ఆధిక్యం దిశగా కివీస్ | Newzealand towards lead | Sakshi
Sakshi News home page

ఆధిక్యం దిశగా కివీస్

Published Thu, Nov 20 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

ఆధిక్యం దిశగా కివీస్

ఆధిక్యం దిశగా కివీస్

పాకిస్థాన్‌తో రెండో టెస్టు

దుబాయ్: పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంపై కన్నేసింది. మ్యాచ్ మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. అజహర్ అలీ (225 బంతుల్లో 75; 6 ఫోర్లు, 1 సిక్స్), యూనిస్ ఖాన్ (160 బంతుల్లో 72; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా, అసద్ షఫీఖ్ (44) రాణించాడు.

కివీస్ బౌలర్లలో ఇష్ సోధి 2 వికెట్లు పడగొట్టగా...బౌల్ట్, సౌతీ, క్రెయిగ్, నీషామ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో 4 వికెట్లు ఉన్న పాక్ మరో 122 పరుగులు వెనుకబడి ఉంది. సర్ఫరాజ్ (28 బ్యాటింగ్), యాసిర్ (1 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement