Beth Mooney
-
రెచ్చిపోయిన గుజరాత్ కెప్టెన్.. చివరి 12 బంతుల్లో 7 బౌండరీలు
మహిళల ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 11) గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు లారా వాల్వార్డ్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (42 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దయాలన్ హేమలత 0, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 4, ఆష్లే గార్డ్నర్ 15, భారతి ఫుల్మలి 1, కేథరీన్ బ్రైస్ 11, తనుజా కన్వర్ 1, షబ్నమ్ 0 పరుగులకు ఔటయ్యారు. వారియర్జ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 3 వికెట్లతో విజృంభించగా.. దీప్తి శర్మ 2, రాజేశ్వరీ గైక్వాడ్, చమారీ ఆటపట్టు తలో వికెట్ పడగొట్టారు. పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడిన మూనీ.. గుజరాత్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన మూనీ తొలుత ఆచితూచి ఆడినప్పటికీ.. ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. చివరి 12 బంతుల్ని ఎదుర్కొన్న మూనీ.. ఏకంగా 7 ఫోర్లతో విరుచుకుపడింది. 19వ ఓవర్లో రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు రాబట్టిన మూనీ.. చివరి ఓవర్లో ఏకంగా ఐదు బౌండరీలు బాది 21 పరుగులు పిండుకుంది. మూనీ ఆఖరి రెండు ఓవర్లలో జూలు విదల్చడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ఢిల్లీ, ముంబై జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. గుజరాత్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీ, యూపీ వారియర్జ్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. -
ఆర్సీబీతో మ్యాచ్.. విధ్వంసం సృష్టించిన గుజరాత్ ఓపెనర్లు
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (మార్చి 6) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఓపెనింగ్ బ్యాటర్లు లారా వొల్వార్డ్ట్, బెత్ మూనీ శివాలెత్తిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. లారా, మూనీ రెచ్చిపోవడంతో భారీ స్కోర్ చేసింది. లారా 45 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 76 పరుగులు చేయగా.. మూనీ 51 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లారా, మూనీ మినహా గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేకపోయారు. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 18, ఆష్లే గార్డ్నర్ 0, దయాలన్ హేమలత 1, వేద కృష్ణమూర్తి ఒక పరుగు చేశారు. ఆర్సీబీ బౌలర్ సోఫీ మోలినెక్స్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. మోలినెక్స్ ఆఖరి ఓవర్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసింది. ఒకరు రనౌటయ్యారు. 18వ ఓవర్ వరకు (187/1) అతి భారీ స్కోర్ దిశగా సాగుతున్నట్లు కనిపించిన గుజరాత్ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి చివరి 2 ఓవర్లలో కేవలం 12 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లలో సోఫీ మోలినెక్స్, జార్జియా వేర్హమ్ తలో వికెట్ పడగొట్టగా.. ముగ్గురు బ్యాటర్లు రనౌట్లయ్యారు. -
సూర్య, హర్మన్‌ల ఖాతాలో ప్రతిష్టాత్మక అవార్డు
టీమిండియా టి20 స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రతిష్టాత్మక విజ్డెన్ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నారు. గతేడాది టి20 క్రికెట్లో సూపర్ ప్రదర్శనతో అదగొట్టినందుకు గాను సూర్యకుమార్ విజ్డన్ అల్మానిక్ లీడింగ్ టి20 క్రికెటర్ ఇన్ వరల్డ్ అవార్డు గెలుచుకోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. తద్వారా విజ్డన్ అవార్డు గెలిచిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. 2022 ఏడాదిలో సూర్యకుమార్ టి20 క్రికెట్లో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. 2022 ఏడాదిలో 187.43 స్ట్రైక్‌రేట్‌తో సూర్య 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉండగా.. 68 సిక్సర్లు బాదాడు. సూర్య బ్యాటింగ్ మాయాజాలంతో టీమిండియా 40 మ్యాచ్‌ల్లో 28 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక నాటింగ్హమ్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 117 పరుగులు చేసిన సూర్యకు టి20ల్లో తొలి శతకం. ఇక హర్మన్‌ప్రీత్ గతేడాది కెప్టెన్‌గానే గాక బ్యాటర్‌గానూ అదరగొట్టింది. వన్డేల్లో 754 పరుగులు, టి20ల్లో 524 పరుగులు సాధించింది. ఇంగ్లండ్‌పై వన్డే మ్యాచ్‌లో 143 పరుగులు నాటౌట్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఇక కెప్టెన్‌గా కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఇక మరిన్ని అవార్డుల విషయానికి వస్తే.. గతేడాది టెస్టుల్లో టాప్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఔట్‌స్టాండింగ్ టెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకోగా.. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వరుసగా మూడోసారి లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. గతేడాది బెన్ స్టోక్స్ నాయకత్వంలో 10 టెస్టుల్లో తొమ్మిదింటిలో గెలవడం విశేషం. అలాగే 2022 టి20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ వరల్డ్ టాప్ వుమెన్స్ క్రికెటర్ అవార్డును రెండోసారి కొల్లగొట్టింది. -
గుజరాత్ కెప్టెన్ స్థానంలో సౌతాఫ్రికా ఓపెనర్
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్ (2023) తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ జెయింట్స్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఆసీస్ స్టార్ ప్లేయర్/వికెట్‌కీపర్ బెత్ మూనీ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడి, ఆతర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లకు (యూపీ వారియర్జ్, ఆర్సీబీ)దూరంగా ఉంది. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో మూనీ సీజన్ మొత్తానికే దూరమైంది. దీంతో ఆమె స్థానాన్ని సౌతాఫ్రికా ఓపెనర్ లారా వొల్వార్ట్తో భర్తీ చేసింది యాజమాన్యం. జెయింట్స్ మూనీని బేస్ ధర 30 లక్షలకు సొంతం చేసుకుంది. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడేందుకు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న వొల్వార్ట్.. మార్చి 11 ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉంటుందని సమాచారం. ప్రస్తుతానికి మూనీ గైర్హాజరీలో కెప్టెన్‌గా స్నేహ్ రాణా, వికెట్‌కీపర్‌గా సుష్మా వర్మ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మూనీని వేలంలో గుజరాత్ జెయింట్స్ 2 కోట్లు వెచ్చించి దక్కించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు గాయపడిన ఆల్‌రౌండర్ లక్ష్మీ యాదవ్ స్థానంలో శివాలి షిండేను భర్తీ చేసుకుంది యూపీ వారియర్జ్ యాజమాన్యం. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన 26 ఏళ్ల శివాలి.. మహారాష్ట్ర, ఇండియా ఏ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. మార్చి 9 నాటికి డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టిక ఇలా ఉంది.. -
హారిస్ సంచలన ఇన్నింగ్స్.. గుజరాత్‌పై యూపీ వారియర్జ్ విజయం
హారిస్ సంచలన ఇన్నింగ్స్.. గుజరాత్‌పై యూపీ వారియర్జ్ విజయం మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్జ్ శుభారంబం చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో యూపీ విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో యూపీ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. ఆ జట్టు బ్యాటర్ గ్రేస్ హారిస్ అద్భుత ఇన్నింగ్స్‌తో తమ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆఖరి ఓవర్ వేసిన సదర్లాండ్ బౌలింగ్‌లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో మ్యాచ్‌ను హారిస్ ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్‌లో కేవలం 26 బంతులు ఎదుర్కొన్న హారిస్ 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 59 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు కిరణ్ నవ్‌గిరే(53)పరుగులతో యూపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ ఐదు వికెట్లు సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది. గార్త్ తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. ►18 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 7 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీస్(36), ఎకిలిస్టోన్(9) పరుగులతో ఉన్నారు. యూపీ విజయానికి 12 బంతుల్లో 33 పరుగులు కావాలి. ►17 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీస్(23), ఎకిలిస్టోన్(3) పరుగులతో ఉన్నారు. ఐదు వికెట్లతో చెలరేగిన కిమ్ గార్త్ వరుస క్రమంలో యూపీ వారియర్జ్ 3 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్లు ముగిసే సరికి యూపీ 6 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. యూపీ విజయానికి 42 బంతుల్లో 82 పరుగులు కావాలి. క్రీజులో హ్యారిస్, వైద్యా ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు గుజరాత్ పేసర్ కిమ్ గార్త్ ఐదు వికెట్లు పడగొట్టింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో హర్లీన్ డియోల్(46),గార్డనర్(25) పరుగులతో రాణించారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెక్‌గ్రాత్,శర్వాణి తలా వికెట్ సాధించారు. 9 ఓవర్లకు యూపీ స్కోర్: 60/3 9 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో కిరణ్ నవ్‌గిరే(40), దీప్తి శర్మ(8) పరుగులతో ఉన్నారు. 26 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో యూపీ 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హీలీతో పాటు శ్వేతా సెహ్రావత్, మెక్‌గ్రాత్ వికెట్లను యూపీ కోల్పోయింది. కాగా తొలి మూడు వికెట్లను కూడా గుజరాత్ పేసర్ కిమ్ గార్త్ పడగొట్టింది. రాణించిన గుజరాత్ బ్యాటర్లు.. యూపీ టార్గెట్ 170 పరుగులు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో హర్లీన్ డియోల్(46),గార్డనర్(25) పరుగులతో రాణించారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెక్‌గ్రాత్,శర్వాణి తలా వికెట్ సాధించారు. ► 16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్ డియోల్(23), హేమలత (1)పరుగులతో ఉన్నారు. ► 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్ డియోల్(23), గార్డనర్(18) పరుగులతో ఉన్నారు. 9 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 58/3 ►9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్, సుష్మా వర్మ పరుగులతో ఉన్నారు. ►38 పరుగుల వద్ద గుజరాత్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన మేఘన.. సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో పెవియలన్కు చేరింది. ►34 పరుగుల వద్ద గుజరాత్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన డాంక్లీ.. దీప్తి శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యంది. క్రీజులో హర్లీన్ వచ్చింది. 3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 30/0 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో సబ్బినేని మేఘన(20), డాంక్లీ(10) పరుగులతో ఉన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. యూపీ వారియర్జ్ తమ తొలి మ్యాచ్‌లో డివై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు గుజరాత్ రెగ్యూలర్ కెప్టెన్ బెత్ మూనీ గాయం కారణంగా దూరమైంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టుకు స్నేహ్ రానా సారథ్యం వహించనుంది. తుది జట్లు: యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, సిమ్రాన్ షేక్, కిరణ్ నవ్‌గిరే, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్ గుజరాత్ జెయింట్స్ : సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, సుష్మా వర్మ(వికెట్‌కీపర్), దయాళన్ హేమలత, స్నేహ్ రాణా(కెప్టెన్), తనుజా కన్వర్, మాన్సీ జోషి -
గుజరాత్ పతనాన్ని శాసించి, ముంబైను గెలిపించిన ఈ అమ్మాయి ఎవరు..?
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023) తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్.. ముంబై ఇండియన్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 4) జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. గుజరాత్ జెయింట్స్‌ను 143 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు) మెరుపు అర్ధశతకంతో, ఓపెనర్ హేలీ మాథ్యూస్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అమేలియా కెర్ర్ (24 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), నాట్ సీవర్-బ్రంట్ (18 బంతుల్లో 23; 5 ఫోర్లు), పూజా వస్త్రాకర్ (8 బంతుల్లో 15; 3 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా 2.. వేర్హమ్, గార్డ్నర్, తనుజా కన్వర్ తలో వికెట్ దక్కించుకున్నారు. 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. సైకా ఇషాఖీ (3.1-1-11-4), నాట్ సీవర్-బ్రంట్ (2-0-5-2), అమేలియా కెర్ర్ (2-1-12-2), ఇస్సీ వాంగ్ (3-0-7-1) ధాటికి 15.1 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే చేసి పేకమేడలా కూలింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో దయాలన్ హేమలత (23 బంతుల్లో 29 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), 11వ నంబర్ ప్లేయర్ మోనికా పటేల్ (9 బంతుల్లో 10; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. గుజరాత్ స్కోర్ కార్డు సున్నాలు, సింగిల్ డిజిట్ స్కోర్లతో నిండుకుని ఫుట్‌బాల్ స్కోర్ కార్డును తలపించింది. సబ్బినేని మేఘన (2), బెత్ మూనీ (0 రిటైర్డ్ హర్ట్), హర్లీన్ డియోల్ (0), ఆష్లే గార్డ్నర్ (0), అన్నాబెల్ సుదర్లాండ్ (6), జార్జియా వేర్హమ్ (8), స్నేహ్ రాణా (1), తనుజా కన్వర్ (0), మాన్సీ జోషీ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ పతనాన్ని శాసించి, ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన సైకా ఇషాఖీ ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇషాఖీ ఎవరు.. ఆమె ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు నెటిజన్లు. సైకా ఇషాఖీ గురించి నెట్లో సెర్చ్ చేయగా.. ఆమె ఓ దిగువ మధ్యతరగతి బెంగాలీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లెఫ్ట్ హ్యాండ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన 27 ఏళ్ల ఇషాఖీ.. టీమిండియా తరఫున అరంగేట్రం చేయనప్పటికీ ఇండియా డి వుమెన్, ట్రయల్‌బ్లేజర్స్, బెంగాల్, ఇండియా ఏ వుమెన్ జట్లకు ప్రాతినిధ్యం వహించినట్లుగా తెలుస్తోంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సామర్థ్యమున్న ఇషాఖీ.. 2021లో ఇండియా-సితో జరిగిన ఓ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో అమేలియా కెర్ర్, హేలీ మాథ్యూస్ లాంటి అంతర్జాతీయ స్థాయి స్పిన్నర్లు ఉన్నా, ఇషాఖీ వారిని ఫేడ్ అవుట్ చేసి మరీ సత్తా చాటింది. ఈ ఒక్క మ్యాచ్‌లో ప్రదర్శనతో ఇషాఖీ రాత్రికిరాత్రి స్టార్‌గా మారిపోయింది. -
64 పరుగులకే కుప్పకూలిన గుజరాత్.. ముంబై ఘన విజయం
గుజరాత్ జెయింట్స్‌కు దారుణ పరాభవం ►డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 64 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దయాలన్ హేమలత 29 నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. సైకా ఇషికీ నాలుగు వికెట్లతో చెలరేగింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హర్మన్‌కు తోడు హేలీ మాథ్యూస్(31 బంతుల్లో 47 పరుగులు), అమెలియా కెర్(24 బంతుల్లో 45 నాటౌట్) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. తనుజా కన్వర్, అష్లే గార్డనర్, జార్జియా వెర్హమ్లు తలా ఒక వికెట్ తీశారు. ► గుజరాత్ జెయింట్స్ ఫేలవ ఆటతీరు కనబరుస్తుంది. మాన్సి జోషి(6) రూపంలో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్ ► గుజరాత్ జెయింట్స్ కష్టాల్లో పడింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. వర్హెమ్ 4, దయాలన్ హేమలత ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన గుజరాత్ ► 208 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలుత కెప్టెన్ బెత్ మూనీ కాలు బెణకడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన హర్లిన్ డియోల్ వాంగ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. మరుసటి బంతికే స్టార్ బ్యాటర్ అష్లీ గార్డనర్ గోల్డెన్ డకౌట్ అయింది. సబ్బినేని మేఘన రెండు పరుగులు చేసి పెవిలియన్ చేరింది. హర్మన్, అమెలీ కైర్ మెరుపులు.. ముంబై భారీ స్కోరు ► డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హర్మన్‌కు తోడు హేలీ మాథ్యూస్(31 బంతుల్లో 47 పరుగులు), అమెలియా కెర్(24 బంతుల్లో 45 నాటౌట్) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. తనుజా కన్వర్, అష్లే గార్డనర్, జార్జియా వెర్హమ్లు తలా ఒక వికెట్ తీశారు. ముగిసిన హర్మన్ జోరు.. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ► కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్ జోరుకు బ్రేక్ పడింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన హర్మన్(30 బంతుల్లో 65) స్నేహ్రాణా బౌలింగ్‌లో హేమలతాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ మెరుపులు.. భారీ స్కోరు దిశగా ముంబై ► ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌండరీల వర్షం కురిపిస్తోంది. తద్వారా ముంబై భారీ స్కోరు దిశగా కదులుతుంది. 15 బంతుల్లో ఆరు ఫోర్లతో 30 పరుగులతో హర్మన్ దూకుడు ఆటతీరును కనబరుస్తోంది. ప్రస్తుతం ముంబై 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన ముంబై ► దూకుడుగా ఆడిన హేలీ మాథ్యూస్ 47 పరుగుల వద్ద గార్డనర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ముంబై 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. సిక్సర్ల వర్షం కురిపిస్తున్న విండీస్ క్రికెటర్ ► విండీస్ క్రికెటర్ హెలీ మాథ్యూస్ సిక్సర్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ముంబై 8.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. మాథ్యూస్ 41 పరుగులతో క్రీజులో ఉంది. సివర్ బ్రంట్ 23 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ► ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు వికెట్ నష్టానికి 44 పరుగులుగా ఉంది. సివర్ బ్రంట్ 189, మాథ్యూ హెలిస్సా 23 పరుగులతో ఆడుతున్నారు. ► 4 ఓవర్లలో ముంబై ఇండియన్స్ స్కోరు ఎంతంటే? 4 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వుమెన్స్ వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. హెలీ మాథ్యూస్ 15, నట్ సివర్ బ్రంట్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు యస్తికా బాటియా(1) తనూజ కన్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. ► టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న గుజరాత్ జెయింట్స్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి.ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం మ్యాచ్‌కు వేదిక కానుంది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బౌలింగ్ ఏంచుకుంది.గుజరాత్ జెయింట్స్‌కు బెత్ మూనీ సారధ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తే.. గుజరాత్‌తో పోలిస్తే, ముంబైకే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. గుజరాత్ టీమ్‌లో కెప్టెన్ మూనీ, యాష్లే గార్డెనర్, అనాబెల్ సదర్లాండ్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, సబ్బినేని మేఘన గుర్తింపుగల స్టార్ ప్లేయర్లు కాగా.. ముంబై జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్ వాంగ్, హేలీ మాథ్యూస్ ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, హుమైరా కాజీ, ఇస్సీ వాంగ్, జింటిమణి కలిత, సైకా ఇషాక్ గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ(కెప్టెన్), సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, దయాళన్ హేమలత, జార్జియా వేర్హామ్, స్నేహ రాణా, తనూజా కన్వర్, మోనికా పటేల్, మాన్సీ జోషి ► అంతకముందు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సింగర్ డిల్లాన్లు తమ ప్రదర్శనతో స్టేడియాన్ని హోరెత్తించారు. -
మహిళల ఐపీఎల్ 2023.. తొలి మ్యాచ్‌లో గెలుపెవరిది..?
తొట్టతొలి మహిళల ఐపీఎల్ (WPL) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ (మార్చి 4) సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా 2023 WPL ఇనాగురల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్స్.. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. గుజరాత్ జెయింట్స్‌కు బెత్ మూనీ సారధ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తే.. గుజరాత్‌తో పోలిస్తే, ముంబైకే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. గుజరాత్ టీమ్‌లో కెప్టెన్ మూనీ, యాష్లే గార్డెనర్, అనాబెల్ సదర్లాండ్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, సబ్బినేని మేఘన గుర్తింపుగల స్టార్ ప్లేయర్లు కాగా.. ముంబై జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్ వాంగ్, హేలీ మాథ్యూస్ ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ముంబై టీమ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా సంచలన ప్రదర్శనలు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇటీవలికాలంలో వీరి ఫామ్‌ను బట్టి చూస్తే.. ఈ ఐదుగురిని ఆపడం కష్టమని సుస్పష్టమవుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ప్లేయర్స్ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే.. గుజరాత్‌పై పైచేయి సాధించడం హర్మన్ సేనకు పెద్ద కష్టమైన విషయం కాకపోవచ్చు. ఈ మ్యాచ్‌కు ముందు గాయం కారణంగా విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ తప్పుకోవడం గుజరాత్‌కు మైనస్‌గా చెప్పవచ్చు. గుజరాత్ విజయావకాశలు కెప్టెన్ బెత్ మూనీ, యాష్లే గార్డ్నర్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణాలపైనే అధారపడి ఉన్నాయి. కాగా, WPL టీవీ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను స్పోర్ట్స్ 19 నెట్వర్క్ దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్‌ను జియో సినిమా యాప్, వెబ్సైట్ సొంతం చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్.. హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత. గుజరాత్ జెయింట్స్.. బెత్ మూనీ (కెప్టెన్), యాష్లే గార్డ్నర్,జార్జియా వేర్హమ్,స్నేహ్ రాణా, అనాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, సోఫియా డన్క్లే, సుష్మా వర్మ, తనూజ కన్వర్, హర్లీన్ డియోల్, అశ్వని కుమారి, హేమలత, మాన్సి జోషి, మోనిక పటేల్, సబ్బినేని మేఘన, హర్లీ గాల, పరుణిక సిసోడియా, షబ్నమ్ షకీల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023: మహిళా ప్రీమియర్ లీగ్ 5 జట్లు, కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు వీరే!
Women's Premier League 2023 All 5 WPL Squads: భారత క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఐదు ఫ్రాంచైజీ జట్ల మధ్య శనివారం (మార్చి 4) నుంచి మహిళా క్రికెటర్ల పోటీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్-2023కి సంబంధించిన జట్ల పూర్తి వివరాలు మీకోసం.. మహిళా ప్రీమియర్ లీగ్-2023 జట్లు, కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు 1.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- స్మృతి మంధాన- బెన్ సాయెర్ 2. ఢిల్లీ క్యాపిటల్స్- మెగ్ లానింగ్- జొనాథన్ బాటీ 3. యూపీ వారియర్స్- అలిసా హేలీ- జాన్ లూయీస్ 4. గుజరాత్ జెయింట్స్- బెత్ మూనీ- రేచల్ హెయిన్స్ 5. ముంబై ఇండియన్స్- హర్మన్‌ప్రీత్ కౌర్- చార్లెట్ ఎడ్వర్డ్స్ 5 జట్ల సభ్యులు వీరే! 1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్మృతి మంధాన (కెప్టెన్), రేణుకా సింగ్, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దీక్షా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా షిబానా, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెనార్, మేగన్ షట్, సహానా పవార్ 2. ఢిల్లీ క్యాపిటల్స్ మెగ్ లానింగ్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మరిజానే క్యాప్, టైటాస్ సాధు, అలిస్ కాప్సీ, తారా నోరిస్, లారా హ్యారిస్, జేసియా అక్తర్, మిన్ను మణి, తాన్యా భాటియా, పూనమ్ యాదవ్, జెస్ జొనాస్సెన్, స్నేహదీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మొండాల్. 3. యూపీ వారియర్స్ అలిసా హేలీ (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), సోఫియా ఎక్లిస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, కిరణ్ నవ్‌గిరే, గ్రేస్ హారిస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్షవితా చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, సిమ్రన్ షేక్. 4. గుజరాత్ జెయింట్స్ బెత్ మూనీ (కెప్టెన్), ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్లె సదర్లాండ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సబ్బినేని మేఘన, జార్జియా వేర్హామ్, మాన్సీ జోషి, డి. హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, స్నేహ రాణా (వైస్ కెప్టెన్), సుష్మా వర్మ, హర్లీ గాలా, అశ్వని కుమారి, పరునికా సిసోడియా, షబ్నం మహ్మద్. 5. ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత. చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం.. -
గుజరాత్ జెయింట్స్ కెప్టెన్‌గా బెత్ మూనీ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో పాల్గొనే గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ కెపె్టన్‌గా... భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా వైస్ కెపె్టన్‌గా వ్యవహరించనున్నారు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో తొలి డబ్ల్యూపీఎల్ జరగనుంది. 29 ఏళ్ల మూనీ ఇప్పటి వరకు 83 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 18 అర్ధ సెంచరీల సహాయంతో 2,380 పరుగులు చేసింది. -
అదరగొట్టిన ఆసీస్ బ్యాటర్.. టీ20ల్లో వరల్డ్ నెం.1 ర్యాంక్
భారత మహిళలతో టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్ తహీలా మెక్‌గ్రాత్.. ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ముంబై వేదికగా జరిగిన తొలి రెండు టీ20ల్లో మెక్‌గ్రాత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రెండు మ్యాచ్‌లు కలిపి మెక్‌గ్రాత్ 110 పరుగులు సాధించింది. ఈ క్రమంలో తన సహచర క్రికెటర్లు , బెత్ మూనీ, మెగ్ లానింగ్, భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానలను అధిగమించి మెక్‌గ్రాత్ టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. కాగా ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు తొలి స్థానంలో మూనీ కొనసాగింది. ఇక ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో నెం1 ర్యాంక్ సాధించిన 12 ఆస్ట్రేలియా బ్యాటర్‌గా మెక్‌గ్రాత్ నిలిచింది.మెక్‌గ్రాత్ తన కెరీర్లో కేవలం 16 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడి నెం1 ర్యాంక్‌ను తన ఖతాలో వేసుకుంది. కాగా ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్ టాప్-10లో భారత నుంచి ముగ్గురు బ్యాటర్లు ఉన్నారు. మూడో స్థానంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ఆరు, తొమ్మిది ర్యాంక్‌లలో షషాలీ వర్మ, రోడ్రిగ్స్ కొనసాగుతున్నారు. చదవండి: IND vs BAN 1st Test: కోహ్లి, పంత్ 125 పరుగులు చేస్తారు! వారిద్దరూ 20 వికెట్లు తీస్తారు.. -
భారత్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం
ముంబై: భారత మహిళల జట్టుతో శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. రిచా ఘోష్ (36; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ (36 నాటౌట్; 8 ఫోర్లు) రాణించారు. ఆసీస్ అమ్మాయిలు 18.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచారు. ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెత్ మూనీ (57 బంతుల్లో 89 నాటౌట్; 16 ఫోర్లు) మెరిసింది. ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజలి శర్వాణి భారత్ టి20 జట్టు తరఫున అరంగేట్రం చేసిన 72వ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి చెందిన అంజలి 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చింది. చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన ఆసీస్ ఓపెనర్.. మళ్లీ నెంబర్ 1 స్థానానికి!
ఐసీసీ మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ అదరగొట్టింది. కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మూనీ టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్లో 179 పరుగులతో మూనీ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్‌పై 61 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ.. పాకిస్తాన్, న్యూజిలాండ్‌పై పై 70, 36 పరుగులతో రాణించింది. దీంతో రెండో స్థానంలో ఉన్న ఆమె 743 పాయింట్లతో ఆసీస్ కెప్టెన్ లానింగ్‌ను వెనుక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. కాగా మూనీ ఇప్పటి వరకు తన టీ20 కెరీర్లో మూడో సారి నెం1 ర్యాంక్ సాధించడం గమనార్హం. మరోవైపు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ తహిలియా మెక్‌గ్రాత్ తన కెరీర్లో అత్యత్తుమ ర్యాంక్ సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టిన మెక్‌గ్రాత్.. తన కెరీర్లో తొలి సారి ఐదో స్థానానికి చేరుకుంది. ఆదే విధంగా భారత బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా తొలి సారి 10వ ర్యాంక్ సాధించింది. ఇక ఓవరాల్‌గా టాప్ ర్యాంక్‌లో బ్రెత్ మూనీ ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో ఆసీస్ కెప్టెన్ లానింగ్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫియా డివైన్ కొనసాగుతున్నారు. చదవండి: Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్.. డీకే, అశ్విన్ వద్దు! అతడు ఉంటేనే బెటర్! -
బ్యాట్‌తోనే అనుకుంటే.. స్టన్నింగ్ క్యాచ్తోనూ మెరిసింది
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. 157 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్ ఏడోసారి టైటిల్ గెలిచేందుకు ఫైనల్లో అడుగుపెట్టింది. ఆసీస్ బ్యాటింగ్‌లో బెత్ మూనీ చివర్లో దాటిగా ఆడి 31 బంతుల్లోనే 3 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో మెరిసిన బెత్ మూనీ.. అనంతరం ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటింది. వర్షం అంతరాయంతో 45 ఓవర్లకు కుదించగా.. 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఉమెన్స్‌కు ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే షాక్ తగిలింది. విండీస్ ఓపెనర్ రషదా విలియమ్స్‌ను.. మేఘన్ స్కట్డకౌట్గా పెవిలియన్‌గా చేర్చింది. అయితే ఇక్కడ హైలైట్ అయింది మాత్రం బెత్ మూనీనే. విలియమ్స్.. కవర్ డ్రైవ్ దిశగా షాట్ ఆడగా అక్కడే ఉన్న బెత్ మూనీ విల్లుగా ఒకవైపుగా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హేన్స్(85), హేలీ(129) అదిరిపోయే ఆరంభం అందించారు. బెత్ మూనీ 43 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ముగ్గురి అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా నిర్ణీత 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 305 పరుగుల భారీ స్కోరు సాధించింది.లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ డియాండ్ర డాటిన్ శుభారంభం అందించింది. 34 పరుగులతో రాణించింది. వన్‌డౌన్‌లో వచ్చిన హేలీ మాథ్యూస్ 34, కెప్టెన్ స్టెఫానీ టేలర్ 48 పరుగులు సాధించారు. ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారు. దీంతో 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయి వెస్టిండీస్ కుప్పకూలింది. చదవండి: అజేయ రికార్డును కొనసాగిస్తూ.. వెస్టిండీస్‌ను చిత్తు చేసి.. భారీ విజయంతో ఫైనల్‌కు Mitchell Marsh: ఆస్ట్రేలియాకు షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్ View this post on Instagram A post shared by ICC (@icc) -
World Cup 2022: ఎదురులేని ఆసీస్.. బంగ్లాను చిత్తు చేసి.. ఏడింటికి ఏడు గెలిచి
ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా దుమ్ములేపుతోంది. మెగా ఈవెంట్లో ఆడిన ఏడింటికి ఏడు మ్యాచ్‌లు గెలిచి తిరుగులేని జట్టుగా అవతరించింది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించి అజేయ రికార్డును పదిలం చేసుకుంది. తద్వారా ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో మెగ్ లానింగ్ బృందం నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. వర్షం కారణంగా 43 ఓవర్లకు మ్యాచ్ కుదించిన నేపథ్యంలో 5 వికెట్ల తేడాతో గెలుపొంది బంగ్లాను చిత్తు చేసింది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా మహిళా జట్టు నిర్ణీత 43 ఓవర్ల(వరణుడి ఆటంకం)లో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్ షర్మిన్ అక్తర్(24), లతా మొండల్(33) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఆదిలో తడబాటు.. అయితే.. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలీసా హేలీ, రేచల్ హేన్స్ వరుసగా 15, 7 పరుగులకే నిష్క్రమించారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన స్టార్ బ్యాటర్, కెప్టెన్ మెగ్ లానింగ్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో గట్టి షాక్ తగిలింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెత్ మూనీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. మూనీ అజేయ అర్ధ శతకంతో ఆసీస్ 32.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది. బెత్ మూనీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్లు: బంగ్లాదేశ్- 135/6 (43) ఆస్ట్రేలియా 136/5 (32.1) View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
దవడ విరిగింది.. ముఖానికి సర్జరీ.. పడిలేచిన కెరటం
ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్ బెత్ మూనీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఇంగ్లండ్‌తో యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రెండోరోజు ఆటలో బెత్‌మూనీ డైవ్ చేసి బౌండరీని సేవ్ చేయడం వైరల్‌గా మారింది. ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఇంగ్లండ్‌తో టి20 సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ప్రాక్టీస్ సెషన్లో బెత్‌మూనీ ఫీల్డింగ్ చేస్తూ జారిపడింది. వేగంగా పడడంతో ఆమె దవడ పగిలింది. ముఖమంతా రక్తమయమయింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చదవండి: IPL 2022: సగం సీజన్ ఆడడం ఎందుకు... అక్కడే ఉండండి వైద్యులు ఆమె ముఖానికి మూడు మెటల్ప్లేట్స్ అమర్చి కుట్లు వేసి సర్జరీ చేశారు. దవడ బాగానికి బలంగా తాకడంతో గట్టి పదార్థాలు తినకూడదని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో బెత్‌మూనీ తన రోజూవారి ఆహరంలో సూప్, మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌లను కేవలం స్ట్రా ద్వారా మాత్రమే తీసుకుంది. దాదాపు పదిరోజుల పాటు బెత్‌మూనీ ఆహారం ఇదే. సరిగ్గా పదిరోజుల తర్వాత పడిలేచిన కెరటంలా బెత్‌మూనీ యాషెస్‌లో బరిలోకి దిగింది. రెండోరోజు ఆటలో బెత్‌మూనీ బౌండరీలైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని ఆపడం కెమెరాలకు చిక్కింది. గాయం నొప్పి ఇంకా ఉన్నప్పటికి ఏ మాత్రం లెక్కచేయకుండా జట్టుకోసం బరిలోకి దిగిన బెత్మూనీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బెత్ మూనీ దైర్యాన్ని తాము మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామని.. సర్జరీ జరిగిన కేవలం పదిరోజుల్లోనే తిరిగి క్రికెట్ ఆడిన బెత్‌మూనీ మాకు ఆదర్శప్రాయమని ఆ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వుమెన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కెప్టెన్ హెథర్ నైట్ 127 పరుగులు నాటౌట్, సోఫీ ఎసిల్స్టోన్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. Playing with a broken jaw and Beth Mooney is still throwing herself around in the field 😳 #Ashes pic.twitter.com/hBjxOnVgtw — 7Cricket (@7Cricket) January 28, 2022