కోల్‌కతా:పశ్చిమబెంగాల్ వరదలపై సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. వరదల కారణంగా రాష్ర్టంలో 50లక్షల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారని లేఖలో తెలిపారు.వారిని ఆదుకునేందుకుగాను కేంద్రం వెంటనే నిధులివ్వాలని లేఖలో కోరారు.
తమ అనుమతి లేకుండా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ) రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో అనేక జిల్లాలు నీట మునిగాయన్నారు. ఈ విషయమై ప్రధానికి మమత రాసిన తొలి లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ స్పందించారు. డీవీసీ రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలపై ప్రతి దశలోనూ రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చామని వివరణ ఇచ్చారు.
దీనిపై బెనర్జీ స్పందిస్తూ డ్యామ్‌ల నుంచి నీటి విడుదల దామోదర్ వ్యాలీ రిజర్వాయర్ రెగ్యులేషన్ కమిటీ అనుమతి, సహకారంతో జరుగుతుంది. నీటి విడుదలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సంప్రదించాలి కానీ వారు అలా చేయలేదు. అన్ని కీలక నిర్ణయాలను కేంద్రం ఆధ్వర్యంలోని శాఖలు ఏకపక్షంగా తీసుకున్నాయి. రాష్ట్రప్రభుత్వానికి ఎటువంటి నోటీసులు లేకుండా నీరు విడుదల చేశారని తప్పుపట్టారు.నీటి విడుదలకు కొద్ది గంటల ముందు సమాచారం ఇవ్వడంతో రక్షణ చర్యలు చేపట్టడం కుదరలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment