D Gukesh
-
చదరంగం ఎత్తులే కాదు, డ్యాన్స్ స్టెప్పుల్లోనూ మనోడు తోపు, వైరల్ వీడియో
చెన్నైకి చెందిన ఇండియన్ చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ స్టార్ ఆఫ్ ది సోషల్ మీడియాగా హల్ చల్ చేస్తున్నాడు. 17 ఏళ్ల వయసులోనే ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి అత్యంత పిన్న వయసులోనే వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ గా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యామస్ తమిళ సినిమా పాట స్టెప్పులతో అదర గొట్టాడు. మనసులాయో అంటూ దీనికి సంబంధించిన వీడియోను గుకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. చదరంగంలో ప్రత్యర్థులు తోకముడిచే స్టెప్పులే కాదు,అదిరే స్టెప్పులతో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు ‘‘యుద్ధంలో రాణి (చెస్‌లో క్వీన్ పాత్ర)ని ముందు పెట్టి ఎలా నెగ్గాలో తెలిసినవాడు, మొత్తానికి గుకేశ్ రెండో కోణాన్ని ఆవిష్కరించాడు’ అంటూ పలువురు వ్యాఖ్యానించారు. మరి మన ఆటగాడి స్టెప్పులేంటో మీరూ చూసేయండి. Manasilayo...with my family friends!Idhu epdi irukku 😎 pic.twitter.com/r2hkDWYiJE— Gukesh D (@DGukesh) September 29, 2024 -
ఇక ప్రపంచ చాంపియన్‌షిప్‌పై దృష్టి
చెన్నై: చెస్ ఒలింపియాడ్ స్ఫూర్తితో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌పై దృష్టి కేంద్రీకరిస్తానని భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చెప్పాడు. నవంబర్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతానని తెలిపాడు. డిఫెండింగ్ చాంపియన్, చైనీస్ గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌తో భారత ఆటగాడు ప్రపంచ చాంపియన్గుకేశ్ ప్ టైటిల్ కోసం తలపడతాడు. ఈ టోరీ్నకి ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ఫామ్‌ను కాపాడుకునేందుకు... ఎత్తుల్లో ప్రావీణ్యం సంపాదించేందుకు కావాల్సినంత సమయం లభించిందని చెప్పాడు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 15 వరకు సింగపూర్‌లో గుకేశ్, లిరెన్‌ల మధ్య ప్రపంచ పోరు జరుగుతుంది. ఏప్రిల్‌లో క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలుపొందడం ద్వారా ఈ మెగా టోరీ్నకి గుకేశ్ అర్హత సంపాదించాడు. 18 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్ చాలెంజర్ హంగేరిలో ముగిసిన చెస్ ఒలింపియాడ్‌లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా పురుషుల టీమ్ విభాగంలో సహచరులు వెనుకబడిన ప్రతి సందర్భంలో కీలక విజయాలతో జట్టును అజేయంగా నిలపడంలో గుకేశ్ పాత్ర ఎంతో ఉంది. ఒలింపియాడ్‌పై మాట్లాడుతూ ‘ఈ టోర్నీని నేను ఒక వ్యక్తిగత ఈవెంట్‌గా భావించాను. కాబట్టే ప్రతి గేమ్‌లో ఇతరుల ఫలితాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఒలింపియాడ్‌లో నా ప్రదర్శన నాకెంతో సంతృప్తినిచ్చింది. జట్టు ప్రదర్శన కూడా బాగుంది’ అని అన్నాడు. తాజా ఫలితం తమ సానుకూల దృక్పథానికి నిదర్శనమని అన్నాడు. భారత ఆటగాళ్లంతా సరైన దిశలో సాగుతున్నారని చెప్పుకొచ్చాడు. ఘనస్వాగతం అంతకుముందు బుడాపెస్ట్ నుంచి చెస్ ఒలింపియాడ్ విజేతలు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన గుకేశ్, ప్రజ్ఞానంద, వైశాలి, పురుషుల జట్టు కెప్టెన్ శ్రీనాథ్ నారాయణ్‌లకు చెన్నైలో చెస్ సంఘం అధికారులు, అభిమానులు, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. పూల బోకేలతో స్వాగతం పలికిన అభిమానులు పలువురు గ్రాండ్మాస్టర్లతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. చెస్ ఒలింపియాడ్‌లో గతంలో ఉన్న కాంస్యం రంగు మార్చి బంగారు మయం చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రజ్ఞానంద అన్నాడు. అతని సోదరి వైశాలి మాట్లాడుతూ సొంతగడ్డపై జరిగిన గత ఈవెంట్లో కాంస్యంతో సరిపెట్టుకున్న తమ పసిడి కల తాజాగా హంగేరిలో సాకారమైందని హర్షం వ్యక్తం చేసింది. వంతిక అగర్వాల్, తానియా సచ్దేవ్లకు ఢిల్లీ చెస్ సంఘం అధికారులు, హైదరాబాద్‌లో ద్రోణవల్లి హారికకు భారత స్పోర్ట్స్ అథారిటీ అధికారులు స్వాగతం పలికి సన్మానం చేశారు. -
చరిత్రలో తొలిసారి..!
చరిత్రలో తొలిసారి ఇద్దరు భారత గ్రాండ్ మాస్టర్లు లైవ్ చెస్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో చోటు దక్కించుకున్నారు. చెస్ ఒలింపియాడ్‌లో తాజా ప్రదర్శనల అనంతరం అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్ లైవ్ ర్యాంకింగ్స్‌లో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అర్జున్ ఖాతాలో 2788.1 పాయింట్లు ఉండగా.. గుకేశ్ ఖాతాలో 2775.2 పాయింట్లు ఉన్నాయి. 2832.3 పాయింట్లతో మాగ్నస్ కార్ల్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లైవ్ ర్యాంకింగ్స్ అనేవి రియల్ టైమ్‌లో అప్డేట్ అయ్యే రేటింగ్స్. ఫిడే నెలాఖర్లో ప్రచురించే రేటింగ్స్‌కు వీటికి వ్యత్యాసం ఉంటుంది.కాగా, బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో పాల్గొంటున్న భారత చెస్ ప్లేయర్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ టోర్నీలో భారత పురుషులు, మహిళల జట్లు వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేశాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3-1తో ఆతిథ్య హంగేరిని ఓడించింది. ఈ టోర్నీలో అర్జున్ ఎరిగైసి వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేయగా.. రిచర్డ్‌తో జరిగిన గేమ్‌ను గుకేశ్ డ్రాగా ముగించాడు. మహిళల జట్టు 2.5-1.5 తేడాతో అర్మేనియాపై విజయం సాధించింది.చదవండి: కొరియాను చిత్తు చేసిన భారత్.. ఆరోసారి ఫైనల్లో -
గుకేశ్ ఖాతాలో ఏడో ‘డ్రా’
సెయింట్ లూయిస్: సింక్ఫీల్డ్ కప్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద వరుసగా ఏడో ‘డ్రా’ నమోదు చేశారు. టాప్ సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన గేమ్‌ను గుకేశ్ 60 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఇయాన్ నిపోమ్‌నిషి (రష్యా)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 19 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) ఐదు పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో ఉన్నాడు. నాలుగు పాయింట్లతో కరువానా రెండో స్థానంలో నిలిచాడు. 3.5 పాయింట్లతో గుకేశ్, మాక్సిమి లాచెర్ (ఫ్రాన్స్), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్), వెస్లీ సో (అమెరికా), ప్రజ్ఞానంద సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. -
డింగ్ లిరెన్‌తో గుకేశ్ గేమ్ ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్‌ను భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’తో ప్రారంభించాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను గుకేశ్ 28 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. డింగ్ లిరెన్, గుకేశ్ మధ్య ఈ ఏడాది నవంబర్‌లో సింగపూర్ వేదికగా ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు తలపడటం ఆసక్తిని కలిగించింది.భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద కూడా తన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. మొత్తం పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు ఫాబియానో కరువానా (అమెరికా), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్), వెస్లీ సో (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), డింగ్ లిరెన్ (చైనా), ఇయాన్ నెపోమ్నిషి (రష్యా), మాక్సిమి వాచెర్ లెగ్రావ్ (ఫ్రాన్స్), నొదిర్బెక్ మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. -
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం
భారత చెస్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఫిడే రేటింగ్ లిస్ట్‌లో (ర్యాంకింగ్స్) తొలిసారి ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్లు టాప్-10లో నిలిచారు.2024 జులై నెల ర్యాంకింగ్స్‌లో అర్జున్ ఎరిగైసి నాలుగో స్థానంలో, డి గుకేశ్ ఏడులో, ఆర్ ప్రజ్ఞానానంద ఎనిమిదో స్థానంలో నిలిచారు. భారతీయ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 11వ స్థానంలో నిలిచాడు. అరవింద్ చితంబరం ఏకంగా 18.5 ఎలో రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని 44వ స్థానం నుంచి 29 స్థానానికి ఎగబాకాడు. జులై నెల పురుషుల రేటింగ్ లిస్ట్ టాప్ 100 జాబితాలో ఏకంగా పది మంది భారతీయులు (అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్, ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్, విదిత్ సంతోష్ గుజరాతీ, అరవింద్ చితంబరం, హరికృష్ణ పెంటల, నిహాల్ సరిన్, ఎస్ ఎల్ నారాయణన్, సద్వాని రౌనక్) ఉండటం గమనార్హం.మహిళల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. జులై నెల రేటింగ్ లిస్ట్ టాప్-14లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ద్రోణవల్లి హారిక రెండో స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఇటీవలే బాలికల జూనియర్ వరల్డ్ టైటిల్‌ను గెలిచిన దివ్య దేశ్‌ముఖ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానం నుండి 20వ స్థానానికి ఎగబాకింది. -
TePe Sigeman Chess Tournament: రన్నరప్ అర్జున్
మాల్మో (స్వీడన్): టెపె సెజెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్ ఇరిగేశి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో పీటర్ స్విద్లెర్ (రష్యా), అర్జున్, నొదిర్బెక్ అబ్దుసత్తొరోవ్ (ఉజ్బెకిస్తాన్) 4.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు.విజేతను నిర్ణయించడానికి ఈ ముగ్గురి మధ్య బ్లిట్జ్ గేమ్ టైబ్రేక్ నిర్వహించారు. టైబ్రేక్‌లో అర్జున్, నొదిర్బెక్ చేతిలో స్విద్లెర్ ఓడిపోయాడు. దాంతో అర్జున్, నొదిర్బెక్ టైటిల్ కోసం తలపడ్డారు. అర్జున్, నొదిర్బెక్ మధ్య రెండు గేమ్‌లు నిర్వహించగా... తొలి గేమ్‌ను అర్జున్ ‘డ్రా’ చేసుకొని, రెండో గేమ్‌లో ఓడిపోవడంతో నొదిర్బెక్ చాంపియన్‌గా అవతరించాడు.ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్ .. ఆరో ర్యాంకులో గుకేశ్ చెన్నై: గత నెలలో క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు టీనేజర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. గత నెలలో 16వ స్థానంలో ఉన్న గుకేశ్ తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. క్యాండిడేట్స్ టోర్నీ ప్రదర్శనతో గుకేశ్ 21 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం గుకేశ్ ఖాతాలో 2764 రేటింగ్ పాయింట్లున్నాయి. తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 2761 రేటింగ్ పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు. భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 2751 రేటింగ్ పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. భారత ఇతర గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద 14వ ర్యాంక్‌లో, విదిత్ 28వ ర్యాంక్‌లో, పెంటేల హరికృష్ణ 37వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల చెస్ ర్యాంకింగ్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి 5వ ర్యాంక్‌లో, ద్రోణవల్లి హారిక 11వ ర్యాంక్‌లో, వైశాలి 13వ ర్యాంక్‌లో ఉన్నారు. -
భారత చెస్ జట్ల గెలుపు.. హంపి, హారిక, వంతిక, వైశాలి అద్భుతంగా ఆడి..
Asian Games 2023- Chess: ఆసియా క్రీడల టీమ్ చెస్ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు మూడో రౌండ్లో గెలుపొందాయి. ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, గుకేశ్, పెంటేల హరికృష్ణలతో కూడిన భారత జట్టు 3–1తో కజకిస్తాన్‌ను ఓడించింది. మరోవైపు... కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వంతిక అగర్వాల్, వైశాలిలతో కూడిన భారత జట్టు 3.5–0.5తో ఇండోనేసియాపై గెలిచింది. మూడో రౌండ్ తర్వాత భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... ఐదు పాయింట్లతో భారత పురుషుల జట్టు రెండో ర్యాంక్‌లో ఉన్నాయి. భారత్, కొరియా మ్యాచ్ ‘డ్రా’ ఆసియా క్రీడల మహిళల హాకీ ఈవెంట్లో భారత జట్టు తొలి ‘డ్రా’ నమోదు చేసింది. ఆదివారం దక్షిణ కొరియాతో జరిగిన పూల్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్‌ను భారత్ 1–1 గోల్‌తో ‘డ్రా’ చేసుకుంది. కొరియా తరఫున చో హైజిన్ (12వ ని.లో), భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల తర్వాత భారత్, కొరియా ఏడు పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన గోల్స్ అంతరం కారణంగా భారత్ టాప్ ర్యాంక్‌లో, కొరియా రెండో ర్యాంక్‌లో ఉంది. లీగ్ దశ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను హాంకాంగ్‌తో మంగళవారం ఆడుతుంది. -
విశ్వనాథన్ ఆనంద్‌ను వెనక్కి నెట్టి.. నంబర్ 1గా యువ సంచలనం
D Gukesh Replaces Viswanathan Anand: యువ గ్రాండ్‌మాస్టర్ డి గుకేశ్ సంచలనం సృష్టించాడు. గత మూడు దశాబ్దాలుగా భారత చెస్ ప్రపంచాన్ని ఏలుతున్న దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బ్రేక్ చేశాడు. 1986 జూలై నుంచి ఇండియా నంబర్ 1గా కొనసాగుతున్న ఆనంద్‌ను గుకేశ్ అధిగమించాడు. ఈ విషయాన్ని ఫిడే శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. తాజా ఫిడే ర్యాంకింగ్స్(సెప్టెంబరు 1 నుంచి)లో 17 ఏళ్ల ఈ చెన్నై గ్రాండ్ మాస్టర్ ఎనిమిదో ర్యాంకు సాధించాడు. తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుని.. ఆనంద్ కంటే ముందు వరుసలో నిలిచాడు. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. 37 ఏళ్ల రికార్డు బద్దలు ఈ నేపథ్యంలో తన మెంటార్ ఆనంద్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి గుకేశ్ భారత్ తరఫున నెంబర్ 1 ర్యాంకర్‌గా అవతరించాడు. ఆగష్టు 1 నుంచి రేటింగ్ మెరుగుపరచుకుంటూ మూడు స్థానాలు ఎగబాకిన గుకేశ్ ప్రస్తుతం 2758 పాయింట్లు కలిగి ఉండగా.. ఆనంద్ స్కోరు 2754. ఇదిలా ఉంటే.. ఫిడే వరల్డ్‌కప్-2023 రన్నరప్‌గా నిలిచిన ఆర్ ప్రజ్ఞానంద 2727 పాయింట్లతో 19వ ర్యాంకు సాధించి.. భారత్ తరఫున టాప్-3లో నిలిచాడు. ఇక వీరి ముగ్గురితో పాటు విదిత్ సంతోష్ గుజరాతి(27వ ర్యాంకు), అర్జున్ ఇరిగేసి(తెలంగాణ- 29వ ర్యాంకు) టాప్-30లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పి. హరికృష్ణ 31వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా డి గుకేశ్ ఇటీవల ముగిసిన ఫిడే వరల్డ్‌కప్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్స్ చేరిన విషయం విదితమే. చదవండి: పాకిస్తాన్‌తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే It's official! Gukesh is India's #1 in the #FIDErating list! 🔥 The 17-year-old prodigy makes history by overtaking the five-time World Champion Vishy Anand and terminating his uninterrupted 37-year reign as India's top-rated player! 📷 Stev Bonhage pic.twitter.com/paDli9hslX — International Chess Federation (@FIDE_chess) September 1, 2023