
విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్. ఏదో ధర్నా జరుగుతుంటే.. నిరసనకారుల్లో కొందరిని అరెస్ట్ చేయడంలో తన సిబ్బందికి సాయం చేస్తుంటుంది. ఇంతలో వెనకాల పోలీసుల చేతిలో ఉన్న బులుగు చొక్కావోడు.. ఆమె నడుంను పట్టుకుని తెగ ఊగిపోతుంటాడు. చాలామంది ఇదేదో జోక్ అనుకుని.. మెన్ విల్ బి మెన్ అనుకుంటూ వీడియోను ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. నవ్వుకుంటున్నారు. కానీ..
ఆ టైంకి ఆ కామాంధుడి చెర నుంచి తనను తాను విడిపించుకున్న ఆమె.. సిబ్బంది సాయంతో పక్కకు తీసుకెళ్లింది. ఈ ఘటన ఎక్కడ? ఎప్పుడు? జరిగిందో స్పష్టత లేదు. కేసు నమోదైన దానిపైనా స్పష్టత లేదు. పలు జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇచ్చాయికానీ.. ఎక్కడ జరిగిందన్నది ప్రస్తావించలేదు. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలామంది ఆ బులుగు చొక్కావోడిని తిట్టి పారేస్తున్నారు. అలాంటి వాళ్లను వదలకూడదంటూ పోస్టులు పెడుతున్నారు.
పట్టపగలు.. అదీ ఓ మహిళా పోలీస్ పట్ల అలా ప్రవర్తించడం ఏంటని? కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ మహిళా పోలీస్‌తో ఓ వ్యక్తి బహిరంగంగా.. అసభ్యంగా ప్రవర్తించిన తీరును హాస్య కోణంలో కాకుండా తీవ్రంగా పరిగణించాలని పలువురు కోరుతున్నారు.
Just look at that blue shirt guy.
He is trying to harass a lady Police officer.
Such anti social people deserve Jail. pic.twitter.com/nj5MGAEKJU— Sunanda Roy 👑 (@SaffronSunanda) April 9, 2025
ఇదిలా ఉంటే.. మహిళా పోలీసులతో ఇలాంటి అసభ్య ప్రవర్తనల ఘటనలు ఈ మధ్యకాలంలోనే చూశాం. మహారాష్ట్రలో నాగ్‌పుర్ (Nagpur)లో మార్చి మూడో వారంలో.. రెండు గ్రూప్‌ల మధ్య చెలరేగిన హింసతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఒక అల్లరిమూక డ్యూటీలో ఉన్న మహిళా పోలీసు అధికారితో అసభ్యకరంగా ప్రవర్తించింది.
అలాగే.. గణేష్‌పేట ప్రాంతంలో ర్యాపిడ్ కంట్రోల్ పోలీస్ దళంలో విధులు నిర్వహించిన ఓ అధికారిణి సైతం తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న మరో అధికారిణి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారట.