
న్యూజిలాండ్ మహిళలతో మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. కివీస్ నిర్ధేశించిన 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ అమ్మాయిలు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.3 ఓవర్లలోనే ఛేదించారు.
లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ విధ్వంసం సృష్టించింది. కేవలం 42 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో 75 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు మరో ఓపెనర్ జార్జియా వాల్(31 బంతుల్లో 9 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో మెరిసింది. న్యూజిలాండ్ బౌలర్లలో తహుహు రెండు వికెట్లు సాధించగా.. మిగితా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. వైట్‌ఫెర్న్స్ బ్యాటర్లలో అమీలియా కేర్(51 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సోఫీ డివైన్(39) పర్వాలేదన్పించారు. ఆసీస్ బౌలర్లలో బ్రౌన్, మెక్‌గ్రాత్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 23న మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరగనుంది. ఆసీస్‌తో సిరీస్ కంటే ముందు శ్రీలంకతో జరిగిన వైట్‌బాల్ సిరీస్‌లను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది.
చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! పంత్ టీమ్‌లోకి ఎంట్రీ?
Comments
Please login to add a commentAdd a comment