lead
-
సంయుక్త ఆధిక్యంలో గుకేశ్
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో ఎనిమిదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ 5.5 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్త ఆధిక్యంలో ఉన్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను గుకేశ్ 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నొదిక్బెక్ (ఉజ్బెకిస్తాన్), ప్రజ్ఞానంద కూడా 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. పెంటేల హరికృష్ణ (భారత్)ృఅనీశ్ గిరి (నెదర్లాండ్స్) మధ్య గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అలెక్సీ సరానా (సెర్బియా), ఇరిగేశి అర్జున్ (భారత్) మధ్య గేమ్ 23 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. మొత్తం 14 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. -
ఉప ఎన్నికల్లో అధికార పార్టీల హవా
న్యూఢిల్లీ: పదమూడు రాష్ట్రాల్లో 46 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే కైవసం చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాలు తమ స్థానాలను మళ్లీ గెల్చుకున్నాయి. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. అత్యధికంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు 26 చోట్ల గెలిచాయి. ఇవి గతంలో పోలిస్తే అదనంగా తొమ్మిది స్థానాల్లో గెలవడం విశేషం. కాంగ్రెస్ ఏడు చోట్ల గెలిచింది. గతంలో గెలిచిన స్థానాల్లో ఆరింటిని చేజార్చుకుంది. పశ్చిమబెంగాల్లో ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. ఐదు స్థానాలను నిలబెట్టుకున్న టీఎంసీ ఈసారి మదారిహాట్ను బీజేపీ నుంచి లాగేసుకుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో జూనియర్ వైద్యురాలి రేప్, హత్యోదంతం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైనాసరే ఆ అంశం రాష్ట్రంలో టీఎంసీ హవాను ఆపలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మూడు చోట్ల, సమాజ్‌వాదీ పార్టీ రెండు చోట్ల గెలిచాయి. కేరళలో ఎల్డీఎఫ్ కూటమిలోని సీపీఐ(ఎం) పార్టీ, రాజస్థాన్‌లో భారత్ ఆదివాసీ పార్టీ(బీఏపీ) పార్టీ ఒక్కో స్థానంలో జయకేతనం ఎగరేశాయి. యూపీలో బీజేపీ హవా ఉత్తరప్రదేశ్‌లో 9 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా అధికార బీజేపీ ఆరు చోట్ల విజయం సాధించింది. రాష్ట్రంలోని కుందార్కీ, ఘజియాబాద్, ఖేర్, ఫూల్పూర్, ఖతేహరీ, మఝావాన్లో బీజేపీ గెలిచింది. కర్హాల్, సిషామావూలలో సమాజ్‌వాదీ పార్టీ, మీరాపూర్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్ విజయం సాధించాయి. కుందార్కీ స్థానంలో 12 మంది పోటీచేస్తే అందులో 11 మంది ముస్లిం అభ్యర్థులే. ఈ 11 మంది అభ్యర్థుల్ని వెనక్కి నెట్టి ఏకైక హిందూ అభ్యరి్థ, బీజేపీ నేత రామ్‌వీర్ సింగ్ ఏకంగా 1,44,791 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం విశేషం. 1993 నుంచి చూస్తే ఈ స్థానంలో బీజేపీ గెలవడం ఇదే తొలిసారి. ఖతేహరీలోనూ 1991 తర్వాత బీజేపీకి తొలిసారిగా విజయం దక్కింది. రెండూ క్రాంతికారీకే సిక్కింలోని రెండు స్థానాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా గెల్చుకుంది. రాజస్థాన్‌లో అధికార బీజేపీ ఏడింటికిగాను ఐదు చోట్ల జయపతాకం ఎగరేసింది. అస్సాంలోని ఐదు స్థానాలనూ బీజేపీ, దాని మిత్రపక్షాలే గెల్చుకున్నాయి. బీజేపీ మూడు చోట్ల, అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ(యునైటెడ్) ఒక్క స్థానంలో గెలిచాయి. పంజాబ్‌లోని నాలుగు స్థానాల్లో మూడింటిని ఆమ్ ఆద్మీ పార్టీ తన వశంచేసుకుంది. బిహార్‌లోని నాలుగు స్థానాలకుగాను రెండు చోట్ల బీజేపీ, ఒక చోట హిందుస్తానీ ఆవామ్ మోర్చా, మరో చోట జనతాదళ్(యునైటెడ్) గెలిచాయి. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్‌కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్ పార్టీ అభ్యర్థులు దాదాపు అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. కర్ణాటకలోని మొత్తం మూడు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ అభ్యర్థి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ గిద్దెర్బహాలో ఓడారు, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సతీమణి అమృత, గుర్దాస్పూర్ ఎంపీ సుఖ్జీందర్ రంధావా భార్య జతీందర్ కౌర్ సైతం ఓడారు. ఇది కూడా చదవండి: By Election Results: ఆసక్తికరంగా ఉప ఎన్నికల ఫలితాలు -
USA Presidential Elections 2024: హారిస్‌కు మొగ్గు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ మరోసారి స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ఆమెకు ఒక శాతం మొగ్గున్నట్టు మంగళవారం వెలువడ్డ రాయిటర్స్/ఇప్సోస్ తాజా సర్వేలో తేలింది. శుక్రవారం నుంచి ఆదివారం దాకా జరిపిన ఈ మూడు రోజులు హారిస్‌కు 44 శాతం, ట్రంప్‌కు 43 శాతం మంది మద్దతిచ్చారు. 975 మంది నమోదైన ఓటర్లతో కలిపి మొత్తం 1,150 మంది అమెరికా పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే ఎకానమీ, నిరుద్యోగం, ఉపాధి వంటి అతి కీలకమైన అంశాల్లో ఏకంగా 47 శాతం మంది ట్రంప్‌కే ఓటేశారు. హారిస్‌కు మద్దతిచ్చిన వారు కేవలం 37 శాతం మాత్రమే. మరో కీలకాంశమైన వలసల విషయంలో కూడా ట్రంప్ 48 శాతం మంది వైఖరిని సమర్థిస్తే హారిస్‌ను 33 శాతం మందే సమర్థించారు. కచ్చితంగా ఓటేస్తామన్న వారిలో 47 శాతం హారిస్‌ను, 46 శాతం ట్రంప్‌ను బలపరిచారు. హారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చినప్పటి నుంచి సర్వేలన్నీ ఆమెకే మొగ్గున్నట్టు తేల్చడం విశేషం. -
తిరుగులేని తృణమూల్.. బైపోల్స్‌లో ముందంజ
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి తిరుగులేదని మరోసారి తేలింది. రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ సీట్లకు తాజాగా ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. మనిక్టల, బాగ్డా, రానాఘాట్ దక్షిణ్, రాయిగంజ్ అసెంబ్లీ సీట్లకు జులై 10న ఉప ఎన్నిక జరిగింది. వీటి ఫలితాలు శనివారం(జులై 13) ఉదయం నుంచి వెలువడుతున్నాయి.ఉప ఎన్నికల పోలింగ్‌లో అధికార టీఎంసీ అక్రమాలకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలకు టీఎంసీ కొట్టిపారేసింది. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఎంసీ అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. -
ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ!
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార బిజూ జనతాదల్ (బీజేడీ) ఆధిక్యానికి చెక్ పడేలా కనిపిస్తోంది. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది.సుదీర్ఘ కాలంగా పవర్లో ఉన్న బీజేడీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో తాజా ఫలితాల ప్రకారం బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైంది. మరోవైపు అధికార బీజేడీ మూడు పదుల సీట్లతో రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. -
ఎన్డీయే ఆధిక్యం.. మెజార్టీ మార్క్ క్రాస్
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ఆధిక్యంలో మెజార్టీ మార్క్ దాటేసింది. దేశవ్యాప్తంగా సుమారు 301 స్థానాల్లో ఎన్డీయే ముందంజలో ఉంది. ఇండియా కూటమి పోరాటం కొనసాగుతోంది. కాంగ్రెస్ సహా కూటమి అభ్యర్థులు 206 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272. -
ఆధిక్యంలో సీఎం జగన్ సహా పలువురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు
గుంటూరు, సాక్షి: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పలు చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పులివెందులలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. హిందూపురం పార్లమెంట్ స్థానంలో శాంతమ్మ ఆధిక్యంలో ఉన్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్ ముందంజలో ఉన్నారు. దర్శి, రాజంపేట, బద్వేల్, పత్తికొండ, కడప,తుని, మైలవరం అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
పాఠశాలల్లో లీడ్ ఏఐ ఆధారిత అసెస్మెంట్
ముంబై: ఎడ్టెక్ సంస్థ లీడ్ తాజాగా పాఠశాలల్లో కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత మూల్యాంకన విధానాన్ని అందుబాటులోకి తెచి్చంది. నిర్దిష్ట తరగతుల విద్యార్థుల స్థాయులను బట్టి మెరుగైన ప్రశ్నలను రూపొందించేందుకు ఇది ఉపయోగపడతుందని సంస్థ సీఈవో సుమీత్ మెహతా తెలిపారు. టీచర్లు అవసరమైతే వీటిని సమీక్షించి, తగు మార్పులు, చేర్పులు కూడా చేసేందుకు వెసులుబాటు ఉంటుందని వివరించారు. బోధనాంశాలను నేర్చుకోవడంలో విద్యార్థులకు ఎదురవుతున్న సవాళ్లను గుర్తించేందుకు, తగు పరిష్కార మార్గాలను అమలు చేసేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని మెహతా పేర్కొన్నారు. అలాగే ఎగ్జామ్ పేపర్ల లీకేజీ సమస్యకు కూడా అడ్డుకట్ట పడుతుందన్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి అసెస్మెంట్ విధానాన్ని ఎంచుకునే వీలు కలి్పంచే ఈ విధానం .. తమ నెట్‌వర్క్‌లోని 9,000 పైచిలుకు పాఠశాలల్లో, 50,000 మంది పైచిలుకు ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుందని మెహతా చెప్పారు. -
రాజస్థాన్‌లో బీజేపీ దూకుడు: ఆధిక్యంలో సెంచరీ మార్క్ దాటేసింది!
రాజస్థాన్‌లో బీజేపీ 101 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. దాదాపు సగానికిపైగా ఆధిక్యంతో సెంచరీ మార్క్‌ను దాటేసింది. కాంగ్రెస్78 సీట్లతో వెనుకబడి ఉంది.ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగానే బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. రాజస్థాన్ అసెంబ్లీలో 199 సీట్లకు పోలింగ్ జరగ్గా అధికార కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో పడింది. 2018 ఎన్నికల్లో బీజేపీకి 38.77 శాతం, కాంగ్రెస్‌కు 39.30 శాతం ఓట్లు వచ్చాయి. హోరా హోరీ రాజస్థాన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సర్దార్‌పురా నియోజకవర్గం నుండి ముందంజలో ఉండగా, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ టోంక్‌లో వెనుకబడి ఉన్నారు. అలాగే మాజీ సీఎం వసుంధర రాజే ఝల్రాపటన్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌లాల్ చౌహాన్ వెనుకంజలో ఉన్నారు. రెండు పార్టీలు వివిధ స్థాయిలలో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు , తిరుగుబాటు అభ్యర్థులను వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. టికెట్ నిరాకరించడంతో బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి 40 మంది రెబల్స్ పోటీ చేశారు. అటు బీజేపీ ఎంపీ, విద్యాధర్ నగర్ అభ్యర్థి సీఎం రేసులో ప్రధానంగా వినిస్తున్న దియా కుమారి జైపూర్‌లోని గోవింద్ దేవ్‌జీ ఆలయంలో ప్రార్థనలు చేశారు. బీజేపీ ఎంపీ, విద్యాధర్ నగర్ అభ్యర్థి దియా కుమారి జైపూర్‌లోని గోవింద్ దేవ్‌జీ ఆలయంలో ప్రార్థనలు చేశారు. #WATCH | As early trends show BJP leading in Rajasthan, state BJP president CP Joshi says, "This lead will keep growing. We will win over 135 seats." pic.twitter.com/YHJjvr4D97 — ANI (@ANI) December 3, 2023 135 సీట్లు మావే, స్వీట్లు పంచేస్తున్నాం మరోవైపు విజయం తమదేనని, ప్రస్తుత మెజార్టీ కొనసాగుతుందని, ఇప్పటికే లడ్డూలను కూడా పంపిణీ చేశామని బీజేపీ నేత సీపీ జోషి వెల్లడించారు. 135 సీట్లు సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. కాగా మూడు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా. దీంతో తుది ఫలితాల కోసం అటు బీజేపీ , కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. #WATCH | Counting of votes | Rajasthan: BJP MP and candidate from Vidhyadhar Nagar, Diya Kumari offers prayers at Govind Devji temple in Jaipur. pic.twitter.com/TMw5iqmtzJ — ANI (@ANI) December 3, 2023 -
పసుపు ప్రాణాలను హరిస్తుందా? వెలుగులోకి షాకింగ్ విషయాలు
పసుపు శుభాకార్యలకే గాక ఆయుర్వేద పరంగా కూడా మంచి ఔషధ లక్షణాలు కలిగింది. ఇందులో అధికంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందువల్ల వంటల్లో తప్పనిసరిగా పసుపుని వాడతారు అందరూ. అలాంటి పసుపు కాస్తా సీసంలా మారి ప్రాణాలను హరిస్తుందంటూ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అందుకోసం బంగ్లాదేశం ప్రభుత్వం నడుబిగించి మరి పసుపు వాడకాన్ని నియంత్రించిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. నిజంగా పసుపు మంచిది కాదా? అది ప్రాణాంతకమైన సీసంలా మారుతుందా? తదితరాల గురించే ఈ కథనం! దక్షిణాసియా వాసులు విరివిగా వాడే వాటిలో ఈ పసుపు ఒకటి. ఇప్పుడది మంచిది కాదని, దీని వల్ల ప్రజలు చనిపోతున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది. దీని కారణంగా చాలామంది ప్రజలు, చిన్నారుల, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్నట్లు పేర్కొంది. 2019లో ఈ పసుపు కారణంగా దాదాపు 1.4 మిలియన్ల మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ డయేరియా డిసీజ్ రీసెర్చ్ బృందాలు, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంతో కలిపి చేసిన పరిశోధనాల్లో పసుపుకి సంబంధించిన పలు షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఈ పసుపు వినియోగం కారణంగా వ్యక్తుల శరీరంలోని రక్తంలో సీసం చేరి ఎలా ప్రాణాలు తీస్తుందో వివరించింది. ఇదేలా జరుగుతందని పలు అధ్యయనాలు జరపగా.. పసుపు కల్తీకి గురవ్వడం వల్ల అని తేలింది. ముఖ్యంగా హోల్‌సేల్ మార్కెట్లోని వ్యాపారులు పసుపుని పెద్ద ఎత్తున్న కల్తీ చేస్తున్నారని గుర్తించారు బంగ్లాదేశ్ అధికారులు. ఈ కల్తీకి అడ్డుకట్టవేసేలా బంగ్లాదేశ్ బజార్లలో పెద్ద ఎత్తున్న హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఈ కల్తీ పసుపు వినియోగానికి అడ్డుకట్ట వేసేలా ప్రచారం చేసింది. దీని ఫలితంగా రెండేళ్లో సుగంధ ద్రవ్యాల మార్కెట్లో పసుపు కల్తీ వ్యాప్తి కట్టడి చేస్తూ.. సున్నాకి తీసుకొచ్చింది. పసుపు మిల్లీ కార్మికుల రక్తంలోని సీసం స్థాయిలను చూసి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యే దీనిపై దృష్టిసారించే పరిశోధనలకు నాంది పలికింది. అప్పుడే పసుపు పెద్ద ఎత్తున కల్తీ అవుతున్నట్లు గుర్తించింది. దీనికి సత్వరమే అడ్డుకట్టవేసి లక్షలాది ప్రాణాలను కాపాడింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఈ కల్తీ కారణంగా ప్రపంచంలోని సుమారు 815 మంది మిలియన్ల మంది పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ ప్రాణాంతక లోహం బారిన పడుతున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఈ పరిస్థితి పేద దేశాల్లో పిల్లల్లో ఎక్కువుగా కనిపిస్తోందని వాషింగ్టన్‌లోని థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ పేర్కొంది. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన పసుపు ప్రకృతి ప్రసాదించిన ప్రసాదంగా సక్రమంగా వాడితే ఎంత మంచిదో దాన్ని కూడా కల్తీ చేసేందుకు యత్నిస్తే మన ప్రాణాలనే హరిస్తుందనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ. (చదవండి: 'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!) -
ఆహార పంటల విస్తీర్ణం పెరగాలి
సాక్షి, విశాఖపట్నం: నీటి కొరత పెరిగే కొద్దీ ప్రజల జీవన ప్రమాణాల్లో అనేక మార్పులు వస్తాయని ప్రపంచ బ్యాంక్ గ్రూప్ గ్లోబల్ మిషన్ లీడర్ అమల్ తాల్బి తెలిపారు. ముఖ్యంగా ఆహార కొరత వేధిస్తుందని చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు తప్పవన్నారు. 2030 నాటికి 670 మిలియన్ల మంది ఆకలితో అలమటిస్తారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగణంగా ఆహార పంటల విస్తీర్ణాన్ని పెంచాల్సి ఉందన్నారు. 2050 నాటికి ప్రస్తుతం ఉన్న ఆహార ఉత్పత్తి రెట్టింపయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో 500 మిలియన్లకు పైగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల నుంచి 80 శాతం వరకూ ఆహారం ఉత్పత్తవుతోందని తెలిపారు. పేదరికాన్ని జయించేందుకు ప్రపంచ బ్యాంక్ అత్యంత కీలక నిర్ణయాలను అమలు చేస్తోందన్నారు. విశాఖపట్నంలో 25వ అంతర్జాతీయ కాంగ్రెస్, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 74వ అంతర్జాతీయ సమావేశాల్లో అమల్ తాల్బి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ‘సాక్షి’తో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నీటి ఎద్దడి పెరుగుతోంది.. గత 50 ఏళ్లలో వర్షపాతం గణనీయంగా 233 శాతం పెరిగింది. అయితే.. భూమికి చేరుతున్న వర్షపు నీటిని ఒడిసిపట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నాం. ఈ కారణంగానే నీటి ఎద్దడి పెరుగుతోంది. వాతావరణంలో తలెత్తుతున్న 10 మార్పుల్లో 8 నీటికి సంబంధించినవే ఉంటున్నాయి. దీన్నిబట్టి చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. సుస్థిర లక్ష్యాలు నిర్దేశించుకున్నాం.. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్ మిషన్ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా నీటి ఉత్పాదకత– సంరక్షణ, ఆహార ఉత్పత్తిని పెంపొందించడం తదితర అంశాలపై ప్రపంచ బ్యాంక్ సుస్థిర లక్ష్యాల్ని నిర్దేశించుకుంది. ఫార్మర్ లెడ్ ఇరిగేషన్ డెవలప్మెంట్ పేరుతో నీటిపారుదల రంగంలో స్థితిస్థాపకత, సాగునీటి నిర్వహణలో ఖచ్చితత్వం, నీటివనరుల అభివృద్ధి, మురుగు నీటి నిర్వహణ, వ్యవసాయంలో అత్యాధునిక పద్ధతులు, యాంత్రీకరణ తదితర అంశాలపై ఈ మిషన్ పనిచేస్తోంది. తొలి విడతలో ఆఫ్రికా దేశాల్లో 450 మిలియన్ యూఎస్ డాలర్లు ఖర్చు చేస్తున్నాం. ఈ మిషన్‌లో భాగంగా 77 మిలియన్ల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం. అక్కడ విధానాల్లో అనేక మార్పుల్ని తీసుకొచ్చాం. భవిష్యత్తులో మిగిలిన దేశాల్లోనూ ప్రపంచ బ్యాంక్ మిషన్‌ని అమలు చేస్తాం. తద్వారా నీటి ఎద్దడి, ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాం. -
కెమికల్ కిల్లింగ్స్!
వివిధ రసాయనాలు, పురుగుమందులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది రసాయనాల కారణంగా మృతిచెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్యంపై రసాయనాల ప్రభావం పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అంతర్జాతీయంగా జరిగే అన్ని రకాల మరణాల్లో 3.6 శాతం కెమికల్స్ ద్వారానే జరుగుతున్నాయని నివేదిక వివరించింది. ముఖ్యంగా భారత్‌లో పురుగుమందుల వల్లే ఏడాదికి 70 వేల ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొంది. – సాక్షి, హైదరాబాద్హృద్రోగాలే అధికం హృద్రోగాలే అధికం డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం... కెమికల్స్ వల్ల వచ్చే జబ్బుల్లో అత్యధికంగా 40% గుండె జబ్బులే ఉంటున్నాయి. అలాగే 20% దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు, 15% కేన్సర్లు ఉంటున్నాయి. ఏటా లక్ష మంది పురుషుల్లో కెమికల్స్ వల్ల 35 మరణాలు సంభవిస్తుండగా అందులో 32 జబ్బులు దీర్ఘకాలిక జబ్బుల వల్లే జరుగుతున్నాయి. మహిళల్లో లక్షకు 17మంది కెమికల్స్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల్లో 20% కెమికల్స్ ద్వారా, రైతు ఆత్మహత్యల్లో 30% కెమికల్స్ ద్వారా, 1.4% నిద్రమాత్రల వంటి మందులు వేసుకోవడమే కారణం. ఏయే రసాయనాల వల్ల ఎటువంటి జబ్బులు..? ఆర్సెనిక్, ఆస్బెస్టాస్, బెంజిన్, బెరీలియం, క్యాడ్మియం తదితర రసాయనాలు 2.9 శాతం కేన్సర్లకు కారణమవుతున్నాయి. ఆర్సెనిక్ భూగర్భ జలాల నుంచి వస్తుండగా బొగ్గు గనుల్లో పనిచేసే వారిలో ఆస్బెస్టాస్ చేరుతోంది. ధూమపానం, వాహన కాలుష్యం ద్వారా బెంజిన్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. మురికినీరు లేదా కలుషిత జలాల్లో ఉండే చేపలు తినడం, అలాంటి నీటితో సాగు చేసే ఆలుగడ్డ, వరి, పొగాకు ద్వారా క్యాడ్మియం ఒంట్లోకి చేరుతోంది. సీసం వాడకాన్ని తగ్గించాలి... ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 41 శాతం దేశాలు సీసంపై చాలావరకు నియంత్రణ విధించాయి. అయినా పెయింటింగ్స్, వాహన ఇంధనాలు, నీరు, ఫుడ్ ప్యాకేజీలు, చిన్నారుల ఆట బొమ్మల్లో దాని వాడకం ఇంకా కొనసాగుతోంది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా వస్తువుల్లో సీసం వాడకాన్ని నివారించాలి. అన్ని రకాల రసాయనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారంటే 16 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారన్నమాట. – డాక్టర్ కిరణ్ మాదల,సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ సీసంతో ఆరోగ్యానికి హాని.. కెమికల్స్ వల్ల హానిలో సగ భాగం సీసం అనే లోహం ద్వారానే జరుగుతోంది. సీసాన్ని పెయింటింగ్స్, ప్లంబింగ్ పనులతోపాటు స్మోకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మైనింగ్, ఐరన్, ఉక్కు తయారీ, ఆయిల్ రిఫైనింగ్‌లో, పెట్రోల్, విమాన ఇంధనాలు, కాస్మెటిక్స్, సంప్రదాయ మందులు, నగల తయారీ, సిరామిక్స్, ఎల్రక్టానిక్ వస్తువులు, వాటర్ పైప్‌లలో సీసం ఉంటోంది. కలర్ కోటింగ్‌తో కూడిన ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బుల్లో 4.6 శాతం, కిడ్నీ జబ్బుల్లో 3 శాతం సీసం ద్వారా వస్తున్నాయి. చిన్నారుల్లో మూడో వంతు బుద్ధిమాంద్యం సీసం ద్వారా ఏర్పడుతోంది. పిల్లల్లో ఎక్కువగా పెయింటింగ్స్ ద్వారా సీసం వారిలో చేరుతుండగా ఐదేళ్లలోపు పిల్లల్లో సీసం కలిగించే దుష్ప్రభావం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. సీసం కలిసిన వస్తువుల వాడకం వల్ల గర్భిణుల్లో ముందస్తు ప్రసవాలు లేదా అబార్షన్లు జరుగుతున్నాయి. -
కాపెక్స్ వ్యయంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ - వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కాపెక్స్ (మూలధనం) వ్యయంలో ఇతర రాష్ట్రాలకంటే కూడా ముందంజలో అగ్రగామిగా అవతరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) డేటా ప్రకారం.. ఏప్రిల్ - జూన్ కాలంలో ఆంధ్రప్రదేశ్ మూలధన వ్యయంలో రూ. 12,669 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. కాగా FY24కి రాష్ట్ర కాపెక్స్ బడ్జెట్ రూ. 31,061 కోట్లుతో 41 శాతంగా ఉంది. ఇక్కడ తెలుసుకోవలసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణ మూలధన వ్యయం కూడా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 8 శాతంతో పోలిస్తే FY24 బడ్జెట్లో 27 శాతానికి పెరిగింది. క్యూ1లో వార్షిక లక్ష్యంలో 20 శాతానికి పైగా సాధించిన ఇతర రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఉన్నాయి. 20 రాష్ట్రాల కాపెక్స్ ఖర్చులను విశ్లేషించిన రేటింగ్ ఏజెన్సీ.. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లు కలిసి మొదటి త్రైమాసికంలో మొత్తం క్యాపెక్స్‌లో 56.4 శాతంగా ఉన్నాయని పేర్కొంది. పటిష్టమైన పన్ను వసూళ్లు, వ్యయం తగ్గడం, ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో సబ్సిడీలు, జీతాల చెల్లింపుల ద్వారా కాపెక్స్ వృద్ధి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ తన బడ్జెట్ రెవెన్యూ రాబడిలో క్యూ1లో 22 శాతాన్ని సాధించింది. ఇది క్రితం సంవత్సరం త్రైమాసికంలో 18 శాతంగా ఉంది. గత సంవత్సరంతో పోల్చితే ఈ త్రైమాసికంలో వడ్డీ, పెన్షన్, సబ్సిడీ చెల్లింపులు వంటి వ్యయాలను నియంత్రించడంలో కూడా రాష్ట్రం బాగా పనిచేసింది. -
NZ vs SL 1st Test: డరైల్ మిచెల్ సెంచరీ
క్రైస్ట్‌చర్చ్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ అనూహ్యంగా స్వల్ప ఆధిక్యం అందుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 162/5తో ఆట కొనసాగించిన కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టుకు 18 పరుగుల ఆధిక్యం దక్కింది. డరైల్ మిచెల్ (193 బంతుల్లో 102; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, మాట్ హెన్రీ (75 బంతుల్లో 72; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. అసిత ఫెర్నాండో 4 వికెట్లు పడగొట్టగా, లహిరు కుమారకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (20 బ్యాటింగ్), ప్రభాత్ జయసూర్య (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం లంక 65 పరుగులు మాత్రమే ముందంజలో ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికర స్థితికి చేరింది. -
8వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
కెప్టెన్సీ వద్దంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్స్ ..!
-
పెన్సిళ్ల పై మహాభారతాన్ని లిఖించింది!
కారంచేడు: సూక్ష్మకళపై మక్కువతో సీస లేఖినిలపై (పెన్సిళ్లపై) మహాభారతాన్ని లిఖించింది ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. మహాభారతంలోని 18 పర్వాలను.. 700 శ్లోకాలను సంస్కృత భాషలో అవలీలగా లిఖించగలిగింది. ఇందుకు ఆమె 810 పెన్సిళ్లను ఉపయోగించింది. వాటిపై 67,230 అక్షరాలను, 7,238 పదాలను లిఖించింది. ఇందుకోసం పెన్సిళ్లను ముందుగా బద్దగా చీల్చి అందులోని లిడ్ 2 మిల్లీమీటర్ల మందం ఉండేలా చూసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకోవడం లక్ష్యమని మహిత చెబుతోంది. బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులు మహిత మొదట్లో బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులను చెక్కడం ప్రారంభించింది. గింజలపై జాతీయ జెండా, తాళం, బాణం, వినాయకుడు, కొంగ, మినప్పప్పుపైన కూడా వినాయకుడు వంటి ఆకృతులను చక్కగా చెక్కి శభాష్ అనిపించుకుంది. ఆ తరువాత పెన్సిల్‌పై మహాభారతాన్ని చెక్కాలనే ఆలోచనకు పదునుపెట్టింది. సూక్ష్మ కళలను ప్రోత్సహించాలి కళలలో సూక్ష్మకళ ఒకటి. అధికారులు, ప్రభుత్వం, ప్రజలు ఇలాంటి సూక్ష్మకళను ప్రోత్సహించాలి. నాలాంటి వారెందరో ఉన్నా.. ప్రతిభను కనబర్చుకునే వీలు లేక ఇలాంటి కళలు మరుగున పడుతున్నాయి. ఆర్థికం, శిక్షణ పరంగా ఈ కళలను ప్రోత్సహించాలి. – అన్నం మహిత (చదవండి: సరికొత్త శకం) -
‘లెడ్ స్థాయిని తగ్గించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి’
సాక్షి, అమరావతి: అమర్‌రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీలో లెడ్ స్థాయిని తగ్గించేలా వెంటనే యాజమాన్యం చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అమర్‌రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీలో కాలుష్యం, పీసీబీ ఆదేశాలపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా.. అమర్‌రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీ వల్ల ప్రమాదకరస్థాయిలో లెడ్ ఉందని పేర్కొంది. గాలిలో, నీటిలో, భూమిలో లెడ్ ఉందని, దాన్ని తగ్గించకపోతే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు తేల్చిచెప్పింది. -
ఆధిక్యంలో హంపి
సెయింట్ లూయిస్ (అమెరికా): ఈ ఏడాది తొలి టైటిల్‌కు ఆంధ్రప్రదేశ్ చెస్ గ్రాండ్‌మాస్టర్, భారత మహిళల నంబర్‌వన్ కోనేరు హంపి విజయం దూరంలో ఉంది. కెయిన్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఎనిమిదో రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచింది. వాలెంటినా గునీనా (రష్యా)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి 35 ఎత్తుల్లో విజయం సాధించింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో హంపి తలపడుతుంది. ఈ గేమ్‌లో హంపి గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా విజేతగా అవతరిస్తుంది. మరోవైపు హారిక ఈ టోర్నీలో ఆరో ‘డ్రా’ నమోదు చేసుకుంది. హారిక ప్రపంచ మాజీ చాంపియన్ మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను హారిక 58 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఎనిమిదో రౌండ్ తర్వాత హంపి 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఐదు పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) రెండో స్థానంలో, 4.5 పాయింట్లతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జూ వెన్జున్ (చైనా), మరియా ముజిచుక్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. నాలుగు పాయింట్లతో హారిక ఆరో స్థానంలో ఉంది. పాయింట్ల పరంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అగ్రస్థానంలో నిలిస్తే ప్లే ఆఫ్ గేమ్‌ల (ర్యాపిడ్, బ్లిట్జ్, అర్మగెడాన్) ద్వారా ఏకైక విజేతను నిర్ణయిస్తారు. -
నగరిలో రోజా వికాసం
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ దిశగా వైసీపీ అప్రతిహతంగా దూసుకుపోతోంది. సగానికి పైగా సీట్లలో వైఎస్సార్సీపీ ప్రభంజనం కొనసాగుతోంది. 150కు పైగా నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు గుర్రాలు సత్తా చాటుతున్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ, ఇతర పార్టీల తప్పుడు అంచనాలు, లెక్కలకు ధీటుగా ఆమె దూసుకుపోతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై రోజా మెజారిటీతో గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుమ్మురేపుతోంది. ఏపీ ఫలితాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఫ్యాన్ హవాతో ఎంపీల పరంగా దేశంలోనే అదిపెద్ద పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవతరించనుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడుతుండగా, అధికార పార్టీ మంత్రులు పలువురు వెనుకంజలో ఉండటం గమనార్హం. ఇక జనసేన ప్రభావమే లేకుండా పోయింది. -
ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో వైఎస్సార్సీపీ విజయ బావుటా!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ శరవేగంగా దూసుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ జోరుకు టీడీపీ కొట్టుకుపోతోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో పాటు, ఈవీఎంల లెక్కింపులో మొదటి దశలో విజయం దిశగా పయనిస్తోంది. రాష్ట్రంలో శ్రీకాకుళం, కడప, విజయనగరం, వైజాగ్ తదితర జిల్లాల్లో ముందంజలో ఉంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బోణీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం, పాలకొల్లు చింతలపూడి తదితర 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం తదితర 10 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయ బావుటా ఎగురవేసేందుకు సన్నద్ధమవుతోంది. -
ముంబైలో దూసుకుపోతున్న శివసేన
-
జియోతో 4జీ విప్లవం: ఐడీసీ
న్యూఢిల్లీ: ఉచితవాయిస్ కాల్స్, ఉచిత 4 జీ డేటాలతో టెలికాం ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో సంచలనానికి నాంది పలకనుంది. జియో ఉచిత 4జీ సిమ్ కార్డులు, తక్కువ ధరలకే 4జీస్మార్ట్ ఫోన్ల నేపథ్యంలో 4 జీ విప్లవానికి భారతదేశం అగ్రస్థానంలో నిలవనుందని ఇంటర్నేషనల్ డాటా కార్పేరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి బిలియన్ ఖాతాదారుల లక్ష్యంతో ప్రారంభించిన 4జీ స్మార్ట్ ఫోన్లతో ఇండియా లాంటి కీలకమైన మార్కెట్లలో 4జీ విప్లవానికి దారులు వేసిందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) బుధవారం వెల్లడించింది . ప్రపంచ వ్యాప్తంగా 4జీ స్మార్ట్ ఫోన్ల వినియోగంలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు కానుందని తెలిపింది. 2016లో 21.3 శాతం వృద్ధితో 1.17 బిలియన్ యూనిట్ల చేరనుందని తెలిపింది. 2015 లో 967 మిలియన్లుగా ఉందని పేర్కొంది. కొత్త ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రవేశంతో ఇండియా లాంటి కీలక మార్కెట్లలో వేగవంతమైన అభివృద్ధిని చూస్తున్నట్టు వ్యాఖ్యానించింది. ఉచిత సిమ్ కార్డులు, తక్కువ ధరలకే సొంత బ్రాండెడ్ 4జీస్మార్ట్ ఫోన్లతో దూకుడుగా ఎంట్రీ ఇచ్చిన జియో మార్కెట్ ను షేక్ చేస్తోందని అసోసియేట్ రిసెర్చ్ డైరెక్టర్ మెలిస్సా చౌ చెప్పారు . కాగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ వాణిజ్యపరంగా సెప్టెంబర్ 5న జియో సేవలను లాంచ్ చేశారు. సుమారు 3,100 నగరాలు, పట్టణాలు అంతటా ఆధార్ ఆధారిత సేవలు ప్రారంభించారు. దీంతో జియో వినియోగదారులకు డిసెంబర్ 31 వరకు అపరిమిత హెచ్డీ వాయిస్ కాల్స్ హై స్పీడ్ డేటా ను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. -
జమ్మూ కశ్మీర్‌కు ఆధిక్యం
ముంబై: ఆంధ్రతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ రంజీ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌కు తొలి ఇన్నింగ్స ఆధిక్యం లభించింది. శనివారం మూడో రోజు ఆంధ్ర తొలి ఇన్నింగ్సలో 99.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటరుుంది. రవితేజ (81), ప్రదీప్ (47) రాణించారు. జమ్మూ బౌలర్లలో అజీజ్ ఐదు, రసూల్ మూడు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సలో 79 పరుగుల ఆధిక్యం సాధించిన జమ్మూ కశ్మీర్ జట్టు... మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సలో 18.5 ఓవర్లలో రెండు వికెట్లకు 31 పరుగులు చేసింది. హైదరాబాద్ తడబాటు భువనేశ్వర్‌లో కేరళతో జరగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తడబడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సలో 87 ఓవర్లలో ఏడు వికెట్లకు 231 పరుగులు చేసింది. సందీప్ (53) అర్ధసెంచరీ చేశాడు. అంతకుముందు కేరళ తొలి ఇన్నింగ్‌సను 181 ఓవర్లలో 9 వికెట్లకు 517 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. -
తాజా సర్వేలో ట్రంప్ మరింత వెనక్కి
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు ఆదరణ రోజురోజుకూ తగ్గిపోతోంది. పాక్స్ న్యూస్ నిర్వహించిన తాజా సర్వే ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. ట్రంప్ ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఓటర్ల ఆదరణ పెరిగిందని జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వేలో తేలింది. సెప్టెంబర్ 11 నుంచి 14 తేదీల మధ్య ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ.. కేవలం ఒక పాయింట్ శాతం ఓటర్ల మెజారిటీ కలిగి ఉన్నారని వెల్లడికాగా.. తాజా సర్వే ఫలితాల్లో మాత్రం హిల్లరీ ఆధిక్యం మూడు పాయింట్ల శాతానికి పెరిగింది. ట్రంప్‌కు 40 శాతం ఓటర్లు మద్దతు ఇవ్వగా.. హిల్లరీకి 43 శాతం ఓటర్ల మద్దతు ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. మొదటి డిబేట్లో మహిళలపై ట్రంప్ దృక్పథం సరిగా లేదంటూ హిల్లరీ ఎండగట్టిన విషయం తెలిసిందే. ఈ డిబేట్ అనంతరం ట్రంప్‌కు జనాదరణ తగ్గినట్లు తెలుస్తోంది. రాండమ్ శాంపిల్ విధానంలో దేశ వ్యాప్తంగా 10,000 మందికి పైగా రిజిష్టర్డ్ ఓటర్ల అభిప్రాయాలతో ఈ సర్వేను నిర్వహించినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. -
ట్రంప్, హిల్లరీలు హోరాహోరీ..
అమెరికా అధ్యక్షపదవి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ల పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ల మధ్య పోటీ నువ్వా.. నేనా అన్నట్లుగా సాగుతోంది. గురువారం ఫాక్స్ న్యూస్ విడుదల చేసిన వివరాల ప్రకారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ఒక శాతం ఓట్ల మెజారిటీతో ముందంజలోఉన్నట్లు పేర్కొంది. నెల క్రితం వరకు దాదాపు ఎనిమిది శాతం ఓట్ల మెజారిటీతో ముందున్న హిల్లరీ, ట్రంప్ ల మధ్య తేడా ఒక్కసారిగా 1.5 శాతానికి పడిపోయింది. 9/11వార్షిక సమావేశంలో క్లింటన్ అస్వస్ధతకు గురైన తర్వాత అమెరికాలో జరిగిన మొదటి ఎన్నిక ఇదే. ఈ సమావేశానికి ముందు వరకు ట్రంప్ కంటే ఎనిమిది శాతం మెజారిటీ ఓట్లతో హిల్లరీ ముందంజలో ఉండటం గమనార్హం. దీంతో అధ్యక్షపదవి ఎవరికి దక్కుతుందో రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. హిల్లరీ ఆరోగ్య పరిస్ధితిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఫలించినట్లు ఈ ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. ట్రంప్, ఆయన తరఫున కార్యకర్తలు పదేపదే హిల్లరీ ఆరోగ్యంపై అనుమానాలను రేకితిస్తూ చేసిన ప్రసంగాలు ఫలించాయి. హిల్లరీ ఆరోగ్యంపై ఆమె డాక్టర్ మరిన్ని వివరాలను వెల్లడించడం కూడా కొంతమేరకు ప్రతికూలతను చూపినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం హిల్లరీ 45శాతం ఓట్లతో ఉండగా.. ట్రంప్ 46 శాతం ఓట్లతో లీడ్ లో ఉన్నారు. కాగా ఈ నెల 26న మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగనుంది. -
93 పరుగుల ఆధిక్యంలో వరంగల్
వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ మైదానంలో బుధవారం ప్రారంభమైన అంతర్ జిల్లాల టుడే లీగ్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. వరంగల్ వర్సెస్ నిజామాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మెుదట నిజామాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే 35 ఓవర్లలో నిజామాబా ద్ జట్టు 89 పరుగులు సాధించి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన వరంగల్ జట్టు సాయంత్రం వరకు జరిగిన ఆటలో 55 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు సాధించి నిజామాబాద్ జట్టుపై 93 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుం ది. వరంగల్ జట్టు క్రీడాకారుడు సోను బౌలింగ్‌లో ప్రతిభ కనబరిచి 6 వికెట్లను తీశాడు. సాయంత్రం వరకు సాగిన మ్యాచ్ లో సుఖాంత్ 59 పరుగులు, సాయిచరణ్ 89 పరుగులు చేశారు. గురువారం మ్యాచ్ కొనసాగుతుందని వరంగల్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. -
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సైకిల్‌యాత్ర
కోదాడఅర్బన్: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిరక్షణ, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సమరభేరి సైకిల్ యాత్రలు మంగళవారం కోదాడ పట్టణంలో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఈ సైకిల్‌యాత్రను ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ మాజీ అధ్యక్షుడు జుట్టుకొండ బసవయ్య , ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల విద్యాసాగర్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 134 వసతి గృహాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయని, వాటిలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలపై తమ సైకిల్‌యాత్రలో అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధనాకుల శ్రీకాంత్, వర్మ, మట్టపల్లి వెంకట్, పల్లపు శ్రీనివాస్, ఉపేందర్, మహేందర్, ప్రవీణ్, నవీన్, సతీష్, మహేష్, ఎస్.రాధాకృష్ణ, ఎం. ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ ఫోన్లతో జర జాగ్రత్త!
స్మార్ట ఫోన్లతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు పరిశోధకులు. స్మార్ట్ ఫోన్లకు అపరిమితమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుండటంతో జనం ప్రయాణాల్లో కూడా వాటిని వదలట్లేదు. దీంతో చికాకు, ఆత్రుత పెరుగే అవకాశం ఉందని తాజా అధ్యయనాల ద్వారా కనుగొన్నారు. స్మార్ట్ ఫోన్లలో అత్యంత ఎక్కువగా ఇంటర్నెట్ వాడటం 'వెబ్ డిపెండెన్స్ యాంగ్జయిటీ'కి దారితీస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల మనుషుల్లో తెలియని చికాకు, ఆత్రుత పెరుగుతుందని, విషయాలను సునిశితంగా ఆలోచించే శక్తి కోల్పోయి, ఆగ్రహావేశాలకు లోనయ్యే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. యువకులు, విద్యావంతుల్లో ఎక్కువగా ఈ వెబ్ డిపెండెన్స్ సమస్య వస్తోందని తైవాన్ లోని టైచుంగ్ నేషనల్ చిన్-యి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు హుయి జెన్ యాంగ్ తెలిపారు. సాంకేతికత వాడకాన్ని బట్టి మన మనస్తత్వం మారే అవకాశం ఉంటుందని ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనాల్లో వివరించారు. ఒక వ్యక్తి తన భద్రత కోసం మరొకరితో సన్నిహితంగా ఉండటంవల్ల పొందే మానసిక పరివర్తన సిద్ధాంతాన్ని పోలుస్తూ ఈ కొత్త పరిశోధనలకు ఉదాహరణగా జోడించారు. సదరు వ్యక్తి దగ్గరగా ఉన్నపుడు ప్రశాంతంగా ఉండటం, లేకపోతే ఆత్రుతకు లోనవ్వడం వంటి మానసిక పరివర్తనను పరిశోధకులు తమ అధ్యయనాల్లో వినియోగించారు. ఒకరికి ఒకరు దూరమైనప్పుడు కలిగే ఆత్రుత..స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ ల కు దూరమైనప్పుడు కూడా కలిగే అవకాశం ఉందని పరిశోధనకులు కనుగొన్నారు. -
సమ్మెసెగ
- బస్టాండ్‌లో ఉద్రిక్తత - బస్సు అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తులు - ఆర్టీసీ కార్మికుల పనేనని పోలీసుల జులుం - గౌతంరెడ్డి సహా పలువురు నేతల అరెస్టు, విడుదల - పలు ప్రాంతాల్లో పోలీసుల ఫైర్ నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, నినాదాలు, అరెస్టులతో నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ శనివారం రణరంగాన్ని తలపించింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరసన ప్రదర్శనలోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఎక్స్‌ప్రెస్ బస్సు అద్దాలు పగలగొట్టడంతో రెచ్చిపోయిన పోలీసులు ఆందోళనకారులపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేసి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు తిప్పారు. 56మందిపై కేసులు నమోదుచేసి సాయంత్రం విడుదల చేశారు. బస్‌స్టేషన్ : ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా నాల్గోరోజు శనివారం నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ డిపో నుంచి మెయిన్ గేటు వరకు నిరసన ర్యాలీ జరి పారు. ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతలు మెయిన్ గేట్ ముందు బైఠాయించారు. దీనికి వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మద్దతు తెలిపి కార్మికులతో పాటే బైఠాయించారు. ఇదిలావుంటే.. బస్టాండ్‌లో ప్లాట్‌ఫాంపై ఉన్న గుంటూరు-రాజమండ్రి బస్సు అద్దాలను రాధాకృష్ణ, రమేష్, రాజు, సుబ్బారావు అనే వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై బస్సు యజమాని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బస్టాండ్ ప్రధాన గేటు వద్ద నిరసన జరుపుతున్న కార్మికులకు సంబంధం లేని వ్యక్తులు అద్దాలు పగలకొట్టడంతో పోలీసులు నిరసనకారులపై జులం ప్రదర్శించారు. ఆర్టీసీ కార్మికులు, వారికి మద్దతు ప్రకటించడానికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీల నేతలను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనాల్లో పడేశారు. అరెస్ట్, విడుదల బస్టాండ్‌లో నిరసన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేశారు. తొలుత నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మాచవరం, సత్యనారాయణపురం, ఉయ్యూరు, పమిడిముక్కల పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 56 మందిపై 151 సీఆర్సీ కేసు నమోదు చేశారు. అనంతరం సాయంత్రం ఆరు గంటల సమయంలో విడుదల చేశారు. స్టేషన్ల నుంచి వచ్చిన వారంతా పాత బస్టాండ్‌లో కార్మికులతో సమావేశమయ్యారు. పోలీసుల తీరు దారుణం : గౌతంరెడ్డి కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటంలో పోలీసులు చూపిన తీరు దారుణమని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేయడం సబబు కాదన్నారు. నగరంలో ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని ఆయనను కలుస్తారని, ఆందోళన చేస్తారని స్టేషన్లకు తరలించారని చెప్పారు. అరెస్టులతో భయపెట్టి ఉద్యమాన్ని ఆపలేరన్నారు. అంతకుముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో గౌతంరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీకి కార్మికుల వల్లే నష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి ప్రభుత్వంలో ఎటువంటి మార్పు లేకపోవడం మంచిదికాదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను, ప్రజల ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం త్వరగా స్పందించాలని కోరారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ గతంలో జరిపిన చర్చల్లో కార్మికులను మోసం చేసిన యాజమాన్యం, ఇకపై మోసగించేందుకు అవకాశం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు విశ్వనాథ రవి, సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్, సీఐటీయూ నాయకులు ముజఫర్ అహ్మద్, ఆర్టీసీ యూనియన్ నేతలు ఎన్‌హెచ్‌ఎన్ చక్రవర్తి, యార్లగడ్డ రమేష్, టీవీ భవాని, నారాయణ, మోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
మూగజీవాలను కాటేస్తున్న లెడ్
కొందుర్గు: పరిశ్రమల నుంచి విచ్చల విడిగా బయటకు వెలువడుతున్న లెడ్ మూగజీవాలను కాటేస్తోంది. సమీపంలోని పచ్చికను తిని నీళ్లు తాగిన పశువులు మృ త్యువాతపడుతున్నాయి. ఈ క్రమం లో ఈనెల 1వ తేదీన సమీప పొలాల రైతులకు చెందిన ఏడు పశువులు మృతి చెం దాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అ నుమతులు లేకున్నా మండలంలోని జి ల్లేడ్ గ్రామశివారులో ఓ పరిశ్రమ కొనసాగుతోంది. ఇక్కడ కర్బన పదార్థాలను మరిగించి లెడ్ను తయారుచేస్తున్నారు. పరిశ్రమ సమీపంలోని పొలాల్లో మేత మే యడంతో ఎల్కగూడాలో గతంలోనే ఏడు పశువులు మృతిచెందాయి. గుట్టుచప్పు డు కాకుండా జిల్లేడ్లో చెట్లపొదల మా టున లెడ్ తయారీకి మరో పరిశ్రమను నడుపుతున్నారు. ఈ పరిశ్రమ ఉదయం 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది. లెడ్ తయారీ ఇలా.. వాహనాల్లోని కాలిపోయిన బ్యాటరీల్లో ఉండే వ్యర్థపదార్థం, రాక్పౌడర్, బొగ్గు, ఇనుమును బాగా మరిగించి లెడ్ను తయారుచేస్తున్నారు. దీన్ని రాత్రికిరాత్రే హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పరిశ్రమలోని ఒక్కో బట్టీలో 25కిలోల బరువు ఉన్న మూడు లెడ్ కడ్డీలను తయారుచేస్తారు. ఇక్కడి నుంచి విషరసాయనాలు సమీపంలోని చెరువులు, బోరుబావుల్లోని నీళ్లల్లో ఇంకిపోతున్నాయి. ఈ నీటిని తాగిన పశువులు చనిపోతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేనప్పటికీ పరిశ్రమ నిర్వహణ కోసం ట్రాన్స్‌కో అధికారులు ఓ సింగిల్‌ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అమర్చారు. అంతేగాక వ్యవసాయబోరు నుంచి పరిశ్రమకు నీటిని వాడుకుంటున్నారు. ఇటు గ్రామపంచాయతీ, రెవె న్యూ, పరిశ్రమల శాఖ, అటు కాలుష్యం నియంత్రణ మండలి అధికారులు ప ట్టించుకోకపోవడంతో విచ్చలవిడిగా కా లుష్యం వెదజల్లుతూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. యజమానిపై చర్యలు తీసుకుని పరిశ్రమను సీజ్‌చేయాలని సమీప పొలాల రైతులు కోరుతున్నారు. మిల్లులో నమూనాల సేకరణ పర్యావరణ ఇంజనీర్ శ్రీలక్ష్మి నేతృత్వంలోని అధికారుల బృందం గద్వాల మండలం వీరాపురం స్టేజీ వద్ద ఉన్న మిల్లులను పరిశీలించింది. అక్కడి నుంచి నేరుగా కొండపల్లి క్రాస్‌రోడ్డులో ఉన్న రమ్య జిన్నింగ్ మిల్లుకు చేరుకున్నారు. ఫ్యాక్టరీలోకి వెళ్లిన అధికారుల బృందం జిన్నింగ్ మిల్లులో డీలింటింగ్ ప్రాసెస్ యూనిట్ల వద్దకు చేరుకొని అక్కడి నీటిలో నమూనాలు సేకరించారు. ఇదే సమయంలో ఫ్యాక్టరీలోకి మునిసిపల్ చైర్పర్సన్ బృందం వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంగా గొడవ ప్రారంభం కావడంతో అధికారులు ఫ్యాక్టరీ ముందుకు వచ్చేశారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న డీలింటింగ్కు సంబంధించిన నమూనాలపై నివేదికలు సిద్ధంచేశారు. సంతకాల కోసం మిల్లు యజమానిని పిలిచినా రాకపోవడంతో అధికారులు ఉన్నతాధికారులకు వాస్తవాలను నివేదిస్తామంటూ వెళ్లిపోయారు. -
ఆధిక్యం దిశగా కివీస్
పాకిస్థాన్‌తో రెండో టెస్టు దుబాయ్: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంపై కన్నేసింది. మ్యాచ్ మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. అజహర్ అలీ (225 బంతుల్లో 75; 6 ఫోర్లు, 1 సిక్స్), యూనిస్ ఖాన్ (160 బంతుల్లో 72; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా, అసద్ షఫీఖ్ (44) రాణించాడు. కివీస్ బౌలర్లలో ఇష్ సోధి 2 వికెట్లు పడగొట్టగా...బౌల్ట్, సౌతీ, క్రెయిగ్, నీషామ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో 4 వికెట్లు ఉన్న పాక్ మరో 122 పరుగులు వెనుకబడి ఉంది. సర్ఫరాజ్ (28 బ్యాటింగ్), యాసిర్ (1 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. -
రీడ్ - లీడ్
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న రెండో కథనమిది. చదువు చదువు అంటూ పిల్లల వెంటపడటమే తప్ప చదువుపై, అసలు పుస్తకాలపై వారిలో ఆసక్తిని పెంచడమెలా అని ఆలోచించే వారున్నారా? మేమున్నాం అంటున్నారు జాయ్ ఆఫ్ రీడింగ్ గ్రూప్ సభ్యులు. పిల్లలకు చదువులోని ఇంపును, గ్రహించే శక్తిని అందిస్తూనే.. ఆ ఆసక్తి కొనసాగేందుకు అవసరమైన పుస్తకాలతో లైబ్రరీలను అందిస్తున్న ఈ సంస్థ పరిచయమిది. పాఠ్యపుస్తకాలే అరకొరగా ఉండే గవర్నమెంటు స్కూళ్లు, ఫీజులకు తప్ప అన్నింటికీ లోటే అన్నట్టుండే ప్రైవేటు స్కూళ్లలో లైబ్రరీ గురించి వెతకడం ఎడారిలో నీటిజాడ కోసం తాపత్రయపడటమే. అలాంటి నిరర్థక యత్నాలు చే యకూడదని తెలిసిన సిటీ యువత తమ వంతుగా జాయ్ ఆఫ్ రీడింగ్‌ను అందించడానికి నడుం క ట్టింది. బుక్స్ ఫర్ స్కూల్స్.. ‘ఏ పనైనా ఆనందంగా చేస్తే అది మనకు ఇష్టంగా మారుతుంది. సహజంగానే అందులో నేర్పు కూడా వస్తుంది. అందుకే చిన్నారులకు చదవడంలోని ఆనందాన్ని నేర్పడానికి ఈ లైబ్రరీల ఏర్పాటు’ అన్నారు మనీష్. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే మనీష్, గగన్, హరిణి, సీఏ టెక్నాలజీస్ ఉద్యోగులైన మొహక్, ప్రవేష్ ఐఎల్ఎస్ నుంచి శ్రీధర్‌లతో పాటు అమెరికాలోని ఎన్జీవోలో పనిచేస్తున్న మధు ఈ అంశంపై పని చేసేందుకు చేతులు కలిపారు. ఊహ తెలిసిన దగ్గర్నుంచి పరీక్షల భయాన్ని పెంచే పాఠ్యపుస్తకాలే తప్ప పఠనంలోని సంతోషాన్ని అందించే పుస్తకాలు లేకపోవడమే చిన్నారుల్లో పఠనాసక్తి కొరవడటానికి కారణం అంటోంది మనీష్ అండ్ కో. అందుకే రీడింగ్ కల్చర్‌ను పెంచాలనే ఉద్దేశంతో సిటీలో ఏడాదిన్నర క్రితం ఈ ‘జాయ్ ఆఫ్ రీడింగ్’ ఇనీషియేటివ్‌కు శ్రీకారం చుట్టింది. దీనిలో తొలి అడుగుగా కళ్యాణ్‌నగర్‌లో ఒక పూర్తిస్థాయి లైబ్రరీని ప్రారంభించారు. అక్కడ నుంచి దశలవారీగా బస్తీల్లోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు లైబ్రరీ సదుపాయం లేని ప్రైవేటు పాఠశాలల్లో కూడా పరిమిత స్థాయి పుస్తకాలతో లైబ్రరీలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ‘కనీసం 200-300 వరకూ పుస్తకాలు సేకరించి పాఠశాలలకు అందిస్తున్నాం. ఇప్పటికి 9 ప్రభుత్వ, 3 ప్రైవేటు పాఠశాలలకు ఇచ్చాం. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలకల్లా 100 పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం లక్ష్యం’ అంటూ చెప్పారు మనీష్. ఆన్లైన్లో సేకరించడంతో పాటు దాతలు ఎవరైనా సరే పుస్తకాలు అందిస్తే వాటిని ఇలా విద్యార్థుల్లో విజ్ఞానం పెంచడానికి ఉపయోగిస్తామని చెబుతున్నారు. రీడ్ ఫర్ జాయ్... చదవడంలోని ఆనందం గురించి తెలిస్తేనే కదా చిన్నారులు పుస్తకాలను ఇష్టపడేది? అందుకే కేవలం పుస్తకాలు ఇచ్చేసి ఊరుకోకుండా ఆయా పాఠశాలల్లో వీకెండ్స్‌లో రీడింగ్ సెషన్లు కూడా వీరు నిర్వహిస్తున్నారు.‘టీచ్ ఫర్ ఇండియా మాకు వాలంటీర్ల విషయంలో హెల్ప్ చేస్తోంది. వాలంటీర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని రీడింగ్ సెషన్ల అనుభవాన్ని ఇంప్రూవ్ చేయడం. వాలంటీర్లు, కార్పొరేట్ కంపెనీల నుంచి అంగీకారం పొందడం. దీర్ఘకాలం నిలిచేలా ఒక బలమైన రీడర్స్ కమ్యూనిటీని నిర్మించడం లక్ష్యాలుగా ముందుకు సాగుతున్నాం’ అని మనీష్ వివరించారు. ఆన్లైన్లో రిక్వెస్ట్‌లతో పాటుగా వ్యక్తిగతంగా ఇచ్చేవారు, సంస్థల నుంచి బుక్స్ సేకరిస్తున్నారు. ‘స్పందన బాగుంది. ఇప్పటికి 27 వేలకు పైగా బుక్స్ కలెక్ట్ చేశాం’ అని చెప్పారాయన. బుక్స్ ట్రాక్ చేయడానికి, డేటా నిర్వహణ, లైబ్రరీ స్టాక్‌ను తరచుగా రీప్లేస్ చేయడం వంటి లైబ్రరీ నిర్వహణ బాధ్యతలను కూడా ఎంపిక చేసిన వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఇక వీరు తొలుత ఏర్పాటు చేసిన కళ్యాణ్‌నగర్ లోని సెంట్రల్ లైబ్రరీని విద్యార్థులు ఉచితంగా వినియోగించుకోవచ్చు. వాలంటీర్లు కావాలి... తమకు ఇతరత్రా చేయూత కన్నా పిల్లలకు మంచి విషయాలు చెప్పాలని, పఠనంలోని గొప్పతనాన్ని వివరించాలనే ఆసక్తి కలిగిన వాలంటీర్ల అవసరం ఉందని మనీష్ అంటున్నారు. నెలలోని 3, 4వ శనివారాల్లో రీడింగ్ సెషన్ల నిర్వహణకు స్కూల్స్‌కు వెళ్లిగాని లేదా ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా కూడా వాలంటీర్లు వర్క్ చేయవచ్చంటున్నారు. ఉదయం 11-మధ్యాహ్నం 1 గంట మధ్య ఇవి ఉంటాయని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు భవిష్యత్తులో ఆర్ఫన్ హోమ్స్, హౌసింగ్ కమ్యూనిటీస్, ఎన్జీవోలకు సైతం బుక్స్ అందించాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. వాలంటీర్లు www.joyofreading.org వెబ్సైట్ గానీ, 7702711124, 9966655697 ఫోన్ నంబర్లలో గానీ సంప్రదించవచ్చు. info@joyofreading.orgకి అభిప్రాయాలు మెయిల్ చేయొచ్చు. ప్రెజెంటేషన్: సత్యబాబు satyasakshi@gmail.com -
మట్టి ప్రతిమలే మేలు..!
మొయినాబాద్ రూరల్: ప్రపంచానికి ఆధ్యాత్మిక పరిమాళాన్ని అందించిన భారత్‌లో కొన్ని వేల సంవత్సరాలుగా పూరాతన సంస్కృతి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఇవన్ని ప్రకృతితో మమేకమై జరుపుకునే పండుగలే. అయితే ఇటీవలె వచ్చిన ఆధునాతన పద్ధతులతో ఈ సంప్రదాయాలే పర్యావరణానికి కీడు చేస్తున్నాయి. ఒకప్పుడు మట్టితో తయారు చేసే వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుకునేవారు. ఆ తరువాత వాటిని చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేసినా సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు మాత్రం ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్రమాదకరమైన రసాయనాలతో ఆకర్షణీయ రూపాల్లో విగ్రహాలను తయారు చేస్తున్నారు. పూజల అనంతరం ఈ విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేసినా అవి కరగడం లేదు. అంతేకాకుండా ఆ ప్రతిమల్లోని రసాయనాలు చెరువులు, కుంటలను కలుషితం చేస్తున్నాయి. దీనికి బదులు మట్టి విగ్రహాలనే వాడాలని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రచారాన్ని ప్రారంభించాయి. జీవరాశుల మృత్యువాత ప్రతి సంవత్సరం హిందువులు వినాయక పండుగ కోసం రాష్ర్ట వాప్తంగా లక్షల సంఖ్యలో గణేష్ విగ్రహాలను కొనుగోలు చేస్తారు. వీటిలో 75 శాతంకుపైగా రసాయన పదార్థాలైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌తో తయారు చేసిన విగ్రహాలే ఉంటాయి. అయితే పూజల అనంతరం ఈ విగ్రహాలను సమీపంలోవున్న చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తుంటారు. ఆ సమయంలో విగ్రహాల తయారీలో ఉపయోగించిన కృత్రిమ రంగులైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పాదరసం, సీసం, కాడ్మీయం, క్రోమీయం తదితర రసాయనాలు నీటిలో కలుస్తున్నాయి. దీంతో నీరు, గాలి కాలుష్యమవుతోంది. వీటితో క్యాన్సర్, జీర్ణకోశం, మూత్రపిండాలు, చర్మానికి సంబంధించిన వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఈ రసాయనాలతో చెరువులు, కుంటల్లో వుండే జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇటీవలె మట్టి విగ్రహాల వినియోగం పెరిగిపోయింది. మట్టి విగ్రహాల వినియోగం శ్రే యస్కరం పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి విగ్రహాలను వినియోగించడమే శ్రేయస్కరమని వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. చెరువుల, కుంటల వద్ద లభిం చే బంక మట్టితో వివిధ ఆకారాల్లో విగ్రహాలను చేయవచ్చు. వీటివల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడే అవకాశముండదు. మట్టితో తయారు చేసే విగ్రహాలు నిమజ్జనం చేసిన వెంటనే నీటిలో సులభంగా కరిగిపోతాయి. అయితే మట్టితో తయారు చేసిన విగ్రహాలు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలతో పోలిస్తే ఆకర్షణీయంగా కని పించకపోవడంతో చాలా మంది వీటిపై ఆసక్తి చూపడంలే దు. మట్టి విగ్రహాలపై ప్రభుత్వాలు, పర్యావరణ శాస్త్రవేత్తలు ప్రజలలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ కారణంగా ఏటేటా వాతావరణ కాలుష్యం పెరుతూనే ఉంది. కొన్ని చోట్ల పర్యావరణ ప్రేమికులు మట్టి విగ్రహాలను పూజిస్తూ పర్యావరణ పరిరక్షణకై ప్రజల కు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీకి ఓ సంఘం ఈ తరుణంలో మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో గతేడాది మట్టి విగ్రహాల తయారీ సంఘం ఏర్పడింది. కె. మంజుల అనే మహిళ ఈ సంఘాన్ని స్థాపించి తనతోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పిస్తోంది. గతేడాది దాదాపు 6 వేల విగ్రహాలను జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు, ఎంజీసీలకు సరఫరా చేశామని, ఈసారి 10 వేల విగ్రహాలను తయారు చేయనున్నట్లు చెబుతోంది. ఈసారి వినాయక చవితి కోసం మూడు నెలల క్రితమే పనులు ప్రారంభించామని, విగ్రహాల తయారీ కూడా దాదాపు పూర్తయినట్లు వివరించింది. మట్టి విగ్రహాల తయారీ ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలని, సర్కారు బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తోంది. -
గుర్రప చెరువులో మునిగి తండ్రీకొడుకుల మృతి
=బంతి కోసం నీటిలో దిగి కుమారుడు.. =కొడుకు ఆచూకీ కోసం చెరువులో దిగి తండ్రి కన్నుమూత =ఇద్దరి మృతదేహాలూ లభ్యం అవనిగడ్డ, న్యూస్‌లైన్ : చెరువులో కొడుకు గల్లంతవగా, గాలింపు కోసం చెరువులోకి దిగిన తండ్రి కూడా మృతిచెందిన విషాద ఘటన అవనిగడ్డలో ఆదివారం జరిగింది. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన బిట్ర శ్రీను (42) అల్యూమినియం పాత్రల వ్యాపారం చేసేందుకు మూడేళ్ల క్రితం అవనిగడ్డకు వచ్చాడు. చెరువు సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కొంతమంది పిల్లలతో కలిసి శ్రీను కుమారుడు వెంకటేష్ (6) బంతి ఆట ఆడుతుండగా అది చెరువులో పడింది. దానిని తీసుకువచ్చేందుకు కొంతమంది యత్నించగా, పెద్దలు వారించటంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. అరగంట తర్వాత వెంకటేష్ బంతి తీసేందుకు చెరువులోకి దిగాడు. ఎంతసేపటికీ ఒడ్డుకు రాకపోవడాన్ని గమనించిన కొందరు పిల్లలు కేకలు వేసి స్థానికులకు విషయం వివరించారు. స్థానికులు వచ్చి గాలించినా వెంకటేష్ ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చెరువు వద్దకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అప్పటికే చీకటి పడటంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. కుమారుడి ఆచూకీ కోసం... ‘మా కుమారుడిని ఎవరూ కాపాడటం లేదు, నేనే రక్షించుకుంటా’ అంటూ తండ్రి శ్రీను చెరువులోకి దూకాడు. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా ఇద్దరి ఆచూకీ లభించలేదు. పులిగడ్డ నుంచి గజ ఈతగాళ్లను తీసుకువచ్చి వెదికించడంతో తండ్రి శ్రీను మృతదేహం, ఆ తర్వాత రాత్రి సమయంలో వెంకటేష్ మృతదేహం లభ్యమయ్యాయి. మృతుడు శ్రీనుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తె యల్లమ్మ (11)కు గుండె సంబంధ వ్యాధి రావడంతో తల్లి వీరమ్మ వైద్య పరీక్షల కోసం ఐదు రోజుల కిందట విజయవాడ తీసుకువెళ్లింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించి వెంకటేష్‌ను గాలించి ఉంటే తన తమ్ముడు నీట మునిగేవాడు కాదని శ్రీను అక్క నాంచారమ్మ భోరున విలపిస్తూ చెప్పింది. అవనిగడ్డ సీఐ రమణమూర్తి, ఎస్సై శ్రీనివాస్, తహశీల్దార్ వెన్నెల శ్రీను ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.