WPL 2023
-
హ్యాట్రిక్ తీసిన బౌలర్‌నే వదిలేసిన ముంబై ఇండియన్స్
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) ఇవాళ రిటెన్షన్ జాబితాలను విడుదల చేశాయి. దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు నలుగురి నుంచి ఆరుగురిని వేలానికి వదిలేసి మిగతా ప్లేయర్లను అలాగే అట్టిపెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ సైతం నలుగురిని వేలానికి వదిలేసి, 14 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్‌లో ముగ్గురు భారత అన్క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. ఓ విదేశీ స్టార్ ప్లేయర్ ఉంది. వచ్చే సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇస్సీ వాంగ్‌ను అనూహ్యంగా వేలానికి వదిలేసింది. 22 ఏళ్ల ఇస్సీ డబ్ల్యూపీఎల్ డెబ్యూ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున హ్యాట్రిక్ తీసింది. మహిళల ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన తొలి క్రికెటర్ ఇస్సీనే కావడం విశేషం. 2023 సీజన్లో యూపీ వారియర్జ్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇస్సీ ఈ ఘనత సాధించింది. హ్యాట్రిక్ తీయడంతో పాటు తొలి సీజన్లో ఓ వెలుగు వెలిగిన ఇస్సీ 2024 సీజన్లో మరో స్టార్ విదేశీ పేసర్ (షబ్నిమ్ ఇస్మాయిల్) రావడంతో మరుగున పడిపోయింది. షబ్నిమ్ ఎంట్రీతో ఇస్సీకి అవకాశాలు కరువయ్యాయి. షబ్నిమ్ అద్భుతమైన ప్రదర్శనలతో రాణించడంతో ఈ ఏడాది వేలానికి ముందు ఇస్సీని వదిలేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐ మేనేజ్మెంట్ ఇస్సీని వదులుకోక తప్పలేదు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇస్సీతో పాటు స్వదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్లను కూడా వేలానికి వదిలేసింది. ముంబై ఇండియన్స్ ఈసారి కూడా హర్మన్‌ప్రీత్‌ను కెప్టెన్‌గా కొనసాగించింది. ఎంఐ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్‌లో యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్ లాంటి స్వదేశీ, విదేశీ స్టార్లు ఉన్నారు. వేలంలో పాల్గొనేందుకు ముంబై ఇండియన్స్ పర్స్‌లో ఇంకా 2.65 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో ముంబై ఇండియన్స్ మరో నలుగురు ప్లేయర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే, తొలి సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్.. రెండో సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ముంబైని ఇంటికి పంపించిన ఆర్సీబీనే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..హార్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సంజనా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, అమన్‌జోత్ కౌర్, అమన్‌దీప్ కౌర్, కీర్తనముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్ వీళ్లే..ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్, ఇస్సీ వాంగ్ -
242 పరుగులతో విధ్వంసం.. 31 ఫోర్లు, 7 సిక్స్‌లు! ఎవరీ సెహ్రావత్?
బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఢిల్లీ యువ సంచలనం శ్వేతా సెహ్రావత్ విధ్వంసం సృష్టించింది. శనివారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్వేతా సెహ్రావత్ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు శ్వేతా చుక్కలు చూపించింది. బౌండరీల వర్షం కురిపించింది. ఈ మ్యాచ్‌లో 150 బంతులు ఎదుర్కొన్న సెహ్రవత్ 31 ఫోర్లు, 7 సిక్స్‌లతో ఏకంగా 242 పరుగులు చేసింది. తద్వారా లిస్ట్-ఏ క్రికెట్లో ద్విశతకం సాధించిన తొలి మహిళ క్రికెటర్‌గా శ్వేతా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా దేశీవాళీ క్రికెట్(మూడు ఫార్మాట్లు)లో అత్యధిక స్కోర్ సాధించిన మహిళ క్రికెటర్‌గా నిలిచింది. ఎవరీ శ్వేతా సెహ్రావత్ .. 20 ఏళ్ల శ్వేతా సెహ్రావత్ దేశీవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. గతేడాది జరిగిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించింది. ఆ టోర్నీలో టాప్ రన్ స్కోరర్‌గా శ్వేతా సెహ్రావత్ నిలిచింది. కాగా శ్వేత మహిళల ప్రీమియర్‌లో లీగ్‌లో కూడా భాగమైంది. ఈ యువ సంచలనం యూపీ వారియర్జ్‌కు ప్రాతినిథ్యం వహిస్తుంది. 2023 డబ్ల్యూపీఎల్ వేలంలో రూ.40 లక్షలకు శ్వేతాను యూపీ సొంతం చేసుకుంది. కానీ ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మాత్రం ఆమె నిరాశపరిచింది. తొలి సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన సెహ్రావత్ కేవలం 34 పరుగులు మాత్రమే చేసింది. Super Sehrawat 👏 2️⃣4️⃣2️⃣ runs 1️⃣5️⃣0️⃣ balls 3️⃣1️⃣ fours 7️⃣ sixes Shweta Sehrawat sparkled in Delhi's 400-run win over Nagaland with a splendid marathon 242-run knock at the MECON Stadium, Ranchi in the @IDFCFIRSTBank #SWOneday Trophy Scorecard ▶️ https://t.co/3QV6VBY42y pic.twitter.com/WPfgDKeL0a — BCCI Women (@BCCIWomen) January 6, 2024 -
ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా ఆసీస్ మాజీ క్రికెటర్
డబ్ల్యూపీఎల్-2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ మహిళల జట్టు హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ల్యూక్ విలియమ్స్‌ను నియమించింది. కాగా మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌లో ఆర్సీబీ జట్టు ఘోర ప్రదర్శన కనబరిచింది. డబ్ల్యూపీఎల్-2023లో 8 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ క్రమంలోనే మొదటి ఎడిషన్ ప్రధాన కోచ్‌గా బెన్ సాయర్పై ఆర్సీబీ వేటు వేసింది. బెన్ సాయర్ స్ధానాన్ని ల్యూక్ విలియమ్స్ భర్తీ చేయనున్నాడు. కాగా కోచ్‌గా విలియమ్స్‌కు ఆపారమైన అనుభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీలకు అతడు కోచ్‌గా పనిచేశాడు. మహిళల బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు నాలుగు సీజన్ల పాటు విలియమ్స్ కోచ్‌గా వ్యవహరించాడు. అదే విధంగా ది హాండ్రడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా అతడు పనిచేశాడు. అదే విధంగా ఆస్ట్రేలియాలోని ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో సౌత్ ఆస్ట్రేలియన్ స్కార్పియన్స్ జట్టుకు కూడా తన సేవలు అందించాడు. చదవండి: Asian Games 2023: మలేషియాతో మ్యాచ్ రద్దు.. సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా -
IPL 2024: అప్పట్లో ఆర్సీబీకి.. 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ! కారణం తెలిస్తే..
Mitchell Starc Eyes IPL Return In 2024: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్-2024కు తప్పక అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. ఆర్సీబీకి ప్రాతినిథ్యం కాగా 2014 ఎడిషన్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన స్టార్క్.. తొలుత ఢిల్లీతో మ్యాచ్‌లో ఒక వికెట్ తీశాడు. మరుసటి ఏడాదిలోనే ఐపీఎల్ నుంచి వైదొలిగిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. మొత్తంగా ఈ టీ20 లీగ్‌లో 27 మ్యాచ్‌లలో కలిపి 34 వికెట్లతో రాణించాడు. ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ రీఎంట్రీ కాగా, 2018లో కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేసినప్పటికీ గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కే తన ప్రాధాన్యం అంటూ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో సుమారు ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు స్టార్క్ సిద్ధపడుతున్నాడు. అయితే, దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉంది మరి! టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా స్టార్క్ మళ్లీ క్యాష్ రిచ్ లీగ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అతడే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. అసలు విషయం అదీ! ‘‘ఇప్పటికి ఎనిమిదేళ్లు గడిచాయి. వచ్చే ఏడాది కచ్చితంగా తిరిగి వస్తా. టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఇది నాకెంతగానో ఉపయోగపడుతుంది. ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి చూపడానికి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఐసీసీ టోర్నీకి ముందు ఇలాంటి అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు’’ అని మిచెల్ స్టార్క్ పేర్కొన్నాడు. డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌గా స్టార్క్ భార్య కాగా ఆస్ట్రేలియా తరఫున ఇప్పటి వరకు 82 టెస్టులు, 110 వన్డేలు, 58 టీ20లు ఆడిన స్టార్క్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 333, 219, 73 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. స్టార్క్ భార్య, ఆసీస్ వికెట్ కీపర్ భార్య అలిసా హేలీ వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేసే క్రమంలో బీసీసీఐ ప్రవేశపెట్టిన ఈ టీ20 లీగ్‌లో యూపీ వారియర్స్ జట్టుకు ఆమె కెప్టెన్‌గా ఎంపికైంది. రూ. 70 లక్షలతో యూపీ ఫ్రాంఛైజీ హేలీని కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే... ప్రపంచకప్-2023 టోర్నీకి ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో మిచెల్ స్టార్క్ స్థానం దక్కించుకున్నాడు. చదవండి: సిగ్గుపడు రోహిత్! నువ్వసలు కెప్టెన్వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు! వరల్డ్‌కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే? -
కేకేఆర్‌తో మ్యాచ్.. మారనున్న ముంబై ఇండియన్స్ జెర్సీ
ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 16) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలుత ముంబైలోని వాంఖడేలో మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ధరించనున్న జెర్సీలు ప్రత్యేక ఆకర్శణగా నిలువనున్నాయి. ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ చేపట్టిన ESA (అందరికీ విద్య మరియు క్రీడలు) రోజులో భాగంగా ముంబై ఇండియన్స్ పురుషుల జట్టు మహిళల ఐపీఎల్ (WPL)లో ఎంఐ వుమెన్స్ టీమ్ ధరించిన జెర్సీలను ధరించి బరిలోకి దిగుతుంది. आपले boys are all set for the #ESADay 👕💙 #OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan #ESADay @ril_foundation pic.twitter.com/hujrhb4Mlf — Mumbai Indians (@mipaltan) April 15, 2023 ఈ మ్యాచ్‌ను 19000 మంది అమ్మాయిలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎంఐ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. WPL తొలి ఛాంపియన్స్ ఎంఐ వుమెన్స్ టీమ్ ఈ మ్యాచ్ వీక్షించేందుకు హాజరయ్యే వారిలో ప్రత్యేక ఆకర్శణగా నిలువనుంది. మెన్స్ టీమ్ ఆటగాళ్లు వుమెన్స్ టీమ్ జెర్సీలు పట్టుకున్న ఫోటోలను ముంబై ఇండియన్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఇందుకు స్పెషల్ జెర్సీ ఫర్ ESA డే అనే క్యాప్షన్‌ను జోడించింది. "I’m sure Rohit & Harman’s presence will motivate & encourage them." 🤩💙 आपले coaches shed light on #ESADay & the impact it will have 🙌#OneFamily #MIvKKR #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ril_foundation @markb46 @KieronPollard55 @JhulanG10 MI TV pic.twitter.com/gorjqo7MVd — Mumbai Indians (@mipaltan) April 15, 2023 ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో (ఆర్సీబీ, సీఎస్కే) ఘోర పరాజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో ఆ జట్టులో నూతనోత్తేజం నెలకొంది. ఈ మ్యాచ్‌లోనూ రోహిత్ సేన అతికష్టం మీద ఆఖరి బంతికి విజయం సాధించినప్పటికీ, అన్ని విభాగాల్లో సత్తా చాటింది. సూర్యకుమార్ పేలవ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతుంది. బ్యాటింగ్‌లో తిలక్ వర్మ, బౌలింగ్‌లో బెహ్రెన్‌డార్ఫ్ సత్తా చాటుతుండటం.. రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు అదనంగా కలిసొచ్చే అంశాలు. మొత్తానికి అరకొర బలగాలతో ముంబై ఇండియన్స్.. పటిష్టమైన కేకేఆర్‌ను ఎలా ఢీకొంటుందో వేచి చూడాలి. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రేయసిని పెళ్లాడిన ఆసీస్ మహిళా క్రికెటర్.. ఫొటోలు వైరల్
Jess Jonassen Marriage: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జెస్సికా లూసీ జొనాసెన్ తన చిరకాల ప్రేయసి సారా వెర్న్‌ను పెళ్లాడింది. పదేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఏప్రిల్ 6న వివాహ బంధంలో అడుగుపెట్టింది. హవాయిలో అత్యంత సన్నిహితుల నడుమ జొనాసెన్- సారా పెళ్లి జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జెస్ జొనాసెన్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘సర్ప్రైజ్! థర్డ్‌టైమ్ లక్కీ.. ఎట్టకేలకు నా బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లాడాను. ఏప్రిల్ 6.. నా హృదయంలో అలా నిలిచిపోతుంది’’ అని ట్వీట్ చేసింది. అవును లెస్బియన్నే కాగా జొనాసెన్ తాను లెస్బియన్ అన్న విషయాన్ని గర్వంగా ఈ ప్రపంచానికి చెప్పుకోగలనంటూ గతంలో ప్రకటించింది. ఈ క్రమంలోనే సారాతో ప్రేమలో ఉన్నట్లు 2018లో ప్రకటించిన ఆమె తాజాగా తనను వివాహమాడింది. ఇక ఆస్ట్రేలియాలో 2017 నుంచి స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించారన్న విషయం తెలిసిందే. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో ఆల్‌రౌండర్‌గా ఎదిగిన జొనాసెన్.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన ఆసీస్ జట్టులో సభ్యురాలు. ఐదుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో మెంబర్. ఆమె ఖాతాలో వన్డే వరల్డ్‌కప్(2022) కూడా ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఆసీస్ జట్టులో కూడా జొనాసెన్ భాగమైంది. ఆస్ట్రేలియా తరఫున ఇప్పటి వరకు వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టిన 30 ఏళ్ల జొనాసెన్.. మొత్తంగా 88 మ్యాచ్‌లలో 135 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. 100 టీ20లు ఆడి 91 వికెట్లు తీసింది. వుమెన్ ప్రీమియర్ లీగ్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. ఢిల్లీ తరఫున తొమ్మిది మ్యాచ్‌లలో తొమ్మిది వికెట్లు తీసింది. కొత్తేం కాదు ఇప్పటికే చాలా మంది మహిళా క్రికెటర్లు లెస్బియన్లుగా ప్రకటించుకోవడమే గాకుండా.. తమ భాగస్వాములను కూడా పెళ్లాడారు. డేనియెల్ వ్యాట్- జార్జ్ హాడ్జ్, డానే వాన్ నీకెర్క్-మారిజానే క్యాప్, లీ తహుహు- ఆమీ సాటెర్త్‌వైట్, నటాలీ సీవర్- కేథరిన్ బ్రంట్, లిజెల్లీ లీ- తంజా క్రోన్జ్, లారెన్ విన్ఫీల్డ్- కర్టెనీ హిల్, మేఘన్ షట్- జెస్ హొల్యోక్, హేలీ జెన్సెన్- నికోలా హాంకోక్, మ్యాడీ గ్రీన్- లిజ్ పెర్రీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. చదవండి: వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్ SURPRISE!! 3rd time lucky - finally married my best friend 🥰 April 6th will always have a special place in my heart 👩❤️👩💍 #hawaii #wedding #love pic.twitter.com/rOYEyrOGFQ — Jessica Jonassen (@JJonassen21) April 14, 2023 -
చీరకట్టులో తళుక్కుమన్న టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు సారధి హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త లుక్‌తో అదరగొట్టింది. ఎప్పుడూ స్పోర్ట్స్ డ్రెస్‌లో కనిపించే ఈ ఛాంపియన్ కెప్టెన్ కొత్తగా చీరకట్టులో కనిపించి అభిమానుల ఫ్యూజులు ఎగురగొట్టింది. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో తళుక్కుమన్న హర్మన్‌ను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ ఫోటోను హర్మన్ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. View this post on Instagram A post shared by Harmanpreet Kaur (@imharmanpreet_kaur) కొందరు హర్మన్ ఫోటోను చూసి అచ్చం మళయాళ కుట్టిలా ఉందని అంటుంటే మరికొందరేమో బెంగాళీ భామ అని, తెలుగమ్మాయిలా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో లైక్స్ రావడంతో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ఇటీవలే ముగిసిన మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్లో హర్మన్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మహిళల జట్టు ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ చేజిక్కించుకుంది. లీగ్ ప్రారంభం నుంచే హాట్ ఫేవరెట్‌గా మారిన హర్మన్ సేన, ఎలిమినేటర్‌లో యూపీ వారియర్జ్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. హేలీ మాథ్యూస్ (4-2-25-3), మేలీ కెర్ (4-0-18-2) అద్భుత ప్రదర్శన ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఛేదనలో నాట్ సీవర్ బ్రంట్ (60 నాటౌట్), హర్మన్ (37) రాణించడంతో ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. లీగ్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన హర్మన్.. సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆరంభం ఎడిషన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన హర్మన్.. 40.41 సగటున, 135.10 స్ట్రయిక్ రేట్‌తో 281 పరుగులు చేసింది. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
హర్మన్ ప్రీత్ డబ్ల్యూపీఎల్ టైటిల్ సాధిస్తుందని ముందే ఊహించాడు..!
ప్రిడిక్షన్స్ అనేవి క్రికెట్లో సర్వసాధారణం. ఆటగాళ్లు, జట్ల ఫామ్‌ను బట్టి ఏ ఆటగాడు రాణిస్తాడో, ఏ జట్టు గెలుస్తుందో ముందే ఊహించడం పరిపాటిగా మారింది. కొందరేమో వారి అనుభవం వల్ల ఏ ఆటగాడు సెంచరీ కొడతాడో, ఏ ఆటగాడు ఎక్కువ వికెట్లు పడగొడతాడో పక్కాగా చెప్పేస్తుంటారు. ఇటీవలకాలంలో కొందరు ఆటగాళ్లు గతంలో సోషల్‌మీడియా వేదికగా చేసిన కొన్ని పోస్ట్‌లు వైరలయ్యాయి. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గతంలో ఎప్పుడో చేసిన ట్వీట్లు, ప్రస్తుతం ఆటగాళ్ల గణాంకాలతో మ్యాచ్ అవుతుండటం ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. తాజాగా ఇలాంటి ప్రిడిక్షనే ఒకటి సోషల్‌మీడియాలో వైరలవుతోంది. భారత మహిళా క్రికెట్ జట్టు సారధి హర్మన్‌ప్రీత్ కౌర్ మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) తొలి టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌కు అందిస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు గ్రీన్ స్టోన్ చాలారోజుల ముందే పసిగట్టాడు. హౌజ్జాట్ అనే పుస్తకంలో గ్రీన్‌స్టోన్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కొద్దిరోజుల కిందట హర్మన్.. ముంబై ఇండియన్స్‌కు డబ్ల్యూపీఎల్ టైటిల్ అందించడంతో ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. Harmanpreet winning it for MI. Predicted thrice!1. https://t.co/6Mp16lNXsp2. In an Instagram reel3. in the book, 'Howzzat' pic.twitter.com/2Zu5zsEUDY— GREENSTONE LOBO (@GreenstoneLobo) March 26, 2023 గ్రీన్‌స్టోన్ వెర్షన్‌పై క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎంఐ ముందే వ్యవస్థలను మేనేజ్ చేసిందని కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటే, మరికొందరేమో హర్మన్‌కు ఆ టాలెంట్ ఉండింది కాబట్టి ముంబైను ఛాంపియన్‌గా నిలబెట్టగలిగిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, డబ్ల్యూపీఎల్-2023 ఫైనల్లో ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించి తొట్టతొలి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. -
డబ్ల్యూపీఎల్: అవార్డులు ఎవరికి? విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతంటే! పీఎస్ఎల్ విజేత కంటే..
Womens Premier League 2023: మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజేతగా నిలిచి ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ అరంగేట్ర చాంపియన్‌గా రికార్డులకెక్కింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి హర్మన్ సేన ఈ మేరకు చరిత్ర సృష్టించింది. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని ముద్దాడి సంబరాల్లో మునిగిపోయింది. మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రవేశపెట్టిన డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌ను మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. ఇక ఈ విజయంతో చాంపియన్ ముంబై, వివిధ విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లు గెలుచుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?! డబ్ల్యూపీఎల్-2023 అవార్డులు, ప్రైజ్‌మనీ ►విజేత- ముంబై ఇండియన్స్ వుమెన్- గోల్డెన్ ట్రోఫీ- రూ. 6 కోట్లు ►రన్నరప్- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- రూ. 3 కోట్లు ►మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ హేలీ మాథ్యూస్(ముంబై ఇండియన్స్)- రూ. 5 లక్షలు ►ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు)- మెగ్ లానింగ్(ఢిల్లీ క్యాపిటల్స్)- 9 ఇన్నింగ్స్‌లో 345 పరుగులు- రూ. 5 లక్షలు ►పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు)- హేలీ మాథ్యూస్(ముంబై ఇండియన్స్)- 16 వికెట్లు ►ఫెయిర్ ప్లే అవార్డు- ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ►క్యాచ్ ఆఫ్ ది సీజన్: హర్మన్‌ప్రీత్ కౌర్(ముంబై)- యూపీ వారియర్జ్ దేవికా వైద్య క్యాచ్- రూ. 5 లక్షలు ►సఫారీ పవర్ఫుల్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్- సోఫీ డివైన్ (ఆర్సీబీ)- 8 ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు- రూ. 5 లక్షలు ►ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్- యస్తికా భాటియా(ముంబై)- రూ. 5 లక్షలు. పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేత కంటే మహిళా ప్రీమియర్ లీగ్ విజేతకు అందిన మొత్తం పీఎస్ఎల్ చాంపియన్ లాహోర్ కలందర్స్ గెల్చుకున్న మొత్తం కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఈ ఏడాది పీఎస్ఎల్ విన్నర్‌గా అవతరించిన లాహోర్ రూ. 3.4 కోట్లు ప్రైజ్‌మనీ అందుకోగా.. రన్నరప్ ముల్తాన్ సుల్తాన్స్ సుమారు 1.37 కోట్ల రూపాయలు గెలుచుకుంది. The young promising wicketkeeper-batter shined bright in a victorious season for @mipaltan 👏👏@YastikaBhatia becomes the emerging player of the season 👌#TATAWPL pic.twitter.com/hO8qMDUkty — Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023 చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు IPL 2023: ఐపీఎల్ తోపులు వీరే.. సింహభాగం రికార్డులు యూనివర్సల్ బాస్‌వే..! Raw emotions 🎥 A moment to savor for @mipaltan 👌 👌 #TATAWPL | #Final | #DCvMI pic.twitter.com/wdf7t07NMJ — Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023 Winner: విజేత ముంబై ఇండియన్స్..
ముంబై: తొలి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నమెంట్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తుది పోరులోనూ సమష్టి ప్రదర్శనతో అదే జోరును కొనసాగించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా...ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 134 పరుగులు సాధించింది. ముంబై బౌలింగ్ ధాటికి ఢిల్లీ ఆరంభం నుంచే తడబడింది. కెపె్టన్ మెగ్ లానింగ్ (29 బంతుల్లో 35; 5 ఫోర్లు) మినహా అంతా విఫలం కావడంతో టపటపా వికెట్లు కోల్పోయింది. దాంతో స్కోరు 79/9కు చేరింది. అయితే ఆఖరి వికెట్‌కు రాధ యాదవ్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖా పాండే (17 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి 24 బంతుల్లోనే అభేద్యంగా 52 పరుగులు జోడించడంతో కాస్త గౌరవప్రదమైన స్కోరు దక్కింది. అనంతరం ముంబై కూడా 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నాట్ సివర్ బ్రంట్ (55 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (39 బంతుల్లో 37; 5 ఫోర్లు) మూడో వికెట్‌కు 74 బంతుల్లో 72 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. 345 డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్) నిలిచింది. ఆమె 9 మ్యాచ్‌లు ఆడి రెండు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 345 పరుగులు సాధించింది. 16 డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా హేలీ మాథ్యూస్ (ముంబై), సోఫీ ఎకెల్‌స్టోన్ (యూపీ వారియర్స్) నిలిచారు. వీరిద్దరు 16 వికెట్ల చొప్పున తీశారు. స్కోరు వివరాలు : ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (రనౌట్) 35; షఫాలీ (సి) కెర్ (బి) వాంగ్ 11; క్యాప్సీ (సి) అమన్‌జోత్ (బి) వాంగ్ 0; జెమీమా (సి) మాథ్యూస్ (బి) వాంగ్ 9; మరిజాన్ కాప్ (సి) యస్తిక (బి) కెర్ 18; జొనాసెన్ (సి అండ్ బి) మాథ్యూస్ 2; అరుంధతి రెడ్డి (సి) ఇషాక్ (బి) కెర్ 0; శిఖా పాండే (నాటౌట్) 27; మిన్ను (సి) యస్తిక (బి) మాథ్యూస్ 1; తానియా (బి) మాథ్యూస్ 0; రాధ (నాటౌట్) 27; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–35, 4–73, 5–74, 6–75, 7–75, 8–79, 9–79. బౌలింగ్: నాట్ సివర్ 4–0–37–0, ఇసీ వాంగ్ 4–0–42–3, సైకా ఇషాక్ 4–0–28–0, అమేలియా కెర్ 4–0–18–2, హేలీ మాథ్యూస్ 4–2–5–3. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) అరుంధతి (బి) జొనాసెన్ 13; యస్తిక (సి) క్యాప్సీ (బి) రాధ 4; నాట్ సివర్ (నాటౌట్) 60; హర్మన్‌ప్రీత్ (రనౌట్) 37; అమేలియా కెర్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1–13, 2–23, 3–95. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–0–22–0, రాధ యాదవ్ 4–0–24–1, జొనాసెన్ 4–0–28–1, శిఖా పాండే 4–0–23–0, అలైస్ క్యాప్సీ 3.3–0–34–0. -
ఫైనల్లో ఢిల్లీ ఓటమి.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్‌గా ముంబై ఇండియన్స్
తొట్ట తొలి మహిళల ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్‌గా ముంబై ఇండియన్స్ నిలిచింది. బ్రబౌర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ముంబై విజేతగా అవతరించింది. 132 పరుగుల స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ నాట్ స్కివర్ కీలక పాత్ర పోషించింది. 60 పరుగులతో ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టును ఛాంపియన్స్‌గా నిలిపింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(37) కూడా ముంబై విజయంలో తమ వంతు పాత్ర పోషించింది. కాగా ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, జానెసన్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీను రాధా యాదవ్, శిఖా పాండే అదుకున్నారు. వీరిద్దరూ ఆఖరి వికెట్‌కు 52 పరుగుల కీలక బాగస్వామ్యం నెలకొల్పారు. రాధా యాదవ్(27), శిఖా పాండే(27) పరుగులు సాధించారు. అంతకు ముందు ఢిల్లీ కెప్టెన్ లానింగ్(35)పరుగులతో రాణించింది. ఇక ముంబై బౌలర్లలో వాంగ్, మాథ్యూస్ తలా మూడు వికెట్లు సాధించగా.. కేర్ రెండు వికెట్లు పడగొట్టింది. మూడో వికెట్ కోల్పోయిన ముంబై.. హర్మన్ ప్రీత్ ఔట్ 95 పరుగుల వద్ద ముంబై కీలక వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్ రూపంలో వెనుదిగిరిగింది. క్రీజులో స్కివర్(45), కేర్ ఉన్నారు. ముంబై విజయానికి 18 బంతుల్లో 26 పరుగులు కావాలి. 9 ఓవర్లకు ముంబై స్కోర్: 45/2 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 9 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. క్రీజులో స్కివర్(15), హర్మాన్ ప్రీత్ కౌర్(11) పరుగులతో ఉన్నారు. 24 పరుగులకే 2 వికెట్లు కెల్పోయిన ముంబై 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. రాధాయాదవ్ బౌలింగ్‌లో యస్తికా భాటియా(4) పెవిలియన్‌కు చేరగా.. జానెసన్ బౌలింగ్‌లో మాథ్యూస్(13) ఔటైంది. 4 ఓవర్లకు ముంబై స్కోర్: 24/22 అదరగొట్టిన శిఖా, రాధా.. ముంబై టార్గెట్ 132 పరుగులు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఢిల్లీను రాధా యాదవ్, శిఖా పాండే అదుకున్నారు. వీరిద్దరూ ఆఖరి వికెట్‌కు 52 పరుగుల కీలక బాగస్వామ్యం నెలకొల్పారు. రాధా యాదవ్(27), శిఖా పాండే(27) పరుగులు సాధించారు. అంతకు ముందు ఢిల్లీ కెప్టెన్ లానింగ్(35)పరుగులతో రాణించింది. ఇక ముంబై బౌలర్లలో వాంగ్, మాథ్యూస్ తలా మూడు వికెట్లు సాధించగా.. కేర్ రెండు వికెట్లు పడగొట్టింది. 75 పరుగులకే ఏడు వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో ఢిల్లీ! 75 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో శిఖా పాండే(1), మిన్ను మణి(1) పరుగులతో ఉన్నారు. ఇప్పటివరకు ఢిల్లీ బౌలర్లలో వాంగ్ మూడు వికెట్లు, అమీలియా కేర్ రెండు, మాథ్యూస్ ఒక్క వికెట్ సాధించారు. నాలుగు వికెట్ కోల్పోయిన ఢిల్లీ 73 పరుగుల వద్ద ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కాప్.. కేర్ బౌలింగ్‌లో ఔటైంది. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 35 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జెమిమా రోడ్రిగ్స్.. వాంగ్ బౌలింగ్‌లో మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. 12 పరుగులకే రెండు వికెట్లు.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన వాంగ్ బౌలింగ్‌లో మూడో బంతికి షఫాలీ వర్మ పెవిలియన్‌కు చేరగా.. నాలుగో బంతికి క్యాప్సీ డకౌటయ్యంది. 2 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 16/2 మహిళల ప్రీమియర్ లీగ్-2023 ఫైనల్‌కు రంగం సిద్దమైంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా వేదికగా తుదిపోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. ఢిల్లీ మాత్రం తమ జట్టులో ఒకే ఒక మార్పు చేసింది. పూనమ్ యాదవ్ స్థానంలో మిన్ను మణి తుది జట్టులోకి వచ్చింది. తుది జట్లు: ముంబై ఇండియన్స్ హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), నటాలీ స్కివెర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, సైకా ఇషాక్, హుమైరా కాజీ జింటిమణి కలిత ఢిల్లీ క్యాపిటల్స్ మెగ్ లానింగ్(కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(వికెట్ కీపర్), రాధా యాదవ్, శిఖా పాండే, మిన్ను మణి -
ముంబై ఇండియన్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇవాళ ఫైనల్ ఆడబోతున్న ముంబై ఇండియన్స్ వుమెన్స్ టీమ్‌కు ఓ ప్రత్యేక వీడియో ద్వారా విషెస్ తెలిపాడు. డబ్ల్యూపీఎల్ ఫైనల్లో భాగంగా ముంబై ఇండియన్స్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్‌తో పాటు ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్ సభ్యులందరూ హర్మన్ సేనకు శుభాకాంక్షలు తెలిపారు. Mumbai Indians skipper Rohit Sharma has a special message for the MI Women's team ahead of the WPL final.#CricTracker #RohitSharma #WPL2023 pic.twitter.com/ETrlW0gtVp — CricTracker (@Cricketracker) March 26, 2023 రోహిత్ మాట్లాడిన ప్రత్యేక వీడియోను ముంబై ఇండియన్స్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోలో రోహిత్ మాట్లాడుతూ.. గత నాలుగు వారాలుగా మీ ఆట తీరు అద్భుతంగా ఉండింది. వ్యక్తిగతంగా నేను మీ ఆటతీరును ఆస్వాదించాను. ఇవాళ జరుగబోయే ఫైనల్ చాలా కీలకం. ఆటను ఆస్వాదిస్తూనే ఎంజాయ్ చేయండి. నేటి ఫైనల్లో మీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చండి అంటూ ఎంఐ వుమెన్స్ టీమ్‌ను ఎంకరేజ్ చేశాడు. కాగా, బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టేబుల్ టాపర్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే నిష్క్రమించాయి. -
WPL 2023 Final: తొలి టైటిల్ కొట్టేదెవరు?
ముంబై: ప్రతిష్టాత్మకంగా తొలి సారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి ఘట్టానికి చేరింది. టోర్నీ మొదటి విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. నేడు డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. టోర్నీ ఆరంభంలో దూకుడు కనబర్చి దూసుకెళ్లిన ముంబై ఆ తర్వాత వెనుకబడటంతో ఫైనల్ చేరేందుకు ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. ఢిల్లీ మాత్రం సరైన సమయంలో సత్తా చాటి వరుస విజయాలతో పాటు రన్‌రేట్‌ను పెంచుకొని అగ్రస్థానంతో తుది పోరుకు అర్హత సాధింది. ఢిల్లీ బ్యాటింగ్ భారం ఓపెనర్ లానింగ్‌తో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లపై ఉంది. ఆల్‌రౌండర్‌గా మరిజాన్ కప్ ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించింది. మరో వైపు హర్మన్‌ప్రీత్ ఫామ్‌లో లేకపోయినా నాట్ సివర్, హీలీ మాథ్యూస్ ముంబైకి భారీ స్కోరు అందించగలరు. అమేలియా కెర్ రూపంలో ధాటిగా ఆడే మరో బ్యాటర్ కూడా ఉంది. ప్రత్యర్థి కంటే బలమైన బౌలింగ్ లైనప్ ముంబై ఆశలను పెంచుతోంది. సైకా ఇషాక్ 15 వికెట్లతో ఫామ్‌లో ఉండగా, పేసర్ ఇసీ వాంగ్ పదునేమిటో ఎలిమినేటర్‌లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఫైనల్ సమరం ఖాయం. -
ఇంగ్లండ్ బౌలర్ చరిత్ర.. డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్
మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023)లో ముంబై ఇండియన్స్ వుమెన్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం యూపీ వారియర్జ్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఇంగ్లండ్ బౌలర్ ఇసీ వాంగ్ ఈ ఫీట్‌ను సాధించింది. యూపీ వారియర్జ్ ఇన్నింగ్స్ సమయంలో 56/4తో కష్టాల్లో నిలిచి కోలుకునే ప్రయత్నం చేస్తున్న దశలో ఇసీ వాంగ్ దెబ్బతీసింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వరుస మూడు బంతుల్లో నవ్‌గిరే, సిమ్రన్ షేక్, సోఫీ ఎకెల్స్టోన్లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించింది. ఈ దెబ్బతో యూపీ వారియర్జ్ ఓటమి ఖరారైపోయింది. ఇక డబ్ల్యూపీఎల్‌లో ఇదే తొలి హ్యాట్రిక్ కాగా.. ఐపీఎల్లో మాత్రం ఇప్పటివరకు 21సార్లు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. ఇక 2008 తొలి సీజన్లో సీఎస్కే బౌలర్ లక్ష్మీపతి బాలాజీ ఐపీఎల్లో తొలి హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్లో అత్యధికంగా అమిత్ మిశ్రా మూడుసార్లు హ్యాట్రిక్ తీయగా.. యువరాజ్ సింగ్ రెండుసార్లు హ్యాట్రిక్ ఫీట్ సాధించాడు. Historic moment in WPL, Take a bow Issy Wong. pic.twitter.com/eIHNFEioSk — Johns. (@CricCrazyJohns) March 24, 2023 చదవండి: పాక్‌కు ఘోర అవమానం.. చరిత్ర సృష్టించిన అఫ్గానిస్తాన్ -
సివర్ జోరు... వాంగ్ హోరు
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ లో ఆరంభ అంచనాలను నిజం చేస్తూ ముంబై ఇండియన్స్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. లీగ్ దశ చివర్లో కాస్త తడబడినా... తమ స్థాయిని ప్రదర్శిస్తూ హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం శుక్రవారం జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 72 పరుగులతో ఏకపక్ష విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో నాట్ సివర్ బ్రంట్ చెలరేగగా, బౌలింగ్ ఇసీ వాంగ్ లీగ్‌లో తొలి ‘హ్యాట్రిక్’తో సత్తా చాటింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నాట్ సివర్ (38 బంతుల్లో 72 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించగా... అమేలియా కెర్ (19 బంతుల్లో 29; 5 ఫోర్లు) చివర్లో దూకుడుగా ఆడింది. అనంతరం యూపీ 17.4 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. కిరణ్ నవ్‌గిరే (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెపె్టన్ అలీసా హీలీ పుట్టిన రోజునాడు ఓటమిని ఎదుర్కొన్న యూపీ టోర్నీని మూడో స్థానంతో ముగించగా... ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడుతుంది. సివర్ దూకుడు... ముంబై ఇన్నింగ్స్ మొత్తంలో నాట్ సివర్ ఆట చుక్కానిలా నిలిచింది. వరుసగా నాలుగు కీలక భాగస్వామ్యాలతో ఆమె జట్టుకు భారీ స్కోరును అందించడంలో సఫలమైంది. తొలి బంతికే ఫోర్‌తో యస్తిక భాటియా (18 బంతుల్లో 21; 4 ఫోర్లు) ఆటను మొదలు పెట్టింది. ఆ తర్వాత కొన్ని చక్కటి షాట్లు ఆడిన తర్వాత యస్తికను అంజలి శర్వాణి వెనక్కి పంపించింది. ఆ తర్వాత హేలీ మాథ్యూస్ (26 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) జత కలసింది. హేలీ తనదైన శైలిలో ధాటిగా ఆడలేక విఫలం కాగా, ఎకెల్‌స్టోన్ చక్కటి బంతికి హర్మన్‌ప్రీత్ (14) అవుటైంది. అయితే మరో ఎండ్‌లో మాత్రం సివర్ తన జోరు కొనసాగించింది. పార్శవి ఓవర్లో వరుసగా 4, 6, 4 కొట్టిన ఆమె 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. చివరి 2 ఓవర్లలో ముంబై 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు రాబట్టడం విశేషం. టపటపా... కిరణ్ నవ్‌గిరే ఇన్నింగ్స్ మినహా యూపీ ఆటలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోయింది. ఇషాక్ ఓవర్లో కిరణ్ 3 ఫోర్లు, 1 సిక్స్ బాదడమై హైలైట్. కీలక ప్లేయర్లు అలీసా హీలీ (11), తాలియా మెక్‌గ్రాత్ (7), గ్రేస్ హారిస్ (14) విఫలం కావడం జట్టును దెబ్బ తీసింది. 56/4తో కష్టాల్లో నిలిచి కోలుకునే ప్రయత్నం చేస్తున్న దశలో ఇసీ వాంగ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వరుస మూడు బంతుల్లో నవ్‌గిరే, సిమ్రన్ షేక్, సోఫీ ఎకెల్స్టోన్లను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ సాధించింది. వాంగ్ దెబ్బకు యూపీ ఓటమి లాంఛనమే అయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (సి) నవ్‌గిరే (బి) అంజలి 21; హీలీ మాథ్యూస్ (సి) నవ్‌గిరే (బి) పార్శవి 26; నాట్ సివర్ (నాటౌట్) 72; హర్మన్‌ప్రీత్ (బి) ఎకెల్‌స్టోన్ 14; అమేలియా కెర్ (సి) అంజలి (బి) ఎకెల్‌స్టోన్ 29; పూజ వస్త్రకర్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–31, 2–69, 3–104, 4–164. బౌలింగ్: హారిస్ 3–0–20–0, అంజలి 3–0–17–1, రాజేశ్వరి 4–0–36–0, ఎకెల్‌స్టోన్ 4–0–39–2, దీప్తి శర్మ 4–0–39–0, పార్శవి చోప్రా 2–0–25–1. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: హీలీ (సి) హర్మన్ (బి) వాంగ్ 11; శ్వేత (సి) మాథ్యూస్ (బి) ఇషాక్ 1; తాలియా (రనౌట్) 7; నవ్‌గిరే (సి) సివర్ (బి) వాంగ్ 43; హారిస్ (సి) వాంగ్ (బి) సివర్ 14; దీప్తి శర్మ (సి) కలిత (బి) మాథ్యూస్ 16; సిమ్రన్ (బి) వాంగ్ 0; ఎకెల్‌స్టోన్ (బి) వాంగ్ 0; అంజలి (బి) కలిత 5; రాజేశ్వరి (ఎల్బీ) (బి) ఇషాక్ 5; పార్శవి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 110. వికెట్ల పతనం: 1–8, 2–12, 3–21, 4–56, 5–84, 6–84, 7–84, 8–94, 9–104, 10–110. బౌలింగ్: నాట్ సివర్ 3–0–21–1, సైకా ఇషాక్ 2.4–1–24–2, వాంగ్ 4–0–15–4, అమేలియా 3–0–25–0, మాథ్యూస్ 3–0–21–1, అమన్‌జోత్ 1–0–2–0, కలిత 1–0–2–1. -
ఎలిమినేటర్.. ఫైనల్‌కు వెళ్లేది ఎవరు?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ఈరోజు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టుతో అలీసా హీలీ కెప్టెన్సీలోని యూపీ వారియర్స్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్షప్రసారం చేస్తారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. హర్మన్‌తో పాటు హీలీ మాథ్యూస్, యస్తిక భాటియా, స్కీవర్ బ్రంట్, అమేలియా కెర్ర్ , పూజా వస్త్రాకర్ రూపంలో టాప్ ఆటగాళ్లు ముంబైకి అందుబాటులో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో సైకా ఇషాఖ్పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు అలీసా హీలీ సారథ్యంలోని యూపీ వారియర్స్ తహిలా మెక్‌గ్రాత్, సోఫియా ఎకెల్‌స్టోన్‌పై ఎక్కువ ఆధారపడుతోంది. చదవండి: ఐపీఎల్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు అభిమానులను పిచ్చోళ్లను చేశారు -
WPL 2023: స్మృతి మంధన చేసిన ఒక్కో పరుగు విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
డబ్ల్యూపీఎల్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా (రూ. 3.4 కోట్లు) రికార్డు నెలకొల్పిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధన.. ప్రస్తుత సీజన్లో చేసిన ఒక్కో పరుగు విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. డబ్ల్యూపీఎల్-2023లో మంధన సాధించిన పరుగుల ప్రకారం ఆమె ఒక్కో పరుగు విలువ రూ. 2. 28 లక్షలవుతుంది. ఈ సీజన్లో ఆమె ఆడిన 8 మ్యాచ్‌ల్లో 18.62 సగటున, 111.19 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో ఒక్కటంటే ఒక్క అర్ధసెంచరీ కూడా లేకపోగా ఓ సారి డకౌట్ కూడా అయ్యింది. మంధన అత్యధిక వ్యక్తిగత స్కోర్ (37) గుజరాత్ జెయింట్స్‌పై నమోదు చేసింది. ఆమె ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు స్పిన్నర్ల చేతిలో ఔటై, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తానెంత పూరో నిరూపించుకుంది. కాగా, డబ్ల్యూపీఎల్-2023 సీజన్ తుది దశకు చేరింది. పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు, 1.856 రన్‌రేట్), ముంబై ఇండియన్స్ (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు, 1.711 రన్‌రేట్), యూపీ వారియర్జ్ (8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు, -0.200 రన్‌రేట్) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (8 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు, -1.137 రన్‌రేట్), గుజరాత్ జెయింట్స్ (8 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు, -2.220 రన్‌రేట్) ఫ్రాంచైజీలు లీగ్‌ను ఎలిమినేట్ అయ్యాయి. మార్చి 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్.. ముంబై ఇండియన్స్‌తో తలపడనుండగా, ఈ మ్యాచ్‌లో విన్నర్ మార్చి 26న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొంటుంది. -
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా! పాపం ముంబై!
WPL 2023- Delhi Capitals In Finals- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారంతో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించగా... ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై గెలిచింది. పాపం ముంబై.. మరో మ్యాచ్‌లో ఢిల్లీ, ముంబై 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ (1.856) ‘టాపర్’గా నిలిచి ఫైనల్ చేరింది. మరో ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే ఏకైక ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ముంబై తలపడుతుంది. ఢిల్లీతో మ్యాచ్‌లో తొలుత యూపీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. తాలియా (58 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసింది. ఢిల్లీ బౌలర్లలో అలైస్ క్యాప్సీ (3/26) ఆకట్టుకుంది. ఢిల్లీ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్యాప్సీ క్యాప్సీ (34; 4 ఫోర్లు, 1 సిక్స్), మరిజాన్ కాప్ (34 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), లానింగ్ (23 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిలకడగా ఆడి ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై తో మ్యాచ్‌లో తొలుత బెంగళూరు 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమె లియా కెర్ (3/22) రాణించింది. ముంబై 16.3 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. అమెలియా కెర్ (31 నాటౌట్; 4 ఫోర్లు), యస్తిక (30; 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. చదవండి: Ind Vs Aus 3rd ODI: అతడికి విశ్రాంతి? సుందర్, ఉమ్రాన్ మాలిక్‌కు ఛాన్స్! SA Vs WI: క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేశారు The first-ever team to make it to the 𝗙𝗜𝗡𝗔𝗟 of #TATAWPL 🙌 The @DelhiCapitals are ready to roar 🔥🔥 pic.twitter.com/LZclWYNH8J — Women's Premier League (WPL) (@wplt20) March 22, 2023 -
లీగ్‌లో ఆఖరి మ్యాచ్.. ఢిల్లీతో యూపీ వారియర్జ్...
మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ ఫీల్డింగ్ ఏంచుకుంది. ఈ మ్యాచ్‌లో యూపీ కీలక ప్లేయర్ గ్రేస్ హ్యారిస్‌తో పాటు ఓపెనర్ దేవికా వైద్య, స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌కు విశ్రాంతినిచ్చింది. వాళ్ల స్థానంలో యషశ్రీ, షబ్నం ఇస్మాయిల్ తుది జట్టులోకి వచ్చారు. ఢిల్లీ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. ఇక ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్. రాధా యాదవ్. యూపీ వారియర్స్: అలిసా హేలీ (కెప్టెన్), శ్వేతా షెరావత్, కిరణ్ నవగిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్, సిమ్రాన్ షేక్, పర్షవీ చోప్రా, అంజలీ సర్వానీ, సొప్పదండి యషశ్రీ, షబ్నం ఇస్మాయిల్. 🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to field first against @UPWarriorz Follow the match ▶️ https://t.co/r4rFmhENd7#TATAWPL | #UPWvDC pic.twitter.com/gPYlYR1w8k — Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023 -
అన్నింటా విఫలం.. కెప్టెన్‌గా పనికిరాదా?
స్మృతి మంధాన.. టీమిండియా మహిళల క్రికెట్లో ఒక సంచలనం. దూకుడైన ఆటతీరుకు నిర్వచనంగా చెప్పుకునే మంధాన బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023)లో మాత్రం నిరాశజనక ప్రదర్శన నమోదు చేసింది. పైగా స్టార్ క్యాంపెయినర్ హోదా కట్టబెట్టి వేలంలో ఆర్సీబీ.. భారత మహిళల జట్టులో అందరికంటే ఎక్కువగా రూ.3.40 కోట్లు మంధానపై గుమ్మరించి కొనుగోలు చేసింది. అంతేకాదు ఏదో చేస్తుందని చెప్పి ఆమెను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఇలా కెప్టెన్ అయిందో లేదో ఒత్తిడిలో పడిన స్మృతి మంధాన బ్యాటర్‌గా, కెప్టెన్‌గా పూర్తిగా విఫలమయ్యింది. కెప్టెన్‌గా అనుభవలేమి ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆర్సీబీ కెప్టెన్‌గా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన మంధాన బ్యాటర్‌గానూ పూర్తిగా విఫలమైంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని ఈమె ఎనిమిది మ్యాచ్‌లు కలిపి 18.6 సగటుతో కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది. ఇక కెప్టెన్‌గానూ ఆమె అంతగా సక్సెస్ కాలేకపోయింది. సోఫీ డివైన్ వల్ల ఒక మ్యాచ్.. రిచా ఘోష్ వల్ల మరొక మ్యాచ్ గెలిచిన ఆర్సీబీకి కెప్టెన్‌గా మంధాన చేసిందేమి లేదు. అందుకే వచ్చే సీజన్లో మంధానను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌గా నిరాశపరిచిన మంధాన భవిష్యత్తులో టీమిండియా వుమెన్ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలను కూడా పోగొట్టుకుంది. కెప్టెన్సీ ఒత్తిడి లేకపోతేనే ఆమె బాగా ఆడతుంది అన్న ముద్రను మరింత సుస్థిరం చేసుకుంది. ఇన్నాళ్లు డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన మంధాన తాజాగా బౌలింగ్‌లోనూ దారుణ ప్రదర్శన ఇచ్చింది. రాక రాక బౌలింగ్‌కు వచ్చిన ఆమె ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఒక్క ఓవర్ వేసిన ఆమె ఓవర్‌ను కూడా పూర్తిగా వేయలేకపోయింది. ఐదు వైడ్లు వేసి ప్రత్యర్థి జట్టును గెలిపించింది. కేవలం మూడు బంతులు మాత్రమే సరిగ్గా వేసిన ఆమె మిగతా ఐదు బంతులు వైడ్లు వేయడం గమనార్హం. ఇక మంధానను విరాట్ కోహ్లితో కొంత మంది పోల్చారు. కోహ్లి కూడా తన తొలి ఐపీఎల్ సీజన్లో ఒక్క హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. ఆ తర్వాత సీజన్ నుంచి మాత్రం దుమ్మురేపే ప్రదర్శనతో సుస్థిరంగా పరుగులు సాధిస్తూ వచ్చాడు. మంధాన కూడా కోహ్లి లాగే తొలి సీజన్లో విఫలమైందని.. మలి సీజన్ నుంచి మాత్రం తన బ్యాటింగ్ పవర్ చూపిస్తుందని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. A season to forget for Smriti Mandhana. pic.twitter.com/shh9eGOTDg — Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2023 Both Virat Kohli (IPL) and Smriti Mandhana (WPL) have failed to score a fifty in their inaugural season for RCB. 📸: IPL/WPL pic.twitter.com/K1Pu5CORHD — CricTracker (@Cricketracker) March 21, 2023 చదవండి: ఓటమితో ముగింపు.. ఆర్సీబీకి తప్పని నిరాశ -
ఓటమితో ముగింపు.. ఆర్సీబీకి తప్పని నిరాశ
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ తమ లీగ్ దశను విజయంతో ముగిస్తే.. ఆర్సీబీ మాత్రం ఓటమితో ఇంటిబాట పట్టింది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తులు ఖరారు కావడంతో మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. అయినప్పటికి గెలుపుతో టోర్నీని ముగిద్దామని భావించిన ఆర్సీబీ వుమెన్‌కు నిరాశే ఎదురైంది. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. తొలి వికెట్‌కు హేలీ మాథ్యూస్(24 పరుగులు), యస్తికా బాటియా(30 పరుగులు) 50 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. అయితే స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔట్ అవ్వడం.. ఆ తర్వాత ముంబై వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ ట్రాక్ ఎక్కినట్లే కనిపించింది. కానీ అమేలియా కెర్(31 నాటౌట్).. పూజా వస్త్రాకర్(19 పరుగులు) కీలక భాగస్వామ్యం ఏర్పరిచి జట్టును గెలిపించింది. ఆర్సీబీ బౌలింగ్‌లో కనికా అహుజా రెండు వికెట్లు తీయగా.. శ్రేయాంక్ పాటిల్, ఎల్లిస్ పెర్రీ, మేఘన్ స్కా్ట్, ఆశా శోభనా తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో హర్మన్ సేన 8 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో టాప్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే అందుకున్న ఆర్సీబీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లో 99 పరుగులతో విధ్వంసం సృష్టించిన సోఫీ డివైన్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. ఎల్లిస్ పెర్రీ 29 పరుగులు, రిచా ఘోష్ 29 పరుగులు, స్మృతి మంధార 24 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ వుమెన్ బౌలర్లలో అమెలియా కెర్ మూడు వికెట్లు తీయగా.. నట్-సివర్ బ్రంట్ రెండు, ఇసీ వాంగ్, సయికా ఇషాకీ చెరొక వికెట్ తీశారు. చదవండి: కఠిన ప్రశ్న.. పుజారాను నమ్ముకుంటే అంతే! మెస్సీకి చేదు అనుభవం.. -
ఒక్క మ్యాచ్‌కే పరిమితం.. మళ్లీ అదే ఆటతీరు
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్సీబీ వుమెన్ ఆటతీరు ఏమాత్రం మారడం లేదు. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెలరేగి ఆడిన ఆర్సీబీ వుమెన్ తమ బ్యాటింగ్ మెరుపులు ఒక్కదానికే పరిమితం అన్నట్లుగా తయారయ్యింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లో 99 పరుగులతో విధ్వంసం సృష్టించిన సోఫీ డివైన్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. ఎల్లిస్ పెర్రీ 29 పరుగులు, రిచా ఘోష్ 29 పరుగులు, స్మృతి మంధార 24 పరుగులు చేశారు. మిగతావారు బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ వుమెన్ బౌలర్లలో అమెలియా కెర్ మూడు వికెట్లు తీయగా.. నట్-సివర్ బ్రంట్, ఇసీ వాంగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సయికా ఇషాకీ ఒక వికెట్ తీసింది. -
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎంతవరకు విజయవంతం?
బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023) తుది అంకానికి చేరుకుంది. ఇవాళ్టితో లీగ్ దశ మ్యాచ్‌లు ముగియనున్నాయి. ఆర్సీబీ, ముంబైలు తలపడనుండగా.. మరో మ్యాచ్‌లో యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ ఆఖరి మ్యాచ్ ఆడనున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ ప్లేఆఫ్‌కు క్వాలిఫై కాగా.. ఆర్సీబీ వుమెన్, గుజరాత్ జెయింట్స్ లీగ్ దశలోనే నిష్క్రమించాయి. మరి మెన్స్ ఐపీఎల్‌లాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ విజయవంతమైందా అనేది ఆసక్తికరంగా మారింది. పురుషుల ఐపీఎల్‌తో పోలిస్తే డబ్ల్యూపీఎల్‌కు అంతగా ఆదరణ లేకపోయినప్పటికి తొలివారం ముగిసేసరికి ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. అన్ని వర్గాలు(రూరల్, అర్బన్) కలిపి 50.78 మిలియన్ మంది వీక్షించినట్లు బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్జీ కౌన్సిల్(BARC- బార్క్) తెలిసింది.ఇందులో 15+ ఏజ్ గ్రూప్‌లో 40.35 మిలియన్ మంది ఉన్నట్లు పేర్కొంది. కాగా ఆర్సీబీ వుమెన్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌ను అత్యధికంగా వీక్షించారు. ఈ మ్యాచ్‌కు 0.41 రేటింగ్ నమోదైనట్లు తేలింది. గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ 0.40 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత అత్యధికంగా వీక్షించిన వాటిలో వరుసగా ముంబై ఇండియన్స్ వుమెన్, గుజరాత్ జెయింట్స్ మ్యాచ్(0.26), ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ వుమెన్(0.24), ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్(0.34), ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్జ్(0.33) టీఆర్పీ రేటింగ్స్ సాధించాయి. మరో విశేషమేమిటంటే ముంబై ఇండియన్స్ ఆడిన ప్రతీ మ్యాచ్‌కు మంచి టీఆర్పీ రేటింగ్ లభించింది. ఈ వారంతో ముగియనున్న డబ్ల్యూపీఎల్ వంద మిలియన్ వ్యూస్ సాధించడం కష్టమే అనిపిస్తుంది. ఓవరాల్‌గా 70 నుంచి 80 మిలియన్ల వ్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లు బార్క్ తెలిపింది. ఈ లెక్కన తొలిసారి నిర్వహిస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతమైనట్లే. ఎందుకంటే పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు కాస్త ఆదరణ తక్కువే. అయినా కూడా తొలి సీజన్లో 80 మిలియన్ వ్యూస్ సంపాదించిందంటే ఒక లెక్కన సీజన్ విజయవంతమైనట్లే. చదవండి: టీమిండియాలో నో ఛాన్స్.. హిందీ సీరియల్లో నటిస్తున్న శిఖర్ ధావన్! -
ఉపయోగం లేని మ్యాచ్.. టాప్ ప్లేస్ కోసం మాత్రమే
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ లీగ్ మ్యాచ్‌లకు ఆఖరిరోజు. నేటితో లీగ్ మ్యాచ్‌లు ముగియనున్న వేళ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉపయోగం లేని మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఏంచుకుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్, యూపీ వారియర్జ్లు ప్లేఆఫ్‌కు క్వాలిఫై కాగా.. ఆర్సీబీ, గుజరాత్‌లు ఎలిమినేట్ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబై టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకోవాలని భావిస్తుండగా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆర్సీబీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. గత మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన ఆర్సీబీ ముంబైతో మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తోంది. ముఖ్యంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లో 99 పరుగులు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సోఫీ డివైన్‌పై మరోసారి దృష్టి నెలకొంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టాప్ప్లేస్తో లీగ్ దశను ముగియాలని చూస్తుంది. ఇక తొలి రౌండ్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ వుమెన్: యస్తికా భాటియా (వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నటాలీ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్. ఆర్సీబీ వుమెన్: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, ఆశా శోభన, మేగన్ షుట్, ప్రీతి బోస్ 🚨 Toss Update 🚨@mipaltan win the toss and elect to field first against @RCBTweets. Follow the match ▶️ https://t.co/BQoiFCRPhD#TATAWPL | #RCBvMI pic.twitter.com/AfbXXSf7la — Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023 -
Womens Premier League 2023:ప్లేఆఫ్‌కు యూపీ వారియర్స్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో చివరిదైన మూడో ప్లేఆఫ్ బెర్త్ కూడా ఖరారైంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ దశకు అర్హత పొందగా... ఈ రెండు జట్ల సరసన యూపీ వారియర్స్ చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. యూపీ గెలుపుతో గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు సాధించింది. హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పార్శవి చోప్రా రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి విజయం సాధించింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన యూపీ వారియర్స్‌ను తాలియా (38 బంతుల్లో 57; 11 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. తాలియా అవుటయ్యాక గ్రేస్ హారిస్ యూపీని విజయం దిశగా నడిపించింది. ఏడు బంతులు మిగిలి ఉండగా హారిస్ పెవిలియన్ చేరగా... సోఫీ ఎకిల్‌స్టోన్ (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) యూపీ విజయాన్ని ఖాయం చేసింది. ముంబై ఇండియన్స్‌కు ఢిల్లీ షాక్ సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అందరికంటే ముందుగా ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న ముంబై ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం. ముందుగా ముంబై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. పూజ వస్త్రకర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), ఇసీ వాంగ్ (24 బంతుల్లో 23; 1 సిక్స్), అమన్‌జ్యోత్ కౌర్ (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కప్ (2/13), శిఖా పాండే (2/21), జెస్ జొనాసెన్ (2/25) ముంబైని కట్టడి చేశారు. అనంతరం ఢిల్లీ దూకుడుగా ఆడి 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 110 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, 1 సిక్స్) అవుటవ్వగా.. మెగ్ లానింగ్ (22 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (17 బంతుల్లో 38 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు. ‘ఫైనల్ బెర్త్’ రేసులో ముంబై, ఢిల్లీ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై 10 పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్ ర్యాంక్‌లో, ముంబై రెండో ర్యాంక్‌లో నిలిచాయి. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బెంగళూరుతో ముంబై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)... యూపీతో ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి) ఆడతాయి. ముంబై, ఢిల్లీ జట్లలో భారీ తేడాతో నెగ్గిన జట్టు ‘టాప్’ ర్యాంక్‌తో నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మూడో స్థానంలో నిలిచిన యూపీ వారియర్స్‌తో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. -
ఢిల్లీ బౌలర్ల జోరు.. ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో ఓటమి
డబ్ల్యూపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మార్చి 20) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగా.. ఛేదనలో షఫాలీ వర్మ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, సిక్స్), మెగ్ లాన్నింగ్ (22 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), అలీస్ క్యాప్సీ (17 బంతుల్లో 38 నాటౌట్; ఫోర్, 5 సిక్సర్లు) చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. షఫాలీ వర్మ వికెట్ హేలీ మాథ్యూస్‌కు దక్కింది. ఈ విజయంతో డీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లింది. అంతకుముందు మారిజన్ కాప్ (4-0-13-2), శిఖా పాండే (4-0-21-2), జెస్ జొనాస్సెన్ (4-0-25-2), అరుంధతి రెడ్డి (3-0-10-1) విజృంభించడంతో ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ దశలో ముంబై టీమ్ కనీసం 100 పరుగులు చేయడం కూడా కష్టమే అనుకున్నా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), పూజా వస్త్రాకర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్), ఇస్సీ వాంగ్ (24 బంతుల్లో 23, సిక్స్), అమన్‌జ్యోత్ కౌర్ (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) పుణ్యమా అని ఎంఐ 109 పరుగులు చేయగలిగింది. యస్తికా భాటియా (1), హేలీ మాథ్యూస్ (5), నాట్ సీవర్ బ్రంట్ (0), అమేలియా కెర్ (8) విఫలమయ్యారు. -
విజృంభించిన ఢిల్లీ బౌలర్లు.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన ముంబై ఇండియన్స్
డబ్ల్యూపీఎల్-2023లో భాగంగా ఇవాళ (మార్చి 20) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. మారిజన్ కాప్ (4-0-13-2), శిఖా పాండే (4-0-21-2), జెస్ జొనాస్సెన్ (4-0-25-2), అరుంధతి రెడ్డి (3-0-10-1) విజృంభించడంతో ముంబై బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ దశలో ముంబై టీమ్ కనీసం 100 పరుగులు చేయడం కూడా కష్టమే అనుకున్నా.. హర్మన్‌ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), పూజా వస్త్రాకర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్), ఇస్సీ వాంగ్ (24 బంతుల్లో 23, సిక్స్), అమన్‌జ్యోత్ కౌర్ (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) పుణ్యమా 109 పరుగులు చేయగలిగింది. యస్తికా భాటియా (1), హేలీ మాథ్యూస్ (5), నాట్ సీవర్ బ్రంట్ (0), అమేలియా కెర్ (8) విఫలమయ్యారు. కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైపోయాయి. పాయింట్ల పట్టికలో టాప్-3లో ఉన్న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్జ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ లీగ్ నుంచి నిష్క్రమించాయి. -
మెక్‌గ్రాత్, హ్యారిస్ విధ్వంసం.. ఉత్కంఠ సమరంలో యూపీ వారియర్జ్ విజయం
డబ్ల్యూపీఎల్-2023లో మరో ఉత్కంఠ సమరం జరిగింది. గుజరాత్ జెయింట్స్‌తో ఇవాళ (మార్చి 20) మధ్యాహ్నం మొదలైన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ సూపర్ విక్టరీ సాధించి, ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంది. తద్వారా లీగ్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించాల్సి వచ్చింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా, తాజా విజయంతో వారియర్జ్ ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జెయింట్స్.. దయాలన్ హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్ చేయగా.. తహీల మెక్‌గ్రాత్ (38 బంతుల్లో 57; 11 ఫోర్లు), గ్రేస్ హ్యారిస్ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో మెరిసి తమ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చారు. ఆఖర్లో సోఫీ ఎక్లెస్టోన్ (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి మరో బంతి మిగిలుండగానే వారియర్జ్‌ను విజయతీరాలకు చేర్చింది. 19వ ఓవర్లో ఐదో బంతిని ఎక్లెస్టోన్ బౌండరీకి తరలించడంతో వారియర్జ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన వారియర్జ్‌ను తహీల మెక్‌గ్రాత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో, గ్రేస్ హ్యారిస్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గెలిపించారు. ఈ సీజన్లో జెయింట్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అజేయమైన మెరుపు హాఫ్ సెంచరీతో (26 బంతుల్లో 59) మెరిసి వారియర్జ్‌ను ఇన్నే వికెట్ల తేడాతో గెలిపించిన హ్యారిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
హేమలత, గార్డ్నర్ మెరుపు అర్ధశతకాలు.. గుజరాత్ జెయింట్స్ భారీ స్కోర్
డబ్ల్యూపీఎల్-2023లో భాగంగా యూపీ వారియర్జ్‌తో ఇవాళ (మార్చి 20) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జెయింట్స్.. దయాలన్ హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్ చేసింది. గార్డ్నర్, హేమలత జోరు చూసి ఓ దశలో జెయింట్స్ స్కోర్ సునాయాసంగా 200 పరుగులు దాటుతుందని భావించినప్పటికీ.. రెండు ఓవర్ల వ్యవధిలో ఇద్దరు ఔట్ కావడంతో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ నమోదైంది. సూపర్ ఫామ్‌లో ఉన్న గార్డ్నర్ ఎడాపెడా షాట్లు బాది భారీ స్కోర్‌కు దోహదపడింది. సోఫీ డంక్లే (23), లారా వోల్వార్డ్ (17) తొలి వికెట్‌కు 41 పరుగులు (4.1 ఓవరల్లో) జోడించి శుభారంభాన్ని అందించగా.. హర్లీన్ డియోల్ (4), అశ్వనీ కుమారి (5) విఫలమయ్యారు. వారియర్జ్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పర్షవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టగా.. అంజలీ సర్వాని, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 4 ఓవర్లు బౌల్ చేసిన దీప్తి శర్మ భారీగా పరుగులు (49) సమర్పించుకుంది. కాగా, ప్రస్తుత లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. వారియర్జ్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో మూడో ప్లేస్‌లో ఉంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇదివరకే క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. -
36 బంతుల్లో 99 పరుగులు; ఒక్క పరుగు చేసుంటే చరిత్రలో
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్సీబీ వుమెన్ తొలిసారి తమ బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించారు. అయితే ఆర్సీబీ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడడంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉండడంతో పాటు రన్‌రేట్ కూడా చాలా దారుణంగా ఉంది. రన్‌రేట్ మెరుగుపరుచుకోవాలన్నా.. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలన్న కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఆర్సీబీది. అందుకే కీలకమ్యాచ్‌లో తొలిసారి జూలు విదిల్చింది. ముఖ్యంగా సోఫీ డివైన్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఆమె విధ్వంసానికి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం పరుగుల వర్షంతో తడిసిపోయింది. బంతి పడిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న డివైన్ 36 బంతుల్లోనే 9ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేసింది. అయితే సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఔటైన డివైన్ ఆ ఒక్క పరుగు పూర్తి చేసి ఉంటే చరిత్రకెక్కేది. ఎందుకంటే మహిళల క్రికెట్లో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ డీజెఎస్ డొట్టిన పేరిట ఉంది. ఆమె 38 బంతుల్లోనే శతకం మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత అలీసా హేలీ 46 బంతుల్లో సెంచరీ సాధించి రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో బ్యూమౌంట్ 47 బంతుల్లో, నాలుగో స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్ 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకుంది. కానీ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయిన సోఫీ డివైన్ అరుదైన ఫీట్‌ను మిస్ చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం.సోఫీ డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం. సోఫీ అవుటయ్యాక ఎలీస్ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు), హీథెర్ నైట్ (15 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. Devine power at play ⚡ #GGvRCB #CheerTheW | @RCBTweets pic.twitter.com/YOi84P4tLB — JioCinema (@JioCinema) March 18, 2023 .@RCBTweets register their second win in a row 😍#CheerTheW #TATAWPL #GGvRCB pic.twitter.com/SHz3eh9sRA — JioCinema (@JioCinema) March 18, 2023 చదవండి: ఉత్కంఠ.. ఆఖరి బంతికి రనౌట్; టైటిల్ నిలబెట్టుకున్న లాహోర్ సూపర్ సోఫీ... ఆర్సీబీ వరుసగా రెండో విజయం -
సూపర్ సోఫీ...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫామ్‌లోకి వచ్చింది. ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన బెంగళూరు జట్టు వరుసగా రెండో విజయం అందుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. బెంగళూరుకు ఆడుతున్న న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం. సోఫీ అవుటయ్యాక ఎలీస్ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు), హీథెర్ నైట్ (15 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముంబై ఇండియన్స్‌కు తొలి ఓటమి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా ఉన్న ముంబై ఇండియన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ఐదు వికెట్ల తేడాతో ముంబై జట్టును ఓడించింది. తొలుత ముంబై జట్టు 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. హేలీ మాథ్యూస్ (35; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఇసీ వాంగ్ (32; 4 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (25; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ (3/15), రాజేశ్వరి (2/16), దీప్తి శర్మ (2/35) రాణించారు. అనంతరం యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. తాలియా మెక్‌గ్రాత్ (38; 6 ఫోర్లు, 1 సిక్స్), గ్రేస్ హారిస్ (39; 7 ఫోర్లు) మెరిపించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (13 నాటౌట్; 1 ఫోర్), సోఫీ ఎకిల్‌స్టోన్ (16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) యూపీ జట్టు విజయాన్ని ఖాయం చేశారు. -
దంచికొట్టిన గుజరాత్ జెయింట్స్.. ఆర్సీబీ ఎదుట భారీ టార్గెట్
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డబుల్ హెడర్‌లో భాగంగా శనివారం రాత్రి ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది. లారా వోల్వార్డట్ (42 బంతుల్లో 68 పరుగులు) వరుసగా రెండో అర్థసెంచరీతో రాణించగా.. అష్లే గార్డనర్ 41 పరుగులు, సబ్బినేని మేఘన 31 పరుగులు చేశారు. చివర్లో హర్లీన్ డియోల్ (12), దయలాన్ హేమలత (16)రెచ్చిపోయి ఆడారు. మేఘన్ షట్ వేసిన ఆఖరి ఓవర్లో హర్లీన్, హేమలత తలా ఒక ఫోర్, సిక్స్ బాదారు. దాంతో, గుజరాత్ భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీసింది. సోఫీ డెవినే, ప్రీతీ బోస్ తలా ఒక వికెట్ తీశారు. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ స్నేహ్ రాణా బ్యాటింగ్ తీసుకుంది. అయితే.. 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సోఫియా డంక్లీ (16)ని సోఫీ డెవినే బౌల్డ్ చేసింది. అయితే.. మరో ఓపెనర్ లారా వొల్వార్డ్ మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. 35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో హాఫ్ సెంచరీ సాధించింది. సబ్బినేని మేఘన (31)తో కలిసి రెండో వికెట్‌కు 63 రన్స్, అష్ గార్డ్నర్తో కలిసి మూడో వికెట్‌కు 52 పరుగులు జోడించింది. -
స్టన్నింగ్ క్యాచ్.. హర్మన్ కూడా ఊహించి ఉండదు
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. క్యాచ్ తీసుకుంటుందని ఎవరు ఊహించని రీతిలో హర్మన్ అందుకోవడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. యూపీ ఇన్నింగ్స్ ఆరంభంలో ఇన్నింగ్స్ రెండో ఓవర్లో హేలీ మాథ్యూస్ తొలి బంతిని ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ దిశగా వేసింది. దేవికా డ్రైవ్ ఆడే నేపథ్యంలో బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. ఇక్కడే హర్మన్ అద్భుతంగా డైవ్ చేసి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకుంది. కాస్త పట్టు తప్పినా బంతి చేజారిపోయేదే. అందుకే క్యాచ్ అందుకోగానే హర్మన్ కూడా చాలాసేపు బంతిని తన చేతితో పట్టుకొని గ్రౌండ్లో తిరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ విజయాన్ని అందుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో ఎసెల్‌స్టోన్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించింది. అంతకముందు గ్రేస్ హారిస్ 38, తాహిలా మెక్‌గ్రాత్ 39 పరుగులు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ విజయంతో యూపీ వారియర్జ్ తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. Cheer on Hayley and Harry as they take on the UP Warriors in the #WPL2023 season! 🏏🔥 Use the hashtags #OneFamily, #MumbaiIndians, #AaliRe, and #MIvUPW to show your support for the Mumbai Indians 💙#CricketGaliyara #CricketTwitter #cricketnews pic.twitter.com/Ua4SjQBV2p — Cricket Galiyara (@cricketgaliyara) March 18, 2023 చదవండి: Deepthi Sharma: చరిత్రలో నిలిచిపోయే రనౌట్.. ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ విజయం; ముంబైకి తొలి ఓటమి -
ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ విజయం; ముంబైకి తొలి ఓటమి
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి హై ఓల్టెజ్ మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ ఐదు వికెట్లు తేడాతో విజయాన్ని అందుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో ఎసెల్‌స్టోన్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించింది. అంతకముందు గ్రేస్ హారిస్ 38, తాహిలా మెక్‌గ్రాత్ 39 పరుగులు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమెలియా కెర్ రెండు వికెట్లు తీయగా.. నట్ సివర్, హేలీ మాథ్యూస్, ఇసీ వాంగ్ తలా ఒక వికెట్ తీశారు. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. హేలీ మాథ్యూస్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసీ వాంగ్ 32, హర్మన్‌ప్రీత్ కౌర్ 32 పరుగులు చేశారు. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎసెల్‌స్టోన్ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్ గైక్వాడ్, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెండు అద్బుత రనౌట్లతో మెరిసింది. ఈ విజయంతో యూపీ వారియర్జ్ తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కాగా సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఇదే తొలి ఓటమి. ఇక యూపీ వారియర్జ్ విజయంతో ఆర్సీబీ వుమెన్ ప్లేఆఫ్ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. వరుస ఓటములతో పూర్ రన్‌రేట్ కలిగి ఉండడమే దీనికి కారణం. Take a bow @Sophecc19 🙌🏻🙌🏻She finishes in style with a SIX & powers @UPWarriorz to a thrilling win! 👏👏Scorecard ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/pwR2D2AoLZ— Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023 -
చరిత్రలో నిలిచిపోయే రనౌట్..
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ వుమెన్, యూపీ వారియర్జ్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ స్టన్నింగ్ రనౌట్లతో మెరిసింది. మాములుగానే తాను ఫీల్డ్‌లో ఉందంటే ప్రత్యర్థి బ్యాటర్ల పప్పులు ఉడకవు. ఎందుకంటే బంతి ఆమె చేతి నుంచి వెళ్లడం అసాధ్యం. అయితే పరుగులు సేవ్ చేయడమో లేదంటే ప్రత్యర్థి ఆటగాళ్లను రనౌట్ చేయడమో జరుగుతుంది. తాజాగా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా రెండు రనౌట్లతో మెరవడం విశేషం. అయితే ఇసీ వాంగ్‌ను రనౌట్ చేసిన తీరుకు మాత్రం ఆమెను మెచ్చుకోకుండా ఉండలేం. ఆఖరి ఓవర్‌ను దీప్తి శర్మనే వేసింది. ఓవర్ నాలుగో బంతిని ఇసీ వాంగ్ లాంగ్‌ఆఫ్ దిశగా ఆడింది. సింగిల్ పూర్తి చేసిన వాంగ్ రెండో పరుగుకు పిలుపునిచ్చింది. అప్పటికే బంతిని అందుకున్న దీప్తి శర్మకు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఈజీగా రనౌట్ చేసే చాన్స్ వచ్చింది. కానీ తను మరోలా ఆలోచించింది. స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వెళ్తున్న ఇసీ వాంగ్‌ను రనౌట్ చేయాలనుకొని డైరెక్ట్ త్రో వేసింది. అంతే వాంగ్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీప్తి శర్మ కాన్ఫిడెంట్‌కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. Right On Target 🎯 ft. Deepti Sharma#CricketTwitter #WPL2023 #MIvUPW pic.twitter.com/LkGcz9ubKt — Female Cricket (@imfemalecricket) March 18, 2023 చదవండి: విశాఖ చేరుకున్న క్రికెటర్లు; వర్షం నేపథ్యంలో అభిమానుల్లో ఆందోళన -
యూపీ వారియర్జ్ విజృంభణ.. ముంబై ఇండియన్స్ 127 ఆలౌట్
ముంబై ఇండియన్స్ వుమెన్‌తో మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ బౌలర్లు విజృంభించారు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. హేలీ మాథ్యూస్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసీ వాంగ్ 32, హర్మన్‌ప్రీత్ కౌర్ 32 పరుగులు చేశారు. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎసెల్‌స్టోన్ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్ గైక్వాడ్, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెండు అద్బుత రనౌట్లతో మెరిసింది. తొలుత ఇసీ వాంగ్‌ను రనౌట్ చేసిన దీప్తి.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సైకా ఇషాకిని డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడం విశేషం. ప్లే ఆఫ్‌కు చేరాలంటే యూపీ వారియర్జ్ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి -
యూపీ వారియర్జ్‌కు సంకట స్థితి.. గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్, యూపీ వారియర్జ్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ బౌలింగ్ ఏంచుకుంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే యూపీ వారియర్జ్ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. అయితే పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరం. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రన్‌రేట్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే మైనస్‌లో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఇప్పటికే వరుసగా ఐదు విజయాలతో ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది. హర్మన్‌ప్రీత్ సేన అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుండగా.. యూపీ వారియర్జ్ బ్యాటింగ్‌లో మాత్రం ఒకరిద్దరిపైనే ఆధారపడింది. కెప్టెన్ అలిస్సా హేలీ మంచి ఇన్నింగ్స్‌తో మెరవాల్సిన సమయం ఆసన్నమైంది. దీప్తి శర్మ, దేవికా వైద్య, కిరణ్ నవగిరే, తాహిలా మెక్‌గ్రాత్‌లు రాణిస్తేనే యూపీ గెలవగలదు. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 🚨 Toss Update 🚨@UPWarriorz win the toss and elect to bowl first against @mipaltan. Follow the match ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/LqLaohQ7BX — Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023 -
ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ 136 పరుగులకు ఆలౌట్ అయింది. మారిజన్నే కాప్ 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. అరుంధతీ రెడ్డి 25 పరుగులు, ఎలిస్ క్యాప్సీ 22 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో తనూజా కన్వర్ రెండు వికెట్లు తీయగా.. అష్లే గార్డనర్, కిమ్ గార్త్, హర్లిన్ డియోల్, స్నేహ్రాణా తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్ లారా వోల్వార్డాట్ (45 బంతుల్లో 57, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), అష్లే గార్డనర్(33 బంతుల్లో 51 పరుగులు, 9 ఫోర్లు), హర్లిన్ డియోల్ 31 పరుగులు రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లారా, అష్లే గార్డనర్లు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి గుజరాత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో జెస్ జొనాసెన్ రెండు వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి, మారిజెన్నె కాప్ చెరొక వికెట్ తీశారు. -
సాధారణ స్కోరుకే పరిమితం.. ఢిల్లీ టార్గెట్ 148
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్ లారా వోల్వార్డాట్ (45 బంతుల్లో 57, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), అష్లే గార్డనర్(33 బంతుల్లో 51 పరుగులు, 9 ఫోర్లు), హర్లిన్ డియోల్ 31 పరుగులు రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లారా, అష్లే గార్డనర్లు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి గుజరాత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో జెస్ జొనాసెన్ రెండు వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి, మారిజెన్నె కాప్ చెరొక వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డంక్లీ (4) ఔట్ అయింది. మరిజానే కాప్ వేసిన ఆఖరి బంతికి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. కుదురుకున్న హర్లీన్ డియోల్ (31) ను జొనాసెన్ రెండో వికెట్‌గా వెనక్కి పంపింది. దాంతో, గుజరాత్ జట్టు 53 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత.. ఓపెనర్ లారా వోల్వార్డట్, అష్లే గార్డ్నర్ గుజరాత్‌ను ఆదుకున్నారు. తొలి మ్యాచ్‌లో విఫలమైన ఆమె కీలక మ్యాచ్‌లో రాణించింది. డబ్ల్యూపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసింది. -
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరులో గుజరాత్..
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ బౌలింగ్ ఏంచుకుంది. ఈ టోర్నమెంట్లో నాలుగు విజయాలతో రెండో స్థానంలో ఉన్న పటిష్టమైన ఢిల్లీని గుజరాత్ నిలువరిస్తుందా? అనేది ఆసక్తికరం. గుజరాత్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైన. దాంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ పోటీలో నిలవాలని స్నేహ్ రానా సేన భావిస్తోంది. షఫాలీ వర్మ, మెగ్ లానింగ్, అలైస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, జెస్ జొనాసెన్, కాప్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో కూడా కాప్,శిఖా పాండే, రాధా యాదవ్‌లతో బాగానే ఉంది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ తమ ప్రయాణాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తుంది.హర్లిన్ డియోల్, అష్లీ గార్డనర్, సోఫియా డంక్లీలు రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో మాత్రం కిమ్ గార్త్, తనూజా కన్వర్లతో పటిష్టంగా ఉంది. కెప్టెన్‌గా స్నేహ్రాణా రాణిస్తున్నప్పటికి ఆటలో మాత్రం నిలకడ చూపలేకపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్. రాధా యాదవ్ గుజరాత్ జెయింట్స్ జట్టు : లారా వోల్వార్డ్త్, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హర్లీన్ డియోల్, అష్ గార్డ్నర్, దయలాన్ హేమలత, అశ్విని కుమారి, సుష్మా వర్మ (వికెట్ కీపర్), కిమ్ గార్త్, తనుజా కన్వర్, మన్సీ జోషి 🚨 Toss Update 🚨@DelhiCapitals have elected to bowl against @GujaratGiants. Follow the match 👉 https://t.co/fWIECCa2QJ #TATAWPL | #DCvGG pic.twitter.com/NyMHidy8Aa — Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023 -
ఆసీస్ సుందరికి ఎంత కష్టమొచ్చే!
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ ప్రస్తుతం వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023) తొలి ఎడిషన్‌లో సందడి చేస్తుంది. ఆర్సీబీ వుమెన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె బ్యాటింగ్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. అయితే ఆమె మినహా మిగతావారు విఫలం కావడంతో ఆర్సీబీ వుమెన్ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసింది. అయితే బుధవారం యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో మాత్రం ఆర్సీబీ మంచి ప్రదర్శన కనబరిచి లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఈసారి ఎల్లిస్ పెర్రీ బ్యాట్‌తో విఫలమైనప్పటికి బంతితో రాణించింది. కీలకమైన మూడు వికెట్లు తీసి యూపీ వారియర్జ్‌ను తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా చేసింది. ముఖ్యంగా తన దూకుడైన ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ గుండెల్లో దడ పుట్టించిన గ్రేస్ హారిస్ వికెట్ తీసి జట్టుకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో కనికా అహుజా, రిచా ఘోష్‌లు రాణించడంతో ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఎల్లిస్ పెర్రీ గ్రౌండ్లోకి దూసుకొచ్చి దీప్తిశర్మను కౌగిలించుకొని విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది.ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఎల్లిస్ పెర్రీ మాట్లాడింది. తన జట్టుకు అంటుకున్న రంగు ఇంకా పోలేదని.. దానివల్ల నాకు చిరాకు కలుగుతుందని ఎవరైనా సలహా ఇవ్వగలరా అని అడిగింది. ''ఇంట్లో ఎవరైనా ఉంటే నా జట్టుకు అంటుకున్న పింక్ కలర్‌ను పోగొట్టే చిట్కా చెప్పండి. మీరు చేసే పెద్ద సహాయం అదే. జుట్టుకున్న రంగును చూసినప్పుడల్లా నాకు ఏదో తెలియని చిరాకు కలుగుతుంది. హోలీ ఆడినప్పుడు బాగానే అనిపించింది కానీ జట్టుకు మాత్రం పింక్ కలర్ అలాగే ఉండిపోయింది. దయచేసి సాయం చేయండి.. అది పోగొట్టే మార్గం చెప్పండి'' అంటూ నవ్వుతూ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎల్లిస్ పెర్రీ సాయం కోరడంపై స్పందించిన క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''నీలాంటి అందమైన క్రికెటర్ సలహా అడిగితే ఇవ్వకుండా ఉంటామా.. కచ్చితంగా ఇస్తాం''.. ''అందం, అభినయంతో పాటు ఆటతో మా మనుసుల గెలిచావ్.. నీకు ఆ మాత్రం సాయం చేయలేమా'' అంటూ పేర్కొన్నారు. (2/n) pic.twitter.com/sX7tkzRBfZ — Krish (@archer_KC14) March 15, 2023 చదవండి: ఆడడంలో విఫలం.. తప్పు మీద తప్పు చేస్తూ -
RCB: విరాట్ సర్ చెప్పింది ఇదే! అమ్మ నన్ను బయటకు వెళ్లగొట్టేది..
Women's Premier League 2023- RCB: ‘‘ఆట ఆహ్లాదాన్ని ఇవ్వాలి. అంతేకానీ ఒత్తిడిని కాదని విరాట్ సర్ చెప్పారు. ఒత్తిడిలో కూరుకుపోకూడదని.. ఎంతగా వీలైతే అంతలా ఆటను ఆస్వాదించాలని.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా క్రికెటర్ కనిక అహుజా పేర్కొంది. విరాట్ కోహ్లి తమలో స్ఫూర్తి నింపాడని, ఆయన మాటల ప్రభావం తన మీద పనిచేసిందని చెప్పుకొచ్చింది. కాగా మహిళా ప్రీమియర్ లీగ్-2023 ఆరంభ సీజన్లో ఆర్సీబీ జట్టుకు వరుసగా పరాజయాలు ఎదురైన విషయం తెలిసిందే. దీంతో కెప్టెన్ స్మృతి మంధానపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కనిక అద్బుతం చేసింది. ముంబైలోని డీవై పాటిల్ మైదానంలో యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ తానున్నానంటూ అభయమిచ్చింది. కనిక కీలక ఇన్నింగ్స్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 20 ఏళ్ల కనిక 30 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 46 పరుగులు చేసింది. కనికకు తోడు రిచా ఘోష్ 31 పరుగులతో రాణించడంతో యూపీ విధించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలోనే ఛేదించింది. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన కనికకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇదిలా ఉంటే..ఆస్ట్రేలియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్ పూర్తి చేసుకున్న కోహ్లి ఆర్సీబీ మహిళా జట్టును కలిశాడు. యూపీతో మ్యాచ్‌కు ముందు తన ప్రసంగంతో జట్టులో స్ఫూర్తి నింపాడు. ఈ నేపథ్యంలో కనిక మాట్లాడుతూ కోహ్లిపై అభిమానాన్ని చాటుకుంది. అమ్మ ఆడుకొమ్మని వెళ్లగొట్టేది ఇక తన నేపథ్యం గురించి చెబుతూ.. ‘‘నేను ఇంట్లో ఉంటే రూఫ్ మీదకెక్కి పతంగులు ఎగురవేస్తాను. అల్లరి చేస్తాను. అందుకే మా అమ్మ బయటికి వెళ్లి ఆడుకోమంటూ నన్ను వెళ్లగొట్టేది(నవ్వుతూ). నిజానికి మా ఇంట్లోవాళ్లకు ఆడపిల్లలకు కూడా క్రికెట్ టోర్నీలు ఉంటాయని తెలియదు. మా నాన్న ఎప్పుడూ చదువు మీదే దృష్టి పెట్టమంటారు. కానీ మా అమ్మ మాత్రం క్రికెట్ ఆడమని ప్రోత్సహించేది. ఇప్పుడు కూడా తను ఇచ్చిన ధైర్యమే నన్ను ఇక్కడిదాకా తీసుకువచ్చింది’’ అని కనిక అహుజా పేర్కొంది. కాగా పంజాబ్‌లోని పాటియాలలో ఆగష్టు 7, 2002లో కనిక జన్మించింది. ఈ ఆల్‌రౌండర్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. చదవండి: సచిన్ రికార్డు బద్దలు కొట్టగలిగేది అతడే.. 110 సెంచరీలతో: పాక్ మాజీ పేసర్ Asif Khan: చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. సచిన్ ప్రపంచ రికార్డుపై కన్నేసిన కోహ్లి Virat Kohli’s pep talk to the RCB Women’s Team King came. He spoke. He inspired. He’d be proud watching the girls play the way they did last night. Watch @imVkohli's pre-match chat in the team room on Bold Diaries.#PlayBold #ನಮ್ಮRCB #WPL2023 pic.twitter.com/fz1rxZnID2 — Royal Challengers Bangalore (@RCBTweets) March 16, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హమ్మయ్య,.. మొత్తానికి ఆర్సీబీ గెలిచింది
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో ఆర్సీబీ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ వుమెన్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. కనికా అహుజా 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా గెలవగా.. రిచా ఘోష్ 31 నాటౌట్, హెథర్‌నైట్ 24 పరుగులు చేశారు. ఆఖర్లో కనికా అహుజా ఔట్ అయినప్పటికి రిచా ఘోష్ జట్టును గెలిపించింది. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.. గ్రేస్ హారిస్, దేవికా వైద్య తలా ఒక వికెట్ తీశారు.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయింది. హారిస్ గ్రేస్ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. దీప్తి శర్మ 22, కిరణ్ నవగిరె 22 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో ఎల్లిస్ పెర్రీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆశా శోభన, సోఫీ డివైన్లు చెరొక రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఇతర మ్యాచ్ ఫలితాలపై మాత్రమే ఆర్సీబీ ప్లేఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. యూపీ వారియర్జ్ 135 ఆలౌట్
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్సీబీ తొలిసారి చెలరేగింది. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాణించారు. బౌలర్ల సమిష్టి ప్రదర్శన కనబరచడంతో యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన యూపీ ఇన్నింగ్స్ ఆది నుంచి ఒడిదొడుకుల మధ్యే సాగింది. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. సోఫీ డివైన్ వేసిన తొలి ఓవర్లో రెండో బంతికే దేవికా వైద్య (0) ఎల్బీగా వెనుదిరిగింది. అదే ఓవర్లో చివరి బంతికి కెప్టెన్ అలీస్సా హేలి (1) కూడా ఔటయింది. మేగన్ స్కాట్ వేసిన రెండో ఓవర్లో ఆఖరి బంతికి తహిలా మెక్‌గ్రాత్ (2) రిచా గోష్ కు క్యాచ్ ఇచ్చింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన కిరణ్ నవ్గిరె (26 బంతుల్లో 22, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకోవడానికి యత్నించింది. కానీ ఆశా శోభన యూపీకి షాకిచ్చింది. ఆమె వేసిన ఏడో ఓవర్ రెండో బంతికి నవ్గిరె.. వికెట్ కీపర్ రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఆశా వేసిన 9వ ఓవర్ తొలి బంతికి సిమ్రాన్ షేక్ (2) కూడా కనికకు క్యాచ్ ఇచ్చింది. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి యూపీ ఐదు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. యూపీ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నా హరీస్ (32 బంతులలో 46, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రం నిలకడగా ఆడింది. దీప్తి శర్మ (19 బంతుల్లో 22, 4 ఫోర్లు) తో కలిసి ఆమె యూపీ ఇన్నింగ్స్ ను నడిపించింది. యూపీ ఆ మాత్రం స్కోరైనా చేసిందంటే అది హరీస్ చలవే. దీప్తి శర్మతో కలిసి హరీస్ 42 బంతుల్లోనే 69 పరుగులు జోడించింది. అర్థ సెంచరీ పూర్తి చేసుకుని భారీ స్కోరు మీద కన్నేసిన ఈ జోడిని ఎలీస్ పెర్రీ విడదీసింది. ఆమె వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి దీప్తి.. భారీ షాట్ ఆడబోయి శ్రేయాంక పాటిల్ చేతికి చిక్కింది. అదే ఓవర్లో మూడో బంతికి హరీస్ కూడా రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చింది. దీంతో యూపీ ఏడో వికెట్ కోల్పోయింది. పెర్రీనే వేసిన 18వ ఓవర్లో రెండో బంతికి శ్వేతా సెహ్రావత్ (6) క్లీన్ బౌల్డ్ అయింది. చివరి ఓవర్ వేసిన శ్రేయాంక పాటిల్.. రెండో బంతికి అంజలి శర్వని (8) ని ఔట్ చేయగా.. తర్వాత బంతికే ఎకిల్‌స్టోన్ (12) రనౌట్ అయింది. పలితంగా యూపీ.. 135 పరుగులకు ఆలౌట్ అయింది. ఆర్సీబీ బౌలర్లలో పెర్రీ మూడు వికెట్లు తీయగా, ఆశా శోభన, సోఫీ డివైన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్, మేగన్ షుట్ చెరొక వికెట్ తీశారు -
WPL 2023: యూపీ వారియర్జ్‌తో మ్యాచ్.. ఆర్సీబీ ఇవాళైనా
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఇంతవరకు బోణీ కొట్టని జట్టు ఏదైనా ఉందంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన స్మృతి మంధాన సేన ఒక్క విజయం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయిన ఆర్సీబీ ఇవాళ(బుధవారం) యూపీ వారియర్జ్‌తో మ్యాచ్ ఆడనుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ వుమెన్ బౌలింగ్ ఏంచుకుంది. మరోవైపు యూపీ వారియర్జ్ తాము ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి.. మరో రెండింటిలో ఓడిపోయి మూడో స్థానంలో ఉంది. ఇక తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై యూపీ వారియర్జ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఎల్లిస్ పెర్రీ మినహా మిగతావారు పెద్దగా రాణించడం లేదు. స్మృతి మంధాన అయితే అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా దారుణంగా విఫలమవుతూ వస్తోంది. ఆమె నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. రిచా ఘోష్, సోఫీ డివైన్, హెథర్ నైట్లు బ్యాట్ ఝులిపించలేకపోతున్నారు. ఇక యూపీ వారియర్జ్ బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ అలిస్సా హేలీ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. అయితే ఆమె మినహా మిగతావారు రాణించకపోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఆర్సీబీ వుమెన్ తుదిజట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్(వికెట్ కీపర్), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోబన, రేణుకా ఠాకూర్ సింగ్, కనికా అహుజా యూపీ వారియర్జ్ తుదిజట్టు: అలిస్సా హీలీ(కెప్టెన్/వికెట్ కీపర్), దేవికా వైద్య, కిరణ్ నవ్‌గిరే, గ్రేస్ హారిస్, తహ్లియా మెక్‌గ్రాత్, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్ చదవండి: వరుస ఓటములు బాధిస్తున్నా.. ఆకట్టుకున్న ఆసీస్ క్రికెటర్ వైరల్‌గా మారిన రిషబ్ పంత్ చర్య -
వరుస ఓటములు బాధిస్తున్నా.. ఆకట్టుకున్న ఆసీస్ క్రికెటర్
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023) తొలి ఎడిషన్ నాకౌట్ స్టేజీకి దగ్గరైంది. ఇప్పటికే లీగ్‌లో సగానికి పైగా మ్యాచ్‌లు ముగియడంతో ఎవరు ప్లేఆఫ్‌కు వెళ్తున్నారు.. ఎవరు వెళ్లడం లేదనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ వుమెన్ ఐదు వరుస విజయాలతో ప్లేఆఫ్ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్నట్లే. అదే సమయంలో స్మృతి మంధాన సారధ్యంలోని ఆర్సీబీ వుమెన్ మాత్రం ఐదు వరుస ఓటములతో చివరి స్థానంలో కొనసాగుతూ దాదాపు లీగ్ నుంచి నిష్క్రమించే స్థితికి చేరుకుంది. దాదాపుగా ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయిన ఆర్సీబీ తన చివరి మూడు మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలనుకుంటుంది. ఇక ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. జట్టులో ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలిస్ పెర్రీ మాత్రమే నిలకడగా రాణిస్తూ వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడంతో కాస్త ఎమోషన్‌కు గురైన ఎలిస్ పెర్రీ కంటతడి పెట్టడం కదిలించింది. తాజాగా మరోసారి తన చర్యతో అందరిని ఆకట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ముగియగానే ఆర్సీబీ డగౌట్లో పడేసిన వాటర్‌బాటిల్స్, చెత్తను ఏరి డస్ట్‌బిన్‌లో పడేసింది. డబ్ల్యూపీఎల్‌లో తాను ఆడిన ప్రతి మ్యాచ్ తర్వాత ఎలిస్ పెర్రీ ఇదే కంటిన్యూ చేస్తూ వచ్చింది. పర్యావరణానికి ముప్పుగా ఉన్న ప్లాస్టిక్‌ను ఏరేస్తూ ఆమె చేస్తున్న మంచి పనికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఆర్సీబీ వుమెన్ ఇవాళ(బుధవారం) యూపీ వారియర్జ్‌తో తలపడనుంది. Ellyse Perry cleans her dugout, places then picks up all bottles and garbage after each match. Great gesture from Perry. #royalchallengersbangalore #ViratKohli𓃵 pic.twitter.com/UIwejvwUp3 — 𝗞𝗜𝗡𝗚 𝗞𝗢𝗛𝗟𝗜 (@68036hu) March 15, 2023 Ellyse Perry has habit that after the match, she cleans her dugout and picks up bottles and garbage puts them in the dustbin. Ellyse Perry said - "I think wherever you play, you should respect". Ellyse Perry - The GOAT, The Role model, The inspiration! pic.twitter.com/DxPLmTB8TH — CricketMAN2 (@ImTanujSingh) March 15, 2023 చదవండి: Ind Vs Aus: భారత్- ఆసీస్ వన్డే సిరీస్.. షెడ్యూల్, జట్లు.. పూర్తి వివరాలు R Ashwin: ట్విటర్ అకౌంట్‌పై ఆందోళన.. ఎలాన్ మస్క్‌కు లేఖ -
ఎదురులేని ముంబై ఇండియన్స్.. వరుసగా ఐదో విజయం
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ వుమెన్ దూసుకుపోతుంది. లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ ముంబై బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. హర్లిన్ డియోల్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్నేహ్రాణా 20 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో నట్ సివర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ చెరో మూడు వికెట్లు తీయగా.. అమెలియా కేర్ 2 వికెట్లు పడగొట్టింది.అంతకముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51) అర్ధ శతకంతో రాణించింది. ఈ లీగ్‌లో ఆమెకు ఇది మూడో ఫిఫ్టీ. గుజరాత్ బౌలర్లలో అష్లీ గార్డ్నర్ మూడు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, స్నేహ్రాణా, తనూజా కన్వార్ తలా ఒక వికెట్ పడగొట్టారు. -
హర్మన్‌ప్రీత్ ఫిఫ్టీ.. గుజరాత్ జెయింట్స్ టార్గెట్ 163
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ పోరాడే స్కోరు సాధించింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51) అర్ధ శతకంతో రాణించింది. ఈ లీగ్‌లో ఆమెకు ఇది మూడో ఫిఫ్టీ. నాలుగో వికెట్‌కు హర్మన్‌ప్రీత్, అమేలియా 29 బంతుల్లో 51 రన్స్ చేశారు. అయితే.. ధాటిగా ఆడుతున్న అమేలియా కేర్ (19)ను ఔట్ చేసిన తనూజ కన్వార్ గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చింది. ఆమె ఔటయ్యాక వెంటనే ఇసీ వాంగ్ వెనుదిరిగింది. దాంతో 136 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ పడింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గేర్ మార్చింది. సిక్స్, ఫోర్‌తో స్కోర్‌బోర్డు 150 దాటించింది. 19వ ఓవర్లో అష్లీ గార్డ్నర్ హ్యాట్రిక్‌పై నిలిచింది. వరుస బంతుల్లో హర్మన్‌ప్రీత్, అమన్‌జోత్ కౌర్‌లను ఔట్ చేసింది. కానీ, ఆఖరి బంతికి జింతిమని కతియా రెండు రన్స్ తీసింది. గుజరాత్ బౌలర్లలో అష్లీ గార్డ్నర్ మూడు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, స్నేహ్ రానా, తనూజా కన్వార్ తలా ఒక వికెట్ పడగొట్టారు. -
ఓటమెరుగని ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ నిలువరిస్తుందా?
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ ఫీల్డింగ్ ఏంచుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ టాప్‌లో ఉండగా.. గుజరాత్ జెయింట్స్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఈ టోర్నమెంట్లో ఓటమన్నదే ఎరుగని ముంబైని గుజరాత్ నిలువరిస్తుందా? లేదా? అనేది చూడాలి. ముంబై బ్యాటర్లు హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నాట్ సీవర్ బ్రంట్, అమేలియా కేర్ ఫామ్‌లో ఉన్నారు. ఇసీ వాంగ్, సైకా ఇషాక్ బౌలింగ్‌లో సత్తా చాటుతున్నారు. ఇక గుజరాత్ విషయానికొస్తే… ఓపెనర్లు మేఘన, సోఫీ భారీ స్కోర్ చేయడం లేదు. హర్లీన్ ఒక్కామే రాణిస్తోంది. ఈ లీగ్‌లో ఒక్క విజయం మాత్రమే సాధించిన గుజరాత్, టాప్ గేర్‌లో ఉన్న ముంబైతో ఎలా ఆడనుంది? అనేది ఆసక్తికరం. గుజరాత్ జెయింట్స్: సబ్బినేని మేఘన, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హర్లీన్ డియోల్, అష్ గార్డ్నర్, దయలాన్ హేమలత, అన్నబెల్ సథర్లాండ్, సుష్మా వర్మ (వికెట్ కీపర్), కిమ్ గార్త్, తనుజా కన్వర్, మన్సీ జోషి. ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కేర్, ఇసీ వాంగ్, అమన్‌జోత్ కౌర్, హుమారియా కాజీ, జింతిమణి కలిత, సాయిక్ ఇషాక్ -
WPL 2023: మారని ఆర్సీబీ ఆటతీరు.. వరుసగా ఐదో ఓటమి
మారని ఆర్సీబీ ఆటతీరు.. వరుసగా ఐదో ఓటమి వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ వుమెన్ కథ మారడం లేదు. లీగ్‌లో వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. అలైస్ క్యాప్సీ(38 పరుగులు), కాప్(32 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ 32 పరుగులు, జెస్ జొనాసెన్ 25 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. ఆర్సీబీ బౌలర్లలో ఆశా శోభనా రెండు వికెట్లు తీయగా.. ప్రీతిబోస్, మేఘన్ స్కాట్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 67 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిచా ఘోష్ 37 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీయగా.. తారా నొరిస్ ఒక వికెట్ పడగొట్టింది. నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడగా ఆడుతున్న జెమీమా రోడ్రిగ్స్(32) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కాప్ 16, జొనాసెన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 37 పరుగులు కావాలి. 12 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 90/3 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ 18, కాప్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు కెప్టె్న్ మెగ్ లానింగ్ 15 పరుగులు చేసి ఆశా శోభనా బౌలింగ్‌లో హెథర్నైట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ అలైస్ క్యాప్సీ(38) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులుగా ఉంది. మెగ్ లానింగ్ 3 పరుగులతో క్రీజులో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 151 ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 67 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిచా ఘోష్ 37 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీయగా.. తారా నొరిస్ ఒక వికెట్ పడగొట్టింది. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్.. ప్రస్తతం ఢిల్లీ 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. 12 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 62/2 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 23, హెథర్ నైట్ 11 పరుగులతో ఆడుతున్నారు. 8 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 38/1 ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతుంది. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. క్రీజులో ఎలిస్ పెర్రీ 10, సోఫీ డివైన్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు స్మృతి మంధాన 8 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. స్మృతి మంధాన ఔట్.. తొలి వికెట్ డౌన్ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన వైఫల్యం కొనసాగుతుంది. ఢిల్లీ వుమెన్‌తో మ్యాచ్‌లో 8 పరుగులు మాత్రమే చేసిన మంధాన శిఖా పాండే బౌలింగ్‌లో రోడ్రిగ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ఆర్సీబీ వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఇవాళ ఆర్సీబీ వుమెన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఏంచుకుంది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో వరుసగా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో ఉంది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి.. ఒక్క ఓటమితో ఆరు పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీని ఆర్సీబీ వుమెన్స్ ఎంత మేరకు నిలువరిస్తుందనేది చూడాలి. ఇక తొలి రౌండ్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ): స్మృతి మంధన(కెప్టెన్), సోఫీ డివైన్, హీథర్ నైట్, దిషా కసత్, ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోబన, రేణుకా ఠాకూర్ సింగ్, ప్రీతి బోస్ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ): షఫాలీ వర్మ, మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), మరిజాన్ కప్, జెమీమా రోడ్రిగెస్, అలైస్ క్యాప్సీ, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా (వికెట్‌కీపర్), అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శిఖా పాండే, తారా నోరిస్ -
వారెవ్వా హర్మన్.. ఎదురులేని ముంబై.. వరుసగా నాలుగో విజయం
UP Warriorz vs Mumbai Indians Women- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎనిమిది వికెట్లతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. ముంబైకిది వరుసగా నాలుగో విజయం. కాగా... టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. ఓపెనర్, కెప్టెన్ అలీసా హీలీ (46 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్), తాలియా మెక్‌గ్రాత్ (37 బంతుల్లో 50; 9 ఫోర్లు) రాణించారు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. యస్తిక భాటియా (27 బంతుల్లో 42; 8 ఫోర్లు, 1 సిక్స్), నట్ సీవర్ (31 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) యూపీ బౌలర్లను ధనాధన్ ఆటతో హడలెత్తించారు. సోమవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. చదవండి: Virat Kohli: ఏంటిది కోహ్లి?! పాపం భరత్.. మరీ ఇంత కోపమా? అదొక్కటే కనిపించిందా? వైరల్ Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! ఇక కోహ్లి సాధించాల్సింది అదొక్కటే Two teams ✅ Two captains 😎 Dramatic twists and turns 💥 One winner at the end of it 💪 The story of @mipaltan making it 4️⃣ in 4️⃣ 👌👌 #TATAWPL | #UPWvMI pic.twitter.com/ZVF1Gwqbxw — Women's Premier League (WPL) (@wplt20) March 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ హవా.. వరుసగా నాలుగో విజయం
కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ హవా.. వరుసగా నాలుగో విజయం వారియర్జ్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. యస్తిక భాటియా (42), నాట్ సీవర్ బ్రంట్ (45 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (53 నాటౌట్) మెరుపుల సహకారంతో 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. యస్తికా భాటియా మెరుపులు 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. యస్తికా భాటియా 19 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేయగా.. హేలీ మాథ్యూస్ 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసింది. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 40/0గా ఉంది. మెత్తంగా యూపీ వారియర్స్‌పై 8 వికెట్లు తేడా, 162 పరుగులతో యూపీ వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. రాణించిన హీలీ, మెక్‌గ్రాత్.. తిప్పేసిన ఇషాఖీ, కెర్ అలైసా హీలీ (58), తహీల మెక్‌గ్రాత్ (50) హాఫ్‌సెంచరీలతో రాణించడంతో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హీలీ, మెక్‌గ్రాత్ మినహా వారియర్జ్ ఇన్నింగ్స్‌లో అందరూ విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో సైకా ఇషాఖీ 3, అమేలియా కెర్ 2, హేలీ మాథ్యూస్ ఓ వికెట్ పడగొట్టారు. నిలకడగా ఆడుతున్న అలైసా హీలీ మెక్‌గ్రాత్ 58 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన యూపీ వారియర్జ్‌ను కెప్టెన్ అలైసా హీలీ (39), తహీల మెక్‌గ్రాత్ (38) ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత వారియర్జ్ స్కోర్ 113/2గా ఉంది, దేవిక (6)ను సైకా ఇషాఖీ.. కిరణ్ నవగరే (17)ను అమేలియా కెర్ ఔట్ చేశారు. హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హీలీ ముంబై బౌలర్ సైకా ఇషాఖీ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో యూపీ వారియర్జ్ సారధి అలైసా హీలీ హ్యాట్రిక్ ఫోర్లు సహా మొత్తం 4 బౌండరీలు బాదింది. ఫలితంగా వారియర్జ్ స్కోర్ 5 ఓవర్ల తర్వాత 39/1గా ఉంది. హీలీ (23), కిరణ్ నవగిరే (6) క్రీజ్‌ల ఉన్నారు. అంతకుముందు రెండో ఓవర్ ఆఖరి బంతికి సైకా ఇషాఖీ.. దేవిక వైద్య (6) ఎల్బీడబ్ల్యూ చేసింది. మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ జట్లు ఇవాళ (మార్చి 12) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. యూపీ వారియర్జ్ టీమ్‌లో హ్యారిస్ స్థానంలో ఇస్మాయిల్ బరిలోకి దిగనుండగా.. ముంబై జట్టు పూజా స్థానంలో ధారాను బరిలోకి దించుతుంది. పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలుపొందిన ముంబై టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), యూపీ వారియర్జ్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), గుజరాత్ జెయింట్స్ (4 మ్యాచ్‌ల్లో ఓ విజయం), ఆర్సీబీ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుస స్థానాల్లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా (వికెట్‌కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, హర్మన్ప్రీతి కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కెర్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమైరా ఖాజీ, జింటిమని కలిత, సైకా ఇషాఖీ యూపీ వారియర్జ్: దేవిక వైద్య, అలైసా హీలీ (కెప్టెన్/వికెట్‌కీపర్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవగిరే, తహీలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలీ శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్ -
WPL 2023: చెలరేగిన మరిజన్, షఫాలీ.. ఢిల్లీ చేతిలో గుజరాత్ చిత్తు
Gujarat Giants vs Delhi Capitals Women- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అసాధారణ విజయం సాధించింది. బౌలింగ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజన్ కాప్ (5/15), బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (28 బంతుల్లో 76 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగారు. దీంతో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్లో కిమ్ గార్త్ (37 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. హర్లీన్ డియోల్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు), జార్జియా వేర్హామ్ (25 బంతుల్లో 22; 2 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. ఢిల్లీ మీడియం పేసర్ మరిజన్ (4–0–15–5) బెంబేలెత్తించింది. శిఖాపాండేకు 3 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లోని తొలి 4 వికెట్లను మరిజనే పడగొట్టింది. దీంతో 28 పరుగులకే గుజరాత్ 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా కేవలం 7.1 ఓవర్లలో 107 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షఫాలీ, కెప్టెన్ మెగ్ లానింగ్ (15 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన ఓపెనింగ్ భాగస్వామ్యంతో జట్టుకు అలవోక విజయం అందించారు. గార్డ్నెర్ వేసిన 4వ ఓవర్లో షఫాలీ, లానింగ్ కలిసి 4, 4, 6, 1, 4, 4లతో 23 పరుగులు రాబట్టడం విశేషం. షఫాలీ 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. డబ్ల్యూపీఎల్‌లో నేడు ముంబై ్ఠ Vs యూపీ వారియర్స్ రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
'బ్యాటర్‌గా విఫలం.. ఓటములకు పూర్తి బాధ్యత నాదే'
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీ ఓటమిపాలైంది. శుక్రవారం యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటములకు పూర్తి బాధ్యత తానే వహిస్తున్నట్లు ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొంది. మ్యాచ్ ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన స్మృతి మంధాన.. ''గత నాలుగు మ్యాచ్‌లుగా ఇదే జరుగుతుంది. ప్రతీ మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించినప్పటికి.. ఆ తర్వాత వికెట్లు కోల్పోతున్నాం. ఇది మ్యాచ్‌లపై ప్రభావం చూపిస్తోంది. మా గేమ్ ప్లాన్ సరిగా లేకపోవడంతోనే వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాం. ఈ ఓటములకు పూర్తి బాధ్యత నాదే. ఒక బ్యాటర్‌గా నేను పూర్తిగా ఫెయిలవుతున్నా. టాపార్డర్ బ్యాటింగ్ మెరుగుపడాల్సి ఉంది. ఓటములతో గడిచిన వారం మాకు కఠినంగా అనిపించింది. నా ఫ్యామిలీ ఎప్పుడు నాకు సపోర్ట్‌గా ఉంటుంది.. కానీ నా నమ్మకం ఏంటంటే ఒక్కరమే ఒంటరిగా కూర్చొని ఓటమికి గల కారణాలను వెతికి సరిచేసుకోవడమే'' అని చెప్పుకొచ్చింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వుమెన్స్ 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఎలిస్ పెర్రీ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సోఫి డివైన్ 36 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో ఎసెల్‌స్టోన్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ 13 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ అలిసా హేలీ (47 బంతుల్లో 96 నాటౌట్, 18 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుపులు మెరిపించగా.. దేవికా వైద్య 36 పరుగులతో సహకరించింది. Stay strong, captain! Let’s turn it around. 🙌#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2023 pic.twitter.com/LRvv9pXaAi — Royal Challengers Bangalore (@RCBTweets) March 10, 2023 చదవండి: Cristiano Ronaldo: ఇదే తగ్గించుకుంటే మంచిది.. 41 బంతుల్లోనే శతకం.. అతిపెద్ద టార్గెట్‌ను చేధించి ప్లేఆఫ్స్‌కు -
WPL 2023: ఆర్సీబీపై యూపీ వారియర్స్ ఘన విజయం.. వికెట్ నష్టపోకుండా
► 139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ అద్భుత బ్యాటింగ్ లైనప్‌తో సత్తా చాటింది. ఓపెనర్లు హీలీ (47 బంతుల్లో 96, 4x18, 6x1), వైద్య (31 బంతుల్లో 36, 4x5), రాణించడంతో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ► యూపీ వారియర్స్ వికెట్ నష్టపోకుండా విజయం దిశగా దూసుకెళ్తోంది. 11 ఓవర్లు ముగిసే సమయానికి 115 పరుగులు చేసింది. క్రీజులో వైద్య (29), హీలీ (79) పరుగులతో ఉన్నారు. మరో 24 పరుగులు చేస్తే యూపీ వారియర్స్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ►139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్.. 7 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. క్రీజులో వైద్య(17), హీలీ(48) పరుగులతో ఉన్నారు. 3 ఓవర్లకు యూపీ స్కోర్: 32/0 139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్.. 3 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో వైద్య(13) హీలీ(19) పరుగులతో ఉన్నారు. 4 వికెట్లతో చెలరేగిన ఎక్లెస్టోన్.. 138 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. 138 పరుగులకే ఆలౌటైంది. యూపీ వారియర్స్ స్పిన్నర్ సోఫి ఎక్లెస్టోన్ నాలుగు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు దీప్తిశర్మ 3 వికెట్లతో చెలరేగింది. ఇక బెంగళూరు బ్యాటర్లలో ఎల్లీస్ పెర్రీ(52), సోఫీ డివైన్(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ►15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో పెర్రీ(37), రిచా ఘోష్ ఉన్నారు. ►11 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో పెర్రీ(37), నైట్ ఉన్నారు. ►6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసింది. క్రీజులో సోఫి డివైన్(33), పెర్రీ(22) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 29 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ మంధాన.. రాజేశ్వరీ గైక్వాడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. క్రీజులో పెర్రీ, డివైన్ ఉన్నారు. ►3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 29 పరుగులు చేసింది. క్రీజులో సోఫి డివైన్(25), మంధాన(4) పరుగులతో ఉన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ తో కీలక మ్యాచ్‌లో తలపడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్దమైంది. వరుసగా మూడు పరాజయాలను చవిచూసిన ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన(కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్(వికెట్ కీపర్), ఎరిన్ బర్న్స్, శ్రేయంక పాటిల్, కనికా అహుజా, సహానా పవార్, కోమల్ జంజాద్, రేణుకా ఠాకూర్ సింగ్ యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, దేవిక వైద్య, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్ చదవండి: IND vs AUS: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ.. పరువు పోగట్టుకున్న రోహిత్, జడ్డూ! వీడియో వైరల్ -
హ్యాట్రిక్ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ వుమెన్
హ్యాట్రిక్ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ వుమెన్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ వుమెన్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. యస్తికా బాటియా 41, హేలీ మాథ్యూస్ 32 పరుగులతో రాణించారు. ఇక నట్‌సివర్ బ్రంట్ 23 నాటౌట్, హర్మన్ 11 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 105 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. జెమీమా రోడ్రిగ్స్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో సైకా ఇషాకీ, ఇసీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలో మూడు వికెట్లు తీయగా.. పూజా వస్త్రాకర్ ఒక వికెట్ పడగొట్టింది. తొలి వికెట్ డౌన్.. విజయం దిశగా ముంబై ఇండియన్స్ 106 పరుగుల స్వల్ప చేధనలో భాగంగా ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులతో దాటిగా ఆడుతున్న యస్తికా బాటియా తారా నోరిస్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. ప్రస్తుతం ముంబై వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ 22 పరుగులతో ఆడుతుంది. దూకుడు ప్రదర్శిస్తున్న ముంబై.. 4 ఓవర్లలో 33/0 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ దూకుడు ప్రదర్శిస్తుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. యస్తికా బాటియా 14, హేలీ మాథ్యూస్ 17 పరుగులతో ఆడుతున్నారు. 105 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 105 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. జెమీమా రోడ్రిగ్స్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో సైకా ఇషాకీ, ఇసీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలో మూడు వికెట్లు తీయగా.. పూజా వస్త్రాకర్ ఒక వికెట్ పడగొట్టింది. కుప్పకూలిన ఢిల్లీ ఇన్నింగ్స్.. 85 పరుగులకే ఏడు వికెట్లు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ఆటతీరు కనబరుస్తుంది. 87 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. 4 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 18/1 4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 10 పరుగులు, కాప్సీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. షఫాలీ వర్మ క్లీన్‌బౌల్డ్.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 2 పరుగులు చేసిన షఫాలీ వర్మ సయికా ఇషాకీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగింది. 2 ఓవర్లలో జట్టు స్కోరు వికెట్ నష్టానికి 8 పరుగులుగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వుమెన్, ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఇరుజట్లు తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ సహా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఇరుజట్ల మధ్య టఫ్‌ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మారిజాన్ కాప్, జెమిమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా(వికెట్ కీపర్), మిన్ను మణి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్ ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI): హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్ -
గుజరాత్ కెప్టెన్ స్థానంలో సౌతాఫ్రికా ఓపెనర్
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్ (2023) తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ జెయింట్స్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఆసీస్ స్టార్ ప్లేయర్/వికెట్‌కీపర్ బెత్ మూనీ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడి, ఆతర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లకు (యూపీ వారియర్జ్, ఆర్సీబీ)దూరంగా ఉంది. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో మూనీ సీజన్ మొత్తానికే దూరమైంది. దీంతో ఆమె స్థానాన్ని సౌతాఫ్రికా ఓపెనర్ లారా వొల్వార్ట్తో భర్తీ చేసింది యాజమాన్యం. జెయింట్స్ మూనీని బేస్ ధర 30 లక్షలకు సొంతం చేసుకుంది. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడేందుకు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న వొల్వార్ట్.. మార్చి 11 ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉంటుందని సమాచారం. ప్రస్తుతానికి మూనీ గైర్హాజరీలో కెప్టెన్‌గా స్నేహ్ రాణా, వికెట్‌కీపర్‌గా సుష్మా వర్మ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మూనీని వేలంలో గుజరాత్ జెయింట్స్ 2 కోట్లు వెచ్చించి దక్కించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు గాయపడిన ఆల్‌రౌండర్ లక్ష్మీ యాదవ్ స్థానంలో శివాలి షిండేను భర్తీ చేసుకుంది యూపీ వారియర్జ్ యాజమాన్యం. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన 26 ఏళ్ల శివాలి.. మహారాష్ట్ర, ఇండియా ఏ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. మార్చి 9 నాటికి డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టిక ఇలా ఉంది.. -
డబ్ల్యూపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్ క్రికెటర్..
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా తొలి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదైంది. గుజరాత్ జెయింట్స్ బ్యాటర్.. ఇంగ్లండ్ ప్లేయర్ సోఫియా డంక్లీ 18 బంతుల్లోనే అర్థశతకం మార్క్‌ను అందుకుంది. బుధవారం ఆర్సీబీతో మ్యాచ్‌లో డంక్లీ ఈ ఫీట్ అందుకుంది. తద్వారా డబ్ల్యూపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా డంక్లీ రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా 28 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 65 పరుగులతో విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా రేణుకా ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టిన డంక్లీ.. ప్రీతిబోస్ వేసిన ఐదో ఓవర్లో విశ్వరూపం చూపించింది. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు పిండుకొని అర్థసెంచరీ మార్క్‌ను అందుకుంది. ఇక మహిళల టి20 క్రికెట్లో అత్యంత వేగంగా ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలిచింది. ఇక సోఫియా డంక్లీ ఇంగ్లండ్ తరపున 44 టి20ల్లో 652 పరుగులు, 28 మ్యాచ్‌ల్లో 746 పరుగులు, మూడు టెస్టుల్లో 152 పరుగులు చేసింది. -
గుజరాత్‌కు తొలి గెలుపు.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి
గుజరాత్‌కు తొలి గెలుపు.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి ఆర్సీబీ ఆటతీరు మారడం లేదు. వరుసగా మూడో ఓటమితో లీగ్‌లో హ్యాట్రిక్ నమోదు చేసింది. 202 పరుగల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సోఫీ డివైన్ 45 బంతుల్లో 66 పరుగులు, హెథర్‌నైట్ 11 బంతుల్లో 30 పరుగులు నాటౌట్ రాణించినప్పటికి చేయాల్సిన స్కోరు ఎక్కువగా ఉండడం.. మిగతావారు విఫలం కావడంతో ఆర్సీబీకి ఓటమి ఎదురైంది. గుజరత్ బౌలర్లలో అష్లే గార్డనర్ మూడు వికెట్లు తీయగా.. అన్నాబెల్ సదర్లాండ్ రెండు, మాన్సీ జోషీ ఒక వికెట్ తీశారు. అంతకముందు గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సోఫియా డంక్లీ(28 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసానికి తోడుగా హర్లిన్ డియోల్(45 బంతుల్లో 67 పరుగులు) మెరుపులు మెరిపించింది. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హెథర్‌నైట్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. 14 ఓవర్లలో ఆర్సీబీ 118/2 14 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 51 పరుగులతో, రిచా ఘోష్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 24, సోఫీ డివైన్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లలో ఆర్సీబీ 74/1 9 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 16, సోఫీ డివైన్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ స్మృతి మంధాన(18) రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. అష్లే గార్డనర్ బౌలింగ్‌లో మాన్సీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. టార్గెట్ 202.. ధీటుగా బదులిస్తున్న ఆర్సీబీ 202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ ధాటిగా ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసిది. సోఫీ డివైన్ 18 బంతుల్లో 31, మంధాన 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. దంచికొట్టిన గుజరాత్.. ఆర్సీబీ టార్గెట్ 202 ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సోఫియా డంక్లీ(28 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసానికి తోడుగా హర్లిన్ డియోల్(45 బంతుల్లో 67 పరుగులు) మెరుపులు మెరిపించింది. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో శ్రేయాంక్ పాటిల్ బౌలింగ్ బాగా వేయడంతో గుజరాత్ స్కోరు కాస్త తగ్గింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హెథర్‌నైట్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. దంచికొడుతున్న గుజరాత్.. 14 ఓవర్లలో 136/3 ఆర్సీబీ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 14 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. హర్లిన్ డియోల్ 42, దయాలన్ హేమలత ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. 18 బంతుల్లోనే అర్థశతకం.. గుజరాత్ జెయింట్స్ ఓపెనర్ డంక్లీ 18 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకుంది. ప్రీతీ బోస్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో డంక్లీ వీరవిహారం చేసింది. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు పిండుకున్న డంక్లీ 18 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గుజరాత్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. డంక్లీ 54, హర్లీన్ డియోల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ ఆర్సీబీ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన సబ్బినేని మేఘన స్కౌట్ బౌలింగ్‌లో రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం గుజరాత్ మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బుధవారం ఆర్సీబీ వుమెన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. కాగా సీజన్లో ఇప్పటివరకు ఇరుజట్లు తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యి పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండు జట్లలో ఏ జట్టు భోణీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరుజట్లలో గుజరాత్ జెయింట్స్ కాస్త ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ బెత్ మూనీ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లో కూడా స్నేహ్ రాణానే కెప్టెన్‌గా గుజరాత్‌ను నడిపించనుంది. ఆర్సీబీ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూనమ్ ఖేమ్నార్, కనికా అహుజా, శ్రేయాంక పాటిల్, మేగాన్ షుట్, రేణుకా ఠాకూర్ సింగ్, ప్రీతి బోస్ గుజరాత్ జెయింట్స్(ప్లేయింగ్ XI): స్నేహ్ రాణా(కెప్టెన్) సబ్బినేని మేఘన, సోఫియా డంక్లీ, హర్లీన్ డియోల్, అన్నాబెల్ సదర్లాండ్, సుష్మా వర్మ(వికెట్ కీపర్), అష్లీగ్ గార్డనర్, దయాళన్ హేమలత, కిమ్ గార్త్, మాన్సీ జోషి, తనూజా కన్వర్ -
RCB: సప్తవర్ణశోభితం.. హోలీ వేడుకల్లో స్మృతి సేన! శాశ్వతంగా ఉండిపోదు కదా!
WPL 2023 RCB- Holi 2023: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా క్రికెటర్లు రంగుల్లో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగు చల్లుకుంటూ హోలీ పండుగను సంబరంగా జరుపుకొన్నారు. కెప్టెన్ స్మృతి మంధాన సహా విదేశీ ప్లేయర్లు ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, హీథర్ నైట్ ఈ వేడుకల్లో భాగమయ్యారు. శాశ్వతంగా ఉండిపోతుందా? తమ ప్లేయర్లంతా సప్తవర్ణశోభితమై ఉన్న ఫొటోలను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆసీస్ క్రికెటర్ ఎలిస్ పెర్రీ.. ‘‘ఇప్పటికే రెండుసార్లు హెయిర్ వాష్ చేశా! ఒకవేళ ఈ రంగు శాశ్వతంగా ఉండిపోదు కదా!’’ అంటూ గులాల్‌తో నిండిపోయిన జుట్టుతో ఉన్న ఫొటోను షేర్ చేసి సరదాగా కామెంట్ చేసింది. రెండింటిలోనూ ఓటమి బీసీసీఐ తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్సీబీ ఫ్రాంఛైజీ జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు లీగ్‌లోనే అత్యధికంగా 3.4 కోట్ల రూపాయల భారీ ధర చెల్లించి ఆమెను కొనుగోలు చేసింది. ఇక స్మృతిని కెప్టెన్‌గా నియమించిన ఆర్సీబీ.. టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాను తమ మెంటార్‌గా నియమించి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఆర్సీబీ ఓడిపోవడం గమనార్హం. ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 60 పరుగులు, రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బుధవారం (మార్చి 8) గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో గెలిచి విజయ ప్రస్థానాన్ని ఆరంభించాలని పట్టుదలగా ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు స్మృతి మంధాన (కెప్టెన్), రేణుకా సింగ్, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దీక్షా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా షిబానా, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెనార్, మేగన్ షట్, సహానా పవార్. చదవండి: Saeed Anwar-PM Modi: ప్రధాని మోదీపై పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. Ind Vs Aus: నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న టీమిండియా.. యువ బ్యాటర్‌పై ద్రవిడ్ ప్రత్యేక శ్రద్ధ -
WPL 2023: క్రికెట్.. బిర్యానీ.. అంతే..!: విశాఖ క్రికెటర్ షబ్నమ్
WPL 2023- Shabnam- Gujarat Giants: ఎనిమిదేళ్ళవయసులో సరదాగా తండ్రితో గ్రౌండ్‌కు వెళ్ళేది. అక్కడ కొంతమంది అమ్మాయిలు క్రికెట్ ఆడుతుంటే ఎంతో ఆసక్తిగా చూసేది. ఓ రోజు తనకూ క్రికెట్ ఆడాలనివుందనే అభిలాషను వ్యక్తపరిచింది. తల్లిదండ్రులుప్రోత్సహించడంతో క్రికెట్ బాల్ అందుకుంది. నేడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ తరపున ఉమెన్ ప్రీమియర్ లీగ్ స్థాయికి ఎదిగిపోయింది. ఇటీవల అండర్19 టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ సొంతం చేసుకున్న జట్టుకు ఆడింది. ఆరేళ్లలోనే తన మీడియం పేస్‌తో ప్రత్యర్థుల్ని బెంబెలెత్తించే స్థాయికి చేరుకుంది విశాఖ ఉమెన్ క్రికెటర్ షబ్నమ్ మహ్మాద్ షకీల్. ఆటే శ్వాసగా రాణిస్తున్న రైట్ ఆర్మ్ మీడియం పేసర్ షబ్నమ్ మహిళా దినోత్సవసందర్భంగా తన అంతరంగాన్ని సాక్షితో పంచుకుంది. క్రికెట్ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది... 2017లో క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేసవి శిబిరాల్లో పా ల్గొన్నాను. నాకు మొదట్నించీ బ్యాటింగ్ కంటే బౌలింగ్‌లోనే ఇష్టం ఉండేది. రెండేళ్ళలో మీడియం పేసర్‌గా ఎదిగాను. పేస్‌లో వేరియేషన్స్‌తో బంతులు విసురుతుండటంతో అండర్ 16 జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అనతికాలంలోనే ఆంధ్రజట్టుకు ఆడాను. రైల్వేస్ జట్టుతో ప్రాక్టీస్‌లో నెట్‌బౌలర్‌గా సీనియర్స్‌తో ఎలా ఆడాలో నేర్చుకున్నాను. అనంతరం ఏకంగా ఉమెన్ అండర్ 19 వరల్డ్‌కప్, జాతీయ జట్టుకు ఎంపికయ్యాను. ప్రస్తుతం ఉమెన్ ఐపీఎల్లో గుజరాత్ జెయింట్స్‌కు ఆడుతున్నాను. చదువెలా సాగుతోంది... పదో తరగతి చదువుతున్నాను. ఏప్రిల్‌లో పరీక్షలున్నాయి. ఉమెన్ ఐపీఎల్ పూర్తికాగానే పరీక్షలు రాస్తాను. మా టీచర్లు ఓ ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేశారు. సబ్జెక్ట్ డౌట్స్ వివరిస్తుంటారు. ప్రాక్టీస్, పా ఠాలు ఏకకాలంలో సాగుతున్నాయి. ప్రస్తుతం ఉమెన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ తరపున ఆడుతూ ముంబయ్‌లో ఉన్నాను. ఇటీవలే అండర్ 19 ఉమెన్ వరల్డ్ కప్‌లోనూ ఆడాను. ప్రస్తుత లక్ష్యం... సీనియర్ ఉమెన్ జట్టులో ఇండియా తరపున ఆడటమే నా లక్ష్యం. అండర్–19 వరల్డ్‌కప్‌కు ఆడిన జట్లలో నేనే చిన్నదానిని. ఇప్పుడు ప్రీమియర్ లీగ్‌లోనూ చిన్న దాన్ని. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమెన్ ఐపీఎల్‌కు ఎంపికైన తొలి క్రికెటర్‌ను. పదినేహేళ్ల ప్రాయంలోనే ఇది సాధ్యపడటం చాలా సంతోషాన్నిచ్చింది. జూనియర్ వుమెన్ టీ20 వరల్డ్‌కప్‌లో... జూనియర్స్ వరల్డ్‌కప్ ఆడుతున్నప్పుడు, సీనియర్ల నుంచి చాలా సలహాలు తీసుకున్నాను. కోచ్‌లు నీనియర్ సభ్యులు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని, అప్పుడే ఎక్స్పోజర్ వస్తుందని సూచించారు. ముందు మన బలహీనతలు తెలుసుకుని, వాటి ని అధిగమించాలని కూడా చె΄్పారు. అందుకు తగినట్టు గానే మ్యాచ్‌ల్లో సీనియర్స్‌ను జాగ్రత్తగా గమనిస్తున్నాను. అందరిలోకి చిన్నదాన్ని కావడంతో ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారు. ఇన్స్పిరేషన్ ఎవరు... జులన్ గోస్వామి ఆట తీరును జాగ్రత్తగా గమనిస్తుంటాను. ఫాస్ట్ బౌలింగ్‌లో ఆమె నా స్ఫూర్తి. ఏ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారు? యూనిఫామ్ వేనుకునే జాబ్ చేయాలనేది నా ఆకాంక్ష. దేశం పట్ల నాకు చాలా గౌరవం. డిఫెన్స్, పోలీస్ లాంటి రంగాల్లో పని చేయాలని ఉంది. మీ హాబీలేంటి? నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటేనే ఇష్టం ఏర్పడటంతో మిగిలిన విషయాల పట్ల పెద్దగా ఆసక్తి కలగలేదు. అందుకే హాలిడే ఎంజాయ్ చేయాలని, ఏవైనా కొత్త ప్రదేశాలకు వెళ్లాలనే ఆలోచన కూడా రాలేదు. నాన్న షకీల్ తన జట్టుకు ఆడుతుంటే సరదాగా చెల్లెలు షాజహానాతో కలిసి కామెంటరీ చెప్పేదాన్ని. అలా సరదాగా ప్రారంభమైన నా క్రికెట్ కెరీర్ నేడు ప్రీమియర్ లీగ్, జూనియర్ వరల్డ్ కప్ ఆడేస్థాయికి చేరింది. మ్యాచ్‌లలో భాగంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళాను తప్ప ప్రదేశాలను చూడడం కోసం ఎక్కడికీ వెళ్లలేదు. ఏ రంగు ఇష్టం? నీలం రంగు అంటే ఇష్టం. లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటూ ఉంటాను. ఇక బాగా ఇష్టమైనది నిద్ర. ఖాళీ దొరికితే ఎక్కువగా పడుకుంటాను. సరదాగా మ్యాచ్‌లు చూసే స్థాయి నుంచి సీరియస్‌గా మ్యాచ్‌లాడే స్థాయికి ఎదగడంతో తీరిక అనేది ఉండటం లేదు. ఈ నెల 27న తిరిగి విశాఖ చేరుకోగానే పరీక్షలపై దృష్టి పెట్టాలి. చెస్, బ్యాడ్మింటన్ సరదాగా ఆడుతుంటాను. డైట్ ఎలా? నాకు బిరియానీ అంటే ఇష్టం. అమ్మ రాత్రికి పుల్కాల్లో రకరకాల వంటలు చేస్తుంది. డైట్ పట్ల చాలా శ్రద్ధ వహిస్తాను. ఆహారసూచనలను పా టిస్తాను. డ్రైప్రూట్స్ ఎక్కువగా తీసుకుంటాను. స్వీట్స్ జోలికి వెళ్ళను. ఎలాంటి సినిమాలిష్టం? సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పటివరకు ఆట, చదువే నా లోకం. కానీ ఆటల మీద వచ్చిన సినిమాల్ని చూస్తాను. ఉదయాన్నే ఐదుగంటల కల్లా ప్రాక్టీస్ చేసుకోవడానికి గ్రౌండ్‌కు వెళ్తాను. కోచ్‌లు చెప్పిన వాటిని తూచ తప్పకుండా ఆచరించడం. వీలు దొరికినప్పుడల్లా సబ్జెక్ట్ బుక్స్ ముందేసుకు కూర్చోవడమే ప్రస్తుత నా దినచర్య. – డాక్టర్ ఎ. సూర్యప్రకాశరావు మాడిమి, విశాఖపట్నం -
ఆసీస్ క్రికెటర్ కోరికను తీర్చిన హర్షా బోగ్లే
హర్షా బోగ్లే.. పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్ కామెంటేటరీకి పెట్టింది పేరు.. తన వాక్చాతుర్యంతో అభిమానులను కట్టిపడేయడం అతని స్పెషాలిటీ. తాజాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో హర్షా బోగ్లే కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ గ్రేస్ హారిస్ కోరికను హర్షా బోగ్లే నెరవేర్చాడు. మరి గ్రేస్ హారిస్ కోరిక ఏంటి.. ఆ కథేంటి అనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి. ఆర్సీబీతో తొలి మ్యాచ్ ముగిసిన అనంతరం గ్రేస్ హారిస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. తాను బర్గర్‌ను చాలా మిస్సవుతున్నానని పేర్కొంది. గ్రేస్ హారిస్ మాటలు విన్నాడో ఏమో తెలియదు కానీ హర్షా బోగ్లే ఇవాళ ఆమెను సర్ప్రైజ్ చేశాడు. ఇవాళ(మార్చి 7న) యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు గ్రేస్ హారిస్ బెంచ్‌కే పరిమితమైంది. మ్యాచ్ మధ్యలో హర్షా బోగ్లే గ్రేస్ హారిస్ వద్దకు వచ్చి నీకిష్టమైన వస్తువు నా దగ్గర ఉంది.. ఇది నీకే అంటూ బర్గర్‌ను ఆమె చేతిలో పెట్టాడు. దీంతో నవ్వులో మునిగి తేలిన గ్రేస్ హారిస్ సంతోషంగా స్వీకరించి హర్షా బోగ్లేకు కృతజ్క్షతలు తెలిపింది. Grace Harris mentioned her craving for a burger during the press conference in the last match, and Harsha surprised her with one today. Looks like she has become everyone's favorite now. 🤣❤ pic.twitter.com/GDGV1gZvQu— Shivani Shukla (@iShivani_Shukla) March 7, 2023 -
స్టన్నింగ్ క్యాచ్.. క్యాచ్ ఆఫ్ సీజన్ అయ్యే అవకాశం!
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రాధా యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో ఆమె ఈ ఫీట్ నమోదు చేసింది. యూపీ వారియర్జ్ ఇన్నింగ్స్ సమయంలో 11వ ఓవర్ శిఖా పాండే వేసింది. ఓవర్ తొలి బంతిని దీప్తి శర్మ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడింది. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న రాధా యాదవ్ ముందుకు పరిగెత్తుకొచ్చి డైవ్ చేస్తూ లో క్యాచ్ తీసుకుంది. దెబ్బకు దీప్తి శర్మ మొహం మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్జ్ ముంగిట 212 పరుగుల భారీ టార్గెట్‌ను విధించింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో జెస్ జాన్సెన్ 20 బంతుల్లో 42 నాటౌట్, జెమీమా రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 నాటౌట్ విధ్వంసం సృష్టించడడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎస్సెల్స్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్ తీశారు. Catch of the WPL: Radha Yadav. pic.twitter.com/RTGoONifYT — Johns. (@CricCrazyJohns) March 7, 2023 చదవండి: Rahul Dravid: డబ్ల్యూటీసీ వల్లే ఇదంతా.. -
తాహిలా మెక్‌గ్రాత్ పోరాటం వృథా.. యూపీ వారియర్జ్ ఓటమి
తాహిలా మెక్‌గ్రాత్ పోరాటం వృథా.. యూపీ వారియర్జ్ ఓటమి వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 42 పరుగులతో విజయం సాధించింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. తాహిలా మెక్‌గ్రాత్ (50 బంతుల్లో 90 పరుగులు నాటౌట్, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాటం వృథా అయినా ఆకట్టుకుంది. ఆమె మినహా మిగతావారు విఫలమయ్యారు. జెస్ జొనాన్సెన్ మూడు వికెట్లు తీసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో జెస్ జాన్సెన్ 20 బంతుల్లో 42 నాటౌట్, జెమీమా రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 నాటౌట్ విధ్వంసం సృష్టించారు. 16 ఓవర్లలో యూపీ వారియర్జ్ 113/4 16 ఓవర్లు ముగిసేసరికి యూపీ వారియర్జ్ నాలుగు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. మెక్‌గ్రాత్ 47 పరుగులు, వైద్య 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి 24 బంతుల్లో 99 పరుగులు కావాలి. 12 ఓవర్లలో యూపీ వారియర్జ్ 84/4 12 ఓవర్లు ముగిసేసరికి యూపీ వారియర్జ్ నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. మెక్‌గ్రాత్ 34 పరుగులు, వైద్య 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 12 పరుగులు చేసిన దీప్తి శర్మ రాధా యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగింది. 8 ఓవర్లలో యూపీ వారియర్జ్ స్కోరు 51/3 8 ఓవర్ల ఆట ముగిసేసరికి యూపీ వారియర్జ్ మూడు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. తాహిలా మెక్‌గ్రాత్ 11, దీప్తి శర్మ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి 72 బంతుల్లో 161 పరుగులు కావాలి. ► 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన యూపీ వారియర్జ్ కష్టాల్లో పడింది. క్యాప్స్ బౌలింగ్‌లో సెహ్రావత్(1 పరుగు) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన యూపీ వారియర్జ్ 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ధాటిగా ఆడుతున్న కెప్టెన్ అలిసా హేలీ(24 పరుగులు) జాన్సెన్ బౌలింగ్‌లో రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత గతమ్యాచ్ హీరో కిరణ్ నావగిరే 2 పరుగులు చేసి జాన్సెన్ బౌలింగ్‌లోనే వెనుదిరిగింది. ప్రస్తుతం యూపీ వారియర్జ్ రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్ టార్గెట్ 212 వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్.. యూపీ వారియర్జ్ ముంగిట 212 పరుగుల భారీ టార్గెట్‌ను విధించింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో జెస్ జాన్సెన్ 20 బంతుల్లో 42 నాటౌట్, జెమీమా రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 నాటౌట్ విధ్వంసం సృష్టించడడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎస్సెల్స్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్ తీశారు. భారీ స్కోరుగా దిశగా ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 14 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసిది. అలిస్ క్యాప్సీ 21, జెమీమా రోడ్రిగ్స్ 10 పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 16 పరుగులు చేసిన కాప్ వెనుదిరగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 55 పరుగులతో ఆడుతుంది. 9 ఓవర్లలో 87/1 9 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 53 పరుగులు, కాప్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఒపెనర్ షఫాలీ వర్మ 17 పరుగుల వద్ద మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. 3 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 18/0 మూడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 15, షఫాలీ వర్మ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న యూపీ వారియర్జ్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. తాము ఆడిన తొలి మ్యాచ్‌లో విజయాలు సాధించిన ఇరుజట్లు తొలిసారి తలపడనున్నాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్స్ బౌలింగ్ ఏంచుకుంది. అయితే మ్యాచ్‌లో మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఫెవరెట్‌గా కనిపిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీని ఓడించడం యూపీ వారియర్జ్‌కు సవాలే. అయితే యూపీ వారియర్జ్ కూడా బలంగానే కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్(ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మారిజానే కాప్, జెమిమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా(వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్ యూపీ వారియర్జ్ (ప్లేయింగ్ XI): అలిస్సా హీలీ(వికెట్ కీపర్, కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్ -
వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసమేల?!
International Women's Day- BCCI- IPL 2023:భారత క్రికెట్ నియంత్రణ మండలి గత ఆర్నెళ్ల కాలంలో రెండు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. లింగ వివక్షను రూపుమాపే క్రమంలో సరికొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టింది. మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు గొప్ప ముందడుగు వేసింది. అందులో మొదటిది.. మ్యాచ్ ఫీజులు.. అవును.. పురుషుల క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే ఫీజులు అసలు లెక్కలోకే రావు! దీంతో మిగతా రంగాల మాదిరే క్రికెట్లోనూ అమ్మాయిల పట్ల ఉన్న వివక్షను తొలగించాలని.. మ్యాచ్ ఫీజుల విషయంలో ఉన్న అంతరాన్ని తొలగించాలంటూ డిమాండ్లు వినిపించాయి. ఇందుకు అనుగుణంగా గతేడాది అక్టోబరులో బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. ఇక నుంచి భారత మహిళల జట్టు కాంట్రాక్ట్ క్రికెటర్లకు కూడా పురుషుల జట్టుతో సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లిస్తామని అక్టోబరు 27న బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు బోర్డు తెలిపింది. మహిళా క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకువెళ్లేలా.. క్రికెటర్లుగా ఎదగాలని కోరుకునే అమ్మాయిల ఆశలకు ఊపిరిలూదుతూ బీసీసీఐ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చిన రోజును ‘రెడ్ లెటర్ డే’గా అభివర్ణిస్తూ హర్షం వ్యక్తమైంది. సచిన్ టెండుల్కర్, మిథాలీ రాజ్ వంటి దిగ్గజాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ విషయంలోనూ తొలుత న్యూజిలాండే! మహిళా క్రికెట్లో తొలి టీ20 లీగ్‌ను ప్రవేశపెట్టింది న్యూజిలాండ్. వుమెన్స్ సూపర్ స్మాష్ పేరిట 2007 నుంచి నేటికీ లీగ్‌ను కొనసాగిస్తోంది. తర్వాత వెస్టిండీస్ ట్వంటీ20 బ్లేజ్ పేరుతో 2012 నుంచి లీగ్‌ను నిర్వహిస్తోంది. ఇక ఆస్ట్రేలియా.. విజయవంతమైన బిగ్‌బాష్ లీగ్(పురుషులు)లో మహిళా క్రికెటర్లను భాగం చేసేందుకు 2015లో వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌ను ప్రవేశపెట్టింది. నాటి నుంచి నేటిదాకా ఈ టోర్నీ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌లో చార్లెట్ ఎడ్వర్డ్స్ కప్(2021 నుంచి), భారత్‌లో వుమెన్స్ టీ20 చాలెంజ్(2018-2022), వెస్టిండీస్‌లో ట్వంటీ20 బ్లేజ్(2012-), వుమెన్స్ కరేబియన్ లీగ్(2022-), జింబాబ్వేలో వుమెన్స్ టీ20(2020), పాకిస్తాన్లో పీసీబీ ట్రయాంగులర్ ట్వంటీ20(2020), సౌతాఫ్రికాలో వుమెన్స్ టీ20 సూపర్‌లీగ్(2019-), శ్రీలంకలో వుమెన్స్ సూపర్ ప్రొవెన్షియల్ టీ20 టోర్నమెంట్(2019-).. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మహిళా టీ20 లీగ్‌లు ఉన్నాయి. అయితే, ఇప్పటికే భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగెస్, పూజా వస్త్రాకర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ తదితరులు పేరెన్నికగన్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆడారు. ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్ అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుష టీ20లీగ్‌లను తలదన్నేలా క్యాష్ రిచ్ లీగ్‌ను రూపొందించిన.. బీసీసీఐ కాస్త ఆలస్యంగానైనా వుమెన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా (దేశీ, విదేశీ) ఎంతో మంది పురుష క్రికెటర్లకు లైఫ్‌నిచ్చిన ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్‌ను నిర్వహించేందుకు సమాయత్తమైంది. మార్చి 4, 2023న ముంబై ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ మ్యాచ్‌తో ఈ మహిళా ప్రీమియర్ లీగ్‌కు తెరలేచింది. ఇద్దరు భారత కెప్టెన్లు(హర్మన్‌ప్రీత్ కౌర్(ముంబై), స్మృతి మంధాన), ముగ్గురు విదేశీ కెప్టెన్లు(మెగ్ లానింగ్, బెత్‌మూనీ, అలిసా హేలీ) ఈ లీగ్‌లో ఆయా జట్లను ముందుకు నడిపిస్తున్నారు. హర్షణీయమే కానీ.. కోట్లలో తేడా అంటే దారుణం! తొలుత మ్యాచ్ ఫీజుల విషయం.. ఇప్పుడు ఇలా టీ20 లీగ్.. మరి నిజంగానే భారత్‌లో పురుష, మహిళా క్రికెటర్ల మధ్య అంతరాలు పూర్తిగా తొలగిపోయినట్లేనా? అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఫీజుల విషయంలో సమానత్వాన్ని అమలు చేసేందుకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం హర్షణీయమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిజానికి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్న రెండో బోర్డుగా బీసీసీఐ ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో కూడా వ్యత్యాసం కొనసాగుతున్న వేళ ఇలాంటి నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, కాంట్రాక్టుల విషయంలో ఇంకా ఆ వ్యత్యాసం అలాగే ఉండిపోవడం, ఈ అంశంపై బీసీసీఐ స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. చరిత్ర సృష్టించిన షఫాలీ సేన 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు.. ఇటీవలి ప్రపంచకప్‌లో సెమీస్ వరకు చేరింది. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన అండర్-19 మహిళా టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో ఏకంగా చాంపియన్‌గా నిలిచి చరిత్రకెక్కింది. యువ కెరటం షఫాలీ వర్మ సారథ్యంలో ఈ అద్భుతం జరిగింది. వాళ్లకు కోట్లు.. వీళ్లకు లక్షలు అయితే, బోర్డు ఇంతవరకు కాంట్రాక్ట్ మొత్తం విషయంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. పురుష క్రికెటర్లకు ఎ, బి, సి గ్రేడ్లలో వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటితో పాటు ‘ఎ’ ప్లస్ కేటగిరీలో రూ. 7 కోట్లు చెల్లించే బీసీసీఐ.. మహిళా క్రికెటర్లలో ‘ఎ’ గ్రేడ్‌కు రూ. 50 లక్షలు, ‘బి’, ‘సి’ గ్రేడ్లకు రూ. 30 లక్షలు, రూ. 10 లక్షలు మాత్రమే ఇస్తోంది. పురుషుల క్రికెట్‌కు ఉన్న ఆదరణ, స్పాన్సర్లు, ప్రేక్షకులు, రేటింగ్‌లు, బ్రాండ్ వాల్యూ దృష్ట్యా వారికి అంతమొత్తం చెల్లిస్తున్నారన్న మాట కాదనలేని వాస్తవమే. ఆరు రెట్లు అధికం అయితే, ఇరువురి కాంట్రాక్టుల విషయంలో కోట్లల్లో వ్యత్యాసం ఉండటం మరీ దారుణం. ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐపై.. పురుషుల క్రికెట్ స్థాయికి చేరేలా మహిళా క్రికెట్‌ను మరింత ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. ఇక డబ్ల్యూపీఎల్ విషయానికొస్తే.. ఐదు జట్లలో అత్యధికంగా ముగ్గురు విదేశీ కెప్టెన్లే! వేలంలో అత్యధిక 3.40 కోట్ల రూపాయలు. ఐపీఎల్ వేలంలో 18 కోట్ల పైచిలుకు ధర పలికే ఆటగాళ్ల కంటే దాదాపు ఆరు రెట్లు తక్కువ. ఒకవేళ లీగ్ భారీగా సక్సెస్ అయితే.. ఈ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ.. కాంట్రాక్ట్ విషయంలో మాత్రం బోర్డు తలచుకుంటేనే మహిళా క్రికెటర్ల భవితవ్యం మారుతుంది. ఆట మీద ప్రేమతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వాళ్లు ఆర్థికంగా మరింత నిలదొక్కుకునే ఆస్కారం ఉంటుంది. కూతుళ్లను క్రికెటర్లు చేయాలనుకునే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు సైతం కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. ‘‘యా దేవి సర్వభూతేశు, శక్తి రూపేన సమస్థితా’’ అంటూ మహిళా శక్తిని చాటేలా గీతం రూపొందించిన బీసీసీఐ.. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఓ మ్యాచ్‌ను మైదానంలో ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించిన బోర్డు.. వచ్చే ఏడాది తిరిగేలోపు కాంట్రాక్టుల విషయంలో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షిద్దాం!! -సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్‌ను తెచ్చుకోనున్న ముంబై ఇండియన్స్ WPL 2023: రెండు ముంబై ఇండియన్స్ జట్లు.. రెండు వేర్వేరు ఆరంభాలు View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
MI Vs RCB: ఓటమికి ప్రధాన కారణం అదే.. అయినా: స్మృతి మంధాన
Same Results Memes Trolls On RCB: ‘‘మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. మెరుగైన స్కోరు నమోదు చేయాల్సింది. ఓటమిని అంగీకరించకతప్పదు. అయితే, కచ్చితంగా లోపాలు సరిదిద్దుకుని తిరిగి పుంజుకుంటాం. నిజానికి నాతో సహా ఇద్దరు- ముగ్గురు బ్యాటర్లు కనీసం 20 పరుగులు చేయగలిగారు. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాం. నిజం చెప్పాలంటే.. మా బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. 6-7 మంచి ఆప్షన్లు ఉన్నాయి. కానీ బ్యాటర్లు మెరుగైన స్కోరు నమోదు చేయనపుడు వారు మాత్రం ఏం చేయగలుగుతారు. కాబట్టి ఇందుకు వాళ్లను బాధ్యులను చేయడం సరికాదు. ఫ్రాంఛైజ్ క్రికెట్లో మనకు శుభారంభాలు లభించినా.. మ్యాచ్ గెలుస్తున్నామనిపించినా.. ఆఖరి నిమిషం వరకు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. అయితే, ఈ రోజు మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైన వేళ కనిక, శ్రియాంక బ్యాటింగ్ చేసిన తీరు మాకు అత్యంత సానుకూల అంశం. వాళ్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొంది. ముంబై ఇండియన్స్ వుమెన్‌తో పోరులో ఓటమికి బాధ్యత వహించిన స్మృతి.. బ్యాటర్ల వైఫల్యమే పరాజయానికి ప్రధాన కారణమని తెలిపింది. PC: RCB కాగా మహిళా ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన 23, వికెట్ కీపర్ రిచా ఘోష్ 28, లోయర్ ఆర్డర్లో కనికా అహుజా 22, శ్రియాంక పాటిల్ 23, మేగన్ షట్ 20 పరుగులు చేయగలిగారు. మిగిలిన వాళ్లు కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆర్సీబీ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి టార్గెట్ ఛేదించింది. ముంబై ఓపెనర్ హేలీ మాథ్యూస్ 77 పరుగులతో అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్ యస్తికా భాటియా 23 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ నటాలీ సీవర్- బ్రంట్ 55 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హేలీ మాథ్యూస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. ఇక వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడటంతో ఆర్సీబీపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇక ఆర్సీబీ రాత మారదని, కోహ్లి వారసత్వాన్ని స్మృతి కొనసాగిస్తుందంటూ మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్ ఇందుకు ధీటుగానే బదులిస్తున్నారు. కేవలం రెండు మ్యాచ్‌లతో అంచనా వేయొద్దని హితవు పలుకుతున్నారు. ఇక స్మృతి సేన మార్చి 8న గుజరాత్‌తో తదుపరి మ్యాచ్ ఆడనుంది. చదవండి: WPL 2023 GG Vs RCB: మహిళా దినోత్సవ కానుక.. బీసీసీఐ బంపరాఫర్.. అందరికీ ఉచిత ప్రవేశం! Shubman Gill: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గిల్.. సారా అలీఖాన్ కాదు! ఆమే నా క్రష్ అంటూ.. Every Year Same Story For RCB Fans And Meme Material For MI And CsK Fans pic.twitter.com/sgKFfQOqPt — Captain Jack Sparrow (@ImVivaan45) March 6, 2023 Virat Kohli Legacy is Followed By #SmritiMandhana🤣🤣 Haarcb ☕☕#RCBWvsMIW . #MIvsRCB . #WPL2023 pic.twitter.com/dBB11lv8GY — क्रिकेट प्रेमी (Cricket Premi) VK18 💓 (@cricaddicted18) March 6, 2023 -
WPL 2023 GG Vs RCB: స్పెషల్ డే.. ‘స్పెషల్ మ్యాచ్’.. అందరికి ఎంట్రీ ఫ్రీ
WPL 2023- International Women's Day 2023: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రికెట్ ప్రేమికులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బంపరాఫర్ ఇచ్చింది. వుమెన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా మార్చి 8 నాటి మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ టీమ్ మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. అందరికీ ఉచిత ప్రవేశం మహిళా దినోత్సవ కానుకగా ఈ ఆసక్తికర పోరును నేరుగా చూసేందుకు వీలు కల్పించారు నిర్వాహకులు. ఈ మేరకు.. ‘‘మహిళా దినోత్సవాన్ని మేము ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం. మార్చి 8, 2023న టాటా డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్ వీక్షించేందుకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ముంబై- ఆర్సీబీ మధ్య సోమవారం నాటి మ్యాచ్ సందర్భంగా స్క్రీన్ మీద ఈ మేరకు ప్రకటన చేసిన నిర్వాహకులు.. సోషల్ మీడియా వేదికగా మరోసారి ఈ శుభవార్తను పంచుకున్నారు. దీంతో బీసీసీఐపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టిక్కెట్లు ఉచితంగా ఇవ్వడం కంటే కూడా మహిళా క్రికెటర్లకు సమున్నత గౌరవం కల్పిస్తున్న తీరుకు ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా స్టేడియం పరిమితికి తగ్గట్లు కొన్ని షరతులతో ఫ్రీగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ముంబై టాప్ భారత మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బీసీసీఐ మహిళా ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మార్చి 4న ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ మ్యాచ్‌తో లీగ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన గుజరాత్‌పై 143 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ తలపడగా.. లానింగ్ బృందం 60 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. స్పెషల్ డే.. స్పెషల్ మ్యాచ్ మూడో మ్యాచ్‌లో గుజరాత్- యూపీ వారియర్స్ పోటీ పడగా.. యూపీ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక నాలుగో మ్యాచ్ ముంబై- ఆర్సీబీ మధ్య జరుగగా.. స్మృతి మంధాన సేనకు ముంబై చేతిలో 9 వికెట్ల తేడాతో పరాభవం ఎదురైంది. ఇక ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరుగగా.. ముంబై రెండింటిలో ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంతవరకు రెండేసి మ్యాచ్‌లు ఆడి రెండింట్లోనూ ఓడిన గుజరాత్- ఆర్సీబీ మార్చి 8న గెలుపు కోసం పోటీపడనున్నాయి. మహిళలకు ప్రత్యేకమైన రోజున మరి విజయం ఎవరిని వరిస్తుందో!! చదవండి: WPL 2023: ఆర్సీబీ రాత ఇంతేనా.. మహిళల ఐపీఎల్‌లోనూ నిరాశ తప్పదా..? PSL 2023: మార్టిన్ గప్తిల్ వీరవిహారం.. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో.. View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
ఆర్సీబీ రాత ఇంతేనా.. మహిళల ఐపీఎల్‌లోనూ నిరాశ తప్పదా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ (2008) నుంచి ఏ యేటికి ఆ యేడు ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు, ప్రతి సీజన్లోనూ ఉసూరుమనిపిస్తూ ఫ్రాంచైజీ అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్న విషయం విధితమే. పేరులో రాయల్, జట్టు నిండా స్టార్లు ఉన్నారనే మాట తప్పించి, ఆర్సీబీ 15 ఎడిషన్లలో సాధించింది ఏమీ లేదు. 2009, 2011, 2016 ఎడిషన్లలో రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు.. ప్రతి యేడు 'ఈ సాలా కప్ నమ్మదే' అనడం తప్ప ఒక్కసారి కూడా టైటిల్ సాధించింది లేదు. 2009 ఎడిషన్‌లో రాస్ టేలర్, 2011లో క్రిస్ గేల్, 2016లో విరాట్ కోహ్లి ఒంటిరిగా విజృంభించడంతో ఈ మూడు ఎడిషన్లలో ఫైనల్‌కు చేరింది తప్పిస్తే.. ఈ జట్టు మూకుమ్మడిగా ఆడి, గెలిచింది ఎప్పుడూ లేదు. కనీసం మహిళల ఐపీఎల్ (WPL)లో అయినా ఫేట్ మారుతుందని ఆశించిన ఆర్సీబీ అభిమానులకు ఇక్కడ కూడా నిరాశ తప్పడం లేదు. మెన్స్ టీమ్‌కు తాము ఏమాత్రం తక్కువ కాదన్నట్లు, మహిళల టీమ్ పోటీపడి మరీ వరుస పరాజయాలు మూటగట్టుకుంటుంది. డబ్ల్యూపీఎల్-2023లో ఆర్సీబీ వుమెన్స్ టీమ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, మెన్స్ ఆర్సీబీని గుర్తు చేస్తుంది. మెన్స్ ఆర్సీబీ లాగే వుమెన్స్ ఆర్సీబీ కూడా స్టార్లతో కళకళలాడుతున్నప్పటికీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడుతుంది.కోట్లు కుమ్మరించి ఏరికోరి ఎంచుకున్న కెప్టెన్ మంధన వ్యూహాలు రచించడంలో దారుణంగా విఫలమవుతుండగా.. ఢిల్లీ, ముంబైలతో జరిగిన మ్యాచ్‌ల్లో అంతర్జాతీయ స్టార్లు సోఫీ డివైన్, రిచా ఘోష్, రేణుకా సింగ్ పూర్తిగా చేతులెత్తేశారు. ఢిల్లీతో మ్యాచ్‌లో ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, మెగాన్ షట్ పర్వాలేదనిపించగా.. కెప్టెన్ మంధన రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో ఓకే అనిపించింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌ల్లో కూడా ఆర్సీబీ ప్రదర్శన ఇలాగే కొనసాగితే, మెన్స్ ఆర్సీబీలాగే ఈ జట్టు పరిస్థితి కూడా పేపర్‌పై పులిలా తయారవుతుంది. కాగా, డబ్ల్యూపీఎల్ అరంగ్రేటం సీజన్లో భారీ అంచనాల నడుమ బరిలో నిలిచిన ఆర్సీబీ.. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో, రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించినా, ఆతర్వాత వచ్చే ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్ విషయంలో వరుస ఇదైతే, బౌలింగ్‌లో ఆర్సీబీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఢిల్లీతో మ్యాచ్‌లో షఫాలీ, లాన్నింగ్‌లకు కనీసం డాట్ బాల్ వేయలేక ఆర్సీబీ బౌలర్లు అష్టకష్టాలు పడ్డారు. ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్ మినహాయించి, 19 ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు బౌండరీలు, సిక్సర్లు సమర్పించుకున్నారు. ముంబైతో మ్యాచ్‌లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. దాదాపుగా అందరూ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఆర్సీబీ బౌలర్లు కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది. -
WPL 2023: ముంబై సూపర్ షో
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ధనాధన్ ఆల్‌రౌండ్ షోతో వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను చిత్తు చేసింది. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టిన హేలీ మాథ్యూస్ బ్యాటింగ్‌లో (38 బంతుల్లో 77 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. టాపార్డర్ బ్యాటర్ నట్ సీవర్ బ్రంట్ (29 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరుపు అర్ధ సెంచరీ సాధించడంతో ఛేదన సులువైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ (26 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, సయిక ఇషాక్, అమెలియా కెర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ హేలీ, బ్రంట్‌ల అజేయ అర్ధ సెంచరీలతో 14.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసింది. అందరూ అంతంతే! బెంగళూరు స్కోరైతే 150 దాటింది కానీ... ఏ ఒక్క బ్యాటర్‌ది చెప్పుకోదగ్గ స్కోరుగానీ, ఇన్నింగ్స్‌ను కుదుటపర్చిన భాగస్వామ్యంగానీ లేవు. అదే బెంగళూరు పాలిట శాపమైంది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (17 బంతుల్లో 23; 5 ఫోర్లు) మొదలు మేగన్ షట్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) దాకా ఐదుగురు బ్యాటర్లు రిచా, కనిక ఆహుజా (13 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయాంక పాటిల్ (15 బంతుల్లో 23; 4 ఫోర్లు) 20 పైచిలుకు పరుగులు చేశారు. అందరు ఇలా వచ్చి అలా షాట్లు బాదేసి పెవిలియన్‌కు వెళ్లినవారే! ఇందులో ఏ ఒక్కరు నిలబడినా, మెరుపుల భాగస్వామ్యం నమోదైనా పరిస్థితి మరోలా ఉండేది. అయితే ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంలో సమష్టిగా సఫలమయ్యారు. హేలీ, బ్రంట్ ఫిఫ్టీ–ఫిఫ్టీ ముంబై ముందున్న లక్ష్యం 156 పరుగులు. అంత సులభమైందేమీ కాదు. కానీ యస్తిక భాటియా (19 బంతుల్లో 23; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన హేలీ మాథ్యూస్ తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగింది. స్కోరు జోరందుకున్న సమయంలో యస్తికను ప్రీతి బోస్ వికెట్ ముందు దొరకబుచ్చుకుంది. 45 పరుగుల వద్ద తొలి వికెట్ కూలగా, బెంగళూరుకు అదే ఆఖరి ఆనందం అయ్యింది. తర్వాత నట్ సీవర్ వచ్చాక హేలీ వేగం మరో దశకు చేరింది. బెంగళూరు కెప్టెన్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. అటు బ్రంట్, ఇటు హేలీ బౌండరీలను అవలీలగా బాదేస్తుంటే ఆద్యంతం ‘పవర్ ప్లే’నే కనిపించింది. పదో ఓవర్లోనే హేలీ 26 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 10.2 ఓవర్లోనే జట్టు స్కోరు 100 దాటింది. మేగన్ షట్ వేసిన 12, శ్రేయాంక పాటిల్ వేసిన 13వ ఓవర్లలో బ్రంట్, హేలీలు ఫోర్లతో చెలరేగిపోయారు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే ముంబై 40 పరుగులు చేయడంతో లక్ష్యాన్ని 5.4 ఓవర్ల ముందే ఛేదించింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) వాంగ్ (బి) హేలీ 23; సోఫీ (సి) అమన్‌జోత్ (బి) సయిక 16; దిశ (బి) సయిక 0; ఎలైస్ పెర్రీ రనౌట్ 13; హీథెర్‌నైట్ (బి) హేలీ 0; రిచాఘోష్ (సి) నట్ సీవర్ (బి) హేలీ 28; కనిక (సి) యస్తిక (బి) పూజ 22; శ్రేయాంక (ఎల్బీ) (బి) నట్ సీవర్ 23; మేగన్ (స్టంప్డ్) యస్తిక (బి) అమెలియా 20; రేణుక (బి) అమెలియా 2; ప్రీతి నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 155. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–43, 4–43, 5–71, 6–105, 7–112, 8–146, 9–154, 10–155. బౌలింగ్: హేలీ 4–0–28–3, నట్ సీవర్ 3–0–34–1, సయిక ఇషాక్ 4–0–26–2, ఇసి వాంగ్ 2–0–18–0, అమెలియా కెర్ 3.4–0–30–2, కలిత 1–0–10–0, పూజ 1–0–8–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ నాటౌట్ 77; యస్తిక (ఎల్బీ) (బి) ప్రీతి 23; నట్ సీవర్ నాటౌట్ 55; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 159. వికెట్ల పతనం: 1–45. బౌలింగ్: రేణుక 3–0–28–0, ప్రీతి బోస్ 4–0–34–1, మేగన్ షట్ 3–0–32–0, ఎలైస్ పెర్రీ 1.2–0–18–0, శ్రేయాంక 2–0–32–0, సోఫీ డివైన్ 1–0–11–0. డబ్ల్యూపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ X లక్నో విజార్డ్స్ రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
మథ్యూస్ ఆల్‌రౌండ్ షో.. ఆర్సీబీని చిత్తు చేసిన ముంబై
మథ్యూస్ ఆల్‌రౌండ్ షో.. ముంబై ఘన విజయం మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ముంబై విజయభేరి మోగించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. కేవలం 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి చేధించింది. ముంబై విజయంలో ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మాథ్యూస్ కీలక పాత్ర పోషించింది. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన మాథ్యూస్, బ్యాటింగ్‌లో 77 పరుగులతో ఆజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మాథ్యూస్‌తో పాటు నాట్ స్కివర్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. 29 బంతులు ఎదుర్కొన్న స్కివర్ 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. అమీలియా కేర్, ఇషాక్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో రిచా ఘోష్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతో పాటు మంధాన(23), కనికా అహుజా(22) పరుగులతో రాణించారు. ►10 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్(50), నాట్ స్కివర్(22) పరుగులతో ఉన్నారు. ►6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్(31), నాట్ స్కివర్(0) పరుగులతో ఉన్నారు. ►156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 2 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో మాథ్యూస్,యస్తికా భాటియా ఉన్నారు. ►టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. అమీలియా కేర్, ఇషాక్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో రిచా ఘోష్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆమెతో పాటు మంధాన(23), కనికా అహుజా(22) పరుగులతో రాణించారు. ►18 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. క్రీజులో స్కాట్(14), రేణుకా సింగ్ ఉన్నారు. ►71 పరుగులు వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన పెర్రీ రనౌట్ రూపంలో వెనుదిరిగింది. 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో రిచాఘోష్, కనికా ఉన్నారు. 43 పరుగులకే 4 వికెట్లు.. కష్టాల్లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ కేవలం 43 పరుగులుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధాన(11), డివైన్(6),దిశా కసత్(0), నైట్(0) పెవిలియన్‌కు చేరారు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్, సైకా ఇషాక్ చెరో రెండు వికెట్లు సాధించారు. ►2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. క్రీజులో స్మృతి మంధాన(11), డివైన్(6) పరుగులతో ఉన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్-2023 తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసిన ఆర్సీబీ.. ఇప్పుడు బ్రబౌర్న్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. బెంగళూరు మాత్రం ఒక మార్పు చేసింది. తుది జట్లు: ముంబై ఇండియన్స్ : యస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, దిశా కసత్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, కనికా అహుజా, మేగన్ షుట్, శ్రేయాంక పాటిల్, ప్రీతీ బోస్, రేణుకా ఠాకూర్ సింగ్ -
MI Vs RCB: పరుగుల వరద.. ముంబైపై ఆర్సీబీ గెలుపు ఖాయం!
Womens Premier League 2023 RCB VS MI: మహిళా ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తప్పక గెలుస్తుందని టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ముంబై ఇండియన్స్ మహిళా జట్టుపై స్మృతి సేన పైచేయి సాధిస్తుందని జోస్యం చెప్పాడు. ఇరు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగడం ఖాయమని.. ఆర్సీబీని విజయం వరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే, టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవాలని సూచించాడు. ఇక ముంబై టాపార్డర్ పటిష్టంగా ఉన్నపటికీ ఆర్సీబీ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు విశ్లేషిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘బెంగళూరు మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, ఆ మ్యాచ్ జరిగింది బ్రబౌర్న్ స్టేడియంలో అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ముంబైతోనూ అదే మైదానంలో పోటీపడనుంది. ఇప్పటికే బ్రబౌర్న్‌లో ఆడినందు వల్ల అక్కడి పరిస్థితులపై ఆర్సీబీ ప్లేయర్లకు అవగాహన ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ గత ప్రదర్శనలు గమనిస్తే అందరూ ముంబై వైపే మొగ్గు చూపుతారు. కానీ నేను మాత్రం ఈసారి ఆర్సీబీకే ఓటు వేస్తున్నా. స్మృతి రాణిస్తేనే అయితే, స్మృతి భారీ స్కోరు నమోదు చేయాల్సి ఉంది. ముఖ్యంగా ముంబై స్పిన్ ఆల్‌రౌండర్ హైలీ మాథ్యూస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి. ఈ ఆఫ్ స్పిన్నర్ కచ్చితంగా స్మృతిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి స్మృతి మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఇక సోఫీ డివైన్ కూడా బ్యాట్ ఝులిపించాల్సి ఉంది. ఇక ఆర్సీబీ పేస్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ బౌలింగ్ సేవలను మరింత మెరుగ్గా వాడుకోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అదే విధంగా ముంబై బ్యాటింగ్ ఆర్డర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ముంబై టాపార్డర్ అత్యద్భుతంగా ఉంది. హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నటాలీ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్, అమేలియా కెర్.. ఆ తర్వాత పూజా వస్త్రాకర్‌లతో పటిష్టంగా కనపడుతోంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుందన్న ఆకాశ్ చోప్రా.. ‘‘బ్రబౌర్న్ పిచ్ ఫ్లాట్‌గా ఉంది. మరో భారీ స్కోరు నమోదు కావడం ఖాయం. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోవాలి. పిచ్ ఫ్లాట్‌గా ఉంటుంది.. కాబట్టి ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటే కనీసం 200 పరుగులు స్కోరు చేస్తేనే గెలిచే అవకాశాలు ఉంటాయి’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా డబ్ల్యూపీఎల్-2023 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో తలపడ్డ ముంబై.. 143 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో హర్మన్‌ప్రీత్ సేన ఆకాశమే హద్దుగా చెలరేగి తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయం సాధించింది. మరోవైపు.. తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ టీమ్‌తో తలపడ్డ ఆర్సీబీ.. 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక గత మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేయగా.. ఆర్సీబీ సారథి స్మృతి 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 35 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం (మార్చి 6) మ్యాచ్ జరుగనుంది. చదవండి: Virat Kohli: నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. కనీసం: స్మృతి మంధాన సచిన్ ప్రపంచంలో మేటి బ్యాటరే.. కానీ..! షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు -
బ్యాట్‌తో ఇరగదీసి, డ్యాన్స్‌తో అదరగొట్టిన జెమీమా రోడ్రిగెస్
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా నిన్న (మార్చి 5) రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు), మారిజాన్ కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెస్ (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) శివాలెత్తడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో తారా నోరిస్ (5/29) నిప్పులు చెరగడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. SCCCENESSSS https://t.co/MwCnUfPzrH — Jemimah Rodrigues (@JemiRodrigues) March 5, 2023 కాగా, డీసీ ఇన్నింగ్స్ చివర్లో బరిలోకి దిగి బ్యాట్‌తో ఇరగదీసిన జెమీమా రోడ్రిగెస్.. ఆతర్వాత ఫీల్డింగ్ చేసే సమయంలో డ్యాన్స్‌తో అదరగొట్టి అభిమానుల మనసులను కొల్లగొట్టింది. డీసీ వైస్ కెప్టెన్ అయిన 22 ఏళ్ల రోడ్రిగెస్.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా, స్టేడియంలో ఒక్కసారిగా మ్యూజిక్ ప్లే కావడం మొదలైంది. హఠాత్తుగా ఫాస్ట్ బీట్ సంగీతం ప్లే కావడంతో తనలోని డ్యాన్సర్‌ను ఆపుకోలేకపోయిన రోడ్రిగెస్.. బాంగ్రా, వెస్ట్రన్ కలగలిపిన నృత్యం చేస్తూ ఊగిపోయింది. రోడ్రిగెస్.. అచ్చం ప్రొఫెషనల్ డ్యాన్సర్లా డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచింది. రోడ్రిగెస్ డ్యాన్సింగ్ స్కిల్స్‌కు ఫిదా అయిన అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందకేమో రోడ్రిగెస్‌ను విరాట్ కోహ్లితో పోలుస్తూ 100 పర్సంట్ ఎంటర్టైనర్ అంటూ కొనియాడుతున్నారు. మ్యాచ్ అనంతరం ఫ్యాన్స్ పోస్ట్ చేసిన తన డ్యాన్సింగ్ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోలకు రోడ్రిగెస్ రెస్పాండ్ అయ్యింది. కొందరికి ఆమె రీట్వీట్లు కూడా చేసింది. రొడ్రిగెస్ డ్యాన్సింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. -
WPL 2023: నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. కనీసం: స్మృతి మంధాన
WPL 2023- Smriti Mandhana: ఇంతవరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా సరే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న క్రేజే వేరు. రోజురోజుకు ఆర్సీబీ అభిమానగణం పెరుగుతుందే తప్ప తగ్గటం లేదనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా స్టార్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్సీబీ నాయకుడిగా జట్టును ముందుండి నడిపించిన కోహ్లి ట్రోఫీ గెలవకపోయినా తన అద్భుత ఆట తీరుతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. గత సీజన్‌తో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన కోహ్లి ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్మృతి సారథ్యంలో ఇదిలా ఉంటే.. భారత మహిళా క్రికెట్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మహిళా ప్రీమియర్ లీగ్ మార్చి 4న ఆరంభమైన విషయం తెలిసిందే. ఐదు జట్లు పోటీపడుతున్న ఈ టీ20 లీగ్‌లో ఆర్సీబీ వుమెన్ టీమ్‌కు టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మార్చి 5న మ్యాచ్ పూర్తి చేసుకున్న స్మృతి సేన.. సోమవారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లితో తనను పోలుస్తూ వస్తున్న వార్తలపై విలేకరుల ప్రశ్నకు స్మృతి ఈ విధంగా సమాధానమచ్చింది. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పోలికలు నాకు అస్సలు నచ్చవు. ఎందుకంటే కోహ్లి తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో అద్భుత రికార్డులు సాధించాడు. నేను ఆ స్థాయికి చేరుకోవాలని కోరుకోవడమే తప్ప.. కనీసం కోహ్లి రికార్డులకు దరిదాపుల్లో కూడా లేను. ముఖ్యంగా ఆర్సీబీకి కోహ్లి అందిస్తున్న సేవలు అమోఘం. నేను కూడా తనలా ఉండేందుకు, జట్టును గొప్ప స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తా’’ అని స్మృతి పేర్కొంది. కాగా డబ్ల్యూపీఎల్-2023 వేలంలో భాగంగా ఆర్సీబీ అత్యధికంగా 3.4 కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్మృతి మంధానను కొనుగోలు చేసింది. ఇక కోహ్లి, స్మృతి జెర్సీ నంబర్ 18 కావడం విశేషం. ఇదిలా ఉంటే డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ 60 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లి ఘనత.. ఇక 2013 నుంచి ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి.. 2021 సీజన్ తర్వాత నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. సారథిగా 140 మ్యాచ్‌ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు నమెదు చేశాడు. మరో 4 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ 2016లో రన్నరప్‌గా నిలిచింది. మరో మూడుసార్లు ప్లేఆఫ్స్(2015, 2020, 2021 )చేరింది. ఇక సుదీర్ఘకాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన ఈ రన్‌మెషీన్ అంతర్జాతీయ క్రికెట్లో 74 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. చదవండి: WPL 2023: ఎంఎస్డీ పేరును బ్యాట్‌పై రాసుకుని హాఫ్ సెంచరీ బాదిన యూపీ వారియర్జ్ బ్యాటర్ Ind Vs Aus: ‘అసలు సెలక్టర్లు ఏం చేస్తున్నారు.. వాళ్లు రాజీనామా చేయాల్సిందే’.. టీమిండియా దిగ్గజం వ్యాఖ్యలు వైరల్ -
స్పాన్సర్స్ ఎవరూ లేక, ధోని పేరును బ్యాట్‌పై రాసుకుని ఇరగదీసింది
మహిళల ఐపీఎల్ (WPL) 2023 సీజన్ మొదటి రెండు మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగడంతో కాస్త బోర్‌గా ఫీలైన అభిమానులకు నిన్న (మార్చి 5) రాత్రి గుజరాత్ జెయింట్స్-యూపీ వారియర్జ్ మధ్య జరిగిన మ్యాచ్ అసలుసిసలైన టీ20 మజాను అందించింది. చివరి నిమిషం వరకు రసవత్తరంగా సాగి ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 46; 7 ఫోర్లు), ఆష్లే గార్డెనర్ (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్), సబ్బినేని మేఘన (15 బంతుల్లో 24; 5 ఫోర్లు), హేమలత (13 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. కిరణ్ నవ్‌గిరే (43 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్రేస్ హ్యారిస్ (26 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), సోఫీ ఎక్లెస్టోన్ (12 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటంతో యూపీ వారియర్జ్ మరో బంతి మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓ పక్క వికెట్లు పడుతున్నా కిరణ్ ఒక్కరే జట్టు భారాన్ని అంతా మోయగా.. గెలుపుపై ఆశలు సన్నగిల్లిన తరుణంలో గ్రేస్, సోఫీ జోడీ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి తమ జట్టుకు అపురూపమైన విజయాన్నందించారు. వీరిలో ముఖ్యంగా గ్రేస్ ఆకాశమే హద్దుగా చెలరేగి 18వ ఓవర్లో 20 పరుగులు, 19వ ఓవర్లో 14 పరుగులు, చివరి ఓవర్లో 25 పరుగులు పిండుకుని వారియర్జ్‌కు బోణీ విజయాన్నందించింది. కాగా, ఈ మ్యాచ్‌లో వారియర్జ్ బ్యాటింగ్ సందర్భంగా కనిపించిన ఓ ఆసక్తికర సీన్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్శించింది. వారియర్జ్ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరే.. టీమిండియా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరును తన బ్యాట్‌పై రాసుకుని బరిలోకి దిగింది. ధోని అంటే పడిచచ్చిపోయే కిరణ్.. స్పాన్సర్ ఎవరూ లేకపోవడంతో ఇలా చేసి ఎంఎస్డీపై అభిమానాన్ని చాటుకుంది. ఎంఎస్డీ7 అని రాసివున్న బ్యాట్‌తో బరిలోకి దిగిన కిరణ్.. ధోని తరహాలోనే విధ్వంసం సృష్టించి, తన జట్టు గెలుపుకు బలమైన పునాది వేసింది. కిరణ్ బ్యాట్‌పై ఎంఎస్డీ7 అని రాసి ఉండటాన్ని లైవ్‌లో కామెంటర్లు ప్రస్తావించడంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయింది. కిరణ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఎవరికీ తెలియని కిరణ్.. రాత్రికిరాత్రి స్టార్ అయిపోయింది. ధోని పేరు పుణ్యమా అని ప్రస్తుతం ఈమె పేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల నోళ్లలో నానుతుంది. ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ కిరణ్ నవ్గరేను ప్రతేక్యంగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. కుడి చేతి వాటం ఆల్‌రౌండర్ అయిన 28 ఏళ్ల కిరణ్ ప్రభు నవ్గరే.. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది. దేశవాలీ టోర్నీల్లో గతంలో మహారాష్ట్ర, ప్రస్తుతం నాగాలాండ్‌కు ఆడుతున్న నవ్గరే.. వుమెన్స్ టీ20 చాలెంజ్‌లో వెలాసిటి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. టీ20ల్లో 150కి పైగా వ్యక్తిగత స్కోర్ సాధించిన ఏకైక భారత బ్యాటర్ కిరణ్ రికార్డుల్లోకెక్కింది. మహిళల సీనియర్ టీ20 ట్రోఫీ-2022లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ అజేయమైన 162 పరుగులు సాధించి, మహిళల క్రికెట్లో డాషింగ్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. -
‘అమ్మాయిల ఆటకు డబ్ల్యూపీఎల్‌తో అందలం’
దేశంలో మహిళా క్రికెటర్ల కలలు సాకారమయ్యేందుకు డబ్ల్యూపీఎల్ దోహదం చేస్తుందని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ అన్నారు. ‘మరెంతో మంది యువ క్రీడాకారిణిలు క్రికెట్‌వైపు మళ్లేందుకు, కెరీర్‌గా ఎంచుకునేందుకు డబ్ల్యూపీఎల్ ఉపయోగపడుతుంది. ఇందులో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. తొలి మ్యాచ్‌లో తమ ఫ్రాంచైజీ భారీ విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నా’ అని నీతా అంబానీ వ్యాఖ్యానించారు. -
షఫాలీ, లానింగ్ ధనాధన్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో పరుగుల హోరెత్తుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 200 పైచిలుకు పరుగులు నమోదయ్యాయి. ఢిలీక్యాపిటల్స్ ఓపెనర్లు షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ మెగ్ లానింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) చెలరేగారు. బౌలింగ్‌లో తారా నోరిస్ (5/29) నిప్పులు చెరగడంతో ఢిల్లీ 60 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై జయభేరి మోగించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి 223 పరుగుల భారీస్కోరు చేసింది. మహిళల టి20 క్రికెట్లో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్లు లానింగ్, షఫాలీ తొలి వికెట్‌కు 162 పరుగులు జోడించారు. షఫాలీ 31 బంతుల్లో (5 ఫోర్లు, 3 సిక్స్‌లు)... లానింగ్ 30 బంతుల్లో (10 ఫోర్లు) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆఖర్లో మరిజన్ కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేయగలిగింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (23 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), ఎలీస్ పెర్రీ (19 బంతుల్లో 31; 5 ఫోర్లు), హీథెర్‌నైట్ (21 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడారు. తారా నోరిస్ 5, అలైస్ క్యాప్సీ 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) హీథెర్‌నైట్ 72; షఫాలీ (సి) రిచా (బి) హీథెర్‌నైట్ 84; మరిజన్ కాప్ (నాటౌట్) 39; జెమీమా (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–162, 2–163. బౌలింగ్: రేణుక సింగ్ 3–0–24–0, మేగన్ 4–0–45–0, ప్రీతి 4–0– 35–0, పెర్రీ 3–0–29–0, సోఫీ డివైన్ 1–0–20–0, శోభన 2–0–29–0, హీథెర్‌నైట్ 3–0–40–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) శిఖా (బి) క్యాప్సీ 35; సోఫీ డివైన్ (సి) షఫాలీ (బి) క్యాప్సీ 14; పెర్రీ (బి) నోరిస్ 31; దిశ (సి) క్యాప్సీ (బి) నోరిస్ 9; రిచా (సి) రాధ (బి) నోరిస్ 2; హీథెర్‌నైట్ (సి) లానింగ్ (బి) నోరిస్ 34; కనిక (సి) షఫాలీ (బి) నోరిస్ 0; శోభన (సి) రాధ (బి) శిఖా 2; మేగన్ (నాటౌట్) 30; ప్రీతి బోస్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–41, 2–56, 3–89, 4–90, 5–93, 6–93, 7–96, 8–150. బౌలింగ్: శిఖా పాండే 4–0–35–1, మరిజన్ కాప్ 4–0–36–0, జొనసెన్ 4–0–28–0, అలైస్ క్యాప్సీ 2–0–10–2, రాధ యాదవ్ 2–0–24–0, తారా నోరిస్ 4–0–29–5. -
‘గ్రేట్’ హారిస్...
ముంబై: పురుషుల లీగ్‌కు ఏమాత్రం తీసిపోని మ్యాచ్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు వన్నెలద్దింది. ఉత్తరప్రదేశ్ (యూపీ) వారియర్స్ ‘హిట్టర్’ గ్రేస్ హారిస్ (26 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఖరి ఓవర్ మెరుపులతో మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. 170 లక్ష్యం ఛేదించే క్రమంలో యూపీ ఒకదశలో 105/7 స్కోరుతో ఓటమికి దగ్గరైంది. ఈ దశలో సోఫీ ఎకిల్‌స్టోన్ (12 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అండతో హారిస్ ధనాధన్ ‘గ్రేట్’ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. అబేధ్యమైన 8వ వికెట్‌కు ఈ ఇద్దరు 4.1 ఓవర్లలో 70 పరుగులు జోడించి యూపీని గెలిపించారు. ఆఖరి ఓవర్లో యూపీకి 19 పరుగుల కావాల్సి ఉండగా.. అనాబెల్ వేసిన ఈ ఓవర్లో గ్రేస్ వరుసగా 6, వైడ్, 2, 4, వైడ్, 4, 6లతో ఏకంగా 24 పరుగులు పిండుకుంది. దీంతో యూపీ 3 వికెట్లతో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచింది. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 46; 7 ఫోర్లు) రాణించగా, సబ్బినేని మేఘన (15 బంతుల్లో 24; 5 ఫోర్లు), ఆష్లే గార్డ్నర్ (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), హేమలత (13 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసి గెలిచింది. కిమ్ గార్త్ (5/36) యూపీని బెంబేలెత్తించినా ఫలితం లేకపోయింది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మేఘన (సి) శ్వేత (బి) సోఫీ 24; సోఫియా (బి) దీప్తి 13; హర్లిన్ (సి) తాలియా (బి) అంజలి శర్వాణి 46; అనాబెల్ సదర్లాండ్ (సి) అంజలి (బి) సోఫీ 8; సుష్మ (సి) శ్వేత (బి) తాలియా 9; గార్డ్నర్ (స్టంప్డ్) హీలీ (బి) దీప్తి 25; హేమలత (నాటౌట్) 21; స్నేహ్ రాణా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–34, 2–38, 3–50, 4–76, 5–120, 6–142. బౌలింగ్: రాజేశ్వరి 4–0–30–0, అంజలి శర్వాణి 4–0–43–1, దీప్తి 4–0–27–2, సోఫీ 4–0–25–2, తాలియా 2–0–18–1, దేవిక 2–0–24–0. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: హీలీ (సి అండ్ బి) గార్త్ 7; శ్వేత (సి) మాన్సి (బి) గార్త్ 5, కిరణ్ నవ్‌గిరే (సి) సుష్మ (బి) గార్త్ 53; తాలియా (సి) హేమలత (బి) గార్త్ 0; దీప్తి (బి) మాన్సి 11; గ్రేస్ హారిస్ (నాటౌట్) 59; సిమ్రన్ (బి) గార్త్ 0; దేవిక (సి) హేమలత (బి) అనాబెల్ 4; సోఫీ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–13, 2–19, 3–20, 4–86, 5–88, 6–88, 7–105. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–36–5, తనూజ 4–0–29–0, గార్డ్నెర్ 4–0–34–0, అనాబెల్ 3.5–0–41–1, స్నేహ్ రాణా 2–0–16–0, మాన్సి 2–0–15–1. ♦ డబ్ల్యూపీఎల్‌లో నేడు ముంబై ఇండియన్స్ Vs బెంగళూరు రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు.. కేవలం రూ.10 లక్షలు మాత్రమే! ఎవరీ తారా నోరిస్?
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ తారా నోరిస్ సరి కొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి పేసర్‌గా నోరిస్ రికార్డులకెక్కింది. ఈ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో నోరిస్ ఈ రికార్డు సాధించింది. ఈ మ్యాచ్‌లో నోరిస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. తన 4 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 60 పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగల్గింది. అంతకుముందు షషాలీ వర్మ(84), లానింగ్(72) పరుగులతో అదరగొట్టడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన నోరిస్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో అదరగొట్టిన తారా నోరిస్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ తారా నోరిస్? ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై వేదికగా జరిగిన వేలంలో అమెరికా చెందిన 24 ఏళ్ల తారా నోరిస్‌ను 10 లక్షల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. నోరిస్ తన జాతీయ జట్టు తరపున ఇప్పటి వరకు 5 టీ20లు ఆడింది. నోరిస్ ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీ రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో తన పేరును ప్రపంచానికి పరిచయం చేసింది. 2020 సీజన్లో సౌథర్ వైపర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన తారా.. 12 వికెట్లతో సత్తా చాటింది. ఆ ఏడాది సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా నిలిచింది. చదవండి: కోహ్లి, సూర్య, బాబర్ కాదు.. అతడే ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు! 𝐓𝐚𝐫𝐚 𝐍𝐨𝐫𝐫𝐢𝐬 𝐟𝐫𝐨𝐦 𝐏𝐡𝐢𝐥𝐚𝐝𝐞𝐥𝐩𝐡𝐢𝐚 🇺🇸, what a banging Hollywood style debut! 🤩 pic.twitter.com/TvNZ4cBBYH — Sports18 (@Sports18) March 5, 2023 -
హారిస్ సంచలన ఇన్నింగ్స్.. గుజరాత్‌పై యూపీ వారియర్జ్ విజయం
హారిస్ సంచలన ఇన్నింగ్స్.. గుజరాత్‌పై యూపీ వారియర్జ్ విజయం మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్జ్ శుభారంబం చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో యూపీ విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో యూపీ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. ఆ జట్టు బ్యాటర్ గ్రేస్ హారిస్ అద్భుత ఇన్నింగ్స్‌తో తమ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆఖరి ఓవర్ వేసిన సదర్లాండ్ బౌలింగ్‌లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో మ్యాచ్‌ను హారిస్ ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్‌లో కేవలం 26 బంతులు ఎదుర్కొన్న హారిస్ 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 59 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు కిరణ్ నవ్‌గిరే(53)పరుగులతో యూపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ ఐదు వికెట్లు సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది. గార్త్ తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. ►18 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 7 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీస్(36), ఎకిలిస్టోన్(9) పరుగులతో ఉన్నారు. యూపీ విజయానికి 12 బంతుల్లో 33 పరుగులు కావాలి. ►17 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీస్(23), ఎకిలిస్టోన్(3) పరుగులతో ఉన్నారు. ఐదు వికెట్లతో చెలరేగిన కిమ్ గార్త్ వరుస క్రమంలో యూపీ వారియర్జ్ 3 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్లు ముగిసే సరికి యూపీ 6 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. యూపీ విజయానికి 42 బంతుల్లో 82 పరుగులు కావాలి. క్రీజులో హ్యారిస్, వైద్యా ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు గుజరాత్ పేసర్ కిమ్ గార్త్ ఐదు వికెట్లు పడగొట్టింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో హర్లీన్ డియోల్(46),గార్డనర్(25) పరుగులతో రాణించారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెక్‌గ్రాత్,శర్వాణి తలా వికెట్ సాధించారు. 9 ఓవర్లకు యూపీ స్కోర్: 60/3 9 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో కిరణ్ నవ్‌గిరే(40), దీప్తి శర్మ(8) పరుగులతో ఉన్నారు. 26 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో యూపీ 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హీలీతో పాటు శ్వేతా సెహ్రావత్, మెక్‌గ్రాత్ వికెట్లను యూపీ కోల్పోయింది. కాగా తొలి మూడు వికెట్లను కూడా గుజరాత్ పేసర్ కిమ్ గార్త్ పడగొట్టింది. రాణించిన గుజరాత్ బ్యాటర్లు.. యూపీ టార్గెట్ 170 పరుగులు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో హర్లీన్ డియోల్(46),గార్డనర్(25) పరుగులతో రాణించారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెక్‌గ్రాత్,శర్వాణి తలా వికెట్ సాధించారు. ► 16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్ డియోల్(23), హేమలత (1)పరుగులతో ఉన్నారు. ► 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్ డియోల్(23), గార్డనర్(18) పరుగులతో ఉన్నారు. 9 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 58/3 ►9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్, సుష్మా వర్మ పరుగులతో ఉన్నారు. ►38 పరుగుల వద్ద గుజరాత్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన మేఘన.. సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో పెవియలన్కు చేరింది. ►34 పరుగుల వద్ద గుజరాత్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన డాంక్లీ.. దీప్తి శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యంది. క్రీజులో హర్లీన్ వచ్చింది. 3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 30/0 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో సబ్బినేని మేఘన(20), డాంక్లీ(10) పరుగులతో ఉన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. యూపీ వారియర్జ్ తమ తొలి మ్యాచ్‌లో డివై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు గుజరాత్ రెగ్యూలర్ కెప్టెన్ బెత్ మూనీ గాయం కారణంగా దూరమైంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టుకు స్నేహ్ రానా సారథ్యం వహించనుంది. తుది జట్లు: యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, సిమ్రాన్ షేక్, కిరణ్ నవ్‌గిరే, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్ గుజరాత్ జెయింట్స్ : సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, సుష్మా వర్మ(వికెట్‌కీపర్), దయాళన్ హేమలత, స్నేహ్ రాణా(కెప్టెన్), తనుజా కన్వర్, మాన్సీ జోషి -
ముంబై ఇండియన్స్ రికార్డు బద్దలు కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్ విధ్వంసానికి, పరుగుల ప్రవాహానికి వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) మెరుపు హాఫ్‌సెంచరీలతో విరుచుకుపడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. షఫాలీ, లాన్నింగ్‌లను హీథర్ నైట్ ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపడంతో స్కోర్ కాస్త మందగించింది. ఒకవేళ వీరిద్దరూ చివరి వరకు క్రీజ్‌లో ఉండి ఉంటే సీన్ వేరేలా ఉండేది. ఆఖర్లో మారిజాన్ కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెస్ (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) కూడా చెలరేగి ఆడారు. డీసీ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ మినహాయించి ప్రతి ఓవర్లో కనీసం ఓ బౌండరీ నమోదైందంటే డీసీ బ్యాటర్ల విధ్వంసం ఏ రేంజ్ సాగిందో ఇట్టే అర్ధమవుతుంది. ఈ మ్యాచ్‌లో డీసీ 223 పరుగులు చేయడంతో గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నెలకొల్పిన 207 పరుగుల టీమ్ టోటల్ రికార్డు బద్దలైంది. ముంబై సాధించిన స్కోర్ కంటే డీసీ జట్టు 16 పరుగులు అధికంగా సాధించింది. డీసీ ఓపెనర్లు, ముఖ్యంగా షఫాలీ వర్మ వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలకు తరలించి, ఐపీఎల్‌కు డబ్ల్యూపీఎల్ ఏమాత్రం తీసిపోదని చెప్పకనే చెప్పింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ సైతం డీసీ తరహాలోనే రెచ్చిపోవడంతో మ్యాచ్‌లో విధ్వంసకర వాతావరణం కొనసాగింది. 4 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. కాగా, డబ్ల్యూపీఎల్-2023 తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.