ముంబై వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. మంధానను రూ.3.40 కోట్ల భారీ ధరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. దీంతో వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్‌గా మంధాన నిలిచింది.
ఇక ఆర్సీబీ మెనెజెమెంట్ తమ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఆర్సీబీ క్రికెట్ డైరక్టర్ మైక్ హెస్సన్ స్పందించాడు. కొన్ని మ్యాచ్‌లలో భారత జట్టుకు సారథ్యం వహించిన మంధానకు తమ జట్టును నడిపించే సత్తా ఉంది అని హెస్సన్ అభిప్రాయపడ్డాడు.
వేలం అనంతరం హెస్సన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. స్మృతికి కెప్టెన్సీ అనుభవం ఎక్కువగా ఉంది. ఆమె భారత్‌కు చెందిన క్రికెటర్ కాబట్టి, అక్కడ పరిస్థితులు బాగా తెలుసు. కాబట్టి మా జట్టు పగ్గాలు ఆమెకు అప్పజెప్పె ఛాన్స్ ఎక్కువగా ఉంది. అదే విధంగా మా జట్టులో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.
కాబట్టి వీరిందరూ కలిసి జట్టును విజయ పథంలో నడిపిస్తారని భావిస్తున్నాను అని అతడు పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో మంధానతో పాటు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ వంటి సీనియర్ క్రికెటర్లు ఉన్నారు.
వేలంలో ఆర్సీబీ దక్కించుకున్నక్రికెటర్ల జాబితా ఇదే
►స్మృతి మంధాన- రూ.3.40 కోట్లు
►రిచా ఘోష్- రూ.1.90 కోట్లు
►ఎలీస్ పెర్రీ- రూ.1.70 కోట్లు
►రేణుక సింగ్- రూ.1.50 కోట్లు
►సోఫీ డివైన్- రూ.50 లక్షలు
►హీతెర్ నైట్- రూ.40 లక్షలు
►మేగన్ షుట్- రూ.40 లక్షలు
►కనిక అహుజ- రూ.35 లక్షలు
►డేన్‌వాన్ నికెర్క్- రూ.30 లక్షలు
►ఎరిన్ బర్న్స్ - రూ.30 లక్షలు
►ప్రీతి బోస్ - రూ.30 లక్షలు
►కోమల్ జంజద్ - రూ.25 లక్షలు
►ఆశ శోభన- రూ.10 లక్షలు
►దిశ కాసత్ - రూ.10 లక్షలు
►ఇంద్రాణి రాయ్- రూ.10 లక్షలు
►పూనమ్ ఖేమ్నర్- రూ.10 లక్షలు
►సహన పవార్- రూ.10 లక్షలు
►శ్రేయాంక పాటిల్- రూ.10 లక్షలు
►మొత్తం ప్లేయర్లు: 18 విదేశీ ప్లేయర్లు: 6
చదవండి: WPL 2023: బాబర్ కంటే మంధానకి రెండున్నర రెట్లు ఎక్కువ.. పాక్ ప్లేయర్లు ఇప్పుడేమంటారో?
Comments
Please login to add a commentAdd a comment