చెన్నై: తమిళనాడులో వరుణుడి బీభత్సం గత నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఎడతెరపి లేని వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు ముంచెత్తుతుంది. వర్షాలు, వరదలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మహిళా పోలీస్ అధికారి ఓ వ్యక్తిని కాపాడిన వీడియో తాజాగా వైరలవుతోంది.
చదవండి: అద్భుతమైన ఫోటో.. రాష్ట్రపతిని ఆశీర్వదించిన 102 ఏళ్ల టీచర్
పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి చెన్నైలోని టీపీ ఛత్రం ప్రాంతంలోని స్మశానవాటికలో భారీ వర్షం కారణంగా చెట్టు విరిగిపడి 8 ఏళ్ల యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా.. మహిళా పోలీస్ అధికారి ఆమె భుజాలపై యువకుడిని మోసుకెళ్లి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. మహిళా పోలీస్ ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు. ‘మీ సేవతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. హ్యాట్సాఫ్ మేడమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
కాగా భారీ వర్షాలతో శనివారం నుంచి ఇప్పటివరకు 12 మంది మరణించినట్లు తమిళనాడు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ జయంత్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటుతుందని, చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment