విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఎనిమిదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ 5.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్త ఆధిక్యంలో ఉన్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను గుకేశ్ 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
నొదిక్‌బెక్ (ఉజ్బెకిస్తాన్), ప్రజ్ఞానంద కూడా 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. పెంటేల హరికృష్ణ (భారత్)ృఅనీశ్ గిరి (నెదర్లాండ్స్) మధ్య గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అలెక్సీ సరానా (సెర్బియా), ఇరిగేశి అర్జున్ (భారత్) మధ్య గేమ్ 23 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. మొత్తం 14 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment