాకు కేటాయించిన 30 టీఎంసీల్లో కేవలం 13 టీఎంసీలనే వాడుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ చర్యలవల్ల 17 టీఎంసీలను కోల్పోయాం. ► సాగర్ కుడి కాలువ కింద మాకు కేటాయించిన 15 టీఎంసీల్లో ఇప్పటివరకు ఐదు టీఎంసీలు వాడుకున్నాం. మిగతా పది టీఎంసీలను వాడుకోనివ్వకుండా సాగర్‌ను తెలంగాణ ఖాళీచేస్తే.. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చడం సవాల్‌గా మారుతుందన్న ఆందోళనతోనే సాగర్ స్పిల్ వేను స్వాదీనం చేసుకుని, కుడి కాలువకు నీటిని విడుదల చేసి మా హక్కులను పరిరక్షించుకున్నాం. నీటి విడుదలను ఆపే ప్రశ్నేలేదు. నేడు రెండు రాష్ట్రాలతో కేంద్రం భేటీ కృష్ణా జలాలపై హక్కులను కాపాడుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్ వే సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. సాగర్ వివాదంతోపాటు కృష్ణా జలాల పంపకాలు, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించడంపై రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్, కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ తదితరులు పాల్గొనే ఈ సమావేశం శనివారం ఉ.11గంటలకు హైబ్రీడ్ విధానంలో (వీడియో కాన్ఫరెన్స్) జరుగుతుంది. గత తొమ్మిదేళ్లుగా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కార్ హరిస్తున్న తీరును ఈ సమావేశంలో కేంద్రం దృష్టికి మరోసారి తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. -
21 ఏళ్ల తర్వాత.. లాడెన్ లేఖ వైరల్
లండన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం తీవ్రరూపం దాలి్చన వేళ.. ఒకప్పటి అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను మరోసారి జనం స్ఫురణకు తెచ్చుకుంటున్నారు. 2001లో అమెరికాపై అనూహ్య రీతిలో ఉగ్రదాడులు జరిపి ప్రపంచ దేశాలకు షాకిచి్చన బిన్ లాడెన్.. ఆ తర్వాత అమెరికా ప్రజలనుద్దేశించి రాసిన రెండు పేజీల లేఖ టిక్–టాక్‌లో వైరల్‌గా మారడం గమనార్హం. ఒసామా లేఖకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. పాలస్తీనాను ఆక్రమించి అణచివేతకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కూడా 9/11 దాడులకు ఓ కారణమని అందులో లాడెన్ సమరి్థంచుకున్నాడు. ‘‘పాలస్తీనా దశాబ్దాలుగా ఆక్రమణలో ఉంది. అమెరికా అధ్యక్షులెవరూ పట్టించుకోలేదు. పాలస్తీనా ఎప్పటికీ ఆక్రమణలోనే ఉండిపోదు. సంకెళ్లను తెంచుకునేందుకు ప్రయతి్నస్తాం. అమెరికా అహంకారానికి క్రైస్తవుల రక్తంతో మూల్యం చెల్లించక తప్పదు’అని లాడెన్ హెచ్చరించాడు. -
రిషి సునాక్‌పై సుయెల్లా బ్రేవర్మన్ ధ్వజం: మూడు పేజీల లేఖ కలకలం
మంత్రివర్గంలో అనూహ్యంగా మార్పులు చేసి, కొత్త వివాదానికి తెరలేపిన బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత, భారత్ సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ స్పందించారు. ప్రధాని సునాక్‌కు ఎవరూ మద్దతుగా లేని సమయంలో తాను ఎంతో అండగా నిలిచానని, వాగ్దానాలన్నింటినీ పక్కన బెట్టి, పాలనలో విఫలమై, ఇపుడు తనపై వేటు వేశారంటూ ఘాటు విమర్శలతో ఒక లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం నుండి వైదొలగమని కోరినందుకు ధన్యవాదాలు. ఇది బాధ కలిగించింది కానీ, బ్రిటీష్ ప్రజలు కోరికమేరకు హోం సెక్రటరీగా పని చేయడం తన అదృష్టమనీ, ఈ సందర్బంగా పౌరసేవకులు, పోలీసులు, బోర్డర్ ఫోర్స్ అధికారులు , భద్రతా నిపుణులందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు. కొన్ని షరతులపై 2022లో అక్టోబ్లో హోం సెక్రటరీగా సేవ చేయడానికి ఆఫర్‌ని అంగీకరించాను అంటూ తన లేఖను మొదలు పెట్టారు. (వర్క్ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే: దిగ్గజాలు ఇపుడేమంటాయో?) రిషి సునాక్ ప్రధాని కావడానికి తాను ఎంతో తోడ్పాడ్డానని ఆమె పేర్కొన్నారు. కీలకమైన పాలసీలపై తనకిచ్చిన దృఢమైన హామీల మేరకు ఆయనకు మద్దతిచ్చాననీ, అయితే ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి, కీలకమైన విధానాల అమల్లో విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే దేశానికి మేలు చేస్తానని బ్రిటన్ ప్రజలకిచ్చిన హామీలను రిషి విస్మరించాంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. అంతేకాదు ప్రధానిగా కొన సాగేందుకు రిషి సునాక్ అనర్హుడంటూ మండిపడ్డారు. అక్రమ వలసలను తగ్గించడం, ఇంగ్లీషు ఛానల్నుదాటకుండా వలస పడవలను ఆపడం, బయోలాజికల్ సెక్స్‌ను రక్షించేలా పాఠశాలలకు చట్టబద్ధమైన మార్గదర్శకత్వం జారీ చేయడం, ఉత్తర ఐర్లాండ్ ప్రోటోకాల్‌పై లాంటి వాగ్దానాల్ని ఆమె ప్రస్తావించారు. ఇది తమ పరస్పర ఒప్పందానికి ద్రోహం మాత్రమే కాదు, దేశానికి చేసి ద్రోహం కూడా అంటూ మూడు పేజీల లేఖలో బ్రేవర్మన్ ధ్వజమెత్తారు. ఎవరైనా నిజాయితీగా ఉండాలి అసలు మీ ప్లాన్లేవీ పని చేయడం లేదు, రికార్డు స్థాయిలో ఎన్నికల పరాజయాల్ని చూశాం. సమయం మించి పోతోందంటూ ఆమె ఒక రేంజ్లో ప్రధానిపై విరుచుకుపడ్డారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: కీలక పరిణామం, ఇది వాడి పనేనా?) ఇది ఇలా ఉంటే రిషి సునాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. సొంత పార్టీ నుంచే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. రిషి క్యాబినెట్‌లోని సీనియర్, సుయెల్లా బ్రేవర్మన్ను హోంమంత్రిగా తొలగించడాన్ని వారు తప్పు పడుతున్నారు. గాజాపై ఇజ్రాయేల్ దాడులను వ్యతిరేకిస్తూ లండన్ వీధుల్లో పాలస్తీనా మద్దతుదారులు మార్చ్, పోలీసుల తీరుపై గత వారం చేసిన వ్యాఖ్యల తర్వాత సుయెల్లాను తొలగించిన విషయం తెలిసిందే. -
తెలుగు రాష్ట్రాలకు గోదావరి జలాల పంపిణీకి..ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య గోదావరి జలాల వాటాను తేల్చి, నీటిని పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై న్యాయసలహా, తెలంగాణ సర్కార్ అభిప్రాయం తీసుకుని కొత్త గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌పై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనుంది. కేంద్రానికి రాసిన లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ♦ గోదావరి బేసిన్లో మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. కానీ.. ప్రస్తుత జల వివాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ఉత్పన్నమైంది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన గోదావరి జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. ♦ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు ట్రిబ్యునల్ ఏర్పాటుకు అంగీకరించారు. ♦ గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి లభ్యతను తేల్చాలి. ♦ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసి.. రెండు రాష్ట్రాల వాటాలు తేల్చాలి. దిగువ రాష్ట్రంలోని ప్రాజెక్టుల ఆయకట్టు హక్కులను పరిరక్షించేలా ఎగువ ప్రాజెక్టుల నిర్వహణ నియమావళిని రూపొందించాలి. ♦ కాళేశ్వరం ఎత్తిపోతలతో తెలంగాణ చేపట్టిన ఇతర ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించాలి. ♦ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిలుపుదల చేసేలా తెలంగాణను ఆదేశిస్తూ.. దిగువ రాష్ట్రం ప్రయోజనాలను పరిరక్షిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి. ♦ ఉమ్మడి రాష్ట్ర పరిధిలో జీడబ్ల్యూడీటీ (గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్) అవార్డు ప్రకారం గోదావరిలో నీటి లభ్యతను నిర్ధారించి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వాటాలు తేల్చడానికి ఐఎస్ఆర్డబ్ల్యూడీ (అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు) చట్టం–1956 సెక్షన్–4(1) ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. ♦ జీడబ్ల్యూడీటీ అవార్డుతో పాటు విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ 714.13 టీఎంసీలు వినియోగించుకోవడానికి అక్రమంగా ఏడు ప్రాజెక్టులను నిర్మిస్తుండటాన్ని అనేక సార్లు కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాం. ♦ ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మదింపు చేసి.. అపెక్స్ కౌన్సిల్ ఆమోదించేవరకూ వాటిని నిలుపుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశించినా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. ♦ తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే.. ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం బ్యారేజ్, పోలవరం ప్రాజెక్టుల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ♦ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉత్పన్నమైన నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం.. 2020, అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించిన మేరకు ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–3 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు గోదావరి జలాలను పంపిణీ చేయాలి. ♦ జీడబ్ల్యూటీడీ అవార్డు ద్వారాగానీ విభజన చట్టం ద్వారాగానీ రెండు రాష్ట్రాలకు ఇప్పటిదాకా గోదావరి జలాలను ప్రత్యేకంగా కేటాయింపులు చేసిన దాఖలాలు లేవు. కానీ.. తెలంగాణ సర్కార్ విభజన చట్టాన్ని పట్టించుకోకుండా అక్రమంగా కాళేశ్వరం(450 టీఎంసీలు), దేవాదుల మూడో దశ (22 టీఎంసీలు), తుపాకులగూడెం బ్యారేజ్ (100 టీఎంసీలు), సీతారామ ఎత్తిపోతల (100 టీఎంసీలు), వాటర్ గ్రిడ్ (32.58 టీఎంసీలు), లోయర్ పెన్‌గంగపై బ్యారేజ్‌లు (6.55 టీఎంసీలు), రామప్ప లేక్ నుంచి పాకాల లేక్‌కు తరలింపు (3 టీఎంసీలు) ప్రాజెక్టులను చేపట్టింది. నికర జలాల్లో మిగులు లేకుండానే.. ♦జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం.. రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిధిలో గోదావరిలో 70 టీఎంసీల పునరుత్పత్తి జలాలతో పాటు 75 శాతం లభ్యత ఆధారంగా (నికర జలాలు) 1,430 టీఎంసీల లభ్యత ఉంటుందని వ్యాప్కోస్ తేల్చింది. ♦ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ధవళేశ్వరం బ్యారేజ్, నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టులకు 659.691 టీఎంసీల కేటాయింపు ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 116.20 టీఎంసీలు అవసరం. అంటే ఆంధ్రప్రదేశ్ డిమాండ్ 775.891 టీఎంసీలు. బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కే వరద జలాలపై పూర్తి హక్కు ఉంటుంది. ♦తెలంగాణలో ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 471.686 టీఎంసీలను వినియోగించుకుంటున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 178.116 టీఎంసీలు అవసరం. అంటే.. తెలంగాణ డిమాండ్ 649.802 టీఎంసీలు. గోదావరిలో 1,430 టీఎంసీల నికర జలాలు ఉంటాయని వ్యాప్కోస్ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటే.. 1425.693 టీఎంసీలు అవసరం. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే గోదావరిలో నికర జలాల్లో మిగులు లేదు. ♦గోదావరి నికర జలాల్లో మిగులు లేకున్నా సరే.. 714.13 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా అక్రమంగా ఏడు ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులకు విఘాతం కలుగుతుంది. ♦ గోదావరి జలాల వినియోగం, పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం లేకపోయినా తెలంగాణ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును 2015లో చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని అనేకసార్లు కోరినా పెడచెవిన పెట్టి.. 2018, జూన్ 6న కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. ♦అంతర్రాష్ట్ర జల వివాదం అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నాకే ప్రాజెక్టు అథారిటీ ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా కాళేళ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతి చెల్లదు. -
మా వ్యూహం మాకుంది
‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 10న విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ–‘‘వ్యూహం’ చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదు. దీంతో ప్రస్తుతానికి సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకుంటే ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటాం. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా ‘వ్యూహం’ను రిలీజ్ చేసుకుంటాం. ఈ సినిమా విడుదల ఆపాలని నారా లోకేశ్ సెన్సార్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. అయితే అదెంత నిజమో చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. మీడియా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పినట్లే ‘వ్యూహం’ ద్వారా నా అభిప్రాయాలు చెప్పాను. అది ఎవరైనా వింటారా? లేదా అన్నది అర్థం లేని ప్రశ్న. సినిమా ఇవ్వడం వరకే నా బాధ్యత’’ అన్నారు. ‘‘మా సినిమాను రివైజింగ్ కమిటికీ పంపినా నష్టం జరగదు. మేము అనుకున్నట్లే అన్నీ సకాలంలో జరుగుతాయని ఆశిస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’’అన్నారు దాసరి కిరణ్ కుమార్. -
రామోజీ రావుకు కొడాలి నాని బహిరంగ లేఖ
-
చంద్ర‘లేఖ’.. నవ్వులపాలు.. ఇంతకీ ఆ లెటర్ రాసిందెవరు?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని అబద్దాల ఫ్యాక్టరీగా మార్చేశారని మరోసారి రుజువు అయింది. అవినీతి కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసినట్లు ఆ పార్టీ చేసిన ప్రచారం ఇందుకు దర్పణం పడుతుంది. తదుపరి అది చంద్రబాబు రాసిన లేఖ కాదని బహిర్గతం అవడంతో మళ్లీ టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి దానికి కలరింగ్ ఇచ్చి, అదేదో చంద్రబాబు ములాఖత్ లో చెప్పారని, వాటిని ఆయన కుటుంబ సభ్యులు క్రోడీకరించి రాశారని ప్రచారం చేశాయి. ✍️ఒక రాజకీయ పార్టీ ఇంతలా అసత్యాలు చెప్పడం ఎంత దారుణం. ఈ విషయంలో చంద్రబాబుది ఒక రికార్డేనని అనేక దృష్టాంతాలు తెలియచేస్తాయి. జైలు శాఖ అధికారులు అసలు అలాంటి లేఖ ఏదీ చంద్రబాబు రాయలేదని, తమకు తెలియకుండా ఎలాంటి లేఖలు బయటకు వెళ్లవని చెప్పడంతోనే నిజం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు ఎన్.టి.రామారావు ఆధ్వర్యంలో టీడీపీ నడిచే రోజుల్లో మరీ ఇంత దిగజారి అబద్దాలు చెప్పడానికి వెనుకాడేవారు. కాని ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది మొదలు పూర్తి విరుద్దంగా వ్యవహారాలు సాగుతున్నాయి. కొంతకాలం అది వాటంగానే ఆయనకు ఉపయోగపడిందని చెప్పాలి. ✍️ఒక చోట చెప్పిన మాట ఇంకో చోట చెప్పకపోవడం, ఒకదానికి విరుద్దంగా మరోకటి చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అప్పట్లో సోషల్ మీడియా లేదు. రాజకీయ ప్రత్యర్ధులకు మీడియా అండ లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిని ఆయన ఆకట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. టీడీపీ, లేదా చంద్రబాబు ఒక అబద్దం ఏదైనా ప్రచారం చేయాలని అనుకున్నా, వెంటనే పసికట్టే మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో అయితే సాధికారికంగా దీనికి సంబంధించిన కథనాలు వెలువడుతున్నాయి. అందువల్లే వారి ఆటలు గతంలో మాదిరి నడవడం లేదు. ✍️తాజాగా చంద్రబాబు రాసినట్లు చెబుతున్న ఈ లేఖను చదివితే విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఆ లేఖలో వాడిన భాష చంద్రబాబుది కాదు. ఆయనకు అంత భాషా జ్ఞానం లేదన్నది అందరికి తెలిసిన రహస్యమే. అలాగే ఆయన కుమారుడు లోకేష్‌కు అసలు తెలుగే అంతంతమాత్రంగా వచ్చు. ఈ మధ్యే కాస్త బెటర్‌గా మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తికి ఇలా లేఖ రాయగలరని ఊహించలేం. ఎవరో అద్దె కవి లేదా అద్దె రచయిత తయారు చేసిన లేఖ ఇదని అర్దం అయిపోతోంది. అందులో ఆయన తాను జైలులో లేనని, ప్రజల హృదయాలలో ఉన్నానని కవితాత్మక ధోరణిలో పేర్కొన్నారు. కవిత్వమే రాని చంద్రబాబుకు ఈ డైలాగులు ఎలాగూ రావు. ✍️ఇదంతా అతిశయోక్తులు, అసత్యాలతో రాశారు. తానే భువనేశ్వరిని యాత్ర చేయాలని కోరినట్లు తెలిపారు. భువనేశ్వరి యాత్రపై ప్రజలలో వ్యతిరేకత రాకుండా ఉండడానికి, ఒకపక్క భర్త జైలులో ఉంటే, ఆమె ఇలా జైలులో తిరుగుతారా అన్న విమర్శ రాకుండా ఉండడానికి చంద్రబాబు ఈ ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. ఇంతవరకు జైలులో చర్చించుకుని ఉండవచ్చు. కాని దీనినే ఆయన లేఖగా రాశారన్నది అబద్దమని తేలుతుంది. జగన్ నియంత అని చంద్రబాబు అన్నారట. దీనిని బట్టి జగన్ శక్తి సామర్ధ్యాలు ఇప్పటికి చంద్రబాబుకు తెలిశాయన్నమాట. ఆయనను ఏ మాట బడితే ఆ మాటతో దూషించి, అధికారంలోకి వచ్చిన వెంటనే జైలుకు పంపుతామని చెబుతూ సైకో భాష వాడుతూ వచ్చిన చంద్రబాబు తాను జైలుకు వెళితే మాత్రం నియంత అని అంటున్నారు. ✍️న్యాయమే గెలుస్తుందని, తాను తప్పు చేయనని, చేయలేదని అంటున్నారే కాని ,తనపై వచ్చిన స్కిల్ కేసులోని ఆరోపణల గురించి ఎందుకు ఒక్క ముక్క చెప్పలేకపోయారు?వాటిలో ఉన్న అభియోగాలకు కొన్నిటికైనా సమాధానం ఇచ్చి ఉండవచ్చు కదా! అలా ఇచ్చే పరిస్థితి లేదు కనుకే అతి తెలివిగా జైలులో ఉన్నప్పటికి ప్రజల గురించే ఆలోచిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కుట్రతో అవినీతి ముద్ర వేసే ప్రయత్నం అని అన్నారే కాని, అది ఏ రకంగా కుట్రో తెలపలేకపోయారు. ఓటమి భయంతో జైలు గోడల మధ్య బందించారని ఆయన అంటున్నారు. ✍️అవినీతి కేసులో జైలులో పడిన మాట నిజమే. కాని ఆ తర్వాత ఆయనను రిమాండ్‌కు పంపింది కోర్టులు కదా! వాటిలో ఆయనకు అనుకూలమైన ఫలితాలు ఇంతవరకు రాకపోవడం వల్ల కదా ఆయన జైలులో ఉండవలసి వస్తోంది. ఆయన అవినీతికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టులు వ్యాఖ్యానించిన విషయాన్ని జనం మర్చిపోవాలన్నది ఆయన కోరిక కావచ్చు. ఆ విషయం చెప్పకుండా, జనాన్ని మభ్య పెట్టాలని చూడడమే ఆక్షేపణీయం. ప్రజలే తన కుటుంబమని సెంటిమెంట్ డైలాగులు చెప్పడానికి బాగానే ఉంటాయి.కాని సెంటిమెంటు కోసం అబద్దపు లేఖలు సృష్టిస్తే ఇంకా ఏమైనా కాస్తో, కూస్తో మిగిలి ఉన్న పరువు కూడా పోతుందని చెప్పాలి. తెలుగుదేశం కార్యకర్తలలో ఏర్పడిన నైరాశ్యాన్ని ఇలాంటి దొంగ లేఖల ద్వారా తొలగించడానికి ప్రయత్నించబోయి భంగపడ్డారని అనుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
మేడిగడ్డపై వాస్తవాలు వెలికి తీయండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్య భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లు కుంగడానికి ఎవరు బాధ్యులో తేల్చాలని కోరుతూ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సోమవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు. బ్యారేజీ భద్రతను పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించింది. కాగా గతేడాది పార్లమెంటులో ఆమోదం పొందిన ‘డ్యామ్ సేఫ్టీ బిల్లు’లో భాగంగా.. ‘కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ నిపుణుల బృందాన్ని తెలంగాణకు పంపించి మేడిగడ్డ వద్ద క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా వాస్తవాలను వెలికి తీయా లని కేంద్రానికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి కోరారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవ డం దురదృష్టకరమని పేర్కొంటూ, 6వ బ్లాక్‌లోని గేట్ నంబర్ 15 నుంచి 20 వరకు కుంగిపోయాయని తెలిపారు. పెద్దగా శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపాక, బ్యారేజీ గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారని వివరించారు. సాగునీటి కోసం నిల్వ చేసిన నీళ్లన్నీ ఇలా వృ«థాగా కిందికి వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ భద్రతకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానంగా.. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు బోర్ హోల్ శాంపిల్స్ తీసుకుని భూమి సామర్థ్యాన్ని నిర్ణయించే పరీక్షలు నిర్వహించారా? లేదా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత ఏర్పడే పరిస్థితులకు అనుగుణంగా.. పైనుంచి వచ్చే వరద, దిగువకు వదిలే నీటి ప్రవాహానికి సంబంధించి రివర్ క్రాస్ సెక్షన్ పరీక్షలు, అధ్యయనాన్ని నిర్వహించారా? ఈ సందర్భంగా ఏమైనా ఇబ్బందులను గమనించారా? వాటన్నింటినీ పరిశీలించాలని కోరారు. ఫౌండేషన్‌లో నాణ్యత లోపం ‘పిల్లర్ల కింద వేసిన ఫౌండేషన్ (పియర్స్) నాణ్య తతో నిర్మించలేదని స్పష్టమైంది. పియర్స్ నిర్మించే సమయంలో అక్కడ సాయిల్ ట్రీట్మెంట్ జరగలేద నేది అర్థమవుతోంది. ఫౌండేషన్ తనిఖీ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్ట మవుతోంది..’ అని కిషన్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొ న్నారు. ప్రాజెక్టును ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్ – కన్స్ట్రక్షన్) పద్ధతిలో కాంట్రాక్ట్ కంపెనీ చేసిందా? లేక రాష్ట్ర నీటిపారుదల విభాగానికి చెందిన సీడీవో (సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్) ద్వారా చేయించారా? అన్న విషయాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. -
పండుగపై పడగ!
సాక్షి, అమరావతి: అంతటా పండుగ సంతోషాలు, సంబరాలు వెల్లివిరుస్తున్న శుభవేళ ప్రతిపక్ష టీడీపీ మాత్రం వికృత రాజకీయాలకు తెగబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు, అలజడులు, విధ్వంసాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతోంది. స్కిల్ కుంభకోణంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి రాశారంటూ ఓ నకిలీ లేఖను ప్రచారంలోకి తేవడంతోపాటు సోమవారం సాయంత్రం ‘జగనాసుర దహనం’ అనే కార్యక్రమానికి నారా లోకేశ్ పిలుపునివ్వడం ద్వారా పార్టీ శ్రేణులు, రౌడీమూకలను అల్లర్లకు పురిగొల్పుతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలను దహనం చేయడంతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, దుకాణాలపై దాడులు, లూటీలు చేయాలన్నది టీడీపీ లోపాయికారీ కుట్రగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చి సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసి అల్లకల్లోలం సృష్టించాలని పథకం వేశారు. మత కలహాలు, వర్గ వైషమ్యాలు సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. విపక్షం కుట్ర రాజకీయాల పట్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన ‘నారా’సురుడు చంద్రబాబే అసలైన నరకాసురుడని వ్యాఖ్యానిస్తున్నారు. అటువంటి వ్యక్తి జైల్లో ఉండటమే ప్రజలకు అసలైన దసరా అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. పోలీసు యంత్రాంగం అప్రమత్తం తాజా పరిణామాలతో పోలీసు యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైంది. ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రజలు సామరస్య పూర్వకంగా ఆనందోత్సాహాలతో దసరా పండుగ నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. -
కృష్ణా జలాలపై ఏపీ హక్కులను పరిరక్షించండి
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగించకుండా పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల (ఐఎస్ఆర్డబ్ల్యూడీ–ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ షేరింగ్ డిస్ప్యూట్స్) చట్టం–1956లో సెక్షన్–1 ప్రకారం కొనసాగుతున్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2కు మరిన్ని విధి విధానాల జారీకి బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం 2014 జూలై 14న చేసిన ఫిర్యాదు ప్రకారం ఈ విధి విధానాలను కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేశారని గుర్తు చేశారు. ఆ విధి విధానాల నుంచి కృష్ణా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లోని మిగతా రెండు రాష్ట్రాలను (మహారాష్ట్ర, కర్ణాటక) పూర్తిగా మినహాయించి.. రెండు రాష్ట్రాలకే (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) పరిమితం చేయాలని ఏకపక్షంగా సూచించడం అశాస్త్రీయం అని చెప్పారు. దీంతోపాటు జాతీయ సంపద అయిన జల వనరులను న్యాయ బద్ధంగా వినియోగించుకోవడానికి కూడా విరుద్ధమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కృష్ణా జలాలపై ఆధార పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ పరమైన చిక్కులను పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకోకుండా కేంద్ర జల్ శక్తి శాఖను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానికి లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం – ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–4 ప్రకారం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–1 (కేడబ్ల్యూడీటీ – కృష్ణా వాటర్ డిస్పూట్ ట్రిబ్యునల్)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేడబ్ల్యూడీటీ–1 ఇచ్చిన తుది నివేదిక ఆధారంగా 1976 మే 31న గెజిట్‌ను ప్రచురించింది. కృష్ణా నదిలో 2,130 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయని కేడబ్ల్యూడీటీ–1 లెక్క కట్టింది. – 75 శాతం లభ్యత ఆధారంగా ఆ మేరకు నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసింది. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించింది. 2,130 టీఎంసీల కన్నా అధికంగా ఉన్న జలాలు అంటే మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–6(1) ప్రకారం కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. అదనపు ప్రవాహాన్ని వినియోగించుకునే స్వేచ్ఛ – అనంతరం కృష్ణా జలాల పంపిణీకి ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం –1956లోని సెక్షన్–4 (1) ప్రకారం 2004 ఏప్రిల్ 2న కేడబ్ల్యూడీటీ–2 (బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న సెక్షన్–5(2) ప్రకారం నివేదిక సమర్పించింది. ఆ తర్వాత 2013 నవంబర్ 29న సెక్షన్ 5(3) ప్రకారం కేడబ్ల్యూడీటీ–1 ద్వారా అప్పటికే 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన 2,130 టీఎంసీల కేటాయింపులను నిర్ధారిస్తూ కేడబ్ల్యూడీటీ–2 తదుపరి నివేదిక సమర్పించింది. – బేసిన్‌లోని రాష్ట్రాలకు సగటు ప్రవాహాలతో సహా 65 శాతం లభ్యత ఆధారంగా అదనపు నీటిని కూడా కేటాయించింది. దీని కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 194 టీఎంసీలు కేటాయించింది. దాంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన మొత్తం కేటాయింపులు 1005 టీఎంసీలు (811 టీఎంసీలు+194 టీఎంసీలు). దీంతోపాటు 2,578 టీఎంసీల కంటే ఎక్కువగా ఉండే అదనపు ప్రవాహాలను ఉపయోగించుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు స్వేచ్ఛ ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఐదు ఎస్సెల్పీలు – కేడబ్ల్యూడీటీ–2 నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఐదు ఎస్సెల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్)లను కృష్ణా బేసిన్‌లోని రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేశాయి. సెక్షన్ 5(2) ప్రకారం కేడబ్ల్యూడీటీ–2 ఇచ్చిన నివేదికను పక్కన పెట్టాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సుప్రీంకోర్టు 2011 సెప్టెంబరు 16న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా కేడబ్ల్యూడీటీ–2 సెక్షన్–5(2) కింద ఇచ్చిన నివేదికపై స్టే ఇచ్చింది. అన్ని ఎస్సెల్సీలు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే అంశాన్ని 2021 ఆగస్టు 17న.. ఆ తర్వాత 2022 జూన్ 25న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ట్రిబ్యునల్ ద్వారా జరిగిన కేటాయింపులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా న్యాయ బద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరాం. -
అతి నియంత్రణ అనర్ధదాయకం..
న్యూఢిల్లీ: ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సర్విసులని, మరొకటని ఇంటర్నెట్ సేవలను వేర్వేరుగా వర్గీకరిస్తూ ’అతిగా నియంత్రించడం’ అనర్ధదాయకంగా మారే ప్రమాదముందని స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల వివిధ రకాల సేవలు అందించే సంస్థలు వివక్షకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలాకు 129 అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఈ మేరకు సంయుక్త లేఖ రాశారు. జిరోధాకు చెందిన నితిన్ కామత్, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు వీరిలో ఉన్నారు. ఓటీటీలు భారీగా డేటాను వినియోగిస్తుండటం వల్ల తమ నెట్‌వర్క్‌లపై భారం పెరిగిపోతోందని, వ్యయాలను భర్తీ చేసుకునేందుకు సదరు ఓటీటీ సంస్థల లాభాల్లో కొంత వాటా తమకూ ఇప్పించాలని టెల్కోలు కోరుతున్న నేపథ్యంలో స్టార్టప్‌ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీడ్, లభ్యత, వ్యయాలపరంగా ఏ యాప్‌పైనా టెలికం, ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్లు వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించే నెట్ న్యూట్రాలిటీ విధానానికే తమ మద్దతని లేఖలో స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తెలిపారు. ఓటీటీ వంటి సర్విసులు అందించే సంస్థలను టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్పీ) నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తేవడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ యాప్స్, సర్విసులకు టెలికం లైసెన్సింగ్ నిబంధనలను వర్తించేస్తే దేశీ స్టార్టప్ వ్యవస్థకు తీవ్ర హాని జరుగుతుందని వివరించాయి. ఇవన్నీ కూడా బడా బహుళజాతి సంస్థలకే లబ్ధి చేకూరుస్తాయని అంకుర సంస్థల వ్యవస్థాపకులు లేఖలో తెలిపారు. -
కేసీఆర్‌కు మైనంపల్లి సంచలన లేఖ.. బీఆర్ఎస్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా అధికార బీఆర్ఎస్ మాల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్‌కు మైనంపల్లి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక, లేఖలో బీఆర్ఎస్ పార్టీ నేతలపై మైనంపల్లి సంచలన ఆరోపణలు చేశారు. మైనంపల్లి లేఖలో.. బీఆర్ఎస్ పార్టీలో కొందరు సీనియర్ నేతలతో తీవ్రవిబేధాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్లో పారదర్శకత, ప్రజాస్వామ్యం లేదంటూ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయత్వం క్షేత్రస్థాయిలో ఉన్న శ్రేణుల అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పార్టీ పేరు మార్చడం కార్యకర్తలకు ఇష్టం లేదని, ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ తెలంగాణలో నష్టం వాటిల్లిందన్నారు. అధికారం కోసం ఆరాటపడే కొందరి చేతుల్లోకి బీఆర్ఎస్ వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికీ లొంగే ప్రసక్తే లేదు.. అంతకుముందు.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక వీడియో ప్రకటనను ఆయన విడుదల చేశారు. మల్కాజిగిరి ప్రజలు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తానని, దేనికీ లొంగే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు. రోహిత్‌కు నో టికెట్.. ఇదిలా ఉండగా.. గత నెల 21న బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మంత్రి హరీశ్‌రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లికే మరోమారు టికెట్ కేటాయించిన కేసీఆర్.. కానీ, ఆయన కుమారుడు రోహిత్‌కు మాత్రం టికెట్ ఇవ్వలేదు. దీంతో మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగినా బీఆర్ఎస్ వేచి చూసే ధోరణి అవలంభించింది. ఈ నెల 26న ఢిల్లీలో సోనియా, రాహుల్ సమక్షంలో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరిక ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజశేఖర్‌రెడ్డికి టికెట్‌పై త్వరలో ప్రకటన నెల రోజుల క్రితం మైనంపల్లి ధిక్కార స్వరం వినిపించిన మరుక్షణం నుంచే కేసీఆర్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డి పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మైనంపల్లి రాజీనామా నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశముంది. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో 70 సీట్లలో వడపోత పూర్తి! -
జడ్జిపై టీడీపీ నేతల పోస్టులు.. రాష్ట్రపతి భవన్ నుంచి సీరియస్ లేఖ
సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ రాసింది. రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా.. జవహర్ రెడ్డికి లేఖ రాశారు. అయితే, చంద్రబాబు కేసులో భాగంగా అడిషనల్ సెషన్స్ జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు వెళ్లింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్ రామానుజరావు ఈ-మెయిల్ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును రిమాండ్‌కు పంపించిన తర్వాత హిమబిందు వ్యక్తిగత జీవితంపై టీడీపీ నేతలు వివాదస్పదంగా వ్యవహరించారు. హిమబిందు వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని రామానుజరావు తన ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామానుజరావు ఫిర్యాదు రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ రాసింది. జడ్జి హిమబిందుకు సంబంధించిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని జవహర్‌రెడ్డికి పీసీ మీనా లేఖ రాశారు. ఇది కూడా చదవండి: ‘బ్లూజీన్’ ద్వారా కోర్టులో చంద్రబాబు హాజరు -
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ కీలక లేఖ..
-
25 ఏళ్లయినా..గడువు కోరుతూనే ఉంటారు
సాక్షి, హైదరాబాద్: ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసి 18 ఏళ్లయినా నివేదక అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 25 ఏళ్ల తర్వాత కూడా ఇంకా సమయం కావాలని కోరుతూనే ఉంటారని అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాలు సమయం ఇస్తున్నామని, కొత్తగా నిర్మించే భవనాల్లో ఇంకుడుగుంతల ఏర్పాటుపై అమికస్ క్యూరీ చేసిన సూచనలపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్‌లో నీటికొరతపై సుభాష్‌చంద్రన్ 2005లో హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లో అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి నివేదిక సమర్పించారు. ప్రస్తుతం నీటికొరత అంతగా లేకపోయినా, భవిష్యత్ అవసరాల నిమిత్తం సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని, భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడే ఇంకుడుగుంత ఏర్పాటు తప్పనిసరి చేయాలన్నారు. వాల్టా చట్టం కింద బోర్ల తవ్వకంపై నియంత్రణ అవసరమని చెప్పారు. దీనిపై నివేదిక అందజేయడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. ఏళ్లు గడిచినా ఇంకా గడువు కోరడం సాధారణంగా మారిందని ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. 3 వారాలు గడువిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
మహిళ, బీసీ బిల్లులపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
-
పార్టీ క్యాడర్‌కు అనుబంధ సంఘాలకు అచ్చెన్నాయుడు లేఖ
-
సిట్ అధికారులకు చంద్రబాబు లేఖ
సాక్షి, విజయవాడ: తన లీగల్ టీమ్‌ను కలిసేందుకు అనుమతి కోరుతూ సిట్ అధికారులకు చంద్రబాబు లేఖ రాశారు. లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు, ఎం.లక్ష్మీనారాయణ, జవ్వాజి శరత్ చంద్రలను కలిసేందుకు చంద్రబాబు అనుమతి కోరారు. కాసేపట్లో ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది. అంతకు ముందు ఆయన్ని సీఐడీ ఆఫీసుకు తరలించారు.. ఆయనకు వైద్య పరీక్షలు అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబును నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. చదవండి: CBN: కళ్లు మూసుకుని అవినీతిని ప్రోత్సహించి.. -
ప్రధానికి లేఖ.. మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదు?
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం లేకపోవడాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధానికి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని సోనియా గాంధీని కవిత సూటిగా ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం కాదా? అని అడిగారు. మహిళా బిల్లును కాంగ్రెస్ పూర్తిగా విస్మరిస్తున్నట్టు తేటతెల్లమైందని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ముఖ్యమైన మహిళ బిల్లు పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని నిరూపితమైందని స్పష్టం చేశారు. ఈమేరకు బుధవారం రోజున ఎక్స్ (ట్విట్టర్)లో కవిత పోస్ట్ చేశారు. చదవండి: ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్ రన్ ప్రారంభించనున్న సీఎం Saddened to see that the urgency for discussing Women's Reservation Bill was completely ignored in Congress Parliamentary Party Chairperson and MP Smt. Sonia Gandhi Ji's letter to the Prime Minister. Mrs. Gandhi Ji, the nation awaits your powerful advocacy for gender equality.… https://t.co/RHlQAbLPz8 — Kavitha Kalvakuntla (@RaoKavitha) September 6, 2023 -
పెద్దపల్లిలో మావోయిస్టు లేఖ కలకలం.. బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్!
సాక్షి, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లిలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. గోరెడ్డిపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్, భూషనవేని శ్రీనివాస్, శ్రీరాములు గోపాల్‌కు వార్నింగ్ ఇస్తూ లేఖలు విడుదల చేశారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని లేఖలో హెచ్చరించారు. దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని మావోయిస్టు నేత వెంకటేష్ పేరిట లేఖ విడుదల అయ్యాయి. ‘30 మందికి పైగా ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మించి నిరుద్యోగులుగా ఉన్న యువత నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని పేర్కొన్నారు. ఒక్కొక్కరి దగ్గర 4 నుంచి 6 లక్షల వరకు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టించలేదు. ఉద్యోగాలు వస్తాయని ఆశలు కల్పించి మోసం చేయడంతో బాధితులు డబ్బులు వాపస్ ఇవ్వాలని అడిగితే నాయకులంతా ప్రభుత్వ అండదండలతో మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరిస్తున్నారు. పోలీసులతో, రాజకీయ నాయకులతో బెదిరిస్తున్నారు. చదవండి: ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు డబ్బులు వాపస్ ఇవ్వకపోవడంతో ఆస్తులు అమ్ముకున్న వాళ్లు దిక్కులేని వాళ్లు అయ్యారు. ఆర్ఎఫ్ఎల్ బాధ్యులు ఇచ్చిన డబ్బులు వాపస్ ఇవ్వాలి. ఈ ముగ్గురు భూ కబ్జాలు చేస్తూ ప్రజల మధ్య తగాదాలు సృష్టించి డబ్బులు తీసుకొని పంచాయితీలు చేయడం, వినని వారిపై కేసులు పెట్టించడం, ఇద్దరి మధ్య ఒప్పందం చేయించి డబ్బులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గ్రామంలో దళితులపై సమస్యలు సృష్టించి వారిని కొట్టించారు. తిరిగి పోలీసులకు చెప్పి గ్రామాన్ని దిగ్భందించి దళితులను తీసుకెళ్లి 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచి చిత్రహింసలు పెట్టి ఉల్టా కేసులు పెట్టించారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు. గుండాయిజం, భూతగాదాలు, పంచాయితీలు చేయడం మానుకోవాలి, దళితులపై కేసులు ఉపసంహరించుకోని, వారికి క్షమాపనలు చెప్పాలి, లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు’ అని లేఖలో పేర్కొన్నారు. -
సమావేశాల్లో ఆ 9 అంశాలపై చర్చించండి
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అజెండాను ప్రకటించకుండానే ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసారి సమావేశాల్లో మణిపూర్‌లో హింస, దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు తదితర కీలకాంశాలపై చర్చించాలని డిమాండ్‌చేస్తూ ప్రధాని మోదీకి సోనియా లేఖ రాశారు. ముఖ్యంగా తొమ్మిది అంశాలపై చర్చ జరగాల్సిందేనని ఆమె పట్టుబట్టారు. ‘ మణిపూర్‌లో హింస, పెరిగిన ధరవరలు, రాష్ట్రాలు– కేంద్రం మధ్య క్షీణిస్తున్న సత్సంబంధాలు, చైనాతో సరిహద్దు వెంట కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అదానీ గ్రూప్‌లో అవినీతి లావాదేవీల బహిర్గతం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు వంటి అంశాలను చర్చించాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ‘ ఇతర రాజకీయ పారీ్టలతో ఎలాంటి సంప్రతింపులు జరపకుండానే ఎలాంటి ఎజెండా ప్రకటించకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వ ఎజెండా ఏమిటో ఎవ్వరికీ తెలియదు. సమావేశాలు జరిగే ఈ మొత్తం ఐదు రోజులూ ప్రభుత్వ ఎజెండాపైనే చర్చ జరగనుందని మాకు సమాచారం వచ్చింది’ అని సోనియా వ్యాఖ్యానించారు. ఇదో చక్కని అవకాశం ‘ఇదో చక్కని అవకాశం. ప్రజాసమస్యలు, ప్రాముఖ్యత దృష్ట్యా ఈసారి సమావేశాల్లో మేం తప్పకుండా పాల్గొంటాం. ఈ అంశాలపై చర్చకు సమయం కేటాయిస్తారనే భావిస్తున్నాను’ అని సోనియా అన్నారు. ‘ఉభయ సభల్లో ఏ అంశాలపై చర్చిస్తారో అనే విషయాన్ని ముందుగా తెలపకుండానే సెషన్‌ను ప్రారంభిస్తుండటం బహూశా ఇదే తొలిసారి అనుకుంటా’ అని కాంగ్రెస్ మరో నేత జైరామ్ రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర రాజకీయ పారీ్టలు చేస్తున్న డిమాండ్లకు తగ్గట్లు దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని సోనియా కోరారు. ప్రకృతి విపత్తుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో భారీ వరదలు సృష్టించిన విలయం, మరి కొన్ని రాష్ట్రాల్లో కరువు కాటకాలు వంటి ఘటనలను చర్చించాలని సోనియా డిమాండ్‌చేశారు. ‘పెరుగుతున్న నిరుద్యోగిత, సమాజంలో అసమానతలు, సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సమస్యల వలయంలో చిక్కుకోవడం వంటి అంశాలనూ చర్చించాలి. రైతుల డిమాండ్ మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతాంగం సమస్యలు చర్చకు రావాలి’ అని సోనియా అన్నారు. ‘ఈసారి సమావేశాలను మేం బాయ్‌కాట్ చేయబోం. సభలోనే ఉండి సమస్యలపై పోరాడతాం’ అని ఢిల్లీలో మీడియా సమావేశంలో జైరాం రమేశ్ చెప్పారు. ఆ తొమ్మిది అంశాలు 1. ప్రస్తుత దేశ ఆర్ధిక పరిస్థితితో పాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, అసమానతల పెరుగుదల, ఎస్ఎంఈలపై దుస్థితి 2. రైతులు, రైతు సంస్థలు లేవనెత్తిన కనీస మద్దతు ధర అంశంతో పాటు వారు లేవనెత్తిన ఇతర డిమాండ్ల పరిస్కారం కోసం మోదీ సర్కార్ చూపే నిబద్ధత 3.అదానీ వ్యాపార సమూహం లావాదేవీలను దర్యాప్తు చేయడానికి జేపీసీ ఏర్పాటు 4.మణిపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న నిరంతర వేదన, రాజ్యాంగ వ్యవస్థల విచి్ఛన్నం, అక్కడ నెలకొల్పాల్సిన సామాజిక సామరస్యం 5.హరియాణా వంటి వివిధ రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలు పెరగడం 6.భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని మన సరిహద్దుల్లో దేశ సార్వ¿ౌమాధికారానికి ఎదురైన సవాళ్లు 7.దేశవ్యాప్తంగా కుల గణన 8.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దిగజారుతున్న సంబంధాలు 9.ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో విపరీతమైన వరదలు, మరికొన్ని రాష్ట్రాల్లో కరువు కారణంగా పెరిగిన కష్టాలు Here is the letter from CPP Chairperson Smt. Sonia Gandhi ji to PM Modi, addressing the issues that the party wishes to discuss in the upcoming special parliamentary session. pic.twitter.com/gFZnO9eISb — Congress (@INCIndia) September 6, 2023 #WATCH | #WATCH | Congress MP Jairam Ramesh says, "Sonia Gandhi in a letter (to PM Modi) mentioned that the session has been called without any discussion with the opposition...Nobody had any information about it...This is for the first time that we do not have any details for… pic.twitter.com/IzEXXJFMEj — ANI (@ANI) September 6, 2023 -
వెంటనే ఉత్తరం రాస్తే.. ఈ బహుమతి మీకే..!
ఆదిలాబాద్: నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్, ఈ–మెయిల్స్, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నారు. ఐదు దశాబ్దాల ముందుకు వెళ్తే ఉత్తర ప్రత్యుత్తరాలు కేవలం లేఖల ద్వారానే జరిగాయి. దూరప్రాంతాల్లో ఉన్న వారి క్షేమ సమాచారాన్ని ఉత్తరం, టెలిఫోన్, టెలిగ్రామ్ ద్వారా తెలుసుకునే పరిస్థితి ఉండేది. సెల్‌ఫోన్ వినియోగం.. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడకం తర్వాత సమాచార వ్యవస్థలో విప్లవం వచ్చిందని చెప్పవచ్చు. నేటి తరానికి ఇంచుమించుగా ఉత్తరం అంటే తెలియని పరిస్థితి ఉంది. అందుకే ఉత్తరాన్ని తిరిగి పరిచయం చేసేందుకు, తెలిసిన వారికి మరోసారి గుర్తు చేసేందుకు తపాలాశాఖ నడుం బిగించింది. లేఖరులకు పోటీ పెడుతోంది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉత్తరాలకు ప్రాధాన్యం తగ్గింది. దూర ప్రాంతాల్లో ఉన్న వారి క్షేమ సమాచారం తెలియజేయాలన్నా, వ్యాపార అవసరాల ని మిత్తం సమాచారం పంపించాలన్నా ఒకప్పుడు పె న్ను, పేపరు తీసుకుని లేఖలు రాసేవారు. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కానరాదు. మొబైల్ ఫోన్ ద్వారా స మస్త సమాచారాన్ని క్షణాల్లో వివిధ మార్గాల్లో చేరవేస్తున్నారు. ఫోన్లోనే ప్రత్యక్షంగా వాయిస్ కాల్, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఖండాంతరాల్లో ఉన్న వారితో సైతం వీడియో కాల్ ద్వారా మాట్లాడే పరిస్థితి ఉండడంతో లేఖల ద్వారా ఉత్తర, ప్రత్యుత్తరాలు మర్చిపోయిన పరిస్థితి ఉంది. ఒకప్పటి సమాచార సాధనమైన ఉత్తరాన్ని నేటి యువతరానికి గుర్తు చేసేందుకు తపాలా శాఖ లేఖారచన పోటీలకు శ్రీకారం చుట్టింది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’ అనే అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ‘థాయి ఆఖర్’ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. బహుమతులు ఇలా.. రెండు కేటగిరీల వారీగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విజేతలను ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ఒక్కో విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి 12 మందికి మించకుండా ప్రథమ రూ.25 వేలు, ద్వితీయ రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5వేలు, జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ రూ.25 వేలు, తృతీయ రూ.10 వేల నగదు అందజేస్తారు. సద్వినియోగం చేసుకోవాలి.. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సదవకాశం. వయసుతో పనిలేకుండా ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇచ్చిన అంశానికి సంబంధించి స్వదస్తూరితో వ్యాసం రాసి పోస్ట్ చేయాలి. – ఎన్.అనిల్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాలా శాఖ పర్యవేక్షకులు రెండు విభాగాల్లో.. ఈ పోటీల్లో భారతదేశ పౌరులు పాల్గొనవచ్చు. 18 ఏళ్ల లోపు వారికి ఒక కేటగిరీ, ఆపై వారిని మరో కేటగిరీగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో వ్యాసం రాయవచ్చు. డిజిటల్ విధానంలో పాలన, మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాలను అందులో పొందుపర్చారు. ఎ4 సైజ్ పేపరుపై రాసి ఎన్వలప్ కవర్లో పంపించవచ్చు. ఎన్వలప్ కవర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా, ఇన్‌ల్యాండ్ లెటర్ అయితే 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్స్ సాధనాల్లో టైప్ చేసిన లేఖలను పోటీకి అనుమతించరు. వ్యాసం చేతితో మాత్రమే రాసి పంపించాలి. లేఖలు పంపించేవారు వారి వయసును నిర్ధారిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోటీలో గెలిస్తే వారి వయస్సు, ఐడీ ధ్రువీకరణకు అవసరమైన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రాసిన ఉత్తరాలను ఎస్పీవోఎస్, ఆదిలాబాద్ డివిజన్ చిరునామాకు అక్టోబరు 31లోగా పంపించాలి. -
సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విద్యార్థినులు రక్తంతో లేఖ..
లక్నో: ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లో బాలికలను లైంగికంగా వేధింపులకు గురి చేసినందుకు స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానోపాధ్యాయుడు రాజీవ్ పాండే తమను ఆఫీస్‌కు పిలిచి అసభ్యంగా తాకేవాడని విద్యార్థినులు పోలీసులకు తెలిపారు. తమ తల్లిదండ్రులకు ఈ విషయాలు తెలపడానికి భయపడేవారమని చెప్పారు. ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విద్యార్థినులు రక్తంతో లేఖ రాశారని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు వేధింపుల గురించి చెప్పగా.. ప్రిన్సిపల్‌కు, తమ కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగిందని విద్యార్థినులు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో పాఠశాలకు వచ్చి దాడి చేశారని తమపైనే ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని వెల్లడించారు. ఈ క్రమంలో రెండు వర్గాల తరపు నుంచి కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందుకు పోలీసులు తమను బెదిరింపులకు గురిచేసి నాలుగు గంటలు స్టేషన్లో ఉంచారని పేర్కొన్నారు. ఇకపై తరగతులకు హాజరకావద్దని పోలీసులు హెచ్చరించినట్లు లేఖలో రాశారు. ప్రిన్సిపల్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినందున పోలీసులు చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు లేఖలో తెలిపారు. తామంతా మీ కూతుళ్లమని పేర్కొంటూ.. తమకు న్యాయం చేయాలని సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ అనంతరం స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని గాజియాబాద్ సీనియర్ పోలీసు ఆఫీసర్ సలోని అగర్వాల్ తెలిపారు. ఇదీ చదవండి: 'నాకే సలాం కొట్టవా..?' బాలునిపై కాంగ్రెస్ నేత కొడుకు దాడి -
కాళేశ్వరంపై సందేహాలన్నీ తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం, మనుగడ, సుస్థిరతలపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేననెత్తిన సందేహాల్లో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని, వాటికి కూడా బదులిస్తే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీని పరిశీలిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్లు తెలిసింది. జీఎస్టీ సమావేశంలో పాల్గొనేందుకు గత జూలైలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అక్కడ జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తాజాగా షెకావత్ స్పందించారు. మంత్రి హరీశ్‌రావు స్వయంగా లేఖ రాశారు. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలు అసంపూర్ణంగా ఉన్నాయని, అన్ని అంశాలపై సమగ్ర సమాధానాలను ఇవ్వాలని లేఖలో కోరినట్టు తెలిసింది. ఆ వెంటనే ప్రాజెక్టుకు అనుమతుల జారీ ప్రక్రియను పునరుద్ధరిస్తామని కూడా తెలియజేసినట్టు సమాచారం. ఇబ్బందికర ప్రశ్నలు..క్లుప్తంగా వివరాలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు చేసిన వ్యయం, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు యూనిట్‌కు రూ.3 చొప్పున విద్యుత్ సరఫరాకు తెలంగాణ ఈఆర్సీ అనుమతి ఇచ్చిందా? ప్రస్తుత విద్యుత్ చార్జీలు ఎంత? విద్యుత్ చార్జీల భారం దృష్ట్యా భవిష్యత్తులో ప్రాజెక్టు ఆర్థికంగా మనుగడ సాధిస్తుందా? ప్రాజెక్టు సుస్థిర మనుగడకు ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి ? ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎంత? రుణాలు, వడ్డీల రేట్లు ఎంత? తదితర వివరాలను అందజేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. గతేడాది జూలైలో గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లు ఎందుకు మునిగాయి? పంప్‌హౌస్‌లు, సర్విస్ బే ఎత్తుఎంత? జలాశయాల ఎఫ్ఆర్ఎల్ ఎంత? లాంటి సాంకేతిక అంశాలపై కూడా ఆరా తీసింది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన అన్ని కాంపోనెంట్ల డిజైన్లను సమర్పించాలని సూచించింది. దూర ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణాలు, ప్రాజె క్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలనూ అడిగింది. సీడబ్ల్యూసీ అడిగిన సమాచారం చాలావరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండడంతో వివరాలు క్లుప్తంగా అందజేసినట్టు తెలిసింది. కాగా ఈ సమాచారంపై సంతృప్తి చెందకపోవడంతోనే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీ ప్రక్రియ ను సీడబ్ల్యూసీ నిలుపుదల చేసినట్టు సమాచారం. -
గద్దర్ భార్య విమలకు ప్రధాని మోదీ లేఖ
ఇటీవల మరణించిన ప్రజాకవి గద్దర్ భార్య గుమ్మడి విమలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. గద్దర్ మృతి తెలుసుకొని తానెంతో బాధపడ్డానని తెలిపారు. తీవ్ర దు:ఖంలో ఉన్న గద్దర్ కుటుంబానికి మోదీ సానుభూతిని తెలియజేశారు. సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను గద్దర్ పాటలు, రచనలు ప్రతిబింబిస్తాయని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కొనియాడారు. గద్దర్ కుటుంబ సభ్యుల దు:ఖాన్ని మాటల్లో చెప్పలేనని, శ్రేయోభిలాషులకు, బంధువులకు దీనిని తట్టుకునే శక్తిని ప్రసాదించమని కోరకుంటున్నానని మోదీ తెలిపారు. చివరిగా లేఖలో ఓంశాంతి అని పేర్కొన్నారు. కాగా ఈ నెల 6వ తేదీన గద్దర్ మృతి చెందిన విషయం తెలిసిందే. గత నెల జూలై 20వ తేదీన గుండెపోటుతో బేగంపేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరిన గద్దర్‌కు గుండెకు శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. అయితే గద్దర్‌కు ఊపిరితిత్తులు, యూరినరీ ఇన్ ఫెక్షన్ కారణంగా మృతి చెందినట్టుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 7వ తేదీన గద్దర్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారు. ఆయన అంతిమ యాత్రను చూసేందుకు కూడా జనాలు భారీగా తరలివచ్చారు. చదవండి: అమ్మ ప్రేమకు బహుమతిగా చంద్రుడిపై స్థలం కొన్న కూతురు.. -
రాష్ట్రపతి ముర్ముకు లక్ష్మీపార్వతి లేఖ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత, ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఎన్టీఆర్ పేరు మీద రూ.100 నాణేం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆమె లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ భార్యనైన తనను ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని లక్ష్మీపార్వతి లేఖలో కోరారు. భార్యగా తానే అసలైన వారసురాలినని లేఖలో పేర్కొన్న లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ పేరుపై రూ.100 నాణెం విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు, ఇతర కుటుంబసభ్యుల వల్లే ఎన్టీఆర్ చనిపోయారని, ఎన్టీఆర్ మరణానికి కారణమైన వారిని కార్యక్రమానికి పిలవడంపై లేఖలో లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: చంద్రబాబే కదా సిసలైన సైకో! -
గోదావరిలో చుక్కనీటినీ వదులుకోం
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో తమ వాటా 967 టీఎంసీల్లో చుక్కనీటిని కూడా వదులుకోబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరిలో నీటిలభ్యతను తేల్చుతూ ఇటీవల కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) గోదావరి బోర్డుకు సమర్పించిన నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత నది కలిసేచోట నుంచి గోదావరి నది సముద్రంలో కలిసేవరకు ఉన్న జీ–10 సబ్ బేసిన్‌లోని తెలంగాణ వాటాలో 28.847 టీఎంసీలను సీడబ్ల్యూసీ తక్కువగా చూపించిందని తప్పుబట్టింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా గోదావరి బోర్డు చైర్మన్ ఎంకే సిన్హాకు లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1,486 టీఎంసీలకుగాను తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు, ఏపీ ప్రాజెక్టులకు 518 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. జీ–10 సబ్ బేసిన్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు 287.189 టీఎంసీలు అవసరమని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మరో 126.642 టీఎంసీలు కావాలని, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులకు 8.887 టీఎంసీలు, విద్యుదుత్పత్తి అవసరాలకు 12.2 టీఎంసీలు అవసరమని తేల్చిచెప్పారు. జీ–10 సబ్ బేసిన్లో మొత్తం 434.918 టీఎంసీల కేటాయింపులు అవసరమని, సీడబ్ల్యూసీ నివేదికలో 406.07 టీఎంసీలను మాత్రమే చూపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిలభ్యత సీడబ్ల్యూసీ 498.07 టీఎంసీలని నిర్ధారించగా, సీడబ్ల్యూసీ పరిధిలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఏసీ) అనుమతుల ప్రకారం గోదావరి డెల్టా, పోలవరం అవసరాలకు 484.5 టీఎంసీలు అవసరమని గుర్తుచేశారు. పోలవరం దిగువ 45.83 టీఎంసీల లభ్యత ఉందని, పోలవరం అవసరాలకు 438 టీఎంసీలు సరిపోతాయని స్పష్టం చేశారు. -
‘గే లవ్ ఫాంటసీలో ఒబామా’.. మాజీ ప్రియురాలి లేఖలో మరిన్ని వివరాలు..
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 1982లో తన మాజీ ప్రేమికురాలికి ఒక లేఖ రాశారు. దానిలో ఏమి రాశారన్నది తాజాగా బయటపడి సంచలనంగా మారింది. బరాక్ ఒబామాకు గే సెక్స్ అంటే ఇష్టమని ఈ లెటర్ ద్వారా వెల్లడయ్యింది. తనకు రోజూ పురుషులను దగ్గరికి తీసుకోవడమంటే ఇష్టమని, అయితే అది తన కల్పన మాత్రమేనని దానిలో ఒబామా పేర్కొన్నారు. బరాక్ ఒబామా తన మాజీ ప్రియురాలికి రాసిన లేఖను న్యూయార్క్ పోస్టు బయటపెట్టింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఒబామాకు గే సెక్స్ ఫాంటసీ అంటే ఇష్టమనే విషయాన్ని ఈ ఉత్తరం వెల్లడించింది. దానిలో ఆయన తాను పురుషులతో రోజూ లైంగిక కార్యకలాలపాల్లో పాల్గొంటున్నట్లు కలలుకంటానని తెలిపారు. ఈ ఉత్తరం రాసే సమయానికి ఒబామా వయసు 21 ఏళ్లు. 1982 నవంబరులో ఆయన తన మాజీ ప్రేమికురాలు అలెక్స్ మెక్నియర్కు ఈ ఉత్తరం రాశారు. ఒబామా, అలెక్స్ ఆరోజుల్లో లాస్ఏంజిల్స్లోని ఆక్సిడెంటల్ కాలేజీ విద్యార్థులు. అప్పుడు వారు రిలేషన్లో ఉండేవారు. ఆ ఉత్తరంలో ఒబామా.. హోమో సెక్సువాలిటీ గురించి ప్రస్తావించారు. 40 ఏళ్ల క్రితం నాటి ఈ లెటర్‌ను ఒబామా తాను రాసినదేనని అంగీకరించారు. తాను ఒక పురుషుని రూపంలోనే మరో పురుషునితో ఉండేందుకు ఇష్టపడ్డానని ఒబామా పేర్కొన్నారు. ఒబామాతో రిలేషన్ ముగిసిన అనంతరం అతని మాజీ ప్రేమికురాలు అలెక్స్ ఆ లేఖలోని కొన్ని వివరాలను వెల్లడించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ ఉత్తరం ఎమోరీ యూనివర్శిటీలో ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 1992లో మిషెల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఇది కూడా చదవండి: 6 వేల కి.మీ. ప్రయాణించి బీచ్‌లో బిడ్డకు జననం.. పరాయి ప్రాంతంలో బందీగా మారిన జంట! -
నువ్వు మరింత అందంగా తయారవుతున్నావ్.. హీరోయిన్‌కు ప్రేమలేఖ!
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పరిచయం అక్కర్లేని పేరు. 2009లో అల్లాదీన్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించింది. ఇవాళ ఆమె 38వ ఏడాదిలో అడుగు పెడుతున్నారు. మోడలింగ్‌పై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించింది. అయితే తాజాగా ఆమె బర్త్ డే సందర్భంగా జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపాడు. (ఇది చదవండి: చిరంజీవిపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్!) రూ. 200 కోట్ల మానీలాండరింగ్ కేసులో ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో సుకేశ్ చంద్రశేఖర్ తన ఫ్రెండ్‌కు విషెస్ చెప్పాడు. నటి పుట్టినరోజు సందర్భంగా సుకేశ్ ఆమెకు ఓ ప్రేమ లేఖ రాశారు. ఈ ప్రేమలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నిన్ను చాలా మిస్సవుతున్నా సుకేశ్ లేఖలో రాస్తూ..'నా బేబీ జాక్వెలిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీర్వదాలు నీకు ఎప్పుడు ఉంటాయి. నా జీవితంలో ప్రతి ఏడాది నీ పుట్టినరోజు అత్యంత ఇష్టమైన రోజు. నా బర్త్ డే కంటే కూడా ఎక్కువ. బేబీ నువ్వు రోజు రోజుకి మరింత అందంగా..యవ్వనంగా తయారవుతున్నావ్. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా. వచ్చే ఏడాది నీ పుట్టినరోజును కలిసి జరుపుకుంటానని ఆశిస్తున్నా. ఈ గ్రహంలోని ఏ శక్తి నిన్ను ప్రేమించకుండా ఆపలేదు.' అంటూ తీవ్రమైన భావోద్వేగంతో రాసుకొచ్చాడు. గతంలో చంద్రశేఖర్ ఆమెను కౌగిలించుకోవడం, కేక్ తినిపించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యాడు. అయితే గతంలో సుఖేష్ చంద్రశేఖర్‌తో డేటింగ్లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఖండించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? జూ.ఎన్టీఆర్‌తో ఆ సినిమాలో ) -
‘నీకు పెళ్లయ్యింది.. నా హృదయం ముక్కలయ్యింది’.. షాకిస్తున్న ఎలక్ట్రీషియన్ లెటర్!
ఇంటిలో పనిచేసేందుకు వచ్చే ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్లాంటి వారు ఒక్కోసారి ఆ ఇంటిలోని మహిళలను వేధించిన ఘటనలను మనం చూస్తుంటాం. ఇటువంటి సందర్భాల్లో కొందరు దుర్మార్గులయితే పెళ్లయిన మహిళలతో స్నేహం చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన మెకియన్ మెక్క్రాకెన్ అనే మహిళకు విచిత్ర ఘటన ఎదురయ్యింది. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేసింది. మెకియన్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె భర్త కొలెటల్, మరిది డెవ్ బయటకు వెళ్లారు. ఆ సమయంలో వారి ఫర్నీచర్ స్టోర్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. స్టోర్‌లోని ఫ్యాను మరమ్మతు చేసేందుకు ఒక ఎలక్ట్రీషియన్‌ను పిలిచారు. నాటి అనుభవం గురించి మెకియన్ మాట్లాడుతూ ‘ఎలక్ట్రీషియన్ ఫ్యాను బాగు చేసేందుకు అనువుగా అక్కడి సోఫాను పక్కకు జరిపాను. అలాగే ఆ ఎలక్ట్రీషియన్‌కు సాయం చేసే ఉద్దేశంతో ఏమైనా కావాలా’ అని అడిగాను. దానికి ఆ ఎలక్ట్రీషియన్ సమాధానమిస్తూ ‘మీ ఆదేశాలను శిరసావహిస్తాను’ అని నెమ్మదిగా అన్నాడు. అయితే ఈ మాటను ఆమె పెద్దగా పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయింది. తరువాత ఎలక్ట్రీషియన్ బాత్రూమ్ వినియోగించుకునేందుకు ఆమె అనుమతి కోరాడు. తరువాత ‘మీరు ఎంతో అందంగా ఉన్నారు. అయితే మీకు వివాహం జరిగిందని తెలిసి నా హృదయం ముక్కలయ్యింది. అయినా మీరు నాతో రావాలనుకుంటే వచ్చేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. సోఫా కుషన్‌పై మీకోసం ఒక లెటర్ అతికించాను’ అని అన్నాడు. ఈ మాటలు విన్న మెకియన్ కంగారు పడిపోయింది. అతను పని ముగించుకుని వెళ్లేవరకూ వేచిచూసింది. అతను వెళ్లగానే కుషన్‌పై అంటించిన లెటర్ చదివింది. దానిలో.. ‘నిన్ను ఇబ్బందుల్లో పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. నీకు పెళ్లయినప్పటికీ, నాతో రావాలనుకుంటే వచ్చేయ్, నేను నీకు అన్ని ఆనందాలను అందిస్తాను’ అని ఉంది. ఈ విషయాన్ని మెకియన్ తన భర్తకు తెలియజేసింది. వెంటనే భర్త ఆ ఎలక్ట్రీషియన్‌ను నిలదీశాడు. దీంతో ఆ ఎలక్ట్రీషియన్ మెకియన్కు క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఈ పోస్టును చూసి యూజర్లు రకరకాలుగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్.. మీరు ఆ ఎలక్ట్రీషియన్ బాస్‌కు ఫిర్యాదు చేయాల్సింది అని సలహా ఇవ్వగా, మరొకరు ఆ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్న కంపెనీ రివ్యూలో ఈ విషయాన్ని రాయాలని కోరారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్ ‘ఆణిముత్యం’.. ఎవరికీ తెలియని షాహిద్ ఖాన్ సక్సెస్ స్టోరీ! -
బీఆర్ఎస్లోకి వెళ్తున్నారంటూ వార్తలు.. లేఖలో అసలు విషయం చెప్పిన ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తనపై జరుగుతున్న దుష్ప్రచారం ఓ ముఖ్యనేత కుట్రేనంటూ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ సీరియస్ అయ్యారు. ‘‘నేను పార్టీలో కొన్ని సమస్యల పట్ల అసంతృప్తిగా ఉండొచ్చు. ఇదంతా ఇంటి దొంగల కుట్రేనని ఉత్తమ్ వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో నా అనుచరులను అణగదొక్కేందుకు వాళ్లను తొలగించడానికి లక్ష్యంగా ప్రచారం జరిగింది. నేను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం’’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాకముందే పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. అధికార బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు సైతం ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు పార్టీలు మారుతుండగా.. మరొకొందరు పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కూడా పార్టీ మారుతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన బహిరంగ లేఖ ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చారు. చదవండి: కేటీఆర్‌కు పిండ ప్రదానం.. రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు -
ఏపీ ట్రాన్స్‌కోలో నకిలీ లేఖ కలకలం
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్‌కోలో నకిలీ లేఖ కలకలం రేపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ ఆదేశాల ప్రతులు నిజం కాదని, అదంతా తప్పుడు ప్రచారమని ట్రాన్స్‌కో అదనపు కార్యదర్శి వి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 17 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోమని చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌కు తాను రాసినట్లుగా చక్కర్లు కొడుతున్న లేఖ అబద్ధమని తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కోకి సంబంధించి శాశ్వత ప్రాతిపదికన చేపట్టే నియామకాలు, ఉద్యోగ ప్రకటనలు ట్రాన్స్‌కో, ఇతర విద్యుత్ సంస్థల అధికారిక వెబ్సైట్లు, ప్రింట్ మీడియాలో ప్రకటన ద్వారా తెలియజేస్తామని వివరించారు. ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ఛీటింగ్ ‘మార్గం' మూత! -
ఆన్లైన్ స్కిల్ గేమింగ్‌ను వేరుగా చూడాలి
న్యూఢిల్లీ: గేమింగ్ పరిశ్రమను 28 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని పరిశ్రమలోని కొన్ని వర్గాలు విభేధిస్తున్నాయి. ఏ గేమ్ అన్న దానితో సంబంధం లేకుండా గేమింగ్ పరిశ్రమ మొత్తాన్ని గరిష్ట పన్ను పరిధిలోకి తీసుకురావడం తెలిసిందే. దీన్ని సుమా రు 120 ఆన్లైన్ క్యాజువల్ స్కిల్ గేమింగ్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. పన్ను విషయంలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ నుంచి తమను (స్కిల్ గేమింగ్/నైపుణ్యాలను పెంచుకునేవి) వేరుగా చూడాలని కోరు తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులకు లేఖ రాశాయి. అంతర్జాతీయంగా ప్రైజ్ మనీతో కూడిన ఫ్యాంటసీ స్పోర్ట్స్‌పై పన్ను అనేది ఆన్లైన్ స్కిల్ గేమింగ్‌తో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు మంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. లాటరీలు, ఫ్యాంటసీ స్పోర్ట్స్‌తో పోలిస్తే ఆన్లైన్ స్కిల్ గేమింగ్ వినియో గం భిన్నంగా ఉంటుందని వివరించాయి. అలాగే, వ్యాపార నమూనా, సామాజిక ఔచిత్యం వేర్వేరు అని పేర్కొన్నాయి. రియల్ మనీ గేమింగ్ పరిశ్రమలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ అనేది ప్రత్యేక విభాగమని పరిశోధనా సంస్థలైన కేపీఎంజీ, రెడ్‌సీర్ సైతం వర్గీకరించినట్టు తెలిపాయి. ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ అనేది పరిశ్రమకు మరణశాసనంగా మారుతుందని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కనుక పరిశ్రమ మనుగడకు వీలుగా తమపై పన్ను భారాన్ని తగ్గించాలని కోరాయి. -
Manipur: మతం రంగు పులమొద్దు
ఢిల్లీ: మణిపూర్ హింసకు మతం రంగును అద్ది.. ఏకంగా పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టింది యూకే. అయితే దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత విషయాల్లో జోక్యాన్ని సహించబోమని చెబుతూనే.. వలసవాద బుద్ధిని ప్రదర్శించారంటూ మండిపడింది. తాజాగా ఈ ఎపిసోడ్లో మరో పరిణామం చోటు చేసుకుంది. ఇంఫాల్‌కు చెందిన పౌర సంఘాలన్నీ Coordinating Committee on Manipur Integrity సంయుక్తంగా.. యూరోపియన్ పార్లమెంట్‌కు లేఖలు రాశాయి. మణిపూర్ అల్లర్లు వలస చిన్-కుకీ నార్క్ ఉగ్రవాదులకు, స్థానిక మెయితీ తెగలకు మధ్య జరుగుతోంది. అంతేకాని దానికి మతం రంగు పులమడం సరికాదని పేర్కొన్నాయి. ఈ మేరకు స్ట్రాస్బోర్గ్కు చెందిన యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెట్సోలాకు సీవోసీవోఎంఐ కో-ఆర్డినేటర్ జితేంద్ర నిన్గోంబా లేఖ రాశారు. ‘‘మణిపూర్ అల్లర్లు.. హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనవహించడం సరికాదని, కేంద్రం సత్వరమే జోక్యం చేసుకుని ఉంటే ఉంటే పరిస్థితి ఇలా తయారయ్యేది కాదని.. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలంటూ యూరోపియన్ పార్లమెంట్ తొలిసారిగా మణిపూర్ అంశం మీద తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ పరిణామాన్ని స్వాగతించిన సీవోసీవోఎంఐ.. మతం రంగు అద్దడంపై మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మణిపూర్ ఘర్షణలకు ఆజ్యం పోసింది నార్క్-టెర్రరిజం. అలాంటి ప్రధాన సమస్యను మీరు విస్మరించారు. తద్వారా మణిపూర్‌ను మరో న్యూ గోల్డెన్ ట్రయాంగిల్‌గా మారేందుకు అవకాశం కల్పించారు. (చైనా, లావోస్, మయన్మార్, థాయ్‌లాండ్‌లో డ్రగ్ ట్రాఫికింగ్ కారిడార్లను కలిపి ది గోల్డెన్ ట్రయాంగిల్‌గా అభివర్ణిస్తుంటారు.) ఇలాంటి తీర్మానం ప్రవేశపెట్టడం విచారకరం. చిన్-కుకీ ఉగ్ర సంస్థల ప్రచారం వల్లే.. మణిపూర్‌లో క్రైస్తవ మైనారిటీ, మెజారిటీ మెయితీ హిందువుల మధ్య వివాదంగా మీరు తప్పుగా అర్థం చేసుకోగలిగేలా చేసింది. మణిపూర్‌లో మతపరమైన కారణాల వల్ల హింస చెలరేగలేదు. పైగా ఇక్కడెంతో సామరస్యం విరజిల్లుతోంది కూడా. రాజధాని ఇంఫాల్ సహా మెయితీల ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లోనూ చర్చిల కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలగలేదని మీరు గమనించాలి. మణిపూర్‌లో లక్షాల డెబ్భై వేల జనాభా ఉన్న మెయితీ తెగ ప్రజలు క్రైస్తవులే. అలాగే.. కుకీ జనాభాలో 35 శాతం క్రైస్తవులు ఉన్నారు. కేవలం గంజాయి, మత్తు పదార్థాల రవాణా(నార్కో టెర్రరిజం), ఆయుధాల అక్రమ రవాణా మీద ఆధారపడి ఉన్న వలస ‘చిన్-కుకీ’ గ్రూప్‌ల వల్లే మణిపూర్‌కు ఈ పరిస్థితి దాపురించింది. వీళ్ల ప్రభావం సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్‌కు కూడా తప్పడం లేదు అని లేఖలో స్పష్టం చేసింది సీవోసీవోఎంఐ. ఇదీ చదవండి: మెయితీల వలసబాట.. కారణం ఎవరంటే..