![Lok Sabha Election 2024: Mamata Attacks Bengal Governor Over Molestation Charges](/styles/webp/s3/article_images/2024/05/12/WB-GOVERNER.jpg.webp?itok=U_i2iBIm)
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
సప్తాగ్రామ్: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోసుపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ ఇంకా పదవిలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం సప్తాగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం మమతా బెనర్జీ మాట్లాడారు.
గవర్నర్ పదవిలో ఆనంద బోసు కొనసాగినంత కాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టబోనని తేలి్చచెప్పారు. ఒకవేళ గవర్నర్‌ను కలవాలనుకుంటే వీధుల్లోనే కలుస్తానని అన్నారు. మహిళలపై వేధింపులకు గవర్నర్ సమాధానం చెప్పాలన్నారు. గత నెల 24న, ఈ నెల 2న గవర్నర్ ఆనంద బోసు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి గతవారం కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తప్పు చేయలేదని గవర్నర్ అన్నారు. పూర్తి వీడియోలను గవర్నర్ బహిర్గతం చేయలేదని మమత ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment