New Zealand
-
కివీస్‌దే టి20 సిరీస్
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): బ్యాటర్ల దూకుడుకు... బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో... పాకిస్తాన్‌తో నాలుగో టి20లో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన పోరులో ఆతిథ్య న్యూజిలాండ్ 115 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలుపొందింది. ఫలితంగా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3–1తో సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (22 బంతుల్లో 44; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిన్ అలెన్ (20 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. బ్రేస్‌వెల్ (26 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా... మార్క్ చాప్మన్ (24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ (29; 1 ఫోర్, 1 సిక్స్) ఉన్నంతసేపు దూకుడు కనబర్చారు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3, అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ పూర్తిగా తడబడింది. 16.2 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. మొత్తం జట్టులో అబ్దుల్ సమద్ (30 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇర్ఫాన్ ఖాన్ (24; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. గత మ్యాచ్ సెంచరీ హీరో హసన్ నవాజ్ (1), కెప్టెన్ ఆఘా సల్మాన్ (1), మొహమ్మద్ హరీస్ (2), షాదాబ్ ఖాన్ (1), ఖుష్దిల్ షా (6) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 4, ఫోల్క్స్ 3 వికెట్లు పడగొట్టారు. కివీస్ ఓపెనర్ అలెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి టి20 బుధవారం వెల్లింగ్టన్లో జరుగుతుంది. బాదుడే బాదుడు... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు సీఫెర్ట్, అలెన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. బౌలర్‌తో సంబంధం లేకుండా ఈ జోడీ ఎడాపెడా బౌండరీలతో చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన సీఫెర్ట్... అబ్రార్ వేసిన నాలుగో ఓవర్లో 6, 4, 6 కొట్టాడు. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 54 పరుగులు చేసింది. మరో భారీ షాట్‌కు యత్నించి సీఫెర్ట్ అవుట్ కాగా... ఆ తర్వాత బాదే బాధ్యత అలెన్ తీసుకున్నాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై విరుచుకుపడిన అలెన్... అబ్రార్ వేసిన ఏడో ఓవర్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఫలితంగా 8 ఓవర్లలోనే కివీస్ వంద పరుగుల మార్క్ దాటింది. షాదాబ్ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6, 6 కొట్టిన అలెన్ 19 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... 10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 134/2తో నిలిచింది. ఈ దూకుడు చూస్తుంటే కివీస్ మరింత భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించినా... ఆ తర్వాత తేరుకున్న పాక్ బౌలర్లు ఒత్తిడి పెంచి కివీస్‌ను కాస్త కట్టడి చేశారు. చివర్లో బ్రాస్‌వెల్ కొన్ని చక్కటి షాట్లతో జట్టుకు మంచి స్కోరు అందించాడు. పెవిలియన్‌కు ‘క్యూ’ భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఇన్నింగ్స్ రెండో బంతికే హరీస్ క్లీన్»ౌల్డ్ కాగా... గత మ్యాచ్‌లో సెంచరీతో జట్టుకు చక్కటి విజయాన్ని అందించిన హసన్ నవాజ్ రెండో ఓవర్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. బాధ్యతగా ఆడాల్సిన కెప్టెన్ సల్మాన్ కూడా కీపర్ క్యాచ్‌గా వెనుదిరగగా... ఇర్ఫాన్ ఖాన్ కాసేపు పోరాడాడు. షాదాబ్, ఖుష్దిల్ షా, అబ్బాస్ అఫ్రిది (1), షాహీన్ షా అఫ్రిది (6) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా ఒక దశలో పాకిస్తాన్ 56 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి మరింత ఘోరం పరాజయం మూటగట్టుకునేలా కనిపించినా... ఆఖర్లో సమద్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును వంద పరుగుల మైలురాయి దాటించాడు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ (4/20), ఫోల్‌్క్స (3/25) కలిసి 7 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. -
PAK Vs NZ: పాక్‌తో నాలుగో టీ20.. ఫిన్ అలెన్ ఊచకోత.. న్యూజిలాండ్ భారీ స్కోర్
మౌంట్ మాంగనూయ్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (మార్చి 23) జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్, బ్రేస్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. టాస్ ఓడి పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ సుడిగాలి ప్రారంభాన్ని అందించారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ తొలి నాలుగు ఓవర్లలో 54 పరుగులు చేసింది. 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసిన అనంతరం సీఫర్ట్ హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఖుష్దిల్ షా అద్భుతమైన క్యాచ్ పట్టి సీఫర్ట్‌ను పెవిలియన్‌కు పంపాడు.అప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉండిన అలెన్.. సీఫర్ట్ ఔట్ కాగానే జూలు విదిల్చాడు. హరీస్ రౌఫ్ మినహా ప్రతి పాక్ బౌలర్‌ను ఎడాపెడా వాయించాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అలెన్ విధ్వంసం తారా స్థాయికి చేరింది. ఈ ఓవర్లో అతను వరుసగా 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది మొత్తంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అలెన్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో ఇది ఎనిమిదో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.అలెన్ (20 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాక న్యూజిలాండ్ స్కోర్ ఒక్కసారిగా మందగించింది. 11 నుంచి 16వ ఓవర్ వరకు పాక్ బౌలర్లు అద్భుతంగా బౌల్ చేశారు. 10వ ఓవర్ తర్వాత 134 పరుగులున్న న్యూజిలాండ్ స్కోర్ 16 ఓవర్ల తర్వాత 166 పరుగులుగా మాత్రమే ఉంది. ఈ 6 ఓవర్లలో న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి కేవలం 32 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఖర్లో కెప్టెన్ బ్రేస్‌వెల్ మూగబోయిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను మేల్కొలిపాడు. బ్రేస్‌వెల్ వచ్చీ రాగానే పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17వ ఓవర్లో షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో వరుసగా సిక్సర్, బౌండరీ బాదిన బ్రేస్‌వెల్ ఆతర్వాత మరో అఫ్రిది (అబ్బాస్) వేసిన ఓవర్లోనూ అదే సీన్‌ను రిపీట్ చేశాడు. ఆ ఓవర్లో బ్రేస్‌వెల్‌తో పాటు డారిల్ మిచెల్ కూడా చెలరేగడంతో న్యూజిలాండ్‌కు 23 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో డారిల్ మిచెల్ ఔట్ కావడంతో స్కోర్ మళ్లీ నెమ్మదించింది. ఆ ఓవర్లో కేవలం 5 పరుగులే వచ్చాయి. షాహీన్ అఫ్రిది వేసిన చివరి ఓవర్లో బ్రేస్‌వెల్ మరోసారి విరుచుకుపడటంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 220 పరుగుల వద్ద ముగిసింది. 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసిన బ్రేస్‌వెల్ అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో చాప్మన్ 24, డారిల్ మిచెల్ 29, నీషమ్ 3, హే 3 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 3 వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్ 2, అబ్బాస్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న నాలుగో టీ20 ఇది. దీనికి ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తొలి రెండు న్యూజిలాండ్ గెలువగా.. మూడో టీ20లో పాక్ విజయం సాధించింది. 5 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం పాకిస్తాన్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. -
మరో విజయం సాధిస్తే...
వెల్లింగ్టన్: వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించేందుకు న్యూజిలాండ్, న్యూ కాలడోనియా జట్లు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. ఓసియానియా జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఈనెల 24న ఈ రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్లో గెలిచిన జట్టు 2026 ప్రపంచకప్ టోర్నీ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంటుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్ 7–0 గోల్స్ తేడాతో ఫిజీ జట్టుపై గెలుపొందగా... న్యూ కాలడోనియా జట్టు 3–0తో తాహితి జట్టును ఓడించింది. ఫిజీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ తరఫున క్రిస్టోఫర్ వుడ్ (6వ, 56వ, 60వ నిమిషాల్లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. సర్ప్రీత్ సింగ్ (16వ నిమిషంలో), టైలర్ గ్రాంట్ బిండన్ (23వ నిమిషంలో), టిమోతీ జాన్ పేన్ (32వ నిమిషంలో), బార్బరూసెస్ (73వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. తాహితి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో న్యూ కాలడోనియా తరఫున జార్జెస్ గోప్ ఫెనెపెజ్ (50వ, 76వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... లూయిస్ వాయా (90+1వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. న్యూజిలాండ్ జట్టు ఇప్పటికి రెండుసార్లు (1982లో, 2010లో) ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో పోటీపడింది. మరోవైపు న్యూ కాలడోనియా జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేదు. -
తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్లు.. కట్ చేస్తే టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. పాక్ ప్లేయర్ సంచలనం
పాకిస్తాన్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ సంచలన ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 21) జరిగిన టీ20లో 44 బంతుల్లోనే శతక్కొట్టి.. పొట్టి ఫార్మాట్లో పాక్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నవాజ్ అంతర్జాతీయ క్రికెట్లో తన మూడో మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. కెరీర్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఖాతా కూడా తెరవలేకపోయిన నవాజ్.. మూడో మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ చేసి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ సెంచరీతో నవాజ్ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్‌లో నవాజ్ చేసిన సెంచరీ (44 బంతుల్లో) పాక్ తరఫున టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఈ రికార్డు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (49 బంతుల్లో) పేరిట ఉండేది. తాజాగా బాబర్ రికార్డును నవాజ్ బద్దలు కొట్టాడు.టీ20ల్లో పాక్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలుహసన్ నవాజ్- 44 బంతులుబాబర్ ఆజమ్- 49బాబర్ ఆజమ్- 58అహ్మద్ షెహజాద్- 58బాబర్ ఆజమ్- 62మహ్మద్ రిజ్వాన్- 63మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ఈ మ్యాచ్‌లో మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న నవాజ్ 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నవాజ్ చేసిన ఈ స్కోర్ టీ20ల్లో పాక్ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా రికార్డైంది. టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు బాబర్ ఆజమ్ పేరిట ఉంది. 2021లో సౌతాఫ్రికాపై బాబర్ 122 పరుగులు చేశాడు. బాబర్ తర్వాత టీ20ల్లో పాక్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు అహ్మద్ షెహజాద్ పేరిట ఉంది. 2014లో షెహజాద్ బంగ్లాదేశ్‌పై 111లతో అజేయంగా నిలిచాడు.ఏడో అతి పిన్న వయస్కుడుఈ సెంచరీతో నవాజ్ టీ20ల్లో సెంచరీ చేసిన ఏడో అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. నవాజ్ 22 ఏళ్ల 212 రోజుల వయసులో సెంచరీ చేశాడు. టీ20ల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడి రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ పేరిట ఉంది. జజాయ్ 20 ఏళ్ల 337 రోజుల వయసులో శతక్కొట్టాడు.టీ20ల్లో సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కులుహజ్రతుల్లా జజాయ్- 20 ఏళ్ల 337 రోజులుయశస్వి జైస్వాల్- 21 ఏళ్ల 279 రోజులుతిలక్ వర్మ- 22 ఏళ్ల 5 రోజులుతిలక్ వర్మ- 22 ఏళ్ల 7 రోజులురహ్మానుల్లా గుర్బాజ్- 22 ఏళ్ల 31 రోజులుఅహ్మద్ షెహజాద్- 22 ఏళ్ల 127 రోజులుహసన్ నవాజ్- 22 ఏళ్ల 212 రోజులుకెరీర్లో మూడో మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన నవాజ్ టీ20ల్లో అత్యంత వేగంగా (మ్యాచ్‌ల పరంగా) సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రిచర్డ్ లెవి-రెండో మ్యాచ్ఎవిన్ లెవిస్- రెండో మ్యాచ్అభిషేక్ శర్మ- రెండో మ్యాచ్దీపక్ హూడా- మూడో మ్యాచ్హసన్ నవాజ్- మూడో మ్యాచ్టీ20ల్లో పాక్ తరఫున మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీఈ మ్యాచ్‌లో నవాజ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో పాక్ తరఫున మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. టీ20ల్లో పాక్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు షర్జీల్ ఖాన్ (24) పేరిట ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ న్యూజిలాండ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ 44 బంతుల్లోనే శతక్కొట్టి పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలో 2, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ ఓపెనర్ హసన్ నవాజ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లనే లక్ష్యాన్ని ఊదేసింది. నవాజ్‌కు మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (20 బంతుల్లో 41), కెప్టెన్ సల్మాన్ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్) సహకరించారు. ఈ గెలుపుతో పాక్ సిరీస్‌లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో టీ20 మార్చి 23న మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది. -
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
పాక్ క్రికెట్ జట్టు టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 205 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే ఊదేసి.. పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 200 పైబడిన లక్ష్యాలను ఇంత తొందరగా ఏ జట్టూ ఛేదించలేదు. గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉండేది. సౌతాఫ్రికా 2007లో వెస్టిండీస్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో ఛేదించింది. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 200 ప్లస్ లక్ష్యాలను ఛేదించిన జట్ల జాబితాలో మూడో స్థానంలో కూడా పాకిస్తానే ఉంది. 2021లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ 205 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఛేదించింది.మ్యాచ్ విషయానికొస్తే.. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ న్యూజిలాండ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో బ్రేస్‌వెల్ (18 బంతుల్లో 31), టిమ్ సీఫర్ట్ (19), డారిల్ మిచెల్ (17), ఐష్ సోధి (10) రెండంకెల స్కోర్లు చేయగా.. ఫిన్ అలెన్ 0, నీషమ్ 3, మిచెల్ హే 9, జేమీసన్ 0, డఫీ 2 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలో 2, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ ఓపెనర్ హసన్ నవాజ్ (45 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లనే లక్ష్యాన్ని ఊదేసింది. నవాజ్‌కు మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (20 బంతుల్లో 41), కెప్టెన్ సల్మాన్ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్) సహకరించడంతో పాక్ మరో 4 ఓవర్లు మిగిలుండగానే వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ కోల్పోయిన ఏకైక వికెట్ డఫీకి దక్కింది. ఈ గెలుపుతో పాక్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో టీ20 మార్చి 23న మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది. -
44 బంతుల్లో శతక్కొట్టిన పాక్ ఓపెనర్.. 9 వికెట్ల తేడాతో చిత్తైన న్యూజిలాండ్
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ యువ ఓపెనర్ హసన్ నవాజ్ 44 బంతుల్లోనే శతక్కొట్టి పాక్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. టీ20ల్లో పాక్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఈ రికార్డు బాబర్ ఆజమ్ పేరిట ఉండేది. బాబర్ 2021లో సౌతాఫ్రికాపై 49 బంతుల్లో శతక్కొట్టాడు.నవాజ్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో న్యూజిలాండ్ నిర్ధేశించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ 16 ఓవర్లలోనే ఊదేసింది. ఈ గెలుపుతో పాక్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు టీ20ల్లో ఘన విజయాలు సాధించిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావించింది. అయితే కివీస్ అశలపై హసన్ నవాజ్ నీళ్లు చల్లాడు. నవాజ్ తన కెరీర్లో మూడో మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించడం విశేషం. ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నవాజ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు.పాక్ క్రికెట్ జట్టు విషయానికొస్తే.. ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికీ తెలీదు. వరుసగా పరాజయాలతో ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఆ జట్టు.. ఒక్కసారిగా సంచలన ప్రదర్శనతో భారీ లక్ష్యాన్ని ఛేదించి ఊహించని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఇటీవలికాలంలో ఆ జట్టు ప్రదర్శన అంత దారుణంగా ఉంది మరి. నవాజ్ తన సుడిగాలి శతకంతో పాక్ క్రికెట్లో ఒక్కసారిగా హీరో అయిపోయాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.5 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో చాప్మన్ తర్వాత ఎవరూ ఆ స్థాయిలో రాణించలేదు. ఆఖర్లో కెప్టెన్ బ్రేస్‌వెల్ (18 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. టిమ్ సీఫర్ట్ (19), డారిల్ మిచెల్ (17), ఐష్ సోధి (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఫిన్ అలెన్ 0, నీషమ్ 3, మిచెల్ హే 9, జేమీసన్ 0, డఫీ 2 పరుగులకు ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది తలో 2, షాదాబ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఆది నుంచి దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్లు మహ్మద్ హరీస్ (20 బంతుల్లో 41), హసన్ నవాజ్ (45 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు సాధించారు. హరీస్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన సల్మాన్ అఘా (31 బంతుల్లో 51 నాటౌట్) కూడా దూకుడుగా ఆడాడు. ఫలితంగా పాక్ మరో 4 ఓవర్లు మిగిలుండగానే వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. పాక్ కోల్పోయిన ఏకైక వికెట్ డఫీకి దక్కింది. ఈ సిరీస్‌లో నాలుగో టీ20 మార్చి 23న మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది. -
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా..
న్యూజిలాండ్ మహిళలతో మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. కివీస్ నిర్ధేశించిన 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ అమ్మాయిలు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.3 ఓవర్లలోనే ఛేదించారు.లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ విధ్వంసం సృష్టించింది. కేవలం 42 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు మరో ఓపెనర్ జార్జియా వాల్(31 బంతుల్లో 9 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో మెరిసింది. న్యూజిలాండ్ బౌలర్లలో తహుహు రెండు వికెట్లు సాధించగా.. మిగితా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. వైట్‌ఫెర్న్స్ బ్యాటర్లలో అమీలియా కేర్(51 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సోఫీ డివైన్(39) పర్వాలేదన్పించారు. ఆసీస్ బౌలర్లలో బ్రౌన్, మెక్‌గ్రాత్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 23న మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరగనుంది. ఆసీస్‌తో సిరీస్ కంటే ముందు శ్రీలంకతో జరిగిన వైట్‌బాల్ సిరీస్‌లను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది.చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! పంత్ టీమ్‌లోకి ఎంట్రీ? -
Video: అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ బ్యాటర్.. సిక్సర్ల వర్షం
డునెడిన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో టీ20లో పాక్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు సహా 26 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అఫ్రిది పలు చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. టీ20ల్లో ఓ ఓవర్లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న పాక్ బౌలర్‌గా మొహమ్మద్ సమీ, ఫహీమ్ అష్రాఫ్ పేరిట ఉన్న చెత్త రికార్డును సమం చేశాడు. సమీ 2010లో ఆస్ట్రేలియాతో.. ఫహీమ్ 2021లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓ ఓవర్లో నాలుగు సిక్సర్లు సమర్పించుకున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది కూడా 4 సిక్సర్లు సమర్పించుకొని సమీ, ఫహీమ్ రికార్డును సమం చేశాడు. అఫ్రిది బౌలింగ్‌ను సీఫర్ట్ ఊచకోత కోసిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Seifert has 7 letters, so does Maximum 🤌Tim Seifert took Shaheen Afridi to the cleaners in his second over, smashing four sixes in it 🤯#NZvPAK pic.twitter.com/F5nFqmo7G6— FanCode (@FanCode) March 18, 2025ఒకే ఓవర్లో 26 పరుగులు సమర్పించుకోవడంతో అఫ్రిది మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. తన టీ20 కెరీర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఓవర్‌గా ఇది రికార్డుల్లోకెక్కింది. గతంలో అఫ్రిది టీ20ల్లో ఓ ఓవర్లో రెండు సార్లు (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌పై) 24 పరుగులు సమర్పించుకున్నాడు. అఫ్రిది ఈ చెత్త రికార్డులు నమోదు చేయడానికి న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్ కారకుడు. అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో సీఫర్ట్ శివాలెత్తిపోయి నాలుగు సిక్సర్లు బాదాడు. ఓ డబుల్ తీశాడు.ఈ మ్యాచ్‌లో సీఫర్ట్ మొత్తంగా 5 సిక్సర్లు, 3 బౌండరీలు బాది 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. సీఫర్ట్‌కు ముందు మొహమ్మద్ అలీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో న్యూజిలాండ్ మరో ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా చెలరేగాడు. ఈ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. సీఫర్ట్ ఔటయ్యాక కూడా చెలరేగిన అలెన్ 16 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 38 పరుగులు చేశాడు. సీఫర్ట్, అలెన్ విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ తొలి 7 ఓవర్లలో ఏకంగా 88 పరుగులు సాధించింది.వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ అఘా టాప్ స్కోరర్‌గా నిలువగా.. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22 నాటౌట్), మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్ (11), అబ్దుల్ సమద్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో హసన్ నవాజ్ (0), ఖుష్దిల్ షా (2), జహన్దాద్ ఖాన్ (0), హరీస్ రౌఫ్ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ చెలరేగిపోయారు. ఫలితంగా న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సీఫర్ట్, అలెన్ ఔటయ్యాక తడబడిన న్యూజిలాండ్ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్ చాప్మన్ (1), డారిల్ మిచెల్ (15), జిమ్మీ నీషమ్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ దశలో మిచెల్ హే (21 నాటౌట్), కెప్టెన్ బ్రేస్‌వెల్ (5 నాటౌట్) సహకారంతో న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, మొహమ్మద్ అలీ, ఖుష్దిల్ షా, జహన్దాద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్ సిరీస్‌ను కోల్పోతుంది. -
న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ చిత్తైన పాకిస్తాన్
5 టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న పాక్ క్రికెట్ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 18) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పాక్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన కెప్టెన్ సల్మాన్ అఘా టాప్ స్కోరర్‌గా నిలువగా.. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22 నాటౌట్), మహ్మద్ హరీస్ (11), ఇర్ఫాన్ ఖాన్ (11), అబ్దుల్ సమద్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ ఇన్నింగ్స్‌లో హసన్ నవాజ్ (0), ఖుష్దిల్ షా (2), జహన్దాద్ ఖాన్ (0), హరీస్ రౌఫ్ (1) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేకబ్ డఫీ, బెన్ సియర్స్, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి తలో రెండు వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (22 బంతుల్లో 45), ఫిన్ అలెన్ (16 బంతుల్లో 32) చెలరేగిపోయారు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును తాకింది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో టిమ్ సీఫర్ట్ శివాలెత్తిపోయాడు. ఈ ఓవర్లో సీఫర్ట్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు. అంతకుముందు మొహమ్మద్ అలీ వేసిన రెండో ఓవర్లో ఫిన్ అలెన్ కూడా చెలరేగాడు. ఈ ఓవర్లో అలెన్ మూడు సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా మ్యాచ్ 10 ఓవర్లలోనే ముగిస్తుందని అంతా అనుకున్నారు. అయితే పాక్ బౌలర్లు ఒక్కసారిగా ఫామ్‌లోకి రావడంతో న్యూజిలాండ్ 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. మార్క్ చాప్మన్ (1), డారిల్ మిచెల్ (15), జిమ్మీ నీషమ్ (5) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. మిచెల్ హే (21 నాటౌట్), కెప్టెన్ బ్రేస్‌వెల్ (5 నాటౌట్) న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ 13.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, మొహమ్మద్ అలీ, ఖుష్దిల్ షా, జహన్దాద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా మార్చి 21న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే పాక్ సిరీస్‌ను కోల్పోతుంది. -
ఖలిస్తానీ శక్తుల భరతం పట్టండి
న్యూఢిల్లీ: ద్వీపదేశమైన న్యూజిలాండ్‌లో ఖలిస్తానీ శక్తుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతుండడం, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆయా శక్తులను కఠినంగా అణచివేయాలని న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్‌కు విజ్ఞప్తి చేశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు న్యూజిలాండ్‌ను అడ్డాగా మారనివ్వకూడదని కోరారు. మోదీ, లక్సన్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్–న్యూజిలాండ్ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. 2019లో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడులు, 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు సారూప్యం ఉందని మోదీ గుర్తుచేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాద దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రాడికల్ శక్తులపై పోరాడే విషయంలో భారత్, న్యూజిలాండ్ మధ్య సహకారం కొనసాగుతుందని స్పష్టంచేశారు. రక్షణ పరిశ్రమ రంగంలో సహకారానికి రోడ్‌మ్యాప్ భారత్, న్యూజిలాండ్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై చర్చలు ప్రారంభం కావడాన్ని మోదీ, లక్సన్ స్వాగతించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే భారత్, న్యూజిలాండ్ మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించారు. ఇండో–పసిఫిక్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాత్మక వైఖరిపై తాము చర్చించామని లక్సన్ వివరించారు. మోదీ, లక్సన్ భేటీ సందర్భంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆరు కీలక ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాల నడుమ రక్షణ సంబంధాలను వ్యవస్థీకృతంగా మార్చడం, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి ఇరు పక్షాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ పరిశ్రమ రంగంలో సహకారం కోసం ఒక రోడ్‌మ్యాప్ రూపొందించాలని ఇరు దేశాలు నిర్ణయానికొచ్చాయి. విస్తరణవాదం వద్దు.. అభివృద్ధే కావాలి స్వేచ్ఛాయుత, భద్రతతో కూడిన, సౌభాగ్యవంతమైన ఇండో–పసిఫిక్‌కు భారత్, న్యూజిలాండ్ బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇండో–పసిఫిక్‌లో అభివృద్ధిని కోరుకుంటున్నాం తప్ప విస్తరణవాదాన్ని కాదంటూ పరోక్షంగా చైనా తీరును తప్పుపట్టారు. ఇండో–పసిఫిక్ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను అందరూ గౌరవించాలని మోదీ, లక్సన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అక్రమ వలసల సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఒక దేశానికి చెందిన నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కార్మికులకు మరో దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చట్టబద్ధమైన ఏర్పాటు చేసుకోవాలని, దీనిపై చర్చలు ప్రారంభించాలని అంగీకారానికి వచ్చారు. గాజాలో శాశ్వతంగా శాంతి నెలకొనాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడించారు.అందుకే క్రికెట్ మాట ఎత్తలేదు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన చర్చల్లో క్రికెట్ అంశం ప్రస్తావనకు రాలేదని న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగానే ఆ అంశాన్ని విస్మరించానని అన్నారు. భారత్–న్యూజిలాండ్ మధ్య దౌత్య సంబంధాల దెబ్బతినకుండా అడ్డుకోవాలన్నదే తన ఆలోచన అని వివరించారు. దీంతో పక్కనే ఉన్న ప్రధాని మోదీ బిగ్గరగా నవ్వేశారు. సోమవారం భేటీ తర్వాత లక్సన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోïఫీలో భారత్ చేతిలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఓడిపో యిన సంగతి తెలిసిందే. అలాగే ఇండియాలో జరిగిన టెస్టు క్రికెట్ సిరీస్‌లో న్యూజిలాండ్ నెగ్గింది. తమ చర్చల్లో క్రికెట్ గురించి మాట్లాడనందుకు మోదీని అభినందిస్తున్నానని లక్సన్ చెప్పారు. మరోవైపు మోదీ, లక్సన్ కలిసి సోమవారం ఢిల్లీలోని చరిత్రాత్మక గురుద్వారా రకాబ్‌గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్
మహిళల క్రికెట్లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (మార్చి 16) జరిగిన టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ శ్రీలంకను 113 పరుగులకే (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు బ్రీ ఇల్లింగ్, జెస్ కెర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఫ్లోరా డెవాన్‌షైర్, బ్రూక్ హ్యలీడే చెరో వికెట్ దక్కించుకున్నారు. కెప్టెన్ సూజీ బేట్స్ (4-1-16-0) వికెట్ తీయకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో మనుడి ననయక్కార (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. చమారీ ఆటపట్టు (23), కవిశ దిల్హరి (12), నిలాక్షి డిసిల్వ (20), హర్షిత మాధవి (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విష్మి గౌతమ్ డకౌట్ కాగా.. సుగంధిక కుమార్ 1 పరుగు చేసి ఔటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. సుజీ బేట్స్ (47), బ్రూక్ హ్యాలీడే (46 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడి న్యూజిలాండ్‌ను గెలిపించారు. న్యూజిలాండ్ ప్లేయర్స్‌లో జార్జియా ప్లిమ్మర్ 4, ఎమ్మా మెక్లియాడ్ 11 పరుగులకు ఔటయ్యారు. హ్యాలీడే.. ఇజ్జీ షార్ప్‌తో (8 నాటౌట్) కలిసి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్పింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో నిలిచింది. తొలి టీ20లో శ్రీలంక న్యూజిలాండ్‌పై సంచలన విజయం సాధించింది. నిర్ణయాత్మక మూడో టీ20 మార్చి 18న డునెడిన్‌లో జరుగనుంది. కాగా, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం శ్రీలంక న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్ 2-0 తేడాతో గెలుపొందింది. -
న్యూజిలాండ్‌కు షాకిచ్చిన శ్రీలంక
పరిమత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల జట్టు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 14) జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. లంక బౌలర్లు మల్కి మదారా 3, కవిష దిల్హరి, ఇనోషి ప్రియదర్శిని తలో 2, సుగంధిక కుమారి, చమారీ ఆటపట్టు చెరో వికెట్ తీసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఎమ్మా మెక్లియోడ్ (44), కెప్టెన్ సూజీ బేట్స్ (21), జెస్ కెర్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జార్జియా ప్లిమ్మర్ 2, బ్రూక్ హ్యాలిడే 4, ఇజ్జి షార్ప్ 0, మ్యాడీ గ్రీన్ 5, పోల్లి ఇంగ్లిస్ 4, రోస్‌మేరీ మైర్ 0, ఎడెన్ కార్సన్ 7 పరుగులు చేశారు. లంక బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.అనంతరం ఓపెనర్ చమారీ ఆటపట్టు (48 బంతుల్లో 64 నాటౌట్) అజేయ అర్ద సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిలాక్షి డిసిల్వతో (12 నాటౌట్) కలిసి ఆటపట్టు లంకను విజయతీరాలకు చేర్చింది. లంక ఇన్నింగ్స్‌లో విష్మి గౌతమ్ 7, హర్షిత సమరవిక్రమ 2, కవిశ దిల్హరి 12 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 2 వికెట్లు పడగొట్టింది. ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా, ఈ పర్యటనలో శ్రీలంక ముందుగా వన్డే సిరీస్ ఆడింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండు, మూడు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ జయకేతనం ఎగురవేసింది. రెండో టీ20 క్రైస్ట్‌చర్చ్ వేదికగా మార్చి 16న జరుగనుంది. -
New Zealand: హోలీ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని
భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో నేడు హోలీ వేడుకలు(Holi celebrations) జరుగుతున్నాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ హోలీ ఆడుతూ ఆనందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో న్యూజిలాండ్ ప్రధాని ప్రజల మధ్య హోలీ ఆడుతున్న దృశ్యాన్ని చూడవచ్చు.ఈ వీడియోను న్యూజిలాండ్(New Zealand)లోని ఇస్కాన్ ఆలయం వద్ద చిత్రీకరించారు.ఇక్కడ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్(Christopher Luxon) సమక్షంలో హోలీ వేడుకలు జరిగాయి. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ఇస్కాన్ ఆలయానికి జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని జనసమూహంపై రంగులు చల్లుతూ కనిపించారు. అలాగే అక్కడున్నవారంతా ఒకరిపై ఒకరు ఎంతో ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. Prime Minister of New Zealand Christopher Luxon celebrating #Holi. pic.twitter.com/xjPbxPLeyT— The Gorilla (News & Updates) (@iGorilla19) March 12, 2025వేడుకలు జరుగుతున్న సమయంలో న్యూజిలాండ్ ప్రధాని మెడలో పూల దండ వేసుకున్నారు. అతని భుజంపైవున్న టవల్‌పై హ్యాపీ హోలీ అని రాసివుంది. కాగా హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునే హోలీ, దీపావళి అంతర్జాతీయ పండుగలుగా పరిణమిస్తున్నాయి. అమెరికా, కెనడా, మారిషస్, ఫిజి, గయానా, నేపాల్, న్యూజిలాండ్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.ఇది కూడా చదవండి: Holi: మధుర.. కోల్‌కతా.. ఢిల్లీ.. అంతా రంగులమయం -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనకు రివార్డు.. న్యూజిలాండ్ కెప్టెన్‌గా బ్రేస్‌వెల్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో అద్భుత ప్రదర్శనకు గానూ న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌కు రివార్డు లభించింది. త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బ్రేస్‌వెల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్ జాతీయ జట్టు పగ్గాలు చేపట్టడం బ్రేస్‌వెల్‌కు ఇది మొదటిసారి. గతేడాది బ్రేస్‌వెల్ ఇదే పాకిస్తాన్‌పై (పాకస్తాన్‌లో) ఓ సారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పడు న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ఈసారి కూడా పాక్‌తో జరుగబోయే సిరీస్ కోసం ఎంపిక చేసిన న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాళ్లు లేరు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన న్యూజిలాండ్ జట్టులో నుంచి కేవలం ఏడుగురు మాత్రమే ఈ సిరీస్‌కు ఎంపికయ్యారు. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ విశ్రాంతి తీసుకోవడంతో బ్రేస్‌వెల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పాక్‌తో సిరీస్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ హీరో రచిన్ రవీంద్రతో పాటు స్టార్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ కూడా ఎంపిక కాలేదు. ఈ ముగ్గురికి న్యూజిలాండ్ సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన పేసర్ లోకీ ఫెర్గూసన్ కూడా ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఫెర్గూసన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తుంది. విదేశీ లీగ్‌ల కమిట్మెంట్స్ కారణంగా గత సిరీస్‌కు దూరంగా ఉన్న టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్, జేమ్స్ నీషమ్ పాక్‌తో సిరీస్‌కు జట్టులోకి వచ్చారు. లంకతో సిరీస్‌కు దూరంగా ఉన్న వెటరన్ లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన పేసర్ బెన్ సియర్స్ ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు. వర్క్ లోడ్ కారణంగా పేసర్లు కైల్ జేమీసన్, విలియమ్ ఓరూర్కీ తొలి మూడు టీ20లకు మాత్రమే ఎంపికయ్యారు. కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల బ్రేస్‌వెల్ ఆనందం వ్యక్తం చేశాడు. జాతీయ జట్టుకు సారథ్యం వహించడం గొప్ప గౌరవమని అన్నాడు. టీ20ల్లో పాక్ బలమైన ప్రత్యర్థి అని, వారిని ఎదుర్కొనేందుకు ఆతృతగా ఉన్నాయని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడటంతో ఆటగాళ్లు కాస్త నిరుత్సాపడ్డారని.. పాక్‌తో సిరీస్ సమయానికి మామూలు స్థితికి వస్తారని పేర్కొన్నాడు. వైట్ బాల్ కెప్టెన్‌గా సాంట్నర్ లెగసీకి కొనసాగిస్తానని తెలిపాడు. కాగా, న్యూజిలాండ్‌లో పాక్ పర్యటన మార్చి 16న మొదలవుతుంది. ఈ పర్యటనలో పాక్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడుతుంది. పాకిస్తాన్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు: మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ (4,5 మ్యాచ్‌లకు), మిచ్ హే, మాట్ హెన్రీ (4,5 మ్యాచ్‌లకు), కైల్ జామిసన్ (1, 2, 3 మ్యాచ్‌లకు), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్కే (1, 2, 3 మ్యాచ్‌లకు), టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధిన్యూజిలాండ్ పర్యటనలో పాక్ షెడ్యూల్..మార్చి 16- తొలి టీ20 (క్రైస్ట్‌చర్చ్)మార్చి 18- రెండో టీ20 (డునెడిన్)మార్చి 21- మూడో టీ20 (ఆక్లాండ్)మార్చి 23- నాలుగో టీ20 (మౌంట్ మౌంగనూయ్)మార్చి 26- ఐదో టీ20 (వెల్లింగ్టన్)మార్చి 29- తొలి వన్డే (నేపియర్)ఏప్రిల్ 2- రెండో వన్డే (హ్యామిల్టన్)ఏప్రిల్ 5- మూడో వన్డే (మౌంట్ మౌంగనూయ్) -
వన్డే విజయం తెచ్చిన ఆనందం...
నవంబర్ 19, 2023... కోట్లాది మంది భారతీయుల ఆశలు మోస్తూ వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ బరిలోకి దిగిన భారత్ అనూహ్య పరాజయంతో అభిమానుల గుండెలు బద్దలయ్యాయి... జూన్ 29, 2024... టి20 ఫార్మాట్లో తమ స్థాయికి తగ్గ ఆటను కనబరుస్తూ భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకుంది...ఫ్యాన్స్‌కు కాస్త ఊరట... మార్చి 9, 2025... అంచనాలకు అనుగుణంగా ప్రతీ మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిక్యంతో భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ సాధించింది... దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఆనందం... సాక్షి క్రీడా విభాగం : సుమారు 16 నెలల వ్యవధిలో భారత జట్టు మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరింది. వాటిలో రెండింటిలో విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్ ఓటమి వేదన ఇప్పటికీ తీరనిది అయినా మిగతా రెండు విజయాలతో సాంత్వన దక్కిందనేది మాత్రం వాస్తవం. అంతర్జాతీయ క్రీడల్లో ఒక టోర్నమెంట్‌కు, మరో టోర్నమెంట్‌కు పోలిక ఉండదు. ఒక విజయానికి, మరో విజయానికి సంబంధం ఉండదు. దేని ప్రత్యేకత దానిదే. కానీ గెలుపు ఇచ్చే కిక్ మాత్రం ఎప్పుడైనా ఒకటే! ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు దానినే అనుభవిస్తున్నారు.వరల్డ్ కప్ కాకపోయినా టాప్–8 జట్ల మధ్య జరిగిన సమరంలో భారత్ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యులైన రోహిత్, కోహ్లి, జడేజా ఇప్పుడూ ఉన్నారు. 2017 ఫైనల్లో పాక్ చేతిలో ఓడిన వారిలో ఈ ముగ్గురితో పాటు హార్దిక్ పాండ్యా, షమీ కూడా ఉన్నారు. షమీ, అయ్యర్, రాహుల్, హర్షిత్ రాణా, వరుణ్, సుందర్‌లకు ఇదే తొలి ఐసీసీ టైటిల్. దాని విలువ ఏమిటో వారి ఆనందంలోనే కనిపిస్తోంది. స్పిన్నర్లే విన్నర్లు... చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించినప్పుడు ‘ఐదుగురు స్పిన్నర్లా’ అంటూ అన్ని వైపుల నుంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. పైగా అప్పటికే ఎంపిక చేసిన జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించి మరీ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. టోర్నీలో మన స్పిన్నర్ల ప్రదర్శన చూస్తే ఇది ఎంత సరైన నిర్ణయమో తేలింది. సుందర్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాకపోగా... మిగతా నలుగురు వరుణ్, కుల్దీప్, అక్షర్, జడేజా పెను ప్రభావం చూపించారు. ఈ నలుగురు కలిసి మొత్తం 26 వికెట్లు పడగొట్టారు. ఇందులో వరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కేవలం 15.11 సగటుతో అతను 9 వికెట్లు తీశాడు. లీగ్ దశలోనే కివీస్ పని పట్టిన అతను ఫైనల్లోనూ అదే ఆటను ప్రదర్శించి జట్టు విజయానికి కారణమయ్యాడు. కీలకమైన యంగ్, ఫిలిప్స్ వికెట్లు తీసిన అతను కనీసం ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం! టోర్నీకి ముందు అతను ఒకే ఒక వన్డే ఆడాడు. ‘వరుణ్ బౌలింగ్‌లో ఏదో ప్రత్యేకత ఉంది. నెట్స్‌లో కూడా అతను మాకు మామూలుగానే బౌలింగ్ చేస్తాడు. తన అసలైన ఆయుధాలను మ్యాచ్‌లోనే ప్రదర్శిస్తాడు. అలా చేస్తే చాలు’ అంటు రోహిత్ చేసిన ప్రశంస వరుణ్ విలువను చూపించింది. ఆరంభంలో కుల్దీప్ పెద్దగా ప్రభావం చూపకపోయినా... తుది పోరులో రెండు కీలక వికెట్లతో కివీస్‌ను నిలువరించాడు. జడేజా, అక్షర్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టి పడేశారు. వీరిద్దరి ఎకానమీ 4.35 మాత్రమే ఉందంటే వారు ఎంత పొదుపుగా బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన షమీ గతంలోలా అద్భుతంగా బౌలింగ్ చేయకపోయినా కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నాడు. టోర్నీలో అతను తీసిన 9 వికెట్లలో సెమీస్‌లో స్మిత్‌ను అవుట్ చేసిన క్షణం హైలైట్‌గా నిలిచింది. బుమ్రా లేని లోటును పూరిస్తూ ఈ సీనియర్ బౌలర్ తన వంతు పాత్రను పోషించాడు. బ్యాటర్లు సమష్టిగా... బ్యాటింగ్‌లో ఎప్పటిలాగే విరాట్ కోహ్లి (మొత్తం 218 పరుగులు) భారత జట్టు మూల స్థంభంగా నిలిచాడు. 1 సెంచరీ, 1 అర్ధసెంచరీతో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అతను జట్టును గెలిపించాడు. టోర్నీకి ముందు అతని బ్యాటింగ్‌పై కాస్త సందేహాలు రేగినా... వాటిని అతను పటాపంచలు చేశాడు. కోహ్లినే స్వయంగా చెప్పినట్లు ఆ్రస్టేలియా టూర్ తర్వాత తాము ఒక విజయం కోసం చూస్తున్న స్థితిలో ఈ టైటిల్ దక్కింది. మొత్తం పరుగులు చూస్తే రోహిత్ శర్మ (180) తక్కువగానే కనిపిస్తున్నా... ఓపెనర్‌గా అతను చూపించిన ప్రభావం ఎంతో ఉంది. శ్రేయస్ అయ్యర్ (243) జట్టు అత్యధిక స్కోరర్‌గా నిలవగా, గిల్ (188 పరుగులు) ఒక సెంచరీతో తాను ప్రధాన పాత్ర పోషించాడు. తనపై వస్తున్న విమర్శలకు జవాబిస్తూ కేఎల్ రాహుల్ (140 పరుగులు) మూడు మ్యాచ్‌లలో చివరి వరకు నిలిచి జట్టును గెలుపు తీరం చేర్చాడు. ఐదో స్థానంలో ప్రమోట్ అయిన అక్షర్ పటేల్ (109 పరుగులు) కూడా ఆకట్టుకున్నాడు. టాప్–6 బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ఆడటంతో ఆందోళన లేకపోయింది. ఐదు మ్యాచ్‌లలో భారత్ నాలుగు సార్లు సునాయాసంగా 232, 242, 265, 252 లక్ష్యాలను అందుకుంది. కెప్టెన్ గా రోహిత్ ముద్ర... భారత్ నుంచి ధోని మాత్రం కెపె్టన్‌గా ఒకటికి మించి ఐసీసీ టైటిల్స్ సాధించాడు. ఇప్పుడు రెండు ట్రోఫీలతో రోహిత్ శర్మ తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. మరో దాంట్లో ఫైనల్ కూడా చేర్చిన ఘనత, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్లో సారథిగా వ్యవహరించిన ఘనత కూడా అతని ఖాతాలో ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో కీలక సమయాల్లో కెప్టెన్ గా అతను జట్టును నడిపించిన తీరు హైలైట్‌గా నిలిచింది. గంభీర్‌కు ఊరట... ద్రవిడ్ నుంచి కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గంభీర్ కోచింగ్‌లో చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. శ్రీలంకపై టి20 సిరీస్, స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ లు గెలిచినా వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆ తర్వాత ఆసీస్ చేతిలో టెస్టుల్లో చిత్తయిన అవమాన భారం మాత్రమే అందరికీ గుర్తుండిపోయింది.ఇలాంటి సమయంలో వచ్చిన గెలుపు కోచ్‌గా అతనికి ఊరటనిచ్చిoదనడంలో సందేహం లేదు. ‘అంతర్జాతీయ క్రికెట్లో సంతృప్తికరమైన ఆట ఎప్పటికీ ఉండదు. ప్రతీసారి ఏదో ఒక విషయం మెరుగు పర్చుకోవాల్సిందే. అప్పుడే నిలకడగా ఫలితాలు వస్తాయి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన కోచ్ ఇప్పుడు ఫైనల్ అనంతరం చిరునవ్వులు చిందించాడు.ప్రధాని ప్రశంసలు... మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘అద్భుతమైన మ్యాచ్...అద్భుతమైన ఫలితం... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మన క్రికెట్ జట్టును చూసి గర్వపడుతున్నా. టోర్నమెంట్ ఆసాంతం వారంతా చాలా బాగా ఆడారు. అసాధారణ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన మన జట్టుకు నా అభినందనలు’ అని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. టీమిండియాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబ్రాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అభినందనలు తెలిపారు.మాజీ సీఎం జగన్ అభినందనలు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని ఆయన పేర్కొన్నారు.7 భారత్ సాధించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్స్ సంఖ్య. ఇందులో 2 వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011), 2 టి20 వరల్డ్‌కప్‌లు (2007, 2024), 3 చాంపియన్స్ ట్రోఫీలు (2022, 2013, 2025) ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 10 ఐసీసీ టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉంది.ఎవరికెంత ప్రైజ్‌మనీ అంటే? విజేత భారత్ 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 52 లక్షలు) రన్నరప్ కివీస్ 11 లక్షల 20 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 76 లక్షలు) -
మనమే చాంపియన్స్
భారత జట్టు మరోసారి తమ చాంపియన్ ఆటను ప్రదర్శించింది. తొలి మ్యాచ్ నుంచి అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చిన జట్టు అజేయంగా విజయప్రస్థానాన్ని ముగించింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సమష్టి ఆటతో ఒక్కో ప్రత్యర్థిని పడగొడుతూ వచ్చిన జట్టు తమ స్థాయికి తగ్గ విజయాన్ని అందుకుంది. ఏడాది వ్యవధిలో మరో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్‌ను సొంతం చేసుకొని ప్రపంచ క్రికెట్‌పై తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని పూర్తిగా మరచిపోయేలా కాకపోయినా... ఈ ఫార్మాట్లో మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకొని అభిమానులకు ఆనందాన్ని పంచింది. 2013లాగే ఒక్క ఓటమి కూడా లేకుండా టీమిండియా ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. ఫైనల్లో టాస్ ఓడినా న్యూజిలాండ్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేయడంతోనే భారత్‌కు గెలుపు దారులు తెరుచుకున్నాయి. మన స్పిన్ చతుష్టయాన్ని ఎదుర్కోవడంలో మళ్లీ తడబడిన కివీస్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఛేదనలో రోహిత్ శర్మ దూకుడైన ఆరంభం లక్ష్యాన్ని అందుకునేందుకు తగిన పునాది వేసింది. మధ్యలో కొద్దిసేపు కివీస్ స్పిన్నర్లూ ప్రభావం చూపడంతో 17 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో సమర్థమైన బ్యాటింగ్ లైనప్ తడబడకుండా టీమ్‌ను విజయతీరం చేర్చింది. క్రికెట్లో ‘మంచి బాలురు’వంటి న్యూజిలాండ్ టీమ్ మరోసారి ‘పోరాడి ఓడిన’ ముద్రతోనే నిరాశగా నిష్క్రమించింది.దుబాయ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ–2025ను భారత్ సొంతం చేసుకుంది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ కలిపి ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓటమి లేకుండా జట్టు టైటిల్ గెలుచుకుంది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. గతంలో భారత్ 2002, 2013లలో కూడా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెల్చుకుంది. ఫైనల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డరైల్ మిచెల్ (101 బంతుల్లో 63; 3 ఫోర్లు), మైకేల్ బ్రేస్‌వెల్ (40 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (83 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నీ మొత్తంలో 263 పరుగులు చేసి 3 వికెట్లు తీసిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు గెల్చుకున్నాడు. మిచెల్ హాఫ్ సెంచరీ... కివీస్ ఇన్నింగ్స్‌ను రచిన్ రవీంద్ర (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా మొదలు పెట్టాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను షమీ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్ స్పిన్నర్ వరుణ్‌ను బౌలింగ్‌కు దింపింది. విల్ యంగ్ (23 బంతుల్లో 15; 2 ఫోర్లు)ను అవుట్ చేసి అతను ఓపెనింగ్ జోడీని విడదీశాడు. 10 ఓవర్లలో కివీస్ స్కోరు 69 పరుగులకు చేరింది. తన తొలి బంతికే రచిన్‌ను బౌల్డ్ చేసిన కుల్దీప్, తన రెండో ఓవర్లో విలియమ్సన్ (14 బంతుల్లో 11; 1 ఫోర్)ను పెవిలియన్ పంపించి ప్రత్య ర్థిని దెబ్బ కొట్టాడు.లాథమ్ (30 బంతుల్లో 14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడటంతో పరుగులు నెమ్మదిగా వచ్చాయి. వరుసగా 81 బంతుల పాటు బౌండరీనే రాలేదు. ఎట్టకేలకు 91 బంతుల్లో మిచెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఒక వైపు తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయినా... ఆఖర్లో బ్రేస్‌వెల్ వేగంగా ఆడటంతో జట్టు స్కోరు 250 పరుగులు దాటింది. చివరి 10 ఓవర్లలో కివీస్ 79 పరుగులు చేసింది. నలుగురు భారత స్పిన్నర్లు కలిపి 38 ఓవర్లలో 144 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా... ఇద్దరు పేసర్లు 12 ఓవర్లలో 104 పరుగులిచ్చి ఒకే వికెట్ తీయడం మన స్పిన్నర్ల ప్రభావాన్ని చూపించింది. రాణించిన అయ్యర్... ఇన్నింగ్స్ రెండో బంతికే సిక్స్‌తో మొదలు పెట్టిన రోహిత్ తన ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడుగా ఆడాడు. నాథన్ స్మిత్ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ (50 బంతుల్లో 31; 1 సిక్స్) పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాడు. 10 ఓవర్లలో స్కోరు 64 పరుగులు కాగా, 41 బంతుల్లోనే రోహిత్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఎట్టకేలకు శతక భాగస్వామ్యం తర్వాత గిల్ అవుట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆపై మరో 17 పరుగుల తేడాతో రెండు కీలక వికెట్లు తీసి కివీస్ పైచేయి సాధించింది. బ్రేస్‌వెల్ తొలి బంతికి కోహ్లి (1) వికెట్ల ముందు దొరికిపోగా, రోహిత్ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. ఈ దశలో అయ్యర్, అక్షర్ పటేల్ (40 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి చక్కటి సమన్వయంతో జాగ్రత్తగా ఆడుతూ మళ్లీ ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలో వెనక్కి పంపడంతో కివీస్ బృందంలో ఆశలు రేగాయి. అయితే కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ముందుండి నడిపిస్తూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. 68 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన రాహుల్‌కు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) సహకరించాడు. 49వ ఓవర్ చివరి బంతిని జడేజా (6 బంతుల్లో 9 నాటౌట్; 1 ఫోర్) డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా ఫోర్ కొట్టడంతో భారత్ విజయాన్ని పూర్తి చేసుకుంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (ఎల్బీ) (బి) వరుణ్ 15; రచిన్ (బి) కుల్దీప్ 37; విలియమ్సన్ (సి అండ్ బి) కుల్దీప్ 11; మిచెల్ (సి) రోహిత్ (బి) షమీ 63; లాథమ్ (ఎల్బీ) (బి) జడేజా 14; ఫిలిప్స్ (బి) వరుణ్ 34; బ్రేస్‌వెల్ (నాటౌట్) 53; సాంట్నర్ (రనౌట్) 8; స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–57, 2–69, 3–75, 4–108, 5–165, 6–211, 7–239. బౌలింగ్: షమీ 9–0–74–1, పాండ్యా 3–0–30–0, వరుణ్ చక్రవర్తి 10–0–45–2, కుల్దీప్ యాదవ్ 10–0–40–2, అక్షర్ పటేల్ 8–0–29–0, రవీంద్ర జడేజా 10–0–30–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (స్టంప్డ్) లాథమ్ (బి) రచిన్ 76; శుబ్‌మన్ గిల్ (సి) ఫిలిప్స్ (బి) సాంట్నర్ 31; కోహ్లి (ఎల్బీ) (బి) బ్రేస్‌వెల్ 1; శ్రేయస్ అయ్యర్ (సి) రచిన్ (బి) సాంట్నర్ 48; అక్షర్ పటేల్ (సి) రూర్కే (బి) బ్రేస్‌వెల్ 29; కేఎల్ రాహుల్ (నాటౌట్) 34; హార్దిక్ పాండ్యా (సి అండ్ బి) జేమీసన్ 18; జడేజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–105, 2–106, 3–122, 4–183, 5–203, 6–241. బౌలింగ్: జేమీసన్ 5–0–24–1, రూర్కే 7–0–56–0, స్మిత్ 2–0–22–0, సాంట్నర్ 10–0–46–2, రచిన్ 10–1–47–1, బ్రేస్‌వెల్ 10–1–28–2, ఫిలిప్స్ 5–0–31–0. ఫిలిప్స్ అసాధారణంఫీల్డింగ్ అత్యుత్తమ ప్రమాణాలు చూపిస్తూ తన స్థాయిని పెంచుకున్న ఫిలిప్స్ ఆదివారం మరోసారి దానిని ప్రదర్శించాడు. షార్ట్ కవర్ వైపు గిల్ షాట్ ఆడగా అసాధారణంగా గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో ఫిలిప్స్ అందుకోవడం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఈ టోర్నీలో అతను ఇప్పటికే కోహ్లి, రిజ్వాన్ క్యాచ్‌లను కూడా ఇదే తరహాలో అందుకున్నాడు. క్యాచ్‌లు వదిలేశారు...భారత జట్టు ఫీల్డింగ్‌లో పలు అవకాశాలు చేజార్చింది. కష్టసాధ్యమే అయినా ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేసింది. అయితే లైఫ్ లభించిన ఆటగాళ్లెవరూ దానిని పెద్దగా సది్వనియోగం చేసుకోలేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. రచిన్ రవీంద్ర స్కోరు 29 వద్ద ఉన్నప్పుడు రెండుసార్లు బతికిపోయాడు. షమీ రిటర్న్ క్యాచ్ వదిలేయగా, అయ్యర్ మరో క్యాచ్ వదిలేశాడు. మిచెల్ స్కోరు 38 వద్ద రోహిత్ క్యాచ్ వదిలేయగా, ఫిలిప్స్ స్కోరు 27 వద్ద గిల్ క్యాచ్ వదిలేసి అవకాశమిచ్చాడు. ఆ తర్వాత కివీస్ కూడా గ్రౌండ్ ఫీల్డింగ్ అద్భుతంగా చేసినా... రెండు క్యాచ్‌లు వదిలేసింది. గిల్ 1 పరుగు వద్ద మిచెల్ క్యాచ్ వదిలేయగా, అయ్యర్ 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు జేమీసన్ అతి సులువైన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. 12 రోహిత్ శర్మ వరుసగా 12వసారి టాస్ ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (12) రికార్డును సమం చేశాడు. అయితే మ్యాచ్‌లు గెలుస్తూ ఐసీసీ టైటిల్ సాధించిన వేళ ఇలాంటి టాస్‌లు ఎన్ని ఓడిపోయినా రోహిత్‌కు లెక్క లేదు! ‘నేను రిటైర్ కావడం లేదు’ చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్ మానసికంగా దృఢంగా ఉంటాడు. సరైన షాట్లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్‌ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్‌పై అలాంటి బౌలర్ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు నన్ను కోచ్ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్‌నుంచి రిటైర్ కావడం లేదు. ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను –రోహిత్, భారత కెప్టెన్ గొప్పగా అనిపిస్తోంది. ఆ్రస్టేలియాతో సిరీస్ తర్వాత సరైన రీతిలో పునరాగమనం చేయాలని భావించాం. కుర్రాళ్ళతో కలిసి ఆడటం ఎంతో బాగుంది. వారు సరైన సమయంలో స్పందిస్తూ జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. ఇన్నేళ్లుగా ఆడుతున్న తర్వాత ఒత్తిడి కొత్త కాదు. టైటిల్ గెలవాలంటే ఆటగాళ్లంతా రాణించాల్సి ఉంటుంది. అందరూ సమష్టిగా సత్తా చాటడంతోనే ఇది సాధ్యమైంది. సరైన, తగిన సమయం సమయం చూసి తప్పుకోవడం ముఖ్యం (రిటైర్మెంట్పై). –విరాట్ కోహ్లి -
CT 2025 Final: నాలుగు క్యాచ్‌లు జారవిడిచిన టీమిండియా ఫీల్డర్లు.. మూల్యం తప్పదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో ఇవాళ (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో న్యూజిలాండ్ 196 పరుగులకు (44 ఓవర్లలో) సగం వికెట్లు కోల్పోయింది. డారిల్ మిచెల్ (51), మైఖేల్ బ్రేస్‌వెల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ దక్కించుకున్నాడు. వరుణ్, కుల్దీప్ న్యూజిలాండ్ ఆటగాళ్లు భాగస్వామ్యాలు నెలకొల్పుతున్న సమయంలో వికెట్లు తీసి భారత్‌ను తిరిగి ఆటలోకి తెచ్చారు. భారత్‌కు తొలి ఫలితం వరుణ్ చక్రవర్తి అందించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి వరుణ్ విల్ యంగ్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం కుల్దీప్ తన మొదటి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను (37) క్లీన్ బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే కుల్దీప్ మరో అద్భుత బంతితో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను (11) క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. మిచెల్, లాథమ్ క్రీజ్‌లో కుదురుకుంటుండగా.. జడేజా లాథమ్‌ను (14) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిచెల్‌తో కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్‌ను (34) వరుణ్ చక్రవర్తి మరో అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. 40 ఓవర్లలోపే భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు డ్రాప్ చేశారు. తొలుత రచిన్ రవీంద్ర అందించిన రెండు క్యాచ్‌లను శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ నేలపాలు చేశారు. అయితే అదృష్టవశాత్తు రచిన్ ఔట్ కావడంతో భారత ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత భారత ఫీల్డర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరో రెండు క్యాచ్‌లు జారవిడిచారు. డారిల్ మిచెల్ క్యాచ్‌ను రోహిత్.. ఫిలిప్స్ క్యాచ్‌ను గిల్ వదిలేశారు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్ ఔటయ్యాడు కానీ మరో డేంజర్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడు. మిచెల్ డ్రాప్ క్యాచ్‌కు టీమిండియా మూల్యం చెల్లించకుంటుందేమో వేచి చూడాలి. -
కప్ కొట్టేది ఎవరు ?.. సర్ ప్రైజ్ ఇచ్చేది ఎవరు ?
-
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్
-
కౌన్ బనేగా ఛాంపియన్?
-
చాంపియన్ నువ్వా.. నేనా
పుష్కర కాలం క్రితం భారత జట్టు ఐదు మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధించి అజేయంగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. నాటి జట్టులో ఆడిన రోహిత్, కోహ్లి, జడేజా ప్రస్తుత టీమ్‌లోనూ భాగంగా ఉన్నారు. ఇప్పుడు కూడా టీమిండియా దాదాపు అదే తరహా ఫామ్‌తో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వచ్చింది. మరో మ్యాచ్‌లో ఇదే జోరు కొనసాగిస్తే ఏడాది వ్యవధిలో రెండో ఐసీసీ టైటిల్ భారత్ ఖాతాలో చేరుతుంది. భారత్ మూడో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో ఇప్పుడు న్యూజిలాండ్ అడ్డుగా ఉంది. లీగ్ స్థాయిల్లో ఎలా ఆడినా మన టీమ్‌పై ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో కివీస్‌దే పైచేయిగా ఉంది. పట్టుదలతో చివరి వరకు పోరాడటం, అంచనాలకు మించి రాణించడంలో ఆ జట్టుకు ఎంతో పేరుంది. వారం రోజుల క్రితం భారత్ చేతిలో ఓడినా ఆ మ్యాచ్‌తో దీనికి పోలిక లేదు. ఆ మ్యాచ్ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటూ అసలు పోరులో సత్తా చాటగలదు. గెలుపోటములతో పాటు మరో కీలకాంశం ఈ మ్యాచ్‌కు సంబంధించి చర్చకు వస్తోంది. సుదీర్ఘ కాలంగా భారత జట్టు మూల స్థంభాలుగా అద్భుత విజయాలు అందించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈమ్యాచ్‌తో తమ వన్డే కెరీర్‌ను ముగిస్తారా...టి20 వరల్డ్ కప్ తరహాలో ఘనంగా ఆటను ముగిస్తారా అనేది చూడాలి. మరో వైపు కివీస్ కూడా తమ స్టార్ విలియమ్సన్కు ఒక్క ఐసీసీ వన్డే టోర్నీతోనైనా వీడ్కోలు పలకాలని పట్టుదలగా ఉంది.దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో పలు ఆసక్తికర సమరాల తర్వాత అసలైన ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన టీమిండియా ఒక వైపు... నిలకడగా రాణించిన కివీస్ మరో వైపు తుది సమరం కోసం రంగంలో నిలిచాయి. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురు చూస్తున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో నేడు న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. 2017లో చివరిసారిగా జరిగిన ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత్ అంతకు ముందు రెండు సార్లు టైటిల్ సాధించింది. 2000లో చాంపియన్స్ ట్రోఫీని గెలిచిన కివీస్ ఖాతాలో వన్డేల్లో ఏకైక ఐసీసీ టోర్నీ ఉంది. భారత్ తమ బలమైన బ్యాటింగ్‌తో పాటు స్పిన్‌పై ఆధారపడుతుండగా...పరిస్థితులకు తగినట్లు స్పందించే తమ ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని కివీస్ నమ్ముకుంది. చివరకు ఎవరిది పైచేయి అవుతుందో ఆసక్తికరం. మార్పుల్లేకుండా... టోర్నీలో భారత్ ప్రదర్శన చూస్తే తుది జట్టులో ఎలాంటి మార్పులకు అవకాశమే లేదు. ఆటగాళ్లంతా చక్కటి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్‌గా గిల్ కీలకం కానుండగా... మిడిలార్డర్లో అయ్యర్, రాహుల్ జట్టు భారం మోస్తారు. రాహుల్ బ్యాటింగ్ దూకుడు సెమీఫైనల్లో కనిపించింది కాబట్టి అతని ఫామ్‌పై కూడా ఆందోళన పోయింది. వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో కివీస్‌పై సెంచరీ చేసినప్పటినుంచి ఆ జట్టుపై అయ్యర్ మన బెస్ట్ బ్యాటర్. వరుసగా అన్ని మ్యాచ్‌లలో అతను చెలరేగిపోయాడు. స్టార్ బ్యాటర్ కోహ్లి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో కోహ్లి నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 217 పరుగులు సాధించాడు. అతని స్థాయి ఇన్నింగ్స్ మరొకటి వస్తే చాలు భారత్‌కు తిరుగుండదు. అన్ని ఫార్మాట్లలో కలిపి తాను ఆడిన ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో 10 ఇన్నింగ్స్‌లలో కోహ్లి 3 అర్ధసెంచరీలు చేశాడు. దీనిని మరింత మెరుగుపర్చుకునే అవకాశం అతని ముందుంది.అయితే ఇప్పుడు భారత జట్టుకు సంబంధించి రోహిత్ బ్యాటింగే కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌లలో అతను విఫలమయ్యాడు. దూకుడుగా 20–30 పరుగులు చేసి పవర్‌ప్లేలోనే నిష్క్రమిస్తుండటం జట్టుకు ఇబ్బందిగా మారుతోంది. దీనిని అధిగమించి రోహిత్ భారీ స్కోరు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 10 ఐసీసీ టోర్నీ ఫైనల్ ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు! ఇప్పుడు తన స్థాయిని చూపించేందుకు ఇది సరైన వేదిక. మరో వైపు భారత స్పిన్నర్లు ప్రత్యర్థిపై చెలరేగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. లీగ్ దశలో ఐదు వికెట్లతో కివీస్‌ను దెబ్బ తీసిన వరుణ్ చక్రవర్తి జట్టు ప్రధానాస్త్రం కాగా, లెఫ్టార్మ్ మణికట్టు బౌలర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించగలడు. జడేజా, అక్షర్ కూడా రాణిస్తే కివీస్‌కు కష్టాలు ఖాయం. మన నలుగురు స్పిన్నర్లు కలిపి టోర్నీలో 21 వికెట్లు తీశారు. పేస్‌తో షమీ ఆకట్టుకోగా, పాండ్యా కూడా అండగా నిలుస్తున్నాడు. హెన్రీ ఆడతాడా! లీగ్ దశలో భారత్ చేతిలో ఓడినా న్యూజిలాండ్‌పై ఆ మ్యాచ్ ఫలితం పెద్దగా పడలేదు. ఆ మ్యాచ్లోజరిగిన లోపాలను సవరించుకొని బరిలోకి దిగుతున్నామని టీమ్ మేనేజ్మెంట్ ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తోంది. టీమ్ బ్యాటింగ్ విషయంలో కివీస్ బలంగా కనిపిస్తోంది. రచిన్ రవీంద్ర సెంచరీలతో చెలరేగిపోతుండగా... విలియమ్సన్ కూడా అదే స్థాయి ఆటను ప్రదర్శించాడు. ఐదు ఐసీసీ టోర్నీ ఫైనల్స్ ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ ఒకే ఒక అర్ధ సెంచరీ చేసినా... అతను ఈ టోర్నీలో రాణిస్తున్న తీరు జట్టుకు అదనపు బలంగా మారింది. యంగ్, మిచెల్ కూడా ఆకట్టుకోగా... ఫిలిప్స్ తన ఫీల్డింగ్‌తో హైలైట్‌గా నిలిచాడు. ధాటిగా ఆడగల సత్తా ఉన్న ఫిలిప్స్ కూడా చెలరేగితే కివీస్ కూడా భారీ స్కోరు సాధించగలేదు. జట్టు స్పిన్ కూడా మెరుగ్గానే ఉంది. కెప్టెన్ సాంట్నర్, బ్రేస్వెల్లతో పాటు ఫిలిప్స్ కూడా బంతిని బాగా టర్న్ చేయగల సమర్థుడు. పేసర్లు జేమీసన్, రూర్కేలు కీలకం కానుండగా అసలు మ్యాచ్‌కు ముందు హెన్రీ గాయం ఆందోళన రేపుతోంది. భారత్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన హెన్రీ జట్టు ప్రధానాయుధం. అతను కోలుకొని బరిలోకి దిగితే కివీస్‌కు ఊరట. పిచ్, వాతావరణం ఫైనల్‌కు కూడా నెమ్మదైన పిచ్ అందుబాటులో ఉంది. ఆట సాగుతున్న కొద్దీ స్పిన్నర్ల ప్రభావం పెరుగుతుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్ష సూచన లేదు. వన్డే టోర్నీ గెలిపిస్తాడా! భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును నాలుగు ఐసీసీ ఈవెంట్లలోనూ ఫైనల్ చేర్చాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆఖరి పోరుకు అర్హత సాధించింది. ఇందులో రెండు ఫైనల్స్‌లో పరాజయం పాలైన జట్టు టి20ల్లో విశ్వవిజేతగా నిలిచింది.ఇప్పుడు ధోని తర్వాత రెండు ఐసీసీ టైటిల్స్ సాధించిన భారత సారథిగా నిలిచేందుకు అతను అడుగు దూరంలో ఉన్నాడు. దీనిని అతను అందుకుంటాడా అనేది నేడు జరిగే ఫైనల్ పోరులో తేలుతుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ తన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి మ్యాచా! కోహ్లి, రోహిత్‌ల భవిష్యత్తు ఈ మ్యాచ్‌తో తేలుతుందని అంతటా చర్చ వినిపిస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జట్టును సిద్ధం చేసేందుకు వీరు తప్పుకుంటారని అనుకుంటున్నా దీనిపై ఇప్పుడు స్పష్టత రాకపోవచ్చు. నిజానికి వీరి స్థాయి, ఆటను బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు తప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కోహ్లి అయితే చెలరేగిపోతున్నాడు. అతని ఫిట్‌నెస్‌కు కూడా ఢోకా లేదు. అయితే స్టీవ్ స్మిత్ తరహాలోనే తానే స్వయంగా దూరమవుతాడా అనేది చెప్పలేం. మరో వైపు రోహిత్‌పైనే అందరి దృష్టీ ఉంది. ఇప్పటికి టి20లనుంచి తప్పుకున్న రోహిత్ సిడ్నీ టెస్టుకు దూరమైన దానిపై కూడా సందేహాలు రేపాడు. ఇక మిగిలిన ఫార్మాట్ వన్డేలు మాత్రమే. అయితే నిజంగా కొనసాగే ఆలోచన లేకపోయినా ఈ మ్యాచ్ ముగియగానే అధికారికంగా రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన రాకపోవచ్చని వినిపిస్తోంది. భారీగా బెట్టింగ్‌లు... ఫైనల్‌పై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఈ మొత్తం సుమారు రూ.5 వేల కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. దీని వెనక పెద్ద మాఫియా సామ్రాజ్యం కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌పై పెద్ద స్థాయిలో బెట్టింగ్‌లు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 2000భారత్, న్యూజిలాండ్ మధ్యే 2000 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 4 వికెట్ల తేడాతో నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్, షమీ, కుల్దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), యంగ్, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్, రూర్కే, హెన్రీ/ డఫీ. -
CT 2025 Final: వరుణ్ మిస్టరీ కోడ్‌ను కివీస్ బ్యాటర్లు ఛేదించగలరా..?
భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లో జరుగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను రెండు సమవుజ్జీలైన జట్ల మధ్య జరిగే టైటిల్ పోరుగా అభివర్ణించవచ్చు. బ్యాటింగ్ పరంగా చూస్తే భారత్, న్యూజిలాండ్ రెండు జట్ల బ్యాట్స్‌మన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. భారత్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో మినహా న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఎక్కడా తడబడినట్టు కానీ, తక్కువ స్థాయిలో ఆడుతున్నట్టు కానీ కనిపించలేదు. న్యూజిలాండ్ ను ఈ మ్యాచ్ లో నిలువరించి ఘనత భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి దక్కుతుంది.తొలి పోరులో వరుణ్ దే పైచేయిగత ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి కివీస్ బ్యాట్స్‌మన్‌ని తన వైవిధ్యమైన బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టాడు. అంటే న్యూ జిలాండ్ బ్యాట్స్‌మన్ కి స్పిన్నర్లను ఆడటం తెలియక కాదు. వారి జట్టులోనూ అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్నర్లపై ఆధిపత్యం సాధించే అద్భుతమైన బ్యాట్స్‌మన్ కూడా ఉన్నారు. కానీ వరుణ్ మాత్రం విభిన్నమైన స్పిన్నర్. అతని బౌలింగ్ యాక్షన్ బట్టి అతని ఎలాంటి బంతి వేస్తాడో అంచనా వేయడం కష్టం.అదే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ కి పెద్ద అవరోధంగా కనిపిస్తోంది. అందుకే ఆ మ్యాచ్ లో వరుణ్ మిస్టరీ కోడ్‌ను అర్థం చేసుకోవడానికి కివీస్ బ్యాటర్లు నానా తిప్పలు పడ్డారు. ఈ మ్యాచ్ లో వరుణ్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ మరియు మిచెల్ సాంట్నర్ వంటి కీలక వికెట్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై కూడా వరుణ్ మంచి వైవిధ్యం తో బౌలింగ్ చేసాడు. ఎప్పడూ భారత్ జట్టుకి ప్రధాన అడ్డంకి గా నిలిచే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను తన తొలి బంతితోనే బోల్తా కొట్టించాడు. వరుణ్ ఫామ్ ఫైనల్‌కి ముందు భారత్‌కు అదనపు బలాన్నిస్తునడంలో సందేహం లేదు.వరుణ్ గురించి హెచ్చరించిన కివీస్ కోచ్ అందుకే మ్యాచ్ కి ముందే న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ తమ బ్యాట్సమన్లని వరుణ్ నుంచి ఎదురయ్యే సవాలుకి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. గత మ్యాచ్ లో మా జట్టు పై 5/42 గణాంకాలతో పైచేయి సాధించిన వరుణ్ ఫైనల్లో ఆడతాడని కచ్చితంగా చెప్పగలను. వరుణ్ ఒక క్లాస్ బౌలర్. గత మ్యాచ్ లో మాకు తన నైపుణ్యం మేమిటో రుచి చూపించాడు. ఫైనల్లో వరుణ్ మాకు పెద్ద ముప్పుగా భావిస్తున్నాం. ఈ విషయం (వరుణ్ మా ప్రధాన అడ్డంకి అని ) ముందే తెలిసింది కాబట్టి అతన్ని ఎలా ఎదుర్కోగలం. ఎలా పరుగులు సాధించగలము అనే దాని పై అంచనాలు వేస్తున్నామని స్టీడ్ అన్నాడు.హెన్రీ ఆడతాడా?న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ సందర్భంగా కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయపడ్డాడు. ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేసే ప్రయత్నంలో డైవింగ్ క్యాచ్ తీసుకుంటుండగా, హెన్రీ కుడి భుజంపై గాయమైంది. వెంటనే ఫిజియోలు అతనిని పరిశీలించినప్పటికీ అతను తీవ్ర అసౌకర్యంతో ఉన్నట్టు కనిపించాడు. చివరికి హెన్రీ మైదానం నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది. ఈ మ్యాచ్ లో మాట్ హెన్రీ తన 10 ఓవర్లను పూర్తి చేయలేకపోయాడు. అతను కేవలం 7 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 42 పరుగులు ఇచ్చాడు.ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. మాట్ హెన్రీ భుజం కొంచెం నొప్పిగా ఉందని.. అతను భారత్‌తో ఫైనల్ ఆడగలడో లేదో వేచి చూడాలన్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్‌మన్ ని నిలువరించడంలో హెన్రీ కీలక పాత్ర వహించాడు. ఈ మ్యాచ్ లో హెన్రీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తన అత్యుత్తమ గణాంకాలు (5/42) నమోదు చేసుకున్నాడు. ఫైనల్లో హెన్రీ ఆడకపోతే న్యూజిలాండ్‌కు పెద్ద దెబ్బ అవుతుంది. -
రేపు దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్
-
రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడితే...
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ , స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫైనల్లో భారీ ఇన్నింగ్స్ ఆడితే అది మ్యాచ్‌నే ప్రభావితం చేస్తుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ విశ్లేషించారు. ‘హిట్‌మ్యాన్’ 25, 30 పరుగులకే పరిమితం కాకుండా ఎక్కువసేపు క్రీజులో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ టోర్నీలో రోహిత్ మెరుపు ఆరంభాల కోసం ప్రతిసారి ఎదురుదాడికి దిగుతున్నాడు. కానీ ఇదే క్రమంలో వెంటనే అవుటవుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై చేసిన 41 పరుగులే రోహిత్ అత్యధిక స్కోరుగా ఉంది. దీనిపై గావస్కర్ మాట్లాడుతూ ‘ఒకవేళ రోహిత్ 25 ఓవర్లపాటు బ్యాటింగ్ చేస్తే భారత్ 180 నుంచి 200 పరుగులు సాధిస్తుంది. అప్పుడు రెండు, మూడు వికెట్లు పడినా ఇన్నింగ్స్‌కు ఏ ఇబ్బంది ఉండదు. అక్కడి నుంచి సులువుగా 350 పరుగుల మార్క్‌ను దాటేస్తుంది. ఈ విషయాన్ని భారత కెపె్టన్ గుర్తుంచుకోవాలి. ఓపెనింగ్ మెరుపులు మెరిపించి వెళ్లడం కంటే కూడా కాస్త దూకుడుగా ఆడుతూ కనీసం 25–30 ఓవర్ల పాటు క్రీజును అట్టిపెట్టుకుంటే మ్యాచ్ రూపురేఖలే మారుతాయ్. రోహిత్ ఆట ఇన్నింగ్స్‌పై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యర్థి చేతుల్లోంచి లాగేసుకోవచ్చు’ అని అన్నారు. భారత కెప్టెన్ పాక్‌పై 20, న్యూజిలాండ్‌పై 15, ఆ్రస్టేలియాపై 28 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అర్ధసెంచరీ కూడా బాదలేకపోయాడు. న్యూజిలాండ్‌కు నాసిర్ హుస్సేన్ మద్దతు చాంపియన్స్ ట్రోఫీలో భారత్ అజేయమైన జట్టే అయినప్పటికీ ఫైనల్లో ట్రోఫీ గెలిచే అర్హత న్యూజిలాండ్‌కే ఉందని ఇంగ్లండ్ మాజీ కెపె్టన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. ‘కివీ క్రికెటర్లు చోకర్లు కాదు. ఒత్తిడిలోనూ నిలబడే స్థైర్యం వారికుంది. ప్రపంచశ్రేణి ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో ఉన్నారు. అమీతుమీలో వారంతా శక్తికిమించే పోరాడతారు’ అని వివరించాడు. -
CT 2025: వరుణ్‌తోనే పెను ముప్పు: కివీస్ కోచ్
దుబాయ్: న్యూజిలాండ్ జట్టుకు ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) బెంగపట్టుకుంది. అతనితోనే పెద్ద ముప్పు అని స్వయంగా కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించారు. ఆదివారం ఇక్కడ జరిగే ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)’ టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో కోచ్ స్టెడ్ మీడియాతో మాట్లాడుతూ ‘భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వరుణ్ తిప్పేశాడు. అతని 5 వికెట్ల ప్రదర్శనే మ్యాచ్‌లో మేం కోలుకోకుండా చేసింది. అతనొక క్లాస్ బౌలర్. తన స్పిన్ నైపుణ్యంతో ఎవరికైనా ఉచ్చు బిగించగలడు. ఫైనల్లోనూ అతనే మాకు పెద్ద సమస్య. అందుకే మేం అతని బౌలింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఎలాగైనా ఫైనల్ రోజు అతని ఉచ్చులో పడకుండా బ్యాటింగ్ చేయాలనే ప్రణాళికతో బరిలోకి దిగుతాం’ అని అన్నారు. పలువురు క్రికెటర్లు దుబాయ్ అనుకూలతలపై చేస్తున్న వ్యాఖ్యల్ని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ‘టోర్నీ షెడ్యూల్, వేదికలనేవి మన చేతుల్లో ఉండవు. అందుకే దానిపై అతిగా ఆలోచించం. ఆందోళన చెందం. భారత్ అన్నీ మ్యాచ్‌లు అక్కడ ఆడి ఉండొచ్చు. అలాగే మేం కూడా అక్కడ ఓ మ్యాచ్ ఆడాం. కాబట్టి అక్కడి పరిస్థితులెంటో మాకూ బాగా తెలుసు. ఇలాంటి పెద్ద టోర్నీలో అదికూడా ఎనిమిది జట్ల నుంచి రెండు జట్లు ఫైనల్ దశకు వచ్చాక అనుకూలతలు, ప్రతికూలతలనే సాకులు వెతక్కొద్దు. టైటిల్‌కు ఒక మ్యాచ్ దూరంలో ఉన్నాం. దాని గురించే ఆలోచిస్తాం. వ్యూహాలు రచిస్తాం. మిగతా విషయాల్ని పట్టించుకోం’ అని కోచ్ వివరించారు. షెడ్యూల్ పాక్ నుంచి దుబాయ్‌కి... అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి బిజిబిజీగా ఉన్నప్పటికీ న్యూజిలాండ్ ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఎలాంటి బడలిక ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. ఫైనల్‌కు హెన్రీ దూరం! పేసర్ మ్యాట్ హెన్రీ(Matt Henry) చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడటం అనుమానంగా మారింది. భుజం నొప్పితో బాధపడుతున్న అతను ఆదివారం మ్యాచ్ సమయానికల్లా కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ గంపెడాశలు పెట్టుకుంది. 33 ఏళ్ల హెన్రీ భారత్‌పై లీగ్ మ్యాచ్‌లో 5/42 గణాంకాలు నమోదు చేయడంతోపాటు ఈ టోర్నీలో మొత్తం 10 వికెట్లు తీశాడు. తన ప్రదర్శనతో ప్రధాన బౌలర్‌గా మారిన అతను దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో గాయపడ్డాడు. ‘మ్యాచ్ సమయంలో కిందపడటంతో అతని భుజానికి స్వల్పగాయమైంది. ఇదేమంత తీవ్రమైంది కాదు. ముందుజాగ్రత్తగా స్కానింగ్ కూడా తీశాం. సానుకూల రిపోర్టు వస్తుందనే ఆశిస్తున్నాం. ఫైనల్లో అతను ఎలాగైనా ఆడాలని మేమంతా గట్టిగా కోరుకుంటున్నాం’ అని కోచ్ స్టెడ్ చెప్పారు. -
గ్రీన్ అద్భుత శతకం.. శ్రీలంకను చిత్తు చేసిన న్యూజిలాండ్
న్యూజిలాండ్, శ్రీలంక మహిళా జట్ల మధ్య ఇవాళ (మార్చి 7) వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ శ్రీలంకను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. మిడిలార్డర్ బ్యాటర్ మ్యాడీ గ్రీన్ అద్భుత సెంచరీతో (100) కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్రీన్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. జార్జియా ప్లిమ్మర్ 28, ఇసబెల్లా గేజ్ 19, జెస్ కెర్ 38, పోల్లీ ఇంగ్లిస్ 34 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ సూజీ బేట్స్ 5, ఎమ్మా మెక్లియోడ్ 6, బ్రూక్ హ్యల్లీడే 6 పరుగులకు ఔటయ్యారు. ఈ దశలో జార్జియా ప్లిమ్మర్ కొద్ది సేపు సంయమనంతో బ్యాటింగ్ చేసింది. ప్లిమ్మర్ 54 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేసి ఔటైంది. అనంతరం గ్రీన్.. గేజ్, కెర్, ఇంగ్లిస్ సహకారంతో సెంచరీ పూర్తి చేసుకుంది. గ్రీన్ సెంచరీ పూర్తి చేసుకుని ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటైంది. శ్రీలంక బౌలర్లలో చమారీ ఆటపట్టు 2 వికెట్లు పడగొట్టగా.. అచిని కులసూరియ, ఇనోషి ప్రియదర్శిని, కవిశ దిల్హరి తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 46.4 ఓవర్లలో 167 పరుగులకే చాపచుట్టేసి ఓటమిపాలైంది. కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌కు కుప్పకూల్చారు. హన్నా రోవ్ 4, బ్రీ లింగ్, ఏడెన్ కార్సన్ తలో 2, సూజీ బేట్స్ ఓ వికెట్ తీశారు. జెస్ కెర్ వికెట్ తీయకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హర్షిత సమరవిక్రమ (59) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించారు. కవిష దిల్హరి 25, నీలాక్షి డిసిల్వ 20, అనుష్క సంజీవని 13 (నాటౌట్), కుగంధిక కుమారి, కెప్టెన్ ఆటపట్టు తలో 11 పరుగులు చేశారు. మనుడి ననయక్కార, ఇనోషి ప్రియదర్శిని డకౌట్లు కాగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రీలంక న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో నేపియర్ వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. మూడో వన్డే నెల్సన్ వేదికగా మార్చి 9న జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. మార్చి 14, 16, 18 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లు క్రైస్ట్‌చర్చ్‌లో జరుగనుండగా.. మూడో టీ20 డునెడిన్‌లో జరుగనుంది. -
IND vs NZ: ‘పిచ్‌పై భారత్‌కు స్పష్టత ఉంది’
లాహోర్: చాంపియన్స్ ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికపై, ఒకే మైదానంలో ఆడుతూ, కనీసం ప్రయాణం చేసే అవసరం కూడా లేకుండా భారత్‌కు అన్ని అనుకూలతలు ఉన్నాయని వస్తున్న విమర్శల్లో మరో కీలక ఆటగాడు గొంతు కలిపాడు. టీమిండియాతో ఆదివారం జరిగే తుది పోరుకు ముందు కివీస్ టాప్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ పరోక్షంగా ఇదే విషయంపై మాట్లాడాడు. దుబాయ్‌లో పరిస్థితులపై భారత్‌కు మంచి అవగాహన ఉంది కదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘దుబాయ్‌లో ఎలాంటి వ్యూహాలు పని చేస్తాయో భారత్‌కు బాగా తెలుసు. అన్ని మ్యాచ్‌లు ఒకే చోట ఆడిన జట్టుకు అక్కడి పరిస్థితులు, పిచ్ ఎలా స్పందిస్తుందో అవగాహన ఉంటుంది కదా. కానీ షెడ్యూల్ అలా ఉంది కాబట్టి ఏమీ చేయలేం. ఇతర అంశాల ప్రభావం ఉన్నా సరే... మేం ఫైనల్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాం. లాహోర్‌లో ఆడిన వాటితో పోలిస్తే అక్కడి పరిస్థితులు భిన్నం. మేమూ ఒక మ్యాచ్ దుబాయ్‌లో ఆడాం. ఫైనల్ కోసం అందుబాటులో ఉన్న సమయాన్ని వాడుకొని సన్నద్ధమవుతాం. భారత్ చేతిలో ఓడిన గత లీగ్ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుంటాం’ అని విలియమ్సన్ అన్నాడు. మరోవైపు కివీస్ కెప్టెన్ మైకేల్ సాంట్నర్ కాస్త భిన్నంగా స్పందించాడు. విభిన్న పరిస్థితుల్లో ఆడాల్సి రావడం అంతర్జాతీయ క్రికెట్ స్వభావమని, టోర్నీ షెడ్యూల్‌ను నిర్ణయించేది తాను కాదన్న సాంట్నర్ ఫైనల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. -
టీమిండియాతో ఫైనల్.. న్యూజిలాండ్‌కు భారీ షాక్?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్(IND vs NZ) అమీతుమీ తెల్చుకోనున్నాయి. తొలి సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసి టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరింది కివీస్.అయితే ఈ తుదిపోరుకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఆ జట్టు స్టార్ పేసర్ మాట్ హెన్రీ(Matt Henry) గాయం బారిన పడ్డాడు. లహోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో హెన్రిస్ క్లాసెన్ క్యాచ్‌ను అందుకునే క్రమంలో హెన్రీ భుజానికి గాయమైంది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు.వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలో వచ్చినప్పటికి తన సెకెండ్ స్పెల్‌లో కేవలం రెండు ఓవర్లు బౌలింగ్ మాత్రమే వేశాడు. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన హెన్రీ.. 43 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే మ్యాచ్ అనంతరం హెన్రీ గాయంపై కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ సైతం కాస్త ఆందోళన వ్యక్తం చేశాడు. "హెన్రీ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి, అతడి గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలి అన్నట్లు శాంట్నర్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ హెన్రీ ఫైనల్‌కు దూరమైతే కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బే అనే చెప్పాలి.అతడు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో హెన్రీ 5 వికెట్లతో సత్తాచాటాడు. ముఖ్యంగా భారత్‌పై మంచి రికార్డు అతడికి ఉంది. భారత్‌పై 11 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీ స్పీడ్ స్టార్.. 4.48 ఎకానమీతో 21 వికెట్లు పడగొట్టాడు.చదవండి: Steve Smith: కోహ్లికి ముందే తెలుసు! -
బిగెస్ట్ ఫైట్ కోసం కోట్లాది భారత అభిమానుల ఎదురుచూపులు
-
ఫైనల్స్ లో భారత్ తో తలపడనున్న న్యూజిలాండ్
-
NZ Vs SA: దుబాయ్‌కి న్యూజిలాండ్
టోర్నీకి ముందు... మూడు దశాబ్దాల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ టోర్నీ భాగ్యం దక్కించుకున్న పాకిస్తాన్... ఎంతో మురిపెంగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలను పిలిచి కనుమరుగైన ముక్కోణపు టోర్నీతో సన్నాహక సమరంలో పాల్గొంది. ఫైనల్‌కు ముందు... టైటిల్ పోరుకుముందే పాకిస్తాన్లో ఆతిథ్యం ముగిసింది. రెండో సెమీఫైనల్‌తోనే వారి ఐసీసీ ఈవెంట్ ముచ్చట తీరింది. ఇక ఓవర్ టు దుబాయ్! పాక్ సన్నాహక టోర్నీ పెడితే ట్రోఫీ గెలిచి మరీ సన్నద్ధమైన న్యూజిలాండ్ ఇప్పుడు ఏకంగా చాంపియన్స్ ట్రోఫీపైనే కన్నేసింది. లాహోర్: చాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ గర్జించింది. ముందు బ్యాటింగ్‌లో... తర్వాత బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా జట్టును కుదేలు చేసింది. రెండు మాజీ చాంపియన్ జట్ల మధ్య బుధవారం జరిగిన సెమీఫైనల్లో 2000 టోర్నీ విజేత కివీస్ 50 పరుగుల తేడాతో 1998 చాంపియన్ దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 108; 13 ఫోర్లు, 1 సిక్స్), కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కారు. ఫిలిప్స్ (27 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ (37 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి ఓడింది. మిల్లర్ (67 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీరోచిత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్, కెపె్టన్ బవుమా (71 బంతుల్లో 56; 4 ఫోర్లు, 1 సిక్స్), డసెన్ (66 బంతుల్లో 69; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. దుబాయ్‌లో ఈ నెల 9న ఆదివారం జరిగే ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ’ ఫైనల్లో భారత్‌తో న్యూజిలాండ్ ఆడుతుంది. ఇటు రచిన్, అటు విలియమ్సన్ టాప్–4 బ్యాటర్లు ఆడితే స్కోరు ఏ రకంగా జోరందుకుంటుందో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది. మొదట ఓపెనర్లు విల్ యంగ్ (23 బంతుల్లో 21; 3 ఫోర్లు), రచిన్ రవీంద్ర 48 పరుగులతో మంచి ఆరంభమే ఇచ్చారు. యంగ్ అవుటయ్యాక వచ్చిన విలియమ్సన్తో రచిన్ సమన్వయం న్యూజిలాండ్ భారీస్కోరుకు బాట వేసింది. సఫారీలాంటి మేటి బౌలర్లపై ఇద్దరూ సులువుగా షాట్లు బాదారు. అలుపు లేకుండా పరుగులు రాబట్టారు.47 బంతుల్లో రచిన్, 61 బంతుల్లో విలియమ్సన్ ఫిఫ్టీలు చేశారు. ఇద్దరి బ్యాటింగ్ ప్రతాపంతో స్కోరుబోర్డు పరుగు పెట్టింది. 93 బంతుల్లో రచిన్ శతకం పూర్తవగా, 32వ ఓవర్లో జట్టు 200 స్కోరు చేసింది. ఎట్టకేలకు రచిన్‌ను రబడ అవుట్ చేసి రెండో వికెట్‌కు 164 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. మిచెల్ కూడా ధాటిగా పరుగులు సాధించడంతో దక్షిణాఫ్రికాకు కష్టాలు తప్పలేదు. విలియమ్సన్ 91 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని కాసేపటికి నిష్క్రమించాడు. 40 ఓవర్లలో 250 పరుగులు చేసిన న్యూజిలాండ్ చివరి 10 ఓవర్లలో 112 పరుగుల్ని చకచకా జత చేసింది. మిల్లర్ 100 నాటౌట్ ఓపెనర్ రికెల్టన్ (17) ఆరంభంలోనే అవుట్ కాగా... కెపె్టన్ బవుమా, డసెన్‌లు చక్కగా ఆడటంతో ఒకదశలో సఫారీ స్కోరు 125/1. లక్ష్యానికి సరైన దిశగా కనిపించింది. కానీ అదే స్కోరుపై బవుమా, కాసేపయ్యాక డసెన్, క్లాసెన్ (3), మార్క్రమ్ (29 బంతుల్లో 31; 3 ఫోర్లు)లు నిష్క్రమించడంతో 200 స్కోరు వద్ద ఆరో వికెట్ కోల్పోయి లక్ష్యానికి దూరమైంది. ఈ దశలో ఒకేఒక్కడు మిల్లర్ ఒంటరి పోరాటం చేశాడు. ముల్డర్ (8), యాన్సెన్ (3)ల అండలేక అతని పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించింది కానీ జట్టును గెలిపించలేకపోయింది. 46 ఓవర్లలో సఫారీ స్కోరు 259/9. అప్పటికి మిల్లర్ (47 నాటౌట్) ఫిఫ్టీ కూడా చేయలేదు. కానీ చివరి 4 ఓవర్లలో 53 పరుగులు చేస్తే ఆ పరుగులన్నీ అతనే బాదడం... 67 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (సి) మార్క్రమ్ (బి) ఇన్‌గిడి 21; రచిన్ (సి) క్లాసెన్ (బి) రబడ 108; విలియమ్సన్ (సి) ఇన్‌గిడి (బి) ముల్డర్ 102; మిచెల్ (సి) రబడ (బి) ఇన్‌గిడి 49; లాథమ్ (బి) రబడ 4; ఫిలిప్స్ (నాటౌట్) 49; బ్రేస్‌వెల్ (సి) రికెల్టన్ (బి) ఇన్‌గిడి 16; సాంట్నర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 362. వికెట్ల పతనం: 1–48, 2–212, 3–251, 4–257, 5–314, 6–360. బౌలింగ్: యాన్సెన్ 10–0–79–0, ఇన్‌గిడి 10–0–72–3, రబడ 10–1–70–2, ముల్డర్ 6–0–48–1, కేశవ్ మహరాజ్ 10–0–65–0, మార్క్రమ్ 4–0–23–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) బ్రేస్‌వెల్ (బి) హెన్రీ 17; బవుమా (సి) విలియమ్సన్ (బి) సాంట్నర్ 56; డసెన్ (బి) సాంట్నర్ 69; మార్క్రమ్ (సి అండ్ బి) రచిన్ 31; క్లాసెన్ (సి) హెన్రీ (బి) సాంట్నర్ 3; మిల్లర్ (నాటౌట్) 100; ముల్డర్ (సి) రచిన్ (బి) బ్రేస్‌వెల్ 8; యాన్సెన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫిలిప్స్ 3; కేశవ్ (సి) లాథమ్ (బి) ఫిలిప్స్ 1; రబడ (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 16; ఇన్‌గిడి (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 312. వికెట్ల పతనం: 1–20, 2–125, 3–161, 4–167, 5–189, 6–200, 7–212, 8–218, 9–256. బౌలింగ్: హెన్రీ 7–0–43–2, జేమీసన్ 7–1–57–0, రూర్కే 8–0–69–0, బ్రేస్‌వెల్ 10–0–53–1, సాంట్నర్ 10–0–43–3, రచిన్ రవీంద్ర 5–0–20–1, ఫిలిప్స్ 3–0–27–2. -
CT 2025: సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్.. ఫైనల్లో టీమిండియాతో అమీతుమీ
ఇవాళ (మార్చి 5) జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియాతో అమీతుమీకి అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (101 బంతుల్లో 108; 13 ఫోర్లు, సిక్స్), కేన్ విలియమ్సన్ (94 బంతుల్లో 102; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ 49 పరుగులతో (37 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) రాణించగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (27 బంతుల్లో 49 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, ముల్దర్ ఓ వికెట్ పడగొట్టారు.భారీ లక్ష్య ఛేదనలో తడబడిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు మాత్రమే చేయగలిగింది. బవుమా (56), డసెన్ (69) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు ఆడి మిల్లర్ మెరుపు సెంచరీ (67 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. మిల్లర్ చివరి బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు తీసి సౌతాఫ్రికా విజయావకాశాలను దెబ్బకొట్టాడు. మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ తలో 2, బ్రేస్‌వెల్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టారు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగనుంది. కాగా, తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆసీస్‌పై ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి, ఓవరాల్‌గా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో విరాట్ కోహ్లి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. చరిత్ర సృష్టించిన కేన్ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేన్ తన 370వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.48వ శతకం.. స్టీవ్ స్మిత్ రికార్డు సమంనేటి మ్యాచ్‌లో సెంచరీతో కేన్ వన్డేల్లో 15వ సెంచరీ, ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో) 48వ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక వన్డే సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఫాబ్ ఫోర్లో ఒకడైన స్టీవ్ స్మిత్ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లి (82) పేరిట ఉంది. ఓవరాల్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ (100) పేరిట ఉంది. రచిన్ రికార్డు శతకంఈ మ్యాచ్‌లో సెంచరీతో రచిన్ కూడా రికార్డుల్లోకెక్కాడు. కివీస్ తరఫున ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక శతకాలు (5) బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లో రచిన్‌కు ఇది రెండో శతకం కాగా.. అంతకుముందు భారత్‌లో జరిగిన 2023 వన్డే వరల్డ్‌కప్‌లో మూడు సెంచరీలు బాదాడు. -
SA VS NZ 2nd Semis: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు
ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదైంది. 2025 ఎడిషన్‌లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోర్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఇదే ఎడిషన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 356 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్దేశించిన 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆసీస్ ఈ రికార్డు స్కోర్ సాధించింది.ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో టాప్-5 అత్యధిక స్కోర్లు362 - న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా, 2025356 - ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్, 2025351 - ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా, 2025347 - న్యూజిలాండ్ vs USA, 2004338 - పాకిస్తాన్ vs ఇండియా, 2017331 - ఇండియా vs సౌత్ ఆఫ్రికా, 2013ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేసిన స్కోర్ ఐసీసీ వన్డే టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్‌ల్లో మూడో అత్యధిక స్కోర్‌గా (362) రికార్డైంది. ఐసీసీ వన్డే టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోర్ రికార్డు టీమిండియా పేరిట ఉంది. 2023 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 397 పరుగులు చేసింది.ఐసీసీ వన్డే టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్‌ల్లో టాప్-5 అత్యధిక స్కోర్లు397/4 - IND vs NZ, ముంబై , CWC 2023 SF393/6 - NZ vs WI, వెల్లింగ్టన్, CWC 2015 QF362/6 - NZ vs SA, లాహోర్, CT 2025 SF359/2 - AUS vs IND, జోహన్నెస్‌బర్గ్, CWC 2003 ఫైనల్338/4 - PAK vs IND, ది ఓవల్, CT 2017 ఫైనల్రచిన్, విలియమ్సన్ శతకాలుమ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 21, డారిల్ మిచెల్ 49, టామ్ లాథమ్ 4, బ్రేస్‌వెల్ 16 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (49 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2, ముల్దర్ ఓ వికెట్ తీశారు.ఛేదిస్తే చరిత్రేవన్డే క్రికెట్లో కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే నేడు కివీస్ నిర్దేశించిన టార్గెట్ (363) కంటే ఎక్కువ లక్ష్యాలు ఛేదించబడ్డాయి. ఈ రెండు సార్లు భారీ లక్ష్యాలను సౌతాఫ్రికానే ఛేదించింది. రెండు సందర్భాల్లో సౌతాఫ్రికా ప్రత్యర్థి ఆస్ట్రేలియానే కావడం విశేషం. 2006లో సౌతాఫ్రికా 435 పరుగుల లక్ష్యాన్ని విజయవంతగా ఛేదించింది. ఆతర్వాత 2016లో 372 లక్ష్యాన్ని ఊదేసింది. -
CT 2025, SA VS NZ 2nd Semis: 48వ శతకం.. స్మిత్ రికార్డును సమం చేసిన కేన్ మామ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుండగా.. తొలుత రచిన్ రవీంద్ర సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆతర్వాత కొద్ది సేపటికే కేన్ విలియమ్సన్ శతక్కొట్టాడు. వీరిద్దరూ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. సెంచరీల అనంతరం రచిన్ (108), కేన్ (102) ఇద్దరూ ఔటయ్యారు. 45 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 296/4గా ఉంది. డారిల్ మిచెల్ (48), గ్లెన్ ఫిలిప్స్ (9) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 2, ఎంగిడి, ముల్దర్ తలో వికెట్ పడగొట్టారు.48వ శతకం.. స్టీవ్ స్మిత్ రికార్డు సమంనేటి మ్యాచ్‌లో సెంచరీతో కేన్ వన్డేల్లో 15వ సెంచరీ, ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో) 48వ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక వన్డే సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఫాబ్ ఫోర్లో ఒకడైన స్టీవ్ స్మిత్ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లి (82) పేరిట ఉంది. ఓవరాల్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ (100) పేరిట ఉంది.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు (ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లు)విరాట్ కోహ్లి-82జో రూట్-53రోహిత్ శర్మ-49కేన్ విలియమ్సన్-48స్టీవ్ స్మిత్-48హ్యాట్రిక్ సెంచరీలువన్డేల్లో సౌతాఫ్రికాపై కేన్ మామకు ఇది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. ఏ జట్టుపై అయినా వన్డేల్లో హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్ విలియమ్సనే. సౌతాఫ్రికాపై వన్డేల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ కూడా విలియమ్సనే. ఐసీసీ టోర్నీల్లో (వన్డేలు) రచిన్ రవీంద్ర (5) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ కూడా విలియమ్సనే (4). 19000 పరుగుల క్లబ్లో కేన్.. తొలి న్యూజిలాండ్ ప్లేయర్ఈ ఇన్నింగ్స్‌లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేన్ విలియమ్సన్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. అంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేన్ తన 370వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.ఓవరాల్‌గా 16వ ఆటగాడుఅంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న 12వ ఆటగాడిగా కేన్ రికార్డుల్లోకెక్కాడు. కేన్‌కు ముందు సచిన్ (34357), సంగక్కర (28016), విరాట్ కోహ్లి (27598), రికీ పాంటింగ్ (27483), జయవర్దనే (25957), జాక్ కల్లిస్ (25534), రాహుల్ ద్రవిడ్ (24208), బ్రియాన్ లారా (22358), సనత్ జయసూర్య (21032), శివ్‌నరైన్ చంద్రపాల్ (20988), జో రూట్ (20724), ఇంజమామ్ ఉల్ హక్ (20580), ఏబీ డివిలియర్స్ (20014), రోహిత్ శర్మ (19624), క్రిస్ గేల్ (19593) ఈ ఘనత సాధించారు. -
CT 2025, SA VS NZ 2nd Semis: చరిత్ర సృష్టించిన కేన్ మామ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ (South Africa Vs New Zealand) జట్ల మధ్య ఇవాళ (మార్చి 5) రెండో సెమీఫైనల్ జరుగుతుంది. లాహోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 33 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోర్ 212/1గా ఉంది. విల్ యంగ్ (21) ఔట్ కాగా.. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (80) క్రీజ్‌లో ఉన్నారు. విల్ యంగ్ వికెట్ లుంగి ఎంగిడికి దక్కింది.కాగా, ఈ ఇన్నింగ్స్‌లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఓ అరుదైన మైలురాయిని తాకాడు. అంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేన్ తన 370వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం కేన్ ఖాతాలో 47 సెంచరీలు, 103 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేన్ ఒక్క వన్డేల్లోనే 164 ఇన్నింగ్స్‌ల్లో 14 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీల సాయంతో 7185 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 186 ఇన్నింగ్స్‌ల్లో 33 సెంచరీలు, 37 అర్ద సెంచరీల సాయంతో 9276 పరుగులు.. 93 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 18 హాఫ్ సెంచరీల సాయంతో 2575 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 16వ ఆటగాడుఅంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న 12వ ఆటగాడిగా కేన్ రికార్డుల్లోకెక్కాడు. కేన్‌కు ముందు సచిన్ (34357), సంగక్కర (28016), విరాట్ కోహ్లి (27598), రికీ పాంటింగ్ (27483), జయవర్దనే (25957), జాక్ కల్లిస్ (25534), రాహుల్ ద్రవిడ్ (24208), బ్రియాన్ లారా (22358), సనత్ జయసూర్య (21032), శివ్‌నరైన్ చంద్రపాల్ (20988), జో రూట్ (20724), ఇంజమామ్ ఉల్ హక్ (20580), ఏబీ డివిలియర్స్ (20014), రోహిత్ శర్మ (19624), క్రిస్ గేల్ (19593) ఈ ఘనత సాధించారు. 19000 పరుగుల మైలురాయిని తాకే క్రమంలో కేన్ డేవిడ్ వార్నర్‌ను (18995) అధిగమించాడు.అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ తర్వాత అత్యధికంగా రాస్ టేలర్ 18199 పరుగులు చేశాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ 15289 పరుగులు సాధించాడు. ప్రస్తుతం కేన్ న్యూజిలాండ్ తరఫున అత్యధిక సెంచరీలు (47) చేసిన ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన కేన్.. మూడు ఫార్మాట్లలో తనదైన ముద్ర వేసి ఈ తరం ఫాబ్ ఫోర్లో ఒకడిగా కొనసాగుతున్నాడు.కాగా, ప్రస్తుతం సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో విజేత దుబాయ్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 9న జరుగనుంది. భారత్.. తొలి సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసి వరుసగా మూడోసారి, ఓవరాల్‌గా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. -
దుబాయ్‌కు వెళ్లేదెవరో?
లాహోర్: ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్ తొలి బెర్త్‌ను ఖరారు చేసుకోగా... ఫైనల్ రెండో బెర్త్ కోసం దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు నేడు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం దుబాయ్‌లో జరిగే టైటిల్ పోరులో టీమిండియాతో ఆడుతుంది. ఐసీసీ టోర్నీల్లో దురదృష్టం వెంట పెట్టుకొని తిరిగే దక్షిణాఫ్రికా జట్టు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంటే... పాకిస్తాన్ పిచ్‌లపై ఇటీవల ముక్కోణపు సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. బలాబలాల దృష్ట్యా ఇరు జట్లు సమ ఉజ్జీలే అయినా... నాణ్యమైన స్పిన్నర్లు అందుబాటులో ఉన్న న్యూజిలాండ్‌దే పైచేయిగా కనిపిస్తోంది. ఇరు జట్లు గతంలో ఒక్కోసారి ఈ టోర్నీలో విజేతగా నిలిచాయి. 1998లో దక్షిణాఫ్రికా, 2000లో న్యూజిలాండ్ ఈ ట్రోఫీని చేజిక్కించుకున్నాయి. అయితే అప్పట్లో ఈ టోర్నీ పేరు చాంపియన్స్ ట్రోఫీ అని కాకుండా... ‘ఐసీసీ నాకౌట్ ట్రోఫీ’ అని ఉండేది. ఐసీసీ టోర్నీల్లో ‘చోకర్స్’గా ముద్ర చెరిపేసుకోవాలని తెంబా బవుమా సారథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో తుదిమెట్టుపై తడబడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న న్యూజిలాండ్ ఈసారి ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గ్రూప్ ‘బి’లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి... ఆసీస్‌తో పోరు వర్షం కారణంగా రద్దు కావడంతో దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు గ్రూప్ ‘ఎ’లో రెండు మ్యాచ్‌లు గెలిచి, ఒక దాంట్లో ఓడి 4 పాయింట్లతో కివీస్ సెమీస్‌కు చేరింది. సఫారీలకు సాధ్యమేనా? ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఐసీసీ నిర్వహిస్తున్న గత 7 ఈవెంట్లలో నాకౌట్‌కు చేరిన దక్షిణాఫ్రికా జట్టు... ఈసారి కప్పుకొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 2023 పురుషుల వన్డే ప్రపంచకప్, 2024 పురుషుల టి20 ప్రపంచకప్, 2025 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ), 2024 పురుషుల అండర్–19 వరల్డ్‌కప్, 2024 టి20 ప్రపంచకప్, 2025 మహిళల అండర్–19 ప్రపంచకప్ ఇలా.. ఈ ఏడు టోర్నీల్లో సఫారీ టీమ్ నాకౌట్ దశకు చేరింది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. డోర్జీ కూడా కోలుకున్నప్పటికీ అతడికి తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే.మార్క్రమ్, డసెన్, క్లాసెన్, మిల్లర్, రికెల్టన్ కలిసి కట్టుగా రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే సూచనలు ఉన్న నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లలో ఒకరు ఇన్నింగ్స్ ఆసాంతం నిలవాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో స్టార్ పేసర్లు కగిసో రబడ, లుంగి ఇన్‌గిడి కంటే... ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్, ముల్డర్ బాగా ప్రభావం చూపుతున్నారు. కేశవ్ మహరాజ్ స్పిన్ బౌలింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఆత్మవిశ్వాసంతో కివీస్... పాకిస్తాన్ వేదికగా ఇటీవల జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ సొంతం చేసుకున్న న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. లీగ్ దశలో భాగంగా భారత్ చేతిలో ఓడినప్పటికీ కివీస్‌ను తక్కువ అంచనా వేసేందుకు లేదు. విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిషెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్ రూపంలో న్యూజిలాండ్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ రూర్కే, హెన్రీ, జేమీసన్తో పాటు కెపె్టన్ సాంట్నర్ కీలకం కానున్నాడు.7 ఐసీసీ టోర్నీల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు జరగగా... అందులో న్యూజిలాండ్ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. నాలుగింటిలో దక్షిణాఫ్రికా గెలిచింది. -
CT 2025: ఐదేసిన వరుణ్.. న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపు అనంతరం భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది. తద్వారా సెమీస్‌లో గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాతో తలపడతుంది. మార్చి 4న ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్.. గ్రూప్-బి టాపర్ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది.రాణించిన శ్రేయస్, హార్దిక్, అక్షర్తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్-3 బ్యాటర్లు రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (2), విరాట్ కోహ్లి (11) విఫలమయ్యారు. మధ్యలో కేఎల్ రాహుల్ (23) కాసేపు నిలకడగా ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.ఐదేసిన వరుణ్250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో లక్ష్యానికి 45 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెరీర్లో రెండో వన్డే ఆడుతున్న వరుణ్ ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కుల్దీప్ 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసి భారత్ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. వీరందరూ చెలరేగడంతో భారత్ 250 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఓ పక్క క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విలియమ్సన్ విఫలయత్నం చేశాడు. అయితే అతనికి సహచరుల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 22, రచిన్ రవీంద్ర 6, డారిల్ మిచెల్ 17, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 12, బ్రేస్‌వెల్ 2, మ్యాట్ హెన్రీ 2, విలియమ్ ఓరూర్కీ 1 పరుగు చేశారు. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (28) బ్యాట్ ఝులిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
Champions Trophy 2025: న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయంన్యూజిలాండ్పై టీమిండియా 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. విలియమ్సన్కు మిగతా కివీస్ బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. భారత బౌలర్లలో వరుణ్‌తో పాటు కుల్దీప్ (2), హార్దిక్ పాండ్యా (1), అక్షర్ పటేల్ (1), రవీంద్ర జడేజా (1) వికెట్లు తీశారు.అంతకుముందు భారత్.. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ ఐదు, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. మార్చి 4న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్.. ఆస్ట్రేలయాతో తలపడనుంది. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్.. సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తివరుణ్ చక్రవర్తి తన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మ్యాట్ హెన్రీ (2) వికెట్ ఈ మ్యాచ్‌లో వరుణ్‌కు ఐదవది. విరాట్ కోహ్లి క్యాచ్ పట్టడంతో హెన్రీ ఔటయ్యాడు.సాంట్నర్ క్లీన్ బౌల్ట్.. వరుణ్ ఖాతాలో నాలుగో వికెట్న్యూజిలాండ్ ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో న్యూజిలాండ్ చివరి ఆశాకిరణం మిచెల్ సాంట్నర్ (28) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డేంజర్ మ్యాన్ విలియమ్సన్ ఔట్169 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. డేంజర్ మ్యాన్ కేన్ విలియమ్సన్ (81) ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో విలియమ్సన్ స్టంపౌటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. బ్రేస్‌వెల్ ఔట్.. వరుణ్ ఖాతాలో మూడో వికెట్159 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బ్రేస్‌వెల్ (2) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. డేంజర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్ ఔట్వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సిక్సర్ బాదిన మరుసటి బంతిరే డేంజర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఔటయ్యాడు. ఫిలిప్స్‌ను వరుణ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. 35.4 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 151/5గా ఉంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే 86 బంతుల్లో 99 పరుగులు చేయాలి. నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్133 పరుగుల వద్ద (32.2 ఓవర్లు) న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. జడేజా కీలకమైన టామ్ లాథమ్ (14) వికెట్ తీశాడు. లాథమ్ జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే మరో 117 పరుగులు చేయాలి. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విలియమ్సన్జడేజా బౌలింగ్‌లో బౌండరీతో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేన్‌కు వన్డేల్లో ఇది 47వ హాఫ్ సెంచరీ. కేన్ తన హాఫ్ సెంచరీలో 5 బౌండరీలు బాదాడు. మ్యాజిక్ చేసిన కుల్దీప్.. మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్93 పరుగుల వద్ద న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ డెలివరీతో డారిల్ మిచెల్‌ను (17) ఎల్బీడబ్ల్యూ చేశాడు. 26 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 104/3గా ఉంది. కేన్ విలియమ్సన్ 45, టామ్ లాథమ్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాంటే ఇంకా 146 పరుగులు చేయాలి. విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన వరుణ్ చక్రవర్తి49 పరుగుల వద్ద (13.3 ఓవర్లు) న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో విల్ యంగ్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేన్ విలియమ్సన్కు (19) జతగా డారిల్ మిచెల్ క్రీజ్‌లోకి వచ్చాడు. అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్.. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్250 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 17 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్ పట్టడంతో రచిన్ రవీంద్ర (6) ఔటయ్యాడు. విల్ యంగ్‌కు (10) జతగా కేన్ విలియమ్సన్ క్రీజ్‌లోకి వచ్చాడు.రాణించిన శ్రేయస్ అయ్యర్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్యా (45) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 15, శుభ్‌మన్ గిల్ 2, విరాట్ కోహ్లి 11 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (23) శ్రేయస్‌తో కలిసి కాసేపు నిలకడగా ఆడాడు.ఆఖర్లో రవీంద్ర జడేజా 16, షమీ 5 పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో మెరిశాడు. జేమీసన్, విలియమ్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదిలారు. పలు అద్భుతమైన క్యాచ్‌లు పట్టారు. గ్లెన్ ఫిలిప్స్ (కోహ్లి), కేన్ విలియమ్సన్ (జడేజా) పట్టిన క్యాచ్‌లు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి.ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్246 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (45) ఔటయ్యాడు. చివరి ఓవర్లో హార్దిక్ సింగిల్స్ తీయకుండా ఓవరాక్షన్ చేశాడు. ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా223 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్182 పరుగుల వద్ద (39.1 ఓవర్లు) భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (23) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యాకు (3) జతగా రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ ఔట్172 పరుగుల వద్ద (36.2 ఓవర్లు) టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 98 బంతుల్లో 78 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కేఎల్ రాహుల్‌కు (17) జతగా హార్దిక్ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్128 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో కుదురుకున్న అక్షర్ పటేల్ 42 పరుగుల వద్ద ఔటయ్యాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో లీడింగ్ ఎడ్జ్ తీసుకోవడంతో అక్షర్ ఔటయ్యాడు. కేన్ విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ పట్టుకుని అక్షర్‌ను పెవిలియన్‌కు పంపాడు. శ్రేయస్‌కు (51) జతగా కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన శ్రేయస్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ 75 బంతుల్లో 4 బౌండరీల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో శ్రేయస్‌కు ఇది అత్యంత నిదానమైన (బంతుల పరంగా) హాఫ్ సెంచరీ. 29 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 127/3గా ఉంది. శ్రేయస్ 51, అక్షర్ పటేల్ 42 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (మార్చి 2) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. కివీస్ పేసర్లు చెలరేగడంతో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (17) మరోసారి మంచి ఆరంభం లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. శుభ్‌మన్ గిల్ (2) ఈ టోర్నీలో తొలిసారి సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో విరాట్ కోహ్లి 11 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.కష్టాల్లో ఉన్న భారత్‌ను శ్రేయస్ అయ్యర్ (35 నాటౌట్), అక్షర్ పటేల్ (23 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఇప్పటికే 60 పరుగులు జోడించారు. 23 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 90 పరుగులుగా ఉంది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2, జేమీసన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్ ఇదివరకే సెమీస్‌కు చేరడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరాయి.తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కే -
భారత్-కివీస్ మధ్య ఫైట్
-
Champions Trophy: సెమీస్ సన్నాహకం
భారత్, న్యూజిలాండ్ వన్డేల్లో చివరిసారిగా గత వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీస్‌లో కూడా భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి విజయాలు అందుకుంది. అంతకు ముందు కివీస్‌తో వరుసగా మూడు వన్డేల్లో కూడా టీమిండియాదే పైచేయి. అయితే ఫార్మాట్లు వేరైనా ఇటీవల మన గడ్డపై టెస్టు సిరీస్‌లో ఆ జట్టు కొట్టిన దెబ్బ ఇంకా తాజాగానే ఉంది. ఇరు జట్లలో ఎక్కువ మంది ఆటగాళ్లు ఆ సిరీస్‌లో ఆడినవారే. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీలో తమ సత్తా చాటేందుకు భారత్ సిద్ధంగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ కోణంలో ఇది నామమాత్రపు మ్యాచే అయినా సెమీస్‌కు ముందు సన్నాహకంగా ఇది ఉపయోగపడనుంది. ఇరు జట్ల సెమీస్ ప్రత్యర్థి ఎవరో కూడా ఈ మ్యాచ్‌తోనే తేలనుంది. దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో గ్రూప్ ‘ఎ’నుంచి ఇప్పటికే సెమీ ఫైనల్ చేరిన భారత్, న్యూజిలాండ్ చివరి లీగ్ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాయి. ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ నెగ్గిన టీమ్‌లు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే గ్రూప్ టాపర్‌గా సెమీఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడుతుంది. ఓడితే సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది. పంత్‌కు చాన్స్! గత రెండు మ్యాచ్‌లలో ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకే పరిమితం చేసి భారత జట్టు లక్ష్యాలను సునాయాసంగా ఛేదించింది. మన ప్రదర్శనను బట్టి చూస్తే అంతా ఫామ్‌లో ఉండటంతో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అయితే అందుబాటులో ఉన్న ఇతర ఆటగాళ్లకు మ్యాచ్ అవకాశం ఇచ్చే ఆలోచనతో టీమ్ మేనేజ్మెంట్ ఉంది. వికెట్ కీపర్‌గా రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ ఆడటం దాదాపు ఖాయమైంది. కారు ప్రమాదం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత పంత్ ఇప్పటి వరకు ఒకే ఒక్క వన్డే గత ఏడాది ఆడాడు. ఈ మ్యాచ్ తర్వాత ఒకే రోజు విరామంతో సెమీఫైనల్ ఆడాల్సి ఉండటంతో ప్రధాన పేసర్ షమీకి విశ్రాంతినిచ్చే అవకాశం కూడా ఉంది. అతని స్థానంలో అర్ష్ దీప్ ఆడవచ్చు. కివీస్ టాప్–8లో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు కాబట్టి లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ స్థానంలో సుందర్ జట్టులోకి రానున్నాడు. పంత్ బరిలోకి దిగితే అక్షర్ బ్యాటింగ్ అవసరం కూడా టీమ్‌కు అంతగా ఉండకపోవచ్చు. మరో వైపు కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని కూడా ఆడిస్తే అతని వన్డే ప్రదర్శనను అంచనా వేసే అవకాశం ఉంది. బ్యాటింగ్‌పరంగా రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్‌లతో టాప్–4 పటిష్టంగా ఉండగా పాండ్యా, జడేజా అదనపు బలం. అదే జట్టుతో... న్యూజిలాండ్ కూడా అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. జట్టులో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు కూడా సత్తా చాటుతున్నారు. రచిన్, యంగ్, లాథమ్ ఇప్పటికే సెంచరీలు సాధించగా, కాన్వే కూడా ఫామ్‌లో ఉన్నాడు. సీనియర్ బ్యాటర్ విలియమ్సన్ వైఫల్యమే కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే గతంలో కీలక మ్యాచ్‌లలో భారత్‌పై రాణించిన రికార్డు ఉన్న మాజీ కెపె్టన్ తన స్థాయికి తగినట్లు ఆడితే టీమ్‌కు తిరుగుండదు. ఫిలిప్స్‌లాంటి ఆల్‌రౌండర్ జట్టుకు మరింత కీలకం. జేమీసన్, రూర్కే, హెన్సీలతో పేస్ బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. కివీస్ స్పిన్ కూడా చాలా బలంగా ఉండటం విశేషం. సాంట్నర్, బ్రేస్‌వెల్ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. ఓవరాల్‌గా కివీస్ కూడా దుర్బేధ్యంగా కనిపిస్తోంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, పంత్, పాండ్యా, జడేజా, సుందర్, రాణా, వరుణ్, అర్ష్ దీప్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్ ), కాన్వే, రచిన్, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే. పిచ్, వాతావరణం స్పిన్‌కు అనుకూలం. వర్షసూచన ఏమాత్రం లేదు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. కోహ్లి @300 భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌తో 300 వన్డేలు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ ఘనత సాధించిన 7వ భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా 22వ ఆటగాడిగా కోహ్లి నిలుస్తాడు. 299 వన్డేల కెరీర్లో కోహ్లి 58.20 సగటుతో 14,085 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు, 73 అర్ధసెంచరీలు ఉన్నాయి. కోహ్లికి ముందు భారత్ నుంచి సచిన్, ధోని, ద్రవిడ్, అజహరుద్దీన్, గంగూలీ, యువరాజ్ 300 వన్డేలు ఆడారు. -
NZ Vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఇటీవలే ముక్కోణపు వన్డే సిరీస్‌లో గాయపడిన న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర శతకంతో చెలరేగాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో 15 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన కివీస్‌ను రవీంద్ర తన అద్బుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.డెవాన్ కాన్వే, టామ్ లాథమ్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఈ క్రమంలో 95 బంతుల్లో తన నాలుగో వన్డే సెంచరీ మార్క్‌ను రవీంద్ర అందుకున్నాడు. ఓవరాల్‌గా 105 బంతులు ఎదుర్కొన్న రచిన్.. 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 112 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడి సూపర్ సెంచరీ ఫలితంగా కివీస్ లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 46.1 ఓవర్లలో అందుకుంది. దీంతో తమ సెమీస్ బెర్త్‌ను న్యూజిలాండ్ ఖారారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో శతకొట్టిన రవీంద్ర పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.రవీంద్ర సాధించిన రికార్డులు ఇవే..వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్‌గా రచిన్ రవీంద్ర రికార్డులకెక్కాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన రచిన్.. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బంగ్లాదేశ్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే శతకంతో మెరిశాడు.తద్వారా ఈ అరుదైన ఫీట్‌ను రచిన్ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు 19 మంది తమ డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీ చేయగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో 15 మంది ఆటగాళ్లు తమ ఫస్ట్ మ్యాచ్‌లోనే శతక్కొట్టారు.కానీ ఈ రెండు ఈవెంట్లలోనే అరంగేట్ర మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్ రవీంద్రే కావడం విశేషం. రవీంద్ర తన కెరీర్లో నాలుగు వన్డే సెంచరీలు నమోదు చేయగా.. ఆ నాలుగు కూడా ఐసీసీ వేదికలపైనే కావడం విశేషం. దీంతతో ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన కివీస్ బ్యాటర్‌గా కూడా రచిన్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్(3) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో విలియమ్సన్ రికార్డును రచిన్ బ్రేక్ చేశాడు.చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్‌కు భారీ షాక్.. టోర్నీ నుంచి ఔట్ -
కివీస్‌తో కలిసి సెమీస్‌కు భారత్
బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్ ఓవర్లో కవర్స్ దిశగా ఫోర్ కొట్టిన కివీస్ బ్యాటర్ బ్రేస్‌వెల్... ఈ షాట్‌తో చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సమీకరణం తేలిపోయింది. ఈ బౌండరీతో న్యూజిలాండ్, భారత్ అధికారికంగా సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య జట్టయిన పాకిస్తాన్‌తో పాటు బంగ్లాదేశ్ కథ కూడా లీగ్ దశలోనే ముగిసింది. నిష్క్రమించిన రెండు జట్లు ప్రాధాన్యత లేని పోరులో గురువారం తలపడనుండగా... సెమీస్‌కు ముందు సన్నాహకంగా ఆదివారం కివీస్‌ను భారత్ ఎదుర్కోనుంది.కివీస్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో విఫలమైన బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ తరహాలోనే పేలవ బ్యాటింగ్‌తో దాదాపు అదే స్కోరు సాధించగా... మరో 23 బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ ఛేదనను అలవోకగా పూర్తి చేసింది. విరామం లేకుండా వరుసగా 10 ఓవర్లు వేసిన ఆఫ్‌స్పిన్నర్ బ్రేస్‌వెల్ నాలుగు కీలక వికెట్లతో ప్రత్యర్థి పని పట్టగా... బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర సెంచరీ హైలైట్‌గా నిలిచాయి. గత చాంపియన్స్ ట్రోఫీలో తమను ఓడించి సెమీఫైనల్ చేరిన బంగ్లాదేశ్‌ను ఇప్పుడు కివీస్ అదే తరహాలో 5 వికెట్లతో ఓడించి సెమీస్ చేరడం విశేషం. రావల్పిండి: చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండో విజయంతో మాజీ విజేత న్యూజిలాండ్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇదే గ్రూప్‌లో రెండు విజయాలు సాధించిన భారత్ కూడా కివీస్‌తో పాటు సెమీస్ చేరింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో కివీస్ 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.కెప్టెన్ నజ్ముల్ హుసేన్ (110 బంతుల్లో 77; 9 ఫోర్లు), జాకీర్ అలీ (55 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రేస్‌వెల్ (4/26) నాలుగు వికెట్లతో బంగ్లాదేశ్‌ను దెబ్బ తీశాడు. అనంతరం న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 240 పరుగులు సాధించి గెలిచింది. రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 112; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో సత్తా చాటగా... లాథమ్ (76 బంతుల్లో 55; 3 ఫోర్లు) రాణించాడు. నజ్ముల్ అర్ధసెంచరీ... బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు తన్జీద్ (24; 1 ఫోర్, 2 సిక్స్‌లు), నజ్ముల్ ధాటిగా మొదలు పెట్టారు. తన్జీద్ రెండు సిక్స్‌లు బాదగా, జేమీసన్ ఓవర్లో నజ్ముల్ 3 ఫోర్లు కొట్టాడు. అయితే 9వ ఓవర్లోనే స్పిన్ బౌలింగ్‌ను మొదలు పెట్టిన కివీస్ ఫలితం సాధించింది. బ్రేస్‌వెల్ తొలి ఓవర్లోనే తన్జీద్ వికెట్ తీసి పతనానికి శ్రీకారం చుట్టగా... మిరాజ్ (13) మరోసారి విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత బ్రేస్‌వెల్ మళ్లీ బంగ్లాను దెబ్బ కొట్టాడు.21 పరుగుల వ్యవధిలో బంగ్లా తౌహీద్ (7), ముషి్ఫకర్ (2), మహ్మదుల్లా (4) వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లూ బ్రేస్‌వెల్ ఖాతాలోకే చేరాయి. ఈ దశలో నజ్ముల్, జాకీర్ కొద్దిసేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. 71 బంతుల్లో నజ్ముల్ అర్ధ సెంచరీ పూర్తయింది. నజ్ముల్‌ను అవుట్ చేసి రూర్కే ఈ జోడీని విడదీయగా... బంగ్లా మిగిలిన వికెట్లు కోల్పోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. బంగ్లా ఇన్నింగ్స్‌లో డాట్ బాల్స్ ఏకంగా 178 ఉన్నాయి. శతక భాగస్వామ్యం... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే యంగ్ (0) అవుట్ కాగా, కొద్ది సేపటికే కేన్ విలియమ్సన్ (5) కూడా వెనుదిరిగాడు. కాన్వే, రచిన్ కలిసి మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించిన తర్వాత కాన్వే పెవిలియన్ చేరాడు. అయితే రచిన్, లాథమ్‌ల భారీ భాగస్వామ్యం జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది. ఈ ద్వయాన్ని విడదీసేందుకు బంగ్లా బౌలర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో 95 బంతుల్లోనే రచిన్ కెరీర్లో నాలుగో సెంచరీని అందుకున్నాడు. లాథమ్ కూడా 71 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఎట్టకేలకు విజయానికి 36 పరుగుల దూరంలో రచిన్‌ను బంగ్లా అవుట్ చేయగా, కొద్ది సేపటికే లాథమ్ కూడా నిష్క్రమించాడు. అయితే ఫిలిప్స్ (21 నాటౌట్), బ్రేస్‌వెల్ (11 నాటౌట్) కలిసి మిగతా పనిని పూర్తి చేశారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తన్జీద్ (సి) విలియమ్సన్ (బి) బ్రేస్‌వెల్ 24; నజ్ముల్ (సి) బ్రేస్‌వెల్ (బి) రూర్కే 77; మిరాజ్ (సి) సాంట్నర్ (బి) రూర్కే 13; తౌహీద్ (సి) విలియమ్సన్ (బి) బ్రేస్‌వెల్ 7; ముషి్ఫకర్ (సి) రచిన్ (బి) బ్రేస్‌వెల్ 2; మహ్ముదుల్లా (సి) రూర్కే (బి) బ్రేస్‌వెల్ 4; జాకీర్ (రనౌట్) 45; రిషాద్ (సి) సాంట్నర్ (బి) హెన్రీ 26; తస్కీన్ (సి) కాన్వే (బి) జేమీసన్ 10; ముస్తఫిజుర్ (నాటౌట్) 3; నాహిద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 236.వికెట్ల పతనం: 1–45, 2–64, 3–97, 4–106, 5–118, 6–163, 7–196, 8–231, 9– 236. బౌలింగ్: హెన్రీ 9–0–57–1, జేమీసన్ 9–1– 48–1, బ్రేస్‌వెల్ 10–0–26–4, రూర్కే 10–1– 48– 2, సాంట్నర్ 10–1–44–0, ఫిలిప్స్ 2–0– 10–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (బి) తస్కీన్ 0; కాన్వే (బి) ముస్తఫిజుర్ 30; విలియమ్సన్ (సి) ముష్ఫికర్ (బి) నాహిద్ 5; రచిన్ (సి) (సబ్) పర్వేజ్ (బి) రిషాద్ 112; లాథమ్ (రనౌట్) 55; ఫిలిప్స్ (నాటౌట్) 21; బ్రేస్‌వెల్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (46.1 ఓవర్లలో 5 వికెట్లకు) 240.వికెట్ల పతనం: 1–0, 2–15, 3–72, 4–201, 5–214. బౌలింగ్: తస్కీన్ 7–2–28–1, నాహిద్ 9–0–43–1, మిరాజ్ 10–0–53–0, ముస్తఫిజుర్ 10–0–42–1, రిషాద్ 9.1–0–58–1, నజ్ముల్ 1–0–12–0. చాంపియన్స్ ట్రోఫీలో నేడుఆ్రస్టేలియా x దక్షిణాఫ్రికామధ్యాహ్నం గం. 2:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సెమీస్ లక్ష్యంగా...
రావల్పిండి: టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌ను ఓడించిన న్యూజిలాండ్ వరుస విజయాలతో సెమీఫైనల్ చేరాలని భావిస్తుంది. నేడు బంగ్లాదేశ్‌తో జరిగే పోరులో గెలిచి నాకౌట్‌కు అర్హత పొందాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. సోమవారం గ్రూప్ ‘ఎ’లో జరిగే ఈ మ్యాచ్ బంగ్లాదేశ్‌కు చావోరేవో కానుంది. భారత్ చేతిలో తొలి మ్యాచ్ ఓడిన నజు్మల్ హుస్సేన్ బృందం నెట్ రన్‌రేట్‌లోనూ మైనస్‌లోకి పడిపోయింది. ఇప్పుడు ఇదీ ఓడితే ఇంటిదారి పట్టడం మినహా ఇంకో దారే ఉండదు. అయితే పటిష్టమైన కివీస్‌ను ఓడించడం అంత సులభం కాదు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్‌లో సన్నాహకంగా జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీలో టైటిల్ సాధించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండ్ సామర్థ్యంతో పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లాంటి జట్టుపై గెలుపొందడం, సెమీఫైనల్‌కు చేరడం కివీస్‌కు కష్టమైతే కాదు. అయితే మ్యాచ్‌పై ఏ బెంగా లేని న్యూజిలాండ్ తుదిజట్టు కసరత్తుపైనే తర్జనభర్జన పడుతోంది. తలకు అయిన స్వల్పగాయం నుంచి రచిన్ రవీంద్ర కోలుకోవడంతో కివీస్‌కు డాషింగ్ ఓపెనర్ అందుబాటులో వచ్చాడు.గత మ్యాచ్‌లో కాన్వే, విల్ యంగ్ ఇన్నింగ్స్ ఆరంభించగా, ఇప్పుడు విల్ యంగ్‌ను తప్పించే అవకాశముంది. ఇదే జరిగితే లెఫ్ట్–రైట్ హ్యాండ్ ఓపెనింగ్ కాంబినేషన్ అటకెక్కుతుంది. ఫామ్‌లో ఉన్న కాన్వేతో రవీంద్ర ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్ తీవ్ర ఒత్తిడిలో మరో గట్టి ప్రత్యర్థిని ఎదుర్కొననుండటం పెద్ద సవాల్‌గా మారింది. గత మ్యాచ్‌లో భారత్‌ను బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టిన నజు్మల్ బృందం బ్యాటింగ్‌లో పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడు బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకుంటే మ్యాచ్‌లో ప్రత్యరి్థకి గట్టిపోటీ ఇచ్చే అవకాశముంటుంది. లేదంటే ఇంకో మ్యాచ్ (పాక్‌తో) ఉండగానే గ్రూప్ దశలోనే వెనుదిరగడం ఖాయమవుతుంది. -
PAK Vs NZ: పాక్‌కు పరాభవం
కరాచీ: సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగు పెట్టిన పాకిస్తాన్ జట్టు పేలవమైన ఆటను ప్రదర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన ఆ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమిని మూటగట్టుకుంది. ఐదు రోజుల క్రితం ఇదే మైదానంలో ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్‌ను మట్టికరిపించిన న్యూజిలాండ్ దానిని పునరావృతం చేసింది. అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ టోర్నీలో విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో సాంట్నర్ సారథ్యంలోని కివీస్ 60 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ లాథమ్ (104 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్ యంగ్ (113 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు. యంగ్, లాథమ్ నాలుగో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. గ్లెన్ ఫిలిప్స్ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. లాథమ్, ఫిలిప్స్ ఐదో వికెట్‌కు 12.2 ఓవర్లలోనే 125 పరుగులు జత చేశారు. చివరి 10 ఓవర్లలో కివీస్ 113 పరుగులు సాధించింది. అనంతరం పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌటైంది. ఖుష్దిల్ షా (49 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (90 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (సి) (సబ్) ఫహీమ్ (బి) నసీమ్ 107; కాన్వే (బి) అబ్రార్ 10; విలియమ్సన్ (సి) రిజ్వాన్ (బి) నసీమ్ 1; మిచెల్ (సి) అఫ్రిది (బి) రవూఫ్ 10; లాథమ్ (నాటౌట్) 118; ఫిలిప్స్ (సి) ఫఖర్ (బి) రవూఫ్ 61; బ్రేస్‌వెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 320. వికెట్ల పతనం: 1–39, 2–40, 3–73, 4–191, 5–316. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–0–68–0, నసీమ్ 10–0–63–2, అబ్రార్ 10– 0–47–1, రవూఫ్ 10–0–83–2, ఖుష్దిల్ 7–0– 40–0, సల్మాన్ 3–0–15–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షకీల్ (సి) హెన్రీ (బి) రూర్కే 6; బాబర్ ఆజమ్ (సి) విలియమ్సన్ (బి) సాంట్నర్ 64; రిజ్వాన్ (సి) ఫిలిప్స్ (బి) రూర్కే 3; ఫఖర్ (బి) బ్రేస్‌వెల్ 24; సల్మాన్ (సి) బ్రేస్‌వెల్ (బి) స్మిత్ 42; తాహిర్ (సి) విలియమ్సన్ (బి) సాంట్నర్ 1; ఖుష్దిల్ (సి) బ్రేస్‌వెల్ (బి) రూర్కే 69; అఫ్రిది (సి) లాథమ్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; నసీమ్ (బి) హెన్రీ 13; రవూఫ్ (సి) మిచెల్ (బి) సాంట్నర్ 19; అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (47.2 ఓవర్లలో ఆలౌట్) 260. వికెట్ల పతనం: 1–8, 2–22, 3–69, 4–127, 5–128, 6–153, 7–200, 8–229, 9–260, 10–260. బౌలింగ్: హెన్రీ 7.2–1–25–2, రూర్కే 9–0–47–3, బ్రేస్‌వెల్ 10–1–38–1, ఫిలిప్స్ 9–0–63–0, సాంట్నర్ 10–0–66–3, స్మిత్ 2–0–20–1. -
ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్‌పై న్యూజిలాండ్‌దే పైచేయి..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 19) ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లు మినహా మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ తమ మ్యాచ్‌లను పాక్‌లో ఆడటం లేదు. టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి.టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్.. న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్‌లోని కరాచీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. పాక్‌పై న్యూజిలాండ్‌కు సంపూర్ణ ఆధిక్యం ఉంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో తలపడగా.. మూడుసార్లు న్యూజిలాండే విజేతగా నిలిచింది.కెన్యా వేదికగా జరిగిన టోర్నీ రెండో ఎడిషన్‌లో (2000) పాకిస్తాన్, న్యూజిలాండ్ తొలిసారి తలపడ్డాయి. నాటి ఎడిషన్ సెమీఫైనల్లో ఈ రెండు జట్లు ఢీకొన్నాయి. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.2 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 49 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ తరఫున సయీద్ అన్వర్ (104) సెంచరీ చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. న్యూజిలాండ్ ఆటగాడు రోజర్ ట్వూస్ (87) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సెమీస్‌లో పాక్‌పై విజయం సాధించిన న్యూజిలాండ్.. ఆతర్వాత ఫైనల్లో భారత్‌పై కూడా గెలుపొంది తమ తొలి ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది.ఆతర్వాత భారత్‌లో జరిగిన 2006 ఎడిషన్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు రెండోసారి తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్‌దే పైచేయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ పాక్‌ను 51 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన పాక్ 46.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ తరఫున స్కాట్ స్టైరిస్ (86), పాక్ తరఫున మొహమ్మద్ యూసఫ్ (71) టాప్ స్కోరర్లుగా నిలిచారు.సౌతాఫ్రికాలో జరిగిన 2009 ఎడిషన్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు మూడో సారి తలపడ్డాయి. ముచ్చటగా మూడోసారి కూడా న్యూజిలాండే విజేతగా నిలిచింది. నాటి ఎడిషన్ సెమీఫైనల్లో ఈ ఇరు జట్లు తలపడగా.. న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీస్‌లో పాక్‌పై గెలుపుతో ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్.. ఫైనల్లో ఆసీస్ చేతిలో పరాజయంపాలైంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై ఘనమైన రికార్డు కలిగిన న్యూజిలాండ్ మరో విజయం సాధిస్తుందో లేక తొలి ఓటమిని మూటగట్టుకుంటుదో వేచి చూడాలి. ఛాంపియన్స ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ జట్టు..మార్క్ చాప్మన్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్పాకిస్తాన్ జట్టు..మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాన్, సౌద్ షకీల్ -
ICC Champions Trophy: సై అంటే సై... ఏ జట్టు ఎలా ఉందంటే...
వన్డే క్రికెట్లో మరో ‘ప్రపంచ’ పోరుకు సమయం ఆసన్నమైంది. వరల్డ్ కప్ కాని వరల్డ్ కప్‌గా గుర్తింపు తెచ్చుకున్న చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. ప్రపంచ కప్‌తో పోలిస్తే తక్కువ జట్లతో టాప్–8తో పరిమితమైన ఈ ఐసీసీ టోర్నీలో జరగబోయే హోరాహోరీ సమరాలు ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ఒక ఐసీసీ టోర్నీకి వేదిక అవుతుండగా... భారత జట్టు పాకిస్తాన్ గడ్డపై ఆడకుండా దుబాయ్‌కే పరిమితమవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం చివరిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన పాక్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా... రెండుసార్లు టైటిల్ సాధించిన భారత్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దాటి ఈ ఫార్మాట్లో మళ్లీ ‘చాంపియన్’ హోదా కోసం రెడీ అంటోంది. కరాచీ: ఐసీసీ 2017లో చాంపియన్స్ ట్రోఫీని ఇంగ్లండ్‌లో నిర్వహించింది. లెక్క ప్రకారం 2021లో తర్వాతి టోర్నీ జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా కోవిడ్ కారణంగా ఐసీసీ అన్ని షెడ్యూల్లలో మార్పులు చేయాల్సి వచ్చింది. 2020లో జరగాల్సిన టి20 ప్రపంచ కప్‌ను తప్పనిసరి పరిస్థితుల్లో 2021కి మార్చారు. ఈ నేపథ్యంలో ఒకే ఏడాది రెండు ఐసీసీ టోర్నీల నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి 2021 టోర్నీని పూర్తిగా రద్దు చేసేశారు. మరో నాలుగేళ్లకు ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లు దీనికి నేరుగా అర్హత సాధించాయి. దాంతో మాజీ చాంపియన్ శ్రీలంక దూరం కాగా... అసలు వరల్డ్ కప్ ప్రధాన పోటీలకే క్వాలిఫై కాని మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్ కూడా ఈ టోర్నీలో కనిపించడం లేదు. అఫ్గానిస్తాన్ తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో భాగంగా నాలుగు వేదికల్లో కలిపి మొత్తం 12 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. భారత్ ఆడే 3 లీగ్ మ్యాచ్‌లు మినహా మిగతా వాటికి పాకిస్తాన్ వేదిక కాగా... భారత్ తమ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడుతుంది. టీమిండియా సెమీఫైనల్, ఆపై ఫైనల్ చేరితే ఆ రెండు మ్యాచ్‌లూ దుబాయ్‌లోనే జరుగుతాయి. మరో సెమీఫైనల్‌కు మాత్రం పాక్ ఆతిథ్యమిస్తుంది. భారత్ ఫైనల్ చేరకపోతే మాత్రం టైటిల్ పోరును పాకిస్తాన్ గడ్డపైనే నిర్వహిస్తారు. ఏ జట్టు ఎలా ఉందంటే...» ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఇంగ్లండ్ జట్టు రెండు సార్లు ఫైనల్స్‌లో ఓడింది. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తాము నమ్ముకున్న విధ్వంసక ఆట ఇప్పుడు ఏమాత్రం పనికి రాక కుప్పకూలిపోతోంది. బ్యాటింగ్‌లో రూట్, కెప్టెన్ బట్లర్, బ్రూక్ రాణించడం కీలకం. పేసర్లు ప్రభావం చూపలేకపోతుండగా... బలమైన స్పిన్నర్ జట్టులో లేడు. ఫామ్‌పరంగా వరల్డ్ కప్ తర్వాత 14 వన్డేలు ఆడితే 4 మాత్రమే గెలి చింది. వెస్టిండీస్, భారత్‌ల చేతిలో చిత్తయింది. » 2000లో తమ ఏకైక ఐసీసీ టోర్నీ నెగ్గిన న్యూజిలాండ్... 2009లో ఫైనల్ చేరింది. వైవిధ్యమైన ఆటగాళ్ల కూర్పుతో జట్టు ఇతర అన్ని టీమ్లకంటే మెరుగ్గా కనిపిస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, లాథమ్‌లతో బ్యాటింగ్ బలంగా ఉండగా, కెప్టెన్ సాంట్నర్‌తో కలిపి ముగ్గురు స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు. ఫెర్గూసన్ దూరం కావడం లోటే అయినా హెన్రీ పదునైన పేస్ కీలకం కానుంది. గత మూడు సిరీస్‌లలో రెండు గెలిచిన జట్టు... తాజాగా ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్‌ను ఓడించి విజేతగా నిలిచింది. » టోర్నీలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా గత రెండుసార్లు సెమీస్ కూడా చేరలేకపోయింది. ముగ్గురు ప్రధాన పేసర్లు కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ లేకుండా బరిలోకి దిగడం బౌలింగ్‌ను బలహీనపర్చింది. దాంతో బ్యాటింగ్‌పైనే భారం ఉంది. కెప్టెన్ స్మిత్, హెడ్, మ్యాక్స్‌వెల్ కీలకం కానున్నారు. పేసర్లు జాన్సన్, ఎలిస్‌లతో పాటు స్పిన్నర్ జంపా రాణించాల్సి ఉంది. 2023 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్‌పై సిరీస్ గెలిచిన ఆసీస్... పాక్, శ్రీలంక చేతుల్లో ఓడింది.» తొలిసారి 1998లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఆ తర్వాత నాలుగుసార్లు సెమీస్ చేరినా ముందంజ వేయలేకపోయింది. వరల్డ్ కప్ తర్వాత 14 మ్యాచ్‌లలో నాలుగే గెలిచినా... ఎక్కువసార్లు ద్వితీయ శ్రేణి జట్టే బరిలోకి దిగింది. కాబట్టి కీలక ఆటగాళ్లు రాణిస్తే సెమీస్ కచి్చతంగా చేరగలమని ఆశిస్తోంది. క్లాసెన్ అద్భుత ఫామ్‌లో ఉండగా... కెప్టెన్ బవుమా డసెన్, మార్క్రమ్ తమ వన్డే ఆటను ప్రదర్శించాల్సి ఉంది. రబడ మినహా బౌలింగ్‌లో పదును లేదు. » డిఫెండింగ్ చాంపియన్‌గా పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. గత టైటిల్ మినహా అంతకు ముందు పేలవ రికార్డు ఉంది. సొంతగడ్డపై జరుగుతుండటం పెద్ద సానుకూలత. ఫామ్‌లో లేకపోయినా ఇప్పటికీ బాబర్ ఆజమే కీలక బ్యాటర్. కెప్టెన్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా ప్రత్యర్థి స్పిన్‌ను ఎలా ఆడతారనే దానిపైనే జట్టు అవకాశాలు ఉన్నాయి. సయీమ్ అయూబ్ దూరం కావడం ఇబ్బంది పెట్టే అంశం. షాహీన్, నసీమ్, రవూఫ్‌లతో బౌలింగ్ ఇప్పటికీ సమస్యే. అబ్రార్ నాణ్యమైన స్పిన్నర్ కాదు.» టోర్నీ చరిత్రలో బంగ్లాదేశ్ 12 మ్యాచ్‌లు ఆడితే గెలిచింది 2 మాత్రమే. ఇటీవల వరుసగా వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ చేతుల్లో సిరీస్‌లు ఓడింది. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ లేదు. అయితే టెస్టులు, టి20లతో పోలిస్తే వన్డేల్లో కాస్త మెరుగ్గా ఆడుతుండటంతో కొన్ని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త తరం పేస్ బౌలర్లు తన్జీమ్, నాహిద్ చెప్పుకోదగ్గ రీతిలో ఆకట్టుకున్నారు. షకీబ్, తమీమ్ ఇక్బాల్‌ల తరాన్ని దాటి ఐసీసీ ఈవెంట్లో నజ్ముల్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ఈసారి కాస్త కొత్తగా కనిపిస్తోంది. » అఫ్గానిస్తాన్ జట్టుకు ఇదే తొలి చాంపియన్స్ ట్రోఫీ. వరల్డ్ కప్‌లో టాప్–8లో నిలిచి అర్హత సాధించడంతోనే ఆ జట్టు ఎంత మెరుగైందో చెప్పవచ్చు. వరల్డ్ కప్ తర్వాత ఐదు సిరీస్‌లు ఆడితే నాలుగు గెలిచింది. టి20 వరల్డ్ కప్‌లో కూడా సెమీస్ చేరిన టీమ్ తాము ఎలాంటి జట్టునైనా ఓడించగలమనే నమ్మకాన్ని కలిగిస్తోంది. గుర్బాజ్, కెప్టెన్ హష్మతుల్లా, అజ్మతుల్లా బ్యాటింగ్‌లో ప్రధానం కాగా...బౌలింగ్‌లో రషీద్ పెద్ద బలం. సీనియర్లు నబీ, నైబ్లకు గెలిపించగల సామర్థ్యం ఉంది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మరో బిగ్ వికెట్ డౌన్
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy-2025) ప్రారంభానికి ముందు మరో పెద్ద వికెట్ పడింది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ లోకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఫెర్గూసన్ కుడికాలి పాదంపై గాయమైంది. ఫెర్గూసన్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడంపై ముందు నుంచి అనుమానంగా ఉండింది. ప్రస్తుతం అదే నిజమైంది. ఫెర్గూసన్ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరం కానున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఫెర్గూసన్‌కు రీప్లేస్‌మెంట్‌గా కైల్ జేమీసన్‌ను (Kyle Jamieson) ఎంపిక చేశారు న్యూజిలాండ్ సెలెక్టర్లు. గాయాల కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన 11వ ప్లేయర్ ఫెర్గూసన్.ఇదివరకే స్టార్ ప్లేయర్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, అన్రిచ్ నోర్జే, గెరాల్డ్ కొయెట్జీ, సైమ్ అయూబ్, జేకబ్ బేతెల్, అల్లా ఘజన్ఫర్, బెన్ సియర్స్ గాయాల కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారు. స్టార్ ఆటగాళ్లు.. ముఖ్యంగా పేసర్లు దూరం కావడంతో మెగా టోర్నీ కళ తప్పే అవకాశముంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయం బారిన పడిన రెండో ఆటగాడు ఫెర్గూసన్. కొద్ది రోజుల ముందు పేసర్ బెన్ సియర్స్ కూడా గాయం బారిన పడ్డాడు. అతని స్థానంలో జేకబ్ డఫీ జట్టులోకి వచ్చాడు. తాజాగా ఫెర్గూసన్ కూడా గాయపడటంతో న్యూజిలాండ్ పేస్ విభాగం బలహీనపడినట్లు కనిపిస్తుంది. ఆ జట్టు పేస్ విభాగంలో మ్యాట్ హెన్నీ ఒక్కడే అనుభవజ్ఞుడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ పాకిస్తాన్‌తో తలపడనుంది. కరాచీలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్‌లు పాకిస్తాన్లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న ఆడనుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. మార్చి 2న భారత్.. న్యూజిలాండ్‌తో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ షెడ్యూల్..ఫిబ్రవరి 19న పాకిస్తాన్తోఫిబ్రవరి 24న బంగ్లాదేశ్తోమార్చి 2న టీమిండియాతోఛాంపియన్స్ ట్రోఫీ కోసం న్యూజిలాండ్ జట్టు..మార్క్ చాప్మన్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్ -
కౌంటీల్లో ఆడనున్న కేన్ మామ
లండన్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కౌంటీ జట్టు మిడిలెసెక్స్‌తో జతకట్టాడు. ఇంగ్లండ్ దేశవాళీ టి20 కౌంటీ చాంపియన్‌షిప్ ఆడేందుకు రెండేళ్ల పాటు మిడిలెసెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్‌లో జరిగే ఫ్రాంచైజీ లీగ్ ‘ది హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్‌కు కివీస్ దిగ్గజం సారథ్యం వహిస్తున్నాడు. గతంలో టి20 కౌంటీ చాంపియన్‌షిప్‌లో గ్లూసెస్టర్‌షైర్ (2011–12), యార్క్‌షైర్ (2013–2018)కు ప్రాతినిధ్యం వహించాడు. తాజా సీజన్లో బ్లాస్ట్ గ్రూప్‌లో మిడిలెసెక్స్ తరఫున కనీసం పది మ్యాచ్‌లు ఆడనున్నాడు. అనంతరం మరో ఐదు కౌంటీ చాంపియన్‌షిప్ మ్యాచ్‌ల్లోనూ విలియమ్సన్ బరిలోకి దిగుతాడు.‘గతంలో అడపాదడపా కౌంటీలు ఆడాను. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో సీజన్‌కు అందుబాటులో ఉంటాను’ అని అన్నాడు. ఈ వెటరన్ బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 18,000 పైచిలుకు పరుగులు చేశాడు. 47 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 54.88, వన్డేల్లో 49.65, టి20ల్లో 33.44 సగటు నమోదు చేశాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్ ప్రాతినిధ్యం వహించిన విలియమ్సన్ కరీబియన్ లీగ్‌లో బార్బడోస్ ట్రిడెంట్స్, ఎస్ఏ–20 (సఫారీ లీగ్)లో డర్బన్ సూపర్‌జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడు. ఈ సీజన్లో కరాచీ కింగ్స్ జట్టుతో జతకట్టిన కేన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లోనూ ఆడనున్నాడు. -
ట్రై సిరీస్ ఫైనల్.. చెలరేగిన న్యూజిలాండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన పాక్
కరాచీలో జరుగుతున్న ట్రయాంగులర్ సిరీస్ (Tri-Series) ఫైనల్లో న్యూజిలాండ్ (New Zealand), పాకిస్తాన్ (Pakistan) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో పాక్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పేసర్ విలియమ్ ఓరూర్కీ నాలుగు వికెట్లు తీసి పాక్‌ను ప్రధాన దెబ్బకొట్టాడు. మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేసి తలో రెండు వికెట్లు తీశారు. జేకబ్ డఫీ, నాథన్ స్మిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు.పాక్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కెప్టెన్ రిజ్వాన్ చేసిన 46 పరుగులే అత్యధికం. సల్మాన్ అఘా 45, తయ్యబ్ తాహిర్ 38, బాబర్ ఆజమ్ 29, ఫహీమ్ అష్రఫ్ 22, ఫకర్ జమాన్ 10, సౌద్ షకీల్ 8, ఖుష్దిల్ షా 7, షాహీన్ అఫ్రిది 1, నసీం షా 19 పరుగులు చేశారు.వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన బాబర్ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ హాషిమ్ ఆమ్లాతో కలిసి రికార్డు షేర్ చేసుకున్నాడు. ఆమ్లా, బాబర్‌కు తలో 123 ఇన్నింగ్స్‌ల్లో 6000 పరుగులు పూర్తి చేశారు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో బాబర్, ఆమ్లా తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. విరాట్ 136 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకితే.. కేన్ మామ, వార్నర్ భాయ్ తలో 139 ఇన్నింగ్స్‌ల్లో 6000 పరుగుల క్లబ్లో చేరారు.కాగా, ఈ ముక్కోణపు సిరీస్‌లో పాక్, న్యూజిలాండ్‌తో పాటు సౌతాఫ్రికా కూడా పాల్గొంది. ఈ టోర్నీలో ఫైనల్‌కు ముందు మూడు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మూడో మ్యాచ్‌లో పాక్.. సౌతాఫ్రికా నిర్దేశించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ స్వదేశంలో ఈ టోర్నీని నిర్వహించింది.పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. భారత్‌ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. -
Champions Trophy: న్యూజిలాండ్‌కు ఊహించని షాక్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముగింట న్యూజిలాండ్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు లాకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర గాయాల బారిన పడగా.. తాజాగా యువ పేసర్ బెన్ సియర్స్ ఈ జాబితాలోకి చేరాడు. సియర్స్ తొడ కండరాల గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. అతడి స్ధానాన్ని మరో పేసర్ జాకబ్ డఫీతో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. సియర్స్ ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ట్రైసిరీస్‌లో కివీస్ జట్టులో భాగంగా ఉన్నాడు. అయితే పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్లో సియర్స్ తొడ కండరాలు పట్టేశాయి.అనంతరం అతడిని స్కానింగ్‌కు తరలించగా.. గ్రేడ్-3 గాయంగా తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఈ యువ ఆటగాడు రెండు నుంచి మూడు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఈ క్రమంలోనే కివీస్ సెలక్టర్లు అతడి స్ధానాన్ని జాకబ్ డఫీతో భర్తీ చేశారు. కాగా ఈ ఐసీసీ ఈవెంట్‌కు ముందు న్యూజిలాండ్ అద్బుతమైన ఫామ్‌లో ఉంది.ప్రస్తుతం జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు ఆర్హత సాధించింది. శుక్రవారం కరాచీ వేదికగా పాక్‌తో జరగనున్న ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని కివీస్ భావిస్తోంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌కు కివీ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర సైతం దూరమయ్యాడు.పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రవీంద్ర తలకు గాయమైంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని బ్లాక్‌క్యాప్స్ హెడ్‌కోచ్ గ్యారీ స్టెడ్ స్పష్టం చేశాడు. ఇక ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ తమ మొదటి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న పాక్‌తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర,జేకబ్ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్చదవండి: Champions Trophy: ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా? -
'అతడు తలనొప్పితో బాధపడుతున్నాడు.. త్వరలోనే జట్టులోకి వస్తాడు'
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముంగిట పాకిస్తాన్-దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ట్రైసిరీస్ తుది అంకానికి చేరుకుంది. కరాచీ వేదికగా శుక్రవారం జరగనున్న ఫైనల్ పోరులో కివీస్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్ర గాయం కారణంగా ఫైనల్ పోరుకు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు. లహోర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో రవీంద్ర తలకు గాయమైంది. బంతి అతడి నుదిటికి తాకడంతో రక్తస్రావమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌కు రవీంద్ర దూరమయ్యాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి రచిన్ కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రచిన్ వేగంగా కోలుకుంటున్నాడు. అతడికి హెడ్ ఇంజ్యూరీ అసెస్మెంట్(HIA) సంబంధించి అన్ని పరీక్షలు నిర్వహించాము. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే గత మూడు నాలుగు రోజుల నుంచి కాస్త తలనొప్పితో బాధపడుతున్నాడు. గాయం తర్వాత రచిన్ తొలిసారి నెట్ ప్రాక్టీస్‌లో పాల్గోనున్నాడు. అతడు మరి కొన్ని రోజుల్లో తన ఫిట్నెస్ సాధిస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మా తొలి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని నేను భావిస్తున్నాను అని స్టెడ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్స్టాండ్ బై: జేకబ్ డఫీచదవండి: ప్లీజ్.. నన్ను కింగ్ అని పిలవకండి: బాబర్ ఆజం -
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన
అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (ఫిబ్రవరి 10) జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్లు లేక సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ కోచ్‌ను బరిలోకి దించింది. మెజార్టీ శాతం ఆటగాళ్లు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇరుక్కుపోవడంతో ఈ టోర్నీలో సౌతాఫ్రికాకు ఆటగాళ్ల కొరత ఏర్పడింది. ఈ టోర్నీ కోసం సౌతాఫ్రికా సెలెక్టర్లు కేవలం 12 మంది సభ్యుల జట్టును మాత్రమే ఎంపిక చేశారు. ఈ 12లోనూ ఇద్దరు ఆటగాళ్లు ఎమర్జెన్సీ మీద మైదానాన్ని వీడటంతో ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ వాండిలే గ్వావు తప్పనిసరి పరిస్థితుల్లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. అయితే ఇలాంటి ఘటన సౌతాఫ్రికాకు మాత్రం కొత్తేమీ కాదు. గత సీజన్లో అబుదాబీలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు అస్వస్థతకు గురికావడంతో బ్యాటింగ్ కోచ్ జేమీ డుమినీ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు.We don’t see that happening too often! 😅South Africa’s fielding coach Wandile Gwavu came on as a substitute fielder during the New Zealand innings! 👀#TriNationSeriesonFanCode pic.twitter.com/ilU5Zj2Xxn— FanCode (@FanCode) February 10, 2025ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఓడించి, ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. అరంగట్రేం ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కీ (150) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ సెంచరీతో బ్రీట్జ్కీ వన్డే అరంగేట్రంలో 150 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో.. జే స్మిత్ (41) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. కెప్టెన్ బవుమా (20), కైల్ వెర్రిన్ (1), ముత్తుసామి (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్‌కు ఓ వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. కేన్ విలియమ్సన్ (133) అజేయ శతకంతో విరుచుకుపడటంతో మరో 8 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. డెవాన్ కాన్వే (97) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ.. న్యూజిలాండ్ గెలుపుకు గట్టి పునాది వేశాడు. విలియమ్సన్.. గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి (28 నాటౌట్) న్యూజిలాండ్‌ను గెలుపు తీరాలు దాటించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 19, డారిల్ మిచెల్ 10, టామ్ లాథమ్ డకౌటయ్యారు.సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి 2, ఈథన్ బాష్, జూనియర్ డాలా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విలియమ్సన్ వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో రేపు (ఫిబ్రవరి 12) జరుగబోయే మ్యాచ్‌లో (పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా) విజేత ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్లో జరుగుతున్న టోర్నీ కావడంతో ఈ టోర్నీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
మార్టిన్ గప్టిల్ ఊచకోత.. 42 బంతుల్లో 160 పరుగులు! వీడియో వైరల్
న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటకి.. తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. లెజెండ్స్ 90 లీగ్ టోర్నీలో గప్టిల్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గప్టిల్.. సోమవారం రాయ్‌పూర్ వేదికగా బిగ్ బాయ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన గప్టిల్, ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసంతో రాయ్‌పూర్ స్టేడియం దద్దరిల్లిపోయింది. కేవలం 49 బంతులు మాత్రమే ఎదుర్కొన్న గప్టిల్.. 16 సిక్స్‌లు, 12 ఫోర్లతో 160 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ రిషి ధావన్(42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు.తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ వారియర్స్ నిర్ణీత 90 బంతుల్లో వికెట్ నష్టపోకుండా 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బిగ్ బాయ్స్ జట్టు.. నిర్ణీత 90 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. బిగ్ బాయ్స్ బ్యాటర్లలో రాబిన్ బిస్ట్(55) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సౌరబ్ తివారీ(37) పరుగులతో రాణించారు. ఛత్తీస్‌గఢ్ వారియర్స్ బౌలర్లలో మనన్ శర్మ రెండు, అభిమన్యు మిథన్, ఖాలీం ఖాన్ తలా వికెట్ సాధించారు.తిరుగులేని గప్టిల్..కాగా న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో గప్టిల్ తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. 16 ఏళ్ల పాటు కివీస్‌కు ప్రాతనిథ్యం వహించిన గప్టిల్.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. టీ20ల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా గప్టిల్ ఉన్నాడు. 122 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 3531 పరుగులు చేశాడు. వన్డేల్లోనూ న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు (7,346) చేసిన మూడో బ్యాటర్‌గా ఉన్నాడు. అతడి కంటే ముందు రాస్ టేలర్ (8,607), స్టీఫెన్ ప్లెమింగ్ (8,007) ఉన్నారు.చదవండి: ICC Champions Trophy: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు Absolute carnage in Raipur! 🤯 Martin Guptill goes absolutely berserk, smashing 160 runs off just 49 deliveries, including 16 maximums! 😱#Legend90onFanCode pic.twitter.com/6Bpkw4aEA4— FanCode (@FanCode) February 10, 2025 -
అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. వరల్డ్ రికార్డు
సౌతాఫ్రికా ఓపెనర్ (South Africa Opener) మాథ్యూ బ్రీట్జ్కీ (Matthew Breetzke) వన్డే అరంగేట్రంలోనే (ODI Debut) సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్ ట్రై సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో బ్రీట్జ్కీ ఈ ఫీట్‌ను సాధించాడు. అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 19వ ఆటగాడిగా, నాలుగో సౌతాఫ్రికన్ ప్లేయర్‌గా బ్రీట్జ్కీ రికార్డుబుక్కుల్లోకెక్కాడు. బ్రీట్జ్కీకి ముందు డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్), డెస్మండ్ హేన్స్ (విండీస్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), సలీం ఇలాహి (పాకిస్తాన్), మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), కొలిన్ ఇంగ్రామ్ (సౌతాఫ్రికా), రాబర్ట్ నికోల్ (న్యూజిలాండ్), ఫిల్ హ్యూస్ (ఆస్ట్రేలియా), మైఖేల్ లంబ్ (ఇంగ్లండ్), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్), కేఎల్ రాహుల్ (ఇండియా), టెంబా బవుమా (సౌతాఫ్రికా), ఇమామ్ ఉల్ హార్ (పాకిస్తాన్), రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా), ఆబిద్ అలీ (పాకిస్తాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), మైఖేల్ ఇంగ్లిష్ (స్కాట్లాండ్), అమీర్ జాంగూ (వెస్టిండీస్) వన్డే అరంగేట్రంలోనే సెంచరీలు చేశారు.వన్డే అరంగేట్రంలనే సెంచరీలు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..కొలిన్ ఇంగ్రామ్ 2010లో జింబాబ్వేపైటెంబా బవుమా 2016లో ఐర్లాండ్పైరీజా హెండ్రిక్స్ 2018లో శ్రీలంకపైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైతటస్థ వేదికపై వన్డే అరంగ్రేటంలో సెంచరీ చేసిన ఆటగాళ్లు..ఆండీ ఫ్లవర్ 1992లో శ్రీలంకపైఇమామ్ ఉల్ హాక్ 2017లో శ్రీలంకపైఆబిద్ అలీ 2018లో ఆస్ట్రేలియాపైరహ్మానుల్లా గుర్బాజ్ 2021లో ఐర్లాండ్పైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైబ్రీట్జ్కీ ప్రపంచ రికార్డున్యూజిలాండ్తో మ్యాచ్‌లో 148 బంతులు ఎదుర్కొన్న బ్రీట్జ్కీ 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ప్రదర్శనతో బ్రీట్జ్కీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో 150 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గతంలో వన్డే అరంగేట్రంలో 150 పరుగులు ఎవ్వరూ స్కోర్ చేయలేదు. ఈ మ్యాచ్‌కు ముందు వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం డెస్మండ్ హేన్స్ పేరిట ఉండింది. హేన్స్ తన వన్డే డెబ్యూలో 148 పరుగులు స్కోర్ చేశాడు. తాజా ప్రదర్శనతో వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు కూడా బ్రీట్జ్కీ ఖాతాలోకి చేరింది.న్యూజిలాండ్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్కీ (150) అరంగేట్రంలోనే సెంచరీతో కదంతొక్కగా.. వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో రాణించాడు. జేసన్ స్మిత్ (41) పర్వాలేదనిపించాడు. టెంబా బవుమా 20, కైల్ వెర్రిన్ 1, సెనూరన్ ముత్తుసామి 2 పరుగులు చేసి ఔటయ్యారు.న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ తలో రెండు వికెట్లు.. మైఖేల్ బ్రేస్‌వెల్ ఓ వికెట్ పడగొట్టారు. -
న్యూజిలాండ్ టీ20 టోర్నీ విజేతగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
న్యూజిలాండ్ టీ20 టోర్నీ సూపర్ స్మాష్ (Super Smash) విజేతగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ (Central Districts) (సెంట్రల్ స్టాగ్స్) అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన ఫైనల్లో ఆ జట్టు కాంటర్బరీ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ సూపర్ స్మాష్ టైటిల్ గెలవడం 2019 తర్వాత ఇదే మొదటిసారి. ఇనాగురల్ ఎడిషన్‌లో (2006) టైటిల్ గెలిచిన కాంటర్బరీ కింగ్స్ వరుసగా ఐదోసారి, మొత్తంగా ఏడో సారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కాంటర్బరీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన డారిల్ మిచెల్ (Daryl Mitchell) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెక్కోంచీ (27), చాడ్ బోవ్స్ (16), షిప్లే (10), మ్యాట్ హెన్రీ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. మిచెల్ హే (5), మాథ్యూ బాయిల్ (2), జకరీ ఫౌల్క్స్ (7) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ బౌలర్లలో టాబీ ఫిండ్లే 3 వికెట్లు పడగొట్టగా.. రాండెల్ 2, అంగస్ షా, టిక్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు.136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్.. డేన్ క్లీవర్ (43), విల్ యంగ్ (35) రాణించడంతో మరో 16 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్‌లో జాక్ బాయిల్ 5, కెప్టెన్ టామ్ బ్రూస్ 14 పరుగులు చేసి ఔట్ కాగా.. విలియమ్ క్లార్క్ (17), కర్టిస్ హీపీ (9) సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌ను విజయతీరాలకు చేర్చారు. కాంటర్బరీ కింగ్స్ బౌలర్లలో కైల్ జేమీసన్ 2, విలియమ్ ఓరూర్కీ, హెన్రీ షిప్లే తలో వికెట్ పడగొట్టారు.కాగా, న్యూజిలాండ్‌లో జరిగే సూపర్ స్మాష్ టీ20 టోర్నీ 2005-06లో తొలిసారి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ టోర్నీ పలు పేర్లతో చలామణి అవుతూ వస్తుంది. తొలుత న్యూజిలాండ్ టీ20 కాంపిటీషన్ అని, ఆతర్వాత స్టేట్ టీ20 అని, 2009-2012 వరకు హెచ్ఆర్వీ కప్ అని, 2013-14 ఎడిషన్‌లో హెచ్ఆర్వీ టీ20 అని, 2018-19 సీజన్ నుంచి సూపర్ స్మాష్ అని నిర్వహించబడుతుంది. ఈ టోర్నీ పురుషులతో పాటు మహిళల విభాగంలోనూ జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ప్రస్తుత సీజన్లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ఆడే చాలామంది ఆటగాళ్లు పాల్గొంటారు. -
T20 WC 2025 USA vs Ire: ధనాధన్.. 9.4 ఓవర్లలోనే..
ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్-2025(ICC Under 19 Womens T20 World Cup 2025)లో అమెరికా తొలి గెలుపు నమోదు చేసింది. అమెరికా యువతుల జట్టు ఐర్లాండ్(Ireland Women U19 vs USA Women U19)పై మెరిక విజయం సాధించింది. కేవలం 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. జొహూర్ బహ్రూ వేదికగా సోమవారం జరిగిన ఈ ‘సూపర్ షో’ టోర్నీకే వన్నె తెచ్చింది. 75 పరుగులకే ఆలౌట్ముందుగా ఐర్లాండ్ 17.4 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌటైంది. అలైస్ వాల్ష్ (16; 2 ఫోర్లు), లాలా మెక్బ్రిడ్ (13), అబీ హ్యారిసన్ (13), ఫ్రెయా సర్జెంట్ (10) రెండంకెల స్కోర్లు చేశారు.ఇసాని వాఘెలా 3, అదితిబా, రీతూ సింగ్, చేతన ప్రసాద్ తలా 2 వికెట్లు తీశారు. తెలుగు సంతతి అమ్మాయి ఇమ్మడి శాన్వీ ఒక వికెట్ తీసింది. తర్వాత అమెరికా జట్టు 9.4 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు దిశా ఢీంగ్రా (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), తెలుగు సంతతి అమ్మాయి పగిడ్యాల చేతన రెడ్డి (25 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 9.3 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. ఆ మరుసటి బంతికే ఇసాని వాఘేలా (4 నాటౌట్) బౌండరీ బాదడంతో ఇంకా 10.2 ఓవర్లు మిగిలుండగానే అమెరికా అమోఘ విజయం సాధించింది. ఇక మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో శ్రీలంకతో వెస్టిండీస్ (ఉదయం 8 గంటల నుంచి), మలేసియాతో భారత్ (మధ్యాహ్నం 12 గంటల నుంచి) తలపడతాయి.సంచలన విజయంఈ మెగా టోర్నీతోనే వరల్డ్‌కప్‌లో అరంగేట్రం చేసిన ఆఫ్రికా దేశం నైజీరియా యువతుల జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఐసీసీ మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్‌లో సోమవారం జరిగిన పోరులో నైజీరియా... న్యూజిలాండ్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. మహిళల క్రికెట్లో కివీస్ బలమైన జట్టు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లకు ఏమాత్రం తీసిపోని గట్టి ప్రత్యర్థి. అలాంటి జట్టును తాము నిర్దేశించిన 66 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించకుండా నిలువరించడం పెద్ద విశేషం.గ్రూప్ ‘సి’లో జరిగిన ఈ మ్యాచ్‌లో నైజీరియా అమ్మాయిల జట్టు 2 పరుగుల తేడాతో కివీస్‌పై గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నైజీరియా నిర్ణీత 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కెప్టెన్ లక్కీ పియెటి (25 బంతుల్లో 19; 1 ఫోర్) టాప్‌స్కోరర్ కాగా, లిలియన్ ఉడే (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) రెండంకెల స్కోరు చేసింది.ఇతరుల్లో ఇంకెవరూ కనీసం పది పరుగులైనా చేయలేదు. తర్వాత స్వల్ప లక్ష్యమే అయినా కివీస్ 13 ఓవర్లలో 6 వికెట్లకు 63 పరుగులే చేసి ఓడింది. అనిక టాడ్ (27 బంతుల్లో 19; 1 ఫోర్), ఇవ్ వొలాండ్ (15 బంతుల్లో 14; 1 ఫోర్) మెరుగ్గా ఆడారంతే! లలియన్ ఉడే (3–0–8–1) బౌలింగ్‌లోనూ అదరగొట్టింది.ఆఖరి ఓవర్ డ్రామా... కివీస్ 57/5 స్కోరు చేసి గెలుపు వాకిట నిలబడింది. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు చేస్తే చాలు. కానీ నైజీరియన్ బౌలర్ లక్కీ పియెటి 6 పరుగులే ఇచ్చింది. దీంతో 2 పరుగుల తేడాతో ఊహించని విధంగా న్యూజిలాండ్ కంగుతింది. లక్కీ తొలి నాలుగు బంతుల్లో 4 పరుగులే ఇచ్చింది. ఇందులో రెండో బంతి ‘బై’ కాగా, నాలుగో బంతి లెగ్‌బై!అంటే బ్యాటర్లు కొట్టింది 2 పరుగులే అన్నమాట! ఐదో బంతికి పరుగే ఇవ్వలేదు. ఇక మిగిలింది. చివరి బంతి... కివీస్ గెలిచేందుకు 5 పరుగులు కావాలి. అయాన్ లంబట్ (6 నాటౌట్) కొట్టిన షాట్‌కు 2 పరుగులే రాగా, మరో పరుగుకు ప్రయతి్నంచడంతో కెప్టెన్ టష్ వేక్లిన్ (18 బంతుల్లో 18; 2 ఫోర్లు) రనౌటైంది. చదవండి: 10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్‌కప్-2025లో సంచలనం -
పొట్టి ప్రపంచకప్‌లో పెను సంచలనం.. న్యూజిలాండ్‌కు షాకిచ్చిన పసికూన
మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్-2025లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్‌కు షాకిచ్చింది. ఇవాళ (జనవరి 20) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో నైజీరియా న్యూజిలాండ్‌పై 2 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్ సీనియర్ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్ ఛాంపియన్‌గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్‌ను సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. గ్రూప్-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. నైజీరియా తరఫున కెప్టెన్ లక్కీ పెటీ (22 బంతుల్లో 18; ఫోర్, సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ లిల్లియన్ ఉడే (25 బంతుల్లో 19; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో నంబర్ బ్యాటర్ ఒమోసిగో ఎగువాకున్ (4 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించింది. నైజీరియా ఇన్నింగ్స్ మొత్తంలో 4 బౌండరీలు, ఓ సిక్సర్ మాత్రమే నమోదయ్యాయి. న్యూజిలాండ్ తరఫున బౌలింగ్ చేసిన ఆరుగురిలో ఐదుగురు తలో వికెట్ తీశారు.అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పసికూన నైజీరియా విజయవంతంగా కాపాడుకుంది. ఛేదనలో న్యూజిలాండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయినా, ఆతర్వాత నిలదొక్కుకున్నట్లు కనిపించింది. ఆ జట్టుకు చెందిన ముగ్గరు మిడిలార్డర్ బ్యాటర్లు రెండంకెల స్కోర్లు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ముగ్గురు ఔట్ కావడంతో న్యూజిలాండ్ కోలుకోలేకపోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. నైజీరియా బౌలర్ లిల్లియన్ ఉడే అద్భుతంగా బౌల్ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో నైజీరియా సంచలన విజయం నమోదు చేసింది. బ్యాట్‌తో రాణించిన నైజీరియా కెప్టెన్ బంతితోనూ పర్వాలేదనిపించింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఆమెకే దక్కింది. ఈ గెలుపుతో నైజీరియా గ్రూప్-సి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ గ్రూప్‌లో నైజీరియాతో పాటు న్యూజిలాండ్, సౌతాఫ్రికా, సమోవా జట్లు ఉన్నాయి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ నిన్ననే బోణీ కొట్టింది. గ్రూప్-ఏలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం భారత బ్యాటర్లు 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
కేన్ విలియమ్సన్కు అవమానం
దిగ్గజ బ్యాటర్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్కు అవమానం జరిగింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) డ్రాఫ్ట్‌లో కేన్ మామను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్లాటినమ్ డ్రాఫ్ట్‌లో కేన్ మరో 43 మంది స్టార్ ఆటగాళ్లతో కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన కేన్‌ను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా ఎవరూ పట్టించుకోలేదు. కేన్ బరిలో నిలిచిన ప్లాటినమ్ డ్రాఫ్ట్ నుంచి 10 మంది ఆటగాళ్లను ఎంపిక చేసున్నాయి ఫ్రాంచైజీలు.అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో వార్నర్ అదరగొడుతున్నాడు. ఈ లీగ్‌లో వార్నర్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 63.20 సగటున 142.34 స్ట్రయిక్‌రేట్‌తో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఫామ్ కారణంగానే పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో వార్నర్‌కు మాంచి గిరాకీ ఉండింది.విలియమ్సన్ విషయానికొస్తే.. ఈ కివీస్ లెజెండ్ ఇటీవలి కాలంలో పెద్దగా టీ20లు ఆడింది లేదు. 2023లో ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడని కేన్.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ (2024) కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్, పీఎస్ఎల్లో కేన్ ఎంపిక కాకపోవడానికి అతని ఫిట్నెస్ కూడా ఓ కారణమే. ఇటీవలి కాలంలో కేన్ తరుచూ గాయాల బారిన పడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉండి కూడా కేన్ పొట్టి ఫార్మాట్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో వేగం లేకపోవడం, భారీ షాట్లు ఆడలేకపోవడం కేన్‌కు ప్రధాన సమస్యలు.కేన్ ప్రైవేట్ లీగ్‌ల్లో పెద్దగా రాణించలేకపోయినా అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పర్వాలేదనిపించాడు. కేన్ తన దేశం తరఫున 93 టీ20లు ఆడి 33.44 సగటున 2575 పరుగులు చేశాడు. కేన్‌ను ప్రైవేట్ లీగ్‌ల్లో ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోకపోవడానికి అతని వయసు మరో ప్రధాన కారణం. ప్రస్తుతం కేన్ మామ వయసు 34 ఏళ్లు.కేన్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో కేన్ డర్బన్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే కేన్ అదరగొట్టాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న పలువురు స్టార్ ఆటగాళ్లు..డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్)డారిల్ మిచెల్ (లాహోర్ ఖలందర్స్)మార్క్ చాప్మన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)మైఖేల్ బ్రేస్‌వెల్ (ముల్తాన్ సుల్తాన్స్)ఆడమ్ మిల్నే (కరాచీ కింగ్స్)ఫిన్ అలెన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)జేసన్ హోల్డర్ (ఇస్లామాబాద్ యునైటెడ్)ఆమెర్ జమాల్ (కరాచీ కింగ్స్) -
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. కెప్టెన్ అయ్యాక సాంట్నర్‌కు ఇదే తొలి ఇసీసీ టోర్నీ. ఈ రెండు టోర్నీల కోసం పేస్ బౌలింగ్ త్రయం విలియమ్ ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్ ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి ఇదే తొలి ఐసీసీ టోర్నీ. పేసర్ జేకబ్ డఫీ ఈ రెండు టోర్నీల కోసం స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ILT20 ప్లే ఆఫ్స్ నేపథ్యంలో లోకీ ఫెర్గూసన్ ట్రయాంగులర్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే స్టాండ్ బైగా డఫీ ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఆతిథ్య పాకిస్తాన్‌తో ఆడనుంది. టోర్నీ ఆరంభ రోజునే ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్‌లో (2000) న్యూజిలాండే విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఛాంపియన్స్ ట్రోఫీ-2025, పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్స్టాండ్ బై: జేకబ్ డఫీపాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (ముల్తాన్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 14- ఫైనల్ (ముల్తాన్)ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్ -ఏ, కరాచీఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 21- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి, కరాచీఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 23- పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి,రావల్పిండిఫిబ్రవరి 26- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 28- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, లాహోర్మార్చి 01- దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, కరాచీమార్చి 02- న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్మార్చి 04- మొదటి సెమీ ఫైనల్ (A1 వర్సెస్ B2), దుబాయ్మార్చి 05- రెండో సెమీ ఫైనల్ (B1 వర్సెస్ A2), లాహోర్మార్చి 09- ఫైనల్ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
రిటైర్మెంట్ ప్రకటించిన విధ్వంసకర వీరుడు
న్యూజిలాండ్ ప్టార్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల గప్తిల్ న్యూజిలాండ్ తరఫున 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 367 మ్యాచ్‌లు (మూడు ఫార్మాట్లలో) ఆడాడు. తన జట్టు తరఫున ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన గప్తిల్ కెరీర్లో ఓవరాల్‌గా 23 సెంచరీలు చేశాడు.2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గప్తిల్ 47 టెస్ట్‌లు, 198 వన్డేలు, 122 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 29.4 సగటున 2586 పరుగులు చేసిన గప్తిల్.. ఈ ఫార్మాట్లో మూడు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేశాడు. గప్తిల్ తన మూడు టెస్ట్ సెంచరీలను బంగ్లాదేశ్ (189), జింబాబ్వే (109), శ్రీలంకపై (156) చేశాడు. గప్తిల్ తన చివరి టెస్ట్‌ను 2016లో ఆడాడు.వన్డేల విషయానికొస్తే.. గప్తిల్ ఈ ఫార్మాట్లో 41.7 సగటున, 87.3 స్ట్రయిక్‌రేట్‌తో 7346 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో గప్తిల్ ఓ డబుల్ సెంచరీ కూడా చేశాడు. 2015లో గప్తిల్ వెస్టిండీస్‌పై 237 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి, ఏకైక క్రికెటర్ గప్తిల్ మాత్రమే. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో గప్తిల్ రెండో స్థానంలో ఉన్నాడు.ఈ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (264) పేరిట ఉంది. వన్డేల్లో న్యూజిలాండ్ తరఫున మూడో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ గప్తిల్‌కు రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రమే గప్తిల్ కంటే ఎక్కువ పరుగులు చేశారు. 2009లోనే వన్డే అరంగేట్రం చేసిన గప్తిల్.. తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి ఆటగాడు గప్తిలే.టీ20ల విషయానికొస్తే.. 135 స్ట్రయిక్‌రేట్‌తో 31.8 సగటున 3531 పరుగులు చేసిన గప్తిల్ పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా కెరీర్‌ను ముగించాడు. టీ20ల్లో గప్తిల్ 2 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన గప్తిల్ న్యూజిలాండ్ తరఫున అండర్-19 స్థాయి నుంచి ఆడుతున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌ను ముగించిన సందర్భంగా గప్తిల్ తన సహచరులకు , కోచింగ్ స్టాఫ్‌కు, కుటంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. తన క్రికెటింగ్ కెరీర్ కోసం కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని గప్తిల్ చెప్పుకొచ్చాడు. -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన న్యూజిలాండ్ ప్లేయర్.. వీడియో వైరల్
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద స్మిత్ పక్షిలా గాల్లోకి ఎగిరి సూపర్ మ్యాన్ క్యాచ్ పట్టుకున్నాడు. ఛేదనలో లంక ఇన్నింగ్స్ 29వ ఓవర్లో (ఆఖరి బంతికి) ఇది జరిగింది. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్‌లో లంక బ్యాటర్ ఎషాన్ మలింగ రూమ్ తీసుకుని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని వికెట్‌కీపర్ వెనుక భాగంలో డీప్ థర్డ్ దిశగా గాల్లోకి ఎగిరింది. నాథన్ స్మిత్ కొద్ది మీటర్ల పాటు స్ప్రింట్ చేసి బౌండరీ రోప్‌కు ముందు అద్బుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. NATHAN SMITH GRABS AN ABSOLUTE STUNNER. 🤯pic.twitter.com/wDknkRRFOV— Mufaddal Vohra (@mufaddal_vohra) January 8, 2025దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. క్రికెట్ అభిమానులు నాథన్ స్మిత్ విన్యాసానికి ముగ్దులవుతున్నారు. సూపర్ క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు.కాగా, ఈ మ్యాచ్‌లో శ్రీలంక న్యూజిలాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో ఓడింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (63 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ద శతకం బాదగా.. వన్ డౌన్ బ్యాటర్ మార్క్ చాప్మన్ (52 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. డారిల్ మిచెల్ (38), గ్లెన్ ఫిలిప్స్ (22), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విల్ యంగ్ 16, టామ్ లాథమ్ 1, నాథన్ స్మిత్ 0, మ్యాట్ హెన్రీ 1, విలియమ్ ఓరూర్కీ 3 పరుగులు (నాటౌట్) చేశారు. లంక బౌలర్లలో మహీశ్ తీక్షణ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హసరంగ రెండు, ఎషాన్ మలింగ, అశిత ఫెర్నాండో తలో వికెట్ తీశారు.అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ (64) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. చమిందు విక్రమసింఘే (17), జనిత్ లియనగే (22), అవిష్క ఫెర్నాండో (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ లంక టాప్ స్కోరర్ కమిందు వికెట్ సహా మూడు వికెట్లు తీశాడు. జాకబ్ డఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
NZ Vs SL: తీక్షణ హ్యాట్రిక్ వృధా.. రెండో వన్డేలోనూ ఓడిన శ్రీలంక
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (జనవరి 8) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (63 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ద శతకం బాదగా.. వన్ డౌన్ బ్యాటర్ మార్క్ చాప్మన్ (52 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. డారిల్ మిచెల్ (38), గ్లెన్ ఫిలిప్స్ (22), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విల్ యంగ్ 16, టామ్ లాథమ్ 1, నాథన్ స్మిత్ 0, మ్యాట్ హెన్రీ 1, విలియమ్ ఓరూర్కీ 3 పరుగులు (నాటౌట్) చేశారు.తీక్షణ హ్యాట్రిక్ఈ మ్యాచ్‌లో లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. 35 ఓవర్లో ఆఖరి రెండు బంతులకు వరుసగా రెండు వికెట్లు తీసిన తీక్షణ.. ఆ తర్వాత 37వ ఓవర్ తొలి బంతికి మరో వికెట్ పడగొట్టి వన్డేల్లో తన తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. మిచెల్ సాంట్నర్‌ను తొలుత ఔట్ చేసిన తీక్షణ.. ఆ తర్వాత వరుసగా నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీని ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 8 ఓవర్లు వేసిన తీక్షణ 44 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తీక్షణతో పాటు హసరంగ (2), ఎషాన్ మలింగ (1), అశిత ఫెర్నాండో (1) వికెట్లు తీశారు.అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంకను కమిందు మెండిస్ (64), జనిత్ లియనాగే (22) ఆదుకునే ప్రయత్నం చేశారు. లియనాగే 16వ ఓవర్ ఆఖరి బంతికి ఔట్ కావడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. చమిందు విక్రమసింఘే (17) క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం వచ్చిన ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంక 1, అవిష్క ఫెర్నాండో 10, కుసాల్ మెండిస్ 2, అసలంక 4, హసరంగ 1, తీక్షణ 6, మలింగ 4 పరుగులు చేసి ఔటయ్యారు. కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ కీలకమైన కమిందు మెండిస్ వికెట్ పడగొట్టడంతో పాటు ఇద్దరు చివరి వరుస ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపాడు. జేకబ్ డఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీశారు.కాగా, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి వన్డేలోనూ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు చివరి వన్డే జనవరి 11న ఆక్లాండ్‌లో జరుగనుంది. -
న్యూజిలాండ్ వీసా నిబంధనల్లో... సడలింపులు
వెల్లింగ్టన్: కార్మికుల కొరత తదితరాల నేపథ్యంలో వీసా నిబంధనలను న్యూజిలాండ్ సరళతరం చేసింది. ఇమిగ్రేషన్ ప్రక్రియను క్రమబద్దీకరిస్తూ గణనీయమైన మార్పులు చేసింది. పని అనుభవం, వేతనాలు, వీసా వ్యవధి తదితరాలను మార్చింది. న్యూజిలాండ్‌లో ఉపాధి పొందాలనుకునే కార్మికులకు కనీస అనుభవ అర్హతను మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. దాంతో ఇకపై ఆ దేశంలో ఉపాధి పొందడం మరింత సులభతరం కానుంది. న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయులకు ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వీసాల్లో మార్పు.. సీజనల్ వర్కర్లు న్యూజిలాండ్‌లో ఉండేందుకు రెండు కొత్త మార్గాలను కూడా ప్రవేశపెట్టారు. అనుభవజు్ఞలైన సీజనల్ కార్మికులకు మూడేళ్ల మల్టీ–ఎంట్రీ వీసా, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల సింగిల్–ఎంట్రీ వీసాలు ఇవ్వనున్నారు. గుర్తింపు పొందిన ఎంప్లాయర్ వర్క్ వీసా (ఏఈడబ్ల్యూవీ), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా (ఎస్పీడబ్ల్యూవీ)లకు సగటు వేతన ప్రమాణాలను తొలగించారు. కొత్త నిబంధనల ప్రకారం యజమానులు ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ రేటు ప్రకారం జీతాలివ్వాల్సి ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ (ఏఎన్జెడ్ఎస్సీఓ) స్కిల్ లెవల్స్ 4 లేదా 5 పరిధిలోకి వచ్చే ఉద్యోగాలకు రెండేళ్ల వీసా వ్యవధిని మూడేళ్లకు పెంచారు. ఇప్పటికే రెండేళ్ల వీసా ఉన్న ఉద్యోగులు ఏడాది పొడిగింపు కోరవచ్చు. వలసదారులు తమ పిల్లలను వెంట తీసుకొచ్చేందుకు కనీస వార్షిక వేతనాన్ని 55,844 డాలర్లకు పెంచారు. విద్యార్థుల వీసాలో సవరణ పోస్ట్ స్టడీ వర్క్ వీసా (పీఎస్ డబ్ల్యూవీ)ను కూడా న్యూజిలాండ్ సవరించింది. దీని ప్రకారం విద్యార్థులు అర్హతలను బట్టి అక్కడ మూడేళ్ల పాటు ఉండటానికి, పని చేయడానికి అనుమతిస్తారు. పీజీ డిప్లొమా తర్వాత మాస్టర్స్ పూర్తి చేసిన విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు అర్హత కోల్పోకుండా ఉండేందుకూ ఈ నిబంధనలు వీలు కలి్పస్తాయి. శ్రామిక రంగ కంపెనీలకు కార్మికులను తీసుకోవడం మరింత సులభతరం కానుంది. స్టూడెంట్ వీసా తదితరాల నుంచి ఏఈడబ్ల్యూవీకి మారాలనుకునే వలసదారులకు వచ్చే ఏప్రిల్ నుంచి మధ్యంతర పని హక్కులు కూడా ఇస్తారు. -
న్యూజిలాండ్ వీసా కొత్త రూల్స్ ఇవే..
అమెరికా వీసా నిబంధనలలో మార్పులు ప్రకటించిన అనంతరం.. న్యూజిలాండ్ కూడా అదే బాటలో వీసాలో మార్పులు చేసింది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడానికి మాత్రమే కాకుండా.. కీలక ఆందోళనలను పరిష్కరించడానికి, న్యూజిలాండ్ తన వీసా.. ఉపాధి అవసరాలకు అనేక మార్పులను ప్రకటించింది.న్యూజిలాండ్ వీసాలోని మార్పులలో ఎంప్లాయర్ వర్క్ వీసా (AEWV), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా (SPWV) పాత్రల కోసం వేతన పరిమితులను తొలగించడం, వలసదారులకు అనుభవ అవసరాన్ని తగ్గించడంతో పాటు.. కార్మికుల కోసం కొత్త మార్గాలను పరిచయం చేయడం వంటివి ఉన్నాయిన్యూజిలాండ్ వీసా నిబంధనల్లో మార్పులుఎంప్లాయర్ వర్క్ వీసా (AEWV) హోల్డర్లు తమ పిల్లలను న్యూజిలాండ్‌కు తీసుకురావాలనుకుంటే.. వారు ఏడాదికి సుమారు రూ. 25 లక్షల కంటే ఎక్కువ సంపాదించాలి. ఈ ఆదాయ పరిమితి 2019 నుండి మారలేదు. ఎందుకంటే వలస వచ్చిన కుటుంబాలు ఆర్థికంగా బాగా జీవించడానికి దీనిని ప్రవేశపెట్టారు.దేశంలో కార్మికుల కొరతను తగ్గించడానికి, వలసదారుల వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. ఈ కొత్త రూల్ మరింత మంది ఉద్యోగాల కోసం.. న్యూజిలాండ్ వెళ్ళడానికి సహాయపడుతుంది.న్యూజిలాండ్ కాలానుగుణ కార్మికుల కోసం రెండు కొత్త మార్గాలను ప్రవేశపెట్టింది. ఎక్స్పీరియన్స్ కలిగిన కార్మికులకు మల్టీ-ఎంట్రీ వీసా మూడు సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల పాటు సింగిల్ ఎంట్రీ వీసా అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: యూఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..ఆస్ట్రేలియన్ & న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అక్యుపేషన్స్ (ANZSCO) స్కిల్ లెవల్స్ 4 లేదా 5 కింద పరిగణించే ఉద్యోగాలను పొందడానికి.. ఉద్యోగులు రెండేళ్ల ముందు వీసా నుంచి మూడు సంవత్సరాల వర్క్ వీసాను పొందుతారు. ప్రస్తుతం ఈ ఉద్యోగాల్లో ఉన్నవారు మరో సంవత్సరం పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఏప్రిల్ 2025 నుంచి.. ఏదైనా ఇతర పని లేదా స్టూడెంట్ వీసాల నుంచి AEWVకి మారాలనుకునే వారికి మధ్యంతర ఉద్యోగ హక్కులు ఇవ్వబడతాయి. ఉపాధిలో ఉండేందుకు తమ కొత్త వీసాల ఆమోదం కోసం చూస్తున్న వలసదారులకు ఇది సహాయం చేస్తుంది. -
ఆకాశాన్నంటుతున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అక్కడ న్యూ ఇయర్ వచ్చేసింది
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమమయ్యాయి. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆక్లాండ్ వాసులు న్యూఇయర్ వేడుకల్ని ప్రారంభించారు. భారత్‌లో కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ వాసులు 2025లోకి అడుగుపెట్టారు. ఆనందోత్సాహాల మధ్య ఆక్లాండ్ స్కై టవర్ వద్ద న్యూఇయర్ వేడుకల్ని అట్టహాసంగా ప్రారంభించారు. కాగా, ప్రపంచంలో తొలిసారిగా కొత్త సంవత్సరంలోకి అడుగుకు పెట్టే నగరం ఆక్లాండ్ -
కిరిబాటి.. కొత్త సంవత్సరం వచ్చేసిందోచ్!
Happy New Year 2025: పాత ఒక రోత.. కొత్త ఒక వింత అంటే బాగోదేమో.. కానీ పాత జ్ఞాపకాలని మదిలో దాచుకుంటూ కొత్త ఆశల్ని భుజానకెత్తుకోవడం అంటే సరిగ్గా సరిపోతుంది కదా. మరికొన్ని గంటల్లో యావత్ ప్రపంచం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఒక్కో దేశం ఒక్కో విధంగా కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతోంది.అయితే ఇప్పటికే పలు దేశాల్లో కొత్త ఏడాది ఉదయించింది’. ప్రపంచంలో అన్నింటికి కంటే ముందు సూర్యుడు ఉదయించే దేశాల్లో పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయి. అందులో కిరిబాటి అనే ద్వీప దేశం ఒకటి. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో ఆ భానుడి లేలేత కిరణాలు కిరిబాటి అనే చిన్న దేశం మీద ముందుగా పడతాయి. అంటే ఈ దేశమే ముందు నిద్ర లేస్తుంది అన్నమాట. ఇదొక ద్వీప దేశం. దీని జనాభా చాలా తక్కువ.ఇక్కడ జనాభా 1.34 లక్షలు అని ఒక అంచనా. మన లెక్కన ఒక అసెంబ్లీ నియోజవర్గం ఓటర్ల సంఖ్య కంటే చిన్న దేశం ఇది. భారత్‌లో డిసెంబర్ 31(3.30 PM) సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ జనవరి 1వ తేదీ వచ్చేస్తుంది. భారత్‌కు కిరిబాటికి ఇంచుమించు 8.30 గంటల సమయం వ్యత్యాసం ఉంది.🎆✨ Happy New Year 2025! ✨🎆The first to welcome 2025: 🎉Christmas Island, Kiribati: 5 AM EST (3:30 PM IST)Chatham Islands, NZ: 5:15 AM EST (3:45 PM IST)Auckland & Wellington, NZ: 6 AM EST (4:30 PM IST)The countdown begins! 🌍#HappyNewYear #HappyNewYear2025 pic.twitter.com/RRqFy7PgT8— Shahadat Hossain (@shsajib) December 31, 2024 భూమిపై ప్రకృతి సౌందర్యం, ప్రజలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది ఒకటి. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాల టాప్-10 జాబితాలో కూడా ఈ ద్వీప దేశానికి చోటు ఉండటం విశేషం. ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో, న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉంది. భారత్‌లో ( 12 am అయిన సందర్భంలో)కొత్త ఏడాది ప్రారంభం కావడానికంటే ముందే నూతన సంవత్సరం జరుపుకునే పలు దేశాల జాబితా వరుస క్రమంలో..కిరిబాటి(8.30 am on Jan 1)సమోవా, టోంగా((7.30 am on Jan 1)న్యూజిలాండ్((7.30 am on January 1)రష్యా, ఫిజి((6.30 am on January 1)ఆస్ట్రేలియా((5.30 am on January 1)పాపువా న్యూగినియా((4.30 am on January 1)ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా( 1.30 am on January 1)చైనా, మలేషియా, సింగపూర్(2.30 am on January 1)వియాత్నాం, థాయ్‌లాండ్( 1.30 am on January 1)మయన్మార్(1 am on January 1)బంగ్లాదేశ్, కజికిస్తాన్, భూటాన్( 12.30 am on January 1)నేపాల్(12.15 am on January 1) -
నిప్పులు చెరిగిన డఫీ.. లంకను చిత్తు చేసిన కివీస్.. సిరీస్ కైవసం
మౌంట్ మాంగనూయ్ వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరిగిన రెండో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand) 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ సిరీస్‌ను కివీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఇవాళ (డిసెంబర్ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక టాస్ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టిమ్ రాబిన్సన్ (41), మార్క్ చాప్మన్ (42), మిచెల్ హే (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర 1, గ్లెన్ ఫిలిప్స్ 23, డారిల్ మిచెల్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో మిచెల్ హే (Mitchell Hay) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, మతీశ పతిరణ తలో వికెట్ దక్కించుకున్నారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. జేకబ్ డఫీ (Jacob Duffy) (4-0-15-4) నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించాడు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ తలో రెండు.. మైఖేల్ బ్రేస్‌వెల్, జకరీ ఫోల్క్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లంక ఇన్నింగ్స్‌లో కుసాల్ పెరీరా (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పథుమ్ నిస్సంక (37), చరిత్ అసలంక (20), కుసాల్ మెండిస్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. కమిందు మెండిస్ (7), అవిష్క ఫెర్నాండో (5), వనిందు హసరంగ (1), మహీశ్ తీక్షణ (0), బినుర ఫెర్నాండో (3), మతీశ పతిరణ (0) విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 నెల్సన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 2న జరుగనుంది.తొలి మ్యాచ్‌లోనూ ఇబ్బంది పెట్టిన డఫీన్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ తలో టీ20లోనూ లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆ మ్యాచ్‌లో డఫీ 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. తద్వారా ఛేదనలో శ్రీలంక ఇబ్బంది పడి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (62), మైఖేల్ బ్రేస్‌వెల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ, బినుర తలో రెండు వికెట్లు తీయగా.. పతిరణ ఓ వికెట్ దక్కించుకున్నాడు.173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు నిస్సంక (90), కుసాల్ మెండిస్ (46) రాణించడంతో ఓ దశలో గెలుపు దిశగా సాగింది. అయితే డఫీ సహా కివీస్ పేసర్లు మ్యాట్ హెన్రీ (2/28), జకరీ ఫోల్క్స్ (2/41) ఒక్కసారిగా విజృంభించడంతో శ్రీలంక ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. -
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం శ్రీలంక జట్టు ప్రకటన
న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (డిసెంబర్ 18) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలగేను విడిచిపెట్టింది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో తలపడిన లంక జట్టులో ఇది ఏకైక మార్పు.ప్రస్తుతం ప్రకటించిన లంక జట్టు పేస్ మరియు స్పిన్ బౌలర్లతో సమతూకంగా ఉంది. గత న్యూజిలాండ్ సిరీస్‌లో అరంగేట్రం చేసిన సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ చమిందు విక్రమసింఘే తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రముఖ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ స్పిన్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. హసరంగ స్పిన్ టీమ్‌లో మహీశ్ తీక్షణ, లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండడ్సే ఉన్నారు.లంక పేస్ విభాగాన్ని అశిత ఫెర్నాండో లీడ్ చేయనున్నాడు. నువాన్ తుషార, మతీష పతిరణ, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బినుర ఫెర్నాండో పేస్ టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు. బ్యాటింగ్ విషయానికొస్తే.. కెప్టెన్ అసలంక, నిస్సంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, చండీమాల్, కమిందు మెండిస్, భానుక రాజపక్సతో ఈ విభాగం పటిష్టంగా ఉంది.కాగా, న్యూజిలాండ్ పర్యటనలో తొలి టీ20 డిసెంబర్ 28న జరుగనుంది. మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం డిసెంబర్ 30వ తేదీ రెండో టీ20 జరుగనుంది. తొలి టీ20 జరిగిన చోటే ఈ మ్యాచ్ కూడా జరుగనుంది. వచ్చే ఏడాది జనవరి 2న మూడో టీ20 జరుగనుంది. నెల్సన్‌లోని సాక్స్టన్ ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. టీ20 సిరీస్ అనంతరం జనవరి 5, 8, 11 తేదీల్లో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది.న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం శ్రీలంక జట్టు..చరిత్ అసలంక (కెప్టెన్), పతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, భానుక రాజపక్స, వనిందు హసరంగా, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరణ, జెఫ్రీ వాండర్సే, నువాన్ తుషార, అశిత ఫెర్నాండో, బినుర ఫెర్నాండో, మహేశ్ తీక్షణ -
న్యూజిలాండ్ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్
న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల జట్ల (వన్డే, టీ20) ఫుల్ టైమ్ కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ న్యూజిలాండ్ అధికారికంగా ప్రకటించింది. సాంట్నర్.. కేన్ విలియమ్సన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడు. కేన్ మామ ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 32 ఏళ్ల సాంట్నర్ న్యూజిలాండ్ తరఫున 100కు పైగా వన్డేలు, టీ20లు ఆడాడు. సాంట్నర్ ఇప్పటికే 24 టీ20లు, 4 వన్డేల్లో న్యూజిలాండ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. న్యూజిలాండ్ ఫుల్ టైమ్ కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్ ప్రస్తానం ఈ నెలాఖరులో జరిగే శ్రీలంక సిరీస్‌తో మొదలవుతుంది. సమీప భవిష్యత్తులో న్యూజిలాండ్ బిజీ షెడ్యూల్ (పరిమిత ఓవర్ల సిరీస్‌లు) కలిగి ఉంది. శ్రీలంకతో సిరీస్‌ల అనంతరం పాక్‌తో కలిసి ట్రయాంగులర్ సిరీస్‌లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. దీని తర్వాత స్వదేశంలో పాక్‌తో టీ20, వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉంది.న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్‌గా ఎంపిక కావడంపై సాంట్నర్ స్పందిస్తూ.. ఇది చాలా గొప్ప గౌరవమని అన్నాడు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు న్యూజిలాండ్‌కు ఆడాలనేది తన కల అని చెప్పాడు. అలాంటిది ఏకంగా తన జట్టును ముందుండి నడిపించే అవకాశం రావడం అదృష్టమని తెలిపాడు. కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టడం సవాలుగా భావిస్తున్నానని అన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ రెడ్ బాల్ (టెస్ట్) కెప్టెన్‌గా టామ్ లాథమ్ కొనసాగనున్నాడు. -
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
హ్యామిల్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ ముందు న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేన్ విలియమ్సన్ (156) సెంచరీతో కదంతొక్కడంతో న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 453 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 658 పరుగులు చేయాలి.న్యూజిలాండ్ భారీ స్కోర్కేన్ విలియమ్సన్తో పాటు విల్ యంగ్ (60), డారిల్ మిచెల్ (60), రచిన్ రవీంద్ర (44), టామ్ బ్లండెల్ (44 నాటౌట్), మిచెల్ సాంట్నర్ (49) రాణించడంతో సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. విలియమ్సన్ ఔటైన తర్వాత న్యూజిలాండ్ టెయిలెండర్లు వేగంగా పరుగులు రాబట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేకబ్ బేతెల్ 3, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ చెరో 2, పాట్స్, అట్కిన్సన్, రూట్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ (4/48), విలియమ్ ఓరూర్కీ (3/33), మిచెల్ సాంట్నర్ (3/7) ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జాక్ క్రాలే (21), బెన్ డకెట్ (11), జేకబ్ బేతెల్ (12), ఓలీ పోప్ (24), బెన్ స్టోక్స్ (27) రెండంకెల స్కోర్లు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులకు ఆలౌటైంది. టామ్ లాథమ్ (63), సాంట్నర్ (76) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ (42), కేన్ విలియమ్సన్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో పాట్స్ 4, అట్కిన్సన్ 3, బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
NZ Vs ENG 3rd Test: చరిత్ర సృష్టించిన కేన్ మామ
హ్యామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. కేన్‌కు టెస్ట్‌ల్లో ఇది 33వ సెంచరీ. జేకబ్ బేతెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేన్ తన సెంచరీ మార్కును 137 బంతుల్లో అందుకున్నాడు. కేన్ సెంచరీలో 14 బౌండరీలు, ఓ సిక్సర్ ఉన్నాయి. కేన్ తన కెరీర్లో 105 టెస్ట్‌లు ఆడి 54.91 సగటున 33 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీల సాయంతో 9225 పరుగులు చేశాడు.చరిత్ర సృష్టించిన కేన్ మామఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో సెంచరీ చేసిన అనంతరం కేన్ మామ చరిత్ర సృష్టించాడు. ఒకే వేదికపై ఐదు వరుస సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేన్ హ్యామిల్టన్ గడ్డపై వరుసగా ఐదు టెస్ట్ సెంచరీలు చేశాడు. హ్యామిల్టన్‌లో కేన్ సగటు 97.69గా ఉంది. ఇక్కడ కేన్ 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1563 పరుగులు చేశాడు.ఒకే వేదికపై అత్యధిక సగటు కలిగిన రికార్డు క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. బ్రాడ్‌మన్ మెల్బోర్న్లో 128.53 సగటు కలిగి ఉన్నాడు. బ్రాడ్‌మన్ తర్వాత ఒకే వేదికపై అత్యధిక సగటు కలిగి రికార్డు వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో లక్ష్యణ్ సగటు 110.63గా ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. కేన్ మామ సెంచరీతో కదంతొక్కడంతో మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. మూడో రోజు టీ విరామం సమయానికి న్యూజిలాండ్ 478 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్కోర్ 274/4గా ఉంది. కేన్ విలియమ్సన్ (123), డారిల్ మిచెల్ (18) క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. రచిన్ రవీంద్ర (44) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. పాట్స్, అట్కిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ (4/48), విలియమ్ ఓరూర్కీ (3/33), మిచెల్ సాంట్నర్ (3/7) ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.దీనికి ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (63), సాంట్నర్ (76) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ (42), కేన్ విలియమ్సన్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
హ్యామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఓ మార్పు చేసింది. గత రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రిస్ వోక్స్ స్థానంలో మాథ్యూ పాట్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహా రెండో టెస్ట్ ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించనుంది ఇంగ్లండ్ మేనేజ్మెంట్.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది. మరో టెస్ట్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2008 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్‌కు ఇది తొలి టెస్ట్ సిరీస్ విజయం.తొలి టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో విజయంక్రైస్ట్చర్చ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (171), బ్రైడన్ కార్స్ (10 వికెట్లు) అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.323 పరుగుల తేడాతో విజయంవెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 323 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (123, 55), జో రూట్ (106) సెంచరీలతో కదం తొక్కారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది.మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఒల్లీ పోప్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే, మాథ్యూ పాట్స్, షోయబ్ బషీర్ -
WTC Final: న్యూజిలాండ్ అవకాశాలపై నీళ్లు చల్లిన ఐసీసీ
ఇంగ్లండ్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ ఇరు జట్ల మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం కోత విధించింది. అలాగే ఇరు జట్లకు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లు పెనాల్టీ పడ్డాయి.ఐసీసీ తీసుకున్న ఈ చర్య వల్ల ఇంగ్లండ్‌కు పెద్దగా నష్టమేమీ లేనప్పటికీ.. న్యూజిలాండ్‌కు మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు దెబ్బతిన్నాయి. తాజా పెనాల్టీ అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ఐదో స్థానానికి పడిపోయింది. దీనికి ముందు ఆ జట్టు శ్రీలంకతో పాటు సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉండింది.న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌తో తదుపరి జరుగబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరలేదు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పర్సెంటేజీ 47.92గా ఉంది. ఇంగ్లండ్‌తో తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా న్యూజిలాండ్ పాయింట్ల పర్సెంటేజీ 55.36 శాతం వరకు మాత్రమే చేరుకుంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరేందుకు ఇది సరిపోదు. కాబట్టి ఐసీసీ తాజాగా విధించిన పాయింట్ల కోత న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసిందనే చెప్పాలి. మరోవైపు న్యూజిలాండ్‌తో పాటు పాయింట్ల కోత విధించబడ్డ ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఇదివరకే అనధికారికంగా నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు 40.75 శాతం పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది.ఇదిలా ఉంటే, క్రైస్ట్‌చర్చ్ వేదికగా తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ (171), బ్రైడన్ కార్స్ (10 వికెట్లు) సత్తా చాటి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి మొదలవుతుంది. -
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. గ్లెన్ ఫిలిప్స్ 58 పరుగుల అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.బ్రూక్ భారీ శతకంఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ భారీ సెంచరీతో (171) కదం తొక్కాడు. ఓలీ పోప్ (77), బెన్ స్టోక్స్ (80) అర్ద శతకాలతో రాణించారు. బెన్ డకెట్ (46), గస్ అట్కిన్సన్ (48), బ్రైడన్ కార్స్ (33 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నాథన్ స్మిత్ మూడు, టిమ్ సౌథీ రెండు, విలియమ్ ఓరూర్కీ ఓ వికెట్ దక్కించుకున్నారు.నిప్పులు చెరిగిన బ్రైడన్ కార్స్తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్‌కు దెబ్బకొట్టిన బ్రైడన్ కార్స్ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్‌లో కార్స్ 6 వికెట్లు పడగొట్టాడు. కార్స్‌తో పాటు క్రిస్ వోక్స్ (3/59), అట్కిన్సన్ (1/57) కూడా చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 254 పరుగులకు చాపచుట్టేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ (61), డారిల్ మిచెల్ (84) అర్ద సెంచరీలతో రాణించారు.ఆడుతూపాడుతూ విజయతీరాలకు..!104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 12.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. అరంగేట్రం ఆటగాడు జాకబ్ బేతెల్ 37 బంతుల్లో 50 పరుగులు.. జో రూట్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బెన్ డకెట్ 27, జాక్ క్రాలే ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు తీసిన బ్రైడన్ కార్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. -
శతక్కొట్టిన హ్యారీ బ్రూక్.. సెకెండ్ ఫాస్టెస్ట్ ప్లేయర్‌గా రికార్డు
క్రైస్ట్‌చర్చ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. బ్రూక్ తన కెరీర్లో ఏడో టెస్ట్ సెంచరీని 123 బంతుల్లో పూర్తి చేశాడు. బ్రూక్ సెంచరీ మార్కును బౌండరీతో చేరుకోవడం విశేషం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన బ్రూక్.. ఓలీ పోప్‌తో (77) కలిసి ఐదో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అనంతరం బ్రూక్.. బెన్ స్టోక్స్‌తో (32 నాటౌట్) కలిసి ఆరో వికెట్‌కు అజేయమైన 86 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం బ్రూక్ 126 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 71 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 309 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 39 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 0, బెన్ డకెట్ 46, జాకబ్ బేతెల్ 10, జో రూట్ 0, ఓలీ పోప్ 77 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో 4 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. 2000 పరుగులు పూర్తి చేసుకున్న బ్రూక్ఈ మ్యాచ్‌లో బ్రూక్ 2000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. టెప్ట్ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ రెండో స్థానంలో నిలిచాడు. బ్రూక్ 2000 పరుగుల మార్కును తాకేందుకు 2300 బంతులు తీసుకున్నాడు. ఈ జాబితాలో బ్రూక్ సహచరుడు బెన్ డకెట్ టాప్‌లో ఉన్నాడు. డకెట్ 2293 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.టెస్ట్‌ల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితా..బెన్ డకెట్-2293హ్యారీ బ్రూక్-2300టిమ్ సౌథీ-2418అడమ్ గిల్‌క్రిస్ట్-2483 -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్యాచ్.. నమ్మశక్యం కాని రీతిలో..!
క్రికెట్ చరిత్రలో అత్యంత అద్భుతమైన క్యాచ్‌కు న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యం కాని రీతిలో ఒంటిచేత్తో డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి బ్యాటర్ ఓలీ పోప్ సహా ఫీల్డ్‌లో ఉన్న వారందరికి మతి పోయింది. ఫిలిప్స్ విన్యాసం చూసి నెటిజన్లు ముగ్దులైపోతున్నారు. ఇదేం క్యాచ్ రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Glenn Phillips adds another unbelievable catch to his career resume! The 151-run Brook-Pope (77) partnership is broken. Watch LIVE in NZ on TVNZ DUKE and TVNZ+ #ENGvNZ pic.twitter.com/6qmSCdpa8u— BLACKCAPS (@BLACKCAPS) November 29, 2024వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్ బ్యాటింగ్ 53వ ఓవర్లో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టిమ్ సౌథీని బౌలింగ్‌కు దించాడు. అప్పటికే ఓలీ పోప్.. హ్యారీ బ్రూక్‌తో కలిసి ఐదో వికెట్‌కు 151 పరుగులు జోడించాడు. సౌథీ వేసిన షార్ట్ పిచ్ డెలివరీకి ఓలీ పోప్ కట్ షాట్ ఆడగా.. గ్లెన్ ఫిలిప్స్ అకస్మాత్తుగా ఫ్రేమ్‌లోకి వచ్చి అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఫలితంగా పోప్ 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఓలీ పోప్ ఔటైన అనంతరం కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్‌లోకి వచ్చాడు. బ్రూక్ 86 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ స్కోర్ 232/5గా ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 0, బెన్ డకెట్ 46, జాకబ్ బేతెల్ 10, జో రూట్ 0, ఓలీ పోప్ 77 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు.అందకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో 4 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. -
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్.. సెంచరీ చేజార్చుకున్న కేన్ మామ
క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో 33వ సెంచరీ మిస్ అయ్యాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ లాథమ్ 47, డెవాన్ కాన్వే 2, రచిన్ రవీంద్ర 34, డారిల్ మిచెల్ 19, టామ్ బ్లండెల్ 17, నాథన్ స్మిత్ 3, మ్యాట్ హెన్రీ 18 పరుగులు చేసి ఔట్ కాగా.. గ్లెన్ ఫిలిప్స్ (41), టిమ్ సౌథీ (10) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్, రచిన్ రవీంద్ర క్రీజ్‌లో ఉండగా న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే షోయబ్ బషీర్ స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను దెబ్బకొట్టాడు. కాగా, గాయం కారణంగా కేన్ విలియమ్సన్ భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను భారత్ 0-3 తేడాతో న్యూజిలాండ్‌కు కోల్పోయింది.ఆరేళ్లలో తొలిసారి..ఈ మ్యాచ్‌లో కేన్ సెంచరీ సాధిస్తాడని అంతా అనుకున్నారు. అయితే కేన్ అట్కిన్సన్ బౌలింగ్‌లో టెంప్టింగ్ షాట్ ఆడి జాక్ క్రాలే చేతికి చిక్కాడు. కేన్ 90ల్లో ఔట్ కావడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. విలియమ్సన్ తన చివరి టెస్ట్ సెంచరీని ఇదే ఏడాది ఫిబ్రవరిలో సౌతాఫ్రికాపై సాధించాడు. -
‘క్రో–థోర్ప్’ ట్రోఫీ కోసం న్యూజిలాండ్, ఇంగ్లండ్ పోరు
లండన్: భారత్, ఆ్రస్టేలియాల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లాగే ఇకపై న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల జట్ల మధ్య ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’ నిర్వహించనున్నారు. న్యూజిలాండ్ దివంగత దిగ్గజం మార్టిన్ క్రో, ఇంగ్లండ్ దివంగత లెజెండ్ గ్రాహం థోర్ప్ల పేరిట ఈ ఏడాది నుంచి ద్వైపాక్షిక సిరీస్ అంకురార్పణ జరగనుంది. విజేతకు బహూకరించే ట్రోఫీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల బ్యాట్లను ఉపయోగించి ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’ని రూపొందించారు. న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ డేవిడ్ ఎన్గవాటి ఈ కలప (బ్యాట్) ట్రోఫీని తయారు చేశారు. ప్రపంచ శ్రేణి కళాకృతులను, వినియోగదారుల అభిరుచులకు తగ్గ ఆకృతులను (కస్టమ్ డిజైన్) తయారు చేయడంలో ‘మహు క్రియేటివ్’ సంస్థకు మంచి పేరుంది. డేవిడ్‌కు చెందిన ఈ సంస్థే గతంలో కివీస్, సఫారీల మధ్య జరిగిన టోర్నీ కోసం ‘తంగివాయ్ షీల్డ్’ను రూపొందించింది. దిగ్గజ క్రికెటర్ల విషయానికొస్తే అసలైన క్రికెట్ ఫార్మాట్ (టెస్టు)లో అటు మారి్టన్ క్రో... ఇటు గ్రాహం థోర్ప్ అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేశారు. తన కెరీర్లో 77 టెస్టులాడిన క్రో 45.36 సగటుతో 5444 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 18 అర్ధసెంచరీలున్నాయి. 143 వన్డేల్లో 38.55 సగటుతో 4704 పరుగులు సాధించాడు. 4 శతకాలు, 34 అర్ధశతకాలు బాదాడు. థోర్ప్ సరిగ్గా 100 టెస్టులాడాడు. 44.66 సగటుతో 6744 పరుగులు చేశాడు. 16 సెంచరీలు, 39 ఫిఫ్టీలున్నాయి. వన్డే కెరీర్లో 82 మ్యాచ్‌ల్లో 37.18 సగటుతో 2380 పరుగులు చేశాడు. 21 అర్ధసెంచరీలున్నాయి. సాధారణంగా క్రికెట్ ట్రోఫీలన్నీ లోహం (మెటల్)తోనే తయారవుతాయి. కానీ ‘కో–థోర్ప్ ట్రోఫీ’ మాత్రం భిన్నమైంది. ఇరు దిగ్గజ క్రికెటర్ల కుటుంబాలు బ్యాట్లు ఇవ్వడంతో డేవిడ్ తన నైపుణ్యంతో కలప ‘టోఫీ’గా మలిచాడు. దీన్ని మారి్టన్ సోదరి డెబ్ క్రో, మాజీ ఇంగ్లండ్ సారథి మైకేల్ అథర్టన్ కలిసి గురువారం క్రైస్ట్‌చర్చ్‌లో మొదలయ్యే తొలి టెస్టు సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆవిష్కరిస్తారు. -
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్‌కీపర్ బ్యాటర్ జోర్డన్ కాక్స్ కుడి చేతి బొటన వేలు ఫ్రాక్చర్ అయ్యింది. క్వీన్టౌన్లో జరుగుతున్న నెట్ సెషన్ సందర్భంగా కాక్స్ గాయపడ్డాడు. గాయం కారణంగా కాక్స్ న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కాక్స్‌కు రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించాల్సి ఉంది.కాగా, క్రైస్ట్ చర్చ్ వేదికగా నవంబర్ 28 నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌లో కాక్స్ అరంగేట్రం చేయాల్సి ఉండింది. అయితే ఈ లోపే అతను గాయపడి డెబ్యూ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాక్స్ జేమీ స్మిత్ స్థానంలో స్టాండ్ ఇన్ వికెట్‌కీపర్‌గా న్యూజిలాండ్ టూర్‌కు ఎంపికయ్యాడు. జేమీ స్మిత్ ప్రస్తుతం పితృత్వ సెలవులో ఉన్నాడు.ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్ ఎలెవెన్‌తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. జోర్డన్ కాక్స్ ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో పాల్గొన్నాడు. ఆతర్వాత అతను గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కనబర్చింది. తొలి ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (94), ఓలీ పోప్ (42).. రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ (82 నాటౌట్), బెన్ స్టోక్స్ (59) మాత్రమే రాణించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగింది.న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాకబ్ బేతెల్, రెహాన్ అహ్మద్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, ఓలీ పోప్ (వికెట్‌కీపర్), , షోయబ్ బషీర్, గస్ అట్కిన్సన్, ఓల్లీ స్టోన్, జాక్ లీచ్, మాథ్యూ పాట్స్ఇంగ్లండ్తో తొలి టెస్ట్‌కు న్యూజిలాండ్ జట్టు..గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, నాథన్ స్మిత్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్‌కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓ రూర్కీ, టిమ్ సౌథీషెడ్యూల్.. నవంబర్ 28-డిసెంబర్ 2 వరకు- తొలి టెస్ట్ (క్రైస్ట్ చర్చ్)డిసెంబర్ 6-10 వరకు- రెండో టెస్ట్ (వెల్లింగ్టన్)డిసెంబర్ 14-18 వరకు- మూడో టెస్ట్ (హ్యామిల్టన్) -
శ్రీలంక, న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు
పల్లెకెలె వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ఇవాళ (నవంబర్ 19) జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 21 ఓవర్ల పాటు మ్యాచ్ సజావుగా సాగింది. ఆతర్వాత వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ 9 పరుగులు చేసి ఔట్ కాగా.. విల్ యంగ్ 56, హెన్రీ నికోల్స 46 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్‌కు ఓ వికెట్ దక్కింది.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో శ్రీలంక తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. రెండు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటించింది. -
నిరసన డ్యాన్సులు..
-
న్యూజిలాండ్ - పార్లమెంట్ దద్దరిల్లింది
-
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 18 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 35 ఏళ్ల సౌథీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది డిసెంబర్లో తన హోం గ్రౌండ్( హామిల్టన్‌లోని సెడాన్ పార్క్)లో ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్ అనంతరం టెస్టులకు విడ్కోలు పలకనున్నట్లు సౌథీ వెల్లడించాడు.ఒకవేళ కివీస్ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే మాత్రం అతడు తన దేశం తరపున ఆడేందుకు అందుబాటులో ఉండనున్నాడు. అదే విధంగా దేశీవాళీ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నట్లు ఈ కివీ స్టార్ పేసర్ చెప్పుకొచ్చాడు. "న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. 18 సంవత్సరాలుగా బ్లాక్‌క్యాప్స్ కోసం ఆడటం నాకు చాలా స్పెషల్. టెస్టు క్రికెట్‌కు నా హృదయంలో ప్రత్యేక స్ధానం ఉంది. ఏ జట్టుపై అయితే నేను టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశానో, ఇప్పుడు అదే జట్టుపై నా కెరీర్‌ను ముగించనున్నాను. నాకు బాగా ఇష్టమైన మూడు మైదానాల్లో సెడాన్ పార్క్ ఒకటి.అందుకే అక్కడే టెస్టులకు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను"అని సౌథీ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా 2008లో ఇంగ్లండ్‌పై సౌథీ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టాడు. తన 18 ఏళ్ల కెరీర్లో కివీస్ తరపున ఇప్పటివరకు 104 టెస్టులు ఆడిన సౌథీ.. 385 వికెట్లతో పాటు 2185 పరుగులు సాధించాడు. మరోవైపు 161 వన్డేల్లో 742 పరుగులు, 221 వికెట్లు తీశాడు. 125 టీ20లు ఆడిన సౌథీ 303 పరుగులు, 164 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది -
New Zealand: ఆమె మళ్లీ వచ్చింది.. దద్దరిల్లిన పార్లమెంట్!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీ హన-రాహితి ‘హక’ వినూత్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో బిల్లు పేపర్లను చించేస్తూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.న్యూజిలాండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా హన-రాహితి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంట్లో ఆమె అడుగుపెట్టిన తర్వాత.. తమ కమ్యూనిటీ(మావోరి కమ్యూనిటీ)పై వివక్షను ప్రశ్నిస్తూ ఎంపీ హన-రాహితి పార్లమెంటులో చేసిన ప్రసంగం సంచలనం రేపింది. గిరిజన సంప్రదాయ పద్దతిలో హక చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక, తాజాగా మరోసారి హన-రాహితి ఇలా నిరసన తెలిపారు.తాజాగా ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ హన ‘హక’ ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా పార్లమెంట్లో బిల్లు పేపర్లు చించేస్తూ అధికార సభ్యులను చూస్తూ కోపంతో ఊగిపోయారు. ఇక, వెంటనే ఆమెకు మద్దతుగా సహచర ఎంపీలు, గ్యాలరీలో ఉన్నవారు కూడా గళం కలపడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.🇳🇿 Māori MPs performing the Haka in New Zealand Parliament ripping apart a bill redefining the Treaty of Waitangi.The Treaty of Waitangi is a document of central importance to the history of New Zealand, its constitution, and its national mythos. pic.twitter.com/OeUZ0g1UMj— Lord Bebo (@MyLordBebo) November 14, 2024ఇదిలా ఉండగా.. ఆమె గత ఏడాది అక్టోబర్‌లో నానాయా మహుతా నుంచి పోటీ చేసి హన-రాహితి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆమె (మావోరి కమ్యూనిటీ) గిరిజనుల కోసం పోరాడుతున్నారు. ఆమె హంట్లీ అనే ఓ చిన్న పట్టణానికి చెందింది. ఇక జనవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ‘నేను మీ కోసం చనిపోతాను. కానీ నేను మీకోసం కూడా జీవిస్తాను. నేను రాజకీయ నాయకురాలిని కాదు. మావోరీ భాష యొక్క సంరక్షకురాలిని అని చెప్పుకొచ్చారు. -
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. కుసాల్, అవిష్క శతకాలు.. శ్రీలంక భారీ స్కోర్
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్ 13) జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (115 బంతుల్లో 100; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ కుసాల్ మెండిస్ (128 బంతుల్లో 143; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. శ్రీలంక స్కోర్ 324/5 (49.2 ఓవర్లు) వద్ద నుండగా వర్షం అంతరాయం కలిగించింది. లంక ఇన్నింగ్స్‌లో మరో నాలుగు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి.శ్రీలంక వన్డేల్లో న్యూజిలాండ్‌పై 300 ప్లస్ స్కోర్ సాధించడం ఇది రెండో సారి మాత్రమే. 2019లో ఆ జట్టు 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో లంక బ్యాటర్లు కుసాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో రెండో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. న్యూజిలాండ్‌తో ఒకే వన్డేలో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది రెండోసారి. 2001లో షార్జాలో జరిగిన మ్యాచ్‌లో సనత్ జయసూర్య (107), మహేళ జయవర్దనే (116) సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 17 పరుగులకే ఆ జట్టు ఓపెనర్ పథుమ్ నిస్సంక (12) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత కుసాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో రెండో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. సెంచరీ పూర్తైన వెంటనే అవిష్క ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన సదీర సమరవిక్రమ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆతర్వాత బరిలోకి దిగిన కెప్టెన్ అసలంక వేగంగా 40 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. జనిత్ లియనాగే క్రీజ్‌లో ఉన్నాడు.కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ మూడు వికెట్లు పడగొట్టగా.. మైఖేల్ బ్రేస్‌వెల్, ఐష్ సోధి తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్‌కు ముందు శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించగా.. చివరి బంతి వరకు రసవత్తరంగా సాగిన రెండో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుంది. -
న్యూజిలాండ్‌కు భారీ షాక్.. హ్యాట్రిక్ వీరుడు దూరం
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా తొడ కండరాల గాయం కారంణంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దంబుల్లా వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టీ20లో హసరంగా తొడ కండరాలు పట్టేశాయి.గాయంతో బాధపడుతూనే తన బౌలింగ్ కోటాను హసరంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా వికెట్ల మధ్య కుంటుతూ కన్పించాడు. దీంతో అతడికి లంక మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానాన్ని దుషాన్ హేమంతతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది. దుషాన్ హేమంత శ్రీలంక తరపున ఇప్పటివరకు ఐదు వన్డేలు ఆడాడు. ఇటీవల ఎమర్జింగ్ ఆసియాకప్‌లో కూడా హేమంత అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. బుధవారం దంబుల్లా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.ఫెర్గూసన్‌కు గాయం..మరోవైపు న్యూజిలాండ్‌కు కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దంబుల్లా వేదికగా లంకతో జరిగిన రెండో టీ20లో ఫెర్గూసన్ గాయ పడ్డాడు.ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసి ఫెర్గూసన్ తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. కానీ అంతలోనే గాయపడడంతో సిరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని ఆడమ్ మిల్నేతో సెలక్టర్లు భర్తీ చేశారు.చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్‌పై వేటు! అతడికి ఛాన్స్? -
సూర్యకుమార్ యాదవ్ రికార్డును సమం చేసిన హసరంగ
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ల ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్‌లతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం హసరంగ ఖాతాలో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. అలాగే సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్ పేరిట కూడా ఐదు ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. హసరంగ 23 టీ20 సిరీస్‌ల్లో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకుంటే.. స్కై 22 సిరీస్‌ల్లో, బాబర్ ఆజమ్ 35, వార్నర్ 42, షకీబ్ 45 సిరీస్‌ల్లో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న రికార్డు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 46 సిరీస్‌ల్లో ఏడు సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. కాగా, తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హసరంగ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇది అతనికి ఐదో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో శ్రీలంక జట్టు 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. హసరంగ (4-1-17-4), మతీశ పతిరణ (4-1-11-3, నువాన్ తుషార (4-0-22-2), తీక్షణ (3.3-0-16-1) దెబ్బకు 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రీలంక ఈ మాత్రం స్కోర్‌ను కూడా ఛేదించలేక 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా న్యూజిలాండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపులో న్యూజిలాండ్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1 సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసి శ్రీలంక పతనానికి బీజం వేసిన లోకీ ఫెర్గూసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆరు వికెట్లు తీసిన హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. -
కివీస్‌తో రెండో టీ20.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడ్డ శ్రీలంక
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఇవాళ (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంక జట్టు బొక్కబోర్లా పడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్ తుషార (4-0-22-2), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక.. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శ్రీలంకను తొలుత లోకీ ఫెర్గూసన్ (2-0-7-3) హ్యాట్రిక్‌తో దెబ్బకొట్టగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు తీసి శ్రీలంక చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడిన పథుమ్ నిస్సంకను (52) ఫిలిప్స్ ఆఖరి ఓవర్ రెండో బంతికి ఔట్ చేశాడు. ఆతర్వాత మూడు, ఐదు బంతులకు పతిరణ (0), తీక్షణ (14) వికెట్లు తీశాడు. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంకతో పాటు భానుక రాజపక్స్(15), తీక్షణ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫిలిప్స్, ఫెర్గూసన్ తలో 3 వికెట్లు.. బ్రేస్‌వెల్ 2, సాంట్నర్, ఫోల్క్స్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని తొలి టీ20లో శ్రీలంక విజయం సాధించిన విషయం తెలిసిందే. -
శ్రీలంకతో రెండో టీ20.. హ్యాట్రిక్ తీసిన న్యూజిలాండ్ బౌలర్
డంబుల్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ పేసర్ లోకీ ఫెర్గూసన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునేందుకు బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఫెర్గూసన్ తన స్పెల్ మొదటి ఓవర్ చివరి బంతికి ఓ వికెట్ (కుసాల్ పెరీరా).. ఆతర్వాత రెండో ఓవర్ తొలి రెండు బంతులకు రెండు వికెట్లు (కమిందు మెండిస్, అసలంక) తీశాడు. ఫెర్గూసన్.. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన ఐదో బౌలర్‌గా (జేకబ్ ఓరమ్, టిమ్ సౌథీ (2), మైఖేల్ బ్రేస్‌వెల్, మ్యాట్ హెన్రీ).. ఓవరాల్‌గా టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన 64వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.The Lockie Ferguson hat-trick. 🌟pic.twitter.com/dhtmS1tLlp— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్ తుషార (4-0-22-2), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక..ఫెర్గూసన్ (2-0-7-3), మిచెల్ సాంట్నర్ (3-0-10-1) ధాటికి 34 పరుగులకే (7.2 ఓవర్లలో) నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుసాల్ మెండిస్ 2, కుసాల్ పెరీరా 3, కమిందు మెండిస్ 1, అసలంక డకౌట్ కాగా.. పథుమ్ నిస్సంక (33), భానుక రాజపక్స్ (15) శ్రీలంకను విజయతీరాలు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 11.2 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 63/4గా ఉంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే మరో 52 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
లంక స్పిన్నర్ల మాయాజాలం.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
డంబుల్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక స్పిన్నర్లు రెచ్చిపోయారు. వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) మాయాజాలం ధాటికి న్యూజిలాండ్ 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. తొలి బంతికే వికెట్ తీసిన పేసర్ నువాన్ తుషార రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి బంతికే ఓపెనర్ టిమ్ రాబిన్సన్ తుషార బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్క్ చాప్మన్ 2, గ్లెన్ ఫిలిప్స్ 4, మైఖేల్ బ్రేస్‌వెల్ 0, మిచ్ హే 3, జాకరీ ఫోల్క్స్ 6, ఐష్ సోధి ఒక్క పరుగు చేశారు. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్లు ఏ దశలోనూ న్యూజిలాండ్ బ్యాటర్లను మెరుగైన స్కోర్ దిశగా సాగనీయలేదు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో శ్రీలంక తొలి మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే. -
అసలంక కెప్టెన్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్‌పై శ్రీలంక ఘన విజయం
న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను శ్రీలంక విజయంతో ఆరంభించింది. దంబుల్లా వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది.బ్రాస్‌వెల్ (27), జాకరీ ఫోల్క్స్ (27 నాటౌట్) మినహా తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. టిమ్ రాబిన్సన్ (3), గ్లెన్ ఫిలిప్స్ (1), మిషెల్ హై (0), జోష్ క్లార్క్సన్ (3) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలగే 3, పతిరన, హసరంగ, నువాన్ తుషారా తలా రెండు వికెట్లు పడగొట్టారు.అసలంక కెప్టెన్ ఇన్నింగ్స్..అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చరిత్ అసలంక (28 బంతుల్లో 35; ఒక ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... కుశాల్ పెరీరా (23), కమిందు మెండిస్ (23), వనిందు హసరంగ (22) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకరీ ఫోల్క్స్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య నేడు దంబుల్లాలోనే రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.చదవండి: BGT 2024: టీమిండియా టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్లకు చోటు -
ఆత్మపరిశీలన అవసరం!
సొంతగడ్డపై చిరకాలంగా భారత క్రికెట్ జట్టు అజేయమైనదనే రికార్డు కుప్పకూలింది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ చేతిలో మనవాళ్ళు మొత్తం 3 టెస్టుల్లోనూ ఓటమి పాలయ్యారు. స్వదేశంలో టెస్ట్సిరీస్ను ఇలా 0–3 తేడాతో చేజార్చుకోవడం భారత క్రికెట్చరిత్రలో ఇదే ప్రథమం. కాగా, ఈ సిరీస్ పరాభవంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానం ఆస్ట్రేలియాకు కోల్పోయి, ద్వితీయ స్థానానికి పడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజమైనా, ఈ స్థాయి పరాజయం భారత జట్టు అత్యవసరంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. టీ20ల మోజులో పడి టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన కనీసపాటి సన్నద్ధత అయినా లేకుండానే బరిలోకి దిగిన మన ఆటగాళ్ళ నిర్లక్ష్యాన్ని నిలదీస్తోంది. ఆఖరుసారిగా 2012లో ఇంగ్లండ్‌కు చెందిన అలస్టయిర్ కుక్ చేతిలో ధోనీ సేన 2–1 తేడాతో టెస్ట్ సిరీస్‌లో ఓటమి పాలైన తర్వాత గత పుష్కరకాలంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఎన్నడూ మళ్ళీ సిరీస్‌ను కోల్పోలేదు. భారత జట్టు సారథులు మారుతూ వచ్చినా, 18 టెస్ట్ సిరీస్‌లలో విజయం మనదే. కివీస్‌పైనా ఆ ట్రాక్ రికార్డ్ కొనసాగుతుందని అందరూ భావించిన నేపథ్యంలో ఇది ఊహించని ఎదురుదెబ్బ. గత నెలలో బెంగుళూరులో 8 వికెట్ల తేడాతో తొలి టెస్ట్, ఆ వెంటనే పుణేలో 113 పరుగుల తేడాతో మలి టెస్ట్ ఓడిపోయినప్పుడే సిరీస్ చేజారింది. అయితే, ముంబయ్‌లో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లోనైనా గెలిచి, భారత జట్టు పరువు నిలుపుకొంటుందని ఆశించారు. చివరకు ఆ ఆశను కూడా వమ్ము చేసి, కివీస్ ముందు మన ఆటగాళ్ళు చేతులెత్తేయడం ఇప్పుడిప్పుడే మర్చిపోలేని ఘోర పరాభవం. ముంబయ్‌లో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక ఆదివారం భారత జట్టు 121 పరుగులకే ఆలౌట్ అవడంతో, అవమానకరమైన రీతిలో 0–3 తేడాతో సిరీస్‌ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కచ్చితంగా ఇది భారత జట్టుకు మేలుకొలుపు. భారత జట్టు వ్యూహరచన లోపాలు కొల్లలు. కివీస్‌తో బెంగుళూరు టెస్ట్‌లో టాస్ గెలిచాక మన వాళ్ళు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం అలాంటిదే. బ్యాట్స్మన్ల ఆర్డర్లో అనూహ్య ప్రయోగాల సంగతీ అంతే. ఇక, అవసరం లేకున్నా పుణేలో బంతి సుడులు తిరిగేలా పిచ్ రూపొందించారు. అదీ ప్రత్యర్థి జట్టుకే లాభించింది. కాబట్టి, భారత జట్టులోని మేధాబృందం ఆగి, ఆలోచించాలి. సిరీస్‌కు ముందు దులీప్ ట్రోఫీలో ఆడాలని చెప్పినా, మరిన్ని వసతుల కోసం అనంతపురం నుంచి బెంగు ళూరుకు వేదిక మార్చినా అగ్రశ్రేణి ఆటగాళ్ళు ముందుకు రాకపోవడం ఘోరం. వారిని అందుకు అనుమతించడం ఒక రకంగా క్రికెట్ బోర్డ్ స్వయంకృతాపరాధమే. దాని పర్యవసానం, సిరీస్ భవిత తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల అత్యల్పస్కోర్కి భారత్ అవుటైనప్పుడే అర్థమైపోయింది. స్పిన్ ఆడడంలో భారత ఆటగాళ్ళు దిట్టలని ప్రతీతి. కానీ, అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. జట్టులో బెస్ట్ బ్యాట్స్‌మెన్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌లో తరచూ ఔటవుతున్నారనీ, 2021 – 2024 మధ్య సొంత గడ్డపైన స్పిన్ బౌలింగ్‌లో సాధించిన సగటు పరుగులు 30 మాత్రమేననీ విశ్లేషకులు లెక్కలు తీశారు. అసాధారణ స్పిన్నర్లు కాకున్నా, కివీస్ బౌలర్ల చేతుల్లో భారత ఆటగాళ్ళు టకటకా ఔటవడం చూస్తే, స్పిన్‌లో మనం మాస్టర్లం కాదని తాజా సిరీస్ ఎత్తిచూపినట్టయింది. అలాగే, ఎర్ర బంతితో ఆడే టెస్ట్‌లకూ, తెల్ల బంతితో నడిచే టీ20 లకూ మధ్య చాలా తేడా ఉందని ఆటగాళ్ళు గ్రహించాలి. అన్ని బంతులూ ఆడి తీరాలి, పరుగులు చేయాలనే టీ20ల ధోరణితోనే టెస్ట్‌లు ఆడితే చిక్కులు తప్పవు. 2021లో టెస్ట్ ఓపెనర్‌గా ఇంగ్లండ్‌లో సక్సెస్ సాధించిన రోహిత్ మార్చుకున్న టీ20 ధోరణితోనే కివీస్‌పై ఆడడం వల్ల ఇబ్బంది పడ్డారు. కెప్టెన్‌గా ఆయనే పరుగులు చేయకపోతే, జట్టు పైన, ఆయన సారథ్యంపైన ఒత్తిడి తప్పదు. గతంలో 2011–12 ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టు నుంచి ద్రావిడ్, లక్ష్మణ్‌ల రిటైర్మెంట్కు దారి తీసింది. చరిత్ర పునరావృతమై, ఇప్పుడు రానున్న టూర్ కోహ్లీ, రోహిత్‌లకు చివరిది అవుతుందా? చెప్పలేం. అనూహ్యంగా వారిద్దరూ విఫలమైన కివీస్ సిరీస్ పరిస్థితే ఆస్ట్రేలియా టూర్ లోనూ ఎదురైతే, సీనియర్లు రిటైర్ కావాలంటూ ఒత్తిడి పెరుగుతుంది. ఇక, వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపి యన్ షిప్ విషయానికొస్తే, కివీస్ సిరీస్ దెబ్బతో వరల్డ్ టెస్ట్ ర్యాకింగుల్లో మన స్థానం పడిపోయినందున భారత్ ఫైనల్‌కు చేరడం కష్టమే. ఇంకా చెప్పాలంటే, ఆస్ట్రేలియాను దాని సొంత గడ్డపై 4–0 తేడాతో ఓడిస్తే కానీ, మన ఫైనల్ ఆశ పండదు. ఏ రకంగా చూసినా అసాధ్యమే. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా టూర్‌లోనైనా మన జట్టు మితిమీరిన ఆలోచనలు, అంచనాలు పక్కనబెట్టి కేవలం ఆడు తున్న టెస్టులపై ఒకదాని వెంట మరొకటిగా దృష్టి పెడితే మేలు. పరిస్థితులు, పిచ్ స్వభావాన్ని బట్టి అప్పటికప్పుడు ఆట తీరును మలుచుకోవాలే తప్ప, ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి దూకుడు చూపుదామనుకుంటే చిక్కే. మారకపోతే మళ్ళీ కివీస్‌తో సిరీస్‌లో లాగా బోర్లా పడక తప్పదు. నిజానికి, భారత్ ఇప్పటికీ మంచి జట్టే. ఆటగాళ్ళలో ప్రతిభకు కొదవ లేదు. అయితే, టాలెంట్ ఎంత ఉన్నా ఆటలో టెంపర్మెంట్ ముఖ్యం. వాటికి తోడు కింద పడినా మళ్ళీ పైకి లేచి సత్తా చాటే చేవ కీలకం. మన జట్టు ఇప్పుడు వీటిని ప్రదర్శించాలి. అందుకోసం తాజా సిరీస్ ఓటమికి కారణాలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 3–0 తేడాతో సిరీస్‌ను కోల్పోయి, ఈ అధఃపాతాళానికి ఎలా పడిపోయామో స్వీయ విశ్లేషణ జరుపుకోవాలి. టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన ఆనందాన్ని మర్చిపోక ముందే ఈ పరాజయాన్ని ఎలా కోరి కొని తెచ్చుకున్నామో విశ్లేషించుకోవాలి. ఎంతైనా, పరాజయాలే విజయాలకు మొదటి మెట్టు కదా! -
Ind vs NZ: ‘రిజర్వ్’ నుంచి ‘హీరో’గా మారి... టీమిండియాపై గెలుపులో కీలకంగా
ముంబై: న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్ 2020 డిసెంబర్లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే భారత్‌తో సిరీస్‌కు ముందు వరకు ఈ నాలుగేళ్లలో అతను 16 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. ప్రతీసారి రిజర్వ్ ఆటగాడిగానే ఎంపిక కావడం... విరామంలో సహచరులకు డ్రింక్స్ అందించడం మినహా అతనికి చెప్పుకోదగ్గ అవకాశాలే రాలేదు! జట్టులో ఎవరైనా గాయపడితే తప్ప యంగ్ పేరును టీమ్ మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి. గాయం నుంచి కేన్ విలియమ్సన్ కోలుకోకపోవడంతో ముందుగా తొలి టెస్టులో చాన్స్ లభించింది. ఆ తర్వాత విలియమ్సన్ తర్వాతి మ్యాచ్‌లూ ఆడలేడని ఖాయం కావడంతో యంగ్ చోటుకు ఢోకా లేకుండా పోయింది. చివరకు సిరీస్‌లో మొత్తం 244 పరుగులు సాధించి కివీస్ చారిత్రాత్మక విజయంలో కీలకపాత్ర పోషించిన అతను ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. డ్రింక్స్ అందించడమే తనకు అలవాటుగా మారిపోయిందని... ఇప్పుడు టీమ్‌ను గెలిపించడం తనకు గర్వంగా అనిపిస్తోందని విల్ యంగ్ వ్యాఖ్యానించాడు. ‘నాలుగేళ్లలో వేర్వేరు కారణాలతో నేను మైదానంలో కంటే బయటే ఎక్కువగా ఉన్నాను. ఎప్పుడూ రిజర్వ్ బ్యాటర్‌గానే నా పేరు ఉండేది. జట్టు సభ్యులకు డ్రింక్స్ అందించడమే ఒక అనుభవంగా మారిపోయింది. అయితే ఎప్పుడు అవకాశం వచ్చినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించా. విలియమ్సన్ స్థానంలో వచ్చి నా అతడిని అనుకరించకుండా నా సొంత ఆటనే ఆడాను. ఇప్పుడు నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది’ అని యంగ్ అన్నాడు. భారత్‌ను స్పిన్ పిచ్‌లపైనే చిత్తు చేయడం గొప్పగా అనిపించిందని యంగ్ చెప్పాడు. -
స్వయంకృతమే.. భారత సీనియర్ ఆటగాళ్ల ఘోరవైఫల్యం
బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లను ఎదుర్కోలేక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో తిరిగి కోలుకునే ప్రయత్నం చేసినా మ్యాచ్ మాత్రం చేజారింది! దీంతో 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు ఒక టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. ‘అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే’ అని కెప్టెన్ అంటే... అభిమానులు కూడా అతడికి అండగా నిలిచారు.సిరీస్‌లో వెనుకబడ్డ టీమిండియా రెండో టెస్టు కోసం పుణేలో స్పిన్ పిచ్‌ను సిద్ధం చేసింది. అది ముందే పసిగట్టిన న్యూజిలాండ్ పేసర్లను పక్కన పెట్టి స్పిన్నర్లను రంగంలోకి దింపి ఫలితం రాబట్టింది. మామూలు స్పిన్నర్లను సైతం ఎదుర్కోలేకపోయిన టీమిండియా... ఈసారి తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌట్ కాగా... మరో ఓటమి తప్పలేదు. ఈ విజయంతో భారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు తొలిసారి టెస్టు సిరీస్ గెలిచింది.కనీసం మూడో టెస్టులోనైనా భారత జట్టు విజయం సాధించక పోతుందా అని ఆశపడ్డ అభిమానులకు వాంఖడే స్టేడియంలోనూ గుండెకోత తప్పలేదు. 147 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 121 పరుగులకే పరిమితమై సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఒకవైపు మ్యాచ్ మ్యాచ్‌కూ పరిణతి చెందుతూ ముందుకు సాగిన న్యూజిలాండ్ మ్యాచ్‌కు ఒకటి చొప్పున ఘనతలు ఖాతాలో వేసుకుంటే... టీమిండియా మాత్రం చెత్త రికార్డు లిఖించుకుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆత్మపరిశీలన చేసుకోకుండా అంతకుమించిన పొరబాటు మరొకటి ఉండదు! సాక్షి క్రీడా విభాగం విదేశాల్లో ప్రదర్శనల సంగతి పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియాకు తిరుగులేదనేది జగమెరిగిన సత్యం. పుష్కరకాలంగా దీనికి మరింత బలం చేకూర్చుతూ భారత జట్టు... ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ వరుస సిరీస్‌లు గెలుస్తూ వస్తోంది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఇలా ప్రత్యర్థులు మారుతున్నారు తప్ప ఫలితం మాత్రం మారలేదు. ఈ జోరుతోనే వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన భారత్... ముచ్చటగా మూడోసారీ తుదిపోరుకు అర్హత సాధించడం ఖాయమే అనిపించింది. 12 ఏళ్లుగా స్వదేశంలో పరాజయం ఎరగకుండా జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా... ఈ క్రమంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచి రికార్డు సృష్టించింది. ఇదే జోష్‌లో ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుందనుకుంటున్న దశలో న్యూజిలాండ్ జట్టు సమష్టి ప్రదర్శనతో చెలరేగి టీమిండియాను నేలకు దించింది. మెరుగైన వ్యూహాలకు, మెరికల్లాంటి ప్లేయర్లు తోడైతే భారత్‌ను భారత్‌లో ఓడించడం పెద్ద కష్టం కాదని కివీస్ ప్లేయర్లు నిరూపించారు. ఇన్నాళ్లు భారత ప్లేయర్ల ప్రధాన బలమనుకున్న స్పిన్‌తోనే టీమిండియాను ఎలా దెబ్బకొట్టవచ్చో న్యూజిలాండ్ అచరణలో చూపింది. శ్రీలంకలో క్లీన్‌స్వీప్‌నకు గురై... కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు అనే స్థితిలో భారత్‌లో అడుగు పెట్టిన న్యూజిలాండ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ సిరీస్ క్లీన్‌స్వీప్ చేస్తే... అదే సమయంలో చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తూ టీమిండియా 91 ఏళ్ల తమ టెస్టు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన దశలో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్... అత్యుద్భుత ప్రదర్శనతో టీమిండియాపై సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. తమ ప్రధాన ఆటగాడు కేన్ విలియమ్సన్ లేకుండానే భారత్‌పై కివీస్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చితే... రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లున్న టీమిండియా మాత్రం నాసిరకం ఆటతీరుతో ఉసూరుమనిపించింది. ఆ ఏకాగ్రత ఏది? సుదీర్ఘ ఫార్మాట్లో సంయమనం ముఖ్యం అనేది మరిచిన భారత ప్లేయర్లు... క్రీజులోకి అడుగు పెట్టడంతోనే భారీ షాట్లకు పోయి వికెట్ సమర్పించుకోవడం చూస్తుంటే మనవాళ్లు టి20ల మాయలో పడ్డట్లు కనిపిస్తోంది. ఇదే నిజం అనుకుందాం అంటే ముంబై టెస్టులో 147 పరుగుల లక్ష్యఛేదనలో తలా రెండు భారీ షాట్లు ఆడిన టీమిండియా గెలవాల్సింది కానీ అదీ జరగలేదు. తొలి ఇన్నింగ్స్‌లో మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయిన కోహ్లి... రెండో ఇన్నింగ్స్‌లో అసలు నిలిచే ప్రయత్నం కూడా చేయలేకపోగా... రెండు ఫోర్లు బాదిన రోహిత్ అదే జోష్‌లో మరో చెత్త షాట్ ఆడి అప్పనంగా వికెట్ సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో గొప్ప పోరాట పటిమ చూపిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా టర్న్ అయిన బంతికి బౌల్డ్ కాగా... యశస్వి వికెట్ల ముందు దొరికిపోయాడు. మిడిలార్డర్లో ఆకట్టుకుంటాడనుకున్న సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. పంత్ ఒక్కడే సిరీస్ మొత్తం నిలకడ కనబర్చాడు. పక్కా గేమ్ ప్లాన్‌తో బరిలోకి దిగితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు రాబట్టడం పెద్ద కష్టం కాదని పంత్ నిరూపించాడు. ఇక మన స్పిన్నర్లు విజృంభిస్తారు అనుకొని సిద్ధం చేసిన పిచ్‌లపై ప్రత్యర్థి అనామక స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకుంటుంటే... అనుభవజ్ఞులైన మనవాళ్లు మాత్రం కింద వరుస బ్యాటర్లను సైతం అడ్డుకోలేక ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఎలాంటి పిచ్‌పైనైనా మొండిగా నిలబడి పోరాడగల చతేశ్వర్ పుజారా, రహానే వంటి ఆటగాళ్లు లేని లోటు ఈ సిరీస్‌తో స్పష్టం కాగా... ఆ్రస్టేలియా పర్యటనకు ముందు టీమిండియాకు ఈ సిరీస్ చాలా పాఠాలు నేరి్పంది. ఈ జట్టుతోనే ఆసీస్ టూర్‌కు వెళ్లనున్న టీమిండియా... లోపాలను అధిగమించకపోతే ‘బోర్డర్–గవాస్కర్’ ట్రోఫీని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. -
రసవత్తర స్థితిలో...
ఆఖరి మూడో టెస్టును స్పిన్నే దున్నేస్తోంది. రెండో రోజు 15 వికెట్లు కూలాయి. ఇంతలా గింగిర్లు తిరుగుతున్న పిచ్‌పై రిషభ్ పంత్ టెస్టులో టి20 ఆట ఆడేశాడు. దీంతో తొలి సెషన్లో ఆతిథ్య జట్టు వేగంగా పరుగులు సాధించింది. రెండో సెషన్లో ఎజాజ్ స్పిన్ భారత్‌ను చుట్టేసింది. అయితే మూడో సెషన్లో మన స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్‌లు చెలరేగడంతో భారత్ పట్టు బిగించినట్లు కనిపించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. నామమాత్రమైన ఆఖరి వికెట్ మిగిలుంది. ఇలాంటి కఠిన పిచ్‌పై ఇది కూడా చిన్న లక్ష్యమేమీ కాదు కాబట్టి మూడో రోజూ హోరాహోరీ పోరు ఖాయం. ముంబై: చివరి టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. అటో... ఇటో... ఎవరివైపో కానీ ఈ మ్యాచ్ అయితే మూడు రోజుల్లో ముగియడం ఖాయమైంది. ప్రత్యర్థి స్పిన్‌కు ఎదురీదితే భారత్ 1–2తో సిరీస్‌లో పరువు నిలుపుకుంటుంది. ఉచ్చులో పడితే మాత్రం సొంతగడ్డపై వైట్‌వాష్ అవుతుంది. రెండో రోజు ఆటలో మాత్రం భారత బ్యాటర్లే కాస్త పైచేయి సాధించారని చెప్పొచ్చు. 6 వికెట్లు సమర్పించుకున్న టీమిండియా క్రితం రోజు స్కోరుకు 177 పరుగులు జత చేసింది. శుబ్‌మన్ గిల్ (146 బంతుల్లో 90; 7 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (59 బంతుల్లో 60; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టారు. ఎజాజ్ పటేల్‌కు 5 వికెట్లు దక్కాయి. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు చేజార్చుకున్న న్యూజిలాండ్ 171 పరుగులు చేసింది. విల్ యంగ్ (100 బంతుల్లో 51; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు. పంత్ ధనాధన్ ఫిఫ్టీ తొలి సెషన్లో భారత బ్యాటర్లు రిషభ్ పంత్, శుబ్‌మన్ నిలకడగా ఆడటంతో కివీస్ బౌలర్ల ఆటలు సాగలేదు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ చాప్మన్ లాంగాన్‌లో గిల్ ఇచ్చిన క్యాచ్‌ను, లాంగాఫ్‌లో పంత్ క్యాచ్‌ను మ్యాట్ హెన్రీ వదిలేశారు. దీన్ని సద్వినియోగం చేసుకొన్న బ్యాటర్లు ఇద్దరూ అర్ధ సెంచరీలతో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. శనివారం 86/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 59.4 ఓవర్లలో 263 పరుగుల వద్ద ఆలౌటైంది.పంత్, గిల్ కివీస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ పరుగులు సాధించారు. ముఖ్యంగా రిషభ్ టి20 ఫార్మాటల్లే చెలరేగిపోయాడు. ఎజాజ్ పటేల్, ఫిలిప్స్ బౌలింగ్‌లో చూడచక్కని బౌండరీలు, భారీ సిక్సర్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో 29వ ఓవర్లోనే భారత్ స్కోరు 150 పరుగులను దాటింది. మరుసటి ఓవర్లోనే ఇద్దరి ఫిఫ్టీలు పూర్తయ్యాయి.30వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన గిల్ 66 బంతుల్లో, నాలుగో బంతికి పరుగు తీసిన రిషభ్ 36 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. కాసేపటి తర్వాత ఇష్ సోధి... పంత్‌ను ఎల్బీగా అవుట్ చేయడంతో ఐదో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రవీంద్ర జడేజా (14) క్రీజులోకి రాగా, టీమిండియా లంచ్ విరామానికి 195/5 స్కోరు చేసింది. అప్పటికి ఇంకా ఆతిథ్య జట్టు 40 పరుగులు వెనుకబడే ఉంది. ఎజాజ్ దెబ్బ రెండో సెషన్లో ఎజాజ్ పటేల్ స్పిన్ మాయాజాలం మొదలవడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. జట్టు స్కోరు 200 దాటగానే జడేజాను ఫిలిప్స్ అవుట్ చేయగా, స్వల్ప వ్యవధిలో ఎజాజ్... సర్ఫరాజ్ (0), గిల్, అశ్విన్ (6)ల వికెట్లను పడగొట్టడంతో గిల్ 10 పరుగుల దూరంలో సెంచరీ అవకాశాన్ని కోల్పోగా... భారత్ భారీ ఆధిక్యం సాధించలేకపోయింది.ఆకాశ్‌దీప్ (0) రనౌట్ కావడంతో టీ విరామానికి ముందే భారత్ 263 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అయితే వికెట్ పూర్తిగా స్పిన్‌కు అనువుగా మారిపోవడంతో భారత సీనియర్ స్పిన్ ద్వయం అశ్విన్–జడేజా కివీస్ రెండో ఇన్నింగ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్ తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు.మిచెల్ (21; 1 ఫోర్, 1 సిక్స్), ఫిలిప్స్ (26; 1 ఫోర్, 3 సిక్స్‌లు)ల అండతో యంగ్ 95 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. 171 పరుగుల వద్ద హెన్రీ (10)ని జడేజా బౌల్డ్ చేయడంతో రెండో రోజు ఆటను ముగించారు. ఆకాశ్‌దీప్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం కివీస్ 143 పరుగుల ముందంజలో ఉంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 235 భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఎజాజ్ 30; రోహిత్ (సి) లాథమ్ (బి) హెన్రీ 18; గిల్ (సి) మిచెల్ (బి) ఎజాజ్ 90; సిరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎజాజ్ 0; కోహ్లి రనౌట్ 4; పంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సోధి 60; జడేజా (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 14; సర్ఫరాజ్ (సి) బ్లన్‌డెల్ (బి) ఎజాజ్ 0; సుందర్ నాటౌట్ 38; అశ్విన్ (సి) మిచెల్ (బి) ఎజాజ్ 6; ఆకాశ్‌దీప్ రనౌట్ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (59.4 ఓవర్లలో ఆలౌట్) 263. వికెట్ల పతనం: 1–25, 2–78, 3–78, 4–84, 5–180, 6–203, 7–204, 8–227, 9–247, 10–263. బౌలింగ్: మ్యాట్ హెన్రీ 8–1–26–1, విలియమ్ ఓ రూర్కే 2–1–5–0, ఎజాజ్ పటేల్ 21.4–3– 103–5, గ్లెన్ ఫిలిప్స్ 20–0–84–1, రచిన్ రవీంద్ర 1–0–8–0, ఇష్ సోధి 7–0–36–1. న్యూజిలాండ్ రెండోఇన్నింగ్స్: లాథమ్ (బి) ఆకాశ్‌దీప్ 1; కాన్వే (సి) గిల్ (బి) సుందర్ 22; యంగ్ (సి అండ్ బి) అశ్విన్ 51; రచిన్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 4; మిచెల్ (సి) అశ్విన్ (బి) జడేజా 21; బ్లన్‌డెల్ (బి) జడేజా 4; ఫిలిప్స్ (బి) అశ్విన్ 26; ఇష్ సోధి (సి) కోహ్లి (బి) జడేజా 8; హెన్రీ (బి) జడేజా 10; ఎజాజ్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (43.3 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–2, 2–39, 3–44, 4–94, 5–100, 6–131, 7–148, 8–150, 9–171. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 5–0–10–1, వాషింగ్టన్ సుందర్ 10–0–30–1, అశ్విన్ 16–0–63–3, జడేజా 12.3–2–52–4. -
ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్.. ఆధిక్యం ఎంతంటే..?
-
IND Vs NZ: రెచ్చిపోయిన సుందర్.. లంచ్ విరామం సమయానికి కివీస్ స్కోర్ ఎంతంటే..?
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ (నవంబర్ 1) మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయాడు. కివీస్ స్టార్ బ్యాటర్లు టామ్ లాథమ్ (28), రచిన్ రవీంద్రను (5) క్లీన్ బౌల్డ్ చేశాడు. డెవాన్ కాన్వేను (4) ఆకాశ్‌దీప్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. లంచ్ విరామం సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. విల్ యంగ్ (38), డారిల్ మిచెల్ (11) క్రీజ్‌లో ఉన్నారు.WASHINGTON SUNDAR WITH TWO ABSOLUTE JAFFAS..!!!- First Latham, now Rachin. 🤯👌pic.twitter.com/JBz5P04YwP— Mufaddal Vohra (@mufaddal_vohra) November 1, 2024రెండో టెస్ట్‌లో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సుందర్ ఈ మ్యాచ్‌లోనూ ఇరగదీస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. మిచెల్ సాంట్నర్ గాయపడటంతో అతని స్థానంలో ఐష్ సోధి.. టిమ్ సౌథీ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ సైతం ఓ మార్పు చేసింది. బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. బుమ్రా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.Akash Deep traps Conway. 🔥 pic.twitter.com/tuTjqKupDf— Mufaddal Vohra (@mufaddal_vohra) November 1, 2024తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్న్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్.. బుమ్రా ఔట్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 1) మొదలుకానున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. మిచెల్ సాంట్నర్ గాయపడటంతో అతని స్థానంలో ఐష్ సోధి.. టిమ్ సౌథీ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ సైతం ఓ మార్పు చేసింది. బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. బుమ్రా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇదివరకే రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌దీప్, మొహమ్మద్ సిరాజ్న్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీచదవండి: విధ్వంసం సృష్టించిన ఎవిన్ లెవిస్.. తొలి వన్డేలో విండీస్ విజయం -
IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..?
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడో టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదని తెలుస్తుంది. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాకు విశ్రాంతినివ్వనున్నారని సమాచారం. మూడో టెస్ట్‌కు బుమ్రా అందుబాటులో ఉండడన్న విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్ నేరుగా చెప్పనప్పటికీ.. వర్క్ లోడ్ అనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తుంది. దీన్ని బట్టి చూస్తే బుమ్రాకు విశ్రాంతినివ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సెషన్స్‌లో సైతం బుమ్రా పెద్దగా బౌలింగ్ చేయలేదు. ఆకాశ్‌దీప్, మొహ్మద్ సిరాజ్ నెట్స్‌లో లాంగ్ స్పెల్స్ వేశారు. దీన్ని బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్ట్‌లో ఈ ఇద్దరు ఆడటం ఖాయంగా కనిపిస్తుంది.మూడో టెస్ట్‌లో ఇద్దరు పేసర్లతో పాటు ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. రెండో టెస్ట్‌లో ఆడిన స్పిన్నర్లే మూడో టెస్ట్‌లోనూ కొనసాగవచ్చు. మూడో టెస్ట్ కోసమని హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అతను బెంచ్‌కే పరిమితం అయ్యేలా కనిపిస్తున్నాడు. మూడో టెస్ట్‌లో టీమిండియా ఒక్క మార్పు మాత్రమే చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బుమ్రా స్థానాన్ని సిరాజ్ భర్తీ చేసే అవకాశం ఉంది. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగవచ్చు.న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ కోసం భారత జట్టు (అంచనా)..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రేపు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. చదవండి: మళ్లీ ఐదేసిన రబాడ.. ఫాలో ఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ -
India vs New Zealand: జయమా... పరాభవమా!
పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా... ఇప్పుడు క్లీన్‌స్వీప్ ప్రమాదం ముంగిట నిలిచింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఇప్పటి వరకు ఒక్క సిరీస్‌లోనూ క్లీన్‌స్వీప్ కాని భారత జట్టు... ఇప్పుడు న్యూజిలాండ్ తో అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరోవైపు భారత్‌లో భారత్‌పై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ నెగ్గని న్యూజిలాండ్... ఆ పని పూర్తి చేసి క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఈ మ్యాచ్‌లో విజయం అనివార్యం అయిన పరిస్థితుల్లో రోహిత్ బృందం ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం! తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసికట్టుగా కదంతొక్కాలని, భారత్‌ను గెలుపు బాట పట్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు.ముంబై: అనూహ్య తడబాటుతో న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన భారత జట్టు శుక్రవారం నుంచి వాంఖడే మైదానం వేదికగా నామమాత్రమైన మూడో టెస్టు ఆడనుంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా ... కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంటే... తొలిసారి భారత్ లో సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ దాన్ని క్లీన్‌స్వీప్‌గా మలచాలని భావిస్తోంది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో గత 12 సంవత్సరాలుగా భారత జట్టు టెస్టు సిరీస్ ఓడిపోలేదు. అంతేకాకుండా 1984 నుంచి స్వదేశంలో భారత జట్టు ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనూ మూడు టెస్టుల్లో ఓడిపోలేదు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పేస్ పిచ్‌ను సిద్ధం చేసి... వాతావరణ మార్పుల మధ్య తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంతో ఘోర పరాజయం మూటగట్టుకున్న రోహిత్ జట్టు... పుణేలో జరిగిన రెండో టెస్టులో స్పిన్ పిచ్‌పై కూడా తడబడింది. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలరనే పేరున్న మన ఆటగాళ్లు పుణే టెస్టులో పార్ట్ టైమ్ స్పిన్నర్ లాంటి సాంట్నర్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేయడం అభిమానులను కలవర పరిచింది. ఈ నేపథ్యంలో వాంఖడే పిచ్‌ను సహజసిద్ధంగా ఉంచామని... జట్టు కోసం పిచ్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని భారత సహాయక కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. ఈ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆఖరి మ్యాచ్‌లోనైనా రాణిస్తారా చూడాలి. వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన టీమిండియా... ముచ్చటగా మూడోసారి కూడా తుదిపోరుకు అర్హత సాధించాలంటే మిగిలిన ఆరు టెస్టుల్లో సత్తా చాటాల్సిన అవసరముంది. బ్యాటర్లపైనే భారం! కొట్టిన పిండి లాంటి స్వదేశీ పిచ్‌లపై పరుగులు రాబట్టేందుకు భారత ఆటగాళ్లు ఇబ్బంది పడుతుంటే... న్యూజిలాండ్ బ్యాటర్లు మాత్రం సులువుగా పరుగులు చేస్తున్నారు. 2, 52, 0, 8... ఈ సిరీస్‌లో టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మ స్కోర్లివి. టాపార్డర్‌లో ముందుండి ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన రోహిత్ ఇలాంటి ప్రదర్శన చేస్తుండగా... స్టార్ బ్యాటర్ కోహ్లి గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 0, 70, 1, 17 పరుగులు చేశాడు. చాన్నాళ్లుగా జట్టు బాధ్యతలు మోస్తున్న ఈ జంట స్థాయికి ఈ ప్రదర్శన తగినది కాకపోగా... మిగిలిన వాళ్లు కూడా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. యశస్వి జైస్వాల్ మంచి టచ్‌లో ఉండగా... శుబ్‌మన్ గిల్, సర్ఫరాజ్, పంత్ కలిసి కట్టుగా కదం తొక్కితేనే భారీ స్కోరు సాధ్యం. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అశి్వన్, వాషింగ్టన్ సుందర్ కేవలం బౌలింగ్‌పైనే కాకుండా బ్యాటింగ్‌లోనూ తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరముంది. ప్రధానంగా గత టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాళ్లను న్యూజిలాండ్ స్పిన్నర్ సాంట్నర్ వణికించిన చోట... అశ్విన్–జడేజా జోడీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ లోపాలను అధిగమించకపోతే టీమిండియా మూడో టెస్టులోనూ పరాభవం మూటగట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు కేన్ విలియమ్సన్ వంటి కీలక ఆటగాడు లేకుండానే భారత్‌పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ ఇదే జోరు చివరి మ్యాచ్‌లోనూ కొనసాగించాలని చూస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కెపె్టన్ లాథమ్ నిలకడగా రాణిస్తుండగా... ఫిలిప్స్, మిచెల్ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తే న్యూజిలాండ్‌కు ఈ టెస్టులోనూ తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో సౌతీ, ఒరూర్కీ, హెన్రీ, సాంట్నర్ విజృంభిస్తే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు. జోరుగా సాధన తొలి రెండు టెస్టుల్లో ప్రభావం చూపలేకపోయిన టీమిండియా... కివీస్‌తో మూడో టెస్టుకు ముందు జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. వాంఖడే పిచ్ స్పిన్‌కు సహకరించే అవకాశం ఉండటంతో స్పిన్నర్లను ఎదుర్కోవడంపై మన ప్లేయర్లు దృష్టి సారించారు. రోహిత్ శర్మ, కోహ్లితో పాటు ప్లేయర్లందరూ సాధనలో పాల్గొన్నారు. -
మూడో టెస్టుకు హర్షిత్
ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టెస్టు కోసం పేస్ బౌలర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. బుధవారం అతను జట్టుతో చేరతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ట్రావెలింగ్ రిజర్వ్‌లలో ఢిల్లీకి చెందిన హర్షిత్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రధాన జట్టులోకి రానున్నాడని సమాచారం. నవంబర్ 1 నుంచి భారత్, కివీస్ మధ్య మూడో టెస్టు వాంఖెడే మైదానంలో జరుగుతుంది. హర్షిత్‌కు ఇప్పటికే బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఆ్రస్టేలియాకు వెళ్లే భారత టెస్టు టీమ్‌లో చోటు లభించింది. దానికి ముందు ఒక టెస్టులో అతడిని ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.కివీస్‌తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో మూడో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే హర్షిత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టవచ్చు. బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లకు ఎంపికైనా... హర్షిత్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మంగళవారం అస్సాంతో ముగిసిన రంజీ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన హర్షిత్...ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 24.00 సగటుతో రాణా 43 వికెట్లు పడగొట్టాడు. విలియమ్సన్ దూరం వెలింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేని అతను ఇప్పుడు మూడో టెస్టునుంచి తప్పుకున్నాడు. విలియమ్సన్ భారత్‌కు రావడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గాయం నుంచి కోలుకొని అతను ప్రస్తుతం రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. అయితే ముందు జాగ్రత్తగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.సంచలన ప్రదర్శనతో కివీస్ ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో హడావిడిగా విలియమ్సన్‌ను బరిలోకి దించరాదని బోర్డు భావించింది. ఈ సిరీస్ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. దాని కోసం విలియమ్సన్ పూర్తి స్థాయిలో ఫిట్‌గా అందుబాటులో ఉండాలనేదే ప్రధాన కారణం. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన తర్వాత స్వదేశానికి వెళ్లిన విలియమ్సన్ గాయం కారణంగా భారత గడ్డపై అడుగు పెట్టనే లేదు. -
టీమిండియాతో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్ షాక్
టీమిండియాతో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. గాయం కారణంగానే విలియమ్సన్ తొలి రెండు టెస్ట్‌లకు కూడా దూరమయ్యాడు. వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ దృష్ట్యా విలియమ్సన్‌ను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంచామని కివీస్ మేనేజ్మెంట్ తెలిపింది. ప్రస్తుతం విలియమ్సన్ న్యూజిలాండ్‌లోనే రిహాబ్‌లో ఉన్నాడు. అతను మూడో టెస్ట్ కోసం భారత్‌కు రావడం లేదని కివీస్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోకి తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టెస్ట్ ముంబై వేదికగా నవంబర్ 1న ప్రారంభం కానుంది. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ విన్నర్ -
సిరీస్ తేల్చే సమరం
అహ్మదాబాద్: ‘భారత జట్టు విజయం సాధించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఇది సిగ్గు పడాల్సిన విషయం’... ఆదివారం జరిగిన రెండో వన్డేపై న్యూజిలాండ్ మహిళల జట్టు కెపె్టన్ సోఫీ డివైన్ చేసిన వ్యాఖ్య ఇది. ప్రత్యర్థి సారథి కాస్త ఘాటుగానే చెప్పినా మన జట్టు బ్యాటింగ్ బలహీనతను అది చూపించింది. గత మ్యాచ్‌లో 260 పరుగుల లక్ష్య ఛేదనలో 18వ ఓవర్లోనే 77 పరుగులకు భారత టాప్–5 వెనుదిరగడంతోనే ఓటమి దాదాపుగా ఖాయమైంది. 9వ నంబర్ బ్యాటర్ రాధా యాదవ్ ఆదుకోకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. కీలకమైన చివరి పోరులోనైనా బ్యాటింగ్‌లో రాణిస్తే సొంతగడ్డపై సిరీస్ గెలుచుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత్, కివీస్ టీమ్‌లు తలపడనున్నాయి. తొలి వన్డేలో కూడా భారత్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతోనే నెగ్గింది. రెండు వన్డేల్లో కలిపి మన బ్యాటర్లు ఎవరూ కనీసం అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. చివరి మ్యాచ్‌లో నెగ్గాలంటే ముగ్గురు ప్రధాన బ్యాటర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగాల్సి ఉంది. ముఖ్యంగా స్మృతి సుదీర్ఘ కాలంగా వరుసగా విఫలమవుతూ తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ సిరీస్‌లో ఆమె 5, 0 స్కోర్లకే పరిమితమైంది. ఇదే సిరీస్‌తో అరంగేట్రం చేసిన తేజల్ను తప్పు పట్టలేం కానీ జెమీమా కూడా మిడిలార్డర్లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందరూ సమష్టిగా చెలరేగితేనే కివీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. మరోవైపు న్యూజిలాండ్ గత విజయం తర్వాత ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. రెండో వన్డేలో బ్యాటర్లు మూడు అర్ధ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓపెనర్లు సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, హ్యాలిడే, మ్యాడీ గ్రీన్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక కెపె్టన్ సోఫీ డివైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు ఇటు సారథిగా కూడా ఆమె జట్టును సమర్థంగా నడిపిస్తోంది. సీనియర్ పేసర్ తహుహు ఆఫ్‌స్పిన్నర్ ఈడెన్ కార్సన్‌లు ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగల సమర్థులు. లాంటి స్థితిలో స్వదేశంలో సిరీస్ కోల్పోరాదంటే హర్మన్ బృందం రెట్టింపు శ్రమించాల్సి ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్ కౌర్ (కెపె్టన్), షఫాలీ, స్మృతి, యస్తిక, జెమీమా, తేజల్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా/శ్రేయాంక పాటిల్. న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ప్లిమ్మర్, లారెన్ డౌన్, హ్యాలిడే, గ్రీన్, ఇసబెల్లా, జెస్ కెర్, తహుహు, కార్సన్, జొనాస్. -
న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టీమిండియా ఓటమి
అహ్మదాబాద్ వేదికగా భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (అక్టోబర్ 27) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. సూజీ బేట్స్ (58), కెప్టెన్ సోఫీ డివైన్ (79) అర్ద సెంచరీలతో రాణించగా.. జార్జియా ప్లిమ్మర్ (41), మ్యాడీ గ్రీన్ (42) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ రెండు, ప్రియా మిశ్రా, సైమా ఠాకోర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 47.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లు లియా తహుహు, సోఫీ డివైన్ తలో మూడు వికెట్లు.. ఏడెన్ కార్సన్, జెస్ కెర్ చెరో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించారు. భారత ఇన్నింగ్స్‌లో రాధా యాదవ్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. షెఫాలీ వర్మ 11, స్మృతి మంధన 0, యస్తికా భాటియా 12, హర్మన్‌ప్రీత్ కౌర్ 24, జెమీమా రోడ్రిగెజ్ 17, తేజల్ హసబ్నిస్ 15, దీప్తి శర్మ 15, అరుంధతి రెడ్డి 2, సైమా ఠాకోర్ 29 పరుగులు చేసి ఔటయ్యారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపుతో 1-1తో సిరీస్ సమం అయ్యింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది. -
సిరీస్‌పై భారత మహిళల గురి
అహ్మదాబాద్: భారత మహిళల జట్టు సిరీస్ లక్ష్యంగా రెండో వన్డే బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తొలి మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్‌ను కంగు తినిపించిన భారత్ ఇప్పుడు వరుస విజయంపై కన్నేసింది. తద్వారా మరో వన్డే మిగిలుండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు కివీస్ ఈ మ్యాచ్‌లో పుంజుకొని సిరీస్ రేసులో నిలవాలని ఆశిస్తోంది. తప్పక గెలవాల్సిన ఒత్తిడి ఉన్న కివీస్ ఏమేరకు రాణిస్తుందో చూడాలి. స్మృతి రాణిస్తేనే... గత మ్యాచ్‌లో రెగ్యులర్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్ ఫిట్నెస్ సమస్యలతో దూరం కావడంతో సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్ జట్టును కలవరపెడుతోంది. ఇటీవలి టి20 ప్రపంచకప్ సహా వరుసగా విఫలమవడం బ్యాటింగ్ విభాగాన్ని ఒత్తిడికి గురిచేస్తోంది. టాపార్డర్‌లో షఫాలీ, యస్తిక భాటియా మెరుగ్గా ఆడటం, జెమీమా, దీప్తిశర్మ తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరుస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన తేజల్ హసబి్నస్ మిడిలార్డర్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో హర్మన్ జట్టులోకి వచ్చినా ఆమె స్థానానికి ఢోకాలేదు. కివీస్‌కు మరో దెబ్బ సిరీస్‌లో వెనుకబడిన న్యూజిలాండ్‌కు అమెలియా కెర్ గాయం మరో దెబ్బకొట్టింది. తొలి వన్డే సందర్భంగా ఆమె తొడకండరాల గాయానికి గురైంది. దీంతో మిగతా మ్యాచ్‌లకు దూరమైన ఆమె స్వదేశానికి పయనమైంది. ఇటీవల టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్టార్ ఆల్‌రౌండర్ లేకపోవడం జట్టుకు మరింత ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు సోఫీ డివైన్ సేన సమష్టిగా ఆడితేనే గెలిచి సిరీస్‌లో నిలుస్తుంది. లేదంటే సిరీస్ కోల్పోయే పరిస్థితి వస్తుంది. జట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, యస్తిక, జెమిమా, తేజల్ హసబ్నిస్, దీప్తిశర్మ, అరుంధతీ, రాధా యాదవ్, సయిమా, రేణుకా సింగ్. న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీబేట్స్, జార్జియా, బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసాబెల్ల గేజ్, జెస్ కెర్, మోలి ఫెన్ఫోల్డ్, ఎడెన్ కార్సన్, లీ తహుహు. -
IND vs NZ 2nd Test: ‘పరాభవ భారం’
‘నాపై ఇక కత్తులు దూయండి’... బెంగళూరు టెస్టులో 46కు ఆలౌట్ అయిన తర్వాత మీడియా సమావేశంలో రోహిత్ శర్మ వ్యాఖ్య ఇది! ‘12 ఏళ్ల తర్వాత ఒక సిరీస్ ఓడిపోయాం...ఈమాత్రం మినహాయింపు ఇవ్వడంలో తప్పు లేదు’...రెండో టెస్టులో ఓటమి అనంతరం అదే కెప్టెన్ చెప్పిన మాట ఇది. ఇన్నేళ్లుగా తమ ఆటతో విజయాలనే తాము అలవాటు చేశామని, కాబట్టి పరాజయం అందరికీ కొత్తగా అనిపిస్తోందని కూడా రోహిత్ అన్నాడు. అంటే 46 ఆలౌట్‌ను ఒకానొక అరుదైన రోజుగా అంగీకరించిన కెప్టెన్ కు ఇప్పుడు ఓటమి అలవాటైపోయినట్లుగా అనిపించింది! అయితే ఈ పుష్కర కాలంలో అప్పుడప్పుడు వచ్చిన మ్యాచ్ పరాజయాలకు, తాజాగా సిరీస్ కోల్పోవడానికి మధ్య చాలా తేడా ఉంది. ఇన్నేళ్లలో ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలాంటి టీమ్‌లు భారత్‌ను ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. మ్యాచ్‌లు గెలిచినా అవి సిరీస్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాయి. వీటితో పోలిస్తే న్యూజిలాండ్ టెస్టుల్లో అనామక జట్టు కిందే లెక్క. దీనికి ముందు 12 సిరీస్‌లలో కలిపి ఆ టీమ్ ఇక్కడ రెండే మ్యాచ్‌లు గెలవగలిగింది. పైగా ఇటీవలే శ్రీలంక చేతిలో 0–2తో చిత్తుగా ఓడి ఇక్కడకు వచ్చింది. సౌతీ, లాథమ్‌లకు మినహా మిగతావారెవరికీ ఇక్కడ టెస్టులు ఆడిన అనుభవం ఎక్కువగా లేదు. కేన్ విలియమ్సన్‌లాంటి స్టార్ ప్లేయర్ కూడా అందుబాటులో లేడు. అయినా సరే కివీస్ టీమ్ భారత్‌పై పైచేయి సాధించగలిగింది. రెండు పూర్తిగా భిన్నమైన పిచ్‌లపై ఆ జట్టు పైచేయి సాధించిన తీరు టీమిండియా లోపాలను చూపించింది. ముందుగా బెంగళూరు టెస్టులో పేస్ బౌలింగ్ ముందు భారత్ మోకరిల్లి చెత్త రికార్డులను నమోదు చేసింది. దాంతో హడావిడిగా మన బలం స్పిన్ అంటూ పూర్తిగా స్పిన్ పిచ్‌తో సిద్ధమైంది. కానీ ముందు మన బ్యాటర్లు అలాంటి పిచ్‌పై, స్పిన్‌ను సమర్థంగా ఆడగలరా లేదా అనే ఆలోచన రానట్లుంది! అందుకే సాంట్నర్ స్పిన్‌ను కూడా ఎదుర్కోలేకపోయింది. 2017లో ఇదే పుణేలో, ఇదే తరహా పిచ్‌పై ఇలాంటి లెఫ్టార్మ్ స్పిన్నర్ స్టీవ్ ఒ కీఫ్‌కు 12 వికెట్లు అప్పగించి ఆసీస్ చేతిలో భారత్ 333 పరుగులతో చిత్తయింది. ఇప్పుడు కూడా పదునైన స్పిన్‌ను ఆడటం తమ వల్ల కాదని మన బ్యాటర్లు నిరూపించారు. పిచ్‌పై గిర్రున తిరుగుతున్న బంతులకు వారి వద్ద జవాబు లేకపోయింది. బంగ్లాలాంటి బలహీన జట్టుపై దూకుడైన ఆటతో సిరీస్ గెలిచిన వైనంతో మన ప్లేయర్లలో అతి విశ్వాసం పెరిగినట్లు కనిపించింది. పైగా న్యూజిలాండ్ టెస్టుల్లో ప్రభావం చూపలేదనే తేలికపాటి భావం కూడా కావచ్చు! సిరీస్‌లో రోహిత్ విఫలం కాగా, కోహ్లి తన ఆటతో తీవ్రంగా నిరాశపర్చాడు. జైస్వాల్ ఒక్కడే ఆకట్టుకోగా, రెండో ఇన్నింగ్స్‌లో పంత్ రనౌట్ అతని నిరక్ష్యాన్ని చూపించింది. సాంట్నర్ చెలరేగిన చోట అదే శైలి బౌలర్ అయిన జడేజాకు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఇదే టీమ్ ఆ్రస్టేలియాకు వెళ్లి గెలుస్తుందనుకోవడం అత్యాశే. మరో వైపు కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా ఈ ఓటమిలో పాత్ర ఉంది. బంగ్లాపై సిరీస్ విజయాన్ని గొప్పగా చెప్పుకుంటూ...‘ఒక్క రోజులో 400 పరుగులు చేయగల, అవసరమైతే రెండు రోజులు నిలబడి డ్రా చేసుకోగల జట్టుగా మేం మారాలి. నా దృష్టిలో ఆటలో ఎదగడం అంటే అదే’ అంటూ వ్యాఖ్య చేశాడు. 400 సంగతేమో కానీ మన బ్యాటింగ్ బలహీనత ఏమిటో ఇది చూపించింది. శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ ఓటమి, 46 ఆలౌట్, 36 ఏళ్ల తర్వాత కివీస్ చేతిలో టెస్టు పరాజయం, ఇప్పుడు తొలిసారి సిరీస్, 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో పరాభవం...ఇవన్నీ కూడా కోచ్ గంభీర్ ఖాతాలో చేరాల్సినవే! ఇకపై మాటలను కట్టిపెట్టి కోచ్‌గా తన బాధ్యతలు సరిగ్గా నెరవేర్చాల్సిన సమయమిది. 4 రోహిత్ కెప్టెన్సీలో స్వదేశంలో భారత్ ఓడిన టెస్టుల సంఖ్య. గతంలో అజహర్, కపిల్ కెప్టెన్సీలో 4 మ్యాచ్‌లు ఓడగా... పటౌడీ నాయకత్వంలో భారత్ 9 మ్యాచ్‌లు ఓడింది. –సాక్షి క్రీడావిభాగం -
IND vs NZ: రెండో టెస్టులో భారత్ ఓటమి..
-
IND VS NZ 2nd Test: కివీస్ చేతిలో టీమిండియా ఓటమి
అప్డేట్:న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.టీ విరామ సమయానికి టీమిండియాస్కోరు: 178-7(40 ఓవర్లలో). విజయానికి ఇంకా 181 పరుగుల దూరంలో ఉంది.పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 147 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (77) రాణించగా.. రోహిత్ శర్మ (8), శుభ్‌మన్ గిల్ (23), విరాట్ కోహ్లి (17), రిషబ్ పంత్ (0) విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (21), సర్ఫరాజ్ ఖాన్ (9) కూడా నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 181 పరుగులు చేయాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో (7/59) భారత్‌ను దెబ్బకొట్టిన మిచెల్ సాంట్నర్ ఈ ఇన్నింగ్స్‌లోనూ (4/49) కష్టాల్లోకి నెట్టాడు.అంతకుముందు న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి, గిల్ చెరో 30 పరుగులు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు. -
255 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
పూణే వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (సెకెండ్ ఇన్నింగ్స్‌లో) న్యూజిలాండ్ 255 పరుగులకు ఆలౌటైంది. 198/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 57 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. తద్వారా న్యూజిలాండ్.. టీమిండియా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో (సెకెండ్) టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి, గిల్ చెరో 30 పరుగులు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్‌లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో నెగ్గిన విషయం తెలిసిందే. చదవండి: రసిఖ్ సలాం.. టీమిండియా రైజింగ్ స్టార్ -
ఇలా అయితే కష్టమే!
‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు’... అన్న చందంగా ఏరి కోరి సిద్ధం చేసుకున్న స్పిన్ పిచ్‌పై టీమిండియా బోల్తా కొట్టింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పిచ్ పేస్‌కు అనుకూలించడం వల్లే టీమిండియా తడబడింది అని సర్దిచెప్పుకున్న వాళ్లు సైతం... పుణే ప్రదర్శనతో బేజారవుతున్నారు. ప్రత్యర్థిని స్పిన్ వలలో వేసి ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్న రోహిత్ సేన చివరకు ఆ ఉచ్చులోనే చిక్కి విలవిల లాడింది. టెస్టు కెరీర్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాలుగు కంటే ఎక్కువ వికెట్లు తీసిన అనుభవం లేని సాంట్నర్‌కు ఏకంగా మనవాళ్లు ఏడు వికెట్లు సమర్పించుకున్నారు. భారత ఆటగాళ్లు తడబడ్డ చోటే రెండో ఇన్నింగ్స్‌లోనూ న్యూజిలాండ్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టడం పుండు మీద కారం చల్లినట్లయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నా... కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మాత్రం చక్కటి ఇన్నింగ్స్‌తో అలరించాడు. స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో క్రీజు వదలి ఒక అడుగు ముందుకు వేసి బంతిని అందుకోవడంతో పాటు... కాళ్ల కదలికలో చురుకుదనం చూపిస్తూ ఖాళీల్లోకి బంతిని పోనిచ్చి పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్నా... ఏమాత్రం తడబడకుండా క్రీజులో నిలిచి కెపె్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 1955–56 నుంచి భారత్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇక్కడ టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. 36 ఏళ్ల తర్వాత తొలిసారి భారత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు మ్యాచ్ ఓడిన టీమిండియా... ఇప్పుడు టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటిసారి సిరీస్ ఓటమి అంచున నిలిచింది. వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలనుకుంటున్న టీమిండియా... ఇదే ప్రదర్శన కొనసాగిస్తే మున్ముందు మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదు. 2023–25 ఎడిషన్‌లో భాగంగా భారత్ ఇంకా కేవలం ఆరు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అందులో ఒకటి న్యూజిలాండ్‌తో కాగా... మిగిలిన ఐదు ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియాతో. ఇలాంటి దశలో స్వదేశంలో ఆడుతున్న సిరీస్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితితో ఆసీస్ గడ్డపై అడుగు పెడుతుంది అనుకుంటే... ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వస్తున్నాయి. తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత భారత మాజీ కెప్టెన్ , హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... ‘జట్టులో పుజారా వంటి ప్లేయర్ ఎంతో అవసరం. ఎలాంటి పిచ్‌పైనైనా ఓపికగా నిలవడంతో పాటు సహచరులకు భరోసా ఇవ్వగల సామర్థ్యం అతడి సొంతం’ అని అన్నాడు. ఇప్పుడు వరుసగా రెండో టెస్టులోనూ మన బ్యాటర్ల ఆటతీరు చూస్తుంటే కుంబ్లే చెప్పింది నిజమే అనిపిస్తోంది. స్వదేశంలోనే పరిస్థితి ఇలా ఉంటే... ఆ్రస్టేలియా టూర్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందనే అనుమానాలు రేకెత్తక మానవు! గత రెండు ఆసీస్ పర్యటనల్లోనూ పుజారా క్రీజులో పాతుకుపోయి జట్టుకు మూలస్తంభంలా నిలిచి మరపురాని విజయాలు అందించాడు. మరి బెంగళూరు, పుణే పిచ్‌పైనే పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడుతున్న మనవాళ్లు కంగారూ గడ్డపై ఏం చేస్తారో వేచి చూడాలి! –సాక్షి క్రీడావిభాగం -
కాంస్యం కోసం యువ భారత్ పోరు
కౌలాలంపూర్: జొహర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారంతో రౌండ్ రాబిన్ లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. టాప్–2లో నిలిచిన ఆ్రస్టేలియా, బ్రిటన్ జట్లు టైటిల్ కోసం పోటీపడనుండగా... మూడో స్థానంలో నిలిచిన భారత్, నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్లు కాంస్య పతకం కోసం తలపడతాయి. 5–6 స్థానాల కోసం జపాన్, ఆతిథ్య మలేసియా జట్లు ఆడతాయి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్న భారత జట్టుకు నాలుగో మ్యాచ్‌లో ఆ్రస్టేలియా కళ్లెం వేసింది. ఒక్క గోల్ సమర్పించుకోకుండా భారత్‌ఫై నాలుగు గోల్స్ సాధించి ఆ్రస్టేలియా ఘనవిజయం నమోదు చేసుకుంది. అయినప్పటికీ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిస్తే భారత జట్టు ఫైనల్‌కు చేరుకునేది. కానీ అలా జరగలేదు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను భారత జట్టు 3–3తో ‘డ్రా’ చేసుకుంది.భారత్ తరఫున గుర్జోత్ సింగ్ (6వ నిమిషంలో), రోహిత్ (17వ నిమిషంలో), తాలెమ్ ప్రియోబర్తా (60వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ జట్టుకు జాంటీ ఎల్మెస్ (17వ, 32వ, 45వ నిమిషాల్లో) ఏకంగా మూడు గోల్స్ అందించాడు. కివీస్‌తో మ్యాచ్ ‘డ్రా’ కావడంతో భారత జట్టు ఫైనల్ బెర్త్ ఖరారయ్యేది ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధార పడింది. అయితే బ్రిటన్ జట్టు 3–1తో జపాన్‌పై, ఆ్రస్టేలియా 9–3తో మలేసియాపై ఘనవిజయం సాధించాయి. ఫలితంగా బ్రిటన్, ఆ్రస్టేలియా, భారత జట్లు 10 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఆ్రస్టేలియా, బ్రిటన్ తొలి రెండు స్థానాల్లో నిలువగా... భారత్‌కు మూడో స్థానం దక్కింది. -
IND Vs NZ: పుణేలోనూ పరేషాన్
తొలి టెస్టులో న్యూజిలాండ్ పేస్ బౌలర్ల ధాటికి దాసోహం అన్న భారత జట్టు... రెండో టెస్టులో స్పిన్నర్లను ఎదుర్కోలేక చేతులెత్తేసింది. ఏడేళ్ల క్రితం ఇక్కడే జరిగిన టెస్టు మ్యాచ్‌లో పూర్తి స్పిన్ పిచ్‌ను సిద్ధం చేసి ఆ్రస్టేలియా చేతిలో భంగపాటుకు గురైన టీమిండియా... ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలోనూ అలాంటి పరిస్థితే ఎదుర్కుంటోంది. స్పిన్‌ను ఆడటంలో సిద్ధహస్తులు అనుకున్న మన బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ బృందం కుప్పకూలగా ... భారత బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డచోట కివీస్ ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు. ఫలితంగా రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా గడ్డు స్థితిలో ఉంది. భారత గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవని న్యూజిలాండ్ ఇప్పటికే 301 పరుగుల ఆధిక్యంతో దూసుకెళ్తుండగా... పుష్కర కాలం నుంచి సొంతగడ్డపై సిరీస్ ఓటమి ఎరుగని టీమిండియా ఇప్పుడు ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది! ఇక ఈ మ్యాచ్ నుంచి రోహిత్ బృందం గట్టెక్కాలంటే అద్భుతం జరగాల్సిందే! పుణే: దశాబ్ద కాలంగా సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ... ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్న టీమిండియా 12 సంవత్సరాల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమి అంచున నిలిచింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ పేసర్ల ధాటికి బెంబేలెత్తి పరాజయం పాలైన టీమిండియా... ఇప్పుడు పుణేలో ప్రత్యర్థి స్పిన్ దెబ్బకు వెనుకంజ వేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన న్యూజిలాండ్ జట్టు శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (133 బంతుల్లో 86; 10 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. బ్లన్‌డెల్ (30 బ్యాటింగ్; 2 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. చేతిలో ఐదు వికెట్లు ఉన్న న్యూజిలాండ్... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 103 పరుగులు కలుపుకొని ఓవరాల్‌గా 301 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. బ్లన్డెల్తో పాటు గ్లెన్ ఫిలిప్స్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 16/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 45.3 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా (38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... యశస్వి జైస్వాల్ (30), శుబ్‌మన్ గిల్ (30) ఫర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిషెల్ సాంట్నర్ 7 వికెట్లతో సత్తా చాటగా... గ్లెన్ ఫిలిప్స్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. లాథమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన చోట... బ్యాటింగ్ ఎలా చేయాలో లాథమ్ ఆచరణలో చూపాడు. అప్పటికే 100 పరుగులకు పైగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన లాథమ్... ఒక్కో పరుగు జోడిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు బోర్డును నడిపించాడు. కాన్వే (17), విల్ యంగ్ (23), రచిన్ రవీంద్ర (9), మిచెల్ (18) ఎక్కువసేపు నిలవకపోయినా... చిన్న చిన్న భాగస్వామ్యాలు నిరి్మస్తూ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. పేసర్లు ప్రభావం చూపకపోవడంతో భారత కెపె్టన్ రోహిత్ శర్మ ఆరంభం నుంచే స్పిన్నర్లను నమ్ముకోగా.. సుందర్ మినహా అశ్విన్, జడేజా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయారు. మరి కాసేపట్లో రెండో రోజు ఆట ముగుస్తుందనగా.. లాథమ్‌ను సుందర్ వికెట్ల ముందు దొరక బుచ్చుకోగా... ఇప్పటికే 301 పరుగుల ఆధిక్యం సాధించిన న్యూజిలాండ్... టీమిండియా ముందు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం.ఒకరి వెంట ఒకరు.. బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు... స్పిన్‌కు స్వర్గధామంలా కనిపిస్తున్న పుణే పిచ్‌పైనైనా చెలరేగుతుంది అనుకుంటే అదీ సాధ్యపడలేదు. రెండో వికెట్‌కు గిల్, జైస్వాల్ జోడించిన 49 పరుగులే భారత ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం కాగా.. జట్టు స్కోరు 50 వద్ద గిల్ ఔటయ్యాడు.ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. సాంట్నర్ వేసిన ఊరించే బంతికి విరాట్ కోహ్లి (1) క్లీన్ బౌల్డ్ కాగా.. యశస్వి జైస్వాల్, పంత్ (18)ను ఫిలిప్స్ బుట్టలో వేసుకున్నాడు. గత మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి తన విలువ చాటుకున్న కోహ్లి చెత్త బంతికి పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్ (11), అశ్విన్ (4) ఎక్కువసేపు నిలువలేకపోయారు. బెంగళూరులో భారీ సెంచరీతో జట్టులో ఆత్మవిశ్వాసం నింపిన సర్ఫరాజ్ ఈసారి అదే ప్రయత్నం చేయలేకపోయాడు. జడేజా ధాటిగా ఆడగా... సుందర్ (18 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయంగా నిలిచాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 259; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 30; రోహిత్ (బి) సౌతీ 0; గిల్ (ఎల్బీ) (బి) సాంట్నర్ 30; కోహ్లి (బి) సాంట్నర్ 1; పంత్ (బి) ఫిలిప్స్ 18; సర్ఫరాజ్ (సి) రూర్కే (బి) సాంట్నర్ 11; జడేజా (ఎల్బీ) సాంట్నర్ 38; అశ్విన్ (ఎల్బీ) (బి) సాంట్నర్ 4; సుందర్ (నాటౌట్) 18; ఆకాశ్‌దీప్ (బి) సాంట్నర్ 6; బుమ్రా (ఎల్బీ) (బి) సాంట్నర్ 0; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్) 156. వికెట్ల పతనం: 1–1, 2–50, 3–56, 4–70, 5–83, 6–95, 7–103, 8–136, 9–142, 10–156. బౌలింగ్: సౌతీ 6–1–18–1, రూర్కే 3–2–5–0, ఎజాజ్ 11–1–54–0, సాంట్నర్ 19.3–1–53–7, ఫిలిప్స్ 6–0–26–2. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) సుందర్ 86; కాన్వే (ఎల్బీ) (బి) సుందర్ 17; యంగ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 23; రచిన్ (బి) సుందర్ 18; మిషెల్ (సి) జైస్వాల్ (బి) సుందర్ 18; బ్లన్‌డెల్ (బ్యాటింగ్) 30; ఫిలిప్స్ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (53 ఓవర్లలో 5 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–36, 2–78, 3–89, 4–123, 5–183. బౌలింగ్: అశ్విన్ 17–1–64–1; సుందర్ 19–0–56–4; జడేజా 11–1–50–0; బుమ్రా 6–1–25–0. -
‘సప్త’ సుందర్
వాషింగ్టన్ సుందర్ టెస్టు మ్యాచ్ ఆడి మూడున్నరేళ్లు దాటింది. ఈ సిరీస్ తొలి టెస్టులో అతనికి చోటే లేదు. అయితే రంజీ ట్రోఫీలో ప్రదర్శన కారణంగా జట్టులో నలుగురు రెగ్యులర్ స్పిన్నర్లు ఉన్నా రెండో టెస్టు కోసం 16వ సభ్యుడిగా అతడిని అదనంగా ఎంపిక చేశారు. ఆఫ్ స్పిన్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతనికి ఈ అవకాశం కల్పించింది. తొలి రోజు సుందర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఏకంగా ఏడు వికెట్లతో న్యూజిలాండ్‌ను పడగొట్టాడు. సహచర తమిళనాడు సీనియర్ అశ్విన్ తొలి మూడు వికెట్లతో మొదలు పెడితే సుందర్ దానిని కొనసాగించాడు. కివీస్‌ను 259 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా... రోహిత్ శర్మ వికెట్ చేజార్చుకొని రోజును కాస్త నిరాశగా ముగించింది. పుణే: భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో ఊహించినట్లుగానే తొలి రోజు నుంచే స్పిన్నర్ల జోరు మొదలైంది. ఆఫ్‌స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ (7/59), రవిచంద్రన్ అశ్విన్ (3/64) ధాటికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 259 పరుగులకే ఆలౌటైంది. డెవాన్ కాన్వే (141 బంతుల్లో 76; 11 ఫోర్లు), రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం ఆట ముగిసేసరికి భారత్ 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా... యశస్వి జైస్వాల్ (6 బ్యాటింగ్), శుబ్‌మన్ గిల్ (10 బ్యాటింగ్) తమ దూకుడును కట్టిపెట్టి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, సిరాజ్, కుల్దీప్ యాదవ్ స్థానాల్లో గిల్, ఆకాశ్‌దీప్, సుందర్ జట్టులోకి వచ్చారు. ఈసారీ వారిద్దరే... గత టెస్టు తరహాలోనే ఈ సారి కూడా కివీస్ టాప్–7లో కాన్వే, రచిన్ మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడగా... మిగతా వారంతా విఫలమయ్యారు. పేసర్లు వేసిన తొలి 7 ఓవర్లలో కివీస్ 5 ఫోర్లతో చకచకా 30 పరుగులు రాబట్టింది. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్లోనే అశ్విన్‌ను బౌలింగ్‌కు దించడం ఫలితాన్ని అందించింది. తన ఐదో బంతికే టామ్ లాథమ్ (15)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతను కొద్ది సేపటికే విల్ యంగ్ (18)ను పెవిలియన్ పంపించాడు. ఈ దశలో కాన్వే, రచిన్ కలిసి జట్టును ఆదుకున్నారు. లంచ్ తర్వాత బుమ్రా వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన కాన్వే 109 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు 62 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం తర్వాత కాన్వేను అవుట్ చేసి అశ్విన్ ఈ జోడీని విడగొట్టాడు. అయితే రచిన్ మాత్రం చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆకాశ్‌దీప్ ఓవర్లో రెండు వరుస ఫోర్లతో అతను 93 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగా... ఒకదశలో కివీస్ 197/3 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. టపటపా... స్పిన్నర్ సుందర్ కొత్త స్పెల్‌తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చక్కటి బంతితో రచిన్‌ను క్లీన్»ౌల్డ్ చేసి కివీస్ పతనానికి శ్రీకారం చుట్టిన అతను తర్వాతి ఓవర్లో బ్లన్‌డెల్ (3) పని పట్టాడు. టీ విరామం తర్వాత చివరి సెషన్లో మిగిలిన ఐదు వికెట్లు తీసేందుకు సుందర్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. అతని బంతులను ఆడలేక బ్యాటర్లంతా వికెట్లు సమర్పించుకున్నారు. ఒక్క మిచెల్ సాన్‌ట్నర్ (51 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే కొద్దిసేపు పోరాడగలిగాడు. తన తొలి 13 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయని సుందర్ తర్వాత 61 బంతుల వ్యవధిలో 7 వికెట్లు పడగొట్టడం విశేషం. ప్రత్యర్థి 10 వికెట్లను ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లే కలిసి పడగొట్టడం భారత్ తరఫున ఇదే తొలిసారి. 62 పరుగుల వ్యవధిలో కివీస్ చివరి 7 వికెట్లు కోల్పోయింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 15; కాన్వే (సి) పంత్ (బి) అశ్విన్ 76; యంగ్ (సి) పంత్ (బి) అశ్విన్ 18; రచిన్ (బి) సుందర్ 65; మిచెల్ (ఎల్బీ) (బి) సుందర్ 18; బ్లన్‌డెల్ (బి) సుందర్ 3; ఫిలిప్స్ (సి) అశ్విన్ (బి) సుందర్ 9; సాన్‌ట్నర్ (బి) సుందర్ 33; సౌతీ (బి) సుందర్ 5; ఎజాజ్ (బి) సుందర్ 4; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (79.1 ఓవర్లలో ఆలౌట్) 259. వికెట్ల పతనం: 1–32, 2–76, 3–138, 4–197, 5–201, 6–204, 7–236, 8–242, 9–252, 10–259. బౌలింగ్: బుమ్రా 8–2–32–0, ఆకాశ్‌దీప్ 6–0–41–0, అశ్విన్ 24–2–64–3, వాషింగ్టన్ సుందర్ 23.1–4–59–7, జడేజా 18–0–53–0. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బ్యాటింగ్) 6; రోహిత్ (బి) సౌతీ 0; గిల్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టానికి) 16. వికెట్ల పతనం: 1–1. బౌలింగ్: సౌతీ 3–1–4–1, రూర్కే 3–2–5–0, ఎజాజ్ 3–1–5–0, సాన్‌ట్నర్ 2–0–2–0. -
IND Vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. టీమిండియాలో మూడు మార్పులు
పూణే వేదికగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 24) ప్రారంభంకానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్‌కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేచదవండి: స్కై, విరాట్లను అధిగమించిన సికందర్ రజా -
హర్మన్‌ప్రీత్‌కు పరీక్ష!
అహ్మదాబాద్: ఇటీవల మహిళల టి20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన భారత జట్టు మరో పరీక్షకు సిద్ధమైంది. తాజా టి20 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన న్యూజిలాండ్ జట్టుతో నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తలపడనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఐసీసీ ట్రోఫీ కోసం చకోర పక్షిలా చూస్తున్న భారత మహిళల జట్టుకు తాజా టి20 ప్రపంచకప్‌లో చుక్కెదురైంది. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై వేటు పడటం ఖాయమే అని అంతా భావించినా... సెలక్షన్ కమిటీ మాత్రం హర్మన్‌పై నమ్మకముంచింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు హర్మన్‌కే పగ్గాలు అప్పగించింది. మరి అందరికంటే అనుభవజు్ఞరాలైన హర్మన్‌ప్రీత్ జట్టును ఎలా నడిపిస్తుందో చూడాలి. 12వ తరగతి పరీక్షల కారణంగా రిచా ఘోష్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోగా.. ఆశ శోభన గాయంతో జట్టుకు దూరమైంది. దీంతో నలుగురు యువ ఆటగాళ్లు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత ‘ఎ’ జట్టు ప్లేయర్లు తేజల్, సయాలీ, ప్రియా మిశ్రాతో పాటు డబ్ల్యూపీఎల్‌లో రాణించిన సైమా ఠాకూర్ మొదటిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. టి20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన 35 ఏళ్ల హర్మన్‌పై ఒత్తిడి అధికంగా ఉండగా... స్మృతి మంధాన, షఫాలీ వర్మ మెరుగైన ఆరంభాలు ఇవ్వాల్సిన అవసరముంది. మిడిలార్డర్లో హర్మన్‌తో పాటు జెమీమా, హేమలత, దీప్తి కీలకం కానున్నారు. మరోవైపు సోఫీ డివైన్ సారథ్యంలో టి20 ప్రపంచకప్ గెలిచి ఉత్సాహంగా ఉన్న న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. 20 భారత్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 20 వన్డేలు జరిగాయి. 10 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 9 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. 9 తొమ్మిది సంవత్సరాల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. చివరిసారి 2015లో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు 3–2తో సొంతం చేసుకుంది.54 ఓవరాల్‌గా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 54 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. 20 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా... 33 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. -
పుణేలో ప్రతీకారానికి సిద్ధం!
సొంతగడ్డపై తొలి టెస్టులో ప్రత్యర్థి చేతిలో ఓడి వెనుకబడటం, ఆ తర్వాత కోలుకొని వరుస విజయాలతో సిరీస్ గెలుచుకోవడం భారత జట్టుకు కొత్త కాదు. ఇటీవల ఆస్ట్రేలియా ఒకసారి, ఇంగ్లండ్ రెండుసార్లు ఇలాగే ముందంజ వేసినా మన టీమ్ మళ్లీ సత్తా చాటి తామేంటో చూపించింది. ఇప్పుడు ఈ విషయంలో న్యూజిలాండ్ వంతు! ప్రతికూల పిచ్ దెబ్బకు అనూహ్యంగా కివీస్ చేతిలో తొలి టెస్టులో ఓడిన టీమిండియా ప్రతీకారానికి సిద్ధమైంది. తమ స్థాయిని ప్రదర్శిస్తూ రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగుతోంది. మరోవైపు గత విజయం ఇచ్చిన ఉత్సాహంతో న్యూజిలాండ్ కూడా ఎక్కడా తగ్గరాదని పట్టుదలగా ఉంది. పుణే: ‘రెండు గంటలు మినహా మిగతా మ్యాచ్ మొత్తం మేం బాగా ఆడాం’... బెంగళూరు టెస్టులో ప్రదర్శనపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్య ఇది. పిచ్‌పై అంచనా తప్పడంతో 0–1తో సిరీస్‌లో వెనుకబడిన భారత్ ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వ రాదని భావిస్తోంది. అందుకే తమ టీమ్ బలగంతో పాటు స్పిన్ బలాన్ని కూడా నమ్ముకుంటోంది. పూర్తిగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ను రూపొందించి ప్రత్యర్థికి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సిరీస్‌లో 1–1తో సమంగా నిలుస్తుంది. బరిలోకి గిల్... గత టెస్టు మ్యాచ్ ఆడిన జట్టులోంచి భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కోలుకున్న టాపార్డర్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉన్నాడని మేనేజ్మెంట్ ప్రకటించింది. అయితే గిల్ వస్తే ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరం. రాహుల్‌పై విమర్శలు వస్తున్నా... అతను మిడిలార్డర్‌కు మారిన తర్వాత 1 సెంచరీ, 2 అర్ధసెంచరీలతో మెరుగైన ప్రదర్శనే చేశాడు. కానీ గత టెస్టులో ఆటను బట్టి సర్ఫరాజ్‌కే మొగ్గు చూపవచ్చు. ఈ యువ ఆటగాడు తన బ్యాటింగ్ జోరు కొనసాగించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. మరోవైపు సిరాజ్ ఫామ్‌లో లేకపోవడంతో అతనికి బదులుగా ఆకాశ్‌దీప్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఎలాగూ స్పిన్‌తో యుద్ధానికి సిద్ధం అవుతున్నారు కాబట్టి నాలుగో స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు. రోహిత్, యశస్వి, గిల్, కోహ్లిలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. పంత్ కూడా పూర్తిగా కోలుకున్నాడు. బంగ్లాదేశ్‌తో ఆడిన తరహాలో అశ్విన్, జడేజా కూడా ఒక చేయి వేస్తే తిరుగుండదు. బౌలింగ్‌లో వీరిద్దరితో పాటు కుల్దీప్ కివీస్‌ను కుప్పకూల్చాలని టీమ్ కోరుకుంటోంది. సాన్‌ట్నర్‌కు చోటు... తొలి టెస్టులో గెలిచినా... వాస్తవ పరిస్థితి ఏమిటో న్యూజిలాండ్‌కు తెలుసు. గత మ్యాచ్ విజయం తమలో స్ఫూర్తి నింపేందుకు పనికొస్తుందే తప్ప వరుసగా రెండో టెస్టులో భారత్‌ను ఇక్కడ ఓడించడం అంత సులువు కాదనేది నిజం. అందుకే టీమ్ అన్ని రకాలుగా సన్నద్ధమై ఉంది. పూర్తిగా స్పిన్ పిచ్ అయినా సరే ముందే బెదిరిపోమని, దానికి అనుగుణంగా తమ ఆటను మార్చుకుంటామని కెపె్టన్ లాథమ్ చెబుతున్నాడు. తొలి టెస్టులో కీలక బ్యాటింగ్ ప్రదర్శన చేసిన రచిన్, కాన్వే, యంగ్ మరోసారి జట్టుకు భారీ స్కోరు అందించగల సమర్థులు. వీరితో పాటు లాథమ్, మిచెల్, బ్లన్‌డెల్ కూడా రాణించాలని జట్టు ఆశిస్తోంది. దూకుడైన బ్యాటింగ్ చేయగల సమర్థుడైన ఫిలిప్స్ ఇటీవల పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా రాణిస్తుండటం ఆ జట్టుకు సానుకూలాంశం. అయితే బెంగళూరు తరహాలో ముగ్గురు పేసర్లు ప్రభావం చూపించే అవకాశం లేదు కాబట్టి ఒకరిని తప్పించి మరో రెగ్యులర్ స్పిన్నర్ సాన్ట్నర్ను జట్టు బరిలోకి దించనుంది. 2 పుణేలో భారత జట్టు ఇప్పటి వరకు రెండు టెస్టులు ఆడింది. ఒక మ్యాచ్‌లో ఓడి, మరో మ్యాచ్‌లో గెలిచింది. 2017లో ఆ్రస్టేలియా చేతిలో ఓడిన భారత్... 2019లో దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పిచ్, వాతావరణం తొలి టెస్టు ముగిసిన దగ్గరి నుంచి చెబుతున్నట్లుగా పూర్తిగా పొడిగా ఉండే స్పిన్ వికెట్‌ను సిద్ధం చేశారు. ఆట సాగుతున్నకొద్దీ స్పిన్నర్లు మరింత ప్రభావం చూపగలరు. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్షసూచన ఏమాత్రం లేదు. అయితే 2017లో ఇదే మైదానంలో పూర్తిగా స్పిన్ పిచ్‌ను తయారు చేసిన భారత్... ఆసీస్ స్పిన్ దెబ్బకు 333 పరుగులతో ఓడి భంగపడిన విషయం గమనార్హం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లి, సర్ఫరాజ్/రాహుల్, పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, ఆకాశ్‌దీప్/సుందర్. న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్ ), కాన్వే, యంగ్, రచిన్, మిచెల్, బ్లన్‌డెల్, ఫిలిప్స్, హెన్రీ, ఎజాజ్, సాన్‌ట్నర్, సౌతీ/రూర్కే. -
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు
లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది. న్యూజిలాండ్‌లో జరిగే ఫోర్డ్ ట్రోఫీలో క్యాంటర్బరీ ఆటగాడు చాడ్ బోవ్స్ 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ బాదాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో బోవ్స్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ట్రవిస్ హెడ్, ఎన్ జగదీశన్ పేరిట ఉండేది. వీరిద్దరూ 114 బంతుల్లో డబుల్ సాధించారు. తాజాగా బోవ్స్.. హెడ్ (సౌత్ ఆస్ట్రేలియా), జగదీశన్ (తమిళనాడు) రికార్డును బద్దలు కొట్టాడు. View this post on Instagram A post shared by Canterbury Cricket (@canterbury.cricket)బోవ్స్ ఈ మ్యాచ్‌లో మరో ఘనత కూడా సాధించాడు. న్యూజిలాండ్ లిస్ట్-ఏ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 110 బంతులు ఎదుర్కొని 205 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ లిస్ట్-ఏ చరిత్రలో అత్యధిక స్కోర్ రికార్డు జేమీ హౌ (222) పేరిట ఉంది.CHAD BOWES SMASHED THE FASTEST DOUBLE HUNDRED IN LIST A CRICKET HISTORY - 103 BALLS. 🤯 pic.twitter.com/sMbIUJnQBW— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2024మ్యాచ్ విషయానికొస్తే.. బోవ్స్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాంటర్బరీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఒటాగో 103 పరుగులకే ఆలౌటై 240 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. చదవండి: న్యూజిలాండ్ టీమ్‌కు కొత్త కెప్టెన్ -
న్యూజిలాండ్ టీమ్‌కు కొత్త కెప్టెన్
నవంబర్ 9 నుంచి శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేశారు ఆ దేశ సెలెక్టర్లు. ఈ సిరీస్‌లలో మిచెల్ సాంట్నర్ కివీస్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత న్యూజిలాండ్ ఆడుతున్న మొదటి పరిమిత ఓవర్ల సిరీస్ ఇదే. ఈ సిరీస్‌లలో సాంట్నర్ న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్, వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ మిచ్ హే తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫెర్గూసన్, జాకబ్ డఫీ, జాక్ ఫోల్క్స్ పేసర్లుగా.. ఐష్ సోధి స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా.. గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా.. మార్క్ చాప్మన్, హెన్రీ నికోల్స్, టిమ్ రాబిన్సన్, జోష్ క్లార్క్సన్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు.ఈ సిరీస్‌ల కోసం టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విలియమ్ ఓరూర్కీ, రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్లను పరిగణలోకి తీసుకోలేదు. వీరంతా ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో బిజీగా ఉన్నారు. భారత్‌తో సిరీస్ ముగిసిన అనంతరం వీరు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.కాగా, రెండు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. నవంబర్ 9న డంబుల్లా వేదికగా తొలి టీ20, నవంబర్ 10న అదే డంబుల్లా వేదికగా రెండో టీ20 జరుగనున్నాయి. అనంతరం నవంబర్ 13న డంబుల్లా వేదికగానే తొలి వన్డే, నవంబర్ 17, 19 తేదీల్లో క్యాండీ వేదికగా రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి.శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్ జట్టు..మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే (వికెట్‌కీపర్), హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ రాబిన్సన్, నాథన్ స్మిత్, ఐష్ సోధి, విల్ యంగ్చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు గాయం -
వారిద్దరూ సిద్ధమే
పుణే: గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన శుబ్‌మన్ గిల్‌తో పాటు... మోకాలి వాపుతో కీపింగ్ చేసేందుకు ఇబ్బంది పడిన రిషబ్ పంత్ రెండో టెస్టు వరకు అందుబాటులో ఉంటారని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే వెల్లడించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా... భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం నుంచి పుణేలో రెండో టెస్టు ప్రారంభం కానుండగా.. మంగళవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. అనంతరం డస్కటే మీడియాతో మాట్లాడాడు. బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాన్వేను స్టంపౌట్ చేసే ప్రయత్నంలో పంత్ మోకాలికి గాయమైంది. గతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అదే కాలికి శస్త్రచికిత్స జరగడంతో జట్టు మొత్తం ఆందోళనకు గురైంది. గాయం తీవ్రత ఎక్కువ ఉండటంతో వెంటనే పంత్ మైదానాన్ని వీడగా... అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. అనంతరం అత్యవసర పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్... పరిగెత్తడానికి ఇబ్బంది పడుతూనే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్ అనంతరం ‘పంత్‌ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొనడంతో అతడు రెండో టెస్టులో ఆడతాడా లేదా అనే సంశయం నెలకొంది. అయితే తాజాగా డస్కటే ఈ అంశంపై స్పష్టత ఇచ్చాడు. ‘పంత్ పూర్తిగా కోలుకున్నాడు. పుణే టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడు. గిల్ ఆరోగ్యం కూడా కుదుట పడింది. అతడు నెట్ ప్రాక్టీస్ కూడా చేశాడు. మ్యాచ్ వరకు అంతా సవ్యంగా ఉంటుంది అనుకుంటున్నాం’ అని డస్కటే పేర్కొన్నాడు. ఆ ఇద్దరి మధ్యే పోటీ భారత తుది జట్టులో చోటు కోసం ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ ఉందని డస్కటే అన్నాడు. తొలి టెస్టులో భారీ సెంచరీతో రాణించిన సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ మధ్య పోటీ ఉందని అన్నాడు. ‘ఇందులో దాయడానికి ఏమీ లేదు. తుది జట్టులో ఓ బెర్త్ కోసం పోటీ ఉంది. బెంగళూరు టెస్టులో సర్ఫరాజ్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ కూడా సంసిద్ధంగా ఉన్నాడు. పిచ్, పరిస్థితులను బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది. రాహుల్ ఆటతీరును కోచ్ గౌతమ్ గంభీర్ నిశితంగా పరిశీలిస్తున్నాడు. రాహుల్‌పై టీమ్ మేనేజ్మెంట్కు నమ్మకముంది. అదే సమయంలో దేశవాళీలతో పాటు అవకాశం వచ్చిన ప్రతిసారీ జాతీయ జట్టు తరఫున నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సర్ఫరాజ్‌ను కూడా పక్కన పెట్టలేం. అందుకే అందరు ఆటగాళ్లకు అండగా నిలుస్తాం. న్యూజిలాండ్ జట్టులో ఎక్కువ మంది ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉండటం వల్లే ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టుకు ఎంపిక చేశారు. ఇటీవల రంజీ ట్రోఫీలో అతడి ప్రదర్శన బాగుంది. తమిళనాడు తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి భారీ సెంచరీ బాదడంతో పాటు... బౌలింగ్‌లోనూ రాణించాడు’ అని డస్కటే గుర్తు చేశాడు. ఇక స్వదేశంలో జరిగిన టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ను కూడా డస్కటే వెనకేసుకొచ్చాడు. ‘బెంగళూరు టెస్టు ఆఖరి రోజు తొలి గంటలో సిరాజ్ చక్కటి బౌలింగ్ చేశాడు. దురదృష్టవశాత్తు వికెట్ దక్కక పోయినా... అతడి బౌలింగ్‌లో ఎలాంటి లోపం లేదు. నాణ్యమైన బంతులతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. పుణేలో పరిస్థితులను బట్టే జట్టు ఎంపిక ఉంటుంది’ అని డస్కటే వివరించాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఎలాంటి సమస్యలు లేవని అతడు అన్నాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టే అతడు తక్కువ బౌలింగ్ చేశాడని తెలిపాడు. టీమిండియా ముమ్మర సాధన తొలి టెస్టులో పరాజయం పాలై సిరీస్‌లో వెనుకబడిన టీమిండియా... రెండో టెస్టు కోసం కసరత్తులు చేస్తోంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు. పంత్ గాయం నేపథ్యంలో మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్... కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. కాసేపటికి మైదానంలోకి వచ్చిన పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో పాటు చివర్లో కీపింగ్ సాధన కూడా చేయడంతో అతడి ఫిట్‌నెస్‌పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. మరోవైపు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఇక కొత్తగా జట్టుతో కలిసి వాషింగ్టన్ సుందర్ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ సాగించాడు. ఈ మ్యాచ్ కోసం రూపొందించిన పిచ్‌ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెపె్టన్ రోహిత్ శర్మ, బౌలర్లు జడేజా తదితరులు నిశితంగా పరిశీలించారు. రెండో టెస్టు కోసం స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను తయారు చేసినట్లు సమాచారం. -
ఎలాంటి పిచ్ ఎదురైనా...
పుణే: తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు... రెండో మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఆ జట్టు ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ అన్నాడు. పుణేలో స్పిన్ పిచ్ ఎదురయ్యే అవకాశముందని... అయితే దాని కోసం కివీస్ ప్లేయర్ల వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్... 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం మిచెల్ మాట్లాడుతూ.. ‘పిచ్ గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. అది ఆటగాళ్ల పని కాదు. పరిస్థితులను ఆకలింపు చేసుకొని దానికి తగ్గట్లు ముందుకు సాగడం ముఖ్యం. ఇందులో మా ప్లేయర్లు సిద్ధహస్తులు. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ముఖ్యం. ప్రత్యర్థి 20 వికెట్లు పడగొట్టడంతో పాటు మంచి స్కోర్లు చేయడం గురించే మేం ఆలోచిస్తున్నాం. బెంగళూరు విజయం జట్టులో మరింత సానుకూల దృక్పథం నింపింది. అయితే దాన్ని పక్కన పెట్టి పుణేలో మళ్లీ తాజాగా ప్రారంభించాల్సిందే. శ్రీలంక పర్యటనలో భాగంగా గాలెలో పూర్తిగా స్పిన్ పిచ్‌లపై మ్యాచ్‌లు ఆడాం. ఒక్కో పిచ్ ప్రత్యేకత ఒకలా ఉంటుంది. వికెట్‌ను బట్టి ఆటతీరును మార్చుకుంటూ ముందుకు సాగాలి. తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ ప్రపంచ స్థాయి ప్లేయర్ అతడి ఆటతీరు నాకు చాలా ఇష్టం’ అని మిచెల్ అన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ మహిళల జట్టు తొలిసారి ఐసీసీ టి20 ప్రపంచకప్ గెలవడం చాలా ఆనందంగా ఉందని మిచెల్ పేర్కొన్నాడు. రెండో టెస్టుకూ విలియమ్సన్ దూరంపుణే: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత్‌తో రెండో టెస్టులో కూడా బరిలోకి దిగబోడని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. గజ్జల్లో గాయం కారణంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టుకు దూరమైన విలియమ్సన్... ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడని బోర్డు మంగళవారం స్పష్టం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు గెలిచిన న్యూజిలాండ్... గురువారం నుంచి రెండో టెస్టులో టీమిండియాతో తలపడుతుంది. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గాయపడ్డ విలియమ్సన్ అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. ‘కేన్ కోలుకుంటున్నాడు. అయితే వంద శాతం ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అతడు రెండో టెస్టులో ఆడబోవడం లేదు. ప్రస్తుతం విలియమ్సన్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. మూడో టెస్టు వరకు అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాడని భావిస్తున్నాం’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విలియమ్సన్ గైర్హాజరీలోనూ సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ జట్టు... 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచి సిరీస్‌లో ముందంజ వేసింది. -
ఐసీసీ వరల్డ్ కప్ బెస్ట్ టీమ్ ప్రకటన.. భారత్ నుంచి ఒకే ఒక్కరు
మహిళల టీ20 ప్రపంచకప్-2024 విజేతగా న్యూజిలాండ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీని న్యూజిలాండ్ ముద్దాడింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా ఈవెంట్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో కూడిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రకటించింది.ఈ టీమ్‌కు దక్షిణాఫ్రికా సారథి లారా వోల్వార్ట్ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వోల్వార్ట్ తన అద్భుత కెప్టెన్సీ, ప్రదర్శనతో సౌతాఫ్రికాను ఫైనల్‌కు చేర్చింది. 12 మంది సభ్యుల ఈ టీమ్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల నుంచి చెరో ముగ్గురికి అవకాశం లభించింది. ఈ జట్టులో భారత్ నుంచి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు ఒక్కరికే చోటు దక్కింది. . భారత జట్టు సెమీఫైనల్‌కు చేరడంలో విఫలమైనా నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి హర్మన్ 2 అర్ధ సెంచరీలు సహా 133.92 స్ట్రయిక్ రేట్‌తో 150 పరుగులు సాధించింది.జట్టు వివరాలు: లారా వోల్వార్ట్ (కెప్టెన్), తజీమిన్ బ్రిట్స్, నాన్కులులెకొ ఎమ్‌లాబా (దక్షిణాఫ్రికా), అమేలియా కెర్, రోజ్మేరీ మెయిర్, ఈడెన్ కార్సన్ (న్యూజిలాండ్), డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్ (వెస్టిండీస్), డానీ వ్యాట్ (ఇంగ్లండ్), మెగాన్ షుట్ (ఆ్రస్టేలియా), నిగార్ సుల్తానా (బంగ్లాదేశ్), హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్). -
అయ్యో పంత్...! నీకే ఎందుకిలా..? ఏడోసారి సెంచరీ మిస్..
-
వరల్డ్ ఛాంపియన్స్‌గా న్యూజిలాండ్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 ఛాంపియన్స్‌గా న్యూజిలాండ్ అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో చిత్తు చేసిన న్యూజిలాండ్ మహిళల జట్టు.. తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది.గత 15 ఏళ్లగా ఊరిస్తున్న పొట్టివరల్డ్కప్ టైటిల్‌ను ఎట్టకేలకు వైట్ ఫెర్న్స్ తమ సొంతం చేసుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా తలరాత మారలేదు. పురుషుల జట్టు మాదిరిగానే మరోసారి సౌతాఫ్రికా అమ్మాయిలు కూడా ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు. తొలిసారి వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడాలనుకున్న దక్షిణాఫ్రికా కల మాత్రం నేరవేరలేదు. ఏదమైనప్పటి అద్బుత పోరాటంతో ఫైనల్ వరకు వచ్చిన సౌతాఫ్రికాపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక టీ20 వరల్డ్‌కప్-2024 ముగిసిన నేపథ్యంలో విజేత, రన్నరప్ సహా ఈ టోర్నీలో పాల్గొన్న జట్లకు ఎంత మేర ప్రైజ్ మనీ దక్కిందన్న అంశాన్ని పరిశీలిద్దాం.విజేతకు ఎంతంటే?అయితే ఐసీసీ ఈ ప్రపంచకప్ నుంచి పురుషులు, మహిళల ప్రైజ్ మనీ సమానంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఛాంపియన్ న్యూజిలాండ్‌కు 2.34 మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ.19.67 కోట్లు) బహుమతి లభించింది.►అదే విధంగా గ్రూపు దశలో నాలుగింటికి మూడు మ్యాచ్‌లు గెలిచిన డివైన్ బృందానికి ఛాంపియన్‌గా అందుకున్న మొత్తంతో పాటు అదనంగా రూ. 78 లక్షలు ముట్టింది. అంటే న్యూజిలాండ్ మొత్తంగా ప్రైజ్‌మనీ రూపంలో రూ.20.45 కోట్లు దక్కనుంది.గ్రూప్ దశలో ఒక మ్యాచ్ గెలిచిన ప్రతి జట్టుకు రూ. 26.19 లక్షల నగదు బహుమతి అందింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌కు భారీగా ప్రైజ్ మనీ లభించింది.రన్నరప్‌కు ఎంతంటే?►రన్నరప్ దక్షిణాఫ్రికాకు 1.17 మిలియన్ డాలర్లు (రూ. 9. 83 కోట్లు). అంతేకాకుండా లీగ్ స్టేజీలో 3 మ్యాచ్‌లు గెలిచిన సౌతాఫ్రికాకు రూ. 78 లక్షలు ఇందుకు అదనంగా లభించాయి. దీంతో మొత్తంగా సూమారు రూ.10.62 కోట్ల నగదు బహుమతిని దక్షిణాఫ్రికా అమ్మాయిలు అందుకున్నారు.సెమీస్ చేరిన జట్లకు ఎంత ముట్టిందంటే?►గ్రూపు-ఎ నుంచి ఆస్ట్రేలియా, గ్రూపు-బి నుంచి వెస్టిండీస్ సెమీ ఫైనలిస్టులుగా అందుకున్న మొత్తం చెరో 5.67 కోట్ల రూపాయలు.►ఇక లీగ్ స్టేజీలో నాలుగింటికి 4 మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్‌కు అదనంగా దక్కిన మొత్తం 1.4 కోట్ల రూపాయలు.►అదే విధంగా గ్రూపు స్టేజిలో మూడు మ్యాచ్‌లు గెలిచిన విండీస్‌కు కు దక్కిన మొత్తం...రూ. 78 లక్షలు.►ఇక గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన భారత్‌కు కేవలం రూ. 52 లక్షలు మాత్రమే దక్కింది. ఎందుకంటే లీగ్ స్టేజీలో భారత్ కేవలం రెండు మ్యాచ్‌లే గెలిచింది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేత న్యూజిలాండ్
-
మహిళల టి20 ప్రపంచకప్ విశ్వవిజేతగా న్యూజిలాండ్ (ఫొటోలు)
-
W T20 WC 2024: కొత్త చాంపియన్ న్యూజిలాండ్
ఒక జట్టు తలరాత మారలేదు. పురుషులు, మహిళల జట్టేదైనా కావొచ్చు కానీ... దక్షిణాఫ్రికా ఐసీసీ ప్రపంచకప్ భాగ్యానికి మాత్రం నోచుకోలేదు. మరో‘సారీ’ చోకర్స్గానే మిగిలారు. మరో జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నేళ్లయినా న్యూజిలాండ్ పురుషుల జట్టు సాధించలేకపోయిన వరల్డ్‌కప్ (వన్డే, టి20) టైటిల్స్‌ను న్యూజిలాండ్ మహిళల జట్టు (2000లో వన్డే) సాధించి ఔరా అనిపించింది. దుబాయ్: దక్షిణాఫ్రికాను చూస్తే ఎవరైనా అయ్యో పాపం అనక మానరు! సరిగ్గా నాలుగు నెలల కిందట టీమిండియా చేతిలో పురుషుల జట్టు, ఇప్పుడేమో న్యూజిలాండ్ చేతిలో మహిళల దక్షిణాఫ్రికా టీమ్ ఫైనల్లో పరాజయంతో ప్రపంచకప్ కలను కలగానే మిగిల్చుకున్నాయి. సఫారీకిది తీరని వ్యథే! మరీ ముఖ్యంగా అమ్మాయిలకైతే గతేడాది సొంతగడ్డపై, ఇప్పుడు దుబాయ్‌లో వరుసగా రన్నరప్ ట్రోఫీనే దిక్కయింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో న్యూజిలాండ్ కొత్త విశ్వవిజేతగా అవతరించింది. అమీతుమీలో కివీస్ జట్టు 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. మూడో ప్రయత్నంలో టి20 ప్రపంచకప్‌ను దక్కించుకుంది. 2009, 2010లలో న్యూజిలాండ్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. విజేత న్యూజిలాండ్ జట్టుకు 23 లక్షల 40 వేల (రూ. 19 కోట్ల 67 లక్షలు) డాలర్లు, రన్నరప్ దక్షిణాఫ్రికా జట్టుకు 11 లక్షల 70 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 83 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్ అమెలియా కెర్ (43; 4 ఫోర్లు), ఓపెనర్ సుజీ బేట్స్ (32; 3 ఫోర్లు), మిడిలార్డర్లో బ్రూక్ హ్యాలిడే (28 బంతుల్లో 38; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎమ్‌లాబా 2 వికెట్లు తీయగా, అయబొంగ, ట్రియాన్, డి క్లెర్క్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులే చేసి ఓడిపోయింది. ఓపెనర్లు కెపె్టన్ లౌరా వోల్వార్ట్ (33; 5 ఫోర్లు), తజ్మిన్ బ్రిట్స్ (17; 1 ఫోర్) 6.5 ఓవర్లలో 51 పరుగులు చేసి శుభారంభమిచ్చారు. ఇక మిగిలిన 13.1 ఓవర్లలో 108 పరుగులు చేస్తే కప్ గెలిచేసేది. కానీ అదే స్కోరుపై బ్రిట్స్, కాసేపటికి లౌరా అవుట్ కావడంతోనే అంతా మారిపోయింది. తర్వాత వచ్చిన అనెకె (9), మరిజాన్ (8), డి క్లెర్క్ (6), ట్రియాన్ (14), సునె లుస్ (8), డెర్క్సెన్ (10) కివీ బౌలర్ల ధాటికి బెంబేలెత్తారు. రోజ్మేరీ, అమెలియా కెర్ చెరో 3 వికెట్లు తీశారు. కెర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు దక్కాయి. -
36 ఏళ్ల తర్వాత...
అంచనాలు తప్పలేదు... అద్భుతాలు జరగలేదు! బుమ్రా ఆరంభ మెరుపులు తప్ప మన బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను నిలువరించడంలో విఫలమయ్యారు. ఫలితంగా తొలి టెస్టులో భారత జట్టు పరాజయం పాలైంది.తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి... ఆ తర్వాత అసమాన పోరాటంతో పోటీలోకి వచ్చిన టీమిండియా చివరి రోజు మ్యాజిక్ కొనసాగించలేకపోయింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 36 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు విజయం నమోదు చేసుకుంది. బెంగళూరు: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది. వర్షం అంతరాయం మధ్య సాగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలిచింది. భారత గడ్డపై న్యూజిలాండ్‌కు 36 ఏళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1–0తో ముందంజ వేసింది. 107 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 0/0తో ఆదివారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి గెలిచింది. విల్ యంగ్ (76 బంతుల్లో 48 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రచిన్ రవీంద్ర (46 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) రాణించారు. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి పుణెలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఆడుతూ పాడుతూ! తొలి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బందిపడ్డ చోట... నాలుగో ఇన్నింగ్స్‌లో చేధన అంత సులువు కాదని అంతా భావించారు. అందుకు తగ్గట్లే ఇన్నింగ్స్ ఐదో బంతికే టామ్ లాథమ్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బుమ్రా భారత శిబిరంలో ఆనందం నింపాడు. అయితే ఆ సంబరాలు ఎక్కువసేపు సాగలేదు. బుమ్రా, సిరాజ్ కట్టుదిట్టమైన బంతులు సంధించినా... న్యూజిలాండ్ బ్యాటర్లు సంయమనం కోల్పోలేదు. ఈ క్రమంలో కాన్వే (17) కూడా బుమ్రా బౌలింగ్‌లోనే వెనుదిరగ్గా... క్రీజులోకి వచ్చిరాగానే రచిన్ రవీంద్ర ఎదురుదాడి ప్రారంభించాడు. మరో ఎండ్ నుంచి యంగ్ కూడా ధాటిగా ఆడటంతో లక్ష్యం సులువైపోయింది. మూడో స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ ధారాళంగా పరుగులు ఇచ్చుకోగా... అదనపు పేసర్ ఆకాశ్‌దీప్ లోటు స్పష్టంగా కనిపించింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కాగా... తిరిగి వర్షం వచ్చి మ్యాచ్ నిలిచిపోతే బాగుండు అని సగటు భారత క్రీడాభిమాని ఆశించినా అది సాధ్యపడలేదు. క్లిష్టమైన బంతులను కాచుకుంటూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన రచిన్, యంగ్ జోడీ మూడో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402; భారత్ రెండో ఇన్నింగ్స్ 462; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) బుమ్రా 0; కాన్వే (ఎల్బీ) బుమ్రా 17; యంగ్ (నాటౌట్) 48; రచిన్ రవీంద్ర (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (27.4 ఓవర్లలో 2 వికెట్లకు ) 110. వికెట్ల పతనం: 1–0, 2–35. బౌలింగ్: బుమ్రా 8–1–29–2; సిరాజ్ 7–3–16–0; జడేజా 7.4–1–28–0; కుల్దీప్ 3–0–26–0, అశ్విన్ 2–0–6–0. ఈ మ్యాచ్ తొలి మూడు గంటలు తప్ప మేం మంచి ప్రదర్శనే చేశాం. అప్పుడప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తుంటాయి. వాటిని దాటి ముందకు వెళ్లాలి. ఈ ఒక్క పరాజయాన్ని బట్టి ప్లేయర్ల సామర్థ్యాన్ని అంచనా వేయకూడదు. తొలి ఇన్నింగ్స్‌లో మా బ్యాటింగ్ బాగా సాగలేదు. రెండో ఇన్నింగ్స్‌లో దాన్ని సరిదిద్దుకున్నాం. ఈ మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా చాలా పాఠాలు నేర్చుకున్నాం. శుబ్‌మన్ గిల్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ బాధ్యత తీసుకొని భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది జట్టుకు శుభసూచకం. ఇంగ్లండ్‌పై ఇలాగే తొలి టెస్టు ఓడిన తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గాం. ఒక మ్యాచ్ ఫలితంతోనో ఒక సిరీస్ ఫలితంతోనో జట్టు దృక్పథం మారదు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ 36 సంవత్సరాల తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉంది. రెండో టెస్టులో టీమిండియా నుంచి గట్టి పోటీ ఎదురువుతుందని మాకు తెలుసు. రెండో ఇన్నింగ్స్‌లో రెండో కొత్త బంతి తీసుకున్న తర్వాతే తిరిగి పోటీలోకి వచ్చాం. మా పేసర్లు చక్కటి బంతులతో టీమిండియాను కట్టడి చేయడంతో ఛేదన సులువైంది. తొలి ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర, టిమ్ సౌతీ మధ్య భాగస్వామ్యమే జట్టును గెలిపించింది. –టామ్ లాథమ్, న్యూజిలాండ్ కెప్టెన్ -
IND Vs NZ Photos: 36 ఏళ్ల నిరీక్షణకు తెర.. తొలి టెస్టు కివీస్‌దే (ఫోటోలు)
-
3 నిమిషాలు మించి హత్తుకోకండి
వెల్లింగ్టన్: తమను విడిచి విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్‌పోర్టుల్లో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు గుంపులుగా వచ్చి వీడ్కోలు చెబుతుండటం మనం చూసే ఉంటాం. ఇలా ఒక్కో ప్రయాణికుడికి వీడ్కోలు చెప్పే వారి సంఖ్య పెరుగుతుండటం, వచీ్చపోయే ద్వారాల వద్ద రద్దీ ఎక్కువవడంతో న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్ ఎయిర్పోర్ట్ నిర్వాహకులు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. ‘‘మీ ఆప్తులకు హత్తుకుని వీడ్కోలు పలకాలంటే గరిష్టంగా మూడు నిమిషాలే హగ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ సమయం మనసారా వీడ్కోలు పలకాలంటే కారు పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోండి’అని ఒక పెద్ద బోర్డ్ తగిలించింది. తమ నిర్ణయాన్ని ఎయిర్పోర్ట్ సీఈఓ డేనియర్ బోనో సమర్థించుకున్నారు. ‘‘విరహవేదన కావొచ్చు ఇంకేమైనా కావొచ్చు. ఆప్తులు దూరమవుతుంటే కౌగిలించుకుంటే ఆ బాధ కాస్తయినా తీరుతుంది. అందుకే కౌగిలించుకుంటే కేవలం 20 సెకన్లలోనే ప్రేమ హార్మోన్ ‘ఆక్సిటాసిన్’విడుదలవుతుంది. బాధ తగ్గుతుంది. అంతమాత్రాన దారిలో అడ్డుగా ఉండి అదేపనిగా హత్తుకుంటే ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. డ్రాప్ జోన్ల వద్ద అడ్డుగా ఉండటం సబబు కాదు’అని ఆయన వాదించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమ వారికి ప్రశాంతంగా కాస్తంత ఎక్కువ సమయం వీడ్కోలు చెప్పడం కూడా ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందా? అని కొందరు విమర్శలకు దిగారు. ఎయిర్పోర్ట్ నిర్ణయాన్ని కొందరు సమర్థించారు. ‘‘మిగతా దేశాల్లో కారులో లగేజీ దింపి హత్తుకుని, ఏడ్చి సాగనంపితే ఆ కొద్ది సమయానికే ‘కిస్ అండ్ ఫ్లై’చార్జీల కింద చాలా నగదు వసూలుచేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఎంతో మంచిది. తొలి 15 నిమిషాలు పార్కింగ్ ఉచితం’’అని ఒక ప్రయాణికుడు మెచ్చుకున్నాడు. ప్రయాణికుల వెంట వచ్చే వారిని తగ్గించేందుకు చాలా దేశాల ఎయిర్‌పోర్ట్‌లు ఆ కొద్దిసేపు కారు ఆపినందుకు కూడా చార్జీలు వసూలుచేస్తుండం గమనార్హం. బ్రిటన్‌లోని ఎస్సెక్స్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఇందుకు 15 నిమిషాలకు దాదాపు రూ.768 వసూలుచేస్తోంది. -
లక్ష్యం కివీస్107 పరుగులు... భారత్ 10 వికెట్లు!
మూడు రోజులుగా మలుపులతో టెస్టు క్రికెట్ మజాను చూపించిన బెంగళూరు మ్యాచ్ ఆసక్తికర ముగింపునకు చేరింది... తప్పులు సరిదిద్దుకొని రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిన భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ప్రదర్శన వెంటాడింది... ఫలితంగా న్యూజిలాండ్ ముందు 107 పరుగుల అతి స్వల్ప లక్ష్యం... కాపాడుకోవాల్సిన పరుగులు తక్కువే కానీ ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిన చోట మన బౌలర్లు నిలువరించలేరా, కుప్పకూల్చలేరా... బుమ్రా వేసిన తొలి నాలుగు బంతులు ఇదేనమ్మకాన్ని కలిగించాయి... అయితే చివరి రోజు బౌలింగ్‌తో పాటు వాతావరణం, పిచ్ కూడా మనకు కలిసి రావాలి! 35.1 ఓవర్లలో 177 పరుగులు...సర్ఫరాజ్, పంత్ భాగస్వామ్యం శనివారం భారత అభిమానులను అలరించింది...ఈ జోడీ మెరుపు బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా జట్టు సాగుతున్నట్లు అనిపించింది... సర్ఫరాజ్ ఖాన్ కెరీర్లో తొలి సెంచరీతో మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకోగా, శతకం చేజారినా...పంత్ చేసిన 99 పరుగులు ప్రత్యేకంగా నిలిచాయి. అయితే న్యూజిలాండ్ తీసుకున్న కొత్త బంతి భారత్ రాత మార్చింది. 408/3తో పటిష్టంగా కనిపించిన టీమ్ 54 పరుగులకే తర్వాతి 7 వికెట్లు కోల్పోయింది. దాంతో మ్యాచ్ మళ్లీ కివీస్ వైపు మొగ్గింది. బెంగళూరు: భారత్ గడ్డపై 36 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ నెగ్గేందుకు న్యూజిలాండ్ రంగం సిద్ధం చేసుకుంది. ప్రత్యర్థి ముందు భారత్ కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 బంతులే ఎదుర్కొన్న కివీస్ పరుగులేమీ చేయలేదు. వెలుతురులేమి, ఆపై వాన కారణంగా అంపైర్లు ముందుగానే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. శనివారం 51.1 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. అంతకు ముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 99.3 ఓవర్లలో 462 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (195 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా...రిషభ్ పంత్ (105 బంతుల్లో 99; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. రూర్కే, హెన్రీ చెరో 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. భారీ భాగస్వామ్యం... ఓవర్‌నైట్ స్కోరు 231/3 వద్ద సర్ఫరాజ్, పంత్ నాలుగో రోజు ఉదయం జత కలిశారు. అక్కడినుంచి కివీస్ బౌలర్లపై వీరిద్దరి ఆధిపత్యం కొనసాగింది. ఒకరితో మరొకరు పోటీ పడుతూ పరుగులు సాధించగా...కివీస్ బౌలర్లంతా చేతులెత్తేశారు. లేట్ కట్, ర్యాంప్ షాట్లతో సర్ఫరాజ్ పరుగులు రాబట్టగా, స్లాగ్ స్వీప్‌లతో పంత్ విరుచుకుపడ్డాడు. ఒక దశలో 16 బంతుల వ్యవధిలో సర్ఫరాజ్ 5 ఫోర్లు బాదాడు. ఆ తర్వాత సౌతీ బౌలింగ్‌లో డీప్ కవర్ దిశగా కొట్టిన ఫోర్‌తో అతని సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత పంత్ తన జోరును ప్రదర్శించారు. సౌతీ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అతను... పటేల్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో చెలరేగాడు. ఆ తర్వాత 55 బంతుల్లో అతను హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అయితే నిర్ణీత లంచ్ సమయానికి కాస్త ముందే ఆరంభమైన వర్షం...ఆ తర్వాతా కొనసాగడంతో ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత ఆట మొదలయ్యాక వీరిని నిలువరించడంతో కివీస్ బౌలర్ల వల్ల కాలేదు. ఎట్టకేలకు కొత్త బంతి ఆ జట్టుకు కలిసొచ్చింది. అదే వైఫల్యం... 150 పరుగులు పూర్తి చేసుకున్న వెంటనే సర్ఫరాజ్‌ను అవుట్ చేసి సౌతీ భారత్ పతనానికి శ్రీకారం చుట్టాడు. సౌతీ తర్వాతి ఓవర్లో సిక్స్‌తో పంత్ 96కు చేరుకున్నాడు. అయితే దురదృష్టం అతడిని వెంటాడింది. 99 పరుగుల వద్ద రూర్కే వేసిన బంతిని డ్రైవ్ చేయబోగా...అతని బ్యాట్‌ను తగిలి బంతి స్టంప్స్‌పై పడింది. చిన్నస్వామి స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించగా, పంత్ నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత భారత అభిమానులు మరింత నిరాశ చెందే సమయం వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లాగే అదే వరుసలో రాహుల్ (12), జడేజా (5), అశ్విన్ (15) విఫలమయ్యారు. ఆ తర్వాత ఒకే ఓవర్లో హెన్రీ రెండు వికెట్లు తీసి భారత్ కథ ముగించాడు. పంత్ రనౌట్ అయి ఉంటే... సర్ఫరాజ్, పంత్ భాగస్వామ్యంలో ఒకే ఒక్క సారి కివీస్‌కు మంచి అవకాశం వచ్చింది. పంత్ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు సునాయాసంగా రనౌట్ చేసే అవకాశాన్ని జట్టు చేజార్చుకుంది. హెన్రీ వేసిన బంతిని పంత్ గల్లీ దిశగా ఆడగా సింగిల్ పూర్తి కాగా, రెండో పరుగు కోసం పంత్ బాగా ముందుకొచ్చేశాడు. సర్ఫరాజ్ వారించడంతో అతను వెనక్కి వెళ్ళాడు కానీ క్రీజ్‌కు చాలా దూరంగా ఉన్నాడు. అయితే బంతిని అందుకునేందుకు తన స్థానం నుంచి చాలా దూరం జరిగిన కీపర్ బ్లన్‌డెల్ తన వెనక ఉన్న పరిస్థితిని గుర్తించలేకపోయాడు. అతను సరైన చోట ఉంటే పంత్ అక్కడే వెనుదిరిగేవాడు! 107 గతంలో 107 లేదా అంతకంటే తక్కువ ల„ ్యాన్ని సొంతగడ్డపై భారత్ ఒకే ఒక సారి కాపాడుకుంది. 2004లో స్పిన్‌కు బాగా అనుకూలించిన ముంబై టెస్టులో 107 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 93 పరుగులకే కుప్పకూలింది. 7 టెస్టుల్లో పంత్ 90ల్లో అవుట్ కావడం ఇది ఏడో సారి. అతని ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి. 7 భారత్ తరఫున ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి అత్యధికంగా ఏడుగురు డకౌట్ అయ్యారు. గతంలో ఇలాంటి ప్రదర్శన 1952లో (ఇంగ్లండ్‌పై) నమోదైంది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్ 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (స్టంప్డ్) బ్లన్‌డెల్ (బి) పటేల్ 35; రోహిత్ (బి) పటేల్ 52; కోహ్లి (సి) బ్లన్‌డెల్ (బి) ఫిలిప్స్ 70; సర్ఫరాజ్ (సి) పటేల్ (బి) సౌతీ 150; పంత్ (బి) రూర్కే 99; రాహుల్ (సి) బ్లన్‌డెల్ (బి) రూర్కే 12; జడేజా (సి) యంగ్ (బి) రూర్కే 5; అశ్విన్ (ఎల్బీ) (బి) హెన్రీ 15; కుల్దీప్ (నాటౌట్) 6; బుమ్రా (సి) బ్లన్‌డెల్ (బి) హెన్రీ 0; సిరాజ్ (సి) సౌతీ (బి) హెన్రీ 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (99.3 ఓవర్లలో ఆలౌట్) 462. వికెట్ల పతనం: 1–72, 2–95, 3–231, 4–408, 5–433, 6–438, 7–441, 8–458, 9–462, 10–462. బౌలింగ్: సౌతీ 15–2–53–1, హెన్రీ 24.3–3–102–3, విలియమ్ రూర్కే 21–4–92–3, ఎజాజ్ పటేల్ 18–3–100–2, ఫిలిప్స్ 15–2–69–1, రచిన్ 6–0–30–0. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (బ్యాటింగ్) 0; కాన్వే (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (0.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 0. బౌలింగ్: బుమ్రా 0.4–0–0–0. -
నేడే ఫైనల్: దక్షిణాఫ్రికా Vs న్యూజిలాండ్
దుబాయ్: ఒక వైపు న్యూజిలాండ్ 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది... మరో వైపు దక్షిణాఫ్రికా వరుసగా రెండో సారి తుది పోరుకు అర్హత సాధించి ఈ సారైనా కప్‌ను ఒడిసి పట్టుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మహిళల టి20 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పోరులో సఫారీ టీమ్‌తో కివీస్ తలపడనుంది. ఈ వరల్డ్ కప్ లీగ్ దశలో రెండు జట్ల ప్రస్థానం దాదాపు ఒకే తరహాలో సాగింది. ఇరు జట్లు చెరో 3 విజయాలు సాధించి లీగ్ దశలో తమ గ్రూప్‌నుంచి రెండో స్థానంలోనే నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఆరు సార్లు చాంపియన్ ఆ్రస్టేలియాను ఓడించి దక్షిణాఫ్రికా ముందంజ వేయగా...మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌పై పైచేయి సాధించి కివీస్ ఫైనల్ చేరింది. సుదీర్ఘ కాలంగా మహిళల క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న ఆ్రస్టేలియా, తమదైన రీతిలో క్రికెట్‌కు చిరునామాగా ఉన్న ఇంగ్లండ్లను దాటి రెండు కొత్త జట్లు ఇప్పుడు ఆటపై కొత్త ముద్ర వేసేందుకు ఈ ఫైనల్ సరైన వేదిక కానుంది. ఎవరు గెలిచినా కొత్త చాంపియన్ అవుతారనే విషయమే మహిళల క్రికెట్లో ఆసక్తిని రేపుతోంది. సమ ఉజ్జీల్లాంటి రెండు టీమ్‌ల మధ్య ఫైనల్ ఎంత హోరాహోరీగా సాగుతుందనేది చూడాలి. ఇరు జట్లనుంచి అగ్రశ్రేణి క్రికెటర్లుగా ఎదిగిన సోఫీ డివైన్, సుజీ బేట్స్, మరిజాన్ కాప్లలో ఎవరికి వరల్డ్ కప్ చిరస్మరణీయంగా మారుతుందనేది ఆసక్తికరం. 2010లో ఫైనల్ ఆడిన కివీస్ జట్టులో డివైన్ సభ్యురాలిగా ఉంది. ఆమెతో పాటు అమేలియా కెర్, ప్లిమ్మర్, తహుహు, కార్సన్, రోజ్మేరీలపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. దక్షిణాఫ్రికా టీమ్‌లో బేట్స్, కాప్‌లతో పాటు కెపె్టన్ లారా వోల్వార్ట్, తజ్మీన్, ఎమ్‌లాబా కీలకం కానున్నారు. ఈ మ్యాచ్‌లోకి బరిలోకి దిగడం ద్వారా మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మిథాలీ రాజ్ (333) రికార్డును బేట్స్ సవరించనుంది. సెమీస్‌లో అర్ధసెంచరీతో ఆసీస్ పని పట్టిన అనెక్ బాష్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉంది. తుది జట్లలో ఎలాంటి మార్పు చేయకుండా సెమీస్ ఆడిన టీమ్‌లనే కొనసాగించే అవకాశం ఉంది. దుబాయ్‌లో వాతావరణం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. టోర్నీలో ఒక్కసారి కూడా వాన వల్ల మ్యాచ్‌లకు అంతరాయం కలగలేదు. మంచు సమస్య కూడా లేదు కాబట్టి స్పిన్నర్లు మంచి ప్రభావం చూపగలరు. -
ఎదురీత!
అనూహ్య తడబాటు నుంచి కోలుకున్న టీమిండియా... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఎదురీదుతోంది. బ్యాటింగ్‌కు అనువుగా మారిన బెంగళూరు పిచ్‌పై ప్రత్యర్థి భారీ స్కోరు చేయగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిస్తున్నారు. రచిన్ రవీంద్ర సూపర్ సెంచరీ, టిమ్ సౌతీ సమయోచిత ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత టాపార్డర్ రాణించింది. రోహిత్, కోహ్లి, సర్ఫరాజ్ అర్ధ శతకాలతో టీమిండియా ఇన్నింగ్స్ గాడిన పడింది. మూడో రోజు ఇన్నింగ్స్ చివరి బంతికి విరాట్ కోహ్లిను అవుట్ చేసి న్యూజిలాండ్ పైచేయి సాధించగా... కోహ్లి పెవిలియన్ చేరడంతో ఈ మ్యాచ్‌లో భారత్ గట్టెక్కాలంటే మిగిలిన బ్యాటర్లు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. బెంగళూరు: తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం గట్టిగానే పోరాడుతోంది. ప్రత్యర్థికి భారీ ఆధిక్యం దక్కిన ఈ మ్యాచ్‌లో అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గట్టెక్కడం కష్టమే అనిపిస్తోంది. 356 పరుగులతో వెనుకబడి శుక్రవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (70; 8 ఫోర్లు, ఒక సిక్సర్), సర్ఫరాజ్ ఖాన్ (78 బంతుల్లో 70 బ్యాటింగ్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), కెపె్టన్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 52; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... యశస్వి జైస్వాల్ (35; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. చేతిలో 7 వికెట్లున్న టీమిండియా ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 125 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న సర్ఫరాజ్‌తోపాటు ఇంకా రావాల్సిన కేఎల్ రాహుల్, పంత్, జడేజా, అశ్విన్ భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత్ కోలుకోవచ్చు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 180/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 91.3 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర (157 బంతుల్లో 134; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) తన కెరీర్లో రెండో సెంచరీ సాధించాడు. మాజీ కెపె్టన్ టిమ్ సౌతీ (73 బంతుల్లో 65; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రచిన్‌కు అండగా నిలిచాడు. చివరి బంతికి కోహ్లి అవుట్... తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డ భారత టాపార్డర్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడింది. యశస్వి, రోహిత్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చడంతో టీమిండియాకు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించాక జైస్వాల్ అవుట్ కాగా... కాసేపటికి అర్ధశతకం పూర్తి చేసుకున్న రోహిత్ కూడా వెనుదిరిగాడు. ఈ రెండు వికెట్లు ఎజాజ్ పటేల్ ఖాతాలోకే వెళ్లాయి. మరోసారి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి చకచకా పరుగులు చేస్తూ... ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ 42 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... కోహ్లి 70 బంతుల్లో ఆ మార్క్ అందుకున్నాడు. టీమిండియా కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో చివరి బంతికి కోహ్లి అవుటవ్వడంతో భారత జట్టుకు నిరాశ తప్పలేదు. ఆ భాగస్వామ్యం లేకుంటే... భారత సంతతి ఆటగాడు రచిన్... కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నస్వామి స్టేడియంలో చెలరేగి ఆడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయగలిగింది. మిచెల్ (18), బ్లండెల్ (5), ఫిలిప్స్ (14), హెన్రీ (8) విఫలమవడంతో కివీస్ జట్టు 233/7తో నిలిచింది. కాసేపట్లో కివీస్ ఆలౌట్ కావడం ఖాయమే అనుకుంటే... సౌతీ సహకారంతో రచిన్ రెచ్చిపోయాడు. ఎనిమిదో వికెట్‌కు 137 పరుగులు జోడించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. 4 టెస్టు క్రికెట్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122) ముందున్నారు. ఓవరాల్‌గా ఈ మైలురాయి దాటిన 18వ ప్లేయర్‌గా కోహ్లి ఘనత సాధించాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 15; కాన్వే (బి) అశి్వన్ 91; యంగ్ (సి) కుల్దీప్ (బి) జడేజా 33; రచిన్ (సి) (సబ్) జురేల్ (బి) కుల్దీప్ 134; మిచెల్ (సి) జైస్వాల్ (బి) సిరాజ్ 18; బ్లండెల్ (సి) రాహుల్ (బి) బుమ్రా 5; ఫిలిప్స్ (బి) జడేజా 14; హెన్రీ (బి) జడేజా 8; సౌతీ (సి) జడేజా (బి) సిరాజ్ 65; ఎజాజ్ (ఎల్బీ) కుల్దీప్ 4; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (91.3 ఓవర్లలో ఆలౌట్) 402. వికెట్ల పతనం: 1–67, 2–142, 3–154, 4–193, 5–204, 6–223, 7–233, 8–370, 9–384, 10–402. బౌలింగ్: బుమ్రా 19–7–41–1, సిరాజ్ 18–2–84–2, అశ్విన్ 16–1–94–1, కుల్దీప్ 18.3–1–99–3, జడేజా 20–1–72–3.భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (స్టంప్డ్) బ్లండెల్ (బి) ఎజాజ్ 35; రోహిత్ (బి) ఎజాజ్ 52; కోహ్లి (సి) బ్లండెల్ (బి) ఫిలిప్స్ 70; సర్ఫరాజ్ (బ్యాటింగ్) 70; ఎక్స్ ట్రాలు 4; మొత్తం (49 ఓవర్లలో 3 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–72, 2–95, 3–231. బౌలింగ్: సౌతీ 7–1–22–0; హెన్రీ 11–1–52–0; రూర్కే 11–1–48–0; ఎజాజ్ 12–2–70–2; ఫిలిప్స్ 8–1–36–1. -
ఫైనల్లో న్యూజిలాండ్
షార్జా: మహిళల టి20 ప్రపంచకప్‌లో 14 ఏళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించింది. తద్వారా ఈసారి మహిళల టి20 ప్రపంచకప్‌లో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఈ టోర్నీ చరిత్రలో న్యూజిలాండ్ 2009, 2010లలో వరుసగా రెండుసార్లు ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. విండీస్‌తో జరిగిన సెమీఫైనల్లో మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. జార్జియా ప్లిమర్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. విండీస్ బౌలర్ డాటిన్ నాలుగు వికెట్లు తీసింది. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి ఓడిపోయింది. -
IND vs NZ 1st Test: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. తొలి రోజు ఆట రద్దు
క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరు వేదికగా ఇవాళ (అక్టోబర్ 16) ప్రారంభం కావాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాలేదు. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. టాస్ కూడా సాధ్యపడలేదు. తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ప్రకటించారు. బెంగళూరులో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో కవర్లు తీసేందుకు కూడా సాధ్యపడలేదు. చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ వర్షం ఆగితే ఏమైనా చేయడానికి ఆస్కారం ఉండేది. కానీ వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు చేసేదేమీ లేక తొలి రోజు ఆటను రద్దు చేశారు. రేపు కూడా ఇదే పరస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ఈ మ్యాచ్‌లో ఫలితం తేలుతుందో లేక పేలవమైన డ్రాగా ముగుస్తుందో వేచి చూడాలి.కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో (అక్టోబర్ 24-28).. మూడో టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో (నవంబర్ 1-5) జరుగనున్నాయి. చదవండి: అరంగేట్రం బ్యాటర్ సెంచరీ.. 366 పరుగులకు ఆలౌటైన పాక్ -
Ind vs NZ Test Series: కివీస్ సవాల్!
కొన్నేళ్లుగా స్వదేశంలో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న భారత క్రికెట్ జట్టు మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమైంది. సొంతగడ్డపై ఇటీవల బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా మరో సిరీస్ విజయం లక్ష్యంగా నేటి నుంచి న్యూజిలాండ్‌తో తలపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా సాగుతున్న రోహిత్ శర్మ బృందం ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించడం లాంఛనమే! ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా భారత జట్టు వ్యూహాలకు పదును పెడుతోంది. బెంగళూరు: వచ్చే నెలలో ఆ్రస్టేలియాతో జరిగే మెగా టెస్టు సిరీస్‌కు ముందు స్వదేశంలో భారత జట్టు సత్తాకు పరీక్ష ఎదురుకానుంది. బంగ్లాదేశ్ గట్టి జట్టు కాకపోవడంతో టీమిండియాకు ఇటీవల ఆ జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. కానీ పోరాటపటిమకు మారుపేరైన న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేము. ఐపీఎల్ రూపంలో భారత గడ్డపై ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న ఆటగాళ్లు న్యూజిలాండ్‌లో ఉన్నారు. ఫలితంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ పోటాపోటీగా సాగే అవకాశముంది. అయితే ఈ సిరీస్‌కు శుభారంభం లభించాలంటే వరుణుడు కూడా కరుణించాలి. నేటి నుంచి మూడు రోజులపాటు బెంగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. చివరి రెండు రోజులు ఎండ కాయనుంది. అయితే చిన్నస్వామి స్టేడియంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో వరుణుడు కాస్త తెరిపినిచి్చనా మ్యాచ్ సాగడం ఖాయమే. భారత యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ చక్కటి అవకాశం కానుంది. ముఖ్యంగా శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌పై అందరి దృష్టి నిలవనుంది. ఇప్పటికే జట్టులో కుదురుకున్న ఈ ఇద్దరూ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు గాయాలతో సతమతమవుతోంది. మాజీ కెపె్టన్ కేన్ విలియమ్సన్ తొలి టెస్టుకు అందుబాటులో లేకుండా పోగా... తాజాగా పేస్ బౌలర్ బెన్ సియర్స్ గాయం కారణంగా ఈ సిరీస్‌కే దూరమయ్యాడు. సమతూకంగా... బ్యాటింగ్‌లో టీమిండియాకు పెద్దగా సమస్యలు లేవు. గిల్, జైస్వాల్, పంత్, కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్, కోహ్లి స్థాయి ప్లేయర్లు లయ అందుకునేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు. మరో 53 పరుగులు చేస్తే కోహ్లి భారత్ నుంచి 9 వేల టెస్టు పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా ఘనత వహిస్తాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో అదరగొట్టిన అశ్విన్, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మారింది. అస్వస్థతతో గిల్ మ్యాచ్‌కు దూరమైతే అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి వస్తాడు. బోర్డర్–గవాస్కర్ సిరీస్‌కు ముందు స్వదేశంలోనూ పేస్ పిచ్‌లపైనే ఆడాలని భావించిన టీమిండియా... అందుకు తగ్గట్లే పిచ్‌లను సిద్ధం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో భారత్ ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల వ్యూహంతో బరిలోకి దిగి ఫలితం సాధించింది. ఇక్కడ కూడా అదే కొనసాగించవచ్చు. అదనపు స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి రానున్నాడు. కివీస్‌కు గాయాల బెడద ఇటీవలి కాలంలో న్యూజిలాండ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోతోంది. శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0–2తో కోల్పోయిన న్యూజిలాండ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. భారత్‌తో పర్యటనకు ముందే టిమ్ సౌతీ టెస్టు కెప్టెన్సి నుంచి తప్పుకోగా... విలియమ్సన్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. మరోవైపు యువ పేసర్ బెన్ సియర్స్ కూడా మోకాలి గాయంతో ఈ పర్యటనకు దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో టామ్ లాథమ్ కివీస్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించనుండగా... అతడితో పాటు కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మిషెల్, బ్లండెల్, ఫిలిప్స్‌తో న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ మెరుగ్గానే ఉంది. అయితే భారత స్పిన్నర్లను వీరు ఎలా ఎదుర్కొంటారనేది కీలకం. ఇక ఎజాజ్ పటేల్, సాన్‌ట్నర్, రచిన్‌ల రూపంలో ఆ జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. గత భారత పర్యటనలో ఎజాజ్ ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసి... టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక సీనియర్ సౌతీ, విల్ రూర్కె, ఫిలిప్స్ పేస్ భారం మోయనున్నారు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), జైస్వాల్, గిల్/సర్ఫరాజ్, కోహ్లి, పంత్, రాహుల్, జడేజా, అశ్విన్, ఆకాశ్‌దీప్/కుల్దీప్, బుమ్రా, సిరాజ్. న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్ ), కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మిషెల్, బ్లండెల్, ఫిలిప్స్, సాన్‌ట్నర్/బ్రేస్‌వెల్, సౌతీ, ఎజాజ్ పటేల్, విల్ ఓ రూర్కె. 62 ఇప్పటి వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టులు. ఇందులో 22 మ్యాచ్‌ల్లో భారత్... 13 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలుపొందాయి. 27 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.36 స్వదేశంలో న్యూజిలాండ్‌తో భారత్ ఆడిన టెస్టులు. ఇందులో 17 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 2 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ (1969లో, 1988లో) గెలిచింది. మిగతా 17 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి.పిచ్, వాతావరణంబెంగళూరు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. వర్షాల కారణంగా పిచ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. ఆటకు వరుణుడు ఆటంకం కలిగించవచ్చు. ముఖ్యంగా తొలి మూడు రోజులు బెంగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిన్నస్వామి స్టేడియంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉండటం అభిమానులకు ఊరటనిచ్చే అంశం. -
T20 WC: పాక్‌పై గెలిచి సెమీస్‌కు న్యూజిలాండ్.. భారత్ ఇంటికి
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో వెళ్లిన భారత మహిళల బృందం కథ లీగ్ దశలోనే ముగిసింది. తమ అదృష్టాన్ని ఇతర జట్ల చేతిలో పెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్‌కు కలిసి రాలేదు. గ్రూప్ ‘ఎ’ చివరి పోరులో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ నెగ్గితేనే భారత్ ముందంజ వేసే అవకాశం ఉండగా... కివీస్ ఆ అవకాశం ఇవ్వలేదు. లీగ్ దశలో మూడో విజయంతో ఆ జట్టు దర్జాగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా... పాక్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. 2 కీలక వికెట్లు తీసిన ఎడెన్ కార్సన్ (2/7) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఈ గ్రూప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లూ గెలిచి ఆ్రస్టేలియా ఇప్పటికే సెమీస్ చేరగా, కివీస్‌కు రెండో స్థానం ఖాయమైంది. రెండు విజయాలకే పరిమితమైన భారత్ టోర్నీ నుంచి ని్రష్కమించింది. గెలిపించిన బౌలర్లు... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. నెమ్మదైన పిచ్‌పై ఎవరూ దూకుడుగా ఆడలేకపోవడంతో పరుగులు వేగంగా రాలేదు. సుజీ బేట్స్ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, హ్యాలిడే (22), సోఫీ డివైన్ (19), ప్లిమ్మర్ (17) కీలక పరుగులు జోడించారు. పాక్ బౌలింగ్ మెరుగ్గా ఉన్నా... టీమ్ ఫీల్డింగ్ దెబ్బ తీసింది. పాక్ ఫీల్డర్లు ఏకంగా 8 క్యాచ్‌లు వదిలేయడంతో కివీస్ 100 పరుగులు దాటగలిగింది. అనంతరం పాక్ పేలవమైన బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది. సులువైన లక్ష్యం ముందున్నా ఆ జట్టు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోగా, కివీస్ బౌలర్లు సెమీస్ స్థానం కోసం బలంగా పోరాడారు. పాక్ జట్టులో ఫాతిమా సనా (21), మునీబా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. పవర్‌ప్లే లోపే 5 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు... 12 బంతుల వ్యవధిలో చివరి 5 వికెట్లు చేజార్చుకుంది. -
T20 World Cup 2024: న్యూజిలాండ్‌తో కీలక సమరం.. పాక్ టార్గెట్ 111
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-ఏలో ఇవాళ (అక్టోబర్ 14) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. సెమీస్ బెర్తే లక్ష్యంగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. నష్రా సంధు మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను దెబ్బతీసింది. ఒమైమా సొహైల్, నిదా దార్, సదియా ఇక్బాల్ తలో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో సుజీ బేట్స్ 28, జార్జియా ప్లిమ్మర్ 17, అమేలియా కెర్ 9, సోఫి డివైన్ 19, బ్రూక్ హ్యాలీడే 22, మ్యాడీ గ్రీన్ 9, ఇసబెల్లా గేజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ మ్యాచ్ గెలుపోటములపై టీమిండియా భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓ మోస్తరు విజయం సాధిస్తే భారత్ సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ పాక్ న్యూజిలాండ్‌ను భారీ తేడాతో ఓడిస్తే పాకిస్తానే సెమీస్‌కు చేరుకుంటుంది. న్యూజిలాండ్ గనక పాక్‌ను చిత్తు చేస్తే భారత్, పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకుంటుంది. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. -
T20 World Cup 2024: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేసి లంకేయులను కట్టడి చేశారు. అమేలియా కెర్, లీగ్ క్యాస్పెరెక్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఏడెన్ కార్సన్ ఓ వికెట్ దక్కించుకుంది. లంక బ్యాటర్లలో చమారీ ఆటపట్టు (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. విష్మి గౌతమ్ 8, హర్షిత మాధవి 18, కవిష దిల్హరి 10, అనుష్క సంజీవని 5, నిలాక్షి డిసిల్వ 14, అమా కాంచన 10 పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. జార్జియా స్లిమ్మర్ (53), అమేలియా కెర్ (34) చెలరేగడంతో 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో సుజీ బేట్స్ 17, సోఫీ డివైన్ 13 పరుగులు చేశారు. లంక బౌలర్లలో సచిని నిసంసల, చమారీ ఆటపట్టు తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఆడిన నాలుగో మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన శ్రీలంక గెలుపు రుచి చూడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.చదవండి: రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన ఘట్టం -
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
ముంబై: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ టీమ్‌కు రోహిత్ శర్మ కెపె్టన్ కాగా...పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. సాధారణంగా భారత్‌లో జరిగే సిరీస్‌లకు వైస్ కెపె్టన్ ను ప్రకటించే సాంప్రదాయం లేదు. ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌కు కూడా వైస్ కెప్టెన్ ఎవరూ లేరు. అయితే ఈ సిరీస్ తర్వాత జరిగే ఆ్రస్టేలియా పర్యటనలో పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరం కానున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో కాస్త ముందుగా సన్నద్ధత కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కివీస్‌తో పోరుకు బుమ్రాను ఎంపిక చేసింది. గతంలో ఒకే ఒక టెస్టులో భారత్‌కు సారథిగా వ్యవహరించిన బుమ్రా...శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌లలో వైస్ కెపె్టన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. బంగ్లాతో సిరీస్‌లో ఉన్న 16 మంది సభ్యుల జట్టునుంచి ఒకే ఒక మార్పుతో కివీస్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించారు. పేసర్ యశ్ దయాళ్ను జట్టునుంచి తప్పించారు. ఇది మినహా మిగతా 15 మందిలో ఎలాంటి మార్పూ లేదు. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తాజా జట్టు ప్రకటనతో అర్థమైంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 16 నుంచి బెంగళూరులో తొలి టెస్టు జరుగుతుంది. జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), జైస్వాల్, గిల్, కోహ్లి, రాహుల్, సర్ఫరాజ్, పంత్, జురేల్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్‌దీప్. ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లు: నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా. -
ఆస్ట్రేలియా జోరు
షార్జా: డిఫెండింగ్ చాంపియన్, ఆరుసార్లు విజేత ఆస్ట్రేలియా జట్టు మహిళల టి20 వరల్డ్ కప్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన ఆసీస్ వరుసగా రెండో విజయంతో గ్రూప్ ‘ఎ’లో తమ అగ్ర స్థానాన్ని పటిష్ట పర్చుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఆస్ట్రేలియా 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. బెత్ మూనీ (32 బంతుల్లో 40; 2 ఫోర్లు), ఎలైస్ పెరీ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడగా... కెప్టెన్ అలీసా హీలీ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు), ఫోబీ లిచ్‌ఫీల్డ్ (18 బంతుల్లో 18; 2 ఫోర్లు) అండగా నిలిచారు. ఒకదశలో 109/2తో పటిష్ట స్థితిలో నిలిచిన ఆసీస్ జట్టు ఆ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో 29 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లలో అమేలియా కెర్ 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... హ్యాలిడే, రోజ్మేరీ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. అమేలియా కెర్ (31 బంతుల్లో 29; 3 ఫోర్లు), సుజీ బేట్స్ (20) మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మేగన్ షుట్ 3.2 ఓవర్లు బౌలింగ్ చేయగా... ఈ 20 బంతుల్లో 18 డాట్ బంతులు వేసింది. 3 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆమె 3 వికెట్లు పడగొట్టింది. ఇతర బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ (3/21), సోఫీ మాలినెక్స్ (2/15) కివీస్ పతనంలో ప్రధాన పాత్ర పోషించారు. టి20 ప్రపంచకప్‌లో నేడు భారత్ X శ్రీలంకవేదిక: దుబాయ్; రాత్రి గం. 7:30 నుంచిస్కాట్లాండ్ X దక్షిణాఫ్రికావేదిక: దుబాయ్ ;మధ్యాహ్నం గం. 3:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
WT20 WC Ind vs NZ: కివీస్ ముందు తలవంచారు
ప్రపంచకప్‌కు ముందు ఈ ఏడాది ఆడిన 13 మ్యాచ్‌లలో న్యూజిలాండ్ ఒకటే గెలవగా... 17 మ్యాచ్‌ల్లో 11 గెలిచిన భారత్ ఫేవరెట్‌గా అడుగు పెట్టింది. కానీ అసలు సమయంలో మాత్రం టీమిండియా చేతులెత్తేసి టోర్నీని ఓటమితో మొదలు పెట్టింది. ముందుగా పేలవ బౌలింగ్‌తో కివీస్ మెరుగైన స్కోరు సాధించే అవకాశం కల్పించిన మన మహిళలు... ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ పూర్తిగా తడబడ్డారు. టాప్–5 స్మృతి, హర్మన్, షఫాలీ, జెమీమా, రిచా సమష్టిగా విఫలం కావడంతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు. దుబాయ్: తొలి వరల్డ్ కప్ గెలిచే లక్ష్యంతో ఉత్సాహంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు తొలి పోరులోనే షాక్ తగిలింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 58 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫీ డివైన్ (36 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... ఓపెనర్లు జార్జియా ప్లిమ్మర్ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), సుజీ బేట్స్ (24 బంతుల్లో 27; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం భారత్ 19 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌటైంది. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ (15)దే అత్యధిక స్కోరు. రేపు తమ రెండో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. రాణించిన ఓపెనర్లు న్యూజిలాండ్ ఓపెనర్లు ప్లిమ్మర్, బేట్స్ జట్టుకు ఘనమైన ఆరంభం అందించారు. పూజ వేసిన తొలి ఓవర్లో బేట్స్ రెండు ఫోర్లు కొట్టగా, దీప్తి ఓవర్లో ప్లిమ్మర్ ఫోర్, సిక్స్ బాదింది. అరుంధతి తొలి ఓవర్లో ప్లిమ్మర్ మరో రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 55 పరుగులకు చేరింది. ఇదే ఓవర్లో బేట్స్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కీపర్ రిచా వదిలేసింది. వీరిద్దరిని నిలువరించేందుకు ఇబ్బంది పడిన భారత బౌలర్లకు ఎట్టకేలకు ఎనిమిదో ఓవర్లో తొలి వికెట్ దక్కింది. మొదటి వికెట్‌కు 46 బంతుల్లో 67 పరుగులు జోడించిన ఓపెనర్లు ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. ఆ తర్వాత అమేలియా కెర్ (13) ప్రభావం చూపలేదు కానీ డివైన్ దూకుడైన ఆటతో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. ఆశ శోభన, రేణుక ఓవర్లలో డివైన్ రెండేసి ఫోర్లు కొట్టగా... ఆమె, హ్యాలీడే (16) కలిసి దీప్తి ఓవర్లో మూడు ఫోర్లతో 16 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్లో మరో ఫోర్‌తో డివైన్ 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. టపటపా... మ్యాచ్ గెలవాలంటే వరల్డ్ కప్ చరిత్రలో రెండో అత్యధిక ఛేదన రికార్డును నమోదు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన భారత్‌కు ఏదీ కలిసి రాలేదు. పవర్‌ప్లే ముగిసేలోపే జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. కార్సన్ తన తొలి రెండు ఓవర్లలో షఫాలీ వర్మ (2), స్మృతి మంధాన (12)లను వెనక్కి పంపించగా... మూడో స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ హర్మన్ కూడా విఫలమైంది. అంపైర్ ఎల్బీ నిర్ణయాన్ని ఆమె సవాల్ చేసినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత జెమీమా (13) కూడా ప్రభావం చూపలేకపోయింది. 11వ ఓవర్ చివరికి బంతి రిచా ఘోష్ (12) రూపంలో తమ ఐదో వికెట్ కోల్పోయిన భారత్ ఆ తర్వాత ఓటమి దిశగా సాగిపోయింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: బేట్స్ (సి) శ్రేయాంక (బి) అరుంధతి 27; ప్లిమ్మర్ (సి) స్మృతి (బి) శోభన 34; అమేలియా కెర్ (సి) పూజ (బి) రేణుక 13; డివైన్ (నాటౌట్) 57; హ్యాలీడే (సి) స్మృతి (బి) రేణుక 16; గ్రీన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–67, 2–67, 3–99, 4–145. బౌలింగ్: పూజ వస్త్రకర్ 1–0–9–0, రేణుకా సింగ్ 4–0–27–2, దీప్తి శర్మ 4–0–45–0, అరుంధతి రెడ్డి 4–0–28–1, ఆశా శోభన 4–0–22–1, శ్రేయాంక పాటిల్ 3–0–25–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) గ్రీన్ (బి) కార్సన్ 12; షఫాలీ (సి అండ్ బి) కార్సన్ 2; హర్మన్‌ప్రీత్ (ఎల్బీ) (బి) రోజ్మేరీ 15; జెమీమా (సి) గ్రీన్ (బి) తహుహు 13; రిచా (సి) డివైన్ (బి) తహుహు 12; దీప్తి (సి) డివైన్ (బి) తహుహు 13; అరుంధతి (సి) బేట్స్ (బి) రోజ్మేరీ 1; పూజ (బి) కెర్ 8; శ్రేయాంక (సి) (సబ్) పెన్ఫోల్డ్ (బి) రోజ్మేరీ 7; శోభన (నాటౌట్) 6; రేణుక (సి) డివైన్ (బి) రోజ్మేరీ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 102. వికెట్ల పతనం: 1–11, 2–28, 3–42, 4–55, 5–70, 6–75, 7–88, 8–90, 9–102, 10–102. బౌలింగ్: జెస్ కెర్ 3–0–13–0, ఈడెన్ కార్సన్ 4–0–34–2, రోజ్మేరీ 4–0–19–4, అమేలియా కెర్ 4–0–19–1, తహుహు 4–0–15–3. -
బోణీ బాగుండాలి
దుబాయ్: తొమ్మిదో ప్రయత్నంలోనైనా ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్ టైటిల్ వేటను నేడు ఆరంభించనుంది. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది టి20 ప్రపంచకప్‌లలో భారత్ ఒక్కసారి మాత్రమే ఫైనల్ (2020లో) చేరి రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం కొత్త చరిత్ర తిరగరాయాలని హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం పట్టుదలతో ఉంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. గత ఏడాది వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియా ఈసారి కప్‌తో తిరిగి రావాలంటే శుభారంభం లభించాలి. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టి20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజయం సాధించగా... ఇప్పుడు అదే బాటలో తొలిసారి ‘విశ్వ కిరీటం’ దక్కించుకోవాలని హర్మన్‌ప్రీత్ జట్టు తహతహలాడుతోంది. టి20 ఫార్మాట్లో ప్రపంచకప్ ప్రవేశ పెట్టినప్పటి (2009) నుంచి భారత జట్టులో కొనసాగుతున్న 35 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్... జట్టును ఎలా నడిపిస్తుందనేది ఆసక్తికరం. టాపార్డర్ రాణిస్తేనే! అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలు సాధిస్తున్న భారత మహిళల జట్టు ఐసీసీ టోర్నీల్లో మాత్రం గెలుపు గీత దాటలేకపోతోంది. ఒత్తిడిని ఎదుర్కోలేకపోవడం, ఆటలో కీలక దశలో పట్టు సడలించడం వంటి చిన్న చిన్న తప్పిదాలకు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఇటీవల ఆసియా కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... శ్రీలంకతో ఫైనల్లో అనూహ్యంగా తడబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దీంతో లోపాలను గుర్తించిన కోచింగ్ బృందం జట్టుకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్లేయర్ల ఫిట్నెస్, ఫీల్డింగ్‌ను మరింత సానబెట్టింది. అదే సమయంలో మానసిక దృఢత్వం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. గత ఐదు మ్యాచ్‌ల్లో మూడు అర్ధశతకాలు సాధించిన స్మృతి మంధాన ఆసియా కప్‌లో అదరగొట్టింది. స్మతి అదే జోరు కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఆమెతో పాటు మిగిలిన ప్లేయర్లు సత్తా చాటాల్సిన అవసరముంది. భారత్‌ను పోలి ఉండే దుబాయ్, షార్జా పిచ్‌లపై మన స్పిన్నర్ల ప్రదర్శన కీలకం కానుంది. దీప్తి శర్మపై భారీ అంచనాలు ఉండగా... శ్రేయాంక, ఆశ శోభన, రాధ కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. సమతూకంగా న్యూజిలాండ్... న్యూజిలాండ్ జట్టు అటు అనుభవజ్ఞులు ఇటు యంగ్ ప్లేయర్లతో సమతూకంతో ఉంది. కెపె్టన్ సోఫీ డివైన్, టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ సుజీ బేట్స్ (36 మ్యాచ్‌ల్లో 1066 పరుగులు), లీ తహుహూ, అమెలియా కెర్‌లతో కివీస్ జట్టు పటిష్టంగా ఉంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో రెండుసార్లు (2009, 2010) రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు ఈసారైనా చాంపియన్‌గా అవతరించాలని భావిస్తోంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగనున్న ఈ టోరీ్నలో లీగ్ దశలో ప్రతి జట్టు గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో తలపడనుంది. దీంతో ప్రతి మ్యాచ్ కీలకమే కాగా... లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ శ్రీలంక ఉన్నాయి. దుబాయ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ అమెలియా కెర్ న్యూజిలాండ్ జట్టుకు కీలకం కానుంది. తుది జట్లు (అంచనా) భారత జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, రిచా ఘోష్, హేమలత, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్, రేణుక, రాధ యాదవ్, ఆశ శోభన. న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, అమెలియా కెర్, బ్రూక్ హ్యాలీడే, మ్యాడీ గ్రీన్, ఇజీ గేజ్, కాస్పెరెక్, జెస్ కెర్, లీ తహుహూ, ఈడెన్ కార్సన్, రోస్‌మేరీ మైర్. 4 న్యూజిలాండ్ జట్టుతో భారత్ ఇప్పటి వరకు 13 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక టి20 ప్రపంచకప్‌లో రెండు జట్లు నాలుగుసార్లు తలపడ్డాయి. చెరో రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి. గత రెండు ప్రపంచకప్‌లలో న్యూజిలాండ్‌పై భారతే గెలిచింది.4/4 భారత జట్టు ఆడిన ఎనిమిది ప్రపంచకప్‌లలో తొలి నాలుగింటిలో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. తర్వాతి నాలుగింటిలో ఆడిన తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసింది. తొమ్మిదోసారి ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి. -
మార్టిన్ గప్తిల్ మహోగ్రరూపం.. 11 బంతుల్లో 62 పరుగులు
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లో భాగంగా కోణార్క్ సూర్యాస్ ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో సథరన్ సూపర్ స్టార్స్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ మహోగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో గప్తిల్.. 54 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సథరన్ సూపర్ స్టార్స్ కోణార్క్ సూర్యాస్ ఒడిశాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోణార్క్ సూర్యాస్ ఒడిశా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రిచర్డ్ లెవి 21 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలువగా.. యూసఫ్ పఠాన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు.అనంతరం 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్ సూపర్ స్టార్స్ కేవలం 16 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మార్టిన్ గప్తిల్ ఒంటిచేత్తో సూపర్ స్టార్స్‌ను గెలిపించాడు. శ్రీవట్స్ గోస్వామి 18, మసకద్జ 20, పవన్ నేగి 14 పరుగులు చేశారు.VINTAGE MARTIN GUPTILL. 🔥6,6,6,4,6,6 - 34 runs in a single over in the LLC. 🤯 pic.twitter.com/0LG9g55Lry— Mufaddal Vohra (@mufaddal_vohra) October 2, 2024ఒకే ఓవర్లో 34 పరుగులునవిన్ స్టీవర్ట్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో మార్టిన్ గప్తిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో గప్తిల్ ఐదు సిక్సర్లు, బౌండరీ సహా 34 పరుగులు పిండుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో నవిన్ స్టీవర్ట్ వేసిన మరో ఓవర్లోనూ గప్తిల్ రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో గప్తిల్ 29 పరుగులు (నాలుగు సిక్సర్లు, బౌండరీ) సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో నవిన్ వేసిన రెండు ఓవర్లలో గప్తిల్ 11 బంతులు ఎదుర్కొని 62 పరుగులు రాబట్టాడు.నిన్న ఒకే ఓవర్లో 30 పరుగులునిన్న మణిపాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గప్తిల్ చెలరేగిపోయాడు. డేనియల్ క్రిస్టియన్ వేసిన ఓ ఓవర్లో 30 పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, ఓ బౌండరీ ఉన్నాయి. ఈ మ్యాచ్ మొత్తంలో 29 బంతులు ఎదుర్కొన్న గప్తిల్ 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశారు. చదవండి: విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ రీఎంట్రీ -
మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక.. టాప్‌లోనే భారత్
న్యూజిలాండ్‌పై రెండో టెస్ట్‌లో విజయానంతరం శ్రీలంక జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ (2023-25)లో శ్రీలంక తొమ్మిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు నమోదు చేసి నాలుగింట ఓడింది. న్యూజిలాండ్‌పై తాజా విక్టరీతో శ్రీలంక పాయింట్ల పర్సంటేజీ 55.56 శాతంగా ఉంది. మరోవైపు శ్రీలంక చేతిలో ఓడిన న్యూజిలాండ్ మూడో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది. న్యూజిలాండ్ ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో ఎనిమది మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, ఐదింట పరాజయాలు ఎదుర్కొంది. ఆ జట్టు పాయింట్ల పర్సంటేజీ 37.50 శాతంగా ఉంది.టాప్‌లోనే భారత్స్వదేశంలో బంగ్లాదేశ్‌ను తొలి టెస్ట్‌లో చిత్తుగా ఓడించిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సొంతం చేసుకుని, 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ పాయింట్ల పర్సంటేజీ 71.67 శాతంగా ఉంది. బంగ్లాదేశ్ విషయానికొస్తే.. భారత్ చేతిలో తొలి టెస్ట్‌లో ఓటమి అనంతరం ఈ జట్టు ఐదో స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, నాలుగింట ఓడింది.భారత్ వెనకాలే ఆస్ట్రేలియాడబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా భారత్ వెనకాలే ఉంది. ఆ జట్టు 12 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట గెలిచి మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సైకిల్లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఎనిమిది గెలిచి, ఏడింట ఓడింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.మిగతా జట్ల విషయానికొస్తే..తాజా స్టాండింగ్స్‌లో సౌతాఫ్రికా ఆరో స్థానంలో.. పాకిస్తాన్ ఎనిమిదో స్థానంలో.. వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. సౌతాఫ్రికా ఆరు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు (3 పరాజయాలు, ఓ డ్రా), పాకిస్తాన్ ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు (5 పరాజయాలు), వెస్టిండీస్ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క విజయం (6 పరాజయాలు, 2 డ్రాలు) సాధించాయి.చదవండి: NZ Vs SL 2nd Test: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. -
NZ vs SL 2nd Test: విజయానికి 5 వికెట్ల దూరంలో శ్రీలంక
న్యూజిలాండ్‌పై చారిత్రక సిరీస్ క్లీన్‌స్వీప్‌నకు శ్రీలంక జట్టు ఐదు వికెట్ల దూరంలో నిలిచింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న శ్రీలంక... రెండో టెస్టులోనూ విజయానికి చేరువైంది. శనివారం మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 22/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్... లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ధాటికి విలవిలలాడి 39.5 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటైంది.శ్రీలంకపై న్యూజిలాండ్‌కు ఇదే అత్యల్ప స్కోరు. మిషెల్ సాన్‌ట్నర్ (51 బంతుల్లో 29; 4 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా... రచిన్ రవీంద్ర (10), డారిల్ మిషెల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టామ్ లాథమ్ (2), డ్వేన్ కాన్వే (9), కేన్ విలియమ్సన్ (7), ఎజాజ్ పటేల్ (8), టామ్ బ్లండెల్ (1), గ్లెన్ ఫిలిప్స్ (0) విఫలమయ్యారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 6, నిషాన్ మూడు వికెట్లు పడగొట్టారు.లంక సారథి ధనంజయ ఐదు క్యాచ్‌లు అందుకోవడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 514 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న శ్రీలంక... న్యూజిలాండ్‌ను ఫాలోఆన్ ఆడించగా.. శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 41 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆత్మరక్షణ ధోరణిలో ఆడి దెబ్బతిన్న న్యూజిలాండ్... రెండో ఇన్నింగ్స్‌లో ఎదురుదాడికి దిగింది. డ్వేన్ కాన్వే (62 బంతుల్లో 61; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధసెంచరీ సాధించగా.. కేన్ విలియమ్సన్ (58 బంతుల్లో 46; 4 ఫోర్లు), బ్లండెల్ (50 బంతుల్లో 47 బ్యాటింగ్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (41 బంతుల్లో 32 బ్యాటింగ్; 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో నిషాన్ మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు శ్రీలంక 602/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా... చేతిలో 5 వికెట్లు ఉన్న న్యూజిలాండ్ జట్టు... ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ఇంకా 315 పరుగులు చేయాల్సి ఉంది. వెలుతురులేమి కారణంగా మూడోరోజు ఆట నిర్ణీత సమయం కంటే ముందే ముగిసింది. మొత్తంగా న్యూజిలాండ్ శనివారం ఇక్క రోజే రోజు 13 వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్లోనే 9 వికెట్లు నెలకూలాయి.చదవండి: IND vs BAN: బంగ్లాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు -
జయసూర్య 'సిక్సర్'.. 88 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఘోర ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. శ్రీలంక బౌలర్ల దాటికి న్యూజిలాండ్ కేవలం 88 పరుగులకే కుప్పకూలింది.లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య స్పిన్ వలలో కివీస్ చిక్కుకుంది. జయసూర్య తన మాయాజాలంతో డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కీలక వికెట్లు పడగొట్టాడు. ఏకంగా తొలి ఇన్నింగ్స్‌లో జయసూర్య 6 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అరంగేట్ర పేసర్ నిషాన్ పీరిస్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. బ్లాక్ క్యాప్స్ ఇన్నింగ్స్‌లో 7 మంది ఆటగాళ్లు కేవలం సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితయమయ్యారు. మిచెల్ శాంట్నర్(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఘోర ప్రదర్శన కరబరిచిన కివీస్ ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతోంది. ఫాలో ఆన్‌లో కూడా కివీస్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇంకా 385 పరుగులు వెనకబడి ఉంది. ఇప్పటికే తొలి టెస్టులో లంక చేతిలో కివీస్ ఓటమి చవిచూసింది. -
Ghost Shark: కొత్త దెయ్యం షార్క్ దొరికింది
విల్లింగ్టన్: పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతుల్లో సంచరించే కొత్త రకం చేపను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చేప కళ్లు చాలా నల్లగా ఉండటంతోపాటు చిమ్మచీకటిమయమైన సముద్రం లోతుల్లో సంచరిస్తుండటంతో దీనిని ‘ఘోస్ట్ షార్క్’గా పేర్కొంటున్నారు. ఘోస్ట్ షార్క్‌లను స్పూక్ షిఫ్ లేదా చిమేరా అని కూడా అంటారు. వీటిలో ముళ్లులు, పొలుసులు ఉండవు. శరీరం మొత్తం మెత్తగా మృదులాస్థితోనే తయారై ఉంటుంది. న్యూజిలాండ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అటా్మస్ఫిరికల్ రీసెర్చ్ బృందం ఈ చేప జాతిని కనుగొంది. న్యూజిలాండ్‌కు తూర్పున ఉన్న ఛాథమ్ రైస్ అనే సముద్రజలాల ప్రాంతంలో ఈ చేపలు జీవిస్తున్నాయి. ఉపరితలం నుంచి దాదాపు 2,600 మీటర్లలోతు మాత్రమే సంచరిస్తుంటాయి. మొత్తం పొడవులో సగం ఉండే పొడవాటి ముక్కు లాంటి నోరు వీటి ప్రత్యేకత. ‘‘లాటిన్లో అవియా అంటే బామ్మ. అందుకే దీనిని హరియోటా అవియా అని పేరు పెట్టాం. అంతరించి పోతున్న జాతుల జాబితాలో చేర్చే విషయమై ఆలోచిస్తున్నట్టు నిపుణులు తెలిపారు. -
ప్రభాత్ స్పిన్... శ్రీలంక విన్
గాలే: లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (4/136; 5/68) స్పిన్ మాయాజాలంతో శ్రీలంకను గెలిపించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టడంతో తొలి టెస్టులో ఆతిథ్య జట్టు 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై గెలిచింది. ఆఖరి రోజు లాంఛనం ముగిసేందుకు 3.4 ఓవర్లే సరిపోయాయి. ప్రభాత్ తన వరుస ఓవర్లలోనే మిగతా రెండు వికెట్లను పడేయడంతో కివీస్ ఐదోరోజు ఆటలో కేవలం 4 పరుగులే చేయగలిగింది. దీంతో ఓవర్‌నైట్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సోమవారం 207/8 ఓవర్‌నైట్ స్కోరుతో చివరిరోజు ఆటకొనసాగించిన కివీస్ ఆలౌట్ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. 70వ ఓవర్ వేసిన ప్రభాత్ జయసూర్య స్పిన్‌ను ఎదుర్కోలేక రచిన్ రవీంద్ర (168 బంతుల్లో 92; 9 ఫోర్లు, 1 సిక్స్) తన క్రితం రోజు స్కోరుకు కేవలం పరుగు మాత్రమే జోడించి వికెట్ల ముందు దొరికిపోయాడు. మళ్లీ తన తదుపరి ఓవర్లో ప్రభాత్... ఆఖరి వరుస బ్యాటర్ విలియమ్ ఓ రూర్కే (0)ను బౌల్డ్ చేయడంతో 71.4 ఓవర్లలో 211 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 305 పరుగులు చేయగా, కివీస్ 340 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యం సంపాదించింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు (309) మూడొందల పైచిలుకు పరుగులు చేయడంతో ఉపఖండపు స్పిన్ పిచ్‌లపై 275 పరుగుల లక్ష్యం న్యూజిలాండ్‌కు అసాధ్యమైంది. ఇదే వేదికపై చివరి రెండో టెస్టు ఈ నెల 26 నుంచి 30 వరకు జరుగుతుంది. -
న్యూజిల్యాండ్ కలలను చిదిమేసిన విద్యుదాఘాతం
రామవరప్పాడు: ఉద్యోగం కోసం న్యూజిల్యాండ్ వెళ్లాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని ఆ యువకుడు కన్న కలలను విద్యుదాఘాతం చిదిమేసింది. వర్కింగ్ వీసాతో పాటు విమాన టిక్కెట్లు కూడా సమకూర్చుకున్న ఆ యువకుడి నిండు ప్రాణాలను బలితీసుకుంది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు జెండా చెట్టు సెంటర్ రోడ్డులో దర్శినాల శంకర్, రమణ దంపతులు నివాసం నివసిస్తు న్నారు. వారికి దర్శినాల వినోద్ కుమార్ (30), ప్రమోద్ సంతానం. చిన్న కుమారుడు వినోద్‌కుమార్ తల్లిదండ్రులు, భార్య సంధ్యతో కలిసి గ్రామంలో ఓ అపార్టుమెంట్ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకుని బాల్కనీలో కాళ్లు శుభ్రం చేసుకుంటుండగా ప్రమాదవశాత్తూ పిట్ట గోడకు ఆనుకుని ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై వినోద్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.న్యూజిల్యాండ్ వెళ్లాల్సి ఉండగా విషాదంఈ నెల చివర వినోద్‌కుమార్ ఓ కంపెనీలో పని చేసేందుకు న్యూజిల్యాండ్ వెళ్లాల్సి ఉంది. ఇందు కోసం వర్కింగ్ వీసాతో పాటు విమాన టిక్కెట్లు కూడా సమకూర్చుకున్నాడు. గతంలో వినోద్‌కుమార్ గ్రామంలో చికెన్ షాపు నిర్వహించేవాడు. న్యూజిల్యాండ్‌లో మంచి ఉద్యోగ అవకాశం రావడంతో స్నేహితులతో కలిసి వెళ్లాడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో మృత్యువు విద్యుదాఘాతం రూపంలో కబళించిందని వినోద్ భార్య సంధ్య, తల్లిదండ్రులు శంకర్, రమణ కన్నీరుమున్నీరుగా విలపించారు. బాల్కానీ వద్ద విద్యుత్ తీగలు చేతికందే దూరంలో ప్రమాదకరంగా ఉన్నాయని, రక్షణ ఏర్పాట్లు చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యుల వద్ద వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.