woman police officer
-
మహిళా పోలీసాఫీసర్‌కు 300 కాల్స్!
క్రైమ్: ఆమె ఒక మహిళా పోలీస్ అధికారి. ‘అయితే ఏంటి..’ అనుకుని వెంటపడ్డాడు. అంతేకాదు పోలీస్ స్టేషన్లో ఉండగానే ఫోన్ కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. ఓ అడుగు ముందుకు వేసి తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. చివరకు.. ఖాకీ పవర్ ధాటికి ఆ ఆకతాయి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. కేరళ కొచ్చికి చెందిన ఓ వ్యక్తి.. వనితా పోలీస్ స్టేషన్లో పని చేసే ఓ అధికారిణిని చాలా కాలం నుంచి వెంబడిస్తున్నాడట. ఈ క్రమంలో ఏకంగా 300 ఫోన్ కాల్స్ చేసి.. ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించాడు. దీంతో అతనిపై సీరియస్‌గా దృష్టి సారించిన ఆమె.. రూట్ మార్చింది. తేనె పలుకులు పలికి ట్రాప్ చేసి మరీ అరెస్ట్ చేసింది. నిందితుడ్ని మంగళవారం ఎర్నాకులం కోర్టులో ప్రవేశపెట్టారు. అతనిపై మోపబడిన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించింది. పదే పదే ఫోన్లు చేసి ఆమెతో పాటు స్టేషన్ సిబ్బందిని కూడా వేధించాడతను. తద్వారా వాళ్ల విధులకు విఘాతం కలిగించాడు. ఓ అధికారిణి వెంటపడడం, లైంగికంగా వేధించడం లాంటి నేరాల కింద ఐపీసీ శిక్షా స్మృతులతో పాటు కేరళ పోలీస్ యాక్ట్ ప్రకారం అతనికి శిక్ష విధిస్తున్నట్లు ఎర్నాకులం కోర్టు తీర్పు వెల్లడించింది. ఆ ఆకతాయికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15వేల జరిమానా విధించింది న్యాయస్థానం. ఇదీ చదవండి: బట్టలు చింపేస్తుంటే.. వీడియోలు తీశారు! -
‘మహిళా పోలీస్ వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే’
సంబల్పూర్: ఒడిషాలో ప్రధాన ప్రతిపక్ష నేతకు, ఓ మహిళా పోలీస్ అధికారిణికి మధ్య వాగ్వాదం ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. బహిరంగంగా ఆమెపై ఆరోపణలు గుప్పించిన బీజేపీ నేత జయనారాయణ్ మిశ్రా.. ఆమెను ఒక్కసారిగా తోసేశాడు. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా.. ఆమెనే తనను తోసేసిందంటూ మిశ్రా సైతం ఫిర్యాదు చేశాడు. ఒడిషాలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు పిలుపు ఇచ్చింది బీజేపీ. ఈ క్రమంలో సంబల్పూర్ కలెక్టరేట్ వద్ద బుధవారం ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది. అయితే ఆ సమయంలో మిశ్రాకు, ధనుపలి స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంచార్జ్ అనితా ప్రధాన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అది ఒక్కసారిగా తీవ్రంగా మారి.. ఆయన ఆమెను తోసేశాడు. అనితా ఏం చెప్తోందంటే.. ఆయన నన్ను చూసి.. లంచాలు తీసుకుంటావంటూ విమర్శించాడు. నన్నొక దొంగగా వ్యాఖ్యానించారు. ఎందుకలా విమర్శిస్తారని అడిగితే.. ముఖం మీద చెయ్యేసి తోసేశారు అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. Presenting a super SANSKARI leader from Odisha. He assaulted the Lady Police Officer. Even threatened to burn her Police Station down. He is LOP #JaynarayanMishra of @BJP4Odisha . How much more Respect India can expect!! @Indian10000000 @TamilRatsaschi @cpimlliberation pic.twitter.com/pzdh9TbniJ — Parwez ପରୱେଜ (@parwezalli) February 15, 2023 అయితే మిశ్రా ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. బీజేపీ మహిళా కార్యకర్తలను వేధించడం గురించే ఆమెను ప్రశ్నించాను. అసలు ఆమె ఎవరో కూడా అంతకు ముందు నాకు తెలియదు. నేనేం ఆమెను తోసేయలేదు. ఆమెనే నన్ను తోసేసిందని చెప్తున్నారు. ఈ ఇద్దరి ఫిర్యాదు మీద సంబల్పూర్ ఎస్పీ గంగాధర్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, సమగ్ర నివేదిక వచ్చాకే ఏదైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారాయన. ఇక ఈ ఘటనను ప్రస్తావిస్తూ బీజేపీ.. నవీన్ పట్నాయక్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఓ అధికారి ఓ మంత్రిని కాల్చి చంపేశాడు. ఇప్పుడేమో ఓ పోలీస్ అధికారిణి ప్రతిపక్ష నేతపై దాడికి దిగింది. అసలు ఒడిషాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా? అని నిలదీస్తోంది. మిశ్రా అసెంబ్లీలో ఎక్కడ ప్రభుత్వాన్ని కడిగిపారేస్తారేమోననే భయంతోనే ఇలాంటి చర్యలకు పోలీసులను వుసిగొల్పుతోందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తోంది. మరోవైపు బీజేడీ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. మిశ్రా మీద హత్య కేసుతో సహా 14 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడేమో దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడని విమర్శిస్తోంది. -
అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకున్న మహిళా పోలీస్..
చండీగఢ్: పంజాబ్ మొహాలీలో ఓ మహిళా పోలీస్ అధికారి అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకుంది. నిందితుడిపై కేసు నమోదు చేసేందుకు రూ.20వేలు వసూలు చేసింది. స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఏఎస్ఐ డబ్బు తీసుకున్న దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఏఎస్ఐ పర్వీన్ కౌర్ లంచం తీసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని డీఎస్పీ దర్పణ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. విజిలెన్స్ బ్యూరో దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. పర్వీన్ కౌర్ పోలీస్ లైన్స్‌లో విధులు నిర్వహిస్తోంది. తనపై అత్యాచారం జరిగిందని ఓ బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. నిందుతుడ్ని అరెస్టు చేయాలండే డబ్బు ఇవ్వాల్సిందేనని ఏఎస్ఐ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితురాలు డబ్బు ఇచ్చింది. చదవండి: ఈ డాక్టర్ టెన్త్ ఫెయిల్.. భారీగా ఫీజులు.. రోగం ముదిరిందంటే చాలు.. -
సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో షాకింగ్ ఘటన..
సాక్షి, జనగామ జిల్లా: సీఎం కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్ నుంచి మహిళా పోలీస్ అధికారి జారిపడ్డారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. శనివారం.. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం వద్ద కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు, సెక్యూరిటీ సిబ్బంది బయలు దేరారు. కాన్వాయ్ నుంచి ఓ మహిళా ఆఫీసర్ జారీ జాతీయ రహదారిపై పడిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వాహనాలు నిలిపి వేశారు. చదవండి: 16 ఏళ్ల ప్రస్థానాన్ని సెప్టెంబర్ గుర్తు చేసింది: కేటీఆర్ -
సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో అపశృతి.. కాన్వాయ్ నుంచి జారిపడ్డ మహిళా అధికారి
-
ఫస్ట్ ఉమన్.. క్లిష్ట పరిస్థితుల్లో గట్టి పోలిస్ ఆఫీసర్
‘దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనేది మన తెలుగు సినిమా డైలాగైతే కావచ్చుగానీ హరియాణాలోని గుర్‌గ్రామ్‌కు వెళితే ‘సిటీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనే రియల్ డైలాగ్ లోకల్ లాంగ్వేజ్‌లో అప్పట్లో తరచు వినిపించేది. సిటీ పరిస్థితి క్లిష్టస్థితిలో పడడానికి శాంతిభద్రతల నుంచి ట్రాఫిక్ అస్తవ్యస్తతల వరకు రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్టసమయంలో గుర్‌గ్రామ్ తొలి మహిళా పోలిస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు కళారామచంద్రన్. రెవారి, ఫతేహబాద్, పంచ్‌కుల జిల్లాల సూపరిండెంట్ ఆఫ్ పోలిస్‌గా పనిచేసినా, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినా, మేఘాలయాలోని ఈశాన్య ప్రాంత పోలిస్ అకాడమీ హెడ్‌గా పనిచేసినా... కళా రామచంద్రన్ తనదైన ప్రత్యేకతను సృష్టించుకున్నారు. నిఖార్సయిన పోలిస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు.గుర్‌గ్రామ్‌లో చూడచక్కని రోడ్లు ఉన్నాయి. కానీ ఏంలాభం? ‘వేగమే మా నైజం’ అన్నట్లుగా దూసుకుపోతుంటాయి వాహనాలు. దీనివల్ల యాక్సిడెంట్లు, మరణాలు. మరోవైపు డ్రంకెన్ డ్రైవింగ్. ఇంకోవైపు స్ట్రీట్క్రైమ్స్. సైబర్‌క్రైమ్, ఈవ్‌టీజింగ్ లాంటి సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల నిష్క్రియాపరత్వం మీద వేడివేడి విమర్శ లు కూడా వచ్చాయి.అలాంటి క్లిష్ట సమయంలో బాధ్యత లు తీసుకున్న కళారామచంద్రన్ ‘నగరాన్ని ఏ మేరకు భద్రంగా ఉంచగలరు?’ అనే సందేహాలు రాకపోవడానికి కారణం ఆమెకు ఉన్న వృత్తి నిబద్ధత, మంచిపేరు. ‘క్షేత్రస్థాయి నుంచి పోలిసు పర్యవేక్షణను బలోపేతం చేసే కార్యాచరణకు శ్రీకారం చుట్టాం’ అంటున్నారు కళా రామ చంద్రన్. రకరకాల ప్రాంతాలలో పనిచేసిన అనుభవంతో పాటు, భర్త ఇచ్చిన సూచనలు కూడా గుర్గ్రామ్ని ‘సేఫర్ అండ్ బెటర్’ సిటీగా మార్చడానికి ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కళారామచంద్రన్ భర్త నవదీప్‌సింగ్ సీనియర్ ఐపీయస్ అధికారి. గుర్‌గ్రామ్ పోలిస్ కమిషనర్‌గా పనిచేశారు. -
హ్యాట్సాఫ్ మేడమ్!.. యువకుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళా పోలీస్
-
హ్యాట్సాఫ్ మేడమ్!.. యువకుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళా పోలీస్
చెన్నై: తమిళనాడులో వరుణుడి బీభత్సం గత నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఎడతెరపి లేని వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు ముంచెత్తుతుంది. వర్షాలు, వరదలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మహిళా పోలీస్ అధికారి ఓ వ్యక్తిని కాపాడిన వీడియో తాజాగా వైరలవుతోంది. చదవండి: అద్భుతమైన ఫోటో.. రాష్ట్రపతిని ఆశీర్వదించిన 102 ఏళ్ల టీచర్ పోలీస్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరి చెన్నైలోని టీపీ ఛత్రం ప్రాంతంలోని స్మశానవాటికలో భారీ వర్షం కారణంగా చెట్టు విరిగిపడి 8 ఏళ్ల యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా.. మహిళా పోలీస్ అధికారి ఆమె భుజాలపై యువకుడిని మోసుకెళ్లి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. మహిళా పోలీస్ ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు. ‘మీ సేవతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. హ్యాట్సాఫ్ మేడమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా భారీ వర్షాలతో శనివారం నుంచి ఇప్పటివరకు 12 మంది మరణించినట్లు తమిళనాడు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ జయంత్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటుతుందని, చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు. -
పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం.. మహిళా ఏఎస్ఐ మృతి
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కమాన్‌పూర్ ఏఎస్ఐ భాగ్యలక్ష్మి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పెద్దపల్లిలోని తన నివాసం నుంచి కూతురుతో కలిసి భాగ్యలక్ష్మి బస్టాండ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ.. భాగ్యలక్ష్మి వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ భాగ్యలక్ష్మి మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె కూతురు ద్విచక్ర వాహనం నడుపుతుండగా.. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజేశ్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిథిలో రోడ్డు ప్రమాదం -
మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై
సాక్షి, శ్రీకాకుళం: ‘దైవం మనుష్య రూపేణా’.. అనే నానుడిని ఓ మహిళ పోలీస్ అధికారిణి అక్షరాలా రుజువు చేసింది. ముక్కు, ముఖం తెలియని ఓ మృతదేహాన్ని తన భుజాల మీద మోసి పలువురికి ఆదర్శంగా నిలిచింది. పోలీసు అధికారిణి చేసిన పని.. ఏ ఆపద వచ్చినా పోలీసులు ముందుంటారనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆవిష్కృతమైంది. వివరాలు.. పలాసలోని కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతదేహం లభ్యమైంది. అయితే మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష.. తానే స్వయంగా మృతదేహాన్ని మోసుకుని లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు ఆప్పజెప్పారు. కాగా శిరీషా చూపిన తెగువను పోలీసు అధికారులు అభినందిస్తున్నారు. చదవండి: మా మంచి సారు.. నరేంద్ర..! -
కోవిడ్ దళం
తమిళనాడు పోలీసులు లాక్డౌన్ సమయాన్నిఉల్లంఘించారని ఒక తండ్రీ కొడుకుల ప్రాణాలను బలిగొన్నారు. కాని కేరళలో అలాంటి ఘటనలు లేవు. ఎందుకంటే అక్కడ పర్యవేక్షిస్తున్నది స్త్రీలు కనుక. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి కేరళలోని త్రిచూర్‌లో మొదలెట్టిన మహిళా ఆఫీసర్ల దళం నచ్చ చెప్పడంలో, బుద్ధి చెప్పడంలో మంచి ఫలితాలు సాధించింది. దాంతో ఇప్పుడు కేరళ అంతా ఇలాంటి స్త్రీ దళాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కరోనాపై పోరాడడానికి కేరళ రాష్ట్రం అంతా ఒక స్త్రీ రూపాన్ని తీసుకున్నదా అని అనిపిస్తున్నది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో కేరళ ఆరోగ్య శాఖా మంత్రి కె.కె.శైలజ ఎంత సమర్థంగా పని చేసిందో, ఐక్యరాజ్య సమితి గర్తించేంతగా ఆమె కృషి ఎలా సాగిందో, సాగుతున్నదో అందరికీ తెలుసు. ఆమె మాత్రమే కాదు పాలనా రంగంలో, వైద్య రంగంలో ఎందరో స్త్రీలు కేరళలో కోవిడ్‌పై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వీరితో పాటు అంతే సమర్థంగా పని చేస్తున్నారు అక్కడి మహిళా పోలీసులు. ఇందుకు అక్కడి ‘బుల్లెట్ స్క్వాడ్’ ఒక ఉదాహరణ. భారతదేశం లాక్డౌన్ దశను దాటి అన్‌లాక్ అయ్యే దశలలో ఉంది. ఈ సమయంలో ప్రజలను సదా అప్రమత్తంగా ఉంచాలి. ఐసొలేషన్ వార్డులను, హోమ్ క్వారంటైన్లో ఉన్నవారిని, సమూహాలలో భౌతికదూరం పాటించనివారిని, అనుమతించిన సమయాలకు మించి బయట తిరిగేవారిని వీరందరినీ పర్యవేక్షించాలి. కొన్నిచోట్ల మెత్తగా చెప్పాలి. కొన్నిచోట్ల గట్టిగా కేకలు వెయ్యాలి. ఈ పని మగవారి కంటే స్త్రీలు సమర్థంగా చేయగలని అనుకున్నారు కేరళ డి.జి.పి లోక్‌నాథ్ బెహరా. అనుకున్న వెంటనే ప్రయోగాత్మకంగా త్రిచూర్ పట్టణంలో 40 మంది మహిళా ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పది కొత్త బుల్లెట్లు సమకూర్చారు. ప్రత్యేకంగా ఎర్రరంగు హెల్మెట్లు ఇచ్చారు. ఒక్కో బుల్లెట్ మీద ఇరువురు చొప్పున రోడ్ల మీద ఎప్పుడూ 20 మంది రౌండ్లలో ఉండేలా డ్యూటీలు విధించారు. ‘చూద్దాం... ఏమవుతుందో’ అనుకున్నారు. కాని మహిళా ఆఫీసర్లు తాము ఏం చేయగలరో చేసి చూపించారు. ఈ దళం రోడ్ల మీదకు వచ్చాక త్రిచూర్‌లో గొప్ప క్రమశిక్షణ సాధ్యమైంది. కోవిడ్ హాస్పిటల్స్ దగ్గర, క్వారంటైన్ సెంటర్ల దగ్గర, హోమ్ క్వారంటైన్లో ఉన్న పేషెంట్ల గృహాల దగ్గర, వర్తక సముదాయాల దగ్గర వీరి పహారా అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. బుల్లెట్ చప్పుడు వినిపించగానే ఎక్కడి వాళ్లక్కడ సర్దుకుంటున్నారు. లేదా బుల్లెట్ చప్పుడు ఎప్పుడు అవుతుందా అని బుద్ధిగా ఉంటున్నారు. మెత్తగా ఉండాల్సిన చోట మెత్తగా ఉన్నా తోక జాడిస్తే మాత్రం వీరు చలాన్లు విధిస్తున్నారు. ‘మా బుల్లెట్ స్క్వాడ్ పని తీరు చాలా బాగుంది. ఇది త్రిచూర్ వరకే అనుకున్నాం మొదట. ఈ ఫలితాలు చూశాక రాష్ట్రమంతా మహిళా స్క్వాడ్లను తీసుకురానున్నాం’ అని కేరళ డి.జి.పి. చెప్పారు. ఈ స్క్వాడ్‌ను పర్యవేక్షిస్తున్న త్రిచూర్ పోలిస్ కమిషనర్ ఆర్.ఆదిత్య కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ‘ఈ స్క్వాడ్‌కు చెప్పుకుంటే మా సమస్యలు తీరుతాయి అని కోవిడ్ పేషెంట్లు అనుకోవడం మంచి పరిణామం’ అని ఆయన అన్నాడు. మరోవైపు ఈ స్క్వాడ్ వల్ల ‘బుల్లెట్ బండ్ల’ కు పెరుగుతున్న గౌరవాన్ని చూసి వాటి విక్రయదారులు ఆనందపడుతున్నారు. ఇప్పటివరకూ కూడా దాదాపుగా బుల్లెట్ అంటే మగవారి వాహనం కిందే లెక్క. చాలా తక్కువ మంది స్త్రీలు వీటిని నడుపుతారు. అయితే ఈ మహిళా స్క్వాడ్ వీటిని ఉపయోగిస్తుండటంతో ఇకపై స్త్రీలు కూడా వీటిని కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నారు. ఏమైనా దేశంలో కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే ఇలాంటి స్క్వాడ్స్ అవసరం చాలా ఉంది. ప్రతి ఊళ్లో, ప్రతి నగరంలో ఇలాంటి మహిళా దళాలు తిరుగుతూ ఉంటే ఒక అప్రమత్తత ఉంటుంది. కేరళ విధానాన్ని ఇతర అన్ని రాష్ట్రాలు స్వీకరిస్తాయని ఆశిద్దాం. -
యూపీ లేడీ సింగం పై బదీలీ వేటు..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తలకు గట్టి ఝలక్ ఇచ్చి లేడీ సింగం అనిపించుకున్న పోలీస్ అధికారిణీ శ్రేష్ట ఠాకూర్‌పై బదీలీ వేటు పడింది. ఆమె ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న స్యానా సర్కిల్ నుంచి బహ్రైచ్‌కి బదీలీ చేశారు. లోకల్ బీజేపీ కార్యకర్తల నుంచి ఒత్తిడే ఆమె బదీలీకి కారణమని ప్రచారం జరుగుతోంది. గత నెల 25న జిల్లా స్ధాయి బీజేపీ కార్యకర్తలతో సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారికి జరిమాన విధించి జైలుకు పంపించింది. చుట్టుపదుల సంఖ్యలో వారంతా గుమిగూడి ఆమెను బెదిరించే ప్రయత్నం చేసినా ఏ మాత్రం భయపడకుండా మీ వాహనాలు తనిఖీ చేయకూడదని వెళ్లి ముఖ్యమంత్రితో లిఖిత పూర్వక అనుమతి లేఖను తీసుకొని రండి అని వారికి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె సాహసానికి ప్రశంసల జల్లు కురిసింది. కానీ ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆమె బదిలీ అవడం గమనార్హం. -
'సీఎంతో రాయించుకొని రా.. ఎప్పటికీ చెక్ చేయం'
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ సీనియర్ మహిళా పోలీసు అధికారి కొంతమంది బీజేపీ కార్యకర్తలకు గట్టి ఝలక్ ఇచ్చింది. సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారికి జరిమాన విధించి, అరెస్టు చేయడంపై ఆందోళన చేయబోయిన వారికి ధైర్యంగా సమాధానం చెప్పింది. చుట్టుపదుల సంఖ్యలో వారంతా గుమిగూడి ఆమెను బెదిరించే ప్రయత్నం చేసినా ఏ మాత్రం భయపడకుండా వారికి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది. 'మీ వాహనాలు తనిఖీ చేయకూడదని వెళ్లి ముఖ్యమంత్రితో లిఖిత పూర్వక అనుమతి లేఖను తీసుకొని రండి.. అలా అయితే మేం ఏం చెయ్యం. ఇంత రాత్రిళ్లుపూట మా కుటుంబాలను వదలేసి సరదా కోసం ఇక్కడకు రాలేదు.. మా విధులు మేం నిర్వర్తిస్తున్నాం' అంటూ వారికి ఘాటు సమాధానం ఇచ్చింది. అంతేకాదు.. 'మీరు మీ పార్టీకి(బీజేపీకి) చెడ్డపేరు తెస్తున్నారు. ప్రజలు త్వరలోనే మిమ్మల్ని బీజేపీ గుండాలని అంటారు' అని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రమోద్‌లోదీ అనే జిల్లాస్థాయి బీజేపీ నేత సరైన పత్రాలు లేకుండానే వాహనాలు నడుపుతున్నాడని గుర్తించిన పోలీసులు అతడికి జరిమానా విధించారు. దీంతో అతడు పోలీసులతో దురుసుగా ప్రవర్తింగా అరెస్టు చేశారు. దీనిపై రచ్చ చేసే ప్రయత్నం చేయగా శ్రేష్ట ఠాకూర్ అనే సర్కిల్ అధికారి తగిన విధంగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. -
మహిళా పోలీసు అధికారి అరుదైన ఘనత
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా ఉన్నతాధికారి అరుదైన ఘనతను సాధించారు. ఐపిఎస్ కేడరుకు చెందిన అపర్ణ కుమార్ అంటార్కిటికా ఉపఖండంలోని అత్యంత ఎత్తయిన పర్వత శిఖరాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించారు. 17,000 అడుగుల ఎత్తున ఉన్న మౌంట్ విన్సన్ మాసిఫ్ శిఖరానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తన సహచరులతో కలిసి జనవరి 17 న అపర్ణ ఈ ఫీట్ సాధించి, మౌంట్ విన్సన్ మాసిఫ్ శిఖరం అగ్రభాగాన భారత త్రివర్ణ పతాకం సహా, రాష్ట్ర పోలీసు జెండాను ఎగురవేశారు. దీంతో ఈ ఘనతను సాధించిన దేశంలోని మొట్టమొదటి ఐసిఎస్ ఆఫీసర్ గా ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ ఘనతను ఎవరూ సాధించలేదని పలువురు ప్రముఖులు, ఐపిఎస్ అధికారులు ఆమెను అభినందనల్లో ముంచెత్తారు. భవిష్యత్తుల్లో మరిన్ని సాహసాలకు నాంది పలకాలని అభిలషించారు. ఇటు ఈ అరుదైన ఈ కీర్తిని గడించినందుకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా అపర్ణ కుమార్‌ను అభినందించారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా పోలీసు ఉన్నతాధికారి(ఎఎస్పీ) రాధిక ఏడు వేల మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న మౌంట్కన్ పర్వత శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. ఈ రికార్డును అపర్ణ అధిగమించారు.