
ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ అద్భుతమైన షాట్‌తో మెరిశాడు. డుప్లెసిస్ న్యూ లూక్ షాట్‌తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన గెరాల్డ్ కోయిట్జీ ఆఖరి బంతిని డుప్లెసిస్‌కు 142.3 కి.మీ వేగంతో గుడ్ లెంగ్త్ డెలివరీ సంధించాడు.
అయితే ముందుగానే పొజిషన్‌లో వచ్చిన డుప్లెసిస్.. బంతిని చూడకుండానే ర్యాంప్ షాట్ ఆడాడు. అయితే డెలివరీగా ఎక్కువగా పేస్ ఉండడంతో దెబ్బకు బంతి స్టాండ్స్‌లో పడింది. దీంతో డుప్లెసిస్ న్యూ లూక్ సిక్స్ చూసిన బౌలర్ కొయిట్జీ ఒక్కసారిగా తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
#MIvsRCB,#RCBvsMI,#FafDuPlessis
— Be Positive 🙂↕️🌝💯 (@Tauqeer__azam) April 11, 2024
Fabulous pic.twitter.com/24eiZQQtga