Royal Challegers Bangalore
-
సీఎస్కేతో మ్యాచ్.. ఆర్సీబీకి గుడ్ న్యూస్! స్వింగ్ కింగ్ వచ్చేస్తున్నాడు?
ఐపీఎల్-2025 సీజన్ తొలి మ్యాచ్‌లోనే కేకేఆర్‌ను చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. ఆర్సీబీ తమ రెండో మ్యాచ్‌లో భాగంగా మార్చి 28న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. సీఎస్కే కూడా తమ మొదటి మ్యాచ్‌లో ముంబై పై విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు మరోసారి అభిమానులను మునివేళ్లపై నిలబెట్టడం ఖాయం.ఇక ఈ మ్యాచ్‌కు ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్ ఉంది. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన స్పీడ్ స్టార్ భువనేశ్వర్ కుమార్.. ఇప్పుడు ఫుల్ ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. భువీ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్సీబీ కూడా తాజాగా భువీ బంతి పట్టికుని ఉన్న ఫోటోను షేర్ చేసింది.అందుకు క్యాప్షన్‌గా "భువీ త్వరలోనే బంతిని స్వింగ్ చేస్తాడు. అతడు మరింత బలంగా తిరిగిరానున్నాడని" బెంగళూరు ఫ్రాంచైజీ రాసుకొచ్చింది. దీంతో ఆర్సీబీ తదుపరి మ్యాచ్‌లో భువనేశ్వర్ ఆడటం దాదాపు ఖాయమైనట్లే. కాగా మొదటి మ్యాచ్‌కు భువనేశ్వర్ కుమార్ స్ధానంలో జమ్మూ కాశ్మీర్ బౌలర్రసిఖ్ సలాం చోటు దక్కించుకున్నాడు. కానీ అతడు అంత ప్రభావం చూపలేదు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు. భువీ ఎంట్రీ ఇస్తే ధార్ సలీం బెంచ్‌కు పరిమితం కానున్నాడు. కాగా 35 ఏళ్ల భువనేశ్వర్ కుమార్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 176 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ యూపీ ఫాస్ట్ బౌలర్.. 7.56 ఎకానమీతో 181 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన భువనేశ్వర్‌ను ఐపీఎల్-2025 వేలంలో రూ. 10.75 భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. కాగా సీఎస్కేపై భువనేశ్వర్‌కు అంతమంచి రికార్డు లేదు. సీఎస్కేపై 20 మ్యాచ్‌ల్లో అతడు 39 సగటుతో 20 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఐపీఎల్-2025కు ఆర్సీబీ తుది జట్టు ఇదేరజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ స్వేఖ్ భండాగే, జాకబ్ బండెక్, జాకబ్ బంధేజ్ లుంగీ ఎంగిడీ, అభినందన్ సింగ్, మోహిత్ రాథీ.చదవండి: DC vs LSG: విశాఖలో మ్యాచ్.. తుదిజట్లు ఇవే!.. వర్షం ముప్పు? -
RCB Vs KKR: సాల్ట్, కోహ్లి విధ్వంసం.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆరంభంలోనే క్వింటన్ డికాక్ వికెట్ కోల్పోయినప్పటికి కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే(31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56), సునీల్ నరైన్(26 బంతుల్లో 44) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు.వీరితో పాటు రఘువంశీ(30) పరుగులతో రాణించాడు. డికాక్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్(6), అండ్రీ రస్సెల్(4), రింకూ సింగ్(12) తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో సత్తాచాటగా.. హాజిల్ వుడ్ రెండు, రసీఖ్ ధార్ సలీం, యశ్‌దయాల్ తలా వికెట్ సాధించారు.కోహ్లి, సాల్ట్ విధ్వంసం..175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(59 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్(31 బంతుల్లో 56), పాటిదార్(16 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. పవర్‌ప్లేలో కోహ్లి, సాల్ట్ చాలా దూకుడుగా ఆడారు.వీరిద్దరి విధ్వంసం ఫలితంగా ఆర్సీబీ స్కోర్ ఆరు ఓవర్లలోనే 80 పరుగులు దాటేసింది. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా,సునీల్ నరైన్ తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆప్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2025: కృనాల్ సూపర్ బాల్.. రూ.23 కోట్ల ఆటగాడికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
ఆర్సీబీకి బిగ్ షాక్.. భువనేశ్వర్ కుమార్‌కు గాయం!?
ఐపీఎల్-2025 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(59), ఫిల్ సాల్ట్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అయితే ఈ మ్యాచ్‌తో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ తరపున రీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. కానీ ఆర్సీబీ తుది జట్టులో భువీ చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.దీంతో భువీని ఎందుకు అవకాశమివ్వలేదన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో భువనేశ్వర్ ఆడకపోవడంపై ఆర్సీబీ మెనెజ్‌మెంట్ అప్డేట్ ఇచ్చింది. భువనేశ్వర్ ప్రస్తుతం స్వల్ప గాయంతో బాధపడుతున్నట్లు ఆర్సీబీ తెలిపింది. అతి త్వరలోనే అతడు జట్టులోకి వస్తాడని ఆర్సీబీ పేర్కొంది. భువీ స్ధానంలో యువ పేసర్ రసిఖ్ దార్ సలీమ్ తుది జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్-2025 వేలంలో రూ. 10.75 భారీ ధరకు భువనేశ్వర్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి -
RCB Vs KKR: అజింక్య రహానే విధ్వంసం.. కేవలం 25 బంతుల్లోనే! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో తొలి హాఫ్ సెంచరీ నమోదైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన రహానే.. ఆరంభం నుంచే ఆర్సీబీ బౌలర్లపై విరుచుపడ్డాడు.తనదైన శైలిలో స్టైల్లో షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రహానే కేవలం 25 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 31 బంతులు ఎదుర్కొన్న రహానే.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.రహానే అరుదైన రికార్డు..కాగా ఈ మ్యాచ్‌తో రహానే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కాడు. రహానే తొలిసారిగా 2017 ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ (RPS) జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఐపీఎల్-2019లో రాజస్తాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన రహానే.. ఇప్పుడు మళ్లీ కేకేఆర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. దీంతో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఐపీఎల్-2025లో మెగా వేలంలో రహానేను కేవలం రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి రౌండ్లో అమ్ముడుపోని రహానే ఆఖరి రౌండ్లో కేకేఆర్ సొంతం చేసుకుంది. Proud of You My Man Sir AJINKYA RAHANE 🥹❤️🫡 pic.twitter.com/VeNXSmW2n1— Malay 🇮🇳❤ (@malay_chasta) March 22, 2025 -
సీఎస్కే, ఢిల్లీ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే: డివిలియర్స్
ఐపీఎల్-2025 సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో ఈ మెగా ఈవెంట్‌కు తేరలేవనుంది. శనివారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.కాగా ఈ టోర్నీ ఆరంభానికి సమయం దగ్గరపడుతుండడంతో మాజీ క్రికెటర్లు ప్లే ఆఫ్స్ చేరే జట్లు, టైటిల్ విజేతగా నిలిచే జట్టును అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చేరాడు. ఈ ఏడాది సీజన్లో ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లను డివిలియర్స్ ప్రిడక్ట్ చేశాడు.గతంలో తను ప్రాతినిథ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు పాటు ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT), డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) ప్లే ఆఫ్స్‌కు చేరుతాయని ఏబీడీ జోస్యం చెప్పాడు."ముంబై ఇండియన్స్ జట్టు చాలా పటిష్టంగా కన్పిస్తోంది. ఈసారి ముంబై ఇండియన్స్ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ కూడా టాప్-4లో నిలుస్తోంది. ఆర్సీబీ జట్టు అన్ని విభాగాల్లో సమతుల్యంగా ఉంది. ఆపై గుజరాత్ టైటాన్స్ కూడా తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుందని భావిస్తున్నాను.ఈ మూడు జట్లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ కెకెఆర్ కూడా ప్లేఆఫ్ రేసులో ఉంటుంది" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా డివిలియర్స్ ఎంచుకున్న జట్లలో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ లేకపోవడం అభిమానులు ఆశ్చర్యపరిచింది. కాగా గతేడాది సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని సీఎస్కే గ్రూపు స్టేజికే పరిమితమైంది.చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచరీ -
KKR Vs RCB: ఐపీఎల్ తొలి మ్యాచ్.. ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!?
ఐపీఎల్-2025 సీజన్‌కు రంగం సిద్దమైంది. మార్చి 22న ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం కోల్‌కతా నగరం "ఆరెంజ్ అలర్ట్"లో ఉంది. ఈ క్యాష్‌రిచ్ లీగ్ ప్రారంభం రోజున, అంటే మార్చి 22 (శనివారం) గరిష్టంగా 80 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అక్కడి వాతవారణ శాఖ పేర్కొంది. శనివారం ఉదయం నుంచి పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచే ఛాన్స్ ఉంది.ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అంతకంటే ముందు అక్కడ వర్షం కురిసే సూచనలు కన్పిస్తున్నాయి. అదేవిధంగా ఈడెన్‌గార్డెన్స్‌లో ఐపీఎల్-18వ సీజన్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ ఓపెనింగ్ సెర్మనీకి కూడా ఆటంకం కలిగే అవకాశముంది.కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రోజున వర్ష శాతం అంచనా(అక్యూ వెదర్ ప్రకారం)7-8PM- 10%8-9 PM- 50%9-10PM-70%10-11 PM- 70%కేకేఆర్: అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్, అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, అన్రిచ్ నార్ట్జే, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, స్పెన్సర్ జాన్సన్, లవ్‌నీత్ సిసోడియా, అనుకుల్ రాయ్, మొయిన్ అలీ, చేతన్ సకారియాఆర్సీబీ: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భాండాగే, జాకబ్ బెతేల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికార, లుంగి ఎన్గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాథీచదవండి: IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. బౌలర్లకు పండగే? -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. రూ. 12 కోట్ల ఆటగాడు వచ్చేస్తున్నాడు?
ఐపీఎల్-2025కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అదిరిపోయే వార్త అందింది. గత కొంతకాలంగా మెకాలి గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. గతేడాది ఆఖరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రూ.12.50 కోట్ల భారీ ధరకు హేజిల్‌వుడ్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. 34 ఏళ్ల హేజిల్‌వుడ్.. భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ప్రక్కటెముకల గాయం బారిన పడ్డాడు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే అతడు వైదొలగాడు. అనంతరం ఇదే గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. అయితే తాజాగా హాజిల్‌వుడ్‌కు నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హాజిల్‌వుడ్ ఐపీఎల్లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి క్లియరెన్స్ పొందినట్లు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ ఈఎస్పీఎన్ వెల్లడించింది. అతడు త్వరలోనే భారత గడ్డపై అడుగుపెట్టే అవకాశముంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా కన్పిస్తోంది.ఆర్సీబీ బౌలింగ్ యూనిట్లో భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎంగిడి, జోష్ హేజెల్‌వుడ్ వంటి హేమహేమీలు ఉన్నారు. హాజిల్‌వుడ్ చివరగా 2023 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకే ఆడాడు. ఇక ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడనున్నాయి.ఆర్సీబీ తలరాత మారుతుందా?కాగా ఐపీఎల్ సీజన్లు మారుతున్నప్పటికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలరాత మాత్రం మారడం లేదు. తొలి సీజన్ ఆడుతున్నప్పటికీ కనీసం ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. కనీసం 18వ ఎడిషన్‌లో అయినా ఛాంపియన్స్‌గా నిలవాలని ఆర్సీబీ భావిస్తోంది. తొలిసారి 2009లో ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరుకున్న ఆర్సీబీ డక్కన్ ఛార్జెస్‌పై ఓడిపోయింది. 2011లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్‌పై, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఫైనల్స్‌లో ఓటమి పాలైందిఐపీఎల్-2025కు బెంగళూరు జట్టురజత్ పటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికర, లియామ్ లివింగ్స్టన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫార్డ్, మనోజ్, జోష్ హేజెల్‌వుడ్, రషిక్ దార్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, లుంగీ ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్, యశ్ దయాల్.చదవండి: ఉన్నదే ఒక్కడు.. మీరు కాస్త నోళ్లు మూయండి: పాక్ మాజీ స్పిన్నర్ ఫైర్ -
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 141 పరుగులకు ఢిల్లీ ఆలౌట్
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది.రేణుకా సింగ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఫామ్‌లో ఉన్న షఫాలీ వర్మను ఔట్ చేసి ఢిల్లీకి షాకిచ్చింది. ఆ తర్వాత కెప్టెన్ లానింగ్, రోడ్రిగ్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ లానింగ్(17), రోడ్రిగ్స్ ఔటయ్యాక ఢిల్లీ వికెట్ల పతనం మొదలైంది.ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్, జార్జియా వేర్హామ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, ఏక్తా బిస్త్ తలా రెండు వికెట్లు సాధించారు. ఢిల్లీ బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సారా బ్రైస్(23), అన్నాబెల్ సదర్లాండ్(19) రాణించారు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, మారిజాన్ కాప్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), శిఖా పాండే, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్: స్మృతి మంధాన(కెప్టెన్), డానియెల్ వ్యాట్-హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, రఘ్వీ బిస్ట్, రిచా ఘోష్(వికెట్ కీపర్), కనికా అహుజా, జార్జియా వేర్హామ్, కిమ్ గార్త్, ఏక్తా బిష్త్, జోషిత VJ, రేణుకా ఠాకూర్ -
ఐపీఎల్-2025 షెడ్యూల్ ఖారారు! తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
క్రికెట్ ప్రేమికులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్(IPL 2025) 18వ సీజన్ షెడ్యూల్‌ను పాలక మండలి ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానునున్నట్లు సమాచారం. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ మొదటి మ్యాచ్‌లో మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. అదే రోజు ఆదివారం చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 12 రోజుల తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది.మే 25న ఫైనల్‌కు కూడా కోల్‌కతానే వేదిక కానుండగా... క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే జరుగుతాయి. పది జట్లు పాల్గొనే ఈ టోర్నీలో పది టీమ్‌ల సొంత మైదానాలతో పాటు రెండు ఇతర వేదికలు (ధర్మశాల, గువహటి) కలిపి మొత్తం 12 చోట్ల లీగ్‌ను నిర్వహిస్తారు.రాజస్తాన్ రాయల్స్ టీమ్‌కు గువహటి తమ రెండో సొంత వేదిక కాగా...ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా పంజాబ్ కింగ్స్ తమ మూడు హోం మ్యాచ్‌లను ధర్మశాలలో ఆడుతుంది. అయితే ఐపీఎల్ వర్గాల నుంచి మాత్రం అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారింగా షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.ఆర్సీబీ కెప్టెన్‌గా పాటిదార్..తాజాగా ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్‌గా మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్‌ను ఎంపిక చేసింది. అంతా విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ పగ్గాలు చేపడతాడని భావించారు. కానీ అందుకు కోహ్లి సముఖత చూపలేదని, పాటిదార్ పేరును సూచించినట్లు తెలుస్తోంది. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు ఫ్రాంచైజీలు గత సీజన్లో తమ కెప్టెన్లగా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌ను మెగా వేలంలోకి విడిచిపెట్టాయి. అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. పంత్ లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా నియమితుడయ్యాడు.చదవండి: ఆఖరి బంతికి ఢిల్లీ గెలిచింది -
మహిళల ప్రీమియర్ లీగ్ లో బోణీ కొట్టిన బెంగళూరు
-
ఆర్సీబీలోకి ఆసీస్ స్టార్ ప్లేయర్లు..
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్‌కు సర్వం సిద్ధమవుతుండగా... కొన్ని జట్లు గాయపడిన ప్లేయర్ల స్థానాలను భర్తీ చేసుకున్నాయి. యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ అలీసా హీలీ (ఆ్రస్టేలియా) కాలి పాదం గాయంతో సీజన్ మొత్తానికి దూరమవడంతో ఆమె స్థానాన్ని వెస్టిండీస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ చినెల్లి హెన్రీతో భర్తీ చేసుకుంది. ఇప్పటివరకు 62 అంతర్జాతీయ టి20లు ఆడిన జమైకన్ ఆల్‌రౌండర్ 22 వికెట్లు తీయడంతో పాటు 473 పరుగులు చేసింది. రూ.30 లక్షల ప్రాథమిక ధరతో ఆమెను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. గాయం కారణంగా డబ్ల్యూపీఎల్ టోర్నీకి దూరమవడం బాధాకరమని హీలీ చెప్పింది. ఆమె ఇటీవల మహిళల యాషెస్ సిరీస్‌లో ఆ్రస్టేలియాకు సారథిగా వ్యవహరించింది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB Women) ఫ్రాంచైజీ రెండు మార్పులు చేసింది. వ్యక్తిగత కారణాలతో 35 ఏళ్ల వెటరన్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ (న్యూజిలాండ్), కేట్ క్రాస్ (ఇంగ్లండ్)లిద్దరూ ఈ సీజన్ నుంచి తప్పుకోవడంతో వారి స్థానాలను ఆ్రస్టేలియా ప్లేయర్లు హీథెర్ గ్రాహమ్, కిమ్ గార్త్లతో భర్తీ చేసుకుంది. వీళ్లిద్దరిని చెరో రూ. 30 లక్షల ఫీజుతో తీసుకున్నట్లు ఆర్సీబీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 14 నుంచి వడోదరలో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ పోటీలు జరుగుతాయి.ఆర్సీబీ మహిళల జట్టుస్మృతి మంధాన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లీస్ పెర్రీ, జార్జియా వేర్హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభనా, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిష్త్, హీథెర్ గ్రాహమ్, కిమ్ గార్త్, కనికా అహుజా, డాని వ్యాట్, ప్రేమ రావత్,జోషిత విజె, రాఘవి బిస్త్ ,, జాగ్రవి పవార్.యూపీ జట్టుచినెల్లి హెన్రీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, రాజేశ్వరి గయాక్వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, వృందా దినేష్, సైమా ఠాకోర్, పూనమ్ ఖేమ్నార్, చౌమరి సుల్తానా, చౌమరి సుల్తానా.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి -
Rishabh Pant: అయ్యర్ రికార్డు బ్రేక్.. కోట్లు కొల్లగొట్టిన పంత్! లక్నో సొంతం
ఐపీఎల్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అత్యంత భారీ ధర పలికాడు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆదిలోనే పోటీకి దిగాయి. ఇరు ఫ్రాంఛైజీలు పంత్ కోసం హోరాహోరీగా తలపడి వేలం మొదలైన కాసేపటికే ధరను రూ. 10 కోట్లకు పెంచాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వచ్చిఆ తర్వాత కూడా తగ్గేదేలే అన్నట్లు పంత్ ధరను పెంచుతూ పోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వచ్చి.. రూ. 13 కోట్లకు పెంచింది. ఈ క్రమంలో ఆర్సీబీ తప్పుకోగా.. హైదరాబాద్, లక్నో నువ్వా- నేనా అన్నట్లు దూకుడు పెంచాయి. శ్రేయస్ అయ్యర్ రికార్డు బ్రేక్అయితే, రూ. 20 కోట్లకు ధర పెరిగిన తర్వాత హైదరాబాద్ పోటీ నుంచి తప్పుకొంది. అయితే, అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ ద్వారా రేసులోకి రాగా.. లక్నో అమాంతం ఏడు కోట్లు పెంచింది. మొత్తంగా రూ. 27 కోట్ల భారీ ధరకు పంత్‌ను లక్నో సొంతం చేసుకుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ రికార్డు బ్రేక్ అయింది.పడిలేచిన కెరటంకాగా 2022 చివర్లో పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రమైన గాయాలపాలైనా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023 మొత్తానికి దూరమైన పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఈ ఏడాది పునరాగమనం చేశాడు. ఈ సీజన్లో మొత్తంగా 13 ఇన్నింగ్స్‌లో కలిపి 446 పరుగులు చేశాడు. సారథిగా జట్టును ప్లే ఆఫ్స్ చేర్చలేకపోయినా.. ఆరో స్థానంలో నిలపగలిగాడు. ఇక టీమిండియా తరఫున రీఎంట్రీలో కూడా అదరగొడున్నాడు. అయితే, వేలానికి ముందు ఢిల్లీ అతడిని వదిలేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో పంత్ ఇప్పటి వరకు 111 మ్యాచ్‌లు ఆడి 3284 పరుగులు సాధించాడు.ఇప్పటి వరకు ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు👉రిషభ్ పంత్(లక్నో సూపర్ జెయింట్స్- 2025)- రూ. 27 కోట్లు(వికెట్ కీపర్ బ్యాటర్- టీమిండియా)👉శ్రేయస్ అయ్యర్(పంజాబ్ కింగ్స్- 2025)- రూ. 26.75 కోట్లు(బ్యాటర్- టీమిండియా)👉మిచెల్ స్టార్క్(కోల్‌కతా నైట్ రైడర్స్- 2024)- రూ. 24.75 కోట్లు(పేస్ బౌలర్)👉ప్యాట్ కమిన్స్(సన్‌రైజర్స్ హైదరాబాద్- 2024)- రూ. 20.5 కోట్లు(పేస్ బౌలర్- ఆస్ట్రేలియా)👉సామ్ కర్రాన్(పంజాబ్ కింగ్స్- 2023)- రూ. 18.50 కోట్లు(ఆల్‌రౌండర్- ఇంగ్లండ్).చదవండి: IPL 2025: కేఎల్ రాహుల్‌కు భారీ షాక్..𝗥𝗲𝗰𝗼𝗿𝗱-𝗯𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 🔝Snippets of how that Historic bidding process panned out for Rishabh Pant 🎥 🔽 #TATAIPLAuction | #TATAIPL | @RishabhPant17 | @LucknowIPL | #LSG pic.twitter.com/grfmkuCWLD— IndianPremierLeague (@IPL) November 24, 2024 -
చహల్ కోసం పోటా పోటీ.. రూ.12 కోట్లకు కొనుక్కున్న ఆర్సీబీ!?
ఐపీఎల్-2025 మెగా వేలానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబర్ 24, 25వ తేదీలలో జెడ్డా వేదికగా ఈ మెగా ఆక్షన్ జరగనుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి.ఈ మెగా వేలం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్లను ఏ ఫ్రాంచైజీ దక్కుంచుకుంటుందోనని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కోసం ఫ్యాన్స్ ఆన్లైన్లో మాక్ వేలం నిర్వహించారు. ఈ మెగా వేలం కోసం చహల్ తన కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో రూ. 2 కోట్ల బిడ్డింగ్ నుంచే మాక్ వేలం ప్రారంభమైంది. ఈ క్రమంలో చాహల్ కోసం తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్,గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అయితే రూ.9 కోట్లకు పైగా ఆర్సీబీ వెచ్చించేందుకు సిద్దం కావడంతో పోటీ నుంచి పంజాబ్, గుజరాత్ తప్పుకొన్నాయి. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పోటీలోకి వచ్చింది. చహల్ కోసం రూ. 11.5 కోట్లకు బిడ్ వేసింది. ఆఖరికి ఈ మాక్ వేలంలో చాహల్‌ను రూ. 12 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. చహల్ ఐపీఎల్ జర్నీ ఇదే.. చహల్ 2013లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతడు ఆర్సీబీకి 8 సీజన్ల పాటు ప్రాతినిథ్యం వహించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీకి ఎన్నో అద్బుత విజయాలు అందించాడు. కానీ ఆర్సీబీ ఫ్రాంచైజీ మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడిని రాజస్తాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. రాజస్తాన్ తరపున తొలి సీజన్లోనే పర్పుల్ క్యాప్‌ను చహల్ గెలుచుకున్నాడు. ఇప్పుడు రాజస్తాన్ కూడా చహల్ మెగా వేలంలోకి విడిచిపెట్టింది. ఈ మెగా వేలంలో చహల్‌ను ఆర్సీబీ మళ్లీ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. కాగా చహల్ ప్రస్తుతం ఐపీఎల్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు 155 మ్యాచ్‌లు ఆడిన చహల్.. 22.12 సగటుతో 200 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా టీమిండియా తరఫున టీ20లలో అత్యధిక వికెట్ల(96) వీరుడిగానూ ఉన్నాడుచదవండి: NPL 2024: మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్న శిఖర్ ధావన్.. -
IPL 2025 Mega Auction: కేఎల్ రాహుల్‌కు రూ.20 కోట్లు! ఆర్సీబీ కెప్టెన్‌గా?
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత మూడు సీజన్లలో తమ సారథిగా వ్యవహరించిన రాహుల్‌ను లక్నో ఈసారి రిటైన్ చేసుకోలేదు.దీంతో ఈ కర్ణాటక బ్యాటర్-కీపర్ నవంబర్ 24-25 తేదీలలో జెడ్డాలో వేదికగా జరగనున్న మెగా వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అయితే చాలా మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానులు రాహుల్ తన సొంత గూటికి చేరాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్-2025లో సీజన్లో కేఎల్ ఆర్సీబీ తరపున ఆడితే చూడాలని ఆశపడుతున్నారు. కాగా గతంలో రాహుల్ ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. రాహుల్‌కు రూ.20 కోట్లు!ఈ క్రమంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ అభిమానుల కోసం తాజాగా బెంగళూరులో మాక్ వేలం నిర్వహించింది. ఈ వేలంలో చాలా మంది అభిమానులు పాల్గోన్నారు. కేఎల్ రాహుల్‌ను సొంతం చేసుకోవడానికి రూ. 20 కోట్లు వెచ్చిందేందుకు ఫ్యాన్స్ సిద్దమయ్యారు. మరికొంతమంది ఫ్యాన్స్ రిషబ్ పంత్ కోసం పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఆర్సీబీ కెప్టెన్‌గా రాహుల్?అయితే ఆర్సీబీ యాజమాన్యం కూడా రాహుల్‌పై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలు అప్పగించాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సమాచారం. తమ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌ను వేలంలోకి ఆర్సీబీ విడిచిపెట్టింది. విరాట్ కోహ్లి,యశ్ దయాల్, పాటిదార్‌ను మాత్రం బెంగళూరు రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ పర్స్‌లో ప్రస్తుతం రూ. 83 కోట్లు ఉన్నాయి.చదవండి: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. ఎమోషనల్ వీడియో! స్త్రీగా మారినందు వల్ల -
WPL 2025: రిటైన్ చేసుకున్న భారత్ ప్లేయర్లు వీరే
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలానికి ముందు ఐదు జట్లు కూడా తమ ప్రధాన ప్లేయర్లను అట్టి పెట్టుకున్నాయి. భారత స్టార్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లతో పాటు మెగ్ లానింగ్, మరిజాన్ కాప్, అమెలియా కెర్, అనాబెల్ సదర్లాండ్లను కూడా ఆయా టీమ్‌లు అట్టి పెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ వేలం డిసెంబర్ నెల మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ప్లేయర్లను తీసుకోవడం కోసం లీగ్ టీమ్‌లకు గత సీజన్లో గరిష్టంగా రూ.13 కోట్ల 50 లక్షల పరిధి విధించగా... ఇప్పుడు మరో కోటిన్నర పెంచి దానిని రూ. 15 కోట్లు చేశారు. ఒక్కో టీమ్‌లో 18 మంది చొప్పున మొత్తం 90 మందికి డబ్ల్యూపీఎల్‌లో అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం 71 మందిని టీమ్‌లు రీటెయిన్ చేసుకున్నాయి. దాంతో 19 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. టీమ్‌లు వదిలేసుకున్న ఆటగాళ్లలో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా, తహుహు, క్యాథరీన్ బ్రైస్, వేద కృష్ణమూర్తి, హీతర్ నైట్, ఇసీ వాంగ్, హైదరాబాద్ ప్లేయర్ చొప్పదండి యషశ్రీ ఉన్నారు. రీటెయిన్ చేసుకున్న భారత ప్లేయర్ల వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా, షఫాలీ, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి (హైదరాబాద్), శిఖా పాండే, తానియా భాటియా, మిన్ను మణి, స్నేహ దీప్తి (ఆంధ్రప్రదేశ్), టిటాస్ సాధు. గుజరాత్ జెయింట్స్: హేమలత, తనూజ, షబ్నమ్ షకీల్ (ఆంధ్రప్రదేశ్), ప్రియా మిశ్రా, త్రిష పూజిత, మన్నత్, మేఘనా సింగ్. ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్, అమన్‌దీప్, అమన్‌జోత్, జింతిమణి, కీర్తన, పూజ వస్త్రకర్, సజన, సైకా ఇషాఖ్, యస్తిక భాటియా. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, రిచా ఘోష్, సబ్బినేని మేఘన (ఆంధ్రప్రదేశ్), శ్రేయాంక పాటిల్, ఆశ శోభన, రేణుకా సింగ్, ఏక్తా బిస్త్, కనిక. యూపీ వారియర్స్: కిరణ్ నవ్‌గిరే, శ్వేత సెహ్రావత్, దీప్తి శర్మ, సైమా ఠాకూర్, అంజలి శర్వాణి (ఆంధ్రప్రదేశ్), గౌహర్ సుల్తానా (హైదరాబాద్), ఉమా ఛెత్రి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ ఖెమ్నార్, వృంద దినేశ్. -
14 మందిని రిటైన్ చేసుకున్న ఆర్సీబీ.. కెప్టెన్‌గా మళ్లీ..!
మహిళల ఐపీఎల్ 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) తమ రిటెన్షన్ జాబితాలను ఇవాళ (నవంబర్ 7) ప్రకటించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ సైతం తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. వచ్చే సీజన్ కోసం ఆర్సీబీ 14 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకుని ఆరుగురిని వేలానికి వదిలేసింది. వేలానికి వదిలేసిన వారిలో ఒక ఓవర్సీస్ ప్లేయర్ ఉన్నారు. ఓ జట్టుకు ఆరుగురు ఓవర్సీస్ ప్లేయర్ల రూల్ నేపథ్యంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ నదినే డి క్లెర్క్‌కు వేలానికి వదిలేసింది. డి క్లెర్క్ స్థానంలో ఆర్సీబీ గత నెలలో ఇంగ్లండ్ అటాకింగ్ బ్యాటర్ డ్యానీ వాట్‌ను యూపీ వారియర్జ్ నుంచి ట్రేడింగ్ చేసుకుంది. ముంబై యాజమాన్యం వాట్‌ను 30 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ విడుదల చేసిన మరో ఐదుగురు ప్లేయర్లు (దిషా కసత్, ఇంద్రాణి రాయ్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్) భారతీయ ప్లేయర్లే కావడం విశేషం.ఓవరాల్‌గా చూస్తే ఆర్సీబీ టైటిల్ విన్నింగ్ టీమ్‌ను దాదాపుగా కొనసాగించిందనే చెప్పాలి. ఆర్సీబీ మరో సీజన్‌కు స్మృతి మంధననే కెప్టెన్‌గా కొనసాగించింది. గత సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఎల్లిస్ పెర్రీ, సోఫీ డివైన్, సోఫీ మోలినెక్స్ వచ్చే సీజన్లో కూడా కొనసాగనున్నారు. వీరితో పాటు దేశీయ స్టార్లు రిచా ఘోష్, రేణుక సింగ్ ఠాకూర్ ఆర్సీబీ యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. రిటెన్షన్ల ప్రక్రియ అనంతరం ఆర్సీబీ పర్స్‌లో ఇంకా రూ. 3.25 కోట్ల బ్యాలెన్స్ మిగిలి ఉంది. ఈ మొత్తంతో ఆర్సీబీ మరో నలుగురు లోకల్ ప్లేయర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. పేస్ బౌలింగ్ విభాగంలో రేణుకా సింగ్, ఎల్లిస్ పెర్రీ మాత్రమే ఉండటంతో ఈసారి వేలంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ లోకల్ పేసర్లపై గురి పెట్టవచ్చు. డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది. కాగా, తొలి సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ గత సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్లే..స్మృతి మంధన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, కనిక అహుజా, డానీ వాట్ (యూపీ నుంచి ట్రేడింగ్)ఆర్సీబీ వదిలేసిన ఆటగాళ్లు..దిషా కసత్, ఇంద్రాణి రాయ్, నదినే డి క్లెర్క్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్ -
మీ ఇంగితానికే వదిలేస్తున్నా: రిషభ్ పంత్ ఆగ్రహం
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌కు కోపమొచ్చింది. తన గురించి అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలని.. మరీ ఇంత చెత్తగా ఎలా తయ్యారంటూ గాసిప్ రాయుళ్లకు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడం దుర్మార్గమని పేర్కొన్నాడు.ఆర్సీబీని అడిగితే నో చెప్పిందిఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ పంత్‌ను ఉద్దేశించి ఓ పోస్టు పెట్టాడు. ‘‘రిషభ్ పంత్ తన మేనేజర్ ద్వారా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీని సంప్రదించాడు.అక్కడ కెప్టెన్సీ పదవి ఖాళీగా ఉంటే.. తనకు ఇవ్వమని కోరాడు. కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ అతడి అభ్యర్థనను తిరస్కరించింది. విరాట్‌కు పంత్ అక్కడికి రావడం ఇష్టం లేదు.ఎందుకంటే.. భారత క్రికెట్ జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌లో మాదిరి ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తాడని విరాట్ భయపడ్డాడు. ఆర్సీబీ వర్గాల ద్వారా ఈ విషయం తెలిసింది’’ అని సదరు యూజర్ పేర్కొన్నారు. ఇందుకు పంత్ ఘాటుగా స్పందించాడు.మీ ఇంగితానికే అంతా వదిలేస్తా..‘‘నకిలీ వార్తలు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు ప్రచారం చేస్తున్నారు. కాస్త పద్ధతిగా ప్రవర్తించండి గయ్స్. కారణం లేకుండా ఇలాంటివి రాసి.. ఎందుకు ప్రశాంతంగా ఉండేవాళ్ల మనసులను చెడగొడతారు.అయినా... ఇలాంటి వదంతులు ఇదే మొదటిసారి కాదు.. ఇదే ఆఖరూ కాదు. కానీ పరిస్థితి రోజురోజుకీ మరింత చెత్తగా మారుతోంది. ఇక మీ ఇంగితానికే అంతా వదిలేస్తా. ఇది కేవలం మీ ఒక్కరికే కాదు.. మీలా అవాస్తవాలు ప్రచారం చేసే వాళ్లందరికీ వర్తిస్తుంది’’ అని రిషభ్ పంత్ ఎక్స్ వేదికగా చురకలు అంటించాడు.కాగా ఐపీఎల్లో పంత్ చాలా కాలంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. రోడ్డు ప్రమాదం అనంతరం.. ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చిన.. ఈ లెఫ్టాండర్ 446 పరుగులు చేశాడు. అయితే, కెప్టెన్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. జట్టును ఆరో స్థానంలో నిలిపాడు. చదవండి: షకీబ్ అల్ హసన్ సంచలన ప్రకటన.. టెస్టులకు గుడ్‌బై Fake news . Why do you guys spread so much fake news on social media. Be sensible guys so bad . Don’t create untrustworthy environment for no reason. It’s not the first time and won’t be last but I had to put this out .please always re check with your so called sources. Everyday…— Rishabh Pant (@RishabhPant17) September 26, 2024 -
డుప్లెసిస్పై వేటు..? ఆర్సీబీ కెప్టెన్‌గా ఊహించని ఆటగాడు!
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటైన్ జాబితాను సిద్దం చేసే పనిలో పడ్డాయి. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి ఇంకా రిటెన్షన్ పక్రియకు సంబంధించి ఎటువంటి గైడ్‌లైన్స్ రానిప్పటకి.. ఆయా జట్లు మాత్రం ఇప్పటినుంచే తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. మెగా వేలంకు ముందు ఎవరనీ విడిచిపెట్టాలి, ఎవరిని రిటైన్ చేసుకోవాలి అన్న ఆంశాలపై ఫ్రాంచైజీలు ఓ నిర్ణయంకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పలు సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్పై వేటు వేయాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.డుప్లెసిస్‌తో పాటు ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను సైతం వేలంలోకి విడిచిపెట్టాలని ఆర్సీబీ నిర్ణయించుకున్నట్లు వినికిడి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పాటు రజత్ పటిదార్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను రిటైన్ చేసుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించే ఆలోచనలో ఆర్సీబీ యాజమాన్యం ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చనడుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పాటిదార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్‌లో నిరాశపరిచిన పాటిదార్.. సెకెండ్ హాఫ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 15 మ్యాచ్‌లు ఆడి 398 పరుగులు చేశాడు.గ్రీన్‌కు గుడ్ బై.. ?అదే విధంగా 2024 మినీ వేలం లో రూ.11 కోట్ల రూపాయలకు దక్కించుకున్న అల్జారీ జోసెఫ్ తో పాటు ట్రేడింగ్ ద్వారా రూ. 17 కోట్లకు దక్కించుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సైతం వేలంలోకి వచ్చే అవకాశముంది.ఐపీఎల్-2024లో పర్వాలేదన్పించిన ఆర్సీబీ.. లిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. 2024 ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. -
ఒకవేళ అదే జరిగితే ఆర్సీబీకి ఆడుతా: రింకూ సింగ్
ఐపీఎల్-2025 మెగా వేలానికి బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇంకా ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్‌పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం ఇంకా ఎటువంటి ఆధికారిక ప్రకటన చేయలేదు.వాస్తవానికి మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు గరిష్టంగా ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొని మిగతా ఆటగాళ్లను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని గత నెలలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్‌లో కూడా ఆయా ఫ్రాంచైజీలు ప్రస్తావించాయి. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం ఆయా ఫ్రాంచైజీల అభ్యర్ధననను తిరష్కరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మెగా వేలాన్ని ఈ ఏడాది చివరలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టే ఆయా ఫ్రాంచైజీలు కూడా తమ జట్టులో సమూల మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆర్సీబీకి ఆడాలని ఉంది: రింకూ ఇక ఐపీఎల్ మెగా వేలం వార్తల నేపథ్యంలో టీమిండియా ఫినిషర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఒకవేళ కేకేఆర్ అతడిని రిటైన్ చేసుకోపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడాలన్న తన కోరికను రింకూ వ్యక్తపరిచాడు. విరాట్ కోహ్లి ఆర్సీబీలో ఉన్నందున ఆ ఫ్రాంచైజీకి ఆడాలనకుంటున్నట్లు అతడు తెలిపాడు.కాగా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి రింకూ కేకేఆర్ తరపున ఆడుతున్నాడు. కొన్ని సీజన్లలో అతడిని కోల్‌కతా వేలంలోకి విడిచిపెట్టినప్పటకి తిరిగి మళ్లీ సొంతం చేసుకుంది. ఆ జట్టు ఫినిషర్‌గా రింకూ మారాడు. అయితే ఈ ఏడాది సీజన్లతో కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలిచినప్పటకి రింకూ మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో కేకేఆర్ తరపున 45 మ్యాచ్‌లు ఆడిన రింకూ 143.34 స్ట్రైక్ రేటుతో 893 పరుగులు చేశాడు. -
ముంబై ఇండియన్స్ కాదు.. నా ఫేవరేట్ ప్రత్యర్ధి ఆ జట్టే: కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆదివారం(ఆగస్టు 18)తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో విరాట్ సరదాగా ముచ్చటించాడు. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ నుంచి పలు ప్రశ్నలు కోహ్లికి ఎదురయ్యాయి. తన ఫేవరేట్ క్రికెటర్లను ఎంచుకోమని ఎంఎస్ ధోని, ఎబీ డివిలియర్స్ పేర్లు అప్షన్స్ ఇవ్వగా.. కోహ్లి ఇద్దరూ కూడా తనకు ఇష్టమైన వారేనని తెలివగా సమాధనమిచ్చాడు. ఆ తర్వాత తనకు ఇష్టమైన షాట్ ఫ్లిక్ లేదా కవర్ డ్రైవ్? అని అడగ్గా.. అందుకు కవర్ డ్రైవ్ తన ఫేవరేట్ షాట్ అని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఐపీఎల్లో తన ఫేవరేట్ ప్రత్యర్ధి జట్టు ఏదన్న ప్రశ్న కోహ్లికి ఎదురైంది. అందుకు అప్షన్స్గా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు కాస్త సమయం తీసుకున్న కోహ్లి.. ఆలోచించి కేకేఆర్‌ను తనకు ఇష్టమైన ప్రత్యర్ధిగా ఎంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా భారత జట్టుతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కూడా విరాట్ రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగతున్నాడు. 2008 తొలి సీజన్ నుంచి ఆర్సీబీలోనే కోహ్లి ఉన్నాడు.తొట్టతొలి సీజన్ నుంచి ఒక ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లినే. ఇక ఐపీఎల్లో కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్ అంటే అభిమానలకు పండగే. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు హోరహోరీగా జరుగుతాయి. ఇప్పటివరకు ఇరు జట్లు 34 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. ఆర్సీబీ 14 సార్లు గెలుపొందింది. -
ఆర్సీబీ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..? కార్తీక్ రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని రోహిత్ శర్మ వీడనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది సీజన్‌కు ముందు ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి తమ జట్టు పగ్గాలను ముంబై ఇండియన్స్ కట్టబెట్టింది. దీంతో అప్పటినుంచి తన జట్టు యాజమాన్యంపై హిట్‌మ్యాన్ అసంతృప్తిగా ఉన్నాడు. ఐపీఎల్-2024 సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. అప్పటి కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో ముంబై ఇండియన్స్ గురించి రోహిత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ముంబై జట్టుతో ఇదే నా చివరి సీజన్ అని హిట్‌మ్యాన్ అన్న మాటలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ క్రమంలోనే ముంబైని వీడి ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలంలో రోహిత్ భాగం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రోహిత్ శర్మ వేలంలోకి వస్తే ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేయడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న డుప్లెసిస్పై వేటు వేసి రోహిత్ శర్మ తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజా ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్, ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్‌ను అభిమానులు ప్రశ్నించారు. డీకే ఇటీవలే క్రిక్‌బజ్ చిట్‌చాట్‌లో పాల్గోనున్నాడు. ఈ సందర్భంగా ఐపీఎల్-2025లో ఆర్సీబీకి రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడా అని ఓ అభిమాని డీకేను ప్రశ్నించాడు. అందుకు బదులుగా కార్తీక్ షాకింగ్ రియాక్షన్ ఇస్తూ సైలెంట్‌గా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. What changes should #India make ahead of #ChampionsTrophy? 🤔Why did #Rohit & Co. struggle against spinners❓#LaapataaLadies to #Maharaja: A special binge-watch list for cricketers! 🎦@DineshKarthik talks about it all, only on #heyCB, here ⬇️ pic.twitter.com/e6Q2ipzZei— Cricbuzz (@cricbuzz) August 11, 2024 -
గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం..!?
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు దాదాపు అన్ని ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సీజన్‌కు ముందు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను విడిచిపెట్టాలని ఆర్సీబీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాక్సీ కూడా ఆర్సీబీతో కొనసాగేందుకు సముఖత చూపడం లేదని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. తాజాగా మాక్స్వెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్సీబీ పేజిని ఆన్ ఫాలో చేయడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోందికాగా ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ను ఐపీఎల్-2021 మెగా వేలంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ 14.25 కోట్ల భారీ మొత్తానికి కొనుగొలు చేసింది. ఆ తర్వాతి ఏడాదిలో రూ.11 కోట్లకు మాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్-2023, 24 సీజన్లలో కూడా అతడికి ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. అయితే ఈ ఏడాది సీజన్ మినహా మిగితా సీజన్లలో మాక్సీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2024లో అయితే మాక్స్వెల్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కేవలం 52 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆర్సీబీ తరపున తన డెబ్యూ సీజన్లో మాక్స్వెల్ ఏకంగా 513 పరుగులు చేశాడు. కాగా ఏడాది డిసెంబర్లో ఐపీఎల్-2025 మెగా వేలం జరగనుంది. ఒకవేళ మాక్స్వెల్ వేలంలో వస్తే భారీ మొత్తం దక్కడం ఖాయం. 🚨 Glenn Maxwell Unfollowed #RCB on Instagram #IPL2025 #CricketTwitter pic.twitter.com/8EFfex3165— RCBIANS OFFICIAL (@RcbianOfficial) July 29, 2024 -
IPL 2025: డుప్లెసిస్‌కు షాక్.. ఆర్సీబీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!?
ఐపీఎల్-2025 సీజన్‌కు పలు ఫ్రాంచైజీలు భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి లక్నో సూపర్ జెయింట్స్. వచ్చే ఏడాది సీజన్‌కు ముందు తమ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను విడిచిపెట్టాలని లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దైనిక్ జాగరణ్ రిపోర్ట్ ప్రకారం.. కేఎల్ రాహుల్, లక్నో మేనేజ్మెంట్ మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడిని లక్నో విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు సదరు పత్రిక పేర్కొంది. రాహుల్ కూడా లక్నో మేనేజ్మెంట్ పైన ఆంసతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది సీజన్లో ఎల్ఎస్జి యజమాని సంజీవ్ గోయెంకా, రాహుల్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు పలు ఊహాగానాలు వినిపించాయి.ఆ తర్వాత రాహుల్, గోయెంకా ఇద్దరూ ఈ ఊహాగానాలను ఖండించినప్పటికి.. క్రికెట్ వర్గాల్లో మాత్రం ఇంకా ఈ చర్చనడుస్తోంది. రాహుల్ సారథ్యంలోని ఎల్ఎస్జి రెండు సార్లు ఫ్లే ఆఫ్స్‌కు చేరింది. కానీ ఈ ఏడాది సీజన్లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.ఆర్సీబీ కెప్టెన్‌గా రాహుల్?ఇక కేఎల్ రాహుల్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కన్నేసినట్లు తెలుస్తోంది. మెగా వేలానికి ముందు ఎల్ఎస్జి నుంచి రాహుల్‌ను ట్రేడ్ చేసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వయస్సు 40కి చేరుకోవడంతో.. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కొత్త కెప్టెన్‌ను ఫ్రాంచైజీ వెతుకుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేఎల్ రాహల్‌ను సొంతం చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఆర్సీబీ యాజమాన్యం యోచిస్తున్నట్లు వినికిడి. కాగా కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌ను ఆర్సీబీ ఫ్రాంచైజీతో ప్రారంభించాడు. -
కోచ్‌గా దినేశ్ కార్తీక్
టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. డీకే.. తన తాజా మాజీ జట్టైన ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వచ్చే సీజన్ (2025) నుంచి డీకే కొత్త విధుల్లో చేరతాడని ఆర్సీబీ పేర్కొంది. "సరికొత్త అవతారంలో మరోసారి మాలో భాగమవుతున్న దినేష్ కార్తీక్‌కు స్వాగతం"అని ఆర్సీబీ ట్వీట్లో రాసుకొచ్చింది.39 ఏళ్ల డీకే.. ఈ ఏడాదే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (2008, 2009, 2010, 2014) ఐపీఎల్ ప్రస్తానాన్ని ప్రారంభించిన కార్తీక్.. గత మూడు సీజన్లలో ఆర్సీబీకి (2024, 2023, 2022) ప్రాతినిథ్యం వహించాడు. ఈ మధ్యలో కార్తీక్.. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2011), ముంబై ఇండియన్స్ (2012, 2013), ఆర్సీబీ (2015), గుజరాత్ లయన్స్ (2016, 2017), కేకేఆర్ (2018, 2019, 2020, 2021) ఫ్రాంచైజీలకు ఆడాడు.ఐపీఎల్ ఆరంభ ఎడిషన్ (2008) నుంచి ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో (ఏడుగురు) కార్తీక్ ఒకడు. ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సాహా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ మాత్రమే ఇనాగురల్ ఎడిషన్ నుంచి ఐపీఎల్ ఆడారు. ఇప్పటివరకు జరిగిన 16 ఎడిషన్లలో పాల్గొన్న కార్తీక్ కేవలం రెండే రెండు మ్యాచ్‌లు మిస్ అయ్యాడు. ఐపీఎల్లో కార్తీక్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. డీకే.. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. డీకే, రోహిత్ శర్మ ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు ధోని (264) పేరిట ఉంది. డీకే తన ఐపీఎల్ కెరీర్లో 135.36 స్ట్రయిక్‌రేట్‌తో 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కార్తీక్ ఖాతాలో 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు ఉన్నాయి.Dinesh Karthik talking about RCB and he continues to be with this family. ❤️- RCB 🤝 DK...!!!! pic.twitter.com/TiHTs3yjaA— Tanuj Singh (@ImTanujSingh) July 1, 2024కార్తీక్ కెరీర్‌ను 2022 ఐపీఎల్ ఎడిషన్ మలుపు తప్పింది. ఆ సీజన్లో పేట్రేగిపోయిన కార్తీక్ మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీజన్ ప్రదర్శన కారణంగా అతనికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. 2024 సీజన్లోనూ కార్తీక్ చెలరేగి ఆడాడు. ఈ సీజన్లో అతను 187.35 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. -
ఆరెంజ్ క్యాప్ తో ఐపీఎల్ ట్రోఫీని గెలవలేరు.. కోహ్లిపై రాయుడు ఫైర్!?
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసి కేకేఆర్ ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అయితే కేకేఆర్ విజయం అనంతరం మాట్లాడిన టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు.. సంబంధం లేకుండా ఆర్సీబీ ప్రస్తావన తీసుకువచ్చాడు. అంతేకాకుండా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని రాయుడు మరోసారి టార్గెట్ చేశాడు. ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేమని, సమష్టి ప్రదర్శనలే ఛాంపియన్‌గా నిలబెడుతాయని పరోక్షంగా కోహ్లిపై రాయుడు విమర్శలు గుప్పించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో నిష్క్రమించినప్పటకి.. ఆ జట్టు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా విరాట్ నిలిచాడు.ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్‌కు కంగ్రాట్స్. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్ వంటి దిగ్గజ ఆటగాళ్లకు ఆ జట్టు అండగా నిలిచింది. ఈ దిగ్గజాలు జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించేలా సపోర్ట్ చేసింది.ఐపీఎల్లో ఓ జట్టు గెలుపొందాలంటే సమిష్టి కృషి అవసరం. అంతే తప్ప ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేం. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు 300 లేదా 400 పరుగులు చేస్తేనే జట్టు విజయం సాధ్యమవుతోందని"జియో సినిమా షోలో రాయుడు పేర్కొన్నాడు. కాగా విరాట్‌పై రాయుడు విమర్శల గుప్పించం ఇదేమి తొలిసారి కాదు. ఎలిమేనిటర్‌లో ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత కూడా విరాట్‌ను పరోక్షంగా ఉద్దేశించి రాయుడు ఓ పోస్ట్ చేశాడు. జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం టీమ్‌కు మంచిది కాదుంటా రాయుడు ఎక్స్‌లో రాసుకొచ్చాడు. -
బెంగళూరు టీమ్‌పై నటి వ్యంగ్య పోస్ట్.. ఆ రెండేళ్లు మర్చిపోయారా? అంటూ సెటైర్లు!
తమిళ నటి కస్తూరి 90వ దశకంలో హీరోయిన్గా నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు. సామాజిక, రాజకీయ అంశాల మీద పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే ఇటీవల ఆమె ఐపీఎల్ టీం బెంగళూరు ఓటమిపై పోస్ట్ పెట్టింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయిన ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రముఖ కోలీవుడ్ నటి కస్తూరి తన ట్విటర్లో ఖాతాలో వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. చాలా ఏళ్లుగా ఈ విషయం అక్కడి వారికి తెలుసు అంటూ బెంగళూరు కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ పిక్‌ను షేర్ చేసింది. అంతే కాకుండా 'ఈసాలా కూడా కప్ ఇల్లా' అంటూ కించపరిచేలా క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.అయితే ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమె చేసిన పోస్టుకు కౌంటర్‌గా కామెంట్స్ పెడుతున్నారు. సీఎస్కే టీమ్‌లా రెండేళ్లు మా టీమ్ బ్యాన్ కాలేదని గుర్తు చేస్తున్నారు. మీ టీమ్ అంతా ఫిక్సింగ్ అంటూ కస్తూరిని ట్రోల్ చేస్తున్నారు. మీ టీమ్ చెన్నై ఫిక్సింగ్ కింగ్స్ అంటూ నెటిజన్స్ పెద్దఎత్తున ఆడేసుకుంటున్నారు.The locals have known for years ....🤭😃#eesala #illa pic.twitter.com/gektBLqkFZ— Kasturi (@KasthuriShankar) May 23, 2024 -
థ్యాంక్యూ డీకే.. అతడి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందా: కోహ్లి
టీమిండియా వెటరన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తన కెరీర్లో చివరి ఐపీఎల్ ఆడేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ఓటమి అనంతరం కార్తీక్ తన 17 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి.. కార్తీక్‌తో అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.దినేష్ కార్తీక్‌ను నేను తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2009 సందర్భంగా కలిశాను. బహుశా దక్షిణాఫ్రికాలో అనుకుంటా. నేను అతడితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం అదే మొదటి సారి. అతడు చాలా సరదాగా ఉంటాడు. డికే చాలా యాక్టివ్ ఉంటాడు. అదేవిధంగా కన్ఫ్యూజ్డ్ పర్సన్. చాలా సార్లు అతడు ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. దినేశ్‌పై నాకు కలిగిన తొలి అభిప్రాయం ఇదే. డీకేకు అద్భుతమైన టాలెంట్ ఉంది. నేను మొదటిసారిగా చూసిన దినేష్‌కు, ఇప్పటి దినేష్‌లో ఎలాంటి మార్పులేదు. అతడు తెలివైనవాడు. అంతేకాకుండా చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఫీల్డ్‌లోనే కాదు, ఆఫ్‌ది ఫీల్డ్ కూడా డీకేతో నాకు మంచి అనుబంధం ఉంది. కార్తీక్‌కు క్రికెట్‌పైనే కాకుండా ఇతర విషయాలపై మంచి అవహగహన ఉంది. అతడితో నాకు సంబంధించిన ఏ విషయమైన నేను చర్చిస్తాను. ఐపీఎల్-2022లో నేను పెద్దగా రాణించలేదు. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో దినేష్ నా పక్కను కూర్చోని నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపాడు. నాలో ఉన్న లోపాలను నాకు అర్ధమయ్యేలా చెప్పాడు. నేను ఈ రోజు మెరుగ్గా ఆడుతున్నానంటే అందుకు కారణం డీకేనే. కార్తీక్‌లో తన నిజాయితీ, ధైర్యం నాకు బాగా నచ్చాయి. నాకు పరిచయం అయినందుకు థంక్యూ డీకే అంటూ విరాట్ ఆర్సీబీ షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. -
ఆర్సీబీ అవుట్ కోహ్లీ రికార్డ్
-
అదే మా ఓటమిని శాసించింది.. లేదంటే విజయం మాదే: డుప్లెసిస్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమేనిటర్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. వరుస మ్యాచ్‌ల్లో గెలిచి ఫ్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు.. ఎలిమినేటర్ రౌండ్‌ను దాటలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్(32) పరుగులతో రాణించారు.అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(45) పరుగులతో అదరగొట్టగా.. రియాన్ పరాగ్(36), హెట్‌మైర్(26), పావెల్(16)పరుగులతో రాణించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బ్యాటింగ్‌లో మరింత మెరుగ్గా రాణించింటే ఫలితం మరో విధంగా ఉండేదని డుప్లెసిస్ తెలిపాడు."మేము తొలుత బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించలేకపోయాం. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. అదనంగా 20 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సాధరణంగా ఈ వికెట్‌పై 180 పరుగులు సాధిస్తే టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోవచ్చు.ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్ కాస్త స్లోగా ఉంది. మా బౌలర్లు అద్బుతంగా పోరాడారు. ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మాకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక ఈ సీజన్లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. పాయింట్ల పట్టకలో అట్టడుగు స్ధానం నుంచి ప్లే ఆఫ్స్‌కు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాం. కానీ దురదృష్టవశాత్తూ ఎలిమినేటర్ రౌండ్‌ను దాటలేకపోయామని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. A comeback to winning ways when it mattered the most & how 👌👌Upwards & Onwards for Rajasthan Royals in #TATAIPL 2024 😄⏫Scorecard ▶️ https://t.co/b5YGTn7pOL #RRvRCB | #Eliminator | #TheFinalCall pic.twitter.com/NsxjVGmjZ9— IndianPremierLeague (@IPL) May 22, 2024 -
మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ తీవ్రనిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాక్స్వెల్ డకౌటయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన మాక్సీ.. అశ్విన్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో మాక్స్వెల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా దినేష్ కార్తీక్‌తో కలిసి సమంగా నిలిచాడు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో మాక్స్వెల్ 18 సార్లు డకౌట్ కాగా.. కార్తీక్ కూడా 18 సార్లు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(17) ఉన్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో మాక్సీ(32) నాలుగో స్ధానంలో నిలిచాడు. -
ఆర్సీబీ ఇంటికి.. ఎలిమేనిటర్‌లో రాజస్తాన్ ఘన విజయం
ఆర్సీబీ ఇంటికి.. ఎలిమేనిటర్‌లో రాజస్తాన్ ఘన విజయంఐపీఎల్-2024లో ఫైనల్ చేరేందుకు అడుగుదూరంలో రాజస్తాన్ రాయల్స్ నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమేనిటర్‌లో 4 వికెట్ల తేడాతో రాజస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్-2కు రాజస్తాన్ అర్హత సాధించగా.. ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్(45) పరుగులతో అదరగొట్టగా.. రియాన్ పరాగ్(36), హెట్‌మైర్(26), పావెల్(16)పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు.. ఫెర్గూసన్, కరణ్ శర్మ, గ్రీన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్(32) పరుగులతో రాణించారు. మాక్స్వెల్, దినేష్ కార్తీక్ వంటి కీలక ఆటగాళ్లు నిరాశపరిచారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు, ట్రెంట్ బౌల్ట్,సందీప్ శర్మ, చాహల్ తలా వికెట్ సాధించారు. 13 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 111/313 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజులో రియాన్ పరాగ్(18), జురెల్(8) పరుగులతో ఉన్నారు.మూడో వికెట్ డౌన్..సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన సంజూ.. కరణ్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి జురెల్ వచ్చాడు. 11 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 98/3రెండో వికెట్ డౌన్..81 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పరాగ్ వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న రాజస్తాన్173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ దూకుడుగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్(42), శాంసన్(11) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్..173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన కాడ్మోర్..ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(25), శాంసన్(1) పరుగులతో ఉన్నారు.రాణించిన ఆర్సీబీ బ్యాటర్లు.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే?రాజస్తాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్వాలేదన్పించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. విరాట్ కోహ్లి(33), మహిపాల్(32) పరుగులతో రాణించారు. మాక్స్వెల్, దినేష్ కార్తీక్ వంటి కీలక ఆటగాళ్లు నిరాశపరిచారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు, ట్రెంట్ బౌల్ట్,సందీప్ శర్మ, చాహల్ తలా వికెట్ సాధించారు.ఐదో వికెట్ డౌన్.. పాటిదార్ ఔట్122 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన రజిత్ పాటిదార్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి దినేష్ కార్తీక్ వచ్చాడు.కష్టాల్లో ఆర్సీబీ.. మాక్స్వెల్ డకౌట్బెంగళూరు మరో వికెట్ కోల్పోయింది. 97 పరుగుల వద్ద వరుస బంతుల్లో కెమెరూన్ గ్రీన్(27), మాక్స్వెల్(0) డకౌటయ్యాడు. దీంతో ఆర్సీబీ 12.4 ఓవర్లలో 97/4 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ అవుట్బెంగళూరుకు షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ (33) పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. యుజ్వేందర్ చాహల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 8 ఓవర్లకు 58/2 పరుగులతో ఉంది.పవర్ ప్లేలో తగ్గిన దూకుడుపవర్ ప్లే ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ(30), కెమెరూన్ గ్రీన్ (1) ఉన్నారు.తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన ఫాప్ డుప్లెసిస్.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(18), గ్రీన్(0) పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న ఆర్సీబీ..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిలకడగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్(18), విరాట్ కోహ్లి(16) పరుగులతో ఉన్నారు.ఐపీఎల్-2024లో ఎలిమినేటర్ పోరుకు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఎలిమినేటర్‌లో రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. రాజస్తాన్ ఓ మార్పు చేసింది. హెట్‌మైర్ తుది జట్టులోకి వచ్చాడు.రాజస్తాన్ అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించనుంది.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ -
RR vs RCB: ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
-
రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుహ్యంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావడంలో ఆ జట్టు పేసర్ యష్ దయాల్‌ది కీలక పాత్ర. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో దయాల్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.గతేడాది సీజన్లో గుజరాత్ తరపున జీరోగా మారిన దయాల్ ఇప్పుడు ఆర్సీబీ తరపున హీరోగా మారాడు. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను యశ్ దయాల్‌కు ఇచ్చాడు. క్రీజులో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా వంటి డెంజరస్ ఆటగాళ్లు ఉండడంతో సీఎస్కే విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ అందరని అంచనాలను దయాల్ తారుమారు చేశాడు. తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టినా.. ఏమాత్రం భయపడకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మొత్తం ఏడు పరుగులే ఇచ్చి తన జట్టు ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.ఈ మ్యాచ్‌లో దయాల్ సంచలన ప్రదర్శనతో అతని తండ్రి చంద్రపాల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకును ఆర్సీబీ రూ.5 కోట్లకు కొనుగోలు చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారని చంద్రపాల్ చెప్పుకొచ్చాడు.'నేను ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఓ వ్యక్తి యష్‌ని ఎగతాళి చేస్తూ ఓ మీమ్‌ను షేర్ చేశాడు. యశ్ ఇచ్చిన ఐదు సిక్సర్లను ప్రస్తావిస్తూ హేళన చేసేలా ఆ మీమ్ ఉంది. అది నాకు ఇప్పటికి బాగా గుర్తు ఉంది. ఆ మీమ్‌లో 'ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కథ ప్రారంభం కాకముందే ముగిసింది'అని రాసుకొచ్చారు. ఆ ఆన్లైన్ ట్రోలింగ్ అంతటితో అగిపోలేదు. మేము ఆ ట్రోలింగ్ చూడలేక మా ఫ్యామిలీ గ్రూప్ మినహా అన్ని వాట్సాప్ గ్రూప్‌ల్లో నుంచి నిష్క్రమించాం. ఈ ఏడాది సీజన్ వేలంలో ఆర్సీబీ రూ. 5 కోట్లకు యశ్‌ను సొంతం చేసుకున్నాక కూడా ట్రోలు చేయడం మొదలెట్టారు.ఆర్సీబీ ఫ్రాంచైజీ డబ్బును చెత్తలో పడేసిందంటూ విమర్శించారని" ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దయాల్ తండ్రి చంద్రపాల్ పేర్కొన్నాడు. -
IPL 2024 Playoffs: ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే
ఐపీఎల్-2024లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. టాస్ పడినప్పటకి మరోసారి వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.ఇక లీగ్ స్టేజీ ముగియడంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లపై ఓ లూక్కేద్దం. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. పాయింట్ల టేబుల్లో కేకేఆర్(19) పాయింట్లతో అగ్రస్ధానంలో ఉండగా.. ఎస్ఆర్హెచ్ 17(నెట్ రన్‌రేట్ +0.414), రాజస్తాన్ 17(నెట్ రన్‌రేట్ +0.273), ఆర్సీబీ(14) పాయింట్లతో వరసగా రెండు, మూడు ,నాలుగు స్ధానాల్లో నిలిచాయి. ఇక మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లకు తెరలేవనుంది. మే 21న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడునున్నాయి. మే 22న ఎలిమినేటర్‌లో ఆర్సీబీ, రాజస్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. అనంతరం మే 24 క్వాలిఫియర్-2లో ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫియర్-1లో ఓడిన జట్టు తలపడనున్నాయి. మే 26న చెపాక్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. -
IPL 2024: సీఎస్కే పై ఆర్సీబీ ఘన విజయం (ఫోటోలు)
-
RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
#RCB Vs CSK ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ. అలాంటి ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంటర్స్(#RCB) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఐపీఎల్-17లో ప్లే ఆఫ్ల్స్కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చైన్నె సూపర్ కింగ్స్‌కు షాకిస్తూ మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్‌లో సీఎక్కేపై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా డూప్లిసిస్ మాట్లాడుతూ.. బెంగళూరులో ఈ సీజన్‌ను ముగించడం చాలా ఆనందనిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్‌కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బౌలర్ యశ్ దయాల్‌కు అంకితమిస్తున్నాను. యశ్ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వల్లే మ్యాచ్ గెలిచాం. అందుకే తనకు అవార్డ్‌ను అంకితమిస్తున్నా. THE WINNING CELEBRATION FROM RCB. 🫡❤️- RCB into the Playoffs after having 1 win out of first 8 matches. 🤯🔥pic.twitter.com/LPFjay2A7C— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 ఇలాంటి పిచ్‌పై పరుగులు చేయడం ఎంతో కష్టం. మా బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. మా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా ఆపగలిగారు. ఈ క్రెడిట్ అంతా మా బౌలర్లదే. ఇక, మా జట్టు ఓడినా.. గెలిచినా ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. THE GREATEST COMEBACK IN IPL HISTORY. 🏆- RCB qualified for Playoffs after losing 6 consecutive matches. 🤯pic.twitter.com/eIe6J7Iqhh— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్స్..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్ (54), కోహ్లి (47), రజత్ పటీదార్ (41), గ్రీన్ (38) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్‌లో ఉన్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ఔటయ్యాడు. ఇక, మూడో ఓవర్లో మిచెల్ (4) కూడా నిష్క్రమించాడు. దీంతో, 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85/2 స్కోర్‌తో మళ్లీ రేసులో నిలిచింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్ ఫెర్గూసన్.. రహానెను ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్‌తో పాటు దూబె, శాంట్నర్ ఔట్ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే ఐదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్‌కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాలి. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి.. 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్ (యశ్ దయాళ్) తొలి బంతికే ధోని సిక్స్ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండో బంతికి ధోనీని ఔట్ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు. -
IPL 2024: సీఎస్కేపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీ
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుపెట్టింది. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ సత్తాచాటింది.ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను బెంగళూరు ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫాప్ డుప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(47), రజిత్ పాటిదార్(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 35), ధోని(25) ఆఖరిలో పోరాటం చేశారు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాల్ రెండు వికెట్లు, మాక్స్వెల్, సిరాజ్, గ్రీన్, ఫెర్గూసన్ తలా వికెట్ సాధించారు.అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోయినప్పటికి.. ఛేజింగ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల మార్క్ దాటి ఉంటే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించి ఉండేది. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి.ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చితన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. -
విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మిస్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సత్తాచాటాడు. తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని విరాట్ కోల్పోయాడు. 29 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47 పరుగులు చేశాడు. సీఎస్కే స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటయ్యాడు. డారిల్ మిచెల్ అద్బుతమైన క్యాచ్‌తో కోహ్లిని పెవిలియన్‌కు పంపాడు. 10 ఓవర్ వేసిన శాంట్నర్ బౌలింగ్‌లో నాలుగో బంతిని కోహ్లి లాంగాన్ దిశగా బిగ్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న మిచెల్ టైమింగ్‌లో జంప్ చేస్తూ బంతిని ఒడిసి పట్టుకున్నాడు. కానీ బ్యాలెన్స్ కోల్పోయిన అతడు వెంటనే చాకచక్యంగా బంతిని గాల్లోకి లేపి మళ్లీ బౌండర్ లైన్ లోపలకి వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే మిచెల్ బౌండరీ రోప్‌కు తాకడాని అంతా భావించారు. కానీ రీప్లేలో అతడు క్లీన్ క్యాచ్ అందుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న కోహ్లి సతీమణి అనుష్క శర్మ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Anushka Sharma also thinks Virat Kohli was not out 😭😭😭@JayShah, please bring King Kohli back. He should be batting out there 🇮🇳💔💔💔#IPL2024 #RCBvsCSK #tapmad #HojaoADFree pic.twitter.com/5fnBv6hAJO— Farid Khan (@_FaridKhan) May 18, 2024 -
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్‌ది క్లియర్‌గా నాటౌట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఔటైన విధానం వివాదస్పదమైంది. ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశమైంది.ఏమి జరిగిందంటే?ఆర్సీబీ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో సీఎస్కే స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఐదో బంతి స్టంప్స్ దిశగా వేశాడు. దీంతో రజిత్ పాటిదార్ ఆ డెలివరీని స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఈ క్రమంలో శాంట్నర్ బంతిని ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.అయితే బంతి మాత్రం శాంట్నర్ చేతి వేలికి దగ్గరగా వెళ్తూ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో స్టంప్స్‌ను తాకింది. వెంటనే సీఎస్కే ఆటగాళ్లు రనౌట్ అప్పీల్ చేశారు. దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. తొలుత బంతి చేతి వేలికి తాకిందా లేదా అని నిర్ధారించుకోవడానికి థర్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్ అల్ట్రా ఎడ్జ్ సాయంతో చెక్చేశాడు.అయితే అల్ట్రా ఎడ్జ్‌లో చిన్నగా స్పైక్ రావడంతో బంతి చేతికి వేలికి తాకినట్లు అంపైర్ నిర్ధారించుకున్నాడు. అనంతరం బంతి స్టంప్స్‌కు తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చాడా లేదాన్నది పలు కోణాల్లో అంపైర్ పరిశీలించాడు.ఓ యాంగిల్లో బంతి వికెట్లను తాకే సమయానికే డుప్లిసిస్ తన బ్యాటను గీతను దాటించినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం బ్యాట్ గాల్లో ఉందంటూ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు.దీంతో ఫాప్ డుప్లెసిస్‌తో పాటు స్టేడియంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కానీ చేసేదేమి లేక డుప్లెసిస్ (29 బంతుల్లో 54 రన్స్) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ డుప్లెసిస్‌ది క్లియర్‌గా నాటౌట్, చెత్త అంపైరింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/4hijPiCz9A— Reeze-bubbly fan club (@ClubReeze21946) May 18, 2024 -
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగారు. సీఎస్కే బౌలర్లకు చుక్కలు చూపించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫాప్ డుప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(47), రజిత్ పాటిదార్(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు.సీఎస్కే బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు, తుషార్ దేశ్‌పాండే, శాంట్నర్ తలా వికెట్ సాధించారు. ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించాలంటే 18 పరుగుల తేడాతో సీఎస్కేను ఓడించాలి.చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్..! -
సీఎస్కేతో ఆర్సీబీ కీలక పోరు.. తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో కీలక పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కీలక మ్యాచ్‌లో ఇరు జట్లు ఒకే మార్పుతో బరిలోకి దిగాయి. ఆర్సీబీ జట్టులోకి విల్ జాక్స్ స్ధానంలో మ్యాక్స్‌వెల్ రాగా.. సీఎస్కే జట్టులోకి మిచెల్ శాంట్నర్ వచ్చాడు. కాగా ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్చెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్జీత్ సింగ్, మహేశ్ తీక్షణ -
ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జూలు విదిల్చింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ తమ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరుకుంది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి.ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే?ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే సీఎస్కేతో పాయింట్ల పరంగా సమమవుతోంది. ఆర్సీబీ విజయంతో పాటు తమ రన్‌రేట్‌ను కూడా మెరుగు పరుచుకోవాలి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అదే ఛేజింగ్‌లో అయితే 18.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ఫినిష్ చేయాలి. ఈ క్రమంలో సీఎస్కే(+0.528) కంటే ఆర్సీబీ మెరుగైన రన్‌రేట్(+0.387) సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. అంతేకాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలి. -
వారెవ్వా విరాట్.. చిరుతలా పరిగెత్తుతూ! సంచలన రనౌట్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి మరోసారి అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ సంచలన త్రో తో మెరిశాడు.కళ్లు చెదిరే త్రోతో పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్‌ను కింగ్ కోహ్లి రనౌట్ చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన లూకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో నాలుగో బంతిని డిప్ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే డిప్ మిడ్ వికెట్లో ఫీల్డర్ లేకపోవడంతో సామ్ కుర్రాన్ రెండో పరుగుకు పిలుపునిచ్చాడు.ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి దాదాపుగా 20 మీటర్ల దూరం పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు త్రో చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. బంతిని అందుకునే క్రమంలో కోహ్లి బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి గురి మాత్రం తప్పలేదు. బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి శశాంక్ సింగ్ క్రీజును చేరుకోకపోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి రనౌట్ చూసిన సహచర ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్‌పై 60 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్, కరణ్ శర్మ, స్వప్నిల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు.He's unfolding magic tonight 💫First with the bat & now on the field with that outstanding direct hit 🎯Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #PBKSvRCB | @imVkohli | @RCBTweets pic.twitter.com/6TsRbpamxG— IndianPremierLeague (@IPL) May 9, 2024 -
దినేష్ కార్తీక్ అరుదైన ఘనత.. ద్రవిడ్ రికార్డు బద్దలు
భారత వెటరన్ వికెట్ కీపర్-బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ దినేష్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా కార్తీక్ నిలిచాడు. ఐపీఎల్-2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులు చేసిన డీకే.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు కార్తీక్ ఐపీఎల్లో బెంగళూరు తరపున 57 మ్యాచ్‌ల్లో 912 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉండేది. ద్రవిడ్ 43 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ తరపున 898 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ద్రవిడ్ రికార్డును కార్తీక్ బద్దలు కొట్టాడు. ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటివరకు ఆర్సీబీ తరపున 249 మ్యాచ్‌ల్లో 7897 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. హై స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్‌ను 60 పరుగుల తేడాతో ఆర్సీబీ చిత్తు చేసింది. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ఆర్సీబీ సజీవంగా నిలుపున్‌కుంది.. -
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి అదరగొట్టాడు. పంజాబ్ బౌలర్లను విరాట్ ఊచకోత కోశాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 47 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు రజిత్ పాటిదార్(55), కామెరాన్ గ్రీన్(46) రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌పై 1000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.తద్వారా ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్లో కోహ్లి పంజాబ్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోహ్లి 600 పరుగుల మార్కును కూడా అందుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 634 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సార్లు 600 పరుగులు మార్క్‌ను అందుకున్న కేఎల్ రాహుల్ రికార్డును కోహ్లి సమం చేశాడు. కోహ్లి 4 సీజన్లలో 600 ప్లస్ పరుగులు చేశాడు. రాహుల్ కూడా 4 సీజన్లలో 600 పైగా పరుగులు చేశాడు. -
RCB Vs PBKS: చెలరేగిన విరాట్ కోహ్లి.. పంజాబ్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు.కోహ్లితో పాటు రజిత్ పాటిదార్(55), కామెరాన్ గ్రీన్(46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప రెండు, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కుర్రాన్ తలా రెండు వికెట్లు సాధించారు. -
RCB Vs PBKS: విరాట్ కోహ్లి సింగిల్ హ్యాండ్ సిక్స్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి తన అద్భుత ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కింగ్ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.విరాట్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు.అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లి ఓ సంచలన షాట్‌తో మెరిశాడు.పంజాబ్ యువ పేసర్ విధ్వత్ కావేరప్ప బౌలింగ్‌లో కోహ్లి సింగిల్ హ్యాండ్ సిక్స్ బాదాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 7 వ ఓవర్ వేసిన కావేరప్ప బౌలింగ్‌లో తొలి బంతిని కోహ్లి ఫ్రంట్ ఫుట్కు మిడాఫ్ మీదగా ఒంటి చేత్తో సిక్స్ బాదాడు. విరాట్ షాట్ చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. What an amazing shot by Virat kohli 😳@imVkohli #RCBvsPBKS pic.twitter.com/BDdcQgLC70— Ritu Gurjar (@Ritugurjar111) May 9, 2024 -
పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ కీలక పోరు.. యువ ఆటగాడు అరంగేట్రం
ఐపీఎల్-2024లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో పంజాబ్ కింగ్స్ తరపున విద్వాత్ కవేరప్ప ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌కు పంజాబ్ స్టార్ పేసర్ రబాడ దూరమయ్యాడు. అతడి స్ధానంలో లియామ్ లివింగ్‌స్టోన్ తుది జట్టులో వచ్చాడు. మరోవైపు ఆర్సీబీ ఒకే ఒక మార్పు చేసింది. గ్లెన్ మాక్స్వెల్ స్ధానంలో లాకీ ఫెర్గూసన్ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇక ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), ప్రభ్సిమ్రాన్ సింగ్, రిలీ రోసోవ్, లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్, అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, విధ్వత్ కావరప్ప -
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపున్‌కుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఏడో స్ధానానికి చేరుకుంది. ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.19.3 ఓవర్లలో 147 పరుగులకు గుజరాత్ ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), రాహుల్ తెవాటియా(35) పర్వాలేదన్పించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్(23 బంతుల్లో 64), విరాట్ కోహ్లి(27 బంతుల్లో 42) పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్(21 నాటౌట్), స్వప్నిల్ సింగ్(15) పరుగులతో మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. గుజరాత్ బౌలర్లలో లిటిల్ 4 వికెట్లు పడగొట్టగా.. నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించాడు.No RCB RCB fans will pass without liking this. ❤️🔥💫⭐Vintage RCB | Just RCB is RCBing | Can RCB vs GT | Faf du Plessis | Only RCB #RCBvsGT #GTvsRCB #ViratKohli pic.twitter.com/Ou5XvqxCv1— crazy (@cricrazyNandu) May 4, 2024 -
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన పరిచాడు.కళ్లు చెదిరే త్రోతో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ షారూఖ్ ఖాన్‌ను రనౌట్ చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన విజయ్ కుమార్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియా ఆఫ్‌సైడ్ డిఫెన్స్ ఆడాడు.అయితే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న షారూఖ్ ఖాన్ క్విక్ సింగిల్ కోసం ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ స్ట్రైక్‌లో ఉన్న తెవాటియా మాత్రం నో అంటూ వెనుక్కి వెళ్లమని కాల్ ఇచ్చాడు. అయితే షారూఖ్ ఖాన్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసే లోపే మెరుపు వేగంతో బంతిని అందుకున్న విరాట్ బౌలర్ ఎండ్‌లో స్టంప్స్‌ను పడగొట్టాడు. వెంటనే ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ రిఫర్ చేయగా.. రీప్లేలో కూడా రనౌట్‌గా తేలింది. కోహ్లి సంచలన త్రో చూసిన అందరూ బిత్తరపోయారు. కామెరాన్ గ్రీన్ అయితే కోహ్లి వైపు చూస్తూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
ఐపీఎల్-2024లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. నిర్ణీత 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్(2), వృద్దిమాన్ సహా(1) తీవ్ర నిరాశపరిచారు. వీరిద్దరితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ సాయిసుదర్శన్(6) పరుగులు చేశాడు. 19 పరుగులకే 3 విట్లుల్పోయి గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రమంలో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్లర్(30), గుజరాత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరితో పాటు రాహుల్ తెవాటియా(35) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరైనా సాధించగల్గింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, విజయ్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, కరణ్ చెరో వికెట్ సాధించారు. -
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో టీమిండియా యువ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్ మొదటిలో పర్వాలేదన్పించిన గిల్.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ తీవ్ర నిరాశపరిచాడు. స్లో వికెట్‌పై ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోవడానికి గిల్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్‌లో 7 బంతులు ఆడిన గిల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గిల్.. విజయ్‌కుమార్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గిల్ ఔట్ కాగానే ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇండియన్ క్రికెట్ ప్రిన్స్‌కు ఏమైందని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 32.22 సగటుతో 322 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్‌కప్-2024కు భారత జట్టులో శుబ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. స్టాండ్‌బై జాబితాలో గిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. pic.twitter.com/tjQXP5LDRS— Rajgeeta Yadav (@rajgeetacricket) May 4, 2024 -
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. గుజరాత్ టైటాన్స్ మాత్రం రెండు మార్పులు చేసింది. గుజరాత్ జట్టులోకి మానవ్ సుత్తార్, జౌషువా లిటిల్ వచ్చారు. కాగా కాగా మానవ్ సత్తార్‌కు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ ఆర్సీబీ చాలా ముఖ్యం. ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే ఆర్సీబీకి ఈ మ్యాచ్ చాలా కీలకం. 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట మాత్రమే విజయం సాధించిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో పదో స్ధానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే తమ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైషాక్గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్ -
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి అదరగొట్టాడు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో కోహ్లికి ఇది నాలుగో హాఫ్ సెంచరీ. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 500 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అయితే తన స్ట్రైక్ రేటుపై విమర్శల చేస్తున్న వారికి కోహ్లి గట్టి కౌంటిరిచ్చాడు."నా స్ట్రైక్ రేట్, ఆట గురించి మాట్లాడే వ్యక్తుల గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే జట్టు కోసం, మ్యాచ్ గెలవడానికి ఏమో చేయాలో నాకు తెలుసు. జట్టులో నా పాత్రపై నాకు ఒక క్లారిటీ ఉంది. నేను ఆడే జట్టును గెలిపించడానికి 100 శాతం ఎఫెక్ట్ పెడతాను గత 15 ఏళ్లగా అదే చేస్తున్నాను. ఎక్కడో కూర్చోని మాట్లాడేవారు ఏదైనా మాట్లాడతారు. కాబట్టి వ్యక్తిల స్వంత ఆలోచనలు, వారి ఊహలతో నాకు సంబంధం లేదు. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించడమే నా లక్ష్యమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో కోహ్లి పేర్కొన్నాడు. -
విల్ జాక్స్ విధ్వంసకర సెంచరీ.. 10 సిక్స్‌లతో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు విల్ జాక్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో జాక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజరాత్ బౌలర్లను జాక్స్ ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 41 బంతుల్లోనే జాక్స్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జాక్స్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న జాక్స్.. 5 ఫోర్లు, 10 సిక్స్‌లతో 100 పరుగులతో ఆజేయంగా నిలిచింది. జాక్స్ విధ్వంసం ఫలితంగా 201 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 16 ఓవర్లలో ఊదిపడేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో జాక్స్‌తో పాటు కోహ్లి(70 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక మ్యాచ్‌లో సెంచరీ మెరిసిన జాక్స్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా జాక్స్ నిలిచాడు. ఈ జాబితాలో విండీస్ లెజెండ్ క్రిస్ గేల్ తొలి స్ధానంలో ఉన్నాడు. 2013 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరపున గేల్.. పుణే వారియర్స్‌పై కేవలం 30 బంతుల్లోనే గేల్ శతకం సాధించాడు. ఆ తర్వాతి స్ధానాల్లో యూసఫ్ పఠాన్(37 బంతులు ), డేవిడ్ మిల్లర్(38 బంతులు ), ట్రవిస్ హెడ్(39 బంతులు ), విల్‌జాక్స్(41 బంతులు ) ఉన్నారు. అదే విధంగా ఆర్సీబీ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా జాక్స్ రికార్డులకెక్కాడు. -
విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. కేవలం 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు విల్ జాక్స్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 201 పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ 16 ఓవర్లలో ఊదిపడేసింది. ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన కోహ్లి పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్లో రన్ ఛేజింగ్‌లో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్లో లక్ష్య చేధనలో కోహ్లి ఇప్పటివరకు 24 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ 23 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో ధావన్‌ను కింగ్ కోహ్లి అధిగమించాడు. →అదే విధంగా ఐపీఎల్ సీజన్లో అత్యధిక సార్లు 500 పైగా పరుగులు చేసిన క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లి సమం చేశాడు. వార్నర్ ఇప్పటివరకు 7 సీజన్లలో 500 పైగా పరుగులు చేయగా.. విరాట్ కూడా సరిగ్గా 500 ప్లస్ పరుగులు చేశాడు. ఐపీఎల్-2024లో ఇప్పటివరకు మ్యాచ్‌లు ఆడినహ్లి 500 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాన్నాడు. -
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన బంతితో మెరిశాడు. గుజరాత్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ని అద్భుతమైన ఇన్ స్వింగర్ యార్కర్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షారుఖ్ ఖాన్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్నర్లను షారుఖ్ టార్గెట్ చేస్తుండడంతో బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్.. సిరాజ్‌ను బౌలింగ్ ఎటాక్‌లో తీసుకువచ్చాడు. ఫాప్ నమ్మకాన్ని సిరాజ్ వమ్ము చేయలేదు. గుజరాత్ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన సిరాజ్.. తొలి బంతినే ఇన్ స్వింగర్ యార్కర్‌గా సంధించాడు. సిరాజ్ వేసిన బంతికి షారుఖ్ ఖాన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అతడు బంతిని బ్యాట్‌తో ఆపే లోపే స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో షారుఖ్ ఖాన్ బిత్తరపోయాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ట్రేడ్‌మార్క్ క్రిస్టియానో రొనాల్డో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.pic.twitter.com/MIWgJ4WWbZ— Saksham Nagar (@SAKSHAMNAGAR90) April 28, 2024 -
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన బంతితో మెరిశాడు. గుజరాత్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ని అద్భుతమైన ఇన్ స్వింగర్ యార్కర్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షారుఖ్ ఖాన్ ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్నర్లను షారుఖ్ టార్గెట్ చేస్తుండడంతో బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్.. సిరాజ్‌ను బౌలింగ్ ఎటాక్‌లో తీసుకువచ్చాడు. ఫాప్ నమ్మకాన్ని సిరాజ్ వమ్ము చేయలేదు. గుజరాత్ ఇన్నింగ్స్ 15 ఓవర్ వేసిన సిరాజ్.. తొలి బంతినే ఇన్ స్వింగర్ యార్కర్‌గా సంధించాడు. సిరాజ్ వేసిన బంతికి షారుఖ్ ఖాన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అతడు బంతిని బ్యాట్‌తో ఆపే లోపే స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో షారుఖ్ ఖాన్ బిత్తరపోయాడు. ఈ క్రమంలో సిరాజ్ తన ట్రేడ్‌మార్క్ క్రిస్టియానో రొనాల్డో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.<blockquote class="twitter-tweet"><p lang="zxx" dir="ltr"><a href="https://t.co/MIWgJ4WWbZ">pic.twitter.com/MIWgJ4WWbZ</a></p>&mdash; Saksham Nagar (@SAKSHAMNAGAR90) <a href="https://twitter.com/SAKSHAMNAGAR90/status/1784551354158969025?ref_src=twsrc%5Etfw">April 28, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script> -
అరెరే.. ఏమైందిరా మీకు! కావ్య రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో ఓటమి చవిచూసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఎస్హెర్హెచ్ విఫలమైంది.తొలుత బౌలింగ్‌లో 206 పరుగులు సమర్పించుకున్న సన్‌రైజర్స్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ చెతెలేస్తేఇసింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ మరోసారి తన ఎక్స్‌ప్రెషన్స్‌తో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.తొలుత బౌలింగ్‌లో ఆర్సీబీ వికెట్లు పడినప్పుడు ఎగిరి గెంతులేసిన కావ్యా.. తమ బ్యాటింగ్ వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కడుతున్న సమయంలో కావ్య మారన్ ముఖం చిన్నబోయింది. ముఖ్యంగా అబ్దుల్ సమద్ ఔటైన తర్వాత కావ్య పాప షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఏంటి రా ఏ బ్యాటింగ్ అన్నట్లు కావ్య ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. #RCB Rocked 😎Kavya Maran Shocked 😮💨Congratulations RCB 😍#RCBvsSRH #SRHvRCB#ViratKohli𓃵pic.twitter.com/xISW2H2cWG— Mohammed Aziz (@itsmeaziz07) April 25, 2024 -
రజిత్ పాటిదార్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 4 సిక్స్‌లు! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్ మరో అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పాటిదార్ అదరగొట్టాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విల్ జాక్స్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పాటిదార్.. ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.ముఖ్యంగా స్పిన్నర్లను టార్గెట్ చేశాడు. స్పిన్నర్ మార్కండే వేసిన 11 ఓవర్లో పాటిదార్ వరుసుగా 4 సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే పాటిదార్ తన హాప్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రాబిన్ ఉతప్ప సరసన రజిత్ నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న పాటిదార్ 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50)తో పాటు విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు. Patidar ka 𝑹𝒂𝒋 🤌🫡#SRHvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/v1dzhJjKxZ— JioCinema (@JioCinema) April 25, 2024 -
విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400 పైగా పరుగులు చేసిన చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా 400 రన్స్‌ను క్రాస్ చేసిన విరాట్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 2011, 2013, 2015,2016,2018,2019,2020,2021,2023, 2024 సీజన్లలో కోహ్లి 400 పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 430 పరుగులు సాధించాడు.ఈ మెగా ఈవెంట్లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. 43 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. అదే విధంగా ఐపీఎల్లో ఓపెనర్‌గానూ కోహ్లి 4000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. -
సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. హైదరాబాద్ చేరుకున్న విరాట్ కోహ్లి! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్ పరంగా పర్వాలేదన్పిస్తున్న ఆర్సీబీ.. బౌలింగ్ పరంగా మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. వరుస పరాజయాలతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి కూడా దాదాపు నిష్క్రమించినట్లే. అయితే కనీసం మిగిలిన మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి టోర్నీని ఘనంగా ముగించాలని ఆర్సీబీ భావిస్తోంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో మరో కీలక పోరుకు ఆర్సీబీ సిద్దమైంది. ఏప్రిల్ 25న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హైదరాబాద్ చేరుకున్నాడు. జట్టు కంటే ముందే విరాట్ భాగ్యనగరంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లూక్లో విరాట్ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ నిరాశపరుస్తున్నప్పటికి.. కోహ్లి మాత్రం అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 379 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. #ViratKohli arrived in Hyderabad for the upcoming IPL match, #SRHvsRCB on Thursday. pic.twitter.com/ljkoyENfmy — Gulte (@GulteOfficial) April 23, 2024 -
మాక్స్వెల్ కీలక నిర్ణయం.. ఆ టోర్నీలో ఆడేందుకు ఒప్పందం
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కానున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024 సీజన్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ తరపున మాక్స్వెల్ ఆడనున్నాడు. ఈ మెరకు వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టులో తన సహచర ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్లు సైతం చేరారు. తాజాగా మాక్సీ కూడా జతకట్టడంతో వాషింగ్టన్ ఫ్రాంచైజీ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కాగా ఐపీఎల్-2024 సీజన్ మధ్య నుంచి మాక్స్వెల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. మానసికంగా, శారీరకంగా బాగా ఆలిసిపోయానంటూ మాక్స్వెల్ తాత్కాలిక విరామం తీసుకున్నాడు. ఈ లీగ్‌లో ఆర్సీబీ జట్టుకు తన అవసరం ఎప్పుడొచ్చినా బలంగా తిరిగొస్తానని మాక్స్వెల్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో మాక్సీ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ, ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లు ఆడిన మాక్స్వెల్ కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. మూడు సార్లు డకౌట్లు అయ్యాడు. ఇక యూనైటడ్ స్టేట్స్ నిర్వహిస్తున్న ఈ మేజర్ లీగ్ క్రికెట్ రెండో సీజన్ జూలై 4నుంచి ప్రారంభం కానుంది. -
'కోహ్లిని అలా చూసి చాలా బాధపడ్డా.. 11 మంది బ్యాటర్లతో ఆడాలి'
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఐదో ఓటమి చవిచూసింది. సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు దుమ్ములేపినప్పటికి .. బౌలర్లు మాత్రం మరోసారి చేతులెత్తేశారు. గల్లీ బౌలర్ల కంటే దారుణంగా ఆర్సీబీ బౌలర్లు బౌలింగ్ చేశారు. ఆర్సీబీ బౌలింగ్‌ను ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు చితక్కొట్టారు. ఆర్సీబీ చెత్త బౌలింగ్ కారణంగా ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్‌ను సాధించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో ఆర్సీబీ బౌలర్లపై భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శల వర్షం కురిపించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలింగ్ చాలా దారుణంగా ఉందని శ్రీకాంత్ సీరియస్ అయ్యాడు. "ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్ వంటి సీనియర్ బౌలర్లు కూడా పూర్తిగా తేలిపోయారు. నిన్నటి మ్యాచ్‌లో విల్ జాక్స్ మినహా మిగితా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆర్సీబీకి నేను ఇచ్చే సలహా ఒక్కటే. రాబోయో మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 11 మంది బ్యాటర్లతో ఆడాలి. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ రెండు ఓవర్లు, ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ 4 ఓవర్లు బౌలింగ్ చేయాలి. అదే విధంగా విరాట్ కోహ్లి కూడా బౌలింగ్ చేయాలి. నిన్నటి మ్యాచ్‌లో కోహ్లి 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఉంటే అన్ని పరుగులు ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే కోహ్లి ఒక మంచి బౌలర్. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు స్టేడియం బయటకు బంతులను కొడుతుంటే కోహ్లి ముఖం వాడిపోయింది. కోహ్లిని అలా చూసిన నేను చాలా బాధపడ్డాను. బ్యాటింగ్ చేసే సమయంలో కూడా కోహ్లి చాలా కోపంగా ఉన్నాడు. అందుకు కారణం ఆర్సీబీ బౌలర్లే" అని తన యూట్యూబ్ ఛానల్లో శ్రీకాంత్ పేర్కొన్నాడు. -
టీ20 వరల్డ్‌కప్ జట్టులో దినేష్ కార్తీక్..? అతడికి అంత సీన్ లేదు!
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్, భారత వెటరన్ దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. లేటు వయస్సులో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లతో కార్తీక్ దుమ్మలేపుతున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. గత సీజన్లో నిరాశపరిచిన కార్తీక్ ..ప్రస్తుత సీజన్లో మాత్రం పూర్తి భిన్నంగా కన్పిస్తున్నాడు. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో డీకే అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఓ దశలో మ్యాచ్‌ను ఫినిష్ చేసేలా కన్పించిన కార్తీక్.. ఆఖరికి నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దినేష్ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 226 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కార్తీక్‌కు టీ20 వరల్డ్‌కప్ 2024 భారత జట్టులో చోటు ఇవ్వాలని చాలా మంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయడు చేరాడు. డీకేను టీ20 వరల్డ్‌కప్‌లో ఆడించాలని రాయడు అన్నాడు. "కార్తీక్ తన కెరీర్లో ఎక్కువగా ఎంఎస్ ధోనితో పోటీపడ్డాడు. ధోని కెప్టెన్‌గా, రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉండడంతో కార్తీకు పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. అయితే డీకే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తన కెరీర్లో చివరిసారిగా వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం దక్కుతుందని నేను భావిస్తున్నానను. అతడికి ఛాన్స్ ఇస్తే టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా మారే అవకాశముంది. అంతేకాకుండా భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించి, తన కెరీర్‌ను ఘనంగా ముగించిడానికి కార్తీక్‌కు కూడా ఇది మంచి అవకాశం. కాబట్టి డికేనే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లను కోరుతున్నానని" రాయడు స్టార్‌స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. ఇక ఇదే షోలో పాల్గోన్న భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రాయడు అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు. పఠాన్ నవ్వుతూ ఐపీఎల్ వేరు, వరల్డ్‌కప్ వేరు అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా వరల్డ్‌కప్ వంటి టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదని, కచ్చితంగా తీవ్రమైన ఒత్తడి ఉంటుందని పఠాన్ చెప్పుకొచ్చాడు. -
టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 549 పరుగులు! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన టీ20 క్రికెట్ మజాను అందించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. ఇరు జట్లు కలపి ఏకంగా 549 పరుగులు సాధించాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఇది నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ కూడా ధీటుగా బదులిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆర్సీబీ తమ విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచింది. SRH might’ve won the match but Dinesh Karthik definitely deserved that standing ovation ❤️#RCBvSRH pic.twitter.com/sMWNSC2ptj — UrMiL07™ (@urmilpatel30) April 15, 2024 అత్యధిక సిక్స్‌లు.. అదే విధంగా ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు కలిపి ఏకంగా 38 సిక్స్‌లు బాదేశారు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు నమోదైన రెండు మ్యాచ్‌గా ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ పోరు నిలిచింది. అంతకముందు ఈ ఏడాది సీజన్లో సన్‌రైజర్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా 38 సిక్స్‌లే నమోదయ్యాయి. That's a Book 🔥 Innings from Travis head! pic.twitter.com/lsiLinLU1M — SunRisers OrangeArmy Official (@srhfansofficial) April 15, 2024 -
మా కుర్రాళ్లు బాగా పోరాడారు.. అదే మా కొంపముంచింది: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ వరుసగా ఐదో ఓటమి చవచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. మరోసారి బెంగళూరు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. తొలుత బౌలింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్‌ను సమర్పించుకుంది. ట్రావిస్ హెడ్(102) ,హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ బ్యాటర్లు ఆఖరి వరకు పోరాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని ఫాప్ చెప్పుకొచ్చాడు. "ఈ మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడినందుకు సంతోషంగా ఉంది. ఈ సీజన్లో మా నుంచి వచ్చిన మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన ఇదే. చిన్నస్వామి వికెట్ సరిగ్గా టీ20 క్రికెట్‌కు సరిపోతుంది. 280 పైగా టార్గెట్‌ను ఛేజ్ చేయడం అంత సులభం కాదు. కానీ మేము దగ్గరికి వచ్చి ఓడిపోయాం. ఈ మ్యాచ్‌లో కొన్ని మార్పులు చేశాము. కొత్తగా కొన్ని విషయాలను ప్రయత్నించాం. ఫాస్ట్ బౌలర్లు ఈ పిచ్‌పై పూర్తిగా తేలిపోయారు. బ్యాటింగ్ పరంగా మేము బలంగానే ఉన్నాము. మేము ఇంకా కొన్ని విభాగాల్లో ఇంకా మెరుగవ్వాలి. ముఖ్యంగా బౌలింగ్‌పై ఎక్కువ దృష్టిపెట్టాలి. అదే విధంగా బ్యాటింగ్‌లో కూడా పవర్‌ప్లే తర్వాత రన్ రేట్ తగ్గకుండా చూసుకోవాలి. ఈ హైస్కోరింగ్ రన్ ఛేజ్‌లో మా బాయ్స్ ఆఖరి వరకు మ్యాచ్‌ను విడిచిపెట్టలేదు. తొలుత బౌలింగ్‌లో 30-40 పరుగులు ఎక్కువగా ఇచ్చాం. అదే మా కొంపముంచింది. కానీ ఆటలో గెలుపుటములు సహజం. ఓడిపోయినందుకు కచ్చితంగా బాధ ఉంటుంది. కానీ మా మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మా తర్వాతి మ్యాచ్‌ల్లో ఆడేందుకు సిద్దంగా ఉండాలి కదా" అంటూ పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. -
క్లాసెన్ భారీ సిక్సర్.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి ఉర మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే క్లాసెన్ ఇన్నింగ్స్‌లోని ఓ సిక్స్ దెబ్బకు స్టేడియం పైకప్పు దాటి వెళ్లింది. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన ఫెర్గూసన్ రెండో బంతిని క్లాసెన్‌కు లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ అద్బుతమైన లాఫ్టెడ్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ ఆడాడు. దెబ్బకు బంతి చిన్నస్వామి స్టేడియం బయట పడింది. అతడు కొట్టిన సిక్స్ ఏకంగా 106 మీటర్ల దూరం వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. Got an update from #Chandrayaan, the ball is still travelling at the speed of light 😉#TATAIPL #RCBvSRH #IPLonJioCinema #HeinrichKlaasen #IPLinTelugu pic.twitter.com/fmVeijmSlk — JioCinema (@JioCinema) April 15, 2024 -
చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డులకెక్కింది. ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో 22 సిక్స్‌లు బాదిన ఎస్ఆర్హెచ్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది.ఇంతకుముందు ఈ రికార్డు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉండేది. ఐపీఎల్-2013 సీజన్లో ఆర్సీబీ ఒకే ఇన్నింగ్స్‌లో 21 సిక్స్‌లు కొట్టి టాప్ ప్లేస్‌లో కొనసాగింది. అయితే తాజా మ్యాచ్‌తో 11 ఏళ్ల ఆర్సీబీ రికార్డును సన్‌రైజర్స్ బ్రేక్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మరో సంచలనం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన తన రికార్డునే తనే బ్రేక్ చేసింది. .ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అంతకుముందు ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీ20 హిస్టరీలో రెండో అత్యధిక స్కోర్.. అదే విధంగా మరో రికార్డును కూడా ఎస్ఆర్హెచ్ తమ ఖాతాలో వేసుకుంది. టీ20(అంతర్జాతీయ, లీగ్‌లు) చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరును నమోదు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. నేపాల్ గతేడాది ఏషియన్ గేమ్స్ టోర్నీలో మంగోలియాపై 314 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఎస్ఆర్హెచ్(287) పరుగులతో రెండో స్ధానంలో నిలిచింది. -
చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ?
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో హెడ్ కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్ 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన హెడ్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యంత వేగంగా శతకం నమోదు చేసిన ఆటగాడిగా హెడ్ రికార్డులకెక్కాడు. అదే విధంగా ఐపీఎల్ చరిత్రలోనే నాలుగో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఈ జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(30 బంతులు) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. యూసఫ్ పఠాన్(37 బంతులు), డేవిడ్ మిల్లర్(38 బంతులు) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. -
క్లాసెన్ ఊచకోత.. కేవలం 31 బంతుల్లోనే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్ ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. బౌలర్‌తో సంబంధం లేకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 31 బంతులు మాత్రమే ఎదుర్కొన్న క్లాసెన్.. 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. THE SHOOTING STAR...!!! 💫 - 106M monster by Heinrich Klaasen. 🥵 pic.twitter.com/raWQGOLOiM — Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024 -
IPL 2024: సన్‌రైజర్స్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో సంచలనం సృష్టించింది. ఐపీఎల్లో చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను ఎస్ఆర్హెచ్ నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్లో బాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆర్సీబీ బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్లో తాను సృష్టించిన అత్యధిక పరుగుల రికార్డును.. 20 రోజుల్లో తానే తిరగరాసింది. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. -
ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లకు హెడ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. అభిషేక్ శర్మతో స్కోర్‌ను బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లో హెడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. హెడ్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా ఐపీఎల్ సన్‌రైజర్స్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు. ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. సెంచరీ చేసిన తర్వాత లూకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో హెడ్ ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. TRAVIS HEAD - FASTEST HUNDRED BY SRH BATTER IN IPL HISTORY 🤯pic.twitter.com/GvWCPFpRkd — Johns. (@CricCrazyJohns) April 15, 2024 -
IPL2024 RCB vs SRH: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి..
IPL2024 RCB vs SRH Live Updates: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి.. ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ ఆఖరివరకు పోరాడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో దినేష్ కార్తీక్ అద్బుతమైన పోరాటం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో కార్తీక్ 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(62), విరాట్ కోహ్లి(42) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కండే రెండు, నటరాజన్ ఒక్క వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్ 181 పరుగులు వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన మహిపాల్ లామ్రోర్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో దినేష్ కార్తీక్(36), రావత్(5) పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి 42 బంతుల్లో 128 పరుగులు కావాలి. క్రీజులో దినేష్ కార్తీక్(16), లామ్రోర్(18) పరుగులతో ఉన్నారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. 9 ఓవర్ వేసిన మార్కండే బౌలింగ్‌లో పాటిదార్ ఔట్ కాగా.. అనంతరం కమ్మిన్స్ బౌలింగ్‌లో డుప్లెసిస్(62), సౌరవ్ చౌహన్ పెవిలియన్‌కు చేరారు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 122/5 ఆర్సీబీ రెండో వికెట్ డౌన్.. జాక్స్ ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ఉనద్కట్ బౌలింగ్‌లో విల్ జాక్స్ రనౌటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఫాప్ డుప్లెసిస్(51), పాటిదార్ ఉన్నారు. ఆర్సీబీ తొలి వికెట్ డౌన్.. కోహ్లి ఔట్ 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. చెలరేగి ఆడుతున్న ఆర్సీబీ ఓపెనర్లు.. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి(25), ఫాప్ డుప్లెసిస్(31) పరుగులతో ఉన్నారు. సన్‌రైజర్స్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను ఎస్ఆర్హెచ్ సాధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుమందు ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో తన రికార్డును తానే తిరగరాసింది. అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఏకంగా 22 సిక్స్‌లు బాదారు. ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్ 233 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67, 7 సిక్స్‌లు, 4 ఫోర్లు).. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. 16 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 217/2 16 ఓవర్లు ముగిసే సరికి ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), మార్క్రమ్(9) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్.. హెడ్ ఔట్ ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్.. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 41 బంతులు ఎదుర్కొన్న హెడ్.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో హెన్రిస్ క్లాసెన్(39), మార్క్రమ్(2) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ.. ట్రావిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లకు హెడ్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై హెడ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 38 బంతుల్లో హెడ్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 9 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. 102 పరుగులతో హెడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి1 57 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 108 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ఆభిషేక్ శర్మ.. టాప్లీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(79), క్లాసెన్(1) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దంచికొడుతున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(33), ట్రావిస్ హెడ్(71) పరుగులతో ఉన్నారు. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ ట్రావిస్ హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, 3సిక్స్‌లతో హెడ్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(23), ట్రావిస్ హెడ్(52) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(14), ట్రావిస్ హెడ్(13) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గ్లెన్ మాక్స్వెల్, సిరాజ్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఆర్సీబీ తుది జట్టులోకి కివీస్ ఫాస్ట్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ వచ్చాడు. సన్‌రైజర్స్ మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. తుది జట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, విజయ్‌కుమార్ వైషాక్, రీస్ టోప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్ -
అతడు బాగా అలిసిపోయాడు.. కొన్ని మ్యాచ్‌లకు రెస్ట్ ఇవ్వండి: భజ్జీ
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్లో తొలి మ్యాచ్ నుంచే సిరాజ్ దారుణంగా విఫలమవుతున్నాడు. వికెట్లు విషయం పక్కన పెడితే రన్స్‌ను కూడా భారీగా సమర్పించుకుంటున్నాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం సిరాజ్ పూర్తిగా తేలిపోయాడు. ముంబైతో మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 37 పరుగులిచ్చాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఈ హైదరాబాదీ 57. 25 సగటుతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్‌ను ఉద్దేశించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ బాగా ఆలిసిపోయాడని, అతడికి కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వాలని ఆర్సీబీ మెనెజ్‌మెంట్‌ను భజ్జీ సూచించాడు. "మహ్మద్ సిరాజ్ మానసికంగా, ఫిజికల్‌గా బాగా ఆలసిపోయినట్లు కన్పిస్తున్నాడు. అతడికి ప్రస్తుతం విశ్రాంతి అవసరం. అతడు గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. సిరాజ్ ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. నేనే ఆర్సీబీ మేనేజ్మెంట్లో భాగమైతే అతడికి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి ఇస్తాను. ఏమి జరుగుతుందో తను ఆర్ధం చేసుకోవడానికి అతడికి ఆ సమయం ఉపయోగపడుతోంది. సిరాజ్ అద్బుతమైన బౌలర్ అని మనకు తెలుసు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా కొత్త బంతితో వికెట్లు తీయడం అతడి స్పెషల్. కచ్చితంగా ముంబైతో మ్యాచ్ అతడికి పీడ కలవంటింది. కానీ సిరాజ్‌కు రెస్ట్ ఇస్తే అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇస్తాడని నేను నమ్ముతున్నాను. గతంలో నేను కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. -
'ఆర్సీబీకి వారి అవసరం చాలా ఉంది.. కనీసం వచ్చే సీజన్లోనైనా'
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ లీగ్‌లో భాగంగా గురువారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా పర్వాలేదన్పించిన ఆర్సీబీ.. బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు ఢిపెండ్ చేయలేకపోయారు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టుకు భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ కీలక సూచనలు చేశాడు. ఆర్సీబీ ప్రాంఛైజీకి మెరుగైన టాలెంట్ స్కౌట్స్ అవసరమని బదానీ అన్నాడు. "ఆర్సీబీ ఫ్రాంచైజీలో సరైన టాలెంట్డ్ స్కౌట్లు లేరు. ఆర్సీబీకి మెరుగైన టాలెంట్ స్కౌటింగ్ సిస్టమ్ కూడా అవసరం. గత కొన్ని సీజన్ల నుంచి ఆర్సీబీ స్కౌటింగ్ విభాగంలో కాస్త గందరగోళం నెలకొంది. కాబట్టి రాబోయో సీజన్లలోనైనా ఆర్సీబీ ఫ్రాంచైజీ స్కౌటింగ్ విభాగానికి తగిన ప్రాధాన్యత ఇస్తుందని" నేను ఆశిస్తున్నానని బదార్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా ప్రతీ ఫ్రాంఛైజీలోను టాలెంట్డ్ స్కౌట్ ఉంటారు. ఐపీఎల్ వేలానికి ముందు దేశవ్యాప్తంగా క్రికెట్ టయల్స్ నిర్వహించి ప్రతిభగల యువ క్రికెటర్లను గుర్తించడమే ఈ టాలెంట్డ్ స్కౌట్లు పని. అలా గుర్తించిన ఆటగాళ్లను వేలంలో దక్కించుకోనుందుకు ఫ్రాంచైజీలకు స్కౌట్లు సిఫారస్సు చేస్తారు. -
RCB Vs MI: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. తొలి బౌలర్‌గా! ఎవరికీ సాధ్యం కాలేదు
ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 5 వికెట్ల ఘనత సాధించిన తొలి బౌలర్‌గా బుమ్రా రికార్డలకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఆర్సీబీతో మ్యాచ్‌లో బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట బుమ్రా లిఖించుకున్నాడు. బుమ్రా కంటే ముందు ఎవరూ ఆర్సీబీపై ఫైవ్ వికెట్ల హాల్ సాధించలేదు. గతంలో ఆశిష్ నెహ్రా సీఎస్కే తరపున ఆడుతున్నప్పుడు ఆర్సీబీ 4 వికెట్ల ఘనత మాత్రమే నమోదు చేశాడు. ఇక బుమ్రాకు ఇది ఐపీఎల్లో రెండో ఫైవ్ వికెట్ల హాల్ కావడం గమానార్హం. ఈ మ్యాచ్‌లో తృటిలో హ్యాట్రిక్ వికెట్లు తీసే అవకాశాన్ని బుమ్రా కోల్పోయాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. విరాట్ కోహ్లి వంటి స్టార్ ఆటగాడిని సైతం బుమ్రానే ఔట్ చేశాడు. బుమ్రా తన నాలుగు ఓవర్లలో కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. అద్బుత ప్రదర్శనకు గాను బుమ్రాకు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. Jasprit Bumrah becomes the FIRST player to take an IPL fifer against RCB. pic.twitter.com/z5WmLlPbiF — Kausthub Gudipati (@kaustats) April 11, 2024 -
RCB Vs MI: మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ మరోసారి నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాక్స్వెల్ డకౌటయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న మాక్స్వెల్ ఖాతా తెరవకుండానే శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో డకౌటైన మాక్సీ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా దినేష్ కార్తీక్, రోహిత్ శర్మ సరసన మాక్స్వెల్ చేరాడు. మాక్స్వెల్ ఇప్పటివరకు 17 సార్లు ఐపీఎల్లో డకౌట్లు కాగా.. రోహిత్, కార్తీక్ 17 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. కాగా ఈ ఏడాది సీజన్ తొలి మ్యాచ్ నుంచే మాక్స్వెల్ నిరాశపరుస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మాక్స్వెల్.. కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించాడు. రాబోయో మ్యాచ్‌ల్లో అతడిపై వేటు పడే అవకాశముంది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. -
RCB Vs MI: వారెవ్వా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! రోహిత్ షాక్ (వీడియో)
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ రీస్ టాప్లీ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. టాప్లీ అద్బుత క్యాచ్‌తో మంచి ఊపు మీద ఉన్న రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపాడు. ముంబై ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్‌లో రెండో బంతిని రోహిత్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు స్వీప్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న టాప్లీ ఎడమవైపు ఫుల్-లెంగ్త్ డైవ్ చేసి అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్‌ను అందుకున్నాడు. టాప్లీ క్యాచ్‌తో వాంఖడే స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. రోహిత్ కూడా ఒక్కసారిగా బిత్తరపోయాడు. చేసేదేమి లేక 38 పరుగులు చేసిన రోహిత్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్(34 బంతుల్లో 69) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(52), రోహిత్ శర్మ(38) పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో విల్ జాక్స్, విజయ్ కుమార్, ఆకాష్ దీప్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(61), కార్తీక్(53) పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్పీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. WHAT A CATCH! Reece Topley takes a blinder to dismiss Rohit Sharma. Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvRCB pic.twitter.com/wBAiSbBCoW — IndianPremierLeague (@IPL) April 11, 2024 -
చాలా బాధగా ఉంది.. అతడే మా కొంపముంచాడు: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్లో ఆర్సీబీ మరో ఘోర ఓటమిని చవిచూసింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బెంగళూరు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు అదరగొట్టినప్పటికి.. బౌలర్లు మాత్రం దారుణంగా తేలిపోయారు. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ముంబై సునాయాసంగా కేవలం 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఈ ముంబై చేతిలో ఓటమిపై మ్యాచ్ అనంతరం ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. మంచు ప్రభావం తమ కొంపముంచిందని డుప్లెసిస్ తెలిపాడు. "మేము ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. ఒక మ్యాచ్‌లో విజయం సాధించాలంటే బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ రాణించాలి. టాస్ గెలిచింటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమో. ఎందుకంటే మేము కూడా తొలుత బౌలింగ్ చేయాలనుకున్నాం. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. మా బౌలర్లు చాలా ఇబ్బంది పడ్డారు.అయితే దీనిని నేను సాకుగా చెప్పాలనుకోవడం లేదు. వారు బాగా ఆడారు. మాపై ఒత్తిడి తెచ్చారు. బౌలింగ్‌లో కూడా అద్బుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో మేము కూడా చాలా తప్పులు చేశాము. ఇటువంటి వికెట్‌పై 190 పైగా స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. పవర్‌ప్లేలో మేము మరి కొన్ని పరుగులు సాధించింటే బాగుండేంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుందని మాకు ముందే తెలుసు కాబట్టి 250 పైగా పరుగులు చేయాల్సింది. ఆరంభంలో వికెట్లు కోల్పోడం కూడా మమ్మల్ని దెబ్బతీసింది. అయితే పాటిదార్, నేను క్రీజులో ఉన్నప్పుడు పెద్ద స్కోర్ వస్తుందని భావించాను. కానీ ముంబై బౌలర్లు తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా బుమ్రా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అతడు డెత్ ఓవర్లలో సూపర్ బౌలింగ్ చేశాడు. అతడికి అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బుమ్రాని ఎటాక్ చేసి ఒత్తిడిలోకి నెట్టడం అంత సలభం కాదు. లసిత్ మలింగ గైడన్స్‌లో జస్ప్రీత్ మరింత మెరుగయ్యాడని నేను భావిస్తున్నాను. అటువంటి క్లాస్ బౌలర్ మా జట్టులో ఉంటే బాగుండేది. మా బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదని మాకు తెలుసు. కాబట్టి రాబోయో మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ పరంగా మెరుగ్గా రాణించి భారీ స్కోర్లు సాధించాలని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో ఫాప్ పేర్కొన్నాడు. -
RCB Vs MI: ఇదేమి బౌలింగ్ రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి! ఆర్సీబీపై ట్రోలింగ్
ఐపీఎల్-2024లో ఆర్సీబీ మరో ఘోర ఓటమి చూవిచూసింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. గల్లీ బౌలర్లు కంటే దారుణంగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ బౌలర్లు.. మ్యాచ్‌ను ముంబైకు సమర్పించుకున్నారు. ఆర్సీబీ చెత్త బౌలింగ్ కారణంగా ముంబై 197 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఊదిపడేసింది. ముంబై బ్యాటర్లు ఇషాన్ కిషన్(69),సూర్యకుమార్ యాదవ్(52) బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు.కనీసం ముంబై బ్యాటర్లు అడ్డుకోవడానికి ఏ ఒక్క బౌలర్ కూడా ప్రయత్నించలేదు. సిరాజ్, టాప్లీ లాంటి అంతర్జాతీయ స్ధాయి బౌలర్లు సైతం చేతులెత్తేశారు. Let's all laugh at RCB bowlers and RCB fans 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂#MIvsRCBpic.twitter.com/ieTsdguKOd — 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) April 11, 2024 సిరాజ్ 3 ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకోగా.. టాప్లీ కూడా 3 ఓవర్లలో 34 పరుగులిచ్చాడు. ఇక జూనియర్ బౌలర్ల విషయానికి వస్తే.. ఆకాష్ దీప్ అయితే బౌలింగ్‌లో ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టేశాడు. 3.3 ఓవర్లలో ఆకాష్ ఏకంగా 55 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. అటు విజయ్‌కుమార్ వైశ్యాఖ్ సైతం భారీ పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా మరోసారి ఆర్సీబీ ఓటమిలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆర్సీబీ బౌలర్లను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మీకెందుకు ఆట దండగా.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. Rcb Fans 😭 pic.twitter.com/c5yZNzaTnd — Gagan🇮🇳 (@1no_aalsi_) April 11, 2024 -
RCB Vs MI: ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి విధ్వంసం.. దటీజ్ సూర్య భాయ్! వీడియో
ఐపీఎల్-2024లో తన తొలి మ్యాచ్‌లో విఫలమైన ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సూర్యకుమార్ విధ్వంసం సృష్టించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సూర్య భాయ్ ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో స్కై వీరవీహరం చేశాడు. ఈ క్రమంలో కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 19 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. కాగా అతడికి ఇది తన ఐపీఎల్లో కెరీర్లోనే ఫాస్ట్స్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అదేవిధంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ ఫిప్టీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా మిస్టర్ 360 నిలిచాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్ తొలి స్ధానంలో ఉన్నాడు. ఐపీఎల్-2021 సీజన్లో ఎస్ఆర్హెచ్పై కిషన్ కేవలం 16 బంతుల్లోనే ఆర్ధశతకాన్ని సాధించాడు. ఇక సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వెలకమ్ బ్యాక్ టూ సూర్యభాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టీ20 వరల్డ్‌కప్‌కు ముందు సూర్య ఈ తరహా ప్రదర్శన చేయడం భారత జట్టుకు కలిసొచ్చే ఆంశం. pic.twitter.com/4Z9pwCdawR — Muskaan Bhatt (@MuskaanBhatt11) April 11, 2024 -
RCB Vs MI: శెభాష్ డీకే భాయ్, నీవు వరల్డ్ కప్‌లో ఆడాలి.. రోహిత్ ఆఫర్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం 15.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మాత్రం తన బ్యాటింగ్‌తో అందరని ఆకట్టుకున్నాడు. మరోసారి కార్తీక్ ఫినిషర్‌గా అవతారమెత్తాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డీకే.. ముంబై బౌలర్లలపై విరుచుకుపడ్డాడు. రివర్స్ స్వీప్, స్కూప్ షాట్లతో కార్తీక్ ఆలరించాడు. ఆర్సీబీ 196 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో కార్తీక్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కార్తీక్.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే కార్తీక్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ సైతం ఫిదా అయిపోయాడు. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ.. కార్తీక్ వద్దకు వెళ్లి చప్పట్లు కొడుతూ అభినంధించాడు. అంతేకాకుండా డీకే భాయ్ నీవు టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలంటూ రోహిత్ నవ్వుతూ ఉన్నాడు. కార్తీక్ కూడా ఒకే అన్నట్లు నవ్వుతూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Rohit Sharma teasing DK with " World Cup Khelna hai saabash"😂#RCBvMIpic.twitter.com/F01TTl1szu — Sunil the Cricketer (@1sInto2s) April 11, 2024 -
RCB Vs MI: దినేష్ కార్తీక్ విధ్వంసం.. కేవలం 23 బంతుల్లోనే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దినేష్ కార్తీక్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కార్తీక్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ముఖ్యంగా ముంబై పేసర్ ఆకాష్ మధ్వాల్‌ను డీకే ఓ ఆట ఆడేసుకున్నాడు. ఆకాష్ మధ్వాల్ వేసిన తన ఆఖరి రెండు ఓవర్లలో కార్తీక్ ఏకంగా 38 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కార్తీక్.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కార్తీక్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. డీకే ది ఫినిషర్ అంటూ కామెంట్లు చేస్తున్నాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు. pic.twitter.com/dBwUH5hlgA — Sitaraman (@Sitaraman112971) April 11, 2024 -
11 కోట్లు తీసుకుంటున్నావు.. మరి ఇంత చెత్త ఆటనా? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో మాక్స్వెల్ రెండో సారి డకౌటయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాక్స్వెల్ తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్సీ.. చెత్త షాట్ ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 13 ఓవర్లో శ్రేయాస్ గోపాల్ వేసిన బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన మాక్స్వెల్.. వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో నాలుగు బంతులు ఎదుర్కొని క ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మాక్స్వెల్.. కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించాడు. ఈ క్రమంలో అతడి ఆర్సీబీ అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. రూ. 11 కోట్లు తీసుకుని మరి ఇటువంటి చెత్త ఆడుతావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా అతడిని జట్టు నుంచి పక్కన పెట్టండి మరి కొంతమంది పోస్ట్‌లు చేస్తున్నారు. చదవండి: IPL 2024: ఫాప్ డుప్లెసిస్ 'నో లూక్' సిక్స్.. వీడియో వైరల్ pic.twitter.com/R2Bb8c5H6r — Sitaraman (@Sitaraman112971) April 11, 2024 Maxwell in every match ....🤣😭😭 pic.twitter.com/uwEBu43buT — Jo Kar (@i_am_gustakh) April 11, 2024 -
RCB Vs MI: ఫాప్ డుప్లెసిస్ 'నో లూక్' సిక్స్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ అద్భుతమైన షాట్‌తో మెరిశాడు. డుప్లెసిస్ న్యూ లూక్ షాట్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన గెరాల్డ్ కోయిట్జీ ఆఖరి బంతిని డుప్లెసిస్‌కు 142.3 కి.మీ వేగంతో గుడ్ లెంగ్త్ డెలివరీ సంధించాడు. అయితే ముందుగానే పొజిషన్లో వచ్చిన డుప్లెసిస్.. బంతిని చూడకుండానే ర్యాంప్ షాట్ ఆడాడు. అయితే డెలివరీగా ఎక్కువగా పేస్ ఉండడంతో దెబ్బకు బంతి స్టాండ్స్‌లో పడింది. దీంతో డుప్లెసిస్ న్యూ లూక్ సిక్స్ చూసిన బౌలర్ కొయిట్జీ ఒక్కసారిగా తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. #MIvsRCB,#RCBvsMI,#FafDuPlessis Fabulous pic.twitter.com/24eiZQQtga — Be Positive 🙂↕️🌝💯 (@Tauqeer__azam) April 11, 2024 -
ఆర్సీబీని చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
IPL 2024 MI vs RCB Live Updates: ఆర్సీబీని చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ రెండో విజయం నమోదు చేసింది. వాంఖడే వేదికగా ఆర్సీబీ జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ కిషన్(34 బంతుల్లో 69) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(52), రోహిత్ శర్మ(38) పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో విల్ జాక్స్, విజయ్ కుమార్, ఆకాష్ దీప్ తలా వికెట్ సాధించారు. ముంబై మూడో వికెట్ డౌన్.. సూర్య ఔట్ సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన సూర్య.. విజయ్ కుమార్ వైశ్యాఖ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. సూర్యకుమార్ యాదవ్ ఫిప్టీ.. సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కేవలం 17 బంతుల్లోనే తన ఫిప్టీ మార్క్‌ను అందుకున్నాడు. 13 ఓవర్లకు ముంబై స్కోర్: 169/2 రెండో వికెట్ డౌన్.. 139 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(34), హార్దిక్ పాండ్యా(7) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. 101 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 69 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. ఆకాష్ దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 10 ఓవర్లకు ముంబై స్కోర్: 111/1 క్రీజులో రోహిత్ శర్మ(34), సూర్యకుమార్ యాదవ్(5) పరుగులతో ఉన్నారు. 7 ఓవర్లకు ముంబై స్కోర్: 84/0 7 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(26), ఇషాన్ కిషన్(56) పరుగులతో ఉన్నారు. 4 ఓవర్లకు ముంబై స్కోర్: 32/0 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(8), ఇషాన్ కిషన్(22) పరుగులతో ఉన్నారు. దినేష్ కార్తీక్ విధ్వంసం.. ముంబై టార్గెట్ 197 పరుగులు ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో దినేష్ కార్తీక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతుల్లోనే డీకే 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. వీరిద్దితో పాటు రజిత్ పాటిదార్(50) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇక ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగగా.. ఆకాష్ మధ్వాల్, కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలా వికెట్ సాధించారు. ఐదు వికెట్లతో చెలరేగిన బుమ్రా.. ఆర్సీబీ ఎనిమిదో వికెట్ డౌన్ ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో 21 పరుగులివచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 19 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 117/8. క్రీజులో దినేష్ కార్తీక్(36), ఆకాష్ దీప్(1) పరుగులతో ఉన్నారు. బుమ్ బుమ్ బుమ్రా.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు ముంబై పేసర్ బుమ్రా దాటికి ఆర్సీబీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన బుమ్రా.. తొలుత ఫాప్ డుప్లెసిస్(61), మహిపాల్ లామ్రోర్ తర్వాత పెవిలియన్‌కు చేరాడు. 17 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 154/6 15 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 131/4 15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(58), దినేష్ కార్తీక్(6) పరుగులతో ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. మాక్సీ ఔట్ మాక్స్వెల్ మరోసారి నిరాశపరిచాడు. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో మాక్స్వెల్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 111/4 మూడో వికెట్ డౌన్.. రజిత్ పాటిదార్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. పాటిదార్ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రజిత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 26 బంతుల్లో 4 సిక్స్‌లు, మూడు ఫోర్లతో 50 పరుగులు చేశాడు. 6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 44/2 6 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో రజిత్ పాటిదార్(11), ఫాప్ డుప్లెసిస్(22) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. 23 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన విల్ జాక్స్.. ఆకాష్ మధ్వాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. విరాట్ కోహ్లి ఔట్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 3 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 18/1 ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఒక మార్పుతో బరిలోకి దిగగా.. ఆర్సీబీ మాత్రం ఏకంగా మూడు మార్పులు చేసింది. విల్ జాక్స్, మహిపాల్ లామ్రోర్, విజయ్‌కుమార్ వైశాఖ్ ఆర్సీబీ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లొమ్రోర్, రీస్ టోప్లీ, విజయ్‌కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ, ఆకాష్ మధ్వల్ -
RCB Vs KKR: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆర్సీబీ ఆటగాడిగా విరాట్ రికార్డలకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు కోహ్లి ఐపీఎల్లో 241 సిక్స్‌లు బాదాడు. కాగా ఇంతకముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్, ఆర్సీబీ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ ఐపీఎల్లో 239 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌తో గేల్ రికార్డు బద్దలైంది. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతులు ఎదుర్కొన్న 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. కానీ మ్యాచ్‌లో కేకేఆర్ చేతిలో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 183 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సునీల్ నరైన్(22 బంతుల్లో 47), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(39 నాటౌట్) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. And some people thinks this man shouldn't play T20 World Cup 🤡 83(53) 🔥🔥 @imVkohli#ViratKohli #Kohli #Virat #RCBvsKKR #KKRvsRCB @CricCrazyJohns @mufaddal_vohra pic.twitter.com/X4mXTkQNp0 — Ashu (@Satyam0798) March 29, 2024 -
విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్‌గా
టీమిండియా స్టార్ క్రికెటర్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బెయిర్ స్టో క్యాచ్‌ను అందుకున్న కోహ్లి.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి ఇప్పటివరకు టీ20ల్లో 173 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా పేరిట ఉండేది. టీ20 క్రికెట్లో రైనా 172 క్యాచ్‌లు అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో రైనా ఆల్‌టైమ్ రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ పంజాబ్‌ను తొలుత బ్యాటింగ్‌కు అహ్హనించాడు. -
IPL 2024: దినేష్ కార్తీక్ తుపాన్ ఇన్నింగ్స్.. ఆర్సీబీ ఘన విజయం
IPL 2024 RCB vs PBKS Live Updates: ఆర్సీబీ ఘన విజయం ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(77) కీలక పాత్ర పోషించాడు. కోహ్లితో పాటు దినేష్ కార్తీక్(10 బంతుల్లో 28), మహిపాల్ లామ్రోర్(8 బంతుల్లో17) సైతం అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆఖరి రెండు ఓవర్లలో ఆర్సీబీ విజయానికి 23 పరుగులు అవసరమవ్వగా కార్తీక్ ఫినిషర్‌గా మారాడు. వరుసగా బౌండరీలు బాదుతూ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ, హర్‌ప్రీత్ బరార్ తలా రెండు వికెట్లు సాధించారు. ఐదో వికెట్ డౌన్.. విరాట్ కోహ్లి ఔట్ 130 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 77 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆర్సీబీ విజయానికి 24 బంతుల్లో 47 పరుగులు కావాలి. నాలుగో వికెట్ డౌన్.. మాక్స్వెల్ ఔట్ 103 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన మాక్స్వెల్.. బరార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి రావత్ వచ్చాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 106/4, క్రీజులో కోహ్లి(64), రావత్(2) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ డౌన్.. పాటిదార్ ఔట్ 87 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రజిత్ పాటిదార్.. బరార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మాక్స్వెల్ వచ్చాడు. 12 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 99/3, క్రీజులో కోహ్లి(63), మాక్స్వెల్(3) పరుగులతో ఉన్నారు. విరాట్ కోహ్లి ఫిప్టీ.. విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. కేవలం 31 బంతుల్లోనే విరాట్ 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 85/2. క్రీజులో కోహ్లితో పాటు పాటిదార్(19) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్.. గ్రీన్ ఔట్ 43 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన గ్రీన్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 50/2. క్రీజులో విరాట్ కోహ్లి(35), పాటిదార్(7) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ.. కెప్టెన్ ఔట్ 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఫాప్ డుప్లెసిస్.. రబాడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.క్రీజులో విరాట్ కోహ్లి(21), గ్రీన్(2) పరుగులతో ఉన్నారు. ఆర్సీబీ టార్గెట్ 177 పరుగులు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(45) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జితేష్ శర్మ(27), శశాంక్ సింగ్(21) పరుగులతో రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో మాక్స్వెల్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జోషఫ్, దయాల్ తలా వికెట్ సాధించారు. ఐదో వికెట్ డౌన్.. సామ్ కుర్రాన్ ఔట్ సామ్ కుర్రాన్ రూపంలో పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 132/4 16 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజులో జితేష్ శర్మ(19), సామ్ కుర్రాన్(14) పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. ధావన్ ఔట్ పంజాబ్ కింగ్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్ నాలుగో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.13 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 102/4 మూడో వికెట్ డౌన్.. లివింగ్‌స్టోన్ ఔట్ 98 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన లివింగ్ స్టోన్.. జోషఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండో వికెట్ డౌన్.. ప్రభుసిమ్రాన్ సింగ్ ఔట్ 72 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్.. మాక్స్వెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 40/1 6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(21), ప్రభుసిమ్రాన్(10) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. 17 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ప్రభుసిమ్రాన్ సింగ్ వచ్చాడు. 2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 9/0 టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(8), బెయిర్ స్టో(0) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పలు లేకుండా బరిలోకి దిగాయి. తుది జట్లు పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (సి), జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెప్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్(వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
టీమిండియాలోనే కాదు.. ఇక్కడా ఇంతేనా?! వీడియో వైరల్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆటగాడు, ఆర్సీబీ మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్.. ఇప్పుడు ఐపీఎల్-2024లోనూ అదే తీరును కనబరిచాడు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో పాటిదార్ దారుణంగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న పాటిదార్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి ఎటువంటి ఫుట్ మూమెంట్ లేకుండా ఆఫ్ సైడ్ వైపు ఆడటానికి పాటిదార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ ధోని చేతికి వెళ్లింది. ధోని ఎటువంటి తప్పిదం చేయకుండా రెగ్యులేషన్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేమి ఆటరా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శివమ్ దూబే(34 నాటౌట్), రవీంద్ర జడేజా(25 నాటౌట్) రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆర్సీబీని అనుజ్ రావత్(48), దినేష్ కార్తీక్(38 నాటౌట్) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో అదుకున్నారు. వీరితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(35) పరుగులతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తుఫిజర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. All Happening Here! Faf du Plessis ✅ Rajat Patidar ✅ Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి భారత క్రికెటర్‌గా
టీమిండియా స్టార్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 12000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 376 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 41.21 సగటు, 133.42 స్ట్రయిక్‌రేట్‌తో 12000 పరుగులు చేశాడు. . ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ వీరుడు క్రిస్ గేల్ (14562) టాప్‌లో ఉండగా.. పాక్ షోయబ్ మాలిక్ (13360), విండీస్ పోలార్డ్ (12900), ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ (12319), ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (12065) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో విరాట్ చేరాడు. -
ఐపీఎల్ "డాన్" విరాట్ కోహ్లి.. ఢిల్లీపై అత్యధికంగా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి టాప్ రన్ స్కోరర్ అన్న విషయం తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్‌లో తొలి సీజన్ (2008) నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి.. ఇప్పటివరకు 237 మ్యాచ్‌లు ఆడి 7 సెంచరీలు, 50 అర్దసెంచరీల సాయంతో 130.02 స్ట్రయిక్‌రేట్‌తో 7263 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో ఎన్నో టాప్ రికార్డులు తన ఖాతాలో వేసుకున్న కోహ్లి.. రాబోయే సీజన్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. The Roar for Virat Kohli when he entered at Chinnaswamy stadium. - THE GOAT AT HIS DEN...!!!! 🐐👑 pic.twitter.com/uJYIbVN15Q — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 VIRAT KOHLI AT CHINNASWAMY. - THE KING AT HIS KINGDOM...!!!! 🐐 pic.twitter.com/Hkr3gG7Z4o — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 ఇవాళే (మార్చి 19) ప్రాక్టీస్ ప్రారంభించిన కోహ్లి చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో సహచరులతో కలిసి సరదాగా గడిపాడు. కోహ్లిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. కోహ్లి క్రేజ్‌కి తోడు మహిళా జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడం ఆర్సీబీ అభిమానులకు రెట్టింపు ఉత్సాహానిస్తుంది. Virat Kohli in the batting practice session at Chinnaswamy today. - KING KOHLI IS GETTING READY TO RULE..!!! 👑 pic.twitter.com/1FIMjNze08 — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 Preparations done at the Chinnaswamy Stadium for the RCB Unbox Event. - Virat Kohli standing tall. 🐐pic.twitter.com/ZRhYJcenYy — Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024 ఇవాళ సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ జరుగనుండటంతో అభిమానులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. కోహ్లి నామస్మరణతో స్టేడియం మార్మోగిపోతున్నాయి. కోహ్లి ఇటీవలే రెండో బిడ్డకు తండ్రి కావడంతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. The Craze for RCB & Kohli. - Incredible atmosphere in Chinnaswamy stadium. 🔥pic.twitter.com/So7Dzto8Wv — Johns. (@CricCrazyJohns) March 19, 2024 అన్‌బాక్స్ ఈవెంట్లో ఐపీఎల్ ఛాంపియన్స్ ఆర్సీబీ (మహిళా జట్టు) ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. మహిళా జట్టులాగే పురుషుల టీమ్ కూడా ఆసారి ఐపీఎల్ టైటిల్ సాధిస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. The Stage is set for RCB's Unbox Event at Chinnaswamy stadium...!!!! 🔥 pic.twitter.com/0GkKXpZyRN — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 RCB Women's has arrived at Chinnaswamy stadium in the Unbox Event...!!!! 🏆 pic.twitter.com/VYx1lMLnSo — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 ఐపీఎల్ 2024 సీజన్లో మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లికి సంబంధించిన గణాంకాలపై ఓ లుక్కేద్దాం. కోహ్లి ఏ జట్టుపై ఎన్ని పరుగులు సాధించాడో నెమరు వేసుకుందాం. గణాంకాల ప్రకారం కోహ్లికి ఢిల్లీ ఫ్రాంచైజీపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఫ్రాంచైజీపై కోహ్లి అత్యధికంగా 1030 పరుగులు చేశాడు. ఐపీఎల్లో వివిధ జట్లపై కోహ్లి సాధించిన పరుగుల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 1030 సీఎస్కేపై 985 కేకేఆర్‌పై 861 పంజాబ్ కింగ్స్‌పై 861 ముంబై ఇండియన్స్‌పై 852 సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 669 రాజస్థాన్ రాయల్స్‌పై 618 డెక్కన్ ఛార్జర్స్‌పై 306 గుజరాత్ లయన్స్‌పై 283 కొచ్చి కేరళ టస్కర్స్‌పై 50 లక్నో సూపర్ జెయింట్స్‌పై 117 పూణే వారియర్స్‌పై 128 రైజింగ్ పూణే సూపర్ జెయింట్‌పై 271 గుజరాత్ టైటాన్స్‌పై 232 ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేతో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
ఐపీఎల్ కోసం కోహ్లి న్యూ లుక్.. అదిరిపోయిందిగా! ఫోటో వైరల్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2024 సీజన్‌తో విరాట్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఆర్సీబీ జట్టుతో కలిసిన కోహ్లి.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు కింగ్ కోహ్లి న్యూ లుక్‌లో కన్పించాడు. ఎప్పటికప్పుడు సరికొత్త హెయిర్ స్టైల్‌తో అభిమానులను అకట్టుకునే విరాట్.. ఇప్పుడు మరో కొత్త హెయిర్ స్టైల్లో దర్శనిమిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కోహ్లికి హెయిర్ స్టైల్ చేసింది ఎవరో కాదు.. సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ అలీమ్ హకీమ్. మన దేశంలో టాప్ సెలెబ్రిటీలకు అతడే హెయిర్ స్టైలింగ్ చేస్తుంటాడు. గత సీజన్ ఆరంభానికి ముందు విరాట్ కొత్త హెయిర్ స్టైల్లో కన్పించాడు. అది చేసినది కూడా అలీమ్ హకీమే కావడం గమనార్హం. ఇక ఐపీఎల్ 17వ సీజన్లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ క్యాష్‌రిచ్ లీగ్ ఆరంభానికి ముందు ఆర్సీబీ ఆన్‌బాక్స్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. మార్చి 19(మంగళవారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో విరాట్ సందడి చేయనున్నాడు. 𝑽𝒊𝒓𝒂𝒕 𝑲𝒐𝒉𝒍𝒊 gets a new look 💇 📸: Aalim Hakim pic.twitter.com/QbClloVr80 — CricTracker (@Cricketracker) March 19, 2024 -
డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కల ఎట్టకేలకు నేరవేరింది. గత 16 ఏళ్లగా ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ కలను డబ్ల్యూపీఎల్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ బౌలర్ల జోరుకు 113 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో అదరగొట్టగా.. మోలినెక్స్ 3, ఆశ శోభన 2 రెండో వికెట్లు పడగొట్టారు. అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలి టైటిల్ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఫ్రైజ్ మనీ ఎంత? ఆరెంజ్ క్యాప్ ఎవరికి దక్కింది? ఇటువంటి విషయాలపై ఓ లూక్కేద్దం. విజేతకు ఎంతంటే? డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీకి రూ.6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన క్యాపిటల్స్ కు రూ.3 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఆరెంజ్ క్యాప్ విజేత పెర్రీ.. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆర్సీబీ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచింది. దీంతో ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్ మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 347 పరుగులు చేసింది. పర్పుల్ క్యాప్ హోల్డర్ శ్రేయంక అదేవిధంగా అత్యధిక ఈ ఏడాది సీజన్లో వికెట్లు తీసిన ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయంక పాటిల్ పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచింది. దీంతో ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్ మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రేయంక.. 13 వికెట్లు పడగొట్టింది. మిగితా అవార్డులు దక్కించుకున్న వారు వీరే.. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్-దీప్తి శర్మ ఎమర్జింగ్ ప్లేయర్ - శ్రేయాంక పాటిల్ (బెంగళూరు) మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ - దీప్తి శర్మ (యూపీ) బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ - సజన సజీవన్ (ముంబై) ఫెయిర్ ప్లే టీమ్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు A special moment to celebrate @imVkohli @mandhana_smriti pic.twitter.com/NkEI6iDIjq — CricTracker (@Cricketracker) March 17, 2024 -
RCB: 2844 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత..!
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 17) జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. టేబుల్ టాపర్‌గా నిలిచి ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు చేరుకోగా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి ఆర్సీబీ ఫైనల్‌కు చేరింది. Literally every RCB fan. #DCvRCB pic.twitter.com/y8l9eUAR3K — Yolo247 (@Yolo247Official) March 17, 2024 డబ్ల్యూపీఎల్‌లో ఫైనల్‌కు చేరడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా రెండోసారి కాగా.. ఆర్సీబీ తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించింది. డబ్ల్యూపీఎల్ అరంగేట్రం సీజన్లో (2023) కేవలం రెండే విజయాలతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఆర్సీబీ.. ప్రస్తుత సీజన్లో గ్రూప్ దశలో నాలుగు విజయాలు, కీలకమైన ఎలిమినేటర్‌లో ముంబైపై విజయంతో మొత్తంగా ఐదు విజయాలు సాధించి ఫైనల్‌కు చేరింది. ఐపీఎల్ (2009, 2011, 2016), డబ్ల్యూపీఎల్ (2024), ఛాంపియన్స్ టీ20 లీగ్‌లతో (2011) కలిపి ఐదోసారి ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ.. 2844 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఫైనల్‌కు చేరింది. ఆర్సీబీ చివరిసారిగా 2016 ఐపీఎల్ ఎడిషన్‌లో ఫైనల్స్ ఆడింది. నాటి ఫైనల్లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం ఆర్సీబీ మరోసారి ఫైనల్‌కు చేరింది. మరి ఈ సారి ఫైనల్లోనైనా ఆర్సీబీ విజయం సాధించి తమ టైటిల్ దాహానికి చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి. -
అక్కడా.. ఇక్కడా ఆర్సీబీ ఆటగాళ్లదే డామినేషన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ జట్టునే అధికంగా ఇష్టపడతారు. ఆర్సీబీ ప్రాతినిథ్యం వహించిన, వహిస్తున్న క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి ఆటగాళ్ల రేంజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆర్సీబీ క్రేజ్ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ జట్టు ఆటగాళ్ల క్రేజ్ మహిళల ఐపీఎల్‌లోనూ (డబ్ల్యూపీఎల్) ఇదే రేంజ్లో ఉంది. డబ్ల్యూపీఎల్‌లోనూ ఆర్సీబీ టైటిల్ సాధించకపోయినా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజా డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరి తమ తొలి టైటిల్‌పై అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. నేడు జరుగబోయే ఫైనల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆర్సీబీ కేవలం క్రేజ్ విషయంలోనే తోపు కాదని గణంకాలు సూచిస్తున్నాయి. ఐపీఎల్, డబ్ల్యూపీల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు ఆర్సీబీ ఆటగాళ్ల పేరిటే ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (175) క్రిస్ గేల్ పేరిట ఉండగా.. మహిళల ఐపీఎల్లో ఈ రికార్డు ఆర్సీబీకే చెందిన సోఫీ డివైన్ (99) పేరిట ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/12) ఆర్సీబీ బౌలర్ అల్జరీ జోసఫ్ పేరిట ఉండగా.. డబ్ల్యూపీఎల్‌లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/15) ఎల్లిస్ పెర్రీ పేరిట ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ డామినేషన్ ఏ రేంజ్లో సాగుతుందో ఇట్టే అర్దమవుతుంది. -
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కింగ్ కోహ్లి వచ్చేశాడు! వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి భారత గడ్డపై అడుగుపెట్టాడు. తన భార్య ప్రసవం కారణంగా ఇన్నాళ్లు లండన్‌లో ఉండిపోయిన విరాట్ ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నాడు. శనివారం(మార్చి16) రాత్రి బెంగళూరుకు కోహ్లి చేరుకున్నాడు. ఐపీఎల్-2024 సీజన్‌కు మరో మూడు రోజుల సమయం ఉన్నందన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఆదివారం విరాట్ కలవనున్నాడు. డిసెంబర్ 19న చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఆర్సీబీ ఆన్ బాక్స్ ఈవెంట్లో కోహ్లి పాల్గోనున్నాడు. కాగా కోహ్లి దాదాపు మూడు నెలల నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 టెస్ట్ సిరీస్‌కు కింగ్ కోహ్లి దూరమయ్యాడు. ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇక ఐపీఎల్-2024 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ జట్టు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, గ్లెన్ మాక్స్వెల్, విల్ జాక్స్, మహ్మద్ సిరాజ్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, కామెరాన్ గ్రీన్, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పాటీదార్, ఆకాశ్ దీప్, మయాన్సెక్, మయాన్సెక్ టాప్లీ, కర్ణ్ శర్మ, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, హిమాన్షు శర్మ, విజయ్‌కుమార్ వైషాక్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, సౌరవ్ చౌహాన్, స్వప్నిల్ సింగ్. KING KOHLI AT THE MUMBAI AIRPORT. - The GOAT is coming back!! 🐐pic.twitter.com/7MXeik5eHI — Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2024 -
పేరు మార్చుకోనున్న ఆర్సీబీ..!?
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సీజన్ నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ జట్టు పేరులో స్వల్ప మార్పుచేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీబీ తమ జట్టు పేరును ఇంగ్లీష్‌లో (Royal Challengers Bangalore) అని రాసుకొస్తోంది. అయితే ఇకపై (Royal Challengers Bengaluru)గా మార్చనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆర్సీబీ షేర్ చేసిన ఓ వీడియో ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. ఈ వీడియోలో శాండల్‌వుడ్ నటుడు రిషబ్ శెట్టి మూడు దున్నలను తీసుకువచ్చి వాటిపై రాయల్(Royal), ఛాలెంజర్స్(Challengers), బెంగళూరు(Bangalore) అని వేర్వేరుగా రాసి ఉన్నాయి. ఈ క్రమంలో రిషబ్ బెంగళూరు(Bangalore) అని రాసి ఉన్న దున్నను తీసుకెళ్లిపోమని ఓ వ్యక్తితో చెబుతాడు. కాగా క్రికెటేతర క్రీడల్లో Bangalore అని కాకుండా Bengaluru గా రాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్ధానిక అభిమానుల కోరిక మెరకు ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టుపేరును Bengaluruగా మార్చుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా మార్చి 19న చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న 'ఆన్‌బాక్స్' ఈవెంట్లో ఆధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. విరాట్ కోహ్లి వచ్చేస్తున్నాడు?
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ఇంకా కేవలం 8 రోజుల సమయం మాత్రమే మిగిలింది. మార్చి 22న చెపాక్ వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుడ్ న్యూస్ అందింది. గత రెండు నెలలగా వ్యక్తిగత కారణాలతో ఆటకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మరో మూడు రోజుల్లో ఆర్సీబీ జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లండన్‌లో వున్న విరాట్ ఈ వారం చివరిలోపు ఆర్సీబీ ప్రీ-సీజన్ ట్రైనింగ్ క్యాంప్‌లో చేరనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా మార్చి 19న ఆర్సీబీ తమ కొత్త జెర్సీని రీవీల్ చేసేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని ఓ కార్యక్రమంను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో కోహ్లి సైతం పాల్గోనున్నాడని ఆర్సీబీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇప్పటికే ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ సైతం జట్టుతో కలిశాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. టీ20 వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్..? ఇక ఇది ఇలా ఉండగా.. విరాట్ కోహ్లి విషయంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్ జట్టులో కోహ్లికి చోటు కల్పించకుండా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కోహ్లి ఐపీఎల్లో బాగా రాణిస్తే సెలక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకునే ఛాన్స్ ఉంది. Captain Faftastic is home, and on his naming day! ❤🔥 Thumbs up if you are ready to kick off a Faf-ulous season 👍😁#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #Homecoming @faf1307 pic.twitter.com/CE2fjm25nZ — Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2024 -
'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే'
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ జట్టుకు ఐపీఎల్లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినప్పటికీ అభిమానులు మాత్రం తమ ఆరాధ్య జట్టును ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు నుంచే ఈ సారి కప్ మనదే అంటూ సందడి చేస్తూంటారు. ఇప్పుడు ఐపీఎల్-2024కు సమయం ఆసన్నం కావడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా ఆర్సీబీ నిలుస్తుందని పఠాన్ జోస్యం చెప్పాడు. టైటిల్ గెలుచుకునే అన్ని రకాల అర్హతలు ఆర్సీబీకి ఉన్నాయని పఠాన్ తెలిపాడు. "ఈ ఏడాది ఆర్సీబీ అద్భుతమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ పరంగా బెంగళూరు పటిష్టంగా ఉంది. జట్టులో మంచి ఫినిషర్లు ఉన్నారు. బెంగళూరు జట్టు బ్యాటింగ్ లైనప్ ఆఖరివరకు బలంగా ఉంది. గత సీజన్లలో ఆర్సీబీ బ్యాటింగ్ ఎప్పుడూ అంత పటిష్టంగా లేదు. అయితే బౌలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఆర్సీబీని టైటిల్ ఫేవరేట్‌గా ఎంచుకోరు. కానీ ఈసారి బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కన్పిస్తోంది. చిన్నస్వామి వంటి ప్లాట్ పిచ్‌లపై ఎక్స్‌ప్రెస్ పేస్‌తో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లు ఆర్సీబీ జట్టులో ఉన్నారు. కాబట్టి ఈసారి ఆర్సీబీ టైటిల్ నెగ్గుతుందని భావిస్తున్నాని" స్టార్ స్పోర్ట్స్ గేమ్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. -
సీఎస్కేను తట్టుకునే శక్తి ఆర్సీబీకి ఉందా..? అందులోనూ చెపాక్‌లో..!
ఐపీఎల్ 2024 ఎడిషన్ తొలి షెడ్యూల్‌ను ఇవాళ (ఫిబ్రవరి 22) విడుదల చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తొలి విడతగా 17 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ఈ లెగ్‌లో మొత్తం 21 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 22న జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇంతవరకు టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. చెపాక్ స్టేడియంలో సీఎస్కేపై ఆర్సీబీకి చెత్త రికార్డు ఉంది. ఈ వేదికపై ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. లీగ్ ఆరంభ ఎడిషన్‌లో (2008) ఆర్సీబీ.. సీఎస్కేను ఓడించింది. అప్పటినుంచి జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో (2010, 2011 (రెండు సార్లు), 2012, 2013, 2015, 2019) ఆర్సీబీ ఒక్కసారి కూడా సీఎస్కేను ఓడించలేకపోయింది. ఈ రికార్డే ఆర్సీబీ అభిమానులను సీజన్ ప్రారంభానికి ముందు కలవరపెడుతుంది. జట్ల బలాబలాల ప్రకారం చూసినా.. ప్రస్తుత సీఎస్కే జట్టును నిలువరించే సత్తా ఆర్సీబీ లేదు. చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, అజయ్ మండల్, నిశాంత్ సింధు, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, సిమ్రన్‌జీత్ సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవినాష్ రావు ఆరవెల్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, మహ్మద్ సిరాజ్, దినేష్ కార్తీక్, వైషాక్ విజయ్‌కుమార్, మనోజ్ భాండగే, రజత్ పాటిదార్, అనూజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయి, ఆకాష్ దీప్, రాజన్ కుమార్, హిమాన్షు శర్మ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్రోర్, విల్ జాక్స్, కామెరాన్ గ్రీన్, అల్జరీ జోసెఫ్, యశ్ దయాళ్, టామ్ కర్రన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్, మయాంక్ డాగర్ -
IPL 2024: ఆర్సీబీకి మరో బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!?
ఐపీఎల్-2024కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశముంది. ఇప్పటికే ఇగ్లండ్ ఆల్‌రౌండర్ టామ్ కుర్రాన్ సేవలను కోల్పోయిన ఆర్సీబీని.. తాజాగా మరో ఇంగ్లీష్ పేసర్ గాయం ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. టాప్లీ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్లీ గాయపడ్డాడు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు అతడికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎన్ఓసీ ఇవ్వలేదు. దీంతో పీఎస్ఎల్-2024కు దూరమయ్యాడు. అయితే అతడు ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లో కూడా ఆడేది అనుమానమే మారింది. ఐపీఎల్-2023 వేలంలో అతడిని రూ. 1.90 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే తన అరంగేట్ర సీజన్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో ఆడిన టాప్లీ.. గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పుడు ఈ ఏడాది సీజన్‌కు ముందు సైతం గాయపడ్డాడు. కాగా గాయాల బారిన పడటం అతడికి కొత్తేమి కాదు. గాయం కారణంగా అతడు టీ20 వరల్డ్‌కప్-2022 సైతం దూరమయ్యాడు. అనంతరం భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగమమయ్యాడు. అక్కడ గాయపడిన టాప్లీ.. టోర్నీలో ఆఖరి మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు. -
IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇదే..!
ఫాఫ్ డుప్లెసిస్ బ్యాటర్ 7 కోట్లు (కెప్టెన్) విరాట్ కోహ్లీ బ్యాటర్ 15 కోట్లు గ్లెన్ మాక్స్వెల్ ఆల్ రౌండర్ 11 కోట్లు మహ్మద్ సిరాజ్ బౌలర్ 7 కోట్లు దినేష్ కార్తీక్ వికెట్‌కీపర్-బ్యాటర్ 5.5 కోట్లు వైషాక్ విజయ్‌కుమార్ బౌలర్ 20 లక్షలు మనోజ్ భాండగే ఆల్ రౌండర్ 20 లక్షలు రజత్ పాటిదార్ బ్యాటర్ 20 లక్షలు అనూజ్ రావత్ వికెట్‌కీపర్-బ్యాటర్ 3.4 కోట్లు సుయాష్ ప్రభుదేశాయి ఆల్ రౌండర్ 30 లక్షలు ఆకాష్ దీప్ బౌలర్ 20 లక్షలు రీస్ టాప్లీ బౌలర్ 1.9 కోట్లు రాజన్ కుమార్ బౌలర్ 70 లక్షలు హిమాన్షు శర్మ ఆల్ రౌండర్ 20 లక్షలు కర్ణ్ శర్మ బౌలర్ 50 లక్షలు మహిపాల్ లోమ్రోర్ బ్యాటర్ 95 లక్షలు విల్ జాక్స్ ఆల్ రౌండర్ 3.2 కోట్లు కామెరాన్ గ్రీన్ ఆల్ రౌండర్ 17.5 కోట్లు అల్జరీ జోసెఫ్ బౌలర్ 11.5 కోట్లు యశ్ దయాళ్ బౌలర్ 5 కోట్లు టామ్ కర్రన్ ఆల్ రౌండర్ 1.5 కోట్లు లాకీ ఫెర్గూసన్ బౌలర్ 2 కోట్లు స్వప్నిల్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు సౌరవ్ చౌహాన్ ఆల్ రౌండర్ 20 లక్షలు మయాంక్ డాగర్ ఆల్ రౌండర్ 1.8 కోట్లు స్క్వాడ్ బలం - 25 (భారతీయ ఆటగాళ్లు -17, విదేశీ ప్లేయర్స్ - 8) మిగిలిన పర్స్ - 2.85 కోట్లు -
షాబాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ.. ఆర్సీబీని వీడితేనే బాగుపడతారంటున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో భాగంగా హర్యానాతో ఇవాళ (డిసెంబర్ 11) జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ ఆటగాడు, ఆర్సీబీ మాజీ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ సూపర్ సెంచరీతో (118 బంతుల్లో 100; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా షాబాజ్ ఒంటరిపోరాటం చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. Shahbaz Ahmed - 100 (118).Next best - 24 (41).One of the best innings in the Quarter Final of Vijay Hazare Trophy by Shahbaz...!!!pic.twitter.com/pO2bILZvhf— Mufaddal Vohra (@mufaddal_vohra) December 11, 2023 షాబాజ్ ఒంటరిపోరాటం చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌటైంది. షాజాబ్ తర్వాత బెంగాల్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ చేసిన 24 పరుగులే అత్యధికం. కెప్టెన్ సుదీప్ ఘరామీ (21), ప్రదిప్త ప్రమానిక్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హర్యానా బౌలర్లలో యుజ్వేంద్ర చహల్ (4/37), సుమిత్ కుమార్ (2/27), రాహుల్ తెవాటియా (2/32) బెంగాల్ పతనాన్ని శాశించారు. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన హర్యానా 30 ఓవర్ల తర్వాత 3 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. అంకిత్ కుమార్ (82 నాటౌట్) హర్యానాను గెలుపు దిశగా తీసుకెళ్తున్నాడు. "Shahbaz Ahmed's sensational 💯 under immense pressure in the Vijay Hazare Trophy Knockout game is cricket brilliance at its finest! Single-handedly steering Bengal with a stunning innings, while others faltered. 🏏🔥 #ShahbazAhmed #VijayHazareTrophy" pic.twitter.com/2PJVktLXCH — Hemant ( Sports Active ) (@hemantbhavsar86) December 11, 2023 ఈ మ్యాచ్‌లో షాబాజ్ అహ్మద్ బాధ్యతాయుతమై సెంచరీతో రాణించడంతో బెంగాల్ అభిమానులు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ ట్రేడింగ్‌లో షాబాజ్‌ను సన్‌రైజర్స్‌కు వదిలిపెట్టినందుకు గాను ఆర్సీబీపై దుమ్మెత్తిపోస్తున్నారు. షాబాజ్‌ను ఆర్సీబీ వదిలిపెట్టడమే మంచిదైందని వారు కామెంట్లు చేస్తున్నారు. ఆర్సీబీని వీడితేనే ఆటగాళ్లు బాగుపడతారంటూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు. you leave rcb and you become successful. https://t.co/1UhwUzIdkB — munka in kalimpong (@messymunka) December 11, 2023 కాగా, అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ మయాంక్ డాగర్ కోసం ఆర్సీబీ షాబాజ్ అహ్మద్‌ను సన్‌రైజర్స్‌కు వదిలిపెట్టిన విషయం తెలిసిందే. ట్రేడింగ్ పద్దతిలో షాబాజ్‌ను వదిలేసిన ఆర్సీబీ.. వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్‌లను కూడా వేలానికి వదిలిపెట్టింది. ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు సంబంధించిన వేలం ఈనెల 19న దుబాయ్‌లో జరుగనుంది. -
ఆర్సీబీలోకి రచిన్ రవీంద్ర.. హింట్ ఇచ్చిన యువ సంచలనం!
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అరంగేట్ర వరల్డ్‌కప్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే ప్రపంచస్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో మూడు సెంచరీలతో చెలరేగిన రవీంద్ర.. ప్రస్తుతం టోర్నీ టాప్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన రచిన్.. 565 పరుగులు చేశాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ రవీంద్ర అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర.. అనంతరం బ్యాటింగ్‌లో 42 పరుగులు చేశాడు. కాగా రవీంద్ర భారత సంతతికి చెందిన క్రికెటర్ అనే విషయం తెలిసిందే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడ స్ధిరపడ్డారు. రవీంద్ర కూడా అక్కడే పుట్టాడు. 2021లో టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌తో రవీంద్ర న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆర్సీబీలోకి రవీంద్ర..! కాగా వరల్డ్‌కప్‌లో అదరగొడుతున్న రవీంద్ర ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలని భావిస్తున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చాడు. శ్రీలంకతో మ్యాచ్‌తో అనంతరం రవీంద్ర మాట్లాడుతూ.. "బెంగళూరు, చిన్నస్వామి స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఈ రెండు నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నాయి. భవిష్యత్తులో నేను ఇక్కడ మరింత క్రికెట్ ఆడతానని ఆశిస్తున్నాను’’ అని నవ్వుతూ అన్నాడు. కాగా ఇప్పటికే చాలా మంది యువ సంచలనాలకు అవకాశమిచ్చిన ఆర్సీబీ .. రచిన్‌ను కూడా తన అక్కున చేర్చుకుంటుందో లేదో చూడాలి మరి. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించిన మినీవేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. చదవండి: టీవీల ముందు కూర్చుని ఎవరైనా సలహాలు ఇస్తారు.. అలా కాకుండా: బాబర్ ఆజం -
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రీఎంట్రీ ఇవ్వనున్న ఏబీ డివిలియర్స్!
పీఎల్-2024కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కోచింగ్ స్టాప్‌ను ప్రక్షాళన చేసేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో హెడ్‌కోచ్ సంజయ్ బంగర్, క్రికెట్ డైరక్టర్ మైక్ హెస్సన్‌కు ఆర్సీబీ ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ జట్టు హెడ్‌కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్‌ను నియమించింది. ఈ మెరకు ట్విటర్లో ఆర్సీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే మైక్ హెస్సన్ స్ధానాన్ని మాత్రం ఆర్సీబీ ఇంకా ఎవరితో భర్తీ చేయలేదు. అదే విధంగా బ్యాటింగ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్‌పై కూడా వేటు వేయాలని ఆర్సీబీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్సీబీ మెంటార్‌గా ఏబీ డివిలియర్స్.. ఇక ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీడీ డివిలియర్స్ మళ్లీ ఆర్సీబీతో జతకట్టనున్నట్లు సమాచారం. అయితే ఆటగాడిగా కాకుండా జట్టు సపోర్టింగ్ స్టాప్‌లో ఏబీడీ భాగం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సీజన్లో తమ జట్టు మెంటార్‌గా డివిలియర్స్‌ను నియమించాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటికే ఏబీడీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. డివిలియర్స్ కూడా ఆర్సీబీ ప్రతిపాదనకు ఒప్పుకున్నట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా చాలా సీజన్ల పాటు ఆర్సీబీకి డివిలియర్స్ ప్రాతినిధ్యం వహించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ.. 39.71 సగటు, 151 స్ట్రైక్‌రేట్‌తో 5162 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ౩ సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. తొలి భారత ఆటగాడిగా! -
ఆర్సీబీ హెడ్‌కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్
ఐపీఎల్-2024కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్‌కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్‌ను ఆర్సీబీ యాజమాన్యం నియమించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు హెడ్‌కోచ్‌గా కొనసాగిన సంజయ్ బంగర్‌పై ఆర్సీబీ వేటు వేసింది. అదే విధంగా తమ జట్టు డైరక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్‌కు కూడా బెంగళూరు ఉద్వాసన పలికింది. "ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్, టీ20 ప్రపంచకప్ విన్నింగ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌ను ఆర్సీబీ పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా నియమించాం. అతడు ఈ బాధ్యతలు స్వీకరించినందుకు చాలా సంతోంషంగా ఉందంటూ" ఆర్సీబీ ట్విటర్లో పేర్కొంది. కాగా అండీ ఫ్లవర్‌కు దశాబ్ధానికి పైగా కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రికెట్,ఫ్రాంచైజీ క్రికెట్లో కోచ్‌గా తన సేవలను అందిచాడు. 2010లొ టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా ఫ్లవర్ పనిచేశాడు. అదే విధంగా ఐపీఎల్లో గత రెండు సీజన్లగా లక్నో సూపర్ జెయింట్స్ హెడ్‌కోచ్‌గా అండీ ఉన్నాడు. అయితే వచ్చే ఏడాది సీజన్‌కు ముందు అతడిని లక్నో విడుదల చేయడంతో, ఆర్సీబీ గూటికి చేరాడు. ఇక ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభంలో దుమ్మురేపిన ఆర్సీబీ.. ఆఖరిలో మాత్రం చేతులేత్తేసింది. దీంతో ఈ ఏడాది సీజన్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఆరో స్ధానంతో సరిపెట్టుకుంది. చదవండి:IND vs WI: టీమిండియా బౌలర్ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్‌గా -
ఆర్సీబీపై చాహల్ గరం గరం.. నమ్మించి మోసం చేశారు! కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా..
భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్లో 8 ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు చాహల్‌ను ఆర్సీబీ రీటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన చాహల్‌ను కనీసం మళ్లీ తిరిగి పొందే ప్రయత్నం కూడా ఆర్సీబీ చేయలేదు. అయితే ఈ వేలంలో చాహల్‌ను సంజూ శాంసన్ సారధ్యంలోని రాజస్తాన్ రాయల్స్ రూ. 6.50 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక వేలంలో తనను పట్టించుకోని ఆర్సీబీపై తాజాగా చాహల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 8 సీజన్ల పాటు సేవలు అందించిన తనను విడిచిపెట్టడం చాలా బాధ కలిగించిందని చాహల్ తెలిపాడు. "నన్ను రిటైన్ చేసుకోలేదనే విషయం తెలియగానే చాలా బాధపడ్డాను. 2014లో ఆర్సీబీతో నా ప్రయాణం మొదలైంది. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి మ్యాచ్ నుంచే నాపై నమ్మకం ఉంచాడు. నేను 8 ఏళ్ల పాటు ఆర్సీబీ ఫ్రాంచైజీ తరపున ఆడాను. 2022 వేలానికి ముందు నేను మేనేజ్మెంట్ను ఎక్కువ డబ్బులు అడిగానని నాపై విమర్శలు వచ్చాయి. నేను అలా చేయలేదని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చా. దాదాపు 140 మ్యాచ్‌లు పైగా ఆర్సీబీ తరపున ఆడాను. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం. ఆర్సీబీ నన్ను ఎందుకు సొంతం చేసుకోలేదో ఇప్పటికి నాకు అర్దం కాలేదు. రిటైన్ చేసుకోపోనప్పటికీ వేలంలో కచ్చితంగా కొనుగోలు చేస్తామని మాట ఇచ్చారు. కానీ వేలంలో కనీస ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత వారి నుంచి కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. ఈ విషయం గుర్తు తెచ్చుకున్న ప్రతీసారి నాకు బాధ కలుగుతోంది. ఆ తర్వాత ఏది జరిగినా అది నా మంచికే అని భావించాను. రాజస్తాన్ రాయల్స్‌లో చేరడం వల్ల నేను డెత్ బౌలర్‌గా మారాను. ఆర్సీబీలో ఉన్నప్పుడు నా ఓవర్ల కోటా దాదాపు 16 లేదా 17 ఓవర్‌కే పూర్తయ్యేది. కానీ రాజస్తాన్‌లో చేరాక నా ప్రదర్శన 5 - 10 శాతం ఇంప్రూవ్ అయింది" అని ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అలహబాదియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ పేర్కొన్నాడు. చదవండి: Asian Games 2023: భారత సెలక్టర్లు చాలా పెద్ద తప్పుచేశారు.. అతడు జట్టులో ఉండాల్సింది -
దినేష్ కార్తీక్‌కు బిగ్ షాక్ ఇవ్వనున్న ఆర్సీబీ.. అతడితో పాటు!
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. కనీసం ఈ సీజన్లోనైనా ఛాంపియన్స్‌గా నిలుస్తుందని భావించిన అభిమానులకు.. ఆర్సీబీ మరోసారి నిరాశ మిగిల్చింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఏడింటిలో గెలిచి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు తమ జట్టులో ప్రక్షాళనకు ఆర్సీబీ సిద్దమైనట్లు తెలుస్తోంది. . ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న మినీ వేలంలో పక్కా ప్రణాళికలతో రావాలని ఆర్సీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్లో పేలవ ప్రదర్శన కనబరిచిన దినేష్ కార్తీక్‌కు ఆర్సీబీ గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-16వ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన డికే..11.67 సగటుతో కేవలం 140 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ధానంలో మరో యువ వికెట్ కీపర్‌ను తీసుకోవాలని బెంగళూరు భావిస్తున్నట్లు సమాచారం. అతడితో పాటు విదేశీ ఆటగాళ్లు వనిందూ హసరంగా, జోష్ హాజిల్ వుడ్, ఫిన్ అలెన్‌ను కూడా విడిచిపెట్టాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో హసరంగాను రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆ సీజన్లో పర్వాలేదనపించినప్పటికీ.. ఈ ఏడాది మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. మరోవైపు జోష్ హజెల్‌వుడ్‌ను 7.75 కోట్లకు సొంతం చేసుకుంది. అతడు గాయం కారణంగా ఈ ఏడాది సీజన్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతడి ఫిట్నెస్ దృష్ట్యా వచ్చే సీజన్‌కు ముందు సాగనింపాలని ఆర్సీబీ భావిస్తోంది. చదవండి: గత ఆరేడేళ్ల నుంచి చూస్తున్నా.. సెలక్టర్లకు కొంచెం కూడా తెలివి లేదు: భారత మాజీ క్రికెటర్ -
అతడు లేకపోవడమే ఆర్సీబీకీ ఈ పరిస్ధితి.. ఉండింటేనా
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ గ్రూపు దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో ఆర్సీబీ సరిపెట్టుకుంది. అయితే ఈ సీజన్ ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఫాప్ డుప్లెసిస్, విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మినహా మిగితా బ్యాటరంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో జట్టు బ్యాటింగ్ బాధ్యతను వీరిముగ్గురూ తమ భుజాలపై వేసుకున్నారు. ఇక ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ మిడిలార్డర్ వైఫల్యంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ కీలక వాఖ్యలు చేశాడు. మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ లేకపోవడమే బెంగళూరుకు ఈ పరిస్థితి ఏర్పడందని మూడీ తెలిపాడు. కాగా ఈ ఐపీఎల్ 16వ సీజన్‌కు గాయం కారణంగా రజిత్ పాటిదార్ దూరమయ్యాడు. "ఆర్సీబీలో పటిదార్ లేని లోటు సృష్టంగా కన్పించింది. అతడు మూడో స్థానంలో అద్భుతమైన ఆటగాడు. అతడు జట్టులో లేకపోవడం విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, మాక్స్‌వెల్‌లపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది. కానీ ఈ ముగ్గురు అంత ఒత్తిడిలో కూడా అద్భుతంగా ఆడారు. అదే విధంగా మిడిలార్డర్లో మాత్రమే కాకుండా ఫినిషింగ్‌లో కూడా సరైన ఆటగాళ్లు కన్పించలేదు. గత సీజన్లో ఫినిషర్‌గా అదరగొట్టిన దినేష్ కార్తీక్.. ఈ ఏడాది మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఛాంపియన్స్‌గా నిలవాలంటే ఒకరిద్దరు ఆడితే సరిపోదు. ఏ జట్టు అయితే సమిష్టిగా రాణిస్తుందో అందే విజేతగా నిలుస్తుంది. ఈ సీజన్ ఆర్సీబీకి ఒక గుణపాఠం అవుతుంది. వచ్చే సీజన్లో ఆర్సీబీ కచ్చితంగా తమ జట్టులో కొన్ని మార్పులు చేయాలని" ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీ పేర్కొన్నాడు -
కోహ్లిని గంభీర్, నవీన్‌లు కవ్విస్తుంటే.. లక్నో యాజమాన్యం ఏం చేసిందో చూడండి..!
ఐపీఎల్ 2023లో ఆర్సీబీ-లక్నో మధ్య మ్యాచ్ సందర్భంగా కోహ్లి.. గంభీర్-నవీన్ ఉల్ హక్‌ల మధ్య జరిగిన వన్ టు టూ ఫైట్ గురించి అందరికీ తెలిసిందే. గ్రూప్ స్టేజీ మ్యాచ్ సందర్భంగా వీరు ముగ్గురు బాహాబాహీకి దిగినంత పని చేశారు. అనంతరం వీరు సోషల్‌మీడియా వేదికగా ఒకరని ఒకరు రెచ్చగొట్టుకుంటున్నారు. ఈ విషయంలో కోహ్లి కాస్తంత సైలెంట్ అయినా నవీన్ ఉల్ హక్ మాత్రం ఓవరాక్షన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. తాజాగా (మే 21) గుజరాత్‌పై కోహ్లి వీరోచిత శతకం చేసిన తర్వాత కూడా నవీన్.. కింగ్ కోహ్లిని కవ్వించాడు. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసి కోహ్లితో పాటు ఆర్సీబీని కూడా ఎగతాళి చేశాడు. Naveen Ul Haq posted this video on his Instagram after RCB lost the match#RCBvsGT pic.twitter.com/FCaF41IMnM — Gems of Shorts (@Warlock_Shabby) May 21, 2023 ఇదంతా ఒకెత్తైతే.. గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్ అనంతరం గంభీర్, నవీన్ ఉల్ హక్ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం మాత్రం కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తి ఆకాశానికెత్తింది. లక్నో మేనేజ్మెంట్ తమ ట్వీట్లో కోహ్లిని కొనియాడింది. కోహ్లి తన చివరి రెండు మ్యాచ్‌ల్లో వీరోచితమైన శతకాలు బాది తమను భయపెట్టాడని.. అతను ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన శక్తి అని ప్రశంసల వర్షం కురిపించింది. అలాగే కోహ్లిని ఆల్‌టైమ్ గ్రేట్ (GOAT) ఐకాన్‌తో గౌరవించింది. లక్నో చేసిన ఈ ట్వీట్‌తో కోహ్లి అభిమానులు కాస్త శాంతించారు. గంభీర్,నవీన్‌లను టార్గెట్ చేసే డోస్‌ను కాస్త తగ్గించారు. మన ప్రవర్తనను బట్టి ఇతరుల ప్రవర్తన ఆధారపడి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. This man had us on our feet these last two games. An absolute force of nature. 👏 The 🐐 pic.twitter.com/QS3EEvnoUb — Lucknow Super Giants (@LucknowIPL) May 21, 2023 ఇదిలా ఉంటే, ఆర్సీబీ-లక్నో జట్లు క్వాలిఫయర్స్‌లో కాని, ఎలిమినేటర్‌లో కాని, ఫైనల్లో కాని ఎదురెదురుపడాలని అభిమానులు ఆశించారు. అయితే వారి ఆశ నెరవేరలేదు. నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై గుజరాత్ గెలవడంతో ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లి వీరోచిత శతకం వృధా కాగా.. శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో గుజరాత్‌ను గెలిపించాడు. రేపు (మే 23) జరుగబోయే క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్-సీఎస్కే.. మే 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో-ముంబై.. మే 26న జరిగే క్వాలిఫయర్ 2లో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు-ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు.. మే 28న జరిగే ఫైనల్లో క్వాలిఫయర్ 1 విన్నర్-క్వాలిఫయర్ 2 విన్నర్లు తలపడతాయి. చదవండి: ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న విరాట్ కోహ్లి -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్! గాయపడ్డ కోహ్లి.. అయితే!
ఐపీఎల్-203లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడ్డాడు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా కోహ్లి మోకాలికి గాయమైంది. ఇన్నింగ్స్ 15వ వేసిన విజయకుమార్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ ఫుల్ షాట్ ఆడేప్రయత్నం చేశాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో కోహ్లి పరిగెత్తుకుంటూ వచ్చి డిప్‌మిడ్ వికెట్లో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే క్యాచ్‌ను పట్టేక్రమంలో విరాట్ మెకాలి నేలను బలంగా తాకింది. దీంతో విరాట్ మైదానంలో నొప్పితో విలవిల్లాడు. అయితే నొప్పి తీవ్రంగా ఉండడంతో ఫిజియో సాయంతో విరాట్ మైదానాన్ని వీడడాడు. 15 ఓవర్ అనంతరం కోహ్లి తిరిగి మరి ఫీల్డింగ్‌కు రాలేదు. అయితే కీలకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ముందు కోహ్లి గాయపడడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో కోహ్లి గాయంకు సంబంధించిన అప్డేట్ను ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఇచ్చాడు. విరాట్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, అతడి గాయం అంత తీవ్రమైనది కాదని బంగర్ తెలిపాడు. "విరాట్ మోకాలిలో కొంచెం నొప్పి ఉంది. కానీ అది తీవ్రమైనది కాదు. కోహ్లి వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. విరాట్ కేవలం బ్యాటింగ్‌తో మాత్రమే కాకుండా ఫీల్డింగ్‌లో తనవంతు సహకారం అందిచాలని కోరుకుంటాడు. అతడు బాగా అలసిపోయాడు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో దాదాపు 18 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా 20 ఓవర్ల పాటు ఉన్నాడు. ఈ రోజు మళ్లీ దాదాపు 35 ఓవర్ల పాటు మైదానంలో ఉన్నాడు. విరాట్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది" అని మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకురల సమావేశంలో బంగర్ వెల్లడించాడు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అతడొక అద్భుతం! కొత్తగా కనిపించాడు: హార్దిక్ -
అతడే మా కొంపముంచాడు.. చాలా బాధగా ఉంది! కోహ్లి మాత్రం అద్బుతం: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2023 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంటిముఖం పట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైంది. తద్వారా ప్లేఆప్స్ రేసు నుంచి బెంగళూరు నిష్క్రమించింది. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆర్సీబీ బౌలర్లు విఫలమయ్యారు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కేవలం 19.1 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గిల్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అంతకుముందు ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి(101) కూడా సెంచరీతో మెరిశాడు. ఇక కీలక మ్యాచ్‌లో ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. శుబ్‌మన్ గిల్ తన అద్భుత సెంచరీతో మ్యాచ్‌ను తమనుంచి దూరం చేశాడు అని డుప్లెసిస్ తెలిపాడు. "ఈ మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడం మమ్నల్ని తీవ్రంగా నిరాశపరిచింది. మేము అత్యుత్తమ జట్టుతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాం. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. బంతి ఈజీగా బ్యాట్‌పైకి వచ్చింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో కూడా మంచు ప్రభావం ఉంది కానీ.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం ఇంకా ఎక్కువగా ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మేము రెండు సార్లు బంతిని మార్చాం. బౌలర్లకు అంత గ్రిప్ దొరకలేదు. విరాట్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో మాకు మంచి స్కోర్‌ను అందించాడు. కానీ శుబ్మాన్ మాత్రం తన విరోచిత సెంచరీతో మ్యాచ్‌ను మా నుంచి దూరం చేశాడు. మేము ఈ ఏడాది సీజన్ మొత్తం టాపార్డ్‌లో రాణించనప్పటకీ.. మిడిలార్డర్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాం. గతేడాది కార్తీక్ ఫినిషర్ పాత్ర పోషించాడు. కానీ ఈ సారి మాత్రం భిన్నంగా ఆడాడు. అదే విధంగా పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా వికెట్లు సాధించలేకపోయాం. కొన్ని విభాగాల్లో మేము కాస్త మెరుగవ్వాలి" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేంజేటేషన్లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ప్లే ఆఫ్స్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లిని మరోసారి టార్గెట్ చేసిన నవీన్! ఛీ అసలు నీవు Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6 — IndianPremierLeague (@IPL) May 21, 2023 -
ప్లే ఆఫ్స్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లిని మరోసారి టార్గెట్ చేసిన నవీన్! ఛీ అసలు నీవు
ఐపీఎల్-2023లో ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, నవీన్ ఉల్హక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని కోహ్లి అక్కడితోనే విడిచి పెట్టగా.. నవీన్ ఉల్ హక్ మాత్రం ఏదో విధంగా విరాట్‌ను గెలుకుతున్నాడు. తాజాగా నవీన్ మరోసారి తన వంకర బుద్ధిని చాటుకున్నాడు. విరాట్ కోహ్లిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నవీన్ ఓ పోస్ట్ చేశాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో ఆర్సీబీ ఓటమి పాలవ్వగానే.. నవీన్ ఉల్ హక్ తన ఇనాస్టాగ్రామ్‌లో ఓ క్రిప్టిక్ స్టోరీ పోస్టు చేశాడు. అది కోహ్లితో పాటు ఆర్సీబీ జట్టును ఎగతాళి చేసినట్లు ఉంది. అయితే కోహ్లిని హేళన చేసిన నవీన్ ఉల్‌హక్‌ను ఆర్సీబీ ఫ్యాన్స్ ఓ ఆటాడేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలు చేస్తున్నారు. చీ మరి ఇంత దారుణమా.. నీవు అస్సలు మనిషివేనా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా మే20న కేకేఆర్, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో నవీన్‌ను కూడా కోహ్లి అభిమానులు టార్గెట్ చేశారు. నవీన్-ఉల్-హక్ బౌలింగ్‌కు వచ్చినపుడు ప్రేక్షకులు ``కోహ్లీ.. కోహ్లీ..`` అని కేకలు వేసి తమ నిరసనను తెలియజేశారు. కోహ్లీ అభిమానుల చర్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన నవీన్ ఉల్ హక్.. ``గప్ చుప్`` అని సైగలు చేస్తూ నోటిపై వేలు వేసి సైలంట్‌గా ఉండాలని ఫ్యాన్స్‌ను సూచించాడు. కింగ్ పోరాటం వృథా కాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్బుత పోరాటం వృథా మిగిలిపోయింది. ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీతో చెలరేగాడు. 61 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. జట్టులో మిగితా బ్యాటర్లందరూ విఫలమైనప్పటికీ.. కోహ్లి మాత్రం తన అద్భుత ఇన్నింగ్స్‌తో 197 పరుగుల భారీ స్కోర్‌ను అందించాడు. దురదృష్టవశాత్తూ బౌలర్లు లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమకావడంతో ఆర్సీబీ ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: #Virat Kohli: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఓడినా పర్వాలేదు! ఎప్పటికీ నీవు మా కింగ్‌వే! Naveen Ul Haq posted this video on his Instagram after RCB lost the match#RCBvsGT pic.twitter.com/FCaF41IMnM — Gems of Shorts (@Warlock_Shabby) May 21, 2023 The moment King Kohli created history: 7th IPL century - an absolute GOAT..!! pic.twitter.com/NMwjLp5rjE — Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2023 -
కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఓడినా పర్వాలేదు! ఎప్పటికీ నీవు మా కింగ్‌వే!
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఈ సారైనా టైటిల్‌ను గెలిచి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన ఆర్సీబీకి మరోసారి నిరాశ ఎదురైంది. ఫ్లేఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమి చవి చూసింది. 198 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆర్సీబీ బౌలర్లు విఫలమయ్యారు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కేవలం 19.1 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గిల్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 104 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఒకే ఒక్కడు.. అంతకు ముందు ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి మరో అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ జట్టు బాధ్యతను తన భుజాన వేసుకున్న కింగ్.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ క్యాష్‌రిచ్ లీగ్ ఏడు సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో గేల్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలవ్వగానే కోహ్లి కన్నీరు పెట్టుకున్నాడు. ఆఖరిలో డగౌట్ కూర్చోని మ్యాచ్‌ను వీక్షించిన కోహ్లి.. తన జట్టు ఓడిపోవడంతో ఒక్కసారిగా భావద్వోగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక కోహ్లి కన్నీరు పెట్టుకోవడం అభిమానులకు ఎంతో భాదను కలిగిస్తోంది. ఈ క్రమంలో విరాట్‌కు ఫ్యాన్స్ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. "ఓడిపోయినా పర్వాలేదు.. ఎప్పటికీ నీవు మా కింగ్‌వే" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఒక ఓవరాల్‌గా ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 639 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో నిలిచాడు. చదవండి: #ShubmanGill: సెంచరీతో కదం తొక్కి.. ఆర్సీబీని ఇంటికి పంపి One Tweet from ur side and One RT is Compulsory....! For King Kohli Tears 💔 A TEAM WITH NO HEART 💔 (What is this ?? Go n see my Latest Tweets but now just Follow and Viral this Trend RCB vs GT#ViratKohli𓃵 #ViratKohli #bengalururain pic.twitter.com/eKUw3ZBeMy — I'm Sanju (@JodPahadi) May 21, 2023 -
ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్క రియల్ కింగ్.. కోహ్లి మాత్రమే: పాక్ మాజీ పేసర్
ఐపీఎల్-2023లో ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో సెంచరీ కోసం తన నాలుగేళ్ల నిరీక్షణకు కోహ్లి తెరదించాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేసాడు. కాగా కోహ్లికి ఇది ఆరో ఐపీఎల్ సెంచరీ కావడం గమానర్హం. ఇక కీలక మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లిపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ చేరాడు. అమీర్ కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తాడు. "వాట్ ఏ ఇన్నింగ్స్.. వన్ అండ్ ఓన్లీ రియల్ కింగ్ విరాట్ కోహ్లి. టేక్ ఎ బో" అంటూ అమీర్ ట్విటర్లో రాసుకొచ్చాడు. అదే విధంగా అమీర్ తన తన యూట్యూబ్ ఛానెల్, “ఇన్‌స్వింగ్ విత్ అమీర్”లో మాట్లాడుతూ.. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లి అంటే నాకు చాలా ఇష్టమైన ఆటగాడు. విరాట్ వంటి క్రికెటర్ ప్రస్తత తరంలో లేడు. కోహ్లి సాధించిన ఘనతల గురించి ఎంతచెప్పుకున్న తక్కువే. ఈ రోజు మరో ఘనత సాధించాడు. ఈ సెంచరీ చాలా స్పెషల్. ఎందుకంటే ఆర్సీబీకి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి బ్యాట్ నుంచి వచ్చిన ఇన్నింగ్స్ ఇది. ఈ మ్యాచ్‌లో అతను ఆడిన షాట్లు అద్భుతం. విరాట్ నాలుగేళ్ల తర్వాత తొలి సెంచరీ సాధించాడు. టోర్నమెంట్ చరిత్రలో ఇది ఆరవది. అతడు ప్రపంచ క్రికెట్లో రియల్ కింగ్. విరాట్ ఇంకా ఐదేళ్లు పాటు ఆడితే.. ఎన్ని రికార్డులు నెలకొల్పుతాడో ఊహించలేను. ఆర్సీబీ కచ్చితంగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఈ ఏడాది టైటిల్‌ను ఆర్సీబీ సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు. చదవండి:#Virat Kohli: కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్‌రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ అదుర్స్.. వీడియో వైరల్ what a inning by one and only the real king @imVkohli take a bow. pic.twitter.com/3wOA8hj0Ki — Mohammad Amir (@iamamirofficial) May 18, 2023 -
అవన్నీ చెత్త మాటలు.. నేను అస్సలు పట్టించుకోను! గర్వంగా ఉంది: కోహ్లి
IPL 2023 SRH Vs RCB- Virat Kohli: ఐపీఎల్-2023లో ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. గురువారం ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఓపెనర్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. కీలక మ్యాచ్‌లో కింగ్ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆరో సెంచరీ ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న విరాట్ 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు సాధించాడు. అదే విధంగా కెప్టెన్ డుప్లెసిస్‌తో కలిసి తొలి వికెట్‌కు 172 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కాగా ఐపీఎల్లో విరాట్‌కు ఇది 6వ ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. కాగా ఈ ఏడాది సీజన్లో కోహ్లి అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అతడి స్ట్రైక్ రేట్ మాత్రం తక్కువగా ఉందని పలువరు విమర్శించిన సంగతి తెలిసిందే. తన స్ట్రైక్ రేట్ గురించి వస్తున్న విమర్శలపై కోహ్లి స్పందించాడు. చెత్త మాటలు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో విరాట్ మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ నా గత మ్యాచ్‌ల్లో ఎలా ఆడానన్న విషయం గురించి ఆలోచించను. ప్రస్తుతం ఏ మ్యాచ్‌లో అయితే ఆడుతున్నానో దాని గురించే ఆలోచిస్తా. కొన్ని సార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినప్పటకీ నేను సంతృప్తి చెందను. ఆ విషయం నాకు తెలుసు. అంతే తప్ప బయటనుంచి నా స్ట్రైక్ రేట్ గురించి ఎవరూ ఏమి మాట్లాడిన నేను పట్టించుకోను. ఎందుకంటే అది వారి అభిప్రాయం. అవన్నీ చెత్త మాటలు.. పట్టించుకుంటే ముందుకు వెళ్లలేము. అటువంటి వారు నా పరిస్థితుల్లో ఉంటే తెలుస్తుంది. నేను ఎప్పుడూ జట్టును గెలిపించడానికే ఆడుతాను. పరిస్థితులకు అనుగుణంగా ఆడటం నాకు అలవాటు. అలా చేస్తున్నందకు నాకు గర్వంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2023: సెంచరీలతో చెలరేగిన కోహ్లి, క్లాసెన్.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలి సారి What is the secret of the highly successful Virat-Faf pair?🤔 We will let King Kohli spill the beans 😉#TATAIPL | #SRHvRCB | @RCBTweets | @imVkohli | @faf1307 pic.twitter.com/BEKGcALbZK — IndianPremierLeague (@IPL) May 18, 2023 -
పాపం కావ్య.. ముఖం ఎలా పెట్టుకుందో చూడండి! ఫోటో వైరల్
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి ఎదురైంది. ఉప్పల్ వేదికగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ పరాజయం పాలైంది. అదే విధంగా తమ జట్టు గెలిస్తే చూడాలని మైదానంకు వచ్చిన సన్‌రైజర్స్ యాజమాని కావ్యమారన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఎస్ఆర్హెచ్ ఆడే ప్రతీ మ్యాచ్‌కు కావ్య హాజరవుతూ వారిని ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కానీ ఆరెంజ్ ఆర్మీ మాత్రం కావ్య ఆశలను ఆడి ఆశలు చేస్తోంది తాజాగా కావ్య తన ఎక్స్‌ప్రెషన్స్‌తో మరోసారి సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలిచింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఆరంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన బ్రెస్‌వెల్ బౌలింగ్‌లో తొలి బంతికే అభిషేక్ శర్మ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్‌ను వీక్షిస్తున్న కావ్య మారన్ ఒక్క సారిగా తీవ్ర నిరాశకు గురైంది. అభిషేక్ శర్మ ఔటైన వెంటనే కావ్య మొహం మాడిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్, విరాట్ కోహ్లి సెంచరీలతో చెలరేగారు. చదవండి: IPL 2023: వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. లేదంటేనా! చాలా బాధగా ఉంది: మార్క్రమ్ 📌Kavya Maran. Spotted Good Luck to SRH Fans #SRHvsRCB pic.twitter.com/vQwhSHs3Go — Mufaddal Vohra (@mufddal_vohraa) May 18, 2023 -
వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. లేదంటేనా! చాలా బాధగా ఉంది: మార్క్రమ్
ఐపీఎల్-2023 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తీరుమారలేదు. ఈ మెగా ఈవెంట్లో ఎస్ఆర్హెచ్ మరో ఓటమి చవి చూసింది. ఉప్పల్ వేదికగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. క్లాసెన్ సెంచరీతో చెలరేగడంతో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం 187 లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(100) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ డుప్లెసిస్(71) పరుగులతో రాణించాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ మార్క్రమ్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన క్లాసెన్‌పై మార్క్రమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ మ్యాచ్‌లో మేము బ్యాటింగ్ బాగానే చేశాం. అయితే పవర్‌ప్లేలో కొన్ని కీలకమైన పరుగులు చేయలేకపోయాం. క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు సంచలన ఇన్నింగ్స్ కారణంగా మేము మంచి స్కోర్ సాధించగలిగాం. ఐపీఎల్లో క్లాసెన్ సెంచరీ సాధిస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. ఉప్పల్‌లో మాకే కాదు ఆర్సీబీకి కూడా ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఫ్యాన్స్‌కు విజయాన్ని అందించకపోవడం చాలా బాధగా ఉంది. ఇక ఫాప్, కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అదే మా ఓటమిని శాసించింది. మా జట్టు బౌలింగ్ విభాగంలో కొంతమంది యువ క్రికెటర్లు ఉన్నారు. వారు ఇప్పుడిప్పుడే సరైన ట్రాక్‌లో పడుతున్నారు. పవర్‌ప్లేలో మేము భారీగా పరుగులు సమర్పించుకున్నాం. కార్తీక్ త్యాగి ఒత్తిడికి గురయ్యాడు. మా ప్లాన్స్‌ను అమలు చేయడంలో విఫలమయ్యాం. మయాంక్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ఆఖరి మ్యాచ్‌లో గెలిచి టోర్నీని విజయంతో ముగించాలని భావిస్తున్నాం" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మార్క్రమ్ పేర్కొన్నాడు. చదవండి: Virat Kohli: గేల్ రికార్డు సమం.. చరిత్రకెక్కడానికి ఇంకొక్కటి! -
నీకు బౌన్సర్లు వేయడం మాత్రమే వచ్చా? నాపై రాహుల్ సీరియస్ అయ్యాడు: సిరాజ్
టీ20లు, 24 టీ20లు,18 టెస్టులు ఆడిన సిరాజ్ ఓవరాల్‌గా 101 వికెట్లు పడగొట్టాడు. ఇక సిరాజ్ ప్రస్తుతం ఐపీఎల్-2023లో బీజీబీజీగా ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరాజ్.. ఇక్కడ కూడా దుమ్మురేపుతున్నాడు. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా సిరాజ్(12) నిలిచాడు. ఇక ఈ స్థాయికి చేరుకోవడంలో మహ్మద్ సిరాజ్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. తాజాగా గౌరవ్ కపూర్ చాట్ షో “బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్”లో సిరాజ్ తన సహచర ఆటగాడు కేఎల్ రాహుల్ గురించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. నెట్స్‌లో తను బౌలింగ్ చేస్తుండగా రాహుల్ సీరియస్ అయ్యాడని సిరాజ్ తెలిపాడు. కాగా ఐపీఎల్ అరంగేట్రంకు ముందు బెంగళూరు నెట్బౌల్గా సిరాజ్ పనిచేశాడు. "నేను 2015లో అండర్-23 జట్టులో తొలిసారి ఆడాను. అదే ఏడాదిలో ఫస్ట్‌కాస్ల్ అరంగేట్రం కూడా చేశాను. 2015-16 రంజీ ట్రోఫీలో ఒక మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కింది. ఆ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసుకున్నాను. కానీ ఆ తర్వాత రెండు మ్యాచ్‌లను నన్ను జట్టు నుంచి తొలిగించారు. ఆ తర్వాత ఏడాది ఐపీఎల్ సీజన్లో ఉప్పల్ వేదికగా ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు ముందు నేను ఆర్సీబీ నెట్‌బౌలర్‌గా పనిచేశాను. నెట్స్‌లో రాహుల్‌కు బౌలింగ్ చేసే క్రమంలో వరుసగా బౌన్సర్లను సంధించాను. దీంతో విసుగు చెందిన రాహుల్ నాదగ్గరకు వచ్చి నీకు కేవలం బౌన్సర్లు మాత్రమే వేయడం వచ్చా అని సీరియస్ అయ్యాడు. అందుకు బదులుగా లేదు భయ్యా నాకు ఇతర డెలివరీలు కూడా వేయగలను సమాధానమిచ్చాను" అని “బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్”లో సిరాజ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఇదేమి చెత్త బౌలింగ్రా బాబు.. 12 ఓవర్లలో 132 రన్స్! ఇంతకుమించి ఎవరూ దొరకలేదా? -
నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్తాన్ 40 పరుగులకే ఆలౌటయ్యేది: కోహ్లి
ఐపీఎల్-2023లో భాగంగా మే14న జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 పరగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ కేవలం 59 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని చవి చూసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే మూడో అత్యల్ప స్కోరు కావడం గమానార్హం. ఇక ఈ విజయంతో ఆర్సీబీ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌పై ఆర్సీబీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోమవారం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో కోహ్లి చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్‌గా మారాయి. 'ఒక వేళ నేను బౌలింగ్ చేసి ఉంటే, రాజస్తాన్ రాయల్స్ 40 పరుగులకే ఆలౌట్ అయ్యేది' అని కోహ్లి నవ్వుతూ అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో మే18న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో తలపడనుంది. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లే ఆప్స్‌కు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. చదవండి: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో భువనేశ్వర్! స్వింగ్ సుల్తాన్ ఉంటే! Dressing Room Reactions RR v RCB A near-perfect game, 2 points in the bag, positive NRR - that sums up the satisfying victory in Jaipur. Parnell, Siraj, Maxwell, Bracewell and Anuj take us through the events that transpired and the road ahead.#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 pic.twitter.com/cblwDrfVgd — Royal Challengers Bangalore (@RCBTweets) May 15, 2023 -
సిరాజ్ కొత్త ఇంట్లో సందడి చేసిన ఆర్సీబీ ఆటగాళ్లు.. వీడియో వైరల్
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కీలక పోరుకు రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా మే18న ఎస్ఆర్హెచ్తో ఆర్సీబీ తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్‌కు చేనుకున్న డుప్లెసిస్ సేన.. ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది. ఈ క్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు ఆ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కొత్త ఇంట్లో సందడి చేశారు. సిరాజ్ ఇటీవలే ఫిల్మ్ నగర్లో కొత్త ఇంటిని నిర్మించాడు. తన నూతన గృహ ప్రవేశానికి విరాట్ కోహ్లి, కెప్టెన్ డుప్లెసిస్‌తో పాటు సహచర ఆటగాళ్లను సిరాజ్ అహ్హనించాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఆటగాళ్లు సిరాజ్ కొత్త ఇంటిని సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లితో పాటు డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు కన్పిస్తున్నారు. ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లే ఆప్స్‌కు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. చదవండి: నువ్వేం తింటావు? గుజరాత్లో ఉన్నాను.. నాకిష్టమైన తిండి దొరకదు కదా: షమీ వ్యాఖ్యలు వైరల్ #RCB Team leaved after the New House Opening of Siraj Miya at Flim nagar , Jubilee Hills, HYD ... Time : around 10:00PM #ViratKohli #MohammedSiraj #RoyalChallengersBangalore #RCBvsSRH #ViratKohli𓃵 #RohitSharma𓃵 #LSGvMI @imVkohli @faf1307 @mdsirajofficial @RCBTweets pic.twitter.com/3M2ZdD9ozc — Tarak Anna || Anil 🖤 (@AnilTarakianNTR) May 16, 2023 -
సీఎస్కేను ఓడించే సత్తా ఆ ఒక్క జట్టుకే ఉంది: ఆకాష్ చోప్రా
ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని సీఎస్కే భావిస్తోంది. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సీఎస్కేను తన హోం గ్రౌండ్ చెపాక్‌లో ఓడించే సత్తా ఉన్న ఏకైక జట్టు కోల్‌కతా అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. "చెపాక్ పిచ్‌లో సీఎస్కే తిరిగిండదని మనకు తెలుసు. కానీ వారి సొంతం మైదానంలో పోటీ ఇచ్చే ఏకైక జట్టు ఒకటి ఉంది. అదే కోల్‌కతా నైట్‌రైడర్స్. కేకేఆర్‌లో సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వంటి అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. కాబట్టి కేకేఆర్ కూడా చెపాక్ స్పిన్ పిచ్‌పై రాణించగలదు. ఇక బ్యాటింగ్‌లో రాయ్, గుర్బాజ్ ఇద్దరు ఓవర్సీస్ ఓపెనర్లు ఉన్నారు. వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. అదే విధంగా అనుకుల్ రాయ్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చి రాణిస్తున్నాడు. కాబట్టి కోల్‌కతా జట్టును అంత తేలికగా తీసుకోకూడదు" అని జియోసినిమా 'ఆకాశవాణి' షోలో చోప్రా పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: లక్షలు పెట్టి కొంటే అద్భుతాలు సృష్టిస్తున్నాడు.. మరి 18 కోట్లు తీసుకున్న నువ్విలా! -
ఆర్సీబీతో ముంబై కీలకపోరు.. తిలక్ వర్మ బ్యాక్! అతడు కూడా
ఐపీఎల్-2023లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. మంగళవారం వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఇరు జట్లుకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ రెండు జట్లు కూడా తమ గత మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఈ మ్యాచ్‌లోకి బరిలోకి దిగుతున్నాయి. ఢిల్లీ చేతిలో ఆర్సీబీ ఓటమి చవిచూడగా.. సీఎస్కే చేతిలో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకే దిగనున్నట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ లేమితో స్వదేశానికి వెళ్లిపోయిన జోఫ్రా ఆర్చర్ స్థానంలో ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ జోర్డాన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అదే విధంగా సీఎస్కేతో మ్యాచ్‌కు ఆనారోగ్యం కారణంగా దూరమైన తిలక్ వర్మ కూడా తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్సీబీ కూడా ఒక మార్పు చేసే ఛాన్స్ ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అనుజ్ రావత్ స్థానంలో ప్రభ్‌దేశాయ్ రానున్నట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు చెరో 10 మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు ఐదింట విజయం సాధించాయి. తుది జట్లు(అంచనా) ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోర్డాన్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, అర్షద్ ఖాన్ ఆర్సీబీ: ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, కరణ్ శర్మ మహ్మద్ సిరాజ్ చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! జోర్డాన్ ఎంట్రీ -
అదే మాకు కలిసొచ్చింది.. నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుందని: డుప్లెసిస్
ఐపీఎల్-2023లో భాగంగా వాజ్‌పేయి ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా కాపాడుకోగలిగారు. 127 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. ఇక సంచలన విజయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ స్పందించాడు. లక్నో వంటి వికెట్‌పై తొలుత బ్యాటింగ్ చేయడం తమకు కలిసొచ్చిందని డుప్లెసిస్ తెలిపాడు. "మా హోం గ్రౌండ్ చిన్నస్వామి వికెట్‌కు ఇక్కడి వికెట్ పూర్తి వ్యతిరేకం. మేము ఈ మ్యాచ్‌లో తొలత 6 ఓవర్లు బాగా ఆడాం. విరాట్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడం సంతోషంగా ఉంది. అదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అనుకుంటా. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పిచ్‌లపై తొలుత బ్యాటింగ్ చేయడం చాలా ముఖ్యం. 135 పరుగులు చేస్తే చాలు ఈ వికెట్‌పై మంచిస్కోర్ అవుతుందని భావించాను. ఇదే విషయం నేను కార్తీక్ మాట్లాడుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ మేము అనుకున్న మార్క్‌ను అందుకోలేకపోయాము. అయినప్పటికీ ఫీల్డ్‌లో అడుగుపెట్టేటప్పుడు మా బాయ్స్‌తో ఒకే విషయం చెప్పాను. ఈ స్కోర్‌నే మ్యాచ్ విన్నింగ్ స్కోర్‌గా భావించండి అని చెప్పా. ఆ మాత్రం స్కోర్ సాధిస్తే విజయం మాదే అని ముందే ఊహించా. ఇక మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. జోష్, కరుణ్ చాలా బౌలింగ్ చేశారు. ఇక ఇదే రిథమ్‌ను మా తర్వాతి మ్యాచ్‌ల్లో కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో డుప్లెసిస్ పేర్కొన్నాడు. చదవండి: #Virat Kohli: షాకిచ్చిన బీసీసీఐ! పైకి కనబడేదంతా నిజం కాదు.. కోహ్లి పోస్ట్ వైరల్! ఫ్యాన్స్ ఫైర్ Shootout at 𝚆̶𝚊̶𝚍̶𝚊̶𝚕̶𝚊̶ Ekana: 1️⃣9️⃣ wickets, 1️⃣ hamstring injury, unlimited drama & #RCB breaking 💔 in Lucknow#LSGvRCB #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @RCBTweets pic.twitter.com/7S2NEdsV9b — JioCinema (@JioCinema) May 1, 2023 -
LSG Vs RCB: ఎందుకు వస్తున్నాడో తెలియదు..చెత్త బ్యాటింగ్! ఇంకా జట్టులో అవసరమా?తీసిపడేయండి
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లక్నోలోని ఎకానా స్టేడియంయ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. లక్నో కేవలం 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో దీపక్ హుడా క్రీజులో వచ్చాడు. ఈ సమయంలో ఎంతో బాధ్యతయుతంగా ఆడిల్సిన అతడు.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్లో మాత్రం హుడా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 53 పరుగులు మాత్రమే చేశాడు. 17, 2, 7, 9, 2, 2, 2, 11, 1 ఇవి అతడు తన ఆఖరి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు. ఇక వరుసగా విఫలమవుతున్నప్పటికీ అతడికి అవకాశం ఇస్తున్న లక్నో మేనెజ్మెంట్పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చెత్త ప్రదర్శన చేస్తున్నప్పటికీ ఇంకా జట్టులో చోటు అవరసరమా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి కొంత మంది హుడా తప్ప ఇంకా ఎవరూ జట్టులో లేరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీ చేతిలో 18 పరుగుల తేడాతో లక్నో ఓటమి పాలైంది. చదవండి: #Kohli Vs Naveen-ul-Haq: పో నేనేం సారీ చెప్పను.. కోహ్లిపై నవీన్ సీరియస్!? మరీ ఇంత తలపొగరా? వీడియో వైరల్ -
గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. కింగ్ ఏం చేశాడంటే?
ఐపీఎల్-2023లో భాగంగా వాజ్‌పేయి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్- ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లక్నో ఇన్నింగ్స్ జరుగుతుండగా ఆర్సీబీ మాజీ సారధి విరాట్ కోహ్లి వీరాభిమాని అయిన ఒక వ్యక్తి.. భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి పరుగులు తీశాడు. నేరుగా కోహ్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన అభిమాని.. విరాట్ కాళ్లకు దండం పెట్టాడు. వెంటనే కోహ్లి అతడిని పైకి లేవదీసి హగ్ చేసుకుని బయటకు వెళ్లాలని సూచించాడు. ఇక కోహ్లిని కలిసిన అభిమాని ఆనందానికి అవధులు లేకుండా లేకుండా పోయాయి. ఇక సదరు అభిమాని పట్ల కోహ్లి ప్రవర్తించిన తీరుపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నోపై 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. King of World Cricket. Kohli is loved by millions & won the hearts of everyone. pic.twitter.com/gPMmzp9tDH — Johns. (@CricCrazyJohns) May 1, 2023 చదవండి: #Kohli,Gambhir Fight: మళ్లీ డిష్యూం డిష్యూం.. కోహ్లి, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్ -
నా ఫేవరేట్ ఐపీఎల్ టీం అదే.. మనసులో మాట చెప్పేసిన శ్రీవల్లి
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ సంపాదించుకున్న కన్నడ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్లో సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప-2లో బన్నీ సరసన మరోసారి అలరించనుంది. ఇప్పటికే పుష్ప-2 షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది శాండల్‌వుడ్ భామ. (ఇది చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక) అయితే ఈ ఏడాది ఐపీఎల్-2023 ప్రారంభోత్సవంలో తమన్నా భాటియాతో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన ఫేవరేట్ జట్టు గురించి మనసులోని మాటను బయటపెట్టింది. అంతే కాకుండా తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పేసింది ముద్దుగుమ్మ. రష్మిక మందన్నా మాట్లాడుతూ.. ' నేను కర్ణాటక నుంచి వచ్చా. ఈసారి ఐపీఎల్ తప్పకుండా ఆర్సీబీ గెలుస్తుందని ఆశిస్తున్నా.( ఈ సాలా కప్ నమ్దే) . ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆర్సీబీ ఆటను ఆస్వాదిస్తున్నా. ఐపీఎల్లో నా ఫేవరేట్ క్రికెటర్ విరాట్ సర్. అతను ఓ స్వాగర్. అతనొక అద్భుతం.' అంటూ కొనియాడింది. కాగా.. ప్రస్తుతం దేవ్‌మోహన్‌తో కలిసి రెయిన్బో చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. మరోవైపు టాలీవుడ్ హీరో నితిన్‌తో ఓ చిత్రంలో కనిపించనుంది. (ఇది చదవండి: మహారాణి పాత్రలో నటించనున్న రష్మిక మందన్నా!) .@iamRashmika reveals her RCB FAN-GIRL side. 🙈💓 From being a die-hard @ImVkohli fan to chanting ‘Ee Sala Cup Namde’, she is a TOTAL RCBian! 🤩 Tune-in to #LSGvRCB on #IPLonStar Today | Pre-show at 6:30 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#GameOn #BetterTogether pic.twitter.com/C3NkP9KRl0 — Star Sports (@StarSportsIndia) May 1, 2023 View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
RCB Vs KKR: కోహ్లి కాలికి దండం పెట్టిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అంటే అభిమానులకే కాదు క్రికెటర్లకు కూడా ఎంతో ఇష్టం. అతడిని ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా మొదలపెట్టిన చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. అతడిని కనీసం ఒక్కసారి కలిస్తే చాలు తమ జన్మ ధన్యం అయిపోతుందని అనుకునే వారు కూడా ఉన్నారు. తాజాగా అది మరోసారి రుజువైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ రింకూ సింగ్.. కింగ్ కోహ్లిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. కోహ్లికి కాలికి రింకూ సింగ్ దండం పెట్టాడు. ఐపీఎల్-2023లో భాగంగా కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం డగౌట్‌కు వెళ్తుతుండగా.. కోహ్లి కనిపించగానే వెంటనే అతడి పాదాలను రింకూ తాకాడు. వెంటనే కోహ్లి అతడిని లేపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి(54) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. Rinku singh touched Virat Kohli's feet God of Cricket @imVkohli 🙏 pic.twitter.com/BeivPsWtG7 — 𝙎𝙋𝙄𝘿𝙀𝙔シ︎ (@Spidey_RCB) April 27, 2023 చదవండి: IPL 2023-Washington Sundar: సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు టోర్నీ మొత్తానికి దూరం! -
ఒకప్పుడు టీమిండియా కెప్టెన్.. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్!
ఐపీఎల్-2023లో భాగంగా గురువారం మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ విషయం పక్కన పెడితే.. మొహాలీ స్టేడియం వద్ద భారత పురుషుల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాజ్‌పాల్ సింగ్ పోలీస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ కనిపించాడు. 2011లో భారత కెప్టెన్‌గా పనిచేసిన రాజ్‌పాల్ సింగ్.. ప్రస్తుతం మొహాలీ ట్రాఫిక్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. స్టేడియం మొయిన్ గేట్ వద్ద సెక్యూరిటీగా ఉన్న రాజ్‌పాల్ సింగ్.. తన సహచరులతో కలిసి ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకున్నాడు. కాగా ఐపీఎల్ మ్యాచ్‌లే కాకుండా గత కొంత కాలంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో కూడా తన విధులు నిర్వహించినట్లు రాజ్‌పాల్ తెలిపాడు. స్టేడియం వద్ద పరిస్థితులను ఎలా కంట్రోల్ చేయాలో తనకు బాగా తెలుసని, ఇదంతా డ్యూటీలో భాగమని స్టార్‌స్పోర్ట్‌తో రాజ్‌పాల్ సింగ్ పేర్కొన్నాడు. కాగా రాజ్‌పాల్ మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు నాయకత్వం వహించాడు. అదే విధంగా 2011 ఆసియా పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీని అతడి సారథ్యంలోనే భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ను భారత జట్టు ముద్దాడింది. చదవండి: IPL 2023: చెన్నైతో మ్యాచ్.. సన్‌రైజర్స్ జట్టులో కీలక మార్పు! యార్కర్ల కింగ్‌కు నో ఛాన్స్ IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్ -
విధ్వంసకర వీరుడొచ్చాడు.. వెలగబెట్టిందేమీ లేదు! పాపం పంజాబ్..
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తొలి మ్యాచ్ ఆడాడు. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే లివింగ్‌స్టోన్ నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గురువారం రాయల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన ఓ అద్భుత బంతికి వికెట్ల ముందు లివింగ్‌స్టోన్ దొరికిపోయాడు. అదే విధంగా బౌలింగ్ విషయానికి వస్తే.. కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసిన లివింగ్‌స్టోన్ వికెట్ ఏమీ తీయకుండా 9 పరుగులిచ్చాడు. ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ జట్టుతో చేరి దాదాపు 10 రోజులు అవుతున్న అతడు పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో పంజాబ్ మేనెజ్మెంట్ పక్కన పెట్టింది. ఎట్టకేలకు ఫిట్నెస్ సాధించడంతో అద్భుత ఫామ్‌లో ఉన్న సికిందర్ రజాను పక్కన పెట్టి మరి లివింగ్‌స్టోన్‌కు పంజాబ్ మేనెజ్మెంట్ అవకాశం ఇచ్చింది. పంజాబ్ మేనెజ్మెంట్ నమ్మకాన్ని లివింగ్‌స్టోన్ నిలబెట్టుకో లేకపోయాడు. ఇక పంజాబ్ చివరి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన సికిందర్ రజా స్ధానంలో లివింగ్‌స్టోన్‌ను తీసుకురావడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. రజా లాంటి అద్భుత ఆల్‌రౌండర్ జట్టులో ఉండి ఉంటే.. ఆర్సీబీపై పంజాబ్ కచ్చితంగా విజయం సాధించి ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో 24 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. కాగా ఈ మ్యాచ్‌కు కూడా పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమయ్యాడు. చదవండి: IPL 2023: తిన్నగా ఆడటమే రాదు.. ఇంకా ప్రయోగాలు ఒకటి! చెత్త బ్యాటింగ్ ఎట్టకేలకు ఢిల్లీకి దక్కిన విజయం.. ఆరో మ్యాచ్‌లో అతికష్టమ్మీద -
RCB Vs CSK: ఊహించని విధంగా కోహ్లి ఔట్.. షాక్‌లో అనుష్క! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఊహించని విధంగా ఔటయ్యాడు. 227 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి అద్భుతమైన శుభారంభం ఇవ్వాలని విరాట్ కోహ్లి భావించాడు. తొలి బంతి నుంచే కోహ్లి దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో ఆకాష్ సింగ్ వేసిన తొలి ఓవర్లో మూడో బంతిని విరాట్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తూ బంతి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని కోహ్లి బూటుకి తాకి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన విరాట్‌తో పాటు స్టేడియంలో అభిమానులంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్‌ను వీక్షిస్తోన్న కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా ఒక్క సారిగా షాక్‌కు గురయ్యంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ మ్యాచ్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 6 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 20న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చదవండి: SRH Vs MI: తిలక్ ఇంట్లో డిన్నర్.. తరలివచ్చిన సచిన్, రోహిత్, సూర్య! ఫొటోలు వైరల్ pic.twitter.com/dMpnXPXNut — Billu Pinki (@BilluPinkiSabu) April 18, 2023 -
RCB Vs CSK: ఇదేమి మ్యాచ్ రా బాబు.. బ్యాటర్ల విధ్వంసం! 444 పరుగులు, 33 సిక్స్‌లు
చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫలితం విషయం పక్కన పెడితే.. ఈ మ్యాచ్ మాత్రం అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. ఈ మ్యాచ్‌లో పరుగులు వరద పారింది. రెండు జట్లు కలిపి ఏకంగా 444 పరుగులు నమోదు చేశాయి. అదే విధంగా ఇరు జట్ల బ్యాటర్లు ఏకంగా 33 సిక్స్‌లు బాదడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నై బ్యాటర్లలో కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), దుబే(27 బంతుల్లో 52) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. 227 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన బెంగళూరు తొలి ఓవర్లోనే కోహ్లి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం డుప్లెసిస్, మాక్స్వెల్ షో మొదలైంది. వీరిద్దరూ సీఎస్కే బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించారు. మాక్స్వెల్ 36 బాల్స్‌లో 8 సిక్సర్లు, 3 ఫోర్లతో 76 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 33 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఇక వీరిద్దరూ వరుస క్రమంలో ఔట్ కావడంతో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది. చదవండి: Trolls On Vijaykumar Vyshak: చివరి మ్యాచ్‌లో హీరో.. ఇప్పుడు జీరో! అత్యంత చెత్త రికార్డు.. #Virat Kohli: దూకుడు ఎక్కువైంది.. కోహ్లికి ఊహించని షాక్! ఫైన్ పడింది.. ఎందుకంటే.. 2019: #TATAIPL debut for @RCBTweets 🏏 Now: Chief destructor against them for @ChennaiIPL 💛 Shivam Dube's attack mode was 🔛 with the bat🔥#RCBvCSK #IPLonJioCinema #IPL2023 | @IamShivamDube pic.twitter.com/jTnfAAccOL — JioCinema (@JioCinema) April 17, 2023 -
RCB Vs CSK: చివరి మ్యాచ్‌లో హీరో.. ఇప్పుడు జీరో! అత్యంత చెత్త రికార్డు..
ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ పేసర్ విజయ్‌కుమార్ వైషాక్.. తన రెండో మ్యాచ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్-2023లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విజయ్‌కుమార్ చెత్త ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో విజయ్‌కుమార్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 62 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తరపున అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా వైషాక్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తొలి స్థానంలో ఉన్నాడు. గతేడాది సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్కే చేతిలో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(62), మాక్స్వెల్(76) విరోచిత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. విజయం మాత్రం సీఎస్కేనే వరించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), శివమ్ దుబే(52) పరుగులతో దుమ్ము రేపారు. చదవండి: IPL 2023: మరీ ఇంత బద్దకమా.. మొయిన్ అలీపై కోపంతో ఊగిపోయిన ధోని! వీడియో వైరల్ -
మరీ ఇంత బద్దకమా.. మొయిన్ అలీపై కోపంతో ఊగిపోయిన ధోని! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవి చూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. 227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేయగల్గింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(62), మాక్స్వెల్(76) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. విజయం మాత్రం సీఎస్కే వైపే నిలిచింది. మొయిన్ అలీపై ధోని సీరియస్ ఈ మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్ ఎంస్ ధోని తన ప్రశాంతతను కోల్పోయాడు. ఫీల్డింగ్‌లో అలసత్వం వహించిన మొయిన్ అలీపై ఎంస్ కోపంతో ఊగిపోయాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన పతిరానా బౌలింగ్‌లో చివరి బంతికి పార్నెల్ ఎక్స్ట్రా కవర్ దిశగా షాట్ ఆడాడు. బంతికి ఎక్స్ట్రా కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మొయిన్ అలీ చేతికి వెళ్లింది. ఈ క్రమంలో పార్నెల్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న ప్రభుదేశాయి మాత్రం పార్నెల్‌ను గమనించలేదు. పార్నెల్ గట్టిగా అరవడంతో ప్రభుదేశాయ్ వికెట్ కీపర్‌వైపు పరిగెత్తాడు. అయితే మొయిన్ బంతిని సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతేకాకుండా తన పక్కనే ఉన్న బంతిని వికెట్ కీపర్‌కు త్రో చేయకుండా బద్దకంగా వ్యవహరించాడు. ఒక వేళ బంతిని వెంటనే అందుకుని వికెట్ కీపర్‌కు అతడు త్రో చేసి ఉంటే సుయాష్ ప్రభుదేశాయి రనౌట్‌గా వెనుదిరిగేవాడు. బంతిని త్రో చేయడంలో మొయిన్ అలీ అలసత్వం వహించడంతో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి సుయాష్ తప్పించుకున్నాడు. ఇక మొయిన్ అలీ పేలవ ఫీల్డింగ్‌పై ధోని ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ధోని కోపంతో మొయిన్ వైపు చూస్తూ ఏదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/yeXJEpm5Ts — Billu Pinki (@BilluPinkiSabu) April 18, 2023 .@ChennaiIPL come out on top in the mid-table clash as they beat #RCB by 8 runs in highly entertaining and run-filled #TATAIPL match. 👏 👏 Scorecard ▶️ https://t.co/QZwZlNk1Tt#RCBvCSK pic.twitter.com/jlEz6KmM0V — IndianPremierLeague (@IPL) April 17, 2023 చదవండి: #MS Dhoni: వాళ్లిద్దరు ఇంకాసేపు క్రీజులో ఉంటే మేము ఓడిపోయేవాళ్లం.. 18వ ఓవర్లోనే మ్యాచ్ ముగిసేది! కానీ.. -
దురదృష్టం అంటే కోహ్లిదే.. అయ్యో విరాట్! బౌలర్‌కు మాత్రం!వీడియో వైరల్
చిన్నస్వామి స్టేడియం వేదికగా సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి.. ఆకాష్ సింగ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఏం జరిగిందంటే? సీఎస్కే సెకెండ్ ఇన్నింగ్స్‌లో తమ ఇంపాక్ట్ ప్లేయర్‌గా పేసర్ ఆకాష్ సింగ్‌ను తీసుకుంది. అయితే తొలి ఓవర్ వేసేందుకు ధోని బంతిని ఆకాష్ సింగ్‌కు అందించాడు. ఈ ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టి విరాట్ మంచి జోరు మీద కనిపించాడు. ఇదే ఓవర్లో ఐదో బంతిని కోహ్లి లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని కోహ్లి బూట్‌కు తాకి స్టంప్స్‌ను గిరాటేసింది. అలా జరుగుతుందని కోహ్లి అస్సలు ఊహించలేదు. దీంతో నిరాశతో కింగ్ కోహ్లి మైదానాన్ని వీడిడాడు. ఇక కోహ్లి వికెట్ పడగొట్టిన ఆకాష్ సింగ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెలరేగిన సీఎస్కే బ్యాటర్లు.. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్కే బ్యాటర్లలో కాన్వే(45 బంతుల్లో 83 పరుగులు), శివమ్ దుబే(52) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, పార్నల్, వైశ్యాఖ్,హర్షల్ పటేల్, హసరంగా, మాక్స్వెల్ తలా వికెట్ సాధించారు. చదవండి: IPL 2023: శివమ్ దుబే విధ్వంసం.. 111 మీటర్ల భారీ సిక్సర్! వీడియో వైరల్ This dismissal. Virat Kohli Is the most unlucky Cricketer. pic.twitter.com/1s0CkIldv9 — Sayam Ahmad (@sayam_ahmad_) April 17, 2023 -
శివమ్ దుబే విధ్వంసం.. 111 మీటర్ల భారీ సిక్సర్! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు శివమ్ దుబే శివాలెత్తాడు. రహానే ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన దుబే.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. దుబే బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. మరోవైపు కాన్వేతో కలిసి మూడో వికెట్‌కు 74 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దుబే భారీ సిక్సర్.. ఇక ఈ మ్యాచ్‌లో దుబే భారీ సిక్సర్ బాదాడు. సీఎస్కే ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో 111 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. అతడి పవర్‌కు బంతి స్టేడియం రూఫ్ మీద పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. కాన్వే(83), దుబే(52) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చదవండి: IPL 2023 GT Vs RR: షమీపై సీరియస్ అయిన హార్దిక్.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? వీడియోవైరల్ pic.twitter.com/Hhv65fWxNF — IPLT20 Fan (@FanIplt20) April 17, 2023 -
RCB Vs CSK: ఆర్సీబీతో మ్యాచ్.. చెన్నై కెప్టెన్‌గా జడేజా! మరి ధోని?
ఐపీఎల్-2023లో మరో ఆసక్తికర సమరానికి సమయం అసన్నమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఢిల్లీపై విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న ఆర్సీబీ.. అదే జోరును సీఎస్కే పై కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు రాజస్తాన్‌పై ఓటమి పాలైన సీఎస్కే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని యోచిస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోని.. కెప్టెన్‌గా జడేజా ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. మోకాలి గాయంతో బాధపడుతున్న ధోని కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఈ మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌడర్ రవీంద్ర జడేజా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్కే వికెట్ కీపర్‌గా డెవాన్ కాన్వే బాధ్యతలు చేపట్టనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సీఎస్కే మెనెజ్‌మెంట్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ మ్యాచ్‌కు సీఎస్కే ఆటగాళ్లు బెన్ స్టోక్స్, మగాల గాయం కారణంగా దూరంగా ఉండనున్నారు. కాగా ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై సారధిగా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించాడు. తుది జట్లు: ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, వైషాక్ విజయ్‌కుమార్ సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మతీష్ పతిరణ, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సింగ్ చదవండి: #Riyan Parag: ‘పిచ్చి వేషాలు వేసినా నన్నెవరూ ఏం చేయలేరు! అదే అర్జున్ టెండుల్కర్‌ను చూడండి!’.. మామూలుగా కాదు.. -
అరంగేట్రంలోనే అదరగొట్టిన విజయ్‌కుమార్.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన తల్లి
ఢిల్లీ క్యాపటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కీలకమైన 3 వికెట్లు (4-0-20-3) పడగొట్టి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేస్ బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్సీబీ తరఫున డెబ్యూ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన వైశాఖ్.. డీసీ స్టార్ ప్లేయర్, ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఔట్ చేసి ఐపీఎల్ వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, లలిత్ యాదవ్‌ల వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబర్చి, రాత్రిరాత్రే స్టార్డమ్ తెచ్చుకున్న వైశాఖ్‌ను చూసి అతని తల్లి పుత్రోత్సాహంతో పరవశించిపోయింది. మ్యాచ్ అనంతరం కొడుకును చూడగానే ఆమె పట్టలేనంత ఆనందంతో బిడ్డను ముద్దాడింది. ఈ సన్నివేశాన్ని చూస్తూ పక్కనే ఉన్న తండ్రి మురిసిపోయాడు. 26 ఏళ్ల వైశాఖ్ తమ సొంత ప్రేక్షకుల ముందు తొలి మ్యాచ్‌లోనే విజృంభించడంతో అతని తల్లిదండ్రులు పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోయారు. వైశాఖ్ తల్లి అతన్ని ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోకు ఆర్సీబీ అభిమానులు పిక్చర్ ఆఫ్ ది డే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, నిన్న (ఏప్రిల్ 15) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కోహ్లి (50), బౌలింగ్‌లో విజయ్‌కుమార్ వైశాఖ్ (3/20) రాణించడంతో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండు వరుస పరాజయాల తర్వాత వచ్చిన విజయం (రెండవది). విజయ్‌కుమార్ వైశాఖ్ గురించి.. కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్ వైశాఖ్ 2020-21 సీజన్లో విజయ్‌హజారే ట్రోఫీలో కర్ణాటక తరఫున దేశవాలీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ20 క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వైశాఖ్.. కర్ణాటక తరఫున 2021-22 రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. వైశాఖ్.. ఇప్పటివరకు 10 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 38 వికెట్లు, 14 టీ20ల్లో 22 వికెట్లు, 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ సందర్భంగా రజత్ పాటిదార్ గాయపడడంతో అతని స్థానంలో వైశాఖ్ ఆర్సీబీలోకి వచ్చాడు. -
ఏంటి రాహుల్ భయ్యా ఇది..? ఓహో టెస్లుల్లా ఆడుతున్నందుకేనా.. 17 కోట్లు!
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ తన ఆటతీరుతో చిరాకు తెప్పించాడు. 213 భారీ లక్ష్య ఛేదనలో రాహుల్ టెస్టు మ్యాచ్‌ను తలపించేలా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న రాహుల్ కేవలం 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. రాహుల్ ఆడిన 18 బంతుల్లో కేవలం ఒకే బౌండరీ ఉండడం గమనార్హం. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడిన 61 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్పై చేసిన 35 పరుగులే అతడి అత్యధిక స్కోర్‌గా ఉంది. ఆ 35 పరుగులు కూడా 31 బంతుల్లో చేశాడు. ఇక ఆర్సీబీపై చెత్త ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఏంటి రాహుల్.. టెస్టు మ్యాచ్ అనుకున్నావా అంటూ పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది రూ.17 కోట్లు తీసుకున్నావు.. టెస్టు క్రికెట్ కంటే దారుణంగా ఆడుతున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై ఒక్క వికెట్ తేడాతో లక్నో విజయం సాధించింది. లక్నో విజయంలో స్టోయినిష్(65), పూరన్(62) పరుగులతో కీలక పాత్ర పోషించారు. This KL Rahul is beyond finished! 😭😭 pic.twitter.com/jlVGSYMN2X — supremo ` (@hyperKohli) April 10, 2023 Just B KL Rahul Things 🔥💪 pic.twitter.com/TayK7HzHQq — Siddhartha Patel 🔥 (@Siddhu__94) April 10, 2023 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 చదవండి: Avesh Khan: మరీ అంత ఓవరాక్షన్ పనికిరాదు.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి! వీడియో వైరల్ -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన కోహ్లి..
ఐపీఎల్లో ఆర్సీబీ మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ప్రస్తుతం ఆడుతున్న 9 యాక్టివ్ టీమ్స్‌పై హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రుత్‌రాజ్ గైక్వాడ్‌తో కలిసి విరాట్ సంయుక్తంగా నిలిచాడు. ఐపీఎల్-2023లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకంతో చెలరేగిన కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లక్నోతో మ్యాచ్‌కు ముందు మిగిలిన 8 ఫ్రాంచైజీలపైన అర్థ సెంచరీలు సాధించాడు. ఇక ఐపీఎల్ కెరీర్లో విరాట్‌కు ఇది 46వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 4 సిక్స్‌లు, 4 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో లక్నో చేతిలో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఐపీఎల్ టీమ్స్‌పై కోహ్లి చేసిన హాఫ్ సెంచరీలు ఇవే.. చెన్నై సూపర్ కింగ్స్ - 9 ఢిల్లీ క్యాపిటల్స్ - 8 కోల్‌కతా నైట్ రైడర్స్ - 5 ముంబై ఇండియన్స్ - 5 సన్‌రైజర్స్ హైదరాబాద్ - 4 రాజస్థాన్ రాయల్స్ - 4 పంజాబ్ కింగ్స్ - 3 గుజరాత్ లయన్స్ - 3 రైజింగ్ పూణె సూపర్ జెయింట్ - 3 డెక్కన్ ఛార్జర్స్ - 3 గుజరాత్ టైటాన్స్ - 2 లక్నో సూపర్ జెయింట్స్ - 1 పూణే వారియర్స్ - 1 కొచ్చి టస్కర్స్ - 0 చదవండి: IPL 2023 Dinesh Karthik: ఎంత పనిచేశావు కార్తీక్.. లేదంటేనా? అయ్యో ఆర్సీబీ! వీడియో వైరల్ -
అయ్యో హర్షల్.. ఆ పని ముందే చేయాల్సింది! అలా జరిగి ఉంటేనా! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ సంచలన విజయం నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆర్సీబీతో ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలిపొందింది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి రాహుల్ సేన చేధించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టార్గెట్‌ను ఛేధించిన నాలుగో జట్టుగా లక్నో నిలిచింది. కాగా 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ఆరంభంలో తడబడింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ క్రమంలో స్టోయినిష్(65), పూరన్(62) మెరుపు ఇన్నింగ్స్‌లతో లక్నో శిబరంలో గెలుపు ఆశలను రేకెత్తించాడు. అయితే 18 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో పూరన్ ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోయాడు. దీంతో ఆట ఆఖరిలో హై డ్రామా చోటు చేసుకుంది. ఆట చివర్లో అలా... పూరన్ అవుటైన సమయంలో లక్నో స్కోరు 189/6. మరో 18 బంతుల్లో 24 పరుగులు చేయాలి. కానీ తర్వాతి ఆట మొత్తం మలుపులతో సాగింది. 9 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన సురక్షిత స్థితిలో పార్నెల్ బౌలింగ్‌లో బదోని స్కూప్ షాట్‌తో బంతిని సిక్సర్‌గా మలచడంతో లక్నో సంబరపడింది. కానీ అతని బ్యాట్ స్టంప్స్‌కు తాకడంతో బదోని వెనుదిరగాల్సి వచ్చింది. చివరి ఓవర్లో 5 పరుగులు సునాయాసంగానే అనిపించినా హర్షల్ 5 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. స్కోర్లు సమం కాగా, లక్నో విజయానికి చివరి బంతికి ఒక పరుగు కావాలి. అయితే బంతి వేయకముందే బిష్ణోయ్ క్రీజు దాటి ముందుకు వెళ్లడంతో హర్షల్ ‘మన్కడింగ్’కు ప్రయతి్నంచాడు. కానీ బంతి స్టంప్స్‌ను తాకలేదు. దాంతో రనౌట్ కోసం త్రో చేశాడు. స్టంప్స్ ఎగిరినా, నిబంధనల ప్రకారం అలా రెండు సార్లు చేయడం కుదరదని అంపైర్ చెప్పేశాడు. దాంతో బిష్ణోయ్ నాటౌట్‌గా తేలాడు. చివరి బంతిని అవేశ్ ఆడలేకపోగా, కీపర్ దినేశ్ కార్తీక్ కూడా తడబడి దానిని నేరుగా అందుకోవడంలో విఫలమయ్యాడు. అతను త్రో చేసేలోగా బిష్ణోయ్ ఆ వైపు, అవేశ్ ఈ వైపునకు వచ్చేశారు! దాంతో లక్నో జట్టు ఆనందాన్ని ఆపడం ఎవరితరం కాలేదు. చదవండి: IPL 2023 Dinesh Karthik: ఎంత పనిచేశావు కార్తీక్.. లేదంటేనా? అయ్యో ఆర్సీబీ! వీడియో వైరల్ Virat Kohli mocking his own RCB teammate Harshal Patel for Mankad / Mankading. R Ashwin gonna get good sleep today. pic.twitter.com/Qnvnv1WaGZ — Chintan (@ChinTTan221b) April 10, 2023 -
ఎంత పనిచేశావు కార్తీక్.. లేదంటేనా? అయ్యో ఆర్సీబీ! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో స్టోయినిష్((30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), పూరన్(19 బంతుల్లో 62, 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో లక్నోను గెలుపుకు దగ్గరగా తీసుకు వెళ్లారు. అయితే హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. తొలి బంతికి ఉనద్కట్ సింగిల్ తీశాడు. అనంతరం రెండో బంతికి వుడ్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బిష్ణోయ్ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో లక్నో విజయ సమీకరణం రెండు పరుగులుగా మారింది. నాలుగో బంతికి బిష్ణోయ్ సింగిల్ తీసి ఉనద్కట్ స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో స్కోర్లు సమానం అయ్యాయి. అయితే ఐదో బంతికి ఉనద్కట్ ఔటయ్యాడు. దీంతో ఆర్సీబీ, లక్నో డగౌట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆర్సీబీ కొంపముంచిన డికే ఈ సమయంలో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ చేసిన తప్పిదం ఆర్సీబీ కొంపముంచింది. హర్షల్ పటేల్ ఆఖరి బంతిని లో ఫుల్ టాస్‌గా సంధించాడు. స్ట్రైక్‌లో ఉన్న అవేష్ ఖాన్ బంతిని అంచన వేయడంలో విఫలమయ్యాడు. బ్యాట్‌కు బంతి తగలకపోయినా అవేష్ ఖాన్ బై రన్ కోసం పరిగెత్తాడు. ఈ క్రమంలో బంతిని అందుకోవడంలో దినేష్ కార్తీక్ విఫలమయ్యాడు. ఒక వేళ కార్తీక్ బంతిని అందుకుని రనౌట్ చేసి ఉంటే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసుండేది. కార్తీక్ బంతిని అందుకుని రనౌట్ చేయడంలో విఫలమకావడంతో లక్నో ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2023 LSG vs RCB: చరిత్ర సృష్టించిన పూరన్.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్ Drama at the Chinnaswamy, a last-ball THRILLER 🤯#IPLonJioCinema #IPL2023 #TATAIPL #RCBvLSG | @LucknowIPL pic.twitter.com/AIpR9Q4gFB — JioCinema (@JioCinema) April 10, 2023 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.. కార్తీక్కే చుక్కలు! ఎవరీ సుయాష్ శర్మ?
కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ స్పిన్నర్ సుయాష్ శర్మ తన ఐపీఎల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సుయాష్ శర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేకేఆర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సుయాష్ తన బౌలింగ్ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటర్ దినేష్ కార్తీక్‌ను ఓ అద్భుతమైన బంతితో సుయాష్ ట్రాప్ చేశాడు. ప్లాన్ ప్రకారం ఔట్‌సైడ్ ఆఫ్ బంతిని బంతిని వేసి.. కార్తీక్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక తన తొలి మ్యాచ్‌లో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించిన సుయాష్ శర్మ గురుంచి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఎవరీ సుయాష్ శర్మ? 19 ఏళ్ల సుయాష్ శర్మ ఢిల్లీలో జన్మించాడు. ఇప్పటివరకు అతడు ఏ దేశవాళీ జట్టుకు ఎంపిక కాలేదు. అతడు ఇప్పటివరకు ఢిల్లీ అండర్-25 పురుషుల స్టేట్-ఎ ట్రోఫీలో మాత్రమే ఆడాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన సుయాష్ కేవలం 2వికెట్లు పడగొట్టాడు. కాగా కేకేఆర్‌తో ఆడిన మ్యాచే అతడికి తొలి ప్రొఫెషనల్ గేమ్ కావడం విశేషం. ఇక గతేడాది ఆఖరిలో జరిగిన ఐపీఎల్-2023 మినీవేలంతో సుయాష్ శర్మను రూ.20లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆర్సీబీతో మ్యాచ్‌లోకి వచ్చిన సుయాష్ శర్మ కేకేఆర్ మెన్‌జెమెంట్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. కాగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సుయాష్ శర్మపై కేకేఆర్ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. అతడొక మిస్టరీ స్పిన్నర్ అని చంద్రకాంత్ కొనియాడాడు. చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌లోకి ఆస్ట్రేలియా స్టార్ బౌలర్.. ఎవరంటే? Anuj Rawat ☑️ Dinesh Karthik ☑️ Watch Suyash Sharma pick two quick wickets in his debut game. Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/3igG1jDWb4 — IndianPremierLeague (@IPL) April 6, 2023 -
సునీల్ నరైన్ మ్యాజిక్ .. దెబ్బకు కోహ్లి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. కేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లతో ఆర్సీబీ వెన్ను విరచగా.. సుయాష్ శర్మ మూడు, నరైన్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక్క వికెట్ సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(23) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా తొలి మ్యాచ్‌లో దుమ్మురేపిన విరాట్ కోహ్లి.. ఈ మ్యాచ్‌లో మాత్రం కేవలం 21 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ సూపర్ డెలివరీ.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఓ అద్భుతమైన బంతితో విరాట్ కోహ్లిని బోల్తా కొట్టించాడు. నరైన్ వేసిన బంతికి కోహ్లి దగ్గర సమాధానమే లేకుండా పోయింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసి పటిష్టంగా కన్పించింది. ఈ క్రమంలో కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా.. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ చేతికి బంతి అందించాడు. రాణా నమ్మకాన్ని నరైన్ వమ్ము చేయలేదు. తన వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికే కోహ్లిని క్లీన్ బౌల్డ్ చేశాడు. నరైన్ వేసిన ఆఫ్‌బ్రేక్ బంతిని కోహ్లి లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి వికెట్లను గిరాటేసింది. అది చూసిన కోహ్లి బిత్తిరి పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా సునీల్ నరైన్‌కు ఇది 150వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. చదవండి: IPL 2023: కోహ్లికి డ్యాన్స్ నేర్పించిన షారుక్.. వీడియో వైరల్ ICYMI - TWO outstanding deliveries. Two massive wickets. Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on. Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW — IndianPremierLeague (@IPL) April 6, 2023 -
కోహ్లికి డ్యాన్స్ నేర్పించిన షారుక్.. వీడియో వైరల్
ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ బాద్షా, కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ సందడి చేశాడు. ప్రత్యేక గ్యాలరీలో షారుఖ్ కూర్చుని తన జట్టును సపోర్ట్ చేస్తూ కన్పించాడు. తమ బౌండరీలు బాదినప్పడు, బౌలర్లు వికెట్లు పడగొట్టనప్పడు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ షారుఖ్ ఖాన్ అభినందించాడు. కోహ్లికి డ్యాన్స్ నేర్పించిన షారుక్ కాగా మ్యాచ్ అనంతరం షారుక్ మైదానంలోకి వచ్చి ఇరు జట్ల ఆటగాళ్లతో సరదగా ముచ్చటించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి కింగ్ ఖాన్ డ్యాన్స్ నేర్పించాడు. తన సూపర్ హిట్ మూవీ పఠాన్‌లోని 'ఝూమ్ జో పఠాన్' పాటకు స్టెప్లను షారుక్ నేర్పించాడు. కోహ్లి బాద్షాను అనుకరిస్తూ స్టెప్లు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లతో ఆర్సీబీ వెన్ను విరచగా.. సుయాష్ శర్మ మూడు, నరైన్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ శార్దూల్ ఠాకూర్(29 బంతుల్లో 68) విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. చదవండి: IPL 2023: ఆర్సీబీకి ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! ఈ సారి కూడా కష్టమే This happened after the Clash Of The Titans 💪🏻 a 🫂 is a must after such high-voltage matches 🫶🏻 How endearing it is to see King Khan @iamsrk teaching the steps of #JhoomeJoPathaan to King Kohli @imVkohli 📸 🕺🏻🕺🏻#KKRvsRCB #ShahRukhKhan #KKR #AmiKKR #RCB #ViratKohli pic.twitter.com/DiHCgb5nbU — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) April 6, 2023 -
ఆర్సీబీకి ఊహించని షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! ఈ సారి కూడా కష్టమే
ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ పేసర్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ భుజం గాయం కారణంగా దూరమయ్యాడు. బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా టాప్లీ భుజంకు గాయమైంది. ఈ క్రమంలో అతడు నొప్పితో మైదానంలో విలవిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అదించనప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడు ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో టాప్లే గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో డేవిడ్ విల్లీ తుది జట్టులోకి వచ్చాడు. ఇక గాయపడిన టాప్లే తన స్వదేశానికి వెళ్లనున్నట్లు ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా సృష్టం చేశాడు. అతడి స్థానంలో మరో విదేశీ ఆటగాడిని భర్తీ చేయనున్నట్లు బంగర్ తెలిపాడు. "టాప్లే తన స్వదేశానికి వెళ్లనున్నాడు. అతడు మిగిలిన టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో మరో ఆటగాడిని రిప్లేస్ చేయనున్నాం" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బంగర్ పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లు జోష్ హేజిల్‌వుడ్, రజత్ పాటిదార్, విల్ జాక్స్ గాయం కారణంగా ఐపీఎల్-2023కు దూరమయ్యారు. కాగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘోర పరాజయం పాలైంది. చదవండి: RCB: అర్థం కాని ఆర్సీబీ.. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు -
టీ20ల్లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. రెండో భారత క్రికెటర్‌గా!
ఐపీఎల్-2023ను ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఓటమితో ఆరంభించింది. బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘోర ఓటమి చవిచూసింది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అరుదైన ఫీట్ సాధించాడు. టీ20ల్లో 200 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన రెండో భారత క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో సారథ్యం వహించేందుకు మైదానంలో అడుగుపెట్టిన రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో భారత మాజీ కెప్టెన్ ఎంస్ ధోని(307 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉండగా.. వెస్టెండీస్ మాజీ సారధి(208 మ్యాచ్‌లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్‌కు 143 మ్యాచ్‌ల్లో రోహిత్ సారథ్యం వహించాడు. అదే విధంగా ధోని ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు పుణే సూపర్ జెయింట్స్‌తో కలిపి 211 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు. చదవండి: IPL 2023: అయ్యో విలియమ్సన్.. నిలబడేందుకు కూడా కష్టం! వరల్డ్‌కప్‌కు అనుమానమే -
ఆర్సీబీ జట్టుపై సిద్ధరామయ్య ఎమోషనల్ ట్వీట్.. కన్నడిగులు ఫిదా..
బెంగళూరు: ఐపీఎల్లో తమ తొలి మ్యాచ్‌లో ముంబైపై ఆర్సీబీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం కర్ణాటక మాజీ సీఎం, ప్రతిపక్షనేత సిద్ధరామయ్య చేసిన ట్వీట్ కన్నడిగుల మనసులు దోచుకుంది. ఆర్సీబీ తన అభిమాన జట్టు అని, ఈ టీంను చూస్తే తనకు గర్వంగా ఉంటుందని సిద్ధరామయ్య అన్నారు. ఆర్సీబీ జట్టుకు నాలాగే కోట్ల మంది అభిమానులున్నారు. ఈసారి మనం కచ్చితంగా ఐపీఎల్ కప్పు గెలుస్తామని నాకు బలమైన విశ్వాసం ఉంది. ఒక కన్నడిగగా.. నా మద్దతు ఎప్పుడూ ఆర్సీబీకే ఉంటుంది' అని సిద్ధ రామయ్య ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్‌ను ఆయన స్టేడియంకు వెళ్లి స్వయంగా వీక్షించి ఆద్యంతం ఎంజాయ్ చేస్తూ కన్పించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు కూడా మ్యాచ్‌ను తిలకించారు. ಕ್ರಿಕೆಟ್ ನನ್ನ ಇಷ್ಟದ ಆಟ, ಆರ್ಸಿಬಿ ನನ್ನ ಹೆಮ್ಮೆಯ ತಂಡ.. ನನ್ನಂತಹ ಕೋಟ್ಯಂತರ ಅಭಿಮಾನಿಗಳ ಹಾರೈಕೆ ಆರ್.ಸಿ.ಬಿ ಹುಡುಗರ ಜೊತೆಗಿದೆ.. ಇಂದಲ್ಲ ನಾಳೆ ನಮ್ಮವರೂ ಕಪ್ ಗೆಲ್ಲುತ್ತಾರೆ ಎಂಬ ವಿಶ್ವಾಸ ನನಗಿದೆ. ಓರ್ವ ಕನ್ನಡಿಗನಾಗಿ ನನ್ನ ಬೆಂಬಲ ಯಾವಾಗಲೂ ನಮ್ಮ ಆರ್ಸಿಬಿಗೆ.@RCBTweets #RCBvMI pic.twitter.com/KgCOrbsNle — Siddaramaiah (@siddaramaiah) April 2, 2023 ఆర్సీబీ జట్టుకు కోట్ల మంది అభిమానులున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ టీం ఐపీఎల్ ట్రోఫీ గెలవలేకపోవడం వారిని నిరుత్సాహపరిచే ఏకైక విషయం. మొత్తం 15 సీజన్లలో మూడు సార్లు ఫైనల్ చేరిన ఆర్సీబీ.. ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2009, 2011, 2016 సీజన్లలో రన్నరప్‌గా నిలిచి సరిపెట్టుకుంది. చదవండి: కోహ్లి దెబ్బకు ఆర్చర్‌కు చిప్ దొబ్బినట్లుంది!