ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఔటైన విధానం వివాదస్పదమైంది. ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశమైంది.
ఏమి జరిగిందంటే?
ఆర్సీబీ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో సీఎస్‌కే స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఐదో బంతి స్టంప్స్ దిశగా వేశాడు. దీంతో రజిత్ పాటిదార్ ఆ డెలివరీని స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఈ క్రమంలో శాంట్నర్ బంతిని ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
అయితే బంతి మాత్రం శాంట్నర్ చేతి వేలికి దగ్గరగా వెళ్తూ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో స్టంప్స్‌ను తాకింది. వెంటనే సీఎస్‌కే ఆటగాళ్లు రనౌట్ అప్పీల్ చేశారు.
దీంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. తొలుత బంతి చేతి వేలికి తాకిందా లేదా అని నిర్ధారించుకోవడానికి థర్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్ అల్ట్రా ఎడ్జ్ సాయంతో చెక్‌చేశాడు.
అయితే అల్ట్రా ఎడ్జ్‌లో చిన్నగా స్పైక్ రావడంతో బంతి చేతికి వేలికి తాకినట్లు అంపైర్ నిర్ధారించుకున్నాడు. అనంతరం బంతి స్టంప్స్‌కు తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చాడా లేదాన్నది పలు కోణాల్లో అంపైర్ పరిశీలించాడు.
ఓ యాంగిల్‌లో బంతి వికెట్లను తాకే సమయానికే డుప్లిసిస్ తన బ్యాటను గీతను దాటించినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం బ్యాట్ గాల్లో ఉందంటూ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు.
దీంతో ఫాప్ డుప్లెసిస్‌తో పాటు స్టేడియంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. కానీ చేసేదేమి లేక డుప్లెసిస్ (29 బంతుల్లో 54 రన్స్) నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ డుప్లెసిస్‌ది క్లియర్‌గా నాటౌట్, చెత్త అంపైరింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
— Reeze-bubbly fan club (@ClubReeze21946) May 18, 2024
Comments
Please login to add a commentAdd a comment