Harassment
-
గృహిణికి అండగా ఉన్నందుకు...అంతమొందించాడు
హైదరాబాద్: లైంగిక వేధింపులకు గురవుతున్న ఓ మహిళకు అండగా ఉన్న లాయర్‌ను కక్షగట్టి దారుణంగా హత్య చేశాడు. చంపాపేటలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలి్పన వివరాల ప్రకారం..మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్ (56) నగరంలోని చంపాపేట డివిజన్ న్యూమారుతీనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. తన ఇంటి సమీపంలోనే ఓ అపార్ట్మెంట్లో ఇటీవల ఫ్లాట్‌ను కొనుగోలు చేసి..ఓ గృహిణి కుటుంబ సభ్యులకు అద్దెకు ఇచ్చాడు. అదే కాలనీ సమీపంలోని సుల్తానా అల్వా కాలనీ శ్మశాన వాటిక కాపలాదారుడుగా పని చేస్తున్న గులాం దస్తగిరి ఖాళీ సమయంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా కూడా పనిచేస్తున్నాడు.ఇజ్రాయిల్ కొనుగోలు చేసిన ఫ్లాట్‌లో దస్తగిరి విద్యుత్ మరమ్మతు పనులకు వెళ్తుండే వాడు. ఈ క్రమంలోనే ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్న గృహిణితో పరిచయం ఏర్పడింది. దీన్ని అలుసుగా తీసుకున్న దస్తగిరి తనను ప్రేమించాలని, అండగా ఉంటానని ఆమెను వేధించసాగాడు. వేధింపులు భరించలేని ఆ గృహిణి ఫ్లాట్ యజమాని ఇజ్రాయిల్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన దస్తగిరిని మందలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయించి.. దస్తగిరి వేధింపులు ఎక్కువ అవడంతో 25 రోజుల క్రితం ఇజ్రాయిల్ ఐఎస్‌సదన్ పోలీసులకు గృహిణితో ఫిర్యాదు చేయించాడు. ఆమెకు దస్తగిరి నుంచి ప్రాణహాని ఉందని హెచ్చరించాడు. ఆమెను బంధువుల ఇంటికి పంపించి వేశాడు. ఈ క్రమంలో పోలీసులు దస్తగిరిని స్టేషన్‌కు పిలిపించి..నామమాత్రంగా మందలించి, కౌన్సిలింగ్ చేసి పంపించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దస్తగిరి..ఇజ్రాయిల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. గత మూడు రోజులుగా ఇజ్రాయిల్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించిన దస్తగిరి సోమవారం ఉదయం 9 గంటలకు ఇజ్రాయిల్ తన స్కూటీపై ఒంటరిగా రావటాన్ని పసిగట్టి..ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.విషయం తెలసుకున్న స్థానికులు రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయిల్‌ను సమీపంలోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చేరి్పంచారు. పరీక్షించిన వైద్యులు ఇజ్రాయిల్ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా పోలీసులు గృహిణి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదని, తీసుకుని ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. కాగా ఇజ్రాయిల్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర మాజీ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. -
మాజీ భార్య వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటుడు
ప్రముఖ మలయాళ నటుడు, డైరెక్టర్ బాలా పోలీసులను ఆశ్రయించారు. తన మాజీ భార్య ఎలిజబెత్ ఉదయన్ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన భార్య కోకిలపై యూట్యూబర్ అజు అలెక్స్‌తో కలిసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కంప్లైంట్ ఇచ్చారు. ఎలిజబెత్ తనను రూ. 50 లక్షలు డిమాండ్ చేసిందని పోలీసులకు వివరించారు. ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతోనే తనపై విష ప్రచారం చేస్తోందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.తన ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని నటుడు బాల ఆరోపిస్తున్నారు. యూట్యూబర్ అజు అలెక్స్ ఛానెల్లో తనపై అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేయడం ప్రారంభించారని బాల తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సెప్టెంబర్ 8, 2023లోనే ఎలిజబెత్‌తో తాను విడిపోయినట్లు బాలా పోలీసులకు వెల్లడించారు. కేవలం డబ్బు కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బాలా మండిపడ్డారు.ఫిర్యాదు అనంతరం బాలా మీడియాతో మాట్లాడుతూ..' కొందరు సోషల్ మీడియా ద్వారా నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఇదో వెబ్ సిరీస్‌లా సాగుతోంది. నేనేమైనా రేపిస్టునా?, ఒక మహిళపై ఏడాదిన్నర పాటు అత్యాచారం ఎలా చేయగలను? నాకు ఇప్పటికే సర్జరీ జరిగింది. నా శస్త్రచికిత్స సమయంలో ఎలిజబెత్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఏడాదిన్నర తర్వాత వచ్చి ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది' అని బాల అన్నారు. ఓ వ్యక్తితో కలిసి ఆమె తమపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన భార్య కోకిల మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని వాపోయారు. -
‘సాక్షి’పై సర్కారు అక్కసు
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం నినదిస్తున్న ‘సాక్షి’ పత్రికపై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతి రేక విధానాలను నిలదీస్తున్న ‘సాక్షి’ పత్రికపై అక్రమ కేసులకు తెగబడుతోంది. రెడ్‌బుక్ కుట్రలో తాజా అంకంగా.. కేసు నమోదు చేయాలని రియ ల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)ను ఆదేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ‘వాట్సాప్ గవర్నెన్స్’ విధానం పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ యాప్ ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించేదిగా ఉందని పలువురు నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో.. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కు పరిరక్షణకు బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా సాక్షి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ స్పందించింది. ‘మన మిత్ర.. మరో మారీచుడు’ శీర్షికన గతనెల 3న ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చోరీ అంశాలను కూడా ఇందులో ప్రస్తావించింది. ఆ కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే అమాంతంగా పెరిగిపోతున్న సోషల్ మీడియా వేధింపులు, సైబర్ నేరాలు బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో తమ వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం వాటిల్లే పరిస్థితి తలెత్తడం అందర్నీ ఆందోళనపరిచింది. కానీ, ఆ కథనం ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారింది. ‘సాక్షి’ పత్రికపై కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసు వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. -
కేంద్ర మంత్రి కుమార్తెకు పోకిరీల వేధింపులు
జల్గావ్: తన కుమార్తెను వేధించారంటూ కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జల్గావ్ జిల్లా ముక్తాయ్‌నగర్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను అక్కడ కొందరు యువకులు వేధించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.“ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా మా ప్రాంతంలో సంత్ ముక్తాయ్ యాత్ర జరుగుతుంది. రెండు రోజుల క్రితం నా కూతురు యాత్రకు వెళ్లింది. కొందరు యువకులు ఆమెను వేధించారు. వారిపై ఫిర్యాదు చేసేందుకు నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను' అని మీడియాకు కేంద్ర మంత్రి ఖడ్సే చెప్పారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైనా ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. గుజరాత్ పర్యటన నుంచి నేను ఇంటికి రాగానే నా కుమార్తె ఈ విషయం చెప్పింది. కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సాధారణ మహిళల సంగతి ఏంటో అర్థం చేసుకోవచ్చంటూ కేంద్ర మంత్రి ఖడ్సే వ్యాఖ్యానించారు.రక్షా ఖడ్సే మామ ఏక్నాథ్ ఖడ్సే మాట్లాడుతూ.. ఈ యువకులపై గతంలోనూ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. వారు కరుడుగట్టిన నేరస్థులు. మహారాష్ట్రలో నేరస్థులకు పోలీసులంటే భయమే లేదు. రోజురోజుకు మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. బాధిత మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. వారి తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెల పేర్లు బయటకు రాకూడదని భావిస్తున్నారు. వేరే మార్గం లేకనే ఫిర్యాదు చేశాం’’ అని ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు.పోలీస్ స్టేషన్‌కు వెళితే రెండు గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారని.. అమ్మాయిల విషయం కావడంతో ఆలోచించుకోవాలంటూ పోలీసులు మాకు సలహా ఇచ్చారు. వేధింపులకు పాల్పడ యువకులకు రాజకీయ నాయకుల అండ ఉంది. డీఎస్పీ, ఐజీతో కూడా చెప్పాను’’ అని ఖడ్సే తెలిపారు. -
రూ.5 కోట్ల కట్నం సరిపోలేదట.. బెజవాడలో నవవధువుకు వేధింపులు
సాక్షి, విజయవాడ: రూ.5 కోట్లు కట్నం ఇచ్చారు.. అయినా సరిపోలేదంటూ వివాహం జరిగిన రెండు రోజులకే వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేని ఆ వధువు విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 498A, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3,4 ల కింది కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టుకు హాజరుపరిచారు. తండ్రీ కొడుకులకు 14 రోజుల రిమాండ్ విధించి.. నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించారు. విజయవాడ ఆర్టీసీలో కంట్రోలర్‌గా పని చేస్తున్న చెరుకూరి లక్ష్మణరావు కుమారుడు హేమంత్ అజయ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటక రాయచూర్‌లోకి చెందిన ప్రసన్నకుమార్ కుమార్తె లక్ష్మి కీర్తనకి అజయ్‌తో పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి ముందు నగదు, స్థిరాస్థులు, బంగారం, వెండి మొత్తం కలిపి సుమారు రూ.5 కోట్లు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 7న రాయచూర్‌లో కీర్తన, అజయ్ వివాహం ఘనంగా జరిగింది. అయితే, వివాహం జరిగిన రెండు రోజులకే లక్ష్మి కీర్తనకి కట్నం వేధింపులు మొదలయ్యాయి. మరో రూ.50 లక్షలు తేవాలంటూ అజయ్, లక్ష్మణరావు వేధింపులకు గురిచేశారు. కట్నం కోసం నవ వధువును తండ్రి, కొడుకులు బంధించడంతో... టార్చర్ భరించలేక.. భవానీపురం పోలీసు స్టేషన్లో నవవధువు ఫిర్యాదు చేసింది. -
వరంగల్ ఏకశిలా కాలేజీలో కీచక లెక్చరర్!
సాక్షి, వరంగల్: నగరంలో మరో కీచక లెక్చరర్ నిర్వాకం బయటపడింది. కొత్తవాడలోని ఏకశిలా జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని పట్ల లెక్చరర్ రమేష్ అసభ్యంగా ప్రవర్తించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.యాజమాన్యానికి సమాచారం అందించిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం.. రమేష్‌ను కావాలనే తప్పిస్తున్నారని బంధువులు మండిపడుతున్నారు. కీచక టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
AP: నిన్న వీఆర్వో.. నేడు సీఐ.. మహిళలపై ఆగని వేధింపులు
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాడిపత్రి వీఆర్వో వేధింపుల ఘటన మరువకముందే మరో ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా మడకశిరలో సీఐ.. ఓ మహిళను వేధింపులకు గురిచేశాడు. దీంతో, బాధితురాలు పుట్టపర్తి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలు, యువతులపై వేధింపులు పెరిగాయి. కూటమి నేతల అండతో కొందరు అధికారులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మహిళలపై కొందరు ఉద్యోగుల లైంగిక వేధింపులు పాల్పడుతున్నారు. దీంతో, మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా మడకశిర పోలీసు స్టేషన్లో సీఐ రాగిరి రామయ్య.. ఓ మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన బయటకు వచ్చింది.అయితే, కేసుతో సంబంధం లేకుండా సదరు సీఐ.. ఓ మహిళను రాత్రి 10 గంటల వరకు తన చాంబర్లోనే ఉంచారు. విచారణ పేరుతో ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. అనంతరం, బాధితురాలు.. ధైర్యం చేసుకుని సీఐ తనను లైంగికంగా వేధించారని పుట్టపర్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సీఐ అరాచకం వెలుగులోకి వచ్చింది.ఇదిలా ఉండగా.. తాడిపత్రి వీఆర్వో చంద్రశేఖర్ వేధింపుల ఘటన కూడా తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్‌కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్వో చంద్రశేఖర్‌ను బతిమాలుతూ వస్తోంది. పదే పదే వీఆర్వోను బతిమాలుతుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చంద్రశేఖర్ ‘నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్‌కార్డు ఇప్పిస్తా’ అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత జరుగుతున్నప్పటికీ మహిళలను వేధించిన మడకశిర సీఐ, తాడిపత్రి వీఆర్వోలపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో, బాధితులు, ప్రజలు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వెండి వ్యాపారి కుటుంబం ఆత్మహత్య
సేలం (తమిళనాడు): రుణ వేధింపులతో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడన ఘటన సేలంలో మంగళవారం కలకలం రేపింది. వివరాలు.. సేలం జిల్లా అరిసిపాళయం ముత్యాల్ స్ట్రీట్ ప్రాంతానికి చెందిన బాల్‌రాజ్ (46) వెండి పని చేస్తున్నాడు. అతని భార్య రేఖ (40). వీరి కూతురు జనని(17). ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతుంది. బాల్‌రాజ్ కొద్ది నెలల క్రితం కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాడు. ఈ స్థితిలో ఆయన చేస్తున్న వెండి వ్యాపారంలో నష్టం ఏర్పడడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. అప్పు ఇచ్చిన వారు సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి మంగళవారం ఉదయం అప్పు చెల్లించాలని, లేకుంటే పరువు తీస్తామని బెదిరించినట్లు సమాచారం. దీంతో బాల్‌రాజ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఇరుగుపొరుగు వారు తెలిపారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం బంధువు పరామర్శకు వెళ్లగా.. ఇంటి మేడ గదిలో బాల్‌రాజ్, రేఖ, జనని ముగ్గురు ఉరి వేసుకుని మృతదేహాలుగా వేలాడుతూ కనిపించారు. దిగ్భ్రాంతికి గురైన బంధువును, ఇరుగుపొరుగు వారు అక్కడికి వెళ్లారు. ఈ ఆత్మహత్య ఘటనపై పల్లపట్టి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతో కుటుంబ సమేతంగా వెండి వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపడమే కాకుండా విషాదాన్ని నింపింది. కాగా ఘటనా స్థలంలో.. పోలీసులు బాల్‌రాజ్ రాసిన లేఖను స్వాదీనం చేసుకున్నారు. -
టీడీపీ సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్న టీడీపీ కార్యకర్తలు
-
అప్రమత్తత అంతంత మాత్రమే..ఆడపిల్లల రక్షణ గాలికి!
దాదర్: విద్యార్ధులపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నప్పటికీ అనేక బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్కూళ్లలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ ఇంతవరకూ పూర్తికాలేదు. దీంతో విద్యార్ధుల భద్రత ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ గాలికి వదిలేసినట్టైంది సుమారు నాలుగు నెలల కిందట బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడుల ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ముంబైసహా తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో ఉన్న అన్ని బీఎంసీ పాఠశాలల్లోని తరగతి గదుల్లో, కాంపౌండ్, పాఠశాల ఆవరణలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బీఎంసీ పరిపాలనా విభాగం నిర్ణయం తీసుకుంది. కానీ ముంబై సిటీ పరిధిలో ఉన్న బీఎంసీ పాఠశాలల్లో మాత్రమే సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. పశి్చమ, తూర్పు ఉప నగరాల్లోని 356 పాఠశాలల్లో ఇంతవరకు వాటి ఊసే లేదు. నిధుల కొరత వల్ల వాటిని ఏర్పాటు చేయలేదని బీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల భద్రత అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.‘బద్లాపూర్’ఘటనతో మళ్లీ తెరమీదకు... ముంబై, ఉప నగరాల్లో బీఎంసీకి చెందిన ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ఏడున్నర వేలకుపైగా ఉపాధ్యాయులు బీఎంసీ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నారు. వీరిలో పురుషులతో పోలిస్తే మహిళా ఉపాధ్యాయుల సంఖ్య అధికం. దీంతో వారికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత బీఎంసీపై ఉంది. పాఠశాల తరగతి గదుల్లో, కాంపౌండ్‌లో, ఆవరణలో విద్యార్ధులపై లైంగిక దాడులు, వేధింపులు చోటుచేసుకుంటే సీసీ టీవీ కెమరాల్లో రికార్డయిన వీడియో దశ్యాలు నిందితులను గుర్తించడానికి ఎంతో దోహద పడతాయి. దీంతో బీఎంసీకి చెందిన అన్ని పాఠశాలల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బీఎంసీ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన సంఘటనలతో అప్రమత్తమైన బీఎంసీ అన్ని స్కూళ్లలోనూ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్, గత మూడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న బీఎంసీ ఎన్నికలు, ఇతర అనివార్యకారణాలవల్ల కెమెరాల ఏర్పాటు ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. కానీ బద్లాపూర్ ఘటనతో ఈ అంశం మళ్లీ తెరమీదకు రావడంతో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు సలహదారుల కమిటీని నియమించి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. ఈ ‘ఆర్థిక బడ్జెట్’లో నిధుల మంజూరు? బీఎంసీకి పరిధిలో మొత్తం 479 పాఠశాలుండగా వీటిలో ముంబై సిటీలో ఉన్న 123 పాఠశాలల్లో 2,832 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ నిధుల కొరత వల్ల ఉప నగరాల్లో ఉన్న 356 పాఠశాల్లో మాత్రం ఇంతవరకూ ఏర్పాటు చేయలేదు. చివరకు బీఎంసీ అదనపు కమిషనర్ అమిత్ సైనీ జోక్యం చేసుకుని నిధుల మంజూరుకు ఆదేశించారు. కానీ అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో కోడ్ అమలులోకి వచి్చంది. దీంతో నిధులు మంజూరు ప్రతిపాదన అటకెక్కింది. ఫలితంగా ఉప నగరాల్లోని 356 పాఠశాలల్లో సుమారు ఆరువేల సీసీ టీవీ కెమరాలు ఏర్పాటుచేసే ప్రక్రియ పెండింగులో పడిపోయింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాల తంతు పూర్తయి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. దీంతో ఈ పాఠశాలల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు దాదాపు రూ.54 కోట్లు అవసరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రవేశపెట్టే ఆరి్ధక బడ్జెట్లో నిధులు మంజూరుచేసి పనులు ప్రారంభించాలని బీఎంసీ యోచిస్తోంది. ఇదీ చదవండి: Birthright citizenship : ట్రంప్‌కు షాక్, ఎన్ఆర్ఐలకు భారీ ఊరట -
వినుకొండ రషీద్ కుటుంబానికి సర్కార్ వేధింపులు
పల్నాడు, సాక్షి: ప్రతీకార రాజకీయాలతో ఆ కుటుంబం ఇదివరకే ఓ కొడుకును పొగొట్టుకుంది. ఇప్పుడు అదే రాజకీయానికి మరో కొడుకును జైలుపాలు చేసుకుంది. వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. రషీద్ సోదరుడితో పాటు ఆ కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించింది. వినుకొండ రషీద్ కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోంది. రషీద్ హత్య కేసులో న్యాయం అందించకపోగా.. అతని సోదరుడు ఖాదర్ బాషా తో పాటు కొంతమంది వైఎస్సార్సీపీ నేతలపై స్థానిక పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. రెండున్నరేళ్ల క్రితం బుల్లెట్ దహనం ఘటనలో.. మూడు వారాల కిందట కేసు నమోదు చేసి మరీ అరెస్టులు చేశారు వినుకొండ పోలీసులు. అయితే.. రషీద్ హత్య కేసులో ‘పరారీలో ఉన్న నిందితుడి’ ఫిర్యాదు ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయి. బుల్లెట్ దహనం బదులుగా ఏకంగా ఇల్లు తగలబెట్టారని పేర్కొంటూ కొత్త సెక్షన్ చేర్చి మరీ ఖాదర్ బాషా, ఇతరులను అరెస్ట్ చేయడం గమనార్హం. 2020లో చనిపోయిన సయ్యద్ బాషా పేరును ఈ కేసులో పోలీసులు చేర్చడం ఇంకో కొసమెరుపు. రషీద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వేధిస్తోందని అడ్వొకేట్ ఎంఎం ప్రసాద్ అంటున్నారు. రషీద్ హత్య కేసులో ఈయనే వాదనలు వినిపిస్తున్నారు. ‘రషీద్ హత్య కేసులో ఆరో నిందితుడు షేక్ జానీ బాషాను ఇంతదాకా అరెస్టు చేయలేదు. ఇంతలోపు.. 2022లో జరిగిన ఘటన ఆధారంగా అదే షేక్ జానీ బాషా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రషీద్ సోదరుడు ఖాదర్ బాషాను ఈ కేసులో అక్రమ సెక్షన్లు పెట్టి జైలుకు పంపారు. అలాగే.. ఈ కుటుంబానికి అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారు’’ అని ఎంఎం ప్రసాద్ అంటున్నారు..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్సీపీ పల్నాడ్ లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ళ మాధవి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పోలీసుల అక్రమ కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ నేత రషీదును హత్య చేస్తే.. ఆయన సోదరుడ్ని అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. తన తమ్ముడి కేసులో న్యాయపోరాటం చేస్తున్న ఖాదర్ భాషాను అక్రమ కేసు బనాయించి జైలుకు పంపడం దారుణం. ఇది కూటమి ప్రభుత్వం కాదు కుతంత్రాల ప్రభుత్వం. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు అక్రమార్కులకు వంతపలుకుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని మండిపడ్డారు. ఒక కొడుకును నడిరోడ్డు పైన చంపేశారు మరొక కొడుకును అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారు. ఇది ప్రభుత్వమే నా?. రషీద్ హత్య కేసులో ఇప్పటికీ కొంతమందిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఫిర్యాదు ఇచ్చాడని అక్రమ కేసు నమోదు చేసి నా పెద్ద కొడుకును జైలుకు పంపారు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఎక్కడున్నాడు?. పోలీసులేమో జానీ బాషా పారిపోయాడని చెప్తున్నాడు. మరి అందరూ చూస్తుండగానే ఆయన చంద్రబాబును కలుస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. మాకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నా కొడుకుని జైలుకు పంపి మమ్మల్ని వేధిస్తోంది. ::రషీద్ తల్లి శంషాద్ ఆవేదన -
ఐఏఎస్, ఐపీఎస్‌లపై కూటమి సర్కార్ కక్ష
సాక్షి, విజయవాడ: ఏపీలో ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS)లపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఏడు నెలలైన అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తోంది. రాష్ట్రంలోనే సీనియర్ అధికారి అయిన శ్రీలక్ష్మికి పోస్టింగ్‌కు ఇవ్వ లేదు. చీఫ్ సెక్రటరీ అర్హత జాబితాలో శ్రీలక్ష్మి తొలి స్థానంలో ఉన్నారు. కనీసం పోస్టింగ్ ఇవ్వకుండా మహిళ అధికారిపై కక్ష సాధిస్తున్నారు. ఆల్ ఇండియా టాపర్, బీసీ అధికారి ముత్యాల రాజుకు కూడా పోస్టింగ్ దక్కలేదు.వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సీఎంవోలో పనిచేశారనే కారణంతోనే ముత్యాలరాజుకు పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం. మురళీధర్‌రెడ్డి, మాధవిలత, నీలకంఠరెడ్డికి ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. ఐపీఎస్‌లు రఘురామిరెడ్డి, విశాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డిలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఆంజేయులు, సంజయ్, పీవీ సునీల్, క్రాంతి రాణా, విశాల్ గున్నిలను ప్రభుత్వం వేధిస్తోంది.ఇదీ చదవండి: కాంతి లేని కూటమి పాలన -
పదేళ్లుగా భార్యను పుట్టింటికి పంపకపోవడంతో..
పెందుర్తి: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెందుర్తి మండలం చింతగట్లలో చోటుచేసుకుంది. భర్త తరచూ భౌతికదాడికి పాల్పడడంతో తీవ్ర మనస్తాపానికి గురై తనువు చాలించింది. తమ కుమార్తె మృతికి కారణమైన ఆమె భర్తను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు గ్రామంలో ఆందోళనకు దిగారు. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వివరాలివీ.. చింతగట్ల గ్రామానికి చెందిన గనిశెట్టి కనకరాజుకు నర్సీపట్నం మర్రివలసకు చెందిన పార్వతితో 14 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. భార్య పార్వతిని కనకరాజు నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లుగా ఆమెను పుట్టింటికి కూడా వెళ్లనివ్వలేదు. నిత్యం ఏదో కారణంతో కొట్టేవాడు. ఈ నెల 11న కూడా పార్వతిని తీవ్రంగా కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై కార్ ఏసీ కూలెంట్ వాటర్ తాగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరి్పంచగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించిన తరువాత ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. తమ కుమార్తె మృతికి కారణమైన కనకరాజును తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు గ్రామానికి చేరుకుని పార్వతి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, అంత్యక్రియలు నిర్వహించారు. కనకరాజు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. సీఐ కె.వి.సతీ‹Ùకుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. -
‘ఈ పోలీసుల టార్చర్‌కి చావాలనిపిస్తోంది’
నిజామాబాద్, సాక్షి: భీమ్‌గల్ పట్టణ పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సీఐ, ఎస్సైలు తమను వేధిస్తున్నారంటూ పలువురు వాపోతున్నారు. వరుస ఫిర్యాదులతో విషయం డీజీపీ కార్యాలయం, మానవ హక్కుల సంఘం దాకా చేరుకుంది. ఎస్సై మహేష్ ,సీఐ నవీన్ లు వేధిస్తున్నారంటూ బాధితులు కొందరు రొడ్డెక్కుతున్నారు. చెంగల్(Chengal)కు చెందిన నిఖిష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. వాళ్ల వేధింపులు తాళలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటానని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడతను. ఇక.. విరిగిన కాళ్లతో సత్య గంగయ్య అనే వ్యక్తి పీఎస్(Police Station) దగ్గర నిరసనకు దిగాడు. తనను చావు దెబ్బలు కొట్టారని, అందుకు ఎస్సై, సీఐలే కారణమని ఆరోపించాడతను. భీమ్‌గల్(Bheemgal) పోలీసుల వ్యవహారం డీజీపీ ఆఫీస్‌తో పాటు హెచ్ఆర్సీ కూడా చేరుకుంది. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగినట్లు సమాచారం. -
సుధారాణి కుటుంబానికి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: తప్పుడు కేసులతో కూటమి ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొన్న పెద్దిరెడ్డి సుధారాణికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం చెప్పారు. గురువారం మధ్యాహ్నాం తన కుటుంబ సభ్యులతో ఆమె తాడేపల్లికి వెళ్లి ఆయన్ని కలిశారు.తమపై అకారణంగా కేసులు పెట్టి వేధించారని ఈ సందర్భంగా జగన్ వద్ద సుధారాణి వాపోయారు. అయితే అధైర్య పడొద్దని, ఆమె కుటుంబానికి అండగా నిలుస్తామని, అవసరమైన న్యాయ సహాయం అందజేస్తామని జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.మాజీ మంత్రి విడదల రజిని, సుధారాణి కుటుంబాన్ని దగ్గరుండి జగన్‌కు కలిపించారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, అడ్వకేట్ పోలూరి వెంకటరెడ్డి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. -
'హనీరోజ్ డ్రెస్‌పై చర్చ.. అందులో ఎలాంటి తప్పు లేదు'.. ప్రముఖ కామెంటేటర్
ప్రముఖ మలయాళ నటి హనీరోజ్ (Honey Rose) వేధింపుల కేసులో ఇప్పటికే వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. చాలాసార్లు తనను సోషల్ మీడియా వేదికగా ఇబ్బందులకు గురి చేశాడని హానీ రోజ్ ఆరోపించిస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సుమారు 30మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బిజినెస్మెన్ బాబీ చెమ్మనూరు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వయనాడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.అయితే హనీ రోజ్ ఫిర్యాదు తర్వాత ప్రముఖ మలయాళ కామెంటేటర్ రాహుల్ ఈశ్వర్ హీరోయిన్‌పై విమర్శలు చేశారు. ఈ విషయంలో వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌కు రాహుల్ ఈశ్వర్ మద్దతుగా నిలిచారు. తాజాగా ఓ టీవీ డిబేట్లో పాల్గొన్న రాహుల్ ఈశ్వర్.. హనీ రోజ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. హనీ డ్రెస్ గురించి చర్చించడంలో తప్పు లేదని.. తన మార్కెటింగ్ సామర్థ్యాన్ని ఆమె ఉపయోగించుకుందని రాహుల్ హనీ రోజ్‌ను విమర్శించాడు.తనపై రాహుల్ ఈశ్వర్ చేసిన కామెంట్స్‌కు హనీ రోజ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మీకు భాషపై పట్టు ఉన్న మాట వాస్తవమే కానీ.. మహిళల దుస్తులను చూసినప్పుడు మాత్రం నియంత్రణ కోల్పోతున్నారని ఆయన మాటలు వింటేనే అర్థమవుతోందని మండిపడింది.హనీ రోజ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'మీ భాషపై నియంత్రణ చాలా తక్కువ. ఒక సమస్యపై చర్చ జరిగినప్పుడు.. చర్చకు రెండు వైపులా ఆలోచిస్తే మంచిది. భాషపై మీకున్న అద్భుతమైన పట్టుతో ఎల్లప్పుడూ చర్చలకు సిద్ధంగా ఉంటారు. కానీ రాహుల్ ఈశ్వర్ తన భాషా నైపుణ్యంతో మహిళల సమస్యల విషయంలో మాత్రం తటస్థంగా వ్యవహరిస్తాడు. భాషపై మీ నియంత్రణ గొప్పదే అయినప్పటికీ, మహిళల దుస్తుల విషయానికి వస్తే అది కాస్తా తడబడుతున్నట్లు కనిపిస్తోంది. రాహుల్ ఈశ్వర్ గుడిలో పూజారి కాకపోవడమే మంచిదైంది. లేకుంటే తాను ఉన్న గుడికి వచ్చే మహిళలకు డ్రెస్ కోడ్ పెట్టేవాడు. ఎలాంటి వస్త్రధారణ మీ స్వీయ నియంత్రణకు భంగం కలిగిస్తుందో ఎవరు అంచనా వేయగలరు?. నేను ఎప్పుడైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎదుర్కోవలసి వస్తే ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటా" అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిందిఅసలేం జరిగిందంటే..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. కొందరు తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఒక లేఖను హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని అందులో రాసుకొచ్చింది. తప్పుడు కామెంట్ల గురించి తాను సైలెంట్‌గా ఉంటుంటే.. ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తున్నావా..? అని చాలామంది అడుగుతున్నారని ఆమె తెలిపారు.హనీరోజ్ సినీ కెరీర్..వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఈ ఒక్క సినిమాతోనే 10 చిత్రాలకు దక్కినంత పేరు, గుర్తింపు ఆమె రావడం విశేషం. దీంతో తెలుగు రాష్ట్రాలలో పదుల సంఖ్యలో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు గెస్ట్‌గా వెళ్లారు. వాస్తవంగా 2008లోనే ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
బాలకృష్ణ హీరోయిన్‌కు వేధింపులు.. మద్దతుగా నిలిచిన అమ్మ!
ప్రముఖ నటి హనీ రోజ్ (Honey Rose) పోలీసులను ఆశ్రయించింది. తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఆమె ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఆధారంగా కేరళలోని ఏర్నాకుళం పోలీసులు చర్యలు చేపట్టారు. హనీ రోజ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలోని కుంబళంకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు.అసభ్యకరమైన పోస్టులు..గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. ఈ పోస్ట్ కింద తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో ద్వారా వెల్లడించింది. దీనిపై ఇప్పటికే హనీ రోజ్ ఎర్నాకులం సెంట్రల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దాదాపు 30 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.అసలేం జరిగిందంటే..:ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఆదివారం సాయంత్రం హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని రాసుకొచ్చింది. ఈ కామెంట్స్ గురించిన నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఇలాంటి వాటిని మీరు స్వాగతిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారని తెలిపింది. ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను పిలిచాడు. వ్యక్తిగత కారణాల వల్ల చాలాసార్లు నిరాకరించాను. అందుకు ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్‌కు రావడం.. వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆమె తెలిపింది.హనీకి మద్దతుగా అమ్మ..నటి హనీరోజ్‌పై సోషల్‌మీడియాలో వస్తున్న పోస్టులపై చట్టపరమైన చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని మలయాళ నటీనటుల సంస్థ(AMMA)అమ్మ తెలిపింది. ఈ విషయంలో హనీ రోజ్ చేస్తున్న న్యాయ పోరాటానికి అమ్మ సహకారం, పూర్తి మద్దతు ఉంటుందని లేఖ విడుదల చేసింది. అవసరమైతే న్యాయ సహాయం అందజేస్తామని అమ్మ అడ్ హాక్ కమిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలియజేసింది. హనీ రోజ్‌ను సోషల్ మీడియా ద్వారా పరువు తీయడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నాలను అమ్మ సంఘం ఖండించింది.చులకన వ్యాఖ్యలుఒకసారి అతడి షాప్‌కు వెళ్లినప్పుడు కూడా మీడియా ముందు నాపై చులకన వ్యాఖ్యలు చేశాడు. అవి నన్నెంతో అసౌకర్యానికి గురి చేశాయి. అప్పుడు నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇంటికి వెళ్లాక ప్రోగ్రామ్ నిర్వాహకులకు కాల్ చేసి నాపై చీప్ కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను. అప్పటినుంచి తన ప్రోగ్రామ్స్‌కు వెళ్లడమే మానేశాను.మరోసారి దిగజారుడు వ్యాఖ్యలుఅయితే నేను హాజరైన ఓ ప్రోగ్రామ్‌కు అతడు గెస్టుగా వచ్చాడు. అతడు వస్తున్నాడన్న విషయం నాకు తెలియదు. అక్కడికి వెళ్లాక నాతో డైరెక్ట్‌గా మాట్లాడలేదు కానీ అందరిముందు మళ్లీ నాపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత మరోసారి తన బిజినెస్ ప్రమోషన్స్‌లో పాల్గొనమని ఆఫర్ ఇచ్చాడు. నేను కుదరదన్నాను. అతడి మేనేజర్.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను వారి ఆఫర్‌ను తిరస్కరించాను.హనీ రోజ్ సినిమాలు..కాగా వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ పేరు టాలీవుడ్ (Tollywood)లో మార్మోగిపోయింది. ఈ మలయాళ భామ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇందులో హనీ ఊరమాస్ లుక్‌లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
నటిపై లైంగిక వేధింపులు.. ప్రసాద్‌కు పెళ్లి కూడా అయిందా?
టాలీవుడ్లో ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రసాద్ బెహరాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అతనికి ఇప్పటికే పెళ్లయిందని తెలుస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తనతో కలిసి నటించిన జాను నారాయణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వివరించాడు. అయితే ఆ తర్వాత ఆమెతో విడిపోయినట్లు తెలిపారు. మా ఇద్దరి సెట్ కాకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని ప్రసాద్ పేర్కొన్నారు.(ఇది చదవండి: నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్)కాగా.. మావిడాకులు వెబ్ సిరీస్‌తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌ల ద్వారా టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా పెళ్లివారమండి లాంటి సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. -
నటిపై లైంగిక వేధింపులు.. యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువ నటి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సదరు నటిని లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.కాగా.. ప్రసాద్ బెహరా యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌ల ద్వారా టాలీవుడ్లో ఫేమస్ అయ్యారు. అంతేకాకుండా మావిడాకులు, పెళ్లివారమండి లాంటి సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించారు. ఈ ఏడాది రిలీజైన కమిటీ కుర్రోళ్లు చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు.అసభ్యంగా తాకుతూ..ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ యువనటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో చాలాసార్లు అలానే ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. అందరిముందే సెట్లో తన బ్యాక్ టచ్ చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అందరిముందు తనను అసభ్యంగా తాకుతూ పరువు పోయేలా ప్రవర్తించాడని యువతి వెల్లడించింది. -
‘వేధింపుల’ చట్టానికి కళ్లెం?
మానసిక ఒత్తిళ్లకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాన్ కెస్లర్ చాన్నాళ్ల క్రితం ఒక అధ్యయనం సందర్భంగా తేల్చారు. మహిళలు ఆ ఒత్తిళ్ల పర్యవసానంగా విషాదంలో మునిగితే మగవాళ్లూ, పిల్లలూ ఆగ్రహావేశాలకు లోనవుతారని చెప్పారు. ఒత్తిళ్లకు స్పందించే విషయంలో పిల్లలూ, మగవాళ్లూ ఒకటేనని ఆమె నిశ్చితాభిప్రాయం. ఈ ధోరణికామె ‘ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. అయితే ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారని చెప్పలేం. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ తన భార్యతో వచ్చిన తగాదాకు సంబంధించిన కేసుల్లో తనకూ, తన తల్లిదండ్రులకూ ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దానికి ముందు విడుదల చేసిన 90 నిమిషాల వీడియో, 24 పేజీల లేఖ ఇప్పుడు న్యాయవ్యవస్థలో సైతం చర్చనీయాంశమయ్యాయి. తనపైనా, తనవాళ్లపైనా పెట్టిన 8 తప్పుడు కేసుల్లో, వాటి వెంబడి మొదలైన వేధింపుల్లో యూపీలోని ఒక ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఉన్నారన్నది ఆ రెండింటి సారాంశం.బలహీనులకు జరిగే అన్యాయాలను నివారించటానికీ, వారిని కాపాడటానికీ కొన్ని ప్రత్యేక చట్టాలూ, చర్యలూ అవసరమవుతాయి. అలాంటి చట్టాలు దుర్వినియోగమైతే అది సమాజ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వంకన అసలైన బాధితులకు సకాలంలో న్యాయం దక్కదు సరికదా... బలవంతులకు ఆయుధంగా మారే ప్రమాదం ఉంటుంది. మహిళలపై గృహ హింస క్రమేపీ పెరుగుతున్న వైనాన్ని గమనించి 1983లో భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 498ఏ చేర్చారు. అనంతర కాలంలో 2005లో గృహహింస చట్టం వచ్చింది. 498ఏ సెక్షన్ గత ఏడాది తీసు కొచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లో సెక్షన్ 84గా ఉంది. అయితే అటుతర్వాత కుటుంబాల్లో మహిళలపై హింస ఆగిందా? లేదనే చెప్పాలి. సమాజంలో కొనసాగే ధోరణులకు స్పందన గానే ఏ చట్టాలైనా వస్తాయి. ఎన్నో ఉదంతాలు చోటుచేసుకున్నాక, మరెన్నో ఉద్యమాలు జరిగాక, నలుమూలల నుంచీ ఒత్తిళ్లు పెరిగాక మాత్రమే ఎంతో ఆలస్యంగా ఇలాంటి చట్టాలు వస్తాయి. బల హీనులకు ఉపయోగపడే అటువంటి చట్టాల్ని దుర్వినియోగం చేసే వారుండటం నిజంగా బాధాకరమే.జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం 498ఏ వంటి చట్టాలు ఈమధ్యకాలంలో దుర్వినియోగమవుతున్న ఉదంతాలు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత కక్షతో అత్తింటివారిపైనా, భర్తపైనా తప్పుడు కేసులు పెట్టే తీరువల్ల వివాహ వ్యవస్థ నాశన మవుతున్నదని వ్యాఖ్యానించింది. ఇప్పుడే కాదు... 2014లో కూడా సుప్రీంకోర్టు ఒక సంద ర్భంలో ఇలాంటి వ్యాఖ్యానమే చేసింది. ‘భర్తలపై అలిగే భార్యలకు సెక్షన్ 498ఏ రక్షణ కవచంగా కాక ఆయుధంగా ఉపయోగపడుతోంద’ని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇకపై శిక్షాస్మృతిలోని సెక్షన్ 41కి అనుగుణంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కూడా సూచించింది. నిజమే... ఎలాంటి చట్టాలైనా నిజమైన బాధితులకు ఉపయోగపడినట్టే, అమాయకులను ఇరికించడానికి కూడా దోహదపడుతాయి. చట్టాన్ని వినియోగించేవారిలో, అమలు చేసేవారిలో చిత్తశుద్ధి కొరవడితే జరిగేది ఇదే. ఆ తీర్పు తర్వాత గత పదేళ్లుగా వేధింపుల కేసులు నత్తనడక నడుస్తున్నాయి. అందులో నిజమైన కేసులున్నట్టే అబద్ధపు కేసులు కూడా ఉండొచ్చు. మనది పితృస్వామిక సమాజం కావటంవల్ల పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి కుటుంబ బాధ్యతలు మీద పడేవరకూ ఏ దశలోనూ ఆడవాళ్లపై హింస మటుమాయమైందని చెప్పలేం. వాస్తవానికి ఇందులో చాలా రకాల హింసను మన చట్టాలు అసలు హింసగానే పరిగణించవు. ఆర్థిక స్తోమత, సమాజంలో హోదా వంటివి కూడా మహిళలను ఈ హింస నుంచి కాపాడలేకపోతున్నాయన్నది వాస్తవం. ఒకనాటి ప్రముఖ నటి జీనత్ అమన్, భారత్‌లో మొట్టమొదటి లేడీ ఫిట్నెస్ ట్రైనర్‌గా గుర్తింపు సాధించిన నవాజ్ మోదీలు ఇందుకు ఉదాహరణ. వీరిద్దరూ తమ భర్తల నుంచి తీవ్రమైన గృహహింసను ఎదుర్కొన్నారు. జీనత్‌కు కంటి కండరాలు దెబ్బతిని కనుగుడ్డు బయటకు రాగా, దాన్ని య«థాస్థితిలో ఉంచటానికి గత నలభైయేళ్లలో ఎన్ని సర్జరీలు చేయించుకున్నా ఫలితం రాలేదు. నూతన శస్త్ర చికిత్స విధానాలు అందుబాటులోకొచ్చి నిరుడు ఆమెకు విముక్తి దొరికింది. ఒకప్పుడు కట్టుబాట్లకు జడిసి, నలుగురిలో చులకనవుతామన్న భయంతో ఉండే మహిళలు ఉన్నత చదువుల వల్లా, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం రావటం వల్లా మారారు. వరకట్న వేధింపులు, ఇతర రకాల హింసపై కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అదే సమయంలో కొందరు దుర్వినియోగం చేస్తున్న మాట కూడా వాస్తవం కావొచ్చు. అలాంటివారిని గుర్తించటానికీ, వారి ఆట కట్టించటానికీ దర్యాప్తు చేసే పోలీసు అధికారుల్లో చిత్తశుద్ధి అవసరం. ఈ విషయంలో న్యాయస్థానాల బాధ్యత కూడా ఉంటుంది. లోటుపాట్లు తప్పనిసరిగా సరిచేయాల్సిందే. కానీ ఆ వంకన అలాంటి కేసుల దర్యాప్తులో జాప్యం చోటు చేసు కోకుండా ఇతరేతర మార్గాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఏటా ప్రతి లక్షమంది మహిళల్లో దాదాపు ముగ్గురు వరకట్న హింసకు ప్రాణాలు కోల్పోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. వరకట్న నిషేధ చట్టం వచ్చి 63 ఏళ్లవుతున్నా ఇదే స్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత చట్టాలను నీరగార్చకుండానే ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఆలోచించాలి. -
Justiceisdue: సోషల్ మీడియాను కదిలించిన ఓ భర్త గాథ
#JusticeForAtulSubhash.. #Justiceisdue ఎక్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన అంశం. భార్య పెట్టిన వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడిన ఓ భర్తకు మద్దతుగా సోషల్ మీడియాలో నడుస్తున్న క్యాంపెయిన్ ఇది. మేధావులు, న్యాయ నిపుణులు, పేరు మోసిన జర్నలిస్టులు ఈ క్యాంపెయిన్‌లో భాగం అవుతున్నారు. అయితే ఇలాంటి కేసులు కొత్తేం కాదు కదా!. మరి దీనినే ఎందుకు అంతలా హైలైట్ చేయడం?. ఎందుకంటే.. అతుల్ కేసులో తీవ్రత అంతలా ఉంది కాబట్టి.‘‘ఒకవేళ నాకు న్యాయం జరిగితే.. నా అస్తికలను పవిత్రంగా గంగలో నిమజ్జనం చేయండి. లేకుంటే కోర్టు బయట మురికి కాలువలో కలిపేయండి’’ అంటూ.. చివరి కోరికలతో సహా సుదీర్ఘమైన సూసైడ్ నోట్ రాశారు 34 ఏళ్ల అతుల్ సుభాష్. అది సుప్రీం కోర్టు దాకా చేరాలని ఆయన చేసిన విన్నపం, చనిపోవడానికి ముందు ఆయన చేసుకున్న ఏర్పాట్లు.. తన నాలుగేళ్ల కొడుకు కోసం ఇచ్చిన గిఫ్ట్.. ఇవన్నీ పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి. భార్య, ఆమె కుటుంబం డబ్బు కోసం ఎలా హింసించింది.. ఆఖరికి న్యాయమేంటో చెప్పాల్సిన జడ్జి కూడా తనకు అన్యాయం చేశారంటూ.. ఆ వీడియోలో వివరించి చెప్పారు.👉ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్‌కు 2019లో నిఖితా సింగ్‌తో వివాహమైంది. ఈ జంటకు ఒక బాబు. బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో మంచి పొజిషన్లో పని చేశారాయన. భార్య నిఖితా సింగ్ కూడా టెక్కీనే. మారతహళ్లిలోని మంజునాథ లేఅవుట్లో ఈ కుటుంబం నివసించేది. అయితే.. కొంతకాలంగా భార్య నిఖితా సింగ్ కుటుంబంతో ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె యూపీలోని తన సొంతూరుకు వెళ్లిపోయింది. ఆపై అతుల్‌పై కేసులు పెట్టింది. ఆపై విడాలకు కోసం కోర్టును ఆశ్రయించిందామె.👉ఈ కేసు విషయమై బెంగళూరు నుంచి యూపీకి 40సార్లు తిరిగాడాయన. వెళ్లిన ప్రతీసారి ఓ కొత్త కేసు కోర్టు ముందుకు వచ్చింది. తీవ్ర మానసిక వేదనకు గురైన ఆయన.. డిసెంబర్ 8వ తేదీన బెంగళూరులోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు.. తన సోదరుడికి ఓ మెయిల్ పెట్టాడు. అలాగే తన వైవాహిక జీవితంలో తాను ఎంతలా నరకం అనుభవించింది గంటన్నర పాటు వీడియోగా చిత్రీకరించారు.సంబంధిత వార్త: భార్య కేసు పెట్టిందని.. డెత్‌నోట్ రాసి! आत्महत्या से पहले का #AtulSubhash का 63 मिनट का ये पूरा वीडियो सुनकर निःशब्द और विचलित हूं। उफ़ ! #JusticeForAtulSubhash pic.twitter.com/lFDQZFLEBV— Vinod Kapri (@vinodkapri) December 10, 2024👉నిఖిత, అతుల్‌ను విడిచి వెళ్లి 8 నెలలపైనే అవుతోంది. యూపీ జౌన్పూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందామె. విడాకులకు కారణాలుగా.. అతుల్ మీద గృహ హింస, అసహజ శృంగారం లాంటి అభియోగాలతో తొమ్మిది కేసులు నమోదు చేయించింది. అంతేకాదు అతుల్‌పై కేసులు వెనక్కి తీసుకోవాలంటే.. రూ.3 కోట్ల రూపాయల డబ్బు ఇప్పించాలంటూ కోర్టు బయట బేరసారాలకు దిగింది. ఒకవైపు మానసికంగా.. మరోవైపు కోర్టు చుట్టూ తిరిగి శారీరకంగా అలసిపోయాడు. చివరకు.. తనకు ఎదురైన వేదనను భరించలేక బలవనర్మణానికి పాల్పడ్డారు.న్యాయమూర్తే అపహాస్యం చేస్తే..న్యాయవ్యవస్థ.. నేర వ్యవస్థగా మారితే ఎలా ఉంటుంది?.. ఆ వ్యవస్థలో అవినీతి ఏస్థాయిలో పేరుకుపోయిందో చెబుతూ.. సుభాష్ తన సూసైడ్ నోట్లో ఆవేదన వెల్లగక్కారు. ఈ క్రమంలో జౌన్పూర్ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఒకరు.. తనను ఎంతగా హింసించింది పేర్కొన్నారు. తన కేసును విచారించిన ఓ మహిళా జడ్జి.. తను నుంచి భారీగా లంచం డిమాండ్ చేశారనే విషయాన్ని ప్రస్తావించారాయన. కోర్టులో విచారణకు వెళ్లినప్పుడల్లా.. నిఖిత తనపై కొత్త ఆరోపణలు చేసేదని.. ఒకానొక టైంలో సదరు జడ్జి తనను అపహాస్యం చేస్తూ నవ్వేవారని చెప్పారాయన. అంతేకాదు.. తనకు అనుకూలంగా తీర్పు కోసం ఇవ్వడం కోసం లక్షల సొమ్మును డిమాండ్ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. విచారణ తేదీలను షెడ్యూల్ చేయడానికి కూడా లంచం అడిగారని, ఇవ్వకపోవడంతో గతంలో తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు ఈ ఆరోపణల సంగతి చూడాలంటూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన కోరారు. 👉ప్రతీ చట్టం ఆడవాళ్ల కోసమేనా?. మగవాళ్ల కోసం ఏమీ ఉండదా? అని అతుల్ సోదరుడు బికాస్ వేసిన ప్రశ్న.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన భార్య కోసం తన సోదరుడు చేయగలిగిదంతా చేశాడని.. అయినా ఇలాంటి పరిస్థితుల మధ్య నలిగిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మహిళల రక్షణ కోసం మన దేశంలో చట్టాల్లో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. అందునా.. వివాహితల కోసం వైవాహిక చట్టాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ, ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తే.. ఏం చేయాలనే దానిపైనే న్యాయవ్యవస్థకు స్పష్టత కొరవడింది. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానమే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడం కోసం.. చట్టాన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు కొందరు.సరైన ఆధారాలు లేకుండా.. అడ్డగోలు ఆరోపణలతో నిందితులుగా చట్టం ముందు నిలబెడుతున్నారు. ఇలాంటి కేసుల వల్ల కోర్టుకు పనిభారం పెరిగిపోతోంది.కొన్ని కేసుల్లో.. అతిశయోక్తితో కూడిన ఆరోపణల వల్ల బంధువులు సైతం చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆ న్యాయస్థానాలు కచ్చితంగా న్యాయ పరిశీలనలు జరపాలనే అభిపప్రాయం వ్యక్తమవుతోంది.అన్నింటికి మించి..ఇలాంటి తప్పుడు కేసులు సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. బాధితులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే అతుల్ లాంటివాళ్లెందరో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ‘‘నా కేసులో ఎలాంటి వివరాలు దాచకండి. ప్రతీ విషయం అందరికీ తెలియాలి. అప్పుడే మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత భయానకంగా ఉందో, చట్టాల దుర్వినియోగం ఎంత ఘోరంగా జరుగుతుందో తెలుస్తుంది’’ అంటూ అతుల్ తన చివరి నోట్లో రాశారు. అతుల్ నోట్ ఆధారంగా నిఖిత, ఆమె కుటుంబ సభ్యులపై బెంగళూరులో కేసు నమోదైంది. మరోపక్క అతుల్ సూసైడ్ నోట్లో ప్రస్తావించినట్లే.. తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని.. ఈ కేసు వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కొందరు తెలియజేస్తున్నారు. ఎలాగైనా బాధితుడికి న్యాయం జరగాలని కోరుకుంటూ చిన్నపాటి ఉద్యమాన్నే నడిపిస్తున్నారు. -
లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి
అల్లిపురం (విశాఖ): లోన్ యాప్ వేధింపులకు విశాఖ నగరంలో ఓ యువకుడు బలైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. మహారాణిపేట సీఐ బి.భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన సూరాడ నరేంద్ర తన భార్య అఖిలాదేవి, తల్లి, తండ్రితో కలసి జీవిస్తున్నాడు. ఇతనికి వివాహమై సుమారు 50 రోజులైంది. సముద్రంలో వేటకు వెళ్లి వస్తుంటాడు. భార్య అఖిల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఇంటి అవసరాల నిమిత్తం నరేంద్ర ఆన్లైన్ యాప్‌లో రూ.2 వేలు రుణం తీసుకున్నాడు. ఆ మొత్తం చెల్లించేశాడు. కానీ.. రుణం తిరిగి చెల్లించాలంటూ లోన్ యాప్ నిర్వాహకులు అఖిల సెల్‌ఫోన్‌కు నరేంద్ర, అఖిల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి పంపించారు. లోన్ తక్షణమే తీర్చకపోతే వాటిని ఇతరులకు సైతం పంపిస్తామని బెదిరించారు. ఇంటికి వచ్చిన తరువాత నరేంద్రను అఖిల ఈ విషయం అడగ్గా.. ఇంటి అవసరాల నిమిత్తం తీసుకున్నట్టు చెప్పాడు. తర్వాత అఖిల ఆస్పత్రిలో డ్యూటీకి వెళ్లిపోయింది. రాత్రి 8 గంటల సమయంలో అఖిల అత్త ఫోన్‌చేసి నరేంద్ర తలుపులు తీయటం లేదని చెప్పటంతో ఇంటికి చేరుకుంది. తలుపులు కొట్టినా ఎంతకీ తీయక పోవటంతో పక్కనే ఉన్న కిటికీలోంచి చూడగా.. నరేంద్ర గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. దీంతో తలుపులు విరగ్గొట్టి నరేంద్రను కిందికి దించి కేజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందంయువకుడి మరణానికి కారణమైన లోన్ యాప్ నిర్వాహకులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, మహిళలను అవమానించడం, నేరపూరిత బెదిరింపు, మరొకరి గుర్తింపును మోసపూరితంగా ఉపయోగించడం, ఎలక్ట్రానిక్ రూపంలో లైంగిక, అసభ్యకరమైన విషయాలను ప్రచురించడం, ప్రసారం చేయడం తదితర నేరాలపై బీఎన్ఎస్ 108, 79, 351(2), ఐటీ యాక్ట్ సెక్షన్ 66 (సి), 67(ఎ) కింద కేసు నమోదు చేశామని తెలిపారు. మృతుని మొబైల్ ఫోన్‌ను పరిశీలించి నేరస్తులను గుర్తించేందుకు సైబర్ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. -
విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
సాక్షి, విశాఖపట్నం: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలయ్యాడు. పెళ్లయిన 40 రోజులకే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 వేల రూపాయలు కోసం మార్ఫింగ్ చేసి బెదిరింపులకు దిగారు. స్నేహితులు, బంధువులకు లోన్ యాప్ నిర్వాహకులు మార్పింగ్ ఫోటోలను పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రాక్షస పాలనలో దళితులపై కక్ష
సాక్షి, అమరావతి: ‘‘ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..?’’ అంటూ అహంకారపూరితంగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు! ఆ వర్గాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కుతూ.. దళితులకు అసలు నాయకత్వమే లేకుండా చేయాలనే దుర్నీతితో సాగుతున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం.. ప్రశ్నించడమే పాపమన్నట్లు వ్యవహరిస్తున్నారు.ఒకపక్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుక్షణం వేధింపులకు గురిచేస్తూ.. మరోవైపు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఆర్డీవో, డీఎస్పీ, మండల స్థాయి అధికారులపై కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించారు. సూపర్ సిక్స్ సహా హామీల అమలు, అక్రమాలు, వైఫల్యాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వారిని పోలీసు స్టేషన్లలో అర్ధ నగ్నంగా నిలబెట్టి అవమానాలకు గురి చేసిన ఘటనపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఎస్సీలను ఉక్కుపాదంతో అణచివేత చర్యలను రోజు రోజుకు ఉద్ధృతం చేస్తున్నారని ఆ సామాజిక వర్గ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులు..» అధికారంలోకి వస్తూనే వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం ఆయనపై వరుసగా కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు తెర తీసింది. దళితులకు నాయకత్వం లేకుండా చేయాలనే కుట్రపూరిత ధోరణితో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా కేసులు నమోదు చేస్తూ బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. నందిగం సురేష్ పై అసలు ఎక్కడెక్కడ, ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలంటూ స్వయంగా హైకోర్టు ఆదేశించడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అన్యాయంపై ప్రశ్నించడం.. దళితుల్లో స్ఫూర్తి రగల్చడమే పాపమనే విధంగా దళిత నేతల పట్ల కూటమి సర్కారు దుర్నీతితో వ్యవహరిస్తోంది. » చంద్రబాబుపై గతంలో గులకరాయి పడిన ఘటనకు సంబంధించి నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌లపై కూటమి సర్కారు ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు దిగింది. » కూటమి సర్కారు రాజకీయ క్షక్ష సాధింపుల్లో భాగంగా నారా లోకేశ్‌పై ట్వీట్ చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై స్థానిక పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేసింది. జోరుగా సాగుతున్న పేకాట కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఓ ప్రజాప్రతినిధి పట్ల ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. జరుగుతున్న విషయాన్ని చెబితే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా విపక్షంలో ఉన్నారనే ఏకైక కారణంతో ఓ ఎమ్మెల్యేపై కేసులు బనాయించడం కూటమి సర్కారు అరాచకాలకు పరాకాష్ట. » బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గతేడాది ఓ వలంటీర్ మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని విశ్వరూప్ కుమారుడు డాక్టర్ శ్రీకాంత్‌ను అక్రమంగా అరెస్టు చేసింది. డాక్టర్ శ్రీకాంత్‌ను ఏ 1గా చేర్చి జైలుకు తరలించింది. ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. » మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మేరుగు నాగార్జునపై టీడీపీ నేతలు ఓ మహిళతో తప్పుడు కేసు పెట్టించారు. నాగార్జున డబ్బులు తీసుకుని మోసం చేశారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు బనాయించారు. అయితే తనపై అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించినట్లు ఆ మహిళ అఫిడవిట్లో పేర్కొంది. తాను ఎన్నడూ మేరుగు నాగార్జునను చూడలేదని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఆరి్థక లావాదేవీలు లేవని అందులో వెల్లడించడం గమనార్హం.విద్యావంతుడికి అవమానాలు.. రాజమహేంద్రవరంలో వరదలు వచి్చనప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులను నెల రోజుల్లోనే పరిష్కరించినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన విద్యావంతుడైన దళిత యువకుడు పులి సాగర్ తాను నివాసం ఉండే కృష్ణానగర్, బ్రదరన్ చర్చి ప్రాంతాల్లో వరద నీరు ఇంకా నిల్వ ఉండటం, సమస్యలు తొలగకపోవడంపై ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు. దీంతో ఆయనపై కేసులు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం దారుణ అవమానాలకు గురి చేసింది. పోలీసు స్టేషన్‌కు రావాలని ఆదేశించడంతో ఈ నెల 2న ఆయన రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ స్టేషన్‌కు వెళ్లారు. బీఎస్సీ, బీఈడీ చదివిన తనను పోలీసులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ, బెదిరిస్తూ.. సెల్లో అర్ధనగ్నంగా నిలబెట్టి.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారని పులి సాగర్ వాపోయారు. దళిత యువకుడిని పోలీసులు ఘోరంగా అవమానించిన తీరును సామాజికవేత్తలు ఖండిస్తున్నారు. » చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గంలో గత ఎన్నికల సమయంలో విద్యుత్తు సబ్ స్టేషన్లో ప్రమాదానికి సంబంధించి టీడీపీ నాయకుల ప్రోద్బలంతో దళితుడైన యాదమరి ఎంపీపీ సురేష్ బాబుపై చిత్తూరు టూ టౌన్ సీఐ అక్రమ కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు దళితవాడలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హరి, జయపాల్, భారతి, బాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. » రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లెలో ఇటీవల దళిత వర్గానికి చెందిన ప్రభుపై టీడీపీ సానుభూతిపరులు మరుగుతున్న నూనెను ఒంటిపై పోయడంతో తీవ్ర గాయాలతో కడప రిమ్స్‌లో చేరాడు. » దళితుడనే చిన్న చూపుతో రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబును టీడీపీ నాయకులు ఆయన కార్యాలయంలోనే వేధించారు. తీవ్ర మానసిక వేధింపులతో కలత చెందిన ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికార యంత్రాంగంపై వేధింపులు» ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్‌కు నిష్పక్షపాతంగా పని చేస్తారనే పేరుంది. ఆయన ఏ రాజకీయ పక్షానికీ కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తున్నారు. అగి్నమాపక డీజీ, సీఐడీ చీఫ్ హోదాల్లో సంజయ్ అక్రమాలు, నిధుల దురి్వనియోగానికి పాల్పడ్డారనే నెపం మోపి ఆయన్ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. » ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ను వేధింపులకు గురి చేస్తున్న కూటమి సర్కారు ఐపీఎస్‌లు పాల్రాజు, జాషువాకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా కక్ష సాధిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి అన్బురాజన్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. రాజకీయ దురుద్దేశాలతో రిటైర్డ్ సీనియర్ పోలీస్ అధికారి విజయ్‌పాల్‌ను వేధించి అరెస్టు చేసింది. » ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణకు నిజాయితీగా, చట్ట ప్రకారం వ్యవహరిస్తారని అధికార వర్గాల్లో పేరుంది. గత ప్రభుత్వంలో ఆయన స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీగా పని చేశారు. విధి నిర్వహణలో నిక్కచి్చగా వ్యవహరించిన రామకృష్ణపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తనిఖీలు నిర్వహించి అక్రమాలను వెలికి తీసినందుకు ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు దిగింది. -
హగ్ ఇస్తేనే పాస్‌పోర్టు ఇస్తా: కానిస్టేబుల్ వేధింపులు
బొమ్మనహళ్లి: యువతి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా, తనిఖీ కోసం ఆమె ఇంటికి వెళ్ళిన కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె షాకైంది. ఫిర్యాదు చేయడంతో అతనిని సస్పెండ్ చేసిన ఘటన బెంగళూరు నగరంలోని బ్యాటరాయనపుర ఠాణా పరిధిలో జరిగింది.కోరిక తీర్చమంటూ..ఫిర్యాదు మేరకు వివరాలు.. ఠాణా పరిధిలోని బాపూజీ నగరలో ఉండే ఓ యువతి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంది. ఇందుకోసం పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆమె గురించి తనిఖీ చేయాలని పాస్‌పోర్టు ఆఫీసు నుంచి ఠాణాకు సిఫార్సు వచ్చింది. దీంతో కానిస్టేబుల్ కిరణ్ యువతి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి చొరబడి తలుపులు మూసి, నీ సోదరునిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందువలన నీకు పాస్‌పోర్టు రాదు. నీవు నాకు సహకరిస్తే చాలు అని ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అనడంతో ఒక్కసారి కౌగిలించుకుంటా అని వేధించాడని యువతి ఆరోపించింది. మరో గదిలో ఉన్న సోదరుడు ఏమిటీ గొడవ అని రాగా, కానిస్టేబుల్ మాట మార్చి అక్కడి నుంచి జారుకున్నాడు. మరోవైపు వెరిఫికేషన్ నంబర్ ఇవ్వకుండా బ్లాక్ చేశాడు. దాంతో బాధితురాలు పశ్చిమ డీసీపీ ఎస్. గిరీష్‌ని కలిసి గోడు వెళ్లబోసుకుంది. పోలీసు తప్పు చేసినట్లు గమనించి అతన్ని సస్పెండ్ చేశారు.ముడుపుల గోలకాగా, నగరమే కాకుండా రాష్ట్రమంతటా పాస్‌పోర్టు కోసం పెద్దసంఖ్యలో ప్రజలు దరఖాస్తులు చేస్తుంటారు. తనిఖీల సమయంలో పెద్దమొత్తంలో ముడుపులు అడుగుతారని, ఇవ్వకపోతే ఏదో ఒక సాకుతో పెండింగ్‌లో పెడతారని ఆరోపణలు ఉన్నాయి. గొడవ ఎందుకని చాలామంది డబ్బులు ఇచ్చేస్తారు. -
32 ఏళ్ల మహిళతో అసభ్య ప్రవర్తన.. నటుడిపై లైంగిక వేధింపుల కేసు!
బాలీవుడ్ నటుడు శరద్ కపూర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. తనతో అనుచితంగా ప్రవర్తించాడంటూ శరద్‌పై 32 ఏళ్ల మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ప్రాజెక్ట్ గురించి చర్చించాలంటూ తన ఆఫీస్‌కి ఆహ్వానించి.. అసభ్యకరంగా తాకాడని, లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మహిళా ఫిర్యాదుతో ముంబై పోలీసులు శరద్ కపూర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. రీల్స్ గురించి చర్చించాలంటూ నవంబర్ 26న సదరు మహిళను శరద్ తన ఆఫీస్‌కి ఆహ్వానించాడు. ఆమె ఆఫీస్‌కి వెళ్లగానే అక్కడి సిబ్బంది శరద్ కపూర్ గదికి వెళ్లమని చెప్పారు. ఆమె అతని దగ్గరకు వెళ్లగానే బలవంతంగా కౌగిలించుకొని అసభ్యకరంగా ప్రవర్తించాడు. అక్కడ నుంచి పారిపోయిన తర్వాత కూడా వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు పంపిస్తూ వేధిస్తున్నాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై శరద్ కపూర్ ఇంతవరకు స్పందించలేదు.శరద్ కపూర్ 1995 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. తన కెరీర్లో ఎక్కువగా విలన్ పాత్రలే పోషించాడు. షారుక్ ఖాన్ ‘జోష్’, హృతిక్ రోషన్ ‘లక్ష’ సినిమాలో శరద్ పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. -
లైంగిక దాడి ముద్దాయికి 25 ఏళ్ల శిక్ష
విశాఖ–లీగల్: వావి వరసలు మరిచి వరుసకు కూతురయ్యే చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన సవతి తండ్రికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది గురువారం తీర్పునిచ్చారు. జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించారు. ప్రభుత్వం రూ.4 లక్షలు బాలికకు పరిహారంగా చెల్లించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీఆర్ మూర్తి అందించిన వివరాలు.పశ్చిమగోదావరి జిల్లా రాజఒమ్మంగి మండలం పాక గ్రామానికి చెందిన కుర్ర ఇమాన్యుయేల్ ప్రస్తుతం ఏఎస్ఆర్ జిల్లా లోతుగడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో ఉంటున్నాడు. వృత్తి రీత్యా అతడు చర్చి ఫాదర్. బాధితురాలి తల్లి నందినికి ఆయన రెండో భర్త. నిందితుడు రోజూ కొంతమందితో అడవిలోని మోదుగ ఆకులు ఏరించి, పట్టణ ప్రాంతాలకు విక్రయించేవా డు. 2021 ఆగస్టు 26 మధ్యాహ్నం 12 గంటల సమయంలో అడవిలోని ఒక నిర్జన ప్రదేశంలో నందిని కుమార్తెపై అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు. -
లైంగికంగా వేధించారా.. సాక్ష్యం ఉందా!?
ఒంగోలు టౌన్: ‘ఏంటి.. లైంగికంగా వేధించారా.. సాక్ష్యం ఏమైనా ఉందా’.. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ గడప తొక్కిన బాధిత మహిళకు బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న సీఐ నుంచి ఎదురైన ప్రశ్న ఇది. సాక్ష్యం ఉంటేనే కేసు పెడతామని పోలీసు అధికారి చెప్పడంతో ఆమె బిత్తరపోయింది. పోలీసులు, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన బాధితురాలు చివరికి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. బాధితురాలి కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఓ మహిళ పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న సురేంద్రబాబు, డీఈఓ మహమ్మద్ అన్సారీలు లైంగికంగా వేధిస్తున్నారంటూ సదరు మహిళ అక్టోబరు 18న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన తాలుకా పోలీసుస్టేషన్‌కు రిఫర్ చేశారు. విచారణ కోసం రమ్మంటూ మరుసటి రోజు తాలుకా పోలీసుస్టేషన్ నుంచి పిలుపు రాగా.. ఆమె వెళ్లి సీఐ అజయ్‌కుమార్‌కు తన సమస్య చెప్పుకుంది. వారిరువురూ ద్వంద్వార్ధాలతో కామెంట్ చేస్తున్నారని వాపోయింది. సీఐ స్పందిస్తూ.. ‘నీ మాటలు నమ్మశక్యంగా లేవు, నీ వద్ద వీడియోలు ఉంటే తీసుకురా’.. అని చెప్పారు.తన దగ్గర ఎలాంటి వీడియోల్లేవని, ఒక మహిళ సిగ్గు విడిచి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఊరికే ఎలా చెబుతుందని ప్రశ్నించింది. ఇది జరిగి నెలరోజులైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆమెపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఆస్పత్రిలో పనిచేసే మహిళలతో డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేయించారు. అలాగే, స్థానిక టీడీపీ నేతలు చంద్రశేఖర్, భాస్కర్ బెదిరిస్తున్నారు. దీంతో బాధిత మహిళ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌కు కలిసి తన గోడు చెప్పుకుంది. అయినా ప్రయోజనం లేకపోయేసరికి ఎస్పీని కలిసేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి వెళితే అక్కడ సిబ్బంది ఆమెను ఎస్పీ వద్దకు వెళ్లనీయలేదు.ఇక దిక్కుతోచని స్థితిలో మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, డీజీపీలకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. పైనుంచి వచ్చిన కేసులు విచారించి నివేదిక పైకి పంపిస్తామని, బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు తప్పని తేలిందని సీఐ అజయ్‌కుమార్ చెబుతున్నారు. -
సెక్షన్లు మార్చి.. చట్టాన్ని ఏమార్చి..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులతో వేధింపుల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును కాలరాస్తూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. ఇందుకోసం సెక్షన్లు మార్చేస్తోంది. చట్టాల్ని ఏమారుస్తోంది. సోషల్ మీడియా పోస్టులపై కేసులు అందుకు ఉద్దేశించిన ఐటీ చట్టం ప్రకారం కాకుండా సంబంధంలేని ఇతర చట్టాల కింద పెడుతుండటం ప్రభుత్వ కక్ష సాధింపునకు నిదర్శనం. చివరకు సుధారాణి అనే సోషల్ మీడియా యాక్టివిస్టుపైనా పోక్సో కేసు పెట్టడం ప్రభుత్వ దుర్నీతికి పరాకాష్ట. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఓ మహిళ మీద పోక్సో కేసు పెట్టడమే అత్యంత దారుణమని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని, ఇదే కొనసాగితే ఎవరూ మనుగడ సాగించలేని దుస్థితి వస్తుందని చెబుతున్నారు. బాధిత బాలికకు అండగా నిలిచినందుకు వైఎస్సార్సీపీ నేత, మాజీ శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసు పెట్టడం ప్రభుత్వ మరో బరితెగింపునకు నిదర్శనం. ఇలా నిత్యం రాష్ట్రంలో అనేక మందిపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోంది.ఐటీ చట్టం స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ అక్రమ కేసుల పరంపరవ్యక్తిగతంగా లేదా మీడియా ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేయడం భావ ప్రకటన హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టులపై అభ్యంతరం ఉంటే కేంద్ర ఐటీ చట్టం కింద మాత్రమే కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. కానీ కక్ష సాధింపే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పును నిర్భీతిగా ఉల్లంఘిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తోంది. ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై ఐటీ చట్టం కింద కాకుండా ఇతర చట్టాల కింద కూడా కేసులు పెడుతూ పౌర హక్కులను ఉల్లంఘిస్తోంది. బీఎన్ఎస్ సెక్షన్ 111, పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం.. ఇలా వివిధ చట్టాల కింద కుట్రపూరితంగా కేసులు పెడుతోంది.అందుకు కొన్ని ఉదాహరణలు..» ఇప్పటివరకు 30 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై ఐటీ చట్టంతోపాటు బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద అక్రమ కేసులు నమోదు చేశారు. ఆ సెక్షన్ వ్యవస్థీకృత నేరాల కట్టడికి ఉద్దేశించింది. అంటే ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసేందుకు ఉద్దేశించినది. కానీ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టడం తెగింపు ధోరణే.» 9 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై ఐటీ చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా అక్రమ కేసులు నమోదు చేశారు. అసలు ప్రభుత్వ వైఫల్యాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించడం ఎస్సీ, ఎస్టీ వేధింపు ఎలా అవుతుందోనని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. » మరో విడ్డూరం ఏమిటంటే.. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించే వారిపై పోక్సో చట్టం కింద కేసులు పెట్టడం. గుంటూరు జిల్లాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త, మహిళ సుధారాణిపైనా పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. కొద్దిరోజుల క్రితం సుధారాణి దంపతులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. దీనిపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ ఫుటేజీలను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడంతో గుంటూరు, ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు షాక్ తగిలింది. దాంతో ఆమెపై ఏకంగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, వేధింపులకు గురి చేస్తున్నారు.» చంద్రగిరి నియోజకవర్గంలో ఓ బాలికపై ఇద్దరు దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆమె కుటుంబం తల్లడిల్లింది. సమాచారం తెలిసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అదే ఆయన చేసిన నేరమన్నట్టుగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయనపై ఏకంగా పోక్సో కేసు పెట్టింది. -
జనసేన నేత లైంగిక వేధింపులు..
-
ఫేక్ ఫ్యాక్టరీ ఐ–టీడీపీ
తెనాలికి చెందిన గీతాంజలి అనే గృహిణి తనకు జగనన్న కాలనీలో ఇంటి పట్టా వచ్చిందని, తన సొంతింటి కల నెరవేరుతోందని ఆనందంగా చెప్పడాన్ని టీడీపీ సోషల్ మీడియా జీర్జించుకోలేకపోయింది. గీతాంజలిని సోషల్ మీడియాలో తీవ్రంగా వేధించింది. అత్యంత దారుణంగా బూతులు తిడుతూ పోస్టులు పెట్టింది. వాటిని భరించలేక, భయపడి ఆమె ఆత్మహత్య చేసుకుంది. గీతాంజలి ఇద్దరు ఆడపిల్లలు తల్లిప్రేమకు దూరమయ్యారు.వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుకుని ఆంగ్లంలో అద్భుతంగా మాట్లాడుతున్న బెండపూడి బాలికలపై కూడా టీడీపీ సోషల్ మీడియా బరితెగించి ట్రోల్ చేసింది. ఈ పిల్లల ప్రతిభను ఐక్య రాజ్యసమితి గుర్తించినా ఐ–టీడీపీ మాత్రం తీవ్రంగా వేధించింది. పేద పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా పోస్టులు పెట్టింది. వారు బయటకు వచ్చి మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చింది.సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో ఐ–టీడీపీ అనే అతి పెద్ద బూతుల ఫ్యాక్టరీని టీడీపీ తయారు చేసింది. ఈ ఫ్యాక్టరీ బాలికలు, మహిళలు, విద్యావంతులు, విశ్లేషకులు, రాజకీయ నాయకులు... అనే తేడా లేకుండా టీడీపీకి వ్యతిరేకంగా నోరు విప్పిన ప్రతి ఒక్కరినీ బండబూతులతో చెండాడుతుంది. మార్ఫింగ్ ఫొటోలతో వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. రాజకీయాలతో సంబంధం లేకపోయినా గత ప్రభుత్వ హయాంలో మంచి జరిగిందని చెప్పిన వారిని బజారుకీడ్చి కుంగిపోయి, కుమిలిపోయి చివరికి ప్రాణాలు తీసుకునేంత వరకు వెంటాడి వేధిస్తుంది. సోషల్ మీడియాలో విష ప్రచారం... అంటూ నీతులు చెబుతున్న కూటమి ప్రభుత్వానికి ఈ ఫేక్ ఫ్యాక్టరీ అరాచకాలు మాత్రం కనిపించడం లేదు. కేవలం టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై మాత్రమే కత్తికట్టి కేసులతో వేధిస్తోంది. ‘నిజాయతీగా అయితే టీడీపీ సోషల్ మీడియాపై లెక్కలేనన్ని కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత నీచాతినీచమైనదని టీడీపీ సోషల్ మీడియా విభాగం’ అని విశ్లేషకులు చెబుతున్నారు.ఫేక్ ప్రచారం వ్యవస్థీకృతంఐ–టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని అత్యంత వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ తన ‘ఎక్స్’ ఖాతాలో తరచూ అభ్యంతరకర పదాలతో ట్వీట్లు చేస్తారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని కొమ్మారెడ్డి పట్టాభి, ఆనం వెంకట రమణారెడ్డి వంటి నేతలతోపాటు ఐ–టీడీపీ, సీబీఎన్ ఆర్మీ తదితర విభాగాల సభ్యులు అడ్డూ అదుపూ లేకుండా తమకు నచ్చనివారిపైనా, తటస్థులపైనా బూతులతో విరుచుకుపడుతున్నారు. కొందరు టీడీపీ తరఫున మారుపేర్లతో సోషల్ మీడియాలో చేసే అసభ్య ప్రచారం కనీవినీ ఎరుగనిది. ఫేక్ ప్రచారం విషయంలో ఐ–టీడీపీకి పేటెంట్ ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బూతులతో కలలో కూడా ఊహించలేని అపవాదులు, దుర్భాషలతో ప్రత్యర్థులను వెంటాడి వేటాడటంలో టీడీపీ సోషల్ మీడియాకు ఉన్న నైపుణ్యం, సామర్థ్యం మరెవరికీ ఉండదని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, విద్యావేత్త ప్రొఫెసర్ నాగేశ్వర్ పలుమార్లు అభిప్రాయపడ్డారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ సోషల్ మీడియా తనపై బూతులతో విరుచుకుపడటాన్ని తప్పుపడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏకంగా చంద్రబాబుకు లేఖ రాశారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో తన తల్లిని టీడీపీ సోషల్ మీడియా దూషించిందని చెప్పారు. అయినా చంద్రబాబు పట్టించుకోకపోగా టీడీపీ సోషల్ మీడియాను మరింత ప్రోత్సహించారు. అందువల్లే వైఎస్ జగన్ దంపతులతోపాటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కొడాలి నాని, పేర్ని నాని, కడప ఎంపీ అవినాష్ వంటి అనేక మంది వైఎస్సార్సీపీ నేతలను నిత్యం అవమానించేలా, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు.సోషల్ మీడియాలో టీడీపీ అరాచకదాడి సంగతేంటి?సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు నీచాతినీచంగా పోస్టులు పెట్టడం లేదా? నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను.. వైఎస్సార్సీపీ వాళ్లమీద పోస్టులు పెట్టడం కాదు... మా లాంటి వాళ్లను కూడా బూతులు తిడుతున్నారు. మొన్న రాత్రి 10.32 గంటలకు ఒక టీడీపీ అభిమాని ఫోన్ చేసి బండ బూతులు తిట్టాడు. టీడీపీ శ్రేణులు, టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న వికృతమైన, అరాచకమైన దాడి సంగతి ఏంటీ? దానికి ఆన్సర్ ఉండాలి కదా? నా అనుభవంలో అయితే నన్ను ఏ ఇతర రాజకీయ పార్టీల వాళ్లు కూడా ఇంత బూతులు తిట్టలేదు. చంద్రబాబుపేటీఎం, నువ్వు కమ్యూనిస్టువు, కాంగ్రెసోనివి, నువ్వు బీఆర్ఎస్ వాడివి ఇట్లా రకరకాలుగా అన్నారు. కానీ ఇలా బూతులు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు తిటినట్లు ఎవరూ తిట్టలేదు. నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. అత్యధికంగా తిట్టేది టీడీపీ వాళ్లే. తన వాళ్లను చంద్రబాబు కంట్రోల్ చేయడా?.– ప్రొఫెసర్ నాగేశ్వర్, రాజకీయ పరిశీలకుడు, విశ్లేషకుడు, విద్యావేత్త, హైదరాబాద్ -
పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. ఆ వివాదం గురించేనా?
కొన్నిరోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసిన నటి పూనమ్ కౌర్.. తాజాగా మరో షాకింగ్ ట్వీట్ చేసింది. మరో సంచలన ట్వీట్‌తో ప్రకంపనలు సృష్టించింది. ఈసారి ఏకంగా టాలీవుడ్ హీరోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కోలీవుడ్‌లో ధనుశ్- నయనతార వివాదం కొనసాగుతున్న వేళ.. పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.పూనమ్ తన ట్వీట్లో రాస్తూ..'నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో చేశా. నాతో పాటు ఓ అమ్మాయి కూడా నటించింది. ఆ తర్వాత తను హీరోయిన్గా కూడా చేసింది. అయితే కొన్నేళ్లుగా సినిమాలు చేయడం మానేసింది. అంతేకాదు ఎవరికీ కనిపించకుండా పోయింది. ఇటీవల తను ఓ డొమెస్టిక్ ఫ్లైట్‌లో కలిసింది. పెళ్లి షాపింగ్‌కు వచ్చానని.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అడిగింది. అంతేకాదు.. తాను యూఎస్ వెళ్లినప్పుడు అతను అదే ఫ్లైట్‌లో కనిపించాడని చెప్పింది. ఓ సినిమాలో ఇంటిమేట్ సీన్ టైమ్‌లో నాపై అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. అందువల్లే ఇండస్ట్రీ వదిలి యూఎస్ వెళ్లి చదువుకుంటున్నట్లు వివరించింది. అయినప్పటికీ ఆ హీరో వేధింపులు తగ్గలేదంటూ అమ్మాయి వివరించింది.' అని పూనమ్ తెలిపింది. దీంతో మరోసారి పూనమ్ కౌర్ ట్వీట్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.అందులో తన ట్వీట్లో తమిళనాడు అంటూ ప్రస్తావించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ధనుశ్-నయనతార మధ్య వార్ నడుస్తోంది. ఈ సమయంలో పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. !! ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा ।। !!⠀ TAMILNADU#womensupportingwomen pic.twitter.com/QgYxjfYA7I— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 17, 2024 -
బాలికలపై ఆగని అత్యాచారాలు
చాగలమర్రి/నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వ పాలనలో.. రాష్ట్రంలో అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలాంటి అత్యాచారం వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లాలో ఒక పాఠశాలలో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు అత్యాచార యత్నం చేయగా, నెల్లూరులో పదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. నిందితులపై పోక్సో కేసులు నమోదు చేశారు. ఈ దారుణం గురించి తెలిసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పైనా కేసు నమోదైంది.నంద్యాల జిల్లాలో మండల కేంద్రం చాగలమర్రిలోని శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలికపై అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లైంగికదాడికి యత్నించారు. మూత్ర విసర్జనకు టాయిలెట్‌కు వెళ్లిన చిన్నారిపై వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్యం దాచిపెట్టింది. చిన్నారి తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 12వ తేదీ సాయంత్రం బడి నుంచి ఇంటికెళ్లిన చిన్నారికి జ్వరం వచ్చింది.పొత్తి కడుపులో నొప్పిగా ఉందని ఏడవడంతో తల్లిదండ్రులు స్థానిక కేరళ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యురాలు బాలికపై లైంగికదాడియత్నం జరిగినట్లు చెప్పారు. దీంతో బాలికను మెరుగైన చికిత్స కోసం వైఎస్పార్ జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా కేసు నమోదు చేయాలని సూచించారు. భయపడిన తల్లిదండ్రులు అక్కడి నుంచి కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ కూడా విషయం తెలిపి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.దీంతో తల్లిదండ్రులు వెంటనే చాగలమర్రికి వెళ్లి పాఠశాల కరస్పాండెంట్‌ను ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో బాధితులు బంధువుల సహాయంతో నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ విచారణ చేయాలని ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్‌ను ఆదేశించారు. డీఎస్పీ రవికుమార్ శనివారం ఎస్ఐ రమేష్‌రెడ్డి, సిబ్బందితో కలిసి శ్రీరాఘవేంద్ర పాఠశాలకు వెళ్లి సిబ్బందిని విచారించారు. అనంతరం పోలీసు స్టేషన్లో బాధిత చిన్నారి కుటుంబసభ్యులను విచారించి, వారి ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై పోక్సో కేసు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలికను మాయచేసి అత్యాచారంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో పదో తరగతి బాలిక (16)కు మాయమాటలు చెప్పి ఒక యువకుడు అత్యాచారం చేశాడు. నెల్లూరు రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. మెడికవర్ హాస్పిటల్ వెనుక పాతమెట్టపాళెంలో ఉండే బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన పెంచలయ్య (23) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలలుగా తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెబుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన బాలికను మాయచేసి లొంగదీసుకుని అత్యాచారం చేశాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు శనివారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటూరి రవికిరణ్ పై కొనసాగుతున్న ప్రభుత్వ వేధింపులు
-
కొందరు ఉపాధ్యాయుల వికృత చేష్టలు, బిక్కుబిక్కుమంటున్న అమ్మాయిలు
సిరిసిల్ల కల్చరల్: పాఠశాలల్లో కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్నారు. మాస్టార్లు చెప్పే పాఠాల కోసం బడులకు వస్తున్న విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. చట్టాలు ఎంత పదునుగా తయారవుతున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. అయితే వారి దుశ్చర్యల గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది బాధితులు లోలోపల కుమిలి పోతున్నారు. వెలుగులోకి రానివెన్నో.. బ్యాడ్ టచ్ బారిన పడుతున్న పిల్లలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులకు సైతం చెప్పే స్వేచ్ఛ కొన్ని కుటుంబాల్లో లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవల షీటీమ్స్ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి. అయినా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదులు రావడం తక్కువే. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి నివాసి, ప్రభుత్వ ఉపాధ్యా యుడు నామని సత్యనారాయణ అదే కాలనీకి చెందిన ఓ బాలికను జామకాయ కోసి ఇస్తానంటూ తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలిక చేతులు పట్టుకొని, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. వీర్నపల్లి మండలంలోని మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన ఓ ప్రబుద్ధుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గత నెల 21న జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్లో ఉద్యోగ విరమణకు చేరువైన కె.నరేందర్‌తోపాటు మరో టీచర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్‌నగర్ జెడ్పీ హైసూ్కల్లో రఘునందన్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంతో కేసు నమోదు చేశారు. కొద్ది వారాల క్రితం గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ అదే కళాశాల విద్యార్థిని విషయంలో అనుచితంగా వ్యవహరించాడని కేసు నమోదైంది. ఇప్పటి వరకు నమోదైన కేసులు రాజన్నసిరిసిల్లా జిల్లాలో మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలపై ఇప్పటి వరకు 38 కేసులు నమోదైనట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీటిలో టీచర్లపైనే ఐదు కేసులు నమోదయ్యాయి. ఎవరైనా వేధింపులకు గురైతే 87126 56425 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో). ఇది లైంగిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం. లైంగికదాడి నేరాలకు పాల్పడిన నిందితులకు ఈ చట్టంతో జీవితఖైదీగా 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిగితే కనీసం 10 నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. రెండు నెలల్లోపే కేసు దర్యాప్తు జరగాలని నూతన చట్టం నిబంధన విధించింది. -
నా చావుకు కారణం సీఐ, కానిస్టేబుల్
-
ఇద్దరు చిన్నారులు, వివాహితపై అత్యాచారయత్నం
పూసపాటిరేగ/బేతంచర్ల/సాక్షి టాస్క్‌ఫోర్స్: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై, వివాహితపై మానవ మృగాలు అత్యాచారానికి యతి్నంచాయి. ఈ ఘటనలు విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, పతివాడ గ్రామానికి చెందిన మైనపు హరీశ్ (19) గ్రామ పాఠశాల వెనుకభాగంలో సోమవారం పశువులను మేపుతున్నాడు. అటుగా వెళ్తున్న ఇద్దరు బాలికలను పిలిచి మంచినీళ్లు తీసుకురావాలని కోరాడు.వారిద్దరు సమీపంలోని నిందితుడి ఇంటికెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చారు. వారిలో ఓ చిన్నారి (5)ని ఉండమని లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో భయపడిన అతడు, చిన్నారిని ఇంట్లో అప్పగించాడు. విషయాన్ని చిన్నారి తన తల్లికి చెప్పడంతో గ్రామపెద్దల సహాయంతో పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.నంద్యాల జిల్లాలో.. నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గంలోని కొలుములపల్లెకు చెందిన ఏడేళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ఆ చిన్నారికి తండ్రి లేడు. తల్లి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈనెల 7న బాలిక స్కూల్‌కు వెళ్లలేదు. ఇంటి దగ్గర ఆడుకుంటుండగా గ్రామానికి చెందిన దండగాల్ల ఎల్లయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. బాలిక కేకలకు చుట్టుపక్కల వారు రావడంతో ఎల్లయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివాహితపై టీడీపీ నేత అత్యాచారయత్నం కర్నూలు జిల్లా, గూడూరు మండలం ఆర్.ఖానాపురం గ్రామంలో మంగళవారం పొలం పనులకు వెళ్లిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత బోయ గోపాల్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. అయితే ఆ మహిళ పెద్దగా కేకలు వేస్తూ తప్పించుకుని ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. అనంతరం భర్తతో కలిసి ఆమె గూడూరు ఎస్ఐ తిమ్మయ్యకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలోనూ ఇలాంటి దుశ్చర్యలు.. కాగా టీడీపీ నేత గోపాల్ గతంలో కూడా ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలపై అత్యాచారాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెప్పారు. వారంతా నిందితుడు గోపాల్‌కు భయపడి కేసులు పెట్టేందుకు ముందుకు రాలేదని పేర్కొన్నారు. గోపాల్ టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ మునిస్వామికి స్వయాన మేనల్లుడు. -
అత్త, వారి బంధువుల వేధింపులు తాళలేక క్షోభ అనుభవిస్తున్నా
పంజగుట్ట: గత 10 నెలలుగా అత్త, అత్త తరపు బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, తమ సమీపబంధువు గౌతంరెడ్డి, అత్త గుణపటి పార్వతి, భర్త ఆదాల దామోదర్ రెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ఆపద ఉందని గ్రీన్‌పార్క్, మారీగోల్డ్, ఆవాసా హోటల్స్ డైరెక్టర్ ఆదాల దామోదర్ రెడ్డి సతీమణి రచనా రెడ్డి వాపోయారు. ఇంట్లో ఉన్న తనను ఈ నెల 6న 15మంది బౌన్సర్లు వచ్చి దాడిచేసి కిడ్నాప్ చేసేందుకు యతి్నంచారన్నారు.ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చెయ్యలేదని ఆమె ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తన సోదరితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2022 సంవత్సరంలో తనకు దామోదర్ రెడ్డికి వివాహం అయ్యిందని అప్పటినుండి కొద్దికాలం సజావుగానే తమ దాంపత్యం కొనసాగిందన్నారు. తన భర్త తన మాటవింటున్నాడు కానీ తన అత్త పార్వతి భర్తనుండి విడదీసేందుకు కుట్రలు పన్నిందన్నారు. తమ సమీపబంధువు గ్రీన్‌పార్క్, మారీగోల్డ్ హోటల్స్ సీఈఓ గౌతంరెడ్డి మా అత్త సాయంతో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. తన భర్తనుండి విడాకుల నోటీసు ఇప్పించడంతో గత కొంతకాలంగా తాను ఇల్లు వదిలి వెల్లిపోయానని తిరిగి కోర్టు ఆదేశాలతో గత నెల ఫిల్మ్‌నగర్ లోని తన భర్త ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అప్పటినుండి తనను ఇంట్లోవేసి తాళం వెయ్యడం, గదిలో బంధించడం తీవ్రమానసిక వేదనకు గురిచేశారని తెలిపారు. తన అత్త పార్వతి, భర్త దామోదర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి నుండి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రచనా రెడ్డి వాపోయారు. -
ఏపీలో కొనసాగుతున్న ప్రభుత్వ గూండాగిరీ
-
రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసుల వేధింపులు..
-
బాధిత బాలిక తండ్రిపై తీవ్ర ఒత్తిళ్లు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలానికి చెందిన మైనర్ దళిత బాలికపై జరిగిన దాడి ఘటనను నీరుగార్చేందుకు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు మొదలైనట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధ బాధిత బాలిక చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకుని దాదాపు ఐదు గంటల పాటు మంతనాలు జరపడం.. ఆమెను అనుమతించిన పోలీసులు వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలను మాత్రం అడ్డుకోవడం.. బాలిక తండ్రి ఒక్క రోజులోనే మాట మార్చేలా ఒత్తిడి తేవడం.. ఆద్యంతం ప్రభుత్వం గోప్యంగా వ్యవహరిస్తుండటం దీన్ని బలపరుస్తున్నాయి. వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరగలేదని తేలినట్లు ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు. బాలిక చెప్పిన వివరాల మేరకు అనుమానితులను విచారిస్తున్నట్లు తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత బాలిక సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి దాడి చేసిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను పోలీసులు అర్ధరాత్రి తొలుత పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి తరలించారు.బాధిత కుటుంబంతో పులివర్తి సుధ మంతనాలుచంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధ మంగళవారం ఉదయం 10.20 గంటల ప్రాంతంలో తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి చేరుకుని దాదాపు ఐదు గంటల పాటు బాధిత కుటుంబంతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. సాయంత్రం 3.04 గంటలు దాటాక వెలుపలకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తిరిగి మరోసారి లోపలకు వెళ్లారు. మధ్యాహ్నం 12.09 గంటల ప్రాంతంలో సుధ ఆసుపత్రి లోపల ఉన్న సమయంలో బాలిక తండ్రి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. బాలికపై దాడి జరిగింది వాస్తవమేనని, అయితే లైంగిక దాడి జరగలేదని చెప్పారు. తన కుమార్తె వారిని ప్రేమించలేదనే కారణంతో దాడి చేశారన్నారు.వైఎస్సార్సీపీ, ఏఐఎస్ఎఫ్ ఆందోళనబాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మాజీ మంత్రి ఆర్కే రోజా, తిరుపతి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, నూకతోటి రాజేష్, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఉదయమే వేర్వేరుగా తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి చేరుకోగా రోజా మినహా మిగిలిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను మాత్రం ఆస్పత్రి లోపలకు అనుమతించారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎంపీ, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ధర్నా చేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు కూడా ఆందోళనకు దిగారు. సీపీఐ నాయకులను సైతం అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, భూమన అభినయ్‌ని మాత్రం అనుమతించారు. -
ఏపీలో ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం.. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసుల పరంపర
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వ హామీలు, కూటమి పార్టీ నేతల తీరు, అధికార మదంతో దౌర్జన్యాలు, దుర్మార్గాలు, హత్యలు, హత్యాచారాలు, దాడులు, ఇతరత్రా ఆగడాల గురించి ప్రశ్నించడమే పాపమై పోతోంది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు అర్థం లేకుండా పోయింది. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యంగా మారిపోయింది. చట్టాలన్నీ అధికార పార్టీ నేతల చుట్టాలుగా భావిస్తున్న దుస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పని తీరు గురించి విమర్శలు రావడం సహజం. తద్వారా లోటుపాట్లుంటే సరి చేసుకుని ప్రజలకు మంచి పాలన అందించాల్సిన బాధ్యత అధికార పార్టీదే. ఈ స్ఫూర్తిని ఇసుమంతైనా వంటబట్టించుకోకుండా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. సద్విమర్శలను సైతం స్వీకరించలేని అహంకార ధోరణి పెరిగిపోయింది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక.. ఎప్పుటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజల దృష్టిని మళ్లిస్తూ నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ హామీలు తిరిగి ప్రజలకు గుర్తు చేస్తున్నారన్న దుగ్ధతో సోషల్ మీడియా కార్యకర్తలపై యుద్ధమే ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వారి నోళ్లు బలవంతంగా మూయించాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకు నిబంధనలను తోసిరాజని పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల కనుసైగతో పోలీసు యంత్రాంగం సైతం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెడుతోంది. చిన్నపాటి పోస్టులను కూడా బూతద్దంలో చూపిస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే హక్కు పౌరులకు ఉందని తెలిసినా, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతోంది. కనీసం 41ఎ నోటీసులు ఇచ్చి విచారించకుండానే, అరెస్ట్‌లకు పూనుకోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అని తెలిసినా ముందుకే అడుగులు వేస్తోంది. ఇది రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని, పౌరుల నోరు నొక్కాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగమే ప్రామాణికంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోకపోతే ఆ రెడ్ బుక్కే ఈ ప్రభుత్వానికి డెత్ బుక్ అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. రాష్టవ్యాప్తంగా ఒక్కరోజులోనే 40 మందిపై కేసులు పెట్టారు. పలువురిని ఆరెస్ట్ చేశారు. ఇంకా మరికొందరిపై కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. తద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. ఆయా ఘటనలకు సంబంధించిన వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా: డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై వినుకొండ మండలం పానకాలపాలెం గ్రామవాసి సన్నపనేని వెంకట్రావు ఎన్నికలకు ముందు పోస్టులు పెట్టినట్లు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి నిశ్శంకర శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంకట్రావును 48 గంటలుగా అక్రమంగా నిర్బంధించారు. కోర్టుకు హాజరు పరచకుండా, కుటుంబ సభ్యులు ఎవరినీ కలవనీయకుండా చేశారు. నోటీసులు ఇచ్చే కేసులకు కూడా నాన్ బెయిల్‌బుల్ కేసులు మాదిరిగా అక్రమంగా నిర్బంధించడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం వల్లభపురానికి చెందిన ఆళ్ల జగదీశ్‌రెడ్డిని శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలో సోషల్ మీడియా కార్యకర్త పిల్లి సాగర్ బాబును నాలుగు రోజులుగా రోజూ నాదెండ్ల పోలీస్ స్టేషన్‌కి పిలిపించి కూర్చోబెడుతున్నారు. శ్రీకాకుళం: కాశీబుగ్గలో ఇటీవల ఇద్దరు బాలికలపై టీడీపీ నాయకుల కుటుంబీకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుల ఫైల్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారని మందస మండలం పిడి మందస గ్రామానికి చెందిన గుంపు జగదీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అక్టోబర్ 26న వేకువజామున 4 గంటలకు ఇంటికి వెళ్లి వెరిఫికేషన్ అంటూ హడావుడి చేశారు. ఇతనిపైనే కేసు నమోదు చేస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి డాక్టర్ సీదరి అప్పలరాజుతోపాటు 200 మందికిపైగా వైఎస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు మందస పోలీస్ స్టేషన్‌కు చేరుకొని గట్టిగా నిలదీయడంతో జగదీష్‌ను వదిలేశారు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో మడ్డు జష్వంత్ అనే సోషల్ మీడియా కార్యకర్తపై పోలీసులు ఆదివారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదే గ్రామానికి చెందిన బైనపల్లి దానమ్మ అనే వృద్ధురాలు ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ సందర్భంలో సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఘటనను జష్వంత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై టీడీపీ మండలాధ్యక్షుడు సూరాడ మోహనరావు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వారు జష్వంత్ను అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు జోక్యంతో పోలీసులు వదలక తప్పలేదు.⇒ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పశ్చిమ గోదావరి జిల్లా ఇన్చార్జి బి.జయరామ్‌ను భీమవరం వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లను విమర్శిస్తూ ఆదివారం సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్టు జనసేన పార్టీ భీమవరం టౌన్ సెక్రటరీ పత్తి హరివర్ధన్రావు ఫిర్యాదు చేసినట్టు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు జయరామ్‌పై 321, 153 (ఏ), 505 (2), 67 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ⇒ పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో బాలాజీ రెడ్డి అనే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తను పెనుకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022–23లో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడనే కారణంతో రొద్దం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.⇒ ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో సోషల్ మీడియా కార్యకర్త పెసల శివారెడ్డిని స్పెషల్ పార్టీ పోలీసులు ఎత్తుకెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని కక్ష కట్టారు. వరికుంటపాడు, సీతారామపురం తదితర పోలీస్ స్టేషన్లు తిప్పతూ కొట్టినట్టు సమాచారం.ఉమ్మడి కృష్ణా జిల్లాలో అరాచకం⇒ నందిగామలో సోషల్ మీడియా కార్యకర్త వేల్పుల జైహింద్‌ను అధికార పార్టీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అతడిని మోకాళ్లపై కూర్చోబెట్టారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే పోరంబోకు స్థలంలో 45 ఏళ్లుగా ఉన్న ఇంటిని కూల్చేస్తామని బెదిరించారు. చందర్లపాడు మండలం ముప్పాళ్లలో సోషల్ మీడియా కార్యకర్త సాయం మీరా హుస్సేన్‌ను కంచికచర్ల సీఐ చితకబాది ఎమ్మెల్యే దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించారు. అంతేకాక ఊరు విడిచిపెట్టి వెళ్లాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నందిగామలో సోషల్ మీడియా కార్యకర్త వేల్పుల జైహింద్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించిన టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ⇒ జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త పిళ్లెం వినోద్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. ఇదే మండలం లింగగూడెం గ్రామానికి చెందిన భీమవరపు తంబి అనే సోషల్ మీడియా కార్యకర్తపై కూడా ఇదే రీతిలో కేసు నమోదు చేశారు. ⇒ జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన గౌస్ బాషా, తల కొండ సందీప్, ఆకుల ముక్కంటి (తిరుమలగిరి)పై కూడా కేసులు నమోదు చేశారు. వత్సవాయి మండలంలో షేక్ జానీ (వేములనర్వ), తాళ్లూరి గోపాలకృష్ణ (దబ్బాకుపల్లి)పై కేసు నమోదు చేశారు. జగ్గయ్యపేట పట్టణంలో తమ్మవరపు మురళీకృష్ణ, ఎ.నరేంద్రలపై కేసు నమోదైంది. కంచికచర్ల పరిధిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే కారణంతో పరిటాల గ్రామానికి చెందిన జమలయ్య, గనిఆత్కూర్ గ్రామానికి చెందిన షేక్ ఫరీద్, పెండ్యాల గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్లపై కేసులు పెట్టారు.⇒ నందిగామ పోలీస్‌స్టేషన్‌లో సోషల్ మీడియా కార్యకర్తలు వెలగా సత్యనారాయణ, అనుమోలు సారథి, నండ్రు శ్రీరామ్మూర్తి, సాజిత్, జమలయ్యలపై కేసులు నమోదు చేశారు. వివిధ హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే వీరి పాలిట శాపమైంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని గుడివాడలో అమిగో అలియాస్ ఖాజా బాబా, ఇంటూరు రవి, శ్యామ్‌లపై కేసులు నమోదు చేశారు. ⇒ విజయవాడ భవానీపురంలో ధరావతు శ్రీనివాస నాయక్‌పై, విజయవాడ వన్ టౌన్లో యాష్, సంతోష్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఒక్క విజయవాడ నగరంలోనే పదుల సంఖ్యలో సోషల్ మీడియా ఖాతాలపై టీడీపీ, జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఖాతాలకు సంబంధించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు.వింజమూరులో సోషల్ మీడియా కార్యకర్త శివారెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు పోలీసుల వేధింపులు చట్ట వ్యతిరేకంసాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం, పోలీసులు దాష్టీకానికి పాల్పడుతున్నారని.. రాష్ట్రంలో అరాచక పాలనకు ఇది నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పార్టీ లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ పని తీరును తప్పు పట్టారనే కారణంతో ఇష్టారాజ్యంగా అరెస్టులు చేయడం దారుణం అని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడుతూ అరెస్టులు చేసిన వారి వివరాలను పోలీసులు బయటకు వెల్లడించడం లేదని, న్యాయపరంగా వారికి సహాయం అందకుండా వారి హక్కులను కాలరాస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల అవినీతి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై విమర్శలు సంధిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం దమనకాండకు దిగుతోందన్నారు. ఇది పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అని అభివర్ణించారు. రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను కచ్చితంగా కోర్టుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పోలీసు అధికారులపై కచ్చితంగా కేసులు నమోదు చేసి వారిని కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న పోలీసులను గుర్తిస్తున్నామన్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని వెంటనే విడిచి పెట్టాలని, చట్టాన్ని మీరితే సహించబోమన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపితే.. ఈ ప్రభుత్వానికి అదే డెత్బుక్ అవుతుందని హెచ్చరించారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. ఇప్పటికే పలుమార్లు పోలీసుల వేధింపులకు గురైన ఇంటూరి రవి కిరణ్‌ను మళ్లీ హాజరు కావాల్సిందిగా పోలీసులు సమాచారం ఇవ్వడం దారుణం అన్నారు. నందిగామ, భీమవరం, కొల్లిపర, వినుకొండ, వింజమూరుల్లో కేసులు నమోదు చేశారని చెప్పారు. లండన్‌లో ఉన్న వారిపై కూడా కేసులు నమోదు చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒక్క రోజులోనే నమోదైన కేసుల వివరాలను ఈ సందర్భంగా వారు వెల్లడించారు. -
నాతో వస్తే.. పిల్లలు పుట్టిస్తా..
చేజర్ల: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల వేధింపులతో కొందరు మహిళలు ప్రాణాలు తీసుకోగా అనేకమంది ఆత్మహత్యాయత్నం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకాలు, దాష్టీకాలు పరాకాష్టకు చేరాయి. ఇంటర్ విద్యార్థినిని ప్రేమపేరుతో లొంగదీసుకుని ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ చేయడంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనను మరువకముందే అదే నియోజకవర్గంలోని చేజర్ల మండలంలో మరో దుర్మార్గం వెలుగు చూసింది. నాతో వస్తే పిల్లలు పుట్టిస్తా.. అంటూ టీడీపీ నేత వేధిస్తుండటంతో బాధిత గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. చేజర్ల మండలం యనమదల గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన ఒక గిరిజన మహిళకు ఏడాదిన్నర కిందట పెళ్లయింది. ఆమెకు ఇంకా పిల్లలు కలగలేదు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత మల్లినేని పెంచలయ్య కన్ను ఆమెపై పడింది. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. తరచు లైంగికంగా వేధిస్తున్నాడు. తరచూ ఆమె ఇంటికి వచ్చి ‘నీకు పెళ్లై ఇంతకాలమైనా పిల్లలు పుట్ట లేదు.. నాతో వస్తే పిల్లలు పుట్టిస్తా’ అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించసాగాడు. ‘నేను చెప్పినట్లు వినకపోతే నీ సంగతి తేలుస్తా’ అంటూ బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు స్థానిక పెద్దలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను స్దానిక చేజర్ల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తరువాత మెరుగైన చికిత్స కోసం 108లో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఈ విషయంపై చేజర్ల పోలీసులను అడగగా.. తమకు సమాచారం లేదని చెప్పారు. సమాచారం వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఒకే ఘటన.. రెండు కేసులు.. ఇది బాబు నీతి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురి చేయడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం న్యాయ సూత్రాలను, చట్టాలను కూడా ఉల్లంఘిస్తోంది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప మరేదీ పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కేసులు పెడుతోంది. ఈ క్రమంలోనే ఆయనపై ఒకే కేసుకు సంబంధించి, ఒకే వ్యక్తి ఇచ్చిన రెండు ఫిర్యాదుల ఆధారంగా రెండు కేసులు నమోదు చేసి చట్టాలను సైతం బేఖాతరు చేసింది. 2023లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై అప్పట్లోనే సురేష్‌పై తుళ్లూరు పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. అదే ఘటనపై అదే వ్యక్తి మళ్లీ ఫిర్యాదు చేస్తే.. ఏడాదిన్నర తర్వాత శుక్రవారం మరో కేసు నమోదు చేయడం కూటమి సర్కారు కక్ష సాధింపులకు పరాకాష్టే. ఇక్కడే చట్టాలను, రెజ్యూడికాటాను సర్కారు ఉల్లంఘించింది.2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని రైతులు, పేదలను, వారికి అండగా నిలిచిన సురేష్‌ను అక్రమ కేసులతో వేధించింది. ఆ తర్వాత బాపట్ల వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న నందిగం సురేష్ తమపై దాడి చేశాడంటూ 2023 మార్చి 31న విజయవాడకు చెందిన పనతల సురేష్ అనే వ్యక్తి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరోజు అమరావతి రాజధాని పర్యటనకు వచ్చిన తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన చేసిన ఫిర్యాదుపై అదే రోజున తుళ్లూరు పోలీసులు ఐపీసీ 294, 323, 427 రెడ్ విత్ 34 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. మళ్లీ అదే పనతల సురేష్ అదే ఘటనపై ఏడాదిన్నర తర్వాత ఈ నెల 25న ఫిర్యాదు చేయగా.., నందిగం సురేష్‌పై ఐపీసీ 341, 143, 147, 307, 427 రెడ్‌విత్ 149 సెక్షన్లతో మరోసారి కేసు నమోదు చేశారు. ఇలా ఒకే ఘటనపై రెండు కేసులు (ఎఫ్ఐఆర్లు) నమోదు చేయడం ఒక తప్పు అయితే.. ఏకంగా హత్యా నేరం సెక్షన్లు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపులకు నిదర్శనం. ఇప్పటికే తనకు ఏ మాత్రం సంబంధం లేని రెండు కేసుల్లో నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఓ పాత ఘటనలో మరోసారి కేసు పెట్టడమే కాకుండా, హత్యాయత్నం కేసు పెట్టడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల బలమైన ఆదేశాలే కారణమన్నది జగమెరిగిన సత్యం.రెజ్యూడికాటాను ఉల్లంఘించడమా..!వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపులకు ప్రభుత్వం, పోలీసులు రెజ్యూడికాటాను ఉల్లంఘించడంపై న్యాయ నిపుణులు సైతం విస్తుపోతున్నారు. సహజ న్యాయ సూత్రాల్లో రెజ్యూడికాటా (లాటిన్ పదం) గురించి స్పష్టంగా విశదీకరిస్తున్నారు. ఒకే ఘటన, ఒకే వ్యక్తి ఫిర్యాదుపై ఒకటికి మించి కేసులు నమోదు చేయకుండా నిలువరించడమే రెజ్యూడికాటా. ఇలాంటి కేసులు సహజన్యాయానికి కూడా విరుద్ధమని ఇది స్పష్టం చేస్తుంది. ఒకే వివాదం లేదా ఒకే ఘటనలో అదే పార్టీల మధ్య వ్యాజ్యాలను పదే పదే విచారించడం వల్ల న్యాయ వ్యవస్థ సమయం కూడా వృథా అవుతుందనే దీనిని పరిగణనలోకి తెచ్చారు. ఏదైనా కేసులో తుది తీర్పు వెలువడకుండా అదే కోర్టులో అదే కేసుపై మరో వివాదాన్ని లేవనెత్తితే దాని పునఃపరిశీలనను తిరస్కరించేందుకు న్యాయస్థానం సైతం దీన్ని ఉపయోగిస్తుంది. ఈ రెజ్యూడికాటా క్రిమినల్ చట్టంలో డబుల్ జియోపార్డీ, నాన్ బిస్ అనే భావనను పోలి ఉంటుంది. క్రిమినల్ ప్రాసిక్యూషన్‌లో ఒకే నేరానికి ఒకే విధమైన ప్రాసిక్యూషన్‌ను మాత్రమే ఉండేలా చేయడంతోపాటు రెండో విచారణకు సంబంధించిన చర్యలను నిరోధిస్తుందని న్యాయ నిపుణులు విశదీకరిస్తున్నారు. -
టీడీపీ నేతల వేధింపులతో ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
శ్రీకాళహస్తి/సాక్షి నెట్వర్క్: అధికారంలోకి వచ్చినప్పటినుంచి మహిళలు, ఉద్యోగినులపై కూటమి పక్షాల నేతల వేధింపులు, అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారి వేధింపులు భరించలేక కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా తమను ఉద్యోగాల నుంచి తొలగించడంతో తిరుపతి, కృష్ణాజిల్లాల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. తమ ఉద్యోగాలు తీయవద్దని వేడుకున్నా నేతలు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తీసేశారు.. నా ఉద్యోగం ఇప్పించమ్మా.. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం తాటిపర్తి పంచాయతీలో సంఘమిత్ర రేవతిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ బాధను తట్టుకోలేక రేవతి పురుగుమందు తాగింది. అంతకుముందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సతీమణి రిషితను ఉద్దేశించి మాట్లాడుతూ సెల్ఫీ వీడియో తీసింది. ఆ వీడియోలో.. ‘అమ్మా! రిషితమ్మా.. నేను 16 సంవత్సరాలుగా సంఘమిత్రగా పనిచేస్తున్నాను. దళితురాలైన నన్ను తొలగించారు. ఎలాగైనా నా జాబు నాకు వచ్చేట్లు చేయాలని అభ్యర్థిస్తున్నాను, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా..’ అంటూ సెల్ఫీ వీడియోను ఆపేసి పురుగుమందు తాగింది. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతిని సీఐటీయూ నాయకులు పరామర్శించారు.ఎస్టీ మహిళకు అన్యాయం కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో టీడీపీ నేతలు ఎస్టీ మహిళను ఉద్యోగం నుంచి తీయించేశారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించావంటూ వెలుగు పథకంలో బుక్‌కీపర్‌గా పనిచేస్తున్న గాయత్రిని తీవ్ర ఒత్తిళ్లకు గురిచేశారు. వారి సూచనతో వెలుగు అధికారులు శుక్రవారం గాయత్రిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో గాయత్రి ప్రాణాలు తీసుకోవాలని నిద్రమాత్రలు మింగింది. కుటుంబసభ్యులు ఆమెను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
టీడీపీ నేత రాసలీలలు.. వీడియో లీక్
సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా రాసలీలలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలో పేద మహిళలే టార్గెట్‌గా ఖాదర్ బాషా అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు.టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా అసలు స్వరూపం బట్టబయలైంది. పేద మహిళలను టార్గెట్ చేస్తూ ఖాదర్.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఖాదర్ బాషా లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి ఖాదర్.. ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలే బహిర్గతం చేసింది. దీంతో, అసలు విషయం బయటకు వచ్చింది.ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పచ్చ నేతలు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల సత్యవేడు, ఇప్పుడు రాయచోటిలో వెలుగు చూసిన ఘటనలే ఇందుకు నిదర్శనం. ఈ రెండు ఘటనల్లో బాధితులు ఎంతో ధైర్యం చేసి బయటకు రావడంతో పచ్చ నేతల బాగోతం బయటకు వచ్చింది. -
మొన్న అశ్లీల వీడియో.. నేడు అసభ్యకర ఆడియో!
సాక్షి టాస్‌్కఫోర్స్: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళపై లైంగిక వేధింపుల వీడియోల ఘటన మరువకముందే.. మరో మహిళతో అసభ్యకర సంభాషణలతో కూడిన ఆడియో క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 5న నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు తనను లైంగికంగా వేధించాడని, అందుకు సంబంధించిన వీడియోలతో హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే.ఆ ఘటనకు సంబంధించి హైకోర్టులో కేసు జరుగుతుండగానే సంబంధిత మహిళతో రాజీ చేసుకుని కోర్టులో కేసును ఉపసంహరించుకునేలా పావులు కదిపారు. కాగా, రెండు రోజులుగా ఎమ్మెల్యే ఆదిమూలం మరో మహిళతో కామాంధుడిలా మాట్లాడిన మాటలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే లైంగిక వేధింపుల ఘటన బయటకొచ్చిన రోజే టీడీపీ నుంచి ఆయనను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌ను త్వరలోనే పార్టీ అధిష్టానం ఎత్తేస్తుందని భావిస్తున్న తరుణంలో ఆడియో క్లిప్పులు బయటికి రావడంతో మరోమారు ఆదిమూలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్య
జగ్గయ్యపేట/జగ్గయ్యపేట అర్బన్: టీడీపీ నాయకుల బెదిరింపులను తాళలేక మనస్తాపానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. జగ్గయ్యపేటలోని నాగమయ్య బజారుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త గుగ్గిళ్ల శ్రీను (31) సమీపంలోని స్టీల్ ప్లాంట్‌లోని మినరల్ వాటర్ ప్లాంట్‌లో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పది రోజుల క్రితం టీడీపీ నేత వీర్ల వెంకన్న ఇంటివద్ద విద్యుత్ స్తంభం అడ్డుగా ఉండటంతో దానిని తొలగించి.. శ్రీను ఇంటి ఎదుట అధికారులకు తెలియకుండా రాత్రికి రాత్రే కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశాడు.తన ఇంటిముందు స్తంభం ఎందుకు పెట్టారని, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని, విద్యుత్ తీగలు కిటికీలకు తగిలితే ప్రమాదం జరుగుతుందని శ్రీను ప్రశి్నంచాడు. దీంతో శ్రీను, అతడి కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో శ్రీను ఆ సమస్యను విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అధికారుల నుంచి సమాధానం రాకపోగా.. వెంకన్నతో పాటు టీడీపీ నాయకులు షేక్ చాంద్సాహెబ్, మద్దం నరసింహారావు, నాగబాబు, సరస్వతి, రహంతుల్లా శ్రీను ఇంటికి వచ్చి మరోసారి బెదిరించి వెళ్లారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను ఈ నెల 11న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు అతడు పనిచేసే ప్లాంట్ వద్దకు వెళ్లి చూడగా ఉరి వేసుకుని మృతిచెంది ఉన్నాడు. ఎస్ఐ వెంకటేశ్వరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్నా) తదితరులు శ్రీను మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.టీడీపీ కౌన్సిలర్లు కావేటి కృష్ణ, గొట్టె నాగరాజు ప్రోద్బలంతోనే వీర్ల వెంకన్న, షేక్ చాంద్, మద్దం నరసింహారావు, నాగబాబు, షేక్ బబేబీ, బషీర్, రహీంతుల్లా, వీర్ల సరస్వతి కలిసి తన భర్తను మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకున్నారని శ్రీను భార్య గోవిందమ్మ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారని, నాకు దిక్కెవరంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గుగ్గిళ్ల శ్రీను కుటుంబ సభ్యులను ఆదివారం వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పరామర్శించారు. -
'అ చిత్రాలు చూడాలంటూ.. డైరెక్టర్‌పై నటి సంచలన ఆరోపణలు'!
హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది. సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటీమణులు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారు. ఇండస్ట్రీలో తమను ఇబ్బందులకు గురిచేసిన వారిపేర్లను బహిర్గతం చేశారు. ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ పలువురు స్టార్ డైరెక్టర్స్, నటులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రముఖ నటుడు జయసూర్య సహా ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా మలయాళ డైరెక్టర్‌పై మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది. దర్శకుడు బాలచంద్ర మీనన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ఫేస్బుక్ పోస్ట్‌లో తనకెదురైన కష్టాలను పంచుకుంది. 2007లో డైరెక్టర్ బాలచంద్ర తన గదిలో అశ్లీల చిత్రాలు చూడమని బలవంతం చేశాడని తెలిపింది. కొంతమంది పురుషులు, ముగ్గురు అమ్మాయిలు ఆ గదిలో ఉన్నారని.. తాను మాత్రం బయటికి వచ్చేశానని వెల్లడించింది. బాలచంద్రన్ నన్ను కూర్చొమని అడిగాడని మునీర్ వివరించింది.అయితే గతంలోనూ ఫేస్బుక్ ద్వారా మిను మునీర్ తనకెదురైన ఇబ్బందులను పంచుకుంది. 2013లో ఒక ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నప్పుడు తనను శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని తెలిపింది. దీంతో మలయాళ ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందని పేర్కొంది. చెన్నైకి మకాం మార్చానని వెల్లడించింది. -
తిరుపతి: ఉన్నతాధికారుల వేధింపులు.. సీఐ మిస్సింగ్!
తిరుపతి, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. ఉద్యోగులకు వేధింపులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంతోనే.. జిల్లాలో ఓ సీఐ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి కనిపించకుండా పోవడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నిరోజులుగా ఉన్నతాధికారుల నుంచి ఆయన వేధింపులు ఎదుర్కొంటున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి రాలేదని వాళ్లు అంటున్నారు. తన భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందని, ఆయనకు ఏమైనా జరిగితే అధికారులదే బాధ్యత అని మహేశ్వర్‌రెడ్డి భార్య అంటోంది. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తక ముందే.. ఆయన ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. -
కొండల్లోకి పారిపోయిన ‘గురుకుల’ విద్యార్థులు
నాదెండ్ల: గురుకుల పాఠశాలలో తమను వేధింపులకు గురిచేస్తున్నారని, సరైన ఆహారం అందించకుండా హింసిస్తూ తమతో బాత్రూమ్లు కడిగిస్తున్నారని.. అదేమని అడిగితే చావబాదుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు పాఠశాల గోడ దూకి సమీపంలోని కొండల్లోకి పారిపోయారు. సోమవారం జరిగిన ఈ సంఘటన పల్నాడు జిల్లాలో సంచలనం రేపింది. యడ్లపాడు మండలం వంకాయలపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6–10 తరగతుల్లో 450 మంది విద్యార్థులున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలో ప్రార్థన జరుగుతుండగా 67 మంది గోడ దూకి బయటకు వెళ్లారు.ఇది చూసి కొందరు ఉపాధ్యాయులు 30 మందిని వెనక్కి తేగా.. మరో 37 మంది సమీపంలోని కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీంతో చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు, ఎస్ఐ బాలకృష్ణ సిబ్బందితో కలిసి కొండల్లో విద్యార్థులను వెతికి పట్టుకున్నారు. పాఠశాలలో భోజనం బాగుండదని, తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేదని, మెనూ ప్రకారం వడ్డించరని తెలిపారు. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పాకెట్ మనీని ప్రిన్సి పాల్‌కు ఇస్తామని, సెలవుల్లో తాము ఇళ్లకు వెళ్లేట ప్పుడు అడిగినా ఆ డబ్బు ఇవ్వడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.పాఠశాల ప్రారంభంలో త మకు ఫ్రీ సీట్లు వచ్చినా ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ.4 వేలకు పైగా వసూలు చేశారని చె ప్పారు. పోలీసులు నచ్చజెప్పి తిరిగి పాఠశాలకు తీసుకెళ్లారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, గురుకుల పాఠశాల జిల్లా కో–ఆరి్డనేటర్ పద్మజ, తహసీల్దార్ జయశ్రీలు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులతో ఏకాంతంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపల్ కంచర్ల శిరీష్‌బాబు, ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు. జిల్లా కోఆరి్డనేటర్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య విభేదాలున్నాయని, దీంతో వారు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, వారి ప్రోద్బలంతోనే గోడదూకి పారిపోయారని తెలిపారు. -
అనంతపురం వైద్య కళాశాలలో వేధింపుల కలకలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం :వైద్య విద్యార్థులను వేధించారన్న వార్తలు అనంతపురం మెడికల్ కాలేజీలో కలకలం రేపుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ కాలేజీలోని మూడు విభాగాల్లోని కొందరు అధ్యాపకులు మెడికోలను వేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా.. గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ విభాగాలకు సంబంధించిన అధ్యాపకులు ఈ వేధింపులకు గురిచేసినట్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి.వాస్తవానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులు రాష్ట్రంలోని ఇతర కాలేజీలు, ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసుకుంటారు. ఇప్పుడు ఈ గ్రూపుల్లో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో వేధింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే వైద్యవిద్య పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని ఏకంగా జనరల్ సర్జరీ విభాగంలో లైంగిక వేధింపులు జరిగాయంటూ తన ఇన్‌స్ట్రాగాంలో వెల్లడించినట్లు మెడికోలు చెబుతున్నారు. ఈ అమ్మాయి చేసిన పోస్టే ఇప్పుడు కలకలం రేపుతోంది.పలు అనుమానాలకు తావిస్తున్న వైనం..ప్రస్తుతం అనంతపురం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థులు (నాలుగేళ్లకు కలిపి) 600 మంది, పీజీ వైద్య విద్యార్థులు 200 మంది ఉన్నారు. కాలేజీలో జరిగే వ్యవహారాలు బయటకు చెబితే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తారన్న భయంతో విద్యార్థినులు మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరుగుతున్న వేళ వేధింపుల కలకలం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తాం..మాకు కూడా ఈ విషయాలు వారం రోజుల కిందటే తెలిశాయి. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తున్నాం. – డాక్టర్ మాణిక్యాలరావు, ప్రిన్సిపాల్, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలవాళ్లనే అడగండి చెబుతారు..లైంగిక వేధింపుల విషయం నా దృష్టికి రాలేదు. కొంతమంది పాస్డ్‌ఔట్ విద్యార్థులు పోస్ట్ చేశారని మీరే అంటున్నారు. వాళ్లనే అడగండి.. వాళ్లే మీకు ఏం జరిగిందో చెబుతారు. – డాక్టర్ రామస్వామి నాయక్, హెచ్ఓడీ, జనరల్ సర్జరీ విభాగం, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల -
HYD: అనాథాశ్రమంలో బాలికలతో కేర్ టేకర్ అనుచిత ప్రవర్తన!
సాక్షి, రాజేంద్రనగర్: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనాథాశ్రమంలో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ.. బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేర్ టేకర్ చెప్పిన మాట వినకపోతే దుస్తులు లేకుండా అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట నిలబెట్టడం సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. అనాథలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఓ మహిళ రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని కిస్మత్ పూరలో 15ఏళ్ల క్రితం అనాథాశ్రమాన్ని ప్రారంభించారు.ఈ క్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు తొలుత తన తల్లిని కేర్ టేకర్‌గా నియమించారు. ఆమె వృద్ధురాలు కావడంతో రెండేళ్ల కిందట మరో మహిళ సునీతను ఆమె స్థానంలో కేర్ టేకర్‌గా నియమించారు. ప్రస్తుతం అనాథాశ్రమంలో 45 మంది బాలికలు ఉన్నారు. వారంతా 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నారు.అయితే, కొత్తగా చేరిన కేర్ టేకర్ సునీత.. బాలికలను చిత్రహింసలకు గురిచేయడంతో వారంతా ఆవేదన చెందారు. సునీత చెప్పిన మాటలు వినకపోతే బాలికలను దుస్తులు లేకుండా అందులో పనిచేసే వారి ఎదుట నిలబెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించింది. కాగా, ఈ అనాథాశ్రమానికి చెందిన 25 మంది బాలికలు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సునీత వేధింపులను వారంతా.. ప్రధానోపాధ్యాయురాలు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చలించిపోయిన ఆమె.. రాజేంద్రనగర్ పోలీసులతో పాటు షీ టీమ్స్‌కి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు కేసు నమోదు చేసి సునీతను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, సంస్థ వ్యవస్థాపకురాలితో అందులో పనిచేసే వారిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం! -
Jani Master: పక్కా స్కెచ్‌తో.. డోర్ వెనకాల దాక్కొని..!
సాక్షి, హైదరాబాద్/రాజేంద్రనగర్: తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌కు న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. జానీ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న బాధితురాలు (21) తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఈనెల 15న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి పరారీలో ఉన్న జానీని గురువారం గోవాలోని గ్రాండ్ లియోనీ రిసార్ట్‌లో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని కోర్టులో హాజరు పరిచారు. దీంతో జానీ మాస్టర్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నార్సింగి పోలీసులు న్యాయస్థానానికి సమరి్పంచిన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలను పొందుపరిచారు. చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై మక్కువ.. బాధితురాలికి చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే మక్కువ ఉండటంతో ఆమె తల్లిదండ్రులు నృత్య శిక్షణ ఇప్పించారు. తర్వాత వివిధ ప్రాంతాలలో స్టేజ్ షోలు ఇస్తుండేది. ఈ క్ర మంలో 2017లో పదో తరగతి చదువుతున్న క్రమంలో బాధితురాలికి ఢీ–11 డ్యాన్స్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో తల్లితో సహా కలసి తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చింది. ఈ షోకు న్యాయనిర్ణేతగా నిందితుడు జానీ మాస్టరే వ్యవహరించా డు. అనంతరం బాధితు రాలు ఢీ–12లోనూ పా ల్గొంది కానీ మధ్యలోనే ఆమెను తొలగించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జానీ మాస్టర్ బృందంలోని సభ్యురాలు దర్శిని బాధితురాలికి ఫో న్ చేసి మాస్టర్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తావా? అని అడిగింది. దీంతో ఒప్పుకున్న బాధితురాలు 2019 డిసెంబర్ 15న హైదరాబాద్‌కు వచ్చింది. అల వైకుంఠపురంతో కలిసి.. ‘అల వైకుంఠపురం’సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో తొలిసారిగా జానీ మాస్టర్‌తో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. అదే రోజు మాస్టర్ మేనేజర్ ఒకరు బాధితురాలికి ఫోన్ చేసి జానీ మాస్టర్, మరో ఇద్దరు అసిస్టెంట్లు రాహుల్, మోయిన్లతో కలిసి 2020 జనవరి 10న ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. ముంబైలోని ఓ హోటల్లో చెకిన్ అవుతున్న క్రమంలో జానీ తన ఆధార్ కార్డు, ఇతరత్రా డాక్యుమెంట్లను బాధితురాలికి ఇచ్చాడు. అదే రోజు రాత్రి 11–12 గంటల సమయంలో జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి ఉదయం తాను ఇచ్చిన ఆధార్, డాక్యుమెంట్లను తీసుకొని గదికి రావాలని ఆదేశించాడు. డోర్ వెనకాల దాక్కొని.. అప్పటికే జానీ మాస్టర్ గది తలుపులు తెరిచి, వెనకాల దాక్కొని ఉన్నాడు. బాధితురాలు గది లోపలికి వెళ్లగానే ఒక్కసారిగా తలుపులు మూసేసి, లాక్ వేసేశాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు తనను వదిలేయాలని ప్రాధేయపడుతూ తలుపులు తెరిచేందుకు ప్రయతి్నంచగా.. జానీ మాస్టర్ ఆమెను అడ్డుకొని, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే అసిస్టెంట్ జాబ్ నుంచి తీసేయడమే కాకుండా చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. బాధితురాలి నిస్సహాయతను ఆసరా చేసుకున్న జానీ మాస్టర్ షూటింగ్‌ల పేరు చెప్పి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి హోటల్ గదులు, వ్యానిటీ వ్యాన్లలో అత్యాచారానికి పాల్పడ్డాడు. జానీ మాస్టర్ వేధింపులు, ఆగడాలను తట్టుకోలేకపోయిన బాధితురాలు కొన్ని నెలల పాటు ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. కానీ, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఏమైనా పని ఉంటే అవకాశం ఇప్పించాలని నిందితుడు జానీ మాస్టర్‌ను సంప్రదించింది. తన లైంగిక వాంఛను తీర్చనన్నందుకు షూటింగ్ సమయంలో అందరి ముందు బాధితురాలిని అవమానపరిచేవాడు. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ..మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బాధితురాలిని బలవంతం పెట్టాడు. ఒక రోజు జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి షూటింగ్‌కు రావాలని సూచించాడు. దీంతో తన తల్లి ఇంట్లో లేదని, ఆరోగ్యం బాలేక ఇంట్లో ఉన్నానని తెలిపింది. దీన్ని ఆసరా చేసుకున్న నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జానీ తన భార్య సుమలత అలియాస్ ఆయేషాతో కలిసి బాధితురాలికి ఇంటికి వెళ్లి ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. చిత్ర పరిశ్రమలో జానీకి ఉన్న పరిచయాల కారణంగా బాధితురాలికి ఎక్కడా పని దొరకుండా ఇబ్బందులకు గురి చేశాడు.ఈ క్రమంలో బాధితురాలు ఇంట్లో లేని సమయం చూసి ఓ రోజు ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలితో ఉన్న శారీరక సంబంధం గురించి ఆమె తల్లికి వెల్లడించాడు. ఇక, చిట్టచివరికి బాధితురాలు జానీ అసిస్టెంట్ మోయిన్‌కు ఈ విషయాలు తెలిపింది. అతని సూచన మేరకు బాధితురాలు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ (టీఎఫ్‌టీడీడీఏ) సంఘం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జానీ వెంటనే సంఘం డ్రైవర్ రాజేశ్వర్ రెడ్డిని తీసుకొని గోవాకు పరారయ్యాడు. కాగా, కోర్టు వద్ద జానీ మాస్టర్ భార్యను ఈ విషయమై ప్రశ్నించగా అంతా కోర్టులో తేలుతుందని సమాధానం ఇచ్చారు. -
బయటకొస్తున్న జానీ అరాచకాలు.. భయపడుతున్న కొరియోగ్రాఫర్స్!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో ఆయన చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇప్పటికే జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అత్యాచారం కేసుతో పాటు పోక్సో కేసు నమోదైంది.తాజాగా కొరియోగ్రాఫర్ జానీకి సంబంధించిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. జనసేన పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న జానీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఏపీలో జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జానీ మరింత రెచ్చిపోయారు. తన తోటి కొరియోగ్రాఫర్లను తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: ముమ్మరంగా ఆపరేషన్ ‘జానీ’)సభ్యత్వం ఇవ్వకుండా వేధింపులు..జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జానీ మాస్టర్ దారుణాలకు అడ్డులేకుండా పోయింది. తెలుగు ఫిల్మ్, టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత తోటి కొరియోగ్రాఫర్స్‌ను వేధింపులకు గురి చేశారు. కార్యవర్గం నిర్ణయాలను సైతం లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహారించారు. అసోసియేషన్ ఆడిషన్స్‌లో సెలక్ట్ అయిన వారికి సభ్యత్వం ఇవ్వకుండా వేధించారు. దాదాపు 90 మంది కొరియోగ్రాఫర్స్‌ను సభ్యత్వం ఇవ్వకుండా జానీ మాస్టర్ వేధింపులకు గురిచేశారు. ఇండస్ట్రీలో అతనికి పలుకుబడి ఉండడంతో అరాచకాలపై మాట్లాడేందుకు కొరియోగ్రాఫర్స్ జంకుతున్నారు.గాలిస్తున్న పోలీసులు..యువతి ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం అతను జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు అతని కోసం లడఖ్ బయలుదేరి వెళ్లారు. త్వరలోనే జానీమాస్టర్ అరెస్ట్ అయ్యే అవకాశముంది. -
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రామనగర జిల్లా కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో అత్యాచారం ఘటన జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే మునిరత్న సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోద చేసినట్ల తెలిపారు. మునిరత్నం రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే.Karnataka | A rape, sexual harassment case has been filed against Rajarajeshwari Nagar BJP MLA Munirathna. The case was registered at Kaggalipura police station in Ramanagara district. As per the complaint, the incident took place at a private resort under Kaggalipura police…— ANI (@ANI) September 19, 2024ఇప్పటికే మునిరత్న ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో ప్రస్తుతం బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్‌పై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇవాళ( గురువారం) విచారణ చేపట్టనుంది.అయితే మునిరత్న జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే.. తాజాగా కేసులో ఆయన్ను జైలు దగ్గరే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ తిరస్కరణకు గురైతే కగ్గలిపుర పోలీసులు వారెంట్ దాఖలు చేసి ప్రొసీజర్ ప్రకారం అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) కాంట్రాక్టర్‌ను బెదిరించినందుకు మునిరత్నను బెంగళూరు పోలీసులు సెప్టెంబర్ 14 రాత్రి అదుపులోకి తీసుకున్నారు.చదవండి: Actor Darshan: కారాగారంలో 100 రోజులు -
బాలికల హాస్టల్లో కీచకపర్వం
ఏలూరు టౌన్: పేద బాలికల కోసం ఏర్పాటు చేసిన సేవాశ్రమంలో ఓ కామాంధుడు కొంతకాలంగా చెలరేగిపోతున్నాడు. వార్డెన్ భర్తగా ఎంటరైన సుమారు 55 ఏళ్ల వయసున్న ఆ కీచకుడు బాలికలను చెరబట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తన కోరికను కాదంటే బాలికలను దారుణంగా కొడతాడు. చాలా కాలంగా అతని దుర్మార్గాలను తట్టుకున్న ఆ బాలికలకు ఓపిక నశించింది. సేవాశ్రమంలోని వారంతా మంగళవారం సాయంత్రం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులను వేడుకున్నారు. ఆ కామాంధుడి లీలలు వెలుగులోకి రావడంతో ఏలూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ఘోరకలికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు అమీనాపేటలో శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం ఆధ్వర్యంలో బాలికల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్‌ను నిర్వహకులు సేవాభావంతో ఏర్పాటు చేయగా.. గత కొంతకాలంగా హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న మణిశ్రీ భర్త శశికుమార్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ అత్యంత దారుణంగా వేధిస్తున్నాడు. శశికుమార్ ఏలూరు ఎన్ఆర్పేటలో మణి ఫొటో స్టూడియో నడుపుతూ, మరోవైపు ఏలూరు జిల్లా యర్రగుంటపల్లి బీసీ హాస్టల్లో కూడా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉన్న తన పలుకుబడితో కొంతకాలం క్రితం తన రెండో భార్య మణిశ్రీని సేవాశ్రమంలో వార్డెన్‌గా చేర్చాడని సమాచారం. బాలికలపై లైంగిక దాడులుఆ బాలికల సేవాశ్రమంలో పేద వర్గాలకు చెందిన విద్యార్థినులు వసతి సదుపాయం పొందుతున్నారు. వీరు స్థానికంగా పలు పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. కామాంధుడైన శశికుమార్ ఆ బాలికలపై కన్నేసి సేవాశ్రమంలోకి వార్డెన్ భర్తగా ఎంటరయ్యాడు. పదుల సంఖ్యలో బాలికలను లైంగికంగా వేధించినట్టు బాధిత బాలికలు చెబుతున్నారు. ఆదివారం ఒక బాలికను బాపట్లకు ఫొటో షూట్ కోసమని తీసుకువెళ్లిన శశికుమార్.. సోమవారం రాత్రి తిరిగి తీసుకువచ్చాడు. రాత్రివేళ ఆ బాలిక తన దుస్తులను ఉతుక్కుంటూ ఏడుస్తూ ఉండగా సహచర బాలికలు ప్రశ్నించారు. జరిగిన దారుణాన్ని ఆమె చెప్పింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన శశికుమార్ జరిగిందంతా ఆ బాలిక సహచరులకు చెప్పిందనే అక్కసుతో అక్కడ ఉన్న బాలికలను అందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడు. రాత్రి బాలికల ఏడుపులు వినిపించాయని స్థానికులు కూడా చెప్పారు. శశికుమార్ దారుణాలను ఇక భరిస్తూ ఉండకూడదనే ఉద్దేశంతో బాలికలు మంగళవారం ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. బాధిత బాలికల బంధువులు, తల్లిదండ్రులు కూడా పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాలికలను భయపెట్టి నీరుగార్చే ప్రయత్నంసేవాశ్రమంలో జరిగిన దారుణాలపై పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తారా... అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసే ముందే బాలికలు మీడియాకు జరిగినదంతా వివరించారు. అయినా పోలీసులు మాత్రం బాలికలను భయపెట్టి ఈ దారుణ సంఘటనను నీరుగార్చే ప్రయత్నం చేసు్తన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.వార్డెన్ మణిశ్రీకి ఏలూరులోని ఓ ప్రజాప్రతినిధి వత్తాçÜు పలికినట్లు, అలాగే స్థానిక ఎంపీ కార్యాలయానికి చెందిన వ్యక్తులు సైతం రంగంలోకి దిగి పోలీస్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఫిర్యాదులో కేవలం వేధింపులకు గురిచేసినట్టుగానే బాలికలతో పోలీసులు రాయించినట్లు తెలుస్తోంది. ఏలూరు డీఎస్పీ దర్యాప్తుఏలూరు అమీనాపేటలోని బాలికల వసతి గృహంలో జరిగిన ఘటనపై ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ వెంటనే స్పందించారు. సేవాశ్రమం వద్దకు చేరుకుని ఆరా తీశారు. ఏలూరు మహిళా స్టేషన్ సీఐ ఎం. సుబ్బారావు, ఏలూరు టూటౌన్ సీఐ వైవీ రమణ, బాలల సంరక్షణ అధికారి సూర్యచక్రవేణి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏలూరు డీఎస్పీ మాట్లాడుతూ.. ముగ్గురు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. బాలికలపై లైంగిక దాడి జరిగినట్టు ఫిర్యాదు చేశారని, వీటిపై విచారణ చేస్తామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.ఫొటో షూట్లంటూ.. ఫొటో షూట్ల కోసమని శశికుమార్ ఒక్కొక్క బాలికను దూరప్రాంతాలకు తీసుకువెళతాడనీ, అక్కడ కాళ్లూచేతులూ కట్టేసి అఘాయిత్యానికి పాల్పడతాడని, కాదంటే ఇష్టారాజ్యంగా కొడతాడని బాధిత బాలికలు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి వాళ్ల దగ్గరకు మిమ్మల్ని పంపుతాను, రూమ్‌లు ఏర్పాటు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తాడని చెప్పుకొచ్చారు. బయటకు తీసుకెళ్లి టీ, కాఫీ ఇప్పించి సగం తాగిన అనంతరం కప్పు తీసుకుని తాగుతూ వక్రంగా మాట్లాడుతూ పైశాచికత్వాన్ని చూపిస్తాడని వివరించారు. ఇక స్థానికంగా ఇతర ప్రభుత్వ హాస్టళ్లకు వచ్చే బాలికలను ఈ సేవాశ్రమానికి పంపాలంటూ శశికుమార్ ఆయా హాస్టళ్ల వార్డెన్లను కోరతాడని, అతని కోరిక మేరకు ఆ హాస్టళ్ల వార్డెన్లు బాలికలను ఇక్కడకు పంపుతారని తెలిసింది. -
జానీ మాస్టర్ భార్య దాడి చేసింది
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. జానీ మాస్టర్, అతని భార్య ఇద్దరూ కలిసి ఒకరోజు తన ఇంటికి వచ్చి బలవంతంగా తలుపులు తెరవడంతో పాటు లోపలికి వచ్చి తనతో మతం ప్రస్తావన తీసుకొచ్చారని, నానా రకాలుగా ప్రశ్నించారని, ఈ క్రమంలో జానీ మాస్టర్ భార్య పలుమార్లు తనపై శారీరక దాడికి పాల్పడిందని బాధితురాలు ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు (21) చేసిన ఫిర్యాదు మేరకు ఈనెల 15న నార్సింగి పీఎస్‌లో ఐపీసీ 376 (2)(ఎన్), 506, 323 సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ హోటల్లో మొదలుపెట్టి.. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం..బాధితురాలు 2017లో తన స్వస్థలం నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ఢీ–12 డ్యాన్స్ షో చేస్తున్న క్రమంలో ఆమెకు జానీ మాస్టర్‌తో పరిచయం ఏర్పడింది. సహాయ కొరియోగ్రాఫర్‌గా పనిచేయడానికి జానీ మాస్టర్ బృందం నుంచి ఫోన్ కాల్ రావడంతో 2019లో ఆ బృందంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఈ క్రమంలో ముంబైలో ఒక ప్రాజెక్టు కోసం జానీ మాస్టర్, ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి ముంబైకు వెళ్లింది. అప్పుడు ఓ హోటల్లో జానీ మాస్టర్ ఆమెపై బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని బెదిరించాడు.దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఆపై ప్రతి షూట్ సమయంలోనూ జానీ మాస్టర్ ఆమెను వేధించేవాడు. ఆమె వ్యానిటీ వ్యాన్‌లోకి ప్రవేశించి లైంగిక వాంఛను తీర్చాలని బలవంతం చేసేవాడు. షూటింగ్ సెట్లలో ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఒకసారి తన కోరిక తీర్చనన్నందుకు జుట్టు పట్టుకొని ఆమె తలను వ్యానిటీ వ్యాన్‌లోని అద్దానికి గుద్దాడు. ఒకసారి షూటింగ్ ముగిశాక అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి స్కూటీని ధ్వంసం చేశాడు. మతం మారాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆగంతకుడి బెదిరింపులు.. అనుమానాస్పద పార్శిల్ వేధింపులు భరించలేక బాధితురాలు సొంతంగా ప నిచేసుకోవడం ప్రారంభించింది. కానీ చిత్ర పరిశ్ర మలో తనకున్న పరిచయాలను ఆధారంగా చేసు కుని జానీ మాస్టర్ ఆమెకు ఎలాంటి అవకాశాలు రాకుండా చేసేవాడు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాజెక్టుల కోసం ఆమెను ఎంపిక చేసుకుని, షూటింగ్ కొంత పూర్తయ్యాక మధ్యలో వదిలేసి వేరొకర్ని నియమించుకున్నాడు. గత నెల 17న గుడి నుంచి ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. 28న ఆమె ఇంటి తలుపులకు అనుమానాస్పద పార్శిల్ వేలాడదీసి ఉంది. అందులో ‘కంగ్రాచ్యులేషన్స్ ఫర్ సన్ .. బట్ బీ కేర్ ఫుల్..’అని రాసి ఉందని బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. -
థియేటర్లో అసభ్య ప్రవర్తన.. వెంటనే చేయి పట్టుకుని: హీరోయిన్
బాలీవుడ్ నటి ఇషా డియోల్ పరిచయం అక్కర్లేని పేరు. హేమమాలిని వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ టాప్ జోడీ ధర్మేంద్ర-హేమమాలినిల పెద్ద కూతురే ఇషా. కేవలం 21 ఏళ్ల వయసులోనే 'కోయి మేరే దిల్ సే పూచే' అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇషా.. గతంలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. పుణేలో తాను నటించిన దస్ మూవీ ప్రీమియర్ షోలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. అందరితో పాటు నేను కూడా ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లాను.. అదే సమయంలో ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడని ఇషా వెల్లడించింది. దీంతో వెంటనే అతన్ని చేయి పట్టుకుని లాగి అక్కడే చెంపదెబ్బ కొట్టానని.. ఇలాంటి వారిని అస్సలు ఉపేక్షించవద్దని ఆ సంఘటనను గుర్తు చేసుకుంది. నా చుట్టూ బౌన్సర్లు ఉన్నప్పటికీ ఇలా జరిగిందని పేర్కొంది. కాగా.. ఈషా చివరిసారిగా హంటర్ టూటేగా నహీ తోడేగా అనే షోలో కనిపించింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ హీరో హీరోయిన్ అనే చిత్రంలో కనిపించనుంది.భర్తతో విడాకులుకాగా.. హీరోయిన్ ఈషా డియోల్ కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకుంది. 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకున్న ఈమెకు రాధ్య, మిరాయ అని ఇద్దరు కూతుర్లున్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు ప్రకటించారు. -
ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో నాటకీయ పరిణామాలు
తిరుపతి,సాక్షి: సత్యవేడు టీడీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో హైడ్రామా నడుస్తోంది. మొక్కుబడిగా ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయగా.. విమర్శల నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. తాజా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఎమ్మెల్యే ఆదిమూలం చెన్నై నుంచి పుత్తూరులో తన నివాసానికి చేరుకున్నారు. అయితే.. ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఆయన కుటుంబ సభ్యుల్ని తప్ప ఎవరిని లోపలికి అనుమతించటం లేదు. మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. తిరుపతి మెటర్నరీ హాస్పిటల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఇంకా రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు. వైద్య పరీక్ష జరిగిన నేపధ్యంలో వచ్చే రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేను తిరుపతి ఈస్ట్ పోలీసులు విచారించే అవకాశం ఉంది. హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌లో..మరోవైపు.. బాధితురాలి ఆరోపణల మేరకు తిరుపతి భీమా ప్యారడైజ్‌లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూములు సీజ్, సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని అశ్లీల వీడియోను ఫారెన్సీక్ ల్యాబ్‌కు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకొని ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు.ఇరువైపులా మహిళా అడ్వొకేట్లేఎమ్మెల్యే ఆదిమూలం అత్యాచారం కేసుకు సంబంధించి తిరుపతి ఇంటెలిజెన్స్ డీఎస్పీ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. అయితే.. పోలీసులు నమోదు చేసిన కేసుపై ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్ ప్రస్తావించారు. ఆదిమూలం పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆదిమూలం తరపున అడ్వకేట్ శేషకుమారీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రభుత్వం తరపున న్యాయవాది ఏ వరలక్ష్మి వాదించనున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళా అడ్వకేట్ వాదనలు వినిపించనుండటం విశేషం.ఇదీ చదవండి: ఆదిమూలం రాసలీలలు.. ఫిర్యాదును లోకేష్ సైతం పట్టించుకోలేదా? -
ఫిర్యాదు చేయకపోతే ప్రయోజనం ఉండదు!
మలయాళ సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదిక తర్వాత పలువురు నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. తాము ఎదుర్కొన్న ఘటనలను మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) సమావేశంలో నటి రోహిణి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ– ‘‘లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం మంచిది. తమను వేధించినవారిపై ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు’’ అని పేర్కొన్నారు. -
రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ ఉండాలి!
మలయాళ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక సినిమా రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇతర భాషల్లోనూ హేమా తరహా కమిటీని ఏర్పాటు చేయాలని పలువురు నటీనటులు కోరుతున్నారు. వేధింపుల ఘటనలపై తాజాగా నటి, మాజీ ఎంపీ సుమలత స్పందిస్తూ– ‘‘చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపుల అనుభవాలను నాతో చాలామంది పంచుకున్నారు. సెట్స్‌లో చాలా మందికి భయానక అనుభవాలు ఎదురవుతున్నాయని విన్నాను. అవకాశాల కోసం వేధింపులు ఎదుర్కొన్నామని పలువురు మహిళలు నాతో చె΄్పారు. అయితే నాకు ఇలాంటి ఘటనలు ఎప్పుడూ ఎదురవలేదు. నేను చూడలేదు కాబట్టి వేధింపులు జరగలేదని కాదు. కేవలం సినిమా అనే కాదు.. రాజకీయ రంగంతోపాటు ప్రతి రంగంలోనూ ఇలాంటి పవర్ గ్రూపులు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. ఈ విషయాలను ధైర్యంగా బయటపెట్టిన మహిళలకు, అందుకు బాటలు వేసిన డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్)కి ధన్యవాదాలు. తమకు జరిగిన చేదు అనుభవాలను బయట పెడుతోన్న మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. సెట్స్‌లో మహిళలకు భద్రత కల్పించేలా నిబంధనలను తీసుకురావడం, అలాగే వాటిని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఒక పరిష్కారం. ఒకవేళ ఫిర్యాదు చేసినా యూనియన్లు, సినిమా పరిశ్రమలోని ఇతర విభాగాలు వినకపొవచ్చు. అందుకే సెన్సార్ బోర్డు ఉన్నట్లే మహిళలకు సంబంధించిన భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఉండాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను’’ అని పేర్కొన్నారు. -
ఆడిషన్ సమయంలో బలవంతం చేశాడు: బుల్లితెర నటి
హేమ కమిటీ నివేదిక బహిర్గతం అయ్యాక ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన నటీమణులు తాము ఎదుర్కొన్న చేదు సంఘటనలను బయటకు చెబుతున్నారు. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోన్న క్యాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉందంటూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరో బుల్లితెర నటి తనకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనను తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.తన కెరీర్ తొలినాళ్లలో ఓ హిందీ చిత్ర నిర్మాత వేధింపులకు గురి చేశాడని బుల్లితెర నటి శిల్పా షిండే ఆరోపించింది. ఆడిషన్ సమయంలో తనపై బలవంతం చేశాడని ఆమె పంచుకుంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చేదు సంఘటనను పంచుకుంది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. మహిళలపై లైంగిక వేధింపులు అన్ని రంగాల్లో జరుగుతున్నాయని నటి శిల్పా షిండే అన్నారు.శిల్పా షిండే మాట్లాడుతూ..' నేను 1998-99లో రోజుల్లో ఇండస్ట్రీలో కష్టపడుతున్నా. ఇప్పుడు నేను వారి పేర్లు చెప్పడం ఇష్టం లేదు. ఈ దుస్తులు ధరించండి. మీరు ఒక సీన్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. కానీ నేను అతను ఇచ్చిన దుస్తులు ధరించలేదు. అంతేకాదు.. ఆ సీన్లో అతనే నా బాస్ అని చెప్పాడు. అప్పుడే చాలా అమాయకురాలిని.. అందుకే ఆ సీన్‌కు ఒప్పుకున్నా. కానీ ఆ వ్యక్తి నా మీదికి వచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో నేను భయంతో అతన్ని పక్కకు తోసి బయటకు పరుగెత్తా. అక్కడే ఉన్న సెక్యూరిటీ స్టాఫ్ అంతా నన్ను చూశారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లమన్నారు' అని చెప్పుకొచ్చింది. కాగా.. భాబీజీ ఘర్ పర్ హైన్ అనే సిట్కామ్తో శిల్పా షిండే ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఖత్రోన్ కీ కిలాడీ రియాలిటీ షో సీజన్-14లో పాల్గొంటొంది. -
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆది మూలంపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలు వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు గురిచేస్తూ.. అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. భీమాస్ పారడైజ్ రూం నంబర్ 105,109లో తన ప్రమేయం లేకుండా లైంగికదాడి చేసినట్లు ఫిర్యాదులో బాధితులు తెలిపింది. భీమాస్ పారడైజ్ హోటల్లో సీసీ పుటేజీని పోలీసులు సేకరించారు.కోనేటి ఆదిమూలంపై అదే పార్టీకి చెందిన నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని.. ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే తాను ఆయన లీలలను పెన్ కెమెరాలో రికార్డు చేశానని చెప్పారు.తనవద్ద బలమైన సాక్ష్యాలున్నాయనే ఆయన తనకు అనేకమార్లు ఫోన్లుచేశారని.. రాత్రిపూట మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తున్నారని.. గురువారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇదే విషయమై పార్టీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ విషయాలన్నీ విధిలేని పరిస్థితుల్లో వెల్లడించాల్సి వస్తోందన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అదే పార్టీకి చెందిన నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని.. ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే తాను ఆయన లీలలను పెన్ కెమెరాలో రికార్డు చేశానని చెప్పారు.తనవద్ద బలమైన సాక్ష్యాలున్నాయనే ఆయన తనకు అనేకమార్లు ఫోన్లుచేశారని.. రాత్రిపూట మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తున్నారని.. గురువారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇదే విషయమై పార్టీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ విషయాలన్నీ విధిలేని పరిస్థితుల్లో వెల్లడించాల్సి వస్తోందన్నారు.వరలక్ష్మి ఇంకా ఏమన్నారంటే..ఇద్దరం ఒకే పార్టీకి చెందిన వారం కావడంతో పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరం పాల్గొనే వారం. కొద్దిరోజులకు నా ఫోన్ నెంబర్ తీసుకుని పదేపదే ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఎన్నికలు ముగిసే వరకూ నన్ను సోదరిగా సంభోదించారు. ఆ తర్వాత ఆయన తన నిజస్వరూపం బయటపెట్టారు. ఆయనతో సన్నిహితంగా ఉండాలంటూ బెదిరింపులకు దిగారు. తమ మాట వినకపోతే భర్త, ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని, పార్టీ పరంగా ఎలాంటి లబ్ధి చేకూరకుండా చేస్తాననే వారు.చివరకు.. మాట్లాడుకుని విషయం సెటిల్ చేసుకుందామంటూ నమ్మబలికిన ఆదిమూలం.. ఈ ఏడాది జూలై 6న తిరుపతి భీమాస్ ప్యారడైజ్ హోటల్‌కు పిలిపించాడు. అక్కడి రూమ్ నెం.109లో నాపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే కుటుంబంలో అందరినీ చంపేస్తానంటూ బెదిరించడంతో మిన్నకుండిపోయా. ఆయన అంతటితో ఆగకుండా వేళగాని వేళల్లో ఫోన్లు, సందేశాలతో వేధించేవారు. దీంతో.. అర్థరాత్రి సమయంలో ఎమ్మెల్యే నుంచి పదేపదే ఫోన్లు రావడాన్ని గమనించిన నా భర్త నన్ను ప్రశ్నించడంతో జరిగిందంతా ఆయనకు చెప్పేశాను. కామాంధుడైన ఎమ్మెల్యే ఆదిమూలానికి బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నాం. అదే నెల పదో తేదీన అదే హోటల్లో రూం నెం.105కి ఆయన మళ్లీ రమ్మనడంతో రహస్య కెమెరాలతో వెళ్లాను.ఆ రోజు ఎమ్మెల్యే నాపై మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ తతంగం మొత్తం రహస్య కెమెరాల్లో రికార్డు అయింది. మరోసారి అదే నెల 17న అదే హోటల్లో రూమ్ నెం.105కి రమ్మని మళ్లీ అత్యాచారం చేశాడు. నా వద్ద ఆయన ఆడియోలు, వీడియోలు ఉన్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిమూలం నాపై నిఘా ఉంచి, నా చుట్టూ ఆయన మనుషులను మోహరించాడు. మరోవైపు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళా నేతను లైంగికంగా వేధించిన దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా రావడంతో ఆయనను పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్ చేసింది. -
ఆదిమూలంపై కేసులేవీ?.. గుడ్లవల్లేరు కేసు పురోగతి ఏది?
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని.. కోనేటి ఆదిమూలం బాధితురాలు పక్క రాష్ట్రంలో మీడియా ముందుకు రావడమే అందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. ఒక ఆడపడుచును దారుణంగా వేధించిన ఆదిమూలంపై టీడీపీ ప్రభుత్వం కేసులు కూడా పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారాయన.ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో చర్యలతో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంది. ఈ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడితే న్యాయం జరగదని బాధిత మహిళ భావించింది. చివరకు.. పొరుగు రాష్ట్రానికి వెళ్లి మీడియా ముందుకు వచ్చింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు రక్షణ లేదు. మహిళలకు రక్షణ లేదు. ఇదీ చదవండి: అలా ఆదిమూలం వేధింపులు రికార్డ్ చేశా: బాధితురాలు.. అర్ధరాత్రి కూడా కాల్స్ చేస్తూ ఎమ్మెల్యే వేధించాడు. అలాంటి ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి వేతులు దులుపుకుంటారా?. అలాంటి వ్యక్తిపై లైంగిక దాడి కేసు ఎందుకు పెట్టలేదు?. హత్య చేయబోయాడని బాధితురాలు చెప్తుంటే హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదు?. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారు?. మీకు బాధ్యత లేదా?. ఆదిమూలంపై వెంటనే కేసులు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారాయన. అలాగే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కాలేజీలో లేడీస్ హాస్టల్లో రహస్య కెమెరాలు పెట్టిన ఘటన.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఆ కేసు ఏమైంది?. ఆ కేసు పురోగతిని ఎందుకు బయటకు రానివ్వడం లేదు శివశంకర్ నిలదీశారు. -
‘టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు.. పెన్ కెమెరాలో రికార్డ్ చేశా’
సాక్షి, చిత్తూరు: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించాడని.. ఎవరికైనా చెబితే అంతం చేస్తానంటూ బెదిరించాడంటూ బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డ్ చేశా. సాక్ష్యాలున్నాయనే ఎమ్మెల్యే వందసార్లు కాల్ చేశాడు. మెసేజ్‌లు చేసి బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే నీచ పనులకు తిరుపతి బీమా ప్యారడైజ్ హోటల్ అడ్డా. ఇలాంటి వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’’ బాధితురాలు డిమాండ్ చేసింది...ఒకే పార్టీకి చెందిన వాళ్లం కావడంతో పలు కార్యక్రమాల్లో ఆదిమూలం కలిసేవారు. అలా పరిచయమైన తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నామొబైల్‌కు పదేపదే కాల్స్ చేసేవాడు. తిరుపతిలోని భీమాస్ హోటల్లో నుంచి రూమ్ నెంబర్ 109లోకి రమ్మని చెప్పాడు. అక్కడ నన్ను బెదిరించి నా పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నాతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. అలా నాపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నాను. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడు..ఆదిమూలం గురించి అందరికీ తెలియాలి అనే పెన్ కెమెరా లో రికార్డు చేశాను. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేశాడు. రాత్రులు మెసేజ్‌లు పంపించి వేధించేవాడు. ఎంతోమంది అమ్మాయిలను టార్చర్ చేసేవాడు. ఆదిమూలం కామాంధుడు, రాక్షసుడు. అతని నుంచి సత్యవేడులోని పార్టీ మహిళా కార్యకర్తలను కాపాడాలి’’ అని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. -
ఆరోపణలు నిజమైతే ఐదేళ్లు బహిష్కరణ
నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిటీ ప్రభావం ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం చెన్నైలోని ఆ సంఘం నిర్వాహకుల సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. ఇందులో ముఖ్యంగా విశాఖ కమిటీ సూచనల మేరకు నటీమణుల రక్షణ కోసం ఎస్ఐఏఏ–జీఎస్ఐసీసీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగానూ, నటీమణులు సుహాసిని, ఖుష్బూ సభ్యులుగానూ వ్యవహరిస్తారు. ఈ కమిటీకి ఒక న్యాయవాదిని నియమించనున్నారు. నటీమణులపై లైంగిక వేధింపులు రుజువైతే అందుకు కారణమైన వారిని సినిమాల నుంచి 5 ఏళ్లు బహిష్కరించాలని నిర్మాతల మండలికి సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా బాధిత నటీమణులకు చట్టపరంగా సహాయాలను అందించడం జరుగుతుందన్నారు. అలాగే బాధితుల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశామనీ, తాజాగా ఈమెయిల్ ద్వారానూ ఫిర్యాదులు చేయవచ్చనీ తీర్మానం చేశారు. కాగా యూట్యూబ్ ఛానల్స్ కారణంగా బాధితులైనవారు సైబర్ ΄ోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ కమిటీ వారికి సహకరిస్తుందని, కమిటీ చర్యలను నటీనటుల సంఘం పర్యవేక్షిస్తుందని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ఉ΄ాద్యక్షుడు పూచి మురుగన్, కోశాధికారి కార్తీ ΄ాల్గొన్నారు. -
కన్నడ పరిశ్రమలోనూ హేమా తరహా కమిటీ కావాలి
‘‘మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కన్నడంలోనూ ఓ కమిటీ ఉండాలి. సుప్రీమ్ కోర్టు లేక హై కోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆ కమిటీని ఏర్పాటు చేయాలి’’ అంటూ కర్ణాటకకు చెందిన ‘ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ’ (ఫైర్) కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. కన్నడ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై నివేదిక తీసుకు రావాలని ‘ఫైర్’ సభ్యులు కోరారు. బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు తమ డిమాండ్లను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రంలో పలువురు నటీనటులు, రచయితలు.... ఇలా మొత్తం 153 మంది సంతకం చేశారు. వీరిలో నటుడు కిచ్చా సుదీప్, నటీమణులు రమ్య, ఆషికా రంగనాథ్, శ్రద్ధా శ్రీనాథ్, ‘ఫైర్’ అధ్యక్షురాలు, దర్శకురాలు, రచయిత కవితా లంకేశ్ వంటివారు ఉన్నారు. ‘‘కేఎఫ్ఐ’ (కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ)లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై సమగ్ర విచారణ జర΄ాలి. కర్ణాటక పరిశ్రమలో పని చేస్తున్న మహిళలకు సురక్షితమైన, సమానమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, వారిపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడానికి సమగ్రమైన చర్యలు చేపట్టాలి’’ అని ఆ వినతి పత్రంలో ‘ఫైర్’ పేర్కొంది. కాగా ‘మీటూ’ ఉద్యమం ఊపందుకున్న సమయంలో 2018లో ‘ఫైర్’ సంస్థ ఆరంభమైంది. దేశంలోనే మొట్టమొదట ‘ఐసీసీ’ (పరిశ్రమలో జరుగుతున్న అంతర్గత ఫిర్యాదుల కమిటీ)ని స్థాపించడంలో ‘ఫైర్’ కీలక ΄ాత్ర ΄ోషించింది. లైంగిక వేధింపులకు గురైనవారికి న్యాయ సహాయం అందించడానికి ‘ఫైర్’ కృషి చేస్తూ వస్తోంది. అందరం మాట్లాడుకుంటున్నాము కానీ... – సమంతమలయాళ చిత్ర పరిశ్రమలోని జస్టిస్ హేమా కమిటీ తరహాలో తెలుగులోనూ ఓ కమిటీ రావాలని, తెలుగు ఇండస్ట్రీలో మహిళల కోసం ఏర్పాటు చేయబడిన 2019 సబ్ కమిటీ నివేదికను బయట పెట్టాలని సమంత ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. తాజాగా సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన మరో ΄ోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘ఆగస్టు నెల గడిచి΄ోయింది. 2012లో జరిగిన హత్యాచార ఘటన తరహాలోనే ఇటీవల కోల్‌కతాలోనూ జరిగింది... ఘటనలు జరుగుతున్నాయి. వీటి గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం. ఈ ఘటనల హైప్ మెల్లిగా తగ్గి΄ోతుంది. మనం కూడా మన పనులతో ముందుకెళ్తుంటాం. మళ్లీ ఘటన జరుగుతుంది’’ అంటూ సమంత ఆ ΄ోస్ట్‌లో షేర్ చేశారు. ఇదిలా ఉంటే... తాను గాయపడ్డ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఇన్‌స్టాలో మరో ΄ోస్ట్ షేర్ చేశారు. ‘‘గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ కాలేనా?’’ అంటూ సమంత ఆ ΄ోస్ట్‌లో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఆమె ఏదో సినిమా సెట్లో గాయపడి ఉంటారని ఊహించవచ్చు. -
మన సమస్యకు మనమే పరిష్కర్తలం!
అరుదుగానైనా సరే, తలలు కూలుతున్న శబ్దం మధురంగా వినిపిస్తుంది. మలయాళ చలనచిత్ర పరిశ్రమలో మహిళలపై ప్రబలంగా జరుగుతున్న లైంగిక, ఇతర వేధింపులపై సంచలన నివేదిక విస్ఫోటనం తర్వాత మొదటి వేటు నటుడు సిద్ధిక్, నిర్మాత రంజిత్‌లపై పడింది. సిద్ధిక్‌పై లైంగికదాడి అభియోగాలు మోపారు. ఇకపోతే సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ అరెస్టు నుండి తప్పించుకోవడానికి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.కొందరు దీనిని మలయాళ చిత్రపరిశ్రమలో ‘మీ టూ’ ఉద్యమంగా అభి వర్ణిస్తున్నారు. కచ్చితంగా, మాలీవుడ్‌లో మహిళల పని పరిస్థితులపై జస్టిస్ కె.హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత నెలకొన్న సంఘటనలు పరిశ్రమ నియంత్రణను దాటిపోయాయి. 2019 డిసెంబరు నుండి నివేదికను తొక్కిపట్టి ఉంచిన పినరయి విజయన్ ప్రభుత్వం కూడా ఈ నివేదిక పేర్కొన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని ప్రకటించింది.కోల్‌కతాలో ట్రెయినీ డాక్టర్ ఘోర హత్యాచారంపై చెలరేగుతున్న ఆగ్రహ జ్వాలలకు ప్రతిస్పందనగా కొచ్చిలో రణగొణధ్వనులు వినిపిస్తున్నప్పుడు మనం ఒక పెను మార్పు మలుపులో ఉన్నాము. బద్లాపూర్(మహారాష్ట్ర)లో ప్రజల ఆగ్రహం బాంబే హైకోర్టు విచారణకు దారితీసినప్పుడు, అబ్బాయిల లింగపరమైన సున్నితత్వంతో సహా కొన్ని సూచనలు చేయమని హైకోర్టు ఒక కమిటీని కోరింది.ఇదంతా స్వాగతించదగినదే. అయితే ఇదంతా మనం ఇంతకు ముందే విన్నాం. 2018లో, భారత దేశంలో మీ టూ ఉద్యమం సమయంలో, లైంగిక దాడి ఆరోపణలు తగ్గుముఖం పట్టడంతో మనం ఒక అవకాశాన్ని కోల్పోయాము అని ఉద్యమకారులు అంటారు. ఎందుకంటే ఆరోపణలకు సంబంధించి పెద్ద్ద పేర్లు ఎన్నడూ బయటపడలేదు. దానికి తోడుగా,లైంగిక దాడి గురించి మాట్లాడిన వారిపై క్రిమినల్ పరువు నష్టం దావాలు తీవ్ర ప్రభావం చూపాయి.2013లో, మగవారి మనస్తత్వాలను మార్చే పనిపై గట్టిగా కృషి చేయకుండా, కఠినమైన చట్టాన్ని ఆమోదించడం ఒక్కటే సమస్యను పరిష్కరిస్తుందని భావించిన ప్పుడు మనం మళ్లీ పోరాటాన్ని కోల్పోయాము. ఇప్పుడు మనకు మరో అవకాశం వచ్చింది. కానీ తరువాత ఏమి జరుగుతుందనేది ‘మన’పైనే ఆధార పడి ఉంటుంది. లైంగిక ఆరోపణలకు గురైన వారి సినిమాలను ప్రేక్షకుల్లోని ‘మన’వారే విమర్శనారహి తంగా ఆబగా చూస్తున్నారు. నిశ్శబ్దాన్ని బద్దలుగొట్టి నోరెత్తే వారిని ట్రోల్ చేసి బెదిరించేవారు కూడా సోషల్ మీడియాలోని ’మన’వారే. శక్తిమంతులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసే మహిళలను చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలో ఉన్న ‘మన’వారు కష్టపెడుతున్నారు. చలనచిత్ర విడుదలకు సంబంధించి సమయానుకూలంగా పీఆర్–ఆధారిత సమాచారాన్ని అందజేసే మీడియాలోని ‘మన’వారు జర్నలిజానికి సంబంధించిన క్లిష్టమైన ప్రశ్నలు వేటినీ అడగరు.మాట్లాడేవారు ఒంటరిగా లేరని తెలిసేలా, నిజం చెప్పే భారం మహిళలపై మాత్రమే పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ‘మన’పైనే ఉంది. అలాగే మహిళ లను లైంగికంగా వేటాడేవారిని జాతీయ చర్చల నుండి, బాక్సాఫీస్ నుండి, సాహిత్య వేడుకల నుండి మాత్రమే కాకుండా మన డ్రాయింగ్ రూముల్లో చర్చల నుండి కూడా దూరంగా ఉంచాలి. కోల్‌కతాలోని వైద్యులకు ఆగ్రహించే హక్కు ఉంది. అయితే నిరసనలు రాజకీయ రంగు పులు ముకున్నాయి. లైంగికదాడి చేసిన వారిని నెలాఖరులోగా ఉరిశిక్ష విధించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేసిన ప్రకటనలు పరిష్కా రాన్ని కనుగొనే లక్ష్యంతో కాకుండా, ప్రజల ఆగ్రహాన్ని చల్లబర్చడం కోసమే చేసినట్లున్నాయి.తెగులు లేదా కుళ్లు అనేది వ్యవస్థాగతంగా ఉన్నప్పుడు, దానికి పరిష్కారం అనేది ‘ఇక్కడో రాజీనామా’, ‘అక్కడో కమిటీ ఏర్పాటు’ వంటి రూపాల్లో పాక్షికంగా, అవ్యవస్థీకృతంగా ఉండకూడదు. లైంగిక వేధింపులకు మనం ప్రత్యేకమైన, భిన్నమైన నేరాలుగా ప్రతిస్పందించడం మానేయాలి. మహిళలకు వ్యతిరేకంగా అసమానమైన శక్తి కొనసాగిస్తున్న విస్తృత దాడుల్లో భాగంగా వీటిని చూడాలి.మనకు అసమానతలపై పోరాడే ఉద్యమం అవసరం: బహిరంగ ప్రదేశాల్లో, పార్లమెంటులో, పోలీసు స్టేషన్లలో, పని ప్రదేశాల్లో, న్యాయవ్యవస్థలో ఎక్కువ మంది మహిళలు భాగం కావలసి ఉంది. సోదరీమణులు, కుమార్తెలుగా మాత్రమే ఉండిపోకుండా, మనం సమాన పౌరులం అనే ఆలోచనను సాధారణీకరించాల్సి ఉంది. మనకు ప్రస్తుతం ఒక అవకాశం ఉంది. దానిని స్వాధీనం చేసుకోవడం మనపైనే ఉంది. వ్యాసకర్త జెండర్ అంశాల రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
చట్టాలు చేస్తే చాలా?
దేశాన్ని కదిలించిన ‘అభయ’ ఉదంతం దెబ్బతో బెంగాల్ కొత్త కఠిన చట్టంతో ముందుకొచ్చింది. అత్యాచార దోషులకు ఏకంగా మరణశిక్ష వేయాలంటూ మమతా బెనర్జీ సర్కార్ అత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత’ను తీసుకొచ్చింది. కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ మహిళా డాక్టర్ ఒకరిని గత నెలలో దారుణంగా రేప్ చేసి, చంపేసిన ఘటనతో రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమైన బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది. దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వరమే న్యాయాన్ని అందించి, దోషులకు కఠిన శిక్షలు విధించడానికే ఈ కొత్త బిల్లు తెచ్చామని సర్కార్ చెబుతోంది. బాధిత మహిళల బిల్లు గనక ప్రతిపక్షాలన్నీ కాదనే ధైర్యం చేయలేక తలూపుతూనే, మమత రాజీనామా డిమాండ్‌ను విడవకుండా వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఆమోదం పొందితే కానీ బిల్లు చట్టం కాదు గనక, బాధ్యత కేంద్రం మీదకు నెట్టేసి రాజకీయంగా మార్కులు సంపాదించే పనిలో మమత ముందడుగు వేస్తున్నారు. అత్యాచారాలు, లైంగిక నేరాల నుంచి మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పించే విధంగా చేపట్టిన ‘అపరాజిత మహిళా, శిశు రక్షణ బిల్లు–2024’లో మమత సర్కార్ పలు కొత్త అంశాలను పొందుపరిచింది. 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసేందుకు వీలుగా అపరాజిత టాస్క్‌ఫోర్స్ పేరిట ప్రత్యేక పోలీసు బలగాన్ని ఏర్పాటు చేస్తుందీ బిల్లు. కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త న్యాయచట్టాలు భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), అలాగే పోక్సో చట్టంలోని అంశాలను మించినవి కొన్ని ‘అపరాజిత’లో ఉన్నాయి. పోక్సో కింద 3 నుంచి 5 ఏళ్ళ జైలుశిక్ష, జరిమానా విధించేందుకే వీలుండగా, ఈ సరికొత్త బెంగాల్ అత్యాచార నిరోధక బిల్లు కింద 7 నుంచి పదేళ్ళ శిక్ష తప్పదు. పోక్సో కింద బాధిత చిన్నారి సాక్ష్యాన్ని 30 రోజులలోగా రికార్డ్ చేసి, ఏడాది లోగా విచారణ పూర్తి చేయవచ్చు. అపరాజిత మాత్రం వారం రోజుల్లోనే సాక్ష్యం రికార్డు చేయడం, నెల రోజుల్లో ప్రత్యేక కోర్ట్ విచారణ పూర్తి తప్పనిసరి చేసింది. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించేందుకు ఈ బిల్లు ఉపయుక్తమే. అలాగే, అత్యాచార దోషులకు పెరోల్ సైతం లేని యావజ్జీవ కారాగారవాస శిక్ష తప్పదు. రేప్, లేదా గ్యాంగ్‌రేప్ ద్వారా బాధితుల మరణానికో, జీవచ్ఛవంగా మారడానికో కారణమైన దోషులకు ఉరిశిక్ష విధింపు కూడా కోపోద్రిక్త ప్రజానీకానికి కొంత ఊరట. అలా బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్లకు మించి కఠినంగా ఈ కొత్త బిల్లును తీర్చిదిద్దడం నేరగాళ్ళకు సింహస్వప్నమే. అందుకే, అపరాజిత బిల్లును కనీవినీ ఎరుగని ప్రయత్నంగా పేర్కొంటూ, ‘‘దేశానికి మార్గదర్శి బెంగాల్’’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్ అవుతోంది. మహిళలపై నేరాలను ఏ మాత్రం సహించని వ్యక్తిగా, నాయకురాలిగా దీదీని చూపించే ప్రయత్నమూ జరుగుతోంది. కానీ, అదే సమయంలో దిగజారు తున్న ప్రతిష్ఠను నిలబెట్టుకొనేందుకే ఆమె ఈ బిల్లు తెచ్చారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అభిప్రా యాలు, అనివార్యతలు ఏమైనా... స్త్రీలు, పిల్లల రక్షణకంటూ చేసే ఏ సర్కారీ కొత్త ప్రయత్నాన్ని తీసిపారేయాల్సిన పని లేదు. ప్రతి చర్యనూ స్వాగతించాల్సిందే. నిజానికి, మహిళల రక్షణ నిమిత్తం 2019లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రాత్మకమైన ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. 2020లో మహారాష్ట్ర సైతం అత్యాచార బాధిత స్త్రీల పక్షాన నిలుస్తూ, దోషులకు కఠినశిక్షలతో ‘శక్తి’ బిల్లు పాస్ చేసింది. శాంతిభద్రతలే కాదు... సాధారణ ప్రజాపరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే గనక స్థానికంగా ఇలాంటి కట్టుదిట్టమైన శాసన నిర్మాణాన్ని తప్పు పట్టలేం. కానీ, ఈ చట్టాలన్నీ గవర్నర్ వద్దో, లేదంటే ఆపైన రాష్ట్రపతి వద్దో ఆఖరి ఆమోదముద్ర కోసం నేటికీ ఎదురుచూస్తూనే ఉండడం విషాదం. తాజా అపరాజితకూ ఆ గతి తప్పకపోవచ్చు. రాష్ట్రస్థాయిలో చేస్తున్న ఈ తరహా చట్టాలకు ఆమోదం తెలపడానికి ఢిల్లీ గద్దె మీది పెద్దలకు అభ్యంతరం ఎందుకో అర్థం కాదు. మహిళా పరిరక్షకులమనే ఘనత తమకే దక్కాలన్న రాజకీయాలే తప్ప, ఇతరేతర కారణాలూ కనబడడం లేదు. దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహిళా రెజ్లర్లు సైతం తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వీధికెక్కి పోరాడినా, చీమ కుట్టినట్టయినా లేని పాలకుల నుంచి ఇంకేం ఆశించగలం? ఆ మాటకొస్తే స్త్రీలకు అండగా తామున్నామని ఢిల్లీ పెద్దలు ఆచరణలో నమ్మకం కలిగించలేకపోవడం కూడా రాష్ట్రాల్లో కొత్త చట్టాలకు కారణమని విస్మరించలేం. కఠిన చట్టాలు చేయడం మంచిదే కానీ, కేవలం చట్టాల రూపకల్పనతో లక్ష్యం నెరవేరుతుందా అన్నది బేతాళప్రశ్న. కొన్ని లోటుపాట్లున్నా పాత చట్టాల మొదలు పుష్కరకాలం క్రితపు ‘నిర్భయ’ చట్టం దాకా మన దగ్గర చట్టాలకు కొదవ లేదు. అమలులో చిత్తశుద్ధి లోపమే సమస్య. అపరిచితు లొచ్చి అత్యాచారం జరిపేలా అభద్ర వాతావరణం, అసమర్థ గస్తీ, అధ్వాన్న దర్యాప్తు నెలకొన్నాయంటే ఆ తప్పు పాలకులదేగా! అదే సమయంలో సామాజికంగా, సాంస్కృతికంగా మనుషుల మానసిక కాలుష్యానికి కారణమై, నేరాలకు ప్రేరేపిస్తున్న అంశాలను అరికట్టేందుకు నిజాయతీగా మనందరం చేస్తున్నదేమిటో ఆలోచించుకోవాలి. ఆత్మపరిశీలనా చేసుకోవాలి. ప్రతిపక్ష పాలిత కోల్ కతాలో ‘అభయ’ జరిగిందని బీజేపీ, అధికార బీజేపీ పాలిత హాథ్రస్, ఉన్నావ్‌లలో జరిగిందేమిటని విపక్షాలు పరస్పర దూషణలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రాజకీయంగా పైచేయికై పోరాడే కన్నా సురక్షితమైన పాఠశాలలు, పనిప్రదేశాలు, సత్వరం స్పందించే రక్షక వ్యవస్థ లాంటి ప్రాథమిక అంశాలపై దృష్టి పెడితే అందరికీ మంచిది. అది లేకపోవడమే అసలు సమస్య. -
‘ఆసిఫాబాద్ ఆదివాసీ మహిళ ఘటన’.. బండి సంజయ్ సీరియస్
సాక్షి, జైనూరు: తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఒంటరిగా తన ఊరికి వెళ్తున్న ఆదివాసీ మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్యాయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీకి ఫోన్ చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం దేవుగూడ గ్రామం ఉంది. దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ.. తన సోదరులను కలిసేందుకు నెల 31న సిర్పూర్(యు) మండలంలోని కోహినూర్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. జైనూర్‌లో ఆటో కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం.. ఆమెను నమ్మించి తాను కోహినూరు వెళ్తున్నట్టు చెప్పి ఆటో ఎక్కించాడు. ఈక్రమంలో షేక్ ముగ్దూం రాఘాపూర్ దాటగానే ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతూ లైంగికదాడికి యత్నించాడు.దీంతో, భయపడిన ఆమె కేకలు వేసింది. అనంతరం, షేక్ మగ్దూం.. ఆమెను బెదిరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సమయంలో ఆమె ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో ఆమెను అక్కడే వదిలేసి ఆటో డ్రైవర్ పారిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు ఆమెను గుర్తించి.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆదిలాబాద్ రిమ్స్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.అయితే, ఆమె స్పృహాలో లేకపోవడంతో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని బాధితురాలి తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు తాజాగా స్పృహలోకి రావడంతో అసలు విషయం బయట పడింది. తనపై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడి చేయడానికి యత్నించాడని, తాను ఎదురు తిరిగితే.. తన ముఖంపై ఇనుపరాడుతో బలంగా కొట్టాడని వివరించింది. దీంతో, పోలీసులు.. నిందితుడిపై లైంగికదాడి, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. -
నిజం గెలుస్తుంది: జయసూర్య
మలయాళ నటుడు జయసూర్యపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆయనపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఆగస్టు 31న జయసూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ఓ నోట్‌ను రిలీజ్ చేశారు జయసూర్య. ‘‘నాపై ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. మనస్సాక్షి లేనివారికి తప్పుడు ఆరోపణలు చేయడం సులభం.చేయని వేధింపులను చేశానని చెప్పడం, ఆ ఆరోపణలు మోయడం కూడా ఓ వేధింపులాంటిదే. నిజం కన్నా అబద్ధం వేగంగా ప్రయాణం చేస్తుందంటారు. అయినా నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. నిజం గెలుస్తుంది. ఇక నా వ్యక్తిగతమైన కారణాల దృష్ట్యా ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నాను. నా పనులు పూర్తి కాగానే కేరళకు వస్తాను’’ అని ఆ నోట్లో పేర్కొన్నారు జయసూర్య. దీంతో జయసూర్యపై ఫిర్యాదు చేసిన నటి సోనియా మల్హర్ మరోసారి స్పందించారు. ‘‘నావి తప్పుడు ఆరోపణలని ఆయన (జయసూర్యను ఉద్దేశించి) అంటున్నారు. కానీ నా మాటల్లో నిజం ఉంది. ఆయనపై కామెంట్స్ చేయడానికి నేను లంచం తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. హేమా కమిటీ రిపోర్ట్ వైరల్ అయిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చి, హీరో పేరును బయటపెట్టాను. న్యాయపోరాటం విషయంలో వెనక్కి తగ్గను’’ అని సోనియా మల్హర్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. -
డైట్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు
సాక్షి, అనకాపల్లి : అధికార పార్టీకి సంబంధించినవైతే చాలు పోలీసులు ఎలాంటి ఘోరాలు, నేరాలు అయినా నోరు మెదపడంలేదు. టీడీపీ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ అనకాపల్లిలో నడుపుతున్న దాడి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డైట్) అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆగడాలే ఇందుకు ఉదాహరణ. మెంటార్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ మురళి తనను వేధిస్తున్నాడని ఇంజినీరింగ్ సెకండియర్ విద్యార్థిని చాలాకాలంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎట్టకేలకు అరెస్టుచేసి శుక్రవారం రిమాండ్‌కు పంపారు. కానీ, ఈ విషయాన్ని అనకాపల్లి టౌన్ పోలీసులు చాలా గోప్యత పాటిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మెంటార్ మురళి ఏడాది కాలంగా వేధిస్తున్నాడని బాధితురాలు పేర్కొంటోంది. ప్రతిరోజు రాత్రులు తనకు ఫోన్‌చేసి మాట్లాడాలని, వాట్సాప్ మెసేజ్‌లు చేయాలని, కళాశాలకు వచ్చినప్పుడు తనను కలవాలని, హగ్ చేసుకోవాలని రకరకాలుగా వేధిస్తుండటంతో ఆమె నరకం అనుభవిస్తోంది. అతని వేధింపులు భరించలేక తన స్నేహితుడికి సమస్యలు వివరించడంతో.. ఇటీవల ఆ యువకుడు మురళిని ప్రశ్నించగా ‘నీకేందుకురా పో’.. అంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ దురుసుగా ప్రవర్తించాడు. మీ ఇద్దరి మధ్య వేరే సంబంధం ఉందని మీ తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించాడు. అధ్యాపకుడి ఫోన్‌కాల్ రికార్డింగ్ ఆధారంగా కళాశాలలో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో బాధిత విద్యార్థిని జిల్లా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సైతం ఈ విషయాలను రహస్యంగా ఉంచడం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు.. తమ కుమార్తెపట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడ్ని 14రోజులపాటు రిమాండ్ విధించినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ, ఈ విషయం సీఐ వెల్లడించకపోవడం గమనార్హం. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ మురళి గతంలో చాలామందిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, కళాశాలలో మెంటర్ కావడంతో విద్యార్థులు మౌనంగా భరిస్తున్నారని ఇతర విద్యార్థులు చెబుతున్నారు. -
సీన్‌కి అనవసరమైనప్పటికీ నన్ను తాకాడు: మలయాళ నటి మాలా పార్వతి
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమా కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు మలయాళ సినీ ప్రముఖులపై కేసులు నమోదు అయ్యాయి. అలాగే పలువురు నటీమణులు తమకు ఎదురైన ఇబ్బందుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. తాజాగా మలయాళ నటి మాలా పార్వతి స్పందించారు. ‘‘2010లో నేనొక సినిమా చేశాను. సినిమాలో నా కూతురు న్యాన్సీ (నిత్యామీనన్) నా చుట్టూ తిరుగుతూ సరదాగా ఆడుకునే సీన్ అది. ఆ సమయంలో నా భర్త పాత్రధారి న్యాన్సీని ఆ΄్యాయంగా టచ్ చేయాలి. అయితే ఆ వ్యక్తి ఓ చేత్తో న్యాన్సీని టచ్ చేసి, మరో చేత్తో అన వసరం అయినప్పటికీ నన్ను బలంగా తాకాడు. నాకు నొప్పిగా అనిపించింది.ఆ తర్వాత దర్శకుడు శిబీ మలైయిల్ టచ్ లేకుండా ఈ సీన్‌ని రీ టేక్ చేశారు. కానీ అదే వ్యక్తితో ఒకరి పక్కన మరొకరు కూర్చోవడం, హత్తుకోవడం వంటి సన్నివేశాలు ఉన్నాయి. చె΄్పాలంటే నాకు ఆ సినిమా ఓ టార్చర్లా అనిపించింది. నాకు కంఫర్ట్‌గా అనిపించక΄ోవడంతో ఆ సినిమాలో నేను సరిగ్గా నటించలేకపోయాను కూడా. మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడ్డాను’’ అని ఓ ఆంగ్ల మీడియాతో మాలా పార్వతి చె΄్పారు. అలాగే ఆమె జీవితంలోని మరో ఘటనను కూడా పంచుకున్నారు. ఆ ఘటన గురించి మాట్లాడుతూ– ‘‘2019లో ‘హ్యాపీ సర్దార్’ అనే సినిమా చేశాను. నా కోసం నేను నా ఖర్చుతో క్యారవేన్ పెట్టుకున్నాను. అయితే క్యారవేన్కు నేనెలా అర్హురాలినంటూ ఓ సీనియర్ నటుడు నన్ను ప్రశ్నించాడు. నా సొంత ఖర్చులతో నేను పెట్టుకున్నానని చెప్పినా అతని వైఖరి మారలేదు. నా క్యారవేన్ను కొందరు నటీమణులు కూడా వినియోగించుకున్నారు. అయితే ఓ రోజు నా క్యారవేన్ దగ్గర రాత్రివేళ అనుకోని ఘటనలు జరుగుతున్నాయని నాకో ఫోన్‌కాల్ వచ్చింది. నేను హడావిడిగా వెళ్లాను. నా క్యారవేన్ కనిపించలేదు. దగ్గర్లో ఓ చెట్టు కింద పార్క్ చేసి ఉందని గమనించాను. నేను అక్కడికి వెళ్తుంటే ఇద్దరు బౌన్సర్స్ నన్ను చూసి పారి΄ోయారు. అక్కడే ఉన్న అమ్మాయిలను నేను తీసుకువచ్చాను. ఈ భయంకరమైన ఘటన గురించి ఓ సీనియర్ మలయాళ నటుడికి ఫిర్యాదు చేస్తే... ‘‘నువ్వు సామాజిక కార్యకర్తలా వచ్చావా? లేక నటించడానికి వచ్చావా? అని ప్రశ్నించాడు. ఇలాంటివారి వల్లే సినిమాల్లో మహిళలకు భద్రత లేకుండాపోయిందని చాలా బాధ కలిగింది.‘హ్యాపీ సర్దార్’ సినిమా నా నట జీవితాన్ని మార్చేసింది. నా గొంతును న్యాయం కోసం వినిపించినందు వల్లే నాకు అవకాశాలు తగ్గి΄ోయాయి’’ అన్నారు మాలా పార్వతి. ఇదిలా ఉంటే... 2010లో మాలా పార్వతి చేసిన చిత్రాల్లో ‘అపూర్వ రాగం’లో నిత్యా మీనన్ ఆమె కూతురి పాత్ర చేశారు. సో... ఈ సినిమాలో నటించిన ఓ నటుడి గురించే ఆమె పేర్కొని ఉంటారని ఊహించవచ్చు. ఇక ప్రస్తుత పరిణామాల రీత్యా ఇప్పటికే ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధినేత మోహన్‌లాల్‌తో పాటు ΄్యానల్ సభ్యులందరూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
ఇదో పిరికి చర్య: రాజీనామాలపై తంగలాన్ నటి
హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు డైరెక్టర్స్, నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. ఇప్పటికే కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు అధ్యక్షుడు మోహన్‌లాల్‌తో సహా 17 మంది సభ్యులు రాజీనామా చేశారు. తాజాగా తన సభ్యత్వానికి రాజీనామా చేయడంపై తంగలాన్ నటి పార్వతి తిరువోతు రియాక్ట్ అయ్యారు.అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ఎగ్జిక్యూటివ్ ప్యానెల్ మూకుమ్మడి రాజీనామా చేయడంపై నటి పార్వతి తిరువోతు తీవ్రంగా మండిపడ్డారు. ఇది పిరికిపంద చర్యలా ఉందని తెలిపారు. ఫిల్మ్ అసోసియేషన్‌లో నిరంకుశ పాలన నడుస్తోందని ఆరోపించింది. అయితే తమకు మాట్లాడే అవకాశం లేకపోవడంతో సంతోషంగా అసోసియేషన్‌కు రాజీనామా చేశానని పార్వతి తెలిపారు. మీడియాతో మాట్లాడే బాధ్యత నుంచి తప్పుకోవడం పిరికితనంగా అనిపించిందని పేర్కొన్నారు.ఈ విషయంలో కేరళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పార్వతి తిరువోతు ఆరోపించారు. మహిళలు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పేర్లతో రావాలని లాంటి ప్రకటనలు చేయడం చూస్తుంటే వారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. పేర్లు చెప్పడం ముఖ్యమా? ఆ మహిళకు న్యాయం జరగడమా? అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. -
టీడీపీ నేతల వేధింపులతో దళిత యువతి ఆత్మహత్య!
సాక్షి, నరసరావుపేట/పిడుగురాళ్ల రూరల్: టీడీపీ నేతల వేధింపులు తాళలేక ఓ దళిత యువతి మంగళవారం సాగర్ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. జూలకల్లుకు చెందిన రాముడు, కుమారి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. ప్రభుత్వ రేషన్ డిపో నడిపే రాముడు గతేడాది అక్టోబర్ 6న చనిపోయాడు. అప్పటినుంచి మూడో కుమార్తె మనీషా ఆ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఎన్నికల్లో మనీషా కుటుంబం వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటు వేసిందన్న కక్షతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఆయన అనుచరులైన ఆమె సమీప బంధువులు రేషన్ షాపు వదులుకోవాలని బెదిరించి, దాడులకు దిగారు. వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ దగ్గరకు పిలిపించి షాపు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయడంతో ఆమె అంగీకరించక తప్పలేదు. ఆ దుకాణం మనీషా తల్లి పేరిట ఉండటంతో ఆమె చేత వేలి ముద్ర వేయించుకొని గత నెల నుంచి రేషన్‌ను టీడీపీ నాయకులే పంపిణీ చేశారు. అది చాలదన్నట్టు మనీషా కుటుంబం రేషన్ వాడుకున్నారని, దానికి డబ్బులు చెల్లించాలని అధికారులు, టీడీపీ నాయకులు హుకుం జారీ చేశారు. అంత డబ్బు ఇవ్వలేమని, కొంత కడతామని చెప్పినా వినకుండా వరుసకు అన్న అయ్యే లంజపల్లి వెంకటేశ్వర్లు, ఆయన తండ్రి పిచ్చయ్య మనీషాపై దాడిచేసి, మానసికంగా హింసించారు. అప్పటి నుంచి చనిపోతానంటూ మనీషా ఏడుస్తోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆమె కనిపించకపోవడంతో బంధువులు, గ్రామస్తులు వెతగ్గా సాగర్ కెనాల్ గట్టుపై చెప్పులు, చున్నీ, ఓ లేఖ కనిపించాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. రేషన్ షాపు వదులుకోకపోతే ఏం చేస్తారోనన్న భయంతోనే తన బిడ్డ చనిపోయిందని తల్లి కుమారి కన్నీరు మున్నీరవుతోంది. -
మాలీవుడ్ సూపర్ ‘హీట్’.. ‘అమ్మ’ రాజీనామా!
కేరళ సినిమా రంగంలో భూకంపం పుట్టింది. నటీనటుల సంఘం ‘అమ్మ’ కార్యవర్గం పూర్తిగా రాజీనామా చేసింది. వీరిలో మోహన్‌లాల్ ఉన్నారు. గత కొన్ని రోజులుగా కేరళ సినిమా రంగంలో మహిళలపై దురాగతాలు బయటికి వస్తుండటంతో పరిశ్రమ వణుకుతోంది. కొందరు తమ పదవులకు రాజీనామాలు చేస్తుంటే మరికొందరు ముఖం చాటేస్తున్నారు. ఈ దావానలం బాలీవుడ్ వరకు పాకితే మరింత ప్రక్షాళనం జరగవచ్చు.మలయాళ సినీ పరిశ్రమలో గొలుసుకట్టు ఘటనలు జరుగుతున్నాయి. 2017లో మలయాళ నటి భావనా మీనన్‌పై లైంగిక దాడి జరగడం (కొచ్చి శివార్లలో కారులో కొందరు వ్యక్తులు చేశారని ఆరోపణ) వెనుక సూత్రధారి మలయాళ హీరో దిలీప్ అని రేగిన కార్చిచ్చు అక్కడి ప్రభుత్వం చేత జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయించింది. అయితే ఆ కమిటీ రి΄ోర్టు ఆలస్యంగా 2024 ఆగస్టులోగాని బయటకు రాలేదు. అది వచ్చిన వెంటనే మలయాళ పరిశ్రమలో కొంతమంది మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పసాగారు. దాంతో మలయాళ పరిశ్రమ కుదుపులకు లోనవుతోంది.నటుడు సిద్దిఖీ పై ఆరోపణమలయాళంలో టాప్ కేరెక్టర్ ఆర్టిస్ట్, అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు జనరల్ సెక్రటరీ అయిన సిద్దిఖీ పై రేవతి సంపత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచార ఆరోపణలు చేసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఆమె తన ఆరోపణలను మరోసారి మీడియా ముందుకు తెచ్చింది. ‘2016లో అతను కొచ్చిలోని ఒక హోటల్లో నా పై అత్యాచారం చేశాడు. అప్పుడు నాకు 21 ఏళ్లు ఉంటాయి. నాకు సినిమా రంగం ఆసక్తి ఉందని తెలిసి హోటల్‌కు పిలిపించి హఠాత్తుగా లైంగికదాడి చేశాడు’ అని ఆమె చెప్పింది. ఈ ఆరోపణలు ఆమె 2019లో చేసినా ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకుని సిద్దిఖీని విమర్శల వలయంలో నిలబెట్టాయి. దాంతో అతడు ‘అమ్మ’ పదవికి రాజీనామా చేశాడు. అయితే అతడు తాజాగా ఆ జూనియర్ ఆర్టిస్టు తనపై లేని΄ోని అభాండాలు వేస్తోందని కేరళ డి.జి.పికి ఫిర్యాదు చేశాడు.ఎం.ఎల్.ఏ పేరుమరోవైపు నటుడు ముకేష్ (ఇతను సి.పి.ఎం ఎం.ఎల్.ఏ) పై కూడా టెస్ జోసఫ్ అనే కాస్టింగ్ డైరెక్టర్ అమర్యాదకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. ‘అతను ఔట్‌డోర్‌లో తన రూమ్ పక్కన నా రూమ్ ఉండేలా కుట్ర చేశాడు. నా రూమ్ తలుపు పదే పదే కొట్టాడు’ అని ఆమె తెలియచేసింది. అయితే ముకేష్ ఇదంతా రాజకీయ కుట్ర అని అంటున్నాడు. ఈ దుమారం ఇలా ఉంటే ప్రభుత్వ చలచిత్ర అకాడెమీ ప్రస్తుత చైర్మన్, దర్శకుడు రంజిత్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో అతనూ రాజీనామా చేశాడు. దీంతో ప్రభుత్వం సినిమా పరిశ్రమలో వస్తున్న ఫిర్యాదులపై విచారణకు 4 మహిళా ముగ్గురు పురుష ఐపిఎస్‌లతో ‘సిట్’ ఏర్పాటు చేసింది. ఈ ‘సిట్’ తనకు తానుగా ఫిర్యాదులు నమోదు చేయదని, ఫిర్యాదులను పరిశీలిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో అంతా మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారంగా ఇది మిగలనుందని విమర్శలు వస్తున్నాయి.మేము న్యాయపోరాటాలు చేయలేంఫిర్యాదులు చేస్తున్న మహిళలు ‘మేము కేసులు పెట్టి కోర్టులు చుట్టు తిరగలేం’ అని చెప్పడం గమనార్హం. ‘మేం అంత పెద్దవారిని ఎదుర్కోలేం’ అని వారు అంటున్నారు. మలయాళ ఇండస్ట్రీలో ఉన్న 15 మంది శక్తిమంతులు పరిశ్రమలో ఎవరో పైకి రావాలో, ఎవరు వెనుక ఉండిపోవాలో నిర్ణయిస్తున్నారని హేమ కమిషన్ తెలియచేసింది. వీరు చెప్పినట్టు వినకపోతే ఇండస్ట్రీలో మనలేని పరిస్థితి ఉందని కమిషన్ పేర్కొంది. ‘స్త్రీలను ఎందుకు ఇబ్బంది పెడతారు? అని ప్రశ్నించే పురుషులను కూడా బ్యాన్ చేస్తున్నారు’ అని తెలపడం విశేషం. రాబోయే రోజుల్లో ఈ కందిరీగల తుట్టె ఏ మేరకు ఎవరిని కుట్టనుందో వేచి చూడాలి.కాంప్రమైజ్ – అడ్జస్ట్ఒక నటి సినిమా చేయడానికి అంగీకరించే ముందు మలయాళ పరిశ్రమలో వినిపించే రెండు పదాలు కాంప్రమైజ్, అడ్జస్ట్. వేషం తె ప్రొడక్షన్ మేనేజర్లు ‘రాజీ పడాలని’, ‘సర్దుకుపోవాలని’ కోరుతారు. ‘సరే’ అంటే వేషం. లేకుంటే లేదు. అంతటితో వదిలితే ఫరవాలేదు. కాని హేమా కమిషన్ ప్రకారం ఏ మహిళా ఆర్టిస్ట్ అయినా నో అంటే వెంటనే ఇండస్ట్రీ అంతటా వ్యాపిస్తుంది. ఆమెను ‘దారి’కి తెచ్చే పని ఇండస్ట్రీ అంతా తీసుకుంటుంది. ‘మా సారు (ఏ పెద్ద స్టారో దర్శకుడో ప్రొడ్యూసర్) అడిగితే కాదంటావా?’ అని ఎవరూ వేషం ఇవ్వరు. పస్తులతో మాడేలా చేస్తారు. అందుకే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ముందుకొచ్చి‘మహిళలు చేసే ఏ ఫిర్యాదునైనా సీరియస్‌గా తీసుకోవాలి’ అని బహిరంగంగా మాట్లాడాడుఫ్యాన్స్ ఆర్మీలైంగిక దుశ్చర్యలు ఎదుర్కొన్న మహిళలు బయటకు చెప్పేందుకు భయపడటానికి మరో కారణం ఈ పెద్ద నటులు ఫ్యాన్స్ ఆర్మీలను దాడికి పురిగొల్పుతుండటమే. ఏ హీరోను ఎవరేమన్నా వారి అభిమానులు సోషల్ మీడియాలో బూతులు జోడిస్తూ మీమ్స్ తయారు చేస్తుండటంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. కొన్నిసార్లు భౌతికంగా దాడి చేస్తారనే భయం కూడా సృష్టిస్తున్నారు. అందుకే హేమా కమిషన్ ఫ్యాన్స్‌ను కట్టడి చేయాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా సూచించింది.తలుపు విరిగేలా బాదుతారు‘ఔట్‌డోర్ షూటింగ్లో అర్ధరాత్రి తాగేసి వచ్చి తలుపు విరిగేలా బాదుతారు. అందుకే ఔట్‌డోర్‌లో కుటుంబ సభ్యులను తోడు తీసుకొని వెళ్లాల్సి వస్తోంది’ అని చాలామంది మహిళా ఆర్టిస్టులు హేమా కమిషన్‌కు చెప్పారు. వేషం ఇచ్చేటప్పుడే ‘అడిగితే అంగీకరించాలనే’ డిమాండ్ ప్రోడక్షన్ మేనేజర్ చల్లగా చెపాడని తెలియచేశారు.మోహన్‌లాల్ రాజీనామా30 ఏళ్ల చరిత్ర కలిగిన ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (అమ్మ) అధ్యక్ష పదవికి నటుడు మోహన్‌లాల్ రాజీనామా చేశారు. మలయాళ పరిశ్రమలో స్త్రీలపై సాగుతున్న లైంగిక దోపిడిని జస్టిస్ హేమా కమిషన్ బయట పెట్టాక వినవచ్చిన ఆరోపణల్లో ‘అమ్మ’ జనరల్ సెక్రటరీ సిద్దిఖీతో పాటు మరికొందరి పేర్లు ఉన్న దరిమిలా నైతిక బాధ్యత వహిస్తూ మొత్తం 17 మంది సభ్యులున్న కార్యవర్గం రాజీనామా చేసింది. హడావిడిగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ మీటింగ్‌లో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మమ్మల్ని విమర్శకు, దిద్దుబాటుకు లోను చేసినందుకు కృతజ్ఞతలు’ అని రాజీనామా లేఖలో కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకూ మోహన్‌లాల్, మమ్ముట్టి తదితర సూపర్స్టార్లు హేమా కమిషన్ గురించి ఏమీ మాట్లాడక΄ోవడాన్ని ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ (డబ్లు్యసిసి) తప్పుబట్టింది. మలయాళ రంగంలోని మహిళా నటీమణులు ‘అమ్మ’తో విభేదించి ఈ గ్రూపును నియమించుకున్నారు. హేమా కమిషన్ రిపోర్టును బయటపెట్టమని ΄ోరాడింది వీరే. ‘తంగలాన్’ నటి ΄ార్వతి తిరువోతు ఈ గ్రూప్‌లో చురుగ్గా పని చేస్తోంది. మెంబర్‌షిప్‌కు వెళ్లినా‘మూడు సినిమాల్లో నటిస్తే అమ్మలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. దానికోసం నేను ఫోన్ చేస్తే ఆ పనులు చూసే సభ్యుడు తన ఫ్లాట్‌కు రమ్మన్నాడు. నేను ఫ్లాట్‌కు వెళ్లి ఫామ్ ఫిలప్ చేస్తుంటే వెనుక నుంచి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఔట్‌డోర్ షూటింగ్ లో ఒక నటుడు నా రూమ్‌కు వచ్చి తలుపు తీసిన వెంటనే మంచం మీదకు లాగే ప్రయత్నం చేశాడు. ఇంకో నటుడు రెస్ట్రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడూ వదల్లేదు. కావలించుకున్నాడు. ‘అడ్జస్ట్’ అవమని అందరూ చెప్పడమే. ఎంత అడ్జస్ట్ అవుదామని చూసినా ఇది భరించలేనంతగా ఉండటం వల్ల మలయాళ ఇండస్ట్రీ వదిలిపెట్టి చెన్నైకి మారి΄ోయాను’ అని నటి మీను మునీర్ ఫేస్బుక్లో రాసింది. హేమా కమిషన్ బయటకు వచ్చాక ఈమె ఈ వివరాలు తెలిపింది. – ఫ్యామిలీ డెస్క్ -
అతివకు అండగా..
ఆడ బిడ్డ.. ఇంటి నుండి బయటికొస్తే అడుగడుగునా వంకరచూపులే. బస్టాపు మొదలు కాలేజీ, కార్యాలయం, కార్ఖానా.. ప్రదేశం ఏదైనా అవకాశం దొరికితే వెకిలి చేష్టలు, వేధింపులు.. డబుల్ మీనింగ్ డైలాగులతో టార్చర్. ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నా..సెల్‌ఫోన్‌కు అసభ్య సందేశాలు, ప్రేమ పేరుతో పలకరింపులు, వద్దని తిరస్కరిస్తే ఫొటోల మార్ఫింగ్‌లతో బ్లాక్‌మెయిలింగ్‌లు. ఇవీ.. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా నేటి మహిళను వెంటాడుతున్న అతిపెద్ద సమస్యలు. భయం, కుటుంబ పరువు ,ప్రతిష్ట, గౌరవం దృష్ట్యా అనేకమంది ఈ నిత్య వేధింపులను భరిస్తున్నారు. షీ టీమ్స్ లేదా పోలీసుల వద్దకు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నవారు కొందరే. అందుకే ‘సాక్షి’ ఇక మీ నేస్తం అవుతోంది. ఇంటా బయట, చదివే చోట, పని ప్రదేశంలో, ప్రయాణంలో, చివరకు ‘నెట్’ఇంట్లో.. ఇలా ఎక్కడ, ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నా 8977794588 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తెలపండి. మీ సమస్యల్ని ‘సాక్షి’ తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ దృష్టికి తీసుకెళ్తుంది. మూడో కంటికి తెలియకుండా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. భయం వీడండి..ధైర్యంగా ముందుకు కదలండి. వేధింపుల నుంచి విముక్తి పొందండి. -
ఒకటా రెండా?.. కాల్చుకు తింటోంది!
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు ఉద్యోగులు, అధికారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వేధింపులకు గురి చేయడంపై ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గతంలో ఎన్నడూ లేనివిధంగా 50 మందికిపైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే కూర్చుని సంతకాలు పెట్టి వెళ్లాలని 16 మంది ఐపీఎస్ అధికారులకు అవమానకరంగా ఒక మెమో జారీ చేయడంపై అధికార యంత్రాంగంపై తీవ్ర విస్మయం వ్యక్తమైంది.ఒక్క సివిల్ సర్వీసు అధికారులే కాకుండా గ్రూప్–1 అధికారులు, కింది స్థాయి ఉద్యోగులను సైతం ప్రభుత్వం అదే రీతిలో వేధింపులకు గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఈ ఘటనను రాజకీయం చేసేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నించింది. మదనపల్లెలో ఫైల్స్ దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో ప్రకటన చేయించింది.ప్రస్తుత ఆర్డీవో, పూర్వ ఆర్డీవోతోపాటు సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసింది. కార్యాలయంలోని మిగిలిన ఉద్యోగులను సైతం భయభ్రాంతులకు గురి చేసి తీవ్రంగా వేధించింది. అయితే ఇంతవరకు ఈ ఘటన ఎలా జరిగిందో, అసలు నిజాలు ఏమిటో తేల్చలేకపోయింది. ఇక కొద్దిరోజుల క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయానికి సంబంధించిన పనికిరాని ఫైళ్లను కిందిస్థాయి ఉద్యోగులు దగ్ధం చేస్తే దానిపైనా రాద్ధాంతం చేసింది. పోలవరానికి సంబంధించి పనికిరాని ఫైళ్లను రాజమహేంద్రవరంలో దగ్ధం చేస్తే దానిపైనా టీడీపీ హడావుడి చేసింది. ఈ ఘటనలన్నింట్లోనూ అధికారులు, ఉద్యోగులను అనుమానంతో వేధించడం మినహా ఆరోపణలను నిరూపించలేకపోయింది.ముద్ర వేసి ఇబ్బందులు..ప్రభుత్వం మారాక అన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగులను అనుమానపు చూపులు చూస్తూ వేధిస్తున్నారు. గ్రామ సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సచివాలయంలో వైఎస్సార్సీపీ కోసం పని చేసిన వారంటూ ఒక జాబితా విడుదల చేసి మరీ కొందరు దుష్ప్రచారానికి దిగారు. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన నియోజకవర్గంలో పనిచేసే కొందరు పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులపై పార్టీ ముద్ర వేసి పదోన్నతి లభించినా, బదిలీ అయినా రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. -
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తకు టీడీపీ సోషల్ మీడియా వేధింపులు
సాక్షి, విజయవాడ: టీడీపీ సోషల్ మీడియా వేధింపులపై వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు సుచిత్ర సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నందుకు తనను వేధింపులకు గురిచేస్తున్నారని.. టీడీపీ సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేశారు.‘‘నా ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశా. మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. న్యూడ్ ఫోటోలు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. అత్యాచారం చేస్తామంటూ నన్ను బెదిరిస్తున్నారు’’ అని సుచిత్ర తెలిపారు. -
‘అమ్మాయిపై చెయ్యేస్తే నపుంసకుడిని చెయ్యాలి’
దేశంలో అత్యాచార ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఉదంతాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటూ పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని బద్లాపూర్ మరో అత్యాచారం ఉదంతం వెలుగు చూసింది.ఈ ఘటనకు కారకులైన వారిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై చేయివేసే వారిని నపుంసకులుగా మార్చాలని ఆయన అన్నారు. ఇలాంటి పనులు చేసేవారికి చట్టం ఉన్నదనే భయాన్ని కల్పించాలని, అప్పుడు ఎవరూ తప్పుడు పనులకు పాల్పడరని అజిత్ పవార్ అన్నారు.యావత్మాల్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బద్లాపూర్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం వదిలిపెట్టబోదన్నారు. ఇటువంటి నేరాలకు కఠిన శిక్షలు విధించాలని కోరుతూ రూపొందించిన బిల్లును మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి ముర్ముకు పంపిందన్నారు. ఇది చట్టరూపం దాల్చి, అమలులోకి వస్తే మహిళలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు. -
కోల్‌కతా ఘటన: మాట మార్చిన నిందితుడు.. అక్కడ సీబీఐ సోదాలు
కోల్‌కతా: బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక, కేసులో పలు ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్.. జైలులో గార్డులతో చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. తనకూ ఈ కేసులో ఎలాంటి సంబంధంలేదని చెప్పడం సంచలనంగా మారింది.కాగా, ఆర్జీ కార్ ఆసుపత్రిలో డాక్టర్ హత్యచార కేసులో సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, విచారణ సందర్భంగా సంజయ్ రాయ్ తన నేరాన్ని అంగీకరించాడు. ఆ రోజు ఏం జరిగిందో అంతా వివరించాడు. కానీ, తాజాగా జైలు గార్డులతో మాత్రం మరోలా చెప్పడం గమనార్హం. అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. పేరు చెప్పడానికి ఇష్టపడని జైల్ అధికారులు ఈ విషయం వెల్లడించారు. అంతకుముందు కూడా.. తనకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను నిర్దోషిని అంటూ అందుకే లై డిటెక్టర్ టెస్ట్‌కి అంగీకరించానని కోర్డులో జడ్జ్ ముందే చెప్పాడు.అయితే, హత్యాచార ఘటన సమయంలో సెమినార్ రూమ్ వైపు ఎందుకు వెళ్లావ్ అని పోలీసులు ప్రశ్నించగా.. సంజయ్ దానికి సమాధానం చెప్పలేదు. పొంతన లేని సమాధానాలు చెప్పి విచారణ అధికారులను తప్పుదోవ పట్టించాలని చూశాడు. క్రైమ్ సీన్లో తెల్లవారుజామున 4.03 గంటలకు కనిపించాడుతన ముఖంపై గాయాల గురించి విచారిస్తే సరైన బదులు ఇవ్వడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.CCTV footage shows accused entering hospital!Sanjay Rai is seen wearing jeans & t-shirt with a helmet in hand on August 9 night when he committed the heinous crime.BJP & CPM claimed that Sanjay was a scapegoat framed by @KolkataPolice to shield others.#KolkataDoctorDeathCase pic.twitter.com/TrGz3fWoTV— Nilanjan Das (@NilanjanDasAITC) August 23, 2024ఇదిలా ఉండగా.. ఆగస్టు 24వ తేదీనే(శనివారం) సంజయ్‌కు పాలిగ్రఫీ టెస్ట్ చేయాల్సి ఉండగా..కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో, నేడు ఆదివారం(ఆగస్టు 25) ఈ టెస్ట్ నిర్వహించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ప్రస్తుతానికి జైల్లో ఉన్న సంజయ్ రాయ్‌ని అక్కడే ఉంచి ఈ టెస్ట్ చేయాలని భావిస్తున్నారు. అతని సెల్ వద్దే సీసీ కెమెరాలు పెట్టారు. నిఘా పెంచారు.#WATCH | Kolkata, West Bengal: CBI Anti Corruption Branch reaches the administrative block of RG Kar Medical College and Hospital. CBI started a corruption investigation against former principal Sandeep Ghosh by filing an FIR, yesterday. pic.twitter.com/2KnCsHZXSN— ANI (@ANI) August 25, 2024మరోవైపు.. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో భారీగా ఆర్థిక అవకతవకలు భారీగా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌పై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సీబీఐ అధికారులు.. సందీప్ ఘోష్‌కు సంబంధించిన ఇళ్లు, పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సీబీఐ బృందాలు తనిఖీలు మొదలుపెట్టాయి. -
Supreme Court: కులం పేరిట వేధిస్తేనే... ఎస్సీ, ఎస్టీ కేసు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజికవర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు‘ అని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న షాజన్ స్కారియా అనే యూట్యూబర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేరళకు చెందిన ఎమ్మెల్యే పీవీ శ్రీనిజన్ ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. మరుణదాన్ మలయాళీ అనే యూట్యూబ్ చానల్ నడుపుతున్న షాజన్ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు. షాజన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, ‘బెదిరింపులకు, లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినంత మాత్రాన సదరు నేరానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం సెక్షన్ 3(1)(ఆర్) వర్తించబోదు. కులం పేరిట అవమానించినప్పుడు, వేధించినపుడు మాత్రమే వర్తిస్తుంది. సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు, అగ్ర కులస్తులు మైల, పవిత్రత అంటూ నిమ్నవర్ణాల వారిపట్ల కులం పేరిట దురహంకారపూరితంగా ప్రవర్తించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలను కులం పేరిట వేధించకుండా చూసేందుకే కఠినమైన సెక్షన్లు చేర్చారు. కనుక ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాల ముఖ్యం‘ అని స్పష్టం చేసింది. ‘షాజన్ కేసులో అదేమీ కని్పంచడం లేదు. సదరు వీడియో ద్వారా ఎస్సీ, ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం, శతృత్వ భావం, దురుద్దేశాల వంటివి వెళ్లగక్కినట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఎమ్మెల్యేను కేవలం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారు‘ అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాలు నిర్ధారణ అయితే తప్ప ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. -
మహిళల వేధింపుల్లో టీడీపీ టాప్.. 11వ స్థానంలో జనసేన
-
అట్లుంటయ్.. చింతమనేని వేధింపులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అధికారులు, ఉద్యోగులపై టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేధింపులకు ఇదో మచ్చుతునక. ఏలూరు జిల్లావ్యాప్తంగా 63 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు రాగా 57 మంది కొత్త స్థానాల్లో చేరారు. తన నియోజకవర్గానికి చెందిన మిగిలిన ఆరుగురి పదోన్నతికి మాత్రం చింతమనేని మోకాలడ్డు పెడుతున్నారు. ఆ ఆరుగురిని టార్గెట్ చేసి వారిని రిలీవ్ చేయడానికి వీల్లేదంటూ ఉన్నతాధికారులకు అధికారపార్టీ ఎమ్మెల్యే హుకుం జారీచేశారు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరో 3 రోజులు జాప్యం జరిగితే వచ్చిన పదోన్నతులు దక్కకపోగా స్థానికంగా తీవ్ర అవమానాలు, భౌతిక దాడులు భరిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏలూరు జిల్లాలో ఈనెల 8న 63 మంది గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–2 పదోన్నతి దక్కింది. పదోన్నతి ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి 15 రోజుల్లోగా కొత్త స్థానంలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పదోన్నతుల వ్యవహారం సజావుగా సాగింది. దెందులూరు నియోజకవర్గంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ 12 మందికి పదోన్నతి దక్కితే ఆరుగురు నానా తంటాలు పడి గత వారంలో రిలీవ్ అయి కొత్త స్థానంలో విధుల్లో చేరారు. మిగిలిన ఆరుగురిని మాత్రం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టార్గెట్ చేశారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించారని, స్థానిక నేతలతో సన్నిహితంగా ఉన్నారని, ఇలా రకరకాల ముద్రలు వేసి ఆ ఆరుగురు పదోన్నతులు అడ్డుకున్నారు. తనకు చెప్పకుండా వారిని రిలీవ్ చేయడానికి వీల్లేదని జిల్లా పంచాయతీ అధికారికి ఆయన ఆదేశించారు. దీంతో ఆ ఆరుగురి భవితవ్యం గాలిలో ఉంది. రెడ్‌బుక్ రాజకీయాలుదెందులూరు మండలంలో రామారావుగూడె, పెదవేగి మండలంలోని విజయరాయి, నడిపల్లి, భోగాపురం, జగన్నాథపురం, ఏలూరు రూరల్ మండలంలో మల్కాపురం పంచాయతీ కార్యదర్శులను వేధిస్తూ ఎమ్మెల్యే రెడ్‌బుక్ రాజకీయాలకు తెరతీశారు. కక్ష సాధింపులతో నిరంతరం అవమానాలకు గురిచేయడంతో పాటు మాటలతోనూ వేధిస్తున్నారు. వీరిలో ఒక పంచాయతీ కార్యదర్శిపై కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో 40 నిమిషాల పాటు బహిరంగ వేదికపైనే తీవ్రస్థాయిలో చింతమనేని విరుచుకుపడ్డారు.ప్రొటోకాల్ పాటించలేదనే కారణంతో సదరు కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డీపీఓను ఆదేశించడంతో డీపీఓ ఆగమేఘాలపై సస్పెన్షన్‌కు ఫైల్ రెడీ చేశారు. మరో పంచాయతీ కార్యదర్శి రిలీవ్ కోసం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఆ కార్యదర్శిని మందలించి మరీ పంపినట్లు సమాచారం. -
జనం రోడ్డెక్కనిదే స్పందించరా?
ముంబై: మహారాష్ట్రలో థానే జిల్లాలోని బద్లాపూర్ పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులు దిగ్భ్రాంతికరమని బాంబే హైకోర్టు ఆవేదన వెలిబుచ్చింది. దారుణం జరిగిన నాలుగైదు రోజులకు ప్రజలు మూకుమ్మడిగా ఆందోళనకు దిగితే గానీ పోలీసులు స్పందించలేదంటూ మండిపడింది. ‘‘పసిబిడ్డలపై అఘాయిత్యం జరిగితే తేలిగ్గా తీసుకోవడమేమిటి? జనం ఆగ్రహంతో వీధుల్లోకి వస్తే తప్ప ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదలదా? అంటూ ఆగ్రహించింది.ఈ కేసులో బద్లాపూర్ పోలీసుల దర్యాప్తు సక్రమంగా లేదంటూ ఆక్షేపించింది. ‘‘బాధితులు ఫిర్యాదు చేశారు గనుక ఈ వ్యవహారం బయటకొచి్చంది. బయటకు రాని కేసులు ఎన్నో ఉండొచ్చు’’ అని అభిప్రాయపడింది. ‘‘పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి రాకూడదు. వారు న్యాయం కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండకూడదు’’ అని పేర్కొంది.‘‘పిల్లలకు స్కూళ్లలో కూడా భద్రత లేకపోతే ఏం చేయాలి? ఇక విద్యా హక్కు చట్టానికి అర్థమేమిటి?’’ అంటూ నిలదీసింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకు జాప్యం జరిగిందని పోలీసులను ప్రశ్నించింది. ‘‘బాలికల భద్రతపై రాజీపడడానికి వీల్లేదు. వేధింపుల గురించి తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయని స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోండి’’ అని ఆదేశించింది. 27లోగా నివేదిక సమర్పించండిబద్లాపూర్ పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై జరిగిన అఘాయిత్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. స్కూల్ వాష్ రూమ్‌లో అటెండర్ వారిని లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. ఈ నెల 12, 13న దారుణం జరిగితే పోలీసులు 16న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 17న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జస్టిస్ రేవతి మొహితే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌తో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తుచేసింది. బాలికలకు, వారి కుటుంబాలకు అండగా నిలవాలని, మరింత బాధకు గురిచేయొద్దని ఆదేశించింది. ఈ కేసులో 27వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. -
వైఎస్సార్సీపీ నేత సాయినాథ శర్మ ఇంటిలో అర్థరాత్రి పోలీసుల సోదాలు
కమలాపురం : కమలాపురం నియోజకర్గ వైఎస్ఆర్సీపీ నేత సాయినాథ శర్మపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాయినాథ శర్మతో పాటు ఆయన కుమారుడు, అనుచరులపై హత్యాయత్నం, కిడ్నాప్ తదితర కేసులను పాత తేదీలతో నమోదు చేసిన పోలీసులు సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన ఇంటిని సోదా చేశారు. స్థానిక ఎస్ఐ ప్రతాప్ రెడ్డి ఇద్దరు పోలీసులతో కలిసి ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా కమలాపురం పట్టణంలోని సాయనాథ శర్మ ఇంటిలో సోదాలు జరిపారు. ఆ సమయంలో ఇంటిలో ఆయన సతీమణితో బాటు, ఆయన చెల్లెలు, కూతురు, మరో పెద్ద వయసు ఉన్న మహిళ మాత్రమే ఉన్నారు. కాగా మంగళవారం ఉదయం వారిని నిర్బంధిస్తూ వారి ఇంటి వద్ద మహిళా పోలీసును కాపలాగా ఉంచారు. కుటుంబ సభ్యులను నిర్బంధించారు సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో పోలీసులు తమ ఇంటి ముందు కారు దిగి వేగంగా పరుగెత్తుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారని సాయినాథ శర్మ కుటుంబ సభ్యులు తెలిపారు. తాము ఇంటి వరండాలో కూర్చుని మాట్లాడుకుంటుండగా తమ అనుమతి లేకుండా ఇంటిలో ప్రవేశించారని, ఇంట్లో సాయినాథ శర్మ గానీ , ఆయన కుమారుడు గానీ లేక పోవడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లారని తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటలకు మహిళా పోలీసును తమ ఇంటి వద్ద కాపలా పెట్టారని, తమ కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారన్నారు. సాయినాథ శర్మ సొంత బావ సాంవత్సరీకాలు జరుగుతున్నా తమను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయినాథ శర్మ కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లాలన్నా తమ అనుమతి తీసుకోవాలని ఎస్ఐ సూచించినట్లు మహిళా పోలీసు తెలిపారన్నారు. తాము ఏమి తప్పు చేశామని పోలీసులు తమ కుటుంబాన్ని ఇంతగా వేధిస్తున్నారని వారు ప్రశ్నించారు. తమ మీద పెట్టిన కేసులే తప్పుడు కేసులని, ఆ కేసుల్లో ఇంత వేధింపులు ఎందుకని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసుల వేధింపులు తగదు కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకులపై పోలీసుల వేధింపులు అధికమయ్యాయని కమలాపురం మాజీ శాసన సభ్యుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. మంగళవారం కడప నగరంలోని రవీంద్రనాథ్ రెడ్డి స్వగృహంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కమలాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుడు సాయినాథ్‌శర్మపై కమలాపురం పోలీసులు వేధింపులకు దిగుతున్నారని చెప్పారు. సాయినాథ్‌శర్మతోపాటు ఆయన కుమారుడు, అనుచరులపై హత్యాయత్నం, కిడ్నాప్ తదితర కేసులు పాత తేదీలతో నమోదు చేశారన్నారు. అధికార పార్టీ నాయకులను సంతప్తి పరచడానికి పోలీసులు శ్రమిస్తున్న తీరు ప్రజలను విస్మయపరుస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీకి విధేయులుగా పనిచేస్తున్న అధికారులపై కోర్టును ఆశ్రయించి వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. -
బద్లాపూర్ భగభగ!
థానె/ముంబై: మహారాష్ట్రలోని థానె జిల్లా బద్లాపూర్‌లో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. స్థానిక కిండర్‌గార్టెన్ స్కూల్లో రెండేళ్లు, నాలుగేళ్ల చిన్నారులపై అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. ఘటనపై పోలీసులు సకాలంలో స్పందించలేదంటూ మంగళవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు వందలాదిగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై బైఠాయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, ఆ మార్గంలో 8 గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.బద్లాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు బాధితుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు 11 గంటలపాటు జాప్యం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేధింపుల ఘటన చోటుచేసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్‌తోపాటు ఇద్దరు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. బాధిత చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ నెల 17న అటెండర్‌ను అరెస్ట్ చేశారు. ఘటనకు బాధ్యులుగా చేస్తూ సోమవారం రాత్రి పాఠశాల యాజమాన్యం çస్కూల్ ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, మహిళా అటెండర్‌ను సస్పెండ్ చేసింది.వేధింపుల ఘటనపై పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పింది. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదుపై స్పందించలేదంటూ స్థానిక పోలీస్‌స్టేషన్ ఇన్చార్జిని ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్ ఇన్స్పెక్టర్తోపాటు అసిస్టెంట్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. దర్యాప్తునకు ఐజీ స్థాయి అధికారి సారథ్యంలో సిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. కేసుపై సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆ ఆరోపణలు అవాస్తవం కేసు నమోదు చేసేందుకు పోలీసులు 12 గంటలపాటు ఆలస్యం చేశారంటూ వచి్చన ఆరోపణలను డీసీపీ సుధాకర్ పఠారే చెప్పారు. కేసు నమోదు ప్రక్రియ రాత్రి 11.30 గంటలకు మొదలుకాగా, నిందితుడిని మూడున్నర గంటల్లోపే 3.30 గంటలకు అరెస్ట్ చేశామన్నారు. అభంశుభం తెలియని బాధిత చిన్నారుల నుంచి సమాచారం రాబట్టడం క్లిష్టమైన, సున్నితమైన వ్యవహారమని, ఈ ప్రక్రియ వల్లే కేసు నమోదు ఆలస్యమైందని వివరించారు. ఒక మహిళా అధికారి సహా మొత్తం ముగ్గురు అధికారులు దర్యాప్తు ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారన్నారు. మంత్రి చెప్పినా ససేమిరా.. వేధింపుల ఘటనకు నిరసనగా కొన్ని సంస్థలు మంగళవారం బద్లాపూర్ బంద్‌నకు పిలుపునిచ్చాయి. ఉదయం భారీ సంఖ్యలో కిండర్‌గార్టెన్ విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా మహిళలు తరలివచ్చి పాఠశాల గేట్లు విరగ్గొట్టారు. ఫర్నిచర్, తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక రైల్వే స్టేషన్‌పైకి రాళ్లు రువ్వారు. బ్యానర్లు, ప్లకార్డులు చేతబూని పట్టాలపై బైఠాయించారు. రాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. బాధిత బాలికలకు న్యాయం చేయాలని, దోషులకు ఉరివేయాలని పట్టుబట్టారు.చివరికి సాయంత్రం పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జితో ఆందోళనకారులను చెదరగొట్టారు. రాత్రి 6 గంటల సమయానికి రైళ్ల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి పట్టాలపైనే తిష్ట వేయడంతో సబర్బన్ సహా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బద్లాపూర్‌లో రైల్ రోకో కారణంగా అంబర్నాథ్–కజ్రట్ మార్గంలో 30 వరకు సబర్బన్ రైళ్లను రైల్వే శాఖ పాక్షికంగా రద్దు చేసింది. మరో 12దూరప్రాంత రైళ్లను దారి మళ్లించింది. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు 55 బస్సులను ఏర్పాటు చేసింది. -
కోల్‌కతా ఘటనపై నిరసన.. ఏపీ సర్కారు నోటీసులు
విజయవాడ, సాక్షి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్న ఏపీలో.. ఉద్యోగులపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా.. వైద్య, ఆరోగ్య సిబ్బందికి బెదిరింపులు తారాస్థాయికి చేరాయి. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వమే అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దేశాన్ని కుదిపేసిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా.. సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారని నోటీసులు పంపించింది. ఉద్యోగులపై కక్ష సాధింపులకు దిగిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వైద్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంది. పలు జిల్లాల్లో వైద్య సిబ్బందికి కోల్‌కతా ఘటనకి సంఘీభావం తెలిపారని నోటీసులు జారీ చేసింది. ఇందులో.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ౩౩ మంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకి నోటీసులు జారీ చేసింది. ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీలో పాల్గొన్నారని, 24 గంటల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌వో పేరిట ఆ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న 33 మందిలో 31 మంది మహిళా సిబ్బందే ఉండడం గమనార్హం. కేవలం ఐఎంఏ పిలుపు మేరకు కోల్ కత్తా ఘటనపై నిరసనగా ర్యాలీ నిర్వహించామని, ఉద్దేశపూర్వకంగా తామేమీ తప్పు చేయలేదని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు వాపోతున్నారు. ఇక.. సత్యసాయి జిల్లాలో వైద్య సిబ్బందిపై మరో తరహా వేధింపులకు దిగింది. సమస్యలేవైనా ఉంటే.. వాటిని మంత్రులు, కలెక్టర్ల దృష్టికి అస్సలు తీసుకెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. అలా చేస్తే చర్యలు తప్పవని, శాశ్వత, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులెవరైనా తమ సమస్యలని మెడికల్ ఆఫీసర్ల స్థాయికి మాత్రమే చేరవేయాలని స్పష్టం చేసింది. ఆ వినతుల్ని పైకి పంపించే బాధ్యత మెడికల్ ఆఫీసర్లకు మాత్రమే ఉంటుందని పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలంటూ బెదిరింపులు జారీ చేసింది. ఎన్నికల ముందు ఉద్యోగులకి అండగా ఉంటామని చంద్రబాబుతో పాటు లోకేష్ గొప్పలు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు దిగారు. దీంతో.. కూటమి ప్రభుత్వ తీరుపై వైద్య ఆరోగ్య శాఖలో ఆందోళన వ్యక్తం అవుతోంది. -
మాలీవుడ్ ‘తెర’ వెనుక కన్నీటి చార
మలయాళ పరిశ్రమలో కథలు ఎంత వినూత్నంగా ఉన్నా స్త్రీల విషయంలో వేధింపులు అంతే అమానవీయంగా ఉన్నాయి. బలం ఉన్నవాళ్లు, పలుకుబడి ఉన్నవాళ్లు కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చే మహిళా ఆర్టిస్టులను తాము చెప్పినట్టుగా వినాలని శాసిస్తున్నారు. ‘ఎస్’ అంటే మేకప్... ‘నో’ అంటే ప్యాకప్ అని బెదిరిస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషనే తేల్చి చెప్పింది. మలయాళ పరిశ్రమ ఈ కమిషన్ రిపోర్టుతో కుదుపునకు లోనవుతోంది.‘వినీల ఆకాశంలో ఎన్నో రహస్యాలు... చందమామ అందంగా ఉంటుందని.. నక్షత్రాలు మెరుస్తాయని అనుకుంటాం. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. మీరు చూసేదంతా నిజమనుకోకండి. ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమ కూడా అంతే. పైకి కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో చీకటి కోణాలు. వాటిని వింటుంటే గుండె తరుక్కు పోతుంది. రంగుల ప్రపంచంలో జీవితాలను కోల్పోతున్న ఎంతోమంది మహిళల ఆవేదనను అక్షరబద్ధం చేశాం’ అంటూ నివేదికను మొదలు పెట్టారు జస్టిస్ హేమ. ఉత్తమ అభిరుచి, ప్రజాదరణ ఉన్న సినిమాలు తీస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న మలయాళ పరిశ్రమలో తెర వెనుక కన్నీటి చారను జస్టిస్ హేమ రిపోర్ట్ బట్టబయలు చేసింది. ఇండస్ట్రీలోని 15 మంది పెద్దలు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని స్త్రీల జీవితాలను శాసిస్తున్నారని ఈ కమిటీ పేర్కొనడం గమనార్హం. ఇదీ నేపథ్యందాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్‌స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు. విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో నిన్న (సోమవారం) మధ్యాహ్నం ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. ఈ నివేదికపై పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని మాలీవుడ్ తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.కమిటీ నివేదికలో సంచలన విషయాలు‘శరీరాలను అర్పించుకోవాలి.. ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి.. సహకరించిన వాళ్లకు అవకాశాలు. ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు.. ఇదీ 233 పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం. ‘ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలు పెట్టాడు’ అని జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ‘కొత్తగా వచ్చే నటీమణులకు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరిన విధంగా నడుచుకునే పైకి వచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలం అయ్యారు’ అని కమిటీ తెలిపింది. ‘సినిమా వాళ్లు వేషం ఇస్తామని మహిళలకు ఫోన్ చేస్తే పర్లేదు. అదే మహిళలు తమంతట తాము ఫోన్ చేస్తే ‘ఫేవర్’ చేయాల్సిందే’ అని కమిటీ తెలిపింది.ఆ 15 మందికొంతమంది హీరోలు... మరికొంతమంది దర్శకులు... ఇంకొందరు నిర్మాతలు... ఇలా 15మంది మగ మహారాయుళ్లు సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, వాళ్లు చెప్పినట్టే అందరూ నడుచుకుంటున్నారని నివేదిక తేల్చింది. ఈ 15 మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి. సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పింది. ఆ 15మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది.ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటేసర్దుకుపోండి... రాజీపడండి.. మలయాళ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే మహిళలకు పరిశ్రమ పెద్దలు చెప్పే రెండు మాటలు ఇవే. వీటికి సిద్ధపడి జీవితాలను అర్పించుకుంటేనే భారీ పారితోషకాలతో మెండుగా అవకాశాలు కల్పిస్తారు. కాదు... కూడదని ఎదురు తిరిగితే మాత్రం వాళ్ల జీవితాలను నాశనం చేయడానికి కూడా వెనుకాడరు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందుకు రారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.– ఫణికుమార్ అనంతోజుకమిటీ సిఫార్సులు→ సినీ పరిశ్రమలో మహిళల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలి.→ అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి మహిళలను న్యాయం చేయాలి.→ నేరచరిత్ర ఉన్న వాళ్లపై సినీ ఇండస్ట్రీ నిషేధం విధించాలి→ షూటింగ్ జరిగే ్రపాంతాల్లో మద్యం, మాదకద్రవ్యాలపై నిషేధం విధించాలి.→ ఫ్యాన్ క్లబ్స్ మహిళలను వేధించకుండా చర్యలు తీసుకోవాలి.→ పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలి. -
చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళ్తుండగా..
సైదాబాద్: షాపులో చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళుతున్న మైనర్ బాలికను ఓ కామాంధుడు ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాలు... సైదాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో నివసించే ఓ కుటుంబానికి చెందిన బాలిక(10) ఈ నెల 11న కిరాణషాపులో చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళుతోంది. బాలిక ఇంటికి సమీపంలో నివసించే ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి(58) ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. దాంతో భయపడిన బాలిక తప్పించుకొని ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. ఏం జరిగిందని తల్లి అడగటంతో విషయం బయట పడింది. నెల రోజుల క్రితం కూడా ఇంటి వద్ద తాను ఆడుకుంటుండగా అతడు ఇంట్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని తల్లికి చెప్పింది. వెంటనే బాలిక తల్లి అతని ఇంటికి వెళ్లి నిలదీయగా ఎదురుదాడి చేశాడు. ఈ ఘటనపై అదే రోజు సైదాబాద్ పోలీసులను బాలిక తల్లి ఆశ్రయించగా నిందితుడితో రాజీ చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. రెండురోజులపాటు పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదు. బాధితురాలి తండ్రి ఒక పోలీస్ ఉన్నతాధికారి వద్ద వంటమనిషిగా పనిచేస్తున్నాడు. ఆయనకు విషయం చెప్పగా సైదాబాద్ పోలీసులకు ఫోన్ చేసినట్లు సమాచారం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఈ నెల 13న నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే నిందితుడి భార్య, కూతురు తమను తిట్టారని, ఎక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండని బెదిరించారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. -
సొసైటీ గుమస్తా కుటుంబానికి న్యాయం చేస్తాం
నరసరావుపేట: టీడీపీ నేతలు, బ్యాంకు సిబ్బంది వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న పల్నాడు జిల్లా అన్నవరం పీఏసీఎస్ ఉద్యోగి ఓరుగుంటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని జీడీసీసీ బ్యాంకు అధికారులు హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో జీతం బకాయిలు చెల్లించడంతో పాటు అతని కుమారుడు లక్ష్మీప్రసన్నకుమార్‌రెడ్డికి తండ్రి ఉద్యోగం ఇస్తామన్నారు. అది కూడా పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. వివరాలు.. పల్నాడు జిల్లా అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఓరుగంటి శ్రీనివాసరెడ్డి గుమాస్తాగా పనిచేస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఉద్యోగం మానుకోవాలంటూ అతనిని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. టీడీపీ నేత, అన్నవరం సొసైటీ సీఈవో దొప్పలపూడి శ్రీనివాసరావు బ్యాంకు స్పెషల్ ఆఫీసర్ సురేంద్రబాబుతో కలిసి మూడు నెలలుగా జీతం కూడా నిలిపివేయించాడు. వారిద్దరి వేధింపులు తట్టుకోలేక శ్రీనివాసరెడ్డి శుక్రవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైఎస్సార్సీపీ నేత, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులపై వెంటనే కేసు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దీంతో శాంతి భద్రతల అదనపు ఎస్పీ సీహెచ్.లక్ష్మీపతి బ్యాంకు అధికారులతో మాట్లాడారు. చీఫ్ మేనేజర్ రమాదేవి ప్రభుత్వాస్పత్రికి వచ్చి శ్రీనివాసరెడ్డి భార్య రామసీతమ్మ, కుమారుడు లక్ష్మీప్రసన్నకుమార్‌రెడ్డి, కుమార్తె దేవికకు హామీలు ఇవ్వటంతో ఆందోళన విరమించారు. వెంటనే హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి బ్యాంకు అధికారులకు సూచించారు. కాగా, తన చావుకు టీడీపీ నేత దొప్పలపూడి శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ సురేంద్రబాబు కారణమంటూ శ్రీనివాసరెడ్డి రాసిన సూసైడ్ నోట్‌ను కుమారుడు లక్ష్మీప్రసన్నరెడ్డి మీడియాకు చూపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
టీడీపీ నేతల వేధింపులకు పల్నాడు ఉద్యోగి బలి
సాక్షి, పల్నాడు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులతో రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఉద్యోగులను ఎవరినీ వదలకుండా వేధింపులకు తెగపడుతున్నారు. తాజాగా పచ్చ నేతల వేధింపులకు పల్నాడులో ఓ ఉద్యోగి బలి అయ్యారు. పల్నాడు జిల్లాలోని అన్నారం సొసైటీ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని టీడీపీ సానుభూతిపరులు దొప్పలపూడి శ్రీనివాసరావు, సురేంద్రబాబులు వేధిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అధికారులు సైతం శ్రీనివాస్ రెడ్డికి రెండు నెలల నుంచి జీతం ఆపేశారు. ఉద్యోగం మానేయాలని ఆ ఉద్యోగంలో తమ వారిని ఎంపిక చేసుకుంటామని ఆయన్ను టీడీపీ నేతలు వేధించారు. వారి వేధింపులు భరించలేక శ్రీనివాస్ రెడ్డి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆయన్ను నరసరావుపేట ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి మృతి చెందారు. శ్రీనివాస్‌రెడ్డి మృతికి టీడీపీ నేతల వేధింపులు కారణమని కుటుంసభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. -
మైనర్‌పై అత్యాచారం.. ఎస్పీ నేత అరెస్ట్!
లక్నో: మైనర్‌పై అత్యాచారం కేసులో రాజకీయ నాయకుడు నవాబ్ సింగ్ యాదవ్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, నవాబ్ సింగ్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నాయకుడని తెలుస్తోంది. మరోవైపు.. నవాబ్ సింగ్‌కు బీజేపీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం.ఈ ఘటనపై కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల యూపీలోని అయోధ్యలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. నిన్న రాత్రి 1.30 సమయంలో ఓ బాలిక 112 నంబర్‌కు కాల్ చేసింది. ఈ సందర్బంగా తనపై అత్యాచారం చేశారని, తన అత్తను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. దీంతో, ఓ పోలీసు ఆమె వద్దకు వెళ్లారు. అనంతరం, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. అక్కడ నవాబ్ సింగ్, మరో మహిళ ఉన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవాబ్ సింగ్‌పై పోక్సో నమోదు చేసి అరెస్ట్ చేశాము. కాగా, ఉద్యోగం పేరుతో ఆశ చూపించి నవాబ్ సింగ్ వారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసిందని పోలీసులు చెప్పారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోను బాధితురాలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. #WATCH | Uttar Pradesh: SP leader Nawab Singh Yadav arrested in Kannauj for allegedly attempting to rape a minor girl. Kannauj SP, Amit Kumar Anand says, "Last night around 1.30 am, a call was received on UP 112 wherein a girl said that she had been stripped and an attempt of… pic.twitter.com/7nD114yei9— ANI (@ANI) August 12, 2024 మరోవైపు.. నవాబ్ సింగ్ అరెస్ట్ అనంతరం ఎస్పీ అమిత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవాబ్ సింగ్ ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. అతడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. కానీ, అతడిని రక్షించేందుకు కొందరు బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్టు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. నిజానిజాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. The rape survivor minor girl herself called police and took them to the rapist Samajwadi party leader Nawab.He's a close man to Dimple Yadav...Some people really vote for these people? I mean why? pic.twitter.com/6XCIzO5szJ— Mr Sinha (@MrSinha_) August 12, 2024 -
టీడీపీ నేతల వేధింపులు తాళలేక ‘అంగన్వాడీ’ ఆత్మహత్యాయత్నం
రాయచోటి: తెలుగుదేశం పార్టీ నాయకులు, ఓ విలేకరి (సాక్షి, ఈనాడు కాదు) వేధింపులు భరించలేక అంగన్వాడీ కార్యకర్త పురుగులు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన శనివారం అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, భర్త వీరభద్ర కథనం మేరకు.. దుద్యాల పంచాయతీ పెద్దజంగంపల్లికు చెందిన అంగన్వాడీ కార్యకర్త జె. నాగరత్నకు గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లు మంజూరైంది. ఆమె భర్త వీరభద్ర వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడనే నెపంతో.. తమ ఇంటిని కూల్చివేస్తామని భార్యాభర్తలను టీడీపీ నేతలు, సదరు విలేకరి వేధింపులకు గురి చేస్తూండేవారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రోజూ కుటుంబంపై జరుగుతున్న ఘటనలకు బతుకు మీద విరక్తి చెందడంతో పురుగుల మందు తాగిందని భర్త వీరభద్ర కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంగన్వాడీల నిరసన.. అంగన్వాడీ వర్కర్ నాగరత్నమ్మకు మద్దతుగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట అంగన్వాడీలు నిరసన ప్రదర్శన చేశారు. సీఐటీయూ నేతలు రామాంజనేయులు, శ్రీనివాసులు, భాగ్యలక్ష్మి, సీపీఎం , సీపీఐ నాయకులు , ఐసీడీఎస్ పీడీ శశికళ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న టీడీపీ నాయకులు, ఓ పత్రిక విలేకరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.తాళ్లతో బంధించి దళిత యువకుడిపై దాడికాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో ఘటన ప్రేమ పేరుతో అల్లరి చేశాడని యువకుడిపై యువతి ఫిర్యాదుసామర్లకోట: ప్రేమిస్తున్నానని చెప్పిన ఓ దళిత యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి తాళ్లతో బంధించి చిత్రహింసలు పెట్టారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పీబీ దేవం గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. సామర్లకోట సీఐ ఆర్.అంకబాబు కథనం ప్రకారం..గ్రామానికి చెందిన దళిత యువకుడు చాపల అజయ్ కుమార్.. అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ ఆమె ఇంట్లోకి వెళ్లి అల్లరి చేశాడు. దీనిపై ఆ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిని ప్రేమిస్తున్నానని చెప్పిన నేరానికి ఆమె కుటుంబ సభ్యులు ఆ యువకుడి చేతులు కట్టి, చిత్రహింసలకు గురి చేయగా అతడు తీవ్రంగా గాయపడ్డాడని దళిత సంఘాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తామని సీఐ చెప్పారు. దళిత యువకుడిని చిత్రహింసలకు గురి చేశారనే ఆరోపణలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. కాగా, దళిత యువకుడిపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ డిమాండ్ చేశారు. అజయ్, ఆ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని, ఈ నెల 1న ఇద్దరూ కలసి బయటకు వెళ్లారని, రాత్రి సమయంలో ఆ యువతిని అజయ్ కుమార్ ఇంటి వద్ద క్షేమంగా దింపాడని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను చిత్రహింసలు పెడుతున్నారనే విషయం తెలిసి, అజయ్ శనివారం ఆమె ఇంటికి వెళ్లాడని దీంతో యువతి కుటుంబీకులు అతడిని తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. బందీగా ఉన్న అజయ్ కుమార్‌ను పోలీసులు విడిపించి, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారని చెప్పారు. -
ఎన్టీఆర్ జిల్లా: వేధింపులపై ఎదురుతిరిగారని దాడి చేశారు
ఎన్టీఆర్: ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు మండలం కంభంపాడులో 10వ తరగతి బాలికలను వేధిస్తున్న అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు వేధించారు. ఎదురుతిరిగినందుకు బాలికపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. గత మూడు రోజులుగా ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న సమయంలో కొంతమంది యువకులు వెకిలిచేష్టలతో బాలికను వేధిస్తున్నారు. వారు ఎదురుతిరిగినందుకు బాలికలపై దాడి చేశారు. ఇంట్లో వాళ్లకు చెబితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. యువకుల వేధింపులు తాళలేక బాలికలు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలిపారు. యువకులను బాలికల తల్లిదండ్రులు ప్రశ్నించినగా వారిపై కూడా దాడి తెగపడ్డారు. దీంతో ఆ అకతాయి యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
డాక్టర్ కారు అని నమ్మాను..కానీ నా చేయి పట్టుకుని: బుల్లితెర నటి
బాలీవుడ్ నటి తిలోతమా షోమ్ ఇటీవల సీఏ టాపర్ వెబ్ సిరీస్‌లో మెరిసింది. ఈ సిరీస్‌ను త్రిభువన మిశ్రా డైరెక్షన్లో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ నటి తనకెదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హజరైన తిలోతమా లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఇది నా జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటన అని పేర్కొంది. ఢిల్లీలో బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది.తిలోతమా మాట్లాడుతూ..'ఢిల్లీలో బస్సు కోసం ఎదురు చూస్తున్నా. ఒక కారు వచ్చి నా దగ్గర ఆగింది. నేను భయంతో కొంచెం దూరంగా వెళ్లాలనుకున్నా. కానీ నేను పరిగెత్తితే వారు నన్ను పట్టుకోగలరు. అందుకే రహదారి మధ్యలోకి వచ్చి లిఫ్ట్ అడిగా. చాలా కార్లు వెళ్తున్నా ఎవరూ ఆపలేదు. కొద్దిసేపటికే మెడికల్ గుర్తు ఉన్న కారు ఆపారు. అపరిచితుడితో కలిసి ముందు సీటులోకి కూర్చున్నా. కొంచెం దూరం వెళ్లాక అతను నా చేయి పట్టుకున్నాడు. తాను ప్యాంటు విప్పాడు. నా చేతిని బలవంతంగా పట్టుకున్నాడు. దీంతో అతనిపై తిరగబడడంతో కారు ఆపేశాడు. ఆ తర్వాత కారు దిగేశా' అని చెప్పుకొచ్చింది.అదో భయంకరమైన జ్ఞాపకం..ఇది నా జీవితంలో ఎదురైన భయానక అనుభవం తిలోతమా షోమ్ పేర్కొంది. ఈ ఘటనతో తాను చలించిపోయానని చెప్పింది. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ అతను డాక్టర్ కావడం వల్ల సురక్షితంగా ఉంటుందని భావించి కారు ఎక్కానని వెల్లడించింది. అయితే నేను కారు ముందు సీట్లో కూర్చోవడంతో.. డ్రైవర్ తన ప్యాంట్ విప్పి.. నా చేతిని బలవంతంగా లాగడానికి ప్రయత్నించాడని తెలిపింది. దీంతో వెంటనే అతన్ని కొట్టడంతో కారు ఆపేశాడు.. ఆ తర్వాత వెంటనే కారు దిగి బయటకు వచ్చానని తిలోతమా ఆ చేదు సంఘటనను వివరించింది. నాలోని తిరగబడే ధైర్యమే ఆ రోజు కాపాడిందని సీఏ టాపర్ నటి వెల్లడించింది. -
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్ పోస్ట్ వైరల్!
సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళలు, చిన్నారులపై జరిగే దారుణాలపై నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటోంది. ప్రపంచలో ఎక్కడ అఘాయిత్యం జరిగినా సోషల్ మీడియాలో వేదికగా పోరాటం చేస్తూనే ఉంది. గతంలో మీటూ ఉద్యమంలోనూ చిన్మయి శ్రీపాద గట్టిగానే మహిళల తరఫున పోరాడింది.తాజాగా నటుడు జాన్ విజయ్ మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రస్తావించింది. అతని ప్రవర్తనపై ఇతర మహిళలు కూడా తనతో మాట్లాడారని తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్షాట్లను చిన్మయి ట్విటర్లో షేర్ చేసింది. పని ప్రదేశాల్లో, పబ్‌లు, రెస్టారెంట్లలో జాన్ విజయ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తనకు వచ్చిన స్క్రీన్‌షాట్స్‌ను పంచుకుంది. కాగా.. 2018లోనూ అతనిపై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. జాన్ విజయ్ చివరిసారిగా మలయాళ నటుడు దిలీప్ నటించిన తంకమణి చిత్రంలో విలన్‌గా కనిపించాడు. 2017లో దేశాన్ని కుదిపేసిన లైంగిక వేధింపుల కేసులో నిందితుల్లో దిలీప్ కూడా ఒకరు. అంతే కాకుండా 'ఓరం పో', 'సర్పట్ట పరంబరై, 'సలార్: పార్ట్ 1- సీజ్ఫైర్' లాంటి చిత్రాల్లో జాన్ విజయ్ నటించారు. ప్రభాస్ నటించిన సలార్ మూవీలో రంగ పాత్రలో జాన్ విజయ్ కనిపించారు.More on John Vijay from others who read the post.One of them interviewed him on camera. pic.twitter.com/md6TkyYNJn— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024After The Newsminute report about the Sexual Assault case of Malayalam cinema also mentioned John Vijay for his misdemeanour with the journalistThere are other women speaking about his behaviour in general. pic.twitter.com/AfeLgdC0lY— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024 -
టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్య
కాకినాడ, సాక్షి: టార్గెట్ వైఎస్సార్సీపీతో కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలను కొనసాగిస్తోంది. ఆ పార్టీ నేతల దగ్గరి నుంచి సానుభూతిపరులదాకా, చివరకు ఓటర్లపైనా భౌతిక దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది. మరోవైపు ఆన్లైన్ వేదికగానూ వేధింపులకూ తెగబడుతోంది. ఈ వేధింపులు భరించలేక కాకినాడలో వైఎస్సార్సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో వేట్లపాలెం 10వ వార్డు మెంబర్‌గా వైఎస్సార్సీపీ నేత బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణ ఉన్నాడు. అయితే.. గత కొన్నిరోజులుగా టీడీపీ నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పి ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ ఆయనకు వేధింపులు పెరిగిపోయాయి. దీంతో భరించలేని ఆయన తన నివాసంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సత్యనారాయణ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియగానే స్థానిక వైఎస్సార్సీపీ నేతలు సత్యనారాయణ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్నారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల వాంగ్మూలం సేకరిస్తున్నారు. -
‘వాట్సాప్ గ్రూప్‌లో సూటిపోటి మాటలు.. భరించలేకపోతున్నా!’
ఢిల్లీ: ఆమె ఓ ప్రముఖ బ్యాంకులో ఉద్యోగిణి. కానీ, పని చేసే చోట ఏదో ఒకరూపంలో వేధింపులు ఎదుర్కొంది. వేసుకునే దుస్తుల దగ్గరి నుంచి.. ఆమె తినే తీరు, మాట్లాడే విధానం.. ఇలా తోటి ఉద్యోగులు అన్నింటా ఆమెను హేళన చేస్తూ వచ్చారు. అది పరిధి దాటి వాట్సాప్ గ్రూపుల్లో ఆమెను ట్రోలింగ్ చేసే స్థాయికి చేరుకుంది. భరించలేక లేఖ బలవన్మరణానికి పాల్పడిందామె.నోయిడా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో రిలేషన్షిప్ మేనేజర్‌గా పనిచేసే శివాని త్యాగి ఆత్మహత్య ఘటన ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఘజియాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందామె. ఆరు నెలలపాటు ఆఫీస్‌లో తోటి ఉద్యోగులు ఆమెను వేధించారని, అది భరించలేకే అఘాయిత్యానికి పాల్పడిందని శివాని కుటుంబం ఆరోపిస్తున్నారు. వీటికి తోడు..ఆమె గదిలో దొరికిన సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘సూటిపోటి మాటలతో అన్నింటా అవమానిస్తూ వస్తున్నారు.. ఆఫీస్ వాట్సాప్ గ్రూప్‌లోనూ అది కొనసాగింది. భరించలేకపోతున్నా. తమ్ముడూ.. అమ్మానాన్న, చెల్లి జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసిందామె. లేఖలో మృతురాలు ఐదుగురి పేర్లు ప్రస్తావించింది. పని ప్రాంతంలో ఆమె వేధింపులు ఎదుర్కొందన్న విషయం లేఖ ద్వారా స్పష్టమైంది అని ఘజియాబాద్ డీసీపీ గ్యానన్‌జయ్ సింగ్ మీడియాకు కేసు వివరాల్ని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఆమెను ట్రోలింగ్ చేసేందుకే ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపారాయన.వేధింపులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. వేధింపులు భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆమె చాలాసార్లు ప్రయత్నించింది. కానీ, పైఅధికారులు ఆమెను ఆపుతూ వచ్చారు. అయితే ఓ సహోద్యోగిణితో వాగ్వాదంలో శివాని ఆమెపై చెయ్యి చేసుకుంది. ఆ ఘటన తర్వాత ఆమెకు తొలగింపు నోటీసులు ఇచ్చారు. శివాని అది తట్టుకోలేకపోయింది అని ఆమె సోదరి మీడియాకు చెబుతూ కంటతడి పెట్టింది. -
మరో మలుపు తిరిగిన పూజా ఖేద్కర్ వ్యవహారం
ముంబై: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పుణే జిల్లా కలెక్టర్ సుహార్ దివాసే తనను వేధించారంటూ వాశిం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఓ అధికారి ధృవీకరించారు. మహిళా పోలీసులు సోమవారం వాశింలోని ఖేద్కర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమె పుణే కలెక్టర్ సుహాస్ దివాసేపై ఫిర్యాదు చేశారు అని ఆ అధికారి తెలిపారు. అయితే.. గత రాత్రి 11 గం. సమయంలో ముగ్గురు మహిళా పోలీస్ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి 1గం. టైంలో వెళ్లిపోయారు. పోలీసులు ఎందుకు వచ్చారనే దానిపై నిన్న మీడియా ముందు పూజా ఖేద్కర్ మరోలా స్పందించారు. తనకు పని ఉండి మహిళా పోలీసులను తానే పిలిచానని ఆమె చెప్పారు. అయితే ఆ పని ఏంటన్నది మాత్రం ఆమె చెప్పలేదు. ట్రెయినింగ్‌లో ఉంటూనే పూజా ఖేద్కర్ గొంతెమ్మ కోర్కెలు కోరడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ఆరోపణలపై ఆమెను వాశింకు బదిలీ చేసింది కలెక్టర్ సుహార్ దివాసే. మరోవైపు ఆమె శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ.. రీకాల్ ఆదేశాలు జారీ చేసింది ముస్సోరీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. తక్షణమే ఆమెను వెనక్కి రావాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఆమెపై చర్యల కోసమే ఆ ఉత్తర్వులు వెలువడి ఉంటాయనే చర్చ నడుస్తోంది. -
దారుణాలకు ఏఐ దన్ను!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్లో ఓ డాక్టర్‌కు ఉదయం నుంచి మీరు లోన్ కట్టాలంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కాల్స్ వచ్చాయి. తరువాత వాయిస్ కాల్స్ చేసి విసిగించారు. చేసిన ప్రతీసారీ కొత్త నెంబరుతో వేధించడంతో ఏం చేయాలో పాలుపోక ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు. మీ మిత్రుడు లోన్ తీసుకున్నాడంటూ మరో పోలీసు అధికారికి పదే పదే ఫోన్లు చేసి విసిగించారు. ఇది కేవలం పోలీసులు, వైద్యులకే కాదు.. రాజకీయ నాయకులు, అధికారులు మొదలుకుని విలేకరులను కూడా వదలకుండా వేధిస్తున్నారు.⇒ ఇంతకాలం కాల్‌సెంటర్ల ద్వారా వేధించిన లోన్‌యాప్ యాజమాన్యాలు ఇప్పుడు రూటు మార్చాయి. తమ బాకీని ఎలాగైనా వసూలు చేసుకునేందుకు సరికొత్త పంథాను ఎంచుకున్నాయి. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను సరికొత్త ఆయుధంగా వాడుతున్నాయి. ముందుగా లోన్ తీసుకునే వ్యక్తి నుంచి కాంటాక్ట్స్ యాక్సెస్ చేయాలా? అని అడుగుతారు. యాక్సెస్ పరి్మషన్ ఇవ్వకపోతే లోన్ రాదు. అవసరాల్లో ఉంటారు కాబట్టి అంతా కాంటాక్ట్ యాక్సెస్ పర్మిషన్ ఇస్తారు. ఇదే అదనుగా కాల్స్ చేసి విసిగించడంతోపాటు ఆటోమేటిక్ కాల్స్‌తో వేధింపులకు దిగుతున్నారు.ఉదయం, సాయంత్రం ఏఐ కాల్స్!⇒ ఒక వ్యక్తి ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్న వందలు, వేల కాంటాక్ట్స్‌కి ఒకేసారి ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా గ్రూప్ కాల్ వెళ్తుంది. సార్ మీ లోన్ పెండింగ్‌లో ఉంది. వెంటనే ఈ నెంబరుకు కాల్‌బ్యాక్ చేయండి అంటూ రికార్డెడ్ వాయిస్ వస్తుంది. ఉదయం, సాయంత్రం, లంచ్ సమయాల్లో ఏఐ కాల్స్ వస్తాయి. ప్రతీ పది నిమిషాలకు ఒకసారి కాల్స్ చేసి విసుగు తెíప్పిస్తాయి.కొత్త తలనొప్పులు..⇒ సాధారణంగా ఎవరైనా పోలీసు, వైద్యుడు, ప్రభుత్వాధికారి, రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లను సేవ్ చేసుకుంటారు. అయితే సదరు వ్యక్తి పొరపాటున అప్పు తీసుకుని కట్టకపోతే.. అప్పుడు ఈ కాంటాక్ట్స్‌లో ఉన్న వారంతా బాధితులుగా మారుతున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుంటే అప్పు వసూలు చేయవచ్చన్నది వారి వ్యూహం. ప్రజాజీవితంతో ముడిపడి పనిచేసే వీరు రోజంతా ఏదో పనిలో తలమునకలై ఉంటారు. పైగా నెంబర్లు మార్చి మార్చి చేయడంతో ఎత్తక తప్పనిసరి పరిస్థితి. తీరా ఎత్తితే.. అప్పు కట్టాలి అంటూ వేధింపులు, తిట్లు, దూషణలతో విసిగిస్తున్నారు. మొత్తానికి అకారణంగా వీరంతా వేధింపులకు గురవుతున్నారు. లోన్ యాప్ వేధింపుల నుంచి బయటపడండిలా..⇒ ఎంచుకున్న లోన్‌యాప్ రివ్యూలు ఆన్లైన్లో చదవాకే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ⇒ యాప్‌లో అనవసరమైన కాంటాక్ట్ ఎనేబుల్ పరి్మషన్స్ ఇవ్వరాదు. ⇒పదేపదే కాల్స్ వస్తే బ్లాక్ చేయాలి లేదా ట్రూకాలర్‌లో వాటిని స్పామ్ నంబర్లుగా రిపోర్టు చేయాలి. ⇒అయినా వేధింపులు ఆగకపోతే.. డయల్ 100కి కాల్ చేసి చెప్పాలి లేదా సమీపంలోని పోలీసుస్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలి లేదా 1930కి కాల్చేసి ఫిర్యాదు చేయవచ్చు. ⇒ httpr://cybercrime.gov.in ఈ లింక్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చు. -
మహిళా కమిషన్‌కూ వేధింపులు
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కూటమి ప్రభుత్వం కక్షకట్టింది. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధంగా నియమితులైన పలు కమిషన్ల చైర్పర్సన్లు, సభ్యులను వేధింపులకు గురి చేస్తోంది. వారికి వేతనాలు, టీఏ, డీఏలు నిలిపివేసింది. కనీసం కార్యాలయ నిర్వహణ ఖర్చులూ ఇవ్వడంలేదు. వేతనాలు, టీఏ, డీఏ, నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని కోరితే రాజీనామా చేసి వెళ్లిపోవడం మంచిదని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ అధికారులతో చెప్పిస్తోంది.చివరకు మహిళలకు రక్షణగా నిలిచే మహిళా కమిషన్‌ను సైతం ఇదే విధంగా కక్షపూరితంగా వేధిస్తోంది. దీంతో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాష్ట్ర గవర్నర్‌కు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికీ ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్లు, సభ్యులు రాజీనామా చేసి వెళ్లిపోతే, ఆ స్థానాల్లో తమ వారికి పదవులు కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుయుక్తులకు పాల్పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పదవీకాలం 2026 మార్చి వరకు ఉంది. అయితే, గత నాలుగు నెలల వేతన బకాయిలను కోరినా ప్రభుత్వం చెల్లించడంలేదు. సభ్యులకు ఒక నెల వేతనాన్ని నిలిపివేసింది. ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. కమిషన్ చైర్పర్సన్, సభ్యులు విశాఖపట్నం, నర్సీపట్నం, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచేలా చర్యలు చేట్టారు. ఈ పర్యటనల టీఏ, డీఏలు విడుదల చేయకుండా ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి నిర్వహణ ఖర్చులూ నిలిపివేసింది. దీంతో ఆఫీస్ నిర్వహణ, టీఏ, డీఏలు సైతం కమిషన్ చైర్పర్సన్ సొంతంగా పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలకు గురైన ఘటనల్లో బాధితులను ఆదుకోవలంటూ కమిషన్ ఇస్తున్న ఆదేశాలను సైతం అధికారులు, పలు జిల్లాల ఎస్పీలు బేఖాతరు చేస్తున్నారు. ఎస్పీలు కనీసం యాక్షన్ టేకెన్ రిపోర్టులు కూడా పంపించడంలేదు.కమిషన్లకు వేతనాలు ఆపాలంటూ సీఎం ఆదేశాలురాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా గత ప్రభుత్వం నియమించిన అనేక కమిషన్లకు నెలవారీ ఇచ్చే గౌరవ వేతనాలను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అదేశాలు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్, మైనార్టీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఆర్టీఐ కమిషన్ వంటి వాటికి ఈ నెలలో గౌరవ వేతనాలు, టీఏ, డీఏలు ఇవ్వలేదు. ఇలా ఇబ్బందులకు గురిచేసి, రాజకీయంగా వేధించి వారు రాజీనామా చేసి వెళ్లిపోయేలా చేయాలన్నది చంద్రబాబు సర్కారు ఎత్తుగడగా తేటతెల్లమవుతోంది. న్యాయ పోరాటం చేస్తా: గజ్జల వెంకటలక్ష్మినాకు, తోటి సభ్యులకు గౌరవ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. సభ్యులకు ఒక నెల వేతనం ఆపేశారు. నాకు 4 నెలల వేతన బకాయిలకు అర్జీ పెట్టుకున్నా చెల్లించలేదు. కనీసం టీఏ, డీఏలు, ఆఫీసు నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. గౌరవ వేతనం అడిగితే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అధికారులతో ప్రభుత్వం సలహాలు ఇప్పిస్తోంది. బిల్లులు మంజూరు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్‌ను అడిగితే మహిళా కమిషన్‌గా మిమ్మల్ని ఉండనివ్వరని, రాజీనామా చేయిస్తారంటూ బెదిరించినట్టు మాట్లాడారు. ఇదే విషయమై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జి.జయలక్ష్మికి ఫిర్యాదు చేశాను. వారు ఏ చర్యలు తీసుకుంటారో చూస్తాను. రాజ్యాంగ బద్దమైన నా పదవి రెండేళ్లపాటు (2026 మార్చి వరకు) ఉంటుంది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై ప్రభుత్వం తీరు మారకుంటే న్యాయ పోరాటానికి సిద్ధం. -
ప్రాణం తీసిన ‘ఫైనాన్స్’
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి తీసుకున్న రుణం ఓ మహిళ పాలిట మృత్యు పాశమైంది. అధిక వడ్డీలు చెల్లించలేక, ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు భరించలేక తనువు చాలించింది. మంగళవారం విజయవాడలో ఈ విషాదం చోటు చేసుకుంది. విజయవాడ వాంబే కాలనీకి చెందిన అల్లంపల్లి మస్తానమ్మ అలియాస్ మాధవి (44) పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త లక్ష్మీనారాయణతో విభేదాలు తలెత్తడంతో పదేళ్ల క్రితం విడిపోయి వేరుగా ఉంటోంది. ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తగారిళ్లకు పంపింది. వ్యాపారంలో నష్టం రావడం, పిల్లల వివాహాల కోసం కొంత అప్పులు చేసింది. హైదరాబాద్‌కు చెందిన క్రిస్ ఫైనాన్స్, స్పందన అనే సంస్థల ప్రతినిధులు రుణాలు ఇస్తామని చెప్పడంతో వారి వద్ద డబ్బులు అప్పుగా తీసుకోవడంతో పాటు మరి కొంతమంది మహిళలను కూడా గ్రూపులుగా చేర్చి అప్పు ఇప్పించింది. రూ.42 వేలు అప్పు ఇస్తే ప్రతి నెల మొదటి బుధవారం రూ.3,370 చొప్పున 20 నెలల పాటు చెల్లించాలనే షరతుతో ఫైనాన్స్ సంస్థలు అప్పులు ఇచ్చాయి. కొద్ది నెలలుగా అనారోగ్యం, వ్యాపారం సరిగా నడవకపోవడంతో డబ్బులు చెల్లించేందుకు బయట అప్పులు చేసింది. గత బుధవారం డబ్బులు కట్టకపోవడంతో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు ఆమె ఇంటి వద్దకు వచ్చి బెదిరించినట్లు సమాచారం. తాజాగా మంగళవారం మరోసారి వచ్చి భయబ్రాంతులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మస్తానమ్మ వారి ముందే ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై నున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గృహ సారథిగా సేవలు..మస్తానమ్మ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. 60వ డివిజన్లో వైఎస్సార్ సీపీ గృహ సారథిగా మస్తానమ్మ సేవలందించారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో వైఎస్సార్సీపీ నాయకులు, మహిళలు ఆమె ఇంటి వద్దకు చేరుకుని సంతాపం తెలిపారు. -
సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు
బనశంకరి: జేడీఎస్‌కు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాజాగా ప్ర జ్వల్ తమ్ముడు డాక్టర్ సూరజ్ రేవణ్ణ (36)పై కూడా లైంగిక వేధింపుల కే సు నమోదైంది. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారని చేతన్ కే.ఎస్. అనే జేడీఎస్ కార్యకర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాసన్ జిల్లా అరకలగూడుకు చెందిన చేతన్ వీడియోల ను కూడా విడుదల చేయడంతో కన్నడ రాజకీయాల్లో మరోసారి సంచల నం చెలరేగింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్ ఫాంహౌస్‌కు పిలిచి లైంగిక దాడికి యతి్నంచాడని చేతన్ ఆరోపించాడు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేతన్, అతని బంధువు డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే లైంగిక వేధింపుల కేసు పెడతామని బ్లాక్మెయిల్ చేశారని సూరజ్ రేవణ్ణ ముఖ్య అనుచరుడైన శివకుమార్ సైతం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో స్నేహం చేసిన చేతన్.. సూరజ్ రేవణ్ణ బ్రిగేడ్‌కు పనిచేయడం ప్రారంభించాడని, కుటుంబ ఖర్చులకు డబ్బు ఇవ్వాలని కోరగా తాను నిరాకరించడంతో సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరింపులకు దిగారని శివకుమార్ పేర్కొన్నారు. మొదట రూ. 5 కోట్లు తర్వాత దాన్ని తగ్గించి రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నా రు. శివకుమార్ ఫిర్యాదుతో చేతన్, అతని బంధువుపై కేసు నమోదైంది. -
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడిపై లైంగిక ఆరోపణలు.. బెదిరింపులపై ఫిర్యాదు
బెంగళూరు: జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక ఆరోపణల కేసు కర్ణాటకలో సంచలనం సృష్టించింది. తాజాగా ఆయన సోదరుడు సూరజ్ రేవణ్ణపై ఓ యువకుడు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. పోలీసులకు లేఖ రాశారు. దీనిపై సూరజ్ రేవణ్ణ స్నేహితుడు శివకుమార్ సదరు యువకుడితో పాటు మరో వ్యక్తిపై హసన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.‘చేతన్, అతని బావ ఇద్దరూ నన్ను కలిశారు. వారు నా దగ్గర రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు. వారు కోరినట్లు రూ. 5 కోట్లు ఇవ్వకపోతే.. సూరజ్ రేవణ్ణపై లైంగిక దాడి కేసు నమోదు చేస్తామని బెదిరించారు’ అని శివకుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చేతన్ ముందు తననను కలిసి.. ఉద్యోగం ఇప్పించటం కోసం సాయం చేయాలని కోరాడని శివకుమార్ తెలిపారు. దీంతో నేను సూరజ్ రేవణ్ణ ఫోన్ నంబర్ ఇచ్చాను. అతనికి ఉద్యోగం ఇప్పించనందుకే తమ ఇద్దరినీ (శివకుమార్, సూరజ్ రేవణ్ణ)ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫోలీసులకు శివకుమార్ ఫిర్యాదు చేశారు.మరోవైపు.. చేతన్ సైతం ఓ ప్రైవేట్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. సూరజ్ రేవణ్ణ తనను ఆయన ఫామ్ హౌజ్‌లో లైంగిక వేధింపులుకు గురిచేశాడని ఆరోపించారు. ఇక.. లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణను జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్న కొన్ని రోజులకే ఓ యువకుడు అతని సోదరుడు సూరజ్ రేవణ్ణపై లైంగిక ఆరోపణలు రావటం రాజకీయం తీవ్ర చర్చనీయాంశం అయింది. -
నా బిడ్డను పోలీసులు బలి తీసుకున్నారు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన రెంటపాళ్ల ఉపసర్పంచ్, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు మృతదేహానికి సోమవారం గుంటూరు జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు సత్తెనపల్లి రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళన నిర్వహిస్తారని తెలుసుకున్న పోలీసులు మేడికొండూరులో వారిని ఆపారు.సత్తెనపల్లి టౌన్, మేడికొండూరు సీఐలు పోలూరి శ్రీనివాసరావు, జయకుమార్.. వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. ఎస్బీ సీఐ సురేష్ ఫోన్లో మాట్లాడుతూ జరిగిన విషయం బాధాకరమని, అన్ని విషయాలను పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గర్గ్‌కు వివరించి తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తామని అతడికి తెలిపారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు కారకుడైన సీఐ రాజేశ్ కుమార్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఎలాంటి ఆందోళన చేయకుండా అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు మెత్తబడ్డారు. మృతదేహం ఉన్న వాహనంతో పాదయాత్రగా, ద్విచక్ర వాహనాలతో సత్తెనపల్లి, పాకాలపాడు మీదుగా రెంటపాళ్లకు చేరుకున్నారు.అక్కడ సత్తెనపల్లి డీఎస్పీ జి.గురునాథ్ బాబు నేతృత్వంలో పోలీస్ బలగాలు బందోబస్తు నిర్వహించాయి. ఈ సందర్భంగా మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అభం, శుభం తెలియని తన బిడ్డను పోలీసులు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఊరు వదిలి పోవాలని బెదిరించారని ఆరోపించారు. లేకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తానని సత్తెనపల్లి రూరల్ సీఐ రాజేశ్ కుమార్ హెచ్చరించారని మండిపడ్డారు. తక్షణమే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఇంటిపై దాడి చేసి తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేందుకు కారకులైన టీడీపీ, జనసేన నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా నాగమల్లేశ్వరరావు మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్లుడు ఉపే‹Ù, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, తదితరులు సందర్శించి నివాళులు అరి్పంచారు. -
పోలీసుల వేధింపులతో ఉప సర్పంచ్ ఆత్మహత్య
సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన ఉప సర్పంచి, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు (37) నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మృతిచెందాడు. అతడి మృతితో సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో ఉద్రిక్తత నెలకొంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈనెల 4న పాకాలపాడు పీఏసీఎస్ అధ్యక్షుడు కొర్లకుంట వెంకటేశ్వర్లు కౌంటింగ్‌కు వెళ్లాడు. ఆయన కుమారుడు రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఇంటి వద్ద ఉన్నాడు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఈనెల 4వ తేదీ ఉదయం ఏడుగంటల సమయంలో నాగమల్లేశ్వరరావును ట్రబుల్ మంగర్స్ బైండోవర్‌లో భాగంగా పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారు. మధ్యాహ్నం ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా రావడంతో రెంటపాళ్లలోని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నాగమల్లేశ్వరరావు ఇంటిపై, ఎస్సీ కాలనీపై దాడులకు దిగారు. నాగమల్లేశ్వరరావు ఇంట్లో ఆయన భార్య నందిని, కుమార్తె యశస్విని ఉన్నారు. ఇంటిమీద దాడిచేస్తున్న విషయాన్ని యశస్విని తన తండ్రి నాగమల్లేశ్వరరావుకు ఫోన్‌చేసి చెప్పింది. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఆయన ఫోన్ మాట్లాడబోతుండగా పోలీసులు ఫోన్ లాక్కున్నారు. ఈ నెల 5న సాయంత్రం మర్యాదగా గ్రామం విడిచి వెళ్లు .. లేకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తానంటూ సత్తెనపల్లి రూరల్ సీఐ రాజే‹Ùకుమార్ బెదిరించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో నాలుగు రోజులపాటు దూరంగా ఉంటే గొడవలు సర్దుబాటవుతాయని భావించిన తండ్రి వెంకటేశ్వర్లు కూడా నాగమల్లేశ్వరరావును గుంటూరులో సోదరుడు కొర్లకుంట శ్రీకాంత్ వద్దకు పంపాడు. తనపై ఒక్క కేసు కూడా లేకపోయినా, ఇంటిపైకి వచ్చి గొడవచేసి దాడులు చేసిన టీడీపీ, జనసేన నాయకులను వదిలేసి పోలీసులు తనను బెదిరించటంతో మనస్తాపానికి గురైన నాగమల్లేశ్వరరావు ఈనెల 6న పేరేచర్ల వద్ద గడ్డిమందు కొనుగోలు చేసి 14వ మైలు వద్ద తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటినుంచి మృత్యువుతో పోరాడిన నాగమల్లేశ్వరరావు ఆదివారం మరణించాడు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సమయంలో మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడ పోలీసులు ఫిర్యాదును ట్యాంపరింగ్ చేశారు. నాగమల్లేశ్వరరావు మృతి వార్తతో రెంటపాళ్లలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసు బలగాలను మోహరించారు. నాగమల్లేశ్వరరావు మృతదేహాన్ని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, అంబటి అల్లుడు ఉపేష్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, నాయకులు నల్లబోతు శివనారాయణ, చల్లా శ్రీను, కొమెర శివశంకర్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లును ఓదార్చారు. తన కుమారుడి మృతికి కారకులపై పోలీసు ఉన్నతా«ధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నాగమల్లేశ్వరరావు మృతదేహానికి గుంటూరు జీజీహెచ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. -
టీడీపీ వేధింపులకువైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి
పెదవేగి: టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మండల కన్వీనర్ యలమంచిలి ప్రవీణ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్యారావుపేటకి చెందిన ప్రవీణ్ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దుర్ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి అహర్నిశలు శ్రమించాడన్న కక్షతో ఓట్ల లెక్కింపు రోజు (ఈనెల 4న) సాయంత్రం ప్రవీణ్ ఇంటి మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, బీరు సీసాలు విసిరి, దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు. పెదవేగి పెట్రోల్ బంక్ వైపు వస్తే కొడతామని, బైక్, కారు తగలబెట్టేస్తామని హెచ్చరించారు. బుధవారం ఉదయం ప్రవీణ్ విజయరాయి పెట్రోల్ బంక్‌కి వెళ్లగా.. బండిపై మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఫొటోతో ఉన్న వైఎస్సార్సీపీ స్టిక్కర్ తీసేవరకు బీభత్సం సృష్టించి దాడిచేశారు. టీడీపీ వారి బెదిరింపులకు భయపడి, వేధింపులు భరించలేక ప్రవీణ్.. తన ఇంటి సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేçÜుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ తల్లిదండ్రులు యలమంచిలి ఝన్సీరాణి, ప్రకాశరావు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఉరుకోం టీడీపీ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ భౌతికకాయానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్‌ను బలితీసుకున్న టీడీపీ కార్యకర్తల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని, వారి ఇళ్ల మీదకు వెళ్లి భౌతికదాడులు చేస్తూ, వాహనాలు, ఇంట్లో వస్తువులు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఊరుకునేదిలేదని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులంతా సంయమనం పాటించాలని కోరారు. -
కర్ణాటకలో కొత్త ట్విస్ట్.. ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణకు సిట్ నోటీసులు
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణను విచారించేందుకు శుక్రవారం ఐపీసీ సెక్షన్లు 64(A), 365, 109, 120(B) కింద సిట్ నోటీసులు ఇచ్చింది. తమ విచారణ కోసం భావానీ రేవణ్ణ హోలెనర్సీపూర్‌లోని వారి నివాసంలోనే జూన్ 1న సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది. #BreakingS.I.T issues another notice to #PrajwalRevanna's mother #BhavaniRevanna in the kidnapping case.Prajwal Revanna will shortly be taken for a medical examination, and after that, he will be brought to the City Civil Court Complex for further questioning...: @dpkBopanna… pic.twitter.com/G9croxFBP6— TIMES NOW (@TimesNow) May 31, 2024 ఇక.. శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి భారత్‌కు వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణను సిట్ పోలీసులు బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. ఇక.. అక్కడి నుంచి ఆయన్ను విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా ప్రజ్వల్‌కు పొటెన్సీ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
మహిళా డాక్టర్ పై ఫుడ్ సేఫ్టీ అధికారి వేధింపులు
-
బెంగళూరులో బిగ్ ట్విస్ట్.. ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్
బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు.చదవండి: ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్ రేవణ్ణSuspended #JDS leader #PrajwalRevanna Returns From #Germany, Arrested In Sex Crimes Case.#Hassan MP Prajwal Revanna - who fled to Germany last month, shortly after sex crimes allegations by women who said he forced them into sexual acts that were then filmed - was arrested just… pic.twitter.com/xvDR0Q8qBA— Hate Detector 🔍 (@HateDetectors) May 30, 2024 అక్కడ దిగిన వెంటనే ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్‌ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు.చదవండి: మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవణ్ణపలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయమం తెలిసిందే. దీంతో ప్రజ్వల్ గత ఏప్రిల్‌లో భారత్ విడిచి జర్మనీ పరారయ్యారు. ఇక.. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి.Nearly a month after JD(S) suspended #Hassan MP Prajwal Revanna lands at Kempegowda International Airport, #BengaluruSecurity was tightened at the airport.Revanna to face a probe by SIT, for allegedly assaulted several women and filmed.#PrajwalRevanna #Karnataka pic.twitter.com/L7VT5SPIkP— Surya Reddy (@jsuryareddy) May 30, 2024 అదేవిధంగా ప్రజ్వల్‌కు నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు కూడా చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బహిరంగానే ప్రజ్వల్‌ను కోరిన విషయం తెలిసిందే.చదవండి: ప్రజ్వల్‌కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్యచదవండి: ప్రజ్వల్ రేవణ్ణకు తాత దేవెగౌడ వార్నింగ్.. వెంటనే భారత్‌కు రావాలి -
పోకిరీకి చెప్పుతో దేహశుద్ధి
యశవంతపుర: ఐ లవ్ యూ అని మహిళకు పదే పదే మెసేజ్‌లు పంపి వేధిస్తున్న పోకిరీని ఆమె పాదరక్షతో దేహశుద్ధి చేసింది. ఈ సంఘటన బాగలకోట జిల్లా ఇళకల్ పట్టణంలో జరిగింది. యాసిన్ అనే యువకుడు నివేదిత అనే మహిళను ప్రేమించాలని వాట్సాప్‌లో సందేశాలు పంపసాగాడు. ఇద్దరూ పెళ్లయి కుటుంబాలు ఉన్నవారే. కానీ యాసిన్ బుద్ధి పెడదారి పట్టింది. తనను ప్రేమించాలని ఆమెను వెంటపడసాగాడు. దీంతో ఆదివారం ఆక్రోశానికి గురైన మహిళ యాసిన్ ఇంటికి వచ్చి అతన్ని చెప్పుతో చితకబాదింది. తప్పయిపోయిందని పోకిరీ దండాలు పెట్టాడు. స్థానికులు ఆమెకు సర్దిచెప్పి పంపారు. -
మహిళా ఉద్యోగులపై వేధింపులు.. కామారెడ్డి DMHO సస్పెండ్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా వైద్యాధికారులను లైంగికంగా వేధించినట్లు రుజువుకావడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని కలెక్టర్, ఎస్పీతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన వైద్యశాఖ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యాధికారి అమర్ సింగ్ నాయక్ బుధవారం కామారెడ్డి డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి వివరాలను సేకరించారు. తమను డీఎంహెచ్‌వో ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని మహిళా ఉద్యోగులు ఆయనకు వివరించారు. దీంతో లక్ష్మణ్‌సింగ్‌పై వివిధ సెక్షన్ల కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మహిళా మెడికల్ ఆఫీసర్లను లక్ష్మణ్ సింగ్ వేధిస్తున్నాడని తేలడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. -
కిషన్ లీలలెన్నో..!
కుత్బుల్లాపూర్: పారిశుద్ధ్య విభాగం మహిళా కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ వ్యవహార శైలి ఆది నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో ఆర్టీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా కండక్టర్ విధులు నిర్వర్తిస్తూ డబ్బులు కాజేయడంతో సర్వీసు నుంచి ఇతడిని తొలగించినట్లు తెలిసింది. రాజు కాలనీలో నివాసముండే కిషన్ కూకట్పల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తూ అక్కడి నుంచి అయిదేళ్ల క్రితం గాజులరామారం సర్కిల్‌కు బదిలీపై వచ్చి సూరారం కాలనీలో ఉంటున్నాడు. కాగా.. మహిళా కారి్మకులతో కిషన్ రాసలీలలు బయటపడడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అతడిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కిషన్‌తో పాటు రాసలీలల వీడియోను వైరల్ చేసిన పారిశుద్ధ్య కార్మికుడు ప్రణయ్‌ని సైతం సస్పెండ్ చేయాలని కూకట్పల్లి జడ్సీ అభిలాష అభినవ్‌కు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల కిందటే వెలుగులోకి వచ్చినా.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వాటిని సెల్ఫోన్లో బంధించి మహిళలను లోబరుచుకునేవాడు. తనకు అనుకూలంగా ఉండే మహిళలతో ఒకలా.. లేనివారితో మరోలా వ్యవహరిస్తూ వచ్చేవాడని.. మొత్తం మూడు యూనిట్ల బాధ్యతలు నిర్వహిస్తూ 21 మంది పారిశుద్ధ్య కారి్మకుల హాజరు వేసే విషయంలో సైతం చేతివాటం ప్రదర్శించేవాడని ఆరోపణలున్నాయి. ఆయా అంశాలు మూడు నెలల క్రితమే షాపూర్‌నగర్ యూనిట్లో వెలుగులోకి వచి్చనా అధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా సూరారం ప్రాంతానికి బదిలీ చేసి చేతులు దులుపుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఎదుట వివరణ.. 👉 గ్రేటర్ పరిధిలో మహిళలపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ (ఐసీసీ) గతంలో ఏర్పాటు అయ్యింది. గురువారం వెలుగు చూసిన శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ వ్యవహార శైలిపై ఐసీసీ కమిటీ ముందు అదే రోజు రాత్రి 11 గంటల వరకు విచారణ చేశారు. ఉప కమిషనర్ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్ రెడ్డితో పాటు కిషన్ సైతం హాజరయ్యారు. గతంలో బయోమెట్రిక్ మిషన్ ఎక్కడో పోగా.. పారిశుద్ధ్య కారి్మకులు పోగొట్టారని వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కమిటీ ముందు స్పష్టం చేశారు. 👉 తన రాసలీలల వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులకు విషయం చెప్పిన కిషన్.. అది వైరల్ చేసే క్రమంలో మొత్తం 14 మందికి డబ్బులు ఇచ్చినట్లు తేలింది. వీడియో పలు గ్రూపుల వారీగా చక్కర్లు కొట్టడంతో వాటిని ఇతరులకు పంపకుండా 14 మందికి రూ. వేయి మొదలుకొని రూ.10 వేల వరకు ముట్ట చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికొంత మంది బెదిరింపులు చేయడంతో కిషన్.. ఈ నెల 17న ఉప కమిషనర్ మల్లారెడ్డి, వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్‌రెడ్డికి విషయాన్ని చెప్పుకోవడంతో అతడిని విధుల నుంచి తప్పించారు. వీడియోల లీక్‌పై ఆరా.. గురువారం పలు సామాజిక మాధ్యమాల్లో కిషన్ వీడియోలు చక్కర్లు కొట్టడంతో అధికారులు అవాక్కయ్యారు. ఇవి ఎలా లీక్ అయ్యాయి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఫార్వర్డ్ చేస్తున్న వారిపై సైతం కేసులు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. కాళ్లు మొక్కి.. కవర్ చేసి.. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ తాను తీసుకున్న గోతిలో తానే పడడంతో.. వీడియో వైరల్ చేసిన ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కుతూ కవర్ చేస్తూ వచ్చాడు.. కొంతమంది బెదిరించి డబ్బులు వసూలు చేయగా.. మరి కొంతమంది వదిలేశారు.. ఇలా మూడు నెలల పాటు ముప్పతిప్పలు పెట్టిన పలువురు కార్మికులు, తోటి శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎట్టకేలకు వీడియోను బయటకు పంపడంతో విషయం వెలుగులోకి వచి్చంది. శుభకార్యానికి వెళ్లి సాయి అనే కారి్మకునికి ఫోన్ ఇవ్వడం.. ప్రణయ్ అనే మరో కార్మికుడు ఈ వీడియోలను పలువురికి వైరల్ చేయడం.. ఆ తర్వాత మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిషన్ కామలీలలు బయటపడడంతో ఆయనపై ఉన్నతాధికారులు వేటు వేయడం చకచకా జరిగిపోయాయి. -
‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయండి’
బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన హసనా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడియోలు వైరల్ అయిన తర్వాత ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టుతో దేశం వదిలి వెళ్లిపోయారు. ఇది చాలా సిగ్గు చేటు. ప్రజ్వల్ దేశం వదిలి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. క్రిమినల్ ప్రోసిడింగ్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టును దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నా. ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోండి’’ అని సీఎం సిద్ధారామయ్యలో తన లేఖలో పేర్కొన్నారు. ఇక.. సిద్ధరామయ్య రాసిన లేఖపై కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి శాఖ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. లైంగిక దాడి, అసభ్య వీడియోల కేసులో కర్ణాటక ప్రభుత్వ సమగ్రమైన దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రజ్వల్‌పై సిట్ విచారణ అధికారులు లుక్ అవుట్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.అంతకుముందు ఈ కేసు విషయంలో ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్ ఆధారంగా దౌత్య పాస్‌పోర్ట్ రద్దు చేయాలన్న తమ అభ్యర్థనపై కేంద్రం స్పందించటల లేదని కార్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. కోర్టు అరెస్ట్ వారెంట్నపు జారీ చేసినా.. దౌత్య పాస్‌పోర్టు రద్దు విషయంలో కేంద్రం ఇంకా స్పందిచటం లేదని తెలిపారు. -
జీహెచ్ఎంసీలో కామ పిశాచి.. కమిషనర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: జీహెచ్ఎంసీ సర్కిల్ ఎసిఎఫ్ఏ (శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్) కిషన్ కీచక పర్వం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన కింద పనిచేసే కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ.. అదంతా వీడియోలు, పోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డా కీచకుడు. అయితే ఈ వ్యవహారం మీడియాకు ఎక్కడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రస్ స్పందించారు. కిషన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వివరాల్లోకెళ్తే..కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారం 25 సర్కిల్ పరిధిలో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ఏఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే ఉద్యోగి అదే సర్కిల్లో పని చేసే ఓ పారిశుద్ధ్య కార్మికుకురాలిపై కన్నేసాడు. అధికార దర్పంతో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడే దుస్సాహసానికి వడిగట్టాడు. తాను చెప్పినట్లు వినాలని హుకూం జారీ చేశాడు. ఆఖరికి అతడి మాట వినకపోతే.. విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం వంటి దురాగతాలకు పాల్పడేవాడు. దీంతో బాధితురాలు కీచక కిషన్ వేధింపులకు తట్టుకోలేక ఎవరికీ చెప్పలేక నరక యాతన అనుభవించింది. పైగా వాటన్నింటిని ఫోన్లో రికార్డ్ చేసేవాడుఏం జరిగిందో కానీ.. కిషన్ వీడియోలు బయటకు రావడం సహ ఉద్యోగుల వరకు చేరిపోవడం జరిగింది. దీంతో వారంతా సదరు ఉద్యోగిని గట్టిగా ప్రశ్నించటంతో.. ఎవరికి చెప్పవద్దంటూ..రూ. 10 వేల చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అతడిపై చర్యలు తీసుకోవాలని సహోద్యోగులు, కార్మికులు డిమాండ్ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. -
ప్రజ్వల్ భారత్‌కు వచ్చి లొంగిపో: బాబాయ్ విజ్ఞప్తి
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి ఆరోపణల కేసు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపింది. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా అసభ్య వీడియో వైరల్ అయ్యాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక.. ఈ విషయంలో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. అయితే ఆదివారం ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో బాబాయ్ అయిన జేడీఎస్ చీఫ్ కుమారస్వామి స్పందించారు. విదేశంలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ వెంటనే ఇండియాకు రావాలని కోరారు. లైంగిక ఆరోపణల కేసులో సిట్ ముందు దర్యాప్తు ఎదుర్కొవాలన్నారు. లేకపోతే ప్రజలు తమ కుటుంబాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారని తెలిపారు.‘‘మీడియా ముఖంగా నేను ప్రజ్వల్ రేవణ్ణను ఇండియాకు రావాల్సిందిగా కోరుతున్నా. అతను ఏ దేశంలో ఉన్నా భయం లేకూడా భారత్ తిరిగి రావాలి. ఇంకా ఎంత కాలం ఇలా దాచుకొని తిరుగుతూ ఉంటావు?. ప్రజ్వల్ రేవణ్ణకు తన తాత మాజీ ప్రధాని దేవెగౌడపై గౌరవం ఉంటే వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చి పోలీసులకు లొంగిపోవాలి. మన కుటుంబం గురించి ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకుండా చూడాలి. ...రెండు రోజుల్లో ప్రజ్వల్ పోలీసులకు లొంగిపోవాలి. లక్షల మంది పార్టీ కార్యకర్తలు నీకు ఓటు వేశారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా విదేశంలో ఉంటావు. దయచేసి ఇండియాకి తిరిగి వచ్చి అధికారులు ముందు హాజరుకావాలి. అప్పడే ఈ విషయంలో ఓ ముగింపు వస్తుంది. ఈ వ్యవహారంలో బాధితులకు నేను బహిరంగా క్షమాపణలు చేబుతున్నా. వారి బాధను నేను అర్థం చేసుకోగలను’’ అని కుమారస్వామి అన్నారు. ఇక.. అధికార కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని అనేక సార్లు టార్గెట్ చేసిందని, కానీ పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో పోరాడుతున్నామని కుమారస్వామి పేర్కొన్నారు. -
టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు ఓ మహిళా వలంటీర్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఊళ్లో అందరికీ తలలో నాలుకలా వ్యవహరించిన ఓ సేవకురాలిని టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం పొట్టన పెట్టుకోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. తప్పుడు ఆరోపణలతో వేధింపులు, ఫిర్యాదు, పోలీసుల విచారణతో తీవ్ర భయాందోళనలకు గురై విజయనగరం రూరల్ మండలం దుప్పాడ గ్రామంలో వలంటీరు బొబ్బాది సంతోషి (36) గుండె ఆగిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంతోషి భర్త బొబ్బాది కృష్ణ విజయనగరం కూరగాయల మార్కెట్లో పని చేస్తుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జయదీప్ ఇటీవలే పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. అమ్మాయి లహరి ఎనిమిదో తరగతి చదువుతోంది. సంతోషి వలంటీరుగా చేరిన తర్వాత గ్రామంలో తనకు అప్పగించిన 50 కుటుంబాలకు నిత్యం అందుబాటులో ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని అర్హులకు చేర్చుతూ వారి మన్ననలు అందుకుంది. తనది పేద కుటుంబమే అయినా గ్రామంలో ఏ పేద వారూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో సేవలందించింది. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే అవ్వాతాతలకు పింఛన్ అందించడంలో పోటీ పడేది. సీఎం జగన్ అంటే అభిమానం. ఇవన్నీ అదే గ్రామంలోని టీడీపీ నాయకులకు కంటగింపుగా మారాయి. ఏదో విధంగా వలంటీర్లపై కక్ష సాధింపు లక్ష్యంతో ఉన్న టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారు. టీడీపీ నేతల బెదిరింపులుటీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ స్థానిక టీడీపీ నేతలు గ్రామంలో 50 మంది యువకులను మభ్యపెట్టి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ వలంటీర్లు బొబ్బాది సంతోషి, నారాయణమ్మ, రామలక్ష్మి, స్వాతి, కృష్ణవేణి, కోటమ్మలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు సరిగా విచారించకుండానే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఆగమేఘాలపై ఆ ఆరుగురు వలంటీర్లను సస్పెండ్ చేశారు. పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. పుట్టుమచ్చలు, తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడు రోజుల కిందట సంతోషికి ఫోన్ చేసి అడిగారు. అంతకు ముందు గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో కూడా ఆ నాయకులు వలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు ఊడగొట్టి కేసులు పెట్టించామని, తమ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలి పెట్టబోమని హెచ్చరించారు. పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంటింటి విచారణ చేశారు. ఇవన్నీ సంతోషినిని ఆందోళనకు గురి చేశాయి. ఇదిలా ఉండగా పుట్టుమచ్చలు తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడ్రోజుల కిందట ఆమెకు ఫోన్ చేయడంతో తీవ్రంగా భయాందోళనకు గురైంది. గురువారం ఛాతీలో పట్టేసినట్టు ఉండటంతో తొలుత గ్యాస్ తాలూకు నొప్పిగా భావించింది. కొంత సేపటి తర్వాత గుండెల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు విజయనగరంలో డాక్టర్లకు చూపించారు. వారి సూచనలతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి శుక్రవారం ఆ పేదరాలి గుండె ఆగిపోయింది. సంతోషి హఠాన్మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆమె అంతిమ యాత్రలో పాల్గొని కంట నీరు పెట్టారు. కాగా, ఇంత జరిగినా టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి ఆ కుటుంబం భయపడిపోతోంది. తోటి వలంటీర్లంతా లోలోన కుమిలిపోతున్నారు. -
మమతా బెనర్జీ: రాజ్‌భవన్‌లో అడుగుపెట్టను
సప్తాగ్రామ్: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోసుపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ ఇంకా పదవిలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం సప్తాగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం మమతా బెనర్జీ మాట్లాడారు. గవర్నర్ పదవిలో ఆనంద బోసు కొనసాగినంత కాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టబోనని తేలి్చచెప్పారు. ఒకవేళ గవర్నర్‌ను కలవాలనుకుంటే వీధుల్లోనే కలుస్తానని అన్నారు. మహిళలపై వేధింపులకు గవర్నర్ సమాధానం చెప్పాలన్నారు. గత నెల 24న, ఈ నెల 2న గవర్నర్ ఆనంద బోసు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి గతవారం కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తప్పు చేయలేదని గవర్నర్ అన్నారు. పూర్తి వీడియోలను గవర్నర్ బహిర్గతం చేయలేదని మమత ఆరోపించారు. -
లైంగిక వేధింపుల కేసు: పోలీసుల అదుపులో బీజేపీ నేత
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి కేసు కర్ణాటక రాజకీయాల్లో సంచలనం రేపింది. ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు చేసిన బీజేపీ నేత జీ. దేవరాజే గౌడపై లైంగిక ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు జీ దేవరాజే గౌడను అదుపులోకి తీసుకున్నారు. దేవరాజే గౌడ బెంగళూరు నుంచి చిత్రదుర్గకు ప్రయాణిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 36 ఏళ్ల ఓ మహిళ జీ దేవరాజేపై లైంగిక దాడి ఫిర్యాదు చేయగా.. పోలీసు కేసు నమోదు చేశారు. తనకు సంబంధించిన ఓ స్థలాన్ని అమ్మటంలో సాయం చేయాలని కోరగా.. తనపై దేవరాజే గౌడ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.దేవరాజే గౌడ.. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్డీ రేవణ్ణపై పోటీ చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందే రేవణ్ణపై ఉన్న లైంగిక ఆరోపణల విషయంలో బీజేపీ అధిష్టాన్ని అప్రమత్తం చేశారు. అదే విధంగా పొత్తులో భాగంగా హాసన్ పార్లమెంట్ టికెట్ ప్రజ్వల్‌కు కేటాయించవద్దని కూడా తెలిపారు. అయినా బీజేపీ, జేడీఎస్ పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని ప్రజ్వల్ కేటాయించిన విషయం తెలిసిందే.ఇక.. ప్రజ్వల్ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అభ్యంతక వీడియోలు వైరల్ తర్వాత ఆయన జర్మనీ వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వంలో దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిట్ అధికారులు ప్రజ్వల్ రేవణ్ణ కోసం బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చింది. మరోవైపు.. ప్రజ్వల్ తండ్రి హెచ్.డీ రేవణ్ణ ఓ మహిళను కిడ్నాప్ చేశారన్న కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు. -
Delhi court: బ్రిజ్ భూషణ్‌పై అభియోగాలు నమోదు చేయండి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలను నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. తమను వేధించారంటూ ఐదుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణల్లో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా తగు ఆధారాలున్నట్లు కోర్టు తెలిపింది. కేసులు నమోదు చేయాల్సిందిగా అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్(ఏసీఎంఎం) ప్రియాంకా రాజ్‌పుత్ ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో సహ నిందితుడు, డబ్ల్యూఎఫ్ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌పైనా అభియోగాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్‌పై ఆరో మహిళా మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలకు తగు ఆధారాలు లేనందున ఆమె పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు. కోర్టు ఈనెల 21న అధికారికంగా అభియోగాలను నమోదు చేయనుంది. -
బీజేపీ నేతలు తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించారు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశి్చమ బెంగాల్ సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపులు, అత్యాచారాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని సందేశ్‌ఖాలీకి చెందిన ముగ్గురు మహిళలు స్పష్టం చేశారు. స్థానిక బీజేపీ మహిళా నేత ఒకరు తెల్లకాగితాలపై తమతో బలవంతంగా సంతకాలు పెట్టించారని, ఈ కాగితాలపై బీజేపీ నాయకులే ఫిర్యాదులు రాసి, తమ పేరిట తృణమూల్ కాంగ్రెస్ నేతలపై పోలీసు స్టేషన్లో అత్యాచారం కేసులు పెట్టారని చెప్పారు. తమను మభ్యపెట్టి మోసం చేసిన బీజేపీ నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు తమను వేధిస్తున్నారని, తమకు రక్షణ కలి్పంచాలని కోరారు. ఈ మేరకు ముగ్గురు మహిళలు చెబుతున్నట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలను తృణమూల్ కాంగ్రెస్ షేర్ చేసింది. సందేశ్‌ఖాలీ మహిళలపై తమ పార్టీ నాయకులెవరూ లైంగిక వేధింపులకు పాల్పడలేదని, బీజేపీ నేతలే తప్పుడు ప్రచారం చేశారని పశి్చమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి పాంజా ఆరోపించారు. సందేశ్‌ఖాలీలో కొన్ని భూకబ్జా ఘటనలు మినహా లైంగిక వేధింపుల ప్రసక్తే లేదని అన్నారు. తమ పార్టీని అప్రతిష్టపాలు చేసేలా తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదంతా కుట్ర: సువేందు అధికారి కొత్తగా తెరపైకి వచి్చన వీడియోలపై బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారి స్పందించారు. వాటిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిõÙక్ బెనర్జీ ఉద్దేశపూర్వకంగా సృష్టించాడని విమర్శించారు. దీనివెనుక ప్రైవేట్ ఎన్నికల, రాజకీయ వ్యూహ సంస్థ ‘ఐ–ప్యాక్’ ప్రోద్బలం ఉందని చెప్పారు. మహిళలను తీసుకొచ్చి, బీజేపీపై ఆరోపణలు చేయిస్తున్నారని, ఇదంతా కుట్రేనని స్పష్టం చేశారు. అభిషేక్ బెనర్జీ, ఐ–ప్యాక్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ త్వరలో కోర్టు ఆశ్రయిస్తామని అన్నారు. బీజేపీ నేతలపై ఫిర్యాదు సువేందు అధికారితోపాటు మరికొందరు బీజేపీ నేతలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నాయకులపై అత్యాచార ఆరోపణలు చేసేలా సందేశ్‌ఖాలీ మహిళలను బీజేపీ నేతలు ప్రేరేపించారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
రాసలీలల రామ్మోహన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలైంది. పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వాట్సప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయవాడలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, ఇన్‌స్ట్రాగాం వేదికల్లో అవి చక్కెర్లు కొడుతుండటంతో ఆయన లీలలపై తూర్పు నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా ఓటర్లయితే గద్దెకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లకు గద్దె నిజ స్వరూపం బట్ట బయలైందని టీడీపీ వర్గీయులే వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు 15 ఏళ్లుగా అనుచరుడిగా ఉన్న ఒకరు ఆయన రాసలీలల వ్యవహారాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విజయవాడ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురిచేసి, దాడి చేయడంతో పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గద్దె వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో గద్దె గ్రాఫ్ పడిపోవడంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాట్సప్ చాటింగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులే తేల్చిచెబుతున్నారు. -
బెంగాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై ఓ మహిళా ఉద్యోగి లైంగిన వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో, ఈ ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. బెంగాల్ రాజ్‌భవన్‌లో పని చేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి.. గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. గవర్నర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ.. హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఆశచూపి గవర్నర్ తనపై పలుసార్లు లైంగికంగా వేధించారని సదరు మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. సదురు ఉద్యోగిని ఆరోపణలను గవర్నర్ ఆనంద బోస్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా ఆనంద్ బోస్ స్పందిస్తూ..‘ఇది దురుద్దేశంతో అల్లిన కట్టుకథ. ఇదంతా కల్పితమే. ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల ప్రయోజనాలను కోరుకుంటే.. వారికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బెంగాల్లో హింస, అవినీతికి వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు’ అని కామెంట్స్ చేశారు. “Truth shall triumph. I refuse to be cowed down by engineered narratives. If anybody wants some election benefits by maligning me, God Bless them. But they cannot stop my fight against corruption and violence in Bengal.”— Raj Bhavan Kolkata (@BengalGovernor) May 2, 2024 మరోవైపు.. ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ బెంగాల్లో రెండు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఇలాంటి నేపథ్యంలో గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం బీజేపీకి షాకిచ్చినట్టు అయ్యింది. ఇక, ఈ వ్యవహారంపై అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం గవర్నర్‌పై మండిపడుతున్నారు. -
HD Revanna: అంతా రాజకీయ కుట్ర
బెంగళూరు/శివమొగ్గ: తనపై, తన కుమారుడు ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులు, కేసులు అంతా రాజకీయ కుట్రలో భాగమని కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ వ్యా ఖ్యానించారు. సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది. ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటా. ఆరోపణల్లో నిజం ఉందని దర్యాప్తులో తేలితే ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధం. నాలుగైదేళ్లనాటి పాత అంశాలను పట్టుకుని ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. సిట్ దర్యాప్తు చేశాక నిజాలు బయటికొస్తాయిగా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాళ్లనుకున్నదే చేస్తారు. ఇవన్నీ ఈనాటివి కాదు. కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లుగా ఇది పెద్ద సెక్స్ కుంభకోణమే అయితే సిట్ ఏర్పాటుచేశారుగా. సమగ్ర దర్యాప్తు చేయనివ్వండి. సాధారణంగానే ప్రజ్వల్ విదేశాలకు వెళ్తాడు. ఇప్పుడూ అలాగే వెళ్లాడు. ఎఫ్ఐఆర్ వేస్తారనిగానీ, సిట్‌తో దర్యాప్తు చేయిస్తారనిగానీ ప్రజ్వల్‌కు తెలీదు. దర్యాప్తు అధికారులు ఆదేశించినప్పుడు ప్రజ్వల్ వచ్చి వారికి సహకరిస్తాడు’’ అని రేవణ్ణ చెప్పారు.పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్!లైంగిక ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్‌ను సస్పెండ్ చేయాలనే నిర్ణయానికొచ్చినట్లు జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి సోమ వారం చెప్పారు. ‘‘ ప్రజ్వల్‌పై ఆరోపణలు నిజమైతే ఆయనకు శిక్ష పడాల్సిందే. వివాదంలో ప్రజ్వల్‌ను వెనకేసుకొచ్చే ప్రసక్తే లేదు. తప్పు అని తేలితే కఠినచర్యలు తీసు కోవాల్సిందేనని మా కుటుంబం మొత్తం కోరుకుంటోంది. ప్రజ్వల్ సస్పెన్షన్ నిర్ణయా న్ని మంగళవారం హుబ్బళిలో పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ప్రతిపాదిస్తాం. పార్ల మెంట్‌సభ్యుడు కాబట్టి నిర్ణయం ఢిల్లీ స్థాయి లో జరగాలి. ఈ విషయాన్ని జేడీఎస్ జాతీ య అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు వివరించా’’ అని కుమారస్వామి అన్నారు. -
స్టార్ హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. బోనీ కపూర్‌పై నెటిజన్స్ ఫైర్!
అజయ్ దేవగణ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మైదాన్. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అమిత్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే తాజాగా ఈ సినిమా చూసేందుకు మైదాన్ నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్ థియేటర్‌కు వచ్చారు. అదే సమయంలో హీరోయిన్ ప్రియమణితో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే బోనీ కపూర్ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రియమణి నడుముపై చేతులు వేస్తూ కనిపించారు. అంతే కాకుండా ఎలా పడితే అలా తాకుతూ ప్రియమణిని ఇబ్బందికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ ఫైరవుతున్నారు. 68 ఏళ్ల వయసులో ఉన్న ప్రముఖ నిర్మాత అసభ్యకరంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. "ప్రియమణి లాంటి అందరికీ బాగా తెలిసిన హీరోయిన్‌తో అసహ్యంగా ప్రవర్తించడం బాగాలేదు. ఇక రాబోయే నటీమణులతో బోనీ ఎలా ప్రవర్తిస్తాడో నేను ఊహించలేకపోతున్నా"అంటూ రాసుకొచ్చారు. మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ..' మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని గుర్తుంచుకోండి. ఇలా ప్రవర్తించడం చాలా అవమానకరంగా ఉంది' అని పోస్ట్ చేశారు. బోనీ కపూర్ జీ మీరేమైనా ఇండియాలో హార్వే వైన్స్టెయిన్ అనుకుంటున్నారా? లేదా ఆ బహుమతిని తీసుకున్న వారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. కాగా.. బోనీ కపూర్ మహిళలతో ఇలా అనుచితంగా ప్రవర్తించడం మొదటిసారి కాదని నెటిజన్లు అంటున్నారు. 2023లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)ని ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రనిర్మాత జిగి హడిద్ బేర్ నడుముపై చేతులు వేసి ఫోటోలకు పోజులిచ్చారు. అప్పుడు కూడా నెటిజన్లు విమర్శలు చేశారు. అంతే కాదు ఓ కార్యక్రమంలో ఊర్వశి రౌతేలాతోనూ అలాగే ప్రవర్తించారు -
బరితెగించిన ‘భాష్యం’!
అనంతపురం ఎడ్యుకేషన్: ‘భాష్యం’ విద్యా సంస్థలు బరితెగించాయి. ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భాష్యం విద్యా సంస్థలకు బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి భాష్యం విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికల ఖర్చుల కోసమంటూ ఆ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను వేధిస్తున్నారు. విద్యా సంవత్సరం ముగిసేలోగా ఫీజులు చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నా భాష్యం యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఫీజులు చెల్లిస్తేనే బడికి పంపాలంటూ హుకుం జారీ చేస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో భాష్యం స్కూల్ ఉంది. అధినేత ఎన్నికల ఖర్చులకు డబ్బులు అవసరమని పై నుంచి ఆదేశాలు రావడంతో ఫీజుల కోసం సిబ్బంది విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఫీజు చెల్లిస్తేనే మీ పిల్లలను బడికి పంపండి.. లేకుంటే పంపొద్దు అని తల్లిదండ్రులకు కరాఖండీగా చెప్పేస్తున్నారు. ఈ నెల ఆరో తేదీన 1–9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల ప్రారంభానికి ముందు ఫీజు చెల్లించిన వారినే పరీక్షలకు అనుమతిస్తామని భాష్యం యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో చాలామంది తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు మొత్తాన్ని చెల్లించారు. ఉన్నట్టుండి ఒత్తిడి చేయడంతో మరికొంతమంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా పిల్లల నిర్బంధం పూర్తి ఫీజు చెల్లించలేదనే నెపంతో పది రోజుల క్రితం అనంతపురం భాష్యం స్కూల్లో దాదాపు 50 మంది విద్యార్థులను రోజంతా సిబ్బంది ఒక గదిలో నిర్బంధించారు. తరగతుల్లో కూర్చోబెట్టకుండా వారందరినీ ఒక గదిలో కూర్చోబెట్టారు. అదికూడా బెంచీలపై కాకుండా నేలపై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారు. సాయంత్రం పాఠశాల సమయం ముగిశాక వారిని ఇళ్లకు పంపడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో గోడు చెప్పుకున్నారు. దీంతో మరుసటి రోజు పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు.. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను నిలదీశారు. పాఠశాల ఇన్చార్జ్ అనిల్‌కుమార్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ యాజమాన్యం నుంచి తమకు తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని, తామేమీ చేయలేమని విద్యార్థుల తల్లిదండ్రులకు తేలి్చచెప్పారు. ఎవరితోనైనా చెప్పుకోండి.. ముందు ఫీజు కట్టండని చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు తిరగబడ్డారు. సమస్య పెద్దదయ్యే పరిస్థితి కనిపించడంతో కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 12లోపు అందరూ ఫీజు చెల్లించాలని తల్లిదండ్రులకు పాఠశాల ప్రిన్సిపాల్ సూచించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపడితే భాష్యం పాఠశాలల యాజమాన్యం చేస్తున్న అరాచకాలు మరిన్ని వెలుగులోకి వస్తాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. -
ట్యాపింగ్ మాటున లైంగిక వేధింపులు.. వసూళ్లు!
నల్లగొండ క్రైం: ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం నల్లగొండలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే జిల్లాలోని టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ముగ్గురు పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక అధికారుల బృందం ఆదివారం వారిని మరోసారి విచారించినట్టు చర్చ జరుగుతోంది. అప్పటి జిల్లా ఉన్నతాధికారితో నమ్మకంగా ఉన్న కానిస్టేబుల్‌తో మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు పంపిణీతో పాటు వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలున్నాయి. పోలీసు ఉన్నతాధికారితో ఉన్న నమ్మకాన్ని టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పలువురు కిందిస్థాయి పోలీసుఅధికారులు దందాలు, సెటిల్మెంట్లకు తెర లేపారని ఆరోపణలు వచ్చాయి. మిర్యాలగూడలో రౌడీషీటర్లతో సెటిల్మెంట్లు, నార్కట్‌పల్లి వద్ద దొరికిన గంజాయి కేసులో వసూళ్లకు పాల్పడ్డట్టు సమాచారం. పేకాట, బియ్యం దందా చేసేవారిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. పార్కులో తిరిగే ప్రేమ జంటలను, ఏదేని కేసులో ఉన్న వారిని కలవడానికి వచ్చే కుటుంబ సభ్యులైన మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సమాచారం. పోలీసు అధికారులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో అక్రమ సంపాదనతో ఒక పోలీస్ అధికారి గుర్రంపోడు మండల కేంద్ర సమీపంలోని 9ఎకరాల తోటను కొనుగోలు చేసినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఈ విషయమై దర్యాప్తు అధికారులు కీలకమైన సమాచారం సేకరించినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. దర్యాప్తు అధికారుల విచారణలో మరిన్ని విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. -
ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్నా..
మధురవాడ (భీమిలి): కాలేజీల్లో కామ పిశాచాల వేధింపులు తాళలేక కొంతమంది అమ్మాయిలు చదువులు మధ్యలోనే మానివేస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలే శరణ్యమని భావించి చిన్నతనంలోనే తనువులు చాలిస్తున్నారు. ఫ్యాకల్టీయే బరితెగించి లైంగికంగా వేధింపులు పాల్పడగా.. తట్టుకోలేకపోయిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని కొమ్మాది చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. ఇక్కడ డిప్లమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ (16) లైంగిక వే«ధింపులకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు తాళలేక పోతున్నానంటూ తండ్రికి మెసేజ్ పెట్టి గురువారం అర్ధరాత్రి 1.05 నిమిషాలకు ప్రాంతంలో హాస్టల్ భవనం 4వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విద్యా సంస్థ నిర్లక్ష్యమే కారణం విద్యా సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన కుమార్తె మృతి చెందిందని బాలిక తండ్రి గండికోట రమణ ఆవేదన వ్యక్తం చేశాడు. నర్సీపట్నం సమీపంలోని నాతవరం మండలం పద్మనాభపురానికి చెందిన రైతు కూలి గండికోట రమణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పెళ్లయి అగనంపూడిలో ఉంటోంది. ఆఖరి కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకుంటోంది. రెండో కుమార్తె రూపశ్రీ కొమ్మాది కాలేజీ హాస్టల్లో ఉండి చదువుతోంది. రూపశ్రీ కనిపించడం లేదని తండ్రికి కళాశాల సిబ్బంది ఫోన్ చేసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత రూపశ్రీ అర్ధరాత్రి 12.48 గంటలకు 3వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్‌కి వెళ్లి, 1.05కి 4 ఫ్లోర్ నుంచి కిందకి దూకిందని తెలిసింది. దూకే క్రమంలో చెట్టుకు తగిలి కిందకి పడి తీవ్రంగా గాయపడింది. రూపశ్రీని తరలించిన ఆస్పత్రికి అల్లుడు హరికృష్ణతో కలసి రమణ చేరుకునే లోపు రూపశ్రీ మృతి చెందింది. తండ్రి సెల్‌కి పంపిన మెసేజ్ ఇలా.. హాయ్ అమ్మా, నాన్న, అక్కా, చెల్లి మరియు కుటుంబ సభ్యులకు.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ కాలేజీలో లైంగిక వే«ధింపులు జరుగుతున్నాయి నాన్న. మరి ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరు అని అంటే ఇంకేం చెప్పగలం నాన్న. చాలా చెండాలంగా ప్రవర్తిస్తున్నాడు. ఫొటోలు కూడా తీసుకుని బెదిరిస్తున్నారు. స్టూడెంట్స్‌కి చెప్పాల్సిందిపోయి ఆ ఫ్యాకల్టీ ఇలా ప్రవర్తిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి నాన్న? నా ఫొటోలు కూడా తీసి బెదిరిస్తున్నారు నాన్న. ఇంకా నాకు ఒక్కదానికే కాదు ఇంకా కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరికి చెప్పకోలేక. అలా అని కాలేజికి వెళ్లలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం అని బెదిరించారు. నాకే వేరే దారి కనిపించలేదు. ఎవరో ఒకరు చస్తేనే కానీ ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు ఆ పని నేనే చేస్తున్నా. క్షమించండి నాన్నా. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కళాశాల టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజుకు చెందిన కళాశాల ఇది. ఇక్కడ యాజమాన్యం అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మృతురాలు తండ్రి, సగర సామాజిక వర్గ కుల పెద్దలు ఆరోపిస్తున్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోక్సో, ర్యాగింగ్ కేసు నమోదు మృతురాలు రూపశ్రీతో పాటు ఇంకా ఎంత మంది విద్యార్థులు వేధింపులకు గురయ్యారనే అంశంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. నిందితులపై పోక్సో యాక్ట్, ఆత్మహత్యకు ప్రేరేపించడం, ర్యాగింగ్ తదితర కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పీఎం పాలెం సీఐ రామకృష్ణ తెలిపారు. ఇక విద్యార్థిని ఆత్మహత్యకు కారణాలపై తక్షణం నివేదిక అందజేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండి సీతారాం నగర పోలీసులను, సాంకేతిక విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. -
నిర్మాత లైంగిక వేధింపులు.. ఆ విషయంలో సంతోషంగా ఉందన్న నటి!
బాలీవుడ్లో ప్రముఖ రియాలిటీ షో తారక్ మెహతా కా ఊల్టా చష్మా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఈ షోలో రోషన్ దారువాలా కౌర్ సోధి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జెన్నిఫర్ మిస్త్రీ బన్సీవాల్ అర్ధాంతరంగా తప్పుకుంది. ఆ తర్వాత షో నిర్మాత అసిత్ కుమార్ మోడీ లైంగిక వేధింపుల గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసిత్ కుమార్ మోడీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాజాగా ఈ కేసులో జెన్నిఫర్ మిస్త్రీ విజయం సాధించినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 15న ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడిందని తెలిపింది. అయితే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించవద్దని పోలీసులను కోరినట్లు ఆమె వెల్లడించారు. నాకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే పరిహారంగా అందించారని తెలిపారు. ఈ కేసులో నాకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.25 నుంచి 30 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అదనంగా మరో రూ.5 లక్షలు కోర్టు జరిమానా విధించినట్లు ఆమె వెల్లడించింది. అయినప్పటికీ ఈ కేసులో తనకు ఇంకా పూర్తి న్యాయం జరగలేదని జెన్నిఫర్ మిస్త్రీ వాపోయింది. జెన్నిఫర్ మాట్లాడుతూ.." ఈ కేసులో కోర్టు తీర్పు ఇచ్చి 40 రోజులకు పైగా అయింది. ఇంకా నాకు రావాల్సిన మొత్తం పరిహారం రాలేదు. అతన్ని దోషిగా నిరూపించినప్పటికీ.. ముగ్గురు నిందితులకు ఎలాంటి శిక్ష విధించలేదు. సోహిల్ రమణి, జతిన్ బజాజ్‌లను దోషులుగా చేర్చలేదు. ఇది నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ కేసు తీర్పుతో నేను ఎలాంటి ప్రచారాన్ని కోరుకోవడం లేదు. నాపై జరిగిన వేధింపులను గుర్తించినందుకు సంతోషిస్తున్నా. ఈ కేసులో ప్రస్తుతానికి నాకు సరైన న్యాయం లభించలేదని భావిస్తున్నా" అని చెప్పింది. కోర్టు విధించిన పరిహారం చిన్నదని.. ఇలాంటి నేరాలు ఇతరులు చేసేలా ప్రేరేపించవచ్చని నటి పేర్కొంది. -
అబ్బాయిలతో కలిసి ఉంటేనే వైద్య విద్య
విశాఖ సిటీ: వైద్యురాలుగా స్థిరపడాలనుకుంది. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఎంత ఖర్చయినా తన కుమార్తెను డాక్టర్‌గా చూడాలని తల్లిదండ్రులు తాపత్రయపడ్డారు. నగరానికి చెందిన కన్సల్టెన్సీ ద్వారా కజకిస్తాన్‌లో ఒక యూనివర్సిటీలో సీటు సంపాదించారు. కోటి ఆశలతో విదేశీ యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే విద్యార్థికి వేధింపులు ప్రారంభమయ్యాయి. అక్కడ హాస్టల్లో అబ్బాయిలతో కలిపి వసతి కల్పించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పాశ్చాత్య పోకడలకు ఇమడలేని విద్యార్థిని ఇంటికి వెళ్లిపోతానని వేడుకున్నప్పటికీ.. పాస్‌పోర్ట్ తీసుకొని మొత్తం ఫీజు చెల్లిస్తేనే పంపిస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో విద్యారి్థని తన పరిస్థితిని తల్లిదండ్రులకు చెప్పుకొని దేశం కాని దేశంలో తిండీ, నిద్ర లేకుండా ఇబ్బందులు పడుతోంది. అక్కడి పరిస్థితులను, ఆమె బాధను వివరిస్తూ సెల్ఫీ వీడియో సైతం విడుదల చేసింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన జి.భవాని విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఇందుకోసం గాజువాకలో ఉన్న జీవీకే కన్సల్టెన్సీ అనే సంస్థను సంప్రదించారు. దాని ద్వారా కజకిస్తాన్ దేశంలో ఆల్మటీ నగరంలో కాస్పియన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటుకు డబ్బు చెల్లించారు. ఆ సమయంలోనే అక్కడి వసతి ఏర్పాట్లపై భవాని తండ్రి జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో స్పష్టంగా మాట్లాడారు. గరŠల్స్, బాయ్స్‌కు ప్రత్యేక హాస్టళ్లు ఉంటాయని చెప్పడంతో వారు సీటు కోసం డబ్బు చెల్లించారు. భవాని ఈ నెల 11వ తేదీన కజకిస్తాన్‌కు వెళ్లింది. యూనివర్సిటీలో ఒక భవనంలోనే అబ్బాయిలకు, అమ్మాయిలకు వసతి కలి ్పంచారు. కొద్ది రోజులపాటు సర్దుకున్న భవాని అక్కడి వాతావరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అబ్బాయిలతో కలిసి ఉండడం, వారు సిగరెట్, ఇతర అలవాట్లను చూసి భరించలేక ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీనిపై జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులను సంప్రదించారు. తన కుమార్తెను వేరే హాస్టల్‌కు మార్చాలని కోరాడు. చెప్పిన కొద్దిసేపటికే భవాని రూమ్‌కు కొంత మంది సీనియర్ అబ్బాయిలు వెళ్లి ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే తప్పనిసరిగా తమతో కలిసే ఉండాలని హెచ్చరించారు. అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా వసతి కల్పించినట్లు చెప్పాలని బలవంతం పెట్టడంతో భయపడిన భవాని మళ్లీ తన తండ్రికి ఫోన్ చేసి వేరే హాస్టల్‌కు మార్పించినట్లు చెప్పింది. డబ్బు చెల్లిస్తేనే పాస్‌పోర్ట్ ఇస్తామంటూ.. అక్కడి వాతావరణాన్ని భరించలేని భవాని తాను అక్కడ ఉండలేనని, ఇంటికి పంపించేయాలని కళాశాల వాళ్లను వేడుకుంది. ఫీజు మొత్తం డబ్బు చెల్లిస్తేనే తిరిగి పంపిస్తామంటూ ఆమె పాస్‌పోర్ట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని తండ్రి జగదీష్ కు చెప్పింది. హాస్టల్లో పరిస్థితులు బాగోలేవని, తాను ఇంటికి వెళ్లేందుకు సహాయం చేయాలని అధికారులను కోరుతూ సెల్ఫీ వీడియో తీసి పంపించింది. దీనిపై తండ్రి జగదీష్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెకు తిరిగి విశాఖకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాడు. -
షూరిటీల పేరుతో ‘మార్గదర్శి’ వేధింపులు
నరసరావుపేట రూరల్: షూరిటీల పేరుతో ఖాతాదారులను మార్గదర్శి చిట్స్ యాజమాన్యం వేధిస్తోందని మార్గదర్శి చిట్స్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిట్ పాడుకున్న ఖాతాదారులకు సకాలంలో నగదు చెల్లించడం లేదన్నారు. షూరిటీలు సరిపోవనే నెపంతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. దీంతో పాటు ఆ నగదులో కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఖాతాదారులపై ఒత్తిడి తీసుకువస్తారని చెప్పారు. చట్టవ్యతిరేకంగా మార్గదర్శిలో చిట్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. చిట్ గ్రూప్‌లోని సభ్యులందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. నెలవారీ నగదును డిపాజిట్ చేసే బ్యాంక్ వివరాలు కూడా చిట్ సభ్యులకు తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే దీనిపై న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మార్గదర్శి చిట్ వ్యవహరిస్తోందని తెలిపారు. సకాలంలో చిట్ నగదు చెల్లించలేదనే నెపంతో జరిమానాలు, వడ్డీలు వేస్తున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అధిక శాతం సభ్యులుగా మార్గదర్శి చిట్స్‌లో ఉన్నారని తెలిపారు. వీరి నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 270 మంది ఖాతాదారులు మార్గదర్శి చిట్స్‌లో మోసపోయామని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈవిధంగా పల్నాడు జిల్లాలో 18 మంది ముందుకు వచ్చారని వివరించారు. నరసరావుపేట డిప్యూటీ రిజిస్ట్రార్ చిట్స్, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్‌తో కుమ్మక్కై ఖాతాదారులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. చిట్ నగదు చెల్లించిన ఖాతాదారుల ఆస్తులను జప్తు చేసుకునే విధంగా మార్గదర్శి యాజమాన్యానికి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. మార్గదర్శి చిట్స్‌లో మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇదీ చదవండి: చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ -
భర్త వేధింపులు తాళలేక భార్య విషాదం!
మహబూబ్‌నగర్: భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ముమ్మళ్లపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మంజునాథ్‌రెడ్డి కథనం మేరకు.. పాన్‌గల్ మండలం బుసిరెడ్డిపల్లికి చెందిన కృష్ణయ్య కుమార్తె సరిత (25)ను కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లికి చెందిన నాయిని మారుతికిచ్చి ఆరేళ్ల కిందట వివాహం జరిపించారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మారుతి జిల్లాకేంద్రంలోని మార్కెట్‌యార్డులో కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవారు. బుధవారం ఉదయం భర్త, పిల్లలు బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న సరిత ఇంట్లో ఉరేసుకుంది. ఇంటికి వచ్చిన మారుతి తలుపులు తెరిచి చూడగా సరిత ఉరేసుకొని కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ సరిత తల్లిదండ్రులతో వివరాలు సేకరించారు. కొంతకాలంగా మారుతి అదనపు కట్నం కోసం భార్యను వేధించేవాడని తండ్రి వాపోయాడు. కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. ఇవి చదవండి: భర్త, అత్త వేధింపులతో వివాహిత తీవ్ర నిర్ణయం..! చివరికి.. -
కీచకుడికే జేసీ ప్రభాకర్ అండ!
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత, కౌన్సిలర్ మల్లికార్జున కీచక పర్వం నియోజకవర్గంలో కలకలం రేపింది. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకున్నాడని.. తనకు న్యాయం చేయాలంటూ అనూష అనే యువతి పోరాటానికి దిగింది. ఈ క్రమంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. మల్లికార్జున్ వ్యవహారంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ప్రయత్నించింది. మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆమెను సిబ్బంది అడ్డుకున్నారు. అయితే ఆమె అప్పాయింట్మెంట్ కోసం యత్నించగా.. జేసీ అందుకు నిరాకరించారు. ఆమెను లోనికి రానియొద్దంటూ సిబ్బందికి సూచించారు. దీంతో గేటు వద్దే ఆమె చాలాసేపు ఉండిపోయింది. బాధితురాలికి న్యాయం చేయాల్సిందిపోయి.. కీచకుడికే అండగా నిలబడడం ఏంటని? జేసీ తీరుపై మండిపడుతున్నారు పలువురు. టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున తనను శారీరకంగా వాడుకున్నాడని, రెండు సార్లు అబార్షన్ చేయించాడని, పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని, తనను చంపుతానని టీడీపీ నేత మల్లికార్జున బెదిరిస్తున్నాడని బాధితురాలు అనూష వాపోతోంది. ఈ క్రమంలో ఎస్పీని కలిసి ‘స్పందన’లో తన గోడును సైతం వెల్లబోసుకుందామె. సంబంధిత వార్త: మల్లికార్జున కీచక పర్వమిది! -
టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు!
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తెనాలి, అమరావతి: ఆమె చేసిన తప్పల్లా... తన సంతోషాన్ని దాచుకోలేకపోవటమే. జగనన్న తన పేరిటే ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో చెప్పిందామె. కళ్లలో మెరుపులతో, పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సోషల్ మీడియా మూకలు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి. వీధికుక్కల్లా వెంటాడాయి. మారుపేర్లతో సంచరించే నీతీజాతీ లేని ఈ ఆన్లైన్ మారీచులు.... తాము మనుషులమన్న సంగతే మరిచిపోయి ప్రతి వేదికమీదా ఆమెను నానా దుర్భాషలాడారు. అక్కచెల్లెళ్లుంటారని, తమ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారని గ్రహింపే లేని రీతిలో ఆ బీసీ మహిళ గీతాంజలిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆమె వేషభాషలను ఎగతాళి చేస్తూ, అసభ్యంగా దూషించారు. సమాజం సిగ్గుపడే కామెంట్లతో రంపపు కోత కోశారు. భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యమనుకుంది. రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. లోతుగా చూస్తే ఇది ఆత్మహత్య కాదు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వెంటాడి వెంటాడి చేసిన దారుణమైన హత్య. గొల్తి గీతాంజలి (30) భర్త చంద్రశేఖర్ తెనాలిలోని వహాబ్ పార్క్ ప్రాంతంలో బంగారం పని చేస్తుంటారు. వాళ్లకిద్దరు పిల్లలు. గీతాంజలి కొద్దిరోజుల కిందట ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకు ఇంటిపట్టా ఇచ్చారని, పిల్లలకు అమ్మ ఒడి వస్తోందని, అత్తమామలకు చేయూత, పింఛన్ కానుక అందుతున్నాయని చెబుతూ సీఎం వైఎస్ జగన్‌కు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ధన్యవాదాలు తెలియజేసింది. జగనన్నకు తప్ప ఇంకెవరికి ఓటు వేస్తామంటూ.. ఆమె ఎదురు ప్రశి్నంచిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ, జనసేన కిరాయి మూకలు సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా వేధించాయి. ఆమెను కించపరుస్తూ విపరీతంగా ట్రోల్స్ చేశాయి. వాస్తవానికి గీతాంజలికి గతంలోనే ఇంటి స్థలం మంజూరైంది. ఇటీవల ప్రభుత్వం ఆమెకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేసింది. ఈ నెల 4న కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరైనప్పుడు ఈ ఇంటర్వ్యూ వ్యవహారం చోటుచేసుకుంది. ఉదయమే సభా ప్రాంగణానికి వచ్చిన గీతాంజలి అందరితోపాటు ఎమ్మెల్యే శివకుమార్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పట్టాను అందుకున్నాక తన సంతోషాన్ని ఓ యూట్యూబ్ చానల్‌తో పంచుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ఇంటి స్థలం పొందడం ద్వారా కల నెరవేరిందంటూ ఉద్వేగంగా మాట్లాడింది. జగనన్నను గెలిపించుకోవటం తమ బాధ్యతని పేర్కొంది. ఫీజులు కట్టలేని తమకు అమ్మఒడి ఆసరాగా నిలిచిందని, తన పిల్లలిద్దరూ ఈ కార్యక్రమానికి వస్తే జై జగన్.. అని నినదించేవారని ఉత్సాహంగా చెప్పింది. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురి కావడం, మీడియా ఎదుట మాట్లాడే అలవాటు లేకపోవడంతో తడబాటుకు గురైంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న టీడీపీ, జనసేన ‘సోషల్ మాఫియా’ బాధితురాలిని దారుణంగా ట్రోల్ చేసింది. ఉచ్చం నీచం లేకుండా అసభ్యంగా దూషిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పడుతూ, రాయలేని భాషలో దుర్భాషలాడుతూ కొందరు కామెంట్లు పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన గీతాంజలి శనివారం తెనాలి రైల్వే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు హుటాహుటిన ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తెనాలి జీఆర్పీ పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను విచారించగా సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాల కారణంగా ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల తాను, తన కుటుంబం లబ్ధి పొందినట్లు గతంలో కూడా ఆమె కొన్ని వీడియోల్లో పేర్కొన్నారు. గీతాంజలిని ఆత్మహత్యకు పురిగొల్పేలా దారుణ వ్యాఖ్యలతో వికృతంగా వ్యవహరించిన సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. గీతాంజలిని బూతులు తిడుతూ టీడీపీ, జనసేన అభిమానులు పెట్టిన పోస్టులు, కామెంట్లు.. గీతాంజలి మృతదేహం వద్ద రోదిస్తున్న ఇద్దరు కుమార్తెలు పచ్చ మీడియాపై బాధిత కుటుంబం ఆగ్రహం ఇద్దరు చిన్నారులతో ఎంతో చలాకీగా అందరితో కలిసి మెలసి ఉండే గీతాంజలిని సోషల్ మాఫియా పొట్టన పెట్టుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్ మార్చురీ వద్ద కన్నీరు మున్నీరయ్యారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు ఆడపిల్లల గతి ఏం కావాలంటూ విలపించారు. సోషల్ మీడియా ఆమెను పొట్టనపెట్టుకుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చ సోషల్ మీడియా కళ్లు ఎప్పుడు పచ్చగానే ఉంటాయని, పేదింటి మహిళకు ఇంత సంతోషం దక్కడం వారికి ఇష్టం లేదంటూ మండిపడ్డారు. గీతాంజలికి తల్లితండ్రి దూరంగా ఉండటంతో అమ్మమ్మ, తాతయ్య, మేనమామ కలిసి వివాహం చేశారని, గీతాంజలి సంతోషం పచ్చ సోషల్ మీడియాకు కంటగింపుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చూసి తల్లడిల్లిన చిన్నారులు ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి అంతిమ సంస్కారాలు సోమవారం రాత్రి జరిగాయి. గుంటూరు జీజీహెచ్‌లో శవపరీక్ష అనంతరం చినరావూరుతోటలోని హిందూ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను భర్త బాలచంద్ర నిర్వహించారు. తల్లి భౌతికకాయాన్ని చూసి చిన్నపిల్లలైన కుమార్తెలు రిషిత, రిషిక హృదయ విదారకంగా విలపించడం అందరినీ కలచివేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అక్కడకు చేరుకుని గీతాంజలి భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం ఆదేశానుసారం మంగళవారం వారి ఇంటికి వచ్చి బిడ్డల భవిష్యత్ కోసం ఏం చేయాలనే అంశంపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన అరాచకత్వానికి బీసీ మహిళ బలి: పద్మ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన బీసీ మహిళ గీతాంజలి సంతోషాన్ని చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన పార్టీలు ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నాయని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విచక్షణ మరచిన పచ్చ మూకలు అరాచకంగా ట్రోల్ చేయడంతో తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఆప్యాయంగా పలకరించేది.. మా ఇంటికి ఎదురుగా నివసించే గీతాంజలి ఎప్పుడూ సంతోషంగా, చలాకీగా ఉంటుంది. ఎక్కడ కనిపించినా మామ్మగారూ... అంటూ చాలా ఆప్యాయంగా పలకరించేది. రెండు రోజులుగా కనిపించకపోతే శివరాత్రి కావడంతో ఎటైనా వెళ్లిందేమో అనుకున్నా. ఇలా జరుగుతుందని అనుకోలేదు. చాలా బాధనిపిస్తోంది. – అవ్వారు పద్మావతి, ఇస్లాంపేట, తెనాలి జీవితంలో మర్చిపోలేనంటూ.. మేం ఇస్లాంపేటలో సోడాలు విక్రయిస్తాం. గీతాంజలితో కొద్ది రోజుల పరిచయమే అయినా చాలా కలివిడిగా మాట్లాడేది. ఇటీవలే చిన్నపిల్లల్లా ఆడుకున్నాం. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రం తీసుకున్నానని ఎంతో సంతోషంగా చెప్పింది. నా పేరు మీద ఇచ్చారు... జీవితంలో మర్చిపోలేనని చెప్పి మురిసిపోయింది. ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తోందని చెబుతుండేది. ఆమె చనిపోయిందని తెలిసి ఎంతో బాధపడుతున్నా. – షేక్ రేష్మా, ఇస్లాంపేట, తెనాలి -
రామోజీ ఫిల్మ్‌సిటీ: ఈనాడు ఆఫీసు పైనుంచి పడి మహిళ మృతి
-
అర్ధరాత్రి టాలీవుడ్ హీరో తలుపు కొట్టాడు.. షాక్‌కు గురయ్యా: సీనియర్ నటి
ప్రముఖ తమిళ నటి వెన్నిర ఆడై నిర్మల షాకింగ్ కామెంట్స్ చేసింది. తనపై టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేసింది. ఆమె గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోపై నటుడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. గత ఇంటర్వ్యూలో నిర్మల మాట్లాడుతూ.. 'నేను తెలుగులో చాలా సినిమాల్లో నటించా. దాదాపు కొన్నేళ్ల క్రితం ఓ తెలుగు సినిమాలో నటించా. షూటింగ్ తర్వాత నేను నా రూమ్‌లో నిద్రపోతున్నా. రాత్రి సమయంలో వచ్చి హీరో తలుపు కొట్టాడు. మీరు తలుపు తీయండి. నేనేం చేయను. మీ దగ్గరికి వచ్చి వెళ్లిపోతా అన్నాడు. ఫుల్‌గా మందు తాగి వచ్చి అలా మాట్లాడారు. ఈ ఘటనతో తాను షాక్ అయ్యా. ఆ తర్వాత నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నా. దర్శకనిర్మాతలు నన్ను కన్విన్స్ చేసినప్పటికీ ఒప్పుకోలేదు. ఇలాంటివాటిని నేనస్సలు సహించను' అంటూ వెల్లడించింది. అయితే ఆ నటుడి పేరు చెప్పడానికి కూడా తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన తెలుగు నటుడి నుంచి ఇలాంటి ప్రవర్తన తాను ఊహించలేదని అలనాటి నటి చెప్పింది. కాగా.. తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వెన్నిరాడై నిర్మల తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో నటించారు. వందలాది చిత్రాలు చేసిన ఆమె తన సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వెన్నెలాడె చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమె హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాలుగు వందలకు పైగా చిత్రాలు చేసింది. తెలుగులో మా ఇంటి వెలుగు, దత్తపుత్రుడు, పిచ్చిపిల్ల, బొమ్మ బొరుసు, మదర్ ఇండియా, భక్త ప్రహ్లాద, కరుణామయుడు, శ్రీ సీతారాముల కల్యాణం చూద్దము రారండి, కలిసుందాం రా, జయం మనదేరా, నిన్నే ప్రేమిస్తా వంటి అనేక తెలుగు చిత్రాలు చేసింది. అంతేకాదు.. ఆమె తెలుగులో స్టార్ హీరో బాలకృష్ణ సినిమాల్లో కూడా నటించింది. కాగా.. 2001లో ఒక తెలుగు సినిమా షూటింగ్లో స్టార్ నటుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఆ సినిమా ఫైట్ మాస్టర్ తనను అవమానించాడని బిగ్ బాస్ తమిళ 7 కంటెస్టెంట్, సీనియర్ నటి విచిత్ర కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే. -
గొప్పగా మాట్లాడి వస్తే ఇలాగేనా చెక్ చేసేది ?
న్యూఢిల్లీ: పాక్ బాలికల విద్య, హక్కుల ఉద్యమకారిణి మలాలా యూసఫ్జాయ్లాగా తానేమీ స్వదేశం వదిలిపోలేదని, సొంత కశ్మీర్లో హాయిగా ఉన్నానంటూ బ్రిటన్ పార్లమెంట్ భవనంలో ప్రసంగించిన కశ్మీర్ యువతి యానా మిర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్రిటన్ నుంచి విమానంలో తిరిగొచ్చాక ఆమె బ్యాగులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తనిఖీచేయడమే ఆమె ఆగ్రహానికి లోనయ్యారు. బ్రిటన్‌లో భారత్ గురించి గొప్పగా ప్రసంగించిన నాలాంటి వ్యక్తిని ఇలాగేనా అవమానించేది?. ఖరీదైన లూయిస్ విట్టన్ బ్రాండ్ షాపింగ్ ఖాళీ సంచులు తెచి్చనందుకే బిల్లులు ఎగ్గొట్టిన దొంగలా చూస్తున్నారు. నన్ను వాళ్లు ఇండియా మీడియా యోధురాలిగా భావిస్తే మీరేమో ఇక్కడ నన్ను బ్రాండ్ స్మగ్లర్లా భావించి పరువు తీస్తున్నారు’’ అని అధికారులతో స్వరం పెంచి మాట్లాడారు. అధికారులతో వాగ్వాదం తాలూకు వీడియోను స్వయంగా కెమెరాతో షూట్‌చేసి ‘ఎక్స్’లో షేర్చేశారు. దీనిపై ఢిల్లీ కస్టమ్స్ అధికారులు వివరణ ఇచ్చారు. ‘‘ అంతర్జాతీయ ప్రయాణికుల బ్యాగులను స్కానింగ్ చేయడం సర్వసాధారణం. గౌరవం చట్టాలకు అతీతం కాదు. బ్యాగ్ స్కానింగ్‌కు ఆమె ఒప్పకోలేదు’ అని అన్నారు. -
సెట్లో అసభ్య ప్రవర్తన.. చెంప చెల్లుమనిపించిన బాహుబలి నటి!
2014లో రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నోరా.. ఆ తర్వాత ఏడాదిలోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమా 'టెంపర్'లో స్పెషల్ సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అతి స్వల్ప కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కు చేరింది. అంతే కాకుండా కిక్- 2, షేర్, లోఫర్, ఊపిరి లాంటి చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌తో తన డ్యాన్సులతో ఆకట్టుకుంది. డ్యాన్సర్, మోడల్, సింగర్ కూడా తన సత్తా చాటింది. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ సాంగ్‌తో మంచి క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్‌లో యాక్టింగ్ ద్వారా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సినిమాలని పక్కనబెడితే ఈమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలోయాక్టివ్‌గా ఉంటే నోరాకు ఇన్‌స్టాలో 46.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. సినిమాలతో పాటు టీవీ రియాల్టీ డాన్స్ షోలు, మ్యూజిక్ వీడియోస్, వెబ్ సిరీస్, వెబ్ మూవీస్‌లో సందడి చేస్తోంది. కెరీర్ ఆరంభంలో చాలాసార్లు అవమానాలు ఎదుర్కొన్న నోరా.. అందరి నోళ్లు మూయించేలా ఉన్నతస్థాయికి ఎదిగింది. సహనటుడి అసభ్య ప్రవర్తన తాజాగా తనకు ఎదురైన ఓ చేదు సంఘటనను వివరించింది. ఇండస్ట్రీలో మొదటి నుంచి ఇబ్బందులు పడిన నోరాకు.. ఓ షూటింగ్ సెట్లో జరిగిన అవమానంపై తొలిసారి నోరు విప్పింది. గతంలో ది కపిల్ శర్మ షోకు హాజరైన భామ ఈ విషయాన్ని వెల్లడించింది. 'రోర్: టైగర్ ఆఫ్ ది సుందర్బన్స్' షూటింగ్ సమయంలో సహనటుడు అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. బంగ్లాదేశ్‌లో రోర్ మూవీ షూటింగ్లో ఈ సంఘటన జరిగిందని నోరా పేర్కొంది. మొదట అతను నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడే లాగి చెంప దెబ్బ కొట్టానని తెలిపింది. కానీ ఆ గొడవ అంతటితో ఆగిపోలేదని.. అతను తిరిగి నా జుట్టును పట్టుకుని లాగాడని వివరించింది. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరిందని వెల్లడించింది. దీంతో డైరెక్టర్ జోక్యం చేసుకుని మా ఇద్దరికి సర్దిచెప్పి విడదీయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ భయానక సంఘటనను గుర్తుచేసుకుంది. ఆ గొడవ జరిగిన సమయంలో తాను చాలా బాధపడినట్లు నోరా ఫతేహీ తెలిపింది. కాగా.. ప్రస్తుతం నోరా క్రాక్ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమా ఫిబ్రవరి 23న వెండితెరపైకి రాబోతోంది. ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, అమీ జాక్సన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇండియాలోనే మొట్టమొదటి 'ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్'గా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్ నటిస్తోన్న హౌస్‌ఫుల్-5లో నటించనుంది. -
ట్రాన్స్‌జెండర్‌గా మారి వేధిస్తున్నాడని.. భర్తను హత్య చేయించిన భార్య
సిద్దిపేట కమాన్: ట్రాన్స్‌జెండర్‌గా మారి వేధిస్తున్నాడంటూ సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించింది ఓ భార్య. సుపారీ కింద రూ.18 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకొని.. రూ.4.60 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించింది. సిద్దిపేట వన్‌టౌన్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ రంజిత్‌కుమార్ కథనం ప్రకారం.. సిద్దిపేట బోయిగల్లికి చెందిన వేదశ్రీకి నాసర్‌పూరకు చెందిన దరిపల్లి వెంకటేశ్(33)కు 2014లో వివాహమైంది. 2015లో వీరికి ఒక పాప జన్మించింది. కొద్ది రోజుల తర్వాత వెంకటేశ్‌కు మానసిక ఆలోచనల్లో మార్పు వచ్చింది. అమ్మాయిలాగా ప్రవర్తించడం చెవులకు కమ్మలు, ముక్కుకు పుడక పెట్టుకుని రాత్రి సమయంలో ఆడవారి దుస్తులు ధరించడం చేస్తుండేవాడు. అదనపు కట్నం కోసం కూడా వేధింపులకు గురి చేసేవాడు. 2019లో ఏకంగా వెంకటేశ్ ట్రాన్స్‌జెండర్‌గా మారి భార్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులకు ఉద్యోగం పోవడంతో పగబట్టి.. రోజాగా పేరుమార్చుకున్న వెంకటేశ్ పలుమార్లు చీరకట్టుకుని వేదశ్రీ పనిచేస్తున్న స్కూలుకు వెళ్లి వేధిస్తుండటంతో తన ఉద్యోగాన్ని కోల్పోయింది. మరో స్కూల్లో చేరినా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో తనకు పరిచయమైన సిద్దిపేట నాసర్‌పూర వాస్తవ్యుడు బోయిని రమేశ్‌తో తన బాధను చెప్పుకొని వాపోయింది. తనను, పాపను వేధిస్తున్న వెంకటేశ్ (రోజా)ను ఎలాగైనా అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది. దీంతో వేదశ్రీ, రమేశ్ కలిసి పట్టణంలోని కాకతీయ ఫుట్‌వేర్ యజమాని రమేశ్‌తో వెంకటేశ్(రోజా) హత్య కోసం 2023 సెప్టెంబర్‌లో రూ. 18లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు అడ్వాన్స్‌గా వేదశ్రీ మొదటగా రూ.2లక్షలు చెల్లించింది. ఈ క్రమంలో ఫుట్‌వేర్ రమేశ్‌కు మిత్రుడైన నంగునూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ఇప్పల శేఖర్‌కు హత్య విషయం తెలిపారు. దీంతో ఇప్పల శేఖర్ ముందుగా వేసుకున్న పథకంలో భాగంగా వెంకటేశ్ (రోజా)తో పరిచయం చేసుకుని తరచూ అతడిని కలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇప్పల శేఖర్ వెంకటేశ్(రోజా)కు ఫోన్ చేసి వరంగల్ నుంచి సిద్దిపేటకు పిలిపించాడు. -
నా ఫొటొలకు రిప్లే ఇవ్వలేదో నిన్ను ఫెయిల్ చేస్తా
భువనగిరి క్రైం: పదో తరగతి విద్యార్థినికి ఉపాధ్యాయుడు అసభ్య మెసేజ్‌లు పంపి వేధించాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన బుధవారం భువనగిరి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు, విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో నివసించే బెల్లి సంజయ్ పట్టణంలో పలు పాఠశాలల్లో పీరియడ్ వారీగా సైన్స్ సబ్జెక్ట్ బోధిస్తుంటాడు. కొందరు విద్యార్థులు సబ్జెక్ట్‌లో తమ అనుమానాల నివృత్తి కోసం పలుమార్లు సంజయ్‌ను సెల్ఫోన్లో సంప్రదించేవారు. ఇదే అదనుగా భావించిన సంజయ్ ఓ విద్యార్థిని సెల్‌ఫోన్‌కు అసభ్య మెసేజ్‌లు పంపడం ప్రారంభించాడు. సోషల్ మీడియా యాప్ అయిన ఇన్‌స్ట్రాగామ్‌లోనూ ఆ విద్యార్థినికి ఫొటోలు పంపేవాడు. తన ఫొటోలకు రిప్లే ఇవ్వాలని.. లేదంటే ఫెయిల్ చేస్తానని బెదించేవాడు. దీంతో ఆ విద్యార్థిని ఆందోళనకు గురవుతుండగా కుటుంబ సభ్యులు గుర్తించి ఏం జరిగిందని ఆరా తీయడంతో సంజయ్ బాగోతం బయటపడింది. దీంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇదే విషయమై బుధవారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడు సంజయ్‌ని నిలదీయగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులు సంజయ్‌కి దేహశుద్ధి చేశారు. స్కూల్ యాజమాన్యంపై విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ సంజయ్ కృ, ఎస్ఐ నాగరాజు పాఠశాలకు వచ్చి టీచర్ సంజయ్‌ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టుకు సరెండర్ చేశారు. కాగా సంజయ్‌పై గతంలోనూ ఇదేవిధంగా పలువురిని ఇబ్బందులు పెట్టినట్లు తెలుస్తోంది. నిందుతుడిని కఠినంగా శిక్షించాలని ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, ఆలిండియా పేరెంట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కలెక్టర్, డీఈఓ, పోలీసులకు ఫిర్యాదులు, వినతి పత్రాలు సమర్పించారు. -
మహిళ కనిపిస్తే.. వేధింపులేనా? మీరేం మనుష్యులు
మహిళలకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని సోషల్‌మీడియాలో ప్రస్తావించారు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల. ఆయన ట్విట్టర్ వేదికగా రాసిన పోస్టు యథాతధంగా.. నేను వైద్యం చేసిన ఎంతోమంది ఆడవాళ్లు (వయసు నిమిత్తం లేకుండా), నా స్నేహితురాళ్ల అనుభవాలు ఇవి. ఈ దురదృష్ట అనుభవాలు అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ మనదేశంలో బాగా ఎక్కువ. ఏమిటివి? వీధుల్లో, బస్సుల్లో,రైళ్లలో, ఇళ్లలో,ఆడుకునే స్థలాల్లో, పనిచేసే ప్రదేశాల్లో, గుళ్లలో సమయం సందర్భం ఏదైనాగానీ ఆడవాళ్ళ వెంటబడటం, తేరిపార చూడటం, సైగలు చెయ్యటం, ఫోటోలు తీయటం మాత్రమే కాకుండా కావాలని రాసుకుని వెళ్ళటం, ఇంకా మితిమీరి తాకటం, ముట్టటం, పట్టుకోవడం, కొట్టటం, హఠాత్తుగా మీద పడడం లాంటివి చేసి చాలా ఇబ్బంది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారు అన్నదానికి మానసిక శాస్త్ర పరంగా చాలా కారణాలున్నప్పటికీ ఇది చెడ్డ ప్రవర్తన. ఒకసారి చేసి పట్టుబడనప్పుడు వీళ్లలో ధైర్యం పెరిగి మళ్లీ మళ్లీ చేస్తూ, వారి చర్యల తీవ్రత కూడా పెరుగుతుంది. ముందు భయంతో చేసి, చేశాక ఆనందాన్ని పొందే వీళ్లు తర్వాత తర్వాత దాడికి గురైన ఆడవాళ్ల ముఖంలో ఉండే భయాన్ని, షాక్ ని చూసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. వీళ్లని నియంత్రించే ఒకే ఒక్క మార్గం ఎదిరించటం, పట్టుకుని ప్రశ్నించడం. అలా జరిగిన చాలా సందర్భాల్లో అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. ఒకసారి పట్టుబడ్డాక చాలామంది మానేస్తారు కానీ కొంతమంది కొనసాగిస్తారు. వీళ్లని కఠినంగా శిక్షించటం ద్వారా ఈ నేరాల తీవ్రత కొంతవరకు తగ్గించవచ్చు. ఈమధ్య వచ్చే కొన్ని సినిమాలు కూడా ఇటువంటి ప్రవర్తనని ఎగదోస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. వాళ్లని చాలా బాధకి గురిచేస్తాయి. కోపం, దిగులు, బయటికెళ్లాలంటే భయం, వణుకు, నిస్సహాయత మొదలైన అనుభూతులకి గురవ్వటమే కాకుండా ఆత్మన్యూనత, తమనితాము నిందించుకోవడం, తమ వస్త్రాలంకరణని ప్రశ్నించుకోవడం, తోడు లేనిదే బయటికి వెళ్లకపోవడం చేస్తుంటారు. పైగా ఈబధని ఎవరితో చెప్పుకోలేక సతమతమౌతుంటారు. చెప్పినా కూడా కొన్నిసార్లు వీళ్లే నిందలకు గురవుతుంటారు. కొన్ని గుర్తుపెట్టుకోండి. 1. ఈ అనుభవాలు మీ ఒక్కరికే కాదు, దాదాపు అందరి ఆడవాళ్లలో ఉంటాయి. ఒకసారి మీ అమ్మాయి/సోదరి/భార్య/స్నేహితురాళ్లతో చర్చించండి. వారికి సాంత్వన చేకూర్చి ధైర్యాన్ని ఇచ్చినవాళ్లవుతారు. 2. తప్పు ఎప్పుడూ దాడి చేసినవాళ్లదే. మీరు ఒంటరిగా బయటికి వెళ్ళటం, మీ వస్త్రాలంకరణ, మీ మాటలు ఇవేవీ కూడా వారు మీతో అలా ప్రవర్తించడానికి పచ్చజెండా కాదు. 3. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగరూకతతో ఉండండి, ఎదుటివాళ్లపై అనుమానం ఉంచి వాళ్లు మిమ్మల్ని దరి చేరేటప్పుడు బ్యాగ్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి మార్చటం, చేతులు విదల్చటం వంటి హఠాత్చర్యల వలన దాడిచేసేవాళ్లు దూరం జరుగుతారు. 4. దాడి జరిగినప్పుడు వెంటనే పట్టుకుని ప్రశ్నించండి. వాళ్లు హెడ్లైట్ల కింద దొరికిన కుందేలులా స్థాణువైపోతారు. 5. ఇటువంటి అనుభవాలు మిమ్మల్ని తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేసినా లేక మీ లైంగిక జీవితాన్ని అస్తవ్యస్తం చేసినా మానసిక నిపుణుల్ని కలవండి. డాక్టర్ శ్రీకాంత్ మిరియాల -
ప్రధానిలో నిర్దయ చూస్తే బాధేస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఉదంతంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో కేంద్రం తీరుకు నిరసనగా నిరసనగా ఖేల్ రత్న, అర్జున అవార్డులను రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఢిల్లీలో రోడ్డుపై వదిలేయడం తెలిసిందే. ఆ వీడియోను రాహుల్ ఆదివాంర ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ప్రధానిని వైఖరిని ఎండగట్టారు. ‘‘భారతదేశంలోని ప్రతి అమ్మాయి ఆత్మాభిమానానికి అత్యంత విలువ ఇస్తుంది. అవార్డులు, పురస్కారాలన్నీ ఆ తర్వాతే. ఇలాంటి ధైర్యశాలుల కంటే ‘బాహుబలి’ వంటి పరపతి గల వ్యక్తుల నుంచి పొందే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయా?’’ అని మోదీని ప్రశ్నించారు. ‘‘ప్రధాని అంటే దేశ రక్షకుడు. ఇంతటి తీవ్రమైన అంశంలో ఇంత నిర్దయగా వ్యవహరించడం చాలా బాధేస్తోంది’’ అన్నారు. -
కోడెల శివరామ్ వేధింపులతోనే మా బిడ్డ ఆత్మహత్య
పట్నంబజారు: కోడెల శివరామ్ వేధింపులు భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన మృతుడి తల్లి విలపిస్తున్నారు. మేడికొండూరు పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరేచర్లకు చెందిన కొల్లోజు ఫణీంద్రసాయి(22) నాలుగేళ్ల కిందట గుంటూరు నాజ్‌సెంటర్ డీమార్ట్‌లో గేట్ ఇన్చార్జిగా పనిలో చేరి సూపర్వైజర్గా ఎదిగాడు. కోడెల శివరామ్‌కు సంబంధించి వ్యక్తిగత పనులు కూడా చూస్తుండేవాడు. నగదుకు సంబంధించిన లావాదేవీలతో పాటు గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని కనస్ట్రక్షన్లకు చెందినవి కూడా చూస్తుంటాడు. కొంతకాలం కిందట ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సెల్ స్విచ్ఛాఫ్ చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కంపెనీకి సంబంధించిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడంటూ కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో డీమార్ట్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఆరోగ్యం కుదుటపడ్డాకవచ్చిన ఫణీంద్రసాయి.. రూ.2 లక్షలను తిరిగి ఇచ్చారని సాటి ఉద్యోగులు చెబుతున్నారు. అనంతరం పలు కారణాల రీత్యా ఫణీంద్ర అక్కడ ఉద్యోగం మానేశాడు. కొద్ది రోజుల తర్వాత యాజమాన్యం పిలిపించి తిరిగి ఉద్యోగంలో పెట్టుకుంది. ఈ నెల ప్రారంభంలో తిరిగి అనారోగ్యం తిరగబెట్టడంతో చికిత్స పొంది.. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో కోడెల శివరామ్ అనుచరుడైన నాయక్ నాలుగు రోజులుగా ఇంటికి వచ్చి ఫణీంద్రను భయభ్రాంతులకు గురిచేయడం ప్రారంభించాడు. ఉద్యోగానికి రావాలని లేకుంటే సార్ ఊరుకోరని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఫణీంద్ర గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల శివరామ్, నాయక్‌లు అకారణంగా వేధింపులకు గురిచేయడంతోనే తమ బిడ్డ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి కొల్లోజు నాగమణి ఆరోపిస్తున్నారు. నిత్యం నాయక్ వచ్చి, కోడెల శివరామ్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడే వాడంటూ ఆమె విలపించారు. తన కుమారుడి మృతికి కారణమైన కోడెల శివరామ్, అతని అనుచరుడు నాయక్‌లపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
మహిళలకు అసభ్య మెసేజ్‌లు.. పోకిరిని చితక్కొట్టిన బంధువులు
సాక్షి, హైదరాబాద్: మహిళలు, యువతులను వేధిస్తోన్న ఓ పోకిరిని బాధితుల బంధువులు పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ డయాగ్నొస్టిక్ సెంటర్లో పనిచేసే సికిందర్(26) గంజాయికి బానిసయ్యాడు. డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వచ్చే మహిళలు, యువతుల ఫోన్ నంబర్లు తీసుకుని.. వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలతో వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు భరించలేని కొందరు మహిళలు వారి బంధువులకు తెలపడంతో పోకిరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. గాయపడిన సికిందర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదీ చదవండి: ప్రియురాలి నిర్వాకం.. ప్రియుడిపై కోపంతో సినిమా తరహా పక్కా స్కెచ్ -
న్యాయమూర్తినీ వదలని వేధింపులు!
జిల్లా జడ్జి తనను లైంగికంగా వేధిస్తున్నాడనీ, అనుమతిస్తే గౌరవంగా చనిపోతాననీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కలకలం రేపింది. అసలు దేశవ్యాప్తంగా మహిళలపైన నేరాలు పెరగడం చూస్తున్నాం. మహిళలపై అత్యాచారాలకు కారణం – వారి పట్ల భారత సమాజ దృక్పథమే. అయితే, ఒక మహిళా న్యాయమూర్తి లాంటి ప్రసిద్ధురాలినే వేధింపులు దుర్భర మానసిక స్థితి వైపు నెట్టాయంటే సామాన్య స్త్రీల పరిస్థితి ఏమిటి? విచిత్రమేమంటే, సరికొత్త ఉదారవాద ఆర్థిక యుగంలో తిరిగి పాత తరహా పురుషాధిక్య ధోరణులు ప్రబలిపోతున్నాయి. నేటి ఈ అవాంఛనీయ పరిస్థితులలో కావలసింది సమాజంలో స్త్రీ ప్రతిపత్తిని పెంచగల రాజకీయ విధానాలు, కార్యక్రమాలు! ‘‘ఏ పౌరుడూ మరొక పౌరుణ్ణి కొన గలిగినంత ధనవంతుడుగా ఉండకూడదు. అలాగని ఏ పౌరుడూ తనను తాను అమ్ముకోవలసినంత పేదవాని గానూ ఉండకూడదు.’’ – రూసో మహాకవి, తాత్విక మేధావి ‘‘తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నాడనీ, అనుమతిస్తే గౌరవంగా చనిపోతాననీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్జి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌కు లేఖ రాయడం దేశంలో కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తి సీరియస్‌గా తీసుకొని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను విచారణకు ఆదేశించారు. ‘‘ఇక నాకు ఏమాత్రం జీవించాలని లేదు. నిర్జీవమైన ఈ శరీరాన్ని మోయడం నిష్ప్రయోజనం. నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకోవడానికి అనుమతించండి’’ అని మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ సుప్రీం చీఫ్‌ను కదిలించి వేసిన ఫలితంగా తక్షణ చర్యలకు ఆదేశించారు.’’ – 16.12.2023 నాటి పత్రికా వార్తలు ఇలాంటి ‘వేధింపుల పర్వం’ ఇంతకుముందూ జరిగిందని మరచి పోరాదు. నైతికంగా బలహీనుడైన ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలోనే పనిచేస్తున్న ఒక స్త్రీ అధికారిని రకరకాల వేధింపులకు గురిచేసి, ఆమె లొంగకపోయే సరికి, ఆమెనూ, ఆమె కుటుంబ సభ్యులనూ ఎన్ని రకాల బాధలు పెట్టిందీ లోకం మరచిపోలేదు. అలాంటి నైతిక బలహీనతలు లేనందుననే ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ చంద్రచూడ్ ఉత్తరప్రదేశ్ మహిళా న్యాయమూర్తి పట్ల జరిగిన వేధింపుల కేసుపై తక్షణ విచారణకు ఆదేశించారు. గవర్నర్ల తీరు ఇదిలా ఉంచి, బీజేపీ–ఆరెస్సెస్ నాయకత్వ పాలన ఎలా ఉందో చూడండి: వారి విధానాలను అడ్డుకునే లేదా విమర్శించే రాష్ట్ర ప్రభుత్వాలను అదుపులో ఉంచగల తమ పార్టీ గవర్నర్లకు మాత్రమే రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడే అధికారాలు అప్పగించారు. ఇందుకు పక్కా ఉదాహరణలు – కేరళ, తమిళనాడు గవర్నర్లు తీసు కుంటున్న నిర్ణయాలు! రాజ్యాంగంలోని 200 అధికరణకు ఇచ్చిన తొలి వివరణ ప్రకారం, శాసనసభ చర్చలో ఉన్న బిల్లులను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో శాసనసభ నిర్ణయం. అంతేగానీ ఆ హక్కు గవర్నర్‌కు లేదు. కానీ ఇప్పుడు బీజేపీ గవర్నర్లు తమ అసాధారణ అధికారాలు చెలాయిస్తూ శాసనసభ బిల్లులను తొక్కి పెడుతున్నారు. కానీ, బిల్లును ఆమోదించగల లేదా తిరస్కరించగల అధికారం ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు లేకుండా చేసే పెత్తనం గవర్నర్‌కు లేదు. ఒక వేళ ఏ కారణం చేతనైనా బిల్లును ఆమోదించ నిరాకరించే పక్షంలో ‘తిరిగి పరిశీలించండి’ అన్న విజ్ఞప్తితో శాసన సభకు నివేదించాలేగానీ, బిల్లులను తొక్కిపెట్టే అధికారం మాత్రం గవర్నర్‌కు లేదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కరాఖండీగా ప్రకటించాల్సి వచ్చింది. ఆ అధికారం ప్రజలు ఎన్నుకొనని గవర్నర్లకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రసిద్ధులకే ఇలా ఉంటే... అంతేగాదు, పంజాబ్ శాసనసభ కేసులో సుప్రీంకోర్టు బిల్లులను తొక్కిపెట్టి ఉంచే అధికారం గవర్నర్లకు లేదని స్పష్టం చేయడంతో రాజ్యాంగంలోని 200 అధికరణకు ఆచరణలో విలువ పెరిగింది. ఇదే సూత్రం రాష్ట్రపతికీ వర్తిస్తుంది. లోక్ సభ మాజీ ప్రధాన కార్యదర్శి పి.డి.టి. ఆచారి చెప్పినట్టు, ఒక చట్టం రాజ్యాంగబద్ధత సరైనదా, కాదా అన్నది కోర్టు నిర్ణయించాల్సిందే గానీ, ఆ విషయంపై ఇటు రాష్ట్రపతికీ, అటు గవర్నర్లకూ ఎలాంటి నిర్ణయాధికారం లేదు. అయితేనేమి, పాలకులు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నట్టు నటించ డమేగానీ దాని విలువలను ఆచరణలో పాటించడంలో నడుపుకొనేవి ‘సొంత దుకాణాలే’నని మరవరాదు. ఈ పరిస్థితులలో ఒక్క మహిళా న్యాయమూర్తులపైననే కాదు, అసలు దేశ మహిళలపైననే నేరాల సంఖ్య పెరిగిపోవడం చూస్తున్నాం. 2022వ సంవత్సరానికి నేషనల్ క్రైమ్స్ బ్యూరో ప్రకటించిన వివరాలను బట్టి మహిళలపైన ఇంతకుముందు కంటే నేరాల సంఖ్య పెరిగిపోయింది. పైగా, పెక్కు రాష్ట్రాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పక్కన తమ మగ బంధువుల తోడు లేకుండా తాముగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసుకోలేని స్థితి. మహిళలపై నేరాల సంఖ్య 4 శాతంపైన పెరిగిందని క్రైమ్స్ బ్యూరో నివేదిక. ఇవిగాక భర్తలు, వారి బంధువులు చేసిన నేరాల సంఖ్య 2022లో 4.45 లక్షలు. అంటే, ప్రతి గంటకూ 51 కేసులు రికార్డ య్యాయి. మరీ విచిత్రమేమంటే, ‘సరికొత్త ఉదారవాద ఆర్థిక యుగంలో తిరిగి పాత తరహా పురుషాధిక్య ధోరణులు ప్రబలిపోతున్నా’యని జాతీయ మహిళా సంస్థ ‘జాగోరి’ డైరెక్టర్ జయశ్రీ వేలంకర్ వివరించారు. నేటి ఈ అవాంఛనీయ పరిస్థితులలో కావలసింది సమాజంలో స్త్రీ ప్రతిపత్తిని పెంచగల రాజకీయ విధానాలు, కార్యక్రమాలని ఆమె అన్నారు. మహిళల రక్షణకు ఉద్దేశించిన కఠిన చర్యలు కాగితం మీదనే ఉండి పోయాయిగానీ ఆచరణలో లేవనీ, దీన్ని బట్టి సంప్రదాయంగా స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతూ ఉండటానికి అసలు కారణం – స్త్రీల పట్ల భారత సమాజ దృక్పథమేననీ సుప్రీంకోర్టు ప్రసిద్ధ మహిళా న్యాయ వాది శిల్పి జైన్ స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే, ఉత్తరప్రదేశ్ మహిళా న్యాయమూర్తి లాంటి ప్రసిద్ధురాలినే వేధింపులు దుర్భర మానసిక స్థితివైపు నెట్టాయంటే సామాన్య స్త్రీల విషయంలో గణింపు నకు రాని, వచ్చినా పట్టించుకోని సమాజ స్థితిగతుల్ని అర్థం చేసు కోగలగాలి. మాంస వ్యాపారం నా మిత్రుడు, సుప్రసిద్ధ లాయర్ హనుమారెడ్డి మతాలు – చట్టాల గురించి ముచ్చటిస్తూ మరవరాని రెండు మంచి మాటలు చెప్పాడు: ‘‘మతాలు రాజ్యమేలినప్పుడు చట్టం ఒక పద్ధతిగానూ, రాచరికం రాజ్యమేలినప్పుడు చట్టం మరొక పద్ధతిలోనూ, వ్యాపారం రాజ్యమేలినప్పుడు వేరొక పద్ధతిలోనూ ఉండి ప్రజలకు సంబంధించిన విధివిధానాలు మారుతూ వచ్చాయి. స్థూలంగా చెప్పాలంటే నేరాలు రెండు విధాలుగా ఉండాలి. ఒకటి రాజ్యాధికారం పట్ల నేరం, రెండవది ప్రజలపట్ల నేరం.’’ అలాగే, ‘ప్రేమ’ అనే పేరిట ఎంత ప్రమాదకర పరిణామాలు, విధ్వంసం జరుగుతున్నాయో మందరపు హైమవతి తన ‘నీలి గోరింట’ కవితలో ఇలా చీల్చి చెండాడవలసి వచ్చింది: ‘‘తండ్రీ, కూతురు, గురువు, శిష్యురాలు వావివరసల్లేకుండా ఆడపిల్లలే అంగడి సరుకులైనప్పుడు మానవ మాంస వ్యాపారంలో మహిళల శరీరాలే పెట్టుబడి ఐనప్పుడు రుష్యశృంగుడైనా మేనకను చూచిన విశ్వామిత్రునిలా మారిపోడా?!’’ అలా మారిపోకూడదనే ఉత్తరప్రదేశ్ మహిళా న్యాయమూర్తికి జరిగిన సంఘటన నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పదేపదే చేస్తున్న విజ్ఞప్తుల పరంపర లక్ష్యం! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వీడియోలు మార్ఫింగ్ చేసి.. అసభ్యకరమైన కామెంట్స్: రీతూ చౌదరి
కామెడీ షో జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. కొద్దిరోజుల క్రితం తన తండ్రి మరణించడంతో ప్రస్తుతం తన కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటుంది. తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఓ ఇంటీరియర్ డిజైనర్ వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చింది. అయితే తాజాగా మరో చేదు అనుభవాన్ని రీతూ చౌదరి పంచుకుంది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు చేస్తున్న ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను రీతూ తన ఛానల్లో షేర్ చేసింది. అదేంటో తెలుసుకుందాం. రీతూ చౌదరి మాట్లాడుతూ.. 'నా ఫోటోలను, వీడియోలను ఎవరో మార్ఫింగ్ చేశారు. వీడియోను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏకంగా నన్నే ట్యాగ్ చేసి పైశాచిక ఆనందం పొందారు. సోషల్ మీడియాలో నేను ఏం పెట్టినా చాలా దారుణంగా కామెంట్స్ చేశారు. ఇది జరిగిన దాదాపు ఐదు నెలలైంది. ఈ విషయాన్ని బయటికి చెప్పాలా? వద్దా? నాలో నేనే చాలాసార్లు బాధపడ్డా. బయటికి చెబితే ఏమవుతుందో అని భయపడిపోయా. ఈ వీడియో చేసేందుకు కూడా ఆలోచించా. కానీ చేయక తప్పడం లేదని' ఆవేదన వ్యక్తం చేసింది. మార్ఫింగ్ గురించి రీతూ మాట్లాడుతూ..'నేను ఎప్పటికీ స్ట్రాంగ్‌గా ఉంటా. నేను, శ్రీకాంత్ బయటికి వెళ్లేటప్పుడు ఇలాంటి వీడియోలు చూసి అతనికి చెప్పాలా? వద్దా అని కుమిలిపోయా. ఇది చూసిన శ్రీకాంత్ నువ్వు కానప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పేవాడు. నన్ను ట్యాగ్ చేసేవరకు ఇలాంటి వీడియోలు చేశారని నాకు తెలియదు. కానీ చివరికీ నేను ఈ వీడియోలను సైబర్ పోలీసులకు ఇచ్చాను. మా నాన్న పోయాక తిరిగి కోలుకునేలోపే మళ్లీ ఇలా జరిగింది. కానీ నా వల్ల అవ్వలేదు. ఒక రోజు అమ్మకు ఈ విషయం చెప్పా. కానీ అమ్మ కూడా ఇలాంటివీ పట్టించుకోవద్దని చెప్పింది. మా అన్నకు కూడా చెప్పాను. నా కుటుంబం సపోర్ట్‌గా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ విషయంలో విష్ణుప్రియ అండగా నిలిచారు' అని తెలిపింది. ఆ తర్వాత.. 'నేను సోషల్ మీడియాలో ఏది పెట్టినా.. నాతో వస్తావా? వన్ నైట్‌కు వస్తావా? టూ నైట్స్‌కు ఎంత? అని మేసేజ్ చేసే వాళ్లు కూడా ఉంటారు కదా? అలాంటి వాళ్ల లింక్స్ కూడా నేను పోలీసులకు ఇచ్చా. ఆఫర్స్ లేకనే ఇలా చేసిందంటూ నన్ను ఎంతోమంది టార్చర్ చేశారు. అలాంటి వారినే ఇప్పుడు సైబర్ పోలీసులు పట్టుకున్నారు. అతన్ని నేను ఇంతకుముందు కూడా కలిశాను. ఎందుకిలా చేశావంటే నాకు తెలియదు మేడం అంటున్నారు. అతనికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారంట. అతని బావ వచ్చి చిన్నపిల్లాడు మేడం వదిలేయండని సిగ్గు లేకుండా అడుగుతున్నారని' రీతూ చెప్పుకొచ్చింది. ఇంకా ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారంటూ రీతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అబ్బాయిని ఆసిఫాబాద్ నుంచి పోలీసులు తీసుకొచ్చారని తెలిపింది. ఇలాంటి వీడియోలు చూసి నాకే.. అసలు ఈ లైఫ్ ఏంటని అనిపించిందని రీతూ వెల్లడించింది. ఇలాంటి పిచ్చివాళ్ల ఆట కట్టించేందుకు సైబర్ పోలీసులు ఉన్నారు. ఎవరూ భయపడకండి.. సూసైడ్ చేసుకునే వరకు తీసుకురాకండి.. ధైర్యంగా ముందుకెళ్లండి' అని రీతూ చౌదరి సలహా ఇచ్చింది. ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంది. -
‘కీచక న్యాయం’పై కొరడా!
ఎన్ని చట్టాలున్నా, ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలకు వేధింపులు తప్పడం లేదని తరచు రుజువవుతూనే వుంది. ఆఖరికి న్యాయదేవత కొలువుదీరే పవిత్ర స్థలం కూడా అందుకు మినహాయింపు కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని బాందా జిల్లా మహిళా సివిల్ జడ్జి రాసిన బహిరంగ లేఖ స్పష్టం చేస్తోంది. జిల్లా జడ్జి, ఆయన అనుచరుల నుంచి ఆమె ఎదుర్కుంటున్న వేధింపులు ఎలాంటివో, అవి ఎంత ఆత్మ న్యూనతకు లోనయ్యేలా చేశాయో మహిళా జడ్జి వాడిన పదజాలమే పట్టిచూపుతోంది. ‘నన్నొక వ్యర్థపదార్థంగా చూస్తున్నారు. పురుగుకన్నా హీనంగా పరిగణిస్తున్నారు’ అని అన్నారంటే ఆమె వేదనను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... ‘గత ఏడాదిన్నరగా నడిచే శవంగా బతుకీడుస్తున్నాను. ఇక జీవరహితమైన ఈ కాయాన్ని కొనసాగించలేను. ఆత్మహత్యకు అనుమతించండి’ అని కూడా ఆమె రాశారు. ‘మీరంతా ఆటబొమ్మగా, ప్రాణరహిత పదార్థంగా మారటం నేర్చుకోండి’ అని మహి ళలనుద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తనను రాత్రిపూట ఒంటరిగా కలవమంటూ వేధిస్తున్నారని మొన్న జూలైలో ఆమె చేసిన ఫిర్యాదుపై హైకోర్టులోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారించింది. కానీ కింది ఉద్యోగులు ధైర్యంగా సాక్ష్యం చెప్పాలంటే ఆ జడ్జిని విచారణ సమయంలో బదిలీ చేయాలన్న వినతిని పట్టించుకున్నవారు లేరు. దీనిపై సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేస్తే ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ ధర్మాసనం తోసిపుచ్చటం ఆమె తట్టుకోలేక పోయారు. నిరుడు దేశవ్యాప్తంగా మహిళలపై 4.45 లక్షల నేరాలు చోటు చేసుకున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక చెబుతోంది. లైంగిక నేరాలకు సంబంధించి సగటున ప్రతి 51 నిమిషాలకూ ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతున్నదని ఆ నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ 65,473 కేసులతో మొదటి స్థానంలో వుంటే మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. పనిచేసే చోట మహిళలను వేధించటంలో ఢిల్లీ అగ్రస్థానంలో వుంది. నిజానికి వాస్తవ ఘటనలతో పోలిస్తే కేసుల వరకూ వెళ్లే ఉదంతాలు తక్కువనే చెప్పాలి. అందరి దృష్టిలో పడతామని, ఉపాధి కోల్పోతామని, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ప్రతీకారానికి దిగొచ్చని భయపడి చాలామంది ఫిర్యాదు చేయటానికి వెనకాడతారు. ఈ వేధింపుల పర్యవసానంగా చాలామంది మహిళలు ఆత్మాభిమానం దెబ్బతిని, మానసిక క్షోభకు లోనయి వృత్తిపరంగా ఎదగలేని నిస్సహా యస్థితిలో పడుతున్నారు. ఇలాంటì కేసులు తమముందు విచారణకొచ్చినప్పుడు నేరగాళ్లను కఠి నంగా శిక్షించి, బాధితులకు ఉపశమనం కలగజేయాల్సిన చోటే... మహిళా న్యాయమూర్తులకు వేధింపులుంటే ఇంతకన్నా ఘోరమైన స్థితి ఉంటుందా? నిజానికి న్యాయవ్యవస్థలో లైంగిక వేధింపులుంటున్నాయని ఆరోపణలు రావటం ఇది మొదటిసారేమీ కాదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైనే ఫిర్యాదులొచ్చిన సందర్భా లున్నాయి. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తరుణ్ గొగోయ్‌పై 2019లో ఒక మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసినప్పుడు ఆమెను మొదట బదిలీ చేసి,ఆ తర్వాత సర్వీసునుంచి తొలగించి చివరకు చీటింగ్ కేసు కూడా పెట్టారు. గొగోయ్ పదవీ విరమణ చేశాక ఆ మహిళకు తిరిగి ఉద్యోగం లభించింది. జస్టిస్ గొగోయ్‌కి మాత్రం ఏం కాలేదు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా అదనపు సెషన్స్ జడ్జిగా పనిచేసిన మహిళ కూడా ఇలాంటిస్థితినే ఎదుర్కొన్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తనను వేధించిన తీరు గురించి ఆమె ఫిర్యాదు చేశారు. తన గోడు అరణ్యరోదన కావటంతో గత్యంతరం లేక 2014లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన వేధింపులు ఎలావుండేవో సోదాహరణంగా వివరించారు కూడా. ‘నీ పని తీరు చాలా బాగుంది. నీ అందం మరింత బాగుంది’ అనటం, ఒక శుభకార్యంలో నృత్యం చేయాలంటూ భార్యతో ఫోన్ చేయించటం, ‘ఒంటరిగా ఓసారి నా బంగ్లాకు రా’ అని ఫోన్ చేయటం తేలిగ్గా కొట్టిపారేయదగ్గ ఆరోపణలు కాదు. కానీ విషాదమేమంటే ఆ ఫిర్యాదుకు అతీగతీ లేక పోయింది. ఆ న్యాయమూర్తి నిక్షేపంగా తన పదవీకాలం పూర్తిచేసుకున్నారు. ఆయన రిటైర్ కావటంతో తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆమె 2018లో పిటిషన్ పెట్టుకున్నారు. చివరకు ఆ మహిళా జడ్జి స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం నిర్ధారించుకుని నిరుడు ఉద్యోగంలో చేరడానికి అనుమతించింది. చదువూ సంస్కారం లేనివాళ్లూ, జులాయిలుగా తిరిగేవాళ్లూ మహిళలపై, బాలికలపై వేధింపులకు దిగుతారనే అపోహ వుంది. కానీ పెద్ద చదువులు చదువుకుని, ఉన్నత పదవులు వెలగబెడు తున్న వారిలో కొందరు ఆ తోవలోనే ఉంటున్నారని అప్పుడప్పుడు వెల్లడవుతూనే వుంది. ఇలాంటి కేసుల్లో అసహాయ మహిళలకు ఆసరాగా నిలవాల్సిన మహిళా న్యాయమూర్తులకు సైతం వేధింపులుంటే ఇక దిక్కెవరు? కాలం మారింది. యువతులు చదువుల్లో ఎంతో ముందుంటున్నారు. ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. వేరే వృత్తి ఉద్యోగాలను కాదనుకుని న్యాయవ్యవస్థ వైపు వచ్చే వారిలో చాలామంది సమాజానికి ఏదో చేద్దామన్న సంకల్పంతో వస్తారు. అలాంటి వారికి సమస్య లుండటం దురదృష్టకరం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆ మహిళా జడ్జి లేఖపై వెనువెంటనే స్పందించటం, అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదిక కోరటం హర్షించదగ్గ అంశం. గతంలో మాదిరి కాక దోషులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తే తప్ప ఈ కీచకపర్వం ఆగదు.