తొట్టతొలి మహిళల ఐపీఎల్ (WPL) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ (మార్చి 4) సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా 2023 WPL ఇనాగురల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్స్.. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. గుజరాత్ జెయింట్స్‌కు బెత్ మూనీ సారధ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది.
ఈ మ్యాచ్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తే.. గుజరాత్‌తో పోలిస్తే, ముంబైకే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. గుజరాత్ టీమ్‌లో కెప్టెన్ మూనీ, యాష్లే గార్డెనర్, అనాబెల్ సదర్లాండ్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, సబ్బినేని మేఘన గుర్తింపుగల స్టార్ ప్లేయర్లు కాగా.. ముంబై జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్ వాంగ్, హేలీ మాథ్యూస్ ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ముఖ్యంగా ముంబై టీమ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా సంచలన ప్రదర్శనలు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇటీవలికాలంలో వీరి ఫామ్‌ను బట్టి చూస్తే.. ఈ ఐదుగురిని ఆపడం కష్టమని సుస్పష్టమవుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ప్లేయర్స్ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే.. గుజరాత్‌పై పైచేయి సాధించడం హర్మన్ సేనకు పెద్ద కష్టమైన విషయం కాకపోవచ్చు. ఈ మ్యాచ్‌కు ముందు గాయం కారణంగా విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ తప్పుకోవడం గుజరాత్‌కు మైనస్‌గా చెప్పవచ్చు. గుజరాత్ విజయావకాశలు కెప్టెన్ బెత్ మూనీ, యాష్లే గార్డ్‌నర్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణాలపైనే అధారపడి ఉన్నాయి.
కాగా, WPL టీవీ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను స్పోర్ట్స్ 19 నెట్‌వర్క్ దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్‌ను జియో సినిమా యాప్, వెబ్‌సైట్ సొంతం చేసుకున్నాయి.
ముంబై ఇండియన్స్..
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత.
గుజరాత్ జెయింట్స్..
బెత్ మూనీ (కెప్టెన్), యాష్లే గార్డ్‌నర్,జార్జియా వేర్‌హమ్,స్నేహ్ రాణా, అనాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, సోఫియా డన్‌క్లే, సుష్మా వర్మ, తనూజ కన్వర్, హర్లీన్ డియోల్, అశ్వని కుమారి, హేమలత, మాన్సి జోషి, మోనిక పటేల్, సబ్బినేని మేఘన, హర్లీ గాల, పరుణిక సిసోడియా, షబ్నమ్ షకీల్
Comments
Please login to add a commentAdd a comment