ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. చదరంగ రారాజు హోదాలో తొలిసారి భారత్‌లో అడగుపెట్టాడు. ఈ వరల్డ్ చాంపియన్ సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు.
నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారు
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ అధికారులు, జాతీయ చెస్ సమాఖ్య ముఖ్యులు, అభిమానులు గుకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా... గుకేశ్ మాట్లాడుతూ.. ‘‘సొంతగడ్డ మీద తిరిగి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది.
మీ అభిమానం, మద్దతు చూసిన తర్వాత.. భారత్‌కు ఈ విజయం ఎంతటి గొప్ప అనుభూతిచ్చిందో నాకు మరింతగా అర్థమైంది. మీరంతా అత్యద్భుతం. నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది.
కాగా భారత్ తరఫున వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన రెండో ఆటగాడిగా పద్దెమినిదేళ్ల గుకేశ్ చరిత్రకెక్కాడు. చెన్నైకే చెందిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించాడు.
అంతేకాదు.. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ చాంపియన్ అయిన చెస్ ప్లేయర్‌గానూ రికార్డు సాధించాడు. సింగపూర్ సిటీలో ఇటీవల జరిగిన క్లాసికల్ ఫార్మాట్‌లో గుకేశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించి
డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి చాంపియన్ కిరీటాన్ని అందుకున్నాడు. 32 ఏళ్ల లిరెన్‌తో జరిగిన 14 గేమ్‌ల పోరులో 7.5–6.5 పాయింట్ల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి విజేతగా అవతరించాడు
భారీ నజరానా
ఈ నేపథ్యంలో దొమ్మరాజు గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక వరల్డ్ చాంపియన్‌గా ట్రోఫీతో పాటు గుకేశ్ 13 లక్షల 50 వేల డాలర్ల(రూ.11.45 కోట్లు) ప్రైజ్‌మనీ పొందాడు.
ఇక తమ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకువచ్చిన గుకేశ్‌ను కొనియాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానా ప్రకటించారు. గుకేశ్‌కు రూ. ఐదు కోట్ల క్యాష్ రివార్డు అందచేస్తామని తెలిపారు.
చదవండి: WPL 2025 Auction: ఆశ్చర్యం.. అనూహ్యం.. వారిపై కోట్ల వర్షం! వీరికి మొండిచేయి
#WATCH | Chennai, Tamil Nadu: World Chess Champion #GukeshD says, "I am very glad to be here. I could see the support that and what it means to India...You guys are amazing. You gave me so much energy..." pic.twitter.com/iuFXDiLcjx
— ANI (@ANI) December 16, 2024
Comments
Please login to add a commentAdd a comment