mamata banerjee
-
చొరబాట్లకు మమత సర్కారే కారణం: అమిత్‌షా
కోల్‌కతా: బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ముందున్న పెద్ద టార్గెట్ అన్నారు. ఆదివారం(అక్టోబర్ 27) కోల్‌కతాలో పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.బెంగాల్లో చొరబాట్లను తక్షణమే ఆపాలన్నారు. బెంగాల్లో చొరబాట్లు,అవినీతి ఆగాలంటే 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేనే సాధ్యమన్నారు.బెంగాల్లో మహిళలకు భద్రత లేదని చెప్పడానికి సందేశ్ ఖాలీ హింస,ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనలే నిదర్శనమన్నారు.అక్రమ వలసలు పెరగడం వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాట్లను ఆపినప్పుడే బెంగాల్లో శాంతి నెలకొంటుందన్నారు.కాగా, పశ్చిమబెంగాల్లో రూ.500 కోట్లతో నిర్మించిన ల్యాండ్‌పోర్ట్‌ను అమిత్‌షా ప్రారంభించారు. ఇదీ చదవండి: దీపావళి తర్వాత జార్ఖండ్‌లో ప్రధాని ఎన్నికల ప్రచారం -
జూడాల సమ్మె విరమణ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ జూని యర్ డాక్టర్లు తమ సమ్మె ను విరమించారు. ము ఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం చర్చల అనంతరం 16 రోజులు గా చేస్తున్న దీక్షను విరమించుకున్నారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారం నేపథ్యంలో డిమాండ్ల సాధన కోసం బెంగాల్ జూనియర్ డాక్టర్లు గత 16 రోజులు గా నిరాహారదీక్ష చేస్తున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సంపూర్ణ విధుల బహిష్కరణను కూడా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఈ రోజు సీఎంతో భేటీలో కొన్ని హామీలు లభించాయి. అయితే ప్రభుత్వ వ్యవహార శైలి సరిగా లేదు. ప్రజలు, మా దివంగత సోదరి కుటుంబీకులు దీక్షను విరమించుకోవాలని కోరారు. విషమిస్తు న్న మా ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టు కొని నిరాహారదీక్ష ముగించాలని విజ్ఞప్తి చేశారు. అందుకే దీక్షను ముగిస్తున్నాం అని జూనియర్ డాక్టర్ దెవాశిష్ హల్దర్ వెల్లడించారు. -
నిరసన దీక్షను విరమించండి: సీఎం మమతా
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్‌కు వచ్చి కలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం కోల్‌కతాలోని ఎస్ప్లనేడ్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ప్రధానికి మమత మరో లేఖ.. కేంద్రంపై ఆరోపణలు
కోల్‌కతా:పశ్చిమబెంగాల్ వరదలపై సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. వరదల కారణంగా రాష్ర్టంలో 50లక్షల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారని లేఖలో తెలిపారు.వారిని ఆదుకునేందుకుగాను కేంద్రం వెంటనే నిధులివ్వాలని లేఖలో కోరారు.తమ అనుమతి లేకుండా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ) రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో అనేక జిల్లాలు నీట మునిగాయన్నారు. ఈ విషయమై ప్రధానికి మమత రాసిన తొలి లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ స్పందించారు. డీవీసీ రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలపై ప్రతి దశలోనూ రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చామని వివరణ ఇచ్చారు.దీనిపై బెనర్జీ స్పందిస్తూ డ్యామ్‌ల నుంచి నీటి విడుదల దామోదర్ వ్యాలీ రిజర్వాయర్ రెగ్యులేషన్ కమిటీ అనుమతి, సహకారంతో జరుగుతుంది. నీటి విడుదలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సంప్రదించాలి కానీ వారు అలా చేయలేదు. అన్ని కీలక నిర్ణయాలను కేంద్రం ఆధ్వర్యంలోని శాఖలు ఏకపక్షంగా తీసుకున్నాయి. రాష్ట్రప్రభుత్వానికి ఎటువంటి నోటీసులు లేకుండా నీరు విడుదల చేశారని తప్పుపట్టారు.నీటి విడుదలకు కొద్ది గంటల ముందు సమాచారం ఇవ్వడంతో రక్షణ చర్యలు చేపట్టడం కుదరలేదని విమర్శించారు. -
డీవీసీతో సంబంధం తెంచేసుకుంటాం
కోల్‌కతా: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ)తో తమ రాష్ట్రం అన్ని సంబంధాలను తెంచేసుకుంటుందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీని హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదలకు డీవీసీ ఏకపక్షంగా నీటిని విడుదల చేయడమే కారణమని ఆమె ఆరోపించారు. సీఎం మమత శుక్రవారం ఈ మేరకు ప్రధానికి నాలుగు పేజీల లేఖ రాశారు. రాష్ట్రంలోని చిన్న చిన్న నదులు ప్రమాదకర స్థాయి, అంతకు మించి ప్రవహిస్తున్న విషయం తెలుపుతూ తమ అధికారులు, నీటి విడుదలను వాయిదా వేయాలంటూ లేఖ రాసినా డీవీసీ పట్టించుకోలేదని మమత ఆరోపించారు. డీవీసీ నియంత్రణలో ఉన్న మైథోన్, పంచెట్ జలాశయాల నుంచి కొద్ది గంటల వ్యవధిలోనే ఏకంగా 5 లక్షల క్యూసెక్కుల నీటిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా విడుదల చేశారన్నారు. ఒక్కసారిగా భారీగా వరదలు చుట్టుముట్టడంతో పూర్బ వర్ధమాన్, పశ్చిమ బర్ధమాన్, బీర్భూమ్, బంకురా, హౌరా, హుగ్లీ, పూర్బ మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాలకు చెందిన 50 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. -
సీఎం మమత కీలక నిర్ణయం.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత
కోల్‌కతా: సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో బెంగాల్-జార్ఖండ్ భూ సరిహద్దును మూడు రోజులపాటు మూసివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.అయితే జార్ఖండ్‌ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీవీసీ ద్వారా నీటిని విడుదల చేశారని మమత ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలను వరద నీరు ముంచెత్తినట్లు తెలిపారు. ఇది కేవలం మనవ తప్పదమని ఆమె పేర్కొన్నారు. డీవీసీ.. డ్యామ్‌ల వద్ద పూడిక తీయడంలో దారుణంగా విఫలమయిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో వరద నీరు చుట్టు ముట్టిన హౌరా, మిడ్నాపూర్ జిల్లాల్లోని పలు వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమత పర్యటించారు.ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) కారణమని ఆరోపించారు. ఇష్టమున్నట్టు నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. కేంద్రం ఆడుతున్న నాటకంలో ఇదొక కుట్రగా ఆమె పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని దీదీ డిమాండ్ చేశారు. -
ఇదే చివరిసారి.. వైద్యులను చర్చలకు ఆహ్వానించిన సీఎం మమత
కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఉదంతంలో బెంగాల్ ప్రభుత్వం, వైద్యలు మధ్య చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై నిరసన చేస్తున్న వైద్యులను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి చర్చలకు ఆహ్వానించించారు. కోల్‌కతాలోని సీఎం నివాసంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు అయిదోసారి/చివరి అవకాశంగా ఆందోళన చేస్తున్న వైద్యులను చర్చలకు పిలుస్తున్నట్లు బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వైద్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.‘పశ్చిమ బెంగాల్ ఎం మమతా బెనర్జీతో, వైద్య ప్రతినిధుల సమావేశం కోసం అయిదోసారి. అలాగే చివరిసారి సంప్రదిస్తున్నాం. ముందు రోజు చర్చల్లో నిర్ణయించుకున్నట్లుగా సోమవారం సాయంత్రం 5 గంటలకు కాళీఘాట్‌లోని సీఎం నివాసంలో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరపడానికి మిమ్మల్ని(నిరసనకారులను) మరోసారి ఆహ్వానిస్తున్నాము. చివరిసారి చర్చలకు వచ్చిన వైద్యుల బృందమే నేడు సాయంత్రం 4.45 నిమిషాలకు వేదిక వద్దకు రావాలని అభ్యర్థిస్తున్నాం.ఈ కేసు సుప్రీంకోర్టులో పరిధిలో ఉన్నందును.. మీరు డిమాండ్ చేస్తున్నట్లు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం కానీ వీడియో గ్రఫీ కానీ ఉండదు. దానికి బదులు సమావేశాన్ని రెండు వర్గాలు రికార్డ్ చేసి సంతకాలు చేస్తాయి’ అంటూ మనోజ్ పంత్ పేరిట లేఖలో తెలిపారు.అదే విధంగా సుప్రీకోర్టు ఆదేశాలను వైద్యులు పాటించాలని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరులగా, కోర్టు ఆదేశాలకు కట్టుబడి వైద్యలు విధుల్లోచేరాలని కోరుతున్నట్లు తెలిపారు. వైద్యుల నుంచి సానుకూల స్పందన వస్తుందని, ఫలప్రదమైన చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.కాగా వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ.. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ వైద్యులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు నాలుగు సార్లు వైద్యులను చర్చించేందుకు ఆహ్వానించగా.. లైవ్ టెలికాస్ట్ చేయాలనే డిమాండ్‌తో నిరసనకారులు చర్చలను తిరస్కరించారు. ఇక శనివారం ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం ‘స్వస్థ్ భవన్’ ఎదుట ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులనిరసన శిబిరానికి సీఎం మమతా బెనర్జీ వెళ్లారు. ఆమెను చూడగానే ‘న్యాయం కావాలి’ అంటూ జూనియర్ వైద్యులు నినాదాలు చేశారు. తమ డిమాండ్లపై చర్చ జరిగేవరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చిచెప్పడంతో సీఎం అక్కడినుంచి వెళ్లిపోయారు. -
తాగకపోతే వదిలేట్లు లేరు! తాగి వద్దామా!
-
మమతా బెనర్జీ చివరి ప్రయత్నం
-
RG Kar Incident: వైద్యులకు మమతా బెనర్జీ బుజ్జగింపులు
కోల్‌కతా: ఆర్జీకర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై జూనియర్ వైద్యుల నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ముందుకు సాగకపోవడంతో వైద్యులు ఆందోళనల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ కోల్‌కతాలో వైద్యులు నిరసనలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వైద్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ముందు తను మాటను వినాలని, ఆ తర్వాత నినాదాలు చేయాలంటూ వైద్యులకు సూచించారు. #WATCH | RG Kar Medical College and Hospital rape-murder case: West Bengal CM Mamata Banerjee reaches Swasthya Bhawan in Kolkata to meet the protesting doctors. pic.twitter.com/AbtdOAisKh— ANI (@ANI) September 14, 2024‘దయచేసి ఐదు నిమిషాలు నా మాట వినండి. ఆ తర్వాత నినాదాలు చేయండి. ఆందోళనలు చేయడం ప్రజాస్వామ్యంలో మీ హక్కు. నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. నా భద్రతా అధికారులు వద్దని వారించినా.. నేను ఇక్కడకు వచ్చాను. మీ నిరసనలకు నా సెల్యూట్. నేను కూడా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నదాన్నే. ఇంత కంటే నా పదవి పెద్ద విషయం కాదని నాకూ తెలుసు. రాత్రంతా వర్షంలోనూ మీరు నిరసనలు చేశారు. ఎంతో బాధపడి ఉంటారు. నాకు కూడా బాదేసింది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేకపోయాను.ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నం. ఇక్కడికి నేను ముఖ్యమంత్రిగా రాలేదు. మీ దీదీ (సోదరి)గా వచ్చా. నాకు సీఎం పదవి ముఖ్యం కాదు. నేను డిమాండ్లను అధ్యయనం చేస్తాను, నేనేం ఒంటరిగా ప్రభుత్వాన్ని నడపడం లేదు కదా. ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్తో చర్చించాలి. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటాను. నేను తిలోత్తమ (హత్యాచారానికి గురైన బాధితురాలికి పెట్టిన పేరు). మీ డిమాండ్లను పరిశీలిస్తాను’’ అని ఆమె వైద్యులకు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: కోల్‌కతా అభయ కేసులో బిగ్ ట్విస్ట్.. కాగా కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గత నెలలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగినప్పటి నుండి వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వాస్త్య భవన్ వెలుపల ఆందోళన చేపట్టిన అనతరం రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను చర్చలకు ఆహ్వానించింది. అయితే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే నిరసనకారుల డిమాండ్‌పై అవి నిలిచిపోయాయి.మరోవైపు జూనియర్ వైద్యులు- రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతోన్న ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని జూనియర్ వైద్యులు కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ తరఫున రాసిన నాలుగు పేజీల లేఖను ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు సైతం పంపారు. -
ఇలా చేయటం సబబేనా!
లేవనెత్తిన సమస్యల తీవ్రతను చాటడం, వాటిని పరిష్కరించుకోవటానికి పట్టువిడుపులు ప్రదర్శించటం, గరిష్ఠంగా సాధించుకోవటం ఏ ఉద్యమానికైనా ఉండాల్సిన మౌలిక లక్షణాలు. పశ్చిమబెంగాల్లో జూనియర్ డాక్టర్లు నెల రోజులకుపైగా సాగిస్తున్న ఉద్యమం ఈ ప్రాథమిక సత్యాన్ని గుర్తించాల్సి వుంది. ఆర్జీ కర్ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో తమ సహచర వైద్యురాలు 36 గంటలు నిర్విరామంగా రోగులకు సేవలందించి సేదతీరిన నిశిరాత్రిలో దుండగులు ఆమెపై అత్యాచారం జరిపి పొట్టనబెట్టుకున్న వైనం వెల్లడయ్యాక జూనియర్ డాక్టర్ల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఆ ఉద్యమాన్ని తుంచేయడానికి, సాక్ష్యాధారాలు మాయం చేయడానికి గూండాలను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించిన తీరు వారిని మరింత రెచ్చగొట్టింది. ఉన్నతాదర్శాలతో ఈరంగంలో అడుగుపెట్టిన యువ వైద్యులను పాలనా నిర్వాహకులు వేధించుకు తినటం, మాఫియా లుగా మారటం, పాలకులు పట్టనట్టు వ్యవహరించటం వాస్తవం. తూట్లు పూడుస్తున్నట్టు కనబడు తూనే తూములు తెరిచిన చందంగా పాలకులు వ్యవహరించిన తీరు దాచేస్తే దాగని సత్యం. జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలు ఎటువంటివో, అవి ఎంత ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయో ఇవాళ దేశమంతా తెలిసింది. కొంత హెచ్చుతగ్గులతో ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి దయనీయ స్థితిలోనే జూనియర్ డాక్టర్లు తమ వృత్తిని కొనసాగించాల్సి వస్తున్నదని కూడా అందరూ గ్రహించారు. ప్రజావైద్యరంగంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవ్యవస్థ దళారీలనూ పెత్తందార్లనూ సృష్టించిందని, ఆ రంగాన్ని రోగగ్రస్తం చేసిందని జనంగుర్తించారు. దేన్నయినా రాజకీయ కోణంలోనే చూడటం అలవాటైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీన్నుంచి కూడా అవలీలగా బయటపడగలమని తొలుత భావించారు. పైపై చర్యలతో ఉద్యమాన్ని సద్దుమణగనీయొచ్చని ఆశించారు. పరిస్థితి చేయి దాటుతున్నదనిఆలస్యంగా గ్రహించారు. గురువారం ఉద్యమకారులతో చర్చించడానికి రాష్ట్ర సెక్రటేరియట్లోరెండు గంటలకు పైగా వేచిచూసి, వారు వచ్చే అవకాశం లేదని గ్రహించాక రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ప్రజలకోసం రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని కూడా ప్రకటించారు. మొదట్లో సమస్య పరిష్కారానికి సిద్ధపడని ఆమె వైఖరివల్లనే సమస్య జటిలంగా మారిందన్నది వాస్తవం. వైద్య సాయం అందక, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేకపలువురు మరణించారు. ఈ పాపం నుంచి ఆమె తప్పించుకోలేరు. తన స్వభావానికి భిన్నంగా ఉద్యమం విరమించుకోవాలని ముకుళిత హస్తాలతో ఉద్యమకారులను వేడుకోవటం, వారితో చర్చించటానికి సుదీర్ఘ సమయం వేచిచూడటం ఇది గ్రహించబట్టే. చేతులు కాలాక ఆకులు పట్టు కోవటం లాంటిదే ఇది. అయితే ఉద్యమకారులుగా పట్టువిడుపులు ప్రదర్శించాలని జూనియర్ డాక్టర్లు కూడా గుర్తించాలి. ఉద్యమం విరమించి విధులకు హాజరు కావాలని ఇప్పటికి మూడుసార్లు సర్వోన్నత న్యాయస్థానం కోరింది. అలా చేరితే ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు ఉండబోవని మొన్న పదో తేదీన వారికి చెప్పింది కూడా. జరిగిన దుస్సంఘటనపై దర్యాప్తు జరపాలని, పని పరిస్థితులు మెరుగు పర్చాలని, జూనియర్ డాక్టర్లకు భద్రత కల్పించాలని, పని గంటల భారాన్ని తగ్గించాలని మొదట్లో కోరారు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపాల్‌ను, మరికొందరిని తొలగించారు. పలువురిని అరెస్టు చేశారు. జూనియర్ డాక్టర్లు లేవ నెత్తిన మౌలిక సదుపాయాల కల్పనకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ ఉద్యమకారుల డిమాండ్లు పెరుగుతూ పోతున్నాయి. వైద్యరంగ ప్రక్షాళన కోసం వైద్య విద్యా డైరెక్టర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, నగర పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని తాజాగా వారు కోరుతున్నారు. అంతే కాదు... తమతో మమత జరపదల్చుకున్న చర్చలను చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయాలనిడిమాండ్ చేశారు. అందుకు ఒప్పలేదన్న కారణంతో గురువారం చర్చలను బహిష్కరించారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టే తన కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు చర్చలు ప్రజలందరూ చూసేలా జరగటంలో తప్పేముందన్నది వారి ప్రశ్న. వినటానికి సబబే అనిపించవచ్చు. కానీ మమత అంటున్నట్టు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు సాగుతోంది. దానిపై బహిరంగ చర్చ మంచిదేనా? దుండగుల దాడిలో బలైపోయిన యువ వైద్యురాలి కుటుంబసభ్యుల గోప్యత ఏం కావాలి? ఉద్యమకారులు రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాశారు. కానీ ఇప్పటికే తీసుకున్న చర్యలకు మించి వారేం ఆశిస్తున్నారనుకోవాలి?నిరుపేద వర్గాలకు చెందిన వృద్ధులు, గర్భిణులు, దీర్ఘవ్యాధులతో బాధపడేవారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు లభించక తల్లడిల్లుతున్నారు. దాదాపు 25 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి.8,000 మంది జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా వైద్య సేవలు అందించలేమని సర్కారీ ఆస్పత్రులు చేతులెత్తేయటం వల్ల అంతంతమాత్రంగా బతుకీడుస్తున్నవారు సైతం రోగాలబారిన పడిన తమ ఆప్తుల్ని రక్షించుకోవటానికి అప్పులుచేసి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అందుకే జూనియర్ డాక్టర్లు తమ బాధ్యత గుర్తెరగాలి. పాలకులపై తమకున్న ఆగ్రహం దారితప్పి సామాన్యులను కాటేస్తున్న వైనాన్ని గమనించాలి. తమ డిమాండ్లకు సమాజం నుంచి సానుకూలత, సానుభూతి వ్యక్తమవుతున్న తరుణంలోనే విధుల్లో చేరాలి. తెగేదాకా లాగటం మంచిది కాదని తెలుసుకోవాలి. -
Kolkata: ప్రధాని మోదీ, రాష్ట్రపతికి వైద్యుల లేఖ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. వెంటనే విధుల్లో చేరాలని అటు సుప్రీంకోర్టు ఆదేశించినా, ఇటు చర్యలకు బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానించినా.. వైద్యులు వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా నిరసనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, వైద్య సిబ్బంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ ఘటనపై జోక్యం చేసుకొని ప్రతిష్టంభను ముగించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ఖర్, వైద్యారోగ్య మంత్రి జేపీ నడ్డాకు రాసిన నాలుగు పేజీల లేఖలో.. ‘‘కామాంధుడి చేతిలో బలైన మా సహోద్యోగికి త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దీనివల్ల మేము(వైద్యులు), ఆరోగ్య కార్యకర్తలు బెంగాల్ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి భయం లేకుండా మా విధులు నిర్వర్తించగలం. మేము నిరసనలు ప్రారంభించినప్పటి నుంచి మాపై బెదిరింపులు, హింసలు, ఆసుపత్రులు ధ్వంసం చేయడం వంటి ఘటనలు పెరిగాయి. ఈ క్లిష్ట సమయాల్లో మీ జోక్యం మా అందరికీ వెలుగుగా పనిచేస్తుంది. మేము ధైర్యంగా ముందుకు నడిచే మార్గాన్ని చూపుతుంది. మా చుట్టూ అలుముకున్న చీకటి నుంచి బయట పడేందుకు తోడ్పడుతుంది.’ అని పేర్కొన్నారు.చదవండి: కోల్‌కతా అభయ కేసులో కీలక మలుపు.. సీబీఐ సంచలన నిర్ణయం!కాగా ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసినప్పటి నుంచి వైద్యులు ఆందోళనకు దిగారు. ఇటీవల తాజాగా వైద్యులు మంగళశారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరి రోగులకు సేవలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరసనలు ఆపని వైద్యులపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.అయితే అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు తమ డిమాండ్లను నెరవేర్చాలని వైద్యులు బెంగాల్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌తోపాటు.. వైద్యశాఖలో పలువురి ఉన్నతాధికారుల రాజీనామా కోరుతూ వైద్యులు అయిదు డిమాండ్లను దీదీ సర్కార్ ముందు ఉంచారు.ఈ విషయంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ముందడుగు వేసింది. మూడుసార్లు వైద్యులను చర్చలకు ఆహ్వానించింది. కానీ చర్చల భేటీని లైవ్ టెలికాస్ట్ చేస్తేనే తాము వస్తామని నిరసన కారులు తేల్చి చెబుతున్నారు. దీంతో వైద్యుల తీరుపై అసహనం వ్యక్తం వ్యక్తం చేసిన దీదీ.. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆర్జీ కర్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందని తెలిపారు. నేటితో ఈ సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. -
నేను రాజీనామాకు సిద్ధం: మమతా బెనర్జీ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వంతో చర్చకు జూనియర్ డాక్టర్ల మరోసారి నిరాకరించారు. ఈ క్రమంలో సీఎం మమత సంచలన కామెంట్స్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాను సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నట్టు మమత చెప్పుకొచ్చారు. దీంతో, మమత వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అయితే, అభయ ఘటనపై ఆందోళనల నేపథ్యంలో జూనియర్ డాక్టర్లతో మరోసారి చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వారిని ఆహ్వానించింది. అయితే, వైద్యులు చెబుతున్నట్లుగా 30మంది కాకుండా.. 15మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు అనుమతిస్తామన్నారు. దీంతో డాక్టర్లు ఎవరూ చర్చలకు రాలేదు. ఈ సందర్భంగా డాక్టర్ల కోసం సీఎం దీదీ దాదాపు రెండు గంటల పాటు ఎదురుచూశారు. అనంతరం, సీఎం మమత మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపేందుకు ఇప్పటికే మూడుసార్లు యత్నించాను. ఇప్పుడు కూడా వారితో చర్చించేందుకే ముందుకు వచ్చాం. అభయ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ కారణంగా చేతనే జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నట్టు వారితో చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. కాగా.. ఈ భేటీ వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లు చేశాం. చివరగా.. సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందజేస్తాం. డాక్టర్లతో చర్చించేందుకు దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశాను. అయినప్పటికీ వారి నుంచి స్పందన లేదు. అయితే, వైద్యులు విధులకు దూరంగా ఉండటంతో ఏడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 27 మంది మృతి చెందారు. వైద్యులకు దేశ ప్రజలు అండగా నిలవండి. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమిస్తాను. ఆర్జీ కర్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాను. వైద్యులకు అండగా నిలిచేందుకు ప్రజా ప్రయోజనం కోసం అవసరమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | RG Kar Medical College and Hospital rape-murder case: West Bengal CM Mamata Banerjee says "I tried my best to sit with the junior doctors. I waited 3 days for them that they should have come and settle their problem. Even when they didn't accept the verdict of the… pic.twitter.com/qLD207vSd6— ANI (@ANI) September 12, 2024కాగా, బెంగాల్లో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్‌పై జరిగిన దురాగతాన్ని నిరసిస్తూ జూడాల ఆందోళనలు చేపట్టారు. దీంతో బెంగాల్లో వైద్యసేవలు చాలా వరకు స్తంభించాయి. ఈనేపథ్యంలో జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపించేందకు మమతా సర్కార్ ముందుకు వచ్చింది. ఈ మేరకు బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారికి తాజాగా గురువారం లేఖను పంపారు. ఈరోజు ఐదు గంటలకు చర్చలకు రావాలని లేఖలో పేర్కొన్నారు. 15మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు అనుమతిస్తామన్నారు. అదే విధంగా ఈ ప్రతిపాదిత చర్చలు సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. చివరగా ట్విస్ట్ ఇస్తూ.. చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న వైద్యుల ప్రతిపాదనను మాత్రం తిరస్కరించారు. అయితే, ప్రత్యక్ష ప్రసారం ఉండకపోవడంతో ముఖ్యమంత్రి మమతతో చర్చించేందుకు జూనియర్ డాక్టర్లు ఎవరూ సీఎం ఆఫీసుకు వెళ్లలేదు. West Bengal CM Mamata Banerjee says "I am ready to resign from the Chief Minister of West Bengal. I am not concerned about the post. I want justice, I am only concerned about justice getting served"#MamtaBanerjee #Westbangal #RGKarDoctor #RGKarProtestpic.twitter.com/KjaJzWcGXC— Vijay Singh (@VijaySikriwal) September 12, 2024 -
RG Kar Case: చర్చలపై సందిగ్ధం
కోల్‌కతా: ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై 33 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న వైద్యులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. బెంగాల్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం సచివాలయం(నబన్న)లో ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే.. చివరి నిమిషంలో(5.23ని. టైంలో) ఆ భేటీని లైవ్ టెలికాస్ట్ చేయించాలని వైద్యులు ప్రభుత్వానికి మెయిల్ ద్వారా డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రతినిధులు హాజరుకావాలని నిరసన చేపట్టిన వైద్యులు ప్రధాన షరతుగా పెట్టారు. ఈ చర్చలను బహిరంగ వేదికగా జరపాలని మరో కండీషన్‌గా పెట్టారు. మీడియా ప్రతినిధులు కూడా ఈ చర్చలకు హాజరుకావాలని.. వీటిని లైవ్‌లో ప్రసారం చేయాలని కోరారు. చర్చల్లో పారదర్శకత కోసమే తాము ఇలా కోరుతున్నట్లు స్పష్టం చేశారు. వైద్యులలో 12 నుంచి 15 మందితో కూడిన ప్రతినిధుల బృందం ఈ సమావేశానికి రావాలంటూ సీఎస్ మనోజ్ పంత్ పేరిట ఆహ్వానం వెళ్లింది. అయితే 30 మంది బృందం చర్చలకు వెళ్తామని వైద్యులు అంటున్నారు. ఈ డిమాండ్లతో సాయంత్రం 6గం. లకేప్రారంభం కావాల్సిన చర్చలపై సందిగ్ధం నెలకొంది. అంతకంటే ముందే.. సీఎం మమతా బెనర్జీతో చర్చలకు తామూ సిద్ధమంటూ వైద్యులు ప్రకటన చేశారు. నెల రోజులుగా కొనసాగుతున్న అభయ ఘటన ప్రతిష్టంభనకు తెరదించేలా చర్చలు ఉండాలని, అందుకోసం అపాయింట్మెంట్ కోరుతూ సీఎంవోకు మెయిల్ పంపారు. దీంతో.. వెంటనే ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయానికి రావాల్సిందిగా ప్రభుత్వం బదులిచ్చింది. ఇదీ చదవండి: అభయ ఘటన. నిందితుడి గురించి షాకింగ్ విషయాలు -
సీఎం మమతా అబద్దం చెబుతున్నారు: కోల్‌కతా వైద్యురాలి తల్లి
కోల్‌కతా: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తును అణచివేసేందుకు ప్రయత్నించారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, తమకు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపించారు.అయితే ఈ ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. బాధితురాలి తల్లిదండ్రుల వ్యాఖ్యలను దీ కొట్టిపారేశారు. తమ ప్రభుత్వంపై అపనిందలు వేసే ప్రయత్నమంటూ మండిపడ్డారు.‘బాధితురాలి తల్లిదండ్రులకు మేము ఎప్పుడూ డబ్బు ఇవ్వలేదు. ఒక నిండు జీవితాన్ని డబ్బు ఎప్పటికీ భర్తీ చేయలేదు. కానీ, వారి కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా మంచి పని చేయాలని భావిస్తే.. వారికి మా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చా. ఆ విషయంలో వారు నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు. ఎప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలుసు’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.ఇదిలా ఉండగా సీఎం దీదీ వ్యాఖ్యలను హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తల్లి ఖండించారు. మమతా బెనర్జీ అబద్దం చెబుతున్నారని ఆరోపించారు. వారికి డబ్బులు ఇవ్వాలని చూశారని మరోసారి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘సీఎం మమతా అబద్ధాలు చెబుతున్నారు. నష్టపరిహారం ఇప్పిస్తానని, మీ కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చని మాతో చెప్పారు. నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు నేను మీ ఆఫీసుకు వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పాను’ అని తెలిపారు.అదే విధంగా హత్యాచారం అనంతరం చేపట్టిన నిరసనలను అణచివేసేందుకు సీఎం మమతా ప్రయత్రించారని ఆమె ఆరోపించారు. తమ నిరసనలు ఆపాలని, రాబోయే దుర్గా పూజ ఉత్సవాలకు సిద్దం కావాలని సూచించారని పేర్కొన్నారు. అయితే దీదీ అలా మాట్లాడటం అమానవీయమని అన్నారు. తాను ఒక ఆడపిల్లకు తల్లినైనందున ఇది అమానుషంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
చట్టాలు చేస్తే చాలా?
దేశాన్ని కదిలించిన ‘అభయ’ ఉదంతం దెబ్బతో బెంగాల్ కొత్త కఠిన చట్టంతో ముందుకొచ్చింది. అత్యాచార దోషులకు ఏకంగా మరణశిక్ష వేయాలంటూ మమతా బెనర్జీ సర్కార్ అత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత’ను తీసుకొచ్చింది. కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ మహిళా డాక్టర్ ఒకరిని గత నెలలో దారుణంగా రేప్ చేసి, చంపేసిన ఘటనతో రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమైన బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది. దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వరమే న్యాయాన్ని అందించి, దోషులకు కఠిన శిక్షలు విధించడానికే ఈ కొత్త బిల్లు తెచ్చామని సర్కార్ చెబుతోంది. బాధిత మహిళల బిల్లు గనక ప్రతిపక్షాలన్నీ కాదనే ధైర్యం చేయలేక తలూపుతూనే, మమత రాజీనామా డిమాండ్‌ను విడవకుండా వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఆమోదం పొందితే కానీ బిల్లు చట్టం కాదు గనక, బాధ్యత కేంద్రం మీదకు నెట్టేసి రాజకీయంగా మార్కులు సంపాదించే పనిలో మమత ముందడుగు వేస్తున్నారు. అత్యాచారాలు, లైంగిక నేరాల నుంచి మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పించే విధంగా చేపట్టిన ‘అపరాజిత మహిళా, శిశు రక్షణ బిల్లు–2024’లో మమత సర్కార్ పలు కొత్త అంశాలను పొందుపరిచింది. 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసేందుకు వీలుగా అపరాజిత టాస్క్‌ఫోర్స్ పేరిట ప్రత్యేక పోలీసు బలగాన్ని ఏర్పాటు చేస్తుందీ బిల్లు. కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త న్యాయచట్టాలు భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), అలాగే పోక్సో చట్టంలోని అంశాలను మించినవి కొన్ని ‘అపరాజిత’లో ఉన్నాయి. పోక్సో కింద 3 నుంచి 5 ఏళ్ళ జైలుశిక్ష, జరిమానా విధించేందుకే వీలుండగా, ఈ సరికొత్త బెంగాల్ అత్యాచార నిరోధక బిల్లు కింద 7 నుంచి పదేళ్ళ శిక్ష తప్పదు. పోక్సో కింద బాధిత చిన్నారి సాక్ష్యాన్ని 30 రోజులలోగా రికార్డ్ చేసి, ఏడాది లోగా విచారణ పూర్తి చేయవచ్చు. అపరాజిత మాత్రం వారం రోజుల్లోనే సాక్ష్యం రికార్డు చేయడం, నెల రోజుల్లో ప్రత్యేక కోర్ట్ విచారణ పూర్తి తప్పనిసరి చేసింది. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించేందుకు ఈ బిల్లు ఉపయుక్తమే. అలాగే, అత్యాచార దోషులకు పెరోల్ సైతం లేని యావజ్జీవ కారాగారవాస శిక్ష తప్పదు. రేప్, లేదా గ్యాంగ్‌రేప్ ద్వారా బాధితుల మరణానికో, జీవచ్ఛవంగా మారడానికో కారణమైన దోషులకు ఉరిశిక్ష విధింపు కూడా కోపోద్రిక్త ప్రజానీకానికి కొంత ఊరట. అలా బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్లకు మించి కఠినంగా ఈ కొత్త బిల్లును తీర్చిదిద్దడం నేరగాళ్ళకు సింహస్వప్నమే. అందుకే, అపరాజిత బిల్లును కనీవినీ ఎరుగని ప్రయత్నంగా పేర్కొంటూ, ‘‘దేశానికి మార్గదర్శి బెంగాల్’’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్ అవుతోంది. మహిళలపై నేరాలను ఏ మాత్రం సహించని వ్యక్తిగా, నాయకురాలిగా దీదీని చూపించే ప్రయత్నమూ జరుగుతోంది. కానీ, అదే సమయంలో దిగజారు తున్న ప్రతిష్ఠను నిలబెట్టుకొనేందుకే ఆమె ఈ బిల్లు తెచ్చారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అభిప్రా యాలు, అనివార్యతలు ఏమైనా... స్త్రీలు, పిల్లల రక్షణకంటూ చేసే ఏ సర్కారీ కొత్త ప్రయత్నాన్ని తీసిపారేయాల్సిన పని లేదు. ప్రతి చర్యనూ స్వాగతించాల్సిందే. నిజానికి, మహిళల రక్షణ నిమిత్తం 2019లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రాత్మకమైన ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. 2020లో మహారాష్ట్ర సైతం అత్యాచార బాధిత స్త్రీల పక్షాన నిలుస్తూ, దోషులకు కఠినశిక్షలతో ‘శక్తి’ బిల్లు పాస్ చేసింది. శాంతిభద్రతలే కాదు... సాధారణ ప్రజాపరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే గనక స్థానికంగా ఇలాంటి కట్టుదిట్టమైన శాసన నిర్మాణాన్ని తప్పు పట్టలేం. కానీ, ఈ చట్టాలన్నీ గవర్నర్ వద్దో, లేదంటే ఆపైన రాష్ట్రపతి వద్దో ఆఖరి ఆమోదముద్ర కోసం నేటికీ ఎదురుచూస్తూనే ఉండడం విషాదం. తాజా అపరాజితకూ ఆ గతి తప్పకపోవచ్చు. రాష్ట్రస్థాయిలో చేస్తున్న ఈ తరహా చట్టాలకు ఆమోదం తెలపడానికి ఢిల్లీ గద్దె మీది పెద్దలకు అభ్యంతరం ఎందుకో అర్థం కాదు. మహిళా పరిరక్షకులమనే ఘనత తమకే దక్కాలన్న రాజకీయాలే తప్ప, ఇతరేతర కారణాలూ కనబడడం లేదు. దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహిళా రెజ్లర్లు సైతం తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వీధికెక్కి పోరాడినా, చీమ కుట్టినట్టయినా లేని పాలకుల నుంచి ఇంకేం ఆశించగలం? ఆ మాటకొస్తే స్త్రీలకు అండగా తామున్నామని ఢిల్లీ పెద్దలు ఆచరణలో నమ్మకం కలిగించలేకపోవడం కూడా రాష్ట్రాల్లో కొత్త చట్టాలకు కారణమని విస్మరించలేం. కఠిన చట్టాలు చేయడం మంచిదే కానీ, కేవలం చట్టాల రూపకల్పనతో లక్ష్యం నెరవేరుతుందా అన్నది బేతాళప్రశ్న. కొన్ని లోటుపాట్లున్నా పాత చట్టాల మొదలు పుష్కరకాలం క్రితపు ‘నిర్భయ’ చట్టం దాకా మన దగ్గర చట్టాలకు కొదవ లేదు. అమలులో చిత్తశుద్ధి లోపమే సమస్య. అపరిచితు లొచ్చి అత్యాచారం జరిపేలా అభద్ర వాతావరణం, అసమర్థ గస్తీ, అధ్వాన్న దర్యాప్తు నెలకొన్నాయంటే ఆ తప్పు పాలకులదేగా! అదే సమయంలో సామాజికంగా, సాంస్కృతికంగా మనుషుల మానసిక కాలుష్యానికి కారణమై, నేరాలకు ప్రేరేపిస్తున్న అంశాలను అరికట్టేందుకు నిజాయతీగా మనందరం చేస్తున్నదేమిటో ఆలోచించుకోవాలి. ఆత్మపరిశీలనా చేసుకోవాలి. ప్రతిపక్ష పాలిత కోల్ కతాలో ‘అభయ’ జరిగిందని బీజేపీ, అధికార బీజేపీ పాలిత హాథ్రస్, ఉన్నావ్‌లలో జరిగిందేమిటని విపక్షాలు పరస్పర దూషణలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రాజకీయంగా పైచేయికై పోరాడే కన్నా సురక్షితమైన పాఠశాలలు, పనిప్రదేశాలు, సత్వరం స్పందించే రక్షక వ్యవస్థ లాంటి ప్రాథమిక అంశాలపై దృష్టి పెడితే అందరికీ మంచిది. అది లేకపోవడమే అసలు సమస్య. -
మహిళలపై నేరాలకు మరణ శిక్షే
కోల్‌కతా: మహిళలపై అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాలకు పాల్పడే దోషులకు మరణ శిక్ష విధించడానికి ఉద్దేశించిన ‘అపరాజిత’ బిల్లుకు పశి్చమ బెంగాల్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘అపరాజిత మహిళ, బాలలు(పశి్చమ బెంగాల్ చట్టాలు, సవరణ) బిల్లు–2024’ను రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి మలోయ్ ఘటక్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికార, విపక్ష సభ్యులంతా బిల్లుకు అంగీకారం తెలిపారు. బిల్లుకు సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రతిపాదించిన కొన్ని సవరణలను సభ తిరస్కరించింది.మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారి మరణానికి లేదా జీవచ్ఛవంగా మారడానికి కారణమైన దోషులకు మరణ శిక్ష లేదా పెరోల్‌కు వీల్లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా అపరాజిత బిల్లును పశి్చమ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలపై నేరాల కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, సత్వరమే కోర్టు నుంచి తీర్పు వచ్చేలా బిల్లులో నిబంధనలు జోడించారు. మహిళలు, చిన్నారులకు భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా అత్యాచారాలు, లైంగిక నేరాలకు సంబంధించి ఇప్పుడున్న చట్టంలో కొన్ని మార్పులు చేశారు, కొత్త అంశాలు చేర్చారు.కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులకు మరణ శిక్ష విధించేలా కఠినమైన చట్టం తీసుకొస్తామని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అపరాజిత బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించడం కోసమే రెండు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: సీఎం మమతా బెనర్జీ డిమాండ్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టని ముఖ్యమంత్రులంతా పదవులకు రాజీనామా చేయాలని పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీలో అపరాజిత బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించి, బాధితులకు సత్వరమే న్యాయం చేకూర్చేలా చట్టాల్లో సవరణలు చేయాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అందుకే తామే మొదట చొరవ తీసుకున్నామని తెలిపారు.అపరాజిత బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. ఇది మొత్తం దేశానికి ఒక రోల్‌మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇటీవల ప్రధాని మోదీకి తాను రాసిన రెండు లేఖలను ఆమె సభ ముందుంచారు. మహిళలు, చిన్నారులకు భద్రత కలి్పంచేలా చట్టాలను అమలు చేయడంలో విఫలమైన పాలకులంతా పదవుల నుంచి తప్పుకోవాలని తేలి్చచెప్పారు. ఇదిలా ఉండగా, జూనియర్ డాక్టర్ హత్యకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని సభలో విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు బిగ్గరగా నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్లో మహిళలపై అధికంగా నేరాలు జరుగుతున్నాయని తిప్పికొట్టారు.ఏమిటీ అపరాజిత బిల్లు?భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితతో పాటు పోక్సో చట్టానికి కూడా పశి్చమ బెంగాల్ ప్రభుత్వ అపరాజిత బిల్లు సవరణలను ప్రతిపాదించింది. ‘‘అత్యాచారం, అత్యాచారం–హత్య, సామూహిక అత్యాచారం, బాధితుల గుర్తింపు బయటపెట్టడం, యాసిడ్ దాడి వంటి నేరాలకు విధించే శిక్షలకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64, 66, 70(1), 71, 72(1), 73, 124(1), 124(2)ను సవరించాలి. మహిళలు, చిన్నారులపై అత్యాచారం, లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలి’’ అని పేర్కొంది.‘‘అత్యాచారం కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైన 21 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. తగిన కారణాలుంటే మరో మూడు వారాలు పొడిగించవచ్చు. దోషులకు మరణ శిక్షతో పాటు జరిమానా లేదా ఆజన్మ ఖైదు (మరణించేదాకా) విధించాలి. మహిళలపై నేరాలకు సంబంధించిన కోర్టు కార్యకలాపాలను, కేసు విచారణ వివరాలను అనుమతి లేకుండా ప్రచురిస్తే 3 నుంచి ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించాలి. దర్యాప్తు కోసం డీఎస్పీ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి. దర్యాప్తు వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కోర్టును, దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి’’ అని అపరాజిత బిల్లు ప్రతిపాదించింది. -
బెంగాల్ అసెంబ్లీ ముందుకు అత్యాచార నిరోధక బిల్లు
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై విపక్షాలు, విద్యార్ధి సంఘాలు, వైద్యుల నిరసనలతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సమయంలో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం.. సోమవారం నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును బెంగాల్ న్యాయ మంత్రి మోలోయ్ ఘటక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనికి 'అపరాజిత స్త్రీ, చైల్డ్ బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాలు, సవరణ) బిల్లు 2024'గా పేరు పెట్టారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం, లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి మహిళలు పిల్లలకు రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బిల్లు తీసుకొచ్చింది.ఈ బిల్లులో ఏమి ఉంటుంది అత్యాచారం, హత్య కేసుల్లో మరణశిక్ష విధించే నిబంధన.ఈ బిల్లు ప్రకారం ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 36 రోజుల్లోగా మరణశిక్ష విధించే నిబంధన ఉంటుంది.అత్యాచారం మాత్రమే కాదు యాసిడ్ దాడి కూడా అంతే తీవ్రమైన నేరం, దీనికి జీవిత ఖైదు విధించే నిబంధన ఈ బిల్లులో ఉంది.ప్రతి జిల్లాలో స్పెషల్ ఫోర్స్-అపరాజిత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.ఈ అపరాజిత టాస్క్ ఫోర్స్ అత్యాచారం, యాసిడ్ దాడి లేదా వేధింపుల కేసుల్లో చర్య తీసుకుంటుంది.ఎవరైనా బాధితురాలి గుర్తింపును వెల్లడిస్తే, అతనిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు.కాగా ఈ బిల్లు గురించి గతంలో మమతా బెనర్జీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అత్యాచార ఘటనలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని దీదీ స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న చట్టాలను సవరించి, అత్యాచార నిందితులకు మరణ శిక్ష పడేలా అసెంబ్లీలో వచ్చేవారం బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతామని, దానికి ఆమోదం లభించకపోతే.. రాజ్‌భవన్ బయట నిరసన తెలుపుతామని హెచ్చరించారు.#WATCH | Kolkata, West Bengal: Junior Doctors continue to sit at the protest site in the Lalbazar area. They have been demanding justice for a woman doctor who was raped and murdered at RG Kar Medical College and Hospital on August 9. pic.twitter.com/HZ7mfOxAE2— ANI (@ANI) September 3, 2024 కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసుపై సీబీఐ రెండు సమాంతర దర్యాప్తులు జరుపుతోంది. మొదటిది అత్యాచారం, హత్య కేసుకు సంబంధించినది కాగా, రెండవది ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవలకు సంబంధించినది. ఈ నేరానికి సంబంధించి ఆర్జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.మరోవైపు కోల్‌కతాలోని వివిధ వైద్య కళాశాలలకు చెందిన జూనియర్ వైద్యులు మంగళవారం ఉదయం బిబి గంగూలీ వీధిలో తమ నిరసనను కొనసాగించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. బీబీ గంగూలీ స్ట్రీట్‌లో పోలీసులు భారీ సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. లాల్‌బజార్‌లోని కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు ర్యాలీగా తరలివెళ్లే ప్రయత్నం చేశారు. -
Mamata Banerjee: రేపిస్టులకు మరణశిక్షే
కోల్‌కతా: అత్యాచారం కేసుల్లో మరణశిక్ష విధించేలా చట్టాలను సవరిస్తామని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. వచ్చేవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను పెట్టి ఈ బిల్లును ఆమోదిస్తామన్నారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రేప్ లాంటి నేరాలను తాము ఏమాత్రం ఉపేక్షించబోమని మమత అన్నారు. అత్యాచారానికి మరణశిక్ష విధించే సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంలో ఆలస్యం చేసినా, రాష్ట్రపతికి పంపినా.. తాను రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తానని ప్రకటించారు. రేప్ కేసుల్లో దోషులుగా తేలినవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టం తేవాలని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి టీఎంసీ శనివారం నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమం చేస్తుందని తెలిపారు. గవర్నర్ తమ బిల్లును తొక్కిపెడితే రాజ్‌భవన్ ఎదుట మహిళలతో పెద్ద ఎత్తున ధర్మా చేస్తామని మమత అన్నారు. టీఎంసీ ఛాత్ర పరిషద్ వ్యవస్థాపక దినోత్సవం ర్యాలీని ఉద్దేశించి మమత బుధవారం ప్రసంగించారు. రాజ్‌భవన్‌లో తనను లైంగిక వేధింపులకు గురిచేశారని గతంలో ఒక ఉద్యోగిని ఆరోపించడాన్ని ప్రస్తావించారు. గవర్నర్ సి.వి.ఆనంద బోస్ తమ ప్రభుత్వంపై, టీఎంసీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 20 రోజులుగా సమ్మెలో ఉన్న జూనియర్ డాక్టర్లను తక్షణం విధుల్లో చేర్చాల్సిందిగా కోరారు. ‘తమ సహచరిణికి న్యాయం కోరుతున్న డాక్టర్ల ఆవేదన పట్ల నేను మొదటినుంచీ సానుభూతితోనే ఉన్నాను. ఘటన జరిగి చాలా రోజులు గడిచిపోయినా జూనియర్ డాక్టర్లపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు దిగలేదు. వారి ఆవేదనను అర్థం చేసుకోగలం. కానీ రోగులు ఇబ్బందిపడుతున్నారు. దయచేసి విధుల్లోకి తిరిగిరండి’ అని మమత విజ్ఞప్తి చేశారు. మెడికోల కెరీర్‌కు ఇబ్బంది రాకూడదనే ఒక్క డాక్టర్‌పై కూడా ఎఫ్ఐఆర్ను నమోదు చేయలేదన్నారు. ‘ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ స్వా«దీనం చేసుకొని 16 రోజులు అయింది. దర్యాప్తు పురోగతిని సీబీఐ బయటపెట్టాలి’ అని మమత డిమాండ్ చేశారు. శవాలపై రాజకీయ లబ్ధి పొందాలనే బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపిచి్చందని ధ్వజమెత్తారు. వైద్యురాలి హత్యను చూపి బీజేపీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటోందని మండిపడ్డారు. ప్రధాని ఎందుకు రాజీనామా చేయలేదు? ఆర్.జి.కర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్లపై మమతా తీవ్రంగా స్పందించారు. ‘ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, మణిపూర్‌లతో మహిళలపై లైంగిక దాడులు, హింసను నిరోధించలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు రాజీనామా చేయలేదని నేను బీజేపీ అడుగుతున్నా. అస్సాంలో ఒక నిందితుడినే ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, భవిష్యత్తులో గెలవలేమని తెలుసు కాబట్టే తన రాజీనామాకు బీజేపీ డిమాండ్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఆరి్టఫిషియల్ ఇంటలిజెన్స్‌ను వాడి బీజేపీ పెద్ద ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడుతోందని, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తోందని ఆరోపించారు. దుర్గా పూజ సంబరాలను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నిందన్నారు. బెంగాల్ తగలబెడితే.. ఢిల్లీ కూడా బెంగాల్‌ను అపఖ్యాతి పాల్జేయడానికి కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి కుట్ర పన్నారని బీజేపీపై మమత ధ్వజమెత్తారు. బెంగాల్‌ను తగలబెడితే అసోం, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ, యూపీల్లోనూ అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం సిగ్గుచేటని బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి సుకాంత మజుందార్ అన్నారు. బెంగాల్లో శాంతిభద్రతలు కాపాడాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చేసిన ఫిర్యాదులో కోరారు. -
రాళ్ల దాడులు, లాఠీచార్జి... ర్యాలీ హింసాత్మకం
కోల్‌కతా: ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో యువ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కోల్‌కతాలో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారింది. ఇటు ఇసుక వేస్తే రాలనంత మంది విద్యార్థి నిరసనకారులు, అటు వారిని అడ్డుకునేందుకు వేలాదిగా మోహరించిన పోలీసులతో పరిస్థితి యుద్ధరంగాన్ని తలపించింది. నగరవ్యాప్తంగానే గాక సమీపంలోని హౌరాలో కూడా వారికి, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సచివాలయానికి దారితీసే మార్గాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో దిగ్బంధించారు. వాటిని బద్దలు కొట్టుకుంటూ దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దాంతో ఖాకీలు లాఠీలకు పని చెప్పారు. గాల్లోకి కాల్పులు జరపడంతో పాటు వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడి, లాఠీచార్జిలో ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుషత్వమంటూ బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. మహిళలపై అకృత్యాలను అడ్డుకోవడం చేతగాని మమతా సర్కారు విద్యార్థులపై మాత్రం ప్రతాపం చూపుతోందంటూ దుయ్యబట్టింది.‘‘పోలీసు హింసాకాండకు బాధ్యత వహి స్తూ మమతా బెనర్జీ తక్షణం రాజీనామా చేయాలి. వైద్యురాలి హత్యలో నిజాలు వెలు గు చూసేందుకు వీలుగా పాలీ టెస్టులకు సిద్ధపడాలి’’ అని డిమాండ్ చేసింది. లేదంటే రా ష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించింది. బుధవారం 12 గంటల పాటు బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణ మూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ర్యాలీ బీజేపీ గేమ్ప్లానేనని చెప్పేందుకు ఇదే నిదర్శనం. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను దిగజార్చేందుకే ఆ పార్టీ కంకణం కట్టుకుంది’’ అంటూ మండిపడింది. బంద్ జ రగనిచ్చే ప్రసక్తే లేదని మమత ముఖ్య సలహాదారు ఆలాపన్ బంధోపాధ్యాయ్ కుండబద్దలు కొట్టారు! ఉదయం నుంచే... విద్యార్థి సంఘమైన పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సచివాలయ ర్యాలీ తలపెట్టారు. మరోవైపు డీఏ తదితర డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల అసమ్మతి వేదిక ‘సంగ్రామీ జౌతా మంచా’ కూడా మంగళవారమే చలో సచివాలయానికి పిలుపునిచ్చింది. నిరసనకారులంతా కోల్‌కతాలో పలు ప్రాంతాల నుంచి ఒక్క ఉదుటున సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీటిని భగ్నం చేసేందుకు ఏకంగా 6,000 మందికి పై చిలుకు బలగాలు రంగంలోకి దిగాయి. హౌరా బ్రిడ్జి, సంత్రాగచ్చి రైల్వేస్టేషన్‌తో పాటు నగరంలో పలుచోట్ల బారికేడ్లతో పోలీసులు ముందుగానే రోడ్లను దిగ్బంధించారు. బారికేడ్లపైకెక్కి దూకేందుకు ప్రయత్నించిన నిరసనకారులను నిలువరించేందుకు లాఠీచార్జీ చేయ డంతో చాలామంది గాయపడ్డారు. కోపోద్రిక్తులైన నిరసనకారులు రాళ్లతో పాటు ఇటు కలు కూడా విసరడంతో 30 మంది దాకా పోలీసులు గాయపడ్డారు. ఎంజీ రోడ్, హేస్టి ంగ్స్ రోడ్, ప్రిన్సెప్ ఘాట్ తదితర ప్రాంతాలన్నీ ఘర్షణలకు వేదికగా మారాయి. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారా యి. ‘‘మేమేమీ చట్టాలను అత్రికమించలేదు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే విచక్షణారహితంగా కొట్టారు’’ అంటూ విద్యార్థులు మండిపడ్డారు. 33 మంది మహిళలతో పాటు మొత్తం 126 మంది ఛాత్ర సమాజ్ సభ్యులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వాస్తవానికి 200 పైచిలుకు మందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రేపిస్టులకు మమత అండ: నడ్డా విద్యార్థుల శాంతియుత ర్యాలీపై పోలీసులు జులుం ప్రదర్శించారని బీజేపీ అధ్యక్షుడు జే పీ నడ్డా ఆరోపించారు. ‘‘మమత పాలనలో రేపిస్టులు, క్రిమినల్స్‌కు వ్యవస్థే అన్నివిధాలా అండగా నిలుస్తోంది. మహిళల భద్రత కో సం గళమెత్తడం బెంగాల్లో క్షమించరాని నేరంగా మారింది’’ అంటూ ఎక్స్ పోస్టులో ఎద్దేవా చేశారు. వైద్యురాలిపై హత్యాచారానికి పాల్ప డ్డ వారిని మమత సర్కా రే కాపాడుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. చెవిటి సర్కారు: బీజేపీ మమతను కరడుగట్టిన నియంతగా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అభివర్ణించారు. న్యాయం కావాలంటూ ప్రజలు చేస్తున్న ఆక్రందనలు ఆమె చెవిటి సర్కారుకు విన్పించడం లేదని మండిపడ్డారు. అరాచక ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే బంద్‌కు పిలుపునిచి్చనట్టు తెలిపారు. విద్యార్థుల ర్యాలీపై పోలీసుల అణచివేతకు నిరసనగా పార్టీ కార్యకర్తలతో కలిసి లాల్ బజార్ ప్రాంతంలో బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ఆయన విఫలయత్నం చేశారు. టియర్ గ్యాస్ ధాటికి స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. అరెస్టు చేసిన విద్యార్థులందరినీ బేషరతుగా విడుదల చేయాలంటూ సాయంత్రం దాకా అక్కడే బైఠాయించారు. మరోవైపు బుధవారం రాష్ట్రమంతటినీ స్తంభింపజేయడంతో పాటు సెపె్టంబర్ 6 దాకా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు విపక్ష నేత సువేందు అధికారి ప్రకటించారు. బీజేపీకి చెందిన నలుగురు విద్యార్థి నేతలను మంగళవారం రాత్రే పోలీసులు మాయం చేశారని ఆయన ఆరోపించారు. వాటిని పోలీసులు ఖండించారు. వాళ్లను హత్యాయత్నం అభియోగాలపై అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. డీఎన్ఏ, ఫోరెన్సిక్ సాక్ష్యాలపై...ఎయిమ్స్ వైద్యుల అభిప్రాయం వైద్యురాలి కేసులో సీబీఐ నిర్ణయం కోల్‌కతా: కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసుకు సంబంధించిన డీఎన్ఏ, ఫోరెన్సిక్ సాక్ష్యాలపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని సీబీఐ నిర్ణయించింది. ప్రధాన నిందితు డు సంజయ్ రాయ్ తనంత తానుగా నే ఘోరానికి పాల్పడ్డాడా, అతని వెనక ఎవరన్నా ఉన్నారా అన్నదానిపై పక్కాగా నిర్ధారణకు వచ్చేందుకు వారిచ్చే నివేదిక ఉపయోగపడొచ్చని భావిస్తోంది. సంజయ్‌కి సన్నిహితుడైన ఏఎస్సై అనూప్ దత్తా కూడా ఈ ఘోరంలో అతనికి సా యపడ్డట్టు సీబీఐ అనుమానిస్తోంది. దత్తాకు పాలి టెస్టులు చేసేందుకు కోర్టు ను ఇప్పటికే అనుమతి కోరింది. మరో వైపు ఘోష్ హయాంలో ఆస్పత్రిలో ఆర్థిక అవకతవకలపై తాజాగా ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ‘కమిషనర్’ బైక్‌పై నిందితుడు! కోల్‌కతా: అత్యాచారం, హత్య జరిగిన రాత్రి ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కోల్‌కతా పోలీస్ కమిషనర్ పేరిట రిజిస్టరైన బైక్‌ను వాడినట్టు తేలడం ఆందోళనకరమని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ అన్నారు. వైద్యుల భద్రతపై టాస్‌్కఫోర్స్ తొలి సమావేశం భాగస్వామ్యపక్షాలతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరపాలని నిర్ణయం న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్‌్కఫోర్స్ తొలి సమావేశం మంగళవారం జరిగింది. భద్రతపై ప్రొటోకాల్ రూపొందించడానికి భాగస్వామ్యపక్షాలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో 10 మంది సభ్యులతో ఈ టాస్‌్కఫోర్స్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ సెక్రెటరీ నేతృత్వంలో జరిగిన తొలి సమావేశానికి సభ్యులందరితోపాటు కేంద్ర హోం శాఖ, ఆరోగ్య శాఖ కార్యదర్శులు సైతం హాజరయ్యారు. వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతపై చర్చించారు. తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. ఇప్పటికే వివిధ భాగస్వామ్యపక్షాలతో మాట్లాడామని, తమకు దాదాపు 400 సలహాలు సూచనలు అందాయని టాస్‌్కఫోర్స్ సభ్యులు ఈ సందర్భంగా చెప్పారు. -
మమత బెనర్జీ నివాసం ముట్టడి
-
కోల్‌కతా ఘటనపై ప్రధానికి మమతా లేఖ.. కేంద్రం ఘాటు రిప్లై
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను శిక్షించేందుకు కఠినమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం లేఖపై కేంద్రం ఘాటుగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి సీఎం మమతా బెనర్జీకి సోమవారం లేఖ రాశారు.మహిళలు, చిన్నారులపై వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులను విచారించేందుకు పశ్చిమబెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం 123 ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులను కేటాయించినప్పటికీ.. వీటిలో ఇప్పటికీ చాలా వరకు ప్రారంభించలేదని మండిపడ్డారు. మమత సర్కార్ మహిళల భద్రత విషయంలో వైఫల్యం చెందిందని,మహిళలు, చిన్నారులపై వివక్ష, హింసను నియంత్రించేందుకు తక్షణమే సమర్థమంతమైన చర్యలు తీసుకోవాలని విమర్శలు గుప్పించారు. ‘కోల్‌కతాలో హత్యాచారానికి గురైన డాక్టర్ తల్లిదండ్రులకు నా సంతాపం. గత నెలలో దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం ద్వారా కఠినమైన శిక్షలను అమలు చేస్తున్నాం. దీని ద్వారా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను అడ్డుకుంటున్నాం. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విషయానికొస్తే.. ఈ కోర్టులను ఏర్పాటు చేసేందుకు 2019లో కేంద్రం పథకం ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 30 జూన్ 2024 నాటికి, 409 ప్రత్యేకమైన పోక్సో కోర్టులతో సహా 752 ఎఫ్టీఎస్సీలు పని చేస్తున్నాయి. వీటి కింద 2,53,000 కంటే ఎక్కువ కేసులు పరిష్కరం పపొందాయి. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మొత్తం 123 ఎఫ్టీఎస్సీల కేటాయింపు జరిగింది. ఇందులో 20 ప్రత్యేక పోక్సో కోర్టులు 103 ఎఫ్టీఎస్సీలు ఉన్నాయి. అయితే వీటిలో ఏవి కూడా 2023 జూన్ వరకు పనియలేదు. రాష్ట్రంలో 48,600 అత్యాచారం, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ఇంకా 11 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఉమెన్ హెల్ప్ లైన్ 181, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 112, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098లను సమర్థంగా అమలు చేయడంలో విఫలమయ్యారు. బాధిత మహిళలకు తక్షణ సాయం అందించడంలో ఈ సేవలు ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం పలుమార్లు గుర్తు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని ఇంకా ఏకీకృతం చేయలేదు. ఈ లోపం కారణంగా రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులు ఆపద సమయంలో అవసరమైన సహాయాన్ని కోల్పోతున్నారు’ అని మండిపడ్డారుకాగా దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువైపోతున్నాయని ఆరోపిస్తూ గతవారం మమతా బెనర్జీ ప్రధానినరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో రోజుకు 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని, వీటిలో చాలా సందర్భాల్లో బాధితులు హత్యకు గురవతున్నారని తెలిపారు. ఇదంతా చూస్తుంటే భయంకరంగా ఉంది. ఇది సమాజం విశ్వాసాన్ని, మనస్సాక్షిని కదిలిస్తుందని అన్నారు.మహిళలు సురక్షితంగా ఉండేలా వారికి రక్షణ కల్పించడం మన కర్తవ్యం. ఇటువంటి తీవ్రమైన, సున్నితమైన సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించేలా కేంద్రంచ ట్టం తీసుకుకురావాలి’ అని పేర్కొన్నారు. అదే విధంగా అటువంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. సత్వర న్యాయం జరగాలంటే 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆమె సూచించారు. -
ఎంపీ అభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈనేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడైన ఎంపీ అభిషేక్ బెనర్జీ 11ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేస్తామని పలువురు బెదిరించిన వీడియోలు పశ్చిమ బెంగాల్ బాలల హక్కుల సంఘం దృష్టికి వచ్చాయి. ఆర్జీకార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై నిరసనర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో ఓ వ్యక్తి అభిషేక్ బెనర్జీ కుమార్తెపై దారుణానికి ఒడిగడతామని బెదిరించగా.. మరో వ్యక్తి దారుణానికి ఒడిగట్టిన వారికి రూ.10కోట్లు బహుమతి ఇస్తామని చెప్పిన వీడియో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోపై పిల్లల హక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బహిరంగంగా ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం పిల్లల భద్రతకు హాని కలిగించేలా ఉంది’అని కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.అంతేకాదు ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన నిందితులపై పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్, బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.ఈ ఘటనపై రెండు రోజుల్లో చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలని బాలల హక్కుల సంఘం పోలీసులను కోరింది.జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీదీ రాజీనామా చేయాలని రాజకీయ ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ.. ఇంతటి క్లిష్ట సమయంలో మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాత్రం చురుగ్గా కనిపించడం లేదు. దాంతో పార్టీలో అంతర్గతంగా లుకలుకలున్నాయని వార్తలు వస్తున్నాయి. అభిషేక్ ఎక్కడ..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
కోల్‌కతా హత్యోదంతం వేళ.. సందీప్ ఘోష్‌కు దీదీ రాసిన లేఖ వైరల్
కోల్‌కతా : యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కోల్‌కతా వైద్య విద్యార్థిని కేసులో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022 జూన్ 30న ఆర్జీకార్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ లేఖ రాశారు. ఆ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ లేఖతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అయితే సన్నిహితంగా ఉండే అతి కొద్ది మందికి మాత్రమే మమతా బెనర్జీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖలు రాస్తారని, ఆ కొద్ది మందిలో సందీష్ ఘోష్ సైతం ఉన్నారని సమాచారం. ఇక ఆ లేఖపై దీదీని బీజేపీ టార్గెట్ చేసింది. సందీప్ ఘోష్‌కు పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్, సీఎం మమతా బెనర్జీతో మంచి అనుబంధం ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ సందర్భంగా ఆర్జీకార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సందీప్ ఘోష్ మమతా బెనర్జీ అత్యంత సన్నిహితుల్లో ఒకరు అనేది రహస్యం కాదని, బీజేపీ అధికార ప్రతినిధి ప్రియాంక తిబ్రేవాల్ అన్నారు. ‘ఆర్జీ కార్ ఆసుపత్రిలో అవకతవకలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, డాక్టర్ సందీప్ ఘోష్‌ను తొలగించలేదు. ప్రిన్సిపల్‌గా కొనసాగారు’ అని తిబ్రేవాల్ చెప్పారు.రాజీనామా అంతలోనే పోస్టింగ్ వైద్యురాలిపై జరిగిన దారుణం జరిగిన రెండురోజుల తర్వాత.. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్జీకార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. వెనువెంటనే కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ అంశంపై వివాదం నెలకొంది. కలకత్తా హైకోర్టు సైతం ఆయన పోస్టింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సందీష్ ఘోష్‌ను నిరవధిక సెలవుపై పంపింది. ఆ తర్వాత బెంగాల్ ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది.సందీప్ ఘోష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చుఅదీకాక.. ఈ హత్యాచారం జరిగిన అనంతరం చోటు చేసుకున్న వరుస పరిణామాలు.. ఆ సమయంలో కాలేజీ ప్రిన్సిపల్‌గా సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు తీవ్ర సందేహాస్పదంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం సందీష్ ఘోష్ చుట్టు ఉచ్చు మరింత బిగిసేలా.. ఆర్జీ కార్ ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ సిట్ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోల్‌కతా హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఆర్జీ కార్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ ఆధారంగా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు సైతం ఆగ్రహంఈ వారం ప్రారంభంలో అక్తర్ అలీ డాక్టర్ సందీష్ ఘోష్ మార్చురీలోని అనాధ శవాలతో వ్యాపారం చేశారని, అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు సందీష్ ఘోష్‌ను విచారణకు ఆదేశించింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో ఎవరు టచ్‌లో ఉన్నారు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఎందుకు ఆలస్యం అయ్యింది?అని బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కోర్టు ప్రశ్నించింది. -
Kolkata Doctor Case: క్రైం సీన్‌నే మార్చేశారు
న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి, వైద్య కళాశాలలో వైద్యురాలి హత్యాచారోదంతంపై తమ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్టు సీబీఐ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘‘ఈ పాశవిక చర్యను కప్పిపుచ్చి ఆత్మహత్యగా చిత్రించేందుకు స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రయతి్నంచారు. అందులో భాగంగా మేం దర్యాప్తు బాధ్యతలు స్వీకరించే నాటికి ఏకంగా క్రైం సీన్‌నే సమూలంగా మార్చేశారు.ఈ కారణంగా దర్యాప్తు తమకో పెను సవాలుగా మారింది’’ అంటూ నివేదించింది. ‘‘తొలుత వైద్యురాలి ఆరోగ్యం బాగా లేదంటూ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వాళ్లు ఆస్పత్రికి చేరుకున్నాక ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. హతురాలి అంత్యక్రియలు పూర్తయ్యాక తీరుబడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’’ అని పేర్కొంది. ‘అంతేకాదు, ఆగస్టు 9న ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఆస్పత్రి వైద్యులు ఫోన్ చేసి వైద్యురాలు అపస్మారక స్థితిలో ఉందని సమాచారమిచ్చారు. నిజానికి ఆమె అప్పటికే చనిపోయింది’’ అని తెలిపింది. ప్రిన్సిపల్ వెనక ఎవరున్నట్టు: సీజేఐ కోల్‌కతా దారుణాన్ని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించడం తెలిసిందే. ధర్మాసనం ఆదేశం మేరకు ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన అంశాలతో దర్యాప్తు పురోగతిపై గురువారం సీబీఐ స్థాయీ నివేదిక సమరి్పంచింది. బెంగాల్ సర్కారు కూడా ఓ నివేదిక సమరి్పంచింది. ఈ కేసులో కోల్‌కతా పోలీసుల దర్యాప్తు అత్యంత లోపభూయిష్టమంటూ జస్టిస్ పార్డీవాలా ఈ సందర్భంగా మండిపడ్డారు. ‘‘సాయంత్రం 6.10 నుంచి 7.10 మధ్య పోస్టుమార్టం జరిపారు. అంటే అది అసహజ మరణమని అప్పటికే రూఢీ అయినట్టే. కానీ అర్ధరాత్రి కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం చాలా ఆశ్చర్యకరం.గత 30 ఏళ్లలో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు’’ అంటూ ఆయన తూర్పారబట్టారు. అర్ధరాత్రి పోస్టుమార్టం తర్వాత గానీ క్రైం సీన్‌ను పోలీసులు అ«దీనంలోకి తీసుకోలేదంటూ సీజేఐ ఆక్షేపించారు. అసహజ మరణమని పొద్దున్నే తేలినా ఎందుకంత ఆలస్యం చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ దాఖలులో కోల్‌కతా పోలీసుల అసాధారణ జాప్యం అత్యంత తీవ్రమైన అంశమంటూ దుయ్యబట్టారు. ‘‘14 గంటలు ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమా?! ఘోరం గురించి ఉదయమే తెలిసినా, సాయంత్రానికల్లా పోస్టుమార్టం చేసినా రాత్రి 11.30 దాకా పోలీసులకు సమాచారమే ఇవ్వలేదు. నిజానికి విషయం తెలియగానే నేరుగా ఆస్పత్రికి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూడటం ప్రిన్సిపల్ కనీస బాధ్యత.ఈ విషయంలో ఆయన ఎందుకు జాప్యం చేసినట్టు? అసలాయన ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు? దాని వెనక కారణాలేమిటి? విమర్శల తీవ్రతకు ఎట్టకేలకు ప్రిన్సిపల్ రాజీనామా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకపోగా ఆయన్ను సింపుల్‌గా మరో వైద్య కాలేజీకి బదిలీ చేసింది’’ అంటూ సీజేఐ ఆక్షేపించారు. దీనంతటినీ ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి తొలి ఎంట్రీ నమోదు చేసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు తమ ఎదుట హాజరై ఎంట్రీ నమోదు సమయం తదితర వివరాలన్నింటినీ నేరుగా వెల్లడించాలని ఆదేశించారు.ఈ ఉదంతాన్ని రాజకీయం చేయొద్దని పారీ్టలకు సీజేఐ సూచించారు. హతురాలి జననాంగంలో 150 జీఎం పరిమాణంలో వీర్యం ఉందన్న సీబీఐ తరఫు న్యాయవాది వాదనను తప్పుబట్టారు. సోషల్ మీడియా వార్తల ఆధారంగా వాదనలు విని్పంచొద్దంటూ మందలించారు. గ్యాంగ్ రేప్ జరగలేదని, ఇది కేవలం ఒక్కరి పనేనని ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తులో తేలిందని, డీఎన్ఏ నివేదిక కూడా దీన్నే ధ్రువీకరిస్తోందని సీబీఐ పేర్కొన్నట్టు సమాచారం!మెహతా వర్సెస్ సిబల్పశి్చమ బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఆయనకు, సీబీఐ తరఫున వాదనలు విన్పించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు మధ్య సాగిన వాడీ వేడి వాదనలు కోర్టు హాలును వేడెక్కించాయి. ఎఫ్ఐఆర్ దాఖలులో చోటుచేసుకున్న లోటుపాట్లను తాను వివరిస్తుంటే సిబల్ హేళనగా నవ్వుతున్నారంటూ ఒక దశలో మెహతా తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘ఒక అమాయకురాలు అత్యంత హృదయ విదారక పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది. కనీసం నవ్వకుండా ఉండటం సంస్కారం’’ అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేశారు.వైద్యులు పట్టుబట్టినందుకే వీడియో జరిగిన దారుణం గురించి తెలిసినా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఘోష్ వెంటనే ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటూ సొలిసిటర్ జనరల్ మెహతా తప్పుబట్టారు. హతురాలి తండ్రి ఎంతగా డిమాండ్ చేసినా అంత్యక్రియల అనంతరం రాత్రి 11.45 గంటలకు గానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం చాలా దారుణమని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘పోస్టుమార్టాన్ని వీడియో తీయాల్సిందేనని వైద్యురాలి సహచరులు, సీనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. లేదంటే ఆ ఆధారాలు కూడా మిగిలేవి కాదు’’ అన్నారు. వీటిని సిబల్ ఖండించారు. సీబీఐ నివేదికను బురదజల్లే యత్నంగా అభివర్ణించగా మెహతా తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిజాలను కప్పిపెట్టేందుకు చల్లిన బురదను తొలగించేందుకే సీబీఐ ప్రయతి్నస్తోందన్నారు.నేనూ ధర్మాసుపత్రిలో నేలపై పడుకున్నా: సీజేఐ వైద్యుల సమస్యల గురించి ప్రస్తావిస్తూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి తన కుటుంబీకుల్లో ఒకరికి చికిత్స సందర్భంగా స్వయంగా ధర్మాసుపత్రిలో నేలపై పడుకున్నానని చెప్పారు. వైద్యులు దారుణమైన పరిస్థితుల నడుమ పని చేస్తున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వాళ్లకు కనీస మౌలిక వసతులు కూడా అందుబాటులో లేవు. 36 గంటలు, అంతకుమించి నిరంతరాయంగా పని చేయాల్సి వస్తోంది. ఇది అత్యంత అమానవీయం.అంతసేపు పని చేసి పూర్తిగా అలసిపోయిన స్థితిలో ఎవరన్నా వేధించినా అడ్డుకుని స్వీయరక్షణ చేసుకునే స్థితిలో కూడా ఉండరు! ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయని వైద్యులు దయచేసి అర్థం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు. న్యాయం, ఔషధాలు అందడంలో జాప్యం జరగరాదన్నారు. సమ్మె విరమించి విధులకు వెళ్లాల్సిందిగా వైద్యులను మరోసారి అభ్యర్థించారు. ఆందోళనల్లో పాల్గొన్నందుకు ఆస్పత్రి వర్గాలు తమను వేధిస్తున్నాయని నాగ్‌పూర్ ఎయిమ్స్ వైద్యులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాంతో వైద్యుల శాంతియుత నిరసనలపై బలప్రయోగానికి దిగొద్దని, విధుల్లో చేరాక ప్రతీకార చర్యలేవీ తీసుకోవద్దని సీజేఐ ఆదేశించారు.సలహాల కోసం పోర్టల్‘‘దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం కేంద్ర, రాష్ట్రాలు వారం లోపు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో, డీజీపీలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సంప్రదింపులు జరపాలి’’ అంటూ సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. ‘‘వైద్యుల భద్రత తదితరాలపై సలహాల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలి. సలహాలు, సూచనలను నేషనల్ టాస్‌్కఫోర్స్ పరిగణనలోకి తీసుకుని వైద్యుల భద్రతపై నేషనల్ ప్రొటోకాల్‌ను రూపొందించాలి’’ అంటూ పలు నిర్దేశాలు జారీ చేశారు. విచారణను సెపె్టంబర్ 5కు వాయిదా వేశారు.మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్ టెస్టు మరో నలుగురు వైద్యులకు కూడావైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో హతురాలి సహచరులైన నలుగురు వైద్యులకు కూడా లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు గురు వారం అనుమతి జారీ చేసింది. మరోవైపు అమానుషంగా ప్రవర్తించడం ఘోష్‌కు అలవాటని ఆయన ఇరుగుపొరుగు చెబుతున్నారు. సిజేరియన్ అయిన రెండు వారాలకే భార్యను ఆయన దారుణంగా కొట్టారంటూ 12 ఏళ్ల నాటి ఉదంతాన్ని గుర్తు చేస్తూ వారు చెప్పుకొచ్చారు.రేప్‌కు కఠిన చట్టాలు తెండిమోదీకి మమతా బెనర్జీ లేఖకోల్కతా: మానభంగానికి పాల్పడేవారికి అతి తీవ్రమైన శిక్షలను విధించేలా కేంద్రం కఠిన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేస్తూ పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో పీటీ ట్రైనీ డాక్టర్ పాశవిక హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఈ లేఖను సంధించారు. ‘దేవవ్యాప్తంగా ప్రతిరోజూ రేప్‌లు జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి ప్రతిరోజూ భారత్‌లో 90 రేప్‌లు జరుగుతున్నాయి. వీటిలో చాలాకేసుల్లో బాధితులు హత్యకు గురవుతున్నారు. ఈ పరంపర భీతి గొల్పుతోంది. దేశం, సమాజం విశ్వాసాన్ని, అంతరాత్మను కుదిపేస్తోంది. ఈ ఘోరాలకు ముగింపు పలకడం మన విధి. అప్పుడే మహిళలు సురక్షితంగా, భద్రంగా ఉన్నామని భావిస్తారు. ఇలాంటి ఆందోళకరమైన, సున్నితమైన అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి. అత్యంత కఠినమైన కేంద్ర చట్టాన్ని తేవాలి. రేపిస్టులకు అతి తీవ్రమైన శిక్షలు విధించాలి’ అని మమత లేఖలో కోరారు.రేప్ కేసుల విచారణ వేగంగా జరగాలంటే ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే కేసు విచారణ 15 రోజుల్లోగా పూర్తి కావాలని మమత అన్నారు. వైద్యురాలి హత్యాచారం కేసులో మమత సర్కారు వ్యవహరించిన శైలిని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మమత తీవ్ర విమర్శలను, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డాక్టర్ల సమ్మె విరమణ ప్రకటించిన ఫైమాన్యూఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై ఆందోళనకు దిగిన డాక్టర్లు 11 రోజులుగా తాము చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు నుంచి సానుకూల ఆదేశాలు రావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) వెల్లడించింది. డాక్టర్లు సమ్మె విరమించాలని, తిరిగి విధులకు హాజరయ్యే వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలుండవి సుప్రీంకోర్టు గురువారం హామీ ఇచి్చంది. ’భారత ప్రధాన న్యాయమూర్తి నుంచి సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమించాలని నిర్ణయించాం.ఆసుపత్రుల్లో భద్రత పెంచడం, డాక్టర్లకు రక్షణపై మా వినతులను సుప్రీంకోర్టు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నాం. ఐక్యతతో చట్టపరంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని ఫైమా ‘ఎక్స్’లో వెల్లడించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు ఎయిమ్స్ ఢిల్లీ, ఆర్ఎంఎల్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ, ఇందిరాగాంధీ హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్స్ సమ్మెను విరమిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. బెంగాల్లో మాత్రం సమ్మె విరమించేది లేదని వైద్యులు, వైద్య సిబ్బంది ప్రకటించారు.